Pharma
-
130 బిలియన్ డాలర్లకు దేశీ ఫార్మా
దేశీయ ఫార్మా పరిశ్రమ 2030 నాటికి రెట్టింపు స్థాయికి చేరుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయన్స్ (IPA) ప్రెసిడెంట్, టోరెంట్ గ్రూప్ ఛైర్మన్ సమీహ్ మెహతా తెలిపారు. అప్పటికి 120–130 బిలియన్ డాలర్ల(సుమారు రూ.10,79,400 కోట్లు)కు చేరుకోవచ్చని, 2047 నాటికి 400–450 బిలియన్ డాలర్ల స్థాయిని అందుకోగలదని ఆయన పేర్కొన్నారు. గత 25 ఏళ్లలో భారతీయ ఫార్మా(Pharma) పరిశ్రమ 20 రెట్లు పెరిగిందని వివరించారు.1999–2000లో 3 బిలియన్ డాలర్లుగా ఉన్నది 58 బిలియన్ డాలర్లకు చేరిందని మెహతా చెప్పారు. వాణిజ్య మిగులుకు దోహదపడుతున్న అయిదు రంగాల్లో ఇది కూడా ఒకటని ఐపీఏ ఏర్పాటై 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాసిన ఆర్టికల్‌లో ఆయన పేర్కొన్నారు. వికసిత భారత్ లక్ష్యాల సాధనలో భాగంగా ఉద్యోగాల కల్పన నుండి గ్లోబల్ ట్రేడ్(Global Trade) వరకు వివిధ అంశాల్లో ఫార్మా కీలక పాత్ర పోషించగలదని ఆయన వివరించారు. సానుకూల పాలసీలు, పరిశోధనలు.. అభివృద్ధిపై భారీ పెట్టుబడులు, చౌకగా వైద్యసేవలను అందుబాటులోకి తేవడం మొదలైనవన్నీ పరిశ్రమ పూర్తి సామర్థ్యాల మేరకు పని చేసేందుకు దోహదపడతాయని మెహతా తెలిపారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా జనరిక్ ఔషధాలకు నెలకొన్న డిమాండ్‌లో భారత్ 20 శాతం ఔషధాలను సరఫరా చేస్తోందని, పరిమాణం.. విలువపరంగా 11వ ర్యాంకులో ఉందని వివరించారు. ఇదీ చదవండి: ఇంటి భోజనం మరింత భారం!నష్టాల్లోకి మొబిక్విక్డిజిటల్ వాలెట్ సేవలందించే మొబిక్విక్(Mobikwik) ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసికంలో లాభాలను వీడి నష్టాలు ప్రకటించింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో రూ.3.6 కోట్ల నష్టం నమోదైంది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ.6 కోట్ల స్టాండెలోన్ నికర లాభం ఆర్జించింది. అయితే మొత్తం ఆదాయం రూ.207 కోట్ల నుంచి రూ.297 కోట్లకు ఎగసింది. మొత్తం వ్యయాలు రూ.186 కోట్ల నుంచి రూ.287 కోట్లకు భారీగా పెరిగాయి. ఈ కాలంలో రూ.7 కోట్ల నిర్వహణ లాభం(ఇబిటా) సాధించినట్లు కంపెనీ వెల్లడించింది. కాగా.. గత నెల లో లిస్టయిన వన్ మొబిక్విక్ సిస్టమ్స్ తొలిసారి త్రైమాసిక ఫలితాలు విడుదల చేసింది. తదుపరి వృద్ధి అవకాశాలకు వీలుగా పెట్టుబడులు వెచ్చిస్తుండటంతో నష్టాలు నమోదైనట్లు కంపెనీ తెలియజేసింది. -
లగచర్ల రచ్చ! శాసనసభలో చర్చకు బీఆర్ఎస్ పట్టు
సాక్షి, హైదరాబాద్: ‘లగచర్ల’ఘటనపై సోమవారం శాసనసభ అట్టుడికింది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సభ్యుల నిరసనలు, నినాదాలతో హోరెత్తింది. ‘రాష్ట్రంలో పర్యాటక విధానం’అంశంపై మంత్రి జూపల్లి కృష్ణారావు లఘుచర్చను ప్రారంభించగానే బీఆర్ఎస్ సభ్యులంతా లేచి.. ‘లగచర్ల’రైతుల నిర్బంధం, అరెస్టులపై చర్చించాలని పట్టుబట్టారు. స్పీకర్ అంగీకరించకపోవడంతో ప్లకార్డులను ప్రదర్శిస్తూ, నినాదాలు చేశారు. వెల్‌లోకి దూసుకొచ్చి నిరసన తెలిపారు. అధికార పక్షం నుంచి డిప్యూటీ సీఎం భట్టి, శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు లేచి బీఆర్ఎస్ సభ్యుల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. అయినా బీఆర్ఎస్ సభ్యులు నిరసన కొనసాగించారు. ఈ గందరగోళంలో సభను కొనసాగించలేక మంగళవారం ఉదయం 10 గంటలకు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ప్రకటించారు. వాయిదా తీర్మానాలను తిరస్కరించడంతో.. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం లగచర్లలో ఫార్మా విలేజీ భూసేకరణను ప్రతిఘటించిన రైతులను నిర్బంధించిన ఘటనపై చర్చించాలంటూ టి.హరీశ్‌రావు, ఇతర బీఆర్ఎస్ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్టు ప్రశ్నోత్తరాలు ముగిసిన తర్వాత స్పీకర్ ప్రసాద్‌కుమార్ ప్రకటించారు. దీనితో పార్టీ సభ్యులంతా నిలబడి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ‘ఇదేమి రాజ్యం.. ఇదేమి రాజ్యం..దోపిడీ రాజ్యం.. దొంగల రాజ్యం.. నహీ చలేగా.. తానా షాహీ నహీ చలేగా..’అని నినాదాలు చేశారు. దీనితో సభను కొద్దిసేపు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. వెనక్కి తగ్గని బీఆర్ఎస్ సభ్యులు సభ తిరిగి ప్రారంభం కాగానే బీఆర్ఎస్ సభ్యులు తమ నిరసన కొనసాగించారు. ఈ గందరగోళం మధ్యే పర్యాటక విధానంపై లఘు చర్చను ప్రారంభించాలని మంత్రి జూపల్లి కృష్ణారావుకు స్పీకర్ సూచించారు. కానీ బీఆర్ఎస్ సభ్యులు నినాదాలతో గందరగోళ వాతావరణం నెలకొంది. దీనిపై స్పీకర్ కల్పించుకుని... బీఆర్ఎస్ సభ్యులు ప్లకార్డులను అప్పగించి ఎవరి స్థానాల్లో వారు కూర్చుంటే హరీశ్‌రావుకు మాట్లాడే అవకాశం ఇస్తామని చెప్పారు. అయితే ముందు మాట్లాడేందుకు అవకాశమిస్తే ప్లకార్డులను అప్పగిస్తామని హరీశ్‌రావు బదులిచ్చారు. స్పీకర్ అవకాశం ఇవ్వకపోవడంతో నిరసనను కొనసాగించారు. శ్రీధర్‌బాబు, భట్టి కల్పించుకున్నా.. బీఆర్ఎస్ సభ్యుల ఆందోళనను స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌తోపాటు శాసనసభా వ్యవహారాల మంత్రి డి.శ్రీధర్‌బాబు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్ర స్థాయిలో తప్పుబట్టారు. అందరం కలసి రూల్స్ బుక్ తయారు చేసుకున్నామని, సభలో ప్లకార్డులు ప్రదర్శించడం, నినాదాలు చేయడం దానికి విరుద్ధమని స్పీకర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ సభ్యులు ప్రశాంతంగా కూర్చోవాలని పలుమార్లు విజ్ఞప్తి చేశారు. ఇక సభలో ప్లకార్డులు, కరపత్రాలు ప్రదర్శించరాదని నిబంధనలు ఉన్నాయని, శాసనసభా వ్యవహారాల మంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసిన హరీశ్‌రావుకు అది బాగా తెలుసని మంత్రి డి.శ్రీధర్‌బాబు వ్యాఖ్యానించారు. అసెంబ్లీ కార్యకలాపాలపై ప్రతిరోజూ బులెటిన్ ఇస్తారని, వాటి ప్రకారమే సభ నడుస్తుందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ సభ్యులు లేవనెత్తిన ప్రతి అంశంపై ప్రభుత్వం సమాధానమిస్తుందని హామీ ఇచ్చారు. ఇక సభ గౌరవాన్ని పరిరక్షించాలని... పర్యాటక విధానంపై మంత్రి మాట్లాడుతుంటే బీఆర్ఎస్ సభ్యులు బాధ్యతారాహితంగా వ్యవహరించడం సరికాదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ బీఆర్ఎస్ సభ్యులు నిరసన కొనసాగించారు. ‘రైతులకు కరెంట్ షాకులా?.. రైతులకు బేడీలా..? సిగ్గు సిగ్గు’అంటూ నినాదాలు చేశారు. నిరసనల మధ్య జూపల్లి ప్రసంగం బీఆర్ఎస్ సభ్యుల ఆందోళన కొనసాగుతుండగానే మంత్రి జూపల్లి కృష్ణారావు కాసేపు ప్రసంగించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ఆదాయాన్ని పెంచలేకపోయిందని, తాము పర్యాటక అభివృద్ధి ద్వారా ఆ పనిచేస్తున్నామని చెప్పారు. బంగారు పళ్లెంలో రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పగించామని హరీశ్‌రావు అంటుంటారని, తెరిచి చూస్తే అప్పులకుప్పగా ఉందని విమర్శించారు. 15 నిమిషాలే కొనసాగిన సభ బీఆర్ఎస్ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ, నినాదాలు చేస్తూనే ఉండటంతో గందరగోళం నెలకొంది. దీనితో బీఆర్ఎస్ సభ్యుల నుంచి ప్లకార్డులు తీసుకోవాలని మార్షల్స్‌ను స్పీకర్ ఆదేశించారు. మార్షల్స్ వచ్చేలోపే హరీశ్‌రావు, ఇతర బీఆర్ఎస్ సభ్యులు స్పీకర్ ముందు వెల్‌లోకి దూసుకొచ్చారు. ఇంకా ముందుకు వెళ్లకుండా మార్షల్స్ వారిని అడ్డుకున్నారు. ఈ గందరగోళం నడుమ సభను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. బీఆర్ఎస్ సభ్యులంతా వెల్‌లోకి దూసుకురాగా.. కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి సభ్యుల కుర్చీల వద్దే నిలబడి నిరసన తెలిపారు. మధాŠయ్‌హ్నం 2.25 గంటలకు లఘు చర్చ ప్రారంభంకాగా 2.40 గంటలకు వాయిదా పడింది. అంటే 15 నిమిషాలు మాత్రమే సభ నడిచింది. మండలిలోనూ ‘లగచర్ల’నిరసన ‘లగచర్ల’గిరిజన రైతుల అరెస్టులు, బేడీలు వేయడంపై సోమవారం శాసన మండలిలోనూ బీఆర్ఎస్ తీవ్రంగా నిరసన తెలిపింది. వాయిదా తీర్మానం ఇచ్చింది. దానికి మండలి చైర్మన్ అనుమతించకపోవడంతో శాసన మండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, కల్వకుంట్ల కవిత, ఎల్.రమణ, శంభీపూర్ రాజు, వాణిదేవి, రవీందర్రావు తదితరులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. ‘ఇదేమి రాజ్యం... దోపిడీ రాజ్యం.. దొంగల రాజ్యం.. రైతులకు బేడీలు సిగ్గు సిగ్గు’అంటూ నినాదాలు చేశారు. నేడు అంబేడ్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి, చిత్రహింసలకు గురిచేశారని.. దీనిపై మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన తెలపాలని బీఆర్ఎస్ పిలుపు ఇచ్చింది. జైళ్లలో నిర్బంధించి, రైతన్న చేతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ అమానవీయ, అణచివేత విధానాలను నిలదీయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో మంగళవారం ఉదయం 11 గంటలకు రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు. లగచర్ల రైతులపై కేసులను ఎత్తివేసి వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
సీఎం రేవంత్ రెడ్డితో సీపీఐ సీపీఎం నేతల కీలక భేటీ
-
కాకినాడలో పెన్సిలిన్–జీ ప్లాంటు ప్రారంభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పెన్సిలిన్–జి ఉత్పత్తి కోసం కాకినాడలో నెలకొల్పిన ప్లాంటును ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం వర్చువల్‌గా ప్రారంభించినట్లు ఔషధ రంగ దిగ్గజం అరబిందో ఫార్మాలో భాగమైన లిఫియస్ ఫార్మా వెల్లడించింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలిపింది.ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం కింద రూ. 2,500 కోట్ల వ్యూహాత్మక పెట్టుబడులతో ఈ ప్లాంటు ఏర్పాటైంది. ఈ ప్లాంటు వార్షికోత్పత్తి సామర్ధ్యం 15,000 మెట్రిక్ టన్నులుగా (ఎంటీ) ఉంటుందని సంస్థ డైరెక్టర్ ఎంవీ రామకృష్ణ తెలిపారు.భారత్‌ను ఫార్మా తయారీ హబ్‌గా తీర్చిదిద్దే క్రమంలో స్వయంసమృద్ధి సాధించాలన్న ప్రభుత్వ లక్ష్య సాధనలో కంపెనీ తన వంతు తోడ్పాటును అందించేందుకు కట్టుబడి ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టుకు నాంది పడింది. -
ఫార్మా మృతుల కుటుంబాలకు వైఎస్సార్సీపీ ఆర్థిక సాయం
సాక్షి, విశాఖపట్నం: ఫార్మా మృతుల కుటుంబాలకు వైఎస్సార్సీపీ ఆర్థిక సాయం అందించింది. చనిపోయినవారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున, గాయపడ్డ వారికి రూ.లక్ష చొప్పున చెక్కులు అందజేసినట్లు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో సహాయక కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులు పాల్గొనాలని వైఎస్ జగన్ ఆదేశించారన్నారు. చాలాచోట్ల విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌కు గురవుతున్నారని.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. గుడ్లవల్లేరు ఘటనపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు’’ అంటూ బొత్స ప్రశ్నించారు.బాత్రూమ్లో కెమెరాలు కోసం ఎన్ని రోజులు విచారణ చేస్తారు. కెమెరాలు బాత్ రూమ్‌లో లేకపోతే విద్యార్థులు ఎందుకు ధర్నాలు చేస్తున్నారు.. వీడియోలు ఎందుకు బయటకు వచ్చాయి. చంద్రబాబు, లోకేష్ అక్కడ ఏమి జరగలేదని చెప్పగలరా?. వైఎస్సార్సీపీ పాలనలో ఎక్కడ ఇటువంటి సంఘటనలు జరగలేదు. విశాఖలో లోకేష్ విద్యార్థులతో ఇంట్రాక్ట్ అయ్యారు. 47 వేల క్లాస్ రూమ్‌లను గత ప్రభుత్వం డిజిటలైజేషన్ చేసింది. 20 వేల క్లాస్ రూమ్‌ల్లో టీవీలు ఏర్పాటు చేశాం’’ అని బొత్స తెలిపారు.‘‘విద్యార్థుల కోసం ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టింది. అన్ని వసతులను చూసి లోకేష్ మెచ్చుకున్నారు. ఇది గత ప్రభుత్వ ఘనత. విద్యార్థుల చదువు కోసం వైఎస్ జగన్ సర్కార్ అమ్మఒడి పేరుతో తల్లుల ఖాతాలో డబ్బులు వేశారు. ఈ కూటమి ప్రభుత్వం కనీసం ఒక్క విద్యార్థికి ప్రభుత్వం డబ్బులు వేయలేదు.’’ అంటూ బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. -
రేపు ‘అచ్యుతాపురం సెజ్' బాధితులకు వైఎస్ జగన్ పరామర్శ
సాక్షి,అనకాపల్లి : అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ బాధితులను రేపు (శుక్రవారం) వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించనున్నారు.బుధవారం అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలిన ఘటనలో తీవ్రగాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను రేపు ఉదయం 11 గంటలకు పరామర్శించి, వారి ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకోనున్నారు. ఉదయం 8 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10 గంటలకు విశాఖ చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా అనకాపల్లి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించిన అనంతరం తిరుగు పయనమవుతారువైఎస్ జగన్ దిగ్భ్రాంతి అంతకు ముందు అచ్యుతాపురం సెజ్‌లో బుధవారం ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలడంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రియాక్టర్ పేలుడు ప్రమాదంపై స్థానిక నాయకులతో వైఎస్ జగన్ మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రమాద ప్రాంతాన్ని సందర్శించి బాధితులకు అండగా నిలవాలని ఇప్పటికే వారిని ఆదేశించారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు సంతాపాన్ని,సానుభూతిని తెలిపారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో ఉన్న ఫార్మాకంపెనీలో రియాక్టర్ పేలుడు కారణంగా పలువురు మరణించడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మరణించినవారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తున్నాను. వైయస్సార్సీపీ ప్రభుత్వం ఎల్జీ పాలిమర్స్ బాధితులను ఆదుకున్న తరహాలోనే ఈ…— YS Jagan Mohan Reddy (@ysjagan) August 21, 2024 -
కోటి ఇస్తారంటే ఎలా నమ్మాలి..? బాధిత కుటుంబాల రియాక్షన్..
-
రియాక్టర్ తయారు చేసే వ్యక్తి చెప్పిన సంచలన నిజాలు..
-
18 మంది చనిపోతే పట్టించుకోని ప్రభుత్వం
-
విస్తరిస్తోన్న భారత ఫార్మా మార్కెట్
భారతదేశం ఎగుమతి చేస్తున్న ఫార్మా ఉత్పత్తులు, వైద్య పరికరాల పరిశ్రమ విస్తరిస్తున్నట్లు వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ రంగంలో భారీగా దిగుమతి చేసుకుంటున్న యూఎస్, యూకే, ఇటలీలో భారత్ మార్కెట్ వాటా పెరుగుతోందని పేర్కొంది. యూఎస్‌కు ఔషధాలను అందించే దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉందని చెప్పింది. త్వరలో రెండో స్థానానికి చేరుతామని అంచనా వేసింది.పరిశ్రమల మంత్రిత్వశాఖ తెలిపిన వివరాల ప్రకారం..‘యూఎస్, యూకే, ఇటలీ దేశాలు దిగుమతి చేసుకునే ఇండియా ఫార్మా ఉత్పత్తులకు గిరాకీ పెరిగింది. యూఎస్‌కు ఔషధాలు ఎగుమతి చేసే దేశాల్లో ఐర్లాండ్, స్విట్జర్లాండ్ తర్వాత భారత్ మూడో స్థానంలో ఉంది. ఈ రెండు దేశాలతో పోలిస్తే భారత్ 2023లో తన యూఎస్ మార్కెట్ వాటాను విస్తరించింది. త్వరలో రెండో స్థానానికి చేరే అవకాశం ఉంది. 2022లో 7.33 బిలియన్ డాలర్లుగా(రూ.61 వేలకోట్లు) ఉన్న యూఎస్‌లోని భారత్ ఔషధ దిగుమతులు 2023లో 9.08 బిలియన్ డాలర్ల(రూ.76 వేలకోట్లు)కు పెరిగాయి. దాంతో ఇది 13.1%కు చేరింది. యూఎస్‌కు ఎగుమతిదారుగా ఐర్లాండ్, స్విట్జర్లాండ్ వాటాలు వరుసగా 13.85%, 13.7%కు పడిపోయాయి.ఇదీ చదవండి: ‘అనిశ్చితులున్నా కరెంట్ ఇస్తాం’ఇటలీలోని యాంటీబయాటిక్స్ విభాగంలో భారత్ తన వాటాను పెంచుకుంది. అక్కడి మార్కెట్లో భారత్ పదో స్థానంలో ఉంది. అయితే 2022లో 0.96% ఉన్న ఇండియా వాటా 2023లో 2.12%కు పెరిగింది. విలువ పరంగా యాంటీబయాటిక్స్ ఎగుమతులు 2023లో 23.34 మిలియన్ డాలర్ల(రూ.195 కోట్లు)కు చేరాయి. జర్మనీకి ఎగుమతి చేసే మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్(ఎంఆర్ఐ) పరికరాల మార్కెట్ పెరిగింది. 2022లో దాని వాటా 0.45 శాతంగా ఉండేది. అది 2023లో 1.7%కు చేరింది. విలువ పరంగా ఈ ఎగుమతులు 2023లో 13.02 మిలియన్ డాలర్ల(రూ.109 కోట్లు)కు చేరుకున్నాయి. ఇదిలాఉండగా, భారత్ ఇలా ఫార్మా రంగంలో వృద్ధి చెందడానికి కేంద్ర అందిస్తున్న ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు(పీఎల్ఐ) కారణమని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
అమెరికా చట్టంతో భారత్‌కు లాభం..!
దేశీయ ఫార్మా కాంట్రాక్ట్ తయారీ వ్యాపార విభాగం త్వరలోనే రెట్టింపు అవుతుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రభుత్వ సంస్థలు చైనా ఫార్మా కంపెనీల కొనుగోళ్లు జరపకుండా అమెరికా బయోసెక్యూర్ చట్టాన్ని అమలు చేసే అవకాశం ఉందని పేర్కొన్నాయి. చైనా నుంచి తయారీ కార్యకలాపాలు క్రమంగా భారత్‌కు మళ్లుతున్న నేపథ్యంలో కాంట్రాక్ట్ తయారీ సెగ్మెంట్ వచ్చే మూడేళ్లలో రెండింతలు కాగలదని, అలాగే కాంట్రాక్ట్ రీసెర్చ్ సెగ్మెంట్ మూడు రెట్లు వృద్ధి చెందుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ మేరకు మోర్డోర్ ఇంటెలిజెన్స్ నివేదిక విడుదల చేసింది.నివేదికలోని వివరాల ప్రకారం..2024లో అంతర్జాతీయంగా కాంట్రాక్ట్ అభివృద్ధి, తయారీ సెగ్మెంట్ (సీడీఎంవో) 22.51 బిలియన్ డాలర్లు(రూ.1.8 లక్షల కోట్లు)గా ఉంది. ఇది ఏటా 14.67 శాతం వృద్ధితో 2029 నాటికి 44.63 బిలియన్ డాలర్ల(రూ.3.7 లక్షల కోట్లు)కు చేరనుంది. ఫార్మా విభాగం గణాంకాల ప్రకారం దేశీయంగా కాంట్రాక్ట్ రీసెర్చ్ (సీఆర్వో) సెగ్మెంట్ వార్షికంగా 10.75 శాతం వృద్ధితో 2030 నాటికి 2.5 బిలియన్ డాలర్ల(రూ.20 వేలకోట్లు)కు చేరనుంది. భారతీయ సీడీఎంఏ సెగ్మెంట్ ఇప్పటికే అభివృద్ధి చెందినా, బయోసెక్యూర్ చట్టం అమల చేయడం వల్ల పరిశ్రమకు ఎంతో తోడ్పాటు లభిస్తుంది.ప్రస్తుతం చైనా సీడీఎంవో పరిశ్రమకు అంతర్జాతీయంగా 8 శాతం మార్కెట్ వాటా ఉండగా, భారత్‌కు 2.7 శాతం వాటా ఉంది. చైనా వాటాను కొల్లగొట్టడానికి ఈ చట్టం భారత్‌కు బాగా ఉపకరించగలదని పరిశ్రమవర్గాలు తెలిపాయి. ఇప్పటికే పలు అమెరికన్ సంస్థలు ఉత్పత్తి కొనుగోళ్ల కోసం పలు భారతీయ కంపెనీలను సంప్రదిస్తున్నట్లు వివరించాయి. సుమారు 60 శాతం భారతీయ ఫార్మా కంపెనీలు కొత్త వ్యాపార అవకాశాలు వస్తున్నట్లు వెల్లడించాయి. ఇదీ చదవండి: ‘ఈ దుస్తులు కొనండి’.. ప్రధాని మోదీపోటీ కూడా ఉంది..బయోసెక్యూర్ చట్టంతో ఉపయోగాలు ఉన్నప్పటికీ మన ఫార్మా కంపెనీలకు వెంటనే ప్రయోజనాలు లభించకపోవచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఐర్లాండ్, సింగపూర్ వంటి దేశాల నుంచి మన కంపెనీలకు గట్టి పోటీ ఉండొచ్చని వివరించాయి. అమెరికాలో ప్రస్తుతం 120 ఔషధ ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. చైనా తోడ్పాటు ఉన్న ఈ ప్రాజెక్టులు మన వైపు మళ్లేందుకు సమయం పట్టే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ప్రస్తుత ఒప్పందాలను మరికొంత కాలం కొనసాగించుకునేందుకు వీలు కల్పించే నిబంధనల వల్ల తక్షణం ఆర్థిక లబ్ధి చేకూరకపోవచ్చని వివరించాయి. అయితే, భారతీయ కంపెనీలకంటూ కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. సిప్లా, సింజీన్ వంటి సీడీఎంవోలు తక్కువ వ్యయాలతో ఔషధాలు తయారు చేయగలవు. అలాగే వాటికి సుశిక్షితులైన సిబ్బంది ఉన్నారు. అంతేగాకుండా పరిశ్రమకు ఊతమిచ్చేందుకు ప్రభుత్వం గ్రాంట్లు, రుణాలు కూడా అందిస్తోంది. మొత్తం మీద బయోసెక్యూర్ చట్టమనేది భారతీయ సీడీఎంవో విభాగానికి గేమ్ చేంజర్‌గా ఉండగలదని విశ్లేషకులు తెలిపారు. -
ఫార్మా, ఎయిర్‌కార్గోలో తెలంగాణ సూపర్!
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చేందుకు చర్యలు చేపట్టిన రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని కేంద్ర ఆర్థిక సర్వే వెల్లడించింది. తెలంగాణ, ఏపీతోపాటు పలు ఇతర రాష్ట్రాల్లో స్థూల ద్రవ్యలోటు, ఆర్థిక లోటు తగ్గాయని పేర్కొంది. ముఖ్యంగా మూలధన పెట్టుబడులపై ఈ రాష్ట్రాలు దృష్టి సారించడంతో.. మెరుగ్గా ఖర్చు చేసే పరిస్థితి ఏర్పడిందని తెలిపింది. సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2023–24 ఆర్థిక సర్వే నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. » దేశ ఫార్మా ఉత్పత్తుల్లో తెలంగాణ వాటా 30 శాతానికిపైగా ఉందని, వెయ్యికిపైగా లైఫ్ సైన్సెస్ కంపెనీలకు వేదికగా మారిందని కేంద్రం తెలిపింది. »దేశవ్యాప్తంగా విమానాల ద్వారా సరుకుల రవాణా (ఎయిర్ కార్గో)లో హైదరాబాద్ 44 శాతంతో టాప్‌లో నిలిచిందని వెల్లడించింది. »2019–21 మధ్య దేశ వయోజన జనాభాలో ఊబకాయం ఆందోళనకర స్థాయికి పెరిగిందని... తెలంగాణలో పురుషుల్లో ఊబకాయం 24.2% నుంచి 32.3 శాతానికి.. మహిళల్లో 28.6% నుంచి 30.1శాతానికి పెరిగిందని తెలిపింది.» వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాల కోసం తెచి్చన ఈ–నామ్‌తో తెలంగాణలోని 89 శాతం మంది రైతులు మెరుగైన ధర పొందారని పేర్కొంది. »దేశంలో సిమెంట్ పరిశ్రమల వార్షిక స్థాపిత ఉత్పత్తి సామర్థ్యం 622 మిలియన్ టన్నులకు చేరిందని.. అందులో 85శాతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక తదితర రాష్ట్రాల్లోనే ఉందని తెలిపింది. »ఇక ప్లాస్టిక్ నియంత్రణ లో భాగంగా సిద్దిపేటలో అమలు చేస్తున్న ‘స్టీ ల్ బ్యాంక్’విధానాన్ని కేంద్రం ప్రశంసించింది. -
రూ.300 కోట్లతో ఏఐ ఫార్మా హెల్త్‌కేర్ ఐటీ హబ్
పల్సస్ గ్రూప్ సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్లో రూ.300 కోట్ల అంచనా వ్యయంతో ఏఐ ఆధారిత ఫార్మా హెల్త్‌కేర్ ఐటీ హబ్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. దానివల్ల సుమారు 50,000 ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉన్నట్లు కంపెనీ సీఈఓ, ఎండీ డాక్టర్ గెడెల శ్రీనుబాబు తెలిపారు.హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన 73వ ఇండియన్ ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవంలో ఆయన మాట్లాడుతూ..‘కొత్తగా ఏర్పాటు చేయబోయే ప్రాజెక్ట్ హెల్త్‌కేర్‌తో పాటు ఐటీ రంగానికి ఎంతో ఉపయోగపడుతుంది. దీనివల్ల స్థానిక యువతకు 10,000 ప్రత్యక్ష ఉద్యోగాలు, దాదాపు 40,000 పరోక్ష ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. అత్యాధునిక కృత్రిమేమేధ సహాయంతో ఔషధాలను అభివృద్ధి చేసేందుకు ఈ ప్రాజెక్ట్ తోడ్పడుతుంది. దానివల్ల రోగులకు మెరుగైన వైద్య సదుపాయాలు, మందులను అందించవచ్చు. ఇది దేశంలోనే హెల్త్‌కేర్ ఇన్నోవేషన్‌లో తెలంగాణను ముందంజలో ఉంచుతుంది’ అని శ్రీనుబాబు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ..‘ఫార్మా పరిశ్రమలో అత్యాధునిక ఏఐ సాంకేతికతను ఉపయోగించడం వల్ల తక్కువ ధరకే రోగులకు మందులు, చికిత్స అందే వీలుంటుంది. గ్లోబల్ ఫార్మా క్యాపిటల్‌గా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 9-10 ఫార్మా జోన్ క్లస్టర్లను అభివృద్ధి చేయాలని సీఏం రేవంత్ రెడ్డి నిర్ణయించారు’ అని పేర్కొన్నారు.ఇదీ చదవండి: హాట్‌స్టార్‌లో అనంత్-రాధికల వివాహ వేడుకదేశంలో బల్క్ డ్రగ్ ఉత్పత్తిలో 40 శాతం వాటా హైదరాబాద్ కంపెనీలదే కావడం విశేషం. అందుకనే హైదరాబాద్‌ను ‘బల్క్ డ్రగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా’ అంటారు. ప్రపంచంలోని చాలా వ్యాక్సిన్లు స్థానిక కంపెనీలు తయారుచేసినవే. ఫార్మా రంగంలో హైదరాబాద్‌ను ‘వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్’ అని కూడా పిలుస్తారు. -
తెలంగాణ ఈఏపీసెట్‌లో ఏపీ ప్రభంజనం
సాక్షి, హైదరాబాద్/కొమరాడ/పాలకొండ/బలిజిపేట/గుంటూరు ఎడ్యుకేషన్/కర్నూలు సిటీ: తెలంగాణలో బీటెక్, బీఫార్మసీ, బీఎస్సీ అగ్రికల్చర్ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీసెట్ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు దుమ్ము లేపారు. ఇంజనీరింగ్, అగ్రి–ఫార్మా.. రెండు విభాగాల్లోనూ మొదటి ర్యాంకులు సాధించి సత్తా చాటారు. ఇంజనీరింగ్ విభాగంలో పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండకు చెందిన సతివాడ జ్యోతిరాదిత్య, అగ్రికల్చర్–ఫార్మసీ విభాగంలో అన్నమయ్య జిల్లా మదనపల్లికి చెందిన ఆలూరు ప్రణీత ఫస్ట్ ర్యాంకులతో ప్రభంజనం సృష్టించారు. రెండు విభాగాల్లోనూ టాప్ టెన్‌లో ఐదుగురు చొప్పున ఏపీ విద్యార్థులు ర్యాంకులు దక్కించుకోవడం విశేషం. తెలంగాణ ఈఏపీసెట్ ఫలితాలను శనివారం ఆ రాష్ట్ర విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేశారు. ఆన్లైన్ ద్వారా సీట్ల భర్తీ! టీఎస్ ఈఏపీసెట్ ఈ నెల 7 నుంచి 11 వరకు జరిగింది. ఇంజనీరింగ్ విభాగానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 2,54,750 మంది దరఖాస్తు చేశారు. వీరిలో 2,40,618 మంది పరీక్ష రాయగా 1,80,424 మంది అర్హత సాధించారు. అలాగే అగ్రికల్చర్–ఫార్మా విభాగంలో రెండు రాష్ట్రాల నుంచి 1,00,432 మంది దరఖాస్తు చేస్తే 91,633 మంది పరీక్ష రాశారు. వీరిలో 82,163 మంది అర్హత సాధించారు. ఈ ఏడాది రెండు విభాగాలు కలిపి 3,32,251 మంది రాస్తే.. ఇందులో 2,62,587 (74.98 శాతం) మంది అర్హత సాధించారు. వారం రోజుల్లో కౌన్సెలింగ్ తేదీలను ప్రకటిస్తామని బుర్రా వెంకటేశం తెలిపారు. ఈ ఏడాది ఆన్లైన్ ద్వారా సీట్లను భర్తీ చేసే ఆలోచన చేస్తున్నామన్నారు. మంచి ర్యాంకు సాధించడమే లక్ష్యంగా.. మాది పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం చిలకలపల్లి. అమ్మానాన్న కృష్ణవేణి, నారాయణరావు వ్యవసాయం చేస్తున్నారు. మంచి ర్యాంకు సాధించాలనే పట్టుదలతో చదివా. నా కష్టం ఫలించింది. –నగుడసారి రాధాకృష్ణ, టీఎస్ ఈఏపీసెట్ సెకండ్ ర్యాంకర్ (అగ్రికల్చర్–ఫార్మా విభాగం) ఐఐటీ బాంబేలో చదవడమే నా లక్ష్యం.. మా స్వస్థలం కర్నూలు జిల్లా పంచలింగాల. నాన్న సూర్యకుమార్ యాదవ్ కమ్యూనికేషన్ విభాగంలో ఎస్పీగా పనిచేస్తున్నారు. నేను 10వ తరగతిలో 9.2 జీపీఏ సాధించాను. ఇంటర్లో 951 మార్కులు వచ్చాయి. జేఈఈ మెయిన్‌లో అఖిల భారత స్థాయిలో 311వ ర్యాంకు వచి్చంది. ప్రస్తుతం జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు సన్నద్ధమవుతున్నా. ఐఐటీ బాంబేలో ఇంజనీరింగ్ చేయడమే నా లక్ష్యం. – గొల్లలేఖ హర్ష, టీఎస్ ఈఏపీసెట్ సెకండ్ ర్యాంకర్ (ఇంజనీరింగ్ విభాగం) ఐఏఎస్ అధికారినవుతా.. మాది కర్నూలు జిల్లా ఆదోని. నాన్న రామసుబ్బారెడ్డి, అమ్మ రాజేశ్వరి ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. 8వ తరగతి నుంచి హైదరాబాద్‌లో చదువుతున్నా. నాకు ఇంటర్లో 987 మార్కులు వచ్చాయి. జేఈఈ మెయిన్‌లో 252వ ర్యాంకు వచి్చంది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మంచి ర్యాంకు తెచ్చుకుని ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ చదువుతా. తర్వాత సివిల్స్ రాసి ఐఏఎస్ అధికారినవుతా. – భోగాలపల్లి సందేశ్, టీఎస్ ఈఏపీసెట్ నాలుగో ర్యాంకర్ (ఇంజనీరింగ్ విభాగం) ఐఐటీ బాంబేలో సీఎస్ఈ చదువుతా మాది కర్నూలు. నాన్న ఎం.రామేశ్వరరెడ్డి చిరు వ్యాపారి. అమ్మ గృహిణి. ఇంటర్లో నాకు 980 మార్కులు వచ్చాయి. జేఈఈ మెయిన్‌లో అఖిల భారత స్థాయిలో 36వ ర్యాంకు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 6వ ర్యాంకు వచ్చాయి. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మంచి ర్యాంకు తెచ్చుకుని ఐఐటీ బాంబేలో చదవాలనుకుంటున్నా. – మురసాని సాయి యశ్వంత్‌రెడ్డి, టీఎస్ ఈఏపీసెట్ ఐదో ర్యాంకర్ (ఇంజనీరింగ్ విభాగం) ర్యాంకుల శ్రీ‘నిధి’ మాది పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం దళాయిపేట. అమ్మానాన్న సుశీల, శ్రీనివాసరావు ఇద్దరూ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. నాకు జేఈఈ మెయిన్‌లో అఖిల భారత స్థాయిలో 261వ ర్యాంకు, ఓబీసీ విభాగంలో 35వ ర్యాంకు వచ్చాయి. –ధనుకొండ శ్రీనిధి, టీఎస్ ఈఏపీసెట్ పదో ర్యాంకర్ (ఇంజనీరింగ్ విభాగం) తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే.. మాది పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం యరకరాయపురం. నాన్న మోహనరావు సాంఘిక సంక్షేమ శాఖలో సీనియర్ అసిస్టెంట్‌గా, అమ్మ హైమావతి ఆర్టీసీలో పనిచేస్తున్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే తెలంగాణ ఈఏపీసెట్‌లో మొదటి ర్యాంకు సాధించగలిగాను. – సతివాడ జ్యోతిరాదిత్య, టీఎస్ ఈఏపీసెట్ ఫస్ట్ ర్యాంకర్ (ఇంజనీరింగ్ విభాగం) గుండె వైద్య నిపుణురాలినవుతా.. మాది అన్నమయ్య జిల్లా మదనపల్లి. నాన్న శ్రీకర్ హోమియో మెడికల్ ప్రాక్టీషనర్‌గా, అమ్మ కల్యాణి ప్రైవేట్ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నారు. అక్క సంవిధ కాగ్నిజెంట్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్. నాకు పదో తరగతిలో 600కి 589, ఇంటర్ బైపీసీలో 1000కి 982 మార్కులు వచ్చాయి. ఎయిమ్స్ న్యూఢిల్లీలో ఎంబీబీఎస్ చేసి వైద్యురాలిని కావడమే నా లక్ష్యం. కార్డియాక్ సర్జన్‌గా స్థిరపడాలన్నదే నా ఆకాంక్ష. –ఆలూరు ప్రణీత, టీఎస్ ఈఏపీసెట్ ఫస్ట్ ర్యాంకర్ (అగ్రికల్చర్–ఫార్మా విభాగం) -
రూ. 25,813 కోట్ల పెట్టుబడులు.. 56,171 ఉద్యోగాలు
న్యూఢిల్లీ: ఫార్మా రంగానికి ఉద్దేశించిన ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) కింద రూ. 25,813 కోట్ల మేర పెట్టుబడులు వచ్చాయి. కొత్తగా 56,171 ఉద్యోగాల కల్పన జరిగింది. కేంద్ర ఫార్మా విభాగం (డీవోపీ) వార్షిక సమీక్షలో ఈ విషయాలు వెల్లడించింది. స్కీముకు ఎంపికైన సంస్థలు రూ. 1,16,121 కోట్ల మేర విక్రయించినట్లు డీవోపీ తెలిపింది. దేశీయంగా ఔషధాల తయారీని మరింతగా ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఫార్మా పీఎల్ఐ స్కీము ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. 2020–2021 నుంచి 2028–2029 మధ్య కాలంలో ఇది అమల్లో ఉంటుంది. ఈ పథకం కింద 55 సంస్థల దరఖాస్తులు ఆమోదం పొందాయి. నాణ్యమైన ఔషధాలను అందుబాటు ధరలో అందించేందుకు తలపెట్టిన ’ప్రధాన మంత్రి భారతీయ జనఔషధి పరియోజన’ కింద ఈ ఏడాది 10,000 రిటైల్ అవుట్‌లెట్స్ ప్రారంభించాలన్న లక్ష్యం కూడా డీవోపీ పూర్తయినట్లు పేర్కొంది. పీఎంబీజేపీ కింద 1,965 ఔషధాలు, 293 సర్జికల్ పరికరాలు ఉన్నాయి. -
India-US CEO Forum: ఫార్మా బంధం బలోపేతం
న్యూఢిల్లీ: ఫార్మా, సెమీకండక్టర్లు, కీలక లోహాలు, వర్ధమాన టెక్నాలజీలు తదితర అంశాల్లో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భారత్, అమెరికా నిర్ణయించుకున్నాయి. అలాగే, పర్యవరణ అనుకూల సాంకేతికతలను కలిసి అభివృద్ధి చేయడం, క్రిటికల్ టెక్నాలజీల్లో భాగస్వామ్యాన్ని పటిష్టం చేసుకోవడం వంటి అంశాలపై చర్చించాయి. భారత్–అమెరికా సీఈవో ఫోరం వర్చువల్ భేటీలో భాగంగా కేంద్ర వాణిజ్య మంత్రి పియుష్ గోయల్, అమెరికా వాణిజ్య మంత్రి జినా రైమండో సమావేశంలో ఈ అంశాలు చర్చకు వచి్చనట్లు కేంద్రం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. ఫోరం సభ్యులు సూచించిన సిఫార్సుల అమలుపై దృష్టి పెట్టాలని సీఈవో ఫోరంనకు రైమండో సూచించారు. అలాగే ఫోరంలో అమెరికాకు చెందిన దిగ్గజాలు హనీవెల్, ఫైజర్, కిండ్రిల్, వయాశాట్ చేరికను ప్రకటించారు. సెమీకండక్టర్ సరఫా వ్యవస్థ, ఇన్నోవేషన్ హ్యాండ్õÙక్ వంటి వేదికల ద్వారా పరిశ్రమ అవకాశాలను అందిపుచ్చుకోవాలని గోయల్ పేర్కొన్నారు. 2014లో ఫోరంను పునరుద్ధరించిన తర్వాత నుంచి ఇది ఎనిమిదో సమావేశం. వచ్చే ఏడాది తొలినాళ్లలో తదుపరి భేటీ నిర్వహించనున్నారు. భారత్, అమెరికా దిగ్గజ సంస్థల చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లు సభ్యులుగా ఉన్న ఈ ఫోరంనకు టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్, లాక్‌హీడ్ మారి్టన్ ప్రెసిడెంట్ జేమ్స్ టైస్లెట్ సారథ్యం వహిస్తున్నారు. -
మధుమేహానికి గ్లెన్‌మార్క్ కాంబినేషన్ డ్రగ్
హైదరాబాద్: టైప్–2 మధుమేహానికి గ్లెన్ మార్క్ ఫార్మా తొలి ట్రిపుల్ కాంబినేషన్ డ్రగ్‌ను దేశీ మార్కెట్లో ప్రవేశపెట్టింది. టైప్–2 మధుమేహం చికిత్సలో వినియోగించే టెనేలిగ్లిప్టిన్, డాపాగ్లిఫ్లోజిన్, మెట్ఫారి్మన్ కలయికతో కూడిన ఫిక్స్డ్ డోసేజ్ కాంబినేషన్ (ఎఫ్డీసీ) ఔషధాన్ని ‘జిటా’ పేరుతో విడుదల చేసింది. మధుమేహంతోపాటు, ఇతర అనారోగ్య సమస్యలున్న వారిని దృష్టిలో పెట్టుకుని దీన్ని తీసుకొచి్చంది. ఇందులో టెనేలిగ్లిప్టిన్ 20 ఎంజీ, డాపాగ్లిఫ్లోజిన్ 10ఎంజీ, మెట్ఫార్మిన్ ఎస్ఆర్ (500/1000ఎంజీ) రూపంలో ఉంటాయి. వైద్యుల సిఫారసు మేరకు ఈ ఔషధాన్ని రోజుకు ఒక్కసారి తీసుకోవాల్సి ఉంటుందని గ్లెన్‌మార్క్ ఫార్మా తెలిపింది. హెచ్‌బీఏ1సీ అధికంగా ఉండి, బరువు పెరగడం తదితర ఇతర సమస్యలతో బాధపడే వారిలో ఈ ఔషధం గ్లైసిమిక్ కంట్రోల్‌ను మెరుగుపరుస్తుందని గ్లెన్‌మార్క్ ఫార్మా ఇండియా ఫార్ములేషన్స్ హెడ్ అలోక్ మాలిక్ తెలిపారు. -
ఏపీలో పెట్టుబడుల పరుగులు..
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర ప్రభుత్వం కృషి ఫలితంగా విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో మరో రూ.1,624 కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపంలోకి రానున్నాయి. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం విశాఖ, అనకాపల్లి జిల్లాల పర్యటనలో పలు ఐటీ, ఫార్మా కంపెనీల ప్రారం¿ోత్సవాలు, భూమిపూజ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రధానంగా విశాఖలో ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్‌ను లాంఛనంగా ప్రారంభించడంతో పాటు ఐజియా స్టెరిల్స్ ప్రైవేట్ లిమిటెడ్, లారస్ సింథసిస్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్, లారస్ ల్యాబ్‌లను ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్టుల ద్వారా 4,160 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ఇక సీఎం సోమవారం ప్రారంభించే, భూమి పూజ నిర్వహించే యూనిట్ల వివరాలివీ.. ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్.. విశాఖపట్నంలోని మధురవాడ ఐటీ హిల్ నెంబర్–2లో ఇన్ఫోసిస్ ఒక కొత్త డెవలప్మెంట్ సెంటర్‌ను ఏర్పాటుచేసింది. సుమారు రూ.41 కోట్ల పెట్టుబడితో ఏర్పాటుచేసిన ఈ సెంటర్‌ను భవిష్యత్తులో మరింత విస్తరించనున్నారు. ఇది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్‌గా పనిచేస్తుంది. దీని ఇంటీరియర్ డిజైన్ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా హైబ్రీడ్ వర్క్‌ప్లేస్‌గా రూపొందించారు. దాదాపు వెయ్యిమంది ఈ సెంటర్ నుంచి పనిచేయనున్నారు. గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలకు అనుగుణంగా ఈ కార్యాలయాన్ని తీర్చిదిద్దారు. అత్యంత అధునాతన సదుపాయాలతో విశాలమైన ఆడియో, వీడియో కాన్ఫరెన్స్ హాల్స్, అధునాతన కేఫ్టేరియా, విశాలమైన పార్కింగ్ సౌకర్యాలతో ఈ సెంటర్‌ను నిరి్మంచారు. దీని ప్రారంభోత్సవం అనంతరం ఇన్ఫోసిస్, వివిధ కంపెనీల ఐటీ ప్రతినిధులతో సీఎం సంభాషిస్తారు. . విశాఖలోని ఇన్ఫోసిస్ కార్యాలయం ఇజియా స్టెరిల్స్ ప్రైవేట్ లిమిటెడ్.. ఫార్మా, బయోటెక్ ఉత్పత్తులకు సంబంధించి రూ.300.78 కోట్లతో పరవాడ ఫార్మాసిటీలో నిరి్మంచిన అరబిందో ఫార్మా అనుబంధ సంస్థ ఇజియా (ఈయూఐజీఐఏ) యూనిట్‌ను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించనున్నారు. ఈ యూనిట్ ద్వారా 800 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి. లారస్ సింథసిస్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్.. యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ (ఏపీఐ) ఉత్పత్తులకు సంబంధించి రూ.421.70 కోట్లతో అచ్యుతాపురంలో నిరి్మంచిన ఈ యూనిట్‌ను సీఎం ప్రారంభిస్తారు. దీని ద్వారా 600 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాల కల్పన జరగనుంది. ఇదే కంపెనీ మరో 15 ఎకరాల్లో రూ.407.40 కోట్లతో ఏర్పాటుచేసే యూనిట్ నిర్మాణ పనులకు కూడా సీఎం భూమిపూజ చేస్తారు. విశాఖపట్నంలోని రిషికొండలో ఐటీ సెజ్ లారస్ ల్యాబ్స్ లిమిటెడ్.. ఇక అచ్యుతాపురం ఏపీ సెజ్‌లోని లారస్ ల్యాబ్స్‌లో నిర్మించిన అదనపు భవన సముదాయాన్ని, యూనిట్–2 ఫార్ములేషన్ బ్లాక్‌ను కూడా ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. రూ.460 కోట్లతో ఏర్పాటుచేసిన ఈ యూనిట్ ద్వారా 1,200 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. దీంతోపాటు రూ.407.40 కోట్లతో లారస్ ల్యాబ్స్ కొత్త పరిశ్రమకు కూడా సీఎం భూమిపూజ చేస్తారు. బీచ్ క్లీనింగ్ కోసం జీవీఎంసీ కొనుగోలు చేసిన ప్రత్యేక వాహనాల్ని కూడా ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. సీఎం పర్యటన ఇలా.. సోమవారం ఉదయం ఇన్ఫోసిస్ డెవలప్ మెంట్ సెంటర్ ప్రారంభోత్సవం అనంతరం సీఎం హెలికాప్టర్లో అనకాపల్లి జిల్లా పరవాడకు చేరుకుంటారు. రాంకీ ఫార్మాసిటీలోని అరబిందో ఫార్మా అనుబంధ సంస్థ ఇజియా (ఈయూఐజీఐఏ) స్టెరిలీస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో నూతన యూనిట్‌ను ప్రారంభిస్తారు. ►అక్కడి నుంచి హెలికాప్టర్లో అచ్యుతాపురం సెజ్‌కు చేరుకుని లారెస్ ఫార్మా ల్యాబ్‌లో యూనిట్–2 ఫార్ములేషన్ బ్లాక్, ఎల్ఎస్పీఎల్ యూనిట్–2ని ప్రారంభిస్తారు. ►హెలికాప్టర్ ద్వారా విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుని విజయవాడకు బయల్దేరతారు. ►ఈ నేపథ్యంలో.. మంత్రి ఆదిమూలపు సురేష్, జిల్లా అధికారులతో కలిసి ఆదివారం రుషికొండ ఐటీ సెజ్‌లో ఏర్పాట్లను పరిశీలించారు. బీచ్ యంత్రాలు ప్రారంభించే ప్రాంతంతో పాటు హెలిప్యాడ్‌ను సందర్శించిన మంత్రి.. అక్కడి ఏర్పాట్లు గురించి ఆరా తీశారు. -
Dhruvi Panchal: వన్స్‌మోర్ వంటలు
అహ్మదాబాద్‌లోని ఒక హెల్త్‌కేర్ కంపెనీలో మంచి జీతంతో పనిచేస్తున్న ధృవీ పాంచల్‌కు వంటలు చేయడం అంటే చాలా ఇష్టం. ఆ పాషన్ తనను ఎక్కడిదాకా తీసుకెళ్లిందంటే వీధి పక్కన ఫుడ్ స్టాల్ స్టార్ట్ చేసేంత వరకు! అలా అని ఆమె ఉద్యోగానికి రాజీనామా చేయలేదు. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే సాయంత్రం ఆరు నుంచి రాత్రి పదకొండు వరకు ఫుడ్ స్టాల్ నడుపుతోంది. సోషల్ మీడియాలో షేర్ చేసిన పాంచల్ వీడియో వైరల్ అయింది. ‘చక్కగా ఉద్యోగం చేసుకోకుండా ఎందుకమ్మా ఈ కష్టం’ అన్న వాళ్లు అతి కొద్దిమంది అయితే... ‘ఈ వీడియో మమ్మల్ని ఎంతో ఇన్స్పైరింగ్ చేసింది’ అన్నవాళ్లు ఎక్కువ. -
ఫార్మా, డ్రోన్లు, టెక్స్టైల్స్ పీఎల్ఐలో మార్పులు
న్యూఢిల్లీ: ఫార్మాస్యూటికల్స్, డ్రోన్లు, టెక్స్టైల్స్ రంగాలకు సంబంధించి ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకం(పీఎల్ఐ) కింద కేంద్రం మార్పులు చేయనుంది. ఈ రంగాల్లో తయారీ, పెట్టుబడులను ప్రోత్సహించేందుకు వీలుగా రాయితీలను పెంచనుంది. ఈ విషయాన్ని ఓ సీనియర్ అధికారి అనధికారికంగా వెల్లడించారు. 2021 నుంచి ఇప్పటివరకు 14 రంగాలకు పీఎల్ఐ పథకం కింద కేంద్రం ప్రోత్సాహకాలు ప్రకటించి, దరఖాస్తులను సైతం స్వీకరించింది. మంత్రిత్వ శాఖల మధ్య అంతర్గతంగా కొనసాగిన సంప్రదింపుల్లో భాగంగా ఈ రంగాలకు సంబంధించి సవరణలు చేయాల్సిన అవసరాన్ని గుర్తించినట్టు సదరు సీనియర్ అధికారి తెలిపారు. దీనికి త్వరలోనే కేబినెట్ ఆమోదం పొందనున్నట్టు పేర్కొన్నారు టెక్నికల్ టెక్స్‌టైల్స్‌కు నిర్వచనం మార్చనున్నట్టు చెప్పారు. అలాగే, డ్రోన్లు, డ్రోన్ల విడిభాగాలకు కేటాయించిన రూ.120 కోట్లను పెంచనున్నట్టు వెల్లడించారు. వైట్ గూడ్స్ (ఏసీ, ఎల్ఈడీ లైట్లు) రంగాలకు పీఎల్ఐ కింద నగదు ప్రోత్సాహకాలను ఈ నెల నుంచే విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. 2023 మార్చి నాటికి రూ.2,900 కోట్లను ఇవ్వాల్సి ఉందన్నారు. పీఎల్ఐ కింద వైట్ గూడ్స్, వైద్య పరికరాల తయారీ, ఆటోమొబైల్స్, స్పెషాలిటీ స్టీల్, ఆహారోత్పత్తులు తదితర 14 రంగాలకు కేంద్రం రూ.1.97 లక్షల కోట్లను ప్రకటించింది. అయితే, కొన్ని రంగాలకు సంబంధించి పెద్దగా పురోగతి కనిపించలేదు. దీంతో కొన్ని రంగాలకు సంబంధించి మార్పులు చేయాల్సి రావచ్చని కేంద్ర వాణిజ్య శాఖ అధికారి లోగడ సంకేతం ఇవ్వడం గమనార్హం. ముఖ్యంగా అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ (ఏసీసీ) బ్యాటరీలు, టెక్స్టైల్స్ ఉత్పత్తులు, స్పెషాలిటీ స్టీల్ రంగాల్లో పీఎల్ఐ పట్ల పెద్దగా స్పందన లేకపోవడంతో మార్పులకు కేంద్రం పూనుకున్నట్టు తెలుస్తోంది. -
మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా విశాఖ
సాక్షి, విశాఖపట్నం: అంతర్జాతీయ వాణిజ్య కార్యకలాపాలకు వేదికగా విశాఖపట్నం మారుతోంది. మాన్యుఫాక్చరింగ్, ఫార్మా, ఐటీ, కార్గో... ఇలా భిన్నమైన రంగాలకు సంబంధించిన పరిశ్రమలు ఒక్కొక్కటిగా విశాఖకు విస్తరిస్తున్నాయి. తాజాగా విశాఖపట్నం స్పెషల్ ఎకనమిక్ జోన్ (వీసెజ్)లో మరో మూడు మాన్యుఫాక్చరింగ్ యూనిట్ల ఏర్పాటుకు ఆమోదం లభించింది. రూ.500 కోట్లకు పైగా పెట్టుబడులతో రెండు బయో డీజిల్ కంపెనీలు, ఒక ఫార్మా కంపెనీ ఏడాదిలోపు ఏర్పాటు కానున్నాయి. వీటి ద్వారా 1,200 మందికి పైగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. మరోవైపు తొలి త్రైమాసికంలో గతేడాదితో పోలిస్తే ఉత్పత్తుల ఎగుమతుల్లో 34 శాతం వృద్ధి కనబరిచిన వీసెజ్... అర్ధ సంవత్సరానికి 50 శాతం వృద్ధి నమోదు దిశగా ముందుకు సాగుతోంది. యూఎస్, కెనడాకు ఎగుమతులే లక్ష్యంగా... ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన మూడు యూనిట్లు విశాఖ సెజ్‌లోనే ఏర్పాటు కానున్నాయి. ఇందులో బయోడీజిల్ తయారీ సంస్థ అద్వైత్ బయోఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్, బయోకాన్ లిమిటెడ్, ఫార్మాసూ్యటికల్ ఉత్పత్తుల తయారీ సంస్థ గ్రాన్యూల్స్ సీజెడ్‌ఆర్‌వో సంస్థలు ఉన్నాయి. ఈ కంపెనీలు ఏడాదిలోపు తమ కార్యకలాపాలు ప్రారంభించాలని వీసెజ్ నిబంధన విధించింది. అయితే... ఈ సంస్థలన్నీ ఆరు నుంచి పది నెలల్లోపే ఉత్పత్తుల తయారీని మొదలు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయని వీసెజ్ అధికారులు చెబుతున్నారు. ఈ మూడు కంపెనీలు ప్రధానంగా కెనడా, యూఎస్‌కు ఎగుమతులే లక్ష్యంగా నిర్దేశించుకున్నాయి. రికార్డు స్థాయిలో ఎగుమతులు ఏపీ, తెలంగాణకు వస్తున్న పరిశ్రమలు వీలైనంత త్వరగా కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు చేపట్టాం. దువ్వాడ వీసెజ్ పరిధిలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సెజ్‌లు, యూనిట్ల ద్వారా రికార్డు స్థాయి ఎగుమతులు సాధించాం. 2023–24 మొదటి త్రైమాసికంలో రూ.50,195 కోట్ల విలువైన వస్తువులు, సేవలను ఎగుమతి చేశాం. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది 34 శాతం వృద్ధి రేటు సాధించాం. వివిధ వస్తువులను ఉత్పత్తి చేయడం ద్వారా రూ.35,992 కోట్లు, సేవారంగం ఎగుమతుల్లోనూ 36 శాతం వృద్ధి నమోదైంది. ఈ ఏడాది జూన్ 30వ తేదీ వరకు గణాంకాలను పరిశీలిస్తే రూ.1,04,961 కోట్ల పెట్టుబడులు వీసెజ్ ద్వారా రాగా... మొత్తం 6,61,579 మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. – ఎం.శ్రీనివాస్, వీసెజ్‌జోనల్ డెవలప్మెంట్ కమిషనర్ -
ఇంటర్ ఫెయిల్, రూ.500తో అమెరికాకి పయనం.. కట్ చేస్తే 47 వేల కోట్లకు అధిపతి!
ఏదో సాధించాలనే తపన..ఏమీ సాధించలేదేనన్న నిరాశ.. ఇంకేమీ సాధించలేమోనన్న నిస్పృహ.. ఇలాంటి స్థితిలోనే ఎంతోమంది నిండు జీవితాలను ఛిద్రం చేసుకుంటున్నారు. భవిష్యత్తులో ఉన్నత చదువులు చదివి ఎన్నో ఉన్నత శిఖరాల ఎత్తు ఎదగాల్సిన విద్యార్థులు పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయని,ఫెయిల్ అయ్యామని మరొకరు ఇలా.. చిన్న చిన్న సమస్యలకే కుంగిపోయి బలవన్మరణాలకు పాల్పడుతుంటుంటారు. అలాంటి వారు ఆత్మహత్యలకు పాల్పడే ముందు ఒక్క క్షణం ఆగి, తమను తాము ప్రశ్నించుకుంటే ఎన్నో జీవితాలు నిలబడతాయి. తిరిగి పచ్చగా కళకళలాడతాయని అంటున్నారు మురళి దివి. నాడు ఇంటర్ రెండు సార్లు ఫెయిల్ అయ్యారు. చేతిలో రూ. 500తో అమెరికాకు వెళ్లారు. కట్ చేస్తే నేడు వేల కోట్ల అధిపతిగా ఎదిగారు. ఇంతకీ ఆయన ఎవరని అనుకుంటున్నారా? ఆయన మరెవరో కాదు దివిస్ లేబరేటరీస్ అధినేత దివి మురళి కృష్ణ ప్రసాద్. చదవండి👉 ఈ చెట్టు లేకపోతే ప్రపంచంలో కూల్‌డ్రింక్స్ తయారీ కంపెనీల పరిస్థితి ఏంటో? మురళి దివి ఎవరు? ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా మచిలీపట్నం మురళి దివి స్వస్థలం. ఆయన తండ్రి రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి. తనకు వచ్చే 10 వేల రూపాయల పెన్షన్‌తో 13 మంది పిల్లల్ని పోషించేవారు. అయినప్పటికీ తన కష్టాన్ని పిల్లలకు తెలియనీయకుండా పెంచారు. వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలని శ్రమించారు. కానీ మురళి దివికి ఇంగ్లీష్ అంటే చాలా భయం. ఆ భయమే ఆయనను ఇంటర్మీడియట్లో రెండు సార్లు ఫెయిల్ అయ్యేలా చేసింది. వృద్దిలోకి వస్తారనుకున్న కొడుకు ఇలా ఫెయిల్ కావడంతో తల్లిదండ్రులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అప్పుడే శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుందనే సూక్తిని గట్టిగా నమ్మారు. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని కుంగిపోలేదు. ప్రయత్నించారు. చివరికి విజయమే మురళి దివికి బానిసైంది. అందరూ సంపన్నులే.. కానీ తాను మాత్రం ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం అప్పటికే మణిపాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుతున్న తన సోదరుడి వద్దకు పంపారు. అదే ఆయన జీవితాన్ని కీలక మలుపు తిప్పింది. కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ కోర్సులో చేరారు. అంతర్జాతీయ యూనివర్శిటీ కావడంతో దేశ, విదేశీ విద్యార్ధులు అందులోనూ సంపన్నులు. కానీ తన కుటుంబ నేపథ్యం అందుకు విభిన్నం. ఉన్నత చదువుల కోసం నాన్న, తోబుట్టువులు చేసిన మేలు మరిచిపోలేదని ఓ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఎలాగైనా వారి కష్టానికి ప్రతిఫలంగా ఉన్నత శిఖరాల్ని అధిరోహించాలని అప్పుడే నిశ్చయించుకున్నారు. రేయింబవళ్లు శ్రమించారు. అలా బ్యాచిలర్ డిగ్రీలో యూనివర్సిటీలోనే గోల్డ్ మెడలిస్ట్ సంపాదించారు. అదే యూనివర్సిటీలో బెస్ట్ స్డూడెంట్‌గా గోల్డెన్ అవార్డ్స్‌తో మాస్టర్స్‌ను పూర్తి చేశారు. జీతం రూ.250లే పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత ఉద్యోగం వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చారు. వార్నర్స్ హిందుస్థాన్ కంపెనీలో రూ. 250 జీతంతో కెరీర్ ప్రారంభించారు. ఆ సమయంలో, అమెరికాలో ఫార్మసిస్ట్‌లకు మంచి డిమాండ్ ఉంది. రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్‌లు అమెరికా వీసా పొందడం సులభం. అలా అమెరికా వెళ్లేందుకు ప్రయత్నించారు. యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్ కావడంతో వీసా దొరికింది. వెంటనే గ్రీన్ కార్డ్ సంపాదించారు. చదవండి👉 దేశంలోని ఐటీ ఉద్యోగులకు బంపరాఫర్.. డబుల్ శాలరీలను ఆఫర్ చేస్తున్న కంపెనీలు! చలో అమెరికా కానీ వీసా ఆమోదం తర్వాత మురళికి అమెరికా వెళ్లడానికి 9 నెలలు పట్టింది. 1976-77 సమయంలో తన భార్య, కుమారుడితో కలిసి చేతిలో రూ.500లతో అమెరికాకు పయనమయ్యారు. టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియోలో సైంటిస్ట్‌గా పనిచేశారు. తర్వాత కాస్మోటిక్ ఫార్మాస్యూటికల్ ప్లాంట్ సూపరింటెండెంట్ అయ్యారు. ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతు ఆ కంపెనీకి వైస్ ప్రెసిడెంట్‌గా, డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. జీతం నెలకు రూ.నాలుగున్నర లక్షలకు పెరిగింది. జీవిత భాగస్వామి అంగీకారంతో అంతా సవ్యంగా సాగిపోతున్న సమయంలో మురళికి ఓ ఆలోచన వచ్చింది. నేను నా కుటుంబ సభ్యులకు, నన్ను కన్న నా దేశానికి దూరంగా ఉంటూ ఇక్కడే ఎందుకు పనిచేయాలి? అని తనని తాను ప్రశ్నించుకున్నారు. వెంటనే భారత్‌కు వచ్చేయాలని అనుకున్నారు. చివరికి జీవిత భాగస్వామి అంగీకారంతో మురళి భారత్‌కు వచ్చారు. చదవండి👉 ఇద్దరు ఉద్యోగుల కోసం.. యాపిల్, గూగుల్ సీఈవోల పోటీ.. చివరికి ఎవరు గెలిచారంటే? డాక్టర్ అంజిరెడ్డితో పాటు తిరిగి వచ్చిన తర్వాత, ఏం చేయాలో తెలియదు. వ్యాపారం ప్రారంభించాలంటే అంత డబ్బు కూడా లేదు. అమెరికాలో సైంటిస్ట్‌గా సంపాదించిన అనుభవాన్నే ఆస్తిగా మరల్చుకున్నారు. డాక్టర్ రెడ్డీస్ వ్యవస్థాపకులు డాక్టర్ అంజి రెడ్డిని సంప్రదించారు. తాను భారత్‌లో ఓ కంపెనీని పెట్టాలని అనుకుంటున్నట్లు తన ఐడియాను వివరించారు. ఆ ఆలోచనకు అంజిరెడ్డి సైతం అకర్షితులయ్యారు. అతని సహకారంతో 'కెమినార్' అనే కంపెనీని కొనుగోలు చేశారు. దేశంలోని ప్రముఖ ఫార్మా తయారీ కంపెనీలలో ఒకటిగా తీర్చిదిద్దేందుకు పెట్టుబడులు భారీగా పెట్టారు. కానీ ప్రయాణం అంత సులభం కాదు. అయితే, ధైర్యం, 'సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్' (బలవంతులదే మనుగడ) నినాదంతో ముందుకు సాగారు. చేసి చూపించారు. ఆ సమయంలో ప్రముఖ వ్యాపార వేత్తలలో ఒకరిగా నిలిచారు. దేదీప్యమానంగా వెలుగులు విరజిమ్ముతూ దేశంలోని డిమాండ్లను తీర్చేందుకు ఆంధ్రప్రదేశ్‌లో ప్లాంట్లను ప్రారంభించారు. ఆ అనుభవంతో, సొంతంగా కంపెనీ పెట్టాలనే కోరికతో 1990లో హైదరాబాద్‌లో ‘దివీస్ లేబొరేటరీస్’ ప్రారంభించారు. ఏఐపీఐలు, ఇంటర్మీడియట్ల తయారీకి, వ్యాపారానికి అనుగుణంగా అభివృద్ది చేయడం ప్రారంభించారు. అలా 1995లో మురళి దివి తెలంగాణలోని చౌటుప్పల్‌లోని తన తొలి తయారీ కేంద్రాన్ని, 2002లో విశాఖ సమీపంలో రెండో యూనిట్ ప్రారంభించారు. బిలియనీర్‌గా ఎదిగారు.. దివీస్ ల్యాబ్స్ స్థాపించిన 23 సంవత్సరాల తరువాత, 2013లో మురళి బిలియనీర్ అయ్యారు. 2018-19లో అతను భారతదేశంలో అత్యధిక పారితోషికం పొందిన ఫార్మాస్యూటికల్ ఎగ్జిక్యూటివ్‌గా నిలిచారు. దివీస్ ల్యాబ్స్ స్టాక్ విలువ భారీగా పెరిగింది. అలానే కేంద్రం ప్రారంభించిన ఆత్మ నిర్భర్ అభియాన్, మేక్ ఇన్ ఇండియా మద్దతు.. కోవిడ్ -19 మహమ్మారి వల్ల ఫార్మా ఉత్పత్తుల అవసరం పెరగడంతో దివిస్ ల్యాబ్స్ మరింత ఎదిగింది. ఫోర్బ్స్ ఇండియా ప్రకారం, మురళీ దివి నికర సంపద 5.9 బిలియన్ డాలర్లతో ప్రపంచంలోని 448వ ధనవంతులుగా నిలిచారు. చదవండి👉 యాపిల్ కంపెనీలో వందల కోట్ల మోసం.. భారతీయ ఉద్యోగికి 3 ఏళ్ల జైలు శిక్ష! -
ఎగుమతులు @ 447 బిలియన్ డాలర్లు
రోమ్: భారత్ వస్తు ఎగుమతులు 2022–23 ఆర్థిక సంవత్సరంలో 2021–22తో పోల్చితే 6 శాతం పెరిగి 447 బిలియన్ డాలర్లకు చేరినట్లు వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఇదే సమయంలో దేశ దిగుమతులు 16.5 శాతం ఎగసి 714 బిలియన్ డాలర్లకు చేరినట్లు వెల్లడించారు. వెరసి ఎగుమతులు–దిగుమతుల మధ్య వాణిజ్యలోటు 267 బిలియన్ డాలర్లకు చేరింది. పెట్రోలియం, ఫార్మా, రసాయనాలు, సముద్ర ఉత్పత్తుల రంగాల నుంచి ఎగుమతుల్లో మంచి వృద్ధి నమోదయినట్లు ఆయన వెల్లడించారు. ఫ్రాన్స్, ఇటలీల్లో ఏప్రిల్ 11 నుంచి 13వ తేదీ వరకూ పర్యటించిన గోయల్ ఈ సందర్భంగా పలు కంపెనీల సీఈఓలతో భేటీ అయ్యారు. ఆయా దేశాలతో వాణిజ్య, పెట్టుబడుల సంబంధాలు మరింత పురోగమించడం లక్ష్యంగా ఈ పర్యటన సాగింది. ఈ సందర్భంగా ఆయన విలేకరులకు తెలిపిన అంశాల్లో ముఖ్యమైనవి... ► వస్తు, సేవలు కలిపి ఎగుమతులు కొత్త రికార్డులో 14 శాతం వృద్ధి నమోదయ్యింది. విలువలో 770 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఒక్క సేవల ఎగుమతులు చూస్తే, 27.16 శాతం పెరిగి 323 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇక విభాగాల దిగుమతులు 892 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ భారత్ ఎకానమీ క్రియాశీలత, పురోగమనానికి సూచికలుగా ఎగుమతి–దిగుమతి గణాంకాలు ఉన్నాయి. ► అన్ని దేశాలతో పటిష్ట వాణిజ్య సంబంధాలు నెరపడానికి భారత్ కృషి సల్పుతోంది. ► ఇన్వెస్టర్ల పెట్టుబడులకు భారత్ అత్యంత ఆకర్షణ ప్రదేశంగా ఉంది. ఎకానమీ పరంగా చూస్తే, భారత్ ఎంతో పటిష్టంగా ఉంది. వస్తు, సేవల పన్ను వసూళ్లు భారీగా నమోదవుతున్నాయి. ఎగుమతులు బాగున్నాయి. ద్రవ్యోల్బణం దిగివస్తోంది. విదేశీ మారకద్రవ్య నిల్వలు పటిష్టంగా 600 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. విదేశాల నుంచి భారత్‌కు పంపుతున్న రెమిటెన్సులు 100 బిలియన్ డాలర్లుపైగానే ఉంటున్నాయి. పెట్టుబడుల ప్రవాహం బాగుంది. ► ఎగుమతుల భారీ వృద్ధి లక్ష్యంగా సమర్థవంతమైన విదేశీ వాణిజ్య పాలసీ (ఎఫ్టీపీ)ని భారత్ ఇప్పటికే ఆవిష్కరించింది. 2030 నాటికి దేశ ఎగుమతులను ఏకంగా 2 ట్రిలియన్ డాలర్లకు చేర్చడంతో పాటు రూపాయిని గ్లోబల్ కరెన్సీగా చేయాలని పాలసీలో నిర్దేశించడం జరిగింది. -
డా.రెడ్డీస్ చేతికి ‘మేనే’ అమెరికా జెనరిక్ ప్రిస్క్రిప్షన్ ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియో
సాక్షి,హైదరాబాద్: దేశీయ ఫార్మా దిగ్గజం 'డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్' ఆస్ట్రేలియాకు చెందిన మేనే(Mayne) ఫార్మా గ్రూప్ అమెరికా జెనరిక్ ప్రిస్క్రిప్షన్ ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియోను కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా కంపెనీ 15 మిలియన్ డాలర్ల ఆకస్మిక చెల్లింపులు, 90 మిలియన్ డాలర్ల మేర నగదు చెల్లింపులు చేయనుంది. నిజానికి మేనే ఫార్మా అమెరికా జెనరిక్స్ ప్రిస్క్రిప్షన్ ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియోలో సుమారు 85 జెనరిక్ ఉత్పత్తులు ఉన్నాయి. ఇందులో 45 వాణిజ్య ఉత్పత్తులు కాగా, మిగిలిన 40 ఆమోదించబడిన నాన్-మార్కెటెడ్ ఉత్పత్తులు. కంపెనీ ఉత్పత్తులలో మహిళల ఆరోగ్యంపై దృష్టి సారించే ఔషధాలు ఉన్నాయి. ఇప్పటికే ఆమోదం పొందింని ఈ ఉత్పత్తుల్లో హార్మోనల్ వెజినల్ రింగ్, బర్త్ కంట్రోల్ పిల్, కార్డియో ప్రోడక్ట్ వంటి అధిక విలువలు కలిగిన ఉత్పత్తులు ఉన్నాయి. వీటితో పాటు ఫెంటోరా, నటాజియా, ప్రోలెన్సా వంటి కీలకు ఔషధాలు కూడా ఉన్నాయి. డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ చేతికి మేనే ఫార్మా దక్కడంతో రోగులకు తక్కువ ధరలకే మందులను అందించడానికి, అంతే కాకుండా అవసరమైన మందులు వేగవంతంగా అందించడానికి సహాయపడుతుంది. ఈ సందర్భంగా డాక్టర్ రెడ్డీస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎరెజ్ ఇజ్రాయెలీ మాట్లాడుతూ బలమైన బ్యాలెన్స్ షీట్ బేస్ వ్యాపారాన్ని బలోపేతం చేయడానికి, దీర్ఘకాలిక వృద్ధి ప్రాముఖ్యత కలిగిన ఉత్పత్తులను పొందేందుకు వీలు కల్పిస్తుందన్నారు. -
ఫార్మాస్యూటికల్స్ వృద్ది అంతంతే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత ఫార్మాస్యూటికల్స్ మార్కెట్ 2023 జనవరిలో 2.3 శాతం వృద్ధి చెందింది. 2022 జూన్ నుంచి పోల్చితే ఇదే అత్యల్పం కావడం గమనార్హం. గతేడాది గరిష్ట అమ్మకాలు నమోదు కావడం, కాలానుగుణ ప్రభావం ఇందుకు కారణమని ఇండియా రేటింగ్స్, రిసర్చ్ తెలిపింది. ఇప్పటికే ఉన్న ఉత్పత్తులపై తీసుకున్న ధరల పెంపు గత నెలలో మొత్తం మార్కెట్ పనితీరుకు కీలకంగా ఉంది. అయితే పరిమాణాలు క్షీణించాయని వివరించింది. ఆల్ ఇండియన్ ఒరిజిన్ కెమిస్ట్స్, డిస్ట్రిబ్యూటర్స్ ప్రకారం 2022 జనవరిలో పరిశ్రమ 14.1 శాతం, డిసెంబర్లో 10.4 శాతం దూసుకెళ్లింది. గతేడాది ధరలు 5.8 శాతం పెరిగితే, జనవరిలో ఇది 5.9 శాతంగా ఉంది. కొత్త ఉత్పత్తుల రాక 1.8 శాతం పెరిగింది. 2022లో ఇది 2.8 శాతం. పరిమాణం 5.5 నుంచి 5.4 శాతానికి క్షీణించింది. భారత ఫార్మాస్యూటికల్స్ మార్కెట్ 2021లో 14.9 శాతం, 2022లో 8 శాతం దూసుకెళ్లింది. 2023–24లో పరిశ్రమ 8–10 శాతం వృద్ధికి ఆస్కారం ఉంది. 2023 జనవరిలో డెర్మటాలాజికల్, గైనకాలాజికల్ విభాగం ఔషధాల అమ్మకాలు వరుసగా 11, 10 శాతం పెరిగాయి. విటమిన్స్ విక్రయాలు అతి తక్కువగా 0.3 శాతం అధికం అయ్యాయి. -
హెటిరో నుంచి కోవిడ్ -19 డ్రగ్.. డబ్ల్యూహెచ్ఓ ఆమోద ముద్ర
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మా దిగ్గజం హెటిరోకి చెందిన ’నిర్మాకామ్’ (నిర్మాట్రెల్విర్) నాణ్యతా ప్రమాణాలకు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రీక్వాలిఫికేషన్ (డబ్ల్యూహెచ్‌వో పీక్యూ) ఆమోదముద్ర లభించింది. ఈ ఔషధాన్ని మరింత మందికి అందుబాటులోకి తెచ్చే దిశగా ఇది కీలక మైలురాయని కంపెనీ ఎండీ వంశీ కృష్ణ బండి తెలిపారు. భారత్‌తో పాటు 95 అల్పాదాయ, మధ్య స్థాయి ఆదాయ దేశాల్లో నిర్మాకామ్ను మరింత వేగంగా, చౌకగా అందుబాటులోకి తెచ్చేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. కోవిడ్–19 చికిత్సలో ఉపయోగించే ఫైజర్ ఔషధం ప్యాక్స్‌లోవిడ్‌కు ఇది జనరిక్ వెర్షన్. నిర్మాట్రెల్విర్ 150 మి.గ్రా.(2 ట్యాబ్లెట్లు), రిటోనావిర్ 100 మి.గ్రా.(1 ట్యాబ్లెట్) అనే 2 యాంటీవైరల్ ఔషధాలు ఈ ప్యాక్‌లో ఉంటాయి. దీని తయారీ, విక్రయానికి సంబంధించి మెడిసిన్స్ పేటెంట్ పూల్ (ఎంపీపీ) నుంచి స్వచ్ఛంద లైసెన్సింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు హెటెరో తెలిపింది. ఈ లైసె న్స్ కింద జనరిక్ వెర్షన్‌ను రూపొందించిన తొలి సంస్థ హెటిరో కావడం ప్రశంసనీయమని ఎంపీపీ ఈడీ చార్లెస్ గోర్ తెలిపారు. దేశీయంగా అత్యవసర వినియోగం కోసం డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) నుంచి ఇప్పటికే అనుమతులు పొందినట్లు వివరించింది. -
యాడ్వెంట్ చేతికి సువెన్ ఫార్మా
ముంబై: దేశీ హెల్త్‌కేర్ కంపెనీ సువెన్ ఫార్మాస్యూటికల్స్‌లో మెజారిటీ వాటాను గ్లోబల్ పీఈ దిగ్గజం యాడ్వెంట్ ఇంటర్నేషనల్ సొంతం చేసుకోనుంది. ప్రమోటర్లు జాస్తి కుటుంబం నుంచి 50.1 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు యాడ్వెంట్ అధికారికంగా ప్రకటించింది. ప్రమోటర్ల నుంచి 12.75 కోట్ల షేర్లను కొనుగోలు చేసేందుకు యాడ్వెంట్ రూ. 6,313 కోట్లు వెచ్చించనున్నట్లు సువెన్ బీఎస్ఈకి తెలియజేసింది. దీనిలో భాగంగా సువెన్ వాటాదారులకు యాడ్వెంట్ ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించనున్నట్లు పేర్కొంది. షేరుకి రూ. 495 ధరలో పబ్లిక్ నుంచి 26 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించింది. వెరసి పబ్లిక్ నుంచి 6,61,86,889 షేర్ల కోసం యాడ్వెంట్ రూ. 3,276 కోట్లకుపైగా ఇన్వెస్ట్ చేయనుంది. ప్రస్తుతం సువెన్‌లో జాస్తి కుటుంబీకులకు మొత్తం 60 శాతం వాటా ఉంది. తాజా డీల్‌తో ఈ వాటా 9.9 శాతానికి పరిమితంకానుంది. విలీనానికి ఆసక్తి పోర్ట్‌ఫోలియో కంపెనీ కోహేన్స్‌ను సువెన్‌లో విలీనం చేసేందుకున్న అవకాశాలను అన్వేషించనున్నట్లు యాడ్వెంట్ పేర్కొంది. తద్వారా విలీనం సంస్థ ఎండ్ టు ఎండ్ కాంట్రాక్ట్ డెవలప్మెంట్, తయారీ దిగ్గజంగా ఆవిర్భవించనున్నట్లు తెలియజేసింది. వీటితోపాటు ఏఐపీ తయారీని సైతం కలిగి ఉన్న కంపెనీ ఫార్మా, స్పెషాలిటీ కెమికల్ మార్కెట్లలో సర్వీసులందించనున్నట్లు వివరించింది. ఐదారు నెలల్లో డీల్ పూర్తయ్యే వీలున్నట్లు సువెన్ ఫార్మా ఎండీ జాస్తి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. వ్యూహాత్మక అవకాశాలు, వాటాదారులకు లబ్ధి చేకూర్చడం వంటి అంశాల ఆధారంగా విలీన అంశాన్ని బోర్డు చేపట్టనున్నట్లు తెలియజేశారు. షేర్ల మార్పిడి తదితరాలపై కసరత్తు జరుగుతున్నట్లు చెప్పారు. కాగా.. మిగిలిన 9.9% ప్రమోటర్ల వాటాను 18 నెలలపాటు విక్రయించకుండా లాకిన్ పిరియడ్ వర్తిస్తుందని జాస్తి చెప్పారు. వాటాదారులతోపాటు ఈ వాటాకు తగిన విలువ చేకూరే వరకూ విక్రయించే యోచన లేదని స్పష్టం చేశారు. 2020లో విభజన.. మాతృ సంస్థ సువెన్ లైఫ్ సైన్సెస్ నుంచి 2020లో సువెన్ ఫార్మాస్యూటికల్స్ విడివడింది. గత నాలుగేళ్లలో ఆదాయం 20 శాతం స్థాయిలో వృద్ధి చూపింది. 43 శాతానికి మించిన నిర్వహణ లాభ మార్జిన్లు సాధిస్తోంది. ఇక 2021–22లో కోహేన్స్ రూ. 1,280 కోట్ల టర్నోవర్ అందుకుంది. 2007 నుంచీ దేశీయంగా దృష్టి పెట్టిన యాడ్వెంట్ విభిన్న రంగాలకు చెందిన 14 కంపెనీలలో 3.2 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. ఈ వార్తల నేపథ్యంలో సువెన్ ఫార్మా షేరు దాదాపు 5% పతనమై రూ. 473 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 520–470 మధ్య ఊగిసలాడింది. ముఖ్య సలహాదారుగా.. డీల్ పూర్తయ్యాక కంపెనీ ఎండీ పదవి నుంచి తప్పుకోనున్నట్లు జాస్తి తెలియజేశారు. అయితే ప్రధాన సలహాదారుగా కన్సల్టెన్సీ సర్వీసులను అందించనున్నట్లు వెల్లడించారు. హెల్త్‌కేర్‌లో లోతైన నైపుణ్యం, అంతర్జాతీయంగా వృత్తి నిపుణులుగల యాడ్వెంట్ తమకు అనుగుణమైన కీలక భాగస్వామిగా పేర్కొన్నారు. తద్వారా సువెన్ తదుపరి దశ వృద్ధిలోకి ప్రవేశిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కోహెన్స్‌తో విలీనం ద్వారా విభిన్న సర్వీసులు సమకూర్చగలుగుతామని, ఇది రెండు సంస్థలకూ లబ్ధిని చేకూర్చుతుందని వివరించారు. సువెన్ కొనుగోలు ద్వారా బిలియన్ డాలర్ల(సుమారు రూ. 8,600 కోట్లు) విలువైన గ్లోబల్ కంపెనీకి తెరతీసే వీలున్నట్లు యాడ్వెంట్ ఎండీ పంకజ్ పట్వారీ పేర్కొన్నారు. సువెన్ సామర్థ్యాలను వినియోగించుకోవడం ద్వారా సీడీఎంవో విభాగంలోని గ్లోబల్ కంపెనీలలో ఒకటిగా తీర్చిదిద్దనున్నట్లు తెలియజేశారు. -
ఫార్మాకు ఎగుమతి ప్రోత్సాహకాలు
న్యూఢిల్లీ: ఫార్మా తదితర ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించే దిశగా కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా పన్ను రీఫండ్ స్కీము ఆర్వోడీటీఈపీని రసాయనాలు, ఫార్మా, ఇనుము .. ఉక్కు ఉత్పత్తులకు కూడా నిర్దిష్ట కాలం పాటు వర్తింపచేయాలని నిర్ణయించింది. ఈ ఏడాది డిసెంబర్ 15 నుంచి వచ్చే ఏడాది సెప్టెంబర్ 30 వరకూ ఈ రంగాలకు ఆర్వోడీటీఈపీ వర్తిస్తుంది. కొత్తగా చేర్చినవి కూడా కలిపితే పన్ను రీఫండ్ ప్రయోజనాలు దక్కే ఎగుమతి ఐటమ్‌ల సంఖ్య 8,731 నుంచి 10,342కి చేరుతుంది. స్కీమును విస్తరించడం వల్ల రూ. 1,000 కోట్ల మేర ఆర్థిక భారం ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. అక్టోబర్‌లో ఎగుమతుల వృద్ధి 16.65 శాతం మేర మందగించిన నేపథ్యంలో కేంద్రం నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. -
అమ్మకానికి సువెన్ ఫార్మా!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కంపెనీ అమ్మకం లేదా మెజారిటీ వాటా విక్రయానికి సువెన్ ఫార్మాస్యూటికల్స్ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. మెజారిటీ వాటా అమ్మకం విషయమై సలహా కోసం ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్‌ను నియమించు కున్నట్టు తెలుస్తోంది. కంపెనీని విక్రయించేందుకు ప్రైవేట్ ఈక్విటీ, వ్యూహాత్మక సంస్థలతో చర్చలు జరుగుతున్నాయి. సువెన్ ఫార్మాస్యూటికల్స్‌లో ప్రమోటర్లకు 60 శాతం వాటా ఉంది. డీల్ ద్వారా వచ్చే మొత్తాన్ని సువెన్ లైఫ్ సైన్సెస్‌లో ఔషధాల అభివృద్ధికి ఖర్చు చేయనున్నారు. ఇప్పటి వరకు సువెన్ ఫార్మా నుంచి డివిడెండ్ రూపంలో సమకూరిన మొత్తాన్ని ప్రమోటర్లు ఇందుకోసం వ్యయం చేశారు. సువెన్ లైఫ్ నుంచి 2020లో సువెన్ ఫార్మా విడిపోయింది. క్రితం ముగింపుతో పోలిస్తే సువెన్ ఫార్మాస్యూటికల్స్ షేరు ధర బీఎస్ఈలో బుధవారం 1.52 శాతం ఎగసి రూ.491.10 వద్ద స్థిరపడింది. -
‘స్టాన్ఫోర్డ్’ టాప్ సైంటిస్టుల జాబితాలో భారతీయుడికి చోటు
ఉమ్మడి వరంగల్‌కి చెందిన ప్రముఖ సైంటిస్ట్ డాక్టర్ సాంబారెడ్డికి అరుదైన గౌరవం లభించింది. అమెరికాకు చెందిన ప్రఖ్యాత స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ తాజాగా ప్రకటించిన ప్రకటించిన టాప్ సైంటిస్టుల జాబితాలో ఆయనకు చోటు దక్కింది. ప్రస్తుతం ఆయన టెక్సాస్‌లోని ఏ ఏండ్ ఎం యూనివర్సిటీ కాలేజ్ ఆప్ మెడిసన్‌లో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. ఇప్పటికే ఆయన ప్రొలిఫిక్ మెడికల్ ఇన్వెంటర్, ఫార్మా రీసెర్చర్‌గా గుర్తింపు పొందారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పరకాల మండలం చర్లపల్లిలో డాక్టర్ దూదిపాల సాంబారెడ్డి జన్మించారు. ఆ తర్వాత కాకతీయ వర్సిటీలో ఫార్మాసీ విద్యాను పూర్తి చేసి ఉన్నత విద్యకోసం అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఫార్మా రంగంలో ఆనేక ఆవిష్కరణలను ఆయన చేశారు. న్యూరోథెరాప్యూటిక్స్‌లో ఆయన గ్లోబల్ లీడర్‌గా ఉన్నారు. ఇప్పటి వరకు 215 సైంటిఫిక్ పేపర్లను ప్రచురించగా 100 మందికి పైగా స్కాలర్లకు గైడ్‌గా వ్యవహరించారు. అంతేకాదు 400ల వరకు ప్రెజెంటేషన్లకు ఆయన సహాకారం అందించారు. న్యూరోథెరాప్యూటిక్స్‌లో విభాగంలో విశేష కృషి చేసిన డాక్టర్ సాంబారెడ్డి బ్రెయిన్ డిసార్డర్లకు న్యూరో స్టెరాయిడ్ థెరపీని అభివృద్ధి చేశారు. మెదడు సంబంధిత వ్యాధులకు సంబంధించిన చికిత్సను మెరుగుపరచడంలో ఈ న్యూరో స్టెరాయిడ్ థెరపీ ఎంతగానో ఉపకరించింది. పోస్టపార్టమ్ డిప్రెషన్‌కి సంబంధించి డాక్టర్ సాంబారెడ్డి అభివృద్ధి చేసిన బ్రెక్సానోలెన్ ఔషధం అమెరికా తరఫున ఎఫ్‌డీఏ అనుమతి పొందిన తొలి మెడిసిన్‌గా గుర్తింపు పొందింది. అదే విధంగా ఎపిలెప్పీకి సంబంధించి గానాక్సోలోన్ కూడా ఉంది. న్యూరో సంబంధిత విభాగంలో చేసిన కృషికి గాను డాక్టర్ సాంబారెడ్డికి అనేక అవార్డులు వరించాయి. చదవండి: అటార్నీగా భారత సంతతి మహిళ.. నామినేట్ చేసిన బైడెన్ -
‘ఫార్మా’లిటీస్ కోసం పాట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఫార్మసీ కాలేజీల్లో హడావుడి మొదలైంది. ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) గురువారం నుంచి తనిఖీలు ప్రారంభించనుండటంతో కాలేజీ యాజ మాన్యాలు నానా హైరానా పడుతున్నాయి. పీసీఐ నిబంధనలకు అనుగుణంగా ఫ్యాకల్టీ, మౌలిక వసతులు ఉన్నాయని చూపించేందుకు రకరకాల మార్గాలను అనుసరిస్తున్నాయి. దీనికోసం రికార్డులను కూడా తారుమారు చేసే ప్రయత్నం చేస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. పీసీఐ సిబ్బంది ప్రతి కాలేజీనీ పరిశీలించి వాస్తవ పరిస్థితిపై నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. దీని ఆధారంగానే కాలేజీలకు గుర్తింపు ఇస్తుంటారు. గత రెండేళ్లు కరోనా వల్ల పెద్దగా తనిఖీలు జరగలేదు. ఈసారి ప్రత్యక్ష తనిఖీలను పకడ్బందీగా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు కాలేజీలకు అధికారికంగా ఆదేశాలు కూడా జారీ చేశారు. అద్దె లేబొరేటరీలు చాలా ఫార్మసీ కాలేజీల్లో ఇప్పటికీ పీసీఐ నిబంధనల ప్రకారం లేబొరేటరీలు లేవనే ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో లేబొరేటరీల తనిఖీపై పీసీఐ ప్రధానంగా దృష్టి పెట్టింది. దీంతో ఇప్పటికప్పుడు కెమికల్ లేబొరేటరీలను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. లేబొరేటరీలు ఉన్న కాలేజీలతో మాట్లాడుకొని, తనిఖీ సమయంలో వాటిని తీసుకొచ్చి కాలేజీలో అమర్చుకుని తర్వాత తిరిగిచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. కొన్ని యాజమాన్యాలకు ఒక టి కన్నా ఎక్కువ కాలేజీలున్నాయి. వీళ్లు ఏదో ఒక కాలేజీలోనే లేబొరేటరీని కలిగి ఉన్నారు. ఇలాంటి వాళ్లు తనిఖీ సమయంలో మాయ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫ్యాకల్టీ కోసం పాట్లు చాలా కాలేజీల్లో సబ్జెక్టులో నిష్ణాతులైన అధ్యాపకులను నియమించట్లేదని ఆరోపణలున్నాయి. రికార్డుల్లో పీజీ, పీహెచ్డీ చేసిన అధ్యాపకులు అని పేర్కొంటున్నా విద్యార్థులకు బోధించే అధ్యాపకులు మాత్రం తక్కువ విద్యార్హతలు ఉన్నవాళ్లు ఉంటున్నారని విమర్శలున్నాయి. కాలేజీలో ఎవరు పనిచేస్తున్నారు, వారి అర్హతలేంటో పీసీఐ తనిఖీ చేయాల్సి ఉంది. దీని కోసం అన్ని రికార్డులు, ఫ్యాకల్టీ అందుబాటులో ఉండా లని తెలియజేసింది. దీంతో కాలేజీల యాజమాన్యాలు రికార్డుల్లో పేర్కొన్న వ్యక్తులను తనిఖీ సమయంలో రావాలని చెప్పినట్టు తెలిసింది. దీని కోసం కొంత ముట్టజెప్పేందుకు ఒప్పందమూ చేసుకున్నాయని సమాచారం. ఫ్యాకల్టీ పాన్ కార్డు ఆధారంగా వాళ్లు ఇంకెక్కడైనా ఉపాధి పొందుతున్నారా అని వివరాలు సేకరిస్తే కాలేజీల అసలు బాగోతం బయటపడుతుందని నిపుణులు చెబుతున్నారు. నిబంధనల అమలేదీ? ఫార్మా కాలేజీలు నిలువు దోపిడీ చేస్తున్నాయి. పీసీఐ నిబంధనలు ఎక్కడా అమలు కావట్లేదు. వేతన సంఘం జీతాలు కాదు కదా కనీసం రూ. 20 వేలు ఇచ్చే అవకాశం లేదు. కరోనా సమయంలో ఉద్యోగుల జీతాలు ఇప్పటికీ ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారు. అలాంటప్పుడు డిజిటల్ చెల్లింపులు ఎలా చూపిస్తారు. చిత్తశుద్ధితో తనిఖీలు చేస్తే అవకతవకలు వెలుగు చూస్తాయి. – అయినేని సంతోష్‌కుమార్, ప్రైవేటు సాంకేతిక కాలేజీల అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు -
లైఫ్‌సైన్సెస్ రాజధానిగా హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: కరోనా సంక్షోభం నేపథ్యంలో లైఫ్‌సైన్సెస్ (జీవశాస్త్ర) రంగానికి ప్రాధాన్యత మరింత పెరిగిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. ఈ రంగంలో ప్రపంచ స్థాయి పోటీని తట్టుకుని నిలబడేందుకు భారత్‌లో విప్లవాత్మకమైన సంస్కరణలు అవసరమని అన్నా రు. భారత్‌లో ఈ రంగం పురోగతికి అవసరమైన విధానాలకు అంతగా మద్దతు లభించడం లేదని చెప్పారు. అదే సమయంలో లైఫ్‌సైన్సెస్ రంగానికి హైదరాబాద్ రాజధానిగా మారిందని తెలిపారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో భాగంగా లైఫ్‌సైన్సెస్ రంగానికి సంబంధించి.. ‘తెలంగాణ: ఆసియాలో పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణలకు కీలక స్థానం’అనే అంశంపై సోమవారం జరిగిన చర్చలో కేటీఆర్ పాల్గొన్నారు. ఐటీ, ఫార్మా రంగాలు కలిసి పనిచేయాలి తెలంగాణలో లైఫ్‌సైన్సెస్ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్ ‘హైదరాబాద్ ఫార్మా సిటీ’ఏర్పాటు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన మద్దతు లభించడం లేదని మంత్రి విమర్శించారు. కొత్త ఆవిష్కరణలకు ఊతమివ్వడం ద్వారానే ఈ రంగం అభివృద్ధి చెందుతుందన్నారు. భవిష్యత్తులో లైఫ్‌సైన్సెస్ రంగంలో కొత్త ఆవిష్కరణలు ప్రయోగశాలను దాటి డిజిటల్ డ్రగ్ డిస్కవరీ (ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త ఔషధాల ఆవిష్కరణ) వైపు పయనిస్తాయని అన్నారు. ఈ నేపథ్యంలో ఐటీ, ఫార్మా రంగాలు కలిసి పనిచేయాల్సిన అవసరముందని సూచించారు. సులభతర విధానాలు అవసరం భారత్‌లో పరిశోధన, అభివృద్ధి రంగాల్లో విదేశీ పెట్టుబడులకు వీలుగా సులభతర విధానాలు అవసరమని, ఈ విషయంలో కేంద్రం చొరవ తీసుకోవాలని కేటీఆర్ అన్నారు. వచ్చే దశాబ్దం పాటు భారత్ లైఫ్‌సైన్సెస్ రంగం అభివృద్ధి పథంలో నడిచే అవకాశముందని, ఔషధ తయారీ సంస్థలు ప్రస్తుతమున్న మందుల తయారీకే పరిమితం కాకుండా, కొత్త మందులను తయారు చేసే దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. భారత్‌లో నైపుణ్యానికి కొదవలేదని, లైఫ్‌సైన్సెస్ రంగంలో పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణలకు ప్రాధాన్యతనిస్తూ భారీగా పెట్టుబడులు పెట్టాల్సిన అవసరముందని అన్నారు. తెలంగాణలో లైఫ్‌సైన్సెస్ రంగంలోని ఔత్సాహిక పరిశోధకులకు సహకారం అందించేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో ఉన్న ప్రముఖ సంస్థలతో కలిసి పనిచేస్తోందని తెలిపారు. ఈ చర్చాగోష్టిలో కేటీఆర్‌తో పాటు డాక్టర్ రెడ్డీస్ సంస్థకు చెందిన జీవీ ప్రసాద్‌రెడ్డి, పీడబ్ల్యూసీకి చెందిన మహమ్మద్ అథర్ పాల్గొన్నారు. -
హైదరాబాద్‌లో ఏరో, ఫార్మా వర్సిటీలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏరోనాటికల్, ఫార్మా విశ్వవిద్యాలయాలు రాబోతున్నాయి. వీలైనంత త్వరగా హైదరాబాద్‌లో వీటిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. వర్సిటీల ఏర్పాటుకు సంబంధించి సమగ్ర వివరాలతో నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రిని ఇటీవల ప్రభుత్వం ఆదేశించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. సీఎం కేసీఆర్ స్వయంగా ఈ ప్రతిపాదనను తెరమీదకు తెచ్చినట్టు ఉన్నత విద్య వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో దాదాపు 185 ఫార్మా కాలేజీలుండగా, ఇవి కేవలం బోధనకే పరిమితమవుతున్నాయి. అదీగాక, దేశంలో ఔషధ తయారీలో పరిశోధన చేసే వారి సంఖ్య కూడా తక్కువగా ఉందని ప్రభుత్వం భావిస్తోంది. కరోనా సమయంలో హైదరాబాద్ టీకా తయారీలో కీలక భూమిక పోషించింది. ఇక్కడే వ్యాక్సిన్ తయారవ్వడం, అనేక కీలక పరిశోధనలకు భాగ్యనగరం వేదికగా నిలవడాన్ని కేసీఆర్ ప్రస్తావించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో పరిశోధనకు ప్రత్యేకంగా వర్సిటీ ఉండాలన్నది కేసీఆర్ మనోభీష్టంగా అధికారులు భావిస్తున్నారు. యూనివర్సిటీ ఏర్పాటైతే పరిశోధకులను భారత్‌కు అందించడంతోపాటు, తెలంగాణ దేశంలోనే నంబర్ వన్‌గా ఉంటుందని సీఎం అన్నట్టు తెలిసింది. సరికొత్త అన్వేషణలు: ఏరోనాటికల్ విభాగంలో భారత్‌లో తెలంగాణ మూడో స్థానంలో ఉంది. భవిష్యత్‌లో ఈ సెక్టార్లో మరిన్ని ఆవిష్కరణలకు ఆస్కారం ఉందనే సంకేతాలు వెలువడుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రపంచవ్యాప్తంగా ఏరోనాటికల్ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా పరిశోధనలను పెంచాలని ముఖ్యమంత్రి ఉద్బోధించినట్టు ఉన్నత విద్యామండలి అధికారులు చెబుతున్నారు. ఏరో, ఫార్మా రంగాలకు సంబంధించిన యూనివర్సిటీల ఏర్పాటుకు కావల్సిన మౌలిక వసతులు, తక్షణమే చేపట్టాల్సిన చర్యలపై సమగ్ర నివేదిక రూపొందించే పనిలో అధికారులున్నారు. ఇది పూర్తయిన తర్వాత నేరుగా ముఖ్యమంత్రితో అధికారులు భేటీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. మంచి పరిణామమే ఫార్మా, ఏరోనాటికల్ విశ్వవిద్యాలయాల ఏర్పాటుపై సీఎం కేసీఆర్ ఆసక్తిగా ఉన్నారు. ఇందుకు సంబంధించిన నివేదిక కూడా కోరారు. ఇవి రూపుదాలిస్తే తెలంగాణ మంచి పరిశోధన కేంద్రంగా గుర్తింపు పొందడమే కాకుండా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. వీలైనంత త్వరగా దీనిపై సమగ్ర వివరాలు సేకరించి నివేదిక రూపొందిస్తాం. ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి,ఉన్నత విద్యామండలి చైర్మన్ -
‘పాజిటివ్’లను పట్టేస్తున్న ఫార్మా యాప్!
కరోనా నియంత్రణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కోవిడ్–19 ఫార్మసీ యాప్ సత్ఫలితాలనిచ్చింది. 2020లో తొలి దశ వైరస్ వ్యాప్తి సమయంలో వైద్య, ఆరోగ్య శాఖ ఈ యాప్‌ను ప్రారంభించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఇది 4,534 పాజిటివ్ కేసులను పసిగట్టింది. సాక్షి, అమరావతి: కరోనా వ్యాప్తి ప్రారంభంలో కొందరు అనుమానిత లక్షణాలున్నా పరీక్షలు చేయించుకోకుండా మెడికల్ షాపుల్లో మందులు కొని సొంత వైద్యం చేసుకునే వారు. దీంతో ఇతర కుటుంబ సభ్యులకు వైరస్ వ్యాప్తి చెందడంతో పాటు, సరైన సమయంలో వైద్యం అందక ప్రాణాల మీదికొచ్చేది. ఇలాంటి పరిస్థితులకు చెక్ పెట్టడం కోసం ప్రభుత్వం ఫార్మా యాప్‌ను ప్రవేశపెట్టింది. జలుబు, దగ్గు, జ్వరం, గొంతునొప్పి వంటి కరోనా అనుమానిత సమస్యలకు మందులు కొనుగోలు చేస్తున్న వారి వివరాలు.. పేరు, చిరునామా, ఫోన్ నంబర్ వంటివి యాప్‌లో నమోదు చేయాలని మెడికల్ షాపులకు ఔషధ నియంత్రణ శాఖ ఆదేశాలిచ్చింది. ఇలా నమోదు చేసిన సమాచారం ఆధారంగా స్థానిక వలంటీర్, ఏఎన్ఎం, ఆశావర్కర్‌తో పాటు ఇతర సిబ్బంది స్వయంగా వారి ఇళ్లకు వెళ్లి పరిశీలిస్తారు. సాధారణ సమస్యగా భావిస్తే తగిన జాగ్రత్తలు సూచిస్తారు. కరోనాగా అనుమానం వస్తే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారమిచ్చి పరీక్షలు చేయిస్తారు. మొత్తం 10.94 లక్షల పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా 12,391 మెడికల్ షాపులు ఫార్మా యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నాయి. గడిచిన వారం రోజుల్లో కరోనా అనుమానిత లక్షణాలకు మందులు కొనుగోలు చేసిన 47,666 మంది వివరాలను రాష్ట్ర వ్యాప్తంగా యాప్‌లో నమోదు చేశారు. ఇలా తొలి దశ నుంచి ఇప్పటి వరకూ 19,83,767 మంది వివరాలను నమోదు చేశారు. ఆ వివరాల ఆధారంగా ఫోన్లో మాట్లాడటం, నేరుగా ఇళ్లకు వెళ్లి పరిశీలించడం ద్వారా అందరి ఆరోగ్య పరిస్థితిపై ఆరోగ్య సిబ్బంది ఆరా తీశారు. 10,94,942 మందికి వైద్య పరీక్షలు అవసరమని గుర్తించి, నమూనాలు సేకరించి పరీక్షలు చేయగా, 4,534 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రెగ్నెన్సీ కిట్ల తరహాలో ఇంట్లోనే కరోనా నిర్ధారణ చేసుకునే కిట్లు మార్కెట్లోకొచ్చాయి. ఈ నేపథ్యంలో కరోనా అనుమానిత లక్షణాలున్న వారు రాష్ట్ర వ్యాప్తంగా 35,174 కిట్లను కొనుగోలు చేశారు. వీరి వివరాలను ఫార్మా యాప్‌లో నమోదు చేయడంతో ఆరోగ్య సిబ్బంది వారి ఆరోగ్యంపై వాకబు చేశారు. కృష్ణా జిల్లాలో అత్యధికంగా 4,791, అనంతపురంలో 4,216, విశాఖపట్నంలో 4,133 మంది కిట్లు కొనుగోలు చేశారు. -
కొత్త ఏడాదిలో అతిపెద్ద నష్టం
ముంబై: ట్రేడింగ్ ఆద్యంతం లాభనష్టాల మధ్య ఊగిసలాడిన స్టాక్ సూచీలు చివరి గంటలో లాభాల స్వీకరణతో మంగళవారం భారీ నష్టాలను చవిచూశాయి. అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో సూచీలు ఈ కొత్త ఏడాది(2022)లో అతిపెద్ద నష్టాన్ని నమోదు చేశాయి. సెన్సెక్స్ 554 పాయింట్లు పతనమై 60,755 వద్ద నిలిచింది. నిఫ్టీ 195 పాయింట్లు క్షీణించి 18,113 వద్ద స్థిరపడింది. ఆటో, ఐటీ, టెలికాం, కన్జూమర్, మెటల్, రియల్టీ రంగాల చిన్న, మధ్య తరహా షేర్లు అత్యధికంగా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఫలితంగా బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు వరుసగా రెండున్నర శాతం, రెండు శాతం క్షీణించాయి. సెన్సెక్స్ సూచీలోని 30 షేర్లకు గానూ 23 షేర్లు నష్టపోయాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ 33 పైసలు క్షీణించి 74.58 వద్ద స్థిరపడింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1255 కోట్ల షేర్లను దేశీయ ఇన్వెస్టర్లు రూ.220 కోట్ల షేర్లను అమ్మేశారు. ఆసియా, యూరప్ దేశాల స్టాక్ సూచీలు ఒకటి నుంచి ఒకటిన్నర శాతం పతనమయ్యాయి. అమెరికా ఫ్యూచర్లు సైతం అరశాతం నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. నష్టాలు ఎందుకంటే..? అరబ్ దేశాల్లో అల్లర్లు చెలరేగడంతో సరఫరా ఆందోళనలు తెరపైకి వచ్చి అంతర్జాతీయంగా బ్యారెల్ క్రూడాయిల్ ధర ఏడేళ్ల గరిష్ట స్థాయి 87 డాలర్లను తాకింది. ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్లను పెంచేందుకు సిద్ధమైన నేపథ్యంలో ట్రెజరీ బాండ్లపై రాబడులు పెరుగుతున్నాయి. విదేశీ ఇన్వెస్టర్లతో పాటు గత రెండు ట్రేడింగ్ సెషన్ల నుంచి దేశీయ ఇన్వెస్టర్లు అమ్మకాలకు పాల్పడ్డారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆకస్మిక సమావేశానికి ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ వరుసగా మూడోరోజూ 33 పైసలు క్షీణించింది. ఈ పరిణామాలు దేశీయ ఈక్విటీ మార్కెట్లో అమ్మకాలను ప్రేరేపించాయి. రూ.3.71 లక్షల కోట్లు ఆవిరి స్టాక్ సూచీల భారీ నష్టంతో ఇన్వెస్టర్లు మంగళవారం ఒక్కరోజే రూ. 3.71 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. తద్వారా బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ (విలువ) రూ.276.30 లక్షల కోట్లకు చేరింది. మార్కెట్లో మరిన్ని సంగతులు ♦డిసెంబర్ క్వార్టర్లో రెండింతల బుకింగ్స్‌ను సాధించినట్లు ప్రకటించడంతో ప్రెస్టేజ్ ఎస్టేట్స్ షేరు బీఎస్ఈలో మూడు శాతం లాభంతో రూ. 530 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఎనిమిది శాతం బలపడి ఏడాది గరిష్ట స్థాయి రూ.555 వద్ద స్థిరపడింది. ♦టెలికాం గేర్ మేకర్ హెచ్ఎఫ్సీఎల్ షేరు ఏడు శాతం క్షీణించి రూ.89 వద్ద ముగిసింది. మూడో క్వార్టర్లో ఆదాయం ఏడు శాతం క్షీణించడం షేరు పతనానికి కారణమైంది. ♦స్టాక్ మార్కెట్లో అనిశ్చితిని సూచించే వీఐఎక్స్ ఇండెక్స్ ఆరుశాతం ఎగసి 17.78 స్థాయికి చేరుకుంది. -
ఫిబ్రవరి 11–13 తేదీల్లో క్రెడాయ్ ప్రాపర్టీ షో
సాక్షి, హైదరాబాద్: కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) ప్రాపర్టీ షో మరోసారి నగరవాసుల ముందుకు రానుంది. ఫిబ్రవరి 11 –13 తేదీల్లో హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో క్రెడాయ్ హైదరాబాద్ చాప్టర్ 11వ ఎడిషన్ స్థిరాస్తి ప్రదర్శన జరగనుంది. మూడు రోజుల ప్రదర్శన లేఅవుట్‌ను క్రెడాయ్ ప్రతినిధులు విడుదల చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ చాప్టర్ ప్రెసిడెంట్ పీ రామకృష్ణ రావు మాట్లాడుతూ.. ఐటీ, ఫార్మా హబ్‌గా పేరొందిన హైదరాబాద్‌లో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ), సేవల రంగాలలో స్థిరమైన ఉపాధి కారణంగా ఆదాయంలో వృద్ధి నమోదవుతుందని తెలిపారు. దీంతో యువతరంలో ఆకాంక్షలు పెరుగుతున్నాయని ఇది రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు దోహదమవుతుందని పేర్కొన్నారు. రియల్టీ రంగంలో పెట్టుబడులు పెట్టే కొనుగోలుదారుల సగటు వయస్సు 35 ఏళ్లుగా ఉంటుందని చెప్పారు. గత కొన్ని దశాబ్దాలలో 50 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న కొనుగోలుదారుల జనాభా తక్కువగా ఉందని వివరించారు. కరోనా తర్వాతి నుంచి హైబ్రిడ్ పని విధానంతో అపార్ట్మెంట్ సైజ్లు క్రమంగా పెరుగుతున్నాయని చెప్పారు. టీఎస్ రెరా అనుమతి పొందిన ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌లు, అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాలు, హరిత భవనాల ప్రాజెక్ట్‌లు మాత్రమే ప్రదర్శనలో ఉంటాయని జనరల్ సెక్రటరీ వీ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. కరోనా నిబంధనలను పాటించే విధంగా ప్రదర్శనలో స్టాల్స్, ఎగ్జిబిషన్ లేఅవుట్‌ను రూపొందించామన్నారు. నిర్మాణ సంస్థలతో పాటూ మెటీరియల్ వెండర్లు, తయారీ కంపెనీలు, కన్సల్టెంట్లు, ఆర్థిక సంస్థలు కూడా ఈ ప్రదర్శనలో స్టాల్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్లు జి. ఆనంద్ రెడ్డి, కే రాజేశ్వర్, ఎన్ జైదీప్ రెడ్డి, బీ జగన్నాథ రావు, ట్రెజరర్ ఆదిత్యా గౌర, జాయింట్ సెక్రటరీలు కే రాంబాబు, శివరాజ్ ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు. -
Covid: యాంటీ వైరల్ ఔషధం మోల్నుపిరావిర్’.. ఒక్క మాత్ర రూ.63
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ చికిత్సకు అద్భుతమైన ఔషధంగా పేర్కొంటున్న ‘మోల్నుపిరావిర్’ను ప్రముఖ ఔషధ దిగ్గజ సంస్థ ఆప్టిమస్ ఫార్మా గురువారం మార్కెట్లోకి తీసుకొచ్చింది. బంజారాహిల్స్ హోటల్ పార్క్‌హయత్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంస్థ ఎండీ శ్రీనివాసరెడ్డి వివరాలు వెల్లడించారు. మోల్నుపిరావిర్ 3 దశల్లో క్లినికల్ ట్రయల్స్ ముగించుకుని, ఇటీవలే డీసీజీఐ అనుమతి పొందిందన్నారు. 5 రోజుల్లోనే వైరస్లోడును పూర్తిగా అదుపులోకి తెస్తుందన్నారు. మోల్ను పిరావిర్ టాబ్లెట్లను ఆవిష్కరిస్తున్న ఆప్టిమస్ ఫార్మా సీఎండీ డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఒక్కో ప్యాకెట్లో 5 స్ట్రిప్‌లు ఉంటాయని, వీటిలో 40 మా త్రలు ఉంటాయన్నారు. ఒక్కో మాత్ర 200 ఎంజీ డోసుతో తయారైందని వెల్లడించారు. ఈ మాత్ర రోజుకు రెండు చొప్పున తీసుకోవాలని తెలిపారు. ఒక్కోమాత్ర ఖరీదు రూ.63 ఉంటుందని తెలిపారు. ఈ మందులు పూర్తిగా వైద్యుల పర్యవేక్షణలోనే వాడాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆప్టిమస్ ఫార్మా జీఎం శ్రీధర్, మేనేజర్ అంకూర్, డాక్టర్ ముఖర్జీ పాల్గొన్నారు. చదవండి: చాలా మంది అగ్ర సీఈవోల వేతనం ఒక డాలరే.. ఎందుకు? -
వైద్యశాస్త్రం విస్తుపోయేలా.. చనిపోయే కొడుకు కోసం..తండ్రే స్వయంగా మందు కనిపెట్టాడు!!
కుమ్మింగ్: తమ పిల్లలు అనారోగ్యం కారణంగా మరికొద్ది రోజుల్లో చనిపోతున్నారంటే తల్లిదండ్రులు ఎవరైన తట్టుకోగలరా. పైగా ఆ బిడ్డను రక్షించుకొనేందుకు తిరగని ఆసుపత్రి ఉండదు. అంతేకాదు ఖర్చుకు కూడా వెనకడుగు వేయరు. అయితే తల్లిదండ్రులు పిల్లల్ని కాపాడుకోవటం కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారని అందరకీ తెలుసు. కానీ ఇక్కడొక తండ్రి తన బిడ్డకు వచ్చిన అరుదైన వ్యాధికి మందు లేకపోవడంతో తానే స్వయంగా మందు కనిపెట్టి తన బిడ్డను కాపాడుకోవాలని తాపత్రయపడతాడు. (చదవండి: బల్గేరియాలో దారుణం..బస్సు ప్రమాదంలో 48 మంది మృతి) అసలు విషయంలోకెళ్లితే... చైనాలోని జు వీ అనే వ్యక్తికి హయోయాంగ్ అనే రెండేళ్ల కొడుకు ఉన్నాడు. అతడు ‘మెంకేస్ సిండ్రోమ్’ అనే జన్యు పరమైన వ్యాధితో బాధపడుతున్నాడు. జు వీ కొడుకు హయోయాంగ్‌ని పరీక్షించిన వైద్యులు అతడు కొద్ది నెలల మాత్రమే బతుకుతాడు అని తెలిపారు. పైగా ఈ వ్యాధి నాడివ్యవస్థను ప్రభావితం చేయడంతో కదలలేని స్థితిలో మంచానికే పరిమితమౌతాడన్నారు. నిజం చెప్పాలంటే ఈ వ్యాధితో పోరాడే బాధితులు ఎలాంటి భావోద్వేగాన్ని తెలియజేయలేరు పైగా మూడు సంవత్సరాల వయసుకు మించి జీవించడమనేది అసాధ్యం అన్నారు వైద్యులు. అయితే చైనాలో ఈ అరుదైన వ్యాధికి ఇంతవరకు ఎలాంటి మందు కనిపెట్టలేదని ఆ పిల్లాడి తండ్రి జు వీ తెలుసుకుంటాడు. మరోవైపు ఈ కరోనా మహమ్మరీ కారణంగా చికిత్స నిమిత్తం దేశాలు దాటి వెళ్లడం అసాధ్యం. దీంతో ఆ పిల్లాడి తండ్రి జువీ తానే ఈ వ్యాధికి మందు కనిపెట్టాలని నిర్ణయించుకుటాడు. అనుకున్నదే తడువుగా కుమ్మింగ్‌లో ఉన్న తన అపార్ట్‌మెంట్‌ని ప్రయోగశాలగా మారుస్తాడు. అయితే జువీ కేవలం హైస్కూల్ చదువు మాత్రమే చదువుకున్నాడు. అంతేకాదు జు వీ తన కొడుకు అనారోగ్యానికి గురికాక మునుపు ఆన్లైన్ వ్యాపారం చేస్తుండేవాడు. ఎప్పుడైతే తన కొడుకు ఈ అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడని తెలుసుకున్నాడో అప్పటి నుంచి అతను పరిశోధనలతోనే గడుపుతుంటాడు. ఈ మేరకు జు వీ ఈ వ్యాధి నయం చేయలేనిదని కేవలం మందులతో ఈ వ్యాధి లక్షణాలను తగ్గించగలమనే విషయాన్ని తెలుసుకుంటాడు. అంతేకాదు ఫార్మాకి సంబంధించిన విషయాలను ఆంగ్లంలో ఉండటంతో వాటిని అనువాద సాఫ్టవేర్ సాయంతో విశ్లేషించడం మొదలుపెడతాడు. ఈ క్రమంలో ఈ వ్యాధి లక్షణాలను తగ్గించడంలో కాపర్ హిస్టాడిన్(రాగి) సహాయం చేయగలదని కనుగొంటాడు. కాపర్ క్లోరైడ్ డైహైడ్రేట్ను హిస్టిడిన్, సోడియం హైడ్రాక్సైడ్, నీరు కలిస్తే కాపర్ హిస్టాడిన్ని తయారువుతుందని తెలుసుకుంటాడు. అంతేకాదు ఈ మందు తయారు చేయడానికి ఒక ప్రత్యేక పరికరాన్ని కూడా ఏర్పాటు చేశాడు. అయితే జు వీ తన కొడుకు హయోయాంగ్ తాను స్వయంగా తయారు చేసిన మందును ఇవ్వడం ప్రారంబిస్తాడు. ఈ మేరకు జు వీ తన కొడుకుకి తను స్వయంగా తయారు చేసిన మందుతో చికిత్స చేయడం ప్రారంభించిన రెండు వారాల తర్వాత చేసిన రక్తపరీక్షల్లో రక్తం సాధారణ స్థాయిలో ఉన్నట్లు రసాయన శాస్రవేత్తలు గుర్తిస్తారు. అంతేకాదు పిల్లవాడు మాట్లాడలేడు కానీ తన తండ్రి ఆ పిల్లవాడి తల మీద చేయవేయంగానే చిరు నవ్వుతో తన భావోద్వేగాన్ని తెలియజేశాడని ఆ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఈ మెంకేస్ సిండ్రోమ్ బాలికల కంటే అబ్బాయిల్లోనే ఎక్కువగా ఉంటుందని పైగా ప్రపంచవ్యాప్తంగా సుమారు ప్రతి లక్ష మంది శిశువులలో ఒకరు ఈ వ్యాధి బారిన పడుతున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ మేరకు ఆ పిల్లాడి తండ్రి జు వీ మాట్లాడుతూ..."తాను తయారు చేసిన కాపర్ హిస్తాడిన్ మందుని మొదట కుందేళ్లపై ప్రయోగించాను. అవి బాగానే ఉన్నాయి కాబట్టి నా కొడుకుకి ఏం కాదు అని నిర్థారించుకున్నా. అంతేకాదు ఈ చికిత్స కోసం ఇతర తల్లిదండ్రులు నన్ను సంప్రదించారు కానీ నా కొడుకుకి మాత్రమే బాధ్యత వహించగలనని చెప్పాను. పైగా నా కొడుకుకి తాను ఏ చికిత్స చేసిన హెల్త్ అధికారులు జోక్య చేసుకోరు" అని కూడా చెబుతాడు. ఈ క్రమంలో ఫ్రాన్స్‌లోని టూర్స్ యూనివర్శిటి హాస్పిటల్‌లోని అరుదైన వ్యాధుల నిపుణుడు ప్రొఫెసర్ అన్నీక్ టౌటెన్ మాట్లాడుతూ... "ఒక వైద్యుడిగా జు కేసు గురించి విని "సిగ్గుపడుతున్నాను" . అభివృద్ధి చెందుతున్న దేశంగా అటువంటి కుటుంబాలకు మెరుగైన సహాయం చేయడానికి మన వైద్య వ్యవస్థను మెరుగుపరచగలం. అంతేకాదు ఆ పిల్లాడి తండ్రి జువీతో కలిసి మెంకేస్ సిండ్రోమ్ జన్యు చికిత్స పరిశోధనను ప్రారంభిస్తున్నాం" అని అన్నారు. (చదవండి: వెర్రి వేయి రకాలు.. కుక్కని బుక్ చేసేందుకు...మరీ అలా చేయాలా?) -
అమెరికాలో కాల్పులు.. తెలుగు వ్యక్తి దారుణ హత్య
న్యూయార్క్: అగ్రరాజ్యం అమెరికాలో దుండగుడి కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి మృత్యువాత పడ్డారు. తెలుగు వ్యక్తి శ్రీరంగ అర్వపల్లి(54) న్యూజెర్సీలోని ప్లెయిన్స్‌బోరోలో నివసిస్తున్నారు. 2014 నుంచి అరెక్స్ ల్యాబోరేటరీస్ ఫార్మా సంస్థ సీఈఓగా పని చేస్తున్నారు. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటలకు ఇంట్లో ఉన్న శ్రీరంగపై దుండగుడు కాల్పులు జరిపాడు. ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చి ఈ దురాగతానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. కాల్పులు జరిపిన వ్యక్తిని పెన్సిల్వేనియాలోని నారిస్‌టౌన్‌కు చెందిన జెకై రీడ్ జాన్(27)గా గుర్తించారు. చదవండి: (మెక్సికోలో భారతీయ సాఫ్ట్వేర్ ఇంజనీర్ దారుణ హత్య) శ్రీరంగ తన ఇంటి నుంచి 80 కిలోమీటర్ల దూరంలోని పార్క్స్ క్యాసినోలో మంగళవారం అర్ధరాత్రి తర్వాత 10,000 డాలర్లు గెలుచుకున్నారు. ఇదంతా అక్కడే ఉన్న రీడ్ జాన్ గమనించాడు. ఆ డబ్బు దోచుకోవడానికి శ్రీరంగను కారులో వెంటాడాడు. శ్రీరంగను అనుసరిస్తూ ఇంటిదాకా వచ్చాడు. ఇంట్లోకి రాగానే అతడిపై పిస్తోల్‌తో కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన శ్రీరంగ అక్కడికక్కడే కన్నుమూశారు. రీడ్ జాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫస్ట్ డిగ్రీ మర్డర్ కేసు నమోదు చేశారు. శ్రీరంగ అర్వపల్లికి స్థానికంగా మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
జండర్ న్యూట్రల్ వ్యాక్సిన్ వచ్చేసింది
న్యూఢిల్లీ: జండర్ న్యూట్రల్(ఆడా, మగా అందరూ తీసుకోదగిన) హెచ్‌పీవీ టీకా గార్డ్‌సిల్9ను ఎంఎస్డీ ఫార్మా దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. 9 వాలెంట్ హెచ్‌పీవీ వైరస్ టీకా హెచ్‌పీవీ టైప్స్ 6, 11,16, 18, 31, 33, 45, 52, 58 రకాలపై పనిచేస్తుందని తెలిపింది. హెచ్‌పీవీ కారణంగా వచ్చే పులిపర్లలాంటివాటి నిరోధంలో, ఈ వైరస్ల కారణంగా కలిగే క్యాన్సర్ల నిరోధంలో టీకా ఉపయుక్తంగా ఉంటుందని తెలిపింది. మగ(9–15 సంవత్సరాలు), ఆడ(9–26 సంవత్సరాలు)వారికి ఈ టీకాను ఇవ్వవచ్చని, గార్డ్‌సిల్9 విడుదల ఆరోగ్యవంతమైన భారత నిర్మాణంలో కీలక మలుపని కంపెనీ డైరెక్టర్ రెహాన్ ఖాన్ చెప్పారు. ఈ వైరస్లు ఆడవారికి, మగవారికి సోకుతాయి, అందువల్లనే జెండర్ న్యూట్రల్(ఎవరైనా తీసుకోగలిగేది) టీకా తెచ్చామన్నారు. పిల్లల్లో, వారి తల్లిదండ్రుల్లో ప్రివెంటివ్ కేర్ గురించి, హెచ్‌పీవీ దానివల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన పెంచేందుకు చర్యలు అవసరమన్నారు. (కరోనా దెబ్బ.. ఆయుషు తగ్గింది!) -
హైదరాబాద్‌లో ఐటీ బూమ్.. నూతన పాలసీతో జోష్
సాక్షి, హైదరాబాద్: హైటెక్‌సిటీగా పేరొందిన గ్రేటర్ హైదరాబాద్ నగరంలో కొలువుల కల్పనలో ఐటీ రంగం అగ్రభాగాన నిలిచింది. ఐటీ, బీపీఓ, కేపీఓ రంగాలకు కొంగు బంగారంగా నిలిచిన మహానగరం ఏటా ఫ్రెష్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు, నైపుణ్యం గల పట్టభద్రులకు నూతన కొలువులు సృష్టించడంలో ముందున్నట్లు.. టీంలీజ్ సంస్థ పలు మెట్రో నగరాలపై వివిధ రంగాలపై జరిపిన తాజా అధ్యయనంలో తేలింది. ► ప్రధానంగా ఐటీ, అనుంబంధరంగాల్లో సుమారు 31 శాతం ఉద్యోగాల కల్పన జరుగుతున్నట్లు అంచనా వేసింది. ► ఇక దేశంలో బల్క్‌డ్రగ్ క్యాపిటల్‌గా పేరొందిన మన నగరంలో రెండోస్థానంలో నిలిచిన ఫార్మారంగంలో సుమారు 25 శాతం కొలువుల సృష్టి జరుగుతోందట. ► ఇక మూడోస్థానంలో ఉన్న టెలీ కమ్యూనికేషన్స్రంగంలో 23 శాతం, తయారీ రంగం 21 శాతం ఉద్యోగాలు కల్పిస్తున్నాయని ఈ అధ్యయనం పేర్కొంది. బల్క్‌డ్రగ్ రంగంలోనూ... మహానగరాన్ని ఆనుకొని సుమారు వెయ్యికి పైగా బల్క్‌డ్రగ్, ఫార్మా, ఇంటర్మీడియెట్ కంపెనీలున్నాయి. ఇక్కడి నుంచి దేశ,విదేశాలకు ప్రాణాధార ఔషధాలు, వ్యాక్సీన్లు ఎగుమతి అవుతున్నాయి. ఏటా బిలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఈ రంగం ఆర్జిస్తోంది. నూతన ఔషధాలపై పరిశోధన, కొత్త మందుల సృష్టి,ఎగుమతుల విషయంలో ఖండాతరాల్లో గ్రేటర్ హైదరాబాద్ పేరు మార్మోగుతూనే ఉంది. ఈ రంగంలోనూ ఏటా సుమారు 25 శాతం నూతన ఉద్యోగాల సృష్టి జరుగుతోందని తాజా అధ్యయనం అంచనా వేయడం విశేషం. ప్రధానంగా సైన్స్ గ్రాడ్యుయేట్లతోపాటు పది,ఇంటర్ చదివిన వారికి హెల్పర్లు,నైపుణ్య కార్మికులకు ఈ రంగం భారీగా ఉపాధి కల్పిస్తుండడం విశేషం. నూతన పాలసీతో జోష్ రాష్ట్ర సర్కారు ఐటీ, హార్డ్‌వేర్ రంగాలను మరింత ప్రోత్సహించేందుకు ప్రవేశపెట్టిన నూతన ఐటీ పాలసీ రాకతో ఈ రంగాలు జెట్స్పీడ్తో దూసుకుపోనున్నాయి. రాబోయే ఐదేళ్లలో నూతనంగా మరో నాలుగు లక్షల కొలువుల సృష్టితో పాటు.. ఏటా ఐటీ ఎగుమతులు మూడు లక్షల కోట్ల మార్కును అధిగమించే అవకాశాలున్నట్లు ఐటీ రంగ నిపుణులు అంచనా వేస్తుండడం విశేషం. తాజాగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ 2021–26 మధ్య కాలానికి ప్రకటించిన నూతన పాలసీతో ఐటీ భూమ్ మరింత పెరిగే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో సుమారు 1500 వరకు ఉన్న చిన్న,పెద్ద, కార్పొరేట్ కంపెనీల్లో సుమారు 6.25 లక్షల మంది ఉపాధి పొందుతున్న విషయం విదితమే. గ్రేటర్ పరిధిలో 2014 నుంచి ఐటీ భూమ్ క్రమంగా పెరుగుతోంది. విశ్వవ్యాప్తంగా పేరొందిన దిగ్గజ ఐటీ, బీపీఓ, హార్డ్‌వేర్, కేపీఓ సంస్థలు వెల్లువలా సిటీకి తరలివస్తున్న విషయం విదితమే. (చదవండి: ఏటా మూడు లక్షల కోట్ల ఐటీ ఎగుమతులు.. 10 లక్షల ఉద్యోగాలు) -
ఇంజెక్టబుల్స్ సామర్థ్యం పెంచుతున్న అరబిందో
న్యూఢిల్లీ: ఔషధ రంగ సంస్థ అరబిందో ఫార్మా ఇంజెక్టబుల్స్ తయారీ సామర్థ్యాన్ని పెంచుతోంది. యూఎస్‌లో కొత్త ప్లాంటు నిర్మాణం పూర్తి చేసింది. మరో కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం వద్ద ఏర్పాటు చేస్తోంది. ఈ ఫెసిలిటీ పూర్తి కావడానికి 15–18 నెలల సమయం పడుతుందని 2020–21 వార్షిక నివేదికలో అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ కె.నిత్యానంద రెడ్డి తెలిపారు. ‘కోవిడ్–19 వ్యాక్సిన్ వాణిజ్యీకరణకై సామర్థ్యాలను పెంచుకుంటున్నాం. మల్టీటోప్ పెప్టైడ్ ఆధారిత కోవిడ్–19 వ్యాక్సిన్ యూబీ612 అభివృద్ధి, వాణిజ్యీకరణ, తయారీ కోసం యూఎస్‌కు చెందిన వ్యాక్సినిటీతో ప్రత్యేక లైసెన్స్ ఒప్పందం చేసుకున్నాం. తైవాన్‌లో వ్యాక్సినిటీ చేపట్టిన వ్యాక్సిన్ రెండవ దశ ఔషధ ప్రయోగాలు సెప్టెంబరుకల్లా పూర్తి కానున్నాయి. భారత్‌లో రెండు, మూడవ దశ ఔషధ పరీక్షలకు ఈ కంపెనీ దరఖాస్తు చేసుకుంది. వ్యాక్సిన్ల తయారీ ప్లాంటు సిద్ధం అయింది’’ అని తెలిపారు. -
రండి.. పెట్టుబడులు పెట్టండి!
న్యూఢిల్లీ: కరోనా రాకతో ఫార్మా, హెల్త్‌కేర్ కంపెనీల వ్యాపార అవకాశాలు భారీగా పెరిగాయి. ఏడాది కాలంలో వాటి ఆదాయాలు, లాభాలు గణనీయంగా వృద్ధి చెందడాన్ని గమనించొచ్చు. ఆరోగ్య సంరక్షణ పట్ల అవగాహన విస్తృతం కావడంతో భవిష్యత్తులోనూ ఈ కంపెనీలకు వ్యాపార అవకాశాలు పుష్కలమేనని మార్కెట్ పండితుల అంచనా. ఇన్వెస్టర్ల నుంచి నిధుల సమీకరణకు ఫార్మా, హెల్త్‌కేర్ కంపెనీలకు ఇంతకంటే అనుకూల సమయం ఎప్పుడుంటుంది? అందుకేనేమో చాలా కంపెనీలు ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో/ప్రజలకు తొలిసారిగా వాటాలను ఆఫర్ చేయడం) కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. కరోనా వైరస్‌తో లాభపడే కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లలో ఆసక్తి ఇతోధికం అయినట్టు గణాంకాలు పరిశీలిస్తే తెలుస్తుంది. ఇదే మద్దతుగా 2021లో సుమారు 12 ఫార్మా, హెల్త్ కేర్ కంపెనీలు నిధులను సమీకరించనున్నాయి. గడిచిన ఐదేళ్లలో ఫార్మా, హెల్త్‌కేర్ రంగాల నుంచి కేవలం ఏడు కంపెనీలే ఐపీవోకు రాగా.. ఈ ఒక్క ఏడాది రికార్డు స్థాయి ఐపీవోల వర్షం కురవనుందని తెలుస్తోంది. కొన్ని ఇప్పటికే దరఖాస్తులు: ఐపీవోకు సంబంధించి ఎనిమిది కంపెనీలు ఇప్పటికే ‘డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్’ (డీఆర్‌హెచ్‌పీ)ను సెబీ వద్ద దాఖలు చేశాయి. ఈ జాబితాలో గ్లెన్‌మార్క్ లైఫ్ సైన్సెస్, సుప్రియా లైఫ్ సైన్సెస్, క్రస్నా డయాగ్నొస్టిక్స్, కిమ్స్, తత్వ చింతన్ ఫార్మా, సిఘాచి ఇండస్ట్రీస్, విండ్లాస్ బయోటెక్ కంపెనీలు ఉన్నాయి. అలాగే, థర్డ్‌పార్టీ బీమా సేవలు అందించే ప్రముఖ కంపెనీ మెడిఅసిస్ట్ సైతం సెబీ వద్ద డీఆర్‌హెచ్‌పీ సమర్పించింది. డీఆర్హెచ్పీనే ఆఫర్ డాక్యుమెంట్గానూ పిలుస్తారు. ఐపీవోకు సంబంధించిన వివరాలతో మర్చంట్ బ్యాంకర్లు రూపొందించే ప్రాథమిక డాక్యుమెంట్ ఇది. అదే విధంగా మిగిలిన కంపెనీల ఐపీవో ప్రణాళికలు సైతం వివిధ దశల్లో ఉన్నాయి. ఇలా ఐపీవో ప్రక్రియను ఆరంభించిన కంపెనీల్లో ఎమ్క్యూర్ ఫార్మా, వెల్నెస్ ఫరెవర్, విజయా డయాగ్నోస్టిక్స్, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నాయి. కరోనా మహమ్మారి కారణంగా ఫార్మా, హెల్త్‌కేర్, వాటి అనుబంధ రంగాల్లోని పటిష్టమైన కంపెనీల్లో పెట్టుబడులకు ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరిగినట్టు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ హెడ్ అజయ్ సరఫ్ తెలిపారు. ఎమ్క్యూర్ నుంచి పెద్ద ఇష్యూ.. గ్లెన్‌మార్క్ ఫార్మా అనుబంధ కంపెనీ అయిన గ్లెన్‌మార్క్ లైఫ్ సైన్సెస్ గత నెలలో ఐపీవోకు సెబీ వద్ద దరఖాస్తు దాఖలు చేయగా.. సుమారు రూ.2,000 కోట్ల మేర నిధులను సమీకరించే ప్రతిపాదనతో ఉంది. పుణేకు చెందిన ఎమ్క్యూర్ ఫార్మాస్యూటికల్స్ జనరిక్ డ్రగ్ తయారీలో ప్రముఖ కంపెనీ. ఈ సంస్థ ఐపీవో రూపంలో రూ.3,500–4,000 కోట్లను సమీకరించాలనుకుంటోంది. ఇందుకు సంబంధించి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లతో సంప్రదింపులు మొదలు పెట్టింది. సిరమ్ ఇనిస్టిట్యూట్ అధినేత అదర్ పూనవాలాకు చెందిన రిటైల్ ఫార్మసీ చైన్ కంపెనీ వెల్నెస్ ఫరెవర్ రూ.1,200 కోట్లను ఐపీవో ద్వారా సమీకరించే ప్రతిపాదనతో ఉంది. ‘‘కరోనా కారణంగా భారత హెల్త్‌కేర్ వ్యవస్థలో భారీ మార్పు చోటు చేసుకుంది. ఔషధాలు, టీకాలు, వ్యాధి నిర్దారణ పరీక్షలు, వైద్య ఉపకరణాలు, హాస్పిటల్స్ తదితర కంపెనీల వ్యాపార అవకాశాలు రానున్న కాలంలో ఎన్నో రెట్లు పెరగనున్నాయి. హెల్త్‌కేర్ రంగం మొత్తం మీద ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. దీంతో ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత చూపిస్తున్నారు’’ అని డీఏఎమ్ క్యాపిటల్ ఎండీ, సీఈవో దర్మేష్ మెహతా చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరి 10 నుంచి కరోనా రెండో విడత మొదలు కాగా.. అప్పటి నుంచి నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ 7 శాతం ర్యాలీ చేసింది. ఇదే కాలంలో నిఫ్టీ–50లో రాబడులు ఏమీ లేవు. 2020లో ఈ రంగం నుంచి ఐపీవోకు వచ్చిన ఏకైక కంపెనీగా గ్లాండ్ ఫార్మాను చెప్పుకోవాలి. ఈ సంస్థ ఐపీవో రూపంలో రూ.5,230 కోట్లను (2020 నవంబర్‌లో) సమీకరించింది. ఐపీవో ఇష్యూ ధర రూ.1,500 కాగా.. ఆరు నెలల్లోనే స్టాక్ నూరు శాతం రాబడులను ఇచ్చింది. పబ్లిక్ ఆఫర్ బాటలో.. కంపెనీ ఐపీవో ఇష్యూ అంచనా (రూ.కోట్లలో) ఎమ్క్యూర్ ఫార్మా 3,500 స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ 3,000 గ్లెన్‌మార్క్ లైఫ్‌సైన్సెస్ 2,000 సుప్రియా లైఫ్‌సైన్సెస్ 1,200 క్రస్నా డయాగ్నొస్టిక్స్ 1,200 వెల్నెస్ ఫరెవర్ 1,200 మెడి అసిస్ట్ హెల్త్‌కేర్ 840 కిమ్స్ హాస్పిటల్స్ 700 విండ్లాస్ బయోటెక్ 600 తత్వ చింతన్ ఫార్మా 450 -
50,000 శిఖరంపైకి సెన్సెక్స్
ముంబై: స్టాక్ మార్కెట్లో మూడోరోజూ బడ్జెట్ సందడి కొనసాగడంతో సెన్సెక్స్ సూచీ తొలిసారి 50 వేల శిఖరస్థాయి పైన ముగిసింది. నిఫ్టీ ఇండెక్స్ కూడా జీవితకాల గరిష్ట స్థాయిపై స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడం, భారత మార్కెట్‌పై విదేశీ ఇన్వెస్టర్ల బుల్లిష్ వైఖరిని ప్రదర్శించడం లాంటి అంశాలు కలిసొచ్చాయి. ఫలితంగా సెన్సెక్స్ 458 పాయింట్లు లాభపడి 50,256 వద్ద, నిఫ్టీ 142 పాయింట్లు పెరిగి 14,790 వద్ద ముగిశాయి. సూచీలకిది వరుసగా మూడోరోజూ లాభాల ముగింపు. ఇంట్రాడేలో బ్యాంకింగ్, ఆర్థిక, ఫార్మా షేర్ల కౌంటర్లలో కొనుగోళ్లు జరిగాయి. సిమెంట్, ఎఫ్ఎంసీజీ స్టాకుల్లో లాభాల స్వీకరణ చోటుచేసుకొని నష్టాలను చవి చూశాయి. ట్రేడింగ్ ప్రారంభంలో సూచీలు కొంత నష్టాలను చవిచూసినప్పటికీ.., ఆ తర్వాత తమ జోరును కనబరిచాయి. జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల పరిణామాలతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ప్రాధాన్యత ఇచ్చారు. ఫలితంగా మార్కెట్ ముగింపు వరకు సూచీల ర్యాలీ సాఫీగా సాగింది. ఒక దశలో సెన్సెక్స్ 728 పాయింట్లు లాభపడి 50,526 వద్ద, నిఫ్టీ 222 పాయింట్లు పెరిగి 14,869 వద్ద తమ సరికొత్త జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. సూచీలు చరిత్రాత్మక మైలురాళ్లను అధిగమించిన నేపథ్యంలో బుధవారం ఇన్వెస్టర్లు రూ.1.84 లక్షల కోట్లను ఆర్జించారు. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ మొత్తం కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ.198.45 లక్షల కోట్లకు చేరుకుంది. డాలర్ మారకంలో రూపాయి విలువ ఒక పైసా స్వల్ప లాభంతో ఫ్లాట్‌గా ముగిసింది. ‘‘బడ్జెట్లో మూలధన ప్రణాళికలకు అధిక వ్యయాన్ని కేటాయించారు. ఇవి పెట్టుబడులను ఆకర్షించే విధంగా ఉన్నాయి. కార్పొరేట్ కంపెనీల మెరుగైన ఫలితాలు, ప్రపంచ మార్కెట్ల నుంచి మద్దతు లభిస్తోంది. శుక్రవారం వెలువడే ఆర్బీఐ పాలసీ నిర్ణయం రానున్న రోజుల్లో మార్కెట్‌కు కీలకం కానుంది’ అని రియలన్స్ సెక్యూరిటీస్ హెడ్ స్ట్రాటజీ బినోద్ మోదీ అభిప్రాయపడ్డారు. లిస్టింగ్‌లో మురిపించినా, ఫ్లాట్ ముగింపే..! హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ ఐపీఓ... లిస్టింగ్ లాభాలను నిలుపుకోవడంలో విఫలమైంది. బీఎస్ఈలో ఇష్యూ ధర (రూ.518)తో పోలిస్తే ఈ షేరు 18% ప్రీమియంతో రూ. 612 వద్ద లిస్ట్ అయ్యింది. ఇంట్రాడేలో 23.45 శాతం ర్యాలీ చేసి రూ. 639.50 స్థాయికి ఎగిసింది. షేరు దూసుకెళ్తున్న తరుణంలో ఇన్వెస్టర్లు అనూహ్యంగా లాభాల స్వీకరణ జరిపారు. ఫలితంగా చివరికి 1.81% స్వల్ప లాభంతో రూ.527.40 వద్ద ముగిసింది. మార్కెట్లో మరిన్ని సంగతులు... ► రిలయన్స్ రిటైల్‌తో కుదుర్చుకున్న ఒప్పంద విషయంలో యథాస్థితిని కొనసాగించాలంటూ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఫ్యూచర్ రిటైల్ షేరు 5 శాతం నష్టపోయింది. ► క్యూ3 మెరుగైన ఫలితాలను ప్రకటించడంతో హెచ్డీఎఫ్సీ షేరు 2 శాతం లాభపడింది. ► ఇండస్ఇండ్ బ్యాంకు 7 శాతం లాభపడి తొలిసారి రూ.1000పైన ముగిసింది. ► టాటా మోటార్స్ షేరు 3% లాభపడటంతో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.లక్ష కోట్లను అధిగమించింది. ► మూడో త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో భారతీ ఎయిర్టెల్ షేరు రూ.622 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. చివరికి 1.60 శాతం లాభంతో రూ.609 వద్ద స్థిరపడింది. -
ఈ చిన్న షేరు గెలాప్ వెనుక?!
ముంబై, సాక్షి: సుమారు రెండు నెలల క్రితం తిరిగి స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయిన హెల్త్‌కేర్ రంగ కంపెనీ ఆర్కిడ్ ఫార్మా కౌంటర్‌కు డిమాండ్ కొనసాగుతోంది. వెరసి వరుసగా 40వ సెషన్లోనూ 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. బీఎస్ఈలో రూ. 120 వద్ద నిలిచింది. నవంబర్ 3న తిరిగి లిస్టయిన ఆర్కిడ్ ఫార్మా షేరు 567 శాతం దూసుకెళ్లింది. అయితే ఈ కౌంటర్లో అమ్మకందారులు కరవుకావడంతో ట్రేడింగ్ పరిమాణం తక్కువగానే నమోదవుతున్నట్లు మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ షేరు ట్రేడ్ టు ట్రేడ్ విభాగంలో ఉంది. డెలివరీ తప్పనిసరికాగా.. 5 శాతం సర్క్యూట్ బ్రేకర్ అమలవుతోంది. ప్రస్తుతం కంపెనీలో ప్రమోటర్ల వాటా 98.04 శాతంగా నమోదైంది. అంటే పబ్లిక్కు 2 శాతంకంటే తక్కువగానే వాటా ఉంది. దీనిలో 0.55 శాతమే వ్యక్తిగత వాటాదారుల వద్ద ఉన్నట్లు తెలుస్తోంది. మరో 1 శాతం బ్యాంకులు, ఇతర సంస్థల వద్ద ఉన్నట్లు నిపుణులు తెలియజేశారు. దీంతో ఈ కౌంటర్లో లిక్విడిటీ తక్కువై షేరు పరుగు తీస్తున్నట్లు వివరించారు. చదవండి: (కోరమాండల్ డౌన్- ఈఐడీ ప్యారీ అప్?) ఏం జరిగిందంటే? కార్పొరేట్ దివాళా పరిష్కార ప్రణాళిక(సీఐఆర్‌పీ) ప్రకారం ఆర్కిడ్ ఫార్మాను ఈ ఏడాది మార్చి31న హర్యానాకు చెందిన ధనుకా ల్యాబొరేటరీస్ సొంతం చేసుకుంది. తద్వారా ఆర్కిడ్ బోర్డును కొత్తగా ఏర్పాటు చేసింది. వెరసి ఆర్కిడ్ ఫార్మాకు గుర్గావ్ కంపెనీ ధనుకా ల్యాబ్ ప్రమోటర్ సంస్థగా ఆవిర్భవించింది. ఆపై రిజల్యూషన్ ప్రణాళికకు అనుగుణంగా ఆర్కిడ్ను లాభాల బాటలోకి తీసుకువచ్చే ప్రణాళికలు అమలు చేస్తోంది. దీనిలో భాగంగా తమిళనాడులోని అళత్తూర్లోని ఏపీఐ ప్లాంటు, ఇరుంగట్టుకొట్టాయ్ వద్దగల ఎఫ్‌డీఎఫ్ ప్లాంట్లలో యూఎస్ఎఫ్డీఏ తనిఖీలకు ఆహ్వానించింది. తనిఖీలు విజయవంతంగా ముగియడంతో ఈఐఆర్ సర్టిఫికేషన్ లభించినట్లు ధనుకా పేర్కొంది. ఫార్ములేషన్ల విభాగంలో ఆర్కిడ్‌కు యూఎస్ మార్కెట్లో 40 ఏఎన్‌డీఏలకు అనుమతి ఉన్నట్లు తెలియజేసింది. కాగా.. ఆర్కిడ్పై ఇన్వెస్టర్లు, కస్టమర్ల విశ్వాసాన్ని పెంపొందించేందుకు వీలుగా ధనుకా ల్యాబొరేటరీస్ పటిష్ట చర్యలు తీసుకోవలసి ఉన్నట్లు మార్కెట్ విశ్లేషకులు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. -
నాలుగో రోజూ లాభాలతో షురూ
ముంబై, సాక్షి: ఈక్విటీలలో కొనసాగుతున్న ఎఫ్‌పీఐల పెట్టుబడుల కారణంగా వరుసగా ఐదో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 87 పాయింట్లు పుంజుకుని 46,753కు చేరగా.. నిఫ్టీ 23 పాయింట్లు బలపడి 13,705 వద్ద ట్రేడవుతోంది. బుధవారం వరుసగా రెండో రోజు నాస్డాక్ సైతం సరికొత్త గరిష్టంవద్ద నిలిచింది. దీనికితోడు కోవిడ్-19 సంక్షోభం నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ రికవరీ బాట పట్టిన సంకేతాలతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ఆసక్తి చూపుతున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఇంట్రాడేలో సెన్సెక్స్ 46,778 పాయింట్ల వద్ద, నిఫ్టీ 13,718 వద్ద సరికొత్త గరిష్టాలను తాకాయి. మీడియా ప్లస్ ఎన్ఎస్ఈలో ఫార్మా 1.3 శాతం, మీడియా 0.3 శాతం చొప్పున లాభపడగా.. రియల్టీ, ఎఫ్ఎంసీజీ, పీఎస్‌యూ బ్యాంక్స్ 0.5-0.2 శాతం మధ్య డీలాపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో దివీస్, శ్రీసిమెంట్, ఇండస్ఇండ్, అల్ట్రాటెక్, హెచ్డీఎఫ్సీ, సన్ ఫార్మా, గ్రాసిమ్, ఆర్ఐఎల్, యూపీఎల్, పవర్‌గ్రిడ్ 2.6-1 శాతం మధ్య ఎగశాయి. అయితే హెచ్‌యూఎల్, అదానీ పోర్ట్స్, కోల్ ఇండియా, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఆటో, ఐటీసీ, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్, నెస్లే, ఎన్టీపీసీ 1.25-0.5 శాతం మధ్య నీరసించాయి. జూబిలెంట్ అప్ డెరివేటివ్స్‌లో జూబిలెంట్ ఫుడ్, పేజ్, మ్యాక్స్ ఫైనాన్స్, క్యాడిలా హెల్త్, ఎస్ఆర్ఎఫ్, అంబుజా 4-2 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు ఎంఅండ్ఎం ఫైనాన్స్, బీఈఎల్, శ్రీరామ్ ట్రాన్స్, ఇండిగో, సెయిల్, డీఎల్ఎఫ్ 1.3-1 శాతం క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.5 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,409 లాభపడగా.. 824 నష్టాలతో ట్రేడవుతున్నాయి. ఎఫ్‌ఫీఐల జోరు నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1,982 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 1,718 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 2,484 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 2,667 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
లాభాలతో షురూ- రియల్టీ, ఫార్మా జోరు
ముంబై, సాక్షి: ఆర్థిక వ్యవస్థ రికవరీ బాట పట్టిన అంచనాలతో దేశీ స్టాక్ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 118 పాయింట్లు పుంజుకుని 44,321కు చేరింది. నిఫ్టీ 38 పాయింట్లు లాభపడి 13,007 వద్ద ట్రేడవుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై- సెప్టెంబర్)లో జీడీపీ 7.5 శాతం క్షీణతకే పరిమితంకావడంతో సెంటిమెంటు బలపడినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. మూడో త్రైమాసికంలో దేశ ఆర్థిక వ్యవస్థ మరింత పురోగతిని సాధించే వీలున్నట్లు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. దీంతో ఇన్వెస్టర్లకు కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నట్లు నిపుణులు తెలియజేశారు. ఇంట్రాడేలో సెన్సెక్స్ 44,470, నిఫ్టీ 13,064 పాయింట్ల వరకూ ఎగశాయి. బ్లూచిప్స్ తీరిలా ఎన్ఎస్ఈలో ప్రధానంగా రియల్టీ, ఫార్మా, మెటల్, ఐటీ రంగాలు 2-0.7 శాతం మధ్య పుంజుకున్నాయి. ఆటో, మీడియా 0.25 శాతం స్థాయిలో డీలాపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో గెయిల్, శ్రీసిమెంట్, అల్ట్రాటెక్, ఇన్ఫోసిస్, ఇండస్ఇండ్, బజాజ్ ఆటో, పవర్‌గ్రిడ్, సన్ ఫార్మా, గ్రాసిమ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ 3-1.3 శాతం మధ్య ఎగశాయి. అయితే నెస్లే, కొటక్ బ్యాంక్, ఓఎన్జీసీ, ఎంఅండ్ఎం, హెచ్‌సీఎల్ టెక్, విప్రో, యాక్సిస్, బజాజ్ ఫైనాన్స్, ఎయిర్టెల్ 2.3-0.3 శాతం మధ్య బలహీనపడ్డాయి. ఏసీసీ అప్ డెరివేటివ్ కౌంటర్లలో ఏసీసీ, డీఎల్ఎఫ్, హావెల్స్, ఐసీఐసీఐ లంబార్డ్, బంధన్ బ్యాంక్, గోద్రెజ్ ప్రాపర్టీస్ 4.6-2.5 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోపక్క చోళమండలం, మణప్పురం, ఎస్కార్ట్స్, మైండ్‌ట్రీ, బాటా, అమరరాజా, ఐడియా, కమిన్స్, క్యాడిలా హెల్త్ 2.3-1.4 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.4-0.6 శాతం చొప్పున బలపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,355 లాభపడగా.. 641 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి. ఎఫ్‌ఫీఐల ఇన్వెస్ట్మెంట్స్ నగదు విభాగంలో శుక్రవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 7,713 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 4,969 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. ఇక గురువారం ఎఫ్‌పీఐలు రూ. 2,027 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 3,400 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టినన విషయం విదితమే. కాగా.. నవంబర్ నెలలో ఎఫ్‌పీఐలు ఈక్విటీలలో రూ. 60,358 కోట్లు ఇన్వెస్ట్ చేయడం విశేషం! -
మార్కెట్.. బౌన్స్‌బ్యాక్!
ముంబై: స్టాక్ మార్కెట్ నవంబర్ సిరీస్‌ను లాభాలతో ముగించింది. ఎఫ్అండ్ఓ ముగింపు నేపథ్యంలో ట్రేడింగ్ ఆద్యంతం ఆటుపోట్లకు లోనైనప్పటికీ.., మెటల్, ఫార్మా, బ్యాంకింగ్, ఆర్థిక షేర్ల ర్యాలీ అండతో సూచీలు లాభాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్ 432 పాయింట్లు పెరిగి 44,260 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 129 పాయింట్ల ఆర్జించి 12,987 వద్ద నిలిచింది. మార్కెట్లో నెలకొన్న బుల్లిష్ ట్రెండ్‌కు తగ్గట్లు ట్రేడర్లు తమ పొజిషన్లను రోలోవర్ చేసుకునేందుకే ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు దేశీయ ఈక్విటీల్లోకి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు) పెట్టుబడులు కొనసాగడం, అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల ట్రేడింగ్ వంటి అంశాలు కొనుగోళ్లకు మద్దతునిచ్చాయి. పండుగ సీజన్లో భారత ఆర్థిక వ్యవస్థ అంచనాలకు మించి పనితీరును కనబరిచినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వ్యాఖ్యలూ ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్నిచ్చాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 780 పాయింట్లు, నిఫ్టీ 228 పాయింట్ల రేంజ్లో కదలాడాయి. ఇక నగదు విభాగంలో ఎఫ్‌పీఐలు రూ.2,027 కోట్ల షేర్లను కొనగా, దేశీ ఫండ్స్ (డీఐఐలు) రూ.3,400 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. నవంబర్ సిరీస్‌లో సెన్సెక్స్ 4510 పాయింట్లను, నిఫ్టీ 1316 పాయింట్లు ఎగిశాయి. ఇంట్రాడేలో ఒడిదుడుకుల ట్రేడింగ్.... లాభాల స్వీకరణతో బుధవారం నష్టాలను చవిచూసిన మార్కెట్ గురువారం ఫ్లాట్‌గా మొదలైంది. ఎఫ్అండ్ఓ సిరీస్ ముగింపు రోజు కావడంతో ఆరంభంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. దీంతో ఉదయం సెషన్లో సూచీలు లాభ – నష్టాల మధ్య ట్రేడ్ అయ్యాయి. అయితే మిడ్‌సెషన్ నుంచి మెటల్ షేర్లలో కొనుగోళ్లు మొదలవడంతో లాభాల బాట పట్టాయి. మరోవైపు ఆసియా మార్కెట్ల లాభాల ముగింపు, యూరప్ మార్కెట్ల సానుకూల ప్రారంభంతో మరింత దూసుకెళ్లాయి. -
మళ్లీ రికార్డుల పరుగు..!
ముంబై: స్టాక్ మార్కెట్ మళ్లీ రికార్డుల బాటపట్టింది. జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు కలిసిరావడంతో సూచీలు సోమవారం మరోసారి జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. ఐటీ, ఫార్మా, మెటల్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సెన్సెక్స్ 195 పాయింట్లు పెరిగి 44 వేల పైన 44,077 వద్ద స్థిరపడింది. నిప్టీ 67 పాయింట్లను ఆర్జించి 12900 ఎగువున 12,926 వద్ద నిలిచింది. కోవిడ్–19 కట్టడికి ఫార్మా కంపెనీలు రూపొందిస్తున్న వ్యాక్సిన్లు ట్రయల్ పరీక్షల్లో మెరుగైన ఫలితాలను సాధిస్తున్నాయనే వార్తలు ఈక్విటీలకు ఉత్సాహాన్నిచ్చాయి. తాజాగా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ– ఆస్ట్రాజెనికాల సంయుక్త ఆధ్వర్యంలో రూపకల్పన చేసిన వ్యాక్సిన్ సైతం తుది దశలో మెరుగైన ఫలితాలనిచ్చింది. అలాగే రిలయన్స్ – ఫ్యూచర్ గ్రూప్ డీల్‌కు సీసీఐ ఆమోదం తెలపడంతో రిలయన్స్ షేరు 3 శాతం లాభపడి సూచీల ర్యాలీకి అండగా నిలిచింది. డాలర్ మారకంలో రూపాయి రివకరీ కలిసొచ్చింది. మార్కెట్లో జరిగిన విస్తృతస్థాయి కొనుగోళ్ల భాగంగా చిన్న, మధ్య తరహా షేర్లకు అధికంగా డిమాండ్ నెలకొంది. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 1.25% లాభపడ్డాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 389 పాయింట్లు ఎగసి 44,271 వద్ద, నిఫ్టీ 110 పాయింట్లు లాభపడి 12,969 వద్ద సరికొత్త జీవితకాల గరిష్టాలను తాకాయి. బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు... ప్రైవేట్ బ్యాంకుల్లో ప్రమోటర్ల వాటా పరిమితి 26 శాతానికి పెంచాలని ఆర్బీఐ ఇంటర్నల్ వర్కింగ్ గ్రూప్ (ఐడబ్ల్యూజీ) ప్రతిపాదనతో బ్యాంకింగ్ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఐసీఐసీఐ, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు 2.50 శాతం నుంచి 1% నష్టపోయాయి. ఎన్ఎస్ఈలో బ్యాంకింగ్ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ 1% పతనమైంది. 3 శాతం లాభపడ్డ రిలయన్స్ షేరు... ఆర్ఐఎల్–ఫ్యూచర్ గ్రూప్ కొనుగోలు ఒప్పందానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీఐఐ) ఆమోదం తెలపడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు 3 శాతం లాభపడి రూ.1,951 వద్ద ముగిసింది. ఫ్యూచర్ గ్రూప్‌నకు చెందిన రిటైల్, హోల్‌సేల్, లాజిస్టిక్, గిడ్డంగుల వ్యాపారాలను కొనుగోలు చేయాలన్న రిలయన్స్ రిటైల్ సంస్థ ప్రతిపాదనకు శుక్రవారం సీఐఐ ఆమోదం తెలిపింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఆర్ఐఎల్ షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించండంతో షేరు ఇంట్రాడేలో 4 శాతం ఎగసి రూ.1,970 స్థాయిని అందుకుంది. కంపెనీ మార్కెట్ వాల్యుయేషన్ రూ.34,892 కోట్లు పెరిగి రూ.13.19 లక్షల కోట్లకు చేరుకుంది. ఫ్యూచర్ గ్రూప్ షేర్లలోనూ కొనుగోళ్లే... రూ.24,173 కోట్ల ఆర్ఐఎల్–ఫ్యూచర్ గ్రూప్ డీల్‌కు సీఐఐ అనుమతులు లభించడంతో కిషోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్ గ్రూప్ షేర్లు పరుగులు పెట్టాయి. రిటైల్ ఫ్యూచర్ 10% లాభపడి రూ.70 వద్ద అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. ఫ్యూచర్ లైఫ్‌స్టైల్ ఫ్యాషన్ షేరు 10% ఎగిసి రూ.90.30 స్థాయిని తాకింది. ఫ్యూచర్ ఎంటర్ ప్రైజెస్ షేరు ఇంట్రాడేలో 5% ర్యాలీతో రూ.10.45 స్థాయిని అందుకుంది. -
మార్కెట్ల ర్యాలీ బాట- ఐటీ, ఫార్మా జూమ్
ముంబై, సాక్షి: దేశీ స్టాక్ మార్కెట్లలో రికార్డుల ర్యాలీ కొనసాగుతోంది. గత వారం మధ్యలో బ్రేక్ పడినప్పటికీ తిరిగి వరుసగా రెండో రోజు మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యాయి. దీంతో ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 44,271ను తాకడం ద్వారా ఇంట్రాడేలో సరికొత్త గరిష్టాన్ని అందుకుంది. చివరికి 195 పాయింట్లు బలపడి 44,077 వద్ద నిలిచింది. నిఫ్టీ 67 పాయింట్లు పెరిగి 12,926 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో నిఫ్టీ 12,969కు చేరింది. కోవిడ్-19 కట్టడికి వెలువడనున్న వ్యాక్సిన్లపై అంచనాలు సెంటిమెంటుకు బలాన్నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఆర్బీఐ ప్యానల్ సూచనల నేపథ్యంలో ఎన్బీఎఫ్సీ, స్మాల్ బ్యాంకులు తదితర ఫైనాన్షియల్ రంగ కౌంటర్లకు డిమాండ్ పెరిగింది. బ్యాంక్స్ వీక్ ఎన్ఎస్ఈలో ప్రధానంగా ఐటీ, ఫార్మా, మెటల్, రియల్టీ, ఆటో 2.8-0.6 శాతం మధ్య వృద్ధి చూపాయి. అయితే బ్యాంక్ నిఫ్టీ 0.7 శాతం నీరసించింది. నిఫ్టీ దిగ్గజాలలో ఓఎన్జీసీ, ఇండస్ఇండ్, గెయిల్, డాక్టర్ రెడ్డీస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, విప్రో, ఆర్ఐఎల్, బీపీసీఎల్, టీసీఎస్ 6.7-2.5 శాతం మధ్య జంప్‌చేశాయి. ఇతర బ్లూచిప్స్‌లో హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, యాక్సిస్, ఎస్బీఐ లైఫ్, టైటన్, ఎస్బీఐ, ఎంఅండ్ఎం, ఎయిర్టెల్, ఎల్అండ్టీ, హెచ్డీఎఫ్సీ లైఫ్ 3.5-0.6 శాతం మధ్య క్షీణించాయి. ఐడీఎఫ్సీ ఫస్ట్ డెరివేటివ్ కౌంటర్లలో ఐడీఎఫ్సీ ఫస్ట్, బీహెచ్ఈఎల్, జీఎంఆర్, అదానీ ఎంటర్, సెయిల్, శ్రీరామ్ ట్రాన్స్, బాలకృష్ణ, మదర్సన్, పీవీఆర్, ఐడియా 9.5-3.5 శాతం మధ్య దూసుకెళ్లాయి. కాగా.. మరోపక్క ఎల్ఐసీ హౌసింగ్, ముత్తూట్, గ్లెన్‌మార్క్, బీఈఎల్, సీమెన్స్, వోల్టాస్, బీవోబీ, ఎస్కార్ట్స్, పేజ్, మెక్‌డోవెల్, బాష్, అపోలో టైర్ 2.4-0.6 శాతం మధ్య డీలా పడ్డాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1.3 శాతం చొప్పున ఎగశాయి. ట్రేడైన షేర్లలో 1,683 లాభపడగా.. 1,148 నష్టాలతో నిలిచాయి. ఎఫ్‌పీఐల ఇన్వెస్ట్మెంట్స్ నగదు విభాగంలో వారాంతాన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 3,861 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2,869 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. గురువారం ఎఫ్‌పీఐలు రూ. 1,181 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 2,855 కోట్ల అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
పిడిలైట్ ఇండస్ట్రీస్- అజంతా ఫార్మా.. జోరు
పలు దేశాలలో తిరిగి కరోనా వైరస్ కేసులు తలెత్తుతుండటంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లు పతన బాట పట్టాయి. దేశీయంగానూ మార్కెట్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలోనూ సానుకూల వార్తల కారణంగా పిడిలైట్ ఇండస్ట్రీస్, అజంతా ఫార్మా కౌంటర్లకు డిమాండ్ కనిపిస్తోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో నష్టాల మార్కెట్లోనూ ఈ షేర్లు లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. పిడిలైట్ ఇండస్ట్రీస్ హంట్స్‌మన్ గ్రూప్‌నకు చెందిన దేశీ అనుబంధ విభాగాన్ని కొనుగోలు చేయనున్నట్లు డైవర్సిఫైడ్ దిగ్గజం పిడిలైట్ ఇండస్ట్రీస్ తాజాగా పేర్కొంది. ఇందుకు యూఎస్ఏ కంపెనీతో కుదుర్చుకున్న తప్పనిసరి ఒప్పందానికి బోర్డు ఆమోదముద్ర వేసినట్లు తెలియజేసింది. తద్వారా హంట్స్‌మన్ అడ్వాన్స్డ్ మెటీరియల్స్ సొల్యూషన్స్‌లో 100 శాతం వాటాను సొంతం చేసుకోనున్నట్లు వివరించింది. ఇందుకు సుమారు రూ. 2,100 కోట్లను వెచ్చించనున్నట్లు తెలియజేసింది. హంట్స్‌మన్ అడ్వాన్స్డ్.. అరాల్డైట్, అరాసీల్ తదితర ప్రొడక్టులను కలిగి ఉన్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో పిడిలైట్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 4 శాతం జంప్‌చేసి రూ. 1,578 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1,591 వరకూ పురోగమించింది. అజంతా ఫార్మా సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కు ప్రతిపాదించినట్లు హెల్త్‌కేర్ కంపెనీ అజంతా ఫార్మా తాజాగా పేర్కొంది. వచ్చే నెల 3న కంపెనీ బోర్డు సమావేంకానున్నట్లు తెలియజేసింది. తద్వారా ఈక్విటీ షేర్ల బైబ్యాక్ అంశాన్ని పరిశీలించడంతోపాటు.. ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసిక ఫలితాలను సైతం బోర్డు విడుదల చేయనున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో అజంతా ఫార్మా షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో దాదాపు 4 శాతం జంప్‌చేసి రూ. 1,650 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 1,680 వరకూ లాభపడింది. -
వరుస లాభాలకు బ్రేక్- నష్టాల ముగింపు
ప్రభుత్వ ప్యాకేజీపై సందేహాలతో బుధవారం అమెరికా మార్కెట్లు డీలాపడగా.. దేశీయంగానూ ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెరతీశారు. దీంతో రోజంతా దేశీ మార్కెట్లు బలహీనంగానే కదిలాయి. చివరికి నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 149 పాయింట్లు క్షీణించి 40,558 వద్ద నిలవగా.. నిఫ్టీ 41 పాయింట్ల వెనకడుగుతో 11,896 వద్ద స్థిరపడింది. వెరసి నాలుగు రోజుల లాభాలకు బ్రేక్ పడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 40,722- 40,309 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. నిఫ్టీ సైతం 11,940- 11,824 పాయింట్ల మధ్య ఆటుపోట్లను చవిచూసింది. ఆర్థిక వ్యవస్థకు దన్నుగా భారీ సహాయక ప్యాకేజీని ప్రకటించే అంశంలో యూఎస్ కాంగ్రెస్‌లో కొనసాగుతున్న అనిశ్చితి ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటును బలహీనపరచినట్లు నిపుణులు తెలియజేశారు. దీనికితోడు దేశీ మార్కెట్లలో ఇటీవల నమోదైన ర్యాలీ కారణంగా ట్రేడర్లు లాభాల స్వీకరణ చేపట్టినట్లు తెలియజేశారు. మీడియా ప్లస్‌లో ఎన్ఎస్ఈలో ప్రధానంగా ఫార్మా, ఐటీ, పీఎస్‌యూ బ్యాంక్స్, ఆటో 0.9-0.2 శాతం మధ్య నీరసించాయి. మీడియా, మెటల్, రియల్టీ, ఎఫ్ఎంసీజీ 0.8-0.1 శాతం మధ్య పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఎన్టీపీసీ, టాటా మోటార్స్, ఎయిర్టెల్, ఐవోసీ, బజాజ్ ఫైనాన్స్, బ్రిటానియా, టాటా స్టీల్, యాక్సిస్, ఓఎన్జీసీ, ఎల్అండ్టీ, కోల్ ఇండియా, గెయిల్, అదానీ పోర్ట్స్, ఎంఅండ్ఎం, హెచ్‌యూఎల్, ఐటీసీ 4.2-0.7 శాతం మధ్య ఎగశాయి. అయితే హీరో మోటో, ఇండస్ఇండ్, ఐసీఐసీఐ, టైటన్, హిందాల్కో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, నెస్లే, సిప్లా, సన్ ఫార్మా, ఐషర్, ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, మారుతీ, శ్రీ సిమెంట్, బజాజ్ ఆటో, బజాజ్ ఫిన్సర్వ్, ఆర్ఐఎల్ 3-0.7 శాతం మధ్య డీలా పడ్డాయి. టొరంట్ 'పవర్ ఎఫ్‌అండ్‌వో కౌంటర్లలో టొరంట్ పవర్, శ్రీరామ్ ట్రాన్స్, పెట్రోనెట్, అశోక్ లేలాండ్, వేదాంతా, ఐడియా, ఎల్ఐసీ హౌసింగ్, టాటా పవర్, ఐజీఎల్, ఎల్అండ్టీ ఫైనాన్స్, ఎక్సైడ్, అమరరాజా, ఆర్ఈసీ, పీఎఫ్సీ, మైండ్‌ట్రీ 6-2 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోపక్క జూబిలెంట్ ఫుడ్, అరబిందో, బాలకృష్ణ, నౌకరీ, పీవీఆర్, అపోలో హాస్పిటల్స్, బయోకాన్, ముత్తూట్, గోద్రెజ్ సీపీ, ఐబీ హౌసింగ్, డాబర్, బంధన్ బ్యాంక్ 3.4-1.6 శాతం మధ్య బోర్లా పడ్డాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.5-1 శాతం స్థాయిలో బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,422 లాభపడగా.. 1,204 నష్టాలతో ముగిశాయి. ఎఫ్‌పీఐల కొనుగోళ్లు నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 2,108 కోట్లకుపైగా ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) దాదాపు రూ. 1,634 కోట్ల అమ్మకాలు చేపట్టాయి. మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 1,585 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 1,633 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. ఇక సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 1,657 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 1,622 కోట్ల అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
40,000 పైకి సెన్సెక్స్
ముంబై: స్టాక్ మార్కెట్లో వరుసగా ఆరో రోజూ కొనుగోళ్ల పర్వం కొనసాగింది. ఫలితంగా సెన్సెక్స్ 7 నెలల తర్వాత తొలిసారి 40,000 మార్కును అందుకుంది. నిఫ్టీ 11,800 స్థాయి పైకి చేరుకుంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి విరివిరిగా కొనుగోళ్లు జరగడంతో సూచీల ర్యాలీ సాఫీగా సాగింది. ర్యాలీకి ఐటీ షేర్లు ప్రాతినిధ్యం వహించాయి. అలాగే ఫార్మా, బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగ షేర్లకు కూడా ఆశించిన స్థాయిలో కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా ఇంట్రాడేలో సెన్సెక్స్ 40,469 పాయింట్ల వద్ద, నిఫ్టీ 11,905 పాయింట్ల వద్ద గరిష్టాలను తాకాయి. అయితే చివరి గంటలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. ఫలితంగా 304 పాయింట్ల లాభంతో 40,183 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 96 పాయింట్లను ఆర్జించి 11,835 వద్ద ముగిసింది. మరోవైపు మీడియా, ఎఫ్ఎంసీజీ షేర్లు మాత్రం నష్టాలను చవిచూశాయి. గడిచిన ఆరు ట్రేడింగ్ సెషన్స్‌లో సెన్సెక్స్ 2,210 పాయింట్లను, నిఫ్టీ 612 పాయింట్లను ఆర్జించాయి. అదరగొట్టిన ఐటీ షేర్లు నేడు సూచీల భారీ లాభార్జనలో ఐటీ షేర్ల పాత్ర ఎంతైనా ఉంది. ఐటీ దిగ్గజం టీసీఎస్ కంపెనీ క్యూ2 ఫలితాలు అంచనాలను మించాయి. అలాగే రూ.16వేల కోట్ల బైబ్యాక్ ప్రకటనతో ఇండెక్స్‌ల్లో అధిక వెయిటేజీ కలిగిన టీసీఎస్ షేరు నేడు 3శాతం లాభపడింది. ఈ అక్టోబర్ 13న జరిగే బోర్డు సమావేశంలో బైబ్యాక్ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామనే ప్రకటనతో విప్రో షేరు 7% ర్యాలీ చేసింది. ఇదే రంగంలోని ప్రధాన షేర్లైన ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా షేర్లు 3–2 శాతం ర్యాలీ చేశాయి. మొత్తం మీద బీఎస్ఈ ఐటీ ఇండెక్స్ 3 శాతం పెరిగింది. ప్రపంచ మార్కెట్ల సానుకూల సంకేతాలు అమెరికా అధ్యక్ష ఎన్నికలలోపు కొంతైనా సహాయక ప్యాకేజీని ప్రభుత్వం ప్రకటించవచ్చనే వార్తలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లో సానుకూల సంకేతాల వాతావరణం నెలకొంది. ఆసియాలో కొన్ని మార్కెట్లు నెల గరిష్టం వద్ద ముగిశాయి. యూరప్ మార్కెట్లు లాభంతో ప్రారంభమయ్యాయి. అమెరికా ఫ్యూచర్లు సైతం అరశాతం లాభంతో కదలాడాయి. ప్రపంచమార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలు మన మార్కెట్‌కు కలిసొచ్చాయి. కొనసాగుతున్న ఎఫ్ఐఐల కొనుగోళ్లు భారత ఈక్విటీ మార్కెట్ పట్ల విదేశీ ఇన్వెస్టర్లు సానుకూల వైఖరిని కలిగి ఉన్నారు. లాక్డౌన్ ఎత్తివేత తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా రికవరీ అవుతుందనే అంచనాలు వారిని ఆకర్షిస్తున్నాయి. అందుకు సంకేతంగా ఈ వారం ప్రారంభం నుంచి ఎఫ్ఐఐలు మన మార్కెట్లో భారీ ఎత్తున కొనుగోళ్లు జరుపుతున్నారు. ఐటీ సెక్టార్ మెరుగైన క్యూ2 ఫలితాల ప్రకటనతో మార్కెట్లో సానుకూల వాతావరణాన్ని నెలకొల్పింది. అలాగే పలు కంపెనీల బైబ్యాక్‌లు ఇన్వెస్టర్లను ఉత్సాహపరిచాయి. అమెరికా, భారత్‌లో ఉద్దీపన ప్యాకేజీ ప్రకటన అంచనాలు సెంటిమెంట్‌ను మరింత బలపరిచాయి. – వినోద్ నాయర్, జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ -
ఊగిసలాటలో.. ఫార్మా జోరు- బ్యాంకింగ్ వీక్
మిశ్రమ ప్రపంచ సంకేతాల నడుమ దేశీ స్టాక్ మార్కెట్లు ఒడిదొడుకులతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం స్వల్ప నష్టాలతో కదులుతున్నాయి. సెన్సెక్స్ 64 పాయింట్లు క్షీణించి 37,909కు చేరగా.. నిఫ్టీ 20 పాయింట్ల వెనకడుగుతో 11,203 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 38,080 వద్ద గరిష్టాన్ని తాకగా.. 37,891 దిగువన కనిష్టానికీ చేరింది. ఇక నిఫ్టీ 11,250- 11,200 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. ఇదీ తీరు ఎన్ఎస్ఈలో ఫార్మా 2 శాతం జంప్‌చేయగా.. ఎఫ్ఎంసీజీ 0.4 శాతం పుంజుకుంది. బ్యాంక్ నిఫ్టీ 1.2 శాతం డీలాపడగా.. రియల్టీ, మెటల్, ఐటీ 0.5 శాతం స్థాయిలో నీరసించాయి. నిఫ్టీ దిగ్గజాలలో సిప్లా, డాక్టర్ రెడ్డీస్, దివీస్ ల్యాబ్, సన్ ఫార్మా, ఎంఅండ్ఎం, ఓఎన్జీసీ, యూపీఎల్, హెచ్‌యూఎల్, నెస్లే, టాటా మోటార్స్, బజాజ్ ఆటో, అల్ట్రాటెక్ సిమెంట్, టైటన్, ఆర్ఐఎల్ 3.5-0.5 శాతం మధ్య బలపడ్డాయి. అయితే ఇండస్ఇండ్, ఐసీఐసీఐ, యాక్సిస్, కోల్ ఇండియా, ఎస్బీఐ, పవర్‌గ్రిడ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, హిందాల్కో, టీసీఎస్, అదానీ పోర్ట్స్, బీపీసీఎల్ 2-0.5 శాతం మధ్య క్షీణించాయి. ఫార్మా భళా డెరివేటివ్ కౌంటర్లలో ఐబీ హౌసింగ్, కేడిలా హెల్త్, అరబిందో, లుపిన్, పీవీఆర్, గ్లెన్‌మార్క్, గోద్రెజ్ సీపీ, టొరంట్ ఫార్మా, ఎస్కార్ట్స్, టాటా కన్జూమర్ 4.5-1.5 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. ఐడియా, పీఎన్బీ, బీవోబీ, బంధన్ బ్యాంక్, భెల్, ఇండిగో, బాటా, కంకార్ 2-1 శాతం మధ్య డీలాపడ్డాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.3 శాతం పుంజుకుంది. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 878 లాభపడగా.. 761 నష్టాలతో కదులుతున్నాయి. -
మరో 10 కోట్ల డోసుల వ్యాక్సిన్స్: సీరమ్
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌తోపాటు తక్కువ, మధ్య ఆదాయ దేశాల కోసం అదనంగా 10 కోట్ల డోసుల కరోనా వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయనున్నట్టు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మంగళవారం వెల్లడించింది. 10 కోట్ల డోసుల కోవిడ్-19 వ్యాక్సిన్ల సరఫరాకై సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆగస్టులో గవి, బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్‌తో ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజా ఒప్పందం ప్రకారం మొత్తం 20 కోట్ల డోసుల వరకు ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు కావాల్సిన నిధులు సీరమ్‌కు సమకూరతాయి. నియంత్రణ సంస్థ, డబ్లు్యహెచ్‌వో నుంచి అనుమతి రాగానే వ్యాక్సిన్ల సరఫరా ప్రారంభిస్తామని సీరమ్ సీఈవో అదర్ పూనావాలా తెలిపారు. గవి కోవ్యాక్స్ ఏఎంసీ విధానం ప్రకారం డోసులను 2021 తొలి అర్థభాగం ప్రారంభంలో పంపిణీ ఉంటుందని కంపెనీ వెల్లడించింది. బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ గతంలో ప్రకటించిన రూ.1,125 కోట్లకుతోడు మరో రూ.1,125 కోట్లను గవి సంస్థకు అందిస్తుంది. వ్యాక్సిన్ల తయారీకి ఈ మొత్తాన్ని సీరమ్ ఇన్స్టిట్యూట్ వినియోగిస్తుంది. చదవండి : ఏడాది చివరికి కొవాక్జిన్ చిన్నసైజు తుంపర్లతోనూ కరోనా -
38,000 దిగువకు సెన్సెక్స్- ఐటీ, ఫార్మా అప్
తొలుత సానుకూలంగా ప్రారంభమైనప్పటికీ తదుపరి అమ్మకాలు ఊపందుకోవడంతో రెండో రోజూ దేశీ స్టాక్ మార్కెట్లు నష్టాలతో నిలిచాయి. సెన్సెక్స్ 300 పాయింట్లు క్షీణించి 37,734 వద్ద ముగిసింది. వెరసి 38,000 పాయింట్ల దిగువన స్థిరపడింది. ఇక నిఫ్టీ 97 పాయింట్ల నష్టంతో 11,154 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 38,210- 37,531 పాయింట్ల మధ్య ఊగిసలాడగా.. నిఫ్టీ 11,302- 11,085 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. గ్లోబల్ బ్యాంకులలో అవకతవకల ఆరోపణలు, కోవిడ్-19 కేసులు పెరగడంతో యూరప్‌లో తిరిగి లాక్డవున్లు ప్రకటించడం వంటి పలు ప్రతికూల అంశాలు సెంటిమెంటును బలహీనపరచినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఆదుకున్న ఐటీ ఎన్ఎస్ఈలో ప్రధానంగా మీడియా, ఆటో, పీఎస్‌యూ బ్యాంక్స్, రియల్టీ, మెటల్, రంగాలు 2.6-1.25 శాతం మధ్య క్షీణించగా.. ఐటీ, ఫార్మా 0.7 శాతం చొప్పున బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో జీ 7 శాతం కుప్పకూలగా.. అదానీ పోర్ట్స్, ఇన్ఫ్రాటెల్, గెయిల్, మారుతీ, ఇండస్ఇండ్, టాటా మోటార్స్, యాక్సిస్, బీపీసీఎల్, ఎల్అండ్టీ, ఓఎన్జీసీ, ఏషియన్ పెయింట్స్, ఐవోసీ, హెచ్డీఎఫ్సీ, హీరో మోటో, హిందాల్కో, ఐషర్, ఆర్ఐఎల్ 4.7-1.6 శాతం మధ్య నష్టపోయాయి. అయితే ఇతర బ్లూచిప్స్‌లో హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, సన్ ఫార్మా, టెక్ మహీంద్రా, గ్రాసిమ్, అల్ట్రాటెక్, డాక్టర్ రెడ్డీస్, ఐసీఐసీఐ, సిప్లా, ఎస్బీఐ, ఎయిర్టెల్ 3-0.6 శాతం మధ్య పుంజుకున్నాయి. నష్టాలలో.. డెరివేటివ్ కౌంటర్లలో కెనరా బ్యాంక్, మణప్పురం, ఎంఅండ్ఎం ఫైనాన్స్, జీఎంఆర్, ఇండిగో, భెల్, హెచ్‌పీసీఎల్, బాష్, ఎంజీఎల్, బీఈఎల్, నాల్కో, బంధన్ బ్యాంక్, గ్లెన్‌మార్క్, ఐడీఎఫ్సీ ఫస్ట్ 6-2.7 శాతం మధ్య పతనమయ్యాయి. కాగా.. మరోవైపు దివీస్, కోఫోర్జ్, మైండ్‌ట్రీ, అదానీ ఎంటర్, అరబిందో, సన్ టీవీ 3.4-1.2 శాతం మధ్య ఎగశాయి. .బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1.6 శాతం చొప్పున క్షీణించాయి. ట్రేడైన షేర్లలో 1,874 నష్టపోగా.. 753 మాత్రమే లాభాలతో ముగిశాయి. అమ్మకాలవైపు నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 540 కోట్లు, దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 518 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. కాగా.. వారాంతాన ఎఫ్‌పీఐలు రూ. 205 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 101 కోట్ల అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
చివర్లో అమ్మకాలు- ఫార్మా ధూమ్‌ధామ్
తొలుత హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లను చివరి గంటలో పెరిగిన అమ్మకాలు దెబ్బతీశాయి. వెరసి నష్టాలతో నిలిచాయి. సెన్సెక్స్ 134 పాయింట్లు క్షీణించి 38,846 వద్ద స్థిరపడగా.. నిఫ్టీ స్వల్పంగా 11 పాయింట్ల వెనకడుగుతో 11,505 వద్ద ముగిసింది. తొలుత ఒక దశలో సెన్సెక్స్ 39,200 వద్ద గరిష్టాన్ని తాకగా.. చివర్లో 38,636 పాయింట్ల దిగువకు సైతం చేరింది. ఇక నిఫ్టీ ఇంట్రాడేలో 11,584- 11,446 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. అయితే తొలి నుంచీ ఇన్వెస్టర్లు ఫార్మా కౌంటర్లలో కొనుగోళ్లకు ఎగబడటంతో బీఎస్ఈలో హెల్త్‌కేర్ ఇండెక్స్ 20,689 పాయింట్ల వద్ద చరిత్రాత్మక గరిష్టాన్ని తాకింది. ఫార్మా జోరు ఎన్ఎస్ఈలో ఫార్మా రంగం 5 శాతం జంప్‌చేయగా.. రియల్టీ 2 శాతం, ఆటో 0.4 శాతం చొప్పున బలపడ్డాయి. బ్యాంక్ నిఫ్టీ 1.3 శాతం, ఎఫ్ఎంసీజీ 0.6 శాతం చొప్పున డీలా పడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో డాక్టర్ రెడ్డీస్ 10 శాతం, సిప్లా 7 శాతం చొప్పున దూసుకెళ్లగా.. అదానీ పోర్ట్స్, ఎయిర్టెల్, ఎంఅండ్ఎం, గ్రాసిమ్, టెక్ మహీంద్రా, ఎన్టీపీసీ, సన్ ఫార్మా, హిందాల్కో, విప్రో, పవర్‌గ్రిడ్, హీరో మోటో, ఓఎన్జీసీ, ఏషియన్ పెయింట్స్, యూపీఎల్ 3.7-1.5 శాతం మధ్య ఎగశాయి. ఇతర బ్లూచిప్స్‌లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, శ్రీ సిమెంట్, బజాజ్ ఫిన్, కొటక్ బ్యాంక్, మారుతీ, టైటన్, హెచ్‌యూఎల్, ఎస్బీఐ, ఐవోసీ, కోల్ ఇండియా, ఇన్ఫోసిస్, ఎల్అండ్టీ 2.2-0.75 శాతం మధ్య క్షీణించాయి. డెరివేటివ్స్‌లోనూ.. డెరివేటివ్ కౌంటర్లలో లుపిన్, దివీస్, కేడిలా, గ్లెన్‌మార్క్, అపోలో హాస్పిటల్స్, అరబిందో, డీఎల్ఎఫ్, బయోకాన్, సన్ టీవీ 4.5-2.3 శాతం మధ్య జంప్ చేశాయి. కాగా.. మరోపక్క టాటా కెమ్, అపోలో టైర్, పెట్రోనెట్, బంధన్ బ్యాంక్, టొరంట్ పవర్, ఐడీఎఫ్సీ ఫస్ట్, పిరమల్, వోల్టాస్, కోఫోర్జ్, అమరరాజా, జూబిలెంట్ ఫుడ్, ఎంఅండ్ఎం ఫైనాన్స్, పీఎన్బీ, జిందాల్ స్టీల్, కమిన్స్ 3.2 శాతం మధ్య వెనకడుగు వేశాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 0.25 శాతం పుంజుకోగా, స్మాల్ క్యాప్స్ 0.3 శాతం నీరసించింది. ట్రేడైన షేర్లలో 1308 లాభపడగా.. 1431 నష్టాలతో నిలిచాయి. అమ్మకాలవైపు.. నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 250 కోట్లు, దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 1068 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 265 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 212 కోట్ల అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
నష్టాలలో మార్కెట్లు- ఫార్మా ఎదురీత
సరిహద్దువద్ద చైనాతో వివాదాల నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 175 పాయింట్లు క్షీణించి 39,127ను తాకగా.. నిఫ్టీ 51 పాయింట్ల వెనకడుగుతో 11,554 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 39,141- 39,022 పాయింట్ల మధ్య ఊగిసలాడగా.. నిఫ్టీ 11563- 11521 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. తాజా పాలసీ సమీక్షలో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ దీర్ఘకాలంపాటు నామమాత్ర వడ్డీ రేట్లనే కొనసాగించనున్నట్లు ప్రకటించింది. అయితే టెక్నాలజీ కౌంటర్లలో అమ్మకాలతో బుధవారం యూఎస్ మార్కెట్లు డీలాపడ్డాయి. ప్రస్తుతం ఆసియాలో అధిక శాతం మార్కెట్లు బలహీనపడ్డాయి. బ్లూచిప్స్ తీరిలా ఎన్ఎస్ఈలో బ్యాంకింగ్, రియల్టీ, ఐటీ, మెటల్, ఆటో 1-0.5 శాతం మధ్య నీరసించగా.. ఫార్మా 0.4 శాతం బలపడింది. నిఫ్టీ దిగ్గజాలలో జీ, ఓఎన్జీసీ, డాక్టర్ రెడ్డీస్, కోల్ ఇండియా, గ్రాసిమ్, హెచ్‌సీఎల్ టెక్, హీరోమోటో, సిప్లా, బ్రిటానియా, బీపీసీఎల్, నెస్లే 3-0.5 శాతం మధ్య పుంజుకున్నాయి. అయితే హిందాల్కో, ఐసీఐసీఐ, టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇండస్ఇండ్, యాక్సిస్, కొటక్ మహీంద్రా, టాటా మోటార్స్, బజాజ్ ఆటో, పవర్‌గ్రిడ్, ఎంఅండ్ఎం, విప్రో, శ్రీ సిమెంట్, ఎస్బీఐ 2-0.7 శాతం మధ్య డీలాపడ్డాయి. డెరివేటివ్స్‌లో డెరివేటివ్ కౌంటర్లలో అశోక్ లేలాండ్, ఐడియా, కమిన్స్, అరబిందో, ఎస్కార్ట్స్, ముత్తూట్, లుపిన్, ఎక్సైడ్, టాటా కెమ్, బంధన్ బ్యాంక్ 2-1 శాతం మధ్య క్షీణించాయి. కాగా.. మెక్‌డోవెల్, సెయిల్, టాటా పవర్, చోళమండలం, కోఫోర్జ్, పిడిలైట్, అపోలో టైర్ 4-1 శాతం మధ్య ఎగశాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.25 శాతం చొప్పున బలహీనపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 753 లాభపడగా.. 884 నష్టాలతో కదులుతున్నాయి. -
చివరి సెషన్లో జోరు- రియల్టీ, ఫార్మా అప్
స్వల్ప ఊగిసలాట మధ్య ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు తదుపరి జోరందుకున్నాయి. చివరికి సెన్సెక్స్ 259 పాయింట్లు ఎగసి 39,303 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 83 పాయింట్లు పుంజుకుని 11,605 వద్ద స్థిరపడింది. అయితే తొలి సెషన్లో మార్కెట్లు స్వల్ప హెచ్చుతగ్గులను చవిచూశాయి. మిడ్‌సెషన్ నుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ప్రాధాన్యం ఇవ్వడంతో లాభాలతో నిలిచాయి. వెరసి ఇంట్రాడేలో సెన్సెక్స్ 39,360- 39,038 పాయింట్ల మధ్య ఊగిసలాడగా.. నిఫ్టీ 11618- 11517 పాయింట్ల మధ్య ఒడిదొడుకులను చవిచూసింది. డాక్టర్ రెడ్డీస్ జోరు ఎన్ఎస్ఈలో ప్రధానంగా రియల్టీ, ఫార్మా, ఆటో రంగాలు 2.3-1.5 శాతం మధ్య ఎగశాయి. ఐటీ, ఎఫ్ఎంసీజీ, మెటల్, ప్రయివేట్ బ్యాంక్స్ సైతం 0.5 శాతం స్థాయిలో పుంజుకోగా.. మీడియా 1.6 శాతం, పీఎస్‌యూ బ్యాంక్స్ 0.5 శాతం చొప్పున డీలాపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో డాక్టర్ రెడ్డీస్ 4.5 శాతం జంప్‌చేయగా.. ఎంఅండ్ఎం, హిందాల్కో, బజాజ్ ఆటో, బ్రిటానియా, సన్ ఫార్మా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, విప్రో, సిప్లా, ఎల్అండ్టీ 4-1.4 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే ఇండస్ఇండ్, ఎన్టీపీసీ, ఇన్ఫ్రాటెల్, ఎస్బీఐ, యాక్సిస్, ఓఎన్జీసీ, ఎయిర్టెల్, పవర్‌గ్రిడ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, జీ, ఐటీసీ, గెయిల్, యూపీఎల్, హెచ్‌సీఎల్ టెక్ 2-0.5 శాతం మధ్య బలహీనపడ్డాయి. డీఎల్ఎఫ్ ప్లస్ డెరివేటివ్ కౌంటర్లలో డీఎల్ఎఫ్, రామ్‌కో సిమెంట్, ఎల్అండ్టీ ఫైనాన్స్, కేడిలా హెల్త్, అదానీ ఎంటర్, చోళమండలం, ఎల్ఐసీ హౌసింగ్, లుపిన్, పీఎఫ్సీ 5-2 శాతం మధ్య ఎగశాయి. రియల్టీ కౌంటర్లలో ప్రెస్టేజ్, ఒబెరాయ్, సన్‌టెక్, శోభా, గోద్రెజ్ ప్రాపర్టీస్ 4-1 శాతం మధ్య లాభపడ్డాయి. కాగా మరోవైపు.. సెయిల్, సన్ టీవీ, ఎంజీఎల్, ఐడియా, ఇండిగో, టాటా పవర్, టాటా కెమ్, యూబీఎల్, ఐజీఎల్, హెచ్‌పీసీఎల్, పెట్రోనెట్, పీవీఆర్, జిందాల్ స్టీల్, టొరంట్ పవర్, ఫెడరల్ బ్యాంక్ 4-1.2 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.2-0.5 శాతం చొప్పున బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,416 లాభపడగా..1,315 నష్టాలతో నిలిచాయి. ఎఫ్‌పీఐల కొనుగోళ్లు నగదు విభాగంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1,171 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 896 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 298 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 120 కోట్ల అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
ఊగిసలాటతో షురూ- చిన్న షేర్లు ప్లస్
స్వల్ప ఊగిసలాట మధ్య ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు సానుకూలంగా కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 48 పాయింట్లు బలపడి 39,092ను తాకగా.. నిఫ్టీ 12 పాయింట్లు పుంజుకుని 11,534 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 39,161- 39,052 పాయింట్ల మధ్య ఊగిసలాడగా.. నిఫ్టీ 11546- 11517 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. బ్లూచిప్స్ తీరిలా ఎన్ఎస్ఈలో ప్రధానంగా ఫార్మా, ఆటో రంగాలు బలపడగా.. బ్యాంక్స్, ఐటీ డీలాపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఎంఅండ్ఎం, బ్రిటానియా, గ్రాసిమ్, ఎల్అండ్టీ, బజాజ్ ఆటో, ఐషర్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బీపీసీఎల్, ఎయిర్టెల్, టైటన్, మారుతీ, నెస్లే 1.4-0.7 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే జేఎస్‌డబ్ల్యూ స్టీల్, విప్రో, యూపీఎల్, ఏషియన్ పెయింట్స్, హెచ్‌సీఎల్ టెక్, ఎస్బీఐ, ఐసీఐసీఐ, ఇండస్ఇండ్, యాక్సిస్, పవర్‌గ్రిడ్ 0.7-0.4 శాతం మధ్య బలహీనపడ్డాయి. అపోలో ప్లస్ డెరివేటివ్ కౌంటర్లలో అపోలో హాస్పిటల్స్, అదానీ ఎంటర్, అరబిందో, బయోకాన్, ఐబీ హౌసింగ్, పిరమల్, రామ్‌కో సిమెంట్, మదర్సన్, టీవీఎస్ మోటార్, భారత్ ఫోర్జ్, కేడిలా హెల్త్, ఎస్కార్ట్స్ 4-1.3 శాతం మధ్య ఎగశాయి. కాగా మరోవైపు సన్ టీవీ, టాటా కెమ్, ఐడియా, ఐజీఎల్, పీవీఆర్, కంకార్, అమరరాజా, ఇండిగో, ఫెడరల్ బ్యాంక్ 1.5-0.7 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.35 శాతం చొప్పున బలపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 932 లాభపడగా., 552 నష్టాలతో కదులుతున్నాయి. -
సెన్సెక్స్@ 39,000- బ్యాంక్స్ దన్ను
ప్రధానంగా ప్రయివేట్ బ్యాంక్స్, ఫార్మా దిగ్గజాలకు డిమాండ్ నెలకొనడంతో దేశీ స్టాక్ మార్కెట్లు ఇంట్రాడే గరిష్టాల వద్దే నిలవగలిగాయి. దీంతో సెన్సెక్స్ 39,000 పాయింట్ల మైలురాయికి ఎగువన స్థిరపడగా.. నిఫ్టీ సాంకేతికంగా కీలకమైన 11,500ను అధిగమించింది. నేటి ట్రేడింగ్‌లోనూ యథాప్రకారం ఆటుపోట్లు కనిపించినప్పటికీ చివరికి సెన్సెక్స్ 288 పాయింట్లు బలపడి 39,044 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 82 పాయింట్లు ఎగసి 11,522 వద్ద నిలిచింది. అయితే ఇంట్రాడేలో సెన్సెక్స్ 38,754 దిగువన కనిష్టాన్ని చవిచూడగా.. నిఫ్టీ ఒక దశలో 11,442 వరకూ నీరసించింది. మీడియా డౌన్ ఎన్ఎస్ఈలో ప్రధానంగా ఫార్మా, ప్రయివేట్ బ్యాంక్స్ 2 శాతం పుంజుకోగా.. ఐటీ 0.6 శాతం లాభపడింది. రియల్టీ, మీడియా 0.7-0.4 శాతం చొప్పున బలహీనపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఇండస్ఇండ్, సిప్లా, యూపీఎల్, యాక్సిస్, ఎయిర్టెల్, ఐసీఐసీఐ, బజాజ్ ఫైనాన్స్, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, కొటక్ మహీంద్రా, గ్రాసిమ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఆర్ఐఎల్ 5-1 శాతం మధ్య ఎగశాయి. అయితే టైటన్, మారుతీ, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐషర్, ఐటీసీ, బీపీసీఎల్, ఏషియన్ పెయింట్స్, కోల్ ఇండియా, బజాజ్ ఆటో, ఐవోసీ, హెచ్‌సీఎల్ టెక్ 1.4-0.4 శాతం మధ్య డీలాపడ్డాయి. ఆటో గుడ్ డెరివేటివ్ కౌంటర్లలో మదర్సన్, అశోక్ లేలాండ్, లుపిన్, ఐడీఎఫ్సీ ఫస్ట్, ఎంఅండ్ఎం ఫైనాన్స్, అరబిందో, నౌకరీ, అంబుజా సిమెంట్, ఐజీఎల్, శ్రీరామ్ ట్రాన్స్, మైండ్‌ట్రీ, అమరరాజా, కమిన్స్, గోద్రెజ్‌సీపీ 4-2.4 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోపక్క పీవీఆర్, నాల్కో, ఐబీ హౌసింగ్, బీఈఎల్, మారికో, పేజ్, ఎస్కార్ట్స్, అదానీ ఎంటర్, పీఎన్బీ 3.5-01 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1-1.5 శాతం చొప్పున ఎగశాయి. ట్రేడైన షేర్లలో 1,582 లాభపడగా.. 1,164 నష్టాలతో ముగిశాయి. ఎఫ్‌పీఐల కొనుగోళ్లు నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 298 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 120 కోట్ల అమ్మకాలు చేపట్టాయి. శుక్రవారం ఎఫ్‌పీఐలు రూ. 1,176 కోట్లు ఇన్వెస్ట్ చేయగా, డీఐఐలు రూ. 724 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. -
స్వల్ప నష్టాలతో సరి- ప్రభుత్వ బ్యాంక్స్ జోరు
పారిశ్రామికోత్పత్తి జూన్‌లో పాతాళానికి పడిపోవడం, విదేశీ మార్కెట్ల బలహీనతలతో నీరసంగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు మిడ్‌సెషన్ నుంచీ రికవర్ అయ్యాయి. చివరికి సెన్సెక్స్ 37 పాయింట్లు క్షీణించి 38,370 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 14 పాయింట్ల స్వల్ప నష్టంతో 11,308 వద్ద నిలిచింది. అయితే అమ్మకాలు పెరగడంతో తొలుత సెన్సెక్స్ 38,126 దిగువన కనిష్టాన్ని తాకింది. తదుపరి చివర్లో 38,414 వరకూ ఎగసింది. ఇక నిఫ్టీ 11,243- 11,322 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులు చవిచూసింది. ఆటో, మీడియా అప్ ఎన్ఎస్ఈలో పీఎస్‌యూ బ్యాంక్స్, ఆటో, మీడియా 2.7-2 శాతం మధ్య ఎగశాయి. ఫార్మా, రియల్టీ, మెటల్, ఎఫ్ఎంసీజీ, ప్రయివేట్ బ్యాంక్స్ 1.5-0.4 శాతం మధ్య వెనకడుగు వేశాయి. నిఫ్టీ దిగ్గజాలలో హెచ్‌సీఎల్ టెక్, ఎస్బీఐ, టెక్ మహీంద్రా, ఐషర్, టాటా మోటార్స్, హీరో మోటో, అదానీ పోర్ట్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, మారుతీ, యూపీఎల్ 5-1 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే సిప్లా, కొటక్ బ్యాంక్, సన్ ఫార్మా, బ్రిటానియా, డాక్టర్ రెడ్డీస్, హిందాల్కో, బీపీసీఎల్, విప్రో, బజాజ్ ఫిన్, ఎల్అండ్టీ, ఐవోసీ, బజాజ్ ఫైనాన్స్ 2-1 శాతం మధ్య క్షీణించాయి. ఇండిగో జూమ్ డెరివేటివ్స్‌లో ఇండిగో 10 శాతం దూసుకెళ్లగా.. మదర్సన్, బాష్, పీవీఆర్, భారత్ ఫోర్జ్, బీఈఎల్, పెట్రోనెట్, అశోక్ లేలాండ్, ఎక్సైడ్, పీఎన్బీ 8-3 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు నౌకరీ, కంకార్, ముత్తూట్, బయోకాన్, అపోలో హాస్పిటల్స్, కేడిలా, గ్లెన్‌మార్క్, టొరంట్ ఫార్మా, లుపిన్ 4-2 శాతం మధ్య పతనమయ్యాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.25 శాతం నీరసించింది. ట్రేడైన షేర్లలో 1511 లాభపడగా.. 1214 నష్టపోయాయి. ఎఫ్‌పీఐల పెట్టుబడులు నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1014 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 1415 కోట్లకుపైగా విలువైన అమ్మకాలు చేపట్టాయి. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 303 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 505 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. -
చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం
సాక్షి, న్యూఢిల్లీ: విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్ ఫార్మాసూటికల్ ఇన్‌గ్రీడియంట్స్ (ఏపీఐ) దిగుమతులపై భారత ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా పెంచాలని ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు, చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది. ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్స్ (డీఐ), ఏపీఐల దేశీయ తయారీని ప్రోత్సహించడానికి ఔషధ పరిశ్రమలకు ప్రొడక్షన్ లింక్డ్ ప్రోత్సాహక (పిఎల్ఐ)పథకాన్ని ఇటీవల డీఓపీ ప్రకటించింది. ప్రస్తుతం చైనాపై ఎక్కువగా ఆధారపడిన 53 కీలకమైన ఏపీఐలతో సహా 41 ఇతర ఉత్పత్తులకు ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి భారతీయ కంపెనీలకు 10 వేల కోట్ల రూపాయల ప్రోత్సాహకాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
చివరికి నేలచూపులే- ఫార్మా భేష్
ఆగస్ట్ డెరివేటివ్ సిరీస్ తొలి రోజు దేశీ స్టాక్ మార్కెట్లు ఆద్యంతం హెచ్చుతగ్గుల మధ్య కదిలాయి. చివరికి సెన్సెక్స్ 129 పాయింట్లు క్షీణించి 37,607 వద్ద నిలిచింది. నిఫ్టీ 29 పాయింట్లు తక్కువగా 11,073 వద్ద ముగిసింది. అమెరికన్ టెక్ దిగ్గజాలు అమెజాన్, యాపిల్, ఫేస్బుక్ ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ఫ్యూచర్స్‌లో ఈ షేర్లన్నీ హైజంప్ చేశాయి. అయినప్పటికీ దేశీయంగా మార్కెట్లు ఒడిదొడుకుల మధ్యే ట్రేడయ్యాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 37,898 వద్ద గరిష్టాన్ని తాకగా.. 37,432 దిగువన కనిష్టాన్నీ చవిచూసింది. నిఫ్టీ 11,150-11,027 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. పీఎస్‌యూ బ్యాంక్స్, రియల్టీ అప్ ఎన్ఎస్ఈలో ప్రధానంగా ఫార్మా 3.6 శాతం జంప్‌చేయగా.. పీఎస్‌యూ బ్యాంక్స్, రియల్టీ 1.5 శాతం చొప్పున ఎగశాయి. ఎఫ్ఎంసీజీ, మెటల్ సైతం 0.6 శాతం చొప్పున బలపడటం గమనార్హం. మీడియా మాత్రమే ప్రస్తావించదగ్గ స్థాయిలో 0.9 శాతం బలహీనపడగా.. ప్రయివేట్ బ్యాంక్స్ 0.3 శాతం నీరసించాయి. నిఫ్టీ దిగ్గజాలలో సన్ ఫార్మా, సిప్లా, గ్రాసిమ్ 5 శాతం చొప్పున జంప్‌చేశాయి. ఈ బాటలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్, యూపీఎల్, ఎస్బీఐ, ఎంఅండ్ఎం, యాక్సిస్, హెచ్‌సీఎల్ టెక్, టాటా మోటార్స్ 3-1.5 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే ఐషర్, ఆర్ఐఎల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఆటో, కొటక్ బ్యాంక్, విప్రో, ఏషియన్ పెయింట్స్, హెచ్డీఎఫ్సీ, హీరో మోటో 3-1.5 శాతం మధ్య క్షీణించడంతో మార్కెట్లు తిరోగమించాయి. ఫార్మా జోరు డెరివేటివ్ కౌంటర్లలో టొరంట్ ఫార్మా, పిరమల్, గోద్రెజ్ ప్రాపర్టీస్, అరబిందో, కేడిలా హెల్త్, ఐడియా, బాలకృష్ణ, ఇండిగో, డాబర్, లుపిన్ 9-4 శాతం మధ్య దూసుకెళ్లాయి. కాగా.. మరోపక్క చోళమండలం, ఐబీ హౌసింగ్, హెచ్‌పీసీఎల్, ఎన్ఎండీసీ, టీవీఎస్, మణప్పురం, ఈక్విటాస్, ముత్తూట్, జూబిలెంట్ ఫుడ్, అపోలో హాస్పిటల్స్ 5.3-2 శాతం మధ్య వెనకడుగు వేశాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.4-0.8 శాతం మధ్య బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1430 నష్టపోగా.. 1232 లాభపడ్డాయి. డీఐఐల అమ్మకాలు.. నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 207 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 387 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించాయి. బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 353 కోట్లు, డీఐఐలు రూ. 506 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. -
తొలుత లాభాలు- తుదకు నష్టాలు
జులై ఎఫ్‌అండ్‌వో సిరీస్ చివరి రోజు దేశీ స్టాక్ మార్కెట్లు డీలా పడ్డాయి. సెన్సెక్స్ 335 పాయింట్లు పతనమై 37,736వద్ద ముగిసింది. వెరసి 38,000 పాయింట్ల మార్క్ దిగువకు చేరింది. నిఫ్టీ సైతం 101 పాయింట్లు కోల్పోయి 11,102 వద్ద స్థిరపడింది. ఆర్థిక వ్యవస్థకు అన్నిరకాలుగా అండగా నిలవనున్నట్లు ఫెడరల్ రిజర్వ్ హామీ ఇవ్వడంతో బుధవారం అమెరికా స్టాక్ మార్కెట్లు బలపడ్డాయి. ఈ నేపథ్యంలో హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు తదుపరి యథాప్రకారం అమ్మకాల ఒత్తిడిలో పడ్డాయి. ట్రేడర్లు పొజిషన్లను ఆగస్ట్ సిరీస్‌కు రోలోవర్ చేసుకునే బాటలో మార్కెట్లు ఆటుపోట్లను చవిచూసినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. దీంతో సెన్సెక్స్ 38,414 వద్ద గరిష్టాన్ని తాకగా.. 37,678 వద్ద కనిష్టాన్నీ చవిచూసింది. నిఫ్టీ 11,300- 11,085 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. మీడియా బోర్లా ఎన్ఎస్ఈలో బ్యాంక్ నిఫ్టీ, మీడియా 2 శాతం స్థాయిలో బోర్లా పడగా.. మెటల్ 1.2 శాతం, ఆటో 0.6 శాతం చొప్పున నీరసించాయి. అయితే ఫార్మా 3 శాతం ఎగసింది. ఐటీ 0.7 శాతం పుంజుకుంది. నిఫ్టీ దిగ్గజాలలో డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, విప్రో, వేదాంతా, మారుతీ, ఇన్ఫోసిస్, సిప్లా, బ్రిటానియా 5-0.5 శాతం మధ్య లాభపడ్డాయి. మరోపక్క బీపీసీఎల్, ఇండస్ఇండ్, ఐవోసీ, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్, ఎయిర్టెల్, పవర్‌గ్రిడ్, టాటా మోటార్స్, ఓఎన్జీసీ, గ్రాసిమ్, ఎస్బీఐ, బజాజ్ ఫిన్, గెయిల్ 8-2 శాతం మధ్య పతనమయ్యాయి. ఫైనాన్స్ వీక్ డెరివేటివ్స్‌లో దివీస్, అపోలో హాస్పిటల్స్, జూబిలెండ్ ఫుడ్, నిట్ టెక్, గ్లెన్‌మార్క్, ఎస్బీఐ లైఫ్, లుపిన్, ఇండిగో, అమరరాజా 6-3 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మణప్పురం, ఐబీ హౌసింగ్, శ్రీరామ్ ట్రాన్స్, పీవీఆర్, ఎస్ఆర్ఎఫ్, ఆర్బీఎల్, ఉజ్జీవన్, పిరమల్, భెల్, ఈక్విటాస్ 10-4 శాతం మధ్య పతనమయ్యాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.7 శాతం చొప్పున క్షీణించాయి. ట్రేడైన షేర్లలో 1584 నష్టపోగా.. 1060 మాత్రమే లాభపడ్డాయి. అమ్మకాలవైపు.. నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 353 కోట్లు, దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 506 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 246 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 1017 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించిన విషయం విదితమే. -
కన్సాలిడేషన్‌లో.. ఫార్మా షేర్ల జోరు
దేశీ స్టాక్ మార్కెట్లు కన్సాలిడేషన్ బాట పట్టాయి. జులై ఎఫ్‌అండ్‌వో సిరీస్ నేడు ముగియనుండటంతో స్వల్ప ఆటుపోట్లు చవిచూస్తున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 56 పాయింట్లు క్షీణించి 38,015కు చేరగా.. 21 పాయింట్లు తగ్గిన నిఫ్టీ 11,182 వద్ద కదులుతోంది. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఫార్మా రంగ కౌంటర్లకు మరోసారి డిమాండ్ కనిపిస్తోంది. వెరసి ఎన్ఎస్ఈలో ఫార్మా ఇండెక్స్ 2.5 శాతం ఎగసింది. డాక్టర్ రెడ్డీస్ జూమ్ క్యూ1 ఫలితాల నేపథ్యంలో ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ 5 శాతం జంప్‌చేసింది. రూ. 4520 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 4560 వద్ద రికార్డ్ గరిష్టాన్ని తాకింది. ఈ బాటలో దివీస్ ల్యాబ్స్ 5 శాతం ఎగసి రూ. 2537 వద్ద, గ్లెన్‌మార్క్ 4.4 శాతం జంప్‌చేసి రూ. 443 వద్ద, అపోలో హస్పిటల్స్ 4.2 శాతం పెరిగి రూ. 1710 వద్ద ట్రేడవుతున్నాయి. లాభాల బాటలో ఇతర ఫార్మా కౌంటర్లలో లుపిన్ 3.6 శాతం పుంజుకుని రూ. 890కు చేరగా.. టొరంట్ ఫార్మా 3 శాతం బలపడి రూ. 2450ను తాకింది. ఇదేవిధంగా సన్ ఫార్మా, బయోకాన్, అరబిందో ఫార్మా, కేడిలా హెల్త్‌కేర్ 1.2 శాతం స్థాయిలో లాభపడి కదులుతున్నాయి. కాగా.. నిఫ్టీ దిగ్గజాలలో బీపీసీఎల్ 7 శాతం పతనమైంది. ఇతర బ్లూచిప్స్‌లో ఐవోసీ, ఎయిర్టెల్, ఇండస్ఇండ్, పవర్‌గ్రిడ్, హీరో మోటో, యాక్సిస్, గెయిల్, ఎన్టీపీసీ, టాటా మోటార్స్ 4-1.5 శాతం మధ్య డీలాపడ్డాయి. -
సంక్షోభంలోనూ ‘లైఫ్’ ఉంది..
సాక్షి, హైదరాబాద్: కరోనా సంక్షోభ సమయంలోనే కాకుండా ఆ తర్వాత కూడా ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో అనేక అవకాశాలు ఉంటాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు అన్నారు. ఈ రంగాల్లో భవిష్యత్తు అవకాశాలను అందిపుచ్చుకునేందుకు అవసరమైన ప్రణాళికల్ని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసుకుంటున్నట్లు వెల్లడించారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం మంగళవారం నిర్వహించిన ఓ వెబినార్‌లో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. కేవలం ఔషధ తయారీకే పరిమితం కాక భవిష్యత్తులో డిజిటల్ డ్రగ్ డిస్కవరీ వంటి రంగాల్లోనూ అవకాశాలను అందిపుచ్చుకుంటామన్నారు. ఐటీ రంగానికి చెందిన ఐదు దిగ్గజ కంపెనీలు హైదరాబాద్‌లో తమ కార్యాలయాలు ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అదేరీతిలో నోవార్టిస్ వంటి ఫార్మా దిగ్గజ కంపెనీలూ హైదరాబాద్‌లో కార్యాలయాలు ఏర్పాటు చేశాయన్నారు. డ్రోన్ల ద్వారా ఔషధాల సరఫరా: వరల్డ్ ఎకనమిక్ ఫోరం భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ ప్రస్తావించారు. అపోలో, వరల్డ్ ఎకనమిక్ ఫోరంతో కలిసి ‘మెడిసిన్స్ ఫ్రం ది స్కై’ కార్యక్రమంలో భాగంగా అత్యవసర వేళల్లో డ్రోన్ల ద్వారా ఔషధాలను సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఫార్మా రంగంలో సంస్థల నడుమ పోటీయే కాకుండా భాగస్వామ్యానికి కూడా అవకాశముందన్నారు. కరోనా సంక్షోభ సమయంలో హైదరాబాద్ ఫార్మా రంగం మరోమారు తన బలాన్ని చాటుకుందన్నారు. జీనోమ్ వ్యాలీ, మెడికల్ డివైజెస్ పార్కు, ఫార్మాసిటీ వంటి ప్రాజెక్టులతో హైదరాబాద్ ప్రపంచంలోనే అగ్రగామి ఫార్మా డెస్టినేషన్‌గా నిలదొక్కుకుందన్నారు. 30 శాతం వ్యాక్సిన్లు ఇక్కడి నుంచే.. ప్రపంచవ్యాప్తంగా తయారవుతున్న వ్యాక్సిన్లలో హైదరాబాద్ నుంచి 30 శాతం మేర ఉత్పత్తి అవుతున్నాయని, భారత్ బయోటెక్ వంటి కంపెనీలు వ్యాక్సిన్ల తయారీలో ముందున్నాయని కేటీఆర్ వెల్లడించారు. ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాలు స్థానికంగా మరింత విస్తరించేందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయన్నారు. ఐటీ రంగం తరహాలో ఈ రంగాలూ లక్షలాది మందికి ఉపాధి కల్పించే వాతావరణం ఉందని మంత్రి చెప్పారు. -
నష్టాల మార్కెట్లో ఫార్మా దూకుడు..!
లాభాల స్వీకరణతో మార్కెట్ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నప్పటికీ.., శుక్రవారం ఉదయం సెషన్లో ఫార్మా షేర్ల దూకుడు కొనసాగుతోంది. ఫలితంగా ఎన్ఎస్ఈ ఎక్చ్సేంజ్‌లో ఒక్క నిఫ్టీ ఇండెక్స్ మాత్రమే లాభాల్లో కదులుతుంది. నేడు ఈ ఇండెక్స్ 10,382 వద్ద మొదలైంది. మార్కెట్ ప్రారంభం నుంచి ఫార్మా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. దీంతో ఇండెక్స్ ఒక దశలో 1.50శాతం లాభపడి 10476 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఉదయం 10గంటలకు ఇండెక్స్ నిన్నటి ముగింపు (10,322)తో పోలిస్తే అరశాతం లాభంతో 10375 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లో అత్యధికంగా సన్‌ఫార్మా 3.50శాతం లాభపడింది. కేడిల్లా హెల్త్‌కేర్ 1.50శాతం, డాక్టర్ రెడ్డీస్ షేరుఅరశాతం పెరిగింది. మరోవైపు ఇదే ఇండెక్స్‌లో బయోకాన్ 1శాతానికి పైగా నష్టాన్ని చవిచూసింది. దీవీస్ ల్యాబ్స్, సిప్లా, ఆల్కేమ్ ల్యాబ్స్ షేర్లు అరశాతం నష్టాన్ని చవిచూశాయి. అలాగే అరబిందో ఫార్మా, లుపిన్, టోరెంటో ఫార్మా షేర్లు అరశాతం నుంచి 0.10శాతం పతనమయ్యాయి. -
ఆగస్ట్‌లో ఈ 5ఫార్మా షేర్లను కొనండి: సంజీవ్ భాసిన్
వచ్చేవారంలో ఫార్మా షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకునే అవకాశం ఉందని ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ డైరెక్టర్ సంజీవ్ బాసిన్ తెలిపారు. ఆ వారంలో కన్సాలిడేషన్ తర్వాత ఆగస్ట్‌లో ఫార్మా షేర్ల ర్యాలీకి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ తరుణంలో సిప్లా, లుపిన్, డాక్టర్ లాల్ పాథ్‌ల్యాబ్స్, ఇప్కా ల్యాబ్స్, కేడిల్లా హెల్త్‌కేర్ షేర్లను కొనుగోలు చేయవచ్చని భాసిన్ సిఫార్సు చేస్తున్నారు. ఈ 5కంపెనీలకు ఫార్మా రంగంలో మంచి పేరు ఉందన్నారు. జనరిక్, ల్యాబ్, ఏపీఐ ఒప్పందాల విషయంలో ఈ కంపెనీలు అత్యుత్తమ ప్రమాణాలను పాటిస్తున్నాయని తెలిపారు. టెక్నికల్‌గానూ ఈ షేర్ల ర్యాలీకి సిద్ధమైన విషయాన్ని ఛార్ట్లు చెబుతున్నాయన్నారు. నిఫ్టీతో పాటు మిడ్‌క్యాప్ ఇండెక్స్‌లో అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వగలిగే సత్తా ఈ షేర్లకు ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటికీ బుల్మార్కెట్లోనే ఫార్మా షేర్లు: లాభాల స్వీకరణతో ఇటీవల ఫార్మా షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయని అయితే ఇప్పటికీ ఈ షేర్లు బుల్ మార్కెట్లోనే ఉన్నాయని బాసిస్ తెలిపారు. మార్కెట్ మార్చిలో కనిష్టస్థాయిని తాకినపుడు ఫార్మా షేర్ల ర్యాలీ ప్రారంభమైందన్నారు. ‘‘మూడేళ్ల పాటు స్తబ్దుగా ట్రేడైన ఈఫార్మా షేర్లు గత 3నెలల పాటు లాభాల పంట పండిచాయి. నిజానికి ఇండెక్స్‌ల మార్చి కనిష్టం స్థాయి నుంచి 33శాతం రికవరికి ఫార్మా షేర్లు అందించిన తోడ్పాటు అభినందననీయం. ప్రభుత్వరంగ షేర్ల రీ-రేటింగ్ కారణంగా ఇన్వెస్టర్లు పీఎస్‌యూ బ్యాంక్ షేర్ల కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు. మార్కెట్లో నిధులు అధిక బీటా స్టాకుల్లోకి వెళ్లిపోతున్నాయి’’ అని బాసిన్ చెప్పుకొచ్చారు. -
కార్పోరేట్ ఫలితాలను పట్టించుకోనక్కర్లేదు
ప్రస్తుత పరిస్థితుల్లో కార్పోరేట్ ఫలితాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని మోతీలాల్ ఓస్వాల్ ఫండ్ మేనేజర్ సిద్ధార్థ్ బోత్రా తెలిపారు. తొలి త్రైమాసికానికి ప్రత్యేక నేపథ్యం ఉందని కావున కంపెనీల ఫలితాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ‘‘ఏప్రిల్-జూన్ వ్యవధిలో ప్రతి కంపెనీ కనీసం నెలరోజులకు తగ్గకుండా లాక్డౌన్లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో త్రైమాసిక ఫలితాలను పరిగణనలోకి తీసుకోవడం అవివేకం అవుతుంది. అయితే ఈ సందర్భంలోనూ కొన్ని కంపెనీలు మార్కెట్ వర్గాల అంచనాలకు మించి ఫలితాలను ప్రకటించి ఆశ్చర్యపరిచాయి’’ అని బోత్రా చెప్పుకొచ్చారు. ఐటీ, ఫార్మా సెక్టార్‌పై సానుకూలం: ఐటీ సెక్టార్‌పై తాము సానుకూలంగా ఉన్నట్లు బోత్రా తెలిపారు. రానున్న రోజుల్లో ఈ షేర్లు రాణించే అవకాశం ఉందన్నారు. ఇప్పటి వరకు ఫలితాలను వెల్లడించిన ఐటీ కంపెనీలు ఫలితాలు బాగున్నాయని, ఫలితాల ప్రకటన సందర్భంగా యాజమాన్య వ్యాఖ్యలు, అవుట్‌లుక్‌లు ఐటీ రంగం షేర్లను మరింత ఆకర్షణీయం చేశాయని బోత్రా తెలిపారు. అలాగే గత రెండేళ్ల నుంచి ఫార్మా షేర్లపై తాము సానుకూలంగానే ఉన్నామని తెలిపారు. ఫార్మా రంగంలో తమకు పెద్ద పొజిషన్లు ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికీ తమ దృష్టి దేశీయ ఫార్మా కంపెనీల షేర్లపై ఉందని, ఈ సెక్టార్ నుండి డాక్టర్ రెడ్డీస్ షేరును సిఫార్సు చేస్తామని బోత్రా తెలిపారు. రూరల్ రికవరీ భేష్: దేశీయ ఆర్థిక వ్యవస్థనంతటికీ అవలోకనం చేస్తే..., వ్యవసాయ లేదా రూరల్ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది. అది ప్రభుత్వ ప్రకటించిన ఉద్దీపన చర్యలతో కావచ్చు.మెరుగైన వర్షపాతం నమోదు కావచ్చు రూరల్ వ్యవస్థ సవ్యంగా ఉంది. వలస కూలీలు కూడా తమ స్వస్థలాలైన గ్రామీణ ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. ఫలితంగా అక్కడ వినిమయ వ్యయాలు పెరుగుతున్నాయి. ఈ అంశాలన్నీ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు సహాయం చేస్తున్నాయి. -
ఐటీ, ఫార్మా పుష్- మార్కెట్లు భల్లేభల్లే
కోవిడ్-19కు వ్యాక్సిన్‌పై ఆశలతో ప్రపంచ మార్కెట్లు బలపడటంతో దేశీయంగానూ ఇన్వెస్టర్లకు హుషారొచ్చింది. కొనుగోళ్లకు ఆసక్తి చూపినప్పటికీ కొంత తడబాటు చూపడంతో తొలి పావు గంటలో దేశీ స్టాక్ మార్కెట్లు ఒడిదొడుకులు ఎదుర్కొన్నాయి. తదుపరి కొనుగోళ్లదే పైచేయికావడంతో జోరందుకున్నాయి. చివరి గంటన్నర సమయంలో మరింత దూకుడు చూపాయి. వెరసి సెన్సెక్స్ 420 పాయింట్లు జంప్‌చేసి 36,472 వద్ద నిలవగా.. నిఫ్టీ 122 పాయింట్లు జమ చేసుకుని 10,740 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 36,525 వద్ద గరిష్టాన్ని తాకగా.. 36,038 వద్ద కనిష్టానికీ చేరింది. నిఫ్టీ సైతం 10,755- 10,595 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులు చవిచూసింది. మీడియా డీలా ఎన్ఎస్ఈలో ఐటీ రంగం 3 శాతం పురోగమించగా.. ఫార్మా, ఆటో, ప్రయివేట్ బ్యాంక్స్ 1.5 శాతం స్థాయిలో ఎగశాయి. మీడియా 1.7 శాతం డీలా పడింది. నిఫ్టీ దిగ్గజాలలో ఇన్ఫోసిస్ 10 శాతం దూసుకెళ్లగా.. బీపీసీఎల్, సిప్లా, ఎంఅండ్ఎం, బ్రిటానియా, ఇండస్ఇండ్, నెస్లే, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హెచ్‌సీఎల్ టెక్, డాక్టర్ రెడ్డీస్ 7-3 శాతం మధ్య జంప్‌చేశాయి. అయితే ఇన్ఫ్రాటెల్ 7 శాతం పతనమైంది. ఇతర బ్లూచిప్స్‌లో టెక్ మహీంద్రా, ఐటీసీ, జీ, ఐవోసీ, కోల్ ఇండియా, ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్, గ్రాసిమ్, యూపీఎల్ 3-1 శాతం మధ్య బలహీనపడ్డాయి. టెలికం పతనం డెరివేటివ్ కౌంటర్లలో మ్యాక్స్ ఫైనాన్స్, జిందాల్ స్టీల్, ముత్తూట్ ఫైనాన్స్, ఎంఅండ్ఎం ఫైనాన్స్, ఫెడరల్ బ్యాంక్, మణప్పురం, సెయిల్ 8.3-4.5 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోపక్క ఐడియా 10 శాతం, ఇన్ప్రాటెల్ 7 శాతం చొప్పున పతనమయ్యాయి. ఈ బాటలో అపోలో టైర్, నిట్ టెక్, బంధన్ బ్యాంక్, యూబీఎల్, అపోలో హాస్పిటల్స్ 3-2 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.7 శాతం పుంజుకోగా.. స్మాల్ క్యాప్ 0.15 శాతం నీరసించింది. ట్రేడైన షేర్లలో 1078 లాభపడగా.. 1528 నష్టపోయాయి. భారీ అమ్మకాలు నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 222 కోట్లు, దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 899 కోట్లు చొప్పున స్టాక్స్‌లో అమ్మకాలు చేపట్టారు. ఇక మంగళవారం సైతం ఎఫ్‌పీఐలు దాదాపు రూ. 1566 కోట్లు, డీఐఐలు రూ. 650 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. -
లాభాల్లో ఫార్మా షేర్లు - నష్టాల్లో మార్కెట్
మార్కెట్ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నప్పటికీ.., శుక్రవారం ఉదయం సెషన్లోఫార్మా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. ఫలితంగా ఎన్ఎస్ఈలో ఫార్మా రంగానికి ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పార్మా ఇండెక్స్ దాదాపు 2శాతం లాభపడింది. డాలర్ మారకంలో రూపాయి బలహీనత ఫార్మా షేర్లకు కలిసొస్తుంది. మనదేశంలో తయారయ్యే ఔషధాలు అధిక స్థాయిలో విదేశాలకు ఎగుమతి అవుతుంటాయి. రూపాయి బలహీనతతో విదేశీ ఎగుమతులు మరింత పెరగవచ్చనే ఆశవాహ అంచనాలు ఫార్మా షేర్లను నడిపిస్తున్నాయి. మరోవైపు కరోనా వ్యాక్సిన్ అభివృద్ది చేయడంలో, వేగంగా తయారీని పెంచడంలో భారత్ కచ్చితంగా కీలకపాత్ర పోషిస్తుందని ప్రధాని మోదీ ప్రకటన ఫార్మా షేర్లకు కలిసొచ్చింది. ఉదయం గం.11:30ని.లకు ఫార్మా ఇండెక్స్ మునుపటి ముగింపు(9,987.55)తో పోలిస్తే 1శాతానికి పైగా లాభంతో 10100 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇదే సమయానికి ఫార్మా షేర్లైన సన్‌ఫార్మా 3శాతం, బయోకాన్ 2.50శాతం, టోరెంటో ఫార్మా 1.50శాతం, అరబిందో ఫార్మా, దివీస్ ల్యాబ్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ షేర్లు 1శాతం పెరిగాయి. సిప్లా, కేడిల్లా హెల్త్‌కేర్, ఆల్కేమ్ షేర్లు అరశాతం నుంచి 0.10శాతం పెరిగాయి. ఒక్క లుపిన్ షేరు మాత్రం స్వల్పంగా 0.10శాతం నష్టాన్ని చవిచూసింది. నష్టాల్లో మార్కెట్: మిడ్‌సెషన్ సమయానికి మార్కెట్ నష్టాల్లో కదలాడుతోంది. మెటల్, బ్యాంకింగ్ రంగ షేర్లలో అమ్మకాలతో సూచీల నష్టాలను మూటగట్టుకున్నాయి. మధ్యాహ్నం 12గంటలకు సెన్సెక్స్ 250 పాయింట్లను కోల్పోయి 36,494 వద్ద, నిఫ్టీ 76 పాయింట్లను నష్టపోయి 10,737 వద్ద కదులుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్ నేడు నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. -
దలాల్ స్ట్రీట్‌లోకి కొత్త జూదగాళ్లు వచ్చారు జాగ్రత్త..!
దలాల్ స్ట్రీట్‌లోకి కొత్త జూదగాళ్లు వచ్చారని, ఈ నేపథ్యంలో అప్రమత్తత వహించాలంటూ ప్రముఖ మార్కెట్ నిపుణుడు విజయ్ ఖేడియా హెచ్చరిస్తున్నారు. దేశవ్యాప్తంగా లాక్డౌన్ సమయంలో కొత్త సంపన్నుల రాకతో భారత స్టాక్ మార్కెట్ రద్దీగా మారినట్లు ఖేడియా తెలిపారు. కరోనా కట్టడిలో భాగంగా దేశ ప్రజలందరూ తమ ఆర్థిక, సామాజిక కార్యక్రమాలను నిలిపివేసి ఇళ్లకు పరిమితం కావాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. ఇదే సమయంలో ఇండియా డిపాజిటరీ గణాంకాలను పరిశీలిస్తే ఈ లాక్డౌన్ కాలం(3నెలలు)లో కొత్త డీమాట్ అకౌంట్ల సంఖ్య భారీగా పెరిగింది. దాదాపు 18లక్షల కొత్త డిమాండ్ అకౌంట్లు మార్చి-మే నెలలో పుట్టుకొచ్చినట్లు సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెర్ నివేదికలు చెబుతున్నాయి. మార్కెట్లోకి ఈ కొత్తగా ప్రవేశించినవారిని ఇన్వెస్టర్లు లేదా ట్రేడర్లుగా అని పిలుస్తారని, కాని తాను మాత్రం వారిని జూదగాళ్లుగా పిలవడానికి ఇష్టపడతానని ప్రజలను పేర్కోన్నారు. వీరికి ఇప్పుడు స్టాక్ మార్కెట్లో పందెం కాయడానికి చట్టపరమైన హక్కులు ఉన్నాయన్నారు. జూదగాడికి, ఫ్యూచర్స్ ట్రేడర్‌కు మధ్య ఒక చిన్న తేడా ఉంటుందని, జూదగాడు ఊహాగానాలను విశ్వసిస్తారని ఆయన తెలిపారు. అందుకే ఈక్విటీ మార్కెట్ భారీగా ఒడిదుడుకులకు లోనవుతుందని తెలిపారు. అయితే లాక్డౌన్ టైంలో మార్కెట్లోకి వచ్చిన నిజమైన ఇన్వెస్టర్లకు ఆయన రెండు సలహాలిచ్చారు. ఇంట్రాడే ట్రేడింగ్‌కు దూరంగా ఉండమని, మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడుల ద్వారా వారు తమ ప్రయాణాన్ని ప్రారంభించాలని ఖేడియా తెలిపారు. మరో 6నెలల పాటు నిఫ్టీ 8,000-10,500 శ్రేణిలోనే: నిఫ్టీ ఇండెక్స్ మరో 6నెలల పాటు నిఫ్టీ 8,000-10,500 శ్రేణిలోనే కదలాడేందుకు ఎక్కువ అవకాశాలున్నట్లు విజయ్ ఖేడియా అభిప్రాయపడ్డారు. ‘‘దేశ ఆర్థిక వ్యవస్థ, కోవిడ్-19 అంశాల నుంచి మరో 6-9 నెలల పాటు ప్రతికూల వార్తలనే ఊహించవచ్చు. ఈ వార్తలు మార్కెట్ సెంటిమెంట్ బలహీనపరిస్తాయి. మారిటోరియం విధింపు నిషేధం ముగింపు తర్వాత ఎన్పీఏలపై స్పష్టత వస్తుంది. ఇది మార్కెట్ తదుపరి గమనానికి కీలకం అవుతుంది.’’ అని ఆయన పేరొన్నారు. ఫార్మా, ఐటీ, టెలికాం షేర్లు మార్కెట్ నడిపిస్తాయి: ఫార్మా, ఐటీ, టెలికాం రంగాలకు చెందిన షేర్లపై ఖేడియా బుల్లిష్ వైఖరిని కలిగి ఉన్నారు. ఈ 3 రంగాల షేర్లు ఈ ఏడాది మార్కెట్‌ను నడిపిస్తాయని ఆయన అంటున్నారు. ముఖ్యంగా ఫార్మా షేర్లు బాగా అప్‌ట్రెండ్ మూమెంటమ్‌ను కలిగి ఉన్నాయన్నారు. అయితే బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లో 33 శాతం వెయిటేజీని కలిగి ఉన్న బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లు భారీగా క్షీణించవచ్చని ఖేడియా తెలిపారు. -
ఫార్మా ఇండెక్స్ 5ఏళ్ల బేర్ ఫేజ్ ముగిసినట్లే..!
ఫార్మా ఇండెక్స్‌లో 5ఏళ్ల బేర్ ఫేజ్ ముగిసిందని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు. అందుకు అనుగుణంగానే నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ మార్చి కనిష్ట స్థాయి 50శాతానికి పైగా లాభపడింది. ఇదే సమయంలో నిప్టీ ఇండెక్స్ 30శాతం ర్యాలీ చేసింది. నిప్టీ ఫార్మా ఇండెక్స్ 2015 ఏప్రిల్ 7న 14,020 వద్ద జీవితకాల గరిష్ట స్థాయి నమోదు చేసింది. దాదాపు ఐదేళ్లలో నిఫ్టీ గరిష్టం నుంచి 40శాతం నష్టాన్ని చవిచూసింది. 2020 జూన్ 5 నాటికి 10,081 స్థాయికి చేరుకుంది. కోవిద్-19 సంక్షోభంలో ఫార్మా రంగం అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. ప్రస్తుత వాతావరణం ఫార్మా రంగానికి మరింత అనుకూలంగా ఉందని, ఈ రంగానికి చెందిన కొన్ని ఎంపిక చేయబడిన షేర్లలో ర్యాలీ మరి కొంతకాలం కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా వారు లుపిన్, అరబిందో ఫార్మా, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, దివీస్ ల్యాబ్స్ షేర్లపై వారు బుల్లిష్ వైఖరిని కలిగి ఉన్నారు ‘‘ఈ ఫార్మా ఇండెక్స్ గరిష్టస్థాయి( 14,020) నుంచి దాదాపు 55శాతం పడిపోయి 6,242 వద్ద కనిష్టాన్ని నమోదు చేసిందని ఆయన తెలిపారు. ఆసక్తికరంగా ఈ మొత్తం కరెక్షన్ ఓ డౌన్వర్డ్ స్లోపింగ్ ఛానెల్లో జరిగింది. ఈ ఏప్రిల్ 2020లో ఛానెల్ బ్రేక్ అవుట్ దాని బేర్ దశ ముగిసిన విషయాన్ని తెలియజేస్తుంది. ఫార్మా ఇండెక్స్ 5 ఏళ్ల తర్వాత బేర్ ఫేజ్‌ను ముగించిన తరువాత దాని స్వంత బుల్ రన్‌ను ప్రారంభించినట్లు తెలుస్తుంది.’’ అని చార్ట్‌వ్యూఇండియాడాట్ ఇన్ సాంకేతిక నిపుణుడు మజర్ మహమ్మద్ తెలిపారు. -
జోరుగా ఫార్మా రంగ షేర్ల ర్యాలీ
ఫార్మా రంగానికి చెందిన షేర్లు గురువారం ఉదయం సెషన్లో జోరుగా ర్యాలీ చేస్తున్నాయి. మార్కెట్ ఒడిదుడుకుల ట్రేడింగ్‌లోనూ ఎన్ఎస్ఈలో నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ దాదాపు 2.50శాతం లాభపడింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఫార్మా రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. నాలుగో త్రైమాసిక ఫలితాలు అంచనాలకు మించి నమోదు కావడంతో అరబిందో ఫార్మా షేరు ఇండెక్స్ ఏడాది గరిష్టాన్ని తాకింది. సన్‌ఫార్మా, బయోకాన్ షేర్లు 3శాతం పెరిగాయి. సిప్లా, లుపిన్, గ్లెన్‌మార్క్ షేర్లు 2శాతం ర్యాలీ చేశాయి. దివీస్ ల్యాబ్స్, డాక్టార్ రెడ్డీస్, కేడిలా హెల్త్‌కేర్ షేర్లు 1శాతం లాభపడ్డాయి. అయితే ఒక్క పిరమిల్‌ఎంటర్‌ప్రైజెస్‌లిమిటెడ్ షేరు మాత్రం 3శాతం నష్టాల్లో ట్రేడ్ అవుతోంది. ఉదయం గం.10:45ని.లకు నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ 2శాతం లాభంతో 9,880.85 వద్ద ట్రేడ్ అవుతోంది. దాదాపు ఏడాదిన్నర తరువాత నిఫ్టీ పార్మా ఇండెక్స్ తిరిగి 10వేల స్థాయిని అందుకుంది. ఇదే సమయానికి సిప్లా, సన్‌ఫార్మా షేర్లు వరుసగా 2శాతం, 3శాతం లాభపడి నిఫ్టీ-50 సూచీలోని టాప్-5 షేర్లలో చోటు దక్కించుకున్నాయి. -
ఫార్మాపై ‘లాక్డౌన్’ ప్రభావం
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ ప్రభావం ఫార్మా అమ్మకాలపై ప డింది. ఆంక్షల కారణంగా ఈ ఆర్థిక సంవత్సరంలోని మొదటి నెల ఏప్రిల్‌లో మందుల అమ్మకాలు 12% తగ్గాయని ఇక్వియా అనే సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. లాక్డౌన్ నేపథ్యంలో ప్రైవేటు ఆసుపత్రులు మూసివేయడం, ప్రజలు బయటకు వచ్చే పరిస్థితులు లేకపోవడంతోపాటు తయారీ కంపెనీలకు ఉత్పత్తి, పంపిణీ, నిల్వ చేసుకోవడంలో ఉన్న ఇబ్బందులు మందుల అమ్మకాలను గత మూడేళ్ల స్థాయికి దిగజార్చాయని తేలింది. ఒకటి, రెండు కీలక ఆరోగ్య సమస్యలకు సంబంధించిన మందులు మినహా అన్ని రకాల ట్యాబ్లెట్లు, టానిక్‌ల అమ్మకాలు పడిపోయాయని, జీఎస్టీ అమల్లోకి వచ్చిన 2017 జూలై నుంచి దేశంలో ఈ స్థాయిలో ఫార్మా అమ్మకాలు పడిపోవడం ఇదే తొలిసారని ఆ సర్వే వెల్లడించింది. ఆ నాలుగు కలిపి 40 శాతం తగ్గాయి వాస్తవానికి 2020–21 ఆర్థిక సంవత్సరంలో 1–5 శాతం మేర ఫార్మా అమ్మకాలు పెరుగుతాయనే అంచనా ఉండేది. అందుకు తగినట్టుగానే గత మూడేళ్లుగా ఈ రంగం అమ్మకాల్లో వృద్ధి కనిపిస్తోంది. కానీ, లాక్డౌన్ దెబ్బతో అంచనాలు తప్పాయి. ఏకంగా మొదటినెలలోనే 12 శాతం విక్రయాలు తగ్గిపోవడం గమనార్హం. ఇక, గ్యాస్ట్రో, ఇన్ఫెక్షన్లు, నొప్పులు, విటమిన్ మాత్రల అమ్మకాలు కలిపి 40 శాతం అమ్మకాలు తగ్గిపోయాయి. వీటికి తోడు చర్మ వ్యాధులు, న్యూరో వ్యాధులకు సంబంధించిన మందుల అమ్మకాల్లో కూడా తగ్గుదల కనిపించగా, షుగర్, గుండె సంబంధిత వ్యాధుల నియంత్రణకు ఉపయోగించే మందుల అమ్మకాలు మాత్రం పెరిగాయని ఇక్వియా సర్వేలో వెల్లడైంది. మందుల అమ్మకాలు తగ్గాయిలా ఆరోగ్య సమస్య తగ్గిన శాతం ఇన్ఫెక్షన్ మందులు 30.8 స్త్రీ సంబంధిత మందులు 25.5 చర్మ వ్యాధుల మందులు 23 నొప్పుల మందులు 21.6 గ్యాస్ట్రో, పేగు సంబంధిత 15.8 న్యూరో వ్యాధులు 0.5 కాగా, షుగర్ వ్యాధికి ఉపయోగించే మందులు 10 శాతం, గుండె సంబంధిత వ్యాధులకు ఉపయోగించేవి 13 శాతం అమ్మకాలు పెరిగాయి. -
పార్మా షేర్లపై మక్కువ పెంచుకున్న మ్యూచువల్ ఫండ్లు..!
మ్యూచువల్ ఫండ్లు భారతీయ ఫార్మా షేర్లను ఇంతకు ముందు కన్నా అమితంగా ఇష్టపడుతున్నాయి. ఈ క్రమంలో క్యాపిటల్ గూడ్స్ రంగ షేర్లు మ్యూచువల్ ఫండ్ల ఎంపికలో రెండోస్థానానికి దిగివచ్చాయి. ఫార్మా షేర్లకు ఇనిస్టిట్యూషనల్ ఎక్స్పోజర్ 40 నెలల గరిష్ట స్థాయిలో ఉందని మోతీలాల్ ఓస్వాల్ తెలిపింది. మ్యూచువల్ ఫండ్ల పోర్ట్‌ఫోలియోలో ఫార్మా స్టాక్‌ల వెయిటేజీ వార్షిక ప్రాతిపదికన ఈ ఏడాది ఏప్రిల్‌లో 200 బేసిస్ పాయింట్లు పెరిగి 8 శాతానికి చేరుకుంది. ఈ రంగానికి దేశీయ ఫండ్లు ఓవర్ వెయిట్‌ను కేటాయించాయి. ఏప్రిల్‌లో, ఈ రంగం వెయిటేజ్ మార్చి నెలతో పోలిస్తే 90 బేసిస్ పాయింట్లు పెరిగింది. ఏయూఎం టాప్ 20 ఆస్తి నిర్వహణ సంస్థలలో.. 14 ఫండ్లు ఈ రంగంలో 110-670 బేసిస్ పాయింట్ల మేర ఓవర్ వెయిట్‌ను కలిగి ఉన్నాయి. ఆదిత్య బిర్లా ఏఎంసీ ఫార్మా రంగానికి అత్యధికంగా 12.9శాతం కేటాయింపులను కలిగి ఉంది. తరువాత ఎల్అండ్టీ, కెనరా రోబెకో మ్యూచువల్ ఫండ్లు తమ పోర్ట్ ఫోలియోలో వరుసగా 12.4శాతం, 11.7 శాతం కేటాయింపులు చేశాయి. అన్ని రంగాలతో పోలిస్తే ఫార్మా రంగం అత్యల్ప ఆదాయ డౌన్గ్రేడ్ను చూసింది. జెనరిక్ వ్యాపారానికి సంబంధించి యూఎస్ మార్కెట్లో వ్యాపార అవుట్‌లుక్ క్రమంగా మెరుగుపడిన తరువాత కొన్ని షేర్ల ఆదాయాలు మరింత పెరిగాయి. ఫార్మా కంపెనీలకు వచ్చే మొత్తం ఆదాయంలో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ ఎగుమతులే ఉండటం విశేషం. ఔషధాల అనుమతులు పెరుగుదల, ఉత్పత్తులు పెరగడం, అనుకూలమైన కరెన్సీ కదలికలు తదితర అంశాలు ఫార్మా కంపెనీలపై అంచనాలను పెంచుతున్నాయి. అమెరికాలో ఔషధ ఉత్పత్తుల త్రైమాసిక అమ్మకాలు 1.66- 1.75 బిలియన్ డాలర్ల పరిధిలో ఉన్నాయి. ఇది ధర ఒత్తిడి తగ్గిందని సూచిస్తుంది. పర్యవసానంగా, ఫార్మా కంపెనీల షేర్ల ధరల్ని వారు రీ-రేట్ చేస్తాయి. ఈ ఏడాది ప్రారంభంలో నిఫ్టీ సూచీతో పోలిస్తే నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ 8శాతం డిస్కౌంట్‌తో ట్రేడ్ అయ్యేది. ఇప్పుడు నిఫ్టీ ఫార్మా 41.6శాతం ప్రీమియంతో ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ గత మూడు నెలల్లో సెన్సెక్స్‌ను 41శాతం మేర అధిగమించింది. ఇదే కాలంలో సానుకూల రాబడిని అందించే కొన్ని ఇండెక్స్‌ల్లో ఒకటిగా నిలిచింది. -
ఫార్మా రంగంలోకి అమెజాన్..
ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌తో నాటిలస్ బయోటెక్నాలజీ అనే ప్రముఖ స్టార్టప్ ఫార్మా కంపెనీ జతకట్టనుంది. ఈ కంపెనీ మొదటగా 2016లో అంకుర పరిశ్రమగా ప్రారంభమయ్యి ప్రస్తుతం దిగ్గజ కంపెనీల జాబితాలో నిలిచింది. రోగుల ప్రొటీన్‌ను మ్యాపింగ్ చేసి విశ్లేషించడమే కంపెనీ ముఖ్య లక్ష్యమని సహ వ్యవస్థాపకుడు సుజల్ పటేల్ పేర్కొన్నారు. రోగుల ప్రొటీలన్లను మ్యాపింగ్ చేయడం వల్ల క్యాన్సర్ లాంటి దీర్ఘకాలిక జబ్బులకు తక్కువ ఖర్చుతో చికిత్స అందించవచ్చని కంపెనీ పేర్కొంది. వైద్యులకు చికిత్స అందించేందుకు, మందుల తయారీకి.. ప్రొటిన్ మ్యాపింగ్, రక్తనమూనాలను విశ్లేషించడం ఎంతో కీలకమని కంపెనీ ముఖ్య ప్రతినిథులు అభిప్రాయపడ్డారు. మరోవైపు సరికొత్తగా పుట్టుకొస్తున్న వైరస్ల వల్ల ఫార్మా రంగానికి మంచి భవిష్యత్తు ఉంటుందని ఆరోగ్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. -
ప్రమోటర్ల వాటా అప్: షేరు ధర డౌన్ ..!
స్టాక్ మార్కెట్ పతనాన్ని ప్రమోటర్లు తమ సొంత కంపెనీల్లో వాటాను పెంచుకునే అవకాశంగా మలుచుకుంటున్నారు. గడిచిన రెండు త్రైమాసికాల్లో ఓపెన్ మార్కెట్ కొనుగోళ్ల పద్దతిలో సుమారు 24కంపెనీల్లో ప్రమోటర్లు వాటాను పెంచుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కరోనా వైరస్ లాక్డౌన్ విధింపుతో మార్కెట్ రెగ్యులేటర్ సెబీ... త్రైమాసిక ఫలితాలను ప్రకటించేందుకు కంపెనీలకు అదనపు సమయం ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్1 నుంచి జూన్30 వరకు కంపెనీల వాటాలనుప్రమోటర్లు, ఇతర ఇన్సైడర్లు కొనుగోలు చేయడంపై నిషేధం విధించింది. గడచిన 6నెలల్లో సన్‌ఫార్మా, గ్లెన్‌మార్క్, దీపక్ ఫెర్టిలైజర్స్, వైభవ్ గ్లోబల్, చంబల్ ఫెర్టిలైజర్, మహీంద్రా అండ్ మహీంద్రా, గోద్రేజ్ ఆగ్రోవెట్, ఏపిఎల్ అపోలో ట్యూబ్స్, గోద్రేజ్ ఇండస్ట్రీస్ కంపెనీల ప్రమోటర్లు వాటాలను పెంచుకున్నారు. సన్‌ఫార్మా(2 శాతం), దీపక్ ఫెర్టిలేజర్స్(3 శాతం), వైభవ్ గ్లోబల్(19 శాతం) షేర్లు తప్ప ప్రమోటర్లు వాటాలు పెంచుకున్న కంపెనీల షేర్లు వార్షిక ప్రాతిపదికన 50శాతం వరకు నష్టాన్ని చవిచూశాయి. ఇదే సమయంలో సెన్సెక్స్ 20శాతం క్షీణించింది. రెగ్యూలేటరీలు ఫార్మా కంపెనీలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం ఫార్మా రంగానికి కలిసొచ్చింది. అలాగే ఆదాయాల రికవరీపై ఆశలను పెంచింది. ఐదేళ్ల పనితీరు తర్వాత వాల్యూయేషన్లు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. కోవిడ్ -19 మహమ్మారితో ఈ రంగం చాలా పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉంది. ఫార్మా రీ-రేటెడ్ అవుతుందని మేము నమ్ముతున్నాము. కోటక్ పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ ఫండ్ మేనేజర్ అన్షుల్ సైగల్ నవ భారత్ వెంచర్స్, సైయెంట్, జామ్నా అటో, జెన్సార్ టెక్నాలజీస్, సెంట్రమ్ క్యాపిటల్, వక్రంజీ, గ్రేవీస్ కాటన్, జాగరణ్ ప్రకాశణ్, ఐఆర్బీ ఇన్ఫ్రా, వాలియంట్ కమ్యూనికేషన్స్, కమర్షియల్ సిన్ బ్యాగ్స్, సీసీఎల్ ప్రాడెక్ట్స్, కంపెనీల ప్రమోటర్లు అక్టోబర్-మార్చి నెలలో తమ సంస్థల్లో వాటాను పెంచుకున్నారు. ఈ కంపెనీల షేర్లు వార్షిక ప్రాతిపదికన 10-55శాతం నష్టాలను చవిచూశాయి. ప్రమోటర్లు సొంత కంపెనీల్లో వాటాను ఎప్పుడు పెంచుకుంటారు..? కంపెనీ స్టాక్ విలువ పెరుగుతుందని తెలిసినప్పుడు కంపెనీ లేదా సంబంధిత రంగంలో సానుకూల డెవలప్మెంట్ ఉన్నప్పుడు కొన్ని సార్లు కంపెనీ నియంత్రణ ప్రత్యర్థి చేతుల్లోకి వెళ్లకుండా ఉండేందుకు ప్రమోటర్లు తన కంపెనీలో వాటాను పెంచుకుంటాడు. ప్రమోటర్లు ఆకర్షణీయమైన ధరలకు వాటాలను పొందే అవకాశాన్ని ఉపయోగించుకుంటారు. ఇలా సొంత కంపెనీలో వాటా కొనుగోలు అనేది వారి వ్యాపారాలపై విశ్వాసం చూపించడానికి ఒక మార్గం. అయినప్పటికీ, వారి ఇన్వెస్ట్మెంట్ పరిమాణం చిన్న ఇన్వెసర్ల కంటే ఎక్కువగా ఉన్నందున వాటిని గుడ్డిగా అనుసరించకూడదు అని షేర్‌ఖాన్ ఇన్వెస్ట్మెంట్స్ హెడ్ గౌరవ్ దువా పేర్కోన్నారు. -
డాక్టర్ రెడ్డీస్ లాభం 764 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ నికర లాభం 76 శాతం పెరిగి రూ. 764.2 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో నికర లాభం రూ. 434.4 కోట్లు. తాజాగా గ్లోబల్ జనరిక్స్ వ్యాపార విభాగం గణనీయంగా వృద్ధి చెందడం, పన్నులపరమైన భారం కొంత తగ్గడం తదితర అంశాలు లాభాల వృద్ధికి దోహదపడ్డాయని సంస్థ సీఎఫ్‌వో సౌమేన్ చక్రవర్తి తెలిపారు. క్యూ4లో ఆదాయం 10 శాతం వృద్ధితో సుమారు రూ. 4,017 కోట్ల నుంచి దాదాపు రూ. 4,432 కోట్లకు పెరిగింది. కోవిడ్–19 వ్యాధి చికిత్సకు ఉపయోగపడే ఔషధాలను తయారు చేసేందుకు ఇతర సంస్థలతో కలిసి పనిచేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సంస్థ ఎండీ జీవీ ప్రసాద్ వెల్లడించారు. అత్యధిక అమ్మకాలు.. నాలుగో త్రైమాసికంలో అత్యధిక స్థాయిలో విక్రయాలు నమోదు చేసినట్లు చక్రవర్తి తెలిపారు. వార్షికంగా ఆదాయాలు 13 శాతం, లాభాలు నాలుగు శాతం పెరిగాయని పేర్కొన్నారు. వార్షిక లాభాల వృద్ధికి పన్ను అంశంతో పాటు కనీస ప్రత్యామ్నాయ పన్ను (ఎంఏటీ) క్రెడిట్ కూడా తోడ్పడిందని వివరించారు. మొత్తం మీద గత ఆర్థిక సంవత్సరం మెరుగ్గా సాగిందని సౌమేన్ చక్రవర్తి తెలిపారు. క్యూ4లో ఫార్మా సర్వీసెస్, యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ (పీఎస్‌ఏఐ) విభాగం ఆదాయాలు 6 శాతం పెరిగి రూ. 719.5 కోట్లకు చేరాయి. అంతర్జాతీయంగా జనరిక్స్ విభాగం ఆదాయం 20% పెరిగి రూ. 3,640 కోట్లకు చేరింది. ఇందులో ఉత్తర అమెరికా మార్కెట్ 21% పెరిగి రూ. 1,496 కోట్ల నుంచి రూ.1,807 కోట్లకు ఎగసింది. యూరప్ దేశాల్లో ఆదాయాలు 80% వృద్ధితో రూ. 345 కోట్లకు చేరింది. భారత మార్కెట్లో ఆదాయాలు 5% పెరిగాయి. కరోనా వైరస్ కట్టడిపరమైన లాక్డౌన్ కారణంగా సరుకు రవాణా సంబంధ సమస్యలతో అమ్మకాలపై పాక్షికంగా ప్రభావం పడింది. 2019–20 ఏడాదికి గాను రూ. 5 ముఖ విలువ గల షేరు ఒక్కింటికి రూ. 25 తుది డివిడెండ్ చెల్లించాలని నిర్ణయించినట్లు కంపెనీ వెల్లడించింది.