సైన్యం, పోలీసుల గుప్పెట్లో దేశం
‘రిజర్వేషన్ల’ ఘర్షణలు తీవ్రతరం
ఇప్పటికే 115 దాటిన మరణాలు
ఢాకా/సాక్షి, న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ అట్టుడుకుతోంది. రిజర్వేషన్లపై వారం క్రితం మొదలైన దేశవ్యాప్త హింసాకాండ నానాటికీ పెరిగిపోతోంది. భద్రతా సిబ్బందికి, విద్యార్థులకు మధ్య జరుగుతున్న ఘర్షణల్లో మృతి చెందిన వారి సంఖ్య శనివారంతో 115 దాటింది! రాజధాని ఢాకాతో పాటు ప్రధాన నగరాలు, పట్టణాల్లో కర్ఫ్యూ విధించినా, సైనికులు, పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. అయినా లాభం లేకపోగా పరిస్థితి విషమించడమే గాక పూర్తిగా అదుపు తప్పుతోంది. దాంతో తాజాగా కనిపిస్తే దేశవ్యాప్తంగా కాలి్చవేత (షూట్ ఎట్ సైట్) ఉత్తర్వులు జారీ అయ్యాయి!
978 మంది భారతీయులు వెనక్కు
బంగ్లాదేశ్ నుంచి 978 మంది భారతీయ విద్యార్థులను కేంద్రం సురక్షితంగా వెనక్కు తీసుకొచి్చంది. 778 మంది నౌకల్లో, 200 మంది విమానాల్లో వచ్చారు. బంగ్లాదేశ్‌లో పనలు వర్సిటీల్లో ఇంకా 4 వేలకు పైగా భారతీయ విద్యార్థులున్నారు. వారందరినీ సురక్షితంగా తీసుకొచ్చేందుకు ఢాకాలోని భారత హైకమిషన్ కృషి చేస్తోంది.
ఇదీ సమస్య...
1971 బంగ్లాదేశ్ వార్ వెటరన్ల కుటుంబీకులకు ప్రభుత్వోద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. 2018లో షేక్ హసీనా వీటిని రద్దు చేసింది. ఈ నిర్ణయాన్ని ఢాకా హైకోర్టు తాజాగా తప్పుబట్టింది. ఆ రిజర్వేషన్లను పునరుద్ధరించాలంటూ జూన్ 5న ఆదేశాలిచి్చంది. దీనిపై విద్యార్థులు, ఉద్యోగార్థులు భగ్గుమన్నారు. దేశవ్యాప్తంగా వీటిని వ్యతిరేకిస్తూ భారీగా నిరసనలు, ఆందోళనలకు దిగారు. కోటా పునరుద్ధరణ వద్దే వద్దంటూ రోడ్డెక్కారు. దాంతో కోర్టు ఉత్తర్వులను హసీనా ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టు తాత్కాలికంగా పక్కన పెట్టింది. పరిస్థితి తీవ్రత దృష్ట్యా ఆదివారం తుది విచారణకు అంగీకరించింది.
Comments
Please login to add a commentAdd a comment