ఢాకా: బంగ్లాదేశ్ మరోసారి హింసతో అట్టుడికింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ వివాదంపై ఆందోళనచేస్తున్న ఉద్యమకారులకు అధికార పార్టీ మద్దతుదారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో హింస చెలరేగింది. ఆదివారం(ఆగస్టు4) జరిగిన ఈ ఘర్షణల్లో ఇప్పటివరకూ 91 మంది దాకా మృతి చెందినట్లు బంగ్లాదేశ్ మీడియా వెల్లడించింది.
ఘర్షణల్లో చాలా మందికి తీవ్ర గాయాలైనట్లు తెలిపింది. ఇటీవలే కోటా వివాదంపై చెలరేగిన హింసలో 200 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. బంగ్లాదేశ్‌లో మళ్లీ హింస చెలరేగడంతో అక్కడ ఉన్న దేశ పౌరులను భారత రాయబార కార్యాలయం అలర్ట్ చేసింది. భారత పౌరులంతా సాయం కోసం తమతో టచ్‌లో ఉండాలని కోరింది.
ఇందుకు పలు ఫోన్ నంబర్లను ప్రకటించింది. ఘర్షణల నేపథ్యంలో బంగ్లాదేశ్ వ్యాప్తంగా ఆదివారం సాయంత్రం నుంచి కర్ఫ్యూ విధించారు. హింసకు పాల్పడేవారు విద్యార్థులు కాదని అలాంటివారిని అణచివేయాలని ప్రధాని షేక్‌హసీనా పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment