ఈ-కామర్స్ రంగంలోకి ఆదిత్యా బిర్లా గ్రూప్
ముంబై: ఆదిత్యా బిర్లా గ్రూప్ ఈ-కామర్స్ రంగంలోకి అడుగుపెట్టింది. ఇది ‘అబాఫ్.కామ్’ (అబాఫ్-ఆల్ అబౌట్ ఫ్యాషన్) పేరుతో ఫ్యాషన్ పోర్టల్‌ను ప్రారంభించింది. అబాఫ్ పోర్టల్‌లో దుస్తులు, ఫుట్‌వేర్స్, ఇతర యాక్సిసిరీస్‌లను వినియోగదారుల కోసం అందుబాటులో ఉంచామని ఆదిత్యా బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా తెలిపారు. ఈ పోర్టల్‌లో ప్రస్తుతం 7,000 ఉత్పత్తులను వినియోగదారులకు అందుబాటులో ఉంచామని, వీటి సంఖ్యను రానున్న కాలంలో 20,000లకు పెంచుతామని అబాఫ్.కామ్ ప్రెసిడెంట్, సీఈవో ప్రశాంత్ గుప్తా తెలిపారు.