
అమృత్‌సర్: అమెరికా నుంచి భారత అక్రమ వలసదారులతో కూడిన రెండో విమానం శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో అమృత్‌సర్ విమానాశ్రయంలో ల్యాండయింది. రాత్రి 10 గంటలకు రావాల్సిన ఈ విమానం ఆలస్యమైంది. ఈ విమానంలో 119 మంది వలసదారులను పంపుతామని అమెరికా అధికారులు ప్రకటించినా, 116 మంది మాత్రం వచ్చినట్లు అధికారులు తెలిపారు.
వీరిలో అత్యధికంగా పంజాబ్‌కు చెందిన 65 మంది ఉన్నారు. ఆ తర్వాత హర్యానాకు చెందిన 33 మంది, గుజరాత్ నుంచి 8 మంది, యూపీ, గోవా, మహారాష్ట్ర, రాజస్తాన్‌ల నుంచి ఇద్దరు చొప్పున, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్ నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. వీరంతా 18–30 ఏళ్ల మధ్య వారేనని అధికార వర్గాలు తెలిపాయి. అమెరికా నుంచి మొదటి విడతలో ఈ నెల 5న 104 మంది అక్రమ వలసదారులు భారత్‌కు రావడం తెలిసిందే.

#WATCH | Punjab | The second batch of illegal Indian immigrants who were deported from the US and brought to Amritsar today are now being sent to their respective states.
Visuals from outside of the Amritsar airport pic.twitter.com/T3MLtrmAVO— ANI (@ANI) February 15, 2025
Comments
Please login to add a commentAdd a comment