PM Modi: రైతు మాదిరిగా ఆహారపు అలవాట్లు ఉండాలి..! | PM Narendra Modi: Like Farmer Way Of Eating For Good Health | Sakshi
Sakshi News home page

ఆహారపు అలవాట్లకు సంబంధించి రైతు పద్ధతిని అనుసరించండి!

Published Tue, Feb 11 2025 2:26 PM | Last Updated on Tue, Feb 11 2025 6:54 PM

PM Narendra Modi: Like Farmer Way Of Eating For Good Health

పరీక్ష పై చర్చ(పీపీసీ(Pariksha Pe Charcha 2025) ఎనిమిదవ ఎడిషన్‌ గత సోమవారం(ఫిబ్రవరి 10, 2025న) న్యూఢిల్లీలో జరిగింది. ఆ సెషన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) విద్యార్థులు, ఉపాధ్యాయులను ఉద్దేశించి సంభాషించారు. ఈ కార్యక్రమం లక్ష్యం విద్యార్థులు పరీక్షల ఒత్తిడిని ఎలా జయించాలో మార్గదర్శకత్వం చేయడమే. అయితే ఈ కార్యక్రమంలో మోదీ ఆహారపు అలవాట్లు, ఎలా తినాలి వంటి వాటి గురించి కూడా విద్యార్థులకు చక్కటి సూచనలిచ్చారు. అవేంటో చూద్దామా..

ఇక మోదీ ఈ సెషన్‌లో మంచి ఆరోగ్యం, జ్ఞాపక శక్తికోసం పోషకాహారం ప్రాముఖ్యత గురించి హైలెట్‌ చేశారు. శరీరానికి చిరుధాన్యాలు, కాలానుగుణ కూరగాయలు వంటివి ఎంత ముఖ్యమో వివరించారు. అంతేగాదు ఆ సెషన్‌లో మోదీ విద్యార్థులకు తిల లడ్డూ(నువ్వుల లడ్డూ)లను ఇస్తూ..వీటిని శీతాకాలంలో ఎందుకు తినాలో తెలుసా అని ప్రశ్నించారు. దానికి విద్యార్థులు నువ్వులు శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయని బదులిచ్చారు. 

ఆ తర్వాత చిరుధాన్యాల వినియోగం గురించి కూడా మాట్లాడారు. ఐక్యరాజ్యసమితి 2023ని 'అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం'గా ప్రకటించిందని, అలాగే భారత్‌ కూడా ప్రపంచవ్యాప్తంగా ఎలా ప్రోత్సహించిందో వివరించారు. మన దేశంలో సహజసిద్ధంగా లభించే వాటిలో ఉండే పోషకాల గురించి అవగాహన కల్పించడంపై భారత ప్రభుత్వం ఎలా  ఆసక్తి కనబరుస్తుందో కూడా ప్రస్తావించారు. అలాగే వాటికి పలు రకాల వ్యాధులను నివారించే శక్తి ఉండటమేగాక రాకుండా నివారించే శక్తి ఉందని చెప్పారు. 

ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలంటే..
ఆ కార్యక్రమంలో పరీక్షల ప్రిపరేషన్‌కి సంబంధించిన పలు ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం తోపాటు సకాలంలో భోజనం చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి కూడా చెప్పారు. అంతేగాదు ఎప్పుడు తినాలి, ఎలా తినాలి, ఏమి తినాలి వంటి ప్రశ్నలకు కూడా సమాధానమిచ్చారు. అయితే విద్యార్థులకు పోషకాహారానికే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. 

భారతదేశంలోని రైతులు(farmers) ఉదయాన్నే నిద్రలేచి భోజనం చేస్తారు, రోజంతా పని చేస్తారు మళ్లా ఇంటికి వచ్చి సూర్యాస్తమయానికి  ముందే రాత్రి భోజనం(dinner) చేస్తారు. నిజంగా ఇది వేళ్లకు భోజనం చేసే మంచి అలవాటుగా పేర్కొన్నారు. ఇది జీర్ణక్రియకు మెరుగ్గా ఉంచుతుంది. అలాగే ఆరోగ్యంగా ఉండేలా చేయడమే గాక దీర్ఘాయువుని అందిస్తుందని అన్నారు. 

నిపుణలు అభిప్రాయం ప్రకారం..ప్రధాని మోదీ చెప్పినట్లుగా సాయంత్రం ఏడు గంటలకు ముందు తినడం వల్ల ఆయుష్షు సుమారు 35% పెరుగుతుందని సర్వేలో తేలింది. ఇటలీలోని ఎల్'అక్విలా ప్రాంతంలో నిర్వహించిన మరో పరిశోధనలో సెంచరీ దాటిన చాలమంది వ్యక్తుల్లో సైతం వృద్ధాప్య లక్షణాలు తక్కువుగా ఉన్నట్లు చెప్పారు. 

వారంతా మెక్కలు ఆధారిత ఆహార పదార్థాలు, కేలరీలు తక్కువుగా ఉన్న భోజనమే తీసుకున్నట్లు కూడా పరిశోధన పేర్కొంది. కాబట్టి అందరూ ఎంత పని ఒత్తిడి ఉన్నా వేళకు పోషకాలతో కూడిన ఆహారం తీసుకునే యత్నం చేసి ఆరోగ్యంగా ఉందామా..!:.

(చదవండి: తేనె-నిమ్మకాయ నీటితో బరువు తగ్గరు: హర్ష్‌ గోయెంకా ఫైర్‌)

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement