సాక్షి, మంచిర్యాల: ర్యాగింగ్‌ను నివారించటానికి ప్రభుత్వాలు, విద్యాసంస్థల వంటివి ఎన్ని చర్యలు తీసుకున్నా.. ఎక్కడోచోట ర్యాగింగ్ ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో సీనియర్ విద్యార్థులు రెచ్చిపోతున్నారు. జూనియర్ విద్యార్థులపై పైశాచికంగా ప్రవర్తిస్తున్నారు. తెలంగాణలో ర్యాగింగ్ భూతం మళ్లీ జడలు విప్పుతోంది. తాజాగా ర్యాగింగ్ పేరుతో తోటి విద్యార్థులు దాడి చేయడంతో డిగ్రీ విద్యార్థి మృతి చెందాడు. ఈ విషాద ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది.
మందమర్రి మండలం పొన్నారం గ్రామంలో ఎస్సీ హాస్టల్‌లో కామెర ప్రభాస్ అనే విద్యార్థి బీకాం కంప్యూటర్స్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మూడు రోజుల క్రితం రాత్రి సమయంలో తోటి విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. వేధిస్తూ, దాడి చేయడంతో డిగ్రీ విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment