
తొమ్మిది నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయిన భారత సంతతి నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమికి తిరిగి వచ్చారు. అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో దాదాపు 288 రోజులు గడిపారు. నాసా ఎప్పటికప్పుడూ వారి బాగోగులను ట్రాక్ చేస్తూనే ఉంది.
ఇరువురు తగినంత పోషకాహారాం తీసుకుంటున్నారా..? లేదా అనేది అత్యంత ముఖ్యం. ఈ విషయంలో నాసా తగిన జాగ్రత్తలు తీసుకోవడమే గాక వారి ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను వెల్లడించేది కూడా. నిజానికి ఆ సున్నా గురుత్వాకర్షణలో వ్యోమగాములు ఆహారం తీసుకోవడంలో చాలా సవాళ్లు ఉంటాయి. మరీ వాటిని సునీతా విలియమ్స్, ఆమెతోపాటు చిక్కుకుపోయిన బుచ్ విల్మోర్ ఎలా అధిగమించారు. ఎలాంటి డైట్ తీసుకునేవారు తదితరాల గురించి తెలుసుకుందామా..!.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సునీతా, బుచ్ విల్మోర్ ప్రత్యేక డైట్‌ని ఫాలో అయ్యేవారు. ప్రత్యేక పద్ధతిలో నిల్వ చేసిన ఆహారాన్ని (Self-Sable Menu) తీసుకునేవారు. నివేదికల ప్రకారం.. సునీతా పిజ్జా, రోస్ట్ చికెన్, రొయ్యలు, కాక్‌టెయిల్స్ వంటి కంఫర్ట్ ఫుడ్స్ తీసుకునేవారు. అవన్నీ నాసా స్పేస్ ఫుడ్ సిస్టమ్స్ లాబొరేటరీలో ప్రత్యేకంగా తయారు చేసిన వంటకాలు. పాడవ్వకుండా నిల్వ ఉండే ఈ ఆహారాన్ని ఫుడ్ వార్మర్ ఉపయోగించి వేడిచేసుకుని ఆస్వాదిస్తే చాలు.
ఎంత పరిమాణంలో తీసుకుంటారంటే..
వ్యోమగామి రోజువారీగా 3.8 పౌండ్ల పౌండ్ల మేర ఆహారం తీసుకునేలా కేర్ తీసుకుంటారు. దీన్ని ఆయా వ్యక్తుల పోషకాల పరిమితి మేర నిర్ణయిస్తారు నాసా అధికారులు. అయితే విలియమ్స్ ఆ పరిమితి పరిధిలోనే తగినంత ఆహారం తీసుకునేలా కేర్ తీసుకున్నారు. అయితే ఆ వ్యోమగాములు ఎనిమిది రోజులు ఉండటానికి వెళ్లి సుదీర్ఘకాలం చిక్కుకుపోవాల్సి రావడంతో మొదటలో తాజా పండ్లు, తాజా ఆహారం తీసుకున్నారు.
మూడు నెలలు తర్వాత మాత్రం డ్రై కూరగాయాలు, పండ్లపై ఆధారపడక తప్పలేదు. ఇక బ్రేక్‌ఫాస్ట్‌లో పొడిపాలతో కూడిన తృణధాన్యాలను తీసుకునేవారు. ఇక ప్రోటీన్‌ల పరంగా మాత్రం వండేసిన ట్యూనా, మాంసం ఉంటాయి. అంతరిక్షంలో భూమ్మీద ముందే వండేసిన వంటకాలనే పాడవ్వకుండా ఉండేలా తయారు చేసుకుని తీసుకువెళ్తారు. అక్కడ జస్ట్ వేడి చేసుకుని తింటే సరిపోతుంది. ఇక అక్కడ ఉన్నంత కాలం వ్యోమగాములు దాదాపు 530-గాలన్ల మంచినీటి ట్యాంక్‌ని ఉపయోగించినట్లు సమాచారం.
సుదీర్ఘకాల అంతరిక్ష ప్రయాణంలో తెలుసుకున్నవి..
విలియమ్స తన మిషన్‌లో భాగంగా అత్యాధునిక ఆహారం గురించి పరిశోధన చేశారు. ముఖ్యంగా అంతరిక్షంలో ఉండే వ్యోమగాములు తాజా పోషకాలతో కూడిన ఆహారం తీసుకునేలా మంచి బ్యాక్టీరియాను ఉపయోగించి మొక్కల పెంపకం, వ్యవసాయం వంటివి ఎలా చెయ్యొచ్చు. అక్కడ ఉండే తగినంత మేర నీటితోనే కూరగాయలు, పువ్వుల మొక్కలు ఎలా పెంచొచ్చు వంటి వాటి గురించి సమగ్ర పరిశోధన చేశారు.
అంతేగాదు ఆ మైక్రోగ్రావిటీలో "ఔట్రెడ్జియస్" రోమైన్ లెట్యూస్ - అనే ఒక రకమైన ఎర్ర లెట్యూస్ మొక్కను పెంచడం వంటివి చేశారు కూడా. అడ్వాన్స్‌డ్ ప్లాంట్ హాబిటాట్ కార్యకలాపాలతో సుదీర్ఘ అంతరిక్ష ప్రయాణాలకు మార్గం సుగమం చేయడమే గాక వ్యోమగాములకు ఉపకరించే ఆహార వ్యవస్థలను అభివృద్ధి చేయగలిగే ఓ కొత్త ఆశను రేకెత్తించారు.
(చదవండి: Sunita Williams: సునీతా విలియమ్స్ ఫ్యామిలీ..)
Comments
Please login to add a commentAdd a comment