indeed
-
ఐటీలో మళ్లీ నియామకాల సందడి
ముంబై: ఐటీ రంగంలో మళ్లీ నియామకాలు పుంజుకోనున్నాయి. వచ్చే ఏడాది నాటికి 8.5 శాతం మేర పెరుగుతాయని హైరింగ్ ప్లాట్‌ఫామ్ ‘ఇండీడ్’ అంచనా వేసింది. గత రెండేళ్లుగా ఐటీ రంగంలో నియామకాల పరంగా స్తబ్దత వాతావరణం చూస్తుండడం తెలిసిందే. గతేడాది వ్యాప్తంగా నిపుణులకు ఐటీ రంగంలో డిమాండ్ తగ్గగా.. ఇక మీదట ఇది పుంజుకోనున్నట్టు ఇండీడ్ తెలిపింది. ఇండీడ్ సంస్థకు చెందిన హైరింగ్ ట్రాకర్, ఇండీడ్ ప్లాట్‌ఫామ్ ఇండియా డేటా ఆధారంగా ఈ వివరాలు విడుదల చేసింది. ప్రస్తుతం ఇండీడ్ ప్లాట్‌ఫామ్‌పై నమోదయ్యే నియామకాల్లో 70 శాతం సాఫ్ట్వేర్ ఆధారితమేనని ఈ సంస్థ తెలిపింది. కంపెనీలు ఏఐ, మెషిన్ లెరి్నంగ్ (ఎంఎల్)బ్లాక్‌చైన్ వంటి సాంకేతికతలను వినియోగిస్తుండం ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ డెవలపర్ ఉద్యోగాలకు డిమాండ్‌ను పెంచుతున్నట్టు వివరించింది. స్టార్టప్ ఎకోసిస్టమ్ బలపడుతుండడాన్ని సైతం ప్రస్తావించింది. వీరికి డిమాండ్ ఎక్కువ.. అప్లికేషన్ డెవలపర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఫుల్ స్టాక్ డెవలపర్, సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, పీహెచ్‌పీ డెవలపర్ నియామకాలకు కంపెనీలు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్టు వెల్లడించింది. అలాగే, నెట్ డెవలపర్లు, సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్, డెవ్ఆప్స్ ఇంజనీర్, డేటా ఇంజనీర్, ఫ్రంట్ ఎంట్ డెవలపర్లకు సైతం డిమాండ్ పెరుగుతున్నట్టు తెలిపింది. ఇప్పటికే ఉన్న సాఫ్ట్‌వేర్‌లో ఎప్పటికప్పుడు అప్డేట్లు, సెక్యూరిటీ ప్యాచ్‌లు, కొత్త ఫీచర్లు తీసుకురావాల్సిన అవసరం సైతం డిమాండ్‌కు మద్దతునిస్తున్నట్టు తెలిపింది. ‘‘ఐటీ రంగం ఎక్కువ మందికి ఉపాధి కలి్పస్తోంది. కాకపోతే ఇటీవలి త్రైమాసికాల్లో నియామకాలు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ అనిశి్చతుల నేపథ్యంలో కంపెనీలు అప్రమత్త ధోరణితో వ్యవహరించాయి. ఇప్పుడు ఈ పరిస్థితిలో మార్పు చోటు చేసుకుంటోంది. కంపెనీలు నియామకాలు పెంచుకోవడంపై దృష్టి సారించాయి. గ్లోబల్ క్యాపబులిటీ సెంటర్లు (జీసీసీలు) ఈ నియామకాల్లో కీలక పాత్ర పోషించనున్నాయి’’అని ఇండీడ్ ఇండియా సేల్స్ హెడ్ శశి కుమార్ తెలిపారు. -
ఏఐతో కొత్త అవకాశాలు
ముంబై: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికత భారత్‌లో కొత్త అవకాశాలను తెచి్చపెడుతుందని అంతర్జాతీయ జాబ్ సైట్ ఇండీడ్ నివేదిక తెలిపింది. వచ్చే అయిదేళ్లలో ఏఐ నూతన ఉద్యోగాలను సృష్టిస్తుందని సర్వేలో పాలుపంచుకున్న 85 శాతం కంపెనీలు అభిప్రాయపడ్డాయని వెల్లడించింది. ‘ఏఐ రాకతో ఉద్యోగుల పనుల స్వభావాన్ని మెరుగుపరుస్తుందని 85 శాతం సంస్థలు ఆశిస్తున్నాయి. ఉద్యోగ భద్రత, ఉద్యోగులకు కెరీర్ అభివృద్ధికి అవకాశాలను మెరుగుపరుస్తుందని 77 శాతం కంపెనీలు విశ్వసిస్తున్నాయి. 63 శాతం మంది ఉద్యోగార్ధులు ఏఐ ప్రభావం గురించి తాము సంతోషిస్తున్నామని చెప్పారు. ఈ నూతన సాంకేతికత మరిన్ని ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉందని 53 శాతం మంది అంగీకరించారు’ అని సర్వే తెలిపింది. అంతర్జాతీయంగా ఏడు మార్కెట్లలో ఇండీడ్ తరఫున సెన్సస్‌వైడ్ నిర్వహించిన ఈ సర్వేలో 7,275 కంపెనీలు, ఉద్యోగులు పాలుపంచుకున్నారు. ఇందులో భారత్ నుంచి 1,142 కంపెనీలు, అభ్యర్థులు ఉన్నారు. భారత్‌లో ఇలా.. భారతీయ ఉద్యోగార్ధులు ఏఐ సిస్టమ్స్, టూల్స్ సంభావ్య ప్రయోజనాలను స్వీకరిస్తున్నప్పటికీ వారికి కూడా ఆందోళనలు ఉన్నాయని నివేదిక వెల్లడించింది. రీస్కిల్లింగ్, అప్‌స్కిల్లింగ్ అవసరమని 43 శాతం, వారు పనిచేస్తున్న రంగం లేదా వృత్తిలో సంభావ్య ఉద్యోగ నష్టాలు ఉండొచ్చని 29 శాతం మంది అభిప్రాయపడ్డారు. హెచ్ఆర్/టాలెంట్ అక్విజిషన్ లీడర్లలో ఏఐ సిస్టమ్స్, టూల్స్ తమ పనిని సులభతరం చేస్తాయని 90 శాతం, నియామకం, అభ్యర్థుల అనుభవాన్ని మెరుగుపరుస్తుందని 86 శాతం మంది నమ్ముతున్నారని వివరించింది. ఏఐ సిస్టమ్స్, టూల్స్ తమ ఉద్యోగానికి సంబంధించిన మరింత మానవ అంశాలపై దృష్టి పెట్టేందుకు వీలు కలి్పస్తాయని దాదాపు 81 శాతం కంపెనీలు ఆశాభావం వ్యక్తం చేశాయి. కంపెనీలు, ఉద్యోగులు ఏఐపై అత్యంత ఆశాభావంగా ఉన్నారని తెలిపింది. 98 శాతం హెచ్ఆర్ నిపుణులు, 91 శాతం ఉద్యోగార్ధులు ప్రస్తుతం పని కోసం ఏఐ సాధనాలను ఉపయోగిస్తున్నారని నివేదిక వివరించింది. -
ఈ కంపెనీల్లో సంతోషంగా ఉద్యోగులు.. టాప్ 20 లిస్ట్!
Top 20 companies with happiest employees: ఏదైనా కంపెనీలో ఉద్యోగులు ఎప్నుడు సంతోషంగా ఉంటారు? పనికి తగిన జీతం, గుర్తింపు, ప్రోత్సాహం, మంచి పని వాతావరణం.. ఇవన్నీ ఉంటే ఆ కంపెనీని మంచి కంపెనీగా ఉద్యోగులు భావిస్తారు. ఇదిగో అమెరికాలో అలాంటి కంపెనీల టాప్ 20 లిస్ట్‌ను ప్రముఖ జాబ్ సెర్చ్ సైట్ ‘ఇన్‌డీడ్’ (Indeed) తాజాగా విడుదల చేసింది. అమెరికాకు చెందిన ట్రక్ స్టాప్, కన్వీనియన్స్ స్టోర్ చైన్ ‘లవ్స్ ట్రావెల్ స్టాప్స్ & కంట్రీ స్టోర్స్’ ఈ లిస్ట్‌లో నంబర్ 1 కంపెనీగా నిలిచింది. ఉద్యోగులు సంతోషకరంగా భావిస్తున్న టాప్ 20 కంపెనీలను ఎంపిక చేయడానికి 2022 జూలై నుంచి 2023 జులై మధ్య కాలంలో అనేక మంది ఉద్యోగుల రివ్యూలను తీసుకుంది. సంతోషం, ప్రయోజనం, సంతృప్తి, ఒత్తిడి అనే నాలుగు అంశాల్లో ఆయా కంపెనీలపై ఉద్యోగుల అభిప్రాయాలను సేకరించింది. (Tech Jobs: టెక్ ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్.. ఇక రానున్నవి మంచి రోజులే..!) లవ్స్ ట్రావెల్ స్టాప్స్ & కంట్రీ స్టోర్స్ ఉద్యోగుల సంతోషం విషయంలో 100కు 80 శాతం రేటింగ్‌ను సాధించి టాప్ 1 కంపెనీగా నిలిచింది. ఇతర అంశాల్లోనూ సగటు స్కోర్ 69 నుంచి 71 కంటే చాలా ఎక్కువగానే సాధించింది. ఈ టాప్ 20 లిస్ట్‌లో అత్యధికంగా ఐటీ కంపెనీలే ఉండటం విశేషం. లిస్ట్‌లో ఇండియన్ కంపెనీలు అమెరికాలో ఉద్యోగులు మెచ్చిన ఇన్‌డీడ్ టాప్ 20 కంపెనీల లిస్ట్‌లో మూడు భారతీయ కంపెనీలు ఉండటం గమనార్హం. అవి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) నాలుగో స్థానంలో, విప్రో (Wipro) 8వ స్థానంలో, ఇన్ఫోసిస్ (Infosys) 9వ స్థానంలో నిలిచాయి. టాప్ 20 లిస్ట్ ఇదే.. 1. లవ్స్ ట్రావెల్ స్టాప్స్ & కంట్రీ స్టోర్స్ 2. H&R బ్లాక్ 3. డెల్టా ఎయిర్ లైన్స్ 4. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 5. యాక్సెంచర్ 6. IBM 7. L3 హారిస్ 8. విప్రో 9. ఇన్ఫోసిస్ 10. నైక్ 11. వ్యాన్స్ 12. ఇన్-ఎన్-అవుట్ బర్గర్ 13. కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ 14. హాల్ మార్క్ 15. మైక్రోసాఫ్ట్ 16. నార్త్రోప్ గ్రుమ్మన్ 17. FedEx ఫ్రైట్ 18. డచ్ బ్రదర్స్ కాఫీ 19. వాల్ట్ డిస్నీ కంపెనీ 20. యాపిల్ Proud to be named one of the Top 20 Companies for Work Wellbeing in the U.S. by @indeed. This award is a true testament to IBMers and our culture of openness, collaboration, and trust. https://t.co/MQfriOfKjq pic.twitter.com/FYN50lLPeo — IBM (@IBM) September 21, 2023 -
టెక్‌యేతర ఉద్యోగాలకు డిమాండ్
ముంబై: బహుళ జాతి ఐటీ దిగ్గజాలు ఉద్యోగాల్లో కోతలు విధిస్తున్న తరుణంలో గతేడాది డిసెంబర్లో దేశీయంగా టెక్‌యేతర రంగాల్లో ఉద్యోగులకు డిమాండ్ పెరిగింది. ప్రధానంగా ఆరోగ్య సంరక్షణ, ఆహార సర్వీసులు, నిర్మాణం, విద్యా రంగాల్లో ఈ ధోరణి నెలకొంది. నెలవారీగా ఉద్యోగాల పోస్టింగ్‌లపై అంతర్జాతీయ జాబ్ సైట్ ఇన్‌డీడ్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం హెల్త్‌కేర్ అనుబంధ విభాగాలైన డెంటల్, నర్సింగ్ రంగాల్లో ఉద్యోగాల పోస్టింగ్స్ అత్యధికంగా 30.8 శాతంగా నమోదయ్యాయి. ఫుడ్ సర్వీసెస్ (8.8%), నిర్మాణం (8.3%), ఆర్కిటెక్చర్ (7.2%), విద్య (7.1%) థెరపీ (6.3%), మార్కెటింగ్ (6.1%) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. కరోనా మహమ్మారి అనంతరం వ్యాపార పరిస్థితులు సాధారణ స్థాయికి తిరిగొస్తున్న నేపథ్యంలో నిర్మాణం, సివిల్ ఇంజినీరింగ్ వంటి విభాగాల్లో కాస్త సందడి నెలకొందని నివేదిక పేర్కొంది. అలాగే మహమ్మారి సమయంలో భారీగా కోతలు పడిన మార్కెటింగ్ విభాగంలోనూ హైరింగ్ పుంజుకుందని వివరించింది. కస్టమర్లకు మెరుగైన అనుభూతిని కల్పించడంతో పాటు వ్యాపారం, అమ్మకాలను పెంచుకునేందుకు మార్కెటింగ్ అవసరాన్ని బ్రాండ్లు గుర్తించాయని పేర్కొంది. బెంగళూరు టాప్.. జాబ్ పోస్టింగ్స్ విషయంలో మొత్తం 16.5 శాతం వాటాతో బెంగళూరు అగ్రస్థానంలో నిల్చింది. ముంబై (8.23%), పుణె (6.33%), చెన్నై (6.1%) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. చిన్న నగరాల్లోను డిమాండ్ పెరుగుతోందనడానికి సూచనగా ఉద్యోగాల పోస్టింగ్స్‌లో అహ్మదాబాద్, కోయంబత్తూర్, కొచ్చి, జైపూర్, మొహాలీ వంటి ద్వితీయ శ్రేణి నగరాల వాటా 6.9 శాతంగా నమోదైంది. ప్రయాణాలపై కోవిడ్–19పరమైన ఆంక్షల ఎత్తివేతతో విదేశాల్లో వివిధ రంగాల్లో ఉద్యోగావకాశాలను భారతీయులు గణనీయంగానే అన్వేషిస్తున్నారు. ఈ విషయంలో దేశాలవారీగా చూస్తే మొత్తం సెర్చ్‌లలో అమెరికా వాటా 39.29 శాతంగా ఉండగా, కెనడా 17.23 శాతం, బ్రిటన్ 14.34 శాతం, యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ 13.79 శాతం వాటాతో తర్వాత స్థానాల్లో ఉన్నాయి. అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్నప్పటికీ దేశీయంగా వివిధ ఉద్యోగాల కేటగిరీల్లో వృద్ధి కనబడుతోందని, భారత్‌లో హైరింగ్ ధోరణులు సానుకూలంగా ఉందనడానికి ఇది నిదర్శనమని ఇన్‌డీడ్ ఇండియా హెడ్ (సేల్స్) శశి కుమార్ తెలిపారు. కేంద్ర బడ్జెట్లో ఉపాధి కల్పనపై దృష్టి పెడితే కచ్చితంగా దేశీయంగా జాబ్ మార్కెట్‌కు మరింత ఊతం లభించగలదని ఆయన చెప్పారు. దేశీయంగా ఉద్యోగాల పరిస్థితి ఎలా ఉండబోతోందనేది ఈ ఏడాది తొలి రెండు త్రైమాసికాల్లో ధోరణులే నిర్దేశిస్తాయని పేర్కొన్నారు. -
టెలికం ఉద్యోగాలు పెరిగాయి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం, 5జీ విభాగంలో ఉద్యోగ ప్రకటనలు సెప్టెంబర్‌తో ముగిసిన ఏడాదిలో 33.7 శాతం పెరిగాయని గ్లోబల్ జాబ్ సైట్ ఇండీడ్ వెల్లడించింది. ‘5జీ సేవల కోసం భారత్ ఆసక్తిగా ఎదురు చూస్తోంది. 5జీ నిర్దిష్ట సాంకేతికత, సేవలను అభివృద్ధి చేయడానికి కంపెనీలు ఇప్పటికే నియామకాలను ప్రారంభించాయి. తదుపరితరం నూతన టెలికం సాంకేతికతను వేగంగా స్వీకరించేందుకు వ్యాపార సంస్థలు ఎదురు చూస్తున్నందున రాబోయే కొద్ది త్రైమాసికాల్లో ఈ విభాగంలో నియామకాల్లో పెరుగుదలను చూడవచ్చు. కొత్త సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా భద్రతా వ్యవస్థలను రూపొందించగల, నెట్వర్క్ నిర్మాణాలను బలోపేతం చేయగల నైపుణ్యం కలిగిన ప్రతిభ అవసరమని దీనినిబట్టి అవగతమవుతోంది. అభివృద్ధి చెందిన టెలికమ్యూనికేషన్ రంగానికి అనుగుణంగా ఉద్యోగార్ధులు, పరిశ్రమ సైబర్ సెక్యూరిటీ నిపుణుల బలమైన సమూహాన్ని సృష్టించాలి’ అని నివేదిక వివరించింది. ఉద్యోగ ప్రకటనలు కస్టమర్ సర్వీస్ ప్రతినిధుల కోసం 13.91, ఆపరేషన్స్ అసోసియేట్స్ 8.22 శాతం అధికం అయ్యాయి. 2019 ఆగస్ట్ నుంచి 2022 ఆగస్ట్ మధ్య సైబర్ సెక్యూరిటీ ఉద్యోగాల కోసం ప్రకటనలు 81 శాతం దూసుకెళ్లాయి. -
విదేశాల్లో ఉద్యోగానికి సై.. ఐటీదే ఆధిపత్యం
ముంబై: కోవిడ్–19 నేపథ్యంలో ప్రయాణ అంక్షలు ఉన్నప్పటికీ విదేశాల్లో ఉద్యోగం చేసేందుకు భారతీయులు ఉత్సాహం కనబరుస్తున్నారని జాబ్ సైట్ ఇండీడ్ నివేదిక వెల్లడించింది. ‘2019–21లో విదేశీ ఉద్యోగాల కోసం శోధన పెరిగింది. వీరిలో యూఎస్‌లో జాబ్ కోసం 40 శాతం మంది ఉత్సాహం కనబరిచారు. కెనడాలో ఉద్యోగం కోసం 16 శాతం మంది సర్చ్ చేశారు. జాబితాలో ఆ తర్వాతి స్థానాల్లో యూఏఈ, గ్రేట్ బ్రిటన్, ఖతార్, సింగపూర్, ఆస్ట్రేలియా ఉన్నాయి. భారత్ వెలుపల జాబ్ కోసం 2019 నవంబర్–2020 ఏప్రిల్ మధ్య అత్యధికంగా శోధించారు. అంత క్రితం కాలంతో పోలిస్తే ఇది 72 శాతం అధికం. సెకండ్ వేవ్‌తో ప్రయాణ అంక్షల కారణంగా ఆ తర్వాత ఈ ప్రక్రియ తగ్గింది. మహమ్మారి సెకండ్ వేవ్ నుండి ప్రపంచం కోలుకున్న వెంటనే విదేశీ అవకాశాల కోసం ఉద్యోగ శోధనలు ఊపందుకుని స్థిరంగా కొనసాగాయి. థర్డ్‌వేవ్ మధ్య కూడా భారతీయులు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో ప్రధానంగా ఐటీ ఉద్యోగాల కోసం పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. భారతీయ ప్రతిభ ప్రపంచ దృష్టిని చాలా ఆకర్షిస్తోంది. విదేశీ ఉద్యోగ వేటలో సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఫుల్ స్టాక్ డెవలపర్, డేటా అనలిస్ట్ టాప్‌లో ఉన్నారు. ఐటీ సాంకేతిక నిపుణులకు యూఎస్, ఉత్తర అమెరికా, యూకే టార్గెట్ కాగా, ఇంజనీరింగ్ అభ్యర్థులు గల్ఫ్ ప్రాంతంపై ఫోకస్ చేశారు’ అని నివేదిక వివరించింది. చదవండి: విదేశాలకు చెక్కేస్తున్న దేశ మిలియనీర్లు..! -
గుడ్ న్యూస్: వారంలో 3 రోజులే పని..! వచ్చే ఏడాది నుంచే అమలు..?!
