immigrants
-
వలసదారులకు సంకెళ్లు.. వైట్‌హౌజ్ వివాదాస్పద వీడియో
వాషింగ్టన్: అక్రమ వలసదారులకు సంకెళ్లు వేసి అవమానకరంగా పంపిస్తున్నారని భారత్‌తో సహా ఇతర దేశాల్లో అమెరికాపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా భారత్‌లో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో విమర్శలు గుప్పిస్తోంది. అమెరికా ఇప్పటివరకు భారత్‌కు పంపించిన వలసదారుల చేతులు, కాళ్లకు సంకెళ్లు వేసి అవమానకర రీతిలో తీసుకువచ్చారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.ఈ ఆరోపణలకు ఊతమిచ్చేలా వైట్‌హౌజ్ తాజాగా ఓ వివాదాస్పద 41 నిమిషాల నిడివి గల వీడియోను సోషల్‌మీడియాలో పోస్టు చేసింది. అక్రమ వలసదారులను విమానం ఎక్కించేముందు వారికి సంకెళ్లు వేస్తున్న దృశ్యాలు వీడియోలో ఉన్నాయి. అలాగే వారికి వేయడానికిగాను గొలుసులను పోలీసులు సిద్ధం చేస్తుండడం వీడియోలో కనిపిస్తోంది. అయితే విమానం ఎక్కుతున్న అక్రమ వలదారుల ముఖాలు మాత్రం వీడియోలో కనిపించలేదు. ASMR: Illegal Alien Deportation Flight 🔊 pic.twitter.com/O6L1iYt9b4— The White House (@WhiteHouse) February 18, 2025కాగా, అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులకు సంకెళ్లు వేసి తరలిస్తున్న అంశంలో ఇటీవలే అమెరికా పర్యటనకు వెళ్లిన మోదీ కూడా ఏమీ చేయలేకపోయారని కాంగ్రెస్ మండిపడుతోంది. ఇంతకుముందు ఇదే విషయమై భారత విదేశాంగ మంత్రి జై శంకర్ స్పందిస్తూ మహిళలకు, పిల్లలకు సంకెళ్లు వేయడం లేదని సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. -
వలసదారులతో అమృత్ సర్ కు చేరుకున్న మూడో విమానం
-
వలసదారులపై ట్రంప్ కొరడా
-
భారత్‌కు 116 మంది అక్రమ వలసదారుల రాక.. ఏ రాష్ట్రం వారు ఎక్కువగా ఉన్నారంటే?
అమృత్సర్: అమెరికా నుంచి భారత అక్రమ వలసదారులతో కూడిన రెండో విమానం శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో అమృత్సర్ విమానాశ్రయంలో ల్యాండయింది. రాత్రి 10 గంటలకు రావాల్సిన ఈ విమానం ఆలస్యమైంది. ఈ విమానంలో 119 మంది వలసదారులను పంపుతామని అమెరికా అధికారులు ప్రకటించినా, 116 మంది మాత్రం వచ్చినట్లు అధికారులు తెలిపారు. వీరిలో అత్యధికంగా పంజాబ్‌కు చెందిన 65 మంది ఉన్నారు. ఆ తర్వాత హర్యానాకు చెందిన 33 మంది, గుజరాత్ నుంచి 8 మంది, యూపీ, గోవా, మహారాష్ట్ర, రాజస్తాన్‌ల నుంచి ఇద్దరు చొప్పున, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్ నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. వీరంతా 18–30 ఏళ్ల మధ్య వారేనని అధికార వర్గాలు తెలిపాయి. అమెరికా నుంచి మొదటి విడతలో ఈ నెల 5న 104 మంది అక్రమ వలసదారులు భారత్‌కు రావడం తెలిసిందే. #WATCH | Punjab | The second batch of illegal Indian immigrants who were deported from the US and brought to Amritsar today are now being sent to their respective states. Visuals from outside of the Amritsar airport pic.twitter.com/T3MLtrmAVO— ANI (@ANI) February 15, 2025 -
సైనిక నిర్బంధంలో వెనిజులా వలసదారులు
వాషింగ్టన్: గ్వాంటనామో బేలోని వలసదారుల నిర్బంధ కేంద్రానికి చేరుకున్న వెనిజులా వలసదారుల పర్యవేక్షణా బాధ్యతలను సాధారణ ఇమ్మిగ్రేషన్ సిబ్బందికి బదులు సైనిక అధికారులు చూస్తున్నారు. వలసదారులు ప్రస్తుతం ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ కస్టడీలో ఉన్నారని ట్రంప్ ప్రభుత్వం చెబుతోంది. అయితే ఈ వలసదారులను సైనిక బలగాలు, వైద్యుల బృందాలు చూసుకుంటున్నాయని తాజాగా న్యూయార్క్‌టైమ్స్ ఒక కథనాన్ని ప్రచురించింది. గ్వాంటనామోలో వలసదారుల నిర్బంధ కేంద్రాలను విస్తరించే ప్రణాళికలను ట్రంప్ ప్రకటించిన తరువాత ఇటీవల కొందరు వలసదారులను గ్వాంటనామోకు పంపిన విషయం తెల్సిందే. గ్వాంటనామోలో ఉంచిన వలసదారులకు సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ వెల్లడించిన వివరాల్లో వారి జాతీయత మినహా మరే సమాచారం లేదు. ఆరో నంబర్ వలసదారుల శిబిరంలో 53 మంది పురుషులను ఉంచారు. గతంలో ఈ శిబిరంలో అల్‌ఖైదా అనుమానిత ఉగ్రవాదులను నిర్బంధించారు. ఈ శిబిరంలో సౌకర్యాలు అధ్వానంగా ఉన్నట్లు తెలుస్తోంది. సౌకర్యాలులేని శిబిరంలో వలసదారులను ఉంచారని, తాజా ఆహారం అందించకుండా ప్యాక్‌చేసి తీసుకొచ్చిన సైనిక ఆహారాన్నే వలసదారులకు అందిస్తున్నట్లు తెలుస్తోంది. చట్టవిరుద్ధంగా రావడమే నేరం: ట్రిసియా దాదాపు 100 మందిని గ్వాంటనామో కేంద్రానికి తీసుకొచ్చాం. వీరందరికీ బహిష్కరణ ఉత్తర్వులు అందాయి. చట్టవిరుద్ధంగా అమెరికాలోకి ప్రవేశించి ప్రతి ఒక్కరూ నేరానికి పాల్పడ్డారు. వీరిలో హింసాత్మక కార్యకలాపాలకు పాల్పడిన ముఠా సభ్యులు, అక్రమ విదేశీయులు ఉన్నారు’’అని హోంల్యాండ్ సెక్యూరిటీ ప్రతినిధి ట్రిసియా మెక్ లాఫ్లిన్ చెప్పారు. అయితే, బందీలందరూ చట్టవిరుద్ధంగా అమెరికాలోకి ప్రవేశించలేదని, కొందరు శరణార్థులుగా పరిగణించి ఆశ్రయం కల్పించాలని కోరగా వారి అభ్యర్థనను అమెరికా ప్రభుత్వం తిరస్కరించి వారిని కూడా అరెస్ట్చేసిందని వార్తలొచ్చాయి. -
అక్రమ వలసలపై బ్రిటన్ ప్రధాని సంచలన ప్రకటన
లండన్:తమ దేశంలో ఉంటున్న అక్రమ వలసదారుల విషయంలో అమెరికా బాటలోనే బ్రిటన్ పయనించనుంది. సోమవారం(ఫిబ్రవరి10) అక్రమ వలసదారుల విషయమై బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ కీలక ట్వీట్ చేశారు.‘అక్రమ వలసలకు ఇక ముగింపు పలుకుతాం. బ్రిటన్‌కు అక్రమ వలసలు పెరిగాయి. చాలా మంది అక్రమంగా బ్రిటన్‌కు వచ్చి పనిచేస్తున్నారు’అని ట్వీట్లో స్టార్మర్ పేర్కొన్నారు. Too many people are able to come to the UK and work illegally. We are putting an end to it.— Keir Starmer (@Keir_Starmer) February 10, 2025 కాగా,ట్రంప్ ఇటీవల రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికాలోని అక్రమ వలసదారులపై దృష్టి పెట్టిన విషయం తెలిసిందే.సరైన పత్రాలు లేకుండా అమెరికాలో చాలా కాలం నుంచి ఉంటున్న వారిని గుర్తించి వారిని సొంత దేశాలకు మిలిటరీ విమానాల్లో పంపేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఏ దేశమైన ధిక్కార స్వరం వినిపిస్తే పన్ను బాదుడు ఉంటుందని ట్రంప్ హెచ్చరిస్తున్నారు.దీంతో అన్ని దేశాలు తమ దేశవాసులను తీసుకువస్తున్న అమెరికా విమానాలకు అనుమతి ఇస్తుండడం గమనార్హం. -
వెనక్కి పంపేస్తే నష్టమే!
2024 ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ సాధించిన విజయానికీ – బైడెన్ పాలనా కాలంలో అమెరికా ద్రవ్యోల్బణం పెరగడం, దేశ దక్షిణ సరి హద్దులో వలసదారుల ప్రవాహం వంటివాటి పట్ల ఓటర్లకు ఉన్న అసంతృప్తికీ మధ్య దగ్గరి సంబంధం ఉంది.ట్రంప్ తన రెండవ పదవీకాలంలో మొదటి రోజున తీసుకున్న చర్యలను పరిశీలిద్దాం. సరిహద్దును మూసివేయడం, సరైన పత్రాలు లేని వలసదారులపై కఠినంగా వ్యవహరించడం, అలాగే పౌరులు కాని వారి పిల్లలకు జన్మహక్కు పౌరసత్వాన్ని రద్దుచేయడంవంటి అంశాలపై అధ్యక్షుడు వరుసగా ఆదేశాలు జారీ చేశారు.అక్రమ వలసలపై ఇంతటి అణచివేతకు అత్యంత ప్రాధాన్యతను ఇవ్వడంలో ట్రంప్ ఉద్దేశ్యం ఓటర్లలో ప్రజాదరణ పొందడమే. ఇటీవలి ఆక్సియోస్–ఇప్సోస్ పోల్‌లో 10 మందిలో తొమ్మిది మంది రిపబ్లి కన్లతోపాటు దాదాపు సగం మంది డెమొక్రాట్లు కూడా అనధికార వలసదారుల సామూహిక బహిష్కరణకు మద్దతు ఇస్తున్నారని చెప్పారు. బహిష్కరణ కోసం ఎంపిక చేసుకున్న పద్ధతుల దగ్గరికి వచ్చేటప్పటికి... అంటే కుటుంబాలను వేరు చేయడం లేదా పిల్లలుగా అమెరికాకు వచ్చిన వారిని బహిష్కరించడం వంటివాటికి మద్దతు పలచబడుతోంది.ట్రంప్ ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకోవడానికి అమెరికన్ కాంగ్రెస్ కూడా సిద్ధంగా ఉంది. జనవరి 7న, ప్రతినిధుల సభ లేకన్ రిలే చట్టాన్ని ఆమోదించింది. దొంగతనం,దోపిడీ, కస్టమర్‌గా దుకాణాలలో ప్రవేశించి వస్తువులను దొంగిలించడం వంటివే కాక అంతకు మించిన హింసాత్మక నేరాలకు పాల్పడే అనధికార వలసదారులను బహిష్కరించడాన్ని ఈ చట్టం సులభతరం చేస్తుంది. మొదటి రోజే సెనేట్ తమ ముందుకొచ్చిన బిల్లును 64–35 ఓట్లతో ఆమోదించింది. 12 మంది డెమొక్రాట్లు కూడా రిపబ్లికన్లతో కలిసి అనుకూలంగా ఓటు వేశారు. దీంతో సరైన పత్రాలు లేని వలసదారులపై కఠిన చర్యలు తీసుకుంటే ఆర్థిక పరిణామాలు ఎలా ఉంటాయనే విషయంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ప్యూ రీసెర్చ్ సెంటర్ ప్రకారం, 2022లో దాదాపు కోటి 10 లక్షల మంది అనధికార వలసదారులు అమెరికాలో ఉన్నారు. వారిలో 80 లక్షల 30 వేలమంది శ్రామికులు. గత రెండేళ్లలో వలసదారుల సంఖ్య పెరగడంతో, ఇప్పుడు కోటిమంది అనధికార కార్మికులు ఉండవచ్చని అంచనా. ఇది అమెరికా శ్రామిక శక్తిలో 6 శాతం. కాలిఫోర్నియా, ఫ్లోరిడా, న్యూయార్క్, టెక్సాస్ నగరాల్లోనే దాదాపు సగం మంది వీరు ఉన్నారు.సామూహిక బహిష్కరణలను సమర్థించేవారి వాదన ఏమిటంటే, అవి అమెరికన్ కార్మికులకు ఒక వరం. సామూహిక తొలగింపులు అమెరికన్లకు ఉద్యోగాలను కల్పిస్తాయనీ, వారి వేతనాలను పెంచుతాయనీ ట్రంప్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్టీఫెన్ మిల్లర్ వాదన. అనధికార వలస కార్మికులు ఇలాంటి ఉద్యోగాల కోసం స్థానికంగా జన్మించిన కార్మికులతో పోటీ పడుతున్నారని ఈ వాదన చెబుతోంది. అయితే ఇది వాస్తవం కాదని అనేక అధ్యయనాల వల్ల తేలుతోంది. నిజానికి నమోదుకాని వలసదారులు తరచుగా అమెరికన్ కార్మికులు కోరుకోని ఉద్యోగాలను తీసుకుంటారని ఇవి చెబుతున్నాయి. ఇందుకు ‘నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎంప్లాయర్స్’ కోవిడ్–19 మహమ్మారి కాలంలో సుమారు 1,00,000 సీజనల్ వ్యవసాయ ఉద్యోగాలలో ఎంత మంది నిరుద్యోగ అమెరికన్లు చేరతారో తెలుసుకోవడానికి నిర్వహించిన సర్వే ఒక మంచి ఉదాహరణ. లక్ష ఉద్యోగాలకు గాను కేవలం 337 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారని సర్వే చెప్పింది. కాలానుగుణ వలసదారులు లేకపోతే, కార్మికుల కొరత (ఆహార కొరత) కొనసాగే అవకాశం ఉందని సర్వే తెలిపింది.అనధికార వలసదారులు చేపట్టే అతి సాధారణమైన 15 వృత్తులలో అమెరికాలో జన్మించిన కార్మికులు–అనధికార వలస కార్మికులు ఎంతెంత మంది ఉన్నారనే సంగతినిని ‘బ్రూకింగ్స్’ అధ్యయనం చెబు తోంది. స్థానిక కార్మికులు, అధికారిక వలస కార్మికుల కంటే అనధికార వలసదారులు తక్కువ జీతం, ప్రమాదకరమైన, తక్కువ ఆకర్షణీ యమైన ఉద్యోగాలను ఎక్కువగా తీసుకుంటారని ఈ అధ్యయనం ప్రధానంగా తేల్చింది.అక్రమ వలస కార్మికులను బలవంతంగా పంపివేసే చర్య వల్ల అనేక రంగా లపై వివిధ స్థాయుల్లో కార్మికుల సరఫరాపై ప్రభావం పడుతుందని ‘ది ఎకానమిస్ట్’ ఎత్తి చూపింది. ముఖ్యంగా వ్యవసాయంపై దీని ప్రభావం అధికంగా ఉంటుంది. అమెరికాలోని 25 లక్షలమంది వ్యవసాయ కార్మికులలో దాదాపు 40 శాతం మంది అనధికార వలస దారులేనని అంచనా. వీరి తొలగింపు వల్ల గృహ నిర్మాణం కూడా ప్రభా వితమయ్యే అవకాశం ఉంది. అనధికార వలసదారులు గృహ నిర్మాణ శ్రామిక శక్తిలో ఆరవ వంతు ఉన్నారు.బహిష్కరణలు ఎంత విస్తృతంగా ఉన్నాయనే దానిపైనే మొత్తం అమెరికా ఆర్థిక వ్యవస్థపై పడే ప్రభావం ఆధారపడి ఉంటుంది. ట్రంప్ లక్షలాదిమంది వలసదారులను సాగనంపే ‘అమెరికన్ చరిత్రలో అతిపెద్ద బహిష్కరణ కార్యక్రమం’ నిర్వహిస్తామని బెదిరించినప్పటికీ... చట్టపరమైన, రవాణాపరమైన, ఆర్థిక, రాజకీయ పరమైన అడ్డంకుల వల్ల ఈ కార్యక్రమం విజయవంతం కావడం కష్టమే! ఇంతలోనే, ‘అమెరికన్ పాలనాయంత్రాంగం 10 లక్షలమంది బహిష్కరణతో ప్రారంభించి... ఆపై అక్కడి నుండి ఇంకా ముందుకు వెళ్ళవచ్చు’ అని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సూచించారు. పీటర్సన్ ‘ఇనిస్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్’ చేసిన అధ్యయనంలో, 1956లో అధ్యక్షుడు ఐజెన్ హోవర్ ‘ఆపరేషన్ వెట్బ్యాక్’ కేంపెయిన్ సమయంలో చేసిన 13 లక్షల బహిష్కరణల సంఖ్యకు సమానమైతే గనక, ప్రస్తుత బహిష్కరణల ఫలితంగా 2028లో అమెరికా... జీడీపీ దాని ప్రాథమిక అంచనా కంటే 1.2 శాతం తక్కువగా ఉంటుందట!సక్రమ పత్రాలు లేని కార్మికులు... ప్రభుత్వ ప్రాయోజిత ప్రయోజనాలను పొందుతూ పన్నులు చెల్లించని ‘అమాం బాపతు’ అని మరొక వాదన ఉంది. ‘ఫెడరేషన్ ఫర్ అమెరికన్ ఇమ్మి గ్రేషన్ రిఫార్మ్’ నుండి వచ్చిన డేటా ఆధారంగా, అక్రమ వలసదారులు 2023లో అమెరికన్ పన్ను చెల్లింపుదారులు కట్టిన పన్నుల్లో 150 బిలియన్ డాలర్ల ఖర్చుకు కారణమయ్యారని ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ‘ప్రభుత్వ ఖర్చు తగ్గింపు కార్యక్రమం’ పేర్కొంటోంది. దీనికి ప్రధాన కారణం... ‘వారు తక్కువ సగటు విద్యా స్థాయులను కలిగిఉండటం, ఫలితంగా తక్కువ పన్ను చెల్లింపులు జరగడం, పైగా వారు తరచుగా వారి పిల్లల తరఫున సంక్షేమ కార్య క్రమాలకు అర్హత పొందడం’ అని ‘సెంటర్ ఫర్ ఇమ్మిగ్రేషన్ స్టడీస్’కు చెందిన స్టీవెన్ కమరోటా వాదన.అయితే, మొత్తం వలసదారుల విషయానికి వచ్చేటప్పటికి ఈ వాదన సరికాదు. కోవిడ్–19 మహమ్మారి తర్వాత వలసదారులు 90 లక్షలకు పెరిగారంటే రాబోయే 10 సంవత్సరాలలో అమెరికా ప్రభుత్వ ఆదాయానికి అది 1.2 ట్రిలియన్ డాలర్లను జోడిస్తుందని, ప్రభుత్వ తప్పనిసరి కార్యక్రమాలకు ఖర్చులు 300 బిలియన్ డాలర్ల మేరకు మాత్రమే పెరుగుతాయని ‘కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్ నివేదిక’ అంచనా వేసింది. వలసదారులు స్థానికంగా జన్మించిన కార్మికుల కంటే తక్కువ సంఖ్యలో ఉన్నారు. పైగా వారు పదవీ విరమణ వయస్సుకు చేరుకునే వరకు సామాజిక భద్రత, మెడికేర్ నుండి ప్రయోజనాలను పొందకపోవడం గమనార్హం.చివరగా, నేటి వలసల గురించి చర్చ... పత్రాలు లేని వలస దారులపై కేంద్రీకృతమై ఉన్నప్పటికీ, 34 సంవత్సరాలుగా అమెరికా వలస చట్టాలు గణనీయంగా నవీకరించబడలేదని రెండు వైపులా ఉన్న రాజకీయ నాయకులు గుర్తించాలి. తగ్గుతున్న సంతా నోత్పత్తి రేటు కారణంగా అమెరికా జనాభా పెరుగుదల మందగించడంతో, అమెరికా కార్మిక మార్కెట్ వృద్ధికి ప్రధాన ఆధారం చట్టబద్ధమైన వలసల ద్వారానే లభిస్తుంది.వలసలను అరికట్టడం వల్ల ఆర్థిక వృద్ధి మందగించే అవకాశం ఉంది. అమెరికాకు వలస వచ్చిన చాలా మంది దక్షిణ సరిహద్దు నుంచే ఉధృతంగా రావడానికి ముఖ్య కారణం కాలం చెల్లిన అమెరికా వలస చట్టాలు అని గుర్తించాలి.నికోలస్ సార్జెన్ వ్యాసకర్త ఫోర్ట్ వాషింగ్టన్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్‌కు ఆర్థిక సలహాదారు -
వలసదారుల విమానాల ఖర్చు మిలియన్ డాలర్లు!
వాషింగ్టన్: అధికారంలోకి వస్తే అమెరికా చరిత్రలోనే లేనంతటి భారీ ఆపరేషన్‌తో వలసదారులను వెనక్కి పంపిస్తామంటూ ఇచ్చిన హామీ అమలుకు ట్రంప్ సర్కారుకు భారీగానే చేతి చమురు వదులుతోంది. ఈ నెల 5న అమెరికా నుంచి అమృత్‌సర్‌కు 104 మంది అక్రమ వలసదారులతో చేరుకున్న అమెరికా వైమానిక దళ భారీ విమానం సీ–17ఏ గ్లోబ్‌మాస్టర్ 3 ప్రయాణ ఖర్చు చూస్తే ఎవరైనా నోరు వెళ్లబెట్టాల్సిందే. అమెరికా తమ దేశంలోని వలసదారులను సైనిక విమానంలో పంపడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. అమెరికా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్(ఐసీఈ) విభాగం అంచనాల ప్రకారం..వలసదారుల కోసం వాడే చార్టర్ విమానం ప్రతి గంట ప్రయాణానికి 8,577 డాలర్ల ఖర్చవుతుంది. ప్రమాదకరమైన వలసదారుల కోసమైతే ఈ ఖర్చు మరికాస్త ఎక్కువగానే ఉంటుంది. అయితే, బలగాలు, వాహనాలు, ఇతర సరఫరాల రవాణా కోసం గ్లోబ్ మాస్టర్‌ను 1995 నుంచి అమెరికా ఎయిర్ ఫోర్స్ వినియోగిస్తోంది. ఈ భారీ విమానం ఖర్చు ఏకంగా గంటకు 28,562 డాలర్ల వరకు ఉంటుందని అమెరికా ఎయిర్ మొబిలిటీ కమాండ్ గణాంకాలు చెబుతున్నాయి. సాధారణ చార్టర్ విమానం ఖర్చుకు ఇది మూడు రెట్లు ఎక్కువ. ఎందుకంటే, ఇతర విమానాల మాదిరిగా కాకుండా ఇంధన కోసం మిలటరీ ఎయిర్ బేస్‌ల వద్దే ల్యాండవుతుంది. సైనిక విమానం అయినందున ప్రయాణం కూడా ఇతర దేశాల గగనతలంలో చేసే ప్రయా ణంతో పొలిస్తే వేరుగా ఉంటుంది. ఫ్లయిట్‌రాడార్ 24 రికార్డు ప్రకారం ఈ విమానం సోమవారం కాలిఫోర్నియాలోని శాన్‌డియాగో మెరైన్ కార్ప్స్ ఎయిర్ స్టేషన్ నుంచి బయలుదేరింది. హవాయికి వెళి పసిఫిక్ మహా సముద్రం మీదుగా ఫిలిప్పీన్స్ పమీపంలోని లుజాన్‌కు చేరుకుంది. అటు నుంచి ఇండోనేసియా, మలేసియాల మీదుగా హిందూ మహాసముద్రంలోని డీగో గార్సియా ఎయిర్ బేస్‌కు చేరుకుంది. అటు నుంచి ఇండియాలో ప్రవేశించింది. మొత్తంగా 43 గంటల ప్రయాణానికి గాను కనీసం 10 లక్షల డాలర్లు అంటే సుమారు రూ.8.78 కోట్ల వరకు ఖర్చయినట్లు లెక్కలేస్తున్నారు. అంటే ఒక్కో వలసదారుడికి 10వేల డాలర్ల వరకు అంటే రూ.8.78 లక్షల సొమ్మును ట్రంప్ ప్రభుత్వం వెచ్చించినట్లవుతోంది. సాధారణ ఎయిర్‌లైన్స్ విమానంలో శాన్ఫ్రాన్సిస్కో నుంచి న్యూఢిల్లీ టిక్కెట్ ఖరీదు కనిష్టంగా వెయ్యి డాలర్లు, బిజినెస్ క్లాస్ౖకైతే నాలుగు వేల డాలర్లు కావడం విశేషం. -
వలసదార్లకు దిన దిన గండం
అమెరికా.. ప్రపంచంలోని చాలా దేశాల ప్రజల్లాగే భారతీయులకూ ఓ కలల ప్రపంచం. ఆ డాలర్ డ్రీమ్స్‌ను సాకారం చేసుకోవడానికి, కుటుంబం, పిల్లలకు అందమైన భవిష్యత్ ఇవ్వడానికి ఎంతటి రిస్క్ అయినా తీసుకుంటున్నారు. ఒక్కోసారి ప్రాణాలు పోయే పరిస్థితి ఉన్నా అమెరికాకు వెళ్లే విషయంలో మాత్రం వెనుకడుగువేయట్లేరు. ఇలా ఎలాగోలా చట్టవిరుద్ధంగా వెళ్లి అక్కడ ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? ఎలాంటి అవమానాలు పడుతున్నారు?డాక్యుమెంట్లు లేకుండా అక్రమంగా అమెరికా గడ్డపై అడుగుపెట్టిన వలసదారులు అమెరికాలో అనధికారిక పనులు చేసేందుకు మాత్రమే అవకాశం ఉంటుంది. ఈ ఉద్యోగాలేవీ రికార్డుల్లో ఉండవు. రికార్డులో ఉండాలంటే.. వీసాలు, వర్క్ పర్మిట్లు కావాలి. ఉదాహరణకు అమెరికన్లు చేయడానికి ఇష్టపడని ఉద్యోగాలన్నమాట. దక్షిణ కాలిఫోర్నియాలోని పొలాల్లో పని ఇందులో ఒకటి. ఎక్కువ సమయం, శ్రమతో కూడుకున్న పని అయినప్పటికీ వేరే పని దొరక్క దక్షిణ అమెరికా దేశాల నుంచి వచ్చిన అక్రమ వలసదారులు ఇలాంటి పనులు చేస్తున్నారు. చట్టవిరుద్ధంగా వెళ్లిన మన భారతీయులు ఎక్కువగా గ్యాస్ స్టేషన్లు, రెస్టారెంట్లు, కిరాణా దుకాణాల్లో పనిచేస్తున్నారు. నిర్మాణ రంగంలో కార్మికులుగా, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులుగా ఉద్యోగాలు చేస్తున్నారు. అనుక్షణం భయం.. భయం ఒహాయోలోని క్లీవ్‌ల్యాండ్‌కు అక్రమంగా వలస వచ్చిన ఒక భారతీయుడు ఉదయం 6 గంటలకే గ్యాస్‌స్టేషన్‌లో పనిలో నిమగ్నమవుతాడు. రాత్రిదాకా ఒళ్లు హూనమయ్యేలా పనిచేసి బయటి తిండి తిని తన బంధువుల ఇంట్లో బేస్మెంట్లో నిద్రపోతాడు. ఇందులో కష్టమేముందని దూరం నుంచి చూసిన వాళ్లకు అనిపించొచ్చు. కానీ పని చేసినంత సేపు ఇలాంటి వారి జీవితాల్లో అంతకుమించిన నరకయాతన ఉంటుంది. రిజిస్టర్డ్ వర్క్‌ప్లేస్‌లో పనిచేయలేరు. ఎలాంటి అధికారిక శిక్షణ పొందే అర్హత ఉండదు. డ్రైవింగ్ లైసెన్స్ ఎప్పటికీ రాదు. డ్రైవింగ్ చేయలేరు. సైకిల్ తొక్కుతూ వెళ్లాల్సిందే. అది కూడా అక్కడి అధికారులకు అనుమానం వస్తే పట్టుబడతానేమోనని భయం వెంటాడుతుంది. నిరంతరం మనసులో ఏదో భయం. ఏ క్షణంలోనైనా ఏం జరుగుతుందోనన్న ఆందోళన. వస్తువులు పోయినా, ఎవరితోనైనా గొడవ జరిగినా, తననెవరైనా కొట్టినా పోలీసులకు ఫిర్యాదు చేసేందుకూ వెళ్లలేరు. పట్టుబడితే వారికే రిస్క్. అందుకే ఏం జరిగినా భరించాల్సిందే. ఇంత శ్రమ ఎందుకూ అంటే.. స్వదేశంలో మధ్య తరగతి జీవితం గడుపుతున్న తన కుటుంబానికి మంచి జీవితం ఇవ్వాలనే తపన. కుటుంబాన్ని అమెరికాకు తీసుకురావాలి. అందుకు సరిపడా సంపాదించాలి. లీగల్ రెసిడెంట్‌గా అనుమతి పొందేందుకు లాయర్‌కు పెట్టుకునేంత సంపాదించాలి. ఇలా ఎన్నో ఆశలు. అమెరికన్ అధికారుల నుంచి తప్పించుకోవడం కత్తిమీద సాము. అలాంటిది ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ నుంచి రోజూ ఏదో ఒక విధంగా తప్పించుకోవడం వారికి సర్వసాధారణమైపోతుంది. తోటి భారతీయుల సాయంతో.. అక్రమ వలసదారుల జీవితాల్లో అక్కడి తమలాంటి వాళ్ల సమూహం పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. అక్రమ వలసదారులు కనీసం సిమ్ కార్డు పొందలేరు. బంధువులు ఇచ్చిన సిమ్ కార్డులను ఉపయోగించి స్వదేశంలోని కుటుంబంతో మాట్లాడతారు. బ్యాంకు ఖాతా పొందే అవకాశమే లేదు. సెప్టెంబర్ 11న 9/11 వైమానిక దాడుల తర్వాత అమెరికాలో అన్ని నిబంధనలు కఠినం చేశారు. అందులోభాగంగా బ్యాంకింగ్ నియమాలూ మారాయి. అందుకే స్థానిక యజమానులు అక్రమ వలసదారులకు పనికి వేతనాన్ని కేవలం నగదు రూపంలోనే చెల్లిస్తారు. అదనపు ఆదాయం కోసం, తెలిసినవారి తోటల్లో పనిచేయడం, ఇళ్ల గోడలకు పెయింటింగ్ వేయడం, ఇతర పనులలో సహాయం చేస్తూ ఇంకాస్త డబ్బు సంపాదిస్తారు. అక్రమవలసదారులు అనారోగ్య సమయాల్లో ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. సాధారణంగా అమెరికా ఆసుపత్రులు చట్టవిరుద్ధమైన నివాసితులకు చికిత్సను నిరాకరించవు. కానీ డాక్యుమెంట్లు లేకపోవడం వల్ల ఆస్పత్రుల వద్ద వైద్యం కాస్త కష్టంగా ఉంటుంది. ఇందుకు ప్రత్యామ్నాయంగా అక్కడి చట్టబద్ధ భారతీయ వైద్యులను వీళ్లంతా ఆశ్రయిస్తారు. చవకగా వైద్య చికిత్సలు పొందుతారు. హెచ్–1బీ వీసాలు, గ్రీన్‌కార్డు సంపాదించిన భారతీయుల సహాయంతో ఆన్లైన్ ద్వారా స్వదేశానికి డబ్బులు పంపుతున్నారు. జీవితాలనే పణంగా పెట్టి... చాలా మంది డాక్టర్లు, నర్సులు, లాయర్లు ఇక్కడికి వచ్చి కూలీలుగా పనిచేసి డాక్యుమెంట్లు తయారు చేయించుకున్నారు. ఇలా రకరకాల పనులు చేసి.. డబ్బు సంపాదించి అనుమతి పొందిన వారు చాలా మంది తమ కుటుంబాలను కూడా అమెరికాకు తీసుకొచ్చారు. అమెరికాలోని ప్రభుత్వ పాఠశాలలు డాక్యుమెంటేషన్ అడగవు. దీంతో ఇప్పటివరకు వారి పిల్లలను తీసుకురావడం సులభమైంది. కొందరు అమెరికా వచ్చాక పిల్లలకు జన్మనివ్వడంతో వారు అమెరికా పౌరులుగా మారిపోయారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ట్రంప్ రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన తొలిరోజే జన్మతః పౌరసత్వాన్ని రద్దుచేస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకంచేయడం తెల్సిందే. ఈ ఉత్తర్వులపై సియాటెల్ ఫెడరల్ కోర్టు స్టే విధించింది. ట్రంప్ ప్రభుత్వ బెదిరింపులు డాక్యుమెంట్లు లేని వలసదారులను అమెరికా చేరుకోకుండా ఆపలేకపోతున్నాయి. ఎన్ని భయాలున్నప్పటికీ అమెరికన్ డ్రీమ్ ప్రయత్నాలను ఆపడం లేదు. కలను నిజం చేసుకోవడానికి జీవితాలనే పణంగా పెడుతున్నారు. డాక్యుమెంట్లు లేకుండా ఎట్లా వెళ్తున్నారు? కొందరు భారతీయులు చట్టవిరుద్ధంగా అమెరికాకు వలస వెళ్లడానికి కొన్ని అక్రమ విధానాలను అవలంభిస్తున్నారు. పర్యాటక లేదా తాత్కాలిక వీసాలపై అమెరికాకు వస్తారు. ఆ వీసా గడువు ముగిసినా భారత్‌కు తిరిగిరారు. తప్పించుకు తిరుగుతారు. ఇక భూమార్గంలో వేర్వేరు దేశాలు దాటి వస్తూ చిట్టచివరకు అమెరికా గడ్డపై కాలుమోపుతారు. ‘డంకీ’రూట్‌గా దీనికి పేరు. సరిహద్దులు దాటించేసే ఏజెన్సీలకు దాదాపు 1 లక్ష డాలర్లకు పైగా చెల్లించాల్సి ఉంటుంది. సరైన విద్యార్హతలు, ఇంగ్లిష్ ప్రావీణ్యం లేని కారణంగా అమెరికా వీసా పొందలేని భారతీయులు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఇంకొందరు తొలుత అమెరికా పొరుగున్న ఉన్న కెనడాకు వచ్చి అక్కడ 76 రోజుల విజిటర్ వీసా సంపాదించి అలా అమెరికాకు వచ్చి ఇక అక్కడే తిష్టవేస్తారు. వలసదారులు సాల్వడార్, నికరాగ్వాల గుండా కూడా అమెరికాలోకి ప్రవేశిస్తున్నారు. ఇలా వేర్వేరు అక్రమ విధానాలను అవలంభించి ఇప్పటిదాకా 7,25,000 మంది అమెరికాకు చేరుకున్నట్లు తెలుస్తోంది. 2024 ప్యూ రీసెర్చ్ నివేదిక ప్రకారం అమెరికాలో డాక్యుమెంట్లు లేకుండా వచ్చిన అక్రమ వలసదారుల్లో భారతీయులు మూడో స్థానంలో ఉన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
BirthrightCitizenshipOrder: మనవాళ్లకు భరోసా కావాలి!
ప్రపంచం ఒక గ్లోబల్ విలేజ్ (Global Village) అయిన తరుణంలో జనం మెరుగైన జీవనం గడపడానికి అవకాశాలు ఉన్న చోటుకు వెళ్లి జీవిస్తున్నారు. ప్రపంచంలోనే అధిక జనాభా ఉన్న భారతదేశం (India) నుంచే అత్యధికంగా ఇతరదేశాలకు వలస వెళు తున్నారు. 2024 ఐక్యరాజ్యసమితి ప్రపంచ వలస నివేదిక (యూఎన్ వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్) ప్రకారం కోటీ ఎనభై లక్షలమంది దాకా ఆ ఏడాది భారత్ నుంచి వలస పోయారు. భారత విదేశాంగ శాఖ లెక్కల ప్రకారం 2024 మే నాటికి వివిధ దేశాల్లో ఉన్న భారతీయుల సంఖ్య దాదాపు మూడు కోట్ల 92 లక్షల మంది. ఇందులో రెండుకోట్ల 35 లక్షలమంది ఎన్ఆర్ఐలు (NRIs) ఉన్నారు. మిగతావారు భారతీయ సంతతికి చెందినవారు. ఇతర దేశాలతో పోల్చుకుంటే అత్యధికంగా (54 లక్షలు) అమెరికాలోనే పనిచేస్తున్నారు. ఇది అమెరికా జనాభాలో 1.6 శాతంగా ఉంది. వ్యాపారాలు చేస్తూ, పన్నులు చెల్లిస్తూ అపరిమిత ఆదాయాన్ని అమెరికాకు సాధించి పెడుతున్నప్పటికీ అమెరికాలో ప్రెసిడెంట్ మారినప్పుడల్లా అభద్రతా భావంతో మనవారు కునారిల్లుతున్నారు. 47వ అమెరికా అధ్యక్షుడుగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) విదేశీయులకు అమెరికా గడ్డమీద జన్మించే పిల్లలకు జన్మతః లభించే పౌరసత్వాన్ని రద్దు చేస్తూ ఆర్డర్ జారీచేశారు.(దీన్ని అక్కడి కోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది). Birthright citizenship : ట్రంప్ ఆర్డర్‌ను తోసిపుచ్చిన కోర్టు, ఎన్ఆర్ఐలకు భారీ ఊరటదీంతో అనేకమంది అమెరికాలో నివసిస్తున్న భారతీయ గర్భిణులు ట్రంప్ విధించిన గడువులోపు పిల్లల్ని బలవంతంగా కనడానికి ఆస్పత్రుల దగ్గర బారులు తీరారంటే పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉందో అర్థమవుతుంది.అమెరికాలోని ప్రవాస భారతీయులకు మన కేంద్ర ప్రభుత్వం ఆత్మస్థైర్యం కల్పించే చర్యలు తీసుకోవాలి. ప్రధాని నరేంద్ర మోదీకి డొనాల్డ్ ట్రంప్‌తో ఉన్న స్నేహం మనవారికి మేలు చేస్తుందేమో చూడాలి. చదవండి: హోటల్లో అంట్లు కడిగాడు, ఆత్మహత్యాయత్నం..కట్ చేస్తే.. రూ 500 కోట్లు– ఎండి. మునీర్, సీనియర్ జర్నలిస్ట్ -
బడికి పంపాలన్నా భయపడుతున్నారు
శాన్ఫ్రాన్సిస్కో: అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించిన వలసదారులపై ఉక్కుపాదం మోపుతానని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో అక్రమవలసదారుల్లో భయందోళనలు ఎక్కువయ్యాయి. తమ పిల్లలను బడికి పంపడానికి కూడా అక్రమ వలసదారుల కుటుంబాలు భయపడుతున్నాయి. పాఠశాలలు పిల్లలకు సురక్షితమైన ప్రదేశాలు అని అక్కడి విద్యావేత్తలు వలస తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు. అయితే ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ ఏజెన్సీ అధికారులు పాఠశాలలు, చర్చిలు, ఆసుపత్రులనూ క్షుణ్ణంగా తనిఖీచేసి అక్రమవలసదారులుంటే అక్కడే అరెస్ట్ చేసే అధికారం ఇస్తామని ట్రంప్ ప్రభుత్వం మంగళవారం ప్రకటించిన నేపథ్యంలో వీరిలో ఆందోళనలు మరింత పెరిగాయి. సున్నితమైన ప్రదేశాల్లో ఎన్ఫోర్స్మెంట్ చర్యలు చేపట్టరాదన్న మార్గదర్శకాలను అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న చర్యలు తుడిచిపెట్టేశాయి. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు నేరగాళ్లు ఇకపై అమెరికాలోని పాఠశాలలు, చర్చిల్లో తలదాచుకోలేరని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ఒక ప్రకటనలో తెలిపింది. తాజా విధానం ప్రకారం.. ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్, కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ ఏజెన్సీలు పాఠశాలల్లోకి ప్రవేశించొచ్చు. మైగ్రేషన్ పాలసీ ఇన్స్టిట్యూట్ గణాంకాల ప్రకారం 7,33,000 మంది పాఠశాల వయస్సు పిల్లలు అమెరికాలో అక్రమంగా ఉన్నారు. ఇన్నాళ్లూ జన్మతః పౌరసత్వం నిబంధనతో వీరిలో చాలా మందికి అమెరికా పౌరసత్వం ఉన్నప్పటికీ వీళ్ల తల్లిదండ్రులకు పౌరసత్వం లేదు. తల్లిదండ్రులు చట్టవిరుద్ధంగా అమెరికాకు వచ్చి స్థిరపడ్డారు. ఇలాంటి లక్షలాది మందిని బహిష్కరిస్తామని ట్రంప్ ప్రకటించారు. అనేక వలస కుటుంబాలు బహిరంగంగా తిరిగేందుకు భయపడుతున్నాయి. పిల్లల్ని స్కూళ్లకు పంపించకపోవడంతో విద్యార్థుల హాజరుపై ప్రభావం చూపుతుందంటున్నారు విద్యావేత్తలు. తల్లిదండ్రులకు భరోసా కల్పిస్తున్న పాఠశాలలు కొన్ని రాష్ట్రాలు, జిల్లాల్లోని విద్యాశాఖాధికారులు అక్రమవలసదారుల పిల్లలకు అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. కాలిఫోర్నియాలో ఇమ్మిగ్రేషన్ చట్టాన్ని అమలు చేయడంలో పాఠశాలలు ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్కు సహాయం చేయవని చికాగో పబ్లిక్ స్కూల్స్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నవంబర్‌లో తీర్మానాన్ని ఆమోదించింది. క్రిమినల్ వారెంట్ లేకుండా అధికారులను పాఠశాలల్లోకి అడుగుపెట్టనివ్వమని స్పష్టం చేసింది. విద్యార్థి ఇమ్మిగ్రేషన్ స్థితిపై సమాచారం సేకరించకూడదనే విధానాలను గత నెలలో న్యూయార్క్ నగర ప్రధానోపాధ్యాయులకు గుర్తు చేసింది. అయితే కొన్ని చోట్లా కుటుంబాలకు ఇలాంటి భరోసా దక్కట్లేదు. ట్రంప్ చర్యతో విద్యార్థులు, కుటుంబాలు భయభ్రాంతులకు గురవుతున్నాయని జార్జియా రెఫ్యూజీస్ అకాడమీ చార్టర్ స్కూల్ అధ్యాపకులు చెప్పారు. చాలా మంది విద్యార్థులు పాఠశాలకు దూరమవుతారని భావించి, వారు ముఖ్యమైన పరీక్షలను కోల్పోకుండా ఉండటానికి పరీక్ష షెడ్యూల్‌ను ముందుకు జరిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంటికి పరిమితం చేస్తున్నారని అమెరికా సెంటర్ ఫర్ ఇమ్మిగ్రెంట్ రైట్స్ అధికారి మైఖేల్ ల్యూకెన్స్ తెలిపారు. వలసదారులు తమంతట తాముగా అమెరికాను వీడేలా ప్రభుత్వం భయపెడుతోందని ఆయన ఆరోపించారు. కంటి మీద కునుకు లేదు‘‘ఇప్పుడు మా పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. 14 ఏళ్ల క్రితం గ్వాటెమాల నుంచి వచ్చి బోస్టన్‌లో ఉంటున్నాం. మా పిల్లలు బోస్టన్ స్కూళ్లలో చదువుతున్నారు. అక్రమవలసదారులని ముద్రవేసి ఇప్పుడు మమ్మల్ని పనిచేసుకోనివ్వకపోతే ఏం చేయాలి. న్యాయం కోసం కోర్టుకెళ్లలేను. లైసెన్స్ ఉన్నాసరే కారులో బయటకు కూడా వెళ్లలేని పరిస్థితి. తలచుకుంటే నిద్రకూడా పట్టట్లేదు. చట్టబద్ధత రుజువు కోసం స్కూళ్లో మా పిల్లలను అధికారులను నిలదీస్తే ఏం చేయాలో పాలుపోవట్లేదు’’అని ఐరిస్ గొంజాలెజ్ అని మహిళ వాపోయారు. ఇలా చేస్తారని ఊహించలేదు : కార్మెన్ ‘‘వాళ్లు ఇలా చేస్తారని నేను ఊహించలేదు’’అని మెక్సికో నుంచి వలస వచ్చిన కార్మెన్ అనే వృద్దురాలు ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘శాన్ఫ్రాన్సిస్కో బే పాఠశాలకు నా ఇద్దరు మనవరాళ్లను ఇప్పుడెలా తీసుకెళ్లాలి?. అండగా ఉంటామని పాఠశాల హామీ ఇచ్చింది. అయినా భయంగానే ఉంది. తరిమేస్తే సొంతదేశం అస్సలు వెళ్లలేం. డ్రగ్స్ ముఠాలు రాజ్యమేల మెక్సికోలోని మిచోకాన్ రాష్ట్రం నుంచి వచ్చాం. రెండేళ్ల క్రితం అక్కడ మా అల్లుడిని కిడ్నాప్‌చేశారు. బెదిరింపులు పెరగడంతో అమెరికాకు వలసవచ్చాం. శాన్ఫ్రాన్సిస్కోలో ఉండటానికి అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు ఇక్కడ ఉండలేం. ఎక్కడికీ వెళ్లలేం. దేవుడా మా ప్రాణాలి్న, మా పిల్లల్ని కాపాడు’’అని ఆమె ఏడుస్తూ చెప్పారు. ఇలా పేద అక్రమవలసదారుల వ్యథలు ఇప్పుడు అమెరికా వ్యాప్తంగా వినపడుతున్నాయి. -
‘ట్రంప్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం’
వాషింగ్టన్: అక్రమ వలస దారుల విషయంలో అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని భారత విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ సమర్థించారు. అమెరికాలో ఉన్న అక్రమ భారతీయ వలస దారుల్ని చట్టబద్ధంగా తిరిగి పంపిస్తే అందుకు స్వాగతిస్తామని స్పష్టం చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న జై శంకర్ స్థానిక మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చట్ట విరుద్ధంగా, ఎలాంటి డాక్యుమెంట్లు లేకపోవడం, అక్రమంగా అమెరికాలోకి చొరబడ్డ అక్రమ వలసదారుల్ని తిరిగి భారత్‌కు తీసుకువెళ్లేందుకు మేం ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం’ అని అన్నారు. పత్రాలు లేని వలసదారుల (Undocumented immigrants)ల విషయంలో భారత్ వైఖరి స్థిరంగా ఉందని చెప్పారు. ఇదే విషయాన్ని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోకు తెలిపారు.భారత్ అక్రమ వలసలను గట్టిగా వ్యతిరేకిస్తోందని, ఇది మంచిది కాదని, అనేక చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దారితీస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. భారతీయ ప్రతిభ, భారతీయ నైపుణ్యాలు ప్రపంచ స్థాయిలో ఉపయోగపడడంతో పాటు అవకాశాల్ని అందిపుచ్చుకోవాలని కోరుకుంటున్నాం. కాబట్టే అక్రమ వలస దారుల విషయంలో మా వైఖరి స్పష్టం ఉందని చెప్పారు. #FPLIVE: External Affairs Minister (EAM) S. Jaishankar, has clarified India's stance, saying that New Delhi is open to the "legitimate return" of Indian nationals living 'illegally' abroad, including in the US. https://t.co/JWyTTCKgXV— Firstpost (@firstpost) January 23, 2025 కాగా, అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ట్రంప్ ప్రమాణ స్వీకారానికి భారత్ తరుఫున విదేశాంగ మంత్రి జై శంకర్ హాజరయ్యారు. ప్రమాణ స్వీకారానికి వచ్చే సమయంలో ట్రంప్‌నకు ప్రధాని మోదీ లేఖ రాశారు. ఆ లేఖను జై శంకర్‌ను ట్రంప్‌కు అందించారు. -
భారతీయులను తొక్కేస్తే ట్రంప్ కొంప కొల్లేరే..!
-
జో బైడెన్ సంచలన నిర్ణయం.. పది లక్షల మందికి ఉపశమనం
వాషింగ్టన్: పదవి నుంచి దిగపోవడానికి ముందు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) సంచలన నిర్ణయం తీసుకున్నారు. వలసదారులకు(immigrants) టెంపరరీ ప్రొటెక్టెడ్ స్టేటస్‌ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వెనిజులా, ఎల్ సాల్వడార్, ఉక్రెయిన్, సూడాన్ దేశాలకు చెందిన వారికి వర్క్పర్మిట్లను 18 నెలలపాటు పొడిగించారు. ఈ మేరకు యూఎస్ డిపార్ట్మెంట్ ఆప్ హోంల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయా దేశాలకు చెందిన దాదాపు పది లక్షల మందికి ఉపశమనం లభించనుంది.ఈ రక్షణ ఇప్పటికే అమెరికాలో ఉన్న ప్రజలకు మాత్రమే పరిమితం. ప్రస్తుత రక్షణ గడువు ముగిసినప్పటి నుంచి మరో 18 నెలల పాటు బహిష్కరణ నుంచి ఉపశమనం లభిస్తుంది. బైడెన్ 2021లో అధికారం చేపట్టినప్పటి నుంచి టీపీఎస్‌కు అర్హులైన వ లసదారుల సంఖ్యను బాగా పెంచారు. స్వదే శంలో ప్రకృతి వైపరీత్యాలు, సాయుధ పోరాటం లేదా ఇతర అసాధారణ సంఘటనలతో ప్రభావితమైన ప్రజల కు వర్తింపజేసే ఈ హో దా ఇప్పుడు అమెరికా లో ఉన్న 17 దేశాలకు చెందిన 1 మిలియన్ కంటే ఎక్కువ మందికి వర్తిస్తుంది. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్.. జనవరి 20న బాధ్యతలు చేపట్టున్నారు.వెంటనే వలసదారులను ఆయా దేశాలకు తిప్పి పంపిస్తానని పలు మార్లు ప్రకటించారు. తన మొదటి పదవీ కాలంలోనూ టీపీఎస్ నమోదును ముగించడానికి ప్రయత్నించారు. కానీ యూఎస్కోర్టులు ఆ యన చర్యలను అడ్డుకున్నాయి. ఆయన మరోసారి శ్వేతసౌధానికి వస్తే టీపీఎస్ రక్షణలను రద్దు చేస్తారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ అధికారంలోకి వచ్చాక దేశంలో పనిచేసే అవకాశాన్ని కోల్పోతామని వలసదారులు భయపడుతున్నారు.వారిని రక్షించడానికి మరింత కృషి చేయా లని వలస న్యాయవాదులు, డెమొక్రటిక్ చట్టసభ సభ్యులు బైడెన్‌ను కోరారు. ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ముందే పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. ఫలితంగా అధ్యక్షుడు శుక్రవారం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ పొడిగింపులు లక్షలాది మందికి మద్దతు ఇవ్వడంతోపాటు ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఉపయోగపడతాయని అడ్వకెసీ గ్రూప్ అధ్యక్షుడు టాడ్ షూల్టే అన్నారు.ఇదీ చదవండి: కార్చిచ్చుతో ఇదేం రాజకీయం?!టీపీఎస్‌ను నికరాగ్వా, ఇతర దేశాలకు విస్తరించాలని బైడెన్‌ను కోరారు. టీపీఎస్ ద్వారా ప్రయోజనం పొందినవారిలో వెనిజులాకు చెందినవారే సుమారు 600,000 మంది ఉన్నారు. 1,900 మంది సుడానీలు, 104,000 మంది ఉక్రేనియన్లకు ఉపశమనం లభించింది. ఈ కార్యక్రమంలో అతిపెద్ద జనాభా వెనిజులాదే. 2021లో వెనిజులా వాసులకు బైడెన్ ప్రభు త్వం మొదట టీపీఎస్ హోదాను ఇచ్చింది. -
కెనడాలో ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ పాయింట్ల ఎత్తివేతకు రంగం సిద్ధం!
కెనడా ఇమ్మిగ్రేషన్ మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. లేబర్ మార్కెట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ (LMIA) మద్దతుతో ఉద్యోగ ఆఫర్‌కు సంబంధించినఎక్స్ప్రెస్ ఎంట్రీ పాయింట్ల వ్యవస్థను రద్దు చేయాలని భావిస్తోంది. జాబ్ ఆఫర్పేరుతో జరుగుతున్న మోసపూరిత పద్ధతులను అరికట్టే లక్ష్యంతో ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ పాయింట్ల వ్యవస్థను త్వరలో తొలగించనున్నట్లు ఇమ్మిగ్రేషన్ మంత్రిత్వ ఇమ్మిగ్రేషన్ శాఖ మంత్రి మార్క్ మిల్లర్ తెలిపారు.ఇది కాంప్రహెన్సివ్ ర్యాంకింగ్ సిస్టమ్ (CRS) కట్-ఆఫ్ స్కోర్‌ను చేరుకోవడానికి , అక్కడ శాశ్వత నివాసం పొందే అసలైన లబ్ధిదారులను ప్రభావితం చేయనుందని నిపుణులు భావిస్తున్నారు.తాత్కాలిక విదేశీ వర్కర్ (TFW) ప్రోగ్రామ్‌లో సంస్కరణల్లో భాగంగా ఇది మొదటిసారిగా 2014లో ప్రవేశపెట్టారు. స్టీఫెన్ హార్పర్ ప్రభుత్వం "అర్హత కలిగిన కెనడియన్లు అందుబాటులో లేనప్పుడు తాత్కాలిక ప్రాతిపదికన పూర్తి తీవ్రమైన కార్మికుల కొరతను నివారించేం పరిష్కారంగా" భావించింది. అంటే సాధారణంగా దేశంలోని వివిధ సంస్థలు నిపుణులైన, అర్హులైన ఉద్యోగులను అందుబాటులో లేనపుడు అప్పటికే శాశ్వత నివాసం ఉన్నవారిలో లేకపోతే విదేశీ వ్యక్తులను నియమించుకునే వెసులుబాటు కలుగుతుంది. కెనడాలోని సంస్థలు ఒక విదేశీ ఉద్యోగిని నియమించుకోవాలనుకుంటే, వారు ముందుగా LMIA దరఖాస్తును పూర్తి చేయాలి. ఫెడరల్ ప్రభుత్వం అనుమతి పొందాలి. ఉద్యోగం చేయడానికి కెనడియన్లు లేదా ఇతర శాశ్వత నివాసితులు లేరని కూడా వారు ధృవీకరించాల్సి ఉంటుంది.అలా లేబర్ మార్కెట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ (ఎల్ఎంఏఐ) కింద దరఖాస్తు చేసుకుంటాయి. ఈ సందర్భంగా జాబ్ ఆఫర్ ద్వారా ఆయా వ్యక్తులకు ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ పేరుతో 50 పాయింట్లు అదనంగా లభిస్తాయి. దీంతో.. ఆ వ్యక్తులు కెనడాలో శాశ్వత నివాసం లేదా తాత్కాలిక నివాసం కోరుకుంటే ఈ పాయింట్ల ద్వారా వారికి అదనపు ప్రయోజనం చేకూరుతుంది. అయితే ఈ పేరుతో పలు సంస్థలు మోసాలకు పాల్పడుతున్నాయని, విదేశీ వ్యక్తులు వీటిని కొనుగోలు చేసి.. శాశ్వత నివాసాలు పొందేందుకు అవకాశంకల్పిస్తున్నాయని జస్టిన్ ట్రూడో ప్రభుత్వం భావిస్తోంది. దీనిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. అయితే కెనడాలో శాశ్వత నివాసం పొందేందుకు జాబ్ ఆఫర్ల పేరిట మోసాలు జరుగు తున్నాయని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే నిబంధనలను కఠినతరం చేయాలని నిర్ణయించింది. కొంతమంది ఇమ్మిగ్రేషన్ ఏజెంట్లు చట్టవిరుద్ధంగా LMIAలను వలసదారులకు లేదా శాశ్వత నివాసం పొందడానికి వారి CRS స్కోర్‌ను పెంచుకుంటోందన్న పలు నివేదికల నేపథ్యంలో ఈ ప్రకటన రావడం గమనార్హం. -
ఇండియాపై ట్రంప్ భారీ బాంబు
-
అమెరికాలో వలసదారులు
అభివృద్ధి చెందిన అగ్రరాజ్యం అమెరికాలో స్థిరపడేందుకు ప్రపంచ దేశాల్లోని ప్రజలు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అమెరికా కలను సాకారం చేసుకునేందుకు పలు రకాల వీసాల కోసం అప్లే చేస్తారు. అయితే చాలా మందికి వీసాలు దొరక్క.. అక్రమ మార్గాల్లో సరిహద్దులు దాటి అమెరికాలోకి ప్రవేశిస్తున్నారు. దీంతో అమెరికాలో అక్రమ వలసదారుల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల నుంచి అమెరికాలోకి అక్రమంగా వలసలు పెరగడం అక్కడ తీవ్ర ఆందోళన కలిగించే అంశం. అమెరికన్ జనాభాలో 14.3 శాతం మంది వలసదారులే. ప్రస్తుతం అమెరికాలో 1 కోటి 10 లక్షల మంది అక్రమ వలసదారులు ఉంటున్నారని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్, ప్యూ రీసర్చ్ లెక్కలు చెబుతున్నాయి. అత్యధికంగా మెక్సికో నుంచి వస్తున్నారు. తర్వాతి స్థానంలో భారత్ ఉంది. 2040 నాటికి అమెరికాలో జననాల సంఖ్యను మరణాల సంఖ్య దాటిపోతుందని అంచనా.కరేబియన్, దక్షిణ అమెరికా, ఆసియా, యూరప్, సబ్ సహారా, ఆఫ్రికా నుంచి అనధికార వలసలు పెరిగాయని పరిశోధకులు తెలిపారు. అమెరికా అక్రమ వలసదారుల్లో వెనుజులా, బ్రిజిల్, కెనడా, మాజీ సోవియట్ దేశాలు, చైనా, డొమినికన్ రిపబ్లిక్ దేశాలకు చెందిన వారు ఉన్నారు.అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ డిపోర్టేషన్ పై కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. 2025 జనవరిలో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సరిహద్దులను బలంగా, శక్తిమంతంగా మార్చడంపై దృష్టి సారిస్తానని ట్రంప్ సృష్టం చేశారు.అయితే వలసదారులు లేకపోతే అమెరికా ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బ తింటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా వలసదారుల జనాభా అమెరికాలోనే ఉంది.మరి వలసదారులు అమెరికాలో ఎలాంటి పాత్ర పోషిస్తున్నారు? ఇమ్మిగ్రెంట్స్ లేకపోతే అమెరికా పరిస్థితి ఏంటి? వలసదారుల్ని భారీ సంఖ్యలో వెనక్కి పంపించడం సాద్యమేనా.. ? అక్రమ వలసదారుల్ని సామూహికంగా అమెరికా నుంచి తిప్పి పంపించటం ట్రంప్‌కు అంత ఈజీయేనా? వంటి విషయాలను తరువాత కథనంలో తెలుసుకుందాం..!- సింహబలుడు హనుమంతు -
భారతీయులకు దెబ్బ మీద దెబ్బ ట్రంప్ సంచలనం
-
ట్రంప్ 2.0: ఎన్నారైల ఎదురుచూపులు ఫలించేనా? లేక..
ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, సైనిక శక్తి కలిగి ఉన్న అమెరికాకు అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. ఇమ్మిగ్రేషన్, H1B, F1 వీసాలపై ట్రంప్ 2.O ప్రభావం ఎలా ఉంటుంది? అమెరికాలో విదేశీయుల విద్యకు ట్రంప్ విజయం అనుకూలమా? వ్యతిరేకమా? మరి అమెరికాలో చదువుకుంటే చదువు అయిపోగానే గ్రీన్ కార్డు ఇస్తామని ట్రంప్ గతంలో హామీ ఇచ్చాడు ? అమలు చేస్తాడా? లేదా ? అందరి మదిలో ఇదే ప్రశ్న.. మరోసారి వైట్‌హౌస్‌లో అడుగుపెడుతున్న ట్రంప్ అమెరికా విదేశాంగ విధానం రూపురేఖల్ని మార్చే అవకాశం ఉంది. స్పష్టమైన వివరాలు చెప్పకపోయినప్పటికీ, విదేశాంగ విధానంపై ఎన్నికల సమయంలో ట్రంప్ అనేక హామీలు ఇచ్చారు.ఇమ్మిగ్రేషన్ఇండియన్స్ పై తీవ్ర ప్రభావం చూపే అంశం ఇమ్మిగ్రేషన్. భారత్ నుంచి అమెరికాకు స్టెమ్ రంగాల్లో ఉద్యోగాల కోసం వేలమంది H1B వీసాలపై వెళుతుంటారు. దీంతో స్థానిక అమెరికన్లు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. దేశ జనాభాలో 60% వరకు ఉన్న స్థానిక అమెరికన్లలో ఈ అంశంపై నెలకొన్న అసహనం.. ట్రంప్ విజయానికి ఒక కారణం.గ్రీన్ కార్డు నిబంధనలు : మొదటి నుంచి అమెరికా ఫస్ట్ నినాదంతో ముందుకు వెళ్తున్న డొనాల్డ్ ట్రంప్.. ఈసారి కూడా అదే మంత్రం పఠిస్తున్నారు. ఇతర దేశాల నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడిన గ్రీన్ కార్డు హోల్డర్లపై దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే.. గ్రీన్ కార్డు నిబంధనలు మార్చేందుకు ట్రంప్ యోచిస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే అమెరికాలో గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న 10 లక్షల మంది భారతీయులపై ఆ ప్రభావం పడనుంది.అమెరికా పౌరసత్వం ఎవరికి వస్తుంది..? ఇప్పటివరకు అమెరికా నిబంధనల ప్రకారం.. వలసదారులు గ్రీన్ కార్డు పొందినట్లైతే.. వారికి పుట్టే పిల్లలకు కూడా పుట్టుకతోనే అమెరికా పౌరసత్వం లభిస్తుంది. అయితే ఇప్పుడు ఈ విధానానికే డొనాల్డ్ ట్రంప్ స్వస్తి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడైంది. అమెరికాలో కొత్తగా తీసుకురానున్న గ్రీన్ కార్డ్ రూల్స్ ముసాయిదా ప్రతిపాదన ప్రకారం.. అమెరికాలోని చట్టబద్ధమైన వలసదారులకు పుట్టబోయే పిల్లలు.. పుట్టుకతోనే అమెరికా పౌరసత్వం పొందాలంటే తల్లిదండ్రుల్లో కనీసం ఒకరైనా అమెరికా పౌరుడు లేదా చట్టబద్ధంగా శాశ్వత నివాసి అయి ఉండాల్సిందేనని తెలుస్తోంది. ఇది ప్రవాస భారతీయులకు పెద్ద ఎదురుదెబ్బగా మారనుంది. ప్రస్తుతం అమెరికాలో 48 లక్షల మంది భారత అమెరికన్లు ఉన్నారు. వారిలో 34 శాతం మంది అంటే 16 లక్షల మంది అమెరికాలోనే పుట్టారు. అందువల్ల వారికి పుట్టుకతోనే అమెరికా పౌరసత్వం లభించింది. కానీ ప్రస్తుతం వారిలో ఆందోళన మొదలైంది.అమెరికాలోకి అక్రమంగా వచ్చిన వారిని మూకుమ్మడిగా తిప్పి పంపడం.. డిపోర్టేషన్ పై ఇచ్చిన ఎన్నికల హామీకి కట్టుబడి ఉన్నానంటున్నారు ట్రంప్. దీని కోసం ఎంత ఖర్చైనా సరే, తగ్గేది లేదంటున్నారు. మరి అక్రమ వలసదారుల్ని సామూహికంగా తిప్పి పంపిస్తానన్న ఎన్నికల హామీని నిలబెట్టుకోవడం ట్రంప్‌కు అంత ఈజీయేనా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. సరైనా డాక్యూమెంట్స్ లేకుండా అమెరికాలో ఉంటున్న వారిని గుర్తించి, అరెస్ట్ చేసి వారి సొంత దేశానికి పంపించడం క్లిష్టమైన వ్యవహారం అనే చెప్పాలి. కాగా ట్రంప్ అయినా, ఇంకొకరైనా అమెరికా అధ్యక్షునికి.. అమెరికా ప్రయోజనాలే ముఖ్యం. తరువాతే మరో దేశం. ఇంకా చెప్పాలంటే మొత్తం ప్రపంచాన్ని అమెరికా తమ మార్కెట్‌గా చూస్తుందినటంలో సందేహమే లేదు. మరి కొత్త ప్రభుత్వం ఇమిగ్రేషన్ విషయంలో ఎలాంటి మార్పులు తీసుకు వస్తుందో వేచి చూడాలి. -
భారతీయులకు భారీ షాక్..?
-
ట్రూడో సర్కార్ కీలక నిర్ణయం.. కెనడా వెళ్లే విద్యార్థులకు ఝలక్
ఒట్టావా: కెనడాలోని జస్టిన్ ట్రూడో సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీ విద్యార్థులకు షాకిస్తూ 2025లో స్టడీ పర్మిట్లను తగ్గించేందుకు సిద్ధమైంది. తమ దేశంలో తాత్కాలిక నివాసితుల రాకపోకలను తగ్గించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. కెనడాలో వలసల నియంత్రణకు జస్టిన్ ట్రూడో సర్కార్ సిద్ధమైంది. ఇందులో భాగంగా విదేశీ విద్యార్థులకు స్టడీ పర్మిట్స్, వర్కర్ల పని అనుమతుల విషయంలో మరిన్ని ఆంక్షలు విధించేలా ప్లాన్ చేసింది. 2025లో కొత్త అంతర్జాతీయ విద్యార్థుల స్టడీ పర్మిట్లు 10 శాతం మేర తగ్గించబోతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 2024లో జారీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న 4,85,000 నుంచి 10 శాతం తగ్గితే కేవలం 4,37,000 మందికి మాత్రమే స్టడీ పర్మిట్లు అందుతాయని స్పష్టం చేసింది. ఇక, 2025లో జారీ చేసే స్టడీ పర్మిట్ల సంఖ్య 2026లో కూడా ఎలాంటి మార్పులు ఉండదని ప్రకటించారు. అంతకుముందు.. 2023లో ఈ సంఖ్య 5,09,390గా ఉండగా.. ఈ ఏడాది తొలి ఏడు నెలల్లో 1,75,920 స్టడీ పర్మిట్లను జారీ చేశారు. 📢 New Temporary Residence Cuts in Canada! 🇨🇦The Government of Canada has announced key changes to strengthen temporary residence programs and maintain sustainable immigration levels. Here's what you need to know:Reduction in Study Permits: 10% reduction in study permits for…— Seyi Obasi - Work, Live & Study In Canada🇳🇬🇨🇦 (@SeyiSpeaks) September 18, 2024 మరోవైపు..కెనడా జనాభా 2024 మొదటి త్రైమాసికంలో 41 మిలియన్లకు పైగా ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో తాత్కాలిక నివాసితులలో భారీ పెరుగుదల కనిపించడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే, దేశీయంగా పెరుగుతున్న ఇళ్ల కొరత, నిరుద్యోగ సమస్యకు చెక్ పెట్టడంలో భాగంగానే ఇలా షరతులు విధించినట్టు తెలుస్తోంది.ఇది కూడా చదవండి: Lebanon: లెబనాన్‌లో మళ్లీ పేలుళ్లు.. 32 మంది మృతి -
కెనడాకి బైబై చెబుతున్న భారతీయులు.. కారణం ఇదే?
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు ప్రజల్లో రోజురోజుకి వ్యతిరేకత పెరుగుతోంది. ఖలిస్తానీ నేత హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యలో భారత్ హస్తం ఉందని అసత్య ఆరోపణలు చేసిన ట్రూడోకు కెనడాలో జనాదారణ గణనీయంగా పడిపోయింది. ట్రూడో రోజురోజుకు.. కెనడా ప్రజల మద్దతు కోల్పోతున్నారని, ఆయన నాయకత్వ పటిమపై కెనడా ఓటర్లకు విశ్వాసం సన్నగిల్లుతున్నట్లు సమాచారం. దాదాపూ 60 శాతం మంది ప్రజలు ట్రూడో పదవి నుంచి వైదొలగాలని కోరుకుంటుండగా.. ఇదే సమయంలో ప్రతిపక్ష నేతకు పాపులారిటీ పెరిగిపోయిందని కెనడాకు చెందిన స్థానిక మీడియా సంస్థ గ్లోబల్ న్యూస్ పోల్ సర్వే నిర్వహించింది. అందులో ప్రస్తుత ప్రతిపక్ష నేత పియరీ పోయిలివ్రే దాదాపు 40 శాతం మంది కెనడా ప్రజలు మొగ్గు చూపుతుండగా..ట్రూడో నేతృత్వంలోని లిబరల్ పార్టీ 30 శాతం ఓట్లకే పరిమితం కానుంది. ట్రూడో ఆద్వర్యంలో కెనడా ఆర్ధిక వ్యవస్థ తీవ్రమైన సమస్యలతో కొట్టుమిట్టాడుతుంది. దీనికి తోడు అక్కడి గృహ, ఆరోగ్య సమస్యల పరిష్కారంలో కూడా ట్రూడో సర్కార్ విఫలమైందని సర్వేలో పాల్గొన్న వారు వెల్లడించారు. ఈ మూడు రంగాల్లో ప్రతిపక్ష నేత పియరీ వద్ద మెరుగైన ప్రణాళికలు ఉన్నట్లు పోల్స్‌లో పాల్గొన్న వారు చెబుతున్నారు. మరో సర్వేలో ఈ నేపథ్యంలో ఇనిస్టిట్యూట్ ఫర్ కెనడియన్ సిటిజన్ షిప్ (ఐసీసీ), కాన్ఫారెన్స్ బ్యాంక్ ఆఫ్ బరోడాలు సంయుక్తంగా మరో సర్వే నిర్వహించాయి. ఆ సర్వేలో 2017 నుంచి 2019 మధ్యకాలంలో కెనడాను వదిలి ఇతర దేశాలకు వెళ్లిపోతున్న వారి సంఖ్య పెరిగినట్లు స్పష్టమైంది. వస్తున్నారు.. వెళ్తున్నారు గత అక్టోబర్ 31న విడుదలైన ఈ సర్వేలో 2017 నుంచి కెనడాకి గుడ్ బై చెబుతున్నారో.. అదే స్థాయిలో కెనడాకి వస్తున్న వారి సంఖ్య అధికంగా ఉన్నట్లు సర్వే హైలెట్ చేసింది. అధ్యయనం ప్రకారం, 1982లో లేదా తర్వాత కెనడాలో శాశ్వత నివాసం పొందిన వారిలో 0.9 శాతం మంది ప్రతి సంవత్సరం కెనడాను విడిచిపెట్టారు. అయితే 2019లో ఈ శాతం 1.18 శాతానికి పెరిగింది. ఇది వలసదారుల సగటు రేటుతో పోలిస్తే 31 శాతం పెరుగుదలను చూపుతుంది. కారణం ఇదే 2019లో దాదాపు 67,000 మంది వలసదారులు కెనడాను విడిచిపెట్టగా, 2017లో 60,000 మంది వలసవెళ్లారు. కెనడాను విడిచిపెట్టిన వలసదారుల పెరుగుదలలో ఈ ధోరణి 1990ల నుండి పెరుగుతోందని అధ్యయనం తెలిపింది. ఇనిస్టిట్యూట్ ఫర్ కెనడియన్ సిటిజన్ షిప్ (ఐసీసీ), కాన్ఫారెన్స్ బ్యాంక్ ఆఫ్ బరోడా సర్వేలో కెనడాకు కొత్తగా వచ్చే వారి అంచనాలను అందుకోవడంలో కెనడియన్ ప్రభుత్వం విఫలమైన ఫలితంగా, కెనడా నుంచి వెళ్లే వారి సంఖ్య పెరుగుతున్నాయి. కొత్త వలసదారులు క్షీణిస్తున్న గృహ ప్రణాళికలు, ఒత్తిడిలో ఉన్న ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ, ఉపాధి తక్కువగా ఉండటంతో పాటు ఇతర సమస్యలను ఎదుర్కొంటున్నారని సర్వేలో పాల్గొన్న వారు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఆయన పరిపాలనలో తలెత్తుతున్న ఇబ్బందుల గురించి ఏకరువు పెట్టారు. -
ఉత్తరం నుంచి దక్షిణానికి...వలస వ్యధ!
జెరుసలేం: ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్ సంస్థ చేసిన మతిలేని దాడి సొంత ప్రజలైన పాలస్తీనియన్ల పాలిట భస్మాసుర హస్తంగా మారుతోంది. ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న ఇజ్రాయెల్ హెచ్చరిలతో ఉత్తర గాజావాసులంతా ఇల్లూ వాకిలీ వీడి పొట్ట చేతపట్టుకుని వలసబాట పడుతున్నారు. వందలో, వేలో కాదు! అక్కడి 11 లక్షల మందిలో ఇప్పటికే 4 లక్షల మందికి పైగా వలస వెళ్లగా, ఇజ్రాయెల్ అతి త్వరలో పూర్తిస్థాయి భూతల దాడికి దిగనున్న నేపథ్యంలో మిగతావారూ అదే బాట పట్టారు. బెదిరింపులకు జడవద్దన్న హమాస్ పిలుపులను పట్టించుకుంటున్న దిక్కే లేదు. ఇన్ని లక్షల మందీ మరో దారిలేక దక్షిణ గాజా వైపు సాగుతున్నారు. ఇప్పటికే మౌలిక సదుపాయాలతో పాటు దేనికీ దిక్కులేక కటకటలాడుతున్న దక్షిణ గాజా, అక్కడి జనాభాకు సమాన సంఖ్యలో వచ్చి పడుతున్న తోటి పాలస్తీనియన్లకు ఏ మేరకు ఆశ్రయం కల్పిస్తుందో, ఎలా ఆదుకోగలదో... అంతా అగమ్యగోచరం! ఈ మనకాలపు మహా విషాదానికి ఐక్యరాజ్యసమితితో పాటు అంతర్జాతీయ సమాజం కూడా మౌన ప్రేక్షకురాలిగా మారుతోంది...! పెను ఉత్పాతానికి, మానవ సంక్షోభానికి దారి తీయగల ఈ భారీ వలసలు వద్దంటున్న ఐరాస, అందుకు మరో ప్రత్యామ్నాయమేమీ చూపలేని పరిస్థితుల్లో చేష్టలుడిగింది. సామూహిక వలసలు... కార్లు, ట్రక్కులు, గాడిదలు, కాలినడకన... ఎలా వీలైతే అలా ఉత్తర గాజావాసులు వలస బాట పట్టారు. భారమైన మనసులతో ఇల్లూ వాకిలీ ఖాళీ చేసి కుటుంబాలతో సహా తరలి వెళ్తున్నారు. చుట్టూ వచ్చి పడుతున్న బాంబులు, రాకెట్లు, క్షిపణుల మధ్యే బిక్కుబిక్కుమంటూ సాగుతున్నారు. ఎట్టకేలకు దక్షిణ గాజా చేరినా సురక్షితంగా ఉంటామో లేదో తెలియని అయోమయం! తాగడానికి, తినడానికి కూడా దిక్కుండదేమోనన్న భయం!! వెరసి అంతులేని దైన్యమే వారిని వెంటాడుతోంది. మరోవైపు ఎటూ కదల్లేక ఆస్పత్రుల్లో దీనావస్థలో ఉన్న వేలాది మంది క్షతగాత్రులు, రోగులు నిస్సహాయంగా కాలం గడుపుతున్నారు. ఇజ్రాయెలీల ప్రతీకారేచ్ఛ హమాస్ పాశవిక దాడిపై ఇజ్రాయెలీలు మండిపడుతున్నారు. చీకటిమాటున తీసిన దొంగ దెబ్బపై కనీవినీ ఎరగని రీతిలో ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని నినదిస్తున్నారు. ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ కూడా శుక్రవారం రాత్రి ప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగం వారి భావోద్వేగాలను ప్రతిఫలించింది. హమాస్‌ను సర్వనాశనం చేసి గానీ విశ్రమించేది లేదని ఆయన పునరుద్ఘాటించారు. ఈ నేపథ్యంలో ఉత్తర గాజా ఖాళీ అయ్యాక ఇజ్రాయెల్ ఏ స్థాయి దాడులకు దిగుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అక్కి భవనాలు, నిర్మాణాలు ఇప్పటికే చాలావరకు ఇజ్రాయెల్ రాకెట్ దాడుల్లో నేలమట్టమయ్యాయి. అయితే, అమాయక పాలస్తీనియన్లకు హాని కలగకుండా వీలైనన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు ఇజ్రాయెల్ సైన్యం అధికార ప్రతినిధి జొనాథన్ కొన్రికస్ ప్రకటించారు. తక్షణం దక్షిణాదికి వెళ్లిపోవాలంటూ ఉత్తర గాజా అంతటా సైన్యం కరపత్రాలు జారవిడిచింది. సోషల్ మీడియాలోనూ విజ్ఞప్తి చేసింది. రెండు ప్రధాన రహదారులపై ఉదయం 10 నుంచి సాయంత్రం నాలుగింటి వరకూ ఎలాంటి హానీ తలపెట్టకుండా వలసలను అనుమతిస్తామని ప్రకటించింది. అయితే, యుద్ధం ముగిశాక వారు ఉత్తర గాజాకు తిరిగొచ్చేందుకు అనుమతిస్తామన్న హామీని ఇజ్రాయెల్ నిలుపుకోవడంపై ఈజిప్ట్ తదితర దేశాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. అనుమతిస్తాం: ఈజిప్టు దక్షిణ రఫా సరిహద్దు క్రాసింగ్‌ను తెరిచి ఉత్తర గా జా వాసులను దక్షిణాదికి అనుమతిస్తామని ఈజి ప్టు ప్రకటించింది. గత వారం రోజుల్లో అక్కడ నిర్మించిన తాత్కాలిక గోడలను కూల్చేస్తామని పేర్కొంది. తమవైపు ఇప్పటిదాకా 2,200 మందికి పైగా మరణించినట్టు గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది. అలాగే హమాస్ దాదుల్లో మరణించిన ఇజ్రాయెలీల సంఖ్య 1,500 దాటినట్టు ఆ దేశ ప్రభుత్వం పేర్కొంది. వలస వెళ్తున్నవారి కార్లపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దిగిందని హమాస్ ఆరోపించింది. ఈ దాడులు ఏకంగా 70 మంది అమాయకులను బలిగొన్నాయని పేర్కొ ంది. మరోవైపు ఏ క్షణంలోనైనా హమాస్‌కు ద న్నుగా బరిలో దిగేందుకు సిద్ధమని హెజ్బొల్లా తీవ్రవాద సంస్థ పునరుద్ఘాటించింది. గాజావాసు ల కోసం ఐరాస పంపిన ఔషధాలు తదితరాల తో కూడిన విమానాలు ఈజిప్టులోనే నిలిచిపోయాయి. పాలస్తీనియన్ల పట్ల ఇజ్రాయెల్ దారు ణంగా ప్రవర్తిస్తోందంటూ 57 ఇస్లామిక్ దేశాల కూటమి మండిపడింది. వలసలు పూర్తయేందుకు ఇజ్రాయెల్ మరింత సమయమివ్వాలని యూరోపియన్ యూనియన్ సూచించింది. కళ్లముందు 1948 వలసలు ప్రస్తుత సంక్షోభం 1948 నాటి పాలస్తీనా వలసలను గుర్తు తెస్తోంది. ఇజ్రాయెల్ ఆవిర్భావం సందర్భంగా అరబ్ దేశాలతో జరిగిన యుద్ధం సందర్భంగా ఏకంగా 7 లక్షల మంది పాలస్తీనియన్లు ప్రస్తుత ఇజ్రాయెలీ భూభాగాల నుంచి ఇలాగే వలస బాట పట్టారు. దీనినే వారు నక్బా (భారీ ఉత్పాతం)గా పిలుస్తారు. నాటినుంచి వారు ఇప్పటిదాకా తమ స్వస్థలాల ముఖం చూసేందుకు నోచుకోలేదు! వారు, వారి వారసులు కలిపి 60 లక్షల మంది దాకా వెస్ట్‌బ్యాంక్‌తో పాటు లెబనాన్, సిరియా, జోర్డాన్లలో తలదాచుకుంటున్నారు. గాజాలోనూ ఎక్కువ మంది వీరే. నాటి బాధాకరమైన ఉదంతం ఇప్పుడు పునరావృతమవుతోందని వారు ఆక్రోశిస్తున్నారు. దాడుల్లో హమాస్ కమాండర్ హతం: ఐడీఎఫ్ ఇజ్రాయెల్‌పై మెరుపుదాడికి సారథ్యం వహించిన హమాస్ మిలిటెంట్ సంస్థకు చెందిన కమాండర్ అలీ ఖాదీ హతమయ్యాడు. నక్బా యూనిట్ కంపెనీ కమాండర్‌గా ఉన్న అతన్ని కచ్చితమైన సమాచారం మేరకు డ్రోన్ దాడిలో మట్టుపెట్టినట్టు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) శనివారం ప్రకటించింది. 2005లో పలువురు ఇజ్రాయెల్ పౌరుల కిడ్నాపింగ్, హత్య కేసుల్లో అలీని అదుపులోకి తీసుకున్నారు. కానీ గిలాత్ శాలిద్ ఖైదీల మారి్పడి ఒప్పందంలో భాగంగా విడుదల చేయాల్సి వచి్చంది‘ అంటూ ఆ దేశ వైమానిక దళం ట్వీట్ చేసింది. హమాస్ ఉగ్రవాదులందరికీ అలీకి పట్టిన గతే పడుతుందని హెచ్చరించింది. -
ఇటలీ తీరంలో పడవ బోల్తా.. ఇద్దరి మృతి
మిలాన్: ఇటలీ సముద్ర తీరానికి సమీపంలో రెండు పడవలు నీటమునిగాయి. రెండు పడవల్లో ఒకదాంట్లో 48 మంది మరో దాంట్లో 42 మంది వలసదారులు ప్రయాణిస్తున్నారని వారిలో 57 మందిని కాపాడిన ఇటలీ తీరప్రాంత రక్షణ దళాలు ఓ తల్లీ బిడ్డలను మాత్రం కాపాడలేకపోయామని గల్లంతైన మరో 30 మంది ఆచూకీ కోసం గాలిస్తున్నామని ఇటలీ కోస్ట్ గార్డులు తెలిపారు. వయా ట్యునీషియా.. స్ఫాక్స్ బీచ్ తీరంలో గత వారం 10 మృతదేహాలను కనుగొన్నామని ట్యునీషియా పోర్టు గుండా ఇటలీకి చేరుకోవడం సులభం కాబట్టి అక్రమ వలసదారులు ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు చెబుతున్నారు స్ఫాక్స్ అధికారులు. తాజాగా ఈ రెండు పడవలు కూడా ట్యునీషియా పోర్టు నుండే ఇటలీ వైపుగా వచ్చాయని అవి లంపెడుసా ద్వీపం దాటగానే ఉరుములు మెరుపులతో సముద్రంలో అలజడి రేగడంతో అలల తాకిడికి అందులో ప్రయాణిస్తున్న 90 మంది వలసదారులతో సహా పడవలు బోల్తా పడ్డాయన్నారు. కోస్ట్ గార్డుల సాహసం.. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే ఇటలీ తీర రక్షణ దళాలు హుటాహుటిన స్పందించి 57 మందిని రక్షించగలిగామని తెలిపారు స్ఫాక్స్ అధికారులు. కానీ ప్రమాదంలో ఓ తల్లీ బిడ్డలను మాత్రం కాపాడలేకపోయామని. వారి మృతదేహాలు మాత్రం లభ్యమయ్యాయని తెలిపారు. పడవలోని మిగిలిన 30 మంది గల్లంతు కాగా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అన్నారు. ఇలా అయితే ఎలా? ఈ రెండు పడవల్లోని వలసదారులు సహారా-ఆఫ్రికా దేశాలకు చెందిన వారే అయి ఉంటారని, ఎంతగా ప్రయత్నించినా ఆఫ్రికా దేశాల నుండి ఈ అక్రమ వలసలకు అడ్డుకట్ట వేయలేకున్నామని తెలిపారు ఇటలీ వలసల విచారణాధికారి ఇమ్మానుయేల్ రిసిఫారీ. వారాంతా మెరుగైన జీవితం కోసమే ఇటు వస్తున్నారు. అదేదో చట్టబద్దంగా వస్తే బాగుంటుంది కానీ దొడ్డిదారిన రావడం వల్లనే ఇలా ప్రమాదాల బారిన పడుతున్నారని అన్నారు. డిమాండ్ ఎక్కువ.. ఎందరో వలసదారులు చనిపోతున్నారని సముద్రంలో ప్రమాదాలను నివారించడానికి నౌకలను ఏర్పాటు చేయడం కూడా అక్రమ వలసలను ప్రోత్సహిస్తున్నట్లే ఉంది. పొరుగు దేశానికి వలసలంటే భయపడేవారు కూడా ధైర్యంగా అడుగేసి ఇటు వైపుగా కదులుతున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఈ అక్రమ వలసలు రెట్టింపయ్యాయి. 2022లో 42,600 మంది వలస వచ్చినట్లు రికార్డుల్లో నమోదు కాగా ఈ ఏడాది మాత్రం 92,000 మందికిపైగా వలస వచ్చినట్లు రికార్డులు చెబుతున్నాయి. Migrants rescued from rough seas off Italy. Reports say dozens could still be missing at sea, while more stranded migrants were airlifted from rocks on the island of Lampedusa. Read more: https://t.co/cJMUPoyyWL pic.twitter.com/lbXo28Rbrd — Sky News (@SkyNews) August 7, 2023 ఇది కూడా చదవండి: మొరాకోలో ఘోర రోడ్డు ప్రమాదం.. 24 మంది మృతి.. -
సముద్రంలో ఒళ్ళు గగుర్పొడిచే సాహసం.. తలచుకుంటేనే..
రియో డి జనేరియో: నైజీరియాకు చెందిన నలుగురు వలసదారులు 14 రోజులపాటు కార్గో షిప్ అడుగున ముందుభాగంలో ఉండే చుక్కానిపై కూర్చుని అత్యంత సాహసంతో కూడుకున్న యాత్ర చేసి బ్రెజిల్ చేరుకున్నారు. తిండి లేకుండా దీనావస్థలో ఉన్న వారిని ఆగ్నేయ పోర్టులోని బ్రెజిల్ ఫెడరల్ పోలీసులు కనుగొని రక్షించారు. యూరప్ చేరుకోవాలన్న తపనతో నలుగురు నైజీరియా వలసదారులు అక్రమంగా ఒక పెద్ద ఓడ చుక్కానిపైకి ఎక్కి కూర్చున్నారు. అట్లాంటిక్ మహాసముద్రం వైపుగా కదిలిన ఆ ఓడ యూరప్ వెళ్తుందనుకుంటే అదికాస్తా బ్రెజిల్ వైపుగా కదిలింది. నడిసంద్రంలో ఉన్నంతసేపు వారు ఎక్కడికి వెళ్తోంది కూడా వారికి తెలియదు. రేయింబవళ్లు ఆ చిన్న స్థలంలో ఇరుక్కుని అలా కూర్చుండిపోయారు. వారివద్ద తినడానికి కూడా ఏమీ లేదు. అలాగే బిక్కుబిక్కుమంటూ ప్రమాదకరమైన పరిస్థితుల్లో ప్రయాణించారు. ఆ ఓడ 14 రోజులపాటు మహాసముద్రంలో 5,600 కిలోమీటర్లు ప్రయాణించి బ్రెజిల్ పోర్టు చేరుకుంది. ఓడ బ్రెజిల్ చేరుకున్నాక దయనీయ స్థితిలో చుక్కానిపై కూర్చుని ఉన్న నలుగురిని అక్కడి అధికారులు జాగ్రత్తగా కిందికి దించారు. వారి పరిస్థితి చూసి వెంటనే వారికి ఆహారమిచ్చి ఆశ్రయమిచ్చారు. మొత్తం నలుగురు వలసదారుల్లో ఇద్దరి అభ్యర్ధన మేరకు వారిని తిరిగి నైజీరియా పంపించగా మరో ఇద్దరు మాత్రం బ్రెజిల్‌లోనే ఉండిపోయారు. వారు తమ అనుభవాలను పంచుకుంటూ చుక్కాని మీద కూర్చుని ప్రయాణించడం చాలా భయంకరమైన అనుభూతి. ఒక్కోసారి పెద్ద పెద్ద తిమింగలాలు మాకు దగ్గరగా వెళ్తూ కనిపించేవి. వాటిని చూస్తేనే భయమేసేది. ఒకపక్క సముద్రం మరోపక్క ఓడ ఇంజిన్ శబ్దం హోరెత్తించడంతో నిద్ర కరువైంది. దాహానికి మాత్రం అపుడప్పుడు వేరే మార్గంలేక సముద్రం నీళ్లనే తాగేవాళ్ళం. ఓడ సిబ్బంది కంటపడితే వారు మమ్మల్ని సముద్రంలోకి పడదోస్తారని భయపడి అలాగే ఉండిపోయాము. ఒక్కోసారి మాలో ఎవరైనా కూడా ఆ పని చేస్తారేమోనని భయపడి కళ్ళు తెరచుకుని ఉండే వాళ్ళమన్నాడు. నైజీరియాలో ఆర్ధిక, రాజకీయ అస్థిరత వల్లనే తాము వలస వెళ్లాలని నిర్ణయించుకున్నామన్నాడు. సావో పాలోలో వారికి ఆశ్రయమిచ్చిన చోట ఒక వ్యక్తి మాట్లాడుతూ మేము చాలా మంది వలసదారుల గాధలు విన్నాం కానీ ఇటువంటి సాహస యాత్రను నేనెన్నడూ చూడలేదని అన్నారు. ఇది కూడా చదవండి: సైనిక తిరుగుబాటుతో ఫ్రాన్స్ దేశస్తులను వెనక్కి రప్పిస్తున్న ఎంబసీ -
వారు కాపాడటానికి వచ్చారనుకున్నాం.. కానీ..
ఏథెన్స్: మధ్యధరా సముద్రంలో ప్రయాణిస్తూ గ్రీసు వైపుగా వచ్చి మునిగిపోయిన బోటులో ప్రాణాలు దక్కించుకున్న కొందరు విస్తుపోయే నిజాలను చెబుతున్నారు. గ్రీసు తీర రక్షక దళాల బృందాలను చూడగానే వారు మమ్మల్ని కాపాడతారని అనుకున్నాము కానీ వారే మా పడవ మునిగిపోవడానికి కారణమని చెప్పారు. ఇటీవల ఆఫ్రికా నుండి ఐరోపా దేశాలకు వలస వస్తోన్న ఒక బోటు నీటమునిగిన సంగతి తెలిసిందే. 750కు పైగా వలసదారులు ప్రయాణిస్తున్న ఆ బోటు ప్రమాదంలో 80 మంది మృతి చెందగా 104 మంది మాత్రమే ప్రాణాలు దక్కించుకున్నారు. మిగతా వారంతా గల్లంతయ్యారు. వీరిలో అత్యధికులు పాకిస్తాన్, సిరియా, ఈజిప్టు దేశాలకు చెందినవారే. అయితే వీరిలో ప్రాణాలు దక్కించుకున్న ఈజిప్టు వ్యక్తిని అసలేం జరిగిందని ప్రశ్నించగా.. గ్రీసు సమీపంలోకి రాగానే దూరంగా రక్షక దళాలు కనిపించడంతో మమ్మల్ని కాపాడమని అరిచాము. వారు తాడు వేసి మమ్మల్ని రక్షిస్తారని అనుకుంటే మమ్మల్ని కిందకి లాగేశారని అన్నాడు. సిరియాకు చెందిన మరో మృత్యుంజయుడు చెబుతూ.. వారు మా పడవకు ఒకపక్కన తాడు కట్టి బలంగా లాగడంతో బోటు మునిగిపోయిందని అన్నాడు. వీరిద్దరూ చెప్పినదాని బట్టి చూస్తే గ్రీసు తీర రక్షక బృందాల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఏది ఏమైనా పొట్ట చేతపట్టుకుని జీవనబండిని లాగించాలని ఐరోపా వైపు పయనమైన శరణార్థుల్లో 104 మంది మినహాయిస్తే మిగిలిన వారి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇది కూడా చదవండి: ఇదేం విచిత్రమైన పోటీ.. గిన్నిస్ రికార్డు కూడానా? -
అమెరికా హెచ్1బీ వీసాతో కెనడాలో ఉద్యోగం
టొరొంటొ: అమెరికాలో హెచ్1బీ వీసా వినియోగదారులు ఇక కెనడాలో కూడా ఉద్యోగాలు చేసుకోవచ్చు. ఈ మేరకు కెనడా ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. మొత్తం 10 వేల మంది ఉద్యోగాలు చేయడం కోసం ఓపెన్ వర్క్ పరి్మట్కు ఏర్పాట్లు చేస్తోంది. దీంతో అమెరికాలో భారతీయ టెక్కీలకు కూడా లబ్ధి చేకూరుతుంది. అమెరికాలో దిగ్గజ కంపెనీలు ఉద్యోగాల్లో కోత విధిస్తూ ఉండడంతో దానిని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాల్లో కెనడా ఉంది. అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయిన నిపుణులైన టెక్కీలను ఆకర్షించి సాంకేతిక రంగంలో ప్రపంచంలో అగ్రగామిగా ఎదగాలని చూస్తోంది. ‘‘అమెరికాలో హెచ్1బీ వీసా కలిగి ఉన్న వారు 10 వేల మంది వరకు జూలై 16లోగా కెనడాకు రావడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక్కడే ఉద్యోగాలు చేయొచ్చు. వారి కుటుంబ సభ్యులు చదువుకోవడం, పని చేయడానికి కూడా అనుమతులిస్తాం’’ అని కెనడా వలసలు, పౌరసత్వ సేవల మంత్రి సియాన్ ఫ్రాజర్ చెప్పారు. తాము ఎన్నో లక్ష్యాలను ఏర్పాటు చేసుకున్నామని, దానికి తగ్గట్టుగానే ఇమ్మిగ్రేషన్ టెక్ టాలెంట్ స్ట్రాటజీని అనుసరిస్తున్నట్టుగా చెప్పారు. సాంకేతికంగా వైవిధ్యభరితమైన పురోగతి సాధించి టెక్ జెయింట్గా ఎదగాలన్నదే తమ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమం కింద హెచ్1బీ వీసా వినియోగదారులకు మూడేళ్ల పాటు ఓపెన్ వర్క్ పరి్మట్ లభిస్తుంది. వారి జీవిత భాగస్వామి ఉద్యోగం లేదా చదువుకోవడం వంటివి చేయొచ్చు. అమెరికాలో భారత్, చైనాకు చెందిన వేలాది మంది టెక్కీలను టెక్ కంపెనీలు ప్రతీ ఏటా ఉద్యోగాల్లోకి తీసుకుంటాయి. ప్రస్తుతం అమెరికా మార్కెట్ సరిగా లేకపోవడంతో లేఆఫ్‌లు ఎక్కువగా ఉన్నాయి. గత ఏడాది నవంబర్ నుంచి దాదాపుగా 2 లక్షల మంది టెక్కీలు అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయారు. ఇప్పుడు అలాంటి వారందరికీ కెనడాలో మంచి అవకాశాలు దొరికే చాన్స్ వచి్చంది. ఇది కూడా చదవండి: బార్లో ఉన్న అన్ని కాక్ టెయిల్స్ తాగేశాడు.. చివరికి.. -
ఆస్ట్రేలియాకు క్యూ కడుతున్న భారతీయులు.. ఎందుకిలా?
ఆస్ట్రేలియాలో ఇండియన్ల జనాభా పెరుగుతోంది. ఆ దేశంలో సెటిల్ అయ్యే భారతీయుల సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. భారతీయులహోటళ్లు, పార్కులు, రెస్టారెంట్ బిజినెస్‌లు కూడా అక్కడ ఎక్కువగా విస్తరిస్తున్నాయి. ఇంతలా భారతీయులు ఆస్ట్రేలియా వైపు మొగ్గుచూపడానికి కారణమేంటి? ఆస్త్రేలియాలో ప్రస్తుతమున్న వలస దేశాల్లో భారతీయులు ఎక్కువ మంది ఉన్న నేపథ్యంలో వారిని దృష్టిలో ఉంచుకొని ఆస్ట్రేలియాలో పలు ఇండియన్ రెస్టారెంట్లు అందుబాటులోకి వచ్చాయి. రోహిత్ సింగ్ ఆస్ట్రేలియాలోని మార్నింగ్టన్ పెనిన్సులాలో నివసిస్తున్న రెండవ తరం భారతీయుడు. రోహిత్ సింగ్ కుటుంబం 1990లో ఆస్ట్రేలియాకు వలస వచ్చింది. అవనీ వైన్స్ పేరుతో గత పదేళ్లుగా రెస్టారెంట్ బిజినెస్‌ను నిర్వహిస్తున్నారు. చేపలు, దాల్ మఖానీ సహా పలు భారతీయ వంటకాలను పరిచయం చేస్తున్నారు. ఇంతకుముందు ఆస్ట్రేలియాలో భారతీయులు చాలా తక్కువగా కనిపించేవారని, ఒక వీధిలో ఒకరి కంటే ఎక్కువమంది ఉండేవారు కాదని ప్రముఖ జర్నలిస్ట్ ఆర్తి బెటిగేరి తన అభిప్రాయాన్ని వెల్లడించింది.1960లో వీరి కుటుంబం ఆస్ట్రేలియాకు వలస వచ్చింది. అప్పటితో పోలిస్తే ప్రస్తుతం పరిస్థితులు చాలా మారిపోయాయని, విద్య, ఉద్యోగం సహా సొంత వ్యాపారాల్లో ఇండియన్స్ చురుగ్గా వ్యవహరిస్తున్నారని తెలిపింది. రాజకీయాల్లో కూడా భారతీయులు తమ మార్క్ చూపిస్తున్నారని పేర్కొంది. ఇటీవల ఎన్నికైన న్యూసౌత్ వేల్స్ ప్రభుత్వంలో నలుగురు భారతీయ సంతతికి చెందిన వారే కావడం విశేషం. వీరిలో ఆస్ట్రేలియన్ ట్రెజరర్‌గా తొలిసారిగా భారతీయ మూలాలకు చెందిన డేనియల్ ముఖీ ఎన్నికయ్యారు. ఇటీవల భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ సిడ్నీలో ప్రసంగిస్తూ మాస్టర్ షెఫ్ ఆస్ట్రేలియా లాంటి టీవీ షోలు, క్రికెట్, సినిమాలు ఈ రెండు దేశాల ప్రజలను దగ్గర చేశాయని అన్నారు. 30ఏళ్లలో అదే తొలిసారి ఈ ర్యాలీకి వేలాది మంది ప్రజలు హాజరయ్యారు. 2014 నుంచి అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించిందని నిపుణులు అంటున్నారు. దాదాపు మూడు దశాబ్దాల తరువాత భారత ప్రధాని ఆస్ట్రేలియాకు వెళ్లడం అదే తొలిసారి. మేలో జరిగిన ఈ పర్యటన సందర్భంగా రెండు దేశాల మధ్య రాకపోకలు ముఖ్యంగా విద్యార్థులు, నిపుణులు, విద్యావేత్తలకు సులభతరం చేసేందుకు వలస ఒప్పందాన్ని ప్రకటించాయి. ఇరు దేశాల మధ్య సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు కట్టుబడి ఉన్నట్టు ఇద్దరు ప్రధానులూ తెలిపారు. క్వాడ్ గ్రూపులో భాగస్వామ్యం మార్చిలో, ఆస్ట్రేలియన్ ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ తొలిసారిగా భారత్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఇరు ప్రధానులు రక్షణ, భద్రత, ఆర్థిక సహకాంర, విద్య, ద్వైపాక్షిక వాణిజ్యం వంటి అంశాలపై చర్చించారు.వరుస సమావేశాలతో ఇరు దేశాల మద్య ద్వైపాక్షిక సంబంధాలను మునుపెన్నడూ లేని విధంగా మెరుగుపరిచాయి అని గ్లోబల్ పబ్లిక్ పాలసీ రీసెర్చ్ అండ్ అడ్వకేసీ గ్రూప్ అయిన CUTS ఇంటర్నేషనల్‌లో పనిచేస్తున్న ప్రదీప్ ఎస్ మెహతా చెప్పారు.ఈ రకమైన భాగస్వామ్యం ఇరుదేశాలకూ లాభదాయకమని విశ్లేషకులు భావిస్తున్నారు.ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆధిపత్యాన్ని నిరోధించే లక్ష్యంతో నలుగురు సభ్యుల క్వాడ్ గ్రూపులో భాగమైన ఈ భాగస్వామ్యం రెండు దేశాలకు ప్రయోజనకరంగా ఉందని పరిశీలకులు అంటున్నారు. గణనీయంగా పెరిగిన వలసలు భారత్-ఆస్ట్రేలియా మధ్య సంబంధం ఈనాటిది కాదు. ఒకప్పుడు ఈ రెండు దేశాలు గోండ్వానా అనే మహాఖండంలో భాగంగా ఉండేవి. 1800కాలం నుంచి భారతీయులు ఆస్ట్రేలియాకు వలస వెళ్లడం ప్రారంభమైందని నిపుణులు అంటున్నారు.1900 నుంచి ఈ వలసలు విస్తృతంగా పెరిగాయని,1973లో 'వైట్ ఆస్ట్రేలియా పాలసీ'ని రద్దుచేసిన తరువాత ఆస్ట్రేలియాలోకి వలసలు గణనీయంగా పెరిగాయి. అప్పటికీ కేవలం టెక్ వర్కర్లు, వైద్యులు, నర్సులు,విద్యావేత్తలు వంటి నైపుణ్యం కలిగిన వలసదారులు మాత్రమే ఆస్ట్రేలియాలోకి ఆహ్వానించేవారు.. అది కూడా తక్కువ సంఖ్యలోనే అని రీసెర్చర్ జయంత్ బాపట్ తెలిపారు. అయితే 2006 తర్వాత పరిస్థితి మారింది. నిరసనలతో ఉద్రిక్తత జాన్ హోవార్డ్ నేతృత్వంలోని ప్రభుత్వం భారతీయ విద్యార్థులకు పెద్దపీట వేసింది. వారి చదువులకే కాకుండా శాశ్వర నివాసం పొందడాన్ని సులభతరం చేస్తూ పలు చర్యలను ప్రేవేశపెట్టింది. అయితే గతంలో అక్కడ కూడా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. 2000నాటి చివర్లో సిడ్నీ, మెల్బోర్న్ నగరాల్లో భారతీయ విద్యార్థులపై జరిగిన హింసాత్మక దాడులు వార్తల్లో నిలిచింది. ఈ దాడులకు నిరసనగా అక్కడి భారతీయులు వీధుల్లోకి వచ్చి నిరసనలు చేపట్టారు. ఈ ఘటనలపై భారత్ కూడా ఘాటుగానే స్పందించింది. దీనిపై ఆస్ట్రేలియా ప్రభుత్వం వెంటనే చర్యలు కూడా చేపట్టింది. అయినా సరే ఇప్పటికీ అక్కడక్కడే అలాంటి హింసాత్మక ఘటనలు కనిపిస్తూనే ఉంటాయి. ఆస్ట్రేలియాలో మన సంస్కృతి, సంప్రదాయాలు ఆసియా, దక్షిణాసియా దేశాల నుంచి వలస వచ్చినవారు బహుళ సాంస్కృతికతను తీసుకువచ్చారని, దానివల్ల ఆ దేశ ఆర్థికవ్యవస్థ వృద్ధి చెందిందని కొందరు మద్దతుదారులు అంటారు. భారత్ నుంచి అక్కడికి వెళ్లిన వారు కూడా మన సంస్కృతి, సంప్రదాయాల గురించి చెబుతూ మరింత అవగాహన కల్పిస్తున్నారు. సిడ్నీలో పెరిగిన 24 ఏళ్ల దివ్య సక్సేనా కథక్, భరతనాట్యం వంటి నృత్యాలను ఆస్ట్రేలియాలో మరింత మెయిన్ స్ట్రీమ్‌గా మార్చాలని కోరుకుంటోంది. స్టీరియోటైప్‌లను బద్దలు కొట్టడానికి తనలాంటి భారతీయ-ఆస్ట్రేలియన్ క్రియేటివ్‌ల యొక్క అభివృద్ధి చెందుతున్న సంఘం సిడ్నీలో ఉందని ఆమె చెప్పింది. -
Kudrat Dutta Chaudhary: హక్కుల గొంతుక
దేశం కాని దేశం వెళ్లిన వారికి రకరకాల సమస్యలు ఎదురవుతుంటాయి. అలాంటి సమస్యల్లో ఉన్న వారికి తక్షణ సహాయం చేసే బలమైన వ్యక్తి అవసరం. అలాంటి వ్యక్తి... కుద్రత్ చౌదరి. ఇమిగ్రెంట్ రైట్స్ కమిషనర్‌గా శాన్ఫ్రాన్సిస్కోలో నివసించే వలసదారులకు అండగా ఉండనుంది... శాన్ఫ్రాన్సిస్కో (యూఎస్) ఇమిగ్రెంట్ రైట్స్ కమిషనర్(ఐఆర్సీ)గా బాధ్యతలు చేపట్టిన కుద్రత్ దత్తా చౌదరి వార్తల్లో వ్యక్తిగా నిలిచింది. ఈ పదవికి ఎంపికైన భారతసంతతి(ఇమిగ్రెంట్)కి చెందిన తొలివ్యక్తిగా గుర్తింపు పొందింది. శాన్ఫ్రాన్సిస్కోలో నివసించే వలసదారుల సమస్యలు, విధానాలకు సంబంధించిన విషయాలపై మేయర్, బోర్డ్ ఆఫ్ సూపర్వైజర్స్కు ‘ఐఆర్సీ’ సలహాలు ఇస్తుంది. ‘కొత్త బాధ్యత నాలో ఉత్సాహాన్ని, ఉద్వేగాన్ని నింపింది. నా వాళ్ల గురించి పనిచేసే అవకాశం లభించింది’ అంటుంది కుద్రత్. చండీగఢ్‌లో జన్మించిన కుద్రత్ ‘పంజాబ్ ఆర్మీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లా’లో న్యాయశాస్త్రాన్ని అభ్యసించింది. లండన్ కింగ్స్ కాలేజీలో క్రిమినాలజీ, క్రిమినల్ జస్టిస్ చదువుకుంది. హార్వర్డ్ లా స్కూల్లో స్త్రీవాదం, పితృస్వామిక హింస, లైంగిక దోపిడికి సంబంధించిన అంశాలను లోతుగా అధ్యయనం చేసింది. హక్కుల ఉద్యమాలపై మంచి అవగాహన ఉన్న కుద్రత్ సమస్యల పరిష్కారంలో ‘ట్రబుల్ షూటర్’గా పేరు తెచ్చుకుంది. ఎవరికి ఏ సమస్య వచ్చినా తనదైన శైలిలో పరిష్కరించేది. కుద్రత్ మంచి రచయిత్రి కూడా. 2015 భూకంపం (నేపాల్) తరువాత మానవసంబంధాల్లో వచ్చిన మార్పులు, మనుషుల అక్రమరవాణా, లైంగిక దోపిడిపై ‘లైజా: సమ్ టైమ్స్ ది ఎండ్ ఈజ్ ఓన్లీ ఏ బిగినింగ్’ అనే పుస్తకం రాసింది. కుద్రత్ రాసిన ‘లైజా’ పుస్తకం నేపాల్‌లో ఒక వేసవిలో వచ్చిన భూకంపం తాలూకు భయానక భౌతిక విలయ విధ్వంసాన్ని మాత్రమే కాదు మనిషిలోని విధ్వంసాన్ని కూడా కళ్లకు కడుతుంది. 19 సంవత్సరాల లైజా భూకంపంలో తల్లిదండ్రులను కోల్పోతుంది. ఏ దిక్కూ లేని పరిస్థితులలో తమ్ముడిని తీసుకొని కట్మాండూలోని మామయ్య ఇంటికి వెళుతుంది. నా అనుకున్నవారే మోసం చేయడంతో, ఇండియాలోని ఒక చీకటిప్రపంచంలోకి నెట్టబడుతుంది లైజా. ఇలాంటి విషాదాలెన్నో ఈ పుస్తకంలో కనిపిస్తాయి. -
అమెరికన్ల వలస బాట
అమెరికా. ఓ కలల ప్రపంచం. ప్రపంచవ్యాపంగా ఎందరికో స్వర్గధామం. ఎలాగైనా అక్కడ స్థిరపడాలని కలలు కనేవారు, ఎలాగోలా అక్కడికి వలస పోయేవారు కోకొల్లలు. కానీ కొన్నేళ్లుగా అమెరికన్లే భారీ సంఖ్యలో దేశం వీడుతున్నారు! ఎక్కడైతే ఆనందంగా జీవించవచ్చా అని జల్లెడ పట్టి మరీ నచ్చిన దేశానికి వలస పోతున్నారు!! ఈ కొత్త పోకడకు కారణాలేమిటి...? అమెరికన్లు, ముఖ్యంగా సంపన్నులు కొన్నే ళ్లుగా దేశం వీడుతున్నారు. ఇలా విదేశాల బాట పట్టే పోకడ 2019 నుంచి అమెరికాలో బాగా ఊపందుకుంది. ఎలాగోలా ఏదో ఒక దేశ పౌరసత్వం సంపాదించేందుకు ప్రయత్నిస్తున్న అమెరికన్ల సంఖ్య గత మూడేళ్లలో ఏకంగా 337 శాతం పెరిగిందని పలు దేశాల పౌరసత్వానికి సంబంధించి సలహాలు, సదుపాయాలు కల్పించే హెన్లే–పార్ట్నర్స్ సంస్థ వెల్లడించింది. ఇందుకు వీరంతా ప్రధానంగా సిటిజన్‌షిప్ బై ఇన్వెస్ట్మెంట్ (సీబీఐ) పథకాన్ని దగ్గరి దారిగా ఎంచుకుంటు న్నారు. సీబీఐ ద్వారా తమ దగ్గర భారీగా పెట్టుబ డులు పెట్టేవారికి పౌరసత్వానికి, స్థిర నివాసానికి పలు దేశాలు అవకాశం కల్పిస్తున్నాయి. కారణాలు నాలుగు అమెరికన్లలో ఈ పోకడకు నాలుగు ‘సి’లు ప్రధాన కారణాలని హెన్లే–పార్ట్నర్స్కు చెందిన డొమినిక్ హొలెక్ చెబుతున్నారు. అవి కోవిడ్, క్లైమేట్ చేంజ్, క్రిప్టో కరెన్సీ–పన్నులు, కన్ఫ్టిక్ట్ (కల్లోల పరిస్థితులు). కోవిడ్ లాక్డౌన్, ప్రయాణాలపై ఆంక్షలు అమెరికన్లను ఉక్కిరిబిక్కిరి చేశాయి. యూరప్‌లోని చాలా దేశాలకు అమెరికా పాస్పోర్టుతో నేరుగా వెళ్లడం వీలు పడదు. దాంతో చాలామంది అమెరికన్లు యూరప్ దేశాల పౌరసత్వం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇక విచ్చలవిడిగా పెరుగుతున్న భూతాపంలో ప్రధాన వాటా అమెరికా పారిశ్రామిక రంగానిదే. దాంతో అక్కడ చోటుచేసుకుంటున్న వాతావరణ విపరిణామాలు అమెరికన్లను ఆందోళన పరుస్తున్నాయి. మూడేళ్ల క్రితం చెక్ రిపబ్లిక్కు వలస వెళ్లిన ది సావీ రిటైరీ అనే అమెరికా పత్రిక ఎడిటర్ జెఫ్ డి ఒప్డైకి అదే చెబుతున్నారు. ‘‘అమెరికాలో వాతావరణం నానాటికీ బాగా కలుషితమవుతోంది. ప్రశాంతంగా గడపాలనుకునే నేను అక్కడ ఎంతమాత్రమూ ఇమడలేనని తేలిపోయింది’’ అంటారాయన. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టిన వారు, పెరిగిపోతున్న పన్నుల, ధరల భారాన్ని తప్పించుకోవాలనుకునే అమెరికన్లు కూడా మరో ఆలోచన లేకుండా వలస బాట పడుతున్నారు. దేశంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి, కల్లోల స్థితి, ట్రంప్ హయాం నుంచి పెచ్చరిల్లిన జాతి విద్వేషాలు కూడా అమెరికన్లను బాగా భయపెడుతున్నాయి. మనోళ్లు కూడా... గోల్డెన్ వీసాల కోసం ప్రయత్నిస్తున్న ధనిక భారతీయుల సంఖ్యా తక్కువేమీ కాదు. 2014 నుంచి 23 వేల మంది ఇలా రెండో పాస్‌పోర్ట్ పొందినట్టు మోర్గాన్ స్టాన్లీ నివేదిక చెబుతోంది. 2020లోనే ఐదు వేల మంది భారతీయులు మరో దేశ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నట్టు గ్లోబల్ వెల్త్ మైగ్రేషన్ రిపోర్టు తేల్చింది. మనోళ్లు ఎక్కువగా కరేబియన్ దేశం సెయింట్ కిట్స్‌పై ఆసక్తి చూపుతున్నారని సీఎస్ గ్లోబల్ పార్ట్నర్స్ డైరెక్టర్ పాల్‌సింగ్ తెలిపారు. 4 కోట్ల వలసలు! గత మూడున్నరేళ్లలో కనీసం 4 కోట్ల మంది అమెరికన్లు వలస బాట పట్టి ఉంటారని అంచనా. గూగుల్ మాజీ సీఈఓ ఎరిక్ షిమిట్ వంటివారు కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఆయన 2020లో యూరప్ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నా రు. వలసల కోసం చాలామంది గోల్డెన్ పాస్‌పోర్ట్, గోల్డెన్ వీసాగా పిలిచే సీబీఐనే నమ్ముకుంటు న్నారు. దీన్ని పొందడానికి లక్ష నుంచి 95 లక్షల డాలర్ల దాకా పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. గోల్డెన్ పాస్‌పోర్టుకు ప్రయత్నిస్తున్న అమెరికన్లలో చాలామంది పోర్చుగల్ వైపు చూస్తున్నారు. ఆ దేశ పౌరసత్వముంటే 26 యూరప్ దేశాల్లో వీసా లేకుండా ప్రవేశించవచ్చు. రెండు లక్షల డాలర్ల పెట్టబడులు పెడితే ఐదేళ్లు నివాసముండవచ్చు. తర్వాత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. న్యూజిలాండ్, మాల్టా, ఆస్ట్రియా, సెయింట్ కిట్స్, ఆంటిగ్వా అండ్ బార్బుడా పౌరసత్వాలకూ అమెరికన్లలో బాగా డిమాండ్ ఉంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వర్క్‌పర్మిట్లపై యూఎస్ కీలక నిర్ణయం
వాషింగ్టన్: గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులు, హెచ్1బీ వీసా హోల్డర్ల జీవితభాగస్వాములు సహా కొన్ని ఇమ్మిగ్రెంట్ కేటగిరీలకు చెందినవారి వర్క్ పర్మిట్ కాలపరిమితిని 18నెలలు పొడిగిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. దీంతో యూఎస్‌లో పనిచేస్తున్న పలువురు భారతీయ ఐటీ ఉద్యోగులకు ఊరట లభించనుంది. కాలపరిమితి ముగిసిన వర్క్‌పర్మిట్లకు 18నెలల పొడిగింపు ఇచ్చే వెసులుబాటు ఈనెల 4నుంచి అమలవుతుంది. ఆయా ప్రభుత్వ శాఖల్లో ఉన్న వీరి వర్క్‌పర్మిట్ కాలపరిమితి ఆటోమేటిగ్గా 180 నుంచి 540 రోజులకు పెరుగుతుందని హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ శాఖ తెలిపింది. పెండింగ్‌లో ఉన్న ఈఏడీ దరఖాస్తులతో పనిభారం పెరిగిన నేపథ్యంలో ప్రస్తుత కాలపరిమితిని పొడిగించాలని నిర్ణయించినట్లు యూఎస్సీఐఎస్ (అమెరికా ఇమ్మిగ్రేషన్ సేవల శాఖ) డైరెక్టర్ జడోయ్ చెప్పారు. ఇప్పటివరకు ఉన్న నియమాల ప్రకారం యూఎస్ పౌరులు కానివారు వర్క్‌పర్మిట్ కాలపరిమితి ముగిశాక మరో 180 రోజుల పొడిగింపు ఆటోమేటిగ్గా వస్తుంది. ఈ గడువులో వాళ్లు పర్మిట్ రెన్యువల్‌కు దరఖాస్తు చేసుకోవాలి. తాజా నిర్ణయం దాదాపు 87వేల మంది ఇమ్మిగ్రెంట్లకు ఉపయుక్తంగా ఉంటుందని అధికారులు తెలిపారు. తాజా నిర్ణయాన్ని ఇండో అమెరికన్ సంఘాలు స్వాగతించాయి. -
ఆ గ్రీన్ కార్డులపై పరిమితి ఎత్తివేత!
వాషింగ్టన్: ఉద్యోగ ఆధారిత ఇమ్మిగ్రెంట్ వీసాల విషయంలో అమెరికా గ్రీన్ కార్డుల(పర్మనెంట్ లీగల్ రెసిడెన్సీ) జారీపై దేశాల వారీగా అమల్లో ఉన్న పరిమితిని(క్యాప్స్) ఎత్తివేస్తూ కీలకమైన బిల్లుకు హౌస్ జ్యుడీషియరీ కమిటీ ఆమోదం తెలిపింది. అలాగే కుటుంబ ఆధారిత ఇమ్మిగ్రెంట్ వీసాల జారీలోనూ దేశాల వారీగా పరిమితిని 7 నుంచి 15 శాతం పెంచారు. ఈ బిల్లు చట్టరూపం దాల్చి, అమల్లోకి వస్తే అమెరికాలోని భారత్, చైనా ఉద్యోగులకు భారీగా లబ్ధి చేకూరుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఈ రెండు దేశాలకు చెందిన వేలాది మంది ఉద్యోగులు గ్రీన్‌కార్డుల కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారు. హెచ్ఆర్3648 లేదా ఈక్వల్ యాక్సెస్ టు గ్రీన్‌కార్డ్స్ ఫర్ లీగల్ ఎంప్లాయ్మెంట్(ఈగల్)–యాక్ట్ అని పిలుస్తున్న ఈ బిల్లుపై బుధవారం రాత్రి హౌస్ జ్యుడీషియరీ కమిటీ సుదీర్ఘంగా చర్చించింది. బిల్లుకు అనుకూలంగా 22 ఓట్లు, వ్యతిరేకంగా 14 ఓట్లు వచ్చాయి. బిల్లును తదుపరి హౌస్ ఫర్ డిబేట్‌కు వెళ్తుంది. అక్కడ ఓటింగ్ నిర్వహిస్తారు. అనంతరం యూఎస్ సెనేట్ సైతం ఆమోదించాల్సి ఉంటుంది. తర్వాత అధ్యక్షుడు జో బైడెన్ సంతకం చేస్తే చట్టంగా మారుతుంది. సమాన అర్హతలు కలిగినవారు, కొన్ని సందర్భాల్లో ఎక్కువ అర్హతలు ఉన్నవారు ఫలానా దేశంలో పుట్టారన్న కారణంతో గ్రీన్‌కార్డు పొందలేకపోతున్నారని, ఈ విధానాన్ని మార్చాల్సి ఉందని అమెరికా పార్లమెంట్ సభ్యురాలు జోయ్ లాఫ్‌గ్రెప్ అన్నారు. -
హెచ్1బీ భాగస్వాములకు భారీ లబ్ధి
వాషింగ్టన్ : భారత్ నుంచి వచ్చే వారితో సహా వలసదారులకి ప్రయోజనం చేకూరేలా అమెరికాలోని బైడెన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్–1బీ వీసాదారుల జీవిత భాగస్వామ్యులకు (భర్త/భార్య) ఆటోమేటిక్‌గా వర్క్ ఆథరైజేషన్ కల్పించడానికి అంగీకరించింది. అమెరికాలో ఉద్యోగాలు చేయాలనుకునే ఐటీ నిపుణుల భార్యలకి ఈ నిర్ణయంతో ఎంతో ఊరట లభించింది. అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) హెచ్–1బీ వీసా కలిగిన వారి కుటుంబ సభ్యులు (భార/భర్త, 21 ఏళ్ల వయసులోపు పిల్లలు)కి హెచ్–4 వీసా జారీ చేస్తుంది. ఈ వీసాదారులు అమెరికాలో ఉద్యోగం చేయాలనుకుంటే ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ (ఈఏడీ) కలిగి ఉండాలి. దీనిని ఎప్పటికప్పుడు వారు పొడిగించుకుంటూ ఉండాల్సి వస్తుంది. ఇకపై అలాంటి బాధ లేకుండా ఉద్యోగం చేయడానికి వీలుగా ఆటోమేటిక్ వర్క్ ఆథరైజేషన్‌తో కూడిన హెచ్–4 వీసాను మంజూరు చేయడానికి బైడెన్ సర్కార్ పచ్చ జెండా ఊపింది. ఈ నిర్ణయంతో భారత్ నుంచి వెళ్లే మహిళలకే అత్యధికంగా లబ్ధి చేకూరనుంది. ఈఏడీని పొడిగించుకోవడాన్ని సవాల్ చేస్తూ హెచ్–4 వీసాదారుల తరఫున అమెరికన్ ఇమ్మిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ (ఏఐఎల్ఏ) కోర్టులో పిటిషన్ వేసింది. ‘హెచ్–4 వీసాదారులు తరచూ రెగ్యులేటరీ పరీక్ష ఎదుర్కోవాలి. అయితే గతంలో హోంల్యాండ్ ఏజెన్సీ వారికి ఉద్యోగం రాకుండా నిషేధం విధించింది. దీంతో రీ ఆథరైజేషన్ కోసం ఎందరో ఎదురు చూస్తున్నారు. ఎలాంటి చట్టపరమైన కారణాలు లేకుండా వారు అత్యధిక వేతనాలు వచ్చే ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తోంది’అని ఏఐఎల్ఏ లాయర్ జాన్ వాస్డెన్ చెప్పారు. దీనిపై బైడెన్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ప్రస్తుతం 90 వేలమందికి పైగా హెచ్–4 వీసాదారులకు వర్క్ ఆథరైజేషన్ ఉంది. -
డ్రీమర్ల కల తీర్చనున్న అమెరికా
వాషింగ్టన్: అమెరికాలో నివసిస్తున్న చట్టబద్ధ వలసదారుల పిల్లల ‘పౌరసత్వం’ కల నిజమయ్యే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ ప్రకటించింది. అమెరికాలో హెచ్–1బీ, ఇతర దీర్ఘకాలిక నాన్–ఇమ్మిగ్రెంట్ వీసాదారుల పిల్లలను ‘డ్రీమర్’లుగా పిలుస్తారు. ఈ చట్టబద్ధ వలసదారుల పిల్లల వయసు 21 ఏళ్లు నిండితే వారు అమెరికాలో ఉండటానికి అనర్హులు. అప్పుడు వారివారి స్వదేశాలకు అమెరికా సాగనంపుతుంది. ఈ ప్రమాదం నుంచి వీరందరినీ బయటపడేసేందుకు బైడెన్ ప్రభుత్వం చర్యలు తీసుకోనుందని వైట్‌హౌస్ ప్రకటించింది. భారీసంఖ్యలో డ్రీమర్ల తల్లిదండ్రులు దశాబ్దాలుగా అమెరికా శాశ్వత నివాస ధ్రువీకరణ ‘గ్రీన్ కార్డు’ కోసం ఎదురుచూస్తున్నారు. వీరు గ్రీన్‌కార్డుల కోసం సంవత్సరాల తరబడి ఎదురుచూస్తుండటంతో వారి పిల్లల వయసు 21 దాటుతోంది. అలాంటి వారు అమెరికాను వీడిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. డ్రీమర్లు 21ఏళ్ల వయసులోపు వరకూ డిపెండెంట్లుగా తమ తల్లిదండ్రులతోపాటే అమెరికాలోనే ఉండొచ్చు. 21 ఏళ్లు దాటితే వారికి ఆ డిపెండెంట్ హోదా పోతుంది. అమెరికా పౌరసత్వ కల వీరందరికీ అలాగే ఉండిపోయింది. ‘ఇంప్రూవ్ ది డ్రీమ్’ గణాంకాల ప్రకారం రెండు లక్షల మంది డ్రీమర్లు ఉన్నారని, అందులో అధికశాతం మంది భారతీయులేనని సమాచారం. వీరి పౌరసత్వ కల నెరవేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకీ చెప్పారు. అమెరికా వలస విధానంలో సంస్కరణలు తేవాల్సిన తరుణం ఇదేనని ఆయన వ్యాఖ్యానించారు. ఇమ్మిగ్రేషన్ బిల్లు సెనేట్‌కు పంపారు. పాత చట్టానికి సవరణలు, వాడని వీసాలను స్వాధీనం చేసుకోవడం, చాన్నాళ్లు వేచి ఉండే పద్ధతికి స్వస్తి పలకడం, ‘ఒక్కో దేశానికి గరిష్ట పరిమితిలోనే అనుమతులు’.. ఇలా అనేక కుటుంబ ఆధారిత వలస విధానంలో సంస్కరణలు ఆ బిల్లులో ఉన్నాయి’ అని ఆయన చెప్పారు. డ్రీమర్లు అమెరికాలో పనిచేసుకునేందుకు, చట్టం అనుమతించిన వయసు పరిమితిని దాటినా వారికి రక్షణ కల్పించే అంశాలూ ఈ బిల్లులో ఉన్నాయని వైట్‌హౌస్ అధికార ప్రతినిధి కూడా అయిన జెన్‌సాకీ చెప్పారు. -
లైంగికదాడి వీడియో: దొరికిన కామ పిశాచాలు
బెంగళూరు: సంచలనం సృష్టించిన లైంగిక దాడి వైరల్ వీడియోలో కొత్త కోణం వెలుగు చూసింది. ఈ కేసులోని ప్రధాన నిందితులు ఎట్టకేలకు గుర్తించగలిగారు. ఈ వీడియోకు సంబంధించి ఐదుగురిని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ యువతి బట్టలు చించేసి అఘాయిత్యానికి పాల్పడిన వీడియో ఒకటి బుధ, గురు వారాల్లో ఇంటర్నెట్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఘటనపై కేఎస్‌యూ ఢిల్లీ విభాగం హోం మంత్రి అమిత్ షాకు ఒక లేఖ రాసింది. ఆ వెంటనే కేంద్ర మంత్రి కిరెన్ రిజ్జు, ఐపీఎస్ అధికారి రాబిన్ హిబు, మేఘాలయా ఎమ్మెల్యే అంపరీన్ రంగంలోకి దిగారు. దీంతో 24 గంటలు గడవకముందే నిందితులను అరెస్ట్ చేయడం విశేషం. చదండి: బట్టలు చించేసి, ఏడుస్తున్నా వినకుండా.. ఫేస్బుక్ ప్రొఫైల్‌తో? మొదట అది 25 ఏళ్ల నాగాలాండ్ మహిళ వీడియో అని, ఆ అవమానం తట్టుకోలేక ఆమె సూసైడ్ చేసుకుందనే ప్రచారం జరిగింది. ట్విట్టర్లో బాధితురాలిగా న్యాయం జరగాలని క్యాంపెయిన్ జరిగింది. అయితే అది ఆమె వీడియో కాదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు అధికారులు. వీడియో, అందులోని విజువల్స్ ఆధారంగా ఫొటోలు రిలీజ్ చేసిన అస్సాం పోలీసులు.. నిందితుల ఆచూకీ చెప్పిన వాళ్లకు నజరానా ప్రకటిస్తూ ఫేస్బుక్లో ఒక ప్రకటన విడుదల చేశారు. ఆపై ఆ వీడియోలోని నిందితులను రామమూర్తి నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే నిందితుల్లో ఒకరి ఫేస్బుక్ ఫ్రొఫైల్ ఆధారంగా ట్రేస్ చేసి పట్టుకోగలిగామని రామమూర్తి నగర్ స్టేషన్ అధికారి ఒకరు వెల్లడించారు.ఈ అమానుష ఘటనలో మొత్తం ఆరుగురు ఉన్నారని, లైంగిక దాడి కేసులో వాళ్లను అరెస్ట్ చేశామని, అందులో ఇద్దరు మహిళలు ఉన్నారని ఆయన తెలిపారు. బాధితురాలి వయసు 22 సంవత్సరాలని, ఎన్ఆర్ఐ కాలనీలో వారం క్రితం ఆమెపై సామూహిక అత్యాచారం జరిపారని తెలుస్తోంది. అయితే నిందితుల గాయాల గురించి అప్డేట్ అందింది. సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం తీసుకెళ్తున్న క్రమంలో ఇద్దరు పారిపోయే ప్రయత్నం చేశారని, ఈ క్రమంలో కాల్పులు జరపడంతోనే గాయాలయ్యాయని తెలుస్తోంది. అక్రమంగా వచ్చారు కాగా, ఈ కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. బాధితురాలితో సహా నిందితులంతా బంగ్లాదేశ్‌కు చెందిన వాళ్లని పోలీసులు వెల్లడించారు. వాళ్లంతా అక్రమంగా చొరబడి ఇక్కడికొచ్చి స్థిరపడ్డారని, ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. అయితే వాళ్లంతా వ్యభిచారం చేస్తున్నారని, వ్యక్తిగత కారణాలతోనే బాధితురాలిపై అఘాయిత్యానికి పాల్పడ్డారని ఇండిపెండెంట్ జర్నలిస్ట్ ప్రతిభా రామన్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇక నిందితులతో పాటు బాధితురాల్ని ఐడెంటిటీని బంగ్లాదేశ్ ధృవీకరించింది. బాధితురాలు మోఘ్బజార్(ఢాకా) నివాసి అని, సౌదీకి వెళ్లాలని ఏర్పాట్లు చేసుకున్న ఆ అమ్మాయి మూడు నెలల నుంచి జాడ లేకుండా పోయిందని తేజ్గావ్ డీసీపీ సహీదుల్లా వెల్లడించారు. ఇక నిందితుల్లో ఒకడు టిక్‌టాక్‌లో ‘హ్రిదోయ్ బాబు’గా బంగ్లాదేశ్‌లో పాపులర్ అని తెలుస్తోంది. #Nirbhaya-like incident in #Bengaluru. 22-year-old allegedly gang raped by 4 at NRI Colony 6 days ago. Another lady present with accused. All including victim are illegal #immigrants from #Bangladesh reportedly involved in prostitution. Personal rivalry cited. Accused arrested. pic.twitter.com/2zpfIjMxfm — Pratiba Raman (@PratibaRaman) May 27, 2021 -
సర్కారు ఎవరిదో నిర్ణయించేది ఆ రెండు జిల్లాలే!
కోల్‌కతా: నార్త్ 24 పరగణ, సౌత్ 24 పరగణ.. పశ్చిమబెంగాల్లో ఈ రెండు జిల్లాలు తృణమూల్ కాంగ్రెస్‌కు కంచుకోటలు. ఈ కోటలను బద్దలు కొట్టి టీఎంసీ ఓటమికి బాటలు వేయాలనేది బీజేపీ ప్రణాళిక. ఈ రెండు జిల్లాల్లో మరోసారి అత్యధిక స్థానాలు గెలుపొందడం ద్వారా మరోసారి అధికారంలోకి రావాలన్నది టీఎంసీ ఆలోచన. మొత్తం 294 స్థానాల అసెంబ్లీలో ఈ రెండు జిల్లాలకు కలిపి 64 సీట్లు ఉన్నాయి. నార్త్ 24 పరగణలో 33, సౌత్ 24 పరగణలో 31 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. సౌత్ 24 పరగణలో మైనారిటీల ప్రాబల్యం ఎక్కువ. ఈ రెండు జిల్లాలకు బంగ్లాదేశ్‌తో సరిహద్దులున్నాయి. శరణార్థుల జనాభా కూడా ఇక్కడ ఎక్కువ. 1980లో 24 పరగణ జిల్లాను అప్పటి లెఫ్ట్ ప్రభుత్వం రెండు జిల్లాలుగా విభజించింది. మొదట్లో ఈ ప్రాంతంలో వామపక్షాలకు గట్టి పట్టు ఉన్నప్పటికీ క్రమంగా టీఎంసీ పుంజుకుని, లెఫ్ట్ బలాన్ని తగ్గించేసింది. నందిగ్రామ్, సింగూర్ ఉద్యమాలు ఈ ప్రాంతంలో టీంఎసీని మరింత బలోపేతం చేశాయి. 2011, 2016 ఎన్నికల్లో ఈ రెండు జిల్లాల్లో దాదాపు అన్ని స్థానాలను టీఎంసీ గెల్చుకుంది. 2016లో నార్త్ పరగణలో 27, సౌత్ పరగణలో 29 స్థానాలను టీఎంసీ గెల్చుకుంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఈ రెండు జిల్లాల్లో నార్త్ పరగణలో బీజేపీ కొంతవరకు ప్రభావం చూపగలిగింది. ‘బెదిరింపులతో, ప్రలోభాలతో 2019 ఎన్నికల్లో బీజేపీ కొంత ప్రభావం చూపింది. కానీ ఆ తరువాత మేం జాగ్రత్తపడ్డాం. పార్టీ బలోపేతానికి తగిన చర్యలు తీసుకున్నాం’ అని నార్త్ 24 పరగణ జిల్లా టీఎంసీ అధ్యక్షుడు జ్యోతిప్రియొ తెలిపారు. పార్టీలో పెరుగుతున్న అంతర్గత విబేధాలు, మత ఘర్షణల కారణంగా రెండు జిల్లాల్లోనూ టీఎంసీ బలం కొంత తగ్గింది. పౌరసత్వ సవరణ చట్టాన్ని ప్రచారాస్త్రంగా చేపట్టి, శరణార్ధులను ఆకర్షించి 2019 లోక్‌సభ ఎన్నికల్లో నార్త్ 24 పరగణ జిల్లాలో ఉన్న ఐదు స్థానాల్లో రెండింటిని బీజేపీ గెల్చుకోగలిగింది. అలాగే, అక్కడ ప్రబలంగా ఉన్న మథువా వర్గంలో పట్టు సాధించింది. నార్త్ 24 పరగణలోని 14 అసెంబ్లీ స్థానాల్లో మథువాలు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఈ రెండు జిల్లాల నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు సహా పెద్ద ఎత్తున పార్టీ నేతలు బీజేపీలో చేరడం టీఎంసీకి ఆందోళనకరంగా మారింది. కొత్తగా వచ్చిన ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్(ఐఎస్ఎఫ్) సౌత్ 24 పరగణ జిల్లాలో టీఎంసీకి చెందిన మైనారిటీ ఓట్లను చీల్చే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ఐఎస్ఎఫ్ కాంగ్రెస్, లెఫ్ట్‌లతో కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాల ప్రచారం సాయంతో నార్త్ 24 పరగణలో 60% సీట్లను సాధిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ధీమాగా ఉన్నారు. -
వలసలపై సమగ్ర దృష్టి
ఉపాధి కోసం విదేశాలకు వలసపోయినవారికి ఇక్కడి ఎన్నికల్లో ఓటేసే అధికారాన్ని ఇవ్వొచ్చునా... ఇస్తే అందుకనుసరించాల్సిన విధివిధానాలేమిటని దాదాపు దశాబ్దకాలంగా చర్చిస్తుండగా దేశంలో ఒక రాష్ట్రంనుంచి మరో రాష్ట్రానికి వలసపోయేవారి స్థితిగతుల గురించి ఎవరికీ పట్టకపోవటం వింతగానే అనిపిస్తుంది. కరోనా వైరస్ మహమ్మారి మన సమాజంలో దశాబ్దాలుగా పేరుకుపోయిన అన్ని రకాల నిర్లక్ష్యాలనూ, లోటుపాట్లనూ బాహాటంగా ఎత్తిచూపింది. అందులో అంతర్గత వలస లపై నిర్దిష్టమైన విధానాలు, ప్రణాళికలు లేకపోవటం ఒకటి. నీతి ఆయోగ్ దీన్ని సరిచేసే దిశగా తొలి అడుగు వేసింది. ఈ విషయంలో సమగ్ర అధ్యయనం చేసేందుకు నియమించిన కమిటీ సిఫార్సుల ఆధారంగా ఒక ముసాయిదా విధానాన్ని రూపొందించింది. వలస కార్మికులకు ఓటింగ్ హక్కులు కల్పించటంతోసహా వారి విషయంలో తీసుకోవాల్సిన ఇతరత్రా చర్యలను ఈ ముసాయిదా సూచిం చింది. కమిటీలో కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, పౌర సమాజ సంస్థల నుంచి ప్రతినిధులు వున్నారు. వలసలపై అధ్యయనం చేస్తున్న నిపుణులకు కూడా ఇందులో చోటు కల్పించారు. లాక్డౌన్ విధించాక వలస కార్మికులు ఎన్ని అగచాట్లు పడ్డారో చెప్పే కథనాలు మీడి యాలో నిరుడు విస్తృతంగా వచ్చాయి. స్వస్థలాలను వదిలి పొట్టచేతబట్టుకుని వచ్చినవారికి ఆసరా ఇస్తున్నట్టే, ఉపాధి కల్పిస్తున్నట్టే కనబడిన మహా నగరాలు సంక్షోభం తలెత్తేసరికి వారిని గాలికి వదిలేశాయి. నిర్మాణరంగంతోసహా అనేక రంగాల్లో ఏ కొద్దిమందో తప్ప ఎవరూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను పాటించలేదు. ఫలితంగా నిలువనీడలేక, తినడానికి తిండి లేక లాక్డౌన్ నిబం ధనలను కూడా బేఖాతరు చేసి రోజూ లక్షలాదిమంది నడకదారిన వేలాది కిలోమీటర్ల దూరంలోని తమ తమ సొంత ఊళ్లకు వెళ్లాల్సివచ్చింది. అంతర్గత వలసలకు సంబంధించి డేటా వుండాలని, వలస కార్మికుల భద్రతకు, సంక్షేమానికి అదెంతో అవసరమని ఇన్ని దశాబ్దాలుగా ఏ ప్రభుత్వాలూ అనుకోలేదు. ఉపాధి హామీ పథకం, ఒకే దేశం–ఒకే రేషన్‌లాంటి పథకాల కోసం, ఈపీఎఫ్, ఈఎస్ఐ వంటి సదుపాయాలు వర్తింపజేయటం కోసం వేర్వేరు రంగాలు డేటా సేకరిస్తున్నాయి. కానీ ఆ డేటా ఆయా రంగాలకు ఉపయోగపడటం తప్ప మొత్తంగా ఒక సమగ్ర కార్యాచరణకు తోడ్పడేవిధంగా వుండదు. అందువల్లే ఒకచోట నుంచి ఒకచోటకు ఎంతమంది వలసపోతున్నారో ప్రభుత్వాల దగ్గర గణాంకాలు లేవు. ఏ రాష్ట్రంలో ఏ ప్రాంతాలకు చెందినవారు ఎంతమంది వున్నారో చెప్పటం కూడా సాధ్యపడటం లేదు. జనాభా లెక్కల సమయంలో వలస కార్మికులు ఎంతమంది వున్నారో చెప్పే గణాంకాలు వస్తాయి. కానీ అవి కేవలం సంఖ్యాపరంగా అటువంటి కార్మికులు ఎందరో చెప్పడానికి ఉపయోగపడతాయి తప్ప ఆ కార్మికుల కోసం అనుసరించాల్సిన నిర్దిష్టమైన కార్యాచరణ పథక రూపకల్పనకు తోడ్పడవు. వలస కార్మికుల సమస్యలు అనంతం. తమ ప్రాంతం కాని చోటుకూ, తమ భాష మాట్లాడని చోటుకూ వారు వెళ్తారు. వారిని పనిలో పెట్టుకున్నవారు తప్ప మరెవరూ వారికి తెలియదు. పిల్లలకు చదువుల చెప్పించటానికి, అనారోగ్య సమస్య తలెత్తినప్పుడు ఉచితంగా వైద్యం చేయించుకోవటానికి అడుగ డుగునా వారికి అడ్డంకులు ఎదురవుతుంటాయి. అవసరమైన గుర్తింపు కార్డు లేకపోవటం ఇందుకొక కారణం. కనీసం బ్యాంకు ఖాతా ప్రారంభించాలన్నా వారికి సమస్యే. పని చేసే చోట వారికెదురయ్యే ఇతరత్రా సమస్యలు–కనీస సౌకర్యాలు, భద్రతవంటివి సరేసరి. చాలా సందర్భాల్లో దళారుల ద్వారా వారు పనిలో కుదురుకుంటారు. ఇస్తామని చెప్పిన వేతనానికి, ఇస్తున్న వేతనానికి మధ్య వ్యత్యాసం వుంటుంది. కానీ నిలదీస్తే న్యాయం దక్కటం మాట అటుంచి, వున్న ఉపాధి పోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే వారు అత్యంత దారుణమైన, అమానుషమైన పరిస్థితుల్లో బతుకీడుస్తుంటారు. వలస కార్మికులకు సమగ్రమైన చట్టాలుంటే, వారి విషయంలో వివిధ ప్రభుత్వ శాఖల కర్తవ్యా లేమిటో తెలిపే నియమనిబంధనలుంటే వారు దిక్కులేని పక్షులుగా మారే దుస్థితి వుండదు. ఇప్పుడు నీతి ఆయోగ్ ముసాయిదా పత్రం వలస కార్మికులు దేశ సంపదను పెంచటానికి ఎంత కృషి చేస్తున్నారో గణాంకాల సహితంగా తెలిపింది. వలసల్లో ఇమిడివుండే సంక్లిష్టతలనూ, వారి కెదురయ్యే సమస్యలను పరిష్కరించటానికి ఎలాంటి మార్గాలు అనుసరించాలో పత్రం సూచించింది. వారికి ఓటు హక్కు కల్పించాలన్నది మంచి సూచన. ఇందువల్ల ప్రతి రాజకీయ పార్టీ వారి సంక్షేమం కోసం, వారి హక్కుల్ని రక్షించటం కోసం ఏదోమేరకు కృషి చేయటం ప్రారంభిస్తాయి. వలస కార్మికుల తరఫున అధికారులను కలిసి సమస్యలు పరిష్కరించేలా చూడటంలో చురుగ్గా వుంటాయి. అంతర్రాష్ట్ర వలసలకు సంబంధించి ఒక నిర్వహణ వ్యవస్థను ఏర్పాటు చేసి, వలస కార్మికులను నమోదు చేసే విధానం వుంటే కార్మికుల స్వరాష్ట్రంలోనూ, వారు పనిచేసే రాష్ట్రంలోనూ అక్కడి ప్రభుత్వాలు అవసరమైన చర్యలు తీసుకోవటానికి వీలుంటుందని ముసాయిదా చేసిన సూచన కూడా హర్షించదగ్గది. వలస కార్మికుల శ్రమ ద్వారా ఏటా దేశానికి సమకూరే సంపద ఎంతో తెలిస్తే సమాజానికి కూడా వారి ప్రాముఖ్యత ఏమిటో తెలుస్తుంది. నీతి ఆయోగ్ ముసాయిదాలోని లోటుపాట్లపై అందరి అభిప్రాయాలూ సేకరించి, సాధ్యమైనంత త్వరగా తదుపరి చర్యలు తీసు కోవాలి. వలస కార్మికుల సంక్షేమానికి, వారి భద్రతకూ ప్రభుత్వాలు తగిన యంత్రాంగాన్ని రూపొందించాలి. -
చిగురిస్తున్న భారతీయుల ‘గ్రీన్’ ఆశలు
వాషింగ్టన్: అమెరికాలో సుదీర్ఘకాలంగా గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది భారతీయుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డుల మంజూరులో దేశాల కోటాను ఎత్తివేస్తూ రూపొందించిన బిల్లుకి అమెరికా సెనేట్ బుధవారం ఏకగ్రీవంగా ఆమోద ముద్ర వేసింది. ఏటా మంజూరు చేసే గ్రీన్ కార్డుల్లో ఒక్కో దేశానికి 7 శాతం మాత్రమే ఇవ్వాలన్న పరిమితిని ఎత్తి వేస్తూ తీసుకువచ్చిన ఫెయిర్‌నెస్ ఫర్ హై స్కిల్డ్ ఇమి గ్రెంట్స్ యాక్ట్‌ని సెనేట్ ఆమోదించింది. అమెరికాకు వెళ్లే విదేశీయుల్లో అధిక సంఖ్యలో భారతీయులు ఉండడం, గ్రీన్ కార్డు కోసం భారీ సంఖ్యలో దరఖాస్తు చేసుకోవడంతో వారికి ఏళ్లకి ఏళ్లు ఎదురు చూపులు తప్పడం లేదు. ఇప్పుడు ఈ బిల్లుని కొన్ని సవరణలతో సెనేట్ ఆమోదించడంతో ఇది తిరిగి ప్రతినిధుల సభలో ఆమోదం పొందాల్సి ఉంది. ప్రతినిధుల సభ కూడా ఆమోదించాక అధ్యక్షుడు సంతకం చేస్తే చట్ట రూపం దాలుస్తుంది. అమెరికాలో ఏటా లక్షా 40 వేల మందికి గ్రీన్ కార్డులు జారీ చేస్తారు. ఏప్రిల్ నాటికి గ్రీన్‌కార్డు కోసం ఎదురు చూస్తున్న భారతీయులు 8 లక్షల మందికి పైనే. చైనాకు ఎదురు దెబ్బ తగిలేలా సవరణలు గత ఏడాది జూలై 10న ఎస్386 బిల్లుని హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఆమోదించింది. అయితే ప్రతినిధుల సభ ఆమోదించిన బిల్లుకు చైనా మిలటరీతోనూ, కమ్యూనిస్టు పార్టీకి చెందిన వ్యక్తుల్ని ఈ చట్టం నుంచి మినహాయిస్తూ సవరణలు చేసి సెనేట్ ఆమోద ముద్ర వేసింది. ఈ సవరణలు చైనా నుంచి వచ్చిన వారికి ప్రతికూలంగా మారాయి. అమెరికాకు వచ్చిన చైనా విద్యార్థుల్లో అత్యధికులు కమ్యూనిస్టు పార్టీకి అనుబంధంగా పని చేసేవారే. అందుకే ప్రతినిధుల సభ ఈ బిల్లుని ఆమోదిస్తుందా అన్నది వేచి చూడాల్సిందేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
వలసదారులందరికీ పౌరసత్వం
వాషింగ్టన్: అధ్యక్ష ఎన్నికల్లో తాను నెగ్గితే అమెరికాలో ఉంటున్న 1.1 కోట్ల మంది వలసదారులకి అమెరికా పౌరసత్వం ఇస్తానని డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ హామీ ఇచ్చారు. కరోనా సంక్షోభంపై పోరాటం, ఆర్థిక వ్యవస్థ పునఃనిర్మాణం, ప్రపంచవ్యాప్తంగా అమెరికా నాయకత్వం పునరుద్ధరణతో పాటుగా వలసదారుల సమస్యలు తన ఎజెండాలో అగ్రభాగాన ఉంటాయని చెప్పారు. వాషింగ్టన్లో బుధవారం నిధుల సేకరణ కార్యక్రమంలో బైడెన్ మాట్లాడారు. ‘వలస సంక్షోభాన్ని మేము ఎదుర్కోవాల్సి ఉంది. నేను అధికారంలోకి వస్తే ఇమిగ్రేషన్ బిల్లుని ప్రతినిధుల సభ, సెనేట్‌కి పంపిస్తాను. దాని ద్వారా 1.1 కోట్ల మందికి అమెరికా పౌరసత్వం లభిస్తుంది’అని బైడెన్ చెప్పారు. అక్రమ మార్గాల్లో వచ్చిన వారందరూ అమెరికాలో తిష్ట వేశారని, వారిని దేశం నుంచి వెంటనే తరిమేయాలని అధ్యక్షుడు ట్రంప్ అంటూ ఉంటే వలస విధానంలో దానికి విరుద్ధమైన వైఖరిలో బైడెన్ మాట్లాడారు. ట్రంప్ గత నాలుగేళ్లలో తన విధానాల ద్వారా అమెరికాలో వివిధ వ్యవస్థల్ని భ్రష్టు పట్టించారని, తనకు అమెరికా ప్రజలు అధికారాన్ని ఇస్తే అన్ని వ్యవస్థల్ని గాడిలో పెట్టాల్సి ఉంటుందని అన్నారు. -
సాగు భూమిలో సిరులు పండించండి ఇలా...
ఆరోగ్యాన్నిచ్చే ఆహారం, ప్రశాంతతో కూడిన ఆరోగ్యకరమైన జీవనశైలి.. వ్యాధి నిరోధకత ప్రాముఖ్యాన్ని కరోనా మహమ్మారి దాదాపు అందరికీ తెలిసేలా చేసింది. ఎంతో దూరంలో ఉన్నా కానీ ఇంటి నుంచే పని చేసే సౌలభ్యాన్ని (వర్క్ ఫ్రమ్ హోమ్) తీసుకొచ్చింది. దీంతో పల్లెకు పోయి ప్రశాంతంగా జీవించేద్దాం అన్న ధోరణి చాలా మందిలో కలిగింది. అందుకే నగరాలు, పట్టణాల నుంచి పల్లెలకు వలసలు పెరిగిపోయాయి. పనిలో పనిగా పల్లె పట్టున పచ్చని పొలాల్లో సాగు చేసుకుంటూ జీవించడంలో ప్రశాంతతను అనుభవిద్దామన్న అభిలాష పెరుగుతోంది. పట్టణ వాసుల్లో సాగు పట్ల మమకారం పెరగడం కరోనా ముందు నుంచే ఉంది. కానీ, కరోనా ఆగమనంతో అది కాస్త బలపడుతోంది. ఈ పరిణామాలు వ్యవసాయ భూములకు డిమాండ్‌ను తీసుకొస్తున్నాయి. సాగు భూములపై ఇన్వెస్ట్ చేద్దామన్న ఆసక్తిని కలిగిస్తున్నాయి. మరి పెట్టుబడుల పరంగా సాగు భూములు సిరులు కురిపిస్తాయా? దీనికి సమాధానం వెతుక్కునే ముందు.. ఇందులో ఉండే కష్ట, నష్టాల గురించి తప్పక తెలుసుకోవాలి. ఆ వివరాలను అందించే కథనమే ఇది. వ్యవసాయ భూములపై పెట్టుబడులకు ఆకర్షణీయమైన అంశాలు కొన్ని ఉన్నాయి. మీరు రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటే.. సంప్రదాయంగా వాణిజ్య ఆస్తులైన మాల్స్, కార్యాలయాలు, రిటైల్ స్టోర్ల స్థలాలతోపాటు నివాసిత భవనాలు అందుబాటులో ఉంటాయి. కానీ, వీటన్నింటిలోనూ రిస్క్ పాళ్లు ఎక్కువ. గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ రంగ వృద్ధి అన్నవి కొత్త థీమ్‌లుగా అవతరిస్తున్నాయి. గ్రామీణాభివృద్ధిపై ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఫోకస్ పెడుతున్నాయి. ఈ క్రమంలో వ్యవసాయ భూములపై పెట్టుబడులు భవిష్యత్తులో మంచి రాబడులకు అవకాశం కల్పించేవేనంటున్నారు నిపుణులు. సంప్రదాయ రియల్ఎస్టేట్ సాధనాలతో పోలిస్తే సాగు భూముల కొనుగోలులో సౌలభ్యత కూడా ఉంది. తక్కువ పెట్టుబడి ఉన్నా సాగుభూమిని సొంతం చేసుకోవచ్చు. ఎకరం రూ.2 లక్షల నుంచి కూడా అందుబాటులో ఉండడం ఇందుకు అనుకూలం. ఒకవేళ ఫ్లాట్ కొనుగోలు చేయా లంటే కనీసం రూ.20–30 లక్షలు అయినా ఉండాల్సిందే. ఒకవేళ నగరం/పట్టణానికి ఆమడ దూరంలో చిన్న ప్లాట్‌ను తక్కువ పెట్టుబడికి కొనుగోలు చేసుకున్నా.. దానిపై రెగ్యులర్‌గా వచ్చే రాబడులు ఏవీ ఉండవు. పైగా ఆ ప్లాట్ సంరక్షణ బాధ్యత కూడా ఉంటుంది. కానీ, సాగు భూమిపై ఎంతో కొంత రాబడి కొనుగోలు చేసిన తర్వాత నుంచే రావడం మరింత ఆకర్షణీయమైన అంశం. ఎకరంపై ఎంత లేదన్నా ఒక ఏడాదిలో రూ.30వేల వరకు వచ్చే అవకాశం ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఎకరాకు ఇంత చొప్పున కనీస ఆర్థిక సాయాన్ని అందిస్తున్నాయి. ఖర్చులు తీసేసి చూసినా సాగు భూములపై రాబడి 3–5 శాతం మధ్య ఉంటోంది. భూములు పెద్ద మొత్తంలో ఉంటే వచ్చే రాబడి ఇంకా ఎక్కువగానూ ఉంటుంది. పైగా అందులో ఏం సాగు చేస్తున్నారు, వాటిని విక్రయించడం ఎలా? డిమాండ్ పరిస్థితులు కూడా రాబడులను నిర్ణయిస్తాయి. కొనుగోలు చేసిన వ్యవసాయ భూమిని ప్రకృతి సిద్ధమైన సహజ సాగుకు (ఆర్గానిక్) అనుకూలంగా మార్చారనుకోండి రాబడులను ఇంకా పెంచుకోవచ్చు. ఇది కొనుగోలు దారుల నుంచి డిమాండ్‌ను సైతం పెంచుతుంది. నీటి వసతి, ఇతర సదుపాయాలను కల్పించడం ద్వారానూ మీ భూమికి డిమాండ్‌ను పెంచుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో తక్కువ దిగుబడులను ఇచ్చే భూములున్నాయి. వాటిని ఆర్గానిక్ ఫార్మిం గ్ లేదా పారిశ్రామిక యోగ్యమైన భూములుగా మార్చడం అన్నది మంచి ఆలోచనే. తద్వారా అధిక రాబడులకు దారి కల్పించుకోవచ్చు. రహదారుల అభివృద్ధి, ప్రత్యేక ఆర్థిక మండళ్ల కోసం ప్రభుత్వం సమీకరించే భూములకు చెల్లించే పరిహారం కూడా ఇటీవలి కాలంలో గణనీయంగానే పెరగడం గమనార్హం. ఎందుకంటే భూసమీకరణ చట్టం కింద సమీకరించే భూమికి మార్కెట్ ధర కంటే రెండింతలు చెల్లించాల్సి ఉంటుంది. దీనికి అదనంగా గ్రామీణ ప్రాంతాల్లో భూ సమీకరణ కారణంగా ఇతర నష్టాలు ఏవైనా ఉంటే వాటిని కూడా భూ యజమానికి చెల్లించాలని చట్టం చెబుతోంది. వైవిధ్యానికి అవకాశం ప్రతీ పెట్టుబడికి సంబంధించి అనుకూలతలు, రిస్క్లన్నవి సర్వ సాధారణం. కనుక సాగు భూమిపై పెట్టుబడి అన్నది పెట్టుబడుల సాధనాల పరంగా మంచి వైవిధ్యానికి అవకాశం కల్పిస్తుంది. కనీసం 10 ఏళ్లు అంతకంటే ఎక్కువ కాలం పాటు కొనసాగించేవారికి ఇది మంచి సాధనమే అవుతుంది. పెట్టుబడే కాకుండా సాగు పట్ల ఆసక్తి కూడా ఉంటే అదనపు రాబడులకు ఇం దులో వీలుంటుంది. సమీప పట్టణాల్లో ఉద్యోగాలు చేస్తూ వారాంతాల్లో వచ్చి సాగును పర్యవేక్షించుకునే వారికి కూడా అనుకూలమే. ఇక వ్యవసాయమే మా నూతన కెరీర్ అనుకునే వారికి మంచి మార్గమే అవు తుంది. కాకపోతే తగిన నైపుణ్యాల కోసం, ఎక్విప్మెంట్ కోసం కొంత పెట్టుబడి అవసర పడుతుంది. అయితే, ఇవి ఒక్కసారి చేసే ఖర్చు లే. అన్ని గాడిన పడితే మంచి రాబడులు అందుకోవచ్చు. పెట్టుబడికి అయినా.. సాగు పట్ల ఉన్న ఆసక్తి కోసం అయినా వ్యవసాయ భూమిని కొనుగోలు చేయడానికి ముందు నిపుణుల సూచనలు, సలహాలు తీసుకోవడం మంచిది. రిస్క్‌లూ ఉన్నాయ్.. ఇన్ని లాభాలు ఉన్నాయని చెప్పి వ్యవసాయ భూములపై పెట్టుబడులు పెట్టాలని నిర్ణయం తీసుకునే ముందు పరిగణనలోకి తీసుకోవాల్సిన సమస్యలు కూడా కొన్ని ఉన్నాయి. సరైన భూ రికార్డులు లేకపోవడం, తండ్రులు, తాతముత్తాతల పేరు మీద భూములు ఉండి, వారసులు అనుభవిస్తున్నట్టయితే.. చట్టబద్ధంగా వారసులకు సంబంధించి డాక్యుమెంట్లు ఉన్నాయా ఇత్యాది అంశాలను పరిశీలించాలి. ఇంటి ప్లాట్ మాదిరిగా కొని వదిలేయడం కాకుండా.. వ్యవసాయ భూమికి నిర్వహణ బాధ్యతలు కూడా ఉంటాయి. అందుకు కొంత ఖర్చులు కూడా అవుతాయి. సాగు చేస్తున్నట్టయితే వాతావరణ పరిస్థితులు, ఉత్పత్తికి మార్కెట్లో ఉండే డిమాండ్, ధరలు, రవాణా ఖర్చులు ఇత్యాది అంశాలు రాబడులపై ప్రభావం చూపిస్తాయి. ఒకవేళ కొత్తగా వ్యవసాయంలోకి అడుగుపెట్టిన వారు అయితే.. కూలీల ఖర్చులు, ఎక్విప్మెంట్ కోసం పెట్టుబడులు ఇత్యాదివన్నీ భరించాల్సి వస్తుంది. కుదురుకునే వరకు కొన్ని సంవత్సరాల పాటు నష్టాలు రావచ్చు. పూర్తి అవగాహన ఏర్పడి, అన్నింటినీ సవ్యంగా నిర్వహించగలిగితే మంచి లాభాలు చవిచూస్తారు. ఇక ఏదైనా ప్రాజెక్టు వస్తుందని, ఆ ప్రాజెక్టు కింద భూ సమీకరణలో పాల్గొనడం ద్వారా లాభపడాలన్న ఆకాంక్షతో భూమి కొనుగోలు చేసినట్టయితే.. అందుకు కొన్నేళ్ల పాటు ఆగాల్సి రావచ్చు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో భూ సమీకరణ చేసి డబ్బులు చెల్లించే దశలో కొందరు కోర్టులను ఆశ్రయిస్తుంటారు. అటువంటి సందర్భాల్లోనూ జాప్యానికి దారితీస్తుంది. ఇక రియల్ ఎస్టేట్ పెట్టుబడి అంటేనే లిక్విడిటీ పాళ్లు తక్కువ. అంటే అవసరమైన వెంటనే అమ్మి డబ్బు చేసుకోవడానికి అవకాశాలు తక్కువ. మీరు ఆశించే ధరకు కొనుగోలుదారులు ముందుకు రావడానికి ఒక్కోసారి నెలలు, సంవత్సరాలు కూడా పట్టొచ్చు. వీటికి సంబంధించి న్యాయ, లావాదేవీ తదితర ఖర్చులు కూడా భరించాల్సి ఉంటుంది. -
వీసాలపై ట్రంప్ నిర్ణయం.. పిచాయ్ స్పందన
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్1బీ వీసాను తాత్కాలికంగా రద్దు చేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన అమెరికన్లకు సహాయం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ వెల్లడించారు. దీనిపై గూగుల్, ఆల్ఫాబెట్ సంస్థ సీఈవో సుందర్ పిచాయ్.. అసంతృప్తిని వ్యక్తం చేశారు. ట్విట్టర్ ద్వారా స్పందించిన ఆయన.. ‘ట్రంప్ తీసుకున్న నిర్ణయం తనను నిరుత్సాహాపరిచింది. అమెరికా ఆర్థిక ప్రగతిలో ఇమ్మిగ్రేషన్ విధానం ఎంతో తోడ్పడింది. ఆ కారణంగానే అమెరికా టెక్నాలజీ రంగంలో గ్లోబల్ లీడర్‌గా మారింది. ఈ రోజు గూగుల్ కంపెనీ ఇలా ఉందంటే, అది ఇమ్మిగ్రాంట్ల వల్లే’ అని పిచాయ్ తెలిపారు. విదేశీ టెకీలకు వీసాలు జారీ చేయబోమని ట్రంప్ చేసిన ప్రకటన నిరుత్సాహాపరిచినా.. తాము మాత్రం ఇమ్మిగ్రాంట్స్‌కు మద్దతుగా ఉంటామని, అన్ని రకాలుగా అవకాశాలు కల్పిస్తూనే ఉంటామని పిచాయ్ తన ట్విట్లో తెలిపారు. (వీసాలపై ట్రంప్ కీలక నిర్ణయం) ట్రంప్ నిర్ణయాన్ని పిచాయ్ మాత్రమే కాక మైక్రోసాఫ్ట్, ట్విట్టర్ కూడా వ్యతిరేకించాయి.మైక్రోసాఫ్ట్ అధ్యక్షుడు బ్రాడ్ స్మిత్ ట్రంప్ చర్యను విమర్శిస్తూ.. ‘అమెరికాకు ఇప్పుడు వలసదారులు మరింత అవసరం. ప్రస్తుతం మన దేశాన్ని ప్రపంచ ప్రతిభ నుంచి విడదీయడానికి లేదా ఆందోళనను సృష్టించే సమయం కాదు. వలసదారులు మా కంపెనీలో కీలక పాత్ర పోషిస్తారు. వారు మన దేశం క్లిష్టమైన మౌలిక సదుపాయాలకు మద్దతు ఇస్తారు. మనకు చాలా అవసరమైన సమయంలో వలసదారులు ఈ దేశానికి ఎంతో సహకరించారు’ అని ఆయన అన్నారు. బ్రాడ్ స్మిత్ ట్వీట్‌ను మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెల్ల కూడా రీట్వీట్ చేశారు. (వెనక్కి రావాల్సిందేనా!) ట్రంప్ ఇమ్మిగ్రేషన్ ప్రకటనపై ట్విట్టర్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు వరుస ట్వీట్లతో ట్రంప్ చర్యలను విమర్శించింది. ‘ఈ చర్య అమెరికా ఆర్థిక ఆస్తిని, దాని వైవిధ్యాన్ని బలహీనపరుస్తుంది. ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు మన శ్రమశక్తిలో చేరడానికి, పన్నులు చెల్లించడానికి.. ప్రపంచ వేదికపై మన పోటీతత్వానికి తోడ్పడటానికి ఇక్కడకు వస్తారు. వారిని ఇబ్బంది పెట్టే ఆలోచనలు మంచివి కావు’ అని ట్వీట్ చేసింది. కొంతకాలం క్రితం వరకు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌లో భాగమైన ఆలిస్ జి వెల్స్ కూడా ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ‘హెచ్1-బీ వీసా ప్రోగ్రాం ద్వారా ఉత్తమమైన, ప్రతిభావంతులను దేశంలోకి ఆహ్వానించి.. వారి కృషితో అమెరికా ఆర్థిక వ్యవస్థ ఎంతో అభివృద్ధి చెందింది. విదేశీ ప్రతిభను ఆకర్షించడం అమెరికా బలం. బలహీనత కాదు’ అని ఆయన ట్విట్ చేశారు. -
డీఏసీఏపై ట్రంప్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
వాషింగ్టన్: వలస వ్యతిరేక ఎజెండాతో అమెరికా అధ్యక్షుడిగా మళ్లీ ఎన్నికయ్యేందుకు ప్రయత్నిస్తున్న ట్రంప్‌కు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దేశంలో ఉన్న 6.50 లక్షల యువ వలసదారులకు ప్రభుత్వపరమైన రక్షణల రద్దుకు ట్రంప్ చేస్తున్న యత్నాలకు బ్రేక్ పడింది. చిన్నవయస్సులోనే తల్లిదండ్రులతోపాటు వచ్చిన వారు, చట్టవిరుద్ధంగా ఉంటున్న వారికి ప్రభుత్వపరంగా రక్షణలు కల్పిస్తూ ఒబామా ప్రభుత్వం 2012లో డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్‌హుడ్ అరైవల్స్ ప్రోగ్రాం(డీఏసీఏ) తీసుకువచ్చింది. దీన్ని ట్రంప్ వ్యతిరేకించారు.తాజాగా డీఏసీఏ విధానం అక్రమమనీ, దీనిపై సమీక్షించేందుకు కోర్టులకు అధికారం లేదని ట్రంప్ ప్రభుత్వం తరఫు లాయర్లు వాదించారు. ఈ వాదనను ప్రధాన జడ్జి జాన్ రాబర్ట్స్, మరో నలుగురు జడ్జీలు తిరస్కరించారు. ‘డీఏసీఏ ఉపసంహరణ తీరు సరిగాలేదని ప్రధాన న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. -
వెంట తెస్తున్నారు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత తగ్గడం లేదు. మొదట్లో విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారా కొంతమేరకు పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఆ తర్వాత మర్కజ్‌కు వెళ్లొచ్చినవారి ద్వారా అధిక కేసులు నమోదయ్యాయి. దీంతో అప్పట్లో కేసుల సంఖ్య అధికంగా నమోదైంది. ఆ తర్వాత కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. అయితే దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌కు సడలింపులివ్వడంతో జాతీయంగా, అంతర్జాతీయంగా వివిధ ప్రాంతాల్లో ఉంటున్న మన రాష్ట్రానికి చెందినవారు, ఇతరులు వస్తుండటంతో కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. ఒకవైపు వివిధ రాష్ట్రాల్లో ఉండే మన తెలంగాణ వాసులు, అలాగే విదేశాల్లో ఉండే మనవారు కూడా ఇక్కడకు వస్తున్నారు. దీంతో వారి ద్వారా కేసుల సంఖ్య పెరుగుతోందని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. సడలింపుల తర్వాత సోమవారం నాటికి విదేశాల నుంచి మన రాష్ట్రానికి ప్రత్యేక విమానాల్లో వచ్చినవారిలో 28 మందికి, అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 145 మంది వలసదారులకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఉదాహరణకు ఒక్క సోమవారం నాడే రాష్ట్రంలో 66 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా, అందులో 32 కేసులు రాష్ట్రంలో ఉన్నవారికి కరోనా సోకింది. మిగిలిన కేసుల్లో వలసదారులు 15 మంది, విదేశాల నుంచి వచ్చిన వారిలో 18 మంది, మహారాష్ట్రకు చెందినవారు ఒకరున్నారు. అంటే ఒకరోజు నమోదైన కేసుల్లో సగానికిపైగా వలసలు, ఇతర దేశాల నుంచి వచ్చినవారే ఉండటం గమనార్హం. ఈ కేసులను ఎదుర్కోవడం ఎలా? విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి ప్రయాణికులు వస్తుండటంపై వైద్య, ఆరోగ్య వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలన్న దానిపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ‘అనుమానితులను గుర్తించి పరీక్షలు చేస్తున్నాం. గ్రామాల్లోనూ నిఘా పెట్టాం. కొత్త వాళ్లు వస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని కోరాం. చెక్‌పోస్టులు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల్లో థర్మల్ స్క్రీనింగ్‌లు పెట్టి లక్షణాలున్న వారిని పరీక్షిస్తున్నాం’ అని ఒక అధికారి తెలిపారు. ‘ఇప్పటికే లక్షకుపైగా వలసదారులు రాష్ట్రానికి వచ్చారు. వారిలో కొందరు మా కళ్లుగప్పి ఇళ్లకు వెళ్లారు. వారి కోసం వెతుకుతున్నాం’ అని ఆయన వెల్లడించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారిలో అనుమానిత లక్షణాలున్న వారికి పరీక్షలు చేసి, మిగిలిన వారిని హోం క్వారంటైన్లో ఉంచుతున్నామని మరో అధికారి చెప్పారు. -
హెచ్1బీ వీసాదారులకు ఊరట
వాషింగ్టన్: అమెరికాలో భారత్ సహా వివిధ దేశాల నుంచి వచ్చిన వలసదారులకు భారీ ఊరట లభించింది. వివిధ కారణాలతో నోటీసులు అందుకున్న హెచ్1బీ వీసాదారులు, గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులు స్పందించడానికి, అవసరమైన పత్రాలను సమర్పించడానికి ట్రంప్ సర్కార్ మరో రెండు నెలలు గడువు పొడిగిస్తూ అనుమతులు మంజూరు చేసింది. హెచ్1బీ, గ్రీన్‌కార్డులకు సంబంధించి నోటీసులు అందుకున్న వారు స్పందించడానికి గడువును మరో 60 రోజులు పెంచినట్టుగా యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) వెల్లడించింది. వీసా పొడిగింపు విజ్ఞప్తులు (ఎన్–14), తిరస్కరణ నోటీసులు, ఉపసంహరణ నోటీసులు, ప్రాంతీయ పెట్టుబడుల ఉపసంహరణ, ముగింపు నోటీసులు, ఫారమ్ ఐ–290బీ సమర్పణలు, దరఖాస్తు నోటీసులు వంటి వాటిపై అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించడానికి గడువు పెంచింది. ఇప్పటికే జారీ చేసిన నోటీసులపై ఉన్న గడువు తేదీ తర్వాత మరో రెండు నెలలపాటు వారిపై ఎలాంటి చర్యలు ఉండవు. ఫారమ్ ఐ–290బీ నింపి పంపించడానికి ఈ ప్రకటన విడుదలైన నుంచి 60 రోజుల వరకు గడువు ఉంటుంది. అమెరికాలో శాశ్వత నివాసం ఏర్పాటుకు వీలు కల్పించే గ్రీన్ కార్డు దరఖాస్తుదారులు రెండున్నర లక్షల వరకు ఉన్నారు. -
తెలుగు వారిని రప్పించేందుకు సహకరించాలి
భారతదేశానికి రావడం కోసం కువైట్‌లో నమోదు ప్రక్రియలో మన వాళ్లు చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ దృష్ట్యా వివిధ దేశాల నుంచి తిరిగి రావాలనుకుంటున్న వలసదారుల నమోదు ప్రక్రియ, వారిని పంపించే ఏర్పాట్లు సజావుగా సాగేలా ఆయా దేశాల్లోని మన రాయబార కార్యాలయాల అధికారులను ఆదేశించాలని కోరుతున్నాను. ఆయా దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు భారతదేశం వస్తున్న వలసదారుల సమాచారాన్ని (డేటా) విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా ముందుగానే ఆంధ్రప్రదేశ్‌తో సహా అన్ని రాష్ట్రాలకు అందించేలా చూడాలి. తద్వారా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మరిన్ని ఏర్పాట్లతో వారి రాకకై సిద్ధంగా ఉంటాయి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: విదేశాల్లో చిక్కుకున్న తెలుగు వారిని రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు సహకరిం చాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం ఆయన కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం జైశంకర్‌కు లేఖ రాశారు. కువైట్, దుబాయ్‌లలో వలస వచ్చిన వారి రిజిస్ట్రేషన్ జరుగుతోందని, ఆ సందర్భంగా కువైట్‌లో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు. వాటిని పరిష్కరించేందుకు సంబంధిత ఎంబసీ అధికారులకు సూచనలు చేయాలని సీఎం వైఎస్ జగన్ కోరారు. ఆ లేఖలోని ఇతర అంశాలు ఇలా ఉన్నాయి. విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో రావొచ్చు ► కోవిడ్19 సంక్షోభం కారణంగా గల్ఫ్ దేశాలలో ఉద్యోగాలు కోల్పోయి, అంతర్జాతీయ విమానాలు తిరిగి ప్రారంభమయ్యాక భారతదేశానికి, ఆంధ్రప్రదేశ్‌కు తిరిగి వచ్చేవారి సంఖ్య మరింత పెరగొచ్చు. ► దుబాయ్‌లో, ఇతర దేశాల్లో భారత దౌత్యకార్యాలయాలు స్వదేశానికి తిరిగి వెళ్లే భారతీయుల సమాచార సేకరణ కార్యక్రమం చేపట్టాయి. ఇతర రాష్ట్రాల వారితో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తెలుగు వలసదారులు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో అధికంగా ఉన్నారు. ► భారత ప్రభుత్వం అంతర్జాతీయ ప్రయాణ సదుపాయాలను తిరిగి ప్రారంభించాక గల్ఫ్ దేశాల నుండి తిరిగి వచ్చే వారిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వలసదారులు కొన్ని వేల మంది ఉంటారు. వీరి భద్రత, క్షేమం కోసం, క్వారంటైన్ గురించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఆ దిశగా చర్యలు తీసుకుంది. ► ఏప్రిల్ 30 గడువులోగా నమోదు చేసుకోవటానికి, ఏప్రిల్ 29న కువైట్‌లోని మన రాయబార కార్యాలయానికి వలస కార్మికులు భారీగా తరలివచ్చారు. ఈ నమోదు ప్రక్రియలో రాయబార కార్యాలయం వద్ద వారు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ► గత 6 వారాలుగా వివిధ దేశాలలో చిక్కుకున్న ఏపీ విద్యార్థులు, సందర్శకులు భారత ప్రభుత్వం అవకాశం ఇచ్చిన వెంటనే స్వదేశానికి తిరిగి రావడానికి వేచి ఉన్నారనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ► ముఖ్యమంత్రి లేఖను ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షుడు మేడపాటి వెంకట్ పత్రికలకు విడుదల చేశారు. -
విదేశీయుల కట్టడికి ట్రంప్ తొలి అడుగు
వాషింగ్టన్: అమెరికాకు వెల్లువెత్తుతున్న విదేశీ వర్కర్లని పూర్తి స్థాయిలో కట్టడి చేసే వ్యూహంలో భాగంగానే గ్రీన్ కార్డులపై అధ్యక్షుడు ట్రంప్ తాత్కాలిక నిషేధం విధించారని అధ్యక్షుడి ఇమిగ్రేషన్ ఎజెండా రూపకర్త స్టీఫెన్ మిల్లర్ వెల్లడించారు. అమెరికా వలస విధానంలో భారీగా మార్పులు తీసుకురావడం కోసమే అధ్యక్షుడు తొలుత గ్రీన్ కార్డులపై తాత్కాలిక నిషేధాన్ని విధిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వులు తీసుకువచ్చారని ట్రంప్ తరఫున పనిచేసే కొందరు ప్రతినిధులతో మిల్లర్ చెప్పినట్టుగా వాషింగ్టన్ పోస్టు కథనాన్ని ప్రచురించింది. ఉద్యోగాల కోసం వచ్చే వారంతా వారి కుటుంబాన్ని, తల్లిదండ్రుల్ని తీసుకువస్తూ ఉండడంతో వలసదారులు ఎక్కువైపోయారని మిల్లర్ పేర్కొన్నారు. అందుకే ఫ్యామిలీ వీసాలను కూడా ట్రంప్ వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. అమెరికన్లకి ఉద్యోగాలు లేకుండా విదేశీయుల్ని ఎందుకు పోషించాలన్నది మిల్లర్ విధానంగా ఉంది. -
ఆ విషయంలో మనవారే ఎక్కువ..!
మనుషులకు వలసలు కొత్త కాదు. వానరాల నుంచి పరిణామం చెంది నిటారుగా నిలబడటం, రెండు కాళ్లపై నడవడం ప్రారంభించినప్పటి నుంచి ఆదిమానవులు మనుగడ కోసం వలసబాట పట్టారు. మానవజాతి వలసలకు దాదాపు 17.5 లక్షల ఏళ్ల చరిత్ర ఉంది. ఆదిమానవులు తొలుత ఆఫ్రికా నుంచి యూరేసియా వైపు వలసలు సాగించారు. క్రీస్తుపూర్వం 40 వేల ఏళ్ల నాటికి ఈ ఆదిమానవులు ఆసియా, యూరోప్, ఆస్ట్రేలియా ఖండాలకు విస్తరించారు. కాస్త ఆలస్యంగా– అంటే, క్రీస్తుపూర్వం 20 వేల ఏళ్ల నాటికి రెండు అమెరికా ఖండాలకూ వ్యాపించారు. సానుకూల వాతావరణ పరిస్థితులు ఉన్న ప్రాంతాల్లో మానవులు స్థిర నివాసాలు ఏర్పరచుకోవడంతో నాగరికతలు ఏర్పడ్డాయి. రాజ్యాలు ఏర్పడ్డాయి. అవి ఏర్పడిన తర్వాత కూడా ఆధిపత్యం కోసం ఒక ప్రాంతంలోని వారు మరో ప్రాంతం మీదకు దండయాత్రలు సాగించడం, దండయాత్రల్లో స్వాధీనం చేసుకున్న ప్రాంతాలకు కొందరు వలస వెళ్లడం వంటివి కొనసాగాయి. ఆధునిక యుగంలో మనుషుల అవసరాలు, ఆశయాలలో మార్పులు వచ్చినా, వలసలు మాత్రం ఆగలేదు. మెరుగైన ఉపాధి కోసం, జీవన భద్రత కోసం, పురోగతం కోసం ఒక దేశాన్ని వదిలి మరో దేశానికి వలసలు పోతూనే ఉన్నారు. ఆధునిక కాలంలో ఇతర దేశాలకు వలసపోతున్న వారిలో భారతీయులే ఎక్కువగా ఉంటున్నారు. ఆధునిక కాలంలో మెరుగైన ఉపాధి కోసం, ఉన్నత విద్య కోసం, సౌకర్యవంతమైన అధునాతన జీవితం కోసం, స్వదేశంలో ఉంటున్న కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవడం కోసం, జీవితంలో మరింతగా అభివృద్ధి సాధించడం కోసం వెనుకబడిన, అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి చాలామంది అభివృద్ధి చెందిన సంపన్న దేశాలకు వలస వెళుతున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశమైన మన భారత్ నుంచి కూడా చాలామంది దాదాపు ఇవే కారణాలతో వలసబాట పడుతున్నారు. ఐక్యరాజ్య సమితికి చెందిన ఆర్థిక సామాజిక వ్యవహారాల విభాగం ప్రకటించిన వివరాల ప్రకారం స్వదేశాలను విడిచి ఇతర దేశాలలో నివసిస్తున్న వలసదారుల సంఖ్య 27.2 కోట్లకు పైగా ఉంటే, అంతర్జాతీయ వలసలలో మన భారతీయులే అగ్రస్థానంలో నిలుస్తున్నారు. భారత్ నుంచి వివిధ కారణాలతో ఇతర దేశాలకు వలస వెళ్లి, అక్కడ నివసిస్తున్న వారి సంఖ్య 1.75 కోట్లకు పైమాటే. ఇదిలా ఉంటే, ఇతర దేశాల నుంచి భారత్‌కు వలస వచ్చి ఉంటున్న వారి సంఖ్య ప్రస్తుతం 51 లక్షలుగా ఉంది. నాలుగేళ్ల కిందటి లెక్కలతో పోల్చుకుంటే భారత్‌కు వలస వచ్చే విదేశీయుల సంఖ్య కాస్త తగ్గింది. 2015 నాటికి భారత్‌కు వలస వచ్చిన వారి సంఖ్య 52 లక్షలు. గడచిన దశాబ్దం లెక్కలను చూసుకుంటే– 2010–19 మధ్య కాలంలో భారత్‌లో ఉంటున్న విదేశీయుల సంఖ్య మొత్తం దేశ జనాభాలో దాదాపు 0.4 శాతం వరకు ఉంటున్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. విద్య, ఉపాధి తదితర కారణాలతో వలస వచ్చిన వారే కాకుండా, వీరిలో భారత్‌లో తలదాచుకుంటున్న కాందిశీకులు సుమారు 2.07 లక్షల మంది వరకు ఉంటున్నారు. భారత్‌కు వలస వస్తున్న విదేశీయుల్లో ఎక్కువగా పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్ దేశాలకు చెందిన వారి సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. ఆశ్రయమిస్తున్న దేశాల్లో అగ్రగామి అమెరికా విదేశీ వలసదారులకు పెద్దసంఖ్యలో ఆశ్రయమిస్తున్న దేశాల్లో అమెరికా అగ్రగామిగా నిలుస్తోంది. వివిధ దేశాల నుంచి వలస వచ్చి ఉంటున్న వారి సంఖ్య అమెరికాలో దాదాపు 5.1 కోట్లు. జర్మనీ, సౌదీ అరేబియా దేశాలు దాదాపు 1.3 కోట్ల చొప్పున విదేశీ వలసదారులకు ఆశ్రయం కల్పిస్తున్నాయి. రష్యా 1.2 కోట్ల మందికి, యునైటెడ్ కింగ్డమ్ 1 కోటి మందికి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 90 లక్షల మందికి, ఫ్రాన్స్, కెనడా, ఆస్ట్రేలియా దేశాలు దాదాపు 80 లక్షల చొప్పున, ఇటలీ సుమారు 60 లక్షల మంది విదేశీ వలసదారులకు ఆశ్రయం కల్పిస్తున్నాయి. వివిధ భౌగోళిక ప్రాంతాల్లోని జనాభా నిష్పత్తి ప్రకారం చూసుకుంటే, సహారా ఎడారి పరిసరాల్లోని ఆఫ్రికా దేశాల నుంచి అత్యధికంగా 89 శాతం ఇతర దేశాలకు వలస వెళుతున్నారు. తూర్పు ఆసియా– ఆగ్నేయాసియా దేశాల నుంచి 83 శాతం, లాటిన్ అమెరికన్ దేశాలు– కరీబియన్ దేశాల నుంచి 73 శాతం, మధ్య ఆసియా– దక్షిణాసియా దేశాల నుంచి 63 శాతం ప్రజలు ఇతర దేశాలకు వలస వెళుతున్నారు. విదేశీ వలస దారుల్లో అత్యధికంగా 98 శాతం ఉత్తర అమెరికా దేశాల్లోను, ఉత్తరాఫ్రికా–పశ్చిమాసియా దేశాల్లో 59 శాతం నివాసం ఉంటున్నారు. ఉపాధి, విద్య, ఉన్నతమైన జీవితం వంటి అవసరాల కోసం వివిధ దేశాలకు వలస వెళుతున్న వారి సంగతి ఒక ఎత్తయితే, కొన్ని దేశాల్లో యుద్ధ వాతావరణం కారణంగా అనివార్య పరిస్థితుల్లో బలవంతంగా స్వదేశాల సరిహద్దులు దాటి ఇతర దేశాలకు చేరుకుంటున్న వారి సంఖ్య కూడా ఏటేటా పెరుగుతూ వస్తోంది. ఐక్యరాజ్య సమితి ఆర్థిక సామాజిక వ్యవహారాల విభాగం వెల్లడించిన లెక్కల ప్రకారం 2010–17 మధ్య కాలంలో ఇలా అనివార్యంగా స్వదేశాలను విడిచిపెట్టిన వారి సంఖ్య 1.3 కోట్లకు పైగానే ఉంది. బతికి ఉంటే బలుసాకు తినొచ్చనే రీతిలో ఇలా బలవంతంగా స్వదేశాలను విడిచిపెడుతున్న వారి సంఖ్య అత్య«ధికంగా ఉత్తరాఫ్రికా–పశ్చిమాసియా దేశాల్లోనే ఉంది. ఈ దేశాల నుంచి 46 శాతం మంది వివిధ దేశాల్లో కాందిశీకులుగా తలదాచుకుంటున్నారు. అలాగే, సహారా పరిసర ఆఫ్రికా దేశాల నుంచి 21 శాతం మంది ఇతర దేశాల్లో కాందిశీకులుగా ఉంటున్నారు. అభివృద్ధికి ఆలంబన వివిధ దేశాల అభివృద్ధికి వలసలే ఆలంబనగా నిలుస్తున్నాయి. సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాల సాధనలో వలసలు కీలక పాత్ర పోషిస్తాయని, ప్రపంచ దేశాలన్నీ సురక్షితమైన, క్రమబద్ధమైన, బాధ్యతాయుతమైన వలసలకు వెసులుబాటు కల్పించడం ద్వారా సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి వీలవుతుందని ఐక్యరాజ్య సమితి ఆర్థిక సామాజిక వ్యవహారాల అండర్ సెక్రటరీ లియు ఝెన్మిన్ చెబుతున్నారు. వలసల వల్ల కలిగే సామాజిక, ఆర్థిక ప్రయోజనాలను భారతీయ సామాజికవేత్త రాధాకమల్ ముఖర్జీ 1936లోనే తాను రాసిన ‘మైగ్రంట్ ఆసియా’ పుస్తకం ద్వారా వెల్లడించారు. ఆసియా దేశాల్లో, ముఖ్యంగా భారత్‌లో మిగులు కార్మిక శక్తి అత్యధికంగా ఉందని, ఈ మిగులు కార్మిక శక్తి కార్మికుల అవసరం ఎక్కువగా ఉన్న ఇతర దేశాలకు వలస వెళితే ఉభయ దేశాలకూ ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నారు. వివిధ దేశాల్లో బ్రిటిష్ వలస పాలన కొనసాగుతున్న కాలంలో– 1870–1914 సంవత్సరాల మధ్య కాలంలో భారత్ నుంచి దాదాపు 4 కోట్ల మంది బ్రిటిష్ పాలనలో ఉన్న ఇతర దేశాలకు వలస వెళ్లారు. వీరిలో అత్యధికులు మారిషస్ వెళ్లారు. మారిషస్ ప్రస్తుత జనాభాలో దాదాపు 70 శాతం మంది భారత సంతతికి చెందిన వారే కావడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఏర్పడిన 1930 దశకంలో భారత్ నుంచి ఇతర దేశాలకు వలసలు గణనీయంగా తగ్గాయి. అప్పటి వరకు భారతీయులు ఎక్కువగా వలస వెళ్లే శ్రీలంక, మయన్మార్, మలేసియాలకు కూడా వలసల సంఖ్య పడిపోయింది. స్వాతంత్య్రం వచ్చి, కొంత నిలదొక్కుకున్న తర్వాత 1970 దశకం నుంచి భారత్ నుంచి మళ్లీ ఇతర దేశాలకు వలసలు ఊపందుకున్నాయి. స్వాతంత్య్రానికి ముందు భారతీయులు ఎక్కువగా దక్షిణ, ఆగ్నేయాసియా దేశాలకు వలస వెళ్లేవారు. స్వాతంత్య్రం వచ్చాక ఈ వలసలు పశ్చిమాసియా, అమెరికా, యూరోప్‌ల వైపు మళ్లాయి. పశ్చిమాసియా దేశాలు మినహా మిగిలిన దేశాలు తమ దేశాల్లో చిరకాలంగా నివాసం ఉంటున్న విదేశీయులకు పౌరసత్వ అవకాశాలు కూడా కల్పిస్తుండటంతో పలువురు భారతీయులు అమెరికా, కెనడా, యునైటెడ్ కింగ్డమ్, దక్షిణాఫ్రికా, మారిషస్, మలేసియా వంటి దేశాల్లో పౌరసత్వం పొంది అక్కడే స్థిరపడి ఉంటున్నారు. వీరంతా భారత్‌లో ఉంటున్న తమ కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటున్నారు. వివిధ రంగాల్లో పెట్టుబడులు కూడా పెడుతున్నారు. స్వదేశాలను విడిచి ఇతర దేశాలకు చేరుకుంటున్న వలసదారులు తాము గమ్యంగా ఎంపిక చేసుకున్న దేశం అభివృద్ధిలో పాలు పంచుకోవడంతో పాటు తమ తమ స్వదేశాల ఆర్థిక పరిపుష్టికి కూడా ఇతోధికంగా దోహదపడుతున్నారు. ఇతర దేశాల్లో ఉంటున్న భారతీయులు కూడా మన దేశ అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. ప్రవాస భారతీయులు, ఇతర దేశాల్లో స్థిరపడిన భారత సంతతి ప్రజల ద్వారా గడచిన ఆర్థిక సంవత్సరంలో 8000 కోట్ల డాలర్లు (రూ.5.70 లక్షల కోట్లు) మన దేశ ఆర్థిక వ్యవస్థకు వచ్చి చేరాయి. గడచిన దశాబ్ద కాలంలో వలస వెళ్లిన భారతీయుల ద్వారా ఏటా మన ఆర్థిక వ్యవస్థకు చేరే నిధుల మొత్తం రెట్టింపు కంటే పెరిగింది. భారత సంతతి ప్రజల జనాభా లక్షకు పైగానే ఉన్న దేశాలు 32 వరకు ఉన్నాయి. వీటిలో అత్యధిక సంఖ్యలో భారతీయులు అమెరికాలోనే ఉంటున్నారు. ఈ పది దేశాలతో పాటు కువైట్, మారిషస్, ఖతార్, ఓమన్, సింగపూర్, నేపాల్, ట్రినిడాడ్ అండ్ టొబాగో, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, బహ్రెయిన్, ఫిజి, గుయానా, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, ఇటలీ, థాయ్‌లాండ్, సురినేమ్, జర్మనీ, ఫిలిప్పీన్స్, ఫ్రాన్స్, ఇండోనేసియా వంటి దేశాల్లోనూ భారతీయులు గణనీయమైన సంఖ్యలో ఉంటున్నారు. విదేశాలలో స్థిరపడ్డ భారతీయులలో తెలుగు వారి సంఖ్య కూడా గణనీయంగా ఉంటోంది. పై ఐదు దేశాల్లో తెలుగు వారి సంఖ్య లక్షకు పైగానే ఉంది. పలు దేశాల్లో తెలుగు సంస్థలు కూడా క్రియాశీలంగా పనిచేస్తున్నాయి. – పన్యాల జగన్నాథదాసు విదేశాల్లో మనవాళ్ల ఘనత విదేశాల్లో స్థిరపడిన భారతీయులు వివిధ రంగాల్లో ఘన విజయాలు సాధిస్తూ స్వదేశానికి గర్వకారణంగా నిలుస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన హైటెక్ కంపెనీల వ్యవస్థాపకుల్లో 8 శాతం మంది భారత సంతతికి చెందిన వారేనని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వెల్లడించింది. వీరిలో గూగుల్ అధినేత సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెళ్ల వంటి వారు సాంకేతిక రంగంలో ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపగలుగుతున్నారు. భారత సంతతికి చెందిన వారిలో పలువురు వివిధ దేశాల్లోని చట్టసభల్లోనూ కీలక పదవుల్లో రాణిస్తున్నారు. అమెరికా, కెనడా, యునైటెడ్ కింగ్డమ్, మారిషస్, ట్రినిడాడ్ అండ్ టొబాగో, దక్షిణాఫ్రికా, టాంజానియా, సురినేమ్, సింగపూర్, న్యూజిలాండ్, మలేసియా వంటి దేశాల చట్టసభల్లో భారత సంతతికి చెందినవారు గణనీయమైన సంఖ్యలో సభ్యులుగా ఉంటున్నారు. -
రిఫ్రిజిరేటర్లో 41 మంది
తెస్సలోనికి: ట్రక్‌లో దాక్కొని గ్రీస్ దేశంలోకి ప్రవేశించాలని ప్రయత్నించిన 41 మందిని పోలీసులు గుర్తించారు. ట్రక్ రిఫ్రిజిరేటర్లో వలసదారులు ఉండగా, జార్జియాకు చెందిన ట్రక్ డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. జాంతి, కొమొతిని నగరాల మధ్య ఈ ట్రక్కును కనుక్కున్నట్లు పోలీసులు వెల్లడించారు. దాక్కున్న వారంతా ఆరోగ్యంగానే ఉన్నారని, అవసరమైన ఏడు మందికి ప్రాథమిక చికిత్స అందించినట్లు పోలీసులు తెలిపారు. వీరు అఫ్గానిస్తాన్ వాసులుగా భావిస్తున్నారు. -
అమెరికాలో ఎంబీఏకు గడ్డుకాలం
ఇమ్మిగ్రేషన్ విధానంలో మార్పులు, చైనాతో రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికాలోని ప్రఖ్యాత బిజినెస్ స్కూల్స్ విదేశీ విద్యార్థులను ఆకర్షించడంలో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. దీంతో ఈ ఏడాది ఆయా బిజినెస్ స్కూళ్లలో విద్యార్థుల అడ్మిషన్లు గణనీయమైన సంఖ్యలో తగ్గిపోయాయి. హార్వర్డ్ యూనివర్సిటీ, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తదితర అమెరికా అగ్రస్థాయి విద్యాసంస్థల్లోనూ ఇదే తరహా పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా వీటి అనుబంధ బిజినెస్ స్కూళ్లలో ప్రతి ఏడాది అడ్మిషన్ దరఖాస్తుల సంఖ్య తగ్గిపోతోంది. డార్ట్మౌత్ కాలేజీకి చెందిన టక్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో దరఖాస్తుల సంఖ్య ఏకంగా రెండంకెల శాతానికి పడిపోయింది. చదవండి: హెచ్-1బీ వీసాలు: ట్రంప్‌కు సంచలన లేఖ వరుసగా ఐదో ఏడాది కూడా అమెరికాలో ఎంబీఏ కోర్సు దరఖాస్తుల సంఖ్య పడిపోయింది. గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ అడ్మిషన్స్ కౌన్సిల్ విశ్లేషణలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. బిజినెస్ స్కూల్స్ అసోసియేషన్ అయిన ఈ స్వచ్ఛంద సంస్థ.. జీమ్యాట్ అడ్మిషన్స్ టెస్టు నిర్వహిస్తుంది. ప్రస్తుత వేసవికాలంలో ముగిసే విద్యా సంవత్సరానికిగాను అమెరికా బిజినెస్ స్కూళ్లకు విద్యార్థుల నుంచి 1,35,096 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఇందులో సంప్రదాయ ఎంబీఏ కోర్సు దరఖాస్తులు కూడా ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే గత ఏడాది కన్నా దరఖాస్తులు 9.1శాతం పడిపోయాయి. గత ఏడాది కూడా బిజినెస్ కోర్సుల దరఖాస్తుల్లో 7శాతం తగ్గుదల నమోదైంది. ఒకప్పుడు విదేశీ విద్యార్థులు పెద్దసంఖ్యలో అమెరికాలో ఎంబీఏ కోర్సు చేసేందుకు ఉత్సాహం చూపేవారు. అగ్రరాజ్యంలో ఎంబీఏ చేస్తే.. ఆ దేశ ప్రముఖ కంపెనీల్లో అత్యున్నత మేనేజ్మెంట్ హోదాలో ఉద్యోగం సంపాదించవచ్చునని, తద్వారా కంపెనీ నాయకత్వ దశకు ఎదుగుతూ.. భారీ వేతనాలు అందుకోవచ్చునని ఆశించేవారు. కానీ, ఇటీవల చేపట్టిన ఇమ్మిగ్రేషన్ విధానంలో మార్పులు, చైనాతో రాజకీయ, వాణిజ్య ఘర్షణలు, టెక్నాలజీ పరిశ్రమ ఉద్యోగాలు ఎక్కువ ఆకర్షణీయంగా ఉండటంతో అమెరికాలో ఎంబీఏ చేసే విదేశీ విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోతూ వస్తోంది. రెండేళ్ల ఎంబీఏ కోర్సుకు అంతగా డిమాండ్ లేకపోవడం, ఉద్యోగావకాశాలు క్రమంగా తగ్గడం, దీనికితోడు అండర్ గ్రాడ్యుయేట్ రుణభారాలతో మినినీయల్స్ సతమతమవుతుండటంతో ఒకింత ఖరీదైన ఎంబీఐ కోర్సును చేసేందుకు విద్యార్థులు ఆసక్తి చూపడం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
హెచ్-1బీ వీసాలు: ట్రంప్‌కు సంచలన లేఖ
న్యూయార్క్: అమెరికా ఇమ్మిగ్రేషన్ (వలస) విధానంలో సత్వరమే మార్పులు తీసుకురావాలని, మంచి నైపుణ్యం గల విదేశీ వర్కర్స్‌ను మరింతగా దేశంలోకి అనుమతించాలని, అమెరికా ఆర్థిక వృద్ధికి, భవిష్యత్ సాంకేతిక రంగ పునర్నిర్మాణానికి ఇది అత్యవసరమని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆ దేశ బిజినెస్ విశ్వవిద్యాలయాలు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కోరాయి. మంచి నైపుణ్యం గల వర్కర్స్‌ను ఆకర్షించేవిధంగా దేశ ఇమ్మిగ్రేషన్ విధానాన్ని సమీక్షించాలని ట్రంప్‌తోపాటు అమెరికా చట్టసభ నాయకులను అభ్యర్థిస్తూ 50 బిజినెస్ స్కూళ్ల డీన్స్ ఒక బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖను వాల్‌స్ట్రీట్ జనరల్ బుధవారం ప్రచురించింది. యేల్, కొలంబియా, స్టాన్ఫోర్డ్, డ్యూక్, న్యూయార్క్ యూనివర్సిటీ వంటి ప్రఖ్యాత వర్సిటీల అధిపతులు ఈ లేఖపై సంతకం చేశారు. వివిధ దేశాలకు ఇస్తున్న వీసాల మీద పరిమితులు ఎత్తివేయాలని, అత్యున్నత నైపుణ్యం గల వ్యక్తులు అమెరికాకు వచ్చేందుకు వీలుగా హెచ్-1బీ వీసా విధానంలో సంస్కరణలు తీసుకురావాలని, స్కిల్డ్ వర్కర్స్ అమెరికా రాకను ప్రోత్సహించేందుకు ‘హార్ట్‌ల్యాండ్ వీసా’ లాంటి విధానాన్ని అమల్లోకి తీసుకురాలని వారు తమ లేఖలో కోరారు. కాలం చెల్లిన చట్టాలు, ఇమ్మిగ్రేషన్‌పై ప్రాంతాల వారీగా విధిస్తున్న పరిమితులు, ఇటీవలి అస్థిర వాతావరణం వంటి కారణాలు.. అత్యున్నత నైపుణ్యంగల వలసదారులను దేశంలోకి రాకుండా అడ్డుకుంటున్నాయని, దేశ ఆర్థిక వృద్ధికి వారి రాక కీలకమని డీన్స్ పేర్కొన్నారు. గత మూడేళ్లుగా అమెరికా యూనివర్సిటీల్లో, బిజినెస్ స్కూళ్లలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థుల సంఖ్య తగ్గిందని తాము చేపట్టిన విశ్లేషణలో వెల్లడయిందని డీన్స్ పేర్కొన్నారు. ప్రతిభను, నైపుణ్యాన్ని గుర్తించకపోతే అది దీర్ఘకాలంలో అమెరికా ఆర్థిక వ్యవస్థకు చేటు తెస్తుందని డీన్స్ హెచ్చరించారు. చదవండి: అమెరికాలో ఎంబీఏకు గడ్డుకాలం అమెరికా విధించిన పరిమితుల కారణంగా హెచ్-1బీ వీసాలు గణనీయంగా తగ్గిపోయాయని, 2004లో లక్ష95వేల హెచ్-1బీ వీసాలు జారీచేయగా.. ప్రస్తుతం 85వేల వీసాలు మాత్రమే జారీచేస్తున్నారని, డొనాల్డ్ ట్రంప్ హయాంలో హెచ్-1బీ వీసాల తిరస్కరణ గణనీయంగా పెరిగిందని, 2015లో 6శాతం వలసదారులకు మాత్రమే ఈ వీసాలు తిరస్కరించగా.. 2019లో అది ఏకంగా 32శాతానికి ఎగబాకిందని తెలిపారు. అంతేకాకుండా హెచ్-1బీ వీసాల కోసం వస్తున్న దరఖాస్తులు కూడా గణనీయంగా తగ్గిపోయాయని, 2017లో రెండు లక్షల 36వేల హెచ్-1బీ వీసా దరఖాస్తులు రాగా, 2018కి అవి లక్షా 99వేలకు పడిపోయాయని డీన్స్ వెల్లడించారు. ట్రంప్ సర్కారు ఆలాపిస్తున్న వలస వ్యతిరేక రాగం.. తీవ్ర ప్రభావం చూపుతోందని, దీంతో విదేశీ వలసదారుల్లో ఒకరకమైన భయం ఆవరించిందని వారు తెలిపారు. -
బీమా చెల్లించకుంటే రాకండి
వాషింగ్టన్: అమెరికా వెళ్ళేందుకు సమాయత్తమౌతోన్న వేలాది మంది భారతీయుల ఆకాంక్షలపై ట్రంప్ తాజా ఆదేశాలు నీళ్ళు చల్లుతున్నాయి. ఆరోగ్యబీమా ఉన్నదని రుజువు చేసుకోలేని వారినీ, వైద్యఖర్చులను భరించలేని వారినీ అమెరికాలోకి అడుగుపెట్టనివ్వమంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న వీసానిరాకరణ నిర్ణయం ఆందోళన రేకెత్తిస్తోంది. ఆరోగ్యబీమా లేకుండా, వైద్యబిల్లులు చెల్లించే ఆర్థిక స్థోమత లేకుండా అమెరికాలోకి అడుగుపెట్టే వలసదారులను అడ్డుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారంతేల్చి చెప్పారు. అంతేకాకుండా అమెరికా ఆరోగ్య వ్యవస్థపై అదనపు భారం కాబోమని నిరూపించుకున్న వారినే అనుమతించాలని అధికారులను ట్రంప్ ఆదేశించారు. అమెరికా పౌరుల్లోకంటే ఆరోగ్యబీమా లేని చట్టబద్దమైన ప్రవాసులు మూడు రెట్లు అధికంగా ఉన్నట్టు ట్రంప్ ప్రకటనలో పేర్కొన్నారు. అమెరికా ఆరోగ్యవ్యవస్థకీ, పన్నులు చెల్లిస్తోన్న అమెరికా పౌరులకువలసదారుల వల్ల ఖర్చు పెరగకూడదని ట్రంప్ భావిస్తున్నట్టు వైట్ హౌస్ వెల్లడించారు. -
ఆ 40 లక్షల అక్రమ వలసదారులేరి?
ఇండోర్: అసోంలో దాదాపు 40 లక్షలమంది అక్రమ వలసదారులు ఉన్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గతంలో పలుసార్లు చెప్పారని, ఆ 40 లక్షలమంది అక్రమ వలసదారులు ఎక్కడ ఉన్నారో చెప్పాలని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ డిమాండ్ చేశారు. ఇటీవల అసోంలో జాతీయ పౌర జాబితా (ఎన్నార్సీ)ని ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో మొత్తం 19 లక్షలమందికి భారతీయ పౌరసత్వానికి సంబంధించిన సరైన పత్రాలు లేవని ఎన్నార్సీ తేల్చింది. ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ సర్కారు తీరుపై దిగ్విజయ్ ధ్వజమెత్తారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా బీజేపీ ప్రచారం చేస్తోందని, అసోంలోని 40 లక్షలమంది అక్రమ వలసదారులు ఎక్కడున్నారో అమిత్ షా లేదా ఆయన నంబర్ టు కైలాశ్ విజయ్వార్గియా చెప్పాలని డిమాండ్ చేశారు. మతం పేరిట రాజకీయాలు చేస్తూ దేశంలో సందేహాలు రేకెత్తించడం బీజేపీకి పాత అలవాటేనని దిగ్విజయ్ ఎద్దేవా చేశారు. -
అక్రమ వలసదార్ల అరెస్టులు షురూ
వాషింగ్టన్: దేశంలో వలసదార్లను పెద్ద సంఖ్యలో ఏరివేసేందుకు, వారిని దేశ బహిష్కారం చేసేందుకు అమెరికా సర్వసన్నద్ధమైంది. అక్రమ వలసదార్లను ఆదివారం నుంచి అరెస్టు చేయనున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్వీట్ చేశారు. లక్షలాది అక్రమ వలసదార్లను అరెస్టు చేసేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. తగిన ఉత్తర్వులతో వారిని దేశ బహిష్కారం చేయనున్నట్టు ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ యాక్టింగ్ డైరెక్టర్ మాథ్యూ అల్బెన్స్ తెలిపారు. అరెస్టులు కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం కాబోవని, కేసుల దర్యాప్తును అనుసరించి అధికారులు ఎక్కడికంటే అక్కడికి పోతారని ఆయన చెప్పారు. అరెస్టు చేసిన వారిని వారి వారి దేశాలకు పంపుతామని, నేరాలకు పాల్పడిన వారిని ఇక్కడ లేదా వారి దేశాల్లోని జైళ్లకు పంపుతామని ట్రంప్ ప్రకటించారు. అధికారులు అందిస్తున్న వివరాల ప్రకారం – 2000 మందిని లక్ష్యంగా చేసుకుని సోదాలు నిర్వహించనున్నారు. గతంలో జరిగిన దాడులను బట్టి ఇప్పుడు కనీసం 200 మందిని అరెస్టు చేయవచ్చునని భావిస్తున్నారు. ట్రంప్ సర్కారు నిర్ణయాలు అగ్రరాజ్యంలో తీవ్ర రాజకీయ చర్చకు దారితీశాయి. ప్రభుత్వ చర్యలు అమానవీయమైనవంటూ డెమోక్రాట్లు విమర్శలు చేస్తున్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. మధ్య అమెరికా నుంచి ఇంతకు ముందెన్నడూ లేనంత మంది ప్రజలు ఇటీవల యూఎస్ సరిహద్దులకు చేరుకున్న విషయం తెలిసిందే. వీరిలో పలువురు ఇమ్మిగ్రేషన్ కోర్టు కేసులను ఎదుర్కొంటున్నారు. 2016లో బరాక్ ఒబామా హయాంలోను, 2017లో ట్రంప్ హయాంలోను అక్రమ వలసదార్లపై ఇదే తరహా ఆపరేషన్ నిర్వహించారు. -
ఉత్తుత్తి పెళ్లిళ్ల కేసులో భారతీయుడు దోషి
వాషింగ్టన్: భారతీయులు సహా వలసదారులకు అమెరికా పౌరులతో ఉత్తుత్తి పెళ్లిళ్లు చేయించి మోసానికి పాల్పడిన ఒక భారతీయుడిని అక్కడి కోర్టు దోషిగా నిర్ధారించింది. ఫ్లోరిడా రాష్ట్రం పనామా సిటీలో నివాసముంటున్న రవిబాబు కొల్లా(47) 2017 –2018 సంవత్సరాల్లో బే కౌంటీ ప్రాంతంలో ఉత్తుత్తి పెళ్లిళ్ల దందా సాగించాడు. అక్కడి ప్రభుత్వం నుంచి రాయితీలు అందేలా చేసేందుకు, స్థిర నివాసం ఉండేలా చేసేందుకు భారతీయులు సహా ఇతర వలసదారులకు అమెరికా పౌరులతో దాదాపు 80 వరకు పెళ్లిళ్లు జరిపించాడు. అతడికి అమెరికా పౌరసత్వం ఉన్న క్రిస్టల్ క్లౌడ్(40) సహకరించింది. ఈ పెళ్లిళ్లకు అమెరికా పౌరసత్వం ఉన్న పనామా సిటీ, కల్హౌన్, జాక్సన్ కౌంటీలకు చెందిన సుమారు 10 మందిని ఆమె ఎంపిక చేసింది. నకిలీ పెళ్లిళ్లు చేయించిన నేరానికి రవిబాబుకు ఐదేళ్ల వరకు, వీసా మోసాలకు గాను 20 ఏళ్ల వరకు శిక్ష పడే చాన్సుంది. -
వలసదారులతో సుసంపన్నం
వాషింగ్టన్: చట్టబద్ధంగా అమెరికాకు వస్తున్న వలసదారులతో దేశానికి ఎన్నో విధాలుగా మేలు జరుగుతోందని అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ప్రతిభ ఆధారిత వలస విధానం ప్రాముఖ్యత మరోసారి నొక్కి చెప్పిన ట్రంప్..అమెరికా పౌరుల ఉద్యోగాలు, ప్రాణాల్ని పరిరక్షించే ఒక సుదృఢ వలస వ్యవస్థను రూపొందించాల్సిన నైతిక బాధ్యత తమపై ఉందని ఉద్ఘాటించారు. కాంగ్రెస్‌లోని ఉభయ సభల్ని ఉద్దేశించి ఆయన ‘స్టేట్ ఆఫ్ ది యూనియన్’ పేరిట బుధవారం ప్రసంగించారు. ఏటా జరిగే ఈ జరిగే కార్యక్రమం అధ్యక్ష హోదాలో ట్రంప్‌కు రెండోది కావడం గమనార్హం. ప్రతీకార రాజకీయాలను తిరస్కరించాలని, భేదాభిప్రాయాలు పరిష్కరించుకోకుంటే మరో షట్‌డౌన్ వస్తుందని హెచ్చరించారు. ట్రంప్ తన ప్రసంగంలో వివిధ అంశాలపై చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే.. వలసలు, సరిహద్దు గోడపై.. చట్టాలు గౌరవించి, సక్రమంగా అమెరికాకు వస్తున్న వలసదారులు ఎన్నో విధాలుగా మన సమాజాన్ని సుసంపన్నం చేస్తున్నారు. వారు చట్టబద్ధంగా రావాలని కోరుకుంటున్నా. మన పౌరులందరి ప్రయోజనాల్ని రక్షించే ఒక వ్యవస్థను నిర్మించాల్సిన బాధ్యత మనపైనే ఉంది. మెక్సికోతో సరిహద్దు గోడ కోసం కలసి పనిచేద్దాం. రాజీకొద్దాం. అమెరికాను గొప్ప దేశంగా తీర్చిదిద్దే ఒప్పందం చేసుకుందాం. కాంగ్రెస్‌లో విభేదాలపై.. మరో ప్రభుత్వ షట్‌డౌన్ రాకుండా నివారించాలంటే విభేధాల్ని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. పాత గాయాలు మానేలా, భేదాభిప్రాయాలు పక్కనపెట్టి కొత్త పరిష్కారాలు, ఒప్పందాలు చేసుకుందాం. విదేశీ శత్రువులను ఓడించాలంటే స్వదేశంలో మనం కలసిపనిచేయాలి. తాలిబాన్‌తో చర్చలపై.. అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్ ఉగ్రవాదులతో నిర్మాణాత్మక చర్చలు కొనసాగుతున్నాయి. శాంతి స్థాపనకు ప్రయత్నంచే సమయం వచ్చింది. తాలిబాన్లతో చర్చల్లో పురోగతి సాధిస్తే, అక్కడ మన సైన్యాన్ని తగ్గించి, ఉగ్ర వ్యతిరేక కార్యకలాపాలపై దృష్టి సారిస్తాం. చైనా ఉత్పుత్తులపై టారిఫ్‌లు వేయడంపై చైనా ఉత్పత్తులపై టారిఫ్‌లు వేయడం ద్వారా అమెరికాకు ప్రతినెలా బిలియన్ల కొద్ది ఆదాయం వస్తోంది. అంతకుముందు, డ్రాగన్ దేశం మనకు ఒక్క డాలర్ కూడా ఇచ్చేది కాదు. దశాబ్దాలుగా అమెరికాకు ప్రతికూలంగా ఉన్న వాణిజ్య విధానాల్ని రద్దుచేయడానికి అధిక ప్రాముఖ్యత ఇస్తున్నాం. కొత్త అణు ఒప్పందం! భారత్, పాక్‌లను చేరుస్తూ ట్రంప్ సరికొత్త అణు ఒప్పందాన్ని ప్రతిపాదించారు. భారత్‌కు చెందిన పృథ్వీ, అగ్ని క్షిపణులు, పాక్‌కు చెందిన బాబర్, షహీన్, ఘోరి లాంటి క్షిపణుల ప్రయోగాలపై నియంత్రణ ఉండేలా ఆయన ఈ ప్రతిపాదన తెచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందంలో ఆయన నేరుగా భారత్‌ను ప్రస్తావించలేదు. కాగా, కార్యక్రమానికి డెమొక్రాటిక్ పార్టీకి చెందిన మహిళా సభ్యులు తెలుపు రంగు డ్రెస్‌లలో వచ్చారు. 20వ శతాబ్దంలో ఓటుహక్కు కోసం ఉద్యమించిన మహిళల జ్ఞాపకార్థం వారీ రంగు దుస్తుల్లో వచ్చారు. కాగా, ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌లు ఈ నెల 27, 28న వియత్నాంలో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. -
వలసదారులపై బాష్పవాయువు
టిజుయానా: మెక్సికో సరిహద్దుల గుండా అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించాలనుకున్న వలసదారులను యూఎస్ సరిహద్దు దళాలు అడ్డుకున్నాయి. వీరిలో 25 మందిని అరెస్టు చేశాయి. నూతన సంవత్సర వేడుకలు జరుగుతున్న సమయంలో దాదాపు 100 మంది వలసదారులు అమెరికాలోకి చొరబడేందుకు యత్నించారని స్థానిక మీడియా పేర్కొంది. మెక్సికో సరిహద్దు నుంచి దేశంలోకి ప్రవేశించేందుకు యత్నించిన 45 మంది వలసదారులను అడ్డుకున్నామని యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ మంగళవారం వెల్లడించింది. కొద్దిసేపటి తర్వాత వీరంతా సీబీపీ అధికారులపై రాళ్ల వర్షం కురిపించారని తెలిపింది. వలసదారులను అదుపు చేసేందుకు బాష్పవాయువు, పెప్పర్ స్ప్రేను వాడామని వివరించింది. -
అమెరికా సరిహద్దు దాటిన వలసదారులు
తిజువానా(మెక్సికో): సెంట్రల్ అమెరికా నుంచి బయల్దేరిన వలసదారుల తొలి బృందం అమెరికా సరిహద్దు చేరుకుంది. కాలిఫోర్నియాతో సరిహద్దు పంచుకుంటున్న మెక్సికోలోని తిజువానాలో కంచె దాటిన 9 మందిని అమెరికా నిఘా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. వీరిలో తల్లి, నలుగురు పిల్లలు, 19 ఏళ్ల గర్భిణి ఉన్నారు. భద్రతా సిబ్బంది చూస్తుండగానే కంచె దాటి అమెరికా వైపు వెళ్లిన మరికొందరు ఆ వెంటనే వెనక్కి వచ్చారు. సుమారు 4 వేల మందితో కూడిన ప్రధాన బృందం కూడా త్వరలోనే ఇక్కడకి చేరుకునే అవకాశం ఉంది. స్వదేశంలో హింస, పేదరికానికి తాళలేక హొండూరస్, గ్వాటెమాల, ఎల్‌సాల్వడార్ దేశాల ప్రజలు అమెరికాలో ఆశ్రయం పొందడానికి సుదీర్ఘ ప్రయాణం చేస్తున్నారు. -
వలసదారులు వెనక్కి!
అహ్మదాబాద్: దాడుల భయం నేపథ్యంలో హిందీ మాట్లాడే వలసదారులు గుజరాత్‌ను వీడుతుండటం కొనసాగుతోంది. మంగళవారం కూడా హిందీ భాషీయులు గుజరాత్ నుంచి బిహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లోని తమ సొంత ప్రాంతాలకు భారీ సంఖ్యలో వెళ్లిపోయారు. ఇప్పటికే గుజరాత్ నుంచి 60 వేల మందికిపైగా హిందీ వాళ్లు తమ సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయి ఉంటారని అంచనా. హిందీ వలసదారుల్లో భయం పోగొట్టడానికి పారిశ్రామిక ప్రాంతాల్లో పోలీసులు గస్తీ పెంచారు. వందలాది మంది పోలీసులు వడోదరలో కవాతు నిర్వహించి వలసదారులకు భరోసానిచ్చారు. హిందీ భాషీయులపై దాడులకు పాల్పడిన 533 మందిని అరెస్టు చేసి 61 కేసులు నమోదు చేశామని గుజరాత్ హోం శాఖ మంత్రి జడేజా చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో విద్వేషపూరిత పోస్ట్‌లు చేసిన మరో 20 మందిని ఐటీ చట్టం కింద అరెస్టు చేశామన్నారు. అహ్మదాబాద్ రైల్వే స్టేషన్లో ఓ వలసదారుడు మాట్లాడుతూ ‘కొంతమంది నిన్న రాత్రి మా దగ్గరకు వచ్చి మేమంతా మా సొంత రాష్ట్రాలకు వెళ్లిపోవాలనీ, లేకుంటే దాడులు చేస్తామని బెదిరించారు’ అని తెలిపాడు. సబర్‌కాంఠా జిల్లాలో 14 నెలల బాలికపై అత్యాచారం చేశాడనే ఆరోపణలపై బిహార్ నుంచి వచ్చిన ఓ కూలీని పోలీసులు అరెస్టు చేసిన అనంతరం గుజరాత్‌లోని పలు జిల్లాల్లో హిందీ మాట్లాడేవారిపై దాడులు జరుగుతుండటం తెలిసిందే. కాంగ్రెస్సే కారణం: బీజేపీ కాంగ్రెస్ ఎమ్మెల్యే అల్పేశ్ ఠాకూర్, ఆయనకు చెందిన గుజరాత్ క్షత్రియ–ఠాకూర్ సేననే ఈ హింసకు కారణమని బీజేపీ ఆరోపించింది. ‘కాంగ్రెస్సే హింసను రగిలిస్తుంది. ఆ హింసను పార్టీ అధ్యక్షుడు రాహుల్ ఖండిస్తారు’ అంటూ సీఎం రూపానీ ట్వీట్ చేశారు. రాహుల్ అంతకుముందు మాట్లాడుతూ దేశంలో నిరుద్యోగం వల్ల యువతలో పెరుగుతున్న అసహనమే దాడులకు కారణమనీ, జనాభాకు తగ్గట్టుగా ఉద్యోగాలు కల్పించలేకపోవడం ప్రభుత్వ అసమర్థతేనని విమర్శించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ ‘ఈ దాడుల ధోరణి ప్రమాదకరం. ఇదో విపత్కర పరిస్థితి. సమస్య చాలా తీవ్రంగా ఉంది. బీజేపీ ప్రభుత్వం ఎందుకు నియంత్రణ చర్యలు చేపట్టడం లేదో నాకు అర్థం కావడం లేదు’ అని పేర్కొన్నారు. పారిశ్రామిక రంగంపై ప్రభావం వేలాది మంది వలస కార్మికులు గుజరాత్‌ను వీడి వెళ్లిపోతుండటంతో మౌలిక సదుపాయాలు, నిర్మాణ, ఔషధ రంగాల్లో మానవ వనరుల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. కార్మికులు దొరకక భారీ స్థాయిలో ఉత్పత్తి నష్టం వాటిల్లుతోంది. ఔషధ రంగానికి బాగా ప్రముఖంగా ఉన్న గుజరాత్లో దాదాపుగా 3,300 ఔషధ తయారీ కేంద్రాలు ఉన్నాయి. ఫార్మా ఎగుమతుల్లో 28% వాటా గుజరాత్‌దే. వలస కార్మికులు ఎక్కువగా పనిచేసే ఫాక్టరీలు వారి భద్రత కోసం ఇప్పటికే పలు చర్యలు తీసుకున్నాయి. అంతేకాదు ఇప్పటికే రాష్ట్రం విడిచి వెళ్లిపోయిన వారు వెనక్కి వచ్చేలా చర్యలు కూడా చేపడుతున్నట్టు మానవ వనరుల మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. -
ఖతర్‌లో కష్టాలు
ఇందూరు(నిజామాబాద్ అర్బన్): ఉపాధి కోసం పొట్ట చేతపట్టుకుని గల్ఫ్ దేశాలకు వెళ్తున్నవారి పరిస్థితులు అగమ్య గోచరంగా మారుతున్నాయి. జీతం బాగుందనే ఆశతో ఏజెంట్ల మాటలను నమ్మి వెళ్తే దేశం కాని దేశంలో నరకం అనుభవిస్తున్నారు. కొంత మందికి కనీసం తిండికయ్యే ఖర్చంత కూడా వేతనాలు ఇవ్వకుండా అక్కడి కంపెనీలు మోసం చేస్తున్నాయి. ఇదే పరిస్థితిని నిజామాబాద్ జిల్లాకు చెందిన ముగ్గురు బాధితులు ఎదుర్కొన్నారు. ఇందులో ఇద్దరు అప్పుచేసి ఖతర్ దేశం నుంచి బయటపడి ఇండియాకు తిరిగి వచ్చారు. ఏ పరిస్థితుల్లో ఖతర్‡ వెళ్లాల్సి వచ్చింది... ఏజెంటు ఏ విధంగా మోసం చేశాడు... వారు పడ్డ కష్టాలను వివరించారు. ఆర్మూర్ మండలం మంథని గ్రామానికి చెందిన చెలిమెల పవన్, నందిపేట్ మండలం నూత్పల్లి గ్రామానికి చెందిన మెరుగు శ్రీనివాస్ గౌడ్, మోపాల్ మండలం బాడ్సీ గ్రామానికి చెందిన కొట్టాల రవి. వీరు ముగ్గురితో పాటుగా జగిత్యాల్, కరీంనగర్, కామారెడ్డి జిల్లాలకు చెందిన వారితో కలిపి మొత్తం తొమ్మిది మంది ఏజెంట్ చేతిలో మోసపోయారు. కూతురి పెళ్లి చేసేందుకు డబ్బులు కావాలని ఒకరు... ఇక్కడ ఉద్యోగాలు లేక ఖతర్‌లో ఏ పనైనా పర్వాలేదని మరొకరు... ఇల్లు కట్టుకుందామని ఇంకొకరు... ఇలా ఉన్న ఆస్తులను అమ్మేసి, బంగారం తాకట్టు పెట్టి, అప్పులు చేసి ఖతర్ వెళ్లడానికి సిద్ధమయ్యారు. ఖత్తార్‌లో క్యాబ్ డ్రైవర్‌గా వెళ్తున్న వీరికి వేతనం అధిక మొత్తంలో ఉంటుందని, అక్కడి డ్రైవింగ్ లైసెన్సు కూడా కంపెనీయే భరిస్తుందని ఏజెంట్ చెప్పిన మాయ మాటలకు మోసపోయి ఒక్కొక్కరు రూ.1లక్షా 30వేలు కట్టారు. మెట్‌పల్లికి చెందిన పంజాల శ్రీనివాస్ గౌడ్ అనే ఏజెంటుతో పాటు ముంబాయికి చెందిన మరో ఏజెంటుకు ఈ డబ్బులను మొత్తం చెల్లించారు. ఈ ఏడాది మార్చిలో ఖతర్ దేశం వెళ్లారు. ఆలిజర హోలోడింగ్ లిమోసిన్ కర్వ టాక్సీ కంపెనీలో డ్రైవర్‌గా చేరారు. ఏజెంటు చెప్పిన విధంగా ఖత్తార్‌లో పని చేసే కంపెనీలో ఒకరోజు ట్యాక్సీ నడిపి 100 రియళ్లు సంపాదిస్తే 30 రియళ్లు వేతనంగా ఇవ్వాలి. కానీ అక్కడికి వెళ్లిన తరువాత అసలు విషయం తెలుసుకుని ఒక్కసారిగా కంగుతిన్నారు. రోజుకు 450 రియళ్లు సంపాదించి ఇస్తేనే 30 శాతం వేతనంగా ఇస్తామని కంపెనీ వాళ్లు టార్గెట్ పెట్టడంతో ఏం చెయ్యాలో అర్థం కాని స్థితికి చేరుకున్నారు. టార్గెట్ చేయలేని పక్షంలో ప్రతినెల 500 రియళ్లు (ఇక్కడి వేతనం రూ.8 వేలు) ఇస్తున్నారని, అప్పు చేసి ఇంత దూరం వస్తే ఇలా జరిగిందేంటని ఆందోళనకు గురయ్యారు. ఆదుకుని అన్నం పెట్టిన పాకిస్తానోళ్లు... ఇంటికి వెళ్లే పరిస్థితి లేకపోగా, వచ్చే వేతనం భోజనానికి కూడా సరిపోని పరిస్థితి. డ్రైవింగ్ లైసెన్సుకు కూడా అప్పు చేసి దాదాపు రూ.1లక్ష వరకు వెచ్చిస్తే తమ పరిస్థితి ఇలా అయిందని కంపెనీ వారితో గొడవ పడినా ప్రయోజనం లేకపోయిందన్నారు. తిండికి డబ్బులు లేక ఒక్కో రోజు పస్తులు ఉండాల్సి వచ్చిందని, గొడవ పడినందుకు కంపెనీ వాళ్లు వేరే చోటికి పంపించారని తెలిపారు. అక్కడ తెలుగు రాష్ట్రాల వాళ్లున్నా పట్టించుకోలేదని, పాకిస్తాన్ దేశస్తులు కొందరు ఆశ్రయమిచ్చి అన్నం పెట్టి కొన్ని రోజుల పాటు ఆదుకున్నారని చెప్పారు. ఇలా కెన్యా, బంగ్లాదేశ్ వారు కూడా ఆదుకున్నారన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం మంథని గ్రామానికి చెందిన చెలిమెల పవన్, నందిపేట్ మండలం నూత్పల్లి గ్రామానికి చెందిన మెరుగు శ్రీనివాస్ గౌడ్లు తమ కుటుంబ సభ్యులకు ఫోన్‌చేసి డబ్బులు తెప్పించుకుని ఖతర్ నుంచి ఆగస్టు నెలలో స్వదేశానికి చేరుకున్నారు. మిగతా కరీంనగర్, జగిత్యాల్, కామారెడ్డి జిల్లాలకు చెందిన బాధితులు డబ్బులు లేక అక్కడే చిక్కుకుపోయారు. ప్రజాప్రతినిధులకు ట్వీట్ చేసినా స్పందించలేదు.. ఏజెంటు చేతిలో మోస పోయి ఖత్తార్‌లో అష్టకష్టాలు పడ్డ ఈ ఇద్దరు నిజామాబాద్ వాసులు రాష్ట్ర ప్రభుత్వ సాయం కోసం అక్కడి నుంచే ప్రయత్నాలు చేశారు. వచ్చే వేతనం తిండికి కూడా సరిపోవడం లేదని, తమను ఇండియాకు రప్పించి మోసం చేసిన ఏజెంటుపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులకు మెసేజ్ పెట్టినా ఫలితం లేకపోయిందన్నారు. ఇంటికి వచ్చిన తర్వాత జిల్లా కలెక్టరేట్లో జరిగే ప్రజావాణిలో అధికారులకు విన్నవించినా న్యాయం జరగలేదన్నారు. పరాయి దేశం పంపుతానని పరారయ్యాడు! –గల్ఫ్ ఏజెంట్‌పై చర్యలు తీసుకోవాలని బాధితుల వేడుకోలు డిచ్పల్లి: విదేశాలకు పంపిస్తానని ఒక్కొక్కరి నుంచి రూ.65వేలు, పాస్‌పోర్టు తీసుకొని పరారైన కరీంనగర్ జిల్లా జూలపల్లి మండలం కుమ్మరికుంట గ్రామానికి చెందిన గల్ఫ్ ఏజెంట్ నాడెం నర్సయ్యపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు. ఇందల్వాయి మండలం గన్నారం గ్రామానికి చెందిన బాధితులు పందెన శ్రీనివాస్, బాలయ్య, పందెన చిన్న గంగాధర్ శుక్రవారం ఎస్ఐ రాజశేఖర్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. బాధితులు మాట్లాడుతూ గల్ఫ్ దేశం ఇరాక్‌కు పంపిస్తానని నమ్మబలికి ఒక్కొక్కరికి రూ.లక్షా 50వేలు ఖర్చు అవుతుందని అడ్వాన్సుగా రూ.65వేల చొప్పున తీసుకుని పరారయ్యాడన్నారు. నెల రోజులుగా వీసా వస్తుందని మాయ మాటలు చెబుతూ వచ్చాడని వాపోయారు. చివరకు గట్టిగా నిలదీసి తమ డబ్బులు, పాసుపోర్టు ఇవ్వాలని అడిగితే పరారయ్యాడని తెలిపారు. తామే కాకుండా ధర్పల్లి మండలానికి చెందిన మరికొందరిని కూడా మోసగించినట్లు తెలిపారు. సదరు ఏజెంట్‌పై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని బాధితులు కోరారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. ఫిర్యాదు ప్రతులను చూపుతున్న బాధితులు కుటుంబాల పరిస్థితి తలచుకుంటే భయంగా ఉంది : బాధితులు చేసిన వ్యాపారాలు కలిసి రాకపోవడంతో వేరే మార్గం లేక ఖతర్ దేశానికి వెళ్లినం. దేశం వెళ్తే అయినా తమ కుటుంబాలు బాగుపడుతాయని బంగారాం, భూములు అమ్మేసి ఏ జెంటుకు కట్టినం. ఖతర్‌లో ఇచ్చే జీతం తినే తిండికి కూడా సరిపోలేదు. దిక్కుతోచని పరిస్థితుల్లో వేరే దేశస్తులు అన్నం పెట్టి ఆశ్రయమిచ్చిండ్రు. అప్పు చేసి ఇంటికి వచ్చినం. ఇప్పుడు కుటుంబాల పరిస్థితి చూస్తే భయం గా ఉంది. గల్ఫ్ ఏజెంటుపై చర్యలు తీసుకుని డబ్బులు ఇప్పించి న్యాయం చేయాలి. -
బంగ్లాదేశీ ‘చెదల’ను పంపిస్తాం
జైపూర్: బంగ్లాదేశీ వలసదారులు చెదల వంటి వారని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. వారందరినీ దేశం నుంచి వెళ్లగొడతామని ఆయన చెప్పారు. అస్సాంలో ఇటీవల ప్రచురించిన జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్ఆర్సీ) గురించి షా మాట్లాడుతూ ‘బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్ఆర్సీ ద్వారా అస్సాంలో 40 లక్షల మంది అక్రమ వలసదారులున్నట్లు ప్రాథమికంగా తేలింది. వారిలో ఏ ఒక్క చొరబాటుదారుడినీ వదిలిపెట్టం. అందరినీ పంపిస్తాం’ అని రాజస్తాన్‌లో చెప్పారు. చొరబాటుదారులను కాంగ్రెస్ ఓటుబ్యాంకుగా చూసిందనీ, వారందరినీ దేశం నుంచి వెళ్లగొట్టేందుకు బీజేపీ కట్టుబడి ఉందని షా పేర్కొన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గాలిలో మేడలు కడుతున్నారనీ, రాజస్తాన్‌లో బీజేపీ నుంచి అధికారం లాక్కోవడం ఎవ్వరికీ సాధ్యం కాదని షా విశ్వాసం వ్యక్తం చేశారు. -
అమెరికాలో 14% విదేశీయులే
అమెరికాలో వలసదారులను నియంత్రించేందుకు ఒకవైపు అధ్యక్షుడు ట్రంప్ సర్కారు శతవిధాల ప్రయత్నిస్తోంటే మరోవైపు విదేశాల నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడుతున్న వారి సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగిపోతోంది. అమెరికా జనాభా లెక్కల కేంద్రం గత వారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశ జనాభాలో 14శాతం మంది విదేశీయులే ఉన్నారు. అంటే ప్రతి ఏడుగురు అమెరికన్లలో ఒకరు విదేశీయుడన్నమాట. ఈ వలసదారుల్లో చట్టబద్ధంగా వచ్చిన వారితోపాటు అక్రమంగా వచ్చిన వారు కూడా ఉన్నారు. 14 శాతం మంది వలసదారులు ఉండటం ఈ శతాబ్దంలోనే రికార్డు అని సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ స్టడీస్(సీఐఎస్) పేర్కొంది. ఒక్క 2016లోనే అమెరికాలో విదేశీ జనాభా 8 లక్షలు పెరిగింది. 2017 జూలై నాటికి దేశంలో మొత్తం 4.45 కోట్ల మంది వలసదారులు ఉన్నారు. 1980 లెక్కల ప్రకారం ప్రతి 16 మంది అమెరికన్లలో ఒకరు విదేశీయుడు కాగా ఇప్పుడది రెట్టింపు అయింది. మనవాళ్లే ఎక్కువ 2010–17 మధ్య అమెరికాకు వలస వచ్చిన విదేశీయుల్లో ఎక్కువ మంది భారతీయులేనని, ఈ ఏడేళ్లలో 8.30 లక్షల మంది భారతీయులు(47% పెరుగుదల) అమెరికా వెళ్లారని సీఐఎస్ నివేదిక వెల్లడించింది. తర్వాత స్థానాల్లో చైనా (6.77 లక్షలు–31%), డొమినికన్ రిపబ్లిక్ (2.83 లక్షలు–32%) ఉన్నాయి. ఈ కాలంలో నేపాల్ వలసదారులు 120% పెరిగారు. 2017 జూలై నాటికి అమెరికాలో 1.52 లక్షల మంది నేపాలీలు ఉన్నారు. పాకిస్తాన్ నుంచి 4 లక్షల మంది అమెరికాకు వలస వచ్చినట్లు సీఐఎస్ గణాంకాలు చెబుతున్నాయి. 2010– 17 మధ్య 95 లక్షల మంది కొత్త వలసదారులు అమెరికాలో స్థిరపడ్డారు. అయితే ఏటా దాదాపు 3 లక్షల మంది వలసదారులు స్వదేశం వెళ్లిపోతున్నారు. మరో 3 లక్షల మంది చనిపోతున్నారు. -
అమెరికాలో పెరిగిన వలసదారులు
వలసదారులను నియంత్రించేందుకు ఒకవైపు ట్రంప్ సర్కారు శత విధాల ప్రయత్నిస్తోంటే మరోవైపు దేశంలో వలసదారుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగిపోతోంది.అమెరికా జనాభా లెక్కల కేంద్రం గత వారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశ జనాభాలో 14శాతం వలసదారులు(విదేశీయులు)ఉన్నారు. అంటే ప్రతి ఏడుగురు అమెరికన్లలో ఒకరు విదేశీయుడన్నమాట.ఈ వలసదారుల్లో చట్టబద్ధంగా వచ్చిన వారు, అక్రమంగా వచ్చిన వారు కూడా ఉన్నారు. దేశ జనాభాలో 14శాతం వలసదారులు ఉండటం ఈ శతాబ్దంలోనే రికార్డు అని సెంటర్ ఫర్ ఇమ్మిగ్రేషన్ స్టడీస్(సిఐఎస్) పేర్కొంది. 2016లో అమెరికాలో విదేశీ జనాభా 8 లక్షలు పెరిగింది . 2017,జులై నాటికి దేశంలో మొత్తం 4.45 కోట్ల మంది వలసదారులు ఉన్నారు. 1980 లెక్కల ప్రకారం ప్రతి 16 మంది అమెరికన్లలో ఒకరు విదేశీయుడు కాగా ఇప్పుడది రెట్టింపు అయింది. 2010 –2017 మధ్య అమెరికాకు వలస వచ్చిన విదేశీయుల్లో ఎక్కువ మంది భారతీయులేనని, ఈ ఏడేళ్లలో 8.30 లక్షల మంది భారతీయులు(47% పెరుగుదల) అమెరికా వెళ్లారని సీఐఎస్ నివేదిక వెల్లడించింది. తర్వాత స్థానాల్లో చైనా (6.77 లక్షలు–31%),డొమినికన్ రిపబ్లిక్(2.83 లక్షలు–32%) ఉన్నాయి.ఈ కాలంలో నేపాల్ వలసదారులు 120% పెరిగారు. 2017, జులై నాటికి అమెరికాలో 1.52 లక్షల మంది నేపాలీలు ఉన్నారు.పాకిస్తాన్ నుంచి 4 లక్షల మంది అమెరికా వెళ్లినట్టు్ట సీఐఎస్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.2010–17 మధ్య 95 లక్షల మంది కొత్త వలసదారులు అమెరికాలో స్థిరపడ్డారు.ఏటా దాదాపు 3 లక్షల మంది వలసదారులు స్వదేశం వెళ్లిపోతున్నారు.మరో 3 లక్షల మంది చనిపోతున్నారు. అమెరికా జనాభా లెక్కల కేంద్రం నిర్వచనం ప్రకారం విదేశీయులంటే జన్మతః అమెరికన్లు కానివారు.అమెరికా వచ్చి ఆ తర్వాత పౌరసత్వం, గ్రీన్‌కార్డు పొందిన వారు, హెచ్1బీ వీసాదారులు, విదేశీ విద్యార్థులను కూడా వలసదారులుగానే పరిగణిస్తారు. ఇటీవల కొంత కాలంగా ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న వర్క్ వీసాల సంఖ్యను తగ్గించడం, తాత్కాలిక కార్మికుల వీసా గడువు పొడిగించకపోవడం, విదేశీయులను ఉద్యోగాల్లోకి తీసుకోకపోవడం,అక్రమ వలసదారుల్ని వెనక్కి పంపేయడం వంటి చర్యల ఫలితంగా రాబోయే సంవత్సరాల్లో దేశంలో విదేశీయుల సంఖ్య తగ్గే అవకాశం ఉందని సీఐఎస్ పేర్కొంది. -
వాడపల్లి సంగమంలో వాజ్‌పేయి అస్థికల నిమజ్జనం
దామరచర్ల (మిర్యాలగూడ): మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి అస్థికలను నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి కృష్ణా–మూసీ నదుల సంగమంలో గురువారం నిమజ్జనం చేశారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు ఆధ్వర్యంలో వాజ్‌పేయి అస్థికల కలశాన్ని సంగమం వద్దకు తీసుకువచ్చారు. బ్రాహ్మణులు వేద మంత్రాల నడుమ ఆ కలశాన్ని పుణ్యజలంతో అభిషేకించిన అనంతరం సంగమంలో నిమజ్జనం చేశారు. మురళీధర్‌రావు మాట్లాడుతూ, అటల్జీ దేశాభివృద్ధికి కన్న కలలను నిజం చేయడమే ఆయనకు మనమిచ్చే నివాళులన్నారు. కులాలు, మతాలకు అతీతంగా అటల్జీ పనిచేశారని గుర్తుచేశారు. ఆయన చితాభస్మాన్ని దేశంలోని 150 నదుల్లో కలుపుతున్న ట్లు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నేతలు మనోహర్‌రెడ్డి, చింతా సాంబమూర్తి, పాదూరి కరుణ, నూకల నర్సింహారెడ్డి, సాంబయ్య, బాబా, దొండపాటి వెంకటరెడ్డి, కర్నాటి ప్రభాకర్, బంటు సైదులు పాల్గొన్నారు. -
‘యూఏఈ క్షమాభిక్షను వినియోగించుకోండి’
సాక్షి, హైదరాబాద్: యూఏఈలో ప్రకటించిన క్షమాభిక్ష అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎన్నారై, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు గల్ఫ్ ప్రవాసీయులకు ఆదివారం పిలుపునిచ్చారు. ఆగస్టు 1 నుంచి అక్టోబర్ 31 వరకు క్షమాభిక్ష ప్రసాదించనున్నారని మంత్రి తెలిపారు. గల్ఫ్‌లో అక్రమంగా నివాసముంటున్న వారు అక్కడి నిబంధనలకు అనుగుణంగా క్రమబద్ధీకరించుకోవడం, ఎలాంటి పత్రాలు లేకుండా యూఏఈలో ఉంటున్న వారు స్వదేశానికి తిరిగిరావడానికి ఇది మంచి అవకాశమని పేర్కొన్నారు. మళ్లీ కావాంటే వీరు రెండేళ్ల నిషేధం తర్వాత చట్టబద్ధంగా యూఏఈకి వెళ్లే అవకాశం ఉంటుందన్నారు. క్షమాభిక్ష సంద ర్భంగా యూఏఈలోని భారత రాయబార కార్యాలయంతో సమన్వయం చేసుకోవాలని రాష్ట్ర ఎన్నారై శాఖ అధికారులను కేటీఆర్ ఆదే శించారు. ఎన్నారై శాఖ రాయబార కార్యాలయం నుంచి తెలంగాణ ప్రవాసీయుల సమాచారాన్ని సేకరిస్తుందని ఆయన తెలిపారు. క్షమాభిక్ష కాలంలో ఎవరికైనా ప్రభుత్వం నుంచి సహాయం అవసరమైతే 9440854433 హెల్ప్‌లైన్ నం బర్కు ఫోన్ చేయాలన్నారు. ఈ మెయిల్ ద్వారా సాయం కావాలంటే so_nri@ telangana. gov.inకి లేదా యూఏఈ కాన్సులేటులోని హెల్ప్‌డెస్క్ నంబర్ +71565463903 లేదా indiandubai.amnesty@gmail.com ద్వారా సంప్రదించవచ్చని సూచించారు. -
పంజాబ్ టు అమెరికా వయా మెక్సికో
అక్రమ వలసలను అరికట్టడానికి అధ్యక్షుడు ట్రంప్ ఎన్నో చర్యలు తీసుకుంటోంది. వలస నిబంధనలను కఠినంగా అమలు చేస్తూ వేల మంది అక్రమ వలసదారుల్ని ప్రభుత్వం జైల్లో పెడుతోంది. అమెరికా కార్యక్రమాలు, వలస విధానానికి సంబంధించిన సంస్థ(యూఎన్ ప్రోగ్రామ్స్, మైగ్రేషన్ పాలసీ ఇనిస్టిట్యూట్) లెక్కల ప్రకారం ట్రంప్ అధికారంలోకి వచ్చే నాటికి(2017 సెప్టెంబర్) దేశంలోకి అక్రమంగా ప్రవేశించారన్న కారణంగా 2,227 మంది భారతీయులను అధికారులు పట్టుకున్నారు. 2017 అక్టోబర్ నుంచి 2018 మే మధ్య వీరి సంఖ్య 4,197కు పెరిగింది. వీరుకాక న్యూ మెక్సికో, ఒరెగాన్లలోని శరణార్థి శిబిరాల్లో ఉన్న వేల మందిలో దాదాపు 100మంది భారతీయులు ఉన్నారు. వీరిలో చాలా మంది పంజాబీలే. ఒకవైపు అక్రమ వలసదారులు వేల సంఖ్యలో పట్టుబడుతున్నా వలసదారులు మాత్రం తమ ప్రయత్నాలను ఆపడం లేదు. పంజాబ్‌తోపాటు హరియాణ, ఉత్తర ప్రదేశ్ తదితర రాష్ట్రాలకు చెందిన పలువురు తమ కలల తీరమైన అమెరికా చేరుకోవడానికి ప్రాణాలు పణంగా పెడుతున్నారు. అమెరికా సరిహద్దు దేశమైన మెక్సికో నుంచి దొంగ తనంగా అమెరికాలో ప్రవేశిస్తున్నారు. ఇలా అక్రమంగా అమెరికా చేరాలనుకునే వారికి కొయటీస్(మనుషుల్ని అక్రమంగా ఇతర దేశాలకు తరలించే వారిని ఇలా పిలుస్తారు)లు సహకరిస్తున్నారు. వేల రూపాయలు తీసుకుని వివిధ మార్గాల ద్వారా వీరు వలసదారులను మెక్సికో ద్వారా అమెరికాలోకి పంపుతున్నారు. పనిలో పనిగా ఈ వలసదారుల చేత బలవంతంగా మాదక ద్రవ్యాలను కూడా దొంగ రవాణా చేయిస్తుంటారు. అక్రమంగా అమెరికా వెళ్లాలనుకునే వారిని గుర్తించి ఒప్పందాలు చేసుకోవడం కోసం కోసం పంజాబ్ తదితర రాష్ట్రాల్లో దళారులు కూడా ఉన్నారు. 4,600కిమీ ప్రయాణం... దొడ్డిదారిన అమెరికా వెళ్లాలనుకునే వారిని కొయటీస్‌లు మొదట విమానంలో దక్షిణ అమెరికా దేశమైన ఈక్విడార్‌కు తీసుకెళ్తారు. ఈక్విడార్ ప్రభుత్వం ‘90డే వీసా ఆన్ అరైవల్’ విధానాన్ని అమలు పరచడం, మెక్సికో ప్రభుత్వం వలసవిధానాన్ని కచ్చితంగా అమలు పరస్తుండటం వల్ల కొయటీస్‌లు వలసదారులను నేరుగా మెక్సికోకు కాకుండా ఈక్విడార్‌కు తీసుకెళ్తారు.అక్కడ నుంచి సముద్ర మార్గం ద్వారా కొలంబియాలోని కపుర్గన చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా నికరగువాకు వెళతారు. పనామా అడవుల గుండా వీరు ప్రయాణించాల్సి ఉంటుంది. రోడ్డు మార్గంలో వెళ్లేటప్పుడు బస్సులు, కార్లలో ఏర్పాటు చేసిన రహస్య అరల్లో వీరిని దాస్తారు. నికరగువా నుంచి హోండూరస్, గ్వాటెమాలాల మీదుగా ప్రయాణించి వీరు మెక్సికో చేరుకుంటారు. సరిహద్దు దాటించేదిలా.... రెండు దేశాల సరిహద్దులో కంచె ఉన్నా చాలా చోట్ల ఖాళీలు (కంచెలేని ప్రాంతాలు) ఉన్నాయి. అక్కడ నుంచి వలసదారులను సరిహద్దు దాటిస్తున్నారు. సరిహద్దు అధికారులతో ఉన్న ‘పరిచయా’లతో కొయిట్లు వీరిని వీలున్న ప్రాంతం నుంచి అమెరికాలోకి పంపుతారు. ఒకోసారి చిన్న పిల్లల్ని సరిహద్దు దాటించి అధికారులు వారిని పట్టుకునే హడావుడిలో ఉండగా మరోవైపు నుంచి వలసదారుల్ని కంచె దాటించేస్తారు. కొందరికి అమెరికా ప్రభుత్వాన్ని శరణార్థి హోదా కోరుతూ రాసిన దరఖాస్తులు ఇచ్చి వాటితో సహా సరిహద్దుల్లో ఉన్న 48 చట్టబద్ధమైన ప్రవేశ మార్గాల్లో ఏదో ఒక చోట అధికారులకు దొరికిపోయేలా చేస్తారు. వీరిని అధికారులు పట్టుకున్నా శరణార్ధుల దరఖాస్తులు ఉండటంతో వెంటనే తిప్పి పంపరు. ఈక్విడార్ నుంచి అమెరికాకు ఉన్న 4,600 కిలో మీటర్ల ఈ ప్రయాణంలో కొన్ని రోజుల పాటు వీరికి ఆహారం కూడా దొరకదు. ఆకలితోనే ప్రయాణించాల్సి వస్తుంది. ఈ కారణంగా దారిలో కొందరు చనిపోవడం కూడా జరుగుతుంది. బయలు దేరిన వారిలో ఎంత మంది గమ్యం చేరుకుంటారు... ఎందరు దారిలోనే ప్రాణాలు పొగొట్టుకుంటారన్నది బయటి ప్రపంచానికి తెలియదు. వలసదారులను తరలిస్తున్న సమాచారాన్ని దారిలో ఉన్న దేశాల్లోని కొయటీస్‌లు ఒకరికొకరు సెల్ఫోన్ల ద్వారా పంపించుకుంటారు. అవసరమైన సొమ్మును వెస్ట్రన్ యూనియన్, మనీగ్రాంల నుంచి బదిలీ చేస్తుంటారు. మెక్సికోకు అమెరికాతో 3,155 కిలో మీటర్ల సరిహద్దు ఉంది. సరిహద్దు పొడవునా1100 కిలో మీటర్ల మేర కంచె ఉంది. అత్యాధునిక పరికరాలు, ఆయుధాలతో దాదాపు16వేల మంది సైనికులు సరిహద్దు వద్ద కాపలా కాస్తుంటారు. అమెరికా చేరే దారులివీ: మొదట ఈక్విడార్ విమానంలో తీసుకెళ్తారు.అక్కడ నుంచి కొలంబియా, పనామా అడవుల మీదుగా మెక్సికో తీసుకెళతారు.ఈ ప్రయాణానికి నెల నుంచి మూడు నెలలు పడుతుంది. 8 నుంచి 15వేల అమెరికా డాలర్లు వసూలు చేస్తారు. మొదట కొలంబియా, పెరు, బొలీవియా చేరుకుంటారు. అక్కడ నుంచి ఏదైనా మధ్య అమెరికా దేశానికి వెళ్లి అక్కడ నుంచి మెక్సికో వెళతారు. ఒక్కోసారి నకిలీ డాక్యుమెంట్లతో నేరుగా మెక్సికోకే పంపుతారు. ఈ దారిలో అమెరికా చేరడానికి కొన్ని వారాలు/నెలలు పడుతుంది. 10 నుంచి 20 వేల డాలర్ల వరకు వసూలు చేస్తారు. (రవాణా చార్జీలు, తిండి ఖర్చు, నకిలీ డాక్యుమెంట్లు, స్థానిక అధికారులకు ఇచ్చే లంచాలు.. అన్నీ దీనిలో కలిసే ఉంటాయి) - సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
అమెరికన్లకే ఉద్యోగాలు...!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్థానికులకే ఉద్యోగాలన్న విధానం విదేశీ విద్యార్థుల పాలిట పట్ల శాపంగా మారుతోంది. అమెరికా ఫస్ట్ అన్న తన నినాదాన్ని ఆచరణలోకి తీసుకురావడంలో భాగంగా హెచ్ 1 బీ వీసా నిబంధనల్లో మార్పు తీసుకొస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికన్లతోనే అక్కడి ఉద్యోగాల భర్తీకి ఆ దేశ కంపెనీలు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ కారణంగా విదేశీ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కూడా క్రమక్రమంగా తగ్గిపోతున్నాయి. ఈ ఏడాది జూన్ దాకా పరిశీలిస్తే... అమెరికా పౌరసత్వం లేదా ఫెడరల్ ప్రభుత్వం నుంచి ‘వర్క్ ఆథరైజేషన్’ ఉన్న వారినే అక్కడి కంపెనీలు ఉద్యోగాల్లోకి తీసుకోవడం 19 శాతం పెరిగింది. వీసా నిబంధనల ప్రభావం కారణంగా అమెరికాలోని బిజినెస్ స్కూళ్లలో చదువుకున్న విదేశీవిద్యార్థుల ఉద్యోగ అవకాశాలు కూడా తగ్గిపోతున్నాయి. రెండున్నర కోట్ల ఉద్యోగ ప్రకటనలను విశ్లేషించిన ‘ద వాషింగ్టన్ పోస్ట్’ ఓ నివేదికలో దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించింది. 2017లో 55 శాతం అమెరికా కంపెనీలు విదేశీ విద్యార్థులను ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు సుముఖత వ్యక్తం చేశాయి. 2018లో అది 47 శాతానికి పడిపోయింది. హెచ్ 1బీ వీసా దరఖాస్తులపై ట్రంప్ ప్రభుత్వ నిబంధనలు మరింత కఠినతరం చేయనున్న నేపథ్యంలో దీనికి ప్రాధాన్యం ఏర్పడినట్టు ఈ అధ్యయనం పేర్కొంది. ప్రస్తుతమున్న విధానం మేరకు సాంకేతిక, సైద్ధాంతిక నైపుణ్యమున్న వలసదారులు కాని వారిని (నాన్ ఇమ్మిగ్రెంట్స్) కూడా అమెరికా కంపెనీలు ఉద్యోగాల్లో తీసుకునేందుకు హెచ్ 1బీ కేటగిరి అనుమతిస్తోంది. ఇది మూడేళ్ల వరకు చెల్లుబాటు కావడంతో పాటు మళ్లీ పొడిగించేందుకు అవకాశాలుంటాయి. అయినప్పటికీ ఆయా రంగాల్లో విదేశీ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నట్టు వెల్లడైంది. అమెరికాలో గ్రాడ్యుయేషన్ కోర్సులు చదువుతున్న విదేశీ విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నా, వర్క్ పర్మిట్లు పొందుతున్న వారి సంఖ్య మాత్రం దిగజారినట్టు తెలుస్తోంది. 2016 సెప్టెంబర్‌తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 1,14,503 హెచ్ 1బీ వీసాలు అనుమతించగా, 2017లో అది 1,08,101కు పడిపోయింది. వీరిలో మాస్టర్స్ డిగ్రీ ఉన్నవారి సంఖ్య 52,002 నుంచి 45,405కు తగ్గిపోయింది. హెచ్ 1బీ వీసాల కోసం దరఖాస్తు చేసుకుంటున్న వారిలో భారతీయులే అత్యధిక సంఖ్యలో ఉంటున్నారు. 200717 మధ్య కాలంలో ఈ వీసాల కోసం అమెరికా పౌర, వలస సేవా సంస్థ (యూఎస్సీఐఎస్)కు 22 లక్షల మంది ఇండియన్లు దరఖాస్తు చేసుకోగా.. 3,01,000 మందితో చైనీయులు రెండోస్థానంలో నిలిచారు. -
మాట మార్చిన మమత
రాజకీయాల్లో వివిధ అంశాలపై పార్టీల వైఖరి కూడా సమయానికి అనుగుణంగా మారిపోతూనే ఉంటుంది. దీనికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ. అస్సాం జాతీయ పౌర గుర్తింపు (ఎన్ఆర్సీ) తుది ముసాయిదా జాబితా విడుదలైనప్పట్నుంచి ఆమె దానిని తీవ్రంగా విమర్శిస్తూ రాజకీయ వివాదానికి తెర తీశారు. ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనాల కోసమే బీజేపీ ఎన్ఆర్సీని వినియోగించుకుంటోందంటూ విరుచుకుపడుతున్నారు. బంగ్లాదేశీయుల్ని దేశం నుంచి వెనక్కి పంపిస్తే అంతర్యుద్ధం చెలరేగి రక్తపాతానికి దారి తీస్తుందని ఆమె హెచ్చరిస్తున్నారు.. ఇప్పుడంటే ఆమె వలసదారులకు మద్దతుగా మాట్లాడుతూ బీజేపీతో ఢీ అంటే ఢీ అంటున్నారు కానీ సరిగ్గా పదమూడేళ్ల కిందట యూపీఏ హయాంలో మమత పార్లమెంటులో వలసదారుల్ని వెళ్లగొట్టాలంటూ గళమెత్తారు. పార్లమెంటులో ఏం జరిగిందంటే... 2005లో విపక్ష ఎంపీగా ఉన్న మమత బెనర్జీ బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలు ఒక విధ్వంసంగా మారాయంటూ పార్లమెంటులో ధ్వజమెత్తారు. ఈ చొరబాట్లు అత్యంత ఆందోళనకర అంశమని, దీనిపై చర్చ జరగాలంటూ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. వారికి ఓటు హక్కు ఉండడంపై కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు.∙అప్పట్లో లోక్‌సభ స్పీకర్‌గా ఉన్న సీపీఎం నేత సోమనాథ్ ఛటర్జీ ఆ తీర్మానాన్ని తిరస్కరించారు. అప్పట్లో పశ్చిమ బెంగాల్లో సీపీఎం అధికారంలో ఉండడంతో మమత మరింత చెలరేగిపోయారు. స్పీకర్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారంటూ నిప్పులు చెరిగిన ఆమె ఆ సమయంలో సభని నడిపిస్తున్న డిప్యూటీ స్పీకర్ చరణ్‌జిత్ సింగ్ అత్వాల్‌పై తన చేతిలో ఉన్న పేపర్ల కట్ట విసిరికొట్టారు. మమత ఒక్కసారిగా ఆగ్రహావేశాలు ప్రదర్శించడంతో సభ యావత్తూ నివ్వెరపోయింది. చివరికి ఎంపీ పదవికి కూడా ఆమె రాజీనామా చేశారు. అయితే రాజీనామా సరైన ఫార్మాట్లో లేదని దానిని స్పీకర్ తిరస్కరించారు. అప్పట్లో బంగ్లాదేశ్ ముస్లింలు సీపీఎంకు బలమైన ఓటు బ్యాంకుగా ఉండేవారు. దీంతో మమత వారిపై ఎలాంటి మమతని చూపించలేదు. పైపైచ్చు వారిని రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని, వారంతా సామాజిక విధ్వంసులుగా మారుతున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. కానీ కాలక్రమంలో బంగ్లా ముస్లింలు తృణమూల్ వైపు తిరిగిపోయారు. ఇప్పుడు వారంతా టీఎంసీకి బలమైన ఓటు బ్యాంకుగా ఉన్నారు. అందుకే మమత వారి ప్రయోజనాలను కాపాడడానికి ఎలాంటి పోరాటానికైనా సిద్ధపడుతున్నారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ర్యాలీ పాలిటిక్స్ షురూ అస్సాం ఎన్ఆర్సీ పశ్చిమ బెంగాల్లో రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. తృణమూల్ కాంగ్రెస్, బీజేపీలకు ఇదే ఓటు బ్యాంకు అస్త్రంగా మారింది. పశ్చిమ బెంగాల్లో బలం పుంజుకొని వామపక్షాలు, తృణమూల్ కాంగ్రెస్‌లకు బలమైన ప్రత్యామ్నాయంగా ఎదగాలని భావిస్తున్న బీజేపీ ఎన్ఆర్సీ ప్రాతిపదికగా రాజకీయ వ్యూహాలను రచిస్తోంది. ఆగస్టు 11న కోల్‌కతాలో బీజేపీ తలపెట్టిన యువ ర్యాలీకి తొలుత అనుమతి నిరాకరించిన మమత ఆ తర్వాత వెనక్కి తగ్గి ఓకే చెప్పారు. ఇప్పుడు ఆ ర్యాలీలోనే అక్రమ వలసలపై మమత కప్పదాటు వైఖరిని ఎండగట్టడానికి బీజేపీ సిద్ధమవుతోంది. బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వారు భారత వనరుల్ని ఎలా దోచుకుంటున్నారో, భద్రతకు వారెంత ముప్పుగా పరిణమించారో జనంలోకి తీసుకువెళ్లడానికి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సన్నాహాలు చేస్తున్నారు. బంగ్లాదేశ్ అక్రమ వలసల వ్యవహారం జాతీయ పార్టీలతో పాటు, అసోం, పశ్చిమ బెంగాల్లో ప్రాంతీయ పార్టీలకు ఒక ఎన్నికల అంశంగా ఎప్పట్నుంచో ఉంటూ వస్తోంది.. ఇప్పుడు ఈ రెండు పార్టీల మధ్య జరుగుతున్న రసవత్తర రాజకీయం ఏ మలుపు తిరుగుతుందోనని రాజకీయ పరిశీలకులు ఆసక్తిగా చూస్తున్నారు. ఎన్ఆర్సీ దరఖాస్తుల పరిశీలనలో బెంగాల్ నత్తనడక ఎన్ఆర్సీ జాబితా బయటకి వచ్చిన మరుక్షణం నుంచే మమత బెనర్జీ దానిని ఒక రాజకీయ అస్త్రంగా చేసుకున్నారు కానీ దానిని రూపొందించే సమయంలో తృణమూల్ సర్కార్ ఎన్ఆర్సీ అధికారులకు అంతగా సహకరించలేదు. పెళ్లిళ్లు, ఉద్యోగాల నిమిత్తం అసోంలో స్థిరపడిన వారిలో చాలా మంది పశ్చిమ బెంగాల్ చెందినవారు కూడా ఉన్నారు. వారి ధ్రువీకరణ పత్రాలు ఎంతవరకు వాస్తవమో పరిశీలించి వెనక్కి పంపాలంటూ ఎన్ఆర్సీ 1.14 లక్షల మందికి చెందిన డాక్యుమెంట్లను పంపితే, వాటిలో కేవలం 6 శాతాన్ని మాత్రమే పరిశీలించి టీఎంసీ ప్రభుత్వం వెనక్కి పంపింది. పశ్చిమ బెంగాల్‌తో పాటు బిహార్, చండీగఢ్, మణిపూర్, మేఘాలయా వంటి రాష్ట్రాలు డాక్యుమెంట్ల పరిశీలించడంలో విఫలం కావడం కూడా అన్ని లక్షల మందికి జాబితాలో చోటు దక్కకపోవడానికి కారణమైంది. -
విదేశీ కార్మికులకు క్షమాభిక్ష
దుబాయ్: గడువు తీరిన తర్వాత దేశంలో నివసిస్తూ పట్టుబడిన కార్మికులకు యూఏఈ ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించింది. ఇందులో భాగంగా 3 నెలల క్షమాభిక్ష కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించింది. ఆ దేశంలో అక్రమంగా నివసిస్తున్న లక్షల మంది భారతీయులు సహా విదేశీ కార్మికులకు ఇది లబ్ధిచేకూర్చనుంది. ఈ కార్యక్రమం ద్వారా జరిమానాల్లేకుండా దేశం విడిచి వెళ్లడం లేదా ఆర్నెల్లలో ఉద్యోగం వెతుక్కునే చాన్సుంటుంది. యూఏఈ అధికారిక లెక్కల ప్రకారం ఆ దేశంలో 28లక్షల మంది భారతీయ వలసదారులున్నారు. ఇందులో నైపుణ్యం ఉన్న ఉద్యోగులు 15–20% కాగా, 20 శాతం మంది వివిధ ఉద్యోగాల్లో మంచి స్థానాల్లో ఉన్నారు. మిగిలిన 65% మంది వివిధ పరిశ్రమల్లో కార్మికులు. ఆగస్టు 1 నుంచి అక్టోబర్ 31 వరకు క్షమాభిక్ష అమల్లో ఉంటుందని ఈ మధ్యలోనే అక్రమంగా ఉంటున్న వారు స్వచ్ఛందంగా వెళ్లిపోవాలని యూఏఈ గుర్తింపు, పౌరసత్వ సంస్థ స్పష్టం చేసింది. ఈ దిశగా దేశ వ్యాప్తంగా కమ్యూనిటీ సెంటర్లు, వివిధ బహిరంగ ప్రదేశాల్లో అవగాహన కేంద్రాలను ఏర్పాటుచేశారు. బుధవారం ముగ్గురు భారతీయులు అబుదాబిలోని బీఎల్ఎస్ ఇంటర్నేషనల్ సెంటర్లో క్షమాభిక్ష కోరుతూ దరఖాస్తు చేసుకున్నారని అధికారులు వెల్లడించారు. తొలిరోజే కావడంతో సంఖ్య పలుచగా ఉందని.. రానున్న రోజుల్లో మరింత మంది రావొచ్చని భావిస్తున్నారు. యూఏఈలో ఉన్న భారత కార్మికుల్లో ఎక్కువ మంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన వారే ఉన్నారు. ‘క్షమాభిక్ష గురించి సమాచారం తెలిసింది. స్వామి అనే వ్యక్తి మరో ముగ్గురితో కలిసి ఏ1 ఆమ్నెస్టీ సెంటర్లో దరఖాస్తు చేసుకున్నారు. యూఏఈలో యజమాని.. భారత్‌లో ఉన్న తన కుటుంబసభ్యులతో మాట్లాడనివ్వనందునే ఇంట్లో నుంచి పారిపోయి వచ్చానని లక్ష్మీదేవి రెడ్డి అనే మహిళ పేర్కొన్నారు. జూన్‌లోనే తన ఔట్‌పాస్ గడువు ముగిసిందని ఆమె తెలిపారు. యజమాని తనపై కేసు వేసినందున పోలీసు క్లియరెన్స్ రాలేదని.. మరోసారి దరఖాస్తు చేసుకోనున్నట్లు ఆమె చెప్పారు. -
ఈ ‘శ్రీపొన్నాడ’ని అమెరికా పొమ్మంటోంది!
అన్నింటికంటే పెద్ద కష్టం ఏమిటంటే నిలబడటానికి గుప్పెడంత నేల లేకపోవడం.చెప్పుకోవడానికి ఒక దేశం లేకపోవడం. ఎప్పుడో మూడేళ్ల వయస్సులో అమ్మానాన్నతో పాటు అమెరికా వెళ్లిన ఆ 21 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్‌కు అలాంటి కష్టమే వచ్చింది. తనిప్పుడు దారీ తెన్నూ లేని కూడలిలో ఉంది. ఎటు వెళ్లాలో పాలుపోని స్థితి. అమెరికాలో డాక్టర్‌గా పని చేయడానికి వచ్చిన తల్లితోపాటు ఆమె వేలుపట్టుకొని అమెరికా వచ్చిన ‘శ్రీపొన్నాడ’ని అమెరికా ఇప్పుడు పొమ్మంటోంది. 20 ఏళ్ల పాటు అమెరికానే తన దేశమనుకొని పెరిగిన ఆ అమ్మాయి, అక్కడే ఆడుతూ పాడుతూ తనదైన బుల్లి ప్రపంచాన్ని కలగన్న ఆ అమ్మాయి ఇలాంటి రోజొకటొస్తుందని, దానిని ఎదుర్కొనాల్సి వస్తుందని అస్సలు ఊహించలేదు. ట్రంపే కారణం డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం విధించిన కఠినతరమైన వీసా నిబంధనలు శ్రీ పొన్నాడ కలల ప్రపంచాన్ని ఛిద్రం చేశాయి. ‘నాకు అమెరికా తప్ప వేరే ప్రపంచం తెలియదు. నాకు 21 ఏళ్లు వచ్చేశాయని, ఇకపై నేను డిపెండెంట్ వీసాతో అమెరికాలో ఉండరాదని ఇక్కడి నుంచి నన్ను గెంటేస్తోంటే నేనెక్కడికెళ్లాలి’ అని ఆమె అమెరికా న్యాయవ్యవస్థని ప్రశ్నిస్తూ ఫేస్బుక్లో పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. అదే ఇప్పుడు అమెరికాలో స్థిరపడిన భారతీయుల పిల్లల భవిష్యత్తుని ప్రశ్నార్థకంగా మారుస్తోన్న వ్యవస్థకి అద్దంపడుతోంది. శ్రీ పొన్నాడ పోస్ట్ సారాంశం ‘‘నా మూడేళ్ల వయస్సులోనే అమ్మతో కలిసి నా పుట్టినిల్లు భారత్‌ను వదిలిపెట్టాను. మొదట జమైకా లో ఉన్నాను. అమ్మ న్యూయార్క్‌లో ఉండగా నాకు 14 ఏళ్ల వయస్సున్నప్పుడు జమైకా నుంచి నా తమ్ముడు శ్యాంతో సహా అమెరికాలో అడుగుపెట్టాను. 2008 నుంచి అమ్మ న్యూయార్క్‌లోని మేయో క్లినిక్‌లో కార్డియాలజీలో పరిశోధన చేస్తుండేది. అక్కడికెవ్వరూ వెళ్లరునా హైస్కూల్ చదువు పూర్తయ్యేసరికి వైద్యుల అవసరం ఎక్కువగా ఉన్న మిడ్ వెస్ట్‌లోని అయోవా పట్టణంలో అమ్మకి ఫిజీషియన్‌గా ఉద్యోగం వచ్చింది. న్యూయార్క్‌ను విడిచిపెట్టి మిడ్ వెస్ట్‌కు వెళ్లడానికి చాలామంది ఇష్టపడరు. కానీ వైద్యం అవసరమున్న ఆ చోటికి మా కుటుంబమంతా పయనమైంది. నేనూ అయోవా యూనివర్సిటీలో చేరిపోయాను. అందరం కలిసిపోయాం అయోవా డైలీకి ఆర్టికల్స్ రాయడం, అక్కడి పిల్లలకి ఉచితంగా ట్యూషన్స్ చెప్పడం, కంప్యూటర్ సైన్స్‌లో ఉచితంగా శిక్షణనివ్వడం నా దినచర్యలో భాగమైంది. వీకెండ్స్‌లో ఆడపిల్లలకోసం ప్రత్యేకంగా నిర్వహించే కార్యక్రమాలూ నన్నెంతో సజీవంగా ఉంచాయి. అలాగే వుమన్స్ రీసోర్స్ అండ్ యాక్షన్ సెంటర్లో సైతం స్వచ్ఛందంగా పనిచేయడం ప్రారంభించాను. ‘ఇన్ఫార్మాటిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ క్లబ్’కి అధ్యక్షురాలిగా ఉన్నాను. అప్పటి వరకూ అన్నిరకాలుగా వెనుకబడి ఉన్న అయోవా వాసులను ఐటీ ఉద్యోగాల్లోకి తీసుకునేవారు కాదు. అలాంటి అయోవా నుంచి సైతం అనేక మందిని ఐటీ కంపెనీల్లోకి ప్రవేశించేలా ప్రయత్నం చేశాం. ఇంత చేస్తూ కూడా నాకెప్పుడూ ఒకటే ఆందోళన. నాకూ నా కుటుంబ సభ్యులకూ గ్రీన్‌కార్డ్ వస్తుందా లేదా అనే ఒత్తిడితోనే నా జీవితమంతా గడిపాను. సమయం తరుముకొస్తోంది ఏ వనరులూ, సదుపాయాలూ అందుబాటులో లేని అయోవా ప్రజల ఆరోగ్యం కోసం అమ్మ చేసిన సేవకు గాను గుర్తింపుగా జాతీయ ప్రయోజనాల రీత్యా ఆమెకు గ్రీన్‌కార్డ్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఆమె దాని కోసం ఇంకా ఎన్నేళ్లు ఎదురుచూడాలో కూడా తెలియదు. అయితే నాకు వచ్చే యేడాదికి.. అంటే 2019లో 21 ఏళ్లు నిండుతున్న కారణంగా అందర్నీ వదిలి అక్కడి నుంచి వెళ్లిపోక తప్పని పరిస్థితి ఎదురయ్యింది. ఎటు వెళ్లాలో తెలియని అంధకారంలో పడ్డాను. నా తమ్ముడికి కూడా అమెరికా నుంచి వెళ్లిపోక తప్పని రోజు కాచుకొని ఉంది. నా తమ్ముడు శ్యాం అయోవా యూనివర్సిటీలో మ్యాథ్స్, ఫిజిక్స్ చదువుతున్నాడు. మరో రెండేళ్లలో తను కూడా తన స్టేటస్‌ని కోల్పోతాడు. నేను డిపెండెంట్ చిల్డ్రన్స్ వీసాతో చట్టబద్ధంగానే అమెరికాలో అడుగుపెట్టినా ఎందరో భారతీయులకు ఎదురైన దయనీయమైన పరిస్థితే నాకూ ఎదురైంది. అటు అమెరికాతో కాక, ఇటు ఇండియాతో ఎటువంటి అనుబంధమూ లేక, పద్నాలుగేళ్ల వయస్సులో వదిలొచ్చిన జమైకాతో ఏ బంధమూ మిగలక ఇప్పుడేం కావాలో తెలియక ఇలా మిగిలాను. ఇంకా ఎందరో ‘శ్రీ’లు మరో ఆరు నెలల్లో ఇక్కడి నుంచి బలవంతంగా నన్ను బయటకు గెంటేస్తున్నారు. ఎక్కడైతే నేను బుడి బుడి నడకలతో బడికెళ్లానో, ఎక్కడైతే యూనివర్సిటీ పట్టా పుచ్చుకున్నానో, ఎక్కడైతే సమాజసేవా లక్ష్యంతో పనిచేశానో అక్కడి నుంచి సుదూరంగా వెళ్లడానికి వీసా నిబంధనల భూతం నన్ను తరుముకొస్తోంది. ఒక్క నన్నే కాదు. ఇంకా ఎందరో శ్రీలను కూడా’’ అంటోంది శ్రీ పొన్నాడ. చట్టబద్ధంగా అమెరికాలోకి అడుగుపెట్టిన తనలాంటి, తన తమ్ముడిలాంటి పిల్లలకు అండగా ఉండేలా ఒక చట్టం తేవాలని పొన్నాడ కోరుతోంది. ఉద్యోగాధారిత గ్రీన్‌కార్డ్ కేటగిరీలో సంస్కరణ గాలిలో దీపంలా ఉన్న తమలాంటి వారి పరిస్థితిలో మార్పుతెస్తుందని ఆమె ఆశగా ఎదురుచూస్తోంది. గతంలో చట్టం ఎప్పుడూ పిల్లలను తల్లిదండ్రుల నుంచి వేరు చేయలేదు. కానీ ఇప్పుడు చేస్తోంది. ప్లీజ్ హెల్ప్... వు నీడ్ యువర్ సపోర్ట్ అంటూ శ్రీ పెట్టిన పోస్ట్ అందర్నీ కలవరపెడుతోంది. – అరుణ -
క్రిమినల్స్ లాగా చూస్తున్నారు.. 24 గంటలూ సంకెళ్లే...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ’జీరో టాలరెన్స్ పాలసీ’లో భాగంగా అరెగాన్ రాష్ట్రంలోకి అక్రమంగా అడుగుపెట్టిన 123 మందిని అరెస్ట్‌చేసి అమానవీయ పరిస్థితుల్లో జైల్లో పెట్టిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. వీరిలో 52 మంది భారతీయులు, వారిలోనూ 18, 20,22 ఏళ్ల మధ్యలో ఉన్న సిక్కు యువకులు మెజారిటీ సంఖ్యలో ఉన్నారు . అరెగాన్లోని షెరిడాన్ ఫెడరల్ జైలులో వీరిని క్రిమిన ల్స్‌గా చూస్తున్నారని, 24 గంటల పాటు సంకెళ్లలోనే ఉంచడంతో పాటు వారి తలపాగాలు కూడా లాగిపారేసి జంతువులుగా చూస్తూ తీవ్ర అవమానాల పాలు చేస్తున్నట్టు బయటపడింది. అమెరికాలో ఆశ్రయం కోసం వచ్చి కొన్ని వారాలుగా జైలుశిక్షను అనుభవిస్తున్న వారికి న్యాయపరమైన సలహాలు,సూచనలిచ్చేందుకు వెళ్లిన స్వచ్చందసంస్థల ప్రతినిధుల ద్వారా ఈ వ్యవహారం వెలుగు చూసింది. అరెగాన్లో కమ్యూనిటీ కాలేజీ ప్రొఫెసర్‌గా ఉన్న నవనీత్‌కౌర్ ’పంజాబీ ట్రాన్స్‌లేటర్’గా 52 మంది భారతీయులతో మాట్లాడారు. అమెరికా చట్టప్రకారం శరణార్ధిగా పరిగణించే లేదా ప్రవాసం కోరుకునే వారిని అమానవీయంగా చూడడం సరికాదంటున్నారామే. భారతీయులను అరెస్ట్ చేసి 24 గంటలు సంకెళ్లతోనే ఉంచారని, రోజుకు 22 గంటలు తమ భాష తెలియని వారితో కలిసి జైలుగదిలో ఉంచడం ఏమాత్రం మానవత్వం అనిపించుకోదన్నారు. ఎవరైన తమ తమ మత విశ్వాసాలను కొనసాగించే హక్కున్న అమెరికా వంటి దేశంలో సిక్కుల తలపాగలను లాగిపారేసి అవమానించడం గర్హనీయమని ఆమె పేర్కొన్నారు. వీరికి న్యాయసహాయం అందించేందుకు అధికారులకు దరఖాస్తు చేయడంతో పాటు, ఆశ్రయం కోరుతున్న భారతీయులందరికీ సహాయపడేందుకు ’ద ఇన్నోవేషన్ లా లాబ్’ ముందుకొచ్చింది. తమ దేశంలో రాజకీయంగా, మతపరంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని, తమ ›ప్రాణాలకు రక్షణ లేదని అమెరికాలో ఆశ్రయం కోసం వీరంతా మొరపెట్టుకున్నట్టు తెలుస్తోంది. అరెగాన్ జైలులో ఉన్న వారిని ఇటీవల సాన్ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ కార్యాలయ అధికారులు కలుసుకుని వారి సాధకబాధకాలు తెలుసుకున్నారు. ఇంతటి అమానవీయ పరిస్థితులను ఎదుర్కుంటున్నా ఈ శిక్ష అనుభిస్తున్న వారెవరూ కూడా భారత్‌కు తిరిగివెళ్లేందుకు సంసిద్ధంగా లేరని నవనీత్‌కౌర్‌తో పాటు ఇనో్నవేషన్ లాబ్ డైవలప్మెంట్ డైరెక్టర్ విక్టోరియా బెజరానో మ్యూర్‌హెడ్ చెబుతున్నారు. -
అమెరికా కోర్టుల్లో వలస పిల్లల పాట్లు
-
కోర్టులో టేబులెక్కిన బాలుడు.. అయోమయంలో జడ్జి!
సాక్షి, న్యూఢిల్లీ : అమెరికాలో అక్రమంగా ప్రవేశించిన పిల్లలు ఇమిగ్రేషన్ కోర్టు ముందుపడరాని పాట్లు పడుతున్నారు. వారిలో మూడేళ్ల పిల్లలు కూడా ఉంటున్నారు. వారి తరఫున వాదించేందుకు న్యాయవాదులనుగానీ, అమెరికా ఆంగ్లభాషను వారి మాతృభాషలోకి తర్జుమా చేసి చెప్పేందుకు దుబాషీలనుగానీ కోర్టులు నియమించడం లేదు. అందుకు అమెరికా చట్టమే అనుమతించడం లేదు (అయితే సొంతంగా వారిని ఏర్పాటు చేసుకోవచ్చు). పర్యవసానంగా కోర్టుకొచ్చిన పిల్లలు బిక్క మొహాలేసుకొని జడ్జీ వైపు, న్యాయవాదుల వైపు తేరపార చూస్తుంటారు. లేకపోతే చూరుకేసే, బల్లకేసో చూస్తుండి పోతారు. ఇలాగే ఇటీవల కోర్టుకు విచారణకు వచ్చిన ఓ మూడేళ్ల బాలుడు కోర్టులో జరుగుతున్న తంతేమిటో పట్టించుకోకుండా తన చెవులకు తగిలించిన హెడ్‌ఫోన్‌ను పక్కన పడేసి ఎంచక్కా ముందున్న టేబులెక్కి కూర్చున్నాడు. ఇమిగ్రేషన్ జడ్జీ ఏం చేయాలో తెలియక విచారణ ముగిసినట్లు ప్రకటించారు. తమ తరఫున వాదించేందుకు న్యాయవాది, దుబాషీ లేకుండా విచారణకు హాజరయ్యే ప్రతి పది మంది పిల్లల్లో తొమ్మిది మంది పిల్లలను వారి వారి దేశాలకు వెనక్కి పంపిస్తున్నారు. అదే న్యాయవాది సహకారంతో విచారణకు వస్తున్న పిల్లల్లో సగం మందికి అమెరికాలోనే ఉండిపోయే అవకాశం లభిస్తోంది. న్యాయవాదులను పెట్టుకునే అవకాశంలేని పిల్లల తరఫున వాదించేందుకు ఇప్పుడు ‘ఇమ్మిగ్రేషన్ కౌన్సెలింగ్ సర్వీస్’కు చెందిన లిండా ఫ్రీడ్మన్ ముందుకొచ్చారు. గతంలో తల్లిదండ్రులతోపాటు అక్రమంగా వలసవచ్చిన పిల్లలను తల్లిదండ్రులతో కలిపే విచారించే వారని, ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ‘జీరో టాలరెన్స్’ విధానం కింద పెద్ద వాళ్లను, పిల్లలను వేరుచేసి కోర్టు ముందు విచారిస్తున్నారని ఆమె తెలిపారు. ఈ మధ్య పెద్ద వాళ్లు లేకుండా పిల్లలు వలస రావడం కూడా ఎక్కువైందని ఆమె చెప్పారు. అంటే, తల్లిదండ్రులే పిల్లలను తీసుకొచ్చి సరిహద్దులు దాటించి వెనక్కి వెళ్లిపోతారని ఆమె వివరించారు. ఇమ్మిగ్రేషన్ కోర్టు ముందు పిల్లల విచారణ పేరిట జరుగుతున్న తంతు చూసి స్పందించిన లిండా ఫ్రీడ్మన్ వారికి న్యాయ సహాయం చేయడానికి ముందుకు రావడమే కాకుండా ఈ పరిస్థితి ప్రపంచం దష్టికి తీసుకురావడం కోసం ఓ షార్ట్ ఫిల్మ్ కూడా తీసి విడుదల చేశారు. ఆమె తన చిన్ని సినిమా కోసం కోర్టులో నిజంగా జరిగిన మాటల స్క్రిప్టును యథాతథంగా తీసుకున్నారు. అయితే విచారణ ఎదుర్కొంటున్న బాలుడు, కోర్టును అపహాస్యం చేస్తున్నట్లు ఎదురుగా ఉన్న టేబుల్‌ను ఎక్కిన దశ్యం మాత్రం ఆ చిన్ని సినిమాలో లేదు. సినిమాను విడుదల చేశాక ఆ బాలుడి సంఘటన చోటుచేసుకున్నదని లిండా తెలిపారు. ‘అన్అకంపేన్డ్: ఎలోన్ ఇన్ అమెరికా’ పేరుతో ‘యూట్యూబ్’లో విడుదలైన ఈ చిన్ని సినిమాను దాదాపు లక్ష మంది ప్రేక్షకులు ఇప్పటికే చూశారు. -
గడువు పెరిగింది
కోరుట్ల : వలస జీవుల వెతలు గమనిం చిన కువైట్ ప్రభుత్వం ఎట్టకేలకు ఫిబ్రవరి 22తో ముగియనున్న ఆమ్నెస్టీ గ డువును ఏప్రిల్ 22 వరకు పొడిగించిం ది. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లానుంచి వెళ్లి కువైట్‌లో కలివెల్లి అయి ఇబ్బందులు పడుతున్న వలస జీవులకు ఊరట లభించింది. మరో రెండు నెలల గడువు ఉండడంతో అడ్డగోలు గా విమాన ఛార్జీలు పెట్టుకుని స్వదేశానికి రావాల్సిన అవస్థలు తప్పాయి. అప్పులు తీరక.. ఉమ్మడి కరీంనగర్‌లోని జగిత్యాల, సిరి సిల్ల ప్రాంతాల నుంచి సుమారు 5వేల మంది, పెద్దపల్లి, కరీంనగర్ పరిసరా ల నుంచి మరో 1500 మంది వరకు ఉపాధికోసం కువైట్‌కు వెళ్లారు. కంపె నీ వీసాలతో కువైట్ వెళ్లి అక్కడ కంపె నీల్లో వేతనాలు సరిగ్గా లేక స్వదేశంలో చేసిన అప్పులు తీర్చలేక ఇబ్బందులు ఎదురైన క్రమంలో చాలామంది ఎక్కు వ వేతనాల కోసం ఇతర కంపెనీలకు మారి కలివెల్లి అయిన వారి సంఖ్య సుమారు 2500 వరకు ఉంటుందని అంచనా. వీరిలో చాలా మంది కువైట్ ప్రభుత్వం ప్రకటించిన అమ్నేస్టీని వినియోగించుకుని స్వదేశం చేరేందుకు ఇష్టపడడం లేదని సమాచారం. కువైట్ రావడానికి చేసిన అప్పులు తీర్చి ఎంతో కొంత డబ్బు కూడబెట్టకుండా ఇంటికి వెళ్లేందుకు విముఖత చూపుతున్నారు. దీంతో కువైట్‌లో కలివెల్లి అయిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వారిలో సుమారు 980 మంది మాత్రమే స్వదేశానికి వచ్చేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. కాసుల్లేక..చార్జీలు పెరిగి కువైట్ మొదట ప్రకటించిన అమ్నేస్టీ గడువు వినియోగించుకోవడంపై అవగాహన లేని వలసజీవులు చివరి రోజు ల్లో హడావుడి పడడం సమస్యాత్మకంగా మారింది. చాలామంది వలస జీవులు విమాన చార్జీలు తెలంగాణ ప్రభుత్వం భరిస్తుందని ఆశించి ఎదురుచూసినట్లు సమాచారం. ఫిబ్రవరి 22 దగ్గర పడడంతో తప్పనిసరై తమకు తాముగా స్వదేశాలకు వెళ్లేందుకు సిద్దమయ్యారు. ఈక్రమంలో రద్దీ పెరిగిం ది. పదిరోజులుగా కువైట్ విమాన కంపెనీలు అకస్మాత్తుగా చార్జీలు పెం చేశాయి. ఒక్కో టికెట్‌కు రూ.6వేల నుంచి రూ.30 వేలకు చేరింది. చేతిలో డబ్బులు లేక చేయడానికి పనులు లేక స్వదేశానికి తిరిగి వచ్చేందుకు చాలా మంది వలస జీవులు అవస్థలు పడ్డా రు. ఓ దశలో ఇంటి నుంచి డబ్బులు తెప్పించుకునే ప్రయత్నాలు చేశారు. ఊరట దక్కింది.. ఈ పరిస్థితుల్లో జగిత్యాల జిల్లా నుంచి కాంగ్రెస్ నాయకులు జేఎన్. వెంకట్, తెలంగాణ జాగృతి నాయకులు నవీన్ ఆచారీలు కువైట్ నుంచి తిరిగి వచ్చేవారికి విమాన చార్జీలు భరించడానికి ముందుకు రావడం బాధితులకు కొంత ఊరట నిచ్చింది. సుమారు 100–150 మంది వరకు కువైట్ నుం చి తిరిగి వచ్చినట్లు సమాచారం. కొం తమంది స్వయంగా డబ్బులు పెట్టుకుని వాపస్ వచ్చారు. ఇప్పటి వరకు వాపస్ వచ్చిన వారి సంఖ్యను మినహాయించినా మరో 800 మంది వరకు కువైట్‌లోనే ఉన్నట్లుగా సమాచారం. కువైట్ ప్రభుత్వం మళ్లీ అమ్నెస్టీ గడువును ఏప్రిల్ 22 వరకు పెంచడంతో వీరందరికి ఊరట కలిగింది. -
అమెరికా వలస జీవితంలో ఉద్విగ్నక్షణాలు
డెట్రాయిట్ : దేశాల మధ్య గోడలు కడతానన్నాడు. అయితే ఆ గోడలు.. ప్రాంతాలనేకాదు మనుషుల్ని, వారి మధ్య పెనవేసుకున్న అనుబంధాల్ని కూడా విడదీస్తాయన్న సంగతి మర్చిపోయాడు. అవును. మనం మాట్లాడుతున్నది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించే. ఆయన ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయాలతో అమెరికాలో వసలదారులు ఎంతగా క్షోభపడుతున్నది ఈ ఒక్క కథనం చదివితే అవగతమవుతుంది.. ఆ వలసదారుడి పేరు జార్జి గార్సియా. వయసు 39. భార్యాపిల్లలతో డెట్రాయిట్(మిచిగాన్ రాష్ట్రం)లో ఆనందంగా గడిపేవాడు. ట్రంప్ వచ్చిన తర్వాత ఆ కుటుంబానికి శాంతి కరువైంది.. ‘నువ్ పుట్టుకతో అమెరికన్వి కాదు కాబట్టి ఇక్కడినుంచి వెళ్లిపో’ అని అధికారులు జార్జిని ఆదేశించారు. తన భార్య జన్మతః అమెరికనే అని, ఇద్దరు పిల్లలున్నారని, చాలా ఏళ్ల నుంచి పన్నులు కడుతూ అమెరికా చట్టాలను గౌరవిస్తున్నానని జార్జి ఎంత వాదించినా అధికారులు వినిపించుకోలేదు. కనీసం నూతన డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్‌వుడ్ ఆరైవల్స్ చట్టం(డీఏసీఏ) అమలులోకి వచ్చేంత వరకైనా ఆగమంటే ఆగలేదా అధికారులు! తీవ్రమైన నిర్బంధం నడుమ జార్జి గార్సియా జనవరి 15న స్వదేశమైన మెక్సికోకు పయనమయ్యాడు. ఆ రోజు..నల్లజాతీయులు,వలసదారుల హక్కుల కోసం పోరాడిన మార్టిన్ లూథర్‌కింగ్ జయంతి కూడా! జార్జికి వీడ్కోలు చెప్పలేక, ఉండమనే అధికారంలేక.. ఎయిర్‌పోర్టులో ఆ కుటుంబం అనుభవించిన బాధ పలువురిని కంటతడిపెట్టించింది. జార్జి తన ఇద్దరు పిల్లలు, భార్యను గట్టిగా హత్తుకున్నాడు. ఇదే చివరిసారి అన్నట్లు వారి కళ్లలోకి చూశాడు. ‘పద పదా..’ అంటూ అధికారులు అతన్ని లోనికి తీసుకెళ్లారు. మాటరాని భాషలో భారంగా తన వారికి వీడ్కోలు ఇచ్చి అతను ముందుకు కదిలాడు... ట్రంప్ ఫర్మానా ప్రకారం మరో పది సంవత్సరాల దాకా జార్జి అమెరికాలో అడుగుపెట్టేవీలులేదు! ట్రంప్ వలస నిర్ణయాలకు వ్యతిరేకంగా ఎయిర్‌పోర్టులో నిరసనలు జార్జి గార్సియా కుటుంబం(ఫైల్) -
గణేష్ నిమజ్జనానికి భద్రత కట్టుదిట్టం చేశాం డీజీపీ
-
స్వాప్నికులకు పీడకలేనా!
చిన్నప్పుడే అమెరికా వచ్చిన వలసదారులపై నేడు ట్రంప్ నిర్ణయం ► ఆందోళనలో 8 లక్షల మంది యువత ►వీరిలో 7 వేల మంది భారతీయులు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వలస దారులు, శరణార్థులపై కఠినంగా వ్యవహరిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొద్ది గంటల్లో మరో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. చిన్నపిల్లలుగా ఉన్నప్పడు తల్లిదండ్రులతో పాటు అమెరికా వచ్చి అక్కడే ఉద్యోగాలు చేస్తున్న యువతను అక్రమ వలసదారులుగా గుర్తించే అంశంపై నేడు నిర్ణయం వెలువరించే అవకాశముంది. వీరిని అమెరికాలో డ్రీమర్లు (స్వాప్నికులు)గా పిలుస్తారు. ట్రంప్ తీసుకునే నిర్ణయం తో 8 లక్షల మంది కలల సౌధాలు కూలిపోవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. వీరిలో ఏడు వేల మంది భారతీయ అమెరికన్ యువకులు కూడా ఉన్నారు. అమెరికాలో నివసించేందుకు, పనిచేసేందుకు వీరికి అధికారికంగా ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేవు. ఈ డ్రీమర్లు దేశ ఆర్థికవ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తున్నారని, వారిపై దయ చూపాలే తప్ప శిక్షించరాదనే అభిప్రాయంతో ఒబామా 2012లో చట్టపరంగా వెసులుబాటు కల్పించారు. ‘బాల్యంలో వచ్చినవారిపై చర్యల వాయిదా’ (డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్‌హుడ్ అరైవల్స్–డీఏసీఏ) సహాయ కార్యక్రమాన్ని 2012 జూన్ 15న ఆయన ప్రకటించారు. అమెరికా ఫెడరల్ సర్కారు నిధులతో అమలయ్యే ఈ కార్యక్రమంలో 8 లక్షల మంది పెట్టుకున్న దరఖాస్తుల్ని ఆమోదించారు. వీరు ప్రతి రెండేళ్లకు తమ వర్క్ పర్మిట్లను పొడిగించుకునే అవకాశం కల్పించారు. ఆ వర్క్ పర్మిట్ల రద్దుపైనే ట్రంప్ నేడు ప్రకటన చేయనున్నారు. ఎన్నికల ప్రచారంలో ట్రంప్ హామీ అధికారంలోకి రాగానే డీఏసీఏను రద్దు చేస్తానని అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్ హామీనిచ్చారు. వర్క్ పర్మిట్ల పునరుద్ధరణను రద్దు చేసి, వారిని స్వదేశాలకు పంపాలని రెండేళ్ల క్రితమే డిమాండ్ మొదలైంది. డ్రీమర్ల వల్ల స్థానిక అమెరికన్ల ఉపాధికి ప్రమాదమని, వారిలో కొందరు చట్టవ్యతిరేక కార్యకలా పాల్లో పాల్గొంటున్నారని ట్రంప్ మద్దతుదారుల ఆరోపణ. ఈ వలసదారుల్లో ఎక్కువమంది పొరుగుదేశమైన మెక్సికో, మధ్య, దక్షిణ అమెరికా దేశాలకు చెందినవారే. భారత్, వియత్నాం వంటి ఆసియా దేశాలకు చెందిన యువత తొమ్మిది శాతం వరకూ ఉండొచ్చని అంచనా. తీవ్రంగా వ్యతిరేకిస్తున్న టెక్ దిగ్గజాలు ఇన్ని లక్షల మందిని అర్ధంతరంగా వారికి తెలియని దేశాలకు పంపడం అన్యాయమని అన్ని పార్టీల నేతలు వాదిస్తున్నారు. డీఏసీఏ రద్దును ఫేస్బుక్ సీఈవో జుకర్‌బర్గ్, యాపిల్ సీఈఓ టిమ్ కుక్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, అమెజాన్ సీఈవోలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వలసదారులకు చట్టపరంగా రక్షణ కొనసాగించాలని, డీఏసీఏను రద్దు చేస్తే అమెరికా ఆర్థిక వ్యవస్థకు ప్రమాదకరమంటూ 300 మంది టెక్, బిజినెస్ దిగ్గజాలు ఇప్పటికే ట్రంప్‌కు లేఖ రాశారు. పాలకపక్షమైన రిపబ్లికన్ పార్టీకి చెందిన సెనెటర్లు, ప్రతినిధుల సభ సభ్యులు, స్పీకర్ కూడా రద్దును వద్దని కోరుతున్నారు. కాగా ఒబామా హయాంలో ఇచ్చిన ఉత్తర్వుల్ని మంగళవారంలోగా రద్దు చేయకుంటే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని రిపబ్లికన్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు హెచ్చరించాయి. దీంతో సందిగ్ధంలో పడ్డ ట్రంప్ వర్క్ పర్మిట్ల పథకాన్ని వెంటనే రద్దుచేయకుండా ఆరు నెలలు యధాతథ స్థితి కొనసాగించాలని యోచిస్తున్నట్లు సమాచారం. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
200 మంది వలసదారులకు అమెరికా పౌరసత్వం
బోస్టన్: 200 మంది వలసదారులు అమెరికన్ సిటిజన్లుగా పౌరసత్వం పొందారు. బోస్టన్లోని జాన్ ఎఫ్.కెనడీ ప్రెసిడెన్షియల్ లైబ్రరీ అండ్ మ్యూజియంలో మసాచుసెట్స్ ప్రాంతం కోర్టు జడ్జి డెన్నీస్ సేలర్ అధ్యక్షతన అమెరికా పౌరసత్వ కార్యక్రమం బుధవారం జరిగింది. యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, యూఎస్ సిటిజన్‌షిప్, ఇమ్మిగ్రేషన్ సర్వీసులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. కెనడీ అమెరికాకు 35వ అధ్యక్షుడిగా, ఐరిష్– కాథలిక్కు మొదటి కమాండర్ ఇన్ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. కెనడీ ముత్తాతలు ఐర్లాండ్ నుంచి వలసవచ్చారు. -
ఒంటరి పక్షులు
-
సౌదీ డెడ్‌లైన్.. 12000 మంది వెనక్కి!
ఢాకా: దేశంలోని అక్రమ వలసదారులపై సౌదీ అరేబియా ప్రభుత్వం కొరడా ఝులిపిస్తోంది. జూన్ 30 వరకు అక్రమ వలసదారులు తమ దేశాలకు తిరిగివెళ్లాలని డెడ్‌లైన్ విధించింది. దీంతో సుమారు 12,000 మంది బంగ్లాదేశీ అక్రమ వలసదారులు స్వదేశానికి పయనమయ్యేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రియాద్, జెడ్డాలలో ఇప్పటికే 11 వేల మంది బంగ్లాదేశీయులు ఔట్పాస్ను తీసుకున్నారని బంగ్లాదేశ్ ఎంబసీ వెల్లడించింది. డెడ్‌లైన్ లోగా దేశాన్ని విడిచిపెట్టని వారికి జైలు శిక్షతో పాటు ఫైన్ విధించనున్నట్లు సౌదీ ప్రకటించింది. దీనికోసం కొన్ని కొత్త జైళ్లను సైతం సిద్ధం చేస్తోంది. గడువులోగా 'జనరల్ పార్డన్' కింద వెళ్లే అక్రమ వలసదారులు కావాలంటే చట్టబద్ధంగా తిరిగి దేశంలోకి అడుగుపెట్టడానికి సౌదీ అవకాశం కల్పించింది. వీసా గడువు ముగిసిన తరువాత కూడా దేశంలో ఉంటున్న వారిని టార్గెట్‌గా చేసుకొని చేపడుతున్న డ్రైవ్‌లో.. సుమారు 10 లక్షల మందిని దేశంనుంచి పంపించాలని సౌదీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. -
ఇరాక్ వలసదారులకు విముక్తి
హైదరాబాద్: ఇరాక్‌కు వలస వెళ్లి ప్రమాదకర ఐసిస్ జోన్లో చిక్కుకున్న 31మంది తెలంగాణ కార్మికులు ఈరోజు తెల్లవారుజామున ఢిల్లీకి చేరుకున్నారు. అక్కడి నుంచి వారు ఈ సాయంత్రానికి స్వస్థలాలకు చేరుకోనున్నారు. మంచిర్యాల, కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల ప్రాంతాల నుంచి అనేకమంది కార్మికులు రెండేళ్ల క్రితం ఇరాక్‌కు వలస వెళ్లారు. ఏజెంట్ల మాటలు నమ్మి వారు మోసపోయారు. అక్కడ ప్రమాదకర ఐసిస్ జోన్లో చిక్కుకుపోవడంతో తల్లడిల్లిన వారి కుటుంబీకులు తమవారిని రక్షించాలని తెలంగాణ, కేంద్ర ఫ్రభుత్వాలను అభ్యర్థించారు. తెలంగాణ మంత్రి కేటీఆర్, కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్‌లు చొరవ తీసుకుని వీరికి విముక్తి కలిగించారు.