పనిగంటలపై 78 శాతం మంది అభిప్రాయమిదే.. | 78 Percent Indian Employees High Prioritising For family Check The Report | Sakshi
Sakshi News home page

పనిగంటలపై 78 శాతం మంది అభిప్రాయమిదే..

Jan 28 2025 9:07 PM | Updated on Jan 28 2025 9:28 PM

78 Percent Indian Employees High Prioritising For family Check The Report

వారానికి 72 గంటలు, వారానికి 90 గంటలు పనిచేయాలనే.. పనివేళలపై సర్వత్రా చర్చ జరిగింది. దీనిని సమర్దించిన వారి కంటే.. వ్యతిరేకించిన వారి సంఖ్యే ఎక్కువ. కాగా ఇప్పుడు ఇండీడ్.. పనిగంటలపై ఒక సర్వే నిర్వహించి, రిపోర్ట్ విడుదల చేసింది.

గ్లోబల్ జాబ్ సైట్ ఇండీడ్ 'ఫ్యూచర్ కెరీర్ రిజల్యూషన్ రిపోర్ట్' ప్రకారం.. భారతదేశంలో ఐదుగురిలో నలుగురు (78 శాతం) ఉద్యోగులు తమ జీవిత భాగస్వాములు, పిల్లలు, తల్లిదండ్రులతో సమయాన్ని గడపడానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిసింది. ఉద్యోగంలో తక్కువ పని ఒత్తిడి ఉండేలా చూసుకోవడం మాత్రమే కాకుండా.. మానసిక ఆరోగ్యంపై కూడా ద్రుష్టి సారించడానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిసింది.

అభివృద్ధి చెందుతున్న రంగాల్లో ఉద్యోగావకాలు మెండుగా లభిస్తాయని పలువురు ఆశిస్తున్నట్లు కూడా ఈ సర్వేలోనే ఇండీడ్ వెల్లడించింది. ఒక్క భారతదేశంలో మాత్రమే కాకుండా.. జపాన్, ఆస్ట్రేలియా, సింగపూర్ వంటి దేశాలలో కూడా ఉద్యోగులు.. తమ ఉద్యోగానికి, వ్యక్తిగత జీవితానికి సమానంగా ప్రాధాన్యత ఇవ్వడానికే ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్లు ఇండీడ్ మార్కెటింగ్ డైరెక్టర్ 'రాచెల్ టౌన్స్లీ' (Rachael Townsley) పేర్కొన్నారు.

జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడం ముఖ్యమే.. కానీ జీవితం అనేది నిచ్చెన వంటివి కాదు. భద్రత, పనికి తగిన సరైన వేతనం మాత్రమే కాకుండా.. ఇతర ప్రయోజనాలను కూడా చాలామంది బేరీజు వేసుకుంటున్నారు.

ఇదీ చదవండి: బడ్జెట్ 2025 రూపొందించిన ప్రముఖులు వీరే..

ఈ ఏడాది కెరీర్‌లో పురోగతి కోసం.. ఏఐ, మెషిన్ లెర్నింగ్, కోడింగ్ వంటి లేటెస్ట్ టెక్నాలజీలపై నైపుణ్యం పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. 59 శాతం మంది భారతీయ ఉద్యోగులు కూడా సంప్రదాయ డిగ్రీ ఆధారిత అర్హతల కంటే నైపుణ్యాల ఆధారిత నియామకాలపై బలమైన దృష్టితో, నియామక పద్ధతుల్లో మార్పును చూడాలని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement