
మెజారిటీ వాటా కొనుగోలుకి రెడీ
ఒప్పందం విలువ రూ.2444 కోట్లు
న్యూఢిల్లీ: మెడ్‌టెక్ ఫ్రెంచ్ కంపెనీ యాంప్లిట్యూడ్ సర్జికల్‌లో మెజారిటీ వాటా కొనుగోలు చేసేందుకు ప్రత్యేక చర్చలు నిర్వహిస్తున్నట్లు దేశీ హెల్త్‌కేర్ సంస్థ జైడస్ లైఫ్‌సైన్సెస్ పేర్కొంది. మెజారిటీ వాటా సొంతం చేసుకునేందుకు కంపెనీ యాజమాన్యం పీఏఐ పార్ట్‌నర్స్‌సహా రెండు మైనారిటీ వాటాదారు సంస్థలతో డీల్ కుదుర్చుకోనున్నట్లు తెలియజేసింది. వెరసి వోటింగ్ హక్కులతో 85.6% వాటా కొనుగోలుకి 25.68 కోట్ల యూరోలు (రూ.2,444 కోట్లు) వెచ్చించనున్నట్లు వెల్లడించింది. అత్యంత నాణ్యమైన లోయర్‌లింబ్ ఆర్థోపెడిక్ టెక్నాలజీలలో యాంప్లిట్యూడ్‌కు పట్టున్నట్లు పేర్కొంది. వీటిలో సమస్యాత్మకంగా మారిన జాయింట్ల రీప్లేస్‌మెంట్‌లో విని యోగించే మెడికల్ ప్రొడక్టుల డిజైన్, డెవలప్‌మెంట్ తదితర కార్యకలాపాలున్నట్లు తెలియజేసింది.
ఇదీ చదవండి: సిబిల్ స్కోర్ అప్‌డేట్.. ఆర్‌బీఐ ఆరు నిబంధనలు
నిఫ్టీ కెమికల్ ఇండెక్స్ షురూ
కెమికల్ రంగానికీ ఎన్‌ఎస్‌ఈ ప్రాధాన్యత
న్యూఢిల్లీ: స్టాక్ ఎక్ఛ్సేంజీ దిగ్గజం ఎన్‌ఎస్‌ఈ తాజాగా కెమికల్ రంగానికి ఇండెక్స్‌ను ప్రవేశపెట్టింది. నిఫ్టీ కెమికల్స్ పేరుతో ఆవిష్కరించింది. నిఫ్టీ 500 నుంచి కెమికల్ రంగ షేర్ల పనితీరును ఇండెక్స్ ప్రతిఫలించనుంది. అనుబంధ సంస్థ ఎన్‌ఎస్‌ఈ ఇండిసెస్ ద్వారా కొత్త ఇండెక్సునకు తెరతీసింది. తాజా ఇండెక్స్ అసెట్ మేనేజర్లకు ప్రామాణికంగా నిలిచే వీలున్నట్లు ఎన్‌ఎస్‌ఈ అంచనా వేస్తోంది. ఈటీఎఫ్‌ల రూపంలో ప్యాసివ్ ఫండ్స్ ట్రాక్ చేసే రిఫరెన్స్ ఇండెక్స్‌గా ఉపయోగపడనున్నట్లు అభిప్రాయపడింది. ఆరు నెలల సగటు ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా 20 స్టాక్స్‌ను ఎంపిక చేసినట్లు పేర్కొంది. ఎన్‌ఎస్‌ఈ డెరివేటివ్స్ విభాగంలో ట్రేడింగ్‌కు అందుబాటులో ఉన్న షేర్లను పరిగణించింది. ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ విలువ ఆధారంగా ఒక్కో షేరుకి వెయిట్ ఉంటుందని, 33 శాతానికి మించదని ఎక్ఛ్సేంజీ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment