degree student
-
డిగ్రీ విద్యార్థిని వైష్ణవి ఆత్మహత్య..
కరీంనగర్: డిగ్రీలో ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో మండలంలోని మద్దులపల్లికి చెందిన డిగ్రీ విద్యార్థిని పూసల వైష్ణవి (20) ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై రామకృష్ణ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పూసల రాజేశం కూతురు వైష్ణవి కరీంనగర్‌లోని ఓ కళాశాలలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతోంది.డిగ్రీ ఫస్టియర్ ఫస్ట్ సెమ్, సెకండియర్‌లో సెకండ్ సెమిస్టర్లో ఫెయిల్ అయ్యింది. దీంతో మనస్తాపానికి గురైన వైష్ణవి ఆదివారం రాత్రి ఇంట్లో క్రిమిసంహారక మందు తాగింది. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. -
డిగ్రీ విద్యార్థిని వైష్ణవి ఆత్మహత్య..
కరీంనగర్: డిగ్రీలో ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో మండలంలోని మద్దులపల్లికి చెందిన డిగ్రీ విద్యార్థిని పూసల వైష్ణవి (20) ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై రామకృష్ణ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పూసల రాజేశం కూతురు వైష్ణవి కరీంనగర్‌లోని ఓ కళాశాలలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతోంది. డిగ్రీ ఫస్టియర్ ఫస్ట్ సెమ్, సెకండియర్‌లో సెకండ్ సెమిస్టర్లో ఫెయిల్ అయ్యింది. దీంతో మనస్తాపానికి గురైన వైష్ణవి ఆదివారం రాత్రి ఇంట్లో క్రిమిసంహారక మందు తాగింది. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. -
'తనకు బతకడం ఇష్టం లేదని లేఖలో..' ఇంకేదో కారణంతోనే అంటూ కన్నోళ్ల శోకం!
సాక్షి, మెదక్: అనుమానాస్పద స్థితిలో ఒక యువతి మృతి చెందిన ఘటన మెదక్ మండల పరిధిలోని శివ్వాయిపల్లిలో సోమవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. శివ్వాయిపల్లి చెందిన క్కొల్ల శేఖవ్వ, మల్లేశం రెండో కుమార్తె పావని(21) డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది. ఆదివారం సాయంత్రం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆమె ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తనకు బతకడం ఇష్టం లేదని లేఖలో పేర్కొనడం.. పలు అనుమానాలకు తావిస్తోంది. తమ కూతురి మృతిపై విచారణ చేపట్టాలని సోమవారం పావని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇవి చదవండి: బీటెక్ విద్యార్థులు సరదా కోసం వెళ్లి.. ఒక్కసారిగా అనంతలోకాలకు.. -
ర్యాగింగ్ పేరుతో తోటి విద్యార్థుల దాడి.. డిగ్రీ స్టూడెంట్ మృతి
సాక్షి, మంచిర్యాల: ర్యాగింగ్‌ను నివారించటానికి ప్రభుత్వాలు, విద్యాసంస్థల వంటివి ఎన్ని చర్యలు తీసుకున్నా.. ఎక్కడోచోట ర్యాగింగ్ ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో సీనియర్ విద్యార్థులు రెచ్చిపోతున్నారు. జూనియర్ విద్యార్థులపై పైశాచికంగా ప్రవర్తిస్తున్నారు. తెలంగాణలో ర్యాగింగ్ భూతం మళ్లీ జడలు విప్పుతోంది. తాజాగా ర్యాగింగ్ పేరుతో తోటి విద్యార్థులు దాడి చేయడంతో డిగ్రీ విద్యార్థి మృతి చెందాడు. ఈ విషాద ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. మందమర్రి మండలం పొన్నారం గ్రామంలో ఎస్సీ హాస్టల్లో కామెర ప్రభాస్ అనే విద్యార్థి బీకాం కంప్యూటర్స్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మూడు రోజుల క్రితం రాత్రి సమయంలో తోటి విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. వేధిస్తూ, దాడి చేయడంతో డిగ్రీ విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. -
పరీక్షల భయంతో.. కొండపై నుంచి దూకిన విద్యార్థిని..
కర్ణాటక: పరీక్షల భయంతో ఒక విద్యార్థిని కొండమీద నుండి దూకి ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన రామనగర తాలూకాలో జరిగింది. బెంగళూరులో బీఈఎంఎల్ నివాసి ఇషా ప్రసాద్ సైకాలజీలో డిగ్రీ చదువుతోంది. బుధవారం నాడు రామదేవరకొండకు వచ్చి కొండపై నుండి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే చెట్టు కొమ్మపై చిక్కుకుని ఆర్తనాదాలు చేయగా స్థానిక పోలీసులు ఆమెను రక్షించి ప్రథమ చికిత్స అందించి అనంతరం బెంగళూరు లో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరీక్షల భయంతో మానసికంగా కృంగిపోయి ఇలా చేసిందని పోలీసులు తెలిపారు. -
డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
శ్రీకాకుళం: మండలంలోని హంసరాళి పంచాయతీ కొయిటాసాయి గ్రామానికి చెందిన సవర ఢిల్లేశ్వరి(19) మంగళవారం ఆత్మహత్యకు పాల్పడింది. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో పెరట్లో గల మామిడిచెట్టుకు ఉరి వేసుకుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక గిరిజనులు హుటాహుటిన హరిపురం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అప్పటికే ఢిల్లేశ్వరి మరణించినట్టు వైద్యులు చెప్పారు. కుటుంబ వివాదాల కారణంగానే ఢిల్లేశ్వరి ఆత్మహత్య చేసుకున్నట్టు బంధువులు చెబుతున్నారు. మృతురాలి తల్లి సవర వాణిశ్రీ ఫిర్యాదు మేరకు మందస ఎస్ఐ ఎనుకోటి రవికుమార్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి హరిపురం సీహెచ్‌సీలో పోస్టుమార్టం నిర్వహించారు. పెద్ద కుమార్తెకు వివాహం చేసిన ఢిల్లేశ్వరి తల్లిదండ్రులు హరికృష్ణ, వాణిశ్రీలు చిన్న కుమార్తెను చదివించి ప్రయోజకురాలిగా చేయాలనుకున్నారు. ఇంతలో ఆత్మహత్య చేసుకోవడంతో వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
నాన్నా క్షమించు.. ఉంగరం పోయిందని డిగ్రీ విద్యార్థిని బలవన్మరణం
వరంగల్: ఉంగరం పోయిందని మండలంలోని గున్నెపల్లి గ్రామానికి చెందిన మద్దుల హేమలతరెడ్డి(19) మంగళవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. హేమలతరెడ్డి హనుమకొండలోని ఓ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఉగాది పండుగ కోసం ఇటీవల ఇంటికి వచ్చిన హేమలతరెడ్డి చేతి ఉంగరం పోయింది. దీంతో మనస్తాపానికి గురైన సదరు యువతి ఇంట్లో వాళ్లు ఏమైనా అంటారనే భయంతో ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో సూసైడ్ లెటర్ రాసి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి మద్దుల జానకీరాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై కూచిపూడి జగదీశ్ తెలిపారు. -
ప్రాణం తీసిన ప్రేమ?.. 80 రోజుల క్రితం అదృశ్యమై
సాక్షి, ఆదిలాబాద్: 80 రోజుల క్రితం అదృశ్యమైన నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం ఖండ్గాం గ్రామానికి చెందిన శ్రీకాంత్ (20) పట్టణ శివారులోని పసుపువాగు వద్ద చెట్ల పొదల్లో శవమై కనిపించాడు. మృతుడి బ్యాగు, చెప్పులను గుర్తించి శ్రీకాంత్‌గా నిర్ధారించారు. బోధన్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ రెండో ఏడాది చదువుతున్న శ్రీకాంత్ సెపె్టంబర్ 23న కాలే జీ వెళ్తున్నానని చెప్పి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. తల్లిదండ్రులు బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. కాగా శ్రీకాంత్ అదృశ్యం అనంతరం మండలంలోని భూ లక్ష్మీ క్యాంపు గ్రామానికి చెందిన యువతితో ప్రేమ వ్యవహారం బయటకు వచి్చంది. అతను కనిపించకుండా పోయిన నాలుగైదు రోజులకు యువతి బంధువులు ఐదుగురు ఇంటికి వచ్చి బెదిరించినట్టు తల్లిదండ్రులు జ్యోతి, లక్ష్మణ్ పటేల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు స్పందించలేదని, తమ పట్ల దురుసుగా ప్రవర్తించారని అన్నారు. పోలీసులు పట్టించుకోలేదంటూ ధర్నా పోలీసుల నిర్లక్ష్యంతోనే తమ కొడుకు చనిపోయాడని, యువతి తరఫున వారే హత్య చేశారని ఆరోపి స్తూ మృతుని బంధువులు బోధన్ రుద్రూర్ రహదారిపై బైఠాయించి రాత్రి పొద్దుపోయే వరకు ఆందో ళన చేపట్టారు. హత్య కేసులో పోలీసుల పాత్రపై అనుమానాలున్నాయని ఆరోపించారు. డీసీపీ అరవింద్‌బాబు, ఆర్డీవో రాజేశ్వర్ ఘటనా స్థలానికి చేరుకొని మృతుడి కుటుంబ సభ్యులతో మాట్లాడా రు. డివిజన్ పోలీసుల మీద నమ్మకం లేక పోతే వేరే డివిజన్ పోలీసులతో కేసు విచారణ చేపడతామని స్పష్టం చేసిన మీదట ఆందోళన విరమించారు. -
వాడిని వదలొద్దు నాన్నా!
గద్వాల క్రైం: న్యూడ్ కాల్స్ వ్యవహారం మరవక ముందే గద్వాల మండలంలో మరో దారుణం మంగళవారం చోటు చేసుకుంది. బంధువైన ఓ యువకుడితో దిగిన ఫొటో ఓ డిగ్రీ విద్యార్థిని చావుకు కారణమైంది. అనంతపురం గ్రామానికి చెందిన లక్ష్మన్న, నాగమ్మకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు. పెద్ద కుమార్తె మేఘలత అలియాస్ మేఘన(21) జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ మహిళాడిగ్రీ కళాశాలలో బీఎస్సీ చివరి సంవత్సరం చదువుతోంది. అదే గ్రామానికి చెందిన శివకుమార్(24) తమకు బంధువు కావడంతో 2019లో కలిసి ఫొటో దిగారు. ఈ క్రమంలో శివకుమార్ ప్రేమిస్తున్నట్లు చెప్పగా.. యువతి నిరాకరించడంతో ఈ నెల 6న ఉరేసుకొని చనిపోయాడు. అయితే శివకుమార్ స్నేహితుడు అలీబాబు ఆ ఫొటోను వీడియోగా చిత్రీకరించి అమర ప్రేమికులంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. దీంతో మానసిక వేదనకు గురైన యువతి మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. చుట్టుపక్కల వారు గమనించి కిందకి దించగా అప్పటికే మృతిచెందింది. అమ్మా.. నాన్నా.. నన్ను క్షమించండి... చనిపోయే ముందు యువతి రాసిన సూసైడ్ నోట్ పోలీసుల చేతికి చిక్కింది. అందులో ‘అమ్మా.. నాన్నా.. నన్ను క్షమించండి... నేను ఎవరినీ ప్రేమించలేదు.. 2019లో నేను, శివకుమార్ ఓ ఫొటో దిగగా దాన్ని అడ్డం పెట్టుకొని నాలుగేళ్లుగా వేధించాడు. మీకు చెబితే లేనిపోని గొడవలవుతాయని సైలెంట్‌గా ఉన్నా. వాడు చనిపోయాక తోక శాలన్న కుమారుడు అలీబాబు ఆ ఫొటోను వీడియోగా చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసి.. నన్ను బ్లాక్మెయిల్ చేయడంతోపాటు మన పరువు తీశాడు. దీంతో నేను ఎనిమిది రోజులుగా ఎవరికీ మొహం చూయించలేకపోతున్నా.. వాడిని మాత్రం వదలకు నాన్నా. చెల్లిని, తమ్ముడిని బాగా చూసుకో.. ఐ లవ్ యూ నాన్న.. ఐ లవ్ యూ అమ్మ..’అని రాసి ఉంది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
'నాకు చనిపోవాలని అనిపిస్తోంది.. జీవితాన్ని చాలిస్తున్నా'
సాక్షి, హైదరాబాద్(మియాపూర్): డిగ్రీ విద్యార్థిని 20 అంతస్థుల భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటనపై ఎస్ఐ యాదగిరి రావు అందించిన వివరాలివి. పటాన్‌చెరులోని ఏపీఆర్ ఫామ్స్‌లో నివసిస్తున్న మణినాథ్, సౌందర్యల కూతురు కోమలిక (21) నిజాం కళాశాలలో బీఏ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. మియాపూర్‌లోని మాతృశ్రీనగర్‌లోని ఎస్ఎంఆర్ వినయ్ ఫౌంటెన్ హెడ్ అపార్ట్మెంట్లోని అమ్మమ్మ, తాతయ్య ఫ్లాట్‌లో 6 నెలలుగా ఉంటోంది. ఈ క్రమంలో కోమలిక కళాశాల నుంచి మంగళవారం సాయంత్రం అమ్మమ్మ ఇంటికి వచ్చిన కొద్దిసేపటికి అపార్ట్మెంట్ 20వ అంతస్తు పైకి వెళ్లి ఒక్కసారిగా కిందకు దూకింది. తల, శరీర భాగాలకు తీవ్ర రక్తపు గాయాలు కావడంతో అక్కడికక్కడే మరణించింది. డైరీలో ‘నాకు చనిపోవాలని అనిపిస్తోంది.. నా జీవితాన్ని చాలించుకుంటున్నా’ అని ఇంగ్లిష్‌లో రాసి పెట్టిందని పోలీసులు తెలిపారు. కోమలిక ఫోన్‌ను స్వాధీనం చేసుకొని పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. -
కాలేజీ ఫీజు కోసం బాలుడి ‘కిడ్నాప్’.. డిగ్రీ స్టూడెంట్ ప్లాన్‌తో షాక్!
బెంగళూరు: కాలేజీ ఫీజు కట్టేందుకు డబ్బులు లేకపోతే ఎవరైనా ఏం చేస్తారు? బ్యాంకులో విద్యారుణం తీసుకోవటం, తెలిసినవార వద్ద అప్పుగా తీసుకోవటం వంటివి చేస్తారు? కొందరు తప్పని పరిస్థితుల్లో చదువు మానేస్తారు కూడా. కానీ, ఓ డిగ్రీ విద్యార్థి ఏకంగా కిడ్నాప్ చేశాడు. ఓ ధనవంతుడి కుమారుడిని కిడ్నాప్ చేసి రూ.15 లక్షలు తీసుకున్నాడు. వాటితో కాలేజీ ఫీజు కట్టి ఓ బైక్, డిజిటల్ కెమేరా కొనుగోలు చేశాడు. ఈ సంఘటన కర్ణాటకలో వెలుగు చూసింది. ఈ కేసులో 14 ఏళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి డబ్బులు తీసుకున్న బికాం విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు 23 ఏళ్ల ఎం సునీల్ కుమార్‌గా గుర్తించారు. అలాగే.. నిందితుడి స్నేహితుడు, మండికల్కు చెందిన వైవీ నగేశ్ని సైతం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలపిన వివరాల ప్రకారం.. రమేశ్ బాబు అనే కార్పొరేట్ వర్కర్ కుమారుడిని ఇద్దరు స్నేహితులు కలిసి సెప్టెంబర్ 2న కిడ్నాప్ చేశారు. రమేశ్ బాబు కొడుకు భవేశ్ తన గదిలో ఒంటరిగా నిద్రపోతున్నాడని ముందుగానే తెలుసుకుని.. అక్కడికి వెళ్లారు నిందితులు. కత్తి చూపించి బాలుడిని తండ్రి కారులోనే కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత రూ.15 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందుకోసం భవేశ్ తండ్రి మొబైల్ ఫోన్‌నే ఉపయోగించటం గమనార్హం. డబ్బులు ఇచ్చేందుకు రమేశ్ బాబు అంగీకరించటంతో.. రైల్వే ట్రాక్ సమీపంలో నగదు తీసుకుని బాలుడిని విడిచిపెట్టారు. ఆ తర్వాత ఈ సంఘటనపై రమేశ్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ కెమెరాలు, మొబైల్ లొకేషన్ ఆధారంగా నిందితుడిని పట్టుకున్నారు పోలీసులు. నిందితుడు ప్రస్తుతం నిర్మాణ కార్మికుడిగా పని చేస్తున్నాడు. కళాశాల ఫీజు చెల్లించలేకపోవటంతో.. బాలుడిని కిడ్నాప్ చేయాలని ప్రణాళిక రచించినట్లు వెల్లడించారు. బాలుడి తండ్రి వద్ద నుంచి డబ్బులు తీసుకున్నతర్వాత నిందితుడు.. కళాశాలలో ఫీజు కట్టాడు. అందులోంచి ఓ బైక్, డిజిటల్ కెమెరాను కొనుగోలు చేశాడు. ఇదీ చదవండి: చైనా మాస్టర్ ప్లాన్.. ప్రపంచవ్యాప్తంగా అక్రమ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు! -
డిగ్రీ విద్యార్థిని మృతి.. ఉద్రిక్తత.. హాస్టల్లో ఏం జరిగింది?
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: ఆసిఫాబాద్ మండలం బూరుగూడ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో సంగీత అనే డిగ్రీ విద్యార్థిని జ్వరంతో ప్రాణాలు కోల్పోయింది. కరీంనగర్లో ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే విద్యార్థిని చనిపోయిందంటూ మృతదేహంతో ఆసుపత్రి ముందు కుటుంబ సభ్యులు, విద్యార్థి యువజన సంఘాలు ధర్నాకు దిగాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ముగ్గురు విద్యార్థినిలు జ్వరంతో మృతిచెందిన అధికారులు చర్యలు చేపట్టడం లేదని అధికారుల తీరుపై గిరిజనులు మండిపడుతున్నారు. చదవండి: భార్య పుట్టింటికి వెళ్లిందని... ట్రాన్స్ జెండర్‌ని ఇంటికి రప్పించి... -
అధ్యాపకురాలి క్రూరత్వం.. ఆస్పత్రి పాలైన విద్యార్థిని
వేములవాడ అర్బన్: సెలవుపై ఇంటికెళ్లిన విద్యార్థిని తిరిగి కళాశాలకు ఆలస్యంగా వచ్చిందంటూ ఓ అధ్యాపకురాలు ఆమెపట్ల క్రూరంగా ప్రవర్తించింది. ఐదు రోజులపాటు తరగతి గది బయట 8 గంటల చొప్పున నిలబెట్టడంతో నడవలేని స్థితికి చేరి, ఆదివారం ఆసుపత్రి పాలైంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంటకు చెందిన మద్దెల నిహారిక రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని సాంఘిక సంక్షేమ గురుకుల మహిళాడిగ్రీ కళాశాలలో బీకాం మూడో సంవత్సరం చదువుతోంది. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న నిహారిక ఈ నెల 18న ఒకరోజు సెలవుపై ఇంటికెళ్లి 22న తిరిగొచ్చింది. ఆలస్యంగా వచ్చిందంటూ నిహారికపై అధ్యాపకురాలు మహేశ్వరి కఠినంగా వ్యవహరించింది. ఈ నెల 23 నుంచి 27వ తేదీ వరకు క్లాస్‌లోకి అనుమతించకపోగా నిత్యం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బయట నిలుచోబెట్టింది. దీంతో ఆ విద్యార్థిని నడవలేని స్థితికి చేరింది. ఈ విషయం హాస్టల్ ఇన్చార్జి దృష్టికి వెళ్లడంతో ఆదివారం ఉదయం వేములవాడ ఏరియా ఆస్పత్రికి నిహారికను తరలించి వైద్యసేవలు అందించారు. దీనిపై కళాశాల వైస్ ప్రిన్సిపాల్ శ్యామలను వివరణ కోరగా ఈ విషయం తమ దృష్టికి ఇప్పుడే వచ్చిందన్నారు. కాగా, ఘటనపై జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి స్పందిస్తూ అధ్యాపకురాలిని సస్పెండ్ చేశారు. ప్రిన్సిపాల్‌పైనా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
పురుగుల మందు తాగి విద్యార్థిని..
నల్గొండ (చింతపల్లి): చింతపల్లి మండలం వింజమూరు గ్రామానికి చెందిన మట్ట అనూష(20) మాల్ వెంకటేశ్వరనగర్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. బుధవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగింది. బంధువులు గమనించి చింతపల్లి ఆస్పత్రికి, అక్కడి నుంచి మాల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అనూష మృతిచెందిందని ధ్రువీకరించారు. మృతికి గల కారణాలు తెలియరావాల్సి ఉండగా ఈ విషయమై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
డిగ్రీ విద్యార్థినికి వేధింపులు.. ఇంటికొచ్చిమరీ ప్రేమించాలంటూ గొడవ!
భీమదేవరపల్లి: ప్రేమిస్తున్నానని వెంటపడుతూ, తరచూ ఫోన్లో వేధింపులకు గురిచేయడంతో మనస్తాపం చెందిన డిగ్రీ విద్యార్థిని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్లనర్సింగపూర్‌లో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నమిండ్ల చంద్రమౌళి–విజయ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. చిన్న కూతురు శ్వేత (18) డిగ్రీ చదువుతోంది. అదే గ్రామానికి చెందిన మీసాల వంశీ అనే యువకుడు కొన్ని నెలలుగా ప్రేమిస్తున్నా నంటూ వెంటపడుతున్నాడు. ఫోన్లో ఇబ్బందు లకు గురిచేస్తున్నాడు. ఈనెల 24న వంశీతోపాటు అతని స్నేహితుడు మాడ్గల జగదీశ్ ఎవరూలేని సమయంలో శ్వేత ఇంటికి వచ్చి ప్రేమించా లంటూ గొడవ పడ్డారు. అదే సమయంలో తండ్రి చంద్రమౌళి ఇంటికి రావడాన్ని గమనించి వారు వెళ్లిపోయారు. దీంతో మానసిక వేదనకు గురైన శ్వేత శనివారం గ్రామ సమీపంలోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. కూతురు లేని విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు గ్రామ సమీపంలోని వ్యవసాయ బావిలో చూడగా అందులో మృతదేహం కనపడింది. మృతురాలి తండ్రి చంద్రమౌళి ఫిర్యాదుతో వంశీ, జగదీశ్‌పై కేసు నమోదుచేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు తరలించినట్లు ముల్కనూర్ ఎస్సై ప్రవీణ్‌కుమార్ తెలిపారు. -
Degree Student: చదువుకు దూరమై.. బతకడం భారమై..
ధర్మవరం రూరల్(శ్రీసత్యసాయి జిల్లా): కొన్ని పరిస్థితుల దృష్ట్యా చదువుకు దూరమైన ఓ డిగ్రీ విద్యార్థిని తీవ్ర మనోవేదనకు గురై బుధవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విద్యార్థిని తల్లిదండ్రులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు...మండల పరిధిలోని మల్లేనిపల్లి గ్రామానికి చెందిన పూజారి రాములు, అంజనమ్మ దంపతుల కుమార్తె రాధారాణి(19) పట్టణంలోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది. చదవండి: ఏలూరు: కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు మృతి కొన్ని కారణాలతో కుటుంబీకులు ఆమెను చదువు మాన్పించారు. దీంతో తన భవిష్యత్ అంధకారం అయ్యిందని రాధారాణి తీవ్ర మనస్తాపం చెందింది. ఈ క్రమంలోనే బుధవారం ఎవరూలేని సమయంలో ఇంట్లోని దూలానికి ఉరివేసుకుని మృతి చెందింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
యువతి అదృశ్యం కేసు.. అనేక మలుపులు.. అసలేం జరిగిందంటే..
సాక్షి, తూర్పుగోదావరి: పిఠాపురం పట్టణంలో కలకలం రేపిన యువతి అదృశ్యం కేసును 24 గంటల్లో ఛేదించినట్టు, ఆమెను తల్లిదండ్రులకు అప్పగించినట్టు కాకినాడ డీఎస్పీ భీమారావు తెలిపారు. యువతి మానసిక స్థితి బాగోలేక విజయవాడ స్నేహితుల దగ్గరకు వెళ్లి పోగా సాంకేతిక పరిజ్ఞానంతో ఆమె ఆచూకీ తెలుసుకుని అదుపులోకి తీసుకుని తల్లిదండ్రులకు అప్పగించామని ఆయన తెలిపారు. ఆమె ఆటో ఎక్కినట్టు తప్పుడు సమాచారం ఇచ్చిందన్నారు. సోషల్ మీడియాలో వచ్చిన కథనాలన్నీ అభూతకల్పనలుగా ఆయన కొట్టిపారేశారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం సీఐ వైఆర్కే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కేసులో అనేక మలుపులు పరీక్షల హాల్ టిక్కెట్ తెచ్చుకోవడానికి వెళుతున్నానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరిన ఒక యువతి అదృశ్యమైన ఈ ఘటన జిల్లా పోలీసులకు సవాల్‌గా మారింది. ఆటో ఎక్కితే డ్రైవరు ఏడిపిస్తున్నాడు అంటూ ఆమె మెసేజ్ పంపినట్టు సోషల్ మీడియాలో వచ్చినవన్నీ అబద్దాలని (ఆ సమయంలో ఆమె కాకినాడ ఆర్టీసీ బస్టాండ్‌లో కనిపించింది) సీసీ పుటేజీల ఆధారంగా పోలీసులు నిర్ధారించారు. అసలేం జరిగిందంటే.. డిగ్రీ విద్యార్థిని అయిన ఆమె కొన్ని రోజులుగా ఇంటి వద్దే చదువుకుంటోంది. సోమవారం మధ్యాహ్నం కాకినాడలో తాను చదువుకుంటున్న కాలేజీ నుంచి హాల్ టిక్కెట్ తెచ్చుకుంటానని వెళ్లింది. పిఠాపురంలో ఉప్పాడ బస్టాండ్‌కు వెళ్లి కాకినాడ వెళ్లేందుకు ప్రైవేటు బస్ ఎక్కింది. కొంత సేపటికే సెల్ స్విచ్ ఆఫ్ అయ్యింది. తరువాత ఆమె కాకినాడ భానుగుడి సెంటర్లో బస్ దిగి, అక్కడి నుంచి ఆటోలో బస్టాండ్‌కు వెళ్లి ఉంటుందని పోలీసులు అనుకున్నారు. చదవండి: టీడీపీ: పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున బట్టబయలైన విభేదాలు కట్టు కథేనా? సోమవారం రాత్రి 10–30 గంటల సమయంలో ఒకసారి ఆమె ఫోన్ ఆన్ అయినట్టు ఒక కాల్ మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. మంగళవారం తెల్లవారుజామున ఆమె తన స్నేహితుల సోషల్ మీడియా గ్రూపుల నుంచి తప్పుకోవడం సెల్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు గుర్తించారు. దీంతో సోషల్ మీడియాలో వచ్చిన కథనాలు కట్టు కథగా పోలీసులు భావించారు. అసలు ఆమె అలా ఎందుకు వెళ్లింది..? ఎక్కడకు వెళ్లింది అని దర్యాప్తు చేశారు. ఆమె సెల్ నుంచి సిమ్ తీసేయడంతో పోలీసులు దర్యాప్యులో ఇబ్బంది పడ్డారు. పోలీసులు వారికి కనీస సమాచారం ఇవ్వకుండా తన స్పేహితురాలు ఆపదలో ఉందంటూ సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు పెట్టడం పోలీసులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. ఆమె ఫొటోలతో సహా పోస్టింగ్‌లు పెట్టడం నేరమంటున్నారు పోలీసులు. -
నాడు తల్లి.. నేడు కుమార్తె.. వారి మృతిపై అనుమానాలెన్నో
రామాయంపేట, నిజాంపేట(మెదక్): నిజాంపేట మండలం రజాక్‌పల్లి పంచాయతీ పరిధిలోని ఖాసీంపూర్ తండాలో డిగ్రీ విద్యార్థిని అనుమానాస్పదస్థితిలో ఉరి వేసుకొని మృతి చెందింది. తండాకు చెందిన నాజం కూతురు నీరజ(18) డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. తల్లి బుజ్జి గతంలో ఆత్మహత్య చేసుకుంది. ఆమె మృతిపై కూడా అనుమానాలున్నాయి. నీరజకు ఇద్దరు సోదరులున్నారు. కొంతకాలంగా కుటుంబ సమస్యల కారణంగా ఇంట్లో గొడవలు జరుగుతున్నట్టు తెలిసింది. ఆదివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కిటికీ ఊచలకు ఉరివేసుకున్న నీరజ మృతదేహాన్ని పక్కవారు గుర్తించి తండావాసులకు తెలిపారు. తక్కువ ఎత్తులో ఉన్న కిటికీ ఊచలకు ఉరివేసుకున్న నీరజ కాళ్లు రెండు నేలను తాకుతుండటంతో ఆమె మృతిపై తండావాసులు అనుమానం వ్యక్తంచేశారు. నీరజ ఆత్మహత్య అనుమానాస్పదంగా మారగా, తండాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిజాంపేట పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నీరజ కుటుంబ సభ్యులపై అనుమానం వ్యక్తం చేస్తూ తండా వాసులు తరలివచ్చి పోస్టుమార్టం ప్రక్రియను అడ్డుకున్నారు. నిజాంపేట ఎస్సై ప్రకాశ్ మృతురాలి బంధువులకు నచ్చచెప్పినా వినకపోవడంతో, పోస్టుమార్టం సోమవారం నాటికి వాయిదా వేశారు. ఈ మేరకు కేసు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రెండు కిడ్నీలు ఫెయిల్.. ఆదుకుంటే చదువుకుంటా
చండూరు: నిరుపేద కుటుంబానికి పెద్ద కష్టం వచ్చింది. పెద్ద చదువులు చదివి ఉన్నత ఉ ద్యోగం చేయాలన్న ఆ విద్యార్థిని కోరికకు అనారోగ్య సమస్యలు అడ్డంకిగా మారాయి. వివరాలు.. నల్లగొండ జిల్లా చండూరు మండల పరిధిలోని కస్తాల గ్రామానికి చెందిన దోనాల భూపాల్‌రెడ్డి, ప్రేమలత దంపతులు 15 ఏళ్ల కిందట బతుకుదెరువు నిమిత్తం చండూరు పట్టణానికి వలస వచ్చారు. బ్యాంక్ రుణం సహాయంతో ఇక్కడే ఓ చిన్న ఇల్లు తీసుకున్నారు. చదవండి: మరుగుదొడ్డిలో నివాసం.. ‘సాక్షి’ చొరవతో సుజాతకు పక్కా ఇల్లు రైతుల నుంచి పాలు కొనుగోలు చేసి పట్టణంలో ఇంటింటికి తిరుగుతూ పాలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు సంతానం. ఇటీవల పెద్ద కుమార్తె పెళ్లి చేయగా, కుమారుడు చదువుకుంటున్నాడు. కాగా రెండో కుమార్తె గాయత్రి 8 ఏళ్ల క్రితం అనారోగ్యంపాలైంది. హైదరాబాద్‌లోని అనేక కార్పొరేట్ ఆస్పత్రుల్లో చూపించారు. రూ.18 లక్షలకు పైగా ఖర్చు చేసిన తర్వాత గాయత్రి రెండు కిడ్నీలు చెడిపోయినట్లు వైద్యులు చెప్పారు. చదవండి: ప్రపంచంలోనే అతిపెద్ద ఎకో అర్బన్ పార్క్ ‘తెలంగాణలో..’ దీంతో మందులు వాడుతూ కాలం వెళ్లదీస్తోంది. ప్రతినెలా రూ.15 వేల నుంచి రూ.18 వేల వరకు మందులకు ఖర్చవుతుందని, పాల వ్యాపారంలో వచ్చే ఆదాయం ఇల్లు గడవడానికే సరిపోతోందని తల్లిదండ్రులు చెబుతున్నారు. మందులు తెచ్చేందుకు అప్పు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు లేక రెండు నెలలుగా మందులు వాడడం లేదని, దీంతో గాయత్రి ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తుందని, దాతలు ఆదుకోవాలని వేడుకుంటున్నారు. కిడ్నీల మార్పిడికి లక్షలు ఖర్చువుతుందని వైద్యులు చెబుతుండడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉంది. అనారోగ్యంతోనే డిగ్రీ పూర్తి నడవలేని స్థితిలో ఉండి కూడా గాయత్రి నల్లగొండలోని ఎన్జీ కళాశాలలో డిగ్రీ మైక్రో బయాలజీ పూర్తి చేసింది. వారంలో రెండు, మూడు రోజులు బస్సులో కళాశాలకు వెళ్లి వచ్చేది. తీవ్ర జ్వరం ఉన్నా సరే పరీక్షలు రాసి మొదటి ర్యాంకులో పాస్ అయ్యింది. ఉన్నత చదువులు చదువుతా నాకు ఉన్నత చదువులు చదువుకోవాలనే కోరిక ఉంది. కానీ ఆరోగ్యం బాగోలేక ఇబ్బంది పడుతున్నా. డబ్బులు లేక ఇటీవల మందులు కూడా వాడడం మానేశా. అక్క పెళ్లికి చేసిన అప్పు అలానే ఉండటంతో అమ్మానాన్న ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థిక పరిస్థితి సరిగా లేక తమ్ముడు చదువు మానేసి కొన్ని రోజులు ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. ఎవరైనా దాతలు స్పందించి ఆర్థికసాయం చేస్తే మా కుటుంబ కష్టాల నుంచి బయటపడుతుంది. - గాయత్రి -
తెలుగు విద్యార్థికి అరుదైన అవకాశం.. రూ.2 కోట్ల స్కాలర్షిప్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు చెందిన విద్యార్థిని శ్వేతా రెడ్డి(17) అరుదైన అవకాశం లభించింది. అమెరికాలోని ప్రముఖ లాఫాయేట్ కాలేజీ శ్వేతారెడ్డికి ఏకంగా రూ.2 కోట్ల రూపాయల స్కాలర్ షిప్ ఆఫర్ చేసింది. లాఫాయేట్ కాలేజీలో 4 ఏళ్ల బ్యాచిలర్ డిగ్రీ(మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్) కోర్సులో అడ్మిషన్‌తోపాటు ఈ స్కాలర్షిప్ను ప్రకటించింది.ఈ కాలేజీలో అడ్మిషన్ దక్కించుకోవడమే గొప్ప విషయం కాగా.. శ్వేతారెడ్డి స్కాలర్ షిష్‌ను కూడా దక్కించుకుంది. డైయర్ ఫెలోషిప్ పేరిట లాఫాయెట్ కాలేజీ ప్రతి ఏడాది ఆరుగురు విద్యార్థులకు మాత్రం ఈ స్కాలర్ షిప్ అందిస్తుంది. ఈ ఏడాదికి ప్రపంచవ్యాప్తంగా ఎంపికైన ఆరుగురిలో తెలుగు విద్యార్థి శ్వేతారెడ్డి ఉండడం విశేషం. శ్వేతా ప్రతిభ, నాయకత్వ లక్షణాలు చూసే ఈ ఆఫర్ ఇచ్చినట్లు లాఫాయెట్ కాలేజీ తెలిపింది. కాగా స్కాలర్ షిప్ సాధించడం పట్ల శ్వేతా హర్షం వ్యక్తం చేశారు. ఇది తనకు ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. తనకు ఇలాంటి అద్భుత అవకాశం రావడం వెనక డెక్స్ టెరీటీ గ్లోబల్ సంస్థ ఇచ్చిన శిక్షణ, ప్రోత్సాహం ఉందని.. దాని వల్లే తాను ఈ స్కాలర్ షిప్ అందుకోగలిగానని పేర్కొంది. -
యూనివర్సీటీ లైబ్రరీలో చదువుతూ..ఉద్యోగం రాలేదని..
