పరువు గాలికి | Up to date with Suspension controller of examinations | Sakshi
Sakshi News home page

పరువు గాలికి

Published Mon, Jan 5 2015 3:29 AM | Last Updated on Sat, Sep 2 2017 7:13 PM

పరువు గాలికి

పరువు గాలికి

దేశానికి మేధావులు, ఇంజినీర్లు, నాయకులు, మానవ వనరులను అందించాల్సిన వర్సిటీలు పక్కదారి పడుతున్నాయి. కొందరు అధ్యాపకుల వ్యవహారంతో తెలంగాణ యూనివర్సిటీ పరువు బజారుకెక్కుతోంది. నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ గిరిరాజ్ కళాశాలలో 2006లో తెలంగాణ యూనివర్సిటీ ప్రారంభమైంది. అనంతరం డిచ్‌పల్లి శివారులో 577 ఎకరాల స్వస్థలంలోకి మారింది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2009 జనవరి 31న దీనిని ప్రారంభించారు.
 
వివాదాలకు నిలయంగా మారిన తెయూ
వెల్లువెత్తిన ‘అక్రమాల’ ఆరోపణలు
నిధుల వినియోగంపైనా విమర్శలు
పీహెచ్‌డీ ప్రవేశాలూ వివాదాస్పదం
తాజాగా పరీక్షల నియంత్రణాధికారి సస్పెన్షన్
తరచూ మారుతున్న పాలనాధికారులు
ఆవేదన చెందుతున్న విద్యాభిమానులు

 తెయూ (డిచ్‌పల్లి): ప్రారంభించినప్పటి నుంచి తెలంగాణ యూనివర్సిటీ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. తొలి వీసీ కాశీ రాం హయాంలో జరిగిన ఉద్యోగ నియామకాలు జిల్లాకు చెందిన పెద్ద నాయకుని కనుసన్నలలో జరిగినట్లు విద్యార్థి సంఘా లు ఆరోపించాయి. అనంతరం 15 జూలై 2011న తెయూ వీసీగా ప్రొఫెసర్ అక్బర్ అలీఖాన్ ను ప్రభుత్వం నియమించింది. ఆయనపైనా పలు విమర్శలు వెల్లువెత్తాయి.

యూనివర్సిటీ అవుట్‌సోర్సింగ్ ఏజెన్సీ కాంట్రాక్టులకు సంబంధిం చి పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారి నట్లు ఆరోపణలు వచ్చాయి. అవసరానికి మించి మూడున్నర లక్షల జవాబు పత్రాల ను ముద్రింపజేసిన ఘటనలో రూ. పది లక్షలు చే తులు మారినట్లు నిందలు మోయాల్సి వచ్చింది. కేవలం ఆరు నెలల కాలంలో వీసీ తన వా హనంపై రూ.1.80 లక్షలు ఖర్చు చూపించడంపై విద్యార్థి సంఘాలు గవర్నర్‌కు ఫిర్యా దు చేయగా, ఆయన దీనిపై వివరణ కోరా రు.

12బి మంజూరు కోసం తెయూను పరి శీలించేందుకు యూజీసీ బృంద సభ్యులు సందర్శించినప్పుడు రసాయనాల పేరిట రూ.ఎనిమిది లక్షలు, ఇతర ఖర్చుల పేరిట రూ. రెండు లక్షలు ఖర్చు చూపించడం వివాదాస్పదంగా మారింది. పదవీకాలం ముగింపు దశలో యూనివర్సిటీ ఆర్చ్ (స్వాగత తోర ణం/ప్రధాన గేటు) నిర్మాణానికి రూ. 50 లక్షలు ఖర్చు చేయడం వర్సిటీ వర్గాలలో చర్చనీయాంశమైంది. బాలుర వసతి గృహంలో గదులు సరిపోక విద్యార్థులు ఇబ్బం దులు పడుతున్నా, అదనపు గదులు నిర్మాణంపై దృష్టి సారించని వీసీ, కేవలం ఆర్చ్‌కు రూ. 50 లక్షలు ఖర్చు చేయడం విమర్శలకు దారి తీసింది.
 
వీసీ పదవి కాలంలో మారిన ఐదుగురు రిజిస్ట్రార్లు
వీసీగా ప్రొఫెసర్ అక్బర్ అలీఖాన్ పని చేసిన రెండు సంవత్సరాల కాలంలో ఐదుగురు రిజిస్ట్రార్లు మారారు. ఆయన భాధ్యతలు స్వీకరించిన సమయంలో రిజిస్ట్రార్‌గా ఉన్న ప్రొఫెసర్ శివశంకర్ సెప్టెంబర్ 2011లో పదవి నుంచి తప్పుకున్నారు. అనంతరం కొద్ది కాలం ప్రొఫెసర్ యాదగిరి ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌గా పని చేశారు.

ఆ తరువా త ఉస్మానియా యూనివర్సిటీ కెమిస్ట్రీ విభాగం అధ్యాపకుడు ఎన్.అశోక్‌ను రిజిస్ట్రార్‌గా 2012 మార్చ్ 12న ప్రభుత్వం నియమించింది. ఏడాది తర్వాత రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్ లింబాద్రి నియమితులయ్యారు. సంవత్స రం తర్వాత ఆయన పదవీకాలం ముగిసింది. వెంటనే ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్ ధర్మరాజును నియమించారు. ఇలా రెండు సంవత్సరాల కాలంలో ఐదుగురు రిజిస్ట్రార్లు మారారు.
 
తీరు మార్చుకోని అధికారులు
తెలంగాణ యూనివర్సిటీలో పీహెచ్‌డీ కోర్సు ప్రారంభమైననాటి నుంచి అడ్మిషన్ల ప్రక్రియ వివాదాస్పదంగా మారుతూనే ఉంది. తొలిసారి అడ్మిషన్ల సమయంలో రెండు సార్లు ఫలితాలు విడుదల చేయడంపై ఆరోపణలు వెల్లువెత్తా యి. వర్సిటీ అధికారులు తమ తీరు మార్చుకోకుండా ఈసారి కూడా రెండు సార్లు జాబితా మార్చారు. అనర్హులకు ప్రవేశాలు కల్పిండానికే కటాప్ మార్కులు తగ్గించి అర్హులకు అన్యాయం చేశారని ఉన్నత విద్యామండలికి ఫిర్యాదులు అందాయి. తెలుగు పీహెచ్‌డీ ప్రవేశాలలో అక్రమాలు జరిగినట్లు నిర్థారణ కావడంతో ఇద్దరు అధ్యాపకులకు ఇన్‌చార్జి వీసీ శైలజా రామయ్యర్ చార్జి మెమోలు జారీ చేశారు.
 
నియామకాలలో అక్రమాలు
అక్బర్‌అలీఖాన్ హయాంలో చేపట్టిన టీచింగ్, నాన్-టీచింగ్ నియామకాలలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. డబ్బులు తీసుకుని తమకు నచ్చినవారికి ఉద్యోగాలు ఇచ్చారని, అర్హులకు అన్యాయం జరిగిందని కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మరికొందరు గవర్నర్‌కు ఫిర్యా దు చేశారు. కొందరు ఉన్నత విద్యామండలికి, ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో విచారణ కమిటీని నియమించారు.

ప్రభుత్వం మాజీ రిజిస్ట్రార్లు ప్రసాద్‌రావు, భాస్కర్‌రావుతో ఒక కమిటిని నియమించగా, గవర్నర్ నరసింహన్ సూ  చన మేరకు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సీవీ రాములు నేతృత్వంలో ఏక సభ్య విచారణ కమిటీ ఏర్పాటైంది. ఈ రెండు కమిటీలు విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదికలను అందజేశాయి. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండానే వీసీగా అక్బర్‌అలీఖాన్ పదవి కాలం ముగిసింది. కోర్టు మధ్యంతర ఉత్తర్వుల మేరకు గత ఏడాది  జనవరిలో 47 మంది టీచింగ్ సిబ్బంది బాధ్యతలు స్వీకరించారు.
 
సీఓఈ సస్పెన్షన్‌తో పోయిన పరువు
యూనివర్సిటీలో వీసీ, రిజిస్ట్రార్ తర్వాత కీలకమైన పదవి పరీక్షల నియంత్రణాధికారిదే. అనుబంధ కళాశాలలు, క్యాంపస్ కళాశాలల విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించేది పరీక్షల విభాగమే. ఇలాంటి కీలక విభాగానికి అసోసియేట్ ప్రొఫెసర్‌ను అధికారిగా నియమించడమే విమర్శలకు తావిచ్చింది.

సీఓఈగా విధులు నిర్వహిస్తున్న అసోసియేట్ ప్రొఫెసర్ ఏక కాలంలో రెండు చోట్ల వేతనాలు పొందారనే ఆరోపణలపై సస్పెన్షన్‌కు గురికావడంతో వర్సిటీ పరువు మరింత దిగజారినట్లయింది. ఇప్పటికైనా వర్సిటీ ఉన్నతాధికారులు ఇలాంటివి జరగకుం   డా చర్యలు తీసుకుని వర్సిటీ పరువు, ప్రతిష్టలు పెంచేలా చూడాలని పలువురు విద్యాభిమానులు కోరుకుంటున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement