
ఉమ్మడి వరంగల్‌కి చెందిన ప్రముఖ సైంటిస్ట్ డాక్టర్ సాంబారెడ్డికి అరుదైన గౌరవం లభించింది. అమెరికాకు చెందిన ప్రఖ్యాత స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ తాజాగా ప్రకటించిన ప్రకటించిన టాప్ సైంటిస్టుల జాబితాలో ఆయనకు చోటు దక్కింది. ప్రస్తుతం ఆయన టెక్సాస్‌లోని ఏ ఏండ్ ఎం యూనివర్సిటీ కాలేజ్ ఆప్ మెడిసన్‌లో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. ఇప్పటికే ఆయన ప్రొలిఫిక్ మెడికల్ ఇన్వెంటర్, ఫార్మా రీసెర్చర్‌గా గుర్తింపు పొందారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పరకాల మండలం చర్లపల్లిలో డాక్టర్ దూదిపాల సాంబారెడ్డి జన్మించారు. ఆ తర్వాత కాకతీయ వర్సిటీలో ఫార్మాసీ విద్యాను పూర్తి చేసి ఉన్నత విద్యకోసం అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఫార్మా రంగంలో ఆనేక ఆవిష్కరణలను ఆయన చేశారు. న్యూరోథెరాప్యూటిక్స్‌లో ఆయన గ్లోబల్ లీడర్‌గా ఉన్నారు. ఇప్పటి వరకు 215 సైంటిఫిక్ పేపర్లను ప్రచురించగా 100 మందికి పైగా స్కాలర్లకు గైడ్‌గా వ్యవహరించారు. అంతేకాదు 400ల వరకు ప్రెజెంటేషన్లకు ఆయన సహాకారం అందించారు.
న్యూరోథెరాప్యూటిక్స్‌లో విభాగంలో విశేష కృషి చేసిన డాక్టర్ సాంబారెడ్డి బ్రెయిన్ డిసార్డర్లకు న్యూరో స్టెరాయిడ్ థెరపీని అభివృద్ధి చేశారు. మెదడు సంబంధిత వ్యాధులకు సంబంధించిన చికిత్సను మెరుగుపరచడంలో ఈ న్యూరో స్టెరాయిడ్ థెరపీ ఎంతగానో ఉపకరించింది. పోస్టపార్టమ్ డిప్రెషన్‌కి సంబంధించి డాక్టర్ సాంబారెడ్డి అభివృద్ధి చేసిన బ్రెక్సానోలెన్ ఔషధం అమెరికా తరఫున ఎఫ్‌డీఏ అనుమతి పొందిన తొలి మెడిసిన్‌గా గుర్తింపు పొందింది. అదే విధంగా ఎపిలెప్పీకి సంబంధించి గానాక్సోలోన్ కూడా ఉంది. న్యూరో సంబంధిత విభాగంలో చేసిన కృషికి గాను డాక్టర్ సాంబారెడ్డికి అనేక అవార్డులు వరించాయి.
Comments
Please login to add a commentAdd a comment