
డిగ్రీ విద్యార్థినిపై యాసిడ్ దాడి
హిందూపురం: అనంతపురం జిల్లాలో శనివారం సాయంత్రం అమానుషం జరిగింది. హిందూపురంలోని హస్నాబాద్లో ఓ విద్యార్థినిపై ఓ గుర్తు తెలియని దుండగుడు యాసిడ్తో దాడి చేశాడు. విద్యార్థినికి మెడపై కాలిన గాయాలయ్యాయి. తీవ్ర గాయాలతో ఆర్తనాదాలు చేస్తున్న ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది.
స్థానిక డిగ్రీ కళాశాలలో సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్ధిని కాలేజీ నుంచి ఇంటికి వస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. సైకిల్ మీద వచ్చిన దుండగుడు ఆమెపై యాసిడ్ చల్లి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దాడికి పాల్పడిన దుండగుల ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ అమానుషమైన యాసిడ్ దాడికి కారణం ప్రేమ వ్యవహారమా? లేక కుటుంబ కలహాలా? అన్న కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు.