disputes
-
మేం చెప్పేదాకా సర్వేలపై ఉత్తర్వులు, తీర్పులు ఆపండి
న్యూఢిల్లీ: స్వాతంత్య్రం సిద్ధించిన నాటికి ఉన్న ప్రార్థనాస్థలాలను యథాతథ స్థితిలోనే కొనసాగించాలని నిర్దేశించే 1991నాటి చట్టంలోని సెక్షన్లను సవాల్‌చేస్తూ దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం గురువారం కీలకమైన సూచనలు చేసింది. ప్రార్థనాస్థలాల్లో సర్వేలపై వివిధ న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న కేసులపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంగానీ, తీర్పులు చెప్పడంగానీ చేయొద్దని సుప్రీంకోర్టు సూచించింది. ఈ కేసులపై తమ తదుపరి ఉత్తర్వులు వచ్చేదాకా తమ ఆదేశాలే అమల్లో ఉంటాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ కేవీ విశ్వనాథన్, జస్టిస్ సంజయ్ కుమార్ల ధర్మాసనం స్పష్టంచేసింది. ప్రార్థనాస్థలాలు ముఖ్యంగా మసీదులు, దర్గాల వద్ద సర్వేలు చేపట్టడాన్ని సవాల్‌చేస్తూ, సమరి్థస్తూ కొత్తగా ఎలాంటి ఫిర్యాదులు, కేసులను తీసుకోవద్దని ధర్మాసనం దేశంలోని అన్ని కోర్టులకు సూచించింది. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలోని జ్ఞానవాపి మసీదు, మథురలోని షాహీ ఈద్గా మసీదు, సంభాల్‌లోని షాహీ జామా మసీదు, ఢిల్లీలోని కుతుబ్ మినార్ దగ్గర్లోని ఖ్వాత్– ఉల్–ఇస్లామ్ మసీదు, మధ్యప్రదేశ్‌లోని కమల్ మౌలా మసీదు సహా 10 మసీదులు ఉన్న ప్రాంతాల్లో గతంలో హిందూ ఆలయాలు ఉండేవని, ఆయా స్థలాల్లో సర్వే చేపట్టి ఆ ప్రాంతాల వాస్తవిక మత విశిష్టతను తేల్చాలంటూ 18 కేసులు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. వీటిని విచారించిన సందర్భంగా గురువారం సుప్రీంకోర్టు పై విధంగా స్పందించింది. ప్రార్థనాస్థలాల(ప్రత్యేక అధికారాల)చట్టం, 1991లోని 2, 3, 4వ సెక్షన్ల చట్టబద్ధతను సవాల్‌చేస్తూ న్యాయవాది అశ్వినీ వైష్ణవ్ తదితరులు దాఖలుచేసిన ఆరు పిటిషన్లనూ ఈ స్పెషల్ బెంచ్ గురువారమే విచారించింది. 1947 ఆగస్ట్ 15నాటికి ఉన్న ప్రార్థనాస్థలాల యథాతథస్థితిని మార్చడానికి వీల్లేదంటూ 1991 చట్టంలో పలు సెక్షన్లు పొందుపరిచారు. ఈ సెక్షన్లు అయోధ్యలోని రామజన్మభూమి–బాబ్రీ మసీదు వివాదానికి వర్తించవంటూ గతంలో సుప్రీంకోర్టు ధర్మాసనం చరిత్రాత్మక తీర్పు చెప్పి ఆ స్థలాన్ని హిందూవర్గానికి కేటాయించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే వారణాసి, మథుర, సంభాల్ తదితర ప్రాంతాల్లో దశాబ్దాల నాటి మసీదులు, దర్గాలున్న స్థలాల వాస్తవిక మత లక్షణాన్ని తేల్చాలని కొత్తగా పిటిషన్లు పుట్టుకొచి్చన విషయం విదితమే. కేంద్రానికి 4 వారాల గడువు ‘‘ ఉత్తర్వులను నిలుపుదలచేస్తూ అన్ని కోర్టులను ఆదేశించడానికి ముందే సంబంధిత కేసుల్లో కక్షిదారుల వాదనలను సుప్రీంకోర్టు వినాలి’’ అని హిందువుల తరఫున హాజరైన సీనియర్ లాయర్ జే.సాయి దీపక్ కోరారు. దీనిపై సీజేఐ ‘‘ కింది కోర్టులు సుప్రీంకోర్టు కంటే పెద్దవైతే కాదుకదా. ఈ అంశంపై సుప్రీంకోర్టు విస్తృతస్థాయిలో పరిశీలిస్తున్నపుడు కింది కోర్టులకు ఇలాంటి ఆదేశాలు ఇవ్వడం సహజమే. అయినా ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం స్పందన లేకుండా ముందుకు వెళ్లలేం. నాలుగు వారాల్లోపు కేంద్రం తన స్పందనను తెలియజేయాలి. కేంద్రం స్పందన తెలిపాక మరో నాలుగు వారాల్లోపు సంబంధిత కక్షిదారులు వారి స్పందననూ కోర్టుకు తెలియజేయాలి’’ అని సూచించారు. ఈ అంశానికి సంబంధించి 2022 సెపె్టంబర్లో దాఖలైన ప్రధాన పిటిషన్ విషయంలో కోర్టు కేంద్రానికి నోటీసులు పంపింది. 1991 చట్టాన్ని సవాల్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ జ్ఞానవాపి మసీదు మేనేజ్మెంట్ కమిటీ తదితర సంస్థలు ముస్లింల తరఫున కేసులు వేశాయి. 1991 చట్టాన్ని తప్పుబట్టి తద్వారా మసీదుల ప్రాచీన ఉనికిని ప్రశ్నార్థకం చేయాలని చూస్తున్నారని మసీదు కమిటీలు వాదిస్తున్నాయి. -
పన్ను వివాదాల పరిష్కారానికి అక్టోబర్ 1 నుంచి ‘వివాద్ సే విశ్వాస్ 2.0’
న్యూఢిల్లీ: పన్ను వివాదాల పరిష్కారానికి వీలుగా వివాద్ సే విశ్వాస్ 2.0 పథకం అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. ఈ పథకాన్ని 2024–25 బడ్జెట్లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడం గుర్తుండే ఉంటుంది.రూ.35 లక్షల కోట్ల పన్నుకు సంబంధించి 2.7 కోట్ల ప్రత్యక్ష పన్ను డిమాండ్లు వివిధ దశల్లో, న్యాయ వేదికల వద్ద అపరిష్కృతంగా ఉండడం గమనార్హం. వీటికి పరిష్కారంగా గతంలో అమలు చేసిన వివాద్ సే విశ్వాస్ పథకాన్ని మరో విడత కేంద్రం తీసుకురావడం గమనార్హం. -
ఇక సులభంగా ఎంఎస్ఎంఈ వివాదాల పరిష్కారం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ సంస్థలు, ఇతర సంస్థల నుంచి బకాయిలు వసూలు కాక ఇబ్బందులు పడుతున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈలకు) అండగా నిలిచేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంఎస్ఎంఈల వివాదాల పరిష్కారానికి కొత్తగా నాలుగు చోట్ల ఏపీ ఎంఎస్ఎంఈ ఫెసిలిటేషన్ కౌన్సిల్స్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతవరకు విజయవాడలో రాష్ట్ర స్థాయి ఫెసిలిటేషన్ కౌన్సిల్ మాత్రమే ఉండటంతో వివాదాల పరిష్కారానికి ఇంత దూరం రావడానికి ఎంఎస్ఎంఈలు ఇబ్బందులు ఎదుర్కొనేవి. ఈ విషయాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, కర్నూలులో ప్రాంతీయ కౌన్సిల్స్‌ను ఏర్పాటు చేసింది. కన్సిలేషన్స్ (ఇరు పార్టీలను కూర్చొపెట్టి మాట్లాడి పరిష్కరించడం) స్థాయి వివాదాలను ప్రాంతీయ స్థాయిలో పరిష్కరించేలా, ఆర్బిట్రేషన్ స్థాయి వివాదాలను రాష్ట్రస్థాయి కౌన్సిల్లో పరిష్కరించేలా చట్టంలో మార్పులు తెస్తూ రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకోసం నలుగురు సభ్యులతో కూడిన ప్రాంతీయ ఫెసిలిటేషన్ కౌన్సిళ్లని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కౌన్సిల్ ఎక్స్ అఫిషియో చైర్మన్‌గా జిల్లా స్థాయి పరిశ్రమల శాఖ ఉన్నతాధికారి, ఫెడరేషన్ ఆఫ్ ఏపీ స్మాల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ (ఫ్యాప్సియా) సూచించిన ప్రతినిధి, ఏపీఎస్ఎఫ్సీ జిల్లా బ్రాంచ్ మేనేజర్, ఏపీఐఐసీ సూచించిన వ్యక్తులు సభ్యులుగా ఉంటారు. బకాయిల కోసం కోర్టులకు వెళ్లి సుదీర్ఘ సమయం వృథా చేసుకునే అవసరం లేకుండా వేగంగా పరిష్కరించే చట్టపరమైన హక్కులు ఈ కౌన్సిల్‌కు ఉంటాయి. ప్రభుత్వ అండతో వేగంగా పరిష్కారం వైఎస్ జగన్ ప్రభుత్వం ఎంఎస్ఎంఈలకు అన్ని విధాలుగా అండగా నిలుస్తోంది. మరోపక్క ఏపీ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ ఫెసిలిటేషన్ కౌన్సిల్‌కు కూడా ప్రాధాన్యత ఇస్తోంది. దీంతో సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల బకాయిలు త్వరితగతిన పరిష్కారమవుతున్నాయి. బకాయిల కోసం కౌన్సిల్‌ను సంప్రదించే పరిశ్రమల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇప్పటివరకు ఈ కౌన్సిల్‌కు రూ.654 కోట్ల బకాయిలకు సంబంధించిన 534 ఫిర్యాదులు రాగా వాటిలో 149 ఫిర్యాదులను పరిష్కరించింది. తద్వారా రూ.97 కోట్ల బకాయిలకు పరిష్కారం చూపింది. ఈ సంఖ్య పెరుగుతుండటంతో వివాదాలను మరింత వేగంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రాంతీయ కౌన్సిల్స్ ఏర్పాటు చేసింది. వాటికి స్పష్టమైన పరిధి, విధివిధానాలను నిర్దేశించింది. దీంతో చిన్న పారిశ్రామికవేత్తల ఆర్థిక ఇబ్బందులు తీరనున్నాయి. ప్రభుత్వ నిర్ణయంపై ఎంఎస్ఎంఈ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. సుదీర్ఘకాల డిమాండ్‌ను నెరవేరుస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఫెడరేషన్ ఆఫ్ ఏపీ స్మాల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ (ఫాఫ్సియా) అధ్యక్షుడు మురళీకృష్ణ ప్రభుత్వానికి, పరిశ్రమల శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రాంతీయ కౌన్సిళ్ల పరిధిలోకి వచ్చే జిల్లాలివీ.. విశాఖపట్నం ప్రాంతీయ కౌన్సిల్: విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జిల్లాలు విజయవాడ కౌన్సిల్: కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలు తిరుపతి కౌన్సిల్ : ప్రకాశం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలు కర్నూలు కౌన్సిల్: కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, వైఎస్ఆర్ కడప జిల్లాలు -
శివసేన, ఎన్సీపీ విబేధాలపై స్పీకర్‌కు సుప్రీంకోర్టు తుది గడువు
ఢిల్లీ: శివసేన, ఎన్సీపీ విభేదాలకు సంబంధించి దాఖలైన అనర్హత పిటిషన్లను పరిష్కరించడానికి మహారాష్ట్ర శాసనసభ స్పీకర్ రాహుల్ నార్వేకర్‌కు సుప్రీంకోర్టు నేడు తుది గడువును విధించింది. శివసేన విబేధాలపై డిసెంబర్ 31, 2023 నాటికి, ఎన్సీపీ అనర్హత పిటిషన్లపై జనవరి 31, 2024లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఏకనాథ్ షిండే, అజిత్ పవార్ వర్గాలకు వ్యతిరేకంగా దాఖలైన అనర్హత పిటిషన్లపై స్పీకర్ త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరుతూ శివసేన సభ్యుడు సునీల్ ప్రభు (ఉద్ధవ్ ఠాక్రే), ఎన్సీపీ సభ్యుడు జయంత్ పాటిల్ (శరద్ పవార్) దాఖలు చేసిన రిట్ పిటిషన్లపై భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది. కాగా.. శివసేన పార్టీలో చీలికకు సంబంధించి ఉద్ధవ్ ఠాక్రే, ఏక్నాథ్ షిండే వర్గాలు దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడానికి ఫిబ్రవరి 29, 2024 వరకు సమయం కావాలని కోరిన మహారాష్ట్ర శాసనసభ స్పీకర్ వైఖరిపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ విబేధాలపై ఇంతకాలం కాలయాపన చేసి మళ్లీ గడువు కోరడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. స్పీకర్ రాహుల్ నార్వేకర్ తరఫున వాదనలు వినిపించిన భారత సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. జనవరి 31లోగా విచారణ పూర్తవుతుందని తెలిపారు. దీనిపై స్పందించిన సీజేఐ డీవై చంద్రచూడ్.. డిసెంబర్ 31లోగా తేల్చేయాల్సిందేనని పునరుద్ఘాటించారు. 2022 జులైలో ఈ ఘటనలు చోటుచేసుకోగా.. ఈ అంశంపై నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్‌కే ఉందని ఈ ఏడాది మేలోనే రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసిందని గుర్తుచేశారు. అయితే.. రాబోయే దీపావళి సెలవులు, అసెంబ్లీ శీతాకాల సమావేశాలను ఉటంకిస్తూ జనవరి 31లోపు పూర్తి నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదని ధర్మాసనానికి సొలిసిటర్ జనరల్ విన్నవించారు. వాదనల అనంతరం డిసెంబర్ 31లోపు విచారణ పూర్తి చేయాల్సిందేనని ధర్మాసనం ఉత్తర్వులను జారీ చేసింది. ఎన్సీపీ విభేదాలకు సంబంధించి మాత్రం జనవరి 31 వరకు సమయం ఇచ్చింది. కానీ ఎన్సీపీ విబేధంపై గడువు ఇవ్వడాన్ని అజిత్ పవార్ వర్గం తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ నిరసించారు. ఈ ఏడాది జూలై, సెప్టెంబర్లలో మాత్రమే పిటిషన్లు దాఖలయ్యాయని చెప్పారు. అయితే.. ఈ ఏడాది జులైలో తొమ్మిది మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్లను మాత్రమే ఈ దశలో పరిగణిస్తామని ధర్మాసనం తెలిపింది. శివసనే, ఎన్సీపీ అనర్హత పిటిషన్లను త్వరితగతిన విచారించడానికి తగిన షెడ్యూల్‌ను రూపొందించడానికి మహారాష్ట్ర స్పీకర్‌కు కోర్టు చివరి అవకాశాన్ని ఇప్పటికే ఇచ్చింది. ముఖ్యమంత్రి శిందేతో సహా పలువురు శివసేన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని ఉద్ధవ్ వర్గం పెట్టుకున్న అర్జీలపై ఎటూ తేల్చకుండా నాన్చుతున్నారని స్పీకర్‌పై ఇంతకుముందు ఆగ్రహం వ్యక్తంచేసింది. కాగా.. శివసేనలో తిరుగుబాటు బావుటా ఎగురవేసిన ఏక్నాథ్ షిండే, ఆయన మద్దతుదారులైన ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవాలంటూ సుప్రీం ఆదేశించినా స్పీకర్ జాప్యం చేస్తున్నారంటూ ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన సునీల్ ప్రభు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అటు ఎన్సీపీలోనూ తిరుగుబాటు చేసిన అజిత్ పవార్ వర్గంపై అనర్హత ప్రకటించాలని కోరుతూ శరద్ పవార్ మద్దతుదారులు సర్వోన్నత న్యాయస్థానానికి చేరారు. దీనిపై విచారణ జరుపుతున్న సీజేఐ ధర్మాసనం నేడు తుది గడువును విధించింది. ఇదీ చదవండి: హర్ష్ గోయెంకా కీలక వ్యాఖ్యలు: మూర్తి అలా అనలేదంటున్న గుర్నానీ -
అక్రమాల డ్రెడ్జింగ్!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీసీఐ) నిత్యం వివాదాల మయంగా మారుతోంది. ఎప్పటికప్పుడు తప్పులు చేస్తూ.. సంస్థ పరువును బంగాళాఖాతంలో కలిపేసేలా వ్యవహారాలు జరుగుతున్నాయి. కీలకమైన పోస్టు ఎంపిక విషయంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నకిలీ సర్టిఫికెట్లతో సంస్థ ఎండీ, సీఈవోగా బాధ్యతలు చేపట్టిన జీవైవీ విక్టర్ అదే సంస్థను కోట్లాది రూపాయల నష్టాల ఊబిలో కూరుకుపోయేలా చేశారు. నిండా మునిగిన తర్వాత తేరుకున్న ఉన్నతాధికారులు విక్టర్ని విధుల నుంచి తప్పించారు. తాజాగా ఓ ఉన్నతాధికారి పోస్టును కూడా అదేమాదిరిగా కట్టబెట్టారు. ఇప్పుడు ఆయన నియామకంపైనా వివాదం ముదురుతోంది. షిప్పులో డెక్ కేడెట్‌గా చేరి.. సదరు వ్యక్తి 1987లో ఎస్సీ కోటా స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా షిప్పులో డెక్ కేడెట్‌గా డ్రెడ్జింగ్ కార్పొరేషన్లో చేరారు. 2009లో డీజీఎంగా పదోన్నతి పొంది.. పట్టుమని పది నెలలైనా పని చెయ్యకుండా డీసీఐకు రాజీనామా చేసేశారు. డీసీఐ ప్రత్యర్థి సంస్థగా చెప్పుకునే మెర్కటర్ సంస్థలో డీజీఎం ఆపరేషన్స్‌గా జాయిన్ అయ్యారు. రెండున్నర సంవత్సరాలు పనిచేసి.. తిరిగి 2012లో డీసీఐకి వచ్చేశారు. ఈ సమయంలో డీసీఐలో తిరిగి చేరినప్పుడు విద్యార్హతలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాల్ని సమర్పించారు. ఇక్కడే ఆయన బండారంబట్టబయలయ్యింది. బీ‘కామ్’గా అబద్ధాలు 2020 ఆగస్టులో ఉన్నతాధికారి పోస్టుకు డ్రెడ్జింగ్ కార్పొరేషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సదరు అధికారి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన హిందు రిలీజియన్‌గా దరఖాస్తులో పేర్కొన్నారు. అయితే.. సదరు అధికారి ఆ సమయంలో విశాఖలోని యూనియన్ చాపల్ బాప్టిస్ట్ చర్చ్‌కి వైస్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. క్రిస్టియన్‌గా ఉంటూ ఉద్యోగం కోసం చేసిన దరఖాస్తులో మాత్రం హిందూగా పేర్కొన్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా.. 2012లోనే బీకామ్ పాసైనట్టు అప్లికేషన్‌తో పాటు సర్టిఫికెట్ సమర్పించారు. దీనిపైనా విమర్శలు వచ్చిన నేపథ్యంలో బీకామ్ సర్టిఫికెట్ కూడా నకిలీదని తేలినట్టు తెలిసింది. డిగ్రీ కూడా చేయని వ్యక్తిని.. కేవలం ఇంటర్ విద్యార్హత ఉన్న వ్యక్తికి ఉన్నతాధికారి హోదాను కట్టబెట్టేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతోపాటు తాను పనిచేసిన మెర్కటర్ సంస్థ డీసీఐకి అనుబంధ సంస్థగా దరఖాస్తులో పేర్కొన్నారు. కానీ.. సదరు సంస్థ డీసీఐకు పూర్తి ప్రత్యర్థి సంస్థ. ఇలా.. విద్యార్హత నుంచి ప్రతి అంశాన్ని తప్పుగా చూపిస్తూ.. కీలక బాధ్యతల్ని దక్కించుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. డీసీఐకి నష్టం చేకూర్చారంటూ ఫిర్యాదుల వెల్లువ సదరు ఉన్నతాధికారి డ్రెడ్జింగ్ కార్పొరేషన్‌కి రాజీనామా చేసి మెర్కటర్ సంస్థలో చేరిన తర్వాత డీసీఐకి నష్టం వాటిల్లేలా వ్యవహరించినట్టు కొందరు ఉద్యోగులు ఆధారాలు సేకరించారు. డీసీఐలో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో పోటీ సంస్థ అయిన మెర్కటర్ సుమారుగా రూ.800 కోట్ల విలువైన పనులను డీసీఐ కంటే 5 శాతం వరకు అధికంగా కోట్ చేసి దక్కించుకుంది. దీనివెనుక సదరు అధికారి హస్తం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా.. ఓవైపు జీఎంగా పనిచేస్తూనే మరోవైపు లీగల్ సెల్ బాధ్యతల్ని కూడా పర్యవేక్షించిన సదరు అధికారి రూ.50 కోట్ల విలువైన ఆర్బిట్రేషన్‌ను మెర్కటర్‌కు దక్కేలా చేశారనీ.. ఈ విధంగా లబ్ధి చేకూర్చడం వల్లే.. మెర్కటర్ సంస్థ సదరు ఉన్నతాధికారికి డీజీఎం బాధ్యతలు అప్పగించిందని తెలుస్తోంది. ఇలా ప్రతి విషయంలోనూ సదరు అధికారికి సంబంధించిన నియామకం వెనుక అక్రమాల జాబితాలను జత చేస్తూ కేంద్ర పోర్టులు మంత్రిత్వ శాఖతో పాటు సీబీఐకి కూడా కొందరు ఉద్యోగులు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. -
పౌరసరఫరాల సంస్థలో విభేదాలు.. ‘సార్’ X ఉన్నతాధికారులు
సాక్షి, హైదరాబాద్: పౌరసరఫరాల సంస్థలో ఆధిపత్య పోరు నడుస్తోంది. సంస్థలో కీలక హోదా ల్లో ఉన్న ఉన్నతాధికారులకు, సంస్థ బాధ్యతలు చూసేందుకు నియమితులైన ‘సార్’కు మధ్య విభేదాలు పెరుగుతున్నాయి. తాను ప్రతిపాదించి న పనులేవీ సంస్థలో జరగడం లేదని, ఎక్కడికక్కడ ఆటంకాలు సృష్టిస్తున్నారని ‘సార్’ అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా, సంస్థ నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకోమంటే ఎలా అని అధికారులు ప్రశ్నిస్తున్నారు. రైస్‌మిల్లుల్లో ధాన్యం మిల్లింగ్, సీ ఎంఆర్ అప్పగింత మొదలు మిల్లులు, ఎంఎల్ఎస్ పాయింట్లపై విజిలెన్స్ దాడులు, రేషన్ దుకాణా లకు బియ్యం సరఫరాలో అవకత వకల వరకు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకం మొద లు అధికారుల బదిలీల వరకు పలు అంశాలపై విభేదా లు సంస్థ సిబ్బందిలో హాట్‌టాపిక్‌గా మారాయి. మిల్లుల్లో తనిఖీలు .. విజిలెన్స్ దాడులు రాష్ట్రంలో ధాన్యం దిగుబడి పెరిగిన నేపథ్యంలో రైస్‌మిల్లుల్లో ధాన్యం కుప్పలు పేరుకుపోయి, సీఎంఆర్ నిర్దేశిత గడువులోగా పూర్తి కావడం లేదు. దీంతో కొన్ని నెలల క్రితం మిల్లర్ల అక్రమాలను నిగ్గు తేల్చే పేరుతో ప్రభుత్వ ప్రతినిధిగా ‘సార్’ రంగంలోకి దిగారు. పలు జిల్లాల్లో స్థానిక విజిలెన్స్, జిల్లా అధికారులతో కలిసి తనిఖీలు చేశారు. అయితే ఏ మిల్లులో ఎంత లోటు ఉంది, ఏ మేరకు అక్రమాలకు పాల్పడ్డాయనే అంశాలను మీడియాకు వెల్లడించేందుకు తాను చేసిన ప్రయత్నాలను ఉన్నత స్థాయిలో అధికారులు అడ్డుకున్నారని ఆయ న ఆరోపిస్తున్నారు. అయితే ఎండీకి గానీ, ప్రభుత్వ పెద్దలకు గానీ సమాచారం ఇవ్వకుండా ‘రహస్య ఎజెండా’తో ‘సార్’ తనిఖీలు చేశారని సంస్థ అధికారులు కౌంటర్ ఇస్తున్నారు. తనిఖీల పేరుతో దందాలు సాగుతున్నాయనే అనుమానాలే దీనికి కారణమని కొందరు చెబుతున్నారు. ఇటీవల పలు జిల్లాల్లో రేషన్ బియ్యం పంపిణీ జరిగే ఎంఎల్ఎస్ పాయింట్లకు విజిలెన్స్ సిబ్బందిని పంపిస్తూ దాడుల పేరుతో భయపెడుతున్నారని, తనను ప్రసన్నం చేసుకున్న వారిని వదిలేసి, లేదంటే బెదిరిస్తున్నారనే ఆరోప ణలు వస్తున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. సీఆర్ఓ భవనానికి బ్రేక్ సికింద్రాబాద్‌లోని చీఫ్ రేషనింగ్ అధికారి (సీఆర్ఓ) భవనాన్ని రెండు అంతస్తుల్లో నిర్మించాల ని బాధ్యతలు చేపట్టిన వెంటనే ‘సార్’ భావించారు. ప్రభుత్వంతో సంబంధం లేకుండా మిల్లర్ల ‘సహకారం’తో రూ.2 కోట్లతో నిర్మించాలని ఆయన ప్రయత్నించారు. ఈ మేరకు సంస్థలో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న డీఈఈని ప్రతిపాదనలు అడిగితే, ఆయన కేవలం రూ.70 లక్షల అంచనాతో ప్రతిపాదనలు ఇచ్చారు. తర్వాత సదరు డీఈఈ డిప్యుటేషన్ రద్దు చేసుకొని వెళ్లిపోయారు. ఆయన స్థానంలో కరీంనగర్లో పనిచేసిన ఓ రిటైర్డ్ ఇంజనీర్‌ను డీఈఈగా తెచ్చేందుకు ‘సార్’ చేసిన ప్రయత్నం విఫలమైంది. దీన్ని కూడా ప్రభుత్వ పెద్దల ద్వారా ఉన్నతాధికారులు అడ్డుకున్నారనే వాదన విన్పిస్తుండగా, మిల్లర్ల ‘సహకారం’తో భవన నిర్మాణం చేపట్టడాన్ని అధికారులు తప్పుబడుతున్నారు. 11 మంది సిబ్బంది ఆరుకు కుదింపు కీలక పదవిలో చేరిన తర్వాత ‘సార్’ తన పేషీలో 11 మంది సిబ్బందిని నియమించుకున్నారు. అయి తే సంస్థ ఎండీ.. వారి సంఖ్యను ఏకంగా ఆరుకు కుదిస్తూ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశం అయ్యింది. అయితే ఈ మేరకు ఆదేశాలు వచ్చినా సిబ్బందిని తగ్గించే నిర్ణయం అమలుకాకపోవడంపై సంస్థలో చర్చ జరుగుతోంది. ఔట్సోర్సింగ్ నియామకాలకు నో రాష్ట్రంలో ఏ కార్పొరేషన్లో లేనివిధంగా పౌరసరఫరాల సంస్థలో 800 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించి ‘సార్’ చేసిన సిఫారసులను అధికారులు ఆమోదించడం లేదని సమాచారం. ప్రధాన కార్యాలయంలో ఉండే లీగల్ అడ్వయిజర్ తరహాలో జిల్లాకో లీగల్ అడ్వయిజర్‌ను పెట్టాలని ప్రతిపాదించినప్పటికీ ఉన్నతాధికారి అంగీకరించలేదని తెలుస్తోంది. మూడు జిల్లాల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా ముగ్గురికి అవకాశం ఇవ్వగా, మరి కొందరి కోసం చేస్తున్న ప్రయత్నాలకు కూడా అడ్డు పడుతున్నట్లు సమాచారం. జిల్లాల్లో పనిచేస్తున్న డీఎంలు, ఇతర ఉద్యోగుల బదిలీల విషయంలో కూడా తన ప్రతిపాదనలను పట్టించుకోవడం లేదని ‘సార్’ అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. వసూళ్ల ఆరోపణలు ఇదే సమయంలో ‘సార్’పై పలు ఆరోపణలు సంస్థలో విన్పిస్తుండటం గమనార్హం. త్వరలో డిప్యుటేషన్ పూర్తయ్యే డీజీఎం–అడ్మిన్, డీజీఎం – ఫైనాన్స్ పోస్టుల నియామకం కోసం బేరసారాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు పీడీఎస్ బియ్యాన్ని సీఎంఆర్ కింద పంపించి ఉద్యోగం కోల్పోయిన వ్యక్తిని మళ్లీ అదే పోస్టులో నియమించేందుకు ప్రయత్నాలు జరిగాయని, ఈ విషయంలో నలుగురు రైస్ మిల్లర్లు బేరం కుదిర్చారనే ఆరోపణలు కూడా విన్పిస్తున్నాయి. -
గిరిజన భూ వివాదాలకు సత్వర పరిష్కారం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గిరిజన భూ వివాదాల సత్వర పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలోని గిరిజనులకు చెందిన షెడ్యూల్డ్ ఏరియా ‘భూ బదలాయింపు నిబంధనలు (ఎల్టీఆర్) 1/70’ ప్రకారం వారి హక్కులను కాపాడేలా పక్కా కార్యాచరణ చేపట్టింది. దాదాపు 1976 నుంచి పేరుకుపోయిన వేలాది ఎల్టీఆర్ కేసుల్లో వేగంగా విచారణ జరిపి సత్వర న్యాయం అందించే దిశగా ఆదేశాలిచ్చింది. దీంతో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందుకోసం అవసరమైన యంత్రాంగాన్ని సమకూర్చడంతోపాటు ఇటీవల ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేసింది. తీసుకోవాల్సిన చర్యలపై మార్గదర్శకాలు సైతం జారీ చేసింది. పెండింగ్‌లో ఉన్న ఎల్టీఆర్ కేసులు విచారణ వేగవంతం చేయడం, పాత కేసుల్లోని భూ వివాదాలను త్వరితగతిన పరిష్కరించడం, కొత్తగా నమోదైన కేసులను 6 నెలల గడువులోను, అప్పీల్‌కు వెళ్లిన కేసులు రెండు నెలల్లో పరిష్కరించాలని ఆదేశాలిచ్చింది. అప్పటికీ వివాదం కొలిక్కిరాకపోతే గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, కమిషనర్ విచారణకు వెళుతుంది. కేసుల్లో గిరిజనులకు అనుకూలమైన ఉత్తర్వులను వేగంగా అమలులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టాలని పేర్కొంది. గిరిజనులకు వ్యతిరేకంగా వచ్చింన వాటి వివరాలను సంబంధిత అధికారులకు తెలియజేయడంతోపాటు ఆయా గ్రామ సచివాలయాల వద్ద ప్రదర్శించాల్సి ఉంటుంది. ఎల్టీఆర్ కేసుల పురోగతిపై ఎప్పటికప్పుడు ఐటీడీఏ పీవోలు, మైదాన ప్రాంత కలెక్టర్లు పర్యవేక్షించాల్సి ఉంటుంది. వీటికి సంబంధించిన సమాచారాన్ని ప్రతి మూడు నెలలకు ఒకసారి నివేదిక పంపించాలి. ఎల్టీఆర్ కేసులు, హక్కులపై ఐటీడీఏల పరిధిలో వాల్ పోస్టర్లు, కరపత్రాల ద్వారా గిరిజనులకు పెద్దఎత్తున అవగాహన కల్పించాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆదేశాలు ఇచ్చింది. గిరిజన భూములకు రక్ష 1/70 యాక్ట్ రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ ప్రకారం గిరిజనులకు ప్రత్యేక హక్కులు కల్పించారు. భూములకు సంబంధించి 1/70 (1959 చట్ట సవరణ) సెక్షన్–3తో గిరిజనులకు భూములపై హక్కులున్నాయి. షెడ్యూల్డ్ ఏరియాలో గిరిజనులకు చెందిన భూములు వారే అనుభవించాలి. గిరిజనులు నుంచి గిరిజనులు భూములు పొందచ్చు. గిరిజనుల నుంచి గిరిజనేతరులు కొనుగోలు చేయడం, ఆక్రమించడం వంటివి చెల్లవు. భూముల అన్యాక్రాంతాన్ని నిరోధించడమే దీని ఉద్దేశం. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతం (షెడ్యూల్డ్ ఏరియా) 37 మండలాల పరిధిలోని 3,512 గ్రామాల్లో నివసించే వారికి ఈ హక్కులు వర్తిస్తాయి. గిరిజనులకు చెందిన భూవివాదాల పరిష్కారం కోసం అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, ఏలూరు జిల్లాలకు చెందిన రంపచోడవరం, పాడేరు, పార్వతీపురం, సీతంపేట, కోట రామచంద్రపురం, పోలవరం ఐటీడీఏల పరిధిలో ఐదు ప్రత్యేక ఎల్టీఆర్ కోర్టులను ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఆయా ప్రాంతాల్లో భూ వివాదాలను తొలుత డిప్యూటీ తహసిల్దార్ (డీటీ) గుర్తించి నోటీసులు జారీ చేస్తారు. తగిన సమాచారం సేకరించిన అనంతరం ఐటీడీఏల పరిధిలోని పాడేరు, రంపచోడవరం, ఎల్వీఎన్ పేట, కేఆర్ పురం, పోలవరం కోర్టుల్లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు విచారణ చేపడతారు. ఈ వివాదాల్లో తగిన పత్రాలు, ఆధారాలను సమర్పించడం ద్వారా భూమి ఎవరిదో నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఎల్టీఆర్ ఆర్డర్ అమలు ఇలా ♦ ప్రారంభం (1976) నుండి ఈ ఏడాది జూన్ వరకు 29,810 ఎల్టీఆర్ వివాదాలు(1,47,554 ఎకరాలు) గుర్తించారు. ♦ 12,678 కేసులు (56,882 ఎకరాలు) గిరిజనులకు అనుకూలంగా ఉత్తర్వులు అమలయ్యాయి. ♦ 11,754 కేసుల్లో 51,278 ఎకరాలను గిరిజనులకు స్వాదీనం చేశారు. ♦ 924 కేసుల్లో 5,604 ఎకరాలను అప్పగించాల్సి ఉంది. మరికొన్ని కేసులు పలుస్థాయి (కోర్టు)ల్లో పెండింగ్‌లో ఉన్నాయి. -
పెనుకొండ టీడీపీలో ముసలం..
సాక్షి, పెనుకొండ: పెనుకొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో ముసలం పుట్టింది. కురుబ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ సవిత, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప వరుస కార్యక్రమాలతో మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. రాబోవు ఎన్నికల్లో గెలుపు మాట అటుంచితే పార్టీ టికెట్ పార్థుడికి దక్కడం కష్టమేనన్న వాదన పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. సవిత ధీమా రాబోవు ఎన్నికల్లో పోటీ చేసేందుకు యువతకు ప్రాధాన్యతనిస్తున్నట్లు టీడీపీ అధిష్టానం ప్రకటించడంతో కురుబ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ సవితలో ఆశలు రేకెత్తాయి. దీంతో పార్టీ కార్యక్రమాలు విస్తృతం చేశారు. రాబోవు ఎన్నికల్లో పార్టీ టికెట్ తనకేనంటూ ఇప్పటికే పార్టీ శ్రేణులకు స్పష్టం చేసిన ఆమె.. ఇతర జిల్లాల్లోనూ పార్టీ చేపడుతున్న కార్యక్రమాల్లో పాల్గొంటూ తన ఇమేజ్ను పెంచుకునే చర్యలు ముమ్మరం చేశారు. కలిసొచ్చిన రాజకీయ శత్రువు.. మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథికి మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్పకు మధ్య ఉన్న రాజకీయ శత్రుత్వం సవితకు కలిసొచ్చింది. పార్థుడిని ఎలాగైనా దెబ్బ తీయాలన్న కసి నిమ్మలలో వ్యక్తమవుతోంది. గతంలో ఎమ్మెల్యేగా ఉన్న బీకే ప్రతి సమావేశంలోనూ నిమ్మలను అవమానపరుస్తూ వచ్చారు. దీంతో పార్థుడి ఓటమే లక్ష్యంగా కిష్టప్ప తన రాజకీయ అస్త్రాలను ఎక్కు పెట్టారు. ఈ క్రమంలో సవితకు కిష్టప్ప మద్దతు ఇస్తున్నట్లుగా పార్టీ శ్రేణులు బాహటంగానే పేర్కొంటున్నాయి. దీనికి తోడు తన కుమారులు అంబరీష్, శిరీష్‌లో ఎవరో ఒకరికి పార్టీ టికెట్ దక్కించుకునేందుకు కిష్టప్ప పావులు కదుపుతున్నారు. పుట్టపర్తి లేక పెనుకొండ నియోజకవర్గాల్లో ఏదో ఒక స్థానం నుంచి కుమారులను బరిలో దించేందుకు కిష్టప్ప ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో ఎలాగైనా తన భార్యకు పార్టీ టికెట్ దక్కించుకునేందుకు సవిత భర్త వెంకటేశ్వర చౌదరి పెద్ద ఎత్తున లాబీయింగ్ మొదలు పెట్టారు. కానీ బీకే మాత్రం అధిష్టానానికి తనపైనే ఎంతో గురి ఉందని, ప్రజల్లోనూ తనకే పట్టు ఉందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ ధీమాతోనే పార్టీలో ఏ ఒక్కరినీ ఆయన ఖాతరు చేయడం లేదు. ఎడమొహం.. పెడమొహం.. పెనుకొండ నియోజకవర్గ వ్యాప్తంగా టీడీపీలో గ్రూపు రాజకీయాలు ఎక్కువయ్యాయి. బీకే పార్థసారథి ఓ కార్యక్రమాన్ని చేపడితే దానికి ప్రతిగా సవిత మరో కార్యక్రమానికి పిలుపునిస్తోంది. దీంతో నిన్నామొన్నటి వరకూ బీకే వెంట నడిచిన పలువురు ముఖ్య నాయకులు సవితమ్మ గ్రూపులోకి చేరారు. ఇక ఏదైనా కార్యక్రమంలో ఇరు వర్గాలు ఎదురుపడ్డా.. ఎడమొహం పెడమొహంగానే ఉంటున్నాయి. అంతటితో ఆగకుండా దూషణల పర్వానికి తెర తీస్తున్నాయి. ఇటీవల పెనుకొండలోని బోయగేరిలో పార్థుడి నేతృత్వంలో జరిగిన ఓ కార్యక్రమం ఇందుకు అద్దం పడుతోంది. తమ ప్రత్యర్థి వర్గానికి చెందిన వారు ఆ కార్యక్రమంలో పాల్గొనరాదంటూ పార్థుడి ముఖ్య అనుచరుడు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేశాడు. ఇది వర్గ పోరుకు మరింత ఆజ్యం పోసింది. పోటాపోటీగా కార్యాలయాలు.. పెనుకొండలో టీడీపీ నాయకులు రెండు కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నారు. తన స్వగృహంలోనే పార్థుడు కార్యాలయం నిర్వహిస్తుండగా.. ప్రతిగా ఎన్టీఆర్ సర్కిల్లో సవితమ్మ చేత మరో కార్యాలయాన్ని ఆమె వర్గీయులు ఏర్పాటు చేయించారు. అంతటితో ఆగకుండా పోటాపోటీగా కార్యక్రమాలు, సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ కిందిస్థాయి కార్యకర్తలను అయోమయానికి గురి చేస్తున్నారు. ఎన్నికలకు మరో ఏడాదిన్నర కాలం ఉండడంతో ముగ్గురు నాయకుల మధ్య తీవ్ర విభేధాలు చంద్రబాబు, లోకేష్ దృష్టికి వెళ్లినట్లు సమాచారం. ( చదవండి: నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: ఎమ్మెల్యే కేతిరెడ్డి ) -
సైకిల్ బ్రాండ్ పాలిట్రిక్స్.. టీడీపీలో రచ్చ రచ్చ..
సాక్షి, కృష్ణా జిల్లా: పచ్చ పార్టీలో ఆయనో సీనియర్ నేత. లోక్ సభ సభ్యుడు కూడా. కాని ఆయన నియోజకవర్గంలో తిరగడంలేదట. కాని తనకు గౌరవం తగ్గినట్లు అనిపిస్తే మాత్రం ఏ స్థాయి నేతైనా అయినా సరే ఏకిపారేస్తున్నారట. తాజాగా ఓ అసెంబ్లీ సెగ్మెంట్లో తెలుగు తమ్ముళ్ల మధ్య తలెత్తిన వివాదం పార్టీల్లో రచ్చ రచ్చ అవుతోంది. నాన్ స్టాప్ ట్రావెల్స్ విజయవాడ ఎంపీ కేశినేని నాని చాన్నాళ్ళుగా పార్టీ అధినేత చంద్రబాబుతో దూరం మెయింటెన్ చేస్తున్నారు. విజయవాడ కేంద్రంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలే ఆయన దూరం కావడానికి కారణమని అందరికీ తెలిసిందే. ఈ ప్రభావం అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ కనిపిస్తోందంటున్నారు. ప్రతీ సెగ్మెంట్లోనూ పార్టీ ఇంఛార్జిలు వర్సెస్ క్యాడర్ అనేలా మారిపోయాయి ప్రస్తుత పరిస్థితులు. ఒంటెద్దు పోకడతో పోయేవారు కొందరైతే... ఈసారి టిక్కెట్ మాకు కావాలంటే మాకు కావాలంటూ పోటీ పడేవారు మరికొందరు. ఐతే ఇలాంటి పంచాయతీనే తిరువూరు నియోజకవర్గంలో తమ్ముళ్ల మధ్య చిచ్చు రాజేసింది. పైగా ఎంపీ కేశినేని నానికి, పార్లమెంటరీ నియోజకవర్గ ఇంఛార్జి నెట్టెం రఘురామ్‌కు మధ్య గ్యాప్ వచ్చేలా చేసింది. పక్కలో బళ్లెం తిరువూరు నియోజకవర్గం టీడీపీకి శావల దేవదత్ ఇంఛార్జిగా వ్యవహరిస్తున్నారు. బాధ్యతలు అప్పగించినప్పటి నుంచి తిరువూరులోని సీనియర్ల పెత్తనానికి దేవదత్ చెక్ పెడుతూ వస్తున్నారు. ప్రత్యేకించి తనకంటూ ఓ కోటరీని ఏర్పాటు చేసుకుని పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే దేవదత్ వైఖరి నచ్చకపోయినప్పటికీ సీనియర్లు మాత్రం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూనే... అతని ఒంటెద్దు పోకడలను తప్పుపడుతున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల టీడీపీ సామాజిక మాధ్యమం ఐటీడీపీ కార్యకర్త ఒకరు దేవదత్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీనిపై దేవదత్ ఎంపీ కేశినేని నాని వద్ద పంచాయతీ పెట్టారు. తన వర్గానికి చెందిన నాయకులను పక్కన పెట్టేయడంతో కేశినేని నానికి.. దేవదత్ మీద పీకల వరకూ కోపం ఉందట. అందుకే దేవదత్ కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన ఐటీడీపీ కార్యకర్తను తన కార్యాలయానికి పిలిపించి...దేవదత్ ఎదుటే అతన్ని సన్మానించారట కేశినేని. అంతటితో ఆగకుండా ఈసారి తిరువూరు టిక్కెట్ నీకు రాదు...ఇప్పటి వరకూ పార్టీ కోసం చేసిన ఖర్చుకి లెక్కలు చెబితే ఆ డబ్బు ఇచ్చేస్తానంటూ దేవదత్‌పై మండిపడ్డారట. ఊహించని ఈ పరిణామంతో దేవదత్ ఖంగుతిన్నారని సమాచారం. చదవండి: అంతా పక్కా స్క్రిప్ట్.. అసలు కారణం ఇదన్న మాట.. ఈ పరిణామం తర్వాత తిరువూరులో దేవదత్ తో పొసగని కేశినేని నాని వర్గం అంతా ఏకమయ్యారు. నియోజకవర్గ ఇంఛార్జిగా దేవదత్ తమకొద్దంటూ ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం వద్ద పంచాయతీ పెట్టారట. దీనిపై నెట్టెం ఇంట్లో మాట్లాడినదంతా తెల్లారేసరికి టీడీపీ అనుకూల పత్రికల్లో వచ్చేయడంతో ఆయన షాక్ తిన్నారట. అంతర్గతంగా మాట్లాడుకున్న విషయాలను బయటికి లీక్ చేస్తే సహించబోనని.. అలాంటి వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవంటూ నెట్టెం రఘురాం హెచ్చరించారట. ఇప్పటికే తన వర్గానికి ప్రాధాన్యత దక్కడం లేదన్న ఆక్రోశంలో ఉన్న కేశినేని నాని సడెన్ గా తెరపైకి వచ్చి.. నెట్టెం రఘురామ్ చేసిన ప్రకటనకు సంబంధించిన పేపర్ క్లిప్పింగ్ ను తన ఫేస్ బుక్ పేజీలో పోస్టు చేశారు. పైగా.. నిజంగా క్రమశిక్షణ ఉల్లంఘించిన వారి లిస్ట్ రుజువులతో సహా పంపిస్తాం.. చర్యలు తీసుకుంటారా మరి అంటూ సెటైర్లు వేశారు కేశినేని నాని. నాని ఫేస్ బుక్ పోస్టు టీడీపీలో తీవ్ర చర్చకు దారితీసిందని సమాచారం. బాబు తెచ్చిన బాధ అసలే పార్టీ అధినేతతో సరిగా పొసగని కేశినేని... ఇలా తనకు కోపం తెప్పిస్తే ఎవరినైనా సోషల్ మీడియా వేదికగా ఉతికి ఆరేస్తుండటంతో తెలుగు తమ్ముళ్ళు విసుక్కుంటున్నారట. పార్టీలో గొడవలుంటే సర్ధి చెప్పాల్సిన స్థాయిలో ఉన్నవారే ఇలా రచ్చకెక్కుతుంటే మా గతేంకానూ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట పచ్చ పార్టీ కార్యకర్తలు. -
రాజ్‌భవన్.. నివురుగప్పిన నిప్పు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం తనపై వివక్ష చూపుతోందంటూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వంపై నేరుగా ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు గవర్నర్ల పాత్ర, ప్రభుత్వాలతో సంబంధాలకు సంబంధించిన అంశాలు మళ్లీ తెరపైకి వస్తున్నాయి. నిజానికి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తమిళిసై స్థాయిలో బహిరంగంగా విమర్శలు చేసిన, ఆవేదన వ్యక్తం చేసిన గవర్నర్ మరొకరు లేరు. నాడు రామ్‌లాల్ నుంచి.. ఉమ్మడి ఏపీ, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటివరకు పనిచేసిన గవర్నర్లలో అత్యంత వివాదాస్పదుడిగా రామ్‌లాల్ పేరును చెబుతుంటారు. ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని అప్రజాస్వామికంగా రద్దు చేసిన గవర్నర్‌గా ఆయన చరిత్రకెక్కారు. తర్వాత కుముద్‌బెన్ జోషి గవర్నర్‌గా ఉన్నప్పుడూ నాటి ఎన్టీఆర్ ప్రభుత్వంతో పలు విషయాల్లో విభేదించి వార్తల్లో నిలిచారు. రాజ్‌భవన్‌లో జోగినులకు వివాహం జరిపించి సంచలనం సృష్టించారు. కొంతకాలం నాటి సీఎం ఎన్టీఆర్‌తో కుముద్‌బెన్ కోల్డ్‌వార్ సాగింది. నరసింహన్ హయాంలో.. ఉమ్మడి ఏపీ గవర్నర్‌గా నరసింహన్ పనిచేసిన కాలంలో పలుమార్లు రాజ్‌భవన్‌కు, ప్రభుత్వానికి మధ్య విభేదాలు వచ్చాయి. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న ఆ సమయంలో నరసింహన్ కొంత కఠినంగా వ్యవహరించారు. ఇక్కడి పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదికలు పంపించారు. ఆయన హయాంలోనే రాష్ట్ర విభజన జరగడంతో.. తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాల బాధ్యతలను కొంతకాలం చూసుకున్నారు. ఈ సమయంలో హైదరాబాద్‌లో శాంతిభద్రతల పరిస్థితిపై వివాదం తలెత్తినప్పుడు.. సెక్షన్–8 ప్రయోగించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతో కొంత ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఇక తెలంగాణ ప్రభుత్వం ఆమోదం కోసం పంపించిన మున్సిపల్ చట్టంపై కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ తిప్పి పంపారు. మార్పులు చేసి తీసుకెళితే ఆమోదించారు. ప్రస్తుత గవర్నర్ తమిళిసై కూడా.. ప్రభుత్వం పాడి కౌశిక్‌రెడ్డిని గవర్నర్ కోటాలో నామినేట్ చేస్తే, ఆయనకు తగిన అర్హతలు లేవంటూ తిప్పిపంపారు. మరోవైపు పశ్చిమబెంగాల్, తమిళనాడు, మహారాష్ట్ర (ఉద్ధవ్‌ఠాక్రే సీఎంగా ఉండగా), కేరళ రాష్ట్రాల గవర్నర్లు, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కూడా పలు అంశాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో విభేదించి వివాదాస్పదులుగా నిలిచారు. ఇదీ చదవండి: గవర్నర్ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రుల ఆగ్రహం.. -
మూడు పెళ్లిళ్లు.. సవతుల మధ్య పోరు.. చివరికి షాకింగ్ ట్విస్ట్
తిరువొత్తియూరు(తమిళనాడు): కృష్ణగిరి జిల్లాలో సవతుల మధ్య జరిగిన పోరులో ఓ తల్లీ, కుమారుడు సజీవదహనం అయిన సంఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని ఊతంకరై సమీపంలో ఉన్న కల్లావి చెంగల్ పట్టికి చెందిన సెందామరై కన్నన్ (55) వీధి నాటకం కళాకారుడు. ఇతను ధర్మపురి జిల్లా స్వామియార్ పురానికి చెందిన సెల్విని మొదట వివాహం చేసుకున్నాడు. చదవండి: మహిళతో వివాహేతర సంబంధం.. పెళ్లికి ఒప్పుకోలేదని.. వీరికి ఇద్దరు కుమార్తెలు. ఆ తరువాత సెందామరై కన్నన్ కీల్‌కుప్పం ప్రాంతానికి చెందిన కమల (47)ను రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి కూడా ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. అందులో కుమార్తెకు వివాహం కాగా, కుమారుడు గురు (17) ప్లస్ టూ చదివి ఇంట్లో ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో అతను సత్య (30) అనే మహిళను మూడో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ముత్తు అనే కుమారుడు ఉన్నాడు. ఈ క్రమంలో రెండో భార్య కమల, మూడో భార్య సత్యకు మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కమల, గురు బుధవారం రాత్రి ఇంటిలో భోజనం చేసి నిద్రపోయారు. గురువారం వారు ఎంతకీ ఇంటిలో నుంచి బయటకు రాకపోవడంతో ఇరుగుపొరుగు వారు అనుమానం వచ్చి చూశారు. అనంతరం కల్లావి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి తలుపులు పగలగొట్టి చూడగా, అక్కడ కాలిపోయిన స్థితిలో కమల, గురు మృతదేహాలు ఉన్నాయి. విచారణలో ఇద్దరూ సజీవ దహనం చేసుకున్నట్లు తెలిసింది. దీనిపై సమాచారం అందుకున్న ఊతంకరై డీఎస్పీ అలెగ్జాండర్ విచారణ చేపట్టి, ఇద్దరి మృతదేహాలను శవ పరీక్ష కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సవతుల గొడవలో ఇద్దరు సజీవదహనం కావడంపై సెందామరై కన్నన్, సత్యను పోలీసులు విచారణ చేస్తున్నారు. -
రచ్చ రచ్చ.. మైదుకూరు టీడీపీలో డీఎల్ ‘చిచ్చు’
సాక్షి ప్రతినిధి, కడప: రాబోయే ఎన్నికల్లో మైదుకూరు టీడీపీ టిక్కెట్ నాకంటే నాకంటూ మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి పుట్టా సుధాకర్ యాదవ్‌లు పోటీపడి ప్రచారం చేస్తున్నారు. దీంతో పచ్చ పార్టీలో రచ్చ రోడ్డెక్కింది. పార్టీలో చేరకుండానే సీనియర్ నేత డీఎల్ రవీంద్రారెడ్డి టీడీపీలో వర్గ రాజకీయాలకు ఆజ్యం పోశారు. ఔట్‌డేటెడ్ డీఎల్‌కు టీడీపీ టిక్కెట్ ఇచ్చే ప్రసక్తే లేదని, రాబోయే ఎన్నికల్లో తానే పోటీ చేస్తానని పుట్టా సుధాకర్ యాదవ్ వర్గం తేల్చి చెబుతోంది. దీంతో మైదుకూరు నియోజకవర్గంలో టీడీపీ రెండు వర్గాలుగా చీలిపోయింది. చదవండి: టీడీపీ నాయకుడి కొడుకు నిర్వాకం.. ‘రూ.40 లక్షలు తెస్తేనే కాపురం చేస్తా’ వచ్చే ఎన్నికల్లో మైదుకూరు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయడం ఖాయమని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి విస్తృత ప్రచారం చేస్తున్నారు. జులై నెల నుంచి నియోజకవర్గం మొత్తం తిరిగి ప్రచారం చేయనున్నట్లు ఆయన మీడియాకు వెల్లడించారు. దశాబ్దకాలంగా క్రీయాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న డీఎల్ ఇటీవలి కాలంలో అధికార పార్టీపై పనిగట్టుకుని విమర్శలకు దిగుతూ తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ మధ్యే ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌లను డీఎల్ హైదరాబాదులో కలిశారు. తర్వాత నియోజకవర్గానికి వచ్చి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు తన అనుయాయులతోపాటు మీడియాకు వెల్లడించారు. త్వరలోనే నియోజకవర్గంలో తిరుగుతానని చెప్పిన డీఎల్ అందుకోసం వేద పండితులను సంప్రదించి ముహూర్తం సైతం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈలోగా మైదుకూరు టీడీపీ అభ్యర్థిగా తనను ప్రకటించాలని టీడీపీ అధిష్టానంపై డీఎల్ ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఇదే సందర్భంలో మైదుకూరులో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి తప్ప మిగిలిన వ్యక్తులు ఇప్పటివరకు గెలువలేదని చంద్రబాబు, లోకేష్‌లకు గణాంకాలతో డీఎల్ వివరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తనకే టిక్కెట్ ఇవ్వాలని, ఒకవేళ సుధాకర్ యాదవ్‌కు ఇచ్చినా గెలిచే ప్రసక్తే లేదని డీఎల్ తేల్చి చెప్పినట్లు సమాచారం. చంద్రబాబు ఎటూ తేల్చకపోవడంతో వెనుదిరిగి వచ్చిన ఆయన తనకే టిక్కెట్టు అంటూ మైదుకూరు నియోజకవర్గంలో ప్రచారం మొదలు పెట్టారు. డీఎల్‌ది మైండ్ గేమ్....టిక్కెట్ నాదే! రాబోయే ఎన్నికల్లోనూ మైదుకూరు టిక్కెట్ తనకేనని టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి పుట్టా సుధాకర్ యాదవ్ ధీమాగా ఉన్నారు. డీఎల్‌కు టీడీపీ టిక్కెట్ అన్న ప్రచారం నేపథ్యంలో ఆయన మూడు రోజుల కిందట పార్టీ అధినేత చంద్రబాబును కలిశారు. అనంతరం డీఎల్ మైండ్ గేమ్ మాటలు ఎవరూ నమ్మవద్దని నియోజకవర్గంలోని తన వర్గీయులకు తేల్చి చెప్పారు. సుధాకర్ యాదవ్ ఇన్నాళ్లు పార్టీని నమ్ముకుని ఆర్థికంగా నష్టపోయాడని, రెండుసార్లు ఓడిపోయాడన్న సానుభూతితోపాటు ఆర్థికంగా బలోపేతంగా ఉండడం ఆయనకు రాబోయే ఎన్నికల్లో కలిసి వస్తుందని ఆయన వర్గీయులు చెబుతున్నారు. బీసీ సామాజిక వర్గం మొత్తం సుధాకర్ యాదవ్‌కు అండగా నిలవనుందని వారు చెబుతున్నారు. ఇదే సమయంలో సుధాకర్‌యాదవ్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఓ వర్గం ఈ దఫా ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్ రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తోంది. మరోవైపు డీఎల్ చెప్పిన రెడ్డి సామాజిక వర్గ సెంటిమెంట్‌ను పదేపదే చంద్రబాబు, లోకేష్ చెవిలో వేస్తున్నట్లు తెలుస్తోంది. రచ్చకెక్కిన వర్గ విబేధాలు మైదుకూరు టీడీపీ టిక్కెట్ తనకేనంటూ డీఎల్ రవీంద్రారెడ్డి తెరపైకి రావడంతో పార్టీలో వర్గ విబేధాలు రచ్చకెక్కాయి. సుధాకర్‌యాదవ్‌ను వ్యతిరేకిస్తున్న కొన్ని వర్గాలు డీఎల్‌కు టిక్కెట్ అంటూ ప్రచారం చేస్తుండగా సుధాకర్‌యాదవ్‌కు టిక్కెట్ ఇ వ్వకపోతే పార్టీనే వీడుతామని ఆయన అనుచరవ ర్గం అంటున్నారు. ఒకవేళ డీఎల్‌కు టిక్కెట్టు ఇచ్చినా ఆయనను ఓడగొట్టడం ఖాయమని చెబుతున్నారు. మొత్తంగా మైదుకూరు టీడీపీ టిక్కెట్ ఎవరికి ఇచ్చినా ప్రత్యర్థి వర్గం సహకరించే పరిస్థితి లేదు. -
మరీ బిత్తిరితనం.. పెళ్లి కొడుకు షేర్వాణీ ధరించడంతో ఏకంగా రాళ్లతో...
భోపాల్: పెళ్లిలో వరుడు షేర్వాణీ ధరించడంపై చెలరేగిన వివాదం ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లా మంగ్‌బడా గ్రామం ఇందుకు వేదికైంది. వరుడు షేర్వాణీ వేసుకోగా గిరిజన సంప్రదాయానుసారం ధోతీ, కుర్తా మాత్రమే ధరించాలంటూ అమ్మాయి తరఫువాళ్లు పట్టుబట్టారు. దీనిపై చెలరేగిన వాగ్వాదం ముదిరి అమ్మాయి, అబ్బాయి తరఫువారు రాళ్లు రువ్వుకోవడంతో పలువురు గాయపడ్డారు. దీనిపై పరస్పరం పోలీసులకు ఫిర్యాదు కూడా చేసుకున్నారు. షేర్వాణీపై పెళ్లికూతురి తల్లిదండ్రులు అభ్యంతరపెట్టకున్నా వారి బంధువులే రగడ చేశారంటూ పెళ్లికొడుకు ముక్తాయించాడు. ఆ తర్వాత పెళ్లి నిరాటంకంగా జరిగిపోవడం విశేషం! చదవండి👉 అయ్యా సర్పంచునయ్యా.. దానం చెయ్యండి -
తేలని వివాదం.. బిగ్‌బజార్‌ని స్వాధీనం చేసుకోనున్న రిలయన్స్
దేశంలోనే అతి పెద్ద వివాస్పద డీల్స్‌లో ఒకటిగా నిలిచింది ఫ్యూచర్ గ్రూప్ అమ్మకం. ఫ్యూచర్ గ్రూపులో అమెజాన్ పెట్టుబడులు ఉండగా.. దాన్ని రిలయన్స్ కొనుగోలు చేసేందుకు ప్రయత్నించింది. ఈ నిర్ణయం వివాస్పదం కావడంతో ఢిల్లీ హైకోర్టు, సుప్రీం కోర్టు, సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్లలో ఈ కేసుపై విచారణ కొనసాగుతున్నాయి. రిలయన్స్ సంస్థ 2.3 బిలియన్ డాలర్లకు ఫ్యూచర్ కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. అమెజాన్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ డీల్ మధ్యలో ఆగిపోయింది. ఈ వివాదం తలెత్తె సమయానికి దేశవ్యాప్తంగా ఫ్యూచర్ గ్రూప్‌కి 1700 అవుట్‌లెట్స్ ఉన్నాయి. సుదీర్ఘ విచారణ జరిగినా కేసు ఓ కొలిక్కి రాలేదు. ఇంతలో ఫ్యూచర్ గ్రూప్ ఆధీనంలో ఉన్న అవుట్‌లెట్స్ లీజు అగ్రిమెంట్లు ముగుస్తున్నాయి. తమకు లీజు బకాయిలు చెల్లించాలంటూ భవనాల యజమానుల నుంచి ఒత్తిడి వస్తోంది. అంతేకాదు రెండేళ్లుగా ఫ్యూచర్ ఆధీనంలో ఉన్న బిగ్‌బజార్ తదితర అవుట్లెట్ల వ్యాపారం మందగించింది. ఉద్యోగుల భవిష్యత్తు ప్రమాదంలో పడింది. కోర్టులో వివాదం నడుస్తున్నప్పటికీ ఫ్యూచర్ ఆధీనంలోని 1700 అవుట్లెట్లలో ఓ 200 అవుట్లెట్లను రిలయన్స్ స్వాధీనం చేసుకునే ఆలోచనలో ఉంది. వాటిని పాత పేరుతో లేదా రిలయన్స్ బ్రాండ్ కిందకు తీసుకువచ్చి వ్యాపారం పునరుద్ధరించే లక్ష్యంతో ఉంది. ఇప్పటికే ఎంపిక చేసిన రిటైల్ అవుట్లెట్లలో పని చేస్తున్న ఉద్యోగులకు సమాచారం అందించారు. అయితే ప్రస్తుత వ్యహారంపై రిలయన్స్, ఫ్యూచర్, అమెజాన్లు అధికారికంగా స్పందించలేదు. తాజా అప్డేట్స్ను ముందుగా రాయిటర్స్ ప్రచురించగా ఆ తర్వాత జాతీయ మీడియాలో ఇది హాట్‌టాపిక్‌గా మారింది. మరోవైపు ఫ్యూచర్ వివాదానికి సంబంధించి 2022 మార్చిలో న్యాయస్థానాల్లో మరోసారి విచారణ జరగనుంది. -
వివక్ష, వివాదం ఉంటేనే జోక్యం
న్యూఢిల్లీ: ప్రభుత్వ పాలనా విధానాల్లో స్పష్టంగా వివక్ష, వివాదకర అంశాలు ఉన్న సందర్భాల్లోనే కోర్టులు కలగజేసుకోవాలని, విధానాలు సవ్యంగా ఉన్నపుడు జోక్యం అనవసరమని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. బోనస్ మార్కుల విషయంలో హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఎన్హెచ్ఎం, ఎన్ఆర్హెచ్ఎం సిబ్బంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌ను గురువారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎల్.నాగేశ్వర రావు, జస్టిస్ బీఆర్ గవాయ్‌ల ధర్మాసనం విచారించింది. ‘ రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ అవసరాలకు తగ్గట్లుగా శిక్షణ పూర్తిచేసుకుని రాజస్తాన్ గ్రామీణ, ఎడారి ప్రాంతాల్లో పనిచేసిన ఆ సిబ్బందికి అదనపు పరిజ్ఞానం, అనుభవం ఉంటుంది. అందుకే వారికి అదనంగా బోనస్ మార్కులు ఇవ్వడం సబబే. ఇలాంటి పరిపాలనా విధానాల్లో కలగజేసుకోవడంలో కోర్టులు తొందరపాటు పనికిరాదు. వివాదాలు ఉంటేనే న్యాయం అందించేందుకు నెమ్మదిగా జోక్యం చేసుకోవాలి’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అనవసర వ్యాఖ్యలొద్దు న్యూఢిల్లీ: ఏదైనా కేసుపై విచారణ జరిపేటప్పుడు దానితో సంబంధం లేని అనవసర వ్యాఖ్యలు చేయద్దని హైకోర్టులకు సుప్రీంకోర్టు సూచించింది. హైకోర్టులు పరిధులను అతిక్రమించరాదని, వాద, ప్రతివాదుల మధ్య వివాదాలకు తలెత్తేలా వ్యవహరించరాదని, అనవసర వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని జస్టిస్ ఎం.ఆర్.షా, జస్టిస్ బి.వి.నాగరత్నతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఓ టెండర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ భారత్ ఫ్రిట్జ్ వెర్నర్ లిమిటెడ్ అనే సంస్థ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ విషయంలో హైకోర్టు వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. ఢిల్లీ హైకోర్టు కనీసం రిట్ పిటిషన్ అర్హతను కూడా నిర్ణయించలేదని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆక్షేపించింది. కేసుతో సంబంధం లేని అనవసర వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని హితవు పలికింది. -
స్పైస్‌జెట్ ప్రతిపాదనలను అంగీకరించం
న్యూఢిల్లీ: స్పైస్‌జెట్‌తో రూ.600 కోట్ల తమ వివిద పరిష్కారానికి సంబంధించి ఆ సంస్థ చేసిన రెండు ప్రతిపాదనలూ తమకు ఆమోదయోగం కాదని కేఏఎల్ ఎయిర్వేస్, మీడియా దిగ్గజం కళానిధి మారన్లు సుప్రీంకోర్టుకు తెలియజేశారు. స్పైస్‌జెట్ రెండు ప్రతిపాదనలను అంగీకరిస్తారా? అని ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, న్యాయమూర్తులు ఎఎస్ బోపన్న, హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం కాల్ ఎయిర్వేస్ ప్రైవేట్ లిమిటెడ్, మారన్ల అభిప్రాయాన్ని అడిగినప్పుడు, ఈ ప్రతిపాదనలు ఆమోదయోగం కాదని పేర్కొన్నాయి. కేసు తదుపరి విచారణ మార్చి 2వ తేదీకి వాయిదా పడింది. కళానిధి మారన్ స్పైస్‌జెట్ మాజీ ప్రమోటర్. ఆయనకు చెందిన కేఏఎల్ ఎయిర్వేస్ ఎయిర్‌లైన్ ట్రాన్స్పోర్ట్ సేవలను నిర్వహిస్తోంది. కేసు వివరాలు క్లుప్తంగా... కేఏఎల్, మారన్లు స్పైస్‌జెట్‌లో తమ షేర్‌హోల్డింగ్‌ను 2015 ఫిబ్రవరిలో కంట్రోలింగ్ షేర్‌హోల్డర్, సహ వ్యవస్థాపకుడు అజయ్ సింగ్‌కు బదలాయించారు. అయితే ఈ డీల్‌కు సంబంధించి ప్రిఫర్డ్ షేర్లు, వారెంట్లను మారన్‌కు అనుకూలంగా జారీ చేయకపోవడంపై వివాదం నెలకొంది. స్పైస్‌జెట్‌లోని తమ మొత్తం 350.4 మిలియన్ల ఈక్విటీ షేర్లను, ఎయిర్‌లైన్‌లో 58.46 శాతం వాటాను దాని సహ వ్యవస్థాపకుడు సింగ్‌కు ఫిబ్రవరి 2015లో కేవలం రూ. 2కి మారన్, కేఏఎల్ ఎయిర్వేస్కు చేశారు. స్పైస్‌జెట్‌తో వాటా బదిలీ వివాదంపై మారన్ కేఏఎల్ ఎయిర్వేస్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాయి. ఈక్విటీ షేర్లుగా రీడీమబుల్ చేయదగిన 18 కోట్ల వారెంట్లను తమకు బదలాయించాలని డిమాండ్ చేశాయి. 2016 జూలై 29న హైకోర్టు రూలింగ్ ఇస్తూ, ఆర్బిట్రేషన్ కింద వివాదాన్ని పరిష్కరించుకోవాలని సూచించింది. రూ.579 కోట్లను హైకోర్టు రిజిస్ట్రీ వద్ద డిపాజిట్ చేయాలని కూడా స్పైస్‌జెట్, సింగ్‌ను హైకోర్టు ఆదేశించింది. అయితే కోర్టు తదుపరి ఆదేశాల మేరకు స్పైస్‌జెట్ హైకోర్టులో రూ.329 కోట్ల బ్యాంక్ గ్యారెంటీని, రూ.250 కోట్ల నగదును డిపాజిట్ చేసింది. అయితే దీనిపై స్పైస్‌జెట్ చేసిన అప్పీల్‌ను 2017 జూలైలో అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. మరోవైపు 2018 జూలై 20వ తేదీన ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ అవార్డు ఇస్తూ, వారెంట్లు ఇష్యూ చేయనందుకు రూ.1,323 కోట్ల నష్టపరిహారాన్ని ఇవ్వాలన్న మారన్ కేఏఎల్ క్లెయిమ్‌ను కొట్టేసింది. అయితే వడ్డీసహా రూ.579 కోట్ల రిఫండ్ చేయాలని ఆదేశించింది. ఆర్బిట్రేషన్ అవార్డుపై సన్ టీవీ నెట్వర్క్ యజమాని కూడా అయిన మారన్, కేఏఎల్ ఎయిర్‌వేస్‌లు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాయి. దీనిపై ఢిల్లీ హైకోర్టు 2020 నవంబర్ 2వ తేదీన ఆదేశాలు ఇస్తూ, ఈ వివాదంలో వడ్డీకి సంబంధించి రూ.243 కోట్ల డిపాజిట్ చేయలని స్సైస్జెట్ను ఆదేశించింది. స్పైస్‌జెట్ నవంబర్ 7న సుప్రీంకోర్టును ఆశ్రయించి, ఈ ఉత్తర్వుపై స్టే పొందింది. రెండు ప్రతిపాదనలు ఇవీ.. అత్యున్నత న్యాయస్థానంలో వివాద శాశ్వత పరిష్కారానికి స్పైస్‌జెట్ రెండు ప్రతిపాదనలు చేసింది. అందులో ఒకటి– ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్గా రూ.300 కోట్ల చెల్లింపులు. ఢిల్లీ హైకోర్టులో డిపాజిట్ చేసిన రూ. 270 కోట్ల బ్యాంక్ గ్యారెంటీలో ప్రస్తుతానికి రూ.100 కోట్లు చెల్లించి, కేసు తదుపరి విచారణ ఢిల్లీ హైకోర్టులో వేగవంతం చేసేలా సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు పొందడం రెండవ ఆఫర్. తాజాగా ఈ రెండు ఆఫర్లను కేఏఎల్ ఎయిర్వేస్, మారన్లు తిరస్కరించారు. ఆర్బిట్రేషన్ అవార్డు కింద తమకు రూ.920 కోట్లు స్పైస్‌జెట్ నుంచి రావాల్సి ఉందని డిమాండ్ చేశాయి. -
ఏ కష్టం వచ్చిందోగానీ.. కానిస్టేబుల్ భార్య ఆత్మహత్య
సాక్షి, తుమకూరు (కర్ణాటక): ఏ కష్టం వచ్చిందోగానీ పసిగుడ్డును వదిలేసి పోలీస్ క్వార్టర్స్‌లో కానిస్టేబుల్ భార్య ఆత్మహత్య చేసుకుంది. చిక్కనాయకనహళ్ళి పోలీస్ స్టేషన్ వద్ద ఈ ఘటన జరిగింది. కానిస్టేబుల్ శశిధర్, భార్య లావణ్య (32)తో కలిసి క్వార్టర్స్‌లో ఉంటున్నాడు. ఏడాదిన్నర క్రితం పెళ్లి కాగా, వీరికి ఆరునెలల మగ బిడ్డ ఉన్నాడు. ఇద్దరూ చుట్టుపక్కల గ్రామాలకు చెందినవారే. ఆదివారం ఉదయం శశిధర్ డ్యూటీకి వెళ్లినప్పుడు ఇంట్లో లావణ్య ఉరి వేసుకుంది. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన శశిధర్ ఉరికి వేలాడుతున్న భార్యను కిందికి దించి ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె కన్నుమూసింది. వేధింపులతో యువకుడు ఆత్మహత్య మైసూరు: టి.నరసిపుర తాలూకా వ్యాసరాజపుర గ్రామానికి చెందిన రామనాయక కుమారుడు మను (19) అనే యువకుడు యువతి కుటుంబం వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతడు ఒక యువతిని ప్రేమిస్తున్నట్లు చెప్పగా ఆమె తిరస్కరించింది. ఈ విషయంలో యువతి బంధువులు సిద్దరాజు, ప్రతాప్, శాంతరాజు, భాగ్యమ్మ అనేక సార్లు పిలిచి మనును తిట్టడంతో అతడు ఆవేదన చెందాడు. దీంతో ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. మను తల్లి బన్నూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేపట్టారు. -
విశాఖ రింగు వలల వివాదం పరిష్కారంపై సమావేశం
-
విశాఖ: మత్స్యకార గ్రామాల్లో 144 సెక్షన్ ఎత్తివేత
సాక్షి, విశాఖపట్నం: రింగు వలల వివాదం పరిష్కారానికి మత్స్యకార సంఘాల నాయకులతో ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రులు అవంతి శ్రీనివాస్, కురసాల కన్నబాబు, సీదిరి అప్పలరాజు ఆదివారం చర్చలు జరిపారు. సంప్రదాయ కారులు, రింగు వలల మత్స్యకార సంఘాల ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు వెల్లడించారు. ఈ నెల 20లోగా నివేదిక ఇవ్వాలని గడువు పెట్టామని తెలిపారు. రేపటి నుంచి సంప్రదాయ మత్స్యకారులు చేపలవేటకు వెళ్లొచ్చాన్నారు. సముద్రంలో 8 కి.మీ తర్వాత రింగు వలలు వాడొచ్చని పేర్కొన్నారు. అధికారులు, మత్సకార సంఘాల నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. మత్స్యకార గ్రామాల్లో రేపటి నుంచి 144 సెక్షన్ ఎత్తివేస్తున్నట్లు మంత్రి తెలిపారు. చదవండి: 'ప్రేమపెళ్లి.. జ్యోతుల నెహ్రూ నుంచి ప్రాణహాని ఉంది' ఇటీవల రింగు వలల వినియోగం విషయంపై సముద్రంలో మత్స్యకారుల మధ్య తలెత్తిన వివాదం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. ఈ మేరకు జిల్లా ఇన్చార్జ్ మంత్రి కురసాల కన్నబాబు, మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి విశాఖ కలెక్టరేట్ కార్యాలయంలో మత్స్యకార సంఘం నాయకులతో భేటీ అయ్యారు. ఇరు వర్గాల నుంచి వివిధ అంశాలపై అభిప్రాయాలను సేకరించారు. వీటిపై అధికారుల నుంచి కూడా వివరణ తీసుకున్నారు ఈ దశలో సాంప్రదాయ మత్స్యకారులు చేపల వేట కొనసాగించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని అధికారులు తేల్చారు. అలాగే రింగు వలల వినియోగంపై లైసెన్స్ ఉన్న మత్స్యకారులు తీరం నుంచి 8 కిలో మీటర్ల దూరంలో చేపలవేట కొనసాగించవచ్చని కూడా అధికారులు నిర్ణయించారు అయితే ఎనిమిది కిలోమీటర్ల దూరంలో చేపలవేట సాగించినట్లయితే ఎలాంటి మత్స్య సంపద లభించదని రింగు వలల మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇరు గ్రామాలకు చెందిన మత్స్యకారులు నిర్ణీత ప్రాంతంలో చేపల వేట కొనసాగించడానికి అనుమతి ఇవ్వాలని అధికారులను మత్స్యకారులు కోరారు. అలాంటి అనుమతులు చట్టబద్ధంగా ఇవ్వడానికి అవకాశం లేదని అధికారులు తేల్చి చెప్పారు. దీంతో ఇరు గ్రామాల పెద్దలు కొందరు అధికారులతో కలిసి కమిటీగా ఏర్పడి ఈ సమస్యను పరిష్కరించుకుంటామని చెప్పారు. దీంతో ఈ నెల 20వ తేదీలోగా ఈ సమస్యపై గ్రామ పెద్దల మధ్య చర్చలు జరిపి నివేదిక ఇవ్వాలని మంత్రులు సూచించగా.. ఇరు గ్రామాల ప్రజలు కూడా సమ్మతించారు మరోవైపు ఉద్రిక్తతల నడుమ కొనసాగిస్తున్న 144 సెక్షన్ కూడా ఎత్తి వేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ ప్రకటించారు. మత్స్యకారులు సమన్వయంతో చేపల వేటను రేపటినుంచి కొనసాగించవచ్చని మంత్రులు ప్రకటించారు. -
ట్రాక్టర్‌తో ఢీకొట్టించి.. చక్రాలతో తొక్కించాడు..!
సాక్షి, హుజూర్నగర్(నల్లగొండ): పాతకక్షల నేపథ్యంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన హుజూర్నగర్ మండలం లక్కవరంలో బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని లక్కవరం గ్రామానికి చెందిన బాతుక మహేష్(32) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మహేష్ అదే గ్రామానికి చెందిన సైదులు భార్యతో సఖ్యతగా మెలుగుతున్నాడని గొడవలు జరుగుతున్నాయి. పలు మార్లు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీలు కూడా జరిగాయి. ట్రాక్టర్‌తో ఢీకొట్టి.. మహేష్ మంగళవారం గ్రామ శివారులోని డొంకదారి గుండా బైక్‌పై వస్తున్నాడు. అదే సమయంలో సైదులు ట్రాక్టర్‌తో వచ్చి ఢీకొట్టాడు. దీంతో మహేశ్ ఎగిరి పక్కన పొలంలో పడిపోయాడు. అనంతరం ట్రాక్టర్‌తో మరోమారు ఢీకొట్టడంతో మహేశ్ అక్కడికక్కడే మృతిచెందాడు. ట్రాక్టర్‌ను అక్కడే వదిలేసి కుటుంబంతో సహా నిందితుడు పారిపోయాడు. రైతులు గమనించడంతో.. ఉదయం వ్యవసాయ పొలాలకు వెళ్తున్న రైతులు వ్యవసాయ పొలంలో బైక్, మృతదేహం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. పాతకక్షల నేపథ్యంలో సైదులే ఘాతుకానికి ఒడిగట్టాడని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య యమున, ఇద్దరు కుమార్తెలు స్పందన, హారికలు ఉన్నారు. కాగా మృతుడి భార్య ఫిర్యాదు మేరకు సైదులుపై హత్య కేసు నమాదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కె.వెంకట్‌రెడ్డి తెలిపారు. -
పన్ను వివాద కేసుల ఉపసంహరణ: కెయిర్న్
న్యూఢిల్లీ: దాదాపు ఏడేళ్లుగా భారత ప్రభుత్వంతో నెలకొన్న రెట్రాస్పెక్టివ్ ట్యాక్స్ వివాదానికి ముగింపు పలికే దిశగా బ్రిటన్ ఇంధన దిగ్గజం కెయిర్న్ ఎనర్జీ చర్యలు తీసుకుంది. కేంద్రంతో కుదుర్చుకున్న సెటిల్మెట్ ఒప్పందం ప్రకారం.. అమెరికా, ఫ్రాన్స్, సింగపూర్ తదితర దేశాల కోర్టుల్లో భారత్‌పై వేసిన దావాలన్నింటినీ ఉపసంహరించుకుంది. ఇందుకు సంబంధించి కేసులను ఉపసంహరించుకున్న వివరాలతో కేంద్రానికి ఫారం 3ని సమర్పించనున్నట్లు కెయిర్న్ ఎనర్జీ (ప్రస్తుతం క్యాప్రికార్న్ ఎనర్జీ) తెలిపింది. ఆ తర్వాత ట్యాక్స్‌ల రిఫండ్ కోసం ప్రభుత్వం ఫారం 4 జారీ చేస్తుందని పేర్కొంది. దీంతో రూ. 7,900 కోట్ల పన్ను మొత్తాన్ని ప్రభుత్వం నుంచి రిఫండ్ పొందేందుకు కంపెనీకి మార్గం సుగమం అయ్యింది. ఇదీ నేపథ్యం 2006–07లో భారత విభాగాన్ని లిస్టింగ్ చేసే ముందు వ్యాపార పునర్వ్యవస్థీకరణ ద్వారా కెయిర్న్ గణనీయంగా క్యాపిటల్ గెయిన్స్ పొందిందన్నది ఆదాయ పన్ను శాఖ ఆరోపణ. లావాదేవీలు జరిగి చాలాకాలం గడిచినప్పటికీ వాటికి కూడా పన్నులను వర్తింపచేసే విధంగా (రెట్రాస్పెక్టివ్) 2012లో ప్రవేశపెట్టిన చట్టాన్ని ప్రయోగించి రూ. 10,247 కోట్ల మేర పన్నులు కట్టాలంటూ కెయిర్న్‌కు నోటీసులు పంపించింది. దీనిపై కెయిర్న్.. ఆర్పిట్రేషన్ ట్రిబ్యునళ్లను ఆశ్రయించగా కంపెనీకి అనుకూలంగా తీర్పులు వచ్చాయి. అంతర్జాతీయంగా పరువు పోతుండటంతో గతేడాది ఆగస్టులో వివాదాస్పద రెట్రాస్పెక్టివ్ చట్టాన్ని కేంద్రం పక్కన పెట్టింది. -
పొలం తవ్వుతుండగా గుప్త నిధులు.. మహిళ పూనకంతో ఊగిపోయి
సాక్షి, రామన్నపేట(నల్లగొండ): మండలంలోని కుంకుడుపాముల గ్రామంలో ఓ రైతు పొలంలో గుప్తనిధులు లభ్యమైన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. కుంకుడుపాముల గ్రామానికి చెందిన కన్నెబోయిన మల్లయ్య సర్వే నంబర్లు 16, 17లోని తన పొలంలో వారం రోజుల క్రితం గట్లు తీస్తుండగా మట్టిపాత్ర(గురిగి), చిన్న ఇనుపపెట్టె కనిపించాయి. మట్టిపాత్రలో 38 వెండి నాణేలు, 5 వెండి పట్టీలు, 14 వెండి రింగులు(విరిగినవి) లభ్యమయ్యాయి. ఇనుప పెట్టెలో 19 బంగారు బిళ్లలు(పుస్తెలతాడుకు ఉండేవి) ఐదు బంగారు గుండ్లు ఉన్నాయి. వెండి నాణేలపై ఉర్దూ పదాలు ఉన్నాయి. కాగా మల్లయ్య తీసిన గట్టును ఆనుకొని అతడి సోదరుడు లింగయ్య పొలం ఉంటుంది. అందులో నాటు వేసేందుకు వచ్చిన కూలీలు వాటిని తలా ఒకటి తీసుకోవడానికి చేతిలో పట్టుకున్నారు. అదే సమయంలో ఒక మహిళ పూనకం వచ్చినట్టు ఊగి వాటిని ముట్టుకుంటే అరిష్టమని పలుకడంతో వారంతా నాణేలు, బంగారు ఆభరణాలను తిరిగి ఇచ్చారు. పొలంలో లభ్యమైన నిధిని మల్లయ్య ఇంటి వద్ద గల పెంటకుప్పలో దాచాడు. విషయం తెలుసుకున్న అతడి సోదరుడు లింగయ్య ఇద్దరి మధ్య ఉన్న పొలంగట్టులో దొరికింది కాబట్టి తనకు వాటా కావాలని డిమాండ్ చేశాడు. వరినాట్లు ముగిసిన రెండురోజుల అనంతరం సోదరులిద్దరు గ్రామంలోని ఓ పెద్దమనిషిని ఆశ్రయించారు. సమానంగా పంచుకోవాలని పెద్దమనిషి సలహా ఇచ్చాడు. వాటిని పంచుకునే విషయంలో అన్నదమ్ములిద్దరికీ తేడా వచ్చింది. దీంతో మల్లయ్య మంగళవారం తనకు పొలంలో దొరికిన గుప్తనిధిని రామన్నపేట పోలీసులకు అప్పజెప్పాడు. గుప్తనిధి వివరాలను రెవెన్యూ అధికారులకు అందించామని, గురువారం వారికి అందజేయనున్నట్లు సీఐ చింతా మోతీరాం తెలిపారు. చదవండి: మరో ఆసక్తికర పరిణామం.. జిరాక్స్ తీస్తే కొంపలు అంటుకుంటాయ్..!? -
మరదలిని లోబర్చుకుని.. భార్యకు పిల్లలు పుట్టకుండా చేసి
సాక్షి, నల్లగొండ: మహిళను వేధింపులకు గురిచేసిన ఐదుగురిపై స్థానిక మహిళా పోలీస్ స్టేషన్లో గురువారం కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ మండలంలోని అనంతారం గ్రామానికి చెందిన మహేశ్వరం సువర్ణను హైదరాబాద్‌లోని మీర్‌పేటకు చెందిన సంపూర్ణచారికి ఇచ్చి 30 ఏళ్ల క్రితం వివాహం చేశారు. కట్నంగా ప్లాటు, నాలుగు తులాల బంగారు ఆభరణాలు ఇచ్చారు. వివాహమైన తర్వాత మూడేళ్ల వరకు వారి సంసారం సాఫీగా జరిగింది. ఈ క్రమంలో జీవనోపాధి కోసం సంపూర్ణచారి అనంతారం అత్తగారింటికి వచ్చి సువర్ణ సోదరి సరస్వతితో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. పథకం ప్రకారం సంపూర్ణచారి సువర్ణను ఇబ్బందులకు గురి చేస్తూ గర్భం దాల్చకుండా చేసి పిల్లలు పుట్టరనే నెపంతో ఇద్దరితో కలిసి ఉంటానని నమ్మించి సరస్వతిని పెళ్లిచేసుకున్నాడు. తనను మంచిగా చూసుకుంటానని మోసం చేశాడని, ఆత్మహత్య చేసుకోవాలని తనపై పలుమార్లు దాడి చేశారని భర్త సంపూర్ణచారిపై సువర్ణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగలక్ష్మి తెలిపారు. చదవండి: రహస్యంగా ఫోన్‌కాల్స్.. ఎన్నిసార్లు చెప్పినా మారని కోడలు.. చివరకు -
పక్కింటి వారి వేధింపులు.. ఆటోడ్రైవర్ ఆత్మహత్య
సాక్షి, మందమర్రిరూరల్(ఆదిలాబాద్): పట్టణంలోని పాటచెట్టు ప్రాంతానికి చెందిన కాదాసి సమ్మయ్య (49) అనే ఆటోడ్రైవర్ మంగళవారం మందమర్రి రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటి పక్కన ఉన్న వారితో జరిగిన గొడవ కారణంగా మనస్తాపం చెంది, తెలంగాణ ఎక్స్‌ప్రెస్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే హెడ్‌కానిస్టేబుల్ సంపత్ తెలిపారు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. కాగా.. పక్కింటి వారి వేధింపులతోనే సమ్మయ్య ఆత్మహత్య చేసుకున్నాడని, మంగళవారం రాత్రి మృతుని కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. మృతదేహాన్ని రోడ్డుపై ఉంచి ధర్నాకు దిగారు. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. సంఘటన స్థలానికి చేరుకున్న సీఐ ప్రమోద్‌రావు బాధిత కుటుంబంతో మాట్లాడారు. పూర్తిస్థాయి విచారణ చేపట్టి, న్యాయం చేస్తామని ఆయన హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. పురుగుల మందు తాగి యువకుడు.. సిర్పూర్(యూ)(ఆసిఫాబాద్): మండలంలోని మహగాం గ్రామ పంచాయతీ పరిధిలో గల అలిగూడకు చెందిన మంగం వెంకట్రావ్ (23) అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై సందీప్ తెలిపిన వివరాల ప్రకారం.. అప్పులు పెరిగిపోవడం, వ్యక్తిగత కారణాలతో సోమవారం రాత్రి ఇంట్లో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఉట్నూర్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అక్కడే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య జారుబాయి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తండ్రి వాగు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వెల్లడించారు. -
అమెజాన్, ఫ్యూచర్ గ్రూప్ అధికారులకు ఈడీ సమన్లు
న్యూఢిల్లీ: ఫ్యూచర్ గ్రూప్‌లో అమెజాన్ ఇండియా పెట్టుబడుల విషయంలో విదేశీ మారక చట్టం (ఫెమా) నిబంధనల ఉల్లంఘన జరిగిందన్న ఆరోపణలపై ఇరు కంపెనీల అధికారులకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. నిర్దిష్ట పత్రాలతో పాటు విచారణకు హాజరు కావాలంటూ అమెజాన్ ఇండియా కంట్రీ హెడ్ అమిత్ అగర్వాల్ సహా సీనియర్ అధికారులకు సూచించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈడీ సమన్లను పరిశీలిస్తున్నామని, తగు విధంగా స్పందిస్తామని అమెజాన్ ప్రతినిధి తెలిపారు. ఫ్యూచర్ గ్రూప్ సంస్థలో అమెజాన్‌కు పెట్టుబడులు ఉన్న సంగతి తెలిసిందే. దీని ఊతంతో .. దేశీ దిగ్గజం రిలయన్స్‌కి ‘ఫ్యూచర్ రిటైల్’ సంస్థను విక్రయించనివ్వకుండా అడ్డుపడుతుండటంపై ఫ్యూచర్ గ్రూప్, అమెజాన్‌ల మధ్య వివాదం నడుస్తోంది. ఫ్యూచర్ గ్రూప్‌లోని అన్‌లిస్టెడ్ కంపెనీలో పెట్టుబడుల ద్వారా ఫ్యూచర్ రిటైల్‌పై అజమాయిషీ చలాయించేందుకు అమెజాన్ ప్రయత్నిస్తుండటాన్ని .. ఫెమా, విదేశీ పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనల ఉల్లంఘ నగా భావించాల్సి వస్తుందంటూ ఇటీవల ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. మరోవైపు, ఈ–కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటివి నిర్దిష్ట మల్టీ–బ్రాండ్ రిటైల్ వ్యాపారాలు సాగిస్తుండటంపై తగు చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర వాణిజ్య శాఖ ఇటీవలే ఈడీకి సూచించింది. ఈ నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజా సమన్లు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. చదవండి: ఫ్యూచర్ రిటైల్‌లో ఆర్థిక అవకతవకలు -
తెలుగు తమ్ముళ్ల వీధి కొట్లాట.. డివిజన్ ఇన్చార్జిని చితకబాదిన కార్యకర్తలు
పటమట(విజయవాడ తూర్పు): ఆధిపత్య పోరులో తెలుగు తమ్ముళ్లు వీధి కొట్లాటకు దిగారు. తమను అజమాయిషీ చేయడమేంటంటూ పార్టీ డివిజన్ అధ్యక్షుడినే చితకబాదారు. ఈ ఘటన బుధవారం విజయవాడలోని 19వ డివిజన్లో జరిగింది. లబ్బీపేటలోని టీడీపీ కార్యాలయం ఎదురుగా బుధవారం ఆ పార్టీ కార్యకర్తల మధ్య స్వల్ప వివాదం చోటుచేసుకుంది. పార్టీ డివిజన్ అధ్యక్షుడు బాగం సాయిప్రసాద్ ఆ వివాదంపై తీర్పు చెప్పేందుకు వెళ్లాడు. దీనికి కార్యకర్తలు.. తమ మధ్యకు రావొద్దని, సంబంధం లేని అంశాల్లో జోక్యం చేసుకోవద్దంటూ ఆయనకు సూచించారు. పార్టీ డివిజన్ అధ్యక్షుడిగా నియమితులైనప్పట్నుంచి ఒంటెత్తు పోకడలతో వ్యవహరిస్తున్నావంటూ దుర్భాషలాడుతూ సాయిప్రసాద్‌ను చితకబాదారు. పార్టీ కార్యాలయంలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. స్థానికులు కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌కు సమాచారమివ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని వారందరినీ స్టేషన్‌కు తరలించారు. -
ఫ్యూచర్‌గ్రూపు, అమెజాన్ వివాదంలో మరో మలుపు!
న్యూఢిల్లీ: కిషోర్ బియానీకి చెందిన ఫ్యూచర్గ్రూపుతో సయోధ్యకు అమెజాన్ సిద్ధమైనట్టు తెలుస్తోంది. అమెజాన్‌కు వ్యతిరేకంగా ఫెమా ఉల్లంఘనలపై సీసీఐ వద్ద ఫ్యూచర్ గ్రూపు కేసు దాఖలు చేసింది. అమెజాన్‌లో పెట్టుబడులకు ఆమోదం తీసుకునే విషయంలో సీసీఐ వద్ద వాస్తవాలను తప్పుదోవ పట్టించడం ద్వారా ఫెమా నిబంధనలను ఉల్లంఘించినట్టు ఫ్యూచర్ గ్రూపు ఆరోపిస్తోంది. ఈకేసును వెనక్కి తీసుకోవాలని ఫ్యూచర్ గ్రూపును అమెజాన్ కోరినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. పెట్టుబడులకు సంబంధించి తమ మధ్య వివాదానానికి ముగింపు విషయమై ఇరు వర్గాలు చర్చించినట్టు కూడా ఆ వర్గాలు తెలిపాయి. ఫ్యూచర్ గ్రూపు తన రిటైల్, హోల్‌సేల్, లాజిస్టిక్స్ వ్యాపారాలను రిలయన్స్‌కు విక్రయించేందుకు గతేడాది ఒప్పందం చేసుకోవడం తెలిసిందే. ఫ్యూచర్ రిటైల్‌లో పెట్టుబడులు కలిగిన అమెజాన్ ఈ డీల్‌ను వ్యతిరేకిస్తూ కోర్టులను ఆశ్రయించడంతో ఇది నిలిచిపోయింది. అమెజాన్ పక్కకు తప్పుకుంటే చెల్లించాల్సిన పరిహారంపైనా చర్చించినట్టు ఆ వర్గాలు పేర్కొన్నాయి. కానీ, ఈ విషయాన్ని తప్పుదోవపట్టించేదిగా, కల్పితంగా అమెజాన్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. ఫ్యూచర్ రిటైల్‌కు సాయం చేసేందుకు అమెజాన్ ఇప్పటికీ సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. చదవండి: అమెజాన్ అభ్యంతరాలు సరికాదు.. మరోసారి సుప్రీం కోర్టును కోరిన ఎఫ్ఆర్ఎల్ -
కూకట్పల్లి: పిల్లలతో సహా గృహిణి అదృశ్యం
సాక్షి, భాగ్యనగర్ కాలనీ(హైదరాబాద్): భర్తతో గొడవపడి పార్క్‌కు వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిన మహిళ తన చిన్నారులతో కలిసి అదృశ్యమైన సంఘటన కూకట్పల్లి పీఎస్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. బాలాజీ నగర్లో చీకటి జవహర్ విజయ్, స్వాతి (35) కూతురు, కుమారుడితో కలిసి ఉంటున్నారు. విజయ్ నానక్ రామ్ గూడలోని యూబీఎస్ బ్యాంకులో పని చేస్తున్నాడు. తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. గతంలో గొడవలు పడగా పోలీసులు కౌన్సెలింగ్ చేసి పంపించారు. ప్రతిరోజు తన పిల్లలు ద్యుతి (5), కుమారుడు విరాజు (3)తో కలసి స్వాతి పార్క్‌కు వెళుతుంది. సాయంత్రం నాలుగు గంటల సమయంలో భర్త నిద్రలో ఉండగా పిల్లలతో సమీపంలోని పార్క్‌కు వెళ్ళింది. తిరిగి ఇంటికి రాలేదు. దీంతో భర్త ఆమె కోసం ఎంత వాకబు చేసినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
అదానీ వర్సెస్ అమెరికన్ బ్యాంక్.. ఆ విషయంపై సంబంధాలు కట్!
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాలోని అదానీకి చెందిన కార్మైకేల్ బొగ్గు గనితో అమెరికన్ బ్యాంక్– బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ మెల్లన్ కార్పొరేషన్ తన సంబంధాలను తెంచుకుంది. దీనితో అదానీ గ్రూప్‌నకు అలాగే ఆ సంస్థకు ఆస్ట్రేలియాలో ఉన్న బొగ్గు గనికి అమెరికా ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నుంచి ఎటువంటి ఆర్థిక సహాయం లభించదు. పర్యావరణ, సామాజిక, పాలన నియమాలకు అదానీ ఆస్ట్రేలియా వెంచర్ విరుద్ధంగా ఉండడమే తన నిర్ణయానికి కారణమని పేర్కొంది. స్థానిక ప్రజల ఆందోళనల నేపథ్యంలో తాజా నిర్ణయం జరిగింది. -
బాంబే హైకోర్టుకి చేరిన జీ టీవీ వివాదం
జీ టీవీ యాజమాన్యానికి దానిలో పెట్టుబడిదారులకు మధ్య చెలరేగిన వివాదం ఇప్పట్లో చల్లారేలా లేదు. వివాదం పరిష్కరించుకునేందుకు ఇరు వర్గాలు సుముఖంగా లేవు. దీంతో రెండు వైపులా వేర్వేరుగా న్యాయస్థానాలను ఆశ్రయించారు. బాంబై హైకోర్టులో అత్యవసర బోర్డు సమావేశం నిర్వహించాలంటూ ఇన్వెస్కో, ఓఎఫ్ఐ గ్లోబల్ చైనా ఫండ్లు పంపిన నోటీసులు చట్ట విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ జీ టీవీ యాజమాన్యం బాంబే హైకోర్టును ఆశ్రయించింది. అంతకు ముందే అత్యవసర బోర్డు సమావేశం నిర్వహించలేమంటూ ఇన్వెస్కో , ఓఎఫ్‌ఐలకు జీ టీవీ తెలియజేసింది. ముదిరిన వివాదం జీ టీవీలో ఇన్వెస్కోతో పాటు ఓఎఫ్ఐ గ్లోబల్ చైనా ఫండ్ సంస్థలు భారీగా పెట్టుబడులు పెట్టాయి. ఈ రెండు సంస్థలు దాదాపు 18 శాతం వాటాతో జీ టీవీలో మేజర్ షేర్‌హోల్డర్లుగా ఉన్నాయి. సెప్టెంబరు 4న జీ టీవీ సీఈవోగా పునీత్ గోయెంకాను తొలగించాలంటూ మేజర్ షేర్ హోల్డర్లు జీ మేనేజ్మెంట్ని కోరారు. దీనిపై చర్చలు జరుగుతుండగానే షేర్ హోల్డర్లను సంప్రదించకుండా సోనీ టీవీలో జీ టీవీని విలీనం చేశారు. ఈ రెండు సంస్థలకు సంయుక్తంగా సీఈవోగా పునీత్ గోయెంకాను నియమించారు. వెనక్కి తగ్గట్లేదు మేజర్ షేర్ హోల్డర్ల నిర్ణయాలను పక్కన పెట్టి విలీనం చేయడమే కాకుండా తాము కోరినట్టుగా సీఈవో మార్పు చేయకపోవడంతో అత్యవరసర బోర్డు సమావేశం నిర్వహించాలంటూ మరోసారి ఇన్వెస్కో జీని కోరింది. అయితే జీ ఈ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అక్టోబరు 4న విచారణ జీ యాజమాన్య మొండి వైఖరిని నిరసిస్తూ ఇన్వెస్కో సంస్థ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ని ఆశ్రయించింది. వెనువెంటనే అత్యవసర బోర్డు సమావేశం నిర్వహించేలా జీ మేనేజ్మెంట్కు ఆదేశాలు ఇవ్వాలని కోరింది. అక్టోబరు 4న దీనిపై విచారణ జరగనుంది. దీంతో అక్టోబరు 2నే జీ యాజమాన్యం బాంబే హై కోర్టును ఆశ్రయించింది. చదవండి : ‘జీ’ కప్పులో చల్లారని తుఫాను.. కొత్త చిక్కుల్లో సోని -
కోవిషీల్డ్ ఓకే.. సర్టీఫికెట్‌తోనే సమస్య
లండన్: కరోనా వ్యాక్సిన్ అంశంలో భారత్, బ్రిటన్ మధ్య చెలరేగిన వివాదం ఇంకా సద్దుమణగలేదు. ఈ విషయంలో బ్రిటన్ ప్రభుత్వం వెనక్కి తగ్గినట్టే తగ్గి మళ్లీ మెలిక పెట్టింది. అక్టోబర్ 4 నుంచి విదేశీ ప్రయాణికులు పాటించాల్సిన కోవిడ్ నిబంధనలకు సంబంధించిన మార్గదర్శకాలను కొద్దిరోజుల కిందట బ్రిటన్ ప్రభుత్వం విడుదల చేసింది. అందులో కోవిషీల్డ్ వ్యాక్సిన్ లేకపోవడంపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగడంతో ఆ దేశం దిగొచ్చింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్‌తో తమకు ఎలాంటి సమస్య లేదన్న యూకే అధికారులు, భారత్ జారీ చేసే వ్యాక్సినేషన్ ధ్రువపత్రంపైనే కొన్ని అనుమానాలను నివృత్తి చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. కోవిడ్–19 వ్యాక్సిన్ జాబితాలో ఆ్రస్టాజెనికా కోవిషీల్డ్‌ను చేరుస్తూ బుధవారం నిబంధనల్ని సవరించారు. అయితే కోవిషీల్డ్ తీసుకున్నప్పటికీ భారత్ నుంచి వచ్చే ప్రయాణికులు 10 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. వ్యాక్సినేషన్ ధ్రువపత్రం అంశంలో భారత్, యూకే పరస్పరం చర్చించుకుంటున్నాయని, ఈ సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందని వెల్లడించారు. విదేశీ ప్రయాణికుల మార్గదర్శకాల్లో బ్రిటన్ కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను చేర్చకపోవడంపై భారత్ పదునైన విమర్శలే చేసింది. బ్రిటన్‌కు చెందిన ఆక్స్ఫర్డ్–ఆ్రస్టాజెనెకా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్నే పుణేలోని సీరమ్ ఇన్స్టిట్యూట్ కోవిషీల్డ్ పేరుతో చేస్తోందని, అలాంటప్పుడు ఆ వ్యాక్సిన్‌పై ఎందుకు వివక్ష ప్రదర్శిస్తున్నారంటూ నిలదీసింది. భారత్‌లో తయారైన టీకాలు పనికొచ్చినప్పుడు... అదే టీకా వేసుకున్న వారు బ్రిటన్‌కు ఎందుకు రాకూడదంటూ సూటిగా ప్రశ్నించింది. భారత్ విమర్శలతో వెనక్కి తగ్గిన బ్రిటన్ వ్యాక్సిన్‌కి అంగీకరించినప్పటికీ, భారత్ జారీ చేసే వ్యాక్సిన్ ధ్రువపత్రం ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనలకు అనుగుణంగా లేదని, అందుకే ఆ వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ క్వారంటైన్ నిబంధనలు పాటించి తీరాలని చెప్పింది. మరోవైపు భారత్ అధికారులు మాత్రం వ్యాక్సిన్ సర్టిఫికెట్ జారీ చేసే ప్రక్రియలో ఎలాంటి సమస్య లేదని, డబ్ల్యూహెచ్ఓ నిబంధనలకి అనుగుణంగానే జారీ చేస్తున్నామని చెబుతున్నారు. -
ఏడేళ్ల క్రితం హిజ్రాగా మారిన యువకుడు.. మిత్రులు అన్యాయం చేశారని..
సాక్షి, కోలారు(కర్ణాటక): ఏడేళ్ల కిందట ఇల్లు వదిలి హిజ్రాగా మారిన శివకుమార్ అలియాస్ వందన (30) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గాంధీనగరలో నివాసం ఉంటున్న వందన గురువారం రాత్రి భిక్షాటన చేయగా వచ్చిన డబ్బును పంచుకోవడంలో తోటి హిజ్రాలతో గలాటా జరిగింది. మిత్రులు కూడా అన్యాయం చేశారన్న ఆవేదనకు లోనైన వందన శుక్రవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. గల్‌పేట పోలీసులు పరిశీలన జరిపి కేసు నమోదు చేశారు. అడవి ఏనుగు కంటబడి.. మైసూరు: మైసూరు సమీపంలో చామరాజనగర జిల్లా పరిధిలోని బిళిగిరి రంగన బెట్ట ప్రాంతం పుణజనూరు వద్ద అడవి ఏనుగు దాడిలో ఒకరు మృతి చెందారు. చామరాజనగర తాలూకాకు చెందిన చాటి నింగయ్య (52) జాతీయ రహదారిలో నడుచుకుంటూ వెళ్తుండగా కొంతదూరంలో ఓ అడవి ఏనుగు రోడ్డు దాటుతోంది. అది నింగయ్యను చూసి కోపంతో పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన్ని కాళ్ళతో తొక్కి చంపింది. చామరాజనగర పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. చదవండి: Afghanistan: విమానంలోనే అఫ్గన్ మహిళ ప్రసవం -
తల్లిదండ్రుల మధ్య గొడవ.. పురుగుల మందు తాగిన కుమార్తె..
సాక్షి, మద్దిరాల(నల్లగొండ): పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండల పరిధి లోని జి.కొత్తపల్లి గ్రామంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. గురువారం పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జి.కొత్తపల్లి గ్రామానికి చెందిన నిమ్మ సుధాకర్ మేరమ్మ దంపతులు తరచూ గొడవ పడుతున్నారు. దీంతో వారి కుమార్తె నిమ్మ రూప(18)మనస్థాపానికి గురై బుధవారం రాత్రి పురుగుల మందు తాగింది. గమనించిన తల్లిదండ్రులు సూర్యాపేట ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. తల్లి మేరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై నాగయ్య తెలిపారు. -
డబ్బు విషయంలో తగాదా.. కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేసి..
మహబూబ్‌నగర్: వనపర్తి జిల్లా విపనగండ్ల మండలంలో దారుణం చోటుచేసుకుంది. సంపత్ రావుపల్లికి చెందిన చంద్రయ్య అనే వ్యక్తికి, హైదరాబాద్‌కు చెందిన శ్రీకాంత్‌కు మధ్య డబ్బు విషయంలో గొడవ ఏర్పడింది. దీంతో చంద్రయ్య, శ్రీకాంత్‌ను అతని కుటుంబ సభ్యులను సంపత్‌రావుపల్లిలో తన ఇంట్లో నిర్భందించాడు. అంతటితో ఆగకుండా.. కుటుంబ సభ్యులను చిత్రహింసలకు గురిచేశాడు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. భయంతో అరుపులు, కేకలు పెట్టారు. ఇవి విన్న చుట్టుపక్కల వారు వెంటనే డయల్ 100కి సమాచారం అందించారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులకు విముక్తి కల్పించారు. పోలీసుల రాకను గమనించిన చంద్రయ్య అక్కడి నుంచి పారిపోయాడు. కాగా,బాధితులకు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న విపనగండ్ల పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
భార్య భర్తల మధ్య గొడవ.. మామపై లారీ ఎక్కించి..
సాక్షి, సేలం(తమిళనాడు): భార్యభర్తల మధ్య గొడవకు బంధువు బలయ్యాడు. వివరాలు.. సేలం గాంధీనగర్ చోలపల్లానికి చెందిన సుబ్రమణి (32) లారీ డ్రైవర్. భార్య జీవిత. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో జీవిత పుట్టింటికి వెళ్లింది. ఆదివారం రాత్రి సుబ్రమణి అత్తారింటికి వెళ్లి భార్యను కాపురానికి రావాలని కోరాడు. అదే సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం ఏర్పడింది. ఆగ్రహించిన సుబ్రమణి కంటైనర్ లారీతో మామను గుద్దడానికి యత్నించాడు. ఆయన్ను తప్పించే ప్రయత్నంలో జీవిత అత్త కుమారుడు జీవా (26)పై లారీ ఎక్కింది. తీవ్రంగా గాయపడిన జీవాను సేలం ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. స్థానికు లు సుబ్రమణికి దేహశుద్ధి చేశారు. దీంతో అదే ఆస్పత్రిలో చేరాడు. పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. -
సుమతో విడిగా ఉన్న మాట నిజమే : రాజీవ్ కనకాల
Rajeev Kanakala About Clashes with Suma: టాలీవుడ్ బెస్ట్ కపుల్స్‌లో సుమ-రాజీవ్ కనకాల కూడా ఒకరు. ఓవైపు యాంకరింగ్‌లో మకుటం లేని మహారాణిలా సుమ చెలామణి అవుతుంటే, నటుడిగా రాజీవ్ కనకాల తమ కెరియర్లో దూసుకుపోతున్నారు. అయితే పాతికేళ్ల వీరి వివాహబంధంలో పొరపాచ్చాలు వచ్చాయని, విడాకులు కూడా తీసుకోబోతున్నారంటూ గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోనే ఉంటూ ఇద్దరూ వేరువేరు ఇళ్లల్లో ఉండటం ఈ రూమర్స్‌కు మరింత బలం చేకూర్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రాజీవ్ కనకాల.. ఈ విషయాలపై క్లారిటీ ఇచ్చారు. 'నిజంగానే కొన్నిరోజులు సుమతో విడిగా ఉండాల్సి వచ్చింది. అమ్మ చనిపోయిన తర్వాత నాన్న దేవదాస్ కనకాల ఒక్కరే మణికొండలోని సొంతింట్లో ఉండేవారు. నాన్నను మా ఫ్లాట్‌కు తీసుకువద్దాం అనుకుంటే ఆయన బుక్ లైబ్రరీ చాలా పెద్దగా ఉండేది. దీంతో అది మా ఫ్లాట్‌లోకి షిఫ్ట్ చేయడం కష్టమయ్యింది. దీంతో నాన్నతో పాటు నేను మణికొండలో ఉండిపోయాను. అంతే తప్పా సుమతో విడిపోయి కాదు. మేమిద్దరం వేరేవేరు ఇళ్లలో ఉండటంతో సుమ-రాజీవ్ కనకాల విడిపోయారు. త్వరలోనే విడాకులు తీసుకుంటారు అంటూ ఏవేవో వార్తలు రాశారు. అందులో ఏమాత్రం నిజం లేదు. మా మధ్య ఎలాంటి సమస్యలు లేవు' అంటూ రాజీవ్ పేర్కొన్నాడు. ఇటీవలె నారప్ప సినిమాలో రాజీవ్ కీలక పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. -
మంగళగిరి ఎన్ఆర్ఐ ఆస్పత్రి డైరెక్టర్ల మధ్య వివాదం
సాక్షి, గుంటూరు: మంగళగిరి ఎన్ఆర్ఐ ఆస్పత్రి డైరెక్టర్ల మధ్య వివాదం తారాస్థాయికి చేరుకుంది. వివాదం కారణంగా డైరెక్టర్లు ముక్కామల అప్పారావు, నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్ వర్గాలుగా విడిపోయారు. ఎవరికి వారే తమకు మెజార్టీ డైరెక్టర్ల మద్దతు ఉందంటూ కొత్త కమిటీలను ప్రకటించుకున్నారు. 19 మంది డైరెక్టర్ల మద్దతు ఉందంటూ ముక్కామల.. కొత్త కమిటీ ఏర్పాటు చేయగా, 17 మంది డైరెక్టర్ల మద్దతు ఉందంటూ మరో కమిటీని ఉపేంద్రనాథ్ ఏర్పాటు చేశారు. మాజీ కార్యదర్శి అప్పారావు మాట్లాడుతూ, డైరెక్టర్ల మధ్య విభేదాలు వాస్తవమని.. ఆర్ధికపరమైన అవకతవకలపై విచారణ త్వరగా పూర్తి చేయాలని కోరారు. చదవండి: మచిలీపట్నంలో టీడీపీ కార్పొరేటర్ వీరంగం పోర్ట్స్ బిల్లు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం: గౌతమ్‌రెడ్డి -
ఘోరం: కన్న బిడ్డలను బావిలో పడేసిన తల్లి..
సాక్షి, వేలూరు(తిరువణ్ణామలై): కుటుంబ కలహాలతో జీవితంపై విరక్తి చెంది ఇద్దరు పిల్లలను బావిలో తోసి తల్లి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన తిరువణ్ణామలై జిల్లాలో చోటు చేసుకుంది. కణ్ణమంగళం సమీపంలోని అయ్యంపాళ్యంకు చెందిన అరుల్దాస్ పుష్పలత(27) దంపతులకు కుమారుడు సర్వేష్(2), కుమార్తె సంజన(1) ఉన్నారు. రెండు రోజుల క్రితం దంపతుల మధ్య గొడవ జరిగింది. మనస్తాపం చెందిన పుష్పలత సోమవారం రాత్రి 12 గంటలకు ఇద్దరు పిల్లలను తీసుకుని ఇంటి సమీపంలోని బావిలో ఇద్దరు పిల్లలను తోసి ఆమె కూడా బావిలో దూకింది. దీంతో సర్వేష్. సంజన మృతి చెందారు. పుష్పలత బావిలో ఉన్న మోటరు పైపును పటుకుని కేకలు వేసింది. స్థానికులు బావి వద్దకు చేరుకొని పుష్పలతను బయటకు తీశారు. చిన్నారుల మృత దేహాలను బయటకు తీశారు. విషయం తెలుసుకున్న కణ్ణమంగళం పోలీసులు చిన్నారుల మృత దేహాలను ఆçస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. కుటుంబ కలహాలే కారణమని తెలిసింది. ఇద్దరు చిన్నారుల మృతదేహాల వద్ద బంధువులు గుండెలవిసేలా విలపించారు. -
పిల్లల కళ్ల ముందే.. భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య
ఛత్తీస్‌ఘడ్: పంజాబ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ తన భర్తని కిరాతంగా పొడిచి హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన గుర్గావ్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. సచిన్ కుమార్, గుంజన్ ఇద్దరు దంపతులు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక సచిన్ ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే, వీరి మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే గత వారం వీరి మధ్య గొడవ తీవ్రసస్థాయికి చేరింది. దీంతో భార్య గుంజన్ ఆవేశం పట్టలేక వంటగదిలోని కత్తిని తీసుకొని భర్త సచిన్‌ను పొడిచి చంపింది. ఆ సమయంలో వీరి ఇద్దరు పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు.గుంజన్ ఆ తర్వాత సచిన్ బంధువులకు సమాచారం అందించింది. అక్కడికి చేరుకున్న వారు సంఘటన స్థలంలో రక్తపు మడుగులో ఉన్న సచిన్‌ను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే సచిన్ మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. కాగా, సచిన్ కుటుంబ సభ్యులు, అతని భార్య గుంజన్‌పై అనుమానం వ్యక్తం చేస్తూ.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు గుంజన్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు చేపట్టిన విచారణలో గుంజన్, పిల్లలు తడబడటం, ఒత్తిడికి గురవ్వడాన్ని వారు గుర్తించారు. విచారణలో మరిన్ని విషయాలు బయటకు రాబడతామని స్థానిక పోలీసు అధికారి ప్రీత్‌పాల్ సింగ్ తెలిపారు. చదవండి: దారుణం: దెయ్యం పట్టిందని కొడుకును కొట్టి చంపిన తల్లి -
దళితులకు అన్యాయం జరిగితే ఎవరైనా కేసు పెట్టవచ్చు!
విజయవాడ: అమరావతిలో దళితుల భూములను చంద్రబాబు అక్రమంగా కాజేశారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విమర్శించారు. రైతులకు మాయమాటలు చెప్పి, తక్కువ ధరకే వారి భూములను సొంతం చేసుకున్నారని ఎద్దేవా చేశారు. సీఐడీ అధికారుల ఎదుట హజరైన ఆళ్ల తన దగ్గరున్న భూకుంభకోణానికి సంబంధించిన అన్ని ఆధారాలను అందించారు. ఈ భూలావాదేవీలకు సంబంధించి రెవెన్యూ అధికారులు ఇవ్వాల్సిన జీవోలను మున్సిపపల్ శాఖ ద్వారా అక్రమంగా పొందారని అన్నారు. ఒక్క మంగళగిరి నియోజక వర్గంలోనే 500 ఎకరాల అసైన్డ్ భూములను కాజేశారని తెలిపారు. తాడికొండతో కలుపుకుంటే మొత్తంగా 4 వేల ఎకరాల భూమిని లాక్కున్నారని పేర్కొన్నారు. దీంతో రాజధానికి రైతులు తన దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేశారని తెలిపారు. అయితే, దళితులకు అన్యాయం జరిగితే ఎవరైనా కేసు పెట్టవచ్చని చెప్పారు. దీనికి దళితుడే అవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. చంద్రబాబు తప్పుచేయకపోతే సీఐడీ అధికారుల ఎదుట హజరై విచారణను ఎదుర్కొవాలని సవాల్ విసిరారు. చదవండి: ఏపీలో కొలువుదీరిన కొత్త పాలక మండళ్లు -
రూ. లక్ష కోట్ల ‘పన్ను’ పరిష్కారం
న్యూఢిల్లీ: ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న పన్ను వివాదాల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘వివాద్ సే విశ్వాస్’ పథకానికి మంచి స్పందన లభించింది. ఆదాయపన్ను శాఖతో పన్ను వివాదాలు నెలకొన్న 5 లక్షల యూనిట్లలో సుమారు లక్ష యూనిట్లు (సంస్థలు/పరిశ్రమలు) వివాద్ సే విశ్వాస్ పథకాన్ని ఎంపిక చేసుకున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి అజయ్‌భూషణ్ పాండే తెలిపారు. ప్రత్యక్ష పన్నులకు సంబంధించి ఆదాయపన్ను శాఖతో నెలకొన్న వివాదాల పరిష్కారానికి వివాద్ సే విశ్వాస్ పథకాన్ని 2020–21 బడ్జెట్ సందర్భంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. పలు అప్పిలేట్ వేదికల వద్ద 4.8 లక్షల అప్పీళ్లు పరిష్కారాల కోసం వేచి చూస్తుండగా.. వీటికి సంబంధించి రూ.9.32 లక్షల కోట్లు బ్లాక్ అయి ఉన్నాయి. ఇలా అపరిష్కృతంగా ఉన్న కేసుల్లో 96,000 (రూ.83,000 కోట్లు) ఈ పథకాన్ని ఎంపిక చేసుకున్నాయి. డిసెంబర్‌తోనే ఈ పథకానికి గడువు ముగిసిపోనుండగా.. కేంద్రం జనవరి 31 వరకు పొడిగించింది. ఈ పథకాన్ని ఎంచుకున్న సంస్థలు అవసరమైన మేర పన్ను చెల్లించినట్టయితే ఆ వివాదానికి అంతటితో ఆదాయపన్ను శాఖ ముగింపు పలుకుతుంది. అంతేకాదు న్యాయపరమైన చర్యలు కూడా చేపట్టదు. రూ.లక్ష కోట్లకు పైగా పన్ను డిమాండ్లను తప్పుడు ఎంట్రీ (చేర్చడం) కారణంగా వచ్చినవని గుర్తించి పరిష్కరించినట్టు పాండా చెప్పారు. కఠిన చర్యల వల్లే జీఎస్టీ ఆదాయంలో వృద్ధి డేటా విశ్లేషణ, ఏజెన్సీల నుంచి వచ్చే సమాచారం ఆధారంగా జీఎస్టీ ఎగవేతలను అడ్డుకునే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టినట్టు పాండే చెప్పారు. ఇందులో భాగంగా 7,000కు పైగా సంస్థలపై చర్యలు మొదలయ్యాయని, 187 మందిని అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు. ఈ చర్యల ఫలితమే ఆదాయం పెరుగు దలన్నారు. 2020 డిసెంబర్లో జీఎస్టీ ఆదాయం రూ.1.15 లక్షల కోట్లకు పెరిగిన విషయం తెలిసిందే. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఒక నెలలో నమోదైన అత్యధిక ఆదాయం ఇదే కావడం గమనార్హం. నకిలీ బిల్లుల రాకెట్‌కు వ్యతిరేకంగా చర్యలు చేపట్టడం వల్ల 187 మంది అరెస్ట్ అయ్యారని, వీరిలో ఐదుగురు చార్టర్డ్ అకౌంటెంట్లు ఉన్నట్టు పాండే తెలిపారు. కొంత మంది ఎండీలు కూడా 40–50 రోజుల నుంచి జైలులోనే ఉండిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. -
వేల సంఖ్యలో ఐఫోన్లు ఎత్తుకెళ్లారు
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలోని ఆపిల్ ఐఫోన్ తయారీ ప్లాంట్‌లో ఉద్యోగుల నిరసన ఆందోళన రేపింది. వేతనాలు చెల్లించలేదనే ఆగ్రహంతో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ప్లాంట్‌పై దాడిచేసిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 12న కర్ణాటకలోని కోలార్ జిల్లాలోని ప్లాంట్‌లో ఉద్యోగులు సృష్టించిన విధ్వంసంలో తమకు 440 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని తైవాన్‌కు చెందిన విస్ట్రాన్ కార్పొరేషన్ తాజాగా ప్రకటించింది. అసెంబ్లింగ్ పరికరాలు, బయోటెక్ డివైజ్‌లు ఇతర పరికరాలు దెబ్బతిన్నాయని వెల్లడించింది. అంతేకాదు వేలాది ఐఫోన్లుఎత్తుకుపోయారని ఆరోపించింది. దర్యాప్తునకు స్థానిక అధికారులతో సహకరిస్తున్నట్టు తెలిపింది. బెంగళూరుకు సుమారు 60 కిలోమీటర్ల దూరంలోని కోలార్ జిల్లాలోని నర్సాపురలో తైవాన్ టెక్ దిగ్గజం విస్ట్రాన్ కార్పొరేషన్ ఐఫోన్ తయారీ ప్లాంట్‌ను నిర్వహిస్తోంది. జీతాల విషయంలో కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న ఉద్యోగులు, సహనం నశించి ప్లాంట్‌లో విధ్వంసానికి తెగబడ్డారు. కిటికీ అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం, వాహనాలకు నిప్పంటిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనలో సుమారు 100 మందికిపైగా ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. ఈ విధ్వంసంలో 700 కంప్యూటర్లు ధ్వంసమైనాయనీ, సుమారు రూ.40కోట్లకు పైగా ఆస్తి నష్టం సంభవించిందని మొదట అంచనా వేశారు. 100 కోట్ల రూపాయల లోపు నష్టాలు సంభవించవచ్చని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు ఈ ఘటనను కర్ణాటక ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. విస్ట్రాన్, కాంట్రాక్టు కార్మికుల మధ్య వివాదం మూడు నెలలుగా కొనసాగుతోందని తెలిపింది. విస్ట్రాన్ తన కోలార్ యూనిట్ కోసం 8,900 మందిని నియమించుకోవడానికి ఆరు అనుబంధ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు రాష్ట్ర కార్మిక మంత్రి శివరామ్ హెబ్బర్ తెలిపారు. అయితే ఈ నియామకాలకు సంబంధించి విస్ట్రాన్, కాంట్రాక్టర్లు,ఉద్యోగుల మధ్య ఏర్పడిన వివాదమే హింసకు కారణమై ఉండవచ్చని పరిశ్రమల మంత్రి జగదీష్ శెట్టర్ వ్యాఖ్యానించారు. కాగా కోలార్ జిల్లాలో నరసపుర ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న తైవానీస్ విస్ట్రాన్ కార్పొరేషన్ తయారీ కేంద్రం దేశంలోని మొట్టమొదటి ఐఫోన్ తయారీ కర్మాగారం. -
భూమా కుటుంబంలో ‘డెయిరీ’ చిచ్చు
నంద్యాల: భూమా కుటుంబంలో విభేదాలు రచ్చ కెక్కాయి. విజయ డెయిరీ చైర్మన్ పదవి కోసం మాజీ ఎంపీ, దివంగత నేత భూమా నాగిరెడ్డి కుమారుడు జగత్ విఖ్యాత్ రెడ్డి పట్టుబడుతున్నారు. చైర్మన్‌గా ఉన్న భూమా నారాయణరెడ్డి ఇందుకు అంగీకరించడం లేదు. ఈ పదవి గత 25 సంవత్సరాలుగా భూమా కుటుంబం చేతిలోనే ఉంది. ఐదురోజుల క్రితం విజయ డెయిరీ సమావేశం జరగాల్సి ఉండగా కోరం లేక వాయిదా పడింది. ముగ్గురు డైరెక్టర్లను భూమా జగత్ విఖ్యాత్‌రెడ్డి, ఆయన బావ(మాజీ మంత్రి అఖిల ప్రియ భర్త)భార్గవర్ధన్ ఆళ్లగడ్డలో బలవంతంగా ఉంచారు. దీంతో వారు రాకపోవడంతో కోరం లేక సమావేశం వాయిదా పడినట్లు తెలుస్తోంది. తిరిగి ఈనెల 2వ తేదీ సోమవారం పాలక మండలి సమావేశం నిర్వహించాల్సి ఉంది. (చదవండి: రాజధాని పేరిట చంద్రబాబు బినామీ ఉద్యమం) ఈ నేపథ్యంలో సమావేశం వాయిదా పడకూడదని, విజయ డెయిరీ చైర్మన్ భూమా నారాయణరెడ్డి కొంత మంది డైరెక్టర్లను నంద్యాల శివారులోని రైతునగరంలో ఉంచారు. ఈ విషయం తెలుసుకున్న భూమా జగత్ విఖ్యాత్‌రెడ్డి, భార్గవర్ధన్ నాయుడు ఆదివారం రాత్రి డైరెక్టర్లు ఉన్న రైతునగరానికి వెళ్లి భూమా నారాయణరెడ్డితో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న నంద్యాల తాలూకా సీఐ దివాకర్‌రెడ్డి తన సిబ్బందితో రైతునగరానికి ఆదివారం రాత్రి చేరుకొని ఇరువర్గాలకు సర్దిచెప్పారు. ఈ క్రమంలో విజయ డెయిరీ పాలక మండలి సమావేశం సోమవారం పోలీస్ బందోబస్తు మధ్య కొనసాగింది. ఆరుగురు సీఐలు, పది మంది ఎస్ఐలు, 50 మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సమావేశానికి 11 మంది డైరెక్టర్లు హాజరయ్యారు. (చదవండి: బీసీలంతా వైఎస్ జగన్‌కు రుణపడ్డాం: జయరాం) మనవడి పోస్టు పోయింది భూమా జగత్ విఖ్యాత్‌రెడ్డి నా మనవడు. నిన్న భార్గవర్ధన్తో కలిసి నా ఇంటి వద్దకు వచ్చినప్పుడే మనవడి పోస్టు పోయింది. చైర్మన్ పదవి అందరితో కూర్చొని మాట్లాడి తీసుకోవాలే కాని, నేను రాజీనామా చేస్తే వారికి వస్తాదనేది వారి భ్రమ. – భూమా నారాయణరెడ్డి, విజయ డెయిరీ చైర్మన్ -
అనంతపురంలో కరపత్రాల కలకలం
అనంతపురం అర్బన్: పౌర సరఫరాల సంస్థ కార్యాలయంలో ఉద్యోగుల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయి. సంస్థ డీఎం డమ్మీగా మారారంటూ కొందరు ముద్రించిన కరపత్రాలు బయటకు రావడం కలకలం రేపింది. ప్రధానంగా అసిస్టెంట్ మేనేజర్ (ఏఎం)ని టార్గెట్ చేస్తూ కరపత్రంలో ఆరోపణలు సంధించారు. జిల్లా మేనేజర్ పేరుకే అధికారిగా అంటూ... కార్యాలయంలో పెత్తనం పూర్తిగా అసిస్టెంట్ మేనేజర్‌దే అంటూ విమర్శలు చేశారు. గతంలో ఆయన పనిచేసిన చోట ఉద్యోగులతో ఏ విధంగా వ్యవహరించారనేది చెబుతూ... ఇక్కడా అదే తరహాలో వ్యవహరిస్తున్నారు అంటూ... ఇలా పలు ఆరోపణలతో కూడిన కరపత్రం బయటికి రావడం కార్యాలయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. చాలా రోజులుగా ఉద్యోగుల మధ్య విభేధాలు సంస్థ ఉద్యోగుల్లో ఏడాది కాలంగా విబేధాలు నెలకొన్నాయి. ప్రస్తుతం అవి తీవ్రస్థాయికి చేరుకుని ఏకంగా కరపత్రాలు ముద్రించే వరకు వచ్చాయి. ఇటీవల కాలంలో సంస్థలోని కొందరు ఉద్యోగులు, అధికారులపైనా ఆరోపణలు వెల్లువెత్తాయి. పర్సంటేజీ కోసం కాంట్రాక్టర్లపై ఒత్తిడి చేస్తున్నారని, ఉద్యోగులపై కొందరు అధికారులు బెదిరింపులకు దిగుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు ఇక్కడి వ్యవహారాలపై దృష్టి పెట్టకపోతే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉంది. కాగా, కరపత్రం విషయాన్ని సంస్థ జిల్లా మేనేజర్ మోహన్‌బాబు దృష్టికి ‘సాక్షి’ తీసుకెళ్లింది. దీనిపై ఆయన వివరణ ఇచ్చేందుకు కొంత ఇబ్బంది పడ్డారు. మాది ఈ ప్రాంతం కాదు.. ఒకటి రెండేళ్లు ఉండి వెళ్లిపోతాం..అంటూ ముభావంగా ఉండిపోయారు. -
చైనాకు హెచ్చరిక
ప్రధాని నరేంద్ర మోదీ చైనా దురాగతంపై మాట్లాడటం లేదంటూ విమర్శిస్తున్నవారు ఇక శాంతించవచ్చు. ఆయన శుక్రవారం లదాఖ్ ప్రాంతంలో ఆకస్మిక పర్యటన జరిపి సైన్యం, వైమానికదళం, ఇండో టిబెటిన్ సరిహద్దు పోలీస్(ఐటీబీపీ) జవాన్లనుద్దేశించి ప్రసంగించడంతో పాటు, చైనా సైనికుల దుండగంలో గాయపడి చికిత్స పొందుతున్న జవాన్లను పరామర్శించారు. విస్తరణవాదానికి ఇక నూకలు చెల్లాయని, అలాంటి ప్రయత్నాలు చేసే శక్తులు ఓటమి పాలవడమో, పలాయనం చిత్తగించడమో తప్పలేదని చరిత్ర చాటుతున్నదని చైనానుద్దేశించి హెచ్చరించారు. చెప్పాలంటే ఇది చైనాకు మాత్రమే కాదు...ఆ దేశం పోకడల గురించి ప్రపంచ దేశాలన్నిటినీ అప్రమత్తం చేసిన సందేశం. ఇరు దేశాల సైన్యం మధ్యా వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద గల్వాన్ లోయలో ఘర్షణలు జరిగాక మన ప్రధాని లదాఖ్ వెళ్లి సైన్యంతో మాట్లాడటం వారి నైతిక స్థైర్యాన్ని పెంచడానికి ఎంతగానో తోడ్పడుతుంది. చొరబాటుకు పాల్పడితే భారత్ మౌనంగా వుండిపోదన్న సంకేతమిస్తుంది. పురాణ ప్రతీకలతో సాగిన మోదీ ప్రసంగం... యుద్ధానికి కాలుదువ్వితే అందుకు కూడా సిద్ధంగా వున్నామన్న పరోక్ష సందేశాన్ని పంపింది. ‘మురళీకృష్ణుని కొలిచే జనమే సుదర్శన ధారి అయిన కృష్ణుణ్ణి కూడా పూజిస్తారని తెలుసుకోవాల’ని తన ప్రసంగంలో మోదీ చెప్పారు. ప్రధాని అడుగిడిన నిమూ ప్రాంతం సముద్ర మట్టానికి 11,000 అడుగుల ఎత్తులో వుంది. సుశిక్షిత జవాన్లకు తప్ప అన్యులకు అది కష్టసాధ్యమైన ప్రాంతం. గత నెల 18న అఖిల పక్ష సమావేశాన్నుద్దేశించి ప్రసంగించిన సందర్భంగా మన భూభాగంలోకి ఎవరూ ప్రవేశించలేదని, మన పోస్ట్‌లను ఎవరూ స్వాధీనం చేసుకోలేదని నరేంద్ర మోదీ చెప్పినప్పుడు విపక్షాలనుంచి విమర్శలొచ్చాయి. అదే నిజమైతే మన జవాన్లపై చైనా సైనికులు ఎందుకు దాడి చేశారన్న ప్రశ్నలు తలెత్తాయి. చైనా మొదటినుంచీ మన విషయంలో రెండు సమాంతర మార్గాలను అనుసరిస్తోంది. అక్కడి రాజకీయ నాయకత్వం మన పాలకులతో స్నేహ పూర్వకంగా వుంటుంది. దౌత్యపరమైన సంబంధాల్లో అంతా సవ్యంగానే వున్నట్టు కనబడుతుంది. కానీ ఆ దేశ సైన్యం మాత్రం సరిహద్దుల్లో దూకుడు ప్రదర్శిస్తుంటుంది. కయ్యానికి కాలు దువ్వుతుంటుంది. మొదటినుంచీ ఈ తంతు సాగుతూనే వుంది. కనుకనే తరచుగా సమస్య లొస్తున్నాయి. ఒక్కోసారి అవి ఘర్షణలుగా రూపాంతరం చెందుతున్నాయి. అఖిలపక్ష సమావేశంలో మోదీ చేసిన ప్రసంగం చైనా నాయకత్వానికి ఒక అవకాశం ఇచ్చినట్టని...చప్పుడు చేయకుండా వచ్చిన దారినే వారు వెళ్లిపోవడానికి తోవ చూపినట్టని కొందరు సైనిక నిపుణులు విశ్లేషించారు. ఆయన కోరుకున్నట్టు జరగలేదు గనుకే తాజా ప్రసంగంలో మోదీ కఠినంగా మాట్లారని వారు చెబుతున్నారు. అందులో నిజానిజాలేమిటన్న సంగతలావుంచితే తూర్పు లదాఖ్ ప్రాంతంలో చైనా వైఖరి గతంతో పోలిస్తే పూర్తిగా మారిందన్నది వాస్తవం. ఎల్ఏసీ పొడవునా వివాదాస్పదమైనవిగా గుర్తించిన ప్రాంతాలపై ఇరు దేశాల మధ్యా కొన్ని దశాబ్దాలుగా చర్చలు సాగుతూనే వున్నాయి. 1993, 1996, 2005 ల్లో కుదిరిన అవగాహనను బట్టి ఇరు దేశాల సైన్యాలు పరస్పర విశ్వాసాన్ని పెంపొందించుకునే చర్యలు కొనసాగించాలి. తమకు సంబంధించని విషయాలపై అభ్యంతరాలు చెప్పకూడదు. కానీ ఈమధ్యకాలంలో దీనికి చైనా చెల్లుచీటి ఇచ్చింది. ఎల్ఏసీకి తనవైపున్న ప్రాంతంలో చాన్నాళ్లక్రితమే చైనా రోడ్ల నిర్మాణం చేపట్టి పూర్తి చేసింది. అంతా పూర్తయ్యాక ఇరు దేశాలూ అన్ని రకాల నిర్మాణాలనూ ఆపేయాలంటూ ఈమధ్య ప్రతిపాదించడం మొదలుపెట్టింది. అంటే తనవైపున్న భూభాగంలో సైన్యం కదలికలకు అనువుగా రోడ్లు ఉండాలి. కానీ మనం మాత్రం ఆ పని చేయకూడదు. తన ప్రతిపాదనను మనం అంగీకరించడం లేదన్న దుగ్ధ చైనాకుంది. అలాగే కొన్ని ప్రాంతాల్లోకి చొరబడి ఆక్రమిస్తే ఎల్ఏసీపై చర్చలకు భారత్ తొందరపడుతుందని, అప్పుడు సమస్య వేగంగా పరిష్కారమవుతుందని చైనా అనుకున్నట్టు కనబడుతోంది. కనుకనే ఇంతక్రితం కేవలం గస్తీకే పరిమితమైన గల్వాన్ ప్రాంతంలోకి చొరబడి తిష్టవేసింది. ఒక అనిశ్చితి వాతా వరణాన్ని ఎల్లకాలమూ కొనసాగించడం మంచిది కాదని, అది మన ప్రయోజనాలను దెబ్బ తీస్తుందని మన పాలకులు ఇన్ని దశాబ్దాలుగా తెలుసుకోలేకపోయారు. అందువల్లే ఎల్ఏసీపై విషయంలో ఎప్పుడూ సరిగా దృష్టి కేంద్రీకరించలేదు. ఇదే అదునుగా చైనా చొరబాటు ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. శాంతి కావాలని బలంగా ఆకాంక్షిస్తే యుద్ధానికి నిరంతరం సిద్ధంగా వుండాలని రోమన్ జనరల్ వెజెటియస్ చెప్పిన మాట. లదాఖ్‌లో మన బలగాలనుద్దేశించి ప్రసంగించిన మోదీ సైతం ఆ అర్ధంలోనే మాట్లాడారు. శాంతి నెలకొనాలంటే ముందుగా ధైర్యసాహసాలుండాలని చెప్పారు. పిరికివారు, బలహీనులు శాంతిని సాధించలేరన్నారు. చైనా రెండు నెలలుగా ఎల్ఏసీ వద్ద కొన్ని ప్రాంతాల్లో సైన్యాన్ని మోహరిస్తున్నట్టే, మన దేశం కూడా అక్కడికి బలగాలను తరలిస్తోంది. దానికితోడు శుక్రవారం చేసిన ప్రసంగంలో దేనికైనా సిద్ధమని మోదీ ఇచ్చిన సంకేతం చైనాపై ప్రభావం చూపిన జాడలు కనబడుతున్నాయి. కనుకనే ‘ఇరు దేశాలూ పరస్పర సంబంధాల్లో వున్నాయి. సరిహద్దుల్లో ఉద్రిక్తతలను ఉపశమింపజేసేందుకు దౌత్యపరంగా, సైనికంగా చర్చలు సాగుతున్నాయి. ఈ పరిస్థితిని విషమింపజేసేలా ఎవరూ వ్యవహరించకూడద’ంటూ చైనా విదేశాంగ ప్రతినిధి సన్నాయినొక్కులు నొక్కారు. యుద్ధం తలెత్తడం ఏ దేశానికీ మంచిది కాదు. అది ఇరు వైపులా ప్రాణనష్టానికి, ఆర్థికంగా కుంగుబాటుకు దారిదీస్తుంది. అలాగని ఉపేక్షించే ధోరణి కూడా ప్రమాదకరం. ఇప్పుడు సమస్య ఎజెండాలోకి వచ్చింది గనుక ఎల్ఏసీ విషయంలో శాశ్వత పరిష్కారం సాధించే దిశగా కృషి చేయాలి. ఆ విషయంలో ఇక తాత్సారం పనికిరాదు. -
సాధ్యమైనంత త్వరగా శాంతి
సాక్షి, న్యూఢిల్లీ: సరిహద్దుల్లో ఉద్రిక్తతలను సాధ్యమైనంత త్వరగా తగ్గించుకోవాలని భారత్, చైనా నిర్ణయించాయి. తూర్పు లద్దాఖ్‌లోని సరిహద్దుల్లో గత 7 వారాలుగా నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు ‘వేగవంతమైన, క్రమానుగత, దశలవారీ’ ప్రక్రియను ప్రారంభించడం ప్రాధాన్యతాంశంగా గుర్తించే విషయంలో రెండు దేశాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఇరుదేశాల కమాండర్ స్థాయి చర్చలు మంగళవారం దాదాపు 12 గంటల పాటు జరిగాయి. బాధ్యతాయుత విధానంలో ఈ సమస్యను పరిష్కరించుకోవాలని రెండు దేశాల విదేశాంగ మంత్రులు జై శంకర్, వాంగ్ యి తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగానే చర్చల ప్రక్రియలో నిర్ణయాలు తీసుకుంటున్నట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. గల్వాన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య తీవ్రస్థాయి ఘర్షణలు చోటుచేసుకున్న తరువాత జూన్ 17న రెండు దేశాల విదేశాంగ మంత్రులు ఫోన్లో మాట్లాడుకున్న విషయం తెలిసిందే. వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంట బలగాలను ఉపసంహరించుకోవడం క్లిష్టమైన ప్రక్రియ అని ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఎల్ఏసీకి భారత్ వైపు ఉన్న చూషుల్‌లో మంగళవారం ఉదయం 11 గంటల నుంచి రెండు దేశాల మధ్య ఆర్మీ కమాండర్ స్థాయి చర్చలు జరిగాయి. భారత ప్రతినిధి బృందానికి 14 కాప్స్ కమాండర్ లెఫ్ట్‌నెంట్ జనరల్ హరీందర్ సింగ్ నేతృత్వం వహించగా, చైనా బృందానికి టిబెట్ మిలటరీ డిస్ట్రిక్ట్ మేజర్ జనరల్ లియు లిన్ నేతృత్వం వహించారు. ఈ రెండు బృందాల మధ్య జూన్ 6న తొలి విడత చర్చలు జరిగాయి. ఆ తరువాత గల్వాన్ లోయలో ప్రాణాంతక ఘర్షణల అనంతరం జూన్ 22న మరోసారి ఈ రెండు బృందాలు సమావేశమయ్యాయి. తాజాగా భేటీ మూడోది. కాగా, ఉద్రిక్తతల సడలింపుపై రెండు దేశాలు నిజాయితీతో ఉన్నాయని ఆర్మీ వర్గాలు తెలిపాయి. పూర్తి స్థాయి ఒప్పందం కుదిరేందుకు ఆర్మీ, దౌత్య మార్గాల్లో మరికొన్ని విడతలు చర్చలు జరగాల్సిన అవసరం ఉందన్నాయి. సరిహద్దుల్లోని అన్ని వివాదాస్పద ప్రాంతాల నుంచి బలగాలను ఉపసంహరించాలని, ఏప్రిల్ ముందునాటి యథాతథ స్థితి నెలకొనేలా చూడాలని గత రెండు విడతల చర్చల్లో భారత్ గట్టిగా డిమాండ్ చేసిందని వెల్లడించాయి. రేపు లద్దాఖ్‌లో రాజ్‌నాథ్ పర్యటన! రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం లద్దాఖ్‌లో పర్యటించే అవకాశముంది. సరిహద్దు పోస్ట్‌లను సందర్శించి, భారత ఆర్మీ సన్నద్ధతను పరిశీలిస్తారని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. మిలటరీలోని సీనియర్ అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తారని వెల్లడించాయి. -
పాక్‌తో చేతులు కలిపిన చైనా?
దుష్ట పన్నాగాల డ్రాగన్ దేశం ఒక వైపు చర్చలంటూనే మరోవైపు కయ్యానికి కాలు దువ్వుతోంది. భారత్‌పై ఒత్తిడి పెంచడానికి పాక్‌తో చేతులు కలిపింది. లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖకు తూర్పు దిక్కున చైనా సైనికులు మోహరించి రంకెలు వేస్తూ ఉంటే, ఉత్తరాన నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ సైన్యాన్ని మోహరించి ఉరుముతోంది. ఎటు నుం చైనా ఎలాంటి విషమ పరిస్థితి ఎదురైనా రెండు దేశాలకు గట్టి బుద్ధి చెప్పడానికి భారత్ సన్నద్ధమైంది. సాక్షి, న్యూఢిల్లీ: సరిహద్దుల్లో సంక్షోభ నివారణకు ఒక వైపు భారత్‌తో చర్చలు సాగిస్తూనే చైనా తన వక్రబుద్ధిని బయటపెట్టుకుంటోంది. భారత్‌పై ఒత్తిడి పెంచడానికి పాకిస్తాన్‌తో చేతులు కలుపుతున్నట్టుగా తెలుస్తోంది. తూర్పు దిశగా తమ సైన్యం, ఉత్తరాన పాక్ సైన్యాన్ని మోహరించి, జమ్ము కశ్మీర్లో హింస రాజేసే ముక్కోణపు కుట్రకు డ్రాగన్ దేశం తెరతీసింది. ఉగ్రవాద సంస్థ అల్బదర్తో చైనా అధికారులు మంతనాలు సాగిస్తున్నట్టుగా ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయని జాతీయ మీడియా కథనాలు ప్రసారం చేసింది. లద్దాఖ్‌లో నియంత్రణ రేఖ వెంబడి ఉత్తరం దిశగా గిల్గిట్ బాల్టిస్తాన్ సమీపంలో పాకిస్తాన్ 20 వేల మంది సైనికుల్ని మోహరించింది. ఈ ప్రాంతమంతా పాక్ రాడార్లు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నట్టు సమాచారం. జమ్మూ కశ్మీర్ విభజన తర్వాత గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతం కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్‌లోకి వచ్చింది. అయితే ఈ ప్రాంతం పాక్ ఆక్రమిత కశ్మీర్ పరిధిలో ఉంది. లద్దాఖ్ సెక్టార్లో వాస్తవాధీన రేఖ వెంబడి తూర్పుదిక్కున చైనా 20 వేల మందికి పైగా సైనికుల్ని మోహరిస్తే, వాళ్లతో సరిసమానంగా పాకిస్తాన్ ఉత్తరం దిశగా సైన్యాన్ని రంగంలోకి దింపింది. ఇక చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన మరో 10 నుంచి 12 వేల మంది సైనికులు సరిహద్దులకి వెయ్యి కిలో మీటర్ల దూరంలో ఉత్తర జిన్జియాంగ్ ప్రాంతంలో మోహరించారు. వారితో పాటు వాయువేగంతో పరుగులు తీసే వాహనాలు, ఆయుధాలు కూడా ఉన్నాయి. అవసరమైతే ఈ సైనికులు 48 గంటల్లో భారత్ సరిహద్దుకు చేరుకునేలా డ్రాగన్ దేశం సన్నాహాలు చేసిందని ప్రభుత్వంలో ఉన్నత స్థాయి అధికారి తెలిపారు. అయితే భారత ప్రభుత్వం ఈ సైనికుల కదలికలపై పూర్తిగా నిఘా ఉంచిందని చైనా వ్యూహాలను దీటుగా ఎదుర్కొంటామని ఆ అధికారి వెల్లడించారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థతో అల్బదర్తో చైనా అధికారులు చర్చలు జరుపుతున్నట్టుగా ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం. జమ్ము కశ్మీర్లో రక్తపాతం సృష్టించిన చరిత్ర ఈ సంస్థకి ఉంది. అల్బదర్ను మళ్లీ పునరుద్ధరించడానికి చైనా మద్దతు ఇచ్చే అవకాశాలున్నాయని సమాచారం. వేడెక్కుతున్న పాంగాంగ్ సరస్సు తీరం పాంగాంగ్ సరస్సుకి ఉత్తరంగా భారత్ భూభాగంలోకి 8 కి.మీ. మేర లోపలికి చొచ్చుకు వచ్చిన చైనా ఆ ప్రాంతం తనదేనని చాటి చెప్పడానికి చిహ్నాలను ఏర్పాటు చేసింది. ఫింగర్ 4–5 మధ్య 80 మీటర్ల పొడవున శాసనాల మాదిరి చిహ్నాలను నిర్మించింది. వీటిపై చైనాకు చెందిన మాండరిన్ గుర్తులను ఉంచి ఆ ప్రాంతమంతా తమదేనని చెప్పడానికి ప్రయత్నిస్తోంది. ఇక ఫింగర్ 4–8 మధ్య ఎనిమిది కిలో మీటర్ల పొడవునా తాత్కాలిక శిబిరాలు, బంకర్లు ఏర్పాటు చేసి భారీగా సైన్యాన్ని మోహరిస్తోంది. చైనా ఆర్మీకి ఈ ప్రాంతం నుంచి వెనక్కి తగ్గే ఆలోచన లేదని, అందుకే డ్రాగన్ దేశాన్ని ఎదుర్కోవడానికి భారత్ సైన్యాన్ని, యుద్ధ ట్యాంకుల్ని మోహరిస్తూ ప్రణాళికలు రచిస్తోందని ఉన్నతాధికారులు వెల్లడించారు. పాంగాంగ్‌కు భారత్ ఉక్కు పడవలు పాంగాంగ్ సరస్సు ప్రాంతంలో నిఘా మరింత పెంచడానికి భారత నావికా దళం సమాయత్తమైంది. డజనుకు పైగా ఉక్కు పడవల్ని లద్దాఖ్ వైపు మళ్తిస్తోంది. ఇప్పటికే పాంగాంగ్లో చైనా ఆర్మీ అత్యంత భారీ నౌకలైన టైప్ 928 బీలను మోహరించింది. దీనికి ప్రతిగా భారత్ కూడా భారీ నౌకలను తరలించే దిశగా ప్రణాళికలు సిద్ధంగా చేస్తోంది. ఈ లోగా పరిస్థితుల్ని పర్యవేక్షించడానికి ఈ ఉక్కు పడవలు పాంగాంగ్ తీర ప్రాంతానికి చేరుకుంటాయి. వాస్తవాధీన రేఖ వెంబడి చైనా కవ్వింపు చర్యలకు దిగుతుండడంతో కేంద్రం సరిహద్దుల్లో ఆర్మీకి సర్వాధికారాలు కట్టబెట్టింది. చైనా ఏదైనా చర్యలకు పాల్పడితే వాటిని తిప్పికొట్టడమే లక్ష్యంగా భారత్ సర్వసన్నద్ధంగా ఉంది. -
‘కమలం’లో కలకలం..
సాక్షి, నిర్మల్: కమలం పార్టీలో కలకలం చెలరేగింది. రాష్ట్ర నాయకుల ఎదుటే వాగ్వాదం, బాహాబాహీ జరిగింది. జిల్లాలో వర్గ రాజకీయం మరోసారి బయటపడింది. జిల్లా బీజేపీ అధ్యక్షురాలిగా పడకంటి రమాదేవిని రెండోసారి నియమించడంపైనే రగడ కొనసాగింది. ఇందుకు జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయమే వేదికైంది. స్థానిక కార్యాలయంలో శుక్రవారం జిల్లా స్థాయి సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి రాష్ట్ర సంఘటన మంత్రి శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సమావేశం ప్రారంభానికి ముందే ఆందోళన ప్రారంభమైంది. పదవి నుంచి తొలగించాలంటూ.. రెండోసారి జిల్లా అధ్యక్షురాలిగా నియమించిన రమాదేవిని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ భైంసాకు చెందిన కౌన్సిలర్లు, నాయకులు ఆందోళన చేపట్టారు. రాష్ట్ర సంఘటన మంత్రి శ్రీనివాస్‌ను సమావేశానికి రానివ్వకుండా పార్టీ కార్యాలయం ఎదుట బైటాయించారు. శ్రీనివాస్, రమాదేవిలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారిని కార్యాలయంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. జిల్లాలో రమాదేవి అందుబాటులో ఉండకపోవడంతో పార్టీ తీవ్రంగా నష్టపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో టికెట్లను అర్హులకు కాకుండా అనర్హులకు కేటాయించారని ఆరోపించారు. పార్టీ అభివృద్ధికి కాకుండా అధికార టీఆర్ఎస్ పార్టీకి కోవర్టుగా పని చేస్తున్నారని విమర్శించారు. భైంసా అల్లర్లలో నష్టపోయిన బాధితులకు కూడా అండగా నిలువకుండా పోయిందని ఆరోపించారు. ఆమెను వెంటనే పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తాము కౌన్సిలర్ పదవులకు రాజీనామా చేస్తామని వారు హెచ్చరించారు. ఇరు వర్గాల మధ్య తోపులాట.. కౌన్సిలర్లు పార్టీ కార్యాలయం ఎదుట బైటాయించి ఆందోళన చేపట్టడం, శ్రీనివాస్, రమాదేవిలకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈక్రమంలో రమాదేవి వర్గానికి, భైంసా బీజేపీ కౌన్సిలర్లకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈక్రమంలో ఒకరిపైఒకరు బాహాబాహీకి దిగారు. ఈసందర్భంగా నిర్మల్‌కు చెందిన ఒకరిద్దరు నాయకులు తీరుపైనా భైంసా కౌన్సిలర్లు, నాయకులు మండిపడ్డారు. అనంతరం రాష్ట్ర సంఘటన మంత్రి శ్రీనివాస్ వారిని సముదాయించడంతో గొడవ సద్దుమణిగింది. పార్టీ నష్టపోతుంది.. జిల్లాలో కాషాయపార్టీ అంటే అభిమానం ఉన్న కార్యకర్తలు, ప్రజలు లక్షల్లో ఉన్నారని, కానీ పార్టీని నడిపించే నాయకులే సరిగా లేరన్న ఆరోపణలు బీజేపీలో వెల్లువెత్తుతున్నాయి. అధిపత్య ధోరణి, అందరినీ కలుపుకొని పోయే తత్వం లేకపోవడంతోనే పార్టీలో వర్గాలు పెరుగుతున్నాయని పలువురు నాయకులు ఆరోపించారు. ఎంపీ ఎన్నికల్లో భారీగా ఓట్లు వేసి పార్టీని గెలిపించారని, అలాంటి అభిమానమున్న వారికి బీజేపీని దూరం చేసే విధంగా పనిచేస్తున్నారంటూ విమర్శించారు. జిల్లా, రాష్ట్ర నాయకుల తీరుతోనే జిల్లాలో పార్టీ నష్టపోతోందని మండిపడ్డారు. డాక్టర్ రమాదేవికి రెండోసారి అధ్యక్ష పదవి ఇవ్వడంలో గల ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. ఆమెను తొలగించకుంటే తమ పదవులకు రాజీనామాలు చేస్తామంటూ భైంసా కౌన్సిలర్లు, నాయకులు హెచ్చరించారు. సిద్ధాంత పార్టీగా పేరున్న బీజేపీలో రాష్ట్ర సంఘటన మంత్రి, జిల్లాకు చెందిన సీనియర్ నాయకుల ముందే ఆందోళన చెలరేగడం చర్చనీయాంశమైంది. -
విద్యార్థుల మధ్య ఘర్షణ
సాక్షి, నర్సంపేట రూరల్: రెండు తరగతుల విద్యార్థుల మధ్య జరిగిన గొడవ రాళ్ల దాడికి దారితీసిన సంఘటన వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలోని సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. శనివారం రాత్రి 9, 10, ఇంటర్మీడియట్ విద్యార్థులు భోజనశాలకు వెళ్లారు. ఈ క్రమంలో విద్యార్థులు మధ్య మాట మాట పెరిగడంతో ఉపాధ్యాయులు నచ్చజెప్పి పంపించారు. ఒక వర్గం విద్యార్థులు భోజనశాల నుంచి బయటకు వస్తూ మరోవర్గం వారిని దుర్భాషలాడటంతో రాత్రి మళ్లీ గొడవకు దిగారు. దీంతో ఉపాధ్యాయులు ఇంటర్మీడియట్ విద్యార్థులందరినీ క్యాంపస్‌లోకి పంపించి తాళాలు వేశారు. కాగా, బయటనే ఉన్న 9, 10 తరగతి విద్యార్థులు ఇంటర్ విద్యార్థుల గదులపై రాళ్ల వర్షం కురిపించారు. దీంతో రాళ్లు తగిలి నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు వచ్చి రాళ్లు రువ్విన విద్యార్థులను చెదరగొట్టారు. గాయపడిన విద్యార్థులను నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నర్సంపేట ఎస్సై నవీన్‌కుమార్ ఈ ఘటనపై మాట్లాడుతూ, ఘర్షణ జరిగిన విషయం తమ దృష్టికి వచ్చిందని, అయితే ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు. ఫిర్యాదు అందిన వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఇంటిపై దాడి
సాక్షి, కల్వకుర్తి టౌన్: స్థానిక ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఇంటిపై టీఆర్ఎస్ నాయకులే దాడిచేసిన ఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. వెల్దండ మండలం పోతేపల్లికి చెందిన సంజీవ్‌కుమార్‌యాదవ్ 9వ డైరెక్టర్ స్థానం, 7వ డైరెక్టర్ స్థానం నుంచి జూపల్లికి చెందిన భాస్కర్‌రావు పోటీచేసి గెలుపొందారు. వీరిలో జూపల్లి భాస్కర్‌రావుకు పీఏసీఎస్ చైర్మన్ పదవి ఇస్తున్నట్లు సమాచారం తెలుసుకున్న సంజీవ్ అనుచరులు కల్వకుర్తిలో ఎమ్మెల్యే ఇంటికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మాట్లాడుతుండగా సంజీవ్, జూపల్లి భాస్కర్‌రావు అనుచరులకు మాటమాట పెరిగి గొడవకు దారితీసి.. దాడి చేసుకునే స్థాయికి చేరుకుంది. ఈ క్రమంలోనే సంజీవ్ అనుచరులు ఎమ్మెల్యే ఇంటికి ఉన్న కిటికీ అద్దాలను ధ్వంసం చేయడంతోపాటు ఏకంగా ఎమ్మెల్యేపై దాడిచేసేందుకు యత్నించారు. వెంటనే తేరుకున్న గన్మెన్లు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి ఆందోళనకారులను చెదరగొట్టారు. అయితే ఇద్దరు కార్యకర్తలు ఒంటిపై పెట్రోలు పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. అద్దాలను ధ్వంసం చేస్తున్న సమయంలో ఓ కార్యకర్తకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో డివిజన్లోని అన్ని పోలీస్స్టేషన్ల పోలీసులు ఎమ్మెల్యే ఇంటికి చేరుకున్నారు. పరిశీలించిన డీఎస్పీ.. ఎమ్మెల్యే ఇంటిపై దాడి సమాచారం తెలుసుకున్న డీఎస్పీ గిరిబాబు అక్కడికి చేరుకొని పరిశీలించారు. ఎమ్మెల్యే ఇంటి ముందు నిరసన వ్యక్తం చేస్తున్న సంజీవ్‌యాదవ్‌కు, మద్దతుదారులకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించారు. అనంతరం డీఎస్పీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ను కలిసి పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ విషయమై డీఎస్పీ స్పందిస్తూ ఫిర్యాదు అందితే తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
గ్యాస్ వివాదాలపై నిపుణుల కమిటీ
న్యూఢిల్లీ: చమురు, గ్యాస్ రంగాల్లో పెట్టుబడులపై వివాదాలు ప్రతికూల ప్రభావం చూపిస్తున్న నేపథ్యంలో ఈ అంశంపై కేంద్రం దృష్టి సారించింది. సుదీర్ఘ న్యాయపోరు సమస్యలు లేకుండా నిర్దిష్ట కాలవ్యవధిలోగా ఇంధనాల అన్వేషణ, ఉత్పత్తి సంబంధ వివాదాల సత్వర పరిష్కారం కోసం ప్రత్యేకంగా నిపుణుల కమిటీని నియమించింది. ఇందులో చమురు శాఖ మాజీ కార్యదర్శి జీసీ చతుర్వేది, ఆయిల్ ఇండియా మాజీ సీఎండీ బికాష్ సి బోరా, హిందాల్కో ఇండస్ట్రీస్ ఎండీ సతీష్ పాయ్ సభ్యులుగా ఉంటారని కేంద్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్లో వెల్లడించింది. కమిటీ కాల వ్యవధి మూడేళ్ల పాటు ఉంటుంది. వివాదాలను కనిష్టంగా మూడు నెలల్లో పరిష్కరించే అవకాశం ఉంటుంది. మధ్యవర్తిత్వం ద్వారా భాగస్వాముల మధ్య లేదా కాంట్రాక్టరు.. ప్రభుత్వం మధ్య తలెత్తే వివాదాలను పరిష్కరించడంపై ఈ కమిటీ దృష్టి పెడుతుంది. ఇందుకోసం థర్డ్ పార్టీ సర్వీసులను కూడా తీసుకోవచ్చు. ఆర్బిట్రేషన్ కోసం నిపుణుల కమిటీని ఆశ్రయించిన తర్వాత.. మళ్లీ ప్రత్యేకంగా కోర్టుకు వెళ్లడానికి కుదరదు. అయితే, పరస్పర అంగీకారంతో సమస్య పరిష్కార ప్రక్రియ వ్యవధిని పెంచుకోవచ్చు. నిర్దిష్టంగా చట్టపరమైన అంశాలు ఉంటే తప్ప ఆయా సంస్థల ఉద్యోగులు, ఉన్నతాధికారులే.. కమిటీ ముందు వాదనలు వినిపించవచ్చు. అడ్వొకేట్లు, కన్సల్టెంట్ల పాత్రేమీ ఇందులో ఉండదు. -
మాట్లాడితే రూ.1500 జరిమానా
సాక్షి, సిరిసిల్ల: అందరూ కలిసి మెలిసి ఉండాల్సిన పరిస్థితులు పోయి మాకు మేము.. మీకు మీరన్న చందంగా ఒకే కులంలోని వాళ్లే రెండు గా విడిపోతున్నారు. అంతేకాదు ఇలా విడిపోయిన వాళ్లు గ్రూపులుగా మారి ఒక గ్రూప్ వాళ్లు ఇంకో గ్రూప్‌లో వాళ్లతో మాట్లాడితే చాలు జరిమానా చెల్లించాల్సిన దుస్థితి నెల కొంది. నిబంధనలను అతిక్రమించి ఒకసారి మాట్లాడితే రూ.500 నుంచి 1500 జరిమానా. మళ్లీ అదే పనిగా రెండోసారి మాట్లాడితే ఇక ఏకంగా రూ.10 వేల జరిమానా చెల్లించాలి. ఈ వివాదం ఇప్పటిది కాదట 2016లో ప్రభుత్వ భూమిలో ఉన్న చెట్లను కొట్టిన వ్యవహారంలో పెద్దలకు, చెట్టుకొట్టిన వ్యక్తిని నిలదీయడంలో చెలరేగిన సంఘంలోని సంఘర్షణ నేటికీ చల్లారడం లేదు. ఒక కూతురు గర్భసంచి ఆపరేషన్ జరిగితే ఆమెను చూడడానికి వెళ్లిన తల్లికి జరిమానా వేసే స్థాయికి చేరింది. ఇలాంటి జరిమానా మేము భరించలేమని ఆ ఊరిలో బాధితులుగా ఉన్న కొందరు ఆదివారం సిరిసిల్ల డీఎస్పీ కార్యాలయానికి వచ్చారు. డీఎస్పీ లేకపోవడంతో దీనిపై ఇక ఈ నెల 24న జిల్లా ఎస్పీ ఏర్పాటు చేసిన ప్రజలతో ముఖాముఖీలోనే తమ గోడు వెల్లబోస్తామని ఆవేదనతో వెనుదిరిగారు. కులంలో కలహాలకు మూలమిదీ.. రాజన్న సిరిసిల్ల ముస్తాబాద్ మండలం పొతుగల్‌లో 2016లో వరద కారణంగా చెరువు కట్ట తెగింది. ఈ క్రమంలో అక్కడ చెట్లు ఓ వ్యక్తి కొట్టుకోవడం చూసిన కొందరు ఒక వర్గానికి చెందిన కులస్తులు అవి అందరికీ చెందినవని దానిని ఒక వ్యక్తి ఎలా కొట్టుకెళ్తాడన్న విమర్శలు చేశారు. దీంతో సంఘంలో పెద్దమనిషి జంగం బూమ్‌రాపుకు, కులస్తులు కలిసి అతనిని అందరి సమక్షలో చెట్లను కొట్టిన విషయమై ప్రశ్నించారు. ఇదే క్రమంలో కులంలో సదరు వ్యక్తి దురుసుగా, దుర్భాషలాడడంతోపాటు పెద్దమనిషిని కొట్టేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పెద్దమనిషి అతనిపై రాయిని విసిరినట్లు బాధిత కుటుంబాలు వెల్లడించాయి. దీం తో భూంరాజుపై కేసు నమోదు జరిగి నేటికీ కోర్టుకు హాజరవుతున్నట్లు కులస్తులు తెలి పారు. ఇదే విషయాన్ని మనసుల్లో పెట్టుకున్న కొందరు కులపెద్దగా ఉన్న అతనిపై వారి సన్నిహితులతో ఎవరూ సుఖ సంతోషాలతో పాలుపంచుకోకూడదని అదే కులంలోని కొందరు హెచ్చరించినట్లు ఆవేదనగా ప్రస్తుతం బహిష్కరణ, జరిమానా చెల్లించిన కుటుంబీకులు వెల్లడిస్తున్నారు. భార్యను చూడ్డానికి వస్తే జరిమానా నా భార్యకు ఇటీవల గర్భసంచి ఆపరేషన్ జరిగింది. ఈ విషయం తెలిసి నా అత్తవాళ్లు వస్తే వాళ్లకు సంఘంలో జరిమానా వేశారు. దీంతో ఇక మా అత్తవాళ్లు రావడం లేదు. నా బిడ్డనే నా భార్యకు సేవలు చేస్తోంది. ఉన్న ఊళ్లో మాకు మా సంఘంలో జరిమానా వేయ డంఏంది. కుటుంబాల్లో చిచ్చు పెడుతున్నారు. – కొప్పు ప్రభాకర్, బాధిత సంఘ సభ్యుడు, పోత్గల్ అల్లుడితో మాట్లాడితే జరిమానా వేశారు నాకు అన్నీ మా అల్లుడి వాళ్లే చూసుకుంటరు. నాకు చేయి విరిగితే అన్ని తానై చూసిండు. ఇప్పుడు సంఘం రెండుగా మారడంతో ఒక దానిలో నా చిట్టీ ఉంది. మరో దానిలో అల్లుడు ఉన్నడు. మొన్న మాట్లాడినందుకు నాకు జరిమానా అన్నరు. ఎందుకు కట్టాలి జరిమానా. అందరూ కలిసి ఉండాలనే చెప్పిన. – యెంకవ్వ, పోత్గల్, ముస్తాబాద్ అధికారులను కలిశాం చెట్లు కొట్టిన విషయంలో సంఘంలో అందరి సమక్షంలోనే నేను రాయితో కొట్టిన ఘటనలో నాపై కేసు నడుస్తోంది. నేను చట్టంలో తప్పు తేలితే శిక్ష అనభవిస్తా. నాతోపాటు మరికొంత మందిని సంఘం నుంచి తీసేయడం సరికాదు. అధికారులు చర్యలు తీసుకోవాలి. దీనిపై ఇప్ప టికే పలుమార్లు పోలీస్ అధికారులను కలిశాం. ఎస్పీని కలవాలని ఆలోచనలో ఉన్నాం. – భూంరాజు, సంఘం పెద్ద మనిషి, పోత్గల్ -
వివాదాల రిజిస్ట్రేషన్!
సాక్షి ప్రతినిధి, విజయనగరం: జిల్లాలో స్టాంప్ ఆండ్ రిజిస్ట్రేషన్ శాఖలో 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. ఏటా స్టాంప్స్ ఆండ్ రిజిస్ట్రేషన్ శాఖకు రూ.200 కోట్లకు పైగా రిజిస్ట్రేషన్ ఫీజుల ద్వారా ఆదాయం సమకూరుతోంది. సగటున రోజుకు రూ.60 లక్షల ఆదాయం రిజిస్ట్రేషన్ ఫీజు రూపేణా ప్రభుత్వానికి వస్తోంది. అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు భూముల కొనుగోలుదారులు చెల్లించే చలా నా ఫీజులో అధికారులకు 0.5 శాతం నుంచి 1 శాతం వరకు కమీషన్ రూపంలో చెల్లించేవారు. వీటిని దస్తావేజు లేఖర్లే వసూలు చేసి అధికారులకు అందజేసేవారు. గతంలో ఒక్కో అధికారి కార్యాలయం ప్రదేశాన్ని బట్టి వారి నెల జీతంతో సమానమైన ఆదాయాన్ని ఒక్క రోజులోనే తీసుకువెళ్లిన సందర్భాలు అనేకం. వీటికి మూలకారకులైన దస్తావేజు లేఖర్లు ప్రభుత్వ ఉద్యోగులు కాకపోవడంతో వీరిపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం లేకపోయేది. లేఖర్ల గుప్పిట్లోనే అధికారులు.. జిల్లాలో 13 సబ్ రిజిస్ట్రార్ల కార్యాలయాల పరిధిలో సరాసరి 5 నుంచి 10 మంది డాక్యుమెంట్ రైటర్లు ఉన్నారు. వీరివద్ద 100 మంది వరకు పనిచేస్తుం టారు. వీరే అధికారులకు, క్రయవిక్రయదారులకు మధ్య దళారులుగా వ్యవహరించి పనికానిచ్చేస్తుంటారు. ఎన్నో ఏళ్లుగా పని చేసి ఉండటంతో ఆ శాఖలో లోటుపాట్లు వీరికి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియవు. ఈ కారణంగానే అధికారులను సైతం వీరి గుప్పిట్లో పెట్టుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. క్రయవిక్రయదారుల నుంచి అధికారుల పేరిట వసూలు చేసేది కొంతైతే వీరి సంపాదన దానికి రెట్టింపు ఉంటుందని అధికారులే అంటున్నారు. విజయనగరంలో కొత్త వివాదం.. విజయనగరం జాయింట్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో కొద్ది రోజుల క్రితం అధికారులు తమ పేరిట ఎవరైనా లంచాలు అడిగినా ఇవ్వొద్దంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. క్రయవిక్రయదారులు దస్తావేజులు నేరుగా కార్యాలయానికి తీసుకువస్తే రిజిస్ట్రేషన్లు చేస్తామని దానిలో పేర్కొన్నారు. అయితే దీని వెనుక కారణం వేరే ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా కొనుగోలు దారులతో ‘అన్ని విధాలుగా సత్సంబంధాలు’ నెరపిన అధికారి ఆకస్మికంగా మంచివాడిగా మారిపోవడానికి అసలు కారణం ఆయన ఉద్యోగోన్నతుల జాబితాలో ఉండటమేనని తెలుస్తోంది. రెండు, మూడు నెలల్లో ఉద్యోగోన్నతి వచ్చే అవకాశం ఉన్నం దున ఈ సమయంలో అవినీతి చేసి పట్టుబడితే నష్టం చాలా ఎక్కువని భావించిన ఆయన తన పంథాను మార్చుకున్నట్లుగా చెబుతున్నారని కొందరు కొనుగోలు దారులు ఆరోపిస్తున్నారు. ఆ అధికారి ఇటీవల తన వద్దకు రిజిస్ట్రేషన్‌కోసం ఎవరు వచ్చినా రోజంతా వెయిట్ చేయించి చివరి నిమిషంలో సర్వర్ పనిచేయడం లేదంటూ తప్పించుకుంటున్నారని, దీనివల్ల వేరే రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వెళ్లి రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నామని చెబుతున్నారు. అలా రోజం తా వేచిఉన్నవారికి, అధికారులకు మధ్య వాగ్వివా దాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ విషయమై జాయింట్ సబ్‌రిజిస్ట్రార్ రాపాక మురళి వద్ద సాక్షి ప్రతినిధి ప్రస్తావించగా... తాను కార్యాలయంలో లం చాలు ఇవ్వొద్దని ఫ్లెక్సీ పెట్టినందునే తనపై బెదిరింపులకు దిగుతున్నారనీ, ఆకాశ రామన్న ఉత్తరాలతో భయపెడుతున్నారని, దీనిపై రెండో పట్టణ పోలీసు స్టేషన్లో తాను ఫిర్యాదు చేసినట్టు కూడా తెలిపారు. -
నెన్నెలలో ఆధిపత్య పోరు..!
సాక్షి, బెల్లంపల్లి: అక్కడ ఆధిపత్య ధోరణి పరాకాష్టకు చేరుకుంది. రెండువర్గాలు సమఉజ్జీలుగా మారి ఏ తీరైన గొడవలకైనా ‘ సై ’ అంటున్నాయి. రాజకీయ పరంగా శత్రువులుగా మారి ఏ సమస్యనైనా సరే అనువుగా మల్చుకుంటున్నారు. భార్యాభర్తల గొడవలు, కుటుంబ తగాదాలు, పొలంగట్ల జగడాలు, రా జకీయ, ఇతరత్రా గొడవలకు కొమ్ము కాస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇరువర్గాలు చె రోదిక్కు చేరిపోయి ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించుకోవడం అక్కడ రెండేళ్ల పైబడి నుంచి నిరాటంకంగా సాగుతోంది. ప్రతి స మస్యను రాజకీయపరంగా మలు చు కుని ఆ రెండు వర్గాలు క్రమంగా శాంతిభద్రతలకు భంగం వాటిళ్లేలా ప్రవర్తిస్తున్నాయి. అధికార పక్షంగా ఓవర్గం, విపక్షంగా మరో వర్గం ప్రతి సమస్యను గొడవలకు దారితీసేలా వ్యవహరిస్తుండటంతో పోలీసులకు తలనొప్పిగా మారింది. నెన్నెల మండలంలో ఆధిపత్య అహంకారం తలకెక్కి వ్యవహరిస్తున్న తీరు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వివవాదాలకు మారుపేరుగా ... బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉన్న నెన్నెల మండలం ఇటీవలి కాలంలో వివాదాలకు మారుపేరుగా నిలుస్తోంది. రెం డేళ్ల పైబడి నుంచి అధికార, విపక్షాలుగా ఉన్న రెండువర్గాలు ఏ అంశంలోనూ వెనక్కితగ్గకుం డా కయ్యానికి కాలుదువ్వుతున్నాయి. చివరికి వారిపైత్యం భార్యాభర్తల గొడవల వరకు కూడా వెళ్లినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నా యి. గ్రామాలలో ఏ ఇద్దరు తగువులాడినా ఓ వ్యక్తి పక్షాన ఓవర్గం, మరోవ్యక్తి పక్షాన ప్రత్యర్థి వర్గం దూరిపోయి ఆధిపత్యం కోసం ఘర్ష ణ వాతావరణానికి పురిగొల్పుతున్నారనే వి మర్శలు ఉన్నాయి. రాజకీయ పరంగా కూడా పంతాలు, పట్టింపులకు పోవడం, ఒకరిపై ఒకరు పోలీసు ఠాణాల్లో ఫిర్యాదు చేసుకోవడం, విచారణ చేపట్టకముందే కేసు నమోదు కోసం పోలీసులపై వొత్తిళ్లు తేవడం, తాము చెప్పిందే నడవాలనే అహంకారం నెత్తికెక్కి ప్రవర్తిస్తున్నారు. భూ ఆక్రమణలు, భూ వివాదాలకు దిగడం, దౌర్జన్యంగా వ్యవహరించడం, ఉద్దేశపూర్వకంగా అల్లర్లకు దిగడం ఓవ ర్గం నాయకుడికి పరిపాటిగా మారిందని గ్రా మీణులు పేర్కొంటున్నారు. ఓ ముఖ్యనేతకు బినామీగా ఉండి అతడి అండదండలతో ఎవర్నీ లెక్కచేయకుండా దుందూకుడుగా వ్యవహరించడం జరుగుతోందని పలువురు చర్చించుకుంటున్నారు. అదేతీరుగా ఆ వర్గానికి ప్ర త్యర్థిగా వ్యవహరిస్తున్న వర్గం కూడా తామేమీ తక్కువ కాదన్నట్లుగా వ్యవహరిస్తుండటంతో ఇరువర్గాల మధ్య కక్షలు పెరిగి పోతున్నాయి. వ్యక్తిగతంగా, ఆస్తుల పరంగా ఆ రెండువర్గాల ముఖ్యనాయకుల మధ్య తగాదాలేం లేకపోయినా రాజకీయ పరంగా వైరివర్గాలుగా మారి ‘హమ్ కిసీసే కమ్ నహీ’ అంటున్నారు. ఈ పరిస్థితులు శాంతిభద్రతలకు విఘాతం కలిగించడంతోపాటు పోలీసులకు సరికొత్త సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. రూట్ మార్చిన పోలీసులు నెన్నెల మండలంలో జరుగుతున్న ఘర్షణలు, ఇతరత్రా అంశాలకు ఎటు తిరిగి శాంతిభద్రతల సమస్యకు దారి తీస్తున్నట్లు పోలీసువర్గా లు అంచనాకు వచ్చాయి. ఏ వర్గానికి నచ్చజెప్పినా వినకపోగా పైపెచ్చు పోలీసులు ప్రత్యర్థి వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నా రని దుష్ప్రచారం చేయడం, ఉన్నతాధికారుల కు తప్పుడు ఫిర్యాదులు చేస్తుండటంతో ఇక్కడి వర్గ రాజకీయాలలో అనివార్యంగా పోలీసులు పావులుగా మారాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం నడస్తున్న ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు భిన్నంగా పోలీసు ఉన్నతాధికారులు ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ‘ట్రబుల్ మాంగర్స్’ గా ముద్రపడ్డ 16 మందిని మంగళవారం కౌన్సెలింగ్‌కు పిలిపించి తమదైన ధోరణిలో మర్యాద చేసినట్లు ప్రచారం జరుగుతోంది. వారిపై కేసు నమోదు చేసి కోర్టుకు పంపారు. ఈ అంశం ప్రస్తుతం బెల్లంపల్లి నియోజకవర్గంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మచ్చుకు కొన్ని సంఘటనలు.. నెన్నెల మండల కేంద్రంలో ఓవర్గ నాయకుడు భూకబ్జాకు పాల్పడినట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చి వివాదంగా మారింది. ఆవ్యవహారంపై రామాగౌడ్ అనే వ్యక్తి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. చివరికి ఆ వ్యవహారంలో ఓ వ్యక్తి పేరుమీద తప్పుడు కుల ధృవీకరణ పత్రం తీసుకుని తనపై తప్పుడు కేసు పెట్టించారని రామాగౌడ్ మనస్థాపం చెంది మంచిర్యాల కలెక్టరేట్‌కు వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. లంబాడి తండాలో ఓ మహిళ మంత్రాలు చేస్తోందని అనుమానించి ఆమెపై దాడి చేసిన ఘటనలో ఓ వర్గం నాయకుడి పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. సదరు నాయకుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. గొడవలకు దిగడం నైజంగా మార్చుకున్న ఓవర్గం నాయకుడిని ఇటీవల సత్ప్రవర్తన కోసం పోలీసులు నెన్నెల తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు. కానీ అతడి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో పోలీసులు మరో కేసు పెట్టారు. మరో వర్గానికి చెందిన ఓ నాయకుడు తానేమీ తక్కువగా కాదన్నట్లుగా ఓ కేసు వ్యవహారంలో జోక్యం కల్పించుకుని ఏకం గా ఏఎస్సైపై దౌర్జన్యానికి పాల్పడమే కాకుండా అతడి విధులకు ఆటంకం కలిగించడంతో ఆ నాయకుడిపై కేసు నమోదైంది. ప్రభుత్వ భూమిని కబ్జాచేశాడని నెన్నెల మండలానికి చెందిన ఓ సామాజిక కార్యకర్త ఓ వర్గం నాయకుడిపై హైకోర్టులో కేసు వేయడం, ప్రస్తుతం ఆ కేసు కోర్టు విచారణలో ఉండడం విశేషం. -
కొండ చుట్టూ వివాదాలు
తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వివాదాలు చుట్టుముడుతున్నాయి. పింక్ డైమండ్ మాయమైందన్న దానిపై స్పష్టత లేదు. ఒకటి కాదు.. రెండు కాదు.. లెక్కలేనన్ని వివాదాలు టీటీడీని చుట్టుముట్టుతున్నా.. ఉన్నతాధికారుల నుంచి ఆధారాలతో కూడిన వివరణ చెప్పిన దాఖలాలు కనిపించడం లేదు. శ్రీవారికి సమర్పించిన అనేక బంగారు ఆభరణాలు కనిపించలేదనే ఆరోపణలు ఉన్నాయి. తిరుమల పోటులో గుట్టుచప్పుడు కాకుండా తవ్వకాలు జరిపారన్న దానిపై టీటీడీ పొంతనలేని సమాధానాలు.. ప్రభుత్వ పెద్దల సేవ కోసం తహతహలాడే టీటీడీ అధికారులు కొందరు స్వామివారిని సైతం పస్తులు ఉంచారని అర్చకుల ఆందోళన.. టీటీడీ నిధులు టీడీపీ నేతల ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. తిరుమల ఆలయంలో జరుగుతున్న అపచారాలపై నోరు విప్పినందుకు టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు, మరి కొందరిని రిటైర్మెంట్ పేరుతో ఇంటికి పంపారని ఆరోపణలు ఉన్నాయి. శ్రీగోవిందరాజస్వామి ఆలయంలో చోరీకి గురైన కిరీటాల వెనుక నిర్లక్ష్యంపై ఎవరిపైనా ఎటువంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. తాజాగా తమిళనాడులో పట్టుబడ్డ రూ.కోట్లు విలువచేసే బంగారంపై టీటీడీ పొంతనలేని సమాధానాలు ఇవ్వడంపై మరిన్ని అనుమానాలకు తావిచ్చినట్లు అవుతోంది. ఇలా టీటీడీపై వస్తున్న ఆరోపణలపై విచారణ చేపట్టి నిజాలను నిగ్గుతేల్చి భక్తుల్లో నమ్మకాన్ని పెంచాల్సిన ప్రభుత్వ అధికారులు, టీటీడీ ఆ ప్రయత్నాలేవీ చేయకపోవడంపై మరిన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పింక్ డైమండ్.. పోటు తవ్వకాలపై వీడని మిస్టరీ కోట్ల రూపాయలు విలువచేసే డైమండ్‌ను విదేశాల్లో విక్రయించారని తిరుమల ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు ఆరోపించారు. పింక్ డైమండ్‌తో పాటు శ్రీవారికి సమర్పించిన విలువైన ఆభరణాలు కూడా మాయమయ్యాయనే ఆరోపణలు ఉన్నాయి. శ్రీవారి ఆలయంలో ఆగమశాస్త్రానికి విరుద్ధంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని, అందులో శ్రీవారి పోటులో రహస్యంగా తవ్వకాలు జరిపారన్న ది రమణదీక్షితులతో పాటు, టీటీడీ ఆలయ చరిత్రపై ముద్రించిన పుస్తకాల్లోనూ పేర్కొన్నారు. ఆలయంలోని ప్రదక్షిణ ప్రాకారంలో శ్రీవారికి సమర్పించిన విలువైన కానుకలను పూడ్చిపెట్టారని చరిత్రకారులు చెబుతున్నారు. బ్రిటిష్ కాలంలో తహశీల్దార్‌గా పనిచేసిన శ్రీనివాసాచార్యులు పోటులో తవ్వకాలు జరిపి అర్థాంతరంగా ఆపివేసిన విషయాన్ని అప్పటి కలెక్టర్ జేమ్స్ స్టార్టన్ రచించిన ‘సవాల్ ఈ జవాబ్’ పుస్తకంలో పేర్కొన్నారు. ఈ పుస్తకాన్ని టీటీడీలో పనిచేస్తూ ఉద్యోగ విమరణ పొందిన సొరకాయల కృష్ణారెడ్డి ‘గోపీకృష్ణ’ పేరుతో ‘మన ఆలయాల చరిత్ర’గా తెలుగులో అనువదించారు. అందులో ‘శ్రీవారికి అనేక మంది కానుకలు సమర్పించారు. వాటిని ఎక్కడ దాయాలో తెలియక అప్పట్లో ఆలయ నిర్వాహకులు ప్రదక్షిణ ప్రాకారంలో పూడ్చిపెట్టారు. ఆ ప్రదక్షిణ ప్రాకారం 300 గజాల పొడవు.. 40 గజాల వెడల్పు కలిగి ఉంటుంది. ఆ విస్తీర్ణంలో రాజులు శ్రీవారికి సమర్పించిన కానుకలను బండల కింద ఎక్కడ పూడ్చిపెట్టారో తెలుసుకునేందుకు అప్పట్లో తహశీల్దార్‌గా పనిచేసిన శ్రీనివాసాచార్యులు ప్రయత్నించారు. అయితే తనకు, తనతో పనిచేసే వారికి అకస్మాత్తుగా జబ్బుచేయడంతో అది అపచారంగా భావించి ప్రయత్నాన్ని విరమించుకున్నారు. అప్పటి నుంచి అనేక మంది తవ్వకాలు జరిపి విఫలమయ్యారు. ఆ తరువాత ప్రదక్షిణ ప్రాకారాన్ని మూతవేశారు. అందులో శ్రీరామానుజస్వామి, తొండమాన్ చక్రవర్తి సమర్పించిన విలువైన కానుకలు కూడా బండల కింద దాచి ఉంచినట్లు ప్రచారం ఉంది. వాటిలో అతి ముఖ్యమైంది నాగా భరణం. ఈ ఆభరణం బిల్వ పత్రాలను పోలి ఉంటుంది.’ అని పేర్కొన్నారు. ఆ బంగారం పట్టుబడకుండా ఉంటే? తమిళనాడులో ఎన్నికల ముందు రోజు గత బుధవారం రాత్రి రూ.400 కోట్లకుపైగా విలువచేసే 1381 కిలోల బంగారం పట్టుబడిన విషయం తెలిసిందే. ఆ బంగారం మొదటి తమకు సంబంధం లేదని చెప్పిన టీటీడీ, కొన్ని గంటల తరువాత ఆ బంగారం టీటీడీదేనని ప్రకటించింది. అన్ని కోట్లు విలువచేసే బం గారం తరలించే సమయంలో ఎటువంటి భద్రత లేకుండా తీసుకు రావడం వెనుక ఆంతర్యం ఏమి టని పలువురు ప్రశ్నిస్తున్నారు. తమిళనాడులో పట్టుబడ్డ బంగారాన్ని ఎక్కడికో తరలిస్తుండగా పట్టుబడిందా? అధికారులు పట్టుకోవడంతో టీటీడీ ట్రెజరీకి చేరిందంటున్నారు. బంగారం తరలింపు విషయంలో ఇటు టీటీడీ, అటు బ్యాంకు అధికారులు తీసుకోవాల్సిన చర్యలు తీసుకోలేదని విచారణాధికారి మన్మోహన్సింగ్ కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యంకు నివేదిక ఇచ్చినట్లు సమాచారం. అదే విధంగా తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే బంగారు ఆభరణాలను జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ చేయకుండా కొందరు అధికారులు కమీషన్లకు కక్కుర్తిపడి నగదు, బం గారాన్ని ప్రైవేట్ బ్యాంకుల్లో డిపాజిట్ చేయడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకే తవ్వకాలు జరిపారా ? క్రీస్తు పూర్వం 1150లో నిర్మించిన ఆలయంలోని పోటులోనే రోజూ మూడు వేళలా మూడు రకాల ప్రసాదాలు త యారు చేసి స్వామి వారికి సమర్పిస్తారు. అటువంటి ప్రాకారాలను పగులగొట్టడానికి 2017 డిసెంబర్ 8 నుంచి 30 వరకు మూతవేశారనేది రమణదీక్షితులు చేసిన ఆరోపణ. ఆలయంలో విమాన ప్రాకారం, బూందిపోటు, లోపల పోటులో ఏ పనిచేయాలన్నా ఆగమశాస్త్రం ప్రకారమే చేపట్టాల్సి ఉందని అర్చకులు అభిప్రాయం. పోటులో చేపట్టిన పనులకు సంబంధించి ఎవ్వరికీ తెలియదని, అంత రహస్యంగా ఎందుకు పనులు చేయాల్సిన అవసరం ఏముందని అనుమానాలు వ్యక్తం చేశారు. ఆలయంలో మరమ్మతులు చేయాలంటే ఆగమ అడ్వైజర్‌ను సంప్రదించాల్సి ఉన్నా.. అటువంటి ప్రయత్నాలేవీ చేయలేదని దీక్షితుల ప్రశ్న. డిసెంబర్ 20న పోటును పరిశీలించే వరకు ఆ అపచారం గురించి తనకు తెలియదని పేర్కొన్నారు కూడా. పోటులో జరిగిన తవ్వకాలు చూసి ఆశ్చర్యపోయానని, పురాతనమైన గోడలను, బండలను పగులగొట్టడం చూసి బాధ వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. బ్రిటీ ష్ హయాంలో జిల్లా కలెక్టర్ పుస్తకంలో రాసిన అంశాలు, రమణదీక్షితులు చేసిన ఆరోపణలకు పోలికలు ఉన్నాయని భక్తులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే ఆ 22 రోజులు పోటులో ఏం జరిగిందనే దానిపై అటు భక్తులు, ఇటు టీటీడీ అధికారులు కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆరోపణల్లో నిజం లేదని చెబుతున్న టీటీడీ, ఆ సమయంలో ఉన్న సీసీ పుటేజీని బయటపెడితే నిజా నిజాలు బయటపడే అవకాశం ఉన్నా.. ఆ ప్రయత్నం చేయక పోవడంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉంటే టీటీడీ అధికారులు కొందరు వీవీఐపీల సేవలో తరిస్తూ భక్తులను విస్మరిస్తున్నారనే ఆరో పణలు ఉన్నాయి. ఇంకా స్వామి వారికి రోజూ జరిగే సుప్రభాతసేవను అర్ధరాత్రి నుంచే నిర్వహించాలని ఒత్తిడి చేస్తున్నారని, 20 నిమిషాలపాటు జరగాల్సిన తోమాల సేవను పది నిమిషాల్లో ముగించాలని అధికారులు ఒత్తిడి చేస్తు న్నారని ప్రధాన అర్చకులే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డిపాజిట్లుప్రైవేటు బ్యాంకులోఎందుకు? తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకలు.. వచ్చే ఆదా యం సుమారు రూ.వెయ్యి కోట్లు టీటీడీ ప్రైవేటు బ్యాంకులో డిపాజిట్ చేసిం ది. ప్రభుత్వ బ్యాంకులు ఉన్నా... ప్రైవేటు బ్యాంకులో ఎందుకు డిపాజిట్ చేయాల్సి వచ్చిందని రాయలసీమ హక్కుల పోరాట సమితి కన్వీనర్ నవీన్‌కుమార్‌రెడ్డి వెలుగులోకి తీసుకురావడంతో పాటు కోర్టును ఆశ్రయించారు. టీటీడీ తీసుకున్న నిర్ణయంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై కౌంటర్ దాఖలు చేయాల్సిన టీటీడీ సబ్ కమిటీని ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంది. అదే విధంగా లడ్డూ పోటును విస్తరించే క్రమంలో ఉగ్రాణం వద్ద ఉన్న గోడను తొలగించి పెద్దది చేయాలని టీటీడీ భావించినట్లు సమాచారం. ఆ గోడను తొలగించేందుకు టీటీడీ రూ.2 కోట్లతో టెండర్ పిలిచి నిధులు దుర్వినియోగం చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. ఒక గోడను తొలగించేందుకు రూ.2 కోట్లు అవసరమా? అని టీటీడీ అధికారులే కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. అదే విధంగా శ్రీవారి ఆలయంలో వెండివాకిలి వద్ద భక్తులకు వీలుగా ఉండేందుకు మెట్లను ఏర్పాటు చేశారు. అది ఆగమశాస్త్రానికి విరుద్ధంగా ఏర్పాటు చేశారని అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో వెంటనే తొలగించారు. ఆ మెట్లు ఏర్పాటు చేసేందుకు సుమారు రూ.33 లక్షలు ఖర్చుచేసినట్లు తెలిసింది. ఇలా తిరుమల తిరుపతి దేవస్థానం నిధులను కొందరు అధికారులు స్వలాభం కోసం ఖర్చుచేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. టీటీడీ నిర్లక్ష్యంతోనే కిరీటాలు చోరీ శ్రీగోవిందరాజస్వామి ఆలయంలో ఉత్సవ విగ్రహాలకు అలంకరించిన కిరీటాల చోరీకి టీటీడీ నిర్లక్ష్యమే కారణమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అదే విధంగా చోరీ చేధించే విషయంలో ఎక్కడా టీటీడీ పాత్ర నామమాత్రంగా కూడా కనిపించలేదు. ఈ ఏడాది ఫిబ్రవరి 3న శ్రీగోవిందరాజస్వామి ఆలయంలో ఉత్సవమూర్తులకు అలకరించిన మూడు బంగారు కిరీటాలు మాయమైన విషయం తెలిసిందే. చోరీకి గురైన కిరీటాలను దొంగ కరిగించి అమ్మిసొమ్ము చేసుకున్నాడు. చోరీకి గురై 80 రోజులు గడచిపోయినా.. కిరీటాలు అపహరణకు గురైన విషయంలో బాధ్యులపై టీటీడీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు పట్టుకుని అప్పగించడంతో దొంగ దొరి కాడని, బంగారం దొరికిందని సముదాయించుకుంటున్నారు తప్పితే టీటీడీ చేసిందేమీ లేదని తెలుస్తోంది. మొత్తంగా ఐదేళ్ల కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో టీడీపీ నేతల పెత్తనం అధికం కావడంతో అధికారులు కూడా ఇష్టారాజ్యం వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రత్యేక దర్శనాల టికెట్లు, లడ్డూలు బ్లాక్ మార్కెట్లో అమ్మి సొమ్ముచేసుకోవడంలోనూ విమర్శలు ఉన్నాయి. పాలకమండలి సభ్యులు ఎల్1, ఎల్2, ఎల్3 దర్శనాలతో పాటు వివిధ సేవా టికెట్లను బ్లాక్‌లో విక్రయించి సొమ్ముచేసుకుంటున్నారే ప్రచారం ఉంది. ఇలా టీటీడీ చుట్టూ వివాదాలు చుట్టుముడుతున్నా... వాటిపై ఎక్కడా విచారణ చేపట్టి నిజాలను నిగ్గుతేల్చిన దాఖలాలు లేవని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి అనుచరులకు రెస్టారెంట్లు తిరుమలలో మంత్రి అనుచరులకు రెస్టారెంట్లు కట్టబెట్టారు. తిరుమలలో ఉన్న రెస్టారెంట్లు, క్యాంటీన్లలో టీటీడీ నిర్ణయించిన ధరలు అమలు కావడం లేదని వాటిని మూసివేశారు. ఆ తరువాత వాట న్నింటికీ ఇటీవల టెండర్లు పిలిచారు. అయితే అన్నమయ్య భవన్‌తో పాటు అన్నమయ్య రెస్టారెంట్, మ్యూజియం సమీపంలోని సందీప రెస్టారెంట్‌కు మాత్రం టెండరు విధానం కాకుండా కొత్త పద్ధతిలో అప్పగించేందుకు పథకం వేశారు. అందులో భాగంగా ఈ రెస్టారెంట్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడిచే సంస్థలకు అప్పగించాలని నిర్ణయించారు. ఆసక్తి ఉన్న సంస్థలు దరఖాస్తు చేసుకోవాలని కూడా నోటిఫికేషన్ ఇచ్చారు. దీంతో సందీప రెస్టారెంట్ దరఖాస్తు చేసుకుంది. ఆ రెస్టారెంట్లకు నెలకు రూ.3 లక్షల అద్దె చెల్లించేందుకు సిద్ధమైంది. ఇదే రెస్టారెంట్ గతంలో రూ.45.66 లక్షలు పలికింది. దీనికి ముందు ఉన్న మయూర హోటల్ వారు ఇదే రెస్టారెంట్‌కు నెలకు రూ.8.83 లక్షలు అద్దె చెల్లిస్తూ వచ్చారు. అయితే దీన్ని కేవలం రూ.3 లక్షలకే ఏపీటీడీసీకి కట్టబెట్టేందుకు టీడీపీ పాలకమండలి తీర్మానించింది. ఈ లెక్కన గత టెండరుతో పోల్చితే నెలకు రూ.42 లక్షలు, ఏడాదికి రూ.5 కోట్లు టీటీడీ నష్టపోవాల్సి వస్తోంది. ఇంత తగ్గించి అప్పజెప్పినా ఆ రెస్టారెంట్లలో భక్తులకు తక్కువ ధరకు భోజనం పెడుతున్నారా? అంటే అదీ లేదు. జనతా హోటల్లో రూ.60 భోజనం ఉంటే.. ఏపీటీడీసీలో రూ.120 ఉంది. వడ రూ. 24 ఉంటే.. ఏపీటీడీసీలో రూ.60 ఉంది. ఇలా అన్ని తినుబండారాల ధరలు రెట్టింపుగా ఉన్నాయి. రెస్టారెంట్‌ను దక్కించుకున్నా ఏపీ టూరిజం శాఖ వారు నడుపుతున్నారా? అంటే అదీ లేదు. వాటిని మంత్రి అనుచరులకు నామమాత్రపు ధరతో అప్పగించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీడీపీ నేతల స్వప్రయోజనాలకు నిధులు టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కోసం భూమి కేటాయించలేదు. అయితే టాటా ఆస్పత్రికి మాత్రం సుమారు రూ.వెయ్యి కోట్లు విలువచేసే భూమిని కేటాయించడంపై అప్పట్లో అనేక విమర్శలు వెల్లువెత్తాయి. అదే విధంగా టీడీపీ నేతల స్వప్రయోజనాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పనుల కోసం రూ.40 కోట్లు టీటీడీ నిధులు కేటాయించింది. అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి రూ.150 కోట్లు కేటాయించింది. ఇంత పెద్ద మొత్తంలో ఆల య నిర్మాణానికి నిధులు కేటాయిస్తున్న టీటీడీకి ప్రభుత్వం అమరావతిలో భూమిని ఉచితంగా ఇవ్వాల్సి ఉంది. ప్రైవేటు సంస్థలకు వందల ఎకరాలను ధారాదత్తం చేస్తున్న ప్రభుత్వం టీటీడీకి మాత్రం ఉచితంగా ఇచ్చేందుకు ఇష్టపడలేదు. ఆలయ నిర్మాణానికి నిధులు కేటాయించడంతో పాటు భూమిని కూడా టీటీడీనే కొనుగోలు చేయాలని హుకుం జారీ చేసింది. దీంతో టీటీడీ అమరావతిలో రూ.12.50 కోట్లు వెచ్చించి భూమిని కొనుగోలు చేసింది. నిత్యావసరాల కొనుగోల్‌మాల్ తిరుమలలో శ్రీవారి భక్తులకు నిత్యాన్నదానం, లడ్డూ ప్రసాదాల తయారీ కోసం టీటీడీ కొనుగోలు చేసే నిత్యావసర వస్తువుల కొనుగోళ్లలో భారీ ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. శ్రీవారి ప్రసాదాల కోసం వినియోగించే నెయ్యి, జీడిపప్పు, ఎండుద్రాక్ష, పప్పుదినుసులు పూర్తిగా నాసిరకంగా ఉంటున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అదే విధంగా స్వామి వారికి అభిషేకం తరువాత వినియోగించే పట్టువస్త్రాలు, వీఐపీలకు కప్పే వస్త్రాలు తదితరాలు కూడా నాసిరకమైనవిగా ప్రచారం జరుగుతోంది. తిరుమల శ్రీవారి ఆలయంలో లడ్డూ, వడ, జిలేబి, వివిధ రకాల పప్పుదినుసులు, కొబ్బరికాయలు, స్వామివారి పట్టువస్త్రాలు, వీఐపీలకు కప్పే పట్టువస్త్రాలతో పాటు సుమారు 250 రకాల వస్తువులను టీటీడీ కొనుగోచేస్తోంది. వాటిని తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ గోదాములో నిల్వచేస్తుంటారు. ఈ వస్తువుల కోసం ఏటా టీటీడీ కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయిస్తుంటుంది. అందులో భాగంగా గత ఏడాది రూ.450 కోట్లు కేటాయించింది. అధికమాసం కారణంగా ఈ ఏడు రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుండడం, పెరటాసి నెల రావడంతో పెద్ద మొత్తంలో నిధులు కేటాయించినట్లు టీటీడీ అధికారులు చెబుతున్నారు. ఈ మొత్తాన్ని సరుకుల కొనుగోళ్లకు టెండర్ పిలిచి కాంట్రాక్టరుకు అప్పగించారు. దీనిపై అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. అయినా ఆ ఆరోపణలపై విచారణ చేపట్టి నిజాలను నిగ్గుతేల్చిని దాఖలాలు లేవు. అన్న ప్రసాదం ‘చిన్న’ బోయింది తిరుమలలో అన్నప్రసాదాలు అంతకంతకూ తగ్గిపోతున్నాయి. తిరుమల శ్రీవారికి లడ్డూతో పాటు మరెన్నో రకాల అన్నప్రసాదాలను నైవేద్యంగా సమర్పిస్తుంటారు. శ్రీవారి లడ్డూలు ఎంత రుచిగా ఉంటాయో.. స్వామికి సమర్పించే అన్న ప్రసాదాలు మరింత రుచిగా ఉంటాయి. అటువంటి అన్న ప్రసాదాలు ఇటీవల కాలంలో దొరకడమే అరుదైపోతోంది. చక్కెర పొంగలి, దద్దోజనం, సీరా, కదంబం, పులిహోరా, మలిహోరా, పాయసం, పోలీ, సుగీ, జిలేబి ఇవన్నీ రుచిగా ఉంటాయి. నెయ్యి కారుతూ.. జీడిపప్పు తేలుతూ ఉండే శ్రీవారి అన్నప్రసాదం కొద్దిగానైనా ఆరగించాలని భక్తులు ఆశపడుతారు. అటువంటి అన్న ప్రసాదాలు ప్రస్తుతం కరువయ్యాయి. సాధారణ రోజుల్లో రోజుకు 900 కిలోలు (200 గంగాళాలు), వారంతాల్లో రోజుకు 1200 కిలోలు (250 గంగాళాలు) ప్రసాదాలు తయారు చేసేవారు. ఈ ప్రసాదాలను వకుళామాత పోటు, పాకశాల, అవ్వపోటు అని పిలిచే వంటశాలలోనే దాదాపు వెయ్యి ఏళ్లుగా తయారువుతున్నాయి. ఇక్కడ సిద్ధమైన ప్రసాదాలను శ్రీవారి గర్భాలయంలోకి తీసుకెళ్లి స్వామికి ఆరగింపు చేస్తారు. ఆపై భక్తులకు పంచిపెడుతుంటారు. స్వామి వారికి సమర్పించే ప్రసాదాలను వైఖానస వైష్ణవులు అత్యంత నిష్టతో తయారు చేస్తారు. తిరుమలలో నిత్యం గంగాళాలకు గంగాళాలు ప్రసాదాలు తయారై వస్తుండేవి. చిన్న లడ్డూ రోజులో ఒకటి రెండు గంటలు సమయం మాత్రమే భక్తులకు ప్రసాదంగా ఇచ్చేవారు. మిగతా సమయం అంతా అన్న ప్రసాదాలనే పంపిణీ చేసేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. దేవస్థానంలో జరుగుతున్న అపచారాలు, పొరబాట్లను ఎత్తిచూపినందుకు ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు, మరి కొందరు అర్చకులను పాలకమండలి రిటైర్మెంట్ ఇచ్చి ఇంటికి పంపింది. అర్చకులను ఇంటికి పంపడం వెనుక కేవలం కక్ష సాధింపేనని ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికలకు కొన్నాళ్లకు ముందు ఏర్పాటైన పాలకమండలి అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
జారిపోయిన ‘జనసేన’
విజయనగరం మున్సిపాలిటీ/డెంకాడ: జనసేన, మిత్రపక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ఎన్ని కల ప్రచారం జావగారిపోయింది. విజయనగరం పట్టణంలోని అయోధ్యమైదానంలోనూ, డెంకాడ మండలంలోని నాతవలస–సింగవరం మధ్యలో శుక్రవారం సభల్లో పవన్ పాల్గొన్నారు. పక్కపక్కనే ఉన్న ప్రాంతాల్లో పవన్ రెండు సభలు నిర్వహించడానికి ఆ పార్టీలో ఉన్న గ్రూపు తగాదాలే కారణమయ్యాయి. ఉదయం పదిగంటలకు విజయనగరం పట్టణంలో సభకు వస్తారని జనసేన పార్టీ ప్రకటించింది. మధ్యాహ్నం వంటిగంటకు గానీ పవన్ రాలేదు. అప్పటి వరకూ ఆయన కోసం వచ్చిన కొద్దిపాటి అభిమానులు కూడా ఎండను తట్టుకోలేక విలవిల్లాడిపోయారు. వేదికపైకి వస్తుండగా ఓ అభిమాని పవన్ రెండు కాళ్లూ గట్టిగా పట్టుకోవడంతో ఆయన కిందపడిపోయారు. అతనిని పవన్ భద్రతా సిబ్బంది పక్కకు తీసుకువెళ్లి దేహశుద్ధి చేశారు. అనంతరం ప్రసంగించిన పవన్ తన ప్రసంగాన్ని ఎక్కడ మొదలుపెట్టారో, ఎక్కడ ముగించారో ఎవరికీ అర్ధం కాలేదు. టీడీపీని విమర్శించడానికి అన్యమనస్కంగా ఉన్నట్టు ప్రసంగంలో కనిపించింది. పవన్ వల్ల తమకు కొన్ని ఓట్లు అయినా పడతాయని ఆశపడిన ఆ పార్టీ అభ్యర్థులు పవన్ ప్రసంగంతో తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. విజయనగరం, నెల్లిమర్ల అభ్యర్థుల మధ్య సయోధ్య లేకపోవడం కారణంగానే రెండు చోట్లా పవన్ సభలు పెట్టాల్సి వచ్చిందని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. పవన్ రాకకు ముందు జనసేన, మిత్ర పక్షాల నేతలు ప్రసంగించారు. పార్టీ నుంచి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తున్నవారు పాల్గొన్నారు. -
వేలెత్తి చూపేలా...!
వినడానికి విచిత్రంగా... చెప్పుకోవడానికి ఆశ్చర్యకరంగా అనిపించే ఘటనలు ఇటీవల క్రికెట్లో తరచుగా చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటివి ఆటగాళ్ల మధ్యనో... మైదానంలోని ప్రేక్షకుల కారణంగానో అయితే పెద్దగా ప్రాధాన్యం ఉండకపోయేది. కానీ, ఆటకు ఆయువుపట్టయిన అంపైరింగ్ వ్యవస్థలో తలెత్తుతుండటంతో చర్చనీయాంశం అవుతున్నాయి. మ్యాచ్ ఫలితంపై అంతోఇంతో ప్రభావం చూపుతూనే... ఒక్కోసారి వివాదానికి సైతం దారితీస్తూ ‘జెంటిల్మన్’ గేమ్ స్ఫూర్తిని సూటిగా ప్రశ్నిస్తున్నాయి. మరీ ముఖ్యంగా వివిధ జట్ల మధ్య జరిగిన గత ఐదారు సిరీస్‌లను పరిశీలిస్తే అంపైరింగ్ పొర‘పాట్లు’ ఏ స్థాయిలో ఉన్నాయో తెలుస్తుంది. సాక్షి క్రీడా విభాగం ఏదైనా అనుమానం వస్తే సంప్రదించేందుకు సహచర అంపైర్ ఉన్నాడు... అప్పటికీ సంశయం ఉంటే నివృత్తికి థర్డ్ అంపైర్‌కు నివేదించే వీలుంది... ఆపై తేల్చేందుకు టెక్నాలజీ తోడుంది! ఇన్ని పటిష్ట ఏర్పాట్లు చేసుకున్నా ఇటీవల అంపైరింగ్‌లో పదేపదే పొరపాట్లు దొర్లుతున్నాయి. ఇలాంటివి ఒకటీ, అరా అయితే చూసీచూడనట్లు వదిలేయొచ్చు. అప్పుడప్పుడు అంటే మానవ తప్పిదమని సర్దిచెప్పుకోవచ్చు. కానీ, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సిరీస్‌లలో తలెత్తుతుండటంతో ప్రమాణాలపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఓ దశలో సహనం కోల్పోయిన ఆటగాళ్లు నిలదీసే వరకు వెళ్తున్నాయి. ఈ ఆవేశంలో అనుకోకుండా హద్దు మీరితే మొదట చర్యలకు గురయ్యేది క్రికెటర్లే కావడం గమనార్హం. విచక్షణతో వదిలేశారు... ప్రతి అంశానికీ టెక్నాలజీ వైపు చూస్తున్న ఈ రోజుల్లోనూ అంపైరింగ్ దోషాలంటే అవి ఆటగాళ్ల పాలిట గ్రహపాట్లుగానే భావించాలి. ఓవైపు టెస్టుల్లో పెద్దగా పరిగణనలోకి తీసుకోకుండా వదిలేయాల్సిన ‘స్లో ఓవర్ రేట్’కే మ్యాచ్‌లకు మ్యాచ్‌లు నిషేధం విధిస్తున్న అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)... మైదానంలో అదుపు తప్పిన ఆటగాళ్లను అన్నిసార్లు ఊరకనే వదిలేస్తుందని అనుకోలేం. ఉదాహరణకు డిసెంబరులో బంగ్లాదేశ్‌పై మూడో టి20లో ఒషేన్ థామస్ వేసిన ఓ బంతిని ‘నో బాల్’గా ప్రకటించడంపై వెస్టిండీస్ కెప్టెన్ కార్లొస్ బ్రాత్‌వైట్ అంపైర్ తన్వీర్ అహ్మద్‌తో తీవ్రమైన వాదనకు దిగాడు. ఈ వివాదం కారణంగా మ్యాచ్ 8 నిమిషాలు ఆగింది. వాస్తవానికి థామస్‌ది ‘నో బాల్’ కాదు. దీంతో బ్రాత్‌వైట్‌పై చర్యలు తీసుకోలేదు. మరోవైపు ఇదే సిరీస్ రెండో టి20లో స్లో ఓవర్ రేట్‌కు బ్రాత్‌వైట్ మ్యాచ్ ఫీజులో 40 శాతం కోత పడటం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. అక్కడ... ఇక్కడ... ఎక్కడైనా! సెప్టెంబరులో జరిగిన ఆసియా కప్‌లో భారత్–అఫ్గానిస్తాన్ వన్డేలో, భారత్–న్యూజిలాండ్ రెండో టి20లో, ఇంగ్లండ్–వెస్టిండీస్ టెస్టులో, ప్రస్తుత శ్రీలంక–దక్షిణాఫ్రికా టెస్టులో అంపైరింగ్ తప్పటడుగులు సాధారణమయ్యాయి. కొత్తవారంటే తడబడ్డారని అనుకున్నా, వందలకొద్దీ మ్యాచ్‌లను పర్యవేక్షించిన అలీమ్ దార్ వంటి సీనియర్ల నిర్ణయాలు సైతం వేలెత్తిచూపేలా చేస్తున్నాయి. ఇలాంటి సమయాల్లో చూపాల్సిన ‘సమయ’స్ఫూర్తి వారిలో కొరవడుతోంది. దీంతో పని భారం తగ్గింపు, నిర్ణయాల్లో కచ్చితత్వం కోసమంటూ తీసుకొచ్చిన సాంకేతికతకూ విలువ లేకుండా పోతోంది. ‘అంపైరింగ్ నిర్ణయాలను ప్రశ్నించి లేనిపోని తలనొప్పులు తెచ్చుకుని మ్యాచ్ నిషేధాలను ఎదుర్కోవడం ఇష్టం లేదంటూ’ ఆసియా కప్‌లో అఫ్గానిస్తాన్‌పై మ్యాచ్‌కు భారత కెప్టెన్‌గా వ్యవహరించిన ధోని వ్యాఖ్యానించాడు. ధోని మాటల అంతరార్థం... అంపైర్లు సరైన నిర్ణయాలు తీసుకోలేదని అందరికీ తెలిసిపోయింది. సాఫ్ట్ సిగ్నల్ ఎత్తివేయండి... డీఆర్ఎస్లోనూ ఏమీ తేలని పక్షంలో... అంపైర్ తొలుత ప్రకటించిన నిర్ణయానికే కట్టుబడి ఉండే సాఫ్ట్ సిగ్నల్‌ను ఎత్తివేయాలని క్రికెట్ ప్రముఖుల నుంచి బలమైన డిమాండ్ వస్తోంది. కొన్నిసార్లు మైదానంలో ఆటగాళ్ల సంబరాలకు ప్రభావితులై అంపైర్లు నిర్ణయాలు తీసుకుంటున్నారని, అలాంటపుడు తుది నిర్ణయాన్ని వారికే ఎలా వదిలేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇవీ... అంపైరాంగ్ ఘటనలు! ఇంగ్లండ్–వెస్టిండీస్ మూడో టెస్టు తొలి రోజు అల్జారీ జోసెఫ్ బౌలింగ్‌లో కాట్ అండ్ బౌల్డ్ అయిన బెన్ స్టోక్స్ డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయాడు. అయితే అంపైర్ పరిశీలించి జోసెఫ్ ‘నో బాల్’ వేసినట్లు తేల్చి వెనక్కుపిల్చాడు. కానీ, అప్పటికే బెయిర్‌స్టో గ్రౌండ్లోకి వచ్చేశాడు. 2017 ఏప్రిల్ నుంచి మారిన రూల్ నంబర్ 31.7 ప్రకారం... ఔట్‌గా వెళ్లిపోయిన బ్యాట్స్‌మన్‌ను మరుసటి బంతి పడేవరకు వెనక్కు పిలిచే అధికారం అంపైర్లకు ఉంది. దీంతో స్టోక్స్‌ను మళ్లీ బ్యాటింగ్‌కు అనుమతించారు. ►భారత్‌పై రెండో టి20లో న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ డరైల్ మిచెల్ ఎల్బీడబ్ల్యూ వివాదం రేపింది. దీనిపై నిర్ణయ సమీక్ష పద్ధతి (డీఆర్ఎస్)కి వెళ్లగా హాట్‌స్పాట్‌లో బంతి బ్యాట్‌కు తగిలినట్లు స్పష్టమైంది. అయితే, బంతి ట్రాకింగ్‌లో మూడు ఎరుపు గుర్తులు కనిపించడంతో మూడో అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. ►డిసెంబరులో బంగ్లాదేశ్–వెస్టిండీస్ టి20లో ఒషేన్ థామస్ కాలు క్రీజ్‌కు తగులుతున్నా అంపైర్ తన్వీర్ అహ్మద్ నోబాల్ ఇచ్చాడు. పెద్ద వివాదం రేగడంతో తాను అంతర్జాతీయ క్రికెట్‌కు కొత్తవాడినని, పొరపాటు చేశానని అతడు అంగీకరించాడు. ►శ్రీలంకతో టెస్టులో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ హషీమ్ ఆమ్లా స్పష్టంగా ఔటయినా అలీమ్ దార్ ఇవ్వలేదు. లంక కెప్టెన్ కరుణరత్నె డీఆర్ఎస్ కోరబోగా నిర్ణీత సమయం (15 సెకన్లు) అయిపోయిందంటూ దార్ తిరస్కరించాడు. కానీ, మరో రెండు సెకన్ల వ్యవధి మిగిలే ఉన్నట్లు తర్వాత తేలింది. -
ఆదాయ పన్ను వివాదాల పరిష్కారానికి 2 కమిటీలు
న్యూఢిల్లీ: ఆదాయ పన్ను శాఖ సంబంధ వివాదాల పరిష్కారాలు సూచించేందుకు, అంతర్జాతీయంగా అనుసరిస్తున్న విధానాల పరిశీలనకు కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు కొత్తగా రెండు కమిటీలు ఏర్పాటు చేసింది. ఇవి రెండూ కూడా నెల రోజుల్లోగా నివేదికలు సమర్పించాల్సి ఉంటుంది. వివాదాస్పద అంశాల క్రమబద్ధీకరణ, పరిష్కార మార్గాలు సూచించేందుకు ఏర్పాటైన కమిటీకి ఐటీ కమిషనర్ హోదా అధికారి సారథ్యం వహిస్తారు. ఇందులో ఐదుగురు సభ్యులు ఉంటారు. ఇక పన్ను వివాదాల పరిష్కారానికి అంతర్జాతీయంగా అనుసరిస్తున్న విధానాల పరిశీలనకు ఏర్పాటైన రెండో కమిటీకి కమిషనర్ స్థాయి అధికారి సారథ్యం వహిస్తారు. ఇందులో కూడా నలుగురు సభ్యులు ఉంటారు. సాధ్యమైనంత వరకూ లిటిగేషన్లను తగ్గించే దిశగా సీబీడీటీ ఇటీవలి కాలంలో పలు చర్యలు తీసుకుంది. ట్రిబ్యునల్స్, కోర్టుల్లో ట్యాక్స్ శాఖ అప్పీలు చేసేందుకు ఉద్దేశించిన పన్ను బాకీల పరిమితిని కూడా గణనీయంగా పెంచింది. అధికారిక గణాంకాల ప్రకారం 2018 ఏప్రిల్ 1 నాటికి ఐటీ అపీల్స్ కమిషనర్ ముందు అప్పీల్స్ రూపంలో రూ. 6.38 లక్షల కోట్ల బకాయిల వివాదాలు పెండింగ్‌లో ఉన్నాయి. -
హైకోర్టు ఉద్యోగుల హౌసింగ్ సొసైటీపై కీలక తీర్పు
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు ఉద్యోగుల హౌసింగ్ సొసైటీలో గత దశాబ్ద కాలంగా కొనసాగుతున్న పలు వివాదాలకు ఫుల్స్టాప్ పెట్టే దిశగా ఉమ్మడి హైకోర్టు ఇటీవల కీలక తీర్పు వెలువరించింది. ఈ సొసైటీ కార్యకలాపాల పర్యవేక్షణకు ముగ్గురు న్యాయమూర్తులతో కమిటీని ఏర్పాటు చేసింది. జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్ చల్లా కోదండరామ్, జస్టిస్ పి.కేశవరావులకు ఈ కమిటీలో స్థానం కల్పించింది. సొసైటీ అకౌంట్ల పరిశీలనకు న్యాయవాదులు వేదుల శ్రీనివాస్, ఎస్.మమతలతో ఏర్పాటు చేసిన కమిటీ తన బాధ్యతలను పూర్తి చేసి, రెండు నెలల్లో తన నివేదికను జడ్జీల కమిటీకి అప్పగించాలని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. ఈ కమిటీ నివేదికను బట్టి జడ్జీల కమిటీ తదుపరి తగిన ఆదేశాలు జారీ చేయవచ్చునంది. సొసైటీ మేనేజింగ్ కమిటీలోని సభ్యులు ఎవరైనా ఏ రకమైన దుర్వినియోగానికి పాల్పడి ఉంటే, వారిపై ఐపీసీ, సహకార చట్ట నిబంధనల మేరకు మూడు నెలల్లో తగిన చర్యలు తీసుకోవచ్చునని హైకోర్టు స్పష్టం చేసింది. ఇప్పటికే స్వాధీనం చేసుకున్న రికార్డులన్నింటినీ కూడా రిజిష్ట్రార్ జనరల్ చేత నియమితులయ్యే అధికారికి అప్పగించాలని సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జి, అడ్మినిస్ట్రేటివ్ అధికారిని హైకోర్టు ఆదేశించింది. లేఔట్ అమలు విషయంలో జడ్జీల కమిటీ అనుమతితో సొసైటీ సభ్యులు సర్వసభ్య సమావేశం నిర్వహించుకోవచ్చునంది. ప్లాట్ల కేటాయింపు విధానం, సభ్యులు చెల్లించిన లేఔట్ అభివృద్ధి చార్జీలు తదితర వివరాలను జడ్జీల కమిటీకి, సొసైటీ సభ్యులకు అందచేయాలని ప్రస్తుత హౌసింగ్ సొసైటీ పాలకవర్గాన్ని హైకోర్టు ఆదేశించింది. తమ ముందుంచిన లేఔట్, భవన ప్లాన్లను జడ్జీల కమిటీ ముందు ఉంచి, వాటిని ఆ కమిటీ సలహా మేరకు అమలు చేయాలని స్పష్టం చేసింది. ఆర్జీ... ఉద్యోగులపైఓ కన్నేసి ఉంచండి.. ఏ వ్యక్తి నుంచి రూ.5వేలకు మించి నగదును తీసుకోవడానికి గానీ, చెల్లింపులు చేయడానికిగానీ వీల్లేదని కమిటీ పాలకవర్గానికి హైకోర్టు తేల్చి చెప్పింది. జడ్జీల కమిటీని సంప్రదించి ఓ చార్టర్డ్ అకౌంటెంట్‌ను నియమించుకోవాలని ఆదేశించింది. చెల్లింపులు, స్వీకరణల ఖాతాలను సిద్ధం చేయాలంది, మూడు, ఆరు నెలలతో పాటు వార్షిక ఆడిట్ నివేదికలను సిద్ధం చేసి, వాటిని డిస్ప్లే బోర్డులో ఉంచాలంది. లేఔట్ అభివృద్ధి, తదితర పనులపై సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్ట్‌ను వేర్వేరు ఏజెన్సీల నుంచి తెప్పించుకోవాలని, అంతిమంగా జడ్జీల కమిటీ ఆమోదించిన వారికి పనులు అప్పగించాలంది. సభ్యులకు కేటాయించిన ప్లాట్లలో నిర్మాణాలను హౌసింగ్ సొసైటీ చేపట్టడానికి వీల్లేదంది. కేటాయించిన ప్లాట్లను ఉపయోగించుకునే విషయంలో సభ్యులకు స్వేచ్ఛనివ్వాలంది. సొసైటీకి హైకోర్టు ప్రాంగణంలో కేటాయించిన కార్యాలయాన్ని ఎట్టి పరిస్థితుల్లో దుర్వినియోగం చేయరాదని, కోర్టు పని గంటల్లో సొసైటీ కార్యకలాపాల్లో పాల్గొనరాదని ఆదేశించింది. ఈ విషయంలో ఉద్యోగులపై ఓ కన్నేసి ఉంచాలని రిజిష్ట్రార్ జనరల్ (ఆర్జీ)ను ఆదేశించింది. ప్రభుత్వంతో సంప్రదింపులు చేసుకోండి... అర్హులైన పలువురికి సొసైటీలో సభ్యత్వం ఇవ్వలేదన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో, ప్రస్తుతం కేటాయించిన స్థలం పక్కనే ఏదైనా స్థలం ఖాళీగా ఉంటే దానిని కేటాయించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేసుకోవాలని సొసైటీకి స్పష్టం చేసింది. స్థలం కేటాయింపు విషయంలో ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకోవచ్చునంది. తాము ఆదేశించిన మేర ప్లాట్ల కేటాయింపులు, లేఔట్ అభివృద్ధి సంతృప్తికరంగా జరుగుతుంటే, జడ్జీల కమిటీ పక్కకు జరిగి, ఎన్నిౖకైన పాలకవర్గాలు స్వతంత్రంగా ముందుకెళ్లేందుకు అవకాశం ఇవ్వాలంది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ప్రత్యేక దృష్టి సారించిన సీజే రాధాకృష్ణన్... హైకోర్టు ఉద్యోగులకు 2010లో ఇళ్ల స్థలాల కేటాయింపు జరిగింది. అంతకు ముందే ఏపీ హైకోర్టు ఉద్యోగుల హౌసింగ్ సొసైటీ ఏర్పాటు జరిగింది. స్థలాల కేటాయింపు జరగడానికి ముందే సొసైటీ బైలాను సవరించడంపై 2007లో కొందరు హైకోర్టులో పిటిషన్లు వేశారు. స్థలం కేటాయింపు జరిగిన తరువాత వివాదాలు మరింత ముదిరాయి. ఆ తరువాత పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగం జరిగింది. వీటన్నింటిపై పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఉమ్మడి హైకోర్టు సీజేగా వచ్చిన జస్టిస్ రాధాకృష్ణన్ ఈ మొత్తం వివాదాలపై ప్రత్యేక దృష్టి సారించారు. సొసైటీలో చోటు చేసుకున్న అన్ని పరిణామాలను పాలనాపరంగా తెలుసుకున్నారు. ఈ వివాదాలన్నింటికీ ఫుల్స్టాప్ పెట్టాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఈ వ్యాజ్యాలన్నింటిపై సీజే నేతృత్వంలోని ధర్మాసనం ఇటీవల వాదనలు విని తీర్పు వెలువరించింది. -
విశాల్ ఫస్ట్‌లుక్.. చెలరేగిన వివాదం!
బీరు బాటిల్ పట్టుకుని ఉన్న విశాల్ కొత్త సినిమా పోస్టర్ పై తమిళనాట వివాదం రాజుకుంటోంది. తెలుగులో హిట్‌గా నిలిచిన టెంపర్ చిత్రాన్ని విశాల్ తమిళంలో ‘అయోగ్య’ పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పోస్టర్‌ను సోమవారం చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పోస్టర్ లో విశాల్ పోలీసు జీపుపై బీరుబాటిల్ పట్టుకుని కూర్చున్న సన్నివేశం ఉంది. ఇదే ఇప్పుడు తమిళుల్లో ఆగ్రహం తెప్పిస్తుంది. బాధ్యతాయుత పదవుల్లో ఉండటమే కాకుండా సమాజానికి మంచి చెప్పే హీరో ఇటువంటి సన్నివేశాల్లో నటించటం ద్వారా సమాజానికి ఎటువంటి సందేశం ఇస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. ప్రధానంగా మద్యపానంపై పోరాడుతున్న పిఎంకె పార్టీ వ్యవస్థాపకుడు రాందాస్ విశాల్ పై విరుచుకు పడ్డారు. గతంలో సినిమాల్లో తారలు పొగతాగటంపై రాద్దాంతం చేసి ఓ మేరకు విజయం సాధించారు రాందాస్. ఇప్పుడు మద్యం విషయంలో విశాల్‌పై మండిపడుతున్నారు. అయితే ఈ వివాదం ఎక్కడికి వెళుతుందోనని తమిళ చిత్రసీమ ఆందోళనలో ఉంది. మరి దీనిపై విశాల్ సమాధానం ఎలా ఉంటుందో వెయిట్ అంట్ సీ అని విశ్లేషకులు అంటున్నారు. తమిళనాట సినిమాల్లో సిగరెట్ తాగటంపై రాజకీయ నేతల విమర్శలకు ఏకంగా రజనీకాంత్, కమల్ హాసన్, అజిత్, విజయ్ వంటి హీరోలే తమ సినిమాల్లో అలాంటి సన్నివేశాలను తొలగించటంతో పాటు ఇకపై తమ సినిమాల్లో అటువంటివి ఉండబోవని ప్రకటించి ఆచరిస్తున్నారు. -
'ఈ- ఆక్షన్' ...మీ కోసమే!!
సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం:శ్రీకృష్ణ, నీలిమ అందినంత రుణం దొరుకుతోంది కదా అని తాహతుకు మించి అప్పు చేసి ఇల్లు కొన్నారు. కానీ తరవాత పరిస్థితులు తిరగబడి ఆ ఇంటి రుణానికి ఈఎంఐలు చెల్లించలేని పరిస్థితిలో పడిపోయారు!!. రామరాజుకు సొంత కంపెనీ ఉంది. ఆదాయం బాగా వస్తున్నపుడు కంపెనీ విస్తరణ కోసం రుణాలు తీసుకున్నాడు. తను అప్పటికే కొనుగోలు చేసిన నాలుగైదు ఫ్లాట్లను కూడా సెక్యూరిటీగా తనఖా పెట్టాడు. కాకపోతే ఆ వ్యాపారంలో పోటీ పెరిగి లాభాలు పడిపోయాయి. ఈఎంఐలు చెల్లించలేని పరిస్థితిలో పడ్డాడు!!. ఇలా... కారణాలు ఏవైనా కావచ్చు. వ్యక్తులు ఎవరైనా కావచ్చు. ఈ మధ్య రుణాలు తీసుకున్న వారు డిఫాల్ట్ అవుతున్న సందర్భాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. పైపెచ్చు బ్యాంకులు ఇంతకుముందు చూసీ చూడనట్లు వ్యవహరించేవి. ఏడాది రెండేళ్లపాటు రుణాల వాయిదాలు చెల్లించకపోయినా పెద్దగా పట్టించుకునేవి కావు. కానీ మారిన నిబంధనలు, పెరిగిన నిఘా, ప్రభుత్వ చర్యల నేపథ్యంలో ఇపుడవి చాలా కఠినంగా వ్యవహరిస్తున్నాయి. వాయిదాలు చెల్లించటంలో విఫలమైన డిఫాల్టర్లకు నోటీసులిస్తూ... వారు తనఖా పెట్టిన ఇళ్లను, ఇతర ఆస్తులను వేలానికి పెడుతున్నాయి. ఈ మధ్య పత్రికల్లో ఇలాంటి వేలాలకు సంబంధించిన ప్రకటనలు కూడా పెరిగాయి. ఇలా ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు, అస్సెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీలు, ఆర్థిక సంస్థలు వేలానికి పెడుతున్న ఆస్తుల సంఖ్య పెరుగుతోంది. దీనికి కారణాలు ఏమైనా... కాస్త తక్కువలో ఇళ్లు కొనుక్కుని సెటిల్ అవుదామనుకునే ఈ డిస్ట్రెస్డ్ సేల్ ఒక మంచి అవకాశమనే చెప్పాలి. ఈ వేలానికి సంబంధించిన ప్రక్రియ అంతా ఆన్లైన్లోనే పూర్తవుతోంది. ఔత్సాహిక కొనుగోలుదారులకు ఇది మరింత కలసివచ్చే అంశం. ఈ నేపథ్యంలో అసలు ఇలాంటి ఇళ్లను కొనొచ్చా? కొంటే లాభమా... నష్టమా? కొనేముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఇవన్నీ తెలియజేసేదే ఈ ‘ప్రాఫిట్ ప్లస్’ ప్రత్యేక కథనం... అన్ని రకాల ఆస్తుల వేలం బ్యాంకులు వేలం వేసే వాటిలో అన్ని రకాల ఆస్తులూ ఉంటున్నాయి. ఎస్బీఐ ఇటీవలే అతిపెద్ద ఎలక్ట్రానిక్(ఈ) వేలాన్ని నిర్వహించింది. ఇందులో ఒకేసారి 1,000 ఆస్తులను వేలానికి పెట్టింది. ఇందులో ఇళ్లు, వాణిజ్య భవనాలు (ఆఫీసులు, షాపులు) ఫ్యాక్టరీ బిల్డింగులు ఉన్నాయి. వేలం వేసింది ఏ ప్రాంతం, ఎంత విస్తీర్ణంలో ఉన్నది తదితర అంశాలను బట్టి ధర ఉంటుంది. ఉదాహరణకు ముంబై శాంతాక్రజ్ ఈస్ట్‌లో రెండు పడకగదుల ఇళ్లను రూ.2 కోట్ల రిజర్వ్ ధరకు వేలానికి పెట్టింది. నవీ ముంబైలో ఫ్లాట్ లేదా షాపు ధర రూ.8.5 కోట్లు. పాతవి, తక్కువ విస్తీర్ణంతో ఉన్న ఫ్లాట్లు లేదా షాపులు, చిన్న పట్టణాల్లో ఆస్తులు రూ.50 లక్షల్లోపే ఉంటున్నాయి. ధరలూ ఆకర్షణీయమే! కొన్ని సందర్భాల్లో వేలంలోకి వచ్చేవి ఆకర్షణీయ ధరల్లోనే ఉంటున్నాయి. ఎందుకంటే తమకున్న బకాయిలను వసూలు చేసుకుంటే చాలనుకుని బ్యాంకులు ధర తగ్గించి అమ్మకానికి పెడుతుంటాయి. వేలానికి ఉంచే అన్ని ఆస్తులపై బ్యాంకులు లాభాలను ఆశించలేని పరిస్థితి ఉంటుంది. పైగా ఇది బ్యాంకు, కొనుగోలుదారుల మధ్య నేరుగా జరిగే లావాదేవీ. మధ్యలో బ్రోకర్లు ఉండరు. తమ వద్ద నమోదైన వ్యాల్యూయర్ల సిఫారసుల మేరకు బ్యాంకులు వేలం ధరను ఖరారు చేస్తుంటాయి. సాధారణంగా మార్కెట్ ధర కంటే 10–15 శాతం తక్కువే ఉంటుంది. ఇందులో రిజర్వ్ ధర ఉంటుంది. బ్యాంకులు ఇంత కంటే తక్కువ ధరకు విక్రయించవని అర్థం. ఆ ధరకు అదనంగా కొంత కోట్ చేస్తూ వేలంలో పాల్గొనవచ్చు. చివరికి ఎక్కువ కోట్ చేసినవారు విజేతగా నిలుస్తారు. బిడ్డింగ్ ప్రక్రియ ఎలా...? వేలం ప్రక్రియలో పాల్గొని బిడ్డింగ్ వేయడం చాలా సులభం. ఆక్షన్ సైట్లు, స్థానిక వార్తా పత్రికల ద్వారా ఈ–వేలం గురించి తెలుసుకోవచ్చు. బ్యాంక్ ఈ ఆక్షన్స్, ఫోర్క్లోజర్ ఇండియా, ఈఆక్షన్.ఎన్పాసోర్స్ తదితర పోర్టల్స్ పలు బ్యాంకుల తరఫున వేలం ప్రక్రియను నిర్వహిస్తుంటాయి. కెనరా బ్యాంకు అయితే ‘కెనరాబ్యాంకు. ఆక్షన్టైగర్.నెట్’లో వేలం వేస్తుంటుంది. ప్రతి ప్రాపర్టీ సమాచారం అక్కడే అందుబాటులో ఉంటుంది. బిడ్డింగ్‌ను కూడా అక్కడే సమర్పించొచ్చు. బిడ్ డాక్యుమెంట్‌లోనే ప్రాపర్టీకి సంబంధించి రుణ బకాయిలు తదితర సమాచారం తెలుసుకోవచ్చు. ఈ పోర్టల్స్‌లో తమ పేరు, ఇతర కేవైసీ వివరాలతో నమోదు చేసుకున్న తర్వాతే బిడ్‌కు అర్హత లభిస్తుంది. పైగా వేలంలో పాల్గొని బిడ్ వేసే వారు ప్రాపర్టీ రిజర్వ్ ధరలో 10% చెల్లించాల్సి ఉంటుంది. ఏ తేదీన, ఏ సమయంలో ఆస్తిని వేలం వేస్తున్నదీ బ్యాంకు తెలియజేస్తుంది. అలాగే, ప్రత్యక్షంగా ఆ ప్రాపర్టీని చూసుకునేందుకూ ఒక తేదీని నిర్ణయిస్తుంది. ఆ రోజున వెళ్లి ప్రాపర్టీని చూసుకోవచ్చు. వేలం గెలుచుకున్న వారు విక్రయ ధరలో 25 శాతాన్ని అదే రోజు చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని తదుపరి 15 రోజుల్లో చెల్లించేయాలి. దీనికి కావాలనుకుంటే రుణం తీసుకోవచ్చు. దీంతో ఆస్తిపై హక్కులను కొనుగోలుదారులకు బ్యాంకులు బదలాయిస్తాయి. సొసైటీ నిరంభ్యంతర పత్రాన్ని (ఎన్వోసీ) కూడా అందిస్తాయి. పరిశీలించాల్సినవి ఇవీ... బ్యాంకుల ఈ వేలంలో పాల్గొని ఆస్తిని సొంతం చేసుకునే వారు ఓ న్యాయవాది సహకారం తీసుకోవడం ద్వారా టైటిల్ పరంగా సమస్యలు ఎదురు కాకుండా జాగ్రత్తపడొచ్చు. ఆ ఆస్తిపై ఏవైనా పెండింగ్‌లో వివాదాలున్నాయా అన్నది తెలుసుకోవచ్చు. ఇక కొనుగోలు చేస్తున్న ఆస్తికి సంబంధించి నీటి పన్ను, ఆస్తి పన్ను బకాయిలు ఏవైనా ఉన్నదీ తెలుసుకోవాలి. బ్యాంకులు పేర్కొన్న నిర్ణీత గడువులోపే చెల్లింపులన్నీ జరిగేలా చూసుకోవాలి. ఇక వేలాన్ని రద్దు చేసే సందర్భాలు కూడా ఉంటాయి. నోటీసు ఇచ్చిన తేదీ నుంచి 30 రోజుల తర్వాత బ్యాంకులు వేలం వేస్తాయి. ఈలోపు బకాయిదారుడు తాను తీసుకున్న రుణాన్ని చెల్లించేస్తే బ్యాంకులు రద్దు నిర్ణయం తీసుకుంటాయి. కొన్ని సొసైటీలు అయితే తొలి తిరస్కరణ హక్కు కింద తామే ఆస్తిని కొనుగోలు చేయవచ్చు. ప్రతికూలతలూ ఉంటాయి! ఆస్తిని ‘ఉన్నది ఉన్నట్టుగా’ అనే స్థితిలో బ్యాంకు అమ్మకానికి పెడుతుంది. అంటే ఆ ప్రాపర్టీకి సంబంధించిన టైటిల్ విషయంలోనూ, ఇతరత్రా న్యాయపరమైన వివాదాలు ఏమైనా ఉంటే వాటికి బ్యాంకులు బాధ్యత వహించవు. పైపెచ్చు సదరు ఆస్తికి సంబంధించి పన్నులు, ఇతరత్రా అంశాల్లో స్థానిక సొసైటీలకు, మున్సిపాలిటీలకు ఏవైనా బకాయిలున్నా సరే వాటిని బ్యాంకు చెల్లించదు. వేలానికి పెట్టే ఇళ్లు కొత్తవి కావు కనక మరమ్మతులు వంటివేవైనా చేయించాల్సి ఉంటే వాటిని కొనుగోలుదారే చేయించుకోవాల్సి ఉంటుంది. మొత్తంగా చూస్తే ఆ ఇంటికి సంబంధించి వివాదాలు, మరమ్మతులు, బకాయిల వంటి అన్నిటికీ కొనుగోలు చేసిన వారే బాధ్యులవుతారు. వారే పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. -
గ్రూపుల లొల్లి !
సాక్షి, కొత్తగూడెం : సాధారణ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ అధికార టీఆర్ఎస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అయితే పినపాక నియోజకవర్గంలో ఇవి మరింతగా ముదురుతున్నాయి. టీఆర్ఎస్ అధికారంలో ఉండడంతో ఇతర ప్రాంతాల మాదిరిగానే ఇక్కడా భారీ వలసలతో పార్టీ కిక్కిరిసిపోయింది. 2014లో ఈ నియోజకవర్గంలో నామమాత్రంగా ఉన్న పార్టీ బలం ప్రస్తుతం గణనీయంగా పెరిగింది. పార్టీలోకి వలసల పరంపర ఉన్నప్పటికీ.. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు వైఎస్సార్సీపీని వీడి టీఆర్ఎస్లోకి వచ్చాక చేరికలు ఇబ్బడిముబ్బడిగా జరగడంతో ప్రస్తుతం కిటకిటలాడిపోతోంది. ఈ క్రమంలో దాదాపు అన్ని పార్టీల గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి నాయకుల వరకు గులాబీ కండువా కప్పుకున్నారు. దీంతో గ్రూపుల సంఖ్య కూడా అదేస్థాయిలో పెరుగుతూ వచ్చింది. కాంగ్రెస్ పార్టీని మించి టీఆర్ఎస్లో గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయని రాజకీయ వర్గాల్లో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సహ జంగానే గ్రూపుల లొల్లి నడుస్తోంది. ఎన్నికల ఏడాది కావడంతో ఈ గ్రూపు రాజకీయాలు మరింత క్రియాశీలకం అవుతున్నాయి. ఈ నియోజకవర్గంలో ప్రస్తుత గ్రూపులు అసమ్మతి రాజకీయాలుగా రూపాంతరం చెందాయి. ఇవి చివరకు దాడులకు దారితీస్తున్నాయి. మణుగూరు మండలంలో ప్రారంభమైన అసమ్మతి గళాలు ఇతర మండలాలకూ విస్తరించాయి. అసమ్మతి ప్రభా వంతో గుండాల మండలంలో దాడి సైతం చోటుచేసుకుంది. పాయం అండతో పదవులు పొంది చివరకు అసమ్మతి రాగాలు.. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు వైఎస్సార్సీపీ నుంచి టీఆర్ఎస్లో చేరినప్పుడు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు ఇతర పార్టీలకు చెందిన అనేకమంది టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఎమ్మెల్యే పాయం తన అనుచరులతో పాటు, వివిధ పార్టీల నుంచి వచ్చిన వారిలో పలువురికి పార్టీ, నామినేటెడ్ పదవులు అప్పగించారు. అయితే వివిధ అభివృద్ధి పనుల కేటాయింపుల్లో మాత్రం ఎమ్మెల్యే పక్షపాతం చూపిస్తూ కొంతమందినే ప్రోత్సహిస్తున్నారంటూ కొందరు అసమ్మతి రాగం అందుకున్నారు. మణుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు మండలాల జెడ్పీటీసీలు, ఇతర నాయకులు కొందరు మొదట మణుగూరులో అసమ్మతి శిబిరం ఏర్పాటు చేసుకున్నారు. వీరు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా సంతకాలు సైతం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మణుగూరుకు చెందిన కొందరు అసమ్మతివాదులు గత 26న గుండాలలో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా సంతకాలు సేకరించి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ద్వారా పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయనున్నట్లు సదరు అసమ్మతి నాయకులు చెప్పినట్లు సమాచారం. మండల కార్యదర్శిపై అధ్యక్షుడి దాడి.. కాగా, టీఆర్ఎస్ గుండాల మండల కార్యదర్శి కదిర్ 27న విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే కొందరు పార్టీలో ఉంటూ చీలికకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దీంతో 28న పార్టీ గుండాల మండలాధ్యక్షుడు భాస్కర్.. తనకు సమాచారం లేకుండా ప్రెస్‌మీట్ ఎలా పెట్టావంటూ కదిర్‌పై కర్రతో దాడి చేయడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స అనంతరం కదిర్ భాస్కర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పరిస్థితి మరింత చేయిదాటిపోకుండా ఉండేందుకు ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రంగంలోకి దిగాల్సి వచ్చింది. -
అరుణ వర్సెస్ జైపాల్!
సాక్షి, హైదరాబాద్ : పాలమూరు జిల్లా కాంగ్రెస్ రాజకీయం ముదిరి పాకాన పడుతోంది. జిల్లాలో కీలక నేతలైన కేంద్ర మాజీ మంత్రి ఎస్. జైపాల్‌రెడ్డి, ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి డి.కె. అరుణల మధ్య రోజురోజుకూ విభేదాలు తీవ్రమవుతున్నాయి. నాగం జనార్దన్‌రెడ్డిని పార్టీలో చేర్చుకునే విషయంలో అరుణకు వ్యతిరేకంగా జైపాల్ కుట్ర చేశారన్న ఆరోపణలతో విభేదాలు తారస్థాయికి చేరాయి. ఈ పరిణామం అనంతరం అరుణ కూడా దూకుడుగానే వెళ్తూ వీలున్నప్పుడల్లా జైపాల్‌ను ఇబ్బందుల్లో పడేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)లో స్థానం లభిస్తుందని, అధిష్టానం వద్ద చక్రం తిప్పే అవకాశం వస్తుందని ఆశించిన జైపాల్‌రెడ్డికి ఈ విషయంలో ఆశాభంగం జరగ్గా ఇదే అదనుగా అరుణ ఏకంగా జైపాల్ లోక్‌సభ టికెట్‌కు ఎసరు పెట్టే వ్యూహాలు రచిస్తున్నారు. మహబూబ్‌నగర్ లోక్‌సభ టికెట్‌తోపాటు దాని పరిధిలోని అసెంబ్లీ స్థానాలనూ బీసీలకు కేటాయించాలని ఆమె ప్రతిపాదిస్తున్నారు. అయితే జైపాల్ శిబిరం మాత్రం అధిష్టానం తమకే ప్రాధాన్యమిస్తుందని ధీమాగా ఉంది. తెరపైకి చిత్తరంజన్‌దాస్ పేరు... మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం పరిధిలో అరుణ, జైపాల్ వర్గాలు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాయి. ముఖ్యంగా లోక్‌సభతోపాటు ఆ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో తమ వర్గానికి చెందిన నేతలకే టికెట్లు దక్కించుకోవాలనే వ్యూహంతో పావులు కదుపుతున్నాయి. ఇదే క్రమంలో మహబూబ్‌నగర్ లోక్‌సభ నుంచి టికెట్ ఖాయం అని ప్రచారం జరుగుతున్న జైపాల్‌రెడ్డికి కాకుండా బీసీ వర్గాలకు చెందిన చిత్తరంజన్‌దాస్ పేరును అరుణ తెరపైకి తెచ్చారు. గతంలో అలంపూర్ మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకట్రామిరెడ్డి లేదా చిత్తరంజన్దాస్లలో ఒకరికి టికెట్ ఇవ్వాలని ప్రతిపాదించిన అరుణ ఇప్పుడు బీసీ కార్డు ప్రయోగిస్తున్నారు. మహబూబ్‌నగర్ లోక్‌సభతోపాటు అసెంబ్లీ స్థానాన్ని కూడా బీసీలకే ఇవ్వాలని ఆమె వాదిస్తున్నారు. గతంలో ఎన్.టి. రామారావును ఓడించి సంచలనం సృష్టించిన ప్రస్తుత కాంగ్రెస్ ఓబీసీ సెల్ రాష్ట్ర చైర్మన్ చిత్తరంజన్‌దాస్‌కు లోక్‌సభ సీటు ఇవ్వాలంటున్నారు. అలాగే ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన నేతలకు లోక్‌సభ స్థానం పరిధిలోని అసెంబ్లీ సీట్లు ఇస్తే ప్రయోజనంగా ఉంటుందని వాదిస్తున్నారు. కానీ ఈ వాదనను జైపాల్ వర్గం కొట్టిపారేస్తోంది. పార్టీలో సీనియర్ నేతగా, ఉత్తమ పార్లమెంటేరియన్‌గా గుర్తింపు పొందిన జైపాల్‌రెడ్డికే మహబూబ్‌నగర్ లోక్‌సభ టికెట్ వస్తుందని చెబుతోంది. లోక్‌సభకు పోటీ చేయించే ఆలోచనతోపాటు రాష్ట్రంలో పార్టీని సమన్వయం చేసే బాధ్యతలు ఉన్నందునే అధిష్టానం జైపాల్‌ను సీడబ్ల్యూసీలోకి తీసుకోలేదని పేర్కొంటోంది. నాలుగు అసెంబ్లీ స్థానాలపై కిరికిరి... మహబూబ్‌నగర్ లోక్‌సభ పరిధిలో షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, దేవరకద్ర, మక్తల్, నారాయణ్‌పేట్, కొడంగల్ అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇందులో షాద్‌నగర్ నుంచి సి.ప్రతాప్‌రెడ్డి, జడ్చర్ల నుంచి మల్లు రవి, కొడంగల్ నుంచి ఎ. రేవంత్‌రెడ్డిలకు టికెట్లు ఇచ్చే విషయమై ఇరువర్గాల్లోనూ ఏకాభిప్రాయముంది. మిగిలిన నాలుగు చోట్ల అరుణ, జైపాల్ వర్గాలు ఎడ్డెం అంటే తెడ్డెం అంటున్నాయి. మహబూబ్‌నగర్‌లో జైపాల్ వర్గం సురేందర్‌రెడ్డి పేరును ప్రతిపాదిస్తోంది. ఒకవేళ మైనారిటీలకు ఇవ్వాలనుకుంటే టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఇబ్రహీంకు ఇవ్వాలంటోంది. అయితే అరుణ మాత్రం ఈ రెండు ప్రతిపాదనలను వ్యతిరేకిస్తున్నారు. డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్ విషయంలో అరుణ వ్యతిరేక అభిప్రాయంతో లేనప్పటికీ అక్కడ ముదిరాజ్ సామాజిక వర్గానికి సీటు ఇవ్వాలని ఆమె అంటున్నారు. ఇందుకోసం స్థానిక నేత ఎన్.పి. వెంకటేశ్ పేరును ఆమె ప్రతిపాదస్తున్నారు. లేదంటే ఎర్ర శేఖర్‌కు ఇవ్వాలని చెబుతున్నారు. దేవరకద్ర నియోజకవర్గంలో గతంలో పోటీచేసి ఓడిపోయి నాలుగేళ్లు పార్టీని కాపాడిన పవన్‌కుమార్‌రెడ్డిని అరుణ వర్గం ప్రతిపాదిస్తోంది. అయితే ఇక్కడ జైపాల్‌రెడ్డి మాత్రం బీసీ కోటాలో కాటం ప్రదీప్‌కుమార్‌గౌడ్ పేరు తెరపైకి తెస్తున్నారు. బంగారం వ్యాపారి షరాబు కృష్ణను నారాయణపేట సీటుకు జైపాల్ ప్రతిపాదిస్తుంటే తన బంధువు శివకుమార్‌రెడ్డికి టికెట్ ఇప్పించుకోవాలనే ఆలోచనతో అరుణ ఉన్నారు. గతంలో ఆయన పార్టీలో చేరాలనుకున్నా తమ్ముడు రామ్మోహన్‌రెడ్డి కోసం తానే అడ్డుకున్నానని, గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిన శివకుమార్‌రెడ్డికి ఈసారి ఎలాగైనా టికెట్ ఇప్పిస్తానని అరుణ సన్నిహితుల వద్ద చెబుతున్నారు. ఇక పూర్తిగా అరుణ హవా నడిచే మక్తల్ నియోజకవర్గంలో ఆమె ప్రస్తుత జెడ్పీటీసీ శ్రీహరి పేరు ప్రతిపాదిస్తున్నారు. కానీ జైపాల్ మాత్రం స్థానిక నేత నిజాం పాషాకు ప్రాధాన్యమిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ జైపాల్, అరుణల మధ్య విభేదాలు మరింత తీవ్రమయ్యే అవకాశముందని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. -
ప్రిన్సిపాల్ కుర్చీ కోసం వాదులాట!
భైంసా/భైంసాటౌన్ ఆదిలాబాద్ : డివిజన్ కేంద్రమైన భైంసాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం ప్రిన్సిపాల్ చార్జి అప్పగింతపై హైడ్రామా కొనసాగింది. ఈ విషయంలో గతంలో పనిచేసిన ఇద్దరు ప్రిన్సిపాళ్ల మధ్య వాగ్వాదం జరిగింది. భైంసాలో ప్రిన్సిపాల్‌గా పని చేసిన ఖాలిక్ ఫిబ్రవరి 8, 2018లో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియెట్ జాయింట్ సెక్రెటరీగా పదోన్నతిపై బదిలీపై వెళ్లారు. ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేసే జుఫిషియా సుల్తానాకు భైంసాలోని కళాశాలకు సంబంధించిన ఎఫ్ఏసీ (ఫుల్ అడిషనల్ చార్జెస్) అప్పగించారు. అప్పటి నుంచి ప్రిన్సిపాల్‌గా జుఫిషియా సుల్తానా కొనసాగుతున్నారు. ఆ సమయంలో జుఫీషియా సుల్తానా పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించాలని పదోన్నతిపై వెళ్లిన ఖాలిక్‌కు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో పని ఒత్తిడి మూలంగా ఐదు నెలలుగా ఇక్కడికి రాలేకపోవడంతో, ఖాలిక్ ఇక్కడి ప్రిన్సిపాల్‌కు పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించలేకపోయారు. ఈ విషయం ఇలా ఉండగానే విద్యా సంవత్సరం ఆరంభంలోనే అధ్యాపకుల బదిలీలు జరిగాయి. ఇన్చార్జి ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న జుఫీషియా సుల్తానాకు ముథోల్ జూనియర్ కళాశాలకు బదిలీ అయింది. ఆమె స్థానంలో నిర్మల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన షబానా తరున్నమ్కు బాధ్యతలు అప్పగించాలని వరంగల్ ఆర్జేడీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. వేతనం ఆగడంతో.. పదోన్నతిపై వెళ్లిన ఇంటర్మీడియెట్ బోర్డు జాయింట్ సెక్రెటరీ ఖాలిక్ పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించనందుకుగాను ఐదు నెలల వేతనం ఆగినట్లు సమాచారం. ఉన్నతాధికారుల సూచన మేరకు బుధవారం భైంసా జూనియర్ కళాశాలకు చేరుకున్న ఖాలిక్ ఎల్పీసీ (లాస్ట్ పే సర్టిఫికెట్) కోసం ఇన్చార్జి ప్రిన్సిపాల్ వద్దకు వచ్చారు. పదిహేను రోజుల క్రితమే షబానా తరున్నమ్కు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించాలని ఉత్తర్వులు ఇచ్చినా.. ఇటీవలే బదిలీపై వెళ్లిన జుఫీషియా సుల్తానా చార్జి ఇవ్వలేదు. ప్రిన్సిపాల్ కుర్చీ కోసం వీరి మధ్య వాదోపవాదాలు పెరిగాయి. చార్జి ఇచ్చేందుకు భైంసాకు వచ్చిన జుఫీషియా సుల్తానా, ఖాలిక్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఈ సమయంలో జుఫీషియా సుల్తానా దురుసుగా మాట్లాడి, అసభ్య పదజాలంతో దూషిస్తూ తన చేతిలో ఉన్న వాటర్ బాటిల్‌ను ఖాలిక్పై విసిరి గాయపరించినట్లు సమాచారం. ఉన్నతాధికారులకు ఫిర్యాదులు.. భైంసా కళాశాలలో కొనసాగిన ఈ వాగ్వాదంపై బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియెట్ జాయింట్ సెక్రెటరీగా పని చేస్తున్న ఖాలిక్ ఉన్నతాధికారులకు కళాశాల ఆవరణ నుంచి ఫిర్యాదు చేశారు. ఆదిలాబాద్ డీఐవో దస్రునాయక్ ఆర్జేడీ సుహాసిని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియెట్ కమిషనర్ అశోక్ కుమార్‌తో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని వివరించారు. కొత్త ప్రిన్సిపాల్‌కు అందని బాధ్యతలు.. గతంలో భైంసాలో పనిచేసిన ఇద్దరు ప్రిన్సిపాళ్ల మధ్య బాధ్యతల అప్పగింతపై జరిగిన మాటల యుద్ధం, వాగ్వాదంతో పరిస్థితి వేడెక్కిపోయింది. అక్కడే పనిచేస్తున్న తోటి లెక్చరర్లంతా ప్రిన్సిపాల్ గదికి చేరుకున్నారు. జరిగిన ఘటనంతా తెలుసుకుని ఇరువురిని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో కొత్తగా ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు తీసుకునేందుకు వచ్చిన షబానా తరున్నమ్ ఏమీ చేయలేకుండా వెనుదిరిగింది. దురుసుగా ప్రవర్తించారు.. ఎల్పీసీ కోసం భైంసా కళాశాలకు వచ్చాను. పని ఒత్తిడి కారణంగా ఇక్కడికి రాలేకపోయాను. చార్జి ఇచ్చే సమయంలో అన్ని విషయాలు తెలియజేశాను. ఎల్పీసీ లేని కారణంగా నాకు ఐదు నెలలుగా వేతనం నిలిచింది. దీంతో ఎల్పీసీ కోసం భైంసాలోని కళాశాలకు వచ్చిన నాపై అప్పటి ఇన్చార్జి ప్రిన్సిపాల్ జుఫీషియా సుల్తానా దురుసుగా ప్రవర్తిస్తూ నాపై వాటర్ బాటిల్ విసిరి దాడికి దిగింది. ఎల్పీసీ ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో ఇక్కడ జరిగిన విషయం ఉన్నతాధికారులకు తెలియజేశాను. - ఖాలిక్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియెట్ జాయింట్ సెక్రెటరీ ఖర్చుల వివరాలు అందివ్వని కారణంతోనే.. ఫిబ్రవరిలో పదోన్నతిపై వెళ్లిన ఖాలిక్ పూర్తి స్థాయిలో బాధ్యతలు అప్పగించలేదు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియెట్ జాయింట్ సెక్రెటరీగా పనిచేసేందుకు వెళ్లిన సమయంలో కళాశాలకు ప్రభుత్వం కేటాయించిన నిధుల వివరాలు, ఖర్చులు అప్పగించలేదు. సుమారుగా రూ.2.58 లక్షలకు సంబంధించిన వివరాలు సరిగ్గా లేవు. ఈ కారణంగా లాస్ట్ పే సర్టిఫికెట్ ఇవ్వలేదు. కొత్తగా నియమితులైన షబానా తరున్నమ్ బాధ్యతలు స్వీకరించేందుకు ఆసక్తి చూపడం లేదు. అందుకే బాధ్యతలు అప్పగించలేదు. త్వరలో నేనే ఇక్కడికి వచ్చి ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు చేపడతాను. - జుఫీషియా సుల్తానా -
తీజ్ పండుగ సాక్షిగా టీఆర్ఎస్ గ్రూపుల మధ్య లొల్లి
నల్లబెల్లి వరంగల్ : మండలంలోని గుండ్లపహాడ్ శివారు బజ్జుతండాలో గురువారం టీఆర్ఎస్ పార్టీలో రెండు గ్రూపుల మధ్య ఉన్న విభేదాలు భగ్గుమన్నాయి. వివరాల్లోకెళితే.. బజ్జుతండాలో లంబాడ గిరిజనులు తీజ్ పండుగను జరుపుకుంటుండగా తండాలోని యువతులు రెండు గ్రూపులుగా విడిపోయి జరుపుల సోమ్లా, జర్పుల కొమ్మాలు ఇంటి ఆవరణలో గోధుమనారు బుట్టలు ఏర్పాటుచేశారు. ఈ పండుగకు గిరిజనులు సివిల్ సప్లయీస్ రాష్ట్ర చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డిని ఆహ్వానించారు. సుదర్శన్‌రెడ్డిని గుండ్లపాహాడ్ జాతీయ రహదారి నుంచి బజ్జుతండా వరకు గిరిజన యువతులు నృత్యాలు చేస్తూ ర్యాలీగా తీసుకెళ్లారు. జర్పుల సోమ్లా ఇంటి సమీపానికి రాగానే పెద్దికి స్వాగతం పలుకుతున్న సోమ్లా గ్రూపు వారిని కొమ్మలు గ్రూపునకు చెందిన వ్యక్తులు అడ్డుకుని ఒకరిపై ఒకరు వాగ్వివాదానికి దిగారు. ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించిన వారిని దూషించగా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. కొమ్మాలు గ్రూపు సభ్యులను వారించిన ‘పెద్ది’ సోమ్లా ఇంటి ఆవరణలో ఏర్పాటుచేసిన గోదుమ బుట్టల వద్దకు వెళ్లి తీజ్ ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం కొమ్మాలు ఇంటి ఆవరణలో ఏర్పాటుచేసిన గోధుమ బుట్టల వద్దకు పెద్ది వెళ్తుండగా కొమ్మాలు గ్రూపునకు చెందిన వారు పెద్ది సుదర్శన్‌రెడ్డిని అడ్డుకున్నారు. తీజ్ ఉత్సవాలను ప్రారంభించకుండా గోధుమనారు బుట్టలను తొలగించారు. మమ్ములను కాదని సోమ్లా ఇంటికి ఎలా పోతావని ప్రశ్నించారు. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆగ్రహం వ్యక్తం చేస్తూ గోదుమ నారు బుట్టలను పెద్ది సుదర్శన్రెడ్డిపైకి విసిరేస్తూ నిరసన తెలిపారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి అనుకూలంగా కొమ్మాలు గ్రూపు సభ్యులు నినాదాలు చేశారు. వారిని సమన్వయం చేసేందుకు ప్రయత్నించినా ఎంతకు వినకపోవడంతో పెద్ది వెనుదిగారు. విషయం తెలుసుకొన్న పోలీసులు బజ్జుతండాకు చేరుకొని ఎలాంటి అవాం?నీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. కార్యక్రమంలో నల్లబెల్లి, నర్సంపేట ఎంపీపీ బానోత్ సారంగపాణి, బాదవత్ బద్రమ్మ, డాక్టర్ ఉదయ్‌సింగ్, నాయకులు జాటోత్లాలు, జాటోత్ తిరుపతి, జీవ్లా, తేజవత్ బద్రు, లావుడ్యా రాంసింగ్ తదితరులు పాల్గొన్నారు. -
పోడు ‘పోరాటం’..!
పర్ణశాల: ఏజన్సీలోని పచ్చని పల్లెలు.. ఇప్పుడు పోడు భూముల వివాదాలకు నిలయాలుగా మారుతున్నాయి. ఒకప్పుడు గిరిజనులు తాము కష్టపడి పోడు కొట్టి, వాటి రక్షణ కోసం అటవీ అధికారులతో కొట్లాడారు. కానీ ఇప్పుడు ఒకరి పోడు భూమిని మరొకరు దుక్కులు దున్నుతున్నారు. ఘర్షణకు దిగుతున్నారు. దీంతో పల్లెలు పగతో రగిలిపోతున్నాయి. దుమ్ముగూడెం మండలంలో రోజుకొక్క ఊరిలో పోడు భూముల కోసం కొట్లాటలు జరుగుతున్నాయి. కేసులు నమోదవుతున్నాయి. గిరిజనులు ప్రతి రోజు పోలీస్ స్టేషన్ చుట్టు తిరుగుతున్నారు. రెండు రోజుల క్రితం సిగారం, రామరావుపేట గ్రామాల మధ్య పోడు వివాదంతో మొదలైన ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఈ ఘర్షణలో ఒక మహిళకు తీవ్రంగా, ఇంకొందరికి స్వల్పంగా గాయాలయ్యాయి. ఆ తరువాత రోజు జిన్నెలగూడెం, చింతగుప్ప గ్రామాల మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. గురువారం చిన్ననల్లబల్లి మరో ఘటన జరిగింది. ఇలా ప్రతి రోజు ఏదో ఒక ఊరిలో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ మధ్యలో కొన్ని రాజకీయ పార్టీల నాయకులు ఈ వివాదాలను రాజకీయ లబ్దికోసం వాడుకునేందుకు పావులు కదుపుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు జరిగిన భూతగాదాలు అన్ని గ్రామాల్లో రాత్రులే జరిగాయి. ఇప్పటికైనా ఈ వివాదాలను పోలీసు ఉన్నతాధికారులు పరిష్కరించకపోతే సమస్య తీవ్రమయ్యే ప్రమాదముంది. -
గులాబీ పార్టీలో ముసలం
సాక్షి, జనగామ: జనగామ నియోజకవర్గంలోని అధికార టీఆర్ఎస్ పార్టీలో ముసలం మొదలైంది. ఒక వైపు సాధారణ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండగా.. నేడో, రేపో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగబోతున్న తరుణంలో.. అధికార పార్టీ నాయకులకు సొంత కార్యకర్తల నుంచే విమర్శలు ఎదురవుతుండడం చర్చనీయాంశంగా మారింది. జిల్లాలోని నర్మెట మండలానికి చెందిన పీఏసీఎస్ చైర్మన్, టీఆర్ఎస్ సీనియర్ నేత ఇమ్మడి శ్రీనివాస్‌రెడ్డి.. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తగాపై తిరుగుబాటు ప్రకటించారు. జనగామ ఎమ్మెల్యే చేత నియమితులై సమన్వయకర్తగా చెలామణి అవుతున్న నాయకుడు నాలుగేళ్లుగా కార్యకర్తలను పట్టించుకోవడం లేదని, వారి బాగోగులు మరిచారని, నర్మెట ఎంపీపీ మరణిస్తే కనీసం పరామర్శకు సైతం రాలేదని తన వాట్సప్ పోస్టింగ్‌లో తెలిపారు. నాలుగేళ్లుగా కార్యకర్తలతో సమన్వయకర్త మీటింగ్‌లు పెట్టిన సందర్భాలు లేవని, ఎలక్షన్లు దగ్గరపడుతున్నాయని, ఇప్పటికైనా పార్టీని కాపాడాలని ఇమ్మడి శ్రీనివాస్‌రెడ్డి కామెంట్ చేస్తూ పోస్టింగ్ చేశారు. కాగా, శ్రీనివాస్‌రెడ్డి చేసిన పోస్టింగ్ సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్‌గా మారింది. నియోజకవర్గంలోనే సీనియర్ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీనివాస్‌రెడ్డి పార్టీ నాయకులపై బహిరంగ విమర్శలకు దిగడం టీఆర్ఎస్ పార్టీలో కలకలం రేపుతున్నాయి. అధికార పార్టీలో అంతర్గత విభేదాలు పొడచూపుతుండడంతో నియోజకవర్గంలోని గులాబీ శ్రేణులు అయోమయానికి గురవుతున్నారు. ఇమ్మడి శ్రీనివాస్‌రెడ్డి సంధించిన విమర్శలకు సొంత పార్టీలోని నాయకులు, కార్యకర్తలు మద్దతు తెలపడం గమనార్హం. ఏదిఏమైనా అధికార పార్టీలో శ్రీనివాస్‌రెడ్డి చేసిన విమర్శలు టీఆర్ఎస్లోనే కాకుండా రాజకీయాల్లో వర్గాల్లో చర్చకు దారీతీస్తున్నాయి. -
ముదిరిన బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల నడుమ ఘర్షణ
సూర్యాపేట క్రైం : సూర్యాపేట జిల్లాకేంద్రంలో బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య నెలకొన్న ఘర్షణ కాస్త.. శుక్రవారం చిలికి చిలికి గాలివానలా మారింది. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్నారంటూ బీజేపీ, టీఆర్ఎస్ ఇరువర్గాల నాయకులు ఒకరిపై ఒకరు నాలుగు రోజుల క్రితం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. వివరాలు.. సూర్యాపేట పట్టణంలోని బాలాజీనగర్‌కు చెందిన జోగు సాయి అనే యువకుడు జై సంకినేని అంటూ నాలుగు రోజుల క్రితం ఫేస్బు క్లో పోస్ట్ అప్లోడ్ చేశారు. అదేకాలనీకి చెందిన టీఆర్ఎస్ కార్యకర్తలు అన్నపూర్ణ నరేందర్‌గౌడ్, నరేష్‌లు జై సంకినేని పోస్టులు ఆపాలంటూ మందలించారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ నెలకొని విషయం పోలీస్‌స్టేషన్‌కు చేరుకుంది. అంతటితో ఆగకుండా తిరిగి శుక్రవారం రాత్రి సమయంలో సాయి కాలనీలో సంచరిస్తుండగా.. గుర్తుతెలియని వ్యక్తులు ఇద్దరు బైక్‌పై వచ్చి తీసుకెళ్లారు. కుడకుడ సమీపంలోని గుట్టల్లోకి తీసుకెళ్లి నరేందర్‌గౌడ్, నరేష్లతో పాటు మరో ఇద్దరు కలిసి సాయిపై బ్లేడ్‌తో దాడిచేసినట్లు తెలిపారు. దాడికి గురైన సాయి నేరుగా పోలీస్‌స్టేషన్‌కు చేరుకోగా.. అక్కడ పోలీసులు ఆయన ఫిర్యాదును ఎవరూ స్వీకరించలేదన్నారు. ఆస్పత్రి ఎదుట ఆందోళన,లాఠీచార్జ్ చేసిన పోలీసులు ఆస్పత్రి ఎదుట సాయిపై టీఆర్ఎస్ కార్యకర్తలు బ్లేడ్‌తో దాడి చేశారని తెలియగా.. పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు, బంధువులు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ నాగేశ్వరరావు, సీఐలు శివశంకర్, ప్రవీణ్‌కుమార్, ఎస్ఐ జానికిరాములుతో పాటు సిబ్బంది చేరుకొని అడ్డువచ్చిన వారిపై లాఠీచార్జ్ చేశారు. సీఐని సస్పెండ్ చేయాలి : సంకినేని సూర్యాపేట అర్బన్ : ఫేస్బుక్లో బీజేపీ నాయకులపై దుర్భాషలాడుతున్నారని మూడు రోజుల కింద ఫిర్యాదు చేసినా పట్టణ సీఐ పట్టించుకోలేదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు తెలిపారు. ఫిర్యాదు చేసిన వారిని గాయపరిస్తే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినా పట్టణ సీఐ పట్టించుకోలేదన్నారు. సీఐని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. -
వరుస వివాదాల్లో టీటీడీ నిర్ణయాలు
-
‘గుత్తా’కు సహాయనిరాకరణ!
సాక్షి, హైదరాబాద్: రైతు సమన్వయ సమితి చైర్మన్‌గా గుత్తా సుఖేందర్‌రెడ్డి బాధ్యతలు చేపట్టి వారం కూడా కాలేదు. అప్పుడే, తన కార్యాలయం కేటాయింపుపై వివాదాలు చుట్టుముడుతున్నాయి. వ్యవసాయ కమిషనరేట్‌లోని మీటింగ్ హాలును గుత్తా చాంబర్‌గా కేటాయించారు. అయితే కమిషనరేట్ ప్రాంగణంలో గుత్తాకు చాంబర్ కేటాయించవద్దంటూ కొందరు ఉద్యోగులు విన్నవించగా అది తాత్కాలికమేనంటూ ఉన్నతాధికారులు సర్దిచెప్పినట్లు తెలిసింది. ఆ శాఖ మంత్రితో అత్యంత సన్నిహితంగా ఉండే ఉద్యోగులే అభ్యంతరం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. నెల క్రితమే అధికారులు గుత్తా కోసం వ్యవసాయ కమిషనరేట్‌లో ఒక చాంబర్ సిద్ధం చేశారు. అందుకోసం రూ.40 లక్షలు ఖర్చు చేశారు. అంతా సిద్ధం చేశాక గుత్తా సోదరుడు, కుమారుడు వచ్చి ఆ కార్యాలయాన్ని పరిశీలించి వాస్తు ప్రకారం లేదంటూ విముఖత చూపారు. కమిషనర్ జగన్మోహన్ విధులు నిర్వహిస్తున్న చాంబర్‌ను కేటాయించాలని గుత్తా అనుచరులు ఒత్తిడి తెచ్చారు. దీనిపై కొందరు ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పైస్థాయి అధికారులకు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయం జోక్యం చేసుకోవడంతో గుత్తా వెనక్కి తగ్గాల్సి వచ్చింది. చివరకు మీటింగ్ హాలునే చాంబర్‌గా సిద్ధం చేశారు. ఆధిపత్యంపై పరస్పర వ్యాఖ్యలు వ్యవసాయాధికారులపై గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు రైతు సమన్వయ సమితి సభ్యులు ఆధిపత్యం చేస్తున్నారనే ఫిర్యాదులు వచ్చాయి. ఆదిలోనే గుత్తా చాంబర్ విషయమూ వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో గుత్తా బాధ్యతల స్వీకరణ సందర్భంగా మంత్రి పోచారం పలు వ్యాఖ్యలు చేశారు. ‘వ్యవసాయాధికారుల మనసు నొప్పించకుండా సమితి సభ్యులు సమన్వయం చేసుకొని పనిచేయాలి. ఎవరిపైనా పెత్తనం చేయడానికి మనం ఇక్కడకు రాలేదు. అధికారులపై ఆధిపత్యం వద్దు. ఇప్పటివరకు తామంతా కలసిమెలసి కుటుంబసభ్యుల్లా పనిచేస్తున్నాం’అంటూ పోచారం చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. అదే సందర్భంలో గుత్తా మాట్లాడుతూ ‘వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్ అధికారులతో సమితి సభ్యులు సమన్వయంతో పనిచేయాలి. ఎవరిపైనా ఆధిపత్యం చేయకూడదు’అని పేర్కొనడం గమనార్హం.‘కమిషనరేట్‌లో గుత్తా కార్యాలయం ఉంటే మాకు చాలా ఇబ్బంది అవుతుందని, ప్రొటోకాల్తోనే సరిపోతుంది’అని కొందరు ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేశారు. -
వృద్ధుడి దారుణ హత్య
ఇంటికి నడుచుకుంటూ వెళుతున్న వృద్ధుడిపై దుండగులు విరుచుకుపడ్డారు. పొత్తికడుపులోకి కత్తులు దూసి పారిపోయారు. స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించేలోపు ఆ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. కొడుకులే హత్య చేసి ఉంటారని తల్లి ఆరోపిస్తోంది. గుంతకల్లులో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. గుంతకల్లు: గుంతకల్లు పట్టణం కసాపురం రోడ్డులోని రెడ్డిస్ట్రీట్‌లో నివాసముంటున్న కసి బసప్ప (68) దారుణ హత్యకు గురయ్యాడు. డీఎస్పీ శ్రీధర్‌రావు, హతుడి భార్య కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కసి బసప్ప, రామలింగమ్మ దంపతులు. వీరికి ముగ్గురు కుమారులు (ధనుంజయ్య, శివ, ఆంజనేయులు), ముగ్గురు కుమార్తెలు సంతానం. 48 ఎకరాల పొలం ఉండగా.. ముగ్గురు కుమారులకు చెరి 11 ఎకరాలు చొప్పున (మొత్తం 33 ఎకరాలు) పంచి ఇచ్చారు. మిగిలిన 15 ఎకరాల్లో ఆడపిల్లలకు చెరి ఒకటిన్నర ఎకరం చొప్పున పంచారు. మిగిలిన పదిన్నర ఎకరాలను వృద్ధ దంపతుల తమ జీవనాధారం కోసం పెట్టుకున్నారు. ఆడపిల్లలకు భూమి ఇవ్వడం కుమారులకు ససేమిరా ఇష్టం లేదు. పంపకాల సమయంలోనే తండ్రిపై దాడి కూడా చేసి ఆస్పత్రిపాలు చేశారు. భూమి అమ్ముకున్నందుకు గొడవ.. వృద్ధ దంపతులు కుటుంబ అవసరాల కోసం తమవద్ద ఉన్న పొలంలో నాలుగు ఎకరాలు అమ్ముకున్నారు. భూ మి ఎలా అమ్ముతారంటూ కుమారులు రోజూ తండ్రితో గొడవపడుతుండేవారు. ఆస్తి పంపకాల గొడవల్లోనే ఆంజనేయులును ధనుంజయ్య, శివ కొట్టి పంపారు. కుమారులపై అనుమానం ఆస్తి పంపకాల విషయమై బసప్పతో కుమారులు తరచూ గొడవపడుతుండేవారని డీఎస్పీ శ్రీధర్‌రావు విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. 2016లో బసప్పపై దాడి చేయగా కుమారులు శివ, ధనుంజయ్యలపై రామలింగమ్మ అప్పట్లో కసాపురం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారన్నారు. ఆస్తి కోసం తరచూ గొడవపడుతుండటంతో కసాపురం స్టేషన్‌కు పిలిపించి బైండోవర్ కూడా చేసినట్లు వెల్లడించారు. బసప్ప హత్యకు గురైన తర్వాత శివ, ధనుంజయ్య కనిపించకుండాపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామన్నారు. కొడుకులే చంపారు ఆడపిల్లలకు భూమి ఇవ్వడం నా కుమారులకు ససేమిరా ఇష్టం లేదు. ఆ సమయంలోనే మా ఆయనపై దాడి కూడా చేసి ఆస్పత్రిపాలు చేశారు. మాదంపతుల ఖర్చుల నిమి త్తం 4 ఎకరాల భూమిని అమ్మితే.. ఎలా అ మ్ముతారంటూ రోజూ తండ్రి బసప్పతో కు మారులు గొడవ పడుతుండేవారు. ఆస్తి పం పకాల గొడవల్లోనే ఆంజినేయులును ధ నుం జయ్య, శివలు కొట్టి పంపారు. ఇప్పటికీ అం జినేయులు ఎక్కడ ఉన్నాడన్న విషయం తెలియదు. ఆడపిల్లలకు భూమి పంచడమే కాక పొలం అమ్మాడన్న కోపంతో శివ, ధ నుంజయ్యలు తండ్రిని హత్య చేశారు. ఇలాంటి దుస్థితి ఏ దంపతులకూ రాకూడదు. – కసి బసప్ప భార్య రామలింగమ్మ -
బ్యాలెట్ పేపర్లే ముద్దు: ట్రంప్
వాషింగ్టన్: ఎన్నికల్లో వివాదాలు తలెత్తకుండా ఉండాలంటే బ్యాలెట్ విధానమే సరైందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విదేశీ శక్తుల జోక్యం ఉందన్న ఆరోపణలకు బ్యాలెట్ పేపర్లే సమాధానం చెబుతాయని వ్యాఖ్యానించారు. ఇది పాత విధానమే అయినప్పటికీ పెద్దపెద్ద కంప్యూటర్లతో పరిష్కారం కాని సమస్య, కేవలం బ్యాలెట్ పేపర్లను వాడితే తీరుతుందన్నారు.ఈ విధానం ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో అమల్లో ఉందనీ, అధ్యక్ష ఎన్నికల్లోనూ తీసుకువచ్చేందుకు హోంలాండ్ సెక్యూరిటీ తదితర భద్రతా సంస్థలు తీవ్రంగా ఆలోచన చేస్తున్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ పద్ధతి అమలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. -
అని, అనలేదని అనడం ఆయనకే చెల్లు!
-
అని, అనలేదని అనడం ఆయనకే చెల్లు!
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి అన్ని విధాల అండగా ఉంటున్న ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ మరోసారి నోరు జారడంపై వివాదం రగులుతోంది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు అనాలోచితంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఆ తర్వాత సర్దుకోలేక సతమతమవడం మోహన్ భాగవత్‌కు మొదటి నుంచి అలవాటే. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా మోహన్ భాగవత్ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడారు. బీసీలు ఎక్కువగా ఉన్న బీహార్‌లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడడం వల్ల బీసీలు దూరమయ్యారని, పర్వవసానంగా ఎన్నికల్లో గెలవాల్సింది, ఓడిపోయామని బీజేపీ వర్గాలు ఇప్పటికీ వాదిస్తాయి. మొన్న ఆదివారం నాడు కూడా ఆయన ఓ సభలో మాట్లాడుతూ.. యుద్ధానికి సన్నద్ధం కావాలంటే భారత సైన్యానికి ఆరు నెలల కాలం పడుతుందని, అదే ఆరెస్సెస్‌కు మూడు రోజులు చాలని అన్నారు. కశ్మీర్ సరిహద్దుల్లో పాక్‌సైనికులు, టెర్రరిస్టులను తరచూ ఎదుర్కొంటూ భారత సైనికులు అసువులు భాస్తున్న సమయంలో మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలు వారిని అవమానించేలా ఉన్నాయి. జరిగిన నష్టాన్ని గ్రహించి తర్వాత ఆరెస్సెస్ ఆయన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చింది. మీడియానే ఆయన వ్యాఖ్యలను వక్రీకరించినట్లుగా పేర్కొంది. ‘భారత సైన్యాన్ని ఆయన అవమానపర్చలేదు. ఇతర భారతీయులకన్నా ఆరెస్సెస్ మంచి క్రమశిక్షణగల వారని చెప్పడమే ఆయన ఉద్దేశమని వివరణ ఇచ్చింది. ‘భారత రాజ్యాంగం అనుమతిస్తే పౌర సమాజాన్ని యుద్ధానికి సన్నద్ధం చేయడానికి సైన్యానికి ఆరు నెలలు పడుతుందని, అదే ఆరెస్సెస్ కార్యకర్తలు ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తారు కనుక మూడు రోజుల్లోనే యుద్ధం చేయడానికి సిద్ధం అవుతారు’ అని మోహన్ భాగవత్ వ్యాఖ్యానించారని ఆరెస్సెస్ నాయకుడు మన్మోహన్ వైద్య వివరణ ఇచ్చారు. భారత సైన్యంతో ఆరెస్సెస్‌ను ఆయన పోల్చలేదని, సాధారణ పౌర సమాజంతో, ఆరెస్సెస్ కార్యకర్తలను పోల్చారని, ఇరువురికి శిక్షణ ఇవ్వాల్సింది సైన్యమేనని వైద్య చెప్పుకొచ్చారు. ఆయనే కాకుండా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజీజు, కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా కూడా వెనకా ముందు ఆలోచించకుండా మోహన్ భాగవత్ ‘అలా’ అనలేదంటూ వివరణలు ఇచ్చారు. మరి ‘ఎలా’ అన్నారో ఆయన ప్రసంగం వీడియో టేపును చూస్తే ఎవరికైనా ఇట్టే అర్థం అవుతుంది కదా! -
రణరంగంగా మున్సిపల్ సమావేశం
బెల్లంపల్లి : మున్సిపల్ సర్వసభ్య సమావేశం మరోమారు రణరంగంగా మారింది. కొందరు సభ్యులు బాహాబాహీకి దిగారు. ఒకరి చొక్కాలను మరొకరు పట్టుకుని రసాభసా చేశారు. తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల మధ్య మంగళవారం బెల్లంపల్లి మున్సిపల్ సమావేశాన్ని నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ పి.సునీతారాణి అధ్యక్షత నిర్వహించిన సర్వసభ్య సమావేశం ప్రారంభంలోనే సభ్యుడు పత్తిపాక రాజ్‌కుమార్ కుర్చీలోంచి లేచి అభ్యంతరం తెలిపారు. సమావేశం నెల ప్రారంభంలో నిర్వహించాలని, దీంతో సభ్యులకు ఇబ్బంది ఉండదని రాజ్‌కుమార్ మాట్లాడారు. అంతలోనే మరో సభ్యుడు ఎలిగేటి శ్రీనివాస్ కుర్చీలోంచి లేచి సమావేశం ఎప్పుడు నిర్వహిస్తే ఏంటి, ప్రతి సారి ఏదో ఒక గొడవ చేస్తావ్ అంటూ ఆవేశంగా రాజ్‌కుమార్ వైపు వచ్చాడు. దీంతో ఈ ఇద్దరు సభ్యులు కోపోద్రిక్తులై ఒకరి చొక్కాలు మరొకరు పట్టుకుని ఘర్షణకు దిగారు. కుర్చీలను తన్నడంతో సమావేశం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. అంతలోనే ఇతర సభ్యులు అప్రమత్తమై ఘర్షణకు దిగిన సభ్యులను చెరో వైపుకు తీసుకెళ్లారు. దీంతో గొడవ సద్దుమణిగింది. ఈ ఘటన ముగిసిన తర్వాత ఎజెండా అంశాలపై వైస్‌చైర్మన్ నూనేటి సత్యనారాయణ మాట్లాడారు. ఒక్కో అంశాన్ని మెజార్టీ సభ్యుల అభిప్రాయం ప్రకారం మాత్రమే ఆమోదించాలని వైస్ చైర్మన్, సభ్యులు కమిషనర్‌కు స్పష్టం చేశారు. ఒకటో అంశం ఆమోదించిన సభ్యులు, రూ.2.34 కోట్లతో ప్రతిపాదించిన రెండో అంశంపై చర్చ ప్రారంభం కాగా వైస్‌చైర్మన్, మెజార్టీ సభ్యులు వాయిదా వేయాలని పట్టుబట్టారు. ఇంతలో సభ్యుడు రాజేశ్వర్ నిల్చుని రెండో అంశాన్ని ఆమోదించాల్సిందేనని సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మరోమారు గొడవ ప్రారంభమైంది. వైస్‌చైర్మన్ సత్యనారాయణ, సభ్యుడు రాజేశ్వర్ ఆవేశానికి గురై కుర్చీలు విసురుకున్నారు. ఒకరినొకరు తీవ్రంగా దూషించుకున్నారు. ఘర్షణ సద్దుమణిగిన కొద్దిసేపటి తర్వాత సమావేశం నిర్వహించారు. గొడవ జరుగుతున్న క్రమంలో టూటౌన్ ఎస్సై జె.సురేష్ బందోబస్తు నిర్వహించారు. ఏకగీవ్రంగా ఆరు అంశాలు ఆమోదం.. బెల్లంపల్లి : మున్సిపల్ సమావేశంలో సభ్యులు ఆరు అంశాలను ఏకగ్రీవంగా ఆమోదించినట్లు చైర్పర్సన్ సునీతారాణి, కమిషనర్ రాజు తెలిపారు. సమావేశ అనంతరం విలేకరులతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. మరో నాలుగు అంశాలను సభ్యులు వాయిదా వేసినట్లు తెలిపారు. సభా మర్యాదలు పాటించాలని సభ్యులకు పదే పదే గుర్తు చేస్తున్నా విస్మరించి ఘర్షణ పడుతున్నారని తెలిపారు. ఇకపై సమావేశంలో గొడవకు దిగితే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సభ్యులు ఎల్.రాములు, కె.కవిత, సరిత, రాజేశ్వర్ పాల్గొన్నారు. ఆర్వోను సరెండర్ చేస్తూ తీర్మానం.. మున్సిపల్ రెవెన్యూ అధికారి(ఆర్వో) మల్లారెడ్డిని ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ మెజార్టీ సభ్యులు తీర్మానం చేసినట్లు వైస్‌చైర్మన్ సత్యనారాయణ, సభ్యులు తెలిపారు. సమావేశ అనంతరం విలేకరులతో మాట్లాడుతూ సభ్యులు చేసిన తీర్మానాలను కాదని వేరే తీర్మానాలు మినిట్స్ బుక్‌లో రాసి తప్పుదోవ పట్టించిన ఆర్వోను వెంటనే ప్రభుత్వానికి సరెండర్ చేయాలని పట్టుబట్టి సభ్యులు తీర్మానం చేశారని వెల్లడించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ కటకం సతీష్, సభ్యులు వాసు, యూసుఫ్, శారద, రమ్మణమ్మ, స్రవంతి, శ్రీనివాస్, స్వప్న, రాజ్‌కుమార్, లావణ్య, భాగ్యలక్ష్మీ, సుమలత, వరలక్ష్మీ, వంశీకృష్ణారెడ్డి, అరుణ, రాజులాల్‌యాదవ్, కో– ఆప్షన్ సభ్యుడు నిజాముద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
బ్యాట్‌తో కొట్టిన స్నేహితులు: యువకుడు మృతి
పాడేరు: విశాఖ జిల్లా పాడేరు మండలం ఈరాడపల్లి గ్రామంలో క్రికెట్ మ్యాచ్‌లో ఘర్షణ ఒకరి నిండు ప్రాణాలు బలిగొంది. ఓ యువకుడిని అతడి స్నేహితులే క్రికెట్ బ్యాట్‌తో కొట్టి చంపారు. స్థానికుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రాణం తీసిన ప్రహరీ వివాదం
సాక్షి, హైదరాబాద్: ప్రహరీ విషయంలో జరిగిన గొడవ ఓ వృద్ధుడి ప్రాణాన్ని బలిగొంది. ఈ సంఘటన ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) ఎన్‌ఆర్‌ఎస్‌హెచ్ హాస్టల్ సమీపంలో జరిగింది. ఓయూ రిటైర్డ్ ఉద్యోగి హుమయూన్ కబీర్‌పై ఓయూ ఎన్‌ఆర్‌ఎస్‌హెచ్ హాస్టల్ సమీపంలో శనివారం రాత్రి దాడి జరిగింది. ముగ్గురు వ్యక్తులు కలిసి కట్టెలతో కొట్టి ఆయన్ను తీవ్రంగా గాయపరిచారు. అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. కబీర్ ఇంటి పక్కనే ఉండే భార్యాభర్తలు, మరొకరు కలిసి ఇతనిపై దాడి చేసినట్లు, ప్రహరీ విషయంలో గొడవ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు ముగ్గురిని ఓయూ పోలీసులు అరెస్టు చేశారు. -
పద్మావతిని వీడని వివాదాలు
సాక్షి,న్యూఢిల్లీ: వివాదాలకు కేంద్ర బిందువైన సంజయ్ లీలా భన్సాలీ వెండితెర దృశ్య కావ్యం పద్మావతి వార్తల్లో నానుతూనే ఉంది. పద్మావతి మూవీ విడుదలను నిలిపివేయాలని రాజస్థాన్‌లో నిరసనలు మిన్నంటాయి. పద్మావతి చిత్రం విడుదలకు అభ్యంతరం వ్యక్తం చేస్తూ చిత్తోర్‌ఘర్‌లో ఆందోళనకారులు భారీ నిరసనను చేపట్టారు. చిత్రంలో అభ్యంతరకర సన్నివేశాలున్నాయంటూ పద్మావతి మూవీని వ్యతిరేకిస్తూ చిత్తోర్ఘర్ బంద్‌ను పాటించారు. పద్మావతి సినిమాలో చరిత్రను వక్రీకరించారంటూ రాజ్పుట్ కర్ణి సేన రాజస్థాన్ అంతటా నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే. భారత్‌కు గర్వకారణమైన చరిత్రను వక్రీకరించేందుకు తాము ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించమని రాజ్పుట్ కర్ణి సేన జాతీయ కన్వీనర్ ప్రమోద్ రాణా స్పష్టం చేశారు. -
‘అలాంటి సీన్స్ లేవు’
సాక్షి,ముంబయి: బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకోన్ టైటిల్ రోల్లో సంజయ్ లీలా భన్సాలీ చెక్కిన చారిత్రక దృశ్య కావ్యం పద్మావతిని వివాదాలు వెంటాడుతున్నాయి. తమ మూవీలో అభ్యంతరకర దృశ్యాలు లేవని, రాణీ పద్మినీ క్యారెక్టర్‌ను అవమానించేలా చూపడం లేదని మేకర్లు వివరణ ఇస్తున్నా ఆందోళనలు తగ్గుముఖం పట్టడం లేదు. గుజరాత్‌లోని ఓ మాల్లో పద్మావతి పోస్టర్‌ను కొందరు దగ్ధం చేసిన క్రమంలో ఈ వ్యవహారంపై కేంద్ర సమాచార ప్రసార మంత్రి స్మృతీ ఇరానీ జోక్యం చేసుకోవాలని దీపికా పడుకోన్ ట్వీట్ చేయడం వార్తల్లో నిలిచింది. సినిమా ఇంతవరకూ విడుదల కాకపోయినా దీనిపై అనవసర ద్వేషం వెళ్లకక్కడంపై దీపిక ఆవేదన వ్యక్తం చేస్తూ పలు ట్వీట్లు చేశారు. వీటిని నెటిజన్లు, సెలబ్రిటీలు రీట్వీట్ చేస్తూ ఆమెకు బాసటగా నిలిచారు. పద్మావతిలో్ రాణి పద్మినీగా చేస్తున్న దీపికా పడుకోన్, అల్లావుద్దీన్ ఖిల్జీగా నటించిన రణ్‌వీర్‌సింగ్‌ల మధ్య ఎలాంటి సన్నివేశాలు లేవని, రాజ్పుట్ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న మాదిరిగా వీరిద్దరి మధ్య రొమాంటిక్ సీన్స్ అసలే లేవని ఫిల్మ్ మేకర్లు వివరణ ఇస్తుండగా, పలువురు వాటిని ట్వీట్ చేశారు.ఇంత చెబుతున్నారాజ్పుట్ సంఘాల ఆందోళన చల్లారలేదు. సినిమా సెట్స్‌ను దగ్ధం చేయడంతో పాటు తమకు సినిమా విడుదలకు ముందే ప్రివ్యూ వేయకుంటే థియేటర్లను నాశనం చేస్తామని వారు హెచ్చరించారు.పద్మావతిలో అభ్యంతరకర సన్నివేశాలుంటే తాము వాటిని గుర్తించి కట్స్ చెబుతామని, అప్పుడే రిలీజ్‌కు సహకరిస్తామని వారు తేల్చిచెప్పారు.తమ సూచనలను పెడచెవిన పెట్టి సినిమా విడుదలకు పూనుకుంటే ఆందోళనలు ఎంతటి స్థాయికి వెళతాయో తాము చెప్పలేమని వారు హెచ్చరించారు. దీపికా పడుకోన్, షాహిద్ కపూర్, రణ్‌వీర్‌సింగ్‌లు ప్రధాన పాత్రల్లో నటించిన పద్మావతి డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. -
నిర్వాసితుల భూముల్లో నెత్తుటి ధారలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : పోలవరం ప్రాజెక్టులో సర్వం పోగొట్టుకుంటున్న నిర్వాసితులకు ప్రభుత్వం ఇస్తున్న ఆర్అండ్ఆర్ ప్యాకేజీలో భూమికి భూమి, ఇల్లుకు ఇల్లు పరిహారంతో పాటు పలు వివాదాలను కూడా ప్రభుత్వం అంటగడుతోంది. వారికి ఇచ్చిన భూముల్లో పంట తీసుకు వెళ్ళాలన్నా లేదా కౌలుకు ఇచ్చుకోవాలన్నా స్థానిక గిరిజనులతో పోరాటం చెయ్యాల్సిందే. నిర్వాసితులు స్థానిక గిరిజనుల మధ్య జరుగుతున్న వివాదాలతో నిర్వాసితుల భూముల్లో నెత్తుటి ధారలు పారుతున్నాయి. జీలుగుమిల్లి మండలం పి.నారాయణపురం గ్రామంలో పోలవరం నిర్వాసిత గ్రామాలు అయిన ఎర్రవరం, శివగిరి, టేకూరు, కొరుటూరు, గాజుల గొంది, చీడూరు, కటుకూరు గ్రామాల గిరిజనులకు 12 సర్వే నంబర్లలో 500 ఎకరాల భూమిని 2014 సంవత్సరంలో ప్రభుత్వం కేటాయించింది. అప్పటి నుండి ఈ భూముల్లో నిర్వాసితులు సాగు చేసుకోవాలన్నా.. కౌలుకు ఇచ్చుకోవాలన్నా ప్రతి సంవత్సరం స్థానిక గిరిజనులతో వివాదాలు ఏర్పడుతున్నాయి. చివరకు పోలీసులు రంగ ప్రవేశం చేసి అడ్డుకున్న వారిపై కేసుల నమోదు చేయడం జరుగుతోంది. 500 ఎకరాల భూమిపై ఎన్నో ఉద్యమాలు పి.నారాయణపురం గ్రామంలో పోలవరం నిర్వాసితులకు కేటాయించిన అయిదు వందల ఎకరాల భూమి ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన భూ ఉద్యమాలకు పుట్టినిల్లు. ఈ భూమిపైనే సంవత్సరాల పాటు ఉద్యమాలు చేసి అనేక మంది నాయకులు అయ్యారు. ఉద్యమ పార్టీలో రాష్ట్ర స్థాయి నాయకులతో పాటు జాతీయ స్థాయి నాయకులు కూడా ఈ భూమి గిరిజనులకు ఇప్పించడానికి పోరాటం చేశారు. దీనిలో కొంత భూమిలో గిరిజనులకు పట్టాలు కూడా వచ్చాయి. దీంతో మిగిలిన గ్రామాలకు చెందిన వారు కూడా ఈ భూములపై పోరాటం చేస్తే తమకు ఎంతోకొంత భూమి దక్కుతుందని ఆశతో ఉన్నారు. స్థానిక గిరిజనులు అప్పటి నుండి పోరాటాలు చేసూ్తనే ఉన్నారు. ఈ అయిదు వందల ఎకరాల భూమి చాగల్లు గ్రామానికి చెందిన 17 మందితో కూడిన ఫరంకు సంబంధించిన భూమి. ఈ భూమిలో మామిడితోట ఉండేది. రికార్డు అంతా వారికి అనుకూలంగా ఉన్నా గత 30 సంవత్సరాల కాలంలో ఇక్కడ వారు సాగు చేసిన దాఖలాలు లేవు. ప్రతి సంవత్సరం మామిడి కాయలు తీసుకు వెళ్ళడానికి స్థానిక గిరిజన నాయకులకు ఎంతో కొంత ముట్ట చెప్పి కాయలను అమ్ముకునే వారు. లేదా తహసీల్దార్, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగి తిరిగి చివరకు పోలీస్ రక్షణతో వారు పంటను తీసుకు వెళ్ళేవారు. 2014 సంవత్సరంలో ఈ భూమిని పోలవరం నిర్వాసితులకు కేటాయించడంతో చాగల్లు ఫరం ప్రతినిధులు ఈ భూమిపై సొమ్ములు చేసుకోగా వారు పడిన బాధలు ఇప్పుడు ప్రతి సంవత్సరం నిర్వాసితులు పడుతున్నారు. కౌలు పంచాయితీలే వివాదాలకు కారణం నిర్వాసితుల భూమిలో వివాదాలకు ప్రధానంగా భూమి కౌలు పంచాయితీలే కారణమవుతున్నాయి. నిర్వాసితులకు కేటాయించిన భూములను వారు ప్రస్తుతం ఇక్కడకు వచ్చి సాగు చేసుకునే పరిస్థితి లేదు. దీంతో ఈ భూములను స్థానికంగా ఉన్న కొందరు గిరిజనుల ఆధ్వర్యంలో గుత్త బేరంగా కౌలుకు ఇచ్చేస్తున్నారు. వీటిని తక్కువ కౌలుకు తీసుకుని ఎక్కువ కౌలుకు బయట వ్యక్తులకు ఇస్తున్నారు. దీంతో స్థానికంగా ఉన్న గిరిజనుల మధ్య వివాదాలు వస్తున్నాయి. నిర్వాసితుల కౌలు సొమ్ములు కొందరే తినడం ఏంటి మేము గిరిజనులం కాదా అని వీరు నిర్వాసిత భూముల్లోకి అడ్డంగా వెళుతున్నారు. దీంతో ఇక్కడ వివాదాలు చెలరేగుతున్నాయి. ప్రభుత్వం మాత్రం భూమి ఇచ్చేశాం కొట్టుకుచావండన్నట్లుగా చూస్తూ ఊరుకోవడంతో ప్రతిసారి ఈ వివాదాలు సర్వసాధారణంగా మారాయి. భవిష్యత్‌లో ఇవి మరింత ఎక్కువ కాకముందే సమస్య పరిష్కారానికి ప్రభుత్వం పూనుకోవాలి్స న అవసరం ఉంది. -
రెవెన్యూలో రచ్చ
ఏలూరు (మెట్రో) : జిల్లా రెవెన్యూ అసోసియేషన్‌లో విభేదాలు రచ్చకెక్కాయి. అసోసియేషన్ నాయకులు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునే స్థాయికి చేరాయి. ఇప్పటికే రాష్ట్ర రెవెన్యూ అసోసియేషన్ రెండు వర్గాలుగా చీలిపోగా.. ఒక వర్గం రెవెన్యూలో రచ్చ అశోక్‌బాబు తరఫున, మరోవర్గం బొప్పరాజు తరఫున పనిచేస్తున్నాయి. జిల్లాలో మాత్రం ఒకే రెవెన్యూ అసోసియేషన్ నడుస్తుండగా.. ఇందులో విభేదాలు తారస్థాయికి చేరాయి. జిల్లా రెవెన్యూ శాఖలో 2,500 మంది వీఆర్ఓలు, 909 మంది వీఆర్ఏలు, 900 మంది జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు, ఆర్ఐలు, సూపరిం టెండెంట్లు, ఏఓలు కలిపి మొత్తంగా 4,300 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరందరి సమస్యల పరిష్కారానికి కృషి చేసే జిల్లా రెవెన్యూ అసోసియేషన్‌లో 12 మంది జిల్లాస్థాయి నాయకులు, ఏడుగురు కార్యవర్గ సభ్యులు, ఒక రాష్ట్ర కార్యదర్శి, 10 మంది డివిజన్ అధ్యక్షులు, కార్యదర్శులు ఉన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం తాపత్రయం వ్యక్తిగత ప్రయోజనాల కోసమే అసోసియేషన్ నాయకులు వెంపర్లాడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ అసోసియేషన్ తరఫున ఏదైనా ఆందోళన చేయాల్సి వస్తే ముందుగా సమావేశం నిర్వహించి.. అజెండాలో ఆ అంశాన్ని పొందుపర్చాలి. సభ్యులందరి నిర్ణయం మేరకు తీర్మానం ఆమోదించాలి. అనంతరం కలెక్టర్‌కు నివేదించాలి. అప్పటికీ సమస్య పరిష్కారం కాకుంటే నల్లబ్యాడీ్జలు ధరించి భోజన విరామ సమయంలో నిరసన తెలపడం వంటి దశలవారీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుంది. అయితే, ఫిబ్రవరి 13న అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు లాం విద్యాసాగర్ ఇవేమీ చేయకుండానే నేరుగా వర్కు టు రూల్ ఉద్యమానికి తెరతీశారు. ఇది ఆయన వ్యక్తిగత ప్రయోజనాల కోసమే చేశారంటూ యూనియన్ సభ్యులు విమర్శలు సంధించారు. దీంతో ఆ ఉద్యమం విఫలమైంది. కేసుల పరంపర సంఘ అధ్యక్షుడు విద్యాసాగర్ అసోసియేషన్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటూ మార్చి నెలలో రాష్ట్ర అసోసియేషన్ ప్రతినిధులు విచారణ జరిపారు. సంఘ సభ్యులే తనపై ఫిర్యాదులు చేశారని విద్యాసాగర్ ఆరోపించారు. అనంతరం అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కె.రమేష్ కుమార్‌ను ఆ బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్టు విద్యాసాగర్ ప్రకటించారు. తనను తొలగించే అధికారం ఎవరికీ లేదంటూ రమేష్ మంగళవారం కార్యవర్గ సమావేశం నిర్వహించగా.. రమేష్ తనపై దాడి చేసేందుకు సభ్యులను కూడగడుతున్నారని విద్యాసాగర్ ఏలూరు డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. అనంతరం విద్యాసాగర్ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో రెండువర్గాల మధ్య ఘర్షణలు తలెత్తే అవకాశం ఉందనే ఉద్దేశంతో పోలీసులు జిల్లా రెవెన్యూ భవనం వద్ద పికెట్ ఏర్పాటు చేశారు. రూ.20 లక్షలు కాజేసేందుకు కుట్ర ! రెవెన్యూ అసోసియేషన్‌లో రూ.20 లక్షల సొమ్ము ఉన్నట్టు చెబుతున్నారు. ఆ మొత్తాన్ని కారు కొనేందుకు, స్వలాభాలకు ఉపయోగించుకునేందుకు అసోసియేషన్ నాయకులు కుట్ర పన్నుతున్నారనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో రెవెన్యూ అసోసియేషన్ ప్రతిని ధులు బుధవారం వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు విమర్శలు సంధించుకుంటూ పత్రికలకు ప్రకటనలు విడుదల చేశారు. ఇది ఎటు దారితీస్తుందోననే ఆందోళన, ఉత్కంఠ రెవెన్యూ ఉద్యోగుల్లో నెలకొంది. -
తమ్ముళ్ల కుమ్ములాట
సాక్షి ప్రతినిధి, ఏలూరు : తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. ఆ పార్టీ సంస్థాగత ఎన్నికల సందర్భంగా అసంతృప్తుల మోత మోగుతోంది. పార్టీ మండల, పట్టణ శాఖ అధ్యక్ష పదవుల కోసం నాయకులు వర్గాలుగా విడిపోయి పోరాటాలకు దిగుతున్నారు. దీంతో చాలాచోట్ల ఎన్నికలను వాయిదా వేయడం, లేకపోతే అధిష్టానానికి నివేదించడం చేస్తున్నారు. తాజాగా బుధవారం భీమవరం నియోజకవర్గంలో టీడీపీ సంస్థాగత ఎన్నికల వ్యవహారం నాయకుల అలకలు, ఆందోళనలతో ముగిసింది. పార్టీ పట్టణ శాఖ అధ్యక్ష పదవిని పలువురు ఆశించగా.. ఆశావహులు ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు), ఎంపీ తోట సీతారామలక్ష్మి, పార్టీ సీనియర్ నాయకుడు మెంటే పార్థసారథి వర్గాలుగా విడిపోయి ఎవరికి వారు పైచేయి సాధించడానికి ప్రయత్నించారు. ఈ పదవి కోసం కాపు, కమ్మ, క్షత్రియ సామాజిక వర్గాలు పోటీ పడ్డాయి. దీంతో అధ్యక్షుడి ఎంపిక బాధ్యతను రాష్ట్రమంత్రి నారా లోకేష్‌కు వదిలివేయాలని కమ్మ సామాజిక వర్గానికి చెందిన చెరుకూరి రామకృష్ణచౌదరి డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని పార్టీ సీనియర్ నేత మెంటే పార్థసారథి సీరియస్‌గా తీసుకోవడంతో ఆయన వర్గానికి చెందిన తోట భోగయ్య ఆ పదవిని దక్కిం చుకున్నారు. వీరవాసరం మండల శాఖ అధ్యక్ష పదవిని శెట్టిబలిజ సామాజిక వర్గానికి ఇవ్వాలని ఆ వర్గానికి చెందిన వీరవల్లి రామకృష్ణ డిమాండ్ చేశా రు. పరిస్థితి అనుకూలించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ సమావేశం నుంచి వెళ్లిపోయారు. భీమవరం మండల అధ్యక్ష పదవి కాపు వర్గానికి ఇవ్వాలంటూ గందరగోళం సృష్టించారు. మధ్యేమార్గంగా అగ్నికుల క్షత్రియ వర్గానికి అధ్యక్ష పదవి కట్ట బెట్టారు. గోపాలపురం నియోజకవర్గంలోని 4 మండలాల్లో మండల శాఖ ఎన్నికలు ఇంతవరకు జరగలేదు. పార్టీలో అంతర్గత విభేదాల వల్ల పదవులకు పోటీ ఏర్పడింది. దేవరపల్లిలో మంగళవారం రాత్రి నిర్వహించిన పార్టీ మండల సమావేశంలో అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న సుంకర దుర్గారావు, కొయ్యలమూడి చినబాబు వర్గీయులు బాహాబాహీకి దిగారు. రెండువర్గాల వాగ్వి వాదంతో సమావేశం రసాభాసగా జరిగింది. ఎన్నిక జరపకుండానే సమావేశాన్ని ముగించారు. గోపాలపురం మండలంలో ముగ్గురు, ద్వారకాతిరుమల మండలంలో ముగ్గురు నాయకులు పోటీపడటంతో ఏకాభిప్రాయం కుదరలేదు. గోపాలపురంలో రహస్య ఓటింగ్ ద్వారా అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. పోలవరం నియోజకవర్గ టీడీపీ సమావేశాన్ని కొయ్యలగూడెం మండలం రామానుజపురంలో ఈ నెల 25వ తేదీన నిర్వహించారు. ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన 7 మండలాల విస్తృతస్థాయి సమావేశానికి పరిశీలకురాలిగా పార్టీ జిల్లా అధ్యక్షురాలు, ఎంపీ తోట సీతారామలక్ష్మి హాజరయ్యారు. ఇక్కడా పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యాయి. కొయ్యలగూడెం, పోలవరం, జీలుగుమిల్లి మండలాలకు సంబం ధించి అధ్యక్షుల ఎంపికలో వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. నాయకులు రెండు ప్రధాన సామాజిక వర్గాలుగా విడిపోగా, ఒక వర్గం ఎంపీ అనుకూలురుగా, మరో వర్గం ఎమ్మెల్యే అనుకూలురుగా పైరవీలు చేసుకున్నారు. ముఖ్యంగా కొయ్యలగూడెం మండల టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న పారేపల్లి రామారావు ఏఎంసీ చైర్మన్‌గా వ్యవహరిస్తుండటంతో పార్టీ పదవికి రాజీనామా చేయాలని, మరో సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని నియమించాలని కార్యకర్తలు పట్టుబట్టారు. ఈ విషయాన్ని అధిష్టానానికి నివేదిస్తామని ప్రకటించిన సీతారామలక్ష్మి సభను ముగించారు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కేఎస్ జవహర్ ప్రాతినిధ్యం వహిస్తున్న కొవ్వూరు నియోజకవర్గంలోనూ సంస్థాగత ఎన్నికలు గ్రూపు రాజకీయాలకు తెరలేపాయి. చాగల్లు మండల, కొవ్వూరు పట్టణ కమిటీల విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదు. నాయకులు రెండు గ్రూపులుగా విడిపోయి పదవుల కోసం పట్టుబడుతున్నారు. నాయకులు ఏకాభిప్రాయానికి రాకపోవడంతో రెండుచోట్ల కమిటీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. కొవ్వూరు పట్టణ కమిటీ అధ్యక్ష పదవి కోసం రెండు పేర్లు తెరపైకి వచ్చాయి. రెండు గ్రూపుల నాయకులు పోటాపోటీగా ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు. టీడీపీ నేత జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరి, మునిసిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, మెజార్టీ కౌన్సిలర్లు పార్టీ జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు పొట్రు శ్రీనివాసరావు పేరును ప్రతిపాదించారు. మునిసిపల్ మాజీ చైర్మన్ సూరపనేని చిన్ని, రామా సొసైటీ అధ్యక్షుడు కంఠమణి రామకృష్ణ, అర్బన్ బ్యాంకు చైర్మన్ మద్దిపట్ల శివరామకృష్ణ తదితరులు దాయిన రామకృష్ణ పేరును తెరపైకి తెచ్చారు. ఇరుపక్షాలు ఏకాభిప్రాయానికి రాలేదు. పార్టీ పట్టణ అధ్యక్ష పదవిని బీసీలకు ఇవ్వాలంటూ బీసీ నాయకులు మంత్రి ఇంటివద్ద ఆందోళనకు దిగారు. చాగల్లు అధ్యక్ష పదవి కోసం నిర్వహించిన సమావేశంలో నాయకులు వాగ్వి వాదానికి దిగడంతో ఆరుపులు, కేకలతో రసాభాసగా సాగింది. కొందరు నాయకులు బొడ్డు రాజు పేరును ప్రతిపాదించగా, మరికొందరు చాగల్లు, నెలటూరు గ్రామాలకు చెందిన వారికే అధ్యక్ష పదవి ఇవ్వాలని పట్టుబట్టారు. ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఎన్నికను వాయిదా వేశారు. మొత్తంగా టీడీపీ నాయకుల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు సంస్థాగత ఎన్నికల సందర్భంగా భగ్గుమంటున్నాయి. -
‘తమ్మిలేరు’ తగాదా
చింతలపూడి : తమ్మిలేరు రిజర్వాయర్‌లో కొన్నేళ్లుగా అనధికారికంగా రొయ్య ల సాగు చేస్తుండటం వివాదాలకు తావిస్తోంది. ప్రాజెక్టుపై రాజకీయ నాయకుల ప్రాబల్యం పెరగడంతో దళారులు మత్స్యకారుల నోళ్లు మూ యిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏటా కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల మ త్స్యకారుల సంఘాల మధ్య వివా దం చోటు చేసుకుంటోంది. నాగిరెడ్డిగూడెం సమీపంలోని తమ్మిలేరు ప్రాజెక్టు, కృష్ణాజిల్లా మంకొల్లు వద్ద నిర్మించిన గోనెలవాగులో గతేడాది సెప్టెంబర్‌లో అనధికారికంగా రొయ్య పిల్లలను వేశా రు. ఇప్పుడు వాటిని పట్టి అమ్ముకునే విషయంలో మరోసారి వివాదం తలెత్తింది. ప్రాజెక్టులో రొయ్య పిల్లలను మేము వేశామంటే, మేము వేశామని రొయ్యలు మాకే అమ్మాలని రెండు జిల్లాలకు చెందిన వ్యాపారులు వివా దాన్ని రగిల్చారు. దీంతో ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో రొయ్యల వేటను నిషేధిస్తూ కృష్ణాజిల్లా చాట్రాయి తహసీల్దార్ 144 సెక్షన్ విధించారు. దీంతో ప్రాజెక్టుపై ఆధారపడి బతుకుతున్న సుమారు 400 మత్స్యకార కుటుంబా లు ఆందోళన చెందుతున్నాయి. దళారుల కన్ను మత్స్యశాఖ ఏటా తమ్మిలేరులో చేప పిల్లలను వేసి, అవి పెరిగాక వాటిని మత్స్యకారులు పట్టుకుని అమ్ముకునేలా ఏర్పాట్లు చేసింది. అయితే రొయ్య ల సాగు ద్వారా ఎక్కువ ఆదాయం వస్తుండటంతో రెండు జిల్లాలకు చెందిన దళారుల కన్ను ప్రాజెక్టుపై పడింది. రాజకీయ పలుకుబడితో జలాశయంలో రొయ్యలు పెంచుతూ కోట్లు గడిస్తున్నారు. ఇందుకోసం మ త్స్యకార సంఘాలతో ముందుగానే ఒప్పందం చేసుకుని పట్టిన రొయ్యలను తమకే విక్రయించాలని నిబంధన విధిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల పట్టిన రొయ్యలను తక్కువ ధరకు కొనుగోలు చేయడానికి కృష్ణా జిల్లాకు చెందిన వ్యాపారి ప్రయత్నించగా మత్స్యకారులు గిట్టదని చెప్పడంతో వివాదం చోటు చేసుకుంది. దీంతో స్థానిక మత్స్యకారులు విషయాన్ని మంత్రి పీతల సుజాత దృష్టికి తీసుకువెళ్లారు. మంత్రి ఆదేశాలతో జిల్లాకు చెందిన మత్స్యశాఖ డీడీ ఎం.యాకూబ్‌పాష, తహసీల్దార్ టి.మైఖేల్‌రాజ్ గ త శనివారం ప్రాజెక్టును పరిశీలించా రు. మత్స్యకార సంఘాలతో సంప్రదిం పులు జరిపారు. త్వరలోనే రెండు జి ల్లాల అధికారులు, మత్స్యకార సంఘాలతో సమావేశం ఏర్పాటు చేస్తామని అప్పటి వరకు రొయ్యల వేటకు వెళ్లవద్దని అధికారులు ఆదేశించారు. రొయ్యల సాగు నిషేధం తమ్మిలేరు ప్రాజెక్టులో రొయ్యల సాగు నిషేధం. అయినా దళారులు ఏటా రొయ్య పిల్లలను జలాశయంలో వేసి పెంచడం, పట్టుకుని అమ్మడం చేస్తున్నారు. ఇదంతా ఇరిగేషన్, మత్స్యశాఖ అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం తమ్మిలేరు ప్రాజెక్టుపై రూ.10 కోట్లతో తాగునీటి పథకం నిర్మిస్తోంది. దీని ద్వారా చింతలపూడి, ప్రగడవరం పంచాయతీలకు తాగునీరు అందించనున్నారు. ప్రాజెక్టులో రొయ్యల సాగు చేపడితే నీరు కలుషితమై తాగడానికి పనికిరావని, అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. దీనిపై ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సీహెచ్ అమరేశ్వరరావును వివరణ కోరగా తమ్మిలేరులో రొయ్యల సాగు చేస్తున్న వారికి నోటీసులు ఇస్తున్నామని, విషయాన్ని కలెక్టర్ భాస్కర్ దృష్టికి తీసుకువెళ్లి చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
మిత్రభేదం
సాక్షి ప్రతినిధి, ఏలూరు : మిత్రపక్షాలైన టీడీపీ, బీజేపీ మధ్య విభేదాలు మళ్లీ రాజుకు న్నాయి. కలహాల కాపురం చేస్తున్న ఆ రెండు పార్టీల నేతల మధ్య వివా దానికి ఈసారి తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపలి్ల మేకల సంత వేదికైంది. ఈ వివాదాన్ని సాకుగా చూపి జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఆరోపణలు, ప్రత్యారోపణలకు దిగుతున్నారు. గత వారంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వద్ద జరిగిన జిల్లా టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో మిత్రపక్షంతో ఉన్న విభేదాలను పరిష్కరించాలి్సన బాధ్యత జిల్లా ఇన్చార్జి మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడిపై పెట్టారు. ఆయన ఇంకా జిల్లాకు రాకముందే ఈ వివాదం పెరిగి పెద్దదవుతోంది. పెదతాడేపలి్లలోని మేకల సంత ఎవరు నిర్వహించాలనే దానిపై టీడీపీ, బీజేపీ వర్గాల మధ్య తలెత్తిన వివాదం ముదిరి పాకానపడింది. దీనిని అడ్డం పెట్టుకుని జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో చేసిన అభివృద్ధికి సంబంధించి ఒకే వేదికపై చర్చకు రావాలని సవాల్ విసరగా, తాను ఆ స్థాయికి దిగజారబోనని మంత్రి సమాధానం ఇవ్వడంతో వివాదం ముదిరింది. సోమవారం ఉదయం ఇరువర్గాలు పెదతాడేపల్లిలో మోహరించడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మేకల సంతపై పాత నిర్వాహకులకే హక్కు ఉందంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని మంత్రి మాణిక్యాలరావు వాదిస్తున్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ, డీపీఓతోపాటు, జస్టిస్ చల్లా కోదండరామ్ ఈ సంత పాత వారికే చెందుతుందని ఆదేశాలు ఇచ్చారని మంత్రి చెబుతున్నారు. అప్పిలేట్ అథారిటీ ఆదేశాలు సైతం ఆ సంఘానికే అనుకూలంగా ఉన్నాయని, ఆ ఉత్తర్వులను అమలు చేయాలంటూ జిల్లా పంచాయతీ అధికారి ద్వారా పెదతాడేపల్లి గ్రామ కార్యదర్శికి ఆదేశాలు వెళ్లడంతో ఈ నెల 17వ తేదీన గ్రామ కార్యదర్శి ఆ సంఘానికి లైసెన్సు ఇచ్చారని మంత్రి మాణిక్యాలరావు స్పష్టం చేస్తున్నారు. టీడీపీ నాయకులు మాత్రం నిర్వాహకుల్లో రెండు వర్గాలు ఉన్నాయని, వారిని కూర్చొబెట్టి తాము రాజీ చేస్తున్న తరుణంలో మంత్రి ఏకపక్షంగా లైసెన్సులు ఇప్పించడం ఏమిటని వాదిస్తున్నారు. ఈ లైసెన్సులను తాము ఒప్పుకునేది లేదంటూ సంతను అడ్డుకునే ప్రయత్నం చేస్తుండటంతో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. రెండువర్గాలు చేస్తున్న రాద్ధా్దంతంతో తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో పేరున్న పెదతాడేపల్లి మేకల సంత ప్రాభవం కోల్పోతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదే సందర్భంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గంపై అధిపత్యం కోసం జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు చేస్తున్న ప్రయత్నాలను మిత్రపక్షమైన బీజేపీ సీరియస్‌గా తీసుకుంటోంది. పదేపదే వివాదాలు సృస్టిస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. తాడేపల్లిగూడెం అభివృద్ధి కోసం మంత్రి కంటే తాను ఒక్క పైసా తక్కువ ఖర్చు పెట్టినా రాజీనామా చేస్తానని జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు పేర్కొనడాన్ని వారు తప్పుపడుతున్నారు. తాను నిట్, బకింగ్‌హాం కెనాల్ జలరవాణా, ఆర్ అండ్ బీ రోడ్ల కోసం తెచ్చిన నిధులను ఒకసారి బేరీజు వేసుకోవాలని, తానైతే ఎవరి రాజీనామా కోరడం లేదని మంత్రి మాణిక్యాలరావు పరోక్షంగా బాపిరాజును ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఇరుపక్షాల వివాదానికి సంతను వేదికగా చేసుకోవడంపై మేకల, గొర్రెల వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. -
శ్రీకాకుళం టీడీపీలో ముసలం
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా టీడీపీలో ముసలం మొదలైంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై నేతలు బహిరంగంగానే తీవ్ర అసంతృప్తి వెలిబుచ్చుతున్నారు. టీడీపీ సీనియర్ నేత కొల్ల అప్పలనాయుడు రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు రెడీ అయ్యారు. కాసేపట్లో ఆయన నామినేషన్ వేయనున్నట్లు సమాచారం. -
ఆస్తి కోసం తండ్రిపై హత్యాయత్నం
టేకులపల్లి : ఆస్తి తగాదాల నేపథ్యంలో ఓ కొడుకు కన్న తండ్రినే హతమార్చబోయాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం బొమ్మనపల్లి పంచాయతీలో జరిగింది. బిల్లుడు తండాకు చెందిన భూక్యా పంతు(80), అతని కొడుకు తార్యాకు ఆస్తి విషయంలో కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి కూడా తగాదా జరిగింది. అర్థరాత్రి సమయంలో నిద్రిస్తున్న తండ్రిపై తార్యా కత్తితో దాడి చేశాడు. మెడకు తీవ్ర గాయం కావటంతో 108లో కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
స్నేహితుల మధ్య వివాదం, పరస్పరం దాడి
-
స్నేహితుల మధ్య వివాదం, పరస్పరం దాడి
హైదరాబాద్ : చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని మారుతి నగర్ లో ఇద్దరు స్నేహితుల మధ్య వ్యక్తిగత వివాదాలు దాడికి దారి తీశాయి. స్థానికంగా నివాసం ఉంటున్న భాస్కర్ రెడ్డి, శంకర్ ఇరువురు చాలాకాలంగా స్నేహితులు. వీరిద్దరూ ఒకే గదిలో నివాసం ఉండేవాళ్లు. అయితే వారిమధ్య విభేదాలు రావడంతో ప్రస్తుతం వేర్వేరుగా ఉంటున్నారు. ఓ విషయమై శుక్రవారం కలుసుకున్న వీరిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అదికాస్తా ముదిరి పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో శంకర్ ఆగ్రహంతో భాస్కర్‌రెడ్డిపై దాడి చేశాడు. చుట్టుపక్కల వారు పట్టుకోబోగా శంకర్ అక్కడ నుంచి పరారయ్యాడు. అయితే స్థానికులు అతడిని వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తీవ్రంగా గాయపడిన భాస్కర్‌రెడ్డిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
సహకార సంఘాల్లో నిబంధనలకు తూట్లు
కామవరపుకోట: సహకార సంఘాలపై అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో వివాదాల్లో కూరుకుపోతున్నాయి. సొసైటీల వ్యాపార లావాదేవీలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి వాటి స్థితిగతులపై ప్రభుత్వానికి నివేదించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. జిల్లాలో 258 సహకార సంఘాలు, 31 జిల్లా సహకార కేంద్ర బ్యాంకు శాఖలు ఉన్నాయి. ఇవి ఏలూరులోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) ప్రధాన కార్యాలయం పర్యవేక్షణలో పనిచేస్తాయి. 258 సొసైటీలను 31 డీసీసీబీ బ్రాంచీలకు కేటాయించారు. ఈ బ్రాంచ్‌లు తమ పరిధిలోని సొసైటీలకు ఫైనాన్సింగ్ బ్యాంకులుగా వ్యవహరిస్తాయి. సొసైటీలు సక్రమంగా పనిచేసేందుకు ఫైనాన్సింగ్ బ్యాంక్ తరఫున బ్రాంచ్ మేనేజర్, సూపర్వైజర్ ప్రభుత్వం తరఫున సహకార శాఖకు చెందిన అసిస్టెంట్ రిజిస్ట్రార్, ఆడిట్ విభాగం ప్రతినిధులు పర్యవేక్షిస్తూ ఉండాలి. అయితే కొందరు అధికారులు పైరవీలు, రాజకీయ ప్రలోభాలకు తలొగ్గి సొసైటీల్లో జరిగే అవినీతి, అక్రమాలను చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వివాదాల్లో కొన్ని.. జిల్లాలో ఒకప్పుడు మంచిపేరున్న తిరుమలాపురం, ద్వారకాతిరుమల సొసైటీలు పూర్వ వైభవాన్ని కోల్పో యి క్లిష్ట పరిస్థితుల్లో ఉండటానికి ఫైనాన్సింగ్ బ్యాంక్, సహకార శాఖాధికారుల నిర్లిప్తతే కారణమని పలువురు ఆరోపిస్తున్నారు. తిరుమలాపురం సొసైటీలో కార్యదర్శిగా పనిచేసిన ఒక వ్యక్తి ఆత్మహత్య కూడా చేసుకున్నాడని దీనిని బట్టి పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. కామవరపుకోట బ్రాంచి పరిధిలోని టి.నరసాపురం మండలం కె.జగ్గవరం సొసైటీలో సుమారు రూ.కోటి వరకు దుర్వినియోగమయితే కేవలం కార్యదర్శిని మాత్రమే బాధ్యుడ్ని చేయడం, కామవరపుకోట సొసైటీలో దుర్వినియోగం కాని సొమ్మును రూ.1.14 కోట్లను దుర్వినియోగం అయినట్టు చూపించి పాలకవర్గాన్ని రద్దు చేయడం అధికారుల ద్వంద వైఖరికి, రాజకీయ ప్రలోభాలకు నిదర్శనంగా నిలుస్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలోని పలు సహకార సంఘాల్లో బైలా నిబంధనకు మించి నగదు నిల్వలను నిర్వహిస్తుంటే ఆ సంఘాల వైపు అధికారులు కన్నెత్తి చూడకపోవడం వారి పక్షపాత వైఖరిని తెలియజేస్తున్నాయి. -
ఆ అధ్యక్షుడికి నోరు పారేసుకోవడం కొత్తేమీ కాదు!
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాపై నోరు పారేసుకున్న ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డుటెర్టెకి వివాదాల్లో చిక్కుకోవడం కొత్తేమీ కాదు. గతంలో పలు వివాదాల్లో చిక్కుకున్న ఆయన.. గుర్తింపు కోసమే కామెంట్లు చేస్తారనే వాదనలు ఉన్నాయి. డుటెర్టె-వివాదాలు గ్యాంగ్ రేప్ జోక్ అధ్యక్ష పదవికి రేసులో ఉన్న డుటెర్టె.. గుర్తింపు కోసం వాషింగ్టన్ పోస్టులో వచ్చిన ఓ రేప్ కథనంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 1989లో ఆస్ట్రేలియా న్యాయశాఖ మంత్రి జాక్వెలిన్ హమిల్ ను దారుణంగా రేప్ చేసి, చంపారని ఆ కథనం. దవావో జైలులో జరిగిన ఈ ఘటనలో మొత్తం 15 మంది మరణించారు. దీనిపై స్పందించిన డుటెర్టె మృతుల శవాలను బయటకు తెచ్చిన తర్వాత తాను స్వయంగా చూశానని చెప్పారు. రేప్ కు గురైన ఆమె ముఖాన్ని కూడా చూశానని చెప్పారు. ఆమె చాలా అందంగా ఉందని, అచ్చం అమెరికన్ నటిలా ఉందని జోక్ చేశారు. ఆమె రేప్ కావడం తనకు కోపం తెప్పించిందని.. వృథాగా ఓ అందమైన యువతి చనిపోయిందని అయిందని వివాదాస్పదంగా మాట్లాడారు. డుటెర్టెపై నెటీజన్లు తీవ్రంగా విరుచుకుపడ్డారు. పోప్ ఫ్రాన్సిస్ నూ వదల్లేదు అధ్యక్ష పదవి అభ్యర్ధిగా అధికారిక ప్రకటన కార్యక్రమానికి ఆలస్యంగా రావడంపై డుటెర్టె పోప్ ఫ్రాన్సిన్స్ ను కారణంగా చూపుతూ దురుసుగా మాట్లాడారు. మనిలాలో పోప్ మీటింగ్ కారణంగా ట్రాఫిక్ జాం అయిందని సభలో చెప్పారు. పోప్ ను ఉద్దేశించి జోక్ చేశారు. పోప్ ఓ వెలయాలి కొడుకు అంటూ దారుణంగా మాట్లాడారు. మీ ప్రాంతానికి వెళ్లిపోండి. ఇంకెప్పుడూ ఇటువైపు రావొద్దంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. తాను పోప్ ను ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదని తన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ట్రాఫిక్ జాం అయిందని అన్నారు. తన వ్యాఖ్యలపై ఎట్టి పరిస్థితుల్లో క్షమాపణ కోరనని తేల్చిచెప్పారు. మానవహక్కుల ఉల్లంఘన ఫిలిప్పీన్స్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డుటెర్టె డ్రగ్స్ రవాణాపై ఉక్కుపాదం మోపారు. ఎంతలా అంటే దేశంలో ఉన్న ప్రతి ఇంటిని సోదా చేయించి.. అనుమానం ఉన్న ప్రతి ఒక్కరిని చంపించారు. డ్రగ్స్ కారణంతో డుటెర్టె చంపించిన వారి సంఖ్య 2వేలకు పైమాటే. డ్రగ్స్ కేసుల్లో మానవహక్కుల ఉల్లంఘనపై మాట్లాడిన ఆ విషయంలో తాను ఎవరిని లెక్కచేయనని వ్యాఖ్యానించారు. దీంతో మానవహక్కుల కార్యకర్తలు ఆయనకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారు. దక్షిణ చైనా సముద్రం దక్షిణ చైనా సముద్రంపై అంతర్జాతీయ కోర్టు తీర్పు తర్వాత డుటెర్టె దురాక్రమణదారులను ఊరికే వదిలిపెట్టమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వివాదాస్పద భూభాగంలో తాను జెట్ లో విహరించాడానికి సిద్దంగా ఉన్నానని కూడా కామెంట్ చేశారు. అక్కడితో ఆగని డుటెర్టె ఫిలిప్పీన్స్ జెండాను కూడా ఆ ప్రాంతంలో ఎగురవేస్తానని ప్రకటించారు. యూఎన్ చీఫ్ కు షాక్ ఐక్యరాజ్యసమితి ప్రధానకార్యదర్శి బాన్ కీ మూన్ తో సమావేశానికి డుటెర్టె నో చెప్పి మరోసారి వార్తలకెక్కారు. యూఎన్ ఫీలిప్పీన్స్ ప్రభుత్వాన్ని తక్కువ చేసి మాట్లాడటంతోనే మూన్ ని కలవడానికి డుటెర్టె ససేమీరా అన్నట్లు అక్కడి పత్రికలు రాశాయి. ఐక్యరాజ్యసమితిని ఉద్దేశించి బూతులు కూడా మాట్లాడినట్లు అక్కడ పత్రికలు ప్రచురించాయి. తక్షణమే స్పందించిన యూఎన్.. సభ్యత్వ దేశాల జాబితా నుంచి ఫిలిప్పీన్స్ తప్పిస్తామని హెచ్చరికలు చేసింది. దీంతో వెనక్కు తగ్గిన డుటెర్టె తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. -
వరకట్న వేధింపులతో వివాహిత ఆత్మహత్య
వేముల: వరకట్న వేధింపులు తాళలేక నాగశిల్ప(22) అనే వివాహిత ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం వేములలో జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నరేంద్రకుమార్ తెలిపారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బలపనూరు గ్రామానికి చెందిన నాగశిల్పను వేములకు చెందిన కొమెర మధుకు ఇచ్చి ఏడాది క్రితం వివాహం చేశారు. కొన్నాళ్లపాటు వీరి సంసారం సజావుగా సాగింది. అయితే గత కొన్నాళ్లుగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో తరచూ గొడవపడేవారు. అదనపు కట్నం తేవాలని తన కుమార్తెను వేధించేవారని.. ఇది తాళలేకే శనివారం ఒంటిపై కిరోసిన్ పోసుకొని తన కుమార్తె నాగ శిల్ప ఆత్మహత్య చేసుకుందని తండ్రి పెద్ద వెంకటేష్ ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు రాములయ్య, ఈశ్వరమ్మ, మధు, విజయ్, ప్రసాద్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఏఎస్పీ వేములలో ఒంటిపై కిరోసిన్ పోసుకొని నాగశిల్ప ఆత్మహత్య చేసుకున్న సంఘటన స్థలాన్ని పులివెందుల ఏఎస్పీ అన్బురాజన్, సీఐ రామకృష్ణుడు శనివారం సందర్శించారు. అనంతరం మృతురాలి బంధువులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.అనంతరం ఆయన స్థానిక పోలీస్ స్టేషన్లో విలేకరులతో మాట్లాడుతూ మృతురాలి భర్తను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామన్నారు. -
'సరోగసీ' బిల్లు-సమస్యలు
సంతానం కోసం పరితపించే దంపతులు పిల్లల్ని కనడానికి అమల్లోకొచ్చిన వివిధ రకాల సాంకేతికతల్లో అద్దె గర్భం(సరోగసీ) విధానం ఒకటి. ఇంచుమించు 2000 సంవత్సరంలో మొదలై మన దేశానికి ‘క్రాడిల్ ఆఫ్ ద వరల్డ్’(ప్రపంచ ఊయల) అని పేరొచ్చేంతగా ఇప్పుడది విస్తరించింది. ఈ నేపథ్యంలో బుధవారం కేంద్ర కేబినెట్ అద్దె గర్భం(నియంత్రణ) బిల్లును ఆమోదించింది. మహిళా ఉద్య మకారులు, ఆరోగ్యరంగ కార్యకర్తలు నియంత్రణ చట్టం అవసరమని పదేళ్లుగా చెబుతున్నారు. 2008లో అప్పటి యూపీఏ సర్కారు ఆ పని ప్రారంభించింది. మరో రెండేళ్లకు బిల్లు రూపొందించింది. అనంతరకాలంలో దానిలో ఎన్నో మార్పులు జరిగాయి. కానీ ఏవో కారణాల వల్ల అది కేంద్ర కేబినెట్ ముందుకే రాలేదు. ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొస్తున్న బిల్లులో ఎన్నో అనుకూలాంశాలున్నట్టే ప్రతికూలాంశాలు కూడా ఉన్నాయి. సరోగసీ భావన చుట్టూ సామాజిక, వాణిజ్య, ఆరోగ్య, నైతిక సంబంధమైన అనేక చిక్కుముళ్లు ఉన్నాయి. ప్రస్తుత బిల్లు ఇందులో కొన్ని అంశాలను ఉపేక్షించగా, మరికొన్నిటిని అతిగా పట్టించుకుందని చెప్పక తప్పదు. కొందరు సామాజిక ఉద్యమకారులు చెబుతున్నట్టు ఈ బిల్లు చట్టమైతే సరోగసీ విధానం చీకటి వ్యాపారంగా మారే ప్రమాదం కూడా లేకపోలేదు. అద్దె గర్భం విషయానికొచ్చేసరికి మన దగ్గరున్నట్టే చాలా దేశాల్లో భిన్నాభి ప్రాయాలు, వాదనలు ఉన్నాయి. వేర్వేరు రకాల చట్టాలున్నాయి. కొన్నిచోట్ల ఈ విధానాన్ని చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించి నిషేధిస్తే, మరికొన్నిచోట్ల డబ్బు ప్రసక్తి లేని సందర్భాల్లో మాత్రమే అనుమతిస్తున్నారు. గర్భందాల్చడానికి సిద్ధపడే మహిళ... దంపతుల్లో ఎవరో ఒకరి రక్తసంబంధీకురాలై ఉండాలని బ్రిటన్ చట్టం షరతు విధిస్తోంది. కారుణ్య మరణంలాంటి వివాదాస్పద అంశాల్లో సైతం అనుకూలమైన చట్టం తీసుకొచ్చిన స్విట్జర్లాండ్ కూడా సంతానాన్ని పొందడానికి ఐవీఎఫ్ ప్రక్రియను మాత్రమే గుర్తిస్తోంది. సరోగసీని అంగీకరించిన దేశాల్లో అందుకయ్యే ఖర్చు మన కరెన్సీలో దాదాపు 50 లక్షలు. కనుకనే ఏ నియంత్రణా లేని మన దేశంలో సంతాన సాఫల్య పర్యాటకం (ఫెర్టిలిటీ టూరిజం) గత కొన్నేళ్లుగా పెరిగింది. ఏటా దాదాపు ఆరేడు వేల కోట్ల రూపాయల మేర ఈ వ్యాపారం సాగుతున్నదని కొన్ని అంచనాలు చెబుతున్నాయి. సరోగసీ విధానంలో బిడ్డను కని ఇచ్చే తల్లి ఎదుర్కొనవలసివచ్చే వివిధ సమస్యల్లో ఆరోగ్య సమస్య అత్యంత కీలకమైనది. అలాగే సంతానం కోసం వచ్చిన దంపతులు శిశువును వివిధ కారణాలవల్ల తిరస్కరిస్తే ఏర్పడే సమస్యలు దీనికి అదనం. తమకంటూ సంతానం కలగడం సాధ్యంకాదని నిరాశా నిస్పృహలకు లోనైన దంపతులకు ఈ ప్రక్రియ వరమే కావొచ్చుగానీ... మహిళను ‘కని ఇచ్చే యంత్రం’గా, బిడ్డను ఒక ‘సరుకు’గా ఇది పరిగణిస్తున్నదన్న వాదన ఉంది. మాతృత్వం, దానితో ముడిపడి ఉండే భావోద్వేగాలకు సరోగసీలో తావులేదు. కడుపులో బిడ్డ పెరుగుతున్నకొద్దీ తల్లిలో ఏర్పడే మమకారం, అనుబంధాలను ఇది పట్టించుకోదు. ఇక ప్రసవ సమయంలో కొందరిలో వచ్చే మధుమేహం, అధిక రక్తపోటు... ప్రసవానంతరం వచ్చే ఇతరత్రా ఆరోగ్య సమస్యలు వారిని జీవితాంతం వేధిస్తాయి. గర్భస్రావమైతే ముందుగా కుదుర్చు కున్న ఒప్పందం మేరకు ఇవ్వాల్సిన డబ్బుల్ని ఎగ్గొట్టే అవకాశాలుంటాయి. వాణిజ్య అద్దె గర్భాలను నిషేధించడమే వీటన్నిటికీ పరిష్కారమవుతుందా? సరోగసీ ద్వారా తొమ్మిది నెలల్లో అయిదారు లక్షలు సంపాదించవచ్చునని ఆశపడి ముందుకొచ్చేవారిని రాబోయే చట్టం నిరోధించడం మాట అటుంచి దాన్ని కాస్తా చీకటి వ్యాపారంగా మార్చే ప్రమాదం పొంచి ఉంటుంది. ఇప్పటికే కిడ్నీ మార్పిడికి సంబంధించిన చట్టం మాఫియాలకు వేల కోట్లు ఆర్జించిపెడుతోంది. మనలాంటి పితృస్వామిక వ్యవస్థలో సరోగసీపై నిర్ణయం తీసుకునేది ఎక్కువ సందర్భాల్లో భర్తేనని వేరే చెప్పనవసరం లేదు. డబ్బుకు ఆశపడి అతను శాసించినప్పుడు ఆ మహిళకు వేరే గత్యంతరం ఉండదు. చట్టాన్ని కాదని బిడ్డను కనడానికి సిద్ధపడిన తల్లికి ప్రామాణికమైన వైద్య సేవలు అందే అవకాశాలు కుంచించుకుపోతాయి. ఇది ఆ మహిళను మరిన్ని సమస్యల్లోకి నెడుతుంది. పేద మహిళలనూ... ముఖ్యంగా గ్రామీణ, గిరిజన ప్రాంత మహిళలను కాపాడటమే ఈ బిల్లు ధ్యేయమంటున్న కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ దీన్ని గుర్తించినట్టు లేరు. దంప తులకు చెందిన దగ్గరి బంధువుల్లోని మహిళలను మాత్రమే సరోగసీకి అనుమతిస్తామని బిల్లు అంటున్నది. వారైతేనే సంతానం లేని దంపతులకు బిడ్డను కని ఇస్తే పుణ్యమని భావిస్తారని, బయటి వారైతే లాభాపేక్షతో మాత్రమే చేస్తారన్నది బిల్లు భావన కావొచ్చు. కుటుంబంపై పెత్తనంవహించే మగవాడి పాత్రను, అతడు పెట్టే ఒత్తిళ్లను ఇది గుర్తించినట్టు లేదు. చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్నవారికి తప్ప సహజీవనం చేసే జంటకు సరోగసీలో బిడ్డను పొందే హక్కు లేకుండా చేయడం మరో వివాదాస్పద నిర్ణయం. వివాహ మనేది లేకుండా దీర్ఘకాలం ఒక జంట కలిసి ఉన్నప్పుడు దాన్ని చట్టబద్ధమైన వివాహంతో సమానంగా గుర్తించాలని ఏడెనిమిదేళ్లక్రితం సుప్రీంకోర్టు ప్రభుత్వానికి సూచించింది. 2013లో వెలువడిన తీర్పు దాన్ని మరింత విశదీకరించింది. ఆడ, మగ మధ్య ప్రేమానుబంధం ఏర్పడి, వారు సహజీవనం చేస్తే అది వారి ‘జీవించే హక్కు’లో అంతర్భాగమని, ఆ చర్యను నేరంగా పరిగణించడం చెల్లదని చెప్పింది. సహజీవనం చేసే జంటకు బిడ్డను పొందే హక్కు లేదనడం... అందుకు నైతికత, విలువలు వంటివి కారణాలుగా చెప్పడం ఆ తీర్పు స్ఫూర్తికి విరుద్ధం కాదా? ఒకపక్క మన జువెనైల్ చట్టం పెళ్లయిందా, లేదా అనే దాంతో నిమిత్తం లేకుండా ప్రతివారికీ దత్తత చేసుకునే హక్కు కల్పిస్తుంటే... ఈ బిల్లు సరోగసీ ద్వారా బిడ్డను పొందాలనుకున్నవారికి పెళ్లయి ఉండాలని చెప్పడం ఓ వైచిత్రి. బిల్లుపై పార్ల మెంటు వెలుపలా, లోపలా మరింత లోతైన చర్చ జరిగి మెరుగైన, ఆచరణాత్మకమైన విధానం రూపు దిద్దుకోవాలని ఆశిద్దాం. -
భూ బాగోతాలపై కలెక్టర్ సీరియస్
విచారణకు ఆదేశం నలుగురు డిప్యూటీ కలెక్టర్ల నియామకం రెండు రోజుల్లో విచారణ ప్రారంభం అధికారులు, అక్రమార్కుల గుండెళ్లో రైళ్లు అసెంబ్లీలో ప్రస్తావనకు వైఎస్సార్సీపీ సిద్ధం నక్కపల్లి మండలంలో పలు గ్రామాల్లో ఇటీవల వెలుగుచూసిన భూ బాగోతాలపై జిల్లా అధికార యంత్రాంగం సీరియస్‌గా పరిగణించినట్లు తెలిసింది. ప్రభుత్వ మిగులు భూములకు పట్టాలు ఇచ్చినట్లు రికార్డులు తారుమారుచేసి ఒన్ బీల్లో నమోదు చేయడంపై కలెక్టర్ ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. ఈ బాగోతాల వెనుక ఎవరెవరి ప్రమేయం ఉందన్న విషయంపై విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. ప్రత్యేకంగా నలుగురు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లను నియమించి భూ అక్రమాలపై నివేదిక సమర్పించాలని ఆదేశించారు. దీంతో అక్రమాలకు పాల్పడిన వారి గుండెళ్లో రైళ్లు పరిగెడుతున్నాయి. నక్కపల్లి: విశాఖ – చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌కు ప్రభుత్వం భూమి సేకరిస్తుండటంతో కొంతమంది టీడీపీ నాయకులు అధికారులతో చేతులు కలిపి అక్రమంగా పరిహారం పొందేందుకు ఎత్తుగడలు వేశారు. ప్రభుత్వ భూములకు కూడా పట్టాలు ఇచ్చినట్లు ఒన్‌బీల్లో నమోదు చేయించి పరిహారం కాజేసేందుకు ఎత్తుగడలు వేశారు. సుమారు రూ.30 కోట్లు విలువైన సుమారు 100 ఎకరాల ప్రభుత్వ భూములకు సంబంధించిన రికార్డులను తారుమారు చేశారు. రాజయ్యపేటలో 19 ఎకరాలు, అమలాపురంలో 70 ఎకరాలు, నెల్లిపూడిలో 20 ఎకరాలు ఇలా రికార్డులు తారుమారు చేసి పరిహారం కాజేసేందుకు కుట్రపన్నారు. అసైన్మెంట్ కమిటీ ఆమోదం కాని, డీ ఫారం పట్టాలు గాని జారీచేయని భూములకు నిబంధనలకు విరుద్ధంగా అడంగల్, ఒన్‌బీల్లో మార్పుచేసి ఖాతానెంబర్లు ఇచ్చి ఆన్లైన్ చేశారు. రాజయ్యపేటలో రామాలయానికి చెందిన సుమారు 19 ఎకరాలు జిరాయితీ భూమికి బినామీ వారసుడిని తెరమీదకు తెచ్చి అతని చేత నష్టపరిహారానికి క్లెయిం చేయించి సుమారు రూ. 4 కోట్ల పరిహారం కాజేసేందుకు స్కెచ్ వేశారు. సాక్షి కథనాలతో పరిహారం మంజూరుకు బ్రేక్ అడంగల్‌లో సాగుదారులు పేర్లు నమోదు చేయకుండా పరిహారం స్వాహా చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. దీంతో పరిహారం మంజూరుకు బ్రేక్ పడింది. అమలాపురం, నెల్లిపూడిలలో కూడా అదే పరిస్థితి. ఇక్కడ కూడా సుమారు 70 ఎకరాలకు పట్టాలు ఇచ్చినట్లు ఆన్లైన్ చేశారు. ఈ మూడు గ్రామాల్లో జరిగిన భూబాగోతాల్లో లక్షలాది రూపాయలు చేతులు మారాయి. మండలంలో కొంతమంది పచ్చనేతల అండతో చేస్తున్న ఈ బాగోతాలను అధికారపార్టీలోనే కొంతమంది అసమ్మతినేతలు పార్టీ అధిష్టానానికి పత్రికా క్లిప్పింగులతో సహా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. పార్టీకి చెడ్డపేరు రావడంతోపాటు, ప్రతిపక్ష పార్టీ ఈ వ్యవహారాన్ని వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించడానికి రంగం సిద్ధం చేస్తోందన్న సమాచారం టీడీపీ అధిష్టానం దష్టికి వెళ్లింది. విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే పార్టీకి అప్రతిష్ట వస్తుందని కొందరు అసమ్మతి నేతలు పార్టీకి వివరించినట్లు సమాచారం. వైఎస్సార్ సీపీ నేతలు మాత్రం అన్ని ఆధారాలు సేకరించి నివేదిక వైఎస్ జగన్మోహన్రెడ్డికి అందజేయడానికి సిద్ధపడుతున్నారు. త్వరలో విచారణ ప్రారంభం ఇటీవల కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ప్రవీణ్ కుమార్ ఈ భూ బాగోతాలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక అందజేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. నలుగురు డిప్యూటీ కలెక్టర్లను నియమించడంతో వారు పుష్కరాల ముగిసిన అనంతరం ఈ వ్యవహారంపై గ్రామాల్లో విచారణ ప్రారంభించనున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ బాగోతాల్లో ముఖ్యంగా వీఆర్వోలు, కొందరు మండల స్థాయి అధికారులు కీలక పాత్ర పోషించారు. విచారణ పారదర్శకంగా జరిగితే ఈ బాగోతం చాలామంది మెడకు చుట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
గూడు చెదిరిన‘హౌసింగ్ కార్పొరేషన్ ’
♦ గృహనిర్మాణ సంస్థకు మంగళం పాడనున్న సర్కారు ♦ విడతల వారీగా ఇతర శాఖలకు ఉద్యోగుల డిప్యుటేషన్లు ♦ తాజాగా 106 మంది ఏఈలు బదిలీ సాక్షి, రంగారెడ్డి జిల్లా: రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ గూడు చెదిరిన పక్షివోలే మారింది. దానికి అస్తిత్వం లేకుండా పోతోంది. గతంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం పేరిట కార్పొరేషన్ హవా నడిపించింది. అవినీతిలో కూరుకుపోయిన ఇళ్ల పథకానికి ప్రభుత్వం చెక్ పెట్టడంతో గృహనిర్మాణ సంస్థకు పెద్దగా పనిలేకుండా పోయింది. దీంతో ఆ శాఖకు మంగళం పాడి అందులోని ఉద్యోగులకు ఇతర శాఖల్లోకి బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో కొందరు ఉద్యోగులకు మహానగర మంచినీటి సరఫరా మురుగునీటి పారుదల బోర్డుకు డిప్యుటేషన్‌పై పంపింది. ఇదే తరహాలో పంచాయతీరాజ్, రహదారులు భవనాల శాఖకు సైతం ఇంజనీర్లను బదిలీపై పంపేందుకు చర్యలు చేపట్టింది. జలమండలిలోకి 66 మంది: హౌసింగ్ కార్పొరేషన్‌లోని ఇంజనీరింగ్ అధికారులను పొరుగు శాఖలకు సాగనంపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా తొలుత డిప్లొమా అర్హతతో ఉన్న ఇంజనీర్లకు డిప్యుటేషన్ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 66 మంది ఏఈ(సహాయక ఇంజనీర్లు)లను జలమండలికి కేటాయించింది. డిప్యుటేషన్ ఉత్తర్వులు తీసుకున్న ఏఈలు జలమండలిలో రిపోర్టు చేశారు. బివరేజెస్ కార్పొరేషన్‌కు 40 మందిని డిప్యుటేషన్‌పై పంపింది. సుముఖత వ్యక్తం చేస్తే...: తాజాగా 106 మంది ఏఈలను డిప్యుటేషన్‌పై పంపిన హౌజింగ్ కార్పొరేషన్ మిగతా ఉద్యోగులను ఏయే శాఖల్లో సర్దుబాటు చేయాలనే అంశంపై మళ్లగుల్లాలు పడుతోంది. ఈక్రమంలో పంచాయతీ రాజ్, రహదారులు, భవనాల శాఖకు ఉద్యోగుల సమాచారాన్ని పంపింది. అర్హతల ఆధారంగా ఆయా శాఖలు సుముఖత వ్యక్తం చేస్తే వారికి సైతం డిప్యుటేషన్ ఇచ్చేందుకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ శాఖలకు పంపించేవారిలో సహాయ కార్యనిర్వాహక ఇంజనీర్లు(ఏఈఈ), ఉప కార్యనిర్వాహక ఇంజనీర్లు(డీఈఈ), కార్యనిర్వాహక ఇంజనీర్లు(ఈఈ) ఉన్నారు. వారికి నెలవారీ వేతనాలను ఆయా శాఖలే చెల్లించాలి. సీఐడీ కేసుల సంగతేంటి!: ఇందిరమ్మ ఇళ్ల పథకంలో జరిగిన అవకతవకలపై సీఐడీ దర్యాప్తు చేస్తోంది. ఇందుకు సంబంధించి పలువరు హౌసింగ్ అధికారులపై కేసులు నమోదయ్యాయి. నిధుల దుర్వినియోగం, నిర్మాణాల్లో అక్రమాలు, ఇళ్ల మంజూరీలో తాజాగా కార్పొరేషన్‌లోని ఉద్యోగులనంతా డిప్యూటేషన్‌పై పంపితే విచారణ ప్రక్రియ ఎలా సాగుతుందనే గందరగోళం కూడా ఉంది. -
వాటాలు కుదరలేదు
-
కృష్ణా వాటాలు కుదర్లేదు
-
ముఖం చాటేసిన తమ్ముళ్లు!
అధికార తెలుగుదేశం పార్టీ తిరుపతిలో అట్టహాసంగా మహానాడును ప్రారంభించింది. ఈ కార్యక్రమం అంటే ఎంతో ఉత్సాహంగా హాజరయ్యే తెలుగు తమ్ముళ్లు జిల్లా నుంచి నామమాత్రంగానే తరలివెళ్లారు. దీనికి ప్రధాన కారణం గ్రూపు తగాదాలేననేది బహిరంగ రహస్యం. పాస్‌లు వచ్చినవారంతా వెళ్లారని జిల్లా నాయకులు చెబుతున్నా ద్వితీయ శ్రేణిలో చాలామంది డుమ్మాకొట్టినట్లు సమాచారం. టీడీపీ మహానాడుకు డుమ్మా! * ఇచ్ఛాపురంలో ఏఎంసీ చిచ్చు * మిగతాచోట్ల గ్రూపుల గొడవ * జిల్లా నుంచి నామమాత్ర హాజరు సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: తొలినుంచి టీడీపీకి కంచుకోట అని పేరొందిన ఇచ్ఛాపురం నియోజకవర్గం నుంచి ఎక్కువ మంది కార్యకర్తలు మహానాడు కార్యక్రమానికి వెళ్లేవారు. ఇచ్ఛాపురం పట్టణం నుంచి కూడా 50 మందికి తక్కువ కాకుండా హాజరయ్యేవారు. ఈసారి మాత్రం స్థానికంగా పదవుల కేటాయింపులతో తలెత్తిన వివాదాలు, గ్రూపు రాజకీయాలతో తమ్ముళ్లు చాలామంది అలకపాన్పు ఎక్కారు. ఇచ్ఛాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్ష పదవిని పట్టణానికి చెందిన నేతలకు కాకుండా రూరల్ ప్రాంతానికి చెందిన సాడి సహదేవ్రెడ్డికి కేటాయించిన సంగతి తెలిసిందే. దీంతో పార్టీ కార్యక్రమాలకు పట్టణ క్యాడర్ కొన్నాళ్లుగా దూరం పాటిస్తోంది. దాదాపుగా ముఖ్య నాయకులు చాలామంది మహానాడు కార్యక్రమానికి సైతం హాజరుకాలేదని తెలిసింది. వారిలో ఇచ్ఛాపురం పట్టణ టీడీపీ అధ్యక్షుడు కె.ధర్మారావు, మరో ముఖ్యనేత జగన్నాథరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు అంబటి లింగరాజు, జిల్లా పార్టీ నాయకుడు చాట్ల తులసీదాస్‌రెడ్డి ఉన్నారు. ఈ విషయమై స్థానిక టీడీపీ కార్యకర్తలు ఆరా తీస్తే... శనివారం నాటి కార్యక్రమానికి హాజరవుతున్నారని కొంతమంది సర్దిచెబుతున్నట్లు సమాచారం. అలాగే నరసన్నపేట నియోజకవర్గం నుంచి గతంలో క్రమం తప్పక మహానాడుకు హాజరైన కొంతమంది సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు ఈసారి వెళ్లలేదు. నరసన్నపేట మండలాధ్యక్షురాలు పార్వతమ్మ, సర్పంచ్ జి.చిట్టిబాబు కూడా ఉండటం చర్చనీయాంశమైంది. పలాస నియోజకవర్గం నుంచి గత ఎన్నికలలో టిక్కెట్ ఆశించిన మద్దిల చిన్నయ్య కూడా ఈసారి మహానాడుకు దూరంగా ఉన్నారు. గ్రూపులుగా విడిపోయి టీడీపీలో మంత్రి అచ్చెన్నాయుడు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళావెంకటరావు, ఇతర ఎమ్మెల్యేల మధ్యనున్న గ్రూపు తగాదాలు మహానాడు కార్యక్రమంలోనూ కనిపించాయి. నియోజకవర్గంలో అంతా ఒక్కరిగా గాకుండా గ్రూపులుగా విడిపోయి తిరుపతి ప్రయాణమయ్యారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో అచ్చెన్న గ్రూపు, ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి గ్రూపు వేర్వేరుగానే వెళ్లారు. అయితే ఈ రెండు గ్రూపుల్లోనూ ఉన్న కళింగ కోమటి సామాజికవర్గం నేతలు మాత్రం ఒకే బృందంగా వెళ్లడం మారుతున్న రాజకీయ పరిణామాలకు అద్దం పట్టింది. గుండ లక్ష్మీదేవి భర్త, మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రెండ్రోజుల క్రితం పార్టీ సమావేశానికి హాజరుకావడం, రాబోయే శ్రీకాకుళం నగరపాలకసంస్థ ఎన్నికలలో మేయర్ అభ్యర్థిగా రంగంలోకి దిగుతారనే ప్రచారం నేపథ్యంలో కళింగ కోమటి సామాజిక వర్గం నాయకులు ఏకతాటిపైకి వస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే రాజాం నియోజకవర్గంలో కూడా కళావెంకటరావు గ్రూపు, ఎమ్మెల్సీ ప్రతిభాభారతి గ్రూపులను మహానాడు ఏకం చేయలేకపోయింది. పాతపట్నంలోనూ మూడు గ్రూపులదీ అదే పరిస్థితి. ఎంపీ రామ్మోహన్నాయుడు, మంత్రి అచ్చెన్నాయుడుల గ్రూపు, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు గ్రూపులకు ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి చేరిన ఎమ్మెల్యే కలమట వెంకటరమణ గ్రూపు తోడయ్యింది. ఎంపీ, మంత్రిల గ్రూపు, ఎమ్మెల్యే కలమట గ్రూపు ఒకే మాటపై ఉండటంతో అసహనంతో ఉన్న శత్రుచర్ల గ్రూపు ఈసారి మహానాడుకు వెళ్లరనే ప్రచారం జరిగింది. అయితే ఆఖరి నిమిషంలో కొంతమంది బయల్దేరి వెళ్లారని తెలిసింది. -
చైర్పర్సన్ X సీఈవో!
జిల్లాపరిషత్ కార్యాలయం వివాదాలకు కేరాఫ్‌గా మారుతోంది. ప్రతి చిన్న విషయూన్ని ఉద్యోగులు భూతద్దంలో చూస్తుండడంతో ఇక్కడ వాతావరణం చెడుతోందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఉద్యోగుల మధ్య కుర్చీల కుమ్ములాటలు చైర్పర్సన్ చౌదరి ధనలక్ష్మి, సీఈవో బి.నగేష్ మధ్య అంతరానికి కారణమవుతున్నాయి. పాలనా వ్యవహారాల్లో చైర్పర్సన్ నిర్ణయానికి సీఈవో అడ్డుపడుతుండడంతో సమస్య తలెత్తిందని కార్యాలయ వర్గాలు బహిరంగంగా చెప్పుకుంటున్నాయి. పాలనా వ్యవహారాల్లో తరచూ ఇలాంటి సమస్యలే ఎదురవుతుండడంతో ఉద్యోగులు వర్గాలుగా విడిపోయి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. * అంతర్గత బదిలీలపై మాటపట్టింపు * సీట్ల కోసం ఉద్యోగుల కుమ్ములాట * ముదురుతున్న వ్యవహారం * కీలక సీట్లపై మల్లగుల్లాలు శ్రీకాకుళం టౌన్: జెడ్పీ కార్యాలయంలో తొమ్మిది విభాగాలున్నాయి. వాటిలో ఆర్థిక, పాలనా వ్యవహారాలు, కార్యాలయ నిర్వహణ, ఇంజినీరింగ్ విభాగాలు కలుపుకుని తొమ్మిది సెక్షన్లు పనిచేస్తున్నాయి. అందులో ఏ విభాగంలో అకౌంట్స్, బీ లో పాలనా అంశాలు, సీ లో నియామకాలు, ఉద్యోగుల వ్యవహారాలు, డీ లో లేఖా సంబంధమైన అంశాలు, ఈ లో విద్యాశాఖ వ్యవహరాలు, ఎఫ్, జీ విభాగాల్లో ప్రావిడెంట్ ఫండ్, ఇంజినీరింగ్‌తోపాటు ఫ్లానింగ్ విభాగాలుగా విభజించారు. కార్యాలయ నిర్వహణకు ఇవి ఎంతో కీలకం. ఇందులో ఇంజినీరింగ్, అకౌంట్స్, పీఎఫ్, నియామకాల విభాగాలు నిర్వహించే ఉద్యోగుల సీట్లకు గిరాకీ ఉంటుంది. ఇక్కడ నిత్యం ఆర్థిక లావాదేవీలు ఉండడంతో ఈ విభాగాల్లో పని చేసేందుకు వీలుగా అక్కడ కుర్చీల కోసం పాకులాడుతుంటారు. పాలకవర్గం మారినపుడు వారికి అనుకూలంగా లేని ఉద్యోగులను కీలక విభాగాల్లో నియమించకుండా పాలకవర్గం సైతం జాగ్రత్త పడుతూఉంటుంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కీలక విభాగాల్లో నియమించడానికి వీలుగా ప్రస్తుత చైర్పర్సన్ చౌదరి ధనలక్ష్మి జెడ్పీ కార్యాలయంలో శాఖల మార్పిడి రెండుసార్లు చేపట్టారు. గతంలో కొందర్ని మార్చినప్పటికీ అకౌంట్స్ విభాగంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి విషయంలో ముఖ్యప్రణాళికాధికారి (సీఈఓ), చైర్పర్సన్ల మధ్య అంతరం పెరిగింది. అలాగే కార్యాలయ పరిధిలో టైఫిస్టుగా పనిచేస్తున్న సంతోష్‌ను కుటుంబ కలహాల ఫిర్యాదు మేరకు అరెస్టయినపుడు సస్పెండ్ చేయాల్సి ఉండగా..చైర్పర్సన్ అడ్డుపడ్డారు. అయితే నిబంధనల ప్రకారం సీఈవో నగేష్ సస్పెం డ్ చేశారు. దీంతో అప్పట్లో చైర్పర్సన్, సీఈవోల మధ్య మనస్పర్థలు నెలకొన్నాయి. తాజాగా 15 మంది ఉద్యోగులకు శాఖల మార్పునకు చైర్పర్సన్ ధనలక్ష్మి ఆదేశాలు జారీ చేశారు. అకౌంట్స్ విభాగంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న సెక్షన్ అధికారి సీటు మార్చాలని చైర్పర్సన్ నిర్ణయం తీసుకున్నారు. అతనితోపాటు ఇద్దరు సూపరింటెండెంట్లకు శాఖల మార్పిడి తప్పనిసరి. వీరితో కలసి 15 మందికి స్థానచలనంతోపాటు కొత్తగా వచ్చిన మరో ముగ్గురికి సీట్లు కేటాయించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయాన్ని అమలు చేయాల్సిన సీఈవో మూడురోజులుగా మార్పునకు అనుమతించలేదు. ఇది జెడ్పీలో చర్చనీయూంశంగా మారింది. ఈ విషయం జెడ్పీ సీఈవో, చైర్పర్సన్ల మధ్య వివాదానికి దారితీసే పరిస్థితి ఉందని కొంతమంది ఉద్యోగులంటున్నారు. పాలనా సౌలభ్యం కోసమే మార్పులు జెడ్పీలో పరిపాలనా సౌలభ్యం కోసం మార్పులు చేసుకునే వీలుంది. శాఖల మార్పు అనివార్యం.బాధ్యతాయుతం గా పనిచేస్తున్న వారిని మార్చినప్పు డు కొత్తసమస్యలు తలెత్తకుండా చేస్తాం. - బి.నగేష్, జెడ్పీ సీఈవో అభ్యంతరాలు ఉండడం సహజమే జెడ్పీ పరిధిలో పాలనా పరమైన అం శా ల్లో మార్పులు తీసుకురావాలన్న ఆలోచనతోనే అంతర్గతమార్పులు చేస్తున్నాం. శాఖల మార్పు వల్ల ఉన్నతాధికారులకు అభ్యంతరాలు ఉండడం సహజమే. మార్పులు చేసినపుడు వారి ఆలోచనలు వేరుగా ఉంటాయి. - చౌదరి ధనలక్ష్మి, జెడ్పీ చైర్పర్సన్ -
ఆ చిత్రంలో నేను నటించలేదు
జాతీయ అవార్డు గ్రహీత నటుడు బాబీసింహా నటించిన తాజా చిత్రం కో-2 ఇటీవల విడుదలై ప్రదర్శింపబడుతోంది. బాబీసింహా పేరు ఇప్పుడు వార్తల్లో మారు మోగుతోంది. ఆయన్ని మరోసారి వివాదాల్లోగా లాగినట్లు తెలుస్తోంది. ఇంతకు ముందు ఒకసారి ఆయన నటించిన చిత్రానికి ఒప్పందం ప్రకారం పారితోషికం చెల్లించకుండా, ఆయన పాత్రకు వేరే వారితో డబ్బింగ్ చెప్పించి విడుదల చూసి బాబీసింహాను వివాదాల్లోకి దించినట్లు ప్రచారం హోరెత్తింది. తాజాగా బాబీసింహా నటించని చిత్రంలో ఆయన నటించినట్లు ప్రచారం చేస్తూ మరోసారి వివాదాల్లోకి దించినట్లు ఆయన వాపోతున్నారు. దీనికి సంబంధించిన వివరాల్లోకెళ్లితే మీరా జాగ్రత్తై అనే చిత్రంలో బాబీసింహా నటించినట్లు ఇటీవల మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇది తన దృష్టికి రావడంతో బాబీసింహా దిగ్భ్రాంతికి గురైయారు. వెంటనే స్పందించిన ఆయన నడిగర్‌సంఘంకు పిర్యాదు చేశారు. అందులో ఆయన పేర్కొంటూ తాను మూడేళ్లుగా దక్షిణ భారత నటీనటుల సంఘంలో సభ్యుడిగా కొనసాగుతున్నానన్నారు. తన సభ్యత్వ నమోదు నంబర్.7871 అని పొందుపరచారు. తన పేరుకు కళంకం ఆపాదించే విధంగా కొందరు ప్రయత్నిస్తున్నారన్నారు. కొన్ని రోజులుగా దిన పత్రికల్లో తనకు తెలియని దర్శకుడు, నిర్మాత మీరా జాగ్రత్తై అనే చిత్రంలో తాను నటించినట్లు ప్రచారం చేస్తున్నారన్నారు. ఆ ప్రకటనల్లో తాను ఇంతకు ముందు నటించిన ఉరుమీన్ చిత్ర ఫొటోలను ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు. నిజానికి తానా చిత్రంలో నటించనేలేదు. డబ్బింగ్కుడా చెప్పలేదు అని తెలిపారు. ఇక పోతే ఆ చిత్రంలో కథానాయకిగా చెప్పబడే నటి మోనీకాను తాను నేరుగా చూసింది కూడా లేదు అన్నారు. ఈ వ్యవహారంలో నిజానిజాలను గ్రహించి తగిన చర్యలు తీసుకోవలసిందిగా కోరుకుంటున్నానని బాబీసింహా పేర్కొన్నారు. -
ఆస్తి తగాదాలతో అన్నను చంపేశాడు..
లక్సెట్టిపేట్(ఆదిలాబాద్): ఆస్తి పంపకాల్లో తేడాలు..ఆ అన్నదమ్ముల మధ్య చిచ్చుపెట్టాయి. గొడవ ముదిరి ఒకరి ప్రాణం తీసేదాకా వెళ్లింది. ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేట్ మండలం లక్ష్మింపూర్ గ్రామంలో బుధవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శంకరయ్య, గంగయ్య అన్నదమ్ములు. తమకు సంక్రమించిన ఆస్తి పంపకాల్లో వారి మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలోనే బుధవారం సాయంత్రం గొడవపడ్డారు. ఆవేశంతో ఉన్న గంగయ్య అన్న శంకరయ్య(45)ను రోకలిబండతో కొట్టి చంపాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వివాదాలకు ముగింపు పలకండి!
* రాష్ట్రాభివృద్ధికి అంతా కలసి పనిచేయండి * నగరి ఎమ్మెల్యే రోజా కేసులో సుప్రీం కోర్టు * ప్రజలే సుప్రీం.. న్యాయవ్యవస్థ, శాసన వ్యవస్థ కాదు * తన మాటల్లో ఉద్దేశం ఏంటో చెబుతూ స్పీకర్‌కు రోజా లేఖ రాస్తారు * ఆ లేఖతో ఇక ముగింపు పలకండి.. విచారణ నేటికి వాయిదా సాక్షి,న్యూఢిల్లీ: రాష్ట్రాభివృద్ధికి అంతా కలసి పనిచేయాలని, వివాదాలకు ముగింపు పలకాలని ఏపీ రాష్ట్రానికి సుప్రీం కోర్టు హితవు పలికింది. తన మాటల్లో ఉద్దేశం ఏంటో తెలుపుతూ నగరి ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత ఆర్.కె.రోజా శాసనసభాపతికి లేఖ రాస్తారని, ఈ లేఖతో 3 అభియోగాలతో ముడివడి ఉన్న వివాదాలకూ ముగింపు పలకాలని సుప్రీం కోర్టు హితవు పలికింది. ఇది తమ సలహా మాత్రమేనని స్పష్టం చేసింది. తనను ఏడాది పాటు సస్పెండ్ చేయడాన్ని హైకోర్టులో సవాలు చేయగా తనకనుకూలంగా ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ నిలిపివేయడాన్ని సవాలు చేస్తూ రోజా సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ గురువారం విచారణకు వచ్చింది. జస్టిస్ గోపాల గౌడ, జస్టిస్ అరుణ్‌మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. దాదాపు నాలుగున్నర గంటల పాటు ఇరు పక్షాలు వాదనలు వినిపించిన అనంతరం తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ముందుగా పిటిషనర్ ఆర్.కె.రోజా తరఫున సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ వాదనలు వినిపించారు. రోజా సస్పెండైన తీరు, సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు, దానిని నిలిపివేస్తూ డివిజన్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను వివరించారు. ‘‘శాసనసభ నిబంధనావళిలోని 340 (2) నిబంధన ప్రకారమే ఏడాదిపాటు సస్పెండ్ చేశామని తొలుత చెప్పిన ప్రభుత్వం, తరువాత రాజ్యాంగంలోని 194 ఆర్టికల్ ప్రకారం సస్పెండ్ చేశామంది. దీనిపై హైకోర్టుకు వెళ్లగా సింగిల్ జడ్జి అనుకూలంగా ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను డివిజన్ బెంచ్ రద్దు చేసింది. వాస్తవానికి 340 (2) నిబంధన కింద ఒక సభ్యుడిని ఆ సెషన్‌కు మాత్రమే సస్పెన్షన్ చేసే వీలుంది. కానీ రోజాను నిబంధనలకు విరుద్ధంగా డిసెంబర్ 18 నుంచి ఏడాదిపాటు సస్పెండ్ చేశారు. ఇక ఆర్టికల్ 194 పరిధిలో సభాహక్కుల తీర్మానం ద్వారా సస్పెండ్ చేయాలనుకుంటే అందుకు వీలుగా ఏపీ శాసనసభ కార్యకలాపాల నిబంధనావళి చాప్టర్ 20లోని సెక్షన్ 170 నుంచి 174 వరకు గల ప్రక్రియను అనుసరించాలి. కానీ ఇవేవీ లేకుండా కేవలం నిబంధన తప్పుగా ప్రస్తావించామంటే సరిపోదు. ఇది పొరపాటు కాదు. పిటిషనర్‌కు తన వివరణ ఇచ్చే అవకాశమే లేకుండా చేశారు. ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. కాల్‌మనీ సెక్స్ రాకెట్‌ను లేవనెత్తినందుకే రోజాను సభ నుంచి బయటికి పంపాలని చూశారు. డిసెంబర్ 18న జరిగిన 2 ఘటనల్లో వేర్వేరు గా స్పందించారు. సభానాయకుడిని దూషిం చారంటూ ఏడాది పాటు సస్పెండ్ చేశారు. ఎమ్మెల్యే అనితను దూషించారంటూ ప్రివిలేజ్ కమిటీ నోటీసులిచ్చింది. ఈ రెండింటిలో విభిన్నంగా ఎలా వ్యవహరిస్తారు? సీఎంను దూషించారని భావిస్తే అప్పుడూ ప్రివిలేజ్ కమిటీ ద్వారా నోటీసులు ఇవ్వాలి కదా? తమిళనాడులో ఆరుగురు శాసనసభ్యుల సస్పెన్షన్ వ్యవహారంలో జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ అభయ్ మనోమర్ సాప్రేతో కూడిన ధర్మాసనం సహజ న్యాయసూత్రాలను పాటించలేదన్న కారణంతో సస్పెన్షన్‌ను ర ద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది’’ అని వాదించారు. అహంతో తలెత్తుతున్న ఘర్షణలు ఈ సందర్భంలో జస్టిస్ గోపాల గౌడ స్పందిస్తూ.. ‘‘చట్టసభలు ప్రజా సమస్యలపై చర్చించాలి. కానీ అహంతో ఘర్షణలు తలెత్తుతున్నాయి. సభా నాయకులు, ప్రతిపక్ష నేతల మధ్య వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి. మేధోపరమైన చర్చలు జరగడం లేదు’’ అన్నారు. తరువాత ప్రభుత్వం తరఫున న్యాయవాది పీపీ రావు స్పందిస్తూ ‘పిటిషనర్ సభకు క్షమాపణ చెప్పాలి’ అని కోరారు. జస్టిస్ అరుణ్ మిశ్రా జోక్యం చేసుకుంటూ ‘‘పిటిషనర్ క్షమాపణ చెబితే మీరు వ్యవహారాన్ని ముగిస్తారా?’’ అని అడగ్గా పీపీరావు సమ్మతించారు. ఇందిరా జైసింగ్ స్పందిస్తూ.. దీనికీ ఒక ప్రక్రియ ఉందని, దానిని అనుసరించకుండా ఎలా చెప్పగలమని జవాబిచ్చారు. గత తీర్పులు పిటిషనర్‌కు అనుకూలం జస్టిస్ గోపాల గౌడ మాట్లాడుతూ.. ‘‘ఈ కేసులో న్యాయసమీక్షకూ వెళ్లొచ్చు. సుప్రీం గతంలో ఇచ్చిన తీర్పులు పిటిషనర్ వాదనలకు బలం చేకూర్చేవే. పిటిషనర్ తాను సభానాయకుడిని ఏ ఉద్దేశంతో అన్నారో స్పీకర్‌కు వివరణ ఇస్తారు. సభాకార్యక్రమాలు సజావుగా నడవాలి. న్యాయ వ్యవస్థగానీ, శాసన వ్యవస్థగానీ సుప్రీం కాదు. ప్రజలే సుప్రీం. ఒకవేళ పిటిషనర్‌కు సమ్మతమైతేనే వివరణ ఇస్తారు. అది కూడా సభలోనే’’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంలో పిటిషనర్ తరఫు మరో న్యాయవాది నర్మద సంపత్.. పిటిషనర్‌కు వివరణ ఇచ్చే అవకాశం ఇవ్వలేదన్నారు. పీపీ రావు కల్పించుకుని.. విచారం వ్యక్తంచేస్తూ స్పీకర్‌కు ఎమ్మె ల్యే లేఖ ఇస్తే ఈ వ్యవహారాన్ని ముగిం చేందుకు స్పీకర్‌ను ఒప్పిస్తానన్నారు. ‘‘మీరు విచారం వ్యక్తం చేయాలంటూ పట్టుపట్టొద్దు. ‘నేను ఆ ఉద్దేశంతో అనలేదు’ అని కేవలం ఒక వాక్యంలో లేఖ రాస్తారు’’ అని జస్టిస్ గోపాల గౌడ పేర్కొన్నారు. ఇందిరా జైసింగ్ వాదనలు వినిపిస్తూ.. సభానాయకుడి విషయంలో, ఎమ్మెల్యేలు అనిత, కాల్వ శ్రీనివాసులు విషయంలో 3 అభియోగాలు మోపారని, అనిత, కాల్వ శ్రీనివాసులు విషయంలో సమాధానం ఇచ్చామని, మూడింటికీ ఈ లేఖ వర్తించాలని విన్నవించారు. దీనికి పీపీరావు అభ్యంతరం వ్యక్తంచేశారు. దీంతో ఇందిరా జైసింగ్ ‘ముందుగా 3 అభియోగాలను ఉపసంహరించుకోమనండి. సస్పెన్షన్ ఎత్తివేయమనండి. అప్పుడు మా విచారం వ్యక్తంచేస్తాం’ అని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో పీపీ రావు తిరిగి వాదనలు వినిపించగా.. జస్టిస్ గోపాల గౌడ కల్పించుకుని ‘‘మీరు 194 అధికరణకు గల ప్రక్రియను అవలంబించలేదు. ఈ విషయంలో 2 రాజ్యాంగ ధర్మాసనాల తీర్పులు పిటిషనర్‌కు అనుకూలంగా ఉన్నాయి. మీరు సమస్యకు ముగింపు పలకండి’’ అన్నారు. తమ అభిప్రాయం చెప్పేందుకు శుక్రవారం వరకు ఆగాలని కోర్టును ఇందిరా జైసింగ్ అభ్యర్థించారు. జస్టిస్ గౌడ తిరిగి జోక్యంచేసుకుంటూ ‘సామరస్యంగా వ్యవహారం ముగిసిపోయేలా చర్యలు తీసుకోండి’ అని పీపీరావుకు చెబుతూ విచారణ వాయిదా వేశారు. -
ఆధిపత్యం వర్సెస్ ఆత్మగౌరవం
సాలూరు టీడీపీలో మరో వర్గపోరు నాయకులతో సఖ్యత నెరపని ఎమ్మెల్సీ సంధ్యారాణి మొన్న భంజ్‌దేవ్‌తో నేడు చైర్పర్సన్ విజయకుమారితో విభేదాలు సాలూరు : సాలూరు తెలుగుదేశం పార్టీలో మరో వర్గపోరు పురుడుపోసుకుంది. మాజీ ఎమ్మెల్యే ఆర్పీ భంజ్‌దేవ్‌కు ఎమ్మెల్సీ సంధ్యారాణి నడుమ విభేదాలున్న సంగతి తెలిసిందే. ఇది చాలదన్నట్లు ప్రస్తుతం ఎమ్మెల్సీ, మున్సిపల్ చైరపర్సన్ మధ్య కూడా విభేదాలు చోటుచేసుకున్నాయి. దీంతో చోటామోటా నాయకులు, కార్యకర్తలు ఎవరి వెంట నడవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. వీరిమధ్య జరుగుతున్న అంతర్యుద్ధాన్ని ఆత్మగౌరవానికి, ఆధిపత్యానికి మధ్య జరుగుతున్న పోరుగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. సొంత కష్టంతో అధికారంలోకి.. గుమ్మిడి సంధ్యారాణి పార్లమెంట్ ఎన్నికల్లో, భంజ్‌దేవ్ శాసనసభ ఎన్నికల్లో ఓటమి చవిచూడగా సాలూరు మున్సిపాలిటీలో టీడీపీ పతాకం ఎగరడానికి గొర్లె విజయకుమారి, ఆమె భర్త మాధవరావు కృషేనని చెప్పక తప్పదు. ఇదిలా ఉంటే మున్సిపల్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన విజయకుమారి తనదైన శైలిలో పాలన సాగిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. అయితే సంధ్యారాణికి ఎమ్మెల్సీ పదవి వరించిన అనంతరం పరిస్థితిలో పూర్తి మార్పు వచ్చింది. ప్రతి చిన్న పనికీ ఆమె వచ్చి శంకుస్థాపనలు చేయడం, సమావేశాలు నిర్వహించడం వంటివి చేస్తూ తమను ఓవర్టేక్ చేస్తున్నారని విజయకుమారి వర్గీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సొంతపార్టీలోనే ఆధిపత్యం చెలారుుస్తూ తమను తొక్కేయాలని భావించడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. అంతేగాకుండా పార్టీ ఇన్చార్జి భంజ్‌దేవ్ వెంట నడవకూడదని ఆదేశిస్తున్నారని, ఇలా అయితే ఎలా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల సాలూరు రైల్బస్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి తనకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని చైర్పర్సన్ ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే రాజకీయ ఒడిదుడుకులు ఉండకూడదనే ఉద్దేశంతోనే సంధ్యారాణి వెంట చైర్పర్సన్ విజయకుమారి, భంజ్‌దేవ్ వెంట ఆమె భర్త మాధవరావు తిరుగుతున్నా వేధింపు లు తప్పడం లేదని తెలుస్తోంది. ఇటీవల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఆక్రమిత స్థలాల్లో షాపులను కూలగొట్టడాన్ని ఎమ్మెల్సీ తప్పుబట్టారు. దీన్ని చైర్పర్సన్ వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. కౌన్సిల్ నిర్ణయం మేరకు తీసుకున్న నిర్ణయూన్ని ఎమ్మెల్సీ ఎలా తప్పుబడతారని ప్రశ్నిస్తున్నారు. అలాగే ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకానికి సంబంధించి ఎమ్మెల్సీ, చైర్పర్సన్లు వేర్వేరుగా గురువారం శంకుస్థాపనలు చేపట్టారంటే వీరి మధ్య విభేదాలు ఏ స్థారుులో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. వీరి తీరు పట్ల సొంత పార్టీలోనే అసంతృప్తి సెగలు వినిపిస్తున్నాయి. అయితే సంధ్యారాణి సహకారంతోనే రాజకీయూల్లోకి వచ్చిన విజయకుమారి ఆమెతోనే వైరం నడపడాన్ని ఎమ్మెల్సీ వర్గీయులు తప్పుబడుతున్నారు. ఏది ఏమైనా అధికారపార్టీలో ఉన్నామన్న మాటేగానీ నాయకుల మధ్య ఆధిపత్యపోరులో తాము నలిగిపోతున్నామని కార్యకర్తలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి ఎలా ఉంటుందో వేచి చూడాలి. -
కొత్త కూర్పు.. భారీ కుదుపు!
ఏపీఈపీడీసీఎల్ సీజీఎంల బాధ్యతల్లో మార్పులు ఒకే రోజు కదిలిన నలుగురు ఉన్నతాధికారుల కుర్చీలు జీఎం స్థాయి అధికారికి సీజీఎంగా పదోన్నతి.. కీలక బాధ్యతలు పలు వివాదాలు, పనితీరు కారణమనే అనుమానాలు మార్పులపై డిస్కమ్ పరిధిలో విస్తృత చర్చ డిస్కమ్ కేంద్రస్థానంలో అత్యంత కీలకమైన బాధ్యతలు కొత్తగా పదోన్నతి పొందిన అధికారికి అప్పగింత.. నలుగురు సీజీఎంలకు ఉన్నపళంగా బాధ్యతల మార్పు.. ఒకేరోజు జరిగిన ఈ భారీ మార్పులు తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఈపీడీసీఎల్)ను కుదిపేశాయి. ఎందుకిలా ఒక్కసారి భారీ మార్పులని ఆరా తీస్తే.. ఆరోపణలు, వివాదాలు ముసురుకోవడమే కారణమని స్పష్టమవుతోంది. భూగర్భ కేబుల్ వ్యవస్థ ఏర్పాటు వంటి కీలక ప్రాజెక్టులు చేపట్టనున్న తరుణంలో జరిగిన ఈ భారీ మార్పులు సంస్థలో చర్చనీయాంశమయ్యాయి. విశాఖపట్నం : ఈపీడీసీఎల్ ఉన్నతాధికారుల బాధ్యతల్లో భారీ మార్పులు జరిగాయి. ఉన్నతాధికారుల పనితీరు, వారిపై ఉన్న వివాదాల నేపథ్యంలో భవిష్యత్ ప్రాజెక్టులను దృష్టిలో ఉంచుకుని సంస్థ సీఎండీ ఆర్.ముత్యాలరాజు భారీ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. నలుగురు చీఫ్ జనరల్ మేనేజర్ల(సీజీఎం)ను వారు ప్రస్తుతం నిర్వహిస్తున్న బాధ్యతల నుంచి తప్పించి కొత్త బాధ్యతలు అప్పగించారు. అదే సమయంలో కార్పొరేట్ కార్యాలయం జనరల్ మేనేజర్‌కు సీజీఎంగా పదోన్నతి కల్పించడంతోపాటు అత్యంత కీలక బాధ్యతలు అప్పగించారు. అకస్మాత్తుగా జరిగిన ఈ మార్పులు డిస్కమ్‌లో కలకలం సృష్టించాయి. ఆరోపణలు.. వివాదాలు ఈపీడీసీఎల్ పరిధిలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 54,11,997 మంది వినియోగదారులున్నారు. ఏటా వేల కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి. అయితే అంతే స్థాయిలో అవినీతి పెరుగుతోందన్న ఆరోపణలూ ఉన్నాయి. కింది స్థాయి లైన్మెన్ నుంచి, ఏఈ, ఏడీఈ, డీఈ, జీఎం, సీజీఎం వరకూ అన్ని స్థాయిల వారిపై ఆరోపణలకు కొదవ లేదు. అయితే సీజీఎం స్థాయి అధికారులపై ఆరోపణలు రావడం అరుదుగా జరుగుతుంటుంది. కానీ ప్రస్తుతం స్థానచలనం పొందిన నలుగురిలో ఒక సీజీఎం నిత్యం వివాదాల్లోనే ఉంటుంటారు. గతంలో సూపరింటెండింగ్ ఇంజనీర్‌గా పనిచేసిన చోట కూడా పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. అలాంటి వ్యక్తి ఏడాదిన్నరగా సీజీఎం హోదాలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయనపై తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కొన్ని విద్యుత్ ఉద్యోగుల సంఘాలు ఆరోపణలు చేశాయి. ఓ మహిళా అధికారి విషయంలో ఆయన అనుచితంగా కల్పించుకున్నారనే ఆరోపణల నేపధ్యంలో పలు విచారణలు కూడా జరిగాయి. ఆయన ఇంకా ఆ పదవిలో ఉంటే భవిష్యత్‌లో విశాఖలో చేపట్టబోయే భూగర్భ విద్యుత్ కేబుల్ ప్రాజెక్టుపై ప్రభావం పడుతుందనే ఉద్దేశంతో ప్రస్తుత బాధ్యతల నుంచి తప్పించినట్లు సమాచారం. ఆయన స్థానంలో ఓ జీఎంకు సీజీఎంగా పదోన్నతి కల్పించి నియమించారు. డిస్కమ్ కేంద్ర కార్యాలయంలో అత్యంత కీలక స్థానంగా భావించే చోట సీనియర్లను కాదని కొత్త వ్యక్తిని తెచ్చిపెట్టడం చర్చనీయాంశమైంది. ఇక మరో సీజీఎంపైనా ఇటీవల పలు ఆరోపణలు వచ్చాయి. విద్యుత్ చార్జీల పెంపుపై జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో ఆయనపై పరోక్షంగా ప్రజాసంఘాలు విరుచుకుపడ్డాయి. దీంతో ఆయనను కూడా ప్రస్తుత బాధ్యతల నుంచి తప్పించారు. అన్ని విషయాల్లోనూ అత్యంత పక్కాగా వ్యవహరించే ప్రపంచ బ్యాంకు బాధ్యతలను ఆయనకు అప్పగించారు. పెద్దగా ప్రాధాన్యం లేని మరో బాధ్యత కూడా ఇచ్చారు. దీంతో ఆయన దూకుడుకు అడ్డుకట్ట వేసినట్లయ్యింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల(పీపీఏ)పై వస్తున్న అనేక ఆరోపణల నేపథ్యంలో ఆ బాధ్యతలను ప్రస్తుతం ప్లానింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సీజీఎంకు అదనంగా ఇచ్చారు. ఇక ఎప్పుడూ అప్రధాన్య బాధ్యతల్లోనే ఉండే మరో సీజీఎంకు మళ్లీ అలాంటి పనినే అప్పగించారు. ‘ఏపీఈపీడీసీఎల్’ పదోన్నతులు ఏపీఈపీడీసీఎల్‌లో ముగ్గురు అధికారులకు పదోన్నతి కల్పిస్తూ సీఎండీ ఆర్.ముత్యాలరాజు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కమర్షియల్ విభాగంలో జనరల్ మేనేజర్‌గా ఉన్న పీవీవీ సత్యనారాయణకు చీఫ్ జనరల్ మేనేజర్‌గా పదోన్నతి ఇచ్చి ఐదు జిల్లాల ఆపరేషన్స్ బాధ్యతలు అప్పగించారు. రామగుండం విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో 1984లో ఎలక్ట్రికల్ ఇంజనీర్‌గా బాధ్యతలు చేపట్టి విద్యుత్ విభాగంలో అడుగుపెట్టిన ఆయన పశ్చిమగోదావరి, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో వివిధ స్థాయుల్లో విధులు నిర్వర్తించారు. రెండేళ్లుగా జీఎంగా ఉన్నారు. ఇక విశాఖ కార్పొరేట్ కార్యాలయంలో డీఈగా ఉన్న పి.సంజీవరావుకు సూపరింటెండింగ్ ఇంజనీర్‌గా పదోన్నతి లభించింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో డీపీఈ-1 ఏడీఈగా పనిచేస్తున్న బి.వీరభద్రరావుకు డీఈగా పదోన్నతి కల్పించి విశాఖ కార్పొరేట్ కార్యాలయానికి బదిలీ చేశారు. కార్పొరేట్ కార్యాలయంలో సీజీఎంలు, జీఎంల ప్రస్తుత బాధ్యతల్లో మార్పులు చేశారు. -
రైల్వే వేడుకలో రగడ
సాక్షి, చెన్నై: దక్షిణ రైల్వే నేతృత్వంలో తాంబరం రైల్వే కాలనీ మైదానం వేదికగా పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు ఏర్పాట్లు చేశారు. తాంబరం నుంచి చెంగల్పట్టు వైపుగా మూడో రైల్వే మార్గం పనులు, కళ్లకురిచ్చి- చిన్న సేలం మధ్య రైల్వే మార్గం విస్తరణ పనులు అందులో ఉన్నాయి. అలాగే, తిరుచ్చి రైల్వే స్టేషన్లో కొత్తగా నిర్మించిన ఎస్కలేటర్ ప్రారంభోత్సవం, చెన్నై సెంట్రల్, తిరువనంత పురం స్టేషన్లలో ప్రయాణికుల కోసం దుప్పట్లు, దిండుల విక్రయాలకు, సెంట్రల్ నుంచి షాలిమార్‌కు వారంతపు రైలుకు జెండా ఊపడం తదితర అంశాలు ఈ వేడుకలో ఉన్నాయి. ఇందులో ముఖ్య అతిథిగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు పాల్గొని తాంబరం- చెంగల్పట్టు మూడో ట్రాక్ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే, వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ఇతర పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. వారంతపు రైలు సేవలకు జెండా ఊపారు. ఇంత వరకు బాగానే ఉన్నా, డీఎంకే రాజ్య సభ సభ్యుడు తిరుచ్చి శివను ప్రసంగానికి ఆహ్వానించడం వివాదానికి దారి తీసినట్టు అయింది. వాదులాట: తిరుచ్చి శివ తన ప్రసంగంలో రైల్వే అధికారులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తిరుచ్చి రైల్వేస్టేషన్లో ఎస్కలేటర్ ఏర్పాటుకు తన నియోజకవర్గ నిధి నుంచి రూ. 95 లక్షలు ఇచ్చినట్టు ప్రకటించారు. అయితే, రైల్వే అధికారుల ప్రకటనలో ఎక్కడా తాను కేటాయించినట్టుగా పేర్కొనక పోవడం విచారకరంగా వ్యాఖ్యానించా రు. తిరుచ్చిలో జరగాల్సిన వేడుకను తాంబరానకి మార్చారని, ఈ వేడుకను బహిష్కరించాలని తొలుత తాను భావించినట్టు పేర్కొన్నారు. అయితే, మంత్రి సురేష్ ప్రభు పిలుపుతో ఇక్కడికి వచ్చానని, అధికార వేడుకల్ని సైతం రాజకీయం చేయడం తగదంటూ పరోక్షంగా అన్నాడీఎంకే సర్కారును ఉద్దేశించి స్పందించారు. ఇంతలో వేదిక మీదున్న రాష్ట్ర మంత్రి చిన్నయ్య మైక్ అందుకుని వ్యంగ్యాస్త్రంతో కూడిన ఓ సామెతను గుర్తు చేస్తూ తీవ్రంగానే స్పందించి తన సీట్లో కూర్చున్నారు. మంత్రికి ఇరు వైపులా చిన్నయ్య, శివ కూర్చోవడమే కాదు, ఇద్దరూ వాగ్యుద్ధానికి దిగారు. ఇద్దరు ఏవో తిట్టుకుంటున్నట్టుగా స్పందించడంతో తన ప్రసంగానికి పిలుపు వచ్చినట్టుగా చటుక్కున అక్కడి నుంచి లేచిన మైక్ అందుకున్నారు. అప్పటికి కూడా వేదికపై తమ సీట్లలో ఉన్నట్టుగా తిరుచ్చి శివ, చిన్నయ్య వాదులాడుకుంటూ ఉండడంతో పక్కనే ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ జోక్యం చేసుకుని ఇద్దరిని బుజ్జగించాల్సి వచ్చింది. అంత వరకు ఈ ఇద్దరి వాదులాట వేదిక ముందున్న వాళ్లనే కాదు కేంద్ర మంత్రిని సైతం విస్మయానికి గురి చేసినట్టు అయింది. నిధుల పెంపు: రైల్వే మంత్రి సురేష్ ప్రభు తన ప్రసంగంలో తమిళనాడుకు రైల్వే పథకాల్లో పెద్ద పీట వేస్తున్నామన్నారు. తమ హయంలోనే భాగస్వామ్యం పెరిగిందన్నారు. 1.5 శాతం మేరకు నిధుల్ని పెంచామని, కొత్త పథకాలను, రైళ్లను అందిస్తూ వస్తున్నామని వివరించారు. తమిళనాడు ప్రభుత్వం, కేంద్రం సమష్టిగా పథకాల్ని అమలు చేస్తున్నాయని, మున్ముందు మరిన్ని పథకాలు తమిళనాడుకు దరి చేరుతాయని వ్యాఖ్యానించారు. -
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
మాగనూరు: కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురై ఓ వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా మాగనూరు మండలం కొల్టూరు గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శంకరప్ప(45) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా కుటుంబ కలహాలతో సతమతమవుతున్నాడు. దీంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. -
’ఉమ్మడి ఏపీకి కేటాయించిన నీటినే పంచుకోవాలి’
-
అస్పత్రిలో మగబిడ్డ పై వివాదం
-
విభజన అంశాలపై సబ్ కమిటీ ఏర్పాటు
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ విభజన నేపథ్యంలో తలెత్తిన వివాదాల పరిష్కారంపై పనిచేస్తున్న కమిటీకి సాయం అందించేందుకు కేంద్ర హోంశాఖ ఓ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఏపీ, తెలంగాణల మధ్య ఉన్న వివాదాలు, ఇబ్బందులను పరిష్కరించే అంశాలపై దృష్టి పెడుతుంది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి కుమార్ అలోక్ దీనికి నేతృత్వం వహిస్తారు. ఇరు రాష్ట్రాల నుంచి పునర్వ్యవస్థీకరణ కార్యదర్శులు, ఢిల్లీలోని ఏపీ, తెలంగాణ రెసిడెంట్ కమిషనర్లు, రెండు రాష్ట్రాల శాఖల కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. అవసరమైన సందర్భాల్లో కేంద్రంలోని సంబంధిత (వివాదానికి సంబంధించి) మంత్రిత్వశాఖ ప్రతినిధి కూడా ఉంటారు. ఈ మేరకు కార్యాలయ మెమోను కేంద్ర, రాష్ట్ర సంబంధాల అండర్ సెక్రటరీ ఏకే మనీష్ ఈ నెల 12న జారీ చేశారు. ఈ సబ్ కమిటీ ఈ నెల 26న సమావేశం కానున్నట్టు సమాచారం. -
ఏపీ కాంగ్రెస్ సీనియర్ల మధ్య విభేదాలు
-
'ఆ ఇద్దరి ఎమ్మెల్యేల వివాదం వ్యక్తిగతం'
-
ఎన్ని వివాదాలు వస్తే అంత మంచిది!
‘‘వర్కింగ్ స్టయిల్ పరంగా నార్త్‌కి, సౌత్‌కి చాలా తేడా ఉంది. దక్షిణాదిన ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఒక నియమం ప్రకారం పని చేస్తూ ఉంటారు. కానీ, ఉత్తరాదిన అలా కాదు... తమకు నచ్చినట్లు పని చేస్తారు’’ అని లక్ష్మీరాయ్ అంటున్నారు. తమిళ చిత్రం ‘మౌన గురు’ హిందీ రీమేక్ ‘అకీరా’ ద్వారా ఆమె బాలీవుడ్‌కి పరిచయమవుతున్నారు. మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సొనాక్షీ సిన్హా కథానాయిక. ఇందులో లక్ష్మీ రాయ్ అతిథి పాత్ర చేస్తున్నారు. బాలీవుడ్ వర్కింగ్ స్టయిల్ కొత్తగా ఉందని, కానీ ఎంజాయబుల్‌గా ఉందని లక్ష్మీ రాయ్ చెబుతూ - ‘‘సౌత్‌లో వివాదాలంటే కంగారుపడతారు. ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని భయపడతారు. కానీ, నార్త్‌లో అలా కాదు. వివాదాలను కోరుకుంటారు. ఎన్ని వివాదాలొస్తే అంత మంచిదని, బోల్డంత పాపులార్టీ వస్తుందని భావిస్తారు. కానీ, నేను మాత్రం పాపులార్టీ కోసం వివాదాలు కోరుకోవడంలేదు’’ అన్నారు. ‘అకీరా’లో చేస్తున్నది అతిథి పాత్రే అయినా మంచి గుర్తింపు వస్తుందనే నమ్మకం ఉందని ఆమె తెలిపారు. బాలీవుడ్ నుంచి లక్ష్మీరాయ్‌కి మరికొన్ని అవకాశాలు వస్తున్నాయట. ప్రస్తుతం అవి చర్చల దశలో ఉన్నాయని, అధికారికంగా సైన్ చేసిన తర్వాత ఆ చిత్రాల వివరాలు తెలియజేస్తానని లక్ష్మీ రాయ్ చెప్పారు. -
అడిగేదెవరని..!
వివాదాల సుడిలో హుజూరాబాద్ నగర పంచాయతీ హడావుడి నిర్ణయూలు..నిబంధనలకు నీళ్లు ఆర్భాటమెక్కువ... ఆచరణ తక్కువ నిధులు ఫుల్... ప్రణాళిక నిల్ ధనార్జనే ధ్వేయంగావ్యవహరిస్తున్న పాలకవర్గం సతుల పాలనలో పతుల పెత్తనం సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : హుజూరాబాద్ నగర పంచాయతీ అక్రమాలకే కాదు... వివాదాలకూ కేరాఫ్‌గా నిలిచింది. పాలకవర్గం తీసుకునే నిర్ణయాలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారాయి. హడావుడిగా నిర్ణయాలు తీసుకోవడం, వాటి అమలులో నిబంధనలను ఉల్లంఘించడం ఇక్కడ షరా మామూలైంది. రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ సొంత నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఇబ్బడి ముబ్బడిగా నిధులు మంజూరు చేయిస్తుంటే... వాటిని ప్రణాళిక ప్రకారం ఖర్చు చేయాల్సిన పాలకవర్గ సభ్యులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. అభివృద్ధి పనుల కోసం మంజూరైన రూ.3.24 కోట్ల నిధులను స్వాహా చేసేందుకు మెజారిటీ పనులకు సింగిల్ టెండర్లే దాఖలయ్యేలా వ్యూహాత్మకంగా వ్యవహరించిన అధికారులు, పాలకవర్గ సభ్యుల తీరును ‘సాక్షి’ బయటపెట్టడంతో నియోజకవర్గ ప్రజల నుంచి అనేక ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. అందులో భాగంగా 2014 జూలైలో కొలువు దీరిన నగర పంచాయతీ పాలకవర్గం నాటి నుంచి నేటి వరకు తీసుకున్న నిర్ణయాలు ఏవిధంగా వివాదాస్పదమయ్యాయనే వివరాలను పంపుతున్నారు. వారు పంపిన వాటిలో మచ్చుకు కొన్ని ఉదాహరణలను పాఠకుల ముందుంచుతున్నాం. హడావుడి నిర్ణయాలు, ఆపై వివాదాలు పట్టణంలోని అంబేద్కర్ కూడలివద్ద షాపులను, దు కాణాల ముందు రేకులను, మురికి కాలువలను, ఇం దిరమ్మ విగ్రహన్ని కూల్చి వేయడం వివాదాస్పదమైంది. ప్రజాప్రతినిధులు, బాధితులతో చర్చించకుండా ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయంపై స్థానికంగా ఆగ్రహావేశాలు పెల్లుబికాయి.కనీసం ప్రత్యామ్నయం చూపకుండానే హడావుడిగా పొక్లెయిన్లను పెట్టి ఏకపక్షంగా కూల్చివేయడంపై విమర్శలు వచ్చాయి. హనుమాన్ దేవాలయం వద్ద నాలుగు కాళ్ల మండపం నిర్మించాలని హడావుడిగా తీర్మానించిన పాలకవర్గం అందులో భాగంగా నివాస గృహలను తొలగించేందుకు మార్కింగ్ వేయించి కూల్చివేతకు సిద్ధమైంది. ఆందోళన చెందిన బాధితులంతా మంత్రి ఈటలను కలిసి తమ ఇళ్లు కూల్చితే రోడ్డున పడుతామని కన్నీటి పర్యంతమవుతూ గోడు వెళ్లబోసుకోవడం, మంత్రి జోక్యంతో కూల్చివేతల నిర్ణయం పెండింగ్‌లో పడింది. ఐబీ అతిథిగృహం షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం విషయంలో అవకతవకలు జరిగి వివాదాలు తలెత్తాయి. పోలీస్‌స్టేషన్ ఎదురుగా ఉన్న జెడ్పీ పాఠశాల స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు నగరపంచాయతీ నుంచి నోటీసులు జారీ చేయడానికి రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఇందులో కూడా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం సాకుగా చూపుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు హుజూరాబాద్‌లో ఎన్ని షాపింగ్ కాంప్లెక్స్‌లు నిర్మిస్తారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నగరపంచాయతీ కార్యాలయం చుట్టూ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాలని కూడా పంచాయతీ ఉవ్విళ్లూరుతోంది. అంబేద్కర్ విగ్రహం చుట్టూ రూ. 50 లక్షలతో చమన్ నిర్మిస్తామని ఊహ చిత్రాలు గీయించి ఆర్భాటం చేసినా ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేకపోగా భవిష్యత్‌లో చమన్ నిర్మాణం జరుగుతుందా? లేదా? అనే అనుమానాలను స్థానిక ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. కార్మికుల నియామకాల్లోనూ కక్కుర్తి? నగరపంచాయితీలో పని చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాల చెల్లింపుల భారం ఎక్కువ అవుతుందని భావించిన పాలకవర్గం మొదట్లో అధికారుల పాలనలో నియమించిన కాంట్రాక్ట్ కార్మికులను తొలగిస్తూ తీర్మానించింది. దీంతో ఆయా కార్మికులంతా కోర్టును ఆశ్రయించడంతో నిర్ణీత గడువు వరకు తొలగించరాదని స్టే ఇచ్చింది. దీంతో సదరు కార్మికులను కొనసాగించేందుకు కొందరు పాలకవర్గ సభ్యులు ఒక్కో కార్మికుడి వద్ద నుంచి రూ.1.50 లక్షలు పుచ్చుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఏ కార్మికులనైతే తొలగించాలని పాలకవర్గం తీర్మానించిందో ఆ కార్మికులే నేడు విధుల్లో కొనసాగుతుండడంతో ఈ ఆరోపణలకు బలం చేకూరినట్లయింది. మొక్కలను పెంచండి...చెట్లను నరకండి! హుజూరాబాద్ నగర పంచాయతీ తీరు మొక్కలను పెంచండి-చెట్టను నరుకండి’ చందంగా మారింది. నియోజకవర్గంలో విరివిగా మొక్కలను పెంచాలని నిర్ణయించిన పాలకవర్గ సభ్యులు కొందరు మోడల్ చెరువు, రోడ్డు పక్కనున్న వేప, తుమ్మ చెట్లను నరికివేయడం గమనార్హం. వాస్తవానికి చెట్లు నరకాలంటే తహశీల్దార్‌కు దరఖాస్తు చేసుకోవాలి. తహశీల్దార్ ద్వారా డిఎఫ్వో ఆమోదం పొందిన తర్వాత కొన్ని నిబంధనలు పాటించి చెట్లు నరకాలి. ఒక చెట్టు నరికిన తర్వాత మూడు నెలల్లోపు రెండు మొక్కలు నాటాలనే ఒప్పందంతోపాటు ఆ పరిధిని బట్టి నగదు కూడా చెల్లించాలి. కానీ ఈ నిబంధనలేవీ పాటించకుండానే కరెంట్ స్తంభాలకు, డ్రైనేజీకి అడ్డంకిగా మారాయనే సాకుతో రోడ్డు పక్కనున్న వేప చెట్లను నరికివేయించారు. ఎలాంటి టెండర్లు పిలువకుండా నే మోడల్ చెరువులోని లక్షల విలువైన తుమ్మ చెట్లను నరికి వేయించి అమ్ముకున్నారే ఆరోపణలున్నాయి. చెట్ల నరికివేత డబ్బులు పంచాయతీ ఖాతాలో జమ అయ్యాయా? లేదా? అని స్థానికులు కొందరు అధికారులను లిఖితపూర్వకంగా అడిగినప్పటికి వారి నుండి సమాధానం రాకపోవడం గమనార్హం. ప్లానింగ్ వద్దు... ఖర్చు చేయడమే ముద్దు విరివిగా వస్తున్న నిధులను ఎడాపెడా ఖర్చు చేయడమే తప్ప ప్రణాళికాబద్ధంగా పనులు జరగడం లేదనడానికి బండ అంకూస్ వీధిలో నిర్మించిన డ్రైనేజీయే నిదర్శనం. 13వ ఆర్థిక సంఘం ద్వారా రూ.8లక్షలు విడుదల కాగా, వాటితో ఆగమేఘాల మీద ఈ డ్రైనేజీ నిర్మించి మధ్యలోనే వదిలేశారు. సూపర్‌బజార్, వివేకానందనగర్, బండ అంకూస్ వీధికి సంబంధించిన మురికినీళ్లను ఈ కాలువ ద్వారా శివారులోని గంగన్న కుంటకు తరలించాలి. ఇంతకుముందు చిన్నగా ఉన్న కాలువను తొలగించి ఈ పెద్ద డ్రైనేజీని నిర్మించినా ఫలితం లేకపోయింది. దీంతో మురికినీరంతా డ్రైనేజీలోనే వారంరోజులగా నిల్వ ఉంటోంది. ఈ క్రమంలో దోమలు, ఈగలతో దుర్వాసన వెదజల్లుతూ కాలనీవాసులంతా రోగాలపాలవుతున్నారు. దీనిపై ఫిర్యాదులు వెళ్లినా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఇటీవల రూ.3.24 కోట్లు విడుదల కావడంతో మధ్యలో వదిలేసిన డ్రైనేజీ పనులను పూర్తి చేస్తారని అంతా భావించారు. అయితే టెండర్లు పిలిచిన 56 పనుల్లో దీని ప్రస్తావన లేకపోవడం విమర్శలకు దారితీస్తోంది. ఇష్టారాజ్యంగా నిధుల కేటాయింపు నగర పంచాయతీ పరిధిలో ఏయే పనులకు ప్రాధాన్యత ఇవ్వాలనే అంశాన్ని పాలకవర్గ సభ్యులు పట్టించుకోవడం లేదు. ప్రధానంగా మురికికాలువలు, సిమెంటు రహదారులు, కల్వర్టులు లేని వార్డులు, వెనుకబడిన కాలనీలకు ప్రాముఖ్యతను ఇవ్వాల్సినప్పటికీ... అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ అభివృద్ధి నిధులను వార్డుల వారీగా పంపిణీ చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పట్టణంలో 20 వార్డులు ఉండగా అభివృద్ధి పనులతో సంబంధం లేకుండా ప్రతీ వార్డుకు రూ.10లక్షల నుంచి రూ.25లక్షల వరకు కేటాయించారు. అందులోనూ పట్టణంలో అత్యవసరమైన పనులను పక్కనబెట్టి సులభంగా పూర్తిచేసే పనులను ఎంచుకున్నట్లు అర్థమవుతోంది. పనుల ఎంపికలో కూడా పైరవీలకే పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. దశాబ్దాల కాలంగా రహదారులు లేక, డ్రైనేజీ వ్యవస్థ లేక ఇబ్బందులు పడేవాళ్లకు ఈ పనుల్లో అన్యాయం జరిగిందనే విమర్శలున్నారుు. సతుల పాలనలో పతుల పెత్తనం మహిళా రిజర్వేషన్ పుణ్యమా అని పది మంది మహిళలు ఇక్కడ కౌన్సిలర్లుగా గెలిచినప్పటికీ వీరి స్థానంలో భర్తలే పెత్తనం చెలాయిస్తున్నారనేది బహిరంగ రహస్యం. కార్యాలయంలో మహిళా కౌన్స్లర్ల భర్తల పెత్తనంతో సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. ఇన్ని వివాదాలు, కార్యాలయంలో సిబ్బంది పనుల్లో నిర్లక్ష్యం, పరిష్కారానికి నోచుకోని ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ హుజూరాబాద్ నగరపంచాయతీని ఇటీవల ఉత్త‘మ’ పంచాయితీగా అధికారులు ఎంపిక చేయడం గమనార్హం. -
ఎన్ఎస్ఎల్ నిధులు వివాదాస్పదం
చక్కెర పరిశ్రమ విభాగంలో రూ.20 లక్షలపై రచ్చ సాక్షి, హైదరాబాద్: నిజాం షుగర్స్ లిమిటెడ్‌కు చెందిన రూ.20 లక్షల నిధుల వ్యవహారం చక్కెర పరిశ్రమల విభాగంలో వివాదాలకు దారి తీస్తోంది. సుమారు రెండు దశాబ్దాల క్రితం అనంతపురం జిల్లా హిందూపూర్‌లోని నిజాం షుగర్స్‌ను ప్రైవేటు పరం చేశారు. ఈ సందర్భంగా జరిగిన లావాదేవీల్లో బకాయి రూపంలో సీడీసీకి (చెరుకు పరిశ్రమాభివృద్ధి సంస్థ) రావాల్సిన రూ.20 లక్షలను సదరు ప్రైవేటు సంస్థ చెల్లించింది. చాలాకాలంగా చిత్తూరు చెరుకు సహాయ కమిషనర్ ఖాతాలో వున్న ఈ సొమ్మును రాష్ట్ర పునర్విభజన సమయంలో చక్కెర పరిశ్రమల విభాగం కమిషనరేట్ ఖాతాలో జమ చేశారు. ఈ నిధుల్లో నుంచి ఓ అధికారి వాహనం కొనుగోలుకు ప్రతిపాదిం చారు. చక్కెర పరిశ్రమల విభాగంలో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న ఉన్నతాధికారి ఈ ప్రతిపాదనకు అభ్యంతరం చెప్పినట్లు సమాచారం. ఉమ్మడి రాష్ట్రంలోని ఆస్తుల అమ్మకానికి సంబంధించిన నిధులు కాబట్టి, ఏపీకి చెందుతాయంటూ ఆ ఉన్నతాధికారి నివేదిక సిద్ధం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. నిజాం షుగర్స్‌కు అప్పులు, ఆస్తులు తెలంగాణకే చెందుతున్నందున రూ.20 లక్షలపై ఎలాం టి వివాదం లేదని మరో అధికారి వాదిస్తున్నారు. -
‘సుప్రీం’కు తల్లీకూతుళ్ల వివాదం
- హైకోర్టు తీర్పు నిలుపుదలకు నిరాకరణ - ‘బీఈ’ వివాద పరిష్కార బాధ్యతలు పెద్ద మనుషులకు - ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు హైదరాబాద్: ప్రముఖ ఔషధ తయారీ సంస్థ బయోలాజికల్ ఈ (బీఈ) యాజమాన్యపు హక్కు విషయంలో తల్లీ, కూతుళ్ల మధ్య తలెత్తిన వివాదం ఇప్పుడు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు చేరింది. కంపెనీ డెరైక్టర్లుగా ముగ్గురు కుమార్తెల నియామకం చెల్లదని, 81 శాతం వాటాల బదలాయింపు నిబంధనలకు అనుగుణంగా లేదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలుపుదల చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. తల్లీ, కూతుళ్ల మధ్య సాగుతున్న ఈ వివాదాన్ని పెద్ద మనుషుల సమక్షంలో పరిష్కరించుకోవడం మేలని స్పష్టం చేసింది. ఈ వివాదాన్ని పరిష్కరించే బాధ్యతలను సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్ పి.వి.రెడ్డి, జస్టిస్ ఆర్.వి.రవీంద్రన్‌లకు అప్పగించింది. వీరు ఈ కేసులో మధ్యవర్తులుగా వ్యవహరిస్తారు. ఈ ఉత్తర్వుల ప్రతి అందుకున్న నాటి నుంచి ఆరు వారాల్లోపు వివాదాన్ని పరిష్కరించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ గోపాలగౌడ, జస్టిస్ నాగప్పలతో కూడిన ధర్మాసనం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై రెండో వారానికి వాయిదా వేసింది. బీఈ కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ డాక్టర్ విజయకుమార్‌రాజు దాట్ల ఇటీవల మరణించడంతో, ఈ కంపెనీపై ఆధిపత్యం కోసం తల్లీ కూతుళ్ల మధ్య వివాదం తలెత్తింది. ఇది హైకోర్టుకు చేరడంతో, సుదీర్ఘ వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి ఇటీవల తీర్పు వెలువరించారు. డెరైక్టర్లుగా పూర్ణిమ, ఇందిరా, మహిమల నియామకం, 81 శాతం వాటాల బదలాయింపు చెల్లదన్నారు. ఈ తీర్పును సవాలు చేస్తూ మహిమ, పూర్ణిమలు వేర్వేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాలను గత వారం జస్టిస్ గోపాలగౌడ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఇరుపక్షాల తరఫున ప్రముఖ సీనియర్ న్యాయవాదులు కపిల్‌సిబాల్, దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం, తాజాగా ఉత్తర్వులు జారీ చేస్తూ ఈ వివాద పరిష్కార బాధ్యతలను మధ్యవర్తులకు అప్పగించింది. -
తల్లీ, కూతుళ్ల సెంటిమెంట్ కొట్టుకుపోయింది
81 శాతం వాటాల బదిలీ చెల్లదు బయోలాజికల్- ఈ కంపెనీ కుటుంబ వివాదంపై హైకోర్టు కుటుంబ ఆధ్వర్యంలో నడుస్తున్న బయోలాజికల్- ఈ (బీఈ) మార్గదర్శకుడి మరణంతో న్యాయ వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. తల్లీకూతుళ్లు హద్దులు గీసుకుని చేస్తున్న ఈ యుద్ధంలో సెంటిమెంట్ కొట్టుకుపోయింది. వారసులెవరనే విషయంపై కోర్టులో తల్లీ, కూతుళ్లు తమంతట తాముగా దోషులుగా నిలబడి, ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. హైదరాబాద్: ప్రముఖ ఔషధ తయారీ కంపెనీ బయోలాజికల్- ఈ (బీఈ) కంపెనీపై ఆధిపత్యం కోసం తల్లీ, కూతుళ్ల మధ్య సాగుతున్న వివాదంలో హైకోర్టు కీలక తీర్పునిచ్చిం ది. కంపెనీ డెరెక్టర్లుగా పూర్ణిమ, ఇందిరా, మహిమ చట్టబద్ధంగా నియమితులు కాలేదని తేల్చి చెప్పింది. బీఈ చైర్మన్, ఎండీ విజయకుమార్ దాట్ల పేరుతో ఉన్న 81 శాతం వాటాల బదిలీ చెల్లదని ప్రకటించింది. కంపెనీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తల్లి రేణుక దాట్ల, కుమార్తెలు పూర్ణిమ, ఇందిరా, మహిమ.. వివాదాలను పక్కనపెట్టాలని ఆదేశించింది. మూడో వ్యక్తికి జోక్యం చేసుకునే అవకాశమిస్తే, కంపెనీ పట్టాలు తప్పే ప్రమాదం ఉందని హెచ్చరిం చింది. తాత్కాలిక బోర్డ్ ఆఫ్ డెరైక్టర్లుగా రేణుక, ఆమె ముగ్గురు కుమార్తెలను నియమించిన కోర్టు, వీరిలో రేణుక ఈడీగా, మిగిలినవారు డెరైక్టర్లుగా ఉంటారని తెలిపింది. వారసులెవరనే విషయంపై సివిల్ కోర్టులో ఉన్న వివాదం తేలేంత వరకు ఆయనకున్న 81శాతం వాటాలను బోర్డు ఎవరికీ బదలాయించరాదంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి ఇటీవల తీర్పు వెలువరించారు. ఇదీ వివాదం... బీఈ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్‌గా ఉన్న డాక్టర్ దాట్ల విజయకుమార్‌రాజు ఇటీవల మరణించారు. ఆయన మృతితో ఈ కంపెనీపై ఆధిపత్యం కోసం తల్లీ కూతుళ్ల మధ్య వివాదం తలెత్తింది. ఇదే సమయంలో ముగ్గురు కుమార్తెలు డెరైక్టర్లుగా నియమితులయ్యారు. విజయకుమార్ రాజు పేరు మీద ఉన్న 81 శాతం వాటాను ముగ్గురు కుమార్తెల్లో ఒకరి పేరున బదలాయించుకున్నారు. వీటన్నింటిపై విజయకుమార్‌రాజు సతీమణి రేణుక హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై సుదీర్ఘ వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి, ఇటీవల తీర్పు వెలువరిస్తూ, కంపెనీ ప్రయోజనాలనే సర్వోన్నతంగా భావిస్తూ తల్లీ, కూతుళ్లకే నిర్వహణ బాధ్యతలను అప్పగిస్తున్నట్లు పేర్కొన్నారు. రేణుక మేనేజింగ్ డెరైక్టర్‌గా, ఏకాభిప్రాయంతో ఈ బోర్డు తగిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. బోర్డు డెరైక్టర్ల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోతే, కంపెనీ లా బోర్డును ఆశ్రయించి ఉత్తర్వులు పొందవచ్చునని తెలిపారు. కంపెనీ లా బోర్డులో ఉన్న పిటిషన్‌పై నిర్ణయం వెలువడేంత వరకు ఈ తాత్కాలిక బోర్డు కొనసాగుతుందని, సివిల్ కోర్టులో వివాదం తేలేంత వరకు తమ వద్ద ఉన్న పిటిషన్‌ను కంపెనీ లా బోర్డు అలానే పెండింగ్‌లో ఉంచాలని ఆదేశించారు. -
శ్రీకాకుళం జిల్లా టీడీపీలో ముసలం
శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. జిల్లా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న గౌతు శ్యాం సుందర్ శివాజీ, చౌదరి బాజ్జీ రెండు వర్గాలుగా చీలిపోయారు. వీరిద్దరు జిల్లా అధ్యక్షులుగా నేనంటే నేను అని పోటీ పడుతున్నారు. జిల్లా అధ్యక్ష పదవి తనకే కట్టబెట్టాలని ఇద్దరు నాయకులు బల ప్రదర్శనకు దిగుతున్నారు. ఎమ్మెల్యేల మద్దతు తనకు ఉందని గౌతు శ్యాంసుందర్ శివాజీ అంటుంటే... ఐవిఆర్ఎస్ విధానం ద్వారా అభిప్రాయ సేకరణలో కార్యకర్తల మద్దతు తనకే ఉందని చౌదరి బాజ్జీ చెపుతున్నారు. దీంతో ఐవీఆర్ఎస్ సిస్టమ్‌పై తెలుగు తమ్ముళ్లుల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమకు కావాలసినవారిని జిల్లా అధ్యక్షులుగా ఎంపిక చేసేందుకు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఈ విధానాన్ని తెరపైకి తీసుకువచ్చారని తెలుగు తమ్ముళ్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలో అధ్యక్ష ఎన్నికలు నిర్వహించాలని టీడీపీ నిర్ణయించింది. ఈ ఎన్నికలు శనివారం ప్రారంభమై సోమవారంతో ముగియనున్నాయి. నేడు పశ్చిమగోదావరి జిల్లా, గుంటూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల టీడీపీ అధ్యక్షుల ఎన్నికలు జరగనున్నాయి. -
అసెంబ్లీ సాక్షిగా ‘చిల్లర’ వ్యవహారం
- బిల్లు ఆపేశారంటూ ఆర్అండ్బీ - అధికారులపై స్పీకర్‌కు ఫిర్యాదు - చెల్లించాల్సిన రూ. 80 వేల - విషయంలో వివాదం సాక్షి, హైదరాబాద్: అస్మదీయులైతే నిబంధనలు పక్కకు పెడతారు.. కోరినన్ని పనులు దక్కేలా చూస్తారు. తమవారు కాకపోతే కమీషన్ ఇవ్వనిదే బిల్లులు ముందుకు సాగవు.. రోడ్డు భవనాల శాఖ లో ఇలాంటి ఫిర్యాదులు కోకొల్లలు. తాజాగా ఆ శాఖ అధికారుల తీరుపై ఓ కాంట్రాక్టర్ శాసనసభ స్పీకర్ మధుసూదనాచారికి ఫిర్యాదు చేశాడు. అధికారులు అడిగిన కమీషన్ గడువుకు ముందు ఇవ్వలేదని తనకు చెల్లించాల్సిన బిల్లు ఆపేశారని ఆరోపించాడు. ఆ అధికారికి రావాల్సి న బిల్లు విలువ రూ. 80వేలు మాత్రమే.. చివరకు రోడ్లు భవనాల శాఖ దగ్గరకు ఈ పంచాయితీ చేరింది. ఇదీ సంగతి...: శాసన సభ, మండలి భవనాల్లో ఫర్నీచర్, కుళాయి, నీటిపైపులకు రోజువారీ ఫిర్యాదుల ప్రకారం మరమ్మతులు చేసేందుకు ప్లంబర్, కార్పెంటర్లను ఏర్పాటు చేస్తారు. ఈ ప్రక్రియ ఔట్సోర్సింగ్ పద్ధతిలో జరుగుతుంది. దీని టెండర్లను ఈ ఏడాది జనవరిలో పిలిచారు. 6నెలలకు రూ. 2.48 లక్షల కాంట్రాక్ట్‌ను పర్ఫెక్ట్ సర్వీసెస్ అనే సంస్థకు 5.2 శాతం తక్కువగా కట్టబెట్టారు. ఆర్థిక సంవత్సరం ముగుస్తుండడంతో మూడు నెలలకు సంబంధించి రూ. 80వేలను చెల్లించాలని అధికారులను కాంట్రాక్టు సంస్థ కోరింది. ఎన్నిసార్లు అధికారులకు విజ్ఞప్తి చేసినా స్పందిచలేదని స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. అసెంబ్లీ, మండలి భవనాల పనులకు బిల్లులు చెల్లించేందుకు సిద్ధం చేసిన జా బితాలో పర్ఫెక్ట్ సర్వీసెస్ సంస్థ పనుల మొత్తాన్ని చేర్చకపోవడంతో ఈ వివాదం వచ్చింది. -
ఖాకీ దూకుడు
కొందరి దుందుడుకు చర్యలతో మసకబారుతున్న పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతిష్ట వరుస వివాదాలతో ఉక్కిరిబిక్కిరి చేయిజారి.. ఆపై కట్టుకథలు చెబుతున్న వైనం కమిషనరేట్‌పై దృష్టి సారించిన హోంశాఖ విజయవాడ : శాంతిభద్రతల పరిరక్షణ పేరుతో కొందరు పోలీసుల దుందుడుకు చర్యలు ప్రజల ప్రాణాలమీదకు తెస్తున్నాయి. పోలీసు శాఖ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయి. ప్రజలపై అకారణంగా చేయిచేసుకోవడం ఇటీవల నగర పోలీసులకు పరిపాటిగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెండు రోజుల క్రితం బైక్ వెళ్తున్న యువకులను అడ్డుకుని దాడిచేయడంతో పాటు వారిపై కేసు కూడా నమోదు చేయడంతో కలకలం రేగింది. ఈ ఘటన మరువకముందే పోలీసుల అదుపులో ఉన్న పాత నేరస్తుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం సంచలనం సృష్టించింది. దీంతో పోలీసుల దురుసు ప్రవర్తనపై హోం శాఖ దృష్టి సారించినట్లు సమాచారం. ప్రత్యేక నిఘా విభాగం ఇటీవల నగర పోలీస్ కమిషనరేట్‌తో పాటు జిల్లాలో జరిగిన పరిణామాలపై వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తి అనుమానాస్పద మృతి పెనమలూరు పోలీసుల అదుపులో ఉన్న గన్నవరానికి చెందిన పుల్లా రమేష్ అనే యువకుడు మంగళవారం రాత్రి 11.30 గంటలకు అనుమానాస్పద స్థితిలో మరణించడం జిల్లాలో సంచలనం సృష్టించింది. తాము రమేష్‌ను రామవరప్పాడు జంక్షన్ వద్ద అదుపులోకి తీసుకోగా, తన జేబులో ఉన్న కొంగలను చంపేందుకు వినియోగించే మందు మింగాడని, ఆస్పత్రికి తీసుకొచ్చేలోపే మృతిచెందాడని పోలీసులు చెబుతున్నారు. పోలీసుల మాటలను రమేష్ బంధువులు ఖండిస్తున్నారు. చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్నాడనే అనుమానంతో మంగళవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో రమేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని పెనమలూరు పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారని చెబుతున్నారు. పోలీస్‌స్టేషన్‌లో కొట్టడం వల్లే రమేష్ మృతిచెంది ఉంటాడని వారు ఆరోపిస్తున్నారు. పోలీసులు చెబుతున్నట్లే విష గుళికలు మింగిన వెంటనే పక్కనే ఉన్న ప్రభుత్వాస్పత్రికి ఐదు నిమిషాల్లోపు తీసుకువెళ్లవచ్చని, అలా చేసి ఉంటే బతికేవాడు కదా.. అని బంధువులు ప్రశ్నిస్తున్నారు. పూర్తిస్థాయిలో విచారిస్తేనే రమేష్ మృతి వెనుక కారణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. దాడి చేశారు.. ఆపై కేసు కట్టారు.. బందరు రోడ్డులో పశువుల ఆస్పత్రి జంక్షన్ వద్ద సోమవారం రాత్రి ఇద్దరు యువకులపై పోలీసులు దాడిచేయడం నగరంలో కలకలం రేపింది. పోలీసుల దాడిలో తీవ్రంగా గాయపడిన యంపాడ కల్యాణచక్రవర్తి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తన స్నేహితుడు చొక్కా బాబూదుర్గారావు(బాబి)ని ట్రాఫిక్ ఆర్ఎస్ఐ శ్రీకాంత్ తొలుత కొట్టారని, ఎందుకు దాడిచేస్తున్నారని ప్రశ్నించినందుకు తనను కూడా కొట్టారని, ఒక్క దెబ్బ మాత్రమే గుర్తుందని, ఉదయం కళ్లు తెరిచి చూస్తే ఆస్పత్రిలో ఉన్నానని చక్రవర్తి వాపోయారు. మరోవైపు చక్రవర్తి, బాబీలపై కృష్ణలంక పోలీసులు కేసు కూడా నమోదుచేయడంతో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తున్నవారిని గుర్తించేందుకు బ్రీత్ ఎనలైజర్ ఉపయోగించామని, ఆ సమయంలో ఐదుగురు అక్కడికి చేరుకొని గొడవకు దిగారని, ఒకరిని ఒకరు నెట్టుకోవడంతో చక్రవర్తి కిందపడి గాయాలపాలయ్యాడని, తాను కూడా కిందపడబోయానని ఆర్ఎస్ఐ చెబుతున్నారు. సాయం చేయకపోగా.. కేసు నమోదు.. ఆర్టీసీ బస్టాండ్‌లోని అవుట్‌పోస్ట్‌లో ఉన్న ఏఎస్ఐ మల్లికార్జునరావుపై సోమవారం రాత్రి దాడిచేశారని ఇద్దరు వ్యక్తులపై కృష్ణలంక పోలీసులు కేసు నమోదుచేయడం చర్చనీయాంశంగా మారింది. ఖమ్మం జిల్లా కోదాడకు చెందిన ఇద్దరు నున్న గ్రామంలో ఉంటున్న తమ బంధువుల ఇంట్లో శుభకార్యానికి హాజరయ్యారు. తిరిగి వెళ్లేందుకు ఆర్టీసీ బస్టాండ్‌కు వచ్చారు. వారిలో శ్రీనివాస్ అనే వ్యక్తిని పోలీస్ అవుట్‌పోస్ట్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి వెనుక నుంచి కొట్టి కనిపించకుండా పరారయ్యాడు. తనను కొట్టిన వ్యక్తి ఎవరో తెలుసుకునేందుకు సీసీ కెమెరా ఫుటేజీలు చూపించాలని అవుట్‌పోస్ట్‌లో ఉన్న ఏఎస్ఐ మల్లికార్జునరావును శ్రీనివాస్ కోరారు. సాధ్యం కాదని ఏఎస్ఐ చెప్పడంతో మాటామాట పెరిగి ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో శ్రీనివాస్, అతని వెంట ఉన్న వ్యక్తిని ఏఎస్ఐ కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. తనపై దాడిచేసి అవుట్‌పోస్ట్‌లోని కాగితాలను లాక్కుని పారిపోతున్నారని ఏఎస్ఐ కేసు పెట్టారు. వారిని రాత్రంతా స్టేషన్లో ఉంచి, మంగళవారం ఉదయం కోర్టులో హాజరుపరిచారు. హోంగార్డు హడావుడితో ఇద్దరు దుర్మరణం నాలుగు రోజుల క్రితం భవానీపురం రావిచెట్టు సెంటర్ వద్ద ఒక లారీ బ్రేక్ ఫెయిల్ కావడంతో మెకానిక్‌ను తీసుకొచ్చేందుకు డ్రైవర్ వెళ్లాడు. ఈలోపు అక్కడి హోంగార్డు నానా హంగామా చేసి క్రేన్ ద్వారా లారీని తొలగించేందుకు ప్రయత్నించాడు. లారీ తాలూకు ఎవరూ లేకుండానే క్రేన్ డ్రైవర్‌తో లారీని అక్కడి నుంచి వేరే చోటుకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో లారీ అదుపుతప్పి డివైడర్ మీదుగా వెళ్లింది. డివైడర్‌పై నిద్రిస్తున్న ఇద్దరు వ్యక్తులు మరణించారు. హోంగార్డుపై కేసు నమోదు చేశారు. జిల్లాలోనూ అనేక ఘటనలు.. మచిలీపట్నంలోని చిలకలపూడి పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం రాజమండ్రికి చెందిన నాగరాజు అనే వ్యక్తి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. ఓ ఇంట్లో దొంగతనం చేసేందుకు ప్రయత్నిస్తూ అతను చిలకలపూడి పోలీసులకు చిక్కాడు. అతన్ని పోలీసులు తమదైన శైలిలో రోజుల తరబడి విచారణ చేయటంతో భరించలేక ఇనుప రేకుతో పీక కోసుకున్నాడు. బందరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. జి.కొండూరు పోలీస్‌స్టేషన్ ఎదురుగా ఉన్న ఓ ఇంట్లో నివసించే సుజాత అనే వివాహిత వారం రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఆమె మృతికి ఓ హెడ్‌కానిస్టేబుల్ కారణమంటూ మృతురాలి కుటుంబ సభ్యులు, స్థానికులు పోలీస్‌స్టేషన్ ఎదుట ఫిబ్రవరి 5వ తేదీన ధర్నా నిర్వహించారు. దీంతో బాధ్యుడైన హెడ్‌కానిస్టేబుల్, అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు నమోదు చేస్తామని పోలీసు అధికారులు హామీ ఇచ్చారు. బందరు మండలం సీతారామపురానికి చెందిన కారు డ్రైవర్ శ్రీనివాస్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో బందరు తాలుకా పోలీసులు అతన్ని నెలల తరబడి పోలీస్‌స్టేషన్ చుట్టూ తిప్పుతున్నారు. పోలీసుల వేధింపులు భరించలేని శ్రీనివాస్ ఎస్పీకి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. దీంతో ఏలూరు రేంజ్ డీఐజీకి ఫిర్యాదు చేశారు. పెడన పోలీసుల అత్యుత్సాహం వల్ల రెండు నెలల క్రితం ఇద్దరు రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డారు. శ్రీను అనే వ్యక్తిపై పెడన స్టేషన్లో కేసులు ఉన్నాయి. అతను పెడన బంటుమిల్లి రహదారిలో ద్విచక్ర వాహనంపై తన బంధువైన మహిళను తీసుకువెళుతుండగా ఎస్ఐ మణికుమార్‌తో పాటు పోలీసులు వెంబడించారు. ఈ క్రమంలో శ్రీను నడుపుతున్న వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. శ్రీనుతో పాటు ద్విచక్ర వాహనంపై ఉన్న మహిళ తీవ్ర గాయాలపాలయ్యారు. విమర్శలకు దారితీసిన సీపీ ప్రకటన వరుసగా జరుగుతున్న పరిణామాలను కూలంకషంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాల్సిన నగర పోలీస్ కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు బుధవారం విడుదల చేసిన ప్రకటన పలు విమర్శలకు దారితీసింది. సత్యాన్వేషణ చేసే తీరిక, సామర్థ్యం, చేయాలనే తపన, ఆలోచన కొందరు జర్నలిస్టుల్లో లేవని, అందుకే పత్రికలు, మీడియాల్లో తప్పుడు కథనాలు ప్రచురించి, ప్రసారం చేస్తున్నారని, ఇది శాంతియుత పౌర జీవనానికి హాని కలిగిస్తున్నదని ఆయన పేర్కొనడం వివాదాస్పదంగా మారింది. -
మా అన్నయ్య మాకు దేవుడు : చక్రి సోదరి
-
విషాదం వివాదం
-
నిరుపేదల కోసం ఉచిత న్యాయసలహా
భార్యాభర్తల మధ్య వివాదాలు ఏర్పడ్డా, అత్తగారింటి లో వేధింపులు ఎదురవుతున్నా, తన కాపురాన్ని, బిడ్డల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సాధారణంగా భార్యే ఎలాగోలా సర్దుకుపోవాలని చూస్తుంది. అయితే ఆ వివాదాలు చినికి చినికి గాలివానగా మారినప్పుడు, భర్త లేదా అత్తమామల నుంచి వేధింపులు అంతకంతకూ పెరిగిపోతూన్నప్పుడు న్యాయసలహా కావాలనుకుంటుంది. అయితే కోర్టుకు వెళ్లడం సాధారణ గృహిణికి అంత సులువుగా సాధ్యమయ్యే పని కాదు. లాయర్ ఫీజే బోలెడంత. ఇతరత్రాఖర్చులు ఎలానూ తప్పవు. వాటిని భరించే స్తోమత లేక తనలో తాను కుమిలి పోతూ, నిర్వేదానికి, నిస్పృహకు లోనవుతుంది. ఇలాంటి వారి ఇబ్బందులను, సాధక బాధకాలను దృష్టిలో ఉంచుకుని ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత న్యాయసలహాను అందించేందుకు న్యాయసలహా సదన్లను ఏర్పాటు చేశాయి. ఒక్క మహిళలే కాదు... వికలాంగులు, ఎస్.సి, ఎస్.సీలు, నిరుపేదలు (లక్షరూపాయల వార్షిక ఆదాయానికి మించని వారు) తమ సమస్యలను లీగల్ సర్వీస్ అథారిటీకి తెలిపి, వారి నుంచి ఉచిత సలహా పొందవచ్చు. ఇంతకూ సమస్యలను తెలిపేదెలాగంటారా... మీ సమస్యను రాతపూర్వకంగా/ఫోన్ ద్వారా/ నేరుగా లీగల్ సర్వీస్ అథారిటీ కార్యదర్శికి తెలియజేయవచ్చు. దీనికి అడ్వకేట్‌తో అవసరం లేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో మొత్తం 207 లీగల్ సర్వీస్ అథారిటీలు పని చేస్తున్నాయి. సామాన్యులు ఈ సేవలను ఎలా వినియోగించుకోవచ్చో తెలియజేయడానికి ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ సహకారంతో వినియోగదారుల సంక్షేమ సంఘం పని చేస్తుంది. రాష్ట్ర, జిల్లా స్థాయిలోని న్యాయ సలహా కేంద్రాలు పని చేస్తాయి. రాష్ర్టస్థాయి న్యాయసలహా కేంద్రం ఫోన్ నంబర్లు... రాష్ట న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి: 04023446700 హైకోర్టు న్యాయసేవాధికార సంఘ కార్యదర్శి: 04023446704 రాష్ర్ట న్యాయసేవాధికార సంస్థ పాలనాధికారి: 04023446703. పై నంబర్లను సంప్రదించడం ద్వారా అవసరమైన సమాచారాన్ని పొందవచ్చు. అయితే ఉచితం కదా అని ప్రతి చిన్న విషయానికీ పదే పదే ఫోన్ చేసి అధికారుల సహనాన్ని పరీక్షించటం మాత్రం భావ్యం కాదని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. -
పరువు గాలికి
దేశానికి మేధావులు, ఇంజినీర్లు, నాయకులు, మానవ వనరులను అందించాల్సిన వర్సిటీలు పక్కదారి పడుతున్నాయి. కొందరు అధ్యాపకుల వ్యవహారంతో తెలంగాణ యూనివర్సిటీ పరువు బజారుకెక్కుతోంది. నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ గిరిరాజ్ కళాశాలలో 2006లో తెలంగాణ యూనివర్సిటీ ప్రారంభమైంది. అనంతరం డిచ్పల్లి శివారులో 577 ఎకరాల స్వస్థలంలోకి మారింది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2009 జనవరి 31న దీనిని ప్రారంభించారు. ⇒వివాదాలకు నిలయంగా మారిన తెయూ ⇒వెల్లువెత్తిన ‘అక్రమాల’ ఆరోపణలు ⇒నిధుల వినియోగంపైనా విమర్శలు ⇒ పీహెచ్డీ ప్రవేశాలూ వివాదాస్పదం ⇒తాజాగా పరీక్షల నియంత్రణాధికారి సస్పెన్షన్ ⇒తరచూ మారుతున్న పాలనాధికారులు ⇒ఆవేదన చెందుతున్న విద్యాభిమానులు తెయూ (డిచ్పల్లి): ప్రారంభించినప్పటి నుంచి తెలంగాణ యూనివర్సిటీ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. తొలి వీసీ కాశీ రాం హయాంలో జరిగిన ఉద్యోగ నియామకాలు జిల్లాకు చెందిన పెద్ద నాయకుని కనుసన్నలలో జరిగినట్లు విద్యార్థి సంఘా లు ఆరోపించాయి. అనంతరం 15 జూలై 2011న తెయూ వీసీగా ప్రొఫెసర్ అక్బర్ అలీఖాన్ ను ప్రభుత్వం నియమించింది. ఆయనపైనా పలు విమర్శలు వెల్లువెత్తాయి. యూనివర్సిటీ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ కాంట్రాక్టులకు సంబంధిం చి పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారి నట్లు ఆరోపణలు వచ్చాయి. అవసరానికి మించి మూడున్నర లక్షల జవాబు పత్రాల ను ముద్రింపజేసిన ఘటనలో రూ. పది లక్షలు చే తులు మారినట్లు నిందలు మోయాల్సి వచ్చింది. కేవలం ఆరు నెలల కాలంలో వీసీ తన వా హనంపై రూ.1.80 లక్షలు ఖర్చు చూపించడంపై విద్యార్థి సంఘాలు గవర్నర్‌కు ఫిర్యా దు చేయగా, ఆయన దీనిపై వివరణ కోరా రు. 12బి మంజూరు కోసం తెయూను పరి శీలించేందుకు యూజీసీ బృంద సభ్యులు సందర్శించినప్పుడు రసాయనాల పేరిట రూ.ఎనిమిది లక్షలు, ఇతర ఖర్చుల పేరిట రూ. రెండు లక్షలు ఖర్చు చూపించడం వివాదాస్పదంగా మారింది. పదవీకాలం ముగింపు దశలో యూనివర్సిటీ ఆర్చ్ (స్వాగత తోర ణం/ప్రధాన గేటు) నిర్మాణానికి రూ. 50 లక్షలు ఖర్చు చేయడం వర్సిటీ వర్గాలలో చర్చనీయాంశమైంది. బాలుర వసతి గృహంలో గదులు సరిపోక విద్యార్థులు ఇబ్బం దులు పడుతున్నా, అదనపు గదులు నిర్మాణంపై దృష్టి సారించని వీసీ, కేవలం ఆర్చ్‌కు రూ. 50 లక్షలు ఖర్చు చేయడం విమర్శలకు దారి తీసింది. వీసీ పదవి కాలంలో మారిన ఐదుగురు రిజిస్ట్రార్లు వీసీగా ప్రొఫెసర్ అక్బర్ అలీఖాన్ పని చేసిన రెండు సంవత్సరాల కాలంలో ఐదుగురు రిజిస్ట్రార్లు మారారు. ఆయన భాధ్యతలు స్వీకరించిన సమయంలో రిజిస్ట్రార్‌గా ఉన్న ప్రొఫెసర్ శివశంకర్ సెప్టెంబర్ 2011లో పదవి నుంచి తప్పుకున్నారు. అనంతరం కొద్ది కాలం ప్రొఫెసర్ యాదగిరి ఇన్చార్జి రిజిస్ట్రార్‌గా పని చేశారు. ఆ తరువా త ఉస్మానియా యూనివర్సిటీ కెమిస్ట్రీ విభాగం అధ్యాపకుడు ఎన్.అశోక్‌ను రిజిస్ట్రార్‌గా 2012 మార్చ్ 12న ప్రభుత్వం నియమించింది. ఏడాది తర్వాత రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్ లింబాద్రి నియమితులయ్యారు. సంవత్స రం తర్వాత ఆయన పదవీకాలం ముగిసింది. వెంటనే ఇన్చార్జి రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్ ధర్మరాజును నియమించారు. ఇలా రెండు సంవత్సరాల కాలంలో ఐదుగురు రిజిస్ట్రార్లు మారారు. తీరు మార్చుకోని అధికారులు తెలంగాణ యూనివర్సిటీలో పీహెచ్డీ కోర్సు ప్రారంభమైననాటి నుంచి అడ్మిషన్ల ప్రక్రియ వివాదాస్పదంగా మారుతూనే ఉంది. తొలిసారి అడ్మిషన్ల సమయంలో రెండు సార్లు ఫలితాలు విడుదల చేయడంపై ఆరోపణలు వెల్లువెత్తా యి. వర్సిటీ అధికారులు తమ తీరు మార్చుకోకుండా ఈసారి కూడా రెండు సార్లు జాబితా మార్చారు. అనర్హులకు ప్రవేశాలు కల్పిండానికే కటాప్ మార్కులు తగ్గించి అర్హులకు అన్యాయం చేశారని ఉన్నత విద్యామండలికి ఫిర్యాదులు అందాయి. తెలుగు పీహెచ్డీ ప్రవేశాలలో అక్రమాలు జరిగినట్లు నిర్థారణ కావడంతో ఇద్దరు అధ్యాపకులకు ఇన్చార్జి వీసీ శైలజా రామయ్యర్ చార్జి మెమోలు జారీ చేశారు. నియామకాలలో అక్రమాలు అక్బర్‌అలీఖాన్ హయాంలో చేపట్టిన టీచింగ్, నాన్-టీచింగ్ నియామకాలలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. డబ్బులు తీసుకుని తమకు నచ్చినవారికి ఉద్యోగాలు ఇచ్చారని, అర్హులకు అన్యాయం జరిగిందని కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మరికొందరు గవర్నర్‌కు ఫిర్యా దు చేశారు. కొందరు ఉన్నత విద్యామండలికి, ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో విచారణ కమిటీని నియమించారు. ప్రభుత్వం మాజీ రిజిస్ట్రార్లు ప్రసాద్‌రావు, భాస్కర్‌రావుతో ఒక కమిటిని నియమించగా, గవర్నర్ నరసింహన్ సూ చన మేరకు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సీవీ రాములు నేతృత్వంలో ఏక సభ్య విచారణ కమిటీ ఏర్పాటైంది. ఈ రెండు కమిటీలు విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదికలను అందజేశాయి. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండానే వీసీగా అక్బర్‌అలీఖాన్ పదవి కాలం ముగిసింది. కోర్టు మధ్యంతర ఉత్తర్వుల మేరకు గత ఏడాది జనవరిలో 47 మంది టీచింగ్ సిబ్బంది బాధ్యతలు స్వీకరించారు. సీఓఈ సస్పెన్షన్‌తో పోయిన పరువు యూనివర్సిటీలో వీసీ, రిజిస్ట్రార్ తర్వాత కీలకమైన పదవి పరీక్షల నియంత్రణాధికారిదే. అనుబంధ కళాశాలలు, క్యాంపస్ కళాశాలల విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించేది పరీక్షల విభాగమే. ఇలాంటి కీలక విభాగానికి అసోసియేట్ ప్రొఫెసర్‌ను అధికారిగా నియమించడమే విమర్శలకు తావిచ్చింది. సీఓఈగా విధులు నిర్వహిస్తున్న అసోసియేట్ ప్రొఫెసర్ ఏక కాలంలో రెండు చోట్ల వేతనాలు పొందారనే ఆరోపణలపై సస్పెన్షన్‌కు గురికావడంతో వర్సిటీ పరువు మరింత దిగజారినట్లయింది. ఇప్పటికైనా వర్సిటీ ఉన్నతాధికారులు ఇలాంటివి జరగకుం డా చర్యలు తీసుకుని వర్సిటీ పరువు, ప్రతిష్టలు పెంచేలా చూడాలని పలువురు విద్యాభిమానులు కోరుకుంటున్నారు. -
మర్యాద రామన్నలం అనిపించుకుందాం
ప్రయాణంలో దూకుడుతో వివాదాలు తోటి వాహనదారులకు కష్టం ప్రమాదాలకు దారి తీస్తున్న వైనం ‘అహం’తోనే చిక్కులు ‘పహెలే ఆప్’తో ఘర్షణలు నివారిద్దాం రోడ్డుపై వాహనాలు నడిపే వారుముఖ్యమైన పత్రాలతో పాటు అదనంగా ఒకదాన్ని తమ వద్ద ఉంచుకోవాలి. దానిపేరే ‘మర్యాద’. అదేంటీ కొత్తగా మాకు మర్యాదలు నేర్పుతారా? అని ప్రశ్నిస్తున్నారా? ఇది కాస్త భిన్నమైన మర్యాద. అందుకే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి వస్తోంది. కొంతమంది వాహన చోదకులు అడ్డదిడ్డంగా నడపడం.. పరిసరాలను పట్టించుకోకుండా హారన్లు మోగించడం... తోటి వాహనదారులతో అనుచితంగా ప్రవర్తించడం వంటివి చేస్తుంటారు. అవతలి వారి స్పందన తీవ్రంగా ఉంటే పరిస్థితి చేయి దాటుతుంది. రోడ్డు రేజ్‌గా పిలిచే ఈ చర్యలు తగదాలు...ఘర్షణలకు దారి తీస్తాయి. ఫలితంగా ట్రాఫిక్ స్తంభించడంతో పాటు విద్వేషాలకూ బీజం పడుతోంది. వాహనదారులు కొంచెం ‘స్పీడ్’ తగ్గించి... సహనం... ఓర్పుతో పాటు తోటి వారికి మర్యాదనివ్వాలనే విషయాన్ని గుర్తుంచుకుంటే... మనతో పాటు పక్క వారి ప్రయాణం సాఫీగా సాగిపోతుంది. వెనుక వచ్చే వారికి దారినివ్వడం... ముందు వెళ్లే వారికి ఇబ్బంది కలుగకుండా చూడడం వంటివి మన సంస్కారాన్ని చాటిచెబుతాయి. సిటీబ్యూరో: నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే పంజగుట్ట చౌరస్తాలో అకస్మాత్తుగా వాహనాలు స్తంభించాయి. క్షణాల్లో రోడ్డు మధ్యలో పెద్ద గుంపు చేరిపోయింది. కార్లు రోడ్డుపైనే నిలిపివేసిన ఇద్దరు వాహనదారులు ఒకరితో ఒకరు వాగ్యుద్ధానికి దిగారు. మాటా మాటా పెరిగింది. ఆగ్రహావేశాలు మిన్నంటాయి. పరస్పరం దాడులకు తె గబడ్డారు. ఐదు నిమిషాల్లో పంజగుట్ట నుంచి నాలుగువైపులా కిలోమీటర్‌కు పైగా వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ పోలీసులు పరుగెత్తుకొచ్చారు. విషయం ఆరా తీశారు. ఇద్దరికీ కౌన్సెలింగ్ చేసి పంపించారు. ఒక్క పంజగుట్ట చౌరస్తాలోనే ఇలాంటి రోడ్ రేజ్ సంఘటనలు నిత్యం పదికి పైగా ఉంటాయి. గ్రేటర్ హైదరాబాద్‌లోని 221 కూడళ్లలో వందల సంఖ్యలో చోటు చేసుకుంటున్నాయి. వాటిలో పోలీస్‌స్టేషన్ దాకా వెళ్లి కేసులు నమోదయ్యేవి అరుదు. ఈ ఏడాది అక్టోబర్ 30 నాటికి నగరంలో 970 దాడి కేసులు నమోదు కాగా...వాటిలో 25 శాతం రోడ్‌రేజ్ సంఘటనలే ఉన్నట్లు పోలీసులు చెప్పారు. వీటి వెనుక ఈగో, సామాజిక హోదాలే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. బీఎండబ్ల్యూ, ఆడి వంటి లగ్జరీ కార్లలో వెళ్లేవారు మిగతా వాహనదారులు తమకు దారి ఇవ్వాలని కోరుకుంటారు. వాహనదారులందరిలో ఉండే సహజమైన ఈగో అందుకు నిరాకరిస్తుంది. దాంతో గొడవలు జరుగుతాయి. ఇలా చేస్తుంటారు... ► రోడ్లపై జిగ్‌జాగ్ డ్రైవింగ్. ఎక్కువగా కట్లు కొట్టడం. ► ఓవర్టేక్ చేస్తూ తోటి వాహనదారులను ఇబ్బందులకు గురి చేస్తారు. ►అంతులేనివేగంతో తోటి వాహనదారులను అయోమయం, గందరగోళంలోకి నె ట్టివేస్తారు. ► అదే పనిగా హెడ్‌లైట్స్ డిప్ చేయడం. ► చేతులు గాల్లో ఊపుతూ తోటి వాహనదారులను టీజ్ చేయడం. ► అకారణంగా తోటి వాహనదారులను కొట్టడం, వాహనం వెనుక బంపర్లకు తాకించడం ► బిగ్గరగా అరవడం. తోటి వారితో అనవసరమైన వాదకు దిగి ఇబ్బంది పెట్టడం వంటివన్నీ రోడ్‌రేజ్ సృష్టించేవే... ► బస్‌స్టాపుల్లో ఆగాల్సిన సిటీ బస్సుల ను డ్రైవర్లు రోడ్డు మధ్యలోనే ఆపేస్తారు. ప్రయాణికులు ఎక్కేవరకు, దిగేవరకు బస్సు వెనుక వేల కొద్దీ వాహనాలు స్తంభించిపోతాయి. ► నగరంలో ఆటోల వల్ల కూడా ఈ సమస్య ఎదురవుతోంది. చాలా మంది ఆటోడ్రైవర్లు ఆకస్మాత్తుగా యూ టర్న్ తీసుకుంటారు. గల్లీలోంచి మెయిన్ రోడ్డు పైకి ప్రవేశించే వాహనదారులు ఏమాత్రం మర్యాద లేకుండా దూసుకొస్తారు. అప్పటికే ఒక స్థాయి వేగంతో మెయిన్ రోడ్డుపై వెళ్లే వాహనదారుడికి ఇది తీవ్ర ఇబ్బందికరం. అప్రమత్తంగా ఉండి బ్రేక్ వేస్తే సరి. లేదంటే ప్రమాదాలకు దారి తీస్తుంది. వాహనాల పెరుగుదలతో... నగరంలో ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న వాహనాలు, ఇరుకైపోతున్న రహదారులు, మరోవైపు మెట్రో రైలు పనులు, అడుగడుగునా స్తంభించిపోతున్న వాహనాలు వాహనదారుల్లో అసహనానికి కారణమవుతున్నాయి. నగరంలో కనీసం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీయాల్సిన వాహనాలు 17 నుంచి 20 కిలోమీటర్ల వేగాన్ని దాటి ముందుకు వెళ్లడం లేదు. ఏటా 1.75 లక్షల నుంచి 2 లక్షల వాహనాలు కొత్తగా వచ్చి చేరుతున్నాయి. నిత్యం 600 కొత్త వాహనాలు నమోదవుతున్నట్లు అంచనా.ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వాహనాల సంఖ్య 44 లక్షలకు చేరుకుంది. కానీ రోడ్లు మాత్రం 8 శాతమే ఉన్నాయి. చెన్నై నగరంలో ఒక కిలోమీటర్ పరిధిలో కేవలం 593 వాహనాలు ఉంటే హైదరాబాద్‌లో 723 ఉన్నాయి.పెరుగుతున్న వాహనాలకు తగిన మౌలిక సదుపాయాలు, రహదారులు లేకపోవడంతో వాహనదారుల అసహనం రోడ్‌రేజ్ కు దారి తీస్తోంది. నిత్య కృత్యం నగరంలో ప్రతి నిత్యం ఎక్కడో ఒక చోట ఇలాంటి ఘర్షణలు, గొడవలు, కొట్లాటలు తారసపడుతూనే ఉంటాయి. అడ్డగోలుగా రోడ్డు దాటడం, ట్రాఫిక్ నిబంధనలు పట్టించుకోకపోవడం, అదేపనిగా హారన్ మోగించడం, తోటి వాహనదారులకు ఇబ్బందులు కలిగించడం వంటివి ఘర్షణలకు తావిస్తున్నాయి. వాహనదారుల్లో ఏ ఒక్కరు సహనం పాటించినా అంతటితో పరిష్కారమయ్యే రోడ్‌రేజ్ .. ఆవేశంతో పెను తుపాన్‌గా మారుతోంది. ట్రాఫిక్ ఉల్లంఘనలపై ఉన్నట్లుగా రోడ్డు రేజ్‌పై ఎలాంటి చట్టాలూ లేవు. ఇది కేవలం వాహనదారుల ప్రవర్తనకు సంబంధించిన అంశం. అడుగడుగునా ‘రేజ్’... గత అక్టోబర్ 6న రక్షాపురం చౌరస్తా మీదుగా కారులో వెళ్తున్న ఒక న్యాయవాది రెడ్‌సిగ్నల్ పడడంతో వాహనాన్ని ఆపారు. ఆ వెన కాలేఇద్దరు యువకులు బైక్ పై వచ్చారు. గ్రీన్ సిగ్నల్ పడడంతో వాహనాలన్నీ ముందుకు కదిలాయి. న్యాయవాది కారు స్టార్ట్ కాకపోవడంతో అక్కడే నిలిచిపోయింది. దాని వెనుకే బైక్‌పైన ఉన్న ఆ ఇద్దరు తీవ్ర ఆవేశానికిలోనై న్యాయవాదిపై దాడికి పాల్పడ్డారు. అనంతరం ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. నవంబర్ 16వ ఓ సినీ నటుడి కుమారుడు ఔటర్ టోల్గేట్ వద్ద టోల్ ఫీజ్ కడుతుండగా... ఆయన వెనుక ఓఎమ్మెల్యే తన అనుచరులతో వచ్చి కారు నిలిపారు. అడ్డంగా ఉన్న కారు తీయాలని ఎమ్మెల్యే అనుచరులు గట్టిగా హారన్ కొట్టారు. యువకుడు వారిని సముదాయించే ప్రయత్నం చేశాడు. ‘మమ్మల్ని ప్రశ్నిస్తావా’ అంటూ ఇద్దరు ముగ్గురు కారు దిగి యువకుడిపై దాడి చేశారు. పహెలే ఆప్ అందాం... ఇలాంటి సమస్యల నివారణకు మర్యాద ఒక్కటే పరిష్కారం. వాహనదారులు ఒకరినొకరు గౌరవించుకోవాలి. ప్రతి ఒక్కరూ నిబంధనలకు అనుగుణంగా రోడ్లను వినియోగించుకొనే హక్కును కలిగి ఉన్నారనే స్పృహతో వాహనాలు నడపాలి. ఈ లక్ష్యంతోనే కేంద్రప్రభుత్వం గతేడాది దేశవ్యాప్తంగా ‘వెన్ యూ ఆర్ ఆన్ ద రోడ్...సే ‘పహెలే ఆప్’ అనే స్ఫూర్తిదాయకమైన నినాదాన్ని రహదారి భద్రతా ఉద్యమ ప్రచారంగా ముందుకు తెచ్చింది. వాహనదారులు పరస్పరంగౌరవించుకొనే విధంగా ‘ముందు మీరు వెళ్లండి’ అని చెప్పడం. మన తోటి వారు ముందు వెళ్లేందుకు అవకాశం ఇవ్వడం దీని ఉద్దేశం. లక్నో నగర ప్రజలు ఒకరినొకరు గౌరవించుకొనేందుకు తరచూ వాడేమాట ‘పహలే ఆప్’. దురుసుతనం వద్దు తోటి వాహనదారుల ప్రవర్తన దురుసుగా ఉండొచ్చు. కానీ మనలో అలాంటి మార్పు రాకుండా చూసుకోవాలి. డ్రైవింగ్ సమయంలో వాగ్వాదం మంచిది కాదు. తోటి వ్యక్తులు తప్పు చేసినా సరే ఆ సమయంలో కొద్ది సేపు మౌనంగా ఉండి, లేదా మీ వాహనాన్ని పక్కకు ఆపుకొని మీలో ఆవేశం, కోపం తగ్గాక తిరిగి ముందుకు వెళ్లండి. ఒత్తిడి, మనస్తాపం, చికాకు వల్ల ఆరోగ్యం దెబ్బ తింటుంది. తద్వారా ప్రమాదాలకు దారి తీస్తుంది. - పుప్పాల శ్రీనివాస్, మోటారు వాహన తనిఖీ అధికారి, రహదారి భద్రతా నిపుణులు సహనం కోల్పోవద్దు రోడ్లపై ప్రమాదాలు జరిగే సమయంలో వాహనదారులు సహనం కోల్పోతున్నారు. దీనివల్ల ట్రాఫిక్ స్తంభించిపోయి తోటి వాహనదారులకు ఇబ్బందులు కలుగుతుంటాయి. ఎవరూ ఉద్దేశపూర్వకంగా ప్రమాదాలు చేయరన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. క్షణికావేశానికి లోనుకాకుండా సంయమనం పాటించాలి. - సాలం, వాహనదారుడు. పహాడీషరీఫ్ ఓపిక అవసరం చిన్న ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులను ఆస్పత్రులకు తరలించి... ప్రమాదానికి కారణమైన వారిని పోలీసులకు అప్పగించాలి. ముఖ్యంగా ట్రాఫిక్ స్తంభించకుండా చూడాలి. ప్రతి చిన్న ప్రమాదాన్నీ పెద్దదిగా చేసి తోటి వారిని ఇబ్బందులకు గురి చేయడం సరైన పద్దతి కాదు. - ఫయీం, వాహనదారుడు. -
విజయవాడ టీడీపీలో విభేదాలు!
-
నేడు ప్రాథమిక ఉపాధ్యాయ సంఘాల విలీనం
సాక్షి, హైదరాబాద్: వివాదాలు, కోర్టు కేసులు, ఆధిపత్య పోరు మూలంగా పదేళ్ల క్రితం విడిపోయిన ప్రాథమిక ఉపాధ్యాయ సంఘాలను మళ్లీ ఏకం చేసి కొత్త సంఘా న్ని ఏర్పాటు చేస్తున్నామని రెండు గ్రూపుల నేతలు టి.వై.ఎస్. శర్మ, టి.సాయిబాబ, షౌకత్ అలీ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రెండు సంఘాలను ఏకం చేసి తెలంగాణ రాష్ట్ర ప్రాథమిక ఉపాధ్యాయుల సంఘాన్ని(టీఎస్పీటీఏ) ఏర్పాటు చేస్తున్నామన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో ని ఎస్సీఈఆర్టీలో సమావేశమై సంఘాల విలీనంతో పాటు టీఎస్పీటీఏ కొత్తకార్యవర్గాన్ని ప్రకటిస్తామని వెల్లడించారు. -
ఆస్తి రాయలేదని భర్త అంతు చూడబోయింది..
పిఠాపురం : దశాబ్దాల తరబడి కష్టసుఖాలను కలిసి పంచుకున్న భర్తపైనే.. ఆస్తి రాయడం లేదన్న కసితో నడిరోడ్డుపైనే కత్తి దూసిందో మహిళ. ఆమె ఘాతుకానికి గాయపడ్డ ఆ వృద్ధుడు ఆస్పత్రిలో కోలుకుంటుండగా ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం మండలం వెల్దుర్తిలో బుధవారం జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. వెల్దుర్తి ఎస్సీ పేటకు చెందిన 60 ఏళ్ల దేవారపు లాజర్, 55 ఏళ్ల నూకాలమ్మ దంపతులకు కుమార్తె, ఇద్దరు కొడుకులు ఉన్నారు. లాజర్ పేరిట కొంత పొలం, ఇల్లు ఉండగా రూ.వెయ్యి పింఛను అందుకుంటున్నాడు. ఆస్తి బిడ్డలకు ఇచ్చేస్తే, తన బాగోగులు చూసే వారుండరంటున్న నూకాలమ్మ కొంతకాలంగా ఆస్తిని తన పేరిట రాయమని భర్తతో గొడవపడుతోంది. భార్యాభర్తల మధ్య రాజీకి మంగళవారం పెద్దలు పంచాయితీ నిర్వహిస్తుండగా నూకాలమ్మ మధ్యలోనే వెళ్లిపోయింది. బుధవారం లాజర్ మరో వ్యక్తితో కలిసి టీ తాగేందుకు ఊరి సెంటర్లోకి వెళ్లాడు. భర్తను వెన్నాడుతూ వచ్చిన నూకాలమ్మ వెనుక నుంచి మెడ మీద నరికేందుకు కత్తి దూసింది. పసిగట్టిన లాజర్ కుడిచెయ్యి అడ్డం పెట్టుకుని తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని తొలుత పిఠాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన రూరల్ ఎస్సై మురళీమోహన్ నిందితురాలిని గురువారం కోర్టులో హాజరు పరుస్తామని చెప్పారు. -
మా బుజ్జిగాడూ... దేవుడు మెచ్చే నా అబద్ధాలు!!
మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.) కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తి విషయంలో చికాకులు తొలగుతాయి. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగస్తులకు అనుకూల మార్పులు. రాజకీయరంగం వారికి ఒత్తిడులు తొలగుతాయి. వారం మధ్యలో వివాదాలు. తీర్థయాత్రలు. వృషభం (కృత్తిక 2,3,4పా, రోిహ ణి, మృగశిర 1,2పా.) యుక్తితో సమస్యలు పరిష్కరించుకుంటారు. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. వివాహయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగస్తులకు పైస్థాయి వారినుంచి ప్రశంసలు అందుతాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. మిథునం (మృగశిర 3,4పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.) పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. బాధ్యతల సమర్థవంత నిర్వహణకు ప్రశంసలు పొందుతారు. జీవితాశయం నెరవేరుతుంది. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు నూతనోత్సాహం. కళారంగం వారికి కొత్త అవకాశాలు. వారం చివరిలో ఆస్తి వివాదాలు. కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) బంధువుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు మందగిస్తాయి. పనులు శ్రమానంతరం పూర్తి. ఇరుగు పొరుగుతో సఖ్యత. ఆరోగ్యపరంగా చికాకులు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది. పారిశ్రామికవర్గాలకు అరుదైన ఆహ్వానాలు. వారం మధ్యలో అనుకోని ప్రయాణాలు. సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.) కొన్ని పనులు నత్తనడకన సాగుతాయి. బంధువులతో మాటపట్టింపులు. విద్యార్థులకు ఫలితాలు సంతృప్తినిస్తాయి. ఇంటి నిర్మాణయత్నాలలో కదలికలు. రావలసిన సొమ్ము అందుతుంది. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు. ఉద్యోగులు బాధ్యతలపై మరింత శ్రద్ధ వహించాలి. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనల్లో మార్పులు. వారం వాహనయోగం. కన్య (ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త1,2పా.,) కొత్త వ్యక్తుల పరిచయం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాల సర్దుబాటు. విద్యార్థులకు కోరుకున్న విద్యావకాశాలు. ఇంటాబయటా అనుకూలం. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు. పారిశ్రామికవర్గాలకు అనుకోని ఆహ్వానాలు. వారం మధ్యలో ఆస్తి వివాదాలు. అనారోగ్యం. తుల (చిత్త 3,4పా, స్వాతి, విశాఖ1,2,3పా.) ఆర్థిక పరిస్థితి ఆశాజనకం. మిత్రులు, బంధువులతో వివాదాలు తీరతాయి. సేవలకు తగిన గుర్తింపు. సమస్యలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు అనుకున్న విధంగా లాభిస్తాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు. రాజకీయవర్గాలకు పదవులు. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. వ్యయప్రయాసలు. వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ) కొత్త పనులు ప్రారంభిస్తారు. గౌరవమర్యాదలు పొందుతారు. జీవిత భాగస్వామితో వివాదాల పరిష్కారం. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. వాహనయోగం. వ్యాపార విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన వార్తలు. కళారంగం వారికి సన్మానాలు. వారం మధ్యలో ఆరోగ్యభంగం. ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా.) బంధువులతో వివాదాలు తీరతాయి. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. వ్యాపారాలు అనుకున్న విధంగా లాభిస్తాయి. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో అనారోగ్యం. మకరం (ఉత్తరాషాఢ 2,3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1,2పా.) ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. పనుల్లో జాప్యం. బంధువులతో అకారణంగా వివాదాలు. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. నిర్ణయాలలో తొందరవద్దు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. రాజకీయవర్గాలకు నిరుత్సాహం. వారం మధ్యలో స్వల్ప ధనలాభం. కుంభం (ధనిష్ట 3,4పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా.) ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వాక్చాతుర్యంతో అందర్నీ ఆకట్టుకుంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు. కళారంగం వారికి సన్మానాలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. దూరప్రయాణాలు. మీనం (పూర్వాభాద్ర 4పా., ఉత్తరాభాద్ర, రేవతి) బంధువుల నుంచి శుభవార్తలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహాన్నిస్తాయి. విద్యార్థులు ప్రతిభను చాటుకుంటారు. వాహనయోగం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగస్తులకు ఉత్సాహవంతం. కళారంగం వారికి సన్మానాలు. వారం మధ్యలో అనుకోని ప్రయాణాలు. -
ఏపీ సర్కార్ లో బదలీల రచ్చ
-
విద్యాశాఖ అంటేనే.. జ్వరమొస్తోంది!
దీర్ఘ సెలవులో వెళ్లిన పాఠశాల విద్య డెరైక్టర్ ఉషారాణి తప్పుకుంటానంటున్న ఇంటర్ బోర్డు కార్యదర్శి రాంశంకర్ అధికారుల్లో గుబులు పుట్టిస్తున్న ఇరు రాష్ట్రాల వివాదాలు ఏ నిర్ణయం తీసుకుంటే ఏ మవుతుందోననే ఆందోళన కీలక నిర్ణయాలకు దూరంగా ఉంటున్న ఉన్నతాధికారులు వార్షిక పరీక్షలు ముంచుకొస్తున్న తరుణంలో ఇదీ దుస్థితి బెంబేలెత్తుతున్న ఉన్నతాధికారులు కేంద్రానికి వెళ్లే యోచనలో ముఖ్యకార్యదర్శి నీలం సహానీ హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో విద్యాశాఖలో పనిచేయడానికి ఉన్నతాధికారులు బెంబేలెత్తిపోతున్నారు. ఆ శాఖలో బాధ్యతలు నిర్వర్తిస్తు న్న అధికారులు ఏదో ఒక కారణం చూపి అక్కడి నుంచి బయటపడాలన్న భావనలోనే ఉంటున్నా రు. రాష్ట్ర విభజన చట్టం పదో షెడ్యూల్లో ఉన్న ఉన్నత విద్యా వ్యవహారాలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య తరచూ వివాదాలు తలెత్తుతుండడంతో అధికారులు ఆయా నిర్ణయాల నుంచి సాధ్యమైనంతమేర దూరంగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. తాము ఎందుకు ఇరకాటంలో పడాలని ఆయా శాఖల నుంచి బయటకు వెళ్లేందుకే మొగ్గుచూపుతున్నారు. కేంద్రానికి వెళ్లిపోయే యోచనలో సహానీలు... ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి నీలం సహానీ రాష్ట్ర సర్వీసుల నుంచి కేంద్ర సర్వీసులకు వెళ్లాలని భావిస్తున్నారు. స్త్రీ శిశుసంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్న నీలం సహానీ.. ఉన్నత విద్యాశాఖ బాధ్యతలు అదనంగా చూస్తున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య విద్యా శాఖ వ్యవహారాలు తరచూ వివాదాలుగా మారుతుండడంతో ఏ నిర్ణయాన్నీ తీసుకోలేకపోతున్నారు. ఇటీవల ఇరు రాష్ట్రాల విద్యాశాఖ మంత్రుల సమావేశంలో నీలం సహానీ ఏపీ వాదనను గట్టిగా విని పించారు. ఇంటర్మీడియట్ పరీక్షలు, ఎంసెట్ వేర్వేరుగా నిర్వహించడం సాధ్యం కాదని తేల్చి చెప్పడంతో ఒక దశలో తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి సహానీపై అసహనం వ్యక్తంచేశారు. ఇరు రాష్ట్రాల మధ్య వివాదం అలాగే కొనసాగుతున్న తరుణంలో విద్యాశాఖ బాధ్యతల నుంచి ఎంత త్వరగా తప్పుకుంటే అంత మంచి దన్న అభిప్రాయంతో ఆమె ఉన్నట్లు పేర్కొంటున్నారు. తెలంగాణకు కేటాయించిన ఈమె భర్త అజయ్ సహానీతో పాటు కేంద్ర సర్వీసులకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. బయటపడే యోచనలో ఇంటర్‌బోర్డు కార్యదర్శి ఇంటర్ బోర్డు కార్యదర్శిగా ఉన్న రాంశంకర్‌నాయక్ తనను బాధ్యతల నుంచి తప్పించాలని కొంతకాలంగా ప్రభుత్వాన్ని వేడుకొంటున్నారు. ఇంటర్ బోర్డు వ్యవహారాలు రెండు రాష్ట్రాల మధ్య గందరగోళంగా మారడం, ఏ నిర్ణయం తీసుకున్నా బోర్డు ఉమ్మడిగా ఉన్న పరిస్థితుల్లో ఆయా వర్గాల నుంచి వ్యతిరేకత వస్తుండడంతో త్వరగా బయటపడాలని ఆయన భావిస్తున్నా రు. ఐఏఎస్‌ల విభజనలో ఆయన ఏపీకే కేటాయింపయ్యారు. అధికారికంగా ఆ జాబితా అమల్లోకి వస్తే తనకు ఇక్కడి నుంచి మోక్షం కలుగుతుందని ఆయన అభిప్రాయపడుతున్నారు. విద్యాశాఖ డెరైక్టర్ సెలవు... పాఠశాల విద్యాశాఖలోనూ అధికారుల పరిస్థితి ఇలాగే ఉంది. పాఠశాల విద్యాశాఖ డైరక్టర్ ఉషారాణి ఇప్పటికే సెలవుపై వెళ్లారు. ఆరోగ్యం బాగోలేని కారణం చూపి ఆమె ఎక్కువ రోజులు సెలవుపై వెళ్లారు. అయితే.. విద్యాశాఖలో ఉన్నతస్థాయి అధికారుల మధ్య తలెత్తిన వివాదాల నేపథ్యంలోనే ఉషారాణి సెలవు పెట్టి వెళ్లినట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం పాఠశాల విద్యాశాఖ బాధ్యతలను కూడా ఇంట ర్ బోర్డు కార్యదర్శి రాంశంకర్కే అప్పగించారు. అంటీముట్టనట్లు ఉంటున్న అధర్‌సిన్హా... ప్రాధమిక, ఇంటర్ విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్న అధర్‌సిన్హా ఇంటర్మీడియట్ కమిషనర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ఐఏఎస్‌ల విభజనలో ఆయన తెలంగాణకు కేటాయింపు అయ్యారు. దీంతో గత కొంత కాలంగా ఆయన ఈ శాఖ తరఫున నిర్ణయాల్లో ఎలాంటి చొరవ చూపడం లేదన్న విమర్శలున్నాయి. రానున్న రోజుల్లో తెలంగాణలో పనిచేయాల్సి ఉంటుందన్న అభిప్రాయంతోనో ఏమో కానీ ఆయన శాఖ వ్యవహారాల్లో అంటీముట్టనట్లుగా ఉంటున్నారు. వివాదాస్పదంగా ఉన ్న ఇంటర్మీడియట్ విషయంలో అయితే మరీ దూరంగా ఉంటున్నారని ఆ శాఖవర్గాలే పేర్కొంటున్నాయి.ఓ పక్క పదో తరగతి, ఇంటర్మీడియట్ తదితర పబ్లిక్ పరీక్షల ఏర్పాట్లు చురుగ్గా సాగాల్సిన తరుణంలో విద్యా శాఖా ఉన్నతాధికారుల వ్యవ హారం చర్చనీయాంశంగా మారుతోంది. -
అమ్మోరికి విభజన సెగ
జంగారెడ్డిగూడెం :గిరిజనుల ఆరాధ్య దేవతగా వెలుగొందుతున్న గుబ్బల మంగమ్మ ఆలయం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదాలకు కేంద్ర బిందువైంది. దట్టమైన అటవీ ప్రాంతం మధ్య కొలువై పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకర్షిస్తున్న ఈ ఆలయం వాస్తవానికి మన జిల్లాలోని బుట్టాయగూడెం మండల పరిధిలో ఉంది. గతంలో అమ్మవారి పాత ఆలయం ఖమ్మం జిల్లా పరిధిలో ఉండేది. అది శిథిలం కావడంతో పశ్చిమగోదావరి జిల్లా పరిధిలో కొత్త ఆలయం నిర్మించారు. ఈ ప్రాంతం పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోనే ఉన్నా.. అమ్మవారు మాత్రం ఖమ్మం జిల్లాకు చెందిన వారని, అందువల్ల ఆలయం తమకే చెందుతుందని ఖమ్మం జిల్లాకు చెందిన గిరిజనులు వాదిస్తున్నారు. కొండరెడ్డి గిరిజనులు, కోయ తెగకు చెందిన గిరిజనుల మధ్య పొడసూపిన ఈ వివాదం ముదిరి రెండు రాష్ట్రాల మధ్య సమస్యగా మారింది. వివాదం ఇలా మొదలైంది గుబ్బల మంగమ్మ గుడి నిర్వహణలో విషయమై తలెత్తిన వివాదం గిరిపుత్రులైన కొండరెడ్లు, కోయ తెగల మధ్య చిచ్చు రగులుస్తోంది. దట్టమైన అటవీ ప్రాంతంలో స్వయం వ్యక్తంగా వెలసినగుబ్బల మంగమ్మను గిరిజనులు ఆరాధ్య దైవంగా కొలుస్తున్నారు. కోరిన కోర్కెలు తీర్చే కల్పతల్లిగా, వరాలిచ్చే అమ్మగా పేరుండటంతో ఆలయానికి మైదాన ప్రాంతాల నుంచి సైతం వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. ప్రకృతి ప్రేమికులు, పర్యాటకుల తాకిడి సైతం పెరుగుతోంది. ఇదే స్థారుులో ఆలయూనికొచ్చే ఆదాయం సైతం భారీగా పెరిగింది. ఈ మొత్తాన్ని ఆలయ నిర్వహణతోపాటు బుట్టాయగూడెం మండలం కామవరం, మోతుగూడెం, పందిరి మామిడిగూడెం గ్రామాలకు చెందిన కొండరెడ్లు ఆ గ్రామాల అభివృద్ధికి వెచ్చిస్తున్నారు. ఇందుకోసం ఆలయ అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేశారు. ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండల పరిధిలోని గోగులపూడి, కన్నాయిగూడెం గిరిజనులు సైతం ఆలయ ఆదాయంలో సమాన వాటా పొందుతూ గ్రామాల అభివృద్ధికి వినియోగించేవారు. ఇదిలావుండగా, 1996లో ఆలయూన్ని దేవాదాయ శాఖకు అప్పగిస్తూ అప్పటి ప్రభుత్వం జీవో జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయూన్ని గిరిజనులు తీవ్రంగా వ్యతిరేకించడంతో దేవాదాయ శాఖ వెనక్కి తగ్గింది. అప్పటినుంచి ఆలయం అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలోనే ఉంది. ఆలయ ఆదాయూన్ని పాత పద్ధతిలోనే ధూపదీప నైవేద్యాలతోపాటు ఆ గ్రామాల అభివృద్ధికి వినియోగిస్తూ వస్తున్నారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోగా, తెలంగాణ రాష్ట్ర పరిధిలోని అశ్వారావుపేట మండలం గోగులపూడి, కన్నాయిగూడెం గ్రామాలకు ఇస్తున్నట్టుగానే తమ గ్రామాలకూ ఆల య ఆదాయంలో సమాన వాటా ఇవ్వాలంటూ అదే మండలంలోని రామచంద్రపురం, వేపులపాడు గ్రామస్తులు పట్టుబడుతున్నారు. దీంతో అశ్వారావుపేట మండల పరిధిలోని గిరిజనులకు, బుట్టాయగూడెం మండల పరిధిలోని గిరిజనులకు మధ్య వివాదాలు మొదలయ్యూయి. రెండు ప్రాంతాల గిరి జనులు కొట్లాటలకు దిగి పోలీసు కేసులు పెట్టుకునే స్థారుుకి విభేదాలు పెరిగారుు. దీంతో అశ్వారావుపేట, బుట్టాయగూడెం మండలాలకు చెందిన పోలీ సులు, అటవీ శాఖ అధికారులు గిరిజనులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆలయ సరిహద్దు ఏ ప్రాంతానికి చెందుతుందో కచ్చితంగా చెప్పాలని అశ్వారావుపేట మండలం కన్నాయిగూడెం, రామచంద్రపురం గ్రామాల గిరిజనులు పట్టుబట్టారు. దీంతో భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు పశ్చిమగోదావరి జిల్లా ఐటీడీఏ అధికారులతో ఇటీవల చర్చలు జరిపారు. అమ్మవారి ఆలయం ఖమ్మం జిల్లాకే చెందుతుందంటూ అక్కడి అధికారులు కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. దీంతో ఇప్పటివరకూ గిరిజనులకే పరిమితమైన ఈ సమస్య కాస్తా ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదంగా మారింది. ఆ ప్రాంతమంతా ‘పశ్చిమ’దే వివాదాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కె.భాస్కర్ ఆధ్వర్యంలో అధికారులు సమావేశమై చర్చించగా, ప్రస్తు తం ఉన్న ఆలయంతోపాటు, అమ్మవారి పాత ఆల యం కూడా పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోనే ఉన్నట్టు తేలింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో అశ్వారావుపేట మండల పరిధిలోని అటవీ ప్రాంతమంతా పశ్చిమగోదావరి జిల్లాలో విలీనమైందనే విషయూన్ని అటవీ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఈ దృష్ట్యా జిల్లా పరిధిలో ఉన్న కొత్త ఆలయంతోపాటు శిథిల మైన పాత ఆలయం కూడా మనకే చెందుతుందని రూఢీ చేశారు. ఇందుకు ఖమ్మం జిల్లా అధికారులు ససేమిరా అంటున్నారు. రెండు రాష్ట్రాల మధ్య చర్చల ప్రక్రియ ఇంకా కొలిక్కి రాలేదు. దీంతో భక్తులు అధికంగా వచ్చే ప్రతి మంగళవారం, ఆది వారం రోజుల్లో గుబ్బల మంగమ్మ ఆలయం వద్ద వివాదాలు, ఘర్షణలు చోటుచేసుకుంటున్నారుు. ప్రస్తుత కార్తీక మాసంలో అమ్మవారిని దర్శించుకునేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్దఎత్తున వస్తున్నారు. ఈ వివాదానికి వెంటనే పరిష్కారం దొరక్కపోతే ముదిరి పాకాన పడుతుందని, ఆంధ్రా, తెలంగాణ ప్రజల మధ్య చిచ్చు రగిల్చే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. -
మహారాష్ట్ర కాంగ్రెస్‌లో అసమ్మతి
న్యూఢిల్లీ: అసలే లోక్‌సభ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయి కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీని కొత్త సమస్యలు చుట్టుముడుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో అసమ్మతి సెగలు భగ్గుమంటున్నాయి. తాజాగా మహారాష్ట్రలో కాంగ్రెస్ నాయకుల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌ను తప్పించాలని మరో సీనియర్ నేత నారాయణ్ రాణే డిమాండ్ చేస్తున్నారు. లేకుంటు కేబినెట్ నుంచి వైదొలగుతానని హెచ్చరించాడు. దీంతో ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ జోక్యం చేసుకుని మహారాష్ట్ర సీఎంతో చర్చిస్తున్నారు. ఇక తెలంగాణలో పీసీసీ చీఫ్‌ను మార్చాలని సీనియర్ నేత వీ హనుమంతరావు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. మరి కొన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. -
హోర్డింగ్‌లతో ఆదాయం..
ఫిక్స్డ్ డిపాజిట్లు, స్టాక్ మార్కెట్లు లాంటివే కాకుండా చిన్న ఇన్వెస్టర్ల కోసం కొంగొత్త ఆదాయ మార్గాలు వస్తున్నాయి. ఇలాంటివే హోర్డింగ్‌లు, బిల్‌బోర్డులు వంటివి. కొన్ని చోట్ల హోర్డింగ్‌లను తొలగించాలంటూ వివాదాలు ఉన్నా నోయిడా, ముంబైలాంటి ప్రాంతాల్లో హోర్డింగ్‌లపై ఇన్వెస్ట్మెంటు ట్రెండు ఊపందుకుంటోంది. ఏరియా, ప్రకటనలను బట్టి సుమారు పది లక్షల రూపాయలు పెట్టి తీసుకున్న బిల్‌బోర్డ్స్ నెలకు దాదాపు రెండు లక్షల దాకా ఆదాయాన్ని అందిస్తున్నాయి. దీంతో చిన్న ఇన్వెస్టర్లు వీటిపై కూడా ఆసక్తి చూపిస్తున్నారు. సాధారణంగా ప్రభుత్వ రంగ సంస్థలవయితే బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొనే తీసుకోవాల్సి ఉంటుంది. అదే ప్రైవేట్ మాల్స్, బిల్డింగ్స్ వంటి వాటి లోనైతే ఆయా భవంతుల యజమానులతో ఇన్వెస్టర్లు ఒప్పందాలు కుదుర్చుకుని సదరు హోర్డింగ్‌లను అద్దెకు తీసుకోవచ్చు. ఆ తర్వాత అడ్వరై ్టజింగ్ ఏజె న్సీల సహాయంతో కస్టమర్లను సాధించుకోవచ్చు. ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయాన్ని అందుకునే ఇన్వెస్టర్లు హోర్డింగ్‌కి సంబంధించిన అద్దెలు, పన్నులు కట్టుకోవాల్సి ఉంటుంది. ప్రైవేట్ వాటితో పోలిస్తే ప్రభుత్వ విభాగాల అసెట్స్‌పై మెరుగైన రాబడులు అందుకోవ చ్చు. చాలా మటుకు ఇవి తక్కువ రేటుకి లభిస్తాయి..వచ్చే ఆదాయాలు మాత్రం ప్రాంతాన్ని బట్టి భారీగా ఉంటాయి. సందర్భాన్ని బట్టి కొన్ని సార్లు నెలకు అద్దె రూ. 5,000 రేంజిలో ఉంటే.. ప్రకటనల ద్వారా రూ. 50,000 దాకా కూడా ఆర్జించవచ్చనేది అడ్వరై ్టజ్మెంట్ రంగ సంస్థల మాట. -
ఈ సమయంలో వివాదాలొద్దు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ కీలకదశకు చేరుకున్న ప్రస్తుత తరుణంలో వివాదాలు ఉద్యమానికి మంచిది కాదని, భవిష్యత్తులో ఇలాంటివి జరుగకుండా అందరం కలిసి పనిచేద్దామని తెలంగాణ రాజకీయ జేఏసీ, విద్యార్థి జేఏసీ నేతలు నిర్ణయించారు. సకల జనభేరి సందర్భంగా రాజకీయ జేఏసీ కో చైర్మన్ వి.శ్రీనివాస్‌గౌడ్, విద్యార్థి జేఏసీ నేతల మధ్య తలెత్తిన విభేదాలకు ముగింపు పలికారు. టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు నివాసంలో రెండు జేఏసీల నేతలు బుధవారం సమావేశమయ్యారు. రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం, ముఖ్యనేతలు సి.విఠల్, వి.శ్రీనివాస్‌గౌడ్, అద్దంకి దయాకర్, కారెం రవీందర్‌రెడ్డి, టీఆర్ఎస్ నేతలు బి.వినోద్‌కుమార్, బాల్క సుమన్, ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం, విద్యార్థి జేఏసీ నేతలు పిడమర్తి రవి, మధు తదితరులు చర్చల్లో పాల్గొన్నారు. ‘సకల జనభేరిలో విద్యార్థులను నిర్లక్ష్యం చేశారు. ఐదున్నర గంటలపాటు సభ జరిగితే 10 నిమిషాలైనా విద్యార్థులను మాట్లాడించే సమయంలేదా? పత్తా లేనివారెందరో సకల జనభేరిలో పెత్తనం చేశారు. విద్యార్థి నేతలను పిలిచి మాట్లాడిస్తామని చెప్పి అవమానించారు. దీనికి సమాధానం చెప్పకుండా శ్రీనివాస్‌గౌడ్ ఎలా బెదిరిస్తారు’ అని విద్యార్థి జేఏసీ నేతలు ఈ సందర్భంగా నిలదీశారు. దీనిపై రాజకీయ జేఏసీ నేతలు స్పందిస్తూ ‘‘సకల జనభేరిలో విద్యార్థులను మాట్లాడించకపోవడం బాధాకరమే. సభలోనూ, సభ తర్వాత జరిగిన పరిణామాలు కూడా బాధాకరం. ఇవి జరిగి ఉండాల్సినవి కావు. తెలంగాణ బిల్లు పార్లమెంటులోకి రాబోయే తరుణంలో ఉద్యమ శక్తుల మధ్య విభేదాలు ఎవరికీ మంచిది కాదు. ఈ వివాదాన్ని ఇంతటితో వదిలేద్దాం. భవిష్యత్తులో ఇలాంటి దురదృష్టకర పరిణామాలు జరగకుండా సమన్వయం చేసుకుందాం’’ అని ప్రతిపాదించారు. మిగిలిన రాజకీయ జేఏసీ, టీఆర్ఎస్, ప్రజాసంఘాల జేఏసీ నేతలు కూడా విద్యార్థులను సముదాయించారు. దీంతో విద్యార్థులు, శ్రీనివాస్‌గౌడ్ పరస్పరం ఆలింగనం చేసుకుని సమస్యను ఇంతటితో వదిలేద్దామని నిర్ణయించారు. అనంతరం పలువురు నేతలు విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమానికి విద్యార్థులే ఊపిరి అని, భవిష్యత్తులోనూ విద్యార్థుల పోరాటాలు, నిబద్ధత ఉద్యమానికి చాలా అవసరమని కేశవరావు, బి.వినోద్ అన్నారు. భవిష్యత్తులో అన్ని జేఏసీలతో కలసి పనిచేస్తామని, హైదరాబాద్‌లో వైఎస్సార్సీపీ సమైక్య సభను అడ్డుకుంటామని పిడమర్తి రవి చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ సభకు అనుమతిని ఇస్తే ఉద్యోగులంతా సహాయ నిరాకరణకు దిగుతామని శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. హైదరాబాద్‌లో సభను పెడతామంటే యుద్ధం జరిగి తీరుతుందని గజ్జెల కాంతం చెప్పారు.