telangana university
-
తెలంగాణ వర్సిటీ అధ్యాపకుల సమస్యల్ని పరిష్కరిస్తాం: వినోద్‌కుమార్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న అధ్యాపకుల సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్ పేర్కొన్నారు. తెలంగాణ స్టేట్ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (టీఎస్‌యూటీఏ) 3వ కన్వెన్షన్ శనివారం జరిగింది. ఈ సందర్భంగా ‘తెలంగాణలో ఉన్నత విద్య– సమకాలీన సమస్యలు – సాధ్యమైన చర్యలు‘ అనే అంశంపై నిర్వహించిన సదస్సుకు వినోద్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వర్సిటీ నిర్మాణాల అభివృద్ధికి సీఎస్ఆర్ నిధులు వినియోగించాలని సూచించారు. వివిధ భావజాలాలతో సంబంధం లేకుండా విద్యార్థులను రాజకీయ భాగస్వామ్యానికి దూరంగా ఉంచడంలో కుట్ర దాగుందని, దీని పర్యవసానాలు సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని చెప్పారు. టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి మాట్లాడు తూ..పెండింగ్‌లో ఉన్న వర్సిటీ సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కరించాలని కోరారు. -
ఏసీబీ వలలో వీసీ
-
ఏసీబీకి చేతికి చిక్కిన వీసీ.. ఇంతకూ తొలగించే అధికారం ఎవరికి?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ ఏసీబీ వలలో చిక్కిన తర్వాత రాజ్యాంగ పరమైన అనేక అంశాలపై విద్యాశాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నిజానికి వీసీ నియామకం, తొలగింపుపై పూర్తి అధికారాలు గవర్నర్‌కు మాత్రమే ఉంటాయి. నియామకానికి సిఫార్సు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నా, తొలగింపు విషయంలో మాత్రం ఏ అధికారం ఉండదని నిబంధనలు పేర్కొంటున్నాయి. తెలంగాణ యూనివర్సిటీ పాలక మండలి సమావేశంలోనూ వీసీ ఈ అంశాలను అనేక సందర్భాల్లో ప్రస్తావించారు. కాలేజీ విద్య కమిషనర్‌కు తనను ప్రశ్నించే అధికారమే లేదని ఆయన అన్నట్టు మీడియాలో వచ్చింది. ఆ త ర్వాత కూడా తనను తీసివేసే అధికారం ప్రభుత్వాని కి ఎక్కడుందనే వాదన పరోక్షంగా వీసీ లేవ నెత్తారు. ఇదే క్రమంలో యూనివర్సిటీ పాలన వ్యవహారాల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొనడం, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలు చేయడం, తాజాగా ఓ వ్యవహారంలో ఏసీబీ ప్రత్యక్షంగా వీసీని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడం ఈ ఎపిసోడ్లో కొత్త మలుపు. ఇప్పు డు జరగబోయేదేంటనేది హాట్ టాపిక్‌గా మారింది. వీసీ నియామకం ఎలా...? ఏదైనా యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్‌ను నియమించేటప్పుడు ముందుగా ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తుంది. ఈ ప్రక్రియ కోసం ముగ్గురు సభ్యులతో ఓ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఇందులో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నుంచి ఒకరు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒకరు, వీసీ నియామకం జరిగే విశ్వవిద్యాలయం నుంచి ఒకరిని ఈ కమిటీలో చేరుస్తారు. యూజీసీ ఎవరినైనా నిపుణుడిని సూచిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున విద్యాశాఖ కార్యదర్శి సభ్యుడిగా ఉంటారు. యూనివర్సిటీ తరపున పదవీ విరమణ చేసిన నిపుణుడైన మాజీ వీసీని సాధారణంగా చేరుస్తారు. నోటిఫికేషన్ తర్వాత వచ్చే దరఖాస్తులను కమిటీ పరిశీలించి, ముగ్గురి పేర్లను గవర్నర్‌కు పంపుతుంది. ఇందులోంచి గవర్నర్ ఒకరిని ఎంపిక చేస్తారు. ఆ తర్వాత గవర్నర్ నియామకానికి సంబంధించిన నియామకపు ఉత్తర్వులు రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ కార్యదర్శి ఇస్తారు. తొలగింపు ఎలా? గవర్నర్ నియమించిన వైస్ చాన్స్‌లర్ ప్రభుత్వానికి ఇష్టం లేదనుకుంటే రెండింట మూడొంతుల అసెంబ్లీ మెజారిటీ తీసుకుని వీసీ తొలగింపు ఉత్తర్వులు ఇవ్వొచ్చు. ఇక్కడ కూడా అసెంబ్లీ నిర్ణయాన్ని గవర్నర్‌కు పంపాల్సి ఉంటుంది. నేరుగా గవర్నర్‌కు కూడా వీసీని కారణాలు లేకుండా తొలగించే అధికారం ఉండదు. అయితే, తెలంగాణ యూనివర్సిటీ వీసీ వివాదం భిన్నమైంది. ఇలాంటి సంక్లిష్ట సమస్య గతంలో ఎప్పుడూ ఎదురవ్వలేదు. ఏసీబీ దాడి చేయడంపైనా పలు ప్రశ్నలు తెరమీదకొస్తున్నాయి. ఇలా దాడి చేయాలన్నా, ముందుగా గవర్నర్ అనుమతి తీసుకోవాలా? అనే విషయమై ఉన్నతాధికారులు ముందుగా న్యాయ నిపుణుల సలహా తీసుకున్నారు. వీసీ వేతనం తీసుకుంటున్నాడు కాబట్టి, ప్రజా సేవకుడిగానే చూడాలని నిపుణులు తెలిపారు. కాబట్టి ఏసీబీ చట్టం పరిధిలోకి వస్తారని స్పష్టం చేశారు. ఏసీబీ దాడి, అరెస్టు జరిగిన తర్వాత వీసీని కూడా సస్పెండ్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. విచారణ పూర్తయి నేరం రుజువైతే శాశ్వతంగా తొలగించే అధికారం కూడా రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుందని చెబుతున్నారు. కాకపోతే ప్రతీ విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళా్లల్సిన అవసరం ఉంటుందని నిపుణులు అంటున్నారు. -
వీసీ అరెస్ట్.. తెలంగాణ వర్శిటీలో విద్యార్థుల సంబరాలు
సాక్షి, హైదరాబాద్: లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ దాచేపల్లి రవీందర్ గుప్తాను శనివారం సాయంత్రం అరెస్ట్ చేశారు. ఈ కేసులో తొలుత వీసీని అదుపులోకి తీసుకున్న ఏసీబీ.. పూర్తి స్థాయిలో తనిఖీలు ఆయన్ను అనంతరం అరెస్ట్ చేసింది. ఈ క్రమంలోనే రవీందర్ గుప్తా ఇంట్లో, ఆఫీస్‌లో, యూనివర్శిటీ చాంబర్లో ఏసీబీ తనిఖీలు నిర్వహించింది. ఆపై రవీందర్‌ను అరెస్ట్ చేసిన ఏసీబీ.. కోర్టులో హాజరుపర్చనుంది. అయితే రూ. 50 వేలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ రవీందర్ అరెస్టు చేయగానే యూనివర్శిటీ విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు. బాణాసంచా కాల్చడంతో పాటు స్వీట్లు పంచుకుని మరీ సెలబబ్రేట్ చేసుకున్నారు. గతం కొంతకాలంగా వీసీ తీరుతో విసిగిపోయిన విద్యార్థులు.. ఏసీబీ అరెస్ట్ వార్త తర్వాత సంబరాలు చేసుకున్నారు. కాగా, నిజామాబాద్ భీమ్‌గల్ లో ఉన్న ఓ కళాశాలకు పరీక్ష కేంద్రం అనుమతి కోసం రూ. 50 వేలు లంచం డిమాండ్ చేశారాయన. ఈ క్రమంలో బాధితుడు దాసరి శంకర్ మమ్మల్ని ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని ఆయన్ని అదుపులోని తీసుకున్నాం. గతంలో అతని పై వచ్చిన ఫిర్యాదులపై విజిలెన్స్ దర్యాప్తు జరుగుతుంది. ప్రస్తుతం నివాసంతో పాటు యూనివర్సిటీలోనూ సోదాలు చేస్తున్నాం. సోదాలు పూర్తి అయినా తర్వాత అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిస్తాం అని డీఎస్పీ సుదర్శన్ వెల్లడించారు. ఇదిలా ఉంటే.. వీసీ రవీందర్ తీరుపై మొదటి నుంచి విమర్శలే వినవస్తున్నాయి. గతంలో ఆయన పలుమార్లు వార్తల్లో నిలిచారు. ఇక తాజాగా.. ఆయనపై ఆరోపణల నేపథ్యంలోనే అక్రమాలు-అవకతవకలపై యూనివర్సిటీలో ఏసీబీ తనిఖీలు కూడా జరిగాయి. అయినా కూడా ఆయన తీరు మార్చుకోకుండా.. లంచంతో పట్టుబడడం గమనార్హం. చదవండి: మా పక్కింటి వాళ్లే ఇలా చేస్తారనుకోలేదు: బాలుడి తండ్రి ఆవేదన -
అవును.. ఆయన లంచంతో పట్టుబడ్డాడు: ఏసీబీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ దాచేపల్లి రవీందర్ గుప్తా(63) తమ అదుపులోనే ఉన్న విషయాన్ని ఏసీబీ డీఎస్సీ సుదర్శన్ ప్రకటించారు. అయితే ఆయన్ని ఇంకా అరెస్ట్ చేయలేదని.. పూర్తి స్థాయిలో తనిఖీలు ముగిశాక అరెస్ట్ చేస్తామని స్పష్టత ఇచ్చారు. సాక్షితో మాట్లాడిన ఆయన.. శనివారం జరిగిన పరిణామాలకు వివరించారు. తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రవీందర్ గుప్తా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాం. తార్నాకలోని తన ఇంట్లోనే బాధితుడి నుంచి రూ. 50 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికాడాయన. ఆయన అల్మారా నుంచి నగదును సేకరించి.. కెమికల్ టెస్ట్ నిర్వహించి వేలిముద్రలతో పోల్చి చూసుకున్నాం. ఆ వేలిముద్రలు ఆయన ఫింగర్ ప్రింట్స్‌తో సరిపోలాయి. నిజామాబాద్ భీమ్‌గల్ లో ఉన్న ఓ కళాశాలకు పరీక్ష కేంద్రం అనుమతి కోసం రూ. 50 వేలు లంచం డిమాండ్ చేశారాయన. ఈ క్రమంలో బాధితుడు దాసరి శంకర్ మమ్మల్ని ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని ఆయన్ని అదుపులోని తీసుకున్నాం. గతంలో అతని పై వచ్చిన ఫిర్యాదులపై విజిలెన్స్ దర్యాప్తు జరుగుతుంది. ప్రస్తుతం నివాసంతో పాటు యూనివర్సిటీలోనూ సోదాలు చేస్తున్నాం. సోదాలు పూర్తి అయినా తర్వాత అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిస్తాం అని డీఎస్పీ సుదర్శన్ వెల్లడించారు. ఇదిలా ఉంటే.. వీసీ రవీందర్ తీరుపై మొదటి నుంచి విమర్శలే వినవస్తున్నాయి. గతంలో ఆయన పలుమార్లు వార్తల్లో నిలిచారు. ఇక తాజాగా.. ఆయనపై ఆరోపణల నేపథ్యంలోనే అక్రమాలు-అవకతవకలపై యూనివర్సిటీలో ఏసీబీ తనిఖీలు కూడా జరిగాయి. అయినా కూడా ఆయన తీరు మార్చుకోకుండా.. లంచంతో పట్టుబడడం గమనార్హం. వీడియో: గర్ల్స్ హాస్టల్ లోకి వెళ్లి డబ్బులు చల్లుతూ వీసీ రవీందర్ డ్యాన్స్ లు ఇదీ చదవండి: కోరుకున్న కాలేజీ.. కోర్సు కూడా! -
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ తెలంగాణ వర్సిటీ వీసీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రవీందర్ గుప్తా ఏసీబీ ఉచ్చులో పడ్డారు. శనివారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని ఆయన్ని ఏసీబీ అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని తన ఇంట్లోనే లంచం తీసుకుంటూ ఆయన పట్టుబడినట్లు సమాచారం. గత కొంతకాలంగా తెలంగాణ యూనివర్సిటీలో అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాలు యూనివర్సిటీలో సోదాలు నిర్వహించాయి. ఆరోపణలకు తగ్గట్లే అక్రమ నియామకాలు, అక్రమ లావాదేవీలు జరిగినట్లు ఏసీబీ నిర్ధారించుకున్నట్లు తెలుస్తోంది. అయితే.. తాజాగా పరీక్షా కేంద్రం ఏర్పాటు కోసం ఓ వ్యక్తి నుంచి డబ్బులు డిమాండ్ చేశాడు వీసీ రవీందర్ గుప్తా. ఈ క్రమంలో బాధితుడు శంకర్ ఏసీబీని ఆశ్రయించగా.. ఏసీబీ వల పన్నింది. శనివారం ఉదయం హైదరాబాద్‌లోని తన నివాసానికి వెళ్లి బాధితుడు డబ్బు ఇవ్వబోయాడు. ఆ టైంలో రూ. 50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు రవీందర్ గుప్తా. అనంతరం ఆయన ఇంట్లో తనిఖీలు నిర్వహించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు ఆయన్నీ అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఏసీబీ నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇదీ చదవండి: BRS ఎమ్మెల్యేల ఇళ్ల నుంచి ఏం తీసుకెళ్లారు? -
తెలంగాణ వర్సిటీలో విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ సోదాలు
సాక్షి, నిజామాబాద్: తెలంగాణ యూనివర్సిటీలో (Telangana university) మంగళవారం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సోదాలు కొనసాగుతున్నాయి. గత కొంతకాలంగా యూనివర్సిటీలో అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో అధికారులు సోదాలు నిర్వహిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. ఈసీ సభ్యులకు, వీసీకి మధ్య విబేధాలపై తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు దృష్టిసారించారు. ఇదిలా ఉంటే.. యూనివర్సిటీలో అక్రమ నియామకాలు, అక్రమ లావాదేవీలు జరిగాయని ఈసీ చర్యలకు దిగింది. వీసీ రవీందర్ గుప్తా అక్రమాలకు పాల్పడ్డారని రిజిస్ట్రార్‌ను మారుస్తామని ఈసీ ప్రకటించింది. దీనికి వ్యతిరేకంగా కొత్త రిజిస్ట్రార్‌ను నియమిస్తూ వీసీ నిర్ణయం తీసుకున్నారు. దీంతో యూనివర్సిటీలో పాలన గందరగోళంగా మారింది. ఈసీ సభ్యులకు, వీసీకి మధ్య ప్రచ్చన్న యుద్ధం కొనసాగుతోంది. అక్రమ నియామకాలు, లావాదేవీలు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తడంతో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రంగంలోకి దిగారు. ఇదీ చదవండి: జాతీయ ర్యాంకుల్లో తెలంగాణ వర్సిటీలు డల్.. కారణం అదేనా! -
తెలంగాణ వర్సిటీలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సోదాలు
-
రిజిస్ట్రార్ గదికి తాళం.. తెయూలో వివాదం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్/సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విశ్వవిద్యాలయంలో రిజిస్ట్రార్ పదవి విషయంలో వివాదం కొనసాగుతూనే ఉంది. సోమవారం రిజిస్ట్రార్ యాదగిరి గదికి తాళం వేసి ఉంచడంతో గందరగోళం నెలకొంది. దీనిపై రిజిస్ట్రార్ యాదగిరి ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాకాటి కరుణ కమిషనర్ నవీన్‌మిట్టల్‌కు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. వర్సిటీలో ఉదయం అన్ని విభాగాలు, చాంబర్లకు సెక్యూరిటీ సిబ్బంది తాళాలు తెరిచారు. రిజిస్ట్రార్ చాంబర్ మాత్రం తెరవద్దని వైస్ చాన్స్‌లర్ పీఏ సవిత చెప్పడంతో తెరవకుండానే ఉంచారు. అక్కడకు వచ్చి న రిజిస్ట్రార్ విషయాన్ని పాలకమండలి సభ్యులకు చెప్పడంతో వారు వీసీకి ఫోన్ చేశారు. దీంతో మధ్యాహ్నం 1.30 గంటలకు తాళం తీయడంతో సిబ్బంది వెళ్లి కూర్చున్నారు. రిజిస్ట్రార్ మాత్రం చాంబర్‌కు రాలేదు. ప్రభుత్వం చెబితేనే రిస్ట్రాస్టార్‌గా వచ్చా.. ప్రభుత్వం, పాలకమండలి చెబితేనే రిస్ట్రాస్టార్‌గా వచ్చానని, సమస్య పరిష్కారం చేస్తేనే బాధ్యతలు స్వీకరిస్తానని యాదగిరి ‘సాక్షి’కి తెలిపారు. తనను లొంగదీసుకునే ఉద్దేశంతోనే వీసీ ఇలా చేశారని ఆరోపించారు. కాగా తాళం వేసిన విషయమై వీసీ రవీందర్‌గుప్తాను ‘సాక్షి’ప్రశ్నించగా, తాను తాళం వేయించలేదని, అలా చేస్తే తాళానికి సీల్ వేసి, లెటర్ విడుదల చేసేవాడినన్నారు. వీసీ గా ఉన్న తన అనుమతి లేకుండానే ఈసీ సభ్యులు యాదగిరిని రిజిస్ట్రార్‌గా నియమించ డం చెల్లదన్నారు. తాను రిజిస్ట్రార్‌గా పెట్టిన విద్యావర్థినిని బయటకు పంపి యాదగిరిని ఎలా నియమిస్తారన్నారు. తెయూలోనూ ఇతర ప్రొఫె సర్లు ఉన్నప్పటికీ తనకు నచ్చని యాదగిరిని నియమించారని, తాను ఆర్డర్ ఇవ్వకుండా యాదగిరి ఎలా బాధ్యతలు తీసుకుంటారని వీసీ అన్నారు. తెయూ వీసీని సస్పెండ్ చేయాలని గవర్నర్‌కు ఫిర్యాదు తెయూ వీసీపై వచ్చి న ఆరోపణలపై విచారణ కమిషన్ లేదా రిటైర్డ్ హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని బీజేపీ నేత దినేశ్ కులాచారితో పాటు పలువురు వర్సిటీ విద్యార్థులు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత వీసీ 2021మేలో పదవి చేపట్టాక పరిపాలన, ఆర్థిక వ్యవహారాల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ మేరకు సోమ వారం రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసైకి వినతిపత్రం సమర్పించారు. -
నిజామాబాద్: తెలంగాణ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళనలు
-
తెలంగాణ యూనివర్సిటీ వీసీ అక్రమాలపై విచారణ
తెయూ (డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ డి.రవీందర్ పాల్పడిన అక్రమ చెల్లింపులు, నిధుల దుర్వినియోగం వంటి అంశాలపై ఐదుగురు సభ్యుల కమిటీ విచారణ ప్రారంభించింది. ఇందులో భాగంగా శుక్రవారం కమిటీ సభ్యులు గంగాధర్‌గౌడ్, వసుంధరదేవి, ప్రవీణ్‌కుమార్ వర్సిటీని సందర్శించారు. వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరిని కలిసి 2021 నవంబర్ నుంచి 2023 ఏప్రిల్ 18 వరకు వర్సిటీ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ తీసుకున్నారు. ఆ మధ్యకాలంలో జరిపిన చెల్లింపులపై విచారణ జరపనున్నారు. వర్సిటీకి విచారణ కమిటీ రాక సందర్భంగా విద్యార్థులు ‘థాంక్యూ సాక్షి’అంటూ క్యాంపస్‌లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ‘తెలంగాణ యూనివర్సిటీలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను వెలుగులోకి తీసుకువచ్చిన ‘సాక్షి’పత్రికకు ధన్యవాదములు’అంటూ ఫ్లెక్సీలో పేర్కొన్నారు. ఫ్లెక్సీల ఏర్పాటు సోషల్ మీడియాలో వైరలైంది. వర్సిటీలో కూడా ఈ అంశం చర్చనీయాంశమైంది. ఈ నెల 19న హైదరాబాద్ రూసా భవనంలో రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాకాటి కరుణ, ఆ శాఖ కమిషనర్ నవీన్‌మిట్టల్ ఆధ్వర్యంలో యూనివర్సిటీ పాలకమండలి సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ముందుగా ఈ సమావేశానికి హాజరైన వీసీ ప్రొఫెసర్ డి.రవీందర్ వాకౌట్ చేసి బయటకు వెళ్లిపోయారు. అనంతరం వీసీ అక్రమాలపై విచారణ కోసం రాష్ట్ర ఆర్థిక శాఖ డిప్యూటీ డైరెక్టర్ చంద్రకళ, నలుగురు ఈసీ మెంబర్లతో కలిపి పాలకమండలి కమిటీని ఏర్పాటు చేసింది. అనంతరం ఈ నెల 26న జరిగిన పాలకమండలి సమావేశంలో ఏ విధంగా విచారణ జరపాలనే విషయమై కమిటీ సభ్యులకు మార్గనిర్దేశనం చేశారు. ఈసీ నిర్ణయాలు తాత్కాలికంగా రద్దు చేసిన హైకోర్టు ఈ నెల 19న జరిగిన తెలంగాణ యూనివర్సిటీపాలక మండలి(ఈసీ) సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు మధ్యంతరంగా రద్దు చేస్తూ రాష్ట్ర హైకోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసినట్లు వీసీ ప్రొఫెసర్ రవీందర్ తెలిపారు. ఈ సమావేశంలో వీసీ అధికారాలు తగ్గించడం, ఇన్చార్జి రిజిస్ట్రార్‌గా విద్యావర్ధినిని తొలగించి ప్రొఫెసర్ యాదగిరిని నియమించడం, వీసీపై వచ్చిన ఆరోపణల విచారణకు ఐదుగురు సభ్యుల కమిటీ ఏర్పాటు వంటి నిర్ణయాలను ఈసీ తీసుకున్న విషయం తెలిసిందే. ఈసీ నిర్ణయాలపై తాను హైకోర్టును ఆశ్రయించగా, ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని వీసీ తెలిపారు. అయితే, హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కోర్టులో కౌంటర్ దాఖలు చేస్తుందని ప్రొఫెసర్ యాదగిరి తెలిపారు. -
వీసీ నిర్వాకం: అమ్మాయిలతో డ్యాన్సులు.. డబ్బులు వెదజల్లుతూ..
సాక్షి, తెయూ (డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ వైస్‌చాన్సలర్ ప్రొఫెసర్ డి.రవీందర్ గుప్తా క్యాంపస్‌లోని విద్యార్థినులతో కలిసి గురువారం రాత్రి చేసిన డ్యాన్సులు వివాదాస్పదంగా మారాయి. ఒక వీసీ.. అమ్మాయిలతో డ్యాన్సులు చేస్తూ, క్యాబరే తరహాలో డబ్బులు వెదజల్లడమేంటంటూ శనివారం ఉదయం నుంచి టీవీలు, సామాజిక మాధ్యమాల్లో కథనాలు ప్రసారం అయ్యా యి. వీసీ తీరును నిరసిస్తూ విద్యార్థి సంఘాల నాయకులు గర్ల్స్ హాస్టల్ వద్ద ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ మొత్తం ఎపిసోడ్‌పై వీసీ రవీందర్ గుప్తా శనివారం సాయంత్రం ఒక ప్రకటనలో స్పందించారు. గణేశ్ నిమజ్జనం రోజు విద్యార్థినుల కోరిక మేరకే హాస్టల్ వద్దకు వెళ్లానని, విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించలేదని, డ్యాన్సులు చేస్తూ డబ్బులు వెదజల్లానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొన్నారు. అనవసరమైన, అవాస్తవమైన వార్తలు వ్యాప్తి చేస్తే కఠిన చర్యలుంటాయని, గణేశ్ నిమజ్జనంలో వీసీ ఒక భక్తుడిగా మాత్రమే పాల్గొన్నారని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ విద్యావర్ధిని పేర్కొన్నారు. చదవండి: (మహిళల్లో పెరుగుతున్న స్థూలకాయం) -
విద్యార్థినులతో తెలంగాణ యూనివర్సిటీ వీసీ చిందులు
-
వర్సిటీల్లో సమస్యలను పరిష్కరించాలి: కృష్ణయ్య
గన్‌ఫౌండ్రీ: తెలంగాణ ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో శనివారం బషీర్‌బాగ్‌లోని విద్యాశాఖ మంత్రి కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు–మన బడి కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి నిధులు కేటాయించడం హర్షణీయమన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తి స్థాయి ఉపాధ్యాయులు లేకపోవడం వల్ల విద్యార్థుల చదువు దెబ్బతినే అవకాశముందని ఆందోళన వ్యక్తంచేశారు. పూర్తిస్థాయి టీచర్లను నియమించే వరకు 16 వేల మంది విద్యా వాలంటీర్లను కొనసాగిస్తూ వారిని రెన్యూవల్ చేయాలని డిమాండ్ చేశారు. కస్తూర్బా పాఠశాలలో గతంలో పని చేసిన 937 మంది కాంట్రాక్టు టీచర్లను కొనసాగించాలని కోరారు. బాసర ట్రిపుల్ ఐటీలో కలుషిత ఆహారం వలన ఆస్పత్రిలో ఉన్న వారికి మెరుగైన వైద్యం అందించాలని, ఈ ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ నాయకుడు గుజ్జ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
సైబర్‌క్రైం కేసులు పెడతాం.. సిబ్బందిని బెదిరించిన తెయూ వీసీ
సాక్షి, తెయూ(నిజామాబాద్): యూనివర్సిటీకి సంబంధించిన వివరాలు ఫొటోలు తీసి ఎవరైనా మీడియాకు అందజేస్తే వారిపై సైబర్ క్రైం నేరం కింద కేసులు పెట్టిస్తామని తెలంగాణ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ రవీందర్ హెచ్చరించారు. పాలక మండలి (ఈసీ) అనుమతి లేకుండా అవుట్సోర్సింగ్ విధానంలో ఇటీవల సుమారు 50 మంది బోధనేతర సిబ్బంది నియామకాలపై పలు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఇదే విషయమై బుధవారం సాయంత్రం 6 గంటలకు బోధన, బోధనేతర, రెగ్యులర్, అవుట్సోర్సింగ్ సిబ్బందితో సమావేశం నిర్వహించనున్నట్లు సిబ్బందికి బుధవారం 4 గంటలకు స మాచారం ఇచ్చారు. దీంతో 5 గంటలకు విధు లు ముగించుకుని ఇళ్లకు వెళ్లాల్సిన సిబ్బంది క్యాంపస్‌లోనే ఉండిపోయారు. వీసీ రవీందర్ తో పాటు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కనకయ్య రాత్రి 7 గంటల తర్వాత ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల సెమినార్ హాల్లో సిబ్బందితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. వర్సిటీ అభివృద్ధికి ఒక విజన్‌తో ముందుకు వె ళుతున్న తనను కొందరు అసత్య ఆరోపణల తో అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెయూ పరిధిలో మెయిన్ క్యాంపస్ (డిచ్పల్లి), సౌత్ క్యాంపస్(భిక్కనూర్), ఎడ్యుకేషన్ క్యాంపస్ (సారంగపూర్) మూడు క్యాంపస్‌లు ఉన్నాయని, సిబ్బంది కొరత వల్లనే అవుట్ సోర్సింగ్ విధానంలో నియామకాలు చేపట్టినట్లు తెలిపారు. మూడు క్యాంపస్‌లు ఉన్న విషయం రాష్ట్ర ఉన్నత విద్యామండలికి తెలియదని వీసీ పేర్కొనడంతో బోధన, బోధనేతర సిబ్బంది అవాక్కయ్యారు. ప్రస్తుత ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి గతంలో రెండు సార్లు తెయూ రిజిస్ట్రార్ గా పని చేసిన విషయం తెలిసిందేనని ఆయనకు ఎన్ని క్యాంపస్‌లు ఉన్నాయో తెలియదా అని వారు నవ్వుకున్నారు. సిబ్బంది నియామకాలపై మీడియాలో వార్తలు వస్తే సిబ్బందిని బెదిరింపులకు గురి చేయడం ఏంటని పలువురు వాపోయా రు. రాత్రి 7.45 గంటలకు సమావేశం ముగించడంతో ఈ సమయంలో తాము ఇళ్లకు ఎలా వె ళ్లాలని మహిళా సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశా రు. ప్రిన్సిపాల్ ఆఫీస్ నుంచి ఫొటోలు వెళ్లాయనుకుంటే వారితోనే సమావేశం నిర్వహించాలే కానీ మెయిన్ క్యాంపస్, ఎడ్యుకేషన్ క్యాంపస్‌లకు చెందిన అందరినీ పిలిపించి బెదిరింపులకు పాల్పడితే ఏమిటని ప్రశ్నించారు. చదవండి: బుడ్డోడి కాన్ఫిడెన్స్‌కి కేటీఆర్ ఫిదా: ‘పేపర్ వేస్తే తప్పేంటి’ -
ఆన్లైన్లో వచ్చే ప్రశ్నాపత్రం.. అరగంటలో లీక్.. మూడు రోజులుగా..
సాక్షి, బోధన్ (నిజామాబాద్): తెలంగాణ వర్సిటీ పరిధిలో నిర్వహిస్తున్న డిగ్రీ సెమిస్టర్ పరీక్షల నిర్వహణ ఇష్టారాజ్యంగా మారింది. వర్సిటీ ఉన్నతాధికారుల నిఘా కరువైంది. కరోనా నిబంధల పేరుతో పరీక్షల నిర్వహణలో తీసుకోవాల్సిన కనీస నిబంధన చర్యలను పట్టించుకోకపోవడంతో ప్రైవేటు డిగ్రీ కళాశాలల పరీక్షా కేంద్రాల వారికి అనుకూలంగా మారిందనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. అరగంట ఆలస్యంలోనే కిటుకు.. పోటీపరీక్షల్లో అమలుచేసే నిమిషం ఆలస్యం నిబంధన సాధారణ పరీక్షల్లో అమలు చేయకపోవడం కొందరు విద్యార్థులకు అనుకూలంగా మారింది. అరగంట ఆలస్యంగా వచ్చినా విద్యార్థులను అనుమతించాల్సి ఉంటుంది. ఈ నిబంధనను అనుకూలంగా తీసుకుని పరీక్షా కేంద్రాల్లోని పలువురు అబ్జర్వర్లు విద్యార్థులకు మాల్‌ప్రాక్టీస్‌ను పోత్రహిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆన్లైన్లో ప్రశ్నాపత్రం.. పరీక్షా సమయానికి 15 నిమిషాల ముందు వర్సిటీ పరీక్షల విభాగం అధికారులు పరీక్షా కేంద్రాలకు ఆన్లైన్లో ప్రశ్నాపత్రం పంపిస్తారు. ప్రతి పరీక్షా కేంద్రానికి పంపించే ప్రశ్నాప్రతాలపై ప్రత్యేకమైన కోడ్ వేస్తారు. నిర్వాహకులు డౌన్లోడ్ చేసుకుని పరీక్ష సమయానికి 5 నిమిషాలు ముందుగా సబ్జెక్టుల వారీగా విద్యార్థుల గదులకు చేరవేస్తారు. అబ్జర్వర్స్ ఈ ప్రక్రియను తమకు అనుకూలంగా మా ర్చుకుంటున్నారు. కొందరు తమ వద్ద ఉన్న మొబైల్ ఫోన్ల ద్వారా ప్రశ్నాపత్రాన్ని ఫొటో తీసి బయటకు చేరవేయగా విద్యార్థులు వాటి జవాబులను మైక్రో జిరాక్స్ తీసుకుని ఎగ్జామ్ హాల్‌కు వచ్చి మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడుతున్నారు. బోధన్‌లో ప్రశ్నాపత్రం లీక్.. బోధన్‌లో 5 పరీక్షా కేంద్రాలుండగా, ఒకటి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో, 4 ప్రైవేట్‌లో ఉన్నాయి. 3 రోజుల నుంచి పేపర్ లీకేజీ జరుగుతున్నట్లు సమాచారం. శనివారం నాలుగో సెమిస్టర్ డాటాబేస్ మేనేజ్ మెంట్ ప్రశ్నపత్రం బయటకు లీక్ చేశారు. దీంతో ఓ జిరాక్స్ సెంటర్ వద్ద విద్యార్థులు గుంపులుగా చేరి లీకేజైన ప్రశ్నల జవాబులు మైక్రో జిరాక్స్‌లు తీసుకుని పరీక్ష రాసినట్లు తెలిసింది. -
వర్సిటీలో చిరుత కలకలం.. పరీక్షలు వాయిదా
-
వర్సిటీలో చిరుత కలకలం.. పరీక్షలు వాయిదా
సాక్షి, నిజామాబాద్ : డిచ్పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీతో చిరుత పులి సంచారం కలకలం రేపింది. ఉదయం వాకింగ్‌కు వెళ్లిన వారికి చిరుత కనిపించడంతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. వర్సిటీలోని ఎంసీఏ భవనం వద్ద చిరుత సంచరిస్తున్నట్లు విద్యార్థులు కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. దీంతో హాస్టల్ విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని యూనివర్సిటీ అధికారులు నోటీసులు జారీ చేశారు. చిరుత గాలింపు కోసం అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వర్సిటీ ఆవరణలో చిరుత పులి పాద ముద్రల కోసం ఇందల్వాయి అటవీ రేంజి అధికారులు, సిబ్బంది అన్వేషిస్తున్నారు. తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో శుక్రవారం జరగాల్సిన పీజీ పరీక్షలను వాయిదా వేశారు. ఈ రోజు జరగాల్సిన పరీక్షలను ఈ నెల 22వ తేదీన తిరిగి నిర్వహిస్తామని పరీక్షల నియంత్రణాధికారి వెల్లడించారు. -
‘ఆడాలని, పాడాలని ఇబ్బంది పెడుతున్నారు’
సాక్షి, కామారెడ్డి : తెలంగాణ యూనివర్సిటీకి చెందిన భిక్కనూర్ సౌత్ క్యాంపస్‌లో జూనియర్లపై సీనియర్లు ర్యాంగింగ్ నిర్వహిస్తున్నారు. ఇంట్రడక్షన్ క్లాసుల పేరుతో ఇబ్బందులకు గురిచేస్తూ... అర్ధరాత్రి ఒంటిగంట వరకు రూమ్‌కు పిలిపించి పరిచయం పేరుతో ఆగడాలకు పాల్పడుతున్నారు. సీనియర్లు వేధింపులు భరించలేని జూనియర్లు ఈ విషయాన్ని కళాశాల ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్లారు. గానా బజానా అంటూ ఆడాలని. పాడాలని, చేతులు కట్టుకోవాలని, తల దించి నిలబడాలని ఇబ్బంది పెడుతున్నారని ప్రిన్సిపల్ ఎదుట విద్యార్థులు వాపోయారు. అనంతరం పోలీసులకు సమాచారం అందివ్వగా పోలీసుల ఎదుట సీనియర్ల ఆగడాల గురించి వివరించారు. ఇక డీఎస్పీ శశాంక్ రెడ్డి ఆదేశాలతో భిక్కనూరు సీఐ యాలాద్రి హాస్టల్‌కు వచ్చి విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. జూనియర్లతో అమర్యాదగా ప్రవర్తించినా.. ర్యాగింగ్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని సీనియర్లను హెచ్చరించారు. -
తెయూను మొదటి స్థానంలో నిలబెడదాం
సాక్షి, డిచ్పల్లి : యూనివర్సిటీ సిబ్బంది అందరూ తనకు సమానమేనని, సమష్టి కృషితో తెలంగాణ యూనివర్సిటీని రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలబెడదామని సీనియర్ ఐఏఎస్ అధికారి, ఇన్చార్జి వీసీ వి.అనిల్‌కుమార్ అన్నారు. శుక్రవారం తెయూ ఇన్చార్జి వీసీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన పరిపాలనా భవనంలో వివిధ విభాగాలను సందర్శించారు. బోధన, బోధనేతర సిబ్బందిని విభాగాల వారీగా పరిచయం చేసుకున్నారు. విద్యా సంస్థలంటే తనకెంతో ఇష్టమని, తాను చదువుకునే సమయంలోనే ఉద్యోగం సాధించడానికి వివిధ పోటీ పరీక్షలను రాశానని గుర్తు చేసుకున్నారు. ఆచార్యుల ఆలోచనా విధానం, మార్గనిర్దేశనం ఉన్నతంగా ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపారు. యూనివర్సిటీకి క్రమంగా వస్తూ ఉంటానని ప్రతి నెలలోనూ సిబ్బంది పనితీరుకు సంబం ధించి సమావేశం నిర్వహిస్తామన్నారు. అందరి సూచనలు, సలహాల ప్రకారం విద్యాపరమైన అభివృద్ధిని సాధించేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో తెయూ మూడోస్థానంలో ఉందని, మొదటి స్థానానికి రావడానికి మనందరం సమష్టిగా పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అధ్యాపకులు, విద్యార్థుల మధ్య స్నేహ పూర్వకమైన వాతావరణం ఉండాలని సూచించారు. అధ్యాపకులు విద్యార్థులకు మార్గదర్శకంగా నిలవాలన్నారు. ప్రతి విద్యార్థి పరీక్ష ఫలితాల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించేలా అధ్యాపకులు కృషి చేయాలని సూచించారు. ఫలితాల్లో ప్రథమ స్థానం సాధించిన విద్యార్థికి గోల్డెన్, రెండో స్థానంలో నిలిచిన విద్యార్థికి సిల్వర్, మూడో స్థానం పొందిన విద్యార్థికి కాపర్ బ్యాడ్జెస్ వంటి గుర్తింపు కార్డులను నోటీస్ బోర్డులపై ప్రదర్శించాలని సూచించారు. తద్వారా విద్యార్థులందరూ పోటీతత్వంతో మరింత బాగా చదివి మంచి ఫలితాలను సాధించడానికి చూస్తారని ఇన్చార్జి వీసీ తెలిపారు. ఆయన వెంట రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బలరాములు, సీవోఈ సంపత్‌కుమార్, ఏఈ వినోద్, వివిధ విభాగాల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది తదితరులున్నారు. -
‘అవుట్సోర్సింగ్ సిబ్బంది పొట్టగొట్టారు’
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ వీ సీ ప్రొఫెసర్ సాంబయ్యను అవుట్ సోర్సింగ్ సి బ్బంది అడ్డుకుని నిరసన తెలిపారు. వీసీ మూడే ళ్ల పదవీకాలం బుధవారం ముగిసింది. గురువా రం వీడ్కోలు సన్మాన కార్యక్రమానికి వెళ్లేందుకు వీసీ సిద్ధమయ్యారు. ఇంతలోనే వీసీ రెసిడెన్స్ వ ద్దకు చేరుకున్న అవుట్సోర్సింగ్ సిబ్బంది అక్క డే బైటాయించి ధర్నా నిర్వహించారు. జీవో నెంబరు 14 ప్రకారం వేతనాలు పెంచకుండా తమకు తీవ్ర అన్యాయం చేశాడరని ఆరోపించారు. మూడేళ్ల కాలంలో వీసీ ఒక నియంతలా వ్య వహరించారని, అవుట్ సోర్సింగ్ సిబ్బందిని తీ వ్ర ఇబ్బందులకు గురిచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెసిడెన్స్ నుంచి బయటకు వచ్చిన వీసీ సాంబయ్యను చుట్టుముట్టిన అవుట్సోర్సింగ్ సిబ్బంది తమ పొట్టారని ఆరోపిస్తూ దుర్భాషలాడారు. సమాన పనికి సమాన వేతనం చెల్లిం చాలని జీవో ఉన్నప్పటికీ తెలంగాణ యూనివర్సిటీలో అమలు చేయకుండా సాంబయ్య తమ కు అన్యాయం చేశారని సిబ్బంది ఆగ్రహం వ్య క్తం చేశారు. దీంతో అక్కడ కొద్ది సేపు ఉద్రిక్త వా తావరణం ఏర్పడింది. సమాచారం అందుకు న్న డిచ్పల్లి సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై నవీన్‌కు మార్ క్యాంపస్ కు చేరుకుని అవుట్ సోర్సింగ్ సి బ్బందిని సముదాయించి శాంతింపజేశారు. సాంబయ్యను అక్కడి నుంచి వాహనంలో పం పించి వేశారు. నియంత అధికారి వర్సిటీని వది లి వెళుతున్నారని పేర్కొంటూ అవుట్ సోర్సింగ్ సిబ్బంది బాణాసంచా కాల్చి సంబురాలు జరుపుకున్నారు. -
ముదురుతున్న తె.యూ వివాదం
సాక్షి, తె.యూ (డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీలో పాతిక రోజులుగా కొనసాగుతున్న అందోళనలు గురువారం విద్యార్థులు నిరవధిక దీక్షలు చేపట్టడంతో మరింత ముదిరాయి. యూనివర్సిటీలో బోధన తరగతులు కొనసాగక విద్యా సంవత్సరం వృథా అవుతోందని ఆరోపిస్తూ మూడు రోజులుగా అందోళనబాట పట్టిన విద్యార్థులు చివరికి ఆమరణ దీక్షలకు దిగారు. చిచ్చురేపిన జీవో నంబరు 11.. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల(అకడమిక్ కన్సల్టెంట్లు)కు వేతనాలు పెంపు చేస్తూ జీవో నంబరు 11ను విడుదల చేసింది. అయితే తెయూ వీసీ ప్రొఫెసర్ పి.సాంబయ్య తొమ్మిది కోర్సులను సెల్ఫ్ ఫైనాన్స్లుగా ప్రకటించారు. ఆయా కోర్సుల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులకు జీవో నంబరు 11 ప్రకారం పెరిగిన వేతనాలు చెల్లించబోమని స్పష్టం చేయడంతో ఆందోళనలు మొదలయ్యాయి. వర్సిటీలో అన్ని కోర్సులు రెగ్యులర్ కోర్సులుగానే పరిగణించాలని, జీవో నంబరు 11ను కాంట్రాక్టు అధ్యాపకులందరికీ వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ 9 కోర్సుల కాంట్రాక్టు అధ్యాపకులు సమ్మె బాట పట్టారు. 25 రోజులుగా క్యాంపస్ మెయిన్ గేటు వద్ద శిబిరం ఏర్పాటు చేసుకుని నిరవధిక రిలేదీక్షలు కొనసాగిస్తున్నారు. దీంతో 9 కోర్సుల్లో పాఠాలు బోధించేవారు లేక తరగతులు కొనసాగడం లేదు. పట్టించుకోని వీసీ, రిజిస్ట్రార్లు.. 25 రోజులుగా రిలేదీక్షలు చేస్తున్నా వీసీ ప్రొఫెసర్ పి.సాంబయ్య, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బలరాములు మొండివైఖరితో సమస్య పరిష్కారంలో తీవ్ర జాప్యం చేస్తున్నారని కాంట్రాక్టు అధ్యాపకులు, విద్యార్థులు ఆరోపిస్తున్నారు. చర్చల పేరుతో పిలిచి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చి, 19 రోజులుగా వీసీ యూనివర్సిటీకి రాకుండా తప్పించుకు తిరుగుతున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. రిజిస్ట్రార్ సైతం తన చేతిలో ఏమీ లేదని వీసీ ఎలా చెబితే అలా చేస్తామని చేతులెత్తేశారు. దీంతో కాంట్రాక్టు అధ్యాపకులకు మద్దతుగా మూడు రోజులుగా విద్యార్థులు నేరుగా అందోళనబాట పట్టారు. వీసీ సాంబయ్య కన్పించడం లేదంటూ కరపత్రాలు ముద్రించి క్యాంపస్ ఆవరణలో అతికించారు. బోధన, బోధనేతర సిబ్బందిని క్యాంపస్‌లోకి అడుగు పెట్టనీయకుండా అడ్డుకుంటున్నారు. గురువారం సైతం బోధన, బోధనేతర సిబ్బందిని విధులకు హాజరు కాకుండా అడ్డుకున్న విద్యార్థులు అల్పాహారం సైతం గేటు వద్దకే తెప్పించుకుని తిన్నారు. ఆమరణ దీక్షలు.. వీసీ, రిజిస్ట్రార్ల నుంచి స్పందన లేకపోవడంతో గురువారం విద్యార్థులు విఘ్నేశ్, వినోద్, అఖిల్, నర్సింలు, శ్రీకాంత్, అశోక్, ప్రశాంత్ ఆమరణ దీక్షలు ప్రారంభించారు. దీక్షా శిబిరంలో విద్యార్థు లు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తరగతులు జరగకపోవడంతో సిలబస్ పూర్తి కాలేదని, ఈ నెల 27నుంచి సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. సిలబస్ పూర్తి కాకపోవడంతో పరీక్షలు ఎలా రాయాలని ప్రశ్నించారు. ఆమరణ దీక్షలకు మద్దతు తెలిపిన విద్యార్థి నాయకులు యెండల ప్రదీప్, క్రాంతికుమార్ మాట్లాడుతూ.. ఇప్పటికైనా వీసీ, రిజిస్ట్రార్ లు స్పందించి వెంటనే సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. -
టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి
సుభాష్‌నగర్(నిజామాబాద్ అర్బన్) : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో వస్తున్న నూతన పోకడలను అందిపుచ్చుకుని అధ్యాపకులు అత్యాధునిక విద్యాబోధన చేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని తెలం గాణ యూనివర్శిటీ పరీక్షల ముఖ్య నియంత్రణ అధికారి ప్రొఫెసర్ యాదగిరి పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని దుబ్బలోగల గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యలో సమాచార సాంకేతిక పరి జ్ఞానం ఆధారిత బోధనా పద్ధతులపై ఒకరోజు సదస్సును నిర్వహించారు. ఈసందర్భంగా ప్రొఫెసర్ యాదగిరి మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో విద్యాబోధనలో వినూత్నమైన పద్ధతులు అందుబాటులో ఉన్నా య ని, విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో పాఠ్యాంశాలను బోధిస్తే ఆశించిన ఫలితాలు సాధిస్తారని తెలిపారు. టెక్నాలజీని అందిపుచ్చుకోవాలన్నారు. విద్యార్థులకు సన్మానం గత నెలలో ఢిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పరేడ్‌లో పాల్గొన్న గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు హన్మండ్లు, నరేష్, శిరీషను ప్రొఫెసర్ యాదగిరి ఘనంగా సన్మానించారు. ప్రిన్సిపల్ రామ్మోహన్‌రెడ్డి, టీయూ ఎన్ఎస్ఎస్ కో–ఆర్డినేటర్ ప్రొఫెసర్ జి ప్రవీణాబాయి, డీఆర్సీ కో ఆర్డినేటర్ రాకేష్‌చంద్ర, కోశాధికారి వినయ్‌కుమార్, కళాశాల అధ్యాపకులు, జిల్లాలోని డిగ్రీ కళాశాల అధ్యాపకులు, కాంట్రాక్ట్ లెక్చరర్స్ పాల్గొన్నారు. -
ఓ రైతు కొడుకు.. రైతు కావాలనుకోవడం లేదు.!
ఒక ఇంజనీర్ కొడుకు.. ఇంజనీర్ కావాలనుకుంటున్నాడు.. ఓ డాక్టర్ కొడుకు.. డాక్టర్ కావాలనుకుంటున్నాడు.. కానీ.. ఓ రైతు కొడుకు.. మళ్లీ రైతు కావాలనుకోవడం లేదు.. ఇదీ మన దేశంలోని వ్యవసాయ రంగం దుస్థితి.. నేటి యువత వ్యవసాయాన్ని వృత్తిగా చేపట్టడానికి విముఖత చూపుతోంది.. గ్రామీణ ప్రాంతాల్లోని యువత కూడా వ్యవసాయం మినహా మిగతా ఏదో ఓ రంగంవైపు మొగ్గు చూపుతోంది. ముఖ్యంగా ఏదో ఒక ఉద్యోగంలో చేరిపోవాలని కోరుకుంటోంది. ఏటా దేశంలో విద్యార్థులు, యువతపై పలు అంశాల్లో సర్వేలు చేసే అసర్ సంస్థ.. 2017 సంవత్సరానికి సంబంధించి చేసిన అధ్యయనంలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లోని యువతలో కేవలం ఒక శాతం మందే వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకుంటున్నారని సర్వేలో తేలింది. ఇక చాలా మంది యువత సాంకేతికత వినియోగంలో వెనుకబడి ఉన్నారని.. భారతదేశం మ్యాప్‌ను, అందులోని రాష్ట్రాలు, ప్రాంతాలను కూడా గుర్తించలేకపోతున్నారని వెల్లడైంది. అసర్ సంస్థ ఈ అధ్యయనానికి సంబంధించి మంగళవారం ఢిల్లీలో ‘బియాండ్ బేసిక్స్’పేరిట నివేదికను విడుదల చేసింది. ఈ సర్వేలో భాగంగా దేశవ్యాప్తంగా 24 రాష్ట్రాల్లోని 28 జిల్లాల పరిధిలో 14 నుంచి 18 ఏళ్ల వయసున్న 30,532 మంది గ్రామీణ యువతను ప్రశ్నించింది. మన రాష్ట్రంలో తెలంగాణ యూనివర్సిటీ సహకారంతో నిజామాబాద్‌లో సర్వే చేసింది. బ్యాంకింగ్ మెరుగు బ్యాంకుల వినియోగం విషయంలో యువత కొంతమేర మెరుగ్గా ఉన్నట్లు అసర్ గణాంకాలు చెబుతున్నాయి. సర్వే చేసిన మొత్తం యువతలో 78 శాతం మందికి బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. బ్యాంకుల్లో నగదు జమ, ఉపసంహరణ చేశామని 51 శాతం మంది, ఏటీఎం కార్డు ఉందని 16 శాతం మంది చెప్పారు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ తెలుసని చెప్పినవారు 5 శాతం మాత్రమే. ఇక 87 శాతం మంది టీవీ చూశామని, 63 శాతం మంది పేపర్ చదివామని, 47 శాతం మంది రేడియో విన్నామని తెలిపారు. పోలీసు, ఇంజనీరు.. డాక్టరు - మీరు భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నారని ప్రశ్నించగా చాలా మంది యువత సాధారణ సమాధానాలే ఇచ్చారు. - అబ్బాయిల్లో 18 శాతం ఆర్మీ లేదా పోలీస్ ఉద్యోగం చేయాలని, 12 శాతం మంది ఇంజనీర్లు కావాలని చెప్పగా.. అమ్మాయిల్లో 25 శాతం మంది టీచర్, 18 శాతం మంది డాక్టర్/నర్సు అవుతామని చెప్పారు. - ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటామని 13 శాతం మంది అబ్బాయిలు, 9 శాతం మంది అమ్మాయిలు చెప్పారు. - స్కూళ్లు, కాలేజీల్లో నమోదుకాని యువతలో 30% తాము ఏం కావాలనుకుంటున్నామో చెప్పలేకపోయారు. - 40 శాతం మంది తమకు రోల్ మోడల్స్ ఎవరూ లేరని చెప్పగా.. కొందరు తల్లిదండ్రులే రోల్ మోడల్ అని చెప్పారు. నిజామాబాద్‌లో సర్వే ఫలితాలివీ.. మన రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో నిర్వహించిన అధ్యయనంలో.. 60 గ్రామాల్లోని 945 కుటుంబాలకు చెందిన 1,035 మంది 14–18 ఏళ్ల వయసువారిని ప్రశ్నించారు. - ఇందులో 17.2 శాతం మంది అసలు చదువుకోవడం లేదు. 7.3 శాతం మంది వృత్తి విద్యా కోర్సులు చేస్తున్నారు. - 70.3% మొబైల్ ఫోన్‌ను, 35.9% ఇంటర్నెట్ను, 21% కంప్యూటర్ను వినియోగిస్తున్నారు. - 69.4 శాతం మందికి సొంత బ్యాంకు ఖాతాలున్నాయి. బ్యాంకులో నగదు జమ, ఉపసంహరణ వంటివి 44 శాతం మందికే తెలుసు. ఏటీఎంలు వినియోగించడం 20.2 శాతం మందికి, ఇంటర్నెట్ బ్యాంకింగ్ కేవలం 6.3 శాతం మందికే తెలుసు. - రెండో తరగతి పాఠ్య పుస్తకంలోని అంశాలను 76 శాతం మందే తప్పులు లేకుండా చదవగలుగుతున్నారు. ఇంగ్లిష్ వాక్యాలను 70.4 శాతం మందే చదవగలుగుతున్నారు. - 78.4 శాతం మందే డబ్బులు లెక్కపెట్టగలుగుతున్నారు. - సమయాన్ని గంటలు, నిమిషాల్లో 50 శాతం మందే చెప్పగలుగుతున్నారు. - భారతదేశం మ్యాప్‌ను చూపించి ఇది ఏ దేశమని అడిగితే 96.2 శాతం మంది సరైన సమాధానమిచ్చారు. - దేశ రాజధాని ఏదని అడిగితే 54.2 శాతం మంది సరైన జవాబిచ్చారు. - మీది ఏ రాష్ట్రమని అడిగితే 87 శాతం మంది సరిగా చెప్పారు. - మ్యాప్‌లో రాష్ట్రాన్ని గుర్తించాలని కోరితే 73.2 శాతం మంది మాత్రమే సరిగా చూపించారు. మ్యాప్‌ను కూడా గుర్తించలేరు సర్వేలో భారత దేశం చిత్రపటాన్ని (మ్యాప్)ను చూపించి.. ‘ఇది ఏ దేశం’అని అడిగితే 86 శాతం మందే సరైన సమాధానమిచ్చారు. మన దేశ రాజధాని ఏదని అడిగితే 64 శాతం, మీది ఏ రాష్ట్రమని అడిగితే 79 శాతం మాత్రమే సరైన సమాధానాలు ఇచ్చారు. మ్యాప్‌లో మీ రాష్ట్రాన్ని గుర్తించాలని అడిగితే.. 42 శాతమే సరిగా చూపించారు. డిజిటల్.. డొల్లే ప్రపంచం డిజిటల్ యుగంలో దూసుకెళుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మన దేశ యువత చాలా వెనుకబడి ఉందని అసర్ సంస్థ గణాంకాలు చెబుతున్నాయి. సర్వే సందర్భంగా 59.3 శాతం మంది యువత అసలు కంప్యూటర్ను ఎప్పుడూ ఉపయోగించలేదని, 63.7 శాతం మంది ఇంటర్నెట్ వినియోగం తెలియదని వెల్లడించారు. ఇక సెల్‌ఫోన్‌ను వినియోగించినట్లు 82.4 శాతం మంది చెప్పారు. – సాక్షి, హైదరాబాద్ -
సిబ్బంది లేకే ఇబ్బంది!
సమస్యల వలయంలో తెలంగాణ యూనివర్సిటీ నిజామాబాద్ నుంచి పాత బాలప్రసాద్ : తెలంగాణ యూనివర్సిటీలో బోధన, బోధ నేతర సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఏళ్ల తరబడి సిబ్బంది నియామకాలు చేపట్టక పోవడంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదు. యూనివర్సిటీలో ప్రస్తుతం 18 విభాగాలు, 26 కోర్సులు నడుస్తున్నాయి. తెయూకు డిచ్‌పల్లిలో మెయిన్ క్యాంపస్, భిక్కనూర్‌లో సౌత్ క్యాంపస్, సారంగపూర్‌లో ఎడ్యుకేషన్ క్యాంపస్‌లు ఉన్నాయి. తెయూ టీచింగ్ విభాగంలో ప్రస్తుతం 71 మంది రెగ్యులర్ అధ్యాపకులు పనిచేస్తున్నారు. వీరితోపాటు 52 మంది అకాడమిక్ కన్స ల్టెంట్లు విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ఇటీవలే 59 పోస్టులను మంజూరు చేసింది. త్వరలోనే పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసే అవకాశాలున్నాయి. 77లో ఆరుగురు మైనస్.. తెయూలో 77 మంది రెగ్యు లర్ ఫ్యాకల్టీ ఉండగా వారిలో ప్రస్తుతం 71 మంది విధులు నిర్వహిస్తున్నారు. ఒకరు అనారోగ్యంతో మృతి చెందగా మరొకరు పదవీ విరమణ చేశారు. ఇద్దరు డిప్యుటేషన్‌పై ఇతర యూనివర్సిటీలకు వెళ్లగా, ఇద్దరు రాజీనామా చేశారు. 67 రెగ్యులర్ పోస్టులు ఖాళీగా ఉండగా, 52 మంది అకాడమిక్ కన్సల్టెంట్లు పనిచేస్తున్నారు. పెరిగిన కోర్సులకు మరో 63 అధ్యాపక పోస్టులు మంజూరు కావాల్సి ఉంది. అన్ని కోర్సుల్లోనూ సిబ్బందిలేక ఇబ్బందులే.. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, మాథ్స్, బీఈడీ, ఎంఈడీ, ఎల్ఎల్ఎం, కెమిస్ట్రీ రెండేళ్ల పీజీ కోర్సులకు రెగ్యులర్ ఫ్యాకల్టీ లేక కేవలం అకాడమిక్ కన్సల్టెంట్లతోనే తరగ తులు నిర్వహిస్తున్నారు. అప్లయిడ్ స్టాటిస్టిక్స్ కోర్సు ఎనిమిదేళ్లుగా కేవలం ఒక్క అసిస్టెంట్ ప్రొఫెసర్‌తోనే కొనసాగుతోంది. ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సు ఐఎంబీఏ అకాడమిక్ కన్సల్టెంట్లతోనే కొనసాగుతున్నది. భిక్క నూర్ సౌత్ క్యాంపస్‌లో ఒకప్పుడు రాష్ట్రంలోనే పేరొం దిన ఆర్గానిక్ కెమిస్ట్రీ కోర్సును ఓయూ నుంచి తెయూ కు బదిలీ అయిన తర్వాత ఒక రెగ్యులర్ అసిస్టెంట్ ప్రొఫెసర్, అకాడమిక్ కన్సల్టెంట్లతో నిర్వహిస్తున్నారు. గతంలో ఆర్గానిక్ కెమిస్ట్రీ పూర్తి చేసిన విద్యార్థులు 30కి 30 మంది సీఎస్ఐఆర్ ఫెలోషిప్‌తోపాటు మంచి ఉద్యోగాలు సాధించేవారు. ప్రస్తుతం డిచ్పల్లి మెయిన్ క్యాంపస్‌లో ఆర్గానిక్ కెమిస్ట్రీ కోర్సును ప్రవేశపెట్టడంతో రెగ్యులర్ ఫ్యాకల్టీ మొత్తం ఇక్కడే ఉండి పోయారు. -
వర్సిటీల భౌగోళిక స్వరూపంలో మార్పులు!
- తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోకి నిర్మల్, ఆదిలాబాద్ - శాతవాహన వర్సిటీ పరిధిలోకి మంచిర్యాల, కుమ్రంభీం జిల్లాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాల భౌగోళిక స్వరూపాలు మారనున్నాయి. ఈ మేరకు ఉన్నత విద్యామండలి నేతృత్వంలోని కమిటీ ప్రభుత్వానికి ఓ నివేదికను అందజేసింది.మార్పులకు ప్రభుత్వం కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. త్వరలోనే మార్పులతో కూడిన ఉత్తర్వులు వెలువడనున్నాయి. భవిష్యత్తులో మరిన్ని జిల్లాలను కూడా మార్పు చేసేలా కమిటీ సిఫారసు చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలు ఉన్నాయి. నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలను తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురానుంది. కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలను శాతవాహన యూనివర్సిటీ పరిధిలోకి తేనుంది. స్థానిక ఎమ్మెల్యేలు దివాకర్‌రావు, నల్లాల ఓదెలు, చెన్నయ్య, సతీష్‌కుమార్, కోవా లక్ష్మి, కోనేరు కోనప్ప తదితరులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు చేసిన విజ్ఞప్తుల మేరకు ఈ మార్పులు చేసింది. యూనివర్సిటీల పరిధుల్లోని జిల్లాలు ఇవే.. కాకతీయ యూనివర్సిటీ: వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జనగాం, ఖమ్మం, భద్రాద్రి శాతవాహన యూనివర్సిటీ: కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల. కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల తెలంగాణ యూనివర్సిటీ: నిజమాబాద్; కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్. ఉస్మానియా యూనివర్సిటీ: హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, సిద్దిపేట్, మెదక్, సంగారెడ్డి మహాత్మాగాంధీ యూనివర్సిటీ: నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి. పాలమూరు యూనివర్సిటీ: మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్. గద్వాల జోగులాంబ -
టీయూలో ప్రశ్నాపత్రం లీకేజీ?
నిజామాబాద్: తెలంగాణ యూనివర్సిటీ పీజీ పరీక్షల ప్రశ్నపత్రం లీక్ అయినట్లు సమాచారం. మే 16న జరిగిన ఎంఏ మాస్ కమ్యూనికేషన్ నాలుగో సెమిస్టర్ మొదటి పేపర్లోని ప్రశ్నలు బయటికి పొక్కినట్లు ఆలస్యంగా వెలుగులోకి రావడంతో వర్సిటీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. రెండు రోజుల ముందే ఈ ప్రశ్నలు బయటకు పొక్కినట్లు తెలుస్తోంది. యూనివర్సిటీ పీజీ పరీక్షలు మే 16 నుంచి ప్రారంభమయ్యాయి. కాగా, సాధారణంగా పీజీ పరీక్ష పత్రాలను ఇతర యూనివర్సిటీల ప్రొఫెసర్లతో తయారు చేయించి తెప్పిస్తుంటారు. ఎంఏ మాస్ కమ్యూనికేషన్ కోర్సుకు సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ప్రశ్నపత్రాన్ని తెప్పించినట్లు సమాచారం. ఈ పత్రాలు పరీక్షకు కొద్ది రోజుల ముందు యూనివర్సిటీకి చేరుతాయి. ఆ పత్రాల్లో ఏమైన అక్షర దోషాలు, తప్పులు, సవరణలు చేయాల్సిన ప్రక్రియ మోడరేషన్‌ను చేపట్టిన అనంతరం పరీక్ష నిర్వహిస్తారు. మోడరేషన్ సందర్భంగా ఈ పేపర్లోని ప్రశ్నలు బయటకు పొక్కాయా? లేక ఇంకా ఏదైనా సందర్భంలో జరిగిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎంఏ మాస్ కమ్యూనికేషన్‌కు సంబంధించి ప్రశ్నలు బయటికి పొక్కినట్లు సంభాషణ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నట్లు సమాచారం. పరీక్షలో ఏయే ప్రశ్నలు వస్తాయనే అంశంపై వివరిస్తున్న సంభాషణ వాట్సాప్‌లో తిరుగుతోంది. ఈ విషయమై వర్సిటీ వీసీ ప్రొఫెసర్ సాంబయ్యను సంప్రదించగా, ప్రశ్నపత్రం బయటికి పొక్కిన విషయం తన దృష్టికి రాలేదన్నారు. సాధారణంగా పీజీ పరీక్ష పత్రాలు లీకయ్యే అవకాశాలుండవన్నారు. ఇవన్నీ వదంతులు కావచ్చని, అయినా.. విషయం పరిశీలిస్తానని చెప్పారు. -
నిలిచిపోయిన డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు
నిజామాబాద్: తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు నిలిచిపోయాయి. ప్రైవేటు డిగ్రీ కాలేజీలు తమ సెంటర్లలో పరీక్షలను బాయ్‌కాట్ చేయడంతో పరీక్షలు నిలిచిపోయాయి. సీబీసీఎస్ సెమిస్టర్స్ విధానంతో డిగ్రీ, పీజీ యాజమాన్యాలపై 30 శాతం అదనపు భారం పడుతుందని తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ మేనేజ్మెంట్ అసోసియేషన్ వెల్లడించింది. డిగ్రీ, పీజీ ఫీజులు పెరగకపోవడంతో సకాలంలో తమకు రీయింబర్స్మెంట్ అందడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజులు పెరిగే వరకు ఆన్లైన్ అడ్మిషన్లలో పాల్గొనబోం అని ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ మేనేజ్మెంట్ అసోసియేషన్ స్పష్టం చేసింది. -
త్వరలో కొత్త పార్టీ!
ప్రజా గాయకుడు గద్దర్ డిచ్పల్లి (నిజామాబాద్ రూరల్): రాష్ట్రంలో త్వరలో త్యాగాలు చేసినవారంతా ఏకమవుతారు.. త్యాగాల తెలంగాణ లాంటి ఒక పార్టీ ఏర్పడుతుందని ప్రజా గాయకుడు గద్దర్ అన్నారు. బుధవారం రాత్రి తెలంగాణ యూనివర్సిటీలో అంబేడ్కర్ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వ ర్యంలో నిర్వహించిన మహనీయుల జయంతి కార్యక్రమంలో గద్దర్ ప్రసంగించారు. ప్రస్తుతం భౌగోళిక తెలంగాణ వచ్చిందని, పాలన పైనుంచి జరుగుతుందనీ, అది ఉన్నత వర్గాల వారికే ఉపయోగ పడుతుందన్నారు. త్యాగాల తెలంగాణ రావాలన్నారు. -
తెలంగాణ వర్సిటీలో విద్యార్థుల ఆందోళన
డిచ్పల్లి : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఖాళీగా ఉన్న సీట్లను స్పాట్ అడ్మిషన్ ద్వారా వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. విద్యార్థులు యూనివర్సిటీ వీసీ చాంబర్ ఎదుట బైఠాయించి ధర్నాకు దిగారు. ఈ ధర్నాలో సుమారు 30 మంది పాల్గొన్నారు. -
వీసీల నియామకం కేసు సోమవారానికి వాయిదా
తెలంగాణలో యూనివర్శిటీ వీసీల నియామకం కేసు విచారణను సుప్రీం కోర్టు సోమవారానికి వాయిదావేసింది. వీసీల నియామకపు ఉత్తర్వులను కొట్టివేస్తూ ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా గత సోమవారం విచారణ జరిపిన ధర్మాసనం యథాతథస్థితిని కొనసాగిస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీచేసి విచారణను వాయిదావేసిన సంగతి తెలిసిందే. తాజాగా శుక్రవారం ఈ కేసు విచారణకు రాగా తెలంగాణ ప్రభుత్వం కొంత సమయం కోరింది. ఈ నేపథ్యంలో విచారణను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.ఎస్.ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారానికి వాయిదావేసింది. -
వీసీ సాంబయ్యకు మరో నెల ఊరట
తెయూ(డిచ్పల్లి) : సుప్రీం కోర్టు తీర్పుతో తెలంగాణ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ సాంబయ్యకు మరో నెల ఊరట లభించినట్లయింది. గత నెల 25న రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలకు వీసీ లను నియమించింది. ఈ విషయమై హైకోర్టులో కేసు నడుస్తున్న విషయం తెలిసిందే. అదే నెల 27న హైకోర్టు వీసీ ల నియామకాన్ని కొట్టివేస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. అయితే ప్రభుత్వ వినతి మేరకు తీర్పు అమలును నెల రోజుల పాటు వాయిదా వేసింది. హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సోమవారం తెలంగాణలో వీసీ ల నియామకంలో యథాస్థితిని కొనసాగించాలని సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ విన్నపం మేరకు తీర్పును మరో నెల రోజుల పాటు వాయిదా వేసింది. ఒక వేళ సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టు తీర్పుకు అనుకూలంగా ఉత్తర్వులు వచ్చినట్లయితే తెయూ వీసీ సాంబయ్యతో పాటు మిగిలిన యూనివర్సిటీల వీసీ తమ పదవులను కోల్పోయేవారు. -
పొన్నాలను కలిసిన అధ్యాపక బృందం
తెయూ(డిచ్పల్లి) : సీనియర్ రాజకీయ వేత్త, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఆదిలాబాద్ జిల్లాలో పర్యటన ముగించుకుని తిరిగి హైదరాబాద్ వెళ్తూ డిచ్పల్లి మండలం సుద్దపల్లి శివారులో కొద్ది సేపు విశ్రాంతి కోసం ఆగారు. ఈ సందర్భంగా కొంతమంది తెలంగాణ యూనివర్సిటీ అధ్యాపకులు మర్యాదపూర్వకంగా వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా పొన్నాల మాట్లాడుతూ.. ప్రపంచంలో మార్పును తెచ్చేది, ఆవిష్కరణలకు, సృజనాత్మకతను పెంపొందించేది అధ్యాపకులే అన్నారు. అధ్యాపకుల వృత్తి అత్యంత పవిత్రమైందని, బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని సూచించారు. క్లాస్ రూంలలోనే దేశ భవిష్యత్ తయారవుతుందని తెలిపారు. తెలంగాణ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్‌గా ప్రొఫెసర్ పి.సాంబయ్యను నియమించడం హర్షనీయమని, ఆయనతో తనకు పరిచయముందన్నారు. ఆయన నిజాయితీ గల విద్యావేత్త అని, అందరూ వీసీకి సహకరించి, వర్సిటీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. పొన్నాలను కలిసిన వారిలో అధ్యాపకులు జాన్సన్, బి.వెంకటేశ్వర్లు, ఆంజనేయులు, త్రివేణి, చంద్రశేఖర్, నాగరాజు, సత్యనారాయణ, రాజారాం, రమణాచారి, అబ్దుల్ ఖవి తదితరులున్నారు. -
మట్టి పనులకు వెళ్లి చదువుకున్నా
ఎప్పుడూ టీచర్లతో దెబ్బలు తినలేదు తెలంగాణ ఉద్యమం అంటే మహా పిచ్చి కేసీఆర్‌కు నచ్చితే అభిమానిస్తారు సన్మాన సభలో తెలంగాణ యూనివర్సిటీ వీసీ సాంబయ్య పరకాల : తట్టలు ఎత్తాను... రోడ్డు పనులకు వెళ్లాను... మట్టి పనులకు వెళ్లి చదువుకున్నానని తెలంగాణ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ పసుల సాంబయ్య అన్నారు. వీసీగా నియమితులైన సందర్భంగా ఆయన స్వగ్రామమైన మండలంలోని నాగారం ప్రాథమిక పాఠశాలలో సోమవారం సన్మాన సభను నిర్వహించారు. న్యాయవాది ఏరుకొండ జయశంకర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వీసీ పసుల సాంబయ్య దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వీసీ సాంబయ్య మాట్లాడుతూ గ్రామంలో 50పైసలకు కూలీ పోయే వాడినన్నారు. నాగారం, పైడిపల్లి రోడ్డు నిర్మాణం పనికి పోయానని చెప్పారు. ఈ రోడ్డు పోసే పనికి పోయి ఇప్పుడు అదే రోడ్డుపై కారులో వస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. కష్టపడే తత్వం, నమ్మకం ఉంటే పైకి రావచ్చన్నారు. చదువులో అందరి కంటే ముందు ఉండేవాడినని అన్నారు. టీచర్లతో ఒక్క దెబ్బ తినకుండా చదువుకున్నానని తెలిపారు. బాగా చదివే పిల్లలను ఉపాధ్యాయులు ప్రేమిస్తారన్నారు. చదువులో రాణిం చడం కారణంగా జయపాల్, హరగోపాల్ సార్లు ప్రోత్సాహాన్ని అందించారన్నారు. చదువుతున్న క్రమంలోనే ఉద్యోగాలు వచ్చాయన్నారు. లెక్చరర్ కావాలనే ఏకైక కారణంతో కష్టపడి చదువుకున్నానని చెప్పారు. తెలంగాణ ఉద్య మం అంటే మహా పిచ్చిగా మారిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం వ్యాసాలు రాశానని చెప్పారు. అదే అనుభవంతో సమావేశాల్లో మాట్లాడి ప్రజల హృదయాలను గెలుచుకున్నానని తెలిపారు. ఆత్మకూరులో జరిగిన సమావేశంలో నా ప్రసంగం కోసం ప్రజలు పట్టుబట్టడంతో వేదికపై ఉన్న మంత్రి కేటీఆర్ ఆశ్చర్య పోయారన్నారు. టీఆర్ఎస్ శిక్షణ తరగతుల్లో పాల్గొని ఎంపీ, ఎమ్మెల్యేలను మెప్పించానని తెలిపారు. నా ప్రసంగాలే సీఎం కేసీఆర్‌కు దగ్గర అయ్యేటట్లు చేసిందన్నారు. టీఎస్పీఎస్సీ సభ్యుడిగా నియమిస్తానని అంటే తనకు ఇష్టం లేదని చెప్పానన్నారు. వరంగల్ ఎంపీ టికెట్‌ను తిరస్కరించి, వీసీ మాత్రమే కావాలని అడిగానన్నారు. తెలంగాణ యూనివర్సిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని అన్నారు. కేసీఆర్‌కు నచ్చితే అభిమానిస్తారని అన్నారు. గొప్ప పట్టుదల ఉన్న నాయకుడని కొనియాడారు. కార్యక్రమం లో జెడ్పీటీసీ సభ్యురాలు పాడి కల్పనాదేవి, ఎంపీపీ నేతాని సులోచన, ఎంపీటీసీ ఎరుకొండ రమాదేవి–శ్రీనివాస్, కోడూరి మల్లేశం, బాల్య స్నేహితులు గంప లింగమూర్తి, ఆనం దం, రాందాసు, హంసారెడ్డి, నర్సింహరామ య్య, కేయూ పరిశోధక విద్యార్థులు మడికొండ శ్రీను, మార్క కిరణ్, ముంజం ప్రకాష్ , సీఐ విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. -
డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాలకు చివరి అవకాశం
తెయూ(డిచ్పల్లి) : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కోర్సులలో ప్రవేశాల కోసం చివరి దశ ఆన్లైన్ ప్రవేశాలను ఈ నెల 25నుంచి 30వ తేది వరకు నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి శనివారం తెలిపారు. ఇప్పటి వరకు దోస్త్ (డీవోఎస్‌టీ) వెబ్ సైట్ ద్వారా పేర్లు నమోదు చేసుకోని వారు సైతం ఈ నెల 25 నుంచి 30వరకు నమోదు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. మొదటి, రెండవ దశల్లో పేర్లు నమోదు చేసుకున్న వారు పై తేదిల్లో వెబ్ ఆప్షన్లు ఎంచుకోవాలని ఆయన సూచించారు. ఆగస్ట్ 2వ తేదిన సీట్ల కెటాయింపు ఉంటుందని, 4వ తేదిన సంబంధిత కళాశాలల్లో అభ్యర్థులు రిపోర్టు చేయాల్సి ఉంటుందని ఆయన వివరించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. -
తెయూ హాస్టళ్లలో సమస్యలు లేకుండా చూడాలి
డిచ్ పల్లి : తెలంగాణ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్‌లో గల బాలుర, బాలికల వసతి గృహాలపై ప్రిన్సిపాల్ కనకయ్య వార్డెన్లతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యార్థులకు సంబంధించిన అడ్మిషన్ రికార్డులు, దరఖాస్తు ఫారాలు, అడ్మిషన్లు ఫీజులు, డిపాజిట్స్ తదితర విషయాలను పరిశీలించారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో వసతి గృహాల్లో ఉండే విద్యార్థులకు ఎలాంటి సమస్యలు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే త్వరలో ప్రారంభం కానున్న నూతన హాస్టల్ భవనంతో సహా అన్ని వసతి గృహాలను శుభ్రం చేసి ఉంచాలని ఆదేశించారు. అలాగే యూజీసీ నుంచి ప్రత్యేకంగా బాలికల కోసం వసతి గృహాల కోసం ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. గత సంవత్సరంలో లోటు బడ్జెట్ ఏదైనా ఉంటే దానికి గల కారణాలు కనుగొని, సమస్య పరిష్కారం కోసం వసతి గృహ సిబ్బంది చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో చీఫ్ వార్డెన్ రవీందర్‌రెడ్డి, వార్డెన్లు మహేందర్‌రెడ్డి, సంపత్, రాంబాబు, కేర్‌టేకర్స్, సూపరింటెండెంట్ విజయలక్ష్మి, ప్రవీణాబాయి తదితరులు పాల్గొన్నారు. -
సెర్చ్ కమిటీలో మార్పు
- తెయూ వర్సిటీ నామినీగా ప్రొఫెసర్ వీఎస్ ప్రసాద్ - నెల రోజుల్లో తెయూ వీసీ నియామకం - వీసీ కోసం 162 దరఖాస్తులు - జూలై 15న భేటీ కానున్న సెర్చ్ కమిటీ - ఆశావహుల పైరవీలు షురూ తెయూ(డిచ్పల్లి) : తెలంగాణ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ఎంపిక కోసం గతంలో నియమించిన సెర్చ్ కమిటీలో రాష్ట్ర ప్రభుత్వం మార్పు చేసింది. గతంలో తెలంగాణ యూనివర్సిటీ ప్రతినిధిగా ఉన్న కాకతీయ యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ లింగమూర్తిని తొలగించి, ఆయన స్థానంలో బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ వి.శివలింగ ప్రసాద్‌ను నియమించింది. ఈ మేరకు శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో తెలంగాణ యూనివర్సిటీ ప్రతినిధిగా వి.శివలింగ ప్రసాద్, యూజీసీ ప్రతినిధిగా యూనివర్సిటీ ఆఫ్ కలకత్తా వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ సృజన్దాస్, ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్యను సభ్యులుగా నియమిస్తూ శనివారం ఉన్నత విద్యాశాఖ జీవో విడుదల చేసింది. నూతన సెర్చ్ కమిటీ జూలై 15 న సమావేశం అవుతుంది. ఇప్పటికే నల్గొండ జిల్లాలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ వీసీ ఎంపిక కోసం సెర్చ్ కమిటీ సమావేశం ఈ నెల 21న జరిగిన విషయం తెలిసిందే. అలాగే రాష్ట్రంలోని ఓయూ, కేయూ, జేఎన్టీయూహెచ్, బీఆర్ అంబేద్కర్, శాతవాహన, పాలమూరు యూనివర్సిటీ వీసీల ఎంపిక కోసం సెర్చ్ కమిటీ సమావేశాల తేదీలను ప్రభుత్వం ప్రకటించింది. వీసీల ఎంపిక ప్రక్రియను జూలై నెలాఖరు నాటికి పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారని సమాచారం. ప్రొఫెసర్ లింగమూర్తి మార్పు వెనుక.. తెలంగాణ యూనివర్సిటీ వీసీ ఎంపిక కోసం రాష్ట్ర ప్రభుత్వం మొదట ప్రకటించిన సెర్చ్ కమిటీలో కాకతీయ యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ లింగమూర్తి, తెయూ ప్రతినిధిగా ఉన్నారు. అయితే ప్రొఫెసర్ లింగమూర్తి సైతం వీసీ రేసులో ఉన్నారు. శాతవాహన, కాకతీయ యూనివర్సిటీలతో పాటు మరో యూనివర్సిటీ వీసీ కోసం లింగమూర్తి దరఖాస్తు చేసుకున్నారు. వీసీ రేసులో ఉన్న వ్యక్తి మరో యూనివర్సిటీ వీసీ సెర్చ్ కమిటీలో సభ్యుడిగా కొనసాగించడం సమంజసం కాదని ఆలోచించిన ప్రభుత్వం ఆయనను తొలగించినట్లు తెలిసింది. ఆయన స్థానంలో తెయూ ప్రతినిధిగా బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ వీఎస్ ప్రసాద్‌ను నియమించింది. సెర్చ్ కమిటీ సభ్యులు జూలై 15న సమావేశం నిర్వహించి వీసీ కోసం అందిన దరఖాస్తుల నుంచి ముగ్గురు అభ్యర్థులను ఎంపిక చేసి, వారి పేర్లను సీల్డ్ కవర్లో ఉంచి ప్రభుత్వానికి అందజేస్తారు. ఆ ముగ్గురిలో నుంచి ఒకరిని ప్రభుత్వం తెయూ వీసీగా నియమిస్తుంది. సెర్చ్‌కమిటీ సమావేశం తేదీ ఖరారు కావడంతో వీసీ నియామకం కోసం దరఖాస్తు చేసుకున్న ఆశావహులు తమ ప్రయత్నాలు ప్రారంభించారు. నెల రోజుల్లో .. మరో నెల రోజుల్లో తెలంగాణ యూనివర్సిటీ ఇన్చార్జి పాలన నుంచి బయట పడనుంది. రెండు సంవత్సరాలుగా ఇన్చార్జి వీసీల పాలనలో కొనసాగుతున్న తెయూకు త్వరలో శాశ్వత వీసీ రానున్నారు. వీసీ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలంటే కనీసం పదేళ్లు ప్రొఫెసర్‌గా పని చేసి ఉండాలన్న ప్రధానమైన నిబంధన గతంలో ఉండేది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిబంధనను సడలించి ప్రొఫెసర్‌గా ఐదేళ్లు పూర్తి చేసుకున్న వారు అర్హులుగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వీసీగా పని చేయడానికి ఎక్కువ మందికి అవకాశం కల్పించినట్లయింది. రాష్ట్రంలోని యూనివర్సిటీలలో విధులు నిర్వహిస్తున్న ప్రొఫెసర్లు పలువురు పెద్ద సంఖ్యలో వీసీ పోస్టు కోసం దరఖాస్తులు చేశారు. తెయూ వీసీ కోసం 162 దరఖాస్తులు వచ్చినట్లు ఉన్నత విద్యామండలి అధికారులు తెలిపారు. ప్రొఫెసర్ సాయిలు.. తెలంగాణ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీలకు రిజిస్ట్రార్‌గా పని చేసిన ప్రొఫెసర్ సాయిలు నిజామాబాద్ జిల్లాకు చెందిన వారే. మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన సాయిలు, ఇక్కడి పరిస్థితులపై అవగాహన కలిగి ఉన్నారు. ఆయన బలమైన లాబీయింగ్ కలిగి ఉన్నారు. కాకతీయ యూనివర్సిటీలో ఎంబీఏ ఆచార్యుడిగా పని చేస్తున్నారు. ప్రొఫెసర్ సీతారామారావు.. కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ సీతారామరావు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి.పాపిరెడ్డికి అత్యంత సన్నిహితుడు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారు. ప్రొఫెసర్ భూపతిరావు.. కేయూ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న ప్రొఫెసర్ భూపతిరావు బలమైన వెలమ సామాజిక వర్గానికి చెందిన వారు. ఈయనకు రాష్ట్రంలోని ఏదోక యూనివర్సిటీకీ వీసీ గా నియమించే అవకాశాలు ఉన్నట్లు చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఓయూ వీసీగా లేదంటే తెయూ వీసీగా ఈయన పేరు ‘ఫైనల్ త్రీ’ లో ఉండే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ప్రొఫెసర్ సాయన్న.. ఉస్మానియా యూనివర్సిటీలో ఫిజిక్స్ విభాగంలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న జిల్లా వాసి సాయన్న తెయూ వీసీగా పని చేసేందుకు బరిలో నిలిచారు. జిల్లాలోని కోటగిరి ప్రాంతానికి చెందిన ఈయనకు జిల్లా మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ప్రొఫెసర్ శ్యామలా రాథోడ్.. కాకతీయ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న శ్యామలా రాథోడ్ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారు. ఎస్టీ మహిళ కోటాలో వీసీ పోస్టు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రొఫెసర్ దామోదర్ రావు.. అసోసియేషన్ ఆఫ్ కాకతీయ యూనివర్సిటీ టీచర్స్ అధ్యక్షుడు ప్రొఫెసర్ దామోదర్ రావు సైతం రేసులో ఉన్నారు. ఈయన కాపు సామాజిక వర్గానికి చెందిన వారు. ఏది ఏమైనా జిల్లా పరిస్థితులు, యూనివర్సిటీ పరిస్థితులు సంపూర్ణంగా అవగాహన కలిగి ఉన్న ఎంపీ కల్వకుంట్ల కవిత నిర్ణయమే వీసీ ఎంపికలో కీలకం కానుంది. ఈ రకంగా చూసుకుంటే ప్రస్తుత రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి రేసులో ముందు వరసలో ఉండే అవకాశాలున్నాయి. లాబీయింగ్, డబ్బులు ప్రధాన పాత్ర పోషించే అవకాశం.. ఏది ఏమైనా ఈసారి వీసీ ఎంపికలు పారదర్శకంగా చేపడతామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే నిబంధనలు సడలించడంతో వీసీ పోస్టుల కోసం ఆశావహులు పెరగడం వల్ల తీవ్రమైన పోటీ నెలకొంది. రాజకీయంగా బలమైన లాబీయింగ్‌తో పాటు డబ్బులు కీలక పాత్ర పోషించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఒక్కో వీసీ పోస్టు కనీసం రూ.30 - 40 లక్షలు పలికే అవకాశం ఉన్నట్లు వర్సిటీ వర్గాల్లో ప్రధానంగా చర్చ నడుస్తోంది. గతంలో వీసీ లుగా.. తెలంగాణ యూనివర్సిటీ వీసీలుగా గతంలో ప్రొఫెసర్ కాశీరాం (ఎస్సీ(మాల), మహమ్మద్ అక్బర్ అలీఖాన్ (మైనార్టీ) పని చేశారు. ఇప్పుడు వీసీ పదవి ఏ సామాజిక వర్గాన్ని వరిస్తుందో మరి కొద్ది రోజుల్లో తేలనుంది. తెయూ వీసీ రేసులో లింబాద్రి తెయూ వీసీ ఎంపికలో అందరి కంటే ముందు వరసలో ప్రస్తుత ఇన్చార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి పేరు వినిపిస్తోంది. ఏడాదిన్నర కాలంగా ఇన్చార్జి వీసీ, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ సి పార్థసారథితో కలిసి వర్సిటీ అభివృద్ధికి ఆయన చేసిన కృషి కలిసి వచ్చేలా ఉంది. వర్సిటీలో నిరంతర విద్యుత్ సరఫరా, రక్షిత తాగునీటి సరఫరా, ఆధునిక సెంట్రల్ లైబ్రరీ, ఉచిత వై-ఫై ఇంటర్నెట్, అన్నింటికి మించీ ‘నాక్’ గుర్తింపు రావడంలో రిజిస్ట్రార్ లింబాద్రి చేసిన కృషి ఆయనను రేసులో ముందు వరసలో నిలిపే అవకాశం ఉంది. దీనికి తోడు జిల్లా వాసి (స్థానికుడు) కావడం, స్థానిక రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ కల్వకుంట్ల కవిత ఆశీస్సులు ఉండటం కలిసి వస్తుందని ఆశిస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న లింబాద్రి తెయూ రిజిస్ట్రార్‌గా రెండు సార్లు పని చేసిన అనుభవం కలిగి ఉన్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు. -
త్వరలో డిగ్రీ ఫలితాలు
తెయూ రిజిస్ట్రార్ లింబాద్రి తెయూ(డిచ్పల్లి) : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో మార్చిలో నిర్వహించిన డిగ్రీ పరీక్షల ఫలితాలు సాధ్యమైనంత తొందరగా ఇవ్వడానికి కృషి చేస్తున్నట్లు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి తెలిపారు. శుక్రవారం డిగ్రీ జవాబు పత్రాల మూల్యాంకనం జరుగుతున్న స్పాట్ కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. స్పాట్ కేంద్రంలో మూల్యాంకన ప్రక్రియను వేగవంతం చేసి ఫలితాలు తొందరగా ఇచ్చేందుకు కృషి చేయాలని ఆయన పరీక్షల నియంత్రణ విభాగాధికారులను ఆదేశించారు. ఎకనామిక్స్ సబ్జెక్టు మూల్యాంకనంతో పాటు ప్రభుత్వ పాలన శాస్త్ర సబ్జెక్టు మూల్యాంకనం ముగిసిందన్నారు. మేథమెటిక్స్, హిస్టరీ సబ్జెక్టుల మూల్యాంకనం ప్రారంభమైందని రిజిస్ట్రార్ తెలిపారు. కొత్తగా స్పాట్ వాల్యూయేషన్‌కు వస్తున్న అధ్యాపకులు అప్రమత్తతతో మూల్యాంకనం చేయాలని, ఎలాంటి అజాగ్రత్తకు తావీయరాదని రిజిస్ట్రార్ సూచించారు. విద్యార్థులకు ఫైనల్ ఫలితాలు త్వరగా ఇస్తే ఇతర పోటీ పరీక్షలకు అర్హత లభిస్తుందని, వారు ఎన్నో పరీక్షలు రాసుకునే వీలు కలుగుతుందన్నారు. స్పాట్ కేంద్రంలో మంచి సౌకర్యాలతో పాటు బార్ కోడింగ్ ప్రక్రియతో ఆధునిక టెక్నాలజీ వాడకంపై ఆయన సీవోఈ పాత నాగరాజు, అసిస్టెంట్ కంట్రోలర్స్ లావణ్య, రాంబాబు, బాల్‌కిషన్‌లను అభినందించారు. -
వర్సిటీని వేధిస్తోన్న ఖాళీలు
తెయూ(డిచ్పల్లి) : తెలంగాణ యూనివర్సిటీలో బోధన, బోధనేతర సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఏళ్ల తరబడి నియాకాలు లేవు. ఉన్నత విద్యారంగానికి ఎంతో చేస్తున్నామని ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకోవడమే తప్పా ఆచరణలో అవేవి లేవు. దీంతో రెగ్యులర్ ఫ్యాకల్టీ లేక విద్యార్థులకు నాణ్యమైన విద్య కరువైంది. రెగ్యులర్ వారిలో చాలా మందికి పరిపాలనా అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతో వారు తరగతి గదుల మొఖం చూడటం మానేశారు. అదనపు బాధ్యతలు లేని వారిలో పలువురు మొక్కుబడిగా వచ్చిపోతున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో అకడమిక్ కన్సల్టెంట్ల(ఏసీ)తోనే కొద్దో గొప్పో తరగతులు సా..గుతున్నాయని విద్యార్థులు అంటున్నారు. బోధనా సిబ్బంది పొందుతున్న వేతనాలకు సంబంధం లేకుండా మొక్కుబడిగా విధులు బోధిస్తున్నారని, నాణ్యమైన విద్య అందడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు అధ్యాపకులు వర్సిటీకి ఎప్పుడు వస్తారో, ఎప్పుడు పోతారో తెలియని దుస్తితి. పలు విభాగాల్లో రెగ్యులర్ ఫ్యాకల్టీ కరువు.. వర్సిటీలో ప్రస్తుతం 18 విభాగాలు, 26 కోర్సులు నడుస్తున్నాయి. 26 కోర్సులకు పలు కోర్సుల్లో రెగ్యులర్ ఫ్యాకల్టీ లేకుండానే సాగుతున్నాయి. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, మాథ్స్, బీఈడీ, ఎల్ఎల్ఎం, ఫార్మాస్యూటిక్ కెమిస్ట్రీ, ఐడేళ్ల కోర్సు ఐఎంబీఏలకు రెగ్యులర్ ఫ్యాకల్టీ లేక ఏసీలతోనే తరగుతులు నెట్టుకొస్తున్నారు. భిక్కనూర్ సౌత్ క్యాంపస్‌లో ఒకప్పుడు రాష్ట్రంలోనే పేరొం దిన ఆర్గానిక్ కెమిస్ట్రీ కోర్సు ఉంది. ఇది ఓయూ నుంచి తెయూకు బదిలీ అయ్యాక రెగ్యులర్ అసిస్టెంట్ ప్రొఫెసర్, ఏసీతో నెట్టుకొస్తున్నారు. గతంలో ఈ కోర్సు చేసి న విద్యార్థులు 30కి 30 మంది సీఎస్ఐఆర్ ఫెలోషిప్, మంచి ఉద్యోగాలు సాధించేవారు. ప్రస్తుతం డిచ్పల్లి మెయిన్ క్యాంపస్‌లో ఆర్గానిక్ కెమిస్ట్రీ కోర్సును ప్రవేశపెట్టడంతో రెగ్యులర్ ఫ్యాకల్టీ మొత్తం ఇక్కడే ఉండి పోయారు. దీంతో సౌత్ క్యాంపస్‌లో సరైన బోధన లేక విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం లేదు. రెగ్యులర్ ఫ్యా కల్టీ లేని కోర్సుల్లో విద్యార్థులు పీహెచ్డీ చేసేందుకు వీలు లేక నష్టపోతున్నారు. 67 రెగ్యులర్ ఫ్యాకల్టీ పోస్టు లు ఖాళీ ఉండగా, 57 మంది ఏసీలు విధులు నిర్వహిస్తున్నారు. పెరిగిన కోర్సులకు మరో 42 అధ్యాపకల పోస్టులు మంజూరు కావాల్సి ఉంది. నాక్ గ్రేడింగ్‌పై ప్రభావం..! ఇటీవల వర్సిటీ నాక్ గుర్తింపు సాధించింది. అయితే నాక్ పీర్టీం వచ్చినపుడు రెగ్యులర్ ఫ్యాకల్టీ తక్కువగా ఉండ టం, ప్రత్యేక సైన్స్ కళాశాల, ల్యాబ్స్ లేకపోవడం మైన స్‌గా మారాయి. ఈ అంశాలు నాక్ గ్రేడింగ్‌పై ప్రతికూల ప్రభావం చూపాయి. దీంతో కేవలం నాక్ బీ గ్రేడ్‌నే ఇచ్చింది. లేదంటే ఏ గ్రేడ్ సాధించే అవకాశం ఉండేదని వర్సిటీ అధికారులు, అధ్యాపకులు అభిప్రాయపడుతున్నారు. సైన్స్ కళాశాల, ల్యాబ్‌లు లేవు.. తెయూలో సైన్స్ కళాశాల లేక మైనస్‌గా మారింది. ప్రస్తుతం ఆర్ట్స్ కళాశాలలోనే సైన్స్ కోర్సులు సాగుతున్నాయి. సరిపోయే గదులు లేక తరగతి గదుల్లోనే ల్యాబ్స్ ఉన్నాయి. దీంతో సరైన ల్యాబ్స్ లేక విద్యార్థులు పరిశోధనలు సాగించలేక పోతున్నారు. ల్యాబ్స్ లేక సైన్స్ విద్యార్థులు ‘కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(సీఎస్ఐఆర్) ఫెలోషిప్’లను పొందలేక పోతున్నారు. తగినంత ఫ్యాకల్టీ అవసరం.. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందాలంటే రెగ్యులర్ ఫ్యాకల్టీ ఉండాలి. ప్రభుత్వం వర్సిటీల్లో కోర్సులు, విద్యార్థుల సంఖ్యకనుగుణంగా టీచింగ్, నాన్-టీచింగ్ సిబ్బందిని రిక్రూట్ చేయాలి. ప్రస్తుతం తెయూలో తగినంత రెగ్యులర్ ఫ్యాకల్టీ లేకున్నా సాధ్యమైనంత మేర నాణ్యమైన విద్యనందించేందుకు కృషి చేస్తున్నాం. సైన్స్ కళాశాల, ల్యాబ్స్ లేక విద్యార్థులు పరిశోధనలు చేయలేక పోతున్నారు. వీసీ పార్థసారథి వర్సిటీ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. నాక్ గుర్తింపు రావడంతో యూజీసీ, రూసా, కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖల నుంచి నిధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. - ప్రొఫెసర్ లింబాద్రి, రిజిస్ట్రార్ -
తెలంగాణ వర్సిటీకి ‘న్యాక్’ గుర్తింపు
డిచ్పల్లి: నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీ ప్రతిష్టాత్మక న్యాక్ గుర్తింపు పొందింది. ‘బి ప్లస్’ గ్రేడ్‌తో 2.61 స్కోరింగ్ సాధించింది. జిల్లాకో యూనివర్సిటీ ఉండాలనే ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. న్యాక్ వెబ్సైట్లో వర్సిటీకి మంచి గ్రేడింగ్‌తో గుర్తింపు ఇచ్చినట్లు బుధవారం సమాచారం అందుబాటులో ఉంచారు. విషయం తెలిసిన వెంటనే రిజిస్ట్రార్ చాంబర్లో రిజిస్ట్రార్ ఆర్.లింబాద్రిని కలసిన అధ్యాపకులు, బోధన, బోధనేతర, ఔట్సోర్సింగ్ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. నాన్-టీచింగ్ సిబ్బంది ఆధ్వర్యంలో పరిపాలనా భవనం ఎదుట పటాసులు కాల్చి, మిఠాయిలు పంచి పెట్టారు. న్యాక్ గుర్తింపు అందరి సమష్టి కృషి ఫలితమని రిజిస్ట్రార్ పేర్కొన్నారు. -
ఇక వీసీలను నియమించేది సర్కారే
- గవర్నర్ నేతృత్వంలో నియామకాలు రద్దు - రాష్ట్రంలో కొత్తగా యూనివర్సిటీ చట్టం ఏర్పాటు - పాత చట్టాలకు సవరణలు చేస్తూ ఉత్తర్వులు సాక్షి,హైదరాబాద్: యూనివర్సిటీల్లో వైస్ చాన్సలర్లను (వీసీ) నియమించే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తమ అధీనంలోకి తెచ్చుకుంది. ఇన్నాళ్లు గవర్నర్ నేతృత్వంలో జరిగే ఈ నియామకాల విధానం దీంతో రద్దు అయ్యింది. అంతే కాదు వివిధ రంగాల్లో నిపుణులను ఒక్కో యూనివర్సిటీకి చాన్సలర్‌గా నియమించేలా ఈ చట్టం రూపకల్పన జరిగింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీల చట్టం-1991కి రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేసింది. తెలంగాణ యూనివర్సిటీల చట్టంగా దీనిని పేర్కొంది. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో వివిధ యూనివర్సిటీలకు ఉన్న వేర్వేరు చట్టాల్లోని నిబంధనలను కూడా మార్చింది. ఆయా యూనివర్సిటీలకు ఉన్న పాత చట్టాలను తీసుకుంటూనే మార్పులను చేసింది. వర్సిటీ కొత్త చట్టాల నిబంధనలకు సంబంధించి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు శుక్రవారం నుంచే అమల్లోకి వస్తాయి. ఇవీ మార్పులు.. - ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీల చట్టం-1991కు ప్రభుత్వం మార్పులు చేసి తెలంగాణ రాష్ట్రానికి అడాప్ట్ చేసుకుంది. అలాగే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ యాక్ట్-1982, రాజీవ్‌గాంధీ విద్యా వైజ్ఞానిక సాంకేతిక విశ్వ విద్యాలయం (ఆర్జీయూకేటీ) చట్టం-2008, జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వ విద్యాలయ చట్టం-2008, జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ యాక్ట్ -2008, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ యాక్ట్-1985 నిబంధనలకు మార్పులు చేసింది. మిగతా యూనివర్సిటీల చట్టాలను కూడా త్వరలో మార్చుతూ ఉత్తర్వులను జారీ చేయనుంది. - ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీల చట్టం-1991 సెక్షన్ 10లో ఉన్న ‘రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు గవర్నర్ చాన్సలర్‌గా వ్యవహరిస్తారు’ అన్న నిబంధనను మార్పు చేసింది. దాని స్థానంలో ‘ప్రతి యూనివర్సిటీకి చాన్సలర్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది.’ అన్న పదాన్ని చేర్చింది. - సెక్షన్ 11 సబ్ సెక్షన్ 1లో వైస్ చాన్సలర్ పోస్టుకు సెర్చ్ కమిటీలు పంపించే ముగ్గురి పేర్లున్న జాబితాలో ఎవరో ఒకరిని గవర్నర్ ఖరారు చేస్తారన్న నిబంధనను కూడా మార్పు చేసింది. తాజా సవరణ ప్రకారం ‘వీసీ పోస్టుకు సెర్చ్ కమిటీ ముగ్గురి పేర్లున్న ప్యానెల్ జాబితాను అందజేయాలి. అందులో ఎవరో ఒకరిని రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత యూనివర్సిటీకి వీసీగా నియమిస్తుంది.’ అన్న నిబంధనను చేర్చింది. - పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ చట్టం సెక్షన్ 9లో, జేఎన్టీయూ చట్టం సెక్షన్ 6లో, జేఎన్ఎఫ్ఏయూ చట్టం సెక్షన్ 6లో, ఆర్జీయూకేటీ చట్టం సెక్షన్ 6లో, అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ చట్టం సెక్షన్ 9లో ‘యూనివర్సిటీకి చాన్సలర్లను రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది’ అని చేర్చింది. - అలాగే ఆయా యూనివర్సి టీల్లో చట్టాల్లో ‘సెర్చ్ కమిటీలు పంపించే జాబితాలో ఉన్న ముగ్గురిలో ఒకరిని వీసీగా ప్రభుత్వం నియమిస్తుంది’ అని చేర్చింది. త్వరలో వర్సిటీలకు వీసీలు... మూడేళ్లుగా రెగ్యులర్ వైస్ చాన్సలర్లు లేక యూనివర్సిటీల పాలన గందరగోళంగా మారింది. ఆరు నెలలుగా చాన్సలర్లు, వీసీ నియామకాలపై చర్చ జరుగుతున్నా ఉత్తర్వులు జారీ కాలేదు. ఎట్టకేలకు చట్టాలను మార్చుతూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో త్వరలోనే యూనివర్సిటీలకు చాన్సలర్ల నియామకాల ప్రక్రియ మొదలు కానుంది. అంతేకాదు ఒక్కో యూనివర్సిటీకి వీసీ ఎంపిక కోసం సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేయనుంది. రాష్ట్రంలో ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, జేఎన్టీయూ, జేఎన్ఎఫ్ఏయూ, ఆర్జీయూకేటీ, అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీ, పాలమూరు, మహత్మాగాంధీ యూనివర్సిటీలు ఉన్నాయి. ప్రస్తుతం వాటిల్లో ఎక్కడా రెగ్యులర్ వీసీలు లేరు. తాజా ఉత్తర్వులతో చాన్సలర్లు, వీసీల నియామకాల ప్రక్రియ మొదలు కానుంది. -
తెలంగాణ యూనివర్సిటీ డిగ్రీ ఫలితాల విడుదల
నిజామాబాద్: తెలంగాణా యూనివర్సిటీ డిగ్రీ పరీక్షా ఫలితాలను ఉన్నత విద్యాశాఖ వైస్ చైర్మెన్ ప్రొఫెసర్ మల్లేశ్, యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లింబాద్రి సంయుక్తంగా విడుదల చేశారు. ఈ ఫలితాల్లో 33 శాతం ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ఫలితాల కోసం తెలంగాణ యూనివర్సిటీ వెబ్సైట్లో చూసుకోవాలని సూచించారు. -
యూనివర్సిటీకి త్వరలో మాస్టర్ ప్లాన్
తెయూ(డిచ్పల్లి) : అందుబాటులో ఉన్న 577 ఎకరాల స్థలాన్ని సద్విని యోగం చేసుకునే దిశగా తెలంగాణ యూనివర్సిటీ యంత్రాంగం మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు సిద్ధమైంది. ఈ మేరకు జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ అండ్ అర్కిటెక్చర్ యూనివర్సిటీ నిపుణుల బృందం ఇటీవల క్యాంపస్‌లోని సువిశాల స్థలాన్ని పరిశీలించింది. ఈ బృందానికి ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ విజయ్‌కుమార్ నేతృత్వం వహించారు. తెయూ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా, ఏయే స్థ లంలో కళాశాల భవనాలు నిర్మించాలి, గెస్ట్‌హౌస్,ఫ్యాకల్టీ హౌసింగ్,హెల్త్ సెం టర్, హాస్టల్ భవనాలు, స్టేడియం, ఆడిటోరియం ఇతర మౌలిక సదుపాయాలు ఎలా ఉండాలనే విషయాలపై శాస్త్రీయంగా మాస్టర్‌ప్లాన్ రూపొందిస్తారు. నిపుణుల బృందం ఇచ్చిన సూచనలు, ప్రాథమిక రిపోర్ట్‌ను దృష్టిలో ఉంచుకుని బుధవారం డీన్లు, ప్రిన్సిపాళ్లతో వర్సిటీ రిజిస్ట్రార్ లింబా ద్రి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ రాబోయే కాలంలో వర్సిటీ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉం చుకుని ఈ మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేస్తున్నట్లు వివరించారు. నిపుణుల క మిటీ బృందం చేసిన సూచనల గురిం చి సమావేశంలో విపులంగా చర్చిం చారు. ఈ కార్యక్రమంలో ఆచార్యులు ఎమ్.యాదగిరి, కనకయ్య, సత్యనారాయణచారి, జయప్రకాశ్‌రావు, ఎ ల్లోసా, బిల్డింగ్ డివిజన్ ఇంజనీర్లు పాల్గొన్నారు. -
వర్సిటీ అభివృద్ధికి ప్రణాళిక
- దేశంలో అత్యుత్తమ వర్సిటీల్లో ఒకటిగా తెయూ - ఎంపీ కల్వకుంట్ల కవిత తెయూ(డిచ్పల్లి) : తెలంగాణ యూనివర్సిటీని వచ్చే రెండు, మూడు సంవత్సరాలలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశంలోనే అత్యుత్తమ యూనివర్సిటీగా రూపొందించడానికి కృషి చేస్తామని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోనే నంబర్‌వన్ యూనివర్సిటీగా తీర్చిదిద్దటానికి మరిన్ని సమగ్ర ప్రణాళికలు అమలు చేస్తామని అన్నారు. ప్రత్యేక చొరవ తీసుకుని తన అమెరికా పర్యటనలో చికాగో స్టేట్ యూనివర్సిటీతో తెలంగాణ యూనివర్సిటీకి మెమోరాండం ఆఫ్ అండర్ స్టాండింగ్ (ఎంఓయూ) కుదర్చడం పట్ల ఎంపీ కవితకు కృతజ్ఞతలు తెలిపేందుకు రిజిస్ట్రార్ లింబాద్రి, ఇతర అధ్యాపకులు సోమవారం హైదరాబాద్ వెళ్లారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో ఎంపీ కవిత, యూనివర్సిటీ అభివృద్ధికి తన ఆలోచనలను, అభిప్రాయాలను, సమగ్ర ప్రణాళికలను వివరించారు. వర్సిటీలో ఫ్యాకల్టీ సభ్యులకు ప్రత్యేక వసతి సౌకర్యాలు కల్పించడం వంటి ప్రణాళికలు ఉన్నాయని వివరించారు. అనంతరం ఎంపీని రిజిస్ట్రార్ సన్మానించారు. ఆయన వెంట సైన్స్ డీన్ ప్రొఫెసర్ జయప్రకాశ్‌రావు, అసోసియేట్ ప్రొఫెసర్లు పాత నాగరాజు, ఎం.ప్రవీణ్, పీఆర్వో కె.రాజారామ్, పెద్దోళ్ల శ్రీనివాస్, సమత, ప్రసన్నరాణి ఉన్నారు. యూనివర్సిటీ అభివృద్ధికి ఎంపీ సూచనల్లో కొన్ని... - భిన్నమైన, ప్రత్యేక తరహా కోర్సులతో క్యాంపస్ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు - వర్సిటీకి అనుబంధంగా నర్సింగ్ కళాశాల, మేల్, ఫిమేల్ నర్సింగ్ అభ్యర్థులకు శిక్షణ - సంప్రదాయేతర ఇంధన వనరులతో వర్సిటి విద్యుత్ అవసరాలు తీర్చడం, దీని కోసం సోలార్ పవర్, పవన విద్యుత్, బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటు.. - ప్రస్తుతం చికాగో స్టేట్ యూనివర్సిటీ ఎంఓయూతో పాటు ప్రిన్స్టన్, ఓహాయియో యూనివర్సిటీలతో కూడా ఎంఓయూల ఏర్పాటు. వర్సిటీకి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడం.. - వర్సిటీ క్యాంపస్‌లో విద్యార్థుల సౌకర్యం కోసం 24 గంటల విద్యుత్ సరఫరా, ఎస్సారెస్పీ నుండి నిరంతర మంచి నీటి సరఫరా, 24 గంటల ఇంటర్నెట్ సౌకర్యం.. - ప్రస్తుత ఫార్మా కంపెనీల సహకారంతో వర్సిటీలో పరిశోధనా, అభివృద్ధి సంస్థల ఏర్పాటు, విద్యార్థులకు ఉద్యోగావకాశాల కల్పన, ఇంక్యూబేషన్ సెంటర్ల ఏర్పాటు.. - సైన్స్ విభాగాల కోసం ప్రత్యేక లాబోరేటరీ వసతులు, భవన నిర్మాణం.. - వర్సిటీ భూముల రక్షణకు, సమర్థవంతమైన వినియోగానికి సమగ్ర మాస్టర్ ప్లాన్‌తో కూడిన అభివృద్ధి ప్రణాళికలు.. - అంతర్గత రోడ్డ నిర్మాణం కోసం పంచాయతీ రాజ్, రోడ్లు భవనాలశాఖ సహకారంతో పనులు.. -
క్యాంపస్‌లో ఎంపీ కవిత జన్మదిన వేడుకలు
కేక్ కట్ చేసిన వర్సిటీ రిజిస్ట్రార్ తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీలో శుక్రవారం ఎంపీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన తెయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లింబాద్రి కేక్‌ను కట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంపీ కవిత జిల్లాతో పాటు తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు చింత మహేశ్ మాట్లాడుతూ ఎంపీ కవిత ఇలాంటి జన్మదిన వేడుకలను మరెన్నో జరుపుకోవాలని, తెలంగాణ ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో తెయూ టీఆర్ఎస్వీ అధ్యక్షుడు మంత్రి మహేశ్, అర్బన్ ఇన్చార్జి లక్ష్మన్,వర్సిటీ నాయకులు నర్సింహా, జైపాల్, మహేశ్, రవి, ప్రశాంత్, విజయ్, మోహన్, అనిల్, శరత్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కనకయ్య, అధ్యాపకులు ధర్మరాజు, ఘంటా చంద్రశేఖ ర్, తెలంగాణ జాగృతి నాయకులు సాయికుమార్, నవీన్, అనిల్, ప్రభాకర్, శ్రీకాంత్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. వర్సిటీ విద్యార్థి జేఏసీ ఆధ్వర్వంలో కవిత జన్మ దిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. జేఏసీ చైర్మన్ యెండల ప్రదీప్, మాదిగ విద్యార్థి జేఏసీ చైర్మన్ బల్వీర్ ప్రసాద్, విద్యార్థి నాయకులు మధు, పెంటయ్య, రాజు, బాలాజీ, కిషోర్, రవినాయక్, భాను, రెడ్డి రాజు తదితరులు పాల్గొన్నారు. -
రుణం తీర్చుకుంటా
⇒ ఆడబిడ్డగా, కోడలిగా ఆదరించారు ⇒ గద్దెనెక్కించిన గడ్డను అభివృద్ధి చేస్తాం ⇒ పార్లమెంటులో మాట్లాడే అవకాశం మీరిచ్చిందే ⇒ పెద్దపల్లి-నిజామాబాద్ లైన్‌కు రూ.141 కోట్లు ⇒ రూ.500 కోట్లతో నిజామాబాద్‌కు ఔటర్ రింగ్‌రోడ్ ⇒ నిజాం షుగర్ ఫ్యాక్టరీ రైతులకు సీఎం కేసీఆర్ అండ ⇒ గోదావరి పుష్కరాలకు రూ.128 కోట్లతో ఏర్పాట్లు ⇒ తెలంగాణ యూనివర్సిటీకి అంతర్జాతీయ గుర్తింపు ⇒ ఇందూరు ప్రగతే టీఆర్ఎస్ ధ్యేయం ⇒ విలేకరుల సమావేశంలో ఎంపీ కవిత సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ ఆడబిడ్డగా, కోడలిగా ఆదరించిన ఇందూరు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అన్ని రంగాలలో అభివృద్ధి సాధించేందుకు నిరంతర కృషి చేస్తానని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధుల సహాయ, సహాకారాలతో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు ద్వారా ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు. గురువారం నిజామాబాద్‌లోని నిఖిల్‌సాయి ఇంటర్నేషనల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘‘రైల్వే బడ్జెట్లో జిల్లాకు రూ.141 కోట్లు మంజూరు చేయించుకునే అవకాశం కలిగింది. పార్లమెంటులో నా గళాన్ని వినిపించే అవకాశం కలిగించిన జిల్లా ప్రజల రుణం తీర్చుకుంటున్నట్లు భావిస్తున్నాను. ఇదే విధమైన అండదండలు ఉంటే ప్రతి అంశాన్ని ముందుకు తీసుకువెళ్తాను. నిజామాబాద్ కోడలిగా నా కర్తవ్యాన్ని నిర్వహిస్తాను’’ అని పేర్కొన్నారు. రైల్వే బ డ్జెట్లో జిల్లాకు రెండు ఆర్ఓబీలు సహా చిన్న చిన్న పనులు ఎన్నో మంజూరయినట్లు చెప్పారు. రైతులను ఆదుకుంటాం.. నిజాం షుగర్ ఫ్యాక్టరీ రైతులను ఆదుకోడానికి సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని ఎంపీ కవిత తెలిపారు చక్కెర రైతులకు ప్రభుత్వం తరపున దాదాపుగా రూ. 36 0 పైగా రుసుం చెల్లించి, మిగతాది ఆ కంపెనీ చెల్లించేటట్టుగా వాగ్దానం చేశారని పేర్కొన్నారు. రైతుల బకాయిలు రెండు మూడు రోజులలో ప్రభుత్వమే చెల్లించేలా చూ స్తున్నామన్నారు. రైతుల సమస్యలు యాజమాన్యం పట్టించుకోవటం లేదని ఇటీవల ఆ కంపెనీ ఎండీ దృష్టికి తీసుకెళ్లామన్నారు. దక్షిణాది ప్రాంతాలలో గల చక్కెర కార్మాగారాలు అనేక సమస్యల వలయంలో ఉన్నాయన్నారు. నిజాం షుగర్స్‌లో నిల్వ ఉన్న చక్కెరను ప్రభుత్వం రేషన్ దుకాణాలకు సరఫరా చేయించేలా ప్రయత్నం చేస్తున్నామన్నారు. బీడీ కార్మికుల భృతిపై సీఎం మోర్తాడ్ పర్యటనకు వచ్చినప్పుడు మొదటిసారిగా చరిత్రాత్మక ప్రకటన చేశారని, ఈ మేరకు అర్హులైన అందరికీ భృతి కల్పి స్తున్నామన్నారు. 85 వేల మందిని గుర్తించామని, మరో 25 వేల మందికి ఇచ్చేందుకు కలెక్టర్ ప్రతిపాదనలు రూపొందిస్తున్నారని వివరించారు. సకల జనుల సర్వేలో 1. 63 లక్షల మంది కార్మికులు తాము బీడీ కార్మికులమని, ఇదే తమకు జీవనాధారమని నమోదు చేసుకున్నారని, ఈపీఎఫ్ ఖాతాలో 1.59 లక్షల మంది కార్మికులు ఉన్నట్లు గా రికార్డు అయి ఉందన్నారు. ‘‘ఎన్నికల ముందు బీడి కార్మికులకు ఇండ్లు ఇస్తామని చెప్పాం... ఈ విషయంలో నాతోపాటు కలెక్టర్ ఈ పనులో నిమగ్నమై ఉన్నాం’’ అ ని ఎంపీ చెప్పారు. జిల్లాలో మరో విధమైన బీడి కార్మికులు ఉన్నారని, వారందరినీ ఈ పథకంలోకి తెచ్చేందుకు ఆలోచన చేస్తున్నామన్నారు. గోదారి తీరంలో అన్ని ఏర్పాట్లు గోదావరి పుష్కరాల సందర్భంగా పుష్కర ఘాట్లకు ప్రభుత్వం రూ. 128 కోట్లు మంజూరు చేసిందని ఎంపీ కవిత పేర్కొన్నారు. గోదావరి తీర ప్రాంతాలలో ఎటువం టి లోటుపాట్లు లేకుండా తానే స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు కూడా చెప్పారు. నిజామాబాద్ చుట్టూ ఔటర్ రింగ్‌రోడ్డు గురించి సీఎం వాకబు చేయగా మూడు రోజుల క్రి తమే అధికారులు దీనికి సంబంధించి ప్రతిపాదనలు పంపారని, మొదటి దశలో రూ. 510 కోట్లు ఖర్చు అవుతాయని అంచానా కూడ వేశామన్నారు. అయితే ఇందులో భూ సేకరణకే ఎక్కువ మొత్తం ఖర్చు చేయవలసి వస్తుందని, దీనిని ఎలా తగ్గించాలో ఆలోచన చేస్తున్నామన్నారు. రెండవ దశ కింద దాదాపు రూ. 600 కోట్ల నుంచి రూ.700 కోట్లు ఖర్చు అవుతాయని భావిస్తున్నట్లు చెప్పారు. అన్నీ ఇక్కడి నుంచే ప్రారంభం జిల్లా నుంచి చాల పథకాలు ప్రారంభం అవుతున్నాయని, మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలో ఈ ప్రొక్యూర్మెంట్ను తొలిసారిగా వ్యవసాయ మార్కెట్ నుంచే మొదలుపెట్టారని తెలిపారు. పసుపు రైతులకు దీని ద్వారా మేలు కలిగిందన్నారు. దళారుల బెడద తప్పిందన్నారు. పసుపు క్వింటాళుకు ఏడు వేల రూపాయలు వచ్చేలా చూశామన్నారు. నగరంలో మాస్టర్ ప్లాన్ అమలు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారని, టెండర్లు పిలవనున్నారని తెలిపారు. నగరంలో ఎటువంటి సౌకర్యాలు ఉండాలో ప్రముఖలతో ఈ మధ్యలోనే ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసి పనులు ముమ్మరంగా జరిగేలా చూస్తామన్నారు. సీఎం వాగ్దానం ప్రకారం, జనవరిలో 16 దళితులకు మూడెకరాల భూమి ఇచ్చామని, మిగతావారికి ఇచ్చేందుకు భూములు గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల కు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్నారని అన్నారు. తెలంగాణ యూనివర్సిటీని ఇతర దేశాలలోని యూ నివర్సిటీలతో అనుసంధానం చేయనున్నామన్నారు. ఇందులో భాగంగా ‘యూనివర్సిటీ ఆఫ్ చికాగో’ అధి కారులతో అధికార కమ్యూనికేషన్ ప్రారంభమైందని, ఇది విజయవంతమైతే ఏటా జిల్లాలో 75 మందికి అక్కడ అడ్మిషన్ ఇప్పించేందుకు అవకాశం ఉంటుం దన్నారు. విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఏఎస్ పోశెట్టి, నిజామాబాద్ అర్బ న్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా, మేయర్ ఆకుల సు జాత, జడ్పీ వైస్ చైర్ పర్సన్ గడ్డం సుమనారెడ్డి, టీఆర్ఎస్ జిల్లా పరిశీలకులు రూప్సింగ్, టీఆర్ఎస్ నాయకులు డాక్టర్ భూపతిరెడ్డి, కార్పొరేటర్ సుదాం లక్ష్మీ, ఎస్ఏ అలీం, దాదన్నగారి విఠల్‌రావు, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు తారిఖ్ అన్సారీ పాల్గొన్నారు. -
చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం
డిచ్పల్లి(నిజామాబాద్): నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయం విద్యార్థులు గురువారం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను దహనం చేశారు. హైదరాబాద్‌లో ఉంటే విదేశాల్లో ఉన్నట్లే ఉందని ఆయన చేసిన వ్యాఖ్యలపై వారు మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలతో తెలంగాణ అమరవీరుల ఆత్మలు క్షోభిస్తున్నాయని అన్నారు. టీఆర్ఎస్వీ యూనివర్సిటీ విభాగం అధ్యక్షుడు మహేష్ ఆధ్వర్యంలో ఈ నిరసన జరిగింది. -
హైకోర్టు విభజన ఆలస్యంపై విద్యార్థుల ఆందోళన
డిచ్పల్లి: తెలంగాణ హైకోర్టు ఏర్పాటులో ఆలస్యాన్ని నిరసిస్తూ నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థులు బుధవారం తరగతులను బహిష్కరించారు. రాష్ట్ర విభజన జరిగి నెలలు గడుస్తున్నా... ఉమ్మడి హైకోర్టును విభజించకపోవడం సరికాదన్నారు. దీనిపై హైకోర్టు, జిల్లా కోర్టు, స్థానిక కోర్టుల న్యాయవాదులు రిలే దీక్షలు చేపట్టినా... కేంద్రం పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. లా కళాశాలకు చెందిన దాదాపు 200 మంది విద్యార్థులు యూనివర్సిటీలో ర్యాలీ నిర్వహించారు. కళాశాల ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. -
మనమే హీరోలం
తెయూ(డిచ్పల్లి) : సినిమా హీరోలు కేవలం నటులు మాత్రమే. వారిని అభిమానిస్తూ, అనుకరిస్తూ సమయం వృథా చేసుకోవద్దు. మీ జీవితంలో మీరే హీరోలుగా ఎదగాలంటూ తెలంగాణ యూనివర్సిటీ ఇన్చార్జి వైస్ చాన్స్‌లర్, సీనియర్ ఐఏఎస్ అధికారి సి. పార్థసారథి విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు, యువత కేవలం చరిత్ర చదివే వారిలా మిగలకుండా, చరిత్ర సృష్టించే వారిగా ఎదగాలన్నారు. తెలంగాణ యూనివర్సిటీ, జిల్లా బీసీ స్టడీ సర్కిల్ సంయుక్త ఆధ్వర్యంలో వర్సిటీలోని కంప్యూటర్ అండ్ ఇంజినీరింగ్ కాలేజీ ఆవరణలో శనివారం ‘పెయింట్ యువర్ డ్రీమ్స్(కలలకు రూపమిద్దాం)’ రెండో విడత కార్యక్రమానికి వీసీ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బుద్ధి, మనస్సు రె ండింటి మధ్య నిరంతరం సంఘర్షణ జరుగుతుందని, బుద్ధి గెలిస్తే మని షి జీవితంలో విజయం సాధించినట్లేనని ఆయన అన్నారు. జీవితంలో నిద్దిష్ట లక్ష్యాలు ఉండాలని, విజయానికి సంబంధించి పక్కా విజన్ ఏర్పరుచుకుని అందుకనుగుణంగా పాజిటీవ్ ఆలోచనలతో ముందుకు సాగాలన్నారు. నా జీవితానికి నాదే బాధ్యత అన్న విధంగా ఉండాలన్నారు. మన్నుతిన్న పాముల్లాగా, కుక్కిన పేనుల్లాగా ఉండొద్దన్నారు. ప్రతి వ్యక్తికి తన విధిని తానే లిఖించుకునే అవకాశం ఉందని, జీవితంలో ప్రతిదాన్ని ఎంచుకునే అవకా శం మనిషికి ఉంటుందన్నారు. తన భవిష్యత్తును తానే తీర్చిదిద్దుకోవాలన్నారు. గొప్ప వ్యక్తులైన మార్టిన్ లూథర్‌కింగ్, మదర్ థెరిస్సా, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, స్వామి వివేకానంద, స్టీఫెన్ హాకింగ్ లాంటి వారి జీవితాల నుంచి పాఠాలు నేర్చుకోవాలన్నారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చెప్పిన విధంగా కలలు కనండి.. వాటిని సాకారం చేసుకోండని అన్నారు. పార్థసారథి తనదైన శైలిలో విద్యార్థుల మధ్య కలియ తిరుగుతూ వారిలో స్ఫూర్తిని నింపే ప్రసంగం చే శారు. భారత దేశం 2020 సంవత్సరానికి ప్రపంచ దేశాల్లో అత్యధిక శాతం యువకులు ఉన్న దేశంగా ఎదుగుతుందని పార్థసారథి అన్నారు. ప్రపంచ దేశాల చూపంతా భారత్ పైనే ఉందన్నారు. యువత సరైన నైపుణ్యాలు పెంపొం దించుకుంటే ప్రపంచంలో భారత్ సూపర్ పవర్‌గా ఎదుగుతుందన్నారు. అగ్రరాజ్యంగా ఎదగాలంటే యువత చోదక శక్తిగా ఉండాలన్నారు. మనకు చైనా నుండి గట్టి పోటీ ఉంటుందని, నైపుణ్యాల పెంపుతో అధిగమించే అకాశాలుంటాయన్నారు. యువత తమ స్నేహాలను, స్నేహితులను మంచిగా ఎంచుకోవాలని, జీవితంలో ఉన్నత స్థాయికి చేరాలంటే తమకున్న కొన్ని దురలవాట్లను వదిలించుకోవాలని సూచించారు. తాను అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన విద్యార్థులకు బహుమతులను అందజేసి వీసీ వారిని ప్రోత్సహించారు. తెయూ ఇన్చార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లింబాద్రి ప్రారంభోపన్యాసం చేశారు. విద్యార్థులలో ప్రేరణ, మానసిక స్థైర్యం, నైపుణ్యాల పెంపు, పోటీ పరీక్షలపై అవగాహన కల్పించడానికే ‘పెయింట్ యువర్ డ్రీమ్స్’ కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు. బీసీ స్టడీ సర్కిల్ రాష్ట్ర డెరైక్టర్ అలోక్‌కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 9 బీసీ స్టడీ సర్కిళ్లు ఉన్నాయన్నారు. వీటి ద్వారా విద్యార్థులకు గ్రూప్-1, గ్రూప్-2, సివిల్స్, ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన ఉచిత శిక్షణ ఇస్తున్నామన్నారు. జిల్లా బీసీ సంక్షేమాధికారిణి విమల దేవి మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలోని నాగారం స్టేడియంలో బీసీ స్టడీ సర్కిల్ ఉందని తెలిపారు. పోటీ పరీక్షలపై విద్యార్థులకు 45 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇస్తామని తెలిపారు. భోజన వసతి సౌకర్యాల తో పాటు ఉపకార వేతనం, స్టడీ మెటీరియల్‌ను అందజేస్తామని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అదనపు సంయుక్త కలె క్టర్ శేషాద్రి, వర్సిటీ బీసీ సెల్ డెరైక్టర్ శ్రీనివాస్, సమాన అవకాశాల సెల్ డెరైక్టర్ అపర్ణ, పోటీ పరీక్షల సెల్ డెరైక్టర్ బాల శ్రీనివాసమూర్తి, లక్ష్మణ చక్రవర్తి, పీఆర్ఓ రాజారాం, ఏపీఆర్ఓ అబ్దు ల్ ఖవి, అధ్యాపకులు, క్యాంపస్ విద్యార్థులతో పాటు వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. -
కృషితోనే లక్ష్య సాధన
డిచ్పల్లి (నిజామాబాద్): కృషితోనే లక్ష్యసాధన సాధ్యమవుతుందని సీనియర్ ఐఏఎస్ అధికారి, తెలంగాణ యూనివర్సిటీ ఇన్చార్జి వైస్ చాన్స్‌లర్ సి.పార్థసారథి సూచించారు. యూనివర్సిటీ, బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో క్యాంపస్‌లోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో శనివారం 'పెయింట్ యువర్ డ్రీమ్స్' (కలలకు రూపమిద్దాం) రెండో విడత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పార్థసారథి విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపే ప్రసంగం చేశారు. జీవితంలో ఎన్నో అవకాశాలు ఉంటాయని, వాటిని అందిపుచ్చుకుంటే అద్భుత విజయాలు సొంతమవుతాయని వివరించారు. ఫోకస్‌తో లక్ష్యాలు ఎంచుకుని, ఇష్టమైన రంగంలో రాణించాలని అన్నారు. 'మీ జీవితానికి మీరే ఒక హీరోగా భావించుకుని అందుకు అనుగుణంగా ఎదగేందుకు కృషి చేయండి' అని విద్యార్థులకు పిలుపునిచ్చారు. -
పరువు గాలికి
దేశానికి మేధావులు, ఇంజినీర్లు, నాయకులు, మానవ వనరులను అందించాల్సిన వర్సిటీలు పక్కదారి పడుతున్నాయి. కొందరు అధ్యాపకుల వ్యవహారంతో తెలంగాణ యూనివర్సిటీ పరువు బజారుకెక్కుతోంది. నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ గిరిరాజ్ కళాశాలలో 2006లో తెలంగాణ యూనివర్సిటీ ప్రారంభమైంది. అనంతరం డిచ్పల్లి శివారులో 577 ఎకరాల స్వస్థలంలోకి మారింది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2009 జనవరి 31న దీనిని ప్రారంభించారు. ⇒వివాదాలకు నిలయంగా మారిన తెయూ ⇒వెల్లువెత్తిన ‘అక్రమాల’ ఆరోపణలు ⇒నిధుల వినియోగంపైనా విమర్శలు ⇒ పీహెచ్డీ ప్రవేశాలూ వివాదాస్పదం ⇒తాజాగా పరీక్షల నియంత్రణాధికారి సస్పెన్షన్ ⇒తరచూ మారుతున్న పాలనాధికారులు ⇒ఆవేదన చెందుతున్న విద్యాభిమానులు తెయూ (డిచ్పల్లి): ప్రారంభించినప్పటి నుంచి తెలంగాణ యూనివర్సిటీ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. తొలి వీసీ కాశీ రాం హయాంలో జరిగిన ఉద్యోగ నియామకాలు జిల్లాకు చెందిన పెద్ద నాయకుని కనుసన్నలలో జరిగినట్లు విద్యార్థి సంఘా లు ఆరోపించాయి. అనంతరం 15 జూలై 2011న తెయూ వీసీగా ప్రొఫెసర్ అక్బర్ అలీఖాన్ ను ప్రభుత్వం నియమించింది. ఆయనపైనా పలు విమర్శలు వెల్లువెత్తాయి. యూనివర్సిటీ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ కాంట్రాక్టులకు సంబంధిం చి పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారి నట్లు ఆరోపణలు వచ్చాయి. అవసరానికి మించి మూడున్నర లక్షల జవాబు పత్రాల ను ముద్రింపజేసిన ఘటనలో రూ. పది లక్షలు చే తులు మారినట్లు నిందలు మోయాల్సి వచ్చింది. కేవలం ఆరు నెలల కాలంలో వీసీ తన వా హనంపై రూ.1.80 లక్షలు ఖర్చు చూపించడంపై విద్యార్థి సంఘాలు గవర్నర్‌కు ఫిర్యా దు చేయగా, ఆయన దీనిపై వివరణ కోరా రు. 12బి మంజూరు కోసం తెయూను పరి శీలించేందుకు యూజీసీ బృంద సభ్యులు సందర్శించినప్పుడు రసాయనాల పేరిట రూ.ఎనిమిది లక్షలు, ఇతర ఖర్చుల పేరిట రూ. రెండు లక్షలు ఖర్చు చూపించడం వివాదాస్పదంగా మారింది. పదవీకాలం ముగింపు దశలో యూనివర్సిటీ ఆర్చ్ (స్వాగత తోర ణం/ప్రధాన గేటు) నిర్మాణానికి రూ. 50 లక్షలు ఖర్చు చేయడం వర్సిటీ వర్గాలలో చర్చనీయాంశమైంది. బాలుర వసతి గృహంలో గదులు సరిపోక విద్యార్థులు ఇబ్బం దులు పడుతున్నా, అదనపు గదులు నిర్మాణంపై దృష్టి సారించని వీసీ, కేవలం ఆర్చ్‌కు రూ. 50 లక్షలు ఖర్చు చేయడం విమర్శలకు దారి తీసింది. వీసీ పదవి కాలంలో మారిన ఐదుగురు రిజిస్ట్రార్లు వీసీగా ప్రొఫెసర్ అక్బర్ అలీఖాన్ పని చేసిన రెండు సంవత్సరాల కాలంలో ఐదుగురు రిజిస్ట్రార్లు మారారు. ఆయన భాధ్యతలు స్వీకరించిన సమయంలో రిజిస్ట్రార్‌గా ఉన్న ప్రొఫెసర్ శివశంకర్ సెప్టెంబర్ 2011లో పదవి నుంచి తప్పుకున్నారు. అనంతరం కొద్ది కాలం ప్రొఫెసర్ యాదగిరి ఇన్చార్జి రిజిస్ట్రార్‌గా పని చేశారు. ఆ తరువా త ఉస్మానియా యూనివర్సిటీ కెమిస్ట్రీ విభాగం అధ్యాపకుడు ఎన్.అశోక్‌ను రిజిస్ట్రార్‌గా 2012 మార్చ్ 12న ప్రభుత్వం నియమించింది. ఏడాది తర్వాత రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్ లింబాద్రి నియమితులయ్యారు. సంవత్స రం తర్వాత ఆయన పదవీకాలం ముగిసింది. వెంటనే ఇన్చార్జి రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్ ధర్మరాజును నియమించారు. ఇలా రెండు సంవత్సరాల కాలంలో ఐదుగురు రిజిస్ట్రార్లు మారారు. తీరు మార్చుకోని అధికారులు తెలంగాణ యూనివర్సిటీలో పీహెచ్డీ కోర్సు ప్రారంభమైననాటి నుంచి అడ్మిషన్ల ప్రక్రియ వివాదాస్పదంగా మారుతూనే ఉంది. తొలిసారి అడ్మిషన్ల సమయంలో రెండు సార్లు ఫలితాలు విడుదల చేయడంపై ఆరోపణలు వెల్లువెత్తా యి. వర్సిటీ అధికారులు తమ తీరు మార్చుకోకుండా ఈసారి కూడా రెండు సార్లు జాబితా మార్చారు. అనర్హులకు ప్రవేశాలు కల్పిండానికే కటాప్ మార్కులు తగ్గించి అర్హులకు అన్యాయం చేశారని ఉన్నత విద్యామండలికి ఫిర్యాదులు అందాయి. తెలుగు పీహెచ్డీ ప్రవేశాలలో అక్రమాలు జరిగినట్లు నిర్థారణ కావడంతో ఇద్దరు అధ్యాపకులకు ఇన్చార్జి వీసీ శైలజా రామయ్యర్ చార్జి మెమోలు జారీ చేశారు. నియామకాలలో అక్రమాలు అక్బర్‌అలీఖాన్ హయాంలో చేపట్టిన టీచింగ్, నాన్-టీచింగ్ నియామకాలలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. డబ్బులు తీసుకుని తమకు నచ్చినవారికి ఉద్యోగాలు ఇచ్చారని, అర్హులకు అన్యాయం జరిగిందని కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మరికొందరు గవర్నర్‌కు ఫిర్యా దు చేశారు. కొందరు ఉన్నత విద్యామండలికి, ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో విచారణ కమిటీని నియమించారు. ప్రభుత్వం మాజీ రిజిస్ట్రార్లు ప్రసాద్‌రావు, భాస్కర్‌రావుతో ఒక కమిటిని నియమించగా, గవర్నర్ నరసింహన్ సూ చన మేరకు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సీవీ రాములు నేతృత్వంలో ఏక సభ్య విచారణ కమిటీ ఏర్పాటైంది. ఈ రెండు కమిటీలు విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదికలను అందజేశాయి. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండానే వీసీగా అక్బర్‌అలీఖాన్ పదవి కాలం ముగిసింది. కోర్టు మధ్యంతర ఉత్తర్వుల మేరకు గత ఏడాది జనవరిలో 47 మంది టీచింగ్ సిబ్బంది బాధ్యతలు స్వీకరించారు. సీఓఈ సస్పెన్షన్‌తో పోయిన పరువు యూనివర్సిటీలో వీసీ, రిజిస్ట్రార్ తర్వాత కీలకమైన పదవి పరీక్షల నియంత్రణాధికారిదే. అనుబంధ కళాశాలలు, క్యాంపస్ కళాశాలల విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించేది పరీక్షల విభాగమే. ఇలాంటి కీలక విభాగానికి అసోసియేట్ ప్రొఫెసర్‌ను అధికారిగా నియమించడమే విమర్శలకు తావిచ్చింది. సీఓఈగా విధులు నిర్వహిస్తున్న అసోసియేట్ ప్రొఫెసర్ ఏక కాలంలో రెండు చోట్ల వేతనాలు పొందారనే ఆరోపణలపై సస్పెన్షన్‌కు గురికావడంతో వర్సిటీ పరువు మరింత దిగజారినట్లయింది. ఇప్పటికైనా వర్సిటీ ఉన్నతాధికారులు ఇలాంటివి జరగకుం డా చర్యలు తీసుకుని వర్సిటీ పరువు, ప్రతిష్టలు పెంచేలా చూడాలని పలువురు విద్యాభిమానులు కోరుకుంటున్నారు. -
తెయూ సీఓఈ సస్పెన్షన్
తెయూ(డిచ్ పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణాధికారి (సీఓఈ) డాక్టర్ మామిడాల ప్రవీణ్‌ను సస్పెండ్ చేస్తూ గత ఇన్చార్జి వీసీ శైలజా రామయ్యర్ ఉత్తర్వులు జారీ చే సిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. వర్సీటీవర్గాలు తెలిపిన వివరాల ప్రకారం, 2014 జనవరి నాలుగున కోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వుల మేరకు వర్సి టీలో పలువురు శాశ్వత అధ్యాపకులు విధుల్లో చేరారు. వారితోపాటు ఎంపికైన ప్రవీణ్ పది రోజుల తర్వాత తెయూ బయోటెక్నాలజీ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయనను పరీక్షల నియంత్రణాధికారిగా నియమిస్తూ జూలై ఎనిమిదిన అప్పటి ఇన్చార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ధర్మరాజు ఉత్తర్వులు జారీ చేశారు. తెయూలో చేరక ముందు డాక్టర్ ప్రవీణ్ ఉస్మానియా యూనివర్సిటీలో అధ్యాపకుడిగా పని చేశారు. ఇక్కడ చేరిన తర్వాత ఓయూలో వెంటనే రాజీ నామా చేయలేదని సమాచారం. ఇక్కడా, అక్కడా వేతనం పొందినట్లు తెలిసింది. ఒకే సమయంలో రెండు యూనివర్సిటీల్లో వేతనాలు పొందినట్లు అందిన ఫిర్యాదు మేరకు గత నెల 16న ప్రవీణ్‌ను విధుల నుండి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇవి శనివారం వెలుగు చూశాయి. అప్పటి నుంచి సెలవులో వెళ్లిన ప్రవీణ్, సస్పెన్షన్ ఉత్తర్వులు ఉపసంహరింపజేసుకునేందుకు ఉన్నత విద్యామండలితోపాటు రాజకీయ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు సమాచారం. ప్రొబేషనరీ సమయంలో ఉన్న ప్రవీణ్ ఉద్దేశ పూర్వకంగా రెండు చోట్ల వేతనాలు తీసుకున్నట్లు ఉన్నతాధికారులు భావిస్తే క్రిమినల్ కేసు నమోదు చేసే అవకాశాలున్నట్లు వర్సిటీ వర్గాలు పేర్కొన్నాయి. పీహెచ్డీ తెలుగు అడ్మిషన్లు రద్దు తెలంగాణ యూనివర్సిటీలో ఇటీవల నిర్వహించిన పీహెచ్డీ తెలుగు విభాగం అడ్మిషన్లను రద్దు చేస్తూ గత ఇన్చార్జి వీసీ శైలజా రామయ్యార్ డిసెంబర్ 16న ఉత్తర్వులు జారీ చేసిన విషయం కూడా ఆల స్యంగా వెలుగు చూసింది. అనర్హులను ఎంపిక చేశారని ఆరోపిస్తూ కొందరు అభ్యర్థులు అప్పుడు ఫిర్యా దు చేశారు. దీంతో ఈ అంశంపై విచారణ జరిపేందుకు ఉస్మానియా యూనివర్సిటీ కెమిస్ట్రీ విభాగం డీన్ ప్రొఫెసర్ నాగేశ్వరరావును ఏక సభ్య కమిటీగా నియమించారు. ఆయన విచారణ జరిపి నివేదికను ఇన్చార్జి వీసీకి అందజేశారు. అనంతరం అక్రమాలు జరిగాయని నిర్ధారణకు వచ్చిన వీసీ, ఆర్ట్స్ డీన్ ధర్మరాజు, తెలుగు హెచ్ఓడీ కనకయ్యలకు చార్జ్ మెమో లు జారీ చే శారు. అడ్మిషన్లను రద్దు చేశారు. ఈ విషయమై వర్సిటీ ఇన్చార్జి రిజిస్ట్రార్ లింబాద్రిని సంప్రదించగా ఉత్తర్వులు అందిన మాట వాస్తమేనని తెలిపారు. -
ఫీజులపై విద్యార్థుల ఆందోళన
తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ఫీజు రీయింబర్సమెంట్, స్కాలర్ షిప్‌లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ యూనివర్సిటీలో ఏబీవీపీ, పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. దిష్టి బొమ్మ దహనం, ధర్నా చేశారు. తెయూ(డిచ్పల్లి): ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిల విడుదలలో జాప్యాన్ని నిరసిస్తూ తెలంగాణ యూనివర్సిటీ ఏబీవీపీ ఆధ్వర్యంలో శనివారం రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను క్యాంపస్ బాలుర వసతి గృహం ఎదుట దహనం చేశారు. ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటై ఆరు నెలలు గడుస్తున్నా, విద్యార్థుల సమస్యలపై స్పం దించక పోవడం భాదాకరమన్నారు. స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయక పోవడం వల్ల ప్రైవేటు విద్యా సంస్థల యాజామాన్యాలు విద్యార్థులకు ధ్రువీ కరణ పత్రాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కుల సంఘాలు, మత సంస్థల మీద ఉన్న ఉన్న ప్రేమ విద్యార్థుల మీద లేదని విమర్శించారు. ఇప్పటికైనా విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వెంటనే పీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళన కార్యక్రమంలో తె యూ ఏబీవీపీ ఇన్చార్జి రమణ, విద్యార్థి నాయకులు తిరుపతి, అనిల్, సురేశ్, మోహన్, ప్రవీణ్, చరణ్, వెంకటేశ్, ప్రపుల్ తదితరులు పాల్గొన్నారు. పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో ధర్నా తెయూ(డిచ్పల్లి) : పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్ షిప్‌లను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ యూనివర్సిటీ పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. శనివారం క్యాంపస్ బాలుర వసతి గృహం ఎదుట పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలి పారు. ఈ సందర్భం గా తెయూ పీడీఎస్‌యూ అధ్యక్షుడు బాలాజీ మాట్లాడుతూ రాష్ర్ట ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే స్కాలర్షిప్లు, ఇతర సౌకర్యాలు పెరుగుతాయని ఆశిం చిన విద్యార్థులకు ప్రభుత్వ వైఖరి తీవ్ర నిరాశను మిగిల్చిందని అన్నారు. విద్యార్థుల స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చే యాలని లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.నిరసన కార్యక్రమంలో పీడీఎస్‌యూ నాయకులు అజ య్, గజానంద్, శివ, స్టాలిన్, సునీల్, రఘు, స్వామి, నరేశ్ పాల్గొన్నారు. -
30న తెలంగాణ వర్సిటీల బంద్
ఇంచార్జి వీసీలను తొలగించాలని డిమాండ్ హైదరాబాద్: తెలంగాణలోని విశ్వవిద్యాలయాలకు బ్లాక్‌గ్రాంట్స్ నిధులను పెంచి తక్షణం విడుదల చేయాలని అధ్యాపకులు, ఉద్యోగులు డిమాండ్ చేశారు. తెలంగాణ వర్సిటీల్లో ఇంచార్జి వీసీలతో పాలన కుంటుపడిందని, వారిని తొలగించి కొత్త వీసీలను నియమించాలని డిమాండ్ చేశారు. గురువారం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలంగాణ వర్సిటీల అధ్యాపకుల, ఉద్యోగుల జేఏసీ చైర్మన్ ప్రొ.భట్టు సత్యనారాయణ, అధ్యక్షుడు కంచి మనోహర్ మాట్లాడారు. వర్సిటీ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుకు నిరసనగా ఈ నెల 10న మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశం, 17న అన్ని వర్సిటీల్లో మహార్యాలీలు, 23న రోడ్లపై వంటా వార్పు, 30న విశ్వవిద్యాలయాల బంద్ పాటించనున్నట్లు చెప్పారు. -
రాద్ధాంత మెందుకో!
తెయూ(డిచ్పల్లి)/నిజామాబాద్‌అర్బన్ : తెలంగాణ యూనివర్సిటీలో ఇటీవల నిర్వహించిన పీహెచ్డీ అడ్మిషన్లలో అర్హులకు అన్యాయం జరిగిందని, అనర్హులకు సీట్లు కేటాయించారని పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా తెలుగు, బిజినెస్ మేనేజ్మెంట్, మాస్ కమ్యూనికేషన్ విభాగాల్లో పీహెచ్డీ అడ్మిషన్లలో అక్రమాలు చోటు చేసుకున్నాయని కొందరు అభ్యర్థులు ఉన్నత విద్యా మండలికి, అప్పటి తెయూ ఇన్చార్జి వీసీ శైలజా రామయ్యర్‌కు ఫిర్యాదులు చేశారు. స్పందించిన ఇన్చార్జి వీసీ ఓయూ కెమిస్ట్రీ డీన్ ప్రొఫెసర్ నాగేశ్వరరావుతో ఏక సభ్య కమిటీ వేసి విచారణకు ఆదేశించారు. మంగళవారం కమిటీ సభ్యుడు నాగేశ్వరరావు తెయూను సందర్శించి ఇన్చార్జి రిజిస్ట్రార్ చాంబర్లో పీహెచ్డీ అ డ్మిషన్లపై విచారణ నిర్వహించారు. ఈ సందర్భంగా బాధితుల వాదనలు నమోదు చేశారు. అయితే కొందరు విద్యార్థి నాయకులు విచారణ కమిటీనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అందోళకు దిగడంపై విచారణ కమిటీ సభ్యుడు విస్మయం వ్యక్తం చేశారు. ఏవైనా అక్రమాలు జరిగాయని ఫిర్యాదులు వచ్చినప్పుడు విచారణ కమిటీ వేసి నిజానిజాలు తెలుసుకోవడం అన్ని వర్సిటీల్లో జరిగే ప్రక్రియేనని వర్సిటీ విద్యార్థులు పేర్కొం టున్నారు. మద్దతు తెలపలేక విచారణలో వాస్తవాలు వెలికి తీసి బాధితులకు న్యాయం చేయాలని మద్దతు తెలుపాల్సిన విద్యార్థి సంఘాల నాయకులే ఏకంగా కమిటీనే రద్దు చేయాలని డిమాండ్ చేయడమేంటని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. విచారణను అడ్డుకోవడం, ధర్నాలు చేయడం సమంజసంగా లేదని విమర్శిస్తున్నారు. అసలు విచారణ అంటే ఎందుకు అందోళన చెందుతున్నారో అర్థం కావడం లేదని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. విచారణ కమిటీని రద్దు చేయాలని కోరుతూ విద్యార్థి నాయకులు బుధవారం వర్సిటీ కళాశాల తరగతులు బహిష్కరించడాన్ని వ్యతిరేకించారు. అయినా విద్యార్థి నా యకుల మాటను కాదనలేక ఇష్టం లేకున్నా వర్సిటీ బంద్‌కు సహకరించాల్సి వచ్చిందని కొందరు విద్యార్థులు వాపోయారు. వారికి ఇబ్బందులనే పీహెచ్డీ ప్రవేశాలలో అక్రమాలపై విచారణ జరిగితే విద్యార్థి సంఘాల నాయకులకు ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. విచారణ జరిగితే కొందరు అనర్హులు ప్రవేశం కోల్పోతామని భావిస్తున్నారు. పీహెచ్డీ ప్రవేశాలకు సంబంధించి మొదటి లిస్టులో నలుగురు విద్యార్థి సంఘాల నాయకులు ఎంపిక కాలేదు. వారి ఎ ంపిక కోసం కళాశాల అధికారులు సైతం రిజర్వేషన్ కేటగిరిలో మార్పులు చేశారు. ఓపెన్ కేటగిరిలో 45 మార్కులకుగాను 40 మార్కులు, బీసీలకు 40 మార్కులకుగాను 30 మార్కులు, ఎస్సీ, ఎస్టీలకు 35 మార్కులకుగాను 30 మార్కులు తగ్గిస్తు నిబంధనలు చేశారు. దీంతో ఎంపిక కాని విద్యార్థి సంఘం నాయకులు ఎంపికయ్యారు. అర్హత కలిగిన మెరిట్ స్టూడెంట్లకు ఈ మార్పులకు సంబంధించి కనీస సమాచారం అందించలేదు. ఫోన్ చేస్తేనే యూనివర్శిటీకి రావాలని, సీటు వచ్చినట్లు అధికారులు చెప్పుకొచ్చారు. ఓ విద్యార్థి సంఘం నాయకుడికి కేవలం 30 మార్కులే రాగా ప్రవేశానికి అనర్హుడయ్యాడు. కానీ, మార్పులు చేయడంతో సీటు లభిం చింది. హైదరాబాద్‌కు చెందిన మహిళ విద్యార్థి నాయకురాలికి పీహెచ్డీ ప్రవేశానికి అర్హత ఉన్నప్పటి కీ సీటు లభించలేదు. దీంతో ఆమె ఉస్మానియా యూ నివర్శిటీ అధికారులకు ఫిర్యాదు చేసింది. ఇది యూ నివర్శిటీ అధికారులకు తెలిసి సీటు ఇస్తామంటూ యూనివర్శిటీకి పిలిపించారు. నెల రోజులు గడిచినా సీటు మాత్రం ఇవ్వలేదు. యూనివర్శిటీ అధి కారులను నిలదీస్తే ఇటీవలే ప్రవేశం కల్పించారు. ఫీజులు కూడా చెల్లించలేదు యూనివర్శిటీ నిబంధనల ప్రకారం ప్రవేశం పొందిన విద్యార్థుల నుంచి రూ. 16 వేల రూపాయలు ఫీజును వసూలు చేయాలి. పీహెచ్‌డీకి రూ. 15 వేలు, అడ్మిషన్ ఫీజు వెయ్యి రూపాయలు ఉంటుంది. కాని ఎం పికైన కొందరు విద్యార్థి సంఘాల నాయకులు కేవ లం వెయ్యి రూపాయలు మాత్రమే చెల్లించారు. వీరి నుంచి ఫీజులు కూడా వసూలు చేయలేకపోయారు. అదే ఎంబీఏ, మాస్ కమ్యూనికేషన్, తెలుగు విభాగా ల్లో ఇతర విద్యార్థుల నుంచి మాత్రం పూర్తి స్థాయి ఫీజులను వసూలు చేశారు. తెలుగు పీహెచ్డీ ప్రవేశాలపై విద్యార్థుల ఆందోళన వెనుక అధికారుల పాత్ర ఉన్నట్లు సమాచారం. విచారణలో అనర్హులకు అడ్మిషన్ల విషయం బట్టబయలు అవుతుందని, తమపై వేటు పడే అవకాశం ఉందని భావించిన కొందరు అధికారులు విద్యార్థి సంఘం నాయకులను ఉసిగొలిపి మీ ప్రవేశాలు రద్దు అవుతాయని, విచారణను అడ్డుకోవాలని ప్రేరేపించినట్లు సమాచారం. దీంతో విచారణ కమిటీని అడ్డుకోవడం, తెలంగాణ యూనివర్శిటీకి బంద్ పిలుపునిచ్చారని తెలుస్తోంది. -
వర్సిటీలకు నిధులు పెంచాలి
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది (టూటా)ఆధ్వర్యంలో వర్సిటీ పరిపాలనా భవనం ఎదుట గురువారం మహా ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల ఉద్యోగుల, అధ్యాపకుల జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు మహాధర్నా చేపట్టారు. యూనివర్సిటీలకు ఏకమొత్తంలో విడుదల చేసే నిధులు(బ్లాక్ గాంట్స్) పెంచాలని, వర్సిటీ ఉద్యోగులందరికీ హెల్త్ కార్డులందించి ఉచిత వైద్య సదుపాయం కల్పించాలని, ఔట్ సోర్సింగ్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. టూటా అధ్యక్షుడు ప్రొఫెసర్ శివశంకర్, ప్రధానకార్యదర్శి, వర్సిటీ ఇన్చార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత యూనివర్సిటీలకు నిధు లు భారీగా పెరుగుతాయని ఆశించామన్నారు. అయితే గత ప్రభుత్వాల వలనే అరకొర నిధులతో సరిపెట్టారని విమర్శించారు. రెగ్యులర్ వైస్ చాన్స్లర్లను నియమించాలన్నారు. నాన్-టీచింగ్ ఉద్యోగుల సం ఘం అధ్యక్షుడు మనోహర్‌గౌడ్ మాట్లాడుతూ.. ప్రభు త్వ ట్రెజరీ నుంచి వర్సిటీల ఉద్యోగులందరికీ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల యూ నియన్ అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడు తూ.. ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. టూటా ఉపాధ్యక్షులు మమత, పున్నయ్య, జాన్సన్, ఇక్బాల్ ఖురేషీ, సాయాగౌడ్, విజ యలక్ష్మి, టీచింగ్, నాన్-టీచింగ్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
అనర్హులకు అందలం
నిజామాబాద్ అర్బన్: తెలంగాణ యూనివర్సిటీలోని తెలుగు పీహెచ్డీ ప్రవేశాలలో అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు కనీస నిబంధనలు పాటిం చకుండా ఇష్టారీతిన అభ్యర్థులను ఎంపిక చేసినట్లు తెలిసింది. ఇందులో చాలా మంది అనర్హులే ఉన్నారని అంటున్నారు. అర్హులైన విద్యార్థులు మూడు నెలలుగా యూనివర్సిటీ చుట్టు తిరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. గత ఆగస్టు నెలలో పీహెచ్డీ ప్రవేశాలు జరిగాయి. 26 సీట్లకుగాను 86 మంది ఇంటర్వ్యూలకు హాజ రయ్యారు. ఇందులో నెట్‌సెట్ రాసిన వారు ఎనిమిది మంది ఉన్నారు. ఇందులో ముగ్గురికి మాత్రమే ప్రవేశం కల్పించి మిగితావారికి మొండిచేయి చూపించారు. పీహెచ్ డీ ప్రవేశాలకు అర్హత సాధించని విద్యార్థి సంఘం నాయకులకు ప్రవేశం కల్పించారు. ఏం జరిగింది? పీహెచ్డీ ప్రవేశాల జాబితా వెల్లడి ఆగానే అందులో అక్రమాలు జరిగాయంటూ, అర్హత సాధించని నలుగురు విద్యార్థి సంఘం నాయకులు మూడు రోజులపాటు ఆం దోళన చేశారు. తమకు కూడా ప్రవేశాలు కల్పించాలని పట్టుబట్టారు. అధికారులను మాయచేసి ప్రవేశాల నివేదికను రెండవసారి రూపొందింపజేశారు. విద్యార్థి సంఘం నాయకులు నలుగురు అర్హత సాధించినట్లు యూనివర్సిటీ అధికారులు రెండవ జాబితాను పెట్టారు. దీంతో, అంతకు ముందు అర్హత సాధించిన స్వప్న, గాయత్రి అనే ఇద్దరు విద్యార్థినులు అనర్హులుగా మారిపోయారు. నిబంధనల ప్రకారం ముగ్గురు సభ్యుల బృందం ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేయాలి. ఇందులోనూ అనర్హు లకే అవకాశం లభించింది. మూడు రోజుల క్రితం ఓ విద్యార్థిని యూనివర్సిటీ అధికారులతో తీవ్ర వాగ్వివాదానికి దిగడంతో అధికారులు ఆమెకు ప్రవేశం కల్పించారు. ఇందులో విద్యార్థి సంఘాల నాయకులే కీలకంగా వ్యవహరించినట్లు తెలిసింది. 40 సంవత్సరాలు దాటినా విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడుగా కొనసాగుతున్న ఓ నా యకుడికి సైతం పీహెచ్డీ సీటు లభించడం గమనార్హం. ప్రవేశాలకు సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన లిస్టును టీయూ అధికారులు గల్లంతు చేసినట్లు తెలిసింది. బోర్డు అధికారులు ఏం చేసినట్లు! పీహెచ్డీ ప్రవేశాల కోసం ముగ్గురు సభ్యుల బృందం ఉంటుంది. ఇందులో వర్సిటీ ప్రిన్సిపాల్, సీనియర్ తెలుగు లెక్చరర్, మరో అధికారి ఉంటారు. వీరు పీహెచ్డీ ప్రవేశం కోరే అభ్యర్థుల నెట్‌సెట్ ఉత్తీర్ణత, సంబంధిత సబ్జెక్టులలో అనుభవం, ఇంటర్వ్యూలో మార్కుల విధానం, సర్టిఫికెట్లను పరిశీలించాల్సి ఉంటుంది. అన్నీ సక్ర ంగా ఉన్నాయని నిర్ధారించుకున్న తరువాతే జాబితాను వెల్లడించాలి. కానీ, ఈ బృందం కూడా ఉన్నతాధికారుల ఒత్తిడికి తలొగ్గినట్లు తెలిసింది. ఈ ఇంటర్వ్యూకు వచ్చిన ఓ విద్యార్థి ‘‘నేను అర్హురాలిని నాకు ఎందుకు ప్రవేశం కల్పించలేదని’’ ప్రశ్నించగా, ‘‘ఒక్కొక్కరికి పది వేల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. మీరు భరించగలరా’’ అ ని ఓ అధికారి ఎదురు ప్రశ్నించినట్టు సమాచారం. తమ తప్పులు బయటకు రాకుండా జాగ్రత్త పడుతూనే, ప్రవేశాలపై ప్రశ్నించిన అధికారులు, విద్యార్థులను విద్యార్థి సంఘం నాయకులతో బెదిరించారని ఓ విద్యార్థి వాపోయాడు. ఈ వ్యవహారమంతటిపై ఉన్నతాధికారులు విచారణ జరిపితే వాస్తవాలు బయటపడే అవకాశం ఉందని పలువురు చెబుతున్నారు. -
క్యాంపస్‌లో ఆజాద్‌కు ఘన నివాళి
దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్‌కు తెలంగాణ యూనివర్సిటీలో మంగళవారం ఘన నివాళులు అర్పించారు. తెయూ కళాశాల ప్రాంగణం లో మైనారిటీ విభాగం ఆధ్వర్యంలో జాతీయ విద్యా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ట్స్, హ్యూమానిటీస్ ప్రిన్సిపాల్ కనకయ్య మాట్లాడుతూ అబుల్ క లాం ఆజాద్ ద్విజాతి సిద్ధాంతాన్ని వ్యతిరేకించి, హిందూ-ముస్లిం ఐక్యతకు పాటుపడ్డారని తెలిపారు. తొలి విద్యా శాఖ మంత్రిగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్‌ను ఏర్పాటు చేశారన్నారు. తెయూ పీఆర్ఓ రాజారాం మాట్లాడుతూ ఆజాద్ నికార్సైన సెక్యులర్‌వాది అని, పాకిస్తాన్ ఏర్పాటును వ్యతిరేకించిన జాతీయవాది అని అన్నారు. ముందు చూపుతో యూజీసీ, ఐఐటీ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలను ఏర్పాటు చేసి దేశాన్ని విద్యారంగంలో అగ్రభాగాన నిలిపారన్నారు. ఈ కార్యక్రమంలో తెయూ మై నారిటీ విభాగం డైరక్టర్ జమీల్ అహ్మద్, ఉర్దూ విభాగాధిపతి డాక్టర్ అఖ్తర్ సుల్తానా, ప్రొపెసర్ నసీం, డాక్టర్ అబ్దుల్ ఖవి, డాక్టర్ త్రివేణి, డాక్టర్ లక్ష్మణ చక్రవర్తి వి ద్యార్థి నాయకులు పాల్గొన్నారు. సౌత్ క్యాంపస్‌లో భిక్కనూరు : తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్‌లో అబుల్‌కలామ్ ఆజాద్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సబిత, ప్రొఫెసర్లు లలిత, హరిత, ప్రతిజ్ఞ, నాగరాజు, రవీందర్, విద్యార్థి నాయకులు గణేశ్, సంజయ్, సవిత, స్వరూప, దివ్య, మహేశ్ -
‘తెలంగాణ’లోనూ అన్యాయమేనా?
ఆర్మూర్ టౌన్ : తెలంగాణ యూనివర్సిటీకి నిధుల కేటాయింపులో తెలంగాణ రాష్ట్రంలోనూ అన్యాయమే జరిగిందని అఖిల భారత విద్యా పోరాట యాత్ర కన్వీనర్, సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్లో రూ. 7 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకుందని విమర్శించారు. అఖిల భారత విద్యా పోరాట యాత్ర సోమవారం ఆర్మూర్ పట్టణానికి చేరుకుంది. యాత్రకు సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, పీడీఎస్‌యూ, పీడీఎస్‌యూ చంద్రన్న వర్గం, పీవైఎల్, పీవోడబ్ల్యూ, ఏఐకేఎంఎస్ నాయకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ వర్సిటీ అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. అందరికీ నాణ్యమైన విద్య, సమాన ఉద్యోగ అవకాశాలకోసం పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీపీటీఎఫ్, డీటీఎఫ్, ఎన్ఎస్ఎఫ్ల రాష్ట్ర అధ్యక్షులు కొండల్‌రెడ్డి, ఆర్.నారాయణరెడ్డి, స్టాలిన్, పీడీఎస్‌యూ రాష్ట్ర నాయకులు సరిత, సౌందర్య, ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్, జిల్లా అధ్యక్షుడు దేవరాం, ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి దాసు తదితరులు పాల్గొన్నారు. -
తెయూపై శీతకన్ను
భిక్కనూరు : టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ యూనివర్సిటీపై సవతితల్లి ప్రేమ చూపిస్తోందని సౌత్‌క్యాంపస్ విద్యార్థి జేఏసీ కన్వీనర్ సత్యం ఆరోపించారు. శుక్రవారం సౌత్‌క్యాం పస్‌లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ యూనివర్సిటీకి ప్రభుత్వం కేవలం రూ. 24 కోట్లు మాత్రమే మంజూరు చేయడం శోచనీయమన్నారు. జిల్లాలో తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో, రెండు పార్లమెంట్ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రజలు గెలిపించారని, అయితే ఆ విషయాన్ని కేసీఆర్ విస్మరించారని అన్నారు. వెంటనే తెలంగాణ యూనివర్సిటీకి రూ.100 కోట్లు విడుదల చేయని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హె చ్చరించారు. నిరసన కార్యక్రమంలో జేఏసీ అధ్యక్షులు గోవర్ధన్, నాయకులు రఘురాం, రమేశ్, ఫర్మియానాయక్, సంధ్యకుమార్, యోగి, నర్సింలు, శివకుమార్, రఘురామ్‌లు పాల్గొన్నారు. -
వీసీ గారూ.. వర్సిటీని చూడరూ..!
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ రాష్ట్రమొచ్చినా తెలంగాణ యూనివర్సిటీలో సమస్యలు మాత్రం తీరడం లేదు. ఏళ్లు గడుస్తున్నా నిత్యం ఏదో ఓ సమస్యతో విద్యార్థులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. నూతన కోర్సులు, కొత్త భవనలంటూ సంబురపడటమే తప్పా విద్యార్థుల ఇబ్బందులు మాత్రం తీరడం లేదు. రెండు నెలల కిందటే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ కల్వకుంట్ల కవితతో పాటు పలువురు జిల్లా ఎమ్మెల్యేలు ప్రారంభించిన భవన నిర్మాణ పనులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్, లా కళాశాలల భవనాలతో పాటు మెయిన్ గేట్(ఆర్చ్) నిర్మాణ పనులు నత్తకే నడక నేర్పేలా సాగుతున్నాయి. అప్పటి వీసీ అక్బర్ అలీఖాన్ తన పదవీకాలం ముగుస్తుందన్న ఒకే కారణంతో శిలాఫలకంపై తన పేరు ఉండాలనే కాంక్షతో నిర్మాణ పనులు పూర్తి కాక ముందే మంత్రులను పిలిపించి ప్రారంభోత్సవాలు నిర్వహించారు. దీనిపై విద్యార్థులు, వర్సిటీ వర్గాల నుంచి విమర్శలు వచ్చినా ఆయన పట్టించుకోలేదు. ప్రారంభోత్సవాలకు హాజరైన మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు సైతం వీసీ తీరుపై అప్పుడే ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు పూర్తి కాకుండానే తమను ఎందుకు ఆహ్వానించారని వీసీని తప్పుపట్టిన విషయం తెలిసిందే. పనులు పూర్తయిన తర్వాతే ప్రారంభోత్సవాలు చేయాలని విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేసినా అప్పటి వీసీ పట్టించుకోకుండా ప్రారంభోత్సవం నిర్విహ ంచారు. ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు జూన్ 27న ప్రారంభోత్సవాలు జరిగినా నేటికి కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల భవన నిర్మాణ పనులు, మెయిన్ గేట్ నిర్మాణ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంది. లా భవన నిర్మాణ పనులు ఇంకా పూర్తి కాకముందే అందులో తరగతులు ప్రారంభించడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పనులు వెంటనే పూర్తిచేయాలని సంబంధిత కోర్సుల విద్యార్థులు మంగళవారం ధర్నా చేపట్టి.. నిరసన సైతం తెలిపారు. వర్సిటీ ముఖం చూడని వీసీ గత వీసీ అక్బర్‌అలీఖాన్ పదవీ కాలం ముగిసి నెలలు గడుస్తున్నాయి. ఇన్చార్జి వీసీగా శైలజా రామయ్యర్ బాధ్యతలు చేపట్టారు. కానీ ఒక్కసారి కూడా వర్సిటీని సందర్శించలేదు. పాలనకు సం బంధించి ఇక్కడి అధికారులే హైదరాబాద్ వెళ్లి పనులు చేయించుకు వస్తున్నారు. ఉన్నతాధికారు లు దృష్టిసారించక పోవడంతో నెలల తరబడి పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికైనా ఇన్చార్జి వీసీ వర్సిటీపై దృష్టిసారిం చాలని విద్యార్థులు కోరుతున్నారు. -
తెలంగాణ వర్సిటీ మాజీ వీసీ మెడకు బిగిసిన ఉచ్చు
సీఎం వద్దకు చేరిన విచారణ నివేదిక డిచ్పల్లి: తెలంగాణ యూనివర్సిటీ మాజీ వీసీ అక్బర్ అలీఖాన్ మెడకు నియామకాల ఉచ్చు బిగిసింది. వర్సిటీలో చేపట్టిన టీచింగ్, నాన్‌టీచింగ్ నియామకాలకు సంబంధించి వీసీపై ఆరోపణలు రావడంతో గవర్నర్ నరసింహన్ విచారణకు ఆదేశించగా, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సీవీ రాములు విచారణ జరిపిన విషయం తెలిసిందే. ఈ విచారణలో.. నియామకాల నిలిపివేతకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినా వీసీ పట్టించుకోలేదని తేలింది. రెండు, మూడు రోజులలో సీఎం ఈ విషయమై చర్యలు తీసుకోనున్నట్లు తెలిసింది. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ల ఎంపికలో అక్రమాలు చోటుచేసుకున్నట్లు జస్టిస్ సీవీ రాములు తన నివేదికలో నిర్ధారించినట్లు సమాచారం. నియామకాలు రద్దు చేయాలని, కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి నియామకాలు చేపట్టాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లు తెలిసింది. మాజీ వీసీ అక్బర్ అలీఖాన్ రాష్ట్ర మంత్రుల చుట్టూ చక్కర్లు కొడుతున్నట్లు సమాచారం. ఇన్చార్జ వీసీ శైలజా రామయ్యర్‌కు చెప్పించి వేతనాలందేలా చూస్తానని కొత్త అధ్యాపకులకు భరోసా ఇస్తున్నట్లు తెలిసింది. పదవీకాలం ముగిసినా, ప్రస్తుతం ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో విధుల్లో ఉన్న విషయం తెలిసిందే. -
మూడేళ్లలో ఎంతో అభివృద్ధి
తెయూ(డిచ్పల్లి) : తాను తెలంగాణ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ బాధ్యతలు స్వీకరించిన ఈ మూడేళ్లలో వర్సిటీ ఎంతో అభివృద్ధి సాధించిందని అక్బర్ అలీ ఖాన్ పేర్కొన్నారు. అందరి సహకారంతోనే ఈ అభివృద్ధి సాధ్యమైందన్నారు. అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బందితో పా టు మీడియా ప్రతినిధులు ఎంతో సహకరించారంటూ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఆయన గురువారం సాయంత్రం తన చాంబర్లో విలేకరులతో మాట్లాడా రు. తాను బాధ్యతలు స్వీకరించిన వెంటనే జిల్లాలోని కళాశాలల అఫిలియేషన్ లభించిందన్నారు. యూనివర్సిటీ అభివృద్ధిలో ఎంతో కీలకమైన యూజీసీ 12(బి) గుర్తింపును పొందగలిగామన్నారు. ప్రస్తుతం 195 మంది రీసెర్చ్ స్కాలర్లు పరిశోధనల కోసం నమోదు చేసుకున్నారని తెలిపారు. వీరిలో 25 మందికి ప్రతిష్టాత్మకమైన నెట్, సెట్ వంటి అర్హతలున్నాయన్నారు. యూనివర్సిటీలోని పలువురు అధ్యాపకులకు జాతీయ పరిశోధన సంస్థల ప్రాజెక్టులు లభించాయని తెలిపా రు. సైన్స్ విభాగాలకు ఎక్కువగా డిమాండ్ ఉందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని సైన్స్ ప్రయోగశాలలను విస్తరించేందుకు కృషి చేశానని వివరించారు. పరీక్షల నిర్వహణ రంగంలో ఎన్నో మార్పులను తీసుకుని వచ్చామని వీసీ తెలిపారు. కంప్యూటర్ ఆధారిత ఇంటర్నల్ పరీక్షలు, అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ వంటివి ఇందుకు ఉదాహరణగా చె ప్పవచ్చన్నారు. విద్యాసంస్థల నాణ్యత ప్రమాణాలను నిర్ధారించే న్యాక్ పర్యవేక్షణ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు. వర్సిటీ తొలి స్నాతకోత్సవాన్ని గతేడాది నవంబర్ 13వ తేదీన ఎంతో ఘనంగా నిర్వహించామని తెలిపారు. తన హయాంలో 54 మంది శాశ్వత బోధన సిబ్బందిని ఎంపికయ్యారని, అందులో 48 మంది విధుల్లో చేరారని వివరించారు. నియామకాల విషయంలో వచ్చిన ఆరోపణల్లో ఎంత మాత్రం వాస్తవం లేదని, నిబంధనల మేరకే పోస్టులు భర్తీ చేశామని వివరణ ఇచ్చారు. యూనివర్సిటీకి ఉజ్వల మైన భవిష్యత్తు ఉందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ యూనివర్సిటీ భవిష్యత్తులో హార్వర్డ్ యూనివర్సిటీ స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. -
'నన్ను ఒక నియంతగా చూశారు'
నిజామాబాద్ : పోలీస్ పటేల్‌గా, గ్రామ సర్పంచుగా పని చేసిన కాలంలో కొందరు తనను ఒక నియంతగా చూశారని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్ అన్నారు. జిల్లాకు తెలంగాణ యూనివర్సిటీ ఇచ్చిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిది అయితే, వర్సిటీ తెచ్చిన ఘనత తనదేనని గర్వంగా చెప్పగలనని ఆయన తెలిపారు. తెలంగాణ యూనివర్సిటీని ఎక్కడో రాళ్లు, కొండ గుట్టల మధ్య ఏర్పాటు చేయడానికి జిల్లా నాయకుడు ఒకరు ప్రయత్నించారని ఓ కార్యక్రమంలో పాల్గొన్న బాజిరెడ్డి విమర్శించారు. తాను ఎక్కువగా చదువుకోకున్నా, సమాజాన్ని బాగా చదివానని బాజిరెడ్డి అన్నారు. యూనివర్సిటీ అభివృద్ధికి సహాయ సహకారాలు అందజేసేందుకు ముందు ఉంటాయని ఆయన తెలిపారు. -
ఓయూ స్థాయికి తెయూ ఎదగాలి
తెయూ(డిచ్పల్లి) : దేశంలో ఉస్మానియా యూనివర్సిటీకి ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయని, తెలం గాణ యూనివర్సిటీ ఆస్థాయికి చేరుకో వాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీష్‌రెడ్డి ఆకాక్షించారు. వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఆయన శుక్రవారం తెలంగాణ యూనివర్సిటీలో నూతనంగా నిర్మించిన లా కళాశాల భవనం, కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల భవనం, క్యాంపస్ ప్రధాన ద్వారాన్ని ఆయన ప్రారంభించారు. అలాగే కేంద్రీయ గ్రంథాలయ భవన నిర్మాణ పనులకు భూమిపూజ నిర్వహించారు. అనంతరం క్యాంపస్‌లోని కంప్యూటర్ అండ్ ఇంజనీరింగ్ కళాశాల భవనంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ఎన్నో త్యాగా ల వల్ల తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని, రాష్ట్రం సాధించుకోగానే సరిపోదని, తెలంగాణ పునర్నిర్మాణం కోసం 24 గంటలు పనిచేసినా సరిపోదన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థల ద్వారా నాణ్యమైన విద్య అందించడం తెలంగాణ సీఎం కేసీఆర్ కల అన్నారు. ప్రస్తుత విద్యా విధానంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతున్నామని చెప్పారు. రాష్ట్రం విడిపోయినా పొరుగు రాష్ట్రం సీఎం చం ద్రబాబు ఇంకా కుట్రలకు పాల్పడుతూనే ఉన్నారని మంత్రి ఆరోపించారు. తెలంగాణకు కరెం ట్ రాకుండా చేయడానికి బాబు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. సీమాంధ్రుల పాలనలో తెలంగాణలో ప్రభుత్వ విద్యావ్యవస్థ వివక్షకు గురైందన్నారు. ఆంధ్రా ప్రాంతంలో వర్సిటీలు అభివృద్ధికి నోచుకోగా, తెలంగాణలో యూనివర్సిటీలు సరైన వసతి సౌకర్యాలు, తగినన్ని నిధులు లేక సమస్యలకు నిలయంగా మారాయన్నారు.ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మూత్రశాలలు, తరగతి గదులు లేక విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం విద్యాభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. తెయూలో అదనపు కోర్సులు, బాలికల వసతి గృహం, మంజూరుకు కృషి చేస్తానన్నారు. ఎంపీ కల్వకుంట్ల కవిత కోరిక మేరకు మిగిలిన జిల్లాల కన్నా ఈ జిల్లాకు అధిక నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ యూనివర్సిటీలో వీలైతే ఈ విద్యాసంవత్సరంలోనే బీటెక్ ఇంజినీరింగ్ కోర్సు ప్రారంభించేందుకు కృషిచేస్తానని మంత్రి తెలిపారు. హైదరాబాద్‌లో ఏర్పాటు కానున్న ఐటీఐఆర్ ప్రాజెక్ట్‌తో ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. ఈ ప్రాజెక్టులో కనీసం 50 శాతం ఉద్యోగాలను తెలంగాణ విద్యార్థులు సాధించాలని పిలుపునిచ్చారు. బాసరలోని ట్రిపుల్ ఐటీకి చెందిన ఉద్యోగులకు న్యాయం జరిగేలా చూస్తానని, వారి ఉద్యోగాలు పోకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి జగదీష్‌రెడ్డి హామీ ఇచ్చారు. -
‘ఎంఎస్‌డబ్ల్యూ’తో ఎన్నో అవకాశాలు
మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ (ఎంఎఎస్‌డబ్ల్యూ) కోర్సు పూర్తి చేసినవారికి ఉపాధి, ఉద్యోగావకాశాలు మెరుగ్గా ఉంటాయని తెలంగాణ యూనివర్సిటీ ఎంఎస్‌డబ్ల్యూ విభాగాధిపతి(హెచ్‌వోడీ) విజయ్‌కుమార్ శర్మ తెలిపారు. శుక్రవారం ఆయన ‘న్యూస్‌లైన్’తో మాట్లాడారు. ఎంఎస్‌డబ్ల్యూ కోర్సు ప్రాధాన్య త గురించి వివరించారు. ఈ కోర్సు పూర్తి చేసినవారికి ఈజీ ఎస్, ఐసీడీఎస్, ఎన్‌ఆర్‌ఐడీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, సోషల్ వెల్ఫేర్ శాఖలు, ఏపీ సాక్స్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలతోపాటు స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ కంపెనీలు, హాస్పిటల్స్‌లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలుంటాయని తెలిపారు. ముఖ్యంగా ఈ కోర్సు విద్యార్థినులకు అనువైనదన్నారు. కోర్సులో భాగం గా రెండో సంవత్సరంలో ఫ్యామిలీ అండ్ చైల్డ్ వెల్ఫేర్ స్పెషలైజేషన్ చేసినవారికి ప్రభుత్వ రంగ సంస్థలైన ఐసీడీఎస్, ఎన్ఐఆర్డీ, ఏపీ సాక్స్, ఈజీఎస్‌లలో ఉద్యోగావకాశాలుంటాయని పేర్కొన్నారు. కమ్యూనిటీ డెవలప్మెంట్ స్పెషలైజేషన్ చేసినవారికి కమ్యూనిటీ వెల్ఫేర్(ఎస్సీ, ఎస్టీ, బీసీ) శాఖల్లో సంక్షేమ అధికారులుగా, ఎన్జీవో సంస్థలలో కౌన్సిలర్‌గా ఉద్యోగవకాశాలు లభిస్తాయన్నారు. మెడికల్ అండ్ సైకియా ట్రీ స్పెషలైజేషన్ చేసినవారికీ మంచి అవకావాలు లభిస్తాయ ని పేర్కొన్నారు. తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని కామారెడ్డి, ఆర్మూర్, బాన్సువాడ అనుబంధ కళాశాలల్లో, భిక్కనూర్ సౌత్ క్యాంపస్‌లో మూడు రకాల స్పెషలైజేషన్ కోర్సులు ఉన్నాయని తెలిపారు. కో ఎడ్యుకేషన్ వద్దనుకునే అమ్మాయిలు జిల్లా కేంద్రంలోని ఉమెన్స్ కాలేజ్‌ను ఎంపిక చేసుకోవచ్చన్నారు. విద్యార్థినులకు హాస్టల్ వసతి ఉందన్నారు. -
‘తెయూ’ నియామకాలపై విచారణ
తెయూ(డిచ్పల్లి), న్యూస్‌లైన్: తెలంగాణ యూనివర్సిటీలో చేపట్టిన టీచింగ్, నాన్‌టీచింగ్ నియామకాలకు సంబంధించి వీసీ అక్బర్‌అలీఖాన్‌పై వెల్లువెత్తిన ఆరోపణలపై హైకోర్టు రిటైర్డ్ జడ్జి సీవీ రాములు శుక్రవారం రెండో విడత విచారణ జరిపారు. రాష్ట్ర గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ గత నెల 11న హైకోర్టు రిటైర్ట్ జడ్జి సీవీ రాములు తో విచారణ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. విచారణ ప్రక్రియలో భాగంగా ఈ నెల 19, 20వ తేదీల్లో తెయూను సందర్శించిన హైకోర్టు రిటైర్డ్ జడ్జి రాములు తొలి విడతలో రెండు రోజుల పాటు విచారణ నిర్వహించిన విషయం తెలిసిందే. శుక్రవారం ఉదయం తెయూ పరిపాలనా భవనంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లింబాద్రి చాంబర్లో రహస్యంగా విచారణ నిర్వహించారు. కేవలం విచారణ కమిటీకి ఫిర్యాదు చేసిన ఫిర్యాదు దారులను, ఆరోపణలు ఎదుర్కొంటున్న వీసీ అక్బర్‌అలీఖాన్, మాజీ రిజిస్ట్రార్ అశోక్, ప్రస్తుత రిజిస్ట్రార్ లింబాద్రితో పాటు ఇతర అధ్యాపకులను విడివిడిగా విచారణ జరిపారు. తొలి విడతలో నియామకాలకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేయడంతో పాటు వీసీ అక్బర్‌అలీఖాన్, రిజిస్ట్రార్ లింబాద్రిలను నియామకాల విషయమై ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈ సారి కమిటీకి లిఖిత పూర్వక ఫిర్యాదులు అందజేసిన అకడమిక్ కన్సల్టెంట్లు(ఏసీలు) వెంకటగిరి, వెంకట్‌నాయక్, నారాయణ ల వాదనలు విన్న రిటైర్డ్ జడ్జి వివరాలు నమోదు చేసుకున్నారు. తొలగించిన అప్లయిడ్ ఎకనామిక్స్, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ (ఇంటిగ్రేటెడ్ కోర్సులు) కోర్సులకు సంబంధించి నోటిఫికేషన్లో పోస్టులు ప్రకటించడంతో రోస్టర్ పాయింట్ మారి పోయి పలువురికి అన్యాయం జరిగిందని వారు రిటైర్డ్ జడ్జికి వివరించారు. అలాగే హైకోర్టులో తాము వేసిన కేసును ఉపసంహరించుకోవాలని ఒత్తిడి తెచ్చారని ఏసీలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రస్తుత ప్రిన్సిపాల్ కనకయ్యను విచారించి ఆయన సమాధానాలను నమోదు చేసుకున్నారు. నియామక ప్రక్రియలో అర్హతలు ఉన్నా తమను అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుకు బదులు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు ఎంపిక చేశారని కమిటీకి ఫిర్యాదు చేసిన ప్రభంజన్‌రావు(మాస్ కమ్యూనికేషన్స్), వెంకటేశ్వర్లు(ఎకనామిక్స్), కైసర్ మహ్మద్(మేనేజ్మెంట్) తదితరులు రిటైర్ట్ జడ్డి ఎదుట తమ వాదనలు విన్పించారు. నియామకాల విషయాలపై ప్రభుత్వం గతంలో నియమించిన ద్విసభ్య కమిటీ నివేదికలో తప్పు పట్టిన అంశాలపై వీసీతో పాటు మాజీ రిజిస్ట్రార్ అశోక్‌ను రిటైర్డ్ జడ్జి పలు ప్రశ్నలు వేసినట్లు సమాచారం. నియామకాలపై అకడమిక్ కన్సల్టెంట్లు హైకోర్టులో వేసిన కేసు, కోర్టు మధ్యంతర తీర్పు వివరాల గురించి వీసీ, రిజిస్ట్రార్లను ప్రశ్నించి, వారి వివరణలు నమోదు చేసుకున్నట్లు తెలిసింది. వచ్చే జూలై 14న వీసీ అక్బర్‌అలీఖాన్ పదవీ కాలం ముగియనుంది. దీంతో ఆలోపే విచారణ ప్రక్రియను వీలైనంత త్వరగా ముగించి రాష్ట్ర గవర్నర్‌కు అందజేయనున్నట్లు సమాచారం. -
తెయూ డిగ్రీ ఫలితాలు విడుదల
తెయూ(డిచ్పల్లి), న్యూస్‌లైన్ : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని అనుబంధ కళాశాలల డిగ్రీ పరీక్షల ఫలితాలను వర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ అక్బర్ అలీఖాన్, రిజిస్ట్రార్ ప్రొపెసర్ లింబాద్రి మంగళవారం సాయంత్రం ఆవిష్కరించారు. ఫలితాలను యూనివర్సిటీ వెబ్సైట్లో ఆన్లైన్లో వీసీ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొలిసారి యూనివర్సిటీ ఆధ్వర్యంలో మూడేళ్లకు సంబంధించిన డిగ్రీ ఫలితాలు విడుదల చేయడం ఆనందంగా ఉందన్నారు. తాను వీసీగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే ఓయూ నుంచి తెయూకు అఫిలియేషన్ అనుమతి వచ్చిందన్నారు. గత రెండేళ్లుగా తెయూ ద్వారా డిగ్రీ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలు విడుదల చేశామన్నారు. ఈ విద్యా సంవత్సరంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరాల ఫలితాలు విడుదల చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ నసీం, పరీక్షల అదనపు నియంత్రణాధికారి నాగరాజు, అసిస్టెంట్ అకడమిక్ ఆడిట్ సెల్ డైరక్టర్ రాంబాబు, ప్రిన్సిపాల్ కనకయ్య, నాగరాజు, సాయాగౌడ్, అసిస్టెంట్ పీఆర్వో ఖవి పాల్గొన్నారు. తొలిసారి గ్రేడింగ్ విధానం.. తెయూ పరిధిలో మంగళవారం విడుదల చేసిన డిగ్రీ ఫరీక్ష ఫలితాల్లో తొలిసారి గ్రేడింగ్ పద్ధతిలో కన్సాలిడేటెడ్ మెమోలు జారీ చేస్తున్నట్లు వీసీ అక్బర్ అలీఖాన్ తెలిపారు. విద్యార్థులు సాధించిన మార్కుల ఆధారంగా గ్రేడింగ్ కేటాయిస్తామని ఆయన తెలిపారు. ఈ విద్యా సంవత్సరం (2013-14)లో డిగ్రీ ఫలితాల్లో ప్రథమ సంవత్సరం పరీక్షల్లో 26 శాతం, ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో 26 శాతం, తృతీయ సంవత్సరం పరీక్షల్లో 33 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు వీసీ తెలిపారు. మూడేళ్లకు సంబంధిం చి అన్ని కోర్సుల ఫలితాల్లో బాలుర కంటే బాలికలే ఎక్కువ ఉత్తీర్ణత శాతం సాధించినట్లు తెలిపారు. -
తెయూ వీసీ మెడకు బిగుస్తున్న ఉచ్చు
తెయూ (డిచ్పల్లి), న్యూస్‌లైన్: తెలంగాణ యూనివర్సిటీ వీసీ అక్బర్ అలీఖాన్ మెడకు నియామకాల ఉచ్చు బిగుసుకుంటోంది. వర్సిటీలో చేపట్టిన టీచింగ్, నాన్‌టీచింగ్ నియామకాలకు సంబంధించి వీసీపై ఆరోపణలు రావడంతో గవర్నర్ నరసింహన్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సీవీ రాములు నేతృత్వంలో ఓ విచారణ కమిటీని నియమిం చారు. మూడు రోజుల క్రితం యూనివర్సిటీని సందర్శించిన జస్టి స్ సీవీ రాములు నియామకాలకు సంబంధించిన రికార్డులను పరి శీలించారు. వీసీ అక్బర్ అలీఖాన్, రిజిస్ట్రార్ లింబాద్రిని ప్రశ్నించారు. కొన్ని రికార్డులను తన వెంట తీసుకువెళ్లినట్లు సమాచారం. అసలేం జరిగింది తెలంగాణ యూనివర్సిటీలో 103 బోధన, ఏడు బోధనేతర సిబ్బంది నియామకాలకు 2012 మే 25న మూడు నోటిఫికేషన్లు వెలువడ్డా యి. 2012 అక్టోబర్-నవంబర్ నెలలో హైదరాబాద్‌లో ఇంట ర్వ్యూలు నిర్వహించారు. అర్హతలు న్న వారికి కాకుండా, అర్హతలు లేనివారికి కాల్‌లెటర్లు పంపించార ని, ముఖ్యంగా రోస్టర్ పాయింట్ పాటించలేదని, పలువురు అభ్యర్థుల వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారని, రద్దు చేసిన కోర్సులకు కూడా అధ్యాపకులను నియమించారని ఆరోపణలు వచ్చాయి. వీటన్నింటిని పట్టించుకోకుండా వీసీ నియామకాలు చేపట్టారు. 54 మందికి 2013 ఫిబ్రవరి ఒకటిన నియామక పత్రాలు అందజేశారు. ఆ సమయంలో జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉం డడంతో అప్పటి కలెక్టర్ క్రిస్టినా ఆగ్రహం వ్యక్తం చేయడంతో నియామకాలను నిలిపివేశారు. ఈ అన్ని విషయాలపై విద్యార్థి సంఘాలు, అకడ మిక్ కన్సల్టెంట్లు గవర్నర్ నరసింహన్‌కు, అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, డి ప్యూటి సీఎం దామోదర రాజనర్సింహ, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి మిన్నీ మాథ్యూతో పాటు ఉన్నత విద్యామండలి అధికారులకు ఫిర్యాదు చేశారు. కొందరు అకడమిక్ కన్సల్టెంట్లు కోర్టును ఆశ్రయించారు. ద్విసభ్య కమిటీ నియామకం ఫిర్యాదులపై స్పందించిన ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు వెలువరించే వరకు నియామకాలను నిలిపివేయాలని 2013 ఫిబ్రవరి 15న ఆదేశించిం ది. ఆరోపణలపై విచారణకు, ఆంధ్రా యూనివర్సిటీ మాజీ రిజిస్ట్రార్ ప్రొ ఫెసర్ ప్రసాద్‌రావు, కాకతీయ యూనివర్సిటీ మాజీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ భాస్కర్‌రావుతో కూడిన ద్విసభ్య కమిటీని నియమించింది. ఈ కమిటీ వి చారణ జరిపి నియామకాలలో అక్రమాలు జరిగినట్లు ప్రభుత్వానికి 2013 ఏప్రిల్ 16న నివేదిక అందజేసింది. అదే సమయంలో హైకోర్టు సైతం ని యామక ప్రక్రియను నిలిపివేయాలని 2013 మార్చి 13న స్టే ఇచ్చింది. ఈ ఏడాది జనవరి మూడున హైకోర్టు స్టే ఎత్తివేసింది. స్టే తొలగింపు సమాచారం అందిన వెంటనే వీసీ ఈ విషయాన్ని ఉన్నత విద్యామండలి ప్రిన్సిపాల్ సెక్రటరీకి తెలిపారు. పాలకమండలి సమావేశంలో చర్చించి అనుమతి పొందాలని ఆయన సూచించారు. అయితే ఆయన ఆదేశాలను ప ట్టించుకోకుండా వీసీ, రిజిస్ట్రార్ హుటాహుటిన అదేరోజు అర్ధరాత్రి ని యామక పత్రాలు సిద్ధం చేశారు. 54 మంది అభ్యర్థులకు సమాచారం అందజేశారు. మరుసటి రోజున తెల్లవారుఝామున వీరిలో 48 మంది విధులలో చేరారు. ఇప్పటివరకు ఈ నియామకాలకు వర్సిటీ పాలక మండలి అనుమతి లభించలేదు. వీసీని పదవి నుంచి తప్పించే అవకాశం వీసీ నిర్ణయాలు వివాదాస్పదం కావడంతో గవర్నర్ దీనిపై దష్టి సారించి మొత్తం వ్యవహారంపై ఆరా తీశారు. హైకోర్టు తీర్పుపై దష్టి సారించారు. అక్బర్‌అలీఖాన్ పదవీ కాలం మే 14తో ముగియనుంది. ఈ లోపు విచారణ ప్రక్రియను వేగవంతం చేసి తుది నివేదికను ఇవ్వాలని జస్టిస్ సీవీ రాములును ప్రభుత్వం కోరనుంది. ఇంత జరుగుతున్నా, తన పదవీ కా లం పూర్తయ్యేలోగా లైబ్రేరియన్లు, ఇతర బోధనేతర సిబ్బంది ఖాళీలను భర్తీ చేయాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. -
సెమిస్టర్ పరీక్షలకు 77 మంది గైర్హాజరు
తెయూ(డిచ్పల్లి), న్యూస్‌లైన్ : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో జరుగుతున్న పీజీ సెమిస్టర్ పరీక్షలకు బుధవారం రెండో రోజు 77 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ నసీం తెలి పారు. తెయూ ప్రధాన క్యాంపస్‌తో పాటు భిక్కనూర్ సౌత్ క్యాం పస్, నిజామాబాద్, ఆర్మూర్, కామారెడ్డి, బోధన్, బాన్సువాడ కేంద్రాల్లో జరుగుతున్న సెమిస్టర్ పరీక్షల్లో మొత్తం 1,449 మందికి గాను 1,372 మంది విద్యార్థు లు పరీక్షలకు హాజరైనట్లు ఆమె తెలిపారు. ప్రధాన క్యాంపస్‌లో పరీక్షా కేంద్రాన్ని బుధవారం ప్రిన్సిపల్ కనకయ్య, వైస్ ప్రిన్సిపల్ మమత సందర్శించారు. -
తెలంగాణ వర్సిటీ నియామకాల్లో అక్రమాలపై విచారణ
సాక్షి, హైదరాబాద్: నిజమాబాద్ జిల్లా డిచ్పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీలో బోధ నా సిబ్బంది నియామకాల్లో వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ మహ్మద్ అక్బర్ అలీ ఖాన్ అక్రమాలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. యూ నివర్సిటీ యాక్ట్ నిబంధనలకు విరుద్ధంగా నియామకాల్లో వీసీ అక్రమాలకు పాల్పడ్డారని, కోర్టులో స్టేను తొలగించకముందే ని యామకాలు చేపట్టారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకుంది. హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ సీవీ రాములను విచారణ అధికారిగా నియమిం చింది. ఈ మేరకు గురువారం ప్రభుత్వ సీఎస్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. రెండు నెలల్లో దీనిపై విచారించి నివేదిక అందజేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. అసలేం జరిగిందంటే.... తెలంగాణ వర్సిటీలో గత ఏడాది చేపట్టిన 107 బోధనా సిబ్బంది భర్తీలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలొచ్చాయి. దీనిపై ఉన్న త విద్యామండలి ప్రొఫెసర్లు టి.భాస్కర్‌రా వు, ఎం.ఎస్.ప్రసాదరావు నేతృత్వంలో విచారణ జరిగింది. నెట్, స్లెట్ అర్హత లేనివారిని కూడా జాబితాల్లో చేర్చినట్లు, మార్కు లు దిద్దినట్లు, రిసెర్చ్‌కు ఇచ్చే వెయిటేజీ సరిగా ఇవ్వనట్లు, అలాగే జాబితాల్లోని అన్ని పేజీలపై కాకుండా కేవలం చివరి పేజీపై మాత్రమే వీసీ సంతకం చేసినట్లు వారి విచారణలో తేలింది. దీనిపై ప్రభుత్వం వీసీ వివరణ కూడా కోరింది. అయితే కోర్టులో స్టే తొలగించకముందే నియామకాలను చేపట్టి వీసీ మరిన్ని తప్పిదాలకు పాల్పడినట్లు ప్రభుత్వం గుర్తించింది. దీంతో తాజాగా రిటైర్డ్ జడ్జితో విచారణకు ఆదేశించింది. -
తెయూలో నియామకాలపై విచారణ..?
తెయూ(డిచ్పల్లి), న్యూస్‌లైన్: తెలంగాణ యూనివర్సిటీలో చే పట్టిన టీచింగ్, నాన్ టీచింగ్ నియామకాలకు సంబంధించి వీసీ అక్బర్‌అలీఖాన్‌పై వెల్లువెత్తిన ఆరోపణలపై రాష్ట్ర గవర్నర్ నరసింహన్ తీవ్రంగా స్పందించారు. ఆరోపణలపై హైకోర్టు రిటైర్ట్ జడ్జి శ్రీరాములు నేతృత్వంలో కమిటీని నియమించినట్లు సమాచారం. ఈమేరకు శుక్రవారం సాయంత్రం ఉన్నత విద్యాశాఖను ఆదేశించినట్లు తెలిసింది. పాలకమండలి ఆమో దం లేకుండానే ఏకపక్షంగా అర్ధరాత్రి నియామకాలు జరపడంపై గవర్నర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఉన్నత విద్యాశాఖ నుంచి స్పష్టత తీసుకోకుండానే తెయూ వీసీ అక్బర్రాత్రికి రాత్రే చేపట్టిన నియామక ప్రక్రియ వి వాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. జరిగింది ఇదీ... డిచ్పల్లి మండల కేంద్రం శివారులో ఉన ్న తెలంగాణ యూనివర్సిటీలో 103 బోధన, 7 బోధనేతర సిబ్బంది నియామకాలకు 2012, మే 25న నోటిఫికేషన్ వెలువడింది. 2012 అక్టోబర్- నవంబర్ నెలలో హైదరాబాద్‌లోని వ్యవసాయ యూనివర్సిటీ గెస్ట్‌హౌస్‌లో అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇంటర్వ్యూలను స్థానికంగా నిర్వహించకుండా హైదరాబాద్‌లో నిర్వహించడంపై వీసీపై అప్పట్లోనే ఆరోపణలు వెల్లువెత్తాయి. నియామకాల్లో అర్హతలు లేనివారికి కాల్‌లెటర్లు పంపించారని, రోస్టర్ పాయింట్లు పాటించలేదని, పలువురు అభ్యర్థుల వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అయినా ఇవేమీ పట్టించుకోకుండా వీసీ మొండిగా నియామకాలను చేపట్టారు. ఇంటర్వ్యూల్లో అర్హత సాధించిన 54 మందికి 2013, ఫిబ్రవరి 1న నియామక పత్రాలు అందజేశారు. అప్పట్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ విషయమై అప్పటి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ క్రిస్టినా జెడ్ చోంగ్తూ ఆగ్రహం వ్యక్తం చేయడంతో నియామకాలను నిలిపివేశారు. వీటన్నింటిపై విద్యార్థిసంఘాలు, అకడ మిక్ కన్సల్టెంట్లు రాష్ట్ర గవర్నర్ నరసింహన్, అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి మిన్నీ మాథ్యూతో పాటు ఉన్నత విద్యామండలి అధికారులకు సైతం ఫిర్యాదు చేశారు. అనంతరం కోర్టును ఆశ్రయించారు. ఫిర్యాదులపై స్పందించిన ప్రభుత్వం నియామకాలను నిలిపివేస్తూ, ఆరోపణలపై ద్విసభ్య విచారణ కమిటీని నియమించింది. ఆంధ్రా యూనివర్సిటీ మాజీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ప్రసాద్‌రావు, కాకతీయ యూనివర్సిటీ మాజీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ భాస్కర్‌రావును కమిటీ సభ్యులుగా నియమించింది. ఈ ద్విసభ్య కమిటీ విచారణ జరిపి నియామకాల్లో అక్రమాలు జరిగినట్లు నివేదిక అందజేసినట్లు సమాచారం. అదే సమయంలో కోర్టు సైతం నియామక ప్రక్రియను నిలిపివేయాలని 2013, మార్చి13న స్టే ఇచ్చింది. దీంతో ఈ ఏడాది జనవరి 3న హైకోర్టు స్టే ఎత్తివేసింది. ఈ సమాచారం సాయంత్రం వర్సిటీ అధికారులకు అందింది. స్టే తొలగింపు సమాచారం అందిన వెంటనే వీసీ అక్బర్ అలీఖాన్, రిజిస్ట్రార్ లింబాద్రిలు హుటాహుటిన అదేరోజు అర్ధరాత్రి వర్సిటీ పరిపాలనా భవనానికి చేరుకుని నియామక పత్రాలను సిద్ధం చేశారు. 54 మంది అభ్యర్థులకు సమాచారం అందజేసి వర్సిటీకి పిలిపించుకున్నారు. వీరిలో 48 మంది విధుల్లో చేరారు. ఇప్పటి వరకు ఈ నియామకాలకు వర్సిటీ పాలక మండలి అనుమతి లభించలేదు. దీంతో విధుల్లో చేరిన బోధన సిబ్బందికి జీతాలు ఇవ్వడంలో రెండు నెలల పాటు జాప్యం చేశారు. ఇప్పటికీ కొత్తగా విధుల్లో చేరిన అధ్యాపకులు ఇంకా అభద్రతా భావంతోనే పనిచేస్తున్నారు. -
అంతర్జాతీయ సదస్సుకు డాక్టర్ ఎల్లోసా
తెయూ(డిచ్పల్లి), న్యూస్‌లైన్ : తెలంగాణ యూనివర్సిటీ న్యాయశాస్త్ర విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ జెట్లింగ్ ఎల్లోసా ఢిల్లీ యూనివర్సిటీ న్యాయవిభాగంలో మార్చి 21 నుంచి 23 వరకు నిర్వహించనున్న రెండు అంతర్జాతీయ సమావేశాల్లో పత్ర సమర్పణకు ఎంపికయ్యారు. అంతర్జాతీయ హక్కులు, మేథో సంపత్తి హక్కులు తదితర చట్టసంబంధ అంశాలపై ఈ సదస్సులో ఆయన చర్చిస్తారు. ఈ సమావేశాల్లో సుమారు 20 దేశాలకు చెందిన న్యాయ విభాగం నిపుణులు పాల్గొనబోతున్నారని ఎల్లోసా తెలిపారు. -
ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేయాలి
తెయూ(డిచ్పల్లి), న్యూస్‌లైన్: ఉర్దూ భాషాభివృద్ధికి మరింతగా కృషి చేయకపోతే అది నిరాదరణకు గురయ్యే అవకాశం ఉందని రాష్ట్ర మైనారిటీ కమిషన్ చైర్మన్ అబిద్ రసూల్ ఖాన్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ యూనివర్సిటీ ఉర్దూ విభాగం ఆధ్వర్యంలో రెండు రోజులపాటు ఉర్దూ భాషోత్సవం నిర్వహిస్తున్నారు. సోమవారం మొదటిరోజు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అబిద్ రసూల్‌ఖాన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 2,753 ఉర్దూ మీడియం పాఠశాలల్లో సుమారు 2.24 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారన్నారు. ఇటీవలి కాలంలో తల్లిదండ్రులు పిల్లలను ఇంగ్లిష్ మీడియంలో చదివించేందుకు ఆసక్తి చూపుతున్నారని, దీంతో ఉర్దూ భాషపై మక్కువ తగ్గుతోందని పేర్కొన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో పదేళ్లలో ఉర్దూ భాష గుర్తింపును కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మన రాష్ట్రంలో చిన్నచూపు ఇతర రాష్ట్రాలలో, దేశాలలో స్థానిక భాషలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని రసూల్ ఖాన్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని 15 జిల్లాలలో రెండో అధికార భాషగా ఉన్న ఉర్దూను చిన్నచూపు చూస్తుండడం బాధాకరమన్నారు. ఉర్దూ భాష ఏ ఒక్క వర్గానికో సంబంధించింది కాదని, దేశ భాషలలో ప్రముఖమైందని పేర్కొన్నారు. ఈ భాషపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఉర్దూ మీడియం విద్యా సంస్థలలో సౌకర్యాలు కల్పించాలని, ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. రాష్ట్రంలోని 12 రెసిడెన్షియల్ పాఠశాలల్లో, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యాసంస్థల్లోనూ సగం వరకు సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి సంబంధిత ఫారాలు ఉర్దూలో ఉండటం లేదన్నారు. ఉర్దూ భాషాభివృద్ధికి రూ. 200 కోట్లు అందిస్తామని అధికార భాషా సంఘం హామీ ఇచ్చిందని తెలిపారు. ఉర్దూలో వచ్చే ఫిర్యాదులకూ స్పందించాలని అధికారులను కోరారు. యూనివర్సిటీ రివైజ్డ్ సిలబస్‌లో టెక్నాలజీతో కూడిన పాఠ్యాంశాలను పొందుపర్చామని, మల్టీమీడియా ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తున్నామని వర్సిటీ వైస్చాన్ ్సలర్ అక్బర్ అలీఖాన్ తెలిపారు. తెలంగాణలో ఆదరణ తెలంగాణ జిల్లాల్లో ఉర్దూకు మంచి ఆదరణ ఉందని, ముస్లింలే కాకుండా ఇతరులూ ఈ భాషను ఆదరిస్తున్నారని ఉర్దూ అకాడమీ సంచాలకుడు ఎస్ఏ షుకూర్ పేర్కొన్నారు. తెలంగాణ యూనివర్సిటీలో మైనార్టి ఎడ్యుకేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అంతకు ముందు డాక్టర్ సయ్యద్ తాకీ అబేది రచించిన ‘ఫైజ్-ఎ- షెనాసీ’ పుస్తకాన్ని అబిద్ రసూల్‌ఖాన్, అక్బర్ అలీఖాన్‌లు ఆవిష్కరించారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ లింబాద్రి, ప్రిన్సిపాల్ ధర్మరాజు, ఉర్దూ విభాగం హెచ్‌వోడీ అత్తర్ సుల్తానా, జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ జావేద్ అక్రమ్, డీసీసీ అధ్యక్షుడు తాహెర్ బిన్ హందాన్ అధ్యాపకులు, ఉర్దూ భాషాభిమానులు తదితరులు పాల్గొన్నారు. -
వర్సిటీ ప్రతిష్టను దెబ్బతీస్తున్న విద్యార్థులు
సిరికొండ, న్యూస్‌లైన్ : తెలంగాణ యూనివర్సి టీలో సెమిస్టర్ పరీక్షల విషయం లో కొంత మంది విద్యార్థులు కొద్ది రోజులుగా చేస్తున్న ప్రకటనలు వాస్తవానికి విరుద్ధంగా ఉన్నాయని వీసీ అక్బర్ అలీ ఖాన్ అన్నారు. విద్యార్థులు చేస్తున్న వివాదం యూనివర్సిటీ ప్రతిష్టను దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. చాలా మంది విద్యార్థులు పరీక్షలు రాయడానికి సిద్ధంగా ఉన్నా కొంత మంది విద్యార్థులు వారిని అడ్డుకోవడం బాధాకరమన్నారు. సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. గతంలో డిసెంబర్ 3 నుంచి నిర్వహించాల్సిన పరీక్షలను 9వ తేదీకి వాయిదా వేసిన విషయాన్ని గుర్తు చేశారు. పరీక్షలకు సన్నద్ధం కావడానికి కావాల్సిన సమయం ఇచ్చామని తెలిపారు. ఇది వరకే ఒకసారి వాయిదా వేసిన పరీక్షలను మరో మారు వాయిదా వేయడం కుదరదని స్పష్టం చేశారు. ఎందరో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొనే తాను ఆ నిర్ణయం తీసుకున్నానని,విద్యార్థులు సంయమనంతో వ్యవహరించాలని కోరారు. ఇప్పటి వరకు పరీక్షలు రాయని వారు ఇక మీదట పరీక్షలకు హాజరైతే, ఇది వరకు రాయని పరీక్షలను తిరిగి నిర్వహిస్తామని ప్రకటించినప్పటికీ విద్యార్థుల నుంచి స్పందన లేకపోవడం బాధాకరమన్నారు. విద్యార్థుల అర్ధ నగ్న ప్రదర్శన సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని కోరుతూ తెలంగాణ యూనివర్సిటీలో విద్యార్థులు సోమవారం మరో మారు ఆందోళనకు దిగారు. పరీక్షలు వాయిదా వేయడంలో వీసీ అక్బర్ అలీ ఖాన్ తీరును నిరసిస్తూ విద్యార్థులు అర్ధ నగ్న ప్రదర్శన చేపట్టారు. వీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీసీ ఒంటెత్తు పోకడలను వారు తీవ్రంగా ఖండించారు. పరీక్ష ఫీజు గడువు పెంపు తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని 2013-14 సంవత్సరానికి డిగ్రీ అన్ని విభాగాల పరీక్షల ఫీజు గడువును పొడగించినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ నసీం తెలిపారు. బీఏ,బీకాం,బీఎస్సీ కోర్సుల మొదటి,ద్వితీయ,తృతీయ సంవత్సరాల పరీక్షల ఫీజులను ఆలస్య రుసుం లేకుండా ఈ నెల 20వ తేదీ వరకు చెల్లించవచ్చన్నారు. వంద రూపాయల ఆలస్య రుసుంతో ఈ నెల 24 వరకు చెల్లించవచ్చని తెలిపారు. సెమిస్టర్ పరీక్షలకు 162 మంది హాజరు తెయూ పరిధిలోని నాలుగు పరీక్ష కేంద్రాల్లో సెమిస్టర్ పరీక్షలకు సోమవారం 162 మంది హాజరయ్యారని రిజిస్ట్రార్ ఆర్.లింబాద్రి తెలిపారు. తెయూ క్యాంపస్‌లో 34 మంది,గిరిరాజ్లో 20,ఆర్మూర్‌లో 107 మంది,బోధన్‌లో ఒకరు పరీక్షలకు హాజరైనట్లు పేర్కొన్నారు. తెయూలో పరీక్షలకు ఇబ్బందులు తలెత్తకుం డా డిచ్పల్లి పోలీసులు బందోబస్తు నిర్వహించారు. -
తెయూ వీసీపై విద్యార్థుల నిరసనాగ్రహం
తెయూ(డిచ్పల్లి), న్యూస్‌లైన్: సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేయాలని ఆందోళనలు చేస్తుంటే, ఏ మాత్రం పట్టించుకోకుండా మొండిగా వ్యవహరిస్తున్న తెలంగాణ యూనివర్సిటీ వీసీ అక్బర్‌అలీఖాన్‌పై గురువారం విద్యార్థులు నిరసనాగ్రహం ప్రదర్శించారు. డిచ్పల్లిలోని తెయూ బాలుర వసతి గృహ ం ఎదుట విద్యార్థులు వీసీకి పిండ ప్రదానం చే సి నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ.. వారం రోజులుగా విద్యార్థులు చేస్తున్న నిరసనను పట్టించుకోకుండా వీసీ ఏకపక్షంగా సెమిస్టర్ పరీక్షలను నిర్వహించడం తగదన్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. డిచ్పల్లిలోని వర్సిటీ మెయిన్ క్యాంపస్, భిక్కనూరులోని సౌత్ క్యాంపస్‌తో పాటు వర్సిటీ పరిధిలోని అనుబంధ కళాశాలల్లో కనీసం 3 శాతం విద్యార్థులు కూడా పరీక్షలు రాయడం లేదన్నారు. మెజార్టీ విద్యార్థులు పరీక్షలు వాయిదా వేయాలని కోరుతున్నా, వీసీ తన మొండి వైఖరికి పోవడం తగదన్నారు. వెంటనే పరీక్షల రీషెడ్యూల్ చేయాలని డిమాండ్ చేశారు. కామారెడ్డిలో చెట్టుకు ఉరి కామారెడ్డి : పీజీ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేయాలని టీజీవీపి ఆధ్వర్యంలో గురువారం కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ముందు తెయూ వీసీ అక్బర్ అలీఖాన్ దిష్టిబొమ్మను చెట్టుకు ఉరితీశారు. అనంతరం కళాశాల ఎదుట దహనం చేశారు. కార్యక్రమంలో టీజీవీపీ జిల్లా అధ్యక్షుడు నవీన్, నాయకులు లక్ష్మణ్, వేణు, కిరణ్, తిరుపతి, హజాం, విద్యార్థులు పాల్గొన్నారు. సౌత్ క్యాంపస్‌లో పరీక్షల బహిష్కరణ భిక్కనూరు : తెలంగాణ యూనివర్సిటీ సౌత్‌క్యాంపస్‌లో పీజీ ద్వితీయ సంవత్సరం సెమిస్టర్ పరీక్షలను గురువారం విద్యార్థులు బహిష్కరించారు. పరీక్షలకు హాజరు కావాలని ప్రిన్సిపాల్ సుధాకర్‌గౌడ్ విద్యార్థులను కోరగా, విద్యార్థులు నిరాకరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. ఈ నెలలో నెట్ పరీక్షలు ఉన్నందునే సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని వీసీని కోరినా పట్టించుకోవడం లేదని. గత్యంతరం లేక పరీక్షలను బహిష్కరిస్తున్నామని చెప్పారు. పరీక్షలను తిరిగి పది రోజుల తర్వాత నిర్వహించేందుకు రీ నోటిఫికేషన్ వేయాలని విద్యార్థులు కోరారు. దీంతో ప్రిన్సిపాల్ సుధాకర్‌గౌడ్ ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదిస్తానని విదార్థులకు తెలిపారు. -
పరీక్షలు వాయిదా వేయాలి
తెయూ(డిచ్పల్లి), న్యూస్‌లైన్ : తెలంగాణ యూనివర్సిటీ వీసీ అక్బర్ అలీ ఖాన్ మొండివైఖరిని వీడాలని, సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. బుధవారం వర్సిటీలో పరీక్షలు బహిష్కరించారు. తర్వాత బాలుర హాస్టల్నుంచి పరిపాలన భవనం వరకు వీసీ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. అనంతరం దిష్టిబొమ్మను దహనం చేశారు. భవనం వద్ద బైఠాయించి వర్సిటీ అధికారులెవరూ లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ పరీక్షలు వాయిదా వేయాలంటూ ఎనిమిది రోజులుగా ఆందోళన చేస్తున్నా వీసీ పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. విద్యార్థుల మనోభావాలను పట్టించుకోకుండా పోలీసు బందోబస్తు మధ్య పరీక్షలు నిర్వహిస్తుండడం దారుణమన్నారు. విద్యార్థుల ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించా రు. గతంలో పరీక్షలు బహిష్కరించాలని పిలుపునిచ్చినవారే మంగళవారం ప్రెస్‌మీట్ పెట్టి మరీ పరీక్షలు రాయాలని కోరడం సిగ్గు చేటన్నా రు. అలాంటి వారు క్యాంపస్‌లోకి వచ్చినప్పు డు నిలదీయాలని తోటి విద్యార్థులకు సూచిం చారు. పరీక్షలను వాయిదా వేసే వరకు బహిష్కరించడంతో పాటు అందోళనలు కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. ఆందోళనలో తెయూ క్యాంపస్ విద్యార్థులతో పాటు నిజామాబాద్‌లోని ప్రభుత్వ గిరిరాజ్ పీజీ కళాశాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. కొనసాగిన నిరసనలు విద్యార్థులు మధ్యాహ్నం తర్వాత పరిపాలనా భవనం వద్ద తమ నిరసన కొనసాగించారు. వసతి గృహం నుంచి వంటకాలను తెప్పించుకొని అక్కడే భోజనాలు చేసి, నిరసన తెలిపారు. పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని డిమాండ్ చేశారు. క్యాంపస్‌లో రాజకీయాలు చేసే విద్యార్థులు లేరని, విద్యార్థుల తరపున పోరాటం చేసేవారే ఉన్నారని పేర్కొన్నారు. పరీక్షల విషయంలో సందిగ్ధత తొలగేందుకు విద్యార్థులు, ప్రొఫెసర్లతో కమిటీ వేయాలని వారు కోరారు. ఆందోళనల్లో బీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు బలవీర్ప్రసాద్, ఎన్ ఎస్‌యూఐ వర్సిటీ ఇన్చార్జి రమేశ్‌కుమార్, టీఆర్ఎస్వీ నాయకుడు కిషోర్‌నాయక్, టీజీవీపీ నాయకులు సంతోష్, నాగరాజు, లాల్‌సింగ్, నరేశ్‌కుమార్, చెన్నయ్య, కృష్ణ, జగన్, రాజు తదితరులు పాల్గొన్నారు. పరీక్షలు రాసింది 60 మంది తెయూ పరిధిలో బుధవారం 60 మంది పీజీ సెమిస్టర్ పరీక్షలను రాశారని వర్సిటీ అకడమిక్ ఆడిట్ సెల్ డెరైక్టర్ యాదగిరి తెలిపారు. 1,580 మంది పీజీ విద్యార్థులుండగా డిచ్పల్లి మెయిన్ క్యాంపస్‌లో 25 మంది, ఆర్మూర్‌లో 35 మంది విద్యార్థులు పరీక్షలు రాశారని పేర్కొన్నారు. వర్సిటీలో 144 సెక్షన్ కొనసాగుతోంది. ఏడుగురు ఎస్ఐలు, 20 మంది కానిస్టేబుళ్లు భద్రత విధుల్లో పాల్గొన్నారు. -
పరీక్షలు రాసింది 69 మందే..
