నువ్వు స్టార్‌వా? మేం నమ్మాలా! | Katrina Kaif's Family is Finally Taking Her Stardom 'Seriously' | Sakshi
Sakshi News home page

నువ్వు స్టార్‌వా? మేం నమ్మాలా!

Published Mon, May 4 2015 11:11 PM | Last Updated on Sun, Sep 3 2017 1:25 AM

నువ్వు స్టార్‌వా? మేం నమ్మాలా!

నువ్వు స్టార్‌వా? మేం నమ్మాలా!

ప్రపంచమంతా కత్రినా కైఫ్ ‘స్టార్ డమ్’ని గుర్తించింది. కానీ, ఇంట్లోవాళ్లు మాత్రం ‘‘నువ్వు స్టార్‌వా? అది మేం నమ్మాలా?’’  అని కామెంట్ చేసేవారట. ఇటీవల ఓ సందర్భంలో కత్రినానే ఈ విషయం చెప్పారు. ముగ్గురు అక్కలు, ముగ్గురు చెల్లెళ్లు, ఒక అన్నయ్య.. టోటల్‌గా కత్రినా తోడబుట్టినవాళ్లు ఏడుగురు. కత్రినా తల్లి, ఈ ఏడుగురూ కలిసి అమెరికాలో ఉంటారు. అయినప్పటికీ కత్రినా స్టార్‌డమ్ గురించి తెలిసే అవకాశం లేకపోలేదు.
 
  హిందీ రంగంలో తనకెంత సీన్ ఉందో కుటుంబ సభ్యులకు చెప్పడానికి ప్రయత్నించినా, కత్రినా గొప్పలు చెబుతుందనుకునేవాళ్లట. కానీ, లండన్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియమ్‌లో కత్రినా మైనపు బొమ్మ పెట్టిన తర్వాత ఆమె కుటుంబ సభ్యుల మనసు ఒక్కసారిగా మారిపోయిందట. పాప్ గాయకుడు జస్టిన్ బీబర్ మైనపు బొమ్మ పక్కనే కత్రినాది ఉండడం ఆమె కుటుంబం సభ్యులను ఆనందపరిచిందట. ‘నీ స్టార్‌డమ్ కేక... నువ్వు సూపర్’ అని అభినందించారనీ, కుటుంబ సభ్యుల ప్రశంసలు ప్రత్యేకంగా అనిపించాయనీ అన్నారు కత్రినా.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement