AP: బాలికపై గ్యాంగ్‌ రేప్‌ | Gang Molestation Of A Girl In YSR District, More Details About This Case | Sakshi
Sakshi News home page

AP: బాలికపై గ్యాంగ్‌ రేప్‌

Published Fri, Nov 22 2024 5:50 AM | Last Updated on Fri, Nov 22 2024 9:42 AM

Gang molestation of a girl in YSR district

వైఎస్సార్‌ జిల్లాలో దారుణం 

నిందితులంతా టీడీపీ ఎమ్మెల్యే అనుచరుల పిల్లలే.. 

వారిలో ఇద్దరు మైనర్లు 

నెల కిందట దారుణం.. వెలుగులోకి రాకుండా తొక్కిపెట్టిన ఎమ్మెల్యే అనుచరులు

గురువారం బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి..  

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: వైఎస్సార్‌ జిల్లా కమలాపురం నియోజకవర్గ పరిధిలో చింతకొమ్మదిన్నె మండలం సుగాలిబిడికి ప్రాంతానికి చెందిన ఓ మైనర్‌ బాలిక గ్యాంగ్‌ రేప్‌నకు గురైంది. బాలిక ఇంటికి సమీపంలో ఓ యువకుడితో ఒంటరిగా మాట్లాడుతుండగా నిందితుల్లో ఒకరు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. ఆ వీడియో బాలికకు చూపి ఉదయ్‌కిరణ్, మరో ఇద్దరు మైనర్‌లు కలిసి బాలికను లొంగదీసుకుని అత్యాచారానికి పాల్పడ్డారు. 

ఈ ఘటన జరిగి దాదాపు నెల రోజులవుతోంది. నిందితులంతా కమలాపురం టీడీపీ ఎమ్మెల్యే అనుచరుల పిల్లలు కావడంతో ఈ దారుణం వెలుగులోకి రాకుండా తొక్కిపెట్టేశారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఇంటికి వెళ్లి మొదట బేరసారాలు మొదలెట్టారు. ఆ తర్వాత వారిని భయపెట్టే యత్నం చేశారు. 

ఎట్టకేలకు గురువారం బాధితురాలి తండ్రి కడపలోని ‘దిశ’ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు, దిశ పోలీస్‌స్టేషన్‌ డీఎస్పీ రమాకాంత్‌లు సిబ్బందితో కలిసి విచారణ చేపట్టారు. వెంటనే నిందితులు ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. 

నిందితులపై చింతకొమ్మదిన్నె సీఐ శంకర్‌నాయక్‌  పొక్సో యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారని సమాచారం రావడంతో ఆఘమేఘాల మీద టీడీపీ నేతలు, కార్యకర్తలు పోలీసు అధికారులతో మాట్లాడేందుకు, నిందితుల తరఫున బాధితులతో రాజీ కుదిర్చేందుకు రోజంతా విఫలయత్నం చేశారు.

మహిళపై హత్యాచారం
» తల నుజ్జునుజ్జు 
» వైఎస్సార్‌ జిల్లా, కాశినాయన మండలంలో దారుణం 
» చెన్నవరం–పాపిరెడ్డిపల్లె మధ్య ఘటన 
» కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు
కాశినాయన (కలసపాడు): ఓ మహిళపై హత్యాచారం ఘటన వైఎస్సార్‌ జిల్లా, కాశినాయన మండలం, కత్తెరగండ్ల గ్రామ సమీపంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. చాపాడు మండలం, ఖాదర్‌పల్లెకు చెందిన కరీమున్నీసా(32)–నజీర్‌ దంపతులు. కరీమున్నీసా ఎర్రచందనం వ్యవహారాల్లో సెటిల్మెంట్లు చేస్తుంటుంది. ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ తిరుగుతూ ఉంటుంది. ఈ దంపతులకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. నజీర్‌ ఎర్రచందనం కేసులో జైలులో ఉన్నాడు. 

బుధవారం రాత్రి కరీమున్నీసా చెన్నవరం–పాపిరెడ్డిపల్లె మధ్య అనూహ్యంగా దారుణహత్యకు గురైంది. ఆమెను గుర్తు పట్టకుండా ఎవరో ముఖంపై బండరాళ్లతో దారుణంగా మోది హత్య చేశారు. మహిళ మృతదేహం ఉన్నట్లు మేకలకాపరులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు ఆమెపై సామూహిక లైంగికదాడి జరిగినట్టు గుర్తించారు. 

జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు, మైదుకూరు డీఎస్పీ రాజేంద్రప్రసాద్, పోరుమామిళ్ల సీఐ శ్రీనివాసులు, కాశినాయన, పోరుమామిళ్ల ఎస్‌ఐలు హనుమంతు, కొండారెడ్డి, క్లూస్‌టీం అధికారులు గురువారం ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోరుమామిళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

ఈ సందర్భంగా ఎస్పీ విద్యాసాగర్‌ నాయుడు మాట్లాడుతూ కేసు దర్యాప్తు చేస్తున్నామని, నిందితులను త్వరలో పట్టుకుంటామని చెప్పారు. మహిళ తన స్వగ్రామం నుంచి ఫోన్‌ కాంటాక్ట్‌ ద్వారా ఘటనా స్థలానికి వచి్చనట్లు తెలిసిందని, ఈ దాషీ్టకాన్ని ఒకరు చేశారా లేక మరికొందరు కలిసి చేశారా అనేది విచారణలో తేలాల్సి ఉందని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement