సాక్షి, నల్గొండ: సూర్యాపేట మెడికల్ కాలేజీ ర్యాగింగ్ ఘటన నిజమేనని తేలింది. ర్యాగింగ్‌పై ఏర్పాటు చేసిన కమిటీ హాస్టల్‌లో ర్యాగింగ్ జరిగినట్లు నివేదికలో తేల్చింది. ఏడాదిపాటు ఆరుగురు విద్యార్థులపై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు డీఎంఈ తెలిపారు. విద్యార్థులు తక్షణం హాస్టల్ ఖాళీ చేయాలంటూ డీఎంఈ ఆదేశించారు. కాగా, ర్యాగింగ్ ఘటన సంచలనంగా మారడంతో ప్రభుత్వం సీరియస్ అయ్యింది.
కాగా, సూర్యాపేట మెడికల్ కళాశాలకు సంబంధించిన హాస్టల్‌లో ఓ జూనియర్ విద్యార్థిని రెండో సంవత్సరం విద్యార్థులు నాలుగు గంటలు గదిలో బంధించి హింసించారు. మోకాళ్లపై కూర్చోబెట్టి సెల్యూట్ చేయించుకోవడమే కాకుండా పిడిగుద్దులు గుద్దారు. కన్నీరుపెట్టి వేడుకున్నా వదలకుండా ట్రిమ్మర్‌తో గుండు గీసేందుకు ప్రయత్నించారు. టాయిలెట్ వస్తుందని అక్కడి నుంచి బయటపడ్డ ఆ విద్యార్థి ఫోన్ చేసి విషయం తల్లి దండ్రులకు చెప్పాడు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
చదవండి: (కులమేంటని అడిగి.. సార్ అని పిలవాలని హుకుం, గదిలో బంధించి దారుణం)
Comments
Please login to add a commentAdd a comment