vice chancellor
-
నూరు శాతం వర్సిటీల ప్రక్షాళన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలను నూరు శాతం ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. కొంతకాలంగా యూనివర్సిటీలపై ప్రజల్లో నమ్మకం తగ్గుతోందని.. వాటిల్లోని పలు వ్యవస్థలు దెబ్బతిన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. వర్సిటీల గౌరవాన్ని పెంచాల్సిన బాధ్యత వైస్ చాన్స్లర్లపైనే ఉందన్నారు. ఇటీవల నియమితులైన వివిధ యూనివర్సిటీల వీసీలతో సీఎం రేవంత్ శనివారం తన క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిభ, సామాజిక సమీకరణాల ఆధారంగానే విశ్వవిద్యాలయాలకు వైస్ చాన్స్లర్లను ఎంపిక చేశామని.. ఈ ప్రక్రియలో ఎలాంటి ప్రభావితాలు లేవన్నారు. వర్సిటీల్లో దెబ్బతిన్న వ్యవస్థల పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేయాలని వీసీలకు సూచించారు. ప్రస్తుత పరిస్థితులను పరిశీలించి అవసరమైతే కన్సల్టెన్సీలను ఏర్పాటు చేసుకొని అధ్యయనం చేపట్టి నివేదిక రూపొందించాలని దిశానిర్దేశం చేశారు.స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోండి..‘గతంలో వీసీలను విద్యార్థులు ఏళ్ల తరబడి గుర్తుపెట్టుకొనేవాళ్లు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మా ప్రభుత్వం మీకు స్వేచ్ఛ ఇస్తోంది. మంచిపనులు చేసేందుకు సొంతంగా నిర్ణయాలు తీసుకోండి. బాగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురండి. తప్పు జరిగితే మాత్రం ఆశ్చర్యకరమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. వర్సిటీల్లో డ్రగ్స్, గంజాయి విక్రయాలపై దృష్టిపెట్టండి. విద్యార్థులను ఎప్పటికప్పుడు గమనిస్తూ కౌన్సెలింగ్ ఇవ్వండి’ అని సీఎం రేవంత్ వీసీలకు సూచించారు. ఈ సమావేశంలో తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. -
9 వర్సిటీలకు వీసీల నియామకం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 9 విశ్వవిద్యాల యాలకు ఉప కులపతులు నియమితులయ్యారు. ప్రభుత్వ సిఫారసుతో వర్సిటీలకు వీసీలను ఖరారు చేసినట్టు గవర్నర్ కార్యాలయం శుక్రవారం వెల్లడించింది. వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాల వీసీల పేర్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. రాష్ట్రానికి సంబంధించి 13 వర్సిటీలు ఉండగా.. మహిళా వర్సిటీకి ముందే వీసీని నియమించారు. జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూహెచ్), డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (జేఎన్ఏఎఫ్ఏయూ)లకు ఇంకా వీసీలను నియమించాల్సి ఉంది. అంబేడ్కర్ వర్సిటీకి అత్యధిక దరఖాస్తులురాష్ట్రంలోని వర్సిటీలకు చెందిన వీసీల పదవీ కాలం ఈ ఏడాది మే 23 తోనే ముగిసింది. ఈ నేపథ్యంలో తొలుత ఐఏఎస్ అధికారులకు వీసీలుగా బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం, మరోవైపు ఖాళీగా ఉన్న వీసీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. అలాగే సెర్చ్ కమిటీలను కూడా ఏర్పాటు చేసింది. ఈ పోస్టుల కోసం 312 మంది 1,382 దరఖాస్తులు సమర్పించారు. చాలామంది అన్ని వర్సిటీలకు దరఖాస్తు చేశారు. అత్యధికంగా బీఆర్ అంబేడ్కర్ విశ్వ విద్యాలయానికి 208 దరఖాస్తులు వస్తే, ఉస్మానియాకు 193, పాలమూరుకు 159, శాతవాహనకు 158, మహాత్మాగాంధీ వర్సిటీకి 157 వచ్చాయి. జేఎన్టీయూహెచ్కు 106 దరఖాస్తులు అందాయి. వీటన్నింటినీ సెర్చ్ కమిటీ పరిశీలించి మూడు పేర్ల చొప్పున ప్రభుత్వానికి సిఫారసు చేసింది. దీంతో వీసీలను ఎంపిక చేసిన ప్రభుత్వం దసరా ముందు ఫైల్‌ను గవర్నర్ కార్యాలయానికి పంపింది. తాజాగా గవర్నర్ కార్యాలయం వీసీల పేర్లను ఖరారు చేసింది. వివాదంలో జేఎన్టీయూహెచ్జేఎన్టీయూహెచ్కు వీసీ నియామకం ఆఖరి దశలో ఆగిపోయింది. అంతర్గత వివాదం, వీసీ నియామకం కోసం ఏర్పాటు చేసిన సెర్చ్ కమిటీపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో వీసీ ఖరారును వాయిదా వేశారని తెలిసింది. ఈ వర్సిటీకి సెర్చ్ కమిటీ ముగ్గురు పేర్లను సిఫారసు చేయగా.. ఇందులో ఓ మాజీ వీసీ పేరు ఉండటం వివాదాస్పదమైంది. గతంలో ఆయనపై పలు ఆరోపణలున్నాయని, అయినప్పటికీ ఆయన పేరును సెర్చ్ కమిటీ సూచించిందంటూ పలువురు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. దీని వెనుక ఏదో మతలబు ఉందనే అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ కారణంగానే ప్రభుత్వం ఆయనకు సంబంధించిన ఫైల్‌ను గవర్నర్‌కు పంపలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. అంతేగాకుండా ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణకు ప్రభుత్వం ఆదేశించినట్టు సమాచారం. జేఎన్ఏఎఫ్, ‘అంబేడ్కర్’పై భేటీకాని సెర్చ్ కమిటీలుఅంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ పోస్టు కోసం అత్యధిక సంఖ్యలో దరఖాస్తులు రాగా, ఈ పోస్టును దక్కించుకునేందుకు పెద్ద ఎత్తున పైరవీలు సైతం జరిగినట్లు తెలిసింది. కాంగ్రెస్ అధిష్టానం నుంచే నాలుగు సిఫారసులు వచ్చినట్టు తెలిసింది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని సెర్చ్ కమిటీ ఇంతవరకూ ఈ వర్సిటీ విషయమై భేటీ అవ్వలేదని తెలుస్తోంది. అలాగే జేఎన్ఏఎఫ్ఏపై కూడా సెర్చ్ కమిటీ సమావేశం నిర్వహించలేదు. ఈ భేటీ త్వరలో జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.కొత్త వీసీలు వీరే.. యూనివర్సిటీ: వీసీపాలమూరు, మహబూబ్‌నగర్: ప్రొఫెసర్ జీఎన్ శ్రీనివాస్రావుకాకతీయ, వరంగల్: ప్రొఫెసర్ ప్రతాప్ రెడ్డిఉస్మానియా, హైదరాబాద్: ప్రొఫెసర్ కుమార్ మొలుగరంశాతవాహన, కరీంనగర్: ప్రొఫెసర్ ఉమేశ్కుమార్తెలుగు యూనివర్సిటీ, హైదరాబాద్: ప్రొఫెసర్ నిత్యానందరావుమహాత్మాగాంధీ, నల్లగొండ: ప్రొఫెసర్ అల్తాఫ్ హుస్సేన్తెలంగాణ, నిజామాబాద్: ప్రొఫెసర్ యాదగిరిరావుప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ: ప్రొఫెసర్ అల్దాస్ జానయ్యశ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన: ప్రొఫెసర్ రాజిరెడ్డిప్రొఫెసర్ అల్దాస్ జానయ్యజయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీగా నియమితులైన ప్రొ.అల్దాస్ జానయ్య నల్లగొండ జిల్లా, తిప్పర్తి మండలం, మామిడాల గ్రామంలో జన్మించారు. వ్యవసాయ ఆర్థిక శాస్త్రంలో డాక్టరేట్ అందుకున్నారు. ప్రస్తుతం జగిత్యాల వ్యవసాయ కాలేజీ అసోసియేట్ డీన్‌గా సేవలందిస్తున్నారు. 2002లో అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ ఉత్తమ శాస్త్రవేత్త అవార్డు అందుకున్నారు.ప్రొ.రాజిరెడ్డి దండకొండా లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీ వీసీగా నియమితులైన దండ రాజిరెడ్డి మహారాష్ట్రలోని పంజాబ్రావు కృషి విద్యాపీఠ్‌లో అగ్రికల్చర్లో బీఎస్సీ, ఎంఎస్సీ చేశారు. గుజరాత్ అగ్రికల్చర్ వర్సిటీలో అగ్రో మెటియోరాలజీలో పీహెచ్డీ పూర్తి చేశారు. అఫ్గానిస్తాన్ అగ్రోమెట్ సర్వీసెస్ ప్రాజెక్టుకు వరల్డ్ బ్యాంకు కన్సల్టెంటుగా కొంతకాలం పనిచేశారు. చాలాకాలం పాటు జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు.ప్రొ.వెలుదండ నిత్యానందరావు తెలుగు వర్సిటీ వీసీగా నియమితులైన ప్రొ.వెలుదండ నిత్యానందరావు స్వగ్రామం నాగర్‌కర్నూల్ జిల్లా మంగనూరు గ్రామం. పాలెం ఓరియంటల్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. ఓయూలో ఎంఏ తెలుగు, ఎంఫిల్, పీహెచ్డీ పూర్తి చేశారు. ఆ తర్వాత ఉస్మానియా వర్సిటీ తెలుగు విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా, అదే శాఖ హెచ్వోడీగా పనిచేశారు. 2022లో పదవీ విరమణ చేశారు. ఆయన రచించిన ‘విశ్వవిద్యాలయాల్లో తెలుగు పరిశోధన’ అనే గ్రంథం అన్ని వర్సిటీల తెలుగు విభాగాల్లో ప్రామాణిక గ్రంథంగా ఇప్పటికీ బోధిస్తున్నారు.ప్రొ.టి.యాదగిరిరావు తెలంగాణ యూనివర్సిటీ వీసీగా నియమితులైన ప్రొ.యాదగిరిరావు వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం నల్లబెల్లి గ్రామంలో జన్మించారు. పీజీ, పీహెచ్డీ కాకతీయ యూనివర్సిటీలో పూర్తి చేశారు. ఇప్పుడు అదే వర్సిటీలో సీనియర్ ప్రొఫెసర్‌గా ఉన్నారు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ బీవోఎస్ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. గతంలో కేయూలో యూజీసీ కో–ఆర్డినేటింగ్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2021లో రాష్ట్ర ఉత్తమ అధ్యాపకుడి అవార్డు అందుకున్నారు. తెలంగాణ వర్సిటీ సోషల్ సైన్సెస్ డీన్‌గా కూడా కొంతకాలం పనిచేశారు. ప్రొ.జీఎన్ శ్రీనివాస్ పాలమూరు యూనివర్సిటీ వీసీగా నియమితులైన ప్రొ.జీఎన్ శ్రీనివాస్ సిరిసిల్ల జిల్లా కొత్తపల్లి గ్రామంలో జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీలో బీటెక్, ఎంటెక్, పీహెచ్డీ పూర్తిచేశారు. ఓయూలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ప్రస్థానం మొదలు పెట్టిన శ్రీనివాస్.. 2003లో ఏపీలోని అనంతపురం జేఎన్టీయూలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా సేవలందించారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన శ్రీనివాస్.. తెలంగాణ మలిదశ ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేశారు. ప్రొ.కుమార్ మొలుగరం ఉస్మానియా వీసీగా నియమితులైన కుమార్ మొలుగరం రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలం కొండాపురం గ్రామంలో జన్మించారు. ఓయూలో బీటెక్, జేఎన్టీయూలో ఎంటెక్, ఐఐటీ బాంబే నుంచి పీహెచ్డీ పట్టా అందుకున్నారు. సివిల్ ఇంజనీరింగ్ రంగంలో ఆయన అపార అనుభవశాలి. ప్రస్తుతం ఓయూ ఇంజనీరింగ్ కాలేజీలో సీనియర్ ప్రొఫెసర్‌గా, రీజనల్ సెంటర్ ఫర్ అర్బన్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ డైరెక్టర్‌గా సేవలందిస్తున్నారు. 2018లో రాష్ట్ర ఉత్తమ అధ్యాపకుడి పురస్కారం, ఇంజనీర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నారు. ఓయూ 107 సంవత్సరాల చరిత్రలో వీసీగా నియమితులైన తొలి ఎస్సీ (మాదిగ) సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా ఘనత సాధించారు.ప్రొ.అల్తాఫ్ హుస్సేన్ నల్లగొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీగా నియమితులైన ఖాజా అల్తాఫ్ హుస్సేన్.. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో జన్మించారు. ఆత్మకూరులోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి, వరంగల్ సీకేఎం కాలేజీలో ఇంటర్, డిగ్రీ.. కాకతీయ యూనివర్సిటీలో ఫిజిక్స్‌లో పీజీ, పీహెచ్డీ పూర్తిచేశారు. కేయూ ఫిజిక్స్ విభాగంలో ప్రొఫెసర్‌గా, హెచ్వోడీగా, రిజిస్ట్రార్‌గా సేవలందించారు. 2016–19 మధ్యకాలంలో కూడా మహాత్మాగాంధీ వర్సిటీ వీసీగా పనిచేశారు. మహాత్మాగాంధీ యూనివర్సిటీ విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా తీర్చిదిద్దుతామని ఎంజీయూ వీసీగా నియమితులైన అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. వర్సిటీలో కొత్త కోర్సులు ప్రారంభిస్తామని ‘సాక్షి’కి తెలిపారు. ప్రొ.ప్రతాప్‌రెడ్డి కాకతీయ యూనివర్సిటీ వీసీగా నియమితులైన ప్రొ.ప్రతాప్‌రెడ్డిది రంగారెడ్డి జిల్లా యాచారం. ఓయూలో పీజీ, పీహెచ్డీ పూర్తి చేసిన ప్రతాప్‌రెడ్డి.. ఓయూలో జువాలజీ విభాగం హెచ్వోడీగా, రిజిస్ట్రార్‌గా, పీజీ అడ్మిషన్స్ డైరెక్టర్‌గా సేవలందించి రిటైర్ అయ్యారు. ప్రొ.ఉమేష్కుమార్శాతవాహన యూనివర్సిటీ వీసీగా నియమితులైన ఉమేష్‌కుమార్.. మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట గ్రామంలో జన్మించారు. కెమిస్ట్రీ విభాగంలో ఆయనకు అపారమైన అనుభవం ఉంది. గతంలో మహాత్మాగాంధీ వర్సిటీ వీసీగా, రిజిస్ట్రార్‌గా పనిచేశారు. ఇందిరాగాంధీ జాతీయ స్థాయి ఎన్ఎస్ఎస్ ట్రోఫీని 2015లో రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. ఎంజీ యూనివర్సిటీని అభివృద్ధి చేసేందుకు, బోధనా ప్రమాణాలు పెంచేందుకు కృషి చేశారు. -
తెలంగాణలో తొమ్మిది యూనివర్సిటీలకు వీసీల నియామకం
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం తొమ్మిది యూనివర్సిటీలకు వీసీలను నియమించింది. వీసీల నియామకం ఫైల్‌పై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంతకం చేశారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం యూనివర్సిటీలకు వీసీలను నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. పాలమూరు యూనివర్సిటీ వీసీగా శ్రీనివాస్.కాకతీయ యూనివర్సిటీ వీసీగా ప్రతాపరెడ్డిఉస్మానియా యూనివర్సిటీ వీసీగా ఎం కుమార్ శాతవాహన యూనివర్సిటీ వీసీగా ఉమేష్ కుమార్ తెలుగు యూనివర్సిటీ వీసీగా నిత్యానందరావుమహాత్మా గాంధీ యూనివర్సిటీ వీసీగా అల్తాఫ్ హుస్సేన్ తెలంగాణ యూనివర్సిటీ వీసీగా యాదగిరిరావుప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వీసీగా ఆల్ దస్ జానయ్యకొండ లక్ష్మణ్ తెలంగాణ ఆర్టికల్చర్ యూనివర్సిటీ - రాజిరెడ్డిలను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం మధ్యాహ్నం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది -
పూర్తవని కూడికలు, తీసివేతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పది విశ్వవిద్యాలయాల వైస్ చాన్స్‌లర్ పోస్టుల భర్తీ మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఏ యూనివర్సిటీకి ఎవరిని నియమించాలనే అంశంపై కసరత్తు దాదాపు పూర్తయినప్పటికీ, కూడికలు, తీసివేతలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. వీసీల కూర్పు నేపథ్యంలో పలు రకాల ఒత్తిళ్లు వస్తున్నట్టు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. వాస్తవానికి అక్టోబర్ 3, 4 తేదీల్లో ప్రభుత్వం నియమించిన సెర్చ్ కమిటీలు భేటీ కానున్నాయి. ఈ కమిటీలు వీసీల నియామకంపై ప్రభుత్వానికి అవసరమైన సిఫార్సులు చేస్తాయి. ఒక్కో వీసీ పోస్టుకు ముగ్గురిని సూచిస్తాయి. వీటిల్లో ఒకరిని ప్రభుత్వం గుర్తించి, జాబితాను గవర్నర్‌కు పంపాల్సి ఉంటుంది. కాగా, సెర్చ్ కమిటీల భేటీ తర్వాత తుది నిర్ణయం తీసుకునేందుకు సమయం పట్టొచ్చని అధికారులు చెబుతున్నారు. దసరా సెలవులు, ఆ తర్వాత కూడా కొన్ని సెలవులు ఉండటం వల్ల అనుకున్న వ్యవధిలో వీసీల నియామకం జరగకపోవచ్చని ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రక్షాళన తప్పదా?అనుభవజు్ఞలు, పదవికి గౌరవం తెచ్చే వారితోనే ఈసారి వీసీల నియామకం ఉంటుందని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం మీడియాకు తెలిపారు. ఈ దిశగా అనేక మంది పేర్లు పరిశీలించినట్టు చెప్పారు. అయితే, ఈ క్రమంలో ఉన్నత విద్యా మండలిలోనూ భారీ ప్రక్షాళన ఉండొచ్చని అధికార వర్గాలు సంకేతాలు ఇస్తున్నాయి. మండలిలో అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని కొంతమందిని కొనసాగించే ప్రతిపాదన కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఒక్కసారిగా మండలిని కొత్తవారితో నింపడం సరికాదని ఉన్నతాధికారులు ప్రభుత్వానికి సూచించినట్లు తెలుస్తోంది. మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి నేతృత్వంలో కార్యకలాపాలన్నీ సాఫీగా, ఎలాంటి వివాదాలు లేకుండా సాగుతున్నాయన్నది అధికారుల అభిప్రాయం. ఈ కారణంగా లింబాద్రిని కొనసాగించడమా? లేదా అనేదానిపై స్పష్టత రాలేదు. ఒకవేళ లింబాద్రి స్థానంలో వేరే వ్యక్తిని నియమిస్తే, ఆయనను ఏదైనా యూనివర్సిటీకి వీసీగా నియమించే అవకాశముందని తెలుస్తోంది. మండలిలో ఇద్దరు వైస్ చైర్మన్ల మార్పు తప్పదనే వాదన వినిపిస్తోంది. మండలి కార్యదర్శిగా ఉన్న శ్రీరాం వెంకటేశ్ కొన్ని నెలల క్రితమే ఆ పోస్టులోకి వచ్చారు. ఆయన అనుభవా న్ని దృష్టిలో ఉంచుకుని ఈ పోస్టులో కొనసాగించే వీలుంది. కాగా, కీలకమైన జేఎన్టీయూహెచ్కు పోటీ తీవ్ర స్థాయిలో ఉంది. దీనికి ఎన్ఐటీలో ఉన్న ఓ ప్రొఫెసర్ పేరు బలంగా వినిపిస్తోంది. ఢిల్లీ స్థాయిలో వచ్చే సిఫార్సులను కూడా పరిగణనలోనికి తీసుకోవాల్సి వస్తోందని సమాచారం. ఉస్మానియా వర్సిటీ వీసీ పోస్టుకు ఉన్నతాధికారులు పాత వీసీనే సిఫార్సు చేస్తున్నారు. మరో నలుగురు కూడా వివిధ మార్గాల్లో ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఈ స్థానం ఎవరికి దక్కుతుందనేది కీలకంగా మారింది. మొత్తం మీద అన్ని వర్సిటీలకు కూడా పోటీ ఉందని, ఈ నేపథ్యంలో వీసీల కూర్పునకు కొంత సమయం తప్పదని అధికారులు అంటున్నారు. -
17 వర్సిటీలకు ఇన్చార్జ్ వీసీలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 17 యూనివర్సిటీలకు ఇన్చార్జ్ వైస్ చాన్సలర్ల(వీసీల)ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని యూనివర్సిటీల వీసీలపై తీవ్రస్థాయిలో రాజకీయ ఒత్తిళ్లు వచ్చాయి. బలవంతంగా రాజీనామాలు చేయించారనే ఆరోపణలు బలంగా వినిపించాయి.యూనివర్సిటీల్లో టీఎన్ఎస్ఎఫ్, కూటమి అనుకూల ఉద్యోగులు వీసీలను బెదిరిస్తూ.. రాజీనామాలు చేసి వెళ్లిపోవాలంటూ హుకుం జారీ చేశారు. దీంతో జూలై 2 నాటికే వీసీలంతా రాజీనామాలు చేశారు. ఈ రాజీనామాలను గవర్నర్ ఆమోదించడంతో తాజాగా ఆయా వర్సిటీలకు ఇన్చార్జ్ వీసీలను నియమిస్తూ ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి సౌరభ్‌గౌర్ ఉత్తర్వులిచ్చారు. -
పలువురు వీసీల రాజీనామా
ఉన్నత విద్యకు పట్టుగొమ్మలుగా విలసిల్లుతున్న విశ్వవిద్యాలయాలను టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు వదిలిపెట్టడం లేదు. రాజకీయాలకు దూరంగా ఉంటున్న వర్సిటీలను తమ రాజకీయ విషక్రీడలకు బలిచేస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నియమితులైన విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్ (వీసీ), రిజిస్ట్రార్లను రాజీనామాలు చేసి వెళ్లిపోవాలంటూ కూటమి నేతలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.ప్రభుత్వ పెద్దలు అధికారుల ద్వారా వీసీలందరికీ ఫోన్లు చేయిస్తూ ఒత్తిడి తెస్తున్నారు. రాజీనామాలు చేసి వెళ్లిపోవాలని హుకుం జారీ చేస్తున్నారు. దీంతో ఇప్పటికే అనేక మంది వీసీలు రాజీనామాలు చేసి తప్పుకున్నారు. ఈ క్రమంలో మరికొందరు కూటమి నేతలు, అధికారుల ఒత్తిళ్లు తట్టుకోలేక సోమవారం తమ పదవులకు రాజీనామాలు సమర్పించారు.సాక్షి, అమరావతి/కర్నూలు కల్చరల్/ఏఎఫ్‌యూ/తిరుపతి సిటీ/ఏఎన్‌యూ/బాలాజీ చెరువు (కాకినాడ సిటీ): విజయవాడలోని డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ కె.బాబ్జీ రాజీనామా చేశారు. గవర్నర్, వర్సిటీ చాన్సలర్ అయిన అబ్దుల్ నజీర్‌కు మెయిల్ ద్వారా తన రాజీనామా లేఖను పంపారు. బాబ్జీ ఎస్సీ సామాజికవర్గానికి చెందిన సీనియర్ వైద్యుడు. గతంలో వైద్య విద్య సంచాలకులు (డీఎంఈ)గా పనిచేసిన బాబ్జీ గతేడాది ఫిబ్రవరిలో వీసీగా నియమితులయ్యారు. 2026 ఫిబ్రవరి వరకూ ఆయన పదవీకాలం ఉన్నప్పటికీ వైద్య శాఖ ఉన్నతాధికారి ఒకరు ఫోన్ చేసి రాజీనామా చేయాలని ఆదేశించడంతో తన పదవి నుంచి వైదొలిగారు.తప్పుకున్న రాయలసీమ వర్సిటీ వీసీ..కర్నూలులోని రాయలసీమ విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ బి.సుధీర్ ప్రేమ్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయనకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఇన్చార్జి చైర్మన్, డిప్యూటీ సెక్రటరీ ఫోన్ చేసి వెళ్లిపోవాలని సూచించారు. దీంతో సుధీర్ ప్రేమ్ కుమార్ తన రాజీనామా లేఖను గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు పంపారు. హైదరాబాద్ జేఎన్టీయూ మెకానికల్ విభాగం ప్రొఫెసర్ అయిన బి.సుధీర్ ప్రేమ్ కుమార్ ఈ ఏడాది జనవరి 17న వీసీగా బా«ధ్యతలు స్వీకరించారు. పద్మావతి మహిళా వర్సిటీ వీసీ రాజీనామాతిరుపతి పద్మావతి మహిళా వర్సిటీ వీసీ డి.భారతి పదవి నుంచి వైదొలిగారు. ఆమె గతేడాది జూన్ 15న వీసీగా బాధ్యతలు చేపట్టారు. ఆమె పదవీ కాలం మరో రెండేళ్లు ఉన్నప్పటికీ అధికారుల ఒత్తిడితో రాజీనామా చేశారు.వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ వీసీ కూడా..కడపలో 2020లో ఏర్పాటైన డాక్టర్ వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ తొలి వీసీ ఆచార్య బానోతు ఆంజనేయప్రసాద్ కూడా తన పదవీకాలం పూర్తవకుండానే ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో రాజీనామా సమర్పించారు. జేఎన్టీయూ హైదరాబాద్‌లో మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్‌గా ఉన్న ఆయనను గతేడాది ఫిబ్రవరి 9న ఏఎఫ్‌యూ వీసీగా నియమించారు.కాగా ఇప్పటికే వైఎస్సార్ జిల్లాకు చెందిన యోగి వేమన వర్సిటీ (వైవీయూ) వీసీ ఆచార్య చింతా సుధాకర్, రిజిస్ట్రార్ ఆచార్య వై.పి. వెంకట సుబ్బయ్య, ఏఎఫ్‌యూ రిజిస్ట్రార్ ఆచార్య ఇ.సి. సురేంద్రనాథ్‌రెడ్డి రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే. ఎలాంటి రాజకీయ నేపథ్యం, వివాదం లేని గిరిజన ఆచార్యుడైన బానోతు ఆంజనేయప్రసాద్‌ను సైతం రాజీనామా సమర్పించాలని కూటమి ప్రభుత్వం ఒత్తిడి చేయడంతో వీసీ పదవి నుంచి వైదొలిగారు. 2026 ఫిబ్రవరి 8 వరకు పదవీకాలం ఉన్నా తప్పుకున్నారు.వైదొలిగిన జేఎన్టీయూకే వీసీజేఎన్టీయూ–కాకినాడ వీసీ డాక్టర్ జీవీఆర్ ప్రసాదరాజు తన పదవికి రాజీనామా చేశారు. 2021 అక్టోబర్ 29న వీసీగా నియమితులైన ఆయన మరో నాలుగు నెలల పదవీ కాలం ఉండగానే రాజీనామా చేయాల్సి వచ్చింది.ఏఎన్‌యూ వీసీ, ఉన్నతాధికారులు..గుంటూరు జిల్లా నంబూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య పి.రాజశేఖర్, రెక్టార్ ఆచార్య పి.వరప్రసాదమూర్తి, రిజిస్ట్రార్ ఆచార్య బి.కరుణ, పలువురు కో–ఆరి్డనేటర్లు, డైరెక్టర్లు తమ పదవులకు రాజీనామా చేశారు. -
తక్షణమే తప్పుకోండి..
అనంతపురం/విశాఖ సిటీ/గుడుపల్లె (చిత్తూరు జిల్లా)/కోనేరు సెంటర్ (మచిలీపట్నం) : అధికారంలోకి వచ్చిన క్షణం నుంచే కక్ష సాధింపు చర్యలకు తెగబడుతున్న టీడీపీ ప్రభుత్వం.. చివరకు సరస్వతీ నిలయాలైన విశ్వవిద్యాలయాలపైనా విరుచుకుపడుతోంది. విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దే విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న వైస్ ఛాన్సలర్లు వెంటనే రాజీనామా చేసి వెళ్లిపోవాలని అల్టిమేటం జారీచేసింది. ఈ మేరకు ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ పీఏ నుంచి రిజిస్ట్రార్లకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. వెంటనే ఆయా పదవులకు వీసీలు, రిజిస్ట్రార్లు రాజీనామా చేసి వెళ్లిపోవాలని చెప్పారు. అధికారికం కాదులే అని ఆగినా..లోకేశ్ పీఏ పేరుతో ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినా ప్రభుత్వం అలాంటి చర్యలు తీసుకోదని వీసీలు తొలుత భావించారు. అదే నిజమైతే అధికారికంగా ఉత్తర్వులు ఇస్తారు కదా అని అనుకున్నారు. ఎవరో ప్రాంక్ కాల్చేసి ఉండవచ్చని వీసీలు మిన్నకుండిపోయారు. దీంతో నేరుగా వైస్‌ఛాన్సలర్ల వాట్సాప్ గ్రూపులో అధికారికంగా మెసేజ్ పెట్టారు. తక్షణమే వీసీలు, రిజిస్ట్రార్లు తప్పుకోవాలని అందులో ఆదేశించారు. ఈ నేపథ్యంలో.. జేఎన్టీయూ (ఏ), ఎస్కేయూ వీసీలు, రిజిస్ట్రార్లు తమ పదవులకు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో..» జేఎన్టీయూ (ఏ) వీసీ ప్రొఫెసర్ జీవీఆర్ శ్రీనివాసరావు గురువారం సాయంత్రమే తన పదవికి రాజీనామా చేశారు. రిజిస్ట్రార్ ప్రొ. సి.శశిధర్ సైతం రిలీవ్ అయ్యారు. దీంతో ఇన్చార్జ్ రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణను నియమించిన వీసీ శ్రీనివాసరావు.. అనంతరం తన రాజీనామా పత్రాన్ని ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి పంపారు. » అలాగే, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కె. హుస్సేన్‌రెడ్డి కూడా శుక్రవారం సాయంత్రం తన పదవికి రాజీనామా చేశారు. ఎస్కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎంవీ లక్ష్మయ్య మాత్రం పదవిలో కొనసాగేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. » ద్రవిడ వర్సిటీ వైస్ చాన్స్‌లర్ ఆచార్య కొలకలూరి మధుజ్యోతి కూడా శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల వీసీలు రాజీనామా చేస్తున్నారు కాబట్టి మీరు కూడా రాజీనామా చేయాలని శుక్రవారం ఉదయం ఎవరో ఫోన్ ద్వారా ఆమెను ఒత్తిడి చేశారని సమాచారం. రాజీనామా చేయకపోతే వచ్చే సోమవారం ద్రవిడ వÆటీలో ఆందోళన చేస్తామని వీసీని హెచ్చరించారని తెలిసింది. దీంతో ఆమె శుక్రవారం స్వచ్ఛందంగా రాజీనామా చేసి, రాజీనామా పత్రాన్ని ఫ్యాక్స్ ద్వారా గవర్నరుకు పంపించారు. సాయంత్రమే ద్రవిడ వర్సిటీ వదిలి వెళ్లిపోయారు. » అలాగే, కృష్ణా యూనివర్శిటీ వీసీ జి. జ్ఞానమణి సైతం శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. పైనుంచి వచ్చిన ఒత్తిళ్లకు తలొగ్గి ఆయన తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. అప్పటికీ, ఇప్పటికీ అదే తేడా..నిజానికి.. జేఎన్టీయూ (ఏ)లో అప్పటి వీసీ ప్రొ. శ్రీనివాస్‌కుమార్ టీడీపీ ప్రభుత్వ హయాంలోనే నియమితులయ్యారు. 2019లో రాష్ర్టంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చినా.. శ్రీనివాస్‌కుమార్‌ను వీసీగానే కొనసాగించారు. ఎవరూ రాజీనామా చేయాలని కోరలేదు. ఏపీపీఎస్సీ చైర్మన్‌గా ఉదయ్‌భాస్కర్ కూడా 2015లో నియమితులైనా.. ఆరేళ్లపాటు చైర్మన్ పదవీ కాలం పూర్తయ్యే వరకు ఆయన పదవిలో కొనసాగారు. కానీ, టీడీపీ ప్రభుత్వం మాత్రం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏకంగా వైస్ఛాన్సలర్లనే తప్పుకోమనే సంస్కృతికి తెరతీసింది. ప్రజా వ్యతిరేక పాలనను టీడీపీ ప్రభుత్వం తన మార్క్‌గా చూపించేందుకు ఇదే నిదర్శనమని విద్యావేత్తలు భావిస్తున్నారు.పదవి కోసం వైఎస్సార్ విగ్రహం తాకట్టు..ఇక ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఎందరో జీవితాలకు బాటలు వేసిన డాక్టర్ వైఎస్సార్ విగ్రహాన్ని ఈ ఏడాది ఆరంభంలో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో ఏర్పాటుచేశారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన మూడో రోజే విగ్రహాన్ని తొలగించాలని టీఎన్ఎస్ఎఫ్ నేతలు, టీడీపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. విగ్రహం తొలగిస్తే మీరు పదవుల్లో కొనసాగుతారని వీసీ, రిజిస్ట్రార్లను హెచ్చరించారు. దీంతో వారు 24 గంటల్లో వైఎస్సార్ విగ్రహాన్ని అధికారికంగా తొలగించారు. అయినప్పటికీ వారిని ఇంటికి పంపేందుకు ఏర్పాట్లుచేయడం గమనార్హం. ఇదిలా ఉంటే.. జేఎన్టీయూ (ఏ)లో అధునాతనంగా నిర్మించిన ఆడిటోరియానికి ఎన్టీఆర్ పేరు పెట్టారు. అక్కడే ఎన్టీఆర్ విగ్రహాన్ని సైతం ఏర్పాటుచేశారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. ఆ తర్వాత రాష్ర్టంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరినప్పటికీ ఎన్టీఆర్ విగ్రహం ఔన్నత్యాన్ని కాపాడారు. కానీ, టీడీపీ మాత్రం ఎస్కేయూలో ఏర్పాటుచేసిన వైఎస్సార్ విగ్రహాన్ని తొలగించడాన్ని అందరూ తప్పుపడుతున్నారు.ఏయూ వీసీ ప్రసాదరెడ్డి రాజీనామా విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ వీసీ ప్రొ. పీవీజీడీ ప్రసాదరెడ్డి శుక్రవారం రాజీనామా చేశారు. లేఖను గవర్నర్ కార్యాలయానికి పంపించారు. ఆయనతో పాటు రిజిస్ట్రార్ స్టీఫెన్ కూడా తన పదవి నుంచి వైదొలిగారు. వెంటనే ఆయన రాజీనామాకు ఆమోదం తెలిపారు. ఇన్చార్జ్ రిజిస్ట్రార్‌గా ఏయూ అకడమిక్ డీన్‌గా ఉన్న ప్రొ.కిషోర్‌బాబును నియమించారు. ఆయన శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. వాస్తవానికి.. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రసాదరెడ్డికి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఒకవైపు స్థానిక టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులు ప్రసాదరెడ్డిపై రాజకీయ ఆరోపణలు ఎక్కుపెట్టగా.. మరోవైపు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ నుంచి ముఖ్య కార్యదర్శి కార్యాలయం నుంచి ఫోన్లుచేసి రాజీనామా చేయాలని ఒత్తిడి చేశారు. రాజీనామా చెయ్యకపోతే దాడులకు తెగబడతామని పార్టీ శ్రేణులు సైతం హెచ్చరించాయి. దీనిపై ఆయన మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బెదిరింపులకు పాల్పడింది హైదరాబాద్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించినప్పటికీ అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అలాగే, ఏయూలోని వీసీ కార్యాలయం వద్ద నిత్యం నిరసనల పేరుతో టీడీపీ నేతలు, కార్యకర్తలు హడావుడి చేసూ్తనే ఉన్నారు. పలుమార్లు వీసీని అడ్డుకోడానికి ప్రయత్నించారు. -
ఏయ్.. రాజీనామా చేయ్! ఏయూ వీసీ ప్రసాద్‌రెడ్డికి బెదిరింపులు
సాక్షి, విశాఖపట్టణం: ఆంధ్ర యునివర్సిటీ వైఎస్ చాన్స్‌లర్ పీవీజీడీ ప్రసాద్ రెడ్డికి గత కొన్ని రోజులుగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. తక్షణమే తన పదవి రాజీనామా చేయాలంటూ కాల్స్ వస్తున్నాయి. ఇలా హైదరాబాద్ కి చెందిన మాధవనాయుడు అనే వ్యక్తి ఏయూ రిజిస్టర్డ్ ఆఫీస్‌కు ఫోన్ చేసి బెదిరింపులకు దిగ్గుతున్నాడని యూనివర్సిటీ వర్గాలు చెబుతున్నాయి. పీవీజీడీ ప్రసాద్ రెడ్డిని వీసీ పదవికి తక్షణమే రాజీనామా చేసి విదేశాలకు వెళ్లిపోవాలని లేకుంటే తీవ్ర చర్యలు తీసుకుంటామని బెదిరిస్తున్నట్లు సమాచారం. -
‘సెర్చ్’ ఏదీ ?
సాక్షి, హైదరాబాద్ : యూనివర్సిటీల వీసీల నియామకంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. రాష్ట్రంలోని పది విశ్వవిద్యాలయాల వైస్ చాన్స్లర్ల(వీసీ) ఎంపికకు సంబంధించి ప్రభుత్వం నియమించిన సెర్చ్ కమిటీలు ఇప్పటివరకూ ఒక్కసారి కూడా సమావేశం కాలేదు. అన్ని వర్సిటీల్లోనూ ఐఏఎస్‌లే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. వారికి ఇతర బాధ్యతలు ఉండటంతో వర్సిటీలపై పెద్దగా దృష్టి పెట్టలేకపోతున్నారు. సాధారణ కార్యకలాపాలకు కూడా అధికారుల అనుమతి తీసుకోవాల్సి వస్తోంది. ఐఏఎస్‌లంతా హైదరాబాద్‌లోనే ఉండటంతో వర్సిటీల్లోని సిబ్బందికి ఇబ్బందులు తప్పడం లేదు. విద్యా సంవత్సరం మొదలవ్వడంతో వర్సిటీలు కీలకమైన బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. జేఎన్టీయూహెచ్లో అనుబంధ గుర్తింపు, కోర్సుల మార్పిడి వంటి వాటి విషయంలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రైవేట్ కాలేజీలు అంటున్నాయి. మరోవైపు ఐఏఎస్‌లు అధికారులు అందుబాటులో లేకపోవడంతో ఉన్నత విద్యామండలి కూడా యూనివర్సిటీ వ్యవహారాలపై ముందుకెళ్లే పరిస్థితి లేదు. కొత్త కోర్సులు, వాటికి సంబంధించిన బోధన ప్రణాళికపై ఏ నిర్ణయం తీసుకునే అవకాశం లేకుండాపోయిందని మండలివర్గాలు అంటున్నాయి. వీసీల పదవీ కాలం మే 21తో ముగిసింది. దీంతో కొత్తవారి నియామకానికి ప్రభుత్వం సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకూ ఐఏఎస్ అధికారులకు వీసీలుగా అదనపు బాధ్యతలు అప్పగించింది. సెర్చ్ కమిటీలు ఏమైనట్టు? వీసీ ఎంపికకు గత నెలలోనే ప్రభుత్వం సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేసింది. నిపుణులతో కూడిన ఈ కమిటీలు వచ్చిన దరఖాస్తులను వడపోయాలి. అంతిమంగా ముగ్గురిని ఎంపిక చేసి, ప్రభుత్వానికి సిఫార్సు చేయాలి. ఇందులోంచి ఒకరిని ప్రభుత్వం వీసీగా నియమిస్తుంది. మూడు వారాలైనా ఇంతవరకూ సెర్చ్ కమిటీల భేటీ జరగలేదు. వీసీల ఎంపికలో తీసుకోవాల్సిన ప్రామాణిక అంశాలేమిటో ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. పెద్దఎత్తున దరఖాస్తులు రావడం, అందరూ సాంకేతికంగా వీసీ పోస్టులకు అర్హులే కావడంతో సెర్చ్ కమిటీ స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపించడం లేదని తెలుస్తోంది. వీసీల ఎంపికలో ప్రభుత్వానికి కొన్ని రాజకీయ ప్రాధాన్యతలూ ఉంటాయని నిపుణులు అంటున్నారు. సామాజిక ప్రాధాన్యత ఇందులో కీలకమని భావిస్తున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకొని ఎంపిక జరగాల్సి ఉన్నప్పుడు స్పష్టత లేకుండా మేమేం చేయగలమని వారు అంటున్నారు. ఒత్తిడే కారణమా...? ప్రధాన యూనివర్సిటీల వీసీల కోసం పెద్దఎత్తున ప్రభుత్వంపై రాజకీయ ఒత్తిడి వస్తున్నట్టు తెలుస్తోంది. అత్యధికంగా ఇంజనీరింగ్ కాలేజీలకు గుర్తింపు ఇచ్చే జేఎన్టీయూహెచ్ వీసీ కోసం కేంద్రస్థాయిలో కాంగ్రెస్ పెద్దల నుంచే సిఫార్సులు వచ్చినట్టు సమాచారం. నల్లగొండ జిల్లాకు చెందిన ఓ మంత్రి వీసీ పోస్టుకు దరఖాస్తు చేసిన ఓ వ్యక్తి కోసం పట్టుబడుతున్నారు. మరోవైపు నిజామాబాద్‌కు చెందిన మరో కాంగ్రెస్ కీలకనేత మైనారిటీకి చెందిన మరో ప్రొఫెసర్‌కు ఇప్పించేందుకు ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. జేఎన్టీయూహెచ్ వీసీ పోస్టుకు ఎన్ఐటీలో పనిచేస్తున్న రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి పట్ల సీఎంకు సానుకూలత ఉన్నట్టు తెలిసింది. అయితే, తన మాట కన్నా పార్టీలో పెద్దవారికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన పరిస్థితి ఉందని సమాచారం. ఈ కారణంగానే ఇక్కడ సెర్చ్ కమిటీ ఇంతవరకూ భేటీ అవ్వలేదని తెలుస్తోంది. ఉస్మానియా యూనివర్సిటీ వీసీ పోస్టుకు ఓ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కోసం విద్యాశాఖ ఉన్నతాధికారి కూడా పావులు కదుపుతున్నారు. సామాజిక కోణంలో ఈ ప్రతిపాదన తీసుకొస్తున్నా, యూనివర్సిటీ వర్గాల నుంచి ఆయనపై తీవ్ర వ్యతిరేకత ఉందని తెలుస్తోంది. బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ వీసీ పోస్టుకు కూడా జాతీయ, రాష్ట్ర స్థాయి నేతల చేత పైరవీలు జోరుగా సాగుతున్నాయి. ఈ తరహా ఒత్తిడి రావడంతోనే ప్రభుత్వం సెర్చ్ కమిటీలకు అవసరమైన మార్గదర్శకాలు ఇవ్వలేకపోతోందని ఉన్నతవిద్య వర్గాలు చర్చించుకుంటున్నాయి. -
ఐఏఎస్‌లే ఇన్చార్జులు.. 10 యూనివర్సిటీలకు వీసీలుగా నియమించిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు ఐఏఎస్ అధికారుల అజమాయిషీలోకి వెళ్లాయి. వైస్ చాన్స్లర్ల (వీసీల) పదవీకాలం ముగియడంతో.. ప్రభుత్వం ఒక్కో యూనివర్సిటీకి ఒక్కో ఐఏఎస్ అధికారిని ఇన్చార్జి వీసీగా నియమించింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని మొత్తం పది విశ్వవిద్యాలయాల వీసీల పదవీ కాలం ఈ నెల 21వ తేదీతో ముగిసింది. దీనితో వెంటనే వర్సిటీలు ఇన్చార్జుల అ«దీనంలోకి వెళ్లాయి. కొత్త వీసీలు వచ్చే వరకూ అధికారుల పాలనే కొనసాగుతుంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వీసీల నియామక ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు చెప్తున్నాయి. సెర్చ్ కమిటీలు వేసినా.. వాస్తవానికి వీసీల పదవీ కాలం ముగియక ముందే కొత్తవారిని ఎంపిక చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రక్రియకు ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారిందని అధికారులు అంటున్నారు. ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకుని వీసీల నియామకం కోసం దాదాపు అన్ని యూనివర్సిటీలకు సెర్చ్ కమిటీలను నియమించారు. వీసీ పోస్టుల కోసం వచ్చిన దరఖాస్తులను ఆ కమిటీ పరిశీలించి.. అన్ని అర్హతలున్న వారి జాబితాను ప్రభుత్వానికి పంపాల్సి ఉంటుంది. ఆ తర్వాత నియామకాలు ఉంటాయి. కానీ సెర్చ్ కమిటీలు ఇప్పటివరకు ఒక్కసారి కూడా సమావేశం కాలేదు. కాకతీయ యూనివర్సిటీ పరిధిలో అయితే ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటు కాకపోవడంతో సెర్చ్ కమిటీని కూడా ఏర్పాటు చేయలేదు. ఈ క్రమంలో ప్రస్తుత వీసీలనే కొంతకాలం కొనసాగించాలని తొలుత భావించారు. కానీ ఈ ప్రతిపాదనపై అధికారుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పలువురు వీసీలపై ఆరోపణలు, మరికొందరి తీరు వివాదాస్పదం కావడం నేపథ్యంలో.. వారిని కొనసాగించేందుకు ప్రభుత్వం సుముఖత చూపలేదు. భారీగా పైరవీలు షురూ.. వైస్ చాన్స్‌లర్ పోస్టుల కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రంలోని పది విశ్వవిద్యాలయాలకు కలిపి 312 మంది ప్రొఫెసర్లు దరఖాస్తు చేసుకున్నారు. కొందరు ఎక్కువ వర్సిటీలకు దరఖాస్తు చేయడంతో.. మొత్తంగా 1,282 దరఖాస్తులు అందినట్టు అధికార వర్గాలు తెలిపాయి. వీటిలో ఎక్కువ భాగం అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ కోసం వచ్చాయి. ఈ విశ్వవిద్యాలయానికి 208 మంది దరఖాస్తు చేశారు. ఆ తర్వాత ఎక్కువ మంది ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్టీయూహెచ్లకు పోటీపడ్డారు. ఇలా పోటీ తీవ్రంగా ఉండటంతో మంత్రులు, ప్రభుత్వంలోని కీలక వ్యక్తుల ద్వారా కొందరు ప్రొఫెసర్లు పైరవీలు చేస్తున్నారు. రాజధానిలో ఓ యూనివర్సిటీ వీసీగా ఇంతకాలం పనిచేసిన వ్యక్తి.. నల్లగొండ జిల్లాకు చెందిన ఓ మంత్రి ద్వారా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. ఇదే యూనివర్సిటీ వీసీ పోస్టు కోసం మెదక్ జిల్లాకు చెందిన మంత్రి ద్వారా మరో ప్రొఫెసర్ ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఇదే యూనివర్సిటీలో పనిచేసి రిటైర్ అయిన ప్రొఫెసర్ కూడా ఓ కీలక మైనార్టీ నేత ద్వారా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. ఉస్మానియా యూనివర్సిటీ వీసీ పోస్టు కోసం నలుగురు తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తున్నారు. పోటీ తీవ్రంగా ఉండటం, అధికార పారీ్టలోని కీలక వ్యక్తులు తమ వారి కోసం పట్టుపడుతుండటంతో.. వీసీల ఎంపిక కత్తిమీద సాములా మారిందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. -
వందేళ్ల చరిత్ర గలిగిన అలీగఢ్ విశ్వవిద్యాలయానికి తొలి మహిళా వీసీ!
వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన అలీగఢ్ ముస్లీం విశ్వవిద్యాలయానికి తొలి మహిళ వైస్ ఛాన్సలర్‌గా ప్రొఫెసర్ నైమా ఖాతూన్ నియమితులయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదంతో విద్యామంత్రిత్వశాఖ ఖాతూన్ని వీసీగా నియమించింది. దీంతో అలీఘఢ్ విశ్వవిద్యాలయం మహిళా వైస్ ఛాన్సలర్‌ని కలిగి ఉన్న మూడవ కేంద్రీయ విశ్వవిద్యాలయంగా అవతరించింది. ఈ విశ్వవిద్యాలయం 123 ఏళ్ల చరిత్రలో ఈ పదవికి నియమితులైన తొలి మహిళ ఖాతూన్. అయిదేళ్ల పాటు ఆమె ఈ బాధ్యతల్లో కొనసాగుతారు. నైమా ఖాతూన్ అలీగఢః విశ్వవిద్యాలయం నుంచే మనస్తత్వ శాస్త్రంలో పీహెచ్డీ చేశారు. 1988లో అదే విభాగంలో లెక్చరర్‌గా తన ప్రస్థానం ప్రారంభించారు. క్రమంగా ఏప్రిల్ 1998లో అసోసీయేట్ ప్రొఫెసర్‌గా, ఆ తర్వాత 2006లో పూర్తి స్థాయిలో ప్రొఫెసర్‌గా మారారు. ఆమె డిపార్ట్మెంట్ ప్రొఫెసర్, చైర్‌పర్సన్‌గా కూడా పనిచేశారు. ఆమె సైకాలజీ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్‌గా, చైర్‌పర్సన్‌గా పనిచేయడాని కంటే ముందు 2014లో మహిళా కాలేజ్ ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వర్తించారు. అలాగే ఆమె నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ రువాండా, సెంట్రల్ ఆఫ్రికాలో ఒక ఏడాది పాటు ప్రొఫెసర్‌గా బోధించారు. ఆమె అలీగఢ్ విశ్వవిద్యాలయంలో వివిధ అడ్మినిస్ట్రేటివ్ పాత్రలలో కూడా పనిచేశారు, రెసిడెన్షియల్ కోచింగ్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్, డిప్యూటీ ప్రొక్టర్, ఇందిరా గాంధీ హాల్ అండ్ అబ్దుల్లా హాల్ రెండింటిలోనూ ప్రోవోస్ట్‌గా పనిచేశారు. ఆమె సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్, ఢిల్లీ, అలీగఢ్ విశ్వవిద్యాలయాల్లో డాక్టోరల్ వర్క్ నిర్వహించారు. అంతేగాక తన పరిశోధన పత్రాలను యూనివర్శిటీ ఆఫ్ లూయిస్విల్లే (USA), యూనివర్శిటీ ఆఫ్ ఆల్బా యూలియా (రొమేనియా), చులాలాంగ్‌కార్న్ విశ్వవిద్యాలయం (బ్యాంకాక్), ఇస్తాంబుల్ (టర్కీ, స్టన్ (USA) రెండింటిలోని హోలింగ్స్ సెంటర్లో సమర్పించారు. అంతేగాదు నైమా రచయిత, పరిశోధకురాలిగా రెండు పుస్తకాలను కూడా రచించారు. అలాగే ఆమె రచించిన క్లినికల్, హెల్త్, అప్లైడ్ సోషల్,ఆధ్యాత్మిక సైకాలజీ వాటికి సంబంధించిన పత్రాలను జాతీయ, అంతర్జాతీయ జర్నల్లలో ప్రచురితమయ్యాయి. వృత్తిలో అల్ రౌండ్ ఎక్సలెన్స్ పరంగా నైమా ఖాతూన్ పాపా మియాన్ పద్మ భూషణ్ బెస్ట్ గర్ల్ అవార్డు వరించింది. (చదవండి: వారానికి పది గంటలే పని..ఏడాదికి ఏకంగా రూ. 80 లక్షలు..!) -
ఏయూ వీసీ నియామకంపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేం
సాక్షి, అమరావతి:ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ (వీసీ) నియామక ప్రక్రియను నిలుపుదల చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయబోమంది. విశ్వవిద్యాలయం వీసీగా ప్రసాద్‌రెడ్డి పనిచేసిన కాలంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై పిటిషనర్ ఇచ్చిన వినతిపత్రంపై ఛాన్సలర్ (గవర్నర్) తగిన నిర్ణయం తీసుకునేందుకు కొంత సమయం ఇవ్వాల్సిన అవసరం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. తదుపరి విచారణను 8 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రసాద్‌రెడ్డి వీసీగా ఉన్న సమయంలో పలు అక్రమాలు చోటుచేసుకున్నాయని, ఆయన తీసుకున్న నిర్ణయాలపై విచారణ జరిపించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పూర్వ విద్యార్థుల సంఘం హైకోర్టులో పిల్ దాఖలు చేసింది. పిటిషనర్ తరఫున న్యాయవాది పిచ్చయ్య వాదనలు వినిపిస్తూ.. ప్రసాద్‌రెడ్డి నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు చేపట్టారన్నారు. ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా.. ప్రకటన జారీ చేయకుండా ఏకపక్షంగా నియామకాలు చేశారన్నారు. అడ్డగోలుగా చెట్లను నరికేయించారని తెలిపారు. తిరిగి ప్రసాద్‌రెడ్డినే వీసీగా నియమించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ప్రసాద్‌రెడ్డి తీరుపై ఛాన్సలర్‌కు ఈ నెల 1న ఫిర్యాదు చేశామన్నారు. ఇప్పటివరకు ఛాన్సలర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. నవంబర్ 1న ఫిర్యాదు చేసి, స్పందించేందుకు తగిన సమయం ఇవ్వకుండా నవంబర్ 10న ఎలా పిల్ దాఖలు చేస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. స్పందించేందుకు సమయం ఇవ్వాల్సిన అవసరం ఉందంది. ప్రసాద్‌రెడ్డినే తిరిగి వీసీగా నియమిస్తున్నారా? అని విశ్వవిద్యాలయం తరఫు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. తాను తెలుసుకుని పూర్తి వివరాలు కోర్టు ముందుంచుతానని విశ్వవిద్యాలయం న్యాయవాది వి.సాయికుమార్ తెలిపారు. వీసీగా ప్రసాద్‌రెడ్డి కాల పరిమితి 24తో ముగిసిందన్నారు. వాదనలు విన్న ధర్మాసనం, ఫిర్యాదుపై తగిన నిర్ణయం తీసుకునేందుకు ఛాన్సలర్‌కు తగిన సమయం ఇద్దామని తెలిపింది. విచారణను 8 వారాలకు వాయిదా వేస్తున్నట్టు తెలిపింది. ఈ సమయంలో పిచ్చయ్య స్పందిస్తూ.. వీసీ నియామక ప్రక్రియను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఈ దశలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని ధర్మాసనం సీజే ధర్మాసనం తేల్చిచెప్పింది. -
విషాదం: ఓయూ మాజీ వీసీ నవనీత రావు కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్స్లర్ (వీసీ) ప్రొఫెసర్ నవనీత రావు (95) తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి తీరని లోటని పలువురు విద్యార్థులు, అధ్యాపకులు సంతాపం వ్యక్తం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యాభివృద్ధికి ఆయనెంతో కృషి చేశారని కొనియాడారు. అయితే, నవనీత రావు 1985 నుంచి 1991 వరకు ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్‌గా ఆయన పని చేశారు. నవనీత రావు మృతితో జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి పలువురు అధ్యాపకులు, విద్యార్థులు చేరుకుంటున్నారు. ఇక, ఆయన మృతిపై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నవనీత రావు డైనమిక్ అడ్మినిస్ట్రేటర్ అని ఆయన కొనియాడారు. ఓయూ గౌరవాన్ని పెంచడమే కాకుండా, నిరుపేద విద్యార్థుల జీవితాలను కూడా తీర్చిదిద్దారని పేర్కొన్నారు. నవనీత రావు మృతిపై దాసోజు శ్రవణ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిపాలనలో రాజకీయ జోక్యాలకు తావు ఇవ్వకుండా, స్వయం ప్రతిపత్తిని కొనసాగించారని గుర్తు చేశారు. ఉస్మానియా విద్యార్థి నాయకుడిగా, ఆ తర్వాత ఐపీఈలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఆయనతో సన్నిహితంగా పని చేయడం తనకు దక్కిందని శ్రవణ్ పేర్కొన్నారు. నవనీత రావు ఆత్మకు శాంతి చేకూరాలని శ్రవణ్ ప్రార్థించారు. Very saddened to know the unfortunate demise of Prof T Navaneeth Rao Garu, former Vice Chancellor of Osmania University @osmania1917 & former Director of @ipe_info Institute of Public Enterprise. He was a dynamic administrator with great professional values, dignity and… pic.twitter.com/PqRSH68PoY — Prof Dasoju Srravan (@sravandasoju) August 26, 2023 -
విద్యావ్యవస్థలో ఏఐ భాగం కావాలి: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో పాఠశాల విద్య, ఉన్నత విద్యలో కీలక మార్పులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు, యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్లతో తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ కీలక సమావేశం చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ.. విద్యారంగంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టాం. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ విధానాన్ని తీసుకురావాలి. విద్యారంగంలో టెక్నాలజీని విరివిగా ఉపయోగించుకోవాలి. టెక్నాలజీని ఉపయోగించి మార్పులు తీసుకురావాలి. అధునాతన పద్ధతిలో వైద్య విద్యార్థులకు బోధన ఉండాలి. మన విద్యార్థులు క్రియేటర్లుగా ఉండాలి. విద్యార్థులకు కావాల్సిన కోర్సులు, లెర్నింగ్ ఆప్షన్స్‌పై చర్చించాలి. రానున్న రోజుల్లో సిలబస్ విధానం మార్చే అవకాశం ఉంది. అంతర్జాతీయ స్థాయిలో విద్యా సంస్థలతో ఎంవోయూలు పెంచుకోవాలి. విద్యావ్యవస్థలో ఏఐ భాగం కావాలి.. రానున్న రోజుల్లో ఏఐ టెక్నాలజీ ద్వారా విద్యావ్యవస్థలో సరికొత్త మార్పులు వస్తాయి. విద్యావ్యవస్థలో ఏఐని భాగం చేయాల్సిన అవసరం ఉంది. అగ్మెంటేషన్ రియాల్లీలను బోధనలో వాడుకోవడంపై దృష్టి సారించాలి. మన ఫ్యాకల్లీ కూడా ఆ స్థాయిలో పిల్లలకు విద్యనందించాలి. విద్యారంగంలో ఇప్పుడు జరుగుతున్న మార్పులను గమనిస్తే.. మనం ఒక స్థాయిలో ఉంటే.. లక్ష్యం ఇంకో స్థాయిలో ఉంది. ఈ గ్యాప్‌ను పూడ్చాలంటే.. ఏం చేయాలన్నదానిపై ఆలోచనలు చేయాలి. ఉన్నత విద్యా రంగంలో వైస్‌ఛాన్సలర్లది కీలక పాత్ర. టెక్నాలజీ పరంగా చూస్తే.. మొదటి రివల్యూషన్ 1784లో స్టీమ్‌తో రైలు ఇంజన్ రూపంలో చూశాం. తర్వాత 100 ఏళ్ల తర్వాత విద్యుత్ రూపంలో మరొక రివల్యూన్ చూశాం. మూడోది 1960–70 ప్రాంతంలో కంప్యూటర్లు, ఐటీ రంగం రూపేణా మరొక విప్లవం చూశాం. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూపంలో నాలుగో విప్లవం దిశగా అడుగులు వేస్తున్నాం. రాబోయే రోజుల్లో విద్యావిధానాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పూర్తిగా మార్చబోతోంది. ఈ అడుగులో మనం వెనుకబడితే.. కేవలం అనుసరించే వాళ్లుగానే మనం మిగులుతాం. సరైన సమయంలో తగిన విధంగా అడుగులు వేయగలిగితే.. మనం ఈరంగాల్లో నాయకులమవుతాం. ఏఐ అభివృద్ధి చెందుతున్న కొద్దీ.. దీన్ని వినియోగించుకుని, సామర్ధ్యాన్ని పెంచుకునే వర్గం ఒకరు అయితే, ఏఐని క్రియేట్ చేసేవారు.. మరొక వర్గంగా తయారవుతారు. మనం క్రియేటర్లుగా మారాలి.. గతంలో స్టీం ఇంజిన్, ఎలక్ట్రిసిటీ, కంప్యూటర్ విప్లవాల్లో మనం వెనకడుగులోనే ఉన్నాం. మనం ఏదీ క్రియేట్ చేసే పరిస్థితిలో లేం. అందుకనే ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో మనం క్రియేటర్లుగా మారడం అన్నది చాలా ముఖ్యమైనది. ఈ రంగంలో మనం లీడర్లుగా తయారు కావడం చాలా ముఖ్యం. ఎమర్జింగ్ టెక్నాలజీస్‌లో మనం క్రియేటర్లుగా తయారు కావాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని ఒకవైపు మన విద్యావిధానంలోకి తీసుకువచ్చి.. విద్యార్థులకు బోధన, నేర్చుకునే సమర్థతను పెంచుకోవడంలో ఎలా వాడుకోవాలి? అన్న కార్యక్రమం చేస్తూనే.. రెండోవైపున ఏఐ క్రియట్ చేసే స్కిల్స్, టాలెంట్‌ను కూడా మన పిల్లల్లోకి తీసుకుని రావాలి. ఇది కూడా కరిక్యులమ్‌లో భాగం కావాల్సిన అవసరముంది. మార్పులకు శ్రీకారం.. ఇటీవలే జర్మన్ కాన్సులేట్ జనరల్ నన్ను కలిశారు. జర్మనీ లాంటి దేశంలో నైపుణ్యం ఉన్న మానవవనరుల కొరత ఉందని చెప్పారు. పాశ్చాత్య ప్రపంచం అంతా డెమోగ్రఫిక్ ఇన్‌బ్యాలెన్స్ ఎదుర్కొంటోంది. మనదేశంలో, మన రాష్ట్రంలో సుమారు 70శాతం మంది పనిచేసే వయస్సులో ఉన్నారు. వీరికి సరైన నాలెడ్జ్, స్కిల్స్ ఇవ్వలేకపోతే మనం ప్రపంచానికి మార్గనిర్దేశకులుగా ఉండలేం. ఇది వాస్తవం. అందుకే విద్యారంగంలో మార్పులకు మనం శ్రీకారం చుట్టాలి. ఏ రకమైన మార్పులకు శ్రీకారం చుడితే.. మనం అనుకున్నట్టు ఫలితాలు ఉంటాయి, విద్యారంగంలో ఇంకా మెరుగ్గా ఎలా చేయగలుగుతాం అన్నదానిపై ఆలోచనలు చేయాలి. మన పిల్లలు లీడర్లుగా ఉండాలి.. నలుగురితో నేను మాట్లాడి... నాకు అనిపించిన ఆలోచనలన్నింటినీ కూడా వీసీల ముందు ఉంచుతున్నాను. ఈ ఆలోచనలు కార్యాచరణలోకి రావాలి, వీటికి రూపకల్పన జరగాలి. ఇందులో మీ పాత్ర గరిష్టంగా ఉండాలి. ఈరోజు మనం మొట్టమొదటి అడుగు వేస్తున్నాం. ఈ తొలి అడుగు మన ఆలోచనలను చైతన్యం చేయడం ద్వారా విద్యారంగాన్ని ఇప్పుడున్న స్థాయి నుంచి మెరుగైన స్థాయికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రపంచస్థాయిలో మన పిల్లలను అనేక రంగాల్లో లీడర్లుగా చూడాలనుకుంటున్నాం. ఇవాళ మనం చదివిస్తున్న, చదువుకుంటున్న చదువులు నిజంగానే.. ప్రపంచస్థాయిలో నాయకులుగా నిలబడగలిగే స్థాయిలో ఉన్నాయా? లేకపోతే.. ఎలా చేయాలన్న దానిపై ఆలోచనలు చేయాల్సిన అవసరం ఉంది. పిల్లలకు చదువులు చెప్తే విధానాలను పరిశీలిస్తే.. మనం కొన్ని సబ్జెక్టులను నిర్దేశిస్తున్నాం. ఒకసారి వెస్ట్రన్ కరిక్యులమ్ చూస్తే.. వెస్ట్రన్ వరల్డ్‌లో... ఒక ఫ్యాకల్టీని తీసుకుంటే.. చాలా వర్టికల్స్ కనిపిస్తాయి. విద్యార్థులకు మరిన్ని ఆప్షన్స్ ఇవ్వాలి.. ఒక బీకాంలోనే అసెట్ మేనేజ్మెంట్, ఫైనాన్సియల్ మార్కెట్, రిస్క్ మేనేజ్మెంట్, సెక్యూరిటీ అనాలసిస్ ఇలాంటి వర్టికల్స్ ఎన్నో ఉన్నాయి. మన దగ్గర లేవు. మంచి డిగ్రీ రావాలంటే విదేశాలకు పోవాల్సిందే. మనం కూడా చదువుకునే విద్యార్థులకు మరిన్ని ఆప్షన్లు ఇవ్వాలి. వారు కావాల్సిన వర్టికల్స్ చదువుకునే అవకాశాలను ఇవ్వాలి. మనం డిగ్రీలకు సంబంధించి తాజాగా క్రెడిట్స్‌ఇస్తున్నాం. కానీ, వాటి స్థాయిని కూడా పెంచాల్సి ఉంది. పిల్లలకు కావాల్సిన కోర్సుల్లో బోధన అందించాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా చేయడానికి ప్రతీ ఫ్యాకల్టీలో మనం క్రియేట్ చేయగలగాలి. దీనిపై ప్రతి వీసీ కూడా ఆలోచన చేయాలి. ఇవేకాకుండా రకరకాల అంశాల్లో అడుగులు పడాల్సి ఉంది. మనం ఇచ్చే డిగ్రీలకు సంబంధించి కూడా మార్పులు రావాల్సి ఉంది. ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేసి, ఉద్యోగాల కల్పన దిశగా అడుగులేశాం. ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం. వైద్య రంగంలో ఎన్నో మార్పులు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను పూర్తిగా వినియోగించుకోవాలి. సెక్యూరిటీ అనాలసిస్, రిస్క్ మేనేజ్మెంట్ వంటి వర్టికల్ కోర్సులకు సంబంధించి బోధన చేసే స్థాయిలో మనం ఉన్నామా? లేదా? అన్నదికూడా చూడాలి. ఒకవేళ లేకపోతే.. అలాంటి కోర్సులు కావాలనుకునే విద్యార్థులకు బోధనను నిలిపేస్తామా? అంటే నిలిపివేయలేం. వర్చువల్ రియాలిటీని తీసుకునివచ్చి ఆగ్మెంటెడ్ రియాలిటీతో కలుపుతాం. ఎప్పుడైతే ఈ రెండూ కలిసాయో.. వర్చువల్ క్లాస్ టీచర్ విద్యార్ధులకు పాఠాలు చెబుతారు. ఆ మేరకు తరగతుల నిర్వహణ ఉండాలి. మెడికల్ కోర్సుల బోధనలో కూడా మార్పులు గణనీయంగా రావాల్సి ఉంది. 5 ఏళ్ల మెడికల్ కోర్సు రాబోయే రోజుల్లో ఇవాళ సాంకేతిక పరిజ్ఞానానికి తగినట్టుగా కూడా మార్పులు రావాలి. శరీరాన్ని కోసి ఆపరేషన్ చేసే రోజులు పోయాయి. కేవలం కొన్ని హోల్స్ చేసి.. కంప్యూటర్ల ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను వాడకుని ఆపరేషన్ చేసే స్థాయి వచ్చింది. అందుకే వైద్యులకు రోబోటిక్స్, ఏఐలను పాఠ్యప్రణాళికలో, బోధనలో భాగస్వామ్యం చేయాలి. హర్యానాలోని ఒక మెడికల్ కాలేజీలో కూడా దీనికి సంబంధించిన కోర్సులనుకూడా పెట్టారు. కేవలం మెడిసిన్‌లో చికిత్సకు సంబంధించిన జ్ఞానం ఇవ్వడమేకాదు, టెక్నాలజీని ఎలా వాడుకోవాలన్న దానిపై పాఠ్యప్రణాళికలో మార్పులు తీసుకురావాలి. ప్రపంచవ్యాప్తంగా ఎమర్జింగ్ టెక్నాలజీని అవగాహన చేసుకోవాలి. దాన్ని కరిక్యులమ్‌లో ఇంటిగ్రేట్ చేసుకోవాలి. దాన్ని వినయోగించుకోవడం, ఆ రంగాల్లో బోధనను మెరుగుపరచడం చేయాలి. ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా దీనికి సంబంధించిన కంటెంట్ అందుబాటులో ఉంది. అందులో వర్చువల్ రియాల్టీ, అగమెంటెడ్ రియాల్టీని కరిక్యులమ్‌లోకి తీసుకునిరావాలి. వ్యవసాయంలో కూడా గణనీయ మార్పులు.. వ్యవసాయం చేసే తీరుకూడా గణనీయంగా మారిపోతోంది. మన రాష్ట్రంలో గ్రామస్థాయిలో ఆర్బీకేలను తీసుకుని రావడం ద్వారా మిగతా రాష్ట్రాలతో పోలిస్తే.. గణనీయ మార్పులు తీసుకు వచ్చాం. గ్రామ స్ధాయిలో చేయిపట్టుకుని నడిపే వ్యవస్ధను తీసుకొచ్చాం. ఈ అడుగులు ఇక్కడితో ఆగిపోకూడదు. ప్రతి రైతును, ప్రతి ఎకరాలో సాగును కూడా చేయిపట్టుకుని నడిపించుకునే స్థాయికి వెళ్లాలి. ప్రతి ఎకరాలో భూసార పరీక్ష చేస్తాం. శాటిలైట్ ఇమేజ్ ద్వారా భూమిలో ఉన్న కాంపోజిషన్ చెప్పే పరిస్థితి ఉంది. డ్రోన్ల ద్వారా భూసారం ఇంకా దగ్గరగా తెలుసుకునే అవకాశం వస్తోంది. ఈ రిపోర్ట్ ద్వారా ప్లాంట్ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకుని రావచ్చు. దీని ద్వారా ఆ పంటలకు ఎంత మోతాదులో ఎరువులు వేయాలో ఇట్టే తెలిసిపోతుంది. ఈ టెక్నాలజీని మనం పిల్లలకు నేర్పకపోతే.. మనం వెనకబడతాం. ప్రశ్నా పత్నం విధానం మారాలి.. ఆక్స్ఫర్డ్, హార్వర్డ్, ఎంఐటీ, కేంబ్రిడ్జ్ గాని చూస్తే.. వీళ్ల పాఠ్యపుస్తకాలు, వీళ్ల బోధనా పద్ధతులు, ప్రశ్నపత్రాలు రూపొందించే విధానం.. చాలా విభిన్నంగా ఉంటుంది. మనకు, వీరికీ తేడా ఎందుకు ఉంటుంది? అన్నదానిపై ఆలోచన చేయాలి. మన పిల్లలకు మంచి సబ్జెక్ట్ జ్ఞానం ఉండొచ్చు.. కానీ, వెస్ట్రన్ దేశాల మాదిరిగానే అక్కడ రూపొందించే ప్రశ్నలకు సమాధానాలు నింపే పరిస్థితుల్లో ఉన్నారా? అన్నది చూడాలి. ప్రశ్నా పత్నం విధానం మారాలి. వెస్ట్రన్ వరల్డ్ ఎలా బోధిస్తుందన్నది మన కరిక్యులమ్‌లోకి రావాలి. ఇవేమీ చేయకపోతే మనం వెనకబడి ఉంటాం. అక్కడ పాఠ్యపుస్తకాలు కూడా పిల్లలకు ఇచ్చి.. సమాధానాలు రాయించి.. ప్రాక్టికల్ అప్లికబిలిటీ ఉందా? లేదా? అని చూస్తారు. మనం ప్రాక్టికల్ అప్లికబులిటీ ఆఫ్ నాలెడ్జ్‌ను తీసుకునిరావడం లేదు. అందుకే ప్రశ్నపత్రాల రూపకల్పన, బోధనా పద్ధతులు పూర్తిగా మారాలి. ఇవన్నీకూడా అత్యంత కీలకమైన అంశాలు. ఇవన్నీ చేయాల్సిన మార్పులు. ఇవి చేయకపోతే వెనుకబడతాం. ఇవన్నీ చేయాలంటే.. ఎలా చేయాలి? ఎలా చేయగలుగుతాం? అన్నది ఆలోచన చేయాలి. ఒక్కో యూనివర్శిటీ ఒక్కో రకంగా కరిక్యులమ్ తయారు చేయలేదు. ఒక్కో మాదిరిగా ఉండలేదు. మనం చేస్తున్న విజన్ కోసం ఒక హైలెవల్ అకడమిక్ బోర్డు మనకు అవసరం. ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రతిభావంతులతో ఈ బోర్డును ఏర్పాటు చేద్దాం. ఆ బోర్డు ఏర్పాటు చేసిన తర్వాత వాళ్లకు పైన చెప్పిన అంశాలన్నింటినీ ఇంటిగ్రేట్ చేస్తూ ఈ మార్పులతో కరిక్యులమ్‌ను రీడిజైన్ చేద్దాం. పాఠ్యప్రణాళికను, బోధనను, ప్రశ్నపత్రాల తీరును మారుద్దాం. వర్చువల్ రియాలిటీ, ఏఐ టెక్నాలజీని పాఠ్యప్రణాళికలో భాగం చేద్దాం. బోధనలో కూడా వాడుకుందాం. ఇవన్నీ అత్యంత సమర్ధవంతంగా ఎలా చేయాలన్నదానిపై ఆలోచన చేయడానికే బోర్డు ఏర్పాటు చేద్దాం. ప్రాథమిక విద్యాస్థాయి నుంచే మార్పులు రావాలి.. కేవలం ఉన్నత విద్యాస్థాయిలోనే మార్పులు చేస్తే ఫలితాలు రావు. ప్రాథమిక విద్యాస్థాయి నుంచే ఈ మార్పులు రావాలి. ఆ దిశగా ఇప్పటికే కొన్ని అడుగులు పడ్డాయి. స్కూళ్లను ఇప్పటికే ఇంగ్లీష్ మీడియంలోకి మార్పు చేశాం. బైలింగువల్ పాఠ్యపుస్తకాలు ఇచ్చాం. ఆరోవ తరగతి ఆ పైనున్న తరగతులను డిజిటల్ క్లాస్ రూమ్స్‌లా మార్చాం. తరగతి గదుల్లో ఐఎఫ్‌పీ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తున్నాం. డిసెంబరు నాటికి 6వ తరగతి ఆపై తరగతులకు చెందిన 63వేల క్లాస్‌రూమ్స్‌ను ఐఎఫ్పి ఫ్యానెల్స్‌తో డిజిటలైజ్ చేస్తున్నాం. ఇప్పటికే 31వేల తరగతి గదులకు ప్యానెల్స్ ఏర్పాటు చేశాం. బైజూస్ కంటెంట్‌ను ఇంటిగ్రేట్ చేశాం. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు ఇచ్చాం. దీనికి తదుపరిగా తీసుకు రావాల్సిన మార్పులు తీసుకురావాలి. వీఆర్, ఏఆర్, ఏఐలని టెక్నాలజీని వాడుకుని వారికి మంచి బోధన, నేర్చుకునే సమర్థతను పెంచాలి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ క్రియేటర్లుగా కూడా తొలిఅడుగులు అక్కడ పడాలి. అందుకే పాఠశాల విద్య స్థాయిలో ఒక బోర్డును, హయ్యర్‌ఎడ్యుకేషన్ లెవల్లో మరొక బోర్డును ఏర్పాటు చేయాలి. ఈ రెండింటిని ఇంటిగ్రేట్ చేయాలి. పౌండేషన్ లెవల్ నుంచి హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు తీసుకుంటున్న చర్యలను సినర్జీ చేయాలి. కలను సాకారం చేసుకోవాలి.. నా ఆలోచనలను తదుపరిస్థాయికి మీరు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎమర్జింగ్ టెక్నాలజీస్‌లో పలు విధానాలు ఇప్పటికే వచ్చేశాయి. కాని వాటి ఫ్యాకల్టీలో మనం వెనకబడి ఉన్నాం. కంటెంట్ ఇంటర్నెట్లో అందుబాటులో ఉంది. దాన్ని ఎలా వాడుకోవాలి అన్నదానిపై మనం ఆలోచన ఉండాలి. శిక్షణ ఇచ్చుకుంటూ పోతే మనకూ తగినంత ఫ్యాకల్టీ సిద్ధం అవుతారు. ఆ రకంగా దీన్ని అధిగమించాలి. దీనిపై మరిన్ని సాలోచనలు చేయడానికి నాలుగైదు యూనివర్సిటీలతో వర్కింగ్ గ్రూపులను ఏర్పాటు చేయాలి. మెడికల్, ఇంజనీరింగ్‌తో పాటు ఇతర ఫ్యాకల్టీలు కూడా గ్రూపులుగా ఏర్పాటు చేసుకుని అత్యుత్తమ పాఠ్యప్రణాళిక, అత్యుత్తమ బోధనా పద్ధతులను ఖరారు చేయాలి. మన కలను సాకారం చేసుకోవాలి అని సూచనలు చేశారు. ఇది కూడా చదవండి: రామోజీ కథ, బాబు నిర్మాత, పవన్ యాక్టర్: ఎంపీ భరత్ సీరియస్ -
