shaik haseena
-
షేక్ హసీనాకు బిగుస్తున్న ఉచ్చు.. మరో షాకిచ్చిన బంగ్లా సర్కార్
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను మరో బిగ్ షాక్ తగిలింది. బంగ్లాలోని యూనస్ ప్రభుత్వం హసీనా టార్గెట్‌గా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే హాసీనా హయాంలో జరిగిన కొన్ని ఘటనలపై విచారణ జరుపుతోంది. వీటిపై ఐదుగురు సభ్యుల కమిషన్‌ను సైతం ఏర్పాటు చేసింది. తాజాగా కమిషన్ రిపోర్టులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి.బంగ్లాదేశ్‌లో పలువురు అధికారుల అదృశ్యం, కొన్ని హత్యలపై బంగ్లా ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది. రిటైర్డ్ జస్టిస్ మైనుల్ ఇస్లాం చౌదరి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కమిషన్ ‘అన్‌ఫోల్డింగ్ ది ట్రూత్’ అనే నివేదికను యూనస్‌కు అందజేసింది. ఈ కమిషన్ శనివారం మొదటి నివేదికను అందజేసింది. ఇందులో భాగంగా హసీనా హయాంలో మిస్సింగ్ కేసులపై 1,676 ఫిర్యాదులు రాగా.. 3500 మంది అదృశ్యమైనట్టు నివేదికలో పేర్కొంది. వీరిలో పలువురు ప్రభుత్వ అధికారులు కూడా ఉన్నారని తెలిపింది. అక్రమ అరెస్ట్ చేసిన కొందరు కనిపించడంలేదని, హత్యకు గురైనట్టు కూడా తెలిపింది. ఇదే సమయంలో రహస్య నిర్బంధ కేంద్రాల గురించి కూడా వెల్లడించింది. వీటన్నింటిలో హసీనా సహా పలువురు డిఫెన్స్ అధికారులే కారణమని బాంబు పేల్చింది.ఇక, ఈ అంశాలపై కమిషన్ పూర్తి విచారణ ప్రక్రియకు మరో మూడు నుంచి నాలుగు నెలల సమయం పడుతుందని సభ్యులు తెలిపారు. తుది నివేదికను మార్చిలో అందించనున్నట్టు స్పష్టం చేశారు. ఈ సందర్బంగా ప్రధాని యూనస్ మాట్లాడుతూ.. కమిషన్ మొదటి మధ్యంతర నివేదికకు కృతజ్ఞతలు తెలిపారు. విచారణలో భాగంగా కమిషన్ సభ్యులకు ఎలాంటి సహాయం కావాలన్న చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. అలాగే, విచారణలో భాగంగా తాను రహస్య నిర్భంద కేంద్రాలను, జాయింట్ ఇంటరాగేషన్ సెల్స్‌ను సందర్శిస్తానని చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా.. కొద్ది నెలల క్రితం బంగ్లాదేశ్‌లో పౌరుల తిరుగుబాటు కారణంగా షేక్ హసీనా దేశం నుంచి పారిపోయి వచ్చి.. భారత్‌లో తలదాచుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమెను బంగ్లాదేశ్‌కు తిరిగి తీసుకువచ్చేందుకు యూనస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే ఆమెపై పలు రకాల కేసులను పెడుతోంది. -
బంగ్లాలో కృష్ణదాస్ అక్రమ అరెస్ట్.. స్పందించిన షేక్ హసీనా
ఢిల్లీ : ‘ఇస్కాన్‌కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్ ప్రభును అన్యాయం అరెస్ట్ చేశారు. చిన్మయ్ కృష్ణదాస్ ప్రభు అరెస్ట్‌ను ఖండిస్తున్నాం. ఆయను వెంటనే విడుదల చేయాలి. లేదంటే బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వం మానవ హక్కుల ఉల్లంఘన శిక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా హెచ్చరికలు జారీ చేశారు.ప్రార్ధనా మందిరాల్లో దాడులు, ఘర్షణలు, బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న మహమ్మద్ యూనస్ పాలనపై షేక్ హసీనా స్పందించారు. ఓ స్టేట్మెంట్ను విడుదల చేశారు. అందులో.. ఆర్థిక వ్యవస్థ, శాంతిభద్రతలను నిర్వహించడంలో బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వ సామర్థ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. Former Bangladesh PM Sheikh Hasina issues statement in support of Hindu priest Chinmoy Das:A lawyer has been killed in Chittagong, strongly protesting this murder. Those involved in this murder should be found and punished quickly. Human rights have been grossly violated… pic.twitter.com/7AO3BDTtmn— IANS (@ians_india) November 28, 2024‘నిత్యవసర వస్తువుల ధరలను నియంత్రణ, ప్రజల జీవితాలకు భద్రత కల్పించడంలో ప్రస్తుత యూనిస్ ప్రభుత్వం అన్ని రకాలుగా విఫలమైంది. సామాన్య ప్రజలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా జరుగుతున్న దాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నాను’. కృష్ణదాస్ అరెస్ట్‌కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలు ఉద్రిక్తతకు దారి తీశాయి. హింసాత్మకంగా చెలరేగిన ఘర్షణల్లో ఓ న్యాయవాది మరణించినట్లు చిట్టగాంగ్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నజీమ్ ఉద్దిన్ చౌదరి తెలిపారు. న్యాయ వాది మరణంలో ప్రభుత్వ వైఫల్యంపై మండిపడ్డారు. నిందితుల్ని శిక్షించడంలో మధ్యంతర ప్రభుత్వం విఫలమైతే మానవ హక్కుల ఉల్లంఘన శిక్షను ఎదుర్కోవలని ఉంటుందని హెచ్చరించారు.చిట్టగాంగ్‌లో ఒక న్యాయవాది హత్యకు గురయ్యారు. ఈ హత్యకు పాల్పడిన నేరస్తుల్ని వెంటనే శిక్షించాలి. ఈ రకమైన దేశ ఉనికిని దెబ్బ తీసేలా వ్యవహరిస్తున్న సంఘ విద్రోహ శక్తులపై ఐక్యంగా పోరాడాలని బంగ్లాదేశ్ ప్రజలందరికి విజ్ఞప్తి చేస్తున్నాను’ అని అన్నారు. -
బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకు కొత్త టెన్షన్!
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఉచ్చు బిగుస్తోంది. షేక్ హసీనాను తమ దేశం రప్పించేందుకు తాత్కాలిక ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు.. ఆమె వందల సంఖ్యలో కేసులు నమోదు కావడం విశేషం. తాజాగా షేక్ హసీనాపై నమోదైన కేసుల సంఖ్య 155కి చేరింది.కాగా, బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఘటనల కారణంగా షేక్ హసీనా భారత్‌లో తలదాచుకుంటున్నారు. ఇప్పట్లో ఆమె బంగ్లాదేశ్‌కు వెళ్లే సూచనలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఎలాగైనా ఆమెను తిరిగి బంగ్లాకు రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అటు తాత్కాలిక ప్రభుత్వం సైతం ఇదే పనిలో బిజీగా ఉంది. అయితే, హింసాత్మక ఘటనల్లో 22 ఏళ్ల విద్యార్థి హత్యకు సంబంధించి హసీనాతోపాటు మరో 58 మందిపై హత్య కేసు నమోదైనట్లు స్థానిక మీడియా పేర్కొంది.ఇక, హసీనాపై ఇప్పటివరకు 155 కేసులు నమోదయ్యాయి. ఇందులో హత్య కేసులే 136 ఉన్నాయి. మారణహోమం, ఇతర నేరాలకు సంబంధించి ఏడు, మూడు అపహరణ, ఎనిమిది హత్యాయత్నంతోపాటు బీఎన్పీ పార్టీ ఊరేగింపుపై దాడికి సంబంధించిన కేసులున్నాయి. దీంతో, నేరాలు, కేసుల విషయంలో ఆమె బంగ్లాదేశ్‌కు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. మరోవైపు.. ఈ క్రమంలో భారత్‌లో ఆశ్రయం పొందుతున్న మాజీ ప్రధాని షేక్ హసీనాను బంగ్లాదేశ్‌కు రప్పిస్తామని, ఆమెపై అరెస్టు వారెంట్లు జారీ చేస్తామని ఐసీటీ నూతన ప్రాసిక్యూటర్ కామెంట్స్ కూడా చేశాడు.ఇది కూడా చదవండి: పాక్ మాజీ పీఎం ఇమ్రాన్ ఖాన్‌పై మరో కేసు -
కీలెంచి వాతపెడతారు!
బంగ్లాదేశ్ స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఇచ్చే వ్యవహారాన్ని అమెరికా అనుకూల ప్రతిపక్షం సాకుగా చూపి ఆ దేశాన్ని అంతర్యుద్ధానికి సన్నద్ధం చేసిందనేది అక్షర సత్యం. మతం ఆధారంగా ఈ దేశం నుంచి విడిపోయి తూర్పు పాకిస్తాన్‌గా పిలవబడిన బంగ్లాదేశ్‌లో మొదటి నుండి ఉర్దూ మాట్లాడే పాకిస్తాన్ అనుకూల వాదులకూ, బెంగాలీ మాట్లాడే ముస్లింలకూ అనేక విషయాల్లోౖ సెద్ధాంతిక వైరుద్ధ్యం ఉంది. బెంగాలీ మాట్లాడే ముస్లింలు ఎక్కువమంది అవామీ లీగ్ పార్టీకి విధేయులు.ఆ పార్టీ నాయకుడైన షేక్ ముజిబుర్ రెహమాన్‌ను బంగ్లాదేశ్ జాతిపితగా అక్కడి మెజారిటీ ప్రజలు చూస్తారు. అయినప్పటికీ పాకిస్తాన్ అనుకూల వాదులు సైన్యాన్ని అడ్డుపెట్టు కొని 1975లో ముజిబుర్ రెహమాన్‌తో సహా 22 మందిని మట్టు పెట్టారు. ఆయన ఏర్పాటుచేసిన అవామీ లీగ్ పార్టీ కార్యకర్తలకు మైనారిటీలుగా హిందువులు ఎదుర్కొనే సమస్యలపై కొంత అవ గాహన ఉంది. అందుకే వారు అక్కడి హిందుత్వ సంస్థలతో సత్సంబంధాలను కొనసాగిస్తున్నారు. ఈ కారణంతోనే హసీనా ప్రభుత్వ వ్యతిరేకులు హిందువులపై విచక్షణారహితంగా దాడులకు తెగ బడ్డారు. ఇక భారతదేశాన్ని పరిపాలించే ప్రభు త్వం హిందుత్వ ప్రభుత్వం అని నమ్మినవారు... షేక్ హసీనాకు ఆశ్రయం కల్పించడాన్ని సహించలేక బంగ్లాదేశ్‌లో హిందువులపై మారణ హోమం జరిపారు. ఇది అక్షర సత్యం.షేక్ హసీనా రాజీనామా చేసి, ఇండియాకు పారిపోయి వచ్చిన వెంటనే బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ కార్యకర్తలూ, ఇస్లామిక్ తీవ్రవాద గ్రూపు సభ్యులూ కలిసి బంగ్లాదేశ్‌లో జరిపిన మారణ హోమం, హసీనా ఇంట్లో చొరబడి చేసిన నిర్వాకం భారతదేశంలోని కొంతమందికి అమితానందాన్ని కలిగించింది. ఆ ఆనందంతోనే ‘భారత్‌లో కూడా బంగ్లాదేశ్ పరిస్థితులు రాబోతున్నాయనీ, మోదీ కూడా ఏదో ఒక రోజు దేశం విడిచి పారి పోతాడనీ, మోదీ ఇంట్లోకి ఏదో ఒక రోజు ప్రజలు దూరే పరిస్థితి వస్తుందనీ’ వారు వ్యాఖ్యలు చేస్తు న్నారు. ఈ మాటలు దేశ హితైషు లకు పట్టరాని కోపాన్ని తెప్పించాయి.ఇక భారతీయుల, బంగ్లాదేశీయుల ఆలోచనలు ఒకే కోణంలో ఉంటాయా అనే విషయాన్ని పరిశీలిద్దాం! మతం ఆధారంగా దేశాన్ని కోరు కుని, తమ సొంత మతస్థుల చేతిలో అరాచకానికి గురై, మన సైనిక సహకారంతో ఒక స్వతంత్ర భూభాగాన్ని ఏర్పాటు చేసుకుని, దేశానికి ఏది అవసరమో, ఏది అనవసరమో తెలియని ఒక గుంపు స్వభావం కలిగిన వారు బంగ్లా దేశీ యులు. ఇక భారతీయులు ఎంతో పరిణతి కలిగిన సుసంపన్న సాంస్కృతిక వారసత్వం కలవారు. వీరిని రెచ్చగొట్టి, తమ పైశాచికత్వాన్ని పండించుకోవాలని చూసే నాయకులకు ఇక్కడ మద్దతు లభించదు.1967లో కాంగ్రెస్ పార్టీ నిట్ట నిలువునా చీలినప్పుడు, రాజభరణాల రద్దు సమయంలో, 1971 బంగ్లాదేశ్ సంక్షోభ సమ యంలో మన సైన్యాన్ని పాకిస్తాన్ పైకి పంపి నప్పుడు, 1975 ఎమర్జెన్సీ సమయంలో ఈ దేశం అనేక రాజకీయ సంక్షోభాలను ఎదుర్కొంది. కానీ ప్రజలు సంయమనంతో వ్యవహరించి, ప్రజా స్వామ్య పంథాను అనుసరించి, హుందాగా వ్యవహరించారు. బంగ్లాదేశీయుల్లా భారతీ యులు హింసను ఆశ్రయించి ఉంటే– దేశంలో ఎమర్జెన్సీని విధించిన కాంగ్రెస్ పార్టీ నాయ కులకూ, ఆ పార్టీ అనుయాయులకూ షేక్ హసీ నాకు పట్టిన గతే పట్టేది. ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేసినవారిపై ప్రజలు తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటారు. – ఉల్లి బాలరంగయ్య, వ్యాసకర్త సామాజిక, రాజకీయ విశ్లేషకులు -
మేఘాలయలో బంగ్లా టాప్ లీడర్ మృతి.. కారణం అదేనా?
షిల్లాంగ్: ఈశాన్య రాష్ట్రం మేఘాలయలో బంగ్లాదేశ్ రాజకీయ నాయకుడి మృతదేహం లభించడం తీవ్ర కలకలం సృష్టించింది. భారత సరిహద్దు నుంచి 1.5 కి.మీ దూరంలో తమలపాకు తోటలో అవామీ లీగ్ నాయకుడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అనంతరం, అతడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు.వివరాల ప్రకారం.. భారతదేశం-బంగ్లాదేశ్ సరిహద్దు నుండి 1.5 కి.మీ దూరంలో ఉన్న ఈస్ట్ జైన్తియా హిల్స్ జిల్లాలో బంగ్లాకు చెందిన అవామీ లీగ్ నాయకుడు ఇషాక్ అలీ ఖాన్ కన్నా మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ సందర్బంగా జైన్తియా ఎస్పీ గిరిప్రసాద్ మాట్లాడుతూ.. మృతుడి దగ్గర బంగ్లాదేశ్ పాస్‌పోర్ట్ దొరికింది. అతడిని బంగ్లాదేశ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లాకు చెందిన అవామీ లీగ్ నాయకుడు ఇషాక్ అలీ ఖాన్ పన్నాగా గుర్తించాము. పోస్టుమార్గం నిమిత్తం అతడిని ఖలీహ్రియత్లోని సివిల్ ఆసుపత్రి తరలించినట్టు తెలిపారు.ఇక, పోస్టుమార్టం అనంతరం, తదుపరి ప్రక్రియల కోసం డెడ్ బాడీని ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచినట్లు అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ ప్రభుత్వం పతనం తర్వాత పన్నా పరారీలో ఉన్నాడు. షేక్ హసీనా ప్రభుత్వంలో పన్నా కీలక వ్యక్తిగా ఉన్నట్టు సమాచారం. అయితే, భారత్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఆయనకు గుండెపోటు వచ్చి ఉంటుంది అధికారులు భావిస్తున్నారు. ఆయన మృతిపై మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది. -
బంగ్లాదేశ్ రాజకీయాల్లో వేలు పెట్టలేదు: అమెరికా
వాషింగ్టన్: తనను దేశం విడిచి వెళ్లేలా చేసిన కుట్ర వెనుక అమెరికా ఉందని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్‌హసీనా చేసినట్లు చెబుతున్న ఆరోపణలను వైట్‌హౌజ్ తోసిపుచ్చింది. ఈ విషయమై వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీ జీన్పియెర్రె సోమవారం(ఆగస్టు12) మీడియాతో మాట్లాడారు. ‘బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్‌హసీనాను పదవి నుంచి దించడంలో మా పాత్ర ఏమీ లేదు. ఈ విషయంలో అమెరికాపై వచ్చిన ఆరోపణలేవీ నిజం కావు. భవిష్యత్తు ప్రభుత్వంపై బంగ్లాదేశ్ ప్రజలే నిర్ణయం తీసుకోవాలి. అక్కడి పరిణామాలను గమనిస్తుంటాం’అని పియెర్రె తెలిపారు. సెయింట్ మార్టిన్స్ ఐలాండ్‌ను అప్పగించనందుకే తనను పదవి నుంచి అమెరికా దించిందని షేక్‌హసీనా ఆరోపించినట్లు మీడియాలో కథనాలు ప్రచురితమయ్యాయి. అయితే తన తల్లి అలాంటి ఆరోపణలేవీ చేయలేదని షేక్‌హసీనా కుమారుడు సాజిబ్ వాజెద్ చెప్పడం గమనార్హం. -
రాష్ట్రంలో పంటల బీమా ప్రీమియం తక్షణమే చెల్లించండి... ఏపీ సీఎంను డిమాండ్ చేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి
-
బంగ్లాలో దాడులకు పాకిస్థానే కారణం: హసీనా కుమారుడు
ఢాకా: బంగ్లాదేశ్‌లో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. బంగ్లా ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచివెళ్లడంతో అక్కడ సైనిక పాలన కొనసాగుతోంది. ఇలాంటి తరుణంలో ఈ నేపథ్యంలో షేక్ హసీనా కుమారుడు ఆసక్తికర కామెంట్స్ చేశారు. దేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ అనంతరం షేక్ హసీనా తిరిగి స్వదేశానికి వస్తారని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో తమ దేశంలో ఈ పరిస్థితికి పాకిస్తానే కారణమని సంచలన ఆరోపణలు చేశారు.ఇక, తాజాగా షేక్ హసీనా కుమారుడు సాజీబ్ వాజెద్ జాయ్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో కొనసాగుతున్న అనిశ్చితికి పాకిస్థాన్ ఐఎస్ఐ ఆజ్యం పోస్తోంది. విదేశీ జోక్యంతోపాటు పాక్ ఐఎస్ఐ ప్రమేయం ఉందని చెప్పడానికి క్షేత్రస్థాయిలో చోటుచేసుకున్న ఘర్షణలే ఆధారాలు. దాడులు, ఆందోళనలు చాలా సమన్వయంతో, పక్కా ప్రణాళికతో జరిగినట్లు తెలుస్తోంది. వాటిని రెచ్చగొట్టడానికి ఉద్దేశపూర్వకంగానే సోషల్ మీడియాలో ప్రయత్నాలు జరిగాయి. పరిస్థితులను చక్కబెట్టేందుకు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకున్నా.. వాటిని మరింత దిగజార్చేందుకు ప్రయత్నాలు కొనసాగించారు. ఉగ్రవాద, విదేశీ శక్తులు మాత్రమే సమకూర్చగలిగే ఆయుధాలతో అల్లరిమూకలు పోలీసులపైనే దాడులు చేసిన ఫొటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. ఈ అరాచకం నుంచి బంగ్లాదేశ్‌ను రక్షించేందుకు సాధ్యమైనంత కృషి చేస్తాను అని కామెంట్స్ చేశారు.News Alert | Here's what Sajeeb Wazed Joy (son of former Bangladesh PM Sheikh Hasina) said in an exclusive interview with @PTI_News."Sheikh Hasina will be back in Bangladesh once democracy is restored.""Pakistan's ISI fuelling unrest in Bangladesh.""The Indian govt must… pic.twitter.com/serCZm31nu— Press Trust of India (@PTI_News) August 8, 2024ఇదే సమయంలో భారత్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తన తల్లికి రక్షణ కల్పించినందుకు భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పారు. మరోవైపు.. బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ అనంతరం షేక్ హసీనా తిరిగి స్వదేశానికి వస్తారని సాజీబ్ చెప్పుకొచ్చారు. మా పార్టీ వాళ్లపై దాడులు జరుగుతున్నాయి. ఆపదలో ఉన్న పౌరులను, అవామీ లీగ్ పార్టీని షేక్ ముజిబర్ రహ్మాన్ కుటుంబం ఎన్నటికీ ఒంటరిగా వదలిపెట్టదు. బంగ్లాదేశ్‌లో అవామీ పార్టీకి ఎంతో చరిత్ర ఉంది. అందుకే ఆమె ఆమె తప్పకుండా తిరిగి వస్తారు అని అన్నారు. -
Sheikh Hasina: ఆ అక్కకు.. చెల్లెలే ధైర్యం!
ఆగస్ట్ 15, 1975 సైనిక తిరుగుబాటులో బంగ్లాదేశ్ అధ్యక్షుడు షేక్ ముజిబుర్ రెహమాన్, అతడి భార్య, కుమారులు ఊచకోతకు గురయ్యారు. ఆ కల్లోల సమయంలో రెహమాన్ కుమార్తె రెహానా తన అక్క షేక్ హసీనాతో పాటు యూరప్‌లో ఉంది. అంత పెద్ద విషాదాన్ని, దుఃఖాన్ని తట్టుకోవడానికి ఎవరికి ఎవరు ధైర్యం చెప్పుకున్నారో తెలియదు.ఇక అప్పటి నుంచి వారిది వీడని బంధం అయింది. హసీనా ‘లైఫ్‌లాంగ్ షాడో’గా రెహానాకు పేరు పడిపోయింది. కుటుంబసభ్యుల ఊచకోత జరిగిన కొన్ని సంవత్సరాల తరువాత బంగ్లాదేశీ విద్యావేత్త అహ్మద్ సిద్దిఖీని వివాహం చేసుకుంది రెహానా. ఆర్థిక కారణాల వల్ల లండన్‌లో జరిగిన ఈ పెళ్లికి షేక్ హసీనా వెళ్లలేకపోయింది అంటారు. తమ కుటుంబ సభ్యుల కిరాతక హత్యపై నిష్పాక్షిక విచారణకు పిలుపునిస్తూ మొదటిసారిగా అంతర్జాతీయ సమావేశాన్ని నిర్వహించింది రెహానా. ఈ సమావేశంలో ప్రవాసంలో ఉన్న ఆమె రాజకీయ సహచరుల నుంచి అంతర్జాతీయ న్యాయనిపుణుల వరకు ఎంతోమంది పాల్గొన్నారు.క్రూరమైన సైనిక నియంతృత్వ నీడలో బంగ్లాదేశ్ ప్రజల దుస్థితిని అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకు రావడంలో కీలక పాత్ర పోషించింది రెహానా. కుటుంబ ఊచకోతకు సంబంధించిన అప్పటి విషాదం ఊహకు అందనిది. ఇప్పటి సంక్షోభం గురించి మాత్రం ఇద్దరికీ తెలుసు. నిరసనకారులు ఇంటిని చుట్టుముడుతున్నారు. మరోవైపు హసీనా సన్నిహితులు, సలహాదారులు పారిపోయే దారిలో ఉన్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని భయానక పరిస్థితి. ఆ పరిస్థితిలో కూడా అక్క చెయ్యి వీడలేదు రెహానా. ‘పారిపోవడం తప్ప వేరే గత్యంతరం లేదు. లేకపోతే ప్రాణాలకే ప్రమాదం’ అని అత్యంత సన్నిహితులు చెబుతున్నప్పటికీ ‘అది జరిగేది కాదు’ అంటూ వెనక్కి తగ్గలేదు హసీనా. ఆ సమయంలో వారు రెహానాను ఆశ్రయించారు. హసీనా దేశం వీడడానికి ఒప్పుకోవడానికి ఆమె కుమారుడు కారణమని, కాదు రెహానే కారణమని రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. ఏది నిజం అయినప్పటికీ రెహనా అక్కతో పాటు ఇండియాలోకి అడుగు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.రెహానా కుమార్తె తులిప్ సిద్దిఖీ లేబర్ పార్టీ పార్లమెంట్ సభ్యురాలు. యూకేలో లేబర్ పార్టీ అధికారంలో ఉండడంతో బ్రిటన్ ప్రభుత్వాన్ని హసీనా ఆశ్రయం కోరింది. అయితే బ్రిటన్ నుంచి అనుకూల స్పందన రాకపోవడంతో ఇండియాను ఆశ్రయించక తప్పలేదు. అక్క అధికారిక పర్యటనలలో రెహానా ఉండేది. బంగ్లాదేశ్ రాజకీయ సంక్షోభ (2006 –2008) సమయంలో హసీనా జైలులో ఉన్నప్పుడు అక్క తరపున పార్టీ సమావేశాలు నిర్వహించింది. కార్యకర్తల్లో ధైర్యం నింపింది. ఒక్క ముక్కలో చె΄్పాలంటే షేక్ హసీనాకు బంగ్లాదేశ్‌లో ఎంత చరిత్ర ఉందో ఆమె చెల్లెలు రెహానాకూ అంతే చరిత్ర ఉంది. ఆ చరిత్ర హసీనా వెలుగు ముందు మసక మసకగా కనిపించేది. అయితే ప్రతి కల్లోల సమయంలోనూ ఆమె పేరు మీద వెలుగు ప్రసరిస్తుంటుంది.‘రెహానా అక్కను తప్పుదారి పట్టించింది’ అని విమర్శించిన వారూ ఉన్నారు. ‘అక్క సరిౖయెన దారిలో పయనించడానికి, బలమైన నాయకురాలిగా ఎదగడానికి రెహానానే కారణం’ అన్నవారూ ఉన్నారు. ఈ వాదోపవాదాలు, నిజానిజాలతో సంబంధం లేకుండా ఒక్కమాట మాత్రం నిశ్చయంగా చెప్పవచ్చు... అక్కకు చెల్లి కొండంత అండగా నిలిచింది. నిలుస్తోంది. "షేక్ హసీనా పేరు వినిపించగానే ప్రతిధ్వనించే మరో పేరు... రెహానా. అలనాటి కల్లోల కాలం నుంచి అధికార పర్యటనల వరకు అక్క హసీనాతోనే ఉన్నది రెహానా. అక్క జైలుపాలైనప్పుడు పార్టీ క్యాడర్లో ధైర్యాన్ని నింపింది. ఒకప్పుడు కుటుంబాన్ని కోల్పోయి... ఇప్పుడు అధికారాన్ని కోల్పోయి అక్కాచెల్లెళ్లు మన దేశంలో తలదాచుకోవడానికి శరాణార్థులుగా వచ్చారు..." -
నిరసనల ధాటికి రాజీనామా చేసి.. బంగ్లాదేశ్‌ను వీడి భారత్‌కు చేరిన ప్రధాని షేక్ హసీనా..
-
బంగ్లాదేశ్: 100 దాటిన ఘర్షణ మృతుల సంఖ్య
ఢాకా: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో నిరసనకారులు, విద్యార్థులు చేపట్టిన సహాయ నిరాకరణోద్యమం ఆదివారం హింసాత్మకంగా మారింది. అధికార ఆవామీ పార్టీ కార్యకర్తలకు, ఆందోళకారులకు మధ్య దేశవ్యాప్తంగా 13 జిల్లాల్లో జరిగిన ఘర్షణల్లో మరణించినవారి సంఖ్య 100కు చేరింది. ఇందులో 14 మంది పోలీసులు మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. మరోవైపు.. ఆందోళనల నేపథ్యం ప్రభుత్వం నేటి (సోమవారం) నుంచి మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించింది. నిరసనలు జరుగుతున్న ప్రాంతాల్లో కర్ఫ్యు విధించి, ఇంటర్నెట్ సేవలను తెలిపివేశారు. బంగ్లాదేశ్‌లో మళ్లీ అల్లర్ల చెలరేగటంతో అక్కడ ఉండే భారతీయ విద్యార్థులు, పౌరులకు కేంద్ర ప్రభుత్వ అడ్వైజరీ జారీ చేసింది. భారతీయులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. సాయం కోసం ఢాకాలోని భారత హైకమిషన్ సంప్రదించాని పేర్కొంది. .. ప్రస్తుత సమయంలో బంగ్లాదేశ్‌కు భారతీయులు ఎవరూ వెళ్లవద్దని తెలిపింది. అత్యవసర సాయం కోసం భారత హైకమిషన్ ఫోన్ నంబర్లను +8801958383679 +8801958383680 +8801937400591 విడుదల చేసింది. ఇక.. బంగ్లాదేశ్ విముక్తి యోధుల వారసులకు ప్రభుత్వోద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్ల నిర్ణయం ఇటీవల బంగ్లాలో చిచ్చు రేపడం తెలిసిందే. దాంతో సుప్రీంకోర్టు వాటిని 5 శాతానికి తగ్గించింది. -
బంగ్లాదేశ్‌లో మళ్లీ హింస.. 91 మంది మృతి
ఢాకా: బంగ్లాదేశ్ మరోసారి హింసతో అట్టుడికింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ వివాదంపై ఆందోళనచేస్తున్న ఉద్యమకారులకు అధికార పార్టీ మద్దతుదారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో హింస చెలరేగింది. ఆదివారం(ఆగస్టు4) జరిగిన ఈ ఘర్షణల్లో ఇప్పటివరకూ 91 మంది దాకా మృతి చెందినట్లు బంగ్లాదేశ్ మీడియా వెల్లడించింది. ఘర్షణల్లో చాలా మందికి తీవ్ర గాయాలైనట్లు తెలిపింది. ఇటీవలే కోటా వివాదంపై చెలరేగిన హింసలో 200 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. బంగ్లాదేశ్‌లో మళ్లీ హింస చెలరేగడంతో అక్కడ ఉన్న దేశ పౌరులను భారత రాయబార కార్యాలయం అలర్ట్ చేసింది. భారత పౌరులంతా సాయం కోసం తమతో టచ్‌లో ఉండాలని కోరింది. ఇందుకు పలు ఫోన్ నంబర్లను ప్రకటించింది. ఘర్షణల నేపథ్యంలో బంగ్లాదేశ్ వ్యాప్తంగా ఆదివారం సాయంత్రం నుంచి కర్ఫ్యూ విధించారు. హింసకు పాల్పడేవారు విద్యార్థులు కాదని అలాంటివారిని అణచివేయాలని ప్రధాని షేక్‌హసీనా పిలుపునిచ్చారు. -
మరణశయ్యపై ఖలీదా జియా!
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియాకు సరైన వైద్య అందించకుండా ఆమెపై ప్రధాని షేక్ హసీనా పగ తీర్చుకుంటున్నారని బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ ఆరోపించింది. ఖలీదా ‘మరణశయ్య’పై ఉన్నారని, ఆమెకు సరైన వైద్య చికిత్స అందడం లేదని ఆ పార్టీ సెక్రటరీ జేనరల్ ఫక్రుల్ ఇస్లామ్ అలంగీర్ ఆదివారం తెలిపారు. గృహ నిర్బంధంలో ఉన్న 78 ఏళ్ల ఖలీదా జియా శనివారం రాత్రి తన నివాసంలో అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారని, వెంటనే అంబులెన్స్‌లో ఎవర్‌కేర్ ఆస్పత్రికి తరలించారని తెలిపారు. 1991 నుంచి 96 వరకు, 2001 నుంచి 2006 రెండు పర్యాయాలు ప్రధానిగా పనిచేసిన ఖలీదా ఓ అవినీతి కేసులో జైలు పాలయ్యారు. అయితే జియా ఓల్డ్ ఢాకా సెంట్రల్ జైల్లోనే అనారోగ్యానికి గురయ్యారు. ఆ సమయంలోనే ఆమెకు సరైన వైద్యం అందలేదని అలంగీర్ ఆరోపించారు. ఆ తరువాత ఆమె ఇంట్లో ఉండటానికి అనుమతించినప్పటికీ పూర్తి నిర్బంధంలో జైలులాంటి జీవితాన్నే అనుభవిస్తున్నారని చెప్పారు. ఇప్పుడు తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఖలీదాకు విదేశాల్లో చికిత్స అవసరమని మెడికల్ బోర్డు చెప్పినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, సరైన వైద్యం అందకుండా చంపేసి, రాజకీయంగా అడ్డు తొలగంచుకోవాలని ప్రధాని షేక్ హసీనా చూస్తున్నారని అలంగీర్ ఆరోపించారు. -
Sheik Hasina: ఎన్నికల్లో విజయం.. బంగ్లా ప్రధాని కీలక వ్యాఖ్యలు
ఢాకా: ఐదోసారి బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపొందిన అవామీ లీగ్ చీఫ్, దేశ ప్రధాని షేక్ హసీనా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘సహజంగానే బంగ్లాదేశ్ ప్రజలు చాలా తెలివైన వారు. రానున్న ఐదేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించడమే నా లక్ష్యం. 2041కల్లా బంగ్లాదేశ్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. స్మార్ట్ ఎకానమి, స్మార్ట్ ప్రభుత్వం, స్మార్ట్ ప్రజలు నా లక్ష్యాలు’ అని ఎన్నికల్లో మూడింట రెండొంతుల సీట్లు గెలిచి ఘన విజయం సాధించిన తర్వాత హసీనా అన్నారు. ఆదివారం జరిగిన బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికలను ఆ దేశ ప్రధాన పతిపక్ష పార్టీ బహిష్కరించింది. ఎన్నికల్లో బీఎన్పీ పార్టీ అభ్యర్థులు పోటీ చేయలేదు. దీంతో షేక్ హసీనా అవామీ లీగ్ పార్టీ విజయం ఎన్నికల ముందే దాదాపు ఖరారైంది. అయితే ప్రతిపక్ష బీఎన్పీ పార్టీ ఉగ్రవాదులతో కుమ్మక్కై ఎన్నికల్లో పోటీ చేయడానికి భయపడిందని, వారు ఎన్నికలను బహిష్కరించి తనను గెలిపించలేదని, బంగ్లాదేశ్ ప్రజలను గెలిపించారని హసీనా అన్నారు. ఇదీచదవండి..మళ్లీ తీవ్రమవుతున్న యుద్ధం -
బంగ్లా పీఠంపై మళ్లీ హసీనాయే
ఢాకా: బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో అంతా ఊహించినట్టుగానే పాలక అవామీ లీగ్ నెగ్గింది. ఆదివారం పోలింగ్ జరగ్గా రాత్రికల్లా తొలి దశ ఫలితాలు వెలువడ్డాయి. 300 స్థానాలకు గాను ఇప్పటికే 200 చోట్ల నెగ్గి అవామీ లీగ్ మూడింట రెండొంతుల మెజారిటీ సాధించింది. దాంతో ప్రధానిగా షేక్ హసీనా వరుసగా నాలుగోసారి పగ్గాలు చేపట్టనున్నారు. ప్రధాన ప్రతిపక్షం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీతో పాటు విపక్షాలన్నీ బహిష్కరించిన ఈ ఎన్నికలపై జనం పెద్దగా ఆసక్తి చూపలేదు. దాంతో కేవలం 40 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించారు. సాయంత్రం పోలింగ్ ముగియగానే ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించారు. బంగ్లాదేశ్‌లో 2018 సాధారణ ఎన్నికల్లో 80 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. ఈసారి అది ఏకంగా సగానికి పడిపోవడం గమనార్హం. మొత్తం 300 నియోజకవర్గాలకు గాను 299 చోట్ల పోలింగ్ నిర్వహించారు. ఒక స్థానంలో అభ్యర్థి మరణించడంతో ఎన్నిక వాయిదా వేశారు. 27 పార్టీల నుంచి 1,500 మందికిపైగా అభ్యర్థులు బరిలో నిలిచారు. 436 మంది స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేశారు. హసీనా 2009 నుంచి అధికారంలో కొనసాగుతున్నారు. భారత్ పొరుగుదేశం కావడం అదృష్టం ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్టు పారీ్ట–జమాత్–ఇ–ఇస్లామీ కూటమికి ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం లేదని ప్రధాని షేక్ హసీనా విమర్శించారు. ఓటు వేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసే వాతావరణం కల్పించామని చెప్పారు. భారత్ తమకు అత్యంత నమ్మకమైన మిత్రదేశమని చెప్పారు. భారత్ లాంటి దేశం పొరుగున ఉన్నందుకు తాము చాలా అదృష్టవంతులమని స్పష్టం చేశారు. బంగ్లాదేశ్ స్వాతంత్య్ర ఉద్యమానికి భారత్ ఎంతగానో సహకరించిందని చేశారు. 1975 ఆగస్టులో తన తండ్రిని, తల్లిని, ముగ్గురు సోదరులను, ఇతర కుటుంబ సభ్యులను సైనికాధికారులు దారుణంగా హత్య చేశారని పేర్కొన్నారు. -
Bangladesh Elections: ప్రారంభమైన పోలింగ్
ఢాకా: బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఆదివారం(జనవరి 7) ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. ఈ ఎన్నికలను ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఎన్పీ బహిష్కరించింది. అధికార అవామీ లీగ్ పార్టీ ఎన్నికల్లో ఉద్దేశపూర్వకంగా డమ్మీ ఇండిపెండెంట్ క్యాండిడేట్లను బరిలో నిలిపిందని బీఎన్పీ ఆరోపిస్తోంది. పోలింగ్ ప్రారంభం కాగానే ఢాకాలోని ఓ పోలింగ్ కేంద్రంలో ప్రధాని షేక్ హసీనా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె భారత మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ భారత్ తమకు నమ్మకమైన మిత్ర దేశమని చెప్పారు. 1971 లిబరేషన్ సందర్భంగా, 1975లో బంగ్లాదేశ్‌కు భారత్ సహకారం మరవలేనిదన్నారు. దేశంలో మొత్తం 11 కోట్ల 90 లక్షల మంది ఓటర్లున్నారు. మొత్తం 300 యోజకవర్గాలకుగాను 299 నియోజకవర్గాలకు ఆదివారం పోలింగ్ జరుగుతోంది. కొన్ని కారణాల వల్ల ఒక్క నియోజకవర్గానికి తర్వాత ఎన్నిక నిర్వహించనున్నారు. మొత్తం 27 రాజకీయ పార్టీల నుంచి 1500 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా 436 మంది ఇండిపెండెంట్లు పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లోనూ ప్రస్తుత ప్రధాని షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ వరుసగా నాలుగోసారి అధికారం చేజిక్కించుకోనుందని అంచనాలున్నాయి. ఈసారి గెలిస్తే అవామీ లీగ్‌కు దేశంలో ఐదోసారి అధికారం దక్కినట్లవుతుంది. #WATCH | Dhaka: In her message to India, Bangladesh Prime Minister Sheikh Hasina says, ''You are most welcome. We are very lucky...India is our trusted friend. During our liberation war, they supported us...After 1975, when we lost our whole family...they gave us shelter. So our… pic.twitter.com/3Z0NC5BVeD — ANI (@ANI) January 7, 2024 ఇదీచదవండి...లక్షద్వీప్ వర్సెస్ మాల్దీవ్స్ -
బంగ్లాదేశ్: కొన్ని గంటల్లో ఎన్నికలు.. పోలింగ్ బూత్‌లు, స్కూళ్లకు నిప్పు
ఢాకా: బంగ్లాదేశ్‌లో జనవరి 7(ఆదివారం) రోజు జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు ఏర్పాట్లు అన్ని పూర్తి చేస్తున్నారు. పోలింగ్‌కు ఒకరోజు ముందు బంగ్లాదేశ్‌లో ఆందోళనకరమైన పరిస్థితులు చోటుచేసుకున్నాయి. పోలింగ్ అధికారులు ఏర్పాటు చేసిన నాలుగు పోలింగ్ కేంద్రాలు, ఐదు స్కూల్స్‌కు గుర్తు తెలియని దుండగులు నిప్పుపెట్టారు. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దేశ రాజధాని ఢాకా శివారు ప్రాంతాలు, ఘాజీపూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అగ్నిప్రమాద ఘటనలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆదివారం జరగబోయే సార్వత్రిక ఎన్నికల విఘాతం కలిగించాలనే లక్ష్యంతో గుర్తు తెలియని దుండుగులు పొలింగ్ బూత్‌లకు నిప్పు పెట్టినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తాము ఈ ఘటనను పరిశీలించామని, పూర్తిగా అప్రమత్తతతో ఉన్నామని ఘాజీపూర్ పోలీసు ఉన్నతాధికారి ఖాజీ షఫీకుల్ ఆలం తెలిపారు. దీనికంటే ముందు ఓ రైలు అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు, ఇద్దరు పిల్లలు మంటల్లో చిక్కుకొని మృతి చెందారు. శుక్రవారం రాత్రి 9 గంటలకు జరిగిన ఈ ప్రమాదంలో ఎనిమిది మందికి తీవ్రగాయాలు కాగా వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే మరోవైపు దేశంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను ప్రధాన ప్రతిపక్షం బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ (BNP) వరుసగా మూడోసారి బహిష్కరించిన విషయం తెలిసిందే. దీంతో ప్రధానమంత్రి షేక్ హసీనా ఈసారి కూడా తన అధికారాన్ని నిలబెట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేపు పోలింగ్ అనే సమయంలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాద ఘటనలు తీవ్ర ఉద్రిక్తతతలకు దారితీస్తోంది. ఇక.. రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. చదవండి: బంగ్లా సుస్థిరత కొనసాగేనా? -
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఆసక్తికర పలకరింపు
-
‘మా అతిపెద్ద సమస్య అదే.. భారత్ పరిష్కరించగలదు’
ఢాకా: రోహింగ్యా శరణార్థులు తమ దేశానికి అతిపెద్ద సమస్యగా మారారని పేర్కొన్నారు బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా. వారిని తిరిగి స్వదేశానికి పంపించేందుకు అంతర్జాతీయ సమాజాలతో చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు. లక్షలాది మంది శరణార్థులు దేశంలో ఉండటం వల్ల పలు సవాళ్లు ఎదురవుతున్నాయన్నారు. ఈ సమస్యను పరిష్కరించటంలో భారత్ కీలక పాత్ర పోషించగలదని నమ్ముతున్నట్లు చెప్పారు హసీనా. ఆమె శనివారం ఓ ఆంగ్ల వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు వ్యాఖ్యానించారు. ‘రోహింగ్యాల సమస్య అతిపెద్ద భారమని మాకు తెలుసు. భారత్ పెద్ద దేశం. కొంత మంది శరణార్థులకు ఆశ్రయం ఇవ్వొచ్చు. కానీ, పెద్దగా ఏమీ చేయలేదు. మా దేశంలో 1.1మిలియన్ల మంది రోహింగ్యాలు ఉన్నారు. అందుకే వారు తిరిగి సొంత ఇళ్లకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ సమాజం, పొరుగు దేశాలతో చర్చలు జరుపుతున్నాం. వారిని తిరిగి పంపించేందుకు వారు కొన్ని చర్యలు తీసుకున్నారు. మానవీయ కోణంలోనే వారికి ఆశ్రయం కల్పించాం. కొవిడ్ సమయంలో మొత్తం రోహింగ్యాలకు టీకాలు వేయించాం. కానీ, వారు ఏన్నాళ్లుంటారు. అందుకే వారిని క్యాంపులో ఉంచాం. అక్కడ పర్యావరణ సమస్యలు తలెత్తుతున్నాయి. కొందరు మత్తు పదార్థాలు, మహిళల అక్రమ రవాణలకు పాల్పడుతున్నారు. వారు ఎంత త్వరగా స్వస్థలాలకు వెళితే మాకు, మయన్మార్‌కు అంత మంచిది. ఈ క్రమంలో వారిని స్వస్థలాలకు పంపే విషయమై ఏషియాన్, యూఎన్వో, ఇతర దేశాలతో చర్చిస్తున్నాం. కానీ, భారత్ పొరుగు దేశం. వారు దీనిలో కీలక పాత్ర పోషించగలరు. నేను అదే అనుకొంటున్నాను’ అని షేక్ హసీనా పేర్కొన్నారు. తీస్తా నది జలాల పంపకాల అంశలో భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య సమన్వయంపై ప్రశ్నించగా.. తీస్తా నది విషయంలో ఉత్పన్నమైన సమస్యలను పరిష్కరించాల్సి ఉందన్నారు. భారత ప్రధాని కూడా ఇందుకు సానుకూలంగా ఉన్నారని తెలిపారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయంలో తమ విద్యార్థులు పలువురిని భారత్ స్వస్థలాలకు చేర్చిందన్నారు. కొవిడ్ సమయంలో వ్యాక్సిన్ మైత్రి రూపంలో సహాయపడిందని గుర్తు చేసుకొన్నారు. హసీనా సోమవారం నుంచి నాలుగు రోజులపాటు భారత్‌లో అధికారిక పర్యటన జరపనున్నారు. ఇదీ చదవండి: ‘మేం ఫ్రీగా డబ్బులిస్తాం...ఇళ్లు కట్టుకోండి’..బంపరాఫర్ ఇచ్చిన ప్రభుత్వం! -
మోదీజీ మీ సాయానికి థ్యాంక్స్.. ట్రెండ్ సెట్టర్‌గా భారత ప్రధాని
సాక్షి, న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. 14 రోజులుగా రష్యన్ బలగాలు ఉక్రెయిన్‌పై మిస్సైల్స్, బాంబు దాడులతో విరుచుకుపడుతున్నాయి. బాంబు దాడుల నేపథ్యంలో విదేశాలకు చెందిన విద్యార్థులు తమ స్వదేశాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బాంబు దాడుల్లో విదేశీ విద్యార్థులు సైతం మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే, భారత విద్యార్థులను స్వదేశానికి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ గంగాను చేపట్టింది. దీనిలో భాగంగా ఇప్పటికే వేల సంఖ్యలో భారత విద్యార్థులను, పౌరులను ప్రత్యేక విమానాల ద్వారా స్వదేశానికి తరలించింది. మరోవైపు ఆపరేషన్ గంగాలో భాగంగా కేవలం భారతీయులే కాకుండా బంగ్లాదేశీయులు, నేపాలీలు, పాకిస్తానీలు, ట్యూనీషియన్లు కూడా ప్రత్యేక విమానాల ద్వారా భారత్ చేరుకుని ఇక్కడి నుంచి తమ స్వదేశాలను వెళ్తున్నారు. కాగా, తొమ్మిది మంది బంగ్లాదేశ్ ప్రజలు.. ఆపరేషన్ గంగాతో ఇండియా నుంచి తమ దేశానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా బంగ్లా ప్రధాని షేక్ హసీనా.. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు చెప్పారు. తమ దేశ పౌరులను యుద్ద ప్రభావిత ఉక్రెయిన్ నుంచి సురక్షితంగా తరలించినందుకు మోదీకి ఆమె థ్యాంక్స్.. అంటూ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు.. పాకిస్తాన్‌కు చెందిన ఆస్మా షఫీక్.. భారత ప్రభుత్వం, రాయబార కార్యాలయాలనికి, ప్రధాని నరేంద్రమోదీకి థ్యాంక్స్ చెప్పింది. ఉక్రెయిన్‌లో తాను ఎదుర్కొన్న అత్యంత క్లిష్టమైన పరిస్థితి నుంచి బయటపడేందుకు తనకు సాయం చేసిన ఇండియన్ ఎంబసీకి, నరేంద్రమోదీకి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఇది చదవండి: పుతిన్‌ను ఆపకపోతే ప్రపంచం మొత్తం పెనువిధ్వంసమే: ఉక్రెయిన్ అధ్యక్షుడి భార్య జెలెన్స్కా -
లైంగిక ఆరోపణలకు రివెంజ్!.. నటి అరెస్ట్‌తో ఉలిక్కిపాటు
రంగుల ప్రపంచంలో వివాదాలు-విమర్శల్లో చిక్కుకునే సెలబ్రిటీల పరిస్థితి ఎలా ఉంటోందో చెప్పే ఘటన ఇది. అగ్ర కథానాయిక పోరీ మోనీ(28) అరెస్ట్ బంగ్లాదేశ్‌లో సంచలనం సృష్టించింది. పెద్ద ఎత్తున్న మాదక ద్రవ్యాలు కలిగి ఉందన్న ఆరోపణలపై బంగ్లాదేశ్ యాంటీ-టెర్రర్ స్క్వాడ్ ‘రాబ్’(Rapid Action Battalion) బుధవారం రాత్రి ఆమెను అరెస్ట్ చేసింది. అయితే ఓ ప్రముఖ వ్యాపారవేత్తపై లైంగిక-హత్యారోపణలు చేసిన కొద్దిరోజులకే ఆమె అరెస్ట్ కావడంతో.. ఆమె ఫ్యాన్స్ బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాను న్యాయం కోసం నిలదీస్తున్నారు. అరెస్ట్ ఇలా.. బుధవారం సాయంత్రం ఢాకా బనానీలో ఉన్న ఆమె ఇంటికి చేరుకున్న రాబ్ టీం.. సుమారు నాలుగు గంటపాటు సోదాలు నిర్వహించింది. ఆపై రాత్రి తొమ్మిది గంటల టైంలో ఆమెను హెడ్ క్వార్టర్స్‌కు తరలించి ప్రశ్నించింది. ఆ వెంటనే ఆమె అరెస్ట్‌ను ధృవీకరిస్తూ రాబ్ వింగ్ డైరెక్టర్ కమాండర్ ఖాందకేర్ మోయిన్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆమె ఇంట్లో పెద్ద ఎత్తున్న మత్తు, మాదక ద్రవ్యాలు, ఫారిన్ లిక్కర్ బాటిళ్లు ఆమె ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు రాబ్ వెల్లడించింది. ఈ మేరకు గురువారం ఉదయం ఆమెను కోర్టులో ప్రవేశపెట్టగా.. నాలుగు రోజుల రిమాండ్ విధించింది న్యాయస్థానం. ప్రతీకారంగానే.. పోరీ మోనీ అసలు పేరు షామ్‌సున్నాహర్. సైడ్ కిక్ వేషాల నుంచి స్టార్ హీరోయిన్గా ఎదిగింది. జూన్ 8న ప్రముఖ వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు నజీర్ ఉద్దీన్ మహమ్మూద్ మీద లైంగిక ఆరోపణలు చేసింది. బోట్ క్లబ్ వద్ద నజీర్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపించింది. ఒక స్టార్ హీరోయిన్ లైంగిక ఆరోపణలు చేయడం సినీ పరిశ్రమను కుదిపేయగా.. హైలెవల్ పరిచయాలతో కేసు నమోదు కాకుండా తప్పించుకున్నాడు నిందితుడు. ఈ తరుణంలో ఆమెకు నటులు, నెటిజన్స్ నుంచి మద్ధతు దక్కింది. తనకు న్యాయం చేయాలంటూ బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు ఆమె ఫేస్బుక్ ద్వారా విజ్ఞప్తి చేసింది. దీంతో ఎట్టకేలకు నిందితుడు నజీర్‌ను, ముగ్గురు మహిళల్ని, నజీర్ సహచరుడైన డ్రగ్ డీలర్ తుహిన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉల్టా కేసు నజీర్ అరెస్ట్ అయిన వారం తర్వాత గుల్షన్ ఆల్ కమ్యూనిటీ క్లబ్ వాళ్లు పోరీ మోనీపై ఉల్టా ఓ కేసు దాఖలు చేశారు(నజీర్ ఈ క్లబ్‌కు డైరెక్టర్ కూడా). డ్రగ్స్ మత్తులో జూన్ 7న ఆమె క్లబ్‌పై దాడి చేసిందని క్లబ్ అధ్యక్షుడు అలంగిరి ఇక్బాల్ ప్రెస్ మీట్ పెట్టి మరీ వివరించాడు. ఈ నేపథ్యంలో ఆమెపై నార్కొటిక్ చట్టం ప్రకారం కేసు నమోదుకాగా.. ఆపై బెయిల్ దొరికింది. ఆ వెంటనే నజీర్, అతని అనుచరులు బెయిల్ మీద జైలు నుంచి విడుదలయ్యారు. చంపేస్తారన్న కాసేపటికే.. బుధవారం మధ్యాహ్నాం పోరి మోనీ ఫేస్బుక్ లైవ్‌లోకి వచ్చింది. తనను చంపాలని ప్రయత్నిస్తున్నారని, గేట్‌ను ధ్వంసం చేశారని, సాయం కోరినా పోలీసులు స్పందించడం లేదంటూ ఆమె లైవ్‌లో వ్యాఖ్యలు చేసింది. పోలీసుల వంకతో వచ్చి కూడా తనను చంపేస్తారని భయంగా ఉందంటూ ఆమె ఆందోళన చెందింది. ఆ కాసేపటికే ఇంటికి చేరుకున్న Rapid Action Battalion.. ఆమెను అరెస్ట్ చేయడం కొసమెరుపు. ఇక పోరీ మోనీతో పాటు ఓ సినిమా ప్రొడ్యూసర్-అతని ఇద్దరు అనుచరుల మీద కూడా నార్కొటిక్ కేసు నమోదు అయ్యింది. -
ప్రధానికి హత్యా బెదిరింపులు.. సంచలన తీర్పు
చిట్టగాంగ్: బంగ్లాదేశ్ ప్రతిపక్ష పార్టీ నాయకుడు, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఉపాధ్యక్షుడు గైసుద్దీన్ ఖాదర్ చౌదరికి మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ చిట్టగాంగ్ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనాను చంపేస్తానని గత ఏడాది గైసుద్దీన్ ఖాదర్ చౌదరి బెదిరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ బెదిరింపు వ్యాఖ్యలపై అధికార ఆవామీ లీగ్ ప్రధాన కార్యదర్శి నిజాముద్దీన్ ముహురీ కోర్టులో కేసు వేశారు. దీనిపై విచారించిన చిట్టాగాంగ్ కోర్టు.. ఆరోపణలు నిజమేనని రుజువుకావడంతో గత ఏడాది మే 31వతేదీన గైసుద్దీన్ అరెస్టుకు వారంట్ జారీ చేసింది. తాజాగా తుది తీర్పును వెలువరించిన ధర్మాసనం.. సాక్షాత్తూ ప్రధానమంత్రిని చంపేస్తానని బెదిరించిన గైసుద్దీన్ కు మూడేళ్ల జైలు శిక్షతోపాటు ఐదువేల బంగ్లాదేశీ టాకాలను జరిమానాగా చెల్లించాలని తీర్పులో పేర్కొంది. జరిమానా చెల్లించకుంటే మరో మూడు నెలల అదనపు జైలు శిక్ష అనుభవించాలని కోర్టు తెలిపింది. -
బంగ్లా ప్రధానిగా హసీనా ప్రమాణం
ఢాకా: నాలుగోసారి బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా ఎన్నికైన ఆవామీ లీగ్ అధినేత షేక్ హసీనా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. బంగ్లా అధ్యక్షుడు మహ్మద్ అబ్దుల్ హమీద్ హసీనాతో బంగాభవన్‌లో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం 24 మంది కేబినెట్ మంత్రులుగా, 19 సహాయ మంత్రు లుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈసారి కేబినెట్లో 31 మంది కొత్తవారికి అవకాశం కల్పించారు. ఆవామీ లీగ్‌తో జతకట్టిన కూటమి పార్టీలకు చెందిన మాజీ మంత్రులకు స్థానం కల్పించలేదు. ఆవామీ లీగ్‌కు చెందిన వారిని మాత్రమే మంత్రులుగా ఎంపిక చేశారు. వరుసగా మూడుసార్లు, మొత్తంగా 4సార్లు బంగ్లాకు ప్రధానిగా ఎన్నికై హసీనా రికార్డు సృష్టించారు. 1996, 2008, 2014వ సంవత్సరాల్లో ఆమె ప్రధానిగా ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన బంగ్లాదేశ్ 11వ పార్లమెంటు ఎన్నికల్లో హసీనా నేతృత్వంలోని మహాకూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో మహాకూటమి 96% సీట్లను సాధించింది. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు రిగ్గింగ్‌కు పాల్పడ్డారని, ఓటర్లను భయపెట్టి హింసకు పాల్పడ్డారని ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలను హసీనా ఖండించారు. ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ వారిపై దాడులకు పాల్పడటం, హింస చెలరేగడంపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తంచేసింది. -
బంగ్లా ఎన్నికల్లో మళ్లీ హసీనా దూకుడు
ఢాకా : బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రారంభ ఫలితాల్లో ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని పాలక అవామీ లీగ్ దూసుకుపోతోంది. హసీనా సారథ్యంలో మళ్లీ అవామీ లీగ్ విజయ ఢంకా మోగించే దిశగా సాగుతోంది. పాలక పార్టీ 144 స్ధానాల్లో ముందంజలో ఉండగా విపక్ష బీఎన్పీ కేవలం మూడు స్ధానాల్లోనే ఆధిక్యం కనబరుస్తోంది. జతియో పార్టీ ఒక స్ధానంలో ఆధిక్యంలో ఉంది. ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంటకు విస్పష్ట ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. కాగా,అవామీ లీగ్ ఇప్పటికే 19 స్ధానాల్లో విజయం సాధించింది. అంతకుముందు బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఆదివారం హింసాత్మక ఘటనల నడుమ ముగిసింది. ఎన్నికల సందర్భంగా చెలరేగిన హింసలో 13 మంది మర ణించారు. రాజ్షాహి, చిత్తగావ్, కుమిల్లా, కాక్స్‌బజార్ జిల్లాల్లో ఇద్దరేసి చొప్పున మరణించారు. ఇక బ్రమ్మణబెరియా, రంగమతి, నార్సిది, బొగుర, గజీపూర్, సిల్హెట్లో చెలరేగిన అల్లర్లలో ఒక్కరి చొప్పున మరణించారు. మృతుల్లో పాలక అవామీ లీగ్ కార్యకర్తలే అధికంగా ఉన్నారని అధికారులు పేర్కొన్నారు. -
‘రోహింగ్యాల ముచ్చట లేదు’
న్యూయార్క్: విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ మంగళవారం బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. అయితే వీరి భేటీలో రోహింగ్యాల సంక్షోభంపై ఎలాంటి ప్రస్తావనా చోటుచేసుకోకపోవడం గమనార్హం. బంగ్లా ప్రధానితో సుష్మా కేవలం మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారని, ఈ సమావేశంలో రోహింగ్యా ముస్లింల అంశం చర్చకు రాలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ చెప్పారు.ఇరువురి భేటీ కేవలం ద్వైపాక్షిక అంశాలకే పరిమితమైందని తెలిపారు. మయన్మార్ నుంచి పెద్ద ఎత్తున రోహింగ్యాలు బంగ్లాదేశ్‌కు పోటెత్తుతుండటంతో ఈ సమస్యను అధిగమించేందుకు అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకుని మయన్మార్‌పై ఒత్తిడి పెంచాలని బంగ్లాదేశ్ కోరుతోంది. ఆగస్ట్ 25 నుంచి తలెత్తిన మలివిడత ఘర్షణల అనంతరుం మయన్మార్‌లోని రఖీనె రాష్ట్రం నుంచి 4,10,000 మందికి పైగా రోహింగ్యా ముస్లింలు బంగ్లాదేశ్‌కు వచ్చినట్టు ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది.