డిచ్‌పల్లి: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీ ప్రతిష్టాత్మక న్యాక్ గుర్తింపు పొందింది. ‘బి ప్లస్’ గ్రేడ్‌తో 2.61 స్కోరింగ్ సాధించింది. జిల్లాకో యూనివర్సిటీ ఉండాలనే ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. న్యాక్ వెబ్‌సైట్‌లో వర్సిటీకి మంచి గ్రేడింగ్‌తో గుర్తింపు ఇచ్చినట్లు బుధవారం సమాచారం అందుబాటులో ఉంచారు. విషయం తెలిసిన వెంటనే రిజిస్ట్రార్ చాంబర్‌లో రిజిస్ట్రార్ ఆర్.లింబాద్రిని కలసిన అధ్యాపకులు, బోధన, బోధనేతర, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.
నాన్-టీచింగ్ సిబ్బంది ఆధ్వర్యంలో పరిపాలనా భవనం ఎదుట పటాసులు కాల్చి, మిఠాయిలు పంచి పెట్టారు. న్యాక్ గుర్తింపు అందరి సమష్టి కృషి ఫలితమని రిజిస్ట్రార్ పేర్కొన్నారు.
తెలంగాణ వర్సిటీకి ‘న్యాక్’ గుర్తింపు
Published Thu, Jan 21 2016 3:49 AM | Last Updated on Sun, Sep 3 2017 3:59 PM
Advertisement