Textile industry
-
ఏటా రూ.9 లక్షల కోట్ల వస్త్ర ఎగుమతులు
న్యూఢిల్లీ: ఇండియా నుంచి ప్రతిఏటా రూ.9 లక్షల కోట్ల విలువైన వస్త్రాలను విదేశాలకు ఎగుమతి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. 2030ని డెడ్‌లైన్‌గా విధించింది. అయితే, గడువు కంటే ముందే అనుకున్న లక్ష్యం సాధిస్తామన్న విశ్వాసం తనకు ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆదివారం ‘భారత్ టెక్స్–2025’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వస్త్రాల ఎగుమతిలో ప్రస్తుతం మన దేశంలో ప్రపంచంలో ఆరో స్థానంలో ఉందని తెలిపారు. మనం ప్రతిఏటా రూ.3 లక్షల కోట్ల విలువైన వస్త్రాలు ఎగుమతి చేస్తున్నామని వెల్లడించారు. దీన్ని మూడు రెట్లు పెంచాలని పిలుపునిచ్చారు. గత పదేళ్లుగా ప్రభుత్వం అమలు చేస్తున్న చర్యలతో వస్త్ర టెక్స్టైల్ రంగం గణనీయమైన ప్రగతి సాధించిందని హర్షం వ్యక్తంచేశారు. ఈ రంగంలో విదేశీ పెట్టుబడులు రెండు రెట్లు పెరిగాయని చెప్పారు. మనం ఇలాగే కష్టపడి పనిచేస్తే గడువు కంటే ముందే ఏటా రూ.9 లక్షల కోట్ల విలువైన వస్త్రాలను ఎగుమతి చేయగలమని స్పస్టంచేశారు. టెక్స్‌టైట్ రంగంలో ఒక యూనిట్ ఏర్పాటు చేయడానికి రూ.75 కోట్లు అవసరమని, దీంతో 2,000 మందికి ఉపాధి లభిస్తుందని ప్రధాని మోదీ వెల్లడించారు. ఈ రంగంలో అడుగుపెడుతున్న ఔత్సాహికులకు రుణ సదుపాయం కల్పించాలని బ్యాంక్‌లకు సూచించారు. వస్త్ర పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన కార్మికులకు అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. 5ఎఫ్ విజన్‌ను ప్రధానమంత్రి ప్రతిపాదించారు. ఫామ్ టు ఫైబర్, ఫైబర్ టు ఫ్యాక్టరీ, ఫ్యాక్టరీ టు ఫ్యాషన్, ఫ్యాషన్ టు ఫారిన్. ఈ విజన్‌తో రైతులకు, నేత కార్మికులకు, డిజైనర్లకు, వ్యాపారులకు నూతన అవకాశాలు అందుబాటులోకి వస్తాయని ఉద్ఘాటించారు. వస్త్ర పరిశ్రమకు కావాల్సిన నూతన పరికరాల తయారీ కోసం ఐఐటీల వంటి విద్యా సంస్థలతో కలిసి పనిచేయాలని వ్యాపారులకు సూచించారు. భారత్ టెక్స్ ఇప్పుడు అంతర్జాతీయ కార్యక్రమంగా మారిందన్నారు. ఇందులో 120 దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారని తెలిపారు. హై–గ్రేడ్ కార్బన్, ఫైబర్ తయారీ దిశగా మన దేశం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. -
రక్తపుటేరు
అర్జెంటీనాలో ఓ కాలువ ఏకంగా ఎరుపు రంగులోకి మారింది. రాజధాని బ్యూనస్ ఎయిర్ష్ సమీపంలో ఉన్న అవెల్లెనెడా మున్సిపాలిటీలోని సరండ్ కాల్వ ఒక్కసారిగా రంగు మారడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అసలేం జరిగిందంటే అర్జెంటీనా, ఉరుగ్వే మధ్య రియో డి లా ప్లాటాలోకి ప్రవహించే జలమార్గంలో స్థానిక తోలు, వస్త్ర పరిశ్రమలు విపరీతంగా రంగులు, రసాయన వ్యర్థాలను వదులుతున్నాయి. దాంతో కాల్వ ఎప్పుడూ పసుపు రంగులో కనిపిస్తూ యాసిడ్ వాసనలు వస్తుంటుంది. అలాంటిది గురువారం అవెల్లెనెడా వాసులు నిద్రలేచే సరికి అది ఉన్నట్టుండి రక్త వర్ణంలోకి మారి భయంకరంగా కనిపించడమే గాక తీవ్ర దుర్గంధం వెదజల్లింది. ఆ విపరీతమైన దుర్వాసనకే ఉలిక్కిపడి లేచామని చాలామంది వాపోయారు. కాలుష్యంపై ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని వారంటున్నారు. అర్జెంటీనా పర్యావరణ శాఖ దీనిపై స్పందించింది. రంగు మార్పుకు కారణాలను గుర్తించడానికి కాల్వ నుంచి నీటి నమూనాలను సేకరించింది. సమీప ఫ్యాక్టరీ నుంచి రంగు లీకవడం వల్లే కాల్వ నీళ్లు ఎర్నగా మారాయని అధికారులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వస్త్రాల ఎగుమతులు రూ.1.82 లక్షల కోట్లు
టెక్స్టైల్స్, అప్పారెల్ (వస్త్రాలు, దుస్తులు) ఎగుమతులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) తొలి ఏడు నెలల కాలంలో (ఏప్రిల్–అక్టోబర్) 21.35 బిలియన్ డాలర్లకు (రూ.1.82 లక్షల కోట్లు) వృద్ధి చెందాయి. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఎగుమతులు 20 బిలియన్ డాలర్లతో పోల్చి చూస్తే ఏడు శాతం వృద్ధి నమోదైంది. 8,733 మిలియన్ డాలర్ల(USD) ఎగుమతులు (మొత్తం ఎగుమతుల్లో 41 శాతం) రెడీమేడ్(readymade) వస్త్ర విభాగంలోనే నమోదయ్యాయి.కాటన్ టెక్స్టైల్స్ విభాగం నుంచి 7,082 మిలియన్ డాలర్లు (33 శాతం), మనుషుల తయారీ టెక్స్టైల్స్ ఎగుమతులు 3,105 మిలియన్ డాలర్లు (15 శాతం) చొప్పున ఉన్నట్టు కేంద్ర టెక్స్టైల్స్(Textile) శాఖ గణాంకాలు విడుదల చేసింది. వూల్ విభాగంలో 19 శాతం, హ్యాండ్లూమ్ విభాగంలో 6 శాతం చొప్పున ఎగుమతులు క్షీణించగా, మిగిలిన అన్ని విభాగాల్లో ఎగుమతుల వృద్ధి నమోదైనట్టు వెల్లడించింది. మరోవైపు ఇదే కాలంలో టెక్స్టైల్స్, అప్పారెల్ దిగుమతులు ఒక శాతం క్షీణించి 5,425 మిలియన్ డాలర్లుగా ఉన్నట్టు ప్రకటించింది. అత్యధికంగా మ్యాన్ మేడ్ టెక్స్టైల్స్ దిగుమతులు 1,859 మిలియన్ డాలర్లు (34 శాతం)గా ఉన్నాయి. కాటన్ టెక్స్టైల్స్ విభాగంలో, ప్రధానంగా కాటన్ ఫైబర్(Cotton Fiber) దిగుమతులు పెరిగినట్టు టెక్స్టైల్స్ శాఖ నివేదిక వెల్లడించింది. ఇది దేశీ తయారీ సామర్థ్యం పెరగడాన్ని సూచిస్తున్నట్టు పేర్కొంది. ఇదీ చదవండి: ప్రపంచంలో అధిక వేతనం ఈయనకే..!అంతర్జాతీయంగా 3.9 శాతం వాటా..2023–24లో టెక్స్టైల్స్, అప్పారెల్ దిగుమతులు 8.94 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 15 శాతం తగ్గాయి. 2023 సంవత్సరం టెక్స్టైల్స్ ఎగుమతుల్లో భారత్ అంతర్జాతీయంగా ఆరో అతిపెద్ద దేశంగా నిలిచింది. ‘టెక్స్టైల్స్, అప్పారెల్ అంతర్జాతీయ మార్కెట్లో మన దేశ వాటా 3.9 శాతంగా ఉంది. యూఎస్ఏ, ఈయూ 47 శాతం వాటాతో భారత్‌కు అతి పెద్ద ఎగుమతి కేంద్రాలుగా ఉన్నాయి. టెక్స్టైల్స్, అప్పారెల్ పరంగా వాణిజ్య మిగులుతో మన దేశం ఉంది.’అని టెక్స్టైల్స్ శాఖ వెల్లడించింది. -
రూ.ఎనిమిది లక్షల కోట్ల అక్రమ దందా!
దుస్తులు, నిత్యం వినియోగించే వస్తువులు సహా ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్(ఎఫ్ఎంసీజీ) వంటి ఐదు కీలక విభాగాల్లో అక్రమ మార్కెట్ పెరుగుతోందని ఫిక్కీ తెలిపింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను ఈ అక్రమ మార్కెట్ విలువ ఏకంగా రూ.7.97 లక్షల కోట్లకు చేరిందని నివేదికలో పేర్కొంది. అక్రమ వ్యాపారాన్ని అరికట్టడానికి కఠిన శిక్షలు, మెరుగైన నిఘా వ్యవస్థను అమలు చేయాలని కేంద్ర సహాయమంత్రి రణ్విత్‌సింగ్ బిట్టు తెలిపారు.ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఫిక్కీ) కమిటీ-క్యాస్కేడ్, థాట్ ఆర్బిట్రేజ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంయుక్తంగా నివేదిక విడుదల చేశాయి. అందులోని వివరాల ప్రకారం..2022-23లో అధికంగా ప్యాకేజ్డ్ ఫుడ్ విభాగంలో రూ.2.23 లక్షల కోట్ల అక్రమ మార్కెట్ జరిగింది. ఇది దేశంలో జరిగిన మొత్తం అక్రమ మార్కెట్లో నాలుగో వంతు కంటే ఎక్కువ. వస్త్రాలు, దుస్తుల విభాగంలో అక్రమ వ్యాపారం రూ.4.03 లక్షల కోట్లుగా ఉంది. దేశీయ అక్రమ మార్కెట్లో దీని వాటా సగానికిపైగా ఉంది. 2017-18లో ఇది రూ.3.11 లక్షల కోట్లుగా ఉండేది. 29.67% ఈ మార్కెట్ వృద్ధి చెందింది.ఫిక్కి క్యాస్కేడ్ పదో ఎడిషన్ ‘మాస్క్రేడ్ 2024’ కార్యక్రమంలో కేంద్రమంత్రి రణ్విత్‌సింగ్ బిట్టు మాట్లాడుతూ..‘దేశ ఆర్థిక వృద్ధిని నాశనం చేసే అక్రమ మార్కెట్‌కు వ్యతిరేకంగా వివిధ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు సమన్వయంతో పని చేయాలి. నిబంధనలు ఉల్లంఘించిన వారిని కఠినంగా శిక్షించడంతోపాటు భారీ జరిమానాలు విధించాలి’ అన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి, సీబీఐసీ సభ్యులు రాజీవ్ తల్వార్ మాట్లాడుతూ..‘నకిలీ వస్తువులు, స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు అధునాతన సాంకేతికతతో పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాం. దీనివల్ల రోజూ సగటున 60 అక్రమాలు గుర్తిస్తున్నాం. గత 15 నెలల్లో 3,000 మందిని అరెస్టు చేశాం. రూ.40 కోట్ల విలువైన విదేశీ ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నాం’ అన్నారు. ఇదీ చదవండి: 32,000 మంది ఉద్యోగులు సమ్మె.. 27న చర్చలుఅక్రమ వ్యాపారం అనేది కేవలం భారత్‌కు సంబంధించింది మాత్రమే కాదని, ఇది ప్రపంచ సమస్య అని ఫిక్కీ క్యాస్కేడ్ ఛైర్మన్ అనిల్ రాజ్‌పుత్ అన్నారు. ‘ప్రపంచంలోని అన్ని దేశాలు ఈ అక్రమ మార్కెట్‌పై తగిన చర్యలు చేపట్టాలి. అన్ని దేశాలు పరస్పరం సహకరించుకుంటూ ఈ సమస్యను పరిష్కరించాలి’ అని చెప్పారు. కార్యక్రమంలో ప్రపంచ కస్టమ్స్ ఆర్గనైజేషన్ కంప్లయన్స్ అండ్ ఫెసిలిటేషన్ డైరెక్టరేట్ డైరెక్టర్ ప్రణబ్ కుమార్ దాస్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఆర్బిట్రేషన్ (ఐసీఏ) డైరెక్టర్ జనరల్ అరుణ్ చావ్లా పాల్గొన్నారు.నివేదికలోని వివరాలు..ఎఫ్ఎంసీజీ (ప్యాకేజ్డ్ ఫుడ్), ఎఫ్ఎంసీజీ (వ్యక్తిగత, గృహ సంరక్షణ వస్తువులు), మద్యం, పొగాకు, వస్త్రాలు & దుస్తులు వంటి ఐదు విభాగాల్లో అధికంగా అక్రమ రవాణా సాగుతోంది.2022-23లో దేశంలో అక్రమ మార్కెట్ పరిమాణం రూ.7,97,726 కోట్లుగా ఉంది.ఎఫ్ఎంసీజీ (ప్యాకేజ్డ్ ఫుడ్)-రూ.2,23,875 కోట్లుఎఫ్ఎంసీజీ (వ్యక్తిగత, గృహ సంరక్షణ వస్తువులు)-రూ.73,813 కోట్లువస్త్రాలు, దుస్తులు-రూ.4,03,915 కోట్లుపొగాకు ఉత్పత్తులు-రూ.30,017 కోట్లుమద్యం-రూ.66,106 కోట్లుఇదీ చదవండి: పెరిగిన జెరోధా లాభం! భవిష్యత్తులో నష్టాలు తప్పవన్న సీఈఓదేశీయంగా వివిధ మార్గాల్లో విభిన్న వస్తువులను అక్రమంగా తరలిస్తూ స్థానికంగా మార్కెట్ చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఫలితంగా ప్రభుత్వానికి న్యాయబద్ధంగా పన్నుల రూపంలో రావాల్సిన నిధులు సమకూరడం లేదు. దాంతో తప్పక పన్నులు, ఇతర వస్తువుల ధరలు పెంచుతున్నారు. ఏదేమైనా అక్రమ మార్కెట్ సామాన్యుడి నెత్తిన భారంగా మారుతోంది. -
Chandana Jayaram: వస్త్రోత్పత్తుల సోయగం! హ్యాండ్ టు హ్యాండ్ చేనేత ప్రదర్శన షురూ..
సాక్షి, సిటీబ్యూరో: మాదాపూర్‌లోని శిల్పకళావేదికలో మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్ చందనా జయరాం సందడి చేశారు. ఆదివారం ఇక్కడ ఏర్పాటు చేసిన హ్యాండ్ టు హ్యాండ్ చేనేత వస్త్ర ప్రదర్శనను ఆమె ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ కొలువుదీరిన వ్రస్తోత్పత్తుల గురించి చేనేత కళాకారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అనాదిగా వస్తున్న మన సంస్కృతిలో పట్టు, హ్యాండ్లూమ్ వ్రస్తోత్పత్తులకు ఎంతో ప్రత్యేకత ఉందన్నారు. వేడుకలు, సంబరాల్లో ఫ్యాషన్ వేర్ కన్నా ఇలాంటి ఉత్పత్తులవైపే యువత ఎక్కువ మొగ్గు చూపుతున్నారని పేర్కొన్నారు. ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగనున్న ఈ ప్రదర్శనలో దేశవ్యాప్తంగా దాదాపు 14 రాష్ట్రాల నుంచి చేనేతకారులు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తారని నిర్వాహకులు జయేష్ గుప్తా తెలిపారు. ఇందులో భాగంగా75 వేల రకాల వస్త్ర ఉత్పత్తులను అందుబాటులో ఉంచినట్లు వివరించారు.వినూత్నంగా మెటల్ సిరీస్ వాచ్‌లు..సాక్షి, సిటీబ్యూరో: అధునాతన ఫ్యాషన్ హంగులను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకునే హైదరాబాద్ నగర వేదికగా బోల్డ్–ఫ్యాషన్–ఫార్వర్డ్ మెటల్ సిరీస్ వాచ్‌లు అందుబాటులోకి వచ్చాయి.ప్రముఖ ‘ఫా్రస్టాక్ స్మార్ట్’ఆధ్వర్యంలో ఆవిష్కరించిన ఈ మెటల్ సిరీస్ యువతను విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ సందర్భంగా టైటాన్ కంపెనీ సేల్స్ హెడ్ ఆదిత్యరాజ్ మాట్లాడుతూ ఫా్రస్టాక్ స్టెయిన్లెస్–స్టీల్ వాచ్‌ల నుంచి ప్రేరణ పొంది ఈ స్మార్ట్‌వాచ్ కలెక్షన్ ప్రీమియం–గ్రేడ్ మెటల్‌తో రూపొందించామని తెలిపారు. అధునాతన ఫ్యాషన్ గాడ్జెట్స్‌ను ఆస్వాదించడంలో నగరం ఎల్లప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు. -
బంగ్లా బ్రాండ్ ను అందిపుచ్చుకోగలమా!
సాక్షి, అమరావతి : కోవిడ్ సంక్షోభంతో తయారీ రంగం చైనా నుంచి ఇండియాకు ఏ విధంగా మారుతోందో.. ఇప్పుడు బంగ్లాదేశ్‌లో ఏర్పడ్డ సంక్షోభం దేశంలోని టెక్స్టైల్ రంగానికి సదవకాశాన్ని అందిస్తోంది. మరీ ముఖ్యంగా మన రాష్ట్రానికి ఇదో మంచి చాన్స్‌గా టెక్స్టైల్ రంగ నిపుణులు చెబుతున్నారు. మంచి వనరులు, ఎగుమతికి అన్ని అవకాశాలు ఉన్న మన రాష్ట్రంలో దుస్తుల తయారీ రంగాన్ని మరింతగా ప్రోత్సహిస్తే ప్రపంచ ప్రఖ్యాత బ్రాండ్లను తయారు చేసి, ఎగుమతి చేయవచ్చని అంచనా వేస్తున్నారు. బంగ్లాదేశ్‌లో దుస్తుల తయారీ, సంబంధిత పరిశ్రమలు అధిక సంఖ్యలో ఉన్నాయి. ప్రపంచంలోని ప్రముఖ బ్రాండ్ల దుస్తులు అత్యధికంగా బంగ్లాదేశ్‌లోనే తయారవుతుంటాయి. ఈ దేశం నుంచి నెలకు సగటున రూ.31,540 కోట్లు విలువచేసే దుస్తులు ఎగమతి అవుతుంటాయి. అంటే ఏటా 3.60 లక్షల కోట్లకు పైగా విలువైన ఎగుమతులు ఒక్క టెక్స్టైల్ రంగంలోనే ఉంటాయి. బంగ్లాదేశ్‌లో తలెత్తిన రాజకీయ సంక్షోభం, కర్ఫ్యూ కారణంగా అక్కడి పరిశ్రమలు మూతపడ్డాయి. దీంతో ప్రపంచ టెక్స్టైల్ రంగం ఉలిక్కిపడింది. ఇప్పుడు అంతర్జాతీయ బ్రాండ్లు ఇండియా వైపు చూస్తున్నాయి. ప్రస్తుతం బంగ్లాదేశ్ నుంచి జరుగుతున్న ఎగుమతుల్లో 10 శాతం అందిపుచ్చుకున్నా ఇండియా నుంచి ప్రతి నెలా రూ.3,320 కోట్ల ఎగుమతులు అదనంగా చేయవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మనదేశంలో తమిళనాడు, పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో గార్మెంట్స్ తయారీ పరిశ్రమలు అత్యధికంగా ఉన్నాయని, బంగ్లాదేశ్ సంక్షోభంతో ఈ మూడు రాష్ట్రాలు అత్యధికంగా ప్రయోజనం పొందుతాయని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ టెక్స్టైల్స్ అసోసియేషన్ అంచనా వేస్తోంది. దీర్ఘకాలంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రయోజనంబంగ్లాదేశ్ సంక్షోభాన్ని రాష్ట్రం అందిపుచ్చుకుంటే రాష్ట్ర స్పిన్నింగ్, టెక్స్టైల్ పరిశ్రమలకు భారీ ప్రయోజనం చేకూరనుంది. రాష్ట్రంలో ప్రస్తుతం అనకాపల్లిలో బ్రాండిక్స్, పులివెందులలో బిర్లా గార్మెంట్స్ తప్ప అతిపెద్ద గార్మెంట్స్ తయారీ సంస్థలు లేవు. కోవిడ్ తర్వాత ఎల్రక్టానిక్స్, ఫార్మా రంగాల్లో పీఎల్ఐ స్కీం కింద రాష్ట్రం అవకాశాలు అందిపుచ్చుకున్న విధంగానే ఇప్పుడు గార్మెంట్స్ రంగంలో అందివచి్చన అవకాశాన్ని సది్వనియోగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకు అవసరమైన వనరులన్నీ రాష్ట్రంలో ఉన్నాయని చెబుతున్నారు. దీని ద్వారా రాష్ట్రంలో స్పిన్నింగ్ మిల్లులు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయని విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ సంక్షోభం స్వల్పకాలంలో రాష్ట్ర స్పిన్నింగ్, టెక్స్టైల్ పరిశ్రమలకు ఇబ్బందులకు గురి చేసినా దీర్ఘకాలంలో ప్రయోజనం చేకూరుస్తుందని ఫెడరేషన్ ఆఫ్ ఏపీ టెక్స్టైల్ మాన్యుఫాక్చరింగ్ డైరెక్టర్ సుధాకర్ చౌదరి ‘సాక్షి’కి తెలిపారు. ప్రస్తుతం బంగ్లా సంక్షోభంతో తమిళనాడులోని తిరుపూర్, పంజాబ్‌లోని లూథియానా బాగా ప్రయోజనం పొందుతాయని చెబుతున్నారు. బంగ్లా సంక్షోభం ప్రభావం వల్ల నూలు ఎగుమతులు కొంతమేరకు దెబ్బతిని, స్పిన్నింగ్ మిల్లులు ఇబ్బందుల్లో పడ్డాయి. కొంత కాలంగా రాష్ట్ర టెక్స్టైల్ అమ్మకాలు అంతంతగానే ఉంటున్న సమయంలో బంగ్లాదేశ్ సంక్షోభం మరింతగా భయపెట్టినా, వెంటనే సమసి పోవడంతో ఊపిరిపీల్చుకున్నట్లు ఏపీ స్పిన్నింగ్ మిల్స్ అసోసియేషన్ కార్యాదర్శి మల్లేశ్వర్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం మన రాష్ట్రం నుంచి భారీ స్థాయిలో పత్తి బేళ్లు, యార్న్ బంగ్లాదేశ్‌కు ఎగుమతి అవుతున్నాయని, అదే దేశీయంగా గార్మెంట్ పరిశ్రమలు వస్తే స్థానికంగానే అమ్మకాలు చేసుకునే వెసులుబాటు కలుగుతుందని చెప్పారు. టెక్స్టైల్ రంగంలో తమిళనాడు, పశి్చమ బెంగాల్, పంజాబ్‌తోపాటు తెలంగాణ రాష్ట్రాల నుంచి గట్టి పోటీ ఉందని, దీన్ని తట్టుకునేలా టెక్స్టైల్స్ పాలసీలో ప్రోత్సాహకాలు, నైపుణ్య శిక్షణ, టెక్స్టైల్ పార్కుల ఏర్పాటును ప్రోత్సహించాలని పారిశ్రామిక సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం వద్ద 21,000 మంది పనిచేస్తున్న బ్రాండిక్స్ ఇండియా అప్పరెల్ పార్కు, వైఎస్సార్ జిల్లా పులివెందులలో ప్రముఖ బ్రాండ్ల గార్మెంట్స్ తయారు చేసే ఆదిత్య బిర్లా గార్మెంట్స్ యూనిట్. ఇవి కాకుండా అరవింద్, వర్థమాన్, గోకుల్దాస్, ఎన్ఎస్ఎల్ టెక్స్టైల్స్,టోరే, షోర్ టు షోర్, యూనిచార్మ్, వంటి ప్రముఖ బ్రాండ్ల యూనిట్లు ఉన్నాయి. ఏపీ టైక్స్టైల్స్ రంగంఏటా 5,970 టన్నుల పట్టు (సిల్‌్క) ఉత్పత్తితో దేశంలోరెండో స్థానంఏటా 19 లక్షల బేళ్ల పత్తినిఉత్పత్తితో దేశంలో ఏడో స్థానంఏటా 3.6 కోట్ల స్పిండిల్స్ తయారు చేస్తూ ఈ రంగంలో ఏపీ 7% వాటా కలిగి ఉంది100రాష్ట్రంలో స్పిన్నింగ్, టెక్స్టైల్స్కంపెనీలు18,000పవర్‌లూమ్స్,23 ప్రోసెసింగ్యూనిట్లు,653 చేనేతరెడిమేడ్ గార్మెంట్స్ యూనిట్లు ఉన్నాయి -
రేమండ్ నుంచి రియల్టీ విడదీత
న్యూఢిల్లీ: రియల్టీ బిజినెస్ విభాగాన్ని ప్రత్యేక కంపెనీగా విడదీయనున్నట్లు టెక్స్టైల్స్ దిగ్గజం రేమండ్ లిమిటెడ్ తాజాగా వెల్లడించింది. ఇందుకు కంపెనీ బోర్డు ఆమోదముద్ర వేసినట్లు తెలియజేసింది. రేమండ్ రియల్టీ పేరుతో రియల్ ఎస్టేట్ బిజినెస్‌ను ప్రత్యేక కంపెనీగా ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. దీంతో వాటాదారులకు మరింత విలువ చేకూరనున్నట్లు తెలియజేసింది. తద్వారా భారీ వృద్ధికి వీలున్న దేశీ ప్రాపర్టీ మార్కెట్లో మరింత పురోగతిని సాధించవచ్చని తెలియజేసింది. విడదీత పథకంలో భాగంగా వాటాదారులకు 1:1 ప్రాతిపదికన షేర్లను జారీ చేయనుంది. అంటే రేమండ్ లిమిటెడ్ వాటాదారులకు ప్రతీ షేరుకి 1 రేమండ్ రియల్టీ షేరుని కేటాయించనుంది. వాటాదారులు, రుణదాతలు, ఎన్సీఎల్టీ తదితర నియంత్రణ సంస్థల అనుమతుల తదుపరి రేమండ్ రియల్టీ లిమిటెడ్‌కు తెరతీయనున్నట్లు రేమండ్ వివరించింది. 24 శాతం వాటారేమండ్ లిమిటెడ్ మొత్తం ఆదాయంలో రియల్టీ బిజినెస్ 24 శాతం వాటాను ఆక్రమిస్తోంది. 2023–24లో విడిగా 43 శాతం వృద్ధితో రూ. 1,593 కోట్ల టర్నోవర్ సాధించింది. విడదీతలో భాగంగా రేమండ్ లిమిటెడ్ వాటాదారులకు రేమండ్ రియల్టీ 6,65,73,731 ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో రేమండ్ రియల్టీ లిస్ట్‌కానుంది. అనుబంధ సంస్థలుసహా కంపెనీ నిర్వహిస్తున్న రియల్టీ బిజినెస్‌ను పునర్వ్యవస్థీకరించే బాటలో తాజా పథకానికి తెరతీసినట్లు రేమండ్ లిమిటెడ్ వెల్లడించింది. విడదీత ద్వారా రియలీ్టలో భారీ వృద్ధి అవకాశాలను అందుకోవడం, కొత్త ఇన్వెస్టర్లను ఆకట్టుకోవడం, వ్యూహాత్మక భాగస్వాములను చేర్చుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలియజేసింది. మొత్తం రియల్టీ బిజినెస్‌ను ఒకే కంపెనీ నిర్వహణలోకి తీసుకురానున్నట్లు తెలియజేసింది. గతేడాది రియల్టీ విభాగం రూ. 370 కోట్ల నిర్వహణ లాభం(ఇబిటా) ఆర్జించింది. రియల్టీ తీరిలా రేమండ్ రియల్టీ థానేలో 100 ఎకరాల భూమిని కలిగి ఉంది. 40 ఎకరాలు అభివృద్ధి దశలో ఉంది. ఇక్కడ రూ. 9,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. రూ. 16,000 కోట్లకుపైగా అదనపు ఆదాయానికి వీలుంది. వెరసి థానే ల్యాండ్ బ్యాంక్ ద్వారా రూ. 25,000 కోట్ల ఆదాయానికి అవకాశముంది. ఇటీవల అసెట్‌లైట్ పద్ధతిలో ముంబై, బాంద్రాలో భాగస్వామ్య అభివృద్ధి(జేడీఏ) ప్రాజెక్టుకు తెరతీసింది. అంతేకాకుండా మహీమ్, సియోన్, బాంద్రాలలో మరో మూడు జేడీఏలకు సంతకాలు చేసింది. ఈ నాలుగు ప్రాజెక్టుల ద్వారా రూ. 7,000 కోట్ల టర్నోవర్‌కు వీలుంది.విడదీత వార్తల నేపథ్యంలో రేమండ్ షేరు బీఎస్ఈలో 0.7 శాతం నీరసించి రూ. 2,942 వద్ద ముగిసింది. -
‘పీఎల్ఐ పథకం విస్తరణ’... ఏ రంగానికి.. ??
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకాన్ని వస్త్ర రంగానికి అమలు చేయాలని యోచిస్తున్నట్లు జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ తెలిపారు. ఇండియా ఇంటర్నేషనల్ గార్మెంట్ ఫెయిర్ (ఐఐజీఎఫ్)లో పాల్గొని మాట్లాడారు.‘జౌళి రంగానికి ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకంలో భాగంగా రూ.10,000 కోట్లు అందిస్తున్న కేంద్రం..దీన్ని గార్మెంట్స్ రంగానికి విస్తరించాలని యోచిస్తోంది. వస్త్ర రంగంలో ఎగుమతులను పెంచుకోవడానికి భారీ అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్తులో 50 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.4.13 లక్షల కోట్లు) విలువైన ఎగుమతులను పరిశ్రమ లక్ష్యంగా నిర్ణయించింది. దేశంలో మ్యాన్ మేడ్ ఫైబర్(ఎంఎంఎఫ్) అపెరల్, ఫ్యాబ్రిక్స్ అండ్ టెక్నికల్ టెక్స్టైల్స్ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి ఐదేళ్ల వ్యవధికిగాను 2021లో పీఎల్ఐలో భాగంగా రూ.10,683 కోట్ల ఇచ్చేందుకు ఆమోదించింది. పరిశ్రమ తన లక్ష్యాలను చేరుకోవడానికి ఈ పథకాన్ని గార్మెంట్స్(వస్త్ర) రంగానికి విస్తరించాలని యోచిస్తున్నాం. ప్రస్తుతం భారతీయ టెక్స్టైల్స్ పరిశ్రమ మార్కెట్ పరిమాణం సుమారు 165 బిలియన్ డాలర్లుగా(రూ.13 లక్షల కోట్లు) ఉంది. దాన్ని రానున్న రోజుల్లో 350 బిలియన్ డాలర్ల(సుమారు రూ.27 లక్షల కోట్లు)కు పెంచాల్సి ఉంది. ఈ రంగంలో చైనా కంటే ముందుండేందుకు మంత్రిత్వ శాఖ రోడ్‌మ్యాప్‌ను రూపొందిస్తోంది’ అన్నారు.ఇదీ చదవండి: ట్రేడింగ్‌లో రూ.46 లక్షలు నష్టపోయిన బీటెక్ విద్యార్థి!టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో ఈకామర్స్ మాధ్యమం ద్వారా ఎగుమతులను పెంచే అవకాశాలను అన్వేషించాలని మంత్రి పిలుపునిచ్చారు. ‘గ్రీన్ టెక్స్టైల్స్, రీసైక్లింగ్‌పై దృష్టి సారించాలి. గ్లోబల్ బ్రాండ్లకు సరఫరాదారులుగా మారకుండా దేశీయ కంపెనీలు తమ సొంత బ్రాండ్లను ఏర్పాటు చేసుకోవాలి. ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ పార్కుల పథకం(ఎస్ఐటీపీ)ను పునరుద్ధరించాలనే అంశాన్ని పరిశీలిస్తున్నాం’ అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన కొత్త టెక్స్టైల్ పార్కులను రూపొందించడం ఈ పథకం లక్ష్యం. ఈ పథకం కింద ఇప్పటికే 54 టెక్స్టైల్ పార్కులు మంజూరయ్యాయి. -
సాంకేతిక ఉత్పత్తుల్లో అగ్రగామిగా ఏపీ
సాక్షి, అమరావతి: సాంకేతిక ఉత్పత్తులు (టెక్నికల్ టెక్స్టైల్స్) రంగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా నిలుస్తోంది. ఈ రంగంలో ఐఐటీ–ఢిల్లీ నిర్వహించిన అధ్యయనంలోనూ దేశంలోనే మొదటి నాలుగు స్థానాల్లో రాష్ట్రం చోటు దక్కించుకుంది. సాంకేతిక ఉత్పత్తుల్లో వైద్య రంగం (మెడిటెక్), వ్యవసాయం, ఆక్వా (ఆగ్రోటెక్), ఆటోమొబైల్ (మొబిటెక్), క్రీడా పరికరాలు (స్పోర్ట్స్టెక్), భవన నిర్మాణ సామాగ్రి (బిల్డ్‌టెక్), గృహోపకరణాలు (హోంటెక్), భారీ టవర్లు (ఇండుటెక్), ప్యాకింగ్ సామాగ్రి (ప్యాక్టెక్) వంటి దాదాపు 12 విభాగాల్లో ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభిస్తోంది. రాష్ట్రంలో ప్రధానంగా ఆగ్రో టెక్స్టైల్స్, మొబైల్ టెక్స్‌టెల్స్, జియో టెక్స్‌టైల్స్‌లకు భారీ డిమాండ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికా, జర్మనీ, నేపాల్ తదితర దేశాలకు ఏటా రూ.180 కోట్ల విలువైన సాంకేతిక ఉత్పత్తుల ఎగుమతులు జరుగుతున్నాయి. రాష్ట్రంలోనూ స్థానికంగా వినియోగం ఉంటోంది. విశాఖపట్నంలోని మెడిటెక్ జోన్లో వైద్య పరికరాల ఉత్పత్తులు (మెడికల్ టెక్స్టైల్స్) ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ప్లాస్టిక్, గ్రాసిమ్ వంటి అంతర్జాతీయ డిమాండ్ ఉన్న 15 టెక్నికల్ టెక్స్టైల్ కంపెనీలు మనరాష్ట్రంలోనే ఉండటం విశేషం. రాష్ట్రంలో సాంకేతిక ఉత్పత్తులు (టెక్నికల్ టెక్స్టైల్స్)కు మూడు పారిశ్రామిక కారిడార్లు, పోర్టులు, పారిశ్రామికీకరణ వంటివి అనుకూల పరిస్థితిని సృష్టిస్తున్నాయి. రాష్ట్రంలో ఏయే రంగాల్లో అనుకూలమంటే.. ♦ మొబిటెక్: కియా, ఇసూజీ, అశోక్ లేలాండ్, హీరో వంటి ప్రధాన ఆటోమొబైల్ తయారీదార్ల నుంచి రాష్ట్రంలో మొబిల్‌టెక్ ఉత్పత్తులకు చాలా డిమాండ్ ఉంది. ♦ జియో టెక్స్టైల్స్: దేశంలో రెండో అతిపెద్ద తీర ప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో జియో ట్యూబులు, జియో బ్యాంగ్‌లకు డిమాండ్ ఉంది. ఓడరేవుల వద్ద తీర ప్రాంతం నీటి కోతకు గురికాకుండా జియో ట్యూబులను వినియోగిస్తారు. తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడలో జియోట్యూబ్ సీవాల్ నిర్మాణం ఒకటి. ఇది దేశంలోనే మొదటి జియో టెక్స్టైల్ ట్యూబ్ నిర్మాణంగా గుర్తింపు పొందింది. రోడ్ల పటిష్టత కోసం కూడా జియో ట్యూబులను వినియోగిస్తారు. ♦ ఆగ్రోటెక్ టెక్స్టైల్స్: ఉద్యాన రంగంలో ఉపయోగించే షేడ్ నెట్లు, పండ్లు, మొక్కలకు ఉపయోగించే క్రాప్ కవర్ ఉత్పత్తులు.. స్థిరమైన వ్యవసాయ పద్ధతులు, వనరుల సామర్థ్యం, వ్యర్థాల తగ్గింపునకు దోహదం చేస్తాయి. హారి్టకల్చర్లో ఆగ్రో టెక్స్టైల్స్ వినియోగంతో మంచి దిగుబడులను సాధించవచ్చు. నీటి వినియోగాన్ని 30 నుంచి 45 శాతానికి తగ్గించవచ్చు. ఆక్వా కల్చర్‌లోనూ ఫిషింగ్ నెట్స్, ఫిషింగ్ లైన్ల రూపంలో ఆగ్రో టెక్స్‌టైల్స్‌కు అవకాశాలు ఉన్నాయి. చేపల చెరువుల నిర్మాణం, నిర్వహణలోనూ జియో టెక్స్ౖటెల్స్ను ఉపయోగిస్తున్నారు. రాష్ట్రంలో 2.12 లక్షల హెక్టార్లలో విస్తరించి ఉన్న ఆక్వాకల్చర్ రంగం ఆగ్రోటెక్కు ప్రధాన ప్రోత్సాహంగా నిలుస్తోంది. దేశంలో చేపలు, రొయ్యల ఉత్పత్తిలో ఆగ్రోటెక్, జియోటెక్స్‌టైల్స్‌కు 30 శాతం డిమాండ్ ఉంది. అరటి వ్యర్థాల ఉత్పత్తుల్లో దేశంలోనే ఏపీ టాప్.. టెక్నికల్ టెక్స్‌టైల్స్‌లో అరటి వ్యర్థాలతో ఉత్పత్తులను తయారు చేయడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. అలాగే జనపనార ఉత్పత్తుల్లో ఐదో స్థానం దక్కించుకుంది. రాష్ట్రంలో వ్యవసాయ వ్యర్థాలను నూలుగానూ, ఆ తర్వాత వస్త్రంగానూ పలు రకాలుగా వినియోగించే సాంకేతిక ఉత్పత్తులను తయారు చేయడంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందడుగు వేస్తున్నారు. రీసైకిల్ చేసిన వ్యవసాయ వ్యర్థాలను నూలు ఉత్పత్తులు, షూలు, శానిటరీ నాప్కిన్లు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. అరటి ఫైబర్ నుంచి కవర్లు, శానిటరీ ప్యాడ్లు, నూలు, షూలు తయారు చేస్తున్నారు. పైనాపిల్, అరటి పండు వ్యర్థాల నుంచి వివిధ ఫంక్షనల్ ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తున్నారు. సాంకేతిక ఉత్పత్తుల్లో రాష్ట్రం గత ఐదేళ్లలో 8–10 శాతం వృద్ధిని నమోదు చేసింది. సాంకేతిక ఉత్పత్తులకు మంచి భవిష్యత్ ఉంది.. సీఎం జగన్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో సాంకేతిక ఉత్పత్తుల రంగంలో వ్యర్థాలను సమర్థవంతంగా వినియోగిస్తున్నాం. రాష్ట్రంలో టెక్నికల్ టెక్స్‌టైల్స్‌కు ఆక్వా రంగం పెద్ద వినియోగదారుగా ఉంది. ఆగ్రో టెక్స్టైల్స్.. సుస్థిర వ్యవసాయం, వనరుల సామర్థ్యం, వ్యర్థాల తగ్గింపునకు దోహదం చేస్తున్నాయి. హార్టికల్చర్‌లో ఆగ్రో టెక్స్టైల్స్.. నీరు, ఎరువుల వినియోగాన్ని తగ్గించేందుకు దోహదం చేస్తున్నాయని అనేక అధ్యయనాలు తేల్చాయి. ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక ఉత్పత్తులకు మంచి భవిష్యత్ ఉంది. దీంతో రాష్ట్రంలోనూ ఆ దిశగా గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. పుష్కలమైన వనరులు, సాంకేతిక సామర్థ్యాలు కలిగిన ఆంధ్రప్రదేశ్ టెక్నికల్ టెక్స్‌టైల్స్‌కు ఉత్పత్తిదారుగానే కాకుండా అతిపెద్ద వినియోగదారుగా కూడా ఉండనుంది. – కె.సునీత, చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి రాష్ట్రం నుంచి ఎగుమతవుతున్న సాంకేతిక ఉత్పత్తులు.. జిల్లా ప్రధాన సాంకేతిక ఉత్పత్తులు అనంతపురం సీటు బెల్టులు, ఎయిర్ బ్యాగ్‌లు చిత్తూరు శానిటరీ ప్యాడ్స్ తూర్పుగోదావరి చేపలు పట్టే వలలు, లైఫ్ జాకెట్లు ప్రకాశం కన్వేయర్ బెల్ట్ పశ్చిమగోదావరి జనపనారతో చేసిన హెస్సియన్ వస్త్రం విశాఖపట్నం సన్నటి ఊలు దారాల ఉత్పత్తులు, సీటు బెల్టులు, కన్వేయర్ బెల్టులు -
సిరిసిల్ల నేతన్నలకు రూ.130 కోట్ల ఆర్వీఎం ఆర్డర్లు
సిరిసిల్ల: సిరిసిల్ల నేతన్నలకు రూ.130 కోట్ల రాజీవ్ విద్యామిషన్ (ఆర్వీఎం) వ్రస్తోత్పత్తి ఆర్డర్లు రానున్నాయి. సిరిసిల్లలో ఉత్పత్తి అయిన వ్రస్తానికి గిట్టుబాటు ధర లేక నిల్వలు పేరుకుపోయిన నేపథ్యంలో ‘ఆధునిక మగ్గాలు ఆగాయి’శీర్షికన ఈనెల 3న ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై రాష్ట్ర జౌళి శాఖ అధికారులు స్పందించి సిరిసిల్ల టెక్స్‌టైల్‌పార్క్ వ్రస్తోత్పత్తిదారులతో సమావేశం నిర్వహించారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు టెక్స్‌టైల్‌పార్క్‌లోని యూనిట్లకు ఆర్వీఎం వస్త్రోత్పత్తి ఆర్డర్లు ఇస్తామని జౌళి శాఖ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ అశోక్‌రావు గురువారం ‘సాక్షి’కి తెలిపారు. 1.30 కోట్ల మీటర్ల వ్రస్తోత్పత్తి ఆర్డర్లను సిరిసిల్ల నేతన్నలకు అందిస్తున్నామని వివరించారు. టెక్స్టైల్ పార్క్‌లోని ఆధునిక మగ్గాలపై షరి్టంగ్ వస్త్రం, సిరిసిల్లలోని పవర్‌లూమ్స్‌పై సూటింగ్, ఓనీ వ్రస్తాన్ని ఉత్పత్తి చేసే ఆర్డర్లు ఇవ్వనున్నామని చెప్పారు. ఆర్వీఎం ఆర్డర్ల విలువ రూ.130 కోట్లు ఉంటుందని అంచనా. 50 శాతం కాటన్‌తో వ్రస్తాల ఉత్పత్తి గతానికి భిన్నంగా 50 శాతం కాటన్ నూలుతో కలిపి ఆర్వీఎం వ్రస్తాలను ఉత్పత్తి చేయనున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్స్ కోసం ఈ వ్రస్తోత్పత్తి ఆర్డర్లను సిరిసిల్ల నేతన్నలకు అందిస్తున్నారు. వ్రస్తోత్పత్తికి ముందే నూలును వార్పిన్ చేసి, సైజింగ్ చేసిన తరువాత మగ్గాలపై వ్రస్తాన్ని ఉత్పత్తి చేయనున్నారు. సిరిసిల్లలో తొలిసారి ఈ ప్రయోగం చేస్తున్నారు. గతంలో ప్లెయిన్ వస్త్రాన్ని ఉత్పత్తి చేసి ప్రింటింగ్ చేయించేవారు. కానీ ఈసారి వీవింగ్లోనే డిజైన్లు వచ్చేలా ఉత్పత్తి చేస్తున్నారు. -
ఆధునిక మగ్గాలు ఆగాయి
సిరిసిల్ల: ఒకవైపు మార్కెట్లో బట్టకు సరైన ధర లేదు...మరోవైపు వ్రస్తోత్పత్తి నిల్వలు పేరుకుపోయాయి. దీంతో సిరిసిల్లలోని టెక్స్‌టైల్‌పార్క్ పరిశ్రమలను యజమానులు మంగళవారం మూసివేశారు. దీంతో నేత కార్మికులకు ఉపాధి కరువైంది. టెక్స్టైల్ పార్క్‌లో మాంద్యం(సంక్షోభం) కారణంగా వస్త్రోత్పత్తి గిట్టుబాటు కావడం లేదని వ్రస్తోత్పత్తిదారులు పేర్కొంటున్నారు. ఆధునిక మగ్గాలను నిరవధికంగా బంద్ పెట్టడంతో అక్కడ పనిచేసే వెయ్యి మంది నేత కార్మికులు రోడ్డునపడ్డారు. వేలాదిమంది నేతన్నలకు ఉపాధి కల్పించే లక్ష్యంతో వరంగల్‌లో చేపట్టిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ పునాదుల్లో ఉండగా.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాముందే నిర్మించిన సిరిసిల్ల తొలి టెక్స్టైల్ పార్క్ ఇప్పుడు సంక్షోభంతో మూతపడింది. సిరిసిల్లలో కార్మికులు కూలి పెంచాలని సమ్మెకు దిగడం సహజం. కానీ పరిశ్రమల యజమానులే కార్ఖానాలను మూసి వేసి బట్ట గిట్టుబాటు కావడం లేదని వ్రస్తోత్పత్తిని నిలిపివేయడం టెక్స్టైల్ రంగంలో సంక్షోభానికి అద్దం పడుతోంది. ఉపాధి లక్ష్యంగా.. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి శివారులో 65 ఎకరాల్లో 2003లో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేశారు. 7,000 మంది కార్మికులకు ఉపాధి లక్ష్యంగా దీనిని నెలకొల్పారు. 20 ఏళ్లుగా కేవలం గరిష్టంగా 2వేల మందికి పని కల్పించింది. టెక్స్టైల్ పార్క్‌లో 113 యూనిట్లు ఉండగా.. ప్రస్తుతం వాటి సంఖ్య 65కు పడిపోయింది. 800 ఆధునిక ర్యాపియర్ లూమ్స్‌పై వస్త్రోత్పత్తి జరుగుతోంది. సంక్షోభం కారణంగా 40 మంది యూనిట్ల యజమానులు ఆధునిక ర్యాపియర్స్ లూమ్స్‌ను అమ్మేసుకున్నారు. విద్యుత్ చార్జీలూ భారమే టెక్స్టైల్ పార్క్‌లోని యూనిట్లకు విద్యుత్ చార్జీలు భారంగా మారాయి. వ్రస్తోత్పత్తిదారులకు యూనిట్ కరెంట్ ధర రూ.7.50 ఉంది. అదే మహారాష్ట్రలో యూనిట్ విద్యుత్ చార్జీలు రూ.3 ఉంది. తమిళనాడులో 500 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందిస్తుండగా, అంతకు మించి వినియోగిస్తే ప్రతి యూనిట్‌కు రూ.2.50 ఉంది. పొరుగు రాష్ట్రాల్లో విద్యుత్ టారిఫ్ రేట్లు తక్కువగా ఉండగా, సిరిసిల్లలో ఎక్కువగా ఉండడంతో పొరుగు రాష్ట్రాలతో సిరిసిల్ల వ్యాపారులు పోటీ పడలేకపోతున్నారు. ఇటీవల నూలు రేట్లు బాగా పెరగడం, రవాణా చార్జీలు ఎక్కువ కావడంతో వ్రస్తోత్పత్తి వ్యయం కూడా పెరిగింది. ఒక్కో మీటరు బట్ట నాణ్యతను బట్టి రూ.18 నుంచి రూ.70 వరకు అమ్ముతుంటారు. అయితే ప్రస్తుతం బట్టకు మార్కెట్లో ధర లేక నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. ప్రస్తుతం పార్క్‌లోని యూనిట్లలో కోటి మీటర్ల బట్టల నిల్వలు ఉన్నాయి. దీంతో టెక్స్టైల్ పార్క్‌లో పరిశ్రమలను నిరవధికంగా మూసివేశారు. నెలకు రూ.12వేలు వచ్చేవి పనిచేసిన రోజు రూ.400 నుంచి రూ.500 ఇచ్చేవారు. అంతా కలిపి నెలకు రూ.12వేలు వరకు ఉండేది. ఇప్పుడు పార్క్ మూసివేయడంతో మాకు పని లేకుండాపోయింది. మళ్లీ కార్ఖానాలు తెరిచే దాకా పని ఉండదు. పని చేయకుంటే ఇల్లు గడవదు. – గాజుల మల్లేశం, నేతకార్మికుడు టెక్స్టైల్ రంగం సంక్షోభంలో ఉంది మా కార్ఖానాల్లో బట్టల నిల్వలు పేరుకుపోయాయి. బట్ట ఉత్పత్తి వ్యయం కూడా ఎక్కువ అయ్యింది. ఆ మేరకు బట్టకు ధర లేక ఇబ్బందిగా ఉంది. ధర తగ్గించి అమ్మే పరిస్థితి ఏర్పడింది. నష్టాలను భరిస్తూ వ్రస్తోత్పత్తి చేయలేక యూనిట్లు మూసివే యాలని నిర్ణయం తీసుకున్నాం. –అన్నల్దాస్ అనిల్‌కుమార్, పార్క్ అసోసియేషన్ అధ్యక్షుడు -
ఫార్మా, డ్రోన్లు, టెక్స్టైల్స్ పీఎల్ఐలో మార్పులు
న్యూఢిల్లీ: ఫార్మాస్యూటికల్స్, డ్రోన్లు, టెక్స్టైల్స్ రంగాలకు సంబంధించి ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకం(పీఎల్ఐ) కింద కేంద్రం మార్పులు చేయనుంది. ఈ రంగాల్లో తయారీ, పెట్టుబడులను ప్రోత్సహించేందుకు వీలుగా రాయితీలను పెంచనుంది. ఈ విషయాన్ని ఓ సీనియర్ అధికారి అనధికారికంగా వెల్లడించారు. 2021 నుంచి ఇప్పటివరకు 14 రంగాలకు పీఎల్ఐ పథకం కింద కేంద్రం ప్రోత్సాహకాలు ప్రకటించి, దరఖాస్తులను సైతం స్వీకరించింది. మంత్రిత్వ శాఖల మధ్య అంతర్గతంగా కొనసాగిన సంప్రదింపుల్లో భాగంగా ఈ రంగాలకు సంబంధించి సవరణలు చేయాల్సిన అవసరాన్ని గుర్తించినట్టు సదరు సీనియర్ అధికారి తెలిపారు. దీనికి త్వరలోనే కేబినెట్ ఆమోదం పొందనున్నట్టు పేర్కొన్నారు టెక్నికల్ టెక్స్‌టైల్స్‌కు నిర్వచనం మార్చనున్నట్టు చెప్పారు. అలాగే, డ్రోన్లు, డ్రోన్ల విడిభాగాలకు కేటాయించిన రూ.120 కోట్లను పెంచనున్నట్టు వెల్లడించారు. వైట్ గూడ్స్ (ఏసీ, ఎల్ఈడీ లైట్లు) రంగాలకు పీఎల్ఐ కింద నగదు ప్రోత్సాహకాలను ఈ నెల నుంచే విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. 2023 మార్చి నాటికి రూ.2,900 కోట్లను ఇవ్వాల్సి ఉందన్నారు. పీఎల్ఐ కింద వైట్ గూడ్స్, వైద్య పరికరాల తయారీ, ఆటోమొబైల్స్, స్పెషాలిటీ స్టీల్, ఆహారోత్పత్తులు తదితర 14 రంగాలకు కేంద్రం రూ.1.97 లక్షల కోట్లను ప్రకటించింది. అయితే, కొన్ని రంగాలకు సంబంధించి పెద్దగా పురోగతి కనిపించలేదు. దీంతో కొన్ని రంగాలకు సంబంధించి మార్పులు చేయాల్సి రావచ్చని కేంద్ర వాణిజ్య శాఖ అధికారి లోగడ సంకేతం ఇవ్వడం గమనార్హం. ముఖ్యంగా అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ (ఏసీసీ) బ్యాటరీలు, టెక్స్టైల్స్ ఉత్పత్తులు, స్పెషాలిటీ స్టీల్ రంగాల్లో పీఎల్ఐ పట్ల పెద్దగా స్పందన లేకపోవడంతో మార్పులకు కేంద్రం పూనుకున్నట్టు తెలుస్తోంది. -
హోమ్ టెక్స్టైల్ పరిశ్రమకు పునరుజ్జీవం
ముంబై: హోమ్ టెక్స్టైల్ పరిశ్రమ ఈ ఏడాది 7–9 శాతం మధ్య ఆదాయ వృద్ధిని నమోదు చేయనుంది. దేశీయంగా కాటన్ ధరలు తగ్గుముఖం పట్టడంతో అంతర్జాతీయంగా తిరిగి తన వాటాను పెంచుకుందని క్రిసిల్ రేటింగ్స్ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో హోమ్ టెక్స్టైల్ కంపెనీల ఆదాయం 15 శాతం వరకు తగ్గడం గమనార్హం. పరిశ్రమ నిర్వహణ లాభం 1.5–2 శాతం వరకు మెరుగుపడి 14–14.5 శాతానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చేరుకోవచ్చని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. ముడి సరుకుల ధరలు తక్కువలో ఉండడం, నిర్వహణ పరమైన అనుకూలతలను పేర్కొంది. అయితే ఇప్పటికీ కరోనా ముందు నాటి కంటే తక్కువలోనే ఉన్నట్టు తెలిపింది. దీంతో పరిశ్రమ రుణ భారం స్థిరంగా కొనసాగొచ్చని అంచనా వేసింది. హోమ్ టెక్స్‌టైల్‌లో 40–45 శాతం మార్కెట్ వాటా కలిగిన 40 కంపెనీలను అధ్యయనం చేసిన తర్వాత క్రిసిల్ రేటింగ్స్ ఈ నివేదికను విడుదల చేసింది. ఎగుమతులు పెరుగుతాయి.. భారత హోమ్ టెక్స్టైల్స్ పరిశ్రమ మొత్తం ఆదాయంలో 70–75 శాతం ఎగుమతుల నుంచే వస్తోంది. ఇందులో యూఎస్ వాటా అధికంగా ఉంది. భారత ఎగుమతుల్లో సగం అమెరికాకే వెళుతుంటాయి. కాటన్ ధర క్యాండీకి గతేడాది మే నెలలో రూ.లక్షకు చేరుకోగా, అది ఇప్పుడు రూ.55,000కు తగ్గినట్టు క్రిసిల్ రేటింగ్స్ నివేదిక వెల్లడించింది. అమెరికాలో బడా రిటైల్ సంస్థల వద్ద నిల్వలు తగ్గిపోవడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత కంపెనీలకు ఆర్డర్ల రాక పెరుగుతుందని అంచనా వేసింది. అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో సవాళ్లు నెమ్మదించడంతో గడిచిన కొన్ని నెలలుగా అమ్మకాలు క్రమంగా పెరుగుతున్నట్టు తెలిపింది. ‘‘దేశీయ ముడి సరుకులు ఇప్పుడు పోటీనిచ్చే స్థాయికి తగ్గాయి. అంతర్జాతీయ కొనుగోలు దారులు చైనా ప్లస్ వన్‌కు ప్రాధాన్యం ఇస్తుండడం, యూఎస్ రిటైలింగ్ సంస్థలు తిరిగి స్టాక్ పెంచుకునేందుకు ఆసక్తి చూపిస్తుండడడంతో ఆదాయం పుంజుకుంటుంది’’అని క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ మోహిత్ మఖీజా తెలిపారు. దీనికి నిదర్శనంగా 2022లో భారత కంపెనీల వాటా 44 శాతం నుంచి తిరిగి 47 శాతానికి చేరుకోవడాన్ని ప్రస్తావించారు. 2021లో ఈ వాటా 48 శాతంగా ఉంది. -
టెక్స్టైల్స్ టెక్నాలజీతో మంచి ఉద్యోగాలు
సాక్షి, అమరావతి: దేశంలో వ్యవసాయం తర్వాత రెండో అతిపెద్ద ఉపాధి రంగం జౌళి పరిశ్రమ. జౌళి రంగం ప్రత్యక్షంగా, పరోక్షంగా దేశంలో 10 కోట్ల మందికి ఉపాధి కలి్పస్తూ వేగంగా పురోగమిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఔళి పరిశ్రమను మరింతగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నప్పటికీ నిపుణుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో 300కు పైగా జౌళి మిల్లులు ఉన్నాయి. వీటికి ఏటా వందలాది మంది నిపుణులు అవసరం. అయినా ఏడాదికి 50 మంది కూడా దొరక ట్లేదు. భవిష్యత్తులో జౌళి రంగంలో విద్య, ఉద్యోగ, పారిశ్రామిక, ఎగుమతుల విభాగాల్లో అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే గుంటూరులోని గవర్న మెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్స్టైల్స్ టెక్నాలజీ సంస్థ జౌళి రంగ నిపుణులను తయారు చేస్తూ ప్రత్యేకతను చాటుకుంటోంది. మూడున్నరేళ్ల పాలిటెక్నిక్ కోర్సు టెక్స్టైల్స్ డిప్లొమా కోర్సులు చదివిన వారికి మంచి జీతభత్యాలతో ఉద్యోగాలు లభిస్తున్నాయి. సాధారణ డిప్లొమా కోర్సు మూడేళ్లు ఉంటే.. టెక్స్టైల్స్ టెక్నాలజీ కోర్సు మాత్రం మూడున్నరేళ్లు ఉంటుంది. ఈ కోర్సు అభ్యసించిన వారికి స్పిన్నింగ్, వీవింగ్, కెమికల్ ప్రాసెసింగ్, టెస్టింగ్, ఆధునిక టెక్నికల్ టెక్స్టైల్, అపారల్ మాన్యుఫాక్చరింగ్ వంటి విభాగాల్లో మంచి ఉద్యోగాలు వస్తాయి. కోర్సు పూర్తి చేసిన వెంటనే స్థానికంగా ప్రారంభ వేతనం కనీసం రూ.20 వేలు ఉంటుంది. ఈ రంగంలో నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించేందుకు ప్రభుత్వం సైతం ఇండస్ట్రీ కనెక్ట్ విధానాన్ని అమలు చేస్తూ సిలబస్‌ను ఆధునీకరించింది.ఇందులో భాగంగా ఏడాది పాటు ప్రత్యేక పారిశ్రామిక శిక్షణనిస్తూ నెలకు రూ.7 వేల వరకు స్టైపెండ్ ఇస్తోంది. ‘పూర్వ విద్యార్థుల ద్వారా ప్రేరణ సదస్సులు, క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తూ చివరి సెమిస్టర్ పూర్తి చేసుకున్న ప్రతి విద్యార్థి కి సగటున మూడు సంస్థల్లో రూ.20 వేలకు పైగా జీతభత్యాలతో ఉద్యోగాలు వస్తున్నాయి. 8 నుంచి 10 ఏళ్ల అనుభవంతో కెరీర్లో అత్యున్నత స్థాయికి చేరుకోవచ్చు’ అని గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్స్టైల్స్ టెక్నాలజీ శాఖాధిపతి కె.మహమ్మద్ తెలిపారు. గుంటూరులోని టెక్స్టైల్స్ టెక్నాలజీ చదువుకున్న విద్యార్థులు తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర, పంజాబ్ రాష్ట్రాల్లోని ప్రముఖ పరిశ్రమల్లో సుమారు రూ.3 లక్షల జీతంతో జనరల్ మేనేజర్, టెక్నికల్ మేనేజర్, మిల్ మేనేజర్, గ్రూప్ మేనేజర్ హోదాల్లో రాణిస్తుండటం విశేషం. ఇది మంచి అవకాశం గుంటూరులో 1986లో స్థాపించిన ఈ కాలేజీ 1997కి స్వయం ప్రతిపత్తి సాధించింది. 2023 పాలిసెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు ఈ కోర్సులో చేరొచ్చు. డిప్లొమా తర్వాత బీటెక్, ఎంటెక్, పీహెచ్డీ చేసి ప్రముఖ విద్యా సంస్థల్లోనూ అధ్యాపకులుగా, పరిశోధన సంస్థల్లో శాస్త్రవేత్తలుగా రాణించవచ్చు. ఇందులో అత్యధిక ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉన్నప్పటికీ అవగాహన లేమితో విద్యార్థులు నష్టపోతున్నారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులతో విద్యాబోధన, ప్రాక్టికల్స్, ఇండ్రస్టియల్ ట్రైనింగ్, పరిశ్రమ ప్రముఖుల ద్వారా సెమినార్స్ ద్వారా సమగ్ర శిక్షణ అందిస్తున్నాం. విద్యార్థులు ఈ కోర్సులో ప్రవేశాలు, వివరాలకు 9848372886, 8500724006 నంబర్లను సంప్రదించవచ్చు. – కేవీ రమణ బాబు, ప్రిన్సిపాల్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్స్టైల్స్ టెక్నాలజీ, గుంటూరు -
హిందూపూర్‌లో 350 ఎకరాల్లో టెక్స్టైల్ మరియు ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ కోసం పారిశ్రామికపార్క్ ఏర్పాటు
-
జీరో నుంచి మొదలుపెట్టి.. సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా దీపాలీ..
‘జీరో’ నుంచి ప్రయాణం ప్రారంభించి ఒక్కో పాఠం నేర్చుకుంటూ తమ కంపెనీ ‘వెల్స్పన్’ను ప్రపంచంలోని అతి పెద్ద టెక్ట్స్‌టెల్ కంపెనీల పక్కన నిలబెట్టింది దీపాలీ గోయెంకా... రాజస్థాన్‌లోని జైపుర్‌కు చెందిన దీపాలీకి పద్దెనిమిది సంవత్సరాల వయసులోనే వివాహం జరిగింది. ఇంటికే పరిమితం కాకుండా, ఏదైనా చేయాలనిపించేది. ముప్ఫైసంవత్సరాల వయసులో భర్త చేసే టెక్ట్స్‌టైల్ వ్యాపారంలోకి అడుగు పెట్టింది.‘నా భార్యగా ఇక్కడ నీకు ప్రత్యేక గుర్తింపు, గౌరవం అంటూ ఏవీ ఉండవు’ అని చెప్పాడు ఆమె భర్త ‘వెల్స్పన్’ చైర్మన్ బీకే గోయెంకా. (సోషల్ మీడియా స్టార్, అన్‌స్టాపబుల్ టైకూన్ దిపాలీ: రతన్‌టాటా కంటే ఖరీదైన ఇల్లు) తొలిరోజుల్లో ‘బాస్ భార్య’గానే గుర్తింపు పొందిన దీపాలీ ఆ తరువాత కాలంలో తనదైన గుర్తింపు తెచ్చుకుంది. నిరుపమానమైన నాయకత్వానికి ప్రతీకగా ప్రత్యేక ప్రశంసలు అందుకుంది. సైకాలజీ చదువుకున్న దీపాలీకి వ్యాపార వ్యవహారాలలో ఎలాంటి అనుభవం లేదు. ఏమీ తెలియని శూన్యం నుంచి అన్ని తెలుసుకోవాలనే తపన వరకు ఆమె ప్రయాణం కొనసాగింది. నష్టాలు ఎక్కడా జరుగుతున్నాయి? వాటిని నివారించడం ఎలా? ఇలా ఎన్నో విషయాలను త్వరగా తెలుసుకుంది. ఆఫీసుకు వెళ్లామా, వచ్చామా...అనే తీరులో కాకుండా ప్రతి అంశంపై స్పష్టమైన అవగాహన పెంచుకుంది. ఒకానొక కాలంలో విదేశీ ఒప్పందాలు రద్దు అయిపోయి కంపెనీ సంక్షోభపుటంచుల్లోకి వెళ్లింది. ఇలాంటి పరిస్థితులలో దీపాలీ ట్రబుల్ షూటర్‌గా మారి కంపెనీని మళ్లీ విజయపథంలోకి తీసుకువచ్చింది. (వరల్డ్‌లోనే రిచెస్ట్ బిచ్చగాడు ఎవరో తెలుసా? ఎన్ని కోట్ల ఆస్థి తెలిస్తే..?) ఇంతలోనే కోవిడ్ రూపంలో మరో సంక్షోభం ఎదురైంది. దాన్ని కూడా తన నాయకత్వ లక్షణాలతో విజయవంతంగా అధిగమించింది.‘ఏ సంక్షోభాన్నీ వృథాగా పోనివ్వకూడదు. దానినుంచి నేర్చుకునే విలువైన పాఠాలు ఎన్నో ఉంటాయి. మనల్ని మనం పునఃపరిశీలన చేసుకోవడానికి, మెరుగు పెట్టుకోవడానికి సంక్షోభాలు ఉపయోగపడతాయి’ అంటుంది దీపాలీ. ప్రస్తుతం కంపెనీకి సంబంధించిన ఉత్పత్తుల్లో 94 శాతం బయటి దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇంటర్నేషనల్ మార్కెట్‌తో పాటు ఇండియన్ మార్కెట్‌పై కూడా దీపాలీ దృష్టి సారించింది. ‘వ్యాపారవేత్త నిలువ నీరులా ఒకచోట ఉండిపోకూడదు. ప్రవాహమైపోవాలి. ప్రతి అడుగులో కొత్త విషయాలు తెలుసుకోవాలి. కొత్తగా ఆలోచించడం అనేది వ్యాపారానికి ప్రాణవాయువులాంటిది’ అనేది తాను నమ్మిన సిద్ధాంతం. ఇప్పుడు కంపెనీ చేతిలో సరికొత్త ఆవిష్కరణలకు సంబంధించి 35 పేటెంట్స్ ఉన్నాయి.‘అందరికీ అన్నీ తెలియాలి అని ఏమీ లేదు. తెలుసుకోవడానికి మన దగ్గర ఉన్న శక్తి... ప్రశ్న. ఒక్క ప్రశ్నతో ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. మన అజ్ఞానం బయటపడుతుందేమో అని సంశయిస్తే అక్కడే ఉండిపోతాం. నాకు ఈ విషయం గురించి పెద్దగా తెలియదు. దయచేసి చెబుతారా? అని అడిగేదాన్ని. మనం తెలివి ఉన్న వ్యక్తి అయినంత మాత్రాన సరిపోదు. ఆ తెలివితో కంపెనీ ఎంత ముందుకు వెళ్లిందనేది ముఖ్యం. నేర్చుకోవడం అనే ప్రక్రియకు కాలపరిధి లేదు. అది నిత్యం జరుగుతూనే ఉండాలి’ అంటుంది దీపాలీ. ఈఎస్జీ–ఎన్విరాన్మెంటల్, సోషల్ అండ్ గవర్నెన్స్ తమ వ్యాపారానికి కీలకం అనేది దీపాలీ చెప్పేమాట. కంపెనీ ప్రాడక్ట్స్‌కు సంబంధించి తయారీ ప్రక్రియలో రీసైకిల్ వాటర్‌ను ఉపయోగించడం కూడా ఇందులో భాగమే. మరోవైపు రైతులతో కలిసి పర్యావరణానికి సంబంధించిన విషయాలపై పనిచేస్తోంది.దీపాలీ ‘వెల్స్పన్’లోకి అడుగు పెట్టినప్పుడు కేవలం ఏడు శాతం మంది మహిళలే ఉండేవారు. ఇప్పుడు వారి ప్రాతినిధ్యం ముప్ఫై శాతానికి పెరిగింది.ఈతరం వ్యాపారవేత్తలకు దీపాలీ ఇచ్చే సలహా ఇది...‘వ్యాపారికి తన వ్యాపారం మాత్రమే ప్రపంచం కాకూడదు. తన మానసిక ఆరోగ్యం, తినే తిండి, వ్యాయామాలపై కూడా దృష్టి పెట్టాలి. మనం మానసికంగా చురుగ్గా ఉంటేనే ఉత్తమమైన ఆలోచనలు వస్తాయి’సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా నిరూపించుకున్న దీపాలీ గోయెంకాలో మరో కోణం దాతృత్వం. -
టెక్స్టైల్ పార్క్‌కు సహకరించడం లేదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు ఎంవోయూకు బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు రావడం లేదని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. కేంద్రంలోని పెద్దలను తాను అనేక సార్లు అభ్యర్థించి రాష్ట్రానికి టెక్స్ టైల్ పార్కును తీసుకొస్తే ఇక్కడి సర్కారు నుంచి స్పందన లేక పోగా ఏ మాత్రం సహకరించడం లేదని ఆరోపించారు. శనివారం హైదరాబాద్‌లో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. వ్యవసాయానికి మోదీ ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తోందని, పెద్ద ఎత్తున ఎరువుల సబ్సిడీ ఇస్తోందన్నారు. పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పనే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని ఆయన స్పష్టం చేశారు. తాజాగా పెంచిన పంటల మద్దతు ధర ఈ ఖరీఫ్ సీజన్‌నుంచే అమల్లోకి వస్తుందని, రైతులకు మేలు చేసేలా కేంద్రం గొప్ప నిర్ణయం తీసుకుందన్నారు. భారత్ బ్రాండ్ పేరుతో యూరియా నానో యూరియాతో పాటు భారత్బ్రాండ్ పేరుతో యూరియా ప్రవేశ పెడుతున్నట్టు, ఇందుకు 8 ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్టు కిషన్‌రెడ్డి తెలిపారు. 2014లో దేశ వ్యవసాయ బడ్జెట్ రూ.21,933 కోట్లు ఉంటే, తొమ్మిదేళ్లలో రూ.లక్షా 25 వేల 33 కోట్లకు పెరిగిందని వివరించారు. కిసాన్‌క్రెడిట్‌కార్డుల ద్వారా రూ.28,590 కోట్ల వ్యవసాయ రుణాల మంజూరు, 23 కోట్ల సాయిల్హెల్త్ కార్డులను రైతులకు అందజేసినట్టు తెలియజేశారు. ఒకప్పుడు రూ.లక్ష కోట్ల విలువైన నూనెల దిగుమతి ఉండేదని, ఇప్పుడు రైతుల నుంచి నూనె గింజల సేకరణ 1,500 శాతం పెరిగిందని తెలిపారు. గుడ్ల ఉత్పత్తిలో మూడో స్థానం, మాంసం ఉత్పత్తిలో 8వ స్థానం, పప్పుదినుసుల సేకరణలో కూడా కేంద్రం 7300 శాతం వృద్ధి సాధించిందన్నారు. ఎరువుల రాయితీ గత ఏడాదికి ఈ ఏడాదికి పోలిస్తే 500 శాతం పెరిగిందని చెప్పారు. రూ.20 లక్షల కోట్లు రుణ వితరణ లక్ష్యంగా.. ఈ ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగానికి రూ.20 లక్షల కోట్లు రుణ వితరణ లక్ష్యంగా కార్యాచరణను కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తోందని కిషన్‌రెడ్డి వివరించారు. ప్రస్తుతమున్న ఈ–నామ్మార్కెట్లు 1260 బాగా నడుస్తున్నాయని తెలిపారు. ♦ 9 ఏళ్ల పాలనలో తెలంగాణకు చేకూరిన ప్రయోజనాలను గురించి కిషన్‌రెడ్డి వివరించారు. అవేంటంటే... ♦ తెలంగాణలో 39 లక్షల మంది రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్‌యోజన ద్వారా ఏటా రూ.6 వేలు అందజేత ♦ రూ.6,300 కోట్లతో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభం. ♦ సించాయ్యోజన కింద చిన్న సాగునీటి ప్రాజెక్టుల పూర్తి. ♦ దీని కింద తెలంగాణలో 11 ప్రాజెక్టులను గుర్తించి, వాటిని పూర్తి చేసుకోవడం కోసం ఇప్పటి వరకు రూ.1,248 కోట్లు కేటాయింపు. ♦ రూ.23,948 కోట్లతో ఎల్సీడీసీ ద్వారా గొర్రెల పెంపకం, ఇతర వ్యవసాయ కార్యక్రమాలకు రుణాల మంజూరు. ♦ ఆయిల్ పామ్ మిషన్ కింద రూ.214 కోట్లు. ♦ ఒక్క ఎరువుల మీద రూ.27 వేల కోట్ల రూపాయల సబ్సిడీ. ♦ రైతులకు మేలు చేసే ‘వేపపూత’ యూరియాను అందుబాటులోకి తీసుకొచ్చారు ♦ తెలంగాణలో ఎఫ్‌సీఐ ద్వారా ధాన్యం సేకరణకు కేంద్రం ఒకప్పుడు రూ.3,307 కోట్లు ఖర్చు చేస్తే ఇప్పుడు రూ.26,307 కోట్లు వెచ్చిస్తోంది. -
Karnataka assembly election 2023: ఒక్కో గ్రామ పంచాయతీకి రూ.కోటి
సాక్షి, బళ్లారి: కర్ణాటకలో అధికారంలోకి వస్తే ప్రతి గ్రామ పంచాయతీకి రూ.కోటి, కళ్యాణ కర్ణాటక ప్రాంతాభివృద్ధికి రూ.5,000 కోట్లు మంజూరు చేస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. శుక్రవారం కలబురిగి జిల్లాలోని జేవర్గీ సభలో హోరు వానలోనూ రాహుల్ ప్రసంగించారు. ‘బళ్లారిలో రూ.5,000 కోట్లతో వస్త్ర పరిశ్రమను తెస్తాం. జిల్లాను ప్రపంచ జీన్స్ హబ్‌గా, జీన్స్ రాజధానిగా మారుస్తాం. 50 వేల ఉద్యోగాల భర్తీని పూర్తిచేస్తాం’ అని అన్నారు. ‘ప్రతీ పనికి కాంట్రాక్టర్ల నుంచి మంత్రులు 40 శాతం కమిషన్ గుంజారు. ఈ ప్రభుత్వ దోపిడీతో బళ్లారి ప్రజలు ఆర్థికంగా ఎంతో నష్టపోయారు’’ అని ఆరోపించారు. తాము 150 సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తంచేశారు. -
టెక్స్టైల్ పార్కుల పనుల్లో వేగం పెంచండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నేతన్నల సంక్షేమం, ఆదాయ, వృత్తి నైపుణ్యం పెంచేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కె. తారకరామారావు స్పష్టం చేశారు. బీఆర్కే భవన్లో ఆయన జౌళి శాఖపై శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. టెక్స్ టైల్ శాఖ నిర్వహిస్తున్న కార్యక్రమాలు, వాటి అమలు తీరుపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నేతన్నలకు ప్రభుత్వం అందిస్తున్న చేనేత మిత్ర లాంటి కార్యక్రమాల పురోగతిపై ఆరా తీశారు. ప్రస్తుతం కొనసాగుతున్న పథకాలు అత్యంత సులభంగా నేతన్నలకు అందేలా అవసరమైన మార్పులు చేయాలని అధికారులకు సూచించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా నేతన్నల సంక్షేమం కోసం కేసీఆర్ ప్రభుత్వం విభిన్న కార్యక్రమాలను చేపట్టిందని వివరించారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో మినీ టెక్స్టైల్ పార్కులు, ఆప్పారెల్ పార్కుల అభివృద్ధిని చేపట్టిందన్నారు. గుండ్ల పోచంపల్లి అప్పారెల్ పార్క్, గద్వాల్ హ్యాండ్లూమ్ పార్క్ కార్యక్రమాలపై మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా సమీక్షించారు. ఆయా పార్కుల్లో ఇంకా మిగిలిపోయిన పనులుంటే వెంటనే వాటిని వెంటనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో బ్లాక్ లెవెల్ క్లస్టర్ల పనితీరుపైన, వాటి పురోగతి పైన వెంటనే నివేదిక తయారు చేయాలని ఆదేశించారు. ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి చేనేత కార్మికులు అధికంగా ఉన్న నారాయణపేట, గద్వాల్, దుబ్బాక, కొడకండ్ల, మహాదేవపూర్, కొత్తకోట వంటి ప్రాంతాల్లో ప్రత్యేకంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, మౌలిక వసతుల కల్పనకు అధికారులు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. ఆగస్టు 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని, ఆ రంగంలోని అద్భుతమైన ప్రతిభ కనబరుస్తున్న నేతన్నలకు గుర్తింపునిచ్చేలా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. హైదరాబాద్ నగరంలో చేనేత మ్యూజియాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలను వెంటనే సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పవర్లూమ్పై కూడా... రాష్ట్రంలో ఉపాధి కోసం నేతన్నలు విస్తృతంగా ఆధారపడిన పవర్లూమ్ రంగం కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపైన కూడా ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి సూచించారు. ఇందుకోసం దేశంలోనే ఆదర్శంగా ఉన్న తమిళనాడులోని తిర్పూర్ క్లస్టర్ మాదిరి ఒక సమీకృత పద్ధతిన,అత్యున్నత ప్రమాణాలతో కూడిన పవర్ లూమ్ క్లస్టర్లను తెలంగాణలో అభివృద్ధి చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సూచించారు.ఇందుకోసం తిర్పూర్‌లో పర్యటించి అనేక అంశాలపై విస్తృతంగా అధ్యయనం చేయాలన్నారు. సమావేశంలో చేనేత, పవర్ లూమ్ కార్పొరేషన్ల చైర్మన్లు ఎల్.రమణ, గూడూరి ప్రవీణ్, టెక్స్ టైల్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
రాష్ట్రానికి టెక్స్టైల్ పార్కు
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణలో పీఎం మిత్ర మెగా టెక్స్టైల్ పార్క్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. టెక్స్టైల్ రంగానికి మరింత ఊతం ఇచ్చేలా 5 ఎఫ్ (ఫార్మ్–ఫైబర్–ఫ్యాక్టరీ–ఫ్యాషన్–ఫారిన్) దృష్టితో దేశవ్యాప్తంగా ఏడు మెగా టెక్స్టైల్ పార్కులు నెలకొల్పనున్నట్టు మోదీ శుక్రవారం ట్వీట్లో తెలిపారు. తెలంగాణలో వరంగల్‌తో పాటు ఉత్తర్‌ప్రదేశ్ (లక్నో), మధ్యప్రదేశ్ (ధార్), మహారాష్ట్ర (అమరావతి), తమిళనాడు(విరుదునగర్), కర్ణాటక (కల్బుర్గి), గుజరాత్ (నవ్సారీ)ల్లో పీఎం మిత్ర మెగా టెక్స్టైల్ పార్కులు ఏర్పాటు కానున్నాయి. ఒక్కో మెగా టెక్స్టైల్ పార్కు ద్వారా ప్రత్యక్షంగా ఒక లక్ష ఉద్యోగాలతో పాటు, పరోక్షంగా 2 లక్షలమందికి ఉపాధి కలి్పంచేందుకు అవకాశం ఉండనుంది. అంతేగాక ఒక్కో మెగా టెక్స్టైల్ పార్కు సుమారు రూ.10 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉంటుందని కేంద్ర జౌళి శాఖ తెలిపింది. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పనిచేసే స్పెషల్ పర్పస్ వెహికల్ ద్వారా మెగా టెక్స్టైల్ పార్కు ఏర్పాటు పనుల పర్యవేక్షణ జరుగనుంది. మోదీ ఇచ్చిన మాట మేరకు.. లక్షలాదిమంది రైతులకు, చేనేత కారి్మకులకు ఉపయోగపడటంతోపాటు, వేలాదిమంది యువతకు ఉద్యోగాలను అందించే మెగా టెక్స్టైల్ పార్కును తెలంగాణకు ప్రకటించటం పట్ల ప్రధాని నరేంద్ర మోదీకి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. గతంలో పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన విజయ సంకల్పసభలో మెగా టెక్స్టైల్ పార్కును తెలంగాణకు ఇస్తామన్న ప్రధాని ఇచి్చన మాటకు కట్టుబడి అధికారికంగా ప్రకటన చేశారని కిషన్‌రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఈ మెగా టెక్స్టైల్ పార్కులో దారం తయారీ నుంచి బట్టలు నేయడం, రంగులు అద్దడం, డిజైన్లు ముద్రించడం, వ్రస్తాల తయారీ వరకు అన్ని రకాల పనులు ఒకే ప్రదేశంలో నిర్వహించేలా ఆధునిక మౌలిక సదుపాయాలతో కూడిన భారీ వస్త్ర పరిశ్రమలను ఏర్పాటు చేస్తారన్నారు. ఈ మెగా టెక్స్టైల్ పార్కుల ఏర్పాటు వలన రవాణా ఖర్చులు తగ్గి, భారతీయ టెక్స్టైల్ రంగంలో పోటీతత్వం పెరుగుతుందని కేంద్రమంత్రి తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మెగా టెక్స్టైల్ పార్కు ఏర్పాటు విషయంలో ప్రత్యేక చొరవను చూపించి, అవసరమైన సహాయసహకారాలను అందించి ప్రాజెక్టు త్వరగా కార్యరూపం దాల్చటానికి కృషి చేయాలని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి కోరారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్‌కు ఊతం.. ‘ఫైబర్ టు ఫ్యాబ్రిక్’నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ జిల్లా లోని గీసుకొండ, సంగెం మండలాల పరిధిలోని 1200 ఎకరాల్లో ‘కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు’ను ఏర్పాటు చేసింది. 2017లో ఈ మెగా టెక్స్టైల్ పార్కుకు శంకుస్థాపన చేసిన టీఎస్ఐఐసీ ద్వారా కొంత మేర మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన పను లు కూడా జరిగాయి. అంతర్గత రహదారులు, విద్యుత్ తదితర వసతులను సమకూర్చడంతో యంగ్వన్, గణేశా ఈకో వంటి పెద్ద సంస్థలు తమ కార్యకలాపాలను కూడా ప్రారంభించాయి. అయితే దీనికి పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కలి్పంచేందుకు రూ.897 కోట్లు ఇవ్వాలని గతంలో మంత్రి కేటీఆర్ పలు సందర్భాల్లో కేంద్రా నికి లేఖలు రాశారు. ఈ నేపథ్యంలో తాజాగా ‘పీఎం మిత్ర’టెక్స్ టైల్ పార్కు పథకంలో వరంగల్‌ను చేర్చడం ద్వారా కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో కొత్తగా కాలుష్య శుదీ్ధకరణ ప్లాంటు, ఇతర మౌలిక వసతుల కల్పన సాధ్యమవుతుందని పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ‘సాక్షి’కి వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ నిధులతో టీఎస్ఐఐసీ ద్వారా కొంత మేర వసతుల కల్పన జరిగిందన్నారు. ఇప్పుడు ‘పీఎం మిత్ర’ కింద ఎంత మేర నిధులు వస్తాయనే సమాచారం ఇంకా తమకు అందలేదన్నారు. -
వెల్ స్పన్ టెక్స్టైల్ పార్క్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
-
అరవింద్ లాభం డౌన్!
న్యూఢిల్లీ: టెక్స్టైల్స్ రంగ దిగ్గజం అరవింద్ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 12 శాతం క్షీణించి రూ. 87 కోట్లకు పరిమితమైంది. గతేడాది (2021–22) ఇదే కాలంలో రూ. 98 కోట్లకుపైగా ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 2,270 కోట్ల నుంచి రూ. 1,980 కోట్లకు బలహీనపడింది. అయితే మొత్తం వ్యయాలు సైతం రూ. 2,135 కోట్ల నుంచి రూ. 1,900 కోట్లకు తగ్గాయి. కంపెనీ లక్ష్యానికి అనుగుణంగా దీర్ఘకాలిక రుణ భారాన్ని తగ్గించుకుంటున్నట్లు అరవింద్ పేర్కొంది. దీనిలో భాగంగా క్యూ3లో రూ. 135 కోట్లు తిరిగి చెల్లించడం ద్వారా 2022 డిసెంబర్31కల్లా దీర్ఘకాలిక రుణాలు రూ. 739 కోట్లకు చేరినట్లు వెల్లడించింది. ఫలితాల నేపథ్యంలో అరవింద్ షేరు ఎన్ఎస్ఈలో దాదాపు 2 శాతం నష్టంతో రూ. 85 వద్ద ముగిసింది. చదవండి: ఆయనకు లేదా బాధ్యత? ముందు గూగుల్ సీఈవోను తొలగించండి: పెల్లుబుకిన ఆగ్రహం -
కేంద్రంలో ఆర్థిక మంత్రులు మారుతున్నా.. తెలంగాణకు దక్కింది శూన్యమే
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో ఆర్థిక మంత్రులు మారుతున్నా తెలంగాణతోపాటు టెక్స్టైల్ రంగానికి దక్కింది శూన్యమేనని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం వచ్చే ఏడాది ప్రవేశపెట్టే పూర్తిస్థాయి బడ్జెట్ చివరిదని, అందులో నేత కార్మికులు, టెక్స్టైల్ రంగానికి ఎక్కువ నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. నేత కార్మికుల సంక్షేమం, అభివృద్ధి కోసం ఎనిమిదేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టినా కేంద్రం నుంచి ఎలాంటి ప్రోత్సాహం అందలేదన్నారు. ఈమేరకు కేటీఆర్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. దేశంలోనే అతిపెద్దదైన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ప్రాధాన్యతను కేంద్రం గుర్తించడం లేదని, రూ.1600 కోట్లతో చేపట్టిన ఈ పార్క్‌లో మౌలిక వసతుల కల్పనకు రూ.900 కోట్లు కేటాయించాలని కోరారు. టెక్స్టైల్ రంగానికి ప్రోత్సాహం లేనందునే బంగ్లాదేశ్, శ్రీలంక వంటి చిన్న దేశాల కంటే భారత్ వెనుకబడి ఉందన్నారు. మౌలిక వసతుల కల్పన, ప్రోత్సాహకాల విధానం లేనందునే మేకిన్ ఇండియా నినాదంగానే మిగిలిపోయిందన్నారు. తెలంగాణ లాంటి ప్రగతిశీల రాష్ట్రాలకు సహకరించాలని కోరారు. మెగా క్లస్టర్‌కు రూ.100 కోట్లు ఇవ్వండి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సిరిసిల్ల పవర్లూమ్ క్లస్టర్లో 25 వేల మరమగ్గాలు ఉన్నందున మెగా క్లస్టర్‌గా గుర్తించి రూ.100 కోట్లు ఇవ్వాలని కేటీఆర్ కోరారు. సిరిసిల్ల మరమగ్గాల ఆధునికీకరణ, వాల్యూచైన్ బలోపేతం, మార్కెట్, నైపుణ్యాభివృద్ధి తదితరాల కోసం రూ.990 కోట్లు కేటాయించాలన్నారు. పవర్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మరమగ్గాల రంగాన్ని బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను దృష్టిలో పెట్టుకుని ‘ఇన్–సిటు పవర్లూమ్ అప్‌గ్రెడేషన్’కింద 13వేల మరమగ్గాల ఆధునికీరణకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ‘రాష్ట్రంలో 40వేల మంది నేత కార్మికులు పనిచేస్తున్నందున ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ సంస్థను మంజూరు చేయాలి. చేనేత ఉత్పత్తులపై ప్రతిపాదించిన జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలి. దేశంలో చేనేత, వస్త్ర పరిశ్రమలో 80శాతం చిన్న, సూక్ష్మ యూనిట్లు ఉన్నందున పన్నుల భారం తగ్గించాలి. ప్రస్తుతమున్న రూ.20 లక్షల జీఎస్టీ స్లాబ్‌ను చేనేత, పవర్లూమ్ కార్మికులకు రూ.50 లక్షల వరకు పెంచాలి’అని కోరారు. వచ్చే బడ్జెట్లో తెలంగాణ టెక్స్టైల్ రంగానికి భారీగా నిధులు కేటాయించాలని, రాష్ట్రానికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని కేటీఆర్ కోరారు. టెక్స్టైల్ రంగానికి వ్యతిరేకంగా మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు పునఃసమీక్షించుకోవాలని హితవు పలికారు. మోదీ ప్రభుత్వం రద్దు చేసిన ఆల్ ఇండియా హ్యాండూŠల్మ్, పవర్లూమ్, హ్యాండీక్రాఫ్ట్ మండళ్లను తిరిగి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. -
పీఎల్ఐ పథకంతో టెక్స్‌టైల్స్‌లోకి
న్యూఢిల్లీ: ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) స్కీముతో దేశీ టెక్స్టైల్స్ పరిశ్రమ రూ. 1,536 కోట్ల పెట్టుబడులను ఆకర్షించినట్లు కేంద్రం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. అర్హత కలిగిన 56 దరఖాస్తుదారులకు ఇప్పటికే అనుమతి పత్రాలను జారీ చేసినట్లు వివరించింది. దేశీయంగా దుస్తులు, ఫ్యాబ్రిక్స్, తయారీని ప్రోత్సహించేందుకు కేంద్రం టెక్స్టైల్స్ రంగం కోసం రూ. 10,683 కోట్లతో పీఎల్‌ఐసీ స్కీమును ప్రవేశపెట్టింది. దీని కింద ఈ ఏడాది జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28 వరకూ దరఖాస్తులు స్వీకరించింది. 64 దరఖాస్తుదారులను సెలక్షన్ కమిటీ ఎంపిక చేయగా, 56 దరఖాస్తుదారులు కొత్త కంపెనీ ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేశారు. దీనితో వారికి అనుమతి పత్రాలను కేంద్రం జారీ చేసింది. -
తెలంగాణ చేనేతకు ప్రపంచ మార్కెట్లో డిమాండ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ చేనేత కళా నైపుణ్యానికి ప్రపంచ మార్కెట్లో అద్భుతమైన డిమాండ్ ఉందని అమెరికాకు చెందిన చేనేత, వస్త్ర పరిశోధకురాలు కైరా వెల్లడించారు. భారత్‌లో చేనేత ఉత్పత్తులు కేవలం చీరలకు మాత్రమే పరిమితం అవుతున్నాయన్నారు. ఇతర దుస్తులు, ఉత్పత్తులకు చేనేత, పట్టు పరిశ్రమను అనుసంధానించడం ద్వారా మార్కెటింగ్ విస్తృతి పెరుగుతుందని ఆమె తెలిపారు. చేనేత, వస్త్ర రంగంపై పరిశోధనలో భాగంగా రాష్ట్రంలో పర్యటిస్తున్న కైరా బుధవారం ప్రగతిభవన్‌లో మంత్రి కేటీ రామారావుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర పర్యటనలో తాను అధ్యయనం చేసిన విషయాలను కేటీఆర్‌కు వివరించారు. మరమగ్గాల కార్మికులు డబుల్ జకార్డ్ వంటి వినూత్న టెక్నిక్‌తో వస్త్రాలను ఉత్పత్తి చేయడాన్ని ప్రశంసించారు. రాష్ట్రంలోని పోచంపల్లి, సిద్దిపేట, సిరిసిల్ల, జనగామ, నారాయణపేట, గద్వాల ప్రాంతాల్లో జరుగుతున్న చేనేత వస్త్రాల ఉత్పత్తి, అక్కడి స్థితిగతులపై తాను అధ్యయనం చేసినట్లు వెల్లడించారు. పరిశోధనలో భాగంగా ఇప్పటి వరకు 9 దేశాల్లో పర్యటించగా, చేనేత అధ్యయనానికి భారత్‌లో తెలంగాణను మొదటి ప్రాధాన్యంగా ఎంచుకున్నట్లు కైరా చెప్పారు. చేనేత కళా నైపుణ్యం, వస్త్రాలపై ప్రేమతో దీర్ఘకాల పరిశోధన కోసం తన సమయాన్ని వెచ్చిస్తున్న కైరా ప్రయత్నాన్ని కేటీఆర్ అభినందించారు. -
వస్త్ర ఎగుమతులకు భారత్–యూఏఈ ఎఫ్‌టీఏ బూస్ట్
న్యూఢిల్లీ: భారత్–యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ (యూఏఈ) మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) దేశం నుంచి భారీగా వస్త్ర రంగ ఎగుమతుల పురోగతికి దోహదపడుతుందని వస్త్ర ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఏఈపీసీ) ఫెయిర్ అండ్ ఎగ్జిబిషన్ విభాగం చైర్మన్ అశోక్ రజనీ విశ్లేషించారు. ఈ ఒప్పందం వల్ల సుంకం రహిత మార్కెట్ ఏర్పడుతుందని, ఇది మన ఎగుమతుల్లో యూఏఈ వాటా మరింత పెరగడానికి దోహపడుతుందని ఇక్కడ విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. దుబాయ్‌లో జరుగుతున్న ఇంటర్నేషనల్ అపెరల్ అండ్ టెక్స్టైల్ ఫెయిర్ (ఐఏటీఎఫ్)లో 20 మందికి పైగా దేశీయ ఎగుమతిదారులు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నట్లు వెల్లడించారు. రెడీమేడ్ దుస్తుల్లో చైనా తర్వాతి స్థానంలో మనమే.. యూఏఈకి రెడిమేడ్ దుస్తులను సరఫరా చేసే దేశాల్లో చైనా తర్వాత భారత్ రెండో స్థానంలో ఉందని అశోక్ రజనీ తెలిపారు. ‘‘యూఏఈ సాంప్రదాయకంగా భారత వస్త్ర ఎగుమతులలో అగ్రశ్రేణి వాణిజ్య భాగస్వామిగా ఉంది. రెండు దేశాలూ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ)పై సంతకం చేయడంతో, భారత వస్త్ర ఎగుమతులకు యూఏఈలోకి సుంకం రహిత ప్రవేశం లభిస్తుంది. దీనితో దేశ వస్త్ర రంగం ఎగుమతులు మరింత పెరుగుతాయని అంచనా’’ అని ఆయన వివరించారు. ఎగ్జిబిషన్ గురించి మాట్లాడుతూ, విస్తృత శ్రేణి సాంప్రదాయ పత్తి, ఎంఎంఎఫ్ (మాన్ మేడ్ ఫైబర్స్) వస్త్రాలలో తాజా ఫ్యాషన్ పోకడలకు అనుగుణంగా భారతదేశ అత్యుద్భుత దుస్తుల డిజైన్లు, శైలులను ప్రదర్శించాలని మన ఎగుమతిదారులు లక్ష్యంగా పెట్టుకున్నారని అన్నారు. వివిధ రకాల ముడిసరుకు లభ్యత, ఇతర సానుకూల అంశాల పరంగా మన దేశ గార్మెంట్ పరిశ్రమ పటిష్టతను పరిగణనలోకి తీసుకుని, భారత్‌ను ఒక సోర్స్‌గా (మూల ఉత్పత్తి వనరు) మలచుకోడానికి యూఏఈ దుస్తుల బ్రాండ్లకు ఈ ఫెయిర్ భారీ వ్యాపార అవకాశాలను కల్పిస్తోందని తెలిపారు. భారత్ వస్త్ర పరిశ్రమ పటిష్టతను ఆయన వివరిస్తూ, సాంప్రదాయ దుస్తుల విభాగంలో పరిశ్రమ స్థిరపడిన తర్వాత, మరిన్ని విభాగాల్లోకి విస్తరించడానికి వ్యూహ రచన చేస్తోందన్నారు. దేశ దుస్తుల పరిశ్రమ ఇప్పుడు 16 బిలియన్ డాలర్ల సాంకేతిక వస్త్ర విభాగంలో ఎంఎంఎఫ్ కొత్త రంగాలలోకి విస్తరించిందని పేర్కొన్నారు. ప్రపంచ మార్కెట్ విలువలో ఇది దాదాపు 6 శాతమని తెలిపారు. -
హస్తకళాకారులకు జాతీయ అవార్డులు
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ హస్త కళలు, టైక్స్టైల్స్ రంగాల్లో విశేష ప్రతిభ చూపిన వారికి కేంద్రం అవార్డులు అందజేసింది. సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డులు అందజేసినట్లు టెక్స్టైల్స్ మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. 2017, 2018, 2019లో జాతీయ అవార్డులకు మొత్తం 78 మంది హస్త కళాకారులను ఎంపిక చేసినట్లు పేర్కొంది. 2018కి తెలంగాణ నుంచి కరీంనగర్‌కు చెందిన గద్దె అశోక్‌కుమార్ (సిల్వర్ ఫిలిగ్రీ)కి అందజేసినట్లు తెలిపింది. ఏపీ నుంచి అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన దాలవాయి కుళాయప్ప (లెదర్ పప్పెట్రీ, 2017), డి.శివమ్మ (లెదర్ పప్పెట్రీ, 2019)లకు అవార్డు అందజేసినట్లు పేర్కొంది. అవార్డు గ్రహీతలకు రూ.లక్ష నగదు, తామ్రపత్రం, శాలువా, ధ్రువపత్రం అందజేసినట్లు తెలిపింది. అలాగే, 2017, 2018, 2019 సంవత్సరాలకు మొత్తం 30 మంది శిల్పగురులను ఎంపిక చేయగా ఏపీ నుంచి బ్లాక్ మేకింగ్‌లో కొండ్ర గంగాధర్ (2018), కలంకారిలో వేలాయుధం శ్రీనివాసులు రెడ్డి (2019)ను ఎంపిక చేసినట్లు తెలిపింది. వీరికి బంగారు నాణెం, రూ.2 లక్షల నగదు, తామ్రపత్రం, శాలువా, ప్రశంసాపత్రం అందజేసినట్లు తెలిపింది. పీయూష్ గోయల్ నుంచి అవార్డు అందుకుంటున్న గద్దె అశోక్‌కుమార్ -
నకిలీ వస్త్రాలతో అడ్డంగా దొరికిన షాపింగ్ మాల్ యాజమాన్యం..
-
లాభాల్లో వస్త్రాల తయారీ దిగ్గజం అరవింద్
న్యూఢిల్లీ: వస్త్రాల తయారీ దిగ్గజం అరవింద్ లిమిటెడ్ సెప్టెంబర్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 79 శాతం ఎగసి రూ.125 కోట్లు సాధించింది. టర్నోవర్ 2.93 శాతం అధికమై రూ.2,170 కోట్లకు చేరింది. మొత్తం వ్యయాలు 3.5 శాతం హెచ్చి రూ.2,072 కోట్లుగా ఉంది. వస్త్రాల ద్వారా ఆదాయం 1.88 శాతం పెరిగి రూ.1,759 కోట్లకు, అడ్వాన్స్ మెటీరియల్స్ 5 శాతం అధికమై రూ.313 కోట్లకు చేరింది. క్రితం ముగింపుతో పోలిస్తే అరవింద్ లిమిటెడ్ షేరు ధర బీఎస్ఈలో మంగళవారం 1.88 శాతం తగ్గి రూ.94 వద్ద స్థిరపడింది. -
టెక్స్టైల్స్ రంగానికి రెండో విడత పీఎల్ఐ
న్యూఢిల్లీ: టెక్స్టైల్స్ రంగానికి రెండో విడత ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని (పీఎల్ఐ) పరిశీలిస్తున్నట్టు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. టెక్స్టైల్స్ ఎగుమతుల్లో అగ్రగామిగా ఉన్న చైనా, వియత్నాం దేశాలతో పోటీపడేందుకు ఇది పరిశ్రమకు మద్దతుగా నిలుస్తుందని. టెక్స్టైల్స్ రంగానికి ప్రకటించిన పీఎల్ఐ పథకం పనితీరుపై ఆ శాఖ వ్యవహరాలను చూస్తున్న గోయల్ సమీక్షించారు. టెక్స్టైల్స్ పీఎల్ఐ 2.0 ప్రకటించానికి ముందు భాగస్వాములతో విస్తృత సంప్రదింపులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పరిశ్రమ అంతర్జాతీయ మార్కెట్లో బలమైన పోటీనిచ్చే విధంగా పీఎల్ఐ 2.0ని రూపొందించాలన్నారు. అధిక విలువ కలిగిన ఉత్పత్తులపై దృష్టి పెట్టాలని పరిశ్రమకు సూచించారు. ఉపాధి అవకాశాల కల్పనకు, ఎగుమతులు, వృద్ధి బలోపేతానికి తగినన్ని సామర్థ్యాలు టెక్స్టైల్స్ పరిశ్రమకు ఉన్నట్టు చెప్పారు. -
స్పిన్నింగ్ పరిశ్రమపై మాంద్యం దెబ్బ
కొరిటెపాడు (గుంటూరు): కోవిడ్, రష్యా–ఉక్రెయిన్ యుద్ధ సంక్షోభాలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగించడంతో ఆ ప్రభావం స్పిన్నింగ్ మిల్లుల పరిశ్రమపై తీవ్రంగా ఉంది. కోవిడ్ విపత్తు తర్వాత ఆర్డర్లులేని పరిస్థితుల్లో ముడిసరుకు దూది ధరకంటే నూలు ధర తక్కువ కావడం, ఎగుమతులు క్షీణించడం.. స్వదేశీ మార్కెట్లో డిమాండ్ పడిపోవడం వంటి వరుస పరిణామాలు పరిశ్రమను వెంటాడుతున్నాయి. గత ప్రభుత్వం స్పిన్నింగ్ మిల్లులకు రూ.947 కోట్లు రాయితీలను బకాయి పెడితే కోవిడ్ కష్టాలను గమనించిన ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మూడేళ్లలో రూ.380 కోట్ల బకాయిలను చెల్లించింది. ఈ రంగాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా టెక్స్టైల్ పరిశ్రమ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుండంతో మిల్లులను పూర్తిస్థాయిలో నడపలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో.. మంగళవారం నుంచి 15 రోజుల పాటు స్పిన్నింగి మిల్లులను మూసివేయాలని నిర్ణయించినట్లు ఆంధ్రప్రదేశ్ టెక్స్టైల్ మిల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు లంకా రఘురామిరెడ్డి ప్రకటించారు. 50 శాతం ఉత్పత్తి నిలిపివేసినప్పటికీ.. రాష్ట్ర స్పిన్నింగ్, టెక్స్టైల్ పరిశ్రమల అసోసియేషన్ గత సమావేశంలో అప్పటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఉత్పత్తిలో 50 శాతం నిలిపివేయాలని తీర్మానం చేసిందని, కానీ.. ఇప్పుడు పరిస్థితులు మరింత క్షీణించిన దృష్ట్యా మొత్తం అన్ని పరిశ్రమలు పూర్తిగా మూసివేసి, నష్టాలబారి నుంచి బయటపడాలని నిర్ణయించినట్లు రఘురామిరెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ సంస్థలను, ఎంసీఎక్స్‌ను కట్టడిచేసి, పత్తి ధరలు నిలకడగా ఉండేలా చూడాలని కోరారు. ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న బకాయిలను ప్రస్తుత ప్రభుత్వం కరోనా వేళ గతేడాది సెప్టెంబర్‌లో రూ.237 కోట్లు విడుదలచేసి ఆదుకుందన్నారు. అదే విధంగా ప్రస్తుత విపత్కర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పెండింగ్‌లో ఉన్న అన్ని బకాయిలను విడుదల చేయాలని రఘురామిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా రెండున్నర లక్షల మంది ఆధారపడి జీవిస్తున్న ఈ రంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలన్నారు. -
ఆర్ఐఎల్ చేతికి శుభలక్ష్మీ పాలి
న్యూఢిల్లీ: పాలియెస్టర్ చిప్స్, యార్న్ తయారీ కంపెనీ శుభలక్ష్మీ పాలియెస్టర్స్(ఎస్పీఎల్)ను కొనుగోలు చేసినట్లు డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) తాజాగా పేర్కొంది. ఇందుకు సొంత అనుబంధ సంస్థ రిలయన్స్ పాలియెస్టర్ లిమిటెడ్ ద్వారా తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. దీనిలో భాగంగా శుభలక్ష్మీ పాలియెస్టర్స్, శుభలక్ష్మీ పాలిటెక్స్ లిమిటెడ్‌కు చెందిన పాలియెస్టర్ బిజినెస్‌లను కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించింది. వీటికి రూ. 1,522 కోట్లు, రూ. 70 కోట్లు చొప్పున చెల్లించనున్నట్లు తెలియజేసింది. ఈ డీల్‌కు కాంపిటీషన్ కమిషన్(సీసీఐ)తోపాటు రెండు సంస్థల రుణదాతల నుంచి అనుమతులు లభించవలసి ఉన్నట్లు పేర్కొంది. తాజా కొనుగోలు ద్వారా టెక్స్టైల్ తయారీ బిజినెస్ మరింత పటిష్టంకానున్నట్లు తెలియజేసింది. ఎస్పీఎల్ పాలియెస్టర్ ఫైబర్, యార్స్, టెక్స్టైల్ గ్రేడ్ చిప్స్ తయారు చేస్తోంది. ఏడాదికి 2,52,000 టన్నుల పాలిమరైజేషన్ తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. కంపెనీ గుజరాత్‌లోని దహేజ్, దాద్రానగర్ హవేలీలోని సిల్వస్సాలో ప్లాంట్లను నిర్వహిస్తోంది. ఇదీ చదవండి: ఐటీ జాబ్ పొందడమే మీ లక్ష్యమా? రెజ్యూమ్‌లో ఈ తప్పులు చేయకండి! -
ఏపీలో టెక్స్టైల్ పార్కు ఏర్పాటుకు పరిశీలన
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భారీ ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలించేందుకు రెండు రోజుల పర్యటన నిమిత్తం కేంద్ర బృందం రాష్ట్రానికి వచ్చింది. పీఎం మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ జీఎడ్ పెరెల్ (పీఎం మిత్ర) పథకం కింద కేంద్రం ఏర్పాటు చేయనున్న ఏడు టెక్స్టైల్ పార్కుల్లో ఒకటి రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని.. రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో 1,188 ఎకరాల్లో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని కోరుతూ.. అప్పట్లో కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. ఈ నేపథ్యంలో కేంద్ర టెక్స్టైల్ శాఖ డైరెక్టర్ హెచ్ఎస్ నంద నేతృత్వంలోని కేంద్రబృందం శుక్రవారం విజయవాడకు చేరుకుంది. మంగళగిరి ఏపీఐఐసీ కార్యాలయంలో పరిశ్రమల శాఖ, ఏపీఐఐసీ అధికారులతో పాటు టెక్స్టైల్ రంగానికి చెందిన పారిశ్రామికవేత్తలు, వివిధ టెక్స్టైల్ అసోసియేషన్లతో బృందం సమావేశమై రాష్ట్రంలో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు గల అవకాశాలను చర్చించింది. ఏపీఐఐసీ చైర్మన్ మెట్టు గోవింద రెడ్డి, ఆ సంస్థ వీసీ ఎండీ జవ్వాది సుబ్రమణ్యం టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు గల అవకాశాలు, ప్రయోజనాలను కేంద్ర బృందానికి వివరించారు. రాష్ట్రంలో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు చక్కటి అవకాశాలున్నాయని నంద పేర్కొన్నారు. సమావేశం ముగిసిన తర్వాత కేంద్ర బృందం కడపకు వెళ్లింది. శనివారం వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలోని భూములను బృందం పరిశీలించనుంది. పరిశ్రమల శాఖ డైరెక్టర్ సృజన, ఏపీఐఐసీ ఈడీలు సుదర్శన్ బాబు, రాజేంద్ర ప్రసాద్, పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్ వీఆర్వీఆర్ నాయక్, సీజీఎంలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు -
టెక్స్టైల్ పార్క్ మూసివేత
సిరిసిల్ల: కార్మికుల దినోత్సవం రోజునే టెక్స్టైల్ పార్కు మూతపడింది. మరమగ్గాలపై నేత కార్మికులకు ఉపాధి కల్పించేందుకు ఉమ్మడి రాష్ట్రంలోనే తొలిసారిగా సిరిసిల్లలో ఏర్పాటైన టెక్స్టైల్ పార్క్ లో పరిశ్రమల యజమానులు వస్త్రోత్పత్తి యూని ట్లను ఆదివారం మూసివేశారు. ఇప్పటికే టెక్స్టైల్ పార్క్‌లో వస్త్రోత్పత్తి గిట్టుబాటు కావడం లేదని ఆధునిక మరమగ్గాలను అమ్మేస్తున్నారు. తాజాగా ఆదివారం మొత్తం పరిశ్రమలను నిరవధికంగా బంద్ పెట్టడంతో అక్కడ పనిచేసే 1,500 మంది కార్మికులు రోడ్డునపడ్డారు. మంత్రి కేటీఆర్ ప్రాతి నిధ్యం వహిస్తున్న సిరిసిల్లలోనే టెక్స్టైల్ పార్క్ మూతపడటం చర్చనీయాంశమైంది. కరెంట్ ‘షాక్’ కారణం.. రాజన్న సిరిసిల్ల జిల్లా బద్దెనపల్లి శివారులో 65 ఎకరాల్లో 2003లో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటైంది. ఇక్కడ 7,000మంది కార్మికులకు ఉపాధి కల్పిం చాల్సి ఉండగా.. 3వేల మందికే పని లభిస్తోంది. పార్క్‌లో 113 యూనిట్లలో (1,695 మగ్గాలు) వస్త్రోత్పత్తి జరుగుతోంది. ఇటీవల సంక్షోభానికి గురైన 25మంది యూనిట్ల యజమానులు ఆధునిక ర్యాపియర్స్ లూమ్స్‌ను అమ్మేసుకున్నారు. వసతుల లేమి.. విద్యుత్ చార్జీల భారం పార్క్‌లోని పరిశ్రమ లకు శాపంగా మారాయి. సిరిసిల్లలోని పాత మర మగ్గాలకు 50% విద్యుత్ రాయితీని ప్రభుత్వం అమ లుచేస్తోంది. అదే టెక్స్టైల్ పార్క్‌లో వస్త్రోత్పత్తిదా రులకు యూనిట్ కరెంట్ ధర రూ.7.50 ఉంది. అదే మహారాష్ట్రలో యూనిట్ విద్యుత్ చార్జీ రూ.3గా ఉంది. తమిళనాడులో 500 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందిస్తుండగా.. అంతకుమించి వినియోగిస్తే.. ప్రతి యూనిట్‌కు రూ.2.50గా ఉంది. గతంలో టెక్స్టైల్ పార్క్‌లోని యూనిట్లకు.. 2014 డిసెంబర్ నాటికి 50% విద్యుత్ రాయితీని ప్రభుత్వం అందించి నిలిపివేసింది. ఇప్పుడు పూర్తి స్థాయిలో పరిశ్రమల యజమానులే విద్యుత్ బిల్లు చెల్లిస్తున్నారు. మరోవైపు నూలు రేట్లు బాగా పెరగడం, రవాణా చార్జీలు ఎక్కువ కావడంతో వస్త్రోత్పత్తి వ్యయం పెరిగింది. ఆ మేరకు మార్కెట్లో బట్టకు రేటు లభించక నష్టాలను చవిచూస్తున్నారు. ఫలితంగా టెక్స్టైల్ పార్క్‌లో పరిశ్రమలను నిరవధికంగా మూసివేశారు. యజమానుల డిమాండ్లు ఇవీ.. ♦2015 జనవరి – 2020 డిసెంబర్ వరకు విద్యుత్ సబ్సిడీ రీయింబర్స్ చేయాలి. ♦పార్క్‌లో మరమగ్గాల ఆధునీకరణకు, కొత్త యూనిట్లకు 25% ప్రోత్సాహకం ఇవ్వాలి. ♦పరిశ్రమలకు కేటాయించిన ప్లాట్లకు ‘ఎన్వోసీ’ సరళతరం చేయాలి. ♦టెక్స్టైల్ పార్క్‌లో కమ్యూనిటీ ఫెసిలిటీ సెంటర్ (సీఎఫ్‌సీ) ఏర్పాటు చేయాలి. ♦ప్రభుత్వం వస్త్రోత్పత్తి ఆర్డర్లను 25% టెక్స్టైల్ పార్క్‌కు ఇవ్వాలి. ♦యువకులకు మగ్గాలపై శిక్షణ ఇవ్వాలి. మంత్రి కేటీఆర్ చొరవచూపాలి సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్‌లో నెలకొన్న సమస్యలపై మంత్రి కేటీఆర్ చొరవచూపి ఆదుకోవాలి. ప్రధానంగా పెండింగ్‌లో ఉన్న విద్యుత్ రాయితీ రీయింబర్స్మెంట్ అందించాలి. – అన్నల్దాస్ అనిల్‌కుమార్, పార్క్ అసోసియేషన్ అధ్యక్షుడు -
61 ప్రతిపాదనలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్,టెక్స్‌టైల్స్‌లో రూ.19,000 కోట్ల పెట్టుబడులు!
టెక్స్టైల్స్ రంగానికి సంబంధించి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) కింద.. 61 ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వీటి రూపంలో రూ.19,077 కోట్ల పెట్టుబడులు రానున్నట్టు ప్రకటించింది. ఫలితంగా రూ.1,84,917 కోట్ల టర్నోవర్ నమోదు అవుతుందని.. 2.40 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తోంది. పీఎల్ఐ కింద మొత్తం 67 ప్రతిపాదనలు అందాయని టెక్స్టైల్స్ శాఖ కార్యదర్శి యూపీ సింగ్ వెల్లడించారు. గిన్ని ఫిలమెంట్స్, కింబర్లీ క్లార్క్, అరవింద్ తదితర కంపెనీల ప్రతిపాదనలు ఆమోదం పొందిన వాటిల్లో ఉన్నాయి. పీఎల్ఐ పథకం కింద ఎంఎంఎఫ్ (మానవ తయారీ) వ్రస్తాలు, ఎంఎంఎఫ్ ఫ్యాబ్రిక్స్, టెక్నికల్ టెక్స్టైల్స్ ఉత్పత్తులు తదితర వాటి తయారీపై ఐదేళ్ల కాలంలో రూ.10,683 కోట్ల ప్రోత్సాహకాలను ఇవ్వనున్నట్టు కేంద్ర ప్రభుత్వం లోగడే ప్రకటించడం గమనార్హం. దేశీయంగా టెక్స్టైల్స్ తయారీ సామర్థ్యాన్ని పెంచడం, ఎగుమతులను మరింత విస్తరించుకోవడం ఈ పథకం లక్ష్యాలుగా ఉన్నాయి. పార్ట్–2 కింద ఎక్కువ దరఖాస్తులు మొత్తం 67 దరఖాస్తుల్లో పార్ట్1 కింద 15 రాగా, పార్ట్2 కింద 52 వచ్చాయి. పార్ట్1 కింద కనీసం రూ.300 కోట్లను ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. పీఎల్ఐ కింద ప్రోత్సాహకాలు పొందాలంటే రూ.600 కోట్ల టర్నోవర్ నమోదు చేయాలి. పార్ట్2 కింద కనీస పెట్టుబడి పరిమితి రూ.100 కోట్లు. కనీసం రూ.200 కోట్ల టర్నోవర్ నమోదు చేస్తే ప్రోత్సాహకాలు అందుకోవచ్చు. గిన్ని ఫిలమెంట్స్, అవ్‌గోల్ ఇండియా, గోవా గ్లాస్ ఫైబర్, హెచ్‌పీ కాటన్ టెక్స్టైల్స్ మిల్స్, కింబర్లీ క్లార్క్ ఇండియా, మధుర ఇండ్రస్టియల్ టెక్స్టైల్స్, ఎంసీపీఐ ప్రైవేటు లిమిటెడ్, ప్రతిభ సింటెక్స్, షాహి ఎక్స్‌పోర్ట్స్, ట్రిడెంట్, డోనియర్ ఇండస్ట్రీస్, గోకల్దాస్ ఎక్స్‌పోర్ట్స్, అరవింద్ లిమిటెడ్ ఉన్నాయి. ఇందులో అరవింద్ లిమిటెడ్ రూ.170 కోట్లు, గిన్ని ఫిలమెంట్స్ రూ.180 కోట్లు, గోకల్దాస్ ఎక్స్‌పోర్ట్స్ రూ.143 కోట్లు, కింబర్లీ క్లార్క్ ఇండియా రూ.308 కోట్ల చొప్పున ఇన్వెస్ట్ చేయనున్నాయి. ఆమోదం పొందిన 61 ప్రతిపాదనల్లో ఏడు విదేశీ కంపెనీలకు సంబంధించి ఉన్నాయి. మరిన్ని ఎగుమతులు.. అంతర్జాతీయంగా మానవ తయారీ ఫైబర్, టెక్నికల్ టెక్స్‌టైల్స్‌లో భారత వాటా పెరిగేందుకు ఈ పథకం దోహదం చేస్తుందని యూపీ సింగ్ తెలిపారు. టెక్నికల్ టెక్స్టైల్స్ ఎగుమతులను 2 బిలియన్ డాలర్ల నుంచి 8–10 బిలియన్ డాలర్లకు పెంచుకోవాలని అనుకుంటున్నట్టు ప్రకటించారు. ఇక మెగా ఇన్వెస్ట్మెంట్ టెక్స్‌టెల్స్ పార్క్స్ (మిత్రా) పథకం గురించి సింగ్ మాట్లాడుతూ.. 13 రాష్ట్రాల నుంచి 17 ప్రతిపాదనలు వచి్చనట్టు చెప్పారు. ఇందులో మధ్యప్రదేశ్ నుంచి నాలుగు, కర్ణాటక నుంచి రెండు ఉన్నట్టు పేర్కొన్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకునేందుకు ఆయా రాష్ట్రాలకు బృందాలను పంపిస్తున్నట్టు వెల్లడించారు. ఈ పథకం కింద ఏడు పార్క్‌లను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. వీటి కోసం రాష్ట్రాల ఎంపికకు ప్రత్యేక విధానాన్ని అనుసరించనున్నట్టు చెప్పారు. -
‘లాయల్ టెక్స్టైల్స్’లో భారీ అగ్ని ప్రమాదం
నాయుడుపేట టౌన్: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలంలోని మేనకూరు పరిశ్రమల కేంద్రంలో ఉన్న లాయల్ టెక్స్టైల్స్ పరిశ్రమలో సోమవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రూ.కోట్లలో ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. అగ్నిమాపక శాఖ అధికారుల కథనం మేరకు.. పరిశ్రమలో ఒక్కసారిగా పెద్దఎత్తున మంటలు రావడంతో కార్మికులు బయటకు పరుగులు పెట్టారు. పరిశ్రమ ప్రతినిధులు వెంటనే అగ్నిమాపక శాఖ, పోలీసులకు సమాచారమిచ్చారు. అగ్ని మాపక శాఖ ఇన్చార్జి అధికారి టి.చలమయ్య ఉన్నతాధికారులకు సమాచారాన్ని చేరవేశారు. నాయుడుపేట, సూళ్లూరుపేట, వెంకటగిరి, గూడూరు, కోట తదితర ప్రాంతాల నుంచి అగ్నిమాపక వాహనాలను రప్చించారు. పరిశ్రమలోని దూది గోదాముతో పాటు వస్త్రాలు భద్రపరిచే గోడౌన్లను మంటలు చుట్టముట్టాయి. రాత్రి పొద్దు వరకు కూడా ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పుతున్నారు. సీఐ సోమయ్య సర్కిల్ పరిధిలోని ఎస్ఐలతో కలిసి వెళ్లి సహాయక కార్యక్రమాలు చేస్తున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. -
టెక్స్టైల్ చక్కగా.. ప్లాన్ పక్కాగా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అభివృద్ధి పథంలో వెళ్తున్న టెక్స్టైల్ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన రోడ్‌మ్యాప్ సిద్ధం చేయాలని మంత్రి కేటీఆర్ టెక్స్టైల్ శాఖ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే తెలంగాణ వస్త్ర రంగంలో పెట్టుబడులకు జాతీయ, అంతర్జాతీయ కంపెనీల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. కేటీఆర్ టెక్స్టైల్ శాఖ తరఫున చేపట్టిన పలు కార్యక్రమాలతోపాటు బడ్జెట్లో పొందుపరచాల్సిన వివిధ అంశాలపై సోమవారం ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. టెక్స్టైల్ రంగాన్ని మరింతగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం తరఫున చేపట్టాల్సిన కార్యాచరణ, భవిష్యత్ ప్రణాళికలపైన సమగ్ర నివేదికను రూపొందించాలన్నారు. గత ఏడున్నరేళ్లుగా ప్రభుత్వం నేతన్నల సంక్షేమం, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని అనేక కార్యక్రమాలు చేపట్టిందని, వాటి ఫలితాలు ప్రస్తుతం కనిపిస్తున్నాయని చెప్పారు. ఈ రంగంలో ఉపాధి కల్పనే ప్రాథమిక లక్ష్యంగా, నేతన్నల సంక్షేమమే పరమావధిగా అనేక వినూత్న కార్యక్రమాలను తెచ్చిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. దేశంలో వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న టెక్స్టైల్ రంగాన్ని ప్రాధాన్యత రంగంగా గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం, అందుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై ప్రధానంగా దృష్టి సారించిందన్నారు. రాష్ట్రంలో ఉన్న అవకాశాలను, ఇక్కడి మానవవనరులను, ప్రభుత్వ విధానాలను దృష్టిలో ఉంచుకుని అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని చెప్పారు. సమావేశంలో జౌళిశాఖ కమిషనర్ శైలజా రామయ్యర్, టీఎస్ఐఐసీ ఎండీ వెంకట నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆదిలాబాద్‌లో ఐటీ టవర్, టైక్స్‌టైల్ పార్క్
సాక్షి, హైదరాబాద్: ఆదిలాబాద్‌లో త్వరలో ఐటీ టవర్‌తోపాటు టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తామని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామరావు అన్నారు. ఎన్డీబీఎస్ ఇండియా ఎండీ, సంజీవ్ దేశ్‌పాండే ఐటీ టవర్ ఏర్పాటుకు ముందుకు వచ్చారని వెల్లడించారు. ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ విస్తరించడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఆదిలాబాద్ జిల్లాలోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)ను పునరుద్ధరిస్తే కొత్త కంపెనీ తరహాలో రాయితీలిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్లామని వివరించారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, పలువురు జిల్లా నేతలు బుధవారం మంత్రి కేటీఆర్‌తో ప్రగతి భవన్లో భేటీ అయ్యారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పరిశ్రమల స్థాపన ద్వారా ఉపాధి అవకాశా లు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుం డగా, కేంద్రం మాత్రం ప్రభుత్వరంగ సంస్థను అమ్మేందుకు కుట్ర చేస్తోందన్నారు. సిర్పూర్ పేపర్ మిల్లును రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ప్రారంభిస్తే, సింగరేణి ప్రైవేటీకరణకు కేంద్రం తెరలేపింద న్నారు. ఆదిలాబాద్ సీసీఐ యూనిట్ పునరుద్ధర ణకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు సీసీఐ సాధన సమితి ఏర్పాటు చేసి ఉద్యమ కార్యాచరణ చేపడ తామని ఆ జిల్లా నేతలు వెల్లడించారు. ఈ విష యమై బీజేపీ ఎంపీపై ఒత్తిడి తెస్తామన్నారు. అటవీ భూములపై హక్కులిచ్చేందుకు సానుకూలం ఆదివాసీ రైతులు సాగుచేసుకుంటున్న అటవీ భూములపై హక్కులు కల్పించే విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి కేటీ రామారావు అన్నారు. టీఆర్ఎస్కి చెందిన ఆదివాసీ ప్రజాప్రతినిధులు, ఆదివాసీ సంఘాల ప్రతినిధులు బుధవారం ప్రగతిభవన్‌లో కేటీఆర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఆదివాసీలకు సంబంధించిన అన్ని సమస్యలపై త్వరలో ఆదివాసీ ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. తమ తెగలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని సంఘాల ప్రతినిధులు కేటీఆర్‌ను కోరారు. భేటీలో ప్రభుత్వ విప్ కాంతారావు, ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో పాటు పలువురు టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, ఆదివాసీ సంఘాల నేతలు పాల్గొన్నారు. -
AP: నేతన్నకు ఊతం.. ఆఫర్లతో ఆప్కోకు అందలం
సాక్షి, అమరావతి: క్రిస్మస్, సంక్రాంతి పండుగ సీజన్లలో ప్రకటించిన ఆఫర్ల కారణంగా ఆప్కో వస్త్ర వ్యాపారం ఊపందుకుంది. పండుగ సీజన్లలో అమ్మకాలు పెరగడమే ఇందుకు నిదర్శనం. పండుగ సీజన్లలో 30 శాతం డిస్కౌంట్‌పై ఆప్కో అమ్మకాలు సాగించడంతో ఆప్కో షోరూమ్‌ల ద్వారా గతేడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది జనవరి వరకు ఏకంగా రూ.9 కోట్లకుపైగా వస్త్ర విక్రయాలు జరిగాయి. చదవండి: గుడివాడలో టీడీపీకి భంగపాటు రాష్ట్రంలోని పలు సొసైటీల వద్ద పేరుకుపోయిన చేనేత వస్త్రాల నిల్వలను కరోనా కష్టకాలంలోనూ కొనుగోలు చేస్తున్న ఆప్కో లాభాపేక్ష లేకుండా వినియోగదారులకు అందిస్తోంది. ఒక్క తూర్పుగోదావరి జిల్లా చేనేత సహకార సొసైటీల్లో పేరుకుపోయిన రూ.కోటి 60 లక్షల విలువైన బెడ్షీట్లను ఆప్కో కొనుగోలు చేసి విక్రయాలు జరిపింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 108 ఆప్కో షోరూమ్‌లున్నాయి. వాటిలో నామ మాత్రపు విక్రయాలు జరిగే వాటిని తొలగించి వ్యయప్రయాసలు తగ్గించేందుకు ఆప్కో సిద్ధమైంది. అయితే ఇటీవల ప్రారంభించిన గుంటూరు, ఒంగోలు, కడపలో రోజుకు రూ.లక్షకుపైగా అమ్మకాలు జరగడంతో రాష్ట్రంలో మరో పది మెగా షోరూమ్‌ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. -
వస్త్ర పరిశ్రమకు ఊరట
న్యూఢిల్లీ: వస్త్రాలపై (టెక్స్టైల్స్) జీఎస్టీని 5 శాతం నుంచి 12 శాతానికి పెంచాలన్న నిర్ణయాన్ని జీఎస్టీ కౌన్సిల్ నిలిపివేసింది. పలు రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకించడంతో నిలిపివేస్తూ కౌన్సిల్ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. వాస్తవానికి జనవరి 1 నుంచి నూతన రేటు అమల్లోకి రావాల్సి ఉంది. నిర్ణయాన్ని వాయిదా వేయాలంటూ రాష్ట్రాల నుంచి డిమాండ్లు రావడంతో అత్యవసరంగా జీఎస్టీ మండలి శుక్రవారం భేటీ అయి ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. రాష్ట్రాల ఆర్థిక మంత్రుల కమిటీకి ఈ అంశాన్ని అప్పగించి, ఫిబ్రవరి నాటికి పన్ను రేటుపై సిఫారసు చేయాలని కోరినట్టు మంత్రి సీతారామన్ చెప్పారు. పాదరక్షలకు సంబంధించిన ఇదే డిమాండ్‌కు అంగీకరించలేదన్నారు. రేట్ల హేతుబద్ధీకరణను పరిశీలిస్తున్న రాష్ట్రాల ఆర్థిక మంత్రుల బృందాన్ని.. టెక్స్‌టైల్స్‌పై పన్ను రేటును పరిశీలించాలని కోరినట్టు చెప్పారు. ప్రస్తుతం మానవ తయారీ ఫైబర్‌పై 18 శాతం, మానవ తయారీ యార్న్‌పై 12 శాతం, ఫ్యాబ్రిక్స్‌పై 5 శాతం రేటు అమల్లో ఉంది. ఇన్ని రకాల పన్ను రేటు కాకుండా.. రేట్ల వ్యత్యాసానికి ముగింపు పలికి అన్ని రకాల వస్త్రాలపై (కాటన్ మినహా) జనవరి 1 నుంచి 12 శాతం రేటును అమలు చేయాలని సెప్టెంబర్‌లో జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది. అలాగే అన్ని రకాల పాదరక్షలపైనా 12 శాతం రేటును అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. వస్త్రాలపై 12 శాతం రేటుకు సుముఖంగా లేమని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, పశ్చిమబెంగాల్, రాజస్తాన్, తమిళనాడు తదితర రాష్ట్రాలు తెలియజేయడం గమనార్హం. డిమాండ్ల వల్లే.. కౌన్సిల్ సమావేశం అనంతరం మంత్రి సీతారామన్ వివరాలు వెల్లడించారు. ‘‘డిసెంబర్ నుంచి ప్రతిపాదనలు రావడం మొదలైంది. గుజరాత్ ఆర్థిక మంత్రి నుంచి కూడా లేఖ అందింది. దీంతో అత్యవసరంగా భేటీ అయి 12 శాతం రేటుకు వెళ్లకుండా యథాతథ స్థితిని కొనసాగించాలని నిర్ణయించాం. కనుక రేట్ల పరంగా దిద్దుబాటు ఉండదు’’ అని వివరించారు. మంత్రుల ప్యానెల్ ఇచ్చే సిఫారసులపై ఫిబ్రవరి చివర్లో లేదా మార్చి మొదట్లో నిర్వహించే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో చర్చిస్తామని చెప్పారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అధ్యక్షతన గల మంత్రుల బృందంలో పశ్చిమబెంగాల్, కేరళ, బిహార్ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సభ్యులుగా ఉన్నారు. పరిశ్రమ ఒత్తిడి ఉండొచ్చు.. టెక్స్‌టైల్స్‌పై రేట్ల హేతుబద్ధీకరణకు అన్ని రాష్ట్రాలు అంగీకరించాయి. కానీ రాత్రికిరాత్రి ఒత్తిడి వెనుక.. ధరలు పెరగడం భారంగా పరిణమిస్తుందంటూ పరిశ్రమలో ఒక వర్గం చెప్పడం వల్ల కావచ్చు. అసంఘటిత రంగం రూపంలో ఒత్తిళ్లు రావచ్చని పరిశ్రమ భావించి ఉంటుంది. కొనుగోలు దారులపై భారం పడుతుందన్న ఆలోచన కూడా ఉంది. అందుకనే ఈ అంశం తిరిగి కమిటీ ముందుకు వెళ్లింది. మరింత లోతైన అధ్యయనం చేసి వివరాలను కౌన్సిల్ ముందు ఉంచుతుంది అని సీతారామన్ చెప్పారు. -
చేనేత రంగాన్ని ఆదుకోవాలి: బుగ్గన
సాక్షి, ఢిల్లీ: చేనేత వస్త్రాలపై 12శాతం పన్ను వేయాలన్న ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. 12శాతం పన్నును అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు వ్యతిరేకించారు. శుక్రవారం నిర్వహించిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ముగిసింది. సమావేశం అనంతరం ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ.. చేనేత వస్త్రాల మీద 12శాతం జీఎస్టీ వేయాలన్న ప్రతిపాదనను ఏపీ సహా అన్ని రాష్ట్రాలు వ్యతిరేకించాయని తెలిపారు. ఈ ప్రతిపాదనలను జీఎస్టీ కౌన్సిల్ పక్కన పెట్టిందని, పాలిమర్, కాటన్ వస్త్రాలు ఉత్పత్తి శాతంపైన ఎలాంటి డేటా లేదని అన్నారు. రిఫండ్ శాతంపై ఎలాంటి వివరాలు లేకుండా నిర్ణయం తీసుకోలేమని చెప్పారు. మన రాష్ట్రంలో కాటన్ వస్త్రాల వాడకం ఉందని, చేనేత కార్మికులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారని తెలిపారు. చేనేత కార్మికులు, వ్యాపారులకు ఎలాంటి నష్టం జరగకూడదన్నారు. చేనేత మీద లక్షలాది మంది కార్మికులు ఆధారపడి ఉన్నారని గుర్తుచేశారు. చేనేత రంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉందని, చేనేత వస్త్రాల మీద ప్రస్తుతం ఉన్న 5శాతాన్ని కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. ఈ మొత్తం విషయంపై ప్రత్యేక అధ్యయనం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పోలవరంపై సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలని, ప్రీ బడ్జెట్ మీటింగ్‌లో విజ్ఞప్తి చేశామని పేర్కొన్నారు. కొత్త భూసేకరణ చట్టం వల్ల పోలవరం ఖర్చు పెరిగిందని, వచ్చే బడ్జెట్లో దుగ్గరాజపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్, పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని కోరినట్టు చెప్పారు.ఉత్తరాంధ్ర, రాయలసీమ లాంటి ప్రాంతాల్లో పరిశ్రమల స్థాపనకు రాయితీలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్టు వివరించారు. వెనుకబడిన ప్రాంతాలకు కేబీకే ప్యాకేజీ ఇవ్వాలని,నడికుడి-శ్రీకాళహస్తి, కడప-బెంగుళూర్ రైల్వే, కోటిపల్లి, రాయదుర్గం లైన్లతో పాటు పెండింగ్ రైల్వే ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని కోరినట్టు పేర్కొన్నారు. జనవరి 12న జరిగే హోంశాఖ కార్యదర్శి సమావేశంలో విభజన చట్టం పెండింగ్ అంశాలను ప్రస్తావిస్తామని అన్నారు. దక్షిణ రాష్ట్రాల మండలి సమావేశంలో విభజన చట్టం పెండింగ్ అంశాలపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ప్రధానమంత్రి కార్యాలయం అధికారులతో మాట్లాడినట్లు తెలిపారు. -
జీఎస్టీ పెంపు కార్మికులపై సమ్మెట పోటు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: వస్త్ర పరిశ్రమపై జనవరి ఒకటో తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం విధించనున్న అదనపు జీఎస్టీ ప్రతిపాదనలను వెంటనే విరమించుకోవాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. జీఎస్టీ పెంపుతో దేశంలో చేనేత, వస్త్ర పరిశ్రమ పూర్తి స్థాయిలో కుదేలవుతుందని, వస్త్ర పరిశ్రమపై ఆధారపడిన కోట్లాది మందికి ఇది సమ్మెట పోటులాంటిదని కేటీఆర్ అభివర్ణించారు. చేనేత కార్మికుల జీవితాలను దెబ్బతీసే నిర్ణయాలను విరమించుకోవాలన్నారు. జీఎస్టీ పెంపు ద్వారా చేనేత, జౌళి ఉత్పత్తుల ధరలు పెరుగుతాయని, దాంతో సామాన్యులు ఇబ్బంది పడతారని, కొనుగోళ్లు తగ్గి వస్త్ర, దుస్తుల తయారీ యూనిట్లు నష్టాలబారిన పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. నేతన్నలు ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నా కేంద్రం మొండిగా ముందుకు వెళితే వ్యవసాయ చట్టాల విషయంలో రైతులు ఉద్యమించినట్లుగానే నేత కార్మి కులు కూడా తిరగబడతారన్నారు. పన్ను పెంపు ప్రతిపాదనను కేంద్రం ఉపసంహరించుకునేంత వరకు వస్త్ర పరిశ్రమ, పారిశ్రామికవర్గాలు, నేత కార్మికులకు తెలంగాణ తరపున అండగా నిలబడతామన్నారు. కేంద్ర మంత్రి పీయుష్ గోయల్‌ను ఉద్దేశిస్తూ జీఎస్టీ పెంపు ప్రతిపాదనపై కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘జీఎస్టీని 5 శాతానికి తగ్గించాలంటూ మీ సొంత పార్టీకి చెందిన కేంద్ర వస్త్ర పరిశ్రమ శాఖ సహా య మంత్రి దర్శనా వి జర్దోశ్‌తో పాటు గుజరా త్ బీజేపీ అధ్యక్షుడు కూడా డిమాండ్ చేస్తున్నారు. మా మాట సరే.. కనీసం గుజరాత్ గొంతునైనా వినండి పీయుష్ గారూ’అని ట్విట్టర్లో పేర్కొన్నారు. -
వస్త్ర పరిశ్రమపై GST పిడుగు...
-
జనవరి నుంచి జీఎస్టీలో కొత్త మార్పులు అమల్లోకి..
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్నుల విధానం (జీఎస్టీ)లో చేసిన పలు మార్పులు జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ప్యాసింజర్ల రవాణా .. రెస్టారెంటు సర్వీసులు మొదలైన వాటిని అందించే ఈ–కామర్స్ కంపెనీలు ఈ సేవలపై పన్నులు చెల్లించాల్సి రానుంది. ఇక పాదరక్షలు, టెక్స్టైల్ రంగాలకు కొత్త రేట్లు అమల్లోకి వస్తాయి. ధరతో సంబంధం లేకుండా అన్ని రకాల పాదరక్షలకు 12 శాతం, కాటన్ మినహా అన్ని రకాల టెక్స్టైల్ ఉత్పత్తులకు (రెడీమేడ్ గార్మెంట్స్ సహా) 12 శాతం జీఎస్టీ వర్తించనుంది. అలాగే ఈ–కామర్స్ కంపెనీలు గానీ ప్యాసింజర్ రవాణా సర్వీసులు అందిస్తే 5 శాతం రేటు వర్తిస్తుంది. ఆఫ్‌లైన్ విధానంలో ఈ సేవలు అందించే ఆటో రిక్షా డ్రైవర్లకు మినహాయింపు ఉంటుంది. ఇక స్విగ్గీ, జొమాటో వంటి ఆహార డెలివరీ సేవలు అందించే ఈ–కామర్స్ ఆపరేటర్లు జనవరి 1 నుంచి .. ఆయా హోటల్స్ నుంచి జీఎస్టీ వసూలు చేసి, డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి ఇన్వాయిస్లు కూడా జారీ చేయాల్సి ఉంటుంది. అయితే, ఇప్పటికే కస్టమర్ల నుంచి రెస్టారెంట్లు జీఎస్టీ వసూలు చేస్తున్న నేపథ్యంలో అంతిమంగా కస్టమరుపై అదనపు భారం పడదు. జీఎస్టీ డిపాజిట్ బాధ్యతలను మాత్రమే ఫుడ్ డెలివరీ సంస్థలకు బదలాయించినట్లవుతుంది. -
AP: పెట్టుబడులకు పెట్టని కోట
సాక్షి, అమరావతి: ప్రముఖ పారిశ్రామికవేత్తల పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ సింహద్వారంగా మారుతోంది. పెట్టుబడులను ఆహ్వానించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు పారిశ్రామికవేత్తల్లో నమ్మకాన్ని కలిగిస్తున్నాయనేందుకు ప్రముఖ కంపెనీల మనోగతమే నిదర్శనం. పెట్టుబడుల ప్రతిపాదనలతో రావడమే ఆలస్యం అతి వేగంగా కీలకమైన అన్ని అనుమతులను మంజూరు చేస్తుండటంతో పునాది సమయంలోనే కార్పొరేట్ సంస్థలు విస్తరణ ప్రణాళికలను సైతం ప్రకటిస్తుండటం గమనార్హం. ఇటీవల రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఉత్పత్తిని ప్రారంభించకుండానే విస్తరణ ప్రణాళికలను వెల్లడించాయి. పాత బకాయిలు సైతం.. గత సర్కారు మాదిరిగా పారిశ్రామిక రాయితీలను ఎగ్గొట్టకుండా సకాలంలో ఇవ్వడంతోపాటు పాత బకాయిలను సైతం పిలిచి మరీ ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం పట్ల పారిశ్రామికవేత్తల్లో నమ్మకం పెరిగింది. ఎంఎస్ఎంఈ, టెక్స్టైల్ పరిశ్రమలకు మొదటి విడతలో రూ.1,124 కోట్ల ప్రోత్సాహకాలను ప్రభుత్వం విడుదల చేసింది. అనంతరం రెండో విడతలో ఎంఎస్ఎంఈలకు రూ.440 కోట్లు, టెక్స్టైల్ రూ.684 కోట్లు ఇచ్చింది. ఇప్పటి వరకు రూ.2,248 కోట్ల మేర పారిశ్రామిక ప్రోత్సాహకాలను విడుదల చేసింది. గత సర్కారు బకాయి పెట్టిన రూ.1,588 కోట్లను కూడా వైఎస్సార్ సీపీ ప్రభుత్వమే చెల్లించింది. నిర్వహణ వ్యయం తగ్గడంతో లాభాలు.. ‘వైఎస్సార్ ఏపీ వన్’ ద్వారా ప్రతిపాదనల దగ్గర నుంచి ఓ కంపెనీకి జీవిత కాలం అండగా నిలిచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు సత్ఫలితాలనిస్తున్నాయి. రాష్ట్రంలో నిర్వహణ వ్యయం చాలా తక్కువగా ఉండే విధంగా, కంపెనీలకు మెరుగైన ఆదాయం లభించేలా అన్ని మౌలిక వసతులను ప్రభుత్వం అభివృద్ధి చేసి అందచేస్తోంది. దీంతో పలు సంస్థలు ఉత్పత్తి ప్రారంభం కాకుండానే ఆంధ్రప్రదేశ్‌లో తమ కంపెనీ విస్తరణ ప్రణాళికలను ప్రకటిస్తున్నాయి. పెట్టుబడుల ప్రవాహం ఇలా.. ► జపాన్‌కు చెందిన యొకహోమా గ్రూపు కంపెనీ అలయన్స్ టైర్ గ్రూపు (ఏటీజీ) రాష్ట్రంలో భారీ వాహనాల టైర్ల తయారీ యూనిట్‌ను నెలకొల్పేందుకు ముందుకు వచ్చింది. విశాఖలోని అచ్యుతాపురం సెజ్‌లో సుమారు 80 ఎకరాల విస్తీర్ణంలో రూ.1,250 కోట్లతో ఈ యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో పనులు ప్రారంభించిన సంస్థ అనంతరం రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న చొరవతో పెట్టుబడుల ప్రతిపాదనను రూ.2,500 కోట్లకు పెంచింది. ► తొలుత తమిళనాడులో యూనిట్ ఏర్పాటు చేయాలనుకున్న సెంచరీ ప్లైవుడ్ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో వైఎస్సార్ కడప జిల్లా బద్వేల్లో యూనిట్ ఏర్పాటుకు అంగీకరించింది. ప్రతిపాదన అందిన రెండు నెలల్లోనే యూనిట్ ఏర్పాటుకు అవసరమైన అన్ని అనుమతులను వేగంగా ఇవ్వడంతో సెంచరీ ఫ్లైవుడ్ తన పెట్టుబడులను రూ.600 కోట్ల నుంచి రూ.2,600 కోట్లకు పెంచుతున్నట్లు సంస్థ చైర్మన్ సజ్జన్ భజాంక స్వయంగా ప్రకటించారు. ► కేవలం ఆరు నుంచి తొమ్మిది నెలల్లోనే అభివృద్ధి చేసిన వైఎస్ఆర్ ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ దేశంలోనే అత్యుత్తమ ఈఎంసీగా నిలుస్తుందని డిక్సన్ కంపెనీ ప్రెసిడెంట్, సీవోవో పంకజ్ శర్మ పేర్కొన్నారు. ఇక్కడ స్థాపించే యూనిట్ ద్వారా శామ్సంగ్, బాష్, షావోమి లాంటి పలు ప్రముఖ సంస్థలకు చెందిన ఎలక్ట్రానిక్ ఉపకరణాలను ఉత్పత్తి చేయనున్నామని, యూనిట్‌ను మరింత విస్తరిస్తామని వెల్లడించారు. ► రూ.50 కోట్లతో బ్లూటూత్, పవర్ బ్యాంక్, రూటర్స్ లాంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాల యూనిట్‌ను సెల్కాన్ రెజల్యూట్ పేరుతో ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ ప్రతినిధి వై.గురు తెలిపారు. డిమాండ్‌కు అనుగుణంగా మరింత విస్తరించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసి వైఎస్ఆర్ ఈఎంసీలో ఆరు ఎకరాలు తీసుకున్నట్లు చెప్పారు. ► యాపిల్, రెడ్మీ లాంటి ప్రముఖ బ్రాండ్స్ సెల్ఫోన్లు తయారు చేసే ఫాక్స్‌కాన్ రాష్ట్రంలో మరో రెండు యూనిట్లను నెలకొల్పనున్నట్లు సంస్థ ఎండీ జోష్ ఫల్గర్ ఇప్పటికే ప్రకటించారు. వైఎస్ఆర్ ఈఎంసీలో యూనిట్ ఏర్పాటు చేయాలంటూ ఇటీవల జరిగిన సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆహ్వానించడాన్ని కంపెనీ పరిశీలిస్తోంది. ► రాష్ట్రం నుంచి కియా మోటార్స్ చెన్నై తరలి వెళ్లిపోతోందంటూ ఓ వర్గం మీడియా చేసిన ప్రచారంలో నిజం లేదని ఇప్పటికే స్పష్టమైంది. ఈ దుష్ప్రచారాన్ని ఖండించడమే కాకుండా ఇక్కడ రూ.409 కోట్లతో విస్తరణ ప్రణాళికను సైతం కియా మోటార్స్ ప్రకటించింది. ఏపీలో సరికొత్త నినాదం.. రావాలి జగన్.. కావాలి జగన్.. అనే నినాదం రాష్ట్రమంతా మారుమోగింది. ఇప్పుడు ఆ నినాదం మారింది. జగన్ వచ్చారు... అభివృద్ధి తెచ్చారు. – కొప్పర్తిలో ఏఐఎల్ డిక్సన్ ప్రెసిడెంట్, సీవోవో పంకజ్‌శర్మ అంతకు మించి.. తొలుత రూ.600 కోట్ల పెట్టుబడి పెట్టాలనుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వ చొరవ చూసిన తర్వాత మూడు దశల్లో రూ.2,600 కోట్ల పెట్టుబడి పెడుతున్నాం. – బద్వేల్లో సెంచురీ ఫ్లైవుడ్ కంపెనీ చైర్మన్ సజ్జన్ భజాంక మరిన్ని కంపెనీలను తీసుకొస్తాం పెట్టుబడి ప్రతిపాదన అందచేసిన రెండు నెలల్లోనే భూమి పూజ చేయడం ఇక్కడి ప్రభుత్వ వ్యవస్థపై మా నమ్మకాన్ని పెంచుతోంది. మాతోపాటు అనేక కంపెనీలను తీసుకురావడానికి కృషి చేస్తాం. – పులివెందులలో ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రిటైల్ లిమిటెడ్ ప్రకటన -
జీఎస్టీ పెంపు సరికాదు వస్త్రపరిశ్రమ బతికి బట్టకట్టలేదు
సిరిసిల్ల: కేంద్ర ప్రభుత్వం ఇటీవల వస్త్ర పరిశ్రమపై 7 శాతం జీఎస్టీ పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్‌శాఖ మంత్రి కె.తారకరామారావు కోరారు. ఇప్పటికే 5 శాతం విధిస్తున్న పన్నుకు ఇప్పుడు 7 శాతం పెంచడం వల్ల 12 శాతానికి చేరుతుందని, దీంతో ఆ పరిశ్రమ కుదేలవుతుందని చెప్పా రు. ఈ మేరకు కేటీఆర్ కేంద్ర జౌళి శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు ఆదివారం లేఖ రాశారు. జనవరి 1 నుంచి అమలుకానున్న 7 శాతం పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రెండేళ్లుగా కరోనా సంక్షోభంతో చేనేతరంగం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోందని చెప్పారు. దేశంలో వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్నది టెక్స్టైల్ రంగమని, అలాంటి రంగానికి ప్రోత్సాహకాలు అందించాల్సింది పోయి జీఎస్టీ పెంచడం సబబు కాదన్నారు. దేశ చరిత్రలో ఏనాడూ చేనేత ఉత్పత్తులపై పన్ను లేదని, తొలిసారి 5 శాతం విధించినప్పుడు కూడా తీవ్రమైన వ్యతిరేకత వ చ్చిందని గుర్తుచేశారు. ఇప్పు డు మళ్లీ ఏడు శాతం జీఎస్టీ పెంచితే చేనేతరంగం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ ప్రఖ్యాతిగాం చిన చీరలకు తెలంగాణ ప్రసిద్ధి చెందిందని పేర్కొన్నారు. ఒకవేళ పెంపు నిర్ణయాన్ని వెనక్కితీసుకోకుంటే.. ప్రస్తుతం చేనేత, పవర్లూమ్ వ్యాపారులకు ఉన్న జీఎస్టీ శ్లాబ్‌ను రూ.20 లక్షల నుంచి 50 లక్షల వరకు పెంచాలని కేటీఆర్ కోరారు. ఇప్పటికే ముడి సరుకుల ధరలు పెరిగాయ్.. వస్త్ర పరిశ్రమకు అవసరమైన కాటన్, పాలి స్టర్ నూలు ధరలు 30–40 శాతం పెరిగాయ ని, కరోనా సంక్షోభంతో విదేశాల నుంచి ది గుమతులు తగ్గి రసాయనాల ధరలు కూడా భారీగా పెరిగాయని కేటీఆర్ తెలిపారు. 2011 లెక్కల ప్రకారం 43.3 లక్షల కుటుం బాలు చేనేత రంగంలో ఉంటే తాజా లెక్కల ప్రకారం 30.44 లక్షల కుటుంబాలు మాత్ర మే ఉన్నాయన్నారు. ఇదే ధోరణి కొనసాగితే రానున్న కొద్ది సంవత్సరాల్లోనే దేశంలో చేనేత రంగం అంతర్థానమయ్యే పరిస్థితి నెలకొంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. చేనేతను బలోపేతం చేయాలి 2015లో ప్రధాని మోదీ చేనేతకు చేయూతనిస్తామన్న విషయాన్ని గుర్తు తెచ్చుకొని, గతేడాది ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కేంద్ర జౌళి శాఖ మంత్రి ‘వోకల్ ఫర్ హ్యాండ్ మేడ్’అన్న నినాదం ఇచ్చారని కేటీఆర్ లేఖలో గుర్తు చేశారు. జాతీయ చేనేత ఉత్పత్తులను రెట్టింపు చేసి రూ.1.25 లక్షల కోట్లకు, దేశీయ చేనేత ఎగుమతులను నాలుగు రెట్లు పెంచి రూ.10 వేల కోట్లకు తీసుకుపోతామన్న హామీని దృష్టిలో పెట్టుకోవాలని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. -
స్వదేశీ వస్తువులకు విదేశాల్లో డిమాండ్
పెదవేగి : చేతివృత్తుల ద్వారా దేశంలో తయారైన వస్తువులకు విదేశాల్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుందని టెక్స్టైల్స్ అసిస్టెంట్ డైరెక్టర్ లక్ష్మీ తెలిపారు. పెదవేగి మండలం పెదవేగిలో ఎస్ఎంసీ పాఠశాలలో విద్యార్థులకు చేతి వృత్తులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో తయారైన చేతివృత్తుల వస్తువులకు ఇతర దేశాలలో మంచి గిరాకీ ఉందని, చేతివృత్తుల పట్ల విద్యార్థి దశ నుంచే అవగాహన పెంచుకోవాలని అన్నారు. విద్యార్థులు వస్తువుల తయారీపై శ్రద్ధ వహించాలని ఆమె సూచించారు. లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ జి మాణిక్యాలరావు, ఎస్ఎంసీ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ చుక్క అవినాష్ రాజు, ఇండియన్ బ్యాంక్ మేనేజర్ రామన్న, పాఠశాల హెచ్ ఎం ఉషారాణి పాల్గొన్నారు. -
కొప్పర్తిలో భారీ టెక్స్టైల్ పార్క్
సాక్షి, అమరావతి/న్యూఢిల్లీ : వైఎస్సార్ కడప జిల్లా కొప్పర్తిలో అన్ని మౌలిక వసతులతో పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేస్తున్నామని.. అక్కడ భారీ టెక్స్టైల్ పార్కును ఏర్పాటుచేయాల్సిందిగా కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. టెక్స్టైల్ పార్కు ఏర్పాటుకు ఈ ప్రాంతం ఎంతో అనువుగా ఉంటుందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి వివరించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులతో పాటు కొత్త పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై కేంద్రమంత్రికి గౌతమ్‌రెడ్డి గురువారం పలు ప్రతిపాదనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా కేంద్రం దేశవ్యాప్తంగా ఏర్పాటుచేయ తలపెట్టిన ఏడు టెక్స్టైల్ పార్కుల్లో ఒకటి కొప్పర్తిలో ఏర్పాటుచేయాలన్నారు. విద్యుత్ ఉపకరణాల తయారీకి మన్నవరం అనుకూలం అలాగే, భారీ విద్యుత్ ఉపకరణాల యూనిట్ ఏర్పాటుకు చిత్తూరు జిల్లా మన్నవరం అనుకూలంగా ఉంటుందని, ఈ ప్రాంతాన్ని కూడా పరిశీలించాల్సిందిగా మేకపాటి కేంద్ర మంత్రిని కోరారు. వెనుకబడిన రాయలసీమ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి చొరవతో 2008లో ఎన్టీపీసీ–బీహెచ్ఈఎల్తో కలిసి మన్నవరంలో విద్యుత్ ఉపకరణాల యూనిట్‌ను ఏర్పాటుచేశారని.. ఇందుకోసం ఏపీఐఐసీ 750 ఎకరాల భూమిని కేటాయించిన విషయాన్ని గోయల్ దృష్టికి గౌతమ్‌రెడ్డి తీసుకొచ్చారు. కానీ, బీహెచ్ఈఎల్ ఈ ప్రాజెక్టు నుంచి వైదొలుగుతున్నట్లు ఇప్పటికే ప్రకటించడంతో 2015 నుంచి ఈ యూనిట్ మూతపడి ఉందని.. దీనిని భారీ విద్యుత్ ఉపకరణాల తయారీ జోన్‌కు పరిశీలించాలని కూడా కోరారు. కేంద్రం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు (పీఎల్ఐ) పథకం కింద దేశంలో ఏర్పాటుచేయ తలపెట్టిన మూడు భారీ విద్యుత్ ఉత్పత్తి ఉపకరణాల జోన్లలో ఒకటి మన్నవరంలో ఏర్పాటుచేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన పీయుష్ గోయల్.. త్వరలోనే ఎన్టీపీసీ–బీహెచ్ఈఎల్ ప్రతినిధులతో సమావేశం ఏర్పాటుచేసి నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్లు గౌతమ్‌రెడ్డి వెల్లడించారు. రైల్వే కారిడార్‌ను ఏపీలోనూ చేపట్టాలి ఇక ఆసియా అభివృద్ధి బ్యాంకు నిధులతో చేపట్టిన విశాఖ–చెన్నై పారిశ్రామిక కారిడార్‌లో ప్రస్తుతం ఏడీబీ 80, రాష్ట్ర ప్రభుత్వ వాటా 20 శాతంగా ఉందని.. రాష్ట్ర వాటాను 10 శాతానికి తగ్గించడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోవాలని కోరారు. అలాగే, రక్షణ అవసరాల కోసం ప్రత్యేకంగా నిర్మిస్తున్న రైల్వే కారిడార్‌ను రాష్ట్రంలో కూడా చేపట్టాల్సిందిగా మేకపాటి విజ్ఞప్తి చేశారు. దీనిపై గోయల్ స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన గతిశక్తి మిషన్‌లో భాగస్వామ్యం కావడం ద్వారా ఈ ప్రాజెక్టును చేజిక్కించుకోవచ్చని సూచించారు. త్వరలో విశాఖపట్నం మెడ్‌టెక్ జోన్లో ఏర్పాటుచేసిన మెడక్సిల్ కార్యాలయ ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా పీయూష్ గోయల్‌ను ఆహ్వానించగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు గౌతమ్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఐఐసీ ఎండీ సుబ్రహ్మణ్యం జవ్వాది, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ భావనా సక్సేనా, మెడ్‌టెక్ జోన్ సీఈఓ జితేంద్ర శర్మ, పరిశ్రమల శాఖ సలహాదారు లంకా శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
వస్త్ర రంగం: ఏపీలో ఉన్న మినీ ముంబై ఏదో తెలుసా?
కావలి రూరల్: దేశవ్యాప్తంగా వస్త్ర రంగంలో ముంబైదే పైచేయి.. అయితే ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం ఆ స్థానం నెల్లూరు జిల్లా కావలికే దక్కింది. దీంతో మినీ ముంబైగా పేరు గాంచింది. 1930.. దేశానికి స్వాతంత్య్రం రాక ముందు నుంచే వస్త్ర రంగంలో కావలి కీలకంగా ఉండేది. అప్పట్లో వస్త్రాలకు సంబంధించిన రా మెటీరియల్ (వస్త్రాల బ్లీచింగ్, నీలి రంగు) లాంటి ముడి పదార్ధాలను కావలిలోనే తయారు చేసి సముద్ర మార్గం ద్వారా లండన్‌కు పంపేవారని వాటి ఆనవాళ్లుగా పెద్ద పెద్ద తయారీ తొట్టేలు గత 30 సంవత్సరాల క్రితం వరకు ఉండేవని ప్రచారం. (చదవండి: కర్రల సమరం: ‘గట్టు’ మీద ఒట్టు!) 1933వ సంవత్సరంలోనే కావలి ట్రంకు రోడ్డు వెంబడి 100 వస్త్ర దుకాణాలు ఉండేవని అవి కాస్త ప్రస్తుతం ప్రధానంగా 4 వస్త్ర మార్కెట్లు, 2 గార్మెంట్లు, 1 తయారీ పరిశ్రమ, 500లకు పైగా వస్త్ర దుకాణాలు ఉండటంతో ఇక్కడ అన్నీ రకాల వస్త్రాలు హోల్‌సేల్ ధరలకే లభిస్తూ చూపరులను ఆకట్టుకునేలా ఆకర్షణీయంగా క్వాలిటీతో కూడిన వస్త్రాలు అందుబాటులో ఉంటాయి. ప్రధానంగా కావలి నడిబొడ్డులో రైలు మార్గం, జాతీయ రహదారి ఉండటంతో వ్యాపారాలకు అనుగుణంగా సుదూర ప్రాంతాలైన ముంబాయి, అహ్మాదాబాద్, కలకత్తా, సూరత్, వారణాసి, చెన్నై వంటి మహా నగరాల నుంచి నేరుగా పరిశ్రమల నుంచి డీలర్ షిప్ పొంది నాణ్యమైన వస్త్రాలను దిగుమతి చేసుకుని.. దేశంలోని పలు రాష్ట్రాలకు కావలి నుంచే ఎగుమతులు జరుగుతుంటాయి. వస్త్ర వ్యాపార రంగంపై దాదాపు 15 వేల మందికి పైగా ఆధారపడి జీవిస్తుంటారు. వస్త్ర రంగంలో కావలిలో సంవత్సరానికి సరాసరి రూ.500 నుంచి 800 కోట్లుపైగా అమ్మకాలు సాగిస్తూ నిరుద్యోగులకు జీవనోపాధి కల్పిస్తున్నారు. నగరాలలోని పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లేకపోయిన క్వాలిటీ వస్త్రాలకు కావలి పేరుగడించి ప్రజల ఆదరాభిమానాలు చూరగొంటుంది. -
కొత్తగా ఏడు మెగా టెక్స్టైల్ పార్కులు
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కొత్తగా ఏడు మెగా సమీకృత టెక్స్టైల్ రీజియన్, అపెరల్ (పీఎం మిత్రా) పార్కుల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. వస్త్ర రంగంలో అంతర్జాతీయ మార్కెట్లో పోటీ పడేవిధంగా రూ.4,445 కోట్లతో వీటిని నెలకొల్పాలని నిర్ణయించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీపీ) విధానంలో ఈ పార్కులను అభివృద్ధి చేస్తాయి. ప్రధాని మోదీ అధ్యక్షతన కేబినెట్ బుధవారం సమావేశమైంది. మెగా టెక్స్టైల్ పార్కులతో 7 లక్షల మందికి ప్రత్యక్షంగా, మరో 14 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని కేంద్రం తెలిపింది. ఆర్థిక వ్యవస్థలో వస్త్ర రంగం వాటాను మరింత పెంచడానికే మెగా సమీకృత టెక్స్టైల్ రీజియన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆసక్తి చూపిన రాష్ట్రాల్లో గ్రీన్ ఫీల్డ్/బ్రౌన్‌ఫీల్డ్ ప్రాంతాల్లో ఈ పార్కులు ఏర్పాటు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, పంజాబ్, రాజస్తాన్, గుజరాత్, అస్సాం, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు టెక్స్టైల్ పార్కుల పట్ల ఆసక్తి వ్యక్తం చేసినట్లు కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఎలాంటి వివాదాలు లేని 1,000 ఎకరాలకు పైగా భూమితోపాటు మెరుగైన మౌలిక వసతులు, పర్యావరణ వ్యవస్థ సిద్ధంగా ఉన్న రాష్ట్రాలు ప్రతిపాదనలు అందించాలని సూచించింది. అభివృద్ధి ఆధారిత పెట్టుబడి మద్దతు కింద గ్రీన్‌ఫీల్డ్‌కు గరిష్టంగా రూ.500 కోట్లు, బ్రౌన్ ఫీల్డ్‌కు గరిష్టంగా రూ.200 కోట్లు ఇవ్వనున్నారు. ప్రాజెక్టు వ్యయంలో 30 శాతాన్ని ‘పీఎం మిత్రా’ అందిస్తుంది. రూ.300 కోట్ల ప్రోత్సాహక మద్దతు ఇవ్వనుంది. ప్రైవేట్ రంగం భాగస్వామ్యంతో ప్రాజెక్టును ఆకర్షణీయంగా రూపొందించడానికి గ్యాప్ ఫండ్ సైతం అందజేయనుంది. టెక్స్టైల్ పార్కులో వర్కర్స్ హాస్టళ్లు, హౌసింగ్, లాజిస్టిక్ పార్క్, గిడ్డంగులు, వైద్య, శిక్షణ, నైపుణ్య అభివృద్ధి తదితర మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. తయారీ కార్యకలాపాల కోసం 50 శాతం భూమి, యుటిలిటీల కోసం 20 శాతం, వాణిజ్యాభివృది్ధకి 10 శాతం భూమిని వినియోగిస్తారు. నాన్–గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు బోనస్‌గా 78 రోజుల వేతనం రైల్వే ఉద్యోగులకు 2020–21 ఆర్థిక సంవత్సరంలో 78 రోజుల వేతనానికి సమానమైన ఉత్పాదకత ఆధారిత బోనస్ (పీఎల్బీ) ఇవ్వడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. దీంతో సుమారు 11.56 లక్షల మంది నాన్–గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. ఈ బోనస్‌తో ఖజానాపై రూ.1,984.73 కోట్ల మేర భారం పడనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అర్హులకు బోనస్ కింద గరిష్టంగా రూ.17,951 దక్కనుంది. -
విస్తరణ బాటలో టెక్స్టైల్స్ దిగ్గజం వెల్స్పన్ ఇండియా
న్యూఢిల్లీ: హోమ్ టెక్స్టైల్స్ దిగ్గజం వెల్స్పన్ ఇండియా విస్తరణ బాట పట్టింది. రానున్న రెండేళ్లలో హోమ్ టెక్స్టైల్స్, ఫ్లోరింగ్ బిజినెస్‌ల విస్తరణకు రూ. 800 కోట్లు ఇన్వెస్ట్ చేసే యోచనలో ఉన్నట్లు కంపెనీ తాజాగా తెలియజేసింది. ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరాల(2022–23)లో హోమ్ టెక్స్టైల్స్ విభాగంపై రూ. 656 కోట్లకుపైగా పెట్టుబడులు వెచ్చించనున్నట్లు వెల్లడించింది. వీటిలో భాగంగా రుమాళ్ల(టవల్స్) తయారీ సామర్థ్యాన్ని 20 శాతంమేర పెంచాలని చూస్తున్నట్లు తెలియజేసింది. విదేశీ కస్టమర్ల నుంచి పెరుగుతున్న డిమాండుకు అనుగుణంగా ఇందుకు నిర్ణయించినట్లు తెలియజేసింది. గుజరాత్, కచ్‌లోని అంజార్‌లోగల తయారీ ప్లాంటు సామర్థ్యాన్ని ప్రస్తుత 85,400 మెట్రిక్ టన్నుల నుంచి వార్షికంగా 1,02,000 ఎంటీకి చేర్చేందుకు వారాంతాన సమావేశమైన బోర్డు అనుమతించినట్లు వెల్స్పన్ ఇండియా వివరించింది. కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా టవల్ వస్త్రాలలో 40 మగ్గాల(లూమ్స్)కు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు వెల్లడించింది. వల్సాద్‌పైనా దష్టి గుజరాత్, వపీలోని వల్సాద్ ప్లాంటులో ఆటోమేషన్ ఏర్పాటుకు సైతం బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు వెల్స్పన్ ఇండియా పేర్కొంది. తద్వారా తక్కువ వ్యయాలతో ఉత్పత్తిలో వేగవంత టర్న్‌అరౌండ్‌ను సాధించాలని చూస్తున్నట్లు తెలియజేసింది. వపీలో 80 శాతం రగ్గుల సామర్థ్య పెంపును గత ఆర్థిక సంవత్సరంలోనే ప్రారంభించినట్లు తెలియజేసింది. విస్తరణ ఫలితాలు దశలవారీగా వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం(ఏప్రిల్–జూన్) నుంచి కనిపించనున్నట్లు వివరించింది. విస్తరణతో రెండో ఏడాది నుంచీ రూ. 1,207 కోట్ల ఆదాయానికి అవకాశమున్నట్లు అంచనా వేసింది. ఈ బాటలో రెండేళ్లకుగాను సొంత అనుబంధ సంస్థ వెల్స్పన్ ఫ్లోరింగ్ లిమిటెడ్‌లో దాదాపు రూ. 144 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. -
ప్రోత్సాహక పథకంలో మార్పులు అవసరం
సాక్షి, హైదరాబాద్: వస్త్రోత్పత్తి రంగంలో కేంద్రప్రభుత్వం ప్రకటించిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్)లో మరిన్ని మార్పులు చేయడంతోపాటు సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకాన్ని తిరిగి ప్రారంభించాలని మంత్రి కేటీఆర్ కేంద్రాన్ని కోరారు. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకానికి మరిన్ని అంశాలను జోడిస్తే వస్త్రోత్పత్తి రంగం మరింత బలోపేతమవుతుందని కేంద్రమంత్రి పీయూష్ గోయెల్‌కు శనివారం రాసిన లేఖలో కేటీఆర్ పేర్కొన్నారు. కేంద్రం ప్రకటించిన మార్గదర్శకాల ప్రకారం కృత్రిమ దారాలకు (మాన్ మేడ్ ఫైబర్) మాత్రమే ప్రోత్సాహకాలు వర్తిస్తాయని, ఇవే ప్రోత్సాహకాలను పత్తి ఆధారిత వస్త్రోత్పత్తులు చేసే వారికి కూడా వర్తింపజేస్తే జౌళి పరిశ్రమతో పాటు పత్తి పంటను ఎక్కువగా సాగు చేసే తెలంగాణ వంటి రాష్ట్రాలకు ఎంతో మేలు జరుగుతుందని మంత్రి వివరించారు. అన్ని రకాల ఫైబర్ వస్త్రోత్పత్తిని ప్రోత్సహిస్తే ఈ రంగంలో 7.5లక్షల మం దికి ఉద్యోగావకాశాలు వస్తాయన్నారు. కనీస పెట్టుబడిని తగ్గించండి కృత్రిమ ఫైబర్ సెగ్మెంట్లో రూ.300 కోట్ల కనీస పెట్టుబడులు పెడితేనే కేంద్రం ప్రకటించిన ప్రోత్సాహకాలు పొందే వీలుంటుందని, చైనా లాంటి దేశాలతో పోటీ పడేందుకు కనీస పెట్టుబడిని తగ్గించాలని కేటీఆర్ కోరారు. గార్మెంట్ రంగంలో కనీస పెట్టుబడిని రూ.100 కోట్ల నుంచి రూ.50కోట్లకు తగ్గిస్తే మరింతమంది యూనిట్లు స్థాపించేందుకు ముందుకు వస్తారన్నారు. భారీ టెక్స్టైల్ పార్కుల ఏర్పాటుకు భూమి, ఇతర మౌలిక వసతుల కల్పన అవసరమవుతుందని, తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్‌లో యాంగ్వాన్, కైటెక్స్ వంటి పెద్ద సంస్థలు ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించేందుకు ముందుకు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. -
టెక్స్‌టైల్స్‌కు ‘పీఎల్ఐ’ బూస్ట్!
సాక్షి, న్యూఢిల్లీ: వస్త్ర పరిశ్రమ (టెక్స్టైల్స్)ను ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) కిందకు తీసుకువస్తూ కేంద్ర కేబినెట్ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఈ రంగానికి రానున్న ఐదేళ్లలో రూ.10,683 కోట్లు కేటాయించింది. పరిశ్రమ పురోభివృద్ధి, ఎగుమతులు లక్ష్యంగా ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వాణిజ్య, పరిశ్రమలు, టెక్స్టైల్స్ శాఖ మంత్రి పీయూష్ గోయెల్ విలేకరులకు తెలిపారు. ఎంఎంఎఫ్ (మేన్–మేడ్ ఫైబర్) దుస్తులు, ఎంఎంఎఫ్ వస్త్రాలు, టెక్నికల్ టెక్స్‌టైల్స్‌కు సంబంధించిన 10 విభాగాలు/ఉత్పత్తులకు తాజా నిర్ణయం వర్తిస్తుందని ఆయన వెల్లడించారు. 13 రంగాలకు వర్తించే విధంగా పీఎల్ఐ స్కీమ్‌ను కేంద్ర ప్రభుత్వం 2021–22 ఏడాది బడ్జెట్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పథకానికి మొత్తంగా రూ.1.97 లక్షల కోట్ల కేటాయింపులు జరిపింది. ఉపాధి, వాణిజ్య అవకాశాల మెరుగుదల ఈ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించడంతో పాటు, పత్తి, సహజ ఫైబర్ ఆధారిత వస్త్ర పరిశ్రమలో కొత్తగా ఉపాధి, వాణిజ్య అవకాశాలు పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం దోహదపడనుంది. కొన్ని నిర్దిష్ట జిల్లాలతోపాటు, టైర్–3, టైర్– 4 పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ రంగంలో పెట్టుబడులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు కేంద్రం తెలిపింది. వస్త్ర పరిశ్రమకు పీఎల్ఐ స్కీమ్ వర్తింపు వల్ల తెలుగు రాష్ట్రాలతో పాటు గుజరాత్, యూపీ, మహారాష్ట్ర, తమిళనాడు, పంజాబ్, ఒడిశా తదితర రాష్ట్రాలకు ప్రయోజనం కలుగుతుంనది వివరించింది. ఐదేళ్లలో ఈ స్కీమ్ వల్ల రూ. 19,000 కోట్లకు పైగా కొత్త పెట్టుబడులు వస్తాయని అంచనా వేసింది. రూ. 3 లక్షల కోట్లకు పైగా టర్నోవర్ సాధ్యమవుతుందని పేర్కొంది. ప్రత్యేకించి ఈ పథకం మహిళలకు సాధికారతనిస్తుందని, ఆర్థిక వ్యవస్థలో వారి భాగస్వామ్యాన్ని పెంచుతుందని వివరించింది. ఎంఎంఎఫ్ ఫ్యాబ్రిక్స్‌కు మెరుపు కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం భారత వస్త్ర పరిశ్రమలో కీలక పరిణామం. ఎంఎంఎఫ్ ఫ్యాబ్రిక్ భారత తయారీ సామర్థ్యం పటిష్టతకు ఈ నిర్ణయం దోహదపడుతుంది. ఎంఎంఎఫ్ ఫ్యాబ్రిక్, దారం సరఫరాలను భారత్ కలిగి ఉంది. అయితే అయితే నాణ్యమైన ఎంఎంఎఫ్ వస్త్ర ఉత్పత్తి తగినంతగా లేదు. ఈ సమస్యను అధిగమించడానికి తాజా కేబినెట్ నిర్ణయం సహాయపడుతుంది. భారత్ మొత్తం వస్త్ర ఉత్పత్తిలో ఎంఎంఎఫ్ ఆధారిత దుస్తుల వాటా 20 శాతం మాత్రమే. ఈ నిర్ణయం వల్ల ఎంఎంఎఫ్ ఆధారిత దుస్తులు ఇకపై ప్రతి ఏడాదీ పెరుగుతాయి. వచ్చే మూడేళ్లలో వస్త్ర ఎగుమతులూ రెట్టింపయ్యే అవకాశాలు ఉన్నాయి. – ఏ శక్తివేల్, ఏఈపీసీ చైర్మన్ -
7 కోట్ల మీటర్లు.. 288 డిజైన్లు..
సిరిసిల్ల: తెలంగాణ ప్రభుత్వం 2017 నుంచి రాష్ట్రంలోని తెల్లరేషన్ కార్డు ఉన్న మహిళలకు బతుకమ్మ పండుగ కానుకగా చీరలు అందిస్తోంది. సిరిసిల్లలోని నేతన్నలకు ఉపాధి కలి్పంచాలనే లక్ష్యంతో ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. సంక్షోభంలో ఉన్న వస్త్రపరిశ్రమను ఆదుకోవడంతోపాటు నేతన్నలకు ప్రభుత్వపరంగా ఉపాధి కలి్పస్తున్నారు. ఈసారి పవర్‌లూమ్స్ (మరమగ్గాల)పై డాబీ డిజైన్స్ చీరలను ఉత్పత్తి చేయాలని జౌళి శాఖ ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో పవర్‌లూమ్స్‌కు అదనంగా జకార్డ్, డాబీ పరికరాలను అమర్చి చీరలపై రకరకాల డిజైన్లు వచ్చేలా చేస్తున్నారు. దీంతో చీరల కొంగులు, అంచులపై నెమలి పించం, ఆకులు, కమలం వంటి కంటికి ఇంపైన డిజైన్లతో కూడిన చీరలను సిరిసిల్ల నేతన్నలు నేస్తున్నారు. ఈ ప్రయోగంతో నేతకారి్మకులకు పని ఒత్తిడి, యజమానులకు ఆర్థిక భారం పడింది. అయినా.. నవ్యతను, నాణ్యతను పెంచేక్రమంలో జౌళి శాఖ డాబీ డిజైన్లకు మొగ్గుచూపింది. దీంతో 288 రకాల డిజైన్లలో వందకుపైగా రంగుల్లో ఈ ఏడాది బతుకమ్మ చీరలు సిద్ధమవుతున్నాయి. లక్ష్యం దిశగా అడుగులు: సిరిసిల్లలో వ్రస్తోత్పత్తిదారులకు ఈ ఏడాది జనవరిలోనే బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వగా.. నూలు కొనుగోలు, జకార్డ్, డాబీల దిగుమతి, పవర్‌లూమ్స్‌కు బిగింపు వంటి పనులతో చీరల ఉత్పత్తి ఆలస్యంగా మొదలైంది. మరోవైపు కరోనా లాక్‌డౌన్‌తో కారి్మకులు వెళ్లిపోవడం, నూలు, పవర్‌లూమ్స్ విడిభాగాల దిగుమతిలో కూడా జాప్యమైంది. సిరిసిల్లలోని 136 మ్యాక్స్ సం ఘాలకు, మరో 138 ఎస్ఎస్ఐ యూనిట్లకు, టెక్స్టైల్ పార్క్‌లోని 76 యూనిట్లకు బతుక మ్మ చీరల ఆర్డర్లు ఇచ్చారు. తొలుత జాప్యం జరగడంతో ప్రస్తుతం సిరిసిల్లలో రేయింబవళ్లు వేగంగా వస్త్రోత్పత్తి సాగుతోంది. ఉత్పత్తి అయిన చీరల వ్రస్తాన్ని టెస్కో అధికారులు వెంట వెంటనే సేకరిస్తూ.. ప్రాసెసింగ్‌కు పంపిస్తున్నారు. ఇప్పటికే 60 లక్షల మీటర్ల వ్రస్తాన్ని ప్రాసెసింగ్ కోసం తరలించారు. ఇదిలా ఉండ గా తొలిసారి ఆర్టీసీ కార్గో సేవలను బతుకమ్మ చీరల రవాణాకు వినియోగించుకుంటున్నారు. గత ఏడాది సాంచాలపై మిగిలిపోయిన వస్త్రాన్ని సైతం అధికారులు కొనుగోలు చేస్తున్నారు. మొత్తంగా సిరిసిల్ల నేతన్నలు బతుకమ్మ చీరల వ్రస్తాన్ని సకాలంలో అందించే దిశగా అడుగులు వేస్తున్నారు. మంచి డిజైన్లలో చీరలు ఉన్నాయి.. సిరిసిల్లలో బతుకమ్మ చీరలు మంచి డిజైన్లలో ఉత్పత్తి అవుతున్నాయి. మొదట్లో వస్త్రోత్పత్తిదారులు కొంత ఇ బ్బంది పడినా.. నాణ్యమైన చీరల ఉత్పత్తి దిశగా సాగుతున్నారు. గడువులోగా లక్ష్యం పూర్తి చేస్తాం. ఇప్పటికే చీరల బట్టను ప్రాసెసింగ్‌కు పంపించాం. -
మెగా రిటైల్ టెక్ట్స్‌టైల్ పార్క్‌కు స్పెషల్ ప్యాకేజీ
విజయవాడ: తాడేపల్లిలో క్యాపిటల్ బిజినెస్ పార్క్ సంస్థకు మెగా రిటైల్ టెక్ట్స్‌టైల్ పార్క్‌కు స్పెషల్ ప్యాకేజీ ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 900 టెక్ట్స్‌టైల్ ఔట్ లెట్లను 7 లక్షల చదరపు అడుగులలో ఏర్పాటు చేయనున్నారు. అలాగే అమ్మయ్యప్పర్ టెక్ట్స్‌టైల్ ప్రైవేటు లిమిటెడ్‌కు కూడా స్పెషల్ ప్యాకేజి ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చిత్తూరు జిల్లా నిండ్ర మండలం ఎలక టూర్ లో గ్రీన్ ఫీల్డ్ గార్మెంట్స్ మ్యానుఫాక్చరింగ్ ఏర్పాటు చేయనున్నది. వాల్యూ యాడెడ్ ఎంబ్రాయిడరీ యూనిట్లను కూడా ఏర్పాటు చేయనున్నది. -
టెక్స్‌టైల్‌పై ‘మహా’దెబ్బ
సాక్షి, అమరావతి: రాష్ట్ర టెక్స్టైల్ పరిశ్రమపై కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావాన్నే చూపుతోంది. ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే యార్న్‌ను వినియోగించుకునే మహారాష్ట్ర, గుజరాత్, పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాల్లో కరోనా విలయ తాండవం చేస్తుండటంతో యార్న్ ఎగుమతులు పూర్తిగా ఆగిపోయాయి. మన రాష్ట్రంలో మొత్తం 120 టెక్స్టైల్ మిల్స్ ఉండగా వీటిద్వారా ఏటా 6.87 లక్షల టన్నుల యార్న్ ఉత్పత్తి అవుతుంది. గత ఏడాది నవంబర్ నుంచి ఊపందుకున్న వ్యాపారం పదిరోజుల నుంచి ఒక్కసారిగా ఆగిపోయిందని టెక్స్టైల్ కంపెనీల యజమానులు వాపోతున్నారు. గత పదిరోజుల్లో సుమారు రూ.900 కోట్ల విలువైన ఎగుమతులు ఆగిపోయాయని ఏపీ టెక్స్టైల్ మిల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లంకా రఘురామిరెడ్డి చెప్పారు. ఒక్కో మిల్లు వద్ద కనీసం రూ.6 కోట్ల విలువైన యార్న్ ఉత్పత్తుల ఎగుమతులు ఆగిపోయినట్లు తెలిపారు. మహారాష్ట్ర, బెంగాల్‌లకు ఎగుమతులు పూర్తిగా ఆగిపోగా, తమిళనాడు మార్కెట్‌కు కొద్దిగా ఎగుమతులు జరుగుతున్నాయన్నారు. దీంతో పెద్ద మిల్లులు తమ ఉత్పత్తిని తగ్గించుకుంటుంటే, చిన్న మిల్లులు షిఫ్ట్ విధానాన్ని అమలు చేస్తున్నాయని చెప్పారు. చిన్న మిల్లులు రోజు విడిచి రోజు లేదా రెండు రోజులకు ఒకసారి పనిచేస్తున్నట్లు తెలిపారు. చాలా మిల్లులు మూడునెలల నుంచి ఉత్పత్తి సామర్థ్యంలో 90 శాతానికి చేరుకున్నాయని, ఇప్పుడు ఎగుమతులు ఆగిపోవడంతో ఉత్పత్తిని 60 శాతానికి తగ్గించాయని పేర్కొన్నారు. కూలీలను నిలబెట్టుకునేందుకు.. రాష్ట్రంలోని టెక్స్టైల్ మిల్లులపై ప్రత్యక్షంగా లక్షమంది, పరోక్షంగా నాలుగు లక్షలమంది ఆధారపడి జీవిస్తున్నారు. ఇందులో రెండులక్షల మందికిపైగా ఇతర రాష్రాల నుంచి వచ్చిన వలస కూలీలే. లాక్డౌన్ మొదటి దెబ్బకి సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయిన కూలీలను వెనక్కి రప్పించుకోవడానికి కంపెనీలు చాలా వ్యయప్రయాసలు పడ్డాయి. ఇప్పుడు తిరిగి కరోనా ఉధృతి పెరుగుతుండటంతో కూలీలను కాపాడుకోవడం కోసం ఉత్పత్తిని కొనసాగించాల్సి వస్తోందని ఏపీ టెక్స్టైల్ మిల్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు దండా ప్రసాద్ తెలిపారు. ఉత్పత్తి లేకపోయినా పూర్తిస్థాయి వేతనాలు ఇవ్వాల్సి వస్తోందని, ఇది ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తోందని చెప్పారు. ఈ పరిస్థితి మరో 3 వారాలు కొనసాగే అవకాశం ఉందన్నారు. -
మంటలు ఆర్పుతుండగా బిల్డింగ్ కూలి..
చెన్నై : తమిళనాడులోని మధురైలో శనివారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. విలక్కుతున్ సమీపంలో ఉన్న నవబత్కన వీధిలోని టెక్స్టైల్స్ దుకాణంలో అనూహ్యంగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం... శుక్రవారం రాత్రి 11 గంటల వరకు టెక్స్టైల్స్ దుకాణం ముసివేయగా.. సుమారు శనివారం తెల్లవారుజామున 2.30 గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. భవనంలోని మొదటి అంతస్తులో ముందుగా మంటలు వ్యాపించాయి. అయితే ఈ దుకాణం ఓ పాత బిల్డింగ్‌లో నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ వివిధ ప్రాంతాల నుంచి నాలుగు ఫైర్ ఇంజన్లను సంఘటన స్థలానికి పంపించాయి. చదవండి: తాగి నడిపితే తాట తీస్తాం: సజ్జనార్ మంటలను అదుపులోకి తీసుకు వస్తున్న క్రమంలో బిల్డింగ్ తమపై కూలి ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది (క్రిష్ణమూర్తి, శివరాజన్) గాయాలపాలయ్యారు. వీరు పూర్తిగా శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఇది గమనించిన మిగతా సిబ్బంది ఇద్దరిని వెలికి తీసి వైద్యం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే కృష్ణమూర్తి, శివరాజన్ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. వీరితోపాటు మరో ఇద్దరు సిబ్బందికి చిన్న చిన్న గాయాలయ్యాయి. కాగా మధురై జిల్లా ఫైర్ ఆఫీసర్ కే కళ్యాణా కుమార్, పోలీసులు, మున్సిపల్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. అయితే ప్రమాదానికి సరైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
జౌళి సంచుల్లోనే ఆహార ధాన్యాలు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం జౌళి పరిశ్రమకు ఊతమిచ్చే నిర్ణయం తీసుకుంది. ఆహార ధాన్యాలను తప్పనిసరిగా జనపనార బస్తాల్లోనే నిల్వ చేయాలనే నిబంధనను పొడగించే ప్రతిపాదనకు గురువారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ‘100 శాతం ఆహార ధాన్యాలను, 20% పంచదారను కచ్చితంగా జనపనార సంచుల్లోనే నిలువ చేసే నిబంధనను పొడగించేందుకు ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది’ అని ఆ భేటీ అనంతరం ఒక అధికారిక ప్రకటన వెలువడింది. పశ్చిమబెంగాల్, బిహార్, ఒడిశా, అస్సాం, ఆంధ్రప్రదేశ్, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల్లోని రైతులు, కార్మికులకు ఈ నిర్ణయం లబ్ధి చేకూరుస్తుందని కేంద్ర మంత్రి జవదేకర్ తెలిపారు. రూ. 7500 కోట్ల విలువైన జౌళి సంచులను ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. జౌళి సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. ‘జ్యూట్ ఐకేర్’ ద్వారా రైతులకు ఆధునిక సాగు విధానాలను అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇటీవలనే భారత జౌళి కార్పొరేషన్ 10 వేల క్వింటాళ్లæ విత్తనాల పంపిణీ కోసం నేషనల్ సీడ్స్ కార్పొరేషన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. డ్యామ్‌ల నిర్వహణకు ఆమోదం రానున్న పదేళ్లలో 19 రాష్ట్రాల్లోని 736 ఆనకట్టల నిర్వహణ, ఆధునీకరణ కార్యక్రమానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పదేళ్ల ప్రణాళికలో భాగంగా రూ. 10,211 కోట్లతో ఈ కార్యక్రమ రెండో, మూడో దశ పనులు పూర్తి చేస్తామని కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ, మరో సంస్థ 80% నిధులు సమకూర్చాయని వెల్లడించారు. ఈ పథకం తొలి దశ 2020లో ముగిసిందని పేర్కొన్నారు. తొలి దశలో ఏడు రాష్ట్రాల్లోని 223 ఆనకట్టల నిర్వహణ చేపట్టామన్నారు. -
వస్త్రోత్పత్తిపై కరోనా పడగ
సిరిసిల్ల: ‘మూలిగే నక్కపై తాటిపండు పడినట్లు’ఉంది సిరిసిల్ల నేతన్నల పరిస్థితి’. రాష్ట్ర ప్రభుత్వం సిరిసిల్ల నేత కార్మికులను ఆదుకునేందుకు వివిధ పథకాల్లో వస్త్రోత్పత్తి ఆర్డర్లను ఇస్తోంది. ఈ మేరకు బట్ట ఉత్పత్తి చేస్తూ.. క్షేత్రస్థాయిలో పనిచేసే కార్మికులకు ఉపాధి కల్పిస్తూ.. వస్త్రోత్పత్తి రంగం ముందుకు సాగుతోంది. అంతా సాఫీగానే సాగుతుందని భావిస్తున్న తరుణంలో కోవిడ్–19 మహమ్మారి వస్త్రోత్పత్తి రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. రాష్ట్ర వ్యాప్తంగా 78 వేల మరమగ్గాలు ఉండగా.. ఒక్క సిరిసిల్లలోనే 34 వేల మరమగ్గాలు ఉన్నాయి. ఇక్కడ ఉత్పత్తి అయ్యే పాలిస్టర్ బట్టను కొనేవారు లేక వస్త్ర పరిశ్రమ కుదేలైంది. ప్రభుత్వం ఇచ్చిన సర్వశిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ), రంజాన్, బతుకమ్మ చీరల ఆర్డర్ల వస్త్రాలను ఉత్పత్తి చేస్తున్నారు. వీటికి సంబంధించిన బిల్లులు అందక వస్త్రోత్పత్తిదారులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. సిరిసిల్లకు మొత్తంగా రూ.150 కోట్ల మేరకు ప్రభుత్వం బకాయిలు చెల్లించాల్సి ఉంది మూలకు పడిన రంజాన్ బట్ట రంజాన్ పండుగను పురస్కరించుకొని ముస్లింలకు కానుకగా అందించేందుకు సిరిసిల్లలోని వస్త్రోత్పత్తిదారులకు 26.23 లక్షల మీటర్ల షర్టింగ్ బట్టకు ఆర్డర్లు ఇచ్చారు. 2020 జనవరి 3వ తేదీన ఆర్డర్లు ఇచ్చిన జౌళిశాఖ అధికారులు.. ఫిబ్రవరి 20లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ మేరకు రంజాన్ బట్టను వస్త్రోత్పత్తిదారులు తయారు చేశారు. 10 లక్షల మీటర్ల బట్టను కొనుగోలు చేశారు. మరో 16.23 లక్షల మీటర్ల బట్ట కార్ఖానాల్లోనే ఉంది. ఈలోగా కరోనా లాక్డౌన్ రావడంతో సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్‌లో ఉత్పత్తి చేసిన రంజాన్ బట్ట నిల్వలు పేరుకుపోయాయి. రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టి నూలు, కొనుగోలు చేసి, కార్మికులకు కూలి చెల్లించి అమ్మకానికి సిద్ధంగా ఉన్న బట్టను జౌళిశాఖ కొనుగోలు చేయకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. కరోనా కారణంగా ప్రభుత్వం రంజాన్ పండుగకు కొత్త బట్టలను పంపిణీ చేయలేదు. దీంతో సుమారు రూ.5.40 కోట్ల విలువైన నిల్వలు సిరిసిల్లలో ఉన్నాయి. ఎస్ఎస్ఏది అదే కథ సర్వశిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ)లో 1.30 కోట్ల మీటర్ల బట్టను ఉత్పత్తి చేసేందుకు ఆర్డర్లు ఇచ్చారు. వస్త్రోత్పత్తిదారులు ఆ మేరకు బట్ట ఉత్పత్తి చేశారు. పాఠశాలలు తెరిచే నాటికే విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్స్ అందించాలని ప్రభుత్వం భావించి ముందే ఆర్డర్లు ఇచ్చింది. దీంతో ఉత్సాహంగా ఎస్ఎస్ఏ బట్ట ఉత్పత్తి అయింది. రూ.50 కోట్ల విలువైన బట్ట ఉత్పత్తి చేశారు. ఆరు నెలల కిందట ఈ బట్టను కొనుగోలు చేసిన జౌళిశాఖ ఇటీవల రూ.30 కోట్ల మేరకు చెల్లించింది. ఇంకా రూ.20 కోట్ల వరకు బిల్లులు రావాల్సి ఉంది. సంక్షేమ శాఖలకు సంబంధించి బట్టల బిల్లులు సైతం రూ.3 కోట్ల మేరకు ఇలాగే పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో ఇప్పుడు బతుకమ్మ చీరల ఉత్పత్తి పెట్టుబడిగా వస్త్రోత్పత్తిదారులు అప్పులు చేయాల్సి వస్తుంది. సిరిసిల్లలో ఏడు కోట్ల మీటర్ల బతుకమ్మ చీరల బట్టకు ఆర్డర్లు ఇవ్వగా దీని విలువ రూ.350 కోట్లు. 25 వేల మరమగ్గాలు, వెయ్యి ఆధునిక ర్యాపియర్ మగ్గాలపై 225 రంగుల్లో బతుకమ్మ చీరల ఉత్పత్తి సాగుతోంది. మంత్రి కేటీఆర్ వస్త్రోత్పత్తి ఆర్డర్ల బిల్లులు ఇప్పించాలని వస్త్రవ్యాపారులు కోరుతున్నారు. రూ. 30 కోట్లు ఇచ్చాం రంజాన్‌కు సంబంధించి కొనుగోలు చేసిన వస్త్రానికి ఇటీవల రూ.30 కోట్లు ఇచ్చాం. బతుకమ్మ చీరలను ఇప్పుడే సేకరిస్తున్నాం. దానికి ఎప్పటిలాగే పేమెంట్ ఇస్తాం. వస్త్రం క్వాలిటీ కంట్రోల్ నివేదిక వచ్చిన తరువాత గతంలో కొనుగోలు చేసిన వస్త్రాలకు సంబంధించి జీఎస్టీ బిల్లులను చూసి 10 శాతం బిల్లులను అందరికీ క్లియర్ చేస్తాం. బట్టను తీసుకున్న ఆయా ప్రభుత్వ శాఖల నుంచి ఇంకా బిల్లులు రావాల్సి ఉన్నాయి. అవి రాగానే అన్నింటినీ క్లియర్ చేస్తాం. –శైలజా రామయ్యర్, జౌళిశాఖ డైరెక్టర్ -
ఫ్యాబ్రిక్ హబ్‌గా ఏపీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ఫ్యాబ్రిక్ హబ్‌గా తీర్చిదిద్దుతామని, రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న నూలును గార్మెంట్స్‌గా తయారు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి చెప్పారు. దేశంలో ఉత్పత్తి అవుతున్న స్పిన్నింగ్, జిన్నింగ్‌లో ఏడు శాతం ఇక్కడే తయారవుతుండగా, ఇందులో అత్యధిక భాగం ఎగుమతి అవుతోందని తెలిపారు. టెక్స్టైల్ రంగంపై ఇన్వెస్ట్ ఇండియా నిర్వహించిన వెబినార్‌లో మంత్రి పాల్గొన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ► పోర్టులకు సమీపంలో టెక్స్టైల్ పార్కులను అభివృద్ధి చేయడమేగాక వస్త్రాల తయారీలో సాంకేతికతను పెంపునకు తోడ్పాటునందిస్తాం. ► రాష్ట్రంలో టెక్స్టైల్ పార్కుల ఏర్పాటుకు ముందుకొచ్చే వారికి 50% వరకు రాయితీలిస్తాం. ► సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిశ్రమలకు పూర్తి ప్రోత్సాహకాలిస్తున్నారు. ఇప్పటికే ఎంఎస్ఎంఈలకు ఆరేళ్ల బకాయిలను ఒకేసారి చెల్లించడంతో పాటు టెక్స్టైల్ రంగానికి ఏడేళ్ల కాలానికి సంబంధించి రూ.1,300 కోట్ల బకాయిలు చెల్లించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. వైఎస్సార్ చొరవతోనే ఏర్పాటు ► బ్రాండిక్స్ ఇండియా హెడ్ నైల్ రొసారో మాట్లాడుతూ శ్రీలంకలో అతిపెద్ద అప్పరెల్ ఎక్స్పోర్ట్ కంపెనీని వైఎస్సార్ చొరవతో విశాఖలో ఏర్పాటు చేసేందుకు 2006లో ఒప్పందం కుదుర్చుకుని, 2008లో ఉత్పత్తి ప్రారంభించడమేగాక ఏటా 25 శాతం వృద్ధిని నమోదు చేస్తున్నాం. ► ప్రస్తుతం ఈ సంస్థలో 17,000 మంది మహిళలు పనిచేస్తున్నారు.. ప్రభుత్వ సహకారంతో భవిష్యత్తులో ఇదే విధమైన వృద్ధిని కొనసాగిస్తాం. ► రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను రాష్ట్ర పరిశ్రమలు, పెట్టుబడులు శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ సుబ్రమణ్యం వివరించారు. ► వెబినార్‌లో కేంద్ర చేనేత శాఖ మంత్రి స్మృతి ఇరానీతో పాటు కేంద్ర టెక్స్టైల్ శాఖ కార్యదర్శి రవికపూర్ తదితరులు పాల్గొన్నారు. -
టెక్స్టైల్ హబ్‌గా ఆంధ్రప్రదేశ్
సాక్షి, అమరావతి: రాష్ట్ర వస్త్ర పరిశ్రమను అన్ని విధాలుగా తీర్చిదిద్ది ఆంధ్రప్రదేశ్‌ను టైక్స్‌టైల్ హబ్‌గా మారుస్తామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర చేనేత మంత్రి స్మృతి ఇరానీ చేతుల మీదుగా శుక్రవారం ప్రారంభమైన ఇన్వెస్ట్ ఇండియా వెబినార్‌లో మంత్రి పాల్గొని ప్రసంగించారు. అవకాశాలను అందిపుచ్చుకుని రాష్ట్ర టెక్స్టైల్ రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తామన్నారు.(వైరల్ : ఇద్దరు యువతులను ఒకేసారి పెళ్లి..) రాష్ట్రంలో ఉత్పత్తైన నూలును ఫాబ్రిక్గా మార్చడం, గార్మెంట్స్, గ్లోబల్ టెక్స్టైల్ రంగానికి కేరాఫ్ అడ్రస్‌గా మార్చేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామని చెప్పారు. టెక్స్ టైల్ పార్కుల ఏర్పాటుకు ముందుకొచ్చేవారికి 50 శాతం రాయితీ ఇస్తామని ప్రకటించారు. దిగుమతి, ఎగుమతులు సహా పోర్టులకు సమీపంలో కారిడార్ల ద్వారా రవాణా సంబంధిత అంశాలలో అనుసంధానం చేసి సహకరిస్తామని హామీ ఇచ్చారు. (సీఎఫ్ఓ ఔట్, 700 ఉద్యోగాలు కట్) వస్త్రాల తయారీలో సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధనా సంస్థల ఏర్పాటు, శిక్షణతో పాటు పరిశ్రమలతో సమన్వయం చేసుకోవటానికి తగిన ఆర్థిక, మౌలిక సదుపాయాలు, ఇతర ప్రోత్సాహక విధానాలను కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా అందిపుచ్చుకుంటామని వెల్లడించారు. చేనేత రంగాన్ని ప్రక్షాళన చేస్తామని చెప్పారు. చేనేత రంగానికి సంబంధించిన గత ఏడేళ్లుగా పేరుకుపోయిన బకాయిలను (సుమారు రూ.1300కోట్లు) ఈ ఏడాది చెల్లించనున్నట్లు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో విశాఖపట్నంలోని బ్రాండిక్స్‌కు పునాది వేశారని చెప్పారు. ప్రస్తుతం ఆ కంపెనీలో సుమారు 30వేల కుటుంబాలకు శాశ్వత ఉపాధి దొరుకుతోందని వెల్లడించారు. బ్రాండిక్స్‌లో ఎక్కువగా మహిళలే పని చేస్తున్నారని మంత్రి తెలిపారు. వరల్డ్‌క్లాస్ వర్క్‌ఫోర్స్ కొత్త పారిశ్రామిక విధానంతో వరల్డ్‌క్లాస్ వర్క్ ఫోర్స్‌ను తీసుకొస్తామని మంత్రి చెప్పారు. 30 స్కిల్ కాలేజీలను ఏర్పాటు చేసి, ప్రతిభ, నైపుణ్యం కలిగిన సహజ మానవవనరులను సృష్టిస్తామని వెల్లడించారు. అన్ని రంగాలల్లో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌ను శాశ్వత గమ్యస్థానంగా మార్చుతామని ధీమా వ్యక్తం చేశారు. పరిపాలనలో విధానంలో కొత్త ఒరవడి సృష్టిస్తూ ప్రభుత్వం తీసుకున్న సరికొత్త నిర్ణయాలను, పారిశ్రామిక పాలసీ, ఎమ్ఎస్ఎమ్ఈలకు ఆర్థిక పరిపుష్ఠి కలిగించిన ప్రభుత్వ చర్యలను పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, పరిశ్రమల శాఖ కమిషనర్ సుబ్రహ్మణ్యం జవ్వాది వెబినార్‌లో వివరించారు. ఈ వెబినార్‌లో కర్ణాటక, జార్ఖండ్, ఒడిశా, పంజాబ్‌కు చెందిన చేనేత శాఖ మంత్రులు, కేంద్ర టెక్స్ టైల్ శాఖ కార్యదర్శి రవి కపూర్, జాయింట్ సెక్రటరీ జోగి రంజన్ పాణిగ్రహి, ఇతర రాష్ట్రాల కార్యదర్శులు, 'ఇన్వెస్ట్ ఇండియా' సీఈవో, ఎండీ దీపక్ బగ్లా తదితరులు పాల్గొన్నారు. -
పెట్టుబడులకు వస్త్ర పరిశ్రమ అనుకూలం
సాక్షి, హైదరాబాద్: వస్త్ర పరిశ్రమ రంగంలో పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం ఎర్రతివాచీ పరుస్తోంది. ఈ రంగంలో పెట్టుబడులకున్న మెరుగైన అవకాశాల గురించి పెట్టుబడిదారులకు వివరిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీ రామారావు పలు వివరాలను వెల్లడించారు. ఇన్వెస్ట్ ఇండియా ఆధ్వర్యంలో సోమవారం జరిగిన టెక్స్టైల్ అపెరల్ ఇన్వెస్ట్మెంట్ మీట్ వెబినార్‌లో కేంద్రమంత్రి స్మృతి ఇరానీతో కలిసి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్టంలో వస్త్ర, దుస్తుల తయారీ రంగంలో పెట్టుబడులకున్న సానుకూలతలను వివరించారు. రాష్ట్రంలో 60 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుండగా, నాణ్యత విషయంలో ఇక్కడి పత్తి అంతర్జాతీయస్థాయి ప్రమాణాలకు దీటుగా ఉందని చెప్పారు. పెట్టుబడులతో వచ్చేవారికి అత్యంత అనుకూల పారిశ్రామిక విధానం రాష్ట్రంలో అమలు చేస్తున్నామని, సులభతర వాణిజ్య విధానంలో దేశంలోనే తాము అగ్రభాగాన ఉన్నామని కేటీఆర్ గుర్తుచేశారు. పరిశ్రమలకు నిరంతర విద్యుత్, మిషన్ భగీరథ ద్వారా నిరాటంకంగా నీటిని అందిస్తున్నామని పేర్కొన్నారు. (ఆ ఇంటి కరెంట్ బిల్లు రూ. 25,11,467) పరిశ్రమల కోసం నైపుణ్యశిక్షణ పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వ ఖర్చుతోనే నైపుణ్య శిక్షణ ఇస్తున్న విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. వివిధ వర్గాలతో సంప్రదింపులు జరిపి దేశంలోనే అత్యుత్తమ టెక్స్టైల్ పాలసీని రూపొందించామన్నారు. టెక్స్‌టైల్‌ను ప్రాధాన్యతారంగం గా గుర్తించామని,ప్రోత్సాహకాల విష యంలో పెట్టుబడిదారులకు టైలర్‌మే డ్ పాలసీ అందించేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి వెల్లడించారు. తెలంగాణలో పరిశ్రమ ఏర్పాటు సం దర్భంగా ఎదుర్కొన్న అనుభవాలను, ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని వెల్‌స్పాన్ సీఈవో దీపాలి గొయెంకా వివరించారు. కాగా, కేటీఆర్ ప్రసంగాన్ని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ అభినందించారు. కోవిడ్ సంక్షోభాన్ని ఒక అవకాశంగా ఉపయోగించుకుని.. గతంలో పీపీఈ కిట్లు తయారు చేయలేనిస్థితి నుంచి ప్రస్తుతం ప్రపంచలోనే అతి ఎక్కువ సంఖ్యలో కిట్లు తయారు చేస్తున్న రెండోదేశంగా భారతదేశం నిలిచిందని స్మృతి ఇరానీ వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పాలసీలు, ఇతర అంశాలను ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వెబినార్‌లో వివరించారు. (సర్కారు, గవర్నర్.. ఓ కరోనా) -
ఆశలన్నీ ఆషాడంపైనే..
కడప కల్చరల్: వస్త్ర వ్యాపారుల ఆశలన్నీ ఆషాడంపైనే ఉన్నాయి. సాధారణంగా ఆషాడ మాసం ప్రారంభం కాగానే వస్త్ర వ్యాపారులు ‘ఆషాడం డిస్కౌంట్ సేల్’ పేరిట తగ్గింపు ధరకు ఇస్తారు. దీంతో మహిళల నుంచి వ్రస్తాలకు మంచి డిమాండ్ ఏర్పడి వ్యాపారులు నాలుగు డబ్బులు కళ్లచూసే అవకాశం లభిస్తుంది. పండుగలు, వివాహాల సీజన్ ముగిసిన తర్వాత ఆషాడం డిస్కౌంట్ సేల్స్‌పైనే వస్త్ర వ్యాపారులు నమ్మకం ఉంచుతారు. వీలైనంత తక్కువ ధరకు అంతకుముందు వివాహాలు, ఇతర శుభ కార్యాల కోసం తెప్పించిన వస్త్రాలను విక్రయించి కొత్త స్టాకును తెచ్చి పెట్టుకోవాలని భావిస్తారు. అందుకే కొద్దిపాటి మార్జిన్ ఉన్నా వస్త్రాలను డిస్కౌంట్ సేల్స్‌లో ఉంచి విక్రయిస్తారు. విక్రయాలకు లాక్డౌన్ కరోనా లాక్డౌన్ కారణంగా మంచి సీజన్లో వస్త్ర వ్యాపారాలు మూతపడ్డాయి. మార్చి నుంచి జూన్ మొదటి వారం వరకు పండుగలు, అంతకుమించి వివాహ ముహూర్తాలు ఉండేవి. దీని కోసం వ్యాపారులు కొత్తకొత్త రకాల వ్రస్తాలను పెద్ద ఎత్తున తెచ్చి స్టాక్ ఉంచుకున్నారు. ఊహించని విధంగా లాక్‌డౌన్‌తో వ్యాపారాలకు బ్రేక్ డౌన్ కావడం వారి ఆశలపై నీళ్లు చల్లింది. వారం, పదిరోజులు లేదా ఒక నెల మాత్రమే లాక్డౌన్ ఉంటుందని వారు తొలుత భావించినా ఆ తర్వాత వరుసగా దాదాపు మూడు నెలలపాటు దుకాణాలు మూసి ఉంచాల్సి రావడంతో అటు దుకాణ గదుల అద్దెలు చెల్లించలేక, ఇటు దుకాణాల్లో పనిచేస్తున్న సిబ్బందికి జీతాలు చెల్లించలేక మినిమ్ కరెంటు బిల్లులు చెల్లించాల్సి రావడం తదితర కారణాలతో ఆర్థికంగా కుదేలయ్యారు. జూన్ 4 నుంచి షరతులపై దుకాణాలు తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చినా అప్పటికే సీజన్ ముగిసిపోవడంతో ఆషాడ మాసం ఆఫర్లతోనైనా వ్యాపారం జరుగుతుందని ఆశిస్తున్నారు. ఆషాడం ప్రారంభమై నాలుగు రోజులు గడుస్తున్నా మునుపటిలా వ్యాపారాలు జరుగుతాయన్న ఆశలేవీ కనిపించడం లేదని వ్యాపారులు పేర్కొంటున్నారు. నిజానికి ఎప్పటిలా ఆషాడం పేరిట వ్రస్తాలకు డిస్కౌంట్ ఆఫర్లు ఇచ్చే పరిస్థితి కూడా లేదంటున్నారు. కానీ అంతో ఇంతో వ్యాపారం జరుగుతుందన్న విశ్వాసంతో కొందరు వ్యాపారులు మాత్రం డిస్కౌంట్ ప్రకటనలు ఇస్తున్నారు. నాడు కళకళ.. నేడు వెలవెల సాధారణంగా ఆషాడ మాసం ప్రారంభం కాగానే చిన్నా, పెద్ద వస్త్ర దుకాణాలు కొనుగోలు దారులతో కళకళలాడుతాయి. కొన్ని దుకాణాలు 50 శాతం వరకు ఇవ్వజూపడంతో ఆ దుకాణాల్లో మంచి వ్యాపారం జరుగుతుంది. కానీ లాక్డౌన్ కారణంగా ఈసారి ఆ అవకాశం లేదు. మూడు మాసాలపాటు వ్యాపారాలు లేక నష్టపోవడంతో ప్రభుత్వం సాయం చేయాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు వస్త్ర వ్యాపారులు విన్నవిస్తున్నారు. లాక్డౌన్ ముందు ఆషాఢం ఆఫర్ మంత్రం పనిచేయడం లేదని, ఈ మాసం కూడా భారీగా నష్టాలు చూడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆశలు శ్రావణమాసంలోనేనని భావిస్తున్నారు. ఆషాడమాసం మరో మూడు వారాలు ఉంది గనుక ఈ సమయంలో వ్యాపారాలు పుంజుకునే అవకాశం కూడా ఉందని మరికొందరు వ్యాపారులు ఆశగా ఎదురుచూస్తున్నారు. భవిష్యత్తుపై ఆశ ఆషాడం ఆఫర్లు ఇచ్చే పరిస్థితి పెద్దగా కనిపించకపోయినా భవిష్యత్తుపై ఆశ ఉంది. పెద్దగా లాభాలు ఆశించకపోయినా కార్మికుల జీతాలు, మెయింటెన్స్ ఖర్చులు వస్తే చాలనుకుంటున్నాం. శ్రావణమాసం, ఆపై వచ్చే సీజన్లోనైనా వ్యాపారాలు జరుగుతాయన్న విశ్వాసం ఉంది. – దినేష్‌సింగ్, వస్త్ర వ్యాపారి, కడప లాక్‌డౌన్‌తో తీవ్ర నష్టం లాక్‌డౌన్‌ను ఊహించకపోవడం, మూడు నెలలు దుకాణాలు మూసి వేయడంతో వస్త్రాల స్టాకు కొద్దిమేర పాడై నష్టం చేకూరింది. పనిలేకపోయినా బాడుగలు, కరెంటు బిల్లు, ట్యాక్సు, కారి్మకుల జీతాలు కట్టాల్సి రావడంతో తీవ్రంగా నష్టపోయాం. ప్రభుత్వం ఆదుకోవాలి. – చెన్నంశెట్టి మురళి, వస్త్ర వ్యాపారి, కడప -
మూఢాలు దాటితే మార్కెట్‌కు కళ!
సాక్షి, హైదరాబాద్: ‘ఆషాఢం ధమాకా సేల్స్.. పెళ్లయినా, మరే శుభకార్యమైనా సకుటుంబ సపరివార దుస్తులకు మా వస్త్రాలయానికే విచ్చేయండి.. శ్రావణంలో బ్రహ్మాండమైన తగ్గింపు.. అన్ని రకాల వస్త్రాలకు కేరాఫ్ మా షోరూం.’ఏటా ఆషాఢం నాటికి హైదరాబాద్‌వ్యాప్తంగా కనిపించే సందడి ఇది. ఇక మూఢాలు ముగిసి పెళ్లిళ్లు మొదలయ్యే వేళ వస్త్రాలయాల ముందు కొనుగోలుదారుల వరుసలు.. షోరూంలన్నీపెళ్లింటిలాగా ముస్తాబు.. రంగవల్లికలు, మామిడి తోరణాలు, అరటి పందిళ్లు, విద్యుద్దీపాల వెలుగుజిలుగులు.. ఒకటేమిటి నగరవ్యాప్తంగా పెళ్లికళ తాండవించేది. ఇప్పుడు సరిగ్గా ఆ వేడుక ముందున్నాం కానీ ఆ కళ మాత్రం లేదు. కరోనా ధాటికి మార్కెట్ అంతా కకావికలమైంది. గతంలో ఎన్నడూ ఊహకందని రీతిలో అంతా దెబ్బతిన్నది. ఎంతకాలం ఈ పరిస్థితి ఉంటుందో తెలియని అయోమయం నెలకొంది. కానీ ఆశ మిణుకుమిణుకుమంటోంది. మరికొన్ని రోజుల్లోనే క్రమంగా సాధారణ పరిస్థితి నెలకొంటుందన్న భావన వ్యాపార వర్గాల్లో వ్యక్తమవుతోంది. లాక్డౌన్ సడలింపులతో ఇప్పుడుప్పుడే తెరుచుకుంటున్న వస్త్రాలయాలు కొనుగోలుదారులకు సాదర స్వాగతం పలుకుతున్నాయి. సరి–బేసి పద్ధతిలో దుకాణాలు తెరుచుకొని సరిగ్గా వారమైంది. వస్త్ర వ్యాపారం 20 శాతం బిజినెస్‌తో ముందుకు సాగుతోంది. లాక్డౌన్ తర్వాత రంజాన్‌తో కొనుగోళ్లు మొదలవగా మూఢం దాటాక వచ్చే శుభముహూర్థాల కోసం వస్త్రాల మార్కెట్ ఎదురుచూస్తోంది. జూన్ చివర్లో కొనుగోళ్ల జోరు పెరిగే చాన్స్.. ఈమాత్రం వ్యాపారమన్నా ఉంటుందో లేదోనన్న అనుమానంతో తెరుచుకున్న వస్త్ర వ్యాపారం రంజాన్ బోణీ కొట్టింది. లాక్డౌన్ తర్వాత దుకాణాలు తెరుచుకోవడంతో రంజాన్ కొనుగోళ్లు జరిగాయి. ఈ పరిణామం వస్త్ర వ్యాపారుల్లో కొంత సానుకూల దృక్పథాన్ని కలగజేసింది. ఈమాత్రమన్నా జనం ఇళ్లు విడిచి వస్తారన్న భావన లేని సమయంలో మళ్లీ కొనుగోళ్లు ఊపందుకుంటాయన్న అభిప్రాయాన్ని కలిగించింది. జూన్ ఒకటి నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌కు మరిన్ని సడలింపులు ఇవ్వనున్నందున మరికాస్త ఉత్సాహం మొదలవుతుందన్న అభిప్రాయాన్ని మార్కెట్ వ్యక్తం చేస్తోంది. జూన్ చివరి వరకు పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుందని, జూన్ చివర్లో ఆషాఢం మొదలవుతూనే జోరు పెరుగుతుందని ఓ ప్రముఖ షోరూం యజమాని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే అప్పటికి దేశంలో కరోనా పరిస్థితి, తదనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలు, సూచనల ఆధారంగా పరిస్థితి మెరుగుపడటమనేది ఆధారపడనుంది. మూఢాలు దాటే నాటికి ‘మంచి రోజులు’.. మూఢాలు దాటితే శుభముహూర్తాలు ప్రారంభమవుతాయి. ఇప్పుడు ఆ మంచిరోజులు మార్కెట్‌కు కూడా వస్తాయని వస్త్ర వ్యాపారులు ఆశాభావంతో ఉన్నారు. మే రెండో వారం దాటాక మూఢాలు ప్రారంభమయ్యాయి. జూన్ చివర్లో అషాఢం మొదలు కానుంది. జూలైలో మళ్లీ శుభముహూర్తాలు ప్రారంభమవుతాయి. అప్పటికి ప్రజల్లో కరోనా భయాందోళనలు తగ్గి కొనుగోళ్లపై దృష్టిసారిస్తారనే అంచనా ఏర్పడింది. భయం కొంత.. పొదుపు మరింత లాక్డౌన్ వల్ల చాలా కుటుంబాల్లో ఆర్థిక పరిస్థితులు కొంత ఇబ్బందిగా మారాయి. చిరు వ్యాపారులు నష్టపోవడం, కొన్ని కేటగిరీ ఉద్యోగులకు జీతాల్లో కోతపడటం.. వెరసి పొదుపుపై దృష్టిసారించాల్సి వచ్చింది. వానాకాలం అనగానే వ్యాధుల కాలం అంటారు. సీజనల్ వ్యాధులతోపాటు మళ్లీ కరోనా మరింతగా విజృంభిస్తే మళ్లీ కఠినంగా లాక్డౌన్ అమలు చేసే అవకాశం ఉందన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. దీంతో మరింత పొదుపునకు ప్రాధాన్యమిస్తూ కొనుగోళ్లను తగ్గించుకుంటున్నారు. ఇది కూడా కొనుగోళ్లు మందగించేందుకు ఓ ప్రధాన కారణమని కొందరు వ్యాపారులంటున్నారు. లాక్డౌన్ తర్వాత ఇప్పుడిప్పుడే దుకాణాలు తెరుచుకుంటుండగా కొన్ని రోజులు వేచిచూద్దాం, అప్పుడే దుకాణాలకు వెళ్లకపోవడం మంచిదన్న అభిప్రాయం ఎక్కువ మందిలో ఉంది. దీనివల్ల మందగమనం కొనసాగుతోందని ఎక్కువ మంది వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. జూలై నాటికి 70 శాతం వ్యాపారానికి చాన్స్ లాక్డౌన్ తర్వాత 20 శాతం బిజినెస్‌తో వ్యాపారం ప్రారంభించాం. పరిస్థితులు మెరుగవుతాయన్న పూర్తి ఆశాభావంతో ఉన్నాం. కొన్ని రోజులు గడిస్తే జనం షోరూంలకు పెద్ద సంఖ్యలో వచ్చే పరిస్థితులు మొదలవుతాయి. జూన్‌లో మరో 15 శాతం వ్యాపారం జరుగుతుంది. పెళ్లిళ్లు జరగడం మొదలైతే జూలైలో 70 శాతం వ్యాపారం జరిగే చాన్స్ ఉంది. ఇక అక్టోబర్‌లో పూర్వ పరిస్థితులు వస్తాయన్న నమ్మకం ఉంది. – రాజేంద్రకుమార్, ఫౌండర్ ఎండీ, వీఆర్కే సిల్క్స్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం ఆర్థిక ఇబ్బందుల కంటే కరోనా భయంతోనే జనం ఇంకా పూర్తిస్థాయిలో మార్కెట్‌కు రావట్లేదు. మరో రెండు నెలల్లో చాలా మెరుగైన వాతావరణం ఉండే అవకాశం ఉంది. అప్పటికి పరిస్థితులు దాదాపు చక్కబడొచ్చు. అయినా మేం కొనుగోలుదారులకు భరోసా ఇచ్చే రీతిలో పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ప్రజలు కూడా జాగ్రత్తలు పాటిస్తూ మార్కెట్‌కు వస్తే ఇబ్బంది ఉండదు. కొనుగోలుదారులనే కాదు.. మా సిబ్బందిలో కూడా కాస్త టెంపరేచర్ ఎక్కువగా ఉన్నా షోరూమ్‌లోకి అనుమతించట్లేదు. భౌతికదూరం, శానిటైజేషన్ లాంటి అన్ని నిబంధనలు పాటిస్తున్నాం. జనంలో భయం పోయే రోజులు త్వరలోనే ఉంటాయి. - పి. వెంకటేశ్వర్లు, ఫౌండర్ ఎండీ, ఆర్.ఎస్. బ్రదర్స్ -
చేనేత, జౌళి రంగాలను ఆదుకోవాలి
సాక్షి, హైదరాబాద్: కరోనా సంక్షోభం నేపథ్యంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పించే చేనేత, వస్త్ర, దుస్తుల తయారీ పరిశ్రమలపై దృష్టి కేంద్రీకరించాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు సూచించారు. తక్కువ ఖర్చు, తక్కువ భూ వినియోగంతో ఎక్కువ మందికి ఉపాధి కల్పించే శక్తి ఈ రంగాలకే ఉందన్నారు. చేనేత, టెక్స్టైల్, అపరెల్ పరిశ్రమలపై ఆధారపడిన వారిని ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలంటూ కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి రాసిన లేఖలో కేటీఆర్ పేర్కొన్నారు. దేశం నుంచి ఎగుమతి అయ్యే వస్త్రాల విలువ రూ.36 బిలియన్ డాలర్లు కాగా, బంగ్లాదేశ్, వియత్నాం వంటి దేశాలతో పోటీ నెలకొందన్నారు. చైనాలో పెట్టుబడుల వికేంద్రీకరణపై బహుళ జాతి కంపెనీలు దృష్టి పెడుతున్న నేపథ్యంలో, వాటిని అందిపుచ్చుకునేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరారు. వస్త్ర పరిశ్రమలకు ప్రత్యేక ప్యాకేజీ.. వస్త్ర పరిశ్రమలో పనిచేస్తున్న వారికి 6 నెలలు 50% కూలీ ఇవ్వడంతో పాటు, బంగ్లాదేశ్ తరహాలో దీర్ఘకాలిక రుణ సౌకర్యం కల్పించాలని కేంద్రాన్ని కేటీఆర్ కోరారు. అంతేకాకుండా 3 నెలల పాటు పీఎఫ్, ఈఎస్ఐ వంటి వాటిని కేంద్రమే చెల్లించాలన్నారు. అదనంగా బ్యాంకు రుణాలు, ప్రస్తుత రుణాలపై వడ్డీ మాఫీ లేదా మారటోరియం ఏడాది పొడిగించాలని, ఎన్పీఏ నిబంధనలను సవరించాలన్నారు. టెక్స్టైల్ ఎగుమతులపై ఏడాది పాటు అదనపు ప్రోత్సాహకాలు అందించాలని కోరారు. పత్తి కొనుగోలు మద్దతు ధరకు సంబంధించి రైతులకు నేరుగా వారి ఖాతాల్లోనే సబ్సిడీలు వేయాలన్నారు. భారీ టెక్స్టైల్ జోన్లకు ఆహ్వానం.. దేశంలో భారీ టెక్స్టైల్ జోన్ల ఏర్పాటును స్వాగతించిన కేటీఆర్.. తెలంగాణలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు ను ఏర్పాటు చేస్తున్న విషయాన్ని తన లేఖలో ప్రస్తావించారు. లాక్డౌన్ మూలంగా కార్మికుల వద్ద పేరుకు పోయిన చేనేత ఉత్పత్తులను ఈ కామర్స్ ద్వారా అమ్మకాలు జరపాలని కోరారు. చేనేత వస్త్రాలను కేవీఐసీ, కాటేజ్ ఇండస్ట్రీస్ ద్వారా కొనుగోలు చేయాలన్నారు. 50% యార్న్‌పై సబ్సిడీ ఇవ్వాలని, రెండేళ్ల పాటు చేనేత వస్త్రాలపై జీఎస్టీ మినహాయింపులు ఇవ్వాలని కోరారు. ప్రతి ఆదివారం పదినిమిషాలు కేటాయించండి పది ఆదివారాలు పది నిమిషాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే సీజనల్‌గా వచ్చే డెంగ్యూ, చికున్ గున్యా, మలేరియా వంటి కీటక వ్యాధులను అరికట్టవచ్చని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సీజనల్ వ్యాధుల నివారణ కోసం ‘ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాలు’అనే ప్రత్యేక కార్యక్రమాన్ని మంత్రి తన నివాసంలో ప్రారంభించారు. కేటీఆర్ స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొని తన ఇంటి లోని పూల కుండీలు, ఇతర ప్రదేశాల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకున్నారు. సీఎం కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతిభవన్ ప్రాంగణంలో కలియతిరిగిన మంత్రి కేటీఆర్, జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం అధికారుల సలహా మేరకు యాంటీ లార్వా మందులను చల్లారు. ప్రజలందరికీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఏర్పడిందని, వర్షాకాలం నాటికి దోమల వలన కలిగే సీజనల్ వ్యాధుల నివారణకు ఇప్పటి నుంచే ప్రజలందరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రగతిభవన్‌లో యాంటీ లార్వా మందును చల్లుతున్న మంత్రి కేటీఆర్. చిత్రంలో మేయర్ బొంతు రామ్మోహన్ -
‘యంగ్వాన్’తో టెక్స్‌టైల్‌కు మహర్దశ
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ రంగం తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న టెక్స్టైల్ రంగంలో మరిన్ని పెట్టుబడుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ ప్రయత్నాల్లో భాగంగా వరంగల్‌లో ఏర్పాటు చేసిన మెగా టెక్స్టైల్ పార్కులో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో టెక్స్టైల్ పరిశ్రమలు నెలకొల్పుతామన్నారు. దక్షిణ కొరియాకు చెందిన టెక్స్టైల్ దిగ్గజ కంపెనీ యంగ్వాన్ కార్పొరేషన్ రూ.900 కోట్లతో మెగా టెక్స్టైల్ పార్కులో యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు బుధవారం కేటీఆర్ సమక్షంలో తుది ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ‘గుజరాత్ లో 2017లో జరిగిన టెక్స్టైల్ సమ్మిట్‌లో యంగ్వాన్ కార్పొరేషన్ చైర్మన్ కిసాక్ సుంగ్‌తో సమావేశమై, తెలంగాణ పారిశ్రామిక విధానాలు, టెక్స్టైల్ పరిశ్రమ ఏర్పాటుకు తెలంగాణలో ఉన్న అనుకూలతలను వివరించాం. రాష్ట్రంలో టెక్స్టైల్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు సుంగ్ సానుకూలత వ్యక్తం చేశారు. యంగ్వాన్తో టెక్స్‌టైల్‌కు మహర్దశ పట్టనుంది’అని అన్నారు. 13 దేశాల్లో యంగ్వాన్ కార్యకలాపాలు టెక్స్టైల్ రంగంలో ప్రపంచ అగ్రగామి సంస్థల్లో యంగ్వాన్ కార్పొరేషన్ ఒకటని, ప్రస్తుతం బంగ్లాదేశ్, వియత్నాం, ఇథియోపియా వంటి 13దేశాల్లో తమ యూనిట్ల ద్వారా కార్యకలాపాలు కొనసాగుతున్నాయని కిసాక్ సుంగ్ వెల్లడించారు. రూ.900 కోట్ల పెట్టుబడికి సంబంధించి బుధవారం మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, భారత్, కొరియా రాయబారుల సమక్షంలో ఒప్పందం కుదరగా, 290 ఎకరాల భూ కేటాయింపు పత్రాలను యంగ్వాన్ కార్పొరేషన్ ప్రతినిధులు అందుకున్నా రు. దీని ద్వారా 12వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, కొరియాలో భారత రాయబారి సుప్రియ రంగనాథ్, గౌరవ కాన్సుల్ జనరల్ ఆఫ్ కొరియా ఇన్ హైదరాబాద్ సురేష్ చుక్కపల్లి, టెక్స్టైల్ శాఖ డైరెక్టర్ శైలజా రామయ్యర్ తదితరులు పాల్గొన్నారు. కాకతీయ టెక్స్టైల్ పార్కు సందర్శన.. సాక్షి, వరంగల్ రూరల్: కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు స్థలాన్ని బుధవారం దక్షిణ కొరియా కంపెనీ ప్రతినిధుల బృందం పరిశీలించింది. ఉదయం హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో వచ్చిన ఏడుగురు ప్రతినిధుల బృందం.. తమ కంపెనీకి కేటాయించిన స్థలంలో జరుగుతున్న పనుల గురించి టీఎస్ఐఐసీ అధికారులను అడిగి తెలుసుకుంది. అధికారులు ఇచ్చిన వివరణపై కొరియా బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. -
స్టాక్స్ వ్యూ
ప్రస్తుత ధర: రూ.756 టార్గెట్ ధర: రూ.1,057 ఎందుకంటే: ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రధాన కంపెనీ అయిన గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ప్రస్తుతం నాలుగు విభాగాల్లో–వీఎస్ఎఫ్, సిమెంట్, రసాయనాలు, టెక్స్‌టైల్స్‌ల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. వీటిల్లో వీఎస్ఎఫ్, సిమెంట్ కీలక విభాగాలు. ఈ కంపెనీ మొత్తం ఆదాయం, నిర్వహణ లాభాల్లో ఈ రెండు విభాగాల వాటా దాదాపు 90 శాతం. ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో ఈ కంపెనీ ఆర్థిక ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. వీఎస్ఎఫ్, కాస్టిక్ సోడా ధరలు అంతర్జాతీయంగా బలహీనంగా ఉండటంతో నిర్వహణ లాభం(స్టాండ్అలోన్) అంచనాల మేరకు పెరగలేదు. వీఎస్ఎఫ్(విస్కోస్ స్టేపుల్ ఫైబర్–నూలు లాగానే ఉండే బయోడిగ్రేడబుల్ ఫైబర్. దుస్తులు, హోమ్ టెక్స్టైల్స్, డ్రెస్ మెటీరియల్, లో దుస్తుల తయారీలో దీనిని వినియోగిస్తారు) కు సంబంధించి ఉత్పత్తి సామర్థ్యం వంద శాతాన్ని వినియోగించుకున్నా, అమ్మకాలు 3 శాతమే పెరిగాయి. డిమాండ్ బలహీనంగా ఉండటం, దిగుమతులు పెరగడంతో కెమికల్స్ విభాగం పనితీరు అంచనాలను అందుకోలేకపోయింది. అమ్మకాలు 7 శాతం తగ్గగా, మార్జిన్లు 8 శాతం తగ్గి 20 శాతానికే పరిమితమైంది. దేశంలోనే అతి పెద్ద సిమెంట్ కంపెనీ అయిన అ్రల్టాటెక్ సిమెంట్‌లో 57.3 శాతం వాటా ఉండటం, స్టాండ్అలోన్ వ్యాపారాలు నిలకడైన వృద్ధిని సాధిస్తుండటం, వీఎస్ఎఫ్ వ్యాపారంలో దాదాపు గుత్తాధిపత్యం ఉండటం, వీఎస్ఎఫ్, రసాయనాల విభాగాల ఉత్పత్తి సామర్థ్యాలు పెరుగుతుండటం, ఏబీ క్యాపిటల్, ఇతర కంపెనీల్లో వాటాలుండటం... సానుకూలాంశాలు. మరో గ్రూప్ కంపెనీ వొడాఫోన్ ఐడియా రుణ భారం భారీగా ఉండటం, (ఈ రుణానికి గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ఎలాంటి కార్పొరేట్ గ్యారంటీని ఇవ్వకపోవడంతో ఇది పెద్ద ప్రతికూలాంశం కాబోదు), సిమెంట్, వీఎస్ఎఫ్ ధరలు తగ్గే అవకాశాలు, వీఎస్‌ఎఫ్‌కు సంబంధించి ఉత్పత్తి వ్యయాలు పెరిగే అవకాశాలు.... ప్రతికూలాంశాలు. బాటా ఇండియా బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్ కొనొచ్చు ప్రస్తుత ధర: రూ.1,736 టార్గెట్ ధర: రూ.1,955 ఎందుకంటే: బాటా ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్ ఆర్థికఫలితాలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. మందగమన నేపథ్యంలో కూడా ఈ కంపెనీ ఆదాయం 7 శాతం వృద్ధితో రూ.722 కోట్లకు పెరిగింది. ప్రీమియమ్(ఖరీదైన) ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇస్తుండటం, పటిష్టమైన వ్యయ నియంత్రణ పద్ధతుల కారణంగా స్థూల మార్జిన్లు 60 బేసిస్ పాయింట్లు పెరిగి 54.4 శాతానికి, నిర్వహణ లాభ మార్జిన్ అర శాతం పెరిగి 13.5 శాతానికి పెరిగాయి. కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు కారణంగా నికర లాభం 27 శాతం ఎగసి రూ.71 కోట్లకు పెరిగింది. కొత్త ట్రెండీ కలెక్షన్లను అందుబాటులోకి తెస్తుండటం, మార్కెటింగ్ వ్యయాలు పెంచుతుండటం, ప్రస్తుత స్టోర్ మోడళ్లను రీ డిజైనింగ్ చేయడం తదితర చర్యల కారణంగా ఈ కంపెనీ బ్రాండ్ ఇమేజ్ ‘మాస్’ నుంచి ‘ప్రీమియమ్’కు మారుతోంది. ఫ్రాంచైజీ స్టోర్స్‌తో కలుపుకొని దేశవ్యాప్తంగా 1,420 స్టోర్స్‌ను నిర్వహిస్తోంది. ఐదేళ్లలో 500 ఫ్రాంచైజీ స్టోర్స్‌ను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. మహిళలు, యువత కేటగిరీలో కొత్త ఉత్పత్తులను అందుబాటులోకి తెస్తుండటం, ప్రీమియమ్ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇస్తుండటం, ప్రస్తుతమున్న స్టోర్లను నవీకరిస్తుండటం, ప్రకటనల కోసం అధికంగానే ఖర్చు చేస్తుండటం, స్థూల లాభం మెరుగుపడే అవకాశాలుండటం, ఎలాంటి రుణ భారం లేకపోవడం, రూ.800 కోట్ల మేర నగదు నిల్వలు ఉండటం....సానుకూలాంశాలు. రెండేళ్లలో ఆదాయం 11 శాతం, నికర లాభం 20 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి చెందగలవని అంచనా. -
అల్లికళ తప్పుతోంది!
సాక్షి ప్రతినిధి, ఏలూరు: పై లేసులను చూశారా.. ఎంత అందంగా ఉండి మనస్సును ఆకట్టుకుంటోందో.. దీని వెనుక గాలిలో గమ్మత్తుగా చేతులు తిప్పే మహిళల అద్భుత ప్రతిభ దాగి ఉంది. తదేకంగా దృష్టి కేంద్రీకరించి రూపొందించే ఈ కళాత్మక లేసు అల్లికలకు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంతో ప్రసిద్ధి. కాగా ఉభయ గోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రూపొందించే అల్లికలకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. అయితే క్రమంగా చాలామంది.. ముఖ్యంగా ఈ తరంవారు ఈ కళకు దూరమవుతున్నారు. పనికి తగ్గ ఫలితం దక్కకపోవడం వారిని నిరుత్సాహపరుస్తోంది. నరసాపురం తరువాత దేశంలో ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని గ్రామాల్లో మాత్రమే పరిమితంగా లేసు పరిశ్రమ ఉంది. ఇదే పరిస్థితి కొనసాగితే అరుదైన లేసు అల్లికల కళ పూర్తిగా అంతరించిపోయే ప్రమాదం ఉంది. బామ్మల వారసత్వంగా.. రెండు జిల్లాల్లోని 250 గ్రామాల్లో సుమారు 95 వేల మంది మహిళలు లేసు అల్లికలు చేస్తున్నట్టు అంచనా. గత 50 ఏళ్లుగా తమ బామ్మల వారసత్వంగా ఈ అరుదైన కళను కొనసాగిస్తున్నారు. దాదాపు 2,000 కుటుంబాలు ప్రత్యక్షంగా లేసు పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నాయి. వీరిలో లేసు అల్లే మహిళల నుంచి ఆర్డర్లు తీసుకునే కమీషన్‌దారులు కూడా ఉన్నారు. ఇక అంతర్జాతీయ లేసు ఎగుమతిదారులు నరసాపురం ప్రాంతంలో 50 మంది దాకా ఉన్నారు. లేసు పార్కును ప్రారంభించిన వైఎస్సార్ కేంద్ర జౌళిశాఖ నేతృత్వంలో కేంద్ర హస్త కళల అభివృద్ధి సంస్థ ద్వారా 2005లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నరసాపురం మండలం సీతారామపురంలో లేసు పార్కును ఏర్పాటు చేయించారు. ఆయన స్వయంగా ఈ పార్కును ప్రారంభించారు. ప్రస్తుతం లేసుపార్కుకు అనుసంధానంగా 50 సొసైటీలు, 29,000 మంది సభ్యులు ఉన్నారు. మహిళల్లో మార్కెట్ స్కిల్స్ పెంచడం, అధునాతన డిజైన్ల తయారీకి శిక్షణ ఇవ్వడం, ఉత్పత్తులను నేరుగా అమ్ముకునే సామర్థ్యాన్ని పెంచడానికి లేసుపార్కు ఏర్పాటు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత అధికారంలోకి వచ్చిన పాలకులు ఈ పార్కును నిర్లక్ష్యం చేయడంతో ఆశించిన లక్ష్యం పూర్తిగా నెరవేరలేదు. చైనా నుంచి గట్టిపోటీ ఎదురవుతుండడంతో నరసాపురం లేసు పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. చైనాలో యంత్రాలపై లెక్కకు మించిన డిజైన్లు, నాణ్యతతో కూడిన అల్లికలను ఉత్పత్తి చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో చైనా ఇచ్చినంత తక్కువ ధరకు నరసాపురం ఎగుమతి దారులు అల్లికలను ఇవ్వలేకపోతున్నారు. కుంగదీస్తున్న పన్నుల మోత లేసు పరిశ్రమ హస్తకళలకు సంబంధించింది కావడంతో గతంలో ఎలాంటి సుంకాలు ఉండేవి కావు. ఇప్పుడు లేసు ఎగుమతులపై 5 శాతం జీఎస్టీ విధించారు. పైగా ఎగుమతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహం లేదు. పదేళ్ల క్రితం వరకు ప్రతిఏటా రూ.300 కోట్ల విలువైన లేసు ఉత్పత్తులు నరసాపురం నుంచి ఎగుమతి అయ్యేవి. ప్రస్తుతం ఏటా కేవలం రూ.100 నుంచి రూ.150 కోట్ల మేర వ్యాపారం సాగుతోంది. 2006లో ఒక్క లేసు పార్కు ద్వారానే రూ.100 కోట్ల వ్యాపారం సాగింది. ప్రస్తుతం అది రూ.50 కోట్లకు పడిపోయింది. లేసు పరిశ్రమను ప్రభుత్వం ఆదుకోవాలని మహిళలు, ఎగుమతి దారులు కోరుతున్నారు. శ్రమకు తగ్గ వేతనం దక్కేలా చూడాలి నేను చిన్నప్పటి నుంచి లేసు అల్లికలు కుడుతున్నాను. లేసు కుట్టడం చాలా కష్టమైన పని. కంటి చూపును ఒకేచోట కేంద్రీకరించాలి. దాంతో కళ్ల జబ్బులు వస్తాయి. మా శ్రమకు తగ్గ వేతనం దక్కేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేదంటే ముందుముందు ఎవరూ లేసు అల్లికలు కుట్టరు. ఇప్పటి పిల్లలు ఈ వృత్తిలోకి రావడం లేదు. – చిలుకూరి అంజలి, శిరగాలపల్లి, యలమంచిలి మండలం కేవలం వ్యాపారం మాత్రమే కాదు లేసుపార్కు కేవలం వ్యాపారం కోసమే పెట్టింది కాదు. మారుతున్న ఫ్యాషన్లకు అనుగుణంగా మహిళలకు ఇక్కడ శిక్షణ ఇస్తాం. వారిలో నైపుణ్యాలు పెంచేందుకు కృషి చేస్తున్నాం. అల్లికలు సాగించే మహిళలే నేరుగా ఎగుమతులు చేసుకునే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. మన లేసు పరిశ్రమకు చైనా నుంచి పోటీ ఎదురవుతోంది. – జక్కంపూడి నాయుడు, లేసుపార్కు మేనేజర్ -
పార్టీల ఎజెండా ఏదైనా.. ‘జెండా’ సిరిసిల్లదే..!
సాక్షి, సిరిసిల్ల :ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. సిరిసిల్ల కార్మిక క్షేత్రంలో 1500 మంది ఉపాధి పొందుతున్నారు. గతేడాది అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇప్పటి పార్లమెంట్ ఎన్నికల వరకు సిరిసిల్లలో సందడి నెలకొంది. ఏ పార్టీకి అయినా.. ఎజెండా లేకున్నా.. సరే కానీ ఆ పార్టీ జెండాలు లేకుంటే.. కుదరని పరిస్థితి నెలకొంది. పార్టీ అధినేతలు ప్రచారానికి వచ్చినా.. ఊరూరా ఎన్నికల ప్రచారం చేసినా.. జెండాలు, కండువాలు తప్పని సరి. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల బరిలో నిలిచే అన్ని పార్టీలకు సిరిసిల్ల వస్త్రపరిశ్రమ జెండాలను సరఫరా చేస్తోంది. ఫలితంగా ఊరంతా ఉపాధి పొందుతోంది. బట్ట నుంచి బ్యానర్ల వరకు.. ఎన్నికలు ఏవైనా, పార్టీలేవైనా.. అభ్యర్థి ఎవరైనా ఎన్నికల ప్రచారానికి వినియోగించే జెండాలు, కండువాలు వస్త్రోత్పత్తి ఖిల్లా సిరిసిల్ల నుంచే సరఫరా అవుతాయి. వస్త్ర పరిశ్రమకు నిలయమైన సిరిసిల్లలో 34 వేల మరమగ్గాలు ఉన్నాయి. ఇందులో 27వేల మగ్గాలపై పాలిస్టర్ వస్త్రోత్పత్తి సాగుతుండగా.. మరో ఏడు వేల మగ్గాలపై కాటన్ వస్త్రం ఉత్పత్తి అవుతోంది. పాలిస్టర్ బట్టపై ఆర్డర్ వచ్చినట్లుగా వివిధ పార్టీల గుర్తులు, రంగులు, అభ్యర్థుల పేర్లు ప్రింటింగ్ చేసి సరఫరా చేస్తారు. పాలిస్టర్ బట్టను పార్టీ రంగుల్లో ప్రాసెసింగ్ చేయించి సరఫరా చేస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో పాటు, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు సిరిసిల్ల నుంచి ప్రచార సామగ్రి ఎగుమతి అవుతోంది. దేశవ్యాప్తంగా సిరిసిల్లలో తయారైన జెండాలు ఎన్నికల వేళ రెపరెపలాడుతున్నాయి. సిరిసిల్లలోనే చౌక.. దేశంలోని బీవండి, సూరత్, మాలేగావ్ ప్రాంతాల్లో మరమగ్గాలపై పాలిస్టర్ గుడ్డ ఉత్పత్తి అవుతున్నా.. అక్కడ ఉత్పత్తి అయ్యే వస్త్రం సిరిసిల్ల వస్త్రంలాగా చౌకగా లభించదు. దీంతో హైదరాబాద్‌కు చెందిన మర్వాడీ సేట్లు.. దేశంలోని వివిధ ప్రాంతాల పార్టీల ఆర్డర్లు ముందుగానే తీసుకుని సిరిసిల్ల వస్త్రోత్పత్తిదారులకు ఆర్డర్లు ఇస్తారు. ఒక్క బ్యానర్‌ను సైజును బట్టి రూ.50 నుంచి రూ.200 వరకు ఉంటుంది. కండువా, జెండాలకు రూ.25 నుంచి రూ.50, టోపీ (క్యాప్)లకు రూ.20 నుంచి 30 వరకు తోరణాల జెండాలు పదివేల జెండాలకు రూ.3000 నుంచి రూ.4000 వరకు అమ్ముతారు. బహిరంగ సభల్లో వినియోగించే భారీసైజు బ్యానర్లను సైతం ఇక్కడే ముద్రించి ఇస్తారు. వీఐపీ కండువాలను రూ.100 ఒక్కటి సరఫరా చేస్తారు. రూ.5కోట్ల మేర వ్యాపారం.. ప్రతి ఎన్నికల సమయంలో సిరిసిల్ల వస్త్రపరిశ్రమకు రూ. 5 కోట్ల మేర వ్యాపారం సాగుతోంది. ఇక్కడికి ఆర్డర్లు రావడం కొత్తేం కాదు. సిరిసిల్ల నేతన్నలు గత నలుబై ఏళ్లుగా జెండాలు అందిస్తున్నారు. 1978లో తొలుత సిరిసిల్లలో రామ్బలరామ్ స్క్రీన్పింటర్స్ రంగురంగుల పార్టీల జెండాలను ముద్రించడం ఆరంభించింది. ఇప్పుడు టెక్నాలజీ పెరిగి దేశవ్యాప్తంగా ఉన్న పార్టీలు కాంగ్రెస్, తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతాపార్టీ, వైఎస్సార్సీపీ, బహుజన సమాజ్‌పార్టీ, జనసేన, ఇలా ఏ పార్టీ అయినా ఆయా పార్టీల రంగుల్లో జెండాలను ప్రింట్ చేసి అందిస్తారు. అభ్యర్థుల పేర్లు, నినాదాలు సైతం బట్టపై అద్దడం విశేషం. ఎన్ని‘కళ’ సిరిసిల్లలో పాతిక వేల కుటుంబాలు వస్త్రోత్పత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయి. తరచూ ఆటుపోట్లతో వస్త్రపరిశ్రమ సంక్షోభానికి గురికావడం, ఉపాధి లేక పోవడం వంటి సమస్యలు ఉండేవి. ఇప్పుడు బతుకమ్మ చీరలు ఉత్పత్తి ఆర్డర్లు, ఎన్నికల ప్రచార సామగ్రి ఆర్డర్లు రావడంతో నేతన్నలకు చేతి నిండా పని లభిస్తోంది. ఎన్నికల సామగ్రి సరఫరాతో 500 మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. జెండాలను కుట్టుమిషన్లపై కుట్టే పనిలో మరో వెయ్యి మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు. ఇక్కడే బట్ట తయారు కావడంతో ఇక్కడి కార్మికులకు మెరుగైన ఉపాధి లభిస్తుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) జెండా ఆర్డర్లు సైతం సిరిసిల్లకు రావడం విశేషం. చేదు అనుభవం.. మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి తొలిసారి సిరిసిల్లకే వచ్చారు. ప్రజాచైతన్య యాత్రను సిరిసిల్ల నుంచే శ్రీకారం చుట్టడం భారీ ఎత్తున పీఆర్పీ జెండాలు, కండువాల ఆర్డర్లు వచ్చాయి. ఆర్డర్లు ఇచ్చిన ఆ పార్టీ నేతలు ఆర్డర్లకు డబ్బులు ఇవ్వలేదు. ప్రచార సామగ్రిని తీసుకెళ్లలేదు. దీంతో సిరిసిల్ల వస్త్రవ్యాపారులు ఉద్దేర భేరానికి స్వస్తి పలికారు. ‘‘మిషన్‌పై జెండాలు కుడుతున్న ఈమె మేర్గు లావణ్య. సిరిసిల్లలోని వెంకట్రావునగర్. లావణ్య రోజుకు వెయ్యి జెండాలు కుడుతుంది. ఒక్కో జెండాకు 25పైసల చొప్పున రోజుకు రూ.250 కూలి లభిస్తోంది. నెలకు సగటున లావణ్య ఇంట్లో ఉంటూనే రూ.5వేలు సంపాదిస్తోంది. లావణ్య భర్త శ్రీనివాస్ నేత కార్మికుడు. సాంచాలు నడుపుతూ నెలకు రూ. 8వేలు సంపాదిస్తాడు. ఇంట్లోనే పాపను చూసుకుంటూ లావణ్య ఉపాధి పొందుతోంది’’. ‘‘ఈమె కాటబత్తిని అనిత. సిరిసిల్ల సాయినగర్. అనిత పార్టీల జెండాలు, కండువాల, క్యాప్‌లు కట్‌చేస్తూ.. సరిచేస్తూ.. నెలకు రూ.6వేల వరకు సంపాదిస్తోంది. ఆమె భర్త సత్యనారాయణ డయింగ్ కార్మికుడు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలకు పాల్పడ్డాడు. ఇద్దరు పిల్లలను పోషించేందుకు బీడీలు చేసేది. రోజుకు వెయ్యి బీడీలు చేసినా.. నెలకు రూ.3వేలకు మించి రాకపోయేవి. ఈ డబ్బులతో ఇల్లు కిరాయి చెల్లిస్తూ.. పిల్లలను సాకడం కష్టమైంది. దీంతో ఆమె పార్టీల జెండాల తయారీ కార్ఖానాలో పనికి చేరింది. దీంతో ఇప్పుడు రూ.6వేలు వస్తున్నాయి. ప్రభుత్వం వితంతు పింఛన్ రూ.వెయ్యి ఇస్తోంది. పిల్లలను చదివిస్తోంది’’. 16 ఏళ్లుగా ఇదే పని నేను 2002 నుంచి 16 ఏళ్లుగా ఇదే వ్యాపారం చేస్తున్నాను. ఎన్నికల సమయంలో కొద్దిగా ఎక్కు వ పని ఉంటుంది. మిగితా రోజు ల్లో స్కూల్, కాలేజీల బ్యా నర్లు, యాగాలు, యజ్ఞాల కండువాలు, జెం డాలు సరఫరా చేస్తాను. ఏడాది పొడువునా ఇ దే పని ఉంటుంది. నా వద్ద 25 మంది కార్మికు లు పని చేస్తారు. గతంలో కంటే ఇప్పుడు మంచి గిరాకీ ఉంది. దేశమంతా సరఫరా చేస్తున్నాను. – ద్యావనపల్లి మురళి, వ్యాపారి చదువుకుంటూ.. సంపాదిస్తూ నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న. మా అమ్మ నిర్మలతో పాటు నేను జెండాలు కుడుతాను. చదువుకుంటేనే తీరిక వేళల్లో పనిచేస్తాను. రెండు మిషన్లు ఉన్నాయి. అంతకు ముందు మా అమ్మ బీడీలు చేసేది. బీడీల పని కంటే ఈ పని బాగుంది. మంచి ఉపాధి లభిస్తుంది. ఇంటి వద్దనే నీడ పట్టున ఉండి పని చేస్తాం. ఎన్నికల రోజుల్లో పని ఎక్కువగా ఉంటుంది. – సామల దీప్తి, ఇంటర్ విద్యార్థి -
మాకు ఆ చీర కావాలి..!
