ravinder gupta
-
ఏసీబీ వలలో వీసీ
-
వీసీ అరెస్ట్.. తెలంగాణ వర్శిటీలో విద్యార్థుల సంబరాలు
సాక్షి, హైదరాబాద్: లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ దాచేపల్లి రవీందర్ గుప్తాను శనివారం సాయంత్రం అరెస్ట్ చేశారు. ఈ కేసులో తొలుత వీసీని అదుపులోకి తీసుకున్న ఏసీబీ.. పూర్తి స్థాయిలో తనిఖీలు ఆయన్ను అనంతరం అరెస్ట్ చేసింది. ఈ క్రమంలోనే రవీందర్ గుప్తా ఇంట్లో, ఆఫీస్‌లో, యూనివర్శిటీ చాంబర్లో ఏసీబీ తనిఖీలు నిర్వహించింది. ఆపై రవీందర్‌ను అరెస్ట్ చేసిన ఏసీబీ.. కోర్టులో హాజరుపర్చనుంది. అయితే రూ. 50 వేలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ రవీందర్ అరెస్టు చేయగానే యూనివర్శిటీ విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు. బాణాసంచా కాల్చడంతో పాటు స్వీట్లు పంచుకుని మరీ సెలబబ్రేట్ చేసుకున్నారు. గతం కొంతకాలంగా వీసీ తీరుతో విసిగిపోయిన విద్యార్థులు.. ఏసీబీ అరెస్ట్ వార్త తర్వాత సంబరాలు చేసుకున్నారు. కాగా, నిజామాబాద్ భీమ్‌గల్ లో ఉన్న ఓ కళాశాలకు పరీక్ష కేంద్రం అనుమతి కోసం రూ. 50 వేలు లంచం డిమాండ్ చేశారాయన. ఈ క్రమంలో బాధితుడు దాసరి శంకర్ మమ్మల్ని ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని ఆయన్ని అదుపులోని తీసుకున్నాం. గతంలో అతని పై వచ్చిన ఫిర్యాదులపై విజిలెన్స్ దర్యాప్తు జరుగుతుంది. ప్రస్తుతం నివాసంతో పాటు యూనివర్సిటీలోనూ సోదాలు చేస్తున్నాం. సోదాలు పూర్తి అయినా తర్వాత అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిస్తాం అని డీఎస్పీ సుదర్శన్ వెల్లడించారు. ఇదిలా ఉంటే.. వీసీ రవీందర్ తీరుపై మొదటి నుంచి విమర్శలే వినవస్తున్నాయి. గతంలో ఆయన పలుమార్లు వార్తల్లో నిలిచారు. ఇక తాజాగా.. ఆయనపై ఆరోపణల నేపథ్యంలోనే అక్రమాలు-అవకతవకలపై యూనివర్సిటీలో ఏసీబీ తనిఖీలు కూడా జరిగాయి. అయినా కూడా ఆయన తీరు మార్చుకోకుండా.. లంచంతో పట్టుబడడం గమనార్హం. చదవండి: మా పక్కింటి వాళ్లే ఇలా చేస్తారనుకోలేదు: బాలుడి తండ్రి ఆవేదన -
అవును.. ఆయన లంచంతో పట్టుబడ్డాడు: ఏసీబీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ దాచేపల్లి రవీందర్ గుప్తా(63) తమ అదుపులోనే ఉన్న విషయాన్ని ఏసీబీ డీఎస్సీ సుదర్శన్ ప్రకటించారు. అయితే ఆయన్ని ఇంకా అరెస్ట్ చేయలేదని.. పూర్తి స్థాయిలో తనిఖీలు ముగిశాక అరెస్ట్ చేస్తామని స్పష్టత ఇచ్చారు. సాక్షితో మాట్లాడిన ఆయన.. శనివారం జరిగిన పరిణామాలకు వివరించారు. తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రవీందర్ గుప్తా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాం. తార్నాకలోని తన ఇంట్లోనే బాధితుడి నుంచి రూ. 50 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికాడాయన. ఆయన అల్మారా నుంచి నగదును సేకరించి.. కెమికల్ టెస్ట్ నిర్వహించి వేలిముద్రలతో పోల్చి చూసుకున్నాం. ఆ వేలిముద్రలు ఆయన ఫింగర్ ప్రింట్స్‌తో సరిపోలాయి. నిజామాబాద్ భీమ్‌గల్ లో ఉన్న ఓ కళాశాలకు పరీక్ష కేంద్రం అనుమతి కోసం రూ. 50 వేలు లంచం డిమాండ్ చేశారాయన. ఈ క్రమంలో బాధితుడు దాసరి శంకర్ మమ్మల్ని ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని ఆయన్ని అదుపులోని తీసుకున్నాం. గతంలో అతని పై వచ్చిన ఫిర్యాదులపై విజిలెన్స్ దర్యాప్తు జరుగుతుంది. ప్రస్తుతం నివాసంతో పాటు యూనివర్సిటీలోనూ సోదాలు చేస్తున్నాం. సోదాలు పూర్తి అయినా తర్వాత అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిస్తాం అని డీఎస్పీ సుదర్శన్ వెల్లడించారు. ఇదిలా ఉంటే.. వీసీ రవీందర్ తీరుపై మొదటి నుంచి విమర్శలే వినవస్తున్నాయి. గతంలో ఆయన పలుమార్లు వార్తల్లో నిలిచారు. ఇక తాజాగా.. ఆయనపై ఆరోపణల నేపథ్యంలోనే అక్రమాలు-అవకతవకలపై యూనివర్సిటీలో ఏసీబీ తనిఖీలు కూడా జరిగాయి. అయినా కూడా ఆయన తీరు మార్చుకోకుండా.. లంచంతో పట్టుబడడం గమనార్హం. వీడియో: గర్ల్స్ హాస్టల్ లోకి వెళ్లి డబ్బులు చల్లుతూ వీసీ రవీందర్ డ్యాన్స్ లు ఇదీ చదవండి: కోరుకున్న కాలేజీ.. కోర్సు కూడా! -
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ తెలంగాణ వర్సిటీ వీసీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రవీందర్ గుప్తా ఏసీబీ ఉచ్చులో పడ్డారు. శనివారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని ఆయన్ని ఏసీబీ అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని తన ఇంట్లోనే లంచం తీసుకుంటూ ఆయన పట్టుబడినట్లు సమాచారం. గత కొంతకాలంగా తెలంగాణ యూనివర్సిటీలో అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాలు యూనివర్సిటీలో సోదాలు నిర్వహించాయి. ఆరోపణలకు తగ్గట్లే అక్రమ నియామకాలు, అక్రమ లావాదేవీలు జరిగినట్లు ఏసీబీ నిర్ధారించుకున్నట్లు తెలుస్తోంది. అయితే.. తాజాగా పరీక్షా కేంద్రం ఏర్పాటు కోసం ఓ వ్యక్తి నుంచి డబ్బులు డిమాండ్ చేశాడు వీసీ రవీందర్ గుప్తా. ఈ క్రమంలో బాధితుడు శంకర్ ఏసీబీని ఆశ్రయించగా.. ఏసీబీ వల పన్నింది. శనివారం ఉదయం హైదరాబాద్‌లోని తన నివాసానికి వెళ్లి బాధితుడు డబ్బు ఇవ్వబోయాడు. ఆ టైంలో రూ. 50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు రవీందర్ గుప్తా. అనంతరం ఆయన ఇంట్లో తనిఖీలు నిర్వహించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు ఆయన్నీ అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఏసీబీ నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇదీ చదవండి: BRS ఎమ్మెల్యేల ఇళ్ల నుంచి ఏం తీసుకెళ్లారు? -
వీసీని తొలగించాలని విద్యార్థుల ఆందోళన
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీలో సమస్యలను పరిష్కరించని వైస్ చాన్స్‌లర్ రవీందర్ గుప్తాను తొలగించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు చేపట్టిన ఆందోళన బుధవారం రెండోరోజు కొనసాగింది. క్యాంపస్ మెయిన్ గేట్ వద్ద ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ధర్నా చేశారు. వీసీ రవీందర్ ప్రస్తుత రిజిస్ట్రార్ కె.శివశంకర్ స్థానంలో ఇన్చార్జి రిజిస్ట్రార్‌గా బి.విద్యావర్ధినిని నియమిస్తున్నట్లు తెలియడంతో ర్యాలీగా వెళ్లి వీసీ నివాసాన్ని ముట్టడించారు. తమ అందోళనను పక్కదారి పట్టించేందుకు రిజిస్ట్రార్‌ను మార్చారని ఆరోపించారు. వీసీ బయటకు వచ్చి స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో వీసీ రవీందర్ బయటకు వచ్చి విద్యార్థులతో మాట్లాడారు. నూతన బాలికల హాస్టల్, ఆడిటోరియం నిర్మాణం అంశాలు తన చేతుల్లో లేవని, మిగతా సమస్యలను వారం, పదిహేను రోజుల్లో పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అయితే తమ అందోళనను పక్కదారి పట్టించేందుకే రిజిస్ట్రార్‌ను మార్చారని, ఇన్చార్జి రిజిస్ట్రార్ విద్యావర్ధినిని తొలగించాలని, వీసీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో విద్యార్థుల తీరుపై వీసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అకడమిక్, అడ్మిన్ నియామకాల విషయంలో విద్యార్థులు ప్రశ్నించకూడదని, చదువుపై దృష్టి పెట్టాలని పేర్కొని ఇంట్లోకి వెళ్లిపోయారు. విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తూ అక్కడే మధ్యాహ్న భోజనం చేశారు. సాయంత్రం 6 గంటలకు బయటకు వచ్చిన వీసీకి విద్యార్థులు వినతి పత్రం అందజేశారు. సెప్టెంబర్ మొదటి వారంలో వార్షికోత్సవం నిర్వహించాలని కోరారు. సమస్యలు పరిష్కరిస్తామన్న వీసీ హామీతో విద్యార్థులు ఆందోళన విరమించి హాస్టళ్లకు తిరిగి వెళ్లారు. -
ఎంఎంటీఎస్‌లో రైల్వే జీఎం ఆకస్మిక తనిఖీలు
-
ఎంఎంటీఎస్‌లో రైల్వే జీఎం ఆకస్మిక తనిఖీలు
సికింద్రాబాద్: ఎంఎంటీఎస్ రైళ్లలో దక్షిణ మధ్య రైల్వే జీఎం రవీందర్ గుప్తా సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సికింద్రాబాద్ నుంచి లింగంపల్లి వరకు ఎంఎంటీఎస్ రైలులో ఆయన ప్రయాణించి, ప్రయాణికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎంఎంటీఎస్ రైళ్ల రాకపోకలపై జీఎంకు పలువురు ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండోదశ ఎంఎంటీఎస్ పనులు ప్రారంభమయ్యాయని, సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేస్తామని తెలిపారు. కేంద్రం ఇప్పటికే 817 కోట్ల రూపాయలు విడుదల చేసిందని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో రక్షణ శాఖతో సమస్యలు ఉన్నాయని, వాటిని త్వరలో పరిష్కరించుకుని పనులు పూర్తి చేస్తామని తెలిపారు.