గూడూరు: ఓ నిరుద్యోగ యువకుడు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన వరంగల్ అర్బన్ జిల్లాలోని కేయూ గ్రౌండ్ వద్ద చోటుచేసుకుంది. ఆ యువకుడు తీసిన వీడియో, బంధువుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని తేజావత్ రాంసింగ్‌తండాకు చెందిన బోడ సునీల్ నాయక్ 2016లో డిగ్రీ పూర్తి చేశాడు. అప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలనే తపన తో కాకతీయ యూనివర్సీటీ సమీపంలో స్నేహితులతో కల సి ఉంటున్నాడు. తరచూ యూనివర్సిటీ లైబ్రరీకి వచ్చి పోటీ పరీక్షలకోసం చదువుకునేవాడు. శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో సునీల్ తన సోదరుడికి ‘ఐ మిస్ యూ’ అంటూ ఫోన్లో మెస్సెజ్ పంపించగా.. అతను తిరిగి ఫోన్ చేయడంతో తాను పురుగు మందు తాగినట్లు చెప్పాడు. దీంతో అతని సోదరుడు 108 అంబులెన్స్ కు ఫోన్ చేయగా.. సిబ్బంది మద్యాహ్నం 12 గంటల సమయంలో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. కాగా సునీల్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 48 గంటలు దాటితే కాని ఏ విషయం చెప్పలేమని ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు స్పష్టం చేస్తున్నారు. -
అనూష కుటుంబానికి ప్రభుత్వం అండదండలు
ముప్పాళ్ల (సత్తెనపల్లి): డిగ్రీ విద్యార్థిని కోట అనూష కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా అన్ని విధాలా ఆదుకుంటామని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం గోళ్లపాడులో అనూష తల్లిదండ్రులను ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌తో కలిసి ఆయన బుధవారం పరామర్శించి ధైర్యం చెప్పారు. ఎంపీ మాట్లాడుతూ అనూషను హత్య చేసిన నిందితుడికి కఠిన శిక్షపడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉండేందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశ చట్టాన్ని తెచ్చారని వివరించారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగంగా రూ.10 లక్షల చెక్కును తల్లిదండ్రులకు అందించారు. బాధితులు కోరుకున్న విధంగానే నరసరావుపేటలో ఇంటిస్థలం అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కుటుంబంలోని ఒకరికి ఉద్యోగం ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. -
అనూష కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది
సాక్షి, గుంటూరు: డిగ్రీ విద్యార్థిని అనూష సంఘటన అందర్నీ కలచివేస్తోందని మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. ఆమె గురువారం ముప్పాళ్ళ మండలం గోళ్లపాడులో అనూష కుటుంబ సభ్యులను మహిళా పరామర్శించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఇలాంటి ఘటనలు పునరావతం కాకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అనూష కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీరియస్‌గా స్పందించారని తెలిపారు. నిందితుడికి శిక్ష వెంటనే పడేందుకు దిశ చట్టాన్ని అమలు చేస్తున్నామని వ్యాఖ్యానించారు. నిందితుడికి కఠిన శిక్ష పడాలని సమాజమంతా కోరుకుంటుందని, అనూష కుటుంబానికి ధైర్యం చెప్పామని వాసిరెడ్డి పద్మ తెలిపారు. బుధవారం డిగ్రీ విద్యార్థిని అనూష (19) హత్యకు గురైన విషయం తెలిసిందే. సహ విద్యార్థి మేడా విష్ణువర్ధన్‌రెడ్డి ఆమెను గొంతు నులిమి దారుణంగా హత్యచేశాడు. మృతదేహాన్ని కాలువలో పడేసి అనంతరం పోలీసులకు లొంగిపోయాడు. చదవండి: అనూష కేసు: రెండేళ్లు గా వేధిస్తున్నాడు! -
జూబ్లీహిల్స్: ఇంటికి పిలిచి డిగ్రీ విద్యార్థినిపై అత్యాచారం
బంజారాహిల్స్: పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిపై ఓ యువకుడు అత్యాచారం చేసిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రహమత్‌నగర్ సమీపంలోని కార్మికనగర్‌లో నివసించే విద్యార్థిని (23) బీకాం చదువుతోంది. శుక్రవారం అదే ప్రాంతానికి చెందిన బీటెక్ విద్యార్థి రాజు(23) ఆమెతో మాట్లాడాలని, పెళ్లి చేసుకుంటానని ఇంటికి పిలిపించి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: విడాకులు కోరిన భార్య.. కడుపుమీద కారు ఎక్కించి హత్య) -
అమ్మా.. నాన్నా..! నన్ను క్షమించండి..
‘అమ్మా.. నాన్నా..! నన్ను క్షమించండి.. నేను దేవుడి దగ్గరికి వెళ్లిపోతున్నా.. ఇలా చేసినందుకు బాధపడకండి.. మీ అంత గొప్ప తల్లిదండ్రులకు బిడ్డగా ఉండే హక్కు నాకు లేదు’ అంటూ మండలంలోని మార్జేపల్లెకు చెందిన గణేష్ (20) లేఖ రాసి అదృశ్యమైన సంఘటన గంగవరం మండలంలో కలకలం రేపింది. వారం కిందట జరిగిన ఈ ఉదంతం బుధవారం ఆలస్యంగా వెలుగుచూసింది. విద్యార్థి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు, పోలీసులు గాలిస్తున్నారు. గంగవరం: మండలంలోని మార్జేపల్లెకు చెందిన డిగ్రీ విద్యార్థి గణేష్ తాను దేవుడి దగ్గరికి పోతున్నానని లేఖ రాసి అదృశ్యమైన ఘటన తల్లిదండ్రులను శోకసంద్రంలో ముంచింది. గ్రామస్తులు, పోలీసుల కథనం.. మార్జేపల్లెకు చెందిన శివశంకర్, పద్మజ దంపతులకు గణేష్ మొదటి సంతానం. ఇతను మండల కేంద్రానికి సమీపంలోని ఓ కళాశాలలో బీకాం డిగ్రీ ఫైనల్ చదువుతున్నాడు. చదువుపై బాగా శ్రద్ధ పెట్టి మంచి ఫలితాలు సాధించేవాడు. ఇతర సాంఘిక కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొనేవాడు. వ్యవసాయం, ఇంటి పనుల్లో తల్లిదండ్రులకు తోడ్పడుతూ చక్కగా మసలుకునేవాడు. ఈనెల 21వ తేదీ రాత్రి నోట్‌బుక్‌లో రెండు పేజీల లేఖను రాసి అదృశ్యమయ్యాడు. మోటార్ సైకిల్, సెల్‌ఫోన్, కళాశాల పుస్తకాల బ్యాగ్ కూడా కనిపించలేదు. అప్పటి నుంచి అతడు ఎక్కడున్నాడో..ఏమయ్యాడోనని నిద్రాహారాలు మాని తల్లిదండ్రులు, బంధువులు పలుప్రాంతాల్లో గాలించారు. ఆచూకీ తెలియక పోవడంతో శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియా ద్వారా కూడా ఫొటో పోస్టు చేశారు. కుమారుడు లేని ఇంట్లో తల్లిదండ్రులు నరకయాతన అనుభవిస్తున్నారు. వాళ్లను ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. అతడు రాసి రెండు పేజీల లేఖ చర్చనీయాంశమైంది. అన్నికోణాల్లో దర్యాప్తు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. సెల్‌ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది. సెల్ ఫోన్ ఐఎంఏ ద్వారా ఆచూకీ కోసం చర్యలు తీసుకుంటున్నాం. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. –సుధాకర్‌రెడ్డి, ఎస్ఐ లేఖలోని ముఖ్య సారాంశం ‘నాన్న! నన్ను క్షమించండి. నేను దేవుని దగ్గరకు వెళ్లిపోతున్నా.. నేను ఎంత మరిచిపోదామనుకున్నా ఈ బాధ రోజురోజుకూ నరకం చూపిస్తోంది. నటించడం ఇక నావల్ల కాదు. మళ్లీ జన్మంటూ ఉంటే మీ కడుపునే పుట్టాలని ఉంది. మరో జన్మలో అయినా మీరు చెప్పినట్టు నడుచుకునేట్టు ఆ దేవుడిని వరం అడుగుతా. అమ్మా.. నా కోసం మీరు ఎంత ఏడ్చినా నేను ఎక్కడా ఆనందంగా ఉండలేను. నేను అసలు పుట్టనే లేదనుకో. మా తమ్ముడు జాగ్రత్త. వాడే నేననుకో. నాన్నా.. నీకు ఒకవేళ నేను తలవంపులు తెచ్చింటే నన్ను క్షమించు. తమ్ముడికి కొడుకుగా పుడతా.. మళ్లీ నువ్వే నన్ను పెంచి పెద్ద చేయాలి. అప్పుడే నువ్వు చెప్పినట్టు వింటాను. నేను ఎవరినీ సాధించడానికి ఈ పని చేయలేదు.త మ్ముడూ.. అమ్మానాన్నకు ఇక అన్నీ నువ్వే.’ అంటూ రాసిన ఆ రెండు పేజీల లేఖ ఆ కన్నవారికి తీరని వ్యథ మిగిల్చింది. -
పెళ్లి బరాత్‌కు వెళ్లి.. మందలించడంతో..
సాక్షి, కామారెడ్డి: జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తల్లిదండ్రులు మందలించారని ఓ యువకుడు ఉరివేసుకున్న ఘటన దేవునిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న దేవునిపల్లి గ్రామానికి చెందిన నీలం రాహుల్(18) అనే యువకుడు బుధవారం రాత్రి స్నేహితుని అన్న పెళ్లి బరాత్‌కు వెళ్లాడు. రాత్రి ఆలస్యం కావడంతో తల్లిదండ్రులు రాహుల్‌కు ఫోన్‌చేసి మందలించారు. దీంతో మనస్థాపానికి గురైన రాహుల్ ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (ఇంటికి లేటుగా వస్తున్నాడని భర్త ముఖంపై..) -
ఐఏఎస్ కావాలన్న ఆశలు ఆవిరి...
షాద్‌నగర్ రూరల్: ఉన్నత చదువులు చదివి ఐఏఎస్ కావాలని ఆమె కల. దాని కోసం శ్రమిస్తోంది. కానీ, ఆర్థిక పరిస్థితులు ఉక్కిరిబిక్కిరి చేసి ఆత్మహత్యకు పురికొల్పాయి. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని శ్రీనివాస కాలనీకి చెందిన శ్రీనివాస్‌రెడ్డి, సుమతి దంపతులకు ఐశ్వర్య(19), వైష్ణవి కూతుళ్లు. శ్రీనివాస్‌రెడ్డి బైక్ మెకానిక్. ఐశ్వర్య 8వ తరగతి వరకు హైదరాబాద్‌లో వారి బంధువుల వద్ద చదువుకుంది. ఆ తర్వాత 9, 10 తరగతులు, ఇంటర్ షాద్‌నగర్‌లో అభ్యసించింది. ఇంటర్లో 985 మార్కులతో రాష్ట్ర స్థాయిలో మంచి ర్యాంకు సాధించింది. ఢిల్లీ వెళితే డిగ్రీతో పాటు సివిల్స్‌లో కూడా శిక్షణ తీసుకోవచ్చని ఉపాధ్యాయులు సూచించారు. అయితే, ఐశ్వర్యకు ఆర్థిక ఇబ్బందులు అడ్డంకిగా మారాయి. షాద్‌నగర్‌కు చెందిన కొందరు చదువులకయ్యే ఖర్చును భరిస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో ఐశ్వర్యను తల్లిదండ్రులు ఢిల్లీకి పంపించారు. గత ఏడాదిన్నరగా ఆమె ఢిల్లీ వర్సిటీలోని హాస్టల్లో ఉంటూ డిగ్రీ (రెండవ సంవత్సరం) చదువుకుంటోంది. ఈ నేపథ్యంలో కరోనా కారణంగా వర్సిటీ వారు సెలవులు ప్రకటించడంతో ఐశ్యర్య షాద్‌నగర్‌కు వచ్చింది. ఇటీవల ఆమె ఫోన్‌కు వర్సిటీ నుంచి ఓ మెసేజ్ వచ్చింది. వెంటనే హాస్టల్‌ను ఖాళీ చేయాలని అందులో ఉంది. మరోవైపు కేంద్ర, శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ ఇచ్చే ఇన్స్పైర్ స్కాలర్షిప్ రాలేదు. బయట అద్దెకు ఉండి చదువుకోవాలంటే డబ్బులు కావాలి. (చదవండి: ఐశ్వర్యది ప్రభుత్వ హత్యే!) దీంతో ఆమె తల్లిదండ్రులు అప్పు కోసం ఎంతో ప్రయత్నించారు. ఆదుకుంటామని హామీ ఇచ్చిన వారు కూడా ముందుకురాలేదు. ఈ క్రమంలోనే శ్రీనివాస్‌రెడ్డి అనారోగ్యానికి గురయ్యాడు. తన చదువు కోసం తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులను చూసిన ఐశ్వర్య తీవ్ర మనోవేదనకు గురైంది. తన చదువు తల్లిదండ్రులకు భారమని.. అలా అని చదువు లేకపోతే బతకలేనని.. నన్ను క్షమించండి అని పేర్కొంటూ లేఖ రాసి ఈ నెల 3న ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కనీసం ఒక సంవత్సరం ఇన్స్పైర్ స్కాలర్షిప్ వచ్చేలా చూడండి అంటూ ఐశ్వర్య ఆ లేఖలో వేడుకుంది. (చదవండి: ‘అండగా ఉంటామని ముఖం చాటేశారు’) చదువులు కొనసాగవనే బెంగతోనే ఐశ్వర్య చిన్ననాటి నుంచి ఏ పరీక్షలు రాసినా మంచి మార్కులు సాధించేది. ఐఏఎస్ కావాలని కలలు కనేది. తన కలలను సాకారం చేయలేకపోయాం. చదువులు కొనసాగవనే బెంగతోనే నా కూతురు ఆత్మహత్య చేసుకుంది. – శ్రీనివాస్‌రెడ్డి, ఐశ్వర్య తండ్రి -
ఐశ్వర్యది ప్రభుత్వ హత్యే!
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణకు చెందిన విద్యార్థిని ఐశ్వర్యది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని లేడీ శ్రీరాం కళాశాల (ఎల్ఎస్ఆర్ ) స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) ఆరోపించింది. కళాశాల ఉదాసీన వైఖరి సరికాదని పేర్కొంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ నెల 3న ఐశ్వర్య ఆత్మహత్యకు పాల్పడింది. దీనికి నిరసనగా కేంద్ర సైన్స్, టెక్నాలజీ కార్యాలయం ముందు ఎస్ఎఫ్ఐ, జేఎన్‌యూ విద్యార్థి నేతలు ధర్నా నిర్వహించారు.జేఎన్‌యూ స్టూడెంట్ యూనియన్, నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్యూఐ), తెలుగు స్టూడెంట్ అసోసియేషన్ (టీఎస్ఏ), ఐద్వా–ఢిల్లీలు కూడా నిరసన గళం వినిపించాయి. జస్టిస్ ఫర్ ఐశ్వర్య నినాదంతో ఆందోళన చేశారు. ‘కేంద్ర సైన్స్, టెక్నాలజీ మంత్రిత్వ శాఖ వైఫల్యం కారణంగా అనేక మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడింది. ఉపకార వేతనం ఆలస్యం కావడం వల్లే ఐశ్వర్య ఆర్థిక ఒత్తిడికి గురైంది. కేంద్ర సైన్స్, టెక్నాలజీ మంత్రి రాజీనామా చేయాలి. ఐశ్వర్య కుటుంబానికి ప్రభుత్వం పరిహారమివ్వాలి. ఆమె కుటుంబానికి న్యాయం జరిగే వరకు తరగతులు బహిష్కరి స్తున్నాం’ అని ఎస్ఎఫ్ఐ ఓ ప్రకటనలో పేర్కొంది. ‘ఐశ్వర్యకు చెల్లించాల్సిన ఉపకార వేతనంతో పాటు అదనంగా కొంత మొత్తాన్ని బాధిత కుటుం బానికి అందజేయాలి. విద్యార్థులందరి ఖాతా ల్లోనూ తక్షణమే ఉపకార వేతనాలు జమచేయాలి. కరోనా మహమ్మారి నేపథ్యంలో విద్యార్థులకు మద్దతుగా కేంద్రం చర్యలు తీసుకోవాలి’ అని ఐద్వా ఢిల్లీ అధ్యక్ష, కార్యదర్శులు మెమూనా మొల్లా, ఆశాశర్మ ప్రకటనలో పేర్కొన్నారు. ఆన్లైన్ విద్యా విధానం బాగా సాగుతోందని కేంద్రమంత్రి భావిస్తున్నారని, కానీ విద్యార్థుల ఇబ్బందులు విస్మరిస్తున్నారని జేఎన్‌యూ ప్రతిని«ధులు పేర్కొన్నారు. ‘రాష్ట్రేతర వర్సిటీలు, విదేశాల్లో చదువుకునే విద్యార్థుల కోసం తెలంగాణ ప్రభుత్వం విద్యా విధానం తీసుకురావాలి. వేరే ప్రాంతాల్లో చదువుకునే విద్యార్థులకు సహకరించాలి. రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకపోవడమే ఐశ్వర్య ఆత్మహత్యకు కారణం. ఢిల్లీలో చదువుకోవడానికి వచ్చే విద్యార్థులను ప్రభుత్వాలు ఆదుకోవాలి. ఐశ్వర్య కుటుంబానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.20 లక్షల పరిహారం చెల్లించాలి. ఐశ్వర్య చెల్లెల్ని ప్రభుత్వమే చదివించాలి’ అని టీఎస్ఏ ప్రతినిధి వివేక్ తెలిపారు. ఎల్ఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఉన్నిమాయ, ఎస్ఎఫ్ఐ ఢిల్లీ సంయుక్త కార్యదర్శి మౌనిక శ్రీసాయి, జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షురాలు అయిషీ ఘోష్, అంబేడ్కర్ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ కౌన్సిలర్ నవీన లాంబా, ఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా సంయుక్త కార్యదర్శి దీప్సిత ధర్, ఎన్ఎస్యూఐ జాతీయ కార్యదర్శి, ఏపీ బాధ్యురాలు బూస అనులేఖ తదితరులు నిరసనలో పాల్గొన్నారు. కాగా, కేంద్ర విద్యా మంత్రి పోఖ్రియాల్ నివాసం వద్ద ఎన్ఎస్యూఐ, తెలుగు స్టూడెంట్ అసోసియేషన్ కార్యకర్తలు ఆందోళన చేయడానికి యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో కార్యక్రమాన్ని విరమించారు. ఒత్తిడికి లోనై.... ఎస్ఎఫ్ఐ ఢిల్లీ విభాగం నిర్వహించిన వెబ్ మీడియా సమావేశంలో ఐశ్వర్య తల్లి మాట్లాడారు. లాక్డౌన్ సమయంలో ఇంటికి వచ్చిన ఐశ్వర్యకు వసతి గృహం ఖాళీ చేయాలని ఇటీవల సందేశం వచ్చిందన్నారు. మధ్యలో చదువు మానేస్తే నవ్వులపాలు అవుతామని తీవ్ర ఒత్తిడికి లోనయిందని చెప్పారు. ఉపకార వేతనం సకాలంలో అంది ఉంటే తమ కుమార్తె దక్కేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఐశ్వర్య మృతికి రాహుల్ సంతాపం ఐశ్వర్వ ఆత్మహత్య పట్ల కాంగ్రెస్ ఎంపీ, ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సంతాపం వ్యక్తం చేశారు. విద్యార్థిని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని సోమవారం ఆయన ట్వీట్ చేశారు. బీజేపీ ప్రభుత్వం నోట్ల రద్దు, లాక్డౌన్ వంటి నిర్ణయాలతో లెక్కలేనన్ని కుటుంబాలను నాశనం చేసిందని, ఇది నిజమని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు. -
కూకట్పల్లి అత్యాచారం కేసులో ట్విస్టు
సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లి అత్యాచారం ఘటనలో వెలుగులోకి కొత్త విషయాలు బయటపడుతున్నాయి. అత్యాచారానికి పాల్పడిన ముగ్గురూ మేజర్లని పోలీసులు తేల్చారు. బాధిత యువతి ఆసుపత్రిలో చేరిన తర్వాత కేసును జూబ్లీహిల్స్ పోలీసులు కూకట్‌పల్లికి బదిలీ చేశారు. నిందితులు జోసెఫ్, రాము, నవీన్‌లపై కేసు నమోదు చేసుకున్న కూకట్పల్లి పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాధిత కుటుంబ సభ్యుల స్టేట్మెంట్ రికార్డు చేసేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. అయితే, యువతి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులంతా కనిపించకుండా పోయారు. వారి వివరాల కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలాఉండగా.. యువతి సికింద్రాబాద్‌లోని ఓ కళాశాలలో డిగ్రీ చదువుతున్నట్టు తెలిసింది. (చదవండి: కూకట్‌పల్లిలో దారుణం) పోలీసుల అదుపులో ఓయో సిబ్బంది ఓయో హోటల్ నిర్వాకం వల్లే అమాయక యువతులపై కామాంధులు రెచ్చిపోతున్నారని సామాజిక కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, డిగ్రీ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన ముగ్గురికీ ఓయో సిబ్బంది ప్రత్యేక గదిని కేటాయించినట్టు తెలిసింది. గతంలో లైగింక దాడి, హింసా ఘటనలు జరిగినా ఓయో యాజమాన్యం తీరుమారడం లేదు. యువతకు విచ్చలవిడిగా అద్దెకు గదులు ఇస్తున్నారు. యువతులను వెంట తీసుకెళుతున్నా హోటల్ నిర్వాహకులు పట్టించుకోవడం లేదు. కూకట్‌పల్లిలోని ఓయో ఆనంద ఇన్ హోటల్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని, నిబంధనలు పట్టించుకోకుండా ఎవరికి పడితే వారికి రూమ్‌లు కేటాయిస్తున్నారని స్థానికులు ధ్వజమెత్తారు. ఇక గదుల కేటాయింపులకు సంబంధించి మీడియా హోటల్‌కు చేరుకోగానే ఓ జంట అక్కడ నుంచి పరారైంది. ఈ దృశ్యాలు కెమెరాకి చిక్కాయి. మీడియా కథనాలతో స్పందించిన పోలీసులు ఓయో హోటల్ నిర్వాహకులను, సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. (చదవండి: ఫార్మసిస్ట్ ఆత్మహత్య.. సింహాద్రి బాలుపై తండ్రి ఆరోపణ) -
నమస్తే పెట్టలేదని.. విద్యార్థిపై దాడి
సాక్షి, కొత్తూరు: తమకు నమస్తే పెట్టలేదనే కోపంతో కొందరు యువకులు డిగ్రీ విద్యార్థిని కిడ్నాప్ చేసి కర్రలతో తీవ్రంగా కొట్టి గాయపర్చారు. ఈ సంఘటన కొత్తూరు మండల కేంద్రంలో చోటుచేసుకుంది. సీఐ భూపాల్ శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలో నివాసముండే మహేష్‌కుమార్‌సింగ్ శంషాబాద్‌లోని ఓ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. గురువారం తన స్నేహితులతో కలిసి శంషాబాద్ మండలం నానాజీపూర్‌లోని వాటర్‌ఫాల్స్ వద్దకు వెళ్లాడు. అప్పటికే అక్కడ ఉన్న కొత్తూరుకే చెందిన పల్లెల చందు, కొల్లంపల్లి మురారి, ముడావత్ వినోద్, శ్రీకాంత్ తమను చూసి కూడా నమస్తే పెట్టలేదని ఆగ్రహంతో మహేష్‌కుమార్‌తో గొడవకు దిగారు. అనంతరం అక్కడి నుంచి మహేష్‌కుమార్ తన బైకుపై కొత్తూరుకు వస్తుండగా యువకులు మార్గమధ్యలో అడ్డగించి తమ బైకుపై ఎక్కించుకొని కిడ్నాప్ చేశారు. సుమారు రెండు గంటల పాటు మండలకేంద్రంలోని ఆయా వెంచర్లలో తిప్పుతూ కర్రలతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన మహేష్‌కుమార్ వారి నుంచి తప్పించుకుని ఇంటికి చేరుకుని, శుక్రవారం కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు నలుగురు యువకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మద్యం మత్తులో హత్య శంకర్పల్లి: కన్న తండ్రిని కత్తితో నరికి చంపిన ఉన్మాదిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా, మద్యం మత్తులో హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలో నివాసముంటున్న మ్యాదరి అంజయ్య(60)ను గురువారం రాత్రి అతడి కుమారుడు యాదయ్య కత్తితో తల నరికి హత్య చేశాడు. ఇది గమనించిన స్థానికులు ఇంటి బయట నుంచి తలుపులు వేసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని యాదయ్యను పట్టుకునేందుకు యత్నించగా కత్తితో బెదిరించే ప్రయత్నం చేశాడు. దీంతో గురువారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో చేవెళ్ల ఏసీపీ రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆక్టోపస్, ఫైర్ సిబ్బంది, 50 మందికి పైగా పోలీసులు ఇంటిని చుట్టుముట్టారు. ఆక్టోపస్ సిబ్బంది టియర్ గ్యాస్‌ను ఇంట్లోకి వదలడంతో వాసన తట్టుకోలేక యాదయ్య ఇంట్లో నుంచి ఒక్కసారిగా బయటకు వచ్చాడు. అప్పటికే బయట సిద్ధంగా ఉన్న పోలీసులను తప్పించుకుని మరో ఇంటిపైకి ఎక్కాడు. దీంతో అగ్నిమాపక సిబ్బంది ఇంటి పక్కనే ఉన్న మరో భవనం పైనుంచి నీటిని బలంగా వదలడంతో యాదయ్య కిందపడిపోయాడు. వెంటనే పోలీసులు అతడిని బంధించి పోలీస్‌స్టేషన్ తరలించారు. అనంతరం అంజయ్య మృతదేహం వద్ద వివరాలు సేకరించి పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం ఉదయం యాదయ్యను విచారించగా.. మద్యం మత్తులో కత్తితో తల నరికానని ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. యాదయ్య మానసికస్థితి బాగోలేదని తరచూ భార్య, తల్లిదండ్రులతో గొడవçప³డేవాడని చెల్లెలు సరిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. -
దొంగగా మారిన డిగ్రీ విద్యార్థి!
సాక్షి, బొబ్బిలి: బొబ్బిలిలో అద్దెకుంటూ డిగ్రీ చదువుకుంటున్న యువకుడు జల్సాలకు అలవాటు పడి డబ్బుల కోసం దొంగగా మారాడు. ఉపాధ్యాయుల ఇంట్లో చొరబడి 14 తులాల బంగారాన్ని కాజేశాడు. అయితే పోలీసులు వారం రోజుల్లోనే కేసును ఛేదించి.. విద్యారి్థతోపాటు అతనికి సహకరించిన యువకుడ్ని కటకటాల వెనక్కి నెట్టారు. డీఎస్పీ పాపారావు మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో చోరీకి పాల్పడిన వ్యక్తులను, రికవరీ చేసిన చోరీ సొత్తును ప్రదర్శించి వివరాలు వెల్లడించారు. బొబ్బిలి రైల్వే ఫ్లైఓవర్ దిగువున గల నాయుడు కాలనీలో ఉపాధ్యాయ దంపతులు ఆరిక ఉదయకుమార్, బిడ్డిక ఆశాజ్యోతిలు నివాసముంటున్నారు. లాక్ డౌన్ కారణంగా స్వగ్రామమైన కురుపాం వెళ్లి తిరిగి జూలై 31న వచ్చారు. ఇంటికి వేసిన తాళం ఉంటుండగానే లోపల బీరువా తెరచి ఉండటంతో అనుమానం వచ్చి చూడగా 14 తులాల బంగారు వస్తువులు కనిపించలేదు. దీంతో చోరీ జరిగినట్టు గుర్తించి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్పీ బి.రాజకుమారి విజయనగరంలో డీఎస్పీ శిక్షణ పొందుతున్న జెస్సీ ప్రశాంతికి ఈ కేసును అప్పగించారు. బొబ్బిలి ఐడీ పార్టీ ఏఎస్సై శ్యామ్, హెచ్‌సీ మురళీకృష్ణ, పీసీ శ్రీరామ్‌లతో కలిసి కేసు విచారణ ప్రారంభించారు. విచారణలో భాగంగా అదే ఇంటి సమీపంలో అద్దెకుంటున్న కురుపాం సమీపంలోని ఓ గ్రామానికి చెందిన గొట్టిపల్లి దినేష్‌కుమార్ తన తాహతుకు మించి ఖర్చులు చేస్తున్నట్టు గుర్తించారు. బొబ్బిలిలోనే ఓ కాలేజీలో డిగ్రీ చదువుతున్నట్టు తెలుసుకున్న పోలీసులు అతని ఇంటికి వెళ్లి విచారిద్దామనుకుంటుండగా పారిపోయేందుకు ప్రయతి్నంచగా సిబ్బంది వెంబడించి పట్టుకుని విచారించగా.. దొంగతనం తానే చేసినట్టు ఒప్పుకున్నాడు. వంటింటి కిటికీ తలుపులు పూర్తిగా వేయకపోవడంతో అందులోంచి ప్రవేశించిన దినేష్‌కుమార్ ఉపాధ్యాయులు తమ మంచం పరుపుకిందనే బీరువా తాళాలు ఉంచేయడంతో ఎంచక్కా బీరువా తెరచి అందులోంచి 14 తులాల విలువైన ఏడు గాజులు, రెండు హారాలు, ఒక చైన్, తులం బంగారం ముక్క, వెండి గ్లాసులు దొంగిలించాడు. వీటిని విక్రయించేందుకు తన స్నేహితుడైన శ్రీకాకుళం జిల్లా పిన్నింటిపేటకు చెందిన ఆనందరావును సంప్రదించడంతో వస్తువులు ఇక్కడకు తెస్తే అమ్మేద్దామని సహాయపడ్డాడు. ఈలోగానే దినేష్‌కుమార్ తన తల్లికి ఒంట్లో బాగాలేదని చెప్పి బొబ్బిలిలో మూడు గాజులను విక్రయించాడు. అలాగే గత నెల 29న శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో మూడు గాజులు, బంగారం ముక్కను అమ్మేసినట్టు విచారణలో తేలిందని డీఎస్పీ పేర్కొన్నారు. విక్రయించిన సొత్తుతో పాటు, దినేష్ కుమార్ వద్ద ఉన్న బంగారం చైన్, ఇతర వస్తువులను రికవరీ చేసినట్టు వివరించారు. చోరీ సొత్తును కొద్దిరోజుల్లోనే రికవరీ చేయడంతో ట్రైనీ డీఎస్పీ జెస్సీ ప్రశాంతిని, ఐడీ పార్టీ సిబ్బందిని ఎస్పీ రాజకుమారి అభినందించారని డీఎస్పీ పాపారావు తెలిపారు. చోరీకి పాల్పడిన విద్యార్థితోపాటు అతనికి సహకరించిన యువకుడిని అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించామన్నారు. -
మొబైల్ మత్తులో తల్లిని చంపిన డిగ్రీ విద్యార్థి
సాక్షి, మండ్య: మొబైల్ ఫోన్ వ్యసనం ఓ యువకున్ని హంతకునిగా మార్చింది. ఎప్పుడూ ఫోనేనా, బుద్ధిగా చదువుకో, ఇంట్లో పనులు చేయవచ్చు కదా అని బుద్ధిమాటలు చెప్పిన తల్లిని అంతమొందించాడో తనయుడు. మొబైల్ మత్తులో ఏం చేస్తున్నాడో కూడా తెలియని క్రూరునిగా మారాడు. గత గురువారం మండ్యలోని విద్యా నగరలో ఇంట్లోనే ఒక మహిళ హత్యకు గురైంది. కత్తిపోట్లతో రక్తపుమడుగులో పడి ఉన్న మృతదేహం ఫోటోలు తీవ్ర కలకలం సృష్టించాయి. హతురాలిని శ్రీలక్ష్మి (45)గా గుర్తించారు. విచారణలో నేరం రట్టు ఇంత దారుణంగా ఎవరు చంపి ఉంటారని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆమె కుమారుడు మను శర్మ (21)నే హంతకుడని శనివారం గుర్తించడంతో అందరూ నిశ్చేష్టులయ్యారు. తల్లి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో చాకుతో పొడిచి ఇంటి నుంచి వెళ్ళియాడు. పోలీసులు ఇంటికి వచ్చి హత్యాస్థలిని పరిశీలిస్తున్న సమయంలో తిరిగి వచ్చిన మను శర్మ ఏమీ తెలియనివాడిలా నటించాడు. పోలీసులు కుటుంబ సభ్యులను పిలిపించి విచారణ చేపట్టారు. విచారణలో దొరికిపోయిన మనుశర్మ తానే తల్లీని హత్య చేసినట్లు ముందు ఒప్పుకున్నాడు. (చెంపలు వాయించింది) ఏం జరిగిందంటే మధుసూదన్, శ్రీలక్ష్మి దంపతుల చిన్న కుమారుడు అయిన మను శర్మ బీఎస్సి చివరి ఏడాది చదువుతున్నాడు. ఇతను ఎప్పుడూ మొబైల్ఫోన్లో లీనమయ్యేవాడు. యువతితో కూడా ఫోన్లో మాట్లాడేవాడు. ఇది మంచిది కాదు అని తల్లి మనుశర్మను మందలించేది. అతడు బయటకి వెళ్లకుండా కట్టడి చేసేది. గురువారం అతని కోసం స్నేహితుడు రాగా, బటయకు వెళ్ళవద్దని తల్లి హెచ్చరించింది. తరువాత తల్లీ కొడుకు మధ్య గొడవ మొదలైంది. ఆగ్రహంతో తల్లి అతని తలపైన గట్టిగా కొట్టడంతో మనుశర్మ వంటగదిలోకి వెళ్ళి చాకు తీసుకొని వచ్చి తల్లి మీద దాడికి దిగాడు. కత్తితో విచ్చలవిడిగా పొడిచి వెళ్లిపోయాడు. తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. హత్య జరిగిన కొంత సమయానికి భర్త మధుసూదన్, మరో కుమారుడు ఆదర్శ వచ్చి చూడగా శ్రీలక్ష్మి మృతదేహం కనిపించింది. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు పరిశీలన చేస్తున్న సమయంలో మను శర్మ వచ్చాడు. పోలీసుల విచారణలో చిక్కుముడి వీడింది. నిందితున్ని అరెస్టు చేసి జైలుకు తరలించారు. -
డిగ్రీ విద్యార్థిని లైవ్ డెత్!
-
డిగ్రీ విద్యార్థిని లైవ్ డెత్!
సాక్షి, నెల్లూరు: నెల్లూరులో డిగ్రీ విద్యార్థిని లైవ్ డెత్ కలకలం రేపుతోంది. రమ్య అనే విద్యార్థిని ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకుంటూ వీడియో రికార్డ్ చేసింది. తెల్లారిన తరువాత తమ బిడ్డ గది నుంచి ఎంతకూ బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. తలుపులు పగులకొట్టి చూడగా రమ్య ఉరికి వేలాడుతూ కనిపించింది. ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు ధృవీకరించారు. తోటి విద్యార్థుల వేధింపులతోనే తమ బిడ్డ ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కాల్ డేటా, ఫోన్ మెస్సేజ్‌ల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థిని లైవ్ సూసైడ్ నెల్లూరులో సంచలనంగా మారింది. (చదవండి: అత్యాశకు పోతే 5 కిలోల నకిలీ బంగారం!!) -
పరిమళించిన మానవత్వం
నేరేడ్మెట్: అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందిన డిగ్రీ కళాశాల విద్యార్థిని అంత్యక్రియల నిమిత్తం అధ్యాపకులు, తోటి విద్యార్థులు విరాళాలు అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే...కార్ఖానాకు చెందిన పూజ(18) వాజ్‌పేయినగర్‌లోని మల్కాజిగిరి ప్రభుత్వ డిగ్రీకళాశాలలో బీఎస్సీ చదువుతోంది. పూజ చిన్నతనంలోనే ఆమె తల్లిదండ్రులు మృతి చెందడంతో కార్ఖానాలో ఉంటుంటున్న అమ్మమ్మ వద్ద ఉంటూ చదువుకుంటోంది. శుక్రవారం ఉదయం ఆమె అనారోగ్యంతో మృతి చెందింది. ఈ విషయం తెలియడంతో కళాశాలకు వచ్చిన ఆమె తోటి విద్యార్థిని, విద్యార్థులు, అధ్యాపకులను దిగ్బ్రాంతికి లోనయ్యారు. తరగతులను బహిష్కరించి కళాశాల ఆవరణలో పూజ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె అంత్యక్రియల నిమిత్తం విద్యార్థులు రూ.6వేలు సేకరించగా, కళాశాల అధ్యాకులు తమ వంతుగా రూ.25వేలు అందజేశారు. దీంతో విద్యార్థులు, అధ్యాపకులు ఆమె ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు నగదు అందజేసి, అంతిమ యాత్రలో పాల్గొన్నారు. -
సామూహిక అత్యాచారం
మండపేట: స్నేహితులైన కాలేజీ విద్యార్థిని, విద్యార్థి ఒక చోట ఉండటాన్ని గమనించిన ముగ్గురు దుండగులు యువకుడిపై దాడిచేసి అనంతరం యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా మండపేటలో జరిగింది. బాధిత యువతి బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదీ జరిగింది.. మండపేట సమీప గ్రామానికి చెందిన దళిత యువతి పట్టణంలోని ఓ కళాశాలలో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతోంది. మంగళవారం కళాశాలకు చివరి రోజు కావడంతో స్నేహితులతో వీడ్కోలు వేడుకలు జరిగాయి. తర్వాత స్నేహితుడితో కలిసి బైపాస్ రోడ్డు సమీపంలోని పశువుల మకాం వద్ద మాట్లాడుతోంది. మకాం యజమాని వీరిపై కన్నేశాడు. తన స్నేహితుడైన కోడిపెంట వ్యాపారిని అక్కడికి పిలిచాడు. అతడి పాలేరుగా పనిచేసే మరో స్నేహితునికీ విషయం చెప్పాడు. ఇద్దరూ మరో యువకుడితో కలిసి మోటారు సైకిల్‌పై అక్కడికి వచ్చారు. నలుగురూ కలిసి యువతి స్నేహితుడిపై దాడిచేశారు. సెల్‌ఫోన్ లాక్కున్నారు. అనంతరం ఆమె స్నేహితున్ని ఓ యువకుడు మోటారు సైకిల్‌పై ఎక్కించుకుని సినిమా రోడ్డులోని పాన్‌షాప్ వద్దకు తీసుకువెళ్లాడు. అక్కడ తన ఫోన్‌కు రీచార్జ్ చేయించుకుని వెళ్లిపోయాడు. మిగిలిన ముగ్గురు నిందితులూ యువతిపై అత్యాచారానికి పాల్పడి వెళ్లిపోయారు. మకాం యజమాని ఐదు పదుల వయస్సు దాటిన వ్యక్తి కాగా, మిగిలిన ఇద్దరూ 40 ఏళ్ల వారు. నిందితులు పట్టుబడ్డారిలా.. పాన్ షాపు వద్ద ఉన్న బాధిత విద్యార్థి స్నేహితులకు సమాచారమిచ్చాడు. స్నేహితులతో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నాడు. అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న యువతిని ఇంటికి చేర్చారు. పాన్‌షాప్ వద్ద రీచార్జ్ చేయించిన నంబర్ ఆధారంగా నిందితుల్లో ఒకడైన యువకుడిని గుర్తించారు. యువతి స్నేహితులు, బంధువులు గొల్లపుంతలోని అతని ఇంటికి వెళ్లి దేహశుద్ధి చేశారు. మిగిలిన ముగ్గురి పేర్లు అతను బయటపెట్టగా సంఘం కాలనీలోని ఇద్దరు నిందితుల ఇంటికి చేరుకుని వారినీ చితకబాదారు. ఈలోగా స్థానికులు 100 ఫోన్ చేయడంతో పోలీసులు వచ్చారు. ఈలోగా నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. -
ఆస్తి కోసం డిగ్రీ విద్యార్థినికి వేధింపులు
చీరాల: ఆస్తి కోసం సొంత కుటుంబ సభ్యులు పెడుతున్న వేధింపులు తాళలేక డిగ్రీ చదువుతున్న విద్యార్థిని నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను చుట్టుపక్కల వారు గమనించి 108లో చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం ఆమె ప్రాణాపాయం నుంచి తప్పించుకుని వైద్య సేవలు పొందుతోంది. వివరాలు.. మండలంలోని రామకృష్ణాపురం గ్రామ పంచాయతీకి చెందిన గుర్రం డైసీ చీరాల పట్టణంలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతోంది. తల్లిదండ్రులు చిన్న తనంలో చనిపోవడంతో తాతయ్య జార్జి, నాయనమ్మల వద్ద నివాసం ఉంటోంది. డిగ్రీ చదువుతున్న డైసీ బొడ్డురాయి ప్రాంతానికి చెందిన పవన్ అనే యువకుడిని ప్రేమిస్తోందని బంధువులకు తెలిసింది. ఉమ్మడి ఆస్తి డైసీ ప్రేమిస్తున్న పవన్ అనే యువకుడికి వెళ్తుందన్న అక్కసుతో నెల నుంచి బంధువులు తనను మానసికంగా వేధిస్తున్నారని బాధితురాలు చెబుతోంది. ఆస్తి వారికి చెందేలా సంతకాలు చేయాలని తాతయ్య జార్జి, పెద్దమ్మ సంతోషం, పెదనాన్న, ఇతర కుటుంబ సభ్యులు చిత్రహింసలు పెడుతుండటంతో వాటిని భరించలేక నిద్రమాత్రలు మింగినట్లు ఆమె ఔట్ పోస్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అధిక మొత్తంలో నిద్రమాత్రలు మింగిన బాధితురాలిని 108లో చీరాల ఏరియా వైద్యశాలకు తరలించగా ఔట్‌పోస్టు పోలీసులు ఫిర్యాదు స్వీకరించారు. -
మహా ప్రాణదీపం
కోరకుండానే దేవుడు వరమిచ్చినంత ఆనందంగా ఉంది ఆ కుటుంబం.. అనారోగ్యవంతుల పాలిట ఆపద్బాంధవిగా ఉన్న ఆరోగ్యశ్రీ పథకం తమ కుమార్తెకు వర్తించదని తెలుసుకున్న తల్లిదండ్రులు ఎంతో కుమిలిపోయారు. తమను ఆదుకునే దిక్కెవ్వరని కన్నీళ్లు పెట్టుకున్నారు. బాలిక సహ విద్యార్థులు, కళాశాల యాజమాన్యం చందాలు వేసుకొని కొంత సాయం చేశా రు. చికిత్సకు లక్షల్లో అవసరం కావడంతో.. చేయూతనందించే ఆదరవు కోసం ఎదురుచూస్తున్న దశలో ఓ సంతోషకర వార్త.. బాలిక అనారోగ్యం గురించి ‘సాక్షి’ పత్రిక ద్వారా తెలుసుకున్న ఆరోగ్యశ్రీ అధికారులు ప్రత్యేక కేసుగా పరిగణించి అవసరమైనంత సాయం చేస్తామని ముందుకు వచ్చారు. శ్రీకాకుళం: మెదడుకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న డిగ్రీ విద్యార్థిని జస్మితను ఆరోగ్యశ్రీ పథకం ఆదుకుంటోంది. నగరంలోని ఆ నిరుపేద కుటుంబానికి చెందిన ఈ బాలిక కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతోంది. చికిత్స పొందుతున్నా ఎప్పటికీ వ్యాధి నయం కాకపోవడంతో స్థానిక వైద్యులు విశాఖపట్నం కేజీహెచ్‌కు రిఫర్ చేశారు. అక్కడ పరీక్షలు చేసిన వైద్యులు జస్మితకు శస్త్ర చికిత్స అవసరమని తేల్చారు. నిరుపేద కుటుంబమైన వీరికి శస్త్ర చికిత్స జరిపించేందుకు అవసరమైన రూ.6 లక్షలు భరించలేమని మానసికంగా కుంగిపోయారు. జస్మిత చదువుతున్న కళాశాల విద్యార్థులు, యాజమాన్యం రూ.50 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ విషయం సాక్షిలో ప్రచురితం కావడంతో స్థానిక ఆరోగ్యశ్రీ అధికారులు స్పందించారు. పేదలు ఎటువంటి వ్యాధి తో బాధపడుతున్నా స్పందించి రాష్ట్రస్థాయి అధికారుల దృష్టికి తీసుకురావాలని అప్పటికే ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్‌లో ఆదేశించడంతో దీనిని అధికారులు ఆచరణలో పెట్టారు. జస్మితకు ఉన్న వ్యాధి ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాదని, నిరుపేద కుటుంబమని చెప్పడంతో రాష్ట్ర అధికారులు తక్షణం స్పందించి ప్రత్యేక కేసుగా పరిగణించి చికిత్సలు చేయించాలని జిల్లా ఆరోగ్యశ్రీ అధికారులను ఆదేశించారు. ఈ విషయం సోమవారం జస్మిత కుటుంబ సభ్యులకు తెలియడంతో వారంతా ఆనందపడుతూ విశాఖపట్నం వెళ్లారు. అయితే అక్కడ బుధవారం రావాలని చెప్పడంతో తిరిగి నగరానికి చేరుకున్నారు. రానున్న శుక్ర, శని వారాల్లో గాని, సోమవారం గాని జస్మితకు శస్త్ర చికిత్స జరిగే అవకాశాలున్నాయి. వైఎస్సార్ కుటుంబానికి రుణపడి ఉంటాం.. బిడ్డను ఆరోగ్యశ్రీ పథకం ఆదుకుందని జస్మిత తండ్రి రాము ‘సాక్షి’తో ఆనందం వ్యక్తం చేశారు. తాపీమేస్త్రి గా పనిచేస్తున్న తనకు అంత పెద్ద మొత్తం వెచ్చించే స్థోమత లేదని, తమ కూతురు పడుతున్న బాధ చూడలేక రోజూ తన భా ర్య, తాను కుంగిపోయేవారమన్నారు. బాగా చదివే జస్మిత తమను ఆదుకుంటుందని భావించి ఎన్ని కష్టాలు ఎదురైనా చదివించామన్నారు. ఆరోగ్యశ్రీ పరిధిలో జస్మితకు ఉన్న వ్యాధి రాదని తొలుత వైద్యులు చెప్పడంతో ఆశలు వదులుకున్నామని, ప్రత్యేక కేసుగా పరిగణించి చికిత్స చేయిస్తామని ఆ రోగ్యశ్రీ అధికారులు చెప్పగానే ఆనందం ప ట్టలేకపోయామన్నారు. వైఎస్ జగన్‌కు జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. -
నడిరోడ్డుపై విద్యార్థిని గొంతు కోసిన ప్రేమోన్మాది
-
నడిరోడ్డుపై విద్యార్థిని గొంతు కోసిన ప్రేమోన్మాది
-
విశాఖలో రెచ్చిపోయిన ప్రేమోన్మాది
సాయంత్రం.. సమయం.. 5 గంటలు.. కళాశాల విడిచిపెట్టారు.. మిగిలిన విద్యార్థులతోపాటు ఆ అమ్మాయి కళాశాల నుంచి బయటకు వచ్చి ఇంటివైపు అడుగులు వేస్తోంది. ఇంతలో హఠాత్తుగా దూసుకొచ్చిన ఓ యువకుడు కత్తితో ఆమెపై దాడి చేశాడు. అంతే ఆ ఆమ్మాయి రోడ్డుపైనే కుప్పకూలింది. పట్టణ నడిబొడ్డున.. సినిమాహాలు, పెట్రోల్ బంక్, కళాశాల.. అన్నీ ఉన్న రద్దీ ప్రాంతంలో జరిగిన ఈ దాడితో ఆ ప్రాంతమంతా ఒక్కసారి అలజడి రేగింది. అరుపులు, ఆర్తానాదాలతో దద్దిరిల్లింది. ఈ దారుణం ప్రశాంతతకు మారుపేరైన అనకాపల్లిలో బుధవారం చోటుచేసుకుంది. సాక్షి, విశాఖపట్నం : అనకాపల్లిలోని రైల్వేస్టేషన్‌కు సమీపంలో ఉన్న భీమునిగుమ్మానికి చెందిన కె.సాయి పట్టణంలోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశాడు. అదే ప్రాంతానికి చెందిన పి.యశోధభార్గవి పట్టణంలోని డీవీఎన్ కళాశాలలో డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతోంది. భార్గవిని సాయి గత నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నాడు. వీరిద్దరి విషయం పెద్దలకు తెలియడంతో రెండు కుటుంబాలకు చెందిన వారు పెద్దల సమక్షంలో పెళ్లి చేయాలని నిర్ణయించారు. భార్గవి మైనర్ కావడంతో పెళ్లిని వాయిదా వేసినట్లుగా అక్కడివారు చెబుతున్నారు. ఈలోగా గత ఆరునెలలు నుంచి సాయి తాను ప్రేమించిన భార్గవితో ఘర్షణకు దిగేవాడని తెలిసింది. దీనికి ప్రధాన కారణం భార్గవి మరో వ్యక్తితో చనువుగా ఉండడమే. ఇదే విషయమై ఆమెను తరచూ నిలదీసేవాడు. అయినప్పటికీ మూడో వ్యక్తితో ఆమె చనువుగా ఉండడాన్ని తట్టుకోలేని సాయి ఉన్మాదిగా మారాడు. బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో కళాశాల నుంచి వస్తున్న భార్గవిపై ఒక్కసారిగా దాడికి దిగాడు. కూరగాయల కోసే కత్తి పట్టుకొని భార్గవి మెడపైన, పక్కటెములకులపైన పొడవడంతో కుప్పకూలిపోయింది. ఈ సంఘటన స్వయంగా భార్గవి తాతకు సంబంధించిన పాన్‌షాపు ఎదురుగా జరగడంతో ఆయన షాక్‌కు గురయ్యాడు. సంఘటన జరిగిన కొద్ది క్షణాలకే అక్కడ గుమిగూడిన జనమంతా సాయిని పట్టుకొని దేహశుద్ధి చేశారు. పోలీసులకు సమాచారం అందించడంతో పట్టణ ఎస్సై చక్రధర్, స్వీటీ, సావిత్రి, ట్రాఫిక్ ఎస్సై స్వామినాయుడు సంఘటనా స్థలానికి వచ్చి ఘటన జరిగిన తీరును పరిశీలించారు. అంతేకాకుండా భార్గవిపై సాయి దాడి చేసిన సమయంలో రెండు కుటుంబాలకు చెందిన కొందరు అదే దుకాణం వద్ద ఉండడం గమనార్హం. సాయిని అనకాపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించి ఎస్సై చక్రధర్ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తును ప్రారంభించారు. భార్గవిని అనకాపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స చేశారు. ఈ దాడితో తీవ్రశోకంలోకి మునిగిపోయిన భార్గవి తల్లి నూకరత్నం కన్నీరుమున్నీరవుతూ పడిపోయింది. ఇద్దరికీ పెళ్లి చేయాలని పెద్దల సమక్షంలో నిర్ణయించామని, ముక్కపచ్చలారని తన కుమార్తెపై దాడి చేసిన సాయిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఒక్కసారిగా ఈ ఘటనతో అనకాపల్లి ప్రాంతం ఉలిక్కిపడింది. ఈ సమాచారం జిల్లా మొత్తం సామాజిక మాధ్యమాల ద్వారా వ్యాపించడంతో ఒక్కసారిగా అలజడి రేగింది. ప్రశాంతమైన అనకాపల్లి పట్టణంలో ఈతరహా సంఘటన ఎప్పుడూ చూడలేదని పురపెద్దలు ఆవేదన వ్యక్తం చేశారు. సాయి తండ్రి శ్రీను అనకాపల్లి శారదానదికి ఆనుకొని ఉన్న శ్మశానవాటిక కాపరిగా పని చేస్తున్నాడు. యశోధ భార్గవి తండ్రి కృష్ణ కూలీ పనులు చేసి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తల్లి ఉమా నూకరత్నం గృహిణి. వీరికి ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి. ఒకే ప్రాంతానికి చెందిన ఇద్దరి మధ్య జరిగిన ప్రేమాయణం ఇంతటి విషాదఘటనకు దారితీయడం పట్ల భీమునిగుమ్మం వాసులు జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవైపు మహిళా సంఘాలు ఈ ఘటనను ఖండిస్తూ సాయిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తీవ్ర గాయాలపాలైన భార్గవికి ప్రథమచికిత్స చేసిన అనంతరం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. నివేదిక కోరిన ఏయూ వీసీ ఏయూ క్యాంపస్(విశాఖ తూర్పు): విద్యార్థినిపై అనకాపల్లిలో జరిగిన దాడి ఘటనపై ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి నివేదిక కోరారు. డీవీఎన్ కళాశాల విద్యార్థినిపై జరిగిన దాడిని ఆయన ఖండించారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జరిగిన సంఘటనపై సత్వరమే తనకు నివేదిక అందించాలని ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు. విద్యార్థినుల రక్షణకు, భద్రతకు ప్రాధాన్యమిస్తామన్నారు. త్వరలో వర్సిటీ అనుబంధ కళాశాలల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించి తగిన మార్గదర్శకాలు విడుదల చేస్తామన్నారు. మరోవైపు వీసీ ఆదేశాల మేరకు వర్సిటీ రెక్టార్ ఆచార్య వి.క్రిష్ణమోహన్ డీవీఎన్ కళాశాల ప్రిన్సిపాల్ కె.రమేష్‌తో మాట్లాడారు. విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కళాశాల నుంచి ఇంటికి వెళ్లే సమయంలో సంఘటన జరిగిందని, విద్యార్థిని ప్రాణాపాయం నుంచి బయటపడిందని ప్రిన్సిపాల్ తెలియజేశారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపట్టాలని ప్రిన్సిపాల్‌కు రిజిస్ట్రార్ సూచించారు. పెళ్లికి నిరాకరించడంతోనే ఈ దుశ్చర్య? ఒకే ప్రాంతం, ఒకే సామాజికవర్గానికి చెందిన సాయి, భార్గవిలకు పెద్దల సమక్షంలో పెళ్లి చేయాలని కొద్ది నెలలు క్రితం నిర్ణయించారు. నెల క్రితం సాయి సోదరికి వివాహం కూడా జరిగింది. అయితే భార్గవి అదే ప్రాంతానికి చెందిన మరొక వ్యక్తితో చనువుగా ఉంటుందని భావించి అనుమానంతో సాయి గాయాలపాలైన భార్గవిని నిలదీసేవాడు. ఇలా వీరిద్దరి మధ్య తరచూ వివాదం జరగడంతో నెలరోజుల క్రితం భార్గవి కుటుంబీకులు సాయి ఇంటికి వెళ్లి మీ అబ్బాయి మా అమ్మాయిని వేధిస్తున్నందున పెళ్లి వాయిదా వెద్దామని చెప్పినట్లుగా సమాచారం. దీంతో మరింత మానసిక ఉన్మాదానికి గురైన సాయి గత కొద్దిరోజుల నుంచి భార్గవితో వాదులాటకు దిగేవాడు. ఇక మానసికమైన ఉద్వేగానికి గురై ప్రేమోన్మాదిగా మారిన సాయి తట్టుకోలేక భార్గవిపై కత్తితో దాడి చేశాడు. సాయిపై 307, 506, 509 సెక్షన్లు నమోదు యువతి భార్గవిపై హత్యాయత్నానికి పాల్పడిన సాయిపై 307, 506, 509 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు అనకాపల్లి పట్టణ ఎస్సై చక్రధరరావు పేర్కొన్నారు. కేజీహెచ్‌కు భార్గవి భార్గవికి మెడపై, పక్కటెముకుల్లో కత్తిపోట్లు ఉన్నాయి. ఇక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించాం. ప్రాణానికి ఎటువంటి హానీ లేదు. – జగన్మోహనరావు, ఎన్టీఆర్ వైద్యాలయం సూపరింటెండెంట్ ఎంతటి వారైనా కఠిన చర్యలు ప్రశాంతమైన అనకాపల్లి పట్టణంలో ఎప్పుడు ఇటువంటి దారుణ ఘటనలు జరగలేదు. ఈ హత్యాయత్నం కేసులో నిందితుడు ఎంతటివారైనా కఠిన శిక్ష తప్పదు. గాయపడిన బాలికకు తగిన వైద్య చికిత్స అందిస్తాం. భవిష్యత్‌లో ఇటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటాం. –గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్యే ఎంత ఘోరం చేశాడు మా కుమార్తెను అల్లారుముద్దుగా పెంచుకుంటున్నాం. మా ఇంటికి దగ్గరలోనే ఉన్న సాయి ఇంత ఘోరానికి పాల్ప డతాడని అనుకోలేదు. వీరిద్దరికీ పెళ్లి చేద్దామని రెండు కుటుంబాలకు చెందిన పెద్దల సమక్షంలో నిర్ణయించాం. ఇంతలోనే దాడికి తెగబడిన సాయిని కఠినంగా శిక్షించాలి. సాయిపై 307, 506, 509 సెక్షన్లు నమోదు యువతి భార్గవిపై హత్యాయత్నానికి పాల్పడిన సాయిపై 307, 506, 509 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు అనకాపల్లి పట్టణ ఎస్సై చక్రధరరావు పేర్కొన్నారు. కేజీహెచ్‌కు భార్గవి భార్గవికి మెడపై, పక్కటెముకుల్లో కత్తిపోట్లు ఉన్నాయి. ఇక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించాం. ప్రాణానికి ఎటువంటి హానీ లేదు. – జగన్మోహనరావు, ఎన్టీఆర్ వైద్యాలయం సూపరింటెండెంట్ -
వినూత్న రీతిలో టిక్‌టాక్ చేద్దామని అడవికి వెళ్లి..
కలకడ మండలానికి చెందిన ఈ యువకుడి పేరు మురళీకృష్ణ. చంద్రగిరి సమీపంలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. టిక్‌టాక్ వీడియో తీసేందుకు ఆదివారం శేషాచలం అడవిలోకి వెళ్లాడు.. అక్కడ దారి తప్పాడు. ఆదివారం రాత్రంతా అడవిలోనే ఉండిపోయాడు. చివరికి అతను తన వాట్సాప్ ద్వారా స్నేహితులకు లోకేషన్ షేర్ చేశాడు. స్నేహితులు పోలీసుల సాయంతో అడవిలోకి వెళ్లి సోమవారం తెల్లవారుజాము 3 గంటల ప్రాంతంలో అతన్ని అడవి నుంచి క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. ఈ లోగా భయంతో ఫిట్స్ వచ్చి మురళి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఇదొక్కొటే కాదు.. చాలాచోట్ల ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. టిక్‌టాక్ మోజులో పడుతున్న యువత తమ బంగారు భవిష్యత్‌ను చేతులారా నాశనం చేసుకుంటున్నారు. సాక్షి, చంద్రగిరి: వినూత్న రీతిలో టిక్‌టాక్ చేద్దామని ఆలోచించిన ఓ విద్యార్థి అడవిలోకి వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. సహ విద్యార్థులు, పోలీసులు స్పందించి అడవిలో గాలించి 15 గంటల తర్వాత ఆస్పత్రికి చేర్చారు. పోలీసులు, తోటి విద్యార్థుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. కలకడకు చెందిన మురళీకృష్ణ చంద్రగిరి మండలంలోని ఓ ప్రైవేటు కళాశాలలో మైక్రో బయాలజీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం కళాశాలకు సెలవు కావడంతో టిక్‌టాక్ చేద్దామని ఉదయం 9గంటలకు సమీపంలోని శేషాచలం అటవీ ప్రాంతంలోకి వెళ్లాడు. ఓ ప్రాంతంలో జాతీయ జెండాను నాటి సెల్యూట్ చేశాడు. మరొక చోట పెద్ద కొండపైకి వెక్కి మరో టిక్‌టాక్ చేసి తన సెల్ఫోన్లో భద్రపరుచుకుని తిరుగు పయనమయ్యాడు. దారి తప్పడంతో 5 గంటల పాటు అడవిలో తిరుగు తూ ఉండిపోయాడు. వెంట తెచ్చుకున్న స్నాక్స్, వాటర్ బాటిళ్లు ఖాళీ అవ్వడంతో పూర్తిగా నీరసించిపోయాడు. దిక్కుతోచని స్థితిలో రాత్రి 9 గంటలకు స్నేహితులకు ఫోన్ చేసి వాట్సప్‌లో లోకేషన్ షేర్ చేశాడు. వెంటనే విద్యార్థులు హాస్టల్ యాజమాన్యంతో పాటు చంద్రగిరి పోలీసులకు సమాచారం అందించారు. సకాలంలో స్పందించిన సీఐ రామచంద్రారెడ్డి ప్రత్యేక బృందాన్ని అడవిలోకి పంపించాడు. నాలుగు గంటల తర్వాత గూగుల్ మ్యాప్ ద్వారా మురళీకృష్ణ ఆచూకీ కోసం సుమారు నాలుగు గంటల పాటు పోలీసులు శ్రమించారు. చివరకు సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో శ్రీవారిమెట్టు సమీపంలోని అటవీ ప్రాంతంలో స్పృహ తప్పిన స్థితిలో మురళీకృష్ణను గుర్తిం చారు. పోలీసులు అతన్ని భుజాలపై సుమారు 5 కిలోమీటర్లు మోసుకొచ్చి 108 వాహనంలో తిరుపతి రుయాకు తరలించారు. దీంతో ప్రాణ పాయం నుంచి తప్పించుకున్నాడు. విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు తిరుపతికి చేరుకుని స్వగ్రామానికి తీసుకెళ్టినట్లు పోలీసులు తెలిపారు. టిక్‌టాక్ వ్యసనంలో యువత చిత్తూరు కలెక్టరేట్ : వయస్సు, లింగభేదం లేదు.. బాహ్య ప్రపంచంతో సంబంధం లే దు.. హావభావాలు, అభినయాలు, డ్యాన్సులు, విన్యాసాలు, వ్యంగ్యాస్త్రాలు.. ఇలా విభిన్నమైన వీడియోలను అప్లోడ్ చేస్తూ లైక్‌లు, కామెంట్లు, ఫాలోవర్లను పెంచుకుంటూ ఇదే తమ లోకమంటూ గడిపేస్తున్నారు. సెలబ్రెటీల కన్నా తామేమీ తక్కువ కాదంటూ యువత నుంచి మధ్య వయస్సు కలిగిన వారు సైతం టిక్‌టాక్ మోజులో పడుతున్నారు. అదే మైకంలో మునిగితేలుతున్నారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఈ యాప్ ఒక వ్యసనంగా మారింది. దీనిలో వీడియోలు అప్లోడ్ చేయడం వల్ల కలిగే దుష్ప్రచారాలతో అనేక కుటుంబాలు ఛిన్నాభిన్నం అవడమే కాక, మరికొందరు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. అధిక శాతం ఫోన్లల్లో టిక్‌టాక్ యాప్ ఆండ్రాయిడ్ ఫోన్లు వినియోగిస్తున్న వారిలో అధిక శాతం మంది టిక్‌టాక్ యాప్ ను వాడుతున్నారు. టిక్‌టాక్‌ను వేదికగా చేసుకుని వ్యక్తిగత నైపుణ్యాలను చాటుతున్న వారికి కొదవే లేదు. అదే సమయంలో అత్యుత్సాహం అనర్థాలకు దారితీస్తోంది. జిల్లాలో ఈ యాప్ వినియోగించే వారి సంఖ్య నానాటికీ పెరుగుతూ వస్తోంది. కొందరైతే గంటలతరబడి సెల్లో వీడియోలను వీక్షిస్తూ తమదైన లోకంలో విహరిస్తున్నారు. ఇది ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోందని మానసిక వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిద్రలేమి వల్ల తలెత్తే అనారోగ్య సమస్యలతో చికిత్స కోసం వచ్చే వారి సంఖ్య క్రమేణా పెరుగుతోందని వైద్యులు చెబుతున్నారు. చదువును పక్కనపెట్టి.. చాలామంది విద్యార్థులు చదువును పక్కనపెట్టి టిక్‌టాక్‌ను వినియోగిస్తున్నారు. ఈ సమస్యపై చాలామంది తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల, కళాశాలల నుంచి రాగానే పుస్తకాలను పక్కనపెట్టి సెల్‌ఫోనే లోకంగా కాలం గడిపేస్తున్నారు. పిల్లలు అప్లోడ్ చేసిన వీడియోలు, కామెంట్ల వల్ల ఎక్కడ వివాదాల్లో చిక్కుకోవాల్సి వస్తుందోనని తల్లిదండ్రులు భయాందోళనకు లోనవుతున్నారు. కొందరైతే తరగతి గదుల్లో తోటి విద్యార్థులను ఆటపట్టించడం, డ్యాన్సులు చేయడం, సినీ, రాజకీయ ప్రముఖులను అనుసరిస్తూ చేసిన వీడియోలను అప్లోడ్ చేయడం లాంటివి చేస్తున్నారు. ప్రాణాలపైకి తెచ్చుకోవడం ఎందుకు? టిక్‌టాక్‌లో ఫాలోవర్స్‌ను పెంచుకోవడం కోసం రకరకాల విన్యాసాలు చేసేందుకు యువత ప్రయత్నిస్తోంది. వినూత్నంగా విన్యాసాలు చేస్తే ఫాలోవర్స్ పెరుగుతారని భావించి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వీడియోలు తీసుకుంటున్నారు. నిపుణుల పర్యవేక్షణలో చేసే వీడియోలను అనుసరించి వాటిని స్వయంగా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలాంటివి చేయడం వల్ల మెడ, ఎముకలు విరిగిపోయి తీవ్రంగా గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ కన్నుమూసిన సంఘటన ఇటీవల కర్ణాటకలో చోటు చేసుకుంది. కొందరు గోడలు దూకడం, చెట్ల కొమ్మలు పట్టుకుని ఊగుతూ కిందపడడం, నిల్చోని బైక్‌లను నడపడం, నదులు, సముద్రాలు, ఎత్తయిన ప్రదేశాల్లో నిలబడి టిక్‌టాక్ కోసం వీడియోలు చేస్తూ గల్లంతైన వారు కోకొల్లలు. తప్పు చేస్తే జైలుకే టిక్‌టాప్ యాప్ ద్వారా యువత భవిష్యత్ అంధకారంలోకి వెళ్తోంది. సమాజంపై కనీస అవగాహన లేని వారు చేసే వీడియోలు అప్లోడ్ చేసి కటకటాలపాలవుతున్నారు. తెలంగాణ ప్రజలు అక్కడి ప్రజాప్రతినిధులను దుర్భాషలాడుతూ టిక్‌టాక్‌లో వీడియో అప్లోడ్ చేసిన తిరువూర్‌కు చెందిన డిగ్రీ విద్యార్థిని ఇటీవల పోలీసులు అరెస్టు చేశారు. సామాజిక మాధ్యమాల్లో ఇతరుల ప్రతిష్టకు భంగం కల్గించినా, కామెంట్లు, వీడియోల రూపంలో అసభ్యకరంగా ప్రవర్తించినా దానిని నేరంగా పరిగణిస్తారు. ప్రస్తుతం అభివృద్ధి చెందిన టెక్నాలజీని అనుసరించి టిక్‌టాక్‌లో అసభ్యకరంగా పోస్టుచేసే వారిని గుర్తించడం పోలీసులకు పెద్ద కష్టమేమీ కాదు. ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది సెల్‌ఫోనే జీవితంగా భావిస్తున్న యువత ఆరోగ్యాన్ని చేతులారా నాశనం చేసుకుంటున్నారు. రాత్రంతా సామాజిక మాధ్యమాలకు అలవాటు పడి వివిధ ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. నిద్ర లేకపోవడం వల్ల మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ సమస్యతో బాధపడుతున్న వారు ఎక్కువగా విద్యార్థులు, యువత ఉన్నారు. – డాక్టర్ సుధాకర్‌రెడ్డి, మానసిక వైద్య నిపుణులు -
చదువుల తల్లికి కష్టమొచ్చింది!
లక్షల్లో ఫీజులుకట్టి చదివించినా అందరు పిల్లలు మంచి ఫలితాలను సాధించరు. కానీ కొందరు మాత్రం ఎన్ని ఇబ్బందులున్నా అద్భుత ఫలితాలను తమ సొంతం చేసుకుంటారు. అలాంటి కోవకు చెందిందే యమున. మొన్నటి డిగ్రీ ఫలితాల్లో 9.91 జీపీఏతో మంచి మార్కులు తెచ్చుకుంది. అయితే ఉన్నత చదువులకు ఆర్థిక ఇబ్బందులు తప్పలేదు. తల్లిదండ్రులు మృతిచెందారు. ముగ్గురు ఆడబిడ్డలే. ఓ సోదరికి వివాహమై భర్తతో ఉంది. మరో సోదరి కష్టంతో ఇప్పటిదాకా చదివింది యమున. అయితే ఉన్నత చదువులకు ఆర్థిక ఇబ్బందులు శాపంగా మారాయి. పలమనేరు: రామకుప్పం మండలం కవ్వంపల్లెకు చెందిన యమున పాఠశాల స్థాయి నుంచే బాగా చదువుతోంది. వీకోట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంపీసీ చదివి 920 మార్కులు సాధించింది. దీంతో వీకోటకు చెందిన నలంద డిగ్రీ కళాశాల యాజమాన్యం ఆ విద్యార్థికి కళాశాల ఫీజు లేకుండానే అడ్మిషన్ ఇచ్చారు. బీఎస్సీ కంప్యూటర్స్‌లో 9.91 మార్కులు సాధించి యూనివర్సిటీ టాపర్స్ జాబితాలో చోటుదక్కించుకుంది. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అవ్వాలనే లక్ష్యం శిరీష ఎంసీఏ చేసి సాఫ్ట్వేర్ ఇంజినీర్ కావాలనే లక్ష్యంగా నిర్దేశించుకుంది. అయితే కుటుంబ పరిస్థితులు, పేదరికం అవరోధంగా మారాయి. దీంతో ఇంటికే పరిమితమైంది. ఎంసీఏ చదివించేందుకు ఎవరైనా దాతలు స్పందిస్తే తన కలని సాకారం చేసుకుంటానంటోంది. ఉన్నత చదువులకు తప్పని ఆర్థిక ఇబ్బందులు యమున తండ్రి జయరామిరెడ్డి తొమ్మిదేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. కుటుంబానికి పెద్ద దిక్కు కోల్పోయినా ఆయన భార్య నాగరత్నమ్మ ముగ్గురు ఆడపిల్లలను కూలినాలి చేసి పోషించింది. వీరికి రెండెకరాల మెట్టపొలం మినహా మరే ఆధారం లేదు. పెద్దకుమార్తెకు ఇన్ని కష్టాల నడుమే వివాహం చేసింది.. రెండో కుమార్తె శిరీష డిగ్రీదాకా చదివి ఆపై ఆర్థిక సమస్యలతో చదువుకు స్వస్తి పలకాల్సి వచ్చింది. 9నెలల క్రితం తల్లి నాగరత్నమ్మ సైతం అనారోగ్యంతో మృతిచెందింది. దీంతో ఇంట్లో ఇరువురు ఆడపిల్లలు మాత్రం మిగిలారు. తన లక్ష్యాన్ని చెల్లెలు ద్వారా సాకారం చేసుకోవాలన్న సోదరి శిరీష పక్కనే ఉన్న చిన్నబల్దారు హైస్కూల్లో విద్యావలంటీర్‌గా పనిచేస్తూ కుటుంబానికి దిక్కుగా మారింది. అయితే అక్కడ వీవీలకిచ్చే వేతనం చాలక, అదీనూ నెలనెలా సక్రమంగా రాక ఇబ్బందులు తప్పలేదు. ఈ నేపథ్యంలో యమున ఉన్నత చదువులకు ఆర్థిక సమస్య వెంటాడుతోంది. -
డిగ్రీ యువతిపై హత్యాయత్నం
సాక్షి, విజయనగరం : డిగ్రీ యువతిపై ఓ యువకుడు హత్యాయత్నానికి పాల్పడ్డ సంఘటన శృంగవరపుకోట మండలం శివరామరాజు పేట గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు.. వేపాడు మండలం, ఆకుల సీతంపేట గ్రామానికి చేందిన జి. శిరీష డిగ్రీ చదువుతోంది. ఈ క్రమంలో నిన్న సాయంత్రం శిరీష శిమరామరాజు పేటలో ఉన్న తన మేనత్త ఇంటికి వచ్చింది. ఈ రోజు ఉదయం ఇంట్లో టీవీ చూస్తోన్న శిరీషపై హత్యాయత్నం జరిగింది. శిరీష స్వగ్రామం ఆకుల సీతంపేట గ్రామానికి చెందిన బంగారు పుల్లయ్య అనే యువకుడు శిరీష తన మేనత్త ఇంటికి వెళ్లిందని తెలుసుకుని అక్కడికి వెళ్లి ఆమెపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. బుధవారం ఉదయం శిరీష ఇంట్లో టీవీ చూస్తుండగా.. హఠాత్తుగా అక్కడకు వచ్చిన పుల్లయ్య శిరీష వేసుకున్న చున్నీని ఆమె మెడకు గట్టిగా బిగించి చంపేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో శిరీష ముక్కు నుంచి రక్తస్రావం జరిగి స్పృహతప్పి పడిపోయింది. దాంతో పుల్లయ్య అక్కడ నుంచి పరారయ్యాడు. అనుమానం వచ్చిన స్థానికులు ఇంట్లోకి వచ్చి చూడగా ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న శిరీష వారికి కనిపించింది. తక్షణమే బాధితురాలిని శృంగవరపుకోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు ఆమెకు ప్రథమ చికిత్ప అందించారు. ప్రాణాపాయం లేదని వెల్లడించారు. ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు పుల్లయ్య మీద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
పేట్రేగిన ప్రేమోన్మాదం
వరంగల్ క్రైం/ఎంజీఎం/మామునూరు: వరంగల్ నగరంలో పట్టపగలే ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తన ప్రేమను నిరాకరించిందన్న అక్కసుతో అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై తోటి డిగ్రీ విద్యార్థినిపై పెట్రోలు పోసి నిప్పంటించాడు. వరంగల్‌లో ఆ యువతికి అత్యవసర చికిత్సనందించినా.. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించారు. 70% గాయాల కారణంగా రవళి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు వెల్లడించారు. దాడికి పాల్పడిన యువకుడు సాయి అన్వేష్ ఘటన తర్వాత పారిపోగా.. కేయూ రోడ్డులోని గొల్లపల్లి పెట్రోల్ బంక్ వద్ద ఆయన్ను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన తోపుచర్ల పద్మ, సుధాకర్‌రావు దంపతుల కూతురు రవళి (22) హన్మకొండ రాంనగర్ ప్రాంతంలోని వాగ్దేవి డిగ్రీ కళాశాలలో బీఎస్సీ(ఎంఈసీఎస్) ఫైనలియర్ చదువుతోంది. కాలేజీకి 300 మీటర్ల దూరంలోని హాస్టల్లో ఉంటోంది. బుధవారం ఉదయం 9 గంటల సమయంలో రవళి హాస్టల్ నుంచి స్నేహితులతో కలిసి కళాశాలకు వెళ్తుండగా.. అదే కాలేజీలో బీకాం ఫైనలియర్ చదువుతున్న పెండ్యాల సాయి అన్వేష్ (24) ఆమెను అడ్డుకున్నాడు. ‘నన్ను ప్రేమించాలి’ అంటూ కొంతదూరం వెంటపడ్డాడు. ఆమె నిరాకరించడంతో పిడిగుద్దులు గుద్దాడు. కిందపడిపోయిన రవళిపై వెంట తెచ్చుకున్న పెట్రోలు పోసి అందరూ చూస్తుండగానే నిప్పంటించాడు. పారిపోయేందుకు ప్రయత్నిస్తూనే.. మంటల్లో కాలుతూ కేకలు పెడుతూ కుప్పకూలిపోయింది. పెట్రోలు పోస్తూ నిప్పంటించే సమయంలో రవళి స్నేహితులు అన్వేష్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. వారిని చంపుతానంటూ బెదిరించడంతో అందరూ భయపడిపోయారు. వాగ్దేవి హాస్టల్ నుంచి కళాశాలకు వెళ్లే దారిలో లలితారెడ్డి గర్ల్స్ హాస్టల్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రాణాపాయస్థితిలో రవళి రవళి కాలిన గాయాలతో కొట్టుకుంటుండగా తోటి విద్యార్థి«నులు ఫోన్ చేయడంతో 108 వచ్చింది. బాధితురాలిని 9.30 గంటలకు ఎంజీఎం ఆసుపత్రి అత్యవసర విభాగానికి తరలించారు. ఎంజీఎం పరిపాలనాధికారులు, అత్యవసర విభాగం వైద్యులు, ప్లాస్టిక్ సర్జన్ నిపుణులు హుటాహుటిన రవళికి వైద్యచికిత్సలు అందించారు. విద్యార్థిని 70–80% కాలిన గాయాలతో ప్రాణపాయస్థితిలో కొట్టుమిట్టాడుతోందని ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ తెలిపారు. ఆమెకు మెరుగైన వైద్యచికిత్సలు అవసరమని భావించి మధ్యాహ్నం 12 గంటల సమయంలో ప్రత్యేక వైద్య బృందం ఆధ్వర్యంలో హైదరాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో యశోద ఆసుపత్రికి చేరుకున్నారు. ప్రాణపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్న రవళికి యశోద ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై ప్రత్యేక వైద్య బృందం చికిత్సలు అందిస్తున్న ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. రవళి ముఖం, ఛాతి, కడుపు, చేతులు, వీపు, తొడల ప్రాంతంలో తీవ్రంగా కాలిపోగా, ఊపిరితిత్తుల్లోకి వెళ్లిన పొగ వల్ల శ్వాసకోశ ఇబ్బందులు ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. రవళికి ఫిజిషియన్, పల్మనాలజిస్టు, ప్లాస్టిక్ సర్జన్లతో కూడిన వైద్యబృందం చికిత్సలు అందిస్తున్నట్లు వెల్లడించారు. శోకసంద్రంగా ఎంజీఎం ఆసుపత్రి రవళిపై పెట్రోల్ దాడి జరిగిన విషయాన్ని తెలుసుకున్న కుటుంబసభ్యులు, బంధువులో, తోటి విద్యార్థినులు పెద్ద సంఖ్యలో ఎంజీఎం ఆసుపత్రి అత్యసర విభాగానికి చేరుకున్నారు. రవళిని పరిస్థితిని చూసినవారు దుఃఖాన్ని దిగమింగలేక బోరున విలపించారు. అప్పటివరకు తోటి స్నేహితులతో సంతోషంగా గడిపిన రవళి ప్రాణాపాయస్థితిలో ఎంజీఎం ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతూ ఉండడాన్ని జీర్ణించుకోలేకపోయారు. నా బిడ్డను పొట్టన పెట్టుకున్నాడు ‘నేను పొద్దున్నే బాయి కాడికి పోయిన. నా బిడ్డకు జ్వరం వచ్చిందని చెప్పిండ్రు. వెంటనే మా ఊరి నుంచి వరంగల్‌కు వచ్చిన. ఇక్కడికి వచ్చనాంక నా బిడ్డమీద పెట్రోలు పోసి నిప్పంటించినట్టు చెప్పిండ్రు. ఒక్కగానొక్క బిడ్డను అన్యాయంగా పొట్టనపెట్టుకున్నాడు’అని రవళి తండ్రి సుధాకర్ రోదించాడు. సజీవదహనం చేయాలి ‘మా బిడ్డ ఎవరి జోలికీ పోదు. అన్యాయంగా ఇంత దారుణం చేసిండు. ఇసోంటోళ్లకు కోర్టులు, జైలుశిక్షలు సరిపోవు. మా బిడ్డపై దాడి చేసినవాడిని సజీవదహనం చేయాలి. ప్రాణానికి ప్రాణమే సమాధానం కావాలి’అని రవళి కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్డుకునే లోపే నిప్పంటించాడు వాగ్దేవి కాలేజీ దగ్గర పని ఉంటే ఫ్రెండ్స్‌తో కలిసి నడుచుకుంటూ వెళ్తున్నాను. ఓ యువతిపై నిందితుడు పెట్రోలు పోస్తున్న విషయాన్ని గమనించాను. ముందుగా నీళ్లు కావచ్చనుకున్నా.. కానీ పెట్రోల్ వాసన రావడంతో ఏం చేస్తున్నవురా.. అనే లోపే అగిపుల్ల గీసి అమ్మాయిపై విసిరేసిండు. నేను ఒక్కసారిగా బండిని తన్నాను. వాడు కిందిపడిపోయాడు. ఆమెను కాపాడే ప్రయత్నం చేస్తున్న క్రమంలో వాడు పారిపోయాడు. – అన్వేష్, ప్రత్యక్ష సాక్షి ప్రేమ పేరుతో వేధింపులు సాయి అన్వేష్ స్వగ్రామం వరంగల్ రూరల్ జిల్లా వర్దన్నపేట మండలం చెన్నారం గ్రామం. తల్లిదండ్రులు పెండ్యాల సుజాత, దేవేందర్. సాయి అన్వేష్, రవళి సంగెం మండలం లోహితలోని కాకతీయ పాఠశాలలో కలిసి చదువుకున్నారు. ఇంటర్ చదువుతున్న సమయంలో వీరిమధ్య ప్రేమ వ్యవహారం నడిచినట్లు తెలిసింది. రవళి హన్మకొండలోని వాగ్దేవి కళాశాలలో డిగ్రీలో చేరితే అదే కళాశాలలో బీకాంలో సాయి అన్వేష్ చేరాడు. వీరిమధ్య కొనసాగిన ప్రేమ డిగ్రీలోకి వచ్చిన తర్వాత క్రమంగా తగ్గడం మొదలైంది. దీంతో రవళిపై అన్వేష్ కోపం పెంచుకున్నాడు. ప్రేమను కొనసాగించాల్సిందేనంటూ రవళిపై ఒత్తిడి తెచ్చాడు. చాలా సార్లు బెదిరించాడు కూడా. అన్వేష్ వేధింపులు ఎక్కువవడంతో.. రెండు నెలల క్రితం ఆమె తల్లిదండ్రులకు అసలు విషయం చెప్పింది. దీంతో రవళి తల్లిదండ్రులు సాయి అన్వేష్ తల్లిదండ్రులకు చెప్పి.. వారి గ్రామంలో పెద్ద మనుషుల సమక్షంలో అన్వేష్‌ను హెచ్చరించారు. దీంతో తాను ఇకపై రవళి జోలికి వెళ్లనంటూ అన్వేష్ లిఖితపూర్వకంగా మాటిచ్చాడు. అయితే తన ఊర్లో పరువు తీసిందనే కారణంతో.. కక్ష పెంచుకున్న అన్వేష్.. గతంలో వీరిద్దరూ కలిసి దిగిన ఫొటోలు చూపెట్టి బ్లాక్ మెయిల్ చేసినట్లు తెలిసింది. మరికొద్ది రోజుల్లో డిగ్రీ పూర్తవుతుంది, రవళి దూరమవుతుంది, తనకు దక్కని ప్రేమ మరొకరికి దక్కొద్దనే రవళిపై కక్ష పెంచుకున్నాడు. కొంతకాలంగా చెన్నారం వదిలి.. గీసుగొండ మండలం ధర్మారం గ్రామంలోని అమ్మమ్మ ఇంటి దగ్గరే ఉంటున్నాడు. బుధవారం ఉదయం హన్మకొండ రాంనగర్‌లోని వాగ్దేవి డిగ్రీ కళాశాల సమీపంలో పెట్రోల్‌తో మాటువేసి దారుణానికి పాల్పడ్డాడు. పోలీసుల అదుపులో నిందితుడు రవళిపై పెట్రోల్ దాడి చేసిన తర్వాత సాయి అన్వేష్ బైక్‌ను అక్కడే వదిలేసి పారిపోయాడు. కాసేపటి తర్వాత ములుగు రోడ్డు (కేయూ రోడ్డు)లోని గొల్లపల్లి పెట్రోల్ బంక్ వద్ద సాయి అన్వేష్‌ను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత అన్వేష్‌ను హన్మకొండలోని సుబేదారి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనతో చెన్నారంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఉన్మాదిని కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. ఘటన విషయం తెలియగానే.. సాయి అన్వేష్ తల్లిదండ్రులు ఇంటికి తాళం వేసి బంధువుల ఇళ్లకు వెళ్లినట్లు సమాచారం. విద్యార్థుల ధర్నా రవళిపై జరిగిన పెట్రోలు దాడి గురించి తెలుసుకున్న వాగ్దేవి కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో రోడ్డుపైకి వచ్చి రాస్తారోకో చేశారు. ఉన్మాదిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులను శాంతింపచేసేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. ఉన్మాదికి శిక్ష పడేవరకు కదిలబోమంటూ విద్యార్థులు పట్టుబట్టడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. వరంగల్ పోలీసు కమిషనర్ రవీందర్ మాట్లాడుతూ.. నిందితుడికి శిక్ష పడేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరైనా ఎక్కడైనా అమ్మాయిలపై వేధింపులకు పాల్పడితే.. వెంటనే సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలన్నారు. కఠినంగా శిక్షిస్తాం: ఎర్రబెల్లి రవళిపై హత్యాయత్నం చేసిన అన్వేష్‌కు కఠినంగా శిక్షపడేలా చర్యలు తీసుకుంటామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. బుధవారం సాయంత్రం సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రవళిని ఆయన పరామర్శించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అన్వేష్‌ను గతంలోనే పోలీసులు హెచ్చరించి వదలివేశారని, గ్రామస్తులు కూడా బెదిరించినా పద్దతి మార్చుకోలేదన్నారు. ఆ యువతికి అయ్యే వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని ఆ కుటుంబానికి అన్ని విధాలా సహకారం అందించేందకు సీఎం హామీ ఇచ్చారన్నారు. డాక్టర్లు కూడా ఆమెను కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారని చెప్పారు. రవళి తల్లి పద్మ మాట్లాడుతూ గతంలో పెద్దల సమక్షంలో నిందితున్ని కఠినంగా హెచ్చరించామని అయినా ప్రేమ పేరుతో వేధించాడని వాపోయారు. తనకు ఒక్కగానొక్క కూతురు జీవితం నాశనం చేసిన నిందితున్ని ఇక్కడే ఉరితీయాలని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. -
కొడుకు కాదు.. కర్కోటకుడు
కృష్ణరాజపురం/బెంగళూరు : దారితప్పుతున్నావంటూ మందలించిన తల్లిపై కన్న కుమారుడు విచక్షణారహితంగా దాడి చేసి హింసించిన ఘటన శనివారం చెన్నమ్మనకెరె అచ్చుకట్టె పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు... చెన్నమ్మనకెరె ప్రాంతానికి చెందిన జీవన్ (19) డిగ్రీ చదువుతున్నాడు. దురలవాట్లు, ప్రేమించిన యువతి, తోటి స్నేహితులు తనను హీరోగా భావించాలని ఊహించుకునేవాడు. ప్రేమాయణం సాగిస్తున్న యువతిని ఇంటికి తీసుకువచ్చి తల్లి ఎదుటే సిగిరెట్లు తాగేవాడు. కళాశాలకు వెళ్లకుండా ప్రియురాలితో షికార్లు, పార్టీలు చేసుకునేవాడు. కన్నకొడుకు తన కళ్ల ముందే నాశనమవుతుండడాన్ని తట్టుకోలేక దురలవాట్లు, పరిపక్వత లేని ప్రేమ వల్ల జీవితాన్ని, భవిష్యత్తును నాశనం చేసుకోవద్దంటూ కొడుకును మందలించింది. ఎన్ని వెధవ పనులు చేసినా పల్లెత్తు మాట అనని తల్లి మంచిమాటలు చెప్పగానే జీవన్‌లో దాగున్న రాక్షసుడు బయటకు వచ్చాడు. తనకే నీతులు చెబితే తగిన శాస్తి చేస్తానంటూ చీపురకట్టతో కన్నతల్లిని తీవ్రంగా కొట్టసాగాడు. వదిలేయమంటూ ఎంత వేడుకున్నా తనకు నీతులు చెబితే ఇలాగే ఉంటుందంటూ మరింత తీవ్రంగా కొడుతూ హింసించాడు. ఈ తతంగం మొత్తం జీవన్ కుటుంబ సభ్యులు మొబైల్లో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేయడంతో క్షణాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోలు ప్రసార మాధ్యమాల్లో కూడా ప్రసారం కావడంతో పోలీసులు సుమోటోగా స్వీకరించి జీవన్‌పై కేసు నమోదు చేసుకున్నారు. తన కొడుకు బారి నుంచి తనను రక్షించడంతో పాటు తన కొడుక్కి బుద్ధి వచ్చేలా చేయాలంటూ జీవన్ తల్లి చెన్నమ్మనకెరె అచ్చుకట్టె పోలీసులను కోరారు. -
‘మా కుమారుడ్ని విడిచిపెట్టండి’
శ్రీనగర్: కశ్మీర్‌కు చెందిన మరో యువకుడు ఉగ్రవాదుల్లో చేరాడు. గ్రేటర్ నోయిడాలోని శారద విశ్వవిద్యాలయంలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుకుంటున్న అహ్‌తెసామ్ బిలాల్ సోఫీ(17) ఇస్లామిక్‌స్టేట్ ఆఫ్ జమ్మూకశ్మీర్(ఐఎస్‌జేకే) ఉగ్రసంస్థలో చేరాడు. ఐఎస్ జెండా ముందు బిలాల్ దిగిన ఫొటో ప్రస్తుతం ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. శ్రీనగర్‌కు చెందిన సోఫీ నోయిడాలో చదువుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఢిల్లీకి వెళ్లేందుకు వర్సిటీ అధికారుల నుంచి అనుమతి తీసుకుని అక్టోబర్ 28న వర్సిటీ నుంచి బయలుదేరిన సోఫీ అదృశ్యమయ్యాడు. దీంతో కుటుంబసభ్యులు నోయిడాతో పాటు శ్రీనగర్‌లోని ఖన్యార్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమ కుమారుడిని దయచేసి ఇంటికి పంపాలని ఉగ్రవాదులను వేడుకుంటూ సోఫీ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సోఫీ తండ్రి బిలాల్ ఓ వీడియోలో ఉగ్రవాదులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘మా మీద దయ చూపండి. దయచేసి నా కుమారుడిని ఇంటికి పంపండి. మా మొత్తం కుటుంబంలో ఏకైక మగ సంతానం అతడే. సోఫీ.. మన కుటుంబంలోని 12 మందికి నువ్వే దిక్కు. గత రెండేళ్లలో మన కుటుంబంలో నలుగురిని పోగొట్టుకున్న సంగతి మర్చిపోయావా?’ అని అన్నారు. ఇంటికి రావాల్సిందిగా తల్లి సైతం కొడుకును వీడియోలో కోరింది. -
‘నిజంగా నీకు ధైర్యం ఉంటే చచ్చిపో’
బెంగళూరు : ఒకప్పుడు ‘నువ్వు లేకపోతే జీవితమే లేదు’ అన్నవాడు.. ఇప్పుడు ‘నువ్వు చచ్చిపో.. నేను మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను’ అన్నాడు. ‘నీకు నిజంగా ధైర్యం ఉంటే చచ్చిపో’ అంటూ ప్రేమించిన యువతికి సవాల్ విసిరాడు. ప్రేమించినవాడే చచ్చిపో అనడాన్ని తట్టుకోలేని సదరు యువతి విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. వివరాలు.. బెంగళూరుకు చెందిన దివ్య ఒక ప్రైవేట్ కాలేజ్‌లో డిగ్రి చదువుతోంది. ఈ క్రమంలో హరిష్ అనే యువకుడు దివ్యను ప్రేమిస్తున్నానంటూ ఆమె జీవితంలోకి వచ్చాడు. తమ ప్రేమను పెద్దలు ఒప్పుకోరని భావించిన దివ్య - హరీష్‌లు నాలుగు నెలల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. అనంతరం దివ్య తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు. ఈ క్రమంలో దివ్య తనను వివాహం చేసుకోవాల్సిందిగా హరీష్ మీద ఒత్తిడి తీసుకొచ్చింది. దివ్యను వదిలించుకోవాలని భావిస్తోన్న హరీష్ 15 లక్షల రూపాయలు ఇస్తే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఒక వేళ తాను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటూ దివ్యను బెదిరించాడు. అతని మాటలకు భయపడిన దివ్య అలా చేయవద్దంటూ వేడుకుంది. ఇలా వీరిద్దరి మధ్య సాగిన సంభాషణల్లో హరీష్ ‘నువ్వు చనిపోతే నేను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాన’ని మెసేజ్ చేశాడు. తర్వాత ‘నీకు నిజంగా ధైర్యం ఉంటే చచ్చిపో’ అంటూ మరో సందేశం పంపించాడు. ప్రేమించిన వాడే చావమనడంతో విరక్తి చెందిన దివ్య విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. దివ్య ఆత్మహత్య విషయం తెలుసుకున్న హరీష్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. దివ్య తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేస్ నమోదు చేసిన పోలీసులు హరీష్ కోసం గాలిస్తున్నారు. -
కల చెదిరింది.. కన్నీరు మిగిలింది..!
విధి వక్రీకరించింది. బ్యాంకు ఉద్యోగమే లక్ష్యంగా పట్టుదలతో చదువుతున్న ఆ యువకుడిని డెంగీ జ్వరం రూపంలో మృత్యువు కబలించింది. కూలీనాలీ చేస్తూ చదివిస్తున్న తల్లిదండ్రులకు గర్భశోకం మిగిల్చింది. ఈ విషాద ఘటన రేగిడి మండలం చినశిర్లాం గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. రేగిడి : మండలంలోని చినశిర్లాం గ్రామానికి చెందిన వజ్జిపర్తి తిరుపతిరావు(20) అనే డిగ్రీ విద్యార్థి డెంగీ జ్వరంతో మృత్యుఒడికి చేరాడు. వారం రోజులుగా జ్వరం రావడంతో తల్లిదండ్రులు రాజాంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులుల సూచనలు మేరకు విశాఖలోని ఓ ప్రైవేటు ఆకస్పత్రికి తరలించి చికిత్సను అందించారు. ఓ వైపు చికిత్స అందించగా..మరోవైపు యువకుడు ప్లేట్లేట్స్ పడిపోయాయి. డెంగీ జ్వరం లక్షణాలతో తిరుపతిరావు బాధపడుతున్నట్లు అక్కడ వైద్యులు తెలిపారని, బంధువులు వద్ద అప్పు చేసి మెరుగైన వైద్యం అందిస్తుండగానే కుమారుడు మృత్యువాత పడ్డాడని తల్లిదండ్రులు బోరును విలపిస్తున్నారు. రెక్కలకష్టంతో చదివిస్తుండగా.... తిరుపతిరావు తల్లిదండ్రులు బుచ్చమ్మ, గురువులు రజక వృత్తిపై ఆధారపడి బతుకుతున్నారు. ఓ వైపు రైతు పనులు చేస్తూ మరో వైపు కుల వృత్తి చేసుకుంటూ వచ్చిన అరకొర సొమ్ముతో తిరుపతిరావును, అతని సోదరుడు భవానీని చదివిస్తున్నారు. తిరుపతిరావు చదువులో చురుగ్గా ఉండటం, ఇంతలోనే మృత్యువు ఒడికి చేరడం ఆ కుటుంబాన్ని విషాదంలో నింపింది. వారం రోజులు క్రితం వరకు తమతో తిరిగే స్నేహితుడు ఇక లేడని తెలుసుకున్న తోటి స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చేతికందికొచ్చే కొడుకు మృతిచెందడంతో తండ్రి గురువులు సొమ్మసిల్లిపడిపోయాడు. ‘బ్యాంకు ఉద్యోగం చేసి మిమ్మల్ని పోషిస్తానన్నావు..నాన్నా.. తిరుపతి....లే..’ అంటూ ఆ తండ్రి విలపించడం అందరినీ కంటతడిపెట్టించింది. ‘అన్నయ్యా..బస్సులు తక్కువుగా ఉన్నాయి లే అన్నయ్యా..వేగంగా వెళదాం..’ అంటూ తిరుపతిరావు సోదరుడు భవాని మృతదేహంపై పడి రోదించడం అక్కడివారిని కలచివేసింది. బ్యాంకు ఉద్యోగమే లక్ష్యంగా.. డెంగీ జ్వరంతో మృతిచెందిన తిరుపతిరావు రాజాంలోని ఓ ప్రయివేటు కళాశాలలో బీకాం తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. ఓ వైపు కాంపిటేటివ్ పరీక్షలకు చదువుతుండగా, మరో వైపు బ్యాంకు ఉద్యోగాన్ని లక్ష్యంగా పెట్టుకుంటున్నట్లు తిరుపతిరావు స్నేహితులు విలేకరులకు తెలిపారు. తిరుపతిరావు మృతిపట్ల రాజాంలోని ఎస్‌ఎస్‌ఎన్‌డిగ్రీ కళాశాలకు సెలవు ప్రకటించారు. కళాశాల యాజమాన్యంతోపాటు స్నేహితులు మృతదేహం వద్దకు చేరుకొని నివాళులు అర్పించారు. -
నడిరోడ్డుపై చెప్పుతో కొట్టిన విద్యార్థిని..
బరంపురం: మహిళా రక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా రోడ్‌సైడ్ రోమియోల అగడాలకు అడ్డులేకుండా పోతోంది. ఇందుకు బరంపురం నగరమే ఉదాహరణగా నిలిచిందనడానికి మూడు రోజుల క్రితం నగరంలోని గాంధీనగర్ మెయిన్ రోడ్లో జరిగిన సంఘటన రుజువు చేస్తోంది. మూడు రోజుల క్రితం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి గాంధీనగర్ సాయి కాంప్లెక్స్ దగ్గర మహామాయి మహిళా కళాశాలకు చెందిన డిగ్రీ విద్యార్థిని కళాశాలకు వెళ్తున్న సమయంలో రోడ్‌సైడ్ రోమియో తీవ్రంగా కామెంట్ చేయడంతో బాధిత విద్యార్థిని తీవ్రంగా ప్రతిఘటించి తన చెప్పు తీసి రోమియో చొక్కా పట్టుకుని చెంపలు వాయించింది. ఈ సంఘటనపై స్థానికులు సెల్ఫోన్లలో ఫొటోలు, వీడియోలు చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన కొద్ది నిమిషాల్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేగింది. మరి కొన్ని చానల్స్ రోజంతా పదే పదే చూపించడంతో రాష్ట్ర హోం శాఖ తీవ్ర స్థాయిలో స్పందించి ంది. ఈ నేపథ్యంలో వెంటనే రోడ్‌సైడ్ రోమి యోను అరెస్ట్ చేయాలని ఇటువంటి రోమియాలపై గట్టి చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను ఆదేశించింది. ఈ మేరకు బరంపురం ఎస్పీ పినాకి మిశ్రా టౌన్ పోలీసులను ఆదేశించగా శనివారం టౌన్ పోలీసులు జుమోటోగా రోడ్‌సైడ్ రోమియోను అరెస్ట్ చేసి సాయంత్రం ఎస్డీజేఎం కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. -
తల్లి మందలించిందని.. డిగ్రీ విద్యార్ధిని ఆత్మహత్య
బన్సీలాల్‌పేట్: తల్లి మందలించిందని మనస్తాపానికి లోనైన ఓ విద్యార్ధిని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శుక్రవారం గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అడ్మిన్ ఎస్.ఐ రమేష్ కథనం ప్రకారం.... బన్సీలాల్‌పేట్ ప్రాంతానికి చెందిన శివరాజ్, దుర్గ దంపతుల కుమార్తె శాలిని(20). గురువారం రాత్రి పని విషయంలో తల్లి దుర్గ కుమార్తెను మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన శాలిని ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దేవాలయానికి వెళ్లిన వచ్చిన శివరాజ్ తలుపు కొట్టినా తెరవకపోవడంతో కిటికీ లోనుంచి చూడగా శాలిని ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. స్ధానికుల సహాయంతో తలుపులు పగులగొట్టి ఆమెను కిందికి దించగా అప్పటికే మృతి చెందింది. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
విధి వక్రించి.. కళ తప్పింది
పశ్చిమ గోదావరి, భీమవరం టౌన్: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత చెందిన ఆనందం.. డిగ్రీలో చేరాలన్న ఉత్సాహంతో ఉన్న ఆ విద్యార్థినిని విధి చిన్నచూపు చూసింది. సోడా గ్యాస్ సిలిండర్ రూపంలో ప్రమాదం వెంటాడింది. ఇల్లు, కళాశాల తప్ప మరో లోకం తెలియని ఆ విద్యార్థిని గత ఐదు రోజులుగా భీమవరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి ఎమర్జెన్సీ వార్డులో అపస్మారక స్థితిలో ఉండడం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. స్థానిక వైఎస్సార్ కాలనీ ప్రాంతంలో ఈనెల సోడా గ్యాస్ సిలిండర్ లీకై ఒత్తిడితో ఇంటి గోడను పగలగొట్టుకుని లోపలికి దూసుకువెళ్లిన ఘటనలో విద్యార్థిని చిట్టినీడి సూర్యకళ తీవ్రంగా గాయపడింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సూర్యకళ ఆరోగ్య పరిస్థితిని ఈ ప్రాంత వాసులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన ఆమె కోసం అందరి హృదయాలు తల్లడిల్లుతున్నాయి. తల్లి నాగలక్ష్మి ఇడ్లీ అమ్ముతూ, తండ్రి వెంకట శివకుమార్ కాయకష్టం చేసుకుంటూ తమ ఇద్దరు ఆడపిల్లలు సూర్యకళ, లక్ష్మీ సాయిదుర్గను చదివిస్తున్నారు. సూర్యకళ ఇంటర్ పాసై డిగ్రీలో చేరేందుకు ఎంతో ఆశగా ఎదురుచూస్తోంది. డిగ్రీ పాసై చిన్న ఉద్యోగం సంపాదించి కుటుంబానికి అండగా నిలవాలనుకున్న ఆమెను విధి ప్రమాదంలోకి నెట్టేసింది. ప్రమాదం నుంచి సూర్యకళ చెల్లెలు లక్ష్మీ సాయిదుర్గ అదృష్టవశాత్తూ త్రుటిలో తప్పించుకోగలిగింది. టీవీ చూస్తూ చెల్లెలితో పై చదువుల గురించి చర్చించుకుంటున్న సంతోష సమయంలో ఈ ప్రమాదం జరగడం ఆ కుటుంబాన్ని కలిచివేస్తోంది. ఇద్దరు ఆడపిల్లలూ చదువుకుంటూనే తల్లికి చేదోడు వాదోడుగా ఉండేవారు. రెక్కాడితేగాని డొక్కాడని ఆ తల్లిదండ్రులు ఆస్పత్రిలో ఉన్న తమ పెద్దకుమార్తెను చూసి దిక్కుతోచని స్థితిలో కన్నీటి పర్యంతమవుతున్నారు. మనసున్న మారాజులు తమవంతు ఆర్థిక సహాయం చేస్తున్నారు. మరికొందరు విరాళాలు సేకరించి ఇస్తున్నారు. ప్రమాదంలో సూర్యకళ నడుము కింది భాగం బాగా దెబ్బతినడంతో వైద్యం నిమిత్తం రూ.10 లక్షలుపైనే వ్యయమవుతుందని తెలుస్తోంది. దెబ్బతిన్న భాగంలో తొలి ఆపరేషన్‌కు వైద్యులు ఎంతో శ్రమించారు. మానవతా దృక్పథంతో వైద్యులు ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకుని పూర్తి స్థాయిలో సూర్యకళకు నయం చేసేందుకు శ్రద్ధ చూపుతున్నారు. వైద్యానికి పెద్ద మొత్తం అవసరం కావడంతో ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందితే ఆ నిరుపేద కుటుంబానికి కొంత ఊరడింపు కలుగుతుంది. సహాయం చేయాలనుకునే వారి కోసం... బాధితురాలి తల్లి చిట్టినీడి నాగలక్ష్మి బ్యాంకు అకౌంట్ నంబర్ 004610100038569 ఆంధ్రా బ్యాంకు ఐఎఫ్ఎస్ కోడ్: ANDB0000046 బాధితురాలి బాబాయ్ జనార్దన్ ఫోన్ నంబర్లు 9177733995 7799024033 -
ఫీజు డబ్బు కోసం చోరీ
కర్నూలు: డిగ్రీ చదువుతున్న ఓ విద్యార్థి టర్మ్ ఫీజు డబ్బు కోసం చోరీకి పాల్పడి పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన కర్నూలు ఆర్టీసీ బస్టాండ్‌లో చోటుచేసుకుంది. నాల్గో పట్టణ పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కోడుమూరు మండలం అమడగుండ్ల గ్రామానికి చెందిన పవన్ కుమార్..కర్నూలులోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీఎస్సీ(మ్యాథ్స్) ఫైనలియర్ చదువుతున్నాడు. ప్రతి రోజూ గ్రామం నుంచి కర్నూలు వచ్చేవాడు. ఈ నెల 2వ తేదీ సాయంత్రం.. ఏపీఎస్పీ పదో బెటాలియన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ నర్సింహారెడ్డి భార్య మాధవి కర్నూలు ఆర్టీసీ బస్టాండులో బస్సు ఎక్కుతుండగా..ఆమె మెడలోని మూడు తులాల గొలుసును పవన్ కుమార్ చోరీ చేశాడు. అనుమానంపై పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారించారు. టర్మ్ ఫీజు చెల్లించేందుకు డబ్బు లేకపోవడంతో చోరీకి పాల్పడినట్లు అంగీకరించాడు. దీంతో సదరు విద్యార్థిపై కేసు నమోదు చేసి.. అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. -
రైలు కిందపడి విద్యార్థిని ఆత్మహత్య
గంపలగూడెం(తిరువూరు): మండలంలోని తునికిపాడుకు చెందిన డిగ్రీ విద్యార్థిని రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఇక్కడ సమీపంలోని తెలంగాణా రాష్ట్రం మధిర రైల్వేస్టేషన్ సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు, ప్రత్యక్షసాక్షులు తెలిపిన సమాచారం ప్రకారం... గంపలగూడెం మండలం తునికిపాడు గ్రామానికి చెందిన బుర్రి ధనలక్ష్మి(19)మధిరలోని ఒక ప్రైవేటు కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతుంది. మద్యానికి బానిసైన తండ్రి నర్సింహారావు గురువారం రాత్రి మద్యం తాగి కుమార్తెతో ఘర్షణకు దిగాడు. ఉదయాన్నే పరీక్షరాసేందుకు మధిరకు బయలుదేరి వెళ్లింది. మనస్తాపంతో ఉన్న ఆమె మధ్యాహ్నం 2గంటలకు పరీక్ష అయినప్పటికీ ముందుగానే మధిరకు చేరుకుని ఖమ్మం నుంచి విజయవాడ వైపు వెళుతున్న పుష్పుల్ రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడింది. రైల్వే హెడ్‌కానిస్టేబుల్ తుమ్మల బాలస్వామి కేసు నమోదుచేసి విచారిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మధిర ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
రోకలి బండతో కొట్టి చంపేశారు
వైఎస్ఆర్ జిల్లా, ఖాజీపేట : ఖాజీపేట మండలం బుడ్డాయపల్లెకు చెందిన విజయకుమార్ అనే డిగ్రీ విద్యార్థి హత్య కేసులో వాస్తవాలు ఒక్కొక్కటీ వెలుగు చూస్తున్నాయి. విద్యార్థిని రోకలిబడెతో కొట్టి హతమార్చి.. కారులో తీసుకెళ్లి రైల్వే ట్రాక్‌పై పడేసినట్లు తెలుస్తోంది. బుడ్డాయపల్లె గ్రామానికి చెందిన విజయకుమార్ అలియాస్ సిసింద్రి ఖాజీపేట లోని సాహిత్య డిగ్రీ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. ఇంటికి దగ్గరలో ఉన్న ఒక విద్యార్థినితో పరిచయం పెరిగింది. అది కాస్తా ప్రేమగా మారింది. రెండేళ్లుగా ఈ వ్యవహారం నడుస్తుండేది. ఈ విషయం అమ్మాయి కుటుంబీకులకు తెలియడంతో వారు పలుమార్లు అబ్బాయిని మందలించడంతో పాటు దాడికి కూడా పాల్పడినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. అయినా వీరిలో ఎలాంటి మార్పు లేక పోవడంతో విజయకుమార్‌ను హతమార్చాలని నిర్ణయించినట్లు సమాచారం. రోకలి బండతో కొట్టి చంపారు.. గ్రామస్తులు, విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు.. విజయకుమార్ శనివారం రాత్రి ఇంటిలో భోజనం చేశాడు. తరువాత సెల్ఫోన్లో మాట్లాడుతూ ఇంటి మిద్దె పైకి వెళ్లి పడుకున్నాడు. అదే రోజు రాత్రి అతను ప్రేమిస్తున్న అమ్మాయిని కలిసేందుకు రావాల్సిందిగా ఆమె కుటుంబీకులు విజయ్‌కి సమాచారం అందించారు. ఇంటి నుంచి బయటకు వచ్చిన విద్యార్థిని సాంబశివారెడ్డి, మహేశ్వర్‌రెడ్డి అనే వ్యక్తులు గ్రామంలోని స్కూల్ వెనుక భాగంలోకి తీసుకెళ్లారు. అక్కడ రోకలి బండ తీసుకుని తలపై కొట్టడంతో మృతి చెందాడు. ఆ తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు మృతదేహాన్ని ఒక సంచి పట్టలో చుట్టి కారులో తీసుకుని కడప టోల్గేట్ ప్లాజా మీదుగా కమలాపురం మండలంలోని గంగాయపల్లె వరకు తీసుకెళ్లి రైల్వే ట్రాక్ పై పడేశారు. మృతదేహం పై నుంచి రైలు వెళ్లడంతో శరీరం రెండు భాగాలుగా విడిపోయింది. దీంతో అక్కడ నుంచి వారు వెల్లిపోయారు. అయితే ఇందులో విజయ్‌కి ఎవరైనా ఫోన్ చేస్తే వెళ్లాడా లేక ఎవరైనా వచ్చి బయటకు తీసుకెళ్లారా అనేది తేలాల్సి ఉంది. అలాగే హత్య జరిగింది పేరారెడ్డికొట్టాలు స్కూల్ వెనుక భాగంలో నేనా లేక మరెక్కడైనా జరిగిందా అన్నది పోలీసు విచారణలో బయటకు రావాల్సి ఉంది. అయితే ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు సరిగా స్పందించలేదంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ జాతీయ రహదారిపై ధర్నా కూడా చేపట్టిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో పోలీసులు ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమై కేసును వేగవంతం చేశారు. పోలీసుల చేతికి పూర్తి ఆధారాలు విజయ్ మృతికి సంబంధించి పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. ఇప్పటికే ఇద్దరు అనుమానితుల సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని కాల్‌డేటాను పరిశీలించారు. అలాగే ప్రేమ లేఖలతోపాటు, మెమొరీ కార్డు తదితర ఆధారాలు లభ్యమైనట్లు తెలుస్తోంది. హత్య కేసు విచారణ వేగవంతం విద్యార్థి హత్య కేసులో జిల్లా ఎస్పీ బాబూజీ అట్టాడ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. రైల్వే పోలీసుల నుంచి బుధవారం కేసుకు సంబంధించిన ఫైల్ పోలీసుల చేతికి వచ్చింది.. అలాగే మైదుకూరు డీఎస్పీ శ్రీనివాసులు, రూరల్ సీఐ హనుమంతునాయక్‌లు అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నారు. అమ్మాయి తరుపున వారు ఎక్కడ ఉన్నారు అనే విషయాలను కూడా గుర్తించారు. వారు ఉన్న ప్రదేశానికి వెళ్లి అక్కడ వారిని అదుపులోకి తీసుకుని ఎలా హత్య చేశారనే విషయాన్ని రాబడుతున్నట్లు తెలిసింది. హత్య సంఘటనలో ఎంత మంది పాల్గొన్నారు. ఎవరి ప్రమేయం ఉంది అనే సమాచారాన్ని ఇప్పటికే సేకరించారు. అరెస్టుకు రంగం సిద్ధం ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో విచారించి అన్ని ఆధారాలు సేకరించారు. తామే హత్య చేసినట్లు అనుమానితులు పోలీసుల ఎదుట అంగీకరించడంతో వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు స్పష్టమవుతోంది. -
తండ్రి మందలించాడని..
గొల్లపల్లి(వెల్గటూర్): చదువుకోమని తండ్రి మందలించడంతో మండలంలోని కిషన్‌రావుపేటకు చెందిన కీకల శరణ్య అనే డిగ్రీ విద్యార్థిని శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది. కీకల చంద్రయ్య కూతురు శరణ్య ధర్మారం మండలంలోని ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో చదువుతుంది. కొద్ది రోజుల క్రితం చదువు విషయమై తండ్రితో వాగ్వాదం జరిగింది. దీంతో కలత చెందిన శరణ్య ఈనెల 27న వేకువ జామున ఉరివేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన తల్లిదండ్రులు వెంటనే కరీంనగర్‌కు తరలించారు. ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. తండ్రి చంద్రయ్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తల్లిదండ్రులు మందలించారని...
సాక్షి, కొమురవెల్లి: నేడు తల్లిదండ్రులు పిల్లలని ఏమాత్రం అనలేని పరిస్థితి. చిన్న మాట అన్నాకూడా ఆత్మహత్యలకు పాల్పడి నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు. తాజాగా తల్లిదండ్రులు మందలించారని ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండల కేంద్రంలో జరిగింది. జనాదికుంట కుమార్‌కు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. రెండో కుమారుడు ప్రవీణ్(19) డిగ్రీ ఫైనలియర్ చదువుతున్నాడు. గత నాలుగైదు రోజులుగా కాలేజీకి వెళ్లకుండా ఇంటి దగ్గర చిల్లర తిరుగుళ్లు తిరుగుతుండడంతో వ్యవసాయ బావి వద్దకు పోయి పనిచేయొచ్చు కదా అంటూ తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపం చెందిన ప్రవీణ్ బావి వద్దకు వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో తల్లిదండ్రలు మందలించడమే తమ తప్పయిందంటూ రోదించారు. -
డిగ్రీ విద్యార్థినిపై లైంగిక దాడి
► విద్యార్థినిపై నలుగురు డిగ్రీ విద్యార్థుల లైంగిక దాడి ► వీరంతా సహాధ్యాయులే ► సెల్ ఫోన్లో వీడియో చితీక్రరణ ► యూట్యూబ్‌లో పెడతామని బెదిరింపులు ► బాధితురాలి ఫిర్యాదుతో నిర్భయ కేసు నమోదు ఖమ్మంక్రైం: ఖమ్మంలో దారుణం జరిగింది. డిగ్రీ విద్యార్థినిపై ఆమె సహాధ్యాయులైన ముగ్గురు విద్యార్థులు లైంగిక దాడి చేశారు. దానిని సెల్ఫోన్లో వీడియో తీశారు. యూట్యూబ్‌లో పెడతామని బెదిరించారు. ఆమె ఫిర్యాదుతో ఖమ్మం త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. త్రీ టౌన్ పోలీసులు తెలిపిన వివరాలు... నగరంలోని ట్రంక్ రోడ్డులోగల ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో ఓ విద్యార్థిని డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అఖిల్, రాధాకృష్ణ, కార్తీక్, ఉదయ్... ఈ నలుగురూ ఆమె సహాధ్యాయులు. ఆమె అఖిల్‌తో చనువుగా ఉండేది. ఈ నెల 1న తన పుట్టిన రోజని, తన గదిలో బర్త్‌డే పార్టీ ఉంటుందని ఆమెకు, మిగతా ముగ్గురికి రాధాకృష్ణ చెప్పాడు. పార్టీకి రావాల్సిందని ఆహ్వానించాడు. వారందరూ కలిసి త్రీ టౌన్ ప్రాంతంలోగల పీఎస్ఆర్ రోడ్డులోని రాధాకృష్ణ గదికి వెళ్లారు. బర్త్‌డే పార్టీ పూర్తయిన తర్వాత ఆమెపై రాధాకృష్ణ, అఖిల్, ఉదయ్ లైంగిక దాడి చేశారు. ఆమె ఎంతగా వారించినా, ఎదిరించినా, బతిమిలాడినా వినలేదు. అరిస్తే అక్కడికక్కడే చంపుతామని బెదిరించారు. తన స్నేహితులు లైంగిక దాడి చేస్తుండడాన్ని కార్తీక్ తన సెల్‌ఫోన్‌తో వీడియో తీశాడు. ఆ తరువాత, అతడు కూడా లైంగిక దాడి చేశాడు. ఆ తరువాత, ఆమె రోదిస్తూ ఇంటికి వెళ్లింది. రెండు రోజులపాటు ముభావంగా ఉంది. ఏదో తేడాగా ఉండడంతో తల్లికి అనుమానమొచ్చింది. ధైర్యం చెప్పి, అనునయంగా అడిగింది. ఆ విద్యార్థిని రోదిస్తూ, ఆమెపై నలుగురు స్నేహితులు అత్యాచారం చేసి దాన్ని వీడియో తీసి.. రమ్మన్నప్పుడల్లా వచ్చి తమ కోర్కె తీర్చాలంటూ బెదిరించడం మొదలుపెట్టారని జరిగినదంతా వివరించింది. ఆ తల్లి, తన కూతురితో కలిసి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో సోమవారం సాయంత్రం ఫిర్యాదు చేసింది. ‘లైంగిక దాడి’, ‘నిర్భయ’ కేసులను ఆ నలుగురు డిగ్రీ విద్యార్థులపై సీఐ వెంకన్నబాబు నమోదు చేశారు. వీరిలో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు, మరొకడు పరారీలో ఉన్నట్టు తెలిసింది. -
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్యాయత్నం
తేలని‘ఫలితం’ ఎస్కేయూ: రాయదుర్గానికి చెందిన ఓ యువకుడు అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో బీఎస్సీ చదివాడు. పరీక్షల్లో ఫెయిల్ కావడంతో ఎస్కేయూలోని పరీక్షల విభాగంలో సప్లిమెంటరీ పరీక్ష ఫీజు కట్టి మరోసారి పరీక్షలు రాశాడు. 2016 నవంబర్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యాడు. కానీ ఎస్కేయూ పరీక్షల విభాగం అధికారులు మాత్రం ఫలితాలు ప్రకటించలేదు. కారణం ఆరా తీస్తే కామన్ సర్వీసెస్ ఫీజు చెల్లించలేదన్న సమాధానం వచ్చింది. వాస్తవానికి అతను ఏటా రూ. 1,050 యూనివర్సిటీ కామన్ సర్వీసెస్ ఫీజును అనంతపురం ఆర్ట్స్ కళాశాలకు చెల్లించాడు. కానీ వారు వర్సిటీకి చెల్లించకపోవడంతో డిగ్రీ ఫలితాలు అనౌన్స్డ్ లేటర్ కింద చూపారు. బకాయిలు చెల్లించేంతవరకు ఫలితాలు, మార్క్స్ కార్డులు జారీ చేసేది లేదని వర్సిటీ పరీక్షల విభాగం అధికారులు స్పష్టం చేశారు. ఆరునెలల పాటు వర్సిటీ చుట్టూ తిరిగిన యువకుడు బుధవారం నేరుగా అనంతపురం ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఛాంబర్ వద్దకు చేరుకొని ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యా యత్నం చేశాడు. అప్రమత్తమైన ఆర్ట్స్ కళాశాల సిబ్బంది అతన్ని అడ్డుకున్నారు. వెంటనే ఆర్ట్స్ కళాశాల జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు ఎస్కేయూ పరీక్షల విభాగం వద్దకు చేరుకుని బాధిత విద్యార్థికి న్యాయం చేసేందుకు పరిస్థితి చక్కబెట్టే ప్రయత్నం చేశారు. ఇలా ఈ యువకుడు ఒక్కడే కాదు.. జిల్లాలోని డిగ్రీ కళాశాలల వైఖరితో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు ఎంతో మంది ఉన్నారని తెలుస్తోంది. విద్యార్థితో కట్టించుకొన్నప్పటికీ.. డిగ్రీ కోర్సులు చదువుతున్న ప్రతి విద్యార్థితోనూ .. యూసీఎస్ ఫీజులు కట్టించుకుంటున్నప్పటికీ అనుబంధ డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు సకాలంలో వర్సిటీకి ఫీజులు చెల్లించిన దాఖలాలు లేవు. దీంతో విద్యార్థుల ఫలితాలు నిలుపుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపిస్తోంది. వర్సిటీ నిర్ధారించిన మొత్తం కంటే అదనంగా ఫీజులు కట్టించుకుంటున్నప్పటికీ .. వర్సిటీకి చెల్లించడంలో తాత్సారం వహిస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. -
డిగ్రీ విద్యార్థిని అనుమానాస్పద మృతి
-
డిగ్రీ విద్యార్థిని అనుమానాస్పద మృతి
సిద్ధిపేట: డిగ్రీ విద్యార్థిని సంతోషిణి అనుమానాస్పద మృతిపై ఎలాంటి అపోహలకు తావులేదని, నిస్పక్షపాతంగా విచారణ జరుపుతున్నామని సిద్ధిపేట పోలీసు కమిషనర్ శివకుమార్ తెలిపారు. వైద్యబృందం పర్యవేక్షణలో పోస్టుమార్టం నిర్వహించామని చెప్పారు. మృతురాలి ఒంటిపై పైకి కనిపించే గాయాలు లేవని, పోస్టుమార్టం నివేదికతో పాటు ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ వస్తేనే అసలు విషయం తెలుస్తుందన్నారు. ఈ కేసులో ఇప్పటికే 16 మందిని విచారించినట్టు వెల్లడించారు. ఎవరికి ఎలాంటి సందేశాలు, సమాచారం ఉన్నా ఏసీపీకి తెలియజేయవచ్చని చెప్పారు. మరోవైపు పోలీసుల విచారణపై తమకు నమ్మకం లేదని సిరిసినగండ్ల గ్రామస్తులు పేర్కొన్నారు. అత్యాచారం చేసి చంపేసారని ఆరోపించారు. సంతోషిణి మృతికి పద్మావతి అనే మహిళ ఆమె కుమారుడు కారణమని అంటున్నారు. వీరిపై నిర్భయ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. -
ట్రాక్టర్ బోల్తా.. డిగ్రీ విద్యార్థి దుర్మరణం
కళ్లను దానం చేసిన కుటుంబ సభ్యులు బనగానపల్లె రూరల్ : నాపరాళ్ల ట్రాక్టర్ బోల్తా పడడంతో డిగ్రీ విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన నందివర్గం పోలీసుస్టేషన్ పరిధిలోని రామకృష్ణాపురం అడ్డ రోడ్డు బుధవారం చోటుచేసుకుంది. రామకృష్ణాపురం గ్రామానికి చెందిన బుడిగి మద్దిలేటి, సుభద్ర దంపతులకు మోహన్‌కృష్ణ (22), హరికృష్ణ.. ఇద్దరు కుమారులు. బనగానపల్లెలోని ఓ ప్రైవేట్ కళాశాలలో మోహన్‌కృష్ణ బీఎస్సీ ద్వితీయ సంవత్సరం చేశాడు. హరికృష్ణ ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తి చేసి చివరి సంవత్సరం చేరేందుకు ఉన్నారు. గ్రామంలోని గనిలో నుంచి నాపరాళ్లను ట్రాక్టర్లో పలుకూరు క్రాస్ రోడ్డు వద్ద ఉన్న నాపరాళ్ల డిపోల వద్ద తరలించేందుకు తండ్రి మద్దిలేటితో పాటు మోహన్‌కృష్ణ కూడా లోడింగ్ పనికి వెళ్లాడు. నాపరాళ్ల లోడ్‌ను డిపో వద్దకు తరలిస్తుండగా ఎదురుగా వస్తున్న మరో వాహనానికి సైడ్ ఇవ్వబోయి ట్రాక్టర్ అదుపు తప్పింది. దీంతో ట్రాక్టర్‌కు, ట్రాలీకి ఉన్న బోల్ట్ ఊడిపోవడంతో ట్రాలీ బోల్తాపడి ట్రాలీలో కూర్చున్న మోహన్‌కృష్ణ పైనాపరాళ్లు పడడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న నందివర్గం ఎస్ఐ హనుమంతరెడ్డి ఘటన స్థలానికి వెళ్లి.. మృతదేహం పై పడ్డ నాపరాళ్లను తొలగించి పోస్టుమార్టం నిమిత్తం బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చేతికొచ్చిన పెద్ద కుమారుడు మోహన్‌కృష్ణ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. కళ్లను దానం చేసిన కుటుంబ సభ్యులు ఎస్ఐ హనుమంతరెడ్డి సహకారంతో మోహన్ కృష్ణ కళ్లను తలిదండ్రులు దానం చేశారు. కర్నూలుకు చెందిన కంటి వైద్యనిపుణులు డాక్టర్ భరణికుమార్ ఆధ్వర్యంలో టెక్నిషియన్ రంగారెడ్డి మృతుడు మోహన్ కృష్ణ కళ్లను సేకరించారు. -
ట్రాక్టర్-బైక్ ఢీ.. విద్యార్థికి తీవ్ర గాయాలు
వేంపల్లి: వైఎస్సార్ జిల్లా వేంపల్లి మండలం పాములూరు-అలవలపాడు రహదారి మార్గంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో డిగ్రీ విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. వీరపునాయుని పల్లి మండలం ఓబులరెడ్డి పల్లి గ్రామానికి చెందిన గంగా మహేంద్ర అనే డిగ్రీ విద్యార్థి బుధవారం ఉదయం పులివెందుల లయోలా డిగ్రీ కళాశాలలో పరీక్ష రాసేందుకు మోటార్ బైక్ పై బయలుదేరాడు. పాములూరు-వేంపల్లి రహదారి మధ్యలో గ్రావెల్ తరలిస్తున్న ఓ ట్రాక్టర్ మహేంద్ర వెళ్తున్న బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విద్యార్థికి ఎడమ చేయి, ఎడమ కాలు విరిగినట్లు సమాచారం. చికిత్స నిమిత్తం 108 లో వేంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సలహా మేరకు మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్ కు తరలించారు. -
డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
ధర్మవరం రూరల్: మండల పరిధిలోని రేగాటిపల్లి గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థిని వడ్డే సౌజన్య (18) ఉరేసుకొని సోమవారం ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల మేరకు సౌజన్య పట్టణంలోని శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాలలో బీఎస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. తల్లి లీలావతి ఉదయమే కూలి పనులకు వెళ్లగా తండ్రి వెంకటరాముడు సంత సరుకులు తెచ్చేందుకు పట్టణానికి వెళ్లాడు. ఇదే సమయంలోనే సౌజన్య కళాశాలకు బయలుదేరడానికి సిద్ధమైంది. అయితే ఏమి జరిగిందేమోగానీ ఎవరూ లేని సమయంలో ఇంట్లో ఫ్యా¯ŒSకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రులు పనులు ముగించుకొని సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా కుమార్తె ఫ్యా¯ŒSకు వేలాడుతూ కనిపించింది. రూరల్ ఎస్ఐ యతేంద్ర, ఏఎస్ఐ నాగప్ప వెళ్లి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
కళ్లు తిరిగాయని వెళితే.. చేయి తీసేశారు
వైష్ణవి.. ఈ ఫొటోలో ఉన్నమ్మాయే..చక్కగా ఉంది కదూ..అయితే.. ఇదంతా నెల క్రితం వరకూ..మరిప్పుడు..ఒక చేయి లేదు.. రెండో చేయి పనిచేయడం లేదు.. కాళ్లు కూడా.. స్వల్ప అనారోగ్యంతో ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన యువతి రక్తం ఎక్కించడంతో వాచిపోయిన బాధితురాలి చేయి ఇన్ఫెక్షన్ సోకిందంటూ కుడి చేయి తొలగింపు పని చేయకుండా పోయిన ఎడమ చేయి.. కాళ్లు హెచ్ఆర్సీని ఆశ్రయించిన బాధితురాలి తల్లిదండ్రులు సాక్షి, హైదరాబాద్: చిన్న సమస్యతో ఆస్పత్రికి వెళ్తే.. చివరికది చేయి తీసేదాకా వెళ్లింది. ఆస్పత్రుల నిర్లక్ష్యం.. తమ బంగారుకొండ జీవి తాన్ని చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడేలా చేసిందంటూ వైష్ణవి తల్లిదండ్రులు శనివారం మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకు రూ.24 లక్షల బిల్లు అయిం దని, ఆ మొత్తం చెల్లిస్తేనే తదుపరి వైద్య సేవలు కొనసాగిస్తామని ఆస్పత్రులు స్పష్టం చేయడంతో దిక్కుతోచని స్థితిలో తాము ఇక్కడికి వచ్చామని చెప్పారు. వారేం చెప్పారంటే.. కళ్లు తిరిగి పడిపోయి ఆస్పత్రికి వెళ్తే.. మౌలాలి హనుమాన్‌నగర్‌కు చెందిన రాంశెట్టి సుధాకర్ కుమార్తె వైష్ణవి(17) ఈ నెల 3వ తేదీన అకస్మాత్తుగా కళ్లుతిరిగి పడిపోయింది. దీంతో తల్లి దండ్రులు చికిత్స కోసం ఆమెను నాచారం లోని ప్రసాద్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. డాక్టర్ సుమప్రసాద్ బాధితురాలు రక్తహీనతతో బాధ పడుతోందని, ఆమెకు రక్తం ఎక్కిం చాల్సి ఉందని చెప్పి అడ్మిట్ చేశారు. వారే ‘జనని వలంటరీ బ్లడ్ బ్యాంక్’ నుంచి రక్తం తెప్పించారు. అయితే రక్తం ఎక్కిస్తున్న సమయంలో వైష్ణవి చేయి నల్లగా కమిలి పోయి శరీరమంతా భరించలేని మంటతో ఇబ్బంది పడింది. ఇన్ఫెక్షన్ సోకిందని, మెరుగైన వైద్యం అందించాలని సదరు వైద్యురాలు 4వ తేదీన జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు. నిర్లక్ష్య చికిత్స వల్లే: వైష్ణవి తండ్రి సుధాకర్ వైష్ణవిని అడ్మిట్ చేసుకున్న అపోలో వైద్యులు తల్లిదండ్రులను పిలిచి పరిస్థితి విషమించిందని, కుడి చేయిని వెంటనే తొలగించాలని, లేదంటే ప్రాణాలకే ప్రమాదమని స్పష్టం చేశారు. తమకు ఆలోచించే అవకాశం కూడా ఇవ్వకుండా బలవంతంగా తమతో సంతకం చేయించుకుని తమ కుమార్తె కుడి చేయిని తొలగించారని సుధాకర్ ఆరోపించారు. ఉన్న ఇల్లు అమ్మి వైద్య ఖర్చులు చెల్లించానని, మరో రూ.20 లక్షలు చెల్లించాలని, లేదంటే చికిత్స నిలిపి వేస్తామని ఆస్పత్రి వైద్యులు బెదిరిస్తున్నారని అన్నారు. ఈ మేరకు హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. 15 రోజులుగా వైద్యుల నిర్లక్ష్య చికిత్స వల్లే తన కూతురు ప్రాణాపాయ స్థితికి చేరిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రసాద్ హాస్పిటల్, అపోలో హాస్పిటల్ వైద్యులపై చర్యలు తీసుకోవా లని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు వైద్యుల నిర్లక్ష్యంపై సుధాకర్ నాచారం పోలీసులకూ ఫిర్యాదు చేశాడు. అంతేకాక తమ కుమార్తెకు ఈ గతి పట్టించిన సదరు కార్పొరేట్ వైద్యులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో కూడా ఫిర్యాదు చేశారు. ప్రాణాలకు ప్రమాదమనే తొలగించాం: అపోలో వివరణ వైష్ణవి ఎనీమియాతో బాధపడు తోందని, అప్పటికే ఆమెకు 3 నర్సింగ్ హోమ్స్‌లో చూపించారని, ఆయా ఆస్ప త్రుల్లో రక్తం కూడా ఎక్కించారని, ఏ బ్లడ్ బాటిల్ ద్వారా ఇన్ఫెక్షన్ సోకిందో తెలియ దని అపోలో ఆస్పత్రి వివరణ ఇచ్చింది. ఆమెను తమ వద్దకు తీసుకొచ్చే సమయా నికి తీవ్రమైన ఇన్ఫెక్షన్తో బాధపడు తోందని, ఇన్ఫెక్షన్ సోకిన భాగాన్ని తొలగించకపోతే అది విస్తరించి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడేదని పేర్కొంది. ఇదే అంశాన్ని యువతి తల్లిదండ్రులకు వివ రించామని, వారు చికిత్సకు అంగీకరించిన తర్వాతే ఇన్ఫెక్షన్ సోకిన భాగాన్ని తొలగించి.. మానవతా దృక్పథంతో చికిత్స అందిస్తున్నామని తెలిపింది. బిల్లు చెల్లిం చాల్సిందిగా ఒత్తిడి చేసినట్లు వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని, రూ.19 లక్షల బిల్లు అయితే.. వారు ఇప్పటి వరకు రూ.4 లక్షలే చెల్లించారని వెల్లడించింది. -
డిగ్రీ విద్యార్థిని అనుమానాస్పద మృతి
తొర్రూర్: గొర్రెలకు కాపలాగా వెళ్లిన ఓ డిగ్రీ విద్యార్థిని బావిలో శవమై కనిపించింది. వరంగల్ జిల్లా తొర్రూర్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. స్థానికంగా ఉండే తెల్లగొల్ల బిక్షపతికి గొర్రెల పెంపకందారు. ఆయన కుమార్తె ఉమ(20) డిగ్రీ సెకండియర్ చదువుకుంటోంది. మంగళవారం తండ్రి వేరే పనినిమిత్తం ఊరెళ్లటంతో ఉమ గ్రామం శివారుల్లో గొర్రెలను మేపేందుకు వెళ్లింది. అయితే, సాయంత్రం సమయానికి గొర్రెలు ఇంటికి చేరుకున్నా ఉమ రాలేదు. దీంతో కుటుంబసభ్యులు స్థానికంగా వెదికినా ఫలితం కనిపించలేదు. బుధవారం ఉదయం సమీపంలోని బావి గట్టున ఆమె చెప్పులు, టవల్ కనిపించటంతో గాలించగా శవం లభ్యమైంది. ఉమ ఆత్మహత్య చేసుకుందా లేక ప్రమాదవశాత్తు బావిలో పడి చనిపోయిందా అన్నది తేలాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు స్థానికులు, కుటుంబసభ్యుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. -
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య కలకలం
వరంగల్ అర్బన్: డిగ్రీ చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. చైతన్య డిగ్రీ కాలేజీకి చెందిన విద్యార్థి కృష్ణారెడ్డి వరంగల్ హైవే వద్ద చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు చనిపోయే ముందు కృష్ణారెడ్డి నాణేలతో 'A' అక్షరాన్ని రాసినట్లు గుర్తించారు. విద్యార్థి మృతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఇది హత్యా.. లేక ఆత్మహత్యా.. అని అన్నికోణాల్లోనూ విచారణ చేపట్టనున్నట్లు పోలీసులు తెలిపారు. -
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
అనంతపురం న్యూసిటీ : అనంతపురంలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ మూడో సంవత్సరం చదివే జె.మహేశ్(20) బీఎస్సీ విద్యార్థి రైలు కింద పడి శనివారం ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. రైలు వెళ్లే సమయంలో దూరడంతో తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మరణించినట్లు చెప్పారు. మృతుని జేబులో పరిశీలించగా హాల్ టికెట్ లభ్యమైందన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పెళ్లికి నిరాకరించిందని కత్తితో దాడి
ఆదిలాబాద్ క్రై ం: పెళ్లికి నిరాకరించిందని ఓ యువకుడు డిగ్రీ విద్యార్థినిపై హత్యాయత్నం చేశాడు. కత్తితో ఆమెపై దాడి చేయడంతో నడుం, మోచేతికి గాయాలయ్యారుు. ఈ ఘటన సోమవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జరిగింది. జైనథ్ మండలం మాండగాడ గ్రామానికి చెందిన సిడాం నందిని ఆదిలాబాద్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ ద్వితీ య సంవత్సరం చదువుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో బేల మండలం బెల్గాం గ్రామానికి చెందిన గెడాం నందుతో ఆమెకు వివాహం నిశ్చయమైంది. ఈ పెళ్లి ఇష్టం లేదని నందిని తల్లిదండ్రులకు చెప్పడంతో మూడు రోజులకే ఇరువురి పెద్దల సమక్షంలో నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నారు. దీంతో నందు ఆమెపై కక్ష పెంచుకున్నాడు. నందిని కళాశాల వద్ద సోమవారం నందు మాటు వేసి కత్తితో దాడిచేశాడు. మోచేరుు, నడుంపై గాట్లు పడడంతో ఆమె కేకలు వేసింది. పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. -
డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
బుక్కరాయసముద్రం : విజయనగర్ కాలనీకు చెందిన ఓ డిగ్రీ విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలమేరకు అనంతపురం నగర సమీపంలో ఉన్న విజయనగర కాలనీలో నివాసం ఉంటున్న జయరాములు పార్వతమ్మల కుమార్తె మనీషా(19) నగరంలోని ఎస్ఎస్బీఎన్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఇటీవల వెలువడిన పరీక్షల ఫలితాల్లో రెండు సబ్జెక్టులలో ఫెయిల్ అయింది. దీంతో మనస్థాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చెన్నంపల్లిలో వృద్ధురాలు.. బుక్కరాయసముద్రం : మండల పరిధిలోని చెన్నంపల్లిలో ఓ వృద్ధురాలు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు చెన్నంపల్లిలో జయమ్మ (70) అనారోగ్యంతో బాధపడుతూ ఉండేది. జీవితంపై విరక్తి చెంది కొడుకు, కోడలు ఇంట్లో లేని సమయంలో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అవమానం భరించలేక యువతి ఆత్మహత్య
బసంత్‌నగర్(కరీంనగర్): చేయని తప్పుకు వీధిలో ఆడవాళ్లు సూటిపోటి మాటలతో మానసికంగా వేధించడంతో మనస్తాపం చెందిన ఓ యువతి శుక్రవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన రామగుండం మండలం పాలకుర్తిలో జరిగింది. మృతురాలి బంధువులు, బసంత్‌నగర్ ఎస్సై విజేందర్ తెలిపిన వివరాల ప్రకారం... పాలకుర్తి గ్రామానికి చెందిన సందవేన ఓదెలు–ఐలమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె సంతానం. కూతురు స్రవంతి(20) పెద్దపల్లిలోని ట్రినిటి డిగ్రీ కళాశాలలో డిగ్రీ సెకండియర్ చదువుతోంది. రెండు రోజుల క్రితం జరిగిన గణేశ్ నిమజ్జనోత్సవ ఊరేగింపులో వీధి యువతులతో కలిసి స్రవంతి నృత్యం చేసింది. అయితే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి యువతులను దుర్భాషలాడాడు. ఈ విషయం వివాదాస్పదమైంది. గురువారం గ్రామానికి చెందిన కొంత మంది అతడిపై దాడిచేశారు. స్రవంతితో అసభ్యకరంగా ప్రవర్తించినందుకే తాము దాడి చేసినట్లు వారు గ్రామంలో ప్రచారం చేశారు. దీంతో కొంత మంది మహిళలు సూటిపోటి మాటలతో స్రవంతిని మానసికంగా వేధించారు. భరించలేకపోయిన యువతి శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యాన్‌కు తాడుతో ఉరేసుకుంది. ఈమేరకు స్రవంతి తల్లి ఐలమ్మ, సోదరుడు రమేశ్ బసంత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా స్రవంతి ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ రాసింది. ‘అమ్మనాన్నలు, అన్నయ్యలు దేవుళ్లు.. చేయని తప్పుకు అనవసరంగా కొంత మంది నన్ను బ్లేమ్ చేశారు.. దీని మూలంగా మా అమ్మానాన్నల పరువుపోతుంది. అమ్మానాన్నల పరువు తీసిన నాకు జీవితం ఉన్నా, లేకున్నా ఒక్కటే’ అని అందులో పేర్కొంది. -
డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
రామగుండం (కరీంనగర్) : డిగ్రీ విద్యార్థిని ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన కరీంనగర్ జిల్లా రామగుండం మండలం పాలకుర్తి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఎస్.స్రవంతి(18) డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. యువతి రాసిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు అందులో ఉన్న అంశాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. -
ప్రియుడు మోసం చేశాడని యువతి ఆత్మహత్య
మల్యాల: ప్రేమించిన యువకుడు పెళ్లి చేసుకుంటానని చెప్పి, మరో యువతిని పెళ్లి చేసుకోవడంతో మనస్తాపం చెందిన యువతి ఉరేసుకున్న సంఘటన మండలంలోని తిప్పాయిపల్లిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన సరెళ్ల మౌనిక(19) కరీంనగర్‌లోని ఓ కళాశాలలో బీకాం పథమ సవంత్సరం చదువుతోంది. కొడిమ్యాలకు చెందిన మందల శేఖర్ ఆర్మీలో పనిచేస్తున్నాడు. వీరింద్దరూ రెండేళ్లు ప్రేమించుకున్నారు. అయితే ప్రియురాలికి తెలియకుండా శేఖర్ బుధవారం మరో యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మౌనిక మనస్తాపంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుంది. మృతురాలి తల్లి శారద ఫిర్యాదు మేరకు ఎస్సై రవీందర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మనస్తాపంతో డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
కందుకూరు: కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ డిగ్రీ విద్యార్థి పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన కందుకూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నేదునూరుకు చెందిన కంచెర్ల వెంకటయ్య చిన్న కుమారుడు ప్రభాకర్, అలియాస్ పవన్(20) హైదరాబాద్ సిటీ కళాశాలలో బీకాం చివరి సంవత్సరం చదువుతున్నాడు. పొరుగింట్లో ఉండే బాబాయ్ కుటుంబంతో కలహాలు తలెత్తడంతో మనస్తాపానికి గురైన అతడు మంగళవారం సాయంత్రం పురుగులమందు తాగి నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. పోలీసులు ప్రభాకర్‌ను చికిత్స నిమిత్తం 108వాహనంలో ఉస్మానియా ఆస్సత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అదేరోజు రాత్రి 11 గంటల సమయంలో అతడు మృతి చెందాడు. ఈమేరకు సీఐ విజయ్‌కుమార్ బుధవారం కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబీకులకు అప్పగించారు. -
కాలేజీకి వెళ్లి... తిరిగిరాని విద్యార్థిని
సంతోష్‌నగర్ (హైదరాబాద్) : కళాశాలకని వెళ్లిన ఓ యువతి కనిపించకుండాపోయిన సంఘటన కంచన్‌బాగ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై పి.ప్రమోద్ కుమార్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మీర్పేట్ అల్మాస్గూడ సీఎంఆర్ కాలనీ ప్రాంతానికి చెందిన బండారి పాండు కూతురు(20) చంపాపేట్‌లోని వేద డిగ్రీ కళాశాలలో చదువుకుంటోంది. ఈ నెల 9వ తేదీన సదరు యువతి కళాశాలకని ఇంట్లో నుంచి బయటికి వెళ్లింది. అనంతరం తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు కళాశాల విద్యార్థులను వాకబు చేయగా... ప్రతి రోజు కళాశాల వద్ద నరేష్ అనే ఆటో డ్రైవర్ ఆమెను కలిసేవాడని తెలిసింది. దీనిపై తండ్రి పాండు తన కూతురు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆచూకీ తెలిసిన వారు 040-27854764, 9490616537 నంబర్లలో సమాచారం అందించాలన్నారు. -
పోలీస్‌స్టేషన్‌లో డిగ్రీ విద్యార్థి ఆత్మహత్యాయత్నం
లక్కిరెడ్డిపల్లె: వైఎస్సార్ జిల్లా లక్కిరెడ్డిపల్లెలో డిగ్రీ విద్యార్థి పోలీస్ స్టేషన్లోనే ఆత్మహత్యాయత్నం చేశాడు. వివరాలు.. లక్కిరెడ్డిపల్లె మండలం పాలెంగొల్లపల్లి గ్రామానికి చెందిన జగన్నాథనాయుడు రాయచోటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం జగన్నాథనాయుడు, అతని స్నేహితుల మధ్య గొడవైంది. దాంతో ప్రత్యర్థి వర్గానికి చెందిన విద్యార్థులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతామని బెదిరించారు. కేసు లేకుండా ఉండాలంటే రూ. 30 వేలతో రాజీ కుదుర్చుకోవాలన్నారు. ఈ వ్యవహారమంతా లక్కిరెడ్డిపల్లె పోలీస్ స్టేషన్ లో జరిగింది. దాంతో మనస్థాపానికి గురైన జగన్నాథనాయుడు వాస్మోల్ తాగి స్టేషన్లోనే ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన పోలీసులు అతణ్ణి స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కడప రిమ్స్‌కు తరలించారు. -
కళాశాలకు వెళ్తున్నానని చెప్పి..
బోడుప్పల్ (హైదరాబాద్) : కళాశాలకు వెళ్లిన ఓ విద్యార్థిని కనిపించకుండాపోయిన సంఘటన శనివారం మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ తాజుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. పీర్జాదిగూడ గాంధీనగర్‌లో నివసించే పి.రాబర్ట్ కుమార్తె కావేరి(17) డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుంది. గత నెల 28వ తేదీన కాలేజికి వెళుతున్నానని చెప్పి వెళ్లింది. మరలా తిరిగి రాలేదు. ఎక్కడ వెతికినా కనిపించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు శనివారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అమ్మానాన్న.. క్షమించండి!
రైలు కింద పడి డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య తాండూరు రూరల్: అమ్మానాన్న.. క్షమించండి అంటూ ఓ డిగ్రీ విద్యార్థి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ మండలం హస్నాబాద్‌కు చెందిన మిర్జాపురం రాములు, రాములమ్మ దంపతుల కుమారుడు రాఘవేందర్(20) తాండూరులోని సింధూ డిగ్రీ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్నాడు. చదువుకుంటూనే హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. కొంతకాలంగా రాఘవేందర్ స్వగ్రామంలో ఉంటున్నాడు. ఉద్యోగం మానేసి చదువుకోమని తల్లిదండ్రులు సూచించినా వినకుండా పనిచేసుకుంటూ చదువుకుంటానని చెప్పి గత ఆదివారం ఇంటి నుంచి బయలుదేరాడు. గురువారం ఉదయం తాండూరు రైల్వేస్టేషన్ సమీపంలో రాఘవేందర్ రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతడి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. చేతికి అందివచ్చిన కుమారుడు బలవన్మరణానికి పాల్పడడంతో రాఘవేందర్ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. -
విద్యుదాఘాతంతో డిగ్రీ విద్యార్థి మృతి
రూ.50 వేల విలువైన గేదె కూడా మృత్యువాత . నాదెండ్ల : విద్యుదాఘాతంతో డిగ్రీ విద్యార్థి మృతి చెందిన సంఘటన నాదెండ్ల గ్రామంలోని పంట పొలాల్లో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన తాటి సతీష్ (19) చిలకలూరిపేటలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం పూర్తి చేశాడు. వేసవి సెలవులు కావటంతో ఉదయాన్నే గేదెలను తోలుకుని పొలం వెళ్లాడు. రక్షిత మంచినీటి చెరువు ఎదురుగా ఉన్న పొలాల్లో గేదెలను మేపుతున్నాడు. ఈ క్రమంలో గేదె అరటితోటకు వేసిన ఫెన్సింగ్ తీగలకు తగిలింది. అప్పటికే పొలానికి వెళ్లే విద్యుత్ లైను ఫెన్సింగ్ తీగలకు తగిలి విద్యుత్ ప్రవహిస్తోంది. గేదె అక్కడికక్కడే గిలగిలాకొట్టుకుని మృతి చెందింది. ఈ దృశ్యాన్ని చూసిన సతీష్ గేదెకు ఏమైందోనని దగ్గరకు వెళ్లటంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. కొన ఊపిరితో ఉన్న సతీష్‌ను చిలకలూరిపేట ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. చేతులు, కాళ్లకు విద్యుత్ తీగ తగిలి తీవ్ర గాయాలయ్యాయి. సతీష్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం చిలకలూరిపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఎస్సై చంద్రశేఖర్ సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. గ్రామంలోని ప్రజలు భారీ ఎత్తున ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. ప్రమాదానికి గురై మృతి చెందిన గేదె విలువ సుమారు రూ.50 వేలు ఉంటుందని స్థానికులు తెలిపారు. -
పూజా సామాగ్రికని వెళ్లి యువతి అదృశ్యం
చిలకలగూడ (హైదరాబాద్) : ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ యువతి కనిపించకుండాపోయిన ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వారాసిగూడకు చెందిన గోవిందకుమార్ కుమార్తె మనీషా (19) నగరంలోని ఓ ప్రైవేటు కాలేజీలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది. ఈ నెల 7వ తేదీ సాయంత్రం 5 గంటల సమయంలో పూజా సామగ్రి తెస్తానని కుటుంబసభ్యులకు చెప్పి బయటకు వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి చేరలేదు. సన్నిహితులు, బంధుమిత్రులను వాకబు చేసినా ఫలితం లేకపోవడంతో సోదరుడు సంజయ్‌కుమార్ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని, మనీషా ఆచూకీ తెలిస్తే సమాచారం అందించాలని పోలీసులు కోరారు. -
డిగ్రీ విద్యార్థిని వెంటాడి చంపారు..
మహబూబ్‌నగర్ : పాలమూరు జిల్లాలో దారుణం జరిగింది. ఇటిక్యాల మండలంలో ఓ విద్యార్థిని గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత కిరాతకంగా హతమార్చారు. పుటాన్‌దొడ్డి గ్రామానికి చెందిన కిష్టన్న, జయమ్మ దంపతుల కుమారుడు నరేష్ గద్వాలలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫస్టియర్ చదువుతున్నాడు. అతడిని సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు వెంటాడి నరికి చంపారు. తలను, చేతులను వేరు చేసి మొండాన్ని సమీపంలోని రైలు పట్టాలపై పడేశారు. మంగళవారం ఉదయం స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
వేర్వేరు చోట్ల నలుగురి ఆత్మహత్య
మున్ననూరులో డిగ్రీ విద్యార్థి బలవన్మరణం కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు జిల్లాలో వేర్వేరు చోట్ల నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిలో డిగ్రీ విద్యార్థి, వలస కూలీ, గుర్తుతెలియని వృద్ధుడు, యువకుడు ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులతో వలస కూలీ.. గద్వాల : బిజినేపల్లి మండలం నందివడ్డెమాన్‌కు చెందిన వెంకటన్న (45) మూడునెలల క్రితం భార్యాపిల్లలతో కలిసి బతుకుదెరువు కోసం గద్వాల పట్టణానికి వచ్చాడు. అప్పటి నుంచి నదిఅగ్రహారం వెళ్లే దారిలో తోటలో కూలీగా పనిచేస్తున్నాడు. కాగా, ఈయన తరచూ కడుపునొప్పితో బాధపడుతుండేవాడు. దీనికితోడు ఆర్థిక ఇబ్బందులు పెరిగాయి. దీంతో మనస్తాపానికి గురై శనివారం ఉదయం తోట దగ్గర ఉన్న చెట్టుకు ఉరివేసుకుని చనిపోయాడు. చుట్టుపక్కలవారు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలాన్ని టౌన్ ఎస్ఐ సైదాబాబు పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. అనంతరం గద్వాల ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని వారికి అప్పగించారు. గోపాల్పేట : మండలంలోని మున్ననూరుకు చెందిన లక్ష్మి, వెంకటయ్య దంపతులకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. తల్లిదండ్రులు స్థానికంగా ఉపాధిహామీ పథకంలో కూలీలుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వీరిలో చిన్నకొడుకు తిరుపతి (19) వనపర్తి పట్టణంలోని గాయత్రి డిగ్రీ కళాశాలలో బీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కాగా, రెండురోజుల క్రితం గ్రామంలోని ఓ కిరాణ షాపులో దొంగతానికి పాల్పడ్డాడంటూ అక్కడివారు మందలించారు. అలాగే వారంరోజుల క్రితం మరో సంఘటనలో ఈ విద్యార్థిని దూషించారు. దీంతో మనస్తాపానికి గురై శనివారం మధ్యాహ్నం ఇంటి తలుపునకు కర్టెన్ వేసి ఊయలకొండికి ఉరేసుకుని చనిపోయాడు. మధ్యాహ్నం పని ముగించుకుని తిరిగొచ్చిన తల్లిదండ్రులు చూసి బోరుమన్నారు. అనంతరం బాధిత కుటుంబాన్ని సర్పంచ్ శేఖర్‌యాదవ్ పరామర్శించారు. ఈ ఘటనపై తమకెలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ సైదులు తెలిపారు. కడుపునొప్పి భరించలేక.. కోస్గి : ఇంకో సంఘటనలో కోస్గి మండలం ముశ్రీఫాకు చెందిన నర్సిములు (35) కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. వివిధ ఆస్పత్రుల్లో చూపించుకున్నా ఎంతకూ తగ్గలేదు. దీంతో జీవితంపై విరక్తి చెంది శుక్రవారం సాయంత్రం శివారులోని పొలానికి వెళ్లి పురుగుమందు తాగాడు. కొద్దిసేపటికి అటుగా వెళుతున్న కొందరు గమనించి వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకునే సరికి అతను మృతి చెంది ఉన్నాడు. ఈ విషయమై శనివారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఏఎస్ఐ వెంకటయ్య కేసు దర్యాప్తు జరుపుతున్నారు. కోయిల్‌కొండ : ఓ వృద్ధుడికి ఏ కష్టం వచ్చిందోగాని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. శనివారం ఉదయం కోయిల్‌కొండ మండలంలోని మల్కాపూర్ శివారులో ఓ గుర్తుతెలి యని వ్యక్తి (60) చెట్టుకు ఉరివేసుకుని చనిపోయాడు. మధ్యాహ్నం అ టువైపు వెళ్లిన బాటసారులు గమనించి వెంటనే పోలీసులతోపాటు వీఆర్ఓ లక్ష్మీకాంత్‌రెడ్డికి సమాచారమిచ్చారు. సంఘటన స్థలాన్ని ఎస్ఐ మురళి పరిశీలించి కేసు దర్యాప్తు జరుపుతున్నారు. మృతుడి ఒంటిపై తెల్ల చొక్కా, బేబులో రూ.330లతోపాటు మద్దూరు నుంచి మల్కాపూర్‌కు తీసుకున్న ఆర్టీసీ బస్ టికెట్టు ఉన్నాయి. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రధాన ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. -
డిగ్రీ విద్యార్థి దుర్మరణం
గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ప్రమాదం గిద్దలూరు మండలం పాతపాడు సమీపంలో ఘటన.. కొనకనమిట్ల : గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థి దుర్మరణం పాలయ్యూడు. ఈ సంఘటన ఒంగోలు- గిద్దలూరు రహదారిలోని పాతపాడు సమీపంలో గురువారం ఉదయం జరిగింది. వివరాలు.. కొనకనమిట్ల మండలం చినమనగుండం ఎస్సీ కాలనీకి చెందిన పాపాబత్తిన బాబు కుమారుడు ప్రవీణ్‌కుమార్ (20) పొదిలి ఎస్ఎస్ఎన్ కాలేజీలో బీఎస్సీ (కంప్యూటర్స్) మొదటి సంవత్సరం చదువుతున్నాడు. పరీక్షలు దగ్గర పడుతుండటంతో పొదిలిలో తన బాబాయి ఇంట్లో ఉంటూ కాలేజీకి వెళ్తున్నాడు. ఈ నేపథ్యంలో ప్రవీణ్‌కుమార్ బుధవారం సాయంత్రం గొట్లగట్టు వచ్చి తన మిత్రునికి చెందిన బైకుపై మళ్లీ పొదిలి వెళ్లాడు. రాత్రి పొదిలిలో ఉండి గురువారం ఉదయాన్నే పొదిలి నుంచి స్వగ్రామం చినమనగుండం వస్తున్నాడు. పాతపాడు సమీపంలో ఎదురుగా వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ప్రవీణ్‌కుమార్ ఎగిరి రోడ్డుపై పడటంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. ఢీకొట్టిన వాహనం ఆగకుండా వెళ్లింది. ప్రవీణ్‌కుమార్ తల్లిదండ్రులు సంఘటన స్థలానికి వచ్చి కన్నీటిపర్యంతమయ్యూడు. కాలేజీ ప్రిన్సిపాల్ కేవీఆర్ కృష్ణారెడ్డి, విద్యార్థులు సంఘటన స్థలానికి చేరుకొని విచారం వ్యక్తం చేశారు. ఎస్సై బ్రహ్మనాయుడు వచ్చి వివరాలు సేకరించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు. -
అమ్మానాన్న పొమ్మన్నారు... కలెక్టర్ ఆదుకున్నారు!
తిరువనంతపురం: హెచ్ఐవీ పాజిటివ్ అని తేలడం.. ఆ తర్వాత వేధింపుల కారణంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఓ యువతి(20) నెమ్మదిగా కోలుకుంటోంది. ఈ ఘటన కేరళలోని కన్నూర్ జిల్లాలో గత నెలలో చోటచేసుకుంది. కన్నవాళ్లు కాదన్నా... జిల్లా కలెక్టర్ పి బాలకిరణ్ ఆమెకు అండగా నిలిచారు. ఆ యువతి(20) తిరిగి తన చదువును కొనసాగించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆ యువతిని తిరిగి కాలేజీలో జాయిన్ చేసి ఆమెకు మనోధైర్యాన్ని అందించారు. తనకు అన్ని విధాలా సాయం చేసిన కలెక్టర్ కు బాధిత యువతి కృతజ్ఞతలు తెలిపింది. కలెక్టర్ బుధవారం కాలేజీ విద్యార్థులు, ఆమె తల్లిదండ్రులకు హెచ్ఐవీపై అవగాహనా కల్పించడంతో పాటు యువతికి సహకరించాలని కౌన్సెలింగ్ నిర్వహించారు. అసలు విషయం ఇది.. తనకు సోకిన వ్యాధి గురించిన విషయాన్ని ఇటీవలే ఓ ప్రైవేట్ కాలేజీ విద్యార్థిని బయటపెట్టింది. ఆమెతో ఉండేందుకు తోటి విద్యార్థులు నిరాకరించారు. తోటి విద్యార్థినులు రూమ్స్ ఖాళీ చేయడం మొదలెట్టారు. దీంతో ఆమెను ఆ కాలేజీ యాజమాన్యం అక్కడ నుంచి పంపేసింది. హాస్టల్ ఖాళీ చేయించి ఇంటికి వెళ్లగొట్టారు. కాలేజీ నుంచి పంపించిన విషయాన్ని ప్రిన్సిపాల్ పీఏ జునైద్ కూడా అంగీకరించారు. అయితే ఆ విద్యార్థిని ఇక ఏ గత్యంతరం లేక కన్నవారి వద్దకు వెళ్లింది. అక్కడ కూడా ఆమెకు ఆదరణ కరువైంది. తనకు ఎవరూ అండగా లేరని మనస్తాపం చెందిన యువతి గత నెలలో ఆత్మహత్యకు యత్నించింది. చివరకు ఎలాగోలాగ ప్రాణాలతో బయటపడింది. -
ఇంటర్ పరీక్ష రాస్తూ పట్టుబడ్డ డిగ్రీ విద్యార్థి
తాండూరు రూరల్ : ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్ష రాస్తూ ఓ డిగ్రీ విద్యార్థి పట్టుబడ్డాడు. ఈ సంఘటన తాండూరు అంబేద్కర్ సెంటినరీ జూనియర్ కళాశాల్లో బుధవారం చోటు చేసుకుంది. పట్టణ సీఐ వెంకట్రామయ్య కథనం ప్రకారం.. యాలాల మండలం కొకట్ పంచాయతీ బామ్లనాయక్తండాకు చెందిన రాథోడ్ నవీన్ తాండూరు చైతన్య జూనియర్ కళాశాల్లో ఇంటర్ (సీఈసీ) ద్వితీయ ఏడాది చదువుతున్నాడు. వార్షిక పరీక్షల్లో భాగంగా నవీన్ హాల్ టికెట్ నంబర్ (1615212837) అంబేద్కర్ సెంటినరీ కళాశాల్లో పరీక్ష కేంద్రంలో పరీక్ష రాస్తున్నాడు. బుధవారం జరిగిన పౌరశాస్త్రం పరీక్షను రాసేందుకు నవీన్ బదులు స్థానిక పీపుల్స్ డిగ్రీ కళాశాల్లో డిగ్రీ ద్వితీయ ఏడాది చదువుతున్న బానోత్ నవీన్‌కుమార్ హాజరయ్యాడు. అయితే హాల్‌టిక్కెట్‌లో ఉన్న సంతకానికి, విద్యార్థి పెట్టిన సంతానికి తేడాను గుర్తించిన ఇన్విజిలేటర్ వెంటన్ పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్‌కు సమాచారం ఇచ్చారు. ఆయన పరీక్ష కేంద్రానికి వచ్చి వివరాలు సేకరించగా డిగ్రీ విద్యార్ధి బానోత్ నవీన్‌కుమార్‌గా గుర్తించారు. శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు డిగ్రీ విద్యార్థి బానోత్ నవీన్‌కుమార్‌ను బుధవారం పోలీసులు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కేసు దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు పట్టణ సీఐ తెలిపారు. -
డిగ్రీ విద్యార్థినిపై యాసిడ్ దాడి
హిందూపురం: అనంతపురం జిల్లాలో శనివారం సాయంత్రం అమానుషం జరిగింది. హిందూపురంలోని హస్నాబాద్‌లో ఓ విద్యార్థినిపై ఓ గుర్తు తెలియని దుండగుడు యాసిడ్‌తో దాడి చేశాడు. విద్యార్థినికి మెడపై కాలిన గాయాలయ్యాయి. తీవ్ర గాయాలతో ఆర్తనాదాలు చేస్తున్న ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. స్థానిక డిగ్రీ కళాశాలలో సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్ధిని కాలేజీ నుంచి ఇంటికి వస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. సైకిల్ మీద వచ్చిన దుండగుడు ఆమెపై యాసిడ్ చల్లి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దాడికి పాల్పడిన దుండగుల ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ అమానుషమైన యాసిడ్ దాడికి కారణం ప్రేమ వ్యవహారమా? లేక కుటుంబ కలహాలా? అన్న కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. -
డబ్బు కోసం సోదరుడి కిడ్నాప్!
లక్నో: డబ్బుల కోసం ఆశపడిన ఓ వ్యక్తి తనకు వరుసకు సోదరుడయ్యే యువకుడిని కిడ్నాప్ చేశాడు. అయితే పోలీసులు రంగంలోకి దిగి కేసును త్వరగానే పరిష్కరించారు. డబ్బు మీద ఉన్న మోజు బాధితుడి సోదరుడిని కటకటాల పాలు చేసింది. ఎస్పీ ఉమేష్ కుమార్ సింగ్ కథనం ప్రకారం... హర్దోయ్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ కుమారుడు మనీష్. బీఎస్సీ చదువుతున్న ఆ యువకుడు ఏదో పని నిమిత్తం సోమవారం బయటకు వెళ్లాడు. ఇదే అదనుగా భావించిన వరుసకు సోదరుడయ్యే మరో యువకుడు మనీష్ ను కిడ్నాప్ చేశాడు. మనీష్ ను కిడ్నాప్ చేశాం... రూ.30 లక్షలు తమకు ఇస్తేనే మీ కొడుకుని విడిచి పెడతామని అతడి తల్లిదండ్రులకు ఫోన్ చేసి కిడ్నాపర్లు బెదిరించారు. మనీష్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కిడ్నాప్ నకు పాల్పడ్డ ఇద్దరు నిందితులను శుక్రవారం అరెస్ట్ చేశారు. నాలుగురోజుల పాటు ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు కిడ్నాప్ పథకం వేసిన నిందితుడితో పాటు అతని అసిస్టెంట్ ను అదుపులోకి తీసుకుని విచారణ మొదలెట్టారు. మనీష్ ను కిడ్నాప్ చెర నుంచి విడిపించిన రెస్క్యూ సిబ్బందికి రూ.15 వేలు అందజేసి ఐజీ వారిని అభినందించారు. -
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్యాయత్నం
సింగరాయకొండ : కళాశాలకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లిన యువకుడు కళాశాల సమీపంలో వంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా సింగరాయకొండ రైల్వే గేట్ సమీపంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న ఎమ్. ప్రదీప్ (18) డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ రోజు కళాశాలకు వెళ్తున్నానని చెప్పి ఇంట్లోనుంచి బయలుదేరాడు. ఆ క్రమంలో కళాశాల సమీపంలోని రైల్వే గేట్ వద్ద వంటిపై కిరోసిన్ పోసుకొని ప్రదీప్ నిప్పంటించుకున్నాడు. ఆ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి 108లో ఒంగోలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ప్రేమ విఫలం కావడంతో ప్రదీప్ ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. -
స్కూల్ బస్సు ఢీకొని విద్యార్థి దుర్మరణం
హుజూరాబాద్ టౌన్ : కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని సబ్‌స్టేషన్ సమీపంలో స్కూల్ బస్సు ఢీకొని డిగ్రీ విద్యార్థి మృతి చెందాడు. శుక్రవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. అనిల్ అనే డిగ్రీ విద్యార్థి పల్సర్ బైక్‌పై హుజూరాబాద్‌కు వెళుతూ... సబ్‌స్టేషన్ సమీపంలో స్కూల్ బస్సును అధిగమించే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో బస్సు ఢీకొనడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడ్ని మండలంలోని తుమ్మలపల్లి గ్రామ వాస్తవ్యుడిగా గుర్తించారు. -
డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
అనంతపురం అర్బన్ : ఇంట్లో ఎవరూ లేని సమయంలో డిగ్రీ విద్యార్థిని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన అనంతపురం పట్టణంలోని వేణుగోపాల్ నగర్లో మంగళవారం చోటుచేసుకుంది. స్థానిక వీరుగంటి వీధిలో నివాసముంటున్న నందిని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం ఉరి వేసుకొని ఆత్మహత్య కు పాల్పడింది. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. -
నదిలో పడి డిగ్రీ విద్యార్థి మృతి
మదనపల్లె (చిత్తూరు) : ప్రమాదవశాత్తూ కాలు జారి బాహుదా నదిలో పడి గల్లంతైన డిగ్రీ విద్యార్థి మృతి చెందాడు. ఈ సంఘటన చిత్తూరు మదనపల్లె మండలం నిమ్మనపల్లెలో మంగళవారం చోటుచేసుకుంది. మండలంలోని కొండయ్యగారిపల్లికి చెందిన సోమశంకర్(19) మదనపల్లెలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో మంగళవారం కళాశాలకు వెళ్లడానికి నిమ్మనపల్లె వద్ద బస్సు ఎక్కేందుకు బాహుదా నదిని దాటే క్రమంలో ప్రమాదవశాత్తు అందులో పడి గల్లంతయ్యాడు. ఇది గుర్తించిన స్థానికులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టగా.. సమీపంలోని ముదోల్మర్రి గ్రామంలోని ఇసుక దిబ్బల వద్ద మృతదేహమై కనిపించాడు. -
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
హైదరాబాద్ సిటీ: హైదరాబాద్ బాయ్స్ హాస్టల్లో శుక్రవారం ఉదయం ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మహారాష్ట్రకు చెందిన తనూజ్ దేవగన్(20) అనే విద్యార్థి డిగ్రీ చదువుతున్నాడు. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని ఓ బాయ్స్ హాస్టల్లో ఉంటున్నాడు. శుక్రవారం ఉదయం తనూజ్ తన గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది గమనించిన రూమ్మేట్స్ హాస్టల్ యాజమాన్యానికి తెలిపారు. వారు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టంనిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. తనూజ్ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమై ఉండవచ్చునని తెలుస్తోంది. -
చదువు మానుకోమన్నారని..
ఆదిలాబాద్ జిల్లా : తల్లిదండ్రులు చదువు మానుకోమన్నారనే మనస్తాపంతో ఓ డిగ్రీ విద్యారిని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన దండేపల్లి మండలం రెబ్బనపల్లిలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. దాడి సౌమ్య(19) అనే విద్యార్థిని స్థానిక డిగ్రీ కాలేజీలో డిగ్రీ చదువుతుంది. తల్లిదండ్రులు గత కొంతకాలంగా చదువు మానుకోమంటున్నారు. దీంతో మనస్తాపంతో ఇంట్లో ఎవరూలేని సమయంలో సౌమ్య ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. సౌమ్య ఆత్మహత్యకు పాల్పడడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. -
బీచ్‌లో స్నానానికి వెళ్లిన విద్యార్ధిని మృతి
విజయనగరం: కళింగపట్నం బీచ్‌లో స్నానానికి వెళ్లిన ఓ విద్యార్థిని మృతి చెందింది. గుమ్మలక్ష్మీపురం మండలం బెంగళ గ్రామానికి చెందిన ధనలక్ష్మి గురువారం స్నేహితులతో కలసి కళింగపట్నం బీచ్‌లో స్నానానికి దిగి గల్లంతైంది. ధనలక్ష్మీ స్థానిక డిగ్రీ కాలేజీలో రెండో సంవత్సరం చదువుతోంది. ఆమె కోసం గ్రామస్థులు గురువారం ఎంత గాలించిన ఫలితం లేదు. కాగా, శుక్రవారం ఉదయం ఆమె మృతదేహం కళింగపట్నం తీరానికి కొట్టుకురావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు. ధనలక్ష్మీ మృతితో ఆమె కుటుంబంలో విషాదం నెలకొంది. -
చంద్రబాబు ప్రజల ఉసురు పోసుకుంటున్నారు
-
క్రికెట్ ఆడుతుండగా విద్యార్థికి గుండెపోటు
గుంటూరు (మాచర్ల) : మాచర్ల మండలం విజయపురిసౌత్ గ్రామంలోని ఏపీ గురుకుల కళాశాల సమీపాన ఉన్న ఓ గ్రౌండ్లో శుక్రవారం ఉదయం తోటి స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతుండగా ఓ విద్యార్థికి తీవ్రగుండెపోటు వచ్చింది. సదరు విద్యార్థిని దగ్గర్లోని కమలానెహ్రు ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో చికిత్సపొందుతూ విద్యార్థి శుక్రవారం సాయంత్రం మృతిచెందాడు. చనిపోయిన విద్యార్థి పి.వెంకటేశ్(20) ఆంధ్రప్రదేశ్ గురుకుల కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. అతని స్వస్థలం శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట మండలం చెన్నాపురం గ్రామం. -
సెల్ ఫోన్ కొనివ్వలేదని ఆత్మహత్య
వైరా (ఖమ్మం) : సెల్‌ఫోన్ కొనివ్వలేదని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా వైరా మండలంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని గొల్లనపాడు గ్రామానికి చెందిన కన్నెగంటి హరికృష్ణ డిగ్రీ మొదటి ఏడాది చదువుతున్నాడు. అయితే సెల్‌ఫోన్ కొనివ్వమని ఇంట్లో అడిగాడు. అందుకు తల్లిదండ్రులు నిరాకరించడంతో మనస్తాపం చెందిన హరికృష్ణ పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. -
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
ఎల్లారెడ్డి (నిజామాబాద్) : కడుపు నొప్పి భరించలేక ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి మండలం ఆజామాబాద్ గ్రామంలో శనివారం జరిగింది. ఆజామాబాద్ గ్రామానికి చెందిన షాబాజ్ ఖాన్(20) డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్నాడు. కాగా శనివారం కళాశాలకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయాడు. సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
చిత్రం చెప్పిన కథ
-
డ్రెస్ కోడ్ బాలేదన్నందుకు..
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న నిజాం కాలేజిలో ర్యాగింగ్ కలకలం రేపింది. సీనియర్లు వేధిస్తున్నారంటూ.. డిగ్రీ సెకండియర్ చదువుతున్న రాజేశ్వరి అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంటానంటూ పోలీసు కంట్రోల్ రూంకు ఫోన్ చేసి తెలిపింది. దాంతో పోలీసులు ఒక్కసారిగా కంగారుపడ్డారు. నిజాం కాలేజీలో బీఎస్సీ రెండో ఏడాది చదువుతున్న రాజేశ్వరి అనే విద్యార్థినినీ అదే కాలేజీకి చెందిన రాజశేఖర్ అనే సీనియర్ డ్రెస్ కోడ్ సరిగా లేదని బుధవారం సాయంత్రం చెప్పాడు. ఈ విషయం గురువారం కాలేజీ మొత్తం తెలియడంతో తోటి విద్యార్ధినులు రాజేశ్వరిని ఈ విషయం గురించి అడిగారు. దీంతో మనస్తాపం చెందిన ఆమె బర్కత్‌పురలోని తన హాస్టల్‌కు వెళ్లి కంట్రోల్ రూంకు ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పింది. అప్రమత్తమైన నారాయణగూడ పోలీసులు హాస్టల్‌కు వెళ్లి అమ్మాయిని అదుపులోకి తీసుకొని ఆబిడ్స్ పోలీసులకు అప్పగించారు. సీనియర్ రాజశేఖర్‌ను పోలీసులు స్టేషన్‌కు పిలిపించి ఇద్దరినీ జరిగిన విషయం గురించి అడిగి తెలుసుకున్నారు. తాను కేవలం డ్రెస్ కోడ్ సరిగా లేదని మాత్రమే సలహా ఇచ్చానని రాజశేఖర్చెప్పడం, అదే విషయాన్ని రాజేశ్వరి ధ్రువపర్చడంతో పోలీసులు ఇద్దరికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. -
విషజ్వరంతో డిగ్రీ విద్యార్థిని మృతి
వీరఘట్టం (శ్రీకాకుళం జిల్లా): విషజ్వరంతో డిగ్రీ విద్యార్థిని ఎం.పుణ్యవతి మృతి చెందింది. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం విక్రమపురం గ్రామానికి చెందిన ఎం.పుణ్యవతి ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆమె తల్లిదండ్రులు అప్పారావు, రమణమ్మ కూలిపనులుచేసి జీవనం గడుపుతున్నారు. గతనెల 24వ తేదీన వీరందరూ గోదావరి పుష్కరాలకు వెళ్లివచ్చారు. అప్పటి నుంచి పుణ్యవతి జ్వరంతో బాధపడుతోంది. ప్రైవేట్ వైద్యుల వద్ద చూపించినా ప్రయోజనం లేకపోవడంతో ఈనెల 4వ తేదీన శ్రీకాకుళంలోని రిమ్స్ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ పరీక్షించిన వైద్యులు మలేరియా జ్వరం విషమించిందని మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్ కు తీసుకెళ్లాలని సూచించారు. దాంతో గురువారం కేజీహెచ్‌కు తీసుకెళుతుండగా మార్గంమధ్యలోనే పుణ్యవతి మృతిచెందింది. -
డిగ్రీ విద్యార్థినిపై అత్యాచారం, హత్య
బెంగళూరు(బనశంకరి): కంప్యూటర్ క్లాస్ నుంచి ఇంటికి వెళుతున్న డిగ్రీ విద్యార్థినిని దుండగులు, చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం జరిపిన అనంతరం గొంతుకోసి హత్యచేసిన ఘటన శిరా తాలూకాలోని జవనహళ్లిలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. శిరా తాలూకా పరిధిలోని జవనహళ్లి నివాసి రంగప్ప-రంగమ్మ దంపతుల చిన్న కుమార్తె రత్నమ్మ (20)బీఏ డిగ్రీ ఆఖరు సంవత్సరం చదువుతుంది. గురువారం సాయంత్రం బడువనహళ్లిలోని నందగోకుల కంప్యూటర్ సెంటర్‌కు వెళ్లి క్లాస్ ముగించుకుని ఇంటికి బయల్దేరింది. జవనహళ్లికి చేరుకోవాలంటే బడువనహళ్లి నుంచి గుళిగేనహళ్లిగేట్కు బస్‌లో వచ్చి అక్కడి నుంచి రెండు కిలోమీటర్లు కాలినడకన వెళ్లాలి. దీంతో గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో బస్‌లో దిగి ఇంటికి నడుచుకుని వెళుతున్న రత్నమ్మను దుండగులు అడ్డుకుని నిర్జన ప్రదేశంలోకి ఎత్తుకెళ్లి ఆమెపై అత్యాచారం చేశారు. అనంతరం గొంతుకోసి హత్య చేసి అక్కడి నుంచి పారిపోయారు. అయితే కుమార్తె సాయంత్రం 5 గంటలైనా ఇంటికి చేరుకోకపోవడంతో కంగారుపడిన తల్లిదండ్రులు గుళిగేనహళ్లి గేట్ వద్దకు చేరుకుని విచారించగా ‘‘మీ కుమార్తె 4 గంటలకే నడుచుకుని వెళుతుండడం చూశాం’’ అని అక్కడ స్థానికులు తెలిపారు. దీంతో మరింత భయపడిన తల్లిదండ్రులు మళ్లీ జవనహళ్లికి చేరుకుని గాలించినా ఆమె ఆచూకీ లభించలేదు. అనంతరం గ్రామస్తులతో కలిసి జవనహళ్లికి వచ్చే కాలిబాటలోని నిర్జన ప్రదేశంలోకి వెళ్లి చూడగా కొంచెం దూరంలో పాదరక్షలు కనబడ్డాయి. మరికొంత దూరంలోకి వెళ్లి చూడగా ఆమె శవం కనిపించడంతో విద్యార్థిని తల్లిదండ్రుల ఆక్రందనలు మిన్నంటాయి. ఈ యువతిపై అత్యాచారం చేసి హత్యచేసినట్లు తెలుసుకున్నారు. సమాచారం అందుకున్న శిరా నగర పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, శిరా గ్రామాంతర ఎస్ఐ రామకృష్ణయ్య తమ సిబ్బందితో సంఘటనా స్ధలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం జిల్లా ఎస్పీ కార్తీక్‌రెడ్డి, అదనపు ఎస్పీ ఆర్.లక్ష్మణ్‌కు సమాచారం అందించడంతో కార్తీక్‌రెడ్డి, ఆర్.లక్ష్మణ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. డాగ్‌స్క్వాడ్, వేలిముద్ర నిపుణులతో తక్షణం అక్కడికి చేరుకుని దుండగుల ఆచూకీ తెలుసుకోవడంలో నిమగ్నం అయ్యారు. ఈ ఘటనతో జవనహళ్లి గ్రామస్తులు తీవ్ర కోపోద్రిక్తులై జిల్లా ఇన్చార్జ్ మంత్రి టీబీ.జయచంద్ర సంఘటనా స్థలానికి రావాలంటూ పట్టుబట్టారు. శుక్రవారం ఉదయం యువతి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి, తల్లిదండ్రులకు అప్పగించారు. అయితే జిల్లా ఇన్చార్జ్మంత్రి టీబీ.జయచంద్ర సంఘటనా స్దలానికి చేరుకునే వరకు అంత్యక్రియలు నిర్వహించేదీ లేదంటూ గ్రామస్తులు, కుటుంబ సభ్యులు భీష్మించుకుని కూచున్నారు. గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అనంతరం అదనపు ఎస్పీ.లక్ష్మణ్ విలేకరులతో మాట్లాడుతూ ఈ కేసును తీవ్రంగా పరిగణించామని దుండగుల ఆచూకీ తెలిసిందని త్వరలోనే అరెస్ట్ చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హామీ నిచ్చారు. దుండుగుల ఆచూకీ కోసం మూడు ప్రత్యేక బృందాలు జిల్లా ఎస్పీ కార్తీక్‌రెడ్డి, అదనపు పోలీస్ ఎస్పీ ఆర్.లక్ష్మణ్ దుండగుల ఆచూకీకోసం మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ పోలీస్ బృందా ల్లో శిరా పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, తావరకెరె ఎస్ఐ అంజన్‌కుమార్, శిరా గ్రామాంతర ఎస్ఐ రామకృష్ణయ్య, కళ్లంబెళ్ల ఎస్ఐ చంద్రశేఖర్, తుమకూరు గ్రామాంతర ఎస్ఐ. రవి, కోరా ఎస్ఐ. రవికుమార్ ఉన్నారు. ఇప్పటికే ఈ బృందాలు దుండుగుల ఆచూకీకోసం తీవ్రగాలింపుచర్యలు చేపట్టారు. -
కాలేజీకని వెళ్లి.. విద్యార్థిని అదృశ్యం
నాగోలు (హైదరాబాద్) : కళాశాలకు వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన విద్యార్థిని అదృశ్యమైంది. ఎల్బీనగర్ పోలీసుల కథనం ప్రకారం.... ఎన్టీఆర్ నగర్‌కు చెందిన గుంజి కల్పన(21) కొత్తపేటలోని శివాని కళాశాలలో డిగ్రీ ఫైనలియర్ చదువుతోంది. అయితే గురువారం ఉదయం కళాశాలకు వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు చుట్టు పక్కల వారిని, తెలిసిన వారిని అడిగారు, పలుచోట్ల వెదికారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో తల్లి ఈశ్వరమ్మ శుక్రవారం ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
'అనంత'లో డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
అనంతపురం: కళాశాలకు వచ్చిన ఓ విద్యార్థి రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అనంతపురంలో శుక్రవారం చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రాప్తాడు మండలం గాండ్లపర్తికి చెందిన రవి (21) నగరంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. కళాశాలకు వెళ్లేందుకని ఉదయం ఇంటి నుంచి బయలుదేరి వచ్చాడు. పట్టణంలోని పీటీసీ మైదానం ఎదురుగా రైలుపట్టాలపై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రెండు పట్టాల మధ్య పడుకున్నాడని పోలీసులకు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సమాచారం అందుకున్న రైల్వే ఎస్ఐ ఇస్మాయిల్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వద్ద లభించిన వివరాల ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (రాప్తాడు) -
డిగ్రీ విద్యార్థిని అదృశ్యం
మహబూబ్‌నగర్: డిగ్రీ విద్యార్థిని అదృశ్యమైన సంఘటన మహబూబన్ నగర్ జిల్లా గద్వాల టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు.. మహబూబ్‌నగర్ జిల్లా అయిజ మండల కేంద్రానికి చెందిన అనూష (19) స్థానిక ఎస్వీఎం డిగ్రీ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతోంది. గత ఏప్రిల్ 10న పరీక్షలు రాయడానికి అయిజ నుంచి గద్వాలకు బయల్దేరింది. పరీక్ష రాసిన అనంతరం అనూష ఇంటికి చేరుకోలేదు. అనూష ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు గాలించారు. ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో ఆదివారం తల్లి లక్ష్మిదేవి టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని టౌన్ ఎస్ఐ సైదాబాబు తెలిపారు. -
డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
కరీంనగర్ (కాల్వ శ్రీరామ్‌పూర్) : కరీంనగర్ జిల్లా కాల్వ శ్రీరామ్‌పూర్ మండలం ఊశన్నపల్లి గ్రామానికి చెందిన ఎం.శంకరమ్మ(20) అనే డిగ్రీ విద్యార్థిని బుధవారం మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగులమందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకొవడానికి గల కారణాలు తెలియరాలేదు. -
ప్రాణం తీసిన సరదా
చీటకోడూరు రిజర్వాయర్ కాల్వలోకి దిగిన విద్యార్థిని మృతి వడ్లకొండ, మరిగడి గ్రామాల్లో విషాద ఛాయలు జనగామ రూరల్ : సరదా కోసం వెళ్లిన ఓ డిగ్రీ విద్యార్థిని రిజర్వాయర్‌లో పడి మృతిచెందిన సంఘటన జనగామ మండలంలోని చీటకోడూరు గ్రామం వద్ద గురువారం జరిగింది. వడ్లకొండ గ్రామానికి చెందిన చిలుక సంధ్య(18) జనగామలోని ప్రైవేటు డిగ్రీ కళాశాలలో బీకాం సెకండియర్ చదువుతోంది. ఈమె శామీర్‌పేట గ్రామానికి చెందిన తన స్నేహితురాలు సృజన కుటుంబంతో కలుపుగోలుగా ఉండేది. ఈ క్రమంలో సృజన తల్లి ఏస్తేరు, సోదరుడు సిరోలు జనగామలో బ్యాంక్ పనులు చూసుకుని వడ్లకొండలోని సంధ్య ఇంటికి వెళ్లారు. అక్కడ కొద్దిసేపు మాట్లాడక సరదాగా చీటకోడూరు రిజర్వాయర్ వద్దకు వెళ్లాలని నిశ్చయించుకుని బైక్‌పై వెళ్లారు. డిగ్రీ పరీక్షలు దగ్గరపడ్డాయి చదువుకోవచ్చనే ఉద్దేశంతో సంధ్య పుస్తకాలు కూడా వెంట తీసుకెళ్లింది. చీటకోడూరు రిజర్వాయర్‌కు వచ్చే నీటి కాల్వ వద్ద కూర్చొని మాట్లాడుతుండగా కొద్దిసేపటికి సంధ్య కాల్వ లోతును గమనించకుండానే దిగింది. కాల్వలోకి అడుగుపెట్టగానే ఒక్కసారిగా సంధ్య అందులో మునిగిపోయింది. దీంతో ఆమెను రక్షించేందుకు ఏస్తేరు ప్రయత్నించగా ఆమె కూడా కాల్వలోకి కూరుకుపోయింది. ఇది గమనించిన సిరోలు తన తల్లి ఏస్తేరును బయటకు లాగాడు. సంధ్యను బయటకు తీసేందుకు అతడితోపాటు అక్కడే ఉన్న మరికొందరు కాల్వలోకి దూకినప్పటికీ ఫలితం లేకుండా పోరుుంది. అప్పటికే సంధ్య గల్లంతైంది. సమాచారం తెలుసుకున్న సంధ్య బంధువులు, వడ్లకొండ, చీటకోడూరు గ్రామాల సర్పంచ్‌లు ఎల్లబోయిన ఎల్లమ్మ, కొమురయ్య, కొర్నెపాక లక్ష్మి, ఉపేందర్ అక్కడకు చేరుకుని పోలీసులకు సమాచారమిచ్చారు. గజ ఈతగాళ్ల సాయంతో సంధ్య మృతదేహాన్ని వెలికితీశారు. మృతదేహాన్ని చూసిన బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నాడు తల్లిదండ్రులు.. నేడు కూతురు మృతి మరిగడి గ్రామానికి చెందిన చిలుక మల్లయ్య, కమలమ్మ దంపతులకు కూతుర్లు రేణుక, సంధ్య ఉన్నారు.పదేళ్ల క్రితం అనారోగ్యంతో కొమురయ్య, కొన్నేళ్ల క్రితం తల్లి కమలమ్మ మృతిచెందింది. దీంతో వడ్లకొండ గ్రామంలోని మేనమామ అయిన గుండె రత్నం ఇంట్లో ఉంటూ సంధ్య చదువు కొనసాగిస్తుంది. నాడు తల్లిదండ్రులు, నేడు కూతురు మృతితో వడ్లకొండలో, మరిగడి గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
డబ్బు కోసం నకిలీ మావోయిస్టుగా..
మంచిర్యాల టౌన్ : అక్రమంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో ఓ డిగ్రీ విద్యార్థి నకిలీ మావోయిస్టు అవతారమెత్డాడు. ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్లను పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేశాడు. ఇవ్వకుంటే చంపేస్తానని బెదిరించాడు. చివరికి పోలీసులు పన్నిన వ్యూహంలో అడ్డంగా దొరికిపోయూడు. గురువారం మంచిర్యాల పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఏఎస్పీ ఎస్.ఎం.విజయ్‌కుమార్ వివరాలు వెల్లడించారు. డబ్బు అవసరాలు.. పాత కక్షలతో.. చెన్నూర్ పట్టణంలోని మారెమ్మవాడకు చెందిన కొమటం మధూకర్ అలియాస్ మధు అలి యూస్ మదన్ అనే యువకుడు డిగ్రీ పూర్తి చేశాడు. అక్రమ మార్గంలో డబ్బులు సంపాదిం చాలనే లక్ష్యం పెట్టుకున్నాడు. అలాగే తనకు గత సాధారణ, ప్రాదేశిక ఎన్నికల సమయంలో కొంతమంది ప్రజాప్రతినిదులతో జరిగిన గొడవలతో వ్యక్తిగత కక్షలను పెంచుకున్న మధూకర్ నకిలీ మావోయిస్టు అవతారం ఎత్తాడు. అంతేకాకుండా తను కౌలు తీసుకున్న పొలంలో సాగు సమయంలో దాదాపు రూ.లక్షకు పైగా అప్పుల పాలయ్యాడు. అప్పులను తీర్చుకోవడం కోసం, పాత కక్షలతో ప్రజాప్రతినిధులను బెదిరించి డబ్బులు సంపాదించాలనుకున్నాడు. మహారాష్ట్ర గడ్చిరోలి దళ కమాండర్ రామన్న పేరుతో ప్రజాప్రతినిధులను, కాంట్రాక్టర్లను బెదిరింపులకు గురి చేయడమే లక్షంగా పెట్టుకున్నాడు. పార్టీ చందాగా రూ.లక్షలు డిమాండ్ ఈ క్రమంలో మంచిర్యాల కాలేజ్‌రోడ్‌లోని పాతగర్మిళ్లకు చెందిన బెల్లంకొండ వెంకటేశ్వర్రావు అలాయాస్ భాస్కర్‌రావుతో పాటు ఆయన కుమారుడు భార్గవ్‌కు కూడా ఫోన్ చేసి పార్టీ చందాగా రూ.లక్ష డిమాండ్ చేశాడు. డబ్బులు ఇవ్వకుంటే కుటుంబ సభ్యులను చంపేస్తామని హెచ్చరించారు. దీంతో అనుమానం వచ్చిన కాంట్రాక్టర్ వెంకటేశ్వర్రావు ఫిబ్రవరి 14వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు వేగవంతం చేశారు. మధూకర్ చెన్నూర్‌కు చెందిన మరో ముగ్గురు ప్రజాప్రతినిధులను కూడా మావోయిస్టు పేరుతో బెదిరింపు ఫోన్లు చేశాడు. ఇందులో కోటపల్లి మండల జెడ్పీటీసీ, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డితో ఎన్నికల సమయంలో జరిగిన గొడవను దృష్టిలో పెట్టుకుని మావోయిస్టు పార్టీ చందాగా రూ.3 లక్షలు డిమాండ్ చేశాడు. అలాగే చెన్నూర్ ఎంపీపీ మైదం కళావతి భర్త మైదం రవితో జరిగిన గొడవలో కూడా అతనికి ఫోన్ చేసి పార్టీ చందాగా రూ.5 లక్షలు, గ్రామ పంచాయితీ ఎన్నికల్లో వార్డు సభ్యుడు బత్తుల సమ్మయ్యతో జరిగిన గొడవను దృష్టిలో ఉంచుకుని పార్టీ చందాగా కొంత మొత్తం డబ్బులు డిమాండ్ చేశాడు. వీరంతా పోలీసుల దర్యాప్తులో బాధితులుగా తేలారు. అంతా పక్షం రోజుల్లోనే... మంచిర్యాలకు చెందిన బెల్లంకొండ వెంకటేశ్వర్రావు ఫిర్యాదు మేరకు సీఐ వి.సురేశ్, పోలీస్ సిబ్బంది 15 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి నిందితుడిని గురువారం మంచిర్యాల గర్మిళ్లలో అరెస్ట్ చేశారు. అతడి నుంచి రెండు సెల్ఫోన్లు, రెండు వాల్ పోస్టర్లు స్వాధీనం చేసుకున్నారు. సిబ్బందిని ఏఎస్పీ అభినందించారు. కాగా, పాత కక్షలతో పాటు ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలోనే నకిలీ మావోయిస్టు అవతారం ఎత్తినట్లు విచారణలో మధూకర్ అంగీకరించాడు. అతడిని రిమాండ్‌కు పంపారు. -
డిగ్రీ విద్యార్థిని ప్రాణం తీసిన రాంగ్ కాల్స్
పాపన్నపేట: పోకిరీల రాంగ్‌కాల్స్ ఓ డిగ్రీ విద్యార్థిని బలిగొన్నాయి. వివరాలు... మెదక్ జిల్లా పాపన్నపేట మండలం కొత్తపల్లికి చెందిన మెట్టు నారాయణ రెండో కుమార్తె మెదక్‌లోని శ్రీనివాస్ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ ఫస్టియర్ చదువుతోంది. రెండు నెలలుగా ఆమె సెల్‌కు రాంగ్‌కాల్స్ వస్తున్నాయి. సిమ్ మార్చినా వాటి బెడద తగ్గలేదు. దీంతో కలత చెందిన రాధిక గురువారం రాత్రి ఇంట్లో ఉరేసుకుంది. -
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
ఆదిలాబాద్ : డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తిర్యాణి మండలం చింతపల్లి నాయకపుగూడలో మంగళవారం జరిగింది. వివరాలు.. నాయకపుగూడ గ్రామానికి చెందిన రమేష్ పెద్ద కుమారుడు నాయిడి రాజు తాండూర్లోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ పథమ సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం ఉదయం ఆయన ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారాణాలు తెలియాల్సి ఉంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
డిగ్రీ విద్యార్థిని కిడ్నాప్‌కు విఫల యత్నం
ధర్మవరం టౌన్ : డిగ్రీ చదువుతున్న ఓ విద్యార్థినిని పట్టపగలు కిడ్నాప్ చేసేందుకు దుండగులు విఫలయత్నం చేశారు. విద్యార్థిని పెద్దపెట్టున కేకలు వేయడంతో దుండగులు పరారయ్యారు. శుక్రవారం ఈ ఘటన ధర్మవరం పట్టణంలో కలకలం రేపింది. పోలీసులకు భాదితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. పట్టణంలో నివాసం ఉంటున్న శ్రీరామిరెడ్డి, వెంకటలక్ష్మి దంపతుల కుమార్తె స్రవంతి స్థానిక శ్రీసాయి మహిళా డిగ్రీ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. రోజులాగే శుక్రవారం ఉదయం సోదరుడు భాస్కర్‌రెడ్డి స్రవంతిని కళాశాల వద్ద డ్రాప్ చేసి వెళ్లాడు. కాసేపటి తర్వాత నోటు పుస్తకాలు కావలసి ఉండటంతో స్రవంతి.. ఉపాధ్యాయుల అనుమతి తీసుకుని కళాజ్యోతి వద్ద ఉన్న బుక్‌స్టాల్ వద్దకు బయలుదేరింది. మార్గం మధ్యలో ఏఎస్పీ కార్యాలయం సమీపంలో సుమోలో వచ్చిన దుండగులు స్రవంతిని అటకాయించారు. మంకీ క్యాప్‌లు ధరించిన నలుగురు దుండగులు వాహనం మధ్య భాగంలోని డోర్‌ను తీసి స్రవంతిని బలవంతంగా చేయి పట్టుకుని సుమోలోకి లాగే ప్రయత్నం చేశారు. భయంతో పెద్దపెట్టున కేకలు వేస్తూ.. పెనుగులాడి వారి పట్టు నుంచి విడిపించుకుంది. దీంతో భయపడిన దుండగులు సుమోను వేగంగా నడుపుకుంటూ వెళ్లిపోయారు. పెనుగులాటలో స్రవంతి చేతికి స్వల్ప గాయాలయ్యాయి. భయం భయంగా కుటుంబ సభ్యులకు జరిగిన విషయాన్ని ఫోన్ ద్వారా స్రవంతి వివరించింది. సోదరునితో కలసి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తన తండ్రి శ్రీరామిరెడ్డి కుటుంబానికి, ధర్మవరం మండలం వెంకట తిమ్మాపురంలో ఉండే రవీంద్రరెడ్డి, అతని కుమారుడు మారుతీ రెడ్డిల మధ్య పొలం విషయంలో వివాదం ఉందని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. స్రవంతి సోదరుడు భాస్కరెడ్డిపై గత ఏడాది జరిగిన హత్యాయత్నం కేసులో మారుతి రెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నాడన్నారు. వారితో తప్ప తమకు ఎవరితోనూ విభేదాలు లేవని ఫిర్యాదులో వివరించారు. ఈ విషయమై పట్టణ సీఐ విజయ్‌భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ స్రవంతిని ఎవరో నలుగురు వ్యక్తులు మంకీ క్యాప్‌లు ధరించి కిడ్నాప్ చేయబోయారని చెప్పారు. త్వరలో నిందితులను పట్టుకుంటామన్నారు. -
9వ తరగతి విద్యార్థినిపై అత్యాచారయత్నం
డిగ్రీ విద్యార్థిపై ‘నిర్భయ’ కేసు నమోదు కందుకూరు: ఒంటరిగా ఉన్న ఓ బాలికపై అత్యాచారయత్నం చేసిన డిగ్రీ విద్యార్థిపై పోలీసులు ‘నిర్భయ’ కేసు నమోదు చేశారు. ఈ సంఘటన కందుకూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ చెన్నకేశవరాజు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని ఆకులమైలారం గ్రామానికి చెందిన కడారి మహేష్(23) ఇబ్రహీంపట్నంలో డిగ్రీ చదువుతున్నాడు. బుధవారం సాయంత్రం అదే గ్రామానికి చెందిన 9వ తరగతి విద్యార్థిని(14) పాఠశాల నుంచి ఇంటికి చేరుకుంది. బాలిక ఒంటరిగా ఉండడంతో మహేష్ ఆమె ఇంట్లోకి చొరబడి అత్యాచారయత్నం చేశాడు. విద్యార్థిని బిగ్గరగా కేకలు వేయడంతో ఇరుగుపొరుగు అక్కడికి వచ్చారు. దీంతో మహేష్ అక్కడి నుంచి పారిపోయాడు. గురువారం బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు నిందితుడు మహేష్‌పై ‘నిర్భయ’ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చెన్నకేశవరాజు పేర్కొన్నారు. -
విద్యార్ధిని గొంతు కోసేందుకు ప్రయత్నించిన అగంతకుడు
రాయదుర్గం: డిగ్రీ విద్యార్థిని గొంతు కోసేందుకు అగంతకుడి ప్రయత్నించిన సంఘటన రాయదుర్గంలో కలకలం రేపింది. ఈ ఘటన అనంతపురం జిల్లా రాయదుర్గంలోని ఓ డిగ్రీ కాలేజీలో చోటు చేసుకుంది. అగంతకుడి దాడిలో గాయపడిన డిగ్రీ విద్యార్థిని పరిస్థితి విషమంగా మారడంతో చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. విద్యార్ధినిపై దాడి చేసిన నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అగంతకుడు ఉమేష్ గా గుర్తించారు. -
అసభ్యకర ఫొటోలు తీసి ... బ్లాక్‌మెయిలింగ్
నెల్లూరు : ప్రేమ పేరుతో ఓ విద్యార్థినిని వేధించడంతో పాటు, ప్రేమించకపోతే తల్లిదండ్రులను చంపేస్తానంటూ రౌడీలతో ఆమె ఇంటి మీదకొచ్చిన ఆటోడ్రైవర్ ఉదంతమిది. ఈ ఘటన నాయుడుపేటలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. బాధితురాలి కథనం మేరకు.. ఓజిలిమండలం నెమళ్లపూడికి చెందిన ఓ విద్యార్థిని పట్టణంలోని ఓ కళాశాలలో డిగ్రీ చదువుతోంది. గతంలో ఆమె రోజూ కళాశాలకు ఆటోలో వచ్చివెళ్లేది. ఈ క్రమంలో గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ నరేష్ ప్రేమపేరుతో వేధించాడు. అప్పట్లోనే ఆమె ఈ విషయాన్ని ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్లి అతడిని మందలించింది. అయితే మూడు నెలల క్రితం నరేష్ ఆ విద్యార్థిని ఆటోలో కిడ్నాప్ చేశాడు. దీనిపై అప్పట్లోనే విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నరేష్ తల్లిదండ్రులను పోలీసులు పిలిపించి మందలించి కేసులు లేకుండా వదిలేశారు. కిడ్నాప్ సమయంలో ఆమె అపస్మారక స్థితికి చేరుకోవడంతో అసభ్యకరంగా ఫొటోలు తీసి, బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడసాగాడు. ఈ ఘటనల నేపథ్యంలో విద్యార్థిని కుటుంబం నాయుడుపేటకు కాపురం వచ్చేసింది. అయినా నరేష్ వేధింపుల పర్వం ఆపలేదు.శనివారం సాయంత్రం కొందరితో కలిసి నాయుడుపేటలో విద్యార్థిని కుటుంబం నివాసం ఉంటున్న ఇంటి మీదకు వచ్చాడు. చంపేస్తామంటూ ఆమె తల్లిదండ్రులపై దాడికి యత్నించడంతో పాటు ఆ ప్రాంతంలో బీభత్సం సృష్టించాడు. భయభ్రాంతులకు గురైన బాధిత కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. తనకు ప్రాణరక్షణ కల్పించాలని ఆ విద్యార్థిని ఏఎస్సై బొబ్బిలిరాజును వేడుకుంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కోరిక తీర్చనందుకే హతమార్చాడు
కొత్తకోట టౌన్, న్యూస్‌లైన్ : తన కోరిక తీర్చలేదనే కోపంతో డిగ్రీ విద్యార్థిని లక్ష్మీదేవి (19) ని వరుసకు సోదరుడైన చంద్రశేఖర్ గొడ్డలితో దాడి చేసి హతమార్చాడని వనపర్తి డీఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ కేసు వివరాలను శుక్రవారం కొత్తకోట పోలీస్‌స్టేషన్‌లో ఆయన తెలిపారు. మండలంలోని రామనంతాపురానికి చెందిన చంద్రశేఖర్ వడ్డెర వృత్తిని కొనసాగిస్తూ వివిధ ప్రాంతాలు తిరిగేవాడు. అప్పుడప్పుడూ స్వగ్రామానికి వచ్చేవాడు. పలుసార్లు అసభ్యంగా ప్రవర్తించగా బాధితురాలి సోదరులు, తల్లిదండ్రులు మందలించా రు. ఈ క్రమంలోనే గురువారం మధ్యాహ్నం ఆ యువతి సమీపంలోని తమ పొలానికి వెళుతుండగా వెంబడించి కోరిక తీర్చాలని పట్టుబట్టాడు. నిరాకరించిన ఆమెపై గొడ్డలితో దాడి చేసి చంపేశాడు. బాధిత కుటుం బ సభ్యుల ఫిర్యాదు మేరకు అతడిని పోలీ సులు అరెస్టు చేసి శుక్రవారం సాయంత్రం వనపర్తి కోర్టులో హాజరుపరిచారు. సమావేశంలో కొత్తకోట సీఐ రమేష్‌బాబు, పెద్దమందడి ఎస్ఐ మురళీగౌడ్ పాల్గొన్నారు. విద్యార్థిని మృతదేహానికి పోస్టుమార్టం కొత్తకోట రూరల్, న్యూస్‌లైన్ : మండలంలోని రామనంతాపురంలో దారుణ హత్య కు గురైన డిగ్రీ విద్యార్థిని లక్ష్మీదేవి (19) మృతదేహానికి శుక్రవారం వనపర్తి ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం పోలీసుల బందోబస్తుతో స్వ గ్రామానికి తరలించారు. మృతదేహాన్ని చూసిన బంధువులు, గ్రామస్తులు ఆగ్రహా వేశాలకు లోనై నిందితుడి ఇంటిపై దాడికి యత్నించారు. ఒక దశలో అతని ఇంటి ఎదుటే పూడ్చాలని పట్టుపట్టారు. వారికి కొత్తకోట సీఐ రమేష్‌బాబు, పెద్దమందడి ఎస్ఐ మురళీగౌడ్ నచ్చజెప్పి మృతదేహాన్ని శ్మశాన వాటికకు తరలించారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. -
ప్రకాశం జిల్లాలో డిగ్రీ విద్యార్థి దారుణ హత్య
-
పెళ్లి చేసుకోకుంటే శవానికైనా తాళికడతా!
నన్ను పెళ్లి చేసుకోకపోతే నీ శవానికైన తాళి కడతానని బెదిరించాడు ఓ విద్యార్థి. ఇదే విషయాన్ని బాధితురాలు కళాశాల ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకువెళ్లగా ... ఆయన హేళన చేశారు. మానసికంగా కుంగిపోయిన బాధితురాలిని గమనించిన తల్లి ఆ విషయాన్ని డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్న ఓ విద్యార్థి పట్ల సమీప కాలేజీలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న శ్రీనివాస్ తరచూ వేధిస్తున్నాడు. తనను ప్రేమించాలని పెళ్లిచేసుకుంటానని వెంటపడి, వేధించసాగాడు. ఆకతాయి వేధింపులు తట్టుకోలేని బాధితురాలు తాను చదువుతున్న కళాశాల ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేస్తే ఆయన హేళన చేశాడు. అవమాన భారంతో సదరు విద్యార్థి భోజనం చేయకుండా కుంగిపోతుండటంతో తల్లి గమనించి విషయాన్ని ఆరా తీసింది. తల్లి విషయం తెలుసుకుని విద్యార్థి శ్రీనివాస్‌పై డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశారు. అందరి సమక్షంలో విచారణ జరిపి శ్రీనివాస్‌పై చర్యలు తీసుకుంటామని డిగ్రీ ప్రిన్సిపాల్, అధ్యాపక బృందం విద్యార్థిని తల్లికి హామీ ఇచ్చారు. అదే సమయంలో అక్కడే ఉన్న పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి పొరపాటు ఇకపై జరిగితే ఊరుకునేది లేదని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. -
న్యూఇయర్ వేడుకల్లో విషాదం
-
డిగ్రీ విద్యార్థినిపై తోటి విద్యార్థి అత్యాచారయత్నం
కర్ణాటక:మహిళలపై కామాంధుల ఆకృత్యాలు అంతకంతకూ శృతిమించితూనే ఉన్నాయి. ఓ విద్యార్థినిపై తోటి విద్యార్థి అత్యాచారానికి యత్నించిన ఘటన తాజాగా వెలుగు చూసింది. కర్ణాటక రాష్ట్రంలోని దావణగిరిలో డిగ్రీ చదువుతున్న విద్యార్థినిపై ఆమె సహ విద్యార్థి అత్యాచారం చేయడానికి యత్నించాడు. బాధితురాలికి కరాటే రావడంతో ఆ యువకుడ్ని ప్రతిఘటించింది. దీంతో సహనం కోల్పోయిన ఆ విద్యార్థి ఆమె తలపై బండరాయితో మోదాడు. ఆమెకు తలనుంచి రక్తస్రావం కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. -
డిగ్రీ విద్యార్థిని కిడ్నాప్‌కు యత్నం
చిలకలూరిపేట, న్యూస్‌లైన్: కాలేజీకి వెళ్లేందుకు ఆటో ఎక్కిన డిగ్రీ విద్యార్థినిని కిడ్నాప్ చేసేందుకు డ్రైవర్ యత్నించిన సంఘటన చిలకలూరిపేట పట్టణంలో మంగళవారం కలకలం రేకెత్తించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గణపవరం గ్రామానికి చెందిన విద్యార్థిని పట్టణంలోని ఏఎంజీ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. మంగళవారం కళాశాలకు చేరుకోవటానికి గణపవరం సెంటర్లో ఆటో ఎక్కింది. ఆటోలో ఆమె ఒంటరిగా ఉండటంతో డ్రైవర్ కళాశాల వద్ద ఆపకుండా వేగంగా పోనిచ్చాడు. ఆమె రక్షించండి అంటూ కేకలు వేస్తూ, బస్టాండ్ సమీపంలో కిందకు దూకేసింది. గాయాలైన ఆమెను స్థానికులు ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. ఆసుపత్రిలో ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కొన్ని గంటల వ్యవధిలోనే ఆటో డ్రైవర్‌ను అరెస్టు చేశారు. నిందితుడు ప్రకాశం జిల్లా బయట మంజులూరు గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ రత్నాకర్పార్ధసారధిరాజు అని అర్బన్ సీఐ గొట్టిపాటి చెంచుబాబు సాయంత్రం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అడ్డరోడ్డు సెంటర్ సమీపంలో ఉన్న అతన్ని పోలీసులు వలపన్ని పట్టుకున్నారని చెప్పారు. నిందితుడిని పట్టుకున్న హెడ్‌కానిస్టేబుల్ సుబ్బారావు, ఏఎస్సై వెంకటేశ్వరరావులను అభినందించారు. -
టీ నోట్ ఆమోదంతో విద్యార్థి ఆత్మహత్యాయత్నం
తాడిమర్రి, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ర్టం ఏర్పాటుకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలపడంతో మనస్తాపానికి గురైన అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం పిన్నదరికి చెందిన డిగ్రీ విద్యార్థి సాకే రవికుమార్ (19) గురువారం అర్ధరాత్రి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యుల కథనం మేరకు... రవికుమార్ మూడేళ్ల వయసులోనే తల్లిదండ్రులు ఓబుళమ్మ, సాకే కుళ్లాయప్ప అనారోగ్యంతో మరణించారు. అప్పటి నుంచి గ్రామంలోని పిన్నమ్మ రామకృష్ణమ్మ ఇంటిలో ఉంటూ చదువుకుంటున్నాడు. రాష్ట్ర విభజన ప్రకటన వెలువడినప్పటి నుంచి స్నేహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసేవాడు. ఈ క్రమంలో కేంద్ర కేబినెట్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించి గురువవారం నోట్‌కు ఆమోదం తెలపడంతో తీవ్ర మనోవేదనకు గురై గురువారం అర్ధరాత్రి మిద్దెపెకైక్కి పురుగుల మందు తాగాడు. మందు ప్రభావంతో విలవిలలాడుతూ అరవలేక మందు డబ్బాను కిందకు విసిరేశాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే అతడిని బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు.