
దేశం మొత్తం మీద పనిగంటల ప్రస్తావన జరుగుతున్న సమయంలో.. ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా భార్య.. 'నీర్జా బిర్లా' (Neerja Birla) తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రోజులోని 24 గంటలను '8-8-8' నియమంగా విభజించుకుంటే.. జీవితం సాఫీగా సాగుతుందని పేర్కొన్నారు.
పనికి 8 గంటలు, నిద్రకు 8 గంటలు, విశ్రాంతికి మిగిలిన 8 గంటలు కేటాయించుకోవాలి. ఇలా విభజించుకుంటే.. 24 గంటలు సరిపోతుంది. పనిని మాత్రమే కాకుండా.. వ్యక్తిగత జీవితాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవడంపై ద్రుష్టి సారించాలి. ఈ నియమం పాటించడానికి కొంత కష్టంగా ఉన్నప్పటికీ.. సమతుల్యం చేసుకోవడానికి ప్రయత్నించాలని నీర్జా బిర్లా స్పష్టం చేశారు.
వారానికి 70 గంటలు, 90 గంటలు పనిచేయాలని ఇన్ఫోసిస్ నారాయణమూర్తి, ఎల్ & టీ చైర్మన్ సుబ్రమణ్యన్ చెప్పారు వ్యాఖ్యానించారు. ఈ మాటలను ఆనంద్ మహీంద్రా, గౌతమ్ అదానీ, ఎంక్యూర్ ఫార్మాస్యూటికల్స్ సీఈఓ 'నిమితా థాపర్' మొదలైనవారు విమర్శించారు. తాజాగా నీర్జా బిర్లా కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
పని గంటలపై ఆకాష్ అంబానీ
ముంబై టెక్ వీక్ కార్యక్రమంలో 'ఆకాష్ అంబానీ' మాట్లాడుతూ.. ఆఫీసులో ఎంతసేపు (ఎన్ని గంటలు) ఉంటారనేది ముఖ్యం కాదు, చేస్తున్న పనిలో నాణ్యత ఉండాలి, దాని గురించి మాత్రమే ఆలోచిస్తాను అని అన్నారు. వృద్ధి అంటే జీవితం అనేది రిలయన్స్ నినాదం, అది వ్యక్తిగత జీవితానికి కూడా వరిస్తుందని అన్నారు. కాబట్టి మీరు ప్రతి రోజు ఎదగడానికి కృషి చేయాలని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: 'అర్ధరాత్రి 2 గంటల వరకు మేల్కొనే ఉంటారు': తండ్రి గురించి చెప్పిన ఆకాశ్ అంబానీ