
108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తున్న సిబ్బంది
సాక్షి, అడ్డగూడూరు(నల్లగొండ): సాకే ఇష్టం లేక కుటుంబీకులో, లేక మరేదైనా కారణంతో గానీ.. గుర్తుతెలియని వ్యక్తులు ఓ వృద్ధుడిని చాపలో చుట్టి పడేసి వెళ్లారు. ఈ అమానుష ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూరు మండల పరిధిలో కంచనపల్లి గ్రామం స్టేజీ వద్ద గురువారం చోటుచేసుకుంది.
కంచన్లపల్లి స్టేజి వద్ద వృద్ధుడు చాపలో చుట్టబడి ఉండడంతో స్థానికులు గమనించి పోలీసుకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకొని అతడికి పక్షవాతం వచ్చినట్లు గుర్తించి 108 అంబులెన్స్‌లో మోత్కూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. వృద్ధుడి వివరాలు ఆరాతీస్తున్నామని పోలీసులు తెలిపారు.
చదవండి: ఇప్పుడే వస్తానంటూ వెళ్ళింది.. ఫోన్ చేస్తే స్విచ్చాఫ్
Comments
Please login to add a commentAdd a comment