గాంధీనగర్ : గత వారం జరిగిన పుల్వామా ఉగ్ర దాడి నుంచి భారతావని ఇంకా కోలుకోలేదు. దేశమంతా ఓ వైపు తమ కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్లకు నివాళుర్పిస్తూనే.. మరో పక్క దాయాది దేశం పట్ల తీసుకోబోయే ప్రతీకార చర్యల గురించి చర్చించుకుంటుంది. ఈ నేపథ్యంలో అమర జవాన్లకు నివాళులర్పించేందుకు వినూత్న మార్గాన్ని ఎన్నుకున్నారు గుజరాత్ వస్త్ర వ్యాపారులు. భారతీయ సంప్రదాయానికి చిహ్నమైన చీర మీద.. సరిహద్దుల్లో పహరా కాస్తూ మాతృభూమి కోసం ప్రాణాలర్పించే సైనికుల ఫోటోలను చిత్రించారు. ప్రస్తుతం ఈ చీరకు విపరీతమైన క్రేజ్‌ను సొంతం చేసుకోవడమే కాక మాకు కూడా కావాలంటూ క్యూ కడుతున్న వారి సంఖ్య భారీగా ఉందంటున్నారు చీరను తయారు చేసిన వ్యాపారి. సూరత్‌కు చెందిన అన్నపూర్ణ బట్టల మిల్లు ఈ వినూత్న ప్రయోగాన్ని చేపట్టింది. ఈ విషయం గురించి మిల్లు యజమాని మాట్లాడుతూ.. ‘పుల్వామా ఉగ్ర దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందారు. వీరి త్యాగం వెలకట్టలేనిది. తమ కుటుంబాల గురించి ఆలోచించకుండా దేశం కోసం మనం కోసం ప్రాణాలర్పించారు. వారి త్యాగాలకు చిహ్నంగా జవాన్ల ఫోటోలతో ఈ చీరలను రూపొందించాము. వీటిని అమ్మడం ద్వారా వచ్చిన మొత్తాన్ని పుల్వామా ఉగ్ర దాడిలో మరణించిన సైనికుల కుటుంబాలకు అందిస్తాము. ఈ చీరల మీద మన సైన్యం శక్తిని, యుద్ధ ట్యాంకులను, తేజోస్ విమానాల బొమ్మలను ముద్రించామ’ని తెలిపారు. ప్రస్తుతం ఈ చీరలకు ఫుల్ డిమాండ్ ఉందని.. దేశం నలుమూలల నుంచి ఆర్డర్లు వస్తున్నాయని తెలిపారు మిల్లు యజమాని. ఇదిలా ఉండగా పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ కమాండర్ ఆదిల్... సీఆర్పీఎఫ్ బలగాల వాహన శ్రేణిని ఢీకొట్టి ఆత్మాహుతికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 40 మందికి పైగా జవాన్లు అమరులయ్యారు. ఈ క్రమంలో పుల్వామా దాడిలో కీలక సూత్రధారిని భద్రతా బలగాలు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. -
సిరిసిల్లకు సంక్రాంతి శోభ
సిరిసిల్ల: సిరిసిల్ల వస్త్రపరిశ్రమకు పక్కరాష్ట్రాల నుంచి వస్త్రోత్పత్తి ఆర్డర్లు వస్తున్నాయి. తమిళనాడులో పొం గల్ (సంక్రాంతి) కోసం ఇక్కడ చీరలు తయారవుతు న్నాయి. తమిళనాడు ప్రభుత్వం అక్కడి పేదలకు పం డగ కానుకగా చీరలు, పంచెలు పంపిణీ చేస్తోంది. ఆ ఆర్డర్లు సిరిసిల్ల నేతన్నలకు లభించాయి. దీంతో ఇక్కడి వస్త్రపరిశ్రమలో తమిళనాడు చీరల ఉత్పత్తి జోరుగా సాగుతోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 6 నెలల క్రితం బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వగా 95 లక్షల చీరలకు అవసరమైన 6 కోట్ల మీటర్ల బట్టను ఉత్పత్తి చేశారు. బతుకమ్మ చీరల ఆర్డర్లతో నేతన్నలకుమెరుగైన ఉపాధి లభించింది. ఆ ఆర్డర్లు పూర్తి కాగానే.. ఇప్పుడు కొత్తగా తమిళనాడు ఆర్డర్లు రావడంతో నేత కార్మికుల ఉపాధికి మరో దారి లభించింది. సిరిసిల్లకు పండుగ శోభ ఐదేళ్లుగా సిరిసిల్లలో ఉత్పత్తి అవుతున్న చీరలు తమిళనాడుకు ఎగుమతి అవుతున్నాయి. ఈసారి కూడా తమిళనాడు ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. డిసెంబరు నెలాఖరు వరకు తమిళనాడు చీరలు ఉత్పత్తి కానున్నాయి. పండగకు ముందే ఆర్డర్లు రావడంతో మరమగ్గాలపై వేగంగా చీరలు, దోవతులు, పంచెలను ఉత్పత్తి చేస్తున్నారు. తమిళనాడులో 1.72 కోట్ల పంచె లు, మరో 1.73 కోట్ల చీరలు అవసరం ఉండటంతో అక్కడ ఆ మేరకు ఒకేసారి ఉత్పత్తి సాధ్యం కాకపోవడంతో అక్కడి వస్త్రాల ఏజెంట్ల దృష్టి సిరిసిల్లపై పడింది. దీంతో ఇక్కడ భారీగా ఆర్డర్లు ఇస్తూ.. చీరలు, పంచెలు ఉత్పత్తి చేయిస్తున్నారు. పాలిస్టర్, కాటన్ నూలు కలిసిన దారంతో మెత్తగా చీరలు, పంచెలను నేస్తున్నారు. సిరిసిల్లలో 2 వేల మరమగ్గాలపై చీరలు, పంచెలు ఉత్పత్తి అవుతున్నాయి. ఒక్కో మగ్గం నిత్యం 70 మీటర్లు ఉత్పత్తి చేస్తుండగా రోజుకు లక్షా నలభైవేల మీటర్ల చీరల వస్త్రం ఉత్పత్తి అవుతుంది. ఇక్కడ తయారైన చీరలు, దోవతులను కేరళకు ఎగుమతి చేస్తున్నారు. ఓనం పండగకు సిరిసిల్ల చీరలను, పంచెలను సామాన్యులు ఇష్టపడడంతో కేరళలోని బహిరంగ మార్కెట్‌కు వస్త్రాలు ఎగుమతి అవుతున్నాయి. నాణ్యమైన ఉత్పత్తులు ఇప్పటికే ఉన్న మరమగ్గాలపై కాటన్ చీరలు, తువ్వాలలు, దోవతులు, కర్చిఫ్లు, లుంగీలను ఉత్పత్తి చేస్తున్నారు. చీరలపై అనువైన రంగుల్లో ప్రింటింగ్ చేసి ఆధునిక హంగులను సమకూర్చే అవకాశం ఉంది. పాలిస్టర్ గుడ్డను ఉత్పత్తి చేస్తే మీటర్‌కు రూ.1.80 లభిస్తుండగా, అదే చీర ఉత్పత్తి చేస్తే మీటర్‌కు రూ.4.70 చెల్లిస్తున్నారు. చీర పొడవు 5.50 మీటర్లు ఉండగా.. రూ.25 చెల్లిస్తున్నారు. నూలు అందించి, బీములు పోసి ఇస్తుండటంతో మెరుగైన ఉపాధి సమకూరుతుంది. ఒకే పనికి కొద్ది నైపుణ్యం జోడిస్తే మూడింతల కూలీ దొరుకుతుంది. సిరిసిల్లలో తక్కువ ధరకే గుడ్డ ఉత్పత్తవుతుండగా, తమిళనాడు వ్యాపారులు భారీ ఎత్తున దిగుమతి చేసుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆర్వీఎం, క్రిస్మస్, కేసీఆర్ కిట్ల ఆర్డర్లను సిరిసిల్లకే ఇస్తోంది. పని బాగుంది మొన్నటి వరకు బతుకమ్మ చీరలతో మంచి ఉపాధి లభించింది. ఇప్పుడు తమిళనాడు చీరల ఆర్డర్లు వస్తున్నాయి. పనిబాగుంది. పాలి స్టర్ కంటే కార్మికులకు, ఆసాములకు చీరల ఆర్డర్లతో బతుకుదెరువు బాగుంది. ప్రభుత్వ ఆర్డర్లతో సిరిసిల్లకు మంచి రోజులు వచ్చాయి. – వెల్ది హరిప్రసాద్, ఆసామి బతుకమ్మ ఆర్డర్లతో మంచి కూలీ వచ్చింది సిరిసిల్లలో ప్రభుత్వం ఇచ్చిన బతుకమ్మ చీరల ఆర్డర్లతో మంచి కూలీ వచ్చింది. వారానికి రూ.5 వేలు సంపాదించిన. ఇప్పుడు మళ్లీ వారానికి రూ.2 వేలు వస్తుంది. తమిళనాడు చీరల ఆర్డర్లతో నెలకు రూ.10 వేలు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ ఆర్డర్లు వస్తేనే బాగుంటుంది. అందరికీ పని ఉంటుంది. పాలిస్టర్ కంటే తమిళనాడు చీరలు నయమే. – మహేశుని ప్రసాద్, కార్మికుడు -
వాణిజ్య, వ్యాపార కేంద్రంగా సిరిసిల్ల
సాక్షి, హైదరాబాద్: నేతన్నల సంక్షేమం ప్రధాన అంశంగా రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్లు పాలన సాగించిందని మంత్రి కేటీఆర్ అన్నారు. టెక్స్టైల్ పరిశ్రమను ప్రాధాన్య రంగంగా గుర్తించామని పేర్కొన్నారు. ఈ రంగంలో ప్రస్తుతం ఉన్న స్థితిగతులను సంపూర్ణంగా మార్చడంతో పాటు నూతన పెట్టుబడులను ఆకర్షించి, మరింత మందికి ఉపాధి కల్పించే లక్ష్యంతో పని చేశామని చెప్పారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నేతన్నల ప్రతినిధులు మంగళవారం కేటీఆర్‌ను హైదరాబాద్‌లోని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. సిరిసిల్ల ప్రాంత నేతన్నల స్థితిగతులు మారడంతో ఆ ప్రాంత ఎమ్మెల్యేగా గొప్ప ఆత్మ సంతృప్తి లభించిందని పేర్కొన్నారు. ఒకప్పుడు సిరిసిల్ల స్థితిగతులు తనను ఎంతగానో కలచివేసేవని, తెలంగాణ ఏర్పడ్డాక అక్కడి నేతన్నలకు గౌరవంగా బతికేలా ఆదాయం కల్పించే కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. బతుకమ్మ చీరల వల్ల ఒక్కో కార్మికుడికి నెలకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు నెలసరి వేతనం పొందే పరిస్థితి వచ్చిందని తెలిపారు. అపెరల్ పార్కు ఏర్పాటుతో 10 వేల మంది మహిళలకు వృత్తి నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తామని చెప్పారు. సిరిసిల్లను టెక్స్టైల్ రంగంలోనే కాకుండా అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తామన్నారు. మిడ్ మానేరు పూర్తి కావడంతో సిరిసిల్లకు తాగు, సాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయిందని చెప్పారు. వస్త్ర పరిశ్రమ వ్యాపారులు, నేతన్నల ఆధ్వర్యంలో సిరిసిల్లలో నవంబర్ 2న భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ బహిరంగ సభకు రావాలని నేతన్నలు కేటీఆర్‌ను కోరగా అందుకు అంగీకరించారు. టీఆర్ఎస్కు సంచార జాతుల మద్దతు టీఆర్ఎస్కు ఎన్నికల్లో మద్దతు ఇస్తున్నట్లు తెలంగాణ సంచారజాతుల సంఘం ప్రకటించింది. టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకుంటామని తెలిపింది. తెలం గాణ సంచారజాతుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు వొంటెద్దు నరేందర్ ఆధ్వర్యంలో 80 కులాల బాధ్యులు ఎంపీ కవితను మంగళవారం నగరంలోని ఆమె నివాసంలో కలిశారు. సీఎం కేసీఆర్ సంచారజాతులకు మేలు చేస్తున్నారని, ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేశారని ప్రతినిధులు పేర్కొన్నారు. -
వారికి ఊరట : దిగుమతి సుంకం రెట్టింపు
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ వస్త్ర ఉత్పత్తులకు, ఉత్పత్తిదారులు, ఊరట నిచ్చేలా కేంద్రం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టెక్స్టైల్ ఉత్పత్తులపై దిగుమతి సుంకాన్ని రెట్టింపు చేసింది. భారీ సంఖ్యలో ఈ ఉత్పత్తులపై 20 శాతం దిగుమతి సుంకం విధించింది. ఈ మేరకు ఒక నోటిఫికేషన్‌ను మంగళవారం ప్రభుత్వం లోక్‌సభకు సమర్పించింది. 328 రకాల వస్త్ర ఉత్పత్తులపై 20 శాతం పన్ను విధిస్తున్నట్టు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పోన్ రాధాకృష్ణన్ లోకసభకు చెప్పారు. దిగుమతి చేసుకునే వస్త్ర ఉత్పత్తులపై ప్రస్తుతం పన్ను తక్కువగా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. కస్టమ్స్ యాక్ట్ (1962) సెక్షన్ 159 ప్రకారం రెట్టింపునకు నిర్ణయించినట్టు తెలిపారు. తద్వారా దేశీయ తయారీదారులకు మంచి ప్రోత్సాహం లభించడంతోపాటు, ఈ రంగంలో భారీగా ఉద్యోగావకాశాలు వస్తాయన్నారు. అయితే దిగుమతి చేసుకున్న వస్త్రాల ధరలుమాత్రం మోత మోగనున్నాయి. అలాగే కేంద్రం నిర్ణయంబ చైనా ఉత్పత్తులనే ఎక్కువగా ప్రభావితం చేయనుందని ఎనలిస్టులు భావిస్తున్నారు. కాగా గత నెలలో ప్రభుత్వం 50రకాల వస్త్రాల ఉత్పత్తులపై దిగుమతి సుంకం రెండింతలు చేసింది. జాకెట్లు, సూట్లు, కార్పెట్లపై 20 శాతం దిగుమతి సుంకం విధించిన సంగతి తెలిసిందే. -
టెక్స్టైల్స్ పరిశ్రమకు ప్రోత్సాహకాలు!
న్యూఢిల్లీ: దేశీయ టెక్స్టైల్స్ పరిశ్రమకు మరింత జీవం పోసేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకోనుంది. 300 రకాల వస్త్రోత్పత్తుల దిగుమతులపై సుంకాలు పెంచనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. తద్వారా దేశీయ తయారీకి ప్రోత్సాహాన్నిచ్చి మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించాలన్నది ప్రభుత్వ ఆలోచనగా పేర్కొన్నాయి. అలాగే, ఈ రంగానికి సంబంధించి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలను సైతం సరళీకరించనున్నట్టు ఆ వర్గాలు తెలిపాయి. ఇలా దిగుమతి సుంకాలు పెంచే వాటిలో కొన్ని రకాల ఫ్యాబ్రిక్స్, గార్మెంట్స్, మానవ తయారీ ఫైబర్స్ ఉన్నట్టు చెప్పాయి. ప్రస్తుతం వీటిపై సుంకాలు 5–10 శాతం స్థాయిలో ఉండగా, 20 శాతానికి పెంచనున్నట్టు తెలిపాయి. ఇందుకు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు వెల్లడించాయి. ఈ వారంలోనే సుంకాలు పెంచాలని నిర్ణయిస్తే ముందుగా పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఆ వర్గాలు తెలిపాయి. సుంకాలు పెంచడం వల్ల విదేశీ ఉత్పత్తుల కంటే దేశీయ తయారీ ఉత్పత్తుల ధరలు తక్కువగా ఉండేందుకు అవకాశం కలుగుతుంది. -
కూర్చునే హక్కు
చక్కటి చీర కట్టు. పెదవులపై చెరగని చిరునవ్వు. ప్రాంగణ ద్వారంలోనే ఎదురై.. రారమ్మని ఆహ్వానించే ఆత్మీయమైన పలకరింపులు! షాపింగ్ మాల్స్‌లో సేల్స్ గర్ల్స్ ఇచ్చే నమస్కారాన్ని అందు కున్నాక కొనాలనుకున్న వస్తువు కొనకుండా మానం. ఒకవేళ వద్దనుకున్నా మనతో కొనిపించే వారి వేడికోలు.. ఏ కొంచెం మొహమాటం ఉన్నవారినైనా ఇబ్బంది పెట్టేస్తుంది. కానీ వారి మర్యాదల వెనుక దయనీయమైన వేదన ఒకటుందని కేరళ మహిళలను చూశాక కానీ అర్థం కాదు. ఆ వేదనే కేరళ టెక్స్టైల్ ఇండస్ట్రీలో పనిచేసే మహిళా కార్మికులను ‘కూర్చునే హక్కు’ కోసం ఉద్యమించేలా చేసింది. ఆ ఉద్యమం పేరే మలయాళంలో ఇరుప్పు సమరం.’ పన్నెండు గంటల పాటు ఏకధాటిగా నిలబడి ఉండాలి. అదీ పెదవులపై చిర్నవ్వు చెదరకుండా. 12 గంటల్లో రెండే రెండు సార్లు వాష్‌రూమ్‌కు వెళ్లొచ్చు. అది కూడా ఐదు నిమిషాలకు మించకూడదు! లంచ్‌కి 30 నిమిషాలు టైం ఇస్తారు. అంతకన్నా మించితే జీతంలో కోత. అంతే కాదు. పొరపాటున ఎవరూ చూడట్లేదని నేలమీద కూర్చున్నారో కెమెరా కన్నెర్రజేస్తుంది. ఎవరితోనైనా మాట్లాడినా సూపర్వైజర్ కంఠం ఖంగుమంటుంది. కాళ్లు పీక్కుపోయి ఒక్క క్షణం గోడకి ఒరిగి ఒంటికాలుపై నుంచున్నా కూడా ఫైనే. ఇక కనీస వేతనం కూడా కాని జీతంలో ఇంటికి తీసుకెళ్లేది కోతలే తప్ప జీతం రాళ్లు కాదు. ఇది ఎక్కడో బానిస దేశంలో కాదు.. మహిళల హక్కుల విషయంలో అగ్రభాగాన ఉన్న కేరళ రాష్ట్రంలో. ఈ పరిస్థితి చివరికి టెక్స్టైల్ ఇండస్ట్రీలోనూ, బట్టల షాపుల్లోనూ మహిళా కార్మికులు ‘కూర్చునే హక్కు’ కోసం ఉద్యమించేలా చేసింది. ఎనిమిదేళ్ల సుదీర్ఘ పోరాటం కేరళ రాష్ట్రంలో చాలా చోట్ల మహిళా ఉద్యోగుల ‘కూర్చునే హక్కు’ ఉల్లంఘనకు గురి కాగా ఇప్పుడిక 8 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తరువాత టెక్స్టైల్ ఇండస్ట్రీలో పనిచేసే మహిళా కార్మికులు కూర్చునే హక్కుని సాధించుకున్నారు. ‘రైట్ టు సిట్’ ఉద్యమానికి అనుకూలంగా కేరళ ప్రభుత్వం స్పందించింది. టెక్స్టైల్ ఇండస్ట్రీలో పనిచేస్తోన్న కార్మికులకు కూర్చునేందుకు స్టూల్ తదితరాలను ఏర్పాటు చేయాలనీ, ఎనిమిది గంటల పనిదినాన్ని తప్పనిసరిగా పాటించాలని, అంతకు మించి పని చేయించుకోకూడదనీ అక్కడి ప్రభుత్వం ఆదేశించింది. ఈమేరకు చట్టంలో మార్పులు చేస్తామని ప్రకటించింది. అలాగే మధ్యాహ్నం టీ బ్రేక్, లంచ్ బ్రేక్‌లను తప్పనిసరి చేసింది. ఉద్యమ సార«థి విజి పెన్‌కూట్ అయితే ఇది కేవలం కేరళకు సంబంధించిన విషయం కాదు. అనేక ప్రైవేటు పాఠశాలల్లో టీచర్లు కూర్చోవడం నేరం. కూర్చుంటే ఫైన్.. లాంటివి సర్వసాధారణంగా అమలైపోతున్నాయి. అయితే అసంఘటిత రంగంలో.. ప్రధానంగా భారీ మాల్స్‌లోనూ, బట్టల దుకాణాల్లోనూ మహిళల పట్ల యాజమాన్యాలు అనుసరిస్తోన్న అమానవీయ చర్యలను మొదటిసారిగా కేరళ మహిళలు ధిక్కరించారు. కేరళకు చెందిన విజి పెన్‌కూట్ ఈ ఉద్యమానికి సారథ్యం వహించారు. ‘ఆ ఇదేం పెద్ద సమస్యా?’ అంటూ పెదవి విరిచేసిన పురుష యూనియన్లకు దీటుగా విజి పెన్‌కూట్ అసంఘటిత రంగ కార్మికులకు ప్రత్యేకంగా 2010లో మహిళా సంఘాన్ని (ఏఎంటీయూ) ఏర్పాటు చేసి ‘కూర్చునే హక్కు’ కోసం ఉద్యమించారు. అలా కేరళ మహిళలు తమ కూర్చునే హక్కు కోసం ఎనిమిదేళ్ల పాటు నిలబడ్డారు. చీరల షాపులో తొలి తిరుగుబాటు షాప్ యాజమాన్యాల కాఠిన్యంతో అనేక గంటలపాటు అలాగే నించొని ఉండాల్సి రావడంతో ఈ రంగంలో పనిచేస్తోన్న అనేక మంది మహిళలకు నడుం నొప్పి, మోకాళ్ల నొప్పులు, కాళ్లు వాయడం లాంటి అనారోగ్య సమస్యలెదురయ్యాయి. కేవలం రెండేసార్లు టాయ్‌లెట్‌కి వెళ్లే అవకాశం ఉండటంతో మిగిలిన సమయమంతా (యూరినల్స్‌కి వెళ్లాల్సి వస్తుందని) నీళ్లు తాగకుండా ఉండడంతో చివరకు ప్రాణాంతకమైన కిడ్నీ సమస్యలకు దారితీసేది. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్కి కూడా ఇది కారణమయ్యేది. దీంతో మొదట 2014లో కేరళ, త్రిస్సూర్‌లోని కల్యాణ్ చీరల షాప్‌లో మహిళలు తమ ‘కూర్చునే హక్కు’కోసం స్ట్రైక్ చేశారు. కల్యాణ్ చీరల దుకాణంలో స్ట్రైక్‌తో ఉద్యమం ఊపందుకుంది. దిగివచ్చిన మర్చంట్స్ ‘‘మీరు కూర్చోదల్చుకుంటే, లేదా తరచూ టాయ్‌లెట్‌కి వెళ్లాలనుకుంటే, అలాంటి వాళ్లు ఇంట్లో కూర్చోవాలి తప్ప ఉద్యోగాలు చేయకూడదు’’ అని కేరళ మర్చంట్స్ అసోసియేషన్‌తో పాటు వస్త్ర దుకాణాల యాజమాన్యాలు వ్యాఖ్యానించడం ‘కూర్చునే హక్కు’ (ఇరుప్పు సమరం) కోసం పోరాటానికి ఉసిగొల్పిందంటారు ఈ ఉద్యమానికి సారథ్యం వహించిన విజి. అయితే ఈ ఉద్యమంపై ప్రభుత్వం దృష్టి సారించేందుకు చాలా కాలం పట్టింది. ఈ జూలై 4న కేరళ క్యాబినెట్.. ప్రస్తుతం ఉన్న చట్టంలో ఈ మార్పులు చేయాలని నిర్ణయించడంతో కేరళ మహిళల ‘రైట్ టు సిట్’ ఉద్యమం విజయవంతమైంది. గతంలో ఉన్న కార్మిక చట్టంలో.. ప్రత్యేకించి మహిళల కూర్చునే హక్కు ప్రస్తావన లేదనీ, దీన్ని సవరించడం వల్ల మహిళా కార్మికులందరికీ మేలు జరుగుతుందని కేరళ లేబర్ కమిషనర్ తోజిల్ భావన్ వ్యాఖ్యానించారు. అజిత అనే మాజీ వామపక్ష కార్యకర్త ద్వారా స్ఫూర్తిపొందిన విజి టీనేజ్లోనే ఫెమినిస్ట్ ఉద్యమంలో చేరారు. కోళికోడ్‌లోని అసంఘటిత రంగ కార్మికులతో కలిసి పనిచేస్తోన్న విజీ అంటే అక్కడి మహిళలకు అంతులేని గౌరవం. అదే గౌరవాన్ని ఇప్పుడు కేరళ ప్రభుత్వమూ ఆమెపై కనబరిచిందనడానికి సాక్ష్యం.. త్వరలోనే చట్టంలో జరగబోతున్న సవరణే. -
పట్టు ఉత్పత్తిలో చైనాతో పోటీపడదాం
సాక్షి, హైదరాబాద్: పట్టు ఉత్పత్తి, వస్త్ర పరిశ్రమలో చైనాతో పోటీపడాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో పట్టు రైతుల అవగాహన సదస్సు జరిగింది. దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. గత ఆర్థిక సంవత్సరంలో పట్టు ఉత్పత్తిలో చైనా మొదటి స్థానంలో ఉంటే, భారత్ వెనకబడి రెండోస్థానంలో నిలిచిందన్నారు. అమెరికా, ఇటలీ, జపాన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇంగ్లండ్‌లతో పాటు భారత్ కూడా పట్టును దిగుమతి చేసుకుంటోందని చెప్పారు. పట్టు ఉత్పత్తులకు మనదేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా మంచి గిరాకీ ఉందన్నారు. ఐదో స్థానంలో తెలంగాణ.. సంప్రదాయ పంటలతో పాటు అధిక ఆదాయం ఇచ్చే మల్బరీ సాగు వైపు కూడా రైతులు దృష్టిని సారించాలని జూపల్లి సూచించారు. భారత్‌లో 45 వేల మెట్రిక్ టన్నుల పట్టుకు డిమాండ్ ఉంటే 31వేల మెట్రిక్ టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతోందన్నారు. గతేడాది లెక్కల ప్రకారం దాదాపు 10 వేల మెట్రిక్ టన్నుల పట్టును చైనా నుండి దిగుమతి చేసుకున్నామన్నారు. మనదేశంలో 9,571 మెట్రిక్ టన్నుల పట్టు ఉత్పత్తితో కర్ణాటక మొదటి స్థానంలో ఉంటే 119 మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో తెలంగాణ ఐదో స్థానంలో నిలిచిందన్నారు. తెలంగాణలో మల్బరీ సాగు, పట్టు గూళ్ల ఉత్పత్తితో రైతులకు కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఎకరం సాగుతో ఏడాదికి రూ.4 లక్షలు ఒక ఎకరం మల్బరీ సాగు చేయడం వల్ల ఐదుగురికి ఏడాదంతా ఉపాధి కల్పించవచ్చునని, ఏడాదిలో 8 నుండి 10 పంటలు సాగు చేయవచ్చునని జూపల్లి చెప్పారు. ఎకరానికి దాదాపుగా రూ.4 లక్షల ఆదాయాన్ని ఏడాదిలో ఆర్జించే అవకాశముందని వివరించారు. వాతావరణ పరిస్థితులు, ఇతర సమస్యలు కూడా తక్కువగా ఉంటాయన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా 70 శాతం రాయితీ ఇస్తూ మల్బరీ షెడ్ల నిర్మాణాన్ని ప్రోత్సహిస్తున్నామని వెల్లడించారు. ఉద్యానవన శాఖ కూడా మిగిలిన 30 శాతాన్ని రాయితీగా ఇస్తోందని చెప్పారు. ఈ సందర్భంగా పట్టు దారం–రైతు జీవనాధారం బుక్లెట్, సీడీని జూపల్లి ఆవిష్కరించారు. -
పోలీసులకు నటుడు ఉత్తేజ్ ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: సినీ నటుడు, రచయిత ఉత్తేజ్ పోలీసులను ఆశ్రయించారు. ఆయనకు చెందిన ఓ బట్టల షాపులో దొంగతనం జరగటంతో ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే... అలంకార్ డిజైనర్స్ పేరిట అమీర్‌పేట ఎల్లారెడ్డి గూడలో ఉత్తేజ్‌కు ఓ బట్టల షాపు ఉంది. ఉత్తేజ్ భార్య పద్మావతి ఆ షాపును నిర్వహిస్తున్నారు. శనివారం ముగ్గురు మహిళలు షాపులోకి వచ్చి కస్టమర్లలాగా నటిస్తూ ఖరీదైన చీరలను దొంగిలించుకెళ్లారు. దొంగతనం జరిగిన విషయాన్ని కాస్త ఆలస్యంగా గుర్తించిన పద్మావతి విషయాన్ని భర్తకు తెలియజేశారు. సీసీ ఫుటేజీలను పరిశీలించిన ఉత్తేజ్ దొంగతనం జరిగిన విషయాన్ని గుర్తించి.. ఎస్సార్ నగర్ పోలీసులకు నిన్న సాయంత్రం ఫిర్యాదు చేశారు. చోరీకి గురైన చీరల విలువ రూ.80 వేలుగా ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫుటేజీ ఆధారంగా పోలీసులు కేసును దర్యాప్తు చేపట్టారు. -
కుటుంబ కలహాలతో వస్త్రవ్యాపారి ఆత్మహత్య
సిరిసిల్లటౌన్: కుటుంబ కలహాలతో వస్త్రవ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘట న సిరిసిల్లలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. స్థానిక సుభాష్‌నగర్‌కు చెందిన మేర్గు సుధాకర్(42) సిరిసిల్లలో తయారయ్యే వస్త్రాన్ని ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తుంటాడు.మూడు నెలలుగా ఇంట్లో గొడవలు జరుగుతుండటంతో మనస్తాపంతో ఉంటున్నాడు. నాలుగురోజుల క్రితం భార్య రమాదేవి సుధాకర్‌తో గొడవ పడి పుట్టింటికి వెళ్లింది. దీంతో శుక్రవారం ఉదయం డైయింగ్‌లో కలిపే రసాయనం(నైట్రాప్)తాగి ఇంట్లోనే చనిపోయాడు. మృతుడికి కొడుకు రేవంత్, కూ తురు లహరి ఉన్నారు. అంత్యక్రియల్లో తెలంగాణ రచయితల వేదిక జాతీయ కార్యదర్శి జూకంటి జగన్నాథం, సెస్ వైస్‌చైర్మన్ లగిశెట్టి శ్రీనివాస్, జిల్లెల్ల పీఏసిఎస్ చైర్మన్ పబ్బతి విజయేందర్‌రెడ్డి పాల్గొన్నారు. -
వస్త్ర పరిశ్రమకు ప్రత్యేక ప్రోత్సాహకాలు
సాక్షి, హైదరాబాద్: వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి సీఎం కేసీఆర్ పెద్ద పీట వేస్తున్నారని, ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన వస్త్ర పరిశ్రమల యజమానులు రాష్ట్రానికి తిరిగి రావాలని టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు పిలుపునిచ్చారు. శుక్రవారం బషీర్‌బాగ్ పరిశ్రమ భవన్‌లోని టీఎస్ఐఐసీ బోర్డు రూమ్‌లో తెలంగాణ నుంచి వలసవెళ్లిన షోలాపూర్, భీవండి చేనేత పరిశ్రమల యజమానులతో ఆయన సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కొత్త యూనిట్లు ఏర్పాటు చేసిన వారికి ప్రత్యేకంగా వస్త్ర పరిశ్రమ క్లస్టర్లను నెలకొల్పుతామని చెప్పారు. అంతేకాకుండా స్థలంతో పాటు సబ్సిడీలు, ప్రోత్సాహకాలను అందిస్తామన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బాలమల్లు సూచించారు. సమావేశంలో టీఎస్ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి, చేనేతశాఖ అదనపు సంచాలకులు శ్రీనివాస్‌రెడ్డి, జహీరాబాద్ నిమ్జ్ సీఈవో మధుసూదన్, వరంగల్జిల్లా మడొకిండ టెక్స్టైల్ పార్కు యజమానుల సంఘం అధ్యక్షుడు స్వామి పాల్గొన్నారు. -
మగ్గాలపై..ఆఖరితరం!
సిరిసిల్ల నుంచి వూరడి మల్లికార్జున్: చిన్న చేపను పెద్ద చేప మింగినట్లు.. చేనేత మగ్గాలను మరమగ్గాలు (పవర్‌లూమ్స్) మింగేశాయి. కాలంతో పోటీ పడలేక.. జిగిసచ్చిన వృద్ధ కార్మికు లు మరో పని చేతకాక.. వయసు మీద పడినా.. కళ్లు కనిపించకున్నా.. ఒళ్లు సహకరించకున్నా.. కాళ్లు, చేతులు ఆడిస్తూ.. జానెడు పొట్టకోసం బట్ట నేస్తు న్నారు. ఎంత పనిచేసినా.. తక్కువ కూలీ వస్తుంది. మీటరు వస్త్రం నేస్తే రూ.17. దీంతో రోజంతా పని చేసినా.. రూ.100 రావడం కష్టం. మరో పని చేత కాని చేనేతను నమ్ముకున్న ఆఖరి తరం ఈ పనిలోనే కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మికు లంతా 60ఏళ్ల పైబడిన వారే కావడం విశేషం. సిరిసిల్ల జిల్లాలో 175 మంది కార్మికులున్నారు. ఒంట్లో సత్తువ లేకున్నా.. చేనేత మగ్గంపై బట్టనేస్తున్న ఇతని పేరు మామిడాల చంద్రయ్య(92). సిరిసిల్ల విద్యానగర్‌లో ఉండే చంద్రయ్య చిన్ననాటి నుంచే చేనేత మగ్గంపై బట్టనేస్తున్నాడు. ఒకప్పుడు చేనేత వస్త్రాలు తయారుచేస్తూ బాగానే బతికాడు. ఇల్లు కట్టుకున్నాడు. ఇప్పుడు చేతగాని పానం.. ఎముకలు తేలిన ఒళ్లు.. మగ్గంపై జోటను ఆడియ్యాలంటే రెక్కల్లో సత్తువ లేదు. దీంతో ఆయన పని మానేశారు. ఇప్పుడు చేనేత మగ్గాలపై బట్ట నేస్తున్న కార్మికులు పని మానేస్తే.. ఇక కొత్తగా చేనేత మగ్గాలను నడిపే వారు ఉండరు. చేనేత మగ్గాలకు ముసలితనం వచ్చింది. నేటి యువ ‘తరం’ చేనేత మగ్గాలను నడిపేందుకు ఆసక్తి చూపడం లేదు. మగ్గం మరణశయ్యపై నిలిచింది. 1990లో సిరిసిల్లలో చేనేత శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నైపుణ్యం కలిగిన శిక్షకులతో యువ కార్మికులకు ఆరునెలల శిక్షణ ఇచ్చేవారు. రూ.1200 ఉపకార వేతనం ఇస్తూ ప్రోత్సహించారు. చేనేత రంగంలో ఉపాధి అవకాశాలు లేక శిక్షణ పొందేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో సిరిసిల్లలోని శిక్షణ కేంద్రాన్ని కరీంనగర్‌కు తరలించారు. అక్కడా ఇదే పరిస్థితి. తిరిగి 2015లో సిరిసిల్ల శివారులోని టెక్స్టైల్ పార్క్‌లోకి శిక్షణ కేంద్రాన్ని తరలించారు. మగ్గాల పరికరాలను ఓ అద్దె ఇంట్లో మూలన పడేశారు. తెలంగాణలోని అన్ని జిల్లాలకు చెందిన వారికి శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన కేంద్రం మూలనపడింది. 17 చేనేత మగ్గాలు పనికి రాకుండా పోయాయి.