kumar mangalam birla
-
'8-8-8 రూల్ పాటించండి': పనిగంటలపై నీర్జా బిర్లా
దేశం మొత్తం మీద పనిగంటల ప్రస్తావన జరుగుతున్న సమయంలో.. ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా భార్య.. 'నీర్జా బిర్లా' (Neerja Birla) తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రోజులోని 24 గంటలను '8-8-8' నియమంగా విభజించుకుంటే.. జీవితం సాఫీగా సాగుతుందని పేర్కొన్నారు.పనికి 8 గంటలు, నిద్రకు 8 గంటలు, విశ్రాంతికి మిగిలిన 8 గంటలు కేటాయించుకోవాలి. ఇలా విభజించుకుంటే.. 24 గంటలు సరిపోతుంది. పనిని మాత్రమే కాకుండా.. వ్యక్తిగత జీవితాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవడంపై ద్రుష్టి సారించాలి. ఈ నియమం పాటించడానికి కొంత కష్టంగా ఉన్నప్పటికీ.. సమతుల్యం చేసుకోవడానికి ప్రయత్నించాలని నీర్జా బిర్లా స్పష్టం చేశారు.వారానికి 70 గంటలు, 90 గంటలు పనిచేయాలని ఇన్ఫోసిస్ నారాయణమూర్తి, ఎల్ & టీ చైర్మన్ సుబ్రమణ్యన్ చెప్పారు వ్యాఖ్యానించారు. ఈ మాటలను ఆనంద్ మహీంద్రా, గౌతమ్ అదానీ, ఎంక్యూర్ ఫార్మాస్యూటికల్స్ సీఈఓ 'నిమితా థాపర్' మొదలైనవారు విమర్శించారు. తాజాగా నీర్జా బిర్లా కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.పని గంటలపై ఆకాష్ అంబానీముంబై టెక్ వీక్ కార్యక్రమంలో 'ఆకాష్ అంబానీ' మాట్లాడుతూ.. ఆఫీసులో ఎంతసేపు (ఎన్ని గంటలు) ఉంటారనేది ముఖ్యం కాదు, చేస్తున్న పనిలో నాణ్యత ఉండాలి, దాని గురించి మాత్రమే ఆలోచిస్తాను అని అన్నారు. వృద్ధి అంటే జీవితం అనేది రిలయన్స్ నినాదం, అది వ్యక్తిగత జీవితానికి కూడా వరిస్తుందని అన్నారు. కాబట్టి మీరు ప్రతి రోజు ఎదగడానికి కృషి చేయాలని పేర్కొన్నారు.ఇదీ చదవండి: 'అర్ధరాత్రి 2 గంటల వరకు మేల్కొనే ఉంటారు': తండ్రి గురించి చెప్పిన ఆకాశ్ అంబానీ -
కాస్మెటిక్స్ విభాగంలోకి అనన్య బిర్లా
ముంబై: వ్యాపార దిగ్గజం కుమార మంగళం బిర్లా కుమార్తె అనన్య బిర్లా (30) తాజాగా సౌందర్య సాధనాలు, కాస్మెటిక్స్ విభాగంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ ఏడాది కొత్త వెంచర్ ద్వారా పలు బ్యూటీ, పర్సనల్ కేర్ బ్రాండ్లను దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టనున్నారు. అంతర్జాతీయ ఉత్పత్తులు, వ్యక్తిగత సంరక్షణ అంశాలపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో భారతీయ వినియోగదారులు, దేశీ బ్రాండ్ల నుంచి మరింతగా ఆశిస్తున్నట్లు అనన్య ఒక ప్రకటనలో తెలిపారు. వారి ఆకాంక్షలను తీర్చే విధంగా తమ ఉత్పత్తుల శ్రేణి ఉంటుందని ఆమె పేర్కొన్నారు. అయితే, వెంచర్ పేరు, పెట్టుబడి ప్రణాళికలు మొదలైన వివరాలను వెల్లడించలేదు. ప్రస్తుతం ఏటా 10–11 శాతం వృద్ధి చెందుతున్న పర్సనల్ కేర్ మార్కెట్ 2028 నాటికి 34 బిలియన్ డాలర్లకు చేరొచ్చనే అంచనాలు ఉన్నాయి. 17 ఏళ్ల వయస్సులోనే అనన్య బిర్లా సూక్ష్మ రుణాల సంస్థ స్వతంత్ర మైక్రోఫిన్ను ప్రారంభించారు. ప్రస్తుతం ఇది దేశీయంగా రెండో అతి పెద్ద ఎన్బీఎఫ్సీ–ఎంఎఫ్ఐగా కార్యకలాపాలు సాగిస్తోంది. గాయని, పాటల రచయిత కూడా అయిన అనన్య.. 62 బిలియన్ డాలర్ల ఆదిత్య బిర్లా గ్రూప్ బోర్డులో డైరెక్టరుగా ఉన్నారు. -
కొత్త బిజినెస్‌లోకి అనన్య బిర్లా: ఇషా అంబానీకి పోటీ!?
అందానికి ప్రాధాన్యత ఇచ్చేవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్న తరుణంలో.. చాలామంది ఈ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ జాబితాలోకి ఇప్పుడు భారతీయ ధనవంతులలో ఒకరు.. ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ 'కుమార్ మంగళం బిర్లా' పెద్ద కుమార్తె 'అనన్య బిర్లా' (Ananya Birla) చేరనున్నారు. ఈమె బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ వ్యాపారంలోకి అడుగుపెడుతున్నారు.ఫిబ్రవరి 5న, అనన్య బిర్లా ఒక బ్యూటీ బ్రాండ్‌ను ప్రారంభించాలనే తన ప్రణాళికలను వెల్లడించింది. ఇది టాటాస్, హిందుస్తాన్ యూనిలీవర్ (HUL), లోరియల్ (L'Oréal) వంటి వాటితో పాటు ఇషా అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ రిటైల్ 'తిరా'కు కూడా పోటీ ఇవ్వనున్నట్లు సమాచారం.భారతదేశంలో అందానికి సంబంధించిన ఉత్పత్తుల వినియోగం పెరుగుతోంది. కాబట్టి ఈ రంగం ఏటా 10-11 శాతం వృద్ధిని నమోదు చేస్తోంది. ఇది 2028 నాటికి 34 బిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని అంచనా. దీనిని దృష్టిలో ఉంచుకుని మేకప్, సువాసనలతో సహా అన్ని విభాగాలలో వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని.. దశలవారీగా తమ వ్యాపారం ప్రారంభమవుతుందని అనన్య బిర్లా వెల్లడించారు.అనన్య బిర్లా ప్రారంభించనున్న వెంచర్ పేరు, అది ఏ బ్రాండ్స్ అందిస్తుందనే విషయాలు అధికారికంగా వెల్లడికాలేదు. ప్రపంచ స్థాయి ఉత్పత్తులను భారత మార్కెట్‌కు తీసుకురావడం లక్ష్యంగా ఈ వెంచర్ ప్రారంభించే అవకాశం ఉంది. అయితే ఈమె ప్రారంభించనున్న వ్యాపారానికి బాలీవుడ్ నటి 'జాన్వీ కపూర్' బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించే అవకాశం ఉందని సమాచారం.అనన్య బిర్లాఅనన్య బిర్లా.. ఆదిత్య బిర్లా గ్రూప్ అధినేత, దేశంలో అత్యంత సంపన్నుల్లో ఒకరైన కుమార మంగళం బిర్లా కుమార్తె. సాంప్రదాయ వ్యాపారాలను విడిచిపెట్టి తనకంటూ సొంత మార్గాన్ని ఎంచుకుంది. ఒక్క బిజినెస్‌లోనే కాకుండా వివిధ రంగాల్లో రాణిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈమె కేవలం వ్యాపారవేత్త మాత్రమే కాదు.. సింగర్, రైటర్ కూడా.అనన్య బిర్లా ముంబైలోని అమెరికన్ స్కూల్ ఆఫ్ బాంబేలో ప్రాథమిక విద్య పూర్తి చేసింది. ఆ తరువాత యూకేలోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఉన్నత చదువులు చదివింది. చదువు పూర్తయిన తరువాత ప్రారంభించిన 'స్వతంత్ర మైక్రోఫైనాన్స్' సంస్థ గ్రామీణ ప్రాంతాల్లోని పేద, అల్పాదాయ వర్గాలు, మహిళా పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సేవలను అందిస్తోంది. ఈ సంస్థకు ఆమె సీఈవోగా కూడా ఉన్నారు. అలాగే క్యూరోకార్టే అనే లగ్జరీ ఈ-కామర్స్ సంస్థను కూడా ఆమె ప్రారంభించారు. హస్త కళాకృతులు, శిల్పకళా ఉత్పత్తులను ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా విక్రయిస్తోంది.ఇదీ చదవండి: రతన్ టాటా ఫ్రెండ్.. శంతనుకు టాటా మోటార్స్‌లో కీలక బాధ్యతలుస్వతంత్ర మైక్రోఫిన్అనన్య బిర్లా తన 17ఏళ్ల వయసులోనే.. మైక్రో లెండింగ్ కంపెనీ 'స్వతంత్ర మైక్రోఫిన్' ప్రారంభించింది. ఈ సంస్థ ఇప్పుడు దేశంలోని రెండో అతిపెద్ద ఎన్బీఎఫ్సీ ఎంఎఫ్ఐగా రికార్డ్ సృష్టించింది. అంతే కాకుండా ఈమె ఏఐ ప్లాట్‌ఫామ్ బీటా వెర్షన్‌ను కూడా ప్రారంభించింది. ఇప్పుడు ముచ్చటగా మూడో వెంచర్ ప్రారభించడానికి సిద్ధమైంది. -
అడుగు పెడితే ఫస్టో.. సెకెండో.. అంతే!
న్యూఢిల్లీ: ‘చేస్తున్న, ప్రవేశించే ప్రతి వ్యాపారంలో మొదటి లేదా రెండవ స్థానంలో ఉండాలనుకుంటున్నాం. కాబట్టి సామర్థ్యం పెంపు ఏకైక మార్గం. అలా కాని పక్షంలో ఈ రోజు మనుగడ సాగించడం చాలా కష్టమని నేను భావిస్తున్నాను. లేదంటే అధిక మార్జిన్లను అందించే చాలా ప్రత్యేక, ఉన్నత సాంకేతికత ఉండాలి’ అని ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కేఎం బిర్లా అన్నారు.ఒక మీడియా సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘ఆదిత్య బిర్లా గ్రూప్ దాదాపు 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులు చేసింది. ప్రధానంగా తయారీ రంగంలో పెట్టుబడి పెట్టాం. కంపెనీ నిర్వహించే అన్ని విభాగాలలో మొదటి రెండు స్థానాల్లో నిలవాలని లక్ష్యంగా చేసుకున్నాం. గ్రూప్ పెట్టుబడులు చాలా వరకు రాబోయే 15–20 ఏళ్లలో వ్యాపార దృక్పథం దృష్టిలో పెట్టుకుని దీర్ఘకాలికంగా ఉంటాయి. విలువలు, వ్యక్తులు, సామర్థ్యం పెంపు, దీర్ఘకాలిక లక్ష్యంతో వ్యాపారాల నిర్వహణ అనేది సంస్థ వ్యాపార విధానాన్ని నిర్వచించే కీలక వ్యూహాలు’ అని వెల్లడించారు.కఠినమైన నిర్ణయాలు..గ్రూప్ సంస్థ హిందాల్కో ద్వారా నోవెలిస్ను కొనుగోలు చేయడంతో సహా అనేక కఠినమైన నిర్ణయాలను తీసుకున్నామని బిర్లా తెలిపారు. నోవెలిస్ను దక్కించుకోవడానికి 6 బిలియన్ డాలర్లు వెచ్చించినట్టు చెప్పారు. ‘నేను ఒక కంపెనీని (నోవెలిస్) కొనుగోలు చేశాను. అది చాలా పెద్దది. షేరు దెబ్బతింది. ముఖ్యమైనది కాదని పెట్టుబడిదారులు స్పష్టం చేశారు. తిరిగి పుంజుకోవడానికి దాదాపు ఏడాది పట్టింది. ఆ నిర్ణయం తీసుకున్న ఏ ప్రొఫెషనల్ సీఈవో అయినా తొలగించబడతారు. ఎందుకంటే ఆ సమయంలో అది తప్పుగా అనిపించింది’ అని అన్నారు.దీర్ఘకాలానికి వ్యాపారాలు నిర్వహించడం అనేది మనలో ఒక సంస్కృతి అని వివరించారు. కంపెనీ 36 ఏళ్లలో 100 మిలియన్ టన్నుల సిమెంట్ సామర్థ్యాన్ని నిర్మించింది. వచ్చే 5 ఏళ్లలో దీనిని 150 మిలియన్ టన్నులకు, 10 ఏళ్లలో 200 మిలియన్ టన్నులకు పెంచుతామని ఆయన తెలిపారు. -
సచిన్, కోహ్లి కాదు!.. అత్యంత సంపన్న భారత క్రికెటర్ ఇతడే!
భారత్‌లో అత్యధికంగా ఆర్జిస్తున్న క్రీడాకారుల్లో క్రికెటర్లే అగ్రస్థానంలో ఉంటారు. వారిలోనూ టీమిండియా లెజెండరీ ఆటగాడు, వంద సెంచరీల వీరుడు సచిన్ టెండుల్కర్, దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, రన్‌మెషీన్ విరాట్ కోహ్లి ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నారు. అటు ఆట ద్వారా.. ఇటు పలు ప్రఖ్యాత బ్రాండ్లకు ప్రచారకర్తలుగా వ్యవహరించడం ద్వారా రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఈ ముగ్గురు స్టార్లు ఒక్కొక్కొరు వెయ్యి కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టారని వినికిడి. మరి వీరికంటే ధనవంతుడైన భారత క్రికెటర్ మరొకరు ఉన్నారు. అతడి ఒక్కడి సంపాదనే వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా. లక్షల కో ట్ల సంపదకు అతడు వారసుడు. బిజినెస్ టైకూన్ కుమారుడుదేశంలోనే.. కాదు కాదు.. బహుశా ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెటర్ అయిన అతడు మరెవరో కాదు ఆర్యమన్ విక్రమ్ బిర్లా. దిగ్గజ వ్యాపారవేత్త కుమార్ మంగళం బిర్లా కుమారుడు. జూలై 9, 1997లో ముంబైలో జన్మించాడు. పుట్టుకతోనే రిచ్‌కిడ్ అయిన ఆర్యమన్.. క్రికెటర్‌గా తొలి అడుగులు వేశాడు. మధ్యప్రదేశ్ తరఫున 2017- 18లో రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేశాడు. లెఫ్టాండ్ బ్యాటర్ అయిన ఆర్యమన్.. లెఫ్టార్మ్ స్పిన్ బౌలింగ్ కూడా చేయగలడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 9 మ్యాచ్‌లు ఆడి 414 పరుగులు సాధించాడు ఆర్యమన్ బిర్లా. రూ. 30 లక్షలకు కొనుగోలు చేసిన రాయల్స్ఇందులో ఓ శతకం, ఓ హాఫ్ సెంచరీ ఉన్నాయి. ఇక లిస్ట్-ఏ క్రికెట్లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన అతడు 36 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఆర్యమన్ బిర్లా.. 2018 ఐపీఎల్ వేలంలోకి రాగా.. రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ రూ. 30 లక్షలకు కొనుగోలు చేసింది.అయితే, వ్యక్తిగత కారణాల దృష్ట్యా 2019లోనే క్రికెట్‌కు కూడా దూరమయ్యాడు ఆర్యమన్. కుటుంబ వ్యాపారాలతో బిజీ అయ్యాడు. తన సోదరి అనన్య బిర్లాతో కలిసి ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు చెందిన ఓ కంపెనీ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టాడు. సొంతంగా ముంబైలో ఓ క్లబ్ కూడా కలిగి ఉన్న ఆర్యమన్.. పెంపుడు జంతువు ఓ స్టోర్ కూడా నడుపుతున్నాడు.రెండు లక్షల కోట్లకు పైగా సంపదహురున్ విడుదల చేసిన దేశీయ అత్యంత ధనవంతులు జాబితాలో కుమార్ మంగళం బిర్లా చోటు దక్కించుకోవడంతో.. ఆర్యమన్ బిర్లా పేరు మరోసారి ఇలా తెరపైకి వచ్చింది. ఇక హురున్ రిచ్ లిస్టులో గౌతమ్ అదానీ 11.6 లక్షల కోట్లతో అగ్రస్థానంలో నిలవగా.. ముకేశ్ అంబానీ 10.14 లక్షల కోట్ల నికర ఆస్తులతో రెండో స్థానంలో ఉన్నారు. ఇక ఆరోస్థానంలో ఉన్న కుమార్ మంగళం బిర్లా 2,35,200 కోట్ల నికర సంపద కలిగి ఉన్నారు. ఈ క్రమంలో ఆర్యమన్ నెట్‌వర్త్ డెబ్బై వేల కోట్లకు పైగానే ఉంటుందని వ్యాపారవర్గాలు అంటున్నాయి.చదవండి: క్రికెటర్ సంచలన నిర్ణయం.. 26 ఏళ్లకే ఆటకు వీడ్కోలు! -
భారత్‌కు ఎలాంటి వృద్ధి అవసరమో చెప్పిన బిర్లా..
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థలో మహిళలు కూడా కీలక పాత్ర పోషించే విధంగా భారత్‌కు ’డబుల్ ఇంజిన్’ వృద్ధి అవసరమని పారిశ్రామిక దిగ్గజం ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా అభిప్రాయపడ్డారు. మహిళలు సైతం ఆర్థిక కార్యకలాపాల్లో పాలుపంచుకోవడం వల్ల ఆటోమేటిక్‌గా వృద్ధి కూడా వేగవంతం కాగలదని ఆయన పేర్కొన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే దేశీయంగా శ్రామిక శక్తిలో మహిళల వాటా తక్కువగా ఉండటంపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో బిర్లా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బాంబే చార్టర్డ్ అకౌంటెంట్స్ సొసైటీ (బీసీఏఎస్) నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. భారత్ వేగవంతమైన వృద్ధి ముంగిట ఉందని, రాబోయే రోజుల్లో సూపర్‌పవర్‌గా ఎదుగుతుందని బిర్లా ధీమా వ్యక్తం చేశారు. వచ్చే దశాబ్ద కాలంలో అంతర్జాతీయంగా ఉద్యోగుల్లో దాదాపు నాలుగో వంతు భారత్ నుంచే ఉండనున్నారని ఆయన చెప్పారు. -
బిర్లా ‘ఓపస్’ పెయింట్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పెయింట్స్ రంగంలోకి ఆదిత్య బిర్లా గ్రూప్ సంస్థ అయిన గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ఎంట్రీ ఇచి్చంది. ఈ మేరకు ‘బిర్లా ఓపస్’ బ్రాండ్‌ను గురువారం ఆవిష్కరించింది. డెకోరేటివ్ పెయింట్ల వ్యాపారంలో గ్రాసిమ్ రూ.10,000 కోట్లు వెచ్చించనున్నట్టు వెల్లడించింది. 2024 జనవరి–మార్చి కాలంలో బిర్లా ఓపస్ ఉత్పత్తులు మార్కెట్లోకి రానున్నాయి. గ్రాసిమ్ ఇండస్ట్రీస్ హరియణా, పంజాబ్, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్లో పెయింట్ల తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. మొత్తం వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 133.2 కోట్ల లీటర్లు. అధిక వృద్ధి ఉన్న విపణిలోకి ప్రవేశించడానికి కొత్త విభాగం వీలు కలి్పస్తుందని ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా ఈ సందర్భంగా అన్నారు. విజయవంతమైన వ్యాపారాన్ని ప్రారంభించేందుకు రెండేళ్లుగా బలమైన పునాదిని నిర్మించినట్టు చెప్పారు. రాబోయే సంవత్సరాల్లో రెండవ స్థానంలో నిలిచి లాభదాయక కంపెనీగా ఎదగడానికి ప్రయతి్నస్తున్నామన్నారు. డెకోరేటివ్ పెయింట్స్ పరిశ్రమ భారత్‌లో రెండంకెల వృద్ధితో ఏటా రూ.70,000 కోట్లు నమోదు చేస్తోంది. 2022–23లో గ్రాసిమ్ ఇండస్ట్రీస్ 23 శాతం వృద్ధితో రూ.1.17 లక్షల కోట్ల కన్సాలిడేటెడ్ ఆదాయాన్ని ఆర్జించింది. కాగా, గ్రాసిమ్ షేరు ధర క్రితం ముగింపుతో పోలిస్తే బీఎస్ఈలో గురువారం 0.12 శాతం క్షీణించి రూ.1,931.40 వద్ద స్థిరపడింది. -
అనన్య సామాన్య స్వతంత్రం
అనన్య బిర్లాకు చెందిన సూక్ష్మరుణ కంపెనీ (ఎంఎఫ్ఐ) స్వతంత్ర మైక్రోఫిన్ ప్రైవేట్ లిమిటెడ్ దేశంలో రెండో అతి పెద్ద ‘ఎంఎఫ్ఐ’గా గుర్తింపు పొందనుంది. ఎంటర్‌ప్రెన్యూర్‌గా గెలుపు జెండా ఎగరేసిన అనన్య బిర్లా సింగర్, రైటర్, యాక్టర్, సోషల్ యాక్టివిస్ట్... ఏకంగా అయిదు సింగిల్స్‌లో డబుల్ ప్లాటినమ్ స్టేటస్‌ను సొంతం చేసుకుంది. అనన్య గానప్రతిభ గురించి చెప్పుకోవడానికి ఇదొక మచ్చుతునక మాత్రమే. ‘లెట్ దేర్ బి లవ్’ ‘ఎవ్రీ బడీ లాస్ట్’ పాటలతో అమెరికన్ నేషనల్ టాప్ 40 పాప్ రేడియో షో జాబితాలో చోటు సాధించిన ఫస్ట్ ఇండియన్ ఆర్టిస్ట్‌గా ఘనత సాధించింది. అనన్యకు చిన్నవయసు నుంచే సంగీతం అంటే ఇష్టం. పదకొండు సంవత్సరాల వయసులో సంతూర్ ప్లే చేయడం నేర్చుకుంది. ఎకనామిక్స్ అండ్ మేనేజ్మెంట్ కోసం ‘యూనివర్శిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్’లో చేరిన అనన్య డిగ్రీ పూర్తి కాకుండానే చదువు మానేసింది. యూనివర్శిటీలో చదువు సంగతి ఎలా ఉన్నా సంగీతంలో మాత్రం ఎటు చూసినా అనన్య పేరు వినిపించేది. పాడడంతో పాటు కవితలు, పాటలు కూడా రాసేది. గిటార్ ప్లే చేయడం నేర్చుకుంది. ‘లివిన్ ది లైఫ్’ తన డెబ్యూ సింగిల్. యూట్యూబ్‌లో 14 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. మ్యూజిక్ చార్ట్స్‌లో టాప్‌లో నిలిచింది. కునాల్ కోహ్లీ స్పై థ్రిల్లర్ ‘శ్లోక్’లో నటిగా ఆకట్టుకుంది. ఇంగ్లాండ్‌లో ఉన్నప్పుడు సంగీత, సాహిత్య కార్యక్రమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొనేది అనన్య. ఆందోళన, కుంగుబాటుతో సతమతం అవుతున్న యువత కోసం స్టూడెంట్ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసింది. ఇంగ్లాండ్ నుంచి ఇండియాకు వచ్చిన తరువాత మానసిక సమస్యలతో బాధపడే వారికి సహాయం అందించడానికి ‘ఎంపవర్’ అనే సంస్థను ఏర్పాటు చేసింది. కోవిడ్ సమయంలో మహారాష్ట్ర ప్రభుత్వంతో కలిసి 24“7 ఫ్రీ హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది. ఈ హెల్ప్‌లైన్ ద్వారా వేలాది మంది ప్రజలకు మేలు జరిగింది. అమెరికాకు చెందిన ప్రసిద్ధ మెంటల్ హెల్త్ ఆర్గనైజేషన్ ‘నేషనల్ అలయెన్స్ ఆన్ మెంటల్ ఇల్నెస్’ అంబాసిడర్‌గా నియమితురాలైంది. ‘అనన్య బిర్లా ఫౌండేషన్’తో సేవాకార్యక్రమా లను విస్తృతం చేసింది. సంగీతం అంటే అపారమైన అనురక్తి ఉన్న అనన్య వ్యాపారరంగంలో తొలి అడుగు వేసినప్పుడు... ‘అనన్య లోకం వేరు. ఆమె ఎంటర్‌ప్రెన్యూర్‌గా విజయం సాధించడం కష్టం’ అనే గుసగుసలు వినిపించాయి. అప్పటి వరకు అనన్య పేరు పక్కన సంగీతానికి సంబంధించిన విశేషణాలు కనిపించేవి. తరువాత స్వతంత్ర మైక్రోఫిన్, ఫౌండర్ అనేది ఆమె పేరు పక్కన కనిపించడం మొదలైంది. గ్రామీణ ప్రాంతాలలో మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహించడానికి ‘స్వతంత్ర’ను ఏర్పాటు చేశారు. తన నాయకత్వ లక్షణాలతో ‘స్వతంత్ర’ను అగ్రగామిగా నిలిపింది అనన్య. బెస్ట్ స్టార్టప్‌లకు ఇచ్చే ‘గోల్డ్ అవార్డ్’ను గెలుచుకుంది. 2016లో గ్లోబల్ లగ్జరీ ఇ–కామర్స్ ప్లాట్‌ఫామ్ ఇకై ఏషియాకు సీయీవోగా బాధ్యతలు చేపట్టింది. ఫోర్బ్స్ ఆసియాస్ ఉమెన్ జాబితాలో అనన్య పేరు చోటు చేసుకుంది. ‘స్వతంత్ర’ వ్యవస్థాకురాలిగా అనన్య ఆఫీస్ గదికే పరిమితం కాలేదు. క్షేత్రస్థాయిలో పర్యటించేది. ఇండోర్‌లో ఒక పేదింటి మహిళ ‘స్వతంత్ర’ సహకారంతో ఇల్లు కట్టుకోగలిగింది. ఆమెతో మాట్లాడినప్పుడు అనన్యకు ఎంతో సంతోషంగా అనిపించింది. అనన్య అపురూప విజయాలు చూసినప్పుడు ‘ఏ పని చేసే వాళ్లు ఆ పని చేస్తే మంచిది’ ‘రెండు పడవల మీద కాలు వద్దు’ లాంటి మాటలు, సామెతలు బిత్తర పోతాయి. పనిమీద అనురక్తి, అంకితభావం ఉంటే ఒక రంగానికి చెందిన వారు మరో రంగంలో విజయం సాధించవచ్చు అని చెప్పడానికి అనన్య బిర్లాలాంటి వాళ్లు పెద్ద ఉదాహరణ. పెద్దింటి అమ్మాయి పారిశ్రామిక దిగ్గజం కుమార మంగళం బిర్లా కూతురు అయిన అనన్య బిర్లా బాల్యం నియమ నిబంధనలు, రక్షణ వలయాల మ«ధ్య గడిచింది. చిన్నప్పుడే అనన్యకు బాడీగార్డ్ ఉండేవాడు. మిగతా అమ్మాయిల్లాగా ఎక్కడ పడితే అక్కడ ఆడుకోవడానికి లేదు. ఈ రూల్స్‌తో తనకు ఊపిరి ఆడేది కాదు. ఒత్తిడికి గురయ్యేది. ఇంత ఒత్తిడిలోనూ తనదైన కలలు కనేది. ‘అసలు నేనేమిటి?’ అనే ప్రశ్నకు ఆమెకు సంగీతంలో జవాబు దొరికింది. సంగీతం తనలోని ఒంటరితనాన్ని పోగొట్టడమే కాదు ఆత్మబలాన్ని ఇచ్చింది. ‘పెద్దింటి అమ్మాయి’ అనే పేరు కంటే స్వేచ్ఛాప్రపంచాన్నే అనన్య ఇష్టపడేది. ‘పెద్ద యూనివర్శిటీలో పెద్ద చదువు చదవాలి. పెద్దింటి కుటుంబానికి చెందిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి... ఇలా నా గురించి అనుకునేవారు. అయితే నా ఆలోచనలు దీనికి భిన్నంగా ఉండేవి. ఇది చాలామందిని ఆశ్చర్యపరిచేది. అయితే తల్లిదండ్రులు మాత్రం నాకు ఎప్పుడూ వెన్నుదన్నుగా ఉన్నారు. నా అభిప్రాయాలకు విలువ ఇచ్చారు’ అంటుంది అనన్య. -
బిర్లా పుట్టినరోజు.. రేర్ ఫొటోతో కూతురి ఆసక్తికర పోస్ట్
ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా పుట్టినరోజు (జూన్ 14) పుట్టినరోజు సందర్భంగా ఆయన కుమార్తె అనన్య బిర్లా రేర్ ఫొటోతో ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. చిన్ననాటి ఒక త్రోబ్యాక్ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. పాపాయిగా ఉన్న అనన్యను బిర్లా ఆప్యాయంగా ఎత్తుకున్న ఫొటోను ఆమె షేర్ చేశారు. “పుట్టినరోజు శుభాకాంక్షలు పా! నిన్ను చాలా ప్రేమిస్తున్నాను" అంటూ అనన్య బిర్లా తన ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో ఫొటోను పోస్ట్ చేశారు. వీటికి వేలాదిగా లైక్‌లు, కామెంట్లు వచ్చాయి. అలాగే అనేక మంది ప్రముఖులు కూడా బిర్లాకు పుట్టినరోరజు శుభాకాంక్షలు తెలిపారు. వీరిలో నటుడు బాబీ డియోల్, పుల్కిత్ సామ్రాట్, విజె అనూషా దండేకర్ తదితరులు ఉన్నారు. ఇదీ చదవండి: బిర్లా వారసురాలు.. తండ్రి పేరు చెప్పుకునే టైపు కాదు! విభిన్న ప్రతిభతో సొంత గుర్తింపు.. వాణిజ్యం, పరిశ్రమల రంగానికి చేసిన కృషికి గాను కుమార మంగళం బిర్లాకు ఈ సంవత్సరం పద్మభూషణ్ అవార్డు లభించింది. హిందాల్కో ఇండస్ట్రీస్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, అల్ట్రాటెక్ సిమెంట్, ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్, ఆదిత్య బిర్లా క్యాపిటల్‌తో సహా అన్ని ప్రధాన గ్రూప్ కంపెనీల బోర్డులకు ఆయన అధ్యక్షత వహిస్తున్నారు. కుమార మంగళం బిర్లా ముగ్గురు సంతానంలో అనన్య బిర్లా పెద్దది. ఆమెతోపాటు బిర్లాకు కుమారుడు ఆర్యమాన్ మరో కుమార్తె అద్వైతేషా కూడా ఉన్నారు. Happy Birthday Pa! Love you so much ❤️ pic.twitter.com/cbjB0USncM — Ananya Birla (@ananya_birla) June 14, 2023 View this post on Instagram A post shared by Ananya Birla (@ananyabirla) -
రూ. 4.95 లక్షల కోట్ల సామ్రాజ్యానికి వారసుడు, మాజీ క్రికెటర్ ఎవరో తెలుసా?
కుమార మంగళం బిర్లా నేతృత్వంలోనిఆదిత్య బిర్లా గ్రూప్ నావెల్ జ్యువెల్స్ లిమిటెడ్ పేరుతో బ్రాండెడ్ జ్యువెలరీ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. బడా బాబులే లక్క్ష్యంగా హై క్వాలిటీ జ్యువెలరీ రంగంలో రూ. 5,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఈ నేపథ్యంలో రూ. 4.95 లక్షల కోట్ల సామ్రాజ్యానికి వారసుడు, మాజీ క్రికెటర్ ఆర్యమాన్ బిర్లా గురించి ఆసక్తి నెలకొంది. 60 బిలియన్ డాలర్లు (రూ. 4,95,000 కోట్లు) నికర విలువతో ఆదిత్య బిర్లా గ్రూప్ నికర విలుతో మెటల్, పల్ప్ ఫైబర్, సిమెంట్, కెమికల్స్, టెక్స్టైల్స్, కార్బన్ బ్లాక్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫ్యాషన్ రిటైల్, పునరుత్పాదక ఇంధనం వంటి రంగాలలో దూసుకుపోతోంది. గత రెండు సంవత్సరాలలో పెయింట్స్, B2B ఈ-కామర్స్ బిజినెస్‌తోపాటు మూడు పెద్ద వ్యాపారాల్లోకి ప్రవేశించింది ఇపుడిక ఆభరణాల బిజినెస్‌లో అటు టాటా గ్రూప్ తనిష్క్, ఇటు రిలయన్స్‌కు ప్రధాన ప్రత్యర్థిగా పోటీ పడనుంది. (తనిష్క్, రిలయన్స్‌కు చేదువార్త: వేల కోట్లతో మరో దిగ్గజం ఎంట్రీ) గ్రూప్ ఛైర్మన్ కుమార్ మంగళం బిర్లా కుమారుడే ఆర్యమాన్ బిర్లా కుమార్. 25 ఏళ్ల ఆర్యమాన్ బిర్లా గ్రాసిమ్, హిందాల్కో, ఆదిత్య బిర్లా ఫ్యాషన్, రిటైల్ ఆదిత్య బిర్లా క్యాపిటల్ వంటి దిగ్గజ విభాగాల బాధ్యతల్లో ఉన్నాడు. ఆర్యమాన్ ఒకపుడు దేశీయ క్రికెటర్‌గా ఆకట్టుకున్నాడు. 2017-2018 రంజీ ట్రోఫీలో మధ్యప్రదేశ్‌లో ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు.2018 ఐపీఎల్ వేలంలో అతన్ని రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. ఇక్కడ తన తొలి హాఫ్ సెంచరీ కొట్టి వార్తల్లో నిలిచాడు. (నీతా అంబానీ ఔదార్యం: బాధితులకు భారీ సాయం) ESPN Cricinfo ప్రకారం, అతను ఫస్ట్-క్లాస్ క్రికెట్లో 9 మ్యాచ్‌లు ఆడి, ఒక సెంచరీ ఒక అర్ధ సెంచరీతో సహా 414 పరుగులు చేశాడు. లిస్ట్ A క్రికెట్లో నాలుగు మ్యాచ్‌ల్లో 36 పరుగులు చేశాడు.అండర్-23 CK నాయుడు ట్రోఫీ 2017-18లో, ఆరు మ్యాచ్‌ల్లో 795 పరుగులతో అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. 10 వికెట్లు కూడా తీశాడు. అత్యంత సంపన్న క్రికెటర్, కానీ భారత్ లో అంత్యంత సంపన్న క్రికెటర్‌గా పేరు తెచ్చుకున్న ఆర్యమన్ బిర్లాకు చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే చాలా ఇష్టం. అంతర్జాతీయ క్రికెటర్ కావాలనేది అతని డ్రీమ్. ఆల్ రౌండర్‌గా రాణించాలనుకున్నాడు కానీ ఆందోళన, ఇతర ఆరోగ్య కారణాల రీత్యా క్రికెట్‌నుంచి తప్పుకున్నట్టు ఫెమినా ఇంటర్వ్యూలో చెప్పాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో, ఆర్యమాన్ బిర్లా , అతని సోదరి అనన్య బిర్లా గ్రాసిమ్ ఇండస్ట్రీస్‌లోకి డైరెక్టర్స్ ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఆదిత్య బిర్లా వెంచర్స్ అనే కంపెనీ వెంచర్ క్యాపిటల్ ఫండ్ హెడ్ కూడా. అలాగే D2C ప్లాట్‌ఫారమ్ TMRW బోర్డు డైరెక్టర్ కూడా.బిర్లాకుమార్తె అనన్య 17 సంవత్సరాల వయస్సులో తొలి కంపెనీ Svatantra Microfin Pvt Ltdని స్థాపించింది. అలాగే Ikai Asai అనే ఇంటి అలంకరణ బ్రాండ్‌ను కూడా స్థాపించింది. ఇలాంటి మరిన్ని సక్సెస్ స్టోరీలు,ఇంట్రస్టింగ్ అప్డేట్స్ కోసం చదవండి సాక్షిబిజినెస్ -
తనిష్క్, రిలయన్స్‌కు చేదువార్త: వేల కోట్లతో మరో దిగ్గజం ఎంట్రీ
ప్రముఖ వ్యాపార సంస్థ ఆదిత్య బిర్లా గ్రూప్ బ్రాండెడ్ జ్యువెలరీ రిటైల్ వ్యాపారంలోకి ప్రవేశించ నుంది. ఇప్పటికే పలురంగాల్లో దూసుకుపోతున్న కుమార్ మంగళం బిర్లా నేతృత్వంలోని సంస్థ వేల కోట్ల పెట్టుబడితో దేశవ్యాప్తంగా ప్రత్యేక రిటైల్ స్టోర్లను ఏర్పాటు చేయనుంది. బ్రాండెడ్ జ్యువెలరీ రిటైల్ వ్యాపారంలోకి ప్రవేశిస్తున్నట్టు ఆదిత్యా బిర్లా ఓ ప్రకటనలో తెలిపింది. దాదాపు రూ. 5000 కోట్ల పెట్టుబడితో 'నావల్ జ్యువెల్స్' అనే కొత్త వెంచర్ కింద ఆభరణాల వ్యాపారం ఉంటుందని కంపెనీ తెలిపింది. ప్రత్యేకమైన డిజైన్, అధిక నాణ్యత కలిగిన ఆభరణాల ద్వారా వినియోగదారులకు మెరుగైన సేవలందించే లక్ష్యంతో కొత్త వెంచర్ ఉంటుందని పేర్కొంది. (నీతా అంబానీ ఔదార్యం: బాధితులకు భారీ సాయం) వ్యూహాత్మక పోర్ట్‌ఫోలియో అని, తద్వారా దేశవ్యాప్తంగా వినియోగదారులకు చేరువ కావడానికి, సంస్థ ఉనికిని విస్తరించేందుకు అవకాశం లభిస్తుందని ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార్ మంగళం బిర్లా అన్నారు. ఇప్పటికే పెయింట్స్, B2B ఇ-కామర్స్‌లో ప్రవేశించడమే కాకుండా, మెటల్ పల్ప్ ఫైబర్, సిమెంట్, కెమికల్స్, టెక్స్టైల్స్, కార్బన్ బ్లాక్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫ్యాషన్ రిటైల్, పునరుత్పాదక ఇంధనం వంటి రంగాలలో విస్తరించిన ఆదిత్య బిర్లా గ్రూప్ ఇపుడిక బ్రాండెడ్ జ్యువెలరీ విభాగంలోకి ఎంట్రీ ఇస్తోంది. (మనవరాలికోసం అంబానీ ఏం చేశారో తెలుసా? ఇంటర్నెట్లో వీడియో వైరల్) దీంతో టాటా గ్రూప్‌నకు చెందిన తనిష్క్, రిలయన్స్ జ్యువెల్స్‌తో పోటీ పడనుంది ఆదిత్య బిర్లా గ్రూప్. కంపెనీ డేటా ప్రకారం, దేశీయ ఆభరణాల మార్కెట్ 2025 నాటికి సుమారు రూ. 7.43 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా. భారత రత్నాభరణాల మార్కెట్ వాటా దేశ జీడీపీలో 7 శాతం. -
సంపాదనలో మాత్రమే కాదు లగ్జరీ కార్ల విషయంలో అంతకు మించి
Kumar Mangalam Birla Car Collection: భారతదేశంలో ఉన్న అగ్రశ్రేణి ధనవంతులలో ఒకరైన 'కుమార్ మంగళం బిర్లా' (Kumar Mangalam Birla) గురించి దాదాపు అందరికి తెలుసు. ఈయన ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ మాత్రమే కాకుండా.. బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్‌కి ఛాన్సలర్ కూడా. గతంలో ఈయన సక్సెస్ సీక్రెట్, నికర ఆస్తులు వంటి వాటిని గురించి తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు ఈ కథనంలో మంగళం బిర్లా ఉపయోగించే లగ్జరీ కార్లను గురించి తెలుసుకుందాం. రోల్స్ రాయిస్ ఘోస్ట్ (Rolls Royce Ghost) ప్రముఖ పారిశ్రామిక వేత్త కుమార్ మంగళం బిర్లా ప్రపంచ మార్కెట్లో అత్యంత ఖరీదైన రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన కారుని (రోల్స్ రాయిస్ ఘోస్ట్) కలిగి ఉన్నారు. ఈ కారు ఖరీదు రూ. 8 కోట్లు (ఎక్స్-షోరూమ్). అయితే ఇది కొంత కస్టమైజేషన్ పొందినట్లు తెలుస్తోంది. సుమారు రూ. 9 కోట్లు వరకు ఉండవచ్చు. ఈ కారుని ఆయన అప్పుడప్పుడు మాత్రమే వినియోగిస్తారని సమాచారం. ప్రపంచ మార్కెట్లో అందుబాటులో ఉన్న అత్యంత విలాసవంతమైన కార్లలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన ఈ రోల్స్ రాయిస్ ఘోస్ట్ ముఖేష్ అంబానీ వంటి పారిశ్రామిక వేత్తల గ్యారేజిలో కూడా ఉంది. ఇందులో 6.7 లీటర్ వి12 పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 520 బిహెచ్పి పవర్, 780 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కేవలం 5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. గరిష్ఠ వేగం గంటకు 250 కిమీ. మెర్సిడెస్ మేబ్యాచ్ ఎస్500 (Mercedes-Maybach S500) జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థకు మెర్సిడెస్ కంపెనీకి చెందిన అత్యంత ఖరీదైన కారు 'మేబ్యాచ్ ఎస్500' సెడాన్ కూడా కుమార్ మంగళం బిర్లా గ్యారేజిలో ఉంది. దీని ధర రూ. 1.86 కోట్లు. ఇందులో 4663 సీసీ ఇంజిన్ ఉంటుంది. ఇది 453 బిహెచ్పి పవర్, 700 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ సెడాన్ కేవలం 5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. టాప్ స్పీడ్ గంటకు 250 కిమీ వరకు ఉంది. భారతదేశంలోని సెలబ్రిటీలు, పారిశ్రామిక వేత్తలు ఎక్కువగా ఇష్టపడి కొనుగోలు చేసే కార్లలో ఇది ప్రధానమైనదని. బీఎండబ్ల్యూ 760ఎల్ఐ (BMW 760LI) కుమార్ మంగళం బిర్లా గ్యారేజిలో ఉన్న కార్లలో బీఎండబ్ల్యూ కంపెనీకి చెందిన 760ఎల్ఐ ఒకటి. దీని ధర రూ. 2.46 కోట్లు. రోల్స్ రాయిస్ ఘోస్ట్ కొనుగోలు చేయడానికి ముందు ఈయన ఎక్కువగా ఈ కారునే ఉపయోగించేవారని సమాచారం. ఇది బుల్లెట్ ప్రూఫ్ సెడాన్. కావున వినియోగదారులకు పటిష్టమైన భద్రతను అందిస్తుంది. ఇందులోని 3.0 లీటర్ 6 సిలిండర్ డీజిల్ 850 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ సెడాన్ టాప్ స్పీడ్ గంటకు 250 కిమీ. ఇది కేవలం 3.8 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం వేగవంతమవుతుంది. (ఇదీ చదవండి: పట్టుమని పాతికేళ్ళు లేవు.. కోట్లు విలువ చేసే కార్లు, హెలికాఫ్టర్స్.. ఇంకా ఎన్నో..!) జాగ్వార్ ఎక్స్ఎఫ్ (Jaguar XF) బ్రిటీష్ వాహన తయారీ సంస్థకు చెందిన జాగ్వార్ ఎక్స్ఎఫ్ 'కుమార్ మంగళం బిర్లా' గ్యారేజిలో ఉంది. దీని ధర రూ. 55.67 లక్షలు. ఇందులోని 2.0 లీటర్ 4 సిలిండర్ ఇంజిన్ 247 బిహెచ్పి పవర్ & 365 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ లగ్జరీ కారు కేవలం 7.6 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవతమవుతుంది. టాప్ స్పీడ్ గంటకు 365 కిమీ. (ఇదీ చదవండి: అమ్మేది పాత బూట్లు.. సంపాదన రూ. కోట్లు - ఓ యువకుని సక్సెస్ స్టోరీ) బీఎండబ్ల్యూ 5 సిరీస్ (BMW 5-Series) బీఎండబ్ల్యూ కంపెనీకి చెందిన మరో కారు 5 సిరీస్ కుమార్ మంగళం బిర్లా గ్యారేజిలో ఉంది. దీని ధర రూ. 62.90 లక్షలు. డిజైన్, ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉండే ఈ కారు 2993 ఇంజిన్ కలిగి 261 బిహెచ్పి పవర్ పవర్, 620 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కేవలం 5.7 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం కాగా, టాప్ స్పీడ్ గంటకు 250 కిమీ. 28 సంవత్సరాల వయసులో తండ్రి మరణించిన తరువాత ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేప్పట్టిన కుమార్ మంగళం బిర్లా 47 బ్రాండ్లు, 27 ఎంటర్ప్రైజెస్, 14 పరిశ్రమ రంగాలను విజయపథంలో నడిపిస్తున్నాడు. ప్రస్తుతం కంపెనీ ఆదాయం రూ.50000 కోట్ల కంటే ఎక్కువ అని నివేదికలు చెబుతున్నాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
బిర్లా వారసురాలు.. తండ్రి పేరు చెప్పుకునే టైపు కాదు!
అనన్య బిర్లా.. ఆదిత్య బిర్లా గ్రూప్ అధినేత, దేశంలో అత్యంత సంపన్నుల్లో ఒకరైన కుమార మంగళం బిర్లా కుమార్తె. సాంప్రదాయ వ్యాపారాలను విడిచిపెట్టి తనకంటూ సొంత మార్గాన్ని ఎంచుకుంది. ఒక్క బిజినెస్‌లోనే కాకుండా వివిధ రంగాల్లో రాణిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇదీ చదవండి: Aditi Avasthi: రూ.1600 కోట్ల నిధులు.. ఎడ్టెక్ కంపెనీలకు గట్టి పోటీ ఇస్తున్న అదితి అవస్తీ! బిర్లా కుటుంబం దేశంలోనే సంపన్న కుటుంబాల్లో ఒకటి. వారికి అనేక వ్యాపారాలు ఉన్నాయి. తండ్రి కుమార మంగళం బిర్లా ఫోర్బ్స్ 2023 భారతీయ బిలియనీర్ల జాబితా ప్రకారం.. దేశంలోనే 9వ అత్యంత సంపన్న వ్యక్తి. వీటితో సంబంధం లేకుండా ఒక వ్యాపారవేత్తగా, గాయనిగా విభిన్న రంగాల్లో రాణిస్తున్న అనన్య బిర్లా చదువు, ఆమె నడుపుతున్న వ్యాపారాలు, నికర సంపద వంటివి తెలుసుకుందాం. ఉన్నత చదువు, వ్యాపారాలు అనన్య బిర్లా ముంబైలోని అమెరికన్ స్కూల్ ఆఫ్ బాంబేలో ప్రాథమిక విద్య చదివింది. యూకేలోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్, మేనేజ్మెంట్లో డిగ్రీ పొందింది. అనన్య బిర్లా స్వతంత్ర మైక్రోఫైనాన్స్ అనే సంస్థను స్థాపించి విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఇది గ్రామీణ ప్రాంతాల్లోని పేద, అల్పాదాయ వర్గాలు, మహిళా పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సేవలను అందిస్తోంది. ఈ సంస్థకు ఆమె సీఈవోగా కూడా ఉన్నారు. అలాగే క్యూరోకార్టే అనే లగ్జరీ ఈ-కామర్స్ సంస్థను కూడా ఆమె ప్రారంభించారు. హస్త కళాకృతులు, శిల్పకళా ఉత్పత్తులను ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా విక్రయిస్తోంది. ఇదీ చదవండి: Satyajith Mittal: బూట్లు అమ్మి రూ.లక్షలు సంపాదిస్తున్నారు.. చిన్నప్పుడు పడిన ఇబ్బందే ప్రేరణ! View this post on Instagram A post shared by Ananya Birla (@ananyabirla) విభిన్న ప్రతిభ అనన్య బిర్లా వ్యాపారవేత్త మాత్రమే కాదు.. విజయవంతమైన సంగీత విద్వాంసురాలు కూడా. ‘లివిన్ ద లైఫ్’, ‘హోల్డ్ ఆన్’ వంటి అద్బుతమైన సింగిల్స్‌ను ఆమె విడుదల చేశారు. తన మ్యూజిక్‌కి అనేక అవార్డులను గెలుచుకున్నారు. మానసిక ఆరోగ్య న్యాయవాది కూడా అయిన అనన్య.. మానసికంగా తాను పడిన ఇబ్బందులు, కుంగుబాటు వంటి సమస్యలను కూడా నిర్భయంగా బయటపెట్టారు. ఈ నేపథ్యంలోనే ఆమె అనన్య బిర్లా ఫౌండేషన్‌ను స్థాపించారు. ఇది మానసిక ఆరోగ్య అవగాహనను పెంపొందించడం, మానసిక ఆరోగ్య కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడం వంటి కార్యక్రమాలపై దృష్టి సారించింది. దీంతోపాటు లింగ సమానత్వం, ఫైనాన్షియల్ ఇన్‌క్లూషన్, విద్య, వాతావరణ మార్పు, మానవతా సహాయం వంటి అంశాలకు తోడ్పాటును అందిస్తోంది. నెట్‌వర్త్ అనన్య బిర్లా నికర సంపద విలువ సుమారు 13 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. జీతం గురించి బహిరంగంగా తెలియకపోయినా రెండు విజయవంతమైన కంపెనీలకు వ్యవస్థాపకురాలు, సీఈవోగా ఆమె గణనీయమైన ఆదాయాన్నే ఆర్జిస్తోంది. ఇక సింగర్ గానూ సంపాదిస్తోంది. ఇలాంటి స్పూర్తివంతమైన, విజయవంతమైన వ్యాపారవేత్తల సక్సెస్ స్టోరీల కోసం సాక్షి బిజినెస్ పేజీని చూడిండి -
28 ఏళ్లకే తండ్రి మరణం.. ఇప్పుడు లక్షల కోట్లకు యజమాని
భారతదేశంలోని అగ్రశ్రేణి వ్యాపారవేత్తల్లో ఒకరైన 'కుమార్ మంగళం బిర్లా' (Kumar Mangalam Birla) గురించి దాదాపు అందరికి తెలుసు. ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్‌గా మాత్రమే కాకుండా సుమారు 14.2 బిలియన్ డాలర్ల సంపదకు నాయకుడై భారతీయ సంపన్నుల జాబితాలో 9వ స్థానం పొందిన బిర్లా ఈ స్థాయికి రావడానికి ఎన్నెన్ని అడ్డంకులను ఎదుర్కొన్నాడు? ఆయన సక్సెస్ రహస్యం ఏమిటనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం. 1967 జూన్ 14న జన్మించిన కుమార్ మంగళం బిర్లా ముంబై విశ్వవిద్యాలయంలోని హెచ్ఆర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ నుంచి బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసి తరువాత లండన్ బిజినెస్ స్కూల్లో చదువుకున్నాడు. 1992లో లండన్‌లో CA పూర్తి చేశారు. చదువు పూర్తయిన తరువాత 1995లో ఆయన తండ్రి ఆదిత్య విక్రమ్ బిర్లా మరణించారు. తండ్రి మరణించిన తరువాత 28 సంవత్సరాల వయసులో ఆదిత్య బిర్లా గ్రూప్‌కు ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అతి తక్కువ కాలంలోనే కంపెనీ టర్నోవర్ 2 బిలియన్ల నుంచి 45 బిలియన్లకు చేరింది. (ఇదీ చదవండి: Volkswagen Discounts: ఈ ఆఫర్స్ చాలదా ఫోక్స్‌వ్యాగన్ కారు కొనడానికి - పూర్తి వివరాలు) కుమార్ మంగళం బిర్లా టెలికమ్యూనికేషన్స్, సిమెంట్, మైనింగ్ వంటి వాటితో పాటు సుమారు 16 కంటే ఎక్కువ పరిశ్రమల్లోకి అడుగుపెట్టారు. అంతే కాకుండా వీరు అలెన్ సోలీ, పీటర్ ఇంగ్లాండ్, లూయిస్ ఫిలిప్, పాంటలూన్స్ పేర్లతో దుస్తులను విక్రయిస్తున్నారు. కార్బన్ బ్లాక్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ అండ్ సప్లయర్స్ పేరుతో ఐదు ఖండాల్లోని 12 దేశాలకు కార్బన్ ఎగుమతి చేస్తున్నారు. భారతదేశంలో రైల్వే అవసరాలకు అవసరమైన కార్బన్ పంపించడంలో బిర్లా కాపర్ వాటా భారీగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. 47 బ్రాండ్లు, 27 ఎంటర్ప్రైజెస్, 14 పరిశ్రమ రంగాలను కలిగి ఉన్న ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రస్తుతం విజయపథంలో నిర్విరామంగా ముందుకు సాగుతోంది. బాక్సైట్ తవ్వకాలు, అల్యూమినా ప్రాసెసింగ్, అల్యూమినియంతో కూడిన ఇతర కార్యకలాపాలలో నిమగ్నమైన హిండాల్కోకు కూడా బిర్లా యజమాని. ఇందులో సుమారు 40వేలకంటే ఎక్కువ మంది పనిచేస్తున్నారు. 2004లో గ్రాసిమ్ కొనుగోలు చేసినప్పటి నుంచి అల్ట్రాటెక్ సిమెంట్ భారతదేశంలో అతిపెద్ద సిమెంట్ ఉత్పత్తిదారుగా ప్రపంచంలో మూడవ అతిపెద్దదిగా ఎదిగింది. దీని ఆదాయం ప్రస్తుతం రూ.50000 కోట్ల కంటే ఎక్కువ అని నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం కుమార్ మంగళం బిర్లా నికర ఆస్తుల విలువ సుమారు పది లక్ష కోట్లకంటే ఎక్కువ. -
ప్రతిష్టాత్మక అవార్డులు సొంతం చేసుకున్న వ్యాపారవేత్తలు.. వీరే!
ఇటీవల జరిగిన ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (AIMA) 13వ మేనేజింగ్ ఇండియా అవార్డ్స్ వేడుకలో కుమార్ మంగళం బిర్లా ప్రతిష్టాత్మక 'బిజినెస్ లీడర్ ఆఫ్ ది డికేడ్' అవార్డుని సొంతం చేసుకున్నారు. వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసుకున్న ఈయన 2017లోనే అవుట్‌స్టాండింగ్ బిజినెస్ లీడర్ అవార్డుని కైవసం చేసుకున్నాడు. సుమారు 34 దేశాల్లో వ్యాపారణాలను విజయవంతంగా ముందుకు సాగిస్తున్నారు మంగళం బిర్లా గత దశాబ్దంలో భారతీయ పరిశ్రమకు చేసిన సేవలకుగాను ఈ అవార్డు లభించింది. దేశ రాజధాని నగరం ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రంలో ఇతర కంపెనీల నాయకులు కూడా ఆవార్డులను గెలుచుకున్నారు. ఇందులో టాటా స్టీల్ చైర్మన్ టీవీ నరేంద్రన్‌కు 'AIMA-JRD టాటా కార్పొరేట్ లీడర్షిప్' అవార్డు, ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును టొరెంటో గ్రూప్ చైర్మన్ సమీర్ మెహతా సొంతం చేసుకున్నారు. యంగ్ ఎంటర్ ఎంటర్ప్రెన్యూర్ ఏథర్ ఎనర్జీ వ్యవస్థాపకులు తరుణ్ మెహతా, స్వప్నిక్ జైన్ కైవసం చేసుకున్నారు. అదే సమయంలో టీవీఎస్ కంపెనీ చైర్మన్ వేణు శ్రీనివాసన్ అవుట్‌స్టాండింగ్ ఇన్స్టిట్యూట్ బిల్డర్ అవార్డు, బజాజ్ ఫిన్ సర్వ్ చైర్మన్ సంజయ్ బజాజ్ ట్రాన్స్ఫార్మషన్ బిజినెస్ లీడర్ అవార్డు సొంతం చేసుకున్నారు. -
పద్మభూషణ్ స్వీకరించిన కుమార మంగళం బిర్లా
న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా బుధవారం రాష్ట్రపతి భవన్లో జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నుంచి పద్మభూషణ్ అవార్డును స్వీకరించారు. దీనితో బిర్లా కుటుంబంలో దేశ అత్యున్నత పౌర పురస్కారం అందుకున్న నాల్గవ వ్యక్తిగా నిలిచారు. ఆయన ముత్తాత జీడీ బిర్లా 1957లో పద్మవిభూషణ్ గ్రహీత. తల్లి రాజశ్రీ బిర్లా 2011లో పద్మభూషణ్ పురస్కారం పొందారు. కుమార మంగళం బిర్లా తాత బీకే బిర్లా బంధువు జీపీ బిర్లా 2006లో పద్మభూషణ్‌ను అందుకున్నారు. ఆయన 28 ఏళ్ల సుదీర్ఘ వాణిజ్య అనుభవంలో గ్రూప్ టర్నోవర్ 30 రెట్లు పెరిగి 60 బిలియన్ డాలర్లకు చేరింది. ‘‘ఉన్నత లక్ష్యానికి వ్యాపారం దోహదపడుతూ, జీవితాలను సుసంపన్నం చేయాలన్న ఆదిత్య బిర్లా గ్రూప్ సంకల్పానికి ఈ అవార్డు ఒక గుర్తింపు’’ అని కుమార మంగళం బిర్లా పేర్కొన్నారు. ఈ ఏడాది మరణానంతర పద్మశ్రీ అవార్డులు లభించిన వారిలో ప్రముఖ శీతల పానీయాల బ్రాండ్ రస్నా వ్యవస్థాపకుడు, దివంగత అరీజ్ ఖంబట్టా, దిగ్గజ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా ఉన్నారు. -
ఏపీకి పరిశ్రమల పట్టం
సుదీర్ఘ తీర ప్రాంతం.. అపారమైన సహజ వనరులు.. మానవ వనరుల కొరత లేకపోవడం.. వీటన్నింటికీ తోడు అన్ని విధాలా ప్రభుత్వ సహకారం.. కొత్తగా పరిశ్రమ స్థాపించడానికి ఏ పారిశ్రామికవేత్తకైనా ఇంతకంటే ఏం కావాలి? ఇవన్నీ ఆంధ్రప్రదేశ్‌లో అందుబాటులో ఉండటంతో దిగ్గజ సంస్థల చూపు ఇప్పుడు రాష్ట్రంపై పడింది. పరిశ్రమలు పెడుతున్న వారిని చేయి పట్టుకుని నడిపించేలా నూతన పారిశ్రామిక విధానాన్ని తీసుకు రావడంలో సీఎం వైఎస్ జగన్ ఇతరుల కంటే నాలుగడుగులు ముందుండటం కలిసివస్తోంది. సాక్షి, అమరావతి: పెట్టుబడులు పెట్టేందుకు దేశంలోని దిగ్గజ సంస్థలు పారిశ్రామిక అనుకూల విధానాలున్న మన రాష్ట్రం వైపు చూస్తున్నాయి. ఇప్పటికే టాటాలు, బిర్లాలు, అదానీ, అర్సెలర్ మిట్టల్, సంఘ్వీ, భజాంకా, భంగర్ లాంటి పారిశ్రామిక దిగ్గజాలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో మార్చి 3, 4 తేదీల్లో విశాఖలో జరిగే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్)లో పెట్టుబడులు పెట్టడానికి అనేక దిగ్గజ సంస్థలు ఆసక్తిని వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడానికి సీఎం అధ్యక్షతన ఢిల్లీతో పాటు బెంగళూరు, చెన్నై, ముంబయి, హైదరాబాద్ వంటి పట్టణాల్లో నిర్వహించిన రోడ్‌షోలకు పెట్టుబడిదారుల నుంచి విశేష స్పందన వచ్చింది. కోవిడ్ సంక్షోభ సమయంలో రాష్ట్ర పరిశ్రమలను ఆదుకునేలా సీఎం జగన్ చూపిన చొరవ దేశ పారిశ్రామికవేత్తలను ఆకర్షించింది. అప్పటికే రాష్ట్రంలో అడుగుపెట్టిన పరిశ్రమలు త్వరితగతిన ఉత్పత్తి ప్రారంభించేలా చర్యలు తీసుకుంటూనే.. మరో పక్క కొత్త పెట్టుబడులను ఆకర్షించే విధంగా ప్రభుత్వం వేగంగా అడుగులు ముందుకు వేసింది. గత 44 నెలల్లో పెట్టుబడులను వాస్తవ రూపంలోకి తీసుకురావడంతోపాటు, సులభతర వాణిజ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే అగ్రగామిగా ఉండటం పారిశ్రామిక వేత్తలను ఇటువైపు వచ్చేలా చేస్తోంది. కోవిడ్ సమయంలో ఉపాధి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ పగ్గాలు చేపట్టి్టన తర్వాత 2019 జూన్ నుంచి 2023 జనవరి వరకు రూ.75,649.77 కోట్ల విలువైన పెట్టుబడులు (ఎంఎస్ఎంఈ సహా) వాస్తవ రూపంలోకి వచ్చాయి. ఇందులో 111 భారీ, మెగా యూనిట్లు రూ.56,534.53 కోట్ల పెట్టుబడులతో ఉత్పత్తి ప్రారంభించాయి. వీటి ద్వారా 73,876 మందికి ఉపాధి లభించింది. అంటే సగటున ఏడాదికి రూ.15,418 కోట్ల పెట్టుబడులతో ఉత్పత్తి మొదలైంది. ఇందులో సీఎం వైఎస్ జగన్ చేతులు మీదుగా రూ.13,766 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఆరు యూనిట్లలో ఉత్పత్తి ప్రారంభమైంది. వీటి ద్వారా 15,040 మందికి ఉపాధి లభించింది. ఇవి కాకుండా రూ.7,305 కోట్ల విలువైన కియా పరిశ్రమ వాణిజ్య పరమైన ఉత్పత్తిని కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 2019 డిసెంబర్ 5న లాంఛనంగా ప్రారంభించారు. వీటికి అదనంగా ఎంఎస్ఎంఈ రంగంలో 1,52,558 కొత్త యూనిట్లు ఏర్పాటయ్యాయి. వీటి ద్వారా రూ.19,115.24 కోట్ల పెట్టుబడులు రావడమే కాకుండా 13,63,706 మందికి ఉపాధి లభించింది. ప్రస్తుత ప్రభుత్వంలో గత 44 నెలల్లో సుమారు 24 నెలలు కోవిడ్ సంక్షోభంతో గడిచి పోయినప్పటికీ భారీ ఎత్తున పెట్టుబడులను వాస్తవ రూపంలోకి తీసుకురావడంలో ముందంజలో ఉందని స్పష్టమవుతోంది. మరో రూ.2.35 లక్షల కోట్ల పెట్టుబడులు ఇవికాక మరో 86 ప్రాజెక్టులకు సంబంధించి రూ.2,35,125.60 కోట్ల పెట్టుబడులు వివిధ దశల్లో ఉన్నాయి. ఇవీ వాస్తవ రూపంలోకొస్తే 2,36,806 మందికి ఉపాధి లభించనుంది. వీటిలో రూ.35,672.28 కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించి ఏడు భారీ యూనిట్లు ఉత్పత్తి ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాయి. వీటి ద్వారా 7,015 మందికి ఉపాధి లభించనుంది. వైఎస్ జగన్ సీఎం అయ్యాక సుమారు రూ.13,962 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన 17 యూనిట్ల భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీటి ద్వారా 24,866 మందికి ఉపాధి లభించనుంది. మరో 5 భారీ యూనిట్లు అన్ని అనుమతులు తీసుకొని నిర్మాణ పనులు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాయి. వీటి ద్వారా రూ.46,621.82 కోట్ల పెట్టుబడులతో 15,800 మందికి ఉపాధి లభించనుంది. -
ఆదిత్య బిర్లా: యంగ్ అండ్ డైనమిక్ వారసులొచ్చేశారు!
న్యూఢిల్లీ: అదిత్య బిర్లా గ్రూప్ చీఫ్ కుమార మంగళం బిర్లా వారసులు అనన్యశ్రీ, ఆర్యమాన్లు వరుసగా ఒక్కో గ్రూప్ కంపెనీలోనూ ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ (ఏబీఆర్ఎఫ్ఎల్) బోర్డులో అదనపు నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా చేరారు. బోర్డు సమావేశంలో నామినేషన్, రెమ్యూనరేషన్ కమిటీ సిఫార్సు మేరకు వారిద్దరి నియామకాలను డైరెక్టర్లు ఆమోదించారు. వారిద్దరూ ఇటీవలే ఆదిత్య బిర్లా మేనేజ్మెంట్ కార్పొరేషన్ బోర్డులో కూడా డైరెక్టర్లుగా చేరారు. అనన్య స్వయంగా వ్యాపారవేత్తే కాకుండా గాయని కూడా. ఆమె ఏర్పాటు చేసిన స్వతంత్ర మైక్రోఫిన్ ప్రస్తుతం దేశంలో అత్యంత వేగంగా సూక్ష్మ రుణాల సంస్థల్లో ఒకటిగా ఉందని కంపెనీ పేర్కొంది. స్వతంత్ర మైక్రోఫిన్ నిర్వహణలో ప్రస్తుతం 1 బిలియన్ డాలర్ల పైగా ఆస్తులు (ఏయూఎం) ఉండగా, 7,000 మంది పైచిలుకు సిబ్బంది ఉన్నారు. 2018లో మైక్రో హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్‌ను కూడా కొనుగోలు చేసింది. అలాగే హోమ్ డెకోరేషన్ బ్రాండ్ ఇకాయ్ అసయ్, ఎంపవర్ సంస్థలను కూడా అనన్య ఏర్పాటు చేశారు. మరోవైపు, ఆర్యమాన్ .. వ్యాపారవేత్తగా, వెంచర్ క్యాపిటలిస్ట్‌గా కూడా రాణిస్తున్నారు. ఆదిత్య బిర్లా గ్రూప్ వ్యాపారాల్లో చురుగ్గా పాలుపంచుకుంటున్నారు. -
వ్యాపారం ప్రారంభించడానికి షార్ట్కట్లు ఉండవు
ముంబై: ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ ఎంతో ప్రత్యేకమైన స్థానంలో ఉందన్నారు ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా. భారత్ ఎదుగుదలను ప్రపంచం కోరుకుంటున్నట్టు చెప్పారు. నూతన సంవత్సరం సందర్భంగా కుమార మంగళం బిర్లా తన సందేశాన్ని ఇచ్చారు. ‘‘భారత్ ఆర్థిక సౌభాగ్యం ప్రపంచానికి ఎంతో కీలకమైనది. భారత్ వృద్ధిని ప్రపంచం స్వాగతిస్తుండడం ఆశ్చర్యకరం. ఎందుకంటే భారత్ వృద్ధి స్థిరంగా ఉండడమే కాదు, ఇతరులకు విఘాతం కలిగించనిది. వచ్చే రెండున్నర దశాబ్దాలు భారత్‌కు అమృత కాలం అనడంలో ఎలాంటి సందేహం లేదు’’అని కుమార మంగళం బిర్లా పేర్కొన్నారు. ఐదు ధోరణులు ప్రపంచంపై ఎన్నో ఏళ్లపాటు ప్రభావం చూపిస్తాయన్నారు. చైనా ప్లస్ 1 వ్యూహాత్మక విధానంలో భాగంగా అంతర్జాతీయ కంపెనీలకు భారత్ స్పష్టమైన ఎంపికగా పేర్కొన్నారు. దశాబ్దాలుగా ఏర్పడిన సరఫరా వ్యవస్థ రూపు రేఖలు మారుతున్నట్టు చెప్పారు. దీనికి కొంత సమయం పడుతుందన్నారు. ప్రపంచం ఎంతో వేగంగా గ్రీన్ ఎనర్జీవైపు అడుగులు వేస్తుండడాన్ని రెండో అంశంగా పేర్కొన్నారు. ఈ విధమైన ఇంధన మార్పు దిశగా భారత్ ధైర్యంగా అడుగులు వేసినట్టు చెప్పారు. నూతన వ్యాపారాల నిర్మాణంలో భారత్ వినూత్నంగా వ్యవహరిస్తున్నప్పటికీ.. ఇందులో సమతుల్యత అవసరమన్నారు. వ్యాపారాలు తమ ప్రాథమిక బలాలపై దృష్టి పెట్టాలన్నారు. ‘‘నేడు వ్యాపారాలు ఎదుర్కొంటున్న వినూత్నమైన సవాలు.. ఎంతో కాలంగా ఏర్పాటు చేసుకున్న విశ్వాసం, స్థిరత్వాన్ని కొనసాగిస్తూనే మనల్ని మనం తిరిగి ఆవిష్కరించుకోవాల్సి ఉంది’’అని బిర్లా పేర్కొన్నారు. షార్ట్కట్లు ఉండవు.. వ్యాపారాల నిర్మాణానికి ఎలాంటి దగ్గరి దారులు లేవంటూ, కొత్తగా స్టార్టప్‌లు ఏర్పాటు చేసే వారిని బిర్లా పరోక్షంగా హెచ్చరించారు. మూడు దశాబ్దాల క్రితం నాటి ‘టాప్ గన్’ సినిమా సీక్వెల్‌ను 2022లో తీసుకురాగా బిలియన్ డాలర్లను ఒక నెలలోనే వసూలు చేసిన విషయాన్ని బిర్లా గుర్తు చేశారు. పునఃఆవిష్కరణలు, భవిష్యత్తు నిర్మాణానికి సంబంధించిన ప్రాధాన్యతలను ఈ సినిమా తెలియజేసిందన్నారు. నిధుల లభ్యత, యువ నైపుణ్యాల మద్దతుతో కొత్తగా పుట్టుకొస్తున్న స్టార్టప్‌లను ఆయన స్వాగతిస్తూనే కీలక సూచనలు చేశారు. ‘‘స్టార్టప్ ఎకోసిస్టమ్‌లో చక్కటి బృందాలను నిర్మించాలి. ప్రతిభావంతులను తీసుకునేందుకు భయపడకూడదు. నినాదాల కంటే విలువలకు ప్రాధాన్యం ఇవ్వాలి. నిర్వహణ లాభాలు, స్థూల మార్జిన్లు, నగదు ప్రవాహాలను దృష్టిలో పెట్టుకోవాలి‘‘అని బిర్లా సూచించారు. వృద్ధి కోసం ఇతర అంశాల విషయంలో రాజీపడిన ఇటీవలి కొన్ని కంపెనీలను ఉదాహరణగా పేర్కొన్నారు. ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీలు గ్రీన్ ఎనర్జీపై పెట్టుబడులు పెడుతున్నట్టు చెప్పారు. -
భారత్ అభివృద్ధిని ప్రపంచం కోరుకుంటోంది
ముంబై: ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ ఎంతో ప్రత్యేకమైన స్థానంలో ఉందన్నారు ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా. భారత్ ఎదుగుదలను ప్రపంచం కోరుకుంటున్నట్టు చెప్పారు. నూతన సంవత్సరం సందర్భంగా కుమార మంగళం బిర్లా తన సందేశాన్ని ఇచ్చారు. ‘‘భారత్ ఆర్థిక సౌభాగ్యం ప్రపంచానికి ఎంతో కీలకమైనది. భారత్ వృద్ధిని ప్రపంచం స్వాగతిస్తుండడం ఆశ్చర్యకరం. ఎందుకంటే భారత్ వృద్ధి స్థిరంగా ఉండడమే కాదు, ఇతరులకు విఘాతం కలిగించనిది. వచ్చే రెండున్నర దశాబ్దాలు భారత్‌కు అమృత కాలం అనడంలో ఎలాంటి సందేహం లేదు’’అని కుమార మంగళం బిర్లా పేర్కొన్నారు. ఐదు ధోరణులు ప్రపంచంపై ఎన్నో ఏళ్లపాటు ప్రభావం చూపిస్తాయన్నారు. చైనా ప్లస్ 1 వ్యూహాత్మక విధానంలో భాగంగా అంతర్జాతీయ కంపెనీలకు భారత్ స్పష్టమైన ఎంపికగా పేర్కొన్నారు. దశాబ్దాలుగా ఏర్పడిన సరఫరా వ్యవస్థ రూపు రేఖలు మారుతున్నట్టు చెప్పారు. దీనికి కొంత సమయం పడుతుందన్నారు. ప్రపంచం ఎంతో వేగంగా గ్రీన్ ఎనర్జీవైపు అడుగులు వేస్తుండడాన్ని రెండో అంశంగా పేర్కొన్నారు. ఈ విధమైన ఇంధన మార్పు దిశగా భారత్ ధైర్యంగా అడుగులు వేసినట్టు చెప్పారు. నూతన వ్యాపారాల నిర్మాణంలో భారత్ వినూత్నంగా వ్యవహరిస్తున్నప్పటికీ.. ఇందులో సమతుల్యత అవసరమన్నారు. వ్యాపారాలు తమ ప్రాథమిక బలాలపై దృష్టి పెట్టాలన్నారు. ‘‘నేడు వ్యాపారాలు ఎదుర్కొంటున్న వినూత్నమైన సవాలు.. ఎంతో కాలంగా ఏర్పాటు చేసుకున్న విశ్వాసం, స్థిరత్వాన్ని కొనసాగిస్తూనే మనల్ని మనం తిరిగి ఆవిష్కరించుకోవాల్సి ఉంది’’అని బిర్లా పేర్కొన్నారు. షార్ట్కట్లు ఉండవు.. వ్యాపారాల నిర్మాణానికి ఎలాంటి దగ్గరి దారులు లేవంటూ, కొత్తగా స్టార్టప్‌లు ఏర్పాటు చేసే వారిని బిర్లా పరోక్షంగా హెచ్చరించారు. మూడు దశాబ్దాల క్రితం నాటి ‘టాప్ గన్’ సినిమా సీక్వెల్‌ను 2022లో తీసుకురాగా బిలియన్ డాలర్లను ఒక నెలలోనే వసూలు చేసిన విషయాన్ని బిర్లా గుర్తు చేశారు. పునఃఆవిష్కరణలు, భవిష్యత్తు నిర్మాణానికి సంబంధించిన ప్రాధాన్యతలను ఈ సినిమా తెలియజేసిందన్నారు. నిధుల లభ్యత, యువ నైపుణ్యాల మద్దతుతో కొత్తగా పుట్టుకొస్తున్న స్టార్టప్‌లను ఆయన స్వాగతిస్తూనే కీలక సూచనలు చేశారు. ‘‘స్టార్టప్ ఎకోసిస్టమ్‌లో చక్కటి బృందాలను నిర్మించాలి. ప్రతిభావంతులను తీసుకునేందుకు భయపడకూడదు. నినాదాల కంటే విలువలకు ప్రాధాన్యం ఇవ్వాలి. నిర్వహణ లాభాలు, స్థూల మార్జిన్లు, నగదు ప్రవాహాలను దృష్టిలో పెట్టుకోవాలి‘‘అని బిర్లా సూచించారు. వృద్ధి కోసం ఇతర అంశాల విషయంలో రాజీపడిన ఇటీవలి కొన్ని కంపెనీలను ఉదాహరణగా పేర్కొన్నారు. ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీలు గ్రీన్ ఎనర్జీపై పెట్టుబడులు పెడుతున్నట్టు చెప్పారు. -
2026 కల్లా రూ. 21,000 కోట్లకు..
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్(ఏబీఎఫ్ఆర్ఎల్) రానున్న నాలుగేళ్లలో టర్నోవర్‌ను భారీగా పెంచుకునే ప్రణాళికల్లో ఉంది. 2026కల్లా రూ. 21,000 కోట్ల ఆదాయం సాధించగలమని విశ్వసిస్తున్నట్లు కంపెనీ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా పేర్కొన్నారు. మార్కెట్లో కంపెనీకిగల పొజిషన్‌ను మరింత పటిష్ట పరచుకోవడం ద్వారా లక్ష్యాన్ని సాధించగలమని కంపెనీ 15వ వార్షిక సాధారణ సమావేశం సందర్భంగా వాటాదారులకు తెలియజేశారు. టెక్నాలజీ వినియోగం, ఎగ్జిక్యూషన్ సామర్థ్యాలతో లాభదాయక, ఫ్యూచర్ రెడీ బ్రాండ్ పోర్ట్‌ఫోలియోను నిర్మించనున్నట్లు వివరించారు. 2021 మార్చిలోనే రూ. 21,000 కోట్ల టర్నోవర్‌ను అంచనా వేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. 2026కల్లా అంచనాలను అధిగమించగలమన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో మరిన్ని మైలురాళ్లను అందుకునే లక్ష్యాలను ఏర్పాటు చేసుకోనున్నట్లు చెప్పారు. మార్చితో ముగిసిన గతేడాది(2021–22) కంపెనీ 55 శాతం వృద్ధితో రూ. 8,136 కోట్ల ఆదాయం సాధించింది. -
గ్రాసిమ్ విస్తరణకు రూ.3,117 కోట్లు
న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీ గ్రాసిమ్ ఇండస్ట్రీస్ విస్తరణకు రూ.3,117 కోట్ల మూలధన వ్యయం చేయనుంది. ఈ మొత్తాన్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సామర్థ్యం పెంపు, ప్లాంట్ల ఆధునీకరణకు వెచ్చిస్తామని సంస్థ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా సోమవారం వెల్లడించారు. పెయింట్స్, బీటూబీ ఈ–కామర్స్ వ్యాపారాలు మినహా ఇతర విభాగాల్లో ఈ నిధులను ఖర్చు చేస్తామన్నారు. ‘ఇప్పటికే పెయింట్స్ వ్యాపారంలో రూ.10,000 కోట్ల మూలధన వ్యయానికి బోర్డ్ ఆమోదం తెలిపింది. ఇందులో 2022 మార్చి నాటికే రూ.605 కోట్లు ఖర్చు చేశాం. అదనంగా రూ.2,000 కోట్లను బీటూబీ ఈ–కామర్స్ వ్యాపారానికై వెచ్చిస్తాం. 2021–22లో గ్రాసిమ్ రూ.1,958 కోట్లు మూలధన వ్యయం చేసింది. స్థలం దక్కించుకున్న ఆరు పెయింట్స్ ప్లాంట్లలో నాలుగుచోట్ల నిర్మాణం ప్రారంభం అయింది’ అని వాటాదార్ల సమావేశంలో వివరించారు. -
అవాంతరాలు సర్వసాధారణంగా మారాయి
న్యూఢిల్లీ: వ్యాపారాల నిర్వహణలో వివిధ రకాల అవాంతరాలు ప్రస్తుతం సర్వ సాధారణంగా మారాయని అల్ట్రాటెక్ సిమెంట్ చైర్మన్ కుమార మంగళం బిర్లా వ్యాఖ్యానించారు. అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్నప్పటికీ వాటిని విజయవంతంగా అధిగమించగలిగేలా భారత్ కనిపిస్తోందని తెలిపారు. వార్షిక సర్వ సభ్య సమావేశంలో షేర్హోల్డర్లను ఉద్దేశించి వర్చువల్‌గా చేసిన ప్రసంగంలో ఆయన ఈ అంశాలు ప్రస్తావించారు. ఈ ఏడాది వ్యయాలపరమైన ఒత్తిళ్లు, ఆర్థిక మార్కెట్లలో అస్థిరత విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉన్నప్పటికీ వ్యాపారాలు మధ్యకాలికంగా చూస్తే వ్యాపారాలు రికవరీ బాటలోనే కొనసాగుతున్నాయని బిర్లా వివరించారు. ‘కోవిడ్–19 మహమ్మారి కారణంగా 2020 అసాధారణమైన సంవత్సరంగా గడిచింది. సరఫరా వ్యవస్థలు దెబ్బతినడంతో 2021 కూడా అలాగే గడిచిపోయింది. ఇక ఇప్పుడు రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, అంతర్జాతీయంగా స్టాగ్ఫ్లేషన్ (ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత పెరిగిపోయి.. డిమాండ్ స్తబ్దంగా ఉండటం) వంటి కారణాలతో 2022 కూడా అసాధారణంగానే కొనసాగుతోంది. చూడబోతే అవాంతరాలనేవి సర్వసాధారణంగా మారిపోయినట్లుగా కనిపిస్తోంది‘ అని బిర్లా చెప్పారు. -
మంచి విజన్ ఉన్న యువ సీఎం జగన్: కుమార మంగళం బిర్లా
సాక్షి, తూర్పుగోదావరి: గోదావరి ఒడ్డున, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అయిన ఈ ప్రాంతంలో ఈ పరిశ్రమను ప్రారంభిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. మంచి విజన్ కలిగిన యువ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి. పారిశ్రామిక రంగంలో ఆంధ్రప్రదేశ్ మరింత పురోగమించేలా ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రభుత్వంతో కలిసి అడుగులు వేస్తోంది. ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పడానికి ఆసక్తి చూపుతోంది. ఈ పరిశ్రమ మా గ్రూప్‌లో ఒక మైలు రాయిగా నిలిచిపోనుంది. మా గ్రూప్‌నకు చెందిన అల్ట్రాటెక్, ఆదిత్య ఫ్యాషన్, గార్మెంట్, ఆదిత్య బిర్లా క్యాపిటల్ (ఫైనాన్షియల్ బిజినెస్) ద్వారా రాష్ట్రంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 10 వేల మందికి ఉపాధి కలుగుతుంది. రాష్ట్రంలో విశాల తీర ప్రాంతం, మల్టీ మోడల్ కనెక్టివిటీ, మంచి సామర్థ్యం కలిగిన మానవ వనరులు, నైపుణ్యం కలిగిన కార్మికులు, ఉద్యోగులు (వర్క్‌ఫోర్స్) ఉండటానికి తోడు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించే ప్రభుత్వం.. వెరసి పెట్టుబడుల రంగంలో ఏపీ అగ్రస్థానంలో నిలుస్తుందని గట్టిగా నమ్ముతున్నా.ఔ చదవండి: (కుమార మంగళం బిర్లాకు సీఎం జగన్ ప్రత్యేక విందు) మా గ్రూప్ రసాయన విభాగం విశ్వవ్యాప్తంగా 2.4 బిలియన్ డాలర్ల ఆదాయం పొందుతోంది. భారత్, థాయిలాండ్, జర్మనీ, అమెరికాలో ప్రధానంగా పని చేస్తూ దాదాపు 80 దేశాల్లో 1000కి పైగా ఉత్పత్తులు కొనసాగిస్తోంది. ఇందులో క్లోర్ ఆల్కలీ వ్యాపారం ముఖ్యం. దేశంలోకెల్లా ఇక్కడే.. బలభద్రపురం యూనిట్లో ఎక్కువ ఉత్పత్తి (ఏటా 1.5 లక్షల టన్నులు) జరుగుతుంది. ఇక్కడ ఉత్పత్తి అయ్యే కాస్టిక్ సోడా అనేక పరిశ్రమల అవసరాలు తీర్చనుంది. ఈ ప్లాంట్‌లో స్థానికులకే ఎక్కువ అవకాశం కల్పిస్తున్నాం. వచ్చే నెలల్లో విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పన, సామాజిక అభివృద్ధి కోసం కృషి చేస్తాం. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 10 రోజుల్లోనే, 1947లో మా తాత జీడీ బిర్లాతో మొదలైన మా ప్రస్థానం.. ఇప్పుడు పలు రంగాలకు విస్తరించింది. ప్రస్తుతం గ్రాసిమ్ కంపెనీ 75వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఈ ప్లాంట్ ప్రారంభం కావడం ఆనందంగా ఉంది. ఇందుకు అన్ని విధాలా సహకరించిన సీఎం వైఎస్ జగన్‌కు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు. – కుమార మంగళం బిర్లా, చైర్మన్, ఆదిత్య బిర్లా గ్రూపు -
కుమార మంగళం బిర్లాకు సీఎం జగన్ ప్రత్యేక విందు
సాక్షి, అమరావతి: తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురంలో గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ప్రారంభం అనంతరం గురువారం మధ్యాహ్నం సీఎం జగన్‌తో కలిసి ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా తాడేపల్లికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు తన నివాసంలో సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక విందు ఇచ్చారు. అనంతరం జ్ఞాపిక బహూకరించి సన్మానించారు. గ్రాసిమ్ ఇండస్ట్రీస్, కుమార మంగళం బిర్లాకు శుభాకాంక్షలు. మీ అపార అనుభవం, పరిచయాలు ఆంధ్రప్రదేశ్ ఎదుగుదలకు కచ్చితంగా తోడ్పతాయి. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని, మరిన్ని పెట్టుబడులతో రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నిలవాలని ఆకాంక్షిస్తున్నాం. దేశం నలుమూలల నుంచి రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు ఇది దోహదపడుతుందని భావిస్తున్నా. ఈ పరిశ్రమ వల్ల అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏ సహకారం అవసరమైనా అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. – సీఎం వైఎస్ జగన్ చదవండి: (పరిశ్రమలకు రాచబాట) -
కరోనా 3వ వేవ్ : బ్యాంక్ ఆఫ్ అమెరికా కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: వ్యాక్సినేషన్ వేగవంతంతోనే ఎకానమీలో పురోగతి సాధ్యమని ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా పేర్కొన్నారు. రెండవ వేవ్ కేసులు తగ్గినప్పటికీ, పలు రంగాలపై దాని తీవ్ర ప్రభావం కొనసాగుతోందని అన్నారు. ఈ పరిస్థితుల్లో 2021–22 ఆర్థిక సంవత్సరం వృద్ధిపై అంచనాలను పునః సమీక్షించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. (వృద్ధి రేటును ప్రభుత్వం 11 శాతం అంచనావేస్తుండగా, మూడీస్, ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్‌లు దాదాపు దీనికి ఒక అంకెకే పరిమితం చేస్తున్నాయి) అయితే దీర్ఘకాలంలో చూస్తే భారత్ ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉన్నాయని పేర్కొన్నారు. గ్రూప్ సంస్థ– ఆల్ట్రాటెక్ సిమెంట్ వార్షిక నివేదికలో ప్రముఖ పారిశ్రామికవేత్త వివరించిన విశ్లేషణాంశాల్లో ముఖ్యమైనవి... ♦మొదటివేవ్‌తో పోల్చితే ఎకానమీకి రెండవవేవ్లో స్వల్ప నష్టం మాత్రమే సంభవించింది. వ్యాక్సినేషన్ పురోగతితో రవాణా, ఆర్థిక క్రియాశీలత మెరుగుపడుతుంది. ♦రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సరళతర ఆర్థిక విధానాలు, ప్రభుత్వ నుంచి పెరుగుతున్న మూలధన వ్యయాలు వృద్ధి రికవరీకి మద్దతునిస్తాయి. ♦దీనికితోడు ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, ఆస్తుల అమ్మకం, నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్ అమలు, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం, కొత్త కార్మిక చట్టం పెట్టుబడులకు తద్వారా దీర్ఘకాలంలో వృద్ధికి దోహదపడే అంశాలు. ♦ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య వృద్ధి ధోరణి భారత్ ఎగుమతులకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది. దేశ వృద్ధి బాటలో ఇది అదనపు బలం. ♦దేశంలో ఆరోగ్య రంగానికి సంబంధించి మౌలిక సదుపాయాలు మరింత పెరగాలి. ♦అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ 2021లో ప్రపంచ వృద్ధిని 6 శాతంగా అంచనావేస్తోంది. అయితే వివిధ దేశాల్లో రెండవ, మూడవ వేవ్స్ సవాళ్లు పటిష్ట వృద్ధి అవుట్‌లుక్‌పై సందేహాలను వ్యక్తం చేస్తున్నాయి. కోవిడ్–19 విసిరిన సవాళ్ల నేపథ్యంలో వృద్ధి రికవరీ తీవ్ర ఒడిదుడుకులకు గురవుతోంది. ♦కరోనా సవాళ్లు కొనసాగినప్పటికీ, మన గ్రూప్ సంస్థల ఉద్యోగులు వ్యాపారం, కస్టమర్ సేవలపై తగిన విధమైన దృష్టి సారించారు. సిమెంట్ పరిశ్రమకు మెరుగైన అవకాశాలు ప్రభుత్వ వృద్ధి కార్యకలాపాలు తోడవడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సిమెంట్ పరిశ్రమకు మెరుగైన అవకాశాలు ఉంటాయని అల్ట్రాటెక్ సిమెంట్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా అన్నారు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రభుత్వం ఖర్చు చేయడం, మెరుగైన బడ్జెట్ కేటాయింపులతో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) వంటి సరసమైన గృహ నిర్మాణ పథకాలు సిమెంట్ పరిశ్రమ వృద్ధిని నడిపిస్తాయని వాటాదారులను ఉద్దేశించి తెలిపారు. ‘గృహ, మౌలిక సదుపాయాల రంగంతో సిమెంట్ డిమాండ్ ముడిపడి ఉంది. పరిమాణం పరంగా ఈ పరిశ్రమ వృద్ధి మార్గంలో ఉంది. ప్రభుత్వ లక్ష్యమైన 2022 నాటికి అందరికీ గృహాలు, నిర్మాణంలో ఉన్న పెద్ద మౌలిక సదుపాయాల ప్రాజెక్టులచే ఈ పరిశ్రమ ప్రేరణ పొందింది. 2020–21లో సిమెంట్ రంగం 10–12 శాతం తిరోగమన వృద్ధి నమోదు చేసింది. అయితే ఆర్థిక సంవత్సరం రెండవ అర్ధ భాగంలో త్వరగా కోలుకునే సంకేతాలను చూపించింది. గతేడాది మార్చి–ఏప్రిల్ లాక్డౌన్ అన్ని తయారీ రంగాలకు భారీ సవాళ్లను విసిరింది. మహమ్మారి ఉన్నప్పటికీ గ్రామీణ, చిన్న పట్టణాలు, రిటైల్‌లో సిమెంట్ వినియోగం బలమైన వృద్ధి కనబరిచింది’ అని ఆయన వెల్లడించారు. ఆసియా, పసిఫిక్‌లో డెల్టా భయాలు: మూడీస్ భారత్ ఎకానమీపై కోవిడ్–19 సెకండ్‌వేవ్ సవాళ్లు మరికొంతకాలం కొనసాగుతాయని సోమవారం విడుదల చేసిన ఒక నివేదికలో రేటింగ్ దిగ్గజం– మూడీస్ విశ్లేషించింది. ‘ఆసియా పసిఫిక్ ఎకనమిక్ అవుట్‌లుక్: ది డెల్టా రోడ్‌బ్లాక్’ అన్న శీర్షికన విడుదల చేసిన నివేదికలో కొన్ని ముఖ్యాంశాలను క్లుప్తంగా చూస్తే... సామాజిక దూరం అన్న అంశం ప్రస్తుత త్రైమాసికం (జూలై–ఆగస్టు–సెప్టెంబర్)పై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇక రికవరీ ప్రారంభమయ్యేది ఈ ఏడాది చివరికేనని భావిస్తున్నాం. డెల్టా వేరియంట్ ప్రస్తుతం ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో భయాందోళనలకు గురిచేస్తోంది. 2020తో పోల్చితే ఎకానమీ ఇప్పుడు కొంత తక్కువగా నష్టపోవడం కొంతలో కొంత ఊరట. భారత్ నుంచి ఎగుమతుల విలువ పెరుగుతోంది కానీ, దీనికి అధిక కమోడిటీ ధరలు, గత ఏడాది లో బేస్ ఎఫెక్ట్ కారణం. భారత్‌లో సెకండ్‌వేవ్ తగ్గుతున్నప్పటికీ, చిన్న సంస్థలు కోలుకోడానికి చాలా సమయం పడుతుంది. ఎగుమతులూ ఇప్పుడిప్పుడే నిలద్రొక్కుకుంటున్నాయి. వ్యాక్సినేషన్ మరింత వేగవంతం కావాల్సి ఉంది. 5.5 శాతం వరకూ ప్రపంచ వృద్ధి రేటు.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ (జీడీపీ) వృద్ధి రేటు 2021లో 5 నుంచి 5.5 శాతం శ్రేణిలో ఉంటుందన్నది తాజా అంచనా. ప్రపంచ వాణిజ్యం కూడా గణనీయంగా మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రపంచ పారిశ్రామిక ఉత్పత్తి కూడా పెరుగుతోంది. గ్లోబల్ సప్లై చైన్స్ యథాతథ స్థాయికి చేరుతున్నాయి. మూడవవేవ్ సవాళ్లు తీవ్రం కాకపోతే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తిరిగి వేగంగా పురోగమిస్తుంది. 3వ వేవ్ వస్తే కష్టమే: బ్యాంక్ ఆఫ్ అమెరికా ముంబై: భారత్‌లో కోవిడ్–19 మూడవ వేవ్ సవాళ్లు తీవ్రమయితే, ఎకానమీలో సాధారణ పరిస్థితులు నెలకొనడానికి 2022 నాల్గవ త్రైమాసికం వరకూ సమయం పడుతుందని వా ల్ స్ట్రీట్ బ్రోకరేజ్ సంస్థ– బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ విశ్లేషించింది. ఈ పరిస్థితుల్లో 2022 తొలి నెలల వరకూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండి యా (ఆర్బీఐ) బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను యథాతథంగా 4 శాతంగానే కొనసాగించే వీలుందని వివరించింది. అప్పటికి సాధారణ పరిస్థితులు నెలకొంటే 2023 డిసెంబర్ నాటికి రెపో రేటు 5.5 శాతానికి పెరిగే అవకాశం ఉంటుందని పేర్కొం ది. మూడవ వేవ్ భయాలను పక్కనబెట్టి, ప్రస్తు త పరిస్థితు లకు అనుగుణంగా పరిశీలిస్తే, వృద్ధి, ద్రవ్యో ల్బణం లక్ష్యాల నెరవేరుతాయన్న అభిప్రాయా న్ని వ్యక్తం చేసింది. సరఫరాల సమస్యలను పరి ష్కంచడం ద్వారా రిటైల్ ద్రవ్యోల్బణం కట్టడిలో ఉంచడానికి (2 నుంచి 6 శాతం శ్రేణిలో) కేంద్రం తగిన చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నట్లు బ్యాంక్ ఆఫ్ అమెరికా నివేదిక విశ్లేషించింది. క్రూడ్ కష్టాలు... అయితే అంతర్జాతీయంగా పెరుగుదల ధోరణిలో ఉన్న క్రూడ్ ధరలు ఎకానమీకి కొంత ఇబ్బందిని సృష్టించే వీలుందని అంచనావేసింది. ‘‘తాజా పరిస్థితుల ప్రకారం 2022 రెండవ త్రైమాసికం నాటికి పాలసీ విధానం సరళతరత నుంచి తటస్థ స్థితికి చేరుకుంటుంది. 2022 జూన్‌లో లేదా ఆగస్టులో రెపో రేటు పెంపు ప్రారంభం కావచ్చు. 2023 మార్చి నాటికి 5 శాతం, 2023 డిసెంబర్ నాటికి 5.5 శాతానికి పెరిగే అవకాశం ఉంది’’ అని నివేదిక విశ్లేషించింది. -
అత్యంత సంపన్న క్రికెటర్ ఇతనేనంటే నమ్ముతారా!
ముంబై: భారతదేశంలో అత్యంత సంపన్న క్రికెటర్ ఎవరంటే ఏం ఆలోచించకుండా వెంటనే విరాట్ కోహ్లి, సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని అనే పేర్లు వినిపిస్తాయి. కానీ ఈ ప్రశ్నకు సమాధానం వీరెవరూ కాదంటే మీరు నమ్మగలరా. వ్యాపార దిగ్గజం కుమార్ మంగళం బిర్లా కుమారుడు ఆర్యమన్ బిర్లా ప్రస్తుతం దేశవాలి క్రికెట్లో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మధ్యప్రదేశ్ జట్టు తరపున రంజీ ట్రోఫీలో ఆడుతున్నాడు. 2018లో ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ ఇతడిని రూ. 31 లక్షలకు కొనుగోలు చేసింది. ప్రస్తుతం కుమార్ మంగళం బిర్లా ఆస్తుల విలువ 70 వేల కోట్లు. త్వరలోనే బిర్లా వ్యాపార సామ్రాజ్యానికి ఆర్యమన్ అధిపతి కానున్నాడు. ఈ లెక్క ప్రకారం భారత దేశంలో అత్యంత సంపన్న క్రికెటర్‌గా పేరు సంపాదించనున్నాడు. 23 ఏళ్ల ఆర్యమన్ బిర్లాకు చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే చాలా ఇష్టం, అంతర్జాతీయ క్రికెటర్‌గా మంచి గుర్తింపు సంపాదించాలని కలలు కనేవాడు. అందుకోసం ఈ జూనియర్ బిర్లా ప్రతిరోజూ మైదానంలో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెటర్ల జాబతాలో తన పేరుని చూసుకోవడానికి కఠినమైన శిక్షణ పొందుతున్నాడు. ఆర్యమన్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మాన్, లెఫ్ట్ ఆర్మ్ఆర్థోడాక్స్ బౌలర్. మీ ఇంటి పేరు కారణంగా ఏమైనా ఒత్తిడి ఉందా అని ఆర్యమన్‌ను ఎవరైనా అడిగితే.. అతను చెప్పే సమాధానం ఏంటో తెలుసా.. 'నేను నా సొంతంగా ఎదగడానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తా అని చెప్పుకొచ్చేవాడు. 2017న ఇండోర్‌లో మధ్యప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆర్యమన్ ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లో ఒడిశాపై కేవలం 22 పరుగులు చేశాడు. తరువాత సీ.కే.నాయుడు ట్రోఫీలో అతను 11 ఇన్నింగ్స్‌లలో ఆరు మ్యాచ్‌లు ఆడి 79.50 సగటుతో 795 పరుగులు చేశాడు. ఇక జూనియర్ స్థాయిలో మధ్యప్రదేశ్‌కు ఆడిన ఆర్యమన్ నాలుగు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీలు సాధించాడు. ( చదవండి: సచిన్ టెండూల్కర్‌కు కరోనా పాజిటివ్ ) -
రూ.1,500 కోట్లతో బిట్స్ మేనేజ్మెంట్ స్కూల్
న్యూఢిల్లీ: బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) పిలానీ.. బిట్స్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ (బీఐటీఎస్‌ఓఎం)ను ప్రారంభించనుంది. ఈ ఏడాది జూలైలో 120 మంది విద్యార్థులతో తొలి బ్యాచ్ మొదలుకానుంది. సెంట్రల్ ముంబైలోని పోవై తాత్కాలిక క్యాంపస్‌లో బోధనా తరగతులుంటాయి. రూ.1,500 కోట్ల పెట్టుబడులతో ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో రూ.60 ఎకరాల్లో శాశ్వత క్యాంపస్‌ను అభివృద్ధి చేయనున్నారు. ఇది 2024 నాటికి సిద్ధమవుతుందని బిట్స్ పిలానీ చాన్సలర్ కుమార్ మంగళం బిర్లా తెలిపారు. రెండేళ్ల రెసిడెన్షియల్ బిజినెస్ డిగ్రీ ప్రోగ్రామ్‌ను అందించనున్నారు. కోర్స్ ఫీజు రూ. 24 లక్షలు. న్యూయార్క్‌లోని ఎన్‌వైయూ స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్, వార్టన్ స్కూల్ ఆఫ్ యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా, సింగపూర్ మేనేజ్ మెంట్ యూనివర్శిటీ, కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ వంటి అగ్రశ్రేణి బిజినెస్ స్కూల్స్ ప్రొఫెసర్లతో విద్యా బోధన ఉంటుంది. ‘‘ఎం బీఏ కంటెంట్, డెలివరీ ఫార్మాట్స్‌ను మార్చాల్సిన అవసరం ఉంది. టెక్నాలజీ ద్వారా వ్యాపార నమూనాలు, విధానాలు ఎలా మారుతున్నాయో, కొనుగోలుదారులు అవసరాలకు తగ్గ డిజైన్స్ ఎలా పరిష్కరించబడుతున్నాయో అలాంటి మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ ప్రవేశపెట్టాల్సిన సమయం ఆసన్నమైందని’’ కుమార్ మంగళం పేర్కొన్నారు. -
మమ్మల్ని బయటకు గెంటేశారు: అనన్య బిర్లా
వాషింగ్టన్: ‘‘స్కోపారెస్టారెంట్ నిర్వాహకులు నన్ను, నా కుటుంబాన్ని బయటకు గెంటేశారు. జాతి వివక్ష ప్రదర్శించారు. ఇది నిజంగా విషాదకరం. కస్టమర్ల పట్ల ఇలాంటి వైఖరి సరైంది కాదు. మీ రెస్టారెంటులో భోజనం చేయడానికి మేం మూడు గంటలు ఎదురుచూశాం. కానీ, మీ వెయిటర్ జోషువా సిల్వర్మాన్ మా అమ్మతో అత్యంత దురుసుగా ప్రవర్తించారు. జాతి వివక్షపూరిత వ్యాఖ్యలు చేశారు. ఇది అస్సలు సరైంది కాదు. వెరీ రేసిస్ట్’’ అంటూ సింగర్, బిర్లా కుటుంబ వారసురాలు అనన్య బిర్లా అమెరికన్ రెస్టారెంటులో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి నెటిజన్లతో పంచుకున్నారు. తమ పట్ల జాతి వివక్ష చూపిన రెస్టారెంటు నిర్వాహకులకు సోషల్ మీడియా వేదికగా చురకలు అంటించారు. (చదవండి: ట్రోలింగ్: ‘సంజూ గ్రేట్.. పంత్ నువ్వు హల్వా, పూరీ తిను’ ) కాగా ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్, బిలియనీర్ కుమార్ మంగళం బిర్లా కూతురైన అనన్య బిర్లా గాయనిగా, ఆర్టిస్టుగా తనకంటూ సొంత గుర్తింపు దక్కించుకుంటున్న విషయం తెలిసిందే. శనివారం ఆమె తన తల్లి నీరజా బిర్లా, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి కాలిఫోర్నియాలోని ప్రముఖ ఇటాలియన్- అమెరికన్ రెస్టారెంటుకు వెళ్లారు. ఈ క్రమంలో భోజనం ఆర్డర్ చేసిన తమను, గంటల కొద్దీ వెయిట్ చేయించారని, కస్టమర్లన్న కనీస మర్యాద లేకుండా అనుచితంగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెఫ్ ఆంటోనియా లొఫాసో నేతృత్వంలోని ఇటాలియన్ మూలాలున్న సదరు రెస్టారెంటు నిర్వాహకుల తీరును నెటిజన్ల దృష్టికి తీసుకువచ్చారు. ఇక కూతురి ట్వీట్‌పై స్పందించిన నీరజా బిర్లా సైతం.. ‘‘ఇది నిజంగా షాకింగ్‌గా ఉంది.. అత్యంత అనుచితంగా ప్రవర్తించారు. కస్టమర్లతో ఇలా వ్యవహరించేందుకు మీకు ఎలాంటి హక్కు లేదు’’అంటూ రెస్టారెంట్లు నిర్వాహకుల తీరును ఎండగట్టారు. అనన్య సోదరుడు ఆర్యమన్ బిర్లా కూడా ఈ విషయంపై స్పందించాడు. గతంలో తమకు ఎన్నడూ ఇలాంటి రేసిస్ట్ అనుభవాలు ఎదురుకాలేదని, జాతి వివక్ష ఉందన్న విషయాన్ని ఇంకా నమ్మలేకపోతున్నానని చెప్పుకొచ్చాడు. This restaurant @ScopaRestaurant literally threw my family and I, out of their premises. So racist. So sad. You really need to treat your customers right. Very racist. This is not okay. — Ananya Birla (@ananya_birla) October 24, 2020 We waited for 3 hours to eat at your restaurant. @chefantonia Your waiter Joshua Silverman was extremely rude to my mother, bordering racist. This isn’t okay. — Ananya Birla (@ananya_birla) October 24, 2020 Very shocking ..absolutely ridiculous behaviour by @ScopaRestaurant . You have no right to treat any of your customers like this. https://t.co/szUkdxAgNh — Neerja Birla (@NeerjaBirla) October 24, 2020 I have never experienced anything of this sort. Racism exists and is real. Unbelievable. @ScopaRestaurant https://t.co/FU0NE8e7Qu — Aryaman Birla (@AryamanBirla) October 24, 2020 -
కోవిడ్ క్రాష్ : అంబానీకి నష్టం ఎంతంటే?
సాక్షి, ముంబై: కోవిడ్-19 కల్లోలానికి ప్రపంచ మార్కెట్లు విలవిల్లాడాయి. అటు దేశీయ ఈక్విటీమార్కెట్లు కూడా ఫిబ్రవరి చివరి వారంలో భారీగా నష్టపోయాయి. గత ఆరు సెషన్లుగా వరుస నష్టాలతో ఇన్వెస్టర్ల సంపద రూ.10 లక్షల కోట్లు ఆవిరైపోయింది. శుక్రవారం ఒక్కరోజే రూ.4 లక్షల కోట్లకు పైగా సంపద నిమిషాల్లో కరిగిపోయింది. కరోనా వైరస్ వ్యాప్తికి ఎక్కడా అడ్డుకట్టపడకపోవడంతో ఇన్వెస్టర్లు, ట్రేడర్లు భారీ అమ్మకాలకు దిగారు. దీంతో దేశంలోని కుబేరులు కూడా సంపదను కోల్పోయారు. (5 నిమిషాల్లో రూ. 5 లక్షల కోట్లు హాంఫట్) ముఖ్యంగా ఈ సంవత్సరం మొదటి రెండు నెలల్లోని బలహీన ధోరణి భారత బిలియనీర్ల సంపదను ప్రభావితం చేసింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ సూచిక ప్రకారం, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ ఈ ఏడాది తన సంపదలో 5 బిలియన్ డాలర్లకు పైగా కోల్పోయారు.ఇండెక్స్‌లో పదిహేనవ స్థానంలో ఉన్న ఆసియా టాప్ బిలియనీర్ మొత్తం నికర విలువ 53.5 బిలియన్ డాలర్లు. సెన్సెక్స్1500 పాయింట్లు కుప్పకూలడంతో, మార్కెట్ క్యాప్ పరంగా టాప్‌లో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర శుక్రవారం 4.12 శాతం క్షీణించి రూ.1,328 కు చేరుకుంది, మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ .8.4 లక్షల కోట్లకు పడిపోయింది. (టెక్ దిగ్గజాలకు కోవిడ్-19 సెగ) ఇదే వరుసలో ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా 884 మిలియన్ డాలర్లు కోల్పోయారు. విప్రో లిమిటెడ్ చైర్మన్ అజిమ్ ప్రేమ్‌జీ సంపద రెండు నెలల కాలంలో 869 మిలియన్ డాలర్లు క్షీణించింది. అలాగే గౌతమ్ అదానీ 496 మిలియన్ డాలర్లను కోల్పోయారు. విప్రో షేర్లు 4.53, అదానీ ఎంటర్ప్రైజెస్ 6.5శాతం నష్టపోయాయి. ఇంకా టీసీఎస్, హెచ్డీఎఫ్సీ, ఇన్ఫోసిస్ షేర్లు 2.5 -3.5 శాతం మధ్య, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, టాటా స్టీల్ షేర్లు 4-5 శాతం మధ్య కుప్పకూలిన సంగతి తెలిసిందే. బెంచ్‌మార్క్ సూచికలు 7 శాతం పతనం కావడంతో సెంటిమెంటు పూర్తిగా దెబ్బతిందనీ జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ విశ్లేషించారు. కరోనా మహమ్మారి ముప్పు ఊహించనదానికంటే పెద్దగా ఉండనుందని అంచనా వేశారు. (కోవిడ్-19 : స్విస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం) -
‘ఇవన్నీ నాన్న సీక్రెట్ ఇన్‌స్టాలో చూస్తారు’
న్యూఢిల్లీ : ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లాకు సీక్రెట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉందంట. ఈ అకౌంట్‌ను కేవలం తన కూతురుతో మాత్రమే మాట్లాడానికి వాడతారంట. ఈ విషయాన్ని స్వయంగా ఆయన కూతురే తెలిపారు. పాటల రచయిత, సింగర్ అయిన అనన్య బిర్లా.. తండ్రి కుమార్ మంగళం బిర్లాతో దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. దాంతో పాటు ‘నాన్న నన్ను ఇంత బాగా ఎలా అర్థం చేసుకుంటారో నిజంగా నాకు తెలీదు. నా గురించి ఎంత ఆలోచిస్తారంటే.. తన టై రంగు, నా డ్రెస్ కలర్‌కు మ్యాచ్ అయ్యేలా చూసుకున్నారు. నాన్న ఈ ఫోటోను మీరు మీ సీక్రెట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి చూస్తారని నాకు తెలుసు. లవ్ యు పప్పా’ అంటూ తండ్రితో దిగిన ఫోటోని షేర్ చేశారు అనన్య. ఈ ఫోటోను ఇప్పటికే దాదాపు 24 వేల మంది లైక్ చేశారు. View this post on Instagram I don’t understand how he understands me so deeply! Love you so much papa ❤️❤️ He tried his best to match his tie to the colour of my gown .. and he almost succeeded. Papa, you can see this from your secret account that you created just to stalk me 😂😋🙏🏽 #takemebacktuesday A post shared by Ananya (@ananya_birla) on Jan 28, 2019 at 11:49am PST -
తొలిసారి ఒకే వేదికపైకి టెలికాం ప్రత్యర్థులు
సాక్షి, న్యూఢిల్లీ : టెలికాం మార్కెట్లో పోటాపోటీగా దూసుకుపోతున్న దిగ్గజ అధినేతలు ముగ్గురూ తొలిసారి ఒకే వేదికను పంచుకున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, భారతీ ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్, ఐడియా అధినేత కుమార్ మంగళం బిర్లాలు ఒకే వేదిక పైకి వచ్చారు. నేటి నుంచి న్యూఢిల్లీలో ప్రారంభమైన ఇండియన్ మొబైల్ కాంగ్రెస్‌లో ఈ ముగ్గురూ పాల్గొన్నారు. ఈ సదస్సులో మాట్లాడిన ముఖేష్ అంబానీ, దేశీయ ఎకానమీ వచ్చే 10 ఏళ్లలో ప్రపంచంలో టాప్-3 ఆర్థికవ్యవస్థలో ఒకటిగా నిలుస్తుందన్నారు. ప్రస్తుతం 2.5 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న ఆర్థిక వ్యవస్థ, వచ్చే 10 ఏళ్లలో 7 ట్రిలియన్ డాలర్లను అధిగమిస్తుందని పేర్కొన్నారు. ఈ సదస్సులోనే వొడాఫోన్ గ్రూప్ సీఈవో విట్టోరియో కొలవో, రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, పెట్రోలియం శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, టెలికాం మంత్రి మనోజ్ సిన్హాలు కూడా పాల్గొన్నారు. నేటి నుంచి సెప్టెంబర్ 29 వరకు ఈ సదస్సు జరుగనుంది. డేటా ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థకు కొత్త ఆయిల్గా అభివర్ణించారు. వచ్చే 12 నెలల్లో 4జీ కవరేజ్‌ను విస్తరిస్తుందని, 2జీ వాడకాన్ని అధిగమిస్తుందని తెలిపారు. ఈ ఏడాది రూ.18వేల కోట్ల నుంచి రూ.20వేల కోట్లను ఎయిర్టెల్ పెట్టుబడి పెట్టే యోచనలో ఉందని భారతీ ఎయిర్టెల్ చైర్మన్ సునిల్ మిట్టల్ తెలిపారు. డిజిటల్ ఎకానమీలో భారతీ దిగ్గజ ప్లేయర్‌గా కొనసాగుతుందని చెప్పారు. భవిష్యత్తులో జియోతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. అయితే టెలికాం పరిశ్రమపై పన్నులు అత్యధికంగా ఉన్నాయని, స్పెక్ట్రమ్ వ్యయాలు ఎక్కువగా ఉండి, టారిఫ్‌లు తక్కువగా ఉన్నట్టు పేర్కొన్నారు. గత 20 ఏళ్లలో పెట్టిన పెట్టుబడులన్నింటిన్నీ కలిపితే, దాని కంటే అధిక మొత్తంలో ఈ రెండేళ్లలో పెట్టుబడులుగా పెట్టినట్టు చెప్పారు. ప్రతి ఏడాది నెట్వర్క్ ఇన్ఫ్రాక్ట్ర్చర్కు ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియాలు కలిసి రూ.50వేల కోట్ల నుంచి రూ.60వేల కోట్లను ఇన్వెస్ట్ చేస్తున్నట్టు ఈ దిగ్గజాలు చెప్పాయి. టెలికాం పరిశ్రమ డిజిటల్ ఇండియా ప్రొగ్రామ్‌కు వెన్నుముకగా ఉందని మనోజ్ సిన్హా తెలిపారు. 2020 కల్లా 6 ట్రిలియన్ డాలర్ల మార్కును అధిగమిస్తుందని పేర్కొన్నారు. తొలిసారి భారత్ మొబైల్, ఇంటర్నెట్, టెక్నాలజీ ఈవెంట్‌ను నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. డిజిటల్ వృద్ధికి దోహదం చేస్తూ.. డిజిటల్ ఇండియాను విజయవంతం చేస్తున్న మొబైల్ కంపెనీలు సహకారాన్ని అభినందిస్తున్నట్టు రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. -
ఫ్రెషర్ల కంటే తక్కువగా బిర్లా వేతనం
టెలికాం మార్కెట్ లో రిలయన్స్ జియో దెబ్బ అంతా ఇంతా కాదు. టెలికాం దిగ్గజాల రెవెన్యూలు భారీగా తుడిచిపెట్టుకుపోవడమే కాక, ఆ కంపెనీ చైర్మన్ ల వేతనాలకు భారీగా గండికొడుతోంది. ఐడియా సెల్యులార్ కు చైర్మన్ గా ఉన్న కుమార్ మంగళం బిర్లా 2017 ఆర్థిక సంవత్సరంలో ఫ్రెషర్ల కంటే తక్కువగా వేతనాన్ని ఆర్జించారని తెలిసింది. 2017 ఆర్థికసంవత్సరంలో ఆయన కేవలం రూ.3.30 లక్షల వేతనాన్ని మాత్రమే ఇంటికి తీసుకెళ్లారని కంపెనీ వార్షిక రిపోర్టులో వెల్లడించింది. గతేడాది ఈయన వేతనం రూ.13.15 కోట్లు. 2017లో చైర్మన్ కు లేదా ఇతర నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లకు కంపెనీ ఎలాంటి కమిషన్లను చెల్లించలేదు. దశాబ్దం క్రితం ఐపీఓకు వచ్చిన తర్వాత తొలిసారి ఈ టెలికాం ఆపరేటర్ వార్షిక నికర నష్టాలను నమోదుచేసింది. రెవెన్యూలను పడిపోయినట్టు పేర్కొంది. కన్సాలిడేటెడ్ బేసిస్ లో ఐడియా రెవెన్యూలు 0.8 శాతం పడిపోవడంతో రూ.404 కోట్ల నష్టాలను మూటకట్టుకుంది. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ మార్కెట్లోకి ప్రవేశించిన అనంతరం టెలికాం దిగ్గజాలు భారతీ ఎయిర్ టెల్, వొడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యులార్ లు అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. జియో ఉచిత ఆఫర్ల తాకిడి తట్టుకోవడానికి ఈ కంపెనీలు సైతం భారీగా డేటా ధరలను తగ్గించాయి. ఈ పోటీ వాతావరణాన్ని తట్టుకోవడానికి ఐడియా, వొడాఫోన్ లు కలిసి అతిపెద్ద టెలికాం కంపెనీగా అవతరించబోతున్నాయి. ఈ డీల్ ఇంకా పూర్తికావాల్సి ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో టెలికాం రంగం కోలుకుంటుందని బిర్లా ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లలో సంజీవ్ ఆగా పారితోషికం కూడా రూ.16.7 లక్షల నుంచి రూ.5.90 లక్షలకు పడిపోయింది. అయితే మేనేజింగ్ డైరెక్టర్ హిమాన్షు కపానియా వేతనం మాత్రం 13 శాతం పెరిగింది. ఆయనతో పాటు ఫైనాన్స్ చీఫ్ అక్షయ మూన్ద్రా వేతనం కూడా రూ.2.23 కోట్ల నుంచి రూ.2.33 కోట్లకు ఎగిసింది. దీనిలో స్టాక్ ఆప్షన్లను కలుపలేదు. కంపెనీలో సగటున ఉద్యోగుల వేతనం 8 శాతం పెరిగింది. -
ఉద్యోగాలు సేఫ్..భరోసా ఇస్తున్న సీఈవోలు
కోల్ కత్తా : ఐడియా, వొడాఫోన్ల మెగా విలీన ప్రకటన అనంతరం తమ ఉద్యోగాలు ఉంటాయా? పోతాయా? అని ఆందోళన చెందుతున్న ఎంప్లాయీస్ కు కంపెనీలు భరోసా ఇస్తున్నాయి. ఐడియా, వొడాఫోన్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగుల జాబ్స్ సేఫ్ గానే ఉంటాయని ప్రకటించాయి. ఐడియాలో ఎలాంటి ఉద్యోగాల కోత లేదని ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా స్పష్టంచేశారు. స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో విలీనాంతరం ఏర్పడబోయే అతిపెద్ద టెలికాం కంపెనీకి చైర్మన్ గా కుమార్ మంగళం బిర్లానే వ్యవహరించనున్నారని తెలిసింది. వొడాఫోన్ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ ను అపాయింట్ చేయనుంది. తమ సంబంధిత సర్కిళ్లలో బలమైన ఉనికిని చాటుకోవడానికి ఇరు కంపెనీలు వేరువేరుగానే కార్యకలాపాలు నిర్వహించనున్నాయని ఈ టెలికాం దిగ్గజాలు పేర్కొన్నాయి. ఇండియన్ స్టాఫ్ కు కొత్త ప్రొఫిషనల్ అవకాశాలు కల్పించడానికి ఈ విలీనం ఎంతో సహకరించనుందని తెలుపుతూ వొడాఫోన్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ విట్టోరియో కోలో తమ భారత ఉద్యోగులకు ఓ ఈ-మెయిల్ పంపారు. ఎంతో ఆకట్టుకునే కంపెనీగా వొడాఫోన్ ను తీర్చిదిద్దడానికి వొడాఫోన్ ఇండియా టీమ్ కు ఈ డీల్ సహకరించనుందని పేర్కొన్నారు. గట్టి పోటీ ఉండే ఇండియా మార్కెట్లో విజయం సాధించడానికే వొడాఫోన్ ఇండియా ఉద్యోగులు ఎక్కువగా ఫోకస్ చేస్తారని కృషిచేస్తారని అభిప్రాయపడ్డారు. -
ఈ-కామర్స్ రంగంలోకి ఆదిత్యా బిర్లా గ్రూప్
ముంబై: ఆదిత్యా బిర్లా గ్రూప్ ఈ-కామర్స్ రంగంలోకి అడుగుపెట్టింది. ఇది ‘అబాఫ్.కామ్’ (అబాఫ్-ఆల్ అబౌట్ ఫ్యాషన్) పేరుతో ఫ్యాషన్ పోర్టల్‌ను ప్రారంభించింది. అబాఫ్ పోర్టల్‌లో దుస్తులు, ఫుట్‌వేర్స్, ఇతర యాక్సిసిరీస్లను వినియోగదారుల కోసం అందుబాటులో ఉంచామని ఆదిత్యా బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా తెలిపారు. ఈ పోర్టల్‌లో ప్రస్తుతం 7,000 ఉత్పత్తులను వినియోగదారులకు అందుబాటులో ఉంచామని, వీటి సంఖ్యను రానున్న కాలంలో 20,000లకు పెంచుతామని అబాఫ్.కామ్ ప్రెసిడెంట్, సీఈవో ప్రశాంత్ గుప్తా తెలిపారు. -
ఇండియాలో అత్యంత ఖరీదైన వీధి ఏది?
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వీధి.. హాంగ్‌కాంగ్‌లోని పొల్లాక్ స్ట్రీట్స్. రెండోది.. లండన్‌లోని కెన్సింగ్టన్ ప్యాలెస్ గార్డెన్స్. మరి ఇండియాలో అత్యంత ఖైదీదైన వీధి ఏది?.. ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ముందు దేశంలోనే బిగ్గెస్ట్ డీల్‌గా రికార్డులకెక్కిన భవంతి అమ్మకం వివరాలు చూద్దాం.. ఆదిత్యా బిర్లా గ్రూప్ అధినేత కుమార మంగళం బిర్లా.. ప్రస్తుతం ముంబైలో తానుంటున్న ఇంటికి కొద్ది దూరంలోనే మరో భవంతిని కొనుగోలు చేశాడు. ఇందుకోసం ఏకంగా రూ. 425 కోట్లు వెచ్చించాడు. ఇప్పటివరకు మనదేశంలో ఒక భవంతిని ఇంత భారీ మొత్తానికి కొన్న మొదటివ్యక్తి మంగళం సారే! ఆ భవంతి పేరు జైతా హౌజ్. అరేబియా తీరానికి అతి సమీపంలోని మలబార్ హిల్స్‌లో ఉన్న ఈ బంగళా గురించి ముంబైలో ఎవరినడిగినా చెప్పేస్తారట! అంత పేరున్న ఈ బంగళాకు అసలు ఓనర్లు.. పేపర్ పరిశ్రమ దిగ్గజాలైన జైతా సోదరులు. ఏదో అవసరం కోసం జోన్స్ లాంగ్ అనే అంతర్జాతీయ బిడ్డింగ్ కంపెనీ ద్వారా దానిని అమ్మకానికి పెట్టారు. అలా సోమవారం జరిగిన వేలం పాటలో 25 వేల చదరపు అడుగుల జైతా హౌజ్‌ను అక్షరాల 425 కోట్లకు సొంతం చేసుకున్నాడు కుమార మంగళం బిర్లా . ఇక మన ప్రశ్నకు సమాధానమేంటో ఇప్పటికే ఊహించి ఉంటారే.. అవును. మంగళంసార్ కొత్త భవంతి ఉన్న మలబార్ హిల్స్ లోని లిటిల్ గిబ్స్ స్ట్రీటే మన దేశంలో ఖరీదైన వీధిగా కీర్తి గడిస్తున్నది. గతంలో ఇదే ప్రాంతంలో ఉన్న మహేశ్వరి హౌజ్ రూ.400 కోట్లకు అమ్ముడుపోయింది. దివంగత సైంటిస్ట్ హోమీ జహంగీర్ బాబా భవంతిని వేలం వేయగా రూ.372 కోట్లు పలికింది. మలబార్ హిల్స్ ప్రాంతంలో ప్రస్తుతం ఒక చదరపు అడుగు స్థలం రూ. 1.80 లక్షలకు పైగా పలుకుతున్నదట! మొత్తం ఖరీదులో 10 శాతాన్ని ముందే చెల్లించి జైతాహౌజ్ లోకి దిగనున్న బిర్లా గారు మిగతా డబ్బును విడతలవారిగా చెల్లించనున్నట్లు ఆక్షన్ నిర్వాహకులు చెప్పారు. 'ఈ డీల్ గురించి మేమ మాట్లాడితే బాగోదు' అని బిర్లా సంస్థ ఉద్యోగులు అన్నారు. -
బిర్లా... బటర్ చికెన్ చిక్కు!
న్యూఢిల్లీ: రోమ్‌లో ఉన్నప్పుడు రోమన్‌లాగా ఉండాలని సామెత. ఇది వ్యాపారానికీ బాగా వర్తిస్తుంది. అంతర్జాతీయంగా విస్తరిస్తున్న భారత కంపెనీలు ఆయా దేశాల పరిస్థితులకు తగ్గట్లుగా మారక తప్పడం లేదు. 36 దేశాల్లో 4,000 కోట్ల డాలర్ల బిర్లా గ్రూప్‌ను నడిపిస్తున్న కుమార మంగళం బిర్లా ఉదంతమే దీనికి నిదర్శనం. ఆయన మార్వాడీ కమ్యూనిటీకి చెందినవారు. మార్వాడీల జీవితాల్లో శాకాహారం ప్రధానమైన అంశం. అందుకే ఈ కంపెనీ క్యాంటీన్లలో, కంపెనీ కార్యక్రమాల్లో ఎక్కడా మాంసాహారం, వైన్, విస్కీల సరఫరా ఉండదు. ఇదంతా అంతర్జాతీయ విస్తరణకు ముందు మాత్రమే. ఈ గ్రూప్ 2003లో ఆస్ట్రేలియా లో చిన్న రాగి గనుల కంపెనీని కొనుగోలు చేసింది. ఆస్ట్రేలియా కార్మికుల రోజువారీ జీవితాల్లో ఫోస్టర్ బీర్, బటర్ చికెన్ తప్పనిసరి. దీంతో ఆక్కడి బిర్లా క్యాంటీన్లలో ఈ రెండింటినీ సరఫరా చేయక తప్పలేదని బిర్లా పేర్కొన్నారు. రీ ఇమాజినింగ్ ఇండియా, అన్లాకింగ్ ద పొటెన్షియల్ ఆఫ్ ఏషియాస్ నెక్స్ట్ సూపర్ పవర్ అన్న పుస్తకంలో రాసిన వ్యాసంలో ఆయన ఈ ఉదంతం వెల్లడించారు. -
‘బొగ్గు’కథ ఇక కంచికే!
న్యూఢిల్లీ: బిర్లా గ్రూపు సంస్థల అధినేత కుమారమంగళం బిర్లాపై నమోదైన ‘బొగ్గు’కేసు త్వరలోనే కంచికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. బిర్లాపై కేసును సీబీఐ మూసివేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బిర్లాకు చెందిన హిందాల్కో కంపెనీకి ఒడిశాలోని తలబిరా-2 గని కేటాయింపు సక్రమమేనని, అన్నీ పరిశీలించిన తర్వాతే ప్రధాని ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకున్నారని ప్రధాని కార్యాలయం ప్రకటించడంతో సీబీఐ ఇరకాటంలో పడింది. స్వయంగా ప్రధాని అన్నీ పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకున్నారంటూ పీఎంవో కరాఖండిగా ప్రకటించడంతో ఈ కేసు విషయంలో ఇరకాటంలో పడ్డామని సీబీఐ అధికారులే అంగీకరిస్తున్నారు. కాగా, హిందాల్కోకు బొగ్గు గని కేటాయిస్తూ ప్రధాని తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించిన ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్‌సింగ్ ఆహ్లూవాలియా, దర్యాప్తు విషయంలో ‘మర్యాదకర రీతి’లో వ్యవహరించాలంటూ సీబీఐకి హితవు పలికారు. కుమారమంగళం బిర్లాపై, బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి పీసీ పరేఖ్‌పై సీబీఐ కేసు దాఖలు చేయడంతో ఇటు పారిశ్రామిక వర్గాల నుంచి అటు ప్రభుత్వాధికారుల నుంచి వ్యతిరేకత వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. పారిశ్రామికవేత్తలను బలిపశువులను చేయరాదంటూ పారిశ్రామిక సంఘా లు గగ్గోలు పెట్టాయి. మరోవైపు, బిర్లాపై ఇప్పటికే ఎఫ్ఐఆర్ దాఖలు చేసినందున ఇప్పటికిప్పుడే కేసును అర్ధంతరంగా మూసివేయలేమని, కేసుతో సంబంధం ఉన్న అందరితోనూ మాట్లాడతామని సీబీఐ అధికారులు చెబుతున్నారు. అయితే, కేసును మూసివేసే అవకాశాలను పరిశీలించేందుకు సైతం సిద్ధంగా ఉన్నామని సీబీఐ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ఏ కేసులోనైనా ఎఫ్ఐఆర్ దాఖలు కేవలం ప్రాథమిక చర్య మాత్రమేనని, దర్యాప్తు మొదలైన కేసులను మూసివేసిన ఉదంతాలూ లేకపోలేదని తెలిపారు. దర్యాప్తు కొనసాగుతున్న దశలో కేసును మూసివేసేందుకు సాంకేతికంగా అవకాశాలు లేకపోలేదు. న్యాయ నిపుణుల సలహా తీసుకున్న తర్వాత కేసును మూసివేయాలని సీబీఐ భావిస్తున్నట్లు సమాచారం. కుమారమంగళం బిర్లా రెండు రోజుల కిందట ఆర్థిక మంత్రి చిదంబరంతో భేటీ అయ్యారు. హిందాల్కోకు బొగ్గు బ్లాకు కేటాయింపును సమర్థించుకుంటూ పీఎంవో ప్రకటన, ఆ తర్వాత చిదంబరంతో బిర్లా భేటీ దరిమిలా కేసు మూసివేత దిశగా పరిణామాలు చోటు చేసుకుంటుండటం గమనార్హం. అయితే, ‘మా దర్యాప్తు ప్రకారం ప్రభుత్వరంగ సంస్థలకు, హిందాల్కోకు నడుమ కుదిరిన ఒప్పందం, నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు కంపెనీ ప్రయోజనాలకు అనుగుణంగా ఉంది. బిర్లా, హిందాల్కో, పరేఖ్‌లకు వ్యతిరేకంగా ఏమీ లేనట్లు ఒకవేళ తేలితే కేసు మూసేసేందుకు అవకాశాలు ఉంటాయి’ అని సీబీఐ అధికారి ఒకరు వివరించారు. కాగా, బిర్లా, పరేఖ్‌లపై సీబీఐ కేసు విషయమై తన వైఖరిని వెల్లడిస్తూ అఫిడవిట్ దాఖలు చేసేలా ప్రధానిని ఆదేశించాలంటూ సుప్రీంకోర్టులో ఎంఎల్ శర్మ అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. -
ఇదేనా దర్యాప్తు తీరు?!
సంపాదకీయం: మొదలైన నాటి నుంచి రకరకాల మలుపులు తిరుగుతున్న బొగ్గు కుంభకోణంలో ఇప్పుడు మరో అంకానికి తెరలేచింది. ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆదిత్య బిర్లా గ్రూపు అధినేత కుమార మంగళం బిర్లా, బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి పీసీ పరేఖ్ తదితరులు అవినీతికీ, నేరపూరిత కుట్రకూ పాల్పడ్డారని సీబీఐ ఆరోపించింది. ఆ మేరకు ఎఫ్ఐఆర్ దాఖలుచేయడంతోపాటు దేశవ్యాప్తంగా నాలుగు నగరాల్లోని ఆరుచోట్ల సోదాలు చేసింది. తమిళనాడుకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్‌కు కేటాయించాల్సిన ఒడిశాలోని తలబిరా బొగ్గు గనుల్ని బిర్లా గ్రూపునకు చెందిన హిండాల్కోకు కూడా పంచారని ఇందువల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టంవాటిల్లిందన్నది సీబీఐ ఆరోపణ. కుమార మంగళం బిర్లా దేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్త గనుక ఈ చర్యపై పారిశ్రామికవర్గాల్లో తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఇది పరిశ్రమల విశ్వాసాన్ని, పెట్టుబడుల వాతావరణాన్ని దెబ్బతీస్తుందని ఆ వర్గాలు ప్రకటించాయి. చిత్రమేమంటే, వీరితో ఇద్దరు కేంద్రమంత్రులు...వాణిజ్య మంత్రి ఆనంద్ శర్మ, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి సచిన్ పైలట్లు గొంతు కలిపారు. ‘గట్టి సాక్ష్యాధారాలు’ ఉంటే తప్ప ఈ తరహా చర్యలకు దిగకూడదని హితవు చెప్పారు. ఈ స్కాంలో ఇప్పటికే సీబీఐ 14 ఎఫ్ఐఆర్లు నమోదుచేసింది. కాంగ్రెస్‌కు చెందిన ఎంపీని, మరో కేంద్ర మాజీ మంత్రిని కూడా నిందితులుగా చేర్చింది. దేశంలో చట్టమనేది అందరికీ సమానంగా వర్తిస్తుంది. వర్తించాలి. అందులో రెండోమాట లేదు. ఒకరు ప్రముఖ పారిశ్రామికవేత్తగనుక వారి జోలికి వెళ్లరాదని, మరొకరు కాకలు తీరిన రాజకీయ యోధుడు గనుక వారిని అసలు తాకరాదని ఎవరూ అనరు. అలాంటి విచక్షణో, పక్షపాతమో నిజానికి సీబీఐకే ఉంది. అనేక కేసుల్లో ఆ సంగతి నిరూపణ అవుతూనే ఉంది. బొగ్గు కుంభకోణం సామాన్యమైంది కాదు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 194 బొగ్గు క్షేత్రాలను వేలం విధానంలో కాక, నచ్చినవారికి కట్టబెట్టారన్నది ప్రధానమైన ఆరోపణ. ఇలా చేసినందువల్ల దేశ ఖజానాకు లక్షా 86వేల కోట్ల రూపాయల నష్టంవాటిల్లిందని కాగ్ సంస్థ ఆరోపించింది. ఆరోపణలొచ్చాయి గనుక తనంత తానే స్వచ్ఛందంగా సీబీఐ దర్యాప్తునకు సిద్ధపడదామని కేంద్ర ప్రభుత్వం అనుకోలేదు. ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చొరవ తీసుకుని సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాల్సివచ్చింది. అటు తర్వాతనైనా ఆ దర్యాప్తునకు అవసరమైన సహాయసహకారాలను అందించివుంటే కేంద్రం నిజాయితీ వెల్లడయ్యేది. అలా చేయలేదు సరిగదా...దానికి అవసరమైన ఫైళ్లను అందుబాటులో ఉంచడంలో కూడా విఫలమైంది. సుప్రీంకోర్టు ఈ ఫైళ్ల గల్లంతు వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తంచేసి రెండువారాల్లో వాటిని పట్టి తేవాలని గత నెలలో ఆదేశించింది. అయినా, ఇప్పటికీ దాదాపు 18 ఫైళ్లు ఏమయ్యాయో తెలియడంలేదు. ఈ ప్రహసనానికి ముందు సుప్రీంకోర్టుకు సీబీఐ అంద జేయాల్సిన నివేదికను అప్పటి కేంద్ర న్యాయ శాఖ మంత్రి తెప్పించుకుని, దానికి సవరణలు చేయడం... ఆ ఉదంతంపై సుప్రీంకోర్టు ఆగ్రహించడం ఇవన్నీ అయ్యాయి. సరిగ్గా ఆ సమయంలోనే సీబీఐ ‘పంజరంలో చిలుక’ మాదిరిగా వ్యవహరిస్తున్నదని సుప్రీంకోర్టు పరుషంగా వ్యాఖ్యానించింది. ఇన్ని జరిగాక ఇప్పుడు కుమార మంగళం బిర్లా, పీసీ పరేఖ్‌లపై కేసులు నమోదుచేయడంపై సహజంగానే అనుమానాలు తలెత్తుతాయి. నిజానికి తలబిరా బొగ్గు క్షేత్రాలు కావాలని అభ్యర్థన చేసింది హిండాల్కో సంస్థ కాదు. ఆ సంస్థకు మాతృక అయిన ఇండాల్ సంస్థ. ఆ సంస్థ 1996లో అలాంటి విజ్ఞప్తిచేసింది. అటు తర్వాత కాలంలో ఇండాల్ను బిర్లాలు కొనుగోలుచేయగా, 1996నాటి అభ్యర్థనపై 2005లో కేంద్రం నిర్ణయం తీసుకుని తలబిరా గనుల్ని కేటాయించింది. దర్యాప్తు ప్రారంభించి ఏడాదిన్నర అవుతుండగా, ఇన్నాళ్ల వరకూ బిర్లా జోలికి ఎందుకు వెళ్లలేదు? తొలుత అభ్యర్థన చేసిన ఇండాల్ సంస్థ నిర్వాహకుల్ని ఏమైనా ప్రశ్నించారా? అన్నవి సమాధానంలేని ప్రశ్నలు. అసలు ఈ కుంభకోణంలో సీబీఐ దర్యాప్తే లోపభూయిష్టంగా ఉంది. ప్రధాని మన్మోహన్సింగ్ బొగ్గు శాఖను పర్యవేక్షిస్తున్నప్పుడు ఈ కుంభకోణం ప్రారంభమైంది గనుక దర్యాప్తు ప్రధాని కార్యాలయం నుంచి మొదలుకావాలి. అటు తర్వాత వరసగా ఏ దశలో ఏం జరిగిందనేది క్రమేపీ బయటికొస్తుంది. కేటాయింపుల క్రమంలో లబ్ధిదారు లెవరైనా అధికారులతోగానీ, అధినేతలతోగానీ కుమ్మక్కయ్యారా అనేది స్పష్టం అవుతుంది. దర్యాప్తు క్రమం అలా ఉంటే ఎవరూ సీబీఐని వేలెత్తి చూపే అవకాశం ఉండదు. బొగ్గు క్షేత్రం పొందిన బిర్లా కుట్రదారు అయినప్పుడు, ఆయనకు అలా కేటాయించవచ్చని చెప్పిన తాను కుట్రదారు అయినప్పుడు, తుది నిర్ణయం తీసుకున్న ప్రధాని ఎందుకు కారని పరేఖ్ చేస్తున్న తర్కంలో హేతుబద్ధత ఉన్నది. చేసే పనిలో చిత్తశుద్ధి కొరవడితే, నిష్పాక్షికత ఆవిరైతే...దర్యాప్తు తలకిందులుగా సాగితే ఇలాంటి ప్రశ్నలే ఎదురవుతాయి. ఆ ప్రశ్నలకు సీబీఐ వద్ద జవాబు లుండవు. ప్రముఖ పారిశ్రామికవేత్తలతో సహా అందరినీ నిందితులుగా చేరిస్తే తాను నిష్పాక్షికంగా ఉన్నట్టు చాటుకోవచ్చని సీబీఐ భావించినట్టుంది. ఇవన్నీ వదిలిపెట్టి స్వయంగా ప్రధానే జరిగిందేమిటో చెబితే, బొగ్గు క్షేత్రాల కేటాయింపు ఎలా సబబో చెబితే ఇంతమందిని నిందితులుగా చేయాల్సిన పనే ఉండదు. కానీ, ఆయన మాట్లాడరు. సీబీఐ సక్రమంగా దర్యాప్తు చేయదు. కేంద్ర మంత్రులు మాత్రం ప్రముఖ పారిశ్రామికవేత్తలను నిందితులుగా చేర్చడం అభ్యంతరకర మంటారు. ఇంతకూ ఇలాంటి కప్పదాటు వైఖరులతో, అయోమయ చర్యలతో కేంద్ర ప్రభుత్వంగానీ, సీబీఐగానీ ఏం సాధించదల్చుకున్నాయి? తమ చర్యలతో తాము నగుబాటుపాలవడమే కాదు... దేశ ప్రతిష్ట కూడా దెబ్బతింటున్నదని ఎప్పటికి గ్రహిస్తారు? -
నేను దోషినైతే మన్మోహన్ కూడా దోషే: పరేఖ్
-
నేను దోషినైతే మన్మోహన్ కూడా దోషే: పరేఖ్
న్యూఢిల్లీ: బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి పి.సి.పరేఖ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బొగ్గు కుంభకోణం ఛార్జ్షీటులో తన పేరు చేర్చటంపై ఆయన అభ్యంతరం తెలిపారు. తాను దోషిని అయితే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కూడా దోషేనని పరేఖ్ వ్యాఖ్యానించారు. బొగ్గు కుంభకోణంలో ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆదిత్య బిర్లా గ్రూపు అధినేత కుమారమంగళం బిర్లా(46)పై సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. బొగ్గు కుంభకోణం కేసులో తనను ఇరికిస్తున్నారని పీసీ పరేఖ్ మండిడ్డారు. ప్రభుత్వం తీసుకున్న పాలసీనే తాను అమలు చేశానని అన్నారు. అంతిమ నిర్ణయం తీసుకున్న ఆనాటి బొగ్గు శాఖ మంత్రిని, ప్రధాని మన్మోహన్ సింగ్ పేర్లను ప్రస్తావించకుండా.... తన పేరురను ఛార్జిషీట్లో పేర్కొనడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రయివేట్ సంస్థలకు లబ్ది చేకూరేలా గనులను కేటాయింపు జరిగిందని సీబీఐ భావిస్తే.... ఆ నిర్ణయం తీసుకున్న అందరిని దోషులుగా పేర్కొనాలని డిమాండ్ చేశారు. గనుల కేటాయింపులో ఆయనతోపాటు,పీసీ పరేఖ్, కొంతమంది అధికారులు అవినీతి, నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని ఆరోపిస్తూ అవినీతి నిరోధక చట్టం కింద సీబీఐ కోర్టులో ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. బొగ్గు శాఖ ప్రధానమంత్రి దగ్గర ఉన్న నేపథ్యంలో ఈ కేసుకు చాలా ప్రాధాన్యం ఏర్పడింది. -
కుమార మంగళం బిర్లాను విచారించనున్న సీబీఐ!
న్యూఢిల్లీ : రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలు కుమ్మక్కై దేశ సహజ సంపదను దోపిడీ చేసిన సంఘటనలో సంచలనాలు నమోదు అవుతున్నాయి. భారతీయ పారిశ్రామిక రంగంలో ప్రముఖ వ్యక్తి అయిన కుమార మంగళం బిర్లా పేరును సీబీఐ.. బొగ్గు కుంభకోణం నిందితుల జాబితాలో చేర్చింది. 14వ ఎఫ్ఐఆర్లో బిర్లాతో పాటు ఆయనకు చెందిన హిందాల్కో కంపెనీ పేరును, ప్రభుత్వ రంగ సంస్థ అయిన నాల్కో పేరును కూడా చేర్చింది. ఇందుకు సంబంధించి ఢిల్లీ, కోల్‌కతా, భువనేశ్వర్, ముంబాయి, హైదరాబాద్‌ల్లో సోదాలు జరిపినట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. కుమార్ మంగళం బిర్లా కంపెనీకి 2005లో బొగ్గు గనులు కేటాయించడంలో అవకతవకలకు పాల్పడ్డారని సీబీఐ ఆరోపించింది. 46 ఏళ్ల బిర్లా.. ఈ కేసులో కుట్ర, మోసం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సీబీఐ కుమార మంగళం బిర్లాను ప్రశ్నించే అవకాశం కూడా ఉంది. ఇదే కేసులో బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి పి.సి.పరేఖ్ పేరును కూడా ఎఫ్ఐఆర్లో చేర్చారు. బొగ్గు శాఖ ప్రధానమంత్రి దగ్గర ఉన్న నేపథ్యంలో ఈ కేసుకు చాలా ప్రాధాన్యం ఏర్పడింది. పారదర్శకంగా వేలం పాట నిర్వహించకుండా ఇష్టానుసారం బొగ్గు గనులు కేటాయించడంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసును త్వరితగతిన విచారణ జరపాలని సీబీఐని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. -
బొగ్గు కుంభకోణంలో సీబీఐ మళ్లీ సోదాలు
-
బొగ్గు కుంభకోణంలో సీబీఐ మళ్లీ సోదాలు
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బొగ్గు కుంభకోణం కేసులో సీబీఐ మళ్లీ సోదాలు నిర్వహిస్తోంది. దేశంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్, కోల్‌కతా, ముంబయిలలో సీబీఐ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఇక ఈ కుంభకోణంలో చార్జీషీట్లో తాజాగా ఆదిత్యా బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా పేరును ఛార్జీషీట్లో చేర్చింది. అలాగే బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి పి.సి. పరేఖ్ పేరు కూడా చార్జీషీట్లో నమోదు చేసింది. ఇక యుపిఎ-1 హయాంలో ప్రధాని మన్మోహన్సింగ్ స్వయంగా బొగ్గు మంత్రిత్వశాఖను పర్యవేక్షించిన కాలంలో చోటుచేసుకొన్న భారీ బొగ్గు కేటాయింపుల కుంభకోణంతో ప్రభుత్వ ఖజానాకు దాదాపు పది లక్షల కోట్ల రూపాయలకు పైగా ఆదాయ నష్టం జరిగిందని కంట్రోలర్, ఆడిటర్ జనరల్ కాగ్ వెల్లడించిన వైనం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. 2 జి స్పెక్ట్రమ్ కేసులో లక్ష డెబ్బై వేల కోట్ల నష్టం జరిగిందని వెలుగులోకి తెచ్చిన కాగ్ ఆతర్వాత బొగ్గు గనుల కేటాయింపులో వేలం పాటలు నిర్వహించనందున పదిలక్షల డెబ్బైవేల కోట్ల మేర ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందని లెక్కగట్టింది.