Aditya Birla Group
-
ప్రపంచ ఎకానమీపై ట్రంప్ ఎఫెక్ట్
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ తిరిగి పగ్గాలు చేపట్టడమనేది అంతర్జాతీయ భౌగోళిక–రాజకీయాల్లో మార్పులకు దారి తీయొచ్చని ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా అభిప్రాయపడ్డారు. ప్రపంచ ఎకానమీ, వ్యాపారాలపై గణనీయమైన ప్రభావాలు పడొచ్చని ఆయన వ్యాఖ్యానించారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో చోటు చేసుకున్న పరిణామాలను విశ్లేషించిన సందర్భంగా బిర్లా ఈ మేరకు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 2025లో ప్రపంచంలో అనిశ్చితి, అనూహ్యమైన, సాంప్రదాయానికి భిన్నమైన పరిస్థితులు నెలకొంటాయని బిర్లా చెప్పారు. ఒకవైపు అవకాశాలు మరోవైపు అనిశ్చితి ఉంటుందన్నారు. భారత్ వెలుపల అమెరికా తమకు అతి పెద్ద మార్కెట్ అని, అక్కడ 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతున్నామని ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత పటిష్టం కాగలవని ఆశాభావం వ్యక్తం చేశారు. అవకాశాలు అందిపుచ్చుకోనున్న భారత్ .. పుష్కలంగా పారిశ్రామిక సామర్థ్యాలున్నా అంతగా గుర్తింపునకు నోచుకోని భారత్.. ఇప్పుడు అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సంసిద్ధంగా ఉందని బిర్లా చెప్పారు. యాపిల్ ఉత్పత్తుల తయారీ భారత్‌కి రావడం మంచి పరిణామమని, త్వరలోనే ప్రపంచంలోనే పావు వంతు ఐఫోన్లు భారత్‌లోనే ఉత్పత్తి చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. భారతీయ ఆటోమొబైల్, సిమెంటు పరిశ్రమ మొదలైనవన్నీ అంతర్జాతీయంగా ఎదుగుతున్నాయని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో గ్లోబల్ తయారీ రంగంలో భారత్ కీలక పాత్ర పోషించగలదని పేర్కొన్నారు. 21వ శతాబ్దపు తొలి రెండు దశాబ్దాల్లో టెక్నాలజీ విప్లవం చోటు చేసుకుందని.. దీనితో ప్రయోజనాలు పొందుతున్నప్పటికీ తగు మూల్యం కూడా చెల్లించుకోవాల్సి వస్తోందని తెలిపారు. రాబోయే దశాబ్దంలో ప్రపంచాన్ని ఏకం చేయగలిగే శక్తిగా టెక్నాలజీని వినియోగించుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. -
లిస్టెడ్ కంపెనీగానే ఇండియా సిమెంట్స్
న్యూఢిల్లీ: దక్షిణాదిన కార్యకలాపాలు విస్తరించిన ఇండియా సిమెంట్స్(ఐసీఎల్) స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టెడ్ కంపెనీగా కొనసాగుతుందని అ్రల్టాటెక్ సిమెంట్ తాజాగా పేర్కొంది. ఐసీఎల్‌ను డీలిస్ట్ చేసే యోచనలేదని ఆదిత్య బిర్లా గ్రూప్ సిమెంట్ దిగ్గజం తెలియజేసింది. వారాంతాన ఐసీఎల్ ప్రమోటర్ల నుంచి 32.72 శాతం వాటా కొనుగోలుకి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు అల్ట్రాటెక్ వెల్లడించిన నేపథ్యంలో లిస్టింగ్ అంశానికి ప్రాధాన్యత ఏర్పడింది. డీల్ విలువ రూ.3,954 కోట్లుకాగా.. ఇప్పటికే ఐసీఎల్‌లో 23 శాతం వాటా కలిగిన అల్ట్రాటెక్ దీంతో నిబంధనల ప్రకారం పబ్లిక్ వాటాదారుల నుంచి మరో 26 శాతం వాటా కొనుగోలుకి ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించింది. షేరుకి రూ.390 ధరలో 8.05 కోట్ల షేర్లను కొనుగోలు చేయనుంది. ఇందుకు అల్ట్రాటెక్ రూ.3,142 కోట్లకుపైగా వెచ్చించనుంది. అయితే ఐపీఎల్ క్రికెట్ టీమ్.. చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) యాజమాన్యంలో ఎలాంటి మార్పు ఉండబోదని తెలుస్తోంది. ఐసీఎల్ ప్రమోటర్ ఎన్.శ్రీనివాసన్, కుటుంబ సభ్యులు ప్రమోటర్లుగా ఉన్న సంగతి తెలిసిందే. కాగా.. అల్ట్రాటెక్ తరఫున ఓపెన్ ఆఫర్‌ను చేపట్టిన యాక్సిస్ క్యాపిటల్.. ఐసీఎల్‌ను డీలిస్ట్ చేసే యోచనలేదన్న విషయాన్ని స్టాక్ ఎక్సే్ఛంజీలకు తెలియజేసింది. పూర్తిస్థాయిలో ఓపెన్ ఆఫర్ విజయవంతమైతే ఐసీఎల్‌లో అ్రల్టాటెక్ వాటా 81.49 శాతానికి చేరే వీలుంది! బీఎస్ఈలో ఐసీఎల్ షేరు 0.7 శాతం నీరసించి రూ. 372 వద్ద ముగిసింది. ఓపెన్ ఆఫర్ ధరతో పోలిస్తే ఇది 4.6 శాతం డిస్కౌంట్. -
హైదరాబాద్‌లో ‘బిర్లా ఓపస్’ ఎక్స్పో
హైదరాబాద్: పెయింట్స్ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆదిత్య బిర్లా గ్రూప్ ‘బిర్లా ఓపస్’ పేరుతో దేశంలోని వివిధ నగరాలకు తమ ఉత్పత్తులను పరిచయం చేస్తూ విస్తరించే ప్రయత్నం చేస్తోంది.దేశవ్యాప్తంగా కీలక మార్కెట్లలో విజయవంతమైన ఎక్స్పోలను అనుసరించి, బిర్లా ఓపస్ దేశవ్యాప్తంగా తన వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు 180 పైగా ప్రాంతాలకు దీన్ని మరింత విస్తరిస్తోంది. ఇందులో భాగంగా బిర్లా ఓపస్ ఎక్స్పో జూన్ 24, 25 తేదీల్లో హైదరాబాద్‌లో జరగనుంది.వ్యాపార భాగస్వాములు ముఖ్యంగా డీలర్లు, పెయింటర్లు, కాంట్రాక్టర్లు, ఆర్కిటెక్ట్‌లు, ఇంటీరియర్ డిజైనర్లతో సంబంధాలను పెంపొందించుకోవడం, బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ ఎక్స్‌పోలో బిర్లా ఓపస్ ఉత్పత్తుల శ్రేణిని ప్రదర్శిస్తారు. -
Kumar Mangalam Birla: మూడేళ్లలో రూ. 10 వేల కోట్ల ఆదాయం
న్యూఢిల్లీ: కొత్త వెంచర్ అయిన డెకరేటివ్ పెయింట్స్ వ్యాపార విభాగం నుంచి వచ్చే మూడేళ్లలో రూ. 10,000 కోట్ల ఆదాయాన్ని అంచనా వేస్తున్నట్లు ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా తెలిపారు. అప్పటికల్లా లాభాల్లోకి మళ్లగలమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బిర్లా ఓపస్ బ్రాండ్ కింద డెకరేటివ్ పెయింట్ల వ్యాపారంతో పాటు మూడు పెయింట్ ప్లాంట్లను గురువారం ఆయన ప్రారంభించారు. పానిపట్ (హరియాణ), లూధియానా (పంజాబ్), చెయ్యార్ (తమిళనాడు)లో ఈ ప్లాంట్లు ఉన్నాయి. బిర్లా ఓపస్ పెయింట్లు మార్చి నుంచి పంజాబ్, హరియాణ, తమిళనాడులో లభ్యమవుతాయి. జూలై నుంచి 1 లక్షకు పైగా జనాభా ఉన్న పట్టణాల్లో ఇవి లభిస్తాయని బిర్లా చెప్పారు. ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి 6,000 పట్టణాలకు కార్యకలాపాలు విస్తరించాలని నిర్దేశించుకున్నట్లు వివరించారు. గ్రూప్‌లో కీలకమైన గ్రాసిమ్ ఇండస్ట్రీస్ గతేడాది డెకరేటివ్ పెయింట్ల వ్యాపారంలోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించింది. 2025 నాటికి రూ. 10,000 కోట్లతో దేశీయంగా ఆరు తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే రూ. 5,000 కోట్లు వెచి్చంచినట్లు బిర్లా ఓపస్ బిజినెస్ హెడ్ హిమాంశు కపానియా తాజాగా చెప్పారు. దేశీయంగా డెకరేటివ్ పెయింట్స్ మార్కెట్ దాదాపు రూ. 80,000 కోట్ల స్థాయిలో ఉంది. ఏషియన్ పెయింట్స్, బర్జర్ పెయింట్స్, నెరోలాక్, అక్జో నోవెల్ (డ్యూలక్స్) ఈ విభాగంలో దిగ్గజాలుగా ఉన్నాయి. -
హిందాల్కో లాభం జూమ్
న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా గ్రూప్ మెటల్ రంగ దిగ్గజం హిందాల్కో ఇండస్ట్రీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్ (క్యూ3)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 71 శాతం జంప్‌చేసి రూ. 2,331 కోట్లను తాకింది. అల్యూమినియం, కాపర్ విభాగాలు పటిష్ట పనితీరు చూపడం లాభాలకు దోహదం చేసింది. గతేడాది (2022–23) ఇదే కాలంలో కేవలం రూ. 1,362 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 53,151 కోట్ల నుంచి 52,808 కోట్లకు బలహీనపడింది. కఠిన మార్కెట్ పరిస్థితుల్లోనూ వృద్ధి బాటలో సాగినట్లు కంపెనీ ఎండీ సతీష్ పాయ్ తెలియజేశారు. అల్యూమినియం, కాపర్ బిజినెస్‌లు ఆకర్షణీయ ఫలితాలు సాధించినట్లు పేర్కొన్నారు. ఇందుకు మెరుగైన ప్రొడక్ట్ మిక్స్, తగ్గిన ముడివ్యయాలు సహకరించినట్లు వెల్లడించారు. ఈ రెండు విభాగాల విస్తరణపై పెట్టుబడులను కొనసాగిస్తున్నట్లు తెలియజేశారు. వెరసి ఈ ఏడాది రూ. 4,500 కోట్లు వెచ్చిస్తున్నట్లు ప్రస్తావించారు. వచ్చే ఏడాది(2024–25) పెట్టుబడులను రూ. 5,500 కోట్లకు పెంచనున్నట్లు తెలియజేశారు. ఫలితాల నేపథ్యంలో హిందాల్కో షేరు బీఎస్ఈలో 12.5 శాతం పతనమై రూ. 510 వద్ద ముగిసింది. -
ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు కొత్త హెచ్ఆర్ హెడ్
భారతీయ ప్రముఖ వ్యాపార సమ్మేళనం ఆదిత్య బిర్లా గ్రూప్ తమ కొత్త హెచ్ఆర్ హెడ్‌ను ప్రకటించింది. ముందస్తు పదవీ విరమణ తీసుకుంటున్న సంతృప్త్ మిశ్రా స్థానంలో అశోక్ రామ్చంద్రన్ను డైరెక్టర్ (హెచ్ఆర్) గా నియమించింది. నియామక మార్పులు 2024 జనవరి 15 నుంచి అమలులోకి వస్తాయి. అశోక్ రామ్‌చంద్రన్ ప్రస్తుతం గ్రూప్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. 2015 నుంచి ఆయన ఆదిత్య బిర్లా గ్రూప్‌లో కొనసాగుతున్నారు. గ్రూప్‌లో చేరడానికి ముందు వోడాఫోన్ ఇండియాలో హెచ్ఆర్ డైరెక్టర్‌గా పనిచేశారు. హెచ్ఆర్ విభాగంలో అశోక్ రామచంద్రన్‌కు 34 సంవత్సరాల అనుభవం ఉంది. ఇక డాక్టర్ సంతృప్త్ మిశ్రా ఆదిత్య బిర్లా గ్రూప్‌లో 27 సంవత్సరాలకు పైగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన హెచ్ఆర్ గ్లోబల్ డైరెక్టర్, అలాగే బిర్లా కార్బన్ గ్రూప్ డైరెక్టర్, కెమికల్స్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. మిశ్రా 1996లో హిందుస్థాన్ యూనిలీవర్ నుంచి హెచ్ఆర్ వైస్ ప్రెసిడెంట్‌గా గ్రూప్‌లో చేరారు. -
అ్రల్టాటెక్ తాజా పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా గ్రూప్ సిమెంట్ రంగ దిగ్గజం అ్రల్టాటెక్ విస్తరణపై మరో సారి దృష్టి పెట్టింది. మూడో దశలో భాగంగా ఇందుకు రూ. 13,000 కోట్లు వెచి్చంచనుంది. తద్వారా 2.19 కోట్ల టన్నుల సిమెంట్ తయారీ సామర్థ్యాన్ని జత చేసుకోనుంది. వెరసి కంపెనీ మొత్తం సిమెంట్ తయారీ సామర్థ్యం వార్షికంగా 18.2 కోట్ల టన్నులకు చేరనుంది. నిధులను అంతర్గత వనరుల నుంచి సమకూర్చుకోనున్నట్లు అ్రల్టాటెక్ వెల్లడించింది. వారాంతాన సమావేశమైన బోర్డు ఇందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు పేర్కొంది. పాత ప్లాంట్ల విస్తరణ, కొత్త ప్లాంట్ల ఏర్పాటు సమ్మిళితంగా తాజా సామర్థ్య విస్తరణ చేపట్టనుంది. ప్రస్తుతం కంపెనీ సిమెంట్ తయారీ వార్షిక సామర్థ్యం దాదాపు 13.25 కోట్ల టన్నులుగా ఉంది. సామర్థ్య వినియోగం 75 శాతంగా నమోదవుతోంది. మూడో దశ విస్తరణ పూర్తయితే దక్షిణాదిలో 3.55కోట్ల టన్నులు, తూర్పు ప్రాంతంలో 4.04 కోట్ల టన్నులు, ఉత్తరాదిన 3.62 కోట్ల టన్నులు, పశి్చమాన 3.38 కోట్ల టన్నులు, మధ్య భారతంలో 3.57 కోట్ల టన్ను లు చొప్పున సిమెంట్ తయారీ సామర్థ్యాలను అందుకోనున్నట్లు అల్ట్రాటెక్ వివరించింది. -
బిర్లా ‘ఓపస్’ పెయింట్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పెయింట్స్ రంగంలోకి ఆదిత్య బిర్లా గ్రూప్ సంస్థ అయిన గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ఎంట్రీ ఇచి్చంది. ఈ మేరకు ‘బిర్లా ఓపస్’ బ్రాండ్‌ను గురువారం ఆవిష్కరించింది. డెకోరేటివ్ పెయింట్ల వ్యాపారంలో గ్రాసిమ్ రూ.10,000 కోట్లు వెచ్చించనున్నట్టు వెల్లడించింది. 2024 జనవరి–మార్చి కాలంలో బిర్లా ఓపస్ ఉత్పత్తులు మార్కెట్లోకి రానున్నాయి. గ్రాసిమ్ ఇండస్ట్రీస్ హరియణా, పంజాబ్, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్లో పెయింట్ల తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. మొత్తం వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 133.2 కోట్ల లీటర్లు. అధిక వృద్ధి ఉన్న విపణిలోకి ప్రవేశించడానికి కొత్త విభాగం వీలు కలి్పస్తుందని ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా ఈ సందర్భంగా అన్నారు. విజయవంతమైన వ్యాపారాన్ని ప్రారంభించేందుకు రెండేళ్లుగా బలమైన పునాదిని నిర్మించినట్టు చెప్పారు. రాబోయే సంవత్సరాల్లో రెండవ స్థానంలో నిలిచి లాభదాయక కంపెనీగా ఎదగడానికి ప్రయతి్నస్తున్నామన్నారు. డెకోరేటివ్ పెయింట్స్ పరిశ్రమ భారత్‌లో రెండంకెల వృద్ధితో ఏటా రూ.70,000 కోట్లు నమోదు చేస్తోంది. 2022–23లో గ్రాసిమ్ ఇండస్ట్రీస్ 23 శాతం వృద్ధితో రూ.1.17 లక్షల కోట్ల కన్సాలిడేటెడ్ ఆదాయాన్ని ఆర్జించింది. కాగా, గ్రాసిమ్ షేరు ధర క్రితం ముగింపుతో పోలిస్తే బీఎస్ఈలో గురువారం 0.12 శాతం క్షీణించి రూ.1,931.40 వద్ద స్థిరపడింది. -
పెయింట్ల బిజినెస్‌కు గ్రాసిమ్ సై
న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా గ్రూప్ దిగ్గజం గ్రాసిమ్ ఇండస్ట్రీస్ పెయింట్ల బిజినెస్‌పై దృష్టి పెట్టింది. ప్రధానంగా డెకొరేటివ్ విభాగంలో పట్టు సాధించాలని యోచిస్తోంది. అత్యధిక వృద్ధికి వీలున్న ఈ విభాగంలో దేశంలోనే నంబర్ టూ కంపెనీగా ఆవిర్భవించాలని లక్ష్యంగా పెట్టుకుంది. నిర్మాణరంగ మెటీరియల్స్ సరఫరాకు కొత్తగా ప్రవేశించిన బీటూబీ ఈకామర్స్ బిజినెస్‌కు జతగా పెయింట్ల బిజినెస్‌ను పెంచుకోవాలని ప్రణాళికలు వేసింది. పరివర్తన దశ వృద్ధిలో భాగంగా రెండు కొత్త బిజినెస్‌లవైపు దృష్టి సారించినట్లు కంపెనీ వార్షిక సమావేశంలో చైర్మన్ కుమార్ మంగళం బిర్లా పేర్కొన్నారు. దిగ్గజాలతో పోటీ గతేడాది పెయింట్ల బిజినెస్‌పై పెట్టుబడి ప్రణాళికలను సవరిస్తూ గ్రాసిమ్ రెట్టింపునకు పెంచింది. వెరసి రూ. 10,000 కోట్లను పెయింట్ల బిజినెస్‌పై వెచ్చించేందుకు సిద్ధపడుతోంది. తద్వారా మార్కెట్లో ఇప్పటికే విస్తరించిన పెయింట్స్ తయారీ దిగ్గజాలు ఏషియన్, బెర్జర్, కన్సాయ్ నెరోలాక్, ఆక్జో నోబెల్ ఇండియా తదితరాలతో పోటీకి తెరతీయనుంది. ప్రణాళికలకు అనుగుణంగా ఆరు సైట్లలోనూ ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నట్లు బిర్లా పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం(2023–24) నాలుగో త్రైమాసికానికల్లా ప్లాంట్లు ప్రారంభంకానున్నట్లు వెల్లడించారు. పరిశోధన, అభివృద్ధి యూనిట్ పూర్తిస్థాయిలో పనిచేస్తున్నట్లు తెలియజేశారు. డెకొరేటివ్ పెయింట్ల విభాగంలో నంబర్ టూ కంపెనీగా ఆవిర్భవించే లక్ష్యంతో ఉన్నట్లు వాటాదారులకు బిర్లా తెలియజేశారు. గతేడాది కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా రూ. 4,307 కోట్లు వెచి్చంచగా.. వీటిలో రూ. 1,979 కోట్లు పెయింట్ల బిజినెస్‌కు కేటాయించినట్లు వివరించారు. దేశీ పెయింట్ల బిజినెస్ ప్రస్తుత రూ. 62,000 కోట్ల స్థాయి నుంచి రానున్న ఐదేళ్లలో రూ. లక్ష కోట్లకు చేరనున్నట్లు కొన్ని నివేదికలు అంచనా వేశాయి. ఇటీవల గ్రాసిమ్తోపాటు.. జేఎస్‌డబ్ల్యూ, పిడిలైట్ సైతం పెయింట్ల బిజినెస్‌లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. వారాంతాన గ్రాసిమ్ ఇండస్ట్రీస్ షేరు బీఎస్ఈలో స్వల్ప నష్టంతో రూ. 1,775 వద్ద ముగిసింది. -
ఎక్స్‌ట్రూజన్‌పై హిందాల్కో దృష్టి
న్యూఢిల్లీ: మెటల్ రంగ ఆదిత్య బిర్లా గ్రూప్ దిగ్గజం హిందాల్కో ఇండస్ట్రీస్ రవాణా వ్యాగన్లు, కోచ్‌ల తయారీకి వీలుగా ఎక్స్‌ట్రూజన్ సౌకర్యాలపై పెట్టుబడులకు సిద్ధపడుతోంది. దీంతోపాటు కాపర్, ఈవేస్ట్ రీసైక్లింగ్ ప్లాంట్లపై మొత్తం రూ. 4,000 కోట్లవరకూ వెచి్చంచేందుకు ప్రణాళికలు వేసినట్లు కంపెనీ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా తాజాగా పేర్కొన్నారు. ప్రధానంగా వందే భారత్ రైళ్ల కోచ్‌లకోసం ఎక్స్‌ట్రూజన్ ప్లాంటు ఏర్పాటుకు రూ. 2,000 కోట్లు వెచి్చంచనున్నట్లు వెల్లడించారు. ఈ బాటలో కాపర్, ఈవేస్ట్ రీసైక్లింగ్ యూనిట్ల ఏర్పాటుకు మరో రూ. 2,000 కోట్లు పెట్టుబడులు కేటాయించనున్నట్లు కంపెనీ 64వ వార్షిక వాటాదారుల సమావేశం(ఏజీఎం)లో తెలియజేశారు. కంపెనీ ఇప్పటికే అధిక వేగం, అధిక లోడ్‌కు వీలున్న పూర్తి అల్యూమినియంతో తయారయ్యే తేలికపాటి రేక్‌ల నిర్మాణంలో పాలు పంచుకుంటోంది. ఇక సిమెంట్ బ్యాగులు, ఆహారధాన్యాలు తదితరాల కోసం మరో మూడు డిజైన్లతో రవాణా వ్యాగన్లను రూపొందించేందుకు ప్రణాళికలు వేసింది. మరోవైపు దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ జోరందుకుంటున్న నేపథ్యంలో ఇతర సంస్థల సహకారంతో బ్యాటరీ ఎన్‌క్లోజర్స్, మోటార్ హౌసింగ్స్ తదితర కీలక విడిభాగాల తయారీ, అభివృద్ధిని చేపట్టనున్నట్లు బిర్లా వివరించారు. -
రూ. 4.95 లక్షల కోట్ల సామ్రాజ్యానికి వారసుడు, మాజీ క్రికెటర్ ఎవరో తెలుసా?
కుమార మంగళం బిర్లా నేతృత్వంలోనిఆదిత్య బిర్లా గ్రూప్ నావెల్ జ్యువెల్స్ లిమిటెడ్ పేరుతో బ్రాండెడ్ జ్యువెలరీ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. బడా బాబులే లక్క్ష్యంగా హై క్వాలిటీ జ్యువెలరీ రంగంలో రూ. 5,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఈ నేపథ్యంలో రూ. 4.95 లక్షల కోట్ల సామ్రాజ్యానికి వారసుడు, మాజీ క్రికెటర్ ఆర్యమాన్ బిర్లా గురించి ఆసక్తి నెలకొంది. 60 బిలియన్ డాలర్లు (రూ. 4,95,000 కోట్లు) నికర విలువతో ఆదిత్య బిర్లా గ్రూప్ నికర విలుతో మెటల్, పల్ప్ ఫైబర్, సిమెంట్, కెమికల్స్, టెక్స్టైల్స్, కార్బన్ బ్లాక్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫ్యాషన్ రిటైల్, పునరుత్పాదక ఇంధనం వంటి రంగాలలో దూసుకుపోతోంది. గత రెండు సంవత్సరాలలో పెయింట్స్, B2B ఈ-కామర్స్ బిజినెస్‌తోపాటు మూడు పెద్ద వ్యాపారాల్లోకి ప్రవేశించింది ఇపుడిక ఆభరణాల బిజినెస్‌లో అటు టాటా గ్రూప్ తనిష్క్, ఇటు రిలయన్స్‌కు ప్రధాన ప్రత్యర్థిగా పోటీ పడనుంది. (తనిష్క్, రిలయన్స్‌కు చేదువార్త: వేల కోట్లతో మరో దిగ్గజం ఎంట్రీ) గ్రూప్ ఛైర్మన్ కుమార్ మంగళం బిర్లా కుమారుడే ఆర్యమాన్ బిర్లా కుమార్. 25 ఏళ్ల ఆర్యమాన్ బిర్లా గ్రాసిమ్, హిందాల్కో, ఆదిత్య బిర్లా ఫ్యాషన్, రిటైల్ ఆదిత్య బిర్లా క్యాపిటల్ వంటి దిగ్గజ విభాగాల బాధ్యతల్లో ఉన్నాడు. ఆర్యమాన్ ఒకపుడు దేశీయ క్రికెటర్‌గా ఆకట్టుకున్నాడు. 2017-2018 రంజీ ట్రోఫీలో మధ్యప్రదేశ్‌లో ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు.2018 ఐపీఎల్ వేలంలో అతన్ని రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. ఇక్కడ తన తొలి హాఫ్ సెంచరీ కొట్టి వార్తల్లో నిలిచాడు. (నీతా అంబానీ ఔదార్యం: బాధితులకు భారీ సాయం) ESPN Cricinfo ప్రకారం, అతను ఫస్ట్-క్లాస్ క్రికెట్లో 9 మ్యాచ్‌లు ఆడి, ఒక సెంచరీ ఒక అర్ధ సెంచరీతో సహా 414 పరుగులు చేశాడు. లిస్ట్ A క్రికెట్లో నాలుగు మ్యాచ్‌ల్లో 36 పరుగులు చేశాడు.అండర్-23 CK నాయుడు ట్రోఫీ 2017-18లో, ఆరు మ్యాచ్‌ల్లో 795 పరుగులతో అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. 10 వికెట్లు కూడా తీశాడు. అత్యంత సంపన్న క్రికెటర్, కానీ భారత్ లో అంత్యంత సంపన్న క్రికెటర్‌గా పేరు తెచ్చుకున్న ఆర్యమన్ బిర్లాకు చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే చాలా ఇష్టం. అంతర్జాతీయ క్రికెటర్ కావాలనేది అతని డ్రీమ్. ఆల్ రౌండర్‌గా రాణించాలనుకున్నాడు కానీ ఆందోళన, ఇతర ఆరోగ్య కారణాల రీత్యా క్రికెట్‌నుంచి తప్పుకున్నట్టు ఫెమినా ఇంటర్వ్యూలో చెప్పాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో, ఆర్యమాన్ బిర్లా , అతని సోదరి అనన్య బిర్లా గ్రాసిమ్ ఇండస్ట్రీస్‌లోకి డైరెక్టర్స్ ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఆదిత్య బిర్లా వెంచర్స్ అనే కంపెనీ వెంచర్ క్యాపిటల్ ఫండ్ హెడ్ కూడా. అలాగే D2C ప్లాట్‌ఫారమ్ TMRW బోర్డు డైరెక్టర్ కూడా.బిర్లాకుమార్తె అనన్య 17 సంవత్సరాల వయస్సులో తొలి కంపెనీ Svatantra Microfin Pvt Ltdని స్థాపించింది. అలాగే Ikai Asai అనే ఇంటి అలంకరణ బ్రాండ్‌ను కూడా స్థాపించింది. ఇలాంటి మరిన్ని సక్సెస్ స్టోరీలు,ఇంట్రస్టింగ్ అప్డేట్స్ కోసం చదవండి సాక్షిబిజినెస్ -
కార్పొరేట్ కొలువు.. మనశ్శాంతి కరువు
సాక్షి, అమరావతి: ‘ఐదంకెల జీతం.. ఆఫీస్ కారు.. దేశ, విదేశాల్లో క్యాంప్‌లు.. నీకేంట్రా లైఫ్ మొత్తం దిల్‌కుష్‌గా ఎంజాయ్ చేస్తున్నావ్’ అని స్నేహి తులెవరైనా అంటే.. ‘చూసేవాళ్లకు బాగానే కనిపి స్తుంది. జీవితంలో బొత్తిగా మానసిక ప్రశాంతత లేకుండా పోతోంది. రోజు రోజుకూ యాజమాన్యం నుంచి ఒత్తిళ్లు పెరిగిపోతున్నాయి. రాత్రిళ్లు కంటినిండా నిద్ర ఉండటం లేదు. ముద్ద మింగుడు పడటం లేదు’ అని నిట్టూరుస్తున్నారు కార్పొరేట్ ఉద్యోగులు. దేశంలో కార్పొరేట్ కంపెనీల్లో పనిచేసే సగం మంది ఉద్యోగులు తమ మానసిక ఆరోగ్యం క్షీణిస్తోందని ఆందోళన చెందుతున్నారు. సైలెంట్ స్ట్రగుల్ సర్వే ఏం తేల్చిందంటే.. కార్పొరేట్ ఉద్యోగుల మానసిక పరిస్థితులపై ‘ది సైలెంట్ స్ట్రగుల్’ పేరిట ఆదిత్య బిర్లా ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఎంపవర్ చేపట్టిన సర్వేలో ఉద్యోగులు మానసిక ఆరోగ్యం క్షీణిస్తోందని రూఢీ అయ్యింది. కార్పొరేట్ ఉద్యోగుల మానసిక ఆరోగ్యాన్ని అంచనా చేయడంతోపాటు మెరుగైన మానసిక ఆరోగ్య కార్యక్రమాల నిర్వహణకు అవసరమైన అంతరాలను గుర్తించడం కోసం ఈ అధ్యయనం చేశారు. ఇందులో భాగంగా దేశంలోని ముంబై, కోల్‌కతా, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, అహ్మదాబాద్, పూణె నగరాల్లో 3,000 మంది ఉద్యోగులపై అధ్యయనం చేశారు. అధ్యయనానికి ఎంపిక చేసిన వారిలో 1,627 మంది పురుషులు, 1,373 మంది మహిళలు ఉన్నారు. వీరిలో 2,640 మంది 30–45 ఏళ్లు, 291 మంది 46–60 ఏళ్లు, 69 మంది 60 ఏళ్లు పైబడిన వారున్నారు. రిస్క్‌లో 48 శాతం మంది ఉద్యోగులు అధ్యయనంలో భాగంగా 48 శాతం మంది ఉద్యోగుల మానసిక ఆరోగ్యం రిస్క్‌లో ఉన్నట్టు తేలింది. సమూహాల వారీగా మెంటల్ హెల్త్ రిస్క్ ప్రొఫైల్‌ను పరిశీలించగా.. 56 శాతం మంది మహిళలు, 41 శాతం మంది పురుషులు రిస్క్‌లో ఉన్నారు. అత్యధికంగా 60 ఏళ్లు పైబడిన వారిలో అత్యధికంగా 71 శాతం మంది రిస్క్‌లో ఉండగా.. 46–60 ఏళ్ల వారిలో 48 శాతం, 30–45 ఏళ్ల వారిలో 47 శాతం మంది రిస్క్‌ను ఎదుర్కొంటున్నారు -
పద్మభూషణ్ స్వీకరించిన కుమార మంగళం బిర్లా
న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా బుధవారం రాష్ట్రపతి భవన్లో జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నుంచి పద్మభూషణ్ అవార్డును స్వీకరించారు. దీనితో బిర్లా కుటుంబంలో దేశ అత్యున్నత పౌర పురస్కారం అందుకున్న నాల్గవ వ్యక్తిగా నిలిచారు. ఆయన ముత్తాత జీడీ బిర్లా 1957లో పద్మవిభూషణ్ గ్రహీత. తల్లి రాజశ్రీ బిర్లా 2011లో పద్మభూషణ్ పురస్కారం పొందారు. కుమార మంగళం బిర్లా తాత బీకే బిర్లా బంధువు జీపీ బిర్లా 2006లో పద్మభూషణ్‌ను అందుకున్నారు. ఆయన 28 ఏళ్ల సుదీర్ఘ వాణిజ్య అనుభవంలో గ్రూప్ టర్నోవర్ 30 రెట్లు పెరిగి 60 బిలియన్ డాలర్లకు చేరింది. ‘‘ఉన్నత లక్ష్యానికి వ్యాపారం దోహదపడుతూ, జీవితాలను సుసంపన్నం చేయాలన్న ఆదిత్య బిర్లా గ్రూప్ సంకల్పానికి ఈ అవార్డు ఒక గుర్తింపు’’ అని కుమార మంగళం బిర్లా పేర్కొన్నారు. ఈ ఏడాది మరణానంతర పద్మశ్రీ అవార్డులు లభించిన వారిలో ప్రముఖ శీతల పానీయాల బ్రాండ్ రస్నా వ్యవస్థాపకుడు, దివంగత అరీజ్ ఖంబట్టా, దిగ్గజ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా ఉన్నారు. -
ఏపీకి పరిశ్రమల పట్టం
సుదీర్ఘ తీర ప్రాంతం.. అపారమైన సహజ వనరులు.. మానవ వనరుల కొరత లేకపోవడం.. వీటన్నింటికీ తోడు అన్ని విధాలా ప్రభుత్వ సహకారం.. కొత్తగా పరిశ్రమ స్థాపించడానికి ఏ పారిశ్రామికవేత్తకైనా ఇంతకంటే ఏం కావాలి? ఇవన్నీ ఆంధ్రప్రదేశ్‌లో అందుబాటులో ఉండటంతో దిగ్గజ సంస్థల చూపు ఇప్పుడు రాష్ట్రంపై పడింది. పరిశ్రమలు పెడుతున్న వారిని చేయి పట్టుకుని నడిపించేలా నూతన పారిశ్రామిక విధానాన్ని తీసుకు రావడంలో సీఎం వైఎస్ జగన్ ఇతరుల కంటే నాలుగడుగులు ముందుండటం కలిసివస్తోంది. సాక్షి, అమరావతి: పెట్టుబడులు పెట్టేందుకు దేశంలోని దిగ్గజ సంస్థలు పారిశ్రామిక అనుకూల విధానాలున్న మన రాష్ట్రం వైపు చూస్తున్నాయి. ఇప్పటికే టాటాలు, బిర్లాలు, అదానీ, అర్సెలర్ మిట్టల్, సంఘ్వీ, భజాంకా, భంగర్ లాంటి పారిశ్రామిక దిగ్గజాలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో మార్చి 3, 4 తేదీల్లో విశాఖలో జరిగే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్)లో పెట్టుబడులు పెట్టడానికి అనేక దిగ్గజ సంస్థలు ఆసక్తిని వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడానికి సీఎం అధ్యక్షతన ఢిల్లీతో పాటు బెంగళూరు, చెన్నై, ముంబయి, హైదరాబాద్ వంటి పట్టణాల్లో నిర్వహించిన రోడ్‌షోలకు పెట్టుబడిదారుల నుంచి విశేష స్పందన వచ్చింది. కోవిడ్ సంక్షోభ సమయంలో రాష్ట్ర పరిశ్రమలను ఆదుకునేలా సీఎం జగన్ చూపిన చొరవ దేశ పారిశ్రామికవేత్తలను ఆకర్షించింది. అప్పటికే రాష్ట్రంలో అడుగుపెట్టిన పరిశ్రమలు త్వరితగతిన ఉత్పత్తి ప్రారంభించేలా చర్యలు తీసుకుంటూనే.. మరో పక్క కొత్త పెట్టుబడులను ఆకర్షించే విధంగా ప్రభుత్వం వేగంగా అడుగులు ముందుకు వేసింది. గత 44 నెలల్లో పెట్టుబడులను వాస్తవ రూపంలోకి తీసుకురావడంతోపాటు, సులభతర వాణిజ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే అగ్రగామిగా ఉండటం పారిశ్రామిక వేత్తలను ఇటువైపు వచ్చేలా చేస్తోంది. కోవిడ్ సమయంలో ఉపాధి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ పగ్గాలు చేపట్టి్టన తర్వాత 2019 జూన్ నుంచి 2023 జనవరి వరకు రూ.75,649.77 కోట్ల విలువైన పెట్టుబడులు (ఎంఎస్ఎంఈ సహా) వాస్తవ రూపంలోకి వచ్చాయి. ఇందులో 111 భారీ, మెగా యూనిట్లు రూ.56,534.53 కోట్ల పెట్టుబడులతో ఉత్పత్తి ప్రారంభించాయి. వీటి ద్వారా 73,876 మందికి ఉపాధి లభించింది. అంటే సగటున ఏడాదికి రూ.15,418 కోట్ల పెట్టుబడులతో ఉత్పత్తి మొదలైంది. ఇందులో సీఎం వైఎస్ జగన్ చేతులు మీదుగా రూ.13,766 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఆరు యూనిట్లలో ఉత్పత్తి ప్రారంభమైంది. వీటి ద్వారా 15,040 మందికి ఉపాధి లభించింది. ఇవి కాకుండా రూ.7,305 కోట్ల విలువైన కియా పరిశ్రమ వాణిజ్య పరమైన ఉత్పత్తిని కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 2019 డిసెంబర్ 5న లాంఛనంగా ప్రారంభించారు. వీటికి అదనంగా ఎంఎస్ఎంఈ రంగంలో 1,52,558 కొత్త యూనిట్లు ఏర్పాటయ్యాయి. వీటి ద్వారా రూ.19,115.24 కోట్ల పెట్టుబడులు రావడమే కాకుండా 13,63,706 మందికి ఉపాధి లభించింది. ప్రస్తుత ప్రభుత్వంలో గత 44 నెలల్లో సుమారు 24 నెలలు కోవిడ్ సంక్షోభంతో గడిచి పోయినప్పటికీ భారీ ఎత్తున పెట్టుబడులను వాస్తవ రూపంలోకి తీసుకురావడంలో ముందంజలో ఉందని స్పష్టమవుతోంది. మరో రూ.2.35 లక్షల కోట్ల పెట్టుబడులు ఇవికాక మరో 86 ప్రాజెక్టులకు సంబంధించి రూ.2,35,125.60 కోట్ల పెట్టుబడులు వివిధ దశల్లో ఉన్నాయి. ఇవీ వాస్తవ రూపంలోకొస్తే 2,36,806 మందికి ఉపాధి లభించనుంది. వీటిలో రూ.35,672.28 కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించి ఏడు భారీ యూనిట్లు ఉత్పత్తి ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాయి. వీటి ద్వారా 7,015 మందికి ఉపాధి లభించనుంది. వైఎస్ జగన్ సీఎం అయ్యాక సుమారు రూ.13,962 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన 17 యూనిట్ల భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీటి ద్వారా 24,866 మందికి ఉపాధి లభించనుంది. మరో 5 భారీ యూనిట్లు అన్ని అనుమతులు తీసుకొని నిర్మాణ పనులు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాయి. వీటి ద్వారా రూ.46,621.82 కోట్ల పెట్టుబడులతో 15,800 మందికి ఉపాధి లభించనుంది. -
భారత్ అభివృద్ధిని ప్రపంచం కోరుకుంటోంది
ముంబై: ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ ఎంతో ప్రత్యేకమైన స్థానంలో ఉందన్నారు ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా. భారత్ ఎదుగుదలను ప్రపంచం కోరుకుంటున్నట్టు చెప్పారు. నూతన సంవత్సరం సందర్భంగా కుమార మంగళం బిర్లా తన సందేశాన్ని ఇచ్చారు. ‘‘భారత్ ఆర్థిక సౌభాగ్యం ప్రపంచానికి ఎంతో కీలకమైనది. భారత్ వృద్ధిని ప్రపంచం స్వాగతిస్తుండడం ఆశ్చర్యకరం. ఎందుకంటే భారత్ వృద్ధి స్థిరంగా ఉండడమే కాదు, ఇతరులకు విఘాతం కలిగించనిది. వచ్చే రెండున్నర దశాబ్దాలు భారత్‌కు అమృత కాలం అనడంలో ఎలాంటి సందేహం లేదు’’అని కుమార మంగళం బిర్లా పేర్కొన్నారు. ఐదు ధోరణులు ప్రపంచంపై ఎన్నో ఏళ్లపాటు ప్రభావం చూపిస్తాయన్నారు. చైనా ప్లస్ 1 వ్యూహాత్మక విధానంలో భాగంగా అంతర్జాతీయ కంపెనీలకు భారత్ స్పష్టమైన ఎంపికగా పేర్కొన్నారు. దశాబ్దాలుగా ఏర్పడిన సరఫరా వ్యవస్థ రూపు రేఖలు మారుతున్నట్టు చెప్పారు. దీనికి కొంత సమయం పడుతుందన్నారు. ప్రపంచం ఎంతో వేగంగా గ్రీన్ ఎనర్జీవైపు అడుగులు వేస్తుండడాన్ని రెండో అంశంగా పేర్కొన్నారు. ఈ విధమైన ఇంధన మార్పు దిశగా భారత్ ధైర్యంగా అడుగులు వేసినట్టు చెప్పారు. నూతన వ్యాపారాల నిర్మాణంలో భారత్ వినూత్నంగా వ్యవహరిస్తున్నప్పటికీ.. ఇందులో సమతుల్యత అవసరమన్నారు. వ్యాపారాలు తమ ప్రాథమిక బలాలపై దృష్టి పెట్టాలన్నారు. ‘‘నేడు వ్యాపారాలు ఎదుర్కొంటున్న వినూత్నమైన సవాలు.. ఎంతో కాలంగా ఏర్పాటు చేసుకున్న విశ్వాసం, స్థిరత్వాన్ని కొనసాగిస్తూనే మనల్ని మనం తిరిగి ఆవిష్కరించుకోవాల్సి ఉంది’’అని బిర్లా పేర్కొన్నారు. షార్ట్కట్లు ఉండవు.. వ్యాపారాల నిర్మాణానికి ఎలాంటి దగ్గరి దారులు లేవంటూ, కొత్తగా స్టార్టప్‌లు ఏర్పాటు చేసే వారిని బిర్లా పరోక్షంగా హెచ్చరించారు. మూడు దశాబ్దాల క్రితం నాటి ‘టాప్ గన్’ సినిమా సీక్వెల్‌ను 2022లో తీసుకురాగా బిలియన్ డాలర్లను ఒక నెలలోనే వసూలు చేసిన విషయాన్ని బిర్లా గుర్తు చేశారు. పునఃఆవిష్కరణలు, భవిష్యత్తు నిర్మాణానికి సంబంధించిన ప్రాధాన్యతలను ఈ సినిమా తెలియజేసిందన్నారు. నిధుల లభ్యత, యువ నైపుణ్యాల మద్దతుతో కొత్తగా పుట్టుకొస్తున్న స్టార్టప్‌లను ఆయన స్వాగతిస్తూనే కీలక సూచనలు చేశారు. ‘‘స్టార్టప్ ఎకోసిస్టమ్‌లో చక్కటి బృందాలను నిర్మించాలి. ప్రతిభావంతులను తీసుకునేందుకు భయపడకూడదు. నినాదాల కంటే విలువలకు ప్రాధాన్యం ఇవ్వాలి. నిర్వహణ లాభాలు, స్థూల మార్జిన్లు, నగదు ప్రవాహాలను దృష్టిలో పెట్టుకోవాలి‘‘అని బిర్లా సూచించారు. వృద్ధి కోసం ఇతర అంశాల విషయంలో రాజీపడిన ఇటీవలి కొన్ని కంపెనీలను ఉదాహరణగా పేర్కొన్నారు. ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీలు గ్రీన్ ఎనర్జీపై పెట్టుబడులు పెడుతున్నట్టు చెప్పారు. -
పని వారి కోసం ‘సిప్’
ముంబై: ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ ఏఎంసీ వినూత్నంగా ‘సహ్యోగ్’ అనే ఓ కార్యక్రమాన్ని ప్రారంభించింది. తమకు సాయపడే సిబ్బంది పేరిట సిప్ ప్రారంభించేందుకు ఇది వీలు కల్పిస్తుంది. రోజువారీ మన జీవితాలను సౌకర్యవంతం చేయడం కోసం డ్రైవర్లు, వంట మనుషులు, గార్డెనర్లు, ఇంట్లో పనులు చేసే వారు ఎంతో సాయపడుతుంటారని.. వారికి సైతం జీవితంలో ఎదగాలనే కోరిక ఉంటుందని ఆదిత్య బిర్లా సన్ లైఫ్ పేర్కొంది. ఇతరుల మాదిరే వారికి సైతం రిటైర్మెంట్, పిల్లల విద్య తదితర లక్ష్యాలుంటాయనే విషయాన్ని గుర్తు చేసింది. చదవండి: రోడ్లపై ఆ వాహనాలకు నో ఎంట్రీ..కేంద్రం మరో కీలక నిర్ణయం! -
భారత్‌లో గ్యాలెరీ లాఫయేట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిపార్ట్మెంట్ స్టోర్స్ కంపెనీ, ఫ్రాన్స్‌కు చెందిన గ్యాలెరీ లాఫయేట్ భారత్‌లో అడుగుపెడుతోంది. లగ్జరీ డిపార్ట్మెంట్ స్టోర్లతోపాటు ఈ–కామర్స్ వేదిక ద్వారా దేశీయంగా ఉత్పత్తులను విక్రయించనుంది. ఆదిత్య బిర్లా ఫ్యాషన్, రిటైల్ ఈ మేరకు గ్యాలెరీ లఫయట్తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. తొలి ఔట్లెట్ 90,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ముంబైలో 2024లో, రెండవ స్టోర్ 65,000 చదరపు అడుగుల్లో ఢిల్లీలో 2025లో ప్రారంభం కానుంది. 200లకుపైగా బ్రాండ్స్‌కు చెందిన ఖరీదైన ఫ్యాషన్, యాక్సెసరీస్, ఫుడ్, అలంకరణ, కళాఖండాలను ఇక్కడ విక్రయిస్తారు. భవిష్యత్‌లో లగ్జరీ బ్రాండ్ల వృద్ధి కేంద్రంగా, ప్రపంచ విలాసవంతమైన మార్కెట్‌గా భారత్‌కు ఉన్న ప్రాముఖ్యతకు ఈ భాగస్వామ్యం నిదర్శనమని ఆదిత్య బిర్లా ఫ్యాషన్, రిటైల్ ఎండీ ఆశిష్ దీక్షిత్ తెలిపారు. ‘భారత్ వంటి ప్రతిష్టాత్మక, పరిణతి చెందిన మార్కెట్లో విస్తరించడం గర్వకారణం. ఇక్కడ మా బ్రాండ్ ప్రయోజ నం పొందగలదని బలంగా విశ్వసిస్తున్నాము. 2025 నాటికి విదేశాల్లో 20 స్టోర్లను చేరుకోవాలనే మా ఆశయానికి ఇది నాంది’ అని గ్యాలెరీ లాఫ యేట్ సీఈవో నికోలస్ హౌజ్ వివరించారు. 125 ఏళ్ల చరిత్ర కలిగిన గ్యాలెరీ లాఫయేట్ ఫ్రాన్స్‌తోపాటు పలు దేశాల్లో 65 కేంద్రాలను నిర్వహిస్తోంది. చదవండి: అమలులోకి కొత్త రూల్.. ఆ సమయంలో ఎస్ఎంఎస్ సేవలు బంద్! -
ఆదిత్య బిర్లా ఫ్యాషన్ లాభం ఐదింతలు
న్యూఢిల్లీ: పండుగల సీజన్ కావడంతో ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ సెప్టెంబర్ క్వార్టర్లో మెరుగైన పనితీరు చూపించింది. కన్సాలిడేటెడ్ లాభం ఐదింతలు పెరిగి రూ.29 కోట్లకు చేరింది. ఆదాయం సైతం 50 శాతం పెరిగి రూ.3,075 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో లాభం రూ.5 కోట్లు, ఆదాయం రూ.2,054 కోట్ల చొప్పున ఉన్నాయి. ‘‘కంపెనీ చరిత్రలో ఒక త్రైమాసికంలో అత్యధిక ఆదాయాన్ని నమోదు చేశాం. ఈ కామర్స్ విక్రయాల్లో మెరుగైన పనితీరు వృద్ధికి సాయపడింది. మార్కెటింగ్‌పైనా పెట్టుబడులు పెరిగాయి. బ్రాండ్ల బలోపేతం, వినియోగదారులను చేరుకోవడంపై దృష్టి సారించాం. పెద్ద ఎత్తున స్టోర్ల నెట్వర్క్ విస్తరణ చేపట్టాం. పాంటలూన్ బ్రాండ్ కింద 21 స్టోర్లు, బ్రాండెడ్ వ్యాపారంలో 85 స్టోర్లు ప్రారంభించాం’’ అని ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ తెలిపింది. విభాగాల వారీగా.. ♦ మధుర ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టయిల్ విభాగం ఆదాయం 45 శాతం పెరిగి రూ.2,109 కోట్లుగా ఉంది. ♦ ప్యాంటలూన్స్ ఆదాయం 65 శాతం పెరిగి రూ.1,094 కోట్లకు చేరింది. ♦ఈ కామర్స్ విక్రయాలు 20 శాతం పెరిగాయి. ఎబిట్టా మార్జిన్లు కరోనా ముందున్న స్థాయిని అధిగమించాయి. ♦ కంపెనీ కన్సాలిడేటెడ్ రుణ భారం రూ.243 కోట్లకు తగ్గింది. -
అదరగొట్టిన సెంచురీ టెక్స్టైల్స్, ఆదాయం జంప్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022-23) రెండో త్రైమాసికంలో ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీ సెంచురీ టెక్స్టైల్స్ అండ్ ఇండస్ట్రీస్ ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై-సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 59 శాతం జంప్‌చేసి రూ. 70 కోట్లకు చేరింది. గతేడాది(2021-22) ఇదే కాలంలో కేవలం రూ. 44 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 1,034 కోట్ల నుంచి రూ. 1,242 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 972 కోట్ల నుంచి పెరిగి రూ. 1,125 కోట్లను తాకాయి. కంపెనీ టెక్స్టైల్స్, పల్ప్, పేపర్, రియల్టీ బిజినెస్‌లను నిర్వహిస్తున్న విషయం విదితమే. ఫలితాల నేపథ్యంలో సెంచురీ టెక్స్టైల్స్ షేరు గురువారం నాటి 8 శాతం లాభంతో పోలిస్తే 2 శాతం నష్టంతో 861 వద్ద ట్రేడ్ అవుతోంది. -
గ్రాసిమ్ విస్తరణకు రూ.3,117 కోట్లు
న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీ గ్రాసిమ్ ఇండస్ట్రీస్ విస్తరణకు రూ.3,117 కోట్ల మూలధన వ్యయం చేయనుంది. ఈ మొత్తాన్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సామర్థ్యం పెంపు, ప్లాంట్ల ఆధునీకరణకు వెచ్చిస్తామని సంస్థ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా సోమవారం వెల్లడించారు. పెయింట్స్, బీటూబీ ఈ–కామర్స్ వ్యాపారాలు మినహా ఇతర విభాగాల్లో ఈ నిధులను ఖర్చు చేస్తామన్నారు. ‘ఇప్పటికే పెయింట్స్ వ్యాపారంలో రూ.10,000 కోట్ల మూలధన వ్యయానికి బోర్డ్ ఆమోదం తెలిపింది. ఇందులో 2022 మార్చి నాటికే రూ.605 కోట్లు ఖర్చు చేశాం. అదనంగా రూ.2,000 కోట్లను బీటూబీ ఈ–కామర్స్ వ్యాపారానికై వెచ్చిస్తాం. 2021–22లో గ్రాసిమ్ రూ.1,958 కోట్లు మూలధన వ్యయం చేసింది. స్థలం దక్కించుకున్న ఆరు పెయింట్స్ ప్లాంట్లలో నాలుగుచోట్ల నిర్మాణం ప్రారంభం అయింది’ అని వాటాదార్ల సమావేశంలో వివరించారు. -
ఏబీ హెల్త్‌లో ‘అబుధాబి’ పెట్టుబడి
ముంబై: ఆదిత్య బిర్లా(ఏబీ) గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలో అబుధాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ(ఏఐడీఏ) 10 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. ఇందుకు రూ. 665 కోట్లు వెచ్చించనుంది. ఇందుకు ఏబీ హెల్త్ ఇన్సూరెన్స్ బోర్డుతోపాటు లిస్టెడ్ మాతృ సంస్థ ఏబీ క్యాపిటల్ అనుమతించాయి. తద్వారా ఆరోగ్య బీమా రంగ సంస్థ విలువను రూ. 6,650 కోట్లుగా మదింపు చేసినట్లు ఏబీ క్యాపిటల్ పేర్కొంది. ఏబీ హెల్త్ ఇన్సూరెన్స్‌ను ఆదిత్య బిర్లా గ్రూప్, దక్షిణాఫ్రికా సంస్థ మొమెంటమ్ మెట్రోపాలిటన్ హోల్డింగ్స్ సంయుక్తం (జేవీ)గా ఏర్పాటు చేశాయి. డీల్‌కు దేశీ బీమా నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏ) అనుమతించవలసి ఉంది. వాటా విక్రయం తదుపరి జేవీలో ఏబీసీఎల్కు 45.91 శాతం, మొమెంటమ్ మెట్రోకు 44.10 శాతం చొప్పున వాటాలు ఉంటాయి. ఆరోగ్య బీమాపట్ల అవగాహన పెరగడం, వృద్ధిలో ఉన్న ఆర్థిక వ్యవస్థ కారణంగా దేశీ హెల్త్ ఇన్సూరెన్స్ విభాగం భారీగా విస్తరించేందుకు వీలున్నట్లు ఏఐడీఏ పేర్కొంది. ఇక తాము అనుసరిస్తున్న ప్రత్యేక బిజినెస్ విధానాల పటిష్టతను అడియా పెట్టుబడులు సూచిస్తున్నట్లు ఏబీసీఎల్ తెలియజేసింది. హెల్త్ ఇన్సూరెన్స్‌లో వాటా విక్రయ వార్తల నేపథ్యంలో ఏబీ క్యాపిటల్ షేరు ఎన్ఎస్ఈలో 2 శాతం లాభంతో రూ. 111 వద్ద ముగిసింది. చదవండి: బంఫర్ ఆఫర్: 15 వరకు ఏ మెట్రోస్టేషన్‌కైనా రూ.30 -
హిందాల్కో లాభం రెట్టింపు
న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా గ్రూప్ మెటల్ దిగ్గజం హిందాల్కో ఇండస్ట్రీస్ గతేడాది(2021–22) చివరి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. క్యూ4(జనవరి–మార్చి)లో కన్సాలిడేటెడ్ నికర లాభం రెట్టింపై రూ. 3,851 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో కేవలం రూ. 1,928 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 40,507 కోట్ల నుంచి రూ. 55,764 కోట్లకు జంప్ చేసింది. పటిష్ట సామర్థ్య నిర్వహణ, వినియోగం తదితరాలు సహాయంతో క్యూ4లో కంపెనీ చరిత్రలోనే అత్యధిక లాభాలు ఆర్జించినట్లు హిందాల్కో ఎండీ సతీష్ పాయ్ పేర్కొన్నారు. వెరసి ప్రపంచంలోనే చౌకగా అల్యూమినియం తయారీ, అత్యధిక నిర్వహణ లాభ మార్జిన్లు ఆర్జిస్తున్న కంపెనీగా కొనసాగుతున్నట్లు తెలిపారు. -
హోల్సిమ్ ఇండియా కొనుగోలు రేసులోకి బిర్లా
ముంబై/న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా గ్రూపు సైతం స్విస్ కంపెనీ హోల్సిమ్కు చెందిన అంబుజా సిమెంట్, ఏసీసీ ఆస్తుల కొనుగోలు రేసులోకి అడుగు పెట్టింది. బిర్లా అధికారికంగా బిడ్ వేసిందని, గ్రూపు కంపెనీ అల్ట్రాటెక్ ద్వారా కొనుగోలు చేయనున్నట్టు ఈ వ్యవహారం తెలిసిన వర్గాలు తెలిపాయి. సీసీఐ అనుమతి పొందుతామన్న నమ్మకం తమకు ఉందని, కొన్ని కంపెనీల ఆస్తులను వేరు చేయడానికి కూడా సిద్ధమేనని స్పష్టం చేశాయి. అల్ట్రాటెక్‌కు దేశ సిమెంట్ రంగంలో గణనీయమైన వాటా ఉండడం తెలిసిందే. పోటీ సంస్థలైన ఏసీసీ, అంబుజా సిమెంట్ ఆస్తులు కూడా అల్ట్రాటెక్ చేతికి వెళితే గుత్తాధిపత్యానికి దారితీస్తుందా? లేదా అన్నది సీసీఐ సమీక్షించే అవకాశం నేపథ్యంలో ఇలా తెలిపాయి. ఇప్పటికే జీఎస్డబ్ల్యూ గ్రూపు, అదానీ గ్రూపు సైతం హోల్సిమ్కు చెందిన అంబుజా సిమెంట్, ఏసీసీ ఆస్తుల పట్ల ఆసక్తిగా ఉన్నట్టు వార్తలు వచ్చాయి. స్టీల్ దిగ్గజం ఆర్సెలర్ మిట్టల్ కూడా ఆసక్తిగా ఉందని, రేసులోకి చేరొచ్చని విశ్వసనీయ వర్గాలు తె లిపాయి. ] చదవండి: ఉక్రెయిన్ సంక్షోభం.. ఎగుమతుల్లో ఇండియా రికార్డ్! -
ఆదిత్య బిర్లా క్యాపిటల్ సీఈవోగా విశాఖ మూల్యే!
ముంబై: ఆర్థిక సేవల సంస్థ ఆదిత్య బిర్లా క్యాపిటల్ సీఈవోగా విశాఖ మూల్యే నియమితులయ్యారు. జూన్ 1 నుంచి ఆమె బాధ్యతలు చేపడతారు. ప్రస్తుతం ఆమె ఐసీఐసీఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా ఉన్నారు. ఆదిత్య బిర్లా క్యాపిటల్‌లో అజయ్ శ్రీనివాసన్ స్థానంలో విశాఖ నియమితులయ్యారు. ఆదిత్య బిర్లా మేనేజ్మెంట్ కార్పొరేషన్ బోర్డులో చేరనున్న తొలి మహిళా సభ్యురాలిగా కూడా ఆమేనని కంపెనీ తెలిపింది. చార్టర్డ్ అకౌంటెంట్ అయిన విశాఖ మూలేకి దాదాపు మూడు దశాబ్దాల సుదీర్ఘ కెరియర్ ఉంది. 2002లో ఐసీఐసీఐ బ్యాంక్–ఐసీఐసీఐ విలీనాన్ని పర్యవేక్షించిన టీమ్‌లో ఆమె సభ్యురాలు. అలాగే ఐసీఐసీఐ లాంబార్డ్, ఐసీఐసీఐ వెంచర్లో కూడా కీలక హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. -
మంచి విజన్ ఉన్న యువ సీఎం జగన్: కుమార మంగళం బిర్లా
సాక్షి, తూర్పుగోదావరి: గోదావరి ఒడ్డున, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అయిన ఈ ప్రాంతంలో ఈ పరిశ్రమను ప్రారంభిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. మంచి విజన్ కలిగిన యువ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి. పారిశ్రామిక రంగంలో ఆంధ్రప్రదేశ్ మరింత పురోగమించేలా ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రభుత్వంతో కలిసి అడుగులు వేస్తోంది. ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పడానికి ఆసక్తి చూపుతోంది. ఈ పరిశ్రమ మా గ్రూప్‌లో ఒక మైలు రాయిగా నిలిచిపోనుంది. మా గ్రూప్‌నకు చెందిన అల్ట్రాటెక్, ఆదిత్య ఫ్యాషన్, గార్మెంట్, ఆదిత్య బిర్లా క్యాపిటల్ (ఫైనాన్షియల్ బిజినెస్) ద్వారా రాష్ట్రంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 10 వేల మందికి ఉపాధి కలుగుతుంది. రాష్ట్రంలో విశాల తీర ప్రాంతం, మల్టీ మోడల్ కనెక్టివిటీ, మంచి సామర్థ్యం కలిగిన మానవ వనరులు, నైపుణ్యం కలిగిన కార్మికులు, ఉద్యోగులు (వర్క్‌ఫోర్స్) ఉండటానికి తోడు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించే ప్రభుత్వం.. వెరసి పెట్టుబడుల రంగంలో ఏపీ అగ్రస్థానంలో నిలుస్తుందని గట్టిగా నమ్ముతున్నా.ఔ చదవండి: (కుమార మంగళం బిర్లాకు సీఎం జగన్ ప్రత్యేక విందు) మా గ్రూప్ రసాయన విభాగం విశ్వవ్యాప్తంగా 2.4 బిలియన్ డాలర్ల ఆదాయం పొందుతోంది. భారత్, థాయిలాండ్, జర్మనీ, అమెరికాలో ప్రధానంగా పని చేస్తూ దాదాపు 80 దేశాల్లో 1000కి పైగా ఉత్పత్తులు కొనసాగిస్తోంది. ఇందులో క్లోర్ ఆల్కలీ వ్యాపారం ముఖ్యం. దేశంలోకెల్లా ఇక్కడే.. బలభద్రపురం యూనిట్లో ఎక్కువ ఉత్పత్తి (ఏటా 1.5 లక్షల టన్నులు) జరుగుతుంది. ఇక్కడ ఉత్పత్తి అయ్యే కాస్టిక్ సోడా అనేక పరిశ్రమల అవసరాలు తీర్చనుంది. ఈ ప్లాంట్‌లో స్థానికులకే ఎక్కువ అవకాశం కల్పిస్తున్నాం. వచ్చే నెలల్లో విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పన, సామాజిక అభివృద్ధి కోసం కృషి చేస్తాం. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 10 రోజుల్లోనే, 1947లో మా తాత జీడీ బిర్లాతో మొదలైన మా ప్రస్థానం.. ఇప్పుడు పలు రంగాలకు విస్తరించింది. ప్రస్తుతం గ్రాసిమ్ కంపెనీ 75వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఈ ప్లాంట్ ప్రారంభం కావడం ఆనందంగా ఉంది. ఇందుకు అన్ని విధాలా సహకరించిన సీఎం వైఎస్ జగన్‌కు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు. – కుమార మంగళం బిర్లా, చైర్మన్, ఆదిత్య బిర్లా గ్రూపు -
అల్ట్రాటెక్ లాభం 8 శాతం అప్
న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా గ్రూప్ దిగ్గజం అల్ట్రాటెక్ సిమెంట్ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 8 శాతం ఎగసి రూ. 1,710 కోట్లను అధిగమించింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 1,585 కోట్లు ఆర్జించింది. ఆదాయం 6% ఎగసి రూ. 12,985 కోట్లకు చేరింది. గత క్యూ3లో రూ. 12,262 కోట్ల టర్నోవర్ ప్రకటించింది. ఈ కాలంలో వ్యయాలు 12% పెరిగి రూ. 11,422 కోట్లను తాకాయి. బిర్లా వైట్..: బిర్లా వైట్ బ్రాండు వైట్ సిమెంట్ ఉత్పత్తి సామర్థ్య విస్తరణ, ఆధునీకరణకు రూ. 965 కోట్ల పెట్టుబడులను వెచ్చించనున్నట్లు అల్ట్రాటెక్ వెల్లడించింది. తద్వారా ప్రస్తుత 6.5 లక్షల టన్నుల వార్షిక సామర్థ్యాన్ని దశలవారీగా 12.53 ఎల్టీపీఏకు చేర్చేందుకు తాజా సమావేశంలో బోర్డు అనుమతించినట్లు పేర్కొంది. 1.2 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యం అందుకోవడంతో భారీ మౌలిక ప్రాజెక్టుల ద్వారా బల్క్ సిమెంట్ అమ్మకాలను మరింత పెంచుకోగలమని కంపెనీ అభిప్రాయపడింది. ఇక యూపీలో బారా గ్రైండింగ్ లైన్–2 యూనిట్ ప్రారంభంతో సిమెంట్ ఉత్పాదక సామ ర్థ్యం 114.55 ఎంటీపీఏను తాకినట్లు తెలిపింది. రుణ చెల్లింపులు..: 2021 అక్టోబర్‌లో అమ్మకాలు ఊపందుకున్నప్పటికీ ఎన్సీఆర్లో నిర్మాణాలపై నిషేధం, వర్షాలు, దీపావళి సెలవులు తదితర అంశాలు తదుపరి డిమాండును దెబ్బతీసినట్లు అల్ట్రాటెక్ వివరించింది. వెరసి క్యూ3లో కన్సాలిడేటెడ్ అమ్మకాలు 3 శాతం నీరసించి 23.13 మిలియన్ మెట్రిక్ టన్నులకు పరిమితమయ్యాయి. క్యూ3లో అంతర్గత వనరుల ద్వారా రూ. 3,459 కోట్ల రుణాలను తిరిగి చెల్లించినట్లు వెల్లడించింది. ఫలితాల నేపథ్యంలో అల్ట్రాటెక్ సిమెంట్ షేరు బీఎస్ఈలో దాదాపు 3 శాతం ఎగసి రూ. 7,868 వద్ద ముగిసింది. -
CM Jagan: 'ఆదిత్య బిర్లా కంపెనీ' ద్వారా తొలిదశలో 2 వేల మందికి ఉద్యోగాలు
-
అ్రల్టాటెక్ లాభం రూ. 1,310 కోట్లు
న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా గ్రూప్ దిగ్గజం అ్రల్టాటెక్ సిమెంట్ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) రెండో త్రైమాసికంలో అంతంతమాత్ర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెపె్టంబర్(క్యూ2)లో యథాతథంగా రూ. 1,310 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇందుకు పెట్ కోక్ ధరలు భారీగా పెరగడం ప్రభావం చూపింది. అయితే మొత్తం ఆదాయం 16 శాతం ఎగసి రూ. 12,017 కోట్లకు చేరింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 10,387 కోట్ల ఆదాయం నమోదైంది. ఇక ఈ క్యూ2లో మొత్తం వ్యయాలు 17 శాతం పెరిగి రూ. 10,209 కోట్లను అధిగమించాయి. కోల్, పెట్ కోక్ ధరలు రెట్టింపుకావడంతో ఇంధన వ్యయాలు 17 శాతం అధికమైనట్లు కంపెనీ తెలియజేసింది. అయితే విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోవడం, నిర్వహణ సామర్థ్యంపై దృష్టిపెట్టడం ద్వారా కొంతమేర వ్యయాలను అదుపు చేసినట్లు తెలియజేసింది. క్యూ3(అక్టోబర్–డిసెంబర్)లో మధ్యప్రదేశ్‌లోని బిచర్‌పూర్ కోల్ బ్లాకులో మైనింగ్ కార్యకలాపాలు ప్రారంభంకాగలవని కంపెనీ అంచనా వేస్తోంది. తద్వారా బొగ్గు కొనుగోళ్లపై ఆధారపడటాన్ని తగ్గించుకునే యోచనలో ఉంది. అమ్మకాలు అప్..: క్యూ2లో సిమెంట్ అమ్మకాలు 8% పుంజుకుని 21.64 మిలియన్ టన్నులను తాకాయి. ఈ అక్టోబర్‌లో 1.2 ఎంటీపీఏ సిమెంట్ సామర్థ్యం అందుబాటులోకి వచ్చినట్లు కంపెనీ వెల్లడించింది. బీహార్‌లోని పాట లీపుత్ర సిమెంట్ వర్క్స్, పశి్చమ బెంగాల్‌లోని డాంకునీ సిమెంట్ వర్క్స్ యూనిట్లు ప్రారంభమైనట్లు పేర్కొంది. ఫలితాల నేపథ్యంలో అ్రల్టాటెక్ షేరు ఎన్ఎస్ఈలో యథాతథంగా రూ. 7,395 వద్ద ముగిసింది. -
ఆదిత్య బిర్లాసన్లైఫ్ నుంచి నిఫ్టీ హెల్త్‌కేర్ ఈటీఎఫ్
ముంబై: ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ మ్యూచువల్ ఫండ్.. నూతనంగా ‘ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ నిఫ్టీ హెల్త్‌కేర్ ఈటీఎఫ్’ పథకాన్ని ప్రారంభించింది. ఇది ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ పథకం. నిఫ్టీ హెల్త్‌కేర్ టీఆర్ఐ ఇండెక్స్‌ను అనుసరించి పెట్టుబడులు పెడుతుంది. ఈ నెల 8న మొదలైన ఈ పథకంలో 20వ తేదీ వరకు ఇన్వెస్ట్ చేసుకునేందుకు అవకాశం ఉంది. ఆరోగ్య సంరక్షణ (హెల్త్‌కేర్) రంగంలో ఉన్న అవకాశాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో పెట్టుబడులను వృద్ధి చేసే విధంగా ఈ పథకం పనిచేస్తుంది. నిఫ్టీ హెల్త్‌కేర్ ఇండెక్స్‌లో 20 వరకు కంపెనీలున్నాయి. వీటిల్లో ఈ పథకం ఇన్వెస్ట్ చేస్తుంది. ఈ సందర్భంగా ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ ఏఎంసీ ఎండీ, సీఈవో ఏ.బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ.. ‘‘ఆదాయం, ఎగుమతులు, ఉపాధి కల్పన పరంగా హెల్త్‌కేర్ కూడా దేశంలో ఒకానొక ముఖ్య మైన రంగంగా అవతరించింది. ఈ వృద్ధి లిస్టెడ్ కంపెనీల్లోనూ ప్రతిఫలించాల్సి ఉంది. ఇది ప్యాసివ్ పథకం. కనుక వ్యయాలు తక్కువగా ఉంటాయి. ఈ రంగం వృద్ధిలో పాల్గొనేందుకు ఈ పథకం ఒక చక్కని మార్గం అవుతుంది’’ అని చెప్పారు. -
కరోనా 3వ వేవ్ : బ్యాంక్ ఆఫ్ అమెరికా కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: వ్యాక్సినేషన్ వేగవంతంతోనే ఎకానమీలో పురోగతి సాధ్యమని ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా పేర్కొన్నారు. రెండవ వేవ్ కేసులు తగ్గినప్పటికీ, పలు రంగాలపై దాని తీవ్ర ప్రభావం కొనసాగుతోందని అన్నారు. ఈ పరిస్థితుల్లో 2021–22 ఆర్థిక సంవత్సరం వృద్ధిపై అంచనాలను పునః సమీక్షించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. (వృద్ధి రేటును ప్రభుత్వం 11 శాతం అంచనావేస్తుండగా, మూడీస్, ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్‌లు దాదాపు దీనికి ఒక అంకెకే పరిమితం చేస్తున్నాయి) అయితే దీర్ఘకాలంలో చూస్తే భారత్ ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉన్నాయని పేర్కొన్నారు. గ్రూప్ సంస్థ– ఆల్ట్రాటెక్ సిమెంట్ వార్షిక నివేదికలో ప్రముఖ పారిశ్రామికవేత్త వివరించిన విశ్లేషణాంశాల్లో ముఖ్యమైనవి... ♦మొదటివేవ్‌తో పోల్చితే ఎకానమీకి రెండవవేవ్లో స్వల్ప నష్టం మాత్రమే సంభవించింది. వ్యాక్సినేషన్ పురోగతితో రవాణా, ఆర్థిక క్రియాశీలత మెరుగుపడుతుంది. ♦రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సరళతర ఆర్థిక విధానాలు, ప్రభుత్వ నుంచి పెరుగుతున్న మూలధన వ్యయాలు వృద్ధి రికవరీకి మద్దతునిస్తాయి. ♦దీనికితోడు ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, ఆస్తుల అమ్మకం, నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్ అమలు, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం, కొత్త కార్మిక చట్టం పెట్టుబడులకు తద్వారా దీర్ఘకాలంలో వృద్ధికి దోహదపడే అంశాలు. ♦ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య వృద్ధి ధోరణి భారత్ ఎగుమతులకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది. దేశ వృద్ధి బాటలో ఇది అదనపు బలం. ♦దేశంలో ఆరోగ్య రంగానికి సంబంధించి మౌలిక సదుపాయాలు మరింత పెరగాలి. ♦అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ 2021లో ప్రపంచ వృద్ధిని 6 శాతంగా అంచనావేస్తోంది. అయితే వివిధ దేశాల్లో రెండవ, మూడవ వేవ్స్ సవాళ్లు పటిష్ట వృద్ధి అవుట్‌లుక్‌పై సందేహాలను వ్యక్తం చేస్తున్నాయి. కోవిడ్–19 విసిరిన సవాళ్ల నేపథ్యంలో వృద్ధి రికవరీ తీవ్ర ఒడిదుడుకులకు గురవుతోంది. ♦కరోనా సవాళ్లు కొనసాగినప్పటికీ, మన గ్రూప్ సంస్థల ఉద్యోగులు వ్యాపారం, కస్టమర్ సేవలపై తగిన విధమైన దృష్టి సారించారు. సిమెంట్ పరిశ్రమకు మెరుగైన అవకాశాలు ప్రభుత్వ వృద్ధి కార్యకలాపాలు తోడవడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సిమెంట్ పరిశ్రమకు మెరుగైన అవకాశాలు ఉంటాయని అల్ట్రాటెక్ సిమెంట్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా అన్నారు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రభుత్వం ఖర్చు చేయడం, మెరుగైన బడ్జెట్ కేటాయింపులతో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) వంటి సరసమైన గృహ నిర్మాణ పథకాలు సిమెంట్ పరిశ్రమ వృద్ధిని నడిపిస్తాయని వాటాదారులను ఉద్దేశించి తెలిపారు. ‘గృహ, మౌలిక సదుపాయాల రంగంతో సిమెంట్ డిమాండ్ ముడిపడి ఉంది. పరిమాణం పరంగా ఈ పరిశ్రమ వృద్ధి మార్గంలో ఉంది. ప్రభుత్వ లక్ష్యమైన 2022 నాటికి అందరికీ గృహాలు, నిర్మాణంలో ఉన్న పెద్ద మౌలిక సదుపాయాల ప్రాజెక్టులచే ఈ పరిశ్రమ ప్రేరణ పొందింది. 2020–21లో సిమెంట్ రంగం 10–12 శాతం తిరోగమన వృద్ధి నమోదు చేసింది. అయితే ఆర్థిక సంవత్సరం రెండవ అర్ధ భాగంలో త్వరగా కోలుకునే సంకేతాలను చూపించింది. గతేడాది మార్చి–ఏప్రిల్ లాక్డౌన్ అన్ని తయారీ రంగాలకు భారీ సవాళ్లను విసిరింది. మహమ్మారి ఉన్నప్పటికీ గ్రామీణ, చిన్న పట్టణాలు, రిటైల్‌లో సిమెంట్ వినియోగం బలమైన వృద్ధి కనబరిచింది’ అని ఆయన వెల్లడించారు. ఆసియా, పసిఫిక్‌లో డెల్టా భయాలు: మూడీస్ భారత్ ఎకానమీపై కోవిడ్–19 సెకండ్‌వేవ్ సవాళ్లు మరికొంతకాలం కొనసాగుతాయని సోమవారం విడుదల చేసిన ఒక నివేదికలో రేటింగ్ దిగ్గజం– మూడీస్ విశ్లేషించింది. ‘ఆసియా పసిఫిక్ ఎకనమిక్ అవుట్‌లుక్: ది డెల్టా రోడ్‌బ్లాక్’ అన్న శీర్షికన విడుదల చేసిన నివేదికలో కొన్ని ముఖ్యాంశాలను క్లుప్తంగా చూస్తే... సామాజిక దూరం అన్న అంశం ప్రస్తుత త్రైమాసికం (జూలై–ఆగస్టు–సెప్టెంబర్)పై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇక రికవరీ ప్రారంభమయ్యేది ఈ ఏడాది చివరికేనని భావిస్తున్నాం. డెల్టా వేరియంట్ ప్రస్తుతం ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో భయాందోళనలకు గురిచేస్తోంది. 2020తో పోల్చితే ఎకానమీ ఇప్పుడు కొంత తక్కువగా నష్టపోవడం కొంతలో కొంత ఊరట. భారత్ నుంచి ఎగుమతుల విలువ పెరుగుతోంది కానీ, దీనికి అధిక కమోడిటీ ధరలు, గత ఏడాది లో బేస్ ఎఫెక్ట్ కారణం. భారత్‌లో సెకండ్‌వేవ్ తగ్గుతున్నప్పటికీ, చిన్న సంస్థలు కోలుకోడానికి చాలా సమయం పడుతుంది. ఎగుమతులూ ఇప్పుడిప్పుడే నిలద్రొక్కుకుంటున్నాయి. వ్యాక్సినేషన్ మరింత వేగవంతం కావాల్సి ఉంది. 5.5 శాతం వరకూ ప్రపంచ వృద్ధి రేటు.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ (జీడీపీ) వృద్ధి రేటు 2021లో 5 నుంచి 5.5 శాతం శ్రేణిలో ఉంటుందన్నది తాజా అంచనా. ప్రపంచ వాణిజ్యం కూడా గణనీయంగా మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రపంచ పారిశ్రామిక ఉత్పత్తి కూడా పెరుగుతోంది. గ్లోబల్ సప్లై చైన్స్ యథాతథ స్థాయికి చేరుతున్నాయి. మూడవవేవ్ సవాళ్లు తీవ్రం కాకపోతే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తిరిగి వేగంగా పురోగమిస్తుంది. 3వ వేవ్ వస్తే కష్టమే: బ్యాంక్ ఆఫ్ అమెరికా ముంబై: భారత్‌లో కోవిడ్–19 మూడవ వేవ్ సవాళ్లు తీవ్రమయితే, ఎకానమీలో సాధారణ పరిస్థితులు నెలకొనడానికి 2022 నాల్గవ త్రైమాసికం వరకూ సమయం పడుతుందని వా ల్ స్ట్రీట్ బ్రోకరేజ్ సంస్థ– బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ విశ్లేషించింది. ఈ పరిస్థితుల్లో 2022 తొలి నెలల వరకూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండి యా (ఆర్బీఐ) బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను యథాతథంగా 4 శాతంగానే కొనసాగించే వీలుందని వివరించింది. అప్పటికి సాధారణ పరిస్థితులు నెలకొంటే 2023 డిసెంబర్ నాటికి రెపో రేటు 5.5 శాతానికి పెరిగే అవకాశం ఉంటుందని పేర్కొం ది. మూడవ వేవ్ భయాలను పక్కనబెట్టి, ప్రస్తు త పరిస్థితు లకు అనుగుణంగా పరిశీలిస్తే, వృద్ధి, ద్రవ్యో ల్బణం లక్ష్యాల నెరవేరుతాయన్న అభిప్రాయా న్ని వ్యక్తం చేసింది. సరఫరాల సమస్యలను పరి ష్కంచడం ద్వారా రిటైల్ ద్రవ్యోల్బణం కట్టడిలో ఉంచడానికి (2 నుంచి 6 శాతం శ్రేణిలో) కేంద్రం తగిన చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నట్లు బ్యాంక్ ఆఫ్ అమెరికా నివేదిక విశ్లేషించింది. క్రూడ్ కష్టాలు... అయితే అంతర్జాతీయంగా పెరుగుదల ధోరణిలో ఉన్న క్రూడ్ ధరలు ఎకానమీకి కొంత ఇబ్బందిని సృష్టించే వీలుందని అంచనావేసింది. ‘‘తాజా పరిస్థితుల ప్రకారం 2022 రెండవ త్రైమాసికం నాటికి పాలసీ విధానం సరళతరత నుంచి తటస్థ స్థితికి చేరుకుంటుంది. 2022 జూన్‌లో లేదా ఆగస్టులో రెపో రేటు పెంపు ప్రారంభం కావచ్చు. 2023 మార్చి నాటికి 5 శాతం, 2023 డిసెంబర్ నాటికి 5.5 శాతానికి పెరిగే అవకాశం ఉంది’’ అని నివేదిక విశ్లేషించింది. -
హెల్త్ ఇన్సూరెన్స్ ఆఫర్లు.. క్యాలరీలు కరిగిస్తే డిస్కౌంట్
ముంబై: ఆరోగ్యకరమైన, చురుకైన జీవనవిధానాన్ని అనుసరించే పాలసీదారులను ఆరోగ్య బీమా కంపెనీలు ప్రోత్సహిస్తున్నాయి. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల రెన్యువల్‌పై 80 నుంచి 100 శాతం వరకు తగ్గింపుతోపాటు ఇతర ఆఫర్లను కూడా అందిస్తున్నాయి. సాధారణంగా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఒక పాలసీ ఏడాదిలో ఎటువంటి క్లెయిమ్ లేకపోతే మరుసటి సంవత్సరానికి రెన్యువల్‌పై 25 శాతం నుంచి 50 శాతం వరకు సమ్ అష్యూర్డ్ (బీమా కవరేజీ)ను పెంచే ఆప్షన్‌ను ఇస్తుంటాయి. కానీ, ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ ‘యాక్టివ్ హెల్త్’ ప్లాన్‌లో వరుసగా రెండేళ్ల పాటు ఎటువంటి క్లెయిమ్ లేకపోతే మూడో ఏడాది రెన్యువల్ సమయంలో నూరు శాతం డిస్కౌంట్‌ను ఇస్తోంది. మూడో ఏడాది ప్రీమియం చెల్లింపుల్లో దాన్ని సర్దుబాటు చేసుకోవచ్చు. తగినన్ని యాక్టివ్ డేజ్‌ను సమకూర్చుకున్న కస్టమర్లకే ఆదిత్య బిర్లా ఈ ఆఫర్ ఇస్తోంది. ఒక యాక్టివ్డే అంటే రోజులో 10,000 అడుగులు వేయడం (300 క్యాలరీలను కరిగించుకోవడం). అంటే క్రమం తప్పకుండా నడు స్తూ, ఆరోగ్య రక్షణ చర్యలను తీసుకున్న వారికి రివార్డులతో ప్రతిఫలాన్ని అందిస్తోంది. యాక్టివ్ హెల్త్ యాప్ ద్వారా కస్టమర్ల ఆరోగ్యకరమైన జీవనశైలిని కంపెనీ నమోదు చేస్తుంటుంది. ఆరోగ్యకరమైన జీవనశైలితో క్లెయిమ్‌లు తగ్గుతాయి. కనుక బీమా సంస్థలపై ఆ మేరకు భారం తగ్గుతుంది. మొదటి అడుగు మాదే.. పాలసీదారులు చురుగ్గా, ఆరోగ్యకరంగా ఉండేందుకు ప్రోత్సహిస్తున్నట్టు ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూ రెన్స్ సీఈవో మయాంక్ భత్వాల్ తెలిపారు. నూరు శాతం డిస్కౌంట్ ఇవ్వడం పరిశ్రమలో మొదటిసారిగా పేర్కొన్నారు. ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చే రివార్డులను ప్రీమియం చెల్లింపు ల్లో సర్దుబాటు చేసుకోవడం లేదా మందుల కొనుగోలు లేదా వ్యాధి నిర్ధారణ పరీక్షలకు చెల్లింపుల కోసం వినియోగించుకోవచ్చు. లేదా వరుసగా రెండేళ్లపాటు క్లెయిమ్‌లు లేకపోతే మూడో ఏడాది నూరు శాతం బీమా కవరేజీని పెంచుకునే ఆప్షన్‌ను కూడా కంపెనీ ఇస్తోంది. ఫ్యూచర్ జనరాలి సైతం.. ఫ్యూచర్ జనరాలి సంస్థ ఈ నెలలోనే ఈ తరహా ఫీచర్‌తో ‘హెల్త్ సూపర్ సేవర్’ ప్లాన్‌ను ప్రారంభించింది. ఇందులో 1ఎక్స్, 2ఎక్స్ పేరుతో రెండు ఆప్షన్లు ఉన్నాయి. 1ఎక్స్‌లో క్రితం ఏడాది పాలసీదారు నుంచి ఎటువంటి క్లెయిమ్ లేకపోతే, మరుసటి ఏడాది రెన్యువల్ ప్రీమియంపై 80 శాతం డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. 2ఎక్స్‌లో క్రితం రెండు సంవత్సరాల్లోనూ క్లెయిమ్‌లే లేనట్టయితే.. తదుపరి రెండు సంవత్సరాల ప్రీమియంలో 80 శాతం తగ్గింపు ఇస్తోంది. -
రూ.1,500 కోట్లతో బిట్స్ మేనేజ్మెంట్ స్కూల్
న్యూఢిల్లీ: బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) పిలానీ.. బిట్స్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ (బీఐటీఎస్‌ఓఎం)ను ప్రారంభించనుంది. ఈ ఏడాది జూలైలో 120 మంది విద్యార్థులతో తొలి బ్యాచ్ మొదలుకానుంది. సెంట్రల్ ముంబైలోని పోవై తాత్కాలిక క్యాంపస్‌లో బోధనా తరగతులుంటాయి. రూ.1,500 కోట్ల పెట్టుబడులతో ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో రూ.60 ఎకరాల్లో శాశ్వత క్యాంపస్‌ను అభివృద్ధి చేయనున్నారు. ఇది 2024 నాటికి సిద్ధమవుతుందని బిట్స్ పిలానీ చాన్సలర్ కుమార్ మంగళం బిర్లా తెలిపారు. రెండేళ్ల రెసిడెన్షియల్ బిజినెస్ డిగ్రీ ప్రోగ్రామ్‌ను అందించనున్నారు. కోర్స్ ఫీజు రూ. 24 లక్షలు. న్యూయార్క్‌లోని ఎన్‌వైయూ స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్, వార్టన్ స్కూల్ ఆఫ్ యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా, సింగపూర్ మేనేజ్ మెంట్ యూనివర్శిటీ, కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ వంటి అగ్రశ్రేణి బిజినెస్ స్కూల్స్ ప్రొఫెసర్లతో విద్యా బోధన ఉంటుంది. ‘‘ఎం బీఏ కంటెంట్, డెలివరీ ఫార్మాట్స్‌ను మార్చాల్సిన అవసరం ఉంది. టెక్నాలజీ ద్వారా వ్యాపార నమూనాలు, విధానాలు ఎలా మారుతున్నాయో, కొనుగోలుదారులు అవసరాలకు తగ్గ డిజైన్స్ ఎలా పరిష్కరించబడుతున్నాయో అలాంటి మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ ప్రవేశపెట్టాల్సిన సమయం ఆసన్నమైందని’’ కుమార్ మంగళం పేర్కొన్నారు. -
మమ్మల్ని బయటకు గెంటేశారు: అనన్య బిర్లా
