సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో అమ్మాయిలు, అబ్బాయిల హాస్టల్ కేటాయింపుల విషయంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. మంగళవారం వీసీ కార్యాలయంలో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అబ్బాయిల స్పోర్ట్స్ హాస్టల్‌ను అమ్మాయిలకు కేటాయించారు. తమ కోసం స్పోర్ట్స్ నిధులతో నిర్మించిన హాస్టల్‌ను ఖాళీ చేసేదిలేదని వ్యాయామ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు 12 మంది విద్యార్థులను అరెస్టు చేశారు.
ఓయూ వీసీని రీకాల్ చేయండి
ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ రవీందర్‌ను రీకాల్ చేయాలని బహుజన విద్యార్థి ఫెడరేషన్, ఓయూ విద్యార్థి జేఏసీ నాయకులు మంగళవారం రాష్ట్ర గవర్నర్ తమిళి సైను కోరారు. సంస్కరణల పేరుతో ఇష్టారాజ్యాంగా వ్యవహరిస్తూ విద్యార్థులు, ఉద్యోగులను వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. గతంలో పలువురు అధికారులు యూనివర్సిటీ కాలేజీలు, కార్యాలయాల్లో అవసరం నిమిత్తం డైలీవేజ్, కాంట్రాక్టు ఉద్యోగులను నియమించగా తనకు నచ్చని అధికారులు, సిబ్బందిని వీసీ రవీందర్ అకారణంగా తొలగిస్తున్నారన్నారు.
ప్రభుత్వం 2014లో జారీ చేసిన సర్క్యులర్ ఆధారంగా ఓయూకు సంబంధం లేని ఆర్‌క్యూస్‌లో పని చేస్తున్న 12 మంది ఉద్యోగులను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తీసేయడం దారుణమని, వెంటనే వారిని విధుల్లోకి తీసుకోవాలని విద్యార్థి నేతలు వేల్పుల సంజయ్, కొత్తపల్లి తిరుపతి, పులిగంటి వేణుగోపాల్ డిమాండ్ చేశారు. (క్లిక్: కారులో కూర్చుని వెండితెరపై సినిమా చూడొచ్చు.. త్వరలో హైదరాబాద్‌లో..)
Comments
Please login to add a commentAdd a comment