
వలసవాదులకు ‘సైద్ధాంతిక పరీక్ష’: ట్రంప్
వలస వచ్చే వారికి ‘సైద్ధాంతిక పరీక్ష’ జరపాల్సిన అవసరం ఉందని డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించారు.
వాషింగ్టన్: అమెరికాలోకి వలస వచ్చే వారికి ‘సైద్ధాంతిక పరీక్ష’ జరపాల్సిన అవసరం ఉందని రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించారు. ‘రాడికల్ ఇస్లాం’ను ఎదుర్కోవడంపై ఓహాయోలో మాట్లాడుతూ.. దేశంలోకి వచ్చే వలసవాదుల పూర్వాపరాలు తెలుసుకున్న తరువాతే అనుమతించాలన్నారు.
నాటో దళాలు మధ్య ప్రాచ్యంతో కలసి పనిచేస్తే ఐసిస్‌ను అంతమొందించడం కష్టం కాదన్నారు. తాను అధ్యక్షుడినైతే అభివృద్ధి వైపు దేశం పరిగెత్తేలా చేయడంతో పాటు ఐసిస్‌కు ముగింపునిస్తానని చెప్పారు.