వాషింగ్టన్: ‘‘స్కోపారెస్టారెంట్ నిర్వాహకులు నన్ను, నా కుటుంబాన్ని బయటకు గెంటేశారు. జాతి వివక్ష ప్రదర్శించారు. ఇది నిజంగా విషాదకరం. కస్టమర్ల పట్ల ఇలాంటి వైఖరి సరైంది కాదు. మీ రెస్టారెంటులో భోజనం చేయడానికి మేం మూడు గంటలు ఎదురుచూశాం. కానీ, మీ వెయిటర్ జోషువా సిల్వర్మాన్ మా అమ్మతో అత్యంత దురుసుగా ప్రవర్తించారు. జాతి వివక్షపూరిత వ్యాఖ్యలు చేశారు. ఇది అస్సలు సరైంది కాదు. వెరీ రేసిస్ట్’’ అంటూ సింగర్, బిర్లా కుటుంబ వారసురాలు అనన్య బిర్లా అమెరికన్ రెస్టారెంటులో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి నెటిజన్లతో పంచుకున్నారు. తమ పట్ల జాతి వివక్ష చూపిన రెస్టారెంటు నిర్వాహకులకు సోషల్ మీడియా వేదికగా చురకలు అంటించారు. (చదవండి: ట్రోలింగ్: ‘సంజూ గ్రేట్.. పంత్ నువ్వు హల్వా, పూరీ తిను’ ) కాగా ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్, బిలియనీర్ కుమార్ మంగళం బిర్లా కూతురైన అనన్య బిర్లా గాయనిగా, ఆర్టిస్టుగా తనకంటూ సొంత గుర్తింపు దక్కించుకుంటున్న విషయం తెలిసిందే. శనివారం ఆమె తన తల్లి నీరజా బిర్లా, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి కాలిఫోర్నియాలోని ప్రముఖ ఇటాలియన్- అమెరికన్ రెస్టారెంటుకు వెళ్లారు. ఈ క్రమంలో భోజనం ఆర్డర్ చేసిన తమను, గంటల కొద్దీ వెయిట్ చేయించారని, కస్టమర్లన్న కనీస మర్యాద లేకుండా అనుచితంగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెఫ్ ఆంటోనియా లొఫాసో నేతృత్వంలోని ఇటాలియన్ మూలాలున్న సదరు రెస్టారెంటు నిర్వాహకుల తీరును నెటిజన్ల దృష్టికి తీసుకువచ్చారు. ఇక కూతురి ట్వీట్‌పై స్పందించిన నీరజా బిర్లా సైతం.. ‘‘ఇది నిజంగా షాకింగ్‌గా ఉంది.. అత్యంత అనుచితంగా ప్రవర్తించారు. కస్టమర్లతో ఇలా వ్యవహరించేందుకు మీకు ఎలాంటి హక్కు లేదు’’అంటూ రెస్టారెంట్లు నిర్వాహకుల తీరును ఎండగట్టారు. అనన్య సోదరుడు ఆర్యమన్ బిర్లా కూడా ఈ విషయంపై స్పందించాడు. గతంలో తమకు ఎన్నడూ ఇలాంటి రేసిస్ట్ అనుభవాలు ఎదురుకాలేదని, జాతి వివక్ష ఉందన్న విషయాన్ని ఇంకా నమ్మలేకపోతున్నానని చెప్పుకొచ్చాడు. This restaurant @ScopaRestaurant literally threw my family and I, out of their premises. So racist. So sad. You really need to treat your customers right. Very racist. This is not okay. — Ananya Birla (@ananya_birla) October 24, 2020 We waited for 3 hours to eat at your restaurant. @chefantonia Your waiter Joshua Silverman was extremely rude to my mother, bordering racist. This isn’t okay. — Ananya Birla (@ananya_birla) October 24, 2020 Very shocking ..absolutely ridiculous behaviour by @ScopaRestaurant . You have no right to treat any of your customers like this. https://t.co/szUkdxAgNh — Neerja Birla (@NeerjaBirla) October 24, 2020 I have never experienced anything of this sort. Racism exists and is real. Unbelievable. @ScopaRestaurant https://t.co/FU0NE8e7Qu — Aryaman Birla (@AryamanBirla) October 24, 2020 -
ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌లో ఫ్లిప్‌కార్ట్‌కు వాటాలు
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తాజాగా ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్‌లో (ఏబీఎఫ్ఆర్ఎల్) 7.8 శాతం వాటాలు కొనుగోలు చేయనుంది. ఇందుకోసం రూ. 1,500 కోట్లు వెచ్చించనుంది. ఈ డీల్ ప్రకారం ఫ్లిప్‌కార్ట్‌కు 7.8 శాతం వాటాలు దక్కే విధంగా ప్రిఫరెన్స్ షేర్లు జారీ చేయనున్నట్లు ఆదిత్య బిర్లా ఫ్యాషన్ తెలిపింది. షేరు ఒక్కింటి ధర రూ. 205గా ఉంటుందని పేర్కొంది. గురువారం నాటి షేరు ముగింపు ధర రూ. 153.4తో పోలిస్తే ఇది 33.6 శాతం అధికం. షేర్ల కేటాయింపు తర్వాత ఆదిత్య బిర్లా ఫ్యాషన్ ప్రస్తుత ప్రమోటర్ల వాటా 55.1 శాతంగా ఉంటుంది. ‘భారత్‌లో దుస్తుల పరిశ్రమ వచ్చే అయిదేళ్లలో 100 బిలియన్ డాలర్లకు చేరుతుంది. భవిష్యత్ అవకాశాలపై గల ధీమాకు ఈ డీల్ నిదర్శనం. పటిష్టమైన ఫండమెంటల్స్ ఊతంతో దేశీయంగా ఫ్యాషన్ రిటైల్ గణనీయ వృద్ధి సాధించగలదు‘ అని ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా తెలిపారు. డీల్ ద్వారా వచ్చే నిధులను వ్యాపార వృద్ధిని వేగవంతం చేసుకునేందుకు ఉపయోగించుకోవాలని ఏబీఎఫ్ఆర్ఎల్ వెల్లడించింది. ‘నాణ్యత, విలువను కోరుకునే దేశీ వినియోగదారుల డిమాండ్లకు అనుగుణంగా సేవలు అందించేందుకు తోడ్పడే కొత్త భాగస్వామ్యాలను నిర్మించుకోవడంపై ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ ప్రధానంగా దృష్టి పెడుతోంది‘ అని ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి తెలిపారు. 3,000 పైగా స్టోర్స్..: భారీ మార్జిన్లు ఉండే ఫ్యాషన్ వ్యాపారంలో స్థానం దక్కించుకునేందుకు ఫ్లిప్‌కార్ట్‌కు ఈ ఒప్పందం ఉపయోగపడగలదని పరిశ్రమవర్గాలు అభిప్రాయపడ్డాయి. ఏబీఎఫ్ఆర్ఎల్ పోర్ట్‌ఫోలియోలో పలు అంతర్జాతీయ, దేశీయ బ్రాండ్లు ఉండటం ఫ్లిప్‌కార్ట్‌కు లాభించనుంది. అమెజాన్‌డాట్‌కామ్, రిలయన్స్‌కి గట్టి పోటీనిచ్చేందుకు ఇది ఉపయోగపడనుంది. ఇక, మార్చి 31 నాటికి దాదాపు రూ. 2,776 కోట్ల మేర ఉన్న రుణభారాన్ని తగ్గించుకోవడానికి ఏబీఎఫ్ఆర్ఎల్కు కూడా ఈ డీల్ ఉపయోగకరంగా ఉండనుంది. ఫరెవర్ 21, అమెరికన్ ఈగిల్ అవుట్‌ఫిట్టర్స్, రాల్ఫ్ లారెన్ వంటి అంతర్జాతీయ బ్రాండ్స్ విక్రయానికి అదిత్య బిర్లా ఫ్యాషన్‌కు హక్కులు ఉన్నాయి. ప్యాంటలూన్స్తో పాటు దేశవ్యాప్తంగా 3,000 పైచిలుకు స్టోర్స్ నెట్వర్క్ ఉంది. సుమారు 23,700 పైగా మల్టీబ్రాండ్ అవుట్‌లెట్స్ ద్వారా కూడా విక్రయాలు జరుపుతోంది. తమ వృద్ధి ప్రణాళికలకు ఈ డీల్ ఉపయోగపడుతుందని ఏబీఎఫ్ఆర్ఎల్ ఎండీ ఆశీష్ దీక్షిత్ తెలిపారు. శుక్రవారం బీఎస్ఈలో ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రిటైల్ షేరు సుమారు 8 శాతం పెరిగి రూ.165 వద్ద క్లోజయ్యింది. -
ఆదిత్య బిర్లా గ్రూపు విరాళం రూ.500 కోట్లు
ముంబై: ఆదిత్య బిర్లా గ్రూపు కరోనా వైరస్ మహమ్మారిని తరిమికొట్టేందుకు ముందుకు వచ్చింది. పీఎంకేర్స్ పేరిట కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక నిధికి రూ.400 కోట్లను ఆదిత్య బిర్లా గ్రూపు ప్రకటించింది. అలాగే, రూ.50 కోట్లను కరోనా వైరస్ నివారణ చర్యల కోసం ఏర్పాటైన ఫిక్కీ–ఆదిత్య బిర్లా సీఎస్ఆర్ సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్‌కు, మరో రూ.50 కోట్లను వెంటిలేటర్లు, మాస్క్‌లు, రక్షణ పరికరాల సరఫరాకు ఖర్చు చేయనున్నట్టు గ్రూపు పేర్కొంది. -
పెద్దలకు పరిపూర్ణ రక్షణ
మన దేశ జనాభాలో వృద్ధులు (సీనియర్ సిటిజన్లు) 2015 నాటికి 8 శాతానికి చేరారు. 2050 నాటికి 19 శాతం వృద్ధులే ఉంటారని అంచనా. ప్రతీ ఇంటిలోనూ 60 ఏళ్లు నిండిన వయసు వారు ఆ కుటుంబానికి ఓ పెద్ద ఆస్తి వంటివారే. కుటుంబం కోసం అప్పటి వరకు వారు ఎంతో పాటు పడి, ఎంతో శ్రమకోర్చి ఉంటారు. కానీ, వృద్ధాప్యంలో వారిని చుట్టుముట్టే ఆరోగ్య, జీవనశైలి సమస్యలెన్నో. వీటి కోసం చేయాల్సిన ఖర్చు కొన్ని సందర్భాల్లో భారీగానూ ఉంటుంది. వయసుతోపాటు పెరిగే ఆరోగ్య సంరక్షణ వ్యయాలకు ప్రతీ కుటుంబం తగినంత సన్నద్ధతతో ఉండాలి. అయితే, సీనియర్ సిటిజన్లు, వారి పిల్లలు హెల్త్ కవరేజీ విషయంలో తగినంత రక్షణతో లేనట్టు ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ ఇటీవల నిర్వహించిన సర్వే ద్వారా తెలిసింది. ‘‘ఉమ్మడి కుటుంబాలు కాస్తా ఏక కుటుంబంగా మారుతున్న రోజుల్లో.. పిల్లలు పెద్ద పట్టణాలకు, విదేశాలకు జీవనోపాధి కోసం తరలిపోతుండడంతో పెద్దల జీవనం, వారి సంరక్షణ సవాలుగా మారుతున్నాయి’’ అని ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ సీఈవో మయాంక్ భత్వాల్ పేర్కొన్నారు. ఈ క్రమంలో వృద్ధాప్యంలో సంక్షేమం, ఆరోగ్యం కోసం అవసరమైన చర్యలను ముందు నుంచే తీసుకోవడం శ్రేయస్కరం. ఇందుకు వైద్య బీమాతో పాటు ఇతరత్రా తీసుకోతగిన చర్యలు సూచించే కథనమే ఇది. 50 ఏళ్లకు వచ్చిన వారికి పదవీ విరమణ తీసుకునేందుకు మరో 10 ఏళ్ల వరకు సమయం మిగిలి ఉంటుంది. ఈ కాలాన్ని వైద్య అత్యవసర నిధి సమకూర్చుకునేందుకు వినియోగించుకోవాలి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో సిప్ రూపంలో పదేళ్ల పాటు ఇన్వెస్ట్ చేయడం ద్వారా అవసరమైనంత నిధిని సమకూర్చుకోవచ్చని సెబీ రిజిస్టర్డ్ పెట్టుబడి సలహాదారులు రేణు మహేశ్వరి సూచించారు. హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ తన వంతుగా రోగి చెల్లించాల్సి వస్తే అందుకోసం వైద్య అత్యవసర నిధి అక్కరకు వస్తుంది. అవుట్ పేషెంట్‌గా తీసుకునే చికిత్సలకు అన్ని పాలసీల్లోనూ కవరేజీ ఉండకపోవచ్చు. కనుక అవుట్ పేషెంట్ వైద్య సేవలకు చేసే చెల్లింపులు, ఆస్పత్రికి రాను, పోను చార్జీలు ఇవన్నీ రోగి తన పాకెట్ నుంచే పెట్టుకోవాల్సి రావచ్చు. ఇంటి నుంచే నర్సింగ్, చికిత్సల సేవలను పొందాల్సి వస్తే అయ్యే వ్యయాలు ఎక్కువగానే ఉంటాయి. అత్యవసర నిధి ఉంటే దాన్నుంచి వీటికి చెల్లింపులు చేసుకోవచ్చు. ఒక్కసారి అత్యవసర నిధి సిద్ధం చేసుకున్న తర్వాత.. మొత్తాన్ని ఒకే చోట కాకుండా.. సేవింగ్స్ డిపాజిట్, లిక్విడ్ ఫండ్స్, అల్ట్రా షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్ రూపంలో ఉంచుకోవాలి. గ్రూపు హెల్త్ ఇన్సూరెన్స్‌లో పెద్దలకు చోటు ఉద్యోగం చేసే చోట గ్రూపు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీని సంస్థ ఆఫర్ చేస్తుంటుంది. ఇందులో తమ తల్లిదండ్రుల పేర్లను కూడా యాడ్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే సాధారణంగా గ్రూప్ హెల్త్ కవరేజీలో ప్రీమియం కొంచెం తక్కువగా ఉంటుంది. ముందు నుంచే తల్లిదండ్రులను యాడ్ చేస్తే ప్రీమియం భారం తగ్గించుకోవచ్చు. దీనికి తోడు తల్లిదండ్రులకు విడిగా హెల్త్ కవరేజీ కూడా తీసుకోవాలి. ‘‘చాలా సంస్థలు తల్లిదండ్రులకు దీర్ఘకాలం కవరేజీని ఆఫర్ చేయడం లేదు. అందుకే ముందు తల్లిదండ్రులను గ్రూపు హెల్త్ ఇన్సూరెన్స్‌లో చేర్చుకున్నా కానీ, కొన్ని సంవత్సరాల తర్వాత ఖర్చులను తగ్గించుకునేందుకు తొలగించాల్సి రావచ్చు. పైగా ఈ పాలసీల్లో పెద్దలకు కవరేజీ తక్కువగా రూ.2–3 లక్షల వరకే ఉంటుంది. ఉద్యోగం మానేసినా, లేక సంస్థ మారినా ఈ కవరేజీని కోల్పోవాల్సి వస్తుంది’’ అని పాలసీబజార్ హెల్త్ ఇన్సూరెన్స్ విభాగం హెడ్ అమిత్ ఛబ్రా పేర్కొన్నారు. అవసరమైనంత కవరేజీ తగినంత హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ తీసుకోవడం ఎంతో అవసరం. ‘‘మీరు నివసించే ప్రాంతం, జీవన శైలి, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితులు.. ఆధారంగా ఎంత మేర సమ్ ఇన్సూర్డ్ (బీమా మొత్తం) తీసుకోవాలన్నది ఉంటుంది’’ అని మణిపాల్ సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్ ఎండీ ప్రసూన్ సిక్దర్ తెలిపారు. మెట్రోలో ఉంటున్న వారు, ఆస్పత్రిలో సింగిల్‌రూమ్ కోరుకునే వారు అధిక కవరేజీ తీసుకోవడం అవసరం. వృద్ధ దంపతులకు రూ.10–20 లక్షల కవరేజీ, ఆ వయసులో విడిగా ఒకరికి అయితే రూ.7–10 లక్షల వరకైనా బీమా తీసుకోవాలి. ఆలస్యం చేయవద్దు 50 ఏళ్లకి వచ్చే సరికి దంపతులు ఎట్టి పరిస్థితుల్లోనూ వైద్య బీమా కవరేజీ ఉండేలా చూసుకోవాలి. వైద్య బీమా అన్నది తగినంత లేకపోతే సూపర్ టాపప్ ద్వారా దాన్ని పెంచుకోవాలి. అదే 60 ఏళ్లు నిండిన తర్వాత కొత్తగా హెల్త్ పాలసీ తీసుకోవాలన్నా, సమ్ ఇన్సూర్డ్ మొత్తాన్ని పెంచుకోవాలన్నా లేక సూపర్ టాపప్ తీసుకోవాలన్నా అది కష్టంగా మారుతుంది. ‘‘ఒక వ్యక్తి 60 ఏళ్ల వయసులోకి ప్రవేశించారంటే వారికి కఠిన అండర్‌రైటింగ్ నిబంధనలు అమలవుతాయి. ఉదాహరణకు పాలసీ తీసుకునే ముందు వైద్య పరీక్షలు తప్పనిసరి’’ అని సిక్దర్ తెలిపారు. ముందస్తు వ్యాధులున్న వారికి బీమా కంపెనీలు బీమాకు నిరాకరిస్తున్నాయి కూడా. సీనియర్ సిటిజన్ల కోసం ఉద్దేశించిన పాలసీలు నేడు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. ముందస్తు వ్యాధులకు ఇవి కవరేజీని ఆఫర్ చేస్తున్నప్పటికీ.. ఎన్నో పరిమితులను విధిస్తున్నాయి. కనుక వీటిని దృష్టిలో ఉంచుకోవాలి. కోపేమెంట్ ఎంత..? సీనియర్ సిటిజన్ పాలసీల్లో ఎక్కువ వాటిల్లో కోపేమెంట్ ఆప్షన్ ఉంటోంది. కోపేమెంట్ అంటే వైద్య చికిత్సా వ్యయాల్లో రోగి తన వంతుగా చెల్లించాల్సిన వాటా. ఇది పాలసీలను బట్టి 10–30 శాతం మధ్య ఉండొచ్చు. క్లెయిమ్ మొత్తంలో ఈ మేరకు పాలసీదారులు భరించగా, మిగిలినది బీమా కంపెనీలు చెల్లిస్తాయి. కనుక కోపేమెంట్ క్లాజ్ లేని పాలసీ తీసుకోవాలి. లేదంటే పాలసీదారుని వాటా తక్కువగా ఉండేదానిని ఎంచుకోవడం మంచిది. ఉప పరిమితులు బీమా సంస్థలు చెల్లింపుల్లో ఉప పరిమితులను కూడా విధిస్తుంటాయి. అంటే, ఫలానా వ్యాధికి గరిష్టంగా ఇంత మొత్తమని లేదా సమ్ ఇన్సూర్డ్‌లో నిర్ణీత శాతాన్ని చెల్లిస్తామన్న నిబంధనలు ఉంటాయి. ఉదాహరణకు గుండె సంబంధిత సమస్యలకు గరిష్టంగా రూ.3 లక్షలే చెల్లిస్తామనే పరిమితి ఉండొచ్చు. అదే కేటరాక్ట్ సర్జరీ అయితే గరిష్ట చెల్లింపులను రూ.25,000కు పరిమితం కావొచ్చు. ఒకవేళ ఇంతకు మించి వ్యయం అయితే దాన్ని పాలసీదారులే భరించాల్సి ఉంటుంది. అలాగే అన్ని పాలసీల్లో కాకపోయినా కొన్నింటిలో రూమ్ రెంట్, ఐసీయూ రెంట్ పరంగా ఉప పరిమితులు కూడా ఉంటుంటాయి. వీటితో మొత్తం పాలసీ చెల్లింపులు కూడా మారిపోతాయి. అందుకే పాలసీ తీసుకునే ముందుగానే వీటన్నింటినీ తెలుసుకోవాలి. వేచి ఉండే కాలం సీనియర్ సిటిజన్ పాలసీల్లో రెండు రకాల వేచి ఉండే కాలావధి (వెయిటింగ్ పీరియడ్) ఆప్షన్లు ఉంటుంటాయి. ముందు నుంచీ ఉన్న వ్యాధులకు వర్తించేది ఒకటి. పాలసీ తీసుకున్నాకా రెండు నుంచి నాలుగేళ్లు Výæడిచాకే వీటికి కవరేజీనిస్తాయి. కేటరాక్ట్, మోకీలు మార్పిడి తదితర (కొంత కాలానికి వ్యాప్తి చెందేవి) చికిత్సలకు కవరేజీ కోసం పాలసీ తీసుకున్నాక రెండేళ్ల పాటు ఆగాల్సి రావడం మరొకటి. అంటే ఈ కాలంలో చికిత్సలు చేయించుకోవాల్సి వస్తే అందుకు అయ్యే వ్యయాలను పాలసీదారులే పెట్టుకోవాల్సి వస్తుంది. దాదాపు అన్ని పాలసీల్లోనూ ఈ నిబంధనలు ఉంటున్నాయి. ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ సర్వే అంశాలు ♦ 18% తల్లిదండ్రులకే హెల్త్ కవరేజీ ఉంది. అంటే మెజారిటీకి కవరేజీ లేదు. ♦ 26 శాతం తల్లిదండ్రులు వైద్య పరంగా అత్యవసర పరిస్థితుల్లో చెల్లింపులకు పిల్లలపైనే ఆధారపడుతున్నారు. అంటే నాలుగింట మూడొంతుల మందికి తగినంత పెట్టుబడులు, పొదుపు నిధుల్లేవు. ♦ 29 శాతం మంది తమ తల్లిదండ్రులను కంపెనీ లేదా ప్రభుత్వ వైద్య బీమా కవరేజీలో భాగం చేసినట్టు చెప్పారు. వీరికి ప్రత్యేకంగా కవరేజీ అవసరం కూడా ఉంది. -
2 బిలియన్ డాలర్ల సమీకరణలో యస్ బ్యాంక్
ముంబై: ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ తాజాగా 2 బిలియన్ డాలర్లు సమీకరిస్తోంది. షేర్ల ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ ప్రాతిపదికన ఇన్వెస్ట్ చేసేందుకు పలు సంస్థలు ఆసక్తి వ్యక్తం చేసినట్లు బ్యాంకు వెల్లడించింది. శుక్రవారం బోర్డు సమావేశం అనంతరం స్టాక్ ఎక్సే్చంజీలకు ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఎర్విన్ సింగ్ బ్రెయిచ్/ఎస్పీజీపీ హోల్డింగ్స్ (ఇంకా చర్చలు జరుగుతున్నాయి) 1,200 మిలియన్ డాలర్లు, అమెరికాకు చెందిన ఒక ఫండ్ సంస్థ 120 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకొచ్చాయి. ఇతరత్రా కార్పొరేట్ల కుటుంబ కార్యాలయాలకు సంబంధించి సిటాక్స్ హోల్డింగ్స్ ఫ్యామిలీ ఆఫీస్ 500 మిలియన్ డాలర్లు, జీఎంఆర్ గ్రూప్ అండ్ అసోసియేట్స్ 50 మిలియన్ డాలర్లు, ఆదిత్య బిర్లా ఫ్యామిలీ ఆఫీస్ 25 మిలియన్ డాలర్లు, ప్రముఖ ఇన్వెస్టరు రాకేష్ ఝున్‌ఝున్‌వాలా సతీమణి రేఖా ఝున్‌ఝున్‌వాలా 25 మిలియన్ డాలర్ల పెట్టుబడుల ప్రతిపాదనలు చేశారు. 2 వారాలు లేదా 26 వారాల స్టాక్ సగటు ధర (ఏది ఎక్కువైతే అది) ప్రాతిపదికన షేర్ల కేటాయింపు ఉండనుంది. దీనిపై డిసెంబర్ 10న యస్ బ్యాంక్ బోర్డు మరోసారి భేటీ కానుంది. శుక్రవారం బీఎస్ఈలో యస్ బ్యాంక్ షేరు.. 2.5% క్షీణించి రూ. 68.30 వద్ద ముగిసింది. -
తొలి ఎన్బీఎఫ్సీ కమర్షియల్ పేపర్ల లిస్టింగ్
ముంబై: నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థ (ఎన్బీఎఫ్సీ) ఆదిత్య బిర్లా ఫైనాన్స్ (ఏబీఎఫ్‌ఎల్) తమ కమర్షియల్ పేపర్స్‌ను (సీపీ) స్టాక్ ఎక్సే్ఛంజీల్లో లిస్ట్ చేసింది. తద్వారా స్టాక్ ఎక్సే్ఛంజీల్లో లిస్టయిన తొలి ఎన్‌బీఎఫ్‌సీగా నిలి్చంది. ఈ సీపీ ద్వారా ఏబీఎఫ్‌ఎల్ రూ. 100 కోట్లు సమీకరించింది. వీటి మెచ్యూరిటీ గడువు 2020 ఫిబ్రవరి 7గా ఉంటుందని స్టాక్ ఎక్సే్ఛంజీలు ఎన్ఎస్ఈ, బీఎస్ఈ వేర్వేరు ప్రకటనల్లో తెలిపాయి. స్వల్పకాలిక రుణాలకు సంబంధించిన కమర్షియల్ పేపర్ల లిస్టింగ్‌కు తగిన విధానాలు రూపొందించాలంటూ స్టాక్ ఎక్సే్ఛంజీలకు నియంత్రణ సంస్థ సెబీ ఈ ఏడాది అక్టోబర్‌లో సూచించింది. సెబీ నిబంధనల ప్రకారం.. కనీసం రూ. 100 కోట్ల నికరవిలువ ఉన్న ఎన్బీఎఫ్సీలు, కంపెనీలకు లిస్టింగ్ అర్హత ఉంటుంది. -
విప్లవాత్మక మార్పులతో భారత్ ముందడుగు
బ్యాంకాక్: భారత్ ముఖ రహిత పన్ను మదింపుల వ్యవస్థను అమలు చేస్తోందని, దీంతో పన్నుల వసూళ్లలో వేధింపులు ఉండవని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గడిచిన ఐదేళ్ల కాలంలో ఆర్థిక రంగంలో భారత్ చేపట్టిన ముఖ్యమైన సంస్కరణలను ఆయన ప్రస్తావించారు. థాయిలాండ్‌లో ఆదిత్య బిర్లా గ్రూపు కార్యకలాపాలు ఆరంభించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ప్రధాని హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రముఖ వ్యాపారవేత్తలతో ప్రధాని మాట్లాడారు. అంతర్జాతీయంగా పెట్టుబడులను ఆకర్షిస్తున్న గమ్యస్థానాల్లో భారత్ కూడా ఒకటని గుర్తు చేశారు. గత ఐదేళ్లలో 286 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) రాబట్టినట్టు తెలిపారు. మూసకట్టు ధోరణిలో, బ్యూరోక్రటిక్ విధానంలో పనిచేయడాన్ని భారత్ ఆపేసిందన్నారు. ఆరి్థక, సామాజికాభివృద్ధి దిశగా విప్లవాత్మక మార్పులతో ముందుకు వెళుతోందన్నారు. స్నేహపూర్వక పన్ను విధానం కలిగిన దేశాల్లో ఇప్పుడు భారత్ కూడా ఒకటని, పన్నుల వ్యవస్థను మరింత మెరుగుపరిచే దిశగా పనిచేస్తున్నట్టు చెప్పారు. జీఎస్టీ అమలు, తద్వారా ఆర్థిక అనుసంధానత స్వప్నం ఆచరణ రూపం దాల్చడం గురించి వివరించారు. ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డీబీటీ) అన్నది దళారులు, అసమర్థతకు చెక్ పెట్టిందని, ఇప్పటి వరకు డీబీటీ 20 బిలియన్ డాలర్ల మేర పొదుపు చేసినట్టు చెప్పారు. కార్పొరేట్ పన్ను తగ్గింపు, 5 లక్షల కోట్ల డాలర్ల ఆరి్థక వ్యవస్థగా 2024 నాటికి చేరుకోవడం సహా ఎన్నో అంశాల గురించి ప్రస్తావించారు. దేశంలో వ్యాపార నిర్వహణను సులభతరం చేసే దిశగా తమ ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి ప్రధాని వివరించారు. -
37 శాతం తగ్గిన హిందాల్కో లాభం
న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు చెందిన ప్రధాన కంపెనీ, హిందాల్కో ఇండస్ట్రీస్ నికర లాభం (స్టాండ్ అలోన్) గత ఆర్థిక సంవత్సరం (2018–19) నాలుగో త్రైమాసిక కాలంలో 37 శాతం తగ్గింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017–18) క్యూ4లో రూ.377 కోట్లుగా ఉన్న నికర లాభం గత క్యూ4లో రూ.236 కోట్లకు తగ్గిందని హిందాల్కో తెలిపింది. ఆదాయం మాత్రం రూ.11,892 కోట్ల నుంచి రూ.12,733 కోట్లకు పెరిగిందని కంపెనీ ఎమ్డీ సతీశ్ పాయ్ చెప్పారు. . ఉత్పత్తి వ్యయాలు పెరగడం, ఆర్థిక స్థితిగతులు బలహీనంగా ఉండటం వల్ల నికర లాభం తగ్గిందని వివరించారు. ఒక్కో షేర్‌కు రూ.1.20 డివిడెండ్(120 శాతం)ను ఇవ్వనున్నామని తెలిపారు. వ్యాపార పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ, మంచి ఫలితాలు సాధించామని సతీష్ సంతృప్తి వ్యక్తం చేశారు. -
ఆదిత్య బిర్లా క్యాపిటల్ లాభం 13 శాతం డౌన్
న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా క్యాపిటల్ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో రూ.195 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.225 కోట్ల నికర లాభం వచ్చిందని, 13 శాతం క్షీణత నమోదైందని ఆదిత్య బిర్లా క్యాపిటల్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.2,699 కోట్ల నుంచి రూ.3,590 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఆదిత్య బిర్లా గ్రూప్ ఆర్థిక సేవల వ్యాపారాల హోల్డింగ్ కంపెనీగా ఆదిత్య బిర్లా క్యాపిటల్ వ్యవహరిస్తోంది. ఈ కంపెనీ జీవిత బీమా, అసెట్ మేనేజ్మెంట్, ప్రైవేట్ ఈక్విటీ, కార్పొరేట్ లెండింగ్, ప్రాజెక్ట్ ఫైనాన్స్, సాధారణ బీమా, బ్రోకింగ్, వెల్త్ మేనేజ్మెంట్, ఈక్విటీ, కరెన్సీ, కమోడిటీ బ్రోకింగ్, ఆన్లైన్ పర్సనల్ ఫైనాన్స్ మేనేజ్మెంట్, తదితర సేవలందిస్తోంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఆదిత్య బిర్లా క్యాపిటల్ షేర 1 శాతం లాభపడి రూ.107 వద్ద ముగిసింది. -
అమెజాన్ చేతికి మోర్!!
న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితమైన మోర్ సూపర్ మార్కెట్ చెయిన్ (ఆదిత్య బిర్లా రిటైల్ –ఏబీఆర్ఎల్) ఇక అంతర్జాతీయ రిటైలింగ్ దిగ్గజం అమెజాన్ చేతికి చేరనుంది. ఇందుకు సంబంధించి సమర ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్‌తో మోర్ బ్రాండ్ మాతృసంస్థ ఆదిత్య బిర్లా గ్రూప్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ విలువ సుమారు రూ. 4,200 కోట్లుగా ఉంటుందని అంచనా. ఆదిత్య బిర్లా రిటైల్ (ఏబీఆర్ఎల్)కి ప్రస్తుతం దేశవ్యాప్తంగా మోర్ బ్రాండ్ కింద 509 మోర్ బ్రాండెడ్ సూపర్మార్కెట్లు, 20 హైపర్మార్కెట్లు ఉన్నాయి. సగభాగం పైగా స్టోర్స్ దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలోనే ఉన్నాయి. ఫ్యూచర్ గ్రూప్, రిలయన్స్ రిటైల్, డీమార్ట్ తర్వాత మోర్ నాలుగో స్థానంలో ఉంది. గతేడాది ఏప్రిల్ నాటికి ఏబీఆర్ఎల్ నికర రుణం రూ. 6,456 కోట్లుగా ఉంది. 2016 నుంచి స్టోర్స్ సంఖ్య పెరుగుతూ వస్తున్నప్పటికీ.. కంపెనీ వ్యయాలను నియంత్రించుకుంటూ వస్తోంది. నిర్వహణపరమైన నష్టాల నేపథ్యంలో స్టోర్స్ పరిమాణం, అద్దెలు తగ్గించుకుంటోంది. గతంలో త్రినేత్ర సూపర్‌మార్కెట్‌గా తెలుగురాష్ట్రాల్లో పేరొందిన బ్రాండ్‌నే ఆదిత్య బిర్లా గ్రూప్ 2007లో కొనుగోలు చేసి మోర్గా పేరు మార్చింది. ఒప్పందం ఇలా.. ఏబీఆర్‌ఎల్‌లో కుమార మంగళం బిర్లా.. ఆయన కుటుంబానికి చెందిన ఆర్కేఎన్ రిటైల్‌కి 62 శాతం, కనిష్ట ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్కి 37 శాతం వాటాలు ఉన్నాయి. రెండు హోల్డింగ్ కంపెనీలు .. ఏబీఆర్‌ఎల్‌లోని తమ తమ వాటాలను సమర ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్‌కి చెందిన విట్‌జీగ్ అడ్వైజరీ సర్వీసెస్‌కు విక్రయించనున్నట్లు ఆర్కేఎన్ రిటైల్ సంస్థ వెల్లడించింది. వాస్తవానికి సమర ఈ ఏడాది జూన్‌లోనే ఇందుకు సంబంధించిన ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత గోల్డ్‌మన్ శాక్స్, అమెజాన్‌ని కూడా ఇందులో భాగం చేసింది. ఈ డీల్ కోసం మూడు సంస్థలు ప్రత్యేక సంస్థను లేదా స్పెషల్ పర్పస్ వెహికల్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నాయి. ఇందులో వ్యూహాత్మక భాగస్వామిగా అమెజాన్ 49 శాతం వాటాలు దక్కించుకోనుంది. ఏబీఆర్‌ఎల్‌లో వాటాలు కొంటున్న విట్‌జీగ్ అడ్వైజరీలో కూడా అమెజాన్‌కు వాటాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ రకంగా మొత్తం మీద చూస్తే అమెజాన్ చేతికి మోర్ చేరినట్లు కానుంది. భారత విదేశీ ఇన్వెస్ట్మెంట్ చట్టాల ప్రకారం మోర్ లాంటి మల్టీ బ్రాండ్ రిటైలర్స్‌లో విదేశీ కంపెనీలు 49% వరకే ఇన్వెస్ట్ చేయడానికి ఉంది. దీంతో అవి దేశీ సంస్థలతో జట్టు కట్టి ఇలాంటి కొనుగోళ్లు జరుపుతున్నాయి. ఇటీవలే ఇదే తరహా డీల్‌లో టీపీజీ, శ్రీరామ్ గ్రూప్‌ల నుంచి విశాల్ రిటైల్‌ను రూ.5,000 కోట్లతో కొనుగోలు చేసేందుకు స్విట్జర్లాండ్‌కి చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ పార్ట్నర్స్ గ్రూప్.. దేశీ ఫండ్ హౌస్ కేదార క్యాపిటల్‌తో జట్టు కట్టింది. 1.1 ట్రిలియన్ డాలర్ల మార్కెట్.. ఇప్పటిదాకా ఆన్లైన్ వ్యాపారానికే పరిమితమైన అమెజాన్..ఆఫ్‌లైన్ స్టోర్స్‌పైనా దృష్టి పెడుతోంది. భారత రిటైల్ మార్కెట్ ప్రస్తుతం 672 బిలియన్ డాలర్లుగా ఉండగా.. 2020 నాటికల్లా 1.1 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ రిటైల్ దిగ్గజాలు భారత్‌పై దృష్టి సారిస్తున్నాయి. ఇటీవలే దేశీ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో మెజారిటీ వాటాలను అమెరికా రిటైల్ సంస్థ వాల్‌మార్ట్ 16.7 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. దీని కోసం అమెజాన్ కూడా పోటీపడినప్పటికీ కుదరలేదు. అయితే, గతేడాది షాపర్స్ స్టాప్‌లో రూ. 179 కోట్లు పెట్టి 5% వాటాలు కొనుగోలు చేసింది.ఇక ఇప్పుడు మోర్లో కూడా ఇన్వెస్ట్ చేసిన పక్షంలో దేశీ రిటైల్ రంగంలో అమెజాన్‌కి ఇది రెండో పెట్టుబడి కానుంది. స్థానికంగా తయారయిన ఆహారోత్పత్తులను ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో విక్రయించే అనుబంధ సంస్థను 500 మిలియన్ డాలర్లతో ఏర్పాటు చేసేందుకు గతంలో అనుమతులు వచ్చినప్పటికీ.. విధానాల్లో అస్పష్టత కారణంగా అమెజాన్ రంగంలోకి దిగలేదు. అయితే, ఆహార, నిత్యావసరాల విభాగంలో ప్రవేశించేందుకు చాన్నాళ్లుగా ప్రయత్నిస్తున్న అమెజాన్‌కి.. మోర్లో ఇన్వెస్ట్ చేయడం లాభించనుంది. -
హిందాల్కో చేతికి అమెరికా కంపెనీ
ముంబై: ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రధాన కంపెనీ హిందాల్కో.. అమెరికాకు చెందిన అల్యూమినియమ్ కంపెనీ ‘అలెరిస్’ను కొనుగోలు చేయనున్నది. వాహన, విమానయాన రంగాల ఉత్పత్తులను అందించే అలెరిస్ కంపెనీని 258 కోట్ల డాలర్లకు(సుమారుగా రూ.17,800 కోట్లు) కొనుగోలు చేయడానికి తమ విదేశీ అనుబంధ కంపెనీ నొవాలిస్ ఒక నిశ్చయాత్మకమైన ఒప్పందాన్ని కుదుర్చుకుందని హిందాల్కో గురువారం తెలిపింది. క్లీవ్‌ల్యాండ్‌లోని ఓహియో కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న అలెరిస్ కంపెనీ చేరికతో హిందాల్కో కంపెనీ ప్రపంచంలోనే రెండో అతి పెద్ద అల్యూమినియమ్ కంపెనీగా నిలుస్తుందని కంపెనీ చైర్మన్ కుమార మంగళం బిర్లా వివరించారు. అంతేకాకుండా విలువ ఆధారిత ఉత్పత్తుల సెగ్మెంట్లో మరిన్ని విభిన్నమైన ఉత్పత్తులను అందించడానికి వీలవుతుందని పేర్కొన్నారు. ఈ లావాదేవీ 9–15 నెలల్లో పూర్తవ్వగలదని తెలిపారు. ఈ కంపెనీ కొనుగోలుకు కావలసిన నిధులను రుణాల ద్వారా సమీకరిస్తామని వివరించారు. కాగా, అమెరికా విధిస్తున్న దిగుమతి సుంకాలు స్వల్పకాలిక చర్యేనని, స్వల్ప ప్రభావమే ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. అలెరిస్ కంపెనీకి ఉత్తర అమెరికా, చైనా, యూరప్ దేశాల్లో మొత్తం 13 ప్లాంట్లున్నాయి. హిందాల్కో కంపెనీ పదేళ్ల క్రితం అమెరికాకు చెందిన నొవాలిస్ కంపెనీని 600 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత మళ్లీ ఇదే అతి పెద్ద కొనుగోలు. -
ఆదిత్య బిర్లా గ్రూప్ టార్గెట్‌గా అతిపెద్ద ఎటాక్
ముంబై : భారత్ తొలిసారి అతిపెద్ద ‘క్రిప్టోజాకింగ్’ ఎటాక్ బారిన పడింది. దేశీయ అతిపెద్ద బహుళ జాతీయ దిగ్గజం ఆదిత్య బిర్లా గ్రూప్‌ను టార్గెట్‌గా చేసుకుని హ్యాకర్లు ఈ దాడికి పాల్పడినట్టు వెల్లడైంది. ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీలకు చెందిన 2000కు పైగా కంప్యూటర్లపై హ్యాకర్లు ఈ దాడికి దిగినట్టు తెలిసింది. కొత్త రకం సైబర్ మాల్వేర్ను వీరు గ్రూప్ కంపెనీల కంప్యూటర్లలోకి చొప్పించినట్టు వెల్లడైంది. ఈ కొత్త రకం మాల్వేర్ ద్వారా హ్యాకర్లు క్రిప్టో కరెన్సీను పొందడానికి టార్గెట్ టర్మినల్స్‌ను, వారి ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని దుర్వినియోగపరుస్తారు. గత నెలలోనే ఆదిత్య బిర్లా గ్రూప్‌కు చెందిన అంతర్జాతీయ సబ్సిడరీల్లో ఈ ఎటాక్‌ను గుర్తించినట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. కొన్ని రోజుల్లోనే ఈ మాల్వేర్ తమ బిజినెస్ హౌజ్‌కు చెందిన తయారీ, ఇతర సర్వీసుల కంపెనీలను ఎటాక్ చేసినట్టు పేర్కొన్నాయి. అయితే హ్యాకర్లు ఉద్దేశ్యం సమాచారాన్ని దొంగలించడం కాదని, వ్యాపార కార్యకలాపాలకు అంతరాయం కలిగించడమేనని తెలిపాయి. టార్గెట్ కంప్యూటర్లను హైజాక్ చేయకుండా.. క్రిప్టో కాయిన్లు కలిగిన ఆర్గనైజేషన్ పవర్ సప్లయ్‌కు అంతరాయం సృష్టించిన్నట్టు వెల్లడించాయి. ఈ ఎటాక్‌పై ఆదిత్య బిర్లా గ్రూప్ అధికార ప్రతినిధి స్పందిస్తూ... థ్రెట్ మేనేజ్మెంట్ వ్యవస్థల్లో తమ గ్రూప్ చాలా అడ్వాన్స్‌గా ఉంటుందని, ఎప్పడికప్పుడూ పరిశీలిస్తూ.. వ్యాపార కీలక అప్లికేషన్లను కాపాడుతూ ఉంటామని తెలిపారు. కానీ ఇటీవల తమ గ్రూప్ థ్రెట్ మేనేజ్మెంట్ వ్యవస్థలకు చెందిన కొన్ని డెస్క్‌టాప్ సిస్టమ్స్‌లో అనుమానిత కార్యకలాపాన్ని గుర్తించినట్టు పేర్కొన్నారు. ఇలా గుర్తించిన వెంటనే తమ అంతర్గత టీమ్‌తో విచారణ జరిపించామని, సిస్టమ్స్‌కు అంతరాయం కలిగిస్తున్న ఆ అనుమానిత కార్యకలాపాన్ని తొలగించినట్టు చెప్పారు. దీని వల్ల ఎలాంటి డేటాను కోల్పోలేదని తేల్చారు. దీనిపై ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ చేపట్టినట్టు అధికార ప్రతినిధి తెలిపారు. క్రిప్టోజాకింగ్... ఇది ఓ కొత్త రకం మాల్వేర్ ఇది కంప్యూటర్లను జోంబీస్లోకి మారుస్తోంది. హ్యాకర్ల ప్రధాన ఉద్దేశ్యం సమాచారాన్ని దొంగలించడం కాదు, క్రిప్టోకరెన్సీలను పొందడం ఈ డిజిటల్ సొమ్మును సేకరించే లక్ష్యంతో కంప్యూటర్లు, క్లౌడ్ సీపీయూల ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని హైజాక్ చేస్తారు ఫలితంగా మన కంప్యూటర్లు పనిచేసే వేగం గణనీయంగా తగ్గిపోతుంది -
ఐడియాలోకి మరో రూ.3,250 కోట్లు!
న్యూఢిల్లీ: ఐడియా సెల్యులర్ కంపెనీ ప్రమోటర్ గ్రూప్ సంస్థ, ఆదిత్య బిర్లా గ్రూప్ నుంచి భారీగా నిధులు సమీకరించనున్నది. ఆదిత్య బిర్లా గ్రూప్ సంస్థలకు 32.66 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన కేటాయించి రూ.3,250 కోట్లు సమీకరిస్తున్నట్లు ఐడియా సెల్యులర్ తెలిపింది. రూ.10 ముఖ విలువ గల ఒక్కో షేర్‌ను రూ.99.50 ధరకు కేటాయించాలని తమ డైరెక్టర్ల బోర్డ్ నిర్ణయించిందని ఐడియా సెల్యులర్ చైర్మన్ కుమారమంగళం బిర్లా తెలిపారు. ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు చెందిన బిర్లా టీఎమ్‌టీ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇలైనె ఇన్వెస్ట్మెంట్స్ పీటీఈ లిమిటెడ్(సింగపూర్), ఒరియానా ఇన్వెస్ట్మెంట్స్ పీటీఈ లిమిటెడ్(సింగపూర్), సూర్య కిరణ్ ఇన్వెస్ట్మెంట్స్ పీటీఈ లిమిటెడ్(సింగపూర్)లకు ఈ షేర్లు కేటాయిస్తామన్నారు. ఈ షేర్ల కేటాయింపు వచ్చే నెల ప్రారంభంలోనే పూర్తవుతుందని, దీనివల్ల ఐడియాలో ప్రమోటర్‌గ్రూప్ వాటా ప్రస్తుత 42.4 శాతం నుంచి 47.2 శాతానికి పెరుగుతుందని బిర్లా పేర్కొన్నారు. అదనంగా మరో రూ3,5000 కోట్లు సమీకరణ అదనంగా మరో రూ.3,500 కోట్ల నిధుల సమీకరణ కోసం అన్వేషించాల్సిన మార్గాల నిమిత్తం ఒక ప్యానెల్‌ను నియమించామని కుమార మంగళం తెలిపారు. ఇండస్ టవర్స్‌లో కంపెనీకున్న 11.15% వాటాను కూడా విక్రయించాలని ప్రయత్నిస్తున్నట్లు చెప్పారాయన. ఈ ఏడాది వోల్ట్ (వాయిస్ ఓవర్ 4జీ) సేవల నూ అందించాలని యోచిస్తున్నామని వివరించారు. -
ఐడియా నష్టాలు రూ.1,107 కోట్లు
న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా గ్రూప్‌కు చెందిన టెలికం కంపెనీ ఐడియా సెల్యులార్కు ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ.1,107 కోట్ల నికర నష్టాలొచ్చాయి. ధరల విషయమై పోటీ తీవ్రంగా ఉండటం, జీఎస్టీ అమలు గట్టి ప్రభావమే చూపించాయని ఐడియా తెలిపింది. కంపెనీకి గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.92 కోట్ల నికర లాభం రాగా... ఈ ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్లో మాత్రం రూ.815 కోట్ల నికర నష్టాలు నమోదయ్యాయి. గత క్యూ2లో రూ.9,300 కోట్లుగా ఉన్న ఆదాయం ఈ క్యూ2లో 20 శాతం క్షీణించి రూ.7,466 కోట్లకు పడిపోయింది. 4జీ నెట్వర్క్ కోసం భారీగా పెట్టుబడులు పెడుతుండటంతో వడ్డీ వ్యయాలు రూ. 1,183 కోట్లకు, తరుగుదల వ్యయాలు రూ.2,114 కోట్లకు పెరిగాయని కంపెనీ వెల్లడించింది. ఈ ఏడాది సెప్టెంబర్ చివరి నాటికి నికర రుణ భారం రూ.54,100 కోట్లుగా ఉంది. 7 శాతం తగ్గిన ఏఆర్పీయూ: పోటీ కారణంగా టారిఫ్‌ల విషయంలో తీవ్రమైన ఒత్తిడి నెలకొన్నదని ఐడియా తెలిపింది. గతంలో 15 శాతం సర్వీస్ ట్యాక్స్ ఉందని, ఇప్పుడు 18 శాతం జీఎస్టీ అదనపు భారమని వివరించింది. ‘‘ఈ జూన్ క్వార్టర్లో రూ.141గా ఉన్న ఒక్కో వినియోగదారుడి నుంచి వచ్చే సగటు రాబడి (ఏఆర్పీయూ) ఈ సెప్టెంబర్ క్వార్టర్లో 7 శాతం తగ్గి రూ.132కు పరిమితమయింది. వచ్చే ఏడాది మొదట్లోనే అత్యంత వేగవంతమైన వాయిస్ ఓవర్ లాంగ్–టర్మ్ ఇవొల్యూషన్‌ను (ఓల్ట్) అందుబాటులోకి తేనున్నామని ఐడియా వెల్లడించింది. ఆర్థిక ఫలితాలు నిరుత్సాహకరంగా ఉండడంతో బీఎస్ఈలో ఐడియా షేర్ 3 శాతం క్షీణించి రూ.94 వద్ద ముగిసింది. -
వొడాఫోన్, ఐడియా విలీనానికి సీసీఐ ఆమోదముద్ర
న్యూఢిల్లీ: టెలికం దిగ్గజాలు వొడాఫోన్, ఐడియాల విలీన ప్రతిపాదనకు కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) ఆమోదముద్ర వేసింది. ఇరు సంస్థలకు సీసీఐ అప్రూవల్ లేఖలు పంపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆదిత్య బిర్లా గ్రూప్‌లో భాగమైన ఐడియా, వొడాఫోన్ ఇండియా మార్చి 20న విలీన ప్రతిపాదనను ప్రకటించడం తెలిసిందే. 40 కోట్ల మంది కస్టమర్లు, 35% మార్కెట్ వాటా, ఆదాయాల మార్కెట్లో 41% వాటాతో విలీన కంపెనీ దేశీయంగా అతి పెద్ద టెల్కోగా ఆవిర్భవించగలదని ఇరు సంస్థలు సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. విలీనంతో రూ. 80,000 కోట్ల ఆదాయం గల కంపెనీ ఆవిర్భవించనుంది. విలీన సంస్థలో వొడాఫోన్‌కు 45.1%, ఐడి యా ప్రమోటర్లకు 26% వాటాలు ఉండనున్నాయి. -
అల్ట్రాటెక్ సిమెంట్ లాభం 15శాతం జంప్
న్యూఢిల్లీ: ఆదిత్యా బిర్లా గ్రూప్ కంపెనీ అల్ట్రాటెక్ సిమెంట్ నికరలాభం 2017 జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో 15.14 శాతం పెరుగుదలతో రూ. 897.91 కోట్లకు చేరింది. గతేడాది ఇదేకాలంలో కంపెనీ నికరలాభం రూ. 779.83 కోట్లు. కంపెనీ మొత్తం ఆదాయం 6.45 శాతం వృద్ధితో రూ. 7,603 కోట్ల నుంచి రూ. 8,094 కోట్లకు చేరింది. తాజా ఫలితాల్లో తాము ఇటీవల టేకోవర్ చేసిన జైప్రకాష్ అసోసియేట్స్, జేపీ సిమెంట్ కార్పొరేషన్లకు చెందిన సిమెంటు ప్లాంట్ల ఫలితాలు కూడా కలిసివున్నాయని కంపెనీ మంగళవారం స్టాక్ ఎక్సే్ఛంజీలకు తెలిపింది. జేపీ గ్రూప్‌నకు ఆంధ్రప్రదేశ్‌తో సహా వివిధ ప్రాంతాల్లో వున్న 2.13 కోట్ల టన్నుల వార్షిక సామర్థ్యంగల సిమెంటు ప్లాంట్లను అల్ట్రాటెక్ కొనుగోలుచేసింది. తాజా టేకోవర్‌తో తమ మొత్తం వార్షిక ఉత్పాదక సామర్థ్యం 9.3 కోట్ల టన్నులకు చేరుతుందని కంపెనీ తెలిపింది. ముగిసిన త్రైమాసికంలో ఇంధన ధరల పెరుగుదల కారణంగా వ్యయాలు ఎగిసాయని అల్ట్రాటెక్ పేర్కొంది. ఫలితాల నేపథ్యంలో అల్ట్రాటెక్ సిమెంటు షేరు ధర స్వల్ప తగ్గుదలతో రూ. 4,355 వద్ద క్లోజయ్యింది. -
9 శాతం అదనపు వాటా
విక్రయించనున్న వొడాఫోన్ న్యూఢిల్లీ: వొడాఫోన్ కంపెనీ 9.5 శాతం అదనపు వాటాను ఆదిత్య బిర్లా గ్రూప్‌కు విక్రయించనుంది. ఒక్కో షేర్ రూ.130 చొప్పున ఈ అదనపు వాటాను వొడాఫోన్ విక్రయిస్తోంది. వొడాఫోన్తో కుదిరిన విలీన స్కీమ్ ఒప్పంద వివరాలను ఆదిత్య బిర్లా గ్రూప్ బీఎస్ఈకి నివేదించింది. కాగా ఐడియా సెల్యులర్, వొడాఫోన్ కంపెనీల విలీనం కారణంగా దేశంలోనే అతిపెద్ద టెలికం కంపెనీ అవతరిస్తోంది. 40 కోట్ల వినియోగదారులతో, 35 శాతం మార్కెట్ వాటాతో ఈ కంపెనీ అగ్రస్థానంలో నిలవనున్నది. ఈ డీల్ కారణంగా వొడాఫోన్ ఇండియా విలువ రూ.82,800 కోట్లుగానూ, ఐడియా సెల్యులర్ విలువ రూ.72,200 కోట్లుగానూ అంచనా వేశారు. -
ఆదిత్య బిర్లా గ్రూప్ కు ఆర్బీఐ లైసెన్సు ఇచ్చేసింది!
న్యూఢిల్లీ : పేమెంట్ బ్యాంకు కార్యకలాపాలు ప్రారంభించడానికి ఆదిత్య బిర్లా గ్రూప్ కు రిజర్వు బ్యాంకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దీనికి సంబంధించిన ఆదిత్య బిర్లా గ్రూప్ మంగళవారం ఆర్బీఐ నుంచి లైసెన్సు పొందింది. కుమార్ మంగళం బిర్లా అధినేతగా గ్రూప్ అవుట్ ఫిట్ ఆదిత్య బిర్లా నువో 51:49 జాయింట్ వెంచర్ తో ఆదిత్య బిర్లా ఐడియా పేమెంట్స్ బ్యాంకు లిమిటెడ్ ను ఏర్పాటుచేసింది. టెలికాం దిగ్గజం ఐడియా సెల్యులార్ తో కలిసి ఈ పేమెంట్స్ బ్యాంకు సర్వీసులను ప్రారంభించనుంది. దీనికి సంబంధించిన ఆదిత్య బిర్లా ఐడియా పేమెంట్స్ బ్యాంకు లిమిటెడ్ కు ఆర్బీఐ నుంచి లైసెన్సు అందినట్టు ఆదిత్య బిర్లా నువో మంగళవారం బీఎస్ఈ ఫైలింగ్ లో పేర్కొంది. ప్రస్తుతం ఎయిర్ టెల్, ఇండియా పోస్టులు మాత్రమే పేమెంట్ బ్యాంకు సర్వీసులను ఆఫర్ చేస్తున్నాయి. 2017 ప్రథమార్థంలో ఆదిత్య బిర్లా ఐడియా పేమెంట్స్ బ్యాంకును ఆవిష్కరించనున్నట్టు ఐడియా సెల్యులార్ చీఫ్ కోపరేట్ అఫైర్స్ ఆఫీసర్ రజత్ ముఖర్జీ అంతకముందే తెలిపారు. పేమెంట్స్ బ్యాంకులు ఒక్కో అకౌంట్ పై గరిష్టంగా లక్ష రూపాయల వరకు డిపాజిట్లను స్వీకరించనున్నాయి. -
హెల్త్ బాగుంటే ప్రీమియం వెనక్కి!
► 2 శాతం నుంచి 30 శాతం దాకా క్యాష్ బ్యాక్ ఆఫర్లు ► ఆరోగ్య విధానాల్ని పాటించటానికే ఈ ప్రోత్సాహం ► నాలుగేళ్లలో పది శాతం మార్కెట్ వాటాపై దృష్టి ► ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ సీఈవో మయాంక్ బత్వాల్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆరోగ్య బీమా పాలసీలంటే ఎంతసేపూ అనారోగ్యం గురించి భయపెట్టేలానే ఉంటాయి. ఇలా కాదంటూ... ఆరోగ్య బీమాను పాజిటివ్ కోణంలో చూపించాలనుకుంటోంది కొత్తగా హెల్త్ ఇన్సూరెన్స్ విభాగంలోకి అడుగుపెట్టిన ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ (ఏబీహెచ్ఐ). ఆరోగ్యకరమైన జీవన విధానాల్ని పాటించే పాలసీదారులకు కొంత ప్రీమియం తిరిగిచ్చేలా పాలసీలు రూపొందించింది. వాటి ప్రత్యేకతలు, కంపెనీ ప్రణాళికలను సాక్షి బిజినెస్ బ్యూరోకు వివరించారు సంస్థ సీఈవో మయాంక్ బత్వాల్. ఆ వివరాలు సంక్షిప్తంగా .. ఇప్పటికే పలు స్టాండెలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలున్నాయి. కొత్తగా మీరు ఏం సాధించగలమనుకుంటున్నారు? హెల్త్ ఇన్సూరెన్స్‌లో ముందు హెల్త్ (ఆరోగ్యం).. తర్వాతే ఇన్సూరెన్స్ (బీమా). ఇదే కాన్సెప్ట్‌పై మేం దృష్టి పెడుతున్నాం. ప్రస్తుతం పాలసీలు విక్రయించే కంపెనీలు... మీకేమైనా అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితులు తల్లకిందులైపోతాయి.. ఇబ్బందుల పాలైపోతారు కాబట్టి మా పాలసీ తీసుకోండి అంటున్నాయి. సాధారణంగా కస్టమర్లు ఇలాంటి నెగటివ్ ప్రతిపాదనలు వినటానికి ఇష్టపడరు. అందుకే మేం దానికి పూర్తి భిన్నంగా కస్టమర్లలో సానుకూల దృక్పథాన్ని ప్రోత్సహించేలా మా యాక్టివ్ హెల్త్ పాలసీని రూపొందించాం. ఆరోగ్యకరమైన జీవన విధానాలను పాటిస్తే.. దానికి ప్రతిఫలంగా ప్రీమియంలో కొంత మొత్తం వాపస్ చేస్తామనే ప్రతిపాదన తెచ్చాం. అటుపైన ఏదైనా జరిగితే బీమా కవరేజీ ఎలాగూ ఉంటుంది. ఈ ప్రతిపాదన ఇటు కంపెనీకి, అటు పాలసీదారుకు కూడా మంచిదే. పాలసీదారు ఆరోగ్యకరమైన జీవన విధానాలు పాటించడం వల్ల అనారోగ్యం బారిన పడే అవకాశాలు తగ్గుతాయి. దీంతో కట్టిన ప్రీమియంలో కొంత తిరిగి వస్తుంది. అది పాలసీదారుకు రెండు రకాలుగా లాభం. పాలసీదారు అనారోగ్యం బారిన పడే అవకాశాలు తక్కువ కావడం వల్ల.. క్లెయిమ్‌లు కూడా తక్కువుంటాయి. మాకు లాభం. ప్రీమియంల క్యాష్‌బ్యాక్‌కి సంబంధించి పాలసీదారు జీవన విధానాన్ని ఎలా ట్రాక్ చేస్తారు? ప్రస్తుతం ఫిట్నెస్ ట్రాకింగ్ యాప్స్ చాలానే అందుబాటులో ఉన్నాయి. పాలసీదారు తన ఫోన్లో సదరు యాప్‌ను, మా యాప్‌ను ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ రెండింటినీ అనుసంధానించాలి. అక్కణ్నుంచి నడక, వ్యాయామం మొదలైన వాటన్నింటికి సంబంధించిన సమాచారాన్ని ఏరోజుకారోజు మా యాప్ ట్రాక్ చేస్తుంది. ఉదాహరణకు ఇవాళ ఎన్ని అడుగులు వేశారు (వాకింగ్), ఎంత సేపు జిమ్ చేశారు, కరిగిన కేలరీలు మొదలైన వివరాలన్నీ రికార్డవుతాయి. తదనుగుణంగా స్కోరింగ్, హెల్త్రిటర్న్స్ పేరిట రివార్డులుంటాయి. యాప్ ద్వారా లెక్కించేందుకు వీలు కాని యోగా వంటివి చేస్తున్న పక్షంలో మా వైద్య నిపుణులు ఫిట్నెస్ పరీక్ష సేవలు, తగు సూచనలు అందించేందుకు అందుబాటులో ఉంటారు. ఇలా మెరుగైన ఆరోగ్య విధానాలను పాటించేవారికి ... కట్టిన ప్రీమియంలో రెండున్నర శాతం నుంచి గరిష్టంగా 30 % దాకా రిటర్న్ ఇస్తాం. ఈ మొత్తాన్ని తదుపరి ప్రీమియం కట్టేందుకు కూడా ఉపయోగించుకోవచ్చు. ఇతర సంస్థల నుంచి పోటీ ఎలా ఉంది? సుమారు ఇరవై కోట్ల మందికి ఆరోగ్య బీమా ఉంది. కానీ అది ప్రభుత్వ పథకాలు లేదా కార్పొరేట్ గ్రూప్ పాలసీల రూపంలోనే ఉంటోంది. వ్యక్తిగత హెల్త్ పాలసీల సంఖ్య 3 కోట్ల స్థాయిలోనే ఉంది. మరోవైపు వైద్య చికిత్స వ్యయాలు 12–14 శాతం మేర పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హెల్త్ పాలసీలపై అవగాహన క్రమంగా పెరుగుతోంది. దీంతో ప్రస్తుతం దాదాపు రూ. 27,000 కోట్లుగా ఉన్న దేశీ హెల్త్ ఇన్సూరెన్స్ మార్కెట్ గణనీయంగా వృద్ధి చెందనుంది. మేం కార్పొరేట్ పాలసీలతో పాటు యాక్టివ్ హెల్త్ పేరిట రిటైల్ పాలసీ అందిస్తున్నాం. ఇందులోనే ప్రాథమికమైన, తీవ్రమైన అనారోగ్యాలు మొదలైన వాటికి వేర్వేరు ఆప్షన్స్ ఎంచుకోవచ్చు. డయాబెటిస్, బీపీ, ఆస్తమా వంటి నాలుగు క్రానిక్ డిసీజెస్ చికిత్సకు ఉచిత అప్‌గ్రెడేషన్ ఫీచర్ అందిస్తున్నాం. ఇప్పటికే ఇవి ఉన్నవారు గానీ పాలసీ తీసుకున్నా కూడా తొలి రోజు నుంచే కవరేజీ అందిస్తున్నాం. రిటైల్‌కి సంబంధించి ప్రోడక్టు ప్రస్తుతం ఒకటే అయినప్పటికీ .. సమగ్రంగా అన్నీ అందిస్తున్నాం. పోటీ అంటారా!! ఎన్ని సంస్థలు వచ్చినా ఆరోగ్యకరమైన పోటీనే ఉంటుంది. అంతిమంగా వినియోగదారులకు మంచిదే. వ్యాపార ప్రణాళికలేంటి? ప్రస్తుతం మా నెట్‌వర్క్‌లో సుమారు 150 నగరాల్లో 1600 పైచిలుకు ఆస్పత్రులున్నాయి. రెండువేలకు పైగా ఏజెంట్లున్నారు. ఏజేంట్లు, బ్యాంకులు, ఆన్లైన్ మొదలైన అన్ని మాధ్యమాల ద్వారా మా పాలసీల్ని విక్రయిస్తున్నాం. ప్రస్తుతం బ్యాంకెష్యూరెన్స్కి సంబంధించి కొన్ని బ్యాంకులతో చర్చలు జరుగుతున్నాయి. హైదరాబాద్ సహా ఏడు ప్రధాన నగరాల్లో శాఖలున్నాయి. రాబోయే ఏడాది, ఏడాదిన్నర వ్యవధిలో 100 నగరాల్లో ఏజెన్సీలను విస్తరిస్తాం. రాబోయే నాలుగేళ్లలో హెల్త్ ఇన్సూరెన్స్ మార్కెట్లో కనీసం 8–10 శాతం వాటాను దక్కించుకోవాలని లకిష్యస్తున్నాం. ఒకే బ్యాంకు దాదాపు మూడు బీమా సంస్థల పాలసీలు విక్రయించేందుకు అనుమతులుండటం కలిసొచ్చే అంశం. దీనివల్ల పోటీ ఎలా ఉన్నా.. మరింత మందికి చేరువ అయ్యే వీలు దక్కుతుంది. పర్సనల్ ఫైనాన్స్ బ్రీఫ్స్.. ఫిన్‌టెక్ స్టార్టప్ ‘ఫిన్లే’లో ఇట్జ్‌క్యాష్ పెట్టుబడులు ముంబై: దేశీ ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ రంగ సంస్థ ‘ఇట్జ్‌క్యాష్’ తాజాగా బెంగళూరుకు చెందిన ఎక్స్పెన్స్ మేనేజ్మెంట్ ఫిన్‌టెక్ స్టార్టప్ ‘ఫిన్లే’లో ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్లను చేసింది. దీంతో తమ ఎక్స్పెన్స్ మేనేజ్మెంట్ కార్యకలాపాలు మరింత పటిష్టంగా తయారవుతాయని ఇట్జ్‌క్యాష్ పేర్కొంది. కంపెనీలకు సంబంధించిన ఎక్స్పెన్స్ మేనేజ్మెంట్ మార్కెట్లో 25 బిలియన్ డాలర్లమేర వృద్ధి అవకాశాలున్నాయని ఇట్జ్‌క్యాష్ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ భవికా వాసా తెలిపారు. ఫిన్లే స్టార్టప్ కంపెనీల కోసం ఒక ఎక్స్పెన్స్ మేనేజ్మెంట్ టూల్‌ను తయారు చేసిందన్నారు. రూ.24 లక్షల కోట్లకు ఆస్తుల విలువ: ఎల్ఐసీ ముంబై: బీమా రంగ దిగ్గజం– లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ప్రీమియం తాజాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి తొమ్మిది నెలల ఆడిట్ గణాంకాలను ప్రకటించింది. వీటి ప్రకారం సంస్థ మొత్తం ప్రీమియం ఆదాయం 12.43 శాతం వృద్ధితో రూ.1.29 లక్షల కోట్ల నుంచి రూ.1.45 లక్షల కోట్లకు పెరిగింది. అలాగే ఎల్ఐసీ మొత్తం ఆస్తుల విలువ కూడా 12.81 శాతం వృద్ధితో రూ.21.6 లక్షల కోట్ల నుంచి రూ.24.4 లక్షల కోట్లకు ఎగసింది. కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 44,000 మంది ఏజెంట్లను నియమించుకుంది. ఆర్థిక అక్షరాస్యతకు ఉజ్జీవన్ బ్యాంక్ షార్ట్‌ఫిల్మ్ ముంబై: ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్ (ఉజ్జీవన్ ఎస్ఎఫ్బీ) తాజాగా వినియోగదారుల్లో ఆర్థిక అక్షరాస్యత తీసుకురావడం కోసం ఒక ఎడ్యుకేషనల్ షార్ట్‌ఫిల్మ్ ‘పైసన్ కి ఏబీసీడీ’ని నిర్మించింది. ఇది పరిణామ్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ భాగస్వామ్యంతో ఈ సినిమాను తీసింది. ప్రదీప్ సర్కర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. దాదాపు 20 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా ద్వారా వినియోగదారుల్లో బ్యాంకింగ్‌పై ఉన్న అపోహలను తొలగించి, బ్యాంక్ ఖాతాల వల్ల కలిగే ప్రయోజనాలను వారికి తెలియజేస్తామని ఉజ్జీవన్ ఎస్ఎఫ్బీ పేర్కొంది. -
వొడాఫోన్.. విలీనం ‘ఐడియా’!
భారత్‌లో అతిపెద్ద టెలికం కంపెనీ ఆవిర్భావం ►వొడాఫోన్, ఐడియా విలీనానికి చర్చలు... ►పూర్తిగా షేర్ల రూపంలో డీల్‌కు అవకాశం ►ధ్రువీకరించిన వొడాఫోన్... ►విలీనం పూర్తయితే ఉమ్మడి కంపెనీకి దాదాపు 40 కోట్ల మంది యూజర్లు ►30 శాతం దూసుకెళ్లిన ఐడియా షేరు ధర న్యూఢిల్లీ: భారత్‌లో అతిపెద్ద టెలికం కంపెనీ ఆవిర్భావానికి రంగం సిద్ధమైంది. బ్రిటన్‌కు చెందిన వొడాఫోన్, ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీ ఐడియా సెల్యులార్‌లు ఒక్కటవుతున్నాయి. చాన్నాళ్లుగా వినిపిస్తున్న ఊహాగానాలను నిజం చేస్తూ... ఐడియాతో విలీనం కోసం చర్చలు జరుగుతున్నాయని వొడాఫోన్ గ్రూప్ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. షేర్ల రూపంలో జరిగే ఈ లావాదేవీగనుక పూర్తి అయితే, దేశంలో అతిపెద్ద టెలికం ఆపరేటర్‌గా అవతరించనుంది. రిలయన్స్ జియోతో టారిఫ్‌ల యుద్ధం పతాకస్థాయికి చేరిన నేపథ్యంలో దేశీ టెలికం రంగంలో స్థిరీకరణ(కన్సాలిడేషన్) ఊపందుకుంటుండటం గమనార్హం. ఎయిర్‌టెల్‌ను తలదన్నేలా... ప్రపంచంలో రెండో అతిపెద్ద మొబైల్ నెట్వర్క్ ఆపరేటర్‌గా వొడాఫోన్ ప్రస్తుతం పటిష్టమైన స్థానంలో ఉంది. భారత్‌లోనూ రెండో అతిపెద్ద టెల్కోగా నిలుస్తోంది. ఇక ఐడియా సెల్యులార్ మూడో స్థానంలో ఉంది. ఇప్పుడు ఈ విలీనం ద్వారా ఏర్పాటయ్యే కంపెనీకి 39 కోట్ల మందికి పైగా యూజర్లు ఉంటారు. తద్వారా దేశంలో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకోవడంతోపాటు, ప్రపంచంలోని అతిపెద్ద టెల్కోల్లో ఒకటిగా అవతరిస్తుంది. ప్రస్తుతం దేశీయంగా 24 కోట్ల మందికి పైగా యూజర్లతో భారతీ ఎయిఎయిర్టెల్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. వొడాఫోన్–ఐడియా విలీన సంస్థకు వార్షిక ఆదాయం రూ.78,000 కోట్లు, మార్కెట్ వాటా 43 శాతంగా ఉంటుంది. ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్న ఎయిర్టెల్ గత ఆర్థిక సంవత్సరంలో రూ.50,008 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. మార్కెట్ వాటా 33 శాతం. కాగా, కొత్తగా 4జీ సేవలను ఆరంభించిన ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో... ఉచిత కాల్స్, డేటా ఆఫర్‌ను మార్చి 31 వరకూ పొడించిన సంగతి తెలిసిందే. దీనికి ప్రస్తుతం 7.4 కోట్ల మంది కస్టమర్లు ఉన్నట్లు కంపెనీ చెబుతోంది. టవర్ల వ్యాపారానికి మినహాయింపు... షేర్లరూపంలో జరిగే ప్రతిపాదిత డీల్ ఇంకా సంప్రదింపుల దశలో ఉందని వొడాఫోన్ పేర్కొంది. అయితే, ఇండస్ టవర్స్ జాయింట్ వెంచర్లో తమకున్న 42 శాతం వాటాను ఈ ఒప్పందంలో చేర్చబోమని తెలిపింది. భారతీ ఎయిర్టెల్, ఐడియాతో కలిసి టవర్ల వ్యాపారం కోసం వొడాఫోన్ ఇండస్ టవర్స్ పేరుతో జాయింట్ వెంచర్(జేవీ)ను ఏర్పాటు చేసింది. ‘ఐడియా నుంచి వొడాఫోన్‌కు కొత్తగా షేర్లను జారీ చేసేవిధంగానే విలీన ఒప్పందం ఉంటుంది. దీనివల్ల భారత్‌లో మా కార్యకలాపాల నుంచి వైదొలిగేందుకు వీలవుతుంది. ప్రతిపాదిత ఒప్పందం కుదురుతుందనిగానీ, ఎప్పటికల్లా డీల్ కుదరవచ్చు లేదా నిబంధనలు తదితర అంశాలపై ఎలాంటి కచ్చితత్వం లేదు’ అని వొడాఫోన్ గ్రూప్ పేర్కొంది. కేసులే కారణమా? 2007లో వొడాఫోన్ గ్రూప్ భారత్‌లోకి అడుగుపెట్టింది. అప్పటి ‘హచ్’ టెలికంలో హచిసన్ ఎస్సార్ జాయింట్ వెంచర్‌కు ఉన్న 67 శాతం వాటాను సుమారు 13.1 బిలియన్ డాలర్లకు(హచ్కు ఉన్న 2 బిలియన్ డాలర్ల రుణాన్ని కలిపితే) కొనుగోలు చేసింది. అప్పటి నుంచీ దేశంలో నంబర్ 2 టెలికం ఆపరేటర్‌గా వొడాఫోన్ కొనసాగుతూ వస్తోంది. అయితే, ఈ డీల్‌కు సంబంధించి 2 బిలియన్ డాలర్ల పన్ను చెల్లించాలంటూ అప్పటి యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన రెట్రోస్పెక్టివ్ పన్ను(పాత ఒప్పందాలకూ పన్ను వర్తింపు) నిబంధనలతో వొడాఫోన్ న్యాయపోరాటాన్ని ఆరంభించింది. ఈ కేసులో మన సుప్రీం కోర్టు కూడా వొడాఫోన్‌కు అనుకూలంగానే తీర్పు ఇచ్చింది. దీనిపై ఇంకా న్యాయవివాదం నడుస్తూనే ఉంది. కాగా, గతేడాది భారతీయ వ్యాపార ఆస్తుల విలువలో 5 బిలియన్ పౌండ్లను(దాదాపు 3.35 బిలియన్ డాలర్ల) వొడాఫోన్ తగ్గించుకుంది(రైటాఫ్) కూడా. భారతీయ కార్యకాలాపాలపై వొడాఫోన్ 7 బిలియన్ డాలర్లకుపైగానే పెట్టుబడిగా వెచ్చించింది.ట్యాక్స్ కేసుల నేపథ్యంలో భారత్‌లో వ్యాపార నిర్వహణ చాలా కష్టమంటూ వొడాఫోన్ ఎప్పటినుంచో చెబుతూవస్తోంది. ఈ తరుణంలో ఐడియాతో విలీనం తెరపైకి వచ్చింది. సర్దుకుంటున్న విదేశీ కంపెనీలు... స్పెక్ట్రం కుంభకోణం తర్వాత నెమ్మదిగా విదేశీ టెల్కోలు భారత్ నుంచి నిష్క్రమిస్తున్నాయి. ఇప్పటికే రష్యాకు చెందిన సిస్టెమా ఆర్‌కామ్‌లో కలిసిపోయేందుకు ఒప్పందం కుదరింది. ఎయిర్‌సెల్ కూడా ఆర్‌కామ్‌తో విలీనం అవుతోంది. మరోపక్క, నార్వే కంపెనీ టెలినార్ కూడా ఇక్కడ తమకు సరైన వ్యాపార పరిస్థితులు కనబడటం లేదని... అవకాశం వస్తే భారత్‌కు గుడ్‌బై చెప్పేసేందుకు సిద్ధంగా ఉంది. ఇబ్బందులు తప్పవు... ►ప్రతిపాదిత విలీనానికి కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) ఆమోదం చాలా కీలకం. దీనికోసం విలీనం తర్వాత ఏర్పడే సంస్థ గుజరాత్, మహారాష్ట్ర, హరియాణా, కేరళ, ఉత్తర ప్రదేశ్(పశ్చిమం) సర్కిళ్లలో స్పెక్ట్రంను వదిలేసుకోవాల్సి ఉంటుంది. ►మరోపక్క, టవర్ కంపెనీ ఇండస్‌లో వాటాలను పునర్వ్యవస్థీకరించాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం దీనిలో భారతీ, వొడాఫోన్లకు 42 శాతం చొప్పున, ఐడియాకు 16 శాతం వాటా ఉంది. విలీనం తర్వాత టవర్లకు సంబంధించి అద్దెలు తగ్గడంతో ఇండస్ విలువపై ప్రతికూల ప్రభావం చూపొచ్చు. ►ఇరు కంపెనీల యాజమాన్యాలు కలిసే విషయంలో వాటాల పంపకం, ఇతరత్రా కొన్ని అవాంతరాలు, రిస్కులకు ఆస్కారం ఉంది. నిపుణుల అంచనా ప్రకారం ఈ ఏడాది డిసెంబర్‌కల్లా విలీనం పూర్తయ్యే అవకాశం ఉంది. షేరు రయ్ రయ్... వొడాఫోన్తో విలీనం వార్తల నేపథ్యంలో ఐడియా సెల్యులార్ షేరు ధర దూసుకుపోయింది. సోమవారం బీఎస్ఈలో కంపెనీ షేరు ఒకానొక దశలో 29.2 శాతం ఎగబాకి రూ.100.5 స్థాయిని తాకింది. చివరకు 26 శాతం లాభపడి రూ.97.95 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈలో 26శాతం లాభంతో రూ.98 వద్ద స్థిరపడింది. స్టాక్ మార్కెట్లో ఐడియా లిస్టింగ్ తర్వాత కంపెనీ షేరు విలువ ఒకే రోజు ఇంతలా పెరగడం ఇదే తొలిసారి కావడం విశేషం. షేరు ర్యాలీతో కంపెనీ మార్కెట్ విలువ ఒక్కరోజులోనే రూ.7,257 కోట్లు పెరిగి... రూ.34,279 కోట్లకు చేరింది. కాగా, నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లను ప్రైవేటు ప్లేస్మెంట్ రూపంలో జారీ చేయడం ద్వారా రూ.500 కోట్లను సమీకరించనున్నట్లు సోమవారం స్టాక్ ఎక్సే్ఛంజీలకు ఐడియా వెల్లడించింది. ఐడియా సంగతిదీ... కుమార మంగళం బిర్లా నేతృత్వంలోని ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీల్లో ఐడియా సెల్యులార్ కీలకమైనది. ప్రస్తుతం ఐడియాలో ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు 42.2 శాతం వాటా ఉంది. మలేసియాకు చెందిన యాక్సిటా గ్రూప్‌నకు 19.8 శాతం వాటా ఉండగా.. మిగిలినది ఇతర ఇన్వెస్టర్ల చేతిలో ఉంది. 2007లో వొడాఫోన్ భారత్‌లోకి అడుగుపెట్టినప్పుడే ఐడియా సెల్యులార్ స్టాక్ మార్కెట్లో లిస్టయింది. ప్రస్తుతం ఐడియా సెల్యులార్కు 19 కోట్ల మంది సబ్స్క్రయిబర్లు ఉన్నారు. నంబర్ 3 స్థానంలో ఉంది. మార్కెట్ వాటా దాదాపు 20 శాతం. కాగా, ఐడియాకు ప్రస్తుతం రూ. 55,000 కోట్లకుపైగానే రుణ భారం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో కంపెనీ నికర లాభం 88 శాతం పడిపోయి రూ.762 కోట్ల నుంచి రూ.91 కోట్లకు దిగజారింది. డిసెంబర్ క్వార్టర్(క్యూ3) ఫలితాలు ఇంకా విడుదల కావాల్సి ఉంది. వొడాఫోన్ ఇండియా... వొడాఫోన్ గ్రూప్‌నకు పూర్తిస్థాయి అనుబంధ సంస్థగా వొడాఫోన్ ఇండియా ఉంది. వొడాఫోన్‌కు భారత్‌లో యూజర్ల సంఖ్య 20.1 కోట్లు. గతేడాది సెప్టెంబర్ నాటికి కంపెనీ మొత్తం రుణ భారం రూ.76,800 కోట్లు. అయితే, నవంబర్‌లో మాతృ సంస్థ వొడాఫోన్ గ్రూప్ నుంచి రూ.47,700 కోట్లు పెట్టుబడి రావడంతో రుణ భారం రూ.35,430 కోట్లకు దిగొచ్చింది. ప్రస్తుతం భారత్‌లో కంపెనీ మార్కెట్ వాటా 23 శాతం. -
ఆరోగ్య బీమా రంగంలోకి ఆదిత్యా బిర్లా గ్రూప్
-
ఆరోగ్య బీమా రంగంలోకి ఆదిత్యా బిర్లా గ్రూప్
ఎంఎంఐతో కలసి జాయింట్ వెంచర్‌గా ప్రారంభం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆర్థిక సేవల రంగంలో పేరొందిన ఆదిత్యా బిర్లా గ్రూప్.. తొలిసారిగా ఆరోగ్య బీమా రంగంలోకి ఆదిత్యా బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ (ఏబీహెచ్‌ఐసీఎల్) బ్రాండ్ పేరిట మార్కెట్లోకి ప్రవేశించింది. ఆదిత్యా బిర్లా గ్రూప్, దక్షిణాఫ్రికాకు చెందిన ఆర్థిక సేవల సంస్థ ఎంఎంఐ హోల్డింగ్స్‌తో కలసి 51:49 జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయడం ద్వారా ఆరోగ్యబీమా రంగంలోకి ప్రవేశించినట్లు ఏబీహెచ్‌ఐసీఎల్ సీఈఓ మయాంక్ భత్వాల్ గురువారమిక్కడ తెలిపారు. ప్రస్తుతం రెండు గ్రూపుల్లో 4 రకాల పాలసీలు, ఒక రిటైల్ పాలసీ అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. 150 నగరాల్లోని 1,500 ఆసుపత్రులతో ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పారు. ప్రస్తుతం దేశంలో ఆరోగ్య బీమా పరిశ్రమ 3.5 బిలియన్ డాలర్లుగా ఉందని, పాలసీలు తీసుకునే వారు మాత్రం 5 శాతం లోపే ఉన్నారని తెలిపారు. బీమా పాలసీ మీద సరైన అవగాహనలేమి, ప్రభుత్వ ప్రోత్సాహం తక్కువగా ఉండటమే ఇందుకు కారణాలని అభిప్రాయపడ్డారు. దీన్నే వ్యాపార సూత్రంగా మార్చుకునేందుకు ‘హెల్త్ ఫస్ట్’ పేరిట ఆరోగ్య బీమాపై విస్తృతస్థాయిలో ప్రచారం, అవగాహన కార్యక్రమాలు చేపడతామని వివరించారు. ఈ కార్యక్రమంలో సీఎంఓ అజయ్ కక్కర్ పాల్గొన్నారు. -
‘మోదీ రూ. 25 కోట్ల లంచం తీసుకున్నారు’
న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ పేర్కొన్నట్టు పెద్దనోట్ల రద్దు పేదలకు కడఖ్ చాయ్ కాదని, అది వారికి విషప్రాయమని చెప్పుకొచ్చారు. మోదీ పేదలను దోచుకొని, తన కార్పొరేట్ స్నేహితులను కాపాడుకుంటున్నారని, వ్యాపారవేత్తలు ఆయనకు ముడుపులు ఇస్తుండగా.. వారి ఇళ్లమీద ఐటీదాడులు జరగకుండా మోదీ చూస్తున్నారని విమర్శించారు. పెద్దనోట్ల రద్దు వల్ల ప్రజలు పడుతున్న కష్టాలపై చర్చించేందుకు ప్రత్యేకంగా మంగళవారం నిర్వహించిన ఢిల్లీ అసెంబ్లీ సమావేశాల్లో కేజ్రీవాల్ మాట్లాడారు. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఆదిత్య బిర్లా గ్రూప్ నుంచి రూ. 25 కోట్లు లంచం తీసుకున్నారని కేజ్రీవాల్ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘2013 అక్టోబర్‌లో అప్పటి ఆదిత్య బిర్లా గ్రూప్ అధ్యక్షుడిగా ఉన్న శుబేందు అమితాబ్‌పై ఐటీ దాడులు నిర్వహించింది. ఆయన లాప్‌టాప్‌లు, బ్లాక్‌బెర్రీ ఫోన్లు స్వాధీనం చేసుకుంది. వాటిని పరిశీలించగా 2012 నవంబర్ 16న గుజరాత్ సీఎంకు రూ. 25 కోట్లు చెల్లించినట్టు ల్యాప్‌టాప్‌లో వివరాలు ఉన్నాయి’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. -
మోర్ దుకాణాలపై ‘ఫ్యూచర్’ గ్రూప్ కన్ను
కొనుగోలుకు చర్చలు! న్యూఢిల్లీ : బిగ్‌బజార్, ఫ్యూచర్ బజార్, బ్రాండ్ ఫ్యాక్టరీ, హోమ్టౌన్ వంటి రిటైల్ దుకాణాలను నిర్వహించే ఫ్యూచర్ గ్రూపు... ‘మోర్’ పేరుతో మెగా మార్ట్లను నిర్వహిస్తున్న ఆదిత్య బిర్లా రిటైల్‌ను సొంతం చేసుకోవాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించిన చర్చలు కొనసాగుతున్నట్టు సమాచారం. ఆఫ్‌లైన్ గొలుసుకట్టు రిటైల్ దుకాణాల్లో ఫ్యూచర్ గ్రూపు అగ్రగామిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ విభాగంలో మరింతగా నిలదొక్కుకోవాలన్న వ్యూహాత్మక ఆలోచనలో భాగంగానే మోర్‌ను సొంతం చేసుకోవాలనుకుంటోంది. కొనుగోలు లేదా విలీనం ఈ రెండింటిలో ఆదిత్య బిర్లా గ్రూపు దేనికి అంగీకరించినా ఫ్యూచర్ గ్రూపు సమ్మతించే అవకాశం ఉందని ఈ వహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. ఈ మేరకు ఒక ప్రముఖ మీడియా సంస్థ కథనాన్ని ప్రచురించింది. అయితే, ఇది పూర్తిగా ఊహాగానమేనని, అధికారికంగా వీటిని ఖండిస్తున్నట్టు ఫ్యూచర్‌గ్రూప్ ప్రతినిధి స్పష్టం చేశారు. అదే సమయంలో ఆదిత్య బిర్లా రిటైల్ లిమిటెడ్ దీనిపై స్పందించలేదు. ఫ్యూచర్ కొనుగోళ్ల క్రమం రిలయన్స్ రిటైల్ తర్వాత దేశంలో రెండో అతిపెద్ద రిటైల్ సంస్థ ఫ్యూచర్ గ్రూపు. బిగ్ యాపిల్, నీల్గిరి, భారతీ రిటైల్ వంటి పలు సంస్థలను ఇప్పటికే తన సొంతం చేసుకుంది. దేశవ్యాప్తంగా 200 పట్టణాల్లో 700 దుకాణాలను ఫ్యూచర్ గ్రూపు నిర్వహిస్తోంది. బిగ్బజార్డెరైక్ట్.కామ్, ఫ్యూచర్బజార్.కామ్ వంటి ఈకామర్స్ పోర్టళ్లు కూడా సంస్థ ఆధ్వర్యంలో ఉన్నాయి. ఫర్నిచర్ విక్రయించే ఈ కామర్స్ పోర్టల్ ఫ్యాబ్‌ఫర్నిష్.కామ్‌ను సైతం ఇటీవలే కొనుగోలు చేసింది. -
స్టాక్స్ వ్యూ
హిందాల్కో.. కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: రెలిగేర్ ఎంటర్ప్రైజెస్ ప్రస్తుత ధర: రూ.146 టార్గెట్ ధర: రూ.190 పుస్తక విలువ: రూ.187 ముఖ విలువ: రూ.1 ఈపీఎస్: రూ.4 ఏడాది కనిష్టం/గరిష్టం: రూ.59/152 ఎందుకంటే: ఆదిత్య బిర్లా గ్రూప్‌కు చెందిన హిందాల్కో కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. ఆదాయం క్షీణించినా, అధిక పన్ను వ్యయాలు ఉన్నప్పటికీ, నికర లాభం(స్టాండోలోన్) ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ క్వార్టర్లో ఐదు రెట్లు వృద్ధి చెంది రూ. 294 కోట్లకు పెరిగింది. ఉత్పత్తి నిలకడగా ఉండటం, ఇంధన ధరలు తక్కువగా ఉండటంతో వ్యయ ప్రయోజనాల కారణంగా ఇబిటా అంచనాలను మించి 1,130 కోట్లకు పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇబిటా రూ.12,400 కోట్లుగా ఉండొచ్చని భావిస్తున్నాం. కంపెనీ అనుబంధ సంస్థ నొవాలిస్ కూడా మంచి ఆర్థిక ఫలితాలనే సాధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో హిందాల్కో కంపెనీ రూ.10,000 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నది. ఈ పెట్టుబడులకు పటిష్టమైన ఇబిటా తోడుకానుండటంతో కంపెనీకి రూ.2,500 కోట్ల మేర ఫ్రీ క్యాష్ ఫ్లోస్ ఉండొచ్చని అంచనా వేస్తున్నాం. ఫలితంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నికర రుణ భారం 2,500-3,000కోట్ల రేంజ్లో తగ్గవచ్చు. ఇటీవల జరిగిన వేలంలో 4.5 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలను తక్కువ ధరలకే దక్కించుకున్నది. ఈ బొగ్గు సరఫరాలు ఈ ఏడాది అక్టోబర్ నుంచి అందుబాటులోకి వస్తాయి. దీంతో బొగ్గు వ్యయాలు మరింతగా తగ్గుతాయి. నిర్వహణ అంశాల పరంగా రాగి ఉత్పత్తిని 53 రోజుల పాటు నిలిపేసింది. ఫలితంగా ఈ క్యూ1లో రాగి విభాగం లాభదాయకత తగ్గింది. ఉత్పత్తి కార్యక్రమాలు మళ్లీ ప్రారంభం కానుండటంతో ఈ విభాగం మంచి పనితీరు కనబరిచే అవకాశాలున్నాయి. వడ్డీరేట్లు తగ్గుతుండటంతో వడ్డీ వ్యయాలు గణనీయంగా తగ్గుతాయని కంపెనీ భావిస్తోంది. చైనా, ఇతర దేశాల నుంచి వస్తోన్న అల్యూమినియం దిగుమతులపై యాంటీ డంపింగ్ లేదా కనీస దిగుమతి ధర విధించాలని ప్రభుత్వం యోచిస్తుండటం కంపెనీకి కలసివచ్చే అంశం. లుపిన్.. కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డెరైక్ట్ ప్రస్తుత ధర: రూ.1,579 టార్గెట్ ధర: రూ.1,890 పుస్తక విలువ: రూ.244 ముఖ విలువ: రూ.2 ఈపీఎస్: రూ.57 ఏడాది కనిష్టం/గరిష్టం: రూ.1,274/2,127 ఎందుకంటే: జనరిక్ ఔషధాలు ఎగుమతి చేసే అతి పెద్ద భారత కంపెనీల్లో లుపిన్ ఒకటి. స్థూల మార్జిన్లు పటిష్టంగా ఉండటం, అమెరికా వృద్ధి జోరుగా ఉండటంతో లుపిన్ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఫలితాలు అంచనాలకనుగుణంగానే ఉన్నాయి. కంపెనీ మొత్తం టర్నోవర్‌లో 43 శాతంగా ఉన్న అమెరికా అమ్మకాలు 84 శాతం పెరగడంతో ఆదాయం 41 శాతం వృద్ధితో రూ.4,439 కోట్లకు పెరిగింది. ఇబిటా మార్జిన్లు 333 బేసిస్ పాయింట్లు మెరుగుపడి 30 శాతానికి, ఇబిటా 59 శాతం వృద్ధితో రూ.1,308 కోట్లకు పెరిగాయి. నికరలాభం 55 శాతం పెరిగి రూ.882 కోట్లకు పెరిగింది. పరిశోధన. అభివృద్ధికి అధికంగా పెట్టుబడులు సమకూర్చుకోవడం, అమెరికా, జపాన్‌ల్లో ఔషధాల ధరల నిర్ణయంపై ఒత్తిడి మార్జిన్లపై ప్రభావం చూపుతాయని కంపెనీ అంచనా వేస్తోంది. అయితే వ్యయ నియంత్రణ పద్ధతులు, కొత్త ఔషధాలను మార్కెట్లోకి తేవడం తదితర అంశాల కారణంగా ఈ ఒత్తిడిని అధిగమిస్తామని కంపెనీ ధీమాగా ఉంది. ఇటీవలనే అమెరికాకు చెందిన గావిస్ ఫార్మా కొనుగోలును పూర్తి చేసింది. దీంతో అమెరికా ఎఫ్‌డీఏ ఆమోదం కోసం ప్రతి ఏటా దాఖలు చేసే కొత్త ఔషధాల ప్రతిపాదనలు 20 నుంచి 45కు పెరగనున్నాయి. వీటిల్లో ఏటా కనీసం 15 ప్రతిపాదనలకు ఆమోదం లభించగలదని కంపెనీ భావిస్తోంది. గత పదేళ్లలో ఆదాయం 24%, ఇబిటా 29 శాతం, నికర లాభం 29 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధించాయి. రెండేళ్లలో అమెరికా అమ్మకాలు 26%, భారత విక్రయాలు 11 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా. 2016-18 కాలానికి ఆదాయం 20%, ఇబిటా 21%, నికర లాభం 22 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని భావిస్తున్నాం. వివిధ దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తుండటం, పటిష్టమైన బ్యాలెన్స్ షీట్.. కంపెనీ బలాలు. రష్యా ప్రభుత్వ షరతుల కారణంగా బయోకామ్ కొనుగోలులో జాప్యం కానుండటం ప్రతికూలమైన అంశం. -
గ్రాసిమ్‌లో ఆదిత్య బిర్లా విలీనం
అతి పెద్ద డైవర్సిఫైడ్ కంపెనీ అవతరణ వాటాదారులకు మరింత విలువ చేకూర్చడానికే ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా వెల్లడి న్యూఢిల్లీ: భారత కార్పొరేట్ రంగంలో మరో భారీ విలీనం చోటు చేసుకోనుంది. ఆదిత్య బిర్లా గ్రూప్‌కు చెందిన రెండు కంపెనీలు విలీనం కానున్నాయి. ఆదిత్య బిర్లా నువో (ఏబీఎన్‌ఎల్) కంపెనీ... గ్రాసిమ్ ఇండస్ట్రీస్‌లో విలీనం కానుంది. ఈ విలీనం కారణంగా రూ.60వేల కోట్ల డైవర్సిఫైడ్ సంస్థ అవతరిస్తుంది. ఈ విలీన ప్రణాళికను ఆదిత్య బిర్లా నువో, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, ఆదిత్య బిర్లా ఫైనాన్షియల్ సర్వీసెస్ల డెరైక్టర్ల బోర్డ్‌లు ఆమోదించాయి. ఈ విలీనం వల్ల వాటాదారులకు మరింత విలువ చేకూరుతుందని ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా పేర్కొన్నారు. ఆయన వెల్లడించిన విలీన ప్రణాళిక వివరాల ప్రకారం.., అతి పెద్ద డైవర్సిఫైడ్ కంపెనీల్లో ఒకటి... ఈ విలీనం కారణంగా భారత్‌లో అతి పెద్దదైన, డైవ ర్సిఫైడ్ కంపెనీల్లో ఒకటిగా విలీన కంపెనీ, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ నిలుస్తుందని బిర్లా చెప్పారు. నిలకడైన నగదు ప్రవాహాలు, దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునే సంస్థగా అవతరిస్తుందన్నారు. తయారీ రంగం నుంచి సేవల రంగం వరకూ వివిధ కార్యకలాపాలు నిర్వహిస్తుందని, దేశీయ వృద్ధికి తోడ్పాటునందించగలదని చెప్పారాయన. విలీనాంతరం, రూ.60 వేల కోట్ల టర్నోవర్‌తో గ్రాసిమ్ ఇండస్ట్రీస్ భారత్‌లోనే అగ్రశ్రేణి సిమెంట్ కంపెనీగా, అగ్రశ్రేణి పది డైవ ర్సిఫైడ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల్లో ఒకటిగా, నాలుగో అతి పెద్ద ప్రైవేట్ జీవిత బీమా, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీగా, మూడో అతి పెద్ద టెలికం కంపెనీగా అవతరిస్తుంది. ఈ కంపెనీ ఇబిటా రూ.11,961 కోట్లుగా ఉంటుందని అంచనా. విలీనాంతరం ఏర్పడే కంపెనీలో 17 శాతం వాటా ప్రమోటర్లకు, 57 శాతం వాటా గ్రాసిమ్ కంపెనీకి, మిగిలిన 26 శాతం వాటా ప్రజల వద్ద ఉంటుంది. ఈ లావాదేవీ ఈ ఆర్థిక సంవత్సరం చివరి క్వార్టర్లో గానీ, వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్లో గానీ పూర్తికావచ్చు. మరోవైపు రూ. 10 ముఖ విలువ గల ఒక్కో షేర్‌ను రూ. 2 ముఖ విలువగల ఐదు షేర్లుగా విభజించాలని గ్రాసిమ్ డెరైక్టర్ల బోర్డ్ నిర్ణయించింది. ఇదీ... విలీన ప్రణాళిక ఆదిత్య బిర్లా నువోకు చెందిన ఆర్ధిక సేవల వ్యాపారాన్ని ఈ కంపెనీ పూర్తి అనుబంద సంస్థ, ఆదిత్య బిర్లా ఫైనాన్షియల్ సర్వీసెస్(ఏబీఎఫ్‌ఎస్‌ఎల్)లో విలీనం చేస్తారు. తర్వాతి కాలంలో(వచ్చే ఏడాది మే లేదా జూన్‌లో) ఈ ఏబీఎఫ్‌ఎస్‌ఎల్ స్టాక్ మార్కెట్లో లిస్టవుతుంది. ఆదిత్య బిర్లా నువో కంపెనీని గ్రాసిమ్ ఇండస్ట్రీస్‌లో విలీనం చేస్తారు. ఫలితంగా ప్రతి పది ఆదిత్య బిర్లా నువో షేర్లకు మూడు గ్రాసిమ్ ఈక్విటీ షేర్లు లభిస్తాయి. విలీనాంతరం ఏర్పడే గ్రాసిమ్ షేర్లున్న వాటాదారులకు ప్రతి ఒక్క గ్రాసిమ్ ఈక్విటీ షేర్‌కు ఏడు ఆదిత్య బిర్లా ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఏబీఎఫ్‌ఎస్‌ఎల్) షేర్లు లభిస్తాయి. అంటే ప్రతి పది ఆదిత్య బిర్లా నువో షేర్లకు మూడు గ్రాసిమ్ షేర్లు, 21 ఆదిత్య బిర్లా ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు లభిస్తాయి. ఈ విలీన ప్రతిపాదనకు స్టాక్ ఎక్స్చేంజీల, మధ్య ప్రదేశ్, గుజరాత్ హైకోర్టుల, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా, వాటాదారుల ఆమోదం పొందాల్సి ఉంది. ఇటీవలే ఆరోగ్య బీమాకు అనుమతి! ఆరోగ్య బీమా వ్యాపారం నిర్వహించడానికి ఆదిత్య బిర్లా నువోకు ఇటీవలే ఆమోదం లభించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్థభాగంలో కార్యకలాపాలు ప్రారంభించవచ్చు. ఆదిత్య బిర్లా నువో కంపెనీ సోలార్, చెల్లింపుల బ్యాంకు, ఆరోగ్య బీమా వ్యాపారాల్లోకి ప్రవేశిస్తుంది. కొత్తగా ఏర్పడే ఏబీ ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు ఐడియా సెల్యులర్ రుణభారంతో ఎలాంటి సంబంధం ఉండదు. గ్రాసిమ్ ఇండస్ట్రీస్‌కు నికరంగా ప్రస్తుతం రూ.460 కోట్ల నగదు నిల్వలున్నాయి. ఈ విలీన వార్తల కారణంగా బీఎస్ఈలో ఆదిత్య బిర్లా నువో షేర్ 3.5 శాతం(రూ.53) లాభపడి రూ.1,566 వద్ద, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ షేర్ 6.4 శాతం(రూ.312) క్షీణించి రూ.4,539 వద్ద ముగిశాయి. గ్రాసిమ్ ఇండస్ట్రీస్ 1948లో గ్రాసిమ్ ఇండస్ట్రీస్ టెక్స్టైల్ కంపెనీగా ప్రారంభమైంది. ప్రస్తుతం విస్కోస్ స్టేపుల్ ఫైబర్ తయారీ, సిమెంట్, రసాయనాలు, టెక్స్టైల్స్ వ్యాపారాలను నిర్వహిస్తోంది. కంపెనీ ఆదాయంలో 90 శాతం సిమెంట్ వ్యాపారం నుంచే వస్తోంది. ఈ కంపెనీ అనుబంధ సంస్థ, అల్ట్రాటెక్ సిమెంట్ భారత్‌లోనే అతి పెద్ద సిమెంట్ కంపెనీ. ఆదిత్య బిర్లా నువో ఆర్థిక సేవలు, జీవిత బీమా, సౌర శక్తి సంబంధిత వ్యాపారం, టెలికం, లినన్, వ్యవసాయ, రేయాన్, ఇన్సులేటర్ల సెగ్మెంట్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఐడియాలో 23 శాతం వాటా ఉంది. -
అల్ట్రాటెక్ సిమెంట్ లాభం రూ.780 కోట్లు
న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా గ్రూప్‌కు చెందిన అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.780 కోట్ల నికర లాభం(కన్సాలిటేడెడ్) ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో సాధించిన నికర లాభం రూ.604కోట్లతో పోలిస్తే 29 శాతం వృద్ధి సాధించామని పేర్కొంది. అమ్మకాలు బాగా ఉండడం, వ్యయ నియంత్రణ పద్ధతుల కారణంగా ఈ స్థాయిలో లాభాలు వచ్చాయని వివరించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో రూ.6,341 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1లో రూ.6,590 కోట్లకు పెరిగిందని తెలిపింది. అమ్మకాలు 6 శాతం వృద్దితో 12.57 మిలియన్ టన్నులకు పెరిగాయని, ఉత్పత్తి వ్యయం 7 శాతం తగ్గి రూ.3,643 కోట్లకు చేరిందని పేర్కొంది. -
అల్ట్రాటెక్ లాభం రూ.723 కోట్లు
♦ భారీగా పెరిగిన నికర అమ్మకాలు ♦ లాభంలో 10 శాతం వృద్ధి ♦ ఒక్కో షేరుకి రూ. 9.5 డివిడెండ్ న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు చెందిన అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలానికి రూ.723 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2014-15) నాలుగో త్రైమాసిక కాలంలో సాధించిన నికర లాభం రూ.657 కోట్లతో పోలిస్తే 10 శాతం వృద్ధి సాధించామని అల్ట్రాటెక్ సిమెంట్ పేర్కొంది. నికర అమ్మకాలు పెరగడంతో నికర లాభం 10 శాతం ఎగసిందని తెలియజేసింది. రూ.10 ముఖ విలువ గల ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.9.5 డివిడెండ్‌ను చెల్లిస్తున్నట్లు ప్రకటించింది. తగ్గిన వ్యయాలు 2014-15 క్యూ4లో రూ.6,517 కోట్లుగా ఉన్న నికర అమ్మకాలు 2015-16 క్యూ4లో రూ.6,850 కోట్లకు, మొత్తం వ్యయాలు రూ.5,519 కోట్ల నుంచి రూ.5,857 కోట్లకు చేరుకున్నాయి. దేశీయంగా సిమెంట్ అమ్మకాలు 15 శాతం పెరిగాయని, గ్రే సిమెంట్ అమ్మకాలు 11.51 మిలియన్ టన్నుల నుంచి 13.2 మిలియన్ టన్నులకు వృద్ధి చెందాయని కంపెనీ తెలియజేసింది. పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2014-15లో 43.38 మిలియన్ టన్నులుగా ఉన్న గ్రే సిమెంట్ అమ్మకాలు గత ఆర్థిక సంవత్సరంలో 46.93 మిలియన్ టన్నులకు పెరిగాయి. ఇంధనం ధరలు తగ్గడం, పటిష్టమైన నిర్వహణ పనితీరు కారణంగా నిర్వహణ వ్యయాలు తగ్గాయని తెలిపింది. డిమాండ్ 7-8 శాతం మౌలిక సదుపాయాల అభివృద్ధి, హౌసింగ్, స్మార్ట్ సిటీలు, తదితర అంశాలపై ప్రభుత్వం దృష్టి సారిస్తుండటంతో ఈ ఆర్థిక సంవత్సరంలో సిమెంట్ డిమాండ్ 7-8 శాతం పెరగగలవని కంపెనీ అంచనా వేస్తోంది. ఇది తమకు సానుకూలమైన అంశమని పేర్కొంది. ఈ డిమాండ్‌ను అందిపుచ్చుకోగలమని, భారత దేశ తర్వాతి దశ వృద్ధిలో చురుకుగా పాలుపంచుకోగలమని ధీమా వ్యక్తం చేసింది. తమ వార్షిక ఉత్పాదక సామర్థ్యం 66.3 మిలియన్ టన్నులకు పెరిగిందని, విస్తరణ కార్యక్రమాలన్నీ అనుకున్నవిధంగానే జరుగుతున్నాయని తెలిపింది. ప్రైవేట్ ప్లేస్మెంట్ ప్రాతిపదికన రిడీమబుల్ నాన్-కన్వర్టబుల్ డిబెంచర్లను జారీ చేసేందుకు ఆమోదం పొందామని పేర్కొంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో అల్ట్రాటెక్ సిమెంట్ షేర్ ధర స్వల్పంగా పెరిగి రూ.3,278 వద్ద ముగిసింది. -
స్టాక్స్ వ్యూ
గ్రాసిమ్ ఇండస్ట్రీస్ కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్ ప్రస్తుత ధర: రూ.3845 టార్గెట్ ధర: రూ.4,900 ఎందుకంటే: అదిత్య బిర్లా గ్రూప్‌కు చెందిన ఈ కంపెనీ దుస్తుల తయారీలో వినియోగించే విస్కోస్ స్టేపుల్ ఫైబర్(వీఎస్ఎఫ్), సిమెంట్, కెమికల్స్, టెక్స్టైల్స్ రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. కంపెనీకి 90 శాతానికి పైగా ఆదాయం, నిర్వహణ లాభాలు వీఎస్ఎఫ్, సిమెంట్ రంగాల నుంచే వస్తున్నాయి. దేశీయ సిమెంట్ రంగంలో అగ్రగ్రామి సంస్థ ఆల్ట్రాటెక్ సిమెంట్ ఈ కంపెనీ అనుబంధ సంస్థే. వీఎస్‌ఎఫ్‌కు సంబంధించి 9 శాతం మార్కెట్ వాటాతో మార్కెట్లో అగ్రస్థానంలో ఉంది. గుజరాత్‌లోని విలాయత్‌లో కొత్తగా 550 ఎకరాల్లో వీఎస్ఎఫ్, కెమికల్స్ విభాగాలకు చెందిన ప్లాంట్లను ఏర్పాటు చేసింది. పూర్తిగా ఆటోమేటెడ్ అయిన ఈ ప్లాంట్ల కారణంగా కంపెనీకి పలు వ్యయాలు ఆదా అవుతున్నాయి. ఓడరేవుకు దగ్గరగా ఉండడం వల్ల లాజిస్టిక్స్ ప్రయోజనాలు కూడా కంపెనీకి కలసి వస్తున్నాయి. స్వల్ప పెట్టుబడి, కాలంలోనే ఈ ప్లాంట్ల సామర్థ్యాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. ఏబీసీఎల్ విలీనంతో కెమికల్స్ విభాగం సామర్థ్యం దాదాపు రెట్టింపు కావడం, విలాయత్ ప్లాంట్లను పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం, విస్తృతమైన డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, అధిక విలువ ఉన్న ప్రత్యేకమైన ఉత్పత్తులను మార్కెట్లోకి తేవడం.. కంపెనీకి కలసి వచ్చే అంశాలు. సమ్ ఆప్ ద పార్ట్స్ (ఎస్ఓటీపీ) ప్రాతిపదికన ఏడాది కాలానికి రూ.4,900 టార్గెట్ ధరను నిర్ణయించాం. కోల్ ఇండియా కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: ఎడిల్‌వేజ్ ప్రస్తుత ధర: రూ.288 టార్గెట్ ధర: రూ.376 ఎందుకంటే: ప్రభుత్వ రంగంలోని ఈ మహారత్న కంపెనీ ప్రపంచంలోనే అతి పెద్ద బొగ్గు కంపెనీ, దేశంలో 80 శాతానికి పైగా బొగ్గును ఈ కంపెనీయే ఉత్పత్తి చేస్తోంది. ఇటీవలనే ఉద్యోగులకు వేతనాలను పెంచింది. ఈ వేతనపెంపు, క్లీన్ ఎనర్జీ సుంకం ప్రభావాలను అధిగమించగలమని కంపెనీ ధీమాగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 598 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతీ ఏడాది 5 శాతం వ్యయాలను తగ్గించుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. ధరల పెంచుకోవడం వల్ల వేతనాల పెంపు ప్రభావాన్ని అధిగమించుకోగలమని కంపెనీ పేర్కొంది. దిగుమతి చేసుకునే బొగ్గు ధరలతో పోల్చితే కోల్ ఇండియా బొగ్గు ధరలు తక్కువగానే ఉండటంతో ధరల పెంపుకు అవకాశం ఉంది. కంపెనీ అమ్మకాల్లో 80 శాతం వరకూ దీర్ఘకాల ఒప్పందాలకు సంబంధించినవే కావడంతో అమ్మకాల్లో స్థిరత్వం ఉండగలదు. వ్యయాలు తగ్గించుకోవడం, వేతన పెంపు ప్రభావాన్ని ధరలు పెంచుకోవడం ద్వారా అధిగమించడం వల్ల మార్జిన్లు బాగానే ఉండొచ్చని అంచనా వేస్తున్నాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈపీఎస్‌కు 12 రెట్లు, వచ్చే ఆర్థిక సంవత్సరం ఈపీఎస్‌కు 12.5 రెట్ల ధరకు ప్రస్తుతం ఈ షేర్ ట్రేడవుతోంది. లక్ష్మీ మెషీన్ వర్క్స్ కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: ఫస్ట్‌కాల్ రీసెర్చ్ ప్రస్తుత ధర: రూ.3,398 టార్గెట్ ధర: రూ.3,600 ఎందుకంటే: ఈ కంపెనీ టెక్స్టైల్ మెషినరీ, మెషీన్ టూల్స్, ఫౌండ్రీ విభాగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. టెక్స్టైల్స్ రంగానికి చెందిన పూర్తి స్థాయి యంత్రాలను తయారు చేసే మూడు ప్రపంచ కంపెనీల్లో ఇదొకటి. దేశీయ టెక్స్టైల్ స్నిన్నింగ్ మెషినరీ పరిశ్రమలో 60 శాతం మార్కెట్ వాటా ఈ కంపెనీదే. కంపెనీకి చెందిన సీఎన్సీ మెషీన్ టూల్స్... కస్టమైజ్డ్ ఉత్పత్తులు తయారు చేయడంలో అగ్రశ్రేణి సంస్థ, ఇక వివిధ పరిశ్రమలకు కావలసిన ప్రెసిషన్ క్యాస్టింగ్స్ను ఈ కంపెనీ విభాగం, ఎల్ఎండబ్ల్యూ ఫౌండ్రీ తయారు చేస్తోంది. యూరప్, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. గత క్యూ3లో రూ.568 కోట్లుగా ఉన్న నికర అమ్మకాలు ఈ క్యూ3లో 15 శాతం వృద్ధితో రూ.652 కోట్లకు పెరిగాయి. నికర లాభం 45 కోట్ల నుంచి 42 శాతం వృద్ధితో రూ.63 కోట్లకు ఎగిశాయి. మరో మూడేళ్ల పాటు కంపెనీ మిగులు పరిస్థితులు కొనసాగవచ్చని అంచనా వేస్తున్నాం. రెండేళ్లలో నికర అమ్మకాలు 8 శాతం, నికర లాభం 21 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా. గత ఆర్థిక సంవత్సరంలో 2.56గా ఉన్న మార్కెట్ ధరకు పుస్తక ధరకు ఉన్న నిష్పత్తి ఈ ఆర్థిక సంవత్సరంలో 2.24గా ఉండొచ్చని అంచనా. టెక్స్టైల్స్ రంగానికి చెందిన యంత్రాల ఎగుమతుల్లో ఎన్నో ఏళ్లు టాప్ ఎక్స్పోర్ట్ అవార్డును గెల్చుకున్న కంపెనీ ఇది. -
ఈ-కామర్స్ రంగంలోకి ఆదిత్యా బిర్లా గ్రూప్
ముంబై: ఆదిత్యా బిర్లా గ్రూప్ ఈ-కామర్స్ రంగంలోకి అడుగుపెట్టింది. ఇది ‘అబాఫ్.కామ్’ (అబాఫ్-ఆల్ అబౌట్ ఫ్యాషన్) పేరుతో ఫ్యాషన్ పోర్టల్‌ను ప్రారంభించింది. అబాఫ్ పోర్టల్‌లో దుస్తులు, ఫుట్‌వేర్స్, ఇతర యాక్సిసిరీస్లను వినియోగదారుల కోసం అందుబాటులో ఉంచామని ఆదిత్యా బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా తెలిపారు. ఈ పోర్టల్‌లో ప్రస్తుతం 7,000 ఉత్పత్తులను వినియోగదారులకు అందుబాటులో ఉంచామని, వీటి సంఖ్యను రానున్న కాలంలో 20,000లకు పెంచుతామని అబాఫ్.కామ్ ప్రెసిడెంట్, సీఈవో ప్రశాంత్ గుప్తా తెలిపారు. -
హిందాల్కో లాభం డౌన్..
న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా గ్రూప్‌కు చెందిన ఫ్లాగ్షిప్ కంపెనీ, హిందాల్కో ఇండస్ట్రీస్ నికర లాభం(స్టాండోలోన్) గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి క్వార్టర్‌కు 36 శాతం తగ్గి రూ.160 కోట్లకు దిగింది. ఇక నికర అమ్మకాలు రూ.8,360 కోట్ల నుంచి 10 శాతం వృద్ధితో రూ.9,219 కోట్లకు పెరిగాయని కంపెనీ పేర్కొంది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరానికి నికర లాభం 35 శాతం క్షీణించి రూ.925 కోట్లకు, నికర అమ్మకాలు 24 శాతం వృద్ధి చెంది రూ.34,094 కోట్లకు చేరాయని పేర్కొంది. ఒక్కో షేర్‌కు రూ.1 డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది. ఆర్థిక ఫలితాల నేపథ్యలో హిందాల్కో షేర్ బీఎస్ఈలో 1.5 శాతం క్షీణించి రూ.132 వద్ద ముగిసింది. -
ఇక ఒకే కంపెనీ గూటికి... ఆదిత్య బిర్లా అపారెల్ బిజినెస్
భారీ పునర్వ్యవస్థీకరణకు ఓకే... ⇒ బ్రాండెడ్ రెడీమేడ్ దుస్తుల వ్యాపారాల విలీనం.. ⇒ కొత్త సంస్థ పేరు ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ ⇒ విలీనంతో ఏర్పాటయ్యే కంపెనీకి రూ. 6,000 కోట్ల టర్నోవర్.. 1,869 రిటైల్ స్టోర్లు.. న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా గ్రూప్ తన బ్రాండెడ్ రెడీమేడ్ దుస్తులు(అపారెల్) వ్యాపారాలన్నింటినీ విలీనం చేసి ఒకే సంస్థగా ఏర్పాటు చేసేవిధంగా భారీ పునర్వ్యవస్థీకరణకు తెరతీసింది. పూర్తిగా షేర్ల రూపంలో జరిగే ఈ డీల్‌కు ఆయా కంపెనీల బోర్డులు ఆమోదం తెలిపాయి. దీని ప్రకారం గ్రూప్ హోల్డింగ్ కంపెనీ ఆదిత్య బిర్లా నువో(ఏబీఎన్‌ఎల్)కు చెందిన దుస్తుల వ్యాపారాలతో పాటు గ్రూప్‌లోని మరో సంస్థ మధుర గార్మెంట్స్ లైఫ్‌స్టైల్ రిటైల్ కంపెనీ(ఎంజీఎల్ఆర్సీఎల్)లను విడదీసి మరో లిస్టెడ్ కంపెనీ అయిన పాంటలూన్ ఫ్యాషన్ అండ్ రిటైల్(పీఎఫ్‌ఆర్‌ఎల్)లో విలీనం చేయనున్నారు. విలీనం అనంతరం దీని పేరు ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్(ఏబీఎఫ్ఆర్ఎల్)గా మారుతుంది. కొత్తగా ఏర్పాటైన సంస్థకు దేశవ్యాప్తంగా 1,869 ఎక్స్‌క్లూజివ్ రిటైల్ స్టోర్లు.. అదేవిధంగా రూ.6,000 కోట్ల మేర ఆదాయం ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ‘మధుర గార్మెంట్స్, ఏబీఎన్‌ఎల్ రెడీమేడ్ వ్యాపారాలు, పాంటలూన్స్ను విలీనం చేయడం ద్వారా ఏర్పాటవుతున్న కొత్త సంస్థ..కూడా అతిపెద్దదిగా అవతరించనుంది. అంతేకాదు ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ రంగంలో భారత్‌లోనే టాప్ కంపెనీగా కూడా నిలవనుంది. వాటాదారులకు కూడా దీనివల్ల ప్రయోజనం చేకూరుతుంది’ అని గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా ఆదివారమిక్కడ విలేకరులతో పేర్కొన్నారు. ఈ స్కీమ్ ఆఫ్ అరేంజ్మెంట్ ప్రకారం.. ఏబీఎన్‌ఎల్ వాటాదారులకు ఏబీఎఫ్ఆర్ఎల్లో ప్రత్యక్షంగా షేర్‌హోల్డింగ్ లభిస్తుందన్నారు. షేర్ల కేటాయింపు ఇలా... మధుర ఫ్యాషన్స్‌ను విడదీస్తున్న కారణంగా(డీమెర్జర్) ఏబీఎన్ఎల్లో వాటాదారుల ప్రతి 5 షేర్లకుగాను పీఎఫ్ఆర్ఎల్లో 26 కొత్త షేర్లు లభిస్తాయి. ఇక మధుర లైఫ్‌స్టైల్ డీమెర్జర్ నేపథ్యంలో ఎంజీఎల్ఆర్సీఎల్లో ప్రతి 500 షేర్లకుగాను 7 పీఎఫ్‌ఆర్‌ఎల్ షేర్లు దక్కుతాయి. ఎంజీఎల్ఆర్సీఎల్ ప్రిఫరెన్స్ షేర్హోల్డర్లకు ఒక్కో కొత్త పీఎఫ్‌ఆర్‌ఎల్ షేరు లభిస్తుంది. కార్పొరేట్ అదేవిధంగా నియంత్రణపరమైన అనుమతులకు లోబడి ఈ మొత్తం లవాదేవీలన్నీ వచ్చే 6-9 నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. కాగా, పీఎఫ్ఆర్ఎల్లో ప్రస్తుతం ఉన్న 9.28 కోట్ల ఈక్విటీ షేర్ల పరిమాణం.. ఈ డీల్ పూర్తయ్యాక 77.28 కోట్లకు చేరుతుందని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. మొత్తంమీద ఆదిత్య బిర్లా నువోలో వాటాదారులకు ప్రతి 100 ఈక్విటీ షేర్లకుగాను 520 అదనపు పీఎఫ్ఆర్ షేర్లు దక్కుతాయి. కాగా, కిషోర్ బియానీ ఫ్యూచర్ గ్రూప్‌నకు చెందిన ప్యాంటలూన్ రిటైల్‌లో మెజారిటీ వాటాను 2012లో ఆదిత్య బిర్లా గ్రూప్ చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. మధుర ఫ్యాషన్ అండ్ లైఫ్‌స్టైల్‌కు వాన్ హూసెన్, అలెన్ సోలీ, పీటర్ ఇంగ్లండ్, లూయీస్ ఫిలిప్, పీపుల్ వంటి ప్రఖ్యాత రెడీమేడ్ దుస్తుల బ్రాండ్లు ఉన్నాయి. ప్రస్తుతం పీఎఫ్‌ఆర్‌ఎల్ షేరు ధర(గురువారం ముగింపు) బీఎస్ఈలో రూ.113.90 వద్ద ఉంది. ఈ షేరు ముఖ విలువ రూ.10 కాగా.. మార్కెట్ విలువ(క్యాపిటలైజేషన్) రూ.1,057 కోట్లు. -
రాహుల్ కలల ప్రాజెక్టు రద్దు
లక్నో: సొంత లోక్‌సభ నియోజకవర్గం అమేథీని ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు కేంద్రంగా మలచాలనే రాహుల్ గాంధీ కలలు కల్లలయ్యాయి. అమేథీలోని జగదీశ్‌పూర్‌లో ఆదిత్య బిర్లా గ్రూపు సహకారంతో మెగా ఫుడ్ పార్కుకు రాహుల్ 2013లో శంకుస్థాపన చేశారు. అయితే ఈ ఫుడ్ పార్కును కేంద్రంలోని ఎన్డీయే సర్కారు రద్దు చేసింది. ఈ ఫుడ్ పార్కును దక్కించుకున్న శక్తిమాన్ ఫుడ్‌పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ (బిర్లా గ్రూపునకు అనుబంధ సంస్థ) అనే సంస్థ ఆరునెలల్లోగా భూసేకరణను పూర్తిచేయలేకపోయిందని, అలాగే పలు ఇతర అంశాల్లో కూడా ఒప్పందంలోని నిబంధనలకు కట్టుబడలేదని... అందువల్లే ఫుడ్‌పార్కును రద్దు చేశామని ఫుడ్‌ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ఇందులో ఏర్పాటు చేసే క్యాప్టివ్ పవర్ ప్లాంటుకు సబ్సిడీపై గ్యాస్‌ను సరఫరా చేయకపోతే... ప్రాజెక్టు ఆర్థికంగా మనజాలదని కూడా శక్తిమాన్ సంస్థ తెలిపిందని... అయితే సబ్సిడీపై గ్యాస్ సరఫరా చేయాలనే నిబంధన ఫుడ్‌పార్క్ పాలసీలోనే లేదని ఆయన అన్నారు. రాహుల్ సన్నిహితులు మాత్రం రద్దు నిర్ణయంపై మండిపడుతున్నారు. 40 వేల మందికి ఉపాధి కల్పించే లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు రైతులకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉండేదని, దీనిని రద్దు చేయడం బీజేపీ రైతు వ్యతిరేక విధానాలకు మరో ఉదాహరణ అని కాంగ్రెస్ నేత అఖిలేశ్ ప్రతాప్‌సింగ్ అన్నారు. సంక్షిప్తంగా.. ‘రాహుల్ వేచిచూడాలి’: సోనియా గాంధీనే కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కొనసాగాలని, పార్టీ పగ్గాలు అందుకోవాలంటే రాహుల్ తొలుత తగిన అనుభవం గడించాలని పంజాబ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత అమరీందర్ సింగ్ అన్నారు. యువతకు పగ్గాలు ఇవ్వడమనేది బలవంతంగా జరగరాదన్నారు. రాహుల్ దేశవ్యాప్తంగా పార్టీ శ్రేణులతో మమేకం కావాలన్నారు. ‘రఫల్’పై కోర్టుకెళతా.. స్వామి: ఫ్రాన్స్ కంపెనీ డసాల్ట్ నుంచి 36 రఫల్ విమానాలను కొనుగోలు చేయాలనే ఒప్పందం అవినీతిమయమని బీజేపీ నేత సుబ్రమణ్యం స్వామి అన్నారు. కేంద్రం తన సూచనను పట్టించుకోకపోతే కోర్టుకెళతానన్నారు. ‘రహస్య కెమెరా’.. ఉద్యోగి పనే: కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ట్రయల్ రూమ్ దృశ్యాల చిత్రీకరణ ఓ ఉద్యోగి పనేనని పోలీసులు తేల్చారు. గోవాలోని ఫ్యాబ్ ఇండియా షోరూమ్‌లో ఇరానీ.. సీసీ టీవీ కెమెరా ట్రయల్ రూము వైపున్న విషయాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మంత్రి అభ్యంతరం చేసిన వెంటనే ఓ ఉద్యోగి కెమెరాను మరోవైపు తిప్పాడని, అతని వద్దే డిజిటల్ వీడియో రికార్డర్ పాస్వర్డ్ కూడా ఉందని పోలీసులు తెలిపారు. అయితే నిందితుడిని పేరును వెల్లడించలేదు. అలీగఢ్ వర్సిటీ వీసీగా సైఫుద్దీన్: భారత్‌లోని బోహ్రా ముస్లిం నేత సైదానా ముఫదాల్ సైఫుద్దీన్ అలీగఢ్ ముస్లిం వర్సిటీ వైస్ చాన్స్‌లర్‌గా ఎంపికయ్యారు. వర్సిటీ పాలకవర్గ సమావేశంలోఎన్నిక నిర్వహించగా సైఫుద్దీన్ 97- 33 ఓట్ల తేడాతో రిటైర్డ్ ఐఏఎస్ మెహ్మదూర్ రహమాన్‌పై నెగ్గారు. బంగ్లా జమాతే ఇస్లామీ అగ్రనేత ఉరితీత: బంగ్లాదేశ్ స్వాతంత్రోద్యమ కాలంలో యుద్ధనేరాలకు పాల్పడి వేలాదిమంది మృతికి కారకుడైన జమాతే ఇస్లామీ అగ్రనేత ముహమ్మద్ కమారుజ్జమాన్(63)ను శనివారం రాత్రి ఉరితీశారు. మరణశిక్షను పునస్సమీక్షించాలన్న ఆయన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు ఇటీవల తిరస్కరించింది. దీంతో దేశాధ్యక్షుడిని క్షమాభిక్ష కోరొద్దని కమారుజ్జమాన్ నిర్ణయించుకున్నాడని స్థానిక మీడియా తెలిపింది. -
సిమెంట్ మార్కెట్ స్థిరపడుతోంది: హోల్సిమ్
న్యూఢిల్లీ: దేశీయ సిమెంట్ మార్కెట్ ఈ ఏడాది ప్రారంభం నుంచి స్థిరపడడం మొదలైందని స్విట్జర్లాండ్‌కు చెందిన దిగ్గజ సంస్థ హోల్సిమ్ తెలిపింది. జనవరి - మార్చి త్రైమాసికంలో సిమెంటు విక్రయాలు నిలకడగా ఉన్నాయని పేర్కొంది. అంబుజా సిమెంట్స్, ఏసీసీ లిమిటెడ్‌ల్లో మెజారిటీ వాటా కలిగిన హోల్సిమ్, తొలి త్రైమాసిక ఫలితాల ప్రకటన సందర్భంగా ఈ విషయం తెలిపింది. ఏసీసీ, అంబుజా సిమెంట్స్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 5.80 కోట్ల టన్నులు. ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు చెందిన అల్ట్రాటెక్ తర్వాత దేశంలో అత్యధికంగా సిమెంటు ఉత్పత్తి చేసే సంస్థ హోల్సిమ్. ప్రపంచవ్యాప్తంగా 70కి పైగా దేశాల్లో హోల్సిమ్ సిమెంట్ ఉత్పత్తి కేంద్రాలున్నాయి. సంస్థ మొత్తం ఉత్పత్తి సామర్థ్యం 20.6 కోట్ల టన్నులు. జనవరి - మార్చిలో ఏసీసీ 64.80 లక్షల టన్నుల సిమెంటును విక్రయించగా, అంతకుముందు ఏడాది ఇదేకాలంలో 64.20 లక్షట టన్నులను అమ్మింది. ఇదేకాలంలో అంబుజా అమ్మకాలు 59.60 లక్షల టన్నుల నుంచి 60.60 లక్షల టన్నులకు పెరిగాయి. -
బిర్లా... బటర్ చికెన్ చిక్కు!
న్యూఢిల్లీ: రోమ్‌లో ఉన్నప్పుడు రోమన్‌లాగా ఉండాలని సామెత. ఇది వ్యాపారానికీ బాగా వర్తిస్తుంది. అంతర్జాతీయంగా విస్తరిస్తున్న భారత కంపెనీలు ఆయా దేశాల పరిస్థితులకు తగ్గట్లుగా మారక తప్పడం లేదు. 36 దేశాల్లో 4,000 కోట్ల డాలర్ల బిర్లా గ్రూప్‌ను నడిపిస్తున్న కుమార మంగళం బిర్లా ఉదంతమే దీనికి నిదర్శనం. ఆయన మార్వాడీ కమ్యూనిటీకి చెందినవారు. మార్వాడీల జీవితాల్లో శాకాహారం ప్రధానమైన అంశం. అందుకే ఈ కంపెనీ క్యాంటీన్లలో, కంపెనీ కార్యక్రమాల్లో ఎక్కడా మాంసాహారం, వైన్, విస్కీల సరఫరా ఉండదు. ఇదంతా అంతర్జాతీయ విస్తరణకు ముందు మాత్రమే. ఈ గ్రూప్ 2003లో ఆస్ట్రేలియా లో చిన్న రాగి గనుల కంపెనీని కొనుగోలు చేసింది. ఆస్ట్రేలియా కార్మికుల రోజువారీ జీవితాల్లో ఫోస్టర్ బీర్, బటర్ చికెన్ తప్పనిసరి. దీంతో ఆక్కడి బిర్లా క్యాంటీన్లలో ఈ రెండింటినీ సరఫరా చేయక తప్పలేదని బిర్లా పేర్కొన్నారు. రీ ఇమాజినింగ్ ఇండియా, అన్లాకింగ్ ద పొటెన్షియల్ ఆఫ్ ఏషియాస్ నెక్స్ట్ సూపర్ పవర్ అన్న పుస్తకంలో రాసిన వ్యాసంలో ఆయన ఈ ఉదంతం వెల్లడించారు. -
ఇదేనా దర్యాప్తు తీరు?!
సంపాదకీయం: మొదలైన నాటి నుంచి రకరకాల మలుపులు తిరుగుతున్న బొగ్గు కుంభకోణంలో ఇప్పుడు మరో అంకానికి తెరలేచింది. ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆదిత్య బిర్లా గ్రూపు అధినేత కుమార మంగళం బిర్లా, బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి పీసీ పరేఖ్ తదితరులు అవినీతికీ, నేరపూరిత కుట్రకూ పాల్పడ్డారని సీబీఐ ఆరోపించింది. ఆ మేరకు ఎఫ్ఐఆర్ దాఖలుచేయడంతోపాటు దేశవ్యాప్తంగా నాలుగు నగరాల్లోని ఆరుచోట్ల సోదాలు చేసింది. తమిళనాడుకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్‌కు కేటాయించాల్సిన ఒడిశాలోని తలబిరా బొగ్గు గనుల్ని బిర్లా గ్రూపునకు చెందిన హిండాల్కోకు కూడా పంచారని ఇందువల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టంవాటిల్లిందన్నది సీబీఐ ఆరోపణ. కుమార మంగళం బిర్లా దేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్త గనుక ఈ చర్యపై పారిశ్రామికవర్గాల్లో తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఇది పరిశ్రమల విశ్వాసాన్ని, పెట్టుబడుల వాతావరణాన్ని దెబ్బతీస్తుందని ఆ వర్గాలు ప్రకటించాయి. చిత్రమేమంటే, వీరితో ఇద్దరు కేంద్రమంత్రులు...వాణిజ్య మంత్రి ఆనంద్ శర్మ, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి సచిన్ పైలట్లు గొంతు కలిపారు. ‘గట్టి సాక్ష్యాధారాలు’ ఉంటే తప్ప ఈ తరహా చర్యలకు దిగకూడదని హితవు చెప్పారు. ఈ స్కాంలో ఇప్పటికే సీబీఐ 14 ఎఫ్ఐఆర్లు నమోదుచేసింది. కాంగ్రెస్‌కు చెందిన ఎంపీని, మరో కేంద్ర మాజీ మంత్రిని కూడా నిందితులుగా చేర్చింది. దేశంలో చట్టమనేది అందరికీ సమానంగా వర్తిస్తుంది. వర్తించాలి. అందులో రెండోమాట లేదు. ఒకరు ప్రముఖ పారిశ్రామికవేత్తగనుక వారి జోలికి వెళ్లరాదని, మరొకరు కాకలు తీరిన రాజకీయ యోధుడు గనుక వారిని అసలు తాకరాదని ఎవరూ అనరు. అలాంటి విచక్షణో, పక్షపాతమో నిజానికి సీబీఐకే ఉంది. అనేక కేసుల్లో ఆ సంగతి నిరూపణ అవుతూనే ఉంది. బొగ్గు కుంభకోణం సామాన్యమైంది కాదు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 194 బొగ్గు క్షేత్రాలను వేలం విధానంలో కాక, నచ్చినవారికి కట్టబెట్టారన్నది ప్రధానమైన ఆరోపణ. ఇలా చేసినందువల్ల దేశ ఖజానాకు లక్షా 86వేల కోట్ల రూపాయల నష్టంవాటిల్లిందని కాగ్ సంస్థ ఆరోపించింది. ఆరోపణలొచ్చాయి గనుక తనంత తానే స్వచ్ఛందంగా సీబీఐ దర్యాప్తునకు సిద్ధపడదామని కేంద్ర ప్రభుత్వం అనుకోలేదు. ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చొరవ తీసుకుని సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాల్సివచ్చింది. అటు తర్వాతనైనా ఆ దర్యాప్తునకు అవసరమైన సహాయసహకారాలను అందించివుంటే కేంద్రం నిజాయితీ వెల్లడయ్యేది. అలా చేయలేదు సరిగదా...దానికి అవసరమైన ఫైళ్లను అందుబాటులో ఉంచడంలో కూడా విఫలమైంది. సుప్రీంకోర్టు ఈ ఫైళ్ల గల్లంతు వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తంచేసి రెండువారాల్లో వాటిని పట్టి తేవాలని గత నెలలో ఆదేశించింది. అయినా, ఇప్పటికీ దాదాపు 18 ఫైళ్లు ఏమయ్యాయో తెలియడంలేదు. ఈ ప్రహసనానికి ముందు సుప్రీంకోర్టుకు సీబీఐ అంద జేయాల్సిన నివేదికను అప్పటి కేంద్ర న్యాయ శాఖ మంత్రి తెప్పించుకుని, దానికి సవరణలు చేయడం... ఆ ఉదంతంపై సుప్రీంకోర్టు ఆగ్రహించడం ఇవన్నీ అయ్యాయి. సరిగ్గా ఆ సమయంలోనే సీబీఐ ‘పంజరంలో చిలుక’ మాదిరిగా వ్యవహరిస్తున్నదని సుప్రీంకోర్టు పరుషంగా వ్యాఖ్యానించింది. ఇన్ని జరిగాక ఇప్పుడు కుమార మంగళం బిర్లా, పీసీ పరేఖ్‌లపై కేసులు నమోదుచేయడంపై సహజంగానే అనుమానాలు తలెత్తుతాయి. నిజానికి తలబిరా బొగ్గు క్షేత్రాలు కావాలని అభ్యర్థన చేసింది హిండాల్కో సంస్థ కాదు. ఆ సంస్థకు మాతృక అయిన ఇండాల్ సంస్థ. ఆ సంస్థ 1996లో అలాంటి విజ్ఞప్తిచేసింది. అటు తర్వాత కాలంలో ఇండాల్ను బిర్లాలు కొనుగోలుచేయగా, 1996నాటి అభ్యర్థనపై 2005లో కేంద్రం నిర్ణయం తీసుకుని తలబిరా గనుల్ని కేటాయించింది. దర్యాప్తు ప్రారంభించి ఏడాదిన్నర అవుతుండగా, ఇన్నాళ్ల వరకూ బిర్లా జోలికి ఎందుకు వెళ్లలేదు? తొలుత అభ్యర్థన చేసిన ఇండాల్ సంస్థ నిర్వాహకుల్ని ఏమైనా ప్రశ్నించారా? అన్నవి సమాధానంలేని ప్రశ్నలు. అసలు ఈ కుంభకోణంలో సీబీఐ దర్యాప్తే లోపభూయిష్టంగా ఉంది. ప్రధాని మన్మోహన్సింగ్ బొగ్గు శాఖను పర్యవేక్షిస్తున్నప్పుడు ఈ కుంభకోణం ప్రారంభమైంది గనుక దర్యాప్తు ప్రధాని కార్యాలయం నుంచి మొదలుకావాలి. అటు తర్వాత వరసగా ఏ దశలో ఏం జరిగిందనేది క్రమేపీ బయటికొస్తుంది. కేటాయింపుల క్రమంలో లబ్ధిదారు లెవరైనా అధికారులతోగానీ, అధినేతలతోగానీ కుమ్మక్కయ్యారా అనేది స్పష్టం అవుతుంది. దర్యాప్తు క్రమం అలా ఉంటే ఎవరూ సీబీఐని వేలెత్తి చూపే అవకాశం ఉండదు. బొగ్గు క్షేత్రం పొందిన బిర్లా కుట్రదారు అయినప్పుడు, ఆయనకు అలా కేటాయించవచ్చని చెప్పిన తాను కుట్రదారు అయినప్పుడు, తుది నిర్ణయం తీసుకున్న ప్రధాని ఎందుకు కారని పరేఖ్ చేస్తున్న తర్కంలో హేతుబద్ధత ఉన్నది. చేసే పనిలో చిత్తశుద్ధి కొరవడితే, నిష్పాక్షికత ఆవిరైతే...దర్యాప్తు తలకిందులుగా సాగితే ఇలాంటి ప్రశ్నలే ఎదురవుతాయి. ఆ ప్రశ్నలకు సీబీఐ వద్ద జవాబు లుండవు. ప్రముఖ పారిశ్రామికవేత్తలతో సహా అందరినీ నిందితులుగా చేరిస్తే తాను నిష్పాక్షికంగా ఉన్నట్టు చాటుకోవచ్చని సీబీఐ భావించినట్టుంది. ఇవన్నీ వదిలిపెట్టి స్వయంగా ప్రధానే జరిగిందేమిటో చెబితే, బొగ్గు క్షేత్రాల కేటాయింపు ఎలా సబబో చెబితే ఇంతమందిని నిందితులుగా చేయాల్సిన పనే ఉండదు. కానీ, ఆయన మాట్లాడరు. సీబీఐ సక్రమంగా దర్యాప్తు చేయదు. కేంద్ర మంత్రులు మాత్రం ప్రముఖ పారిశ్రామికవేత్తలను నిందితులుగా చేర్చడం అభ్యంతరకర మంటారు. ఇంతకూ ఇలాంటి కప్పదాటు వైఖరులతో, అయోమయ చర్యలతో కేంద్ర ప్రభుత్వంగానీ, సీబీఐగానీ ఏం సాధించదల్చుకున్నాయి? తమ చర్యలతో తాము నగుబాటుపాలవడమే కాదు... దేశ ప్రతిష్ట కూడా దెబ్బతింటున్నదని ఎప్పటికి గ్రహిస్తారు?