తెయూ(డిచ్పల్లి), న్యూస్‌లైన్ : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని పీజీ సెమిస్టర్ పరీక్షలకు మంగళవారం రెండోరోజు 69 మంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు. డిచ్పల్లి మెయిన్ క్యాంపస్ లో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశా రు. సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్న మెయిన్ క్యాంపస్, భిక్కనూర్ సౌత్క్యాంపస్తో పా టు బాన్సువాడ, కామారెడ్డి, బోధన్, ఆర్మూ ర్, నిజామాబాద్ కేంద్రాల్లో 1,316 మంది విద్యార్థులున్నారు. మెయిన్ క్యాంపస్‌లో 25 మంది, ఆర్మూర్‌లో 42 మంది, నిజామాబాద్‌లోని ప్రభుత్వ గిరిరాజ్ పీజీ కళాశాల కేంద్రంలో ఇద్దరు విద్యార్థులు పరీక్షలు రాశారని వర్సిటీ అధికారులు తెలిపారు. పరీక్షలు వాయిదా వేయాలి పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ ఆర్మూర్ నరేంద్ర కళాశాలకు చెందిన పలువు రు విద్యార్థులు వర్సిటీ రిజిస్ట్రార్ లింబాద్రిని కలిశారు. అయితే పరీక్షలను వాయిదా వేసే ప్రసక్తే లేదని రిజిస్ట్రార్ తేల్చిచెప్పడంతో వారు వెనుదిరిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరీక్షలు బహిష్కరించాలని పిలుపునిచ్చినవారిలో కొందరు పరీక్షలు రాస్తున్నారని, వారు తమను తప్పుదారి పట్టించారని పేర్కొన్నారు. సౌత్ క్యాంపస్‌లో.. భిక్కనూరు : వర్సిటీ సౌత్‌క్యాంపస్‌లో మంగళవారం పీజీ ద్వితీయ సంవత్సరం మూడో సెమిస్టర్ పరీక్షలను విద్యార్థులు బహిష్కరిం చారు. పరీక్షలు వాయిదా వేయాలని వర్సిటీ ఉన్నతాధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని విద్యార్థులు ఆరోపించారు. ‘గిరిరాజ్’లో... నిజామాబాద్ అర్బన్ : పరీక్షలను వాయిదా వేయాలని డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు శ్యాం బాబు డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ కార్యకర్త లు మంగళవారం జిల్లాకేంద్రంలోని ప్రభు త్వ గిరిరాజ్ కళాశాలలో పీజీ పరీక్షలను బహిష్కరించారు. ఈ సందర్భంగా శ్యాంబాబు మాట్లాడుతూ వీసీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పరీక్షలను వాయిదా వేస్తామని చెప్పిన ఆయన తర్వాతి రోజే మాట మార్చారని విమర్శించారు. పరీక్షలను వాయిదా వేయకపోతే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. వాయిదా వేసే ప్రసక్తే లేదు సెమిస్టర్ పరీక్షలను ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వేయబోమని తెలంగాణ యూనివర్సిటీ వీసీ అక్బర్ అలీఖాన్ స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం తన చాంబర్లో విలేకరులతో మాట్లాడారు. విద్యార్థులతో సంప్రదించిన తర్వాతే పరీక్ష తేదీలను ప్రకటించామన్నారు. నవంబర్ 25న ప్రారంభం కావాల్సిన పరీక్షలను విద్యార్థుల వినతి మేరకు డిసెంబర్ 3 వ తేదీకి, తర్వాత డిసెంబర్ 9వ తేఈదకి వాయిదా వేశామన్నారు. వచ్చేనెల 2వ తేదీకి వాయిదా వేయాలని విద్యార్థులు మళ్లీ కోరారని, అయితే ఈనెల 16వ తేదీకి వాయిదా వేయడానికి తాను అంగీకరించినా విద్యార్థులు వినలేదని పేర్కొన్నారు. జనవరిలో సంక్రాంతి సెలవులు ఉంటాయని, అందుకే ఈ నెలలోనే పరీక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు. భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని అందరూ పరీక్షలు రాయాలని సూచించారు. బుధవారం నుంచి పరీక్షలు రాస్తే, మొదటి రెండు రోజులు గైర్హాజరైనవారికి మరో తేదీన పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో రిజిస్ట్రార్ లింబాద్రి, అకడమిక్ ఆడిట్ సెల్ డెరైక్టర్ యాదగిరి పాల్గొన్నారు. -
బందోబస్తు మధ్య సెమిస్టర్ పరీక్షలు
తెయూ(డిచ్పల్లి), న్యూస్‌లైన్ : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని పీజీ సెమిస్టర్ పరీక్షలు సోమవారం పోలీసు బందోబస్తు మధ్య ప్రారంభమయ్యాయి. పరీక్షల నిర్వహణ కోసం డిచ్పల్లి మెయిన్ క్యాంపస్, భిక్కనూరు సౌత్క్యాంపస్తో పాటు బాన్సువాడ, కామారెడ్డి, బోధన్, ఆర్మూర్, నిజామాబాద్(ఏడు)లో కేంద్రాలు ఏర్పాటు చేశారు. సోమవారం 1,358 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉంది. వర్సిటీ ఉన్నతాధికారులు ఈ నెల 16 నుంచి పరీక్షలు నిర్వహిస్తామని హామీ ఇచ్చి, తరువాత మాట మార్చి సోమవారం నుంచి ప్రారంభించడాన్ని నిరసిస్తూ విద్యార్థులు పరీక్షలను బహిష్కరించాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. భిక్కనూరు సౌత్ క్యాంపస్‌తో సహా ఆర్మూర్, బాన్సువాడ, కామారెడ్డి, బోధన్, నిజామాబాద్ పరీక్షా కేంద్రాల్లో ఒక్కరు కూడా పరీక్షలు రాయకుండా బహిష్కరించారు. డిచ్పల్లి మెయిన్ క్యాంపస్‌లోని పరీక్షా కేంద్రంలో 325 మందికి గాను కేవలం 27 మంది విద్యార్థులు మా త్రమే పరీక్షలకు హాజరయ్యారు. మిగతా 298 మంది బహిష్కరించారు. పరీక్షలు బహిష్కరించాలని విద్యార్థులు ముందస్తు పిలుపు నివ్వడంతో వర్సిటీ ఉన్నతాధికారులు పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయాల్సి వచ్చింది. డిచ్పల్లి సీఐ శ్రీశైలం, ఎస్సై నరేశ్, జక్రాన్‌పల్లి ఎస్సై రవికుమార్‌ల ఆధర్వంలో పోలీసులను మెయిన్ క్యాంపస్ వద్ద మోహరించారు. ఆరు కేం ద్రాల్లో విద్యార్థులు సంపూర్ణంగా పరీక్షలు బహిష్కరిం చగా కేవలం మెయిన్ క్యాంపస్‌లో మాత్రం ఉర్దూ విభాగం విద్యార్థులు 14 మంది, తెలుగు ఒకరు, ఎల్ఎల్బి కి చెందిన 12 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. మెయిన్ క్యాంపస్‌లోనే కొందరు విద్యార్థి సంఘాల జిల్లా స్థాయి నాయకులు పరీక్షలకు హాజరు కావడం క్యాంపస్‌లోని విద్యార్థుల మధ్య చర్చకు దారి తీసింది. ఈ విషయమై పలువురు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల వెన్నంటి ఉండాల్సిన సంఘాల నాయకులే ఇలా పరీక్షలకు హాజరు కావడం సమంజసంగా లేదన్నారు. వర్సిటీ ఉన్నతాధికారులు క్యాంపస్‌లోని విద్యార్థుల మద్య కుల రాజకీయాల చిచ్చు పెడుతున్నారని ఆరోపిం చారు. తాము మూడు రోజుల పాటు సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేయాలని ధర్నా చేపట్టగా, ఈ నెల 16 వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన వీసీ మాట మార్చి సోమవారం నుంచే పరీక్షలు ప్రారంభించడం శోచనీయమన్నారు. వీసీ ఒంటెత్తు పోకడలకు నిరసనగా విద్యార్థులు తమ హాల్‌టికెట్లను చించి వేశారు. విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పరీక్షలను వెంటనే వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. పరీక్షలకు అదనపు సమయం.. వర్సిటీ మెయిన్ క్యాంపస్‌లో ప్రారంభమైన సెమిస్టర్ పరీక్షలకు ఉన్నతాధికారులు కొందరు విద్యార్థులకు అదనపు సమయం ఇచ్చారు. కొందరు విద్యార్థులు పరీక్షా హాలు వద్దకు ఆలస్యంగా చేరుకున్నారు. దీంతో వారికి అదనంగా సమయం ఇవ్వాలని ప్రిన్సిపాల్ ధర్మరాజు ఇన్విజిలేటర్లకు సూచించారు. -
తెయూ పరువు గంగ పాలు
తెయూ(డిచ్పల్లి), న్యూస్‌లైన్ : తెలంగాణ యూనివర్సిటీ(తెయూ) తొలి స్నాతకోత్సవం వర్సిటీ ఉన్నతాధికారుల ఒంటెత్తు పోకడల వల్ల అభాసు పాలైంది. బుధవారం జరిగిన తెయూ స్నాతకోత్సవంలో అధికారుల తీరు, ఖాళీ కుర్చీలతో అతిథుల ఎదుట వర్సిటీ పరువు గంగలో కలిసిందని విద్యార్థులు, వర్సిటీ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలలుగా కసరత్తు... తొలి స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహిం చేందుకు మూడు నెలలుగా వీసీ అక్బర్ అలీ ఖాన్, రిజిస్ట్రార్ లింబాద్రిలు కసరత్తు చేశారు. స్నాతకోత్సవాన్ని విజయవంతం చేసేందుకు 16 కమిటీలను ఏర్పాటు చేసి ఒక్కొక్కరికి ఒక్కో పనిని అప్పచెప్పారు. స్నాతకోత్సవానికి రాష్ట్ర గవర్నర్ నరసింహన్, పాలకమండలి సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు హాజరవుతారని తరచూ ప్రెస్మీట్లు ఏర్పాటు చేసి మరీ ఊదర గొట్టారు. వారం క్రితం జిల్లా కేంద్రానికి టూరిస్టు బస్సు పంపి మరీ ప్రింటు, ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులను వర్సిటీకి పిలిపించి స్నాతకోత్సవానికి గవర్నర్ వస్తున్నారని ప్రచారం చేసుకున్నారు. ప్రచారంపై చూపిన శ్రద్ధ స్నాతకోత్సవం విజయవంతం చేయడానికి చేపట్టాల్సిన చర్యలపై చూపలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థుల కోసం స్నాతకోత్సవం నిర్వహిస్తున్నట్లు ఏ కోశానా కన్పించలేదు. తమ హయాంలో తొలి స్నాతకోత్సవం జరిపిన ఖ్యాతి కోసమే కార్యక్రమం నిర్వహిం చినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గవర్నర్ రారని తెలిసినా... రాష్ట్ర గవర్నర్ రారని ముందస్తుగానే తెలిసినా, ఆయన వస్తారని చివరి నిమిషం వరకు ప్రచారం చేయడం విమర్శలకు దారి తీస్తోంది. అసలు విషయాన్ని దాచి గవర్నర్ రాకను సైతం ప్రచారానికే వాడుకున్నారు. స్నాతకోత్సవానికి హాజరయ్యే విద్యార్థులు నిబంధనల ప్రకారం నడుచుకోవాలంటూ లేనిపోని ఆంక్షలు విధించడం, ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులను కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడకపోవడం వర్సిటీ ఉన్నతాధికారుల ఒంటెత్తు పోకడలను తెలియజేస్తుంది. వర్సిటీ ఏర్పాటైన తర్వాత ఇప్ప టి వరకు పూర్తయిన ఆరు బ్యాచులకు సంబంధించి 13 మంది టాపర్లకు మాత్రమే గోల్డ్ మెడల్స్ ఇస్తామని పదే పదే ప్రకటించడం గమనార్హం. దీంతో ప్రతి బ్యాచులో టాపర్లుగా వచ్చిన వారు తీవ్ర నిరాశకు లోనయ్యారు. కనీసం తమకు వేదికపై అతిథుల చేతుల మీదుగా కాన్వకేషన్స్ ఇప్పించాలని వారు పలుమార్లు విన్నవించినా వర్సిటీ ఉన్నతాధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. దాతలకు గౌరవమేదీ... తొలిస్నాతకోత్సవం కోసం టాపర్లకు గోల్డ్‌మెడల్స్ అందజేయాలని కోరుతూ పలువురు దాతలు ముందుకు వచ్చారు. 15 మంది దాతలు ఒక్కొక్కరు గోల్డ్ మెడల్ కోసం రూ.2.10 లక్షలు విరాళంగా అందజేశారు. స్నాతకోత్సవం రోజు దాతలకు కనీస గౌరవం దక్కలేదు. దాతలను ఆహ్వానించే వారే కరువయ్యారు. కనీసం వర్సిటీ సంక్షేమం కోసం విరాళాలు అందజేసిన దాతలకు ప్రత్యేక భోజనం అందజేయలేదు. అలాగే కాన్వకేషన్ కోసం 1497 మంది విద్యార్థులు తమ పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ పేరిట విద్యార్థుల నుంచి సుమారు రూ.12 లక్షలు వసూలు చేశారు. డబ్బులు చెల్లించిన వారికి సైతం వేదిక మీద కాన్వకేషన్స్ ఇవ్వబోమని వర్సిటీ ఉన్నతాధికారులు చెప్పడం వారిని నిరాశకు గురిచేసింది. మంచినీళ్లు కరువు... గోల్డ్‌మెడల్ అందుకోవడానికి వివిధ జిల్లాల నుంచి హాజరైన టాపర్లకు వారి కుటుంబసభ్యులతో పాటు పలువురికి మంచినీళ్లు, భోజనం అందించే వారే కరువయ్యా రు. లక్షలాది రూపాయలు వసూలు చేసి అన్నం పెట్టకుం డా ఆకలితో కడుపులు మాడ్చారని పలువురు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. దాతలు, విద్యార్థులు, మీడియా వారికి, పోలీసులు, అధ్యాపకులకు భోజనాలు ఒకే దగ్గర పెట్టడంతో దాతలు సైతం ప్లేట్ల కోసం కుస్తీ పట్టాల్సి వచ్చింది. వీసీ అక్బర్‌అలీఖాన్ తన ప్రసంగంలో కేవలం ఇద్దరు దాత పేర్లనే ప్రస్తావించి, మిగిలిన దాతలను విస్మరించడంతో దాతలకు గుర్తింపు లేకుండా పోయింది. దీంతో వారు తీవ్ర నిరాశకు లోనయ్యారు. విద్యార్థులు గుర్తు రాలేదా... కార్యక్రమంలో సగం కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చి అతిథుల ఎదుట వర్సిటీ పరువు పోయినట్లయింది. కుర్చీ లు నిండని స్థితిలోనైనా విద్యార్థులను ఆహ్వానిస్తే నిండుదనం కన్పించేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు ప్రస్తుత విద్యార్థుల కోసం కార్యక్రమం నిర్వహిస్తున్న భవనం పక్కనే ఒక టెంటు వేసి ఎల్సీడీ ఏర్పా టు చేశారు. అయితే అక్కడ కూర్చుని కార్యక్రమాన్ని చూ సే వారే కరువయ్యారు. స్నాతకోత్సవాన్ని మినిట్స్ టు మి నిట్స్ ప్రకారమే నిర్వహిస్తామని ప్రకటనలు చేసిన అధికారులు వాటిని పాటించలేదనే విమర్శలు ఉన్నాయి. స్నాతకోత్సవం పేరిట లక్షలు వర్సిటీ నిధులను వృథా చేశారని, కేవలం 13 మందికి గోల్డ్ మెడల్స్ అందజేయడానికి ఇంత తంతు అవసరమా అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
స్నాతకోత్సవం వెలవెల
తెలంగాణ యూనివర్సిటీలో బుధవారం ని ర్వహించిన తొలి స్నాతకోత్సవం వెలవెలబోయింది. వర్సిటీ చాన్స్‌లర్, రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఈ వేడుకకు దూరంగా ఉన్నారు. దీంతో గవర్నర్ చేతుల మీదుగా గోల్డ్‌మెడల్స్ అందుకోవడం గర్వకారణంగా ఉంటుందని భావించిన వారికి నిరాశే మిగిలింది. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు సైతం స్నాతకోత్సవంలో పాల్గొనకపోవడంతో కార్యక్రమం కళావిహీనంగా మారింది. లక్షలు ఖర్చు చేసి నిర్వహించిన కార్యక్రమంలో వర్సిటీ విద్యార్థులను భాగస్వాములను చేయకపోవడం, టాపర్లకు మాత్రమే వేదికపై గోల్డ్‌మెడల్స్, కాన్వకేషన్స్ అందజేయడంతో మిగిలిన విద్యార్థులు ఆవేదనకు లోనయ్యారు. వర్సిటీ ఏర్పడిన నాటినుంచి ఇప్పటివరకు ఆరు బ్యాచులు పూర్తయ్యాయి. ఆయా కోర్సుల్లో టా పర్లుగా నిలిచిన వారందరినీ వేదికపైకి పిలిచి కాన్వకేషన్లు ఇవ్వాలని పూర్వ విద్యార్థులు పలుమార్లు వర్సిటీ అధికారులను కోరారు. అయితే దీనిని వీసీ పట్టించుకోకపోవడంతో చాలా మం ది కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. దీంతో కుర్చీలు ఖాళీగా కనిపించాయి. స్నాతకోత్సవానికి హాజరైన అతిథులకు, విద్యార్థులకు కనీసం మంచినీళ్లు అందించే వారు కరువయ్యారు. చాలా మందికి భోజనం సైతం అందలేదు. కార్యక్రమాన్ని విద్యార్థి సంఘాల నాయకులు అడ్డుకుంటారేమోననే అనుమానంతో భారీ స్థాయిలో ఏర్పాటు చేశారు. వర్సిటీలో ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులను కార్యక్రమానికి అనుమతించకుండా భవనం బయట టెంటు వేసి ఒక ఎల్‌సీడీని ఏర్పాటు చేశారు. దీనిపై విద్యార్థులు తీవ్ర నిరసన తెలిపారు. కాన్వకేషన్ పేరు మీద విద్యార్థుల నుంచి వేలాది రూపాయలు వసూలు చేసి సరైన సౌకర్యాలు కల్పించలేదని పలువురు విద్యార్థులు వర్సిటీ ఉన్నతాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తు కార్యక్రమాల్లోనైనా తమను భాగస్వాములను చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. -
నేడే తొలి స్నాతకోత్సవం
తెయూ(డిచ్పల్లి), న్యూస్‌లైన్ : తొలి స్నాతకోత్సవానికి తెలంగాణ యూనివర్సిటీ సిద్ధమైంది. ఇందుకు వర్సిటీ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా యూజీసీ మాజీ చైర్మన్, ఇండియన్ కౌన్సిల్ ఫర్ సోషల్ సెన్సైస్ రీసెర్చ్ (ఐసీఎస్ఎస్ఆర్) సంస్థ చైర్మన్ ప్రొఫెసర్ సుఖ్‌దేవ్ తోరట్ పాల్గొననున్నారు. ఏపీ యూనివర్సీటీస్ యాక్ట్ -1991 ప్రకారమే స్నాతకోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు వీసీ అక్బర్ అలీఖాన్ తెలిపారు. 2.25 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. 2.42 గంటలకు ముఖ్యఅతిథి సుఖ్‌దేవ్ తోరట్‌కు వర్సిటీ తరపున గౌరవ డాక్టరేట్ ప్రదానం చేస్తామన్నారు. 2.50 గంటలకు గోల్డ్ మెడల్స్ ప్రదానం చేస్తామని పేర్కొన్నారు. 3.50 గంటలకు కార్యక్రమం ముగుస్తుందని తెలిపారు. కాగా 2006-07 నుంచి 2012-13 విద్యాసంవత్సరం వరకు ఆరు బ్యాచ్‌ల విద్యార్థులు పీజీ, బీఈడీ పూర్తి చేశారు. స్నాతకోత్సవానికి 1,497 మంది దరఖాస్తు చేసుకున్నారు. విజయవంతం చేయాలని.. వర్సిటీ క్యాంపస్‌లోని కంప్యూటర్ అండ్ సైన్స్ భవనంలో స్నాతకోత్సవం నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కార్యక్రమాన్ని విజయవంత ం చేయాలని కోరుతూ రిజిస్ట్రార్ లింబాద్రి మంగళవారం తెయూ పూర్వ విద్యార్థుల అసోసియేషన్ సభ్యులు, విద్యార్థి సంఘాల నాయకులతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. వేడుకల్లో పాల్గొనే విద్యార్థులు తెల్లని దుస్తులు ధరించాలని సూచించారు. స్నాతకోత్సవాన్ని విజయవంతం చేయాలని తెయూ పూర్వ విద్యార్థుల అసోసియేషన్ డెరైక్టర్ రాజారాం, అధ్యక్షుడు పంచరెడ్డి చరణ్, కార్యదర్శి సరిత, గౌరవాధ్యక్షుడు పుప్పాల రవి పిలుపునిచ్చారు. స్నాతకోత్సవం నిర్వహించనున్న కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ భవనాన్ని మంగళవారం డిచ్పల్లి సీఐ శ్రీశైలం, ఎస్సై నరేశ్‌లు సందర్శించారు. బందోబస్తు ఏర్పాట్లపై వీసీ అక్బర్‌అలీఖాన్‌తో సీఐ, ఎస్సై చర్చించారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరుగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. పదిహేను గోల్డ్‌మెడల్స్.. తెలంగాణ యూనివర్సిటీలో వివిధ కోర్సుల్లో అత్యధిక మార్కులు సాధించినవారికి దాతల సహకారంతో గోల్డ్ మెడల్స్ అందించనున్నారు. తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధికోసం 15 మంది దాతలు ముందుకు వచ్చారని వర్సిటీ అధికారులు తెలిపారు. వీరు ఒక్కొక్కరు రూ. 2.10 లక్షల చొప్పున వర్సిటీకి విరాళంగా ఇచ్చారన్నారు. దాతలు సూచించిన సబ్జెక్టులో టాపర్‌కు ఏటా వారి పేరుతో గోల్డ్ మెడల్ ఇస్తామని పేర్కొన్నారు. ఇద్దరికి రెండు చొప్పున ఎంబీఏలో టాపర్‌కు గోల్డ్ మెడల్ ఇవ్వాలని ఇద్దరు దాతలు సూచించారని, దీంతో ఈ సబ్జెక్టులో టాపర్‌గా నిలిచిన సనా ఫిరదౌసికి రెండు గోల్డ్ మెడల్స్ అందించనున్నామని వర్సిటీ అధికారులు తెలిపారు. ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీలోనూ ఇదే పరిస్థితి అని, దీంతో ఇందులో టాపర్‌గా నిలిచిన జువేరాకు రెండు గోల్డ్ మెడల్స్ ప్రదానం చేయనున్నామని పేర్కొన్నారు. పసిడి పతకాలు అందుకునేది వీరే ఆర్ట్స్ విభాగంలో.. సయ్యద్ అమీనా మక్బూల్ (ఎంఏ ఉర్దూ) సురంబ కుర్యాల (ఎంఏ తెలుగు) సోషల్ సెన్స్ విభాగంలో.. బాసం త్రివేణి (ఎంఏ మాస్ కమ్యూనికేషన్స్) ఎస్.బాల్కిషన్ (ఎంఎస్‌డబ్ల్యూ) రుహి షాజాజ్ (ఎంఏ ఎకనామిక్స్) కామర్స్ విభాగంలో.. ఎన్.శ్వేత (ఎంకాం) బిజినెస్ మేనేజ్మెంట్ విభాగంలో.. సనా ఫిరదౌసి (ఎంబీఏ) సైన్స్ విభాగంలో.. పి.అనూష (ఎంఎస్సీ బోటని) తిరుపతిగారి నర్సింహారెడ్డి (ఎమ్మెస్సీ ఫిజిక్స్) జువేరా (ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ) కంప్యూటర్ సైన్స్ విభాగంలో.. కె.సంధ్యారాణి (ఎంసీఏ) లా విభాగంలో.. ఫాతిమా బీ బీఈడీ విభాగంలో... హనుమల్ల అర్చన -
తెలంగాణ వర్సిటీలపై సర్కారు వివక్ష : కోదండరాం
నల్లగొండ, న్యూస్‌లైన్: తెలంగాణ యూనివర్సిటీలకు నిధులు కేటాయింపులో ప్రభుత్వం వివక్ష చూపుతోందని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. విశ్వవిద్యాలయం అభివృద్ధికి నిధులు కేటాయించాలంటూ నల్లగొండలో మహాత్మాగాంధీ యూనివర్సిటీ విద్యార్థులు చేస్తున్న దీక్షలను గురువారం ఆయన విరమింపజేసిన అనంతరం మాట్లాడారు. చంద్రబాబు హయాం నుంచే ప్రభుత్వాలు ఉస్మానియా యూనివర్సిటీకి నిధుల కోత మొదలైందని తెలిపారు. ప్రభుత్వ వివక్ష కారణంగానే మహాత్మాగాంధీ యూనివర్సిటీలో పూర్తిస్థాయిలో అభివృద్ధి పనులు జరగడం లేదని చెప్పారు. దీనిపై దశలవారీగా పోరాటాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. జీఓఎంకు 145 పేజీల నివేదిక తెలంగాణ ప్రాంతంలోని సమస్యలు, సీమాంధ్రుల ఆందోళనపై 145 పేజీల నివేదికను కేంద్ర మంత్రుల బృందానికి అందజేసినట్లు ప్రొఫెసర్ కోదర డరాం తెలిపారు. జిల్లా తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో గురువారం నల్లగొండలోని జెడ్పీ సమావేశ మందిరంలో ‘కేంద్ర మంత్రుల బృందం-తెలంగాణ డిమాండ్’ అంశంపై నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నీళ్లు, హైదరాబాద్, ఉద్యోగాలు, విద్యుత్, తదితర అంశాలపై సీమాంధ్రులు నిర్వహిస్తున్న ఆందోళనల్లో అర్థం లేదన్నారు. కేవలం రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకే వారు అపోహలు సృష్టిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర విభజన వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలు, అందుకు పరిష్కారాలను కూడా జీవోఎంకు సమర్పించిన నివేదికలో స్పష్టంగా వివరించమన్నారు. నవంబర్ 1ను విద్రోహదినంగా పాటించాలని పిలుపునిచ్చారు. -
తెయూ వీసీపై హెచ్చార్సీలో ఫిర్యాదు
తెయూ(డిచ్పల్లి), న్యూస్‌లైన్: తెలంగాణ యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్ అక్బర్ అలీఖాన్‌పై సోమవారం వర్సిటీ అకడమిక్ కన్సల్టెంట్లు రాష్ట్ర మా నవ హక్కుల కమిషన్(హెచ్చార్సీ)లో ఫి ర్యాదు చేశారు. హైదరాబాద్‌లో హె చ్చార్సీ చైర్మన్ కాకుమాను పెద్ద పేరిరెడ్డి ని కలిసి ఫిర్యాదు చేసినట్లు అకడమిక్ క న్సల్టెంట్(ఏసీ) అసోసియేషన్ వర్సిటీ అధ్యక్షురాలు సుజాత తెలిపారు. ఆమె హైదరాబాద్ నుంచి ‘న్యూస్‌లైన్’తో ఫో న్లో తెలిపిన వివరాలు.. తెలంగాణ యూనివర్సిటీలో చేపట్టిన టీచింగ్, నాన్-టీచింగ్ నియామకాల్లో వీసీ అక్రమాల కు పాల్పడినట్లు ఆరోపిస్తూ ఫిబ్రవరిలో ఏసీ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైకోర్టులో కేసు వేశారు. దీనిపై స్పందించిన హైకోర్టు నియామకాలను నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. అనంత రం ప్రభుత్వం కూడా నియామకాలను నిలిపివేస్తూ, విచారణ కోసం కమిటీని ని యమించింది. హైకోర్టులో ఈ కేసు నడుస్తుంది. అయితే వారం రోజులుగా తన పై హైకోర్టులో వేసిన కేసును విత్‌డ్రా చే సుకోవాలని పిటిషనర్ వెంకటగిరి(ఏసీ) పై వైస్‌చాన్స్‌లర్ తీవ్ర ఒత్తిడి తెస్తున్నా రు. ఈనెల 25న వీసీ ఆయనను తన చాంబర్‌కు పిలిపించుకుని కేసు విత్‌డ్రా చేసుకోవాలని బెదిరించారు. వెంకటగిరి బెదరకపోవడంతో వర్సిటీకి చెందిన అ సోసియేట్ ప్రొఫెసర్, ఏసీ అసోసియేష న్ మాజీ అధ్యక్షుడి ద్వారా ఆయనపై ఒ త్తిడి పెంచారు. ఈ క్రమంలోనే ఆదివా రం రాత్రి కామారెడ్డిలోని వెంకటగిరి ఇం టికి వెళ్లి మరోసారి ఒత్తిడి చేశారు. దీం తో ఏసీ అసోసియేషన్ ఆధ్వర్యంలో స భ్యులు సోమవారం హైదరాబాద్‌కు వెళ్లి హెచ్ఆర్సీని ఆశ్రయించారు. వీసీ నుంచి తమకు ప్రాణహాని ఉందంటూ చైర్మన్ కు ఫిర్యాదు చేశారు. వీసీతో పాటు తన పై ఒత్తిడి తీసుకువచ్చిన వారి మాటలు సెల్ఫోన్లో రికార్డు చేశామని, వాటి సీడీలను ఫిర్యాదుతో పాటు అందజేశారు. రక్షణ కల్పించాలని ఆదేశం.. అకడమిక్ కన్సల్టెంట్ల ఫిర్యాదుతో స్పం దించిన హెచ్చార్సీ కేసు వేసిన పిటిషనర్ వెంకటగిరికి రక్షణ కల్పించాలంటూ కలెక్టర్, ఎస్పీలను ఆదేశించింది. ఆర్డీఓతో విచారణ జరిపించి, నవంబర్ 13న నివేదిక సమర్పించాలని స్పష్టంచేసింది. అ నంతరం అకడమిక్ కన్సల్టెంట్లు రాష్ట్ర ఉ న్నత విద్యామండలి ప్రిన్సిపాల్ సెక్రెటరీ అజయ్‌మిశ్రాను కలిసి వీసీ బెదిరింపులపై ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో ఏసీ అసోసియేషన్ సభ్యులు జోత్స్న, ఛాయాదేవి, వసంత, మాధురి, వెంకటగిరి, శరత్‌గౌడ్, నారాయణ, సు రేశ్‌గౌడ్, మోహన్‌తోపాటు బీసీ విద్యార్థి సంఘం నాయకులు యెండల ప్రదీప్, శ్రీనివాస్‌గౌడ్ తదితరులు ఉన్నారు. -
‘పీహెచ్డీ’ ఫలితాల్లో అక్రమాలు జరగలేదు
తెయూ(డిచ్పల్లి), న్యూస్‌లైన్ : తెయూ పీహెచ్డీ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో ఎలాం టి అక్రమాలు జరగలేదని వీసీ అక్బర్ అలీఖాన్ తెలి పారు. గురువారం తన చాంబర్లో ఆయన విలేకరుల తో మాట్లాడారు. ఈ ఏడాది 13 విభాగాల్లో పరీక్షలు నిర్వహించామన్నారు. గతేడాది సబ్జెక్టివ్ టైప్ పరీక్షను నిర్వహించగా, ఈసారి ఆబ్జెక్టివ్ టైప్ పరీక్షను నిర్వహిం చామన్నారు. 100 మార్కులకు గాను ఎస్సీ, ఎస్టీలకు 30, బీసీలకు 40, ఓసీలకు 50 మార్కులు కటాఫ్ మా ర్కులుగా నిర్ణయించినట్లు చెప్పారు.2013, జూలై 30న 13 సబ్జెక్టులకు పీహెచ్డీ ప్రవేశ పరీక్ష నిర్వహించగా 411 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. ప్రవేశ పరీక్ష ఫలితాలను రిజల్ట్స్ కమిటీ ఆమోదం తీసుకుని మంగళవారం యూనివర్సిటీ వెబ్సైట్లో పెట్టిన ట్లు తెలిపారు. ప్రకటించిన జాబితా ప్రకారం ప్రవేశ పరీక్షలో 216 మంది ఉత్తీర్ణులైనట్లు వీసీ తెలిపారు. ఈ విషయమై అదేరోజు సాయంత్రం కొందరు విద్యార్థి సంఘాల నాయకులు తన వద్దకు వచ్చి 13 సబ్జెక్టులకు గాను 5 సబ్జెక్టుల్లో 50 శాతం కంటే తక్కువ ఉత్తీర్ణత వచ్చిందని, విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకు ని కటాఫ్ మార్కులను తగ్గించాలని వినతి పత్రం అం దజేశారని తెలిపారు. డీన్స్‌తో సమావేశం నిర్వహించి న్యాయం జరిగేలా చూస్తానని తాను హామీ ఇచ్చానని తెలిపారు. తాను స్వయంగా హామీ ఇచ్చినా బుధవా రం ఉదయం కళాశాల తరగతులు ప్రారంభమైన తర్వాత రెండో పీరియడ్‌లో 670 మంది విద్యార్థులను తరగతులు బహిష్కరింపజేయడం దారుణమన్నారు. ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని, ఇలా తరగతులు బహిష్కరించడం, అందోళనలు నిర్వహించడం చేయవద్దని విద్యార్థి సంఘాల నాయకులను ఆయన కోరారు. వర్సిటీ అభివృద్ధికి విఘాతం తరగతులు బహిష్కరించడం వల్ల వర్సిటీ అభివృద్ధికి విఘాతం కలుగుతుందని, విద్యార్థులకు నష్టం జరుగుతుందని వీసీ ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నత విద్యామండలి నిబంధనల ప్రకారమే కటాఫ్ మార్కులు నిర్ణయించామన్నారు. అయినా విద్యార్థుల వినతి ప్రకారం డీన్స్ సమావేశం నిర్వహించి 50 శాతం ఉత్తీర్ణత కంటే తక్కువ వచ్చిన 5 సబ్జెక్టులకు సంబంధించి కటాఫ్ మార్కులు 5 మార్కులను తగ్గించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్(సీఓఈ) నసీం ఆధ్వర్యంలో తగ్గించిన కటాఫ్ మార్కుల మేరకు తిరిగి పరీక్షా పేపర్లను పరిశీలించి రెండు రోజు ల్లో ఫలితాలను మళ్లీ ప్రకటిస్తామని వీసీ స్పష్టం చేశా రు. ఈ నిర్ణయం ద్వారా విద్యార్థులకు న్యాయం జరుగుతుందని తాను ఆశిస్తున్నానని తెలిపారు. విలేకరుల సమావేశంలో సీఓఈ నసీం పాల్గొన్నారు.