ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను మరో బిగ్ షాక్ తగిలింది. బంగ్లాలోని యూనస్ ప్రభుత్వం హసీనా టార్గెట్‌గా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే హాసీనా హయాంలో జరిగిన కొన్ని ఘటనలపై విచారణ జరుపుతోంది. వీటిపై ఐదుగురు సభ్యుల కమిషన్‌ను సైతం ఏర్పాటు చేసింది. తాజాగా కమిషన్ రిపోర్టులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి.
బంగ్లాదేశ్‌లో పలువురు అధికారుల అదృశ్యం, కొన్ని హత్యలపై బంగ్లా ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది. రిటైర్డ్ జస్టిస్ మైనుల్ ఇస్లాం చౌదరి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కమిషన్ ‘అన్‌ఫోల్డింగ్ ది ట్రూత్’ అనే నివేదికను యూనస్‌కు అందజేసింది. ఈ కమిషన్ శనివారం మొదటి నివేదికను అందజేసింది. ఇందులో భాగంగా హసీనా హయాంలో మిస్సింగ్ కేసులపై 1,676 ఫిర్యాదులు రాగా.. 3500 మంది అదృశ్యమైనట్టు నివేదికలో పేర్కొంది. వీరిలో పలువురు ప్రభుత్వ అధికారులు కూడా ఉన్నారని తెలిపింది. అక్రమ అరెస్ట్ చేసిన కొందరు కనిపించడంలేదని, హత్యకు గురైనట్టు కూడా తెలిపింది. ఇదే సమయంలో రహస్య నిర్బంధ కేంద్రాల గురించి కూడా వెల్లడించింది. వీటన్నింటిలో హసీనా సహా పలువురు డిఫెన్స్ అధికారులే కారణమని బాంబు పేల్చింది.
ఇక, ఈ అంశాలపై కమిషన్ పూర్తి విచారణ ప్రక్రియకు మరో మూడు నుంచి నాలుగు నెలల సమయం పడుతుందని సభ్యులు తెలిపారు. తుది నివేదికను మార్చిలో అందించనున్నట్టు స్పష్టం చేశారు. ఈ సందర్బంగా ప్రధాని యూనస్ మాట్లాడుతూ.. కమిషన్ మొదటి మధ్యంతర నివేదికకు కృతజ్ఞతలు తెలిపారు. విచారణలో భాగంగా కమిషన్ సభ్యులకు ఎలాంటి సహాయం కావాలన్న చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. అలాగే, విచారణలో భాగంగా తాను రహస్య నిర్భంద కేంద్రాలను, జాయింట్ ఇంటరాగేషన్ సెల్స్‌ను సందర్శిస్తానని చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉండగా.. కొద్ది నెలల క్రితం బంగ్లాదేశ్‌లో పౌరుల తిరుగుబాటు కారణంగా షేక్ హసీనా దేశం నుంచి పారిపోయి వచ్చి.. భారత్‌లో తలదాచుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమెను బంగ్లాదేశ్‌కు తిరిగి తీసుకువచ్చేందుకు యూనస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే ఆమెపై పలు రకాల కేసులను పెడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment