నా బిడ్డకు తండ్రి ఎలాన్‌ మస్క్‌.. 13వ సంతానం? | Elon Musk Breaks Silence After Ashley St Clair Allegation | Sakshi
Sakshi News home page

నా బిడ్డకు తండ్రి ఎలాన్‌ మస్క్‌.. 13వ సంతానం?

Published Sun, Feb 16 2025 1:02 PM | Last Updated on Sun, Feb 16 2025 2:13 PM

Elon Musk Breaks Silence After Ashley St Clair Allegation

న్యూయార్క్‌: టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌(Elon Musk)మరోసారి వార్తల్లో నిలిచారు. రచయిత్రి, ఇన్ఫ్లూయెన్సర్ ఆష్లీ సెయింట్ క్లెయిర్.. మస్క్‌పై సంచలన ఆరోపణలు చేశారు. తన బిడ్డకు మస్క్‌ తండ్రి అంటూ సోషల్‌ మీడియాలో వేదికగా పోస్టు పెట్టారు. ఇక, ఆమె పోస్టుపై మస్క్‌ సమాధానం ఇస్తూ ఆసక్తికర సమాధానం ఇచ్చారు.

క్లెయిర్ పోస్టుపై తాజాగా మస్క్‌ సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలో మస్క్‌.. Whoa అని కామెంట్స్‌ చేశారు. బిడ్డకు ఎవరు తండ్రి అని సమాధానం వచ్చేలా సెటైరికల్‌ పోస్టు పెట్టారు. ఇక, అంతకుముందు.. క్లెయిర్ తాను ఐదు నెలల క్రితం ఓ బిడ్డకు జన్మనిచ్చానని.. ఆ చిన్నారికి తండ్రి మస్క్ అని ఎక్స్‌లో పోస్టు చేశారు. తన బిడ్డ మస్క్‌కు 13వ సంతానమని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో.. తమ బిడ్డ భద్రతను, గోప్యతను దృష్టిలో ఉంచుకుని ఇన్ని రోజులు ఈ విషయం బయటపెట్టలేదని, మా ప్రైవసీకి ఎవరూ భంగం కలిగించవద్దంటూ కామెంట్స్‌ చేశారు.

అయితే, బిడ్డ విషయం గురించి తామిద్దరం దీనిని గోప్యంగా ఉంచాలనుకున్నామని.. కానీ, కొన్ని మీడియా సంస్థలు దానిని బహిర్గతం చేశాయని ఆమె తెలిపారు. అందుకే ఇప్పుడు తానే స్వయంగా తన బిడ్డ గురించి చెప్పడానికి ముందు వచ్చానని చెప్పారు. మా సంతానం సురక్షిత వాతావరణంలో పెరగాలని కోరుకుంటున్నానని.. తమ ప్రైవసీకి ఎవరూ భంగం కలిగించవద్దని కోరారు. దీంతో, ఆమె పోస్టు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇదిలా ఉండగా.. మస్క్‌పై గతంలో కూడా పలు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. మస్క్‌ సంస్థకు చెందిన ఇద్దరు ఉద్యోగినులతో శృంగారంలో పాల్గొన్నారంటూ అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలు వెలువరించాయి. ఇక, ఎలాన్‌ మస్క్‌కు ఇప్పటికే 12 మంది సంతానం ఉన్నారు. మొదటి భార్య జస్టిన్‌ ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చింది. ఆ తరువాత 2008లో వారిద్దరూ విడిపోయారు. దీని తరువాత బ్రిటన్ నటి తాలులాహ్ రిలేను మస్క్ పెళ్ళి చేసుకున్నారు. వీరికి పిల్లలు లేకపోగా ఇద్దరూ విడిపోయారు. ప్రస్తుతం ఎలాన్ కెనెడియన్ గాయని గ్రిమ్స్ తో కలిసి ఉంటున్నారు. వీరిద్దరికీ ముగ్గురు పిల్లలు ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement