సాక్షి, హైదరాబాద్: లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ దాచేపల్లి రవీందర్ గుప్తాను శనివారం సాయంత్రం అరెస్ట్ చేశారు. ఈ కేసులో తొలుత వీసీని అదుపులోకి తీసుకున్న ఏసీబీ.. పూర్తి స్థాయిలో తనిఖీలు ఆయన్ను అనంతరం అరెస్ట్ చేసింది. ఈ క్రమంలోనే రవీందర్ గుప్తా ఇంట్లో, ఆఫీస్‌లో, యూనివర్శిటీ చాంబర్‌లో ఏసీబీ తనిఖీలు నిర్వహించింది. ఆపై రవీందర్‌ను అరెస్ట్ చేసిన ఏసీబీ.. కోర్టులో హాజరుపర్చనుంది.
అయితే రూ. 50 వేలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ రవీందర్ అరెస్టు చేయగానే యూనివర్శిటీ విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు. బాణాసంచా కాల్చడంతో పాటు స్వీట్లు పంచుకుని మరీ సెలబబ్రేట్ చేసుకున్నారు. గతం కొంతకాలంగా వీసీ తీరుతో విసిగిపోయిన విద్యార్థులు.. ఏసీబీ అరెస్ట్ వార్త తర్వాత సంబరాలు చేసుకున్నారు.
కాగా, నిజామాబాద్ భీమ్గల్ లో ఉన్న ఓ కళాశాలకు పరీక్ష కేంద్రం అనుమతి కోసం రూ. 50 వేలు లంచం డిమాండ్ చేశారాయన. ఈ క్రమంలో బాధితుడు దాసరి శంకర్ మమ్మల్ని ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని ఆయన్ని అదుపులోని తీసుకున్నాం. గతంలో అతని పై వచ్చిన ఫిర్యాదులపై విజిలెన్స్ దర్యాప్తు జరుగుతుంది. ప్రస్తుతం నివాసంతో పాటు యూనివర్సిటీలోనూ సోదాలు చేస్తున్నాం. సోదాలు పూర్తి అయినా తర్వాత అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిస్తాం అని డీఎస్పీ సుదర్శన్ వెల్లడించారు.
ఇదిలా ఉంటే.. వీసీ రవీందర్ తీరుపై మొదటి నుంచి విమర్శలే వినవస్తున్నాయి. గతంలో ఆయన పలుమార్లు వార్తల్లో నిలిచారు. ఇక తాజాగా.. ఆయనపై ఆరోపణల నేపథ్యంలోనే అక్రమాలు-అవకతవకలపై యూనివర్సిటీలో ఏసీబీ తనిఖీలు కూడా జరిగాయి. అయినా కూడా ఆయన తీరు మార్చుకోకుండా.. లంచంతో పట్టుబడడం గమనార్హం.
చదవండి: మా పక్కింటి వాళ్లే ఇలా చేస్తారనుకోలేదు: బాలుడి తండ్రి ఆవేదన
Comments
Please login to add a commentAdd a comment