ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, నల్లగొండ: మహిళను వేధింపులకు గురిచేసిన ఐదుగురిపై స్థానిక మహిళా పోలీస్ స్టేషన్‌లో గురువారం కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ మండలంలోని అనంతారం గ్రామానికి చెందిన మహేశ్వరం సువర్ణను హైదరాబాద్‌లోని మీర్‌పేటకు చెందిన సంపూర్ణచారికి ఇచ్చి 30 ఏళ్ల క్రితం వివాహం చేశారు. కట్నంగా ప్లాటు, నాలుగు తులాల బంగారు ఆభరణాలు ఇచ్చారు.
వివాహమైన తర్వాత మూడేళ్ల వరకు వారి సంసారం సాఫీగా జరిగింది. ఈ క్రమంలో జీవనోపాధి కోసం సంపూర్ణచారి అనంతారం అత్తగారింటికి వచ్చి సువర్ణ సోదరి సరస్వతితో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. పథకం ప్రకారం సంపూర్ణచారి సువర్ణను ఇబ్బందులకు గురి చేస్తూ గర్భం దాల్చకుండా చేసి పిల్లలు పుట్టరనే నెపంతో ఇద్దరితో కలిసి ఉంటానని నమ్మించి సరస్వతిని పెళ్లిచేసుకున్నాడు.
తనను మంచిగా చూసుకుంటానని మోసం చేశాడని, ఆత్మహత్య చేసుకోవాలని తనపై పలుమార్లు దాడి చేశారని భర్త సంపూర్ణచారిపై సువర్ణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగలక్ష్మి తెలిపారు.
చదవండి: రహస‍్యంగా ఫోన్‌కాల్స్.. ఎన్నిసార్లు చెప్పినా మారని కోడలు.. చివరకు
Comments
Please login to add a commentAdd a comment