![Operation Devil Hunt 1300 Arrested In Bangladesh](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/Bangla.jpg.webp?itok=TRNEQ1zE)
ఢాకా: బంగ్లాదేశ్‌లో మాజీ ప్రధాని షేక్ హసీనా మద్దతుదారులపై ఆపరేషన్ డెవిల్స్ హంట్ పేరిట దాడులు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా దాదాపు 1300 మందిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. కాగా, షేక్ హసీనాకు చెందిన అవామీలీగ్ పార్టీ భవనాలు, ఆస్తులను లక్ష్యంగా చేసుకొని కొందరు దాడులు చేస్తున్నారు. వీటిని అరికట్టేందుకు, ప్రత్యర్థుల ఏరివేతకు మహ్మద్ యూనస్ ప్రభుత్వం ప్లాన్ చేసింది.
బంగ్లాదేశ్‌లో యూనస్ సర్కారు ప్రత్యర్థులను వేధించేందుకు సరికొత్త చర్యలు మొదలుపెట్టింది. బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటై ఆరు నెలలు కావొస్తున్న నేపథ్యంలో దేశంలో అస్థిరతను సృష్టించే వారిని సర్కార్ టార్గెట్ చేసింది. ఈ క్రమంలోనే మాజీ ప్రధాని షేక్ హసీనా మద్దతుదారులపై ఆపరేషన్ డెవిల్స్ హంట్ పేరిట దాడులు మొదలుపెట్టింది. ఢాకా శివారులోని గాజీపుర్‌లో విద్యార్థులపై దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకునేందుకు ‘ఆపరేషన్ డెవిల్ హంట్’ను ప్రారంభించినట్టు ఇంటీరియర్ మినిస్ట్రీ అధిపతి జహంగీర్ ఆలమ్ చౌద్రీ చెప్పుకొచ్చారు.
ప్రజా భద్రతలో భాగంగానే దీనిని అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ‘ఆపరేషన్ డెవిల్ హంట్’లో ఇప్పటికే 1300 అరెస్ట్ చేశారు. మరి కొంత మందిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జహంగీర్ ఆలమ్ మాట్లాడుతూ..‘బంగ్లాదేశ్‌లో విద్యార్థి ఉద్యమం తర్వాత చేపట్టిన దాడులు మరింత పెరిగాయి. వారి ఏరివేతే లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. దుష్టశక్తులను అంతం చేసే వరకు ఇది ఆగదు అంటూ కామెంట్స్ చేశారు.
ఇదిలా ఉండగా.. ఇటీవల హేక్ హసీనా కుటుంబ భవనాలపై కొందరు దాడులు చేసి ధ్వంసం చేశారు. ఈ క్రమంలో బంగబంధు షేక్ ముజిబుర్ రహ్మన్ స్మారక భవనంపై దాడి చేశారు. ఈ దాడిలో భవనం పూర్తిగా దెబ్బతిని.. మ్యూజియం కూడా ధ్వంసమైంది. ఈ నేపథ్యంలో ప్రజలు సంయమనంతో వ్యవహరించాలని మహమ్మద్ యూనస్ కూడా విజ్ఞప్తి చేశారు. ఇటీవల ఓ మంత్రిపై దాడికి ఈ గ్యాంగ్‌లే కారణమని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment