Hostel
-
కర్నూల్ హాస్టల్ లో దారుణం.. చిన్న పిల్లలనే కనికరం లేకుండా
కర్నూల్: జిల్లాలోని కోడుమూరు ఎస్సీ హాస్టల్ లో దారుణం చోటు చేసుకుంది. చిన్న పిల్లలు అని చూడకుండా ఏడో తరగతికి చెందిన ముగ్గురు విద్యార్థులపై పదో తరగతికి చెందిన ఓ విద్యార్థి విచక్షణా రహితంగా విరుచుకుపడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.తన బెల్టు తీసుకుని ఆ విద్యార్థులను చితకబాదాడు. తన మాట వినలేదని చెప్పి ఏడో తరగతి విద్యార్థులను దారుణంగా కొట్టాడు. దాడికి పాల్పడ్డ పదో తరగతి విద్యార్థి అనధికారంగా హాస్టల్ ఉంటున్నట్లు తెలుస్తోంది. -
ఏయూ హాస్టల్‌కి నాట్స్ ఆధ్వర్యంలో ఉచిత మంచాలు
ఆంధ్ర యూనివర్సీటీలో విద్యార్ధుల కోసం ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్, గౌతు లచ్చన్న బలహీన వర్గాల సంస్థ గ్లో, ఆంధ్ర యూనివర్సీటీ పూర్వ విద్యార్థి తాళ్లూరి పూర్ణ చంద్రరావుల ఆర్ధిక సహకారంతో మంచాలను విరాళంగా ఇచ్చారు. ఆంధ్ర యూనివర్సీటీలో కొత్తగా నిర్మించిన విశ్వేశ్వరయ్య వసతి గృహానికి కూడా ఆర్థిక చేయూతను అందించారు. మరిన్ని NRI వార్తలకోం ఇక్కడ క్లిక్ చేయండి!విద్యార్ధులకు నిద్రకు ఇబ్బంది లేకుండా అల్యూమినియంతో తయారుచేసిన 432 మంచాలను తయారు చేయించి ఏయూ హాస్టల్‌కి బహుకరించారు. ఈ కార్యక్రమంలో నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, నాట్స్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి, నాట్స్ బోర్డు మాజీ ఈసీ సభ్యులు, శ్రీనివాస్ బొల్లు, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ శ్రీనివాస్ పిడికిటి, నాట్స్ బోర్డ్ మాజీ డైరెక్టర్ శ్రీనివాస్ అరసడ,నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ మల్లాది, గ్లో సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
సెయింటాన్స్ ఘటనపై కలెక్టర్ సీరియస్
పాడేరు: పట్టణంలోని సెయింటాన్స్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో ఏడో తరగతి విద్యార్థినిపై పదో తరగతి విద్యార్థినులు దాడి చేసిన ఘటనపై కలెక్టర్ దినేష్‌కుమార్ సీరియస్ అయ్యారు. సోమవారం దినపత్రికలు, సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్తలపై ఆయన స్పందించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక అందజేయాలని జిల్లా విద్యశాఖ అధికారి బ్రహ్మాజీరావును ఆదేశించారు. ఇందుకోసంప్రత్యేక కమిటీను ఏర్పాటు చేశారు. దీంతో డీఈవో సోమవారం పాఠశాల, వసతి గృహాన్ని సందర్శించారు. సంఘటన వివరాలను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ నిర్వహణకు అనుమతులు ఉన్నాయా లేదా అనే అంశంపై ఆరా తీశారు. నివేదిక ఆధారంగా వసతి గృహా కేర్ టేకర్ శ్రావ్యను విధుల నుంచి తొలగించారు. ఘటనకు బాధ్యులైన ముగ్గురు టెన్త్ విద్యార్థినులను హాస్టల్ నుంచి ఇళ్లకు పంపించివేశారు. వసతి గృహా నిర్వాహణపై నిత్యం పర్యవేక్షణ జరపాలని, భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు పునారావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇకపై ఇటువంటి ఘటనలు, వివాదాలు జరిగితే పాఠశాల గుర్తింపు రద్దు చేస్తామని డీఈవో హెచ్చరించారు.#viralvideo… pic.twitter.com/dcVm70EvT0— greatandhra (@greatandhranews) February 17, 2025 -
ఏజెన్సీకి సైతం పాకిన ర్యాగింగ్ భూతం
సాక్షి, అల్లూరి సీతారామరాజు జిల్లా: ర్యాగింగ్ భూతం ఏజెన్సీకి సైతం పాకింది. పాడేరు సెయింటెన్స్ స్కూల్ హాస్టల్ విద్యార్థినుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 7వ తరగతి బాలికలపై 10వ తరగతి విద్యార్థులు దాడి చేశారు. వసతి గృహంలో ర్యాగింగ్ జరుగుతుందని విద్యాశాఖ అధికారులు అనుమానిస్తున్నారు. ఘటనపై అధికారులు విచారణ చేట్టారు. ఈ ఘటనపై డీఈవో గోప్యంగా విచారణ జరుపుతున్నారు -
బాలికల హాస్టల్ లో ఆగంతకుడు హల్ చల్
-
ప్రభుత్వ సదన్ బాలికల ఒంటిపై గాయాలు.. వరుదు కళ్యాణి స్ట్రాంగ్ రియాక్షన్
-
క్లాస్‌మేట్‌పై జూనియర్ డాక్టర్ అత్యాచారం
గ్వాలియర్: ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆవరణలోని ఉపయోగంలో లేని హాస్టల్లో ఓ జూనియర్ డాక్టర్(25) తోటి వైద్యురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ నగరంలోని గజరాజా మెడికల్ కాలేజీలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుడు, బాధితురాలు వేర్వేరు హాస్టళ్లలో ఉంటూ చదువుకుంటున్నారు. ఆదివారం నిందితుడు కాలేజీ ఆవరణలోనే ఉన్న ఉపయోగంలో లేని బాయ్స్ హాస్టల్లోకి రావాలని బాధితురాల్ని కోరాడు. అంగీకరించి అక్కడికి వెళ్లిన ఆమెను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటనపై బాధితురాలు కాంపు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, నిందితుడిని సోమవారం అదుపులోకి తీసుకున్నట్లు నగర ఎస్పీ అశోక్ జడొన్ చెప్పారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందన్నారు. -
ఐదు నెలలుగా పులిహోరనే దిక్కు
కుల్కచర్ల: ‘విద్యాసంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి పులిహోర ఒక్కటే టిఫిన్‌గా పెడుతున్నారు. ఏడాదిలో పది రోజులు మాత్రమే పాలు ఇచ్చారు. రెండుసార్లే గుడ్లు ఇచ్చారు. భోజనం నాసిరకంగా ఉండడంతో తినలేక పస్తులుంటున్నాం..’అని వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని ముజాహిద్పూర్ మోడల్ స్కూల్ వసతి గృహంలో ఉంటున్న బాలికలు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం తమ హాస్టల్‌ను సందర్శించిన తహసీల్దార్ మురళీధర్‌కు తమ గోడు విని్పంచారు. వసతి గృహంలో గదులను తామే శుభ్రం చేసుకుంటున్నామని, మరుగుదొడ్లలోకి బకెట్లలో నీరు తెచ్చుకోవాల్సి వస్తోందని తెలిపారు.చలిపెడుతున్నా నేలపైనే పడుకుంటున్నామని, బెడ్ïÙట్లు కూడా ఇళ్ల నుంచి తెచ్చుకున్నామని వివరించారు. పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడంతో పాములు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా ఈ విషయాలను ఎంఈఓ హబీబ్ అహ్మద్ వెంటనే డీఈఓకు తెలియజేయడంతో ఆమె వెంటనే వసతి గృహానికి చేరుకున్నారు. నిర్లక్ష్యం వహిస్తే కఠినచర్యలు:డీఈఓ డీఈఓ రేణుకాదేవి మోడల్ స్కూల్ వసతి గృహాన్ని పరిశీలించి, విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నా రు. పాలు, కూరగాయలు, చికెన్, మటన్, గుడ్లు పంపిణీ చేయడంలో నిర్వాహకులు నిర్లక్ష్యంగా ఉంటున్నారని విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. భోజనం కూడా నాణ్యతతో ఉండటం లేదని తెలిపా రు. దీనిపై డీఈఓ స్పందించారు. మెనూ ప్రకారం భోజన వస్తువులను సరఫరా చేయని టెండరు దారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చ రించారు. ఆమె వెంట మిషన్ భగీరథ డీఈ సుబ్రమణ్యం, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ జ్యోతి హెప్సిబా, కేజీబీవీ ప్రత్యేకాధికారి దేవి తదితరులు ఉన్నారు. -
డిప్లొమా విద్యార్థి ఆత్మహత్య
మధురవాడ: టీడీపీ మాజీ ఎమ్మెల్సీకి చెందిన చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న డిప్లొమా విద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. పీఎంపాలెం పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పార్వతీపురం మన్యం జిల్లా నర్సిపురం బీజీ కాలనీకి చెందిన నిండుగొండ శంకరరావు, జ్ఞానేశ్వరి కుమారుడు జ్యోతి ప్రకాశ్ (16) విశాఖ నగర శివారు కొమ్మాది చైతన్య వ్యాలీలోని చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో డిప్లమా మెకానికల్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కళాశాలలోని బాయ్స్ హాస్టల్ బ్లాక్ ఎఫ్–7లో ఏడుగురు విద్యార్థులతో కలిసి ఉంటున్నాడు. శుక్రవారం తల్లితో ఫోన్లో మాట్లాడిన జ్యోతి ప్రకాశ్.. అక్టోబర్ మొదటి వారంలో పరీక్షలు ఉండడంతో ఆందోళనగా ఉందని చెప్పాడు. శనివారం ఉదయం కాస్త కడుపు నొప్పిగా ఉందని, క్లాసుకి వెళ్లలేనని తల్లికి మళ్లీ ఫోన్ చేసి చెప్పాడు. దీంతో ఆమె వార్డెన్‌కు ఫోన్ చేసి హాస్టల్లో ఉంచాలని చెప్పింది. మధ్యాహ్నం 1.30 సమయంలో ఇదే గదిలో ఉంటున్న సహచర విద్యార్థి తలుపు కొట్టగా తియ్యలేదు. దీంతో హాస్టల్ సిబ్బంది బలవంతంగా తలుపులు తీయగా.. జ్యోతిప్రకాశ్ ఫ్యాన్‌కి ఉరేసుకుని ఉన్నాడు. వైద్యం నిమిత్తం సమీపంలోని గాయత్రి హాస్పిటల్‌కి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విద్యార్థి మృతికి గల కారణాలు తెలియరాలేదని పీఎంపాలెం సీఐ గేదెల బాలకృష్ణ చెప్పారు. కాగా కొద్ది నెలల క్రితం ఇదే క్యాంపస్‌లో ఓ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఒకే ఏడాదిలో ఇద్దరు విద్యార్థులు చనిపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. తల్లి జ్ఞానేశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
విచారణ చెయ్యకుండానే కెమెరాలు లేవని పోలీసులు
-
300 మంది అమ్మాయిల జీవితాలు నాశనం..
-
హాస్టల్... హడల్! సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్న సర్కారీ హాస్టళ్లు
వసతి గృహంకాదు.. ‘శిథిల’ గృహంనల్లగొండ జిల్లా మునుగోడులోని ఎస్సీ బాలుర హాస్టల్ దుస్థితి ఇది. భవనం శిథిలావస్థకు చేరడంతో తరచూ స్లాబ్‌పై పెచ్చులు ఊడిపడుతున్నాయి. భారీ వర్షం వస్తే కుప్పకూలే ప్రమాదం పొంచి ఉందని స్థానికులు అంటున్నారు. హాస్టల్ పరిస్థితి బాగోలేక విద్యార్థులసంఖ్య తగ్గిందని.. గతంలో 60 మందికిపైగా ఉంటే.. ఇప్పుడు 40 మందే ఉన్నారని పేర్కొంటున్నారు.సాక్షి, హైదరాబాద్/సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో పాఠ శాలలు పునఃప్రారంభమై దాదాపు నెల రోజులు కావస్తోంది. చాలామంది విద్యార్థులు తిరిగిసంక్షేమ హాస్టళ్లకు చేరుతున్నారు. కానీ హాస్టళ్లు మాత్రం వసతుల లేమి, అపరిశుభ్రత, ఇతర సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. విరిగిన కిటికీలు, పగిలిన తలుపులు, చెత్తాచెదారం, పిచి్చమొక్కలతో నిండిన పరిసరాలు, పాములు, తేళ్లు, విషపురుగులు, అపరిశుభ్రంగా మారిన టాయిలెట్లతో విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. నిజానికి వేసవి సెలవుల్లో దాదాపు నెలన్నర పాటు వసతి గృహాలన్నీ మూసి ఉన్నాయి. తిరిగి తెరిచే నాటికి వాటిని చక్కదిద్దాల్సిన సంక్షేమ శాఖలు ఏమాత్రం పట్టించుకోకపోవడం సమస్యగా మారింది. మరోవైపు హాస్టళ్లలో వంట కోసం టెండర్లు పూర్తిగాకపోవడం, డైట్ చార్జీలు సరిపోకపోవడంతో విద్యార్థులకు సరైన ఆహారం అందని దుస్థితి నెలకొంది. విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నా.. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల పరిధిలో 2,020 వసతిగృహాలు ఉన్నాయి. అందులో 497 పోస్టుమెట్రిక్, 1,523 ప్రీమెట్రిక్ హాస్టళ్లు. వీటిలో సుమారు 3.30 లక్షల మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. ప్రస్తుతం ఈ హాస్టళ్లలో విద్యార్థుల ప్రవేశాలు కొనసాగుతున్నాయి. ప్రీమెట్రిక్ హాస్టళ్లలో పదోతరగతి పూర్తయిన విద్యార్థులు వెళ్లిపోవడం, కింది తరగతుల్లో కొత్త చేరికలు నమోదవడం జరుగుతోంది. పోస్టుమెట్రిక్ హాస్టళ్లలో కూడా చేరికలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం వృత్తి విద్యా కోర్సులైన పాలిటెక్నిక్, ఫార్మసీ, ఇంజనీరింగ్ తదితర ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు అడ్మిషన్లు కొనసాగనున్నాయి. ఇలా వసతి గృహాల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ.. వసతుల లేమి మాత్రం సమస్యగా మారింది. పారిశుధ్యానికి బడ్జెట్ ఏదీ? శాశ్వత భవనాలున్న సంక్షేమ హాస్టళ్లలో మౌలిక వసతుల సమస్య తీవ్రంగా ఉంది. విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి వసతిగృహాల్లో పారిశుధ్య పనులు, మరమ్మతుల కోసం కొంతమేర నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. కానీ ఆ నిధులు రాకపోవడంతో అధికారులు మరమ్మతులు చేపట్టలేదు. కనీసం హాస్టళ్ల పరిసరాలను సైతం శుభ్రం చేయలేదు. చాలా వసతిగృహాల పరిసరాలు చెత్తాచెదారం, పిచ్చి మొక్కలతో నిండిపోయాయి. వాటిలో పాములు, తేళ్లు, విష పురుగులు చేరుతున్నాయి. వానలు కురుస్తుండటంతో ఆవరణలోకి, గదుల్లోకి వస్తున్నాయి. దీంతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. విరిగిన కిటికీలు, తలుపులతో వాన నీళ్లు గదుల్లోకి పడుతున్నాయి. డైట్ చార్జీలు సరిపోక.. సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు పదేళ్ల కిందటి డైట్ చార్జీలే కొనసాగుతున్నాయి. మూడో తరగతి నుంచి ఏడో తరగతి విద్యార్థులకు నెలకు రూ.950.. ఎనిమిది నుంచి పదో తరగతి విద్యార్థులకు రూ.1,100, ఇంటర్ నుంచి డిగ్రీ విద్యార్థులకు రూ.1,500 చొప్పున ప్రభుత్వం డైట్ చార్జీల కింద చెల్లిస్తోంది. అడ్డగోలుగా పెరిగిన నిత్యావసరాల ధరలతో ఈ చార్జీలు ఏ మూలకూ సరిపోవడం లేదని వసతిగృహాల అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డైట్ చార్జీలను కనీసం 25శాతం పెంచాల్సిన అవసరం ఉందని గత ఏడాది మంత్రుల కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసిందని.. కానీ ఇప్పటివరకు చార్జీలు పెంచలేదని గుర్తు చేస్తున్నారు. కూరగాయలు, నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో.. విద్యార్థులకు తగిన పోషకాహారం అందే పరిస్థితి లేకుండా పోయిందని అంటున్నారు. అద్దె భవనాలతో మరింత గోస రాష్ట్రంలో 858 సంక్షేమ హాస్టళ్లు అద్దె భవనాల్లోనే ఉన్నాయి. ప్రభుత్వ భవనాలు అందుబాటులో లేక, కొత్తవి నిర్మించక ఏళ్లకేళ్లు అలాగే కొనసాగుతున్నాయి. వాటికి చెల్లించాల్సిన అద్దె బిల్లులు నెలల తరబడి పెండింగ్‌లో ఉన్నాయి. మొత్తంగా సుమారు రూ.12 కోట్ల మేర బకాయిలున్నట్లు అధికారిక గణాంకాలే చెప్తున్నాయి. కొన్ని హాస్టల్ భవనాలకు ఏడాదికిపైగా బిల్లులు రావడం లేదని అధికారులు అంటున్నారు. నెలల తరబడి అద్దె చెల్లించకపోవడంతో ఖాళీ చేయాలంటూ యజమానులు ఒత్తిడి చేస్తున్నారని అంటున్నారు. ముఖ్యంగా రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఈ పరిస్థితి ఉందని పేర్కొంటున్నారు. మరికొన్ని కేస్ స్టడీలుపాములు, తేళ్ల సమస్యతో.. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ హాస్టల్ విద్యార్థి మొల్లం శ్యాంకుమార్ గత వారం అనుమానాస్పదంగా మరణించాడు.టాయిలెట్ కోసం రాత్రిపూట బయటికి వెళ్లి, వచి్చన శ్యాంకుమార్.. వాంతులు చేసుకుని, అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. కాసేపటికే కన్నుమూశాడు. టాయిలెట్ సమీపంలోని పొదల్లో తరచూ పాములు, తేళ్లు కనిపించేవని.. అవి కుట్టడం వల్లే శ్యాం మరణించి ఉంటాడని విద్యార్థులు అంటున్నారు. ఈ చిత్రంలో అపరిశుభ్ర వాతావరణంలో కనిపిస్తున్నది పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని మార్కండేయకాలనీలో ఉన్న ఎస్సీ బాలుర వసతి గృహం. అద్దె భవనంలో కొనసాగుతున్న ఈ వసతి గృహంలో 30మంది విద్యార్థులు ఉంటున్నారు. బాత్రూంలు, భవనాన్ని క్లీన్ చేయడానికి మనుషుల్లేక అంతా అపరిశుభ్రత రాజ్యమేలుతోంది. ఇక్కడ వంటకు సంబంధించిన టెండర్లు ఇంకా పూర్తికాలేదని, వంట చేసే ఔట్సోర్సింగ్ ఉద్యోగికి 10 నెలలుగా జీతం రాక కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతోందని.. దాంతో తామే రోజూ రూ.300 ఖర్చుపెట్టి కూరగాయలు తెప్పిస్తూ, వంట కూడా చేస్తూ.. విద్యార్థులకు తిండి పెడుతున్నామని హాస్టల్ వార్డెన్ డప్పు రవికుమార్ చెప్తున్నారు. ప్రభుత్వం త్వరగా స్పందించి టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తే విద్యార్థులకు సరైన భోజనం దొరుకుతుందని అంటున్నారు. -
అల్పాహారం తిని 20 మందికి అస్వస్థత
రామాయంపేట(మెదక్): మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో ఉన్న మోడల్ స్కూల్ హాస్టల్లో అల్పాహారం తిన్న 20 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం ఉదయం అల్పాహారంగా ఉప్మా తిన్నారు. ఇంతలో ఓ విద్యార్థిని బల్లి పడటం చూశానని ఆరోపిస్తుండగా అప్పటికే తిన్న వారికి వాంతులు, విరేచనాలు అయ్యాయి. దీంతో వారిని చికిత్స నిమిత్తం హాస్టల్ వార్డెన్ స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇందులో 20 మందికి గ్లూకోజ్ ఎక్కించి వైద్యసేవలు అందించగా కోలుకున్నారు. సమాచారం తెలుసుకున్న మెదక్ ఆర్డీఓ రమాదేవి, జిల్లా విద్యాశాఖ అధికారి రాధాకిషన్, తహసీల్దార్ రజనీకుమారి, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ పంజా విజయకుమార్ ఆస్పత్రికి చేరుకొని విద్యార్థినులను పరామర్శించారు. అనంతరం ఆర్డీఓ, డీఈఓ, తహసీల్దార్ హాస్టల్‌కు వెళ్లి వండిన అన్నాన్ని పరిశీలించారు. వంటపాత్రలను, బియ్యాన్ని, ఇతర స్టాక్‌ను కూడా పరిశీలన చేశారు. అనంతరం విద్యార్థినులతో కలిసి హాస్టల్లోనే భోజనం చేశారు. వంట చేస్తున్న క్రమంలో జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులు సూచించారు. -
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
తిరువనంతపురం: కేరళలో రెండు రోజుల క్రితం ఒక మహిళ అపార్ట్మెంట్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన ఘటన మరువక ముందే అలాంటి ఘటన మరొకటి జరిగింది. కేరళ కొల్లంలోని ఓ హాస్ట్‌ల్‌లో ఉంటున్న యువతి తాను గర్భవతి అన్న విషయాన్ని స్నేహితురాళ్ల వద్ద దాచింది. ఆదివారం(మే5) హాస్టల్లోని తన గది తలుపు పెట్టుకుని బాత్రూమ్కు వెళ్లి బిడ్డకు జన్మనిచ్చింది. చాలా సేపటివరకు తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చిన స్నేహితురాళ్లు బలవంతంగా తలుపు తీశారు. దీంతో యువతి బిడ్డకు జన్మనిచ్చిందన్న విషయం బయటపడింది. ఈ విషయాన్నివారు అధికారులకు సమాచారమివ్వగా తల్లిబిడ్డను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లిబిడ్డ ఇద్దరు సురక్షితంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. -
సంపులో పడి సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి
హైదరాబాద్: ప్రమదవశాత్తు సంపులో పడి సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి చెందిన సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ వెంకన్న తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వైరా మండలం గార్లకు చెందిన ఖలీల్ పాషా కుమారుడు షేక్ అక్మల్ సుఫుయాన్ (25) సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. గచ్చిబౌలి అంజయ్యనగర్‌లోని షుణ్ముక్ మెన్స్ పీజీ హాస్టల్లో నివాసముంటున్నాడు. సోమవారం ఉదయం 10.30 గంటలకు జిమ్‌కు వెళ్లి తిరిగి హాస్టల్‌కు వస్తుండగా దారిలో తెరిచి ఉంచిన నీళ్ల సంపులో ప్రమాదవశాత్తు అక్మల్ పడిపోయాడు. తీవ్రగాయాలు కావడం, నీటిలో పడడంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న రాయదుర్గం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. హాస్టల్ మేనేజర్ కె. మధుసూదన్‌రెడ్డి నిర్లక్ష్యంతో వ్యవహరించినందునే ఘటన చోటుచేసుకుందని, అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Continuation of video… pic.twitter.com/w6CNRNIQMx — Sudhakar Udumula (@sudhakarudumula) April 22, 2024 -
బాలికలు, మహిళలను వేధించే వారిని వదలం
మధురవాడ(భీమిలి): బాలికలు, మహిళలను ఇబ్బందులకు గురిచేసినా, వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించినా అలాంటి వారిని వదిలే ప్రసక్తే లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి హెచ్చరించారు. విశాఖ కొమ్మాది చైతన్య కళాశాలలో ఫ్యాకల్టీ లైంగిక వేధింపులకు విద్యార్థిని రూపశ్రీ మృతి చెందిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో విచారణ కమిటీ సభ్యులు, ఏపీ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావుతో కలిసి బుధవారం ఆమె కళాశాలను సందర్శించారు. తరగతి గదులు, ల్యాబ్‌లు, హాస్టల్ భవనం, పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. తర్వాత అక్కడి ఇంజనీరింగ్, డిప్లమా ఫ్యాకల్టీ, సిబ్బందితో వేర్వేరుగా సమావేశమయ్యారు. మీ పిల్లలు ఈ పరిస్థితిలో ఉంటే ఇలానే వదిలేస్తారా? ఇక్కడ ల్యాబ్‌లో ఓ వ్యక్తి ఆడబిడ్డల పట్ల అంత దారుణంగా వ్యవహరిస్తున్నాడంటే వాడు మనిషా, పశువా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాల గుర్తింపు రద్దుకు సిఫార్సు అనంతరం వెంకటలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ పిల్లలను తీర్చిదిద్దాల్సిన ఫ్యాకల్టీయే విద్యార్థులతో సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరించడం దారుణమన్నారు. విద్యా సంస్థకు ఉండాల్సిన కనీస నిబంధనలను ఈ కళాశాల పాటించడం లేదని తెలిపారు. చాలా చోట్ల సీసీ కెమెరాల్లేవని, ల్యాబ్‌లో మానిటరింగ్ సిస్టమ్ లేదన్నారు. ఉమెన్ ప్రొటెక్షన్ సెల్, రికార్డులు, ఐసీసీ కమిటీలు, యాంటీ ర్యాగింగ్ సిస్టం.. కనీసం కంప్లయింట్ బాక్స్ కూడా లేదన్నారు. కళాశాల గుర్తింపు రద్దుకు సిఫార్సు చేస్తున్నామన్నారు. హాస్టల్లో విద్యార్థులకు కల్పించే వసతులు, భోజనం వంటి విషయాల్లోనూ వివక్ష ఉందని, ప్రభుత్వం నుంచి ఫీజు వచ్చేవారికి నాణ్యమైన భోజనం లేదని, కనీసం మంచాలు కూడా లేవన్నారు. ప్రైవేటు ఫీజులు చెల్లించే వారికి అన్ని సౌకర్యాలూ కల్పించారని చెప్పారు. ఈ కేసులో ఇప్పటికే ఐదుగురు అరెస్ట్ అయ్యారని, ఇంకా విచారణ కొనసాగుతోందన్నారు. కాగా, రూపశ్రీ మృతిపై వెంకటలక్ష్మి పలు అనుమానాలు వ్యక్తం చేశారు. నాలుగో అంతస్తుపై నుంచి పడి మృతి చెందిన బాలిక శరీరంపై ఏ రకమైన దెబ్బలూ లేకపోవడం, ఒక బాలిక ఉదయం నుంచి రాత్రి వరకు కనిపించకున్నా పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం వంటి ప్రశ్నలు ఎన్నో ఉన్నాయన్నారు. అనంతరం ఆందోళన శిబిరంలో ఉన్న రూపశ్రీ తల్లిదండ్రులను పరామర్శించి.. న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కమిషన్ సభ్యురాలు గెడ్డం ఉమ, ఏపీఎస్‌సీపీసీ డైరెక్టర్ టి.ఆదిలక్ష్మి, మహిళా కమిషన్ డైరెక్టర్ ఆర్.సుజి, ఏయూ లా కాలేజి ప్రొఫెసర్ విజయలక్ష్మి, మహిళా కమిషన్ లీగల్ కౌన్సిలర్ పూజితయాదవ్ తదితరులు పాల్గొన్నారు. పూర్తి నివేదిక ఇవ్వండిసీఎస్, డీజీపీలకు ఎన్హెచ్ఆర్సీ ఆదేశం సాక్షి, న్యూఢిల్లీ: ఫ్యాకల్టీయే లైంగికంగా వేధిస్తే ఇంకెవరికి చెప్పను నాన్న.. అంటూ తండ్రికి మెసేజ్ చేసి ఆత్మహత్యకు పాల్పడిన బాలిక ఘటనపై నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) స్పందించింది. బాలిక ఆత్మహత్య ఘటనపై పూర్తి నివేదికను అందించాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు నోటీసులిచి్చంది. మార్చి 28న విశాఖపట్నం కొమ్మాదిలోని ‘చైతన్య ఇంజనీరింగ్’ కళాశాలలో డిపొ్లమా మొదటి సంవత్సరం చదువుతున్న రూపశ్రీ(16) లైంగిక వేధింపుల కారణంగా హాస్టల్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. తన ఫ్యాకల్టీయే లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు, ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బెదిరిస్తున్నాడని తండ్రికి మెసేజ్‌లో తెలిపింది. ఈ ఘటనపై వార్తా పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా ఎన్హెచ్ఆర్సీ సుమోటాగా కేసు నమోదు చేసింది. నాలుగు వారాల్లో బాలిక ఆత్మహత్యకు గల కారణాలతో తమకు నివేదిక అందించాలంటూ సీఎస్, డీజీపీలను ఎన్హెచ్ఆర్సీ ఆదేశించింది. నివేదికతో పాటు రాష్ట్ర పోలీసు శాఖ జరిపిన ఇన్వెస్టిగేషన్‌ను కూడా తెలపాలంటూ సూచించింది. కాగా, బాలిక ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనను పరిశీలిస్తే కొమ్మాదిలోని “చైతన్య ఇంజనీరింగ్’ కళాశాల యాజమాన్యమే కారణం అనే విషయం తెలుస్తోందంటూ ఎన్హెచ్ఆర్సీ పేర్కొంది. కాలేజీలో ఇంకెంతమంది విద్యార్థినిలు ఫ్యాకల్టీల లైంగిక వేధింపులకు గురవుతున్నారనే విషయాన్ని రాష్ట్ర పోలీసు శాఖ క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని సూచనలు చేసింది. విద్యార్థినులను వేధిస్తున్న వారిపై కేసులను సైతం నమోదు చేయాలని ఎన్హెచ్ఆర్సీ పేర్కొంది. -
కలుషిత ఆహారం.. 200 మంది విద్యార్థులు అనారోగ్యంపాలు!
ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో గల ఒక హాస్టల్లో కలుషిత ఆహారం తిన్న సుమారు 200 మంది విద్యార్థులు అనారోగ్యం పాలయ్యారు. వీరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వీరికి వైద్యులు చికిత్సనందిస్తున్నారు. ఫుడ్ పాయిజన్ కావడంతో విద్యార్థులంతా అస్వస్థతకు గురయ్యారని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఈ ఉదంతంపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆర్యన్ రెసిడెన్సీ అండ్ లాయిడ్స్ హాస్టల్ విద్యార్థులు కలుషిత ఆహారం తిన్న కారణంగా అనారోగ్యం పాలయ్యారని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. కాగా హాస్టల్లో తమకు నాసిరకం భోజనం పెడుతున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. హాస్టల్ నిర్వాహకునిపై బాధిత విద్యార్థులు పోలీసుల ఎదుట తీవ్ర ఆరోపణలు చేశారు. మార్చి 8వ తేదీ సాయంత్రం హాస్టల్లో ఆహారం తిన్న విద్యార్థులు అనారోగ్యం పాలయ్యారని నాలెడ్జ్ పార్క్ పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందగానే బాధిత విద్యార్థులందరినీ సమీపంలోని ఆసుపత్రిలో చేర్చామని పోలీసులు వివరించారు. ప్రస్తుతం విద్యార్థులంతా ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఈ వ్యవహారంపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ కేసులో ఇంతవరకూ ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు. -
హాస్టల్ పిల్లల చేత వంట పనులు...ప్రిన్సిపాల్ పై మండిపడుతున్న తల్లిదండ్రులు
-
నారాయణ ఉమెన్స్ కాలేజీ హాస్టల్ లో ఫుడ్ పాయిజన్
-
విద్యార్థుల క్షేమమే లక్ష్యంగా మరిన్ని చర్యలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థుల క్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టింది. ఇప్పటికే గుర్తించిన 15 రకాల ప్రమాదాలను నివారించేందుకు మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్రంలోని 3,783 హాస్టళ్లు, రెసిడెన్షియల్ హాస్టళ్లలో తీసుకోవాల్సిన పటిష్ట చర్యలపై అధికారులకు ప్రభుత్వం దిశానిర్దేశం చేసింది. హాస్టళ్లలో ఐదు ప్రధాన అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ సమగ్ర ప్రామాణిక కార్యాచరణ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఈబీసీ, వికలాంగుల, జువైనల్ సంక్షేమ శాఖలకు చెందిన వసతి గృహాలు, గురుకుల విద్యాలయాల్లో చదివే విద్యార్థుల భద్రత, విద్య, ఆహారం, ఆరోగ్యం, సౌకర్యాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లలో అనేక ముందు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో అవాంఛనీయ ఘటనలు జరిగే అవకాశం ఉంది. వాటిలో పాము కాటు, కుక్క కాటు, తేలు కుట్టడం, కరెంట్ షాక్, ఎత్తయిన ప్రదేశం నుంచి పడిపోవడం, గాయపడటం, ఆత్మహత్య, ఆత్మహత్యాయత్నం, అనారోగ్యం, కలుíÙత ఆహారం, ఈవ్ టీజింగ్ తదితరాలపై అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించింది. యంత్రాంగం తక్షణమే స్పందించడం వల్ల ప్రమాద తీవ్రతను, నష్టాన్ని తగ్గించవచ్చని పేర్కొంది. ఏదైనా ఘటన జరిగితే వెంటనే హాస్టల్ బాధ్యులు సంబంధిత అధికారులకు సమాచారం తెలియజేసి.. ఉపశమన చర్యలు చేపట్టాలని సూచించింది. హాస్టళ్లలో వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచడంతో పాటు అవసరమైతే మెరుగైన వైద్యం కోసం విద్యార్థులను ఆస్పత్రులకు తరలించాలని స్పష్టం చేసింది. ఏదైనా హాస్టల్లో ఘటన జరిగితే.. 5 నిమిషాల్లోనే సంబంధిత హాస్టల్ బాధ్యులు స్పందించి అక్కడికి చేరుకోవాలని సూచించింది. పది నిమిషాల్లో ఉన్నతాధికారులకు.. 15 నిమిషాల్లో కలెక్టర్‌కు.. అరగంటలోగా పిల్లల తల్లిదండ్రులకు సమాచారమివ్వాలని స్పష్టం చేసింది. ఘటన తీవ్రత ఆధారంగా హాస్టల్ నిర్వాహకులతో పాటు డివిజనల్, జిల్లా స్థాయి అధికారులు వీలైనంత త్వరగా అక్కడికి చేరుకుని అవసరమైన చర్యలు తీసుకోవాలి. ఘటన జరిగిన 24 గంటల్లో విచారణ చేసి ప్రాథమిక నివేదికను అందించాల్సి ఉంటుంది. 48 గంటల్లోగా జిల్లా స్థాయి అధికారి ఘటనాస్థలిని సందర్శించి ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. -
చదువు మాని.. చపాతీల తయారీ.. గురుకులంలో విద్యార్థుల వంటావార్పు
చేర్యాల(సిద్దిపేట): వసతి గృహంలో హాయిగా చదువుకోవలసిన విద్యార్థులు వంట పనివారిగా మారి చపాతీలు తయారు చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాలలోని గురుకుల పాఠశాలలో ఆదివారం జరిగిన ఈ సంఘటన వివరాలివి. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఆదివారం ఉదయం అల్పాహారంలో చపాతీలు అందించాల్సి ఉంటుంది. కానీ వాటి తయారీకి సరిపడా మనుషులు లేకపోవడంతో విద్యార్థులతో చేయించారు. ప్రిన్సిపాల్ సహకారంతోనే కాంట్రాక్టర్ ఇలా పనులు చేయిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని గురుకుల ప్రిన్సిపాల్ అశోక్‌బాబు వద్ద ప్రస్తావించగా.. తమకు ఉన్నతాధికారుల నుంచి అనుమతి ఉందని స్పష్టం చేశారు. అందువల్లే విద్యార్థులతో వంట పని చేయిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. -
‘గాంధీ’లో ర్యాగింగ్‌కు పాల్పడిన 10 మందిఎంబీబీఎస్ విద్యార్థులపై వేటు
సాక్షి, హైదరాబాద్/గాంధీ ఆస్పత్రి: ర్యాగింగ్‌కు పాల్పడిన వైద్య విద్యార్థులపై వేటు పడింది. హైదరాబాద్ గాంధీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫస్టియర్ చదువుతున్న విద్యార్థులను ర్యాగింగ్ చేశారని తేలడంతో 10 మంది సీనియర్ విద్యార్థులను ఏడాదిపాటు కాలేజీ నుంచి సస్పెండ్ చేశారు. వారిని హాస్టల్ నుంచి కూడా తొలగించారు. ఈ మేరకు వైద్య విద్యా సంచాలకుడు (డీఎంఈ) డాక్టర్ రమేశ్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో ఆ వివరాలు వెల్లడించారు. ఇటీవల కొత్తగా ఎంబీబీఎస్‌లో చేరిన విద్యార్థులను రెండు, మూడో ఏడాది చదివే కొందరు ఎంబీబీఎస్ విద్యార్థులు ర్యాగింగ్ చేసినట్టు నిర్ధారణ అయ్యింది. యూజీసీ ఆధ్వర్యంలోని యాంటీ ర్యాగింగ్ సెల్‌కు కూడా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో యూజీసీ నుంచి కూడా ర్యాగింగ్‌కు పాల్పడుతున్న విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్రానికి ఆదేశాలు వచ్చాయి. మరోవైపు స్థానిక పోలీసులూ సమాచారం అందించారు. దీంతో తక్షణమే ర్యాగింగ్‌కు పాల్పడిన 10 మంది విద్యార్థులను సస్పెండ్ చేశారు. దీంతో వారు ఏడాదిపాటు కోర్సుకు దూరం కావాల్సి ఉంటుంది. ర్యాగింగ్‌కు పాల్పడొద్దని అన్ని తరగతుల విద్యార్థులను పిలిపించి కౌన్సెలింగ్ చేశారు. చర్యలు తీసుకుంటే భవిష్యత్ పోతుందని కూడా హెచ్చరించారు. అయినా కొందరు సీనియర్లు కొత్తగా చేరిన ఎంబీబీఎస్ విద్యార్థులను అర్ధరాత్రి రెండు గంటలకు తమ గదులకు పిలిపించి మానసికంగా వేధించడం, బూతులు తిట్టడంతోపాటు డ్యాన్స్‌లు చేయించారు. భౌతికంగా దాడులు జరిగాయా లేదా అన్నదానిపై స్పష్టత లేదని సమాచారం. దీంతో యాంటీ ర్యాగింగ్ కమిటీ ఈ సంఘటనపై విచారణ జరిపి 10 మంది సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడినట్టు గుర్తించింది. వారి సస్పెండ్ కాలం పూర్తయిన తర్వాత వచ్చే ఏడాది మళ్లీ కాలేజీలో చేరినా, హాస్టల్ వసతి మాత్రం కల్పించబోమని డీఎంఈ స్పష్టం చేశారు. ర్యాగింగ్‌కు పాల్పడితే కాలేజీ నుంచి తీసేయాలన్న నిబంధనలు ఉన్నాయని, కానీ తాము వారి భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని ఏడాదిపాటు సస్పెండ్ వరకే పరిమితమయ్యామని వెల్లడించారు. ఇంకా ఎవరైనా ర్యాగింగ్‌కు పాల్పడితే ర్యాగింగ్ నిరోధక నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని వివిధ మెడికల్ కాలేజీల్లోని విద్యార్థులందరినీ ఆయన హెచ్చరించారు. -
100 మందితో గర్ల్స్ హాస్టల్.. రాత్రుళ్లు 89 మంది మిస్సింగ్..
లక్నో: 100 మంది ఉన్నట్లు రిజస్టర్ చేసిన బాలికల రెసిడెన్షియల్ హాస్టల్లో రాత్రిళ్లు 89 మంది మిస్ అయ్యారు. ఈ మేరకు రాత్రిపూట అధికారులు తనిఖీలకు వెళ్లగా.. విషయం వెలుగులోకి వచ్చింది. తప్పిపోయిన బాలికలపై ప్రశ్నించగా.. హాస్టల్ వార్డెన్ సరైన సమాధానం ఇవ్వలేదు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జిల్లాలోని పరాస్‌పూర్ ప్రాంతంలో ఉన్న కస్తూర్భా గాంధీ రెసిడెన్షియల్ గర్ల్స్ పాఠశాలలో జిల్లా మెజిస్ట్రేట్ నేహా శర్మా సోమవారం రాత్రి తనిఖీలు చేశారు. రిజిస్టర్లో 100 మంది పేర్లు నమోదు చేయగా.. కేవలం 11 మంది మాత్రమే హాస్టల్లో ఉన్నారు. హాస్టల్ వార్డెన్ సరితా సింగ్ సరైన సమాధానం ఇవ్వేలేకపోయారు. దీంతో దర్యాప్తుకు అధికారులను ఆదేశించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లా బేసిక్ శిక్షా అధికారి ప్రేమ్ చంద్ యాదవ్ ఈ వ్యవహారంపై స్పందించారు. జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఈ కేసులో ఓ టీచర్, హాస్టల్ వార్డెన్, వాచ్మెన్, ఓ జవాన్ పేర్లను నమోదు చేశారు. డిపార్టెమెంట్ కూడా సదరు వ్యవహారంపై చర్యలు తీసుకుంటోందని ప్రేమ్ చంద్ యాదవ్ తెలిపారు. ఇదీ చదవండి: Onion Price Hike: ఉల్లి ధర పెరుగుదల.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు.. -
విద్యార్థుల మధ్య గొడవ.. హాస్టల్ గదిలో మారణాయుధాలు..
లక్నో: చదువుకోవాల్సిన విద్యార్థుల హాస్టళ్లలో మారణాయుధాలు లభించాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ జిల్లాలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం హాస్టల్లో రెండు పిస్టళ్లు, 30 వరకు బాంబులు లభించాయని తెలిపారు. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. హాస్టల్లో ఇద్దరు విద్యార్థుల మధ్య గొడవ జరిగింది. అదీ కాస్త తీవ్రస్థాయికి చేరడంతో పోలీసులు చొరవ తీసుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో హాస్టల్లో తనిఖీలు చేయగా.. 2 పిస్టళ్లు, 30 బాంబులు లభించాయని పోలీసులు తెలిపారు. అయితే.. ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల ఉమేశ్ పాల్ హత్య జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బీఎస్పీ నాయకుడు రాజు పాల్‌ను కూడా దుండగులు జరిపిన కాల్పుల్లో మృతి చెందారు. ఈ రెండు కేసుల్లో నిందితులు ఈ హాస్టల్లోనే తలదాచుకోగా.. పోలీసులు అరెస్టు చేశారు. ఇదీ చదవండి: చైనీయుడనుకుని సిక్కిం వాసిపై దాడి -
పాడైనయి పెడ్తున్నరట ఇడ్లీలు...కోపంతోని రోడ్డెక్కిండ్రు విద్యార్థులు
-
ట్రంకుపెట్టె పిల్లలు
‘ఒరే మోహన్ గా! మన అమ్మలకి మనం పుట్టుండంరా! నిజంగా మనల్ని కనే ఉంటే మనల్ని రోజూ కళ్లెదురుగా సూసుకోకుండా ఉండగలుగుతారా! మనల్నిలాగా ఈ నరకంలో వదిలేసి ఎళ్లిపోగలుగుతారా?’... ఆరు నుంచి పది వరకు హాస్టల్లో ఉండే ప్రతి పిల్లాడు ఇలా ఎప్పుడో ఒకప్పుడు అనుకోకుండా ఉండడు. ఎదిగీ ఎదగని వయసులో హాస్టల్లో ఏదెలా ఉన్నా అక్కడ పూడ్చలేని వెలితి– తల్లితండ్రులు లేకపోవడం. అమ్మ గోరుముద్దలు, నాన్న ప్రేమపూర్వక గదమాయింపులు, శుభ్రమైన పక్కబట్టలు, రేడియో పాట, సయించే భోజనం, అన్నింటికి మించి భద్రమైన ఇంట్లో ఒళ్లెరుగకపోయే నిద్ర. ఇవేవీ హాస్టల్లో ఉండవు! పిల్లలు చదువుకోవడానికే పుట్టి ఉండవచ్చు. చదువుకోవడానికి మాత్రమే పుట్టలేదు. కాని చదువుకుంటే తప్ప పుట్టగతులు ఉండవు. తొమ్మిది నెలల తర్వాతే పిల్లలందరూ భూమ్మీద పడ్డా ఆ భూమిని బట్టి వారి అదృష్టం ఆధారపడి ఉంటుంది. అగ్రహారం అయితే ఒకలాగా, రెడ్ల ఇలాకా అయితే ఒకలాగా, కామందుల వీధైతే ఒకటి, శెట్టిగారి బజారైతే ఒకటి. ఇవి గాకుండా వేరే వీధులు, వెలివాడలు ఉంటాయి. ఆ భూమ్మీద పుట్టిన పిల్లలు తిండికి, చదువుకు గతి లేకపోతే ఇదిగో ఇలా ప్రభుత్వ హాస్టళ్లలో ఉండి చదువుకోవాలి. అమ్మను తిట్టుకోవాలి. ఆక్రోశించాలి. హాస్టల్లో ఉన్న కన్నబిడ్డను ఆదివారం వచ్చి చూసుకునే వీలు తల్లికి ఉంటుంది. అదీ ఇదీ వండుకొని, బిడ్డ కడుపుకు ఇంత తినిపించుకుని, తల దువ్వి, పేన్లు చూసి, ఒళ్లో పరుండబెట్టుకుని కబుర్లు చెప్పి, వదల్లేక వదల్లేక ఆ తల్లి పోతూ ఉంటే అప్పటికే ఔట్బెల్లు టైమైపోయిందని తల్లి కళ్ల ముందే కన్నకొడుకును నాలుగు పీకుతాడు హాస్టల్ బాధ్యుడు. అప్పుడు తల్లేమైనా భద్రకాళి అవుతుందా? నా కొడుకును ఈ బందీఖానాలో ఉంచను అని తీసుకెళ్లి పోతుందా? ‘మీరు కొట్టి సంపేత్తాకి కనలేదు సారు మేము బిడ్డల్ని. మా గచ్చంతరం బాగోక ఇక్కడొదిలేసాం’ అంటా నడుసుకుంటా ఎలిపోతుంది. ‘ప్రపంచం మొత్తాన్ని తెచ్చి క్లాస్‌రూమ్‌లో కుదించలేము. క్లాస్రూమ్నే ప్రపంచంలోకి తీసు కెళ్లాలి’ అని 1912లో జర్మనీలో మొదటి హాస్టల్‌ను మొదలెట్టాడు రిచర్డ్ షిర్మన్ అనే స్కూల్ టీచరు. విహారాలకు వెళ్లే పిల్లలు తక్కువ ఖర్చులో బస చేయడానికి వీలుండటం లేదని తన స్కూల్లోనే తొలి హాస్టల్ కట్టాడు. అతని వల్ల ప్రపంచమంతా యూత్ హాస్టల్సు, దరిమిలా రెసిడెన్షియల్ స్కూల్స్ వచ్చాయి. విషాదమేమంటే ఏ ఉద్దేశంతో రిచర్డ్ షిర్మన్ హాస్టల్స్ మొదలెట్టాడో దానికి పూర్తి విరుద్ధంగా ఏ విహారమూ లేని బందీఖానాలుగా అవి మారాయి. ‘అందరికన్నా ముందు పరిగెత్తి కంచం పట్టుకుని లైన్లో నిలబడ్డా. అన్నం డేక్షాలొచ్చేసున్నాయ్. పొప్పుది, సాంబారుది, మజ్జిగిది గిన్నిలొత్తే వడ్డన మొదలెట్టేత్తారు. అన్నం డేక్షా మీద మూత లేదేమో ఈగలన్నీ ఆల్నియ్. అన్నియ్యా ఈగలోల్తనాయ్ అని పిలిత్తే ఆ ఈగల్ని తోలకుండానే దాని మీద మూత పడేసాడు వర్కరు. పారిపోయే దారిలేక ఆ ఈగలందులోనే సచ్చి అన్నంలో కలిసి పోనియ్. కంచంలో ఏత్తే హస్తానికో ఈగ పడింది నా కంచంలో’.... పాత భవనాలు, పెచ్చులూడిపోయే సీలింగులు, ఊరికి దూరంగా మనిషి అలికిడి లేని బీడు పరిసరాలు, సరిపోని నీళ్లు, కడుపులో దేవే పాయిఖానాలు, అపరిశుభ్ర ఆహారం, దుప్పట్లు ఇవ్వని చలికాలం, తప్పని తీట.. తామర, చీటికి మాటికి ఘోరంగా చావగొట్టే సిబ్బంది, ముళ్లతీగల ఫెన్సింగ్.... ఇవీ కొన్ని చోట్ల సంక్షేమ హాస్టళ్లు. తెలుగు సాహిత్యంలో హాస్టల్ లైఫ్ చెదురు మదురుగా కనిపిస్తుంది. నవీన్ ‘అంపశయ్య’, కేశవ రెడ్డి ‘సిటీ బ్యూటిఫుల్’, కొమ్మూరి వేణుగోపాలరావు ‘హౌస్ సర్జన్’, వడ్డెర చండీదాస్ ‘అనుక్షణికం’ హాస్టల్ జీవితాన్ని కొద్దో గొప్పో చూపుతాయి. అయితే అవన్నీ పోస్ట్ మెట్రిక్ విద్యార్థుల జీవితాలు. కాని రచయిత మోహన్ తలారి ‘హాస్టల్ లైఫ్’ కథలు ప్రీ మెట్రిక్ విద్యార్థుల భౌతిక మనోలోకాల్లో హాస్టల్ రేపగల కల్లోలాన్ని గట్టిగా పట్టి ఇస్తాయి. ఇరవై ఏళ్ల క్రితం తాడేపల్లిగూడెం సమీపంలోని ఆరుగొలను గురుకుల పాఠశాలలో తాను గడిపిన హాస్టల్ జీవితపు పచ్చి జ్ఞాపకాల ధార ఈ కథలు. కర్కశపు చారలు ఈ కథలు. ఇరవై ఏళ్ల తర్వాత, నేడు, ఇరు రాష్ట్రాల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, గురుకుల పాఠశాలల, హాస్టళ్ల అధికారులు ఈ పుస్తకాన్ని ఒక కొలతగా గనక తీసు కుంటే, అప్పటికీ ఇప్పటికీ ఏం మారిందో, ఎంత మారిందో చూసుకుంటే చేయవలసిన పని తెలు స్తుంది. చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే లక్షలాది నిరుపేద బాలల పెదాలపై చిర్నవ్వు మొలుస్తుంది. నిజానికి ఇంటర్, కాలేజీ హాస్టళ్ల విద్యార్థులకు అంతో ఇంతో ఎరుక, ఎదురీదే సామర్థ్యం ఉంటాయి. కాని 15 లోపు పసివయసు విద్యార్థులు ఉండే, తల్లితండ్రులను వదలి ఉండే, పేదరికం కారణంగానో నిస్సహాయ పరిస్థితుల వల్లనో హాస్టళ్లల్లో ఉండి చదువుకోక తప్పని వర్గాల పిల్లలుండే హాస్టళ్లు ఎంతో ఆదరణీయంగా ఉండాలి. ఆత్మీయంగా ఉండాలి. అక్కున జేర్చుకునేలా ఉండాలి. అలా ఉన్నదా? నీ పిల్లలు ఉండే చోటు ఎలా ఉండాలనుకుంటావో... ఆ పిల్లలు ఉండే చోటు అలా ఉండాలనుకుంటున్నావా? ‘అంకుల్ టామ్స్ కేబిన్ ’ అనే ఒక్క పుస్తకం నల్ల బానిసల జీవితాల్లో సమూలంగా మార్పు తెచ్చింది. మన దేశంలో ఎన్ని పుస్తకాలు వస్తే సంక్షేమ హాస్టళ్లలో చదువుకునే – దేవునితో తప్ప మరెవరితోనూ మొత్తుకునే వీలులేని– ట్రంకుపెట్టె పిల్లల జీవితాలు మారతాయి? -
డిప్యూటీ కలెక్టర్ వికృత చేష్టలు.. ఆకస్మిక తనిఖీల పేరుతో.. బాలికల గదిలోకి వెళ్లి.. మంచంపై
భోపాల్: ఆకస్మిక తనిఖీల పేరుతో సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ హోదాలో ఉన్న ఓ ప్రభుత్వ అధికారి వసతిగృహ బాలికలతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఝాబువా జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్డీఎం సునీల్ కుమార్ ఝా ఆదివారం బాలికల ఆశ్రమం ఝబువా హాస్టల్‌కు ఆకస్మిక తనిఖీ కోసం వెళ్లారు. అక్కడికి వెళ్లగానే హాస్టల్ సూపరింటెండెంట్ని గది బయటే ఉండమని.. బాలికలతో తాను ఒంటరిగా మాట్లాడాలని తెలిపారు. తనీఖీలో భాగంగా అనుకున్న ఆ సూపరింటెండెంట్ కూడా సరే అని రూం బయటే ఉండిపోయాడు. బాలికల గదిలోకి వెళ్లగానే.. ఆ అధికారి ముందుగా అల్పాహారం, మధ్యాహ్న భోజనం గురించి పలు ప్రశ్నలు అడిగారు. తర్వాత బాలికల మంచంపైన కూర్చొని వారిపై చేతులు వేయడం, కౌగిలించుకోవడం వంటి వెకిలి చేష్టలు చేయడం ప్రారంభించాడు. అంతటితో ఆగకుండా బాలికలు ఇబ్బందిపడేలా వారి వ్యక్తిగత విషయాలను కూడా అడిగాడు. 11 నుంచి 13 ఏళ్ల వయసున్న విద్యార్థినులతో అతను దారుణంగా ప్రవర్తించాడు. దీంతో విద్యార్థినులు సూపరింటెండెంట్‌తో కలిసి సోమవారం పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు. మరోవైపు, బాలికల ఫిర్యాదుని నమోదు చేసుకున్న పోలీసులు ఆ అధికారిపై కేసు నమోదు చేశారు. అదే సమయంలో ఈ విషయం వెలుగులోకి రావడంతో, జిల్లా కలెక్టర్ నివేదిక ఆధారంగా నిందితుడిని విధుల నుంచి కూడా సస్పెండ్ చేశారు. పోలీసులు సునీల్ యాదవ్ ఝాను పోక్సో కోర్టు ప్రత్యేక జడ్జి ఎదుట హాజరుపరచి, జుడిషియల్ కస్టడీకి తరలించారు. చదవండి: ‘ఏమండీ వంటగదిలో డబ్బులు పెట్టాను. తీసుకోండి.. మీరు, పిల్లలు జాగ్రత్త’.. అంటూ -
ఇదేం వికృతానందం.. పీజీలోకి వెళ్లి యువతులు స్నానం చేస్తుండగా..
కృష్ణరాజపురం(బెంగళూరు): పీజీలో ఉంటున్న యువతులను ఫొటోలు తీస్తూ వికృతానందం చెందుతున్న చిక్కబళ్లాపురకు చెందిన ఆశోక్ అనే కామాంధుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మహాదేవపురలోని హోడిలో లేడీస్ హాస్ట్ల్స్ ఉన్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థినులు అందులో ఉంటున్నారు. నిందితుడు తన సమీపంలోని పీజీల్లోకి చొరబడి యువతులు స్నానాల చేస్తుండగా రహస్యంగా ఆ దృశ్యాలను వీడియో తీసేవాడు. ఇటీవల ఓ పీజీలో రహస్యంగా వీడియో తీస్తుండగా దీనిని గమనించిన ఓ యువతి చుట్టు పక్కన ఉండే వారిని అప్రమత్తం చేయడంతో యువకుడ్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతని ఫోన్‌ను పరిశీలించగా యువతులు స్నానాలు చేసే దృశ్యాలు కనిపించాయి. దీంతో నిందితుడిని అరెస్ట్ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అరెస్టు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. చదవండి: ఐదేళ్లకే నూరేళ్లూ నిండాయా కన్నా! -
హాస్టల్లో అర్ధరాత్రి ఘోర అగ్నిప్రమాదం.. 10 మంది దుర్మరణం!
ఓ నాలుగు అంతస్తుల హాస్టల్లో అర్ధరాత్రి దాటిన తర్వాత భారీ అగ్నిప్రమాదం సంభవించింది. క్షణాల్లో మంటలు భవనమంతా వ్యాపించి భయానక పరిస్థితి నెలకొంది. న్యూజిలాండ్ వెల్లింగ్టన్లో మంగళవారం రాత్రి 12:30 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో 10 మంది మరణించినట్లు తెలుస్తోంది. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. హాస్టల్లో మొత్తం 92 మంది ఉన్నట్లు సమాచారం. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే భయంతో వీరంతా బయటకు పరుగులు తీశారు. ఇప్పటివరకు 52 మందిని సురక్షితంగా కాపాడినట్లు అధికారులు తెలిపారు. ఇంకా 20 మంది ఆచూకీ తెలియాల్సి ఉందన్నారు. (SENSITIVE) At least 6 people have died, and 20 others are injured in Wellington, NZ, after a fire broke out in a hostel. #nz #newzealand #wellington #hostel #fire #fires #hostelfire #loaferslodge #hostels #nzpol #chrishipkins #torywhanau pic.twitter.com/j9TxuhyKcs — Empact News (@EmpactNews) May 16, 2023 కాగా.. అగ్నిప్రమాదంలో ఆరుగురు చనిపోయినట్లు అధికారికంగా ప్రకటించారు. కానీ ఈ సంఖ్య 10 దాటి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ పూర్తయ్యాక కచ్చితమైన వివరాలు తెలుస్తాయన్నారు. మరోవైపు అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. దీనిపై దర్యాప్తు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. హాస్టల్లో స్ప్రింక్లర్స్ లేవని పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో జరిగిన అతిపెద్ద అగ్నిప్రమాద ఘటన ఇదే అని ఆందోళన వ్యక్తం చేశారు. చదవండి: గురుద్వారా ఆవరణలో మద్యం తాగిన మహిళ.. కాల్చి చంపిన సేవాదార్.. -
హాస్టల్లో ర్యాగింగ్ భూతం.. జూనియర్‌ను కర్రతో చితకబాదిన టెన్త్ క్లాస్ విద్యార్థి
సాక్షి, మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలోని ఓ ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో జూనియర్ విద్యార్థిని ఓ 10వ తరగతి విద్యార్థి చితకబాదాడు. సోమవారం ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జడ్చర్ల హాస్టల్లో బాధిత బాలుడు 9వ తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో ఓ పదో తరగతి విద్యార్థి తాను చెప్పిందే వినాలని కొంతకాలంగా జూనియర్లను భయపెడుతూ మాటవిననివారిని కొడుతున్నాడు. హోలీ పండగ రోజు అర్ధరాత్రి నిద్రపోతున్న తనతోపాటు మరికొందరు విద్యార్థులను లేపి డాన్స్ చేయమని బెదిరించాడని, చేయకుంటే కొట్టాడని, ఈ విషయం ఎవరికైనా చెబితే నాలుగింతలు దెబ్బలు తింటారని బెదిరించడంతో ఎవరికీ చెప్పుకోలేదని బాధిత విద్యార్థి వాపోయాడు. శనివారం రాత్రి మరోమారు గదికి వచ్చి కర్రతో ఇష్టం వచ్చినట్లు కొట్టాడని, దెబ్బలు తాళలేక ఆదివారం ఉదయం జడ్చర్లలోని తన మేనత్త శాంతమ్మ వద్దకు వెళ్లినట్లు చెప్పాడు. అతడి మేనత్త వార్డెన్‌కు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడంతో సోమవారం ఉదయం హాస్టల్ వద్ద బాధిత విద్యార్థి, బంధువులు ఆందోళనకు దిగారు. ఏఎస్‌డబ్ల్యూవో విజయలక్ష్మి హాస్టల్‌కు వచ్చి విచారణ చేపట్టారు. ఆవేశంలో తప్పు చేశానని, ఇకపై చేయబోనని పదో తరగతి విద్యార్థి లిఖితపూర్వకంగా రాసిచ్చాడు. త్వరలో పరీక్షలు ఉండటంతో అతడిని మందలించి వదిలేసినట్లు తెలుస్తోంది. -
స్నేహితుల కళ్లదుటే ఘోరం.. 6వ అంతస్తు నుంచి పడి యువకుడి మృతి
మరణం ఊహించనిది. చావు ఎప్పుడు ఎటు నుంచి వస్తుందో చెప్పలేం. కళ్ల ముందే సంతోషంగా కనిపించిన వారు ఉన్నట్టుండి ప్రాణాలు విడుస్తున్నారు. తాజాగా అలాంటి షాకింగ్ మృత్యు ఘటన ఒకటి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. రెండు క్షణాల ముందు వరకు స్నేహితులతో ఆనందంగా ముచ్చటించిన ఓ యువకుడు ప్రాణాలు అంతలోనే గాల్లో కలిసిపోయాయి. హాస్టల్ బిల్డింగ్‌లోని ఆరో అంతస్తు నుంచి కింద పడి అనూహ్యంగా మరణించాడు. వివరాలు.. జల్పైగురి జిల్లాలోని ధుప్గురికి చెందిన ఇషాంషు బట్టాచార్య అనే 20 ఏళ్ల యువకుడు నీట్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు. ఈ క్రమంలో గతేడాది ఆగష్టులో కోటాలోని జవహార్ నగర్లో కోచింగ్ తీసుకుంటూ ఓ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నాడు. ఓ రోజు స్నేహితులతో బయటకు వెళ్లి అర్థరాత్రి తన హాస్టల్ తిరుగొచ్చాడు. రూమ్ ముందు ఉన్న బాల్కనీలో స్నేహితులతో కలిసి మాట్లాడుకుంటున్నారు. గదిలోకి వెళ్లే ముందు బాల్కనీలో చెప్పులు పక్కకు పెడుతుండగా బ్యాలెన్స్ కోల్పోవడంతో రెయిలింగ్‌పై పడ్డాడు ఇషాంషు బరువు తట్టుకోలేక అల్యూమినియం రెయిలింగ్ విగిరిపోవడంతో అక్కడి నుంచి కింద అమాంతం పడిపోయాడు. బిల్డింగ్ ఆరో అంతస్తు నుంచి పడిపోవడంతో అక్కడికక్కడే మరణించినట్లు కోటా పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని ఎంబీఎస్ ఆసుపత్రికి తరలించామని.. పోస్టుమార్టం అనంతరం కుటుంబానికి అప్పగించనున్నట్లు వెల్లడించారు. కాగా ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు హాస్టల్లోని సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. కన్నీరు పెట్టించే ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. చదవండి: Wildfires: కార్చిచ్చు బీభత్సం.. వందల ఇళ్లు ధ్వంసం.. 13 మంది మృతి.. Breaking News: Coaching student dies after falling from sixth floor of hostel in Rajasthan's Kota. The net was broken, he fallen out when he was trying to put on his slippers by standing with the support of net. Heart-wrenching !#Rajasthan #Kota pic.twitter.com/nZixPXwNfj — Ashwini Shrivastava (@AshwiniSahaya) February 3, 2023 -
ఆ విద్యార్థులకే నిజాం కాలేజీ కొత్త హాస్టల్: మంత్రి సబితా
సాక్షి, హైదరాబాద్: నిజాం కళాశాలలో నూతనంగా నిర్మించిన హాస్టల్ పూర్తిగా యూజీ విద్యార్థులకే కేటాయిస్తామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. మంగళవారం నాడు తన కార్యాలయంలో ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, నిజాం కళాశాల ప్రిన్సిపాల్, నిజాం కళాశాల విద్యార్థినులతో సమావేశమయ్యారు. నిజాం కళాశాల విద్యార్థినుల సమస్యను మానవతా దృక్పథంతో పరిష్కరించాలని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ సూచన మేరకు ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగిందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మార్గదర్శక నిబంధనలకు అనుగుణంగా వసతి కల్పించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థినులందరూ దరఖాస్తు చేసుకోవాలని మంత్రి సూచించారు. రాష్ట్ర చరిత్రలోనే మొదటి సారిగా నిజాం కళాశాలలో యుజీ విద్యార్థినులకు వసతి సౌకర్యం కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. విద్యార్థినులకు కావాల్సిన ఏర్పాట్లను చేయాలని నిజాం కళాశాల ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు. చదవండి: (అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లపై తేల్చేసిన సీఎం కేసీఆర్) -
వడ్డించేందుకు గరిట లేదని... చిప్పతో చట్నీ పోసెయ్
తుమకూరు: తుమకూరు నగరంలో ఉన్న తుమకూరు విశ్వ విద్యాలయానికి నిధులకు లోటులేదు. ప్రతి ఏటా కేంద్ర, రాష్ట్రాల నుంచి వందల కోట్ల రూపాయలు వస్తుంటాయి. ప్రొఫెసర్లు, అధికారులు అధునాతన వసతులతో తులతూగుతూ ఉంటారు. కానీ వర్సిటీ మెస్‌లలో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు లబోదిబోమంటారు. వర్సిటీ పరిధిలో ఉన్న ఎస్సి, ఎస్టీ హాస్టల్లో విద్యార్థులకు ఆహారం వడ్డించేందుకు కనీసం గరిటెలు కూడా లేని దుస్థితి నెలకొంది. గరిటెతో కాకుండా కొబ్బరి చిప్పతో చట్నీని వడ్డించడమే దీనికి నిదర్శనం. శుక్రవారం రాత్రి విద్యార్థులకు భోజనం వడ్డించేటప్పుడు చిత్రాన్నంలోకి చట్నీ వేయడానికి గరిటె లేకపోయింది. దీంతో ఒక చిప్పతో చట్నీని పోశారు. ఈ వీడియో, ఫోటోలు వైరల్ అయ్యాయి. సౌకర్యాల లేమిపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. (చదవండి: నిరుద్యోగులకు మొండిచెయ్యి) -
డాడీ.. మంచి ఒక ముచ్చట జెప్పవే!
బహుశా.. ఆ పోరడు సంబురంగా ఇంటికి చేరే ఉంటడు. మధ్యల ఆగి షాపుల కొత్త బట్టలు కొనుక్కునే ఉంటడు. ముక్కవాసనొచ్చే దుప్పట్లు, ఇడిసిన బట్టలు ఉతికించుకుని కూడా ఉంటడు. అట్లే.. అమ్మ చేసిన గారెలు, కారప్పుస తింటూ.. సరదాగా దోస్తులతో ఆడుకుంట.. బాంబులు పేల్చుకుంట.. డాడీ చేతిల తన్నులు వడుకుంట ఉండాలనే కోరుకుందం. ఎందుకంటే ఆ పోరడు అవ్వయ్యలను అంతగా ఒర్రిచ్చిండు కావట్టి. పండుగలొస్తే సొంత ఊళ్లకు బయలుదేరే జోష్‌లో మునిగిపోతుంటారు అంతా. కానీ, హాస్టల్ స్టూడెంట్స్‌కు మాత్రం అవి భావోద్వేగాలతో నిండిన క్షణాలనే చెప్పొచ్చు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎప్పుడెప్పుడు వస్తారా? అనే ఎదురుచూపులు వర్ణణాతీతం. అలాంటి పిలగాడి ఆడియో క్లిప్ ఒకటి ‘హాస్టల్ తిప్పలు’ పేరుతో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ‘‘డాడీ.. నాకు మనసొప్పుతదలేదే..’’ అంటూ మొదలుపెట్టిన ఆ చిన్నారి.. తన తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడిన ఆడియో క్లిప్ ఒకటి గత రెండు మూడు రోజులుగా విపరీతంగా వైరల్ అవుతోంది. వాట్సాప్ మొదలు.. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇలా ఎక్కడ చూసినా ఈ క్లిప్ సందడి చేస్తోంది. ‘‘డాడీ.. ఒక మంచి ముచ్చట చెప్పవే.. అన్నీ సర్దుకుని రెడీగా ఉండమంటూ’’ తల్లిదండ్రులు చెప్పాల్సిన మాటలను కూడా తనే చెప్పి.. వాళ్లకు విసుగు తెప్పించాడు ఆ చిన్నారి. అంతేకాదు ఆ తండ్రితో పాటు తల్లి కూడా అతన్ని సముదాయించేందుకు చెప్పిన మాటలు, పదే పదే ఫలానా డేట్‌కు కన్ఫర్మ్ వస్తరు కదా అని అడగడం, గిదే లాస్ట్ అంటూ చివర్లో ఆ చిన్నారి పలికిన పలుకులు నవ్వులు పూయిస్తున్నాయి. అయితే.. అదే సమయంలో ఊపిరి తీయకుండా ఆ చిన్నారి మాట్లాడిన మాటలు, అతనిలోని బాధ-ఆందోళన.. అన్నింటికి మించి సున్నితత్వాన్ని ప్రతిబింబించాయని చాలామంది అభిప్రాయపడుతున్నారు. హాస్టల్లో ఉంటేనే.. అలాంటి కష్టాలు తెలుస్తాయని కామెంట్లు చేస్తున్నారు. దసరా సెలవులంటే.. బహుశా ఇది ఈ మధ్య సంభాషణ అయి ఉండొచ్చు. ఆడియో క్లిప్ ఉద్దేశం ఏదైనా.. వైరల్ మాత్రం విపరీతంగా అయ్యింది. మరి.. అనుకున్నట్లు ఆ తల్లిదండ్రులు ఆ పిలగాడి దగ్గరకు వెళ్లారా? ఇంటికి తీసుకువెళ్లారా? అనే ఆత్రుతతో ప్రశ్నించే వాళ్లే కామెంట్ బాక్స్‌లో ఎక్కువైపోయారు. మొత్తానికి ఆ ఫ్యామిలీ ఎవరో.. ఎక్కడుంటారో!. Video Credits: pranks telugu -
దారుణానికి ఒడిగట్టిన హాస్టల్‌మేట్... ప్రియుడికి స్నేహితుల ప్రైవేటు ఫోటోలు పంపించి.
చెన్నై: పంజాబ్‌లోని చండీఘడ్ యూనివర్సిటీ ఘటన మరువక ముందే..ఇలాంటే ఘటనే మధురైలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...రామ్‌నాథ్‌పురం కాముదికి చెందిన ఆషిక్, జనని ఇద్దరు స్నేహితులు. ఆశిక్ వైద్యుడిగా పనిచేస్తున్నాడు. అతని గర్లఫ్రెండ్ జననీ మధురైలో బీఈడీ స్టూడెంట్. ఆమె వర్కింగ్ విమన్ హాస్టల్లో ఉంటుంది. ఐతే ఆమె తన స్నేహితులకు తెలియకుండా వారు బట్టలు మార్చుకున్నప్పుడూ, స్నానం చేస్తున్నప్పుడూ సీక్రేట్‌గా ఫోటోలు తీసి తన ప్రియుడికి పంపిస్తుండేది. మొదట్లో తన ప్రైవేటు ఫోటోలు పంపించేది, తదనంతరం తన ప్రియుడి ఒత్తిడి మేరకు తన హాస్టల్మేట్స్ అందరివి పంపించడం మొదలు పెట్టింది. అనుకోకుండా ఒకరోజు ఆమె స్నేహితులకు ఆమెపై అనుమానం తలెత్తి... ఆమె ఫోన్ చెక్‌చేయగా అసలు విషయం బయటపడింది. దీంతో వారంతా హాస్టల్ వార్డన్కి అసలు విషయం చెప్పి మధరైలోని అన్నానగర్ పోలీస్‌స్టేషన్ ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసుల విచారణలో.. జననీ, ఆశిక్ అనే వ్యక్తి గర్లఫ్రెండ్ అని, ఆమె తన ప్రియుడి క్లినిక్‌లోనే పనిచేస్తున్నట్లు తేలింది. అంతేగాదు ఆమె తన ప్రైవేట్ వీడియోల తోపాటు తన హాస్టల్మేట్స్ అందరీ వీడియోలు పంపినట్లు వెల్లడైంది. ఐతే సదరు వైద్యుడు ఆశిక్ ఈ ఫోటోలను ఎవరికైనా పంపించాడా అనేది తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు సదరు నిందితులిద్దరి అదుపులోకి తీసుకుని అరెస్టు చేయడమే కాకుండా వారి ఫోనులను కూడా సీజ్ చేసినట్లు తెలిపారు డేటా రికవరీ కోసం ఆ ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ నిందితులిద్దరు మదురై సెంట్రల్ జైల్లోనే ఉన్నట్లు పేర్కొన్నారు. (చదవండి: ఫ్రెండే కదా అని నమ్మారు.. హాస్టల్ యువతుల ప్రైవేటు వీడియోలు తీసి..!) -
వరుస విషాదాలు.. హాస్టళ్లలో దారుణాలు.. అసలు ఏం జరుగుతోంది?
సాక్షి ప్రతినిధి మంచిర్యాల/కాగజ్‌నగర్‌టౌన్: కుమురంభీం జిల్లాలో ఓ విద్యార్థిని జ్వరంతో మంగళవారం రాత్రి చనిపోయింది. కాగజ్‌నగర్ మండలం అంకుశాపూర్‌కు చెందిన శంకర్, నీలాబాయి దంపతుల పెద్ద కూతురు ఐశ్వర్య (14) కాగజ్‌నగర్ కేజీబీవీలో 8వ తరగతి చదువుతోంది. మంగళవారం సాయంత్రం తలనొప్పిగా ఉందని డ్యూటీ టీచర్‌కు చెబితే పెయిన్‌బామ్ రాసుకోమనడంతో, జండూబామ్ రాసుకుని నిద్రపోయిన ఐశ్వర్య ఉదయంఎంతకీ నిద్రలేవలేదు. నోరు, ముక్కు నుంచి నురగలు రావడంతో విద్యార్థులు డ్యూటీ టీచర్‌కు చెప్పారు. చదవండి: ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ.. ఇంతలోనే షాకింగ్ ఘటన సమాచారం అందుకున్న తండ్రి శంకర్ వచ్చి పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఐశ్వర్య మృతిచెందిందని వైద్యులు తెలిపారు. బాలిక మరణవార్త తెలుసుకున్న బంధువులు, గ్రామస్తులు, విద్యార్థి సంఘాలు, అఖిలపక్ష నాయకులు మృతదేహంతో హాస్టల్ ముందు 8గంటలపాటు ధర్నా చేశారు. కొందరు స్కూల్లోకి చొచ్చుకెళ్లి డీఈవో అశోక్ ముందే ఫర్నిచర్ ధ్వంసం చేశారు. డీఎస్పీ కరుణాకర్ ఆందోళనకారులకు నచ్చజెప్పి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. బాలిక మృతికి కారణమైన ఎస్వో స్వప్న, ఏఎన్ఎం భారతి, డ్యూటీ టీచర్ శ్రీలతను సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ రాజేశం తెలిపారు. విద్యార్థిని కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఎక్స్‌గ్రేషియాగా రూ.15లక్షల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడంతోపాటు తక్షణ సాయం కింద రూ.50వేలు నగదు ప్రకటించడంతో బాధితులు ఆందోళన విరమించారు. కాగా, గత 15 రోజుల్లో జిల్లాలోని పలు గురుకులాల్లో చదువుతున్న ఐదుగురు విద్యార్థులు మృతిచెందారు. ఇందులో ఒకరు డిగ్రీ విద్యారి్థని. హాస్టళ్లపై ప్రభుత్వ పర్యవేక్షణ కొరవడటం వల్లే ఘటనలు జరుగుతున్నాయని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. -
ఏం జరిగిందో.. ఏమో.. హాస్టల్లో నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య
తిరువళ్లూరు(తమిళనాడు): ఓ నర్సింగ్ విద్యార్థిని హాస్టల్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా తిరువేర్కాడు సమీపంలోని మాదిరవేడులో మహిళా నర్సింగ్ కళాశాల, దానికి అనుబంధంగా హాస్టల్ కూడా ఉంది. ఇక్కడ ఈరోడ్‌కు చెందిన సుమతి(19) నర్సింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతూ హాస్టల్లో ఉంటోంది. శనివారం మధ్యాహ్నం కళాశాల ముగిసిన తరువాత లంచ్ కోసం విద్యార్థులు హాస్టల్‌కు వచ్చారు. అయితే సుమతి డైనింగ్‌హాల్‌కు వెళ్లకుండా తన రూమ్‌కి వెళ్లినట్లు తెలుస్తోంది. చదవండి: ఒంటరి మహిళలే టార్గెట్.. నమ్మించి నగ్న వీడియోలు తీసి.. తన గది నుంచి చాలా సమయం వరకు బయటకు రాకపోవడంతో సహచర విద్యార్థునులు లోపలికి వెళ్లి చూశారు. అక్కడ సుమతి ఫ్యాన్‌కు ఉరికి వేలాడుతుండడంతో తిరువేర్కాడు పోలీసులకు తెలియజేశారు. పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం చెన్నై కీల్పాక్కం వైద్యశాలకు తరలించారు. కాగా సుమతి ఆత్మహత్య విషయాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు ఈరోడ్ నుంచి నేరుగా హాస్టల్ వద్దకు చేరుకున్నారు. తమ బిడ్డ ఆత్మహత్యకు కళాశాల యాజమాన్యం వేధింపులే కారణమని ఆరోపిస్తూ రాస్తారోకోకు యత్నించారు. అప్రమత్తమైన పోలీసులు వారితో చర్చించారు. మృతిపై అనుమానం ఉంటే తమకు ఫిర్యాదు చేయాలంటూ ఆందోళనను విరమింపజేశారు. సీబీసీఐడీ విచారణ ప్రారంభం నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో తిరువేర్కాడు పోలీసులు కేసు నమోదు చేయగా, సీబీసీఐడీ పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆదివారం హాస్టల్ కళాశాల సిబ్బంది, సహచర విద్యార్థులను ప్రశ్నించారు. విచారణలో సుమతి ఓ యువకుడితో సన్నిహితంగా మెలుగుతున్నట్లు గుర్తించారు. ఈ విషయంపై తల్లిదండ్రులతో సుమతి గొడవపడినట్లు పోలీసులు నిర్ధారించారు. రెండుమూడు రోజుల్లో హాస్టల్ నుంచి తీసుకెళ్లాలని నిర్ణయించిన క్రమంలో విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపింది. ఇదిలా ఇండగా ఇటీవల కల్లకురిచ్చి, కీళచ్చేరి హాస్టల్లో ప్లస్–2 విద్యార్థినుల అనుమానాస్పద మృతి ఘటనలను మరువకముందే నర్సింగ్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడడం కలకలం రేపింది. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
బిర్యానీ ఏదని అడిగాడని..
అచ్చంపేట రూరల్: తన బిర్యానీ ప్యాకెట్ కని పించడం లేదంటూ ఒక విద్యార్థి అడిగినందుకు మరో విద్యార్థి వసతి గృహం టెర్రస్ పైనుంచి కిందికి దూకేయడంతో అతని కాలు విరిగింది. ఈ సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల వసతిగృహంలో ఆదివారం జరిగింది. అమ్రాబాద్ మండలం ఎలమపల్లికి చెందిన రామస్వామి, సువ ర్ణ దంపతుల కుమారుడు చారగొండ రాజేశ్ స్థానిక పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నా డు. ఆదివారం కావడంతో విద్యార్థులను చూ సేందుకు తల్లిదండ్రులు వచ్చారు. చికిత్స పొందుతున్న విద్యార్థి రాజేశ్ అదే తరగ తికి చెందిన అరుణ్ అనే విద్యార్థి తల్లిదండ్రులు బిర్యానీ ప్యాకెట్ తీసుకువచ్చారు. మధ్యాహ్నం అరుణ్ బిర్యానీ తిని మిగిలింది రాత్రికి తినేందుకు బాక్సులో పెట్టుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత వచ్చి చూడగా బిర్యానీ ప్యాకెట్ కనిపించకపోవడంతో తోటి స్నేహితులను అడిగాడు. ఈ క్రమంలో రాజేష్‌ను ప్రశ్నించగా.. అతనేమీ మాట్లాడకుండా వసతిగృహం టెర్రస్‌పైకి ఎక్కి దూకేశాడు. వెంటనే పాఠశాల సిబ్బంది రాజేశ్‌ను అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తర లించారు. ఎడమ కాలు విరిగిందనే అనుమా నంతో మహబూబ్‌నగర్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి రిఫర్ చేశారు. -
హాస్టల్ గోడ దూకి.. 150 సీసీ కెమెరాల కళ్లుగప్పి..
చంద్రగిరి(తిరుపతి జిల్లా): అర్ధరాత్రి హాస్టల్ గోడ దూకి నలుగురు విద్యార్థినులు పారిపోయిన ఘటన చంద్రగిరిలో కలకలకం సృష్టించింది. వెస్ట్ డీఎస్పీ నరసప్ప కథనం మేరకు.. విజయనగరం, విజయవాడ, కడప, విశాఖపట్నం ప్రాంతాలకు చెందిన నలుగురు విద్యార్థినులు చంద్రగిరి మండలం తొండవాడ సమీపంలో కంచి కామకోటి పీఠం ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంప్రదాయ పాఠశాలలో ఉంటూ చంద్రగిరిలోని శ్రీనివాస డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నారు. చదవండి: వివాహేతర సంబంధం.. భర్తను అడ్డు తొలగిస్తే కలసి జీవించవచ్చని.. వీరిలో ఇద్దరు విద్యార్థినులు మైనర్లు. వీరు డిగ్రీ చదువుకుంటూ.. హాస్టల్లో వేదాలు, హిందూ సంప్రదాయాలు నేర్చుకుంటున్నారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఈ నలుగురు అమ్మాయిలు హాస్టల్ వెనుక వైపు నుంచి 8 అడుగుల ఎత్తయిన గోడదూకి పారిపోయారు. హాస్టల్ ఇన్చార్జి లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. విద్యార్థినుల ఆచూకీ గుర్తించేందుకు నాలుగు బృందాలను రంగంలోకి దింపినట్లు డీఎస్పీ తెలిపారు. కాగా, హాస్టల్ నుంచి వెళ్లే మూడు రోజులకు ముందు ఏమి జరిగిందనే కోణంలో పోలీసులు విచారిస్తున్నట్టు తెలిసింది. ఓ బయటి వ్యక్తి సెల్‌ఫోన్ నుంచి విద్యార్థినులు శుక్రవారం సాయంత్రం రెండు సార్లు ఎవరితోనో మాట్లాడినట్లు తెలుస్తోంది. సుమారు 350 మంది ఉన్న హాస్టల్లో 150కి పైగా సీసీ కెమెరాలు, 10 మంది సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. అయినా విద్యార్థినులు పారిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. -
ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య
మేడ్చల్‌రూరల్: ఇంజినీరింగ్ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కండ్లకోయలోని సీఎంఆర్ఐటీ కళాశాలలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే హుస్నాబాద్‌కు చెందిన సాత్విక గౌడ్(19) సీఎంఆర్ఐటీలో బీటెక్ ఈసీఈ రెండో సంవత్సరం చదువుతూ కళాశాల హాస్టల్లో ఉంటోంది. శనివారం రాత్రి డిన్నర్‌కు పిలిచేందుకు స్నేహితురాలు సాత్విక గదికి వెళ్లగా అప్పటికే ఆమె ఏడుస్తూ కూర్చుంది. దీనిపై స్నేహితురాలు ప్రశ్నించగా మిడ్ ఎగ్జామ్స్ ఉన్నా.. ఏమీ చదవలేదని చెప్పింది. అంతేగాక మమ్మీ కూడా సరిగ్గా మాట్లాడడం లేదని తెలిపింది. తాను తర్వాత తింటానని చెప్పడంతో మీ రూమ్మెట్స్ లేరు కదా ఒంటరిగా పడుకోవద్దని తన గదికి రావాలని చెప్పి స్నేహితురాలు వెళ్లిపోయింది. ఆదివారం మధ్యాహ్నం వరకు ఆమె కని పించకపోవడంతో స్నేహితులు ఆమె కోసం గాలించారు. బాత్రూమ్ డోర్ తలుపులు కొట్టగా ఎంతకీ తెరుచుకోవపోవడంతో హాస్టల్ వార్డెన్‌కు సమాచా రం అందించారు. వార్డెన్ సిబ్బంది సాయంతో బాత్రూం తలుపులు పగులగొట్టి చూడగా సాత్విక సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించింది. దీంతో మేడ్చల్ పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. సూసైడ్ నోట్లో తల్లిదండ్రులకు సారీ చెప్పి.. సాత్విక సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడినట్లు స్నేహితులు తెలిపారు. ‘నా జీవితాన్ని విడిచిపెడుతున్నాను.. సారీ మమ్మీడాడీ’ అంటూ సూసైడ్ నోట్ రాసింది. గతంలోనూ తాను సరిగ్గా చదవలేకపోతున్నానని కిటికీలోంచి దూకి చావాలనిపిస్తుందని చెప్పేదని, చదువులో ఇబ్బంది కారణంగానే మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని తెలిపారు. ఈ నెల 15న తన బంధువుల శుభకార్యం ఉండగా పరీక్షలు రాసి ఇంటికి వెళ్లాల్సిన విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడడంతో కుటుంబీకులు కన్నీటి పర్యంతమయ్యారు. ఆదివారం సాయంత్రం కాలేజీ వద్దకు వచ్చిన సాత్విక తల్లిదండ్రులు తాము రాకముందే మృతదేహాన్ని ఎలా మార్చురీకి తరలిస్తారని కళాశాల యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: అల్లుడిపై కోపంతో అతడి స్నేహితుడి బైక్ దహనం) ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
టిఫిన్‌లో కప్ప!
తెయూ (డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ బాలికల హాస్టల్లో బుధవారం ఉదయం అల్పాహారంలో భాగంగా అందించిన వెజ్ రైస్‌లో కప్ప రావడంతో విద్యార్థినులు ఆందో ళనకు గురయ్యారు. అప్పటికే పలువురు విద్యార్థినులు అల్పాహారం తిని తరగతులకు వెళ్లారు. ఈ విషయాన్ని హాస్టల్ చీఫ్ వార్డెన్ అబ్దుల్ ఖవీ, బాలికల హాస్టల్ వార్డెన్ జవేరి యా ఉజ్మా, కేర్‌టేకర్ పీరూబాయిల దృష్టికి తీసుకెళ్లారు. వెజ్‌రైస్‌లో కప్ప వచ్చిన మాట నిజమేనని.. మరోసారి తప్పు జరగకుండా జాగ్రత్త పడతామని కుక్ తెలిపారు. -
ఓయూలో అబ్బాయిల హాస్టల్.. అమ్మాయిలకు!
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో అమ్మాయిలు, అబ్బాయిల హాస్టల్ కేటాయింపుల విషయంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. మంగళవారం వీసీ కార్యాలయంలో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అబ్బాయిల స్పోర్ట్స్ హాస్టల్‌ను అమ్మాయిలకు కేటాయించారు. తమ కోసం స్పోర్ట్స్ నిధులతో నిర్మించిన హాస్టల్‌ను ఖాళీ చేసేదిలేదని వ్యాయామ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు 12 మంది విద్యార్థులను అరెస్టు చేశారు. ఓయూ వీసీని రీకాల్ చేయండి ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ రవీందర్‌ను రీకాల్ చేయాలని బహుజన విద్యార్థి ఫెడరేషన్, ఓయూ విద్యార్థి జేఏసీ నాయకులు మంగళవారం రాష్ట్ర గవర్నర్ తమిళి సైను కోరారు. సంస్కరణల పేరుతో ఇష్టారాజ్యాంగా వ్యవహరిస్తూ విద్యార్థులు, ఉద్యోగులను వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. గతంలో పలువురు అధికారులు యూనివర్సిటీ కాలేజీలు, కార్యాలయాల్లో అవసరం నిమిత్తం డైలీవేజ్, కాంట్రాక్టు ఉద్యోగులను నియమించగా తనకు నచ్చని అధికారులు, సిబ్బందిని వీసీ రవీందర్ అకారణంగా తొలగిస్తున్నారన్నారు. ప్రభుత్వం 2014లో జారీ చేసిన సర్క్యులర్ ఆధారంగా ఓయూకు సంబంధం లేని ఆర్క్యూస్లో పని చేస్తున్న 12 మంది ఉద్యోగులను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తీసేయడం దారుణమని, వెంటనే వారిని విధుల్లోకి తీసుకోవాలని విద్యార్థి నేతలు వేల్పుల సంజయ్, కొత్తపల్లి తిరుపతి, పులిగంటి వేణుగోపాల్ డిమాండ్ చేశారు. (క్లిక్: కారులో కూర్చుని వెండితెరపై సినిమా చూడొచ్చు.. త్వరలో హైదరాబాద్‌లో..) -
ట్రాలీ బ్యాగులో ప్రేయసిని కుక్కేసి.. అడ్డంగా దొరికిపోయాడు
ప్రేయసితో తన గదిలో రాత్రంతా సరదాగా గడపాలన్న ఓ కుర్రాడి ప్రయత్నం బెడిసి కొట్టింది. మాస్టర్ ప్లాన్ వేసి గర్ల్‌ఫ్రెండ్‌ను రూమ్‌కి తీసుకెళ్లాలని ప్రయత్నించాడు. కాస్తుంటే.. గదికి చేరుకునేవాడే. ఇంతలో.. కర్ణాటక మణిపాల్ హాస్టల్లో మంగళవారం జరిగిన ఈ ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. స్థానికంగా ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థి.. అదే కాలేజీలో చదువుతున్న విద్యార్థినితో ప్రేమాయణం సాగిస్తున్నాడు. మంగళవారం రాత్రి ఆమెను తన గదికి తీసుకెళ్లాలని ప్లాన్ వేశాడు. ఓ పెద్ద ట్రాలీ బ్యాగులో ఆమెను కుక్కేసి.. హాస్టల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఏం ఎరగనట్లు వెళ్తున్న అతనిపై హాస్టల్ వార్డెన్‌కు అనుమానం వచ్చింది. అంతపెద్ద లగేజ్ ఏంటని ప్రశ్నించాడు. దీంతో ఆన్లైన్లో ఆర్డర్ చేసిన వస్తువులు అంకుల్.. అంటూ తడబడుతూ సమాధానం ఇచ్చాడు ఆ కుర్రాడు.దాంతో ఆ వార్డెన్ అనుమానం మరింత బలపడింది. బ్యాగ్ ఓపెన్ చేయాలని కోరడంతో.. పగిలిపోయే ఐటెమ్స్ ఉన్నాయని, వద్దని రిక్వెస్ట్ చేశాడు. అయినా కుదరదని బలవంతంగా ఆ ట్రాలీ బ్యాగ్ జిప్ ఓపెన్ చేయడంతో.. అందులోంచి ఆ కుర్రాడి గర్ల్‌ఫ్రెండ్ బయటకు వచ్చింది. ఆపై గట్టిగా ప్రశ్నించడంతో హాస్టల్లో గడిపేందుకు తీసుకొచ్చానని నిజం ఒప్పుకున్నాడు. ఈ ఇద్దరూ ఒకే కాలేజ్ స్టూడెంట్స్ కావడంతో సస్పెండ్ చేసి..ఇళ్లకు పంపించినట్లు తెలుస్తోంది. లాక్డౌన్ టైంలో మంగళూరుకు చెందిన ఓ స్టూడెంట్.. తన ఫ్రెండ్‌ను ఇదే తరహాలో అపార్ట్‌మెంట్‌కు తెచ్చుకున్న సంగతి గుర్తుండే ఉంటుంది. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో మణిపాల్‌కు సంబంధం లేదని స్పష్టత ఇచ్చింది Manipal Academy of Higher Education. The funniest video I've seen today 😬 Apparently, a Manipal Univ. student was smuggling his gf out in a trolley bag. Someone's watching too much Netflix. pic.twitter.com/RQLkAfj9vB — 𝙋𝙧𝙚𝙧𝙣𝙖 𝙇𝙞𝙙𝙝𝙤𝙤 (@PLidhoo) February 2, 2022 -
Ragging in Suryapet: ఆరుగురు విద్యార్థులపై సస్పెన్షన్ వేటు
సాక్షి, నల్గొండ: సూర్యాపేట మెడికల్ కాలేజీ ర్యాగింగ్ ఘటన నిజమేనని తేలింది. ర్యాగింగ్‌పై ఏర్పాటు చేసిన కమిటీ హాస్టల్లో ర్యాగింగ్ జరిగినట్లు నివేదికలో తేల్చింది. ఏడాదిపాటు ఆరుగురు విద్యార్థులపై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు డీఎంఈ తెలిపారు. విద్యార్థులు తక్షణం హాస్టల్ ఖాళీ చేయాలంటూ డీఎంఈ ఆదేశించారు. కాగా, ర్యాగింగ్ ఘటన సంచలనంగా మారడంతో ప్రభుత్వం సీరియస్ అయ్యింది. కాగా, సూర్యాపేట మెడికల్ కళాశాలకు సంబంధించిన హాస్టల్లో ఓ జూనియర్ విద్యార్థిని రెండో సంవత్సరం విద్యార్థులు నాలుగు గంటలు గదిలో బంధించి హింసించారు. మోకాళ్లపై కూర్చోబెట్టి సెల్యూట్ చేయించుకోవడమే కాకుండా పిడిగుద్దులు గుద్దారు. కన్నీరుపెట్టి వేడుకున్నా వదలకుండా ట్రిమ్మర్‌తో గుండు గీసేందుకు ప్రయత్నించారు. టాయిలెట్ వస్తుందని అక్కడి నుంచి బయటపడ్డ ఆ విద్యార్థి ఫోన్ చేసి విషయం తల్లి దండ్రులకు చెప్పాడు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. చదవండి: (కులమేంటని అడిగి.. సార్ అని పిలవాలని హుకుం, గదిలో బంధించి దారుణం) -
కులమేంటని అడిగి.. సార్ అని పిలవాలని హుకుం, గదిలో బంధించి దారుణం
సూర్యాపేట క్రైం: కాలేజీల్లో ర్యాగింగ్ భూతం అంతమైపోయిందన్న సమయంలో మళ్లీ అలాంటి సంఘటన ఒకటి వెలుగు చూసింది. సూర్యాపేట మెడికల్ కళాశాలకు సంబంధించిన హాస్టల్లో ఓ జూనియర్ విద్యార్థిని రెండో సంవత్సరం విద్యార్థులు నాలుగు గంటలు గదిలో బంధించి హింసించారు. మోకాళ్లపై కూర్చోబెట్టి సెల్యూట్ చేయించుకోవడమే కాకుండా పిడిగుద్దులు గుద్దారు. కన్నీరుపెట్టి వేడుకున్నా వదలకుండా ట్రిమ్మర్‌తో గుండు గీసేందుకు ప్రయత్నించారు. టాయిలెట్ వస్తుందని అక్కడి నుంచి బయటపడ్డ ఆ విద్యార్థి ఫోన్ చేసి విషయం తల్లి దండ్రులకు చెప్పాడు. తమ రూమ్‌కు రమ్మని కబురు పంపి.. హైదరాబాద్‌లోని మైలార్‌దేవులపల్లికి చెందిన విస్కనూరి సురేష్ కుమారుడు సాయికుమార్ సూర్యాపేట మెడికల్ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. గత నెల 15 నుంచి జనవరి 2 వరకు సెలవులు ప్రకటించడంతో ఇంటికి వెళ్లాడు. సెమిస్టర్స్ ఉండటంతో ప్రిపేర్ అయ్యేందుకు ఈ నెల 1న రాత్రి 8 గంటలకు మెడికల్ కళాశాలకు సంబంధించిన రెడ్డి హాస్టల్‌కు చేరుకున్నాడు. రాత్రి భోజనం చేసి హాస్టల్లోని రెండో ఫ్లోర్‌లోని తన రూమ్‌కు వెళ్లాడు. రాత్రి 8.40కు సాయికుమార్‌ను ఫస్ట్ ఫ్లోర్‌కు రమ్మని హరీశ్‌తో పాటు మరికొందరు రెండో సంవత్సరం విద్యార్థులు.. నితీశ్‌తో కబురు పంపారు. దీంతో ఫస్ట్ ఫ్లోర్‌కు వచ్చిన సాయిని ఫార్మల్ డ్రెస్, షూ వేసుకురమ్మనగా అతను అలాగే వేసుకొని వచ్చాడు. సీనియర్స్ హరీశ్, రంజిత్, శ్రవణ్, శశాంక్, మహేందర్, చాణక్య, సుజిత్ తదితర 25–30 మంది సాయితో సెల్యూట్ చేయించుకున్నారు. ‘కులమేంటని అడిగారు. సార్ అని పిలవాలని, తల్లిదండ్రులు, అక్కాచెల్లి వివరాలు చెప్పాలని వేధించారు. ఇందంతా వీడియో తీశారు. వాయిస్ రికార్డింగ్ చేస్తావా అంటూ మోకాళ్లపై కూర్చోబెట్టి పిడి గుద్దులు గుద్దారు. ట్రిమ్మర్‌తో గుండు గీయాలని చూశారు’ అని సాయి కన్నీరుమున్నీరయ్యాడు. టాయిలెట్ వస్తుందని చెప్పి.. టాయిలెట్ వస్తుందని చెప్పి ఫస్ట్ ఫ్లోర్‌లోని బాత్రూమ్కు సాయి వెళ్లాడు. అక్కడ నుంచి తన రూమ్‌కు వెళ్లి మరో జూనియర్ విద్యార్థి వద్ద ఫోన్ తీసుకుని తల్లిదండ్రులకు ఏడుస్తూ విషయాన్ని వివరించాడు. వెంటనే తండ్రి సురేశ్ హైదరాబాద్ నుంచే 100కు కాల్ చేసి ఫిర్యాదు చేశారు. అరగంట తర్వాత సూర్యాపేట పట్టణ పోలీసులు రెడ్డి హాస్టల్‌కు చేరుకుని సాయిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తల్లిదండ్రులు తెలిపారు. అయితే, జరిగిన ఘటనపై తమకెలాంటి ఫిర్యాదు అందలేదని, లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందితే చర్యలు తీసుకుంటామని సూర్యాపేట పట్టణ సీఐ ఆంజనేయులు చెప్పడం గమనార్హం. రాజీ కుదిర్చాం.. వెళ్లిపోండంటూ.. సాయి తల్లిదండ్రులు జరిగిన విషయాన్ని కాలేజీ సూపరింటెండెంట్‌కు చెప్పగా.. ‘రాజీ కుదిర్చాం. పోలీసులతో మాట్లాడాం. కాలేజీ పేరు బజారున పడకుండా ఉండాలంటే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి. కళాశాల అన్నాక ఇలాంటివి సర్వసాధారణమే’నని చెప్పి పంపించినట్లు విద్యార్థి తండ్రి తెలిపాడు. విషయాన్ని బయటకు చెప్పొద్దని హుకూం జారీ చేశారని కన్నీరుమున్నీరయ్యారు. గతంలో మరొకరిని ర్యాగింగ్ చేసినా ఎందుకు పట్టించుకోలేదని నిలదీయగా ‘మేం చూసుకుంటాం. మీరు వెళ్లిపోండి’ అని సూపరింటెండెంట్ ఘాటుగా చెప్పారని వాపోయారు. దీనిపై సూపరింటెండెట్ మురళీధర్‌రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సీవీ శారదను వివరణ కోరేందుకు యత్నించగా ఫోన్ తీయలేదు. సూసైడ్ చేసుకోవాలనుకున్నా శనివారం రాత్రి సీనియర్స్ నన్ను 4 గంటలు గదిలో బంధించి మద్యం, పొగ తాగుతూ పిడిగుద్దులు గుద్దారు. వీడియోలు తీసి ట్రిమ్మర్‌తో గుండు గీసేందుకు ప్రయత్నించారు. తల్లిదండ్రులు, సిస్టర్స్ బయోడేటా వందసార్లు చెప్పించారు. దీంతో శనివారం అర్ధరాత్రి సూసైడ్ చేసుకోవాలనిపించింది. నెల రోజులుగా హాస్టల్లో ర్యాగింగ్ చేస్తున్నారు. యాజమాన్యానికి చెప్పినా పట్టించుకోలేదు. పోలీసులకు ఫిర్యాదు చేసి రెండ్రోజులైనా న్యాయం జరగలేదు. – సాయికుమార్, ప్రథమ సంవత్సరం విద్యార్థి, సూర్యాపేట మెడికల్ కళాశాల -
హాస్టల్ విద్యార్థుల మెస్‌చార్జీలు పెంచాలి
కవాడిగూడ: రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ హాస్టళ్లలో ఉంటున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల మెస్‌చార్జీలను రూ.1,500 నుంచి రూ.3 వేలకు పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మెస్‌చార్జీలు పెంచాలని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ధర్నాచౌక్‌లో వందలాది మంది విద్యార్థులు మహాధర్నా నిర్వహిం చారు. కృష్ణయ్య మాట్లాడుతూ ఐదేళ్ల క్రితం ఉన్న ధరలకు అనుగుణంగా కాకుండా, పెరిగిన ధరల మేరకు మెస్‌చార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు, ప్రజాప్రతినిధులకు వేతనాలు పెంచు తున్న ప్రభుత్వం రేపటిపౌరులపట్ల ఎందుకింత నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. రూ.3,500 కోట్ల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాల న్నారు. కార్యక్రమంలో సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నీల వెంకటేశ్, విద్యార్థి సంఘం రాష్ట్ర అ«ధ్య క్షుడు జిల్లెపల్లి అంజి, వర్కింగ్ ప్రెసిడెంట్ సతీశ్, మల్లేష్ యాదవ్, చంటి ముదిరాజ్, జి.కృష్ణయాదవ్,అనంతయ్య, భాస్కర్ పాల్గొన్నారు. -
దెయ్యం ఉందంటూ శాంతి పూజలు
ఆదిలాబాద్‌రూరల్: ఆదిలాబాద్ రూరల్ మండలం మామిడిగూడ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో గ్రామస్తులు ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం ఆదివారం శాంతిపూజలు చేశారు. వసతిగృహంలో దెయ్యం ఉం దంటూ విద్యార్థినులు శుక్రవారం రాత్రి కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశారు. ఈ క్రమంలో కిందపడటంతో కొందరికి గాయాలయ్యాయి. విద్యార్థినుల తల్లిదండ్రులు శనివారం హాస్టల్‌కు వచ్చి తమ పిల్లలను ఇంటికి తీసుకెళ్లారు. మళ్లీ వసతిగృహంలో అడుగుపెట్టడానికి విద్యార్థినులు భయపడుతున్నారు. దీంతో ‘శాంతి పూజలు చేశాం. వేదపండితుల సమక్షంలో దెయ్యం పారిపోవాలని శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించాం. దెయ్యం వసతి గృహంవైపు రాకుండా అష్టదిగ్బంధనం చేశాం’ అని మామిడిగూడ ఆదివాసులు తెలిపారు. వసతి గృహంలో ఎలాంటి దెయ్యం లేదని, వదంతులు నమ్మొద్దని కోరారు. విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెంపొందించేందుకు ప్రత్యేక పూజలు నిర్వహించామని తెలిపారు. కరోనాతోనే పిల్లలు రెండేళ్లు చదువులు నష్టపోవాల్సి వచ్చిందని, మళ్లీ దెయ్యం ఉందనే అపోహలు నమ్మి పిల్లల చదువులకు ఇబ్బందులు కలిగించొద్దని తల్లిదండ్రులను కోరారు. ఇంటికి వెళ్లిన విద్యార్థినులను పాఠశాలకు పంపించాలని, ఉపాధ్యాయులతోపాటు గ్రామస్తులందరం అండగా ఉంటామని తెలిపారు. -
హాస్టల్లో ఏదో ఉందని! ఒంటిపై రక్కుతున్నట్లు, తమను లాగుతున్నట్లు అనిపిస్తోందని..
ఆదిలాబాద్ రూరల్: హాస్టల్లో ఏదో ఉందని, తమ ఒంటిపై రక్కుతున్నట్లు, తమను లాగుతున్నట్లు అనిపిస్తోందని ఆదిలాబాద్ రూరల్ మండలం మామిడిగూడ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు భయంతో వణుకుతున్నారు. శుక్రవారం రాత్రి ఓ విద్యార్థినికి అలా అనిపించడంతో ఆమె పెద్దగా కేకలు వేసింది. దీంతో తోటి విద్యార్థినులు కూడా పెద్ద ఎత్తున కేకలు వేశారు. భయంతో ఏడుస్తూ అందరూ ఒకేసారి బయటకు పరుగులు తీశారు. పెద్ద సంఖ్యలో విద్యార్థినులు ఒకేసారి బయ టకు రావడం తో పలువురు అదుపుతప్పి కిందపడ్డారు. ఈ ఘట నలో కొంతమందికి గాయాలయ్యాయి. విద్యార్థినుల కేకలు, అరుపులు విన్న గ్రామస్తులు ఏం జరిగిందో తెలుసుకోవడానికి హుటాహుటిన ఆశ్రమ పాఠశాలకు చేరుకున్నారు. విద్యార్థినులకు ధైర్యం చెప్పి.. గాయప డినవారిని జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. వసతి గృహాంలో జరిగిన సంఘటనపై గ్రామ స్తులు ఉపాధ్యాయులకు సమాచారం అందజేశారు. అయి తే వారు స్పందించకుండా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని గ్రామస్తులు తెలిపారు. భయాందోళ నలో ఉన్న విద్యార్థినులకు ధైర్యాన్ని ఇచ్చేందుకు రాత్రి వసతి గృహంలోనే పలువురు గ్రామస్తులు ఉన్నారు. కాగా, శనివారం ఉదయం తరగతి గదులకు వెళ్లిన విద్యార్థినులు మళ్లీ భయంతో కేకలు, అరుపులతో ఒకరినొకరు తోసుకుంటూ బయటకు పరుగులు తీశారు. ఈ క్రమంలో 50 మంది విద్యార్థినులు కిందపడి గాయపడ్డారు. స్థానికంగా ఉన్న ఏఎన్‌ఎంతోపాటు మరో ఇద్దరు హాస్టల్ సిబ్బంది ఎంత నచ్చజెప్పినా వారు ఏడుపు ఆపలేదు. అప్పటికే అక్కడ జరిగిన సంఘటనను విద్యార్థినులు తల్లిదండ్రులకు ఫోన్ చేసి సమాచారం అందజేశారు. దీంతో అక్కడికి చేరుకున్న తల్లిదండ్రులు భయపడుతున్న పిల్లలను ఇళ్లకు తీసుకెళ్లారు. (చదవండి: ఉదయం పూలు అమ్ముతూ.. రాత్రి అయితే వేషం మార్చి..) ఆశ్రమ పాఠశాలకు ఐటీడీఏ పీవో ఆశ్రమ పాఠశాల విద్యార్థినుల భయాందోళన గురించి తెలుసుకున్న ఐటీడీఏ పీవో అంకిత్ శనివారం రాత్రి 8.30 గంటల కు పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో దెయ్యం ఉందని.. తమ పిల్లలు భయపడుతున్నారని, పిల్లలను ఇళ్లకు తీసుకెళ్తామని విద్యార్థినుల తల్లిదండ్రులు పీవోను కోరారు. అయితే అలాంటి వేమీలేవని, మూఢ నమ్మకాలు పెట్టుకోవద్దని పీవో.. విద్యార్థినులు, తల్లిదండ్రులకు నచ్చజెప్పారు. ఎవరూ ముందుకు రావడం లేదు ఆశ్రమ పాఠశాలలో వార్డెన్‌గా బాధ్యతలు స్వీకరించేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. వసతిగృహంలో రాత్రి సమయంలో ఏఎన్ఎం, నైట్ డ్యూటీ వాచ్‌మన్ విధుల్లో ఉన్నారు. అయినా పిల్లలు భయపడ్డారు. ఆస్పత్రిలో ఉన్న పిల్లలకు ధైర్యం చెప్పి తిరిగి హాస్టల్‌కి పంపించాను. ప్రస్తుతం వసతి గృహంలో పరిస్థితి అంతా బాగానే ఉంది. – భాస్కర్, ఇన్చార్జి హెచ్ఎం, మామిడిగూడ ఆశ్రమ పాఠశాల -
ఉప్మాలో పాము పిల్ల.. 56 మంది అస్వస్థత
సాక్షి, బళ్లారి(కర్ణాటక): ఉప్మాలో పాము పిల్ల పడిన విషయం తెలియక దాన్ని ఆరగించిన విద్యార్థులు అస్వస్థతతో ఆస్పత్రి పాలయ్యారు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. యాదగరి తాలూకా అబ్బెతుమకూరు గ్రామంలోని విశ్వరాధ్య విద్యావర్థక రెసిడెన్షియల్ పాఠశాల హాస్టల్లో గురువారం ఉదయం విద్యార్థులకు అల్పాహారంగా ఉప్మా వడ్డించారు. దానిని తిన్న విద్యార్థుల్లో 56 మందికి నిమిషాల్లోనే వాంతులు, విరేచనాలయ్యాయి. వెంటనే వారినిప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి కలుషిత ఆహారమే కారణమని నిర్థారించారు. సిబ్బంది వెంటనే హాస్టల్‌కు వెళ్లి పరిశీలించగా ఉప్మా ఉన్న పాత్రలో చనిపోయిన పాముపిల్ల కనిపించింది. ఈ విషయాన్ని వైద్యులకు తెలపగా వారు విద్యార్థులను మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ వార్త తెలిసిన వెంటనే పిల్లల తల్లిదండ్రులు ఆస్పత్రులకు చేరుకున్నారు. హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని మండిపడ్డారు. యాదగిరి జిల్లా ఎస్పీ వేదమూర్తి వసతి పాఠశాలను సందర్శించారు. ఆస్పత్రికి వెళ్లి బాధిత విద్యార్థులను పరామర్శించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
విద్యార్థినుల హాస్టల్.. నీడలాగ ఒక ముఖం.. వింత శబ్దాలు..
సాక్షి, నాగిరెడ్డిపేట(నిజామాబాద్): కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండల కేంద్రం గోపాల్పేట ఆదర్శ కళాశాల హాస్టల్ విద్యార్థినులు దయ్యం భయంతో వసతి గృహాన్ని ఖాళీ చేశారు. మంగళవారం రాత్రి స్టడీ అవర్స్‌లో భాగంగా చదువుకుంటున్న విద్యార్థినులకు గదిలో నీడలాగ ఒక ముఖం కనిపించిందని, వెనుకనుంచి తోసేసినట్టుగా అనిపించిందని, వింత శబ్దాలు వినిపించాయని చెప్పారు. దీంతో బెదిరిపోయిన విద్యార్థినులు బుధవారం ఉదయమే సొంత ఊర్లకు వెళ్లిపోయారు. కాగా, విద్యార్థినులు హోమ్‌సిక్ తోనే వెళ్లిపోయారని, తిరిగి రాగానే వారికి కౌన్సిలింగ్ నిర్వహిస్తామని మోడల్‌స్కూల్ ప్రిన్సిపల్ శ్రీలత పేర్కొన్నారు. -
వైరల్ వీడియో: ‘ఏడవకురా.. ఏప్రిల్‌లో వెళ్లిపోతాం లే’
-
‘ఏడవకురా.. ఏప్రిల్‌లో వెళ్లిపోతాం లే’
ఈఇటానగర్: ప్రతి మనిషి జీవితంలో బాల్యం అందమైన జ్ఞాపకంగా ఉంటుంది. ఎందుకంటే అప్పటికి మన బుర్రలో స్వార్థం, ద్రోహం, మోసం, పేద, ధనిక తేడాలు వంటి దుర్మార్గపు ఆలోచనలు ఉండవు. మనసు నిర్మలంగా.. కల్లాకపటం లేకుండా ఉంటుంది. అందరితో కలిసి పోతాం.. త్వరగా స్నేహం చేస్తాం. ఆ వయసులో మనలో జాలి, దయ, కరుణ మాత్రమే ఉంటాయి. మన నేస్తం బాధపడితే చూడలేం. ఏదోలా వారిని ఓదారుస్తాం. ఇక చిన్నారుల్లో స్నేహం ఎంత నిజాయతీగా ఉంటుందో తెలిపే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. హాస్టల్‌కి వెళ్లిన ఓ చిన్నారి అమ్మ గుర్తుకువచ్చి ఏడుస్తాడు. అది చూసి వాడి స్నేహితురాలు ‘ఏడవకురా.. ఏప్రిల్‌లో వెళ్లిపోతాంలే’ అంటూ ఓదారుస్తుంది. ఈ చిన్నారుల క్యూట్ సంభాషణకు సంబంధించిన వీడియో ప్రసుత్తం తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. ఈ సంఘటన అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ ప్రాంతంలోని ఓ హాస్టల్లో చోటు చేసుకుంది. వీడియోలో ఓ చిన్న పిల్లాడు తన అమ్మ గుర్తుకు వచ్చి.. ఏడుస్తూ ఉంటాడు. అది గమనించి ఆ పిల్లాడి స్నేహితురాలు దగ్గరకు వెళ్లి ఓదారుస్తుంది. ‘‘అరే ఏడవకురా.. ఊర్కో. అమ్మ గుర్తుకు వస్తుందా.. ఏడవకు.. ఏప్రిల్‌లో వెళ్లిపోతాం లే’’ అంటూ తనకు తోచిన రీతిలో తన స్నేహితుడిని ఓదారుస్తుంది. (చదవండి: భారత్‌లో అందరికంటే ముందు నిద్రలేచే గ్రామం ఏదో తెలుసా?) ‘‘ప్రేమ అనేది మానవుల సహజ లక్షణం.. అలవాటు చేసుకుంటే అయ్యేది కాదు. ప్రేమ విశ్వవ్యాప్తం.. దానికి ఎంతో శక్తి ఉంది. ప్రేమిస్తూ ఉండండి.. హాస్టల్లో ఉన్న ఈ ఇద్దరు చిన్నారులు ఒకరినొకరు ఎలా ఓదార్చుకుంటున్నారో చూడండి’’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఇది చూసిన నెటిజనులు.. ఎంత క్యూట్‌గా ఉన్నారో.. నాకు నా బాల్యం గుర్తుకు వచ్చింది. ఎంత అందమైన బంధమో కదా అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. (చదవండి: మేకింగ్ ఆఫ్ ఎ క్వీన్.. పచ్చళ్ల మహారాణి) చదవండి: నాన్నా బాగానే ఉన్నా అంటూ చివరి ఫోన్‌కాల్.. -
పాల ఉత్పత్తిలో ‘తడకనపల్లి’ పశువుల హాస్టల్‌కు రెండోస్థానం
కర్నూలు (ఓల్డ్‌సిటీ)/ కల్లూరు : కర్నూలు జిల్లా కల్లూరు మండలంలోని తడకనపల్లి గ్రామంలో పాలు ‘వెల్లువలా’ ఉత్పత్తి అవుతోంది. అక్కడ ప్రభుత్వ పశువుల సంక్షేమ వసతి గృహం ఉండటమే ఇందుకు కారణం. గ్రామ సమీపంలోని పదెకరాల సువిశాల స్థలంలో నెలకొల్పారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా విడుదలైన ప్రత్యేక అభివృద్ధి నిధులు రూ. 1.50 కోట్లు, కేంద్ర ప్రభుత్వపు మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు మరో రూ. 50 లక్షలు జోడించి సుమారు రూ. 2 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించారు. నాలుగేళ్ల క్రితం (2017, జనవరి 2వ తేదీన) 40 గేదెలతో ప్రారంభమైన ఈ హాస్టల్ నేడు ఆ సంఖ్య 200కు పెరిగింది. గేదెలను ఉంచడానికి సుమారు ఎకరం స్థలంలో నాలుగు షెడ్లు నిర్మించారు. ఈ షెడ్లు సుమారు 300 గేదెల పెంపకానికి కూడా సరిపడతాయి. గేదెల మేత కోసం తొమ్మిది ఎకరాల్లో సూపర్ నేపియర్, ఏబీబీఎన్ రకాల గడ్డిని పెంచారు. ఆయా రకాల గడ్డిని మేత మేయడం వల్ల గేదెలు ఎక్కువ పాలు ఇస్తాయి. ఇలాంటి హాస్టల్ రాష్ట్రంలో ఇదే మొదటిదని, దేశంలో గుజరాత్ తర్వాతి స్థానం దీనికే లభిస్తుందని పశు సంవర్ధక శాఖ జేడీ రమేశ్‌బాబు వివరించారు. హాస్టల్ పుట్టుపూర్వోత్తరాలపై ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనమిది.. వైఎస్ ప్రవేశపెట్టిన పీపీసీలే ఆవిర్భావానికి కారణం.. తడకనపల్లి గ్రామ పంచాయతీలో 4,300 జనాభా ఉంది. 1,050 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. పొదుపు లక్ష్మి గ్రూపులు 92 ఉన్నాయి. వాటిలో సభ్యులు దాదాపుగా ప్రతి కుటుంబానికి ఒకరుంటారు. ఇక్కడి మహిళలు చైతన్యవంతులు. ఆర్థిక స్వావలంబన అభిలాష బలంగా ఉంది. గేదెల పెంపకం ద్వారా కలిగే ప్రయోజనాలను గుర్తించి ఎక్కువ సంఖ్యలో అదే వృత్తిని అవలంబించారు. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు రాష్ట్రంలో పాల ఉత్పత్తి పెంచాలనే ఉద్దేశంతో పాల ప్రగతి కేంద్రాలు (పీపీకేలు) ప్రవేశపెట్టారు. ఈ పథకాన్ని ఆతర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు సెర్ప్ ద్వారా అమలు చేశారు. ఐదుగురు డ్వాక్రా గ్రూపు మహిళలు ఒక యూనిట్‌గా జాయింట్ లయబుల్ గ్రూప్ (జేఎల్సీ)లను 2013లో ఏర్పాటు చేశారు. ఒక్కో జేఎల్సీకి ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించిన ముర్రా జాతి గేదెలను బ్యాంకు రుణం ద్వారా కొనిచ్చారు. ఎస్సీ, ఎస్టీలకు రూ. 2.25 లక్షలు, బీసీ, మైనారిటీలకు రూ. లక్ష సబ్సిడీ ఇచ్చారు. గేదెలు కొనడానికి ముందే గడ్డి పెంపకానికి రూ. 30 వేల రుణాన్ని అడ్వాన్స్‌గా ఇప్పించారు. జిల్లా మొత్తంగా 60 పాల ప్రగతి కేంద్రాలు మంజూరైతే కేవలం తడకనపల్లి గ్రామానికి 12 పీపీకేలు కేటాయించారు. ఆ సమయంలో ఇక్కడ గేదెల పెంపకం, పాల ఉత్పత్తి తారాస్థాయికి చేరుకుంది. నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక 2014లో అప్పటి పశుసంవర్ధక శాఖ ప్రత్యేక కార్యదర్శి మన్మోహన్సింగ్ గ్రామాన్ని సందర్శించారు. ఇక్కడ మహిళలు గేదెల పెంపకంపై చూపిస్తున్న ఆసక్తిని గుర్తించి పశువుల హాస్టల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అప్పటి చిన్నటేకూరు పశువైద్యుడు డాక్టర్ నాగరాజు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అప్పటి పశువైద్య శాఖ జేడీ వేణుగోపాల్‌రెడ్డి జిల్లా కలెక్టర్ విజయమోహన్‌ను ఆశ్రయించి ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకం కింద రూ. 50 లక్షలు కేటాయించగా, రాష్ట్ర ప్రభుత్వం రూ. 1.50 కోట్ల ప్రత్యేక నిధులను విడుదల చేసింది. హాస్టల్ ఆవిర్భావానికి ముందు.. ఇంట్లో స్థలం లేని మహిళలు గేదెలను ఇంటి ముందు ఓ తడికె కింద కట్టేసేవారు. దానివల్ల వర్షానికి తడిసి, ఎండకు ఎండి గేదెల పెంపకానికి సరైన అనుకూల వాతావరణం లభించేది కాదు. రాత్రివేళ రక్షణ ఉండేది కాదు. ప్రభుత్వం పశువుల సంక్షేమ వసతి గృహం చేసిన తర్వాత సరైన సదుపాయాలు కలిగాయి. ఈ కారణంగా మొదట 40 గేదెలతో ప్రారంభమైన పశువుల హాస్టల్ క్రమేపీ అభివృద్ధి చెంది ప్రస్తుతం 200 గేదెలతో కళకళలాడుతోంది. హాస్టల్ నిర్వహణ ఇలా... ఈ హాస్టల్లో ప్రస్తుతం సుమారు నలభై నుంచి యాభై కుటుంబాల మహిళలు తమ గేదెలకు ఆశ్రయం కల్పించారు. ఎవరి గేదెలను వారు శుభ్రం చేసి, మేత వేసుకుని వెళ్లాలి. పాలు పిండుకోవాలి. హాస్టల్‌కు అవసరమైన నీటి వసతిని తడకనపల్లి చెరువు నుంచి కల్పించారు. చెరువులో బోరు వేసి పైపులైన్ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. దీనికయ్యే కరెంటు బిల్లును పెంపకందారులంతా సమానంగా భరించాలి. హాస్టల్ మైదానంలో గడ్డి పెంచాలనుకుంటే సొంత ఖర్చుతోనే పెంచుకోవచ్చు. ప్రత్యేక నిర్వహణ కమిటీ.. పశువుల హాస్టల్‌కు ప్రత్యేక నిర్వహణ కమిటీ ఉంటుంది. ఈ కమిటీ హాస్టల్ ప్రారంభంతోనే ఆవిర్భవించింది. ఈ కమిటీకి ప్రస్తుతం బొజ్జమ్మ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. జుబేదాబీ, అంజనమ్మ, గంగావతి, హుసేన్‌బీ, శేషమ్మ కమిటీ సభ్యులు. నెలకొకసారి సమావేశమై నిర్వహణ ఖర్చులపై చర్చిస్తారు. ఒక్కో గేదెపై నెలకు రూ. 100 చొప్పున ఫీజు వసూలు చేస్తారు. పెంపకం కూలీలుగా బీహార్‌వాసులు.. గేదెల పోషణలో బీహార్‌వాసులు నిష్ణాతులు. హాస్టల్లో ఎక్కువ సంఖ్యలో గేదెలు పెట్టుకున్న పెంపకందారుల (గేదెల యజమానుల)కు పోషణ సాధ్యం కాకపోవడంతో అలాంటి వారు తమ సొంత ఖర్చుతో బీహార్‌వాసులను కూలీలుగా నియమించుకున్నారు. గేదెకి రూ. వెయ్యి చొప్పున చెల్లిస్తే పాలు పిండే పని మొదలు సపరలన్నీ వారే చేస్తారు. అధిక పాలదిగుబడి... హాస్టల్లో పోషిస్తున్న గేదెలు దాదాపుగా హర్యానాకు చెందిన ముర్రా జాతి, తమిళనాడుకు చెందిన గ్రేడెడ్ ముర్రాజాతి రకాలకు చెందినవి. వీటికి పాల దిగుబడి ఎక్కువ. పైగా హాస్టల్లో గేదెలకు సరైన గాలి, వెలుతురు, మంచి వాతావరణం ఉంటుంది. దీనికి తోడు సూపర్ నేపియర్, ఏబీబీఎన్ రకాల గడ్డి వాడుతుండటం వల్ల ఒక్కో గేదె రోజుకు 18 మొదలు 20 లీటర్ల దాకా పాలిస్తుంది. పాల కొనుగోలుదారులు ఇక్కడికే వచ్చి లీటరు రూ.50కి చొప్పున కొనుగోలు చేసుకువెళతారు. గ్రామంలో కాకుండా కేవలం పశువుల హాస్టల్లోనే రోజుకు వెయ్యి లీటర్ల పాలు ఉత్పత్తి అవుతాయి. గేదెలు పోషించే మహిళలు లక్షాధికారులయ్యారు. ఉన్న చోటికే వైద్యం.. గతంలో ఇళ్ల వద్ద పోషణ చేసే సమయంలో పెంపకందారులు పశువును ఆసుపత్రికి తీసుకెళ్లాలంటే వ్యయ, ప్రయాసలకు లోనయ్యేవారు. హాస్టల్లో అలాంటి ఇబ్బంది ఉండదు. పశువైద్యులే ఇక్కడికి వస్తారు. ఓ వెటర్నరీ అసిస్టెంట్ నిత్యం ఇక్కడే విధులు నిర్వర్తిస్తుంటారు. వారానికి ఒకసారి చిన్నటేకూరు పశువైద్యుడు పశువుల ఆరోగ్య పరిస్థితులను పరిశీలించి అవసరమైన వాటికి వైద్యం చేస్తారు. అనుబంధంగా పాలకోవా పరిశ్రమ... తడకనపల్లిలో పాల ఉత్పత్తి అధికంగా జరుగుతుండటం వల్ల ఇక్కడ పాలకోవా పరిశ్రమ బాగా అభివృద్ధి చెందింది. కుటీర పరిశ్రమలా ప్రతి ఇంట్లో బట్టీలు పెట్టి కోవాను తయారు చేస్తున్నారు. ఎక్కువ ఆర్డర్లు వచ్చే కొందరు మహిళలు ఆధునిక సాంకేతిక పరిజ్ఙానాన్ని ఉపయోగించి యంత్రాల సాయంతో కోవా తయారు చేస్తున్నారు. తడకనపల్లి కోవా అనేది బ్రాండెడ్‌గా మారింది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆర్డర్లు వస్తుంటాయి. అంతే కాకుండా కోవాను విక్రయించే ప్రత్యేక స్టాల్స్ వెలిశాయి. గ్రామంలోని ప్రధాన రహదారి వెంట వెళితే వరుసగా కనిపిస్తాయి. ఫలించిన స్థానిక ఎమ్మెల్యే కృషి... హాస్టల్ విద్యుత్తు బిల్లు గతంలో కమర్షియల్ కేటగిరీలో ఉండేది. దీనివల్ల యూనిట్ కాస్ట్ పెరిగి, బిల్లు కూడా పెద్ద మొత్తంలో వచ్చేది. కరెంటు బిల్లు ఖర్చును కూడా పెంపకందారులంతా పంచుకోవాల్సి ఉంటుంది. వీరికి మోయలేని భారంగా ఉండేది. విషయం స్థానిక శాసన సభ్యుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి దృష్టికి వెళ్లింది. ఆయన చొరవ తీసుకుని ‘డైరీ ఫాం’ కేటగిరీకి మార్చాలంటూ విద్యుత్ శాఖ ఎస్ఈతో మాట్లాడారు. అందుకు ఎస్ఈ కూడా ఒప్పుకున్నట్లు తెలిసింది. డైరీ ఫాం కేటగిరీ వల్ల తమకు బిల్లు భారం తగ్గనుందని పెంపకందారులు సంతోష పడుతున్నారు. నాకు పక్షం రోజులకు రూ. 20 వేల బిల్లు వస్తుంది: శేషమ్మ, గేదెల పెంపకందారు తడకనపల్లిలో ఉంటాను. జిలానీ గ్రూప్ ఎస్‌హెచ్‌జీ సభ్యురాలిని. ఏడు బర్రెలను హాస్టల్లో పెట్టాను. వీటికి మేత పెట్టడం, పేడ తీయడం, స్నానం చేయించడం, పాలు పితకడం వంటి అన్ని సపర్యలు మేమే చేసుకుంటాం. మా బర్రెలు ఉదయం 20, సాయంత్రం 12 చొప్పున రోజుకు 32 లీటర్ల పాలు ఇస్తాయి. పాల వ్యాపారి నుంచి నాకు పక్షం రోజులకు రూ. 20 వేల బిల్లు లభిస్తుంది. పశువుల హాస్టల్.. ఓ మంచి ఉద్దేశం: రమేశ్‌బాబు, పశుసంవర్ధక శాఖ జేడీ ప్రభుత్వం తడకనపల్లిలో పశువుల హాస్టల్ ఏర్పాటు చేయడం ఒక మంచి ఉద్దేశం. మహిళలు చిన్నచిన్న ఇళ్లల్లో గేదెలను కట్టుకోలేక ఇబ్బంది పడుతుంటారు. స్థలం లేక ఇంటి బయట షెడ్డు వేసి ఉంచుతున్నారు. అలాంటి వాతావరణంలో పశువుల ఆరోగ్యానికి రక్షణ ఉండదు. పాల ఉత్పత్తి కూడా వాటి స్వస్థతను బట్టి ఉంటుంది. ఇక్కడ పశువుల హాస్టల్ ఏర్పాటు చేయడం వల్ల గ్రామం పాల ఉత్పత్తి కేంద్రంగా మారింది. పశువైద్యం కూడా ఒకేచోట లభిస్తోంది. చిన్నటేకూరు పశువైద్యుని పర్యవేక్షణ ఉంటుంది. -
నాన్న.. నాకు చదువొద్దు చనిపోతున్నా..
సాక్షి ప్రతినిధి, చెన్నై: చదువు భారమై.. మానసిక ప్రశాంతతకు దూరమై ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని దారుణమైన రీతిలో తల్లిదండ్రుల ముందే ప్రాణాలు తీసుకుంది. ఈ దయనీయమైన ఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన తంగకుమార్ తమిళనాడు రాష్ట్రంలోని అరియలూరు జిల్లాలోని సిమెంట్ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఇతడి కుమార్తె అబిదా (19) శ్రీపెరంబుదూరులోని ప్రయివేటు ఇంజినీరింగ్ కాలేజీలో రెండో సంవత్సరం చదువుతోంది. చదువంటే ఇష్టం లేదు.. అమ్మానాన్నల బలవంతం మీద కాలేజీలో చేరానని హాస్టల్లోని తోటి విద్యార్థుల వద్ద తరచూ వాపోయి.. మానసిక కుంగుబాటుకు లోనైంది. ఈ విషయం ప్రిన్సిపల్‌కు తెలియడంతో తల్లిదండ్రులను పిలిపించాడు. అమ్మాయి బాగా కోలుకున్న తరువాత ఆమెకు ఇష్టమైతేనే కాలేజీకి పంపాలని ఆయన సూచించగా వారు సమ్మతించారు. సోమవారం రాత్రి ఇంటికి బయలుదేరే ముందు.. హాస్టల్ గదిలో ఉన్న సామాన్లు తెచ్చుకుంటానంటూ తల్లిదండ్రులను గౌండ్ ఫ్లోర్లో కూర్చోబెట్టి అబిదా మిద్దెపైకి వెళ్లింది. ఐదో అంతస్తుకు చేరుకుని అక్కడి నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. తమ కళ్లముందే అబిదా ప్రాణాలు తీసుకోవడంతో తల్లిదండ్రులు, హాస్టల్ సిబ్బంది తల్లడిల్లిపోయారు. మరో ఘటనలో.. తమ్ముడు తిట్టాడని మరో విద్యార్థిని.. చెన్నై తిరువీక నగర్‌కు చెందిన అశోకన్‌కు ప్లస్ వన్ చదువుతున్న కుమార్తె కావ్య (17) ఉంది. ఆమెకు, తమ్ముడికి మధ్య సోమవారం వాదులాట చోటుచేసుకుంది. తల్లిదండ్రులు ఇద్దరికీ నచ్చజెప్పి బయటకు వెళ్లారు. మనస్థాపానికి గురైన కావ్య గదిలోకి వెళ్లి ఉరివేసుకుంది. అక్కను చూసి ఆందోళన చెందిన తమ్ముడు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. వారొచ్చి కుమార్తెను ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. చదవండి: నిమిషాల వ్యవధిలో రెండు సార్లు వ్యాక్సిన్.. తట్టుకోలేక.. -
మహిళ ఒత్తిడితో 24 ఏళ్ల యువకుడి ఆత్మహత్య
ఆగ్రా: ఉత్తర ప్రదేశ్‌లోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ) హాస్టల్లో 24 ఏళ్ల టీచర్ ఉరి వేసుకుని మరణించడం కలకలం రేపింది. బాధితుడు అలీగఢ్‌లోని ఏఎన్సీ కాలేజ్‌లో అధ్యాపకుడిగా పనిచేస్తున్న అభిషేక్ కుమార్ సక్సేనాగా పోలీసులు గుర్తించారు. సక్సేనా గురువారం హాస్టల్ గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. అభిషేక్ గత వారం రోజులుగా తన వసతి గృహాన్ని ఖాళీ చేసి హాస్టల్ గదిలో ఉంటున్నాడు. అయితే ఆగ్రాకు చెందిన ఓ మహిళ ఒత్తిడి కారణంగానే అభిషేక్ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ‘అభిషేక్ ఆత్మహత్యకు పాల్పడే సమయంలో ఒక మహిళతో వీడియో కాల్ మాట్లాడుతున్నాడు. ఆమె నా సోదరుడిని బ్లాక్మెయిల్ చేసింది’ అని బాధితుడి సోదరుడు ఆరోపించారు. యూపీలోని ఫిలిబిత్ అభిషేక్ స్వస్ధలమని పోలీసులు తెలిపారు. సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్లో బాధితుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు చేయడంతో సెక్షన్ 306 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుందని సివిల్ లైన్స్ ఎస్హెచ్ఓ రవీంద్ర కుమార్ దుబే తెలిపారు. -
మా ఫీజులిచ్చేయండి..
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి కట్టడి కోసం విద్యాసంస్థలను మూసివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో.. ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలతో పాటు వాటికి అనుబంధంగా ఉన్న హాస్టళ్లకు కూడా తాళాలు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రైవేటు యాజమాన్యాలు ‘హాస్టళ్ల నుంచి మీ పిల్లలను తీసుకెళ్లండి..’అని విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు చేసి పంపించేస్తున్నాయి. అయితే హాస్టళ్ల ఫీజులు పూర్తిగా చెల్లించిన తల్లిదండ్రులు దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫీజులు కట్టి నెలైనా గడవక ముందే హాస్టళ్లు మూతపడిన నేపథ్యంలో తమకు డబ్బులు తిరిగి ఇచ్చేయాలని కొందరు, వచ్చే సంవత్సరానికి సర్దుబాబు చేయాలని కొందరు కోరుతున్నారు. మార్చి నెలలోనే అధికంగా చేరికలు కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యక్ష బోధనను ప్రారంభించింది. ఫిబ్రవరిలోనే ప్రారంభమైనప్పటికీ మార్చి నెలలోనే ఎక్కువమంది హాస్టళ్లలో చేరారు. జేఈఈ మెయిన్ రెండో పరీక్ష అనంతరం విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో హాస్టళ్లలో వచ్చి చేరారు. పాఠశాలల హాస్టళ్లు మొదలుకుని అన్ని కళాశాలల హాస్టళ్లలో 4.5 లక్షల మంది వరకు విద్యార్థులు చేరినట్లు అంచనా. రాష్ట్రంలో 1,584 ప్రైవేటు జూనియర్ కాలేజీలు ఉండగా, 574 కాలేజీలు హాస్టళ్లను నిర్వహిస్తున్నాయి. ఇవి ప్రత్యక్ష బోధన ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 2 లక్షల మందికి పైగా విద్యార్థులను హాస్టళ్లలో చేర్చుకున్నాయి. ఇక 10,900 వరకు ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లు ఉండగా వేయి వరకు విద్యా సంస్థలు హాస్టళ్లను నిర్వహిస్తున్నాయి. వాటిల్లోనూ ఇప్పటివరకు దాదాపు 2 లక్షల మందికి పైగా విద్యార్థులను తల్లిదండ్రులు హాస్టళ్లలో చేర్పించారు. మరోవైపు రాష్ట్రంలోని 250 ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీలు కూడా హాస్టళ్లను ప్రారంభించాయి. ఆయా కాలేజీ ల్లోని సుమారు 40 వేల మందికి పైగా విద్యార్థులు హాస్టల్ ఫీజులు చెల్లించారు. మిగిలిన 3, 4 నెలల కాలానికి రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు యాజమాన్యాలు వసూలు చేసినట్లు సమాచారం. ప్రభుత్వం చొరవ తీసుకోవాలిఅయితే కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో, విద్యార్థులు సైతం వైరస్ బారిన పడుతుండటంతో ప్రభుత్వం విద్యాసంస్థలు, హాస్టళ్లు మూసేయాలని ఆదేశించింది. అయితే చాలామంది తల్లిదండ్రులు ఫీజులు చెల్లించి నెల రోజులైనా గడవక ముందే, ఇతర రాష్ట్రాల నుంచి పిల్లల్ని తీసుకొచ్చి చేర్పించిన కొందరు తల్లిదండ్రులు తమ స్వస్థలాలకు చేరారో లేదో.. హాస్టళ్లు మూతపడటంతో సమస్య ఏర్పడింది. పిల్లల చదువు కోసం అప్పులు చేసి మరీ ఫీజులు పూర్తిగా చెల్లించామని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాటిని తిరిగి ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం, ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఉన్న విద్యార్థులకు చెల్లించిన ఫీజులను వెనక్కి ఇప్పించాలని, మిగతా విద్యార్థులకు సంబంధించిన ఫీజులను వెనక్కి ఇచ్చేలా లేదా వచ్చే విద్యా సంవత్సరంలో సర్దుబాటు చేసేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
వామ్మో.. మాయలేడి ఎంతపనిచేసింది!
కథలాపూర్(వేములవాడ): ఒక మహిళ బాలికను కిడ్నాప్ చేసిన ఘటన ఇప్పుడు వేములవాడలో సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే..కోరుట్లకు చెందిన సదరు బాలిక కథలాపూర్‌లోని హస్టల్లో ఉంటూ చదువుకొంటుంది. ఈ క్రమంలో అంజుమ్ అనే మహిళ ఆమెకు మాయమాటలు చెప్పింది. ఇంతటితో ఆగకుండా ఒక రోజు బాలిక ఉంటున్న హస్టల్ వద్దకు చేరుకొంది. ఆ తర్వాత వెంటనే బాలికను కిడ్నాప్ చేసింది. అయితే బాలిక కనపడక పోవడంతో ఆందోళన చెందిన సదరు హస్టల్ నిర్వాహకులు బాలిక కుటుంబానికి సమాచారం అందించారు. దీంతో బాలిక బంధువుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అక్కడి సీసీ ఫుటేజీని పరిశీలించి మాయలేడిని అదుపులోకి తీసుకున్నారు. కేసును నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తులో మరిన్ని విషయాలు బయటకు వస్తాయని తెలిపారు. చదవండి: లేడి దొంగ..బట్టలు జారిపోతున్నా పట్టించుకోలేదు! -
భారత అథ్లెటిక్స్ కోచ్ అనూహ్య మృతి
పాటియాలా: భారత్ అథ్లెటిక్స్ (మిడిల్ అండ్ లాంగ్ డిస్టెన్స్) కోచ్ నికొలాయ్ స్నెసరెవ్ శుక్రవారం అనూహ్య పరిస్థితుల్లో మరణించారు. బెలారస్‌కు చెందిన 72 ఏళ్ల స్నెసరెవ్... నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ (ఎన్ఐఎస్)లోని తన హాస్టల్ గదిలో శవమై తేలారు. మృతికి కారణాలు ఇంకా తెలియలేదు. పాటియాలాలో శుక్రవారం ఇండియన్ గ్రాండ్‌ప్రి టోర్నీ జరిగింది. సన్నాహాల్లో భాగంగా ఉదయమే అథ్లెట్లతో కలిసి సాధన లో పాల్గొన్న స్నెసరెవ్ మధ్యాహ్నం ప్రధాన ఈవెంట్ జరిగే సమయంలో కనిపించలేదు. దాంతో అధికారులు ఆయన గదికి వెళ్లగా లోపలి నుంచి తాళం వేసి ఉంది. తలుపులు బద్దలు కొట్టి చూస్తే తన మంచంపై కోచ్ పడిఉన్నారు. 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్ విభాగంలో టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన అవినాశ్ సాబ్లేతో పాటు ఇతర మిడిల్, లాంగ్ డిస్టెన్స్ రన్నర్లకు ఆయన శిక్షణ ఇస్తున్నారు. 2005లో తొలిసారి భారత కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన స్నెసరెవ్ హయాంలోనే ప్రీజా శ్రీధరన్, కవితా రౌత్, సుధా సింగ్, లలిత తదితరులు అంతర్జాతీయ స్థాయిలో మంచి ఫలితాలు సాధించారు. అయితే భారత అథ్లెటిక్స్ సమాఖ్యతో విభేదాలతో 2019 ఫిబ్రవరిలో తన పదవికి రాజీనామా చేసి వెళ్లిపోయారు. అయితే రెండేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ కోచ్‌గా నియమించడంతో మంగళవారమే ఆయన భారతదేశానికి వచ్చారు. -
విద్యార్థినిల బట్టలు విప్పించి డ్యాన్స్ చేయించిన ఖాకీలు
ముంబై: అనాథ ఆశ్రమాలు, ప్రభుత్వ వసతి గృహాల్లో ఉండే బాలికలపై జరిగే దారుణాలకు సంబంధించి అప్పుడప్పుడు వార్తలు చదువుతూనే ఉంటాం. తమకంటూ ఎవరు లేని ఈ అభాగ్యుల పట్ల జాలి, దయ చూపాల్సింది పోయి పశువుల్లా ప్రవర్తిస్తారు కొందరు అధికారులు. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి మహారాష్ట్రలో చోటు చేసుకుంది. రక్షించాల్సిన ఖాకీలే భక్షకులుగా మారారు. పోలీసులు మరి కొందరు వ్యక్తులతో కలిసి ప్రభుత్వ హాస్టల్లో ఉంటున్న కొందరు విద్యార్థినిల చేత అసభ్య కార్యక్రమాలు చేయించారు. బుల్దానా, చిక్లి నియోజక వర్గం బీజేపీ ఎమ్మెల్యే శ్వేతా మహాలే దీని గురించి దిగువ సభలో ప్రస్తావించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు.. రాష్ట్రంలోని జల్గావ్లో ప్రభుత్వం ఆశాదీప్ మహిళల వసతి గృహాన్ని నిర్వహిస్తోంది. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం కొందరు పోలీసు అధికారులు, మరి కొందరితో కలిసి హాస్టల్‌కి వెళ్లారు. అక్కడున్న విద్యార్థినిలను బెదిరించి వారి బట్టలు విప్పించి.. డ్యాన్స్ చేయించారు. ఈ దారుణం గురించి ఓ ఎన్జీఓకు తెలియడంతో వారు ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో నేడు శ్వేతా మహాలే దీని గురించి దిగువ సభలో ప్రస్తావించారు. ఈ సందర్భంగా శ్వేతా మహాలే మాట్లాడుతూ.. ‘‘ఈ దారుణంలో పోలీసులు కూడా పాలు పంచుకున్నారని తెలిసి సిగ్గుపడుతున్నాము. ఇలాంటి పనులతో రాష్ట్రం పరువు పోతుంది. మహిళలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే వారి పట్ల రాక్షసులుగా మారుతున్నారు. ఇలాంటి బాధితులు చాలా మందే ఉంటారని భావిస్తున్నాం. ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం ”అన్నారు శ్వేతా మహాలే. రాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ఈ విషయంపై దర్యాప్తునకు ఆదేశించామని తెలిపారు. మహాలే లేవనెత్తిన సమస్యకు సమాధానమిస్తూ దేశ్ ముఖ్ ఈ సంఘటనపై దర్యాప్తు జరిపేందుకు నలుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశామని.. వారు రెండు రోజుల్లో నివేదిక సమర్పించనున్నట్లు తెలిపారు. దారుణం జరిగిన హాస్టల్‌ను మహిళా, శిశు సంక్షేమ శాఖ నిర్వహిస్తుంది. చదవండి: ఇది పశువుల హాస్టల్.. ప్రియుడిని హత్య చేస్తే.. ఓ రాత్రి నీతో గడిపేందుకు ఓకే -
ఇది పశువుల హాస్టల్..
పైన చిత్రంలో మీరు చూస్తున్నది ఓ హాస్టల్. అదేంటీ.. పిల్లలే కనిపించడం లేదు అని అనుకుంటున్నారా.. ఎందుకంటే ఇది పిల్లల హాస్టల్ కాదు మరి.. పశువుల హాస్టల్. ఔరా.. ఇదేమి విచిత్రం అనుకుంటున్నారా. ఈ హాస్టల్ ఎక్కడుందో తెలుసా.. సిద్దిపేట జిల్లాలోని పొన్నాలలో.. రూ. 2 కోట్లతో దీన్ని నిర్మించారు. ఇక్కడ పెద్ద షెడ్లు, నీటి బోర్లు, వాటర్ ట్యాంక్, డ్రైనేజీ, విద్యుత్, గడ్డికోసే యంత్రాలు, పాలు నిల్వచేసే గది, కాపలాదారులకు గది, పశువుల వైద్య పరీక్ష స్టాండ్ అన్నీ ఉన్నాయి. విద్యార్థులకైతే తల్లిదండ్రులతో ఉండే అవకాశం ఉండదు కానీ.. ఇక్కడ పశువులు ఎంచక్కా తల్లీపిల్లా ఉండొచ్చు. ప్రస్తుతం 57 గేదెలు ఉండగా.. రోజుకు 150 లీటర్ల పాలు విక్రయిస్తున్నారు. మన ఊళ్లోనూ ఇలాంటి హాస్టల్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదూ. సాక్షి, సిద్దిపేట: విద్యార్థులకు హాస్టళ్లు ఉంటాయని ఇప్పటివరకు తెలుసు.. కానీ సిద్దిపేట జిల్లాలో పశువులకూ ప్రత్యేకంగా హాస్టళ్లను నిర్మిస్తున్నారు. ఒక్కో దానిలో 160 గేదెలు, ఆవులకు వసతి కల్పించి.. పాడి పరిశ్రమ అభివృద్ధికి అధికారులు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఈజీఎస్) నిధులతో పాటు, కమ్యూనిటీ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ (సీఎస్ఆర్) నిధులను జోడించి అన్ని హంగులతో హాస్టల్‌ను నిర్మించారు. ఈ హాస్టల్లో ఎస్సీ కార్పొరేషన్, స్త్రీనిధి రుణాల ద్వారా మహిళలకు అందించిన గేదెలు, ఆవులను పెంచి వాటి ద్వారా వచ్చే ఆదాయంతో వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలోనే తొలి ప్రాజెక్టుగా ఈ జిల్లాలో హాస్టళ్లను నిర్మిస్తున్నారు. తర్వాత ఈ పశువుల హాస్టళ్లను దశల వారీగా రాష్ట్రవ్యాప్తంగా నిర్మించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. బాధ్యత వారిదే.. వ్యవసాయానికి అనుబంధంగాపాడి పరిశ్రమను అభివృద్ధి చేయాలన్న లక్ష్మంతోతలపెట్టిన ఈ పశువుల హాస్టళ్ల నిర్వహణను చిన్న,సన్నకారు రైతులు, మహిళా సంఘాలు తీసుకుంటున్నాయి. పశువులకు గడ్డివేయడం, పాలు పితకడం,వాటి పరిశుభ్రత వంటి పనులను మొత్తం రైతులే చూసుకుంటారు. వారి పనులను బట్టి వాటాలు కేటాయించారు. అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్, స్త్రీనిధి ద్వారా రుణాలు తీసుకొని వచ్చిన పాలను విక్రయించడం, వాటిని ఖాతాలకు జమచేయడం అంతా మహిళలు చూసుకుంటారు. పాలను విజయ డెయిరీ సిబ్బందే నేరుగా హాస్టల్ వద్దకే వచ్చి సేకరించడం, వారం వారం డబ్బులు జమచేయడం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రారంభమైన పొన్నాల గ్రామంలోని పశువుల హాస్టల్ నుంచి రోజుకు 57 గేదెల ద్వారా 150 లీటర్ల పాలను విక్రయిస్తున్నారు. వారం రోజుల్లో పూర్తి స్థాయిలో గేదెలు, ఆవులు వస్తాయని అధికారులు చెబుతున్నారు. సౌకర్యంగా ఉంది ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మాకు రెండు గేదెలు ఇచ్చారు. వాటిని హాస్టల్లో ఉంచడంతో సౌకర్యంగా ఉంది. సమయానికి వచ్చి గడ్డివేస్తున్నాం. ఉదయాన్నే పాలు పితుకుతున్నాం. గేదెలు అన్నీ ఒకేచోట ఉండటంతో కాపలా ఇబ్బంది లేదు. దూడల రక్షణ, వైద్య పరీక్షలు ఇక్కడే చేస్తున్నారు. పాలు కూడా ఇక్కడే విక్రయిస్తున్నాం. అయితే ధర తక్కువగా పెడుతున్నారు. పెంచితే మరింత లాభంగా ఉంటుంది. –పులుసు యాదగిరి, రైతు, పొన్నాల గ్రామం వినూత్నంగా నిర్మాణం మంత్రి హరీశ్‌రావు ఈ హాస్టల్ నిర్మాణాలు వినూత్నంగా ఉండాలని అధికారులకు సూచించారు. ఇప్పటికే గొర్రెల పాకలను లబ్ధిదారుల వారీగా కాకుండా సిద్దిపేట జిల్లాలో గ్రామాన్ని యూనిట్‌గా తీసుకొని నిర్మించారు. ఇవి మంచి ఫలితాలు ఇచ్చాయి. ఈ పాకల్లో అన్ని వసతులు ఒకే చోట ఉండటంతో గొర్రెల కాపరులు లాభాలు పొందుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని సిద్దిపేట జిల్లాలోని ఇర్కొడు, పొన్నాల, నర్మెట, మిట్టపల్లి, గుర్రాలగొంది, ఇబ్రహీంపూర్, జక్కాపూర్, గల్లమల్యాల గ్రామాల్లో నిర్మాణాలకు రూ. కోటి రూపాయల ఈజీఎస్ నిధులు, మరో కోటిరూపాయలను సీఎస్ఆర్ ద్వారా సేకరించారు. ఈ నిధులతో పెద్ద షెడ్లు, కాంపౌండ్, నీటికోసం బోర్లు, వాటర్ ట్యాంక్ నిర్మాణం, డ్రైనేజీ, విద్యుత్, గడ్డికోసే యంత్రం, పాలు నిల్వచేసే గది, కాపలా కోసం వచ్చిన వారు ఉండే గది, పశువులను పరీక్ష చేసేందుకు స్టాండ్ మొదలైనవి నిర్మిస్తున్నారు. ఇప్పటికే పొన్నాల గ్రామంలో హాస్టల్‌ను ప్రారంభించారు. ఇక్కడ అన్ని వసతులూ ఉన్నాయిమా గ్రామంలో నిర్మించిన పశువుల హాస్టల్లో అన్ని వసతులున్నాయి.ఇక్కడ 160 గేదెలు, ఆవులు ఉంచే విధంగాషెడ్ను నిర్మించారు. ఇప్పటికే సగం గేదెలు వచ్చాయి. మిగిలిన వాటి కొనుగోలుకోసం రైతులు, గ్రామస్తులతోపాటు పశువైద్యాధికారులు ఏపీలోని ప్రకాశం జిల్లాకు వెళ్లారు. ఇప్పుడు 50 గేదెలు పాలు ఇస్తున్నాయి. మహిళలకు చేతినిండా పని కల్పించేందుకు ఈ హాస్టల్ ఉపయోగపడుతుంది. –రేణుక, గ్రామ సర్పంచ్, పొన్నాల రైతులకు ఉపయోగకరం పశువుల హాస్టల్‌తో చిన్న, సన్నకారురైతులకు ఉపయోగకరంగా ఉంటుంది.ప్రభుత్వం నుంచి సబ్సిడీ ద్వారా అందించే రుణాలను సద్వినియోగం చేసుకొని గేదెలు, ఆవులు కొనుగోలు చేసుకుంటున్నారు. వసతి కోసం హాస్టల్ ఉంది. సమయానికి వెళ్లి మేతవేయడం, శుభ్రపర్చడం, పాలు పితకడం చేస్తే చాలు. వ్యవసాయంతోపాటు, పశుపోషణ కూడా సాగుతుంది.–మమత, పొన్నాల గ్రామం -
స్మార్ట్ ఫోన్ ఉందా?
సాక్షి, హైదరాబాద్: ‘‘బాబూ.. నేను గురుకుల పాఠశాల నుంచి మాట్లాడుతున్నాను. మీ తల్లిదండ్రులు లేదా తోబుట్టువుల్లో ఎవరికైనా స్మార్ట్‌ఫోన్ ఉందా? ఇంటర్నెట్ ప్యాకేజీ వాడుతున్నారా? వాళ్లు ఏ సమయంలో ఇంట్లో ఉంటారు? వెంటనే కనుక్కుని చెప్పు..’’ ఇదీ గురుకుల పాఠశాలల విద్యార్థుల నుంచి బోధన, బోధనేతర సిబ్బంది సేకరిస్తున్న సమాచారం. అన్‌లాక్ 3.0 ప్రక్రియ లోనూ విద్యాసంస్థల్ని తెరిచేందుకు మోక్షం కలగలేదు. కరోనా విజృంభణతో ఇప్పట్లో తెరుచుకునే అవకాశం కనిపించట్లేదు. దీంతో విద్యార్థులు దారిమళ్లకుండా ఉండేందుకు బోధన, అభ్యసన కార్యక్రమాలను కొనసాగించాలని గురుకుల విద్యాసంస్థల సొసైటీలు భావిస్తున్నాయి. ఇం దులో భాగంగా ఆన్లైన్ తరగతుల నిర్వహణపై కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు ఆన్లైన్ బోధన సాగుతోంది. ఈ క్రమంలో గురుకుల విద్యార్థులు చదువులో వెనుకబడకుండా వారికీ ఆన్లైన్ తరగతులను పూర్తిస్థాయిలో నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. అయితే ఇందుకు అవసరమైన స్మార్ట్ఫోన్లు పిల్లల వద్ద ఏ మేరకు అందుబాటులో ఉన్నాయో తెలుసుకోవాలని భావిస్తున్న సొసైటీలు.. క్షేత్రస్థాయిలో ప్రిన్సిపాల్, టీచర్లకు బాధ్యతలు అప్పగించాయి. తమకందని మౌఖిక ఆదేశాల మేరకు వీరంతా సమాచార సేకరణలో నిమగ్నమయ్యారు. టెన్త్, ఇంటర్ సెకండియర్ వాళ్లకు.. ప్రస్తుతం గురుకుల సొసైటీలు పదోతరగతి, ఇంటర్మీడియట్ సెకండియర్ విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు ప్రారంభించేందుకు దాదాపు ఏర్పాట్లు పూర్తిచేశాయి. ఇప్పటికే మహాత్మాజ్యోతిభా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ పరిధిలోని పాఠశాలలు, కళాశాలల్లో ఆన్లైన్ తరగతులు ప్రారంభించారు. టెన్త్, ఇంటర్ సెకండియర్ వాళ్లకు గత పక్షం రోజులుగా జూమ్, గూగుల్ మీటింగ్ యాప్‌ల్లో ఆన్లైన్ తరగతులు చెబుతున్నారు. ఇంటర్నెట్ ప్యాకేజీలను పరిశీలిస్తే.. అన్ని నెట్‌వర్క్‌ల్లో దాదాపు రోజుకు 1.5 జీబీ డాటా ఉంటుంది. దీంతో రెండు గంటల పాటు ఆన్లైన్ తరగతులు బోధిస్తే దాదాపు ఒక జీబీ డాటా వినియోగమవుతుంది. దీంతో మూడు తరగతులు మాత్రమే బోధిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇందులో ఉదయం రెండు, సాయంత్రం ఒక క్లాస్ ఉంటాయి. విద్యార్థుల తల్లిదండ్రులు, తోబుట్టువులు ఇళ్లలో ఉన్న సమయాన్ని అంచనా వేసి ఇలా ఉదయం, సాయంత్రం తరగతులు చెబుతున్నామని, ఆన్లైన్ తరగతులను తను కూడా స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి మల్లయ్యభట్టు ‘సాక్షి’కి చెప్పారు. 75 శాతం స్మార్ట్ఫోన్లే.. గురుకుల పాఠశాలల్లో ప్రతి తరగతిలో రెండు సెక్షన్లు ఉంటాయి. ఒక్కో సెక్షన్లో గరిష్టంగా 40 మంది పిల్లలున్నారు. ఈ క్రమంలో ప్రతి సెక్షన్లో ఉన్న విద్యార్థులకు వ్యక్తిగతంగా ఫోన్లుచేసి వివరాలు సేకరించి ప్రత్యేక నమూనాలో పొందుపరుస్తున్నారు. ఇప్పటికే మెజార్టీ పాఠశాలలు ఈ సమాచార సేకరణ పూర్తి చేశాయి. ప్రతి తరగతిలో గరిష్టంగా 75 శాతం విద్యార్థుల తల్లిదండ్రులు లేదా అన్న, అక్కల్లో ఒకరు స్మార్ట్‌ఫోన్ వాడుతున్నట్లు గుర్తించారు. తరగతుల వారీగా పరిశీలిస్తే కొన్ని సెక్షన్లలోని విద్యార్థుల వద్ద నూరు శాతం స్మార్ట్ ఫోన్లు ఉన్నట్లు విశ్లేషిస్తున్నారు. -
అద్దె డబ్బు చెల్లిస్తేనే లగేజీకి మోక్షం!
గురజాలకు చెందిన సురేంద్ర లక్ష్మీపురంలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉండేవాడు. గుంటూరు నగర శివారులోని ఓ ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. తానుంటున్న హాస్టల్‌కు నెలకు రూ.4 వేల అద్దె చెల్లించేవాడు. లాక్డౌన్ నేపథ్యంలో హాస్టల్ నుంచి మార్చి 21న తన సొంత ఊరు గురజాలకు వెళ్లిపోయాడు. సోమవారం లక్ష్మీపురంలో తాను ఉంటున్న హాస్టల్‌కు వచ్చాడు. హాస్టల్ నుంచి లగేజీ తీసుకువెళ్లాలంటే నెలకు రూ.3 వేల చొప్పున నాలుగు నెలలకు రూ.12 వేలు కట్టాలని హాస్టల్ యజమాని తేల్చి చెప్పాడు. మీరు లేకపోయినా తాను హాస్టల్ అద్దె, కరెంటు బిల్లులు కట్టాలని యజమాని లగేజీ ఇవ్వడానికి ఒప్పుకోలేదు. దీంతో వాగ్వాదానికి దిగిన అతను తన లగేజీని హాస్టల్లోనే వదిలి వెళ్లిపోయాడు. ఈ సమస్య ఒక్క సురేంద్రదే కాదు దాదాపుగా ప్రైవేట్ హాస్టళ్లలో ఉన్న చాలా మంది విద్యార్థులది. సాక్షి, అమరావతి బ్యూరో: గుంటూరు నగరం, పరిసర ప్రాంతాల్లో ఉండే విద్యా సంస్థల్లో చదవడానికి వేలాది మంది విద్యార్థులు గుంటూరు జిల్లాతో పాటు రాష్ట్రం నలుమూల నుంచి వస్తుంటారు. బయట ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే వారు హాస్టల్లో ఉంటూ కళాశాలలకు వెళుతుంటారు. పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న యువత, వివిధ రకాల కోర్సులు చేసే విద్యార్థులు, చిన్న ఉద్యోగాలు, వ్యాపారాలు చేసేవారు హాస్లల్‌లో చేరుతుంటారు. గదులు అద్దెకు తీసుకుని వంట చేసుకుని ఉండడం కన్నా.. హాస్టల్లో ఉండడానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. హాస్టల్లో టైం ఆహారం, మినరల్ వాటర్, స్నానానికి వేడి నీళ్లు, ఇంటర్నెట్ సదుపాయం వంటివి వారికి అందుబాటులో ఉంటాయి. ఇటువంటి వారి కోసం దాదాపు నగరంలో 300 దాకా చిన్నా, పెద్ద ప్రైవేట్ హాస్టళ్లు ఉన్నాయి. దాదాపు 2,500 మంది హాస్టళ్లలో ఉంటున్నారు. వీరిలో విద్యార్థులే అధికం. ప్రస్తుతం నగరంలో నెలకు రూ.4 నుంచి రూ.6 వేల దాకా హాస్టల్ ఫీజలు వసూలు చేస్తున్నారు. అంత డబ్బు ఎలా కట్టాలి? కరోనా నేపథ్యంలో ప్రైవేట్ హస్టళ్లలో ఉండే విద్యార్థులు నాలుగు నెలలుగా హాస్టల్ వదిలి ఇంటిపట్టున ఉంటున్నారు. తిరిగి కొద్ది రోజుల్లో విద్యాసంస్థలు ప్రారంభమవుతాయన్న ఆలోచనతో వారి లగేజీ ఇక్కడే వదలి వెళ్లారు. కరోనా రోజురోజుకూ పెరిగిపోతుండడం, ఇప్పట్లో విద్యా సంస్థలు ప్రారంభం కావన్న ఆలోచనతో విద్యార్థులు లగేజీ కోసం హాస్టల్‌కు వస్తున్నారు. అయితే హాస్టళ్ల యజమానులు నెలకు రూ.3 వేలు దాకా కట్టమని డిమాండ్ చేస్తున్నారని, ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలని ప్రశ్నిస్తున్నారు. లగేజీ ఉంచుకున్నందుకు నెలకు రూ. వెయ్యి దాకా అయితే కట్టగలమని తేల్చిచెబుతున్నారు. కొంత మంది విద్యార్థులు రూ.12 వేలు కట్టడం కన్నా ఉన్న ఆ కొద్ది లగేజీని వదిలి డబ్బులు కట్టకుండా తిరిగి వెళుతున్నారు. ఇటువంటి వారితో పలు హాస్టళ్ల వద్ద వాగ్వాదాలు జరుగుతున్నాయి. లాక్‌డౌన్‌తో చాలా నష్టపోయాం నాలుగు నెలలుగా విద్యార్థులు హాస్టల్ నుంచి వెళ్లిపోవడంతో ఆర్థికంగా చాలా దెబ్బతిన్నామని ప్రైవేట్ హాస్టల్ యజమానులు వాపోతున్నారు. అప్పటి నుంచి తమకు అద్దె, మెస్ ఫీజులు చెల్లించలేదని, తాము మాత్రం హాస్టల్ భవనం అద్దెలు, కరెంటు చార్జీలు చెల్లిస్తున్నామని చెబుతున్నారు. హాస్టల్లో లగేజీ ఉండడంతో వాచ్మెన్లకు పూర్తి జీతాలు, ఇతర సిబ్బంది వెళ్లిపోకుండా వారికి సగం జీతాలు ఇస్తున్నామన్నారు. వీటన్నింటికి అప్పులు తెచ్చి కడుతున్నామంటున్నారు. విద్యార్థులు కొంతమంది లగేజీ తక్కువగా ఉండడంతో డబ్బులు కట్టకుండా లగేజీ వదిలి వెళ్లిపోతున్నారని, ఇలాంటి వారి వల్ల చాలా నష్టపోతున్నామనిలబోదిబోమంటున్నారు. -
తెరుచుకున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతిగృహాలు
పాల్వంచ రూరల్: కరోనా లాక్‌డౌన్‌తో మూతపడిన సంక్షేమ వసతి గృహాలు పదో తరగతి విద్యార్థుల కోసం తిరిగి తెరుచుకున్నాయి. మార్చిలో వాయిదా పడిన ‘పది’ పరీక్షలు తిరిగి ఈనెల 8 నుంచి నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ.. మొత్తం 66 హాస్టళ్లను సోమవారం పునః ప్రారంభించారు. రేపటి(గురువారం) నుంచి విద్యార్థులను హాస్టళ్లలోకి అనుమతిస్తారు. గతంలో హాస్టళ్లలో ఉంటూ చదువుకున్న విద్యార్థులు ప్రస్తుతం కరోనా లాక్‌డౌన్‌తో ఇంటి వద్దే ఉంటున్నారు. అయితే ఇప్పుడు దూర ప్రాంతాల నుంచి వచ్చి పరీక్షలు రాయడం క్షేమం కాదని, భోజన సౌకర్యం లేకుంటే ఇబ్బంది పడతారని భావించిన ప్రభుత్వం.. హాస్టళ్లను తెరవాలని నిర్ణయించింది. పరీక్షలకు 3,298 మంది హాస్టళ్ల విద్యార్థులు.. జిల్లాలో ఐటీడీఏ పరిధిలో 39 గిరిజన ఆశ్రమ పాఠశాలలు ఉండగా, 23 బాలుర, 16 బాలికల హాస్టళ్లు ఉన్నాయి. పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే బాలురు 1,253 మంది కాగా, బాలికలు 1,630 మంది ఉన్నారు. బీసీ సంక్షేమ వసతి గృహాలు బాలురకు 11 ఉండగా 180 మంది, 5 బాలికల హాస్టళ్లలో 55 మంది ఉన్నారు. ఎస్సీ హాస్టళ్లుబాలికలకు 4, బాలురకు 7 ఉన్నాయి. వీటిలో 93 మంది బాలురు, 87 మంది బాలికలు పదో తరగతి చదువుకుంటున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కలిపి మొత్తం 66 హాస్టళ్లకు 3,298 మంది పదో తరగతి విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. గదికి నలుగురే.. పరీక్షలు పూర్తయ్యేంతవరకు విద్యార్థులంతా హాస్టళ్లలోనే నివాసం ఉండాలి. అయితే కరోనా నివారణ చర్యల్లో భాగంగా ఒక్కో గదిలో నలు గురు విద్యార్థులు మాత్రమే ఉండేలా అధికారులు చర్యలు చేపట్టారు. హాస్టళ్లకు వచ్చే ముందే విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. ప్రతిరోజూ శానిటైజ్, థర్మల్ స్క్రీనింగ్ చేస్తారు. అందరికీ మాస్క్‌లు అందజేస్తారు. భౌతికదూ రం పాటించేలా వార్డెన్లు అవగాహన కల్పిస్తారు. పరీక్ష రాసి తిరిగి వచ్చేటప్పుడు కాళ్లు, చేతులు శుభ్రం చేసుకున్న తర్వాతే లోనికి అనుమతిస్తారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం.. పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థుల కోసం ప్రత్యేక మెస్ ఏర్పాటు చేస్తున్నట్లు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి పి.వెంకటేశ్ తెలిపారు. ప్రతిరోజూ ఆల్పాహారంగా ఇడ్లీ, లేదా కిచిడీ పెడతామన్నారు. ఉదయం, సాయంత్రం స్నాక్స్, కాఫీ, రాగి జావ అందిస్తామని, బుధ, ఆది వారాల్లో చికెన్‌తో భోజనం, ప్రతిరోజు కోడిగుడ్డు, వారానికి ఆరు రోజులు ఆరటిపండు, శనివారం స్వీట్ అందజేస్తామని వివరించారు. విద్యార్థులకు కరోనా వైరస్ రాకుండా అన్ని జాగ్రత్త చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఎస్టీ హాస్టల్ విద్యార్థులకు భోజనంతో పాటు బూస్ట్ పాలు, బిస్కెట్లు అందించనున్నట్లు గిరి జన సంక్షేమ శాఖ పీఎంఓ రమణయ్య తెలిపారు. బీసీ హాస్టళ్లలో విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు ఏఎన్ఎంలను అందుబాటులో ఉంచుతున్నట్లు బీసీ సంక్షేమాధికారి సురేందర్ తెలిపారు. -
హాస్టలర్స్ అందోళన: స్పందించిన కేటీఆర్, డీజీపీ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో లాక్డౌన్ నేపథ్యంలో నగరంలోని హాస్టళ్లు, పీజీ మెస్‌లు మూసివేయాల్సిన అవసరం లేదని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ విస్పష్ట ప్రకటన చేశారు. బుధవారం సాయంత్రం నుంచి హస్టళ్లు మూసివేస్తున్నారని అసత్య ప్రచారం జరుగుతుండటంతో హాస్టలర్స్ అయోమయానికి గురైన సంగతి తెలిసిందే. అంతేకాకుండా తమను తమ ఊళ్లకు పంపించాలని ప్రభుత్వాన్ని, పోలీసులను కోరారు. దీంతో హాస్టలర్స్ ఆందోళన నేపథ్యంలో మంత్రి కేటీఆర్ వారి సమస్యలపై స్పందించారు. హాస్టళ్ల యజమానులతో సంప్రదింపులు జరపాలని నగర కమిషనర్‌కు, మేయర్‌కు ఆదేశాలు జారీ చేశారు. దీంతో రంగంలోకి దిగిన నగర మేయర్, పోలీస్ కమిషనర్ పరిస్థితిని సమీక్షించారు. అనంతరం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. హాస్టళ్లు మూసివేస్తున్నారనేది తప్పుడు వార్త అని కొట్టి పారేశారు. లాక్డౌన్ సందర్భంగా ఒక్క హాస్టల్ కూడా మూసివేయలేదని తెలిపారు. అవసరమైతే జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో విద్యార్థులకు భోజన వసతి ఏర్పాటు చేస్తామని మేయర్ పేర్కొనడంతో హాస్టలర్స్‌కు కాస్త ఊరట లభించింది. దీంతో తిరిగి హాస్టల్స్‌కు, పీజీ మెస్‌లకు విద్యార్థులు, ఉద్యోగులు చేరుకుంటున్నారు. హాస్టళ్ల నుంచి ఖాళీ చేయించొద్దు: తెలంగాణ డీజీపీ లాక్డౌన్ నేపథ్యంలో హాస్టళ్లలో ఉండే విద్యార్థులను ఖాళీ చేయించొద్దని నిర్వాహకులకు తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి సూచించారు. హాస్టల్లో ఉండే విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు పంపొద్దని అధికారులను ఆయన ఆదేశించారు. లాక్డౌన్ ఉన్నందున ఎవరూ ఇళ్లు విడిచి వెళ్లొద్దని సూచించారు. స్వస్థలాలకు వెళ్లేందుకు ఇప్పటి వరకు పోలీసులు ఇచ్చిన అనుమతి పత్రాలేవీ చెల్లవని డీజీపీ స్పష్టం చేశారు. పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు హాస్టళ్ల నిర్వాహకులతో మాట్లాడాలని మహేందర్‌రెడ్డి ఆదేశించారు. -
హాస్టల్లో విద్యార్థిని ఆత్మహత్య
కర్ణాటక,శివమొగ్గ: బాలిక ఉరేసుకున్న స్థితిలో మరణించిన సంఘటన సోమవారం నగరంలోని ప్రైవేటు పాఠశాలలో చోటు చేసుకుంది. శికారిపురకు చెందిన కావ్య (15) నగరంలోని మేరి ఇమ్యాక్యులేట్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుకుంటూ అదే పాఠశాలకు చెందిన హాస్టల్లో ఉండేది. ఈ క్రమంలో సోమవారం హాస్టల్ స్టోర్‌రూమ్‌లో కావ్య ఉరేసుకొన్న స్థితిలో శవమై తేలింది. గమనించిన పాఠశాల సిబ్బంది హాస్టల్లో ఉంటున్న మిగతా విద్యార్థులను ఇళ్లకు పంపించి పోలీసులకు సమాచారం అందించారు. పాఠశాలకు చేరుకున్న కోటా పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కావ్య ఆత్మహత్యపై తల్లితండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. కాగా గతనెలలో జరిగిన పరీక్షల్లో కన్నడలో తక్కువ మార్కులు రావడంతో ఉపాధ్యాయులతో పాటు తల్లితండ్రులు కూడా ప్రశ్నించడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. -
స్కూల్ హాస్టల్లో బిడ్డకు జన్మనిచ్చిన విద్యార్థిని
రాయ్‌పూర్ : ఛతీస్‌గఢ్‌లో దారుణం చోటు చేసుకుంది. పాఠశాల వసతి గృహంలో ఓ మైనర్ విద్యార్థిని బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన దంతేవాడ జిల్లా పతారాస్ జిల్లాలో చోటు చేసుకుంది. పతారాస్ గ్రామానికి చెందిన బాలిక దంతేవాడలోని ఒక పాఠశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆ బాలిక తన గ్రామానికి చెందిన యువకుడితో రెండేళ్లుగా ప్రేమలో ఉంది. దీంతో ఆమె గర్భం దాల్చింది. ఆ బాలిక తాను చదువుకుంటున్నపాఠశాలకు సంబంధించిన హాస్టల్లోనే నిర్జీవ శిశువుకు జన్మనిచ్చింది. విషయం తెలిసిన డిప్యూటీ కలెక్టర్ హాస్టల్‌ను సందర్శించి.. వివరాలు సేకరించారు. సూపరింటెండెంట్‌ను సస్పెండ్ చేశారు. బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాలిక జన్మనిచ్చిన మృత శిశువును ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని డిప్యూటీ కలెక్టర్ తెలిపారు. -
ఎస్వీయూలో కలకలం
సాక్షి, చిత్తూరు: ఎస్వీయూ ఇంజినీరింగ్ కళాశాల వసతి గృహంలో పనిచేస్తున్న టైం స్కేల్ ఉద్యోగి రామచంద్రయ్య ఆత్మహత్య క్యాంపస్‌లో కలకలం రేపుతోంది. ఈ సంఘటనతో విద్యార్థుల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. ఈ నేపథ్యంలో ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్, వార్డు వార్డెన్ పదవులకు రాజీనామా చేశారు. దీనిపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు. ఈ సంఘటన క్యాంపస్‌లో సంచలనం రేపుతోంది. ఈ ఉద్యోగి తాను చనిపోయే ముందు తన చావుకు కారణాన్ని వీడియోలో రికార్డు చేసి పంపడం పలు ఆలోచనలకు రేకెత్తిస్తుంది. హాస్టల్ వార్డెన్, సూపరింటెండెంట్, మరో ఉద్యోగి తనను ఇబ్బందులకు గురిచేశారని వారిని నమ్మొద్దని, వసతి గృహం జాగ్రత్త అని విద్యార్థులకు తన వీడియో ద్వారా హెచ్చరించారు. అసలేం జరుగుతోంది ? ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాల 2017లో వరుస వివాదాల్లో చిక్కుకుంది. గత ఏడాది జూన్‌లో రెగ్యులర్, డ్యూయల్ డిగ్రీ కోర్సు విద్యార్థుల మధ్య గొడవలు పెరగడంతో అప్పటి ప్రిన్సిపల్ పద్మనాభం తన పదవికి రాజీనామా చేశారు. ఈ దశలో ప్రిన్సిపల్‌గా ప్రదీప్‌కుమార్ బాధ్యతలు చేపట్టారు. వార్డెన్‌గా పనిచేస్తూ వచ్చిన చెంగయ్యను తొలగించాలని కోరుతూ ఈఏడాది జూన్‌లో విద్యార్థులు ఆందోళన చేశారు. దీంతో ఆయన్ను తొలగించి సత్యనారాయణ మూర్తిని వార్డెన్‌గా నియమించారు. అయితే ఈ దశలో వసతిగృహంలో అనేక అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో స్టోర్ ఇన్చార్జ్గా ఉన్న రామచంద్రయ్యను వేరే చోటికి బదిలీ చేశారు. ఇదిలా ఉంటే ఆయన ఆత్మహత్యకు పాల్పడే ముందు వసతి గృహంలో తనపై నిందలు మోపారని వార్డెన్ సూపరింటెండెంట్ మరో ఉద్యోగిని నమ్మొద్దంటూ తాను విడుదల చేసిన వీడియోలో హెచ్చరించారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు బుధవారం ఆందోళన చేయడంతో వార్డెన్‌తో పాటు ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపాల్ తమ పదవులకు రాజీనామా చేశారు. విద్యార్థుల ఆందోళన ఎస్వీ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల అనుబంధ వసతి గృహంలో స్టోర్ ఇన్చార్జ్గా పనిచేస్తూ 10 రోజుల క్రితం అదే వసతి గృహంలో వేరే విధులకు బదిలీ అయిన టైంస్కేల్ ఉద్యోగి రామచంద్రయ్య(52) మృతిపట్ల ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు భగ్గుమన్నారు. బుధవారం తరగతులు బహిష్కరించి పరిపాలన భవనం ఎదుట ఆందోళనకు దిగారు. తమతో ఆత్మీయంగా ఉంటూ సేవలు అందిస్తున్న ఉద్యోగి ఆత్మహత్య విద్యార్థులను ఎంతో కలతకు గురిచేసింది. దీంతో విద్యార్థులు పరిపాలనా భవనం ఎదుట బైఠాయించి ధర్నాచేశారు. వార్డెన్, ప్రిన్సిపాల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థుల ఆందోళనకు వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్.రాజశేఖర్‌రెడ్డి , యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి బి. ఓబుల్ రెడ్డి మద్దతు ప్రకటించారు. అధికారుల వేధింపుల వల్లే ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. ఎస్వీయూ ఇంజినీరింగ్ కళాశాల వసతి గృహంలో పెద్ద ఎత్తున అవినీతి చోటుచేసుకుంటోందని, దీనిపై విచారణ జరిపి కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు ప్రేమ్, సదాశివ, ముని, ప్రభు, మురళీకృష్ణ పాల్గొన్నారు. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో ప్రిన్సిపాల్ ప్రదీప్‌కుమార్, వైస్ ప్రిన్సిపాల్ నాగేంద్రప్రసాద్, వార్డెన్ సత్యనారాయణమూర్తి, తమ పదవులకు రాజీనామా చేశారు. ఉద్యోగికి న్యాయం చేయాలి ఎస్వీయూ ఇంజినీరింగ్ కళాశాల వసతి గృహంలో పనిచేస్తూ మృతిచెందిన టైంస్కేల్ ఉద్యోగి రామచంద్రయ్య కుటుంబానికి తగిన న్యాయం చేయాలని టైంస్కేల్ అసోసియేషన్ అధ్యక్షుడు సుబ్రమణ్యంరెడ్డి రిజిస్ట్రార్‌ను కోరారు. ఆయన కుటుంబ సభ్యులకు టైంస్కేల్ ఉద్యోగం ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. తమ అభ్యర్థనకు రిజిస్ట్రార్ సానుకూలంగా స్పందించినట్లు ఆయన చెప్పారు. -
జేఎన్‌యూ విద్యార్థులపై లాఠీచార్జి
న్యూఢిల్లీ: హాస్టల్ ఫీజుల పెంపునకు నిరసనగా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) విద్యార్థులు సోమవారం చేపట్టిన పార్లమెంట్ మార్చ్ ఉద్రిక్తతలకు దారి తీసింది. ఫీజుల పెంపును నిరసిస్తూ వర్సిటీ నుంచి పార్లమెంట్ వైపు ర్యాలీగా బయలుదేరిన విద్యార్థులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడు ఆయిషీ ఘోష్ సహా దాదాపు 100 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. పలువురిపై లాఠీ చార్జ్ చేశారు. పోలీసుల దాడిలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. సోమవారం నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకున్నారు. ఫీజులు తగ్గించాలన్న డిమాండ్‌తో జేఎన్‌యూ విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఢిల్లీ వీధుల్లో నినాదాలు చేసుకుంటూ ముందుకుసాగారు. పార్లమెంటు భవనం వద్దకు వెళ్లేందుకు యత్నించడంతో అప్రమత్తమైన పోలీసులు సఫ్దర్‌గంజ్ సమాధి వద్ద వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడే బైఠాయించి విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. పార్లమెంట్ సమీపంలో ఉన్న మూడు మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేశారు. ఉద్యోగ్ భవన్, పటేల్ చౌక్ మెట్రో స్టేషన్లలో రైళ్ల హాల్టింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. నెల్సన్ మండేలా మార్గ్, అరబిందోమార్గ్, బాబా గంగానాథ్ మార్గ్‌లలో పలు ఆంక్షలు విధించారు. విద్యార్థుల ఆందోళనలతో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. కాగా, పోలీసుల తీరుపై విద్యార్థులు విరుచుకుపడ్డారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పోలీసుల దాడిలో గాయపడిన విద్యార్థుల చిత్రాలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘ఎమర్జెన్సీ ఇన్ జేఎన్‌యూ’పేరుతో ట్యాగ్ చేశారు. ఈ ట్యాగ్ ట్విట్టర్లో ట్రెండ్ అయింది. త్రిసభ్య కమిటీ ఏర్పాటు.. జేఎన్‌యూలో సాధారణ పరిస్థితులు నెలకొల్పే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. దీనిలో భాగంగా ముగ్గురు సభ్యులతో కూడిన హైపవర్ కమిటీని ఏర్పాటుచేసినట్లు కేంద్ర మానవ వనరుల శాఖ కార్యదర్శి ఆర్.సుబ్రహ్మణ్యం వెల్లడించారు. ఈ కమిటీలో యూజీసీ మాజీ చైర్మన్ వీఎస్ చౌహాన్, ఏఐసీటీఈ చైర్మన్ అనిల్ సహస్రబుద్ధ, యూజీసీ కార్యదర్శి రజనీష్ జైన్ సభ్యులుగా ఉండనున్నారు. ఈ కమిటీకి యూజీసీ సహకారం అందించనుంది. -
ఫీజు పెంపుపై కొద్దిగా వెనక్కి
న్యూఢిల్లీ: విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ఫీజుల పెంపు నిర్ణయంపై జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) వెనక్కి తగ్గింది. ఎలాంటి స్కాలర్షిప్ తీసుకోని పేద(బీపీఎల్) విద్యార్థులకు హాస్టల్ ఫీజు పెంపును తాత్కాలికంగా రద్దుచేసింది. వర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (ఈసీ) బుధవారం ఈ మేరకు నిర్ణయించింది. వర్సిటీలో విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో క్యాంపస్ వెలుపల ఈసీ సమావేశమైంది. ఈ నిర్ణయాన్ని కంటితుడుపు చర్యగా పేర్కొన్న విద్యార్థి సంఘాలు తమ ఆందోళనను కొనసాగించాలని నిర్ణయించాయి. వర్సిటీ సర్వీస్ చార్జి రూ.1,700 పెంచడంతోపాటు వన్‌టైమ్ మెస్ సెక్యూరిటీ ఫీజును రూ.5,500 నుంచి రూ.12,000 వేలకు పెంచింది. బీపీఎల్‌యేతర విద్యార్థులకు ఉపశమనం కలిగించలేదు. -
గంజాయి సరఫరా డోర్ డెలివరీ..
సాక్షి.సిటీబ్యూరో: విద్యార్థులు, యువతను టార్గెట్‌గా చేసుకుని కొందరు గంజాయి స్మగ్లర్లు యథేచ్చగా దందా కొనసాగిస్తున్నారు. ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా నేరుగా వారు ఉంటున్న ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. విద్యార్థులు బసచేసే హాస్టల్ గదులు, కళాశాలల సమీపంలోని నిర్మానుష్య ప్రాంతాలే గంజాయి విక్రయ కేంద్రాలుగా మారుతున్నాయి. ప్రైవేట్ హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులను టార్గెట్‌గా చేసుకుని గంజాయి విక్రయిస్తున్న అరవింద్ అనే యువకుడిని ఈ నెల 2న పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసి, అతడి నుంచి కిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అతను గత కొన్ని రోజులుగా మంగళ్‌హట్‌కు చెందిన కిషోర్ సింగ్ అనే వ్యక్తి నుంచి కిలోల చొప్పున గంజాయి కొనుగోలు చేసి ప్యాకెట్లుగా మార్చి విద్యార్థులకు విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. గత రెండేళ్లలో ఒక్క ధూల్‌పేట ప్రాంతంలోనే గంజాయి కొనుగోలు చేస్తున్న ఐదువేల మందికి పైగా విద్యార్థులను అదుపులోకి తీసుకున్న అబ్కారీ శాఖ అధికారులు వారికి తల్లిదండ్రుల సమక్షంలోనే కౌన్సెలింగ్ నిర్వహించారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇటీవల వరుస పండుగలు, నూతన ఎక్సైజ్ పాలసీ నేపథ్యంలో బిజీగా ఉన్న అబ్కారీ అధికారులు గంజాయి రవాణాపై దృష్టి సారించకపోవడంతో నగరంలో గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. డోర్ డెలివరీ.. నగరంలోని అమీర్‌పేట, ఎస్ఆర్నగర్, కూకట్పల్లి, మెహిదీపట్నం , హయత్‌నగర్, దిల్సుఖ్నగర్, బీఎన్.రెడ్డి నగర్, హస్తినాపురం, ఉప్పల్, రాజేంద్రనగర్, బాచుపల్లి , ఇబ్రహీంపట్నంతో పాటు శివారు ప్రాంతాల్లో వందల సంఖ్యలో ప్రైవేట్ హాస్టళ్లు వెలిశాయి. వాటిలో వేల సంఖ్యలో విద్యార్ధులు బస చేస్తున్నారు. హాస్టళ్ల నిర్వాహకులు విద్యార్థులకు భోజనం, ఇతర వసతులు ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఇతర విషయాలను పట్టించుకోకపోవడంతో ఇదే అదనుగా కొందరు విద్యార్థులు హాస్టల్ గదుల్లోనే సిగరేట్లలో గంజాయి నింపుకుని సేవిస్తున్నారు. వీరిని టార్గెట్‌గా చేసుకున్న కొన్ని ముఠాలు నేరుగా హాస్టళ్లకే గంజాయి సరఫరా చేస్తున్నాయి. వివిధ మార్గాల్లో నగరానికి.. ఏపీలోని విశాఖపట్నం, అరుకుతో పాటు ఒరిస్సా, ఛత్తీస్ గడ్ రాష్ట్రాల నుంచి నగరానికి అక్రమంగా గంజాయి రవాణా జరుగుతోంది. అక్కడ కిలో రూ. 1000 చొప్పున కొనుగోలు చేసి రోడ్డు లేదా రైలు మార్గాల ద్వారా నగరానికి తరలిస్తున్నారు. పోలీసులు అనుమానించకుండా ఖరీదైన వాహనాలతో పాటు, ఇతర సరకులతో పాటు లారీల్లో తరలిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు మూడు కమిషనరేట్ల పరిధిలో పోలీసులు 10 టన్నులకు పైగా గంజాయిని స్వాధీనం చేసుకోవడం గమనార్హం. రవాణాదారుల నుంచి గంజాయి కొనుగోలు చేసే స్థానిక వ్యాపారులు సురక్షితమైన ప్రాంతాల్లో నిల్వ చేసుకుని గుట్టుచప్పుడు కాకుం డా నగరంలో విక్రయిస్తున్నారు. 20 గ్రాముల చొప్పున ప్యాకెట్లలోకి మార్చి యువతకు అంటగడుతున్నారు. ధర తక్కువ..మత్తెక్కువ.. కొకైన్, బ్రౌన్ షుగర్, ఎల్ఎస్టీ తదితర మత్తు పదార్థాలు గ్రాము ధర రూ.వేలల్లో ఉండటంతో సంపన్న కుటుంబాలకు చెందిన యువత వీటిని కొనుగోలు చేస్తున్నారు. అయితే గంజాయి 20 గ్రాముల ప్యాకెట్ రూ. 100 నుంచి 200 మధ్యలో లభ్యమవుతుండటంతో విద్యార్థులు, యువత దీని పట్ల ఆకర్షితులవుతున్నారు. మొదట సిగరెట్లకు అలవాటు పడి ఆ తర్వాత క్రమంగా గంజాయి వైపు మొగ్గు చూపుతున్నారు. ఇటీవల స్నేహితులతో కలిసి చేసుకునే పార్టీల్లో గంజాయి ప్రధానం ఉంటున్నట్లు సమాచారం. రూట్ మార్చిన స్మగ్లర్లు ... గతంలో ధూల్‌పేట, మంగళ్‌హాట్ ప్రాంతాలు గుడుంబా, నాటుసారాకు కేంద్రాలుగా ఉండేవి. ప్రభుత్వం గుడుంబా తయారీపై కఠిన చర్యలు తీసుకోవడంతో పలువురు ఈ దందాను వదిలేశారు. అయితే ఈజీమనీకి అలవాటు పడిన కొందరు వ్యక్తులు రూటు మార్చుకుని ఇతర ప్రాంతాల నుంచి గంజాయిని తెప్పించి ప్యాకెట్లుగా మార్చి విక్రయిస్తున్నారు. గోల్కొండ, సీతాఫల్మండి, టక్కర్ వాడీ, జుమ్మేరాత్ బజార్ తదితర ప్రాంతాల్లో గంజాయి ప్యాకెట్లు విక్రయించే ముఠాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఆయా ముఠా ముఖ్యులపై వారిపై పోలీసులు, ఎక్సైజ్ అధికారుల నిఘా పెంచడంతో వారు ఇతర ప్రాంతాల్లో తలదాచుకుంటూ అనుచరుల ద్వారా తమ దందా కొనసాగిస్తున్నారు. -
వీడెంత దుర్మార్గుడో చూడండి
రాయ్‌పూర్: బాలింత అని కూడా చూడకుండా మహిళను దారుణంగా రోడ్డు మీదకు ఈడ్చిపారేసిన అమానవీయ ఘటన ఛత్తీస్‌గఢ్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. కొరియా జిల్లా జానక్‌పూర్ బ్లాక్‌లోని బార్వానీ కన్య ఆశ్రమంలో ఈ దారుణం జరిగింది. హాస్టల్ సూపరింటెండెంట్ సుమిళ సింగ్ భర్త రంగ్లాల్ సింగ్ ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో సుమిళ సింగ్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఆమె స్థానంలో లీలావతి అనే మహిళను కొత్త సూపరింటెండెంట్‌గా నియమించారు. అసలేం జరిగింది..? హాస్టల్లో పనిచేస్తున్న ఓ మహిళ తన 3 నెలల బిడ్డతో కలిసి అక్కడే ఓ గదిలో ఉంటోంది. రూము ఖాళీ చేయాలని ఈనెల 10న ఆమెకు రంగ్లాల్ హుకుం జారీ చేశాడు. ఖాళీ చేసేందుకు ఆమె నిరాకరించడంతో బలప్రయోగానికి దిగాడు. మంచం మీద కూర్చున్న ఆమెను దుప్పటితో సహా కిందికి ఈడ్చిపాడేశాడు. అంతటితో ఆగకుండా బాధితురాలిని బలవంతంగా బయటకు లాక్కుపోయాడు. సుమిళ సమక్షంలో ఈ దారుణమంతా జరిగినా భర్తను ఆమె వారించకపోవడం గమనార్హం. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఈనెల 11న పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు. గిరిజన సంక్షేమ శాఖ అధికారులు, అధికార కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఆదివారం బాధితురాలిని పరామర్శించి, ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. #WATCH Chhattisgarh:Ranglal Singh,husband of School Superintendent Sumila Singh misbehaved with a cleaner at Barwani Kanya Ashram in Korea, after she took shelter at students' hostel with her 3-month-old baby.Police says,“FIR filed.Probe on.Accused will be arrested soon.” (18.08) pic.twitter.com/NFayVvh8GZ — ANI (@ANI) August 19, 2019 -
బాలుర వసతిగృహాన్ని పరీశీలించిన ఎమ్మెల్యే
-
హాస్టల్లో ఉండటం ఇష్టం లేక..
మీర్‌పేట: హాస్టల్లో ఉంటూ చదువుకోవడం ఇష్టంలేక ఓ విద్యార్థిని ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా, మాడ్గుల మండలం, నర్సంపల్లి గ్రామానికి చెందిన వల్లదాసు పెద్దయ్య బతుకుదెరువు నిమిత్తం కుటుంబంతో సహా నగరానికి వలస వచ్చి జిల్లెలగూడ బాలాజీనగర్‌లో ఉంటున్నాడు. అతడి పెద్ద కుమార్తె మౌనిక (17)ను ఇంటర్మీడియట్ చదివేందుకు సిద్దిపేట జిల్లా, సముద్రాల గ్రామంలోని ప్రభుత్వ మోడల్ హాస్టల్లో చేర్పించాడు. హాస్టల్లో ఉండి చదువుకోవడం ఇష్టం లేదని ఆమె పలుమార్లు తల్లిదండ్రులకు చెప్పింది. ఈ నెల 22న హాస్టల్ నుంచి ఇంటికి వచ్చింది. మంగళవారం ఉదయం తల్లి అలివేలు బయటికు వెళ్లగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో మౌనిక చున్నీతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హాస్టల్లో ఉండటం ఇష్టం లేకే మౌనిక ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. -
గురుకుల హస్టల్‌ను తనిఖీ చేసిన ఎంపీ,ఎమ్మెల్యే
-
అర్ధరాత్రి అభ్యంతరకరంగా సంచరిస్తున్న జంటలు..
హిమాయత్‌నగర్:‘‘సర్.. ఇంత వరకు నేను ఏ పోలీసు స్టేషన్ మెట్లక్కలేదు. స్థానిక పోలీసులు స్పందించడం లేదు. కొంతమంది చేస్తున్న న్యూసెన్స్‌ను అరికట్టమని పాలీస్ బాస్‌గా మీ వద్దకు వచ్చాం. దయచేసి యాక్షన్ తీసుకోండి’’. ‘‘సర్.. మా ఇంటి పరిసరాల్లో పుట్టగొడుగుల్లా హాస్టల్స్ పుట్టుకొచ్చాయి. వాటిలో ఎన్ని హాస్టళ్లకు అనుమతులున్నాయో తెలియదు. వాళ్లు చేసే న్యూసెన్స్ వల్ల మేము పగలు రాత్రి నిద్రాహారాలు మానుకోవాల్సి వస్తోంది. దయచేసి చర్యలు తీసుకోండి’’. మార్చి 25న ఒకే రోజు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్‌ను కలిసిన హిమాయత్‌నగర్‌కు చెందిన ఇద్దరు మహిళలు చేసిన లిఖితపూర్వక ఫిర్యాదులివి. యాక్షన్ తీసుకోవాలంటూ ఈ ఇద్దరు అధికారులు ఆదేశాలు జారీ చేసి దాదాపు నెల కావొస్తున్నా ఇప్పటి వరకు కింది స్థాయి అధికారులు తీసుకున్న చర్యలు మాత్రం శూన్యం. పోలీసులు నామ్‌కే వాస్తేగా ఒక్కరోజు వచ్చి పది నిమిషాలు గస్తీ నిర్వహించి వెళ్లిపోయారు. ఇక జీహెచ్ఎంసీ సిబ్బంది అయితే ఇటువైపు కనీసం కన్నెత్తి కూడా చూడకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. ♦ అర్దరాత్రి న్యూసెన్స్.. హిమాయత్‌నగర్‌లోని తెలుగు అకాడమీ సమీపంలోని, విఠల్‌వాడీ మసీదు వెనక గల్లీలో సుమారు పది వరకు హాస్టళ్లున్నాయి. వీటిలో రెండు మాత్రమే బాయ్స్ హాస్టల్స్. మిగలనవన్నీ గరŠల్స్ హాస్టల్స్. రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఈ గల్లీలో అమ్మాయిలు, అబ్బాయిలతో సందడిగా ఉంటుంది. రాత్రి 11 గంటల తరువాత నుంచి అసలు రచ్చ మొదలవుతుంది. అమ్మాయిలు, అబ్బాయిలు జంటలుగా హాస్టల్స్ బయట నిలబడటం, అసభ్యకరంగా ప్రవర్తించడం, పెద్దగా కేకలు వేయడం వంటివి షరా మామూలుగా మారాయి. ఇలాంటి చేష్టలను చూస్తూ బయటకు రావాలంటేనే సిగ్గుగా ఉందని స్థానికులు చెబుతున్నారు. అర్దరాత్రి సమయాల్లో సెల్ఫీలు దిగుతూ, అంతాక్ష్యరి, డ్యాన్సులు, బైక్ రైడ్స్‌తో న్యూసెన్స్ చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ♦ ప్రశ్నించిన వారిపై యజమానుల రుబాబు.. మార్చిలో జరిగిన హోలీ రోజు ఇవే హాస్టల్స్ వద్ద అర్దరాత్రి కొంతమంది యువకులు మందు బాటిళ్లతో వీరంగం సృష్టించారు. ఎందుకిలా చేస్తున్నారని ప్రశ్నించిన స్థానికులపై ఆయా హాస్టళ్ల యాజమానులు ‘‘వాళ్లేదో హోలీ సంబురాలు చేసుకుంటున్నారు. మిమ్మల్ని ఏమీ అనలేదు కదా..? మీ పని మీరు చూసుకోండి’’ అంటూ రుబాబ్‌గా మాట్లాడినట్టు స్థానికులు తెలిపారు. ఓ హాస్టల్ ముందు గుమికూడిన యువకులు ♦ కమిషనర్లకు రాతపూర్వక ఫిర్యాదు.. ఈ వ్యవహారంపై పలుమార్లు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్‌కు స్థానికులు దాదాపు నెలరోజుల క్రితం నేరుగా కలిసి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. స్పందించిన సీపీ నారాయణగూడ ఇన్స్పెక్టర్ పాలేపల్లి రమేష్‌ను చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించారు. దీంతో ఈ నెల 5న ఇన్స్పెక్టర్, అడ్మిన్ ఎస్ఐ.కర్ణాకర్రెడ్డితో కలసి గస్తీ నిర్వహించారు. ఆ సమయంలో న్యూసెన్స్ ఏమీ లేకపోవడంతో వారు వెనుదిరిగారు. జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ స్థానికంగా ఎన్ని హాస్టళ్లున్నాయి.? వాటిలో ఎంతమంది ఉంటున్నారు.? ఎన్ని హాస్టల్స్‌కు అనుమతులు ఉన్నాయి.? అనే విషయాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ అధికారులను ఆదేశించారు. ♦ చర్యలు శూన్యం ఈ న్యూసెన్స్ వ్యవహారంపై ఇటు పోలీసుల నుంచి కానీ.. అటు జీహెచ్ఎంసీ అధికారుల నుంచి కానీ ఏ మాత్రం స్పందన రాకపోవడం విచిత్రకరంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. దీనికి కారణంగా ఈ హాస్టల్స్ నడుపుతున్న వ్యక్తుల వెనక బడా బడా రాజకీయ నాయకులు ఉన్నారని, ఫిర్యాదు చేసిన ప్రతిసారీ హాస్టల్ యజమానులు రాజకీయ నాయకులతో పోలీసులకు, జీహెచ్ఎంసీ అధికారులకు ఫోన్లు చేయిస్తున్నారని స్థానికులు ‘సాక్షి’కి తెలిపారు. -
వికలాంగుల వసతి గృహమా.. లేక పశువుల కొట్టమా..?
సాక్షి, ఒంగోలు సిటీ: అసలే దివ్యాంగులు..పైగా ఎముకలు,కీళ్ల సంబంధమైన బాధలతో నరకం చూస్తున్నారు. వీరిలో కొందరికి చేతులు,కాళ్లు ఉన్నట్లుగా కన్పిస్తున్నా అవి వంగే పరిస్థితిలో ఉండవు. ఇలాంటి శారీక బాధలతో బంగారు భవిష్యత్తు కోసం ప్రభుత్వ వసతి గృహానికి వస్తే అక్కడా వారికి న్యాయం జరగడం లేదు. వీరి కోసం ప్రభుత్వం చేస్తున్న దుర్వినియోగం జరుగుతోంది. ఒంగోలు సంతపేటలోని ప్రభుత్వ దివ్యాంగుల వసతి గృహంలో దివ్యాంగులకు అందుతున్న సౌకర్యాలపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అదనపు ఎస్పీ ఎం.రజిని ఆధ్వర్యంలో పరిశీలన చేస్తే వాస్తవాలు వెలుగు చూశాయి. మంగళవారం రాత్రి విజిలెన్సు అధికారులు ఆకస్మికంగా తనిఖీలు జరిపారు. జిల్లా కేంద్రం ఒంగోలు సంతపేటలో దివ్యాంగులకు వసతి గృహం ప్రభుత్వ ఆధీనంలో నడుస్తుంది. ఎక్కడ లబ్ధిపొందే వారికి ఇబ్బంది వచ్చినా, కష్టం వచ్చినా వారు ఎవ్వరికి చెబుకొనే పరిస్థితి లేదు. విజిలెన్స్ అధికారులు ఇటీవల జిల్లాలోని పర్చూరు, కందుకూరు తదితర కేంద్రాలలోని దివ్యాంగుల, బుద్ధిమాంద్యంతో ఇబ్బందిపడుతున్న వారి వసతి గృహాలను తనిఖీ చేసినప్పుడు వారికి అందుతున్న సౌకర్యాలు దీనావస్థలో ఉన్నట్లుగా గుర్తించారు. వీటిపై ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఈ నేపథ్యంలోనే జిల్లా కేంద్రం ఒంగోలులో నడుస్తున్న దివ్యాంగుల (ఆర్ధో) వసతి గృహంలోని వసతులను పరిశీలించినప్పుడు దారుణమైన విషయాలు బయటపడ్డాయి. సరైన వసతి కరువు దివ్యాంగుల వసతి గృహంలో వసతి సరిగ్గా లేదు. రాత్రి వేళ దోమల బెడద. ఉదయం ఎటూ తప్పని కీటకాల సమస్యలు. ఈ బాధలను వీరు నిత్యం అనుభవించి అలవాటు పడ్డారు. వారిని వసతుల విషయమై ప్రశ్నించినప్పుడు దోమలు ఎడతెరిపి లేకుండా కుడుతున్నా అలాగే భరించి అలవాటైందని అంటున్నారు. వీరు అనుభవిస్తున్న ఎముకలు, కీళ్ల సంబంధమైన బాధల కన్నా కీటకాలు పెడుతున్న ఇబ్బంది అంతగా భరించలేనిది కాదు. పరిశుభ్రత అంతంత మాత్రంగానే ఉంటుంది. ఎక్కడ చూసినా మురుగు, అపరిశుభ్రత. ఎప్పుడో గానీ శుభ్రం చేయరు. దీంతో వసతి గృహంలో అనుభవిస్తున్న వసతి వీరికి ఆశించిన సౌకర్యాన్ని ఇవ్వలేకపోతున్నాయి. విజిలెన్స్ అధికారుల ఎదుట దివ్యాంగులు తమ బాధలు తెలుపుకొని వాపోయారు. వసతి గృహంలో శుభ్రత లేని మరుగుదొడ్లు మరుగుదొడ్డికి వెళ్లాలంటే ఇక మరుగుదొడ్డికి వెళ్లాలంటే నానా పాట్లు పడాల్సిందే. ప్రస్తుత పరిస్థితుల్లో అతి చిన్న వయస్సులోనే మోకీళ్లు వ్యాధులు, నొప్పులతో బాధపడ్తున్న వారు అధికమయ్యారు. అన్నీ బాగున్నా, ఆరోగ్యం సరిగ్గా ఉన్న వారే మరుగుదొడ్డి విషయంలో ఎత్తైన వెస్ట్రన్ సీటును వాడుతున్నారు. ఇక వీరు దివ్యాంగులు. పైగా వీరిలో అధిక భాగం కాళ్లు వంగే పరిస్థితిలో లేవు. చేతులు పని చేయవు. అలాంటి వారికి నేల బారు సీటుతో ఉండిన మరుగుదొడ్లే వసతి గృహంలో ఉన్నాయి. అవి కూడా సీటు పగిలిపోయి ఎందుకు పనికిరాని విధంగా ఉన్నా వాటితోనే నెట్టుకొస్తున్నారు. దివ్యాంగులు మరుగుదొడ్డికి వెళ్లాలంటే నానా పాట్లు పడ్తున్నారు. హాజరులో మతలబు దివ్యాంగుల వసతి గృహంలో పిల్లల హాజరులో మతలబు చేస్తున్నారు. మొత్తం 25 పిల్లలను హాజరుపట్టీలో చూపిస్తున్నారు. వీరికి తగినట్లుగా ఆహారం డ్రా చేస్తున్నారు. వాస్తవానికి 13 మందే గృహంలో అందుబాటులో ఉన్నారు. మిగిలిన వారికి ఇస్తున్న బియ్యం,ఇతర వస్తువులు దుర్వినియోగం జరుగుతున్నట్లుగా అధికారులు గుర్తించారు. రికార్డులను పరిశీలించారు. వీటి ఆధారంగా సరుకులు పెద్ద ఎత్తున దుర్వినియోగం జరిగినట్లుగా ప్రాథమికంగా గుర్తించారు. బియ్యం నిల్వలను పరిశీలిస్తే అక్కడిక్కడే 250 కిలోల బియ్యం అదనంగా ఉన్నాయి. అలాగే సరుకులు ఉన్నాయి. వీటిపై నిశితంగా విజిలెన్స్ అధికారులు పరిశీలన చేస్తున్నారు. పాడుపడిన మిద్దెకు రూ.50వేలు వసతి గృహం ప్రైవేటు గృహంలో నడుస్తుంది. మిద్దె బాగా పాడుపడింది. దీనికి నెలకు రూ.50 వేలు అద్దె చెల్లిస్తున్నారు. నెలకు ఇంత పెద్ద మొత్తం వెచ్చిస్తే మంచి సౌకర్యాలు, వసతులు ఉన్న బిల్డింగే వస్తుందని అభిప్రాయపడ్తున్నారు. ఎందు వల్ల ఇంత పెద్ద మొత్తం వెచ్చించి పాడుపడిన మిద్దెలో వసతి గృహాన్ని నడుపుతున్నారని అనుమానాలను వ్యక్తం చేశారు. వీటికి సంబంధించిన రికార్డులను విజిలెన్స్ తనిఖీ చేసింది. వసతి గృహంలో తాగేందుకు సరిగా నీరు లేదు. రిసోర్సు పర్సన్ లేరు వసతిగృహంలోని విద్యార్థులు తొమ్మిది,పది, ఇంటర్,డిగ్రి చదువుతున్న వారున్నారు. వీరికి ఏవైనా డౌట్లు వస్తే సంబంధిత సమస్యను నివృత్తి చేయడానికి అవసరమైన రిసోర్స్ పర్సన్ ఉండాలి. ఇక్కడ ట్యూటర్ కూడా లేరు. వారికి వివిధ సబ్జెక్టుల్లో వచ్చే అనుమానాలను నివృత్తి చేయలేకపోతున్నారు. వీరు చదువుల్లో వెనుకబడి ఉన్నారు.అలాగే ఆహారం కూడా సరిగ్గా లేదు. కనీసం జంతువులు తినేందుకు కూడా పనికిరాకుండా ఆహారం ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. బాత్రూంలు సరిగ్గా లేవు. విద్యుత్ సౌకర్యం సక్రమంగా లేదు. దివ్యాంగుల వసతి గృహం సమస్యలకు నెలవుగా ఉంది. దివ్యాంగుల పట్ల అధికారులు, ప్రభుత్వం ఇంత నిర్దయగా ఉందా అన్న వాస్తవాలు అధికారుల ఆకస్మిక దాడుల్లో వెలుగు చూశాయి. అదనపు ఎస్పీ రజిని సాక్షితో మాట్లాడుతూ దివ్యాంగుల వసతి గృహంలో గుర్తించిన అంశాలపై ప్రభుత్వానికి నివేదిక పంపనున్నట్లుగా తెలిపారు. ఇలాగే జిల్లాలో ఎక్కడైనా వసతి గృహాల సమస్యలు ఉంటే విజిలెన్స్ అధికారుల దృష్టికి తీసుకురావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
హాస్టల్ బస ఎక్కడ?
శ్రీకాకుళం, సీతంపేట/పాలకొండ రూరల్: సంక్షేమ వసతిగృహాల్లో తాగునీరు, మెనూ అమలుతీరు, మరుగుదొడ్ల నిర్వహణ, విద్యార్థుల ఆరోగ్యం వంటి సమస్యల గుర్తించి, వాటి పరిష్కారానికి గతంలో ప్రజాప్రతినిధులు, అధికారులు రాత్రి బస చేపట్టేవారు. అయితే ఇప్పుడా తరహా రాత్రి బస కార్యక్రమం ఎక్కడా కానరావడం లేదు. ఫలితంగా చాలా వసతిగృహాల్లో సమస్యలు తిష్ట వేసి ఉన్నాయి. వీటిని పట్టించుకునే నాథుడే లేడని ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సమీపిస్తున్నా ఈ సమస్యలు పరిష్కారం కాలేదని వాపోతున్నారు. ఇదీ పరిస్థితి... పాలకొండ సబ్ డివిజన్లోని మూడు నియోజకవర్గాలకుగాను రెండు నియోజకవర్గాలు ఏజెన్సీ ప్రాంతాన్ని కలుపుకుని ఉన్నాయి. సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాలు 18, బీసీ సంక్షేమ శాఖ పరిధిలో 18, గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 18, ఎస్సీ, బీసీ, పోస్టుమెట్రిక్ వసతిగృహాల్లో విద్యార్థులు నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారు. వీటితోపాటు సీతంపేట ఏజెన్సీలో 10 వరకు ఆశ్రమ పాఠశాలల వసతి గృహాలున్నాయి. వీటిలో 15 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీటిలో సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇరుకు గదుల్లోనే తరగతులు నిర్వహించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. వసతిగృహాల్లో సరిపడినన్నీ మరుగుదొడ్లు, సురక్షిత నీటి సౌకర్యం వంటివి పూర్తిగా లేవు. నిత్యావసరాలకు నీటివసతి అరకొరగా ఉంది. కొన్నిచోట్ల తరగతులు, విద్యార్థులు ఉండటం అక్కడే అన్న చందంగా నిర్వహిస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో మౌలికవసతుల పేరిట భారీగా నిధులు వెచ్చించినప్పటికీ ఫలితం లేకుండా పోతోంది. కేజీ నుంచి పీజీ వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఉచిత విద్యనందించి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామన్న టీడీపీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సౌకర్యాల కల్పనలో ప్రభుత్వ వైఫల్యం సౌకర్యాల కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. చాలాచోట్ల కనీస సౌకర్యాలు లేక అల్లాడుతున్నారు. అయినా పట్టించుకున్న నాథుడు లేడు. ముఖ్యంగా విద్యార్థులు ఉండటానికి సరైన వసతి లేకపోవడంతో కొంతమంది డ్రాపౌట్‌గా మారుతున్నారు. రాత్రి బస వంటివి చేసి పక్కాగా సమస్యలు పట్టించుకోవాలి.– విశ్వాసరాయి కళావతి,పాలకొండ, ఎమ్మెల్యే పర్యవేక్షణ లేక కుంటుపడుతున్న విద్య అధికారులు పూర్తిస్థాయిలో పర్యవేక్షించి సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటే మంచిది. గతంలో ఎస్ఎఫ్ఐ తరుపున చాలా వసతిగృహాలను సందర్శించాం. ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. మౌలిక వసతుల పేరిట గిరిజన ప్రాంతాల్లో భారీగా నిధులు వెచ్చిస్తున్నప్పటికీ అవి ఎక్కడికి వెళ్తున్నాయో తెలియడం లేదు.– ఎం కనకారావు, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు -
ఆ వార్డెన్ మాకొద్దు
సాలూరు రూరల్,విజయనగరం: వార్డెన్ తమకు సక్రమంగా భోజనం పెట్టలేదని, పలు ఇబ్బందులు పెడుతున్నారని తక్షణమే ఆమెను తొలగించాలని మండలంలోని కురుకూటి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల వి ద్యార్థినులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం వారు పాఠశాల ఎదురుగా ఉన్న రహదారిపై భైఠాయించి నిరసన తెలిపారు. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. వార్డెన్ సుశీల సక్రమంగా భోజనం పెట్డడంలేదని ఆమెను తొలగించాలని ఎస్ఎఫ్ఐ నాయకులతో కలసి విద్యార్థినులు ధర్నా చేశారు. ఆదివారం వంట చేయలేదు గ్యాస్ లేదన్న కారణంతో ఆదివారం మధ్యాçహ్నం భోజనం వండలేదని, రాత్రి గ్యాస్ తీసుకువస్తే 10 గంటల సమయంలో భోజనం అందించారు. ఆ సమయంలో 8, 9, 10 తరగతులకు చెందిన విద్యార్థినులు భోజనం చేయకుండా నిరసన తెలిపి ఆకలితోనే ఉండిపోయారు. సోమవారం ఉదయం కూడా అల్పాహారం చేయకుండా ఎస్ఎఫ్ఐ నాయకులతో కలిసి వార్డెన్‌ను తొలగించాలంటూ ధర్నా నిర్వహించారు. డీడీని అడ్డుకున్న విద్యార్థినులు విద్యార్థినులు ధర్నా చేస్తున్న సమాచారం అందుకున్న ఐటీడీఏ డీడీ కిరణ్‌కుమార్, ఏటీడబ్ల్యూ వరలక్ష్మితో కలిసి మధ్యాహ్నం పాఠశాలకు చేరుకున్నారు. సమయంలో పాఠశాల గేటు వేసి డీడీని అడ్డుకుని తమ నిరసన తెలియజేశారు. పలు పరిణామాల అనంతరం విద్యార్థినులు గేటు తెరవగా డీడీ విచారణ చేపట్టారు. విద్యార్థినులతో మాట్లాడారు. వార్డెన్ సుశీల సక్రమంగా భోజనం పెట్టడం లేదని, ఆదివారం భోజనం వండకపోవడంతో ఆకలితో పడుకున్నామని 8, 9, 10 తరగతులు విద్యార్థినులు తెలిపారు. తమకు ఆ వార్డెన్ వద్దని, ఆమెను తొలగించాలని పట్టుబట్టారు. గ్యాస్ అయిపోవడం వల్ల భోజనం పెట్టలేకపోయామని వార్డెన్ సుశీల డీడీకి వివరించారు. వార్డెన్‌ను సస్పెండ్ చేశాం డీడీ కిరణ్‌కుమార్ విలేకర్లతో మాట్లాడుతూ వార్డెన్‌ను సస్పెండ్ చేశామని తెలిపారు. వార్డెన్ బాధ్యతలను హెచ్‌ఎమ్‌కు ఇచ్చినట్లు తెలిపారు. విచారణ అంశాల నివేదికను ఉన్నతాధికారులకు ఇవ్వనున్నామని తెలిపారు. -
వేధింపులు భరించలేకపోతున్నాం!
శ్రీకాకుళం , సోంపేట: మండలంలోని పలాసపురంలో ‘మిరియం బాలికల రక్షిత గృహం’ నిర్వాహకులు పిల్లలను వేధింపులకు గురిచేస్తున్నట్లు గుర్తిం చామని జిల్లా బాలల సంక్షేమ సమితి చైర్మన్ గరుగుబిల్లి నర్సింహమూర్తి తెలిపారు. శనివారం తమకు వచ్చిన వీడియో మెసేజ్ ఆధారంగా ఆదివారం రక్షిత గృహాన్ని ఆకస్మికంగా సందర్శించగా పలు విషయాలు వెలుగు చూశాయని స్థానిక విలేకరులకు వెల్లడించారు. నిర్వాహకుల దుస్తులు ఉతికించడం, వారు వినియోగించే మరుగుదొడ్లు కడిగించడం, నిర్వాహకుల పిల్లలకు స్నానాలు చేయించడం, మలమూత్ర విసర్జన చేసినప్పుడు కడగటం వంటి పనుల్ని చెబుతున్నారని బాలికలు వాపోయారని పేర్కొన్నారు. ఈ విషయాలను బయటకు చెబితే భోజనం పెట్టకుండా బెదిరించేవారని, బానిసలుగా చూస్తూ శారీరకంగా, మానసికంగా వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకునేందుకు ముందుగా స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తామన్నారు. పూర్తి నివేదికను నాలుగు రోజుల్లో జిల్లా బాలల సంక్షేమ సమితికి అందజేయాల్సిందిగా ఇచ్ఛాపురం చైల్డ్‌లైన్ బృందాన్ని ఆదేశించారు. తదుపరి చర్యలు తీసుకునేవరకు పిల్లలను ఏవిధమైన హింసకు గురిచేయవద్దని నిర్వాహకులను హెచ్చరించారు. జువైనల్ జస్టిస్ చట్టప్రకారం బాలల హక్కులను ఉల్లంఘించిన యాజ మాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకొని రక్షిత గృహం గుర్తింపును రద్దుచేసేందుకు చర్యలు తీసుకొంటామని చెప్పారు. కార్యక్రమంలో బాలల సం క్షేమ సమితి సభ్యులు బగాది శశిభూషణ్‌చౌదరి, రౌతు జ్యోతికుమారి, బద్దాల సురేష్,బాలల రక్షణ అ«ధికారి మెట్ట మల్లేశ్వరరావు, ఇచ్ఛాపురం చైల్డ్‌లై న్ పీసీ సుధీర్, ఆర్.ఝాన్సీ, పలాస చైల్డ్‌లైన్ ప్రాజె క్టు కో–ఆర్డినేటర్ క్రాంతికుమార్ పాల్గొన్నారు. -
విలవిల.. వేతన గోల
జేఎన్టీయూ అనంతపురం ఉన్నతాధికారుల అనాలోచిత నిర్ణయాలతో విద్యార్థుల నిర్వహణ హాస్టల్స్ ( స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టల్) విద్యార్థులు విలవిల్లాడుతున్నారు. క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాల హాస్టల్ విద్యార్థుల నుంచి మెస్ బిల్లుల రూపంలో వసూలు చేసి, తాత్కాలిక ఉద్యోగుల వేతనాలకు సర్దుబాటు చేస్తున్నారు. స్టూడెంట్ మేనేజ్మెంట్హాస్టల్స్ కాబట్టి ఉద్యోగుల జీతాలను విద్యార్థులే భరించాలని జేఎన్టీయూ అనంతపురం అధికారులు అనాలోచిత నిర్ణయాలు అమలు చేస్తుండంతో విద్యార్థులపై పెనుభారం పడుతోంది. ఉద్యోగులకు కూడా చాలీచాలని జీతం అందుతుండడంతో అవస్థలు పడుతున్నారు. అనంతపురం : జేఎన్టీయూ అనంతపురం క్యాంపస్‌లో శిల్ప,అజంతా, అమరావతి, ఎల్లోరా, లేపాక్షి, రత్నసాగర్, తక్షశిల, నలంద హాస్టళ్లు ఉన్నాయి. ఇందులో 2 వేల మంది బీటెక్, ఎంటెక్ విద్యార్థులు ఉంటున్నారు. మొత్తం 26 మంది శాశ్వత ప్రాతిపదికన పనిచేసే ఉద్యోగులు 116 మంది తాత్కాలిక ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ఈ 116 మంది ఉద్యోగులు గత రెండు దశాబ్దాల నుంచి పని చేస్తున్నారు. అప్పటి నుంచి చాలీచాలని వేతనాలు చెల్లిస్తున్నారు. తాజాగా వీరు రూ.6 వేలు జీతాన్ని అందుకుంటున్నారు. ఈ మొత్తం కనీస అవసరాలకు సైతం సరిపోలేదని వాపోతున్నారు. దీంతో జీతాల పెంపుకు విధులు బహిష్కరించారు. తమకు జీతాలు పెంపుదల చేయాలని, గతంలో ఇస్తున్న విధంగా విద్యార్థుల నుంచి కాకుండా నేరుగా వర్సిటీనే జీతాలు చెల్లించాలనే ప్రధాన డిమాండ్లతో ఆందోళన బాట పట్టారు. విద్యార్థులపై మోయలేని భారం : జేఎన్టీయూఏ విద్యార్థుల నిర్వహణ హాస్టల్ (స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టల్) ఉద్యోగులకు చాలీచాలని జీతాలు చెల్లిస్తున్నారు. దీంతో విద్యార్థులు ఒకొక్కరి నుంచి ఏడాదికి రూ.10 వేలు వసూలు చేస్తున్నారు. విద్యార్థులపై భారం పడుతోంది. ఈ మొత్తాన్ని మెస్ బిల్లుల్లో కలిపి కట్టించుకుంటున్నారు. అయితే హాస్టల్స్‌లో 74 పర్మినెంట్ ఉద్యోగాలను భర్తీ చేశామని ప్రభుత్వం నుంచి బ్లాక్‌గ్రాంట్ నిధులను మంజూరు చేయించుకుంటున్నారు. రూ.కోట్లు నిధులు ఇతర అవసరాలకు వినియోగించుకుంటున్నారు. ఫలితంగా విద్యార్థులపై మోయలేని భారం పడుతోంది. నయ వంచన : హాస్టల్ ఉద్యోగులకు జీతా లు చెల్లిస్తున్నామని ప్రభుత్వం నుంచి బ్లాక్ గ్రాంట్ నిధులు మంజూరు చేసి ఓ వైపు ప్రభుత్వాన్ని , విద్యార్థుల నుంచి ఉద్యోగులకు జీతాలు వసూలు చేసి చెల్లించి విద్యార్థులను, ఏళ్ల తరబడి ఉద్యోగులను వెట్టిచాకిరి చేయించుకుంటూ ఉద్యోగులను ఇలా నయవంచన చేశారు. జేఎన్టీయూ అనంతపురం ఉన్నతాధికారులు నిర్ణయాలతో ఉద్యోగులు, విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. విద్యార్థులకు తీరని వేదన హాస్టల్ ఉద్యోగులు 116 మంది నిరవధిక సమ్మెలో పాల్గొనడంతో విద్యార్థులు అవస్థ పడుతున్నారు. విద్యార్థులే నేరుగా కూరగాయలు కొనుగోలు చేసి, భోజనం వండుకోవాల్సి వచ్చింది. 26 నుంచి బీటెక్ విద్యార్థులకు సెమిస్టర్ పరీ క్షలు ప్రారంభం కానుండడంతో విద్యార్థులకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు విద్యార్థులు బయటకు వెళ్లి భోజనం చేసి పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. శ్వేత పత్రం విడుదల చేయాలి హాస్టల్ ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నట్లు తపుడు సమచారం ఇచ్చి నిధులు తెప్పించుకున్నారు. ఈ నిధులను ఏఏ అవసరాలకు వినియోగించారు? ఎంత మొత్తం నిధులు విడుదలయ్యాయి? విద్యార్థుల నుంచి ఉద్యోగులకు చెల్లించిన జీతం మొత్తం? తదితర అంశాలపై జేఎన్టీయూ అనంతపురం అధికారులు శ్వేత పత్రం విడుదల చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఏడాదికి ఒక్కో విద్యార్థి అదనంగా రూ.10 వేలకు పైగానే ఉద్యోగుల జీతాల రూపంలో చెల్లిస్తున్నామని ఆవేదన చెందుతున్నారు. రూ.కోట్లు నిధులకు జవాబుదారీతనం వహించి వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నారు. -
బదిరుల హాస్ట్‌ల నుంచి విద్యార్థుల పరారీ
సాక్షి, హైదరాబాద్ : అబ్దుల్లాపూర్ మెట్, పెద్ద అంబరపేట బదిరుల ఆదర్శ పాఠశాల హాస్టల్ నుంచి ముగ్గురు విద్యార్థులు పరారీ అయ్యారు. వివరాలు.. చిన్నారులు మహేష్, లోకేశ్, యశ్వంత్ బదిరుల హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారు. ఈ క్రమంలో హాస్టల్లో తమను వేధిస్తున్నారంటూ వీరు ముగ్గురు ఎవరికి చెప్పకుండా బయటకు వచ్చారు. వీరిలో మహేష్, లోకేశ్ ఇద్దరు కలిసి ఔటర్ రింగ్ రోడ్ వెంట నడచుకుంటూ వెళ్తుండగా చూసిన స్థానికులు వారిని అడ్డగించి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. చెవిటివారైన ఆ పిల్లలు తమ సైగలతో హాస్ట్‌ల్‌లో తమను వేధిస్తున్నారని.. అందుకే ఇలా బయటకు వచ్చామని వారికి తెలిపారు. దాంతో స్థానికలు వీరిని కోహెడ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. మరో విద్యార్థి యశ్వంత్ ఆచూకీ మాత్రం తెలియలేదు. ఈ లోపు పాఠశాల ఉపాధ్యాయుడు రమేష్, ముగ్గురు విద్యార్థులు హాస్టల్ నుంచి పరారయ్యరంటూ మెట్టూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
జడల బొమ్మాళి
బీటెక్ చదువుతున్న హ్యాపీ డేస్ అవి. కొత్తగా ఓపెన్ చేసిన ప్రసాద్స్ ఐమాక్స్ లోని స్కేరీ హౌస్ కి వెళ్లాలని కొద్ది రోజులుగా మా హాస్టల్ బ్యాచ్ అందరి కోరిక. మా గ్యాంగ్‌లో మేము మొత్తం పదిమందిమి. చిన్నపాటి ఆనందాలకి కూడా తెగ సంబరపడిపోయే బ్యాచ్ మాది. సరదా అయినా, షికారు అయినా అందరం కలిసే వెళ్ళేవాళ్ళం. మొత్తానికి అనుకున్న ప్లాన్ ప్రకారం ఒక ఆదివారం నెక్లెస్ రోడ్‌లోని ఈట్ స్ట్రీట్‌కి వెళ్ళాము. అప్పుడే రిలీజ్ అయిన ఆనంద్ మూవీ ఎఫెక్టేమో! స్టీమ్దోశ, ఫిల్టర్ కాఫీ మాకు ఒక క్రేజీ కాంబినేషన్. ఈట్ స్ట్రీట్‌లో టిఫిన్ అయ్యాక, ప్రసాద్స్ ఐమాక్స్ వెళ్లాము. అద్దాలతో మెరిసిపోతోంది ఐమాక్స్. షాపింగ్ మాల్స్ అంటే ఇలా వుంటాయని అప్పుడప్పుడే తెలుసుకుంటున్న మాకు అది మరో ప్రపంచంలా కనిపించింది. కళ్ళు జిగేలుమనేలా చుట్టూ షాప్ ఔట్లెట్స్. మాల్ మొత్తం సుమారు ఒక గంటన్నర పాటు తిరిగి మా ఫైనల్ డెస్టినేషన్ అయిన స్కేరీ హౌస్ దగ్గరకు చేరుకున్నాం. అప్పటికే చాలా పెద్ద క్యూ ఉంది అక్కడ. ఒకపక్క నవ్వులు, మరోపక్క కేకలు అరుపులతో మొత్తం హడావుడిగా ఉంది. ఎక్కువ ఆలస్యం చేయకుండా చకచకా టికెట్స్ తీసుకొని మేము కూడా క్యూలో నిలుచున్నాం. అప్పటి వరకు ధైర్యంగా వున్నా, హౌస్ లోపలి నుంచి వచ్చే సౌండ్ ఎఫెక్ట్స్‌కు, కేకలకు మా అందరిలో ఏదో మూల కొంచెం భయం మొదలైంది. అలా క్యూలో అరగంట గడిచింది. లోపలికి వెళ్ళడానికి మా ముందు ఇంకా రెండు బ్యాచులు మిగిలి ఉన్నాయి. అంతలో మానస ‘వామ్మో! నాకు మస్తు భయం ఐతాందే. నా వల్ల కాదు. నే డ్రాప్ ఐతా..’ ఏడుపు గొంతుతో అంది. దానికి అసలే భయం ఎక్కువ. ఏదో మేనేజ్ చేసి ఇంత దూరం లాక్కొచ్చాము. దాని మాటలకి రాధిక, శిల్ప కూడా వంతపాడారు. ‘ఒసేయ్ ఎంకి! లోపల ఉన్నవన్నీ స్పెషల్ ఎఫెక్ట్స్. మనుషులే దయ్యాల్లాగా ఉత్తుత్తి యాక్షన్. అంతా మనల్ని భయపెట్టడానికేనే’ ధైర్యం నూరిపోసింది లచ్చి. మృదుల, కన్య కూడా మానసని ఒప్పించడానికి వాళ్ల వంతు తంటాలు పడ్డారు. ఎలాగోలా మొత్తానికి మానసని ఒప్పించారు. మా మాటల్లో పడి క్యూ కదులుతున్న సంగతి కూడా మర్చిపోయాం. లోపలికి వెళ్లాల్సిన నెక్ట్స్ట్ బ్యాచ్ మాదే. డోర్ దగ్గర పొడుగ్గా ఒకతనునల్ల చొక్కా, నల్ల టోపీ వేసుకుని ఉన్నాడు. ‘లోపట మస్తు భయమేస్తదా ?‘‘గట్టిగ అరిస్తే జర సౌండ్ తగ్గించున్రి భయ్యా!!’..‘ఏ చోట ఎక్కువ భయం ఏస్తది ?’ ఇలా రాధిక కురిపించిన ప్రశ్నల వర్షానికి జవాబు అన్నట్టుగా స్కేరీ హౌస్ డోర్ తెరిచి లోపలికి వెళ్ళమన్నట్టుగా సైగ చేశాడు అతను. సగం ధైర్యం, సగం భయంతో మేము ఒకరి చేయి ఇంకొకరం గట్టిగా పట్టుకుని లోపలికి వెళ్ళాము. డోర్ మూసుకుంది. అంతా మసక మసకగా ఉంది. అక్కడక్కడా లాంతరు వెలుగు మిణుకుమంటోంది. అంతలో ఎక్కడ నుంచి ప్రత్యక్షమయ్యాడో ఒకడు వికృతంగా నవ్వుతూ మాకు ఎడమ వైపున్న గోడను చూపించాడు. గోడపై ఏదో రాసుంది. మాకు ఆలోచించేంత సమయం ఇవ్వకుండా ఆ హౌస్ కథ అని వివరించాడు. అతను రక్త చరిత్ర రేంజ్ లో కథ చెప్తున్నా మాకు మాత్రం వినిపిస్తున్న సౌండ్ ఎఫెక్ట్స్‌కి చెమటలు పట్టేశాయి. ఒక్కసారిగా అరిచింది శ్రుతి. తన పక్కనే ఉన్న నా చేయి నలిపినంత పని చేసింది. ‘ఎ..ఎ... ఎముకల గూడు..’ వణుకుతూ అంది.ఆలస్యం చేయకుండా అక్కడ్నుంచి రైలు పెట్టెలులా ముందుకు కదిలాం. ఎదురుగా ఒక పెద్ద చెట్టు. దానిపై అస్థి పంజరాలు వేలాడుతున్నాయి. చెట్టు కింద ఒక ముసలివాడు పడుకుని మూలుగుతున్నాడు. మేము ముందుకు వెళ్లాలంటే అతన్ని దాటే వెళ్ళాలి. మా అందరిలోకల్లా కొద్దో గొప్పో ధైర్యం కొంచెం ఎక్కువున్న లచ్చి ముందుకు నడిచింది. అలా నడిచిందో లేదో, అతడు గబుక్కున లేచి కూర్చుని మంచంతో పాటు ముందుకు జరుగుతూ మమ్మల్ని అడ్డగించబోయాడు. నాకైతే పై ప్రాణం పైనే పోయినంత పనైంది. ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకున్నాం. లోపలికి వెళుతున్నకొద్దీ చీకటి మమ్మల్ని మంచుపొరలా కమ్మేసింది. తలో, ‘ఏయ్ వదులు... నా కాలు వదులు’ అంటూ హర్షిత కేక. తన కాలు ఎవరో పట్టుకున్నారు. భయంతో వాణ్ణి ఒక తన్ను తన్ని ఉరుకో ఉరుకు. అప్పటివరకు ఒకరినొకరం అంటి పెట్టుకునివున్న మేమంతా కూడా చెల్లా చెదురు అయిపోయాం. ఎక్కడ ఉన్నామో తెలియని అయోమయంలో ఉన్న నాకు, చేతికి ఏదో జుట్టులా తగిలేసరికి క్షణం పాటు గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. మూసిన కళ్లు మూసినట్టే ఉన్నాయి. ఎటు కదలాలన్నా భయం. ధైర్యం కూడబలుక్కుని అక్కణ్ణుంచి పరుగులు తీశాను. చీకటిలో ఎటు వెళ్తున్నానో కూడా తెలియలేదు. ఎలాగోలా చివరకు ఒక తలుపు దగ్గరకు వచ్చాను. అది మూసి ఉంది. అంతలో, ఎక్కడ్నుంచి ఊడిపడ్డాడో, మర్రి ఊడల్లాంటి జడలతో ఒకడు భయపెడుతూ ఎదురొచ్చాడు. ఎటు వెళ్లాలో అర్థంకాక గట్టిగా కేకలు పెట్టాన్నేను. అంతలో వెనుక నుంచి సూపర్ వుమన్లా లచ్చి వాడిని ఒక్క ఉదుటున పట్టేసింది. వాడు వదిలించుకోవడానికి ప్రయత్నించాడు, కానీ కుదరలేదు. లచ్చి ఉడుం పట్టుకి వాడికి భయం వేసిందేమో...‘వదలవమ్మా తల్లే! నీకు దణ్ణం ఎడతా! నెక్ట్స్ బ్యాచ్ వచ్చేలోపు నే పోవాల. నా కొంప ముంచకు..’ అని గింజుకున్నాడు. ఒక్కసారిగా మమ్మల్ని కమ్మేసిన చీకటి పొరలు తొలగి వెలుతురు కనిపించింది. ఎగ్జిట్ డోర్ ఓపెన్ అయ్యిందని మాకు అర్థమయ్యేలోపు మేము స్కేరీ హౌస్ బయట వున్నాం. ఒక్కొక్కరుగా మా వాళ్ళందరూ బయటకి వచ్చారు. లచ్చి తన చేతిలో చింపిరి ఊడల జడ పట్టుకుని ఉంది.‘ఎక్కడ వాడు.. ఎక్కడ?’ అంటూ అటూ ఇటూ వెతికింది. దాన్ని అలా చూసి అందరం నవ్వాము. స్కేరీ హౌస్ బయట ఉన్నామని దానికి అర్థమవడానికి కొంత సమయం పట్టింది. లోపల జరిగింది మా వాళ్ళకి చెప్పా. అప్పటివరకు మాలో ఉన్న భయమంతా మా నవ్వులకి ఆవిరైపోయింది. లచ్చికి మేము పెట్టిన ‘జడల బొమ్మాళి’ అన్న పేరు, సోనీ కెమెరాలో బంధించిన ఆ క్షణాలు... ఎప్పుడు తలుచుకున్నా భలే నవ్వొస్తుంది. – సుచిత్రారెడ్డి -
బిహార్ షెల్టర్ హోం కేసు: కీలక మలుపు
పాట్నా : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిహార్ ముజఫర్‌పూర్ వసతిగృహంలో బాలికలపై హత్యాచారాలకు పాల్పడిన కేసులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనపై దర్యాప్తు నిమిత్తం కేంద్రం సీబీఐని నియమించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీబీఐ విచారణలో భాగంగా సికందర్పూర్ ప్రాంతంలోని శ్మశానంలో ఓ అస్థిపంజరం బయటపడింది. దీన్ని వసతి గృహానికి చెందిన బాలిక అస్థిపంజరంగా భావిస్తున్నారు సీబీఐ అధికారులు. దాంతో ఈ అస్థిపంజరానికి ఫోరెన్సిక్ పరీక్షలు, డీఎన్ఏ పరీక్షలు నిర్వహించే ఏర్పాట్లు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు బ్రజేష్ ఠాకూర్ డ్రైవర్ తెలిపిన వివరాలతో ఈ అస్థిపంజరాన్ని గుర్తించినట్లుగా వెల్లడించారు. ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తరువాత మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు. కొద్ది రోజుల క్రితం ముజఫర్‌పూర్ వసతి గృహంలో దాదాపు 40 మందికి పైగా బాలికలపై అఘాయిత్యాలు జరిగిన వార్త బయటపడడంతో దేశవ్యాప్తంగా సంచలంగా మారిన సంగతి తెలిసిందే. బ్రజేష్ ఠాకూర్ అనే వ్యక్తి నడుపుతున్న ఎన్జీవో ఆధ్వర్యంలోని వసతి గృహంలో ఈ దారుణాలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో కొందరు బాలికలను చంపి వసతి గృహంలోనే పూడ్చారని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో స్థానిక పోలీసులు బాలికలు చూపిన చోట వసతిగృహంలో తవ్వకాలు జరిపారు.. కానీ అక్కడ ఏమీ లభ్యం కాలేదని అధికారులు వెల్లడించారు. -
ప్రశ్నిస్తే.. వేధింపులా?
ఆమె చేసిన తప్పల్లా హాస్టళ్లలో పేద బాలలకు సరైన ఆహారం అందుతోందా? లేదా? అని అడగడమే. తమనే ప్రశ్నిస్తావా? అని ఘరానా వార్డెన్లు కన్నెర్ర చేశారు. ఇక జడ్పీ సభ్యురాలికే రౌడీల వేధింపులు తప్పలేదు. మండ్య: హాస్టళ్లలో అందిస్తున్న ఆహారం నాణ్యతపై ప్రశ్నించినందుకు వార్డెన్లు తనమీదకు రౌడీలను ఉసిగొలిపి నడివీధిలో అసభ్యంగా దూషిస్తూ అవమానిస్తున్నారంటూ జడ్పీ సభ్యురాలు కన్నీటి పర్యంతమైన ఘటన గురువారం మండ్య జిల్లా పంచాయితీ సమావేశంలో చోటు చేసుకుంది. జడ్పీ అధ్యక్షురాలు నాగరత్నస్వామి నెలవారి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సభ్యురాలు సునందమ్మ మాట్లాడుతూ నాగమంగల తాలూకా శికారిపుర గ్రామ హాస్టల్ నిర్వహణ అత్యంత నాసిరకంగా ఉంటోందని చెప్పారు. ప్రభుత్వం నిర్ణయించిన మెనూ ప్రకారం కాకుండా హాస్టల్ వార్డెన్లు లోకేశ్, పార్వతిలు వారి ఇష్టానుసారం పిల్లలకు నాసిరకం ఆహారం అందిస్తున్నారంటూ సునందమ్మ ఆరోపించారు. దీన్ని ప్రశ్నించినందుకు హాస్టల్ వార్డెన్లు తనపై రౌడీలతో బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారని, ప్రతిరోజూ రౌడీలు బహిరంగ ప్రదేశాల్లో తనను నానా మాటలంటూ అవమానిస్తున్నారని విలపించారు. దీనిపై జిల్లా సంక్షేమ అధికారికి ఫిర్యాదు చేసినా ఫలితం లేదని చెప్పారు. ఈ విషయాన్ని శాఖ ప్రధాన కమిషనర్ దృష్టికి తీసుకెళతామని జి.పం అధ్యక్షురాలు నాగరత్న స్వామి తెలుపగా, అధ్యక్షురాలిగా మీరెందుకు ఉన్నారని సునందమ్మ గట్టిగా రోదిస్తూ ప్రశ్నించడంతో అందరూ స్తబ్దులయ్యారు. మాటమార్చిన అధికారులు ఈ క్రమంలో జిల్లా సంక్షేమ అధికారి మాలతి,రాజీవ్‌లు తాము జిల్లావ్యాప్తంగా ఉన్న అనేక హాస్టళ్లను పరిశీలించామని ప్రతీ హాస్టల్లోనూ నిర్వహణ తీరు సక్రమంగానే ఉందంటూ బదులిచ్చారు. దీంతో ఇప్పటి వరకు ఎన్ని హాస్టళ్లు పరిశీలించారో చెప్పాలంటూ ప్రశ్నించిన సునందమ్మ.. హాస్టళ్ల పరిశీలనకు ఇప్పుడే వెళదామని డిమాండ్ చేశారు. దీంతో కొన్ని హాస్టళ్లలో సీసీటీవీలు, బయోమెట్రిక్ తదితర వాటిలో నిర్వహణ లోపం ఉందంటూ మాట మార్చారు. జి.పం. సభ్యురాలికే భద్రత లేకపోవడం దారుణమని పలువురు సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. -
వసతిగృహం కోసం ఆందోళన
పాలకొండ : స్థానిక నగర పంచాయతీలో బీసీ బాలికల వసతిగృహం ఏర్పాటు చేయాలని కోరుతూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు పాలకొండ ప్రధాన రహదారిలో ర్యాలీ సోమవారం నిర్వహించి ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాలు, సీపీఐ నాయకులు మాట్లాడుతూ గతంలో ఎస్సీ బాలికల వసతి గృహంలో ఉంటూ బీసీ విద్యార్థినులు పలు కళాశాలల్లో చదువుతున్నారని గుర్తుచేశారు. ఈ ఏడాది కూడా వసతి గృహంలో 37 మంది బీసీ విద్యార్థినులు చేరి పలు కళాశాలల్లో చదువుతున్నారని తెలిపారు. అయితే.. ఈ ఏడాది నుంచి ఎస్సీ వసతి గృహంలో బీసీ విద్యార్థినులు ఉండటాన్ని ప్రభుత్వం రద్దు చేయడంతో వారి భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఉండేందుకు వసతిలేక, కళాశాలలకు వెళ్లలేక అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఉంటూ చదువులు కొనసాగిస్తున్నారని, ప్రస్తుతం వీరి పరిస్థితి ఎంటని ప్రశ్నించారు. తక్షణమే పాలకొండలో బీసీ వసతి గృహాన్ని ఏర్పాటు చేయాలని నినాదాలు చేశారు. అనంతరం ఆర్డీఓ రెడ్డి గున్నయ్యను కలిసి పరిస్థితి వివరించారు. దీనిపై స్పందించిన ఆయన.. సమస్యను కలకర్ట్ దృష్టికి తీసుకు వెళ్లానని, బీసీ వసతి గృహం మంజూరుకు చర్యలు తీసుకునేందుకు ఆయన హమీ ఇచ్చారని వివరించారు. అంతవరకు ఇతర వసతి గృహల్లో ఈ విద్యార్థినులను ఉంచేందుకు చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ హామీ ఇచ్చారు. -
ఆశ్రమ పాఠశాల విద్యార్థి మృతి
పోలవరం రూరల్: ఆశ్రమ పాఠశాలకు వెళ్లిన కుమారుడు పోలవరం ప్రాజెక్టు కుడి కాలువలో మృతదేహంగా కనిపించడంతో కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. పోలవరం మండలం ఇటుకలకోట గ్రామంలో గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో కొమ్ముగూడెం గ్రామానికి చెందిన కుంజం శ్రీనివాస్ (18) 9వ తరగతి చదువుతున్నాడు. ఆగస్టు 15న బుధవారం సాయంత్రం శ్రీనివాస్ వసతి గృహం నుంచి కొమ్ముగూడెం ఇంటికి వెళ్లాడు. గురువారం శ్రీనివాసరావును తండ్రి కుంజం రాజు ఆశ్రమ పాఠశాలకు తీసుకువెళ్లి ఉపాధ్యాయులకు అప్పగించారని తల్లి దుర్గ తెలిపింది. సెలవుల్లో తమ కుమారుడు ఇంటికి వస్తాడని, శనివారం సాయంత్రం రాకపోవడంతో ఆశ్రమ పాఠశాలకు వెళ్లి వార్డెన్‌ను, ఉపాధ్యాయులను అడిగినా సరైన సమాధానం చెప్పకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని తల్లి ఆరోపించింది. దీంతో పోలవరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా గోపాలపురం మండలంలోని పోలవరం కుడికాలువలో ఓ మృతదేహాన్ని పోలీసులు గుర్తించినట్టు చెప్పారన్నారు. మృతదేహాన్ని పరిశీలించగా అది తమ కుమారుడిదని బోరుమన్నారు. వసతి గృహంలో విద్యార్థి ఉన్నాడా లేదా అన్న విషయాన్ని కూడా రెండు రోజులుగా వార్డెన్, ఉపాధ్యాయులు పట్టించుకోలేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తంచేశారు. వారు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే తన కుమారుడిని కోల్పోయామన్నారు. వస తి గృహానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న తన కుమారుడికే ఇటువంటి పరిస్థితి ఉంటే మిగిలిన పిల్లల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. శ్రీనివాస్ కాలువలో పడి ఎలా మృతిచెందాడో తెలియని పరిస్థితి అని కుటుంబ సభ్యులు, బంధువులు పేర్కొంటున్నారు. దుర్గమ్మకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. శ్రీనివాస్ చిన్న కుమారుడు శ్రీనివాస్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతదేహం వివరాలు లభ్యం గోపాలపురం: గోపాలపురం మండలం గుడ్డిగూడెంలో పోలవరం కుడి ప్రధాన కాలువలో శనివారం కొట్టుకొచ్చిన మృతదేహం వివరాల లభ్యమైనట్టు ఎస్సై ఎం.జయబాబు ఆదివారం విలేకరులకు తెలిపారు. మృతుడు పోలవరం మండలం కొమ్ముగూడెం గ్రామానికి చెందిన కుంచెం శ్రీనివాస్ (18)గా గుర్తించినట్టు చెప్పారు. మృతుడు 9వ తరగతి చదువుతున్నాడని ఈనెల 16న పాఠశాలకు వెళుతూ ప్రమాదవశాత్తు పోలవరం కుడి కాలువలో జారిపడి మృతిచెందినట్టు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
రాజస్తానీ పర్స్
నేను డిగ్రీ కాకినాడలో చేశాను. హాస్టల్లో ఫుడ్ పడక, నలుగురు స్నేహితురాళ్లం కలిసి రూమ్‌లో ఉండేవాళ్లం. మేముండే ఇంటి పక్కనే రింకీ అని ఓ రాజస్తానీ అమ్మాయి అద్దెకుండేది. తనకి తెలుగు సరిగా రాకపోయినా మాతో తెలుగులో మాట్లాడటానికే ప్రయత్నిస్తుండేది. మాకేమో ఇంగ్లిష్ సరిగా రాదు. తనకది తెలియకుండా మ్యానేజ్ చెయ్యాలని, ‘అన్ని భాషలు నేర్చుకోవాలి’ అంటూ తనని తెలుగులో మాట్లాడటానికే ప్రోత్సహించేవాళ్లం. తనేం చెప్పినా తన మాటలకంటే హావభావాలను బట్టి అర్థం చేసుకునేవాళ్లం. మా రూముల మధ్యలో ఓ చిన్న పిట్టగోడ మాత్రమే ఉండేది. అందుకే వీలుచిక్కినప్పుడల్లా ఇంటి ఓనర్లు గమనించకుండా అటూ ఇటూ దూకుతూ బాగా ఎంజాయ్ చేస్తుండేవాళ్లం. రింకీ మాతో ఎంత కలిసినా డబ్బుల విషయంలో కాస్త వ్యత్యాసం చూపిస్తూనే ఉండేది. ఒక్క రూపాయి వేస్టైనా ఫీలైపోయేది. దానికి తగ్గట్లే సిచ్యుయేషన్స్ కూడా వస్తుండేవి. ఒకరోజు రింకీ వాళ్ల వాష్‌రూమ్‌లో వాటర్ రాకపోతే మా వాష్‌రూమ్‌లో హెడ్‌బాత్ చేసి హెయిర్ కండీషనర్ మరచిపోయింది. మరునాడు వచ్చి ‘నాకీ కండీషనర్’ అంది. ఎక్కడ పెట్టావంటే ‘మీకీ బాత్రూమ్లో’ అంది. ‘‘చూడుపో.. మార్నింగ్ ఏదో బాటిల్ చూసినట్లు గుర్తు’’ అంది నా స్నేహితురాలు అరుణ. బాటిల్ తెచ్చుకున్న రింకీ ముఖంలో ఒకరకమైన ఆశ్చర్యం కనిపిస్తోంది. ఏమైందని అడిగితే... ‘నాకి బాటిల్ అప్పుడే అయిపోయింది’ అంది షాకింగ్‌గా. చూస్తే అందులో సగానికి పైనే అయిపోయి ఉంది. ‘బాటిల్ ఎప్పుడు ఓపెన్ చేశావ్?’ అడిగింది మరో స్నేహితురాలు శ్రావణి. ‘నిన్నన్నే...(నిన్నే)’ అని చెప్పింది చాలా నిరుత్సాహంగా. మేమెవరం వాడలేదు. ఒకవేళ వాడినా కండీషనర్ ఒక్కరోజులో అంత అయిపోతుందా? ఏం జరిగి ఉంటుందని బాగా ఆలోచించాం. అప్పుడర్థమైంది. మాతో పాటు మా వాష్‌రూమ్‌ని మా ఓనర్ వాళ్ల అమ్మ కూడా వాడుకునేది. ఆమెకు కాస్త చేతివాటం ఉంది. (అప్పుడప్పుడు బయట ఆరవేసిన టవల్స్, కడిగిపెట్టిన ప్లేట్స్ మా దగ్గర మిస్సై, ఆమె రూమ్‌లో కనిపిస్తూ ఉండేవి.) ‘మేబీ.. బామ్మే వాడేసిందంటావా?’ అంది శ్రావణి. ‘ఆమె యూజ్ చేసుకుని వదిలేసే రకం కాదు, దొరికితే మాయం చేసే రకం. అయినా.. ఒకేసారి అంత వాడేసుంటుందా?’ అంది అరుణ. ‘షాంపూ అనుకునుంటుందే, ఎంత రుద్దినా నురుగు రాకపోయేసరికి అలా డబ్బా ఖాళీ చేసినట్లుంది’ అంది ఇంకో స్నేహితురాలు మాధవి. మేమంతా బాగా నవ్వుకున్నాం. అయితే రింకీ బాధ చూడలేక నెల సరుకులతో పాటు కండీషనర్ కూడా తీసుకుని తనకి ఇచ్చేశాం. ఇంకోరోజు పెద్ద వాన వస్తుంటే ఆఫీస్‌కి వెళ్తూ.. బామ్మగారి(ఓనర్ వాళ్ల అమ్మ) చిరిగిన గొడుగు తీసుకుని వెళ్లిందట రింకీ. పెద్ద గాలికి అది పూర్తిగా పాడైపోయిందట. తిరిగి అదే గొడుగు ఇచ్చి.. ‘సారీ.. బామ్మగారూ’ అందట. రింకీ తెలుగులో ఏం చెప్పిందో.. బామ్మకి ఇంగ్లిష్‌లో ఏం అర్థమయ్యిందో.. మేం కాలేజ్ నుంచి రూమ్‌కి వచ్చేసరికి పెద్ద గొడవ. ‘దటీజ్ హోల్స్ అంబ్రిల్లా..’ అంటుంది రింకీ. ‘అయితే మాత్రం.. పూర్తిగా పోగొట్టింది నువ్వే కదా, కొత్తది కొనివ్వు’ అంటుంది బామ్మ. పిచ్చి లేచి మేమే ఆ గొడుగు కొని బామ్మకు ఇచ్చేశాం.కొన్ని రోజులకి, ఓ ఆదివారం ఉన్నట్టుండి పెద్దపెద్ద అరుపు, కేకలు మొదలయ్యాయి. రింకీ వాళ్ల ఇంటి ఓనర్ రింకీపై కోప్పడుతున్నాడు. ‘వాటర్ అయిపోతున్నాయని, వాటర్ ఎక్కువ వాడుతున్నావని’ ఏదేదో తిడుతూ రెచ్చిపోతున్నాడు. రింకీ కూడా పెద్దగానే అరుస్తోంది. గొడవ పెద్దది కావడంతో మేమంతా ఆ గోడ దగ్గరకు వెళ్లాం. అప్పటికే రింకీని ఇళ్లు ఖాళీ చెయ్యమన్నాడు వాళ్ల ఓనర్. పౌరుషంగా బ్యాగ్స్ సర్దుకుంది రింకీ. మమ్మల్ని చూసి బావురుమంది. ‘సరే కానీ, ఇక నుంచి మాతో ఉందూగానీ’ అంటూ.. తన బ్యాగ్స్ అన్నీ ఆ గోడమీద నుంచే అందుకుని రూమ్‌లో పెట్టేసి, తననీ మా రూమ్‌లోకి తీసుకొచ్చాం. అయితే ఇంటి ఓనర్లు ఇద్దరూ ‘మీది తెనాలే.. మాది తెనాలే..’ సాంగ్ ఏదో పాడుకున్నట్లున్నారు. ఓ మూడు గంటల తర్వాత మా ఇంటి ఓనర్ మా దగ్గరకి వచ్చి.. మేం చెప్పేది వినకుండానే ‘రింకీ గురించి నాకు బాగా తెలుసు, తను మాట వినే రకం కాదు, తను మీ రూమ్‌లో ఉండటానికి వీల్లేదు’ అన్నాడు. తలలు పట్టుకున్నాం. అప్పటికే ఐదైంది. తనని ఎక్కడ ఉంచాలో అర్థం కాలేదు. చాలా ప్రయత్నాలు చేశాం. చివరిగా కాకినాడలో ఎప్పటి నుంచో పరిచయమున్న మధు గుర్తుకొచ్చింది. తనూ నాలానే స్నేహితులతో కలిసి రూమ్‌లో ఉండేది. మధుకి కాల్ చేసి, విషయం చెబితే.. ‘సరే, తనని మా రూమ్‌కి తీసుకునిరా, ఎన్ని రోజులున్నా నో ప్రాబ్లమ్’ అంది. మధు వాళ్ల రూమ్ మాకు పెద్ద దూరమేంకాదు. సైకిల్ మీద వెళ్తే ఇరవై నిమిషాలంతే! ముందురోజే నా సైకిల్ పంక్చర్ కావడంతో.. మూడు సైకిల్సే బయటికి తీశాం. నేను.. అరుణ సైకిల్ తీసుకుని, రింకీని ఎక్కించుకోగా, శ్రావణీ సైకిల్ అరుణ ఎక్కింది. మాధవి తన సైకిల్‌కి రింకీ లగేజ్నంతా కట్టుకుంది. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం. సగం దూరం వెళ్లాక రింకీ ‘నాకీ పర్సూ..’ అని అరిచింది. సైకిల్స్‌కి బ్రేకులు పడ్డాయి. ‘అయ్యో ఎక్కడ పడేశావ్?’ అడిగింది అరుణ. ‘నాకీ గురుతూ లేదు..’ అంది రింకీ ఏడుపు ముఖంతో. ‘ఏం కాదులే.. రూమ్‌లోనే మరిచిపోయి ఉంటావ్, మనం ఇంకెక్కడా ఆగలేదుగా’ అన్నాను నేను. అప్పటికి టైమ్ ఏడవుతోంది. ‘సరే పదా.. మనం వెళ్లి తీసుకొచ్చేద్దాం’ అంది అరుణ. ‘అబ్బా.. ఆ మార్కెట్ మధ్యలోంచి ఇప్పుడు ఈ సైకిల్స్‌తో చాలా కష్టమే తల్లి... మార్నింగ్ తెద్దాంలే..’ అంది మాధవి. ‘ఏదోలా ఇప్పుడు తేవడమే బెస్ట్, పైగా రేపు మనం సెవన్కే కాలేజ్‌కి వెళ్లాలి,మర్చిపోయావా?’ అంది అరుణ. రింకీ మళ్లీ ఏడుపు ముఖం పెట్టింది. చేసేది లేక.. వాళ్లని దగ్గరలోని బస్టాప్ దగ్గర వెయిట్ చెయ్యమని చెప్పి, అరుణని ఎక్కించుకుని రూమ్‌కి వెళ్లాను. తాళం చూడగానే ‘కీ’ అనేదొకటి ఉంటుందని, అది మా ఇద్దరి దగ్గర లేదని గుర్తుకొచ్చింది. ‘ఖర్మరా’ అనుకుంటూ ‘కీ’ కోసం మాధవికి కాల్ చేస్తే ‘అయ్యో నా దగ్గరే ఉందే!’ అంది చాలా సింపుల్‌గా. పగలగొడదామంటే అదొక్కటే లాక్, పైగా చాలా పెద్దది. ‘మార్నింగే కాలేజ్‌కి వెళ్లాలి, తాళం లేకపోతే కష్టం కదే’ అంది అరుణ. చచ్చినట్లు ఆ మార్కెట్ దాటుకుంటూ వాళ్లు ఉన్నచోటుకు వెళ్లి ‘కీ’ తెచ్చుకుని, రూమ్ దగ్గర ఆగగానే రింకీ కాల్ చేసింది. సైకిల్ స్టాండ్ వేస్తూనే ‘ఏంటి రింకీ?’ అని అడిగా. ‘పర్సు ఉందీ’ అంది. మెయిన్ గేట్ తీసుకుని లోపలికి వెళ్తున్న అరుణను వెనక్కి పిలిచి ‘పర్స్ ఉందటే, పద వెళ్దాం’ అని, దాన్ని ఎక్కించుకుని, మార్కెట్ దాటుకుని, వాళ్ల దగ్గరకి చేరుకునే సరికి ఎనిమిదిన్నర దాటింది. వెళ్లగానే రింకీ నా దగ్గరకి చాలా ఆతృతగా వచ్చి.. ‘పర్స్ ఉందీ?’ అంటూ వట్టి చెయ్యి చాపింది. ఒక్కసారి నా కాళ్ల కింద భూమి కంపిస్తున్నట్లనిపించింది. ‘పర్స్ ఉంది అన్నావ్ కదే!’ అన్నాను షాకింగ్‌గా. అప్పటికే సీన్ అందరికీ అర్థమైంది. ‘నీ భాష తగలెట్ట... పర్స్ ఉందీ కాదే.. పర్స్ ఉందా? అని ఏడ్వాలి’ అంటూ అరిచింది అరుణ. సైకిల్ వెనకాల కూర్చున్న దానికే అంత కోపం వస్తే.. మరి నా పరిస్థితి ఏంటి.? మాధవి వైపు చాలా నిరుత్సాహంగా ఓ చూపు చూశాను. ‘పర్స్ నేను తెస్తాలే’ అంది. ఆ రోజైతే కోపమొచ్చింది కానీ ఆ సీన్ గుర్తుకొచ్చిన ప్రతిసారీ మేమంతా భలే నవ్వుకుంటాం. పర్స్ అయితే రూమ్‌లో దొరికేసింది కానీ, ఆ రోజు నుంచి రింకీ పేరు ‘రాజస్తానీ పర్స్’ అయిపోయింది. – చిన్ని గాలిదేవర, అమలాపురం -
ద్వారకా తిరుమల గవర్నమెంట్ హాస్టల్లో అరాచకం
-
కంచంలో కొంచెం!
వసతిగృహాల్లో విద్యార్థుల మెనూ డైట్ కంట్రోల్ చేస్తోంది. సంక్షేమ హాస్టళ్లు, అందులో చదివే విద్యార్థులంటే పాలకులకు ఎంత అలుసో.. వారి మెనూ చార్జీలే అద్దం పడుతున్నాయి. మెనూ చార్ట్ చూస్తే పంచభక్ష్యపరమాన్నాలు కనిపిస్తాయి. కంచంలోకి చూస్తే.. పచ్చడి మెతుకులు, నీళ్ల సాంబారు, జావగారే ఆకు కూరలే ఉంటాయి. సంక్షేమ హాస్టళ్ల విద్యార్థుల కోసం రూ.కోట్ల ఖర్చు చేస్తున్నామని పాలకులు గొప్పలు పోతున్నారు. వసతి గృహ విద్యార్థులకు గొప్పగా మోనూ ప్రకటించినా.. మెస్ చార్జీలు మాత్రం పెంచలేదు. ప్రస్తుతం ప్రతి రోజూ ఒక్కో విద్యార్థికి సగటున రూ.25.80 మెస్ చార్జీ ఇస్తుండగా, ప్రభుత్వం ప్రకటించిన మెనూ ప్రకారం రూ.100 వరకూ ఖర్చవుతోంది. గూడూరు: రాష్ట్ర ప్రభుత్వం వసతి గృహ విద్యార్థుల కోసం జూలై 1వ తేదీ నుంచి కొత్త మెనూ ప్రకటించింది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం విద్యార్థులకు ఇస్తున్న మెనూ చార్జీలకు, అమలు చేయాల్సిన మోనూ ఖర్చుకు పొంతన లేకుండా ఉంది. 2012వ సంవత్సరానికి ముందుగా మెస్ చార్జీలు చాలా తక్కువగా ఉండడంతో అప్పటి మెనూనే అమలు సాధ్యం కాని పరిస్థితి ఏర్పడింది. అప్పటి ప్రభుత్వం జీఓ ఎంఎస్ నంబర్ 39 ప్రకారం 2012 డిసెంబరు 7న అప్పటి మెనూను బట్టి 3 నుంచి 7వ తరగతి వరకూ ఉన్న మెస్ చార్జీలు ఒక్కో విద్యార్థికి రూ.430 నుంచి రూ.750కి పెంచారు. 8 నుంచి 10వ తరగతి వరకూ రూ.530 నుంచి రూ.850 వరకూ పెంచారు. ఈ లెక్కన ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.25.80 వంతున అందజేస్తున్నారు. కానీ అప్పటి మోనూకూ విద్యార్థులకు అందజేసే మెస్ చార్జీలకూ పొంతన లేదు. దీంతో మెనూ ఆచరణ కూడా అంతంత మాత్రంగానే కొనసాగుతూ వచ్చింది. ఈ క్రమంలో జీఓ ఎంఎస్ 82 ప్రకారం గత నెల 5వ తేదీ నుంచి మెనూ చార్జీలను నామమాత్రంగా పెంచి, మెనూను మాత్రం ఆచరణకు ఏ మాత్రం సరితూగని విధంగా రకరకాల పౌష్టికాహారాలను చేర్చేశారు. ఈ మెనూ ఈ నెల 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చినా..వసతి గృహాల్లో అమలుకు మాత్రం నోచుకోలేదు. మెనూకు ధరాఘాతం విద్యార్థుల మెనూకు ధరాఘాతం తగిలింది. గతంలో మెనూలో చికెన్ అసలు లేకుండా ఉంటే, ప్రస్తుతం ఆది, మంగళ, శుక్రవారాల్లో చికెన్ వేయాల్సి వస్తోంది. ప్రస్తుతం చికెన్ ధర కిలో రూ.200 పలుకుతోంది. వేరుశనగ ముద్ద కూడా మెనూలో లేదు. ప్రస్తుతం టిఫిన్‌తో రోజూ వేరుశనగ ముద్ద కచ్చితంగా ఇవ్వాల్సి వస్తోంది. గతంలో పాలు మెనూలో లేకుంటే ప్రస్తుతం ఒక్కో విద్యార్థికి ప్రతి రోజూ ఉదయం 100 ఎంఎల్ పాలు అందజేయాల్సి వస్తోంది. ఉదయం టిఫిన్‌లో పూరీని జోడించడం, రోజుకోక ఆకుకూర, వేరుశనగ పప్పు పచ్చడి తదితరాలను మెనూలో అదనంగా చేర్చారు. కోడిగుడ్డు ధర కూడా ప్రస్తుతం రూ.5 కుపైగానే ఉంది. ఇలా ధరాఘాతంతో వసతి గృహాల్లో మెనూ అంతంత మాత్రంగానే అమలవుతోంది. గతంలో మాదిరిగానే ప్రతి రోజూ స్కూల్ నుంచి రాగానే బెల్లంతో కలిపిన రాగి మాల్ట్‌ను అందజేయాల్సి ఉంది. పెంచింది గోరంత..మెనూ కొండంత మెనూ చార్జీలను కూడా ప్రభుత్వం పెంచింది గోరంత అయితే.. మెనూ అమలు కొండంతగా ఉంది. వసతిగృహాల్లోని విద్యార్థులకు ప్రస్తుతం జీఓఎంఎస్ 82 ప్రకారం గత నెల 5న విడుదల చేసిన ఉత్తర్వుల మేరకు 3 నుంచి 7వ తరగతి వరకూ ఒక్కో విద్యార్థికి రూ.750 నుంచి రూ.1000కి పెంచారు. 8 నుంచి 10వ తరగతి వరకూ రూ.850 నుంచి రూ.1,250కి పెంచారు. దీంతో ఒక్కో విద్యార్థికి సగటున రోజుకు రూ. 36.29 అవుతోంది. గతంలో ఉన్న మెస్ చార్జీలకూ, ప్రస్తుతం పెంచిన చార్జీలకూ వ్యత్యాసం రూ.10 మాత్రమే. కానీ గతంలో ఉన్న మెనూకూ, ప్రస్తుతం అందజేయాల్సిన మెనూకూ మాత్రం భారీ వ్యత్యాసం ఉంది. భారీగా అప్పులు చేయాల్సి వస్తోంది వసతి గృహాల వార్డెన్లు అవి సజావుగా సాగేందుకు ప్రతి నెలా అప్పులు చేయక తప్పడం లేదు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి అప్పులు చేసి హాస్టళ్లను నడిపిస్తున్నట్లు వార్డెన్లు వాపోతున్నారు. అదనంగా మెనూలో చేర్చిన చికెన్‌తో పాటు, కోడిగుడ్లు అందించాలంటే 100 మంది విద్యార్థులు ఉన్న వసతి గృహాలకు పెరిగిన ధరలతో నెలకు రూ.30,000 వరకూ పెట్టుబడులు పెట్టాల్సి వస్తోంది. వారాల వారీగా మెనూ ఆదివారం ఉదయం: 100 ఎంఎల్ పాలు, పూరీలో బంగాళాదుంప కర్రీ, శనగ ముద్ద మధ్యాహ్నం: ఫ్రైడ్ రైస్, పెరుగు, గోంగూర పచ్చడి, చికెన్ కర్రీ రాత్రి: అన్నం, వంకాయ కూర, పాలకూర పప్పు, మజ్జిగ, అరటి పండు. సోమవారం ఉదయం: పాలు, పెసలప్పు కిచిడీ, వేరుశనగ పచ్చడి, కోడిగుడ్డు, వేరు శనగముద్ద రాత్రి: అన్నం, దోసకాయకూర, తోటకూర పప్పు, మజ్జిగ మంగళవారం ఉదయం: పాలు, పులిహోర, కోడిగుడ్డు, వేరుశనగ ముద్ద రాత్రి : ఫ్రైడ్‌రైస్, చికెన్ కర్రీ, గోంగూర పప్పు, మజ్జిగ, అరటి పండు బుధవారం ఉదయం: పాలు, ఇడ్లీ, వేరుశనగ పచ్చడి, కోడిగుడ్డు, వేరుశనగ ముద్ద రాత్రి: అన్నం, బంగాళాదుంప కూర, గోంగూర పచ్చడి, మజ్జిగ, అరటి పండు గురువారం ఉదయం: పాలు, గోధుమ రవ్వ ఉప్మా, వేరుశనగ పచ్చడి, కోడిగుడ్డు, వేరుశనగ ముద్ద రాత్రి: అన్నం, సొరకాయకూర, తోటకూరపప్పు, మజ్జిగ, అరటి పండు శుక్రవారం ఉదయం: పాలు, పొంగలి, వేరుశనగ పచ్చడి, కోడిగుడ్డు, వేరుశనగ ముద్ద రాత్రి: ఫ్రైడ్‌రైస్, చికెన్ కర్రీ, గోంగూర పచ్చడి, మజ్జిగ, అరటి పండు శనివారం ఉదయం: పాలు, ఇడ్లీ, కోడిగుడ్డు, వేరుశనగ ముద్ద రాత్రి: అన్నం, కూరగాయల కర్రీ, గోంగూర పచ్చడి, మజ్జిగ, అరటిపండు -
హాస్టల్లో నీళ్ళు లేక స్మశానంలో స్నానాలు..
-
వసతిగృహాల్లో పురుగుల బియ్యం
వసతిగృహ విద్యార్థులకు పురుగుల అన్నమే దిక్కయింది. వేసవి సెలవులకు ముందొచ్చిన బియ్యాన్ని వసతిగృహాల్లో నిల్వ ఉంచగా పురుగులు పట్టాయి. వాటినే ఇప్పుడు వండి పెడుతుండడంతో విద్యార్థులు కష్టమైనా...భరిస్తూ వేరే దిక్కు లేక తింటున్నారు. పార్వతీపురం : వసతిగృహాల్లో బియ్యం పురుగు పడుతున్నాయి. వసతిగృహ అధికారులకు ముందు చూపు లేకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొంది. వేసవి సెలవుల ముందు అధిక సంఖ్యలో బియ్యం ఇండెంట్ పెట్టడంతో వేసవి సెలవులకు విద్యార్ధులు ఇంటికి వెళ్లిపోవడం రెండు నెలలు పాటు బియ్యం నిల్వ ఉండడంతో పురుగులు పడుతున్నాయి. వేసవి సెలవుల తరువాత పాఠశాలలు ప్రారంభం కావడం వసతిగృహాలు తెరుచుకోవడంతో విద్యార్థులకు ఈ నిల్వ బియ్యాన్నే వార్డెన్లు వండి పెడుతున్నారు. పురుగులు పట్టిన బియ్యాన్ని పౌర సరఫరాల గోదాముకు అప్పగించి వాటి స్థానంలో కొత్త బియ్యాన్ని తీసుకోవల్సిన వసతిగృహ అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టకుండా ఉన్న నిల్వ బియ్యాన్నే వండి పెడుతున్నారు. దీంతో విద్యార్థులపై ప్రభావం పడే అవకాశం ఉంది. వసతిగృహ అధికారులకు ముందు చూపు లేకపోవడంతో అనేక వసతిగృహాల్లో వేసవి సెలవులకు ముందు విడిపించిన బియ్యం నిల్వ ఉండడం వేసవి సెలవుల తరువాత వాటిని తిరిగి వాడడంతో పురుగులు పట్టిన భోజనాన్ని విద్యార్థులు తినాల్సి వస్తుంది. తప్పనిసరి పరిస్థితుల్లో విద్యార్థులు కంటికి కనిపించిన వాటిని ఏరుకుని కనిపించని వాటిని ఆహరంతో కలిపి తినేస్తున్నారు. పురుగులు పట్టిన బియ్యం గుర్తింపు రెండు రోజుల కిందట స్థానిక న్యాయమూర్తి ముధుబాబు వసతిగృహాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈయన పరిశీలనలో బియ్యాన్ని పరిశీలన చేయగా బియ్యం పురుగులు పట్టినట్టు గుర్తించారు. ఎందుకిలా అని వసతిగృహ అధికారిని ప్రశ్నించగా వేసవి సెలవులకు ముందు తెచ్చిన బియ్యం కావడంతో పురుగు పట్టాయని చెప్పడంతో న్యాయమూర్తి పిల్లలకు వీటినే పెడితే ఎలా అని మందలించారు. నిల్వ బియ్యాన్ని వెనక్కి పంపించి కొత్త బియ్యాన్ని తెప్పించుకోవాలని ఆదేశించారు. ఇలా అనేక వసతిగృహాల్లో వేసవి సెలవులకు ముందు విడిపించిన బియ్యాన్నే ప్రస్తుతం విద్యార్థులకు వండి పెడుతున్నారు. దీంతో విద్యార్ధులకు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇప్పటికైనా వసతిగృహ అధికారులు నిల్వ బియ్యాన్ని తరలించి కొత్త బియ్యాన్ని తెచ్చుకుంటే బాగుంటుంది. -
వైన్ షాపు పైనే వెల్ఫేర్ హాస్టల్
విద్యార్థులకు హాస్టల్ అవస్థలు తప్పడం లేదు. గుంటూరు నగరం నడిబొడ్డున చుట్టుగుంట ప్రాంతంలో ఓ వైన్‌షాపుపైన సాంఘిక సంక్షేమ వసతి గృహాన్ని నిర్వహించడం పలు విమర్శలకు తావిస్తోంది. అది కూడా పగిలిపోయిన రేకులతో, అపరిశుభ్రత వాతావరణంతో దర్శనమిస్తోంది. ఈ పోస్ట్‌మెట్రిక్ వసతిగృహం కలెక్టరేట్‌కు, సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ కార్యాలయాలకు కూతవేటు దూరంలో ఉండటం గమనార్హం. లక్ష్మీపురం(గుంటూరు): పేద విద్యార్థుల ఉన్నత చదువులే లక్ష్యంగా ఏర్పాటు చేసిన వసతి గృహం నిర్వహణలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. కనీస వసతులు లేని భవనానికి వేల రూపాయల అద్దెలు చెల్లిస్తున్నారు. తాగేందుకు నీరు, ఉండేందుకు సరైన నీడ లేక విద్యార్థులు అందులో కష్టాలు ఎదుర్కొంటున్నారు. వివరాల్లోకి వెళితే... గుంటూరు నగరం నడిబొడ్డున చుట్టుగుంట ప్రాంతంలో ఓ వైన్‌షాపుపైన సాంఘిక సంక్షేమ వసతి గృహం నిర్వహిస్తున్నారు. భవనం పైభాగంలో పగిలిపోయిన రేకులు, అపరిశుభ్రతతో నడుస్తున్న ఈ పోస్ట్‌మెట్రిక్ వసతిగృహం కలెక్టరేట్‌కు, సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ కార్యాలయాలకు కూతవేటు దూరంలోనే ఉంది. నిత్యం ఈ హాస్టల్ మీదుగానే రాష్ట్ర మంత్రులు, జిల్లా స్థాయి అధికారులు రాకపోకలు సాగిస్తుంటారు. కాని ఈ హాస్టల్ వైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. ప్రభుత్వం ఈ వసతి గృహానికి నెలకు రూ.50 వేలు చెల్లిస్తోంది. నాలుగేళ్లుగా ఆ భవనంలో హాస్టల్ నడుపుతున్నారు. ఈ వసతి గృహంలో ఇంటర్ నుంచి పీజీ, ఇంజినీరింగ్, బీటెక్ విద్యార్థులు ప్రభుత్వం అందించే స్కాలర్‌షిప్‌లతో విద్యాభ్యాసం చేస్తూ, ఇక్కడ ఉంటారు. ఈ హాస్టల్ పర్యవేక్షణ అంతా జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు, జాయింట్ డైరెక్టర్ చూడాల్సి ఉంది. ఈ హాస్టల్లో 100 మంది విద్యార్థులకు వసతి గృహాన్ని ప్రభుత్వం మంజూరు చేసింది. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి జిల్లా వాసి అయినప్పటికీ ఈ హాస్టల్ దుస్థితి గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. కనీసం హాస్టల్ అని బోర్డు కూడా ఏర్పాటు చేయలేదు. అడిగే నాథుడు ఎవరూ లేకపోవడంతో ఏడాదికి రూ.6 లక్షలు అద్దె వసూలు చేస్తున్న భవన యజమాని కనీస మరమ్మతులు కూడా చేయించడంలేదు. మురుగు గురించి పట్టించుకోకుండా బ్లీచింగ్ చల్లి సరిపెడుతున్నారు. వర్షం పడితే పుస్తకాలు, దుస్తులు తడిచి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పైకప్పు రేకులు అంతంతమాత్రంగానే ఉన్నాయి. అవి ఎక్కడ ఊడిపడతాయోనని వణికిపోతున్నారు. మరుగుదొడ్లు, తాగునీటి వసతి లేక అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. -
ఉపాధ్యాయుడు కొడుతున్నాడని..
కారంచేడు: గుండుతో ఉన్న వ్యక్తి తమకు ఏవో కొనిస్తామని ఆశ చూపి బాపట్లలో కిడ్నాప్ చేయడంతో అప్రమత్తమై తప్పించుకొచ్చామని ఇద్దరు విద్యార్థుల ఫిర్యాదు మేరకు పోలీసులు అప్రమత్తమయ్యారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం వేకువ జాము వరకు కారంచేడు పోలీసుస్టేషన్ వద్ద హైడ్రామా నడిచింది. వివరాలు.. పర్చూరు మండలం గర్నెపూడికి చెందిన పులి నరేష్ కుమారుడు ఆకాష్, గుంటూరు జిల్లా బాపట్ల మండలం కర్లపాలేనికి చెందిన జాలాది ఆనంద్కుమారు జాన్‌వెస్లీలు గుంటూరు జిల్లా బాపట్ల ఫ్లయి ఓవర్ సమీపంలోని మూర్తినగర్ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారు. వీరు శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో కారంచేడు పోలీసుస్టేషన్ సమీపంలో సంచరిస్తుంటే డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ ప్రసన్నకుమార్ గమనించాడు. మీరు ఎవరు? ఈ సమయంలో ఇక్కడ ఏం చేస్తున్నారని ప్రశ్నించడంతో తమను ఓ వ్యక్తి కిడ్నాప్ చేసి చీరాల వైపు తీసుకెళ్తుంటే తప్పించుకొచ్చామని చెప్పారు. వెంటనే స్పందించిన ప్రసన్నకుమార్ స్థానిక ఎస్ఐతో పాటు ఉన్నతాధికారులకు సమాచారం అదించి అందరినీ అలర్ట్ చేశాడు. ఉన్నతాధికారల సూచన మేరకు చిన్నారులిద్దరినీ పోలీసుస్టేషన్‌కు తీసుకొచ్చి విచారించారు. వారు కొద్ది సేపు పొంతన లేని సమాధానాలు చెప్పారు. అప్పటికే వారు ఆకలితో ఉండటంతో ఆ సమయంలో స్టేషన్ సమీపంలోని చిల్లర దుకాణం తెరిపించి చిరుతిళ్లు తినిపించారు. ఆకలి తీరిన తర్వాత ప్రసన్నకుమార్ వారిని నిదానంగా విచారించాడు. అప్పుడు వారు తమ హాస్టల్లోని టీచర్ కొడుతుండటంతో హాస్టల్ నుంచి పారిపోయి వచ్చామని అంగీకరించారు. వెంటనే బాపట్ల పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హాస్టల్ నిర్వాహకులు వేకువ జామున 4 గంటలకు వచ్చి విద్యార్థులను తీసుకెళ్లారు. పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. విద్యార్థులను గమనించి గంటల సమయంలో వారిని గమ్య స్థానాలకు సురక్షితంగా చేర్చడంలో చకచక్యంగ వ్యవహరించిన కానిస్టేబుల్ ప్రసన్నకుమార్‌ను, ఆయనకు సహకరించిన వెంకట్రావును ఉన్నతాధికారులు, సిబ్బంది, హాస్టల్ నిర్వాహకులు, విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు. -
హాస్టల్ బియ్యం పక్కదారి!
మంచిర్యాలక్రైం: రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులకు అందిస్తున్న సన్నబియ్యం మాయమైన సం ఘటన బుధవారం మంచిర్యాలలో వెలుగుచూసింది. పట్టణలోని ఓ హాస్టల్ నుంచి ఉదయం బియ్యం అక్రమంగా తరలించి సీసీ నస్పూర్ సమీ పంలోని పెట్రోల్‌బంక్ ఎదురుగా ఉన్న ఓ ఇంట్లో నిలువ ఉంచారు. విషయం తెలుసుకున్న ఓ యువకుడు వీడియో తీసి ‘సాక్షి’కి చేరవేశాడు. ఇది తెలుసుకున్న ‘సాక్షి’ విలేకరి 15 నుంచి 20 నిమిషాల్లో ఘటనా స్థలానికి చేరుకునేలోపే అక్కడినుంచి బియాన్ని మాయం చేశారు. బియ్యం గురించి ఇంటివారిని ప్రశ్నించగా తమకేమీ తెలి యదంటూ బెదిరింపులకు దిగారు. ఈ విషయమై పట్టణంలోని ప్రభుత్వ వసతిగృహాల నిర్వాహకులను వివరణ కోరగా తమకేమీ తెలియదని సమాధానం చెప్పడం గమనార్హం. బియ్యం బస్తాలపై తెలంగాణ స్టేట్ సివిల్ సప్లై కార్పొరేషన్ లిమిటెడ్ (టీఎస్సీఎస్సీఎల్) సన్నబియ్యం హాస్టల్ అని ఉంది. బియ్యాన్ని వసతిగృహాలకు తరలిస్తున్న క్రమంలోనే మార్గమధ్యంలో మాయం అవుతున్నాయి. సంబంధిత అధికారులు, వసతిగృహాల నిర్వాహకుల అండతోనే ఈ దందా జోరుగా సాగుతోందని తెలుస్తోంది. బియ్యం ఎక్కడివి, ఎవరు తరలించారు, అసలు దొంగలు ఎవరు అనేది అధికారులు విచారిస్తే తేలనుంది. -
మెడికో ఆత్మహత్య
ఇండోర్: నగరంలోని ఇండెక్స్ ప్రైవేటు మెడికల్ కాలేజీలో పోస్టు గ్రాడ్యుయేట్ చదువుతున్న మెడికల్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్ గదిలో మత్తుమందును తనకు తానుగా ఇంజెక్ట్ చేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. మృతురాలు భోపాల్‌కు చెందిన స్మృతి లాహర్పూరె(32)గా గుర్తించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనాస్థలం నుంచి సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. కానీ అందులోని విషయాలు వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు. సోమవారం వేకువజామున ఒకటిన్నర గంటలకు ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని స్థానిక పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ హకం సింగ్ పవార్ తెలిపారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం దగ్గరలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆధారాల కోసం చనిపోయిన స్మృతి లాహర్పూరె స్నేహితులను పోలీసులు ప్రశ్నించారు. -
శ్రీకాకుళం ట్రిపుల్ఐటీ ఇక్కడేనా..!
నూజివీడు : రెండేళ్లుగా నూజివీడు ట్రిపుల్ఐటీ క్యాంపస్‌లో తాత్కాలికంగా నిర్వహిస్తున్న శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీని రాబోయే విద్యాసంవత్సరానికి కూడా శ్రీకాకుళం జిల్లాలోని ఎస్‌ఎంపురానికి తరలించే సూచనలు కనిపించడం లేదు. ఆగస్టు ఒకటో తేదీ నుంచి పీయూసీ ప్రథమ సంవత్సరం తరగతులు ప్రారంభంకానున్న నేపధ్యంలో శ్రీకాకుళం ట్రిపుల్ఐటీ విద్యార్థుల సంఖ్య 3వేలకు చేరనుంది. దీనికి తోడు నూజివీడు ట్రిపుల్ఐటీ విద్యార్థులు 6500 మందిని కలిపితే మొత్తం విద్యార్థుల సంఖ్య 9500లకు చేరనుంది. అయితే ఇంత మంది విద్యార్థులకు తరగతులు నిర్వహించడానికి తరగతి గదులు, ఉండటానికి హాస్టల్ గదులు అందుబాటులో ఉన్నప్పటికీ, ఇతర విషయాల్లో సమస్యలు మాత్రం పెద్ద ఎత్తున ఎదురయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వేధించనున్న నీటి సమస్య... నూజివీడు ట్రిపుల్‌ఐటీలో గత కొన్ని నెలలుగా నీటి సమస్య వేధిస్తోంది. ఈ పరిస్థితుల్లో దాదాపు 10 వేలకు చేరుతున్న విద్యార్థులకు సరిపడా నీటి లభ్యత లేని పరిస్థితులు ఉన్నాయి. 9500 మంది విద్యార్థులకు, క్యాంపస్‌లోనే ఉంటున్న సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు కలిపి మరో 1000 మంది ఉన్నారు. వీరందరికి రోజుకు కనీసం 12 లక్షల నుంచి 15 లక్షల లీటర్ల నీళ్లు అవసరమవుతాయి. ప్రస్తుతం క్యాంపస్‌లో 23 బోర్లు ఉండగా ఈ బోర్ల మోటర్లు 12 గంటలు పనిచేస్తే కేవలం 4 లక్షల లీటర్లు మాత్రమే వస్తున్నాయి. పురపాలకసంఘంకు చెందిన కృష్ణాజలాల ప్రాజెక్టు నుంచి రోజుకు 5నుంచి 6 లక్షల లీటర్లు వస్తున్నాయి. ఈ రెండు వనరుల నుంచి కేవలం 10 లక్షల లీటర్లు మించి రావడం లేదు. ఇంకా 5 లక్షల లీటర్లు నీళ్లు అవసరమై ఉంది. నూతన బోర్లు వేస్తున్నా భూగర్భజలాలు లేక బోర్లలో నీళ్లు పడటం లేదు. ఈ పరిస్థితుల్లో ప్రధానంగా నీటి సమస్య ఉత్పన్నమయ్యే పరిస్థితి నెలకొంది. శ్రీకాకుళంకు పాత క్యాంపస్ కేటాయింపు శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీలో ఈ విద్యాసంవత్సరం నుంచి ఇంజినీరింగ్ ప్రథమ సంవత్సరం కూడా ప్రారంభంకానున్న నేపథ్యంలో నూజివీడు ట్రిపుల్ఐటీతో సంబంధం లేకుండా గతంలో నూజివీడు ట్రిపుల్ఐటీకి చెందిన పీయూసీ తరగతులు నిర్వహించిన ప్రీఫ్యాబ్ క్యాంపస్‌ను శ్రీకాకుళంకు అప్పగించారు. దీంతో ప్రీఫ్యాబ్ దీనిలో పీయూసీ తరగతులు నిర్వహించడానికి, హాస్టల్ గదుల ఏర్పాటుకు, స్టాఫ్ గదులకు, ల్యాబ్‌లకు సరిపోతుంది. ఎందుకు తరలించలేకపోతున్నారు... రాష్ట్ర ప్రభుత్వం శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీని ఏర్పాటు చేసి రెండేళ్లవుతున్నా ఇక్కడ నుంచి శ్రీకాకుళం జిల్లాకు మార్చడంలో మాత్రం తీవ్ర జాప్యం జరుగుతోంది. శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల మండలం ఎస్ఎంపురంలో ప్రభుత్వం స్థలంతో పాటు 21వ శతాబ్దం గురుకులం భవనాలను సైతం ట్రిపుల్ఐటీకి కేటాయించింది. అంతేగాకుండా ఎచ్చెర్లలోని ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలను నెలకు రూ.4లక్షలకు అద్దెకు సైతం తీసుకుని గత ఏడాది అక్టోబర్ నుంచి అద్దె చెల్లిస్తున్నారు. అయినప్పటికీ శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీని మాత్రం తరలించడం లేదు. 21వ శతాబ్దం గురుకులం భవనాల్లోను, అద్దెకు తీసుకున్న ఇంజినీరింగ్ కళాశాల భవనాలలో 5వందల మందిని మాత్రమే ఉంచడానికి కుదురుతుంది. దీంతో అక్కడే రెండు క్యాంపస్‌లు నిర్వహించాలంటే పరిపాలనా పరంగా తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ నేపధ్యంలో పూర్తిస్థాయిలో భవనాలు అందుబాటులోకి వచ్చిన తరువాతే అక్కడకు మారాలని ఛాన్సలర్ పేర్కొనట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ ఏడాది కూడా ఇక్కడే తరగతులు కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. -
కాస్త వినండి ప్లీజ్
‘ఛీ.. ఛీ.. ఎంత చెప్పినా వినిపించుకోరు. ఏం మనుషులో ఏమో!’ విసుక్కున్నట్టు గట్టిగాపైకే అంటున్న ఆమె కేసి మళ్లీ చూశాను. చేతులు గాల్లోకి తిప్పి తనలో తనే ఏదో మాట్లాడుకుంటోంది. మధ్య మధ్య కన్నీళ్లు తుడుచుకుంటోంది. ‘చెప్పుతో కొట్టాలి.. ’ అనే మాటతో ఉలిక్కిపడి చూశాను. కిటికీ పక్కన కూర్చున్న ఆవిడ ఇంకా ఏవో మాటల్ని తనలో తను అనుకున్నట్టు బైటికే అంటోంది. ఉండుండి తల రుద్దుకుంటోంది. కిటికీ నుంచి బయటకే చూస్తోంది. కొంచెం భయంగా అనిపించి, కాస్త పక్కకు జరిగాను. ఆమెలో మార్పేమీ లే దు. ‘ఈవిడ మతిస్థిమితం తప్పినావిడ కాదు కదా!’ అనుకుంటూ ఒకసారి చుట్టూ చూశాను. అన్ని సీట్లు ఫుల్‌గానే ఉన్నాయి. దాదాపు అందరూ స్మార్ట్ ఫోన్లలో తలలు పెట్టి బిజీగా ఉన్నారు. ముందు సీట్లో కండక్టర్ మాత్రం.. టికెట్ మిషన్‌ను ఒకసారి, బ్యాగులో డబ్బులొకసారి చూసుకుంటున్నాడు. బ్యాగు సర్దుకుంటున్నాడు.అది సిటీ బస్సు. ఆదివారం బంధువులింట్లో ఫంక్షన్. తప్పనిసరి అయి బయల్దేరాను. ‘ఛీ.. ఛీ.. ఎంత చెప్పినా వినిపించుకోరు. ఏం మనుషులో ఏమో!’ విసుక్కున్నట్టు గట్టిగా పైకే అంటున్న ఆమె కేసి మళ్లీ చూశాను. చేతులు గాల్లోకి తిప్పి తనలో తనే ఏదో మాట్లాడుకుంటోంది. మధ్య మధ్య కన్నీళ్లు తుడుచుకుంటోంది. ఆమె కట్టు, బొట్టు చూస్తుంటే ఓ మధ్యతరగతి ఇల్లాలు అని అర్థమవుతోంది. ఆమె చెవుల్లో ఇయర్ ఫోన్స్, చేతిలో ఫోన్ లేదని రూఢీ చేసుకున్నాక... ‘ఎక్కడకు వెళ్లాలి మీరు’ అని మాటలు కలిపాను. ఆమె ఉలిక్కిపడి నా వైపు చూసింది. కన్నీళ్లను తుడుచుకుంటూ ‘మారేడుపల్లి..’ అంది. ‘రిలేటివ్స్ ఇంటికి వెళుతున్నారా..’ అడిగాను. ‘అవును. నిన్న మా ఆడపడుచు వాళ్లింటికి వెళ్లాం. మా ఆయనకు ఏదో పని పడిందట. వెళ్లిపోయాడు..’ అంటూ ఇంకా రాలుతున్న కన్నీటిని తుడుచుకుంటుంది.‘ఏమైనా ప్రాబ్లమా!’ అడిగాను.‘మా తమ్ముడికి ఆరోగ్యం బాగోలేదని తెలిసింది. మా ఆయనకు మా అమ్మవాళ్లకు డబ్బు విషయమై గొడవలు. వాళ్లు ఇటు రావద్దు, నేనటు వెళ్లొద్దు. అమ్మవాళ్లు ఫోన్ చేసినా కోపమే! నా దగ్గర ఫోన్ కూడా లేకుండా చేశాడు. ఐదేళ్లు అవుతోంది వాళ్లతో మాట్లాడి. మా తమ్ముడి గురించి చెబుతుంటే వినిపించుకోకుండానే వెళ్లిపోయాడు. ఏం చెప్పినా అంతే! నోర్మూసుకో అంటాడు...’ చిన్న పలకరింపుతో ఆమె తన ఇంటి విషయాలు చెబుతూ పోతోంది!‘ఇద్దరు మగపిల్లలు. చిన్నోడు టెన్త్‌క్లాస్, పెద్దోడు ఇంటర్మీడియెట్. హాస్టల్లో ఉండి చదువుకుంటారు. ఇంట్లో ఉంటే చదవడం లేదని హాస్టల్లో వేశాడు మా ఆయన..’ ‘మీలో మీరు మాట్లాడుకుంటున్నారు ఎందుకు?’ అడగాలనిపించినా ఆగిపోయాను. అసలు ఆమె బాధ ఏంటో వినేవారే లేరని అర్థమైంది. స్టాప్ వచ్చింది. మారేడుపల్లిలో ఆవిడ బస్సు దిగిపోయింది.‘ఏయ్! దూరంగా నిలబడు ..’ ఎందుకలా మీద మీదకు వస్తావ్! సిగ్గు లేదు, ఎద్దులా పెరిగావు.. ఏం నేర్చుకున్నావ్!’ ముందు సీటు లెఫ్ట్‌సైడ్‌లో కూర్చున్న ఓ పెద్దావిడ.. పక్కన నిల్చున్న అమ్మాయి మీద కస్సుమంటోంది. ఆమె వాయిస్ అంతటి బస్సు సౌండ్లోనూ గట్టిగా వినిపిస్తోంది. వెనకసీట్లో ఉన్నావిడ ‘అదేంటమ్మా! ఆ అమ్మాయి బాగానే నిలబడింది కదా.’ అనేసరికి ‘యు షటప్.. నువ్వెవరు నన్ను క్వొశ్చన్ చేయడానికి..’ అంటూ గయ్యిమని లేచింది. తన వస్తువులను దగ్గరకు సర్దుకుంటోంది. సరిగ్గా ఉన్న వాటిని కూడా మళ్లీ జరిపి పెడుతోంది. మళ్లీ గట్టి గట్టిగా తిడుతూనే ఉంది, చేతులు గాల్లోకి లేపి ఎవరికో వార్నింగ్ ఇస్తోంది. ఎవరు బస్సు ఎక్కి ఆమె సీటు పక్కన నిల్చున్నా .. వాళ్ల మీద కయ్యిమంటూనే ఉంది. ‘మైండ్ సరిగ్గా లేనట్టుంది..’ పక్కసీటావిడ జాలిగా ఆమెవైపు చూస్తూ అంటోంది. నిజమే, మైండ్ దెబ్బతిని ఉంటుంది. బహుశా! చెప్పేది వినడానికి ఎవరూ లేకనో! అసలు వినదగినవారే లేకనో.. ! – నిర్మలారెడ్డి -
ఉపాధికి ఊతం న్యాక్..
సిరిసిల్ల/కోరుట్ల:నిరుద్యోగులకు ఉపాధి శిక్షణతోపాటు, నైపుణ్య శిక్షణ ఇస్తూ వేలాదిమందికి ఉపాధి బాట చూపుతోంది న్యాక్ కేంద్రాలు. రాష్ట్రవ్యాప్తంగా 38 న్యాక్ కేంద్రాలు ఉన్నాయి. వివిధ వృత్తివిద్యా కోర్సుల్లో పేద యువతకు శిక్షణ ఇస్తూ భవిష్యత్‌పై బరోసా కల్పిస్తున్నాయి. న్యాక్ ఆఫర్ చేస్తున్న కోర్సులు.. వెల్డింగ్, ప్లంబింగ్, పేయింటింగ్ అండ్ డెకరేషన్ కోర్సులకు ఏడో తరగతి చదివిన అభ్యర్థులు అర్హులు. ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్, స్టిచింగ్ అండ్ కర్టెన్ మేకింగ్ కోసం పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ల్యాండ్ సర్వేయర్, జనరల్ వర్క్స్ సూపర్వైజర్ కోసం ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత పొంది ఉండాలి. మూడు నెలలపాటు శిక్షణ అందిస్తారు. ఉచిత వసతి గృహం, భోజన వసతి కల్పిస్తారు. వీరు అర్హులు.. ఈ కోర్సులకు 18– 35 వయసు గల అభ్యర్థులు రేషన్ కార్డు, ఆధార్‌కార్డు, క్వాలిఫైంగ్ సర్టిఫికెట్, కుల «ధ్రువీకరణ పత్రం, బ్యాంక్ పాస్‌పుస్తకం దరఖాస్తుతో జతచేసి న్యాక్కేంద్రంలో సమర్పించాలి. నైపుణ్య శిక్షణ.. శిక్షణ పొందే అభ్యర్థులు కార్మికశాఖలో పేరు నమోదు చేసుకోవాలి. లేబర్ కార్డు ఉండాలి. తాపీమేస్త్రీ, ప్లంబింగ్, వెల్డింగ్ కోర్సులకు నైపుణ్య శిక్షణ కోసం 15 రోజులపాటు ఉచిత శిక్షణ ఇవ్వడంతోపాటు భోజన వసతి కల్పిస్తారు. నిత్యం రూ. 300 చొప్పున స్టైఫండ్ చెల్లిస్తారు. నూరుశాతం ప్లేస్మెంట్.. ఉచిత భోజన వసతి హాస్టల్ సదుపాయంతోపాటు, భోజనం, యూనిఫాం, కోర్సు మెటీరియల్స్ అందజేస్తారు. శిక్షణ అనంతరం సర్టిఫికెట్ ఇస్తారు. నూరుశాతం ప్లేస్మెంట్ కల్పిస్తారు. ఉద్యోగంలో చేరిన మూడు నెలల అనంతరం ప్రభుత్వం వారిబ్యాంకు ఖాతాలో రూ. 3,000 జమ చేస్తుంది. ఉన్నత చదువులు చదివినా ఉద్యోగం రావడంలేదనుకునేవారు కొందరు.. చదువు లేక కూలీనాలి చేసేవారు మరికొందరు.. చదువు.. ఆలోచనా శక్తి.. ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకునే నేర్పు ఉన్నవారు మరికొందరు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా తమ కాళ్లపై తాము నిలబడి మరో పదిమందికి ఉపాధి కల్పిస్తున్నారు ఎంతోమంది. స్వయం ఉపాధిపై ఆసక్తి ఉన్నవారిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు అనేక అవకాశాలు కల్పిస్తున్నాయి. వీటిని సద్వినియోగం చేసుకునేందుకు నిబంధనలనూ సరళీకృతం చేస్తున్నాయి. ఆర్థికంగా అండగా నిలిచేందుకు రుణసాయం అందిస్తున్నాయి. రాయితీ.. సబ్సిడీ.. వడ్డీ మాఫీతో స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తున్నాయి. మరికొన్ని సంస్థలు యువత వృత్తినైపుణ్యం పెంచుకునే అవకాశం కల్పిస్తున్నాయి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్వైపు నడిపిస్తున్నాయి. స్వయం ఉపాధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు.. నైపుణ్య శిక్షణ పెంపొందిస్తున్న సంస్థలు.. కోర్సులు.. దరఖాస్తు విధానం.. రుణాలు పొందే అవకాశం.. తదితర వివరాలతో ఈవారం వీకెండ్. -
అప్పనంగా భోం చేశారు
జేఎన్టీయూ: జేఎన్టీయూ అనంతపురం ఇంజినీరింగ్ కళాశాలలోని హాస్టల్ కార్యాలయంలో భారీగా అవినీతి చోటు చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గుర్తింపు ఉన్న ఇంజినీరింగ్ కళాశాల అయినా విద్యార్థి భాగస్వామ్య హాస్టల్స్ పేరుతో నిర్వహిస్తున్నారు. విద్యార్థులు చెల్లించే మొత్తంతోనే హాస్టల్లో ఉద్యోగుల జీతాలు, కరెంటు బిల్లులు, గ్యాస్ బిల్లులు తదితర అన్నింటికీ చెల్లిస్తున్నారు. ఇంతటితో ఆగకుండా ఆసొమ్ముతోనే అవినీతికి పాల్పడ్డారు. ఒకటికాదు..రెండుకాదు అవకాశం ఉన్న ప్రతి చోటా విద్యార్థుల సొమ్మును దిగమింగారనే ప్రచారం జరుగుతోంది. విద్యార్థులపైనే మళ్లీ భారం.. జేఎన్టీయూ అనంతపురం కానిస్టిట్యూట్ కళాశాలగా కలికిరి ఇంజినీరింగ్ కళాశాల ఉంది. అక్కడ ల్యాబ్ సదుపాయం లేదు, పర్మినెంట్ ఫ్యాకల్టీ లేకపోవడంతో ప్రయోగాలు చేసుకోవడానికి క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాలకు విద్యార్థులు వస్తారు. ఏడాదిలో నాలుగు దఫాలు పైగా ఇక్కడి ల్యాబ్‌లు ఉపయోగించుకుంటారు. దీంతో క్యాంపస్ కళాశాల హాస్టల్స్‌లోనే వారికి వసతి ఏర్పాట్లు చేస్తున్నారు. కలికిరి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల నుంచి నేరుగా మెస్ బిల్లులు కట్టించుకున్నారు. ఆ నగదు ఏ ఖాతాల్లోనూ చూపకుండా నామమాత్రంగా కొందరు విద్యార్థులతో చలానాలు మొక్కుబడిగా కట్టించుకున్నారు. ప్రాక్టికల్స్‌కు హాజరైన మొత్తం విద్యార్థుల హాజరు పట్టికను, నామమాత్రంగా తీసిన చలానాలను పరిశీలిస్తే మొత్తం భాగోతం బహిర్గతమయ్యే అవకాశం ఉంది. గత రెండేళ్లుగా కలికిరి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు వస్తున్నారు. ఇందులో అరకోటి పైగానే స్వాహా జరిగినట్లు ఉద్యోగులే చెప్తున్నారు. స్వాహా చేసిన రూ.అరకోటి పైగా మొత్తం హాస్టల్ ఖాతాకు చేరకపోవడంతో జేఎన్టీయూ అనంతపురం ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులపై భారం పడింది. ఇండెంట్‌కు.. బిల్లులకు పొంతనలేదు.. ఇండెంట్లో నిర్ధారించిన రేటుకు, కొనుగోలు బిల్లుకు మధ్య వ్యత్యాసం ఉంది. గతేడాది జనవరి 24న ఇండెంట్లో ఎర్రగడ్డలు కేజీ రూ. 14, మిర్చి రూ. 10లుగా నిర్ధారించారు. కానీ బిల్లులో మాత్రం కేజీ ఎర్రగడ్డలు రూ. 20, మిర్చి రూ.13లుగా చూపించారు. అంటే కేజీకి రూ.6 అదనంగా బిల్లు వేశారు. తిరిగి జనవరి 27న ఇండెంట్లో ఎర్రగడ్డలు రూ.13లు, ఉర్లగడ్డ రూ.10, కానీ బిల్లులో ఎర్రగడ్డలు రూ. 20.60, ఉర్లగడ్డ రూ.25గా బిల్లు వేశారు. బిల్లులోని ప్రతి వస్తువుపైనా అదనంగా బిల్లులు వేశారు. వ్యూహంతో విద్యార్థులు బలి.. సాధారణంగా వరుసగా మూడు రోజులు మెస్‌కు గైర్జాజరయితే సెలవుగా ప్రకటించరు. సెలవు రోజులకు కూడా మెస్‌బిల్లు వేస్తారు. మూడు రోజులకు పైగా మెస్‌కు గైర్హాజరయితే మాత్రమే సెలవుగా ప్రకటించాలి. మూడు రోజులకు పైగా తీసుకున్న సెలవు రోజులకు మెస్ బిల్లు వేయరాదు. నెల రోజులు సెలవులో ఉన్న విద్యార్థులకు సైతం మెస్ బిల్లు వేశారు. దీంతో స్వాహా జరిగిన మొత్తం బహిర్గతం కాకుండా వ్యూహం పన్నారు. హాస్టల్స్‌లో అంతా సజావుగా జరుగుతున్నట్లు భ్రమ కల్పిస్తూ ఉన్నతాధికారులను సైతం దృష్టి మళ్లిస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాప్ట్వేర్ రూపకల్పనకు రూ. 4లక్షలు ఖర్చు.. పేరెన్నికగల టెక్నాలజీ కళాశాలలో సాప్ట్‌వేర్‌ను రూపకల్పన చేసే విద్యార్థులు లేక సాప్ట్‌వేర్‌ను రూపకల్పనకు రూ. 4లక్షలు వెచ్చించారు. మెస్‌బిల్లు వసూలుకు సాప్ట్వేర్ దోహదపడుతుందన్న ఉద్దేశంతో భారీ మొత్తాన్ని ఖర్చు పెట్టారు. ఇందుకు ఎలాంటి విధివిధానాలు, అనుమతి లేకుండా ఖర్చు పెట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
హాస్టల్లో గంజాయి కలకలం
సూర్యాపేటటౌన్ : జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో బుధవారం అర్ధరాత్రి దాటాక గంజాయి దొరకడంతో ఒక్కసారిగా కలకలంరేగింది. పట్ట ణంలోని గాయత్రి జూనియర్ కళాశాల హాస్టల్లో అర్ధరాత్రి 100 కేజీల గంజాయి పట్టుబడింది. వివరాల ప్రకారం.. గాయత్రి కళాశాలకు సమీపంలో హాస్టల్‌ను బాలుర కోసం ఏర్పాటు చేశారు. అయితే రోజు మాది రిగానే కళాశాల విద్యార్థులు సాయంత్రం హాస్టల్‌కు వచ్చి స్టడీ అవర్స్‌లో 10.30 గంటల వరకు ఆరు బయటనే చదువుకున్నారు. కళాశాల వార్డెన్ లింగయ్య 12 కాటన్ల గంజాయిని ఓ ఆటోలో తీసుకొచ్చి కళాశాల హాస్టల్లోని విద్యార్థుల మంచాల కింద దాచి పెట్టాడు. గమనించిన విద్యార్థులు ఏమిటని వార్డెన్‌ను అడుగగా పరీక్ష పేపర్లని చెప్పి బయటికి వెళ్లాడు. విద్యార్థులకు అనుమానం వచ్చి కాటన్లను తెరిచి చూశారు. ఒక్కసారిగా గుప్పుమని గంజాయి వాసన రావడంతో అందులో ఒక విద్యార్థి వారికి తెలిసిన విద్యార్థి సంఘం నాయకులకు సమాచారం ఇచ్చారు. విద్యార్థి సంఘాల ధర్నా.. గంజాయి కళాశాల వసతి గృహంలో ఉందని తెలియడంతో టీజీవీపీ, టీవైఎస్ విద్యార్థి సంఘం నాయకులు కళాశాల హాస్టల్‌కు వెళ్లి సుమారు 100కేజీల గంజాయి కాటన్లను బయటికి తెచ్చి ధర్నాకు దిగారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని 12 కాటన్ల గంజాయిని సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. సుమారు 200మంది విద్యార్థులు ఉండే హాస్టల్లో గంజాయి లభ్యం కావడంతో ఒక్కసారిగా విద్యార్థులు ఉలిక్కిపడ్డారు. పరారీలో హాస్టల్ వార్డెన్.. గంజాయిని హాస్టల్లో దాచిన వార్డెన్ లింగయ్య ఈ విషయం బయటికి పొక్కడంతో వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ శివశంకర్ వార్డె¯Œన్‌తో వచ్చిన వారి వివరాలను ఆరా తీశారు. గంజాయి మూలాలపై లోతుగా విచారణ చేపట్టి నిందితుడిని వెంటనే పట్టుకుంటామని సీఐ తెలిపారు. మాకు ఎలాంటి సంబంధం లేదు : కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ తమ కళాశాల హాస్టల్లో గంజాయి దొరికిందని తెలియడంతో ఒక్కసారిగా అవాక్కయ్యాను. మూడు నెలల క్రితమే కళాశాల హాస్టల్లో వార్డెన్‌గా తేజావత్ లింగయ్యను పెట్టుకున్నాం. అయితే లింగయ్య గంజాయి దందా చేసినట్లు తెలిసింది. రాత్రి కళాశాలకు చేరుకునే సరికి వార్డెన్ లింగయ్య పరారయ్యాడు. కళాశాల యాజమాన్యానికి గంజాయికు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఇదంతా వార్డెన్ లింగయ్య దొరికితే బయటపడుతుంది. వార్డెన్‌పై కేసు నమోదు సూర్యాపేట క్రైం : కళాశాలలో 100 కేజీలకు పైగా గంజాయిని అక్రమంగా నిల్వ ఉంచిన హాస్టల్ వార్డెన్ తేజావత్ లింగయ్యపై ప్రిన్సిపాల్ చామకూరి శ్రీనివాస్ ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శివశంకర్‌తెలిపారు. కళాశాల ఫర్నిచర్ ధ్వంసం... అభం శుభం తెలియని విద్యార్థుల పక్కన గంజాయిపెట్టి వారి జీవితాలతో చెలగాటమాడిన కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకొని గుర్తింపును వెంటనే రద్దు చేయాలని తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో కళాశాల ఎదుట ధర్నా చేశారు. ధర్నాలో భాగంగా కళాశాలలోని అద్దాలు, కుర్చీలను పగులగొట్టి ధ్వంసం చేశారు. వెంటనే కళాశాల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఫర్నిచర్‌ను« ధ్వంసం చేయడంతో వెంటనే సీఐ శివశంకర్ సిబ్బందితో కలిసి చేరుకొని కళాశాల ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టీజీవీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రత్నావత్ వంశీ, అహ్మద్అలీ, చాంప్లా, అశోక్, శివ, ఠాగూర్, మణి,సాయి తదితరులు పాల్గొన్నారు. -
హాస్టల్ నుంచి 8 మంది విద్యార్థుల పరారీ
కరీంనగర్‌ఎడ్యుకేషన్: నగరంలోని ఎస్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెసిడెన్షియల్ బాలుర జూనియర్ కళాశాలకు చెందిన ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 8 మంది శనివారం ఉదయం నుంచి జాడలేకుండా పోయారు. వివరాల్లోకెళితే.. బస్టాండ్ సమీపంలోని కిమ్స్ డిగ్రీ కళాశాల వద్దనున్న ఎస్టీ గురుకులంలోని విద్యార్థులు తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో గోడదూకి పోయినట్లు తోటి విద్యార్థులు చెబుతున్నారు.ఉదయం నుంచి సాయంత్రం వరకు సంక్షేమశాఖ అధికారులు పారిపోయిన విద్యార్థులు ఇళ్లకు వెళ్లారా.. వేరే చోటికి వెళ్లారా అనే విషయంపై స్పందించకుండా ఉండడంతో విమర్శలు వ్యక్తమయ్యాయి. గురుకుల విద్యాలయంలో నిరంతరం పర్యవేక్షణ చేపట్టాల్సిన అధికారులు 8 మంది విద్యార్థులు పారిపోయి 18 గంటలపాటు జాడతెలియకపోయినా అధికారులు నిమ్మకునీరెత్తినట్లు ఉండడం పట్ల గిరిజన సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఈ ఘటన విషయం తెలిసిన గిరిజన జేఏసీ జిల్లా చైర్మన్ బీమాసాహెబ్ హాస్టల్‌ను సందర్శించి విద్యార్థుల వివరాలను ఆరా తీశారు. అద్దె భవనంలో పిల్లలకు సరైన రక్షణ లేదని, రూంలు సరిపడా లేవని, వసతుల లేమితో కొట్టుమిట్టాడుతున్న విద్యార్థులపై గిరిజన సంక్షేమ అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్లే 8 మంది విద్యార్థులు గోడదూకి వెళ్లిపోయారని ఆరోపించారు. హాస్టల్ సందర్శించిన వారిలో డీవైఎస్ఐ నాయకులు తిరుపతినాయక్, బోడ మోహన్ సదయ్య, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. -
శాతవాహన వర్సిటీలో పోలీసు పికెట్
సాక్షి, కరీంనగర్: కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీలో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. జనవరి 1వరకు వర్సిటీ హాస్టల్‌ను అధికారులు మూసివేశారు. రేపు జరగాల్సిన ఎంబీఏ థర్డ్ సెమిస్టర్ పరీక్షను వాయిదా వేశారు. యూనివర్సిటీ ఎదుట మను స్మృతి ప్రతులను పీడీఎస్‌యూ, డీఎస్‌యూ, బీఎస్ఎఫ్, టీవీవీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దహనం చేయడంతో వివాదం చెలరేగింది. ఫలితంగా ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ విద్యార్థి సంఘాలు, వామపక్ష విద్యార్థి సంఘాలు పరస్పరం రాళ్లు రువ్వుకునే వరకు పరిస్థితి వెళ్లింది. ఈ సందర్భంగా యూనివర్సిటీలో పోలీసులు భారీగా మోహరించారు. కాగా, విద్యుత్ మరమ్మతుల దృష్ట్యా హాస్టల్‌కు సెలవు ప్రకటించామని, వర్సిటీలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు లేవని రిజిస్ట్రార్ తెలిపారు. ఇదిలా ఉండగా వర్సిటీ విద్యార్థులపై ఏబీవీపీ కార్యకర్తలు దాడి చేశారని ఆరోపిస్తూ దళిత వామపక్ష విద్యార్థి సంఘాలు రేపు బంద్‌కు పిలుపునిచ్చాయి. -
పారిపోయిన బాలుడిని చేరదీసిన రైల్వే టీటీఈలు
సాక్షి, వరంగల్: హాస్టల్ నుంచి పారిపోయి వచ్చిన బాలుడిని వరంగల్ సీటీఐ అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ సంఘటన వరంగల్ రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది. నెక్కొండ మండలం ముదిగొండ గ్రామానికి చెందిన మేడబోయిన సాయి(13) రెడ్యాలలోని హాస్టల్లో ఉంటూ ఏడో తరగతి చదువుతున్నాడు. సోమవారం తన స్నేహితుడైన దీక్షకుంట్ల గ్రామానికి చెందిన అజయ్‌తో కలిసి హాస్టల్ నుంచి పారిపోయి వచ్చి వరంగల్ స్టేషన్లో స్వర్ణజయంతి ఎక్స్‌ప్రెస్ ఎస్-4 బోగీలో ఎక్కాడు. అజయ్ మాత్రం వరంగల్ స్టేషన్లోనే ఉండిపోయాడు. రైలు బల్లార్షా చేరుకుంటుండగా రైలులోని టీటీఈలు బి.మాధవరావు, ఎస్.శ్రీనివాస్‌లు అతడిని చేరదీశారు. అక్కడినుంచి వారు ఆ బాలుడిని మంగళవారం మరో రైలులో వరంగల్ స్టేషన్‌కు తీసుకొచ్చి అతని కుటుంబీకులకు అప్పగించినట్లు సీటీఐ శ్రీనివాస్‌రావు వివరించారు. ఈ సందర్బంగా ఆయన టీటీఐలు మాధవరావు, శ్రీనివాస్‌లను అభినందించారు. -
హాస్టల్ విద్యార్థి మృతికి ‘నిట్’దే బాధ్యత
సాక్షి, హైదరాబాద్: వరంగల్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో బీటెక్ మూడో ఏడాది చదివే రాజశేఖర్ మృతికి ఆ సంస్థదే బాధ్యతని తేల్చినట్లు రాష్ట్ర వినియోగదారుల కమిషన్ ప్రకటించింది. 2011 డిసెంబర్ 9న అమర్లపూడి రాజశేఖర్ క్రికెట్ ఆడుతూ లక్కవరం చెరువులో పడి మరణించ డానికి నిట్ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని ఫోరం ఈ తీర్పు వెలువరించింది. మృతుడి తల్లిదండ్రులకు రూ.9.70 లక్షలు పరిహారం చెల్లించాలని కమిషన్ చైర్మన్ బీఎన్ రావు నల్లా, సభ్యుడు పాటిల్ విఠల్‌రావుతో కూడిన డివిజన్ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. రాజశేఖర్ తల్లిదండ్రులు అమర్లపూడి శ్యాంరావు, జ్యోతి దాఖలు చేసిన ఫిర్యాదును విచారించిన కమిషన్ ఇటీవల ఈ తీర్పు చెప్పింది. ‘‘హాస్టల్ నుంచి విద్యార్థులు బయటకు వెళ్లేటప్పుడు వార్డెన్ రిజిస్టర్ నిర్వహించాలి. విద్యార్థులు బయటకు ఎప్పుడు వెళ్లారు, ఎందుకు వెళ్లారు, ఎవరి అనుమతి పొంది వెళ్లారు, తిరిగి ఎప్పుడు హాస్టల్‌కు వచ్చారు.. వంటి వివరాలతో కూడిన రిజిస్టర్ విధిగా నిర్వహించాలి. అయితే నిట్ హాస్టల్లో రిజిస్టర్ ఉందో లేదో తెలియని పరిస్థితి ఉందంటే యాజమాన్యం నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. మృతుడు రాజశేఖర్ తల్లిదండ్రులు దిల్‌సుఖ్‌నగర్‌లో కూలీలుగా పనిచేస్తున్నారు కాబట్టి వారి ఆదాయాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలన్న వాదన సరికాదు. నిట్ వంటి సంస్థలో బీటెక్ సీటుకు అర్హత పొందిన విద్యార్థి రాజశేఖర్‌కు కూడా ఆర్జన లేకపోవచ్చు. రాజశేఖర్ బతికి ఉంటే భవిష్యత్‌లో ఆర్జించబోయే ఆదాయం, కంప్యూటర్ కోర్సులకు ఉన్న డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవాలి. నెలకు కనీసం రూ. పది వేలు జీతంతో కూడిన ఉద్యోగం ఉన్నట్లుగా అంచనా వేసి మోటారు వాహనాల చట్టం కింద పరిహారాన్ని రూ.9.70 లక్షలుగా నిర్ణయించాం. ఈ మొత్తంలో మృతుడి తల్లికి రూ.6.40 లక్షలు, తండ్రికి రూ.3.30 లక్షలు చొప్పున చెల్లించాలి. కేసు ఖర్చుల నిమిత్తం అదనంగా రూ.5 వేలు కూడా నిట్ యాజమాన్యం చెల్లించాలి’’అని వినియోగదారుల కమిషన్ తన తీర్పులో పేర్కొంది. ఆరేళ్ల న్యాయపోరాటంలో విజయం నిట్ హాస్టల్ నుంచి రాజశేఖర్‌తోపాటు మరో 12 మంది విద్యార్థులు క్రికెట్ ఆడేందుకు బయటకు వెళ్లారని, క్రికెట్ బాల్ చెరువులో పడటంతో తీసేందుకు వెళ్లిన రాజశేఖర్ ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడని, ఇందులో తమ సంస్థ నిర్లక్ష్యం లేదని నిట్ యాజమాన్యం చేసిన వాదనను కమిషన్ తోసిపుచ్చింది. రాజశేఖర్ తొందరపాటు చర్య వల్లే మరణించినట్లుగా నిట్ ఏర్పాటు చేసిన కమిటీ కూడా తేల్చిందని, మానవీయకోణంలో మృతుడి కుటుంబానికి రూ. లక్ష పరిహారం చెల్లించేందుకు సిద్ధమని నిట్ చేసిన వాదన వీగిపోయింది. తమ కుమారుడు రాజశేఖర్ మృతితో ఏర్పడిన మానసిక క్షోభకు రూ.10 లక్షలు, పరిహారంగా రూ.15 లక్షలు, అంత్యక్రియలు, రవాణా ఇతర ఖర్చుల నిమిత్తం రూ.లక్ష కలిసి మొత్తం రూ.26 లక్షలు ఇప్పించాలని తల్లిదండ్రులు శ్యాంరావు, జ్యోతి న్యాయపోరాటంలో ఆరేళ్లకు విజయం సాధించారు. -
హాస్టల్లోదారుణ హత్య
‘‘సరీగమాపదనీసా.. కర్ కరోకరో కర్ జల్సా’’ అంటూ పాటపాడుకుంటూ.. ఫోర్త్ ఫ్లోర్‌లోని ఫ్రెండ్ రూమ్ నుంచి టెరాస్పైనున్న తన రూమ్‌వైపు పరుగుతీసింది సాగరిక...! అప్పుడు సమయం రాత్రి పదకొండు దాటింది..!! హాస్టల్లో కొందరు అప్పుడప్పుడే నిద్రలోకి జారుకోగా.. మరికొందరు వీడియో కాల్స్, వాట్సాప్ కాల్స్‌తో బిజీగా ఉన్నారు. రూమ్‌లో లైట్ వేసి ఉన్నట్లు గమనించిన సాగరిక.. ‘‘నీలిమా.. ఇంకా నిద్రపోలేదా..?’’ అంటూ డోర్ తీసి ఒక్కనిమిషం షాక్‌లో ఉండిపోయింది. ఆ వెంటనే కెవ్వు కెవ్వుమంటూ అరుస్తూనే ఉంది..! ఆమె భయానకమైన అరుపులకు.. హాస్టల్ మొత్తం ఆ రూమ్ ముందుకు వచ్చినా.. రూమ్‌లోకి వెళ్లేందుకు సాహసించలేకపోయారు. ‘‘హైదరాబాద్‌లోని అమీర్‌పేట్ హాస్టల్లో యువతి దారుణ హత్య’’ అంటూ టీవీ చానల్స్ బ్రేకింగ్ వేసుకుంటున్నాయి. ఆ రూమ్ నిండా రక్తపుమరకలే. మంచంపైన పడి ఉన్న నీలిమ శరీరం కత్తిగాట్లతో ఛిద్రమై ఉంది. నోటినిండా గుడ్డలు కుక్కి ఉన్నాయి. తిన్న అన్నం కూడా సరిగా అరిగినట్లు లేదు. పొట్టలో బలమైన పోట్లతో కడుపులోని అన్నం మెతుకులు కూడా రక్తపు మడుగులో అక్కడక్కడా పడి ఉన్నాయి. అంత భయానకమైన దృశ్యాన్ని ఒక్కసారిగా చూసిన సాగరిక ఇంకా తేరుకోలేకపోతోంది.శవాన్ని హ్యాండోవర్ చేసుకోవడంతో పాటు.. ఆ రూమ్‌ని సీజ్ చెయ్యడం, హాస్టల్ మెయిన్ గేట్ దగ్గర ఉన్న సీసీ çఫుటేజ్ సేకరించడం, నీలిమ తల్లిదండ్రులకు, తన బాయ్ ఫ్రెండ్‌కు సమాచారం అందించడం ఇలా అన్నీ çపూర్తయ్యేసరికి తెల్లవారుజామున 3 అయ్యింది. ‘‘రూమ్మేట్ ఎవ్వరు?’’ అని ఎంక్వైరీ చేసిన ఇన్స్పెక్టర్ జయ కృష్ణ.. సాగరిక ఇంకా తేరుకోకపోవడాన్ని గమనించి మార్నింగ్ 10 తరువాత ఎంక్వైరీ ఉంటుంది అని చెప్పి వెళ్లిపోయాడు. ‘‘నీలిమ నువ్వూ ఫ్రెండ్సా?’’ ‘‘బెస్ట్ ఫ్రెండ్స్!’’ ‘‘మరి అంత బెస్ట్ ఫ్రెండ్‌ని వదిలేసి వేరే రూమ్‌కి వెళ్లాల్సిన పనేమొచ్చింది? మీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవయ్యిందా?’’ ‘‘లేదు సార్.. మేం బాగానే ఉన్నాం. కానీ మా కింద ఫ్లోర్లో మా డిగ్రీ ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్లు కూడా మాకు మంచి స్నేహితులే. రెండు రూమ్లకి తిరుగుతూ ఉంటాం! వాళ్లూ మా రూమ్‌కి వస్తుంటారు!’’‘‘హో.. ఏ టైమ్‌కి రూమ్ నుంచి బయటికి వెళ్లావ్?’’‘‘నైట్ ఎయిట్.. ఎయిట్ థర్టీ సార్..’’‘‘మళ్లీ తిరిగి ఎప్పుడొచ్చావ్?’’‘‘పదకొండు దాటుతుంది!’’‘‘అన్ని గంటలా..!?’’‘‘లాప్టాప్లో సినిమా చూశాం సార్!’’‘‘సినిమానా..?’’‘‘హా.. ‘రాయుడుగారి ఊరు’ సినిమా!’’‘‘అది మొన్నమొన్నే వచ్చిందిగా... పైరసీ..నా..?’’హు.. అన్నట్లు తలదించుకుంది!‘‘మరి నీతోపాటు సినిమా చూడ్డానికి నీలిమ ఎందుకు రాలేదు?’’‘‘తను ఆల్ రెడీ తన బాయ్ ఫ్రెండ్ రాజేష్‌తో కలిసి హాల్లో చూసేసిందట. ‘నువ్వు వెళ్లు నేను చదువుకుంటా’ అంది.‘‘రాజేష్ ఎలాంటి వాడు?’’‘‘ఏమో సార్... నాకు తెలిసినంత వరకు తనకు అనుమానం! నీలిమ అబ్బాయిలతో మాట్లాడితే ఊరుకునేవాడు కాదు. తనని బాగా కమాండ్ చేసేవాడు. తనని సరదాగా బయట కూడా తిరగనిచ్చేవాడు కాదు. ఎక్కడికి వెళ్లినా చెప్పి వెళ్లాలంటాడు. చెబితే వద్దు అనేవాడు. తన మాట కాదని ఏ పనీ చేసేది కాదు. అందుకే మా ఇద్దరిమధ్య చాలాసార్లు గొడవైంది...!’’ ఓకే మిస్ సాగరిక.. మళ్లీ త్వరలోనే మిమ్మల్ని కలుస్తా.. అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు ఇన్స్పెక్టర్ జయ కృష్ణ. ‘‘హాయ్ రాజేష్.. హౌ ఆర్ యు?’’ అనే పలకరింపు విని ఉలిక్కిపడ్డాడు రాజేష్.‘‘నీలిమ గురించి ఆలోచిస్తున్నావా?’’ అంటూ పక్కనే కూర్చున్నాడు ఇన్స్పెక్టర్ జయ కృష్ణ.‘‘అవును సార్.. అంత క్రూరంగా చంపేంత కోపం ఎవరికి ఉందా అని ఆలోచిస్తున్నా సార్!’’ అన్నాడు కళ్లనిండా నీళ్లు తెచ్చుకుని.‘‘తేల్చేద్దాం. మేం ఉన్నదే అందుకు!’’ అన్నాడు ఇన్స్పెక్టర్ జయ కృష్ణ కాస్త అనుమానంతో కూడిన వెటకారంతో..! అతడి వెటకారాన్ని గమనించిన రాజేష్.. మౌనంగా ఉన్నాడు.‘‘సీ మిస్టర్ రాజేష్.. నీలిమ నీకు ఎంత కాలంగా తెలుసు?’’‘‘గత మూడేళ్లుగా!’’‘‘ఎలా పరిచయం?’’‘‘నేను తనని మొదటగా ట్రైన్లోనే చూశాను. మూడేళ్ల క్రితం జాబ్ ఇంటర్వ్యూ కోసం ఖమ్మం నుంచి హైదరాబాద్ వస్తున్నప్పుడు నేను ఎక్కిన బోగీలో తనూ ఎక్కింది. కొద్దిసేపటికే మేం మంచి ఫ్రెండ్స్ అయిపోయాం. ఫోన్ నెంబర్స్ మార్చుకోవడం వల్ల హైదరాబాద్‌లో చాలా సార్లు కలిశాం. అలా నేను ప్రపోజ్ చేస్తే ఓకే చేసింది.’’‘‘తనని బాగా కంట్రోల్ చేసేవాడివట?’’‘‘తను ఒట్టి అమాయకురాలు.. అందరినీ ఇట్టే నమ్మేస్తుంది. ఎలాంటి ప్రాబ్లమ్ రాకూడదనే తనని హెచ్చరించేవాడిని, కోప్పడేవాడిని, తిట్టేవాడిని.’’‘‘చివరిగా ఓ ప్రశ్న.. మీకు సాగరిక తెలుసా?’’ ‘‘హా.. నీలిమ ఫ్రెండ్ కదా!’’‘‘తనతో ఎప్పుడైనా మాట్లాడావా?’’‘‘పెద్ద పరిచయం లేదు సార్!’’‘‘నిజం చెప్పు మిస్టర్ రాజేష్..! నీలిమ కంటే ఎక్కువగా సాగరికతోనే కాల్స్ మాట్లాడుతూ.. నీలిమని సైడ్ చేస్తే ఇద్దరూ సెటిల్ అయిపోదామని ప్లాన్ చేశారు కదా!?’’‘‘ఏం మాట్లాడుతున్నారు సార్..!?’’‘‘ఎస్ మిస్టర్ రాజేష్.. సీ యువర్ కాల్ లిస్ట్..!’’ అంటూ కొన్ని పేపర్స్ రాజేష్ ముందేశాడు ఇన్స్‌స్పెక్టర్!!‘‘సార్.. మీరు పొరబడుతున్నారు.. నేను డైలీ సాగరిక ఫోన్లో మాట్లాడేది సాగరికతో కాదు..!’’‘‘మరి ఎవరితో..?’’‘‘నీలిమతో సార్!’’‘‘ఛా.. నీలిమకి ఫోన్ లేదా?’’‘‘ఉంది బట్.. తన ఫోన్‌కి వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ నిత్యం ఫోన్ చేస్తుంటారు. ఆ సమయంలో కాల్ వెయిటింగ్ వస్తే నీలిమపై డౌట్ వస్తుందని సాగరిక ఫోన్ నీలిమ వాడేది సార్!’’.రాజేష్ మాటలకు మళ్లీ ఆలోచనలో పడ్డాడు ఇన్స్పెక్టర్ జయ కృష్ణ.‘‘అసలు ఈ నీలిమను ఎవరు చంపుంటారు? ఫోరెన్సిక్ ల్యాబ్‌లో కూడా వేలిముద్రలు, డీఎన్ఏ శాంపిల్స్ దొరక్కుండా చాలా జాగ్రత్తపడ్డాడు హంతకుడు. సీసీ ఫుటేజుల్లోనూ కానరాలేదు. సాగరిక, రాజేష్‌లపై అనుమానం ఉంది కానీ, నిరూపించే ఆధారం కనిపించడంలేదు.’’ అంటూ తలపట్టుకున్న ఇన్స్పెక్టర్ జయ కృష్ణకి... నీలిమ తల్లిదండ్రులను మరోసారి కలవాలనిపించింది. వెంటనే నీలిమ తండ్రి రమణమూర్తికి కాల్ చేశాడు.‘‘మీకు శత్రువులెవరైనా ఉన్నారా?’’‘‘మేం ఏదో కౌలు వ్యవసాయం చేసుకునేటోళ్లం. మాకు ఆస్తులా పాస్తులా.. మాకు పగోళ్లెవరుంటారు సారు?’’ అన్నాడు రమణమూర్తి.కాస్త ఆలోచించిన జయ కృష్ణ.. ‘‘మీ అమ్మాయి ఎప్పుడైనా.. ఎవరివల్లైనా ఇబ్బందిపడుతున్నానని కానీ, ఏదైనా సమస్య వచ్చిందనిగానీ మీతో చెప్పిందా?’’‘‘లేదు సారు. ఏదున్నా మా ప్రవీణ్‌తో మాట్లాడేది!’’‘‘ప్రవీణ్ ఎవరు?’’‘‘నా బిడ్డ సారు! నాకు ఓ కొడుకు, కూతురు!!’’‘‘తను ఎక్కడుంటాడు?’’‘‘బెంగుళూర్లో సార్!’’‘‘మరి మీ అమ్మాయి చనిపోయాక ఎందుకు రాలేదు?’’‘‘వచ్చి మళ్లీ వెళ్లిపోయినాడు సారు! బిడ్డ చాలా బాధపడిపోయినాడు!! సెలవులు దొరికితే మళ్లొస్తానన్నాడు.’’‘‘నేను తనని కలవాలి.. రమ్మని చెప్పండి! తన ఫోన్ నెంబర్ ఇవ్వండి!’’ అన్నాడు ఇన్స్పెక్టర్ జయ కృష్ణ. ప్రవీణ్ నెంబర్ తీసుకున్న ఇన్స్పెక్టర్ జయ కృష్ణ తీవ్ర ఆలోచనలో పడ్డాడు. ‘‘ఈ నెంబర్...... నీలిమ కాల్ లిస్ట్ పేపర్స్‌లో చూశాను. కానీ ఫోన్లో చూడలేదే..!?’’ అనుమానం బలపడింది!!!అయినా సొంత అన్నకి చెల్లెల్ని చంపాల్సిన అవసరం ఏముంటుంది? ఒకవేళ ఈ నెంబర్ నీలిమే ఫోన్లోంచి డిలీట్ చేసుంటుందా? అయినా అన్న నెంబర్ డిలీట్ చేసుకోవల్సిన అవసరం తనకేముంటుంది? మేబీ రాజేష్‌కి భయపడి డిలీట్ చేసిందా? రాజేష్‌కి అబ్బాయిలతో మాట్లాడితే ఇష్టం ఉండదన్న మాట నిజమైనా.. సొంత అన్నతో కూడా మాట్లాడొద్దనేంత మూర్ఖుడా రాజేష్??’’ ఇలా ఆలోచిస్తూనే ఉన్నాడు జయ కృష్ణ.‘‘నమస్తే సార్.. నేను ప్రవీణ్. మా చెల్లెలు మర్డర్ విషయంలో నేనే వచ్చి మిమ్మల్ని కలుద్దాం అనుకున్నా. ఈలోపే మీరు రమ్మన్నారట. హంతకుడెవరో దొరికాడా సార్?’’ అన్నాడు ప్రవీణ్ ఇన్స్పెక్టర్ జయ కృష్ణ ఎదురుగా కూర్చుంటూ!!‘హాయ్ ప్రవీణ్... వెల్డన్! ప్రొఫెషనల్ కిలర్స్ని మించిపోయావ్గా!’ అన్నాడు ఇన్స్పెక్టర్.ఆ మాటకు కంగుతిన్న ప్రవీణ్.. ‘‘వాట్ ఆర్ యు టాకింగ్? హంతకుడిని పట్టుకోవడం మీ వల్ల కాదు అంటే కాదని చెప్పండి. ఇలా ఏదేదో మాట్లాడకండి!’’ అన్నాడు చాలా కోపంగా.డెస్క్‌లోని నీలిమ ఫోన్ బయటకి తీస్తూ... ‘‘నార్మల్ మెసేజ్‌లు, కాల్ లిస్ట్ క్లీన్ చేశావు కానీ.. ‘వే టు ఎస్ఎమ్ఎస్’లోని మెసేజ్‌లు డిలీట్ చెయ్యడం మరిచిపోయావ్ బంగారం!’’ అన్నాడు ఇన్స్పెక్టర్ జయ కృష్ణ.నీలిమ హత్య జరిగిన రోజు ‘వే టు ఎస్ఎమ్ఎస్’ మెసేజ్‌లన్నీ వరుసగా ఇలా ఉన్నాయి.. ‘‘హాయ్ అన్నయ్యా, తిన్నాను, ఫ్రెండ్ రూమ్‌కి వెళ్లింది, సినిమా చూడ్డానికి, కొత్తసినిమా, లాపీలో, చదువుకుంటున్నా’’... ఈ మెసేజ్‌లన్నీ నీ నెంబర్‌కే వచ్చాయి. అంటే నువ్వు అడిగిన ప్రశ్నలకు ఇవన్నీ సమాధానాలు..!ఇప్పుడేమంటావ్?అంటూ ప్రవీణ్ కళ్లలోకి సూటిగా చూశాడు ఇన్స్పెక్టర్.ప్రవీణ్ స్వరంలో వణుకును గమనించిన ఇన్స్పెక్టర్.. తనదైన శైలిలో నిజం చెప్పించే ప్రయత్నం చేశాడు. ‘‘నీలిమ ప్రతీది నాతోనే షేర్ చేసుకునేది. అయితే కులంకానివాడిని ప్రేమించి తప్పు చేసింది. ఆ విషయం నా దగ్గర దాచి మరో తప్పు చేసింది. ఆరు నెలల క్రితం నా స్నేహితుడు హరి వల్ల ఈ విషయం తెలిసింది. నిజమేనా అని నిలదీస్తే.. ఎదురు చెప్పింది. ఊరిలో పరువేం కావాలి? అంటూ నచ్చజెప్పాను. వద్దని హెచ్చరించాను. వినలేదు. పైగా ‘‘అమ్మని, నాన్నని ఒప్పించాల్సిన బాధ్యత నీదేనని, లేదంటే వెళ్లిపోయి పెళ్లి చేసుకుంటామని’’ తెగేసి చెప్పింది. అందుకే.. చంపెయ్యాలని నిర్ణయించుకున్నాను. ఆఫీస్‌కి నెలరోజులు సెలవ్ పెట్టి బెంగళూర్ నుంచి హైదరాబాద్ వచ్చేశాను. దాని హాస్టల్ పక్క ఫ్లాట్‌లోనే దిగాను. నాకు మీ పెళ్లి ఇష్టమేనని నమ్మించాను. అమ్మా వాళ్లని ఒప్పించడానికి సమయం కావాలని అడిగాను. సరేనంది. ఇరవైనాలుగు గంటలు తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని తెలివిగా అడిగి తెలుసుకునేవాడిని.తన రూమ్మేట్ ఏదో కొత్త సినిమా చూడ్డానికి వేరే ఫ్రెండ్ రూమ్‌కి వెళ్లిందని, తను రూమ్‌లో చదువుకుంటున్నానని చెప్పింది. సినిమా అంటే కనీసం రెండు మూడు గంటలు.. అంతకన్నా మంచి అవకాశం రాదని నిర్ణయించుకున్నా. నేను ముందు వేసుకున్న పథకం ప్రకారమే... నేను ఉండే ఫ్లాట్ టెరాస్ మీద నుంచి.. తను ఉండే టెరాస్పైకి వెళ్లాను. తలుపు తీసే ఉండటంతో.. తోసుకుని లోపలికి వెళ్లి గడియపెట్టాను. నీలిమ షాక్ అయ్యింది. ‘‘అన్నయ్యా.. బెంగళూర్ నుంచి ఎప్పుడు వచ్చావ్..? అయినా లోపలికి ఎలా వచ్చావ్..?’’ అంటూ నా దగ్గరకు వచ్చింది. ఒక్కక్షణం కూడా ఆలోచించకుండా నోట్లో గుడ్డలు కుక్కి.. వెంటతెచ్చుకున్న కత్తితో ఊపిరి ఆగేంతవరకూ పొడిచేశాను. వెంటనే నా ఆనవాళ్లు తెలియకుండా జాగ్రత్తలు తీసుకుని, తన ఫోన్లో నా చాటింగ్ మొత్తం డిలీట్ చేసి.. ఆ నైట్‌కే బెంగళూర్ వెళ్లిపోయాను’’ అంటూ.. ముగించాడు ప్రవీణ్.‘పరువు కోసం సొంత చెల్లెలి ప్రాణాలు తీసేస్తావా? ఇప్పుడేమైంద్రా నీ పరువు..?? ఆడపిల్లని పరువుగా భావించడం నీదిరా తప్పు. తనకి ఇష్టాలు ఉండవా? నిర్ణయాలు తీసుకో కూడదా?’’ అంటూ.. కాలర్ పట్టుకుని లాక్కెళ్లి జైల్లో పడేశాడు ఇన్స్పెక్టర్ జయ కృష్ణ. నీలిమ అబ్బాయిలతో మాట్లాడితే ఊరుకునేవాడు కాదు. తనని బాగా కమాండ్ చేసేవాడు. తనని సరదాగా బయట కూడా తిరగనిచ్చేవాడు కాదు. ఎక్కడకి వెళ్లినా చెప్పి వెళ్లాలంటాడు. చెబితే వద్దు అనేవాడు. తన మాట కాదని ఏ పని చేసేది కాదు. ∙స్మృతిక -
కాస్మొటిక్ కష్టాలు!
వెల్దుర్తి రూరల్: తలకు నూనె ఉండదు..ముఖం శుభ్రం చేసుకోవడానికి సబ్బు దొరకదు..చెమట వాసన వస్తున్న దుస్తులను ఉతుక్కోవడానికి కష్టమే..వసతిగృహాల్లో ఉండే విద్యార్థుల కష్టాలు ఇవీ. కాస్మొటిక్ చార్జీలు చెల్లిస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నా..వాస్తవం భిన్నంగా ఉంటోంది. ప్రభుత్వం ఇచ్చే చాలీచాలని డబ్బుతో విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రతకు దూరమవుతున్నారు. మాసిన దుస్తులు, చింపిరి జుట్టుతో హాస్టల్ విద్యార్థులు కునారిల్లుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే చార్జీలు సరిపడక ప్రతినెలా తల్లిదండ్రుల నుంచి ఎంతో కొంత తెప్పించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. పాతకాలపు ధరలతో... ప్రతినెలా విద్యార్థులకు ఒక్కో చోట ఒక్కో రకంగా కాస్మొటిక్ చార్జీలను చెల్లిస్తున్నారు. అవి ఎందుకూ సరిపోవడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. దుస్తులు ఉతుక్కోవడానికి మూడు సబ్బులు, స్నానానికి రెండు సబ్బులు, పేస్టు, బ్రష్‌లు, తలకు నూనె, షాంపులు, కటింగ్, ఇతరత్రా ఖర్చులు కలిపి ప్రతి బాలునికి కనీసం రూ.150కి మించి ఖర్చవుతోంది. అదే బాలికలకు వీటన్నిటితో పాటు పౌడర్, తిలకం, అదనంగా నూనె, నాప్కిన్ల ఖర్చు అంటూ రూ.200కు మించుతోంది. వాస్తవ ఖర్చు ఇలా ఉంటే పాతకాలపు ధరలతో కాస్మొటిక్ చార్జీలు చెల్లిస్తున్నారు. నాసిరకం నాప్కిన్లు బాలికలకు పీహెచ్‌సీల ద్వారా ఇటీవలే నాప్కిన్లు సరఫరా చేశారు. అయితే అవి నాసిరకంగా ఉండడంతో బాలికలు తిరస్కరిస్తున్నారు. నాసిరకాన్ని సైతం రూ.8కు అంటగట్టడం ప్రభుత్వానికే చెల్లిందనే విమర్శలు ఉన్నాయి. పదిరోజులకే అయిపోతాయి మాకు నెలకిచ్చే రూ.50 పదిరోజులకే అయిపోతాయి. ఇంటికాట్నుంచి డబ్బు తెప్పించుకోవాల. అమ్మా, నాయన కూడా ఏందిరా ఇది అంటారు. చెప్పులు తెగిపోతే కూడా కుట్టించుకోలేం. సారోళ్లు చూస్తే డ్రస్సు బాగుండాల, అది బాగుండాల, ఇది బాగుండాల అంటారు. ఈ డబ్బులతో అన్నీ ఎట్ల బాగుంటాయి. – డేవిడ్ రాజు,10వ తరగతి, ఎస్సీ బాలుర హాస్టల్, వెల్దుర్తి ఇంట్లో డబ్బులు అడగాల్సి వస్తోంది మాకిచ్చే రూ.75 తీసుకుని మార్కెట్కుపోతే ఏమీ రావు. ఇంట్లో వాళ్లని డబ్బులు అడగక తప్పదు. అమ్మా, నాన్న రావాలన్నా కూలిడిసిపెట్టాలి. రానీక పోనీక మళ్లా ఖర్చులు. కాస్మొటిక్ చార్జీలు పెంచాలని..మా హాస్టల్‌కు వచ్చిన సారోళ్లకు అడుగుతూనే ఉన్నాం..ఎవరూ వినడంలేదు. – శ్రీలక్ష్మి, 9వ తరగతి, బీసీ బాలికల హాస్టల్, వెల్దుర్తి డబ్బులు సరిపోవు హాస్టల్ విద్యార్థులకు ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చే కాస్మొటిక్ చార్జీలు ఏమాత్రం సరిపోవు. జూన్ నుంచి పెంచుతామన్న ప్రభుత్వం ఇంతవరకు పెంచలేదు. పరిశుభ్రతకు పెద్దపీట అంటున్న ప్రభుత్వం.. విద్యార్థుల దయనీయస్థితిని గమనించి వెంటనే కాస్మొటిక్ చార్జీలు పెంచాలి. – దొరస్వామి, వెల్దుర్తి ఎస్సీ బాలుర హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ డబ్బులు సరిపోవు హాస్టల్ విద్యార్థులకు ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చే కాస్మొటిక్ చార్జీలు ఏమాత్రం సరిపోవు. జూన్ నుంచి పెంచుతామన్న ప్రభుత్వం ఇంతవరకు పెంచలేదు. పరిశుభ్రతకు పెద్దపీట అంటున్న ప్రభుత్వం.. విద్యార్థుల దయనీయస్థితిని గమనించి వెంటనే కాస్మొటిక్ చార్జీలు పెంచాలి. – దొరస్వామి, వెల్దుర్తి ఎస్సీ బాలుర హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ -
మాదాపూర్ శ్రీ చైతన్య కాలేజ్‌లో దారుణం
-
వసతి గృహాల్లో ఏసీబీ తనిఖీలు
రెండు వేర్వేరు చోట్ల తనిఖీలు బుట్టాయగూడెం: జిల్లాలోని బుట్టాయగూడెం గిరిజన సంక్షేమ బాలుర వసతి గృహం, గోపాలపురం బీసీ ప్రభుత్వ వసతి గృహాల్లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు బుధవారం తనిఖీలు చేశారు. బుట్టాయగూడెంలోని వసతి గృహంలో రికార్డులు, స్టాకు నిల్వలు, ఖర్చుల వివరాలను పరిశీలించారు. వసతి గృహంలో బిల్డింగ్ సక్రమంగా లేదని, స్టాకులో వ్యత్యాసాలు ఉన్నాయని తమ పరిశీలనలో తేలిందని ఏసీబీ డీఎస్పీ వి.గోపాలకృష్ణ తెలిపారు. విద్యార్థులు కూడా హాజరులో ఉన్నదాని కంటే తక్కువగా ఉన్నట్టు గుర్తించామన్నారు. రాష్ట్ర అవినీతి శాఖాధికారి ఆర్కే ఠాకూర్ ఆదేశాల మేరకు వసతి గృహాల్లో తనిఖీలు చేశామన్నారు. అక్రమాలు అరికట్టేలా వసతి గృహాలకు సరఫరా చేసే వస్తువులపై తప్పనిసరిగా సీలు ఉండాలని ఉన్నతాధికారులకు సూచన చేశామని చెప్పారు. ఏసీబీ సీఐ జె.విల్సన్, పి.శ్రీనివాసరావు పాల్గొన్నారు. గోపాలపురం హాస్టల్లో అవకతవకలు గోపాలపురం: గోపాలపురం పెద్దగూడెంలోని బీసీ ప్రభుత్వ బాలుర వసతి గృహంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేసి అవకతవకలు ఉన్నట్టు గుర్తించారు. ఏసీబీ డీఎస్పీ బి.గోపాలకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ హాస్టల్లో పలు అవకతవకలు జరుగుతున్నాయన్నారు. ఇక్కడ విద్యార్థుల సంఖ్య 117 మందికిగాను కేవలం 19 మంది మాత్రమే ఉన్నారని, పిల్లలకు సరైన పౌష్టికాహారం అందించడం లేదని, మెనూ పాటించడం లేదని తమ పరిశీలనలో తెలిసిందన్నారు. ఉదయం 6 గంటలకు వార్డెన్, వంట మనిషి, అటెండర్లు రావాల్సి ఉండగా ఎవరూ లేనట్టు గుర్తించామన్నారు. వీరికి బదులుగా ఒక ప్రైవేట్ మహిళను ఏర్పాటుచేసుకుని హాస్టల్ నిర్వహిస్తున్నారని చెప్పారు. 98 మంది విద్యార్థులకు అందాల్సిన ఆహారం వార్డెన్ స్వాహా చేస్తున్నట్టు గుర్తించామన్నారు. వార్డెన్ డి.నేతాజీ నుంచి వివరాలు సేకరించి రికార్డులు పరిశీలించామన్నారు. అవకతవకలపై జిల్లా ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వనున్నట్టు డీఎస్పీ చెప్పారు. సీఐ కె.శ్రీనివాస్, కానిస్టేబుళ్లు ఎం.నాగు, ఎం.శ్రీనివాస్, పీఎస్ఎన్ రాజు పాల్గొన్నారు. -
మీర్పేట్ హాస్టల్లో విద్యార్థి ఆత్మహత్య
-
ప్రేమ వ్యవహారమే కారణం ..
జంగారెడ్డిగూడెం/బుట్టాయగూడెం : క్షణికావేశం తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చింది. వారి ఆకాంక్షలకు వెలుగునివ్వాల్సిన విద్యార్థిని తనను తాను అంతం చేసుకుని.. వారి ఆశలను చిదిమేసి అనంత లోకాలకు వెళ్లిపోయింది. జంగారెడ్డిగూడెంలోని విద్యావికాస్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ చదువుతున్న.. బుట్టాయగూడెంకు చెందిన విద్యార్థిని స్వప్న నాయక్ (17) శుక్రవారం ఉదయం కళాశాల హాస్టల్ భవనం నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఆ హఠాత్ పరిణామంతో సహచర విద్యార్థులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఒక్క క్షణం ఆలోచించి ఉంటే ఇంతటి ఘోరం జరిగి ఉండేది కాదని కన్నీటి పర్యంతం అవుతున్నారు. తమతో ఇన్నాళ్లూ కలిసి చదువుకున్న స్నేహితురాలు ఇక లేదని తెలిసి బోరున విలపిస్తున్నారు. శుక్రవారం ఉదయం సుమారు 6 గంటల సమయంలో స్వప్న నాయక్ ఆత్మహత్యకు పాల్పడింది. ఆ సమయంలో హాస్టల్ విద్యార్థులంతా కాలకృత్యాలు తీర్చుకుని స్టడీ అవర్స్‌కు హాజరవుతుండగా.. స్వప్న నాయక్ కూడా వారితో కలిసి హాల్లోకి చేరుకుంది. తాను పుస్తకాలు మరిచిపోయానంటూ హడావుడిగా హాస్టల్ పైభాగంలోకి వెళ్లి ఒక్కసారిగా కిందకు దూకేసిందని తోటి విద్యార్థులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న కళాశాల కరస్పాండెంట్ సతీష్‌చంద్, ఉపాధ్యాయులు స్వప్న నాయక్‌ను స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే విద్యార్థిని మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. స్వప్ననాయక్ తల్లిదండ్రులు శిశుపాల్ నాయక్, షీబా హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. కూతురు మృతి చెందిందని తెలుసుకున్న తల్లి ఆసుపత్రిలో సొమ్మసిల్లి పడిపోయింది. ప్రేమ వ్యవహారమే కారణమంటున్న తల్లిదండ్రులు కూతరు స్వప్న నాయక్ ఆత్మహత్యపై తండ్రి శిశుపాల్ నాయక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రేమ వ్యవహారమే తన కుమార్తె మరణానికి కారణమని భావిస్తున్నట్టు ఆయన పోలీసులకు తెలిపారు. 15 రోజుల క్రితం వరకు స్వప్న బుట్టాయగూడెంలోని తమ ఇంటినుంచే కళాశాలకు వెళ్లేదని.. ఈ మధ్యనే ఆమెను కళాశాల హాస్టల్లో చేర్పించామని శిశుపాల్ నాయక్ తెలిపారు. కాగా ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు ఎస్సై ఎం.కేశవరావు తెలిపారు. కాన్వెంట్ నడుపుకుంటున్న తల్లిదండ్రులు విద్యార్థిని తండ్రి శిశుపాల్ నాయక్ ఒడిశాకు చెందిన వారు కాగా, తల్లి షీబా కేరళకు చెందిన వారు. ఈ దంపతులిద్దరూ 25 సంవత్సరాల క్రితం బుట్టాయగూడెం వచ్చిన సెయింట్ థెరిస్సా పేరిట కాన్వెంట్ నడుపుకుంటూ జీవిస్తున్నారు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు. ఆత్మహత్యకు పాల్పడిన స్వప్న నాయక్ రెండో కుమార్తె. కుమార్తె మృతితో తండ్రి కన్నీటి పర్యంతమవుతున్నారు. పదవ తరగతిలో కూడా 9.8 జీపీఏ సాధించిందని, బాగా చదువుతుందని చెప్పారు. చదువు పాడవకూడదనే ఉద్దేశంతో హాస్టల్లో చేర్చానని, ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయిందని వాపోయారు. -
హాస్టల్లో ఇంటర్ విద్యార్థి మృతి
వినుకొండ రూరల్ : అనుమానాస్పద స్థితిలో విద్యార్థి మృతి చెందిన సంఘటన పట్టణంలోని ఓ ప్రైవేటు కళాశాలలో శనివారం చోటు చేసుకుంది. కాలేజీ నిర్వాహకులు తెలిపిన వివరాల ప్రకారం శావల్యాపురం మండలం పిచికలపాలెం ఎస్సీ కాలనీకి చెందిన అచ్చయ్య, శాసమ్మల కుమారుడు రాంబాబు(16) పట్టణంలోని లాయర్స్ స్ట్రీట్‌లో గల ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియెట్ చదువుతున్నాడు. కళాశాల హాస్టల్లోనే ఉంటున్నాడు. శనివారం కళాశాల వదిలిన తర్వాత హాస్టల్‌కు చేరుకొని మరుగుదొడ్డిలోకి వెళ్లి ఎంతసేపటికీ బయటకు రాలేదు. తోటి విద్యార్థులు వెళ్లి పరిశీలించగా అపస్మారకస్థితిలో పడి ఉన్నాడు. ప్రైవేటు వైద్యశాలకు తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. ఆరోగ్యంగా ఉండే విద్యార్థి ఎలా మృతి చెందాడంటూ రాంబాబు తల్లిదండ్రులు, బంధువులు కళాశాల యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫిట్స్ వల్ల మృతి చెంది ఉండవచ్చని విద్యార్థులు, కళాశాల యాజమాన్యం చెబుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం లేదు. -
ఎస్వీయులో హాస్టల్ గదుల కోసం విద్యార్థుల పాట్లు
-
నూజివీడు ట్రిపుల్ ఐటీ హాస్టల్లో విషాదం
-
9న ఆదర్శ హాస్టళ్లను ప్రారంభించాలి
కర్నూలు సిటీ: జిల్లాలోని అన్ని ఆదర్శ పాఠశాలలకు సంబంధించిన హాస్టళ్లను ఈ నెల 9న ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ చల్లా విజయమోహన్ విద్యాశాఖ అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆదర్శ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, స్కూళ్లకు అప్రోచ్ రోడ్లు, గ్రౌండ్ లెవెలింగ్, మొక్కల పెంపకంపై కలెక్టర్ విద్యాశాఖ అధికారులు, డ్వామా, ఆర్డబ్ల్యూఎస్, ప్రిన్సిపాళ్లు, ఏపీడబ్ల్యూడీసీ అధికారులతో సమీక్షించారు. హాస్టళ్లలో సదుపాయాల కల్పనకు ఎంపీడీఓ, ఆయా పాఠశాలల ప్రిన్సిపాళ్లతో నమన్వయ కమిటీ సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఏపీడీలకు కేటాయించిన పనులు పూర్తి చేయడంలోతీవ్ర నిర్లక్ష్యం చేశారని, ఇకపై నిర్లక్ష్యం చేస్తే మాత్రం చర్యలు తప్పవని హెచ్చరించారు. 15 రోజుల్లోపు పనుల్లో పురోగతి చూపించాలన్నారు. పనులు జరుగుతున్న స్కూళ్లను డీఈఓ సక్రమంగా తనిఖీ చేయడం లేదని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వ్యక్తిగత మరుగుదొడ్లు, స్కూళ్లలో ఉపాధి నిధులతో చేపట్టిన పనులు చేయడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. మీరు నా ఓపికను పరీక్షిస్తున్నారని, చేతకాకపోతే మాతో కాదు అని చెబితే మరొకరితో చేయించుకుంటామని అధికారులపై అగ్రహం వ్యక్తం చేశారు. ఆదర్శ స్కూళ్ల ప్రిన్సిపాళ్లు తమకేమి పట్టనట్లు వ్యహారిస్తున్నారని, ఇకపై అలాంటి అభిప్రాయాలను మానుకుని పాఠశాల అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకుంటే సరిపోతుందో తెలియజేయాల్సిన అవసరం మీపై ఉందన్నారు. జిల్లాలోని ఆదర్శ స్కూళ్లను విభజించి డిప్యూటీ డీఈఓలకు బాధ్యతలు అప్పగిస్తామన్నారు. హాస్టల్ రన్ కాకపోతే సంబంధిత ప్రిన్సిపాల్, డిప్యూటీ డీఈఓలదే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. సమావేశంలో డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డి, డ్వామా పీడీ పుల్లారెడ్డి, డిప్యూటీ డీఈఓలు, ఏపీడీలు, పీఆర్ ఏఈఈలు, ఆదర్శ స్కూళ్ల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు. -
బీసీ హాస్టళ్లలో రేపటి నుంచి బయోమెట్రిక్
కోవెలకుంట్ల: బీసీ సంక్షేమ వసతి గృహాల్లో డిసెంబర్ 1వ తేదీ నుంచి బయోమెట్రిక్ విధానం అమలు కానుంది. జిల్లాలో బీసీ వసతిగృహాలు 54 ఉన్నాయి. ఈ హాస్టళ్లలో ఉంటూ 3 నుంచి 7వ తరగతి చదువుతున్న విద్యార్థులకు నెలకు రూ. 750, అలాగే 8 నుంచి పదో తరగతి విద్యార్థులకు రూ. 850, ఒక్కో విద్యార్థికి రోజుకు 400 గ్రాముల బియ్యం అందజేస్తోంది. వీటితో విద్యార్థులకు ఉదయం, రాత్రివేâ¶ళలు(పాఠశాలలు సెలవుదినాల్లో మధ్యాహ్నాం) భోజన సౌకర్యం కల్పిస్తున్నారు. కొన్ని హాస్టళ్లలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ కొందరు వార్డెన్లు.. బోగస్ హాజరు శాతంతో డైట్ చార్జీలు, బియ్యాన్ని స్వాహా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. బోగస్ హాజరు శాతానికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం హాస్టల్ అధికారులు, సిబ్బంది, విద్యార్థులకు బయెమెట్రిక్ విధానం అమలు చేయనుంది. డిసెంబర్ 1వ తేదీ నుంచి విద్యార్థులు ప్రతిరోజు బయోమెట్రిక్ విధానంలో వేలిముద్రలు వేయాల్సి ఉంది. విద్యార్థుల వేలిముద్రలు ఆధారంగా డైట్‌చార్జీలు, బియ్యం కేటాయించి భోజన సౌకర్యం కల్పించాల్సి ఉంది. అలాగే హాస్టల్లో పనిచేసే సిబ్బంది సైతం రోజుకు రెండుసార్లు బయోమెట్రిక్ విధానంలో వేలిముద్రలు వేసేలా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో విధులకు డుమ్మాకొట్టే సిబ్బందికి చెక్‌పడనుంది. ఈ విధానంపై అవగాహన కల్పించేందుకు బుధవారం జిల్లా కేంద్రంలో శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. -
వసతి గృహం నుంచి విద్యార్థి అదృశ్యం
కాకినాడ క్రైం: విశాఖ జిల్లా పాయకరావుపేట గ్రామానికి చెందిన అల్లు భాస్కరరావు అనే పదిహేడేళ్ల విద్యార్థి కాకినాడ శ్రీచైతన్య జూనియర్ కళాశాల హాస్టల్ నుంచి అదృశ్యమైనట్టు తమకు గురువారం ఫిర్యాదు అందినట్లు రెండో పట్టణ సీఐ చైతన్యకృష్ణ తెలిపారు. భాస్కరరావు కళాశాలో ఇంటర్మీడియెట్ ప్ర««దlమ సంవత్సరం చదువుతున్నాడని, ఈనెల 8వ తేదీ ఉదయం 6 గంటల నుంచి హాస్టల్ నుంచి కనిపించకుండా పోయినట్లు హాస్టల్ ఇన్చార్జి వేసరపు సతీష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇతని ఆచూకీ తెలిస్తే 94407 96541, 0884 2379312 ఫో¯ŒS నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు. -
హాస్టల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
కల్లూరు (రూరల్): కల్లూరు మండలం పెద్దపాడు ఏపీ మోడల్ స్కూల్ బాలికల వసతిగృహంలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ జాస్మిన్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థినులు 9, 10, ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్నవారై ఉండాలని తెలిపారు. దరఖాస్తు ఫారాలు ఏపీ మోడల్ స్కూల్లో సోమవారం నుంచి అందజేస్తామని , పూర్తి చేసిన వాటిని 26వ తేదీ బుధవారం సాయంత్రం 4 గంటలలోపు అందజేయాలని పేర్కొన్నారు. మోడల్ స్కూల్ విద్యార్థినులకు మొదటి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. -
నాణ్యమైన భోజనం అందించాలి
నల్లగొండ టూటౌన్ : జిల్లాల్లోని సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని స్థాయి సంఘం చైర్మన్ బసవయ్య అధికారులను కోరారు. శుక్రవారం జెడ్పీ చైర్మన్ చాంబర్లో తన అధ్యక్షతన జరిగిన 6వ స్థాయి సంఘం సమావేశంలో మాట్లాడారు. విద్యార్థులకు మెరుగైన వసతి కల్పించి నాణ్యమైన భోజనం అందించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. స్కాలర్షిప్ పొందే విద్యార్థులలో సీలింగ్ విధానం విధించడం సరైంది కాదన్నారు. కల్యాణ లక్ష్మి నిధులు సకాలంలో లబ్ధిదారులకు అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ ఏఓ శైలజ, సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు తదితరులున్నారు. -
కాలేజీలో 100మంది విద్యార్థులకు అస్వస్థత
కాన్పూర్: కలుషిత ఆహారం తిని 100 మంది కాలేజీ విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో ఈ ఘటన చోటుచేసుకుంది. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఇప్పటికే విచారణకు ఆదేశించారు. వివరాల్లోకి వెళితే కాన్పూర్ జిల్లాలోని అక్బర్పూర్లో ప్రభాత్ ఇంజినీరింగ్ కాలేజీ ఉంది. ఇందులో వసతి గృహం అవకాశం కూడా ఉంది. ఇందులో 365మంది అబ్బాయిలు, 30మంది అమ్మాయిలు ఉంటున్నారు. వీరంతా బుధవారం మధ్యహ్నాం భోజనం చేశాక అస్వస్థతకు లోనయ్యారు. వరుసగా ఓ వందమందికి వాంతులు, నీళ్ల విరేచనాలు, కళ్లుతిరగడం, అజీర్తివంటి సమస్యలు తలెత్తడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. ఫుడ్ పాయిజినింగ్ అయినట్లు అధికారులు తెలిపారు. కాగా, ఫుడ్ పాయిజినింగ్కు గల కారణాలు శోధిస్తున్నామని, ఇప్పటి వరకు తమ కాలేజీ ప్రాంగణంలో అలాంటి ఘటన జరగలేదని, ఇక ముందు జరగబోనివ్వబోమని కాలేజీ యాజమాన్యం ప్రకటించింది. ఆహారంలో ఏదో పడి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి 16మందిని ఐసీయూలో, మిగితావారిని జనరల్ వార్డులో ఉంచి చికిత్స ఇప్పిస్తున్నారు. -
హాస్టల్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
భీమదేవరపల్లి : మండలంలోని ముల్కనూర్ ఎస్సీ బాలికల హాస్టల్లో భూక్య రజిత అనే విద్యార్థిని సోమవారం రాత్రి నేయిల్‌పాలిష్ తాగి ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలిసింది. హుస్నాబాద్ మండలం మైసమ్మవాగుతండాకు చెందిన రజిత ఎనిమిదో తరగతి చదువుతోంది. ఆమె తన గదిలో నేయిల్‌పాలిష్ తాగగా గమనించిన విద్యార్థులు మ్యాట్రిన్ ఉమకు తెలిపారు. ఆమె వెంటనే రజితను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియరాలేదు. రజితకు ప్రాణపాయం లేదని తెలిసింది. -
పురుగుల అన్నం పెడతారా?
ప్రత్తిపాడు (గుంటూరు): పసి పిల్లలకు పురుగుల బియ్యంతో కూడు పెడతారా.. ఇదే మీ ఇంట్లోని పిల్లలకైతే ఇలానే వండి పెడతారా.. బీసీల ఓట్లతో గద్దెనెక్కిన మీరు బీసీ పిల్లల నోట్లో మట్టి కొడతారా.. అంటూ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీ అంగిరేకుల ఆదిశేషు ప్రభుత్వంతో పాటు సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు తీరుపై ధ్వజమెత్తారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రత్తిపాడులోని బీసీ వసతి గృహాలను శుక్రవారం పరిశీలించారు. విద్యార్థులతో పాటు స్థానిక సిబ్బందితో మాట్లాడారు. స్థితిగతులు, పరిస్థితులను పరిశీలించారు. తదనంతరం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీ అంగిరేకుల ఆదిశేషు మాట్లాడుతూ సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు సొంత నియోజకవర్గంలో వసతి గృహాల పనితీరు అధ్వానంగా ఉందన్నారు. బీసీ కళాశాల బాలుర వసతి గృహంలో పరిస్థితి దారుణంగా ఉందని, మరుగుదొడ్లు అత్యంత అధ్వానంగా ఉన్నాయని చెప్పారు. హాస్టల్ వార్డెన్ మస్తాన్‌వలి విద్యార్థులతో అనుచితంగా వ్యవహరిస్తూ వారిపై దౌర్జన్యాలకు పాల్పడటం హేయమైన చర్యని తెలిపారు. బీసీ బాలికల వసతి గృహంలో నిరంకుశపాలన సాగుతోందన్నారు. 70 మంది విద్యార్థినులకు ఒకే ఒక్క మరుగుదొడ్డి ఉండటం దుర్మార్గమన్నారు. పురుగులు పట్టిన అన్నం పిల్లలకు పెట్టడంతో పాటు మిగిలిన వ్యర్థాలను పిల్లలకు పెడుతూ అనుచితంగా వ్యవహరిస్తున్నారన్నారు. వెంటనే సంబంధిత వార్డెన్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంత దారుణంగా వసతి గృహాల నిర్వహణ జరుగుతుంటే మంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని, లేకుంటే ఎంతవరకైనా పోరాటం చేస్తామని హెచ్చరించారు. డీడీకి ఫిర్యాదు.. హాస్టల్లో దుస్థితిపై బీసీ సంక్షేమ శాఖ డీడీ సూర్యనారాయణకు సంఘ నేతలు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. వసతిగృహాల్లో విద్యార్థులు ఆహారం బాగోలేక అనారోగ్యం బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే తగు చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ నేతలు టి.శ్రీనివాస యాదవ్, బిట్ర వెంకట శివన్నారాయణ, వై.భాస్కర్, బి.శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. -
అంతర్జాతీయ హాస్టల్ సిద్ధం
ఏయూక్యాంపస్: ఆంధ్రవిశ్వవిద్యాలయంలో నూతనంగా నిర్మించిన అధునాతన హాస్టల్‌ను వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు ఆదివారం సాయంత్రం సదర్శించారు. ఏయూ ప్లాటినం జూబ్లీ సమావేశ మందింరానికి చేరువలో నిర్మాంణం పూర్తిచేసుకున్న భవనాన్ని పరిశీలించారు. పూర్తిస్థాయిలో పనులు ముగించి వచ్చే నెలలో విద్యార్థులకు ప్రవేశం కల్పించాలని సూచించారు.విభిన్న దేశాల నుంచి ఏయూలో విద్యను అభ్యశించే విద్యార్థుల సంఖ్య ప్రతీ సంవత్సరం పెరుగుతోదన్నారు. దీనికి అనుగుణంగా అదనపు హాస్టల్స్‌ను నిర్మిస్తున్నామన్నారు. భవిష్యత్తులో ఏయూ విద్యార్థులకు మరిన్ని హాస్టల్స్‌ను నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య వి.ఉమా మహేశ్వరరావు, రెక్టార్ ఆచార్య ఇ.ఏ నారాయణ, విజయనిర్మాణ్ కంపెనీ అధినేత విజయకుమార్,చీఫ్ ఇంజనీర్ మాధవబాబు, పిఆర్ఓ ఎన్.వి.వి.ఎస్ఎస్ మార్కండేయులు తదితరులు పాల్గొన్నారు. -
హాస్టళ్లలో సమస్యలు పరిష్కరించాలి
ఆత్మకూర్(ఎస్) : హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్షుడు సానబోయిన ఉపేందర్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని కస్తూరిబా, ఎస్సీ హాస్టల్, ఆదర్శ పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డిప్యూటీ తహసీల్దార్ వేణుగోపాల్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కస్తూరిబా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మరుగుదొడ్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎస్సీ హాస్టల్లో ప్రహారీ లేకపోవడంతో రాత్రిళ్లు పందులు, తేళ్లు, పాములు వస్తున్నాయన్నారు. విద్యార్ధులు నడచి వెళ్లడానికి దారికూడా సక్రమంగా లేదన్నారు. ఆదర్శ పాఠశాలలో ప్రహరీలేక బాలికలకు రక్షణలేకుండా పోయిందని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు జుజ్జూరి సతీష్, ఏర్పుల సతీష్, ఉప్పుల సైదులు, సురేష్, రమేష్,ప్రవీణ్, ఉపేందర్, వేణు, అప్పిరెడ్డి, నాగరాజు, ప్రభాకర్ తదితరులు ఉన్నారు. -
విద్యార్థులకు అస్వస్థత
40 మందికి వాంతులు, విరేచనాలు ఖానాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు ఖానాపూర్ : మండలంలోని పెంబి గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు మంగళవారం అస్వస్థతకు గురయ్యారు. 40 మందికిపైగా వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. సాయంత్రం భోజనం వికటించడమే అందుకు కారణమై ఉంటుందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. మంగళవారం అర్ధరాత్రి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి వార్డెన్ మోతిలాల్ విద్యార్థులను 108, ఆటోల్లో తరలించారు. మరో ఉపాధ్యాయుడికీ వాంతులు, విరేచనాలు అయ్యాయి. సాయంత్రం 5.30 గంటల నుంచే విద్యార్థులకు వాంతులు, విరేచనాలు ప్రారంభమయ్యాయి. ఆస్పత్రిలోని పడకలు నిండిపోయాయి. -
ఎస్సీ బాలుర వసతి గృహం మూసివేత
చెన్నేకొత్తపల్లి : విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందన్న నెపంతో చెన్నేకొత్తపల్లి మండలంలోని న్యామద్దెల గ్రామ ఎస్సీ బాలుర వసతి గృహానికి అధికారులు తాళం వేశారు. దాదాపు 30 సంవత్సరాల క్రితం ఈ గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ హాస్టల్‌కు రూ. లక్షల ప్రజాధనాన్ని వెచ్చించి సొంత భవనాన్ని ఏర్పాటు చేశారు. విద్యార్థుల సౌకర్యాం కోసం విశాలమైన గదులు, డైనింగ్ హాల్ ఉన్నాయి. ఇక్కడ ఉంటూ చదువుకున్న వారు పలు శాఖల్లో ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఎంతో ఘన చరిత్ర గలిగిన ఈ హాస్టల్ మూతపడడంతో విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. వెంటనే హాస్టల్‌ను పునరుద్ధరించాలంటూ న్యామద్దెల వాసులు కోరుతున్నారు. -
మోడల్ హాస్టళ్ల ప్రారంభంపై నీలినీడలు
– సెప్టెంబర్‌లో ప్రారంభించాలన్న ప్రభుత్వం – వార్డెన్, ఇతర సిబ్బంది నియామకాలు చేపట్టని వైనం – సంరక్షణాధికారి బాధ్యతలను తిరస్కరిస్తున్న అధ్యాపకులు కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): మోడల్ స్కూల్ బాలికల హాస్టళ్ల ప్రారంభంపై నీలినీడలు అలుముకున్నాయి. హాస్టళ్లకు పక్కా భవనాలు పూర్తయి ఏడాది గడిచినా వాటిని ప్రారంభించేందుకు సర్కార్ చర్యలు తీసుకోవడం లేదు. వచ్చే సెప్టెంబర్‌లో ప్రారంభించాలని సర్కారు నిర్ణయించినప్పటికీ ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటి వరకు హాస్టల్ వార్డెన్, ఇతర సిబ్బంది నియామకాలు చేపట్టకపోవడం, మంచినీరు, విద్యుత్ సమస్యలు, మైనర్ మరమ్మతులు నిర్వహించాల్సి ఉండడం ఇందుకు కారణం. 33 హాస్టల్ భవనాలు రెడీ.. జిల్లాలోని అత్యంత వెనుకబడిన 33 మండలాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో 33 మోడల్ స్కూళ్లను 2012లో ప్రారంభించారు. ప్రారంభ సమయంలోనే బాలబాలికలకు హాస్టల్ సదుపాయాన్ని కల్పించాల్సి ఉంది. అయితే అప్పట్లో నిధులలేమితో కేవలం స్కూళ్లకు మాత్రమే ప్రారంభం చేశారు. మోడల్ స్కూళ్లన్నీ మండల కేంద్రాలకు రెండు, మూడు కిలోమీటర్ల దూరంలో ఉండడం, హాస్టళ్లు లేకపోవడంతో బాలుర సంగతి పక్కనపెడితే బాలికలు ఇతర స్కూళ్లకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో 2013–14 లో రాష్ట్ర ప్రభుత్వం రూ. 28 లక్షలతో బాలికలకు మాత్రమే హాస్టల్ సదుపాయాన్ని కల్పించేందుకు నిర్ణయం తీసకుంది. వీటిని 2014–15లో ప్రారంభించేందుకు నిర్ణయించినా భవనాల నిర్మాణంలో అంతులేని జాప్యం కారణంగా కుదరలేదు. వార్డెన్ బాధ్యతలపై అధ్యాపకుల వ్యతిరేకత.. టీజీటీ, పీజీటీలుగా మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న అధ్యాపకులకు అదనపు బాధ్యతగా వార్డెన్ పోస్టును అప్పగించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నా అందుకు వారు విముఖత ప్రదర్శిస్తున్నారు. ఈ ప్రతిపాదనను గతేడాదే ప్రభుత్వం అధ్యాపకుల ముందుంచగా 33 హాస్టళ్లకుగాను కేవలం 15 మంది మాత్రమే వార్డెన్‌గా బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధపడ్డారు. నిరుద్యోగులతో భర్తీ చేయాలి.. మరోవైపు మోడల్‌స్కూల్ హాస్టళ్లలో పనిచేసే సిబ్బంది పోస్టులను నిరుద్యోగులతో భర్తీ చేయాలనే వాదన బలంగా వినిపిస్తోంది. పనిచేస్తున్న లెక్చరర్లకే అదనపు బాధ్యతలుగా హాస్టల్ సమన్వయ పనులను అప్పగిస్తే తీవ్రంగా నష్టపోతామని నిరుద్యోగులు పేర్కొంటున్నారు. మాకు సమాచారం లేదు: కష్ణయ్య, మోడల్ స్కూల్ ఏడీ సెప్టెంబర్‌లో హాస్టళ్లను ప్రారంభించాలని ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. హాస్టళ్లలో సదుపాయాలు, సిబ్బంది నియామకం, ఇతర విషయాలపై విధివిధానాలేమి రాలేదు. 33 హాస్టళ్లకు భవన నిర్మాణాలు పూర్తయ్యాయి. ప్రభుత్వం ఆదేశిస్తే ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాం. -
విద్యార్థుల పట్ల శ్రద్ధ అవసరం
దిలావర్పూర్ : వసతి గృహ విద్యార్థుల పట్ల స్థానిక హెచ్‌డబ్లూవోలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిర్మల్ ఏఎస్‌డబ్ల్యూ ఎంఏ అలీం అన్నారు. మండల కేంద్రమైన దిలావర్పూర్లోని స్థానిక సాంఘీక సంక్షేమ బాలుర వసతి గృహాన్ని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వసతిగృహంలోని విద్యార్థుల హాజరు శాతంతో పాటు పలు రికార్డులను ఆయన పరిశీలించారు. విద్యార్థుల భోజనం, ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు వహించాలన్నారు. ప్రస్తుత వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని వసతిగృహం పరిశుభ్రంగా ఉండేవిధంగా తగు చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యం వక్తిగత పరిశుభ్రతపై విద్యార్థులకు ఎప్పటికప్పుడు సూచనలు అందజేస్తూ విధిగా ప్రతీనెలా వైద్యపరీక్షలు నిర్వహించాలని ఆయన సూచించారు. ప్రతీ వార్డెన్ స్థానికంగా ఉండాలని ఆయన ఆదేశించారు. హెచ్‌డబ్ల్యూవో రవీంధర్గౌడ్తోపాటు వసతిగృహ సిబ్బంది ఉన్నారు. -
రెగ్యులర్ వార్డెన్‌ను నియమిస్తాం
చింతూరు : స్థానిక ఎస్సీ వసతిగృహానికి త్వరలోనే రెగ్యులర్ వార్డెన్‌ను నియమిస్తామని ఏఎస్‌డబ్లు్యఓ డేవిడ్‌రాజు తెలిపారు. విద్యార్థులు హాస్టల్‌ను వీడుతున్న వైనంపై పత్రికల్లో కథనాలు రావడంతో ఆయన సోమవారం హాస్టల్‌ను సందర్శించి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చింతూరు హాస్టల్ వార్డెన్ సెలవుపై వెళ్లడంతో గౌరిదేవిపేట హాస్టల్ వార్డెన్‌కు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. జ్వరాలు వచ్చిన విద్యార్థులను సిబ్బంది ఆస్పత్రులకు తీసుకువెళ్లి వైద్యం అందిస్తున్నారని, విలీన మండలాల్లోని మూడు హాస్టళ్లకు ఒక్కరే వార్డెన్ వుండడంతో కొంత ఇబ్బంది కలుగుతోందన్నారు. ఈ సందర్భంగా ఆయన సిబ్బందితో పాటు విద్యార్థులను విచారించారు. కాగా తరచూ హాస్టల్ నుంచి గైర్హాజరవుతున్న విద్యార్థులే టీసీలు తీసుకుని ఇళ్లకు వెళ్లిపోయారని ఇన్చార్జి వార్డెన్ కుమార్ తెలిపారు. దీనిపై వారిని పలుమార్లు హెచ్చరించినా వారి వైఖరిలో మార్పు రాలేదని, తాను లేని సమయంలో ఉన్నత పాఠశాలలో టీసీలు తీసుకుని వెళ్లిపోయారని ఆయన తెలిపారు. మరోవైపు హాస్టల్ నిర్వహణ సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని, విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోకుండా చూడాలని చింతూరు సర్పంచ్ సోడె శ్రీనివాసరావు, కాంగ్రెస్ నాయకులు ఎండీ హబీబ్, అహ్మద్‌అలీలు ఏఎస్‌డబ్లు్యఓకు విజ్ఞప్తి చేశారు. -
మూతపడనున్న వసతిగృహం
విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందని సాకు ప్రవేశాలపై ప్రచారం కరువు ఏడాదిగా ఇన్‌చార్జీలతోనే నిర్వహణ ఆందోళనలో విద్యార్థులు మర్రిగూడ: అధికారుల నిర్లక్ష్యంతో మర్రిగూడలో దళిత సంక్షేమ బాలుర వసతిగృహం (ఎస్సీ) మూతపడనుంది. మండల కేంద్రంలో మూఫ్పై ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ హాస్టల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందనే సాకుతో మూసివేతకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో పేద విద్యార్థులు రోడ్డున పడే పరిస్థితి నెలకొంది. ఇన్చార్జీ పాలనలో ఇబ్బందులు ఈ హాస్టల్లో పని చేసే వార్డన్ గత ఏడాది మార్చిలో పదవీ విరమణ పొందాడు. అప్పటి నుంచి దేవరకొండ వసతిగృహం వార్డెన్ ఇన్చార్జ్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఇతను వారంలో ఒకటి, రెండు రోజుల మాత్రమే ఇలా వచ్చి అలా పోవడంతో విద్యార్థులకు మౌలిక వసతులు అందడం లేదు. మోను ప్రకారం విద్యార్థులకు భోజనం అందడం లేదు. గత వారం రోజుల నుంచిlఉదయం అల్పహారంగా ఇచ్చే జావా కూడ ఇవ్వడం లేదు. అరటిపండ్లు అందడం లేదు. గతంలో వందల మంది ఉన్న ఈ హాస్టల్లో వసతులు లోపించడం.. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించడంతో అస్తవ్యస్తంగా మారింది. దీనికితోడు ఈయేడు బాడిబాట కార్యక్రమంలో విద్యార్థులను వసతిగృహంలో చేర్పించడంతో అధికారులు విఫలమయ్యారన్న విమర్శలు ఉన్నాయి. దీంతో ఈ విద్యాసంవత్సరం విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిందని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఆందోళనలో విద్యార్థులు lచింతపల్లి, నాంపల్లి, మర్రిగూడ తదితర మండలాల్లోని వివిధ గ్రామాల నుంచిl30 మంది విద్యార్థులు ఈ వసతిగృహంలో ఉంటు విద్యనభ్యాసిస్తున్నారు. అయితే ఇప్పుడు అర్థాంతరంగా హాస్టల్ మూసివేస్తామని అధికారులు చెబుతుండడంతో ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఉన్న ఇన్చార్జ్ వార్డెన్ కూడా సంక్షేమ శాఖ ఉన్నతాధికారులకు మూసివేయాలని నివేధిక అందించాడని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఎటూకానీ సమసయంలో తాము వసతి కోసం ఎక్కడికి వెళ్లాలని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. హాస్టల్‌ను మూసేస్తే ఊరుకోం –సిలివేరు విష్ణు, ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకుడు బాడిబాట కార్యక్రమంలో విద్యార్థులను చేర్చుకోకుండా ఇప్పుడు విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందని హాస్టల్‌ను మూసివేస్తామనడం అధికారులకు సబబు కాదు. హాస్టల్‌ను తొలగిస్తే పేద విద్యార్థులు ఎలా చదువుకుంటారు. అధికారులు మెండిగా వ్యవహరిస్తే అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకోని ఆందోళనలు చేస్తాం. విచారణ చేస్తాం బాలసింగ్, ఏఎస్‌డబ్ల్యూ విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నందున వసతి గృహాన్ని ఎత్తివేయాలి అనుకుంటున్నాం. ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య పెంచడానికి కృషి చేస్తు్తన్నాం. సంఖ్య పెరగని పక్షంలో ఉన్నతాధికారుల నిర్ణయం మేరకు చర్యలు తీసుకుంటాం. -
బీసీ హాస్టళ్లకు విలీనం ముప్పు
తక్కువుంటే తరలించడమే..! నాలుగు హాస్టళ్ల తరలింపునకు ఆదేశాలు విద్యార్థుల కొరతతోనే ఉత్తర్వులు భీమదేవరపల్లి : సంక్షేమ హాస్టళ్లను విద్యార్థుల కొరత వెంటాడుతోంది. సరిపడా సంఖ్యలో విద్యార్థులు లేని హాస్టల్‌ను పొరుగునే ఉన్న మరో హాస్టల్లో విలీనం చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు జిల్లాలోని నాలుగు హాస్టళ్లను ఆగస్టు ఒకటి లోపు తరలించేందుకు జిల్లా కలెక్టర్ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. గతంలో హాస్టల్లో ప్రవేశాలు కావాలంటే పైరవీలు నడిచేవి. ప్రస్తుతం ప్రతి మండలంలో కస్తూరిబా, మోడల్ స్కూల్స్ ఏర్పాటు కావడం.. అక్కడే హాస్టళ్లు నిర్మించడంతో వాటి ప్రభావం వసతి గృహాలపై పడుతోంది. జిల్లాలోని ఎలిగేడు బీసీ హాస్టల్లో 100 మంది విద్యార్థులకు కేవలం 25 మంది, కాటారం మండలం దామెరకుంట బీసీ హాస్టల్లో 15 మంది, భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ బీసీ హాస్టల్లో 17మంది, చిగురుమామిడి మండలం బొమ్మనపల్లిలో 22మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. ఈ హాస్టళ్లలో 100 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాల్సి ఉంది. కనీసం 50 మంది విద్యార్థులు లేని పక్షంలో అట్టి హాస్టళ్లను విలీనం చేస్తామని గతేడాది జిల్లా అధికారుల నుంచి ఆయా వసతి గృహాల వార్డెన్లకు ఆదేశాలు అందాయి. విలీనం భయంతో కొన్నిచోట్ల వార్డెన్లు నానా తంటాలు పడి విద్యార్థులను వసతిగృహాల్లో చేర్పించారు. కానీ.. ఎలిగేడు, దామెరకుంట, ముల్కనూర్, బొమ్మనపల్లి బీసీ వసతి గృహాలకు మాత్రం విద్యార్థులు రాలేకపోయారు. ఈ క్రమంలో వీటిని సమీప వసతి గృహాల్లో విలీనం చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఎలిగేడు వసతి గృహాన్ని సుల్తానాబాద్‌కు, దామెరకుంట హాస్టల్‌ను అదే గ్రామంలోని ఎస్టీ ఆశ్రమ హాస్టల్‌కు, ముల్కనూర్ హాస్టల్‌ను అదే గ్రామంలోని ఎస్సీ వసతి గృహానికి, బొమ్మనపల్లి హాస్టల్‌ను అదే గ్రామంలోని ఎస్సీ బాలుర హాస్టల్లో విలీనం చేశారు. వీరందరినీ ఆగస్టు ఒకటి లోపు తరలించాలని సిరిసిల్ల ఏబీసీడబ్ల్యూవో రాజమనోహర్ వెల్లడించారు. -
వసతిగృహాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బయోమెట్రిక్ విధానంపై ఆరా విద్యార్థుల భోజనం పరిశీలన వికారాబాద్ : కలెక్టర్ రఘునందన్‌రావు వికారాబాద్‌లోని ఎస్సీ నంబర్-1 వసతిగృహాన్ని బుధవారం సాయంత్రం ఆకస్మిక తనిఖీ చేశారు. వసతిగృహాంలో విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం బమోమెట్రిక్ విధానాన్ని పరిశీలించారు. బయోమెట్రిక్ మిషన్ పనిచేయకపోవడంతో వార్డెన్‌ను అడిగి తెలుసుకున్నారు. వారం రోజులుగా మిషన్ పనిచేయడం లేదడంతో కలెక్టర్ స్వయంగా విద్యార్థులతో బయోమెట్రిక్ మిషన్ పనిచేస్తుందా లేదా అని పరిశీలించారు. హాస్టల్ పిల్లలు వివరాలను కంప్యూటర్లో పరిశీలించి వివరాలు సరిగ్గా పొందుపరుస్తున్నారో లేదో తెలుసుకున్నారు. అనంతరం వసతి గృహాం గదులను పరిశీలించారు. పిల్లలు అందించే భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వసతిగృహాంపై ఆరా తీశారు. అనంతరం వసతిగృహం ఆవరణలో నాటిన 150 మొక్కలు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ర్ట ప్రభుత్వం పేద విద్యార్థులకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. కష్టపడి చదువకుని ల్లిదండ్రుల పేరు నిలబెట్టాలని సూచించారు. సమయం వృథా చేసుకోకుండా కష్టపడి చదివి ప్రయోజకులు కావాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. చిన్నప్పటి నుంచి ఒక లక్ష్యాన్ని ఏర్పర్చుకుని దానికి అనుగుణంగా ముందకు సాగాలన్నారు. వసతిగృహాల్లో ఉండి ఈ రోజు ఉన్నత స్థానాల్లో చాలామంది ఉన్నారని, విద్యకు అనువైన స్థలాలు వసతిగృహాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ శృతిఓజా, డీఎస్డబ్లూ ్య మోహన్‌రెడ్డి, ఏఎస్‌డబ్ల్యు శ్వేత, హస్టల్ వార్డెన్ నసీయోద్దీన్ ఉన్నారు. -
ప్రారంభానికి నోచుకోని బాలికల వసతిగృహం
–రూ.1.30కోట్ల నిధులతో పూర్తయిన వసతిగృహాం భవనం –రెండు వందల మంది బాలికలకు వసతి సౌకర్యం –ఇబ్బందులు పడుతున్న విద్యార్ధులు మునగాల: మండల కేంద్రంలో దాదాపు రూ.1.30కోట్ల నిధులతో నిర్మించిన ఆదర్శ పాఠశాల వసతి గృహాం నిర్మాణం పూర్తయినప్పటీకీ ప్రారంబానికి నోచుకోవడం లేదు. దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థినులు నానా ఇబ్బందులు పడుతున్నారు. అన్ని సౌకర్యాలతో కూడిన ఈ వసతి గృహాంలో దాదాపు వంద మంది విద్యార్థినులకు వసతి సౌకర్యం కల్పించే వీలుంది. ఈ హాస్టల్లో 20 గదులున్నాయి. ఒక్కో గదికి నలుగురుకు ఉండే వీలు ఉంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థినులు రెండు వందల మంది పైచిలుకే ఉన్నారు. ప్రస్తుతం ఈ పాఠశాలకు ఇతర ప్రాంతాల నుంచి ఆటోలు, బస్సులు, సైకిళ్ల మీద విద్యార్థినులు నిత్యం పాఠశాలకు వచ్చి విద్యనభ్యసిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరం ఆరంభంలో వసతి గృహాం ప్రారంభిస్తారనుకుంటే అధికారుల నిర్లక్ష్యం మూలంగా ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోలేదు. నీటి సరఫరా, మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్మాణంతో పాటు వసతి గృహాం చుట్టు ప్రహారీ గోడ నిర్మాణం కూడా పూర్తయింది. వీలైనంత త్వరలో వసతి గృహాన్ని ప్రారంభించి విద్యార్థినులను ఇబ్బందుల నుంచి గట్టెక్కించాలని విద్యార్థులు వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. నిత్యం ఇబ్బందులు పడుతున్నాం: శృతి తొమ్మిదో తరగతి,ఆకుపాముల ప్రతిరోజు పాఠశాలకు పది కి.మీ.దూరంలో ఉన్న ఆకపాముల నుంచి మునగాల వరకు ఆర్టీసీ బస్సులో వచ్చి బస్టాప్ నుంచి కి.మీ.దూరం నడిచి పాఠశాలకు వస్తున్నాను. దీంతో ప్రతిరోజు పాఠశాల వచ్చిపోయేందుకు రెండు గంటల సమయం పడుతోంది. దీంతో నిత్యం ఇబ్బందులు పడుతున్నాం. వసతి గృహాం ప్రారంభించి ఇబ్బందులు తొలగించాలి. వసతిగృహాన్ని తక్షణమే ప్రారంభించాలి: ప్రియాంక, ఇంటర్ ప్రథమ సంవత్సరం, కలకోవ వసతిగృహాం నిర్మాణం పూర్తయినప్పటీకీ నేటికి ప్రారంభించకపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నాం. తక్షణమే వసతిగృహాన్ని ప్రారంభించి విద్యార్థులను ఇబ్బందులను తొలగించాలి. 20రోజుల్లో ప్రారంభిస్తాం: సాయిఈశ్వరి, పాఠశాల ప్రిన్సిపాల్ పాఠశాలకు అనుబంధంగా నిర్మించిన వసతి గృహాం నిర్మాణం పూర్తయింది. 20రోజుల్లో జిల్లా మంత్రిగారి చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్ధినుల ఇబ్బందులు తొలగనున్నాయి. వసతి గృహానికి అవసరమైన సిబ్బంది నియామకానికి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తాం. -
వసతి గృహాలకు మంగళం
– జిల్లాలో 32 ఎస్సీ సంక్షేమ వసతి గృహాలు మూత – ప్రభుత్వ నిర్ణయంపై విద్యార్థి సంఘాల మండిపాటు ముద్దనూరు: జిల్లాలో 32 ఎస్సీ సంక్షేమ వసతి గృహాలను మంగళవారం మూసివేశారు. ఈ హాస్టళ్లలో చదువుతున్న 1490 మంది విద్యార్థులను పరిసర ప్రాంతాల్లో ఉన్న ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్లతో పాటు ఇతర హాస్టళ్లలో సర్దుబాటు చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం తమ రెండేళ్ల పాలనలో జిల్లాలో మొత్తం 44 ఎస్సీ సంక్షేమ వసతి గృహాలకు ఎసరుపెట్టింది. దీంతో ఎస్సీ వర్గానికి చెందిన విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్లి చదువుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. రెసిడెన్షియల్ స్కూళ్లలో ఎస్సీ విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తున్నామనే పేరుతో నిరుపేద ఎస్సీ విద్యార్థులను ప్రభుత్వం సంక్షోభంలోకి నెడుతోందనే విమర్శలు తలెత్తుతున్నాయి. గత ఏడాది జిల్లాలో 12 ఎస్సీ హాస్టళ్లను మూసివేయగా ఈ ఏడాది మరో 32 హాస్టళ్లను మంగళవారం నుంచి మూసి వేశారు. దశల వారీగా ఎస్సీ సంక్షేమ వసతి గృహాలను మూసివేసి ఎస్సీ విద్యార్థుల సంక్షేమాన్ని ప్రభుత్వం నీరు గారుస్తోందని విద్యార్థి సంఘాల నాయకులు, మేధావులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇదిలా ఉండగా, ముద్దనూరు ఎస్సీ వసతి గృహంలోని 27మంది విద్యార్థులను పులివెందుల సమీపంలోని బెస్తవారిపల్లె ఏపీ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చేర్పించినట్లు హెచ్డబ్లు్యవో గణేష్‌బాబు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 5,6,7,8 తరగతి చదువుతున్న 885మంది విద్యార్థులను రెసిడెన్షియల్ పాఠశాలల్లో, 3,4,9,10 తరగతి చదువుతున్న వారిని ఇతర ఎస్సీ హాస్టళ్లలోకి మార్చినట్లు ఆ శాఖ జిల్లా డిప్యూటీ డైరక్టర్ సరస్వతి తెలిపారు. -
మెనూ తేడా ఉంటే చర్యలు: కలెక్టర్
శ్రీకాకుళం రూరల్: ప్రభుత్వ విద్యాలయాలు, గురుకులాల్లో మెనూ ఖచ్చితంగా అమలు చేయాలని, లేకుంటే చర్యలు తప్పవని కలెక్టర్ డాక్టర్ పి. లక్ష్మీనృసింహం హెచ్చరించారు. మండలంలోని సింగుపురంలో ఉన్న కస్తూరిబా గాంధీ విద్యాలయాన్ని కలెక్టర్ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన కిచెన్‌లోని ఆహార పదార్థాలను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడారు. ఆహారం ఎలా పెడుతున్నారు, సరిపడా పెడుతున్నారా? లేదా? నాణ్యతగా ఉంటుందా? అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. చదువుల కోసం కూడా ఆరా తీశారు. విద్యార్థినులు చెప్పిన సమాధానాలకు ఆయన సంతప్తి వ్యక్తం చేశారు. అనంతరం పెద్దపాడులోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను సందర్శించారు. అక్కడ కూడా కిచెన్‌ను పరిశీలించారు. విద్యార్థులకు ప్రతి రోజు ఒక అరటి పండు పెడుతున్నట్టు విద్యార్థులు చెప్పారు. విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడారు. ఆయనతో పాటు తహసీల్దార్ సనపల సుధాసాగర్, రెవెన్యూ పరిశీలకులు సంతోష్‌కుమార్, వీఆర్ఓ గణేష్‌ప్రసాద్, ఇన్చార్జి ఎస్ఓ వనజాక్షి తదితరులు ఉన్నారు. -
తెయూ హాస్టళ్లలో సమస్యలు లేకుండా చూడాలి
డిచ్ పల్లి : తెలంగాణ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్‌లో గల బాలుర, బాలికల వసతి గృహాలపై ప్రిన్సిపాల్ కనకయ్య వార్డెన్లతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యార్థులకు సంబంధించిన అడ్మిషన్ రికార్డులు, దరఖాస్తు ఫారాలు, అడ్మిషన్లు ఫీజులు, డిపాజిట్స్ తదితర విషయాలను పరిశీలించారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో వసతి గృహాల్లో ఉండే విద్యార్థులకు ఎలాంటి సమస్యలు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే త్వరలో ప్రారంభం కానున్న నూతన హాస్టల్ భవనంతో సహా అన్ని వసతి గృహాలను శుభ్రం చేసి ఉంచాలని ఆదేశించారు. అలాగే యూజీసీ నుంచి ప్రత్యేకంగా బాలికల కోసం వసతి గృహాల కోసం ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. గత సంవత్సరంలో లోటు బడ్జెట్ ఏదైనా ఉంటే దానికి గల కారణాలు కనుగొని, సమస్య పరిష్కారం కోసం వసతి గృహ సిబ్బంది చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో చీఫ్ వార్డెన్ రవీందర్‌రెడ్డి, వార్డెన్లు మహేందర్‌రెడ్డి, సంపత్, రాంబాబు, కేర్‌టేకర్స్, సూపరింటెండెంట్ విజయలక్ష్మి, ప్రవీణాబాయి తదితరులు పాల్గొన్నారు. -
130 మందికి ఒకే స్నానపు గది
♦ చాలాచోట్ల కనీస సౌకర్యాలూ కరువే ♦ శిథిల భవనాల్లోనే కొనసాగింపు ♦ పెచ్చులూడుతున్న పైకప్పులు ♦ తలుపులే లేని గదులెన్నో.. ♦ బోధన్ బీసీ హాస్టల్లో 130 మందికి ఒకటే స్నానపు గది ♦ వసతి గృహాలపై పర్యవేక్షణ కరువు ♦ ఇన్చార్జి వార్డెన్లతో ఇబ్బందులు బోధన్ పట్టణంలోని ఓ పెంకుటింట్లో బీసీ బాలుర కళాశాల హాస్టల్ కొనసాగుతోంది. ఇక్కడ నాలుగు గదులు, తలుపులు లేని ఓ రేకుల షెడ్డూ ఉన్నాయి. ఇందులో 130 మంది విద్యార్థులు ఉంటున్నారు. నాలుగు మరుగుదొడ్లు ఉన్నా.. రెండే పనిచేస్తున్నాయి. స్నానపు గది ఒకటే ఉంది. అందరూ అదే గదిలో స్నానం చేయాలి. సంక్షేమ హాస్టళ్ల దుస్థితిపై కథనం.. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పిస్తున్నామని పాలకులు పేర్కొంటున్నా.. క్షేత్రస్థాయిలో వాటి ఫలాలు కనిపించడం లేదు. విద్యార్థులకు ఇక్కట్లు తప్పడం లేదు. సంక్షేమ హాస్టళ్లలో ఎక్కడ చూసినా సమస్యలే కనిపిస్తున్నాయి. బోధన్‌లో ఎస్సీ బాలుర (ఎ), (బి), ఇంటిగ్రేటెడ్ బాలికల వసతి గృహం, బీసీ బాలుర కళాశాల, ఎస్సీ బాలుర కళాశాల, బీసీ మహిళా కళాశాల, ఎస్సీ మహిళా కళాశాల హాస్టల్స్, ఎస్టీ హాస్టల్, బెగ్గర్స్ హాస్టల్స్లున్నాయి. ఈ సంక్షేమ హాస్టల్స్‌లో వందలాది మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. పలు హాస్టల్స్‌లో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఎస్టీ బాలుర హాస్టల్లో.. పట్టణంలోని ఎస్టీ బాలుర హాస్టల్లో 90 మంది విద్యార్థులున్నారు. హాస్టల్ భవనంలో పలు గదుల పైకప్పు పెచ్చులూడి పడుతోంది. బాత్రూం, మరుగుదొడ్డి గదులు 20 ఉండగా.. ఇందులో కొన్నింటి తలుపులు విరిగిపోయాయి. బీసీ బాలుర కళాశాల హాస్టల్లో.. పట్టణంలోని రాకాసీపేట్ ప్రాంతంలో అద్దె ఇంట్లో బీసీ బాలుర కళాశాల హాస్టల్ ఉంది. పట్టణంలోని వివిధ కళాశాలలు, కోటగిరి మండలంలోని పాలిటెక్నిక్ కళాశాలలో చదివేవారు 130 మంది ఈ హాస్టల్లో ఉంటున్నారు. పురాతన కాలం నాటి నాలుగు గదుల పెంకుటిళ్లు, రేకులషెడ్డులో హాస్టల్ కొనసాగుతోంది. రేకుల షెడ్డుకు తలుపు లేదు. వర్షం కురిస్తే పైకప్పులోంచి నీరు ఊరుస్తుంది. చలికి విద్యార్థులు వణకాల్సిందే.. ఈ హాస్టల్లో 130 మంది విద్యార్థులున్నారు. ఇక్కడ నాలుగు మరుగుదొడ్లు ఉన్నా.. రెండే పనిచేస్తున్నాయి. ఒకే స్నానపు గది ఉండడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. చిరు జల్లులకే హాస్టల్ పరిసరాలు చిత్తడిగా మారుతున్నాయి. పెంకుటిళ్లు కావడంతో పైకప్పులు ఊరుస్తున్నాయి. రేకుల షెడ్డుకు తలుపులు లేకపోవడంతో చలికి వణుకుతున్నారు. ఏ సమయంలో ఏ పురుగు వస్తుందోనని భయపడుతున్నారు. హాస్టల్ వార్డెన్ చక్రధర్‌కు కళాశాల హాస్టల్‌తో పాటు బీసీ బాలుర హాస్టల్, చందూరు బీసీ బాలుర హాస్టల్ నిర్వహణ బాధ్యతలు ఇచ్చారు. మూడు హాస్టళ్లకు ఒకే వార్డెన్ ఉండడంతో పర్యవేక్షణ లోపించింది. శిథిలావస్థలో బీసీ బాలుర హాస్టల్.. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయానికి సమీపంలో ఉన్న బీసీ బాలుర హాస్టల్ భవనంలో 100 మంది విద్యార్థులు ఉంటున్నారు. ఈ హాస్టల్ భవనం దశాబ్దాల క్రితం నిర్మితమైంది. ప్రస్తుతం శిథిలావస్థలో ఉంది. పైకప్పు పెచ్చులూడిపోతోంది. వర్షం కురిస్తే నీరు గదుల్లోకి చేరుతోంది. హాస్టల్లో 9 గదులుండగా.. ఇందులో మూడింటిని ఆఫీసు, కిచెన్, స్టోర్ రూంలకు కేటాయించారు. మిగిలిన ఆరు ఇరుకు గదుల్లో విద్యార్థులు ఉంటున్నారు. పై కప్పు పెచ్చులూడుతుండడంతో విద్యార్థులు భయాందోళనలకు గురి అవుతున్నారు. ఎస్సీ బాలుర (ఎ) హాస్టల్లో.. రాకాసీసేట్ ప్రాంతంలో ఉన్న ఎస్సీ బాలుర (ఎ) 100 మంది విద్యార్థులున్నారు. పాఠశాల భవనంలో హాస్టల్ ఉంది. నాలుగు గదులు మాత్రమే ఉండడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లాను బీసీ బాలుర కళాశాల అద్దె రేకుల షెడ్డు లో కొనసాగుతోంది. ఇక్కడ సౌకర్యవంతంగా లేదు. హాస్టల్ భవనం దుస్థితిని జిల్లా స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లాను. బీసీ సంక్షేమ శాఖలో నిధుల లేమి ఉందని అధికారులు అంటున్నారు. విద్యార్థులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నాం. - చక్రధర్, వార్డెన్, బీసీ బాలుర కళాశాల హాస్టల్ వార్డెన్, బోధన్ దుప్పట్లు, పెట్టెలు ఇవ్వలేదు హాస్టల్లో సరైన వసతులు లేవు. మ్యాట్లు మాత్రమే ఇచ్చా రు. దుప్పట్లు ఇంకా ఇవ్వలేదు. పాత పెట్టెలే వాడుకుంటున్నాం. హాస్టల్లో నాలుగు గదులున్నాయి. ఒక్కోదాంట్లో 25 మంది విద్యార్థులం ఉంటున్నాం. దీంతో ఇబ్బందిగా ఉంది. - శ్రీకాంత్, ఎస్సీ బాలుర(ఎ) హాస్టల్ విద్యార్థి, బోధన్ ఇరుకు గదులతోనే ఇబ్బంది పాఠశాలలు పునఃప్రారంభమై నెల దాటింది. ఇప్పటి వరకు మాకు యూనిఫాంలు ఇవ్వలేదు. హాస్టల్లో వంద మంది ఉన్నారు. భోజనం బాగానే ఉంది. కానీ ఇరుకు గదులతోనే ఇబ్బం దులు పడుతున్నాం. హాస్టల్‌కు సొంత భవనం నిర్మిస్తే సమస్య తీరుతుంది. - శ్రీనివాస్, ఎస్సీ బాలుర (ఎ) హాస్టల్ విద్యార్థి, బోధన్ -
ఈ మిస్టరీ ఎందుకు వీడడం లేదు?
గుట్ట కాదు.. పుట్ట! విచారిస్తున్నాం! గుట్ట కాదు... పుట్ట! వాళ్లిద్దరూ క్లాస్మేట్స్, స్నేహితురాళ్లు. ఇద్దరూ ఒకేసారి చనిపోయారు! ఎలా చనిపోయారు? ఇంటి నుండి హాస్టల్‌కు వెళ్లాల్సినవాళ్లు... ఎందుకు వెళ్లలేదు? మధ్యలో దారి ఎందుకు మార్చుకున్నారు? ఊరి చివర గుట్ట దగ్గర.. శవాలుగా ఎందుకు కనిపించారు? చనిపోయారా? ఎవరైనా చంపేశారా? ఆర్నెల్లు గడిచినా ఈ మిస్టరీ ఎందుకు వీడడం లేదు? అడవిలో పాముల పుట్టలు ఉంటాయి. లేదంటే... చీమల పుట్టలు ఉంటాయి. కానీ ఇది పాముల పుట్ట కాదు.. చీమల పుట్ట కాదు. అనుమానాల పుట్ట. ఈ పుట్ట పగలాలి. నిజాలు బయటికి రావాలి. వరంగల్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామం. అప్పుడే తెల్లవారింది. ఊరు మెల్లగా బద్దకాన్ని వదిలించుకుంటోంది. ఊరివాళ్లంతా పనుల్లో నిమగ్నమవుతున్నారు. అంతలో ఉన్నట్టుండి గ్రామసింహాల అరుపులతో పరిసరాలు దద్దరిల్లాయి. గుంపులు గుంపులుగా శునకాలు ఊళ్లోకి జొరబడ్డాయి. వెంటనే గ్రామస్తులు వాటిని అదిలించారు. అవి భయపడి పారిపోయాయి. కానీ వెళ్తూ వెళ్తూ తమ నోటిలో ఉన్నవాటిని వదిలేసి వెళ్లాయి. ఒకటే దుర్వాసన. ఏంటా అని చూసిన గ్రామస్థులు హడలిపోయారు. అవి మానవ శరీర అవయవాలు. కుళ్లిపోయి కంపు కొడుతున్నాయి. సమాచారం అందించడంతో పోలీసులు రంగంలోకి దిగారు. కుక్కలను అనుసరిస్తూ వెళ్లిన వాళ్లకి... గ్రామ శివారులోని ఓ గుట్ట వద్ద రెండు మృతదేహాలు కనిపించాయి. శిథిలమైన దశలో... కుక్కలు పీకేయగా ఛిద్రమైన స్థితిలో. ఘోరాతి ఘోరం... దారుణాతి దారుణం! ఆ దృశ్యం చూసి వారి మనసులు వికలమయ్యాయి. అందరిలోనూ ఒకటే ప్రశ్న. ఎవరివా దేహాలు? హాస్టల్‌కని వెళ్లి... నర్సంపేట డివిజన్లోని నల్లబెల్లి మండలం, మూడు చెక్కలపల్లిలో గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల ఒకటుంది. అందులో తొమ్మిదో తరగతి చదువుతున్నారు బానోతు భూమిక, బానోతు ప్రియాంక. ఇద్దరికీ పద్నాలుగేళ్లే. ఇద్దరూ పర్వతగిరి మండలం, నారాయణపురం గ్రామ శివారులోని కంబాలకుంట తండాకు చెందినవారే. పైగా మంచి స్నేహితులు. అందుకేనేమో... మరణంలో కూడా స్నేహం వీడలేదు. ఒక్కసారే చనిపోయారు. ఒక్కలాగే చనిపోయారు. కంబాలకుంట తండాలో 22 గిరిజన కుటుంబాలు ఉన్నాయి. అందరూ తమకున్న కొద్దిపాటి భూమిలో పంటలు పండిస్తూ జీవితాలను సాగిస్తున్నారు. వారిలో బాలు-కమిలి, కిషన్-యాకమ్మ దంపతులు కూడా ఉన్నారు. బాలు-కమిలిలకు ఒక కొడుకు, ఒక కూతురు. ఆ కూతురే ప్రియాంక. కిషన్-యాకమ్మలకు కూడా ఒక కుమారుడు, కుమార్తె. ఆ కుమార్తెయే... భూమిక. ఎదురెదురిళ్లు కావడంతో అందరూ కలిసి మెలిసి ఉండేవారు. అందుకే అనుకుంటా... ఇరువురి ఇళ్లలోకీ విషాదం ఒక్కసారే వచ్చి చేరింది. కూతుళ్ల మరణం రూపంలో. అసలేం జరిగింది? ప్రియాంక, భూమికలిద్దరినీ ఆరో తరగతిలో ఆశ్రమ పాఠశాలలో చేర్చారు తల్లిదండ్రులు. మూడేళ్లుగా హాస్టల్లో ఉండి చదువుకుంటూ సెలవుల్లో ఇంటికి వచ్చి వెళ్తున్నారు. ఆ విధంగానే 2015లో దీపావళి సెలవులకు ముందు... ఇంటికి వచ్చారు. సెలవుల తర్వాత నవంబర్ 23న తిరిగి హాస్టల్‌కు బయలుదేరారు. కానీ హాస్టల్‌కు వెళ్లలేదు. నర్సంపేటలో దిగి జయశ్రీ థియేటర్లో మ్యాట్నీ చూశారు. ఆ తర్వాత కూడా హాస్టల్‌కి వెళ్లలేదు. ములుగు మండలం, మల్లంపల్లి శివారులోని శ్రీనగర్ గ్రామంలో ఉన్న బంధువుల ఇంటికెళ్లారు. వాళ్ల హాస్టల్ వార్డెన్ వీరమ్మ... పిల్లలు ఇంకా రాలేదు అంటూ తల్లిదండ్రులకు ఫోన్ చేసింది. వాకబు చేయగా బంధువుల ఇంట్లో ఉన్నారని తెలిసింది. వెంటనే హాస్టల్‌కు వెళ్లమని చెప్పారు. వెళ్లిపోతాం అన్నారు ఇద్దరూ. అన్నారే కానీ వెళ్లలేదు. అప్పుడే కాదు. ఎప్పటికీ వెళ్లలేదు. వాళ్లు ఎక్కడికి వెళ్లారో, ఏమయ్యారో ఎవరికీ తెలియలేదు. డిసెంబర్ 27న... చెన్నారావుపేట మండలం ఖాదర్‌పేట శివారులోని గుట్ట వద్ద కుళ్లిపోయిన శవాలుగా కనిపించారు. ఎన్నో అనుమానాలు... నిజానికి తల్లిదండ్రులు చెప్పగానే... అంటే నవంబర్ 24న బంధువుల ఇంటి నుంచి మల్లంపల్లికి వచ్చి, ఆర్టీసీ బస్సులో హాస్టల్‌కు బయలుదేరారు ప్రియాంక, భూమిక. తమతోపాటు ప్రయాణిస్తున్న ఓ అటవీ శాఖ ఉద్యోగి నుంచి సెల్‌ఫోన్ తీసుకుని వార్డెన్‌కు ఫోన్ చేశారు. వచ్చేస్తున్నామని చెప్పారు. కానీ వాళ్లు హాస్టల్‌కు వెళ్లలేదు. దాంతో 25న వార్డెన్ తల్లిదండ్రులకు మళ్లీ సమాచారం అందించారు. ఎంత వాకబు చేసినా పిల్లల జాడ తెలియలేదు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు పిల్లల ఫొటోలను పబ్లిక్ ప్రదేశాల్లో అతికించి, వారి ఆచూకీ తెలపమని వేడుకున్నారు. చివరికి వాళ్లని నిర్జీవులుగా చూసి అల్లాడి పోయారు. ఈ సంఘటన సంచలనం సృష్టించింది. పోలీసులు విచారణ చేపట్టినా వాస్తవాలు కనుక్కోలేకపోయారు. మృతదేహాల పక్కన ఉన్న పురుగుల మందు డబ్బాను బట్టి వాళ్లు ఆత్మహత్య చేసుకున్నారు అన్నారే తప్ప ఏం జరిగిందో ఎంతకీ అంచనా వేయలేకపోయారు. దాంతో డీఐజీ ఈ కేసును సీఐడీకి అప్పగించారు. వాళ్లు కూడా ఈ మిస్టరీని నేటికీ ఛేదించలేకపోయారు. అసలు ప్రియాంక, భూమికలు ఆత్మహత్య ఎందుకు చేసుకుంటారు? వాళ్లకి ఏం కష్టాలున్నాయి? ఇవి తల్లిదండ్రులు అడుగుతున్న ప్రశ్నలు. అసలివి ఆత్మహత్యలేనా అన్న ప్రశ్న కూడా చాలామంది మనసుల్లో ఉంది. దానికి కారణం లేకపోలేదు. మృతదేహాల దగ్గర ఉన్న క్రిమి సంహారక మందు డబ్బాలు కొంచెమే ఖాళీ అయ్యాయి. ఆ కాస్త తాగితేనే చనిపోతారా? పోనీ చనిపోయినా... పురుగుల మందు తాగితే కాళ్లూ చేతులూ గిలగిలా కొట్టుకుని ఉండాలి. కానీ అలాంటి ఆనవాళ్లేవీ లేవు. అమ్మాయిల వస్తువులు కొన్ని చెల్లాచెదురుగా పడివున్నాయి. కానీ అవి పడినట్టుగా కాక, కావాలని ఎవరో పెట్టినంత పద్ధతిగా ఉన్నాయి. ఇవన్నీ చూస్తే, మరణాలు అక్కడ సంభవించలేదని, వాళ్లని ఎవరైనా వేరేచోట చంపేసి అక్కడికి తెచ్చి పడేసి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయినా హాస్టల్‌కి వెళ్లాల్సిన అమ్మాయిలు మధ్యలో ఎందుకు ఆగారు? సినిమాకి వాళ్లు మాత్రమే వెళ్లారా? వాళ్లతో ఎవరైనా వెళ్లారా? తర్వాతైనా హాస్టల్‌కి వెళ్లిపోకుండా బంధువుల ఇంటికెందుకు వెళ్లారు? అక్కడేమయ్యింది? ఆ బంధువులు ఎందుకు మాట్లాడటం లేదు? అక్కడ్నుంచి బయల్దేరారని నిర్ధారణ అయ్యింది. మరి హాస్టల్కెందుకు వెళ్లలేదు? మధ్యలో ఎక్కడ ఆగారు? ఎలా అదృశ్యమయ్యారు? దీనంతటి వెనుకా ఎవరి హస్తమైనా ఉందా? ఎవరైనా నమ్మించి మోసం చేశారా? వంచించి హత్య చేశారా? అన్నీ అనుమానాలే. అవి ఇప్పటికీ నివృత్తి కాలేదు. ఎందుకంటే విచారణ ముందుకు సాగలేదు. సీఐడీ ఇన్వెస్టిగేట్ చేస్తోంది. జిల్లా స్థాయి నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటైంది. ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల నిరసన అంతకంతకూ ఎక్కువవుతోంది. కానీ కేసు ఇసుమంత కూడా కదల్లేదు. అడిగితే ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నమంటున్నారు సీఐడీ అధికారులు. రిపోర్టు రావడానికి ఇంతకాలం పడుతుందా? ఈ కేసు ఎప్పటికి తేలుతుంది? ప్రియాంక, భూమికలకు న్యాయం జరుగుతుందా? అసలీ గుట్టు ఎప్పటికైనా వీడుతుందా?? - అబ్బు వెంకట్‌రెడ్డి, సాక్షి, నర్సంపేట, వరంగల్ న్యాయం కావాలి ‘‘ఆడబిడ్డలు లేక ఇల్లంతా సిన్నబోతోంది. మంచిగ సదివి మంచి ఉద్యోగాలు సంపాదించాలని అనుకున్నం. ఆళ్లని ఈ స్థితిలో చూస్తమని కల్లో కూడా అనుకోలేదు. అసలు మా బిడ్డలకు ఆత్మహత్యలు చేసుకునేంత ఇబ్బందులు ఏమీ లేవు. ఆల్లని ఎవరో పొట్టన పెట్టుకుని ఉంటారు. ఆరు నెలలు అయినా పోలీసోళ్లు ఎందుకు తెలుసుకుంటలేరు! ల్యాబ్ రిపోర్ట్ రాలేదని చెబుతాండ్రు. పెద్దపెద్దోళ్ల విషయంలో తొందర్నే వచ్చిన ల్యాబ్ రిపోర్టు మా బిడ్డల కాడికి వచ్చేసరికి ఎందుకు ఆలస్యమైతాందో అర్థం కావడం లేదు. ఏడవని రోజు లేదు. ఏ పనీ సేయలేకపోతాన్నం. ఇప్పటికైనా మా బిడ్డల హత్యల వెనక ఎవరు ఉన్నారో కనిపెట్టాల. - బాలికల తల్లిదండ్రులు ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు కోసం ఎదురు చూస్తున్నాం! ప్రియాంక, భూమికల కేసు విషయమై ఇప్పటి వరకు చేసిన దర్యాప్తులో ఎలాంటి ఆధారాలూ లభించలేదు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు అందిన వెంటనే బాలికల మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులకు నివేదికలు అందించి.. అభిప్రాయాలు తీసుకుని, బాలికలది ఆత్మహత్యా హత్యా అనే విషయాలు వెలుగులోకి తీసుకువస్తాం. మరో వారం రోజుల్లో ఎఫ్ఎస్ఎల్ నివేదిక అందే అవకాశం ఉంది. - డీఎస్పీ బాలుజాదవ్ కేసు దర్యాప్తు చేస్తున్నసీఐడీ అధికారి -
చదువుకోవడం ఇష్టంలేక..
♦ హాస్టల్లోని గ్రిల్‌కు తాడుతో ఉరేసుకున్న యువకుడు ♦ ప్రైవేట్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థి ♦ మండలంలోని అవుశాపూర్‌లో ఘటన ♦ పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని ♦ బంధువుల ఆరోపణ ఆందోళన చేసిన కుటుంబీకులు ఘట్కేసర్ : హాస్టల్లో ఉంటూ.. తొమ్మిదో తరగతి చదువుకుంటున్న ఓ విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడడం స్థానికంగా సంచ లనం రేపింది. వివరాలు.. మండలంలోని అవుశాపూర్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో బుధవారం ఉదయం సంఘటన జరగడంతో మృతుడి బం ధువుల పెద్దసంఖ్యలో పాఠశాల ఎదుట ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆందోళన చేస్తున్న వారిని శాంతింపచేశారు. పో లీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా ఎం.ఆత్మకూరు మండలం కొరటికల్ గ్రామానికి చెందిన పెండెం శాంతికుమార్, శోభ దంపతులు 15 సంవత్సరాల క్రితం నగరంలోని జగద్గిరిగుట్ట ప్రాంతానికి బతుకుదెరు వు నిమిత్తం వచ్చారు. ఫొటోగ్రాఫర్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వారికి ఇద్దరు కుమారులు చిందుకుమార్, నందుకుమార్ ఉన్నారు. చిన్నకుమారుడు నందుకుమార్ (15)ను మండలంలోని ఎస్పీఆర్ (శ్రీపతిరెడ్డి) స్కూల్లో ఆరో తరగతిలో 2011 సంవత్సరంలో చేర్పిం చారు. ఈ క్రమంలో హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థి నందుకుమార్ బుధవారం ఉదయం హాస్టల్లో ఉన్న గ్రిల్‌కు తాడుతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా హాస్టల్లో ఉంటున్న పాఠశాల సిబ్బంది ఆ విషయా న్ని యాజమాన్యానికి తెలిపారు. వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలం వద్దకు చేరుకున్నారు. మృ తుడి తండ్రి శాంతకుమార్‌కు సమాచారం ఇచ్చారు. కానీ ఆయన పెద్దకుమారుడు చిందుకుమార్ మెడికల్ సీటు కౌన్సిలింగ్ కోసం అతడి భార్య శోభతో కలిసి డిల్లీ వెళ్లాడు. అతడు అందుబాటులో లేకపోవడంతో విషయాన్ని తన స్వగ్రామంలోని తన సోదరులకు, బంధువులకు తెలి పారు. దీంతో వారు పాఠశాలకు చేరుకున్నారు. ఖాళీ అయిన పాఠశాల.. నందుకుమార్ అనే హాస్టల్ విద్యార్థి ఆత్యహత్య చేసుకున్న విషయాన్ని మీడియా ద్వారా తెలుసుకున్న తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకుని ఇళ్లకు వెళ్లిపోయారు. ఈ దుర్ఘటన జరగడంతోనే విద్యార్థులను ఇంటికి పంపిస్తున్నామని పాఠశాల యాజమాన్యం వివరించింది. చాలాసార్లు కౌన్సెలింగ్ ఇచ్చాం.. నందుకుమార్ అనే విద్యార్థి ఆరో తరగతిలో అడ్మిట్ అయ్యాడని ఎస్పీఆర్ పాఠశాల ఏఓ ఖలీమ్ చెప్పారు. అతడికి చదువుకోవాలని చాలాసార్లు కౌన్సెలింగ్ ఇచ్చామన్నారు. గతంలో కూడా ఓసారి ఆత్మహత్య చేసుకోవడానికి ఇతడు ప్రయత్నించాడని తల్లిదండ్రులు తనకు తెలిపారని ఆయన చెప్పారు. పోస్టుమార్టంనివేదికలో అన్నీ తెలుస్తాయి.. పోస్టుమార్టం నివేదికలో అన్ని విషయాలూ తె లుస్తాయని సీఐ ప్రకాష్ తెలిపారు. మంగళవారం రాత్రే గ్రిల్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. బంధువులు ఆరోపణ చేస్తున్న కో ణంలో కూడా కేసును దర్యాప్తు చేస్తామన్నారు. యాజమాన్యం నిర్లక్ష్య వైఖరే మృతికి కారణం.. ఎస్పీఆర్ పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి కారణంగానే నందకుమార్ మృతి చెందాడని ఆరోపిస్తూ బంధువులు ఆందోళన చేశారు. విద్యార్థి మృతదేహంపై గాయాలు ఉన్నాయని, పాఠశాల వారే హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. పాఠశాల యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అయితే ఆందోళన చేస్తున్న కుటుంబీకులను పోలీసులు శాంతింపజేశారు. వసతిగృహం నిర్వహణకు అనుమతి లేదు: ఎంఈఓ నర్సింహారెడ్డి ఎస్పీఆర్ స్కూల్ డే స్కాలర్స్ పాఠశాల నడపడానికి మాత్రమే అనుమతి ఉందని, రెసిడెన్షియల్ స్కూల్ నడపడానికి అనుమతి లేదని ఎంఈఓ నర్సింహారెడ్డి తెలిపారు. అనుమతి లేకుండా హాస్టల్ నడపడం చట్ట విరుద్ధం. ఈ విషయంపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. -
పురుగుల అన్నంపై హాస్టల్ విద్యార్థుల ఆందోళన
వనస్థలిపురం : నాణ్యత లోపించిన భోజనం పెడుతున్నారని హాస్టల్ విద్యార్థులు అందోళనకు దిగిన సంఘటన హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో బుధవారం జరిగింది. తమకు నాణ్యమైన భోజనం అందించాల్సి ఉండగా వార్డెన్ అవినీతికి పాల్పడుతూ పురుగుల అన్నం, పాడైన కూరగాయలతో వండిన వంట పెడుతున్నారని బీసీ హాస్టల్ విద్యార్థులు ఆందోళన దిగారు. వార్డెన్ సస్పెండ్ చేయాలని రోడ్డుపై ధర్నా చేశారు. విద్యార్థుల ధర్నాతో రోడ్డుపై ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. -
ఒంటరిగా ఉండలేక ఫినాయిల్ తాగిన విద్యార్థిని
తిరుపతి మెడికల్ : తల్లిదండ్రులను వదిలి హాస్టల్లో ఒంటరిగా ఉండలేక ఒక విద్యార్థిని ఫినాయిల్ తాగింది. ఈ సంఘటన తిరుపతిలో గురువారం చోటు చేసుకుంది. బాధితురాలు, వైద్యుల కథనం మేరకు.. తిరుపతి గిరిపురానికి చెందిన కృష్ణయ్య కుమార్తె హేమావతి స్థానిక నెహ్రూ మున్సిపల్ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. గురువారం ఉదయం యథావిధిగా పాఠశాలకు వెళ్లింది. ఇంటర్వెల్ సమయంలో పాఠశాలలో ఉన్న ఫినాయిల్ బాటిల్ తీసుకుని తాగింది. కొంత సేపటికి కడుపు నొప్పి రావడంతో తల్లడిల్లింది. తోటి విద్యార్థులు ఆమెను రుయాకు తీసుకెళ్లారు. వైద్యులు విచారించగా అసలు విషయం చెప్పింది. హాస్టల్లో ఒంటరిగా ఉండలేక ఫినాయిల్ తాగానని పేర్కొంది. ఈ సంఘటనపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎప్పుడూ సందడిగా ఉండే నెహ్రూ మున్సిపల్ పాఠశాలలో విద్యార్థులకు అందేలా ఫినాయిల్ ఎందుకు పెట్టారు. ఒక విద్యార్థిని ఫినాయిల్ తాగుతుంటే తోటి విద్యార్థులు ఎందుకు అడ్డుకోలేకపోయారు. టీచర్లు ఏం చేస్తున్నారు. ఆ విద్యార్థిని చిన్న పిల్లలతో రుయా ఆస్పత్రికి పంపాల్సిన అవసరం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. పాఠశాలలో టీచర్లు మందలించారా, లేక వసతి గృహంలో ఏమైనా జరిగిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. -
యువతిపై హాస్టల్ యజమాని అత్యాచారయత్నం
హైదరాబాద్: ఎస్ఆర్ నగర్ పరిధిలోని బీకేగూడలో ఉన్న ఓ ప్రైవేటు లేడీస్ హాస్టల్లో ఓ యువతిపై గురువారం లైంగిక దాడి యత్నం జరిగింది. హాస్టల్ యజమాని రవీందర్ యువతికి మత్తుమందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడబోయాడు. రవీందర్ నుంచి తప్పించుకున్న యువతి ఎస్ఆర్నగర్ పోలీసులను ఆశ్రయిచింది. రవీంద్రపై పోలీసులకు యువతి ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి.... రవీందర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడిని దర్యాప్తులో భాగంగా విచారిస్తున్నారు. -
ఆఫ్రికన్ విద్యార్థినుల ఆందోళన
కాకినాడ (తూర్పు గోదావరి జిల్లా) : కాకినాడ పట్టణంలోని వెంకటనగర్‌లో ఆదిత్య విద్యా సంస్థల వద్ద ఉద్రిక్తత నెలకొంది. లేడీస్ హాస్టల్లో తగిన వసతులు లేవంటూ ఆఫ్రికా దేశాలకు చెందిన విద్యార్థినులు తమ వసతి గృహం ముందు మంగళవారం ఆందోళనకు దిగారు. వారికి మద్దతుగా కొందరు ఆఫ్రికన్ విద్యార్థులు హాస్టల్లోకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి వారితో చర్చలు మొదలుపెట్టారు. ఆఫ్రికా దేశాలకు చెందిన విద్యార్థులు పదుల సంఖ్యలో ఆదిత్య విద్యా సంస్థల్లో ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ కోర్సులు చదువుతున్నారు. -
ఫిర్యాదు చేసిన మరునాడే రేప్ చేసి..
బికనీర్: రోజులు గడుస్తున్న కొద్ది విద్యార్థులపట్ల ఉపాధ్యాయుల తీరు ఏవగింపు తెచ్చేలా మారుతోంది. విద్యాబుద్ధులు నేర్పించి తనంతవారిగా తీర్చిదిద్దాల్సినవారు కామాంధుల్లా తయారవుతున్నారు. రాజస్థాన్ లోని బికనీర్ లో వ్యాయామ ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న ఓ వ్యక్తి కామంతో పది హేడేళ్ల విద్యార్థినిపై లైంగిక దాడి చేసి అనంతరం చంపేశాడు. హాస్టల్ దగ్గర ఉన్న నీళ్ల ట్యాంకులో ఆమె మృతదేహాన్ని పడేశాడు. కానీ, అతడు మాత్రం అలా చేయలేదని చెప్తున్నాడు. కాలేజీ యాజమాన్యం కూడా ఆ బాలిక ఆత్మహత్యకు పాల్పడిందని అంటోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రెండు రోజుల కిందటే ఆ బాలిక తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయుడు తనపై కొద్ది రోజులుగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడని ఫిర్యాదు చేసింది. వారు స్పందించేలోగానే అతడు శుక్రవారం మరోసారి ఆ బాలిక లైంగిక దాడిజరిపి అనంతరం హత్య చేసి హాస్టల్ దగ్గర నీటి ట్యాంకులో పడేశాడు. పూర్తి వివరాల కోసం బాలిక మృతదేహాన్ని శవపరీక్ష కోసం పంపారు. -
యువతిపై యువకుడి దాడి
కరీంనగర్ క్రైం : నగరంలోని ఓ హాస్టల్ వద్ద యువతిపై యువకుడు దాడి చేయగా.. స్థానికులు అతడిని చితకబాదారు. నగరంలోని సెవెన్‌హిల్స్ వద్ద ఎస్టీ బాలిక హాస్టల్ ఉంది. శనివారం రాత్రి ఇద్దరు యువకులు అక్కడి రావడంతో హాస్టల్లో ఉంటున్న ముగ్గురు యువతులు వారిని కలిసేందుకొచ్చారు. ఓ యువకుడు, యువతి మధ్య వివాహానికి సంబంధించి మాటమాట పెరిగింది. కోపోద్రిక్తుడైన యువకుడు ఆ యువతిపై చేరుుచేసుకోవడంతో గమనించిన స్థానికులు అతన్ని పట్టుకుని ఠాణాకు తరలించారు. ఈ విషయమై టూటౌన్ పోలీసులను వివరణ కోరగా ఫిర్యాదు రాలేదని తెలిపారు. -
వసతిగృహ విద్యార్థి అనుమానాస్పద మృతి
మందన: పొత్తంగి-సిరిపురం గ్రామానికి చెందిన బీసీ బాలుర వసతి గృహానికి చెందిన విద్యార్థి పిలక హరికృష్ణ మంగళవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసులు, విద్యార్థుల కథనం ప్రకారం.. హరికృష్ణ స్వగ్రామం పొత్తంగి. తల్లిదండ్రులు పున్నయ్య, కురాలు ఏకైక పుత్రుడు. అయితే తండ్రి పున్నయ్య భార్యాబిడ్డలను విడిచిపెట్టి దూరంగా ఉంటున్నాడు. తల్లి కురాలు కూలి పనులు చేసుకుంటూ కుమారుణ్ని చదివించుకుంటోంది. ప్రస్తుతం హరికృష్ణ వసతి గృహంలో ఉంటూ పొత్తంగి-సిరిపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. బీసీ వసతి గృహం శిథిలావస్థలో ఉండటంతో అందులో రాత్రి సమయం ఉండకుండా సమీప ఉన్నత పాఠశాల గదుల్లో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏడాదిగా ఉంటున్నారు. రోజులాగే వసతి గృహంలో భోజనం చేసి పాఠశాల గదిలో చదువుకుని నిద్రించడానికి వెళ్లాడు. తన తోటి ఎనిమిదిమంది విద్యార్థులతో రాత్రి 10 గంటల వరకు చదువుకుని నిద్రించాడని స్నేహితులు తెలిపారు. వేకువ జామున చదువుకోవడానికి లేచి చూస్తే.. హరికృష్ణ లేవకపోవడంతో బయటికి వెళ్లి చూడగా అచేతనంగా పడి ఉండడం చూసి హతాశులయ్యారు. దగ్గరకు వెళ్లి లేపడానికి ప్రయత్నించగా ఎంతకీ లేవకపోవడంతో భయభ్రాంతులకు గురయ్యారు. ట్యూటర్‌గా వస్తున్న వ్యక్తికి సమాచారం అందించగా, ఆయన వచ్చి చూశారని, హరికృష్ణలో చలనం లేకపోవడంతో ఇటీవల వార్డెన్‌గా ఇన్చార్జి బాధ్యతలు తీసుకున్న మందస ఎస్సీ వసతి గృహ వార్డెన్ సుదర్శనరావుకు సమాచారం అందించడంతో ఆయన హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. అయితే అప్పటికే హరికృష్ణ మృతి చెందివున్నట్లు వారు గ్రహించారు. మృతుడు కేవలం అండర్‌వేర్‌తో పడి ఉండగా, కొంత దూరంలో మల, మూత్ర విసర్జన చేసి ఉన్నట్లు ఉంది. మృతుడి రెండు కాళ్లకూ బురద అంటిఉండటంతో రాత్రి సమయంలో ఎవరికీ చెప్పకుండా మల విసర్జనకు వెళ్లి ఉంటాడని, అ సమయంలో భయానికి గురై మృతి చెంది ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా బీసీ సంక్షేమ అధికారి రవిచంద్రకు వార్డెన్ సమాచారం అందించడంతో ఆయన సంఘటన స్థలానికి చేరుకున్నారు. కుమారుడి మరణవార్తను తల్లికి తెలియజేయడానికి వెళ్లగా ఆమె కట్టెలు తెచ్చుకోవడానికి సమీప కొండకు వెళ్లింది. గ్రామస్తులు ఆమెను తీసుకుని వచ్చారు. ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందాడని తెలుసుకుని ఆమె సొమ్మసిల్లి పడిపోయింది. అనంతరం ఆమె గుండెలుబాదుకుంటూ రోదించిన తీరు అందరినీ కలచివేసింది. ఎస్ఐ వి.రవివర్మ విద్యార్థుల నుంచి వివరాలను సేకరించారు. కేసు నమోదు చేశామని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సోంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థి ఏ విధంగా మృతి చెందాడన్న విషయం పూర్తిగా తెలియాల్సి ఉంది. -
పశువులకూ హాస్టల్
రాష్ట్రంలోనే తొలిసారిగా కొయ్యూరు మండలంలో ఏర్పాటుకు ప్రతిపాదన రూ.2 కోట్లు ఖర్చవుతుందని అంచనా ఎకరా స్థలంలో షెడ్ల నిర్మాణం.. 200 గేదెలకు అవకాశం 13 ఎకరాల్లో పశుగ్రాసం పెంపకం రాష్ట్రంలోనే మొదటిసారిగా పశువుల హాస్టల్‌ను కొయ్యూరు మండలంలో ఏర్పాటుచేసేందుకు మంగళవారం ప్రతిపాదనలు తయారు చేశారు. దీనికి రూ.రెండు కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు. పాల ఉత్పత్తిని పెంచి గిరిజన రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. నడింపాలెం పంచాయతీ నల్లగొండలో దీన్ని ఎకరా స్థలంలో ఏర్పాటు చేస్తారు. 200 గేదెలను ఇక్కడ ఉంచుతారు. 13 ఎకరాల్లో పశుగ్రాసం పెంచేందుకు రైతులు అంగీకరించారు. ఐటీడీఏ పీవో నుంచి ఈ ప్రతిపాదన కలెక్టర్‌కు వెళ్తే అక్కడ నుంచి నేరుగా ప్రభుత్వానికి చేరుతుంది. కొయ్యూరు: పశువుల పెంపకంలో సరికొత్త పద్ధతిని ప్రవేశపెట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా పశు సంవర్థక శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కొయ్యూరు వెటనరీ వైద్యుడు కె.రాజేశ్‌కుమార్ మంగళవారం పశువుల హాస్టల్ ఏర్పాటుకు ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనలను పాడేరు ఏడీ కిషోర్‌కు అందజేశారు. ఆయన వాటిని ఐటీడీఏ పీవో హరినారాయణన్‌కు అందజేస్తారు. దానిని పరిశీలించిన అనంతరం పీవో కలెక్టర్‌కు ప్రతిపాదన పంపిస్తారు. అది ప్రభుత్వానికి చేరిన తరువాత నిధులు విడుదలవుతాయి. గత నెలలో పశుసంవర్థక శాఖ జేడీ నల్లగొండను సందర్శించారు. అక్కడ రైతులతో మాట్లాడి ఇక్కడే పశువుల హాస్టల్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. దీనిలో భాగంగా ప్రతిపాదన తయారుచేశారు. కంపరేగుల, నల్లగొండ, పెదమాకవరం, వెలగలపాలెం పంచాయతీ శీకాయపాలేనికి చెందిన 70 మంది రైతుల గేదెలను ఇక్కడ ఉంచుతారు. ఉపాధి హామీ నుంచి పశువులకు గ్రాసం నిమిత్తం భూమిని సేకరిస్తారు. దీనికి అవసరమైన సాగునీటిని ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు కల్పిస్తారు. అక్కడ రైతులు పశుగ్రాసానికి 13 ఎకరాలు ఇచ్చేందుకు అంగీకరించారు. పాల విక్రయం ద్వారా వచ్చిన ఆదాయాన్ని భూమి ఇచ్చిన రైతులకు చెల్లిస్తారు. ఇందుకు రివాల్వింగ్ నిధిని ఏర్పాటు చేస్తారు. ప్రతి లీటరు పాలకు వచ్చే ఆదాయంలో కొంత ఈ నిధికి జమచేసి పశుగ్రాసానికు చెల్లిస్తారు. వెయ్యి లీటర్ల వరకు పాల సేకరణ 200 గేదెలను హాస్టల్లో ఉంచితే సుమారు వెయ్యి లీటర్ల వరకు పాల దిగుబడి వస్తుంది. దీని ద్వారా రైతులు నెలకు రెండు గేదెలు ఉంటే రూ.16 వేల వరకు ఆదాయం పొందే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ ప్రాంతంలో ఎక్కువమంది రైతులు పాలను విక్రయిండం ద్వారా నెలకు ఒక గేదె నుంచి రూ. 8 వేల వరకు ఆదాయం పొందుతున్నారు. పశువుల హాస్టల్ ఏర్పాటు తరువాత ఎవరు ఎక్కువ చెల్లిస్తే వారికే పాలు విక్రయించాలని రైతులు నిర్ణయించారు. పశువులను శుభ్రమైన వాతావరణంలో ఉంచి వాటికి నీరు, గ్రాసం కొరత లేకుండా చూడటం హాస్టల్ ఏర్పాటు ద్వారా సాధ్యపడుతుందని అధికారులు భావిస్తున్నారు. పాల ఉత్పత్తితో పాటు గిరిజనుల ఆదాయాన్ని పెంచడం దీని ప్రధాన ఉద్దేశం. దీనిపై కొయ్యూరు పశువైద్యుడు కె.రాజేశ్‌కుమార్‌ను సంప్రదించగా హాస్టల్ ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు పంపామని చెప్పారు. దీనికి రూ.రెండు కోట్ల వరకు ఖర్చవుతుందన్నారు. రైతుల ఆధార్ కార్డులతో పాటు పూర్తి వివరాలను అందజేశామని తెలిపారు. -
అమ్మకు చారల చీర
అమ్మ పుట్టినరోజుకి మనం ఏమీ కొనిపెట్టం. అసలు అమ్మ పుట్టినరోజు మర్చిపోతాం కూడా! కానీ అమ్మ చనిపోయిన రోజును ఎవ్వరం మర్చిపోలేం. నేహ తన తల్లి చనిపోవడానికి కారణమైన ఒక స్పీడ్‌బ్రేకర్ మీద... అది కనిపించేలా చారలు పూయడానికి పోరాడింది! అదే తను తన అమ్మకు ఇచ్చిన చారల చీర! అమ్మ.. నాన్న.. అమ్మాయి.. ఓ మరాఠీ ఫ్యామిలీ! ఆ నాన్న పేరు వివేక్ చరాటి. చిన్న వ్యాపారి. అమ్మ.. వీణ... బ్యాంక్ క్యాషియర్. స్వతంత్ర భావాలు గల వ్యక్తి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆధునిక మహిళకు ప్రతీక. అమ్మాయి నేహ. అకోలాలో ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతోంది హాస్టల్లో ఉంటూ! అమ్మ మాత్రం కూతుర్ని స్ట్రాంగ్ అండ్ కాన్ఫిడెంట్ గర్ల్‌గా చూడాలనుకుంటోంది. అనుకోవడమే కాదు అలా పెంచుతోంది కూడా! అందుకే మూడో ఏట నుంచే ఫుట్‌బాల్, వాలీబాల్, బాడ్మింటన్ ఆడించడం మొదలుపెట్టింది. ఏడో యేట సైకిల్ నేర్పించింది. పన్నెండో యేట టూ వీలర్ నడిపేలా చేసింది. వీళ్లుండేది మహారాష్ట్ర.. అకోలా జిల్లాలోని గాధింగ్లాజ్ అనే చిన్న టౌన్లో. ఆ ఊళ్లో బ్యాంక్‌లో పనిచేస్తున్న తొలి, ఏకైక మహిళా ఉద్యోగి వీణే. అలాగే ఫుట్‌బాల్, వాలీబాల్, బాడ్మింటన్ లాంటి ఆటలు ఆడే ఏకైక అమ్మాయి కూడా నేహే. బంధువుల దగ్గర్నుంచి ఇరుగుపొరుగు దాకా ఎవరు ఎన్ని అన్నా పట్టించుకోకుండా తాను నిలబడింది.. కూతురూ నిలబడేలా చేసింది వీణ. అందుకే ఆ ఊళ్లోని విద్యావంతులకు, సాహిత్యకారులకు, చివరికి బ్యాంక్‌కు వచ్చే గ్రామీణ ఖాతాదారులకూ వీణ అంటే ఎనలేని గౌరవం.. అభిమానం! హైదరాబాద్ రింగ్ రోడ్డులో ఘోరమైన యాక్సిడెంట్! హైదరాబాద్ - విజయవాడ హైవే దాదాపు ప్రతిరోజూ నెత్తురోడుతూనే ఉంటుంది. నేషనల్ క్రైమ్‌రికార్డ్స్ బ్యూరో ప్రకారం 2014వలో దేశంలో జరిగిన రోడ్డు ప్రమాదాలు నాలుగున్నర లక్షల పైనే! మృత్యువాతపడ్డవారు వారు లక్షా 41 వేల 526 మంది. రోజుకి 12 వందల యాక్సిడెంట్లు నమోదవుతున్నాయి. హలో.. మహారాష్ట్రలోని చింతలులేని ఆ చిన్న కుటుంబానికి.. దేశంలోని ఈ రోడ్డు ప్రమాదాలకు ఏంటీ సంబంధం? వాళ్ల గురించి చెప్తూ హఠాత్తుగా ఈ యాక్సిడెంట్ల గోలేంటి? అని కన్నెర్ర చేసుకోకండి. సంబంధం ఉంది. కాబట్టే ఈ ఇంటరప్షన్! సావధానంగా సాగండి. స్పీడ్ బ్రేకర్... వీణ బ్యాంక్ ఎంప్లాయ్ అని చెప్పుకున్నాం కదా! ప్రతిరోజు ఆమె భర్త వివేక్ స్కూటర్ మీద వీణను బ్యాంక్ దగ్గర దింపి తన వ్యాపార పనులకు వెళ్లిపోతాడు. ఎప్పటిలాగే 2015.. అక్టోబర్ 4.. ఉదయం కూడా ఆ జంట బయలుదేరింది. ఊళ్లోని మున్సిపల్ కార్పోరేషన్ ఆఫీస్ ముందుకు వచ్చారు. వీళ్ల స్కూటర్ వెనకాలే యమస్పీడ్‌గా ఓ ఇన్నోవా దూసుకొస్తోంది. రేర్ వ్యూ మిర్రర్ లోంచి చూశాడు వివేక్. ముందు స్పీడ్ బ్రేకర్ ఉంది. దాటి బండిని పక్కకు తీసుకొని ఇన్నోవాకు దారిద్దామనుకున్నాడు. స్కూటర్‌ను కొంచెం స్లో చేసి స్పీడ్‌బ్రేకర్ దాటిస్తున్నాడు. వెనక వీల్ స్పీడ్ బ్రేకర్ దిగబోతోంది.. అంతలోకే ఇన్నోవా రావడమూ.. దగ్గరికి వస్తేగానీ కనిపించని స్పీడ్బ్రేకర్ని ఇన్నోవా డ్రైవర్ చూడ్డం.. సడన్‌గా హ్యాండ్ బ్రేక్ వేసినా వేగం అదుపుకాలేకపోవడం...స్కూటర్‌ను ఢీ కొట్టడం.. బండికి అటువైపు వివేక్.. ఇటువైపు వీణ కిందపడడమూ.. ఆమె కడుపు మీదనుంచి ఇన్నోవా వెళ్లిపోవడమూ క్షణంలో జరిగాయి. హార్ట్ బ్రోకెన్ వివేక్‌ను, వీణను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. వివేక్‌కు స్వల్పగాయాలయ్యాయి. వీణకు మాత్రం కుడిపక్క ఎముకలన్నీ విరిగిపోయాయి. పేగులు నుజ్జునుజ్జయ్యాయి. పొట్టలో రక్తస్రావం అవుతుంటే ‘ఇక్కడ చికిత్స చేయలేం.. దగ్గర్లోని బెల్గామ్ టౌన్‌కి తీసుకెళ్లండి’ అని వైద్యులు సలహా ఇచ్చారు. అమ్మానాన్నలకు అయిన యాక్సిడెంట్ గురించి అకోలాలో ఉన్న నేహకు కబురు పంపారు బంధువులు. పరిగెత్తుకుంటూ వచ్చింది. కానీ అమ్మ వీణ.. బెల్గాం చేరకుండానే మార్గమధ్యంలోనే దేవుడిని చేరుకుంది. కుప్పకూలిపోయారు వివేక్, నేహ! మూణ్ణెల్లయినా... ధైర్యాన్ని ఉగ్గుపాలతో పెట్టి పెంచిన అమ్మ.. ఆడపిల్లగా కాకుండా మనిషిగా ఎలా బతకాలో నేర్పిన టీచరమ్మ.. తన కాళ్ల మీద తను నిలబడి చూపించిన రోల్‌మోడల్ మరణం నేహను కుంగదీసింది. తండ్రి కొద్దిగా కోలుకున్నా నేహ ఆ డిప్రెషన్‌లోంచి బయటపడలేక పోయింది. చదువు మీద ధ్యాస కుదరడం లేదు. 24 గంటలూ అమ్మ తాలూకు జ్ఞాపకాలే. అమ్మ పోయినప్పుడు పరామర్శకు వచ్చిన చుట్టాలు, స్నేహితులు ‘అక్కడ ఆ స్పీడ్ బ్రేకర్ లేకుంటే ఇంత ప్రమాదం జరిగేది కాదు. దానివల్లే వీణ చనిపోయింది. కనీకనిపించనట్టున్న ఆ స్పీడ్‌బ్రేకర్ గతంలోనూ చాలామందినే పొట్టనపెట్టుకుంది’ అని అన్న మాటలు పదేపదే గుర్తుకురాసాగాయి నేహకు. నిజమే.. ఆ స్పీడ్‌బ్రేకర్ కనిపించేట్టు ఉంటే వెనకాల ఇన్నోవా స్పీడ్ తగ్గేది.. యాక్సిడెంట్ కాకపోయేది.. అమ్మ బతికేది! అనుకుంది చాలాసార్లు. ఆ స్పీడ్‌బ్రేకర్ ఇలాగే చాలామందిని పొట్టనపెట్టుకుంది అన్న మాట మాత్రం మెదడులో ఆలోచనల్ని రేకెత్తించసాగింది. స్నేహితులతో కలిసి.. మూడునెలల తర్వాత ఒకరోజు బయటకు వచ్చింది నేహ.. స్నేహితులను కలిసేందుకు. తనకు వచ్చిన ఐడియాను పంచుకుంది. వాళ్లూ ఓకే అన్నారు. ఆ ఐడియాకు సంబంధించిన సమాచారాన్ని సేకరించారు. తర్వాత మున్సిపల్ ఆఫీస్ అథారిటీస్‌కు దరఖాస్తు రాశారు.. మున్సిపల్ ఆఫీస్ ముందున్న స్పీడ్ బ్రేకర్ కారణంగా ఇప్పటివరకు ఎన్ని ప్రమాదాలు జరిగాయి? ఎంతమంది చనిపోయారు? తాజా ప్రమాదంలో తన తల్లి మరణించడం.. వంటి వివరాలన్నిటినీ తెలుపుతూ, కాబట్టి ఆ స్పీడ్‌బ్రేకర్ స్పష్టంగా కనిపించేలా దానికి పెయింట్ వేద్దామనుకుంటున్నామని, దానివల్ల ప్రమాదాలను అరికట్టవచ్చనే విజ్ఞాపననూ జోడిస్తూ! నిరసన.. ధర్నా.. మున్సిపల్ అధికారులు ఆ దరఖాస్తుని చదివి నిర్లక్ష్యంగా చెత్తబుట్టలో వేశారు. జవాబు రాకపోయేసరికి గాధింగ్లాజ్లో ఉన్న నేహ స్నేహితులే కాదు, తన ఇంజనీరింగ్ క్లాస్మేట్స్ కూడా జత కలిసి మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు. అయినా కదల్లేదు సిబ్బంది. తెల్లవారి ఊరంతా నిరసన ర్యాలీ తీశారు. రెండు రోజుల హడావిడికి కొంత మేల్కొంది మున్సిపాలిటీ. మాట్లాడ్డానికి పిలిచారు అధికారులు. వాళ్లమ్మ మరణానికి కారణమైన స్పీడ్బ్రేకర్కు మాత్రమే పెయింట్ వేయడానికి అనుమతిచ్చారు. ఏ కదలికైనా ఒక్క అడుగుతోనే కదా మొదలు.. అనుకొని సరే అంది నేహ బృందం. ఆరోజే వాళ్లమ్మ ఫోటో తీసుకొచ్చి ఆ స్పీడ్‌బ్రేకర్ ముందు పెట్టారు. స్పీడ్బ్రేకర్కి తెల్లని పెయింట్ వేశారు వాహనదారులకు కనిపించేలా! అలాగే ఆ ఫోటో ముందు వాళ్లమ్మ వివరాలు.. చనిపోయిన కారణాన్ని పెయింట్‌తో రాసింది నేహ. వీళ్ల ప్రయత్నాన్ని చూసిమున్సిపల్ సిబ్బంది కూడా కళ్లు తెరిచారు. దాంతో గాధీంగ్లాజ్లోని అన్ని స్పీడ్బ్రేకర్స్కి పెయింటింగ్ వేసి రోడ్‌సేఫ్టీ మెథడ్స్నూ రాశారు. అయితే వైట్ పెయింట్ కాకుండా రాత్రిపూటా కనపడేలా రేడియం పెయింట్‌ను వేశారు. నేహ వాళ్లు వేసిన స్పీడ్‌బ్రేకర్ సహా అన్నిటికీ! ఇప్పుడు ఇది ఓ ఉద్యమంలా.. అకోలా జిల్లా అంతా పాకింది. ఫలితాలు అనుకూలంగా ఉండడంతో త్వరలోనే ఓ మోస్తరు పట్టణాలకూ దీన్ని విస్తరింపచేయాలని అనుకుంటోందట మహారాష్ట్ర ప్రభుత్వం. సమాజంలో చెడు జరిగినప్పుడో అన్యాయం జరిగినప్పుడో ప్రమాదం జరిగినప్పుడో మన మనసులు కలవరపడతాయి. ఏదైనా చేస్తే బాగుండునని ఉద్రేకపడతాయి. నేహలా మనమూ ఇలాంటి చిన్ని చిన్ని ప్రయత్నాలు చేస్తే అపరాధభావం లేకుండా ఆత్మసంతృప్తితో జీవించవచ్చు. మీరూ అలా ప్రయత్నిస్తారని నమ్ముతూ.. మీ సాక్షి. -
హాస్టల్ నుంచి మరో హాస్టల్‌పైకి దూకుతూ..
-
ఇక నుంచి ప్రతీ వారం హాస్టల్ నిద్ర
అంగన్వాడీ, పీహెచ్‌సీల్లోనూ ఆకస్మిక తనిఖీలు హన్మకొండ ఆనంద నిలయంలో బస చేసిన కలెక్టర్ హన్మకొండ : వసతి గృహాల్లోని సమస్యలు తెలుసుకోవడానికే హాస్టల్ నిద్ర చేస్తున్నట్టు కలెక్టర్ వాకాటి కరుణ అన్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని హాస్టళ్లలో అధికారులు గురువారం హాస్టల్ నిద్ర చేయగా, హన్మకొం డ బాలసముద్రంలోని ఎస్సీ బాలికల వసతి గృ హం(ఆనంద నిలయం)లో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికారులు హాస్టళ్లను సందర్శించడం ద్వారా సమస్యలు తెలుస్తాయ ని.. తద్వారా పరిష్కరించేందుకు వీలు కలుగుతుందన్నారు. ఇక నుంచి ప్రతీవారం హాస్టల్నిద్ర కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు కలెక్టర్ వివరించారు. అలాగే, అంగన్వాడీ కేంద్రాలు, పీహెచ్‌సీలను ఆకస్మికంగా త నిఖీ చేయనున్నట్టు తెలిపారు. కాగా, మొదటిసారి కు రవిలో హాస్టల్ నిద్ర చేశానని, ప్రస్తుతం స్టేషన్ ఘన్పూర్ వెళ్లాల్సి ఉన్నా అనివార్య కారణాల వల్ల హన్మకొండలో చేయాల్సి వచ్చిందని వివరించారు. హాస్టల్ బాగుంది... ‘ఆనంద నిలయం వసతి గృహం బాగుంది. హాస్టల్ గదులకు పెయింట్ వేయించడంతో అందంగా కనిపిస్తోంది. అన్ని హాస్టళ్లను ఇదేతీరుగా తయారు చేయిస్తాం. ఇతర హాస్టళ్ల వార్డెన్లను ఇక్కడకు పిలిపించి చూ పించాలి. ఇందుకు ఏర్పాట్లు చేయండి’ అని సమాచా ర శాఖ ఏడీ జగన్‌కు కలెక్టర్ కరుణ ఈ సందర్భంగా సూచించారు. హాస్టల్ నిద్ర చేపట్టిన కలెక్టర్ ఆనంద నిలయం వద్దకు రాత్రి 9.15 గంటల కు చేరుకున్నా రు. వాహనంలో కొద్దిసేపు ఫోన్ మాట్లాడిన అనంతరం 9.20 గంటలకు హాస్టల్లోకి ప్రవేశించారు. హాస్టల్ గదులను పరిశీలించి బాగున్నాయని కితాబి చ్చారు. విద్యార్థులతో మాట్లాడి ఏం చదువుతున్నారని ప్రశ్నించ గా.. ఆహారపదార్థాల్లో కల్తీపై చదువుతున్నామని తెలిపారు. ధనియాల పొడిలో రంపపుపొడి కలుపుతున్నట్లు ఉందని చెబుతూ పుస్తకాన్ని చూపించారు. ఆ తర్వాత ఒక్కో గదిని కలియతిరిగిన ఆమె విద్యార్థులను ఏం చదువుతున్నారు, ఏ పాఠశాలలో చదువుతున్నారో అడిగి తెలుసుకున్నారు ఐదో తరగతి విద్యార్థిని షియోని పుట్టిన రోజు పురస్కరించుకుని ఆమె కలెక్టర్‌కు చాక్లెట్ ఇవ్వగా.. కలెక్టర్ శుభాకాంక్ష లు తెలిపారు. ఆ తర్వాత విద్యార్థినులతో పాటలు పాడించిన కలెక్టర్ వారితో తన సెల్ఫోన్లో సెల్ఫీలు దిగారు. అనంతరం నిద్రకు ఉపక్రమించారు. -
అర్దరాత్రి లేడీస్ హాస్టల్లో చొరబడిన ఆకతాయి