అమెరికాలో అక్రమంగా ప్రవేశించిన పిల్లలు ఇమిగ్రేషన్ కోర్టు ముందుపడరాని పాట్లు పడుతున్నారు. వారిలో మూడేళ్ల పిల్లలు కూడా ఉంటున్నారు. వారి తరఫున వాదించేందుకు న్యాయవాదులనుగానీ, అమెరికా ఆంగ్లభాషను వారి మాతృభాషలోకి తర్జుమా చేసి చెప్పేందుకు దుబాషీలనుగానీ కోర్టులు నియమించడం లేదు. అందుకు అమెరికా చట్టమే అనుమతించడం లేదు (అయితే సొంతంగా వారిని ఏర్పాటు చేసుకోవచ్చు).