Non Resident Indian (NRI)
-
ఎన్ఆర్ఐ పెళ్లిళ్ల నమోదు తప్పనిసరి
న్యూఢిల్లీ: ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐలు), భారత సంతతికి చెందిన విదేశీయులు(ఓసీఐ)–భారతీయ పౌరుల మధ్య మోసపూరిత వివాహాల పెరుగుతండటం ఆందోళనకరమని న్యాయ కమిషన్ పేర్కొంది. ఈ ధోరణికి అడ్డుకట్ట వేయడానికి సమగ్రమైన చట్టం తేవాలని కేంద్రానికి సూచించింది. భారతీయులు–ఎన్ఆర్ఐలు, భారతీయులు–ఓసీఐల మధ్య పెళ్లిళ్లను విధిగా రిజిస్టర్ చేసే విధానం ఉండాలని స్పష్టం చేసింది. జస్టిస్ రితూరాజ్ అవస్థీ నేతృత్వంలోని లా కమిషన్ ‘లా ఆన్ మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ రిలేటింగ్ టు ఎన్ఆర్ఐ, ఓసీఐ’ అంశంపై అధ్యయనం చేసింది. ఇటీవల కేంద్ర న్యాయ శాఖకు ఇటీవలే నివేదిక సమర్పించింది. దీనిపై కేంద్రం తేదలచిన చట్టం పెళ్లిళ్లకు వివాదాలన్నింటినీ పరిష్కరించేలా సమగ్రంగా ఉండాలని అభిప్రాయపడింది. మోసపూరిత ఎన్ఆర్ఐ వివాహాలతో భారత యువతులు అధికంగా నష్టపోతున్నారని గుర్తుచేసింది. విడాకులు, భాగస్వామికి భరణం, కస్టడీ, చిన్నారుల జీవన వ్యయాన్ని భరించడం వంటి అంశాలను చట్టంలో చేర్చాలని సిఫార్సు చేసింది. వైవాహిక స్థితిని కచి్చతంగా వెల్లడించేలా పాస్‌పోర్టు చట్టం–1967లో సవరణలు చేయాలని పేర్కొంది. పాస్‌పోర్టులో మ్యారేజీ రిజి్రస్టేషన్ నెంబర్ కూడా ఉండాలని తెలిపింది. ఇద్దరు జీవిత భాగస్వాముల పాస్‌పోర్టులను అనుసంధానించాలని, దీనివల్ల మోసాలను అడ్డుకోవచ్చని అభిప్రాయపడింది. -
భారీ ప్యాకేజీతో యూఎస్‌లో ఆమెకు ఉద్యోగం.. పెళ్లంటే భయపడుతోంది! ఎందుకు?
తండ్రి ఐపీఎస్(IPS), తల్లి పన్నుల శాఖలో ఉన్నతాధికారిణి. కుమార్తె ఐఐటీ ముంబైలో చదివింది. స్టాన్‌ఫోర్డ్‌లో స్కాలర్షిప్ సీట్. భారీ ప్యాకేజీతో పెద్ద కంపెనీలో ఉద్యోగం. ఏడేళ్లుగా అమెరికాలోనే. పెళ్ళీడొచ్చింది. పెళ్లంటే భయపడుతోంది. కౌన్సిలింగ్ కోసం తండ్రి రిక్వెస్ట్. నా కౌన్సిలింగ్ మొదలయ్యింది . ముందుగా అవతలి వారు చెప్పింది నేను వింటాను .. ఇదిగో ఆమె మాటలు. "సంబంధాలు వచ్చాయి .. వస్తున్నాయి . నేరుగా వచ్చి ప్రపోజ్ చేసిన వారున్నారు. "దేహి "అంటూ వారిచ్చే చారిటీ కోసం ఎదురు చూడాలా ? 1. నా కంటే తక్కువ చదువు . నా శాలరీలో సగం... ఒక్కో సారి మూడో వంతు . అయినా ఫరావాలేదు అనుకొంటాను. పెళ్లయ్యాక నేను మొత్తం శాలరీ అతని అకౌంట్‌కు, నెల నెలా ట్రాన్స్ఫర్ చేసేయ్యాలంట. నా ఖర్చులకు చాలా ఉదారంగా డబ్బులు ఇస్తాడంట. భార్య- భర్త - కుటుంబం అనుకున్నాక నీది -నాది అని ఉండదు. మనది అనుకున్నాక లెక్కలు ఉండవు. నేను ఒప్పుకొంటాను. కానీ పెళ్లి పరిచయాల్లో ... తొలి సారే... మొహమాటం లేకుండా ఫైనాన్సియల్స్ మాట్లాడుతున్నారు. అంటే నా శాలరీని అయన అకౌంట్ లో లేదా ఆయన తల్లి అకౌంట్ లో వేసి నెల నెల" దేహి "అంటూ వారిచ్చే చారిటీ కోసం ఎదురు చూడాలా ? నా పైన నమ్మకం ఉండదా ? నన్ను వారు నమ్మనప్పుడు నేను వారిని ఎలా నమ్మాలి ? పెళ్లంటే డొమెస్టిక్ స్లేవరీనా ? (బానిసత్వమా ?). అతనికంటే ఉన్నత ఉద్యోగం .. ఎక్కువ పని చేసుకొంటూ, ఇంటికొచ్చాక వంట ఇంటి పనులు చేసుకొంటూ అతనికి అతని కుటుంబ సభ్యులకు పని మనిషి లాగా పని చేస్తూ నా డబ్బు వారికిస్తూ బతకాలా ? పైగా అమెరికా రూల్స్ ప్రకారం రేపు విడాకులు తీసుకోవలసి వస్తే నా జీతం ఎక్కువ కనుక, నేనే అతనికి నెల నెల మెయింటనెన్స్ ఇవ్వాలి. అత్తలు నరకం చూపిస్తారు 2. డబ్బు డబ్బు డబ్బు .. డబ్బే వారి శ్వాస .. డబ్బే వారి నిద్ర .. అదే వారి ఊపిరి .. దాని కోసం ఏమైనా చేస్తారు. నీతి, నియమం లాంటి మోరల్ ఎథిక్స్ ఒట్టి మాటలు . అందరూ ఆలా ఉండరని మీరు అంటున్నారు సార్.. కానీ మొత్తం నలుగురు ఫ్రెండ్స్‌కు ఇదే అనుభవం. పెళ్లి చేసుకొని రెండేళ్లు నరకం అనుభవించి ఇప్పుడు బయట పడ్డారు. ఇండియాలో అయితే కనీసం నలుగురు ఏమనుకొంటారో అనే ఫీలింగ్ ఉంటుంది. ఇక్కడ ఎవరికి వారే .. అంతా వ్యక్తిగతం. అత్తలు నరకం చూపిస్తారు. వారి ప్లానింగ్ మామూలుగా ఉండదు. డబ్బు పిశాచాలు-శాడిజం- డబ్బు పిచ్చి రెండూ కలిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో .. ఇండియాలో వుండే మీకు అవగాహన అయ్యే అవకాశం లేదు సార్. ఒకసారి అమెరికాలోని మనోళ్ల బతుకులను పరిశీలించండి. ఘోరాతిఘోరాలు బయట పడుతాయి . మనుషులమన్న ఫీలింగ్ కూడా ఉండదు 3. గ్రీన్ కార్డు దశ దాటి, అమెరికా పౌరసత్వం వచ్చేస్తే తప్ప ఆ పరిస్థితిని వర్ణించలేం. 30 ఏళ్ళ క్రితం వారు కూడా మా లాగే వీసా పై వచ్చిన వారే.. ఇక్కడ ఉద్యోగ రీత్యా స్థిర పడ్డవారే. మా పైన కన్సర్న్ ..గౌరవం లేక పొతే పోయింది. మనుషులమన్న ఫీలింగ్ కూడా ఉండదు .ముఖ్యంగా వారి పిల్లలు... జన్మతః అమెరికన్ సిటిజెన్ షిప్ కదా. వారు సుపీరియర్ రేస్ అని ఫీలింగ్. లేదు సార్.. మీరన్నట్టు ఏదో ఒకటో రెండో ఇండివిడ్యుల్ కేసెస్ కాదు .. మొత్తం .. మొత్తం .. మేము చూసింది ఇదే. ఆటవికుల్లా చూస్తారు! వీరి ఇళ్లల్లోకి ఇండియా నుంచి బంధువులు వస్తే వారిని మనుషుల లాగా చూడరు. అనాగరికులు ఆటవికులు అని వారి ఫీలింగ్. అమ్మ, నాన్న బలవంతం మీద ఏదో నటిస్తారు. చాలా సార్లు ఆ నటన బయటపడిపోతుంది. ఒక సారి ఇండియా నుంచి వచ్చిన బంధువుల ముందే ఒక అమ్మాయి తండ్రి తో .. హే డాడ్ .. Fxxx అంది . ఆ నాలుగు అక్షరాలా పదం వీరి ఊత పదం. ఇవేమి డబల్ స్టాండర్డ్స్? వీరిని America Born Confused Thesis అమెరికా బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేసిస్... ఏబీసీడీ లంటారు. వీరు మాలాంటి వారి పెళ్లి ప్రొపోసల్ కనీసం కన్సిడర్ చెయ్యరు. చేస్తే గీస్తే .. పెళ్లి జరిగితే అటుపై అత్త టార్చర్. తెల్ల జాతి అమ్మాయితో కొడుకు ఎఫైర్ కొనసాగిస్తూంటాడు. అదేంటత్తయ్య.. అంటే... ఇది ఇక్కడ కామన్ అమ్మ .. ఏమి చేద్దాం అంటుంది. కోడలు మాత్రం అచ్చం తెలుగింటి అమ్మాయిలా వారికి చాకిరీ చెయ్యాలి . ఇవేమి డబల్ స్టాండర్డ్స్ ? " ఇదండీ . ఆ అమ్మాయి నాకు చెప్పిన అంశాలు . మధ్యలో చాల సార్లు ఉద్వేగానికి గురయ్యింది. ఏడ్చింది. అమెరికాలో సెటిల్ అయిన వారందరూ ఇలాగే ఉంటారు అని నేను అనుకోవడం లేదు. అదే విషయాన్ని ఆ అమ్మాయికి పదేపదే చెప్పాను. దుర్యోధనుడికి మంచి వారు .. ధర్మ రాజుకు చెడ్డవారు కనపడలేదట. ఇది కూడా చదవండి: అమెరికాలో ఎవరు మనోళ్లు.. ఎవరు పరాయి వాళ్లు? అదే మోడరన్ లైఫ్ అనుకుంటే ఎలా? ఆ అమ్మాయి దాదాపు గంట మాట్లాడింది. ఉన్నత విద్య చదివిన అమ్మాయి .. పెద్ద ఉద్యోగం .. జీతం సంపాదించుకొన్న అమ్మాయి .. పెళ్లంటే భయపడే స్థితి . కొంత వరకు ఆ అమ్మాయి PERCEPTION .. ఒప్పుకొంటాను. కానీ ఈ సమాజం తప్పులేదా ? బతకడం కోసం డబ్బు కావాలి. కాదనే వాడు ఫూల్ . కానీ.... డబ్బే సర్వస్వం అనుకుని, నెలల వయసులో పిల్లల్ని క్రెష్‌లో చేర్పించి .. వారితో సమయం గడపక .. వారికి జంక్ ఫుడ్ .. మొబైల్ అలవాటు చేసి.. అదే నాగరికత .. అదే మోడరన్ లైఫ్ అనుకొని బతికితే ? గంపెడు వాక్సిన్లు, ఇంటింటా ఆటిజం లేదా ఎలర్జీలు/ ఆటో ఇమ్యూన్ డిసార్డర్ లు, అఫైర్ లు, లైవ్ ఇన్ రిలేషన్‌షిప్‌లు .. నలబై వచ్చినా పెళ్లి ఉండదు .. పెళ్ళైనా... పెటాకులే అయితే ? డబ్బు మహా అంటే ఆనందంగా గడపడానికి ఒక మార్గం. కానీ డబ్బే ఆనందం .. డబ్బే లైఫ్ అని బతికేస్తే ? ఒకరి జీవన శైలిని జడ్జి చెయ్యడం కాదు. అణుబాంబు పై కూర్చుని దాని ట్రిగ్గర్ లాగే ఆటలాడుతున్న వారిని హెచ్చరించే ప్రయత్నం. ధనం మూలం మిదం జగత్.. మానవతాన్ని, మానవ విలువల్ని చంపేయడమే నాగరికత అయితే నేనొక ఆటవికుడుగా బతకడానికే ఇష్టపడతాను . మానవ విలువలు లేని సమాజం అట్టే కాలం బతకదు అని హెచ్చరించడం నా కనీస సామజిక బాధ్యత అని భావిస్తున్న ఒక ఆటవికుడిని నేను. -వాసిరెడ్డి అమర్నాథ్, ప్రముఖ విద్యావేత్త, మానసిక శాస్త్ర పరిశోధకులు -
ఎన్ఆర్ఐలకు గుడ్‌న్యూస్.. ఈ 10 దేశాల వారికే అవకాశం!
న్యూఢిల్లీ: ఎన్ఆర్ఐలకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) సంతోషకర వార్త చెప్పింది. యూఎస్, కెనడా, యూఏఈ తదితర పది దేశాల్లోని వారు యూపీఐ ప్లాట్‌ఫామ్ ద్వారా నిధులను బదిలీ చేసుకోవచ్చని ఎన్పీసీఐ ప్రకటించింది. ఎన్ఆర్ఈ/ఎన్ఆర్వో ఖాతాలకు అనుసంధానంగా యూపీఐ ద్వారా నగదు బదిలీని చేసుకోవచ్చు. ఏప్రిల్ 30 నాటికి ఇందుకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవాలని యూపీఐ భాగస్వాములను ఎన్పీసీఐ కోరింది. సింగపూర్, ఆస్ట్రేలియా, కెనడా, హాంగ్‌కాంగ్, ఒమన్, ఖతార్, యూఎస్ఏ, సౌదీ అరేబియా, యూఏఈ, యూకేలోని ప్రవాస భారతీయులకు ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ పది దేశాల టెలికం కోడ్‌పై యూపీఐ పనిచేసే ఏర్పాటును తీసుకువస్తున్నట్టు, సమీప భవిష్యత్తులో ఇతర దేశాలకూ దీన్ని విస్తరించనున్నట్టు ఎన్పీసీఐ తెలిపింది. ఎన్ఆర్ఐలు భారత్‌కు వచ్చినప్పుడు చెల్లింపులు, నగదు బదిలీ చేసుకునే సౌకర్యం ఇందులో ఉంటుందని ఎన్పీసీఐ చైర్మన్ విశ్వాస్ పటేల్ పేర్కొన్నారు. చదవండి: ఆటో ఎక్స్పో 2023: ఎలక్ట్రిక్ వాహనాలే హైలైట్, 5 మోడళ్లు ప్రపంచంలో తొలిసారి -
ఎన్నారైను టెన్షన్ పెట్టిన నాలుగు గంటలు
ఢిల్లీ: ఏమరపాటులో చేసే పని.. ఒక్కోసారి తీవ్రపరిణామాలకు దారి తీస్తుంటుంది. తన కూతురి పెళ్లి కోసం నగలతో వచ్చిన ఓ ఎన్నారైకి అలాంటి పరిస్థితే ఎదురైంది. నాలుగు గంటల పాటు పోలీస్ స్టేషన్లో టెన్షన్.. టెన్షన్‌గా గడిపాడు ఆ పెద్దయాన. నిఖిలేష్ సిన్హా(50).. లండన్ నుంచి తన కూతురి వివాహం కోసం వచ్చారు. గ్రేటర్ నోయిడాలో ఓ హోటల్లో బస చేసిన ఆయన.. బుధవారం మధ్యాహ్నం సమయంలో ఊరికి వెళ్లేందుకు లగేజీతో ఓ క్యాబ్ బుక్ చేసుకుని బయల్దేరారు. అయితే.. తీరా గమ్యస్థానం చేరుకున్నాక ఆయన ఓ బ్యాగ్‌ను క్యాబ్‌లోనే మరిచిపోయి వెళ్లిపోయారు. అయితే ఆ తర్వాతే ఆయన తలపట్టుకున్నారు. ఆ బ్యాగులో సుమారు కోటి రూపాయల విలువ చేసే నగలు ఉన్నాయట. దీంతో ఆలస్యం చేయకుండా ఆయన బిస్రాఖ్ పోలీసులను ఆశ్రయించాడు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే పోలీసులు ఆ క్యాబ్ నిర్వహణ కార్యాలయానికి వెళ్లి.. నాలుగు గంటల్లో ఆ క్యాబ్ ఉన్న లొకేషన్ గుర్తించారు. తీరా.. ఘజియాబాద్ లాల్ కౌన్ వద్ద క్యాబ్‌ను పోలీసులు పట్టుకున్నారు. అయితే.. ఆ పెద్దాయన క్యాబ్‌లో బ్యాగ్ మరిచిపోయిన విషయం తనకు తెలియదని డ్రైవర్ పోలీసులతో చెప్పాడు. దీంతో నేరుగా క్యాబ్, డ్రైవర్‌తో సహా స్టేషన్‌కి చేరుకున్న పోలీసులు.. నిఖిలేష్ ముందే ఆ బ్యాగ్‌ను ఓపెన్ చేసి నగలను అప్పగించారు. పోలీసుల త్వరగతిన స్పందన ఎన్నారై నిఖిలేష్ సంతోషం వ్యక్తం చేసి.. క్యాబ్ డ్రైవర్‌పై పెట్టిన కేసును ఉపసంహరించుకున్నారు. అప్పటికి సమయం రాత్రి ఎనిమిది గంటలు అయ్యింది. ఇదీ చదవండి: మీరు దళితులు.. మీకు ఏం అమ్మం! -
డాలస్‌లో యజ్ఞేశ్వర శతక పద్యగాన మహోత్సవం
డాలస్ (టెక్సాస్): ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) లు సంయుక్తంగా యజ్ఞేశ్వర శతకము పద్యగాన మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించాయి. డాలస్ మెట్రో ఏరియాలో ఫ్రిస్కో నగరంలో నెలకొనిఉన్న కార్యసిద్ధి హనుమాన్ దేవాలయంలో వేడుకలు వైభవంగా జరిగాయి. డాలాస్-ఫోర్ట్ వర్త్ తానా ప్రాంతీయ ప్రతినిధి సతీష్ కొమ్మన సాహితీ ప్రియులందరికీ సాదర స్వాగతం పలికి, తానా మరియు టాంటెక్స్ సంస్థలు కలసి పనిచేస్తూ మున్ముందు కూడా అనేక మంచి కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. అలాగే తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు సారధ్యంలో ప్రపంచ వ్యాప్తంగా అనేక సాహిత్య, సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం అని, అందరూ తానా కార్యక్రమాలలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. సభాధ్యక్షులు డాక్టర్ ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. జొన్నవిత్తుల మంచి ప్రజాదరణ పొందిన సినిమా పాటలు ఎన్నో రాశారని, సాధారణంగా సినీగీత రచయితలు సినీ రంగానికే పరిమితం అవుతారని కాని కవి జొన్నవిత్తుల అనేక సామాజిక స్పృహకలిగిన పేరడీలు, దండకాలు, దాదాపు 30 శతకాలను రాశారన్నారు. తెలుగువేదకవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు మాట్లాడుతూ ఈరోజు సకల దేవతా మూర్తులు కొలువైనటువంటి పవిత్ర కార్య సిద్ది హనుమాన్ దేవాలయంలో తనకు దైవదర్శనం ఒక దివ్యమైన అనుభూతినిచ్చింది అని, ప్రకాశరావు గారు హిందూ మతం, ధర్మం కోసం చేస్తున్న కృషి, తపన చాలా గొప్పవని అభినందించారు. జొన్నవిత్తులని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మరియు ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) కార్యవర్గ బృందం శాలువా, జ్ణాపిక అందించారు. అదే విధంగా 21వ శతాబ్దపు శతక సార్వభౌమ అనే బిరుదుతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రసాద్ తోటకూర, డాక్టర్ పుదూర్ జగదీశ్వరన్, శ్రీకాంత్ పోలవరపు, సతీష్ కొమ్మన, చినసత్యం వీర్నపు, సతీష్ బండారు, భానుమతి ఇవటూరి, సత్యన్ కళ్యాణ్ దుర్గ్, లెనిన్ వేముల, అనంత్ మల్లవరపు, వెంకట్ ములుకుట్ల, లోకేష్ నాయుడు కొణిదల, ఊరిమిండి నరసింహా రెడ్డి, సుబ్రమణ్యం జొన్నలగడ్డ, ప్రకాశరావు వెలగపూడి, లెనిన్ వీర, విజయ్ కొల్లపనేని, కృష్ణమోహన్ రెడ్డి, వెంకట్, డా. రతీరెడ్డి, సాగర్ అండవోలు, చంద్రహాస్ మద్దుకూరి, పాలేటి లక్ష్మి, కళ్యాణి తాడిమేటి తో సహా ఎంతో మంది భాషాభీమానులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో పాల్గొన్నవారికి, సభ విజయవంతం కావడానికి సహకరించిన వివిధ కమిటీ సభ్యులకు, స్వచ్ఛంద కార్యకర్తలకు డాలస్ ప్రాంతీయ ప్రతినిధి సతీష్ కొమ్మన ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియజేశారు. చదవండి: డాలస్‌లో వైభవంగా శ్రీనివాస కల్యాణం -
టీపీసీసీ ఎన్నారై సెల్ గల్ఫ్ కన్వీనర్‌గా నరేష్ రెడ్డి
జగిత్యాల జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులు సింగిరెడ్డి నరేష్ రెడ్డి ని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీసీసీసీ) ఎన్నారై సెల్ గల్ఫ్ కన్వీనర్‌గా నియమితులయ్యారు. కాంగ్రెస్ పార్టీ ప్రవాస భారతీయుల విభాగం చైర్మన్ డాక్టర్ బీఎం వినోద్ కుమార్ ఈమేరకు నియామక పత్రాన్ని గాంధి భవన్ లో అందజేశారు. ఈ సందర్భంగా నరేష్ రెడ్డిని పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అభినందించారు. గల్ఫ్ కార్మికుల హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది... గల్ఫ్ కార్మికుల బాధలు తీరుస్తుందని హమీ ఇచ్చారు. నరేష్ రెడ్డి జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా, మన్నెగూడెం సర్పంచ్ గా కొనసాగుతున్నారు. గతంలో 11 ఏళ్లపాటు సౌదీ లోని అరేబియన్ అమెరికన్ పెట్రోలియం నేచురల్ గ్యాస్ కంపెనీ లో మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో లెవల్-1 సర్టిఫైడ్ రిగ్గర్ గా పనిచేశారు. 'సౌదీ అరామ్కో' కంపెనీలో అత్యంత నైపుణ్యం కలిగిన శ్రామికశక్తి బృందంలో సభ్యుడిగా గుర్తింపు పొందారు. ఈ సందర్బంగా నరేష్ రెడ్డి మాట్లాడుతూ.. "తెలంగాణ రాష్ట్రానికి చెందిన సుమారు 15 లక్షల మంది గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, యూఏఈ, ఓమన్, ఖతర్, కువైట్, బహ్రెయిన్ లతో పాటు 18 ఈసీఆర్ దేశాలకు ఉపాధి కోసం వలస వెళ్లారు. విదేశాల్లో పనిచేసే కార్మికులకు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడంలో కేంద్ర రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ప్రవాసీ కార్మికుల హక్కుల రక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ అండగా ఉండి పోరాటం చేస్తుంది" అని అన్నారు. చదవండి: గల్ఫ్ కార్మికులను ఆదుకోవాలి - జేఏసీ డిమాండ్ -
ఆటా వార్ రూం : ఢీ అంటే ఢీ
మూడు రోజుల గ్రాండ్ కన్వెన్షన్‌కు సిద్ధమవుతున్నారు ఆటా యోధులు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, వందల మంది ప్రిపరేషన్స్‌లో బిజీబిజీగా ఉన్నారు. తమ సన్నాహకాలకు వార్ రూం ఏర్పాటు చేసుకున్నారు. జులై 1,2,3 తేదీల్లో జరగనున్న అమెరికన్ తెలుగు అసొసియేషన్ ప్రపంచ తెలుగు మహాసభలకోసమే ఈ కసరత్తు. వార్ రూంకు ఇప్పటికే చేరుకున్న కళా బృందాలు తమ ప్రతిభా పాటవాలకు మరింత మెరుగులు దిద్దుతున్నారు. గతానికి భిన్నంగా, మరింత సృజనాత్మకంగా, కొత్త కళా రీతులతో కొంగొత్తగా కనిపించేందుకు సిద్ధమవుతున్నారు. ఆటా కల్చరల్ కమిటీ, హాస్పిటాలిటీ కమిటీలు వీరికి ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. ఇక్కడ కనిపిస్తున్న చాలా మంది పిల్లలు అమెరికాలో పుట్టిపెరిగిన వాళ్లే. అయితే తెలుగు సంప్రదాయాన్ని, సంస్కృతిని మాత్రం తల్లితండ్రుల నుంచి గుర్తు పెట్టుకున్నారు. పేరేంట్స్ తో పాటు తెలుగు రాష్ట్రాలకు వచ్చినప్పుడు అమ్మమ్మ, నానమ్మ ఇళ్లకు వెళ్లి ఇక్కడి విషయాలు గమనిస్తున్నారు. అందుకే అగ్రరాజ్యంలో ఉన్నా తెలుగును మరిచిపోలేదు, ఇక్కడి మట్టివాసనను మరిచిపోలేదు. తమ కళలు, ప్రదర్శనలలో తెలుగు తత్వాన్ని చూపించే పనిలో ఉన్నారు. అమెరికన్ తెలుగు అసొసియేషన్ అధ్యక్షుడు భువనేష్ భుజాల, ఇతర కమిటీ సభ్యులు, వాలంటీర్లు అలుపెరగకుండా కష్టపడుతున్నారు. వేలాది మంది అతిథులకు సంతోషం పంచేలా, ఉత్సాహం నింపేలా తమ వేడుకలు ఉంటాయని హామీ ఇస్తున్నారు. కన్వెన్షన్ సందర్భంగా ప్రతీ కమిటీ ఏ ఏ బాధ్యతలను ఎలా నిర్వర్తించాలన్నదానిపై ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. అందుకే వార్ రూంలో మరో పక్క వాడివేడి చర్చలు జరుపుతున్నారు. ఎలాంటి పొరపాటుకు తావివ్వకుండా బాధ్యతలు పంచుకుంటున్నారు. సుధీర్ బండారు, కాన్ఫరెన్స్ కన్వీనర్ ఎన్నో రోజుల కష్టం ఇది. ఆటా వేడుకలు ఇప్పుడు కాదు.. చాలా రోజుల ముందుగానే మొదలయ్యాయి. సయ్యంది పాదం పేరుతో ఎన్నో రోజులుగా డాన్స్ కాంపిటీషన్లు నిర్వహించి అత్యుత్తమ కళాకారులను ఎంపిక చేశాం. అలాగే జుమ్మంది నాదం పేరుతో గాయకులను ఎంపిక చేశాం. అమెరికాలోనే పుట్టి పెరిగిన కొందరు అద్భుతంగా పాడినప్పుడు ఆశ్చర్యపోయాం. ఈ వేడుకలు కచ్చితంగా ఆహూతులను అలరిస్తాయని నమ్మకంగా చెబుతున్నాం. కిరణ్ పాశం, కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ ఒకరు కాదు, ఇద్దరు కాదు 80 కమిటీలు, 300 మంది వాలంటీర్లు, వీరే కాకుండా పరోక్షంగా మరెంతో మంది సహకారంతో ఈ వేడుకలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తమ తమ వృత్తి బాధ్యతలను పక్కనబెట్టి.. ఈ వేసవి కాలాన్ని అత్యంత ఆహ్లదంగా మార్చేందుకు, ఆటా వేడుకలను అత్యంత మధురంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. వచ్చే మూడు రోజులు మరింత ఉధృతంగా ప్రాక్టీసు సెషన్లుంటాయి. బ్రహ్మండమైన ప్రదర్శనలతో ఆకట్టుకుంటామన్న విశ్వాసం ఉంది. - (వాషింగ్టన్ డిసి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) -
న్యూజెర్సీ సాయిదత్త పీఠాన్ని సందర్శించిన జస్టిస్ ఎన్వీ రమణ
ఎడిసన్, న్యూ జెర్సీ: అమెరికాలో ఆధ్యాత్మిక ప్రవాహాన్ని కొనసాగిస్తున్న న్యూజెర్సీ సాయిదత్త పీఠాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సందర్శించారు. న్యూజెర్సీ ఎడిసన్‌లోని శ్రీ సాయి దత్త పీఠం శివ విష్ణు మందిరంలో వేద పండితులు జస్టిస్ ఎన్వీ రమణ కు వేద మంత్రోచ్ఛారణతో స్వాగతం పలికారు. దేవాలయంలో దేవతా మూర్తులను ఆయన దర్శించుకుని పూజలు చేశారు. వేద పండితుల ఆశీర్వాదం పొందారు. సాయి దత్త పీఠం ఆలయ చైర్మన్, ప్రధాన అర్చకులు రఘుశర్మ శంకరమంచి, న్యూ జెర్సీ పబ్లిక్ యుటిలిటీస్ చైర్మన్ ఉపేంద్ర చివుకుల, ఆలయ బోర్డ్ డైరెక్టర్లు, స్టాఫ్, వాలంటీర్లు ఎన్.వి.రమణను కలిసి తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. చదవండి: ఆరోగ్యాంధ్రప్రదేశ్ లక్ష్యంగా సీఎం జగన్ అడుగులు: వైవీ సుబ్బారెడ్డి -
గల్ఫ్ కార్మికులను ఆదుకోవాలి - జేఏసీ డిమాండ్
గల్ఫ్ కార్మికులకు ప్రత్యేకంగా సంక్షేమ పథకాలు అమలు చేయాలి మంత్రి కేటీఆర్ కు గల్ఫ్ జెఏసి బృందం వినతిపత్రం ఇచ్చింది. ముస్తాబాద్‌లో ఆయన్ను కలిసి గల్ఫ్ జేఏసీ ప్రతినిధులు ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి తో వారు మాట్లాడుతూ కరోనా సందర్బంగా గల్ఫ్ తదితర దేశాల నుండి వాపస్ వచ్చిన వలస కార్మికులకు వారి యాజమాన్యాల నుండి రావలసిన జీతం బకాయిలు, బోనస్, పిఎఫ్, గ్రాట్యుటీ లాంటి 'ఎండ్ ఆఫ్ సర్వీస్ బెనిఫిట్స్' (ఉద్యోగ విరమణ ప్రయోజనాలు) రాబట్టుకోవడం వారి హక్కన్నారు. కావున బాధితుల పక్షాన ప్రభుత్వం నిలబడి న్యాయ సహాయం అందించి కార్మికులను ఆదుకోవాలి కోరారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన సుమారు 15 లక్షల మంది గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, యూఏఈ, ఓమన్, ఖతర్, కువైట్, బహ్రెయిన్ దేశాలతో పాటు మలేషియా, సింగపూర్, అఫ్గానిస్తాన్, ఇరాక్, లిబియా తదితర దేశాలకు ఉపాధి కోసం వలస వెళ్లారని తెలిపారు. వీరందరి సంక్షేమం కోసం గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమైన డిమాండ్లు.. - గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రతి ఏటా రూ.500 కోట్ల బడ్జెట్ కేటాయించాలి. - గల్ఫ్ దేశాలకు ఉద్యోగానికి వెళ్లే కార్మికులకు వీసా చార్జీలు, రిక్రూట్మెంట్ ఫీజులు తదితర ఖర్చులకోసం పావలా వడ్డీ రుణాలు ఇవ్వాలి. - గల్ఫ్ లో చనిపోయిన కార్మికులకు రైతు బంధ, రైతు బీమా లాంటి రూ. 5 లక్షల "గల్ఫ్ ప్రవాసీ బీమా" పథకం ప్రవేశపెట్టాలి. ఈ పథకం ప్రవేశపెడితే ప్రభుత్వంపై ఎక్స్ గ్రేషియా (మృతధన సహాయం) భారం ఉండదు. - విదేశాలకు వెళ్లి నష్టపోయి తిరిగి వచ్చిన వారిని ఆదుకోవడానికి కార్మికులు నైపుణ్యం మరియు అనుభవాన్ని ఉపయోగించుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు సబ్సిడీతో కూడిన రుణాలను ఇచ్చి స్థానికంగా ఉపాధి అవకాశాలను తక్షణం కల్పించాలి. వాపస్ వచ్చినవారు జీవితంలో స్థిరపడటానికి పునరావాసం, పునరేకీకరణ కొరకు ప్రత్యేక పథకం రూపకల్పన చేయాలి. - జైళ్లలో మగ్గుతున్న ప్రవాసులకు న్యాయ సహాయం. - హైదరాబాద్ లో ప్రవాసీ భవన్ ఏర్పాటు. - తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలి. ఆరోగ్యశ్రీ, గృహనిర్మాణం వంటి పథకాలను వర్తింపజేయాలి. - 24 గంటల హెల్ప్ లైన్ (సహాయ కేంద్రం) ఏర్పాటు చేయాకి. - విదేశాల్లో ఉన్న వలసకార్మికులు, ఉద్యోగులు, వృత్తినిపుణులు, విద్యార్థుల రిజిస్ట్రేషన్ కొరకు 'ప్రవాసి తెలంగాణ' వెబ్ పోర్టల్ ఏర్పాటు చేయాలి . - ధనవంతులైన ఎన్నారైలు గ్రామాలను దత్తత తీసుకునేలా ప్రోత్సాహించాలి. - గల్ఫ్ లోని ప్రవాస తెలంగాణీయులకు ఒక వేదిక కల్పించడానికి, రాష్ట్రంతో బంధం ఏర్పరచడానిక వార్షిక ప్రవాసి వేడుకను నిర్వహించడానికి 'గల్ఫ్ ప్రవాసి తెలంగాణ దివస్' ను జరుపాలి. సమస్యలను చర్చించడానికి ఈ వేదిక ఉపయోగపడుతుంది. వివిధ రంగాలలో సేవలందించిన ప్రవాసీలకు అవార్డులను ప్రధానం చేయాలి. - గల్ఫ్ ఎన్నారైలు తమ అమూల్యమైన ఓటు హక్కును ఆన్ లైన్ ద్వారా వినియోగించుకునేలా చేయాలి. చదవండి: గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న పాతబస్తీ మహిళలు.. సాయం కోసం.. -
‘ఆరోగ్యాంధ్రప్రదేశ్ లక్ష్యంగా సీఎం జగన్ అడుగులు’
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సొంత రాష్ట్రంలో ఆరోగ్య సంరక్షణను అందించే లక్ష్యంతో హాస్పిటల్స్, హెల్త్ సెంటర్లను ప్రభుత్వం బలోపేతం చేసిందని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. అమెరికాలోని శాన్ అంటోనియో, టెక్సాస్ లో జరుగుతున్న అమెరికన్ అసోసియేషన్ ఫర్ ఫిజిషియన్స్ అఫ్ ఇండియన్ ఆరిజన్ (AAPI, ఆపి) మహాసభలలో మాజీ లోక్ సభ సభ్యులు, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైద్య రంగంలో చేపట్టిన, చేపట్టబోతున్న అభివృద్ది గురించి ఆయన వివరించారు. ప్రసంగంలోని ముఖ్యాంశాలు... ► గ్రామ స్థాయిలో ఇంటింటికీ ఆరోగ్య సేవలను అందించడమే లక్ష్యంగా 10,032 వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్‌లను ఏర్పాటు చేశారు. ప్రతి క్లినిక్‌లో ఒక ఏఎన్ఎం, ఒక మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్, ఒక ఆశా వర్కర్‌ను నియమించారు. నాడు-నేడులో భాగంగా 977 పీహెచ్‌సీలు పునరుద్ధరించారు. అదే విధంగా 148 పీహెచ్‌సీలు నిర్మాణంలో ఉన్నాయి. అంతే కాకుండా పట్టణాలలో 556 పీహెచ్‌సీలు ఏర్పాటు చేశారు. ప్రతీ 30,000 జనాభాకు ఒక అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (UPHC)తో పాటు అందుకు సరిపడా సిబ్బందిని నియమించారు. ► ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి నాడు-నేడు కింద ప్రభుత్వం రూ.12,268 కోట్లను కేటాయించింది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో కనీసం ఒక మెడికల్ కళాశాల ఉండేలా రూ.7,880 కోట్ల అంచనా వ్యయంతో 16 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ కాలేజీల్లో 1,850 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. 750 ఎంబీబీఎస్ సీట్లకు 2023-24 అడ్మిషన్ల కోసం 5 కొత్త మెడికల్ కాలేజీలు తెరవబడతాయి. ► సుమారు రూ.43 కోట్ల వ్యయంతో 5 జనరల్ హాస్పిటల్స్ టీచింగ్ హాస్పిటల్స్‌గా అప్‌గ్రేడ్ చేస్తున్నారు. పెరుగుతున్న డిమాండ్‌ని దృష్టిలో ఉంచుకుని వైద్య మౌలిక సదుపాయాలు, సౌకర్యాలను బలోపేతం చేయడం, సమీపంలోనే ప్రజలకు ఎండ్ టు ఎండ్ మెడికల్ కేర్ని అందుబాటులో ఉంచడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ► ఇవే కాకుండా జెనెటిక్స్, బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంటేషన్, ఇమ్యునాలజీ వంటి అసాధారణ విభాగాలతో కూడిన అత్యాధునిక ప్రపంచ స్థాయి పీడియాట్రిక్ (చిన్న పిల్లల) సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ప్రారంభించింది. రాష్ట్రంలోని రాయలసీమ, కోస్తా ఆంధ్ర & ఉత్తర ఆంధ్రాలలో ఇటువంటి 3 ఆసుపత్రులను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా విజయవాడ జీజీ హాస్పిటల్లో మొదటి జెనోమిక్ ల్యాబ్‌ను ప్రారంభించింది. ►రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారిగా డబ్ల్యూహెచ్‌వో/జీఎంపీ (WHO/GMP) సర్టిఫైడ్ ఔషధాలను తయారీదారుల నుండి నేరుగా కొనుగోలు చేయడంతో పాటు మొదటిసారిగా బోధనాసుపత్రులలో ఉచితంగా సీటీ, ఎంఆర్ఐ స్కాన్, క్యాత్‌ల్యాబ్ సేవలను ప్రారంభించింది. ► డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ,, ఆరోగ్య బీమా పథకం ద్వారా బీపీఎల్ కుటుంబాలకు (ఆదాయ పరిమితి రూ. 5 లక్షలు) వివిధ రకాలైన 2,446 శస్త్ర చికిత్సల కోసం కొన్ని ఆసుపత్రులతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 1.44 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరింది. ► దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు నెలకు రూ.10,000 వరకు పెన్షన్ అందిస్తుంది. నెలవారీ రూ.35.01 కోట్ల పంపిణీతో 68,874 మంది వ్యక్తులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు. ఆరోగ్య ఆసరా ద్వారా రోగులకు, సామాజిక-ఆర్థికంగా మద్దతు ఇవ్వడానికి వారి కోలుకునే కాలంలో కూడా ప్రభుత్వం రోగికి నగదు ప్రయోజనాన్ని అందిస్తుంది. ► ఆరోగ్యశ్రీ కింద కోవిడ్, బ్లాక్ ఫంగస్ రెండింటినీ చేర్చడం ద్వారా ఉచిత కోవిడ్ చికిత్సను అందించిన ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందన్నారు. ► క్యాన్సర్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు 7 మెడికల్ కాలేజీలను ప్రభుత్వం గుర్తించింది. మొదటి దశలో 3 ఎక్సలెన్స్ కేంద్రాలను ఏర్పాటు చేసి, ఒక్కో కేంద్రానికి రూ.500 కోట్లు కేటాయించారు. టాటా ట్రస్ట్ సహకారంతో రూ.190 కోట్ల వ్యయంతో తిరుపతిలో అధునాతన క్యాన్సర్ కేర్ సెంటర్ స్థాపించబడింది. అన్ని రకాల క్యాన్సర్లను ఎదుర్కోవడానికి హోబీ భాభా క్యాన్సర్ హాస్పిటల్‌తో ఎంవోయూ చేసుకున్నారు. ప్రముఖ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ నోరి దత్తాత్రేయుడుని ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. రేడియేషన్, కీమో, సర్జికల్ ఆంకాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్... మొత్తం 26 మెడికల్ కాలేజీలలో (పాత మరియు కొత్త) దశలవారీగా ఏర్పాటు చేయబడుతుంది. ► రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద నియామక ప్రక్రియ ద్వారా 35,998 మంది వైద్య సిబ్బందిని నియమించారు. ►108 ఎమర్జెన్సీ రెస్పాన్స్ సర్వీస్ (24 గంటల ఎమర్జెన్సీ హెల్త్ ట్రాన్స్‌పోర్టేషన్ సౌకర్యం, ఆరోగ్య సంరక్షణ సలహా సేవలను అందించడానికి మండలానికి ఒకటి చొప్పున 656 మొబైల్ మెడికల్ యూనిట్లు (104 వాహనాలు), 24x7 ఆరోగ్య సేవను అందించడానికి 27 మంది వైద్య అధికారులు మరియు 306 కాల్ ఎగ్జిక్యూటివ్‌లతో 104 టోల్-ఫ్రీ కాల్-సెంటర్, సమగ్ర కంటి సంరక్షణ మరియు దృష్టి లోపాలను నివారించడానికి డాక్టర్ YSR కాంతి వెలుగు, మెటర్నిటీ మోర్టాలిటి రేట్ తగ్గించడానికి తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలు ఏర్పాటు చేశారు. ► ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వరంగ సంస్థ ఏపీఎన్ఆర్టీఎస్ (APNRTS) అధ్యక్షులు వెంకట్. ఎస్ మేడపాటి మాట్లాడుతూ.. ఆరోగ్యాంధ్రప్రదేశ్ లక్ష్యంగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైద్య రంగంలో అనేక సంస్కరణలు చేపడుతున్నారని తెలిపారు. ఇందులో భాగంగా ఎన్నారైలు ముందుకువచ్చి రాష్ట్రానికి తమ వంతు తోడ్పాటు అందించాలని కోరారు. ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఆరోగ్యశ్రీ, సీఎంఆర్ఎఫ్ ఇంచార్జ్ డాక్టర్ హరికృష్ణ , డాక్టర్ వాసుదేవ రెడ్డి నలిపిరెడ్డి ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. ఉత్తర అమెరికాలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి రత్నాకర్ పండుగాయల, నాటా అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి కొర్సపాటి, సీ సుబ్బా రెడ్డి, సీవీబీసీ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జూన్ 23 నుండి 26వ తేదీ వరకు జరిగే ఈ మహాసభల కార్యనిర్వాహకవర్గం డాక్టర్ అనుపమ గోటిముకుల- ప్రెసిడెంట్, పీడియాట్రిక్ కార్డియాక్ అనస్థీషియాలజీ, రవి కొల్లి- రాబోయే ప్రెసిడెంట్ సైకియాట్రీ, డా. సతీష్ కతుల. VP- Hem/Onc, డా. మెహర్ మేడవరం- కార్యదర్శి, IM, డా. లోకేష్ ఎడారా BOT- అలెర్జీ ఇమ్యునాలజీ, డా. శ్రీనగేష్ పలువోయ్ BOT- అలెర్జీ ఇమ్యునాలజీ, డా. సునీల్ కాజా- BOT కార్డియాలజీ, డా. సుధాకర్ జొన్నలగడ్డ మాజీ అధ్యక్షులు, జి.ఐ, డా. సురేష్‌రెడ్డి - మాజీ అధ్యక్షులు, డా. సీనింగ్ గంగాసాని- పాస్ట్ BOT, జార్జియా స్టేట్ మెడికల్ బోర్డ్, డా. రఘు లోలాభట్టు BOT- IM, డా. సుజీత్ పున్నం RD, కార్డియాలజీలు ఉన్నారు. చదవండి: ఆటా వేడుకలకు వేళాయే -
డాలస్‌లో వైభవం గా యోగాడే వేడుకలు
డాలస్ (టెక్సాస్): మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్వర్యంలో అమెరికాలోనే అతి పెద్దదైన, డాలస్‌లో ఉన్న మహాత్మా గాంధీ మెమోరియల్ వద్ద అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరిపారు. 2022 జూన్ 21న ప్రవాస భారతీయులు ఉత్సాహంగా యోగా శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు. మహాత్మా గాంధీ మెమోరియల్ ఛైర్మన్ డాక్టర్ ప్రసాద్ తోటకూర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇండియన్ కాన్సుల్ జనరల్ అసీం మహాజన్‌కి స్వాగతం పలికారు. భారత దేశం ప్రపంచానికి అందించిన యోగా కేవలం జూన్ 21నే కాకుండా నిత్యం అభ్యాసం చెయ్యవలసిన కార్యక్రమమన్నారు. యోగావల్ల శరీరం, మనస్సు స్వాధీనంలో ఉంటాయని తెలియజేశారు. యోగా కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. భారత ప్రధాని నరేంద్రమోడి ఐక్యరాజ్యసమితిలో చేసిన ప్రతిపాదనకు అనుగుణంగా విశ్వవ్యాప్తంగా జూన్ 21 వ తేదీన యోగా కార్యక్రమం జరపడం ఎంతో సంతోషదాయకమని ఇండియన్ కాన్సుల్ జనరల్ అసీం మహాజన్ అన్నారు. ప్రతి రోజూ యోగా చెయ్యడం వల్ల ఒనగూరే ప్రయోజనాలు వివరించారు. ఇండియా అసోసియేషన్ అఫ్ నార్త్ టెక్సాస్ ఉత్తరాధ్యక్షుడు దినేష్ హూడా, బోర్డు సభ్యులు రాజీవ్ కామత్, షబ్నం మోడ్గిల్, పలు సంస్థల సభ్యులు, ప్రవాస భారతీయులు, చిన్నారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారను. ఈ కార్యక్రమం విజయవంతం చెయ్యడంలో సహాయపడిన కార్యకర్తలకు, యోగా శిక్షణ ఇచ్చిన యోగా మాస్టర్ విజయ్, ఐరిస్, ఆనందీలకు, ముఖ్య అతిథి కాన్సల్ జనరల్ అసీం మహాజన్ కు, మహాత్మా గాంధీ మెమోరియల్ బోర్డ్ సభ్యుడు దినేష్ హూడా కృతజ్ఞతలు తెలియజేశారు. చదవండి: అగ్రరాజ్యాన అంగరంగ వైభవంగా అచ్యుతుడి కల్యాణం -
పెదనందిపాడులో నాట్స్ మెగా ఉచిత నేత్ర వైద్య శిబిరం
అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా తెలుగునాట కూడా తన సేవా పరంపరను కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లా పెదనందిపాడులో మెగా ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించింది. పెదకాకాని శంకర కంటి ఆస్పత్రి, జిల్లా అంధత్వ నివారణ సంస్థలతో కలిసి నాట్స్ ఈ ఉచిత కంటి వైద్య చికిత్స శిబిరాన్ని పెదనందిపాడు పీఎఎస్ కళాశాలలో విజయవంతంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు హాజరయ్యారు, విశిష్ట అతిథులుగా ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, మాజీ మంత్రి మాకినేని పెదరత్తయ్య, మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజా హాజరయ్యారు. అమెరికాలోనే కాకుండా సాటి తెలుగువారి కోసం నాట్స్ ఇక్కడ కూడా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఎంపీ లావు కృష్ణ దేవరాయలు అన్నారు. నాట్స్ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన బాపయ్య చౌదరి తన పుట్టిన గడ్డకు ఎంతో కొంత మేలు చేయాలనే సంకల్పంతో ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమని కృష్ణదేవరాయలు ప్రశంసించారు. ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం వల్ల చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు, పేదలకు ఎంతో ఉపయోగం ఉందన్నారు. ఇటువంటి కార్యక్రమాలు బాపయ్య చౌదరి మరెన్నో చేయాలని ఆకాంక్షించారు. పెదనందిపాడు గడ్డ ఎన్నో పోరాటాలకు కేంద్రబిందువుగా ఉందని, అలాంటి ప్రాంతానికి చెందిన బాపయ్య చౌదరి అమెరికాలో ఉన్నత పదవులు అధిరోహించి, తమ జన్మభూమికి సేవ చేయడం అభినందించదగ్గ విషయమని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు అన్నారు. కరోనా సందర్భంలో కూడా బాపయ్య చౌదరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని గుర్తు చేశారు. పెదనందిపాడులో ప్రతిభ గల విద్యార్ధులకు ఉపకార వేతనాలు కూడా ఇస్తున్న బాపయ్య చౌదరి దాతృత్వం గొప్పదని ప్రశంసించారు. బాపయ్య ఈ ప్రాంతానికి మరి ఎన్నో సేవలు చేయాలని ఆకాంక్షించారు. నాట్స్ సంస్థ భాషే రమ్యం సేవే గమ్యం వంటి ఉన్నత ఆశయాలతో స్థాపించిబడింది అని, ఆ సంస్థలో బాపయ్య చౌదరి అంచెలంచెలుగా సేవ చేస్తూ నూతన అధ్యక్షుడిగా ఎన్నిక కావడం మన ప్రాంతానికి గర్వకారణమని మాజీ మంత్రి ఆలపాటి రాజా అన్నారు. ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తా: బాపయ్య చౌదరి, నాట్స్ అధ్యక్షుడు నాట్స్ ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రజల కోసం అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి తెలిపారు. విద్య, వైద్యం తదితర అంశాలపై రాబోయే కాలంలో రెండు రాష్ట్రాలలో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన మిత్రులకు, గ్రామ పెద్దలకు, శంకర కంటి ఆస్పత్రి సిబ్బందికి, వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ శిబిరానికి 2500 మంది పరీక్షలు చేయించుకొగా... వారిలో లో 570 మందిని ఆపరేషన్లు చేయడానికి అర్హులుగా వైద్యులు తేల్చారు. వీరికి విడతలవారీగా బస్సులు ఏర్పాటు చేసి శంకర కంటి ఆసుపత్రి లో ఆపరేషన్లు చేయిస్తామని బాపయ్య చౌదరి తెలిపారు. నాట్స్ చైర్మన్ అరుణ గంటి అమెరికా నుండి పాత కొత్త ఎగ్జిక్యూటివ్ కమిటీలతో సమావేశమయ్యారు. బాపు చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. టెలిఫోన్ ద్వారా బాపయ్య చౌదరికి ప్రత్యేక అభినందనలు తెలియచేశారు. సేవా కార్యక్రమాలకు తమ సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని హామీ ఇచ్చారు. ఈ బృహత్తర కార్యక్రమానికి తమ వంతు మద్దతు అందిస్తామని కాకుమాను నాగేశ్వరరావు, కుర్రా హరిబాబు అన్నారు. ఈ సభకు కాకుమాను నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ వైద్య శిబిరానికి శంకర కంటి ఆసుపత్రి వైద్యులు కే అనూష, ఎస్ శ్రీదివ్య, కే సంకల్ప, క్యాంప్ ఎగ్జిక్యూటివ్ బీవీ నాగబాబులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాట్స్ మాజీ అధ్యక్షులు, బోర్డ్ అఫ్ డైరెక్టర్ మన్నవ మోహనకృష్ణ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మాదల రాజేంద్ర, సభ్యులు ధూళిపాళ్ల సురేంద్ర, కాళహస్తి సత్యనారాయణ, లావు రత్తయ్య, కొల్లా రాజమోహన్ రావు, హైకోర్టు సీనియర్ అడ్వకేట్ నర్రా శ్రీనివాస్, నూతి శ్రావణి, పోపూరి, లక్ష్మీనారాయణ, కుర్రా హరిబాబు, నూతి శ్రీనులతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. చదవండి: ఆపి 40 వార్షిక సదస్సు వివరాలు -
ఫాదర్స్ డే సందర్భంగా నాట్స్ దాతృత్వం
చికాగో: భాషే రమ్యం.. సేవే గమ్యం అని నినదించే ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ దానికి తగ్గట్టుగా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతోంది. ఫాదర్స్ డే సందర్భంగా నాట్స్ చికాగో విభాగం పేదల ఆకలి తీర్చేందుకు ఫుడ్ డ్రైవ్ చేపట్టింది. 2500 డాలర్ల విలువైన ఆహారాన్ని, నిత్యావసరాలను సేకరించింది. చికాగోలో పేదల ఆకలి తీర్చే సంస్థ హెస్డ్ హౌస్ కు సేకరించిన ఆహారాన్ని అందించింది. అత్యంత నిరుపేదలకు, నిరాశ్రయులకు ఈ సంస్థ ఉచితంగా ఆహారాన్ని అందిస్తుంటుంది. పేదలు ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశంతో నాట్స్ సామాజిక బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో నాట్స్ నాయకులు మదన్ పాములపాటి, మూర్తి కొప్పాక, శ్రీనివాస్ బొప్పన, శ్రీనివాస్ అర్సడ, రవి శ్రీకాకుళం, కృష్ణ నిమ్మగడ్డ, ఆర్.కె. బాలినేని, లక్ష్మి బొజ్జ, వేణు కృష్ణార్ధుల, హరీశ్ జమ్ముల, బిందు విధులమూడి, భారతీ పుట్టా, వీర తక్కెళ్లపాటి, రోజా శీలం శెట్టి, కార్తీక్ మోదుకూరి, రజియ వినయ్, నరేంద్ర కడియాల, పాండు చెంగలశెట్టి తదితరులు పాల్గొన్నారు. చదవండి: ఆపి 40 వార్షిక సదస్సు వివరాలు -
ఆపి 40 వార్షిక సదస్సు
ప్రతి భారతీయుడు గర్వించేలా ఆపి (అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్) 40వ వార్షిక సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. టెక్సస్‌లోని శాన్ అంటోనియో నగరంలో జూన్ 23 నుంచి 26 వరకు ఈ వేడుకలు జరుగుతాయని ఆపి అధ్యక్షులు డాక్టర్ అనుపమ గొటిముకుల ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సదస్సు భారతీయత ఉట్టిపడేలా తీర్చిదిద్దుతున్నామని ఆమె తెలిపారు. అందుకోసం కోసం కన్వెన్షన్ చైర్ డాక్టర్ జయేష్ షా, సీఈవో అడివి వెంకీ భారతదేశంలో వైద్యవిద్యను అభ్యసించి ఉన్నత చదువులు, పరిశోధనల నిమిత్తం తొలినాళ్లలో అమెరికా వచ్చిన వాళ్లు అనేక రకాలైన వివక్షలకు గురయ్యారన్నారని తెలిపారు. మొక్కవోని ధైర్యంతో ఆ కష్టాలను అధిగమించి గౌరవంగా అమెరికా రాష్ట్రాల్లో నిలబడటానికి వైద్యులంతా కలిసి 1980 కాలంలో ఏర్పాటు చేసుకున్నదే ఆపి (అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్) అని అనుపమ గొటిముకుల తెలిపారు. ప్రస్తుతం అమెరికాలో ఫిజీషియన్స్ ప్రధానంగా ఎదుర్కుంటున్న మెడికేర్ పేమెంట్ కట్స్చి, ఇమ్మిగ్రేషన్ అంశాలలో ప్రధానమైన గ్రీన్ కార్డ్ బ్లాకేజ్ గురించి అమెరికాలోని చట్టసభల ప్రతినిధులతో ఆపి తరఫున చర్చించడం జరిగిందని ఆమె తెలిపారు. ఈ సదస్సులో విభిన్న రంగాల్లో నిష్ణాతులైన వారిని ఆహ్వానించి సత్కరిస్తున్నామని అనుపమ వెల్లడించారు. సత్కారం అందుకునే వారిలో సునీల్ గావాస్కర్ (క్రికెటర్), డాక్టర్ రాహుల్ గుప్త (డైరెక్టర్ నేషనల్ డ్రగ్ కంట్రోల్ పాలసీ), డాక్టర్ సౌజన్య మోహన్ (టెక్సస్ గ్రూప్), ప్రైమ్ హెల్త్ కేర్ సిఇఓ డాక్టర్ ప్రేమ్ కుమార్ రెడ్డి, సైంటిస్ట్ పీటర్ జె హెటెజ్, సాధ్వి భగవతి సరస్వతి, అష్టాంగయోగ పరమగురు శరత్ జాయిన్, అమెరికన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎలక్ట్ జాక్ రెస్నెక్ జూనియర్లలు ఉన్నారు. డాక్టర్ దువ్వూరుకి పురస్కారం ఆపి సంస్థకు భారతదేశంలో అత్యున్నతమైన సేవల్ని అందిస్తున్నందుకు ప్రముఖ వైద్యనిపుణులు, అపి ఓవర్సీస్ కో ఆర్డినేటర్డా క్టర్ దువ్వూరు ద్వారకానాథరెడ్డి కి స్పెషల్ సర్వీస్ అవార్డును అందించి శాన్ అంటోనియో వేదిక మీద ఘనంగా సత్కరిస్తున్నామని అధ్యక్షురాలు అనుపమ గొటిముకుల వెల్లడించారు. -
వీరే ‘ఆటా’ నవలల పోటీ విజేతలు
తెలుగు భాషా, సాహిత్యంపైన మక్కువతో అమెరికా తెలుగు సంఘం (ఆటా) నిర్వహించిన నవలల పోటీకి ప్రపంచం నలుమూలల నుండి దాదాపుగా 70 వరకూ నవలలు వచ్చాయి. అనేక పరిశీలనలూ, వడ పోతల తర్వాత ఈ దిగువ నవలలకు బహుమతి మొత్తాన్ని సమానంగా పంచాలని న్యాయనిర్ణేతలు నిర్ణయించారు. బహుమతి పొందిన నవలలు పగులు (తాడికొండ శివకుమార శర్మ, వర్జీనియా), కొంతమంది... కొన్నిచోట్ల... (వివిన మూర్తి, బెంగళూరు)గా ఉన్నాయి. విజేతలకు చెరి లక్ష రూపాయలు బహుమతిగా అందివ్వనున్నారు. ఈ రెండు నవలలను ‘ఆటా’ త్వరలో ప్రచురిస్తుంది. ఈ పోటీలో పాల్గొన్న ప్రతీ రచయితకీ, రచయిత్రికీ మా ఆటా కార్యవర్గం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. ఈ పోటీ నిర్వహణలో మాకు ఎంతో సహకరించి, న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన రమణమూర్తి, స్వాతికుమారి, అనిల్ రాయల్, పద్మవల్లి గార్లకు ప్రత్యేక ధన్యవాదాలని ఆటా పేర్కొంది. -
అట్లాంటలో ఆటా సయ్యంది పాదం
తెలుగు అసోసియేషన్ ఆఫ్ అమెరికా (ఆటా) ఆధ్వర్యంలో సయ్యంది పాదం డాన్స్ కాంపిటీషన్‌తో పాటు అందాల పోటీలను అట్లాంటా నగరంలో నిర్వహించారు. ఈ పోటీల్లో 25కి పైగా డాన్స్ గ్రూప్స్ పాల్గొన్నాయి. ఎంతో వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ సెగ్మెంట్స్ క్లాసికల్ మరియు నాన్-క్లాసికల్ విభాగాలలో టీన్స్, మిస్, మిస్సెస్ పోటీలలో చాలా మంది మహిళలు పాల్గొని సందడి చేశారు. ఈ పోటీలను బాలు వళ్లు, శ్వేతా పర్యవేక్షించారు. అందాల పోటీల నిర్వహణలో శ్రావణి రాచకుల్లా, మల్లికా దుంపల, శృతి చితూరీ మరియు ఉదయ ఏటూరి చురుకైన పాత్ర పోషించారు. ఈ పోటీలకు ముందు జ్యోతి ప్రజ్వలన అనంతరం శ్రీరామ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆటా అట్లాంటా టీంని సభకు పరిచయం చేసారు. ట్రస్టీ అనిల్ బొద్దిరెడ్డి ఆటా నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలు, ఆట మెంబెర్ బెనిఫిట్స్ సభకు వివరించారు. ఆటా పూర్వ ప్రెసిడెంట్ కరుణాకర్ అసిరెడ్డి, కో-కోర్డినేటర్ కిరణ్ పాశం, ఆటా కాన్ఫరెన్స్ అడ్వైసర్ గౌతమ్ గోలి, ట్రస్టీస్ అనిల్ బొద్దిరెడ్డి, వేణు పిసికే మరియు ప్రశీల్ రెడ్డి. ఆటా నేషనల్ కమిటీ చైర్ వెంకట్ వీరనేని, నిరంజన్ పొద్దుటూరి , జయ చందా, తిరుమల పిట్టా, శ్రీనివాస్ ఉడతా మరియు ఉమేష్ ముత్యాల పాల్గొన్నారు. ఆటా 17 వ మహా సభలలో విరివిగా పాల్గోవాలిసిందిగా కో-కోర్డినేటర్ కిరణ్ పాశం, అట పూర్వ ప్రెసిడెంట్ కరుణాకర్ అసిరెడ్డి మరియు గౌతమ్ గోలి పిలుపునిచ్చారు. అత్య అద్భుతమైన ప్రతిభ పాటవాలు ప్రదర్శించిన వారికి లీడర్షిప్ టీం ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేసింది. కార్యక్రమంలో పాల్గొన్న వారికి మొమెంటోస్ అందచేశారు. విజేతలు వాషింగ్టన్ డీసీ కార్యకరంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి తోడ్పాటుని అందించిన ప్రతి ఒక్కరికి ఆటాకాన్ఫరెన్స్ కో-కోర్డినేటర్ కిరణ్ పాశం ధన్యవాదాలు తెలియచేశారు. నిర్వాహకులు సయ్యంది పాదం చైర్ సుధా కొండెపు, అడ్వైసర్ రామకృష్ణ అలె, కో చైర్స్ భాను, రాంరాజ్, అందాల పోటీలు చైర్ నీహారిక నవల్గా కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. చదవండి: మన చాయ్ పానీ ముందు..పిజ్జా, బర్గర్లు జుజుబీ అనాల్సిందే! -
ఎవరీ రాధా అయ్యంగార్? ఎందుకు వార్తల్లో వ్యక్తి అయ్యారు??
అమెరికాలో ఒక్కసారిగా వార్తల్లో నానుతున్న వక్తిగా రాధా అయ్యంగార్ నిలిచారు. ఈ ఇండో అమెరికన్ మహిళను కీలక పదవిలోకి తీసుకోవాలనే భావనలో వైట్‌హౌజ్ ఉండటంతో ఒక్కసారిగా ఈమె పేరు తెరమీదకు వచ్చింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక పదవికి ఆమె పేరును జూన్ 15న నామినేట్ చేశారు. అమెరికా రక్షణ వ్యవహరాలను పర్యవేక్షించే పెంటగాన్‌లో కీలక స్థానాలకు ఐదుగురి పేర్లను అమెరికన్ ప్రెసిడెంట్ జోబైడెన్ ప్రతిపాదించారు. దానిలో సెక్యూరిటీ విభాగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న రాధ అయ్యంగార్ ప్లంబ్ కూడా ఉన్నారు. ఆమెను డిప్యూటీ అండర్ సెక్రటరీ ఫర్ డిఫెన్స్ పోస్టుకు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం రాధా అయ్యంగార్ డెప్యూటీ సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్‌లో చీఫ్ ఆఫ్ స్టాఫ్ హోదాలో పని చేస్తున్నారు. ప్రభుత్వ సర్వీసుల్లోకి వెళ్లక ముందు గూగుల్, ఫేస్బుక్ వంటి టెక్ దిగ్గజ కంపెనీలో రాధ పని చేశారు. గూగుల్‌లో రీసెర్చ్ విభాగంలో ఆమె పని చేశారు. ఆ తర్వాత సోషల్ మీడియాకు కొత్త అర్థం చెప్పిన ఫేస్బుక్లో పాలసీ అనాలిసిస్ గ్లోబల్ హెడ్ కొనసాగారు. అంతకు ముందు ఆమె ఎకనామిస్ట్‌గా కూడా అనుభవం గడించారు. హర్వార్డ్, ప్రిన్స్టన్ వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ఆమె చదువుకున్నారు. చదవండి: Sopen Shah: అటార్నీగా భారత సంతతి మహిళ.. నామినేట్ చేసిన బైడెన్ -
న్యూజెర్సీ లో ఘనంగా ‘‘ఆటా’’ సయ్యంది పాదం నృత్య పోటీలు
అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 17వ మహాసభలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ మహాసభలలో భాగంగా న్యూజెర్సీలో ఆటా సయ్యంది పాదం నృత్య పోటీలను భారీ స్థాయిలో నిర్వహించారు. కూచిపూడి, భరత నాట్యం, జానపదం ఫిల్మ్ విభాగాలలో చాలా నాణ్యమైన ప్రదర్శనలతో ఈ పోటీలు అత్యంత ఉత్సాహంగా జరిగాయి. ఈ కార్యక్రమాన్ని న్యూజెర్సీ సయ్యంది పాదం ఇంచార్జీలు ఇందిరా దీక్షిత్, మాధవి అరువ గారి ఆధ్వర్యంలో గొప్పగా జరిగాయి. మ్యూజిక్ ఆడియో సిస్టంను ఏర్పాటు చేసిన రాజ్ చిలుముల, కాన్ఫరెన్స్ డైరెక్టర్ రఘువీర్ రెడ్డిలు విజేతలను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అద్భుతమైన ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన న్యూజెర్సీ సయ్యంది పాదం బృందానికి అభినందనలు తెలిపారు. సక్సెస్ చేయడంలో.. వర్జీనియా నుండి న్యూ జెర్సీకు వచ్చిన సయ్యంది పాదం ఛైర్ సుధారాణి కొండపు, కో-ఛైర్ భాను మాగులూరి గారికి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. వాలంటీర్లకు, న్యూజెర్సీ ఆటా టీమ్ రాజ్ చిలుముల, రీజినల్ కోఆర్డినేటర్ సంతోష్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఆటా బృందం ప్రతి విభాగంలో విజేతలకు సర్టిఫికెట్లు, మెమోంటోలను అందించారు. ఈ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అవడానికి ఇందిరా దీక్షిత్, మాధవి అరువ, నందిని దార్గుల, వాణి అనుగుల, రాజ్ చిలుముల, రఘువీర్ రెడ్డి , సంతోష్ రెడ్డి, శరత్ వేముల , విజయ్ కుందూరు, మహీందర్ రెడ్డి ముసుకు, రవీందర్ గూడూరు , శ్రీకాంత్ గుడిపాటి , శ్రీనివాస్ దార్గుల, శైల మండల ,బిందు, వినోద్ కోడూరు, రామ్ రెడ్డి వేముల, శివాని, విజయ ,ప్రవీణ్, నిహారిక , అపర్ణ, ప్రదీప్ కట్ట , విలాస్ రెడ్డి జంబులతో పాటు మిగితా వలంటీర్లు కృషి చేసారు. వివిధ రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం విజయవంతంగా జరగడం పట్ల సయ్యంది పాదం పోటీల ఛైర్ సుధా కొండపు, సలహాదారు రామకృష్ణారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. సంబంధిత కార్యక్రమాలను విజయవంతం చేసినందుకు స్థానిక కోఆర్డినేటర్లందరికీ ధన్యవాదాలు తెలిపారు. విజేతల వివరాలు సోలో నాన్ క్లాసికల్ సీనియర్ – నేహా రెడ్డి వంగపాటి, సోలో నాన్ క్లాసికల్ జూనియర్ – సంజన నూకెళ్ల, సోలో సీనియర్ క్లాసికల్ – మెగానా మధురకవి, సోలో జూనియర్ క్లాసికల్ – జాన్వీ ఇరివిచెట్టి, నాన్ క్లాసికల్ గ్రూప్ జూనియర్ – నిషా స్కూల్ ఆఫ్ డ్యాన్స్, నాన్ క్లాసికల్ గ్రూప్ సీనియర్ – శైలా మండల స్కూల్ ఆఫ్ డాన్స్, గ్రూప్ జూనియర్ – చార్వి పొట్లూరి, శ్రీనికా కృష్ణన్లు ఉన్నారు. ఆటా 17వ కన్వెన్షన్ ఆటా 17వ కన్వెన్షన్, యూత్ కాన్ఫరెన్స్‌ను వాల్టర్ ఈ కన్వెన్షన్ సెంటర్లో జూలె 1 నుంచి 3 వరకు వాషింగ్టన్ డీసీలో అంగరంగ వైభవంగా జరగనుంది. ఆటా అధ్యక్షుడు భువనేష్ బూజాల, కాన్ఫరెన్స్ కన్వీనర్ సుధీర్ బండారు, బోర్డు ఆఫ్ ట్రస్టీలు వివిధ కమిటీల ఆధ్వర్యములో అమెరికా తెలుగు సంఘం (ఆటా) 17వ మహాసభలు జరగబోతున్నాయి. కావున తెలుగువారందరూ ఈ మహాసభలకు హాజరై, భారీ స్థాయిలో విజయవంతం చేయాలని ఆటా ప్రతినిధులు కోరారు. ఇళయరాజ సంగీత విభావరి మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా తన మొత్తం ట్రూప్ తో జూలై 3న గ్రాండ్ ఫినాలేలో ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి సద్గురు జగ్గీ వాసుదేవ్ హాజరుకానున్నారు. విజయ్ దేవరకొండ, డీజే టిల్లు ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ, రకుల్ ప్రీత్ సింగ్, రామ్ మిర్యాల, మంగ్లీ, కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, క్రిస్ గేల్, రెండు తెలుగు రాష్ట్రాల నుండి అనేక మంది రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు ఈ వేడుకకు విచ్చేయనున్నారు. సంగీత దర్శకుడు తమన్ జూలై 2న సంగీత కచేరీలో ప్రేక్షకులను అలరించనున్నారు. చదవండి: న్యూజెర్సీలో ‘తెలంగాణ’ ఉట్టిపడేలా ఉత్సవాలు -
గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న పాతబస్తీ మహిళలు.. సాయం కోసం..
భవిష్యత్తుపై గంపెడాశలతో గల్ఫ్ బాట పడుతున్న వలస కార్మికులకు నీడలా కష్టాలు వెంటాడుతున్నాయి. అవగాహాన లేమి, ట్రావెల్ ఏంజెట్ల మోసాలు, పనికి పిలిపించుకున్న యజమానుల కక్కుర్తి.. వెరసి వలస కార్మికుల జీవితాలను పెనం మీద నుంచి పొయ్యిలో పడేస్తున్నాయి. తాజాగా పాతబస్తీకి చెందిన ముగ్గురు మహిలా కార్మికులు పరాయి దేశంలో చిక్కుకుని... యజమానులు చూపించే నరకం నుంచి బయట పడేయాలంటూ మొరపెట్టుకున్నారు. - సౌదీ అరేబియాలో బ్యూటీ పార్లర్లో ఉద్యోగం ఉందంటూ భర్త చెప్పిన మాటలు విని మెహరున్నీసా విమానం ఎక్కింది. నెలకు రూ.35,000ల వరకు వేతనం వస్తుందని చెప్పడంతో సౌదీకి రెడీ అయ్యింది. రియాద్‌కి చేరుకునే సమయానికి తీవ్ర అనారోగ్యం పాలైంది. అక్కడ సరైన ఆశ్రయం, తిండి లభించకపోవడంతో ఆరోగ్యం మరింతగా క్షీణించింది. తనను వదిలేస్తే ఇండియాకి తిరిగి వెళ్తానంటూ చెబితే రూ.2 లక్షలు కడితే కానీ వదిలిపెట్టమంటూ యజమాని హుకుం జారీ చేశారు. దీంతో తనను కాపాడాలంటూ ఆమె వీడియో సందేశాన్ని పంపింది. - రిజ్వానా బేగం అనే మహిళ నెలకు రూ.25 వేల వేతనం మీద మెయిడ్‌గా పని చేసేందుకు గల్ఫ్‌కి వెళ్లింది. కనీసం మనిషిగా కూడా గుర్తించకుండా రోజుల తరబడి తిండి పెట్టకుండా వేధించడం, సరైన వసతి కల్పించకుండా నిత్యం నరకం చూపిస్తున్నారు యజమానులు. ఇదేంటని ట్రావెల్ ఏజెన్సీని ప్రశ్నిస్తే.. ఇండియాకు తిరిగి వెళ్లాంటే రూ.2.50 లక్షలు చెల్లించాలు చెప్పారు. దీంతో సాయం అర్థిస్తూ ఆమె ఇండియన్ ఎంబసీ అధికారులకు లేఖ రాసింది. - హసీనా బేగం వలస కార్మికురాలిగా కువైట్‌కి చేరుకుంది. అయితే అక్కడకు వెళ్లిన తర్వాత వెన్నుపూసలో సమస్య తలెత్తింది. దీంతో అక్కడ ఉండలేనంటూ తనను ఇండియాకు తీసుకురావాలంటూ కుటుంబ సభ్యుల ద్వారా మొరపెట్టుకుంది. విదేశాల్లో వలస కార్మికులు పడుతున్న కష్టాలపై కేంద్రం స్పందించింది. ఆయా దేశాలకు చెందిన ఎంబసీ అధికారుకుల సమస్యలను వివరించింది. వారికి ఇబ్బంది రాకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరింది. అవసరం అయితే వారిని ఇండియాకు రప్పించే ఏర్పాటు చేయాలంది. చదవండి: వలస కార్మికుల మెడపై దేశ బహిష్కరణ కత్తి -
‘స్టాన్ఫోర్డ్’ టాప్ సైంటిస్టుల జాబితాలో భారతీయుడికి చోటు
ఉమ్మడి వరంగల్‌కి చెందిన ప్రముఖ సైంటిస్ట్ డాక్టర్ సాంబారెడ్డికి అరుదైన గౌరవం లభించింది. అమెరికాకు చెందిన ప్రఖ్యాత స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ తాజాగా ప్రకటించిన ప్రకటించిన టాప్ సైంటిస్టుల జాబితాలో ఆయనకు చోటు దక్కింది. ప్రస్తుతం ఆయన టెక్సాస్‌లోని ఏ ఏండ్ ఎం యూనివర్సిటీ కాలేజ్ ఆప్ మెడిసన్‌లో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. ఇప్పటికే ఆయన ప్రొలిఫిక్ మెడికల్ ఇన్వెంటర్, ఫార్మా రీసెర్చర్‌గా గుర్తింపు పొందారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పరకాల మండలం చర్లపల్లిలో డాక్టర్ దూదిపాల సాంబారెడ్డి జన్మించారు. ఆ తర్వాత కాకతీయ వర్సిటీలో ఫార్మాసీ విద్యాను పూర్తి చేసి ఉన్నత విద్యకోసం అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఫార్మా రంగంలో ఆనేక ఆవిష్కరణలను ఆయన చేశారు. న్యూరోథెరాప్యూటిక్స్‌లో ఆయన గ్లోబల్ లీడర్‌గా ఉన్నారు. ఇప్పటి వరకు 215 సైంటిఫిక్ పేపర్లను ప్రచురించగా 100 మందికి పైగా స్కాలర్లకు గైడ్‌గా వ్యవహరించారు. అంతేకాదు 400ల వరకు ప్రెజెంటేషన్లకు ఆయన సహాకారం అందించారు. న్యూరోథెరాప్యూటిక్స్‌లో విభాగంలో విశేష కృషి చేసిన డాక్టర్ సాంబారెడ్డి బ్రెయిన్ డిసార్డర్లకు న్యూరో స్టెరాయిడ్ థెరపీని అభివృద్ధి చేశారు. మెదడు సంబంధిత వ్యాధులకు సంబంధించిన చికిత్సను మెరుగుపరచడంలో ఈ న్యూరో స్టెరాయిడ్ థెరపీ ఎంతగానో ఉపకరించింది. పోస్టపార్టమ్ డిప్రెషన్‌కి సంబంధించి డాక్టర్ సాంబారెడ్డి అభివృద్ధి చేసిన బ్రెక్సానోలెన్ ఔషధం అమెరికా తరఫున ఎఫ్‌డీఏ అనుమతి పొందిన తొలి మెడిసిన్‌గా గుర్తింపు పొందింది. అదే విధంగా ఎపిలెప్పీకి సంబంధించి గానాక్సోలోన్ కూడా ఉంది. న్యూరో సంబంధిత విభాగంలో చేసిన కృషికి గాను డాక్టర్ సాంబారెడ్డికి అనేక అవార్డులు వరించాయి. చదవండి: అటార్నీగా భారత సంతతి మహిళ.. నామినేట్ చేసిన బైడెన్ -
న్యూజెర్సీలో ‘తెలంగాణ’ ఉట్టిపడేలా ఉత్సవాలు
తెలంగాణా అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ) మొదటిసారిగా నిర్వహించిన సోలో మెగా కన్వెన్షన్ ఘనంగా జరిగింది. న్యూజెర్సీ ఎక్స్పో & కన్వెన్షన్ సెంటర్లో మే 27 నుంచి 29 వరకు జరిగిన ఈ మెగా ఈవెంట్ ప్రేక్షకులతో గ్రాండ్ సక్సెస్ అయింది. వివిధ కేటగిరీల కింద పలువురికి అవార్డులు అందచేశారు. సాంస్కృతిక విందులు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ఫ్యాషన్ షోలు మెగా ఈవెంట్‌కు రంగులద్దాయి. విందు రాత్రి ముగింపులో సంగీత దర్శకుడు కోటి ట్రూప్ చేపట్టిన కార్యక్రమం ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా తెలంగాణ గర్వకారణమైన బతుకమ్మ, బోనాలు, పోతరాజులతో టీటీఏ మెగా కన్వెన్షన్‌ను అధికారికంగా ప్రారంభించారు. కన్వెన్షన్ సెంటర్ ముఖద్వారాన్ని చార్మినార్, కాకతీయ కళా తోరణం, తెలంగాణ తల్లి, ఆరు అడుగుల బతుకమ్మ, సమ్మక్క, సారక్కల ప్రతిరూపాలతో ఉత్సవ కమిటీ చక్కగా అలంకరించింది. ఈ కార్యక్రమంలో న్యూజెర్సీ స్థానిక సెనేటర్లు సామ్ థామ్సన్, ఈస్ట్ బ్రున్స్విక్ మేయర్ బ్రాడ్ కోహెన్, తెలంగాణ మంత్రులు మరియు రాజకీయ నాయకులు ఈ వేడుకల్లో భాగమయ్యారు. ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో డాక్టర్ మల్లారెడ్డి పైళ్ల ఆధ్వర్యంలో డాక్టర్ విజయపాల్‌రెడ్డి, డాక్టర్ హరనాథ్ పొలిచెర్ల, టీటీఏ అధ్యక్షుడు డాక్టర్ మోహన్‌రెడ్డి పట్లోళ్ల, కన్వీనర్ శ్రీనివాస్ గనగోని, అధ్యక్షుడు ఎలెక్ట్ వంశీరెడ్డి, కోఆర్డినేటర్ గంగాధర్ వుప్పల, కన్వెన్షన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డు ఆఫ్ డైరెక్టర్లు, ఈర్వీపీలు, స్టాండింగ్ కమిటీలు, ప్రాంతీయ కో-ఆర్డినేటర్లు కృషి చేశారు. యునైటెడ్ స్టేట్స్‌లోని ప్రతి మూలకు చెందిన వాలంటీర్లు గత రెండు దశాబ్దాల చరిత్రలో అత్యుత్తమ మెగా కన్వెన్షన్‌ను అందించడానికి ఆరు నెలలకు పైగా తమ వ్యక్తిగత సమయాన్ని వెచ్చించారు. తెలంగాణపై అలంకరణలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలతో కన్వెన్షన్ అంతటా తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించడంలో టీటీఏ విజయవంతమైంది. చదవండి: పెట్రోల్‌పై డిస్కౌంట్! యూఎస్‌లో ఆకట్టుకుంటున్న భారతీయుడు -
పెట్రోల్‌పై డిస్కౌంట్! యూఎస్‌లో ఆకట్టుకుంటున్న భారతీయుడు
అమెరికాలోని ఆరిజోనా రాష్ట్రంలో ఫోనిక్స్‌లో నివసించే జస్విందర్ సింగ్ నిన్నా మొన్నటి వరకు ఎవ్వరికీ పెద్దగా తెలియదు. కానీ ఇప్పుడతను అమెరికాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. ఎంతో మంది అతని గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏం పని చేయడం ద్వారా అతని ఖ్యాతి ఎల్లలు దాటిందనే సందేహం వస్తోందా.... గడిచిన ఆరు నెలలుగా పెట్రోలు ధరలు భగ్గుమంటున్నాయి. ముఖ్యంగా ఉక్రెయిన్ - రష్యా వార్ మొదలైన తర్వాత అయితే ఆకాశమే హద్దుగా పెట్రోలు/డీజిల్ రేట్లు పెరిగాయ్. ప్రభుత్వాలు సైతం సబ్సిడీలు భరించలేక ప్రజల నెత్తినే భారం మోపాయి. కరోనా కష్టకాలం ఆ తర్వాత ఫ్యూయల్ రేట్ల దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం రెక్కలు విప్పింది. ఉప్పు పప్పు మొదలు అన్నింటి ధరలు పెరిగాయ్. డిస్కౌంట్లో పెట్రోల్ అరిజోనాలోని ఫోనిక్స్ దగ్గర జస్విందర్ సింగ్ ఓ పెట్రోల్‌పంప్ (గ్యాస్ స్టేషన్) నిర్వహిస్తున్నాడు. ద్రవ్యోల్బణం ఎఫెక్ట్‌తో అన్ని వస్తువుల ధరలు పెరిగితే... జస్విందర్ బంకులో మాత్రం ప్యూయల్‌పై డిస్కౌంట్ ప్రకటించారు. ప్రస్తుతం అమెరికాలోని ఆరిజోనాలో బ్యారెల్ ఫ్యూయల్ ధర 5.66 డాలర్లు ఉండగా జస్విందర్ ప్రతీ గ్యాలన్పై 47 సెంట్ల డిస్కౌంట్ ప్రకటించాడు. నష్టాలు వచ్చినా జస్విందర్ బంకులో ప్రతీరోజు సగటున వెయ్యి గ్యాలన్ల ఫ్యూయల్ అమ్ముడవుతోంది. ఈ లెక్కన ప్రతీరోజు బంకుకి 500 డాలర్ల (రూ.39 వేలు) వరకు నష్టం వస్తోంది. మార్చి నుంచి జస్విందర్ ఈ డిస్కౌంట్ ప్రకటించాడు. ఆ తర్వాత ఫ్యూయల్ రేట్లు పెరిగినా.. తన డిస్కౌంట్ ఆఫర్‌ను మాత్రం కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. మొదట్లో ఇదేదో పబ్లిసిటీ స్టంట్ అనుకున్నారు. కానీ ఫ్యూయల్ రేట్లు భగ్గుమంటున్నా నెలల తరబడి జస్విందర్ ఇచ్చిన మాట మీద నిలబడటంతో క్రమంగా అందరికీ జస్విందర్ నిజాయితీపై నమ్మకం పెరిగింది. అది అభిమానంగా మారింది. అమ్మనాన్నల స్ఫూర్తితో నష్టాలతో బంకును నిర్వహించడంపై ఎవరైనా జస్వంత్‌ని ప్రశ్నిస్తే... ‘ ఉన్నదాంట్లో పక్కవారికి సాయపడమంటూ మా అమ్మానాన్నలు నాకు నేర్పారు. నేను ఈ గ్యాస్ స్టేషన్ కారణంగానే జీవితంలో స్థిరపడ్డాను. పక్కవారికి సాయపడే స్థితిలో ఉన్నాను. అందుకే పెరిగిన ధరలతో ఇబ్బంది పడుతున్న వారికి సాయంగా ఉండాలని ఈ డిస్కౌంట్ ఆఫర్‌ను కొనసాగిస్తున్నాను’ అని తెలిపాడు జస్వంత్. సాహో జస్వంత్ మధ్యలో నష్టాలు అధికంగా వచ్చినప్పుడు గ్యాస్ స్టేషన్‌కి అనుబంధంగా ఉన్న స్టోరులో జస్వంత్ సింగ్ అతని భార్య ఎక్కువ గంటలు పని చేయడం ద్వారా ఆ నష్టాన్ని భరించగలుగుతున్నట్టు జస్విందర్ తెలిపారు. వ్యాపారం అంటే లెక్కలు లాభాలే చూసుకునే రోజుల్లో తోటి వారికి సాయం చేసే తలంపుతో ముందుకు సాగుతున్న జస్విందర్ గురించి తెలుసుకున్న అమెరికన్లకే కాదు యావత్ లోకం హ్యాట్సాఫ్ చెబుతోంది. చదవండి: అటార్నీగా భారత సంతతి మహిళ.. నామినేట్ చేసిన బైడెన్ -
వలస కార్మికుల మెడపై దేశ బహిష్కరణ కత్తి
నుపూర్ శర్మ బాధ్యతారాహిత్యంగా చేసిన వ్యాఖ్యలు విదేశాల్లో బతుకుతున్న వలస కార్మికులకు కొత్త కష్టాలను తెచ్చి పెట్టాయి. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో ఉన్న వారి భవిష్యత్తును అగమ్యగోచరంలో పడేశాయి. ఇందుకు సంబంధించిన ప్రకంపనలు ముందుగా కువైట్‌లో మొదలయ్యాయి. నుపూర్ శర్మ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా దుమారం రేపిన విషయం విదితమే. దీనిపై గల్ఫ్ దేశాధినేతలు తమ అభిప్రాయాలను భారత రాయబారులకు తెలిపారు. ఖతార్ లాంటి దేశాల్లో భారత వస్తువులను నిషేధించాలనే దాక వ్యవహారం వెళ్లింది. ఇంతలో భారత ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. అయితే గల్ఫ్ దేశాలు తమ ఆగ్రహాన్ని అదుపులో పెట్టుకోవడంలో విఫలం కావడంతో భారత ప్రభుత్వం కూడా దౌత్యపరంగా కౌంటర్ ఎటాక్ స్టార్ట్ చేయడంతో గల్ఫ్ దేశాలు పునరాలోచనలో పడ్డాయి. నుపూర్‌శర్మ వ్యాఖ్యలను నిరసిస్తూ గల్ఫ్ దేశాల్లో కూడా నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనకపోతే ఏమవుతుందో ఏమో అనే భయంతో కొందరు, నుపూర్ వ్యాఖ్యలను నొచ్చుకున్న మరికొందరు వలస కార్మికులు కూడా ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ర్యాలీలు చేశారు. నినాదాలు వినిపించారు. ఇప్పుడు ఇలా ధర్నా కార్యక్రమాల్లో పాల్గొన్న వలస కార్మికులను కువైట్ ప్రభుత్వం టార్గెట్ చేసింది. అక్కడి చట్టాల ప్రకారం వలస కార్మికులకు నిరసన కార్యక్రమాల్లో పాల్గొనే హక్కు లేదంటూ పేర్కొంది. నిబంధనలు ఉల్లంఘించిన వలస కార్మికులను వెంటనే గుర్తించి వారి దేశాలకు పంపించి వేస్తామంటూ హుకుం జారీ చేసింది. అంతేకాదు వారు భవిష్యత్తులో కువైట్‌లో పని చేసుకునే అవకాశం ఇవ్వబోమంటూ తేల్చి చెప్పింది. ఈ మేరకు నిరసనలో పాల్గొన్న వలస కార్మికులను గుర్తించే పని మొదలెట్టింది. కువైట్‌లో ఇండియాతో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఫిలిప్పీన్ దేశాలకు చెందిన కార్మికులు పని చేస్తున్నారు. అయితే వీరిలో భారతీయులే అధికం. ప్రస్తుతం కువైట్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వలస కార్మికుల భవిష్యత్తు ప్రమాదంలో పడింది. అప్పులు చేసి అక్కడికి చేరుకున్న వారిని ఉన్న పళంగా వెనక్కి పంపిస్తే వారి కుటుంబాలు మరింత చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది. చదవండి: సౌదీలో దుబ్బాక వాసి మృతి.. మమ్మీ నాన్న రాడా అంటూ.. -
ఆహా ! అనిపించిన ఫుడ్ ఆర్ట్ ఎగ్జిబిషన్
న్యూయార్క్: అందరూ అన్ని బొమ్మలు గీస్తారు.. కానీ ఆమె బొమ్మలు చాలా చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఆమె బొమ్మలు చూస్తే మీకు నోరు ఊరుతుంది.. తెలంగాణకు చెందిన మన తెలుగుబిడ్డ అమెరికాలో ఏర్పాటుచేసిన ఆర్ట్ ఎగ్జిబిషన్ ఆహుతుల చేత ఆహా అనిపించుకుంది. న్యూజెర్సీలో ఉంటున్న సరస్వతీ టీకే ఎప్పుడూ సరికొత్తగా ఆలోచిస్తూ ఉంటుంది. అమెరికాలో ఫుడ్ ఆర్ట్‌కు మంచి క్రేజ్ ఉంది. అయితే ఆ ఫుడ్ ఆర్ట్స్ అంతా అమెరికన్ ఫుడ్స్ మీదే ఉంటాయి. అసలు మనం కూడా మన తెలుగు వంటకాలను, భారతీయ వంటకాలపై బొమ్మలు వేస్తే ఎలా ఉంటుంది..? మన వంటకాలు కూడా తెలియని వాళ్లకు కచ్చితంగా తెలుస్తాయి కదా..! ఇలాంటి ఆలోచనలతో మన ఆహార సంస్కృతిని కూడా విదేశీయులకు సరికొత్తగా పరిచయం అవుతుందనే భావనతో సరస్వతీ టీకే మన భారతీయ ఆహార చిత్రాలపై దృష్టి పెట్టింది. ఎంతో కళాత్మకంగా, సృజనాత్మకంగా ఫుడ్ ఐటమ్స్ చిత్రాలు గీసి చక్కటి రంగులు అద్దింది. అవి బొమ్మలా..? నిజమైనవా అనే రీతిలో ఆ చిత్రాలను రూపుదిద్దింది. ఇలా తన అభిరుచితో వేసిన చిత్రాలన్నింటితో సరస్వతి ఓ ఆర్ట్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది. సృజనాత్మకతను నిత్యం ప్రోత్సాహించే నాట్స్ బోర్డు చైర్ విమెన్ అరుణ గంటి ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. మన భారతీయ సంస్కృతిని, ఆహారపు అలవాట్లను విశ్వవ్యాప్తం చేయాలంటూ సరస్వతి టీకేని నాట్స్ చైర్ వుమన్ అరుణ గంటి ప్రోత్సహించారు. నాట్స్ బోర్డ్ అఫ్ డైరెక్టర్ రాజ్ అల్లాడ కూడా ఎగ్జిబిషన్ తిలకించారు. చదవండి: న్యూజిలాండ్‌లో తెలుగు సాహితీ సదస్సు -
ఫిలడెల్ఫియాలో నాట్స్ దాతృత్వం
ఫిలడెల్ఫియా: భాషే రమ్యం.. సేవే గమ్యం అనే నినాదానికి తగట్టుగా అమెరికాలో అనేక సేవా కార్యక్రమాలను నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ (నాట్స్)చేపడుతోంది. అందులో భాగంగా ఫిలడెల్ఫియా చాఫ్టర్ లో నాట్స్ విభాగం పేదల ఆకలి తీర్చేందుకు ముందడుగు వేసింది. నాట్స్ బోర్డ్ మాజీ ఛైర్మన్ శ్రీథర్ అప్పసాని, నాట్స్ ప్రోగ్రామ్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ హరినాథ్ బుంగటావుల చొరవతో ఫిలడెల్ఫియాలో లార్డ్స్ ఫ్యాంట్రీ, డౌనింగ్ టౌన్‌కు 6,282 డాలర్లను విరాళంగా అందించారు. పేదల ఆకలి తీర్చే లార్డ్ ఫ్యాంట్రీకి విరాళాలు ఇచ్చేందుకు నాట్స్ సభ్యులు, వాలంటీర్లు ఎంతో ఉత్సాహంగా ముందుకొచ్చారు. నాట్స్ ఇలా సేకరించిన 6,282 డాలర్ల మొత్తాన్ని లార్డ్స్ ఫ్యాంట్రీ డౌనింగ్ టౌన్‌కి విరాళంగా అందించింది. ఈ కార్యక్రమంలో నాట్స్ నేషనల్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ రామ్ కొమ్మనబోయిన, ఫిలడెల్ఫియా నాట్స్ కో ఆర్డినేటర్ అరవింద్ పరుచూరి, జాయింట్ కో ఆర్డినేటర్ శ్రీకాంత్ చుండూరి, రామకృష్ణ గొర్రెపాటి, రవి ఇంద్రకంటి, మధు కొల్లి, కీలక పాత్ర పోషించారు. ఈ విరాళాల సేకరణ కార్యక్రమానికి తెలుగు అసోషియేషన్ ఆఫ్ గ్రేటర్ డెలివర్ వ్యాలీ ప్రెసిడెంట్ ముజీబుర్ రహమాన్, సంయుక్త కార్యదర్శి మధు బుదాటి, సంయుక్త కోశాధికారి సురేష్ బొందుగుల, కమిటీ సభ్యులు రమణ రాకోతు, సుదర్శన్ లింగుట్ల, గౌరీ కర్రోతు తదితరులు తమ పూర్తి సహకారాన్ని అందించారు. ఈ కార్యక్రమానికి సహకారం అందించిన మరికొందరిలో సర్ఫర్ హరి, లావణ్య మోటుపల్లి, బావర్చి బిర్యానీ శ్రీధర్, సుధ అప్పసాని, డివైన్ ఐటీ సర్వీసెస్ రాధిక బుంగటావుల, లావణ్య బొందుగుల, సునీత బుదాటి, కమల మద్దాలి, వంశీధర ధూళిపాళ, సతీష్, కవిత పాల్యపూడి, విజయ్, అంజు వేమగిరి, రవి, రాజశ్రీ జమ్మలమడక, సరోజ, శ్రీనివాస్ సాగరం, భార్గవి రాకోతు, లవకుమార్, సునీత ఇనంపూడి, నీలిమ , సుధాకర్ వోలేటి, బాబు, హిమబిందు మేడి, లక్ష్మి ఇంద్రకంటి, నెక్స్ట్ లెవెల్ ఫైనాన్సియల్ అడ్వైజర్స్, మూర్తి చావలి, హరిణి గుడిసేవ, దీప్తి గొర్రెపాటి, దీక్ష కొల్లి, లలిత, శివ శెట్టి, మూర్తి , వాణి నూతనపాటి, దీపిక సాగరం , వినయ్ మూర్తి, అపర్ణ సాగరం, నిఖిల్ చిన్మయ వంటి పలువురు తమ ధాతృత్వం చాటుకున్నారు. ఈ సందర్భంగా నాట్స్ చైర్ వుమన్ అరుణ గంటి, నాట్స్ నూతన అధ్యక్షుడు నూతి బాపయ్య చౌదరి(బాపు) దాతలను అభినందించారు. చదవండి: అరిజోన రాష్ట్రంలో ఆటా ఫీనిక్స్ టీం ప్రారంభం -
అరిజోన రాష్ట్రంలో ఆటా ఫీనిక్స్ టీం ప్రారంభం
అమెరికన్ తెలుగు అసోసియేషన్ వారు నూతనంగా ఫీనిక్స్, అరిజోన, టీం ఆరంభించారు. జూన్ 5న అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో దాదాపు 400 పైగా తెలుగు వారు పాల్గొన్నారు. ఆటా ప్రెసిడెంట్ భువనేశ్ బుజాల, సెక్రటరీ హరి ప్రసాద్ రెడ్డి లింగాల ముఖ్య అతిధులుగా వచ్చారు. ఈ కార్యక్రంలో చిన్నారులు, పెద్దలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన డ్యాన్స్, పాటల పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విజేతలకు బహుమతులు అందచేశారు. ఆటా ప్రెసిడెంట్ భువనేశ్ బుజాల మాట్లడుతూ.. ఫీనిక్స్ లోకల్ టీం సేవలు కొనియాడారు. వందమందికి పైగా కొత్త సభ్యులు చేరటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రఘు గాడి, రీజినల్ కోఆర్డినేటర్, శేషిరెడ్డి గాదె కో-చైర్ అట స్పోర్ట్స్ ,వంశీ ఏరువారం, ఆర్సీ చెన్నయ్య మద్దూరి ఆర్.సి., బిందా కిరణ్ ఈవెంట్ కోఆర్డినేటర్ కొత్తగా మెంబెర్స్ చేర్పించటంలో ఎంతో తోడ్పాటుని అందించారని తెలిపారు. ఆటా సెక్రటరీ హరి ప్రసాద్ రెడ్డి లింగాలమాట్లాడుతూ భవిష్యత్తులో ఈ టీం మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు, ఆర్గనైజింగ్ టీం సభ్యులు శిల్ప పెనెత్స, రేఖ రెడ్డి ,మదన్ గోపాల్ బొల్లారెడ్డి , ఋక్కు మిల, అనుదీప్ యాపల,సుదర్శన్ మాచుపల్లి, ప్రసాద్ తాటికొండ, ప్రశాంత్ గంగవల్లి , విజయ్ కందుకూరి తదితరులుని అభినందించారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా నివేదిత గాడి, భార్గవి మహీధర్, కిరణ్మయి జ్యోతుల, నీరజ వ్యవరించారు. చదవండి: డాలస్‌లో శ్రీనివాసుడి కల్యాణం -
అయ్యో అఖిల్.. నెలక్రితం జర్మనీలో మృతి..
న్యూశాయంపేట: వరంగల్‌లోని కరీమాబాద్‌కు చెందిన కడారి అఖిల్(26) మృతదేహం గురువారం ఉదయం కరీమాబాద్ నగరానికి చేరుకుంది. అఖిల్ జర్మనీలోనిలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. గత నెల 8న స్నేహితులతో కలిసి అక్కడి నదికి ఈతకు వెళ్లి గల్లంతయ్యాడు. ఆ తర్వాత వారానికి అఖిల్ మృతదేహం లభ్యమైంది. భారత ఎంబసీ అధికారులు కుటుంబీకులకు సమాచారమిచ్చి మృతదేహాన్ని ఇండియాకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. గురువారం ఉదయం అఖిల్ మృతదేహం హైదరాబాద్ ఏయిర్‌పోర్ట్‌కు చేరుకుంది. కుటుంబ సభ్యులు అక్కడి నుంచి మృతదేహాన్ని వరంగల్ తీసుకొచ్చారు. విగతజీవిగా మారిన అఖిల్‌ను చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. అంబేడ్కర్ యువజన సంఘం అధ్యక్షుడు బొమ్మల అంబేడ్కర్ నివాళులర్పించారు. ఆయన వెంట కడారి కుమార్, నీలం మల్లేశం, శంకర్, భిక్షపతి, రాంప్రసాద్, అశోక్, సాంబయ్య, కుమారస్వామి, సురేశ్ తదితరులు ఉన్నారు. చదవండి: సౌదీలో దుబ్బాక వాసి మృతి.. మమ్మీ నాన్న రాడా అంటూ.. -
తానా తెలుగు తేజం పోటీలు విజేతల ప్రకటన
డాలాస్ : ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో నర్విమచిన తెలుగు తేజం భాషా పటిమ పోటీలకు సంబంధించిన విజేతలను ప్రకటించారు. ఈ పోటీలు తానా - తెలుగు పరివ్యాప్తి కమిటీఆధ్వర్యంలో 2022 జూన్ 4, 5 తేదీలలో జూమ్ లో నిర్వహించారు. ఈ పోటీలను (కిశోర, కౌమార, కౌశల) మూడు విభాగాలలో నిర్వహించగా ప్రవాసంలో వున్న వందలాది తెలుగు పిల్లలు ఉత్సాహంతో పాల్గొన్నారు. మెదడుకు మేత, పదవిన్యాసం, పురాణాలు, పదచదరంగం, తెలుగు జాతీయాలు, వేమన పద్యాలు, సుమతీ శతకాలు, మన తెలుగు కవులు, తెలుగులో మాట్లాడడం వంటి సంబందిత అంశాలు పోటీలు నిర్వహించారు. తానా - తెలుగు పరివ్యాప్తి కమిటీ చైర్మన్ చినసత్యం వీర్నపు పొటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ ప్రసాద్ తోటకూర మదిలోనుంచి పుట్టిన ఆలోచన వల్లే ఈ పోటీలు కార్యరూపం దాల్చాయన్నారు. ఈ పోటీల నిర్వాహణకు అన్నివిధాలా సహయ సహకారాలు అందించిన చొక్కాపు వెంకటరమణ, డాలస్ ప్రాంతీయ ప్రతినిధి సతీష్ కొమ్మనలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు మాట్లాడుతూ.. ఈ పోటీలు నిర్వహించడానికి దాతలుగా వున్న ప్రసాద్ తోటకూర, చినసత్యం వీర్నపు, మురళి వెన్నం, రవి పొట్లూరి, వెంకట రాజా కసుకుర్తి, లోకేష్ నాయుడు కొణిదాల, శ్రీకాంత్ పోలవరపు, న్యాయ నిర్ణేతలుగా వున్న శ్రీమతి రాజేశ్వరి నల్లాని, గీతా మాధవి, రాధిక నోరి లకు ధన్యవాదలు తెలియజేశారు. విజేతల వివరాలు - కిశోర(5-10 సంవత్సరాలు) విభాగంలో – మొదటి బహుమతి శ్రీనిధి యలవర్తి, రెండవ బహుమతి చాణక్య సాయి లంక, మూడవ బహుమతి వేదాన్షి చందలు గెలుచుకున్నారు. కన్సోలేషన్ బహుమతులను శ్రీనిజ యలవర్తి, ఉదయ్ వొమరవెల్లిలకు దక్కాయి. - కౌమార (11-14 సంవత్సరాలు) విభాగంలో మొదటి బహుమతి రాధ శ్రీనిధి ఓరుగంటి, రెండవ బహుమతి ఇషిత మూలే, మూడవ బహుమతి సంజన వినీత దుగ్గిలు గెలుచుకున్నారు. కన్సోలేషన్ బహుమతులను ద్విజేష్ గోంట్ల, ఉదయ్ వొమరవెల్లిలను వరించాయి. - కౌశల (15-18 సంవత్సరాలు) విభాగంలో మొదటి బహుమతి శ్రీ ఆదిత్య కార్తీక్ , రెండవ బహుమతి శ్రీ షణ్ముఖ విహార్ దుగ్గి, మూడవ బహుమతి $116 ను శ్రీ యష్మిత్ మోటుపల్లిలకు వచ్చాయి. కాగా కన్సోలేషన్ బహుమతి శ్రీ గణేష్ నలజులకి దక్కింది. చదవండి: న్యూజిలాండ్‌లో తెలుగు సాహితీ సదస్సు -
న్యూజిలాండ్‌లో తెలుగు సాహితీ సదస్సు
ఎనిమిదవ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు 2022 సెప్టెంబరు 17, 18 తేదిల్లో న్యూజిలాండ్ రాజధాని అక్లాండ్ వేదికగా నిర్వహించబోతున్నారు. న్యూజిలాండ్ తెలుగు సంఘం రజతోత్సవాల సందర్భంగా వర్చువల్‌గా 24/7గా ఈ వేడుకలు నిర్వహిస్తామన్నారు. ఈ వేడుకల్లో ఐదు ఖండాలో యాభై దేశాలకు చెందిన సాహిత్తివేత్తలు పాలుపంచుకోనున్నారు. ఈ వేడుకల్లో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా (హ్యూస్టన్ & హైదరాబాద్), న్యూజిలాండ్ తెలుగు సంఘం (అక్లాండ్), తెలుగు మల్లి పత్రిక (ఆస్ట్రేలియా), శ్రీ సాంస్కృతిక కళా సారధి (సింగపూర్), మలేషియా తెలుగు సంఘం (కౌలా లంపూర్), వంశీ ఇంటర్ నేషనల్ (హైదరాబాద్, భారత దేశం), వీధి అరుగు (ఆస్లో, నార్వే), దక్షిణ ఆఫ్రికా తెలుగు సాహిత్య వేదిక (జొహానెస్ బర్గ్), తెలుగు తల్లి పత్రిక (టొరంటో, కెనడా)లు ఈ వేడుకల నిర్వాహనలో భాగం కానున్నాయి. -
నాట్స్ నూతన అధ్యక్షుడిగా నూతి బాపయ్య చౌదరి
డాలస్ (టెక్సాస్): అమెరికాలో అతి పెద్ద తెలుగు సంఘాలలో ఒకటైన ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్, నూతన కార్యవర్గం 2022-24ను ప్రకటించింది. నాట్స్ డాలస్ విభాగంలో చురుకైన నాయకుడిగా పేరు తెచ్చుకున్న నూతి బాపయ్య చౌదరి (బాపుకి నాట్స్ బోర్డు అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టింది. బాపు నూతి నాట్స్ చేపట్టిన ఎన్నో సేవా కార్యక్రమాలను దిగ్విజయం చేయడంలో కీలక పాత్ర పోషించారు. నాట్స్‌లో తనకు అప్పగించిన ప్రతి బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించారు. దీంతో నాట్స్ బోర్డు అధ్యక్ష పదవికి బాపు నూతి వైపే మొగ్గు చూపింది. నాట్స్ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న నలుగురికి ఉపాధ్యక్ష పదవులు కట్టబెట్టింది. వారిలో భాను ప్రకాశ్ ధూళిపాళ్ల, హరినాథ్ బుంగతావుల, మదన్ పాములపాటి, రమేశ్ బెల్లంలు ఉన్నారు. నాట్స్ కార్యదర్శిగా రంజిత్ చాగంటి, సంయుక్తి కార్యదర్శిగా జ్యోతి వనం, కార్యనిర్వహక కార్యదర్శి(మీడియా)గా మురళీ మేడిచెర్ల, కార్యనిర్వాహక కార్యదర్శి (వెబ్) శ్రీనివాస్ గొండి, కోశాధికారిగా హేమంత్ కొల్లా, సంయుక్త కోశాధికారిగా సుధీర్ కె. మిక్కిలినేని లకు నాట్స్ బోర్డు బాధ్యతలు అప్పగించింది. అభినందనలు భాషే రమ్యం.. సేవే గమ్యం లక్ష్యంగా ముందుకు సాగే నాట్స్‌లో నూతన కార్యవర్గంలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను దిగ్విజయంగా నిర్వహిస్తారనే నమ్మకం తనకు ఉందని నాట్స్ బోర్డు ఛైర్మన్ అరుణ గంటి అన్నారు. నాట్స్ బోర్డు తరఫున బోర్డ్ వైస్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, బోర్డ్ సెక్రటరీ శ్యామ్ నాళం.. నాట్స్ నూతన అధ్యక్షుడు బాపు నూతితో పాటు నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు. కార్యవర్గ సభ్యులు నాట్స్ కార్యవర్గంలో దిలీప్ కుమార్ సూరపనేని నేషనల్ కోఆర్డినేటర్ (స్పోర్ట్స్), శ్రీనివాస రావు భీమినేని నేషనల్ కోఆర్డినేటర్ (మెంబెర్షిప్), వెంకట్ మంత్రి నేషనల్ కోఆర్డినేటర్ (సోషల్ మీడియా), కవిత దొడ్డ నేషనల్ కోఆర్డినేటర్ (వుమన్ ఎంపవర్మెంట్), రామ్ నరేష్ కొమ్మనబోయిన నేషనల్ కోఆర్డినేటర్ (హెల్ప్‌లైన్ ఫండ్ రైజింగ్), రాజేష్ కాండ్రు నేషనల్ కోఆర్డినేటర్ (ప్రోగ్రామ్స్), కృష్ణ నిమ్మగడ్డ నేషనల్ కోఆర్డినేటర్ (మార్కెటింగ్), సురేష్ బొల్లు నేషనల్ కోఆర్డినేటర్ (ఇండియా లైసోన్), శ్రీని చిలుకూరి జోనల్ వైస్ ప్రెసిడెంట్ (సౌత్ వెస్ట్ జోన్), గురుకిరణ్ దేసు జోనల్ వైస్ ప్రెసిడెంట్ (మిడ్ ఈస్ట్ జోన్), రామకృష్ణ బాలినేని జోనల్ వైస్ ప్రెసిడెంట్ (మిడ్ సెంట్రల్ జోన్), ప్రసాద్ డీవీ జోనల్ వైస్ ప్రెసిడెంట్ (సౌత్ సెంట్రల్ జోన్), సూర్య గుత్తికొండ (ఇమ్మిగ్రేషన్ & లీగల్ వింగ్ ), లక్ష్మి బొజ్జ (విమెన్ వింగ్)లు ఉన్నారు. చదవండి: డాలస్‌లో సందడిగా టీపాడ్ వనభోజనాలు -
ఆస్ట్రేలియా ఇన్వెస్టర్స్ వెల్కమ్ టూ తెలంగాణ
చెన్నై: ఇండియాలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన రాష్ట్రం తెలంగాణ అని మంత్రి కేటీఆర్ అన్నారు. చెన్నైలో ఆస్ట్రేలియా కాన్సులేట్ జనరల్ నిర్వహించిన యాన్ అప్డేట్ టూ యాన్ ఇండియన్ ఎకనామిక్ స్ట్రాటజీ 2035లో ఆయన ప్రసంగించారు. ఇండియా అనేక విభిన్నతల సమాహారమన్నారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారం ఎంత అవసరమో రాష్ట్ర ప్రభుత్వాలది అనే అంతే నొక్కి చెప్పారు. టీ ఐపాస్ అనేక దేశాల్లో ఇన్వెస్టర్లకు ఇబ్బందికరంగా మారిన రెడ్‌టేపిజానికి అంతం చేసేందుకు ఇండియాలోనే తొలిసారిగా టీ ఐపాస్‌ను (తెలంగాణ ఇండస్ట్రియల్ పాలసీ) అమల్లోకి తెచ్చామన్నారు. దీని వల్ల గడిచిన ఎనిమిదేళ్లలో 19 వేల పరిశ్రమలకు అనుమతులు జారీ చేయగా రికార్డు స్థాయిలో 35 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. 16 లక్షల మందికి ఉపాధి లభించిందన్నారు. తెలంగాణలో అమలవుతున్న పారిశ్రామిక విధానం బాగుండటం వల్ల తమకు వస్తున్న పెట్టుబడుల్లో 24 శాతం రిపీట్ అవుతున్నవే ఉన్నాయని వెల్లడించారు. ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నవారే తమకు బ్రాండ్ అంబాసిడర్లుగా మారుతున్నారంటూ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. స్కిల్ డెవలప్మెంట్ నైపుణ్యంతో కూడిన మానవ వనరులను తయారు చేసేందుకు ప్రపంచ స్థాయి విద్యాసంస్థలతో తెలంగాణకు చెందిన విద్యాసంస్థలు కలిసి పని చేసేలా వ్యూహం రూపొందిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. యూకేతో పాటు ఇటీవల దావోస్‌లో జరిగిన సమావేశంలో ప్రఖ్యాత విద్యా సంస్థలతో చర్చలు జరిగాయని ఆయన అన్నారు. ఇప్పుడు తమతో కలిసి పని చేయాలంటూ ఆస్ట్రేలియాకు సైతం విజ్ఞప్తి చేస్తున్నట్టు కేటీఆర్ వివరించారు. దేశంలో యూఎస్‌కు ఎక్కువగా హైదరాబాద్ నుంచే వెళ్తున్నారని కేటీఆర్ తెలిపారు. ఆ తర్వాత యూకే , ఆస్ట్రేలియాలు ఉన్నాయన్నారు. త్వరలో హైదరాబాద్‌లోనూ ఆస్ట్రేలియా కాన్సులేట్ జనరల్ కార్యాలయం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి కేటీఆర్ చేశారు. చదవండి: స్టార్టప్‌లు జాగ్రత్త! పునాదులు కదులుతున్నాయ్! -
డాలస్‌లో సందడిగా టీపాడ్ వనభోజనాలు
తెలుగువారి వనభోజనం డాలస్‌లోనూ సందడి చేసింది. మనం మరిచిపోతున్న సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కొత్త అనుభూతుల రుచి చూపింది. ప్రకృతి ఒడిలో ఆటలాడుతూ, సేద తీరుతూ, ఆదివారాన్ని ఆసాంతం ఆస్వాదించేలా చేసింది. ఏటా వేలాదిమందితో బతుకమ్మ పండుగను విశేషంగా నిర్వహిస్తూ ప్రపంచవ్యాప్తంగా గల తెలుగు ప్రజల దృష్టిని ఆకర్షించిన ‘డాలస్ తెలంగాణ ప్రజాసమితి (తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్- టీపాడ్) ఈ కార్యక్రమానికి ఆతిథ్యమిచ్చింది. అర్గిల్‌లోని పైలట్‌నాల్ పార్క్‌లో ఆదివారం టీపాడ్ నిర్వహించిన ఈ వనభోజనాల కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. డాలస్, టెక్సాస్ పరిధిలో నివాసముంటున్న సుమారు మూడువేల మంది తెలుగువారు హాజరై తెలంగాణ వంటకాలను రుచి చూసి మైమరిచిపోయారు. వనభోజనాల వేడుక ఆరంభంలో స్థానిక కళాకారుల బృందం ‘డాలస్ పరై కుజు’ ప్రదర్శించిన డప్పు డ్యాన్స్ ఉర్రూతలూగించింది. అనంతరం తెలుగు వారందరూ ఫ్లాష్‌మాబ్‌లో ఉత్సాహంగా పాల్గొన్నారు. పిల్లలు పతంగులను ఎగురవేశారు. లెమన్ స్పూన్ తదితర ఆటలను ఎంజాయ్ చేశారు. పెద్దలు టగ్ ఆఫ్ వార్ లాంటి ఆటలాడి తాము మరచిపోతున్న గతానుభూతులను నెమరువేసుకున్నారు. ముఖానికి పెయింటింగ్‌తో పిల్లలు, పెద్దలు చాలా ఉత్సాహంగా గడిపారు. భోజనాలు, ఆటపాటలతో సాగిన ఈ కార్యక్రమాన్ని టీపాడ్ ఫౌండేషన్ కమిటీ చైర్ అజయ్‌రెడ్డి, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ చైర్ ఇంద్రాని పంచెర్పుల, ప్రెసిడెంట్ రమణ లష్కర్, వైస్ ప్రెసిడెంట్ మాధవి లోకిరెడ్డి, ట్రస్టీలు లింగారెడ్డి అల్వా, రఘువీర్ బండారు. మాధవి సుంకిరెడ్డి, లక్ష్మి పోరెడ్డి, మంజుల తొడుపునూరి విజయవంతంగా నిర్వహించారు. వనభోజనాల్లో భాగంగా కొందరు మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు వనభోజనాలకు వెళ్లే సంస్కృతి తగ్గిపోయిందని, కానీ ఇక్కడ చాలా గొప్పగా ఏర్పాటు చేశారంటూ నిర్వాహకులకు కితాబునిచ్చారు. పిల్లల కోసం తల్లిదండ్రులు అమెరికా వచ్చారంటే నాలుగు గోడలకే పరిమితమవ్వాల్సి ఉంటుందన్న అపవాదును చెరిపివేశారని, ఇక్కడ ఇంతమందితో కలిసి వనభోజనాలకు హాజరవ్వడం తనకెంతో తృప్తినిచ్చిందంటూ చెమర్చిన కళ్లతో నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. డాలస్‌లో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీనివాస కల్యాణం నిర్వహిస్తున్నట్టు టీపాడ్ నిర్వాహకులు ప్రకటించారు. అలెన్‌లోని అలెన్ ఈవెంట్ సెంటర్లో , డాలస్ హిందూ కమ్యూనిటీ సహకారంతో జూన్ 25న స్వామి వారికి, అమ్మవార్లకు వైభవంగా వివాహమహోత్సవం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి జరిపిస్తారని, హాజరైన వారందరికీ తిరుమల వెంకన్న ప్రసాదంతో పాటు వస్త్రాన్ని అందజేయనున్నట్టు అందరి కరతాళ ధ్వనుల మధ్య టీపాడ్ బాధ్యులు వివరించారు. చదవండి: చెట్టు కింద వంట సంబరాలు -
గల్ప్ కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలి
విదేశాలలో అసువులు బాసిన ప్రవాసీ కార్మికుల కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని కోరుతూ గ్రామ ప్రజలు, గల్ఫ్ వాపసీలు గల్ఫ్ జెఏసి డిమాండ్ చేసింది. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వాల్గొండ గ్రామంలో శుక్రవారం జరిగిన ఓ గల్ఫ్ కార్మికుడి శవయాత్రలో జేఏసీ నేతలు పాల్గొన్నారు. వాల్గొండకు చెందిన గుంటి బర్నబ్బ (42) ఇటీవల యూఏఈ రాజధాని అబుదాబిలో గుండెపోటుతో చనిపోయారు. అబుదాబి నుండి మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించడానికి ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ కృషి చేసింది. సహచర కార్మికుడు గజ్జి శంకర్ అబుదాబి నుండి శవపేటికతో పాటు వచ్చారు. హైదరాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి వాల్గొండ వరకు శవపేటిక రవాణాకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత అంబులెన్సు సౌకర్యం కల్పించింది. మృతుడికి భార్య అమృత, కుమారులు అజయ్, హర్షవర్ధన్ ఉన్నారు. గల్ఫ్ దేశాలలో సంవత్సరానికి సుమారు 200 మంది తెలంగాణ ప్రవాసి కార్మికులు చనిపోతున్నారు. గత ఎనిమిది ఏళ్లలో సుమారు 1,600 మంది తెలంగాణ ప్రవాసీల మృతదేహాలు శవపేటికలలో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ద్వారా వారి స్వగ్రామాలకు చేరుకున్నాయి. కొందరి మృతదేహాలకు గల్ఫ్ దేశాలలోనే అంత్యక్రియలు జరిగాయని జగిత్యాల జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులు సింగిరెడ్డి నరేష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గల్ఫ్ దేశాలలో చనిపోయిన కార్మికుల కుటుంబాలను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా (మృత ధన సహాయం) ఇవ్వాలని గల్ఫ్ జెఏసి కన్వీనర్ గుగ్గిల్ల రవిగౌడ్ కోరారు. గల్ఫ్ ప్రవాసీ కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర బడ్జెట్ లో ప్రతి సంవత్సరం రూ. 500 కోట్లు కేటాయించాలి. గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు (గల్ఫ్ బోర్డు) ఏర్పాటు చేయాలని ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షులు స్వదేశ్ పరికిపండ్ల కోరారు. ప్రవాసి అంతిమయాత్రలో సింగిరెడ్డి నరేష్ రెడ్డి, గుగ్గిల్ల రవిగౌడ్, స్వదేశ్ పరికిపండ్ల, ప్రవాసి నాయకుడు మెంగు అనిల్, గ్రామ సర్పంచ్ దండిగ గంగు - రాజన్న, గ్రామస్తులు, గల్ఫ్ వాపసీలు తదితరులు పాల్గొన్నారు. చదవండి: ప్రాణాలతో గల్ఫ్ కు ఎగుమతి.. శవపేటికల్లో దిగుమతి -
వ్యక్తిత్వ వికాసం పై నాట్స్ అవగాహన సదస్సు
ఫ్లోరిడా: అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలను చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా వ్యక్తిత్వ వికాసంపై 2022 మే 26న వెబినార్ నిర్వహించింది. నాట్స్ టెంపాబే విభాగం చేపట్టిన ఈ వెబినార్‌లో ఛేంజ్ సంస్థ వ్యవస్థాపకులు గోపాలకృష్ణ స్వామి మాట్లాడుతూ... వ్యక్తిగత జీవితాల్లో చిన్న చిన్న మార్పులు ఎలాంటి పెద్ద ఫలితాలు ఇస్తాయనేది చక్కగా వివరించారు. తాను రూపొందించిన క్లామ్ ప్రోగ్రామ్ ద్వారా జీవితాన్ని ఎలా ఆనందమయంగా మార్చుకోవచ్చనేది అంశాల వారీగా ఆయన తెలిపారు. వాస్తవాలను గ్రహించినప్పుడే అజ్ఞాన అంధకారం తొలిగిపోయి జీవితంలో కొత్త కాంతులు వస్తాయన్నారు. మనిషికి ఆధ్యాత్మికత ప్రశాంతతను అందిస్తుందని తెలిపారు. మన శక్తికి మనమే పరిమితులను సృష్టించుకోవడం.. ఓటమి వస్తే కుంగిపోవడం.. లాంటి వ్యతిరేక భావనల నుంచి బయటపడేలా గోపాలకృష్ణ స్వామి దిశా నిర్దేశం చేశారు. ఈ వెబినార్‌లో పాల్గొన్న సభ్యుల సందేహాలను గోపాలకృష్ణ నివృత్తి చేశారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో కీలకపాత్ర పోషించిన డాక్టర్ నంద్యాల మల్లికార్జున, రమేష్ కొల్లికి నాట్స్ నాయకత్వం కృతజ్ఞతలు తెలిపింది. ఈ వెబినార్‌కు మద్దతు ఇచ్చిన నాట్స్ బోర్డ్ ఛైర్ విమెన్ అరుణగంటి, నాట్స్ మాజీ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ బోర్డు వైస్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ బోర్డు డైరక్టర్లు శ్రీనివాస్ మల్లాది, రాజేష్ నెట్టెం, నాట్స్ (పైనాన్స్ అండ్ మార్కెటింగ్ ) వైస్ ప్రెసిడెంట్ భాను ధూళిపాళ్ల, నాట్స్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ కాండ్రు, వెబ్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ సుదీర్ మిక్కిలినేని, టెంపాబే చాప్టర్ కోఆర్డినేటర్, ప్రసాద్ అరికట్ల, చాప్టర్ జాయింట్ కోఆర్డినేటర్ సురేష్ బొజ్జా తో పాటు కోర్ టీమ్ కమిటీ సభ్యులు ప్రభాకర్ శాకమూరి, సుధాకర్ మున్నంగి, అనిల్ ఆరెమండ, నవీన్ మేడికొండ, శ్రీనివాస్ బైరెడ్డి, సుమంత్ రామినేని, విజయ్ కట్టా, రమేష్ కొల్లి, రవి తదితరులు ఈ వెబినార్ విజయవంత కావడంలో తమ వంతు సహకారం అందించారు. -
ఆస్ట్రేలియాలో కొత్త రికార్డు నమోదు చేసిన భారతీయ తల్లీకూతురు
ఆస్ట్రేలియాలో స్థిరపడిన భారతీయ కుటుంబం రికార్డు సృష్టించింది. రాయల్ ఆస్ట్రేలియన్ ఎయిర్ ఫోర్స్‌లో స్థానం సాధించారు. ఒకే కుటుంబం నుంచి ఆస్ట్రేలియా రాయల్ ఎయిర్‌ఫోర్స్‌లో స్థానం సాధించిన తల్లీ కూతుళ్లుగా ఇద్దరు రికార్డు సృష్టించారు. భారత్‌కు చెందిన మంజీత్ కౌర్ తన భర్త రూప్‌సింగ్‌తో కలిసి 2009లో స్టూడెంట్ వీసా మీద అమెరికా వెళ్లారు. ఆ తర్వాత 2013లో ఆస్ట్రేలియా పౌరసత్వం తీసుకున్నారు. అనంతరం రాయల్ ఎయిర్‌ఫోర్స్‌లో మెడికల్ వింగ్‌లో అధికారిగా 2017లో ఆమె చేరారు. ఆ తర్వాత ఐదేళ్లకు మంజీత్ కౌర్ కూతురు కుశ్రూప్‌కౌర్ సంధు 2022లో రాయల్ ఎయిర్‌ఫోర్స్‌లో ఎయిర్‌క్రాఫ్ట్ వుమన్‌గా ఉద్యోగం సాధించారు. మంజీత్కౌర్ ఆస్ట్రేలియా ఎయిర్‌ఫోర్స్ మెడికల్ వింగ్‌లో పెట్టేప్పటికే కుశ్రుప్ 15 ఏళ్ల టీనేజర్‌గా ఉంది. అయితే దేశం కాని దేశంలో తన తల్లి సాధించిన ఘనతల నుంచి స్ఫూర్తి పొందిన కుశ్రుప్ పట్టుదలతో ఆస్ట్రేలియా ఎయిర్‌ఫోర్స్‌లో అధికారిగా నియమితురాలైంది. మహిళలు ఏ రంగంలోనూ పురుషులకు తీసిపోరని ఈ తల్లీబిడ్డలు మరోసారి రుజువు చేశారు. చదవండి: నకిలీ ఎన్నారై.. పెళ్లి పేరుతో మోసం.. -
టీప్యాడ్ ఆధ్వర్యంలో వనభోజనాలు
తెలంగాణ ప్రజా సమితి డాలస్ ఆధ్వర్యంలో వనభోజనాల కార్యక్రమం నిర్వహించనున్నారు. 2022 మే 22న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ కార్యక్రమం జరగనుంది. పైలట్ నాల్ పార్క్, 218ఏ ఆర్కిడ్హిల్ ఎల్ఎన్, ఆర్గిలే, టెక్సా్స్లో ఈ వేడుకలు నిర్వహిస్తామని టీప్యాడ్ ప్రకటించింది. -
యూకేలోని ప్రవాసులకు థ్యాంక్స్: కేటీఆర్
రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు దావోస్ పర్యటనకు వెళ్తోన్న తెలంగాణ మంత్రి కేటీఆర్, యూకేలో ఉన్న ప్రవాస భారతీయులు థ్యాంక్స్ చెప్పారు. దావోస్‌లో జరిగే సమావేశానికి హాజరవడానికి ముందు ఆయన యూకేలో కూడా పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా యూకేలో ఉన్న తెలంగాణ ఎన్నారైలు కేటీఆర్‌కు ఘన స్వాగతం పలికారు. లండన్ నగరంలో భారీ హోర్డింగులు ఏర్పాటు చేశారు. నంబర్ ప్లేట్ కేటీఆర్ అని ఉన్న కారులో ఆయన్ని ఎయిర్‌పోర్టులో రిసీవ్ చేసుకున్నారు. దీంతో తనకు లభించిన ఘన స్వాగతాన్ని గుర్తు చేసుకుంటూ మంత్రి కేటీఆర్ ట్విటర్లో ప్రవాస తెలంగాణ ఎన్నారైలకు కృతజ్ఞతలు తెలిపారు. Thank you to the affectionate NRIs of Telangana in UK for their overwhelming welcome 😊 Special thanks to @Anil_trs Garu who has been spearheading NRI TRS in UK for over a decade & @ASHOKDUSARI Garu NRI TRS UK president who gave me a ride in his car with special number plate 😄 pic.twitter.com/N8uxk6h21B — KTR (@KTRTRS) May 18, 2022 చదవండి: దావోస్ సదస్సుకు కేటీఆర్ -
ఎన్నారైకి రూ.3.11 కోట్ల టోకరా
సాక్షి, సిటీబ్యూరో: రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో ప్రవాస భారతీయుడిని రూ.3.11 కోట్లకు మోసం చేసిన ఇద్దరిపై హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు కేసు నమోదు చేశారు. నగరంలోని పారామౌంట్ కాలనీకి చెందిన మహ్మద్ ఇక్బాల్ హుస్సేన్ లండన్‌లో నివసిస్తున్నారు. వ్యాపార పనుల కోసం ఏటా నాలుగైదుసార్లు సిటీకి వస్తుంటారు. 2013లో వచ్చిన సందర్భంలో రిజ్వాన్, మహ్మద్ షోయబ్ అనే వ్యక్తులు ఇక్బాల్‌ను కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేలా ఇక్బాల్‌ను ఒప్పించారు. వీరి మాటలతో వివిధ దఫాల్లో ఇక్బాల్ డబ్బులిచ్చాడు. 2014 ఏప్రిల్ 3న షాద్‌నగర్ సమీపంలోని 2 ఎకరాల 4 గంటల స్థలాన్ని విక్రయిస్తామని చెప్పారు. రూ.44 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకున్నారు. నగదు ముట్టినప్పటికీ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయకుండా దాటవేస్తూ వచ్చారు. దీంతో బాధితుడు ఆరా తీయగా సదరు స్థలానికి, రిజ్వాన్, షోయబ్‌లకు ఎలాంటి సంబంధం లేదని తేలింది. రూ.3.11 కోట్ల మేర వారు మోసం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. చదవండి: నకిలీ ఎన్నారై.. పెళ్లి పేరుతో మోసం.. -
మ్యాట్రిమొనిలో ఎన్నారై పేరుతో మోసం! చివరకు..
ఎన్నారై సంబంధాలకు ఉన్న క్రేజ్‌ను ఆసరాగా చేసుకుని ఓ విదేశీయుడు హైదరాబాద్‌కు చెందిన యువతిని బురిడీ కొట్టించాడు. మాయ మాటలు, కట్టుకథలు అల్లి ఆమె నుంచి లక్షల రూపాయలు కాజేశాడు. మోసపోయినట్టు గ్రహించిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. చివరకు అరెస్టై కటకటాలు లెక్కపెడుతున్నాడు. విదేశీ మోసగాడు ఐవరీ కోస్టు దేశానికి చెందిన అమర ఫ్యానీ(24) అనే యువకుడు మ్యాట్రిమొని సైట్లో తనను తాను ఓ ఎన్నారైగా పేర్కొంటూ తప్పుడు పేరు, అడ్రస్‌తో ప్రొఫైల్ క్రియేట్ చేశాడు. దీన్ని చూసి నమ్మిన హైదరాబాద్‌కి చెందిన యువతి అతనితో సంభాషణ ప్రారంభించింది. ఈ క్రమంలో హైదరాబాదీ యువతిని పెళ్లి చేసుకునేందుకు రెడీ అని చెబుతూ నమ్మకం కలిగించాడు. కస్టమ్స్ పేరుతో ఉన్నట్టుండి హైదరాబాదీ యువతకి ఒకరోజు కస్టమ్స్ అధికారుల పేరుతో ఫోన్ కాల్ వచ్చింది. తనను చూసేందుకు ఇండియా వస్తున్న అమర ఫ్యానీని అక్రమంగా ఫారెన్స్ కరెన్సీ ఉన్నందువల్ల అరెస్ట్ చేసినట్టు తెలిపారు... ఈ వివాదం నుంచి బయట పడేందుకు ఆ యువతి వివిధ బ్యాంకు ఖాతాల నుంచి ఫ్యాన్నీ తెలిపిన నంబర్లకు రూ.11 లక్షల వరకు మనీ సెండ్ చేసింది. ఆ తర్వాత అటువైపు నుంచి కమ్యూనికేషన్ కట్ అయిపోయింది. పరారీ యత్నం కొన్ని రోజులకు మోసపోయినట్టు గ్రహించిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా విచారణలో అమర ఫ్యానీతో పాటు అతని స్నేహితుడు నైజీరియన్ ఐకే ఫినిచ్ (32)కి కూడా ఈ మోసంలో భాగం ఉన్నట్టు గుర్తించారు. వీరిని పట్టుకునేందుకు పోలీసులు వెళ్లగా భవనం దూకి పారిపోయే క్రమంలో ఫినిచ్ తీవ్రంగా గాయపడి కోలుకుంటుండగా.. అమరఫ్యానీ పోలీసుల అదుపులో ఉన్నాడు. వీరిద్దరు ఎన్నారై పేరుతో చాలా మందిని మోసం చేసినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. వీరి గుట్టు రట్టు చేసే పనిలో ఉన్నారు. చదవండి: వలస కార్మికుల కోసం హెల్ప్ డెస్క్ -
చెట్టు కింద వంట సంబరాలు
తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ (అట్లాంటా) ఆధ్వర్యంలో ప్రవాస భారతీయులు చెట్టు కింద వంట కార్యక్రమాన్ని ఉల్లాసంగా నిర్వహించారు. 2022 మే 14న బూఫోర్డ్ డ్యామ్రోడ్డులో ఉన్న సరస్సు ఒడ్డున చిక్కనైన వనంలో పచ్చని చెట్ల కింద వంటావార్పు - ఆటాపాటలతో సందడి చేశారు. ఆరేళ్ల కిందట టీడీఎఫ్ ఈ వంటావార్పు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ వంటావార్పు కార్యక్రమంలో 800ల మందికి పైగా ఎన్నారైలు పాల్గొన్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు అంతా హాయిగా గడిపారు. పురుషులు నలభీములై పాకాలను ఘుమఘుమలాడించగ, స్త్రీమూర్తులు అన్నపూర్ణలై కమ్మదనాన్ని రంగరించారు. సుమారు 20 రకాల నోరూరే శాకాహార మాంసాహార వంటకాలు సిద్ధం చేశారు. లావణ్య గూడూరు తన ఆటపాటలతో ఆకట్టుకుంది. చెట్టు కింద వంట కార్యక్రమం విజయవంతం చేసేందుకు ప్రణాళిక బద్దంగా కార్యాచరణ రూపొందించుకుని టీడీఎఫ్ అందులో విజయం సాధించింది. బాపురెడ్డి కేతిరెడ్డి, స్వాతి సుదిని సారథ్యంలో స్వప్న కస్వా నేతృత్వంలో ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులు, కోర్‌టీం మెంబర్స్ అంతా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమ నిర్వాహణకు తమ వంతు సహకారాన్ని అందించిన సువిద, డెక్కన్ స్పైస్, డీజే దుర్గం, లావణ్య గూడురు ఇతర స్వచ్చంధ సంస్థలకు టీడీఎఫ్ ధన్యవాదాలు తెలిపింది. భవిష్యత్తులో తాము చేపట్టబోయే కార్యక్రమాలకు ఇదే తీరుగా సహాకారం ఇవ్వాలని కోరింది. తమ ఆహ్వానం మన్నించి వచ్చిన ప్రవాస తెలుగువారికి మరోసారి కృతజ్ఞతలు తెలిపింది. చదవండి : టీడీఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా వనితా డే -
ఇంగ్లాండ్ సెంట్రల్ బ్యాంక్‌లో ఎన్నారైకి కీలక పదవి
లండన్: బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వడ్డీ రేట్లను నిర్ణయించే కీలక ద్రవ్య పరపతి విధాన కమిటీలో (ఎంపీసీ) ఎక్స్‌టర్నర్ సభ్యురాలుగా ప్రముఖ విద్యావేత్త, భారతీయ సంతతి మహిళ డాక్టర్ స్వాతి ధింగ్రా నియమితులయ్యారు.ఈ కీలక బాధ్యతల్లో భారతీయ సంతతి మహిళ నియమితులు కావడం ఇదే తొలిసారి. ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ అప్లైడ్ మైక్రోఎకనామిక్స్‌లో స్పెషలైజేషన్ ఉన్న ధింగ్రా ప్రస్తుతం లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ (ఎల్ఎస్ఈ)లో ఎకనామిక్స్ అసోసియేట్ ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ యూనివర్శిటీలో స్వాతి ధింగ్రా విద్యను అభ్యసించారు. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి మాస్టర్స్ పట్టా పొందారు. యూనివర్శిటీ ఆఫ్ విస్కాన్సిన్–మాడిసన్ నుండి ఎంఎస్, పీహెచ్డీ పూర్తి చేశారు. బ్రిటన్ ట్రేడ్ మోడలింగ్ రివ్యూ ఎక్స్పర్ట్ ప్యానెల్లో సభ్యురాలిగా ఉన్నారు. ఈ ఏడాది ఆగస్టు 9న ఆమె ఎంపీసీలో చేరి, మూడేళ్లపాటు కీలక బాధ్యతలు నిర్వహి స్తారు. 2016 ఆగస్టు నుంచి ఎంపీసీ సభ్యునిగా పనిచేస్తున్న మైఖేల్ సాండ్రూస్ స్థానంలో ఆమె ఈ బాధ్యతలు చేపడతారు. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ఎంపీసీలో గవర్నర్‌తోపాటు, ముగ్గురు డిప్యూటీ గవర్నర్లు సభ్యులుగా ఉంటారు. బ్యాంకులో ఒక సీనియర్ ఆధికారితోపాటు, నలుగురు బయటి స్వ తంత్రులు సభ్యులుగా ఉంటారు. వీరిని బ్రిటన్ ఆర్థికమంత్రి నియమిస్తారు. చదవండి: Elon Musk - Twitter Deal: ట్విటర్‌కి బ్రేకప్ చెప్పిన ఈలాన్ మస్క్? -
అమ్మ గొప్పతనాన్ని చాటిన నాట్స్ వెబినార్
న్యూ జెర్సీ: అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని అమ్మల గొప్పతనాన్ని చాటేలా వెబినార్ నిర్వహించింది. తల్లి ప్రేమను తమ బిడ్డలకే కాకుండా చాలా మంది, అమ్మ ప్రేమను పంచుతున్న కొందరు తల్లులతో కలిపి ఈ వెబినార్ నిర్వహించింది. రేపటి పౌరులను తీర్చిదిద్దడంలో అమ్మ పాత్రే కీలకమని ఈ సందర్భంగా మాతృమూర్తులు వివరించారు. ఈ వెబినార్ ప్రాముఖ్యతను జ్యోతి వనం వివరించారు. శర్వాణి సాయి గండూరి అమ్మ మీద పాడిన పాటతో ఈ వెబినార్ ప్రారంభమైంది. కవిత తోటకూర ఈ వెబినార్ కు ప్రధాన వ్యాఖ్యతగా వ్యవహరించారు. కృష్ణవేణి శర్మ, రాధ కాశీనాధుని, ఉమ మాకం లు అమ్మగా తమ అనుభవాలను వివరించారు. శ్రీక అలహరితో పాటు కొంతమంది చిన్నారులు అమ్మలపై వ్రాసిన కవితలు ఈ వెబినార్‌లో స్వయంగా వారే చదవి వినిపించారు. అమ్మ పట్ల తమ ప్రేమను చాటారు. అమ్మల అనుభవాలు, త్యాగాలు తెలుసుకుంటే మనలో అది ఎంతో కొంత స్ఫూర్తిని రగిలిస్తుందనే ఉద్ధేశంతోనే ఈ వెబినార్‌ను చేపట్టామని నాట్స్ బోర్డ్ ఛైర్మన్ అరుణ గంటి అన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పద్మజ నన్నపనేని, లక్ష్మి బొజ్జ, గీత గొల్లపూడి, దీప్తి సూర్యదేవర, ఉమ మాకం, బిందు యలమంచిలి తదితరులు ఈ వెబినార్ నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. నాట్స్ నాయకులు శ్రీనివాస్ కాకుమాను, రవి గుమ్మడిపూడి, మురళీకృష్ణ మేడిచెర్ల, సుధీర్ మిక్కిలినేని తదితరులు ఈ వెబినార్‌కు తమ వంతు సహకారం అందించారు. అమ్మల అనుభవాలను నేటి తరానికి పంచిన ఇంత చక్కటి వెబినార్ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నాట్స్ అధ్యక్షుడు విజయ్ శేఖర్ అన్నే ధన్యవాదాలు తెలిపారు. చదవండి: న్యూజెర్సీలో నాట్స్ ఫుడ్ డ్రైవ్ -
వెటా ఆధ్వర్యంలో మదర్స్ డే వేడుకలు
విమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ (వెటా) ఆధ్వర్యంలో నిర్వహించిన మదర్స్ డే సెలబ్రేషన్స్ విజయవంతంగా ముగిశాయి. మే 16 న మేరీల్యాండ్ హానోవర్‌లో నిర్వహించిన వేడుకలకి దాదాపు ఆరువందల మందికి పైగా సభ్యులు కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ లోకల్ బ్యాండ్ ఆలపించిన గీతాలు ఆకట్టుకున్నాయి. వివిధ పోటీలలో విజేతలుగా నిలిచిన మహిళలకు చాలా బహుమతులను అందజేశారు. అలాగే ఆహుతులందరికీ రిటర్న్ గిఫ్ట్స్ అందజేశారు. ఈ మదర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించడంలో వెటా ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ శైలజ కల్లూరిలతో పాటు వెటా మేరీల్యాండ్ చాప్టర్ కార్యవర్గం నిర్విరామంగా కృష్టి చేసింది. ఈ కార్యక్రమంలో వెటా మీడియా నేషనల్ ఛైర్ పర్సన్ సుగుణారెడ్డి, స్థానిక వెటా సభ్యులు ప్రీతీ రెడ్డి, యామిని రెడ్డి , నవ్యస్మృతి , జయలతో పాటు స్థానిక కమ్యూనిటీ లీడర్స్ సుధా కొండెపి, కవిత చల్ల, శ్రీధర్ నాగిరెడ్డి , డాక్టర్ పల్లవి , రామ్మోహన్ కొండా, యోయో టీవీ నరసింహ రెడ్డి అనిత ముత్తోజు , అపర్ణ కడారి మొదలగు వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన వెటా స్థానిక కార్యవర్గాన్ని ప్రెసిడెంట్ ఝాన్సీరెడ్డి అభినందించారు. తెలుగు మహిళల కోట.. స్త్రీ ప్రగతి పథమే బాట అనే నినాదంతో కేవలం తెలుగు మహిళల కోసం మహిళ సాధికారతే లక్ష్యంగా తెలుగు నేలకు చెందిన ఝాన్సీ రెడ్డి హనుమాండ్ల ‘ఉమెన్ ఎంపవర్ మెంట్ తెలుగు అసోసియేషన్ (వేటా) సంస్థను రెండేళ్ల కిందట ఉత్తర అమెరికాలో ఏర్పాటు చేశారు. మహిళకు అవకాశాలు కల్పించి వారిలో సృజనాత్మకత (క్రియేటివిటీ)ను పెంచి వారి కలలను సాకారం చేసూకోవడానికి ఈ సంస్థ తోడ్పడాలని ఉద్దేశ్యంతో ఝాన్సీరెడ్డి ఈ సంఘం స్థాపించారు. మహిళ నాయకత్వ శక్తిని ప్రపంచానికి తెలియచేసేటందుకు ఇది వేదిక లాగా పనిచేస్తోంది. చదవండి: న్యూజెర్సీలో నాట్స్ ఫుడ్ డ్రైవ్ -
జగమంతా శివపదం
ఋషీపీఠం ఆధ్వర్యంలో రెండో శివపదాల అంతర్జాతీయ పోటీలు జరిగాయి. మే 13 నుంచి 15 వరకు యూట్యూబ్ మాధ్యమంగా ఈ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో నాలుగు ఖండాలలోని పద్నాలుగు దేశాలకు చెందిన 300 మంది ఔత్సాహిక గాయకులు ఈ పాటల పోటీల్లో పాల్గొన్నారు. సామవేదం షణ్ముఖ శర్మ రచించిన వెయ్యికి పైగా శివపద గీతాల్లో కొన్నింటిని ఈ పోటీలో ఆలపించారు. షణ్ముఖుని శివుని ఆరు విభాగాలతో తలపిస్తు ఆరు పూటల జరిగిన ఈ కార్యక్రమం కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి పరిచయవ్యాఖ్యలతో మొదలయ్యింది. ప్రవాసులయిన ఎందరో పిల్లలు సంప్రదాయబద్ధమైన వస్త్రధారణతో, స్పష్టమైన ఉఛ్చారణతో శృతి, లయ బద్ధంగా అద్భుతముగా ఆలపించారు. చిన్మయ జ్యోతిర్మయలింగం, పాలవన్నెవాడు, శివుడు ధరించిన, సకలమంత్రముల సంభవమూలం, సభాపతి పాహిపాహిమామ్ శివపద కల్యాణం తదితర గీతాలు ఆలపించారు. శివపదం కోసం తన జీవితపరమావధిగా, సార్ధకతగా రాసుకున్న పాటలను, ఇంత మంది వాటిని చక్కగా పాడటం ఎంతో ఆనందాన్ని కలిగించిందని షణ్ముఖ శర్మ అన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వాణి, రవి గుండ్లపల్లిలను అభినందించారు. ఈ కార్యక్రమానికి భారత్, ఆస్ట్రేలియా, సింగపూర్, అమెరికాలకు చెందిన పదహారు మంది సంగీత దర్శకులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. చదవండి: సింగపూర్‌లో వైభవంగా వాసవి మాత జయంతి వేడుకలు -
అమెరికాలో భారతీయ విద్యార్థికి వేధింపులు
Indian Student Bullied Texas: భారతీయ మూలాలున్న విద్యార్థిని లక్ష్యంగా చేసుకుని అమెరికన్ స్టూడెంట్ రెచ్చిపోయాడు. మాటలతో వేధిస్తూ భౌతికదాడులకు దిగుతూ హింసించాడు. స్కూల్ క్యాంటీన్లోనే దురాగతం జరుగుతున్నా ఎవ్వరూ ఆపేందుకు ప్రయత్నించలేదు. పైగా కొందరు విద్యార్థులు విపరీత చేష్టలకు పాల్పడుతున్న అమెరికన్ విద్యార్థిని రెచ్చగొట్టారు. ఈ దారుణమైన ఘటన టెక్సాస్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఆ రాష్ట్రంలో కాపెల్ ప్రాంతంలో ఉన్న కాపెల్ మిడిల్ స్కూల్లో చదువుతున్న భారతీయ మూలాలున్న విద్యార్థికి ఇబ్బందులు ఎదురయ్యాయి. క్యాంటీన్లో తింటున్న సమయంలో.. ఓ అమెరికన్ విద్యార్థి అక్కడకు వచ్చి ఇండియన్ స్టూడెంట్‌ని అతను కూర్చున్న చోటు నుంచి లేచి వేరే దగ్గరికి వెళ్లి పోవాలంటూ దబాయించాడు. ఎవరూ లేని సమయంలో తాను అక్కడ కూర్చున్నానని,.. తాను అక్కడి నుంచి లేచి వెళ్లనంటూ ఆ ఇండియన్ స్టూడెంట్ తెలిపాడు. పక్కన ఖాళీగా ఉన్న చోట కూర్చోవాలంటూ సూచించాడు. మాటలతో మొదలెట్టి.. ఇండియన్ ఆరిజిన్ స్టూడెంట్ చేసిన సూచనలు పట్టించుకోకుండా.. కచ్చితంగా నువ్వా కుర్చీలో నుంచి లేచిపోవాల్సిందే అంటూ అమెరికన్ విద్యార్థి ఇండియన్ స్టూడెంట్ను తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు. స్కూల్బ్యాగు తీసి పక్కన పడేశాడు. తన వేలితో మెడపై పొడుస్తూ అవమానకరంగా ప్రవర్తించాడు. ఐనప్పటికీ ఇది ఆత్మగౌరవానికి సంబంధించిన విషయంగా భావించిన భారతీయమూలాలు ఉన్న విద్యార్థి అక్కడి నుంచి లేచేందుకు అంగీకరించలేదు. దీంతో మరింత రెచ్చిపోయిన ఆ అమెరికన్ స్టూడెంట్.. ఇండియన్ స్టూడెంట్ మెడ చుట్టూ చేయి వేసి తలను మెలిపెట్టి కుర్చీ నుంచి లాగి నేలపై పడేశాడు. రెచ్చగొడుతూ వందల మంది విద్యార్థుల సమక్షంలో ఈ అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఇంత జరుగుతున్నా అక్కడున్న వారిలో ఏ ఒక్కరూ భారతీయ మూలాలున్న విద్యార్థికి మద్దతుగా రాలేదు సరికదా కొందరైతే దురాగతానికి పాల్పడుతున్న అమెరికన్ స్టూడెంట్ను రెచ్చగొట్టారు. మరికొందరు జరుగుతున్న ఘటన వీడియో తీస్తూ గడిపారు. బాధితుడికే శిక్ష ఈ నెల 11న ఈ ఘటన జరిగింది. ఆ వెంటనే విషయం స్కూల్ ప్రిన్సిపల్ వరకు వెళ్లింది. దీంతో బాధిత విద్యార్థి తల్లిదండ్రులను స్కూల్‌కి పిలిపించాడు. వీడియోలో కనిపిస్తున్న దురాగతానికి విరుద్దంగా భారతీయ విద్యార్థే అకారణంగా మరో విద్యార్థితో గొడవ పెట్టుకున్నాడని నిర్థారిస్తూ.. బాధిత విద్యార్థిని మూడు రోజుల పాటు స్కూల్ నుంచి సస్పెండ్ చేయగా దాడికి పాల్పడిన అమెరికన్ స్టూడెంట్‌కి కేవలం ఒక రోజు నుంచి నుంచి సస్పెండ్ చేశారు. వరుస ఘటనలు సమానత్వానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని, వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవిస్తామని పదే పదే చెప్పుకునే అమెరికాలో ఈ తరహా ఘటన చోటు చేసుకోవడం ఇండియన్లను నివ్వెరపరుస్తోంది. ఇదే వారంలో నల్లజాతీయులను లక్ష్యంగా చేసుకుని షికాగోలని బఫెలో మార్కెట్లో కాల్పులు జరిపిన ఘటనలో 18 మంది దుర్మరణం పాలయ్యారు. చదవండి: బుసకొట్టిన జాతి విద్వేషం -
రెసిడెంట్, వర్క్‌వీసా గడువు పొడిగించిన న్యూజిలాండ్
న్యూజిలాండ్‌లో వర్క్ పర్మిట్ వీసా, రెసిడెంట్ వీసా మీద ఉన్న వారికి అక్కడి ప్రభుత్వం శుభవార్త తెలిపింది. 2022 మే 9 నుంచి డిసెంబరు 31 వరకు వర్క్ పర్మిట్ / రెసిడెంట్ వీసా ఉన్న వారికి ఎటువంటి రుసుము లేకుండానే ఆటోమేటిక్‌గా మరో ఆరు నెలల పాడు పొడిగింపు ఇచ్చింది. ఎవరికి ఎంత కాలం పొడిగింపు వచ్చిందనే అంశం మే 25న వీసా రికార్డుల్లోకి ఎంటరవుతుందని తెలిపింది. తాజా వీసా గడువు తెలుసుకోవాలంటే మే 25 తర్వాత చెక్ చేసుకోవచ్చని చెప్పింది. -
సింగపూర్‌లో రామ్ మాధవ్ పుస్తక సభ విజయవంతం
డాక్టర్ రామ్ మాధవ్ రచించిన "ది హిందుత్వ పారడైమ్" (సమగ్ర మానవతావాదం మరియు పాశ్చాత్యేతర ప్రపంచ దృష్టికోణం కోసం అన్వేషణ) పుస్తక పరిచయం విశ్లేషణ కార్యక్రమము సింగపూర్ ఘనంగా జరిగింది. శ్రీ సాంస్కృతిక కళాసారథి, సింగపూర్ ఆధ్వర్యంలో మే 8న జరిగిన ఈ కార్యక్రమంలో పదికి పైగా స్థానిక భారతీయ సంస్థలు అధిపతులతో పాటు సుమారుగా ౩౦౦ మందికి పైగా సింగపూర్ వాసులు పాల్గొన్నారు. పుస్తక రచయిత, బీజేపీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఇండియా ఫౌడేషన్ పాలక మండలి సభ్యుడు డాక్టర్ రామ్ మాధవ్ మాట్లాడుతూ... నేను వ్రాసిన హిందుత్వం పుస్తకం 21వ శతాబ్దపు వాస్తవికతకు అన్వయించవచ్చా లేదా అనే దాని గురించి మాట్లాడుతుంది, ఈ ఆలోచన ప్రపంచ దృక్పథం ఆధారంగా మన రాజకీయ వ్యవస్థలను అభివృద్ధి చేయగలమా లేదా అనేది తెలియచేస్తుంది అని తెలిపారు. అనంతరం సభ్యులు అడిగిన ప్రశ్నలకు సావధానంగా సమాధానాలు చెప్పి సందేహ నివృత్తి చేసారు. 'శ్రీ సాంస్కృతిక కళాసారథి' సంస్థని స్థాపించాక మొట్టమొదటి స్థానిక సామూహిక కార్యక్రమము విజయవంతం అవ్వడంపట్ల నిర్వాహుకులు కవుటూరు రత్నకుమార్ తదితరులు సంతోషం తెలియచేశారు. ఈ కార్యక్రమము విజయవంతం కావడం కోసం అహర్నిశలు కృషిచేసిన ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు రవితేజ్ భాగవతుల, రామాంజనేయులు చామిరాజు, శ్రీధర్ భరద్వాజ్, సురేష్ చివుకుల, యోగేష్ హిందూజ, సంజయ్, ఊలపల్లి భాస్కర్,రాధిక మంగిపూడి, రాధాకృష్ణ గణేశ్న, కాత్యాయని గణేశ్న, గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ నుండి ప్రభురామ్, మమత, దినేష్, ఇండియా ఫౌండేషన్ నుండి దీక్ష తదితరులకు శ్రీ సాంస్కృతిక కళాసారథి వ్యవస్థాపక అధ్యక్షులు రత్న కుమార్ కవుటూరు ధన్యవాదాలు తెలియచేసారు. కార్యక్రమ నిర్వహణకు ఆడిటోరియం, భోజన సదుపాయాలను గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ అధ్యక్షుడు అతుల్ ప్రత్యేకంగా అందజేశారు. చదవండి: ఘంటసాల గొప్ప గాయకుడు, మానవతావాది, సంగీత విద్వాంసులు -
హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రవాసి సహాయతా కేంద్రం
ఉపాధి కోసం వలస వెళ్లే కార్మికుల కోసం హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేశారు. ఎయిర్‌పోర్టు నిర్వహిస్తోన్న జీఎంఆర్, తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్‌కామ్)లు సంయుక్తంగా ఈ హెల్ప్‌డెస్క్‌ని ఏర్పాటు చేశాయి. హైదరాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి నిత్యం కార్మికులు వలస కార్మికులు ప్రయాణం చేస్తున్న దృష్ట్యా వారికి సహాయకారిగా ఉండేందుకు ఈ హెల్ప్‌డెస్క్‌ను అందుబాటులోకి తెచ్చారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాణి కుముదిని ఈ హెల్ప్ డెస్క్‌ను ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల నుంచి నిత్యం కువైల్, అబుదాబి, యూఏఈ, ఖతార్, దుబాయ్ వంటి గల్ఫ్ దేశాలకు కార్మికులు వెళ్తుంటారు. అయితే సరైన డాక్యుమెంటేషన్ లేకపోవడం వల్ల విదేశాలకు వెళ్లిన తర్వాత అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. మరికొందరు వలస కార్మికులకు ఉండే హక్కులపై అవగాహన లేక అనేక అవస్థలు పడుతున్నారు. ఇలాంటి సమస్యలకు పరిష్కారం చూపేందుకు, తగు సూచనలు ఇచ్చేందుకు ఈ డెస్క్ ఎంతో తోడ్పాటు అందివ్వనుంది. చదవండి: లైఫ్ అండ్ డెత్ ఇన్ ద గల్ఫ్ -
జర్మనీలో వరంగల్ యువకుడి గల్లంతు.. కేటీఆర్‌ను సాయం కోరిన కుటుంబం
వరంగల్: ఉన్నత చదువుల కోసం జర్మనీ వెళ్లిన వరంగల్‌కి చెందిన యువకుడు అక్కడ గల్లంతయ్యాడు. నగరంలోని కరీమాబాద్‌కి చెందిన కడారి అఖిల్ (26) జర్మనీలోని హోట్టోవన్ యూనివర్సిటీలో ఉన్నత విద్య చదువుతున్నాడు. మూడేళ్లుగా అక్కడే ఉంటున్న అఖిల్ సోలార్ ఎనర్జీ విభాగంలో ఫైనలియర్లో ఉన్నాడు. కాగా రెండు రోజుల క్రితం స్నేహితులతో కలిసి స్థానికంగా ఉన్న నది వద్దకు వెళ్లాడు. నది ఒడ్డున సెల్పీ దిగే క్రమంలో నీటి ప్రవాహంలో పడి గల్లంతయ్యాడు. ఈ విషయాన్ని స్నేహితులు, అక్కడి ఎంబసీ అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అఖిల్ తండ్రి కడారి పరుశురాములు వరంగల్‌లో మేస్త్రీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కుమారుడి బంగారు భవిష్యత్తు కోసం అప్పులు చేసి జర్మనీ పంపించాడు. చేతికి అంది వచ్చిన కొడుకు ఇలా నీటిలో గల్లంతవడంతో పరుశురాములు కుటుంబం ఆందోళన చెందుతోంది. మరోవైపు అఖిల్ సోదరి తన సోదరుడి ఆచూకి, వివరాలు తెలిపేందుకు సాయం చేయాలంటూ మంత్రి కేటీఆర్‌ను ట్విటర్ ద్వారా కోరగా... తన వంతు సాయం చేస్తానంటూ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. Will speak to the authorities in Germany and do our best Rasagnya My team @KTRoffice will keep you informed on any updates that we will get https://t.co/0BZTIh3Roh — KTR (@KTRTRS) May 10, 2022 చదవండి: ప్రాణాలతో గల్ఫ్ కు ఎగుమతి.. శవపేటికల్లో దిగుమతి -
న్యూజెర్సీలో నాట్స్ ఫుడ్ డ్రైవ్
ఎడిసన్ (న్యూ జెర్సీ): భాషే రమ్యం.. సేవే గమ్యం నినాదంతో ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అమెరికాలో ఫుడ్ డ్రైవ్‌ను దిగ్విజయంగా నిర్వహిస్తోంది. నాట్స్ జాతీయ నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు నాట్స్ న్యూజెర్సీలో ఫుడ్ డ్రైవ్ నిర్వహించింది. ఈ ఫుడ్ డ్రైవ్‌లో 500 పౌండ్ల ఆహారాన్ని, ఫుడ్ క్యాన్స్‌ను సేకరించి పేదలకు పంపిణి చేసింది. న్యూజెర్సీలో ఆరవ సారి నాట్స్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తోంది. కోవిడ్ కారణంతో గత రెండేళ్ల ఈ కార్యక్రమానికి బ్రేక్ పడింది. కోవిడ్ కేసులు తగ్గడం.. వ్యాక్సినేషన్ పుంజుకోవడంతో నాట్స్ సభ్యులు ఉత్సాహంగా ఈ ఫుడ్ డ్రైవ్ లో పాల్గొని తమకు తోచినంత ఫుడ్ క్యాన్స్‌ను విరాళంగా ఇచ్చారు. ఈ పుడ్ డ్రైవ్‌కు నాట్స్ బోర్డ్ ఛైర్ విమెన్ అరుణ గంటి, నాట్స్ మాజీ అధ్యక్షులు మోహనకృష్ణ మన్నవ, నాట్స్ బోర్డ్ సెక్రటరీ శ్యాం నాళం, బోర్డ్ డైరెక్టర్స్ శ్రీహరి మందాడి, చంద్రశేఖర్ కొణిదెల, నాట్స్ సెక్రటరీ రంజిత్ చాగంటి, ఇమ్మిగ్రేషన్ అసిస్టెన్స్ సూర్య శేఖర్ గుత్తికొండ, రమేశ్ నూతలపాటి, రాజేశ్ బేతపూడి, గిరి కంభంమెట్టు తదితరులు తమ మద్దతు అందించారు. నాట్స్ న్యూజెర్సీ కో ఆర్డినేటర్ సురేశ్ బొల్లు, జాయింట్ కోఆర్డినేటర్ మోహన కుమార్ వెనిగళ్ల, ఈవెంట్ కమిటీ శేషగిరి కంభంమెట్టు, కమ్యూనిటీ సర్వీసెస్ కమిటీ అరుణ్ శ్రీరామినేని, వంశీ కొప్పురావూరి, కిరణ్ కుమార్ తవ్వ, ప్రశాంత్ లు ఈ పుడ్ డ్రైవ్ విజయవంతానికి కృషి చేశారు. -
జోరుగా సాగుతున్న ఆటా డీసీ కాన్ఫరెన్స్ సన్నాహాక ఏర్పాట్లు
అమెరికన్ తెలుగు అసోసియేషన్ మొట్ట మొదటిసారి అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ నగరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 17వ కాన్ఫరెన్స్ , యూత్ కన్వెన్షన్‌ని జులై 1 నుంచి 3 తారీకు వరకు ఘనంగా నిర్వహించనున్నారు. వాషింగ్టన్ డీసీ వాల్తేర్ ఏ కన్వెన్షన్ సెంటర్లో ఈ కార్యక్రమం జరగనుంది. దీనికి ముఖ్య అతిథులుగా సద్గురు జగ్గీవాసుదేవ్, విజయ్ దేవరకొండ, రకుల్ ప్రీత్ సింగ్, కపిల్ దేవ్, బాలకృష్ణ తదితరులు విచ్చేయచున్నారు. ఆబాలగోపాలాన్ని తన సంగీతంతో ఉర్రూతలూగించే మాస్ట్రో ఇళయరాజా ట్రూప్ చేత మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేస్తున్నారు. ఎంతో మంది బిజినెస్, రాజకీయ, సామాజిక, సాహిత్య, కవులు కళాకారులు, ప్రముఖులు, మేధావులు హాజరవబోతున్న ఈ కార్యకమంలో దాదాపు 1౦,౦౦౦ మందికి పైగా భాగస్వాములు అవుతారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్, కేంద్ర టూరిజం శాఖ మంత్రి కిషన్ రెడ్డి, టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి , కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, కవిత, జి.ఎం.ర్. ఉపాసన కామినేని తదితరులు ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్నారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ భువనేశ్ బుజాల అధ్యక్షతన సుధీర్ బండారు కన్వీనర్‌గా, క్యాపిటల్ ఏరియా తెలుగు సొసైటీ కో-హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ కాన్ఫరెన్స్ కి ఉత్తర అమెరికాలో తెలుగు వారు పెద్ద ఎత్తున హాజరయ్యి తెలుగు వారి ప్రత్యేకతను చాటవలసిందిగా ఆటా కార్యవర్గం ఒక ప్రకటనలో తెలియజేసింది. దాదాపు 2.3 మిలియన చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ కన్వెన్షన్ సెంటర్ లో మినీ షాపింగ్ మాల్ తలపించనుంది. 200 పైగా ప్రత్యేక స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా రియల్ ఎస్టేట్, జ్యుయల్లరీ, చీరలు, ఇన్సూరెన్స్, ఇన్నోవేటివ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ స్టాల్స్ ఏర్పాటు చేయబోతున్నారు. మిగిలి ఉన్న అతి కొద్ది వెండర్ బూత్ కొరకు త్వరగా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా నిర్వాహకులు కోరుతున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధఙంచి మరిన్ని వివరాల్లో కోసం https://www.ataconference.org/exhibits సంప్రదించగలరు. చదవండి: సీఎం జగన్‌ను కలిసిన ఆటా ప్రతినిధుల బృందం -
ఘంటశాలకి భారతరత్న ఇవ్వాలి
అమరగాయకుడు, ప్రముఖ సంగీత దర్శకులు, మరియు స్వాతంత్ర సమరయోధుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు గారి శత జయంతి వేడుకల సందర్భంగా వారికి భారతరత్న పురస్కారం ఇవ్వడం సముచితం అనే నినాదంతో యు.యెస్.ఏ నుండి శంకర నేత్రాలయ యు.యెస్.ఏ. అధ్యక్షుడు బాల ఇందుర్తి ఆధ్వర్యములో ఇప్పటివరకు 90 పైగా టీవీ కార్యక్రమాలను నిర్వహించి ప్రపంచం నలుమూలలో ఉన్న తెలుగు సంస్థలను ఏకాతాటిపై తీసుకువస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందులో భాగంగా యు.యెస్.ఏ నుండి అమెరికా గానకోకిల శారద ఆకనూరి వ్యాఖ్యాతగా 1 మే 2022 నాడు జరిగిన అంతర్జాల కార్యక్రమములో పూజ్య బ్రహ్మశ్రీ పరిపూర్ణానంద స్వామి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ భారతీయ సంస్కృతిలో భార్య భర్తని ఎలా పేరు పెట్టి పిలవదో, గురువుని కూడా పేరు పెట్టి పిలవరని, ఘంటసాల వెంకటేశ్వర రావు గారు మనందరికీ గురువు అని చెపుతూ, వారు ఒక కర్మయోగి, మహాజ్ఞానీ, తపశ్వి అని, వారి జీవితం ఒక తపస్సు అని చెప్పారు... నేను ఒక స్వామిజి అయినా మీరు అందరు చేస్తున్న ప్రయత్నాలకు నేను నమస్కరిస్తున్నాను అని చెపుతూ ఎందుకంటె మీరందరు ఒక తపస్వికి, జ్ఞానికి, కర్మయోగికి భారతరత్న కోసం చేస్తున్న కృషిని కొనియాడారు... భారతరత్నకి ఘంటసాల గారు పూర్తిగా అర్హులు అని చెపుతూ గారి గొప్పతనాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు... ఒక అమరగాయకుడుగా మరియు సంగీత దర్శకుడుగా 10,000 పైగా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ మరియు తులు బాషలలో పాటలుతో పాటు అనేక ప్రైవేట్ ఆల్బమ్స్ పుష్ప విలాపం, కుంతీ విలాపం, దేశభక్తి గీతాలు పాడటం మరియు వ్యాఖ్యానంతో సహా ఆయన ఆలపించిన భగవద్గీత ఇప్పటికి తెలుగువారి ఇళ్లలో మారుమోగుతోందని అని చెప్పారు. అలాగే స్వీయ సంగీత దర్శకుడుగా 110 కంటే ఎక్కువ సినిమాలుకు సంగీత దర్శకత్వం వహించి ఆణిముత్యాలాంటి పాటలను, వాగ్గేయకారుడుగా పాటలను రచించి, సంగీత స్వర కల్పన కూర్చి మరియు వారి అమృత గాత్రంతో ఆ పాటలకు జీవం పోశారు అని చెప్పారు, అలాగే 15వ శతాభ్దం అన్నమయ్య తరువాత తిరుపతి దేవస్థానం గర్భగుడిలో పాటలు పాడిన ఏకైక గంధర్వ గాయకుడు అని తెలియచేస్తూ... వీటన్నటితోపాటు పిన్న వయస్సులోనే దేశంకోసం పోరాడిన స్వాతంత్ర సమరయోధుడుగా 18 నెలల జైలు శిక్షని అనుభవించిన గొప్ప దేశభక్తుడని అని కొనియాడారు. ఘంటసాల గారికి భారతరత్న కోసం change.org లో నేను సంతకం చేస్తున్నాని చెపుతూ మీరందరు కూడా సంతకాల సేకరణను ఇంకా ఉదృతం చేయాలనీ కోరారు. 15 కోట్ల మంది తెలుగు వారి ఆకాంక్షని కేంద్ర పాలకులకు చేరేంతవరకు అందరు కలసి కృషి చేయాలనీ దిశా నిర్దేశము చేసారు... యూఎస్ఏ నుంచి నాటా మాజీ అధ్యక్షుడు డా. రాఘవ రెడ్డి గోసాల, నాట్స్ అధ్యక్షుడు విజయ శేఖర్ అన్నే, ధర్మయోగి ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రాంకుమార్ యడవల్లి, శంకర్ నేత్రాలయ బోర్డు సభ్యులు రమేష్ బాబు చాపరాల, నారాయణరెడ్డి ఇందుర్తి, భారతదేశం నుండి సంకలనకర్త, ఘంటసాల గాన చరిత, చల్లా సుబ్బారాయుడు, సింగపూర్ నుండి శ్రీ సాంస్కృతిక కళాసారథి వ్యవస్థాపక అధ్యక్షుడు రత్న కుమార్ కవుటూరు తదితరులు పాల్గొని మాట్లాడుతూ.., పరిపూర్ణానంద స్వామి పాల్గొనడంతో ఈ కార్యక్రమానికి ఒక కొత్త ఉత్సాహాం వచ్చిందన్నారు. ఘంటసాల పాటలతో తమకున్న అభిమానాన్ని, వారి పాటలలోని మాధుర్యాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు, ఘంటసాలకి భారతరత్న దక్కకపోవడం చాలా బాధాకరం, ఇది తెలుగువారి ఆత్మ గౌరవం అని అభిప్రాయపడుతూ, ఘంటసాల కి కేంద్ర ప్రభుత్వం తగిన రీతిన గుర్తించి భారతరత్న అవార్డు తో సత్కరించాలి అని అభ్యర్ధించారు, అందుకు విదేశాలలో నివసిస్తున్న తెలుగు సంస్థలతో పాటు తెలుగేతర సంస్థలను కూడా అందరిని ఏకతాటిపై తెచ్చి భారతరత్న వచ్చేంతవరకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని తెలిపారు. ఈ బృహత్ కార్యక్రమంలో ఇప్పటివరకు అమెరికా లోని పలు తెలుగు జాతీయ సంస్థల సహకారంతో, భారతదేశం నుంచి పలువురు ప్రముఖులతో పాటు డెన్మార్క్, ఉగాండా, సౌదీ అరేబియా, హంగేరి, బ్రూనై, బోత్సవాన, మారిషస్, ఇండోనేషియా, హాంగ్ కాంగ్, థాయిలాండ్, కెనడా, బెహ్రెయిన్, ఫ్రాన్స్, న్యూజీలాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, యూఏఈ, ఖతార్, ఒమాన్, నార్వే, లండన్, దక్షిణాఫ్రికా లోని పలు తెలుగు సంస్థలతో 93 టీవీ కార్యక్రమాలను నిర్వహించామని నిర్వాహుకులు తెలిపారు. ఘంటసాల కు భారతరత్న ఇవ్వాలని మొదలుపెట్టిన సంతకాల సేకరణకు (Signature Campaign) అనూహ్యస్పందన లభిస్తోందని నిర్వాహుకులు తెలిపారు, -
పడవేయకండి..దానం చేయండి.
న్యూజెర్సీ: ఎప్పుడూ సేవాపథంలో వినూత్నంగా ఆలోచించే ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఈ సారి సరికొత్త కార్యక్రమంతో ముందుకొచ్చింది. డోన్ట్ డిచ్ ఇట్, డోనేట్ ఇట్ (పడవేయకండి.. దానం చేయండి) అనే ఈ కార్యక్రమం ద్వారా ఇళ్లలో మైనర్ రిపేర్లు ఉండి వాడకుండా పడేసిన ఎలక్ట్రానిక్ పరికరాలు( కంప్యూటర్లు, కీబోర్డులు, ఐపాడ్స్, మొబైల్ ఫోన్స్,లాప్టాప్స్,కెమెరా, స్పీకర్లు) సేకరిస్తుంది ఇలా సేకరించిన వాటిని నాట్స్ రిపేర్లు చేయించి శరణార్ధుల పిల్లలకు అందించాలని సంకల్పించింది. గతంలో మేరీ ల్యాండ్‌కు చెందిన పన్నెండేళ్ల మిడిల్ స్కూల్ విద్యార్ధిని మన తెలుగమ్మాయి శ్రావ్య అన్నపరెడ్డి ఈ కార్యక్రమాన్ని కోవిడ్ సమయంలో చేపట్టారు. అప్పట్లో ప్రెసిడెంట్ ట్రంప్ కూడా శ్రావ్య సేవా పథాన్ని కొనియాడుతూ ఆమెను సత్కరించారు. ఇదే స్ఫూర్తిని తీసుకుని నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రాజ్ అల్లాడ చొరవతో అమెరికా అంతగా ఈ కార్యక్రమాన్ని చేపట్టేందుకు శ్రీకారం చుట్టింది. డోన్ట్ డిచ్ ఇట్.. డోనేట్ ఇట్ నినాదంతో ముఖ్యంగా విద్యార్ధులను ఇందులో భాగస్వాములను చేస్తూ ముందుకు సాగనుంది. విద్యార్థి దశలోనే ఈ సమాజానికి నేనేం ఇవ్వగలను అనే బలమైన ఆకాంక్షను విద్యార్ధుల్లో పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదం చేస్తాయని నాట్స్ ఛైర్ విమెన్ అరుణ గంటి ఈ సందర్భంగా తెలిపారు. సేవాభావంతో పాటు విద్యార్ధుల్లో నాయకత్వ లక్షణాలు కూడా ఇలాంటి కార్యక్రమాల ద్వారా అలవడతాయని.. సాటి మనిషికి సాయం చేయడంలో కచ్చితంగా తమ వంతు పాత్ర పోషించాలనే బాధ్యత వస్తుందని నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరక్టర్ రాజ్ అల్లాడ అన్నారు. నాట్స్ అమెరికాలో ప్రతి రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకెళుతుందని నాట్స్ చైర్ వుమన్ అరుణ గంటి, నాట్స్ ప్రెసిడెంట్ విజయశేఖర్ అన్నె తెలిపారు. నాట్స్ వాలంటీర్లు వారి పిల్లలంతా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేందుకు ముందుకు రావాలని నాట్స్ నాయకులు పిలుపునిచ్చారు. తమకు అవసరం లేదనిపించి ఇంట్లో వాడకుండా ఉన్న ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కూడా విద్యార్ధులు సేకరించి తమకు పంపాలని నాట్స్ పేర్కొంది. చదవండి: అనాథల ఆకలి తీర్చేందుకు నాట్స్ ముందడుగు -
అనాథల ఆకలి తీర్చేందుకు నాట్స్ ముందడుగు
టెంపాబే: అనాథల ఆకలి తీర్చేందుకు నాట్స్ మరో ముందడుగు వేసింది. టెంపాబే నాట్స్ విభాగం ఆధ్వర్యంలో ఫ్లోరిడాలో ఫుడ్ డ్రైవ్ నిర్వహించింది. హోప్ చిల్డ్రన్స్ హోమ్ కోసం అనాథ పిల్లల ఆకలి తీర్చటంలో తాము సైతం ముందుంటామని నాట్స్ ఈ సత్కార్యాన్ని చేపట్టింది. దాదాపు 2 వేల పౌండ్ల ఆహరాన్ని ఈ సందర్భంగా నాట్స్ సభ్యులు సేకరించారు. ఇందులో పండ్లు, కూరగాయలు, పాలు, పాల పొడితో పాటు అనేక తినుబండారాలు ఉన్నాయి. చిన్నారులు బలం కోసం మాంసాన్ని కూడా నాట్స్ ఈ ఫుడ్ డ్రైవ్ ద్వారా సేకరించి హోమ్ చిల్డ్రన్స్ హోమ్ కు విరాళంగా అందించింది. భాషే రమ్యం.. సేవే గమ్యం అనే నినాదానికి తగ్గట్టుగా నాట్స్ సభ్యులు, నాట్స్ సభ్యుల పిల్లలు కూడా ఈ ఫుడ్ డ్రైవ్‌లో పాల్గొని దాన గుణంలో తాము సైతం ముందుంటామని నిరూపించారు. హోప్ ఆశ్రమంలో దాదాపు 67 మంది పిల్లలకు నాట్స్ సేకరించిన ఆహారం ఉపయోగపడనుంది. సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలనే సమున్నత ఆశయాన్ని నేటి తరం చిన్నారులకు కూడా అలవర్చేందుకు నాట్స్ సభ్యులు తమ పిల్లలను కూడా ఇందులో భాగస్వాములను చేశారు. ఈ కార్యక్రమానికి సహకరించిన తాజా మార్ట్,జాస్తి కుటుంబం, కాస్మెటిక్ డెంటిస్ట్రీలకు నాట్స్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. ఈ కార్యకమ్రానికి మద్దతిచ్చిన నాట్స్ మాజీ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ ఛైర్ వుమెన్ అరుణ గంటి, నాట్స్ బోర్డ్ వైస్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేనికి నాట్స్ టెంపాబే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు శ్రీనివాస్ మల్లాది, రాజేష్ నెట్టెం, నాట్స్ వైస్ ప్రెసిడెంట్ (ఫైనాన్స్/మార్కెటింగ్) భాను ధూళిపాళ్ల, నాట్స్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ కాండ్రు, నాట్స్ ఎగ్జిక్యూటివ్ వెబ్ సెక్రటరీ సుధీర్ మిక్కిలినినిని, నాట్స్ టెంపాబే సమన్వయకర్త ప్రసాద్ ఆరికట్ల, నాట్స్ టెంపాబే సంయుక్త సమన్వయకర్త సురేష్ బొజ్జ, నాట్స్ కోర్ టీం కమిటీ నాయకులు ప్రభాకర్ శాఖమురి, అనిల్ అరిమండ, నవీన్ మేడికొండ, భార్గవ్ మాధవరెడ్డి, శ్రీనివాస్ బైరెడ్డి, శిరీష దొడ్డపనేని, దీప్తి రత్నకొండతో పాటు చాలా మంది నాట్స్ వాలంటీర్లు ఈ ఫుడ్ డ్రైవ్ లో క్రియాశీలకంగా వ్యవహారించి దీనిని విజయవంతం చేశారు. -
ప్రాణాలతో గల్ఫ్ కు ఎగుమతి.. శవపేటికల్లో దిగుమతి
ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా ఏప్రిల్ 28 న 'అంతర్జాతీయ కార్మికుల స్మారక దినోత్సవం' (ఇంటర్నేషనల్ వర్కర్స్ మెమోరియల్ డే) జరుపుకుంటారు. విధి నిర్వహణలో చనిపోయిన, గాయపడిన, వికలాంగులైన, అనారోగ్యానికి గురైన కార్మికుల స్మారకార్థం జరిపే ఈ కార్యక్రమాన్ని గత కొన్నేళ్లుగా తెలంగాణ గల్ఫ్ కార్మిక సంఘాలు ఈ సందర్భాన్ని 'గల్ఫ్ అమరుల దినోత్సవం' (గల్ఫ్ మార్టియర్స్ డే) గా నిర్వహిస్తున్నారు. చనిపోయిన వారిని స్మరించండి - బ్రతికున్న వారి కోసం పోరాడండి (రిమెంబర్ ది డెడ్ - ఫైట్ ఫర్ ది లివింగ్) అనే నినాదంతో వలస కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం రాజీలేని పోరాటం చేస్తున్నారు. హైదరాబాద్ శంషాబాద్ ఏర్ విమానాశ్రయం పోలీస్ స్టేషన్ రికార్డుల ప్రకారం.. ప్రతి సంవత్సరం దాదాపు 200 శవపేటికలు గల్ఫ్ దేశాల నుండి తెలంగాణకు చేరుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2 జూన్ 2014 నుండి ఏప్రిల్ 2022 వరకు దాదాపు ఎనిమిదేళ్ల కాలంలో సుమారు 1,600 మంది తెలంగాణ వలస కార్మికుల శవపేటికలు రాష్ట్రానికి చేరుకున్నాయి. బతుకుదెరువు కోసం ఎడారి బాట పట్టిన 15 లక్షల మంది తెలంగాణ గల్ఫ్ వలస కార్మికుల కన్నీటి గాథ ఇది. గల్ఫ్ వలసలు అధికంగా ఉన్న ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎప్పుడు ఏవార్త వినాల్సి వస్తుందో అని ప్రవాసీ కుటుంబాలు ఆందోళన చెందుతున్నారు. జన్మభూమిని వదిలి వలస వెళ్లిన అభాగ్యులు గల్ఫ్ దేశాలలో అసువులు బాస్తున్నారు. శవపేటికల కోసం నెలల తరబడి ఎదురు చూడాల్సి వస్తున్నది. కొందరిని అక్కడే ఖననం చేస్తున్నారు. గల్ఫ్ దేశాల ఆసుపత్రుల మార్చురీలలో వందలాది భారతీయుల మృతదేహాలు మగ్గుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో లక్ష రూపాయలు.. స్వరాష్ట్రంలో మొండి చేయి ఆమ్నెస్టీ కారణంగా 2007 లో యూఏఈ దేశం నుండి వాపస్ వచ్చి అప్పుల బాధతో ఉత్తర తెలంగాణ కు చెందిన 29 మంది గల్ఫ్ కార్మికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుల కుటుంబాలను ఆదుకోవడానికి ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ. ఒక లక్ష చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటిస్తూ 9 మే 2008 నాడు జీఓ (నెం. 266) ను జారీ చేసింది. ఆ తర్వాతి కాలంలో గల్ఫ్ దేశాలలో వివిధ కారణాలతో చనిపోయిన పేద కార్మికులకు కూడా ఆర్ధిక సహాయం చేయడం ప్రారంభమైంది. ఉమ్మడి రాష్ట ప్రభుత్వం, ఆనాటి కరీంనగర్ జిల్లాలోని 34 మంది గల్ఫ్ మృతుల కుటుంబాలకు ఒక లక్ష రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా మంజూరు చేస్తూ జీఓ నెం.1840 ను 24 ఏప్రిల్ 2013 న జారీ చేసింది. గవర్నర్ పాలనలో ఆరు పాత జీఓ లను రీ-వాలిడేట్ చేసి జారీ చేసిన జీఓ ఇది. ఉమ్మడి రాష్ట్రంలో వేలాదిమంది గల్ఫ్ దేశాలలో మృతి చెందారు. అప్పటి ప్రభుత్వం 100 మందికి లోపే ఎక్స్ గ్రేషియా ఇచ్చింది. గుండెపోటు మరణాలు అధికం ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ కమ్యూనిటీ మెడిసిన్ అండ్ పబ్లిక్ హెల్త్ 2018లో విడుదల చేసిన నివేదిక ప్రకారం ఎన్నారైలు ఎక్కువగా హృదయ సంబంధిత సమస్యల కారణంగా మరణిస్తున్నారు. పగలు ఎండలో.. రాత్రి ఏసీ వాతావరణంలో నివసించడం, శారీరక, మానసిక ఒత్తిడి, జీవన శైలి, నిద్ర లేమి, ఆహారపు అలవాట్లు, స్మార్ట్ ఫోన్ అధిక వినియోగం, ఆరోగ్య రక్షణకు తగిన చర్యలు తీసుకోకపోవడం లాంటి కారణాలు ఆకస్మిక మరణాలకు కారణాలని కొందరు పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. గల్ఫ్ ఆత్మహత్యలు గల్ఫ్ దేశాల్లో భారతీయుల బలవన్మరణాలు పెరుగుతున్నాయి. మానసిక, వ్యక్తిగత సమస్యలు, అప్పులు, కలలు కల్లలవడం, పనిలో ఒత్తిడి, అధమ స్థాయిలో జీవన పరిస్థితులు, సరిఅయిన వేతనాలు లేకపోవడం, భౌతిక దోపిడీ, మోసం, ద్రవ్యోల్బణం, ప్రియమైన కుటుంబ సభ్యులకు దూరంగా ఉండటం, ఒంటరితనం, సమస్యలను భావాలను పంచుకోవడానికి ఒక సర్కిల్ లేకపోవడం, వైవాహిక జీవితానికి దూరం, నిరాశ, మద్యానికి బానిస అవడము లాంటి కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కోవిడ్ కు పూర్వం విదేశాలలో మరణాలు 2014 నుండి 2019 వరకు ఆరు సంవత్సరాల కాలంలో ఆరు అరబ్ గల్ఫ్ దేశాలలో 33,930 మంది ప్రవాస భారతీయులు మృతి చెందారని ప్రభుత్వం 20 నవంబర్ 2019 న లోక్ సభకు తెలిపింది. ఆరేళ్లలో సౌదీ అరేబియా (15,022), యుఏఈ (9,473), కువైట్ (3,580), ఓమాన్ (3,009), ఖతార్ (1,611), బహరేన్ (1,235) మంది ఎన్నారైలు చనిపోయారు. ఆరు గల్ఫ్ దేశాలలో 89 లక్షల మంది భారతీయులు నివసిస్తుండగా ఇందులో సగటున రోజుకు పదిహేను మంది ఎన్నారైలు మృత్యువాత పడుతున్నారు. ఇదిలా ఉండగా 2015 నుండి 2019 వరకు అయిదు సంవత్సరాల కాలంలో 125 దేశాలలో మృతి చెందిన 21,930 మంది మృతదేహాల శవపేటికలను భారత్ కు తెప్పించామని ప్రభుత్వం 5 ఫిబ్రవరి 2020 న లోక్ సభకు తెలిపింది. వీటిలో అత్యధికం గల్ఫ్ దేశాలలో సంభవించాయి. కోవిడ్ వలన మరణాలు విదేశాలలో కోవిడ్ వలన 4,048 మంది ఎన్నారైలు మృతి చెందారని ప్రభుత్వం 3 డిసెంబర్ 2021 న లోక్ సభ కు తెలిపింది. సౌదీ అరేబియా (1,154), యుఏఈ (894), కువైట్ (668), ఓమాన్ (551), బహరేన్ (200), ఖతార్ (109) ఆరు అరబ్ గల్ఫ్ దేశాలలో 3,576 మంది కోవిడ్ తో చనిపోయారు. అన్ని దేశాల మొత్తం మరణాలలో పోలిస్తే గల్ఫ్ లోనే 88 శాతం మంది కోవిడ్ తో మృతి చెందారు. ప్రమాదాల్లో విదేశాలలో ప్రమాదాల్లో మరణించిన భారతీయుల వివరాలను 3 డిసెంబర్ 2021 న ప్రభుత్వం లోక్ సభ లో వెల్లడించింది. గత మూడేళ్లలో 63 దేశాలలో 2,384 మంది ఎన్నారైలు ప్రమాదాలలో మృతి చెందారు. సౌదీ అరేబియా (683), యుఏఈ (370), కువైట్ (195), ఓమాన్ (94), ఖతార్ (60), బహరేన్ (44) ఆరు గల్ఫ్ దేశాలలో 1,446 మంది ప్రమాదాలలో మృతి చెందారు. ప్రపంచవ్యాప్తంగా జరిగిన భారతీయుల ప్రమాద మరణాలలో గల్ఫ్ లోనే 61 శాతం సంభవించాయి. ఇదిలా ఉండగా గత మూడేళ్లలో నేపాల్ (227), ఫిలిప్పీన్స్ (153), మలేసియా (76), సింగపూర్ (55) మంది ప్రమాదాల్లో మృతి చెందారు. విదేశాల్లో 468 ప్రమాద పరిహార కేసులు పెండింగ్ లో ఉన్నాయి. కువైట్ (142), ఓమాన్ (127), సౌదీ అరేబియా (85), ఖతార్ (41), యుఏఈ (24) కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఎడారిలో ఎండమావులు... కేసీఆర్ గల్ఫ్ హామీలు 14 ఏళ్ళ క్రితం... 2008 లో పరేడ్ గ్రౌండ్స్ లో కేసీఆర్ ప్రసంగం యధాతదంగా (వీడియో ట్రాన్స్క్రిప్ట్): తెలంగాణ భూములు అమ్మగా వచ్చిన వేలకోట్ల రూపాయల నుండి గల్ఫ్ బాధితులను ఆదుకోవడం కొరకు వెంటనే ప్రభుత్వం 500 కోట్ల నిధులు ఏర్పాటు చేయాలి, విడుదల చేయాలని చెప్పి ఈ మహాసభ డిమాండ్ చేస్తావున్నది. గల్ఫ్ బాధితులై మరణించిన వ్యక్తుల కుటుంబానికి 5 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఈ మహాసభ డిమాండ్ చేస్తోంది. గల్ఫ్ లో ఉన్న తెలంగాణ ఎన్నారైల పిల్లలను స్థానికులుగా పరిగణించి, కేరళ ప్రభుత్వం ఏవిధంగా సాయం అందిస్తుందో అదే విధంగా విద్యా, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఈ మహాసభ డిమాండ్ చేస్తోంది. గల్ఫ్ లో చనిపోయిన , ఆత్మహత్య చేసుకున్న వాళ్లకు ఆదుకోవడంతో పాటు స్వదేశం రావడానికి, గల్ఫ్ లో రాష్ట్ర ప్రభుత్వం మానిటరింగ్ సెల్‌ని వెంటనే ఏర్పాటు చేయాలని ఈ మహాసభ డిమాండ్ చేస్తావున్నది. మానవ వనరుల ఎగుమతి.. ఇంధనాల దిగుమతి భారత ప్రభుత్వం గల్ఫ్ దేశాలకు కార్మికులను (మానవ వనరులను) ఎగుమతి చేసి ఇంధనాలను దిగుమతి చేసుకుంటున్నది. ఇది మనుషులను ఎగుమతి చేసి విదేశీ మారక ద్రవ్యం ఆర్జించే పక్కా ఎగుమతి, దిగుమతి వ్యాపారం. కార్మికులు తమ భార్యా బిడ్డలను, తల్లి దండ్రులను, కుటుంబాన్ని, కన్న ఊరును, ఈ దేశాన్ని వదిలి విదేశాల్లో ఒంటరిగా జీవిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులు కూడా ఎడబాటుతో బాధపడుతున్నారు. వీరి త్యాగాలు మనం వెలకట్టగలమా ? ఈ దేశం కోసం డ్యూటీలో భాగాంగా ఎడారిలో దిక్కులేని వారిగా చనిపోయిన మన గల్ఫ్ ప్రవాసీ కార్మికులను "గల్ఫ్ అమరులు" అని పిలుచుకుందాం అని ప్రవాసీ సంఘాలు అంటున్నాయి. దేశ సరిహద్దులు దాటి అరబ్ గల్ఫ్ దేశాలలో సేవలందిస్తున్న వలస కార్మికులు భారతదేశానికి అపారమైన విదేశీ మారకద్రవ్యం ఆర్జించి పెడుతున్నారు. దేశ సరిహద్దుల్లో సేవలందిస్తున్న భారత సైనికుల మాదిరిగా వలస కార్మికులు కూడా దేశాభివృద్ధికి పాటుపడుతున్నారు. గల్ఫ్ దేశాలకు వలస వెళ్లే వారు 95% ఒంటరిగానే వెళుతున్నారు. తక్కువ వేతనం వలన కుటుంబాన్ని వెంట తీసుకెళ్ళలేరు. 15 లక్షల మంది తెలంగాణ రాష్ట్రానికి చెందిన 15 లక్షల మంది కార్మికులు గల్ఫ్ దేశాలలో నివసిస్తున్నారు. వీరు ప్రతి నెలా రూ. 1,500 కోట్లు విదేశీ మారక ద్రవ్యాన్ని భారత్ కు పంపిస్తున్నారు. ఈ విదేశీ మారకద్రవ్యంతో (ఫారిన్ ఎక్స్చేంజి) కేంద్ర ప్రభుత్వం క్రూడ్ ఆయిల్ (పెట్రోల్, డీజిల్) ఇంధనాలను కొనుగోలు చేస్తున్నది. తెలంగాణ ప్రవాసీ కుటుంబాలు ప్రతి నెల పొందుతున్న 1,500 కోట్ల రూపాయల సొమ్ము వినిమయంలోకి వచ్చి కనీసం 10 శాతం స్థానిక పన్నులు వసూలయినా నెలకు 150 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలోకి జమ అవుతుంది, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడానికి ఉపయోగపడుతున్నది. ఎన్నారై పాలసీ, గల్ఫ్ బోర్డు ఏమైంది ? 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు గల్ఫ్ వలస కార్మికుల సంక్షేమానికి టీఆర్ఎస్ ఎన్నికల ప్రణాళికలో అనేక హామీలు ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మర్చిపోయింది. కేరళ, పంజాబ్ తరహా విధానాలను అవలంభిస్తామని తరుచూ చెబుతోంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిది సంవత్సరాలు కావస్తున్నా ప్రత్యేక ప్రవాసి మంత్రిత్వ శాఖ ఏర్పడలేదు. ఇప్పటికీ సాధారణ పరిపాలన శాఖ (జిఏడి) లో ఎన్నారై సెల్ అని ఒక విభాగం మాత్రమే ఉన్నది. ఇప్పటికైనా గల్ఫ్ మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలి. రూ. 500 కోట్ల వార్షిక బడ్జెట్ తో తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు (గల్ఫ్ బోర్డు) ఏర్పాటు చేయాలి. సమగ్ర ఎన్నారై పాలసీ (ప్రవాసీ విధానం) ఏర్పాటు చేయాలి. ఆరోగ్య బీమా, జీవిత బీమా, ప్రమాద బీమా, పెన్షన్ లాంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలని గల్ఫ్ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. - మంద భీంరెడ్డి (వలస వ్యవహారాల విశ్లేషకులు) +91 98494 22622, mbreddy.hyd@gmail.com] చదవండి: లైఫ్ అండ్ డెత్ ఇన్ ద గల్ఫ్ -
ఈ అమరుల కుటుంబాలను ఆదుకోండి..
చనిపోయిన వారిని స్మరించండి - బ్రతికున్న వారి కోసం పోరాడండి (రిమెంబర్ ది డెడ్ - ఫైట్ ఫర్ ది లివింగ్) అనే నినాదంతో గత కొన్నేళ్లుగా తెలంగాణ గల్ఫ్ ప్రవాసి కార్మిక సంఘాలు ప్రతి ఏటా ఏప్రిల్ 28న 'గల్ఫ్ అమరుల దినోత్సవం' (గల్ఫ్ మార్టియర్స్ డే) నిర్వహిస్తున్నారు. విధి నిర్వహణలో చనిపోయిన, గాయపడిన, వికలాంగులైన, అనారోగ్యానికి గురైన కార్మికుల స్మారకార్థం... ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 28 న 'అంతర్జాతీయ కార్మికుల స్మారక దినోత్సవం' (ఇంటర్నేషనల్ వర్కర్స్ మెమోరియల్ డే) జరుపుకుంటారు. ఈ స్మారక దినోత్సవం సందర్భంగా గల్ఫ్ వలస కార్మికుల వెతలను బయటకి తేవడంతో పాటు వారికి చట్టపరమైన సహాయం అందేలా అనేక సంస్థలు రెండు రాష్ట్రాల్లో కృషి చేస్తున్నాయి. పదేళ్ల క్రితం... జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం పాతగూడూరు కు చెందిన దుర్గం భీమయ్య అనే వలస కార్మికుడు ఓమాన్ దేశంలోని మస్కట్ లో నివసించేవాడు. ఓమాన్లో అక్రమ నివాసి (ఖల్లివెల్లి)గా ఉండటంతో ప్రతి దినం జరిమానాలు, జైలు శిక్షల భయంతో జీవించేవాడు. దీంతో ఏ భయాలు లేకుండా బతికేందుకు తిరిగి ఇండియా రావాలనుకున్నాడు. ఈ క్రమంలో ఇండియాకు చేరుకోవడానికి పక్క దేశమైన యూఏఈ (దుబాయి) ద్వారా వెళ్లిపోవడం సులభ మార్గమని ఎవరో చెప్పిన మాటను నమ్మాడు. అదే క్రమంలో కాలి నడకన మరికొందరితో కలిసి ఓమాన్ నుండి యుఏఈకి ఎడారిలో సరిహద్దు వెంబడి నడక ప్రారంభించారు. ఇంతలో 2 మే 2012 న ఓమాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో మరణించాడు. అతి కష్టం మీద శవపేటిక ఇండియాకు వచ్చింది. 1976 నుంచి దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1976 నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. కానీ ఎంత మంది వెళ్లారు? ఎక్కడ పని చేస్తున్నారు ? ఎవరెలా ఉన్నారనే గణాంకాలు పట్టించుకున్న వారు లేరు. స్వతంత్ర భారత దేశంలోనూ ఇంచుమించు ఇదే ధోరణి కొనసాగింది. కానీ 90వ దశకం తర్వాత తీసిన లెక్కల్లో దుర్గం భీమయ్య కంటే ముందే గల్ఫ్ దేశాల్లో అసువులు బాసిన వలస కార్మికుల సంఖ్య 1500లకు పై మాటగానే ఉంది. ఈ తరుణంలో భీమయ్య బాధకర మరణంతో ఒక్కసారిగా గల్ఫ్ వలస కార్మికుల కష్టాలు, వార కుటుంబాలు పడుతున్న బాధలు తెర మీదకు వచ్చాయి. దీంతో వలస కార్మికుల హక్కులు, రక్షణ కోసం పని చేయడంలో అనేక సంస్థలు శ్రద్ధ కనబరుస్తూ వస్తున్నాయి. సాయం అందిన తర్వాత మృతుడు దుర్గం భీమయ్య భార్య స్వప్న తన కుమారుడు శ్రవణ్, కూతురు శ్వేత వైష్ణవి లను కష్టపడి పెంచింది. ఎస్సీ కార్పొరేషన్ సహాయంతో బ్యాంక్ లోన్ తో బర్రెలను కొని పాల ఉత్పత్తి చేపట్టింది. సకాలంలో అప్పు తీర్చేసి బ్యాంకు అధికారుల మన్ననలను పొందింది. కొందరు దాతల చిరు సహాయం పిల్లల చదువుకు ఉపయోగపడింది. ప్రస్తుతం ఉపాధి హామీ కూలీగా పని చేస్తున్నది. రోజువారీ వ్యవసాయ కూలీ, భవన నిర్మాణ కూలీగా కూడా పనిచేస్తున్నది. ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్ లో 10వ తరగతి పాస్ అయిన కూతురు శ్వేత వైష్ణవికి బాల్య వివాహం చేసింది. కూతురుకు కూతురు పుట్టింది. పెళ్లి అయి కూతురు పుట్టినప్పటికీ శ్వేత వైష్ణవి ఇంటర్ ఎంపీసీ సెకండ్ ఇయర్ చదువుతున్నది. కుమారుడు శ్రవణ్ ఇంటర్ ఎంపీసీ పూర్తిచేసి, ఇప్పుడు బీకాం ఫస్టియర్ చదువుతున్నాడు. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం కోసం కోచింగ్ కు వెళ్లాలని ప్రయత్నిస్తున్నాడు. కాలగర్భంలో బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి ఎందరో అమరులయ్యారు. కొందరి జీవితాల్లు కష్టాలు బయటకి రాగా మరెందరో కాలగర్భంలో కలిసిపోయారు. కానీ భీమయ్య ఘటన తర్వాత గల్ఫ్ కార్మికుల జీవితాలు, వాటి కుటుంబ సభ్యుల బాధలపై పట్టింపు పెరిగింది. ఈ క్రమంలో అనుకోని పరిస్థితుల్లో భీమయ్య చనిపోయినా.. అతనికి కుటుంబానికి దక్కిన చిరు సాయం (ఎస్సీ కార్పోరేషన్ రుణం)తో ఆ కుటుంబం తిరిగి నిలదొక్కుకోగలిగింది. కానీ ఇప్పటికీ ఎన్నో కుటుంబాలు ఇటు ప్రభుత్వాల నుంచి అటు సమాజం నుంచి ఎటువంటి సాయం అందక చితికి పోతున్నాయి. చేయూతనివ్వండి ఈ నేపథ్యంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు బతుకుదెరువు వేటలో అమరులైన గల్ఫ్ కార్మికుల కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ సాయం కోసం రెండు రాష్ట్రాల్లో సుమారు ఆరు వేల మంది గల్ఫ్ దేశాల్లో అమరులయ్యారు. వారి కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. - మంద భీంరెడ్డి (గల్ఫ్ వ్యవహారాల విశ్లేషకులు) +91 98494 22622 చదవండి: What Is ECR And ECNR: ఈసీఆర్, ఈసీఎన్నార్ పాస్‌పోర్టులు ఎందుకో తెలుసా ? -
ఘంటసాలకి భారతరత్న ప్రకటించాలంటూ కేంద్రానికి విజ్ఞప్తి
అమరగాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు శత జయంతి వేడుకల సందర్భంగా వారికి భారతరత్న పురస్కారం ఇవ్వాలనే డిమాండ్‌తో శంకర నేత్రాలయ (యూఎస్ఏ) అధ్యక్షుడు బాల ఇందుర్తి ఆధ్వర్యములో వరుసగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇప్పటివరకు 80 పైగా టీవీ కార్యక్రమాలను నిర్వహించి ప్రపంచం నలుమూలలో ఉన్న తెలుగు సంస్థలను ఏకాతాటిపై తీసుకువస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందులో భాగంగా యూఎస్ఏ నుంచి నుండి నీలిమ గడ్డమణుగు వ్యాఖ్యాతగా 24 ఏప్రిల్ 2022 నాడు జరిగిన అంతర్జాల కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఇండియన్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఆపి (AAPI) పూర్వ అధ్యక్షులు డాక్టర్ సురేష్ రెడ్డి ముఖ్య అతిథిగా, చెన్నై నుంచి ఘంటసాల కోడలు శ్రీమతి కృష్ణ కుమారి ఘంటసాల అతిధులుగా పాల్గొన్నారు. సురేష్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర పాలకులు మొదటి నుంచి దక్షిణాది వారి మీద చిన్నచూపుతో వ్యవహరించారని, ముఖ్యంగా తెలుగు వారికీ అన్ని విధాలుగా అన్యాయం జరిగిందన్నారు. ఘంటసాల గారికి భారతరత్న విషయంలో అదే జరిగిందన్నారు. ఇప్పటికయినా ఘంటసాలకి భారతరత్న వచ్చేంతవరకు అందరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇండియన్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ (IAMA) సంస్థలో ఉన్న తెలుగు డాక్టర్లందరి సహకారంతో భారతరత్న కోసం ప్రయత్నం చేస్తామని హామీ ఇస్తూ ఈ కార్యక్రమానికి పూర్తి మద్దతుని ప్రకటించారు. కృష్ణ కుమారి ఘంటసాల మాట్లాడుతూ నిర్వాహుకులు చేస్తున్న ప్రయత్నాన్ని ఘంటసాల కుటుంబం తరుపున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్టు తెలిపారు. మనందరి ప్రయత్నాలు సఫలం కావాలని ఆకాంక్షించారు, ఈ సందర్భంగా బాల ఇందుర్తిని ప్రత్యేకంగా అభినందించారు. అతిత్వరలోనే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలసి వారి సహకారంతో మన అందరి ప్రయత్నాలను ఇంకా ముందుకు తీసుకువెళ్లాలని అభ్యర్ధించారు. ఆస్ట్రేలియా, సిడ్నీ నుండి సంగీత దర్శకుడు, తబలా ప్లేయర్ ఆదిశేషు కోట, సింగపూర్ నుండి శ్రీ సాంస్కృతిక కళాసారథి వ్యవస్థాపక అధ్యక్షుడు రత్న కుమార్ కవుటూరు, డెన్మార్క్ నుండి తెలుగు అసోసియేషన్ వ్యవస్థాపకుడు అమర్నాధ్ పొట్లూరి, ఉగాండా నుండి తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ ఉగాండా చైర్మన్ వి.పార్థసారథి, సౌదీ అరేబియా నుండి సౌదీ తెలుగు అసోసియేషన్ అధ్యక్షురాలు దీపికా రవి, UK నుండి తెలుగు అసోసియేషన్ ఆఫ్ సట్టన్ (TAS) అధ్యక్షుడు నవీన్ జలగడుగు, హంగేరి నుండి యోగహిత ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు, అరవింద కొల్లిపార, యు.యెస్.ఏ నుండి శంకర్ నేత్రాలయ బోర్డు సభ్యులు, ఉపేంద్ర రాచుపల్లి తదితరులు పాల్గొని ఘంటసాల పాటలతో తమకున్న అభిమానాన్ని, వారి పాటలలోని మాధుర్యాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు, ఘంటసాల కి భారతరత్న దక్కకపోవడం చాలా బాధాకరం, ఇది తెలుగు వారి ఆత్మ గౌరవం అని అభిప్రాయపడుతూ, ఘంటసాల కి కేంద్ర ప్రభుత్వం తగిన రీతిన గుర్తించి భారతరత్న అవార్డు తో సత్కరించాలి అని అభ్యర్ధించారు, అందుకు విదేశాలలో నివసిస్తున్న తెలుగు సంస్థలతో పాటు తెలుగేతర సంస్థలను కూడా అందరిని ఏకతాటిపై తెచ్చి భారతరత్న వచ్చేంతవరకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని తెలిపారు. ఈ బృహత్ కార్యక్రమంలో ఇప్పటివరకు అమెరికా లోని పలు తెలుగు జాతీయ సంస్థల సహకారంతో, భారతదేశం నుంచి పలువురు ప్రముఖులతో పాటు డెన్మార్క్, ఉగాండా, సౌదీ అరేబియా, హంగేరి, బ్రూనై, బోత్సవాన, మారిషస్, ఇండోనేషియా, హాంగ్ కాంగ్, థాయిలాండ్, కెనడా, బెహ్రెయిన్, ఫ్రాన్స్, న్యూజీలాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, యూఏఈ, ఖతార్, ఒమాన్, నార్వే, లండన్, దక్షిణాఫ్రికా లోని పలు తెలుగు సంస్థలతో 83 టీవీ కార్యక్రమాలను నిర్వహించామని, ఈ టీవీ చర్చా కార్యక్రమాలకు ప్రపంచ దేశాలలోని తెలుగు సంఘాలకి అనుసంధాన కర్తగా సింగపూర్ నుండి రత్న కుమార్ కవుటూరు వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి కావలసిన సహకారాన్ని శ్రీమతి కృష్ణ కుమారి ఘంటసాల అందిస్తున్నారు. ఘంటసాల కు భారతరత్న ఇవ్వాలని మొదలుపెట్టిన సంతకాల సేకరణకు అనూహ్యస్పందన లభిస్తోందని నిర్వాహుకులు తెలిపారు. చదవండి: ఘంటసాలకు భారతరత్న వచ్చే వరకు కృషి చేద్దాం -
ఎన్నారైలతో గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ భేటీ
డౌనర్స్ గ్రోవ్ (షికాగో): అమెరికా పర్యటనలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి ప్రవాస భారతీయులతో భేటీ అయ్యారు. షికాగోలో ప్రజా రవాణా, కోవిడ్ పరీక్షా కేంద్రాలు, పార్కుల నిర్వహణ, పారిశుధ్యం, డ్రైనేజీ, మురుగునీటి పారుదల వ్యవస్థ కార్యకలాపాలు ముఖ్యంగా ఫ్లాష్ వరద నీటి నియంత్రణ ప్రక్రియ పరిశీలించడానికి డిప్యూటీ మేయర్, కార్పొరేటర్, స్థానిక తెలుగు కమ్యూనిటీ నాయకులతో కలిసి నాపర్విల్లే, షాంబర్గ్ నగర ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా షికాగోలోని డౌనర్స్ గ్రోవ్ లో ప్రవాస భారతీయులతో డిప్యూటీ మేయర్ బృందం భేటీ అయ్యింది. ఈ సమావేశంలో కార్పొరేటర్ సామల హేమ, టీటీసీసీసీ అధ్యక్షురాలు శోభనారెడ్డిలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. నాట్స్ నాయకులు, ఎంటర్‌ప్ర్యూనర్ శ్రీనివాస్ పిడికిటి సమన్వయంతో ఈ భేటి ఏర్పాటు చేశారు. హైదరాబాద్ గ్లోబల్ సిటీగా ఎలా ఎదుగుతుంది? మల్టినేషనల్ కంపెనీలకు ఎలా వేదికగా మారుతుందనే అంశంపై డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి వివరించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలంటూ ఎన్నారైలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై నాయకులు, పారిశ్రామికవేత్తలు మహేష్ కాకర్ల, మదన్ పాములపాటి, శ్రీని యార్లగడ్డ, శ్రీనివాస్ బొప్పన, శ్రీని అరసడ, రవి శ్రీకాకుళం, కేపీ, విజయ్ వెనిగళ్ల, లక్ష్మి బొజ్జ, బిందు బాలినేని, అను, అనిత, రాధ, సుమతి, సుధ, డాక్టర్ నీలిమ, శోభ, దేవి, రాజేష్ వీదులమూడి, కృష్ణ నున్న, కృష్ణ నిమ్మగడ్డ, మనోహర్ పాములపాటి, ఆర్కే, హరీష్ జమ్ముల తదితరులు పాల్గొన్నారు. -
అమెరికా టాప్ 20 డైనమిక్ సీఈఓల జాబితాలో అనిల్ గ్రంధి
ప్రవాస భారతీయుడు అనిల్ గ్రంధి అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. అమెరికాకు చెందని డిజిటల్ సంస్థ సీఈవో పబ్లికేషన్ తాజాగా ఈ ఏడాదికి ప్రకటించిన జాబితాలో ఆయన టాప్ 20లో చోటు దక్కించుకున్నారు. ఏజీ ఫిన్‌ట్యాక్స్ అనే సంస్థకు అనిల్ గ్రంధి ఫౌండర్, సీఈవోగా ఉన్నారు. ఈ కార్పొరేట్ సంస్థలకు పన్నులకు సంబంధించిన విషయాల్లో ఏజీ ఫిన్ ట్యాక్స్ సంస్థ సేవలు అందిస్తోంది. అనిల్ గ్రంధి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని రాజాం. గ్రంది వీరభద్రరావు, ధనలక్ష్మీలు అనిల్ తల్లిదండ్రులు, డిగ్రీ వరకు రాజాంలోనే ఆయన విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఆ తర్వాత అమెరికా వెళ్లారు. చదవండి👉🏾 పాకిస్తాన్లో చదివినోళ్లకు ఉద్యోగాలు ఇవ్వం! -
ఆటిజంపై నాట్స్ సదస్సు
నార్త్ అమెరికా తెలుగు సోసైటీ (నాట్స్) ఆధ్వర్యంలో ఆటిజంపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామని నాట్స్ బోర్డ్ చైర్ఉమన్ అరుణగంటి, ప్రెసిడెంట్ విజయ్ శేఖర్ అన్నెలు తెలిపారు. 2022 ఏప్రిల్ 30న మధ్యాహ్నాం 2:00 గంటలు (4:30 ఈఎస్టీ) ఈ సదస్సు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పలువురు డాక్టర్లు, నిపుణులు ఆటిజంపై చర్చిస్తారు. ఈ కార్యక్రమంలో కృష్ణ మాదిరాజు, మీనాక్షి చింతపల్లి, రామ్ ప్రయాగ, శుభ బొలిశెట్టి, కాశినాథుని రాధ, పద్మజా యలమంచిలిలు పాల్గొంటారు. ఈ కార్యక్రమం వీక్షించేందుకు www.natsworld.org/autism-awareness-acceptance ఉపయోగించవచ్చు. ఫేస్బుక్లో కూడా లైవ్ ఇస్తామని నాట్స్ తెలిపింది. -
తానా తెలుగు తేజం పోటీలు
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) - తెలుగు పరివ్యాప్తి కమిటీ ఆధ్వర్యంలో తెలుగు తేజం పోటీలు జరుగుతున్నాయి. తెలుగు భాషా సాహిత్యం, పరివ్యాప్తిలో భాగంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీల వల్ల ప్రవాస దేశాల్లో నివసిస్తున్న పిల్లలు, యువకులకు తెలుగు భాష పై మక్కువ పెరుగుతుందని తానా తెలిపింది. ఈ పోటీల్లో ప్రవాస దేశాలలో నివసిస్తున్న వారు ఎవరైనా పాల్గొనవచ్చని తానా తెలిపింది. పిల్లలను ప్రోత్సహించి ఈ పోటీలలో భాగస్వాములు చేయవలసిందిగా తల్లిదండ్రులను తానా కోరింది. ఈ పోటీకి సంబంధించి దరఖాస్తు, ప్రవేశ రుసుము, నియమ నిబంధనలు కోసం https://forms.gle/u1gqzHFhTT3a6yYg9 సంప్రదించవచ్చు. దరఖాస్తుతో పాటు ప్రవేశరుసుము చెల్లించడానికి 2022 మే 01 ఆఖరు తేది. అనంతరం జూన్ 4, 5 తేదీలలో జూమ్ లో పోటీల నిర్వహిస్తారు. -
అక్కడ చదివితే.. డిగ్రీలు చెల్లవు, ఉద్యోగాలు ఇవ్వం!
ఉన్నత విద్య కోసం పాకిస్తాన్‌కి వెళితే ఇండియాలో ఉద్యోగాలు, వివిధ కోర్సుల్లో అడ్మిషన్లు పొందలేరంటూ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్, ఆలిండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సంస్థలు స్పష్టం చేశాయి. ఈ మేరకు సంయుక్త పత్రికా ప్రకటన విడుదల చేశాయి. భారతీయులు కానీ ఇండియన్ ఓవర్సీస్ సిటిజన్‌షిప్ కలిగిన వ్యక్తులు ఎటువంటి ఉన్నత విద్య కోసమైనా పాకిస్తాన్ వెళ్లవద్దంటూ సూచించింది. ఒకవేళ ఎవరైనా పాకిస్తాన్‌కి చెందిన యూనివర్సిటీలు, విద్యాసంస్థల్లో కోర్సులను అభ్యసిస్తే వాటిని గుర్తించమని తెలిపింది. ఈ కోర్సులు, సర్టిఫికేట్ల ఆధారంగా ఇండియాలో ఉద్యోగాలు, ఇతర విద్యాసంస్థల్లో ప్రవేశాటకు అనుమతి ఇవ్వబోమంటూ తేల్చి చెప్పింది. ఎవరైనా భారతీయ వలస కార్మికులు పాకిస్థాన్ విద్యాసంస్థల్లో చదువుకుంటే.. వారికి పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ పూర్తయిన తర్వాతే ఉద్యోగులు, ఇతర అడ్మిషన్లు పొందేందుకు అనుమతి ఇస్తామని పేర్కొంది. UGC & AICTE has advised students not to travel to Pakistan for pursuing higher education. pic.twitter.com/L1vl5XmotQ — ANI (@ANI) April 23, 2022 చదవండి👉🏾 అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలుగు విద్యార్థులు, స్థానిక డ్రైవర్ మృతి -
సాయిబాబా ఆలయంలో శ్రీరామ నవమి వేడుకలు
షిరిడి సాయిబాబా దేవస్థానం ఆస్టిన్, వెంకటేశ్వర దేవస్థానం ఆస్టిన్ (టెక్సాస్) ఆధ్వర్యములో అంగరంగ వైభవముగా శ్రీ సీతారామ కళ్యాణం వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో సుమారుగా 6000 మంది భక్తులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగం సాయిబాబాకి చందన, చావడి ఉత్సవం నిర్వహించగా సీతారాములుకి మంగళ స్నానం చేయించారు. సీతారామ కళ్యాణం అనంతరం తీర్థ ప్రసాదాలు ఇచ్చారు. వచ్చిన ప్రతీ భక్తునికి బంతి భోజనాలు ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు కల్పన నూకవరపు, రవి బురుజులు, మల్లిక్ ఆవుల, కేథార్‌నాధ్ ముండ్లురూ, పూర్ణేశ్ సవితాల, విజయ్ దొడ్ల, సౌజన్య , బాలాజీ ఆత్యంలు ఈ వేడుకులు నిర్వహించడంలో పాలు పంచుకున్నారు. అదే విధంగా ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలు, వలంటీర్స్‌కు పేరు పేరున కృతఙ్ఞతలు తెలిపారు. -
ఘంటసాలకు భారతరత్న వచ్చే వరకు కృషి చేద్దాం
అమరగాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావుకి భారతరత్న ఇవ్వాలనే డిమాండ్‌తో శంక నేత్రాలయ (యూఎస్ఏ) మరో నిర్విరామంగా కార్యక్రమాలు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో తాజాగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖ సంగీత దర్శకులు మాధవపెద్ది సురేష్ మాట్లాడుతూ ఘంటసాల గారి పాటలు విని పెరిగామని, వారి లేని లోటుని ఎవరు భర్తీ చేయలేరని అని అన్నారు. ఘంటసాల పాటలలోని వైవిధ్యాన్ని వివరించారు. ముఖ్యంగా ఒక శ్యామలా దండకం, శివశంకరి వంటి పాటలు ఇంకో వెయ్యేళ్ల తర్వాత కూడా ఎవరు ఘంటసాల లాగా పాడలేరని తెలిపారు. గిన్నిస్ బుక్ పురస్కార గ్రహీత కలైమామణి డాక్టర్ పార్వతి రవి ఘంటసాల మాట్లాడుతూ మనందరి ప్రయత్నాలు సఫలమై త్వరలోనే ఘంటసాలకి భారతరత్న రావాలని ఆకాంక్షించారు. ఇతర వక్తలు మాట్లాడుతూ విదేశాలలో నివసిస్తున్న తెలుగు సంస్థలతో పాటు తెలుగేతర సంస్థలన్నింటినీ ఏకతాటిపై తెచ్చి ఘంటసాలకు భారతరత్న వచ్చేంతవరకు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అమెరికా నుంచి ఆపి (ఏఏపీఐ)అధ్యక్షులు డా. అనుపమ గోటిముకుల, విద్యావేత్త, ఆవిష్కర్త డా. బి కె కిషోర్, సేవా ఇంటర్నేషనల్ ఉపాధ్యక్షులు స్వదేష్ కటోచ్, బ్రూనై నుంచి తెలుగు సమాజం అధ్యక్షులు వెంకట రమణ (నాని), బోత్సవాన నుంచి తెలుగు అసోసియేషన్ అఫ్ బోత్సవాన అధ్యక్షులు వెంకట్ తోటకూర, మారిషస్ నుంచి ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్, తెలుగు మహాసభ ఆర్గనైజర్ సీమాద్రి లచ్చయ్య తదితరులు పాల్గొని ఘంటసాల పాటలతో తమకున్న అభిమానాన్ని, వారి పాటలలోని మాధుర్యాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు అమెరికా లోని పలు తెలుగు జాతీయ సంస్థల సహకారంతో, భారతదేశం నుంచి పలువురు ప్రముఖులతో పాటు, బ్రూనై, బోత్సవాన, మారిషస్, ఇండోనేషియా, హాంగ్ కాంగ్, థాయిలాండ్, కెనడా, బెహ్రెయిన్, ఫ్రాన్స్, న్యూజీలాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, యూఏఈ, ఖతార్, ఒమాన్, నార్వే, లండన్, దక్షిణాఫ్రికా లోని పలు తెలుగు సంస్థలతో 73 టీవీ కార్యక్రమాలను నిర్వహించామని, ఈ టీవీ చర్చా కార్యక్రమాలకు ప్రపంచ దేశాలలోని తెలుగు సంఘాలకి అనుసంధాన కర్తగా సింగపూర్ నుండి రత్న కుమార్ కవుటూరు, న్యూజీలాండ్ నుండి శ్రీలత మగతల, ఆస్ట్రేలియా నుండి ఆదిశేషు వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి కావలసిన సహకారాన్ని ఘంటసాల కృష్ణ కుమారి అందిస్తున్నారు. ఉగాది పర్వదిన వసంత నవరాత్రులు సందర్భంగా ఘంటసాల కు భారతరత్న ఇవ్వాలని మొదలుపెట్టిన సంతకాల సేకరణకు (Signature Campaign) అనూహ్యస్పందన లభిస్తోందని నిర్వాహుకులు తెలిపారు. -
మాలి రాయబారిగా ఇండో అమెరికన్‌ని నియమించిన బైడెన్
మాలి దేశానికి అమెరికా రాయబారిగా ఇండో అమెరికన్ మహిళ రచనా సచ్దేవ్ను నియమించారు. ఈ మేరకు వైట్‌హౌజ్ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. భారత సంతతి చెందిన రచనా సచ్దేవ్ అమెరికా ఫారిన్ సర్వీసెస్‌లో సుదీర్ఘ కాలంగా పని చేస్తున్నారు. గతంలో ఆమె శ్రీలంక, సౌదీ అరేబియాలలో పని చేశారు. ఆ తర్వాత చాలా కాలం పాటు ఈస్ట్రర్న్ ఎఫైర్స్ విభాగంలో పని చేశారు. తాజాగా మాలి దేశానికి రాయబారిగా నియమించారు అమెరికా ప్రెసిడెంట్ జోబైడెన్. నెల రోజుల వ్యవధిలో ముగ్గురు భారత సంతతి అధికారులకు రాయబారులుగా పదోన్నతి కల్పించారు జో బైడెన్. మొరాకో దేశానికి రాయబారిగా పునీత్ తల్వార్‌ను నియమించారు. అంతకు ముందు నెదర్లాండ్స్ రాయబారిగా షెఫాలీ రజ్దాన్ దుగ్గల్‌ను ఎంపిక చేశారు. వీరే కాదు వైట్‌హౌజ్‌లోని బైడెన్ టీమ్‌లో కూడా ఇండో అమెరికన్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. చదవండి: నెదర్లాండ్స్‌లో అమెరికా రాయబారిగా షెఫాలీ జర్దాన్ దుగ్గల్ ! -
లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా సీతారాముల కల్యాణం
లాస్ ఏంజిల్స్‌లో సీతారాముల కల్యాణం ఘనంగా జరిగింది. లాస్ఏంజెసెల్ నగరానికి సమీప రాష్ట్రాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలు భారీ ఎత్తున ఈ వేడుకల్లో పాల్గొన్నారు. దీంతో లాస్ఏంజెలెస్ నగర వీధులు కొత్త శోభను సంతరించుకున్నాయి. సిమీ ఇండియా కమ్యూనిటీ సెంటర్లో జరిగిన ఈ కల్యాణం అచ్చంగా భద్రచల శ్రీరాముల కల్యాణ మహోత్సవాన్ని తలపించింది. భద్రాచలంలో ప్రత్యేక పూజలు చేయించి అమెరికాకు తీసుకువచ్చిన ఉత్సవ మూర్తులతో మేళతాళాల సాక్షిగా పెళ్లి జరిగింది. అనంతరం ఆడ పడుచుల కోలాటాల మధ్య సాగిన ఊరేగింపు అందరి మనసులని ఆకట్టుకుంది. దాదాపు 50 మంది తెలుగు ఆడపడుచులు చేసిన కోలాటం ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పాదుకలకు పట్టాభిషేకం నిర్వహించారు. గోవింద, రామ నామా స్మరణతో ఆ ప్రాంగణం అంతా మార్మోగి పోయింది. ఈ కార్యక్రమములో పాల్గొన్న వారంతా సంప్రదాయ దుస్తులు ధరించారు. దాదాపు 700 మందికి పైగా భక్తులు కల్యాణోత్సవంలో భాగమయ్యారు. 70 కి పైగ జంటలు సామూహికంగా కళ్యాణం లో పాల్గొన్నారు. సుమారు నాలుగు గంటలకు పైగా ఈ వేడుకలు జరిగాయి. ఈ కల్యాణోత్సవానికి సహాకరించిన ప్రతీ ఒక్క స్వచ్చంధ సంస్థకి నిర్వాహకులు రామ్ కొడితాల, నంగినేని చందు, టీ కుమార్, ఏ మనోహార్‌లు కృతజ్ఞతలు తెలిపారు. -
ఘనంగా టాస్ ఉగాది సంబరాలు
తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్ (టాస్) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. మూడేళ్ల తర్వాత జరుగుతున్న వేడుకలు కావడంతో టాస్ కన్నుల పండువగా ఈ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు చేసింది. సినీ నేపథ్య గాయని ఉషా పాటలు అలరించాయి. టాస్ సాంస్కృతిక కార్యదర్శి నిరంజన్ నూక ఆధ్వర్యంలో టాస్ ప్రస్తుత, పూర్వ కార్యనిర్వాహాక సభ్యుల జ్యోతి ప్రజ్వాలనతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలను చూసి ఇండో, స్కాటీష్ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఉగాది వేడుకలను పురస్కరించుకుని టాస్ కొత్త కార్యవర్గాన్ని ప్రకటించారు. టాస్ చైర్‌పర్సన్‌గా మైథిలీ కెంటూరీ, అధ్యక్షుడిగా శివ చింపిరి, ప్రధాన కార్యదర్శిగా ఉదయ్ కుమార్ కూదాడి, సంయుక్త కార్యదర్శిగా వెంకటేష్ గడ్డం, కోశాధికారిగా నిరంజన్ నూక, సాంస్కృతిక కార్యదర్శిగా మర్రి విజయ్‌కుమార్, మహిళా కార్యదర్శిగా మాధవీలత, క్రీడా కార్యదర్శిగా జాకీర్షేక్, ఐటీ, మీడియా కార్యదర్శిగా పండరీ జైన్ పొలిశెట్టి, యువజన కార్యదర్శిగా నరేశ్ దీకొండ, అసోసియేట్స్ ప్రాజెక్ట్ కార్యదర్శిగా కర్నాటి బాలాజీ, అసోసియేట్స్ క్రీడా కార్యదర్శిగా సాంబ రాజశేఖర్‌లు ఎన్నికయ్యారు. -
దిగ్విజయంగా కొనసాగిన శ్రీమద్ భాగవత సప్తాహం
సింగపూర్‌లో ప్రఖ్యాత తెలుగు సంస్థలైన 'శ్రీ సాంస్కృతిక కళాసారథి', 'తెలంగాణ కల్చరల్ సొసైటీ', 'తెలుగు భాగవత ప్రచార సమితి' 'కాకతీయ సాంస్కృతిక పరివారం' సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాల వేదికపై వారం రోజులపాటు "శ్రీమద్ భాగవత సప్తాహం" కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. ఉగాది రోజున ప్రారంభమైన ఈ కార్యక్రమం అద్భుతంగా కొనసాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉన్న కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి సింగపూర్ ప్రజలందరికీ ప్రధాని నరేంద్ర మోడీ గారి తరఫున ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు సమాపణోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. బీజేపీ పూర్వ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పూర్వ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యు.దుర్గాప్రసాద్‌రావు, బీజేపీ రాష్ట్ర కోశాధికారి వామరాజు సత్యమూర్తి, టీటీడీ పూర్వ బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి తదితర ప్రముఖులు ఈ వారం రోజులపాటు కార్యక్రమంలో వేర్వేరు తేదీలలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ప్రధాన నిర్వాహకులు రత్న కుమార్ కవుటూరు, నీలం మహేందర్, ఊలపల్లి భాస్కర్, మరియు రాంబాబు పాతూరి, కార్యవర్గ సభ్యులు ప్రశాంత్ రెడ్డి, రమేష్ గడప తదితరులు డాక్టర్ మేడసాని కి ఇతర అతిథులకు తమ కృతజ్ఞతలు తెలియజేసి ప్రపంచ నలుమూలల నుండి తెలుగువారందరూ కలసి భాగవత వైశిష్ట్యాన్ని గురించి తెలుసుకోవసిన ఆవశ్యకత ఉందన్నారు. -
స్కాట్లాండ్లో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు
శ్రీరామనవమిని పురస్కరించుకుని సీతారాముల వారి కల్యాణోత్సవాన్ని యూకేలోని స్కాట్లాండ్ దేశంలో గల అబర్డీన్ ప్రాంతంలోని హిందూ దేవాలయంలో ఘనంగా నిర్వహించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మొట్ట మొదటి సారిగా తెలుగు ప్రాంత ప్రజలతో పాటు అన్ని రాష్ట్రాల ప్రజలు అంగరంగ వైభవంగా ఈ వేడుకలు కన్నుల పండగగా జరుపుకున్నారు. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు ఉత్సవ ప్రాంతానికి తరలివచ్చారు. స్కాటిష్ ప్రజలు సైతం ఈ వేడుకల్లో పాల్గొనడం విశేషం. రామనామ స్మరణతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. సీతాసమేత రాములోరిని దర్శించుకునేందుకు భక్తులు క్యూలో బారులు తీరారు. శ్రీరామ జయరామ, జయ జయ రామ అంటూ తెలుగు ప్రాంత భక్తులు నినాదాలతో హోరెత్తించారు. ఈ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వాహకులు పడకంటి వివేక్, గోల్కొండ వేద, రమేశ్ బాబు, డాక్టర్ నాగ ప్రమోద్, బోయపాటి హారి లు అట్టహాసంగా నిర్వహించారు. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి వారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. స్కాట్ లాండ్ లోని చుట్టుపక్కల ప్రాంతాల నుండి స్వామివారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు మహరాష్ట, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పంజాబ్, హర్యానా తదితర రాష్ట్రాలకు చెందిన ప్రవాస భారతీయ భక్తులు దాదాపు 350 మంది వరకు తరలివచ్చారు. భక్తులు స్వామివారికి కట్నకానుకలు సమర్పించుకున్నారు. అనంతరం స్వామి వారి పల్లకి సేవ కార్యక్రమాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. కల్యాణ అనంతరం అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. -
హ్యూస్టన్‌లో శ్రీరామ నవమి వేడుకలు
-
ఈసీఆర్, ఈసీఎన్నార్ పాస్‌పోర్టులు ఎందుకో తెలుసా ?
ఎమిగ్రేషన్ యాక్టు-1983 ప్రకారం భారత ప్రభుత్వం 18 దేశాలను ఈసీఆర్ (ఎమిగ్రేషన్ చెక్ రిక్వయిర్డ్ - విదేశాలకు ఉద్యోగానికి వెళ్ళడానికి అనుమతి అవసరమైన) క్యాటగిరీ గా నోటిఫై చేసింది. వీటిని స్పెసిఫైడ్, నోటిఫైడ్ ఈసీఆర్ కంట్రీస్ అని కూడా అంటారు. ఆ 18 దేశాలు ఈ పద్దెనిమిది దేశాలలో గల్ఫ్ కోపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) కి చెందిన ఆరు అరబ్ గల్ఫ్ దేశాలు కూడా ఉన్నాయి. అవి బహరేన్, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, ఓమాన్, యూఏఈ అనబడే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. వీటితో పాటు ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, జోర్డాన్, లెబనాన్, లిబియా,.మలేసియా, సుడాన్, సౌత్ సుడాన్, సిరియా, యెమెన్, ఇండోనేసియా, థాయిలాండ్ దేశాలున్నాయి. ఈసీఆర్ పాస్ పోర్ట్ ఎందుకు? ఎమిగ్రేషన్ చెక్ రిక్వయిర్డ్ పాస్‌పోర్టునే సింపుల్‌గా ఈసీఆర్ పాస్‌పోర్టు అంటున్నారు. దీని ప్రకారం నోటిఫై చేసిన 18 ఈసీఆర్ దేశాలకు ఉద్యోగానికి వెళ్ళడానికి భారత ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. 10వ తరగతి కంటే తక్కువ విద్యార్హత ఉన్నవారికి ఈసీఆర్ పాస్ పోర్ట్ జారీ చేస్తారు. అంటే ఈ పాస్‌పోర్టు కింద విదేశాల్లో ఉద్యోగాల కోసం వెళ్లేవారికి విదార్హత, సామాజిక అంశాలపై పట్టు, లోకజ్ఞానం తక్కువ ఉన్నాయని అర్థం. వీరు అమాయకులు, బలహీనులుగా ఉన్నందున ఈ 18 ఈసీఆర్ దేశాలలోని కార్మిక చట్టాలు, వివిధ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని... వల్నరబుల్ (హాని పొందడానికి అవకాశం వున్న) భారత పౌరుల రక్షణ, సంక్షేమం కొరకు భారత ప్రభుత్వం ఈసీఆర్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. తక్కువ నైపుణ్యం కలిగి, శారీరిక శ్రమ చేసే విదేశాలలోని భారతీయ కార్మికులను (బ్లూ కాలర్ వర్కర్స్) రక్షించడం దీని ముఖ్య ఉద్దేశం. క్లియరెన్స్.. ప్రయోజనాలు ఈసీఆర్ పాస్ పోర్ట్ కలిగిన కార్మికులు ఈ 18 ఈసీఆర్ దేశాలకు ఉద్యోగానికి వెళ్లే ముందు... లైసెన్స్ కలిగిన రిక్రూటింగ్ ఏజెన్సీ ద్వారా హైదరాబాద్ లోని పీఓఈ (ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రంట్స్ - వలసదారుల సంరక్షులు) కార్యాలయం ద్వారా ఎమిగ్రేషన్ క్లియరెన్స్ తీసుకోవాలి. వలస కార్మికునికి సంబంధించిన పాస్ పోర్ట్, యాజమాన్య కంపెనీ, రిక్రూటింగ్ ఏజెన్సీ, జీతం అగ్రిమెంట్ తదితర వివరాలు ఈ-మైగ్రేట్ సిస్టం లో నమోదు అవుతాయి. ఈసీఆర్ పాస్ పోర్టు కలిగినవారికి ప్రవాసి భారతీయ బీమా యోజన (పిబిబివై) అనే రూ.10 లక్షల విలువైన ప్రమాద బీమా పాలసీని 'మాండేటరీ' (చట్టబద్దంగా తప్పనిసరిగా) జారీ చేస్తారు. రెండేళ్ల కోసం రూ. 325 ప్రీమియం చెల్లించాలి. ఆ తర్వాత ఆన్ లైన్ లో రెనివల్ చేసుకోవచ్చు. ఈసీఎన్నార్ పాస్ పోర్ట్ అంటే... ఎమిగ్రేషన్ చెక్ నాట్ రిక్వయిర్డ్. విదేశాలకు ఉద్యోగానికి వెళ్ళడానికి భారత ప్రభుత్వం యొక్క అనుమతి అవసరం లేదు.. అని అర్థం. 10వ తరగతి పాస్ అయిన వారికి లేదా విదేశాల్లో మూడేళ్ళ అనుభవం ఉన్నవారికి లేదా ఆదాయపు పన్ను (ఐటి) చెల్లింపుదారులకు లేదా 50 సంవత్సరాల వయస్సు పైబడిన వారికి ఈసీఎన్నార్ పాస్ పోర్ట్ జారీ చేస్తారు. అనగా వీరు తెలివైనవారు, లోకజ్ఞానం కలిగినవారు, ఏదైనా కష్టం వస్తే తమను తాము రక్షించుకోగల సామర్థ్యం ఉన్నవారు అని అర్థం. వీరు కూడా ప్రవాసి భారతీయ బీమా యోజన అనే ఇన్సూరెన్స్ పాలసీని పొందవచ్చు. వీరికి అక్కర్లేదు ఎలాంటి పాస్ పోర్ట్ కలిగిన వారయినా... విజిట్ సీసా, టూరిస్టు వీసాలపై.. ఉద్యోగానికి కాకుండా విహారయాత్రలకు, వైద్యం లాంటి ఇతర అవసరాలకు ఈ 18 దేశాలకు వెళ్లేవారికి ఎమిగ్రేషన్ క్లియరెన్స్ అవసరం లేదు. రాను పోను విమాన ప్రయాణ టిక్కెట్టు, విజిట్, టూరిస్ట్ వీసా ఉంటే సరిపోతుంది. - మంద భీంరెడ్డి, వలస వ్యవహారాల విశ్లేషకులు (+91 98494 22622) చదవండి: వలస కార్మికుల ఆశలు ఆవిరి -
హ్యూస్టన్‌లో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
హ్యుస్టన్ టెక్సాస్ లో ని స్థానిక శ్రీ అష్టలక్ష్మి దేవాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. అష్టలక్ష్మి దేవాలయం, కేటీ హిందూ కమ్యూనిటీ సంయుక్తంగా జరిపిన జరిపిన సీతారాముల కళ్యాణ వేడుకల్లో సుమారు 800 మంది పాల్గొన్నారు. వేదపండితులు సీత రాములకు కళ్యాణంతో పాటు ,పట్టాభిషేకం, మంగళహారతి కార్యక్రమాలను నిర్వహించారు. కల్యాణం అనంతరం అర్చన, మంగళ శాశనం కార్యక్రమాలని ఎంతో భక్తిశ్రద్ధలతో జరిపిరాఉ. జరిపించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి సహకరించిన దాతలు, వలంటీర్లకు కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కళ్యాణం అనంతరం భక్తులకి తీర్థప్రసాదాలు అందజేశారు. -
టీపాడ్ రక్తదాన శిబిరానికి భారీ స్పందన
బ్లడ్‌బ్యాంకుల్లో రక్తం నిల్వల కొరతను దృష్టిలో ఉంచుకొని అమెరికాలోని డాలస్ తెలంగాణ ప్రజాసమితి (టీపాడ్) ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం నిర్వహించారు. స్థానిక ఐటీ కంపెనీ అయిన ఐటీ స్పిన్ ఆవరణలో టెక్సాస్‌లోని అతి పెద్ద బ్లడ్‌బ్యాంక్ కార్టర్ బ్లడ్ కేర్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఫ్రిస్కో, ఎల్లెన, మెక్కెన్నీ, ప్రాస్పర్, ప్లేనో, ఐర్వింగ్, కాపెల్ తదితర ప్రాంతాల నుంచి రక్తదాతలు తరలివచ్చారు. శిబిరం ఏర్పాటు చేసిన ఐటీ స్పిన్ ఆవరణలో బ్లడ్‌బ్యాంక్ వ్యాన్ ను చూసిన కొందరు స్థానికులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం విశేషం. ఈ శిబిరంలో 150 మంది చికిత్సకు సరిపోయేలా 50 పింట్ల రక్తాన్ని సేకరించారు. ఇది సుమారు 10 గుండె శస్త్రచికిత్సలకు సరిపోతుందని కార్టర్ బ్లడ్‌కేర్ ప్రతినిధులు తెలిపారు. ఈ శిబిరానికి ఇంతగా స్పందన వస్తుందని తాము ఊహించలేదని, అంచనాలను మించి రక్తాన్ని సేకరించామని సంతోషం వ్యక్తం చేశారు. కాగా, టీపాడ్ గత ఎనిమిదేళ్ల నుంచి ఇది రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తుండగా, ఇది తొమ్మిదవది. ప్రతిసారి రక్తదానానికి అవసరమైన పరిసరాలను కల్పించిన ఐటీ స్పిన్ కంపెనీ యాజమాన్యం రఘువీర్ బండారు, ఉమా బండారులకు టీపాడ్ కృతజ్ఞతలు తెలిపింది. ఎప్పటిలాగే టీపాడ్.. 2022లో కార్యక్రమాలను రక్తదాన శిబిరంతో మొదలుపెట్టడం విశేషం. డాలస్ తెలంగాణ ప్రజాసమితి సగర్వంగా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని రేణుకా చనమోలు సహాయంతో స్వప్న తుమ్మపాల సమన్వయం చేశారు. అజయ్‌రెడ్డి, రమణ లష్కర్, ఇంద్రాని పంచెర్పుల, పండు పాల్వాయ్ నిర్దేశం చేశారు. టీపాడ్ సేవలను కార్టర్ బ్లడ్‌కేర్ నిర్వాహకులతో పాటు రక్తదాతలు, స్థానికులు అభినందించారు. -
తానా తెలుగు తేజం పోటీలు
విదేశాల్లో నివసిస్తున్న పిల్లలు, యువకులకు తెలుగు భాషపై మక్కువ పెంచే లక్ష్యంతో తెలుగు తేజం పోటీలను తానా, తెలుగు పరివ్యాప్తి కమిటీలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ పోటీల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నివసిస్తున్న పిల్లలు మినహా, ప్రవాస దేశాలలో నివసిస్తున్న వారు ఎవరైనా పాల్గొనవచ్చని తానా పేర్కొంది. దరఖాస్తు విధానం, ప్రవేశ రుసుము తదితర వివరాల కోసం https://forms.gle/u1gqzHFhTT3a6yYg9 నందు సంప్రదించచ్చు. ఈ పోటీలు 2022 జూన్ 4, 5 తేదీలలో వర్చువల్‌గా(జూమ్) నిర్వహిస్తారు. దరఖాస్తు, ప్రవేశరుసుము చెల్లించడానికి 2022 ఏప్రిల్ 25 ఆఖరు తేదని తానా తెలిపింది. -
టెక్సాస్ హ్యూస్టన్ పిక్నిక్ సంబరాలు
-
డాలస్‌లో తానా పుస్తక మహోద్యమం
డాలస్ (టెక్సస్) ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో పుస్తక మహోద్యమం కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రవాస భారతీయులు వారి పిల్లలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈ సందర్భంగా తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. పుస్తకాలను కొని బహుమతులుగా ఇచ్చే సంప్రదాయాన్ని ప్రోత్సహించడం మంచి విషమన్నారు. ముఖ్యంగా పిల్లలకు చిన్నప్పటి నుంచే పుస్తక పఠనం పై ఆసక్తి పెరగాలంటే, వారికి మంచి పుస్తకాలను పరిచయం చెయ్యాలని సూచించారు. ‘పాతికవేల పుస్తకాలు పాఠకుల చేతుల్లోకి’ అనే నినాదంతో ప్రారంభించిన ఈ అక్షర యజ్ఞానికి విశేష స్పందన లభిస్తోందన్నారు. టెక్సాస్ రాష్ట్రంలో తెలుగు భాష మాట్లాడేవారి సంఖ్య నానాటికి పెరుగుతుందని రాష్ట్ర అభివృద్దికి వారి సహాయం మరువలేనిదని టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ ‘గ్రెగ్ అబ్బాట్ అన్నారు. తానా పాఠశాల చైర్మన్ నాగరాజు నలజుల మాట్లాడుతూ పాఠశాలలో పిల్లలకు సులభతరంలో తెలుగు నేర్చుకునే విధంగా పాఠ్యాంశాలను రూపొందించామని తెలిపారు. ఇప్పటికే అమెరికా అంతటా, విదేశాలలో కూడా తానా పాఠశలలో వేల సంఖలో పిల్లలు తెలుగు నేర్చుకుంటున్నారు వివరించారు. ప్రముఖ రచయితలు డాక్టర్ బీరం సుందరరావు, అత్తలూరి విజయలక్ష్మి గౌరవ అతిధులుగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో లోకేష్ నాయుడు, మురళీ వెన్నం, శ్రీకాంత్ పోలవరపు, డాక్టర్ సుధా కలవగుంట, డాక్టర్ ఊరిమిండి నరసింహారెడ్డి, సుబ్రమణ్యం జొన్నలగడ్డ, స్వర్ణ అట్లూరి, రాజేశ్వరి ఉదయగిరి, భాస్కర్ రాయవరం, డాక్టర్ భానుమతి ఇవటూరి , లక్ష్మి పాలేటి, ఉమామహేశ్వరావు పార్నపల్లి (టాంటెక్స్ అధ్యక్షులు), వెంకట్ ములుకుట్ల, పరమేష్ దేవినేని, సాంబయ్య దొడ్డ, వెంకట ప్రమోద్, కళ్యాణి తాడిమేటి, వీర లెనిన్, లెనిన్ వేముల, డాక్టర్ అరుణ జ్యోతి, వెంకట్ తాడిబోయిన మొదలైన పలువురు పురప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
టెక్సాస్ హ్యూస్టన్ పిక్నిక్ సంబరాలు
టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లో తెలుగు వాళ్లంతా కలిసి పిక్నిక్ ఏర్పాటు చేసుకున్నారు. సుమారుగా 200 ఫ్యామిలీస్ దీనిలో పాల్గొని ఆటపాటలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక బిర్యానీపాట్ రెస్టారెంట్లో భోజన సదుపాయాలు కల్పించారు. ఈ పిక్నిక్ విజయవంతం కావడానికి దీనికి సహకరించిన దాతలందరికి బిర్యానీపాట్ రెస్టురెంట్ ఓనర్ శ్రీధర్ కంచనకుంట్ల ధన్యవాదాలు తెలిపారు. -
స్విట్జర్లాండ్‌లో ఉగాది వేడుకలు
తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్విట్జర్లాండ్ (సీహెచ్) జ్యూరీచ్లో ఉగాది వేడుకలు వైభవంగా జరిపారు. సాంస్కృతిక కార్యక్రమాలు, ఆట పాటలతో కనువిందుగా ఈ వేడుక సాగింది. స్విట్జర్లాండ్‌లో స్థిర పడిన 200 మంది తెలుగు ప్రజలు ఈ వేడుకలలో పాల్గొన్నారు. ఈ ఉగాది వేడుకలను తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్విటర్లాండ్ ప్రెసిడెంట్ గనికాంబ కడలి, జనరల్ సెక్రెటరీ డాక్టర్ దుర్గారావు కారంకి, ట్రెజరర్ మాధురి ముళ్ళపూడి , కల్చరల్ సెక్రెటరీ మాణిక్యవల్లి చాగంటి, స్పోర్ట్స్ సెక్రెటరీ రామచంద్ర వుట్టిలతో పాటు ఇతర తెలుగు అసోసియేషన్ సభ్యుల సహకారంతో నిర్వహించారు. -
కెనడాలో సప్త ఖండ అవధానం
తెలుగు భాషకే చెందిన అవధాన ప్రక్రియను దేశ విదేశాలకు పరిచయం చెయ్యాలనే సంకల్పంతో సప్త ఖంఢ అవధాన సాహితీ ఝర అనే కొత్త ప్రక్రియకి వద్దిపర్తి పద్మాకర్ శ్రీకారం చుట్టారు. అందులో ఇప్పటికే వర్చువల్‌గా 11 అష్టావధానాలు పూర్తయ్యాయి. 12వ అవధానం కెనడాలో పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎనిమిది మంది మహిళలు పాల్గొన్నారు. వీరితో పాటు పెరూ నుంచి శ్రీనివాస్ పోలవరపు సైతం ఈ అవధానంలో భాగమయ్యారు. ఎంతో రసవత్తరంగా సాగిన ఈ అవధానం సాహితీ ప్రియులు ఆకట్టుకుంది. ఈ అవధానం తిలకించిన శ్రీ కంచి కామకోటి పీఠం 70వ పీఠాధిపతి విజయేంద్ర సరస్వతీ, పద్మాకర్‌ను ఆశీర్వదించారు. వద్దిపర్తి పద్మాకర్ ఇప్పటి వరకు 1242 అష్టావధానాలు, 12 శతావధానాలు, 8 జంట అవధానాలు పూర్తి చేశారు. తెలుగు, సంస్కృతం, హిందీలలో ఏకకాలంలో మహా సహస్రావధానం చేశారు. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ , జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ , తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థలు వద్దిపర్తి పద్మాకర్‌ను గుర్తించాయి. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అంతర్జాతీయ సంస్థ ప్రతినిధులు బింగి నరేంద్ర గౌడ్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎం విజయలక్ష్మి మురుసుపల్లి, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ చీఫ్ అడ్వైజర్ డాక్టర్ సాయి శ్రీ, ఏలూరు జిల్లా చీఫ్ కో ఆర్డినేటర్ శివశంకర్ తదితర ప్రతినిధులు వద్దిపర్తి పద్మాకర్కి సర్టిఫికెట్, మెడల్ అందజేశారు. -
గణేష్ స్ట్రీట్ @ న్యూయార్క్
అమెరికాలోని ప్రవాస భారతీయులు ఆనందించే విషయం చోటు చేసుకుంది. న్యూయార్క్ నగరంలోని ఓ వీధికి గణేష్ స్ట్రీట్‌గా నామకరణం చేస్తూ అక్కడి స్థానిక ప్రభుత్వ యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. న్యూయర్క్ నగరంలోని క్వీన్స్కౌంటీలో ఉన్న బౌనే వీధిని ఇపై గణేష్ స్ట్రీట్‌గా పిలవనున్నారు. అమెరికాలో స్థిరపడిన భారతీయులు 1977లో ఈ ఆలయాన్ని వల్లభ గణపతి దేవస్థానం పేరుతో నిర్మించారు. కాలక్రమంలో స్థానికంగా గణేష్ టెంపులగా ప్రసిద్ధి చెందింది. ఉత్తర అమెరికాలో అత్యంత పురాతన గుడిగా ఈ ఆలయానికి పేరుంది. దీంతో ఆలయం ప్రతిష్టకు గుర్తుగా బౌనే వీధికి గణేష్ స్ట్రీట్‌గా పేరు మార్చారు. ఈ పేరు మార్చే కార్యక్రమాన్ని ప్రవాస భారతీయులు వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాన్సుల్ జనరల్ రణ్‌ధీర్ జైస్వాల్ పాల్గొన్నారు. బానిసత్వానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో బౌనే అలుపెరుగని పోరాటం చేశారు. దీంతో ఈ వీధికి బౌనే స్ట్రీట్‌గా పేరు వచ్చింది. అనేక ఏళ్లపాటు ఈ వీధిని బౌనే స్ట్రీట్‌గా పిలుస్తు వస్తున్నారు. ఇకపై ఈ వీధిని బౌనే స్ట్రీట్/ గణేష్ స్ట్రీట్‌గా పిలవనున్నారు.