Family numbers
-
సమాజమా నువ్వెక్కడ?
అందరి గురించి ఆలోచించేవాడునలుగురికీ తల్లోనాలుకలా ఉండేవాడుఎవరికి ఏ జబ్బుచేసినా మందులిచ్చి నయం చేసేవాడుసాయమంటే ముందుండేవాడుఆయనకే కష్టం వస్తే...అయ్యోపాపం అనలేకపోయావాకాస్త ఆదరణచూపలేకపోయావా?జీవితంపై విరక్తి చెందితే ..ఊరడింపుగా నాలుగు మాటలు చెప్పలేకపోయావాకుటుంబంతో ఉరికంభమెక్కితే...అలా చూస్తూ ఊరుకున్నావాపసిగుడ్డు గొంతునులిమేసేంతగా మార్చేశావా..ఆయువు ఆగి ఐదురోజులైనా కన్నెత్తి చూడలేకపోయావాఇప్పుడంతా అయిపోయింది..ఆ మనిషి లేడు..ఆ కుటుంబమూ లేదునువ్వుండు.. నూరేళ్లునిర్దయగా...నిక్షేపంగా..అలా నువ్వున్నా..లేనట్టే!అందుకే అతను.. తన ఐదు నెలల ప్రతిరూపాన్ని వెంటతీసుకెళ్లాడు..నార్పలకు చెందిన కృష్ణకిశోర్, శిరీష దంపతులు ఉరి వేసుకుని చనిపోగా..ఐదురోజుల తర్వాత ఇరుగుపొరుగు గుర్తించారు. లోనికి వెళ్లి చూడగా..వారి ప్రేమకు ప్రతిరూపమైన ఐదు నెలల పసికందు ఊయలలో నిర్జీవంగా కనిపించింది. ఈ దృశ్యాన్ని చూసిన మనసున్న మనిషెవరైనా ఇలాగే ప్రశ్నిస్తున్నాడు.. సమాజమా...నువ్వెక్కడా అని..అనంతపురం -
అత్త, వారి బంధువుల వేధింపులు తాళలేక క్షోభ అనుభవిస్తున్నా
పంజగుట్ట: గత 10 నెలలుగా అత్త, అత్త తరపు బంధువులు పెట్టే వేధింపులను తట్టుకోలేకపోతున్నానని, తమ సమీపబంధువు గౌతంరెడ్డి, అత్త గుణపటి పార్వతి, భర్త ఆదాల దామోదర్ రెడ్డి నుంచి తనకు, తన కుటుంబానికి ఆపద ఉందని గ్రీన్‌పార్క్, మారీగోల్డ్, ఆవాసా హోటల్స్ డైరెక్టర్ ఆదాల దామోదర్ రెడ్డి సతీమణి రచనా రెడ్డి వాపోయారు. ఇంట్లో ఉన్న తనను ఈ నెల 6న 15మంది బౌన్సర్లు వచ్చి దాడిచేసి కిడ్నాప్ చేసేందుకు యతి్నంచారన్నారు.ఈ విషయమై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ చెయ్యలేదని ఆమె ఆరోపించారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తన సోదరితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. 2022 సంవత్సరంలో తనకు దామోదర్ రెడ్డికి వివాహం అయ్యిందని అప్పటినుండి కొద్దికాలం సజావుగానే తమ దాంపత్యం కొనసాగిందన్నారు. తన భర్త తన మాటవింటున్నాడు కానీ తన అత్త పార్వతి భర్తనుండి విడదీసేందుకు కుట్రలు పన్నిందన్నారు. తమ సమీపబంధువు గ్రీన్‌పార్క్, మారీగోల్డ్ హోటల్స్ సీఈఓ గౌతంరెడ్డి మా అత్త సాయంతో తనను మానసిక క్షోభకు గురిచేస్తున్నారన్నారు. తన భర్తనుండి విడాకుల నోటీసు ఇప్పించడంతో గత కొంతకాలంగా తాను ఇల్లు వదిలి వెల్లిపోయానని తిరిగి కోర్టు ఆదేశాలతో గత నెల ఫిల్మ్‌నగర్ లోని తన భర్త ఇంటికి వచ్చినట్లు తెలిపారు. అప్పటినుండి తనను ఇంట్లోవేసి తాళం వెయ్యడం, గదిలో బంధించడం తీవ్రమానసిక వేదనకు గురిచేశారని తెలిపారు. తన అత్త పార్వతి, భర్త దామోదర్ రెడ్డి, గౌతమ్ రెడ్డి నుండి తనకు తన కుటుంబానికి ప్రాణహాని ఉందని రచనా రెడ్డి వాపోయారు. -
సత్యదేవుని సన్నిధిలో జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్యేలు
విజయనగరం: అన్నవరం సత్యనారాయణ స్వామిని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, పుష్పాంజలి దంపతులు, నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, పద్మావతి దంపతులు ఆదివారం దర్శించుకున్నారు. వారితో పాటు నూతన వధూవరులు సిరి సహస్ర, ప్రదీప్, ఇతర కుటుంబసభ్యులు సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించారు. ఈ సందర్భంగా వారికి ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం గర్భాలయంలో ఉన్న స్వామివారిని వారంతా దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. -
బాగున్నావా అవ్వా..!
శ్రీకాకుళం (వజ్రపుకొత్తూరు): బాతుపురం పంచాయతీ పెదవంక గ్రామానికి చెందిన మావోయిస్టు నేత చెల్లూరి నారాయణరావు(ప్రస్తుతం అండర్‌గ్రౌండ్‌లో ఉన్నారు) కుటుంబ సభ్యులను ఎస్పీ జి.ఆర్.రాధిక కలిశారు. వజ్రపుకొత్తూరు మండలంలో మంగళవారం పర్యటించిన ఆమె రాజాంలో ఉంటున్న నారాయణరావు తల్లి నీలమ్మను కలిసి అవ్వా.. నీ అరోగ్యం ఎలా ఉందంటూ ఆప్యాయంగా పలకరించారు. కుటుంబ నేపథ్యం, ప్రస్తుత జీవన విధానం అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని, అవసరమైన చికిత్స అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కుటుంబ సభ్యులకు పోలీసులు ఉండగా ఉంటారని, ఎలాంటి సమస్య వచ్చినా సంప్రదించాలని సూచించారు. అనంతరం కొంత నగదు, పండ్లు అందజేశారు. ఆమెతో పాటు కాశీబుగ్గ డీఎస్పీ శివరామిరెడ్డి, కాశీబుగ్గ సీఐ డి.రాము, ఎస్సై కూన గోవిందరావు తదితరులు ఉన్నారు. -
అమానుషం: వృద్ధుడిని చాపలో చుట్టి పడేశారు!
సాక్షి, అడ్డగూడూరు(నల్లగొండ): సాకే ఇష్టం లేక కుటుంబీకులో, లేక మరేదైనా కారణంతో గానీ.. గుర్తుతెలియని వ్యక్తులు ఓ వృద్ధుడిని చాపలో చుట్టి పడేసి వెళ్లారు. ఈ అమానుష ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూరు మండల పరిధిలో కంచనపల్లి గ్రామం స్టేజీ వద్ద గురువారం చోటుచేసుకుంది. కంచన్లపల్లి స్టేజి వద్ద వృద్ధుడు చాపలో చుట్టబడి ఉండడంతో స్థానికులు గమనించి పోలీసుకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకొని అతడికి పక్షవాతం వచ్చినట్లు గుర్తించి 108 అంబులెన్స్‌లో మోత్కూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. వృద్ధుడి వివరాలు ఆరాతీస్తున్నామని పోలీసులు తెలిపారు. చదవండి: ఇప్పుడే వస్తానంటూ వెళ్ళింది.. ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ -
నువ్వు స్టార్‌వా? మేం నమ్మాలా!
ప్రపంచమంతా కత్రినా కైఫ్ ‘స్టార్ డమ్’ని గుర్తించింది. కానీ, ఇంట్లోవాళ్లు మాత్రం ‘‘నువ్వు స్టార్‌వా? అది మేం నమ్మాలా?’’ అని కామెంట్ చేసేవారట. ఇటీవల ఓ సందర్భంలో కత్రినానే ఈ విషయం చెప్పారు. ముగ్గురు అక్కలు, ముగ్గురు చెల్లెళ్లు, ఒక అన్నయ్య.. టోటల్‌గా కత్రినా తోడబుట్టినవాళ్లు ఏడుగురు. కత్రినా తల్లి, ఈ ఏడుగురూ కలిసి అమెరికాలో ఉంటారు. అయినప్పటికీ కత్రినా స్టార్డమ్ గురించి తెలిసే అవకాశం లేకపోలేదు. హిందీ రంగంలో తనకెంత సీన్ ఉందో కుటుంబ సభ్యులకు చెప్పడానికి ప్రయత్నించినా, కత్రినా గొప్పలు చెబుతుందనుకునేవాళ్లట. కానీ, లండన్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియమ్‌లో కత్రినా మైనపు బొమ్మ పెట్టిన తర్వాత ఆమె కుటుంబ సభ్యుల మనసు ఒక్కసారిగా మారిపోయిందట. పాప్ గాయకుడు జస్టిన్ బీబర్ మైనపు బొమ్మ పక్కనే కత్రినాది ఉండడం ఆమె కుటుంబం సభ్యులను ఆనందపరిచిందట. ‘నీ స్టార్డమ్ కేక... నువ్వు సూపర్’ అని అభినందించారనీ, కుటుంబ సభ్యుల ప్రశంసలు ప్రత్యేకంగా అనిపించాయనీ అన్నారు కత్రినా.