ఫార్మా, టెక్స్టైల్స్పై తీవ్ర ప్రభావం
బ్రెగ్జిట్ ప్రభావం యూరోపియన్ యూనియన్‌కు మాత్రమే పరిమితం కాదు. భారత్ సహా ప్రపంచ దేశాలన్నింటి మీదా ఉంటుంది. ఎగుమతులపై ఆధారపడిన దేశీ ఫార్మా, టెక్స్‌టైల్స్ రంగాలపై ఈ ప్రభావం గణనీయంగా ఉంటుంది. ఆటోమొబైల్ పరికరాల ఎగుమతి సంస్థలు, బ్రిటన్‌లో భారీగా పెట్టుబడులు పెట్టిన సంస్థలపైనా కొంత ఉంటుంది.
ఇక ఐటీ, బీపీవో కంపెనీలు అవసరాన్ని బట్టి ఆ ప్రాంతంలో తమ కార్యకలాపాలను పునర్‌వ్యవస్థీకరించుకోవచ్చు. ఒకవేళ పెద్ద ఎత్తున విదేశీ నిధులు తరలిపోయి... రూపాయి విలువ క్షీణించి... ముడిచమురు ధరలు పెరిగితే గనక సమస్య తీవ్రమవుతుంది. దేశీయంగా వివిధ రంగాలు ఒడిదుడుకులకు లోనుకాక తప్పదు. కానీ త్వరలోనే పరిస్థితులు సర్దుకుంటాయి. ఆర్‌బీఐ, ఆర్థిక శాఖ కలిసి ఈ దిశగా పనిచేస్తాయి. బ్రిటన్ కరెన్సీ పౌండు సుమారు 20 శాతం మేర పతనమయ్యే అవకాశముంది.
‘సాక్షి’ బిజినెస్ ప్రతినిధితో డి.ఎస్.రావత్, సోచామ్ సెక్రటరీ జనరల్