అందరి గురించి ఆలోచించేవాడు
నలుగురికీ తల్లోనాలుకలా ఉండేవాడు
ఎవరికి ఏ జబ్బుచేసినా మందులిచ్చి నయం చేసేవాడు
సాయమంటే ముందుండేవాడు
ఆయనకే కష్టం వస్తే...
అయ్యోపాపం అనలేకపోయావా
కాస్త ఆదరణచూపలేకపోయావా?
జీవితంపై విరక్తి చెందితే ..
ఊరడింపుగా నాలుగు మాటలు చెప్పలేకపోయావా
కుటుంబంతో ఉరికంభమెక్కితే...
అలా చూస్తూ ఊరుకున్నావా
పసిగుడ్డు గొంతునులిమేసేంతగా మార్చేశావా..
ఆయువు ఆగి ఐదురోజులైనా కన్నెత్తి చూడలేకపోయావా
ఇప్పుడంతా అయిపోయింది..
ఆ మనిషి లేడు..ఆ కుటుంబమూ లేదు
నువ్వుండు.. నూరేళ్లు
నిర్దయగా...నిక్షేపంగా..
అలా నువ్వున్నా..లేనట్టే!
అందుకే అతను.. తన ఐదు నెలల ప్రతిరూపాన్ని వెంటతీసుకెళ్లాడు..
నార్పలకు చెందిన కృష్ణకిశోర్, శిరీష దంపతులు ఉరి వేసుకుని చనిపోగా..ఐదురోజుల తర్వాత ఇరుగుపొరుగు గుర్తించారు. లోనికి వెళ్లి చూడగా..వారి ప్రేమకు ప్రతిరూపమైన ఐదు నెలల పసికందు ఊయలలో నిర్జీవంగా కనిపించింది. ఈ దృశ్యాన్ని చూసిన మనసున్న మనిషెవరైనా ఇలాగే ప్రశ్నిస్తున్నాడు.. సమాజమా...నువ్వెక్కడా అని..
అనంతపురం
Comments
Please login to add a commentAdd a comment