
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ఆధ్యాత్మిక బాట పట్టారు. కర్ణాటకలోని ప్రముఖ కుక్కే శ్రీ సుబ్రమణ్య ఆలయాన్ని సందర్శించారు. ఇటీవలే కుంభమేళాలోనూ కత్రినా కైఫ్ పుణ్యస్నానమాచరించారు. తాజాగా శ్రీ సుబ్రమణ్య ప్రత్యేకమైన పూజులు చేశారు. అనంతరం అక్కడే నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్‌ను పెళ్లాడిన కత్రినా కైఫ్ స్టార్ హీరోయిన్‌గా పలు సినిమాల్లో నటించింది. హీరో విక్కీ కౌశల్ ప్రేమాయణం నడిపిన ముద్దుగుమ్మ 2021లో అతన్ని పెళ్లాడింది. తెలుగులో వెంకటేశ్ సరసన మల్లీశ్వరి చిత్రంలో మెరిసింది. 2023లో మేరీ క్రిస్మస్, టైగర్-3 చిత్రాలతో అభిమానులను మెప్పించిన ముద్దుగుమ్మ ప్రస్తుతం ఎలాంటి ప్రాజెక్ట్‌లో నటించడం లేదు. ప్రస్తుతం ఆమె భర్త విక్కీ కౌశల్ నటించిన ఛావా మూవీ థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతోంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా ఛావాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇటీవలే తెలుగులోనూ థియేటర్లలో విడుదల చేశారు. ఇప్పటికీ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులు సృష్టిస్తోంది.
కాగా... కత్రినా కైఫ్ ఇటీవల ఐఫా అవార్డ్స్- 2025 వేడుకలో మెరిసింది. జైపూర్‌లో జరిగిన ఈ వేడుకల్లో పలువురు సినీ అగ్రతారలు పాల్గొని సందడి చేశారు. ఈ అవార్డ్స్‌లో కిరణ్ రావు తెరకెక్కించిన లపతా లేడీస్ అత్యధిక అవార్డులు సొంతం చేసుకుంది. ఈ వేడుకల్లో బాలీవుడ్ సినీతారలు షారూఖ్ ఖాన్, రవీనా టాండన్, ఆమె కుమార్తె రాషా తడాని, అభిషేక్ బెనర్జీ వంటి ప్రముఖులు కూడా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment