ragging
-
బాల్యంపై బులీయింగ్ పడగ
‘ఐ వాంట్ టు డై’.. ఐదో తరగతి చదివే ఒక బాలిక తన రెండు నోట్‌బుక్స్‌లో రాసుకున్న వాక్యం ఇది. హైదరాబాద్‌లోని అల్వాల్ తిరుమలగిరి ప్రాంతానికి చెందిన ఆ బాలిక బాగా పేరొందిన పాఠశాలలో చదువుతోంది. నోట్‌బుక్స్‌లో రామకోటి రాసినట్లుగా ‘ఐ వాంట్ టు డై’అంటూ రాసి పేజీలు నింపేసింది. వాటిని చూసి తల్లిదండ్రులుహడలిపోయి, మానసిక వైద్యులను సంప్రదించారు.కొంతకాలంగా ఆ బాలిక తీవ్ర కుంగుబాటుకు లోనైనట్లు వైద్యులు గుర్తించారు. తల్లిదండ్రులు సకాలంలో స్పందించకపోతే పాప ఆత్మహత్యకు పాల్పడి ఉండేదని తెలిపారు. ఆ బాలిక మాత్రమే కాదు.. చాలామంది స్కూల్ పిల్లలు తరగతి గదిలో తోటి విద్యార్థుల వేధింపుల కారణంగా కుంగుబాటుకు గురవుతున్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. కొంతమంది విద్యార్థులు గ్రూపులుగా విడిపోయి ఒకరిద్దరు పిల్లలను టార్గెట్ చేసి అనేక రకాలుగా వేధిస్తున్నారు. వారిలోని శారీరక లోపాలను ఎత్తిచూపుతూ ఏడిపిస్తారు. మానసిక వైద్య పరిభాషలో ‘బులీయింగ్’గా పిలిచే ఈ విష సంస్కృతి చాపకింద నీరులా విస్తరిస్తోంది. కాలేజీల్లో ర్యాగింగ్ తరహాలో స్కూళ్లలో బులీయింగ్ భూతంపిల్లలను వెంటాడుతోందని నిపుణులు చెబుతున్నారు. యూనిసెఫ్ వంటి అంతర్జాతీయ సంస్థల అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఈ విష సంస్కృతి 1.3 శాతం ఉంటే, హైదరాబాద్ తదితర మెట్రో నగరాల్లో 35 నుంచి 37 శాతం వరకు ఉన్నట్లు చెబుతున్నారు. – సాక్షి, హైదరాబాద్ఏమిటీ బులీయింగ్?ఐ వాంట్ టు డై అని రాసిన బాలిక తోటి విద్యార్థుల కంటే కాస్త లావుగా ఉంటుంది. దాంతో తరగతి గదిలో సహ విద్యార్థులు మొదట్లో ఆటపట్టించేవారు. క్రమంగా అంతా ఒక్కటై ఆమెను ఏకాకిని చేసి ఏడిపించడం మొదలుపెట్టారు. ఈ బులీయింగ్ అంతటితో ఆగలేదు. బాలిక చుట్టూ చేరి జడలు పట్టుకొని లాగుతూ ‘పిగ్టేల్’అంటూ ఏడిపించేవారు. ఈ వేధింపులపై క్లాస్ టీచర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. పైగా ఆ బాలికనే తిట్టింది. తల్లిదండ్రులు కూడా తమ బిడ్డ ఫిర్యాదును పట్టించుకోలేదు.దీంతో ఆ బాలిక డిప్రెషన్లోకి వెళ్లింది. పైకి చూడ్డానికి ఇది సాధారణంగా ఏడిపించడం (బులీయింగ్)గానే కనిపిస్తుంది. కానీ పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతుందని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. కొన్ని స్కూళ్లలో కొందరు టీచర్లే బులీయింగ్‌కు ఆజ్యం పోస్తున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. పిల్లల రంగు, రూపు, ఆకృతి, నడక వంటి శారీరక అంశాలను లక్ష్యంగా చేసుకొని ‘బాడీషెమింగ్’కు పాల్పడుతున్నారు. ఏడేళ్ల చిన్నారుల నుంచి 18 ఏళ్ల టీన్స్ వరకు బులీయింగ్ బారిన పడుతున్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.ఆధిపత్య పెంపకంతరగతిలో ఉన్న పిల్లలంతా ఒకేవిధమైన బులీయింగ్ స్వభావాన్ని కలిగి ఉండరు. వారిలో ఒక్కరో, ఇద్దరో కలిసి మిగతా వాళ్లందరినీ ఒక గ్రూపుగా సంఘటితం చేస్తారు. టార్గెట్ చేసిన బాలిక లేదా బాలుడిని ఏకాకిని చేస్తారు. మిగతా పిల్లలు తమ ప్రమేయం లేకుండానే ఆ జట్టులో చేరి ఏడిపిస్తుంటారు. తరగతిలో తాము ఏం చేసినా చెల్లుబాటవుతుందనే ఆ ఒకరిద్దరు పిల్లల ప్రవర్తన మిగతా పిల్లలను ప్రభావితం చేస్తుంది.తోటివారికంటే తామే గొప్పవాళ్లమనే భావన పిల్లల్లో కలగడానికి వారి తల్లిదండ్రుల ఆధిపత్య పెంపకమే (అథారిటేరియన్ పేరెంటింగ్) కారణమని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ విష సంస్కృతి గురించి ఉపాధ్యాయులు, స్కూల్ యాజమాన్యం, తల్లిదండ్రులు పెద్దగా పట్టించుకోవడం లేదు. బులీయింగ్ను అరికట్టాల్సిన టీచర్లే బాధితులను మరింత ఏకాకులను చేస్తున్నారు.స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి రాగానే ఆ రోజు ఎలా గడిచిందనే విషయాన్ని తల్లిదండ్రులు కచి్చతంగా ఆరా తీయాలని నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా బులీయింగ్‌కు గురయ్యే పిల్లలు సరిగ్గా తినకపోవడం, మాట్లాడకుండా ఉండిపోవడం, ఇంట్లోనూ ఒంటరిగా గడపడం వంటి లక్షణాలతో బాధపడుతారు. అలాంటి సమయంలో తల్లిదండ్రులు వెంటనే అప్రమత్తం కావాలని సూచిస్తున్నారు. కలిసికట్టుగా ఎదుర్కోవాలి పిల్లల పెంపకంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. స్నేహపూర్వకంగా ఉండాలి. కానీ కొందరు అందుకు భిన్నంగా డామినేటింగ్ కల్చర్‌లో పిల్లలను పెంచుతారు. దీంతో సహజంగానే ఆ పిల్లలకు అదే సంస్కృతి అలవడుతుంది. తాము అలా ఏడిపించడం వల్ల తోటి విద్యార్థి మనస్సును గాయపరుస్తున్నామనే భావన ఆ పిల్లల్లో ఏ మాత్రం కనిపించదు. ఒక సర్వే ప్రకారం తరగతి గదిలో ప్రతి ముగ్గురిలో ఒకరు ఏదో ఒక విధమైన బులీయింగ్‌కు గురవుతున్నారు. తల్లిదండ్రులు, టీచర్లు, స్కూల్ యాజమాన్యం కలిసికట్టుగా ఎదుర్కోవాల్సిన సమస్య ఇది. బులీయింగ్ లక్షణాలు ఏ రూపంలో కనిపించినా అరికట్టాలి. లేకపోతే పిల్లల భావి జీవితాన్ని ఇది కబళిస్తుంది. – డాక్టర్ సంహిత, మానసిక వైద్యనిపుణులు, సికింద్రాబాద్. -
సెయింటాన్స్ ఘటనపై కలెక్టర్ సీరియస్
పాడేరు: పట్టణంలోని సెయింటాన్స్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో ఏడో తరగతి విద్యార్థినిపై పదో తరగతి విద్యార్థినులు దాడి చేసిన ఘటనపై కలెక్టర్ దినేష్‌కుమార్ సీరియస్ అయ్యారు. సోమవారం దినపత్రికలు, సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్తలపై ఆయన స్పందించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక అందజేయాలని జిల్లా విద్యశాఖ అధికారి బ్రహ్మాజీరావును ఆదేశించారు. ఇందుకోసంప్రత్యేక కమిటీను ఏర్పాటు చేశారు. దీంతో డీఈవో సోమవారం పాఠశాల, వసతి గృహాన్ని సందర్శించారు. సంఘటన వివరాలను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ నిర్వహణకు అనుమతులు ఉన్నాయా లేదా అనే అంశంపై ఆరా తీశారు. నివేదిక ఆధారంగా వసతి గృహా కేర్ టేకర్ శ్రావ్యను విధుల నుంచి తొలగించారు. ఘటనకు బాధ్యులైన ముగ్గురు టెన్త్ విద్యార్థినులను హాస్టల్ నుంచి ఇళ్లకు పంపించివేశారు. వసతి గృహా నిర్వాహణపై నిత్యం పర్యవేక్షణ జరపాలని, భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు పునారావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇకపై ఇటువంటి ఘటనలు, వివాదాలు జరిగితే పాఠశాల గుర్తింపు రద్దు చేస్తామని డీఈవో హెచ్చరించారు.#viralvideo… pic.twitter.com/dcVm70EvT0— greatandhra (@greatandhranews) February 17, 2025 -
విజ్ఞాన్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం
-
మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ భూతం.. డంబెల్స్ వేలాడదీసి
తిరువనంతపురం : ‘అరె తమ్ముళ్లు మందేయాలి. డబ్బులు ఇవ్వండ్రా అని సీనియర్ విద్యార్థులు.. తమ జూనియర్ విద్యార్థులకు హుకుం జారీ చేశారు. దీంతో జూనియర్లు చేసేది లేక కొన్ని వారాల పాటు ప్రతి ఆదివారం సీనియర్లకు డబ్బులు ఇచ్చే వారు. ఈ తరుణంలో ఓ ఆదివారం ఎప్పటిలాగే జూనియర్ల నుంచి డబ్బులు వసూలు చేసేందుకు సీనియర్లు ప్రయత్నించారు. దీంతో జూనియర్లు మీకు ఇచ్చేందుకు మా దగ్గర డబ్బులు లేవు అన్నా’అని సమాధానం ఇచ్చారు. అంతే కోపోద్రికులైన సీనియర్ విద్యార్థులు.. జూనియర్లను అత్యంత కిరాతంగా ర్యాగింగ్ (Ragging) చేశారు. చివరికి..కేరళ పోలీసులు వివరాల మేరకు.. కేరళ (kerala) రాజధాని తిరువనంతపురంకు చెందిన ముగ్గురు విద్యార్థులు కొట్టాయంలో ప్రభుత్వ కాలేజీలో (kottayam government narsing college) నర్సింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. అయితే, గతేడాది నవంబర్‌లో మూడో సంవత్సరం నర్సింగ్ చదువుతున్న ఐదుగురు విద్యార్థులు ఈ ముగ్గురు విద్యార్థుల్ని ర్యాగింగ్ పేరుతో వేధింపులకు గురి చేశారు.ఆ ర్యాగింగ్ ఎలా ఉందంటే? బాధితుల్ని నగ్నంగా నిలబెట్టి గాయపరచడం. వాటిపై కారం పూయడం. మంటకు విలవిల్లాడుతుంటే వీడియోలు తీసి పైశాచికానందం పొందడం. గాయాల్ని కంపాస్‌తో కొలవడం. అంతర్గత అవయవాలకు డంబెల్స్‌ను వేలాడదీయడం వంటి వికృత చేష్టలకు దిగారు. తాము ర్యాగింగ్ చేస్తున్నామని ఫిర్యాదు చేస్తే మీకు చదువును దూరం చేస్తామని బాధిత విద్యార్థుల్ని బెదిరింపులకు దిగారు. అలా నాలుగు నెలల పాటు సీనియర్ల వేధింపులను మౌనంగా భరించారు.ఈ నేపథ్యంలో ఓ బాధిత విద్యార్థి ధైర్యం చేసి కాలేజీలో జరిగిన దారుణం వెలుగులోకి వచ్చింది. తండ్రి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సీనియర్ విద్యార్థుల్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసు కస్టడీలో విద్యార్థుల్ని పోలీసులు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు.👉చదవండి : నేను లీవ్ అడిగితే ఇవ్వరా? ప్రభుత్వ ఉద్యోగి ఏం చేశాడో చూడండి! -
కేరళ ర్యాగింగ్ : ‘నా మేనల్లుడే..’వ్యాపారవేత్త చెప్పిన భయంకర విషయాలు
కేరళ (Kerala)లోని కొచ్చిలో 15 ఏళ్ల మిహిర్ అహ్మద్ ఆత్మహత్య యావత్ దేశాన్ని కుదిపేసింది. ఆ యువకుడు ఎత్తైన భవనం 26వ అంతస్తులోని ఫైర్ ఎగ్జిట్ వింటోనుంచి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. విపరీతమైన ర్యాగింగ్ కారణంగానే అతను ఆత్మహత్యకు పాల్పడినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. బలవంతంగా టాయిలెట్ సీటును నాకమని బలవంతం చేశారని, నిగ్గా (నల్లగా ఉన్నాడని) అంటూ దారుణంగా వేధించడం వల్లనే తన కొడుకు చనిపోయాడని బాధితుడి తల్లి ఆరోపించారు. విచారణ జరిపించాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP), ముఖ్యమంత్రి కార్యాలయానికి కూడా ఫిర్యాదు చేసింది. వేధింపులపై దర్యాప్తు చేయాలని కూడా చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ సహాయం కోరింది. గుండెల్ని పిండేసే విషయాలుమరోవైపు మిహిర్ అకాలమరణంపై ఐడి ఫ్రెష్ ఫుడ్స్ సీఈఓ పీసీ ముస్తఫా iD Fresh Foods CEO, PC Musthafa) స్పందించారు. మిహిర్ తన మేనల్లుడు అని సోషల్‌మీడియాలో వెల్లడించారు. నల్లగా ఉన్నాడనే కారణంగానే అతణ్ణి వేధించి చంపేశారని ఆరోపించారు. ఈ విషయంలో నిజాలు నిగ్గుతేల్చి, తన మేనల్లుడు మిహిర్‌కు న్యాయం చేయాలని డిమాండ్ చేశాడు. దీనికి సంబంధించి ఒక భావోద్వేగ పోస్ట్‌ను ఎక్స్ (గతంలో ట్విటర్) ఇన్‌స్టాలో పంచుకున్నారు.అలాగే మిహిర్‌తో, తన కుమారుడి కలసి చిన్ననాటి స్నాప్‌ను పోస్ట్ చేసి బాధను వ్యక్తం చేశారు. చిన్నపుడు బెంగళూరులో కలిసిపెరిగారని వాళ్లిద్దరూ ప్రాణ స్నేహితులని తెలిపాడు. కేవలం పదిహేనేళ్లకే నూరేళ్లు నిండి పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘మిహిర్ పాఠశాలలో, బస్సులో విద్యార్థుల గ్యాంగ్ దారుణంగా ర్యాగింగ్‌కు పాల్పడింది. శారీరకంగా దాడికి గురిచేసింది. చనిపోయేముందు రోజుకూడా మిహిర్‌ను కొట్టారు. దుర్భాషలాడారు. అవమానించారు. అతన్ని బలవంతంగా వాష్‌రూమ్‌కు తీసుకెళ్లి, టాయిలెట్ సీటును నాకమని బలవంతం చేశారు. టాయిలెట్ ఫ్లష్ చేస్తున్నప్పుడు అతని తలని టాయిలెట్లోకి నెట్టారు. దీని తర్వాత, వారు అతన్ని 'పూపీహెడ్' అని పిలిచి ఎగతాళి చేశారు’’ అంటూ వేధింపుల తాలూకు వివరాలను పీసీ ముస్తఫా వెల్లడించారు. View this post on Instagram A post shared by Musthafa PC (@musthafapcofficial) మిహిర్ మరణించిన తర్వాత కూడా'నిగ్గా' అని సంబోధించారని, ఆ సేజ్స్చూసి చలించిపోయాయనని, చాట్ స్క్రీన్షాట్లను చదివిన తర్వాత ఏడుపు ఆపుకోలేకపోయానని ముస్తఫా పంచుకున్నారు. చిన్నపిల్లాడి పట్ల ఇంత దారుణా అంటూ వాపోయారు. అందుకే ఈ దుర్మార్గుల బెదిరింపులు, ర్యాగింగ్లు లేని ప్రపంచానికి వెళ్లిపోయాడు. వాడి మరణం వృధా కాకూడదు. న్యాయం జరగాలి అని డిమాండ్ చేశారు. న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉంది ,న్యాయం గెలుస్తుందదనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అలాగే ఈ పోరాటానికి మద్దతు ఇవ్వాలని నెటిజన్లును కోరారు. తనకోసం కాదు, ఎదిగే ప్రతిబిడ్డకోసం, సురక్షితమైన వాతావరణంలో చదువుకునేందుకు తాను చేస్తున్న పోరాటంలో తనకు మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇవీ చదవండి: ఇన్నాళ్లకు శుభవార్త, ప్రముఖ ఫ్యాషన్ స్టైలిస్ట్ ఫోటోలు వైరల్‘నేనూ.. మావారు’ : క్లాసిక్ కాంజీవరం చీరలో పీవీ సింధు -
Gujarat: ర్యాగింగ్‌కు ఎంబీబీఎస్ విద్యార్థి బలి
గాంధీనగర్: విద్యాసంస్థలోని సీనియర్ల ర్యాగింగ్‌కు ఓ విద్యాకుసుమం నేల రాలింది. ఈ ఘటన గుజరాత్‌లోని ఓ మెడికల్ కళాశాలలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే అనిల్ మథానియా అనే విద్యార్థి ఈ ఏడాది ధర్పూర్ పటాన్‌లోని జీఎంఈఆర్ఎస్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో అడ్మిషన్ తీసుకున్నాడు.హాస్టల్లోని తృతీయ సంవత్సరం విద్యార్థులు అనిల్‌ను పరిచయం పేరిట మూడు గంటల పాటు కదలకుండా నిలబెట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతసేపు నిలుచుకున్న అనిల్ అపస్మారక స్థితికి చేరుకోవడంతో తోటి విద్యార్థులు అతనిని ఆస్పత్రికి తరలించారు. బాధిత విద్యార్థి తనను సీనియర్లు మూడు గంటల పాటు నిలబెట్టారని కాలేజీ యాజమాన్యానికి తెలిపాడు. చికిత్స పొందుతూ అనిల్ మృతి చెందాడు. పోలీసులు అనిల్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక అనిల్ మృతికి గల కారణాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు. అనిల్ బంధువు ధర్మేంద్ర మీడియాతో మాట్లాడుతూ ‘అనిల్ కుటుంబం గుజరాత్‌లోని సురేంద్రనగర్ జిల్లాలో ఉంటుంది. ఇది పటాన్‌లోని కళాశాలకు 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. నిన్న మాకు కాలేజీ నుండి ఫోన్ వచ్చింది. అనిల్ అపస్మారక స్థితిలో ఉన్నాడని, అతనిని ఆస్పత్రిలో చేర్చామని తెలిపారు. తాము ఇక్కడికి చేరుకోగా, అనిల్‌ను మూడవ సంవత్సరం విద్యార్థులు ర్యాగింగ్ చేసారని తెలిసింది. దీనిపై వెంటనే పోలీసులు దర్యాప్తు చేసి, తమకు న్యాయం చేయాలని’ కోరారు.మెడికల్ కాలేజీ డీన్ హార్దిక్ షా మాట్లాడుతూ ‘అనిల్ అపస్మారక స్థితికి చేరుకున్నాడని గుర్తించిన వెంటనే, అతన్ని ఆస్పత్రికి తరలించాం. ఆ సమయంలో అనిల్ తనను సీనియర్లు ర్యాగింగ్ చేశారని, మూడు గంటల పాటు నిలబెట్టాడని తెలిపాడు. ఈ విషయాన్ని మేము పోలీసులు, అనిల్ కుటుంబ సభ్యులకు తెలియజేశాం. ర్యాగింగ్‌కు పాల్పడిన సీనియర్ విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని పేర్కొన్నారు.విద్యార్థి తండ్రి ఫిర్యాదు మేరకు ఇది ప్రమాదవశాత్తు జరిగిన మృతిగా ముందుగా కేసు నమోదు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి కెకె పాండ్యా తెలిపారు. పోస్టుమార్టం నివేదిక అందాక, దానిలోని వివరాల ఆధారంగా తదిపరి చర్యలు తీసుకుంటామన్నారు. కాలేజీలో ర్యాగింగ్‌పై కూడా దర్యాప్తు చేస్తున్నామన్నారు. కాగా ఉన్నత విద్యా నియంత్రణ సంస్థ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గతంలోనే క్యాంపస్‌లలో ర్యాగింగ్‌ను నిషేధించింది. ర్యాగింగ్‌కు పాల్పడే వారిపై కళాశాల యాజమాన్యాలు కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.ఇది కూడా చదవండి: స్విమ్మింగ్ పూల్‌లో గంతులేస్తూ.. -
అశ్లీల కథలు బిగ్గరగా చదవాలంటూ.. మెడికల్ కాలేజీల్లో హద్దులు దాటిన ర్యాగింగ్
న్యూఢిల్లీ: కొద్ది రోజుల క్రితం కోల్‌కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో మహిళా డాక్టర్‌పై జరిగిన హత్యాచారం యావత్ దేశాన్ని కుదిపేసింది. ఈ ఘటనపై దేశంలోని వైద్యులంతా నిరసనలు చేపట్టారు. ఆస్పత్రుల్లో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేయాలని వారు డిమాండ్ చేశారు.ఇటువంటి ఘటనలు కొనసాగున్న తరుణంలో.. మెడికల్ కాలేజీల్లో కొత్తగా అడ్మిషన్ తీసుకుని, కాలేజీల్లో చేరిన జూనియర్ విద్యార్థులను సీనియర్లు పరిధులు దాటి ర్యాంగింగ్ చేస్తున్న వైనాలు వెలుగు చూస్తున్నాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా అందించిన వివరాల ప్రకారం మెడికల్ కాలేజీల్లో కొత్తగా చేరిన విద్యార్థులను సీనియర్లు ర్యాగింగ్ పేరిట వేధిస్తున్నారు. వారి చేత అశ్లీల పుస్తకాలలోని కథలను బిగ్గరగా చదివిస్తూ, వాటిని గుర్తుపెట్టుకోవాలని బలవంతం చేస్తున్నారు.స్త్రీలపై లైంగిక హింసకు పాల్పడే కథలను జూనియర్ల చేత సీనియర్లు చదివిస్తున్నారు. నిజానికి సీనియర్ వైద్యు విద్యార్థులు కొత్తగా చేరిన విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన పుస్తకాలను అందజేయాల్సి ఉంటుంది. అయితే దీనికి భిన్నంగా సీనియర్ విద్యార్థులు ప్రవర్తిన్నున్న తీరు కనిపిస్తోంది. అలాగే బోర్డుపై అశ్లీల పదాలను రాసి, వాటిని బిగ్గరగా చదవమంటున్నారని జూనియర్లు ఆరోపిస్తున్నారు.ఇటువంటి సందర్భాల్లో జూనియర్లు వెనుకాడితే సీనియర్లు నవ్వుతూ వారిని ఎగతాళి చేస్తుంటారని తెలుస్తోంది. బ్లాంక్ నాయిస్ వ్యవస్థాపకురాలు జాస్మిన్ పతేజా మీడియాతో మాట్లాడుతూ సీనియర్ విద్యార్థులు జూనియర్లతో ర్యాగింగ్ చేసే అంశాలు అత్యాచారాలను ప్రోత్సహించేవిగా ఉన్నాయని పేర్కొన్నారు. ఆపరేషన్ టేబుల్‌పై అపస్మారక స్థితిలో పడి ఉన్న రోగులను చూసి కొందరు అనస్థీషియాలజిస్టులు, సర్జన్లు నీచంగా మాట్లాడటాన్ని చూశానని ఓ సీనియర్ మహిళా డాక్టర్ మీడియా ముందు వాపోయారు.ఇది కూడా చదవండి: ఖమ్మం: అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్వాకం.. విద్యార్థికి గుండు కొట్టించి... -
మళ్లీ ర్యాగింగ్ కలకలం
సాక్షి, హైదరాబాద్: మెడికల్ కాలేజీల్లో ర్యాగింగ్ భూతం మళ్లీ పంజా విసురుతోంది. సుప్రీంకోర్టు తీర్పు (2009), 1956 యూజీసీ చట్టం సెక్షన్ 36, సబ్‌సెక్షన్ (1) ప్రకారం విద్యాసంస్థల్లో ర్యాగింగ్ నిషేధం. అయినా ఆకతాయిలైన సీనియర్ విద్యార్థులు అక్కడక్కడా శ్రుతి మించి ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా మెడికల్ కాలేజీల్లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. గత ఏడాది రాష్ట్రంలోని గాందీ, కాకతీయ, మహబూబాబాద్ వైద్య కళాశాలల్లో ర్యాగింగ్ చోటు చేసుకుంది. తాజాగా పాలమూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ వ్యవహారం వెలుగులోకి రావడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. మరోవైపు గాంధీ మెడికల్ కాలేజీలోనూ ర్యాగింగ్ జరుగుతోందని, అయితే బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది.అలాగే మరికొన్ని ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోనూ ర్యాగింగ్ ఇబ్బందికరంగా మారిందని అంటున్నారు. కొత్తగా ఎంబీబీఎస్‌లో చేరిన విద్యార్థులను సీనియర్లు ర్యాగింగ్ పేరిట వేధింపులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. అధికారులు కఠినచర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా, ర్యాగింగ్ ఘటనలు ఆగడం లేదనే చర్చ జరుగుతోంది. ర్యాగింగ్ పేరిట వికృత చేష్టలు రాష్ట్రవ్యాప్తంగా గత నెల నుంచి ఎంబీబీఎస్ మొదటి ఏడాది తరగతులు ప్రారంభమయ్యాయి. కొత్త విద్యార్థులను రెండు, మూడో ఏడాది చదివే కొందరు ఎంబీబీఎస్ విద్యార్థులు ర్యాగింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ర్యాగింగ్‌కు పాల్పడితే కాలేజీ నుంచి తొలగించాలన్న నిబంధనలు ఉన్నాయని, కానీ విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని సస్పెన్షన్లకే పరిమితం అవుతున్నామని వైద్య విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. గత ఏడాది గాంధీ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ సందర్భంగా కొందరు సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులను అర్ధరాత్రి 2 గంటల సమయంలో తమ హాస్టల్ గదులకు రప్పించి వారితో బలవంతంగా మద్యం, సిగరెట్లు తాగించినట్లు తేలింది. కొందరితో బట్టలు విప్పించి డ్యాన్స్‌లు చేయించారనే ప్రచారం కూడా జరిగింది. వారు బూతులు తిడుతూ, బాధితులతో కూడా బూతులు మాట్లాడించారని తేలింది. కొందరు విద్యార్థినిలను కూడా ర్యాగింగ్ చేసినట్లు ప్రచారం జరిగింది. ‘పాలమూరు’లో విద్యార్థులతో గోడకుర్చీ వేయించడం లాంటి దారుణ చర్యలకు పాల్పడినట్లు తెలిసింది. ఇలా రాష్ట్రంలోని పలు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కూడా ర్యాగింగ్ సంఘటనలు జరుగుతున్నా అవి బయటకు పొక్కకుండా యాజమాన్యాలు జాగ్రత్త వహిస్తున్నాయని అంటున్నారు. అయితే కళాశాలలపై నిఘా వేసి ర్యాగింగ్‌ను అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం ఈ విషయంలో నిర్లిప్తంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. కొన్ని కాలేజీలు డీఎంఈ కార్యాలయానికి సమాచారం ఇవ్వడంలేదని తెలిసింది. కళాశాలల్లో యాంటీ ర్యాగింగ్ కమిటీలు ఉన్నా అవి నామమాత్రంగా మారాయని అంటున్నారు. ర్యాగింగ్ ఘటనలపై వైద్యవిద్య డైరెక్టర్ (డీఎంఈ) డాక్టర్ వాణి వివరణ కోసం ఫోన్ ద్వారా ప్రయత్నించగా ఆమె స్పందించలేదు. క్రిమినల్ చర్య అన్న యూజీసీర్యాగింగ్ను నేరపూరిత (క్రిమినల్) చర్యగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ పేర్కొంది. దీనిపై ఫిర్యాదులకు ప్రత్యేకంగా మానిటరింగ్ సెల్ నంబర్‌ను కూడా ఏర్పాటు చేసింది. ర్యాగింగ్‌ను నిరోధించాలంటూ ఉన్నత విద్యా సంస్థల ప్రిన్సిపాళ్లకు, వర్సిటీల వీసీలకు స్పష్టమైన ఆదేశాలున్నాయి. యూజీసీ నిబంధనలు.. » విద్యాసంస్థల్లో యాంటీ ర్యాగింగ్ కమిటీని, యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్‌ను, యాంటీ ర్యాగింగ్ సెల్‌ను ఏర్పాటు చేయాలి. » ర్యాగింగ్ శ్రుతిమించి విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడిన పక్షంలో సంబంధిత కాలేజీ ప్రిన్సిపాల్, వర్సిటీ రిజిస్ట్రార్లను విచారణకు పిలుస్తారు. వీరు నేషనల్ యాంటీ ర్యాగింగ్ మానిటరింగ్ కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. » విద్యాసంస్థలు, విద్యార్థుల హాస్టళ్లు, కీలక ప్రాంతాల్లో సీసీ టీవీలు ఏర్పాటు చేయాలి. » విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు వర్క్‌షాప్‌లు, సెమినార్లు నిర్వహించాలి. » యాంటీ ర్యాగింగ్ మానిటరింగ్ కమిటీ ఆదేశాల ప్రకారం జూనియర్లు, సీనియర్ల మధ్య అంతరాన్ని పూడ్చేందుకు మెంటార్íÙప్ను ప్రోత్సహించాలి. » లీగల్ కౌన్సెలింగ్ ద్వారా ర్యాగింగ్ నిరోధక చట్టాలు, శిక్షలపై అవగాహన కల్పించాలి. -
పాలమూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: పాలమూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచి్చంది. ఇటీవల కొత్తగా కళాశాలలో చేరిన వైద్య విద్యార్థులను సీనియర్లు ర్యాగింగ్ పేరిట ఇబ్బందులకు గురిచేశారని, గోడ కురీ్చలు వేయించడం వంటి చర్యలతో వేధించారని కళాశాల డైరెక్టర్‌కు రాత పూర్వక ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు పదిమంది సీనియర్ వైద్య విద్యార్థులపై సస్పెన్షన్ విధించారు.తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారిగా ఏర్పడిన ఈ వైద్య కళాశాలకు 2016 జనవరిలో భారత వైద్యమండలి (ఎంసీఐ) నుంచి అనుమతులు లభించాయి. అదే సంవత్సరం జూన్‌లో తరగతులు ప్రారంభం కాగా.. ఇప్పటివరకు ర్యాగింగ్ ఘటనలు చోటుచేసుకోలేదు. తాజాగా ర్యాగింగ్ కారణంగా 10 మంది విద్యార్థుల సస్పెన్షన్ చర్చనీయాంశంగా మారింది. సదరు విద్యార్థులపై డిసెంబర్ ఒకటి వరకు సస్పెన్షన్ అమల్లో ఉంటుందని.. ర్యాగింగ్‌ను ఉపేక్షించేది లేదని కళాశాల డైరెక్టర్ రమేశ్ తెలిపారు. -
Kakinada: రంగరాయ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం
-
కలికిరి జేఎన్టీయూలో ర్యాగింగ్.. విద్యార్థి ఆత్మహత్య
సాక్షి అన్నమయ్య జిల్లా: కలికిరి జేఎన్టీయూలో ర్యాగింగ్ కలకలం రేగింది. కడప జిల్లా, మైదుకూరు మండలం జీవి సత్రానికి చెందిన ప్రవీణ్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తిరుపతి స్విమ్స్‌లో చికిత్స పొందుతూ మృతిచెందాడు.ఈ నెల 12న కలికిరి జెన్టీయూలో బీటెక్ చదివేందుకు కాలేజీలో జాయిన్ అయ్యాడు. ప్రవీణ్‌ను సీనియర్లు ర్యాగింగ్ చేయడంతో ఈ నెల 26న రాత్రి ఇంటికెళ్లి విషం తాగాడు. ఈ సంఘటనపై తల్లిదండ్రులు మైదుకూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కలికిరి సిఐ.. ప్రిన్సిపల్, తోటి విద్యార్థులను విచారించారు. ర్యాగింగ్ నిజమని తేలితే బాధితులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు. ర్యాగింగ్ చేసిన వారిని కఠినంగా శిక్షించాలని బాధిత బంధువులు కోరుతున్నారు. -
కాలేజీల్లో డ్రగ్స్ కట్టడికి క్లబ్‌లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో ర్యాగింగ్ రక్కసిని అరికట్టడం, డ్రగ్స్ ముప్పును నివారించేందుకు తెలంగాణ ఉన్నత విద్యామండలి సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టనుంది. ఈ రెండు సమస్యలను పరిష్కరించేందుకు 24/7 పనిచేసే టోల్‌ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తేనుంది. వారం పది రోజుల్లో ఈ టోల్‌ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తెస్తామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం శనివారం ప్రకటించారు.ఎక్కడ ఇలాంటి తప్పులు జరిగినా విద్యార్థులు నిర్భయంగా ఈ నంబర్‌కు ఫిర్యాదు చేయొచ్చన్నారు. తెలంగాణ ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో శనివారం మాసాబ్‌ట్యాంక్‌లోని జేఎన్ఏఎఫ్ఏయూ ఆడిటోరియంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ వినియోగం వారి వారి జీవితాలతోపాటు దేశాన్ని సైతం నాశనం చేస్తుందన్నారు. పాఠశాల స్థాయిలో డ్రగ్స్‌ను అరికట్టేందుకు ప్రహరీ క్లబ్‌లను ఏర్పాటుచేశామని, కాలేజీల్లో సైతం ఇలాంటి క్లబ్‌లను ఏర్పాటు చేస్తామని చెప్పారు.పటిష్టమైన వ్యవస్థ: డీజీపీ జితేందర్తెలంగాణను డ్రగ్‌ఫ్రీ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేశామని డీజీపీ డాక్టర్ జితేందర్ అన్నారు. రాష్ట్రంలో ర్యాగింగ్‌ను ఇప్పటికే నిషేధించామని, ర్యాగింగ్‌కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి మాట్లాడుతూ.. విద్యార్థుల్లో నైపుణ్యాలు తగ్గుతున్నాయని అన్నారు. దీనికి పరిష్కారంగానే ప్రభుత్వం స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటుచేసి, స్కిల్స్ కోర్సులను ప్రవేశపెట్టిందని గుర్తుచేశారు.నగరాల్లోని వర్సిటీలు, కాలేజీలే కాకుండా మారుమూల ప్రాంతాల్లోని చిన్న కాలేజీల వరకు డ్రగ్స్ చేరాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. డ్రగ్స్‌తో కుటుంబాలు సైతం ఆర్థికంగా చితికిపోతున్నాయని పేర్కొన్నారు. కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన మాట్లాడుతూ.. యాంటీనార్కోటిక్స్ బ్యూరో తెలంగాణలో తప్ప దేశంలో మరెక్కడా లేదన్నారు. మన యువతను నాశనం చేయాలని కొంతమంది దుష్టులు కంకణం కట్టుకున్నారని, డ్రగ్స్ అనే యాసిడ్‌ను పిల్లలపై ప్రయోగిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.యాంటీనార్కోటిక్స్ బ్యూరో డైర్టెర్ సందీప్ శాండిల్య మాట్లాడుతూ డ్రగ్స్ సంబంధిత సమాచారాన్ని 87126 71111 నంబర్‌కు ఫిర్యాదు చేయొచ్చన్నారు. ర్యాగింగ్‌కు సంబంధించి ఇటీవల ఉస్మానియా ఆసుపత్రిలో ఆరుగురు వైద్యులపై కేసులు నమోదు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి, ఉన్నత విద్యామండలి వైస్చైర్మన్లు ప్రొఫెసర్ వెంకటరమణ, ప్రొఫెసర్ ఎస్కే మహమూద్, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ర్యాగింగ్, డ్రగ్స్‌పై సమరభేరి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఉన్నత విద్యాసంస్థల్లో ర్యాగింగ్, మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా ఉన్నత విద్యామండలి ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి ఇప్పటికే ఈ అంశంపై అన్ని స్థాయిల అధికారులతో సమీక్షలు నిర్వహించారు. ఈ నెల 17న హైదరాబాద్‌లో ఉన్నతస్థాయి సదస్సు నిర్వహించాలని నిర్ణయించారు. యువత మాదక ద్రవ్యాలకు బానిసవుతున్న ఉదంతాలు కొంతకాలంగా పెరుగు తున్నాయి. రాష్ట్రంలో పలు యూనివర్సిటీలు, ఇంజనీరింగ్ కాలేజీల్లో ఇవి వెలుగు చూశాయి. వీటి వెనుక మాదకద్రవ్యాల మాఫియా ఉందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. తొలి దశలో విద్యార్థుల్లో అవగాహన పెంచాలని ప్రభుత్వ నివేదికలు పే ర్కొంటున్నాయి. ప్రైవేటు విద్యాసంస్థల్లో ఇలాంటి ఘటనలు బయటపడకుండా యాజమాన్యాలు జాగ్రత్త పడుతున్నాయి. ధనిక విద్యార్థులు చదివే కాలేజీల్లో మాదక ద్రవ్యాల నియంత్రణకు చేపడు తున్న చర్యలు ఆశించినంతగా లేవని నిఘా వర్గాలు ప్రభుత్వానికి చెప్పాయి. మాదక ద్రవ్యాలతో సంబంధం ఉన్న వారిని గుర్తించి, కౌన్సెలింగ్ ఇవ్వడాని కి గల ఏర్పాట్లపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. కౌన్సెలింగ్ తర్వాత కూడా ఈ దిశగా అడుగులేసే విద్యార్థులపై చట్టప రమైన చర్యలకు ఉపక్రమించాలని అధికారులు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన చట్టాలను విద్యా సంవత్సరం ప్రారంభంలోనే విద్యార్థులకు తెలియజేసేందుకు కాలేజీలు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఉన్నత విద్యామండలి ఆదేశించింది. ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలువిద్యాసంస్థల్లో ర్యాగింగ్ తీవ్రంగా ఉందని అధికారులు భావిస్తున్నారు. గ్రామీణ విద్యార్థులు ఎక్కువగా ర్యాగింగ్‌కు గురవుతున్నట్లు గుర్తించారు. కొన్ని విద్యాసంస్థల్లో కుల వివక్షతో కూడిన ర్యాగింగ్ జరుగుతోందని చెబుతున్నారు. ఇలాంటి ఉదంతాలపై కొరడా ఝుళిపించాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఇటీవల రాష్ట్రాలకు ఆదేశాలు పంపింది. ఇందుకు సంబంధించిన విధివిధానాలను కూడా వెల్లడించింది. ప్రతి కాలేజీలోనూ ర్యాగింగ్, మాదక ద్రవ్యాల కట్టడికి ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలని చెప్పింది. ఇందులో ఫ్యాకల్టీతోపాటు, సీనియర్ విద్యార్థులు, ఉన్నత అధికారులను భాగస్వాము లను చేయాలని పేర్కొంది. అయితే, ఏఐసీటీఈ మార్గదర్శకాలు ఎక్కడా అమలవ్వడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ విద్యా సంవత్సరం నుంచి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.17న ఉన్నతస్థాయి సదస్సువిద్యాసంస్థల్లో మాదక ద్రవ్యాల నిరోధం, ర్యాగింగ్ అంశాలపై ఈ నెల 17న జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ఆర్ట్స్ యూనివర్సిటీలో ప్రత్యేక సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి డీజీపీ జితేందర్, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, కాలేజియేట్ కమిషనర్ దేవసేన, యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య హాజరవుతున్నారు. యాంటీ ర్యాగింగ్, మాదక ద్రవ్యాల నియంత్రణపై ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.ఉపేక్షించేది లేదుమాదక ద్రవ్యాల వినియోగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోం. ఈ విషయంలో ఎంతటివారున్నా కఠినంగా చర్యలు తప్పవు. ఈ దిశగా ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలున్నాయి. మాదక ద్రవ్యాల వినియోగంపై సమాచారం ఉంటే విద్యార్థులు స్వేచ్ఛగా మా దృష్టికి తేవాలి. – ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, ఉన్నత విద్యామండలి చైర్మన్ర్యాగింగ్ భూతాన్ని పారదోలాలి కాలేజీల్లో ర్యాగింగ్ వ్యతిరేక కమిటీలు ఏర్పాటు చేయాలని ఇప్పటికే సూచించాం. ఇక నుంచి దీన్ని మరింత విస్తృతం చేస్తాం. కొత్తగా కాలేజీలకు వచ్చే వారిలో మనోనిబ్బరం కల్పించడం, ర్యాగింగ్‌ను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇవ్వడానికి కృషి చేస్తాం. – ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్, ఉన్నత విద్యామండలి కార్యదర్శి -
నిమ్మల రామానాయుడుపై అంబటి మాస్ ర్యాగింగ్
-
ర్యాగింగ్‌ను నిరోధించండి
సాక్షి, అమరావతి: ఉన్నత విద్యా సంస్థల్లో ర్యాగింగ్‌ను ఎలా నిరోధించాలనే దానిపై అన్ని రాష్ట్రాలకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) మార్గదర్శకాలు జారీ చేసింది. ర్యాగింగ్‌పై చర్యలు తీసుకోకపోయినా యూజీసీ ఇచ్చిన మార్గదర్శకాలను పాటించడంలో విఫలమైనా ఆయా విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఆయా రాష్ట్రాల సీఎస్‌లకు పంపిన లేఖల్లో జిల్లా స్థాయి ర్యాగింగ్ నిరోధక కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఆ కమిటీకి కలెక్టర్/డిప్యూటీ కమిషనర్/జిల్లా మేజి్రస్టేట్ అధిపతిగా ఉండాలని, సభ్యులుగా వర్సిటీ/కళాశాల అధిపతులు, ఎస్పీ/ఎస్ఎస్పీను నియమించాలని పేర్కొంది. మెంబర్ సెక్రటరీగా అదనపు జిల్లా మేజి్రస్టేట్ ఉంటారని, కమిటీలో మీడియా ప్రతినిధులు, జిల్లాస్థాయి ఎన్జీవోలు, విద్యార్థి సంఘాలు, పోలీసులు, స్థానిక పరిపాలనతో పాటు సంస్థాగత అధికారులు ఉండాలని సూచించింది. కళాశాలల్లో యాంటీ ర్యాగింగ్ కమిటీ, యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్, యాంటీ ర్యాగింగ్ సెల్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించింది.కీలక ప్రదేశాల్లో సీసీటీవీలను అమర్చాలని చెప్పింది. విద్యార్థుల్లో సామాజిక స్పృహను పెంపొందిస్తూ యాంటీ ర్యాగింగ్ వర్క్‌షాప్‌లు, సెమినార్లు నిర్వహించాలని కోరింది. వర్సిటీలు/విద్యా సంస్థల్లోని ముఖ్య ప్రదేశాల్లో యాంటీ ర్యాగింగ్ పోస్టర్లను ప్రదర్శించాలని వీటిని యూజీసీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు వెల్లడించింది. ర్యాగింగ్ బాధితులు హెల్ప్‌లైన్ 1800–180–5522 కు కాల్ చేయవచ్చని లేదా helpline @antiragging.in కు మెయిల్ పెట్టి సహయాన్ని కోరవచ్చని పేర్కొంది. -
ఇంత దారుణమా?!
ఉన్నత విద్యాసంస్థల్లో చేరే విద్యార్థినులు గతంతో పోలిస్తే 44 శాతం పెరిగారని మొన్న జనవరిలో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఘనంగా ప్రకటించింది. ఇందులో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల పిల్లలు ఎక్కువుండటం శుభసూచకమని చెప్పింది. కానీ ఆడపిల్లల భద్రత విషయంలో ఉన్నత విద్యాసంస్థలు శ్రద్ధ పెడుతున్నాయా? వాటిని పర్యవేక్షించాల్సిన వ్యవస్థలు ఆ సంస్థలను అప్రమత్తం చేస్తు న్నాయా? గుజరాత్‌లోని గాంధీన గర్‌లో కొలువుదీరిన గుజరాత్ జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం (జీఎన్‌ఎల్‌యూ) వాలకం చూస్తే ఏదీ సక్రమంగా లేదన్న సందేహం కలుగుతుంది. నిరుడు సెప్టెంబర్‌లో మీడియాలో వచ్చిన కథనాలను గుజరాత్ హైకోర్టు పరిగణనలోకి తీసుకుని నియమించిన కమిటీ ఇచ్చిన నివేదిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, జస్టిస్ అనిరుద్ధ పి. మయీల నేతృత్వంలోని ధర్మాసనాన్ని దిగ్భ్రాంతి పరిచింది. ఆ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో సాగుతున్నలైంగిక నేరాలను కప్పిపుచ్చటానికి బాధ్యతాయుత స్థానాల్లో వున్న వారు ప్రయత్నించటం భీతి గొలుపుతున్నదని న్యాయమూర్తులు అన్నారంటే అక్కడి పరిస్థితులు ఎంతగా దిగజారాయో అర్థమ వుతుంది. ఈ తరహా అకృత్యాలు, వికృతాలు రాజకీయ నాయకుల అండదండలు లేకుండా సాగవు. ఒక ‘పలుకుబడిగల రాజకీయ నాయకుడు’ ఇలాంటి నేరగాళ్లకు వత్తాసుగా ఉన్నాడని ఒక విద్యార్థిని చెప్పటం గమనార్హం. డైరెక్టర్, రిజిస్ట్రార్, మరికొందరు అధ్యాపకులపై సైతం ఆరోపణలు రావటం గమనిస్తే విశ్వవిద్యాలయం తోడేళ్ల పాలయిందా అన్న సందేహం తలెత్తుతుంది. ప్రపంచీకరణకు తలుపులు బార్లా తెరిచాక దేశంలో ఉన్నత విద్యాసంస్థలు కళ్లు తేలేయటం మొదలైంది. సామాజిక శాస్త్రాల అధ్యయనం మహాపాపమని పాలకులే ప్రచారం చేయటం, విద్యార్జన అంతిమ ధ్యేయం కొలువులు సాధించటం మాత్రమేనన్న అభిప్రాయం కలిగించటం ఉన్నత విద్యాసంస్థలను క్రమేపీ దిగజార్చాయి. తాము ఈ సమాజం నుంచి వచ్చామని, తమ మేధస్సును దీని ఉన్నతికి వినియోగించాలన్న స్పృహ విద్యార్థుల్లో కరువైంది. చాలా ఉన్నత విద్యా సంస్థలు ఇప్పుడు కుల, మత, ప్రాంతీయ జాడ్యాల్లో కూరుకుపోయాయి. ఆడపిల్లల హాస్టళ్లలో సైతం ర్యాగింగ్లు సాగుతుండటం, కొందరు సస్పెండవుతున్నట్టు వార్తలు రావటం యాదృచ్ఛికం కాదు. వర్తమానంలో సినిమా హీరోలూ, క్రికెటర్లూ, ప్రపంచ సంగీత దిగ్గజాలూ ఆరాధ్య దైవాలవు తున్నారు. మాదకద్రవ్యాల సంగతి సరేసరి. ఇన్ని కశ్మలాల మధ్య కూనారిల్లుతున్న విద్యాసంస్థలు రాణిస్తాయని, విద్యార్థులకు వివేకాన్నీ, విజ్ఞానాన్నీ అందిస్తాయని నమ్మటం అమాయత్వమే అవుతుంది. జీఎన్ఎల్యూలోని దారుణాలపై కనీసం అయిదేళ్లుగా ఆరోపణలు వినబడుతున్నాయి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో మారుపేర్లతో కొందరు విద్యార్థినులు తమకెదురైన చేదు అనుభవాలను ఏకరువు పెట్టిన ఉదంతాలున్నాయి. అటువంటి ఉదంతం ఆధారంగా మీడియాలో వచ్చిన కథనమే గుజరాత్ హైకోర్టును రంగంలోకి దించింది. కానీ విశ్వ విద్యాలయం ఏం చేసింది? చర్యల మాట అటుంచి... సాక్షాత్తూ హైకోర్టు ధర్మాసనమే అడిగిందన్న ఇంగితజ్ఞానం కూడా లేకుండా రిజిస్ట్రార్ బుకాయింపులకు దిగాడు. ఈ మహానుభావుడే అంతక్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు పెట్టిన ఇద్దరు విద్యార్థినులను మందలించాడు. ఆఖరికి బాలికల హాస్టల్ వార్డెన్‌గా ఉన్న మహిళా ప్రొఫెసర్ సైతం వారిని భయపెట్టి ఆ పోస్టులను తొలగింపజేశారు. సంస్థ కీర్తిప్రతిష్ఠలు దెబ్బతింటాయన్న సాకుతోనే ఇదంతా సాగించారు. పేరుకు అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ఐసీసీ) వుంది. ఒక మహిళా ప్రొఫెసర్ నేతృత్వంలోనే సాగుతోంది. కానీ ఆ కమిటీకి ఫిర్యాదు చేయటం దండగ అనుకున్నారో, దానిగురించి తెలియనే తెలియదో ఏ బాలికా వారికి ఫిర్యాదు చేయలేదు. కనీసం ఆ కమిటీ తనంత తానే విచారణ జరపాలి కదా... ఆ పని కూడా జరగ లేదు. తొలుత దారుణాలు తన దృష్టికొచ్చాక హైకోర్టు నియమించిన కమిటీలో ఐసీసీ చైర్‌పర్సన్‌కు కూడా చోటిచ్చారు. కానీ ఆమె గారి నిర్వాకం తెలిశాక ఆ కమిటీని రద్దుచేసి విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో మరో కమిటీని ఏర్పాటు చేశారు. కనుకనే ఈ అకృత్యాలు వెలుగు లోకొచ్చాయి. విద్యార్థుల్లో జిజ్ఞాస రేకెత్తించటం, తార్కిక శక్తిని పెంచటం, స్ఫూర్తి రగల్చటం, వారిని సామా జిక మార్పులకు చోదకశక్తులుగా మార్చటం ఉన్నత విద్య లక్ష్యం. జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం వంటిచోట తమ పిల్లలను చదివించటానికి తల్లిదండ్రులు ఎందుకు ఆసక్తి చూపుతారు? అక్కడైతే అత్యున్నత ప్రమాణాలున్న న్యాయవిద్య అందుతుందని, ఆ విశ్వవిద్యాలయంలో నిర్వహించే సెమి నార్లు, ఇతర సదస్సులు తమ పిల్లలను ఉన్నతశ్రేణికి చేరుస్తాయని వారు ఆశిస్తారు. కానీ జరిగిందేమిటి? రేపన్నరోజున న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించి సమాజంలోని దురంతాలను అంతం చేయాల్సినవారే బాధితులుగా మారారు. ఎవరికి చెప్పుకోవాలో, ఎట్లా ఎదుర్కొనాలో తెలియని నిస్సహాయ స్థితిలో పడ్డారు. 2012లో ఢిల్లీలో జరిగిన నిర్భయ ఉదంతం తర్వాత జస్టిస్ జేఎస్ వర్మ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా నిర్భయ చట్టం వచ్చింది. విద్యాసంస్థల్లోనూ, పనిస్థలాల్లోనూ బాలికలకు, మహిళకు భద్రత కల్పించటం వ్యక్తుల, సంస్థల బాధ్యతగా ఆ చట్టం గుర్తించింది. విఫల మైన పక్షంలో కఠినంగా దండించే నిబంధనలున్నాయి. కానీ జరిగిందేమిటి? ఈ దురంతాలపై లోతుగా విచారణ జరగాలి. నేరగాళ్లకూ, వారికి తోడ్పడిన పెద్దలకూ కఠినశిక్షలు పడేలా చర్యలుండాలి. దేశంలోని ఉన్నత విద్యాసంస్థలన్నిటికీ ఆ చర్యలు ఒక హెచ్చరిక కావాలి. -
కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం.. 78 మంది సస్పెండ్
సాక్షి, వరంగల్: వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం రేగింది. ర్యాగింగ్‌కు పాల్పడుతున్నారన్న కారణంతో 81 మంది విద్యార్థినులపై సస్పెన్షన్ వేటు పడింది. జూనియర్లను కొంతకాలంగా ర్యాగింగ్ చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారన్న ఆరోపణలపై వారం రోజులపాటు సస్పెండ్ చేశారు అధికారులు. ఈ విషయంపై యూనివర్సిటీ వైఎస్ ఛాన్సలర్ రమేష్ మాట్లాడుతూ.. యూనివర్సిటీలో ర్యాగింగ్ జరగలేదని తెలిపారు. పరిచయ వేదిక పేరుతో జూనియర్లను సీనియర్లు పిలిచి మాట్లాడారని హాస్టల్లోనూ మరోసారి ఇంట్రడక్షన్ తీసుకున్నారని చెప్పారు. ఈ క్రమంలో జూనియర్లను వేధించిన ఆరోపణలపై 78 మంది సీనియర్ విద్యార్థులను సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. సస్పెన్సన్‌కు గురైన వారిలో పీజీ చదువుతున్న 28, కామర్స్ 28, ఎకనామిక్స్ 25 మంది, జువాలజీ సెకండ్ ఇయర్ విద్యార్థినులు ఉన్నారు. వారం రోజులపాటు సస్పెన్డ్ చేస్తున్నట్లు వర్సిటీ అధికారులు ధృవీకరించారు. అయితే అర్ధరాత్రి హాస్టల్ రూమ్‌కు పిలిచి సీనియర్లు వేధించారని జూనియర్లు చెబుతున్నారు. దీనిపై వర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన అనంతరం వేధింపులు నిజమేనని నిర్థారించి 81 మంది విద్యార్థులను ర్సిటీ అధికారులు వారం రోజుల పాటు సస్పెండ్ చేశారు. చదవండి: HYD: మూసారాంబాగ్ బ్రిడ్జి మూసివేత -
ర్యాగింగ్ పేరుతో తోటి విద్యార్థుల దాడి.. డిగ్రీ స్టూడెంట్ మృతి
సాక్షి, మంచిర్యాల: ర్యాగింగ్‌ను నివారించటానికి ప్రభుత్వాలు, విద్యాసంస్థల వంటివి ఎన్ని చర్యలు తీసుకున్నా.. ఎక్కడోచోట ర్యాగింగ్ ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో సీనియర్ విద్యార్థులు రెచ్చిపోతున్నారు. జూనియర్ విద్యార్థులపై పైశాచికంగా ప్రవర్తిస్తున్నారు. తెలంగాణలో ర్యాగింగ్ భూతం మళ్లీ జడలు విప్పుతోంది. తాజాగా ర్యాగింగ్ పేరుతో తోటి విద్యార్థులు దాడి చేయడంతో డిగ్రీ విద్యార్థి మృతి చెందాడు. ఈ విషాద ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. మందమర్రి మండలం పొన్నారం గ్రామంలో ఎస్సీ హాస్టల్లో కామెర ప్రభాస్ అనే విద్యార్థి బీకాం కంప్యూటర్స్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మూడు రోజుల క్రితం రాత్రి సమయంలో తోటి విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. వేధిస్తూ, దాడి చేయడంతో డిగ్రీ విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. -
‘గాంధీ’లో ర్యాగింగ్‌కు పాల్పడిన 10 మందిఎంబీబీఎస్ విద్యార్థులపై వేటు
సాక్షి, హైదరాబాద్/గాంధీ ఆస్పత్రి: ర్యాగింగ్‌కు పాల్పడిన వైద్య విద్యార్థులపై వేటు పడింది. హైదరాబాద్ గాంధీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫస్టియర్ చదువుతున్న విద్యార్థులను ర్యాగింగ్ చేశారని తేలడంతో 10 మంది సీనియర్ విద్యార్థులను ఏడాదిపాటు కాలేజీ నుంచి సస్పెండ్ చేశారు. వారిని హాస్టల్ నుంచి కూడా తొలగించారు. ఈ మేరకు వైద్య విద్యా సంచాలకుడు (డీఎంఈ) డాక్టర్ రమేశ్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో ఆ వివరాలు వెల్లడించారు. ఇటీవల కొత్తగా ఎంబీబీఎస్‌లో చేరిన విద్యార్థులను రెండు, మూడో ఏడాది చదివే కొందరు ఎంబీబీఎస్ విద్యార్థులు ర్యాగింగ్ చేసినట్టు నిర్ధారణ అయ్యింది. యూజీసీ ఆధ్వర్యంలోని యాంటీ ర్యాగింగ్ సెల్‌కు కూడా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో యూజీసీ నుంచి కూడా ర్యాగింగ్‌కు పాల్పడుతున్న విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్రానికి ఆదేశాలు వచ్చాయి. మరోవైపు స్థానిక పోలీసులూ సమాచారం అందించారు. దీంతో తక్షణమే ర్యాగింగ్‌కు పాల్పడిన 10 మంది విద్యార్థులను సస్పెండ్ చేశారు. దీంతో వారు ఏడాదిపాటు కోర్సుకు దూరం కావాల్సి ఉంటుంది. ర్యాగింగ్‌కు పాల్పడొద్దని అన్ని తరగతుల విద్యార్థులను పిలిపించి కౌన్సెలింగ్ చేశారు. చర్యలు తీసుకుంటే భవిష్యత్ పోతుందని కూడా హెచ్చరించారు. అయినా కొందరు సీనియర్లు కొత్తగా చేరిన ఎంబీబీఎస్ విద్యార్థులను అర్ధరాత్రి రెండు గంటలకు తమ గదులకు పిలిపించి మానసికంగా వేధించడం, బూతులు తిట్టడంతోపాటు డ్యాన్స్‌లు చేయించారు. భౌతికంగా దాడులు జరిగాయా లేదా అన్నదానిపై స్పష్టత లేదని సమాచారం. దీంతో యాంటీ ర్యాగింగ్ కమిటీ ఈ సంఘటనపై విచారణ జరిపి 10 మంది సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడినట్టు గుర్తించింది. వారి సస్పెండ్ కాలం పూర్తయిన తర్వాత వచ్చే ఏడాది మళ్లీ కాలేజీలో చేరినా, హాస్టల్ వసతి మాత్రం కల్పించబోమని డీఎంఈ స్పష్టం చేశారు. ర్యాగింగ్‌కు పాల్పడితే కాలేజీ నుంచి తీసేయాలన్న నిబంధనలు ఉన్నాయని, కానీ తాము వారి భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని ఏడాదిపాటు సస్పెండ్ వరకే పరిమితమయ్యామని వెల్లడించారు. ఇంకా ఎవరైనా ర్యాగింగ్‌కు పాల్పడితే ర్యాగింగ్ నిరోధక నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని వివిధ మెడికల్ కాలేజీల్లోని విద్యార్థులందరినీ ఆయన హెచ్చరించారు. -
ఐఐటీ మండీలో ర్యాగింగ్ ఘటన
న్యూఢిల్లీ/మండీ: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ–మండీలో జూనియర్లను ర్యాగింగ్ చేసిన 10 మంది సీనియర్లను కళాశాల యాజమాన్యం సస్పెండ్ చేసింది. మరో 62 మందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. విద్యార్థి విభాగం ఆఫీస్ బేరర్స్ సస్పెన్షన్‌కు గురయ్యారు. ర్యాగింగ్ చేసిన సీనియర్ విద్యార్థులకు రూ.15వేల నుంచి రూ.25 వేల వరకు జరిమానా విధించారు. 20 నుంచి 60 గంటలపాటు సమాజసేవ చేయాలని ఆదేశించినట్లు ఐఐటీ–మండీ ఉన్నతాధికారులు బుధవారం వెల్లడించారు. ముగ్గురు విద్యార్థి విభాగం ఆఫీస్ బేరర్లతోపాటు 10 మంది విద్యార్థులను తరగతి గదులు, వసతి గృహాల నుంచి డిసెంబర్‌దాకా సస్పెండ్ చేశారు. బీ.టెక్ కోర్సుల్లో కొత్తగా చేరిన మొదటి సంవత్సరం విద్యార్థుల కోసం పరిచయ కార్యక్రమాన్ని ఇటీవల కాలేజీలో నిర్వహించారు. ‘ఈ ఘటనలో 72 మంది సీనియర్ విద్యార్థులపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నాం’ అని కాలేజీ యాజమాన్యం ఒక ప్రకటనలో పేర్కొంది. -
కుక్కలా అరవమని వేధిస్తూ..యువకుల పిచ్చి చేష్టలు..
మధ్యప్రదేశ్:మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఆమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఓ యువకున్ని కుక్కలా అరవమని ఆదేశిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఓ గుంపు బాధితుని చుట్టూ చేరి క్షమాపణలు కోరమని చెబుతూ కుక్కలా అరవమని డిమాండ్ చేస్తున్నట్లు ఆ వీడియోలో ఉంది. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. దర్యాప్తు చేసి 24 గంటల్లో చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా పోలీసులను ఆదేశించారు. 50 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో కొంత మంది యువకులు ఓ వ్యక్తిని వేధిస్తున్నారు. 'కుక్కలా నటించు..క్షమాపణలు చెప్పు' అంటూ అతని చుట్టూ చేరి అరుస్తున్నారు. గుంపులో ఓ వ్యక్తి బాధితున్ని బిగ్గరగా పట్టుకుని ఉన్నాడు. 'సాహిల్ నా తండ్రి, సాహిల్ నా అన్నయ్య లాంటివాడు' అంటూ బాధితుడు అరుస్తున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై స్పందించిన రాష్ట్ర హోం మంత్రి..' ఆ వీడియోను చూశాను. ఇలాంటి స్వభావాన్ని ఖండిస్తున్నాం. దర్యాప్తు చేయాలని కమిషనర్‌ను ఆదేశించాం. దోషులకు కఠిన శిక్షలు విధిస్తాం' అని అన్నారు. సాహిల్, అతని గ్యాంగ్ తమ వ్యక్తికి డ్రగ్స్, మాంసం అలవాటు చేశారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. మతం మారాలని బలవంతం చేస్తున్నారని చెప్పారు. బాధితుడు తన సొంత ఇంట్లోనే దొంగతనం చేసేలా సాహిల్ గ్యాంగ్ ఒత్తిడి చేసినట్లు పేర్కొన్నారు. ఈ అంశంపై ఫిర్యాదు చేస్తే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని, వీడియో వైరల్ అయ్యాక కేసు నమోదు చేశారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ అంశంపై పోలీసు స్టేషన్ ముందు బజరంగ్ దళ్ సభ్యులు ఆందోళనలు చేపట్టారు. జై శ్రీరాం అంటూ నినాదాలు చేశారు. ఇదీ చదవండి:పరువుహత్య చేసి.. బండరాళ్లు కట్టి మొసళ్లకు మేతగా పడేశారు -
మెడికో ప్రీతి మృతిపై వీడని మిస్టరీ
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మెడికో ప్రీతి మృతి మిస్టరీగానే మిగిలింది. రెండు నెలలు కావస్తున్న ప్రీతి డెత్ ఆత్మహత్యనా.. హత్యనా తేలక అనుమానస్పద మృతిగానే పోలీసులు పరిగణిస్తున్నారు. ప్రీతి ఏలా చనిపోయిందో స్పష్టమైన ఆధారాలు లభించకపోయినప్పటికి ర్యాగింగే ప్రీతి డెత్‌కు కారణమని పోలీసులు ఆ దిశగా చర్యలు చేపట్టారు. అందుకు కారణమైన సీనియర్ వైద్య విద్యార్ధి సైఫ్‌ను అరెస్టు చేసి జైల్ కు పంపగా 56 రోజుల అనంతరం షరతులతో కూడిన బెయిల్ మంజూరయ్యింది. ఈ ఏడాది పిబ్రవరి 22న వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో పీజీ మెడికల్ విద్యార్థి ప్రీతి అపస్మారక స్థితిలో పడిపోయింది. నిమ్స్‌కు తరలించి మెరుగైన వైద్యం అందించినా ప్రీతి ప్రాణాలు కోల్పోయారు. ప్రీతి మృతిపై అనేక అనుమానాలు ఆందోళనలు వ్యక్తం కావడంతో పోలీసులు విచారణ చేపట్టి సీనియర్ వైద్య విద్యార్థి సైఫ్ వేధింపులు ర్యాగింగే కారణమని తేల్చారు. ముందుగా ప్రీతి మత్తు ఇంజక్షన్ తీసుకొని ఆత్మహత్య చేసుకుందని భావించినప్పటికీ టాక్సికాలజీ రిపోర్టులో ఎలాంటి మత్తు రసాయనాలు తీసుకున్నట్లు ఆధారాలు లభించలేదు. ఎవరైనా హత్య చేశారా అంటే అందుకు సంబంధించి ఎవిడెన్స్ దొరకలేదు. హత్య కాదు... ఆత్మహత్య చేసుకోలేదు.. మరి ప్రీతి ఎలా చనిపోయిందనేది అందరి మదిని తోలుస్తున్న ప్రశ్న. పోలీసులు మాత్రం అనుమానాస్పద మృతిగా బావిస్తూ అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. దాదాపు రెండు నెలలుగా సాగిస్తున్న విచారణలో ఏమి తేలలేదు. పోలీసులకు సవాల్‌గా మారిన ఈ కేసులో కీలకంగా ఉన్న ఎంజీఎం ఆసుపత్రిలో అత్యవసర శస్త్రచికిత్స విబాగంలో ప్రీతి పడిపోయిన విశ్రాంతి గది సీజ్‌ను తొలగించారు. ఘటన జరిగిన రోజున మట్టెవాడ పోలీసులు ఈ గదిని సీజ్ చేసి పలుమార్లు సిపి రంగనాథ్ సందర్శించి స్వయంగా విచారణ చేశారు. ఇప్పటి వరకు కేసులో ఏలాంటి పురోగతి కనిపించకపోగా, మట్టెవాడ పోలీసులు సీజ్ చేసిన గది తాళాలను తొలగించి ఎంజీఎం అధికారులకు అప్పగించారు. ఈ కేసును పోలీసులు ఎటు తేల్చకుండానే గది తాళాలను ఎంజీఎం అధికారులకు అప్పగించడం చర్చనీయాంశంగా మారింది. ప్రీతి డెత్‌పై ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా క్రమంగా కేసు తీవ్రతను తగ్గిచే ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానాలను ప్రీతి కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. దర్యాప్తు జరుగుతున్న తీరు సరిగాలేదని, ఇప్పటివరకు పోస్ట్ మార్టమ్ రిపోర్ట్, ఫోరెన్సిక్ రిపోర్ట్ లేకుండా కేఎంసీ ప్రిన్సిపల్ హెచ్ఓడీపై చర్యలు తీసుకోకుండా హాస్పిటల్ లో రూమ్ ఎందుకు సీజ్ తొలగించారని ప్రీతి సోదరుడు పృథ్వి ప్రశ్నిస్తున్నారు. కార్డియాక్ అరెస్ట్‌తో చనిపోయిందని ఇండైరెక్ట్ గా చెబుతున్నారని, అదే నిజమైతే ఎందుకు రక్తం ఎక్కించారు.. కడుపుకు ఆపరేషన్ ఎందుకు చేశారనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ఇప్పటికైనా పోలీసులు నిష్పాక్షపాతంగా దర్యాప్తు చేయాలని కోరుతున్నారు. ప్రీతి అపస్మారక స్థితిలో పడిపోయిన గది సీజ్‌ను తొలగించడానికి కారణం పీజీ వైద్య విద్యార్థులు, సిబ్బందికి అత్యవసర చికిత్స కోసం అవసరం కావడంతోనే సీజ్ తొలగించి ఆసుపత్రికి అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. ప్రీతి తల్లిదండ్రుల అనుమానాలను నివృత్తి చేస్తూ ఏ ఒక్క చిన్న అంశాన్ని వదిలిపెట్టకుండా అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని సిపి రంగనాథ్ తెలిపారు. తప్పు చేసిన వారు తప్పించుకోవడానికి వీలు లేకుండా జాగ్రత్తగా లోతైన విచారణ చేస్తున్నామని చెప్పారు. ఫైనల్‌గా పోస్టుమార్టం రిపోర్టు వస్తే కానీ నిర్ణయానికి రాలేమన్నారు సిపి రంగనాథ్. ఒకవేళ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయినా, సాధారణ మరణమే అయినా అందుకు ర్యాగింగే కారణమని స్పష్టం చేశారు. సైఫ్, ప్రీతి సెల్ ఫోన్ మెసేజ్‌లు, వాట్సాప్ గ్రూప్ చాటింగ్‌ల ఆధారంగా ప్రీతి ర్యాగింగ్‌కు గురైందని నిర్ధారించామని, ర్యాగింగ్ యాక్ట్ ప్రకారం సైఫ్ కు పదేళ్ళ శిక్షతోపాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు శిక్ష అదనంగా ఉండే అవకాశం ఉందని ఇటీవల సీపి ప్రకటించారు. మరోవైపు సైఫ్‌ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించగా.. మూడుసార్లు బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురికాగా 56 రోజుల అనంతరం షరతులతో కూడిన బెయిల్ లభించింది. పది వేల బాండ్, ఇద్దరు పూచీకత్తుపై ఎస్సీ ఎస్టీ కోర్టు న్యాయమూర్తి సత్యేంద్ర బెయిల్ ఇచ్చి, ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల మధ్య విచారణ అధికారి ఎదుట హాజరు కావాలని షరతు విధించారు. చార్జిషీటు దాఖలు చేసే వరకు లేదా 16 వారాల వరకు విచారణ అధికారి ఎదుట హాజరు కావాల్సి ఉంటుంది. ఇక దాదాపు రెండు నెలలు కావస్తున్న ఇంకా పోస్ట్ మార్టమ్ రిపోర్టు రాకపోవడం, కేసు మిస్టరీ వీడకపోవడంతో కన్నవారు మానసిక ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు. తన కూతురు ఎలా చనిపోయిందో స్పష్టం చేసి ఇక ముందు ఇలాంటి సంఘటనలు పునఃరావృతం కాకుండా కఠిన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. -
ర్యాగింగ్ చేస్తే కఠిన చర్యలు.. జాతీయ మెడికల్ కమిషన్ హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: మెడికల్ కాలేజీల్లో విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ ర్యాగింగ్ వంటి చర్యలకు పాల్పడరాదని.. అలా చేస్తే కఠిన చర్యలు ఉంటాయని జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) హెచ్చరించింది. విద్యార్థులు మానసిక స్థైర్యాన్ని కలిగి ఉండాలని.. రోగులతో మర్యాదగా, సున్నితంగా వ్యవహరించాలని స్పష్టం చేసింది. మారుతున్న వైద్య విధానాలు, సాంకేతికత, చికిత్సలపై అవగాహన పెంచుకోవాలని సూచించింది. రోగులు, వారికి సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయకూడదని పేర్కొంది. దేశంలో వైద్య విద్యార్థుల వృత్తిపరమైన బాధ్యతలపై ఎన్ఎంసీ తాజాగా మార్గదర్శకాలను జారీచేసింది. వైద్య విద్యార్థుల సమగ్రాభివృద్ధికి ఈ అంశాలు కీలకమని పేర్కొంది. వైద్య విద్యార్థులు రోగులతో సమర్థవంతంగా మాట్లాడటానికి స్థానిక భాష నేర్చుకోవాలని కోరింది. ప్రకృతి వైపరీత్యాలు, విపత్తులు, వైద్యారోగ్య అత్యవసర పరిస్థితుల వంటి సందర్భాల్లో వీలైనంత సాయం చేయాలని సూచించింది. శాస్త్రీయ దృక్పథం అలవర్చుకోవాలి కేవలం చికిత్సకే పరిమితం కాకుండా వైద్యారోగ్య వ్యవస్థపై నమ్మకం కలిగేలా రోగి–వైద్యుడి సంబంధం ఉండాలని ఎన్ఎంసీ స్పష్టం చేసింది. శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని.. జాతీయ ఆరోగ్య సంరక్షణ ప్రాధాన్యతలపై అవగాహన కలిగి ఉండాలని సూచించింది. కేవలం పుస్తకాల నుంచే మాత్రమే కాకుండా అధ్యాపకుల అపార అనుభవం, ఆచరణాత్మక బోధన నుంచి నేర్చుకోవాలని పేర్కొంది. విద్యార్థులు ప్రాక్టికల్ రికార్డులు, కేస్షీట్లను శ్రద్ధగా నిర్వహించాలని.. కాపీ చేయడం, తారుమారు చేయడం వంటివి చేస్తే తగిన చర్యలు చేపడతామని హెచ్చరించింది. -
ర్యాగింగ్ విషయంలో కఠినంగా ఉండండి: మంత్రి విడదల రజిని
సాక్షి, అమరావతి: ర్యాగింగ్ విషయంలో రాష్ట్రంలోని అన్ని మెడికల్ కళాశాలలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. తాజాగా హైదరాబాద్‌లో మెడికో ఆత్మహ్యత ఘటన నేపథ్యంలో మంత్రి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కళాశాలల ప్రిన్సిపల్స్ అందరితో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ టవర్స్ లో ఉన్న వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ వినోద్ కుమార్ ఐఎఎస్, డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ వీసీ బాబ్జి, రిజిస్ట్రార్ రాధికారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి విడదల రజిని మాట్లాడుతూ ర్యాగింగ్ భూతం విషయంలో అన్ని మెడికల్ కళాశాలలు కఠినంగా ఉండాలని స్పష్టంచేశారు. మెడికోలపై ఎక్కడా, ఎలాంటి వేధింపులు ఉండటానికి వీల్లేదని చెప్పారు. కళాశాలల్లోని యాంటీ ర్యాగింగ్ కమిటీలు పూర్తిస్థాయిలో చురుకుగా పనిచేయాలని చెప్పారు. ర్యాగింగ్, ఇతర వేధింపులకు సంబంధించి ఆయా కళాశాలలపై నేరుగా డీఎంఈ, హెల్త్ యూనివర్సిటీ వీసీ పర్యవేక్షణ ఉండాలన్నారు. ఆయా కళాశాలల నుంచి ఎప్పటికప్పుడు యాంటి ర్యాగింగ్ కమిటీల ద్వారా నివేదికలు తెప్పించుకుంటూ ఉండాలన్నారు. విద్యార్థులతో బోధనా సిబ్బంది సహృద్భావంతో ఉండాలని చెప్పారు. కొంతమంది సీనియర్ అధ్యాపకులు వారి సొంత క్లినిక్‌ల నేపథ్యంలో పీజీ విద్యార్థులపై పనిభారం మోపుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయని, ఈ పద్ధతి మారాలని తెలిపారు. పటిష్టమైన చర్యల ద్వారానే ఫలితాలు చదువుల్లో నాణ్యతే కాదని, భద్రత కూడా ఉండాలని మంత్రి విడదల రజిని తెలిపారు. పటిష్టమైన చర్యల ద్వారా మనం సురక్షితంగా మెడికోలను సమాజంలోకి తీసుకురాగలమని చెప్పారు. అన్ని మెడికల్ కళాశాలల్లో విద్యార్థులకు కౌన్సెలింగ్ సెషన్లు ఉండేలా చూసుకోవాలన్నారు. ఒత్తిడి నుంచి బయటపడేలా విద్యార్థులకు యోగా, ధ్యానం లాంటి అంశాలపై అవగాహన పెంచాలన్నారు. కళాశాలల్లో ఫిర్యాదుల పెట్టెలు అందుబాటులో ఉంచాలన్నారు. ఏదైనా సమాచారాన్ని వెనువెంటనే చేరవేసేలా క్యాంపస్‌లో పలు చోట్ల మైక్‌లు ఏర్పాటుచేసుకోవాలన్నారు. ముఖ్యమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఉండేలా చూడాలన్నారు. ప్రతి విద్యార్థిని దిశ యాప్ ను వాడుకునేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. సీనియర్, జూనియర్ విద్యార్థులకు ప్రత్యేక వసతి ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. వారి భోజన సమయాలు కూడా ఒకేలా ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. మన రాష్ట్రంలోని ఏ ఒక్క మెడికల్ కళాశాలలో కూడా ఎక్కడా ఒక్క ర్యాగింగ్ కేసు కూడా నమోదు కావడానికి వీల్లేదని స్పష్టంచేశారు. డిస్ట్రిక్ట్ రెసిడెన్సీ ప్రోగ్రాంతో ప్రజలకు మేలు ఎన్ ఎం సీ నిబంధనలకు అనుగుణంగా ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రతి మెడికల్ కళాశాల డిస్ట్రిక్ట్ రెసిడెన్సీ ప్రోగ్రామ్ ను అమలు చేయాల్సి ఉందని మంత్రి విడదల రజిని తెలిపారు. ఈ డీఆర్ కార్యక్రమంలో భాగంగా ప్రతి పీజీ విద్యార్థి మూడు నెలల పాటు కచ్చితంగా గ్రామీణ ప్రాంతంలో పనిచేయాల్సి ఉందని చెప్పారు. ప్రతి మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్‌కు వారి పరిధిలో మ్యాప్ చేసిన డీహెచ్, ఏహెచ్, సీహెచ్‌సీ, పీహెచ్‌సీల జాబితాను ఇప్పటికే పంపామని తెలిపారు. ఆ జాబితాలో ఉన్న ఆస్పత్రుల్లో పీజీ లు కచ్చితంగా మూడు నెలలు పనిచేసేలా షెడ్యూల్ తయారుచేసుకుని పంపాలని పేర్కొన్నారు. దీనివల్ల ప్రతి మూడు నెలలకు 250 మంది చొప్పున స్పెషలిస్టు వైద్యులు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే పరిస్థితులు ఏర్పడతాయన్నారు. దీనివల్ల ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందని చెప్పారు. పల్లెల్లో ఉండే పేద ప్రజలు మెరుగైన వైద్య సేవలు పొందే అవకాశం దక్కుతుందన్నారు. చదవండి: టీడీపీ నేత నారాయణకు ఏపీ సీఐడీ నోటీసులు -
ప్రతి విద్యాసంస్థలో ర్యాగింగ్ నిరోధక కమిటీలు
సాక్షి, హైదరాబాద్: ప్రతి విద్యాసంస్థల్లో ర్యాగింగ్ నిరోధక కమిటీలు వేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభ ద్రం డిమాండ్ చేశారు. ర్యాగింగ్‌ను నిరోధించేందుకు యూజీసీ, ర్యాగింగ్ మార్గదర్శకాలు పాటించడంతో పాటుగా యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్స్‌ను ఏర్పాటు చేసి ఆయా నంబర్లను విస్తృతంగా ప్రచారం చేయాలని సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ప్రతి విద్యాసంస్థలో ఫిర్యాదు బాక్స్ ఏర్పాటు చేయాలని, కమిటీల్లో తల్లిదండ్రులు, సైక్రియాటిస్ట్, సైకాలజిస్ట్‌లను భాగస్వాములను చేసి విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇవ్వాలని సూచించారు. -
నిమ్స్ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. డాక్టర్ల తీరుపై తీవ్ర ఆగ్రహం
వైద్య విద్యార్థిని ప్రీతి ఐదు రోజులుగా మృత్యువుతో పోరాడి ఆదివారం కన్నుమూసింది. సీనియర్ వేధింపులు తట్టుకోలేక వరంగల్ ఎంజీఎంలో ఆత్మహత్యకు యత్నించిన పీజీ వైద్య విద్యార్థినికి హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స అందించారు. ఆరోగ్యం మరింత క్షీణించడంతో రాత్రి 9.10 గంటలకు ఆమె తుదిశ్వస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. నిమ్స్ వద్ద తీవ్ర ఉద్రిక్తత ప్రీతికి చికిత్స అందించిన నిమ్స్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రీతి మృతికి గల కారణాలను వెల్లడించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. ఆమె మృతి చెందిన విషయాన్ని చెప్పేందుకు తల్లిదండ్రులను ఐసీయూలోకి రావాలని వైద్యులు సూచించారు. కానీ ప్రీతి ఎలా చనిపోయిందన్న విషయాన్ని చెప్పాలని అభ్యర్థించారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ ఇచ్చేవరకు మృతదేహాన్ని తీసుకెళ్లేది లేదని తేల్లి చెప్పారు ఆమె తల్లిదండ్రులు. హెచ్వోడిపై కేసు నమోదు చేయాలని ప్రీతి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. తనని లోపలికి అనుమతించడం లేదని ప్రీతి సోదరుడు వాపోయారు. ఐసీయూ వద్ద ప్రీతి తల్లిదండ్రుల ఆందోళన కొనసాగుతోంది. అయితే కాసేపట్లో ప్రీతి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించనున్నారు. ప్రీతి మరణవార్త విన్న తెలియడంతో ఆమె గ్రామంలో ఆందోళనకు దిగారు గ్రామస్థులు. ప్రీతి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రీతి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. నిందితులు ఎంతటివారైనా సరే కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ప్రభుత్వపరంగా వారి కుటుంబాన్ని అన్ని విధాలుగా అండగా ఉంటామని స్పష్ట చేశారు. -
వేధింపులతో వైద్యవిద్యార్థిని ఆత్మహత్యాయత్నం
సీనియర్ విద్యార్థి ర్యాగింగ్, వేధింపులతో పీజీ వైద్య విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపుతోంది. వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల (కేఎంసీ)లో అనస్థీషియా విభాగంలో పీజీ ఫస్టియర్ చదువుతున్న ధరావత్ ప్రీతి (26) బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఎంజీఎం ఆస్పత్రిలో విధుల్లో ఉన్న ప్రీతి బుధవారం ఉదయం ఆరు గంటల సమయంలో తీవ్ర తలనొప్పి, అలసటగా ఉందని చెప్పి నర్సు వద్ద నుంచి ఓ ఇంజక్షన్ తీసుకుని వేసుకుంది. క్షణాల వ్యవధిలోనే తన గదిలో స్పృహ తప్పి పడిపోవడంతో ఆర్ఐసీయూలో చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమెకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులే దీనికి కారణమని ఆమె తండ్రి ఆరోపించారు. దీనిపై విచారణ జరుపుతున్నామని వైద్య విద్య సంచాలకులు డాక్టర్ రమేశ్ రెడ్డి వెల్లడించారు. ఈ ఘటనపై మంత్రి హరీశ్‌రావు ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్‌తో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. హేళన చేస్తూ వేధించి.. జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి గిర్ని తండాకు చెందిన ధరావత్ నరేందర్, శారద దంపతులకు ముగ్గురు కుమార్తెలు పూజా, ఉష, ప్రీతి, కుమారుడు వంశీ ఉన్నారు. నరేందర్ వరంగల్‌లోని ఆర్పీఎఫ్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. కొన్నేళ్ల క్రితమే వీరి కుటుంబం హైదరాబాద్‌లోని ఉప్పల్‌కు మకాం మార్చింది. పూజా, ఉషల పెళ్లిళ్లు అయ్యాయి. కుమారుడు వంశీ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. ఇంట్లో ఎప్పుడూ సరదాగా ఉండే ప్రీతి గాంధీ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తిచేసింది. కేఎంసీలో పీజీ అనస్థీషియా కోర్సు చదువుతున్న ప్రీతి ఎంజీఎం ఆస్పత్రిలో సీనియర్ విద్యార్థులతో కలిసి అపరేషన్ థియేటర్లో విధులు నిర్వర్తిస్తోంది. అక్కడ పరిచయమైన సీనియర్ విద్యార్థి సైఫ్ ర్యాగింగ్ చేస్తూ ఆమెను మానసికంగా, శారీరకంగా వేధించాడు. తక్కువ కులం అంటూ హేళన చేశాడు. దీనిపై ప్రిన్సిపాల్ ఆదేశానుసారం అనస్థీషియా విభాగాధిపతి డాక్టర్ నాగార్జున రెడ్డి సైఫ్, ప్రీతిలకు మంగళవారం సాయంత్రం కౌన్సెలింగ్ నిర్వహించారు. తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే ప్రీతి ఆత్మహత్యకు యత్నించడంతో ఆమెకు వేధింపులు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుస్తోందని విద్యార్థులు అంటున్నారు. ఈఓటీలో ఏం జరిగిందంటే..: విధుల్లో భాగంగా ఎంజీఎం ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ అపరేషన్ థియేటర్ (ఈఓటీ)లో మంగళవారం సాయంత్రం 4 గంటలకు విధులకు హాజరైన ప్రీతి తోటి వైద్యులతో కలిసి రాత్రి 12 గంటల వరకు రెండు శస్త్రచికిత్సలు చేసింది. తిరిగి బుధవారం తెల్లవారుజామను 5 గంటల సమయంలో మరో శస్త్రచికిత్సకు సిద్ధమై ఆరు గంటలకల్లా పూర్తిచేసింది. ఈ క్రమంలో ప్రీతి తలనొప్పి, ఛాతీలో నొప్పిగా ఉందంటూ జోఫర్, ట్రెమడాల్ ఇంజక్షన్ కావాలని స్టాఫ్‌నర్సుకు చెప్పింది. శస్త్రచికిత్స పూర్తిచేసిన బాధితుడిని వార్డుకు తీసుకెళ్లి తిరిగి థియేటర్‌కు వచి్చన తోటి వైద్యులు ప్రీతి ఎక్కడ ఉందని అక్కడున్న సిబ్బందిని అడిగారు. డాక్టర్స్ రూమ్‌లో ఉందని చెప్పగానే అక్కడికి వెళ్లిన వారికి ప్రీతి ఆపస్మారకస్థితిలో ఉండటం గమనించారు. వద్దు డాడీ అంది.. ఇప్పుడింత పనైంది ‘కాలేజీ, ఆస్పత్రిలో ర్యాగింగ్ చేస్తూ వేధిస్తున్న సైఫ్‌పై ప్రిన్స్‌పాల్‌కు ఫిర్యాదు చేస్తా అంటే వద్దు డాడీ అంటూ నివారించింది. ప్రిన్సిపల్ కక్ష సాధింపు చర్యలకు దిగి మార్కులు తక్కువ వేస్తారంటూ భయపడేది. సైఫ్ అరాచకంపై ఏసీపీ కిషన్‌కు చెప్పాను. ఆ తర్వాత కేఎంసీ ప్రిన్సిపల్ మోహన్ దాసు ఆదేశాల మేరకు డాక్టర్ నాగార్జునరెడ్డి మంగళవారం సాయంత్రం అతడిని మందలించారు. నాపై ఫిర్యాదు చేస్తావా అంటూ సైఫ్ మరోసారి నా బిడ్డను బెదిరించగా మనస్తాపానికి లోనై ఆత్మహత్యకు యతి్నంచింది’ అని తండ్రి నరేందర్ కన్నీళ్ల పర్యంతమయ్యారు. నరేందర్ ఫిర్యాదుమేరకు సైఫ్‌పై వేధింపులు, ర్యాగింగ్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద మట్టెవాడ పోలీసులు కేసులు నమోదు చేశారు. వరంగల్ ఏసీపీ కిషన్ దర్యాప్తు చేస్తున్నారు. కార్డియాక్ అరెస్ట్‌తోనే... కార్డియాక్ అరెస్టు రావడంతో వైద్య బృందంతో సీపీఆర్ ద్వారా చికిత్స చేసి ట్రీట్మెంట్ ఇచ్చామని ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్ చెప్పారు. గుండెకు సంబంధించి 28 శాతం ఎజెక్షన్ ఫ్రాక్షన్ ఆఫ్ హార్ట్, గ్లోబల్ హిపోకైనేషియా, పాంక్రియాటైటిస్, అసైటీస్, ఊపిరితిత్తుల సమస్య ఉన్నట్టు తేలిందన్నారు. ప్రీతి థైరాయిడ్, కీళ్లవాతానికి సంబంధించి మందులు వాడుతున్నట్టు తేలిందన్నారు. సెల్ఫోన్లో అనస్థీషియాపై సెర్చ్ ప్రీతి ఆత్మహత్యకు యతి్నంచకముందు బుధవారం తెల్లవారుజామున తన సెల్ఫోన్లో గూగుల్ సెర్చ్‌లో సాధారణ వ్యక్తి అనస్థీషియా తీసుకుంటే ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయో చూసినట్లు విద్యార్థులు చర్చించుకుంటున్నారు. అయితే ప్రీతి ట్రెమడాల్ తీసుకుందని కొందరు, అనస్థీషియా తీసుకుందని మరికొందరు చెబుతున్నారు. -
Shalini: ఆమె ముసుగు వెనుక ధైర్యం
భుజాన బ్యాగ్‌తో ఆమె అందరిలాగే కాలేజీకి వెళ్లింది. క్యాంటీన్లో పిచ్చాపాటి కబుర్లతో కాలక్షేపం చేసింది. అమ్మాయి కావడంతో.. సాధారణంగా కొందరు యువకులు నెంబర్ అడిగి తీసుకున్నారు. ఆమె కూడా వాళ్లతో ఫోన్ ఛాటింగ్‌లతో గడిపింది. సరదాగా క్లాసులు బంక్ కొట్టి సినిమాలు, షికార్లకు వెళ్లింది. ఇంతా స్టూడెంట్ అనే ముసుగులోనే! కానీ, ఆ ముసుగు వెనుక అసలు రూపం మొన్నటిదాకా ఎవరికీ తెలియదు. షాలినీ చౌహాన్.. గత 24 గంటలుగా దేశవ్యాప్తంగా మారుమోగిపోతున్న పేరు. స్టూడెంట్ ముసుగుతో ర్యాగింగ్ భూతం.. కొమ్ములు వంచిన ఈ ఖాకీ చొక్కాకి, ఆ ప్రయత్నంలో ఆమె ప్రదర్శించిన తెగువకి దేశం మొత్తం సలాం కొడుతోంది. మధ్యప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ అయిన షాలినీ చౌహాన్(24).. స్టూడెంట్ వేషంలో ర్యాగింగ్ చేసేవాళ్లను పట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు. ఇండోర్ మహాత్మా గాంధీ మెమోరియల్ కాలేజీలో ఆమె ర్యాగింగ్ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చింది. మూడు నెలలుగా కాలేజీ క్యాంపస్‌లోనే స్టూడెంట్ ముసుగులో ఆమె ఇండోర్ పోలీసులు నిర్వహించిన అండర్ కవర్ ఆపరేషన్‌లో పాల్గొంది. పదకొండు మంది సీనియర్లు ర్యాంగింగ్ పేరిట వేధిస్తున్న వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చింది ఆమె. దీంతో.. ఆ విద్యార్థులను కాలేజీ యాజమాన్యం మూడు నెలల పాటు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇన్స్పెక్టర్ తజీబ్ ఖ్వాజీ నేతృత్వంలో.. కానిస్టేబుల్ షాలినీ ఈ ఆపరేషన్‌కు దిగింది. తరచూ ఆ కాలేజీలో జూనియర్ల నుంచి ర్యాగింగ్ వ్యవహారం దృష్టికి వస్తుండడం.. అవి మరీ శ్రుతి మించి ఉంటోందన్న విషయం తెలియడంతో పోలీసులు క్యాంపస్‌లో పర్యటించారు. అయితే భయంతో ఫిర్యాదు చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో స్టూడెంట్ మాదిరి ఉన్న షాలినీ రంగంలోకి దించారు ఖ్వాజీ. షాలినీ, మరికొందరు కానిస్టేబుల్స్‌తో కలిసి క్యాంపస్‌లో సివిల్ డ్రెస్‌లో కలియదిరిగింది. విద్యార్థులతో మాట్లాడడం మొదలుపెట్టింది. తాను విద్యార్థుల్లో కలిసి పోయింది. జూనియర్లు, సీనియర్ల నుంచి ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుంది. ర్యాంగింగ్ మరీ దారుణంగా ఉంటుందని గుర్తించింది. ఈ క్రమంలో.. ర్యాంగింగ్కు పాల్పడుతున్న ఆకతాయిలను గుర్తించింది. తన ఐడెంటిటీ రివీల్ చేయకుండానే వివరాలను సేకరించింది. అయితే.. ఈ మూడు నెలల కాలంలో ఎవరికైనా అనుమానం రాలేదా? అని షాలినీని అడిగితే.. టాపిక్ మార్చేదానినని చెప్పిందామె. అమ్మాయిని కావడంతో.. స్టూడెంట్స్ కొందరు సొల్లు కార్చుకుంటూ మాట్లాడేవారని, అదే తనకు బాగా కలిసి వచ్చిందని చెప్తోందామె. -
80 చెంపదెబ్బలు కొట్టిన సీనియర్లు.. రెండో అంతస్తు నుంచి దూకిన విద్యార్థి
దిస్పూర్: అస్సాం డిబ్రూగఢ్ యూనివర్సిటీలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది. సీనియర్ల టార్చర్ భరించలేక ఓ విద్యార్థి హాస్టల్ రెండో అంతస్తు నుంచి కిందకు దూకాడు. తీవ్రగాయాల పాలైన అతడ్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. బాధితుడ్ని శివసాగర్ జిల్లా అమ్గూరికి చెందిన ఆనంద్ శర్మగా గుర్తించారు. ఈ యూనివర్సిటీలో ఎంకామ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అయితే తమ కుమారుడ్ని సీనియర్లు వారం రోజులుగా వేధిస్తున్నారని అతని తల్లి తెలిపింది. ఆదివారం కూడా 80 చెంపదెబ్బలు కొట్టారని, కర్రలు, బాటిళ్లతో టార్చర్ చేశారని వెల్లడించింది. అది భరించలేకే తన కుమారుడు భవనం పైనుంచి దూకేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. ర్యాగింగ్ విషయం గురించి హాస్టల్ వార్డెన్‌ను ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని ఆనంద్ శర్మ తల్లి వాపోయింది. ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జితెన్ హజారికా చెప్పారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సీఎం స్పందన.. ఈ ఘటనకు సంబంధించి మొత్తం ముగ్గురిని అరెస్టు చేశారు పోలీసులు. అయితే ప్రధాన నిందితుడు ఇంకా పరారీలోనే ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు విద్యార్థులు ర్యాగింగ్‌కు దూరంగా ఉండాలని సీఎం హిమంత బిశ్వ శర్మ సూచించారు. పోలీసులు తక్షణమే విచారణ చేపట్టి ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చదవండి: పెళ్లి చేసుకోకపోతే.. ముక్కలు ముక్కలు చేస్తా.. అమ్మాయికి బెదిరింపులు.. -
బాసర ట్రిపుల్ ఐటీలో ర్యాగింగ్!
బాసర(ముధోల్): బాసర ట్రిపుల్ ఐటీలో పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులను సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేయడంతో పోలీసులు ఐదుగురిపై కేసులు నమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. బాసర ట్రిపుల్ ఐటీలోని స్థానిక కృష్ణా బాయిస్ హాస్టల్ రూం నంబర్ 228ను పీయూసీ–1 విద్యార్థులకు అధికారులు కేటాయించారు. అయితే ఆ గదిలోని నూతన వస్తువులైన బెడ్ కార్టులు, ట్యూబ్ లైట్లను పీయూసీ–2 విద్యార్థులు జూనియర్లను బెదిరించి తీసుకెళ్లారు. ఇటీవల డైరెక్టర్ సతీశ్‌కుమార్ హాస్టల్ భవనాలు తనిఖీ చేసిన సందర్భంలో ఈ విషయాన్ని జూనియర్లు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో అప్పటి నుంచి కక్ష సాధింపు చర్యగా సీనియర్లు ర్యాగింగ్ చేయడం మొదలుపెట్టారు. రోజు రోజుకూ సీనియర్ల ర్యాగింగ్ శృతిమించడంతో బాధిత విద్యార్థులు పోలీసులను ఆశ్రయించారు. కళాశాల వార్డెన్ ఫిర్యాదు మేరకు తెలంగాణ ప్రొహిబిషన్ యాక్ట్ సెక్షన్ 323, 506, రాగింగ్ సెక్షన్ 4(1/2/3) ప్రకారం ఐదుగురు విద్యార్థులపై కేసులు నమోదు చేసినట్టు ఎస్సై మహేశ్ తెలిపారు. -
ఐబీఎస్ కాలేజ్ ర్యాగింగ్ ఘటన.. వెలుగులోకి సంచలన విషయాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం రేపిన ఐబీఎస్ కళాశాల ర్యాగింగ్ కేసులో మరిన్ని విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఓ మతాన్ని కించపరుస్తూ బాధిత విద్యార్ధి సోషల్ మీడియాలో పోస్టు పెట్టడంతో ఈ గొడవ మొదలైనట్లు పోలీసులు గుర్తించారు. బాధితుడు శంకర్పల్లి పోలీస్‌లకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసుకున్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో అయిదుగురిని అరెస్ట్ చేయగా.. మరో అయిదుగురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మహ్మద్ ఇమాద్, సోహైల్, వర్షిత్, గణేష్, వాసుదేవ్ వర్మ నే విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఇంత జరిగిన నిర్లక్ష్యంగా వ్యవహరించినా కాలేజీ యాజమాన్యంపై కూడా కేసు నమోదు చేయనున్నారు పోలీసులు. ఈ మేరకు కేసు ఎఫ్ఐఆర్లో మార్పులు చేశారు. కాగా రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం దొంతాన్పల్లి శివారులోని ఇక్ఫాయి(ఐబీఎస్) కళాశాలలో విద్యార్థి హిమాంక్ బన్సాల్‌పై సీనియర్లు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 1వ తేదీన జరిగిన ర్యాగింగ్ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఒక్క విద్యార్థిని లక్ష్యంగా చేసుకొని దాదాపు 10 మంది సీనియర్లు విచక్షణారహితంగా దాడి చేశారు. హాస్టల్ గధిలో బంధించి బాధితుడిపై కూర్చొని, పిడిగుద్దులు గుద్దుతూ తీవ్రంగా గాయపరిచారు. ఈ దృశ్యాలను వీడియో తీయగా.. బాధిత విద్యార్థి దీనిని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. విద్యార్థిని సీనియర్లు తీవ్రంగా కొడుతున్న వీడియో మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్ పోస్టు చేశారు. దీనిపై స్పందించిన ఆయన.. వెంటనే సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రకు పోస్టు చేస్తూ ఈ ఘటనపై తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో కళాశాల యాజమాన్యం దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది. దాడికి పాల్పడిన 12 మంది విద్యార్థులను ఏడాది పాటు సస్పెండ్ చేసింది. కారణం అదేనా! అయితే ఐసీఎఫ్ఏఐ కళాశాలలో బీబీఏ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ అబ్బాయి, అమ్మాయి చాటింగ్ చేసుకున్నారు. కొంతకాలం లవ్ చేసుకున్నాక వీరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. దీంతో యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో యువతిని అవమానిస్తూ పోస్టు పెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న యువతి తన బంధువైన సీనియర్ విద్యార్థికి చెప్పింది. ఇది కాస్తా వివాదానికి దారి తీసింది. అతడు తన స్నేహితులను వెంటబెట్టుకుని హాస్టల్లో ఉన్న యువకుడిపై దాడి చేశారు. మతపరమైన మనోభావాలను దెబ్బతీశారని ఆరోపిస్తూ 15 నుంచి 20 మంది సీనియర్లు తన హాస్టల్ గదిలోకి చొరబడి కొట్టారని బన్సల్ ఫిర్యాదులో పేర్కొన్నారు -
బాబోయ్.. ఇదేం ర్యాగింగ్!
చెన్నై: తమిళనాడులోని ఓ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ భూతం పడగ విప్పింది. సీనియర్లు ర్యాగింగ్ పేరిట జూనియర్లను శారీరకంగా వేధించారు. ఇందుకు సంబంధించిందిగా చెబుతున్న ఓ వీడియో ఇంటర్నెట్లో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో సీనియర్లు దారుణానికి తెగ పడ్డారు. జూనియర్ స్టూడెంట్స్‌ను కేవలం అండర్ వేర్‌పై నిలబెట్టి.. క్యాంపస్‌లోనే దారుణమైన పనులు చేయించారు. అర్థనగ్నంగా క్యాంపస్ రోడ్లపై రౌండ్లు వేయించడంతో పాటు బురదలో బస్కీలు, పుషప్స్ తీయించడం, వాటర్ పైపులతో నీళ్లను చల్లడం లాంటివి చేశారు. చేతికి దొరికిన వస్తువులను వాళ్ల మీదకు విసిరేశారు. మరోవైపు జూనియర్లను అర్థనగ్నంగానే ఒకరినొకరు కౌగిలించుకోవమని చెప్పడం, ప్రైవేట్ పార్ట్‌లపై కొట్టడం లాంటివి చేశాడు ఓ సీనియర్. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో.. కేసు నమోదు అయ్యింది. సీఎంసీ వెల్లూరు యాజమాన్యం.. ఈ ఘటనపై ఫిర్యాదు అందిందని, ఓ కమిటీ ఆధ్వర్యంలో దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి ఏడుగురు సీనియర్లపై వేటు పడినట్లు తెలుస్తోంది. వెల్లూరు ఎస్పీ ఈ ఘటనపై స్పందిస్తూ.. ర్యాగింగ్ వీడియో నిజమైందేనా? నకిలీదా? తేల్చే పనిలో ఉన్నట్లు తెలిపారు. Christian Medical College in Vellore has suspended seven senior medical students for ragging after videos of first-year MBBS students being beaten up, stripped & tortured went viral on social media.#TamilNadu #Vellore #CMC #CMCVellore #CMCRagging #MBBS #Ragging #ViralVideo pic.twitter.com/m5jkjMyUNf — Hate Detector 🔍 (@HateDetectors) November 9, 2022 ఇదీ చదవండి: కరగాట్టంలో ఇక అశ్లీలత ఉండకూడదు! -
వెటర్నరీ వర్సిటీలో ర్యాగింగ్ ‘కలకలం’.. 34 మందిపై చర్యలు!
సాక్షి, హైదరాబాద్: పీవీ నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపుతోంది. మొదటి ఏడాది చదువుతున్న 25 మంది విద్యార్థులను ర్యాగింగ్ చేశారన్న ఆరోపణలపై మొత్తం 34 మంది విద్యార్థులను హాస్టళ్ల నుంచి బహిష్కరించారు. ఇందులో తీవ్ర నేరం చేశారని భావిస్తున్న 25 మందిని రెండు వారాల పాటు తరగతులకు హాజరు కాకుండా కళాశాల ప్రాంగణం నుంచి బహిష్కరిస్తూ కళాశాల అసోసియేట్ డీన్, వార్డెన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణకు విశ్వవిద్యాలయ వర్గాలు ఆదేశించాయి. ఏం జరిగిందంటే...! రెండు, నాలుగో సంవత్సరం చదువుతున్న సీనియర్లు తమను ర్యాగింగ్ చేశారంటూ హాస్టల్ వార్డెన్‌కు 25 మంది జూనియర్ విద్యార్థులు సీల్డ్ బాక్స్‌లో ఫిర్యాదు చేశారు. వార్డెన్ ఘటనపై విచారణకు ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఈ నెల 27వ తేదీన మొదటి ఏడాది చదువుకుంటున్న జూనియర్లను, 28న రెండు, నాలుగో ఏడాది చదువుతున్న సీనియర్లను విచారించి ఆరా తీసింది. విచారణ తర్వాత మొత్తం 34 మంది విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడ్డారని ప్రాథమికంగా నిర్ధారిస్తూ ఈ నెల 29న సదరు కమిటీ నివేదిక ఇచ్చింది. ఇందులో 16 మంది రెండో ఏడాది విద్యార్థులు కాగా, 18 మంది నాలుగో ఏడాది విద్యార్థులున్నారు. నివేదిక ఆధారంగా 25 మందిని హాస్టల్–ఏ నుంచి బహిష్కరించడంతో పాటు తరగతులకు కూడా రెండు వారాల పాటు హాజరు కావద్దని ఆదేశించారు. అదే విధంగా మరో 9 మందిని అన్ని హాస్టళ్ల నుంచి బహిష్కరించడంతో పాటు కళాశాల వాహనాలు ఎక్కవద్దని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా, ర్యాగింగ్‌లో భాగంగా మొదటి ఏడాది చదువుతున్న జూనియర్లను సీనియర్లు కొందరు నగ్నంగా నిలబెట్టారనే ఆరోపణలు వస్తున్నాయి. -
నాగర్‌కర్నూల్: ర్యాగింగ్ భూతానికి మైనా బలి!
సాక్షి, నాగర్‌కర్నూల్: జిల్లాలో ఓ ప్రభుత్వకాలేజీలో ర్యాగింగ్ భూతం.. ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ర్యాగింగ్ చేశారనే మనస్థాపంతో మైనా అనే ఓ డిగ్రీ విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. హనుమాన్ తండాకి చెందిన మైనా(19).. జడ్చర్ల డాక్టర్ బీఆర్ఆర్ ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ చదవుతోంది. బుధవారం ఉదయం పొలానికి వెళ్లి పురుగుల మందు తాగింది. ఆపై ఇంటికి వచ్చి బాధపడుతుండగా.. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ సాయంత్రానికి కన్నుమూసింది. తొలుత సూసైడ్‌కి గల కారణాలు తెలియరాలేదు. అయితే ర్యాంగింగ్కు సంబంధించిన వీడియోగా ఒకటి వైరల్ కావడంతో.. తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేశారు. ర్యాగింగ్ ఘటనపై విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఇక వీడియోలో ఒకరు.. మైనాను కొడుతున్నట్లుగా ప్రచారం అవుతోంది. కౌన్సెలింగ్.. బెదిరింపులు? మైనాపై జరిగిన ర్యాగింగ్ బయటకు రాకుండా కాలేజీ యాజమాన్యం జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది. ఐదుగురు లెక్చరర్లు ఆమెకు కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు విషయం బయట చెప్పొద్దని ప్రిన్సిపాల్ సైతం బెదిరింపులకు పాల్పడ్డట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలపై యాజమాన్యం స్పందించాల్సి ఉంది. -
మెడి‘కిల్స్’పై ఎన్ఎంసీ నజర్
సాక్షి, హైదరాబాద్: మెడికల్ కాలేజీల్లో జరుగుతున్న ఆత్మహత్యలు, ఆత్మహత్యా ధోరణుల నివారణపై జాతీయ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) దృష్టి సారించింది. గత ఐదేళ్లలో ఆత్మహత్య చేసుకున్న పీజీ మెడికల్ విద్యార్థుల సంఖ్య, అదేకాలంలో కాలేజీలను మధ్యలోనే వదిలేసిన విద్యార్థుల వివరాలను తమకు అందజేయాలని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల ప్రిన్సిపాళ్లు, డీన్లకు తాజాగా లేఖ రాసింది. ఆత్మహత్యలు, కోర్సు వదిలిపెట్టి వెళ్లడం, వైద్య విద్యార్థుల పనివేళలకు సంబంధించిన ఒత్తిడి వివరాలను ఈ నెల ఏడో తేదీ నాటికి పంపాలని కోరింది. ఇటీవల ఎన్ఎంసీ ఆధ్వర్యంలోని అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డు(యూజీఎంఈబీ) అధ్యక్షులు డాక్టర్ అరుణ వి.వాణికర్ నేతృత్వంలో యాంటీ ర్యాగింగ్ కమిటీ ఏర్పాటైంది. దాని మొదటి సమావేశంలో వైద్యవిద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి అందిన ర్యాగింగ్ ఫిర్యాదులను సమీక్షించింది. వైద్యవిద్యార్థుల ఆత్మహత్యలు, ఆత్మహత్యా ధోరణిపై చర్చించింది. వైద్యవిద్యార్థులు సంబంధిత మెడికల్ కాలేజీలతోపాటు ఎన్ఎంసీకి కూడా ఫిర్యాదులు చేయడానికి ప్రత్యేక ఈ–మెయిల్ ఐడీని సృష్టించింది. ఈ సమాచారాన్ని అన్ని కాలేజీల వెబ్సైట్లలో ప్రదర్శించాలని, హాస్టల్, మెస్, క్లాస్రూమ్, లైబ్రరీ, లెక్చర్ హాల్, కామన్ రూమ్ మొదలైన ప్రముఖ ప్రదేశాలలో ప్రదర్శించడం ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని ఎన్ఎంసీ సూచించింది. 18–30 ఏళ్ల మధ్యలో ఆగమాగం వైద్యవృత్తిలో తలెత్తే ఒడిదొడుకులను తట్టుకోలేక కొందరు యువవైద్యులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఒక నివేదికలో వెల్లడించిన సంగతి తెలిసిందే. 2016 నుంచి 2020 మధ్యకాలంలో 18 నుంచి 30 ఏళ్ల వయసుకు చెందిన వివిధ రకాల వృత్తుల్లో ఉన్నవారు పలు సమస్యలతో 3,100 మంది ఆత్మహత్య చేసుకున్నారు. అందులో అనేకమంది వైద్యులు ఉన్నారని పేర్కొంది. అదేకాలంలో వివిధ వయస్సులవారు 12,397 మంది పరీక్షల్లో ఫెయిల్ కావడంవల్ల ఆత్మహత్య చేసుకున్నారు. వారిలోనూ వైద్య విద్యార్థులున్నారు. ఈ నేపథ్యంలో వైద్యవిద్యార్థుల్లో ఒత్తిడి, నిరాశలను తగ్గించడానికి మెడికల్ కాలేజీల్లో యోగాను ఎన్ఎంసీ ప్రవేశపెట్టింది. మరోవైపు విదేశాల్లో చదివిన వేలాదిమంది భారత వైద్య విద్యార్థుల్లో ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్(ఎఫ్ఎంజీఈ) పాసయ్యేవారు 20 శాతం వరకే ఉంటున్నారు. ఎఫ్ఎంజీఈ పాసైతేనే మనదేశంలో మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అర్హత ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆత్మహత్యల్లో మూడింట ఒక వంతు పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ విద్యార్థులు, మిగిలినవారు ప్రాక్టీస్ చేస్తున్న వైద్యులు ఉంటున్నారని నివేదికలు చెబుతున్నాయి. పీజీలో ఆర్థికభారం, వృత్తిపరమైన బాధ్యత, వివాహం కాకపోవడం వంటివి ఆత్మహత్యలకు కారణాలుగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఆత్మహత్యల్లో 60 శాతం ఒత్తిడికి సంబంధించినవే ఉంటున్నాయంటున్నారు. ఈ నేపథ్యంలో కాలేజీ స్థాయిలో జరిగే ఆత్మహత్యల నివారణకు ఎన్ఎంసీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. -
ఆచార్య జయశంకర్ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం
-
జూనియర్లను వేధించిన 20 మంది సీనియర్లపై కఠిన చర్యలు
అనంతపురం విద్య: జేఎన్టీయూ(అనంతపురం) ఇంజినీరింగ్ కళాశాల ఉన్నతాధికారులు ర్యాగింగ్‌పై ఉక్కుపాదం మోపారు. జూనియర్లపై వికృత చేష్టలకు పాల్పడిన సీనియర్ విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకున్నారు. ర్యాగింగ్ వ్యవహారంపై ప్రొఫెసర్ల కమిటీ బాధిత విద్యార్థులను, ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థులను విచారించింది. అనంతరం నివేదిక తయారు చేసి వర్సిటీ అధికారులకు అందజేసింది. ఈ క్రమంలో మంగళవారం జేఎన్టీయూ (ఏ) ఇంజినీరింగ్ కళాశాల మెయిన్ బిల్డింగ్‌లో ప్రిన్సిపాల్ పి. సుజాత, వైస్ ప్రిన్సిపాల్ బి.దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో సమావేశమైన కాలేజ్ అకడమిక్ కమిటీ నివేదికను పరిశీలించింది. ర్యాగింగ్‌కు పాల్పడిన 20 మంది విద్యార్థులను సస్పెండ్ చేయాలన్న ప్రొఫెసర్ల కమిటీ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. అయితే ర్యాగింగ్ పాల్పడిన వారిని మూడు కేటగిరీలుగా విభజించారు. మొదటి కేటగిరీ వారికి ఒక సెమిస్టర్ కాలం, రెండో కేటగిరీలోని వారిని నాలుగు వారాలు, మూడో కేటగిరీలోని వారిని రెండు వారాల పాటు సస్పెండ్ చేశారు. శిక్ష కాలంలో తరగతులు, హాస్టల్‌కు అనుమతి లేదని స్పష్టం చేశారు. -
JNTU లో పడగవిప్పిన ర్యాగింగ్ భూతం
-
Ragging in Suryapet: ఆరుగురు విద్యార్థులపై సస్పెన్షన్ వేటు
సాక్షి, నల్గొండ: సూర్యాపేట మెడికల్ కాలేజీ ర్యాగింగ్ ఘటన నిజమేనని తేలింది. ర్యాగింగ్‌పై ఏర్పాటు చేసిన కమిటీ హాస్టల్లో ర్యాగింగ్ జరిగినట్లు నివేదికలో తేల్చింది. ఏడాదిపాటు ఆరుగురు విద్యార్థులపై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు డీఎంఈ తెలిపారు. విద్యార్థులు తక్షణం హాస్టల్ ఖాళీ చేయాలంటూ డీఎంఈ ఆదేశించారు. కాగా, ర్యాగింగ్ ఘటన సంచలనంగా మారడంతో ప్రభుత్వం సీరియస్ అయ్యింది. కాగా, సూర్యాపేట మెడికల్ కళాశాలకు సంబంధించిన హాస్టల్లో ఓ జూనియర్ విద్యార్థిని రెండో సంవత్సరం విద్యార్థులు నాలుగు గంటలు గదిలో బంధించి హింసించారు. మోకాళ్లపై కూర్చోబెట్టి సెల్యూట్ చేయించుకోవడమే కాకుండా పిడిగుద్దులు గుద్దారు. కన్నీరుపెట్టి వేడుకున్నా వదలకుండా ట్రిమ్మర్‌తో గుండు గీసేందుకు ప్రయత్నించారు. టాయిలెట్ వస్తుందని అక్కడి నుంచి బయటపడ్డ ఆ విద్యార్థి ఫోన్ చేసి విషయం తల్లి దండ్రులకు చెప్పాడు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. చదవండి: (కులమేంటని అడిగి.. సార్ అని పిలవాలని హుకుం, గదిలో బంధించి దారుణం) -
సూర్యాపేట మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఉదంతం
-
సూర్యాపేట మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం
-
కులమేంటని అడిగి.. సార్ అని పిలవాలని హుకుం, గదిలో బంధించి దారుణం
సూర్యాపేట క్రైం: కాలేజీల్లో ర్యాగింగ్ భూతం అంతమైపోయిందన్న సమయంలో మళ్లీ అలాంటి సంఘటన ఒకటి వెలుగు చూసింది. సూర్యాపేట మెడికల్ కళాశాలకు సంబంధించిన హాస్టల్లో ఓ జూనియర్ విద్యార్థిని రెండో సంవత్సరం విద్యార్థులు నాలుగు గంటలు గదిలో బంధించి హింసించారు. మోకాళ్లపై కూర్చోబెట్టి సెల్యూట్ చేయించుకోవడమే కాకుండా పిడిగుద్దులు గుద్దారు. కన్నీరుపెట్టి వేడుకున్నా వదలకుండా ట్రిమ్మర్‌తో గుండు గీసేందుకు ప్రయత్నించారు. టాయిలెట్ వస్తుందని అక్కడి నుంచి బయటపడ్డ ఆ విద్యార్థి ఫోన్ చేసి విషయం తల్లి దండ్రులకు చెప్పాడు. తమ రూమ్‌కు రమ్మని కబురు పంపి.. హైదరాబాద్‌లోని మైలార్‌దేవులపల్లికి చెందిన విస్కనూరి సురేష్ కుమారుడు సాయికుమార్ సూర్యాపేట మెడికల్ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. గత నెల 15 నుంచి జనవరి 2 వరకు సెలవులు ప్రకటించడంతో ఇంటికి వెళ్లాడు. సెమిస్టర్స్ ఉండటంతో ప్రిపేర్ అయ్యేందుకు ఈ నెల 1న రాత్రి 8 గంటలకు మెడికల్ కళాశాలకు సంబంధించిన రెడ్డి హాస్టల్‌కు చేరుకున్నాడు. రాత్రి భోజనం చేసి హాస్టల్లోని రెండో ఫ్లోర్‌లోని తన రూమ్‌కు వెళ్లాడు. రాత్రి 8.40కు సాయికుమార్‌ను ఫస్ట్ ఫ్లోర్‌కు రమ్మని హరీశ్‌తో పాటు మరికొందరు రెండో సంవత్సరం విద్యార్థులు.. నితీశ్‌తో కబురు పంపారు. దీంతో ఫస్ట్ ఫ్లోర్‌కు వచ్చిన సాయిని ఫార్మల్ డ్రెస్, షూ వేసుకురమ్మనగా అతను అలాగే వేసుకొని వచ్చాడు. సీనియర్స్ హరీశ్, రంజిత్, శ్రవణ్, శశాంక్, మహేందర్, చాణక్య, సుజిత్ తదితర 25–30 మంది సాయితో సెల్యూట్ చేయించుకున్నారు. ‘కులమేంటని అడిగారు. సార్ అని పిలవాలని, తల్లిదండ్రులు, అక్కాచెల్లి వివరాలు చెప్పాలని వేధించారు. ఇందంతా వీడియో తీశారు. వాయిస్ రికార్డింగ్ చేస్తావా అంటూ మోకాళ్లపై కూర్చోబెట్టి పిడి గుద్దులు గుద్దారు. ట్రిమ్మర్‌తో గుండు గీయాలని చూశారు’ అని సాయి కన్నీరుమున్నీరయ్యాడు. టాయిలెట్ వస్తుందని చెప్పి.. టాయిలెట్ వస్తుందని చెప్పి ఫస్ట్ ఫ్లోర్‌లోని బాత్రూమ్కు సాయి వెళ్లాడు. అక్కడ నుంచి తన రూమ్‌కు వెళ్లి మరో జూనియర్ విద్యార్థి వద్ద ఫోన్ తీసుకుని తల్లిదండ్రులకు ఏడుస్తూ విషయాన్ని వివరించాడు. వెంటనే తండ్రి సురేశ్ హైదరాబాద్ నుంచే 100కు కాల్ చేసి ఫిర్యాదు చేశారు. అరగంట తర్వాత సూర్యాపేట పట్టణ పోలీసులు రెడ్డి హాస్టల్‌కు చేరుకుని సాయిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తల్లిదండ్రులు తెలిపారు. అయితే, జరిగిన ఘటనపై తమకెలాంటి ఫిర్యాదు అందలేదని, లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందితే చర్యలు తీసుకుంటామని సూర్యాపేట పట్టణ సీఐ ఆంజనేయులు చెప్పడం గమనార్హం. రాజీ కుదిర్చాం.. వెళ్లిపోండంటూ.. సాయి తల్లిదండ్రులు జరిగిన విషయాన్ని కాలేజీ సూపరింటెండెంట్‌కు చెప్పగా.. ‘రాజీ కుదిర్చాం. పోలీసులతో మాట్లాడాం. కాలేజీ పేరు బజారున పడకుండా ఉండాలంటే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి. కళాశాల అన్నాక ఇలాంటివి సర్వసాధారణమే’నని చెప్పి పంపించినట్లు విద్యార్థి తండ్రి తెలిపాడు. విషయాన్ని బయటకు చెప్పొద్దని హుకూం జారీ చేశారని కన్నీరుమున్నీరయ్యారు. గతంలో మరొకరిని ర్యాగింగ్ చేసినా ఎందుకు పట్టించుకోలేదని నిలదీయగా ‘మేం చూసుకుంటాం. మీరు వెళ్లిపోండి’ అని సూపరింటెండెంట్ ఘాటుగా చెప్పారని వాపోయారు. దీనిపై సూపరింటెండెట్ మురళీధర్‌రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సీవీ శారదను వివరణ కోరేందుకు యత్నించగా ఫోన్ తీయలేదు. సూసైడ్ చేసుకోవాలనుకున్నా శనివారం రాత్రి సీనియర్స్ నన్ను 4 గంటలు గదిలో బంధించి మద్యం, పొగ తాగుతూ పిడిగుద్దులు గుద్దారు. వీడియోలు తీసి ట్రిమ్మర్‌తో గుండు గీసేందుకు ప్రయత్నించారు. తల్లిదండ్రులు, సిస్టర్స్ బయోడేటా వందసార్లు చెప్పించారు. దీంతో శనివారం అర్ధరాత్రి సూసైడ్ చేసుకోవాలనిపించింది. నెల రోజులుగా హాస్టల్లో ర్యాగింగ్ చేస్తున్నారు. యాజమాన్యానికి చెప్పినా పట్టించుకోలేదు. పోలీసులకు ఫిర్యాదు చేసి రెండ్రోజులైనా న్యాయం జరగలేదు. – సాయికుమార్, ప్రథమ సంవత్సరం విద్యార్థి, సూర్యాపేట మెడికల్ కళాశాల -
KMC: వైద్యకళాశాలలో మరోసారి ర్యాగింగ్ కలకలం
సాక్షి, వరంగల్: వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ ( కేఎంసీ )లో ర్యాగింగ్ కలకలం సృష్టిస్తోంది. సీనియర్ విద్యార్థులు మద్యం మత్తులో ఫ్రెషర్స్ డే పేరుతో జూనియర్లను ర్యాగింగ్ చేస్తున్నారంటూ ట్విట్టర్ లో ప్రధానికి, కేంద్ర హోం మంత్రికి ఫిర్యాదు చేయడం అందరిని ఆందోళన కు గురిచేస్తుంది. అప్రమత్తమైన అధికారులు, పోలీసులు విచారణ చేపట్టి, అలాంటిది ఏమి లేదని తేల్చారు. ట్విట్టర్ ద్వారా ఫిర్యాదుపై సైబర్ క్రైమ్ ద్వారా ఆరా తీస్తున్నారు. వరంగల్ కేఎంసీలో ట్విట్టర్ వేదికగా ర్యాగింగ్ ఫిర్యాదు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. సినీయర్స్ 50 మంది మద్యం తాగి తమను వేధిస్తున్నారని ట్వీట్టర్ ద్వారా రెడ్డి పేరుతో ఓ విద్యార్థి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రాష్ట్రమంత్రి కేటీఆర్, డీజీపీ, రాష్ట్ర వైద్యశాఖ డైరెక్టర్ ట్యాగ్ చేస్తూ ఫిర్యాదు చేశాడు. సోషల్ మీడియా ద్వారా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన విషయంపై ఘటనపై డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రమేశ్ రెడ్డి ఆరా తీశారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్ దాసు ను వివరణ కోరగా అలాంటిది ఏమిలేదన్నారు. జూనియర్ విద్యార్థుల హాస్టల్, సీనియర్ల హాస్టల్ భవనాలు దూరంగా ఉంటాయని తెలిపారు. సీనియర్లు కొందరు జన్మదిన వేడుకలు చేసుకున్నారని, ఆ సందర్భాన్ని గిట్టనివారు ఇలా చిత్రీకరిస్తున్నారని తేల్చిచెప్పారు. కేఎంసీలో జరగాల్సిన ప్రెషర్ డే కు సైతం అనుమతి ఇవ్వలేదన్నారు. ట్విటర్ లో వచ్చిన ఫిర్యాదుపై స్పందించిన పోలీసు కమిషనర్ ఆదేశాలతో మట్టెవాడ పోలీసులు కేఎంసీలో విచారణ నిర్వహించారు. ర్యాగింగ్ పై తమకు విద్యార్థులు ఎవరూ ఫిర్యాదు చేయలేదని ఏసీపీ గిరికూమార్ తెలిపారు. ట్విట్టర్ లో వచ్చిన ఫిర్యాదు పై సైబర్ క్రైమ్ ద్వారా విచారణ జరుపుతున్నామని తెలిపారు. గిరి కూమార్ - ఏసిపి, వరంగల్. రెండు మాసాల క్రితం ఉత్తరాదికి చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెను కళాశాలలో ర్యాగింగ్ కు గురయ్యారనే ప్రచారం జరిగింది. తాజాగా మద్యం మత్తులో సీనియర్స్ ర్యాగింగ్ కు పాల్పడుతున్నారని జూనియర్ విద్యార్థిగా అజ్ఞాత వ్యక్తి ట్విట్టర్ ద్వారా ప్రధాన మంత్రి, హోంమంత్రి, రాష్ట్రమంత్రి కి ఫిర్యాదు చేయడం కలకలం సృష్టిస్తోంది. నిప్పులేనిదే పొగరాదని స్థానికులు భావిస్తున్నారు. -
దారుణం: ర్యాగింగ్ పేరుతో పైలట్‌పై గన్ ఫైరింగ్..!
పారిస్: ర్యాగింగ్ పేరుతో ఓ పైలట్‌పై గన్ ఫైరింగ్ జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది, ఈ సంఘటన ఫ్రాన్స్ దేశానికి చెందిన మధ్యధరా సముద్రంలోని కార్సికా ద్వీపంలో సోలెన్జారా వైమానిక స్థావరంలో చోటుచేసుకుంది. ర్యాగింగ్‌కు పాల్పడ్డ వారిపై క్రిమినల్ కంప్లెయిట్ను బాధితుడు ఫైల్ చేశాడు. వైమానిక దళ శిక్షణ సమయంలో సహచర పైలట్లు అతడిని ఫైరింగ్ టార్గెట్‌కు కట్టేసి, అతడి మీదుగా ఫైటర్ విమానాలను పోనిస్తూ పైలట్‌పై కాల్పులను జరిపారని ఫిర్యాదులో తెలిపాడు. సహచరులు పాశవికంగా ప్రవర్తించారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దానికి సంబంధించిన వీడియోలను, ఫోటోలను అతడి న్యాయవాది ఫ్రెడ్రిక్ బెర్నా ఫిర్యాదులో పొందుపర్చాడు. ఈ సంఘటన 2019 మార్చిలో చోటుచేసుకున్న బాధితుడు మిలటరీ అధికారులను సవాలు చేయడానికి భయపడి ర్యాగింగ్ పాల్పడిన వారిపై ఫిర్యాదును ఇవ్వలేదు. ఆ సమయంలో వారిపై ఫిర్యాదును ఇవ్వలేకపోయాడని బాధితుడి లాయర్ పేర్కొన్నారు. కాగా ఈ విషయంపై ఫ్రెంచి వైమానిక దళ ప్రతినిధి కల్నల్ స్టీఫెన్ స్పెట్ స్పందించారు. శిక్షణ కేంద్రంలో ర్యాగింగ్ లాంటి చర్యలకు తావుండదని తెలిపారు. ర్యాగింగ్‌పై అంతర్గత విచారణ జరిగిందని తెలిపారు. అంతేకాకుండా వారికి శిక్షను కూడా విధించామని పేర్కొన్నారు. కాగా నిందితులపై ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియదని, అంతేకాకుండా నిందితులను ఈ కేసు నుంచి తప్పించేలా చర్యలు జరుగుతున్నాయనీ బాధితుడి లాయర్ ఆరోపించారు. చదవండి: అమెరికాలో కాల్పులు: వేర్వేరు చోట్ల 12 మంది మృతి -
‘నలుగురు అబ్బాయిలను ముద్దు పెట్టుకున్నా’
కొత్త కథలతో ముందుకు వచ్చే బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా తాజాగా నటించిన చిత్రం ‘శుభ్ మంగళ్ జ్యాద సావధాన్’. ఇద్దరు అబ్బాయిల మధ్య ప్రేమ అన్నకాన్సెప్ట్తో ఈ సినిమా సాగుతుంది. ఇక ఇప్పటికే విడుదలైన ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా పెళ్లి మండపంలో హీరో సహనటుడు జితేంద్ర కుమార్‌ను అందరి ముందే ముద్దాడటం వంటి సీన్లు కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అయితే ఆన్ స్క్రీన్‌పై మాత్రమే కాకుండా నిజజీవితంలోనూ ఇలాంటి అనుభవం ఎదురైందంటూ వారి గతాన్ని గుర్తు చేసుకునే ప్రయత్నం చేశారు ఖురానా, జితేంద్ర.(‘గే’ పాత్రలో కనిపించనున్న స్టార్ హీరో!) ఆయుష్మాన్ మాట్లాడుతూ.. ట్రూత్ అండ్ డేర్ ఆట ఆడుతున్న సమయంలో అబ్బాయిని కిస్ చేయాలని టాస్క్ ఇచ్చారన్నాడు. దీంతో ధైర్యంగా ముందుకు వచ్చి తోటివాడిని ముద్దుపెట్టుకున్నానని చెప్పుకొచ్చాడు. ఇక సహనటుడు జితేంద్ర మాట్లాడుతూ.. కాలేజీలో ర్యాగింగ్ ద్వారా తనకు చేదు అనుభవం జరిగిందన్నాడు. ‘ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలో ఓరోజు నన్ను పిలిచి నలుగురు అబ్బాయిలకు ముద్దు పెట్టాలని ఒత్తిడి చేశారు. ఇప్పుడంటే ర్యాగింగ్‌పై నిషేధం ఉంది కానీ ఆ సమయంలో ర్యాగింగ్ రక్కసి రాజ్యమేలుతోందని, దీంతో వాళ్లు చెప్పింది చేయక తప్పలేద’ని వాపోయాడు. కాగా కామెడీ అండ్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. (ఔను.. వాళ్లిద్దరు ప్రేమించుకుంటున్నారు) -
రిమ్స్‌లో భయానక వాతావరణం..
శ్రీకాకుళం: రిమ్స్ వైద్య కళాశాలలో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. భయానక వాతావరణం నెలకొంటోంది. కొందరు సీనియర్లు జూనియర్లను చిత్ర హింసలకు గురిచేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండురోజులపాటు ఓ గదిలో బంధించి క్రికెట్ స్టంప్లతో కొట్టడంతో వారు గాయపడ్డారు. వారికి కనీసం తిండి కూడా పెట్టకుండా, దుస్తులు ఊడదీసి చిత్రహింసలకు గురిచేసినట్టు సమాచారం. భయభ్రాంతులైన వీరు సమాచారాన్ని వారి తల్లిదండ్రులకు అందించారు. అలాగే జరిగిన విషయాన్ని రిమ్స్ కళాశాల అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై కఠినంగా వ్యవహరించాల్సిన అధికారులు ఇరు వర్గాలను రాజీ చేసే ప్రయత్నాలు చేయడం విమర్శలకు తావిస్తోంది. పోలీసులకు ఫిర్యాదు చేయకుండా దెబ్బలు తిన్న, దాడి చేసిన విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి, మాట్లాడి పంపించేసినట్లు కొందరు విద్యార్థులు చెబుతున్నారు. సీనియర్లు కొట్టిన దెబ్బలకు జూనియర్ విద్యార్థుల శరీరంపై గాయాలు రిమ్స్ కళాశాలలోనే చదువుతున్నప్పటికీ హాస్టల్లో ఉండడానికి అనుమతిలేని ఓ విద్యార్థి గడిచిన కొన్నేళ్లుగా హాస్టల్లోనే ఉంటూ కొందరిని భయభ్రాంతులకు గురిచేస్తున్నాడన్న ఆరోపణలువినిపిస్తున్నాయి. సదరు విద్యార్థి పరీక్షలకు హాజరు కాకుండా, వ్యసనాల బారిన పడినట్లు కూడా తెలియవచ్చింది. ఇదే విషయం రిమ్స్ అధికారులకు కూడా విద్యార్థులు చెప్పగా దానిని కూడా సర్దిచెప్పినట్లు జూనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విద్యార్థి తరచూ ఎవరో ఒకరితో గొడవపడుతూ వారు తిరగబడిన పక్షంలో తన వెనుక రౌడీలు ఉన్నారని బెదిరించినట్లు సమాచారం. కొన్ని సందర్భాల్లో కొందరు యువకులను కూడా హాస్టల్ వద్దకు తీసుకొచ్చి బెదిరించినట్లు జూనియర్లు చెబుతున్నారు. ప్రస్తుత సంఘటనలో.. ఎవరికైనా చెబితే రౌడీలతో కొట్టిస్తానని బెదిరించడంతో బాధితులు హాస్టల్ నుంచి బయటకు వెళ్లి ప్రైవేటుగా ఉంటున్న కొందరు స్నేహితుల ఇంటిలో తలదాచుకుంటున్నారు. రిమ్స్ అధికారులు వారికి కబురుపెట్టి, దాడి చేసిన విద్యార్థి తల్లిదండ్రుల ఎదుట హాజరుపరచి రాజీ ధోరణిలో మాట్లాడినట్లు కొందరు వైద్య విద్యార్థులు చెబుతున్నారు. కఠినంగా వ్యవహరించకపోతే భవిష్యత్‌లో కూడా ఇటువంటి సంఘటనలు పునరావృతమయ్యే ప్రమాదముంటుందని అంటున్నారు. అనధికారికంగా ఓ విద్యార్థి హాస్టల్లో ఉంటున్న విషయం గుర్తించలేకపోవడాన్ని కూడా వారు ఆక్షేపిస్తున్నారు. తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడాం ఇద్దరు విద్యార్థులను సీనియర్లు కొట్టిన విషయాన్ని వారి తల్లిదండ్రుల ద్వారా తెలుసుకున్నాం. కొట్టిన విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడాం. దాడి చేసిన విద్యార్థిని పంపించేశాం. ప్రస్తుతం విద్యార్థులంతా సంతోషంగానే ఉన్నారు. – డాక్టర్ కృష్ణవేణి, ప్రిన్సిపాల్, రిమ్స్ వైద్య కళాశాల అనధికారికంగా ఉంటున్న విషయం తెలీదు రిమ్స్ వైద్య కళాశాల హాస్టల్లో అనధికారికంగా ఉంటున్న విద్యార్థి విషయం విద్యార్థులు గాని, సిబ్బంది గాని నా దృష్టికి తీసుకురాలేదు. విద్యార్థులు ఫిర్యాదు చేసిన వెంటనే హాస్టల్ నుంచి పంపించేశాం. అతనిని హెచ్చరించాం. ఇక మీదట ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తాం.– డాక్టర్ బోర ప్రసాద్, వార్డెన్ -
'దిశ' అప్పుడు ఉంటే.. మా అమ్మాయి బతికేది!
సాక్షి, కాకినాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన 'దిశ' చట్టం.. నాలుగేళ్ల కిందటే వచ్చి ఉంటే.. తమ కూతురు బలవన్మరణానికి పాల్పడకుండా ఇవాళ బతికే ఉండేదని రిషితేశ్వరి తల్లిదండ్రులు అన్నారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే సత్వరమే కఠినశిక్ష విధించేలా తీసుకొచ్చిన దిశ చట్టంపై రిషితేశ్వరి తల్లిదండ్రులు మురళీకృష్ణ,దుర్గాబాయ్ మాట్లాడారు. దిశ చట్టంతో ఆడపిల్లలు, మహిళలు ఎంతో ధైర్యంగా ఉంటారని, వారితో అసభ్యంగా ప్రవర్తించాలని చూస్తే మరణ శిక్ష పడుతుందనే భయం వస్తుందని అన్నారు. మహిళల భద్రత కోసం దిశ చట్టాన్ని తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి.. రాష్ట్రంలోని ఆడపిల్లల తరపున కృతజ్ఞతలు తెలిపారు. కళాశాలల విద్యార్థులతో పాటుగా గ్రామీణ స్థాయిలో ప్రజలకు దిశ చట్టంపై అవగహన కల్పించాలని ఈ సందర్భంగా రిషితేశ్వరి తల్లిదండ్రులు కోరారు. గతంలోకి వెళితే.. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో సహ విద్యార్థుల అమానుష చర్యల (ర్యాగింగ్) కారణంగా ఆర్కిటెక్చర్ విద్యార్థిని ఎం. రిషితేశ్వరి ఆత్మహత్యకు పాల్పడింది. ఆర్కిటెక్చర్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ బాబూరావుతో సహా మరో ముగ్గురు విద్యార్థుల ప్రమేయం ఉన్న సంగతి తెలిసిందే. చదవండి: ఆగస్టు 13 నుంచి రిషితేశ్వరి కేసు విచారణ ప్రారంభం రిషితేశ్వరి ఆత్మహత్యకు అప్పటి ప్రిన్సిపలే కారణం -
ర్యాగింగ్‌పై నివేదిక, ఏం తేలనుందో...
సాక్షి, నిజామాబాద్ అర్బన్: ప్రభుత్వ మెడికల్ కళాశాలలలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపుతుంది. రెండు రోజులుగా విద్యార్థులు, అధ్యాపకులు హైరానా పడుతున్నారు. జూనియర్లను ర్యాగింగ్ చేస్తున్న సీనియర్లు, అధ్యాపకులపై ఆరోపణలు వెలువెత్తడం ఆందోళన కలిగి స్తోంది. కళాశాలలో పరిపాలన వ్యవస్థ సక్రమంగా లేదని ఆరోపణలు రావడంపై ఉన్నతాధికారులు దృష్టిసారించారు. కొన్ని రోజులుగా సీనియర్ వైద్య విద్యార్థులు జూనియర్లపై ర్యాగింగ్‌కు పాల్పడుతుండడంతో కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కొన్ని రోజులుగా కళాశాల ఆవరణలో రాత్రి వేళలో పర్యవేక్షణ లేకపోవడంతో విద్యార్థులు ఇష్టారీతిన తిరగడం, మద్యం సేవించడం కొనసాగుతోంది. ఇదివరకు పలుమార్లు కళాశాల ప్రిన్సిపాల్ విద్యార్థులను గట్టిగా హెచ్చరించారు. ముగ్గురు విద్యార్థులపై సైతం చర్యలు తీసుకుని ఇంటికి పంపించారు. అయినా కళాశాలలో విద్యార్థుల ప్రవర్తన మారకపోవడంతో జూనియర్ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు వెళ్లడం కలకలంరేపింది. ఆందోళన ర్యాగింగ్ ఘటనకు సంబంధించి నివేదికలో ఏముందోనని అధ్యాపకులు, విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ర్యాగింగ్ ఘటనపై డీఎంఈ రమేశ్‌రెడ్డి ముగ్గురు ప్రొఫెసర్లతో విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ప్రొఫెసర్లు శ్రీనివాస్, నాగేశ్వర్, శివప్రసాద్‌లు కళాశాలలో విచారణ చేపట్టి నివేదికను డీఎంఈకి పంపించారు. విద్యార్థులను అధ్యాపకులను వేర్వేరుగా విచారించారు. ర్యాగింగ్ ఘటనలు జరిగినట్లు కొందరు జూనియర్ విద్యార్థులు కమిటీ ముందు గోడు వెల్లబోసుకున్నట్లు తెలిసింది. అలాగే కళాశాలలో రాత్రివేళలో మద్యం సేవిస్తున్నారని కొందరు విద్యార్థినులు పేర్కొన్నారు. సెక్యూరిటీ వ్యవస్థ లేకుండాపోయిందని వాపోయినట్లు తెలిసింది. దీంతో నివేదికలో ఏముందోనని ఎలాంటి చర్యలు ఉంటాయోనని అధ్యాపకులు, విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ర్యాగింగ్‌కు పాల్పడితే ఎవరైనా సరే ఉపేక్షించేది లేదని డీఎంఈ తెలిపారు. అలాగే కళాశాలలో జరుగుతున్న సంఘటనపై ఇంటలిజెన్స్ వర్గాలు ఆరా తీసి ప్రభుత్వానికి నివేదిక పంపారు. విద్యార్థులకు సెక్యూరిటీ విధానం సరిగ్గా లేదని నివేదిక కమిటీ కూడా పేర్కొన్నట్లు సమాచారం. ఈ వ్యవహారాలపై విద్యార్థుల తల్లిదండ్రులు కళాశాలలో ఏంజరుగుతుందోనని ఆరా తీస్తున్నారు. మరోవైపు తల్లిదండ్రుల రాకపోకలు కొనసాగుతున్నాయి. ర్యాగింగ్ అవాస్తవం ► మెడికల్ కళాశాలపై వచ్చినవి వదంతులే.. ► ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ఇందిర నిజామాబాద్ అర్బన్: రెండు రోజులుగా ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్ పేరిట వస్తున్న కథనాలు అవాస్తవాలని కళాశాల ప్రిన్సిపల్ ఇందిర గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. కళాశాలలో ర్యాగింగ్ విషయంపై జూనియర్ విద్యార్థులను విచారించగా ఎలాంటి ర్యాగింగ్ జరగలేదని వారు తెలిపారన్నారు. అలాగే విద్యార్థులు గాని, వారి తల్లిదండ్రులు గాని పోలీస్‌స్టేషన్ ఫిర్యాదు చేయలేదని పేర్కొన్నారు. పోలీసులు కేవలం ర్యాగింగ్‌పై అవగాహన సదస్సు నిర్వహించేందుకు కళాశాలకు వచ్చారన్నారు. తెలంగాణ వైద్య విద్య సంచాలకుల ఆదేశాల మేరకు ముగ్గురి సభ్యులతో కూడిన కమిటీ ద్వారా వసతి గృహాల్లో విచారణ చేపట్టిందన్నారు. నివేదికను సీల్డ్కవర్లో డీఎంఈ కార్యాలయానికి పంపించడం జరిగిందన్నారు. ర్యాగింగ్, మత్తు పదార్థాల వాడకంపై పత్రికలు, టీవీల్లో కథనాలు రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారన్నారు. కళాశాలలో ర్యాగింగ్, మత్తు పదార్థాల వినియోగం లాంటివి ఏమీ జరగడం లేదని పేర్కొన్నారు. -
మెడికల్ కళాశాలలో రాగింగ్ కలకలం
-
మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం
సాక్షి, నిజామాబాద్: జిల్లాలో ర్యాగింగ్ కలకలం సంచలనంగా మారింది. నిజామాబాద్ మెడికల్ కళాశాల విద్యార్థిని తనను కొంతమంది ర్యాంగింగ్ చేస్తున్నారంటూ తల్లిదండ్రులతో కలిసి పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా హాస్టల్లో విద్యార్థులు మద్యం తాగుతున్నట్లుగా గుర్తించారు. కాలేజీ యాజమాన్యం ర్యాంగింగ్కు పాల్పడిన ముగ్గురు వైద్య విద్యార్థులను హాస్టల్ నుంచి తొలగించింది. పోలీసుల హెచ్చరికలతో డీఎంఈ విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. -
రిమ్స్‌లో ర్యాగింగ్‌పై సదస్సు
సాక్షి, వైఎస్సార్ జిల్లా : పోలీసు శాఖ ఆధ్వర్యంలో రిమ్స్ మెడికల్ కళాశాలలో యాంటీ ర్యాగింగ్ అవగాహన సదస్సు నిర్వహించారు. ర్యాగింగ్ వల్ల కలిగే అనర్థాలు, సైబర్ నేరాలు అరికట్టే విధంగా డేగ కళజాత బృందం ఆధ్వర్యంలో నాటకాన్ని ప్రదర్శించారు. జిల్లా ఎస్పీ అభిషేక్ మొహంతి, కడప డీఎస్పీ సూర్యనారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఈ సదస్సులో రిమ్స్ మెడికల్ విద్యార్థులు భారీగా హాజరయ్యారు. -
గుండు చేయించుకుని.. భక్తితో నమస్కరిస్తూ
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఓ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ భూతం మరోసారి వెలుగు చూసింది. దాదాపు 150 మందికి పైగా జూనియర్ విద్యార్థులు గుండు చేయించుకుని.. సీనియర్లకు సెల్యూట్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. సైఫాయ్ గ్రామంలోని ఉత్తర ప్రదేశ్ యూనివర్శిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కాలేజీలో ఈ దారుణం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియలో తెగ ప్రచారం అవుతున్నాయి. ఈ వీడియోలో 150 మంది వరకు ఫస్టియర్ విద్యార్థులు గుండు చేయించుకుని.. వరుసలో నడుస్తూ.. సీనియర్లకు భక్తితో నమస్కరిస్తున్నారు. ఆ సమయంలో ఓ సెక్యూరిటీ గార్డ్ అక్కడే ఉన్నాడు. కానీ అతడు దీన్ని ఆపడానికి ప్రయత్నించకపోవడం గమనార్హం. దీని గురించి కాలేజీ యాజమాన్యాన్ని ప్రశ్నించగా.. ‘మా కళశాలలో ర్యాగింగ్‌ని నిషేధించి చాలా కాలమవుతుంది. కాలేజీలో ఇలాంటి చర్యలకు పాల్పడకుండా కఠిన నిర్ణయాలు అమలు చేస్తున్నాం. ఇందుకు కోసం ప్రత్యేకంగా ఓ అధికారిని కూడా నియమించాం. ప్రస్తుతం జరిగిన సంఘటన గురించి పూర్తిగా విచారణ జరుపుతాం. ఇందుకు బాధ్యులైన వారిమీద కఠిన చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు. -
'ర్యాగింగ్ చేస్తే ఇంటికే’
సాక్షి, సిటీబ్యూరో: ‘ర్యాగింగ్ చేస్తే ఇక ఇంటికే’ అనే నినాదంతో జేఎన్టీయూ హైదరాబాద్ ప్రచారం చేస్తోంది. ఇంజినీరింగ్ తరగతులు ప్రారంభమైన నేపథ్యంలో ‘యాంటీ ర్యాగింగ్’ కార్యాచరణ చేపట్టింది. ప్రత్యేక కమిటీల నియామకం, నూతన విద్యార్థులకు ప్రత్యేక వసతులు కల్పించడం, యాంటీ ర్యాగింగ్‌పై విస్తృతంగా ప్రచారం నిర్వహించడం తదితర చేపడుతోంది. జేఎన్టీయూహెచ్కు అనుబంధంగా రాష్ట్రంలో 423 కళాశాలలు ఉండగా... వాటిలో 3.50 లక్షల మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. ప్రతిఏటా కొత్తగా వీటిలో చేరుతున్న విద్యార్థులు ర్యాగింగ్ విషయంలో ఆందోళన చెందుతున్నారు. దీంతో జేఎన్టీయూహెచ్ ప్రత్యేకంగా ప్రచారం చేస్తోంది. ర్యాగింగ్ నివారణకు ప్రభుత్వం కఠిన చట్టాలనూ అమల్లోకి తెచ్చింది. యాజమాన్యందే బాధ్యత ఎవరైనా విద్యార్థి ర్యాగింగ్ బారినపడినప్పుడు అవసరమైన సహాయం కోసం ఎవరిని సంప్రదించాలనే వివరాలను ఆయా కళాశాలల యాజమాన్యాలు కరపత్రాలు, బ్యానర్ల రూపంలో క్యాంపస్‌లో ఏర్పాటు చేయాలి. అడ్మిషన్ సమయంలో వాట్సాప్ ద్వారా విద్యార్థులకూ పంపించాలి. కళాశాల చైర్మన్, ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, వార్డెన్, హెచ్ఓడీలు, స్థానిక ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ల ఫోన్ నంబర్లను విద్యార్ధులకు అందుబాటులో ఉంచాలి. అధ్యాపకులు తరచూ నూతన విద్యార్థులతో మాట్లాడుతూ వారిలో భయాందోళనను తొలగించాలి. కళాశాలల్లో ర్యాగింగ్ జరిగినట్లయితే సంబంధిత యాజమాన్యం బాధ్యత వహించాల్సి ఉంటుంది. ర్యాగింగ్‌ను పూర్తిగా అరికట్టేందుకు హాస్టల్ లొకేషన్ కమిటీ, క్యాంటీన్ కమిటీ, డిపార్ట్మెంట్ కమిటీ, స్పోర్ట్స్ ఏరియా కమిటీలను ఏర్పాటు చేయాలి. శిక్షలివీ... ♦ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ర్యాగింగ్ వ్యతిరేక చట్టం–1997లో యాంటీ ర్యాగింగ్‌కు సంబంధించి యాక్ట్ 26ను తీసుకొచ్చింది. విద్యాసంస్థల్లో ర్యాగింగ్‌ను నిషేధిస్తూ 2002లో ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 2009లో మరిన్ని శిక్షలను పెంచింది. ♦ ర్యాగింగ్ చేసినా, సహకరించినా, ఇతరులను రెచ్చగొట్టినా చట్టరీత్యా నేరం. ర్యాగింగ్ చేసి అవమానించినా, బాధించినా 6 నెలల వరకు జైలు శిక్ష, రూ.1000 జరిమానా. ♦ ర్యాగింగ్‌లో భాగంగా విద్యార్థులపై దాడి చేస్తే ఏడాది జైలు శిక్ష, రూ.2వేల జరిమానా. ♦ అక్రమంగా నిర్భందించడం, గాయపరచడం చేస్తే రెండేళ్ల జైలు శిక్ష, రూ.5వేల జరిమానా. ♦ విద్యార్థులను బలవంతంగా ఎత్తుకెళ్లడం, గాయపర్చడం, లైంగిక దాడికి పాల్పడడం చేస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా. ♦ ర్యాగింగ్ సందర్భంలో విద్యార్ధి మరణించిన, బాధిత విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడినా నిందితుడికి పదేళ్ల జీవిత ఖైదు, రూ.50 వేల జరిమానా. భయం పోగొట్టాలి కళాశాల, హాస్టల్ వాతావరణంలోకి రావడంతో విద్యార్థుల్లో భయం అనేది ఉంటుంది. ప్రతి చిన్న దానికీ భయపడడం, చదువు అర్థం కాకపోవడం, పరీక్షలు తదితర విషయాల వల్ల విద్యార్థులు ఆందోళన పడుతుంటారు. వారిలో నెలకొన్న భయాన్ని తొలగించి, కళాశాల వాతావరణం అలవాటు చేయాలి. అందుకే మొదటి మూడు వారాలు సిలబస్ ప్రారంభించకుండా... ఓరియంటేషన్ తరగతులు నిర్వహిస్తున్నాం. కళాశాలల్లో ఎవరైనా ర్యాగింగ్‌కు పాల్పడితే భయపడకుండా వెంటనే ప్రిన్సిపాల్/అధ్యాపకులకు సమాచారం అందించాలి.– సాయిబాబారెడ్డి, జేఎన్టీయూహెచ్ ప్రిన్సిపాల్ భవిష్యత్ అంధకారమే... విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడితే కళాశాల నుంచి సస్పెండ్ చేస్తారు. జైలు శిక్ష ఆరు నెలలకు మించి పడితే ఏ విద్యాసంస్థలోనూ ప్రవేశం ఉండదు. విదేశాలకు వెళ్లడానికి పాస్‌పోర్టు కూడా రాదు. కళాశాలలు అందించే ఉపకార వేతనాన్ని కోల్పోతారు. ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హుడు. దీంతో ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థి భవిష్యత్ అవకాశాలను పూర్తిగా కోల్పోతాడు. విద్యార్థి ర్యాగింగ్‌కు పాల్పడినట్లు విచారణలో తేలితే కళాశాల యాజమాన్యం సదరు విద్యార్థిని ఎన్ని రోజులైనా సస్పెండ్ చేయొచ్చు. ఒకవేళ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహారిస్తే సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకుడు, చైర్మన్లపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. -
నారాయణ కాలేజీలో ర్యాగింగ్.. విద్యార్థులకు వాతలు
అనంతపురం: పట్టణంలోని నారాయణ కాలేజీలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపుతోంది. ర్యాగింగ్‌లో భాగంగా జూనియర్లు, సీనియర్ల మధ్య ఘర్షణ జరగడంతో... కాలేజీ సిబ్బంది రెచ్చిపోయారు. విద్యార్థులను విచక్షణారహితంగా కొట్టారు. అంతేకాకుండా విద్యార్థులకు కాలేజీ లెక్చరర్లు వాతలు కూడా పెట్టినట్టు తెలుస్తోంది. ఈ గొడవలో పలువురు విద్యార్థులు గాయపడ్డట్టు సమాచారం. -
నారాయణ కాలేజీలో ర్యాగింగ్ కలకలం
-
ర్యాగింగ్ పేరుతో డబ్బులు వసూలు!
చైతన్యపురి: ర్యాగింగ్ పేరుతో తోటి విద్యార్థులు డబ్బు వసూలు చేశారని మనస్తాపంతో ఓ టెన్త్ వి ద్యార్థి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఆలస్యం గా వెలుగులోకి వచ్చి ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కర్మన్‌ఘాట్ గ్రీన్‌పార్కు కాలనీకి చెందిన వెంకట్రావు కుమారుడు రవికిరణ్ కర్మన్‌ఘాట్‌లోని నియో రాయల్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నా డు. గత బుధవారం రవికిరణ్ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకోగా గమనించిన కుటుంబ సభ్యులు హు టాహుటిన అతడిని సమీపంలోని అవేర్ గ్లోబల్ ఆసుపత్రికి తరలించగా ఐసీయూలో చికిత్స అం దించారు. ప్రస్తుతం విద్యార్థి కోలుకుంటున్నాడు. ఈ విషయాన్ని కుటుంబసభ్యులు సరూర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత రవికిరణ్ రాసిన సూసైడ్ నోట్ బయటపడింది. పాఠశాలలో కొంద రు విద్యార్థులు ర్యాగింగ్ చేసి డబ్బులు తేవాలని బెదిరించడంతో రూ.6 వేలు తీసుకెళ్లి వారికి ఇచ్చినట్టు అందులో రవికిరణ్ రాశాడు. ఈ నేపథ్యంలో నే అతడు ఆత్మహత్యాయత్నం చేసినట్టు భా వి స్తు న్నారు. కాగా, రవికిరణ్ వద్ద స్టేట్ మెంట్ తీసుకు న్న పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. ర్యాగింగ్ పై అవగాహన కల్పించాలి.. నియో రాయల్ పాఠశాలలో ర్యాగింగ్‌కు గురై టెన్త్ విద్యార్థి ఆత్మహత్యా యత్నానికి పాల్పడటం దుర దృష్టకరమని ఏపీ బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు అచ్యుతరావు ఒక ప్రకటనలో తెలిపారు. ర్యాంకులు, మార్కుల పేరుతో విద్యా సంస్థలు విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నాయని, ర్యాగింగ్‌కు పాల్పడకుండా పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆయన అన్నారు. ర్యాగింగ్ ఘటనపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
ర్యాగింగ్ రక్కసి
ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్‌ల పేరుతో ఇతరులను హింసించి పైశాచికత్వాన్ని పొందుతున్న విద్యార్థుల ముఠాను మదురై ప్రభుత్వ వైద్య కళాశాలలో గుర్తించారు. వీరి భరతం పట్టేందుకు ఆ కళాశాల ప్రిన్సిపాల్ మరుదు పాండియన్ సిద్ధం అయ్యారు. 20 మందిని గుర్తించి సస్పెండ్ చేశారు. పరీక్షలకు అనుమతి ఇవ్వకూడదని నిర్ణయానికి వచ్చారు. సాక్షి, చెన్నై: వర్సిటీలు, కళాశాలల్లో గతంలో చోటుచేసుకున్న సంఘటనల్ని పరిగణించి ర్యాగింగ్‌ను నిషేధిస్తూ పాలకులు చట్టం తీసుకొచ్చారు. అయితే, చట్టం అమల్లో విఫలమవుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. కళాశాలు ప్రారంభమయితే చాలు ఈవ్ టీజర్లు రంగంలోకి దిగడం సాధారణంగా మారింది. బస్టాపులు, కళాశాల సమీపాల్లో , రైల్వే స్టేషన్లలో విద్యార్థినులు కన్పిస్తే చాలు డొంకతిరుగుడు మాటలతో వేధించే వాళ్లు ఎక్కువే. ఇలాంటి టీజర్ల భరతం పట్టేందుకు పోలీసు యంత్రాంగం రంగంలోకి దిగాల్సిందే. మహిళా పోలీసుల్ని మఫ్టీలో మాటేసినా, ఆ హడావుడి మూణ్ణాళ్ల ముచ్చటగా మారుతోంది. పోలీసుల ధోరణి ఫిర్యాదులు వస్తేనే, తాము స్పందిస్తామన్నట్టుగా ఉంది. కళాశాలల విషయానికి వెళ్తే, జూనియర్లను సీనియర్లు వేధించడం ప్రతిఏటా వెలుగు చూస్తున్నాయి. ర్యాగింగ్ నియంత్రణకు కళాశాల, వర్సిటీల స్థాయిలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగినా, హాస్టళ్లు, బయటి ప్రాంతాల్లో జూనియర్లను వేధించే సీనియర్లు అనేక మంది ఉన్నారు. కొన్ని ర్యాంగింగ్ సంఘటనలు వెలుగులోకి వస్తుండగా, కొందరు విద్యార్థులు సీనియర్లకు భయపడి ముందుకు రావడం లేదు. ఇంకొందరు తమ ఇళ్లకు పరుగులు తీస్తున్నారు. కొన్ని చోట్ల సరదాగా సాగే టీజింగ్,వివాదాలకు సైతం దారితీస్తున్నాయి. వైద్య కళాశాలలు ప్రారంభం ‘ఒక విద్యార్థిని అవమానపర్చడం, మానసికంగా దెబ్బతీయడం, భయందోళనకు గురిచేయడం, బెదిరించడం లేదా గాయపడే పరిస్థితి కల్పించడం.’ వంటివి ర్యాగింగ్‌గా పరిగణించవచ్చు. ఇక, ర్యాగింగ్ నిరోధించాల్సిన బాధ్యత కళాశాల ప్రిన్సిపాల్ లేక యాజమ్యాన్యానిది. చట్టం ప్రకారం ర్యాగింగ్ ఫిర్యాదు అందిన వెంటనే కళాశాల ప్రిన్సిపాల్ లేదా యాజమాన్యం స్పందించి విచారణ చేపట్టాలి. ప్రాథమిక సాక్ష్యాధారాలు లభిస్తే ర్యాగింగ్‌కు పాల్పడిన వారిని వెంటనే సస్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో తాజాగా వైద్య కళాశాలలు ప్రారంభం అయ్యాయి. మొదటి సంవత్సరం విద్యార్థులను ర్యాంగింగ్ పేరిట వేధించే పనిలో సీనియర్లు నిమగ్నం అయ్యారా..? అన్న ప్రశ్నకు సమాధానంగా మదురైలో ఘటన వెలుగు చూసింది. ఢిల్లీకి చేరిన ఫిర్యాదు మదురై ప్రభుత్వ వైద్య కళాశాలలో సీనియర్లు జూనియర్లను ఇష్టారాజ్యంగా వేధిస్తుండడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక్కడ తమకు న్యాయం లభించదన్న ఆందోళనతో జూనియర్ ఒకరు ఏకంగా ఢిల్లీలోని ర్యాంగింగ్ నియంత్రణ కమిటీకి రహస్యంగా మెయిల్ పంపించారు. ఈ మెయిల్‌ను పరిశీలించిన కమిటీ శనివారం రంగంలోకి దిగింది. మదురై వైద్య కళాశాల ప్రిన్సిపాల్ మరుదు పాండియన్ నేతృత్వంలోని బృందంతో కలసి ర్యాగింగ్‌కు పాల్పడుతున్న సీనియర్ల భరతం పట్టే పనిలో నిమగ్నం అయ్యారు. హాస్టల్ గదుల్లో, కళాశాల వెలుపల సీనియర్లు జూనియర్లను హింసిస్తుండడాన్ని పసిగట్టారు. ఈ కమిటీకి పలువురు రెడ్ హ్యాండెండ్‌గా చిక్కారు. దీంతో పదిహేను మంది జూనియర్ విద్యార్థులు సాహసం చేసి సీనియర్ల వేధింపుల గురించి లిఖిత పూర్వకంగా ఆదివారం ప్రిన్సిపల్‌కు ఫిర్యాదుచేశారు. దీంతో రెండో సంవత్సరం చదువుతున్న 20 మంది సీనియర్ విద్యార్థులను గుర్తించారు. వారిని ఆరు నెలల పాటు కళాశాలల నుంచి సస్పెండ్ చేశారు. సెమిస్టర్ పరీక్షలకు అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించారు. అలాగే, ఈ20 మంది హాస్టల్లో రెండేళ్ల పాటు ప్రవేశించకుండా నిషేధం విధించారు. నిఘా నేత్రాల ఆధారంగా.. కళాశాల, హాస్టల్ పరిసరాల్లోని నిఘా నేత్రాల్లో నమోదైన దృశ్యాలను సమగ్రంగా పరిశీలించి, మరికొందరు సీనియర్ల భరతం పట్టే రీతిలో వైద్యకళాశాల వర్గాలు ముందుకు సాగుతున్నాయి. ఇందులో మరో ఇద్దరు విద్యార్థుల తీరును గుర్తించడంతో వారి మీద కూడా చర్యకు నిర్ణయించారు. సోమవారం జరగనున్న కళాశాల ర్యాగింగ్ నియంత్రణ కమిటీ సమావేశంలో వీడియో దృశ్యాలను పరిశీలించి, ర్యాగింగ్‌కు పాల్పడ్డ సీనియర్ల భరతం పట్టేందుకు నిర్ణయించామని ప్రిన్సిపాల్ మరుదు పాండి తెలిపారు. కాగా, మదురైలో ర్యాగింగ్ రక్కసి వెలుగు చూడడంతో రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు, ప్రభుత్వ వైద్య కళాశాలల్లో నిఘాను పెంచారు. ఎవరైనా ర్యాంగింగ్, ఈవ్ టీజింగ్ వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్న హెచ్చరికల బోర్డులు ప్రత్యక్షం అయ్యాయి. -
రెచ్చిపోతున్న మృగాళ్లు
ఉదయం లేవగానే తయారై కళాశాలల వద్ద వేచి ఉండటం.. నచ్చిన అమ్మాయి కనిపిస్తే వెంటపడటం.. అసభ్యకరమాటలతో లైంగిక వేధింపులకు పాల్పడటం ఆకతాయిలకు నిత్యకృత్యంగామారుతోంది. ఎవరైనా తమకు ఎదురు తిరిగితే నేరాలకు, దాడులకు పాల్పడటానికి కూడా వెనుకాడటం లేదు. రహస్యంగా నిఘా ఉంచిన మహిళా రక్షక్ బృందాలు కొంతమంది ఈవ్‌టీజర్లను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా గడిచిన వారం రోజుల్లో అమ్మాయిలను వేధిస్తూ వెంటబడిన 44 మంది ఈవ్‌టీజర్లకు పోలీసులు శనివారం కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతపురం సెంట్రల్: సమాజంలో మహిళలకు, బాలికలకు రక్షణ లేకుండా పోతోంది. ఎక్కడో ఒక చోట అఘాయిత్యాలు వెలుగుచూస్తున్నాయి. పా ఠశాలకు వెళ్లి చదువుకోవాలన్నా.. ఉద్యోగాలు చేయాలన్నా.. ఒంటరిగా వెళ్లాలన్నా ఎక్కడ కీచకులు మాటువేసు ఉంటారోనని భయాందోళన వ్యక్తమవుతోంది. బాలికలు, మహిళల రక్షణ కో సం ప్రత్యేక చట్టాలు అమల్లో ఉన్నా నేరాలు అదు పు కావడం లేదు. చట్టాలపై పెద్దగా అవగాహన లేకపోవడం వలన ఏమవుతుందిలే అనే ధోరణిలో మృగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. ప్రతి ఏడాది పదుల సంఖ్యలో పోక్సో చట్టం కింద కేసులు నమోదవుతుండడం గమనార్హం. చట్టంపై అవగాహన శూన్యం.. ఢిల్లీలో నిర్భయ ఉదంతం అనంతరం మహిళా రక్షణ చట్టాల్లో మార్పులు చేశారు. నిర్భయ యాక్టు, పోక్సో (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్సెస్)యాక్టు అమల్లోకి వచ్చాయి. ఈ చట్టం ప్రకారం 12 సంవత్సరాల లోపు పిల్లలపై లైంగిక వేధింపులు, అత్యాచారం ఘటనలు జరిగితే ఏకంగా ఉరిశిక్ష పడే అవకాశం ఉంది. 18 సంవత్సరాల లోపు పిల్లలపై నేరాలు జరిగితే జీవితఖైదు శిక్ష పడే అవకాశాలున్నాయి. అయితే గ్రామీణ స్థాయి వరకు ఈ చట్టాలపై పెద్దగా అవగాహన లేకుండాపోతోంది. క్షేత్రస్థాయిలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు చట్టంపై అవగాహన కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా నేరాలకు అడ్డుకట్ట పడడం లేదు. ఉసిగొల్పుతున్న సెల్‌ఫోన్స్.. ఇంటర్నెట్ ప్రభావం వలన ఇలాంటి నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ఫోన్లు హల్చల్ చేస్తున్నాయి. వీటికి తోడు పలు కంపెనీలు ఉచిత ఇంటర్నెట్ అవకాశం కల్పించడం వలన ఎక్కువశాతం యువత పెడదారి పడుతున్నారు. తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడంతో నేరాలు మరింత ఎక్కువవుతున్నాయి. చేతిలో సెల్‌ఫోన్ లేకపోతే నిమిషం కూడా గడవదనే రీతిలో యువత వ్యవహరిస్తోంది. యువత మాత్రమే కాకుండా చదువుకున్న విజ్ఞానవంతులు, సన్మార్గంలో నడిపించాల్సిన వ్యక్తులు కూడా ఈ తరహా నేరాలకు పాల్పడుతుండడంతో సభ్యసమాజం తలదించుకోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. అఘాయిత్యాలకుపాల్పడితే కఠిన చర్యలు విద్యార్థినిలు, మహి ళల రక్షణ కోసం కొత్త చట్టాలు అమల్లోకి వచ్చాయి. దీనిపై అవగాహన కల్పించేందుకు జిల్లాలో ప్రత్యేకంగా మహిళా రక్షక్ బృందాలు పనిచేస్తున్నాయి. ప్రతి రోజూ పాఠశాలలు, కాలేజీల్లో పోక్సో, నిర్భయ చట్టాలపై అవగాహన కల్పిస్తున్నాయి. పోలీసులు గ్రామాలకు వెళ్లినప్పుడు కూడా గ్రామసభల్లో ఈ చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కొత్త చట్టాలు వచ్చిన తర్వాత అత్యాచారాలు, లైంగిక వేధింపులకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు పడుతున్నాయి. – జె.వెంకట్రావ్, డీఎస్పీ అనంతపురం -
బీసీ హాస్టల్లో జూనియర్లపై సీనియర్ల దాడి
నిజామాబాద్ : తమ బట్టలు ఉతకాలంటూ సెకండియర్ విద్యార్థులు, జూనియర్ విద్యార్థులపై దాడి చేసిన సంఘటన నిజామాబాద్ బీసీ హాస్టల్లో చోటుచేసుకుంది. సీనియర్ విద్యార్థుల వేధింపులు తట్టుకోలేక నిజామాబాద్ 3వ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో జూనియర్ విద్యార్థులు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సీనియర్ల వేధింపులు ఎక్కువై ఐదుగురు విద్యార్థులు కూడా హాస్టల్ వదిలి వెళ్లేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. బీసీ హాస్టల్ వార్డెన్ నిర్లక్ష్యం వల్లనే సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. -
ర్యాగింగ్ భూతానికి ఇంజనీరింగ్ విద్యార్థిని బలి
-
గురుకులంలో ర్యాగింగ్ రక్కసి..!
సాక్షి, అనంతపురం: సరైన వసతులుండవనే కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లల్ని చేర్పించడానికి ఓ వైపు తల్లిదండ్రులు వెనకడుగువేస్తుంటే.. మరోవైపు సరైన పర్యవేక్షణ లేని కారణంగా జిల్లాలోని ఓ పాఠశాలలో ర్యాగింగ్ జరిగింది. ఈ ఘటన కదిరి మండలం కళాసముద్రంలో గల గురుకుల పాఠశాలలో గురువారం వెలుగుచూసింది. అయిదో తరగతి విదార్థులపై టెన్త్ విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. సీనియర్ల వెకిలి చేష్టలకు భయపడి ముగ్గురు విద్యార్థులు టీసీ తీసుకుని వెళ్లిపోయినట్టు తెలిసింది. కాగా, ఘటనపై ఇంతవరకు విద్యాశాఖ అధికారులెవరూ స్పందించక పోవడం గమనార్హం. -
నన్నూ.. ర్యాగింగ్ చేశారు
హైదరాబాద్, సైదాబాద్: కాలేజీలో తాను కూడా ర్యాగింగ్‌కు గురయ్యానని, నేడు ర్యాగింగ్ చేస్తే కఠినంగా శిక్షిస్తున్నామని, ఆడపిల్లలను ర్యాగింగ్ చేయాలంటే భయపడేలా యాంటి ర్యాగింగ్ చట్టాన్ని అమలు చేస్తున్నట్లు షీ టీమ్ ఇన్చార్జ్, ఐజీ స్వాతిలక్రా అన్నారు. సరస్వతినగర్ కాలనీలోని వైదేహి ఆశ్రమాన్ని మంగళవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆశ్రమ రికార్డులను పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఓ విద్యార్థి ‘మీరు షీ టీమ్‌ను నిర్వహిస్తున్నారు కదా మీరు చదువుకునే రోజుల్లో ఎప్పుడైన ర్యాగింగ్‌కు గురయ్యారా’ ప్రశ్నించగా పై విధంగా స్పందించారు. మహిళలకు భరోసా కల్పించేందుకు ఐపీఎస్‌ను ఎంచుకున్నట్లు తెలిపారు. నగరంలో షీ టీమ్‌ల ఏర్పాటుతో 50 శాతం వేధింపులు తగ్గాయన్నారు. ప్రతి మహిళ, యువతికి ఆత్మరక్షణకు కరాటేలో మెళకువలు అవసరమని, ఇందుకోసం ఆశ్రమంలో ఒక శిక్షకుడిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పెద్ద లక్ష్యాలను నిర్ధేశించుకుని క్రమశిక్షణతో చదివితే జీవితంలో ఏదైనా సాధించవచ్చన్నారు. తాను మొదటిసారి విజయం సాధించలేదని, రెండోసారి ప్రయత్నించి ఐపీఎస్‌కు ఎంపికైనట్లు తెలిపారు. వైదేహి ఆశ్రమ పద్దతులు, భద్రత బాగున్నాయని అభినందించారు. కార్యక్రమంలో ఆశ్రమ అధ్యక్షురాలు సీతాకుమారి, కార్యదర్శి మురళి, భారతీదేవి, రాములు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
బాలికలపై ర్యాగింగ్ పంజా
సేలం: ఆంతరంగిక ఫోటోలను బయటపెడతా మంటూ బెదిరిస్తూ ర్యాగింగ్‌కు పాల్పడడాన్ని తట్టుకోలేక ఇద్దరు బాలికలు ఆత్మహత్యకు యత్నించారు. ఈ సంఘటన సేలం జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సేలం జిల్లా ఓమలూరు సమీపంలోని కాడయాంపట్టి బోయర్ వీధికి చెందిన ఇద్దరు బాలికలు. వీరు నడుపట్టి ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిది, పదో తరగతిలు చదువుకుంటున్నారు. ఇద్దరూ రోజూ ఇంటి నుంచి ఒకటిగా పాఠశాలకు వెళుతుంటా రు. ఆ సమయంలో అదే ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు ఆ బాలికలను అడ్డుకుని చెప్పినట్టు వినాలని.. లేదంటే అంతరంగిక ఫోటోలను బయటపెడతామని బెదిరిస్తూ ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. తీవ్ర మనోవేదనతో బాలికలు ఇద్దరు గురువారం పాఠశాల గదిలో రసాయన పొడిని నీళ్లలో కలుపుకుని తాగారు. వాంతులు చేసుకోవడంతో వారు ఆత్మహత్యకు ప్రయత్నించిన విషయం తెలిసింది. వారిని హుటాహుటిన కాడయాంపట్టి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లి చికిత్స అందించారు. పోలీస్ స్టేషన్ ముట్టడి.. బాలికల కుటుంబీకులు, బంధువులు పెద్ద సంఖ్యలో శుక్రవారం ఉదయం తీవట్టిపట్టి పోలీసు స్టేషన్‌ను ముట్టడించి ఆందోళన చేశారు. ర్యాగింగ్ చేసిన వారిని అరెస్టు చేయాలంటూ పట్టుబట్టారు. దీంతో పోలీసులు వారికి సర్ది చెప్పి పంపించారు. తర్వాత కాడయాంపట్టికి చెందిన భాస్కరన్ కుమారుడు సెల్వమణి (21), ఆర్ముగం కుమారుడు దురైమురుగన్ (19)లను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సెల్వమణి పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. దురైమురుగున్ ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్నాడు. -
‘ఒక్క ర్యాగింగ్ కేసు నమోదు కానివ్వం’
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది కాలంలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో కేవలం రెండు ర్యాగింగ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. వచ్చే సంవత్సరం ఒక్క ర్యాగింగ్ ఘటన చోటుచేసుకోకుండా పనిచేస్తామని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అన్నారు. కాలేజీలలో ర్యాగింగ్ రూపు మాపాలనే ఉద్దేశంతో బషీర్‌బాగ్‌లోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో బుధవారం యాంటీ ర్యాంగింగ్ అవగాహనా కార్యాక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ అంజనీకుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ర్యాగింగ్‌కు పాల్పడే విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కళాశాల యాజమాన్యాలు ర్యాగింగ్ నిర్మూలనపై, చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. హైదరాబాద్ పోలీసులు, షీ టీమ్స్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో అడిషనల్ సీసీ షికా గోయల్, అన్ని జోన్ల డీసీపీలు, కాలేజీ రిజిస్ట్రార్లు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
కర్నూలు మెడికల్ కళాశాలలో కలకలం
-
నాన్నా.. ర్యాగింగ్ తట్టుకోలేక పోతున్నా
కర్నూలు(హాస్పిటల్): ‘నాన్నా..ఇక్కడ నేను చదవలేను..రోజురోజుకూ ర్యాగింగ్ వేధింపులు తట్టుకోలేకపోతున్నానంటూ తండ్రితో చెప్పిన కొద్దిరోజులకే ఓ వైద్యవిద్యార్థి అనుమానాస్పద రీతిలో మృతిచెందాడు. కడప జిల్లాకు చెందిన హర్ష ప్రణీత్‌రెడ్డి(19) కర్నూలు మెడికల్ కళాశాల(కేఎంసీ)లో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. గురువారం అర్ధరాత్రి హాస్టల్లోని తన గదిలో అచేతనంగా పడి ఉండడాన్ని గమనించిన సహచర విద్యార్థులు అతనికి వెంటనే ప్రథమ చికిత్స చేసి .. ఆ తర్వాత స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటన కర్నూలు మెడికల్ కళాశాలలో కలకలం రేపుతోంది. అయితే అంతకు కొద్ది రోజుల ముందు .. హర్ష ప్రణీత్‌రెడ్డి తండ్రి రామాంజులురెడ్డితో ఫోన్లో జరిపిన సంభాషణ తీవ్ర చర్చనీయాంశమవుతోంది. కడప నగరంలోని అరవిందనగర్‌లో నివాసం ఉంటున్న రామాంజులురెడ్డికి ఇద్దరు కుమారులు. ఆయన అక్కడి కోర్టులో టైపిస్ట్‌గా పనిచేస్తున్నారు. పెద్ద కుమారుడు జైపూర్ ఐఐటీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. చిన్న కుమారుడు హర్షప్రణీత్‌రెడ్డి మొదటి నుంచీ చదువులో ప్రతిభ కనబరుస్తూ టెన్త్‌లో 10/10 పాయింట్లు, ఇంటర్లో 985 మార్కులు, ఎంసెట్‌లో 315వ ర్యాంకు సాధించాడు. కర్నూలు మెడికల్ కళాశాలలో సీటు సాధించి హాస్టల్లో ఉండి ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. గురువారం రాత్రి 11.20 గంటలకు రూమ్మేట్స్ చదువుకోవడానికి మేడపైకి వెళ్లారు. అనంతరం హర్ష గది లోపల గడియ పెట్టుకున్నాడు. 12.30 గంటలకు సహ విద్యార్థులు మేడపై నుంచి కిందకు దిగారు. ఎంతసేపు తలుపు కొట్టినా హర్ష తీయలేదు. పక్క గదుల్లో ఉన్న వారిని పిలిచారు. వారు తలుపు కొట్టినా స్పందన లేదు. దీంతో తలుపు బద్దలు కొట్టి.. లోపలి దృశ్యాన్ని చూసి నిర్ఘాంతపోయారు. హర్ష గదిలోని ఫ్యాన్‌కు టవళ్లతో ఉరేసుకుని కింద పడడంతో ఇనుప మంచం సైతం వంగిపోయింది. సహచర విద్యార్థులు స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. చివరి ప్రయత్నంగా ప్రభుత్వ ఆస్పత్రి క్యాజువాలిటీకి తీసుకెళ్లారు. అక్కడ శ్వాస అందించేందుకు అంబూ బ్యాగ్‌తో ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అనంతరం పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. టుటౌన్ సీఐ మురళీకృష్ణరెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ‘తండ్రి : నాన్నా.. ఆరోగ్యం బాగా చూసుకో. రోజూ యోగా చేయి. ఆరోగ్యం బాగుంటుంది. ఏకాగ్రత పెరిగి చదివిన చదువు బాగా గుర్తుంటుంది. కుమారుడు : నాన్నా.. ఇక్కడ(కేఎంసీ హాస్టల్) నీవు చెప్పే యోగా విన్యాసాల కంటే ర్యాగింగ్ విన్యాసాలే కష్టంగా ఉన్నాయి. ర్యాగింగ్‌లో పడే పాట్ల కంటే నాకు యోగా ఓ లెక్క కాదు. ఇక్కడ నేను చదవలేను నాన్నా. తండ్రి : కొత్తలో అలాగే ఉంటుంది.. ఏం కాదులే. చదువుపైనే దృష్టి పెట్టు. కుమారుడు : ఇక్కడి ర్యాగింగ్‌తో ఏకాగ్రతగా చదవలేకపోతున్నా నాన్నా. తండ్రి : ధైర్యంగా ఉండు. అప్పుడప్పుడూ నేను, మీ అమ్మా వచ్చి కలుస్తుంటాములే. కుమారుడు : అలాగే నాన్నా.’ ర్యాగింగ్ వల్లే చనిపోయాడు నా కుమారుడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు. మొదటి నుంచి మెరిట్ స్టూడెంట్. అన్ని సర్టిఫికెట్లు తెచ్చి చూపిస్తా. రాత్రి 1.20 గంటలకు నాకు మెసేజ్ వచ్చింది. మీ కుమారుడు బాత్రూమ్లో కిండపడ్డాడని, సీరియస్‌గా ఉందని. ఉదయం ఇక్కడికి వచ్చి చూస్తే శవమై కనిపించాడు. దీన్ని నేను హత్యగానే భావిస్తున్నా. చనిపోయిన విషయాన్ని ముందుగా చెప్పకుండా దాచిపెట్టారు. పూర్తి సమాచారం ఎవరూ ఇవ్వడం లేదు. నా కుమారుడికి చదువు ఒత్తిడి ఎక్కడా లేదు. ఆడుతూ పాడుతూ చదివే అలవాటు వాడిది. ఇలా విగతజీవిగా చూస్తాననుకోలేదు. – రామాంజులురెడ్డి, హర్ష తండ్రి కళాశాలలో ర్యాగింగ్ లేదు హర్ష ప్రణీత్‌రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరం. ఈ నెల 10 నుంచి వార్షిక పరీక్షలు ఉన్నాయి. అతను యావరేజ్ స్టూడెంట్. చదువుపై ఒత్తిడితో ఉండే వారిని ప్రత్యేకంగా పిలిచి ధైర్యం చెప్పేవాళ్లం. అలాగే హర్షకూ చెప్పాం. బహుశా పరీక్షల భయంతోనే ఆత్మహత్య చేసుకుని ఉండే అవకాశముంది. అయినా ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ చేయిస్తాం. నిజంగా ర్యాగింగ్ జరిగినట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. కుమారుడి మరణవార్తను వెంటనే చెబితే వారు ఆందోళనకు గురవుతారనే ఉద్దేశంతోనే సహ విద్యార్థులు సీరియస్‌గా ఉందని మాత్రమే చెప్పారు. అంతేగానీ మరణ విషయాన్ని దాచిపెట్టాలన్న ఉద్దేశం లేదు. – డాక్టర్ జీఎస్ రామప్రసాద్, కర్నూలు మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ దర్యాప్తు చేస్తున్నాం.. వైద్య విద్యార్థి ఆత్మహత్య ఘటనపై దర్యాప్తు చేస్తున్నాం. చదువు ఒత్తిడే కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. మొబైల్లో తరచూ ఛాటింగ్ చేస్తూ.. మెసేజ్‌లను డిలీట్ చేసేవాడని సమాచారముంది. దీంతో అతని కాల్‌డేటాను పరిశీలిస్తున్నాం. – టూటౌన్ సీఐ మురళీధర్‌రెడ్డి -
దివాకర్‌రెడ్డి కాలేజ్ బాయ్స్ హాస్టల్లో ర్యాగింగ్
-
ర్యాగింగ్ చేస్తే వేటు పడుద్ది
పశ్చిమగోదావరి , తాడేపల్లిగూడెం: ఉన్నత విద్యాసంస్థలలో ర్యాగింగ్ జాడ్యం జడలు విప్పి కరాళ నృత్యం చేస్తోంది. విద్యార్థుల మధ్య విభేదాలకు ఆజ్యం పోస్తోంది. నిట్‌లో జరిగిన ర్యాగింగ్ ఘటన ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఒక జూనియర్ విద్యార్థి ధరించిన దుస్తులపై సీనియర్ చేసిన కామెంట్ ఘర్షణకు దారితీసింది. విషయం కాస్తా ఢిల్లీలోని యాంటీ ర్యాగింగ్ సెల్‌కు వెళ్లింది. రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారి దృష్టికి చేరింది. క్షేత్రస్థాయి దర్యాప్తు అనంతరం 15 మంది విద్యార్థులపై తీసుకున్న చర్యలు వారి భవిష్యత్తుపై పెద్ద మచ్చగా మిగిలిపోనున్నాయి. దేశంలో మొత్తం 31 నిట్లు, ఐఐటీలు ఉన్నాయి. ఈ సంస్థలలో గతంలో ర్యాగింగ్ ఘటనలు జరిగినా, సర్దుబాట్లతో, మహా అయితే రూ.25 వేల అపరాధ రుసుంతో విద్యార్థులు రక్షణాత్మక వలయంలో ఉండేవారు. అయితే ఏపీ నిట్ ఘటనలో ఏకంగా 15 మంది విద్యార్థులకు శిక్ష పడింది. ఒక విద్యార్థిని ఏకంగా కళాశాల నుంచి సస్పెండ్ చేశారు. ఐదుగురిని నాలుగు సెమిస్టర్ల పాటు రెండేళ్లు కళాశాల ప్రవేశాన్ని రద్దు చేశారు. తొమ్మిదిమందికి హాస్టల్ ప్రవేశాన్ని నిషేధించారు. దేశంలో హిమాచల్ ప్రదేశ్, కేరళ రాష్ట్రాలలో ర్యాగింగ్ నేపథ్యంగా సాగిన ఘటనలతో సుప్రీంకోర్టు కొరడా ఝళిపించింది. యూనివర్సిటీ ఆఫ్ కేరళ వర్సెస్ కౌన్సిల్ ప్రిన్సిపల్స్... కాలేజెస్ కేరళ వర్సెస్ అండ్ అదర్స్ కేసులో ఆర్.కె.రాఘవన్ కమిటీ ఇచ్చిన సిఫార్సుల మేరకు ర్యాగింగ్ చట్టాల పదును పెంచారు. ర్యాగింగ్ నిరోధంపై విశ్వ జాగృతి మిషన్ వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంతో ర్యాగింగ్‌ను కట్టడి చేయడానికి కొత్త చట్టాలు, సెక్షన్లు వచ్చాయి. దేనిని ర్యాగింగ్‌గా పరిగణిస్తారంటే.. సైకలాజికల్, సోషల్, పొలిటికల్, ఎకనమిక్, కల్చరల్, అకడమిక్ డైమెన్షన్లో ఏ రూపంలోనైనా ఇబ్బంది పెట్టడాన్ని ర్యాగింగ్‌గా పరిగణిస్తున్నారు. కేంద్ర మానవ వనరుల శాఖా మంత్రిగా కపిల్ సిబాల్ ఉన్న సమయంలో ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ ఇండియా లిమిటెడ్, బీఎస్ఎన్ఎల్ సంస్థల ఆధ్వర్యంలో యూనివర్సిటీ గ్రాంట్సు కమిషన్ పర్యవేక్షణలో ర్యాగింగ్ బాధితులకు 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా ఢిల్లీలో యాంటీ ర్యాగింగ్ సెల్‌ను ఏర్పాటు చేశారు. 1800–180–5522 నంబరుకు ఫోన్ చేసి ర్యాగింగ్ జరిగిన విషయాన్ని బా«ధితుడు తెలియచేస్తే, అందుబాటులో ఉన్న ఉద్యోగి వివరాలు నమోదు చేసుకొని బాధితునికి ఒక యూనిక్ నంబర్ కేటాయిస్తారు. కేవలం 15 నిమిషాల వ్యవధిలో యాక్షన్ ప్రారంభమౌతుంది. పోలీసులు, ఉన్నత విద్యాసంస్థల అధికారులు ఎప్పటికప్పుడు విషయాలను యాంటీ ర్యాగింగ్ సెల్‌కు తెలపాలి. ఫిర్యాదు చేరింది మొదలు తొలి కాల్ వెళ్లేది ఘటన జరిగిన రాష్ట్రానికి చెందిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుకు. ఐపీసీ సెక్షన్లు పనిచేయవు ర్యాగింగ్ ఘటనలో బాధ్యులకు శిక్షలు వేయడానికి ఐపీసీ సెక్షన్లు పనికిరావు. సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ప్రకారం ఆ ఆదేశాలలోని సెక్షన్ 48 ప్రకారం శిక్షలు, చర్యలు ఉంటాయి. ఘటన జరిగిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు కావాల్సిందే. కళాశాల నుంచి పంపించి వేసి ప్రవేశాన్ని రద్దు చేయడం, ఒకటి నుంచి నాలుగు సెమిస్టర్లు సస్పెండ్ చేయడం, హాస్టళ్ల నుంచి బహిష్కరించడం వంటì చర్యలు ఉంటాయి. యాంటీ ర్యాగింగ్ యాక్టు ర్యాగింగ్‌ను క్రిమినల్ అఫెన్సుగా గుర్తించిన ప్రభుత్వం యుజీసీ యాక్టులోని సెక్షన్ 3 ఆఫ్ 1956 లోని సెక్షన్–26 ను అనుసరించి యాంటీ ర్యాగింగ్ సెంట్రల్ యాక్టును 2009 జులై నాలుగో తేదీన తీసుకువచ్చింది. ఈ చట్టం 2009 అక్టోబరు 21వ తేదీ నుంచి అమలులోకి వచ్చింది. ర్యాగింగ్ ఘటనల తీవ్రత ఆధారంగా సెంట్రల్ యాక్టు పురుడుపోసుకుంది. ర్యాగింగ్ బాధితులకు సాంత్వన కోసం పోరు సాగించడానికి యాంటీ ర్యాగింగ్ కమిటీలు, స్క్వాడ్లను ఉన్నత విద్యాసంస్థలలో ఏర్పాటు చేశారు. ఏపీ నిట్‌లో ర్యాగింగ్‌పై అవగాహన ఏపీ నిట్‌లో ర్యాగింగ్ దుష్ఫలితాలు వివరించడానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నాం. ర్యాగింగ్లోకి వెళితే విద్యార్థుల జీవితాలు ఎలా తలకిందులవుతాయో వివరిస్తున్నాం. సైక్రియాటిస్టులు, వ్యక్తిత్వ వికాస నిపుణులు, అనుభవజ్ఞులతో ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేశాం. విద్యార్థులకు ల్యాబ్‌లు, పరీక్షలు లేని సమయంలో ర్యాగింగ్‌పై అవగాహన కల్పిస్తున్నారు. ప్రాంగణంలో యాంటీ ర్యాగింగ్ బోర్డులు ఏర్పాటు చేశాం. – ఎస్.శ్రీనివాసరావు, నిట్ రెసిడెంటు కోఆర్డినేటర్ -
నిట్ వద్ద ఆందోళన
తాడేపల్లిగూడెం రూరల్ : జాతీయ సాంకేతిక విద్యాసంస్థ (నిట్)లో ర్యాగింగ్‌కు పాల్పడి క్రమశిక్షణ చర్యలకు గురైన బాధిత విద్యార్థులు, సహచర విద్యార్థులు సంయుక్తంగా మంగళవారం పెదతాడేపల్లిలోని ఏపీ నిట్ తాత్కాలిక ప్రాంగణంలో ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా 2వ తేదీన జరిగిన సంఘటన ర్యాగింగ్ కాదంటూ... ర్యాగింగ్‌కు గురైనట్టు పేర్కొంటున్న విద్యార్థి ఫిర్యాదు ఉపసంహరించుకున్నా బాధిత విద్యార్థులను డిబార్ చేయడం, హాస్టల్లో ఉండనివ్వకపోవడం వంటి సంఘటనలు, ర్యాగింగ్ చట్టం కింద విద్యార్థులను సస్పెండ్ చేస్తున్నట్టు తల్లిదండ్రులకు సమాచారం వెళ్లడంతో ఈ ఆందోళన చేపట్టారు. బాధిత విద్యార్థులకు ద్వితీయ, తృతీయ సంవత్సరం సహచర విద్యార్థులు మద్దతు పలకడంతో సుమారు 300 మంది వరకు న్యాయం చేయాలంటూ ధర్నాకు దిగారు. ఉదయం 9.45 గంటల నుంచి తరగతులను బహిష్కరించి నిట్ పరిపాలనా భవనం ఎదుట ఆందోళనకు దిగారు. సాయంత్రం వరకు ఆందోళన కొనసాగింది. విద్యార్థులతో చర్చలు నిట్ రెసిడెంట్ కో–ఆర్డినేటర్ శ్రీనివాసరావు, ఇతర అధ్యాపక సిబ్బంది విద్యార్థులను సముదాయించే ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేకపోయింది. సాయంత్రం 3 గంటల ప్రాంతంలో తాడేపల్లిగూడెం రూరల్ ఎస్సై బి.శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిట్ అధికారులు మరోసారి విద్యార్థులతో భేటీ అయ్యారు. విద్యార్థులు తమ డిమాండ్లను లిఖితపూర్వకంగా అందజేశారు. క్రమశిక్షణ చర్యల్లో మదింపు, విద్యార్థులకు న్యాయం చేసేలా వరంగల్ నిట్ ఉన్నతాధికారులతో మాట్లాడతామని భరోసా ఇవ్వడంతో పాటు ప్రత్యక్షంగా వారి విజ్ఞప్తిని ఢిల్లీలోని ఎంహెచ్ఆర్డీకి ఈ మేరకు మెయిల్ చేశారు. వి ద్యార్థులు ఆందోళన విరమించారు. ఒకానొక సమయంలో సమస్య పరి ష్కారం కాని పక్షంలో ఆత్మహత్యలకు సైతం సిద్ధమంటూ విద్యార్థులు హెచ్చరించారు. దీంతో ఓ సమయంలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ఎట్టకేలకు చర్చలు ఫలించడంతో నిట్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. -
నిట్‌లో ర్యాగింగ్ కలకలం
సాక్షి, తాడేపల్లిగూడెం: పశ్చిమ గోదావరి జిల్లాల తాడేపల్లిగూడెం నిట్ కాలేజ్‌లో ర్యాగింగ్ కలకలం రేగింది. బిహార్‌కు చెందిన ఫస్ట్ ఇయర్ విద్యార్థిపై సీనియర్లు ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. దీంతో జూనియర్, సీనియర్ విద్యార్థుల మధ్య శుక్రవారం రాత్రి ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో జూనియర్ విద్యార్థిని సీనియర్లు చితకబాదారు. ఈ ఘటనపై జూనియర్లు యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా విచారణ చేసిన కళాశాల అధికారులు ర్యాగింగ్ కు పాల్పడిన ఐదుగురు విద్యార్థులను సస్పెండ్ చేశారు. మరో 15 మంది విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. వర్సిటీలో ర్యాగింగ్ కలకలం రేగడంతో ఎలాంటి ఘటనలు జరగకుండా తాడేపల్లిగూడెం రూరల్ పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని సమీక్షించారు. -
ర్యాగింగ్ : విద్యార్థినులకు షాక్
సాక్షి, ధర్భంగా : గర్ల్స్ హాస్టల్లో జూనియర్ విద్యార్థినులపై ర్యాంగింగ్కు దిగిన సీనియర్ విద్యార్థినులపై దర్భంగా మెడికల్ కాలేజ్ తీవ్ర చర్యలు తీసుకుంది. ర్యాగింగ్‌లో పాల్గొన్న మొత్తం 54 విద్యార్థినులపై రూ. 25 వేలు జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని నవంబర్ 25 లోపు చెల్లించాలని, లేకపోతే ఆరు నెలల పాటు వారిపై సస్పెన్షన్ వేటు వేస్తామని యాంటి ర్యాగింగ్ కమిటీ నోడల్ ఆఫీసర్ రాధారమణ్ ప్రసాద్ సింగ్ స్పష్టం చేశారు. కాలేజ్‌లో విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడితే రూ. 25 వేల నుంచి లక్ష రూపాయల వరకూ జారిమానా విధించవచ్చని ఆయన చెప్పారు. మొదటిసారి సాధారణ జరిమానా విధించామన్న ఆయన.. మరోసారి ఇటువంటి ఘటనలు జరిగితే పరిణాలు తీవ్రంగా ఉంటాయని చెప్పారు. ఈ నెల 11న కొత్తగా చేరిన విద్యార్థులను సీనియర్లు హాస్టల్లో ర్యాగింగ్ చేసినట్లు ఫిర్యాదులు వచ్చినట్లు ఆయన తెలిపారు. #Bihar: 54 students of girls hostel in Darbhanga Medical College fined Rs 25,000 each for allegedly ragging juniors pic.twitter.com/8Cm1Ce51bM — ANI (@ANI) 19 November 2017 -
జేఎన్టీయూహెచ్లో ర్యాగింగ్?
సాక్షి, హైదరాబాద్: జేఎన్టీయూహెచ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో జూనియర్లపై సీనియర్ విద్యార్థులు వేధింపులకు (ర్యాగింగ్) పాల్పడుతు న్న ఘటనలపై పలు ఫిర్యాదులు అందడంతో పది మంది విద్యార్థులపై అధికారులు వేటు వేసినట్లు సమాచారం. పది రోజుల క్రితం జూనియర్స్ ఉండే కిన్నెర హాస్టల్‌కు మంజీరా హాస్టల్లో ఉండే బీటెక్ రెండో సంవత్సరం విద్యార్థులు వెళ్లి ర్యాగింగ్ చేసినట్లు తెలిసింది. దీనిపై అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో ప్రిన్సిపాల్ గోవర్ధన్ విచారణ కమిటీని నియమించారు. కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా బుధవారం సస్పెన్షన్ వేటు వేశారు. హాస్టల్ వసతి నుంచి ఏడాది పాటు, తరగతులకు హాజరుకాకుండా వారం పాటు సస్పెన్షన్ విధించినట్లు తెలిసింది. ఈ విషయమై ప్రిన్సిపాల్ గోవర్ధన్‌ను వివరణ కోరగా ఆయన స్పందించలేదు. కాగా, గతేడాది ర్యాగింగ్‌కు పాల్పడిన ఇద్దరు సీనియర్ విద్యార్థులను కళాశాల నుంచి సస్పెండ్ చేశారు. -
అనంతలో ర్యాగింగ్ కలకలం
-
అనంతలో ర్యాగింగ్ కలకలం
సాక్షి, గుంతకల్లు: అనంతపురం జిల్లాలో మరోసారి ర్యాగింగ్ కలకలం రేగింది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న నందిని అనే విద్యార్థినిని సీనియర్ విద్యార్థులు వేధిస్తుండటంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఇది గుర్తించిన తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కాన్పూర్ ఐఐటీ తీవ్ర నిర్ణయం..
కాన్పూర్ : ర్యాగింగ్ ఆరోపణలపై కాన్పూర్ ఐఐటీ తీవ్ర నిర్ణయం తీసుకుంది. తోటి విద్యార్థులను వేధించారన్న ఆరోపణలపై 22 మంది విద్యార్థులను సస్పెండ్ చేసింది. ఈ సస్పెన్షన్ ఓ ఏడాది నుంచి మూడేళ్ల వరకు అమల్లో ఉంటుంది. సోమవారం సమావేశమైన ఐఐటీ సెనేట్ ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థుల నుంచి వివరణలు అడిగి తెలుసుకుంది. అనంతరం ఈ మేరకు నిర్ణయాన్ని వెలువరించింది. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న 16మంది విద్యార్థులను మూడేళ్లపాటు సస్పెండ్ చేస్తున్నట్లు డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ మహీంద్ర అగర్వాల్ తెలిపారు. మరో ఆరుగురు విద్యార్థులు ఏడాది పాటు సస్పెన్షన్‌లో ఉంటారని వివరించారు. వీరి అడ్మిషన్లను రద్దు చేయబోమని, సస్పెన్షన్ కాలం పూర్తయ్యాక వీరు తిరిగి తమ చదువులను తిరిగి కొనసాగించవచ్చని పేర్కొన్నారు. ఆగస్టు 19, 20వ తేదీల్లో జూనియర్ స్టూడెంట్స్‌ను కొందరు సీనియర్లు వేధింపులకు గురిచేశారు. దీనిపై పలు ఫిర్యాదులు అందటంతో యాజమాన్యం స్పందించింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. నివేదిక అందటంతో తాజాగా ఈ మేరకు చర్యలు తీసుకుంది. కాగా సస్పెండ్ అయిన విద్యార్థులు బహిష్కరణ కాలంలో క్షమాభిక్ష కోసం విజ్ఞప్తి చేసే హక్కు లేదు. -
ఆలోచించండి..!
భుజానికి బ్యాగు.. చేతిలో మొబైల్ పట్టుకుని అమ్మాయి కాలేజికి బయలుదేరుతుంటే కన్నవారు తమ బిడ్డ గొప్ప చదువులు చదివేందుకు వెళుతోందని మురిసిపోతుంటారు.. భుజానికి బ్యాగు.. చేతిలో బైకు.. మరో చేతిలో సెల్‌ఫోన్ పట్టుకుని అబ్బాయి రయ్‌మని దూసుకుపోతుంటే తమ కొడుకు ఉన్నతస్థాయికి చేరుకుంటాడని ఆ తల్లిదండ్రులు సంబరపడుతుంటారు.. ఇదీ నేటి సమాజంలో నిత్యం మనకు కనిపిస్తున్న దృశ్యం.. చాలామంది యువత కాలేజీకి ఎగనామం పెట్టి తోటి విద్యార్థులతో స్నేహం.. ప్రేమ పేరుతో షికార్లు చేస్తూ.. తమ విలువైన జీవితాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలను సైతం కోల్పోతున్నారు.. ఇలాంటి దుశ్చర్యలకు చరమగీతం పాడాలంటే.. ఓ వైపు తల్లిదండ్రులు.. మరో వైపు కాలేజీ యాజమాన్యాలు.. ఇంకోవైపు పోలీసులు.. యువత..సమాజం.. ఎవరంతట వారు ఆలోచించాలి. మెరుగైన సమాజాన్ని నిర్మించేందుకు ఎవరి వంతు కృషి వారు చేయాలి. కడప అర్బన్ : ఇటీవల కాలంలో విద్యార్థినులపై అత్యాచారాలు.. దౌర్జన్యాలు.. పెరిగిపోతున్నాయి. తను ప్రేమించిన వ్యక్తి అని నమ్మి అతని వెంట వెళ్లి చివరకు శవమై తేలిన సంఘటనలు అనేకం ఉన్నాయి. యువతీ,యువకులు ప్రేమ పేరుతో ఆకర్షణకు లోనై పార్కులు, రిసార్ట్స్, కేఫ్‌లు, హోటళ్లకు, సినిమాలకు, షికార్లు కొడుతూ ఉజ్వల భవిష్యత్తును తమ చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. తమ జీవితాలను నాశనం చేసుకున్నామని గ్రహించేసరికి అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. ఈ అవమనాన్ని భరించలేక కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తమ తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఎందుకు ఆత్మహత్యలకు పాల్పడ్డారనే విషయాన్ని కూడా గ్రహించలేక తీవ్ర ఆవేదనతో కాలం వెళ్లదీస్తున్నారు. ప్రేమపేరుతో అమ్మాయిలకు తప్పని వంచన అమ్మాయిలను ఇంటి నుంచి బయటకు పాఠశాల స్థాయి నుంచి కళాశాల స్థాయి వరకు చదివించే తల్లిదండ్రులు తమ పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటుంటారు. ఈ క్రమంలోనే కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలపై ఉన్న ప్రేమ.. మమకారం.. గారాబం కారణంగా వారికి విపరీతమైన స్వేచ్ఛ ఇస్తున్నారు. వారి కదలికలపై ఏమాత్రం దృష్టి సారించడంలేదు. పర్యవసానంగా ప్రేమ పేరుతో తప్పటడుగులు వేస్తున్నారు. తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి తాము ప్రేమించిన యువకునితో కలిసి ద్విచక్రవాహనాలు, కార్లలో సుదూర ప్రాంతాలకు వెళ్లేందుకు కూడా వెనుకాడటం లేదు. తమ అమ్మాయికి ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అవసరమని భావించి తల్లిదండ్రులు వేలాది రూపాయలు వెచ్చించి సెల్ఫోన్లను కొనుగోలు చేయించి ఇస్తే, వాటితో చాటింగ్ చేస్తూ చివరకు చీటింగ్‌కు గురవుతున్నారు. ఎవరి బాధ్యత ఎంతెంత ? ► యువత తమ ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారంటే వారి చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎవరి బాధ్యత ఎంతెంత అనే విషయంపై కూడా ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. తల్లిదండ్రులు, బంధువులు, ఉపాధ్యాయులు, స్నేహితులు, పోలీసులు కూడా చాలా సందర్భలాలలో బాధ్యత వహించాల్సి వస్తోంది. ►తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రేమ.. అనురాగాన్ని చూపించాల్సిందే. అయితే ఒక్కడే కుమారుడు, ఒక్కతే కుమార్తె అంటూ వారికి కావాల్సిన వస్తు సామగ్రిని కొనుగోలు చేసి ఇవ్వడం, అవసరానికి మించి డబ్బులు ఇవ్వడం చెప్పకనే తమ పిల్లల జీవితాలు నాశనం అయ్యేందుకు వారే కారణమవుతున్నారు. ►విద్యా సంస్థల్లో ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఈవ్‌టీజింగ్, ర్యాగింగ్ లాంటి చర్యలను చూసీచూడనట్లు వదిలేసినా, పర్యవేక్షణ సరిగా లేకపోయినా విద్యార్థులు గతి తప్పుతారు. ►పోలీసులు తమ పరిధిలోని విద్యాసంస్థల్లో ప్రేమ వ్యవహారం, ఈవ్‌టీజింగ్, ర్యాగింగ్ వల్ల కలిగే నష్టాల గురించి అవగాహన కల్పించాలి. జల్సాల కోసం నేరాలకు పాల్పడుతున్న యువకులు యువతులను తమ వైపు ఆకర్షించుకునేందుకు, వారికి ఖరీదైన గిఫ్ట్‌లను ఇచ్చేందుకు, తాము జల్సాగా తిరిగేందుకు కావాల్సిన డబ్బుల కోసం కొందరు యువకులు అడ్డదారులు వెతుక్కుంటున్నారు. మొదట తనను నమ్మి వచ్చిన యువతి కోసం ప్రేమ పేరుతో ఎంతదూరమైనా వెళ్లేందుకు సిద్దమవుతాడు. జల్సాలకు డబ్బులు అవసరమైన సందర్భాల్లో నేరాలకు పాల్పడి పోలీస్ స్టేషన్ల మెట్లెక్కుతున్నారు. హత్యలు, హత్యాయత్నాలు, గ్యాంగ్‌ల ఏర్పాటు, దొంగతనాలు, దోపిడీలకు సైతం పాల్పడుతున్నారు. కటకటాల పాలవుతూ తమను నమ్మి వచ్చిన అమ్మాయిలను సైతం అడ్డంగా మోసగిస్తున్నారు. విద్యా సంస్థల్లో విస్తృత ప్రచారం అవసరం ప్రేమ వ్యవహారంలో ఆకర్షణ తప్ప, ఉన్నత శిఖరాలు అధిరోహించే దిశగా ముందుకు వెళ్లడం చాలా అరుదుగా ఉంటుందనే విషయాలను, ప్రేమ వల్ల లాభ,నష్టాల గురించి విస్తృతంగా ప్రచారం చేయాలి. సదస్సులు, సమావేశాల ద్వారా యువతీ, యువకుల్లో మార్పు తీసుకుని వచ్చేందుకు కృషి చేయాలి. విద్యాసంస్థలు, హాస్టళ్ల వద్ద ఆయా యాజమాన్యాల పర్యవేక్షణ అవసరం. ఈవ్‌టీజింగ్, వేధింపులపై పోలీసుల నిఘా ఉండేందుకు తమ వంతు కృషి చేయాలి. ప్రేమ జంటలకు జిల్లా పోలీసుల కౌన్సెలింగ్ ‘మంత్రాంగం’ జిల్లా పోలీసు యంత్రాంగం పరివర్తన, ఎల్‌హెచ్‌ఎంఎస్, ఈ–చలాన్లపై విస్తృతంగా ప్రచారం చేపట్టింది. ఇటీవల కొంతమంది ప్రేమ జంటలకు పోలీసులు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కడప నగర శివార్లలో ప్రత్యేకంగా కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. గత వారం రోజులుగా ఈప్రక్రియ కొనసాగుతోంది. యువతకు ప్రత్యేక కౌన్సెలింగ్ చేస్తున్నాం యువత ప్రేమ పేరుతో విచ్చల విడిగా కొన్ని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే యువతీ, యువకులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నాం. యువత జంటలు, జంటలుగా పార్కులు, శిల్పారామం లాంటి ప్రదేశాల్లో జుగుప్సాకర చర్యలకు పాల్పడుతున్నారు. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలను తీసుకునేందుకు చర్యలు చేపడుతున్నాం. – షేక్ మాసుం బాషా, కడప డీఎస్పీ అన్నిరకాల పర్యవేక్షణ అవసరం తల్లిదండ్రులు, అధ్యాపకులు, పోలీసుల పర్యవేక్షణ ఎంతైనా అవసరం. ఏయే ప్రాంతాల్లో తిరుగుతున్నారో పర్యవేక్షించి పోలీసులు చర్యలు తీసుకోవాలి. పార్కులు తదితర పర్యాటక ప్రదేశాలకు వచ్చేవారి వివరాలను నమోదు చేసేలా రికార్డును నిర్వహిస్తే అక్కడకి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేందుకు వచ్చేవారు తగ్గిపోతారు. అలాగే కళాశాల ఆవరణంలో ఎలాంటి అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా వారిపై చర్యలు తీసుకునేందుకు వెనుకాడటం లేదు. – డాక్టర్ వెంకటేశ్వర్లు, కడప రిమ్స్ వైద్యకళాశాల ప్రిన్సిపల్ -
ర్యాగింగ్ : వేధించారని యాసిడ్ తాగేశారు
-
నూజివీడు ట్రిపుల్‌ఐటీలో ర్యాగింగ్ కలకలం
-
ర్యాగింగ్‌పై మంత్రి గంటా ఆగ్రహం
నూజివీడు: కృష్ణా జిల్లా నూజివీడు ఐఐఐటిలో ర్యాగింగ్ ఘటన వార్తలపై మంత్రి గంటా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్జీయూకేటీ డైరెక్టర్‌తో ఆయన మాట్లాడి ర్యాగింగ్ నిరోధానికి ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ర్యాగింగ్‌కు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ర్యాగింగ్ ఘటనలను ఏమాత్రం సహించవద్దని అధికారులకు ఆయన స్పష్టం చేశారు. ర్యాగింగ్ ఘటనలు, తీసుకొన్న చర్యలపై నివేదిక పంపాలని ఆదేశించారు. పవిత్రమైన విద్యాలయాల్లో ర్యాగింగ్‌ను సహించేది లేదని మంత్రి గంటా స్పష్టం చేశారు. -
‘అక్కడ ర్యాగింగ్ వాస్తవమే’
సాక్షి, నూజివీడు : కృష్ణాజిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో ర్యాగింగ్ జరిగింది వాస్తవమేనని ట్రిపుల్ ఐటీ డైరెక్టర్, ప్రొఫెసర్ వీరంకి వెంకటదాసు స్పష్టం చేశారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. క్యాంపస్ లోని కొందరు సీనియర్లు తమ జూనియర్లపై ర్యాగింగ్‌కు పాల్పడ్డారని తెలిపారు. ఇందుకు కొందరు ట్రిపుల్ ఐటీ సిబ్బంది కూడా సహకరించారని సంచలన విషయాలు వెల్లడించారు. తమపై ఫిర్యాదు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని సీనియర్లతో పాటు సిబ్బంది కూడా జూనియర్లను బెదిరించినట్లు చెప్పారు. ప్రాథమికంగా ర్యాగింగ్‌కు పాల్పడిన ఆరుగురు విద్యార్థులను గుర్తించామన్నారు. వారిపై చర్యలు తీసుకుంటామని ప్రొఫెసర్ వెంకటదాసు వివరించారు. 'తలెత్తుకుని ఎందుకు వెళ్తున్నావు.. ఫోన్ లో వాట్సాప్ ఎందుకు వాడటం లేదు. కొడితే ఏడుస్తావా?.. ఇవన్నీ బయటకు చెబితే ప్రాణాలు తీస్తామంటూ' ట్రిఫుల్ ఐటీలోని నాల్గో సంవత్సరం విద్యార్థులు థర్డ్ ఇయర్ విద్యార్థులను బెదిరించిన తీరిది. దీంతో పాటు క్రమశిక్షణ కమిటీ సభ్యులకు ఈ3కి చెందిన కొందరు విద్యార్థులు ఇన్ఫార్మర్లుగా ఉన్నారని ద్వేషం పెంచుకున్న ఫైనల్ ఇయర్ విద్యార్థులు మంగళవారం అర్ధరాత్రి దాటిన 20 మందికి పైగా జూనియర్లను ఒక్కొక్కరినీ గదిలోకి రప్పించి కొట్టి బయటకు పంపించడం కలకలం రేపింది. మూడు రోజులు గడుస్తున్నా సీనియర్లపై చర్యలు తీసుకోకుండా చర్చల పేరుతో కాలయాపన చేస్తున్నారని జూనియర్లు ఆరోపిస్తున్నారు. చర్యలు తీసుకోకపోతే ఆందోళనకు దిగుతామని ఈ3 విద్యార్థులు హెచ్చరించిన నేపథ్యంలో డైరెక్టర్, ప్రొఫెసర్ వీరంకి వెంకటదాసు మాట్లాడుతూ.. ర్యాగింగ్ కు పాల్పడిన వారిని గుర్తించామని, చర్యలు తీసుకుంటామని పేర్కొనడం బాధిత విద్యార్థులకు ఊరట కలిగించే విషయమే. -
ర్యాగింగ్: దెబ్బలు తట్టుకోలేక పీఎస్‌లోకి
హైదరాబాద్: నగరశివార్లలోని ఓ పాలిటెక్నిక్ కాలేజీలో ర్యాగింగ్ పేట్రేగిపోయింది. సీనియర్ల ర్యాగింగ్ ఆకృత్యాలను తట్టుకోలేని ఓ విద్యార్థి పోలీస్ స్టేషన్‌కు పరుగుతీసిన ఘటన ఎల్బీనగర్లో చోటుచేసుకుంది. ఎల్బీనగర్ లింగజోడుకు చెందిన గిరిధర్ యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లోని టీడీఆర్ పాలిటెక్నిక్ కాలేజీలో ఫస్టియర్ చదువుతున్నాడు. గురువారం సాయంత్రం బీబీనగర్ నుంచి హైదరాబాద్‌కు కాలేజీ బస్సులో ఇంటికి బయలు దేరిన గిరిధర్‌ను ఫైనలియర్ విద్యార్థులు సమీర్, నరసింహా, నరసింహా గౌడ్లు ర్యాగింగ్ పేరుతో చితకబాదారు. దెబ్బలు తట్టుకోలేని గిరిధర్ బస్సు ఎల్బీనగర్కు చేరుకోగానే పోలీస్‌స్టేషన్‌లోకి పరుగు తీశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు గాయపడ్డ గిరిధర్‌ను సమీప ఆసుపత్రికి తరలించారు. సీనియర్ల కోసం గాలిస్తున్నారు. సీనియర్లు వంగబెట్టి దెబ్బలు కోట్టే గేమ్ తనతో ఆడారని, రూ.500 ఇస్తే వదిలేస్తామన్నారని గిరిధర్ సాక్షికి తెలిపాడు. బీబీనగర్ నుంచి ఉప్పల్ వరకు కొట్టారని, డబ్బులు ఇవ్వకుంటే రోజు ఇలానే కొడుతామని బెదిరించినట్లు గిరిధర్ చెప్పుకొచ్చాడు. -
ర్యాగింగ్: దెబ్బలు తట్టుకోలేక పీఎస్‌లోకి
-
ర్యాగింగ్ కలకలం
జేఎన్టీయూ: అనంతపురం నగరం పరిధిలోని ఓ ప్రవైటు ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం ర్యాగింగ్ కలకలం రేగింది. బీటెక్ మూడో సంవత్సరం విద్యార్థులు ఇద్దరు , మొదటి సంవత్సరం విద్యార్థి పట్ల దురుసుగా ప్రవర్తించారు. దీంతో మొదటి సంవత్సరం విద్యార్థి ప్రతిఘటించాడు. వెంటనే పోలీసులకు ఫోన్ చేయడంతో ఆ ఇద్దరు విద్యార్థులను పోలీసు స్టేషన్‌కు తరలించారు. వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తల్లిదండ్రుల సమక్షంలోనే వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. ర్యాగింగ్ చేస్తే వచ్చే దుష్పరిణామాలు ఎలా ఉంటాయో వివరించారు. ర్యాగింగ్ నిరోధానికి పటిష్టమైన చర్యలు చేపట్టాలని బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థులు కోరుతున్నారు. -
అనంతలో ర్యాగింగ్ కలకలం
– ఎస్కేయూలో ఆత్మహత్యకు యత్నించిన విద్యార్థిని – పీవీకేకేలో విద్యార్థికి గొంతుకోసిన దుండగలు అనంతపురం సెంట్రల్: అనంతలో ర్యాగింగ్ కలకలం రేపింది. ఒకేరోజు ఇద్దరు విద్యార్థులు ర్యాగింగ్ బారిన పడి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని సైన్స్ కళాశాలలో ఎమ్మెస్సీ కెమిస్ట్రీ తొలి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని బుధవారం ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తోటి విద్యార్థులు గమనించి అడ్డుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. మహిళా వసతి గృహాల్లో రాత్రి పూట ర్యాగింగ్ తీవ్రంగా జరుగుతోందని, క్యూలైన్లోనే వెళ్లాలని, తప్పితే రాత్రి పూట చిత్ర విచిత్రాలతో మానసిక క్షోభకు గురిచేస్తున్నారని బాధితురాలు వాపోయారు. అదేవిధంగా మాజీ మంత్రి, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డికి చెందిన పీవీకేకే కళాశాలలో ర్యాగింగ్ జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న నితీష్‌కుమార్‌రెడ్డి గొంతుకోసి దుండగులు పరారయ్యారు. మంగళవారం సాయంత్రం కళాశాల నుంచి బయటకు వచ్చిన విద్యార్థి కళాశాలకు కూతవేట దూరంలోని ముళ్ల పొదల్లో రక్తపుమడుగులో పడి ఉన్నాడు. గమనించిన స్థానికులు తల్లిదండ్రులకు సమాచారం చేరవేయడంతో బాధితున్ని మంగళవారం రాత్రి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. విషయం బయటకు రాకుండా తొక్కిపెట్టారు. అయితే బాధిత విద్యార్థి సదరు కళాశాలలో చదువుకోలేనని.. ర్యాగింగ్‌తో పాటు, తాగి వస్తున్నారని ముందు రోజు తల్లిదండ్రులకు తెలియజేసినట్లు బంధువులు తెలిపారు. -
మాజీ మంత్రి కాలెజీలో ర్యాగింగ్ కలకలం
-
ర్యాగింగ్ రహిత జిల్లాగా తీర్చిదిద్దుతాం
ఎస్పీ ఆకే రవికృష్ణ కర్నూలు: కర్నూలును ప్రమాద, ర్యాగింగ్ రహిత జిల్లాగా తీర్చిదిద్దుదామని ఎస్పీ ఆకే రవికృష్ణ పిలుపునిచ్చారు. నగరంలోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో శనివారం ఉదయం ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన ప్రమాద దృశ్యాలకు సంబంధించిన సీసీ ఫుటేజీలను సేకరించి వాటిని తెరపై ప్రదర్శించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ట్రాఫిక్ డీఎస్పీ రామచంద్ర ఆధ్వర్యంలో ఓ డాక్యుమెంటరీ తయారు చేశారు. అతి వేగంగా వాహనాలు నడపవద్దని, మద్యం సేవించి వాహనాలను నడపవద్దని, సీటుబెల్టు, హెల్మెట్ ధరించాలని యువకులకు అవగాహన కల్పించి ప్రోత్సహించడం కోసం కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఎస్పీ వెల్లడించారు. జిల్లాలో సుమారు 600 మంది ప్రతి ఏటా రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని, 2,500 మందికి పైగా క్షతగాత్రులవుతున్నారని తెలిపారు. జిల్లాలోని అన్ని కళాశాలల్లో ఈ డాక్యుమెంటరీని ప్రదర్శిస్తున్నటు వెల్లడించారు. ర్యాగింగ్‌కు వ్యతిరేకంగా కళాశాలల్లో కమిటీలు ఏర్పాటు చేయాలని ఎస్పీ పిలుపునిచ్చారు. ర్యాగింగ్ జరిగితే కళాశాల యాజమాన్యాలదే బాధ్యత అన్నారు. ఎవరైనా ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యల కింద కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సెయింట్ జోసెఫ్ కళాశాల ప్రిన్సిపల్ శౌరిల్‌రెడ్డి, ట్రాఫిక్ డీఎస్పీ రామచంద్ర, సీఐలు మహేశ్వరరెడ్డి, కృష్ణయ్య, శేఖర్‌రావు, ఆర్ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. -
ఎస్వీఆర్ట్స్ కళాశాలలో ర్యాగింగ్
తిరుపతి: టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో ర్యాగింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనపై మొదటి సంవత్సర విద్యార్థులు క్యాంపస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రెండో సంవత్సరం చదువుతున్న ఒక విద్యార్థిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి... ఆర్ట్స్ కళాశాలలోని శ్రీ వాస్తవ వసతి గృహంలో ఉంటున్న జూనియర్ విద్యార్థులు మెస్‌కు షార్ట్‌లు వేసుకొని వెళ్తున్నారు. దీంతో సీనియర్లు జోక్యం చేసుకొని మెస్‌కు షార్ట్ వేసుకొని రావొద్దని హెచ్చరించారు. అయినా జూనియర్లలో మార్పు రాకపోవడంతో బుధవారం గట్టిగా హెచ్చరించారు. ఈ నేపథ్యంలో సీనియర్, జూనియర్ల మధ్య గొడవ జరిగింది. ఈ సందర్బంలో సీనియర్లు, జూనియర్లపై చేయి చేసుకున్నారు. దీంతో మనస్థాపానికి గురైన ఇద్దరు విద్యార్థులు క్యాంపస్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఒక విద్యార్థిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. -
ర్యాగింగ్ కలకలం
► మెడికల్ కళాశాలలో ప్రత్యేక బృందం విచారణ ► డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కు నివేదిక ► ఆలస్యంగా వెలుగులోకి.. అనంతపురం: అనంతపురం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపుతోంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. ఈనెల 22న రాత్రి మహిళల హాస్టల్లో ఉంటున్న విద్యార్థినులు హాస్టల్ పక్కన ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో 2016 బ్యాచ్‌కు చెందిన విద్యార్థినిని సీనియర్ విద్యార్థిని ర్యాగింగ్ చేసింది. మనస్థాపానికి గురైన సదరు విద్యార్థిని కర్నూలులో ఉన్న తన తండ్రికి విషయాన్ని తెలిపింది. ఆయన ర్యాగింగ్ నిరోధానికి సంబంధించిన కేంద్ర కమిటీకి ఫిర్యాదు చేశారు. అక్కడి నుంచి ఘటనపై విచారణ చేయాలని మెడికల్ కళాశాలకు ఆదేశాలు అందాయి. ఈ క్రమంలో ఈనెల 28న సుదీర్ఘంగా విచారణ కొనసాగింది. డాక్టర్లు మల్లీశ్వరి, ప్రభాకర్, శ్యాంప్రసాద్, శారద, సాయి సుధీర్లతో కూడిన బృందం విద్యార్థినులతో మాట్లాడారు. ఈ సమయంలో ర్యాగింగ్ జరగలేదని విద్యార్థినులు చెప్పడంతో వారు కంగుతిన్నారు. బ్యాచ్‌ల వారీగా విద్యార్థినులను ప్రత్యేకంగా విచారించగా, ఎవరూ కూడా సరైన సమాధానం చెప్పలేదని తెలిసింది. బాధిత విద్యార్థిని తండ్రిని కూడా విచారణకు రప్పించారు. ఈ క్రమంలోనే ఘటన జరిగిన మరుసటి రోజే వారు ‘సారీ’ చెప్పుకున్నారని, విషయం ఇంత పెద్దదవుతుందని అనుకోలేదని, కొందరు విద్యార్థినులు చెప్పినట్లు సమాచారం. కాగా ర్యాగింగ్‌కు సంబంధించి విద్యార్థినులతో రాత పూర్వకంగా లేఖ తీసుకున్నట్లు తెలిసింది. ఆ లేఖతో పాటు విచారణ బృందం నివేదికను కూడా అదే రోజు మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కేఎస్ఎస్ వెంకటేశ్వరరావుకు అందజేశారు. ఆ తర్వాత రిపోర్ట్‌ను కలెక్టర్‌తో పాటు డీఎంఈకి పంపినట్లు సమాచారం. కాగా కళాశాల హాస్టళ్లలో కొందరు సీనియర్లు మితిమీరి ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. జూనియర్లు తమను ‘మేడం’ అని సంభోదించాలని, లేకుంటే ‘మాటల’తో మానసికంగా వేధిస్తున్నట్లు సమాచారం. పైగా భోజనం తినే సమయంలో కూడా జూనియర్లు ముందు వెళ్తే కొందరు సీనియర్లు మానసికంగా ఇబ్బంది పెడుతున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే త్వరలో కళాశాల విద్యార్థులందరితో కళాశాల యాజమాన్యం ప్రత్యేక సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది. -
మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం
– విచారణ చేసిన ప్రత్యేక వైద్య బృందం – డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌కు నివేదిక – ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన అనంతపురం మెడికల్ : అనంతపురం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపుతోంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. ఈనెల 22న రాత్రి మహిళల హాస్టల్లో ఉంటున్న విద్యార్థినులు హాస్టల్ పక్కన ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో 2016 బ్యాచ్‌కు చెందిన విద్యార్థినిని సీనియర్ విద్యార్థిని ర్యాగింగ్ చేసింది. మనస్థాపానికి గురైన సదరు విద్యార్థిని కర్నూలులో ఉన్న తన తండ్రికి విషయాన్ని తెలిపింది. ఆయన ర్యాగింగ్ నిరోధానికి సంబంధించిన కేంద్ర కమిటీకి ఫిర్యాదు చేశారు. అక్కడి నుంచి ఘటనపై విచారణ చేయాలని మెడికల్ కళాశాలకు ఆదేశాలు అందాయి. ఈ క్రమంలో ఈనెల 28న సుదీర్ఘంగా విచారణ కొనసాగింది. డాక్టర్లు మల్లీశ్వరి, ప్రభాకర్, శ్యాంప్రసాద్, శారద, సాయి సుధీర్లతో కూడిన బృందం విద్యార్థినులతో మాట్లాడారు. ఈ సమయంలో ర్యాగింగ్ జరగలేదని విద్యార్థినులు చెప్పడంతో వారు కంగుతిన్నారు. బ్యాచ్‌ల వారీగా విద్యార్థినులను ప్రత్యేకంగా విచారించగా, ఎవరూ కూడా సరైన సమాధానం చెప్పలేదని తెలిసింది. బాధిత విద్యార్థిని తండ్రిని కూడా విచారణకు రప్పించారు. ఈ క్రమంలోనే ఘటన జరిగిన మరుసటి రోజే వారు ‘సారీ’ చెప్పుకున్నారని, విషయం ఇంత పెద్దదవుతుందని అనుకోలేదని, కొందరు విద్యార్థినులు చెప్పినట్లు సమాచారం. కాగా ర్యాగింగ్‌కు సంబంధించి విద్యార్థినులతో రాత పూర్వకంగా లేఖ తీసుకున్నట్లు తెలిసింది. ఆ లేఖతో పాటు విచారణ బృందం నివేదికను కూడా అదే రోజు మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కేఎస్ఎస్ వెంకటేశ్వరరావుకు అందజేశారు. ఆ తర్వాత రిపోర్ట్‌ను కలెక్టర్‌తో పాటు డీఎంఈకి పంపినట్లు సమాచారం. కాగా కళాశాల హాస్టళ్లలో కొందరు సీనియర్లు మితిమీరి ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. జూనియర్లు తమను ‘మేడం’ అని సంభోదించాలని, లేకుంటే ‘మాటల’తో మానసికంగా వేధిస్తున్నట్లు సమాచారం. పైగా భోజనం తినే సమయంలో కూడా జూనియర్లు ముందు వెళ్తే కొందరు సీనియర్లు మానసికంగా ఇబ్బంది పెడుతున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే త్వరలో కళాశాల విద్యార్థులందరితో కళాశాల యాజమాన్యం ప్రత్యేక సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది. -
ర్యాగింగ్ దుమారం
- ఇళ్లకు వెళ్లిపోతున్న జేఎన్టీయూ విద్యార్థినులు జేఎన్టీయూ : జేఎన్టీయూ అనంతపురం ఇంజినీరింగ్ కళాశాలలో ర్యాగింగ్ దుమారం రేపుతోంది. మూడు రోజుల నుంచి నిత్యం హాస్టళ్లలో ఉన్నతాధికారులు పర్యవేక్షణ చేస్తుండటంతో విసిగిపోతున్న విద్యార్థినులు ఇళ్లకు వెళ్లిపోతున్నారు. బీటెక్ కంప్యూటర్ సైన్సెస్ విభాగంలోని సీనియర్ విద్యార్థిని.. జూనియర్ విద్యార్థినికి అసైన్మెంట్లు రాసివ్వమని కోరింది. దీంతో తనను ఎప్పుడూ పనులు చేయాలని పురమాయిస్తున్నారంటూ సదరు విద్యార్థిని తన తండ్రికి తెలిపింది. దీంతో ఆయన నేరుగా జేఎన్టీయూ వీసీ , రిజిస్ట్రార్, ఉన్నత విద్యామండలి చైర్మన్, ప్రిన్సిపల్ సెక్రటరీలకు మెయిల్ ద్వారా లేఖలు పంపారు. ఫలానా అడ్రెస్ నుంచి రాసినట్లు పేర్కొనకుండా.. అనధికార మెయిల్ నుంచి పంపించారు. ర్యాగింగ్ జరుగుతోందని, చర్యలు తీసుకోవాలని అందులో కోరారు. దీంతో అప్రమత్తమైన జేఎన్టీయూ ఉన్నతాధికారులు ర్యాగింగ్ ఘటనపై ఆరా తీశారు. అదే రోజు అప్రమత్తమయ్యారు. కానీ అదే రకమైన పనులకు పురమాయిస్తున్నారంటూ తిరిగి రెండు రోజులకు మళ్లీ మెయిల్ పంపించారు. దీంతో జేఎన్టీయూ ఇన్చార్జ్ వీసీ ఆచార్య కె.రాజగోపాల్, రిజిస్ట్రార్ ఆచార్య ఎస్ కృష్ణయ్య హాస్టళ్లకు వెళ్లి విద్యార్థులతో నేరుగా ఆరా తీశారు. తమతో చెప్పడానికి ఏమైనా ఇబ్బందులుంటే.. ఫిర్యాదు పెట్టెలో ఏ అడ్రెస్ లేకుండా, ర్యాగింగ్ అంశాలను మాత్రమే రాసి వేయాలని సూచించారు. అయినా ఎవరూ స్పందించలేదు. మరోవైపు ఉన్నత విద్యామండలి ఈ అంశంపై వివరణ కోరింది. మూడు రోజుల నుంచి విద్యార్థులతో ఆరా తీసిన అంశాలు, అందుకు సంబంధించిన ఫొటోలు, విచారణ నివేదికను వర్సిటీ అధికారులు ఉన్నత విద్యాశాఖకు పంపారు. జేఎన్టీయూలో ఎలాంటి ర్యాగింగ్ జరగలేదని, మెయిల్ ద్వారా తప్పుడు సమాచారం పంపారని అందులో పేర్కొన్నారు. అలాగే ఉన్నతాధికారులు నిత్యం తనిఖీలు చేస్తుండటంతో విద్యార్థినులు ఆందోళనకు గురై ఇంటిబాట పడుతున్నారు. -
మద్యం కోసం జూనియర్లను చితకబాదారు
వరంగల్: మద్యం తాగించాలంటూ జూనియర్ విద్యార్థులను సీనియర్స్ చితకబాదిన విషయం వరంగల్ జిల్లాలో కలకలం రేపుతోంది. రెండు రోజుల క్రితమే ఓ కాలేజీ విద్యార్థులు మద్యం మత్తులో కత్తులతో దాడులు చేసుకోగా.. ఓ స్టూడెంట్ చావు బతుకుల మధ్య ఆస్పత్రిలో చేరాడు. ఈ ఘటనను మరువకముందే జూనియర్ స్టూడెంట్ పై మద్యం కోసం దాడి చేయడం సంచలనం రేపుతోంది. నగర శివారు లోని ఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఐదుగురు సీనియర్ విద్యార్థులు ఓ జూనియర్ ను మద్యం తాగించాలంటూ గత కొద్దిరోజులుగా వేధిస్తున్నారు. గురువారం అతడిని బలవంతగా సమీపంలో ఉన్న బారుకు తీసుకెళ్లారు. డబ్బులు లేవని కాళ్లు మొక్కినా వినకుండా వేధించారు. దీంతో మరో స్నేహితుడికి కాల్ చేసి రమ్మన్నాడు. అతని దగ్గర కూడా కేవలం రెండు వందల రూపాయలు ఉండడంతో ఇద్దరినీ చితకబాదిన సీనియర్స్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, వరుస సంఘటనలతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పోలీసులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
బడిలో శాడిజం!
-
ప్రైవేట్ స్కూల్లో ర్యాగింగ్ భూతం
-
ఈ మెడికల్ కాలేజీ రూల్స్ సూపర్బ్
ఆగ్రా: సీనియర్ విద్యార్థులు తమ జూనియర్లపై ఎలాంటి ర్యాగింగ్ చర్యలకు దిగకుండా ఉత్తరప్రదేశ్‌లోని సరోజిని నాయుడు మెడికల్ కాలేజీ ముందస్తు చర్యలు ప్రారంభించింది. ఎలాంటి పనులు చేస్తే ర్యాగింగ్కింద భావించి పోలీసు చర్యలు మొదలవుతాయో స్పష్టంగా పేర్కొంటూ క్యాంపస్ ఏరియా మొత్తం కూడా నోటీసులు అంటించింది. ర్యాగింగ్ వ్యతిరేక చర్యలు తీసుకోవడం ఎప్పుడూ ముందుండే ఈ కాలేజీ ఈసారి కొన్ని అదనంగా కూడా చేర్చి వైద్య విద్యార్థుల విద్యాభ్యాసానికి ఎలాంటి భంగం కలగకుండా గట్టి చర్యలు ప్రారంభించింది. ఎలాంటి సైగలతోనైనా, మాటలతోనైనా.. శారీరకంగాగానీ, మానసికంగాగానీ వేధింపులకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని ఆ కాలేజీ యాంటీ ర్యాగింగ్ సెల్ ప్రెసిడెంట్ ఎస్కే ఖతారియా మీడియాకు చెప్పారు. ఓ విద్యార్థి మరో విద్యార్థిని అతడు జూనియర్ అయిన, సీనియర్ అయినా రంగు, జాతి, మతం, కులం,లింగం, లైంగిక పరమైన, కనిపించేతీరుపైనా, ప్రాంతం, జాతీయత, భాష తదతర అంశాలను ఆధారంగా చేసుకొని ఎదుటివారిని వేధిస్తే మాత్రం ర్యాగింగ్ కిందకే వస్తుందని తెలిపారు. ఎవరైనా వీటిని అతిక్రమిస్తే అతడిని కాలేజీ నుంచి సస్పెండ్ చేయడంతోపాటు హాస్టల్ నుంచి వెళ్లగొట్టి రూ.25వేలు ఫైన్ వేసి అతడి పరీక్ష ఫలితాలు కూడా నిలిపివేస్తామని స్పష్టం చేశారు. విద్యార్థుల దుస్తులు, జుట్టుపై కాలేజీకి ఎలాంటి అభ్యంతరం లేదని, ప్రతి విద్యార్థి హుందాగా మాత్రం వ్యవహరించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. -
విజ్ఞాన్ కాలేజ్‌లో ర్యాగింగ్ కలకలం
హైదరాబాద్: నగరంలో మరోసారి ర్యాగింగ్ భూతం కలకలం రేపింది. హైదర్‌గూడలోని విజ్ఞాన్ కళాశాలలో శుక్రవారం ర్యాగింగ్ కలకలం రేగింది. కళాశాలలో ర్యాగింగ్ జరుగుతోందనే సమాచారంతో రంగంలోకి దిగిన రాజేంద్రనగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ర్యాగింగ్ అంశంతో సంబంధం ఉన్న పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి మరింత సమాచారం రాబడుతున్నారు. -
దారుణం చేసిన 21 మంది విద్యార్థులపై వేటు
తిరువనంతపురం: కేరళలో ఓ జూనియర్ విద్యార్థిపై దారుణ చర్యలకు దిగిన 21 మంది సీనియర్ విద్యార్థులపై వేటు పడింది. వారిని సస్పెండ్ చేస్తూ కాలేజీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. కేరళలోని మలప్పురంలోని ఓకాలేజీలో జూనియర్ విద్యార్థిని దాదాపు ఐదు గంటలపాటు వివస్త్రుడిని చేయకూడని పనులు చేయించడంతో అతడి కిడ్నీలు ఎఫెక్ట్ అయ్యి ఆస్పత్రి పాలయ్యాడు. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. దీనిపై పోలీసులు శరవేగంగా ముందుకు కదిలి విచారణ ప్రారంభించారు. మొత్తం 40 మంది జూనియర్ విద్యార్థులు సీనియర్ విద్యార్థులపై ఫిర్యాదు చేశారు. తమందరిని బట్టలు విప్పించి టాయిలెట్లు క్లీన్ చేయించారని పోలీసులకు చెప్పారు. ఈ ఘటన విషయంలో ముగ్గురు ప్రొఫెసర్లను కూడా అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ చేస్తున్నారు. డిసెంబర్ 2న రాత్రి పూట తమ వద్దకు వచ్చిన సీనియర్లు బలవంతంగా మద్యం తాగించారని, చేయకూడని పనులు కూడా చేయించారని తెలిపారు. ర్యాగింగ్ కారణంగానే ఆ విద్యార్థి కిడ్నీలు చెడిపోయాయని వైద్యులు తెలిపారు. -
ఐదుగంటలపాటు దారుణం
న్యూఢిల్లీ: కేరళలో దారుణం చోటుచేసుకుంది. తమ తోటి విద్యార్థి అని కూడా చూడకుండా సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడటంతో ఓ విద్యార్థి ఆస్పత్రి పాలయ్యాడు. వాళ్లు చేసిన ర్యాగింగ్ కారణంగా కిడ్నీలు కూడా పనిచేయని పరిస్థితికి వచ్చి డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ర్యాగింగ్ భూతంపై ప్రతి ఏటా ప్రతి విద్యాలయంలో, సమాజంలో ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంపట్ల పోలీసులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కేరళలోని త్రిశూర్‌లో ఓ 22 ఏళ్ల యువకుడు పాలిటెక్నిక్ కాలేజీలో చదువుతున్నాడు. అతడిని మరో ఎనిమిది మంది విద్యార్థులను పిలిచి వారి బట్టలు విప్పేసి చేయకూడని పనులు చేశారు.. కొన్ని వారితో చేయించారు. 22 ఏళ్ల విద్యార్థికి మాత్రం దాదాపు ఐదుగంటలపాటు ఓ రకంగా శిక్ష మాదిరిగా అమలు చేశారు. దీంతో అది కాస్త కిడ్నీపై ప్రభావం చూపించి ఆస్పత్రి పాలయ్యాడు. ర్యాగింగ్ కారణంగా ఆ విద్యార్థి కిడ్నీలు ఎఫెక్ట్ అయ్యాయని వైద్యులు తెలిపారు. ర్యాగింగ్ కు పాల్పడిన విద్యార్థులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
ర్యాగింగ్ వల్లే వైద్యవిద్యార్థిని ఆత్మహత్య?
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి జీఎస్ఎల్ మెడికల్ కాలేజి విద్యార్థిని శుభశ్రీ (21) ఆత్మహత్యపై పోలీసులు విచారణ ప్రారంభించారు. రాజానగరంలోని మెడికల్ కాలేజి హాస్టల్ లో ఉంటున్న శుభ శ్రీ(21) ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతోంది. ఆమె హాస్టల్ భవనంపై నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది. వాస్తవానికి నలుగురు విద్యార్థులు తనను ర్యాగింగ్ చేస్తున్నారని రెండు వారాల క్రితం శుభశ్రీ ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసింది. దానిపై విచారణ కమిటీని నియమించినట్లు కళాశాల యాజమాన్యం చెబుతోంది. అయితే.. శుభశ్రీ కొన్నాళ్లుగా మానసికంగా ఇబ్బంది పడుతోందని, ఇంతకు ముందు కూడా రెండుసార్లు ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించిందని తెలిపింది. -
క్యాంపస్‌లో అర్థనగ్నంగా పరిగెత్తించారు
హైదరాబాద్: ర్యాగింగ్‌కు వ్యతిరేకంగా ఎన్ని చర్యలు చేపడుతున్నా.. ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో పదేపదే అలాంటి ఘటనలు చోటుచేసుకోవడం కలవరం రేపుతోంది. తాజాగా కూకట్పల్లి జేఎన్టీయూలో ర్యాగింగ్ ఘటన విద్యార్థులను విస్తుపోయేలా చేసింది. రాఘవేంద్ర అనే బీటెక్ విద్యార్థిని సీనియర్లు తీవ్ర వేధింపులకు గురిచేశారు. అర్థరాత్రి వేళ క్రూరంగా ప్రవర్తించిన సీనియర్ విద్యార్థలు.. జూనియర్ విద్యార్థి రాఘవేంద్రను అర్థనగ్నంగా క్యాంపస్‌లో పరుగులు పెట్టించారు. విషయం తెలుసుకున్న ఇతర విద్యార్థులు సీనియర్ల తీరుకు నిరసనగా క్యాంపస్‌లో ఆందోళన బాట పట్టారు. -
ఉషారాణి ఆత్మహత్యపై పూర్తిస్థాయి దర్యాప్తు
విశాఖ: ఇంజినీరింగ్ విద్యార్థిని ఉషారాణి ఆత్మహత్య సంఘటనకు సంబంధించి పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలని రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శిని విదేశీ పర్యటనలో ఉన్న విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదేశించారు. ముఖ్య కార్యదర్శి సుమితాదావ్రాతో మాట్లాడిన ఆయన సంఘటన గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. (చదవండి : ర్యాగింగ్ భూతానికి విద్యార్థిని బలి) కర్నూలు జిల్లా పాణ్యంలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్న ఉషారాణి ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని, బాధ్యులపైనా, ర్యాగింగ్ జరిగినట్లయితే కళాశాలపైనా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ర్యాగింగ్ ఎక్కడ జరిగినా సహించేది లేదని, అలాంటి కళాశాలలపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
ర్యాగింగ్ హద్దులు దాటొద్దు
సిద్దిపేట జోన్: కాలేజీ రోజుల్లో ర్యాగింగ్ సహజమని, అది శృతిమించి హద్దులు దాటకుండా ఆడ పిల్లలకు ధైర్యమిచ్చేదిగా ఉండాలని ‘ఈ జన్మనీకే’ చిత్రం హీరోయిన్ ప్రియ అన్నారు. బుధవారం స్థానిక ప్రతిభ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో శివమ్స్ గార్డెన్లో జరిగిన ఫ్రెషర్స్ పార్టీలో చిత్రం హీరో తరుణ్, హీరోయిన్ ప్రియతో పాటు దర్శక, నిర్మాతలు కీర్తి కుమార్, జూలియస్, రవిచంద్రలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థి దశ ఎంతో గొప్పదన్నారు. కాలేజీ రోజులు తీపి గుర్తులని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూనిట్ సభ్యులు శ్రీనివాస్, శరత్, సాగర్ , కళాశాల ప్రిన్సిపాల్ సూర్యప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. -
విద్యార్థులు సోదరభావంతో మెలగాలి
– ఎస్పీ ఆకే రవికృష్ణ కర్నూలు: విద్యార్థులు ఐక్యమత్యంగా ఉండి సోదర భావంతో మెలగాలని ఎస్పీ ఆకే రవికృష్ణ సూచించారు. కల్లూరు మండలం పెద్దటేకూరు సమీపంలోని బృందావన్ ఇన్సిట్యూట్‌ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) కళాశాలలో బుధవారం ర్యాగింగ్ నిరోధంపై అవగాహన సదస్సు జరిగింది. కార్యక్రమంలో ఎస్పీ ముఖ్యఅతి«థిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఎస్పీ మాట్లాడుతూ కన్నవారి కలలను సాకారం చేయడానికి తపనతో కష్టపడి చదివించే తల్లిదండ్రుల ఆకాంక్షను నెరవేర్చి సమాజానికి ఉత్తమ పౌరులుగా నిలవాలన్నారు. ర్యాగింగ్ చట్టరీత్యా నేరమనే విషయం గుర్తించుకోవాలని హెచ్చరించారు. నిర్ధేశించుకున్న లక్ష్యం సాధించేందుకు క్రమశిక్షణతో ముందుకు సాగాలన్నారు. తల్లిదండ్రుల కలను సాకారం చేసేందుకు శ్రమించాలే కానీ.. ర్యాగింగ్‌తో జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. ప్రతి విద్యార్థి ర్యాగింగ్‌ను పాలద్రోలేందుకు సహకరించాలన్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పరీక్షల్లో రాణించేందుకు ప్రణాళిక బద్ధంగా సిద్ధం కావాలన్నారు. బాగా చదువుకొని జీవితంలో ఉన్నత స్థానానాలను అందుకోవాలని హితోపదేశం చేశారు. విద్యార్థులు ఎలాంటి తప్పిదాలకు పాల్పడకుండా తల్లిదండ్రులు, అధ్యాపకులు నియంత్రణలో ఉంచుకోవాలన్నారు. యాంటి ర్యాగింగ్ చట్టం కింద శిక్షలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. కళాశాలలో ర్యాగింగ్ సమస్యలు ఉంటే డయల్ 100కు కానీ, దగ్గరలోని పోలీస్ స్టేషన్‌కు కాని సమాచారం అందించాలని సూచించారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం ఎస్పీకి సన్మానం చేసి దేవుని ప్రతిమను జ్ఞాపికగా అందజేశారు. అనంతరం కళాశాల విద్యార్థులతో కలిసి ఎస్పీ విందు చేశారు. కార్యక్రమంలో బిట్స్ కళాశాల డైరెక్టర్ శివప్రసాదరెడ్డి, ప్రిన్సిపాల్ బాలాజీ, వైఎస్ ప్రిన్సిపాల్ గిరీష్‌రెడ్డి, వెల్దుర్తి ఎస్ఐ వెంకటేశ్వర్లు, కళాశాల అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. -
ఎస్వీ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్
ఫేర్వెల్ డే ప్రాక్టీస్ ముసుగులో తీవ్ర వేధింపులు హడలిపోతున్న జూనియర్లు సర్దుకు పోవాలంటున్న అధ్యాపకులు తిరుపతి మెడికల్: దశాబ్దాల చరిత్ర కలిగిన తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ భూతం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. పరిచయం పేరుతో జూనియర్లను సీనియర్లు ర్యాగింగ్ చేస్తుండడంతో హాస్టల్లో ఉంటున్న విద్యార్థులు హడలిపోతున్నారు. చిత్ర, విచిత్ర, వెకిలి చేష్టలతో తీవ్రంగా వేధింపులకు గురి చేస్తున్నారని బాధిత విద్యార్థులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇంత జరుగుతున్నా యాజమాన్యం పట్టించుకోక పోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ధైర్యం చేసి ఒకరిద్దరు మౌఖికంగా ఫిర్యాదు చేసినా.. సర్దుకోండి అంటూ అధ్యాపకులు చెప్పి పంపేస్తున్నారని కొందరు జూనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2016-17 విద్యా సంవత్సరానికి గాను ఈనెల 3వ తేదీ నుంచి అనాటమి, పిజియాలజీ, బయో కెమిస్ట్రీ విభాగాలలో తరగతులు ప్రారంభం అయ్యాయి. ఫేర్వెల్ డే ప్రాక్టీస్ పేరుతో తరగతులు ముగిసి చీకటి పడ్డాక కూడా డే స్కాలర్లను ఇళ్లకు పంపకుండా ర్యాగింగ్ చేస్తున్నారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్లో ఉంటున్న విద్యార్థినుల పరిస్థితి మరీ ఘోరంగా మారిందని సమాచారం. కాగా, ర్యాగింగ్ నిరోధానికి చర్యలు తీసుకున్నామని, ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని అధ్యాపకులు చెబుతున్న మాటల్లో ఇసుమంతైనా వాస్తవం లేదని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. శనివారం రాత్రి పొద్దుపోయేదాకా హాస్టల్లో ర్యాగింగ్ కొనసాగినట్లు సమాచారం. -
'నాగార్జున' లో మరోసారి ర్యాగింగ్
-ఐదుగురు విద్యార్థుల సస్పెన్షన్ నాగార్జున యూనివర్సిటీ : గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీలో మరోసారి ర్యాగింగ్ కలకలం రేగింది. జూనియర్ విద్యార్థిపై సీనియర్లు ర్యాగింగ్ కు పాల్పడ్డారు. వివరాలు.. యూనివర్సిటీలో బీటెక్ రెండో సంవత్సరం ఈసీఈ చదువుతున్న ఐదుగురు విద్యార్థులు మొదటి సంవత్సరం సివిల్ స్టూడెంట్ జయంత్‌ను గురువారం రాత్రి ర్యాగింగ్ చేశారు. ఈ విషయంపై స్పందించిన యూనివర్సిటీ ప్రిన్సిపల్ ఆచార్య పి. సిద్ధయ్య ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థులపై సస్పెన్షన్ వేటు వేశారు. ర్యాగింగ్ కు పాల్పడిన శంకర్, నవీన్, వెంకట కృష్ణ, కల్యాణ్, మనోజ్ కుమార్ లను హాస్టల్ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
తలదించుకుని వెళ్లాలి..!
సిద్ధార్థ ఫార్మశీ కళాశాలలో సీనియర్ల ర్యాగింగ్ ఎదురుతిరిగిన జూనియర్లు ఇరువర్గాల మధ్య ఘర్షణ, తోపులాట నూజివీడు : తాము ఎదురొస్తే తలదించుకుని వెళ్లాలి.. సీనియర్లు అంటే గౌరవం ఉండాలి.. తమ ముందు నడవకూడదని.. ఇలా సీనియర్లు జూనియర్లను ర్యాగింగ్ చేస్తున్నారు. రెండు రోజుల క్రితం పట్టణంలోని సిద్ధార్థ ఫార్మశీ కళాశాలలో ఇలాగే ర్యాగింగ్ చేశారని తెలిసింది. ఫార్మశీ నాలుగో సంవత్సరం విద్యార్థులు ప్రథమ సంవత్సరం విద్యార్థులను ర్యాగింగ్ చేస్తుండడంతో వారు కూడా ఎదురు తిరిగారు. ఇరువర్గాల మధ్య వివాదం తోపులాటకు దారితీసింది. సీనియర్ విద్యార్థుల పట్ల గౌరవంగా ఉండాలని, తాము ఎదురొస్తే తలవంచుకుని వెళ్లాలని, మా ముందు నడవకూడదని, పాటలకు డ్యాన్స్‌లు వేయాలని ర్యాగింగ్ చేస్తున్నారు. అంతేగాకుండా తమ పేర్లు ఏమిటో చెప్పాలని సీనియర్ విద్యార్థులు అడుగుతున్నారని, దీనికి మీపేర్లు తెలియదని జూనియర్లు చెబితే, మా పేర్లు ఎందుకు తెలుసుకోలేదని చెంపమీద కొడుతున్నారు. ఇలా కొట్టగా ఒక విద్యార్థి కళ్లజోడు కూడా పగిలింది. ఈ విధంగా ర్యాగింగ్ జరుగుతుండడంతో పట్టణానికి చెందిన ప్రథమ సంవత్సరం విద్యార్థి ఒకరు ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు విషయం తెలిపారు. వారు వచ్చి సీనియర్ విద్యార్థులను నిలదీసే క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం ఇరువర్గాల మధ్య జరిగిన వివాదం తోపులాటకు దారితీసింది. ఈ విషయం పోలీసులకు తెలిసినప్పటికీ కళాశాల యాజమాన్యం గొడవ ఏమీలేదని తెలపడంతో వారు వెనుదిరిగి వెళ్లిపోయారే తప్పితే ర్యాగింగ్ అంశంపై ఆరా తీయలేదు. ర్యాగింగ్ విషయమై ప్రథమ సంవత్సర విద్యార్థులు కళాశాల యాజమాన్యం దృష్టికి తీసుకు వెళ్లినా సరిగా పట్టించుకోకపోవడంతో వారు తమ కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్లారు. వారు రావడంతో కళాశాల వెలుపల గొడవ, ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. రా్యాగింగ్కు కారణమైన ఆఖరి సంవత్సరం విద్యార్థులను తల్లిదండ్రులను తీసుకురమ్మంటూ యాజమాన్యం ఇంటికి పంపించడంతో వారు శనివారం కళాశాలకు రాలేదు. చిన్నవిషయమే కళాశాలలో విద్యార్థుల మధ్య ఇగో సమస్య కారణంగా ఉత్పన్నమైనదే తప్ప సమస్యేమీ కాదు. తల్లిదండ్రులను తీసుకురమ్మని విద్యార్థులకు తెలిపాం. ఇన్నేళ్లలో కళాశాలలో ఎన్నడూ ర్యాగింగ్ అనేది లేదు. - శ్రీనాథ్ నిశ్శంకరరావు, ప్రిన్సిపాల్ -
ర్యాగింగ్‌తో భవిత నాశనం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ర్యాగింగ్‌కు విద్యార్థులు దూరంగా ఉండాలని, లేకుంటే భవిత నాశనమవుతుందని వక్తలు ఉద్బోధించారు. స్థానిక ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ కళాశాలలో యాంటీ రాగింగ్‌పై అవగాహన సదస్సు శనివారం నిర్వహించారు. ముఖ్య అతిథి, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం కళాశాల డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్ డాక్టర్ పి.సాంబశివరావు మాట్లాడుతూ విద్యార్థులందరూ స్నేహభావంతో మెలగాలన్నారు. ర్యాగింగ్‌కు పాల్పడితే చట్టపరంగా కఠిన శిక్షలు ఉన్నాయన్నారు. భవిష్యత్తు దెబ్బతింటుందన్నారు. అసోసియేట్ డీన్ పి.జయరామిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ర్యాగింగ్ పట్ల అవగాహన పెంచుకోకుంటే జరిగే నష్టాలను వివరించారు.విద్యార్థులకు సమస్యలు తలెత్తినప్పుడు ముందుగా తమ తల్లిదండ్రులు, అధ్యాపకులు, తర్వాత పోలీసు వారిని సంప్రదించి సమస్యకు పరిష్కారం చూసుకోవాలని వన్‌టౌన్ ఎస్సై పి.ఆనంద్ సూచించారు. జీవీ నాగేశ్వరరావు, మురళీమోహన్ పాల్గొన్నారు. గురుపూజోత్సవం వ్యవసాయ కళాశాలలో జరిగిన గురుపూజోత్సవంలో ముఖ్య అతిథి పి. సాంబశివరావు మాట్లాడుతూ విద్యార్థులు గురువులు అందించే నాణ్యమైన విద్యను ఆకళింపు చేసుకోవాలన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. -
వైవీయూలో గంభీర వాతావరణం
వైవీయూ : యోగివేమన విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్ అంశం వెలుగు చూడటంతో విశ్వవిద్యాలయంలో గంభీర వాతావరణం నెలకొంది. ఎవరిని పలుకరిస్తే ఏమో అన్న చందంలో విద్యార్థులు, అధ్యాపకులు ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారు. వైవీయూలో ర్యాగింగ్ అంశం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపడంతో అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలకు ఉపక్రమించారు. యాంటీ ర్యాగింగ్ సభ్యులతో సమావేశం నిర్వహించారు. అన్ని విభాగాల సమన్వయకర్తలతో సమావేశం నిర్వహించి ప్రతిరోజు తరగతిలో పాఠం కన్నా ముందుగా 5 నిమిషాల పాటు ర్యాగింగ్ గురించి తెలియజేయాలని సూచించారు. ఈనెల 31వ తేదీలోపు అన్ని విభాగాల్లో ఫ్రెషర్స్‌డే వేడుకలు నిర్వహించాలని, దీనికి ఆయా విభాగాల సమన్వయకర్తలు, విభాగాధిపతులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. ప్రతిరోజు బాలుర, బాలికల వసతి గృహాలను సందర్శించాలని, సెక్యూరిటీని పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా సాయంత్రం జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో ర్యాగింగ్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. కాగా మంగళవారం రాత్రి కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య కె. సత్యనారాయణరెడ్డి, చీఫ్ వార్డెన్ ఆచార్య జి. గులాంతారీఖ్, వార్డెన్లు వసతి గృహాలను తనిఖీ చేశారు. ఈ విషయమై ప్రిన్సిపాల్ ఆచార్య కె. సత్యనారాయణరెడ్డిని వివరణ కోరగా ర్యాగింగ్ అంశంపై ఇప్పటికే విచారణ పూర్తయిందని, బుధవారం రెక్టార్ వచ్చిన తర్వాత ఈ నివేదికను యూజీసీ వారికి పంపనున్నట్లు తెలిపారు. -
ర్యాగింగ్‌కు పాల్పడితే శిక్ష
వైవీయూ : విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ అథారిటీ సీనియర్ సివిల్ జడ్జి యు.వి. ప్రసాద్ పేర్కొన్నారు. వైవీయూలో ర్యాగింగ్ అంశం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో విశ్వవిద్యాలయం–డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సంయుక్త ఆధ్వర్యంలో ర్యాగింగ్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన సీనియర్ సివిల్ జడ్జి యు.వి. ప్రసాద్ మాట్లాడుతూ ర్యాగింగ్‌కు పాల్పడితే విశ్వవిద్యాలయం నుంచి బహిష్కరించడంతో పాటు ప్రవేశాలను సైతం రద్దుచేసే అధికారం కళాశాల యాజమాన్యానికి ఉంటుందని తెలిపారు. విద్యార్థులు తమ చక్కటి భవిష్యత్తు కోసం ర్యాగింగ్ వంటి అంశాల జోలికి వెళ్లకుండా ఉండాలని సూచించారు. అనంతరం ర్యాగింగ్ చట్టాలను గురించి సోదాహరణంగా వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఆచార్య కె. సత్యనారాయణరెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ ఆచార్య జి. గులాంతారీఖ్, రిజిస్ట్రార్ ఆచార్య వై. నజీర్అహ్మద్, విద్యార్థులు పాల్గొన్నారు. -
వైవీయూలో వికృత క్రీడ
వైవీయూ: వైఎస్సార్ జిల్లా యోగివేమన విశ్వవిద్యాలయం(వైవీయూ)లో వికృత క్రీడ పురివిప్పింది. గతవారంలో వర్సిటీలోని పెన్నా, చిత్రావతి మహిళా హాస్టల్స్‌లో సైన్స్ విభాగం విద్యార్థినులు కొత్తగా ప్రవేశాలు పొందిన అదే విభాగం విద్యార్థినులను ర్యాగింగ్ చేశారు. గత కొద్దిరోజులుగా జరుగుతున్న ఈ వ్యవహారంపై పలువురు మనోవేదనకు గురయ్యారు. దీంతో శనివారం రోజున ఏకంగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నేషనల్ యాంటీ ర్యాగింగ్ హెల్ప్‌లైన్‌కు ఆన్లైన్లో ఫిర్యాదు పంపారు. విచారణ చేపట్టాలని యూజీసీ నుంచి ఆదేశం వైవీయూలో ర్యాగింగ్ జరుగుతున్న అంశంపై ఫిర్యాదును స్వీకరించిన యూజీసీ యాంటీ ర్యాగింగ్ సెల్ అధికారులు దీనిపై వెంటనే విచారణ చేపట్టి నివేదిక పంపాలంటూ ఆదివారం మధ్యాహ్నం వర్సిటీ అధికారులకు ఉత్తర్వులు వచ్చాయి. విషయ తీవ్రతను గుర్తించిన అధికారులు హుటాహుటిన చర్యలకు ఉపక్రమించారు. ఆదివారం రాత్రి ప్రిన్సిపాల్ ఆచార్య కె. సత్యనారాయణరెడ్డి, హాస్టల్స్ చీఫ్ వార్డెన్, వైస్ ప్రిన్సిపాల్ ఆచార్య గులాంతారీఖ్, సైన్స్‌విభాగాల సమన్వయకర్తలు, హాస్టల్స్ బాధ్యుడు డా. గంగిరెడ్డిల బృందం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కమిటీ ఏర్పాటు.. విచారణ.. అధికారులు సోమవారం యాంటీ ర్యాగింగ్ కమిటీ సభ్యులతో సమావేశం ఏర్పాటుచేశారు. విద్యార్థినులను పిలిపించి ర్యాగింగ్ అంశంపై గోప్యంగా విచారణ చేపట్టారు. సీనియర్ విద్యార్థినులను విచారించి, మరోసారి ఇటువంటి చర్యలకు పాల్పడమని స్వీయధృవీకరణ పత్రాన్ని సైతం తీసుకున్నట్లు సమాచారం. కాగా సోమవారం సాయంత్రానికి విచారణ పూర్తిచేసిన సభ్యులు నివేదికను సిద్ధం చేశారు. ఈ నివేదికను మంగళవారం యూజీసీ యాంటీర్యాగింగ్సెల్కు పంపించేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు.. విద్యార్థులు ఎవరైనా ర్యాగింగ్‌కు పాల్పడితే కఠినచర్యలు తప్పవు. మహిళా హాస్టల్లో ర్యాగింగ్ జరుగుతున్న అంశం మాదృష్టికి రావడంతో వెంటనే చర్యలు చేపట్టాం. యాంటీ ర్యాగింగ్ కమిటీ సభ్యులతో కలిసి రాత్రివేళ హాస్టల్స్‌ను తనిఖీ చేశాం. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారించేందుకు కమిటీ వేశాం. విచారించిన తర్వాత నివేదికను యూజీసీకి పంపనున్నాం. – ఆచార్య కె.సత్యనారాయణరెడ్డి, ప్రిన్సిపాల్, పీజీ కళాశాల, వైవీయూ వెంటనే చర్యలు చేపట్టాం.. విశ్వవిద్యాలయ హాస్టల్స్‌లో ర్యాగింగ్ జరుగుతున్న అంశం మా దృష్టికి వచ్చిన వెంటనే చర్యలు చేపట్టాం. రాత్రివేళ ఒక మహిళా అధ్యాపకురాలితో పాటు ముగ్గురు అధ్యాపకులు హాస్టల్స్ పర్యవేక్షణకు కేటాయించాం. విద్యార్థినులు ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా మాకు ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం. – ఆచార్య జి. గులాంతారీఖ్, వైస్ ప్రిన్సిపాల్, చీఫ్ వార్డెన్, వైవీయూ హాస్టల్స్ -
ర్యాగింగ్‌కు ఇంటర్ విద్యార్థి బలి
-
ర్యాగింగ్‌కు ఇంటర్ విద్యార్థి బలి
జనగామ (వరంగల్) : ర్యాగింగ్ భూతానికి ఓ విద్యార్థి బలయ్యాడు. వరంగల్ జిల్లా జనగామలోని వాగ్దేవి జూనియర్ కాలేజీలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ప్రవీణ్(16)ను రెండో సంవత్సరం చదువుతున్న ఉమేష్ తీరు మార్చుకోమని హెచ్చరించాడు. దీంతో మనస్తాపానికి గురైన ప్రవీణ్ ఈ నెల 3న తేదీన ఉమేష్‌తో గొడవపడి.. పరస్పరం దాడికి దిగారు. ఈ దాడిలో తీవ్ర గాయాలైన ప్రవీణ్ చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. కుమారుడిపై కళాశాలలో దాడి జరిగిన విషయాన్ని దాచిన యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఫినాయిల్ కేసులో.. ముగ్గురు అమ్మాయిలు అరెస్టు
గుల్బార్గా: కేరళకు చెందిన ఫస్టియర్ దళిత బాలికకు ర్యాగింగ్ పేరిట ఫినాయిల్ తాగించిన కేసులో.. ముగ్గురు సీనియర్ విద్యార్థినులను పోలీసులు అరెస్టు చేశారు. గుల్బర్గాలోని నర్సింగ్ కళాశాలలో 19 ఏళ్ల అశ్వథిపై ర్యాగింగ్ పేరిట సీనియర్ విద్యార్థినులు దుర్మార్గానికి పాల్పడిన సంగతి తెలిసింది. అశ్వథికి బలవంతంగా ఫినాయిల్ తాగించడంతో తన ఆరోగ్యం విషమించింది. కర్ణాటకలో సంచలనం సృష్టించిన ఈ ర్యాగింగ్ కేసులో లక్ష్మి, అధీర, విష్ణుప్రియా అనే విద్యార్థినులను అరెస్టుచేసి జుడ్యీషియల్ కస్టడీకి తరలించినట్టు కలాబురుగి ఎస్పీ ఎన్ శశికుమార్ తెలిపారు. మే 9న ఆల్ కమాల్ నర్సింగ్ కళశాలలో జరిగిన ర్యాగింగ్ ఘటనతో అశ్వథి తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆమె కడుపులోని అవయవాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం అశ్వథి ఆస్పత్రిలో కోలుకుంటున్నది. -
కోహ్లి ఒప్పుకుంటాడా?
న్యూఢిల్లీ: యూత్ ఐకాన్ గా మారిన టీమిండియా స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లి మరో మంచి పనికి పూనుకోనున్నాడు. ర్యాగింగ్ కు వ్యతిరేకంగా గళం విప్పనున్నాడు. అతడితో ర్యాగింగ్ కు వ్యతిరేకంగా ప్రచారం చేయించాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి(హెచ్ ఆర్డీ) శాఖ భావిస్తోంది. దీని గురించి ప్రభుత్వాధికారులు తనను సంప్రదిస్తే కోహ్లి ఒప్పుకుంటాడా, లేదా అనేది వేచి చూడాలి. గతేడాది 399 ర్యాగింగ్ కేసులు నమోదయ్యాయి. విద్యాలయాల్లో ర్యాగింగ్ నివారణకు పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. కోహ్లి లాంటి జనాకర్షణ కలిగిన సెలబ్రిటీతో ప్రచారం చేయిస్తే సందేశంలో వెంటనే లక్ష్యిత వర్గాలకు చేరుతుందని సర్కారు యోచిస్తోంది. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ర్యాగింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ర్యాగింగ్ వల్ల ఎదురయ్యే పరిణామాల గురించి వివరిస్తూ పోస్టర్లు, ప్రకటనలు, లఘుచిత్రాలు రూపొందించాలని యూజీసీని ప్రభుత్వం ఆదేశించింది. ఉచిత మొబైల్ యాప్ కూడా తీసుకురానుంది. ర్యాగింగ్ పై ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నంబర్ 1800-180-5522 ను అందుబాటులోకి తెచ్చింది. -
ర్యాగింగ్: విద్యార్థినితో యాసిడ్ తాగించారు!
ర్యాగింగ్ భూతం వెర్రితలలు వేస్తోంది. కర్ణాటకలోని ఓ నర్సింగ్ కాలేజిలో సీనియర్లు జూనియర్ విద్యార్థినితో బలవంతంగా బాత్రూంలు శుభ్రం చేసే యాసిడ్ తాగించారు. గుల్బర్గాలోని అల్ ఖమర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్‌లో గత నెలలో ఈ ఘటన జరిగింది. అప్పటినుంచి ఇప్పటివరకు బాధితురాలు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతూనే ఉంది. కేరళకు చెందిన మొదటి సంవత్సరం విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను కోజికోడ్‌లోని వైద్యకళాశాలకు తరలించారు. ఆమెకు శరీరం లోపలి భాగాల్లో కాలిన గాయాలయ్యాయి. కర్ణాటక ఆస్పత్రిలోని ఐసీయూలో వారం ఉంచిన తర్వాత కోజికోడ్ తీసుకొచ్చారు. ఆమె పరిస్థితి ఇప్పటికీ విషమంగానే ఉంది. బాధితురాలి తల్లి రోజుకూలీగా పనిచేస్తుంటారు. తన కూతురు మంచి నర్సు కావాలన్న ఉద్దేశంతో రూ. 3 లక్షలు అప్పు చేసి మరీ ఆమెను గుల్బర్గా కాలేజిలో చేర్పించారు. తన కూతురు కనీసం తిండి కూడా తినలేకపోతోందని, వాళ్లు ఎందుకిలా చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనను దాదాపు ఐదు నెలలుగా చిత్రహింసలు పెడుతున్నారని, మూడో సంవత్సరం విద్యార్థినులు ఈ ఆగడాలకు పాల్పడ్డారని బాధితురాలు చెప్పింది. తాను నల్లగా ఉన్నానని, అందుకే ఎవరూ తనను ఇష్టపడరని, తనకు తండ్రి లేరని కూడా వాళ్లు కామెంట్లు చేస్తున్నారని వాపోయింది. బలవంతంగా చేతులు పైకెత్తి, తననోరు తెరిచి, యాసిడ్ తాగించారని తెలిపింది. అయితే ఇది ర్యాగింగ్ కాదని నర్సింగ్ కాలేజి ప్రిన్సిపాల్ డాక్టర్ ఈస్తర్ అంటున్నారు. ఆమె కుటుంబ సమస్యల కారణంగానే ఫినాయిల్ తాగిందని చెప్పారు. ఈ కేసు విచారణకు గుల్బర్గా పోలీసులు ప్రత్యేక బృందాన్ని నియమించారు. -
జూనియర్ పై సీనియర్ల అకృత్యం
కోజికోడ్: ర్యాగింగ్ బారిన పడిన కేరళ నర్సింగ్ విద్యార్థిని ఒకరు చావుబతుకుల్లో ఉంది. సీనియర్స్ కిరాతకం కోజికోడ్ కు చెందిన 19 ఏళ్ల దళిత యువతి ప్రాణాలకు ముప్పు తెచ్చిపెట్టింది. గత 9నకర్ణాటకలో ఈ ఘటన చోటు చేసుకుంది. గుల్బర్గాలోని అల్ ఖమర్ నర్సింగ్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్న కేరళ విద్యార్థిని సీనియర్లు ర్యాగింగ్ చేశారు. ఆమెతో మరుగుదొడ్లు శుభ్రం చేయడానికి వాడే ఫినాయిల్ బలవంతంగా తాగించారు. బాధితురాలిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వారం రోజుల పాటు ఐసీయూలో ఉంచి చికిత్స అందించినా ఆమె కోలుకోలేదు. దీంతో ఆమెను కోజికోడ్ మెడికల్ కాలేజీకి తరలించారు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని, ఫినాయిల్ తాగడం వల్ల అంతర్గత అవయవాలు దెబ్బతిన్నాయని వైద్యులు తెలిపారు. కూలి పనులు చేసుకుని జీవించే తాను కూతురు చదువు కోసం రూ. 3 లక్షలు అప్పు చేశానని బాధితురాలి తల్లి వెల్లడించింది. ర్యాగింగ్ జరగలేదని, కుటుంబ సమస్యల కారణంగానే బాధితురాలు ఫినాయిల్ తాగిందని నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్తేర్ పేర్కొన్నారు. మరోవైపు ఈ ఘటనపై గుల్బర్గా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
ర్యాగింగ్ నిరోధానికి ఈ-బీట్, పెట్రోలింగ్: డీజీపీ
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రైమ్ రేటు తగ్గిందని.. ఇంకా తగ్గాలని ఏపీ డీజీపీ రాముడు చెప్పారు. గత ఏడాది నుంచి ఏప్రిల్ వరకు ఒక్క ఫ్యాక్షన్ కేసు నమోదు కాలేదని ఆయన వెల్లడించారు. సోమవారం విజయవాడలో డీజీపీ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎర్రచందనం రవాణాలో 34మందిపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్టు తెలిపారు. భవిష్యత్తులో ర్యాగింగ్ నిరోధానికి ఈ-బీట్, పెట్రోలింగ్ నిర్వహిస్తామని అన్నారు. కాగా, తూర్పుగోదావరి జిల్లాలో తుని ఘటనలో ఇప్పటివరకూ ఆరుగురిని అరెస్ట్ చేసినట్టు డీజీపీ రాముడు తెలిపారు. -
జూనియర్లను ఈడ్చిఈడ్చి రాడ్లతో కొట్టారు
నోయిడా: ఢిల్లీలో దారుణం జరిగింది. ఇద్దరు జూనియర్లను సీనియర్ విద్యార్థులు ఈడ్చిఈడ్చి కొట్టారు. ఇనుప రాడ్లతో మోదారు. ఈ ఘటనలో 18మంది విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ధ్రువ్ అగర్వాల్, యాశ్ ప్రతాప్ సింగ్ అనే విద్యార్థులు హాస్టల్లో డిన్నర్ పూర్తి చేసుకొని టీవీ హాల్ కు తిరిగొచ్చారు. వారు అలా రాగానే.. పెద్ద మొత్తంలో సీనియర్ విద్యార్థులు తలుపులు వేసి వారిని లోపల పడేసి బాగా కొట్టారు. గంటపాటు అలా ఇష్టమొచ్చినట్లు కొట్టిన తర్వాత వారి బట్టలు విప్పేయండంటూ బలవంత పెట్టారు. సీనియర్లతో పెట్టుకుంటే ఏం జరిగిద్దో వాళ్లు మాకు చూపించాలని అనుకున్నారు. వాళ్లు ప్రతి రోజు మమ్మల్ని ర్యాగింగ్ చేస్తూనే ఉన్నారు. తినే వద్ద కూడా వదిలిపెట్టడం లేదు. కవర్లలో ఆహారం దాచేసి అందులో ఏముందని అడుగుతూ అలా చెప్పకుంటే ముఖంపై విసిరేసి అవమానిస్తారు. ఇలా రోజు జరుగుతుంది' అని గాయాలపాలయిన విద్యార్థుల్లో ఒకరు మీడియాకు చెప్పారు. కాగా, ఇంత పెద్ద మొత్తంలో సంఘటనలు జరుగుతున్నా తమకు కనీస సమాచారం అందించడం లేదంటూ తల్లిదండ్రులు మండిపడుతున్నారు. -
అమ్మో.. ర్యాగింగ్ భూతం!
నెల్లూరు(అర్బన్): నెల్లూరు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ భూతం జడలు విప్పింది. ర్యాగింగ్ పేరిట జూనియర్లను సీనియర్లు హింసిస్తున్నారు. పవిత్రమైన వైద్య విద్యను అభ్యసించాల్సిన చోట ర్యాగింగ్ పేరిట రెండు గ్రూపులుగా మారారు. ర్యాగింగ్ గొడవ గత పదిహేనురోజులుగా జరుగుతున్నప్పటికీ అధికారులు నిలువరించలేకపోయారని విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో జూనియర్లు, వారి తల్లిదండ్రులు సోమవారం నేరుగా ప్రిన్సిపాల్‌తో గొడవకు దిగారు. ఐదుగురు విద్యార్థులపై కేసునమోదు చేయాలని ఐదో నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరో ఇద్దరు మహిళా మెడికో విద్యార్థులపై ఫిర్యాదు చేస్తూ వారిని మందలించాలని కోరారు. దీంతో నిషేధంలో ఉన్న ర్యాగింగ్ విషయం రాష్ట్రంలో మరోసారి సంచలనమైంది. మాట వినకపోతే కొడుతున్నారు గత పదిహేనురోజులుగా సీనియర్లు జూనియర్లను బెదిరిస్తూ పనులు చేయించుకుంటున్నారు. అంగడికి పోయిరమ్మనడం, దుస్తులు ఉతకమనడం, రన్నింగ్ చేయమని చెప్పడం లాంటివి చేస్తున్నారు. తినే భోజనాన్ని లాగేయడం , బోర్డులపై బొమ్మలేయమనడం చేశారు. మాట వినకపోతే గదిలో ఉంచి కొడుతున్నట్టు ఫిర్యాదులందాయి. సీనియర్ మహిళా విద్యార్థులు కూడా తమ జూనియర్లను ఇబ్బందులు పెట్టారు. దీంతో బాధలు భరించలేని జూనియర్స్ తిరగబడ్డారు. ఈనెల 22న పెద్దఎత్తున గొడవ జరిగింది. సీనియర్లు, జూనియర్లు నెట్టుకున్నారు. ఆరోజే జూనియర్లు ప్రిన్సిపాల్ కృష్ణమూర్తిశాస్త్రీకి సీనియర్లపై ఫిర్యాదు చేశారు. ప్రిన్సిపాల్ విచారించి మందలించారు. ఆరోజే సస్పెండ్ చేస్తామని హెచ్చరించడంతో సీనియర్లు ప్రిన్సిపాల్‌ను బతిమాలుకుని ఇక మీదట తప్పు చేయమని లెంపలేసుకున్నారు. దీంతో వదిలేశారు. చంపేస్తామంటూ బెదిరింపులు ఆదివారం రాత్రి మరోమారు హాస్టల్లో గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో కొందరు జూనియర్లు తమ తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. ఒక మెడికో తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి సీనియర్లు తాగొచ్చి తనను చంపేస్తామంటున్నారని వాపోయాడు. దీంతో విద్యార్థి తండ్రి 200 కిలోమీటర్ల నుంచి రాత్రికిరాత్రే బయలుదేరి నెల్లూరు వచ్చారు. ఇదే విషయాన్ని పోలీసులకు చెప్పాడు. ఇలా పలువురు జూనియర్ల తల్లిదండ్రులు సోమవారం కళాశాలకు వచ్చి ప్రిన్సిపాల్‌తో గొడవకు దిగారు. ప్రిన్సిపాల్ తాను చేపట్టిన చర్యలు గురించి వారికి వివరించి సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు. ఈలోపు ఘర్షణ పెద్దదైంది. పోలీసులు రంగప్రవేశం చేశారు. పోలీసుస్టేషన్‌కు విద్యార్థుల తరలింపు ర్యాగింగ్‌కి ప్రధాన కారకులంటూ తల్లిదండ్రులు సందీప్‌సాగర్, యాహియా, ఉదయభాస్కర్, సాయికిశోర్, సాయితేజ అనే సీనియర్లపై ఫిర్యాదుచేశారు. వారిని అరెస్టుచేయాలని డిమాండ్ చేశారు. మరో ఇద్దరు అమ్మాయిలు నోయిల్, ప్రసన్నతేజలకు వార్నింగ్ ఇవ్వాలని కోరారు. దీంతో పోలీసులు ఆ ఐదుగురు విద్యార్థులను అరెస్టు చేసి సాయంత్రం వరకు ఐదో నగర పోలీసుస్టేషన్లో ఉంచారు. ఈలోపు ఇరువర్గాల తల్లిదండ్రులతో ప్రిన్సిపాల్ చర్చలు జరిపారు. విద్యార్థుల భవిష్యతు దెబ్బతింటుందని నచ్చజెప్పారు. ఐదుగురిని రెండు నెలల పాటు హాస్టల్ నుంచి సస్పెండ్ చేస్తున్నామంటూ ప్రిన్సిపాల్ ప్రకటించారు. దీంతో శాంతించిన జూనియర్ల తల్లిదండ్రులు కేసు ఉపసంహరించుకున్నారు. సీనియర్ల తల్లిదండ్రుల చేత ఇక భవిష్యత్‌లో ఎలాంటి తప్పులు చేయబోమని లెటర్లు రాయించుకుంటామని ప్రిన్సిపాల్ ప్రకటించారు. -
ర్యాగింగ్ పేరిట పోర్న్ మూవీలు చూపిస్తున్నారు!
భోపాల్: ర్యాగింగ్ పేరిట సీనియర్ విద్యార్థులు జూనియర్లతో బలవంతంగా పోర్నోగ్రఫీ చూపించి.. అందులోని చర్యలను అనుకరించాల్సిందిగా ఒత్తిడి చేస్తున్న ఘటన తాజాగా భోపాల్‌లోని ఓ ప్రముఖ విద్యాసంస్థలో వెలుగుచూసింది. మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఏంఏఎన్ఐటీ)లో బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థులు శనివారం జాతీయ యాంటీ ర్యాగింగ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగుచూసింది. ఈ ఫిర్యాదు గురించి హెల్ప్‌లైన్ ఇన్స్టిట్యూట్కు సమాచారం అందించింది. ఫిర్యాదు చేసిన విద్యార్థులు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారేనని తెలుస్తోంది. బీటెక్ సెంకండియర్కు చెందిన నలుగురు విద్యార్థులు, మూడో సంవత్సరం చదువుతున్న మరో విద్యార్థి పేరును వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితులు ఐదుగురు కూడా ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారే. 'సీనియర్లు తమ హాస్టల్ గదులకు మమల్ని పిలిపించుకొని.. బలవంతంగా మాకు పోర్న్ మూవీలు చూపిస్తున్నారు. ఆ తర్వాత అందులో చేసినట్టు చేసి చూపించాలని ఒత్తిడి చేస్తున్నారు' అని ఫిర్యాదులో జూనియర్ విద్యార్థులు తెలిపారు. ర్యాగింగ్ పేరిట జూనియర్లను సీనియర్లు వేధించడం చట్టబద్ధంగా నిషేధించిన సంగతి తెలిసిందే. అయినా తమను నిత్యం ర్యాగింగ్ చేయడం సీనియర్లకు అలవాటు మారిందని, వారి తీరుతో జూనియర్లు చాలా మానసికక్షోభకు గురవుతున్నారని జూనియర్ విద్యార్థి ఒకరు ఓ ఆంగ్ల పత్రికకు తెలిపారు. -
అక్కడంతే..!
-
ఓయూ బాలికల హాస్టల్లో ర్యాగింగ్ కలకలం
ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్): ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) క్యాంపస్ ఇంజినీరింగ్ విభాగం బాలికల హాస్టల్లో ఓ విద్యార్థినిని సీనియర్లు ర్యాగింగ్ చేసినట్టు సమాచారం. ఆదివారం హాస్టల్ గదిలో మొదటి సంవత్సరం చదువుతున్న ఇంజినీరింగ్ విద్యార్థిని తనను సీనియర్లు ర్యాగింగ్ చేస్తున్నారని ఆవేదన చెందినట్టు వదంతలు రావడంతో విద్యార్థి సంఘాలు రంగంలోకి దిగాయి. పీడీఎస్‌యూ నాయకురాలు కావేరి, ఏబీవీపీ నగర ఇంచార్జ్ షాజాది హాస్టల్‌ను సందర్శించి ర్యాగింగ్ పై విద్యార్థినులను ఆరా తీశారు. హాస్టల్లో ర్యాగింగ్ జరగలేదని విద్యార్థినులు అంటున్నారు. మరోవైపు ర్యాగింగ్‌పై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని సీఐ అశోక్‌రెడ్డి తెలిపారు. -
అనంతపురం ఎస్కేయూనివర్సిటీలో ర్యాగింగ్
-
ఎవరెస్ట్ ఎక్కినా.. ర్యాగింగ్ బాధ తప్పలేదు
హైదరాబాద్: అతను ఎవరెస్ట్ ఎక్కి ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు, కానీ ర్యాగింగ్ మహమ్మారి నుంచి తప్పించుకోలేక పోయాడు. ఇటీవలే ఎవరెస్ట్ అధిరోహించిన డిగ్రీ విద్యార్థి ఆనంద్‌ను ర్యాగింగ్ పేరుతో సీనియర్లు వేధించారు. ఈ సంఘటన నిజాం కాలేజీలో బుధవారం చోటు చేసుకుంది. బీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్న భరత్, శివ తనను ర్యాగింగ్ చేసినట్టు ఐపీఎస్ ప్రవీణ్ కుమార్‌కు ఆనంద్ ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. దీని పై విచారణ చేయాలని అబిడ్స్ సీఐని ప్రవీణ్ కుమార్ ఆదేశించారు. -
ఆంధ్రా యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం !
-
'అగ్రికల్చర్ కాలేజీల్లో ర్యాగింగ్ జరగకూడదు'
హైదరాబాద్ : ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని వివిధ కళాశాలల్లో ర్యాగింగ్ జరక్కుండా చర్యలు తీసుకోవాలని వైస్ ఛాన్సలర్ డాక్టర్ అల్లూరి పద్మరాజు ఆయా కళాశాలల అధిపతులను ఆదేశించారు. ఏపీలోని వ్యవసాయ, వ్యవసాయ ఇంజినీరింగ్, ఫుడ్ సైన్స్, టెక్నాలజీ, గృహ విజ్ఞాన, పాలిటెక్నిక్ కళాశాలల అధిపతులు, అసోసియేట్ డీన్లు, వార్డెన్ల సమావేశం గురువారం నగరంలో జరిగింది. విద్యార్ధి వ్యవహారాల విభాగం డీన్ డాక్టర్ ఆర్.వి.రాఘవయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వైస్ ఛాన్సలర్ మాట్లాడుతూ.. కళాశాలల్లో చేరిన కొత్త విద్యార్థులను పాతవారు సరదాగానైనా ఆట పట్టించకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. క్రమశిక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించమని సూచించారు. క్లాసుల్లో, హాస్టళ్లలో హాజరును ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పై అధికారులకు తెలియజేయాలన్నారు. హాస్టళ్లలో వసతులు మెరుగుపర్చాలని విజ్ఞప్తి చేశారు. పీజీ విద్యార్ధుల పరిశోధనకు సంబంధించిన డేటాను పర్యవేక్షించాలని సంబంధిత డీన్లను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులకు ఏర్పాటు చేయనున్న ప్రత్యేక శిక్షణ విభాగం వివరాలను అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ కళాశాలలకు నాబార్డ్ ఇచ్చే నిధుల వినియోగానికి పక్కా ప్రణాళికలు తయారు చేయాల్సిందిగా ఆదేశించారు. -
ర్యాగింగ్ కలకలం.. కత్తితో కాలేజీకి వెళ్లాడు
-
ర్యాగింగ్ కలకలం.. కత్తితో కాలేజీకి వెళ్లాడు
అనంతపురం: అనంతపురం జిల్లా కదిరిలో ర్యాగింగ్ కలకలం రేపింది. ఓ విద్యార్థి ప్రతీకారం తీర్చుకునేందుకు ఏకంగా కత్తి తీసుకుని కాలేజీకి వెళ్లాడు. కదిరిలోని స్పేస్ జూనియర్ కాలేజీలో సీనియర్, జూనియర్ విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ర్యాగింగ్‌కు పాల్పడంతో సీనియర్లు, జూనియర్ల మధ్య తీవ్ర వివాదం ఏర్పడింది. దీంతో కక్ష తీర్చుకునేందుకు ఓ విద్యార్థి కత్తితో కాలేజీకి వెళ్లాడు. ఈ విషయం కాలేజీ యాజమాన్యం దృష్టికి రావడంతో స్పందించింది. 10 మంది విద్యార్థులను సస్పెండ్ చేసింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ర్యాగింగ్ నిరోధంపై నేడు సమావేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ యూనివర్సిటీలు, వాటి పరిధిలోని కాలేజీల్లో ర్యాగింగ్ నిరోధానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించి కార్యాచరణ అమలు చేసేందుకు ఉన్నత విద్యా మండలి సిద్ధమైంది. అన్ని యూనివర్సిటీల రిజిస్ట్రార్లతో ఈనెల 7న సమావేశం నిర్వహించనున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి తెలిపారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సాయినాథ్ ఇటీవల ర్యాగింగ్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో కాలేజీల్లో ర్యాగింగ్ నిరోధంపై మండలి చర్యలకు సిద్ధమైంది. ఇప్పటికే అన్ని కాలేజీ హాస్టళ్లలో రాత్రి వేళల్లో అధ్యాపకులు నిద్రించాలని, వీలైతే ప్రథమ సంవత్సర విద్యార్థులకు వేరుగా హాస్టల్ సదుపాయం కల్పించాలని ఆదేశించారు. -
రిషితేశ్వరి కేసు:బెయిల్ పిటిషన్ కొట్టేసిన కోర్టు
-
ర్యాగింగ్ నిరోధానికి చర్యలు చేపట్టండి
ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని కాలేజీల్లో ర్యాగింగ్ నిరోధానికి చర్యలు చేపట్టాలని యూనివర్సిటీలకు ఆదేశాలు జారీ చేసినట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి తెలిపారు. ర్యాగింగ్ నిరోధానికి చర్యలు చేపట్టని కాలేజీలపై కఠిన చర్యలు చేపడతామన్నారు. హాస్టళ్లు ఉన్న కాలేజీలు, వర్సిటీల్లో రక్షణ చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ర్యాగింగ్‌పై సీనియర్ విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇవ్వాలని, అవసరమైతే తొలి ఏడాదిలో చేరిన విద్యార్థులకు వేరుగా నివాస వసతి కల్పించాలని సూచించారు. బాలికల హాస్టళ్లల్లో మహిళా అధ్యాపకులు, బాలుర హాస్టళ్లలో పురుష అధ్యాపకులు రాత్రి వేళల్లో నిద్రించేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. -
సాయినాథ్ ఆత్మహత్యపై దర్యాప్తు
ఫోన్‌కాల్ డేటా పరిశీలిస్తున్న పోలీసులు హైదరాబాద్: కళాశాలలో సీనియర్ల వేధింపులు తట్టుకోలేక బీటెక్ విద్యార్థి సాయినాథ్ (18) ఆత్మహత్య చేసుకున్న ఘటనపై హైదరాబాద్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పేట్ బషీరాబాద్, మేడ్చల్ పోలీసులు సంయుక్తంగా విచారణ చేపట్టారు. సాయినాథ్ ఫోన్ కాల్ డేటా పై దృష్టి సారించారు. ఆగస్టు 28 నుంచి మంగళవారం వరంగల్ జిల్లా కాజీపేట రైల్వే స్టేషన్ సమీపంలో ఆత్మహత్య చేసుకున్న సమయం వరకు సాయినాథ్ ఎవరితో మాట్లాడింది.. అసలు అతడి సెల్‌ఫోన్ ఎక్కడుంది అనే వివరాలపై దర్యాప్తు చేస్తున్నారు. బుధవారం పేట్ బషీరాబాద్ ఏసీపీ అశోక్‌కుమార్ నేతృత్వంలో సీఐ డి.వి రంగారెడ్డి, ఎస్సై వెంకటేశ్‌లు సాయినాథ్ ఉన్న కొంపల్లిలోని రామ్ రితేశ్ బాయ్స్ హాస్టల్‌కి వచ్చి అక్కడి విద్యార్థులను సాయినాథ్ గురించి ఆరా తీశారు. సాయినాథ్ తమతో ఎలాంటి విషయాలు చెప్పలేదని పోలీసుల విచారణలో వారు వెల్లడించారు. ఆగస్టు 17న సాయినాథ్ అన్నయ్య రఘునాథ్ వచ్చి హాస్టల్లో చేర్పించారని హాస్టల్ నిర్వాహకురాలు అర్చన తెలిపింది. సీఎంఆర్, మల్లారెడ్డి, సెయింట్ మార్టిన్ కళాశాలలకు చెందిన 102 మంది విద్యార్థులు తమ హాస్టల్లో ఉంటున్నట్లు తెలిపింది. సీసీ కెమెరాలు ఇటీవల ఏర్పాటు చేశామని, అవి పని చేయడం లేదని, సాయినాథ్ ఇప్పటి వరకు తాను వచ్చి, వెళ్లే సమయాలను ఎప్పుడు ఎంట్రీ బుక్‌లో రాయలేదని పేర్కొంది. స్నేహితులకు చెప్పే సాయినాథ్ శుక్రవారం గది నుంచి బయటకు వెళ్లాడని, తిరిగి ఆదివారం వచ్చాడనే విషయం తనకు తెలియదని విచారణలో వెల్లడించింది. మరోవైపు సాయినాథ్ ఆత్మహత్యపై పలువురు విద్యార్థులను పోలీసులు రహస్యంగా విచారిస్తున్నట్లు తెలిసింది. గురువారం మేడ్చల్‌లోని సీఎంఆర్ కళాశాలలో సీనియర్ విద్యార్థులను విచారించనున్నట్లు సమాచారం. -
ర్యాగింగ్ రోగాన్ని అరికట్టలేరా?
కళ్ల నిండా ఆశలతో... హృదయం నిండా ఉద్వేగంతో...ఎన్నో ఊహలతో, మరెన్నో భయాలతో, సందేహాలతో ఉన్నత విద్యా సంస్థల్లోకి అడుగుపెడుతున్న పిల్లలకు ఆదిలోనే ర్యాగింగ్ భూతం తారసపడుతోంది. ఆ క్షణంనుంచీ వారికి నరకం చూపిస్తూ వెంటాడుతోంది. ఒక రాష్ట్రమని లేదు...ఒక జిల్లా అని లేదు. మారుమూల ప్రాంతాల్లోని విద్యా సంస్థలైనా, నగరంలో ఉండే విద్యా సంస్థలైనా ఇందుకు మినహాయింపు కాదు. ఒకపక్క ఇలాంటి ఉదంతాలపై ఆందోళన వ్యక్తమవుతుండగానే మంగళవారం మరో విద్యార్థి ఆ మహమ్మారికి బలైపోయాడు. రంగారెడ్డి జిల్లా మేడ్చల్ సమీపంలోని ఒక ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫస్టియర్ చదువుతున్న సాయినాథ్ హఠాత్తుగా వరంగల్ జిల్లా వడ్డేపల్లి దగ్గర్లో రైలు పట్టాలపై విగతజీవుడై కనబడ్డాడు. ర్యాగింగ్‌ను ఆపమని కోరుతూ రాసిన లేఖ మృతదేహం వద్ద లభించింది. కళాశాలలో చేరి నిండా నెలరోజులైనా కాకుండానే ఓ పద్దెనిమిదేళ్ల పసివాడు ఇబ్బందుల్లో చిక్కుకోవడం...అందుకు చావు తప్ప గత్యంతరం లేదనుకోవడం ఎంత విషాదకరం! తన చుట్టూ ఉన్న సమాజం తానెదుర్కొంటున్న సమస్యను పరిష్కరించలేదని, ఈ ప్రపంచంలో తాను ఒంటరినని భావించినప్పుడే ఎవరైనా ఇలాంటి చర్యకు ఒడిగడతారు. చదువుల తల్లి ఒడిలో మరణిస్తున్నవారందరూ గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుపేదలు... దళిత, బీసీ కులాలకు చెందినవారూ కావడం యాదృచ్ఛికం కాదు. ర్యాగింగ్ ఘటన చోటు చేసుకున్నప్పుడు హడావుడి చేయడం...ఏవో చర్యలు తీసుకున్నట్టు కనబడటం, మళ్లీ మరొకటి జరిగేవరకూ అంతా సవ్యంగా ఉన్నదనుకోవడం తప్ప... పాలకులు సమస్య లోతుల్లోకి వెళ్లి దృష్టి సారిస్తున్నట్టు లేదు. అందువల్లనే ర్యాగింగ్ ఉదంతాలకు ఫుల్స్టాప్ పడటం లేదు. ఏపీలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో రిషితేశ్వరి విషాద మరణంపై ఎంతో ఆందోళన జరిగింది. ఇక అలాంటివి జరగ కుండా చూస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయినా తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలోనూ, మరో ఒకటి రెండుచోట్లా ర్యాగింగ్ జరిగినట్టు వార్తలొచ్చాయి. నారాయణ కళాశాల శాఖల్లో 12మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇందులో కొన్ని మరణాలపై అనుమానాలున్నాయి. ఇటు తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలోనూ ర్యాగింగ్ ఘటన జరిగింది. మళ్లీ ఇప్పుడు సాయినాథ్ బలైపోయాడు. ర్యాగింగ్ గురించిన వార్తలు విస్తృతంగా మీడియాలో వస్తున్నాయి. అలాంటి ఉదంతాల్లో అరెస్టులు జరుగుతున్నాయి. అయినా ఆ ఉన్మత్త క్రీడ సమసిపోయిన దాఖలాలు కనిపించడంలేదు. అడపా దడపా ఏదో ఒక మూల అలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇక హాస్టల్ ప్రాంగణాల్లో, కాలేజీ క్యాంపస్‌లలో సమాధి అయిపోతున్న ఉదంతాలు ఎన్ని ఉంటున్నాయో బయటి ప్రపంచానికి తెలియదు. ర్యాగింగ్ ఉదంతం చోటుచేసుకున్నదని తెలిసిన వెంటనే కళాశాల యాజమాన్యాలు, ప్రభుత్వ యంత్రాంగం, ప్రత్యేకించి పోలీసులు అత్యంత కఠినంగా వ్యవహరిస్తారన్న సందేశం వెళ్తే పరిస్థితి ఇంతగా దిగజారదు. కానీ మీడియాలో విస్తృత ప్రచారం జరిగిన ఉదంతాల విషయంలోనే ఇది సరిగా కనబడటంలేదు. రిషితేశ్వరి ఘటననే తీసుకుంటే...ఆమె బలికావడానికి ప్రధాన కారకులని ఆరోపణలొచ్చిన విద్యార్థుల ముఠాకు అండదండలిచ్చిన అప్పటి ప్రిన్సిపాల్‌పై ఇంతవరకూ కేసు లేదు. ఆ ఉదంతంపై నియమించిన బాల సుబ్రహ్మణ్యం కమిటీ ఇచ్చిన నివేదికలోని సిఫార్సులేమిటో, అందులో ఎన్నిటిపై తాము చర్య తీసుకున్నారో ఇంతవరకూ బాబు ప్రభుత్వం వెల్లడించలేదు. చిత్రమేమంటే రిషితేశ్వరికి, ఆమెలాంటి ఆడపిల్లలకూ బతుకును దుర్భరం చేస్తున్న వాతావరణానికి కారకులైనవారిపై చర్యలు లేవుగానీ అంతక్రితం ఆ విశ్వ విద్యాలయంలో పరిస్థితుల్ని మెరుగుపర్చడానికి ప్రయత్నించిన దళిత అధ్యాపకుడి ఉద్యోగం మాత్రం పోయింది. విశ్వవిద్యాలయాల్లో ద్వంద్వ ప్రమా ణాలు రాజ్యమేలుతున్నాయనడానికి ఇదే రుజువు. ర్యాగింగ్‌పై 2007లో సీబీఐ మాజీ డెరైక్టర్ ఆర్కే రాఘవన్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ దాన్ని ఒక సామాజిక రుగ్మతగా అభివర్ణించింది. ఎన్నో విలువైన సూచనలు చేసింది. యథాప్రకారం చాలా ప్రభుత్వాలు ఆ సిఫార్సుల్ని పట్టించుకోలేదు. పర్యవసానంగా సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ర్యాగింగ్‌ను ప్రోత్సహించే మానసిక, సామాజిక కారణాలను అధ్యయనం చేయడానికి మానసిక ఆరోగ్య నిపుణులతో కమిటీని ఏర్పాటు చేయమని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. అలాగే ప్రతి కళాశాలలోనూ విధిగా మానసిక ఆరోగ్యనిపుణులొకరు ఉండాలని చెప్పింది. విద్యా సంస్థల్లో మానసిక ఆరోగ్య చర్యలు అమలు చేయాలన్నది. వీటన్నిటినీ ఆచరించేలా చూస్తామంటూ లిఖితపూర్వకంగా ఇవ్వ మని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. సుప్రీంకోర్టు సూచనల పర్యవసానంగా యూజీసీ సైతం కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది. యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్లు, క్విక్ రెస్పాన్స్ వ్యవస్థ, కౌన్సెలింగ్, తల్లిదండ్రులనుంచి అండర్‌టేకింగ్ వగైరాలున్నాయి. ప్రభుత్వాల నిర్లక్ష్యం ముందు ఇవన్నీ బలాదూర్ అవుతున్నాయి. ముఖ్యంగా పార్టీల్లోనూ, ప్రభుత్వాల్లోనూ 'విద్యా మాఫియా' పలుకుబడి పెరిగాక, అందుకు సంబంధించినవారు మంత్రులవుతున్నాక విద్యాసంస్థల్లో ఏం జరుగుతున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. ఈ నరమేథాన్ని ఆపడం పాలకులుగా మాత్రమే కాదు...మనుషులుగా కూడా తమ బాధ్యతని ప్రభుత్వాధినేతలు గుర్తించాలి. ర్యాగింగ్‌పై ఫిర్యాదులొచ్చే వరకూ వేచి చూడకుండా నిర్ణీత కాలవ్యవధిలో కళాశాలల్లో తనిఖీలు నిర్వహిస్తుండటం... ఒక్క నిబంధన పాటించలేదని తేలినా భారీ మొత్తంలో జరిమానాలు విధించడం, ర్యాగింగ్ ఘటన జరిగిన సందర్భంలో వెనువెంటనే సంబంధిత కళాశాల గుర్తింపును రద్దు చేసేలా చర్యలు తీసుకోవడం అత్యవసరం. ర్యాగింగ్‌కు పాల్పడుతున్నవారిని మానసిక రోగులుగా గుర్తించి వారికి కౌన్సెలింగ్ ఇప్పించడం, కేసులు పెట్టడంవంటివి చేయాలి. అలాగే పాఠశాల స్థాయిలోనే విద్యార్థుల్లో మానవీయ విలువల్ని పెంపొందించే పాఠ్యాంశాలుండాలి. భవిష్యత్తులో మరెవరికీ ర్యాగింగ్ కారణంగా కడుపుకోత ఉండకూడదనుకుంటే ప్రభుత్వాలు తమ కర్తవ్యాన్ని గుర్తెరగాలి. -
సాయినాథ్ మృతిపై దర్యాప్తు ముమ్మరం
కుత్బుల్లాపూర్: సీనియర్ల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న బీటెక్ విద్యార్థి సాయినాథ్(18) మృతిపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పేట్ బషీరాబాద్, మేడ్చల్ పోలీసులు సంయుక్తంగా విచారణ చేపడుతున్నారు. రెండు రోజులుగా కళాశాలకు సెలవులు కావడంతో పోలీసులు సాయినాథ్ వినియోగించిన సెల్‌ఫోన్ కాల్‌డేటాపై దృష్టి సారించారు. ఆగస్టు 28 నుంచి మంగళవారం ఖాజీపేట రైల్వే స్టేషన్ సమీపంలో ఆత్మహత్య చేసుకునే వరకు ఎవరితో మాట్లాడింది.. అసలు సెల్‌ఫోన్ ఎక్కడుందన్న మిస్టరీపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. బుధవారం పేట్ బషీరాబాద్ ఏసీపీ అశోక్‌కుమార్ నేతృత్వంలో సీఐ డి.వి. రంగారెడ్డి, ఎస్సై వెంకటేశ్‌లు కొంపల్లిలో ఉన్న రామ్ రితేష్ బాయ్స్ హాస్టల్లో ఉన్న విద్యార్థులను ఆరా తీశారు. డబుల్ బెడ్ రూంలో రఘవీర్, హర్షిత్, రణవీర్, శ్రీధర్, మూర్తి, హర్షిల్లాలతో పాటు సాయినాథ్ ఉంటున్నాడు. అందరితో కలివిడిగా ఉండే అతడు తమకు ఎలాంటి విషయాలు చెప్పలేదని పోలీసులతో వారు వెల్లడించారు. మొత్తం 102 మంది హాస్టల్లో ఉంటున్నారని, అందులో సీఎంఆర్, మల్లారెడ్డి, సెయింట్ మార్టిన్ కళాశాలకు చెందిన విద్యార్థులు ఉన్నారని సమాచారం. స్నేహితులకు చెప్పి శుక్రవారం గది నుంచి బయటకు వెళ్లాడని, తిరిగి ఆదివారం వచ్చాడన్న విషయం తమకు తెలియదని హాస్టల్ నిర్వాహకులు పోలీసులకు చెప్పినట్లు తేలింది. దీనిపై ఇప్పటికే పలువురు విద్యార్థులను రహస్యంగా విచారిస్తున్నట్లు తెలిసింది. గురువారం మేడ్చల్‌లో ఉన్న సీఎంఆర్ కళాశాలలో సీనియర్లను విచారించనున్నారు. మంగళవారం రాత్రి హాస్టల్లో సాయినాథ్ చనిపోయే ముందు రాసిన నోట్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. -
'ర్యాగింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు'
హైదరాబాద్: నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసుపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు. విద్యాలయాల్లో ర్యాగింగ్ నిరోధానికి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ... ర్యాగింగ్ అనే పెనుభూతం బారిన పడి రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకోవడం దారుణం అన్నారు. ఈ ఘటనపై అధికార, విపక్ష పార్టీలు రాజకీయం చేయడం దురదృష్టకరమన్నారు. నాగార్జున యూనివర్సిటీలో ర్యాగింగ్ ఘటనలు జరిగాయా, లేదా అనే దాని గురించి విద్యార్థులందరినీ విచారించాలని సూచించారు. రిషితేశ్వరి ఆత్మహత్య ఘటనపై హోంమంత్రి ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని సమగ్ర దర్యాప్తు జరిపించాలని విజ్ఞప్తి చేశారు. ర్యాగింగ్ పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. -
'ర్యాగింగ్ లేని రాష్ట్రంగా ఏపీ'
⇒ ర్యాగింగ్ రుజువైతే విద్యకు శాశ్వతంగా దూరం విజయవాడ సెంట్రల్: ఆంధ్రప్రదేశ్‌ను ర్యాగింగ్ లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు యాక్షన్ ప్లాన్ రూపొందించినట్లు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. శనివారం ఆయన ఇక్కడ విలేకర్లతో మాట్లాడుతూ.. ర్యాగింగ్‌కు పాల్పడితే శాశ్వతంగా విద్యకు దూరం చేస్తామన్నారు. బయోమెట్రిక్, సీసీ కెమెరాలతో ర్యాగింగ్‌ను కట్టడి చేయనున్నట్లు పేర్కొన్నారు. వైస్‌చాన్స్‌లర్ లే యూనివర్సిటీకి కింగ్ అన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఎక్కడైనా రాజకీయ జోక్యంతో ఇబ్బందులు ఉన్నట్లయితే వాటిని అరికట్టేందుకు ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో యూనివర్సిటీల్లో విద్యావిధానాన్ని అధ్యయనం చేయడం కోసం త్వరలోనే సింగపూర్, అమెరికా, ఫ్రాన్స్, చైనా, ఫిన్‌ల్యాండ్ దేశాలతో పాటు దేశంలోని తమిళనాడు, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటించనున్నట్లు పేర్కొన్నారు. పొట్టిశ్రీరాములు, అంబేద్కర్ యూనివర్సిటీల విద్యార్థుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం మానవత్వం లేకుండా వ్యవహరిస్తోందని మంత్రి గంటా అన్నారు. విద్యార్థుల ఫలితాలను విడుదల చేయాల్సిందిగా తాము లేఖ రాసినా స్పందించలేన్నారు. నాగార్జున యూనివర్సిటీలో రిషితేశ్వరి, వైఎస్ఆర్ జిల్లా నారాయణ విద్యాసంస్థలో విద్యార్థిని మృతిపై అసెంబ్లీలో ప్రతిపక్షం లేవనెత్తే ప్రశ్నలకు అన్ని రకాలుగా సమాధానం చెప్పేలా రికార్డులు సిద్ధం చేయాలని మంత్రి వీసీలకు సూచించారు. నారాయణ క్యాబినెట్లో మంత్రిగా ఉండటంతో పాటు తన బంధువు కూడా కావడంతో అసెంబ్లీలో ప్రతిపక్షం టార్గెట్ చేస్తోందన్నారు. -
పోలీసుల భద్రత సొమ్ము రెట్టింపు: డీజీపీ
సాక్షి, హైదరాబాద్: పోలీసుశాఖలో భద్రత పథకం కింద సిబ్బందికి ఇచ్చే రుణ పరిమితిని, ఎక్స్‌గ్రేషియా సొమ్మును పెంచుతున్నట్లు డీజీపీ అనురాగ్‌శర్మ వెల్లడించారు. గృహనిర్మాణ అడ్వాన్స్ కింద ప్లాట్ కొనుగోలు కోసం సిబ్బందికి రూ.5 లక్షల వరకు పరిమితిని పెంచుతున్నట్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే హెడ్‌కానిస్టేబుల్, పీసీలు, ఏఎస్సై, ఏఆర్ ఎస్సైలకు పరిమితిని రూ.7 లక్షలకు, ఎస్సై క్యాడర్లో ఉన్న అధికారులకు రూ.9 లక్షలకు, డీఎస్పీ ఆపై అధికారులకు 11 లక్షలకు పెంచుతున్నట్లు డీజీపీ వివరించారు. అలాగే నిర్మించిన ఇళ్ల కొనుగోలు కోసం ఇచ్చే సొమ్మునూ భారీగా పెంచారు. వివిధ స్థాయిల్లో ఉన్న అధికారులకు రూ.8 లక్షల నుంచి 23 లక్షలకు పెంచుతున్నట్లు తెలిపారు. సిబ్బంది పిల్లలు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళేందుకు ఇస్తున్న లోన్లను 15 లక్షలకు పెంచారు. వ్యక్తిగత రుణాలతో పాటు కుమార్తెల వివాహం కోసం తీసుకునే రుణ సదుపాయాన్ని రూ.4 లక్షలకు పెంచారు. రుణ సౌకర్యం కోసం ఉన్న నిబంధనలను కూడా కాస్త సడలించారు. గతంలో పదవీ విరమణకు ఐదేళ్ల సర్వీసు ఉంటేనే రుణ సదుపాయం కలిగేది. ప్రస్తుతం దాన్ని మూడేళ్లకే కుదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా ఎక్స్‌గ్రేషియా విషయంలో సహజ మరణాల కింద ఏఎస్సై క్యాడర్ వరకు రూ.4 లక్షలకు పెంచగా... ప్రమాదంలో చనిపోయిన సిబ్బందికి రూ.8 లక్షలకు పెంచారు. ఎస్సై నుంచి ఆపై స్థాయి అధికారులకిచ్చే పరిహారాన్ని కూడా రెట్టింపు చేశారు. సహజ మరణాలకు రూ. 8 లక్షలు, ప్రమాదంలో చనిపోతే 16 లక్షలకు పెంచారు. భద్రతపథకానికి సిబ్బంది సమ్మతి మేరకు ప్రతినెలా చెల్లిస్తున్న కంట్రిబ్యూషన్‌ను రెట్టింపు చేసినట్లు డీజీపీ తెలిపారు. ర్యాగింగ్ భూతాన్ని తరిమికొట్టండి సాక్షి, హైదరాబాద్: ప్రాణాలను హరించే వికృత క్రీడగా మారిన ర్యాగింగ్ భూతాన్ని తరిమికొట్టాలని డీజీపీ అనురాగ్ శర్మ పిలుపునిచ్చారు. ర్యాగింగ్‌కు వ్యతిరేకంగా ‘సే నో టు ర్యాగింగ్.. ఇట్ మైట్ కాస్ట్ యు’ పేరుతో చేపట్టిన పలు రకాల ప్రచార సామగ్రిని అనురాగ్‌శర్మ మంగళవారం తన ఛాంబర్లో ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ర్యాగింగ్‌కు వ్యతిరేకంగా యూనివర్సిటీ, కాలేజీల్లో అవగాహన కల్పించాలని విద్యార్థులను కోరారు. కార్యక్రమానికి బ్యాట్మింటన్ క్రీడాకారిణి నైనా జైస్వాల్, బాడీ బిల్డర్ మీర్ మోతిషా వలీ తదితరులు హాజరయ్యారు. -
'ర్యాగింగ్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించం'
అనంత:యూనివర్శిటీలు, కళాశాలల్లో చోటు చేసుకుంటున్న ర్యాగింగ్ లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించమని డీజీపీ జేవీ రాముడు స్పష్టం చేశారు. గుంటూరు, కడప ఘటనలపై విచారణ జరుపుతున్నామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఎర్ర చందనం స్మగ్లర్ గంగిరెడ్డిని వీలైనంత త్వరగా ఏపీకి తీసుకొస్తామని డీజీపీ తెలిపారు. నకిలీ పట్టా పాస్ పుస్తకాలు తయారు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
యంగ్ హో
-
సాక్షి ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం
-
ర్యాగింగ్ పై 'సాక్షి' రౌండ్ టేబుల్
-
సాక్షి ఎఫెక్ట్:ఏడుగురు విద్యార్థుల సస్పెండ్
తిరుపతి: శ్రీవెంకటేశ్వర యూనివర్శిటీ (ఎస్వీయూ)లో ఎంసీఏ విభాగంలో చోటు చేసుకున్న ర్యాగింగ్ ఘటనపై ఏడుగురు విద్యార్థులను సస్పెండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి సోమవారం ఇంఛార్జ్ వీసీ రాజగోపాల్ యూనివర్శిటీ అధికారులతో సమావేశమైన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. ర్యాగింగ్ కు పాల్పడిన సదరు విద్యార్థులను హాస్టల్, కాలేజీల నుంచి పంపించి వేస్తున్నట్లు వీసీ ప్రకటించారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్ అంశంపై 'సాక్షి' దినపత్రిలో... 'సోమవారం నుంచి సినిమా చూపిస్తాం' అన్న శీర్షికపై కథనం వెలువడిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన అధికారులు వర్సిటీలో విచారణకు ఆదేశించి విద్యార్థులపై చర్యలు తీసుకున్నారు. డి బ్లాక్ వసతి గృహం వద్ద ఎంసీఏ జూనియర్లను.. .సీనియర్లు వేధించి...చొక్కాలు విప్పి సెల్యూట్ చేయాలని ఒత్తిడి చేయటంతో జూనియర్లు భయాందోళనకు గురయ్యారు. -
సాక్షి ఎఫెక్ట్:ఏడుగురు విద్యార్థుల సస్పెండ్
-
'ఎస్వీయూలో ర్యాగింగ్ వాస్తవమే'
-
'ఎస్వీయూలో ర్యాగింగ్ వాస్తవమే'
తిరుపతి: శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్ వాస్తవమేనని రిజిస్ట్రార్ దేవరాజులు, ఆర్డీవో వీరబ్రహ్మయ్య తెలిపారు. ఎస్వీ వర్సిటీలో కలకలం సృష్టించిన ర్యాగింగ్‌పై తిరుపతి ఆర్డీవో సోమవారం విచారణ ప్రారంభించారు. ఆర్డీవో వీరబ్రహ్మం వర్సిటీలోని డీ-బ్లాక్‌కు వెళ్లి ర్యాగింగ్ సంఘటనపై విద్యార్థులు, అధికారులతో చర్చించారు. అనంతరం వారు 'సాక్షి' మీడియాతో మాట్లాడారు. ఐదుగురు సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడినట్టు గుర్తించామన్నారు. అదే విధంగా ర్యాగింగ్‌కు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు పెడుతున్నట్టు తెలిపారు. ర్యాగింగ్ ఘటనపై విచారణకు ఏడుగురు సభ్యులతో కమిటీ వేశామని చెప్పారు. కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ ప్రారంభించినట్లు ఆర్డీవో వీరబ్రహ్మయ్య, రిజిస్ట్రార్ దేవరాజులు మీడియాకు తెలిపారు. -
ఎస్వీయూ ఘటనపై గంటా ఆగ్రహం
విశాఖ: తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో ర్యాగింగ్ ఘటనపై విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ర్యాగింగ్ కు కారణమైన విద్యార్థులను గుర్తించి వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆయన యూనివర్సిటీ వీసీ ని ఆదేశించారు. కాగా ఎస్వీయూలో ఎంసీఏ విభాగంలో చోటు చేసుకున్న ర్యాగింగ్ ఘటనపై అధికారుల విచారణ కొనసాగుతోంది. ర్యాగింగ్‌కు సంబంధించి ముగ్గురిపై చర్యలకు రంగం సిద్ధమైంది. డీ బ్లాకుకు చేరుకుని విచారణ జరిపిన అధికారులు వర్సిటీలో విచారణకు ఆదేశించారు. -
ఎస్వీయూలో ర్యాగింగ్: ముగ్గురిపై చర్యలు!
-
ఎస్వీయూలో ర్యాగింగ్: ముగ్గురిపై చర్యలు!
తిరుపతి : ఎస్వీయూలో ఎంసీఏ విభాగంలో చోటు చేసుకున్న ర్యాగింగ్ ఘటనపై అధికారుల విచారణ కొనసాగుతోంది. ర్యాగింగ్‌కు సంబంధించి ముగ్గురిపై చర్యలకు రంగం సిద్ధమైంది. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్ అంశంపై 'సాక్షి' దినపత్రిలో... సోమవారం నుంచి సినిమా చూపిస్తాం అన్న శీర్షికపై కథనం వెలువడిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన అధికారులు వర్సిటీలో విచారణకు ఆదేశించారు. డి బ్లాక్ వసతి గృహం వద్ద ఎంసీఏ జూనియర్లను...సీనియర్లు వేధించి...చొక్కాలు విప్పి సెల్యూట్ చేయాలని ఒత్తిడి చేయటంతో జూనియర్లు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై ఆదివారం మధ్యాహ్న సమయంలో రెక్టార్ జయశంకర్, ప్రిన్సిపాల్ భగవాన్ రెడ్డి, డెప్యూటీ వార్డన్ రమేష్ బాబు తదితరులు డి బ్లాక్ సందర్శించారు. ఘటనపై విద్యార్థులను విచారణ జరిపారు. ర్యాగింగ్‌కు పాల్పడితే శిక్ష తప్పదని హెచ్చరించారు. ర్యాగింగ్ నివారణకు చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. -
దర్జాగా తిరుగుతున్న ప్రిన్సిపాల్బాబురావు
-
సోమవారం నుంచి సినిమా చూపిస్తాం
యూనివర్సిటీక్యాంపస్ (తిరుపతి): ‘‘మాకు సోమవారంతో సెమిస్టర్ పరీక్షలు అయిపోతాయి, తీరుబడి దొరుకుతుంది. ఈ రోజు చేసిం ది జస్ట్ శాంపిల్ మాత్రమే. మండే నుంచి సినిమా చూపిస్తాం’’ ఇదీ తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో ఎంసీఏ విద్యార్థులు జూనియర్లకు చేస్తున్న హెచ్చరిక. యూనివర్సిటీ వసతి గృహాల్లో సీనియర్ విద్యార్థులు జూనియర్లను తమ గదులకు పిలిపించుకుని యథేచ్ఛగా ర్యాగింగ్‌కు పాల్పడుతున్నారు. ర్యాగింగ్ నివారణకు చర్యలు తీసుకోవాలని, జరగకుండా చూడాలని ఉన్నతాధికారులు చేసిన ఆదేశాలను వార్డెన్లు, అధ్యాపకులు పట్టించుకోకపోవడంతో ర్యాగింగ్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. దీం తో శనివారం ఇద్దరు విద్యార్థులు వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగ నాయకులను ఆశ్రయించారు. తమకు టీసీలు ఇప్పిస్తే వెళ్లిపోతామని మొరపెట్టుకున్నారు. అసలేం జరిగిందని వారిని విచారిస్తే.. ర్యాగింగ్ భూతాలు తమను వేధించిన తీరును వివరించారు. అసలేం జరిగిందంటే.. ఎంసీఏ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఈ నెల 10 నుంచి తరగతులు ప్రారంభమయ్యా యి. దీంతో నూతన విద్యార్థులకు డీ-బ్లాక్‌లో వసతి కల్పించారు. సీనియర్ విద్యార్థులు తమ హాస్టల్లో రెండో ఫ్లోర్లో వసతి పొందుతున్నారు. శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో సీనియర్ విద్యార్థులు జూనియర్లను తమ గదులకు పిలిపించుకుని ర్యాగింగ్ చర్యలకు పాల్పడ్డారు. చేతులు చాపి 2 గంటల పాటు అదే పొజిషన్ నిలబడాలంటూ కొంతమంది విద్యార్థులను ఆదేశించారు. ఇది ట్రైలర్ మాత్రమేనని సోమవారం నుంచి సినిమా చూపిస్తామని వారు హెచ్చరించారు. టేబుల్ కింద క్రికెట్ ఆడిస్తామని, నేల మీద ఫ్రాక్ నడక నేర్పుతామని, స్విమ్మింగ్ పూల్ లేకపోయినా ఈతకొట్టే విధానం చేసి చూపించాల్సి ఉంటుందని జూనియర్లకు చెప్పారు. ఎవరికైనా ఫిర్యాదు చేస్తే విభాగాధిపతికి చెప్పి అన్ని సబ్జెక్టులు ఫెయిల్ చేయిస్తామని భయపెట్టారు. పట్టించుకోని కమిటీలు.. నాగార్జున వర్సిటీలో రిషితేశ్వరి ఆత్మహత్య నేపథ్యంలో ఎస్వీయూలో ర్యాగింగ్ జరగకుండా చర్యలు తీసుకోవాలని ఇన్చార్జి వీసీ రాజగోపాల్, రిజిస్ట్రార్ దేవరాజులు.. వర్సిటీ అధ్యాపకులు, వార్డెన్లు, ప్రిన్సిపాళ్లకు ఆదేశాలిచ్చారు. ఆ మేరకు కమిటీలను వేశారు. ఒక విభాగానికి చెందిన నలుగురు ఈ కమిటీలేసి నిత్యం పర్యవేక్షించాలన్నారు. కానీ ఈ ఆదేశాల్ని కమిటీ సభ్యులు లెక్కచేయలేదని ఆరోపణలొస్తున్నా యి. దీంతో వసతిగృహాల్లో ర్యాగింగ్ కొనసాగుతూనే ఉందని విద్యార్థులు వాపోతున్నారు. -
'ర్యాగింగ్ నియంత్రణ ఉత్తర్వులు విడుదల'