ఏసీబీ వలలో వీసీ
-
ఏసీబీకి చేతికి చిక్కిన వీసీ.. ఇంతకూ తొలగించే అధికారం ఎవరికి?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ ఏసీబీ వలలో చిక్కిన తర్వాత రాజ్యాంగ పరమైన అనేక అంశాలపై విద్యాశాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నిజానికి వీసీ నియామకం, తొలగింపుపై పూర్తి అధికారాలు గవర్నర్‌కు మాత్రమే ఉంటాయి. నియామకానికి సిఫార్సు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నా, తొలగింపు విషయంలో మాత్రం ఏ అధికారం ఉండదని నిబంధనలు పేర్కొంటున్నాయి. తెలంగాణ యూనివర్సిటీ పాలక మండలి సమావేశంలోనూ వీసీ ఈ అంశాలను అనేక సందర్భాల్లో ప్రస్తావించారు. కాలేజీ విద్య కమిషనర్‌కు తనను ప్రశ్నించే అధికారమే లేదని ఆయన అన్నట్టు మీడియాలో వచ్చింది. ఆ త ర్వాత కూడా తనను తీసివేసే అధికారం ప్రభుత్వాని కి ఎక్కడుందనే వాదన పరోక్షంగా వీసీ లేవ నెత్తారు. ఇదే క్రమంలో యూనివర్సిటీ పాలన వ్యవహారాల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొనడం, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలు చేయడం, తాజాగా ఓ వ్యవహారంలో ఏసీబీ ప్రత్యక్షంగా వీసీని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడం ఈ ఎపిసోడ్లో కొత్త మలుపు. ఇప్పు డు జరగబోయేదేంటనేది హాట్ టాపిక్‌గా మారింది. వీసీ నియామకం ఎలా...? ఏదైనా యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్‌ను నియమించేటప్పుడు ముందుగా ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తుంది. ఈ ప్రక్రియ కోసం ముగ్గురు సభ్యులతో ఓ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఇందులో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నుంచి ఒకరు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒకరు, వీసీ నియామకం జరిగే విశ్వవిద్యాలయం నుంచి ఒకరిని ఈ కమిటీలో చేరుస్తారు. యూజీసీ ఎవరినైనా నిపుణుడిని సూచిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున విద్యాశాఖ కార్యదర్శి సభ్యుడిగా ఉంటారు. యూనివర్సిటీ తరపున పదవీ విరమణ చేసిన నిపుణుడైన మాజీ వీసీని సాధారణంగా చేరుస్తారు. నోటిఫికేషన్ తర్వాత వచ్చే దరఖాస్తులను కమిటీ పరిశీలించి, ముగ్గురి పేర్లను గవర్నర్‌కు పంపుతుంది. ఇందులోంచి గవర్నర్ ఒకరిని ఎంపిక చేస్తారు. ఆ తర్వాత గవర్నర్ నియామకానికి సంబంధించిన నియామకపు ఉత్తర్వులు రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ కార్యదర్శి ఇస్తారు. తొలగింపు ఎలా? గవర్నర్ నియమించిన వైస్ చాన్స్‌లర్ ప్రభుత్వానికి ఇష్టం లేదనుకుంటే రెండింట మూడొంతుల అసెంబ్లీ మెజారిటీ తీసుకుని వీసీ తొలగింపు ఉత్తర్వులు ఇవ్వొచ్చు. ఇక్కడ కూడా అసెంబ్లీ నిర్ణయాన్ని గవర్నర్‌కు పంపాల్సి ఉంటుంది. నేరుగా గవర్నర్‌కు కూడా వీసీని కారణాలు లేకుండా తొలగించే అధికారం ఉండదు. అయితే, తెలంగాణ యూనివర్సిటీ వీసీ వివాదం భిన్నమైంది. ఇలాంటి సంక్లిష్ట సమస్య గతంలో ఎప్పుడూ ఎదురవ్వలేదు. ఏసీబీ దాడి చేయడంపైనా పలు ప్రశ్నలు తెరమీదకొస్తున్నాయి. ఇలా దాడి చేయాలన్నా, ముందుగా గవర్నర్ అనుమతి తీసుకోవాలా? అనే విషయమై ఉన్నతాధికారులు ముందుగా న్యాయ నిపుణుల సలహా తీసుకున్నారు. వీసీ వేతనం తీసుకుంటున్నాడు కాబట్టి, ప్రజా సేవకుడిగానే చూడాలని నిపుణులు తెలిపారు. కాబట్టి ఏసీబీ చట్టం పరిధిలోకి వస్తారని స్పష్టం చేశారు. ఏసీబీ దాడి, అరెస్టు జరిగిన తర్వాత వీసీని కూడా సస్పెండ్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. విచారణ పూర్తయి నేరం రుజువైతే శాశ్వతంగా తొలగించే అధికారం కూడా రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుందని చెబుతున్నారు. కాకపోతే ప్రతీ విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళా్లల్సిన అవసరం ఉంటుందని నిపుణులు అంటున్నారు. -
వీసీ అరెస్ట్.. తెలంగాణ వర్శిటీలో విద్యార్థుల సంబరాలు
సాక్షి, హైదరాబాద్: లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ దాచేపల్లి రవీందర్ గుప్తాను శనివారం సాయంత్రం అరెస్ట్ చేశారు. ఈ కేసులో తొలుత వీసీని అదుపులోకి తీసుకున్న ఏసీబీ.. పూర్తి స్థాయిలో తనిఖీలు ఆయన్ను అనంతరం అరెస్ట్ చేసింది. ఈ క్రమంలోనే రవీందర్ గుప్తా ఇంట్లో, ఆఫీస్‌లో, యూనివర్శిటీ చాంబర్లో ఏసీబీ తనిఖీలు నిర్వహించింది. ఆపై రవీందర్‌ను అరెస్ట్ చేసిన ఏసీబీ.. కోర్టులో హాజరుపర్చనుంది. అయితే రూ. 50 వేలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ రవీందర్ అరెస్టు చేయగానే యూనివర్శిటీ విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు. బాణాసంచా కాల్చడంతో పాటు స్వీట్లు పంచుకుని మరీ సెలబబ్రేట్ చేసుకున్నారు. గతం కొంతకాలంగా వీసీ తీరుతో విసిగిపోయిన విద్యార్థులు.. ఏసీబీ అరెస్ట్ వార్త తర్వాత సంబరాలు చేసుకున్నారు. కాగా, నిజామాబాద్ భీమ్‌గల్ లో ఉన్న ఓ కళాశాలకు పరీక్ష కేంద్రం అనుమతి కోసం రూ. 50 వేలు లంచం డిమాండ్ చేశారాయన. ఈ క్రమంలో బాధితుడు దాసరి శంకర్ మమ్మల్ని ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని ఆయన్ని అదుపులోని తీసుకున్నాం. గతంలో అతని పై వచ్చిన ఫిర్యాదులపై విజిలెన్స్ దర్యాప్తు జరుగుతుంది. ప్రస్తుతం నివాసంతో పాటు యూనివర్సిటీలోనూ సోదాలు చేస్తున్నాం. సోదాలు పూర్తి అయినా తర్వాత అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిస్తాం అని డీఎస్పీ సుదర్శన్ వెల్లడించారు. ఇదిలా ఉంటే.. వీసీ రవీందర్ తీరుపై మొదటి నుంచి విమర్శలే వినవస్తున్నాయి. గతంలో ఆయన పలుమార్లు వార్తల్లో నిలిచారు. ఇక తాజాగా.. ఆయనపై ఆరోపణల నేపథ్యంలోనే అక్రమాలు-అవకతవకలపై యూనివర్సిటీలో ఏసీబీ తనిఖీలు కూడా జరిగాయి. అయినా కూడా ఆయన తీరు మార్చుకోకుండా.. లంచంతో పట్టుబడడం గమనార్హం. చదవండి: మా పక్కింటి వాళ్లే ఇలా చేస్తారనుకోలేదు: బాలుడి తండ్రి ఆవేదన -
అవును.. ఆయన లంచంతో పట్టుబడ్డాడు: ఏసీబీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ దాచేపల్లి రవీందర్ గుప్తా(63) తమ అదుపులోనే ఉన్న విషయాన్ని ఏసీబీ డీఎస్సీ సుదర్శన్ ప్రకటించారు. అయితే ఆయన్ని ఇంకా అరెస్ట్ చేయలేదని.. పూర్తి స్థాయిలో తనిఖీలు ముగిశాక అరెస్ట్ చేస్తామని స్పష్టత ఇచ్చారు. సాక్షితో మాట్లాడిన ఆయన.. శనివారం జరిగిన పరిణామాలకు వివరించారు. తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రవీందర్ గుప్తా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాం. తార్నాకలోని తన ఇంట్లోనే బాధితుడి నుంచి రూ. 50 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికాడాయన. ఆయన అల్మారా నుంచి నగదును సేకరించి.. కెమికల్ టెస్ట్ నిర్వహించి వేలిముద్రలతో పోల్చి చూసుకున్నాం. ఆ వేలిముద్రలు ఆయన ఫింగర్ ప్రింట్స్‌తో సరిపోలాయి. నిజామాబాద్ భీమ్‌గల్ లో ఉన్న ఓ కళాశాలకు పరీక్ష కేంద్రం అనుమతి కోసం రూ. 50 వేలు లంచం డిమాండ్ చేశారాయన. ఈ క్రమంలో బాధితుడు దాసరి శంకర్ మమ్మల్ని ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని ఆయన్ని అదుపులోని తీసుకున్నాం. గతంలో అతని పై వచ్చిన ఫిర్యాదులపై విజిలెన్స్ దర్యాప్తు జరుగుతుంది. ప్రస్తుతం నివాసంతో పాటు యూనివర్సిటీలోనూ సోదాలు చేస్తున్నాం. సోదాలు పూర్తి అయినా తర్వాత అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిస్తాం అని డీఎస్పీ సుదర్శన్ వెల్లడించారు. ఇదిలా ఉంటే.. వీసీ రవీందర్ తీరుపై మొదటి నుంచి విమర్శలే వినవస్తున్నాయి. గతంలో ఆయన పలుమార్లు వార్తల్లో నిలిచారు. ఇక తాజాగా.. ఆయనపై ఆరోపణల నేపథ్యంలోనే అక్రమాలు-అవకతవకలపై యూనివర్సిటీలో ఏసీబీ తనిఖీలు కూడా జరిగాయి. అయినా కూడా ఆయన తీరు మార్చుకోకుండా.. లంచంతో పట్టుబడడం గమనార్హం. వీడియో: గర్ల్స్ హాస్టల్ లోకి వెళ్లి డబ్బులు చల్లుతూ వీసీ రవీందర్ డ్యాన్స్ లు ఇదీ చదవండి: కోరుకున్న కాలేజీ.. కోర్సు కూడా! -
ఏసీబీ ట్రాప్ లో తెలంగాణ యూనివర్సిటీ వీసీ
-
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ తెలంగాణ వర్సిటీ వీసీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రవీందర్ గుప్తా ఏసీబీ ఉచ్చులో పడ్డారు. శనివారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని ఆయన్ని ఏసీబీ అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని తన ఇంట్లోనే లంచం తీసుకుంటూ ఆయన పట్టుబడినట్లు సమాచారం. గత కొంతకాలంగా తెలంగాణ యూనివర్సిటీలో అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాలు యూనివర్సిటీలో సోదాలు నిర్వహించాయి. ఆరోపణలకు తగ్గట్లే అక్రమ నియామకాలు, అక్రమ లావాదేవీలు జరిగినట్లు ఏసీబీ నిర్ధారించుకున్నట్లు తెలుస్తోంది. అయితే.. తాజాగా పరీక్షా కేంద్రం ఏర్పాటు కోసం ఓ వ్యక్తి నుంచి డబ్బులు డిమాండ్ చేశాడు వీసీ రవీందర్ గుప్తా. ఈ క్రమంలో బాధితుడు శంకర్ ఏసీబీని ఆశ్రయించగా.. ఏసీబీ వల పన్నింది. శనివారం ఉదయం హైదరాబాద్‌లోని తన నివాసానికి వెళ్లి బాధితుడు డబ్బు ఇవ్వబోయాడు. ఆ టైంలో రూ. 50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు రవీందర్ గుప్తా. అనంతరం ఆయన ఇంట్లో తనిఖీలు నిర్వహించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు ఆయన్నీ అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఏసీబీ నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇదీ చదవండి: BRS ఎమ్మెల్యేల ఇళ్ల నుంచి ఏం తీసుకెళ్లారు? -
లిఖితది ఆత్మహత్య కాదు.. ప్రమాదం: వీసీ వెంకట రమణ
సాక్షి, నిర్మల్: బాసర ట్రిపుల్ ఐటీలో రోజుకో విద్యార్థిని ప్రాణాలు కోల్పోతున్నారు . మొన్న దీపిక అత్మహత్య చేసుకోగా నేడు మరో విద్యార్థి లిఖిత బిల్డింగ్‌పై నుంచి దూకి ప్రాణాలు కోల్పోయింది. ఇది ఆత్మహత్య.. లేక ప్రమాదవశాత్తు జరిగిందా అనేది తేలాల్సి ఉంది. అయితే విద్యార్థినిది అత్మహత్య అంటూ విద్యార్థి సంఘాలు ఆరోపిస్తుండగా..ట్రిపుల్ ఐటీ అధికారులు మాత్రం ప్రమాదవశాత్తు జరిగిందని చెబుతున్నారు. ప్రమాదమా.. లేక ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లిఖిత మరణం ప్రమాదమే: వీసీ నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో ఉన్న విద్యార్థిని లిఖిత మృతదేహాన్ని ఆర్జీయూకేటీ ఇంఛార్జ్ వీసీ వెంకటరమణ పరిశీలించారు. లిఖిత మృతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘విద్యార్థిని మృతి దురదృష్టకరమని తెలిపారు. లిఖితది ఆత్మహత్య కాదని.. ప్రమాదమని తెలిపారు. యూట్యూబ్ చూస్తూ లిఖిత కింద పడిపోయిందన్నారు. అబద్ధపు ప్రచారాన్ని నమ్మవద్దని కోరుతున్నట్లు పేర్కొన్నారు. ఆర్జీయూకేటీలో మరణాలు జరగకుండా చర్యలు తీసుకుంటాం. విద్యార్థులు మనోధైర్యం కోల్పోవద్దని తెలిపారు. నిర్మల్ ఆసుపత్రికి లిఖిత తల్లిదండ్రులు బాసర ట్రిపుల్ ఐటీ ఘటనపై మంత్రి సబితా ఇంద్రెడ్డి .వీసీ వెంకటరమణను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా లిఖిత మృతదేహాన్ని నిర్మల్ ఆసుపత్రికి తరలించగా.. కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. తమ కూతురు మృతిపై తీవ్రంగా విలపిస్తున్నారు. కూతురు మరణంపై కనీసం సమాచారం ఇవ్వలేదని అందోళన వ్యక్తం చేస్తున్నారు.లిఖిత ఎందుకు చనిపోయిదో కారణం చెప్పడంలేదని అధికారుల తీరుపై మండిపడుతున్నారు. అంతకుముందు అసుపత్రికి వచ్చిన వీసి వెంకటరమణను తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. చదవండి: పెళ్లి ఇంట్లో విషాదం.. వడ దెబ్బతో వరుడి మృతి ఇదిలా ఉండగా బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న బూర లిఖిత అనే విద్యార్థిని అర్ధరాత్రి 2 గంటల సమయం హాస్టల్ నాలుగో అంతస్తు పై నుంచి కిందపడింది. తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆమెకు క్యాంపస్‌లోని హెల్త్ సెంటర్లో ప్రథమ చికిత్స అనంతరం భైంసా ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ వైద్యులు పరిక్షించి అయితే అక్కడినుంచి మెరుగైన చికిత్స కోసం నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. లిఖిత అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. లిఖిత స్వస్థలం సిద్దిపేట జిల్లా గజ్వేల్. వారం రోజుల క్రితమే హాస్టల్‌కు వెళ్లిన తమ కూతురు.. ఇంతలోనే ఇలా జరగడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. -
కాళ్లు మొక్కుతాం.. మా డబ్బులు మాకివ్వండి
సాక్షి, నిజామాబాద్ (డిచ్పల్లి): ‘ఏదో పని దొరుకుతుందని ఆశ పడి అప్పు చేసి మరీ డబ్బులు తీసుకొచ్చి మీ చేతుల్లో పెట్టాం. కాళ్లు మొక్కుతాం.. కనికరించి మా డబ్బులు మాకివ్వండి సారూ’ అంటూ తెలంగాణ యూనివర్సిటీ వీసీ డి.రవీందర్‌గుప్తా కాళ్లపై పడి బాధితులు వేడుకున్నారు. వీసీ రవీందర్ బుధవారం క్యాంపస్‌కు వచ్చినట్లు తెలియడంతో భిక్కనూరు మండలం జంగంపల్లికి చెందిన 15 మంది బాధితులు మెయిన్ క్యాంపస్‌కు చేరుకున్నారు. ఉద్యోగాల పేరుతో డెయిలీవేజ్ కింద తమను పనిలోకి చేర్చుకున్నారని, ఇందుకోసం వీసీ రవీందర్ ఒక్కొక్కరి వద్ద రూ. 40 వేల నుంచి రూ. 50వేలు తీసుకున్నారని బాధితులు సుభద్ర, ప్రశాంత్, ప్రభాకర్‌గౌడ్, రాహుల్ తదితరులు తెలిపారు. మూడు నెలలు పనిచేసిన తర్వాత ప్రభుత్వం, ఈసీ ఆమోదం లేదని తమను పనిలోకి రావద్దని చెప్పారని బాధితులు వివరించారు. పనిచేసిన కాలానికి కూడా ఒక్కరూపాయి జీతం ఇవ్వలేదని, తాము ఇచ్చిన డబ్బులన్నా తిరిగి ఇవ్వాలని వీసీని ఘోరావ్ చేశారు. వీరికి విద్యార్థులు అండగా నిలిచారు. పోలీసులు జోక్యం చేసుకోవడంతో క్యాంపస్‌లో ఉద్రిక్తత నెలకొంది. బాధితులు చివరకు వీసీ కాళ్లపై పడి తమ డబ్బులు ఇవ్వాలని వేడుకున్నారు. దీంతో వీసీ.. బాధితులందరూ పేర్లు, అమౌంట్, ఫోన్ నంబర్లు రాసి ఇవ్వాలని, రెండు రోజుల్లో ఎవరి డబ్బు లు వారికి ఫోన్‌పే చేస్తానని హామీ ఇచ్చారు. చదవండి: బీజేపీ అధ్యక్షుడు మార్పు.. క్లారిటీ ఇచ్చిన రాష్ట్ర ఇన్చార్జి -
తెలంగాణ యూనివర్సిటీ వీసీ అక్రమాలపై విచారణ
తెయూ (డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ డి.రవీందర్ పాల్పడిన అక్రమ చెల్లింపులు, నిధుల దుర్వినియోగం వంటి అంశాలపై ఐదుగురు సభ్యుల కమిటీ విచారణ ప్రారంభించింది. ఇందులో భాగంగా శుక్రవారం కమిటీ సభ్యులు గంగాధర్‌గౌడ్, వసుంధరదేవి, ప్రవీణ్‌కుమార్ వర్సిటీని సందర్శించారు. వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరిని కలిసి 2021 నవంబర్ నుంచి 2023 ఏప్రిల్ 18 వరకు వర్సిటీ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ తీసుకున్నారు. ఆ మధ్యకాలంలో జరిపిన చెల్లింపులపై విచారణ జరపనున్నారు. వర్సిటీకి విచారణ కమిటీ రాక సందర్భంగా విద్యార్థులు ‘థాంక్యూ సాక్షి’అంటూ క్యాంపస్‌లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ‘తెలంగాణ యూనివర్సిటీలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను వెలుగులోకి తీసుకువచ్చిన ‘సాక్షి’పత్రికకు ధన్యవాదములు’అంటూ ఫ్లెక్సీలో పేర్కొన్నారు. ఫ్లెక్సీల ఏర్పాటు సోషల్ మీడియాలో వైరలైంది. వర్సిటీలో కూడా ఈ అంశం చర్చనీయాంశమైంది. ఈ నెల 19న హైదరాబాద్ రూసా భవనంలో రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాకాటి కరుణ, ఆ శాఖ కమిషనర్ నవీన్‌మిట్టల్ ఆధ్వర్యంలో యూనివర్సిటీ పాలకమండలి సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ముందుగా ఈ సమావేశానికి హాజరైన వీసీ ప్రొఫెసర్ డి.రవీందర్ వాకౌట్ చేసి బయటకు వెళ్లిపోయారు. అనంతరం వీసీ అక్రమాలపై విచారణ కోసం రాష్ట్ర ఆర్థిక శాఖ డిప్యూటీ డైరెక్టర్ చంద్రకళ, నలుగురు ఈసీ మెంబర్లతో కలిపి పాలకమండలి కమిటీని ఏర్పాటు చేసింది. అనంతరం ఈ నెల 26న జరిగిన పాలకమండలి సమావేశంలో ఏ విధంగా విచారణ జరపాలనే విషయమై కమిటీ సభ్యులకు మార్గనిర్దేశనం చేశారు. ఈసీ నిర్ణయాలు తాత్కాలికంగా రద్దు చేసిన హైకోర్టు ఈ నెల 19న జరిగిన తెలంగాణ యూనివర్సిటీపాలక మండలి(ఈసీ) సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు మధ్యంతరంగా రద్దు చేస్తూ రాష్ట్ర హైకోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసినట్లు వీసీ ప్రొఫెసర్ రవీందర్ తెలిపారు. ఈ సమావేశంలో వీసీ అధికారాలు తగ్గించడం, ఇన్చార్జి రిజిస్ట్రార్‌గా విద్యావర్ధినిని తొలగించి ప్రొఫెసర్ యాదగిరిని నియమించడం, వీసీపై వచ్చిన ఆరోపణల విచారణకు ఐదుగురు సభ్యుల కమిటీ ఏర్పాటు వంటి నిర్ణయాలను ఈసీ తీసుకున్న విషయం తెలిసిందే. ఈసీ నిర్ణయాలపై తాను హైకోర్టును ఆశ్రయించగా, ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని వీసీ తెలిపారు. అయితే, హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కోర్టులో కౌంటర్ దాఖలు చేస్తుందని ప్రొఫెసర్ యాదగిరి తెలిపారు. -
పీజీ డిప్లొమా కోర్సుల బ్రోచర్ ఆవిష్కరణ
ఫిలింనగర్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం కొత్తగా ప్రవేశపెట్టిన పీజీ డిప్లొమా కోర్సుల బ్రోచర్‌ను శనివారం యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ఆచార్య కె. సీతారామారావు ఆవిష్కరించారు. కామర్స్ విభాగం ఆధ్వర్యంలో ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రవేశ పెట్టిన కోర్సుల్లో పీజీ డిప్లొమా ఇన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, పీజీ డిప్లొమా ఇన్ మార్కెటింగ్ మేనేజ్మెంట్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఆపరేషన్స్ మేనేజ్మెంట్ కోర్సులు ఉన్నాయని డీన్ ఆనంద్ పవార్ పేర్కొన్నారు. ఆయా కోర్సులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మార్చి 10 అని వెల్లడించారు. కార్యక్రమంలో అకడమిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, ఇ. సుధారాణి, షకీలా ఖానం, వడ్డాణం శ్రీనివాస్, అన్ని విభాగాల అధిపతులు, డీన్స్ పాల్గొన్నారు. -
సీఎం జగన్‌కు కలిసిన పలు వర్సిటీల కొత్త వీసీలు..
సాక్షి, తాడేపల్లి: ఏపీలో పలు యూనివర్సిటీలకు కొత్తగా నియమితులైన వైస్ ఛాన్స్లర్లు క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. కాగా, వీసీలుగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం.. వీరంతా సీఎం జగన్‌ను కలిశారు. ముఖ్యమంత్రి జగన్‌ను కలిసిన వారిలో కడప డాక్టర్ వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ వీసీగా నియమితులైన బానోత్ ఆంజనేయ ప్రసాద్, జవహర్లాల్ నెహ్రు టెక్నలాజికల్ యూనివర్సిటీ(జేఎన్టీయూ) గురజాడ, విజయనగరం వీసీ కే. వెంకట సుబ్బయ్య, ఆంధ్రకేసరి యూనివర్సిటీ ఒంగోలు వీసీ మారెడ్డి అంజిరెడ్డి ఉన్నారు. ఇక, ఈ సమావేశంలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఫ్రొ. కే. హేమచంద్రారెడ్డి పాల్గొన్నారు.