
ఫార్మా ఇండెక్స్‌లో 5ఏళ్ల బేర్ ఫేజ్ ముగిసిందని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు. అందుకు అనుగుణంగానే నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ మార్చి కనిష్ట స్థాయి 50శాతానికి పైగా లాభపడింది. ఇదే సమయంలో నిప్టీ ఇండెక్స్ 30శాతం ర్యాలీ చేసింది.
నిప్టీ ఫార్మా ఇండెక్స్ 2015 ఏప్రిల్ 7న 14,020 వద్ద జీవితకాల గరిష్ట స్థాయి నమోదు చేసింది. దాదాపు ఐదేళ్లలో నిఫ్టీ గరిష్టం నుంచి 40శాతం నష్టాన్ని చవిచూసింది. 2020 జూన్ 5 నాటికి 10,081 స్థాయికి చేరుకుంది. కోవిద్-19 సంక్షోభంలో ఫార్మా రంగం అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది.
ప్రస్తుత వాతావరణం ఫార్మా రంగానికి మరింత అనుకూలంగా ఉందని, ఈ రంగానికి చెందిన కొన్ని ఎంపిక చేయబడిన షేర్లలో ర్యాలీ మరి కొంతకాలం కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా వారు లుపిన్, అరబిందో ఫార్మా, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, దివీస్ ల్యాబ్స్ షేర్లపై వారు బుల్లిష్ వైఖరిని కలిగి ఉన్నారు
‘‘ఈ ఫార్మా ఇండెక్స్ గరిష్టస్థాయి( 14,020) నుంచి దాదాపు 55శాతం పడిపోయి 6,242 వద్ద కనిష్టాన్ని నమోదు చేసిందని ఆయన తెలిపారు. ఆసక్తికరంగా ఈ మొత్తం కరెక‌్షన్ ఓ డౌన్‌వర్డ్ స్లోపింగ్ ఛానెల్‌లో జరిగింది. ఈ ఏప్రిల్ 2020లో ఛానెల్ బ్రేక్ అవుట్ దాని బేర్ దశ ముగిసిన విషయాన్ని తెలియజేస్తుంది. ఫార్మా ఇండెక్స్ 5 ఏళ్ల తర్వాత బేర్ ఫేజ్‌ను ముగించిన తరువాత దాని స్వంత బుల్ రన్‌ను ప్రారంభించినట్లు తెలుస్తుంది.’’ అని చార్ట్‌వ్యూఇండియాడాట్ ఇన్ సాంకేతిక నిపుణుడు మజర్ మహమ్మద్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment