
బరువు తగ్గడం అంటే సాధారణంగా అందరు అనుకునేది నోటిని కంట్రోల్ చేయడమే మార్గం అని. కానీ ఈ ఇన్‌ఫ్లుయెన్సర్ మాత్రం ముమ్మాటికి అది మాత్రం కాదని చెప్పేస్తోంది. అలాగే మాటిమాటికి బరువుని చెక్‌చేసుకుంటూ వర్కౌట్లు చేయడం కాదని అంటోంది. ఆహారంతో ఆరోగ్యకరమై, స్థిరమైన బంధాన్ని ఏర్పరుచుకుంటే బరువుకి చెక్‌పెట్టగలమని చెబుతోందామె. ఆ విధంగానే తాను బరువు తగ్గానంటూ తన వెయిట్‌లాస్ సీక్రెట్‌ని బయటపెట్టారామె. ఇంతకీ ఆమె ఎలాంటి చిట్కాను అనుసరించిందంటే..
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ గురిష్క్ కౌర్ తన వెయిట్‌లాస్ సీక్రెట్‌ని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారామె. ప్రతి కేలరీలను లెక్కించడం కంటే సమతుల్యతకు పెద్దపీటను వేయమని చెబుతున్నారామె. దాంతోపాటు తాను అనుసరించిన ఈ సింపుల్ చిట్కాలను కూడా అనుసరించినట్లు తెలిపింది.
సింపుల్ చిట్కాలు..
నేచురల్ ఆహారం..
ఆహారం పట్ల వ్యామోహాన్ని నియంత్నించేలా సహజమైన ఆహారానికే ప్రాధాన్యత ఇవ్వాలి. అంటే ప్రాసెస్ చేసిన ఆహారాల కంటే మొక్కల ఆధారిత ఆహారాలనే స్వీకరించాలి. ఆరోగ్య అవసరాలను, ఆకలి కోరికను తీర్చే ఆహారానికే ప్రాధాన్యత ఇవ్వాలంటోంది. ఆకలి సంకేతాల తోపాటు..సమతుల్యంగా తినడం మరవకూడదంటోంది. ఆకలి సంకేతాలు..సమతుల్య భోజనంపైనే ఫోకస్ పెట్టినట్లు నర్మగర్భంగా చెప్పింది.
మైండ్‌ఫుల్‌గా తినడం..
పోషకాహారాలను మనఃపూర్వకంగా తినాలి. ఏదో గబగబ ితినేయడం ాకాకుండా. వాటిని ఇష్టంగా, ఎలా తింటున్నాం అనే దానిపై అటెన్షన్ ఉండాలని చెబుతోందామె.
ఆరోగ్యకరమైన ఆహారానికే ప్రాధాన్యత..
చీట్‌మీల్ వంటి వాటికి చోటివ్వకుండా, స్థిరత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలి. కొన్ని ఆహారాలు మరింత ోపోషకాలు ఉన్నా కూడా ఆరోగ్యానికి బెస్ట్ అయితేనే తీసుకోవాలి. ఒకవేళ జంక్‌ఫుడ్‌ని తినేసినా..దాన్ని కరిగించేలా వర్కౌట్లు బాగా చేయాలి.
ఆహరం కంటే..లైఫ్‌స్టైల్ మారాలి..
కేవలం డైట్‌కే ప్రాధాన్యత ఇవ్వొద్దు. సమతుల్యంగా తినడం, మంచి ఆహారపు అలవాట్లును భాగం చేసుకునే ప్రయత్నం చేయాలంటోంది.
బ్రేక్ చేయకపోవడం..
ఏర్పరచుకున్న లక్ష్యానికి అనుగుణంగా తినేలా ఉండాలి. ఏ మాత్రం ఆశయాన్ని బ్రేక్ చేయని స్ట్రాంగ్ మైండ్‌సెట్‌తో ఉండాలి.
ఇక్కడ ఇన్‌ఫ్లుయెన్సర్ గురిష్క్ కౌర్ బరువు తగ్గడం అనేది ఎలాంటి ఆహారం ఎంచుకోవాలి అనేదాని కంటే..మనసుకి సంబంధించిన పని అని అంటోంది. అది మన నియంత్రణలో ఉంటే ప్రతీది అవలీలగా జయించగలమని చెబుతోంది. ఆ విధమైన జీవనశైలి మార్పులతోనే సుమారు 59 కిలోలు తగ్గినట్లు చెప్పుకొచ్చింది.
(చదవండి: 'నో ఛాన్స్..జస్ట్ ఫోర్స్'..! వైరల్‌గా మహిళ భావోద్వేగ పోస్ట్)