గ్రాసిమ్ ఇండస్ట్రీస్
కొనొచ్చు
బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్
ప్రస్తుత ధర: రూ.3845 టార్గెట్ ధర: రూ.4,900
ఎందుకంటే: అదిత్య బిర్లా గ్రూప్‌కు చెందిన ఈ కంపెనీ దుస్తుల తయారీలో వినియోగించే విస్కోస్ స్టేపుల్ ఫైబర్(వీఎస్‌ఎఫ్), సిమెంట్, కెమికల్స్, టెక్స్‌టైల్స్ రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. కంపెనీకి 90 శాతానికి పైగా ఆదాయం, నిర్వహణ లాభాలు వీఎస్‌ఎఫ్, సిమెంట్ రంగాల నుంచే వస్తున్నాయి. దేశీయ సిమెంట్ రంగంలో అగ్రగ్రామి సంస్థ ఆల్ట్రాటెక్ సిమెంట్ ఈ కంపెనీ అనుబంధ సంస్థే. వీఎస్‌ఎఫ్‌కు సంబంధించి 9 శాతం మార్కెట్ వాటాతో మార్కెట్‌లో అగ్రస్థానంలో ఉంది. గుజరాత్‌లోని విలాయత్‌లో కొత్తగా 550 ఎకరాల్లో వీఎస్‌ఎఫ్, కెమికల్స్ విభాగాలకు చెందిన ప్లాంట్లను ఏర్పాటు చేసింది. పూర్తిగా ఆటోమేటెడ్ అయిన ఈ ప్లాంట్‌ల కారణంగా కంపెనీకి పలు వ్యయాలు ఆదా అవుతున్నాయి. ఓడరేవుకు దగ్గరగా ఉండడం వల్ల లాజిస్టిక్స్ ప్రయోజనాలు కూడా కంపెనీకి కలసి వస్తున్నాయి. స్వల్ప పెట్టుబడి, కాలంలోనే ఈ ప్లాంట్‌ల సామర్థ్యాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. ఏబీసీఎల్ విలీనంతో కెమికల్స్ విభాగం సామర్థ్యం దాదాపు రెట్టింపు కావడం, విలాయత్ ప్లాంట్‌లను పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం, విస్తృతమైన డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్, అధిక విలువ ఉన్న ప్రత్యేకమైన ఉత్పత్తులను మార్కెట్లోకి తేవడం.. కంపెనీకి కలసి వచ్చే అంశాలు. సమ్ ఆప్ ద పార్ట్స్ (ఎస్‌ఓటీపీ) ప్రాతిపదికన ఏడాది కాలానికి రూ.4,900 టార్గెట్ ధరను నిర్ణయించాం.
కోల్ ఇండియా
కొనొచ్చు
బ్రోకరేజ్ సంస్థ: ఎడిల్‌వేజ్
ప్రస్తుత ధర: రూ.288 టార్గెట్ ధర: రూ.376
ఎందుకంటే: ప్రభుత్వ రంగంలోని ఈ మహారత్న కంపెనీ ప్రపంచంలోనే అతి పెద్ద బొగ్గు కంపెనీ, దేశంలో 80 శాతానికి పైగా బొగ్గును ఈ కంపెనీయే ఉత్పత్తి చేస్తోంది. ఇటీవలనే ఉద్యోగులకు వేతనాలను పెంచింది. ఈ వేతనపెంపు, క్లీన్ ఎనర్జీ సుంకం ప్రభావాలను అధిగమించగలమని కంపెనీ ధీమాగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 598 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతీ ఏడాది 5 శాతం వ్యయాలను తగ్గించుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. ధరల పెంచుకోవడం వల్ల వేతనాల పెంపు ప్రభావాన్ని అధిగమించుకోగలమని కంపెనీ పేర్కొంది. దిగుమతి చేసుకునే బొగ్గు ధరలతో పోల్చితే కోల్ ఇండియా బొగ్గు ధరలు తక్కువగానే ఉండటంతో ధరల పెంపుకు అవకాశం ఉంది. కంపెనీ అమ్మకాల్లో 80 శాతం వరకూ దీర్ఘకాల ఒప్పందాలకు సంబంధించినవే కావడంతో అమ్మకాల్లో స్థిరత్వం ఉండగలదు. వ్యయాలు తగ్గించుకోవడం, వేతన పెంపు ప్రభావాన్ని ధరలు పెంచుకోవడం ద్వారా అధిగమించడం వల్ల మార్జిన్లు బాగానే ఉండొచ్చని అంచనా వేస్తున్నాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈపీఎస్‌కు 12 రెట్లు, వచ్చే ఆర్థిక సంవత్సరం ఈపీఎస్‌కు 12.5 రెట్ల ధరకు ప్రస్తుతం ఈ షేర్ ట్రేడవుతోంది.
లక్ష్మీ మెషీన్ వర్క్స్
కొనొచ్చు
బ్రోకరేజ్ సంస్థ: ఫస్ట్‌కాల్ రీసెర్చ్
ప్రస్తుత ధర: రూ.3,398 టార్గెట్ ధర: రూ.3,600
ఎందుకంటే: ఈ కంపెనీ టెక్స్‌టైల్ మెషినరీ, మెషీన్ టూల్స్, ఫౌండ్రీ విభాగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. టెక్స్‌టైల్స్ రంగానికి చెందిన పూర్తి స్థాయి యంత్రాలను తయారు చేసే మూడు ప్రపంచ కంపెనీల్లో ఇదొకటి. దేశీయ టెక్స్‌టైల్ స్నిన్నింగ్ మెషినరీ పరిశ్రమలో 60 శాతం మార్కెట్ వాటా ఈ కంపెనీదే. కంపెనీకి చెందిన సీఎన్‌సీ మెషీన్ టూల్స్... కస్టమైజ్‌డ్ ఉత్పత్తులు తయారు చేయడంలో అగ్రశ్రేణి సంస్థ, ఇక వివిధ పరిశ్రమలకు కావలసిన ప్రెసిషన్ క్యాస్టింగ్స్‌ను ఈ కంపెనీ విభాగం, ఎల్‌ఎండబ్ల్యూ ఫౌండ్రీ తయారు చేస్తోంది. యూరప్, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. గత క్యూ3లో రూ.568 కోట్లుగా ఉన్న నికర అమ్మకాలు ఈ క్యూ3లో 15 శాతం వృద్ధితో రూ.652 కోట్లకు పెరిగాయి. నికర లాభం 45 కోట్ల నుంచి 42 శాతం వృద్ధితో రూ.63 కోట్లకు ఎగిశాయి. మరో మూడేళ్ల పాటు కంపెనీ మిగులు పరిస్థితులు కొనసాగవచ్చని అంచనా వేస్తున్నాం. రెండేళ్లలో నికర అమ్మకాలు 8 శాతం, నికర లాభం 21 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా. గత ఆర్థిక సంవత్సరంలో 2.56గా ఉన్న మార్కెట్ ధరకు పుస్తక ధరకు ఉన్న నిష్పత్తి ఈ ఆర్థిక సంవత్సరంలో 2.24గా ఉండొచ్చని అంచనా. టెక్స్‌టైల్స్ రంగానికి చెందిన యంత్రాల ఎగుమతుల్లో ఎన్నో ఏళ్లు టాప్ ఎక్స్‌పోర్ట్ అవార్డును గెల్చుకున్న కంపెనీ ఇది.