వర్క్ ఫ్రం హోంకే పరిమితమైన ఉద్యోగులకు ఆయా కంపెనీలు గుడ్ న్యూస్ చెప్పనున్నాయి. వచ్చే ఏడాది ప్రారంభం నుంచి వారానికి మూడు రోజుల పాటు ఆఫీస్‌లో పనిచేసేలా వర్క్ కల్చర్‌ను అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉందని ఐటీ పరిశ్రమ సంఘం నాస్కామ్ -ఇండీడ్ సర్వే తెలిపింది. అంతేకాదు ఇప్పటికే పలు కంపెనీలు అమలు చేసిన వారానికి మూడు రోజుల పని విధానాన్ని గుర్తి చేశారు. కరోనా కారణంగా ఉద్యోగులు ఏడాదిన్నరగా ఇంటి వద్ద నుంచే విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో పాటు ఉద్యోగులు సైతం ఆఫీస్‌లకు వచ్చేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో నాస్కామ్-ఇండీడ్ సంస్థలు ‘నాస్కామ్ రిటర్న్ టు వర్క్‌ప్లేస్ సర్వే’ నిర్వహించాయి. ఈ సర్వేలో ముఖ్యంగా ఐటీ ఉద్యోగుల అభిప్రాయాల్ని సేకరించింది. ఇందులో 25 నుంచి 40 ఏండ్లకు పైనున్న ఉద్యోగులు ఎప్పుడెప్పుడు ఆఫీస్‌కు వెళ్దామా' అని ఎదురు చూస్తున్నట్లు సర్వేలో తేలింది. ఐటీ కంపెనీలు తెచ్చిన ఐబ్రిడ్ వర్క్ కల్చర్ పట్ల ఉద్యోగులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని నాస్కామ్ తెలిపింది. ‘నాస్కామ్ రిటర్న్ టు వర్క్‌ప్లేస్ సర్వే’ ► నాస్కామ్-ఇండీడ్ సర్వేలో దాదాపు 50 శాతం మంది ఉద్యోగులు వచ్చే ఏడాది జనవరి నుండి వారానికి 3రోజుల పాటు ఆఫీస్‌లకు వచ్చే అవకాశం ఉంది. యజమానులు, ఉద్యోగులు ఇద్దరూ హైబ్రిడ్ సెటప్‌లో కార్యాలయాలకు తిరిగి రావడానికి ఆసక్తి చూపుతున్నారు. ► ఇప్పటికే టీసీఎస్, ఇన్ఫోసిస్ , విప్రో, హెచ్‌సీఎల్ టెక్ కంపెనీలు ఇప్పటికే సీనియర్ మేనేజ్మెంట్ స్థాయి ఉద్యోగస్తుల్ని కార్యాలయాలకు రప్పించాయి. ఇతర ఉద్యోగులు సైతం ఆఫీస్‌కు వచ్చేలా ప్రోత్సహిస్తున్నాయి. ► ఉద్యోగులు స్వచ్ఛందంగా ఆఫీస్‌కు వచ్చేందుకు మొగ్గుచూపుతున్నారు. ► 81 శాతానికి పైగా సంస్థలు ఉద్యుగుల్ని ఆఫీస్‌లకు రప్పించే విషయంలో ఉద్యోగుల ఆరోగ్యం, భద్రత విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తేలింది. ► దాదాపు 72 శాతం సంస్థలు వచ్చే ఏడాది నుంచి గరిష్టంగా 50 శాతం ఉద్యోగుల్ని ఆఫీసుల్లో పనిచేసేందుకు చూస్తున్నాయి. ► 70 శాతంపైగా ఐటీ, ఇతర కంపెనీలు దీర్ఘకాలిక హైబ్రిడ్ వర్క్ కల్చర్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు మొగ్గుచూపుతున్నాయని ‘నాస్కామ్ రిటర్న్ టు వర్క్‌ప్లేస్ సర్వే’ లో తేలింది. ఇప్పటికే కొన్ని కంపెనల్లో వారానికి మూడు రోజుల పని అమలు వారానికి ఆరు రోజుల పని, ఓ రోజు సెలవు. సాధారణంగా ఇది అన్ని చోట్లా ఉండేదే. కొన్ని కార్పొరేట్ కంపెనీల్లో ఐదు రోజుల పనిదినాలు ఉన్నాయి. అయితే కొన్ని కంపెనీలు కేవలం మూడు రోజుల పనిదినాల విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నాయి. వారానికి మూడురోజుల పనిచేసినా మార్కెట్‌కు అనుగుణంగా 80శాతం వేతనాల్ని చెల్లిస్తామని ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే బెంగళూరుకు చెందిన ఫిన్‌టెక్ స్టార్టప్ కంపెనీ ‘స్లైస్’ ఈ విధానాన్ని అమలు చేసింది. స్లైస్‌లో పనిచేస్తున్న 450 మంది ఉద్యోగులు వారానికి మూడు రోజులే పనిచేస్తున్నారు. హైబ్రిడ్ వర్క్ కల్చర్ హైబ్రిడ్ వర్క్ కల్చర్ అంటే 25 శాతం ఉద్యోగులతో ఆఫీసుల్ని.. దశలవారీగా మిగతా వాళ్లతో వర్క్‌ఫ్రమ్ హోంను నిర్వహించడం. ఇప్పటికే టీసీఎస్ ఈ పని విధానాన్ని 2025 నుంచి పూర్తిగా అమలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు టీసీఎస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎన్జీ సుబ్రమణియం ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. చదవండి: కొత్త వ్యూహం..నవంబర్ 15లోపు ఆఫీసుకు రండి..! -
భారీగా ఉద్యోగాలు, ఈ రేంజ్లో శాలరీలు ఎప్పుడు ఇవ్వలేదేమో!
నిరుద్యోగులకు శుభవార్త. కరోనా కారణంగా నిలిపివేసిన ఉద్యోగాల నియామకాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రోతో పాటు ఇతర సాఫ్ట్ వేర్ కంపెనీలు భారీ ఎత్తున నియామకాలు చేపట్టనున్నట్లు కొన్ని రిపోర్ట్లు వెలుగులోకి వచ్చాయి. 2020 గణాంకాల ప్రకారం..కోవిడ్ కారణంగా ఇండియాలో 12.2 కోట్ల మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోయారు. అయితే ఇప్పుడు పరిస్థితులు చక్కబడ్డాయి. ఇప్పటి వరకు ఉద్యోగుల నియామకాల్ని నిలిపివేసిన సంస్థలు తిరిగి.. ఉద్యోగుల ఎంపికలో నిమగ్నమయ్యాయి. దాదాపు ఒకటిన్నర సంవత్సరం తరువాత దేశంలో థర్డ్ వేవ్ రూపంలో కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తుందనే వార్తలు వస్తున్నా..పలు సెక్టార్లకు చెందిన సంస్థలు భారీ ఎత్తున నియామకాలు చేపట్టనున్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. గత కొద్ది కాలంగా కరోనా ఇండియన్ జాబ్ మార్కెట్ పై ఎలాంటి ప్రభావం చూపుతుందోనన్న అంశంపై విశ్లేషణ చేస్తున్న జాబ్ సైట్ ఇండీడ్ రిపోర్ట్ ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. టెక్ ఉద్యోగాలకు భారీ డిమాండ్ ప్రస్తుతం జాబ్ మార్కెట్లో టెక్ ఉద్యోగాలకు భారీ డిమాండ్ ఉన్నట్లు ఇండీడ్ తెలిపింది. 400శాతం వరకు సాఫ్ట్ వేర్ ఉద్యోగుల డిమాండ్ పెరిగినట్లు ఇండీడ్ తన రిపోర్ట్‌లో పేర్కొంది. లింక్డ్ఇన్ జాబ్ కోసం అప్లయ్ చేస్తే టెక్ ఉద్యోగాలకు ఏ విధమైన డిమాండ్ ఉందో తెలుస్తోందని చెప్పింది. అంతేకాదు 2020లో మహమ్మారి ప్రారంభంలో పలు రంగాల్లో అనిశ్చితి నెలకొందని, జూన్ 2020లో కరోనా ఫస్ట్ వేవ్ గరిష్ట స్థాయికి చేరడానికి కొన్ని నెలల ముందు ఉద్యోగుల నియామకం 50 శాతం తగ్గినట్లు వెల్లడించింది. వీటితో పాటు అప్లికేషన్ డెవలపర్, లీడ్ కన్సల్టెంట్, సేల్స్‌ఫోర్స్ డెవలపర్,సైట్ రిలయబిలిటీ ఇంజనీర్ వంటి టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న జాబ్స్‌కు డిమాండ్ 150-300 శాతం మధ్య పెరిగింది. 70-120 శాతం జీతాల పెంపు సంస్థలు ఉద్యోగుల్ని నియమించడమే కాదు. గతేడాదితో పాలిస్తే ఇప్పుడు భారీ ఎత్తున జీతాలు ఇస్తున్నాయి.ఉద్యోగులు ఎక్కువ జీతాలు ఆశించడమే కాదు..అదే స్థాయిలో కంపెనీలు శాలరీలు ఇచ్చేందుకు వెనకడుగు వేయడంలేదు.పుల్ స్టాక్ ఇంజనీర్లకు కంపెనీలు 70-120 శాతం వరకు జీతాలు పెంచుతున్నాయని నివేదికలో పొందుపరిచింది. ఇక మిగిలిన రంగాలకు చెందిన ఉద్యోగుల జీతాల పెంపు 20-30 శాతంగా ఉంది. ఉద్యోగులకు ఇదే మంచి సమయం ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కెరీర్ గ్యాప్ తర్వాత ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న మహిళా నిపుణుల కోసం అతిపెద్ద రిక్రూట్మెంట్ డ్రైవ్‌ను ప్రారంభించినట్లు ఇటీవల ప్రకటించింది. టీసీఎస్‌తో పాటు ఇన్ఫోసిస్, విప్రో కంపెనీలు దేశం అంతా టెక్ ఉద్యోగుల్ని భారీ ఎత్తున రిక్రూట్ చేసుకుంటున్నాయి. కొత్త ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న, మంచి ఉద్యోగం కావాలనుకునే అభ్యర్ధులకు నైపుణ్యాలు ఉంటే ఇదే మంచి సయమం. బెంగుళూరు, హైదరాబాద్, చెన్నై వంటి ఐటి నగరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకునే అవకాశం ఉందని ఇండీడ్ తన నివేదికలో స్పష్టం చేసింది. చదవండి: నియామకాలు పెరుగుతున్నాయ్, ఆ రంగాలే కీలకం -
కోవిడ్ ముందస్తు స్థాయికి నియామకాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో నియామకాలు కోవిడ్–19 ముందస్తు స్థాయికి చేరుకున్నాయని జాబ్ సైట్ ఇండీడ్ వెల్లడించింది. ఉద్యోగ వృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లడంలో వినియోగ ఆర్థిక వ్యవస్థ ముఖ్యమైన పాత్ర పోషిస్తోందని వివరించింది. ‘నియామకాలు 2020 ఫిబ్రవరి స్థాయికి చేరుకున్నాయి. గతేడాదితో పోలిస్తే జూలైలో ఐటీ టెక్ సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం ప్రకటనలు 19 శాతం అధికమయ్యాయి. ప్రాజెక్ట్ హెడ్, ఇంజనీర్ వంటి ఇతర ఐటీ ఉద్యోగాలకు ప్రకటనలు 8–16 శాతం పెరిగాయి. ఆర్థిక వ్యవస్థ తిరిగి ప్రారంభమవడం, కోవిడ్ –19 సవాళ్ల చుట్టూ పనిచేయడానికి వ్యాపార సంస్థలు చేసే ప్రయత్నాలు భారతీయ జాబ్ మార్కెట్‌ను రికవరీ వైపు నెట్టా యని ఇండీడ్ ఇండియా సేల్స్ హెడ్ శశి కుమార్ తెలిపారు. టెక్ జాబ్స్ జోరు ఎక్కువగా కొనసాగుతున్నప్పటికీ, రిటైల్, ఫుడ్ రంగంలో తిరిగి డిమాం డ్ రావడం వృద్ధిని మరింతగా పెంచడంలో వినియోగ ఆర్థిక వ్యవస్థ కీలకంగా ఉందన్నారు. ప్రాధాన్యతలలో మార్పు.. కంపెనీలు, ఉద్యోగార్ధులకు పరిశుభ్రత ప్రధాన ప్రాధాన్యతగా మారింది. హౌజ్కీపర్స్, కేర్‌టేకర్స్, క్లీనర్స్ ఉద్యోగాలు 60 శాతం దూసుకెళ్లాయి. వెటెరినరీ, థెరపీ, పర్సనల్ కేర్, చైల్డ్ కేర్ ఉద్యోగాల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంది. ఉద్యోగార్ధుల ప్రాధాన్యతలలో గణనీయమైన మార్పును సూచించే ధోరణి ఇది. అభ్యర్థుల్లో ఆసక్తి విషయంలో విమానయానం 25 శాతం, అకౌంటింగ్ 8, కస్టమర్ రిలేషన్స్ 7, అడ్మిన్ 6 శాతం తగ్గాయి. ఉద్యోగ వృద్ధి వేగవంతం అవుతూనే ఉంది. ఎక్కువ మంది కార్మికులు ఉద్యోగాలు వెతుకుతున్నారు. కార్మిక మార్కెట్ పునర్ ప్రారంభంతో ముడిపడి ఉన్న రంగాలు ముందంజలో ఉన్నాయి’ అని ఇండీడ్ వివరించింది. ఈ ట్రెండ్ రాబోయే నెలల్లో కొనసాగవచ్చన్న ఆశను కలిగిస్తున్నాయని టాలెంట్ అక్విజిషన్ అనలిస్ట్ రేచల్ స్టెల్లా రాజ్ తెలిపారు. -
ఒప్పంద కార్మికులకు పెరిగిన డిమాండ్
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఒప్పంద కార్మికుల కోసం డిమాండ్ పెరిగిందని ఉద్యోగావకాశాలను తెలియజేసే పోర్టల్ ఇండీడ్ వెల్లడించింది. ఇండీడ్ నివేదిక ప్రకారం.. 2019తో పోలిస్తే ఈ ఏడాది జనవరి–జూలై మధ్య ఉద్యోగార్థుల నుంచి ఒప్పంద, తాత్కాలిక ఉద్యోగాలు కావాలన్న అభ్యర్థనలు 150 శాతం పెరిగాయి. అలాగే ఈ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయన్న ప్రకటనలు 119 శాతం అధికమయ్యాయి. ఒక్క జూలై నెలలో ఇండీడ్ వేదికగా ఒప్పంద ఉద్యోగాల కోసం చేసిన అన్వేషనలు మూడు రెట్లు పెరిగి 207 శాతం వృద్ధి సాధించాయి. మెయింటెనెన్స్ పర్సన్స్, సర్వీస్ ఇంజనీర్స్ కోసం (ఇన్స్టాలేషన్ విభాగం) డిమాండ్ అత్యధికంగా ఉంది. ఈ విభాగం 128 శాతం వృద్ధి సాధించింది. ఉద్యోగ ప్రకటనలు టెక్నాలజీ, సాఫ్ట్వేర్ విభాగంలో 43 శాతం, మీడియా 28, మార్కెటింగ్ 18.5, సేల్స్ 12, అడ్మినిస్ట్రేషన్‌లో 4 శాతం పెరిగాయి. మేనేజ్మెంట్ 0.8 శాతం, అకౌంటింగ్ 36.5, ఎడ్యుకేషన్ 38 శాతం మైనస్‌లోకి వెళ్లాయి. -
‘వర్క్ ఫ్రం హోం’ కోసం తెగ సెర్చింగ్!
సాక్షి, హైదరాబాద్ : వర్క్ ఫ్రం హోం లేదా రిమోట్ వర్కింగ్.. ఇప్పుడు ఎవరు కలుసుకున్నా, ఫోన్లో పలకరించుకున్నా ఇవే మాటలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఆన్‌లైన్‌లోనూ అత్యధికంగా వీటి గురించే మనోళ్లు తెగ వెతికేస్తున్నారు. ఎంతగా అంటే గతంతో పోల్చితే 442 శాతమంతా..! ‘రిమోట్’, ‘వర్క్ ఫ్రం హోం’ఇంకా ఈ అర్థం వచ్చేలా పదాలతో ఇండియన్లు అధికంగా ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తున్నారు. గతంలో సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ఒకట్రెండు ఇతర రంగాల్లోని ఉన్నతోద్యోగులకు మాత్రమే అనువుగా అందుబాటులో ఉన్న ఇంటి నుంచి పని చేసే పద్ధతి కరోనా మహమ్మారి కారణంగా ఇప్పుడు వివిధ రంగాల్లోని ఉద్యోగులకు కూడా విస్తరించింది. ప్రస్తుత అనిశ్చితి ఎంతకాలం ఉంటుందో అంచనా వేయడం కష్టం కావడంతో తాత్కాలికంగా పరిమిత కాలానికైనా ఈ పని విధానానికి అనేక సంస్థలు మొగ్గు చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌లో ‘వర్క్ ఫ్రం హోం’ ఉద్యోగ అవకాశాల కోసం ఆన్లైన్లో సెర్చింగ్ 442 శాతం పెరిగినట్టు తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇది ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చితే అత్యధికమని కూడా తేలింది. ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ అవకాశాల సంబంధిత సెర్చ్ ఇంజిన్ ‘ఇండీడ్’ప్లాట్ ఫాం ద్వారా సేకరించిన డేటా ఆధారంగా రూపొందించిన నివేదికలో పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. గత ఫిబ్రవరి నుంచి గత నెల జూలై మధ్యకాలంలో ఇంటి నుంచి చేసే ఉద్యోగాల కోసం భారతీయులు భారీ స్థాయిలో ఆన్లైన్లో సెర్చ్ చేసినట్టు ఈ అధ్యయనం తేల్చింది. ‘వర్క్ ఫ్రం హోం’పద్ధతి వల్ల మంచి ఫలితాలు రావడం, ఉత్పాదకత పెరగటం, ఉద్యోగులు కూడా క్రియాశీలంగా వ్యవహరిస్తుండటంతో కంపెనీల యజమానులు, సంస్థల ఉన్నతోద్యోగులు.. మరిన్ని అవకాశాలు పెంచుతున్నట్టుగా ఈ నివేదిక పేర్కొంది. దీంతో ప్రస్తుతం సాఫ్ట్వేర్ టెక్నాలజీ, హెల్త్‌కేర్, మార్కెటింగ్ వంటి రంగాల్లో ఉద్యోగ అవకాశాలు గణనీయంగా పెరిగినట్టు, ముఖ్యంగా డెలివరీ పర్సన్లు, ఐటీ మేనేజర్లకు అవకాశాలు మరింతగా డిమాండ్ ఉన్నట్టుగా వెల్లడించింది. జూలైలో కొన్ని రంగాల్లో కొత్త ప్రకటనలు కరోనా వైరస్ వ్యాప్తి, కోవిడ్ మహమ్మారి విస్తరణ, ప్రభావం ఒక్కో రంగంపై ఒక్కో రకంగా పడింది. అయితే సాఫ్ట్వేర్ టెక్నాలజీ, మెడికల్/డాక్టర్, మార్కెటింగ్ వంటి రంగాల్లో ఉద్యోగ అవకాశాలు బాగా పెరిగాయి. ముఖ్యంగా గత కొన్ని నెలలతో పోల్చితే ఇండియాలో జూలైలో కొన్ని రంగాల్లో ఉద్యోగాల కోసం కొత్త ప్రకటనలు పెరిగాయి. ఇదే ట్రెండ్ ఇకముందూ కొనసాగిన పక్షంలో ఇతర రంగాల్లోనూ ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని ‘ఇండీడ్’అంచనా వేస్తోంది. దీంతో పాటు పాత పద్ధతుల్లో కాకుండా వెబ్సైట్ల ద్వారానే ఎక్కువగా ‘జాబ్ పోస్టింగ్’లు పడతాయని పేర్కొంది. ఇటు వ్యక్తులు, సంస్థలు లక్ష్యంగా చేసుకుని సైబర్ దాడులూ పెరగటంతో ‘స్కిల్డ్ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషన్ల’కు డిమాండ్ అమాంతంగా పెరిగింది. దీంతో సైబర్ సెక్యూరిటీ ఆధారిత ఉద్యోగాల కోసం ప్రకటనలు కొంత పెరగ్గా, దీనికి సంబంధించిన సెర్చ్‌లు కూడా 30 శాతం పెరిగాయి. -
రోబో జాబ్స్ జోరు.. మూడేళ్లలో 191 శాతం వృద్ధి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో గత కొన్నేళ్లుగా రోబోటిక్స్ రంగంలో ఉద్యోగ అవకాశాల కోసం వెతుకులాట గణనీయంగా పెరిగింది. 2015 మే నుంచి 2018 మే మధ్య రోబోటిక్స్ ఉద్యోగ అవకాశాల సెర్చిలో 186 శాతం వృద్ధి నమోదయిందని ప్రముఖ జాబ్ సెర్చ్ పోర్టల్ ఇన్‌డీడ్ తెలియజేసింది. ఇదే కాలంలో జాబ్ పోస్టింగ్స్ 191 శాతం వృద్ధిని నమోదు చేశాయని ఒక నివేదికలో తెలియజేసింది. 2015 తర్వాతి నుంచి దేశంలోని ప్రముఖ కంపెనీలు రోబోటిక్స్ మినహా ఇతర విభాగంలో కొత్త ఉద్యోగ అవకాశాలను చాలా వరకు తగ్గించేశాయని ఇన్‌డీడ్ ఎండీ సతీష్ కుమార్ తెలిపారు. మేకిన్ ఇండియాలో భాగంగా కేంద్రం రోబోటిక్స్ రంగంలో 13 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టిందని, ఇదే రోబోటిక్స్ ఉద్యోగ డిమాండ్‌కు కారణమని తెలిపారు. కన్స్ట్రక్షన్స్, హెల్త్‌కేర్, తయారీ రంగాల్లో రోబోటిక్స్ హవా నడుస్తోందన్నారు. మూడో స్థానంలో తెలంగాణ.. రోబోటిక్స్ సెక్టార్లో అత్యధిక ఉద్యోగ అవకాశాలున్న రాష్ట్రంలో తొలి రెండు స్థానాల్లో మహారాష్ట్ర, కర్ణాటక నిలవగా.. తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత వరుసగా తమిళనాడు, హర్యానా, న్యూఢిల్లీ, వెస్ట్ బెంగాల్, గుజరాత్, ఉత్తర్‌ప్రదేశ్, కేరళ రాష్ట్రాలు నిలిచాయి. సర్జరీల్లోనే ఎక్కువ.. రోబోటిక్స్ ఉద్యోగ అవకాశాలు విభాగాల వారీగా చూసుకుంటే సర్జరీ, కన్స్ట్రక్షన్స్ రంగంలోనే ఎక్కువగా ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే దేశీయ సర్జికల్ రోబోటిక్స్ మార్కెట్ వృద్ధి ఎక్కువగా ఉందని నివేదిక తెలిపింది. -
టెక్ జాబ్స్.. బెంగళూరులోనే ఎక్కువ!!
న్యూఢిల్లీ: టెక్నాలజీ రంగంలో ఉద్యోగాలు కావాలనుకున్నవారు బెంగళూరుకు వెళ్లి ప్రయత్నించటమే ఉత్తమ మార్గంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఈ రంగంలో ఎక్కువ ఉద్యోగ అవకాశాలు బెంగళూరులోనే ఉన్నాయి. దీని తర్వాత రెండు, మూడు స్థానాల్లో వరుసగా ఢిల్లీ– ఎన్సీఆర్, పుణే నిలిచాయి. ప్రముఖ జాబ్ పోర్టల్ ‘ఇన్‌డీడ్’ సమాచారం ప్రకారం... టెక్నాలజీ రంగంలోని మొత్తం జాబ్ పోస్టింగ్‌లను పరిశీలిస్తే.. బెంగళూరు 22 శాతం వాటాతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఢిల్లీ–ఎన్సీఆర్ 11 శాతం వాటాతో రెండో స్థానాన్ని, పుణే 10 శాతం వాటాతో మూడో స్థానాన్ని దక్కించుకున్నాయి. ఇక వీటి తర్వాతి స్థానాల్లో హైదరాబాద్ (9 శాతం), ముంబై (8 శాతం), చెన్నై (7 శాతం), మొహాలి (4 శాతం), అహ్మదాబాద్ (3 శాతం) ఉన్నాయి. టెక్నాలజీ రంగంలోని ఉద్యోగ అవకాశాల్లో భారత సిలికాన్ వ్యాలీగా పిలిచే బెంగళూరు టాప్‌లో నిలవడం ఆశ్చర్యమేమీ కాదని ఇన్‌డీడ్ అభిప్రాయపడింది. 20– 29 ఏళ్ల వయసు గ్రూప్ వారు ఎక్కువగా ఉద్యోగ అవకాశాల వేటలో ఉన్నారని తెలియజేసింది. కంపెనీలు కూడా వీరినే ఎక్కువగా నియమించుకుంటున్నాయని పేర్కొంది. ‘‘55 ఏళ్లపైన వయసున్న వారు కూడా టెక్ జాబ్స్‌పై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. 40–49 ఏళ్ల గ్రూప్ వారు మాత్రం తక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు’’ అని ఇన్‌డీడ్ తెలిపింది. కాగా ఇన్‌డీడ్ గత సర్వేలో బ్లాక్‌చైన్ సంబంధిత జాబ్స్ అంశంలో కూడా బెంగళూరే టాప్‌లో ఉంది. -
వ్యవసాయంపై యువతకు అనాసక్తి
న్యూఢిల్లీ: వ్యవసాయ ఆధారిత ఉద్యోగాలపై యువతరం అంతగా ఆసక్తి చూపడం లేదు. ఉద్యోగ భద్రత లేకపోవడం, వ్యవసాయ రంగం వృద్ధిపై అవగాహన అంతగా లేకపోవడం, ఔత్సాహిక వ్యాపారవేత్తల స్ఫూర్తి లోపించడం ఇందకు కారణాలుగా ఉంటున్నాయి. ఉద్యోగావకాశాల వెబ్సైట్.. ఇన్‌డీడ్ ఇండియా నిర్వహించిన ఒక సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 2017లో తమ పోర్టల్‌లో వ్యవసాయ సంబంధ ఉద్యోగాల కోసం జాబ్ సెర్చ్‌లు సగటున 25 శాతం తగ్గాయని సంస్థ తెలిపింది. 21–25 సంవత్సరాల వయస్సుగల ఉద్యోగార్థుల (తాజా గ్రాడ్యుయేట్స్ మొదలైన మిలీనియల్స్) నుంచి వ్యవసాయ సంబంధ ఉద్యోగాలపై అత్యంత తక్కువ ఆసక్తి వ్యక్తమవుతోంది. అయితే, 31–35 ఏళ్ల మధ్య వయస్సుగల వారు ఈ తరహా ఉద్యోగాలపై సగటు కన్నా ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఆయా ఉద్యోగాలకు సంబంధించిన అవగాహన, సవాళ్లను ఎదుర్కొనడానికి అవసరమయ్యే నైపుణ్యాలను అప్పటికే సాధించడం ఇందుకు కారణంగా కనిపిస్తోంది. సర్వే ప్రకారం 2007 నుంచి చూస్తే వ్యవసాయ సంబంధ ఉద్యోగాల్లో చేరే యువత సంఖ్య 4 శాతం పెరిగింది. మొత్తం మీద ఉద్యోగ భద్రత ఉన్న పక్షంలో ఈ రంగంలో ఉద్యోగావకాశాలు పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తున్నట్లు సర్వే పేర్కొంది. ’సేంద్రియ’ సంస్థల్లో అవకాశాలు .. 2022 నాటికల్లా వ్యవసాయాదాయాన్ని రెట్టింపు చేయాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా .. దేశీ రైతాంగం వేగవంతంగా యాంత్రీకరణకు అలవాటు పడుతున్న నేపథ్యంలో ఈ రంగంలో ఉపాధి అవకాశాలు గణనీయంగా కనిపిస్తున్నాయని ఇన్‌డీడ్ ఇండియా ఎండీ శశి కుమార్ తెలిపారు. అగ్రిబిజినెస్, వ్యవసాయ వనరుల నిర్వహణ, ఫుడ్ సైన్సెస్ అండ్ టెక్నాలజీస్ మొదలైన అత్యాధునిక కోర్సులు కూడా ఈ రంగంలో రాణించేందుకు ఉపయోగపడగలవని పేర్కొన్నారు. నివేదిక ప్రకారం ఎపిగామియా, పేపర్‌బోట్, యాంటీడోట్, 24 మంత్ర వంటి సేంద్రియ వ్యవసాయోత్పత్తుల సంస్థలు మరింతగా నియామకాలు జరిపే అవకాశాలు ఉన్నాయి. -
అమెరికాలో టాప్-20 జాబ్స్...జీతాలు
సాక్షి, హైదరాబాద్ : వాళ్లబ్బాయికి నెలకు యాభైవేలు జీతమట అని నోరెళ్లబెట్టే రోజులు పోయాయి. భారత్‌లో నెలకు లక్షల్లో జీతమంటే తప్ప... పెద్దగా పట్టించుకోని రోజులొచ్చాయి. అమెరికాలో అయితే...చెప్పాల్సిన పనిలేదు. అక్కడి జాబ్ సెర్చ్ ఇంజన్ ‘ఇన్‌డీడ్’ ఈ మధ్య ఓ సర్వే చేసింది. ఏడాదికి లక్ష డాలర్లు (సుమారుగా రూ.65 లక్షలు) లేదా అంతకన్నా ఎక్కువ జీతమొచ్చే ఉద్యోగాల జాబితాను వెల్లడించింది. మెడికల్, టెక్ రంగాల్లో ఇలాంటి ఉద్యోగాలు ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. ఆ వివరాలు మీ కోసం... న్యూరాలజిస్ట్ 1.41 కోట్లు సైకియాట్రిస్ట్ 1.26 కోట్లు అనస్తీషియాలజిస్ట్ 1.12 కోట్లు రేడియాలజిస్ట్ 1.09 కోట్లు ఫిజీషియన్ 1.07 కోట్లు డెంటిస్ట్ 1.02 కోట్లు ప్రొడక్ట్ మేనేజ్మెంట్ డైరెక్టర్ 95.69 లక్షలు సర్జన్ 91.49 లక్షలు మెషీన్ లెర్నింగ్ ఇంజినీర్ 89.18 లక్షలు సేల్స్ వైస్ ప్రెసిడెంట్ 88.18 లక్షలు డేటా సైంటిస్ట్ 87.87 లక్షలు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ 83.04 లక్షలు ఆండ్రాయిడ్ డెవలపర్ 78.55 లక్షలు సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజినీర్ 77.79 లక్షలు ఫుల్‌స్టాక్ డెవలపర్ 72.54 లక్షలు యాక్చువరీ 72.39 లక్షలు ట్యాక్స్మేనేజర్ 70.46 లక్షలు ఆర్కిటెక్ట్ 67.58 లక్షలు నర్స్ ప్రాక్టీషనర్. 67.03 లక్షలు -
సాగునీటి పనులకు బ్రేక్
భూ సేకరణకు సర్కారు అడ్డు కొత్త చట్టం వచ్చేదాకా భూమి తీసుకోరాదంటూ జీవో జూన్ తర్వాత కొత్త చట్టం నిలిచిన దేవాదుల, ఎస్సారెస్పీ పనులు కంతనపల్లిలో సర్వే పనులకే అనుమతి హన్మకొండ, న్యూస్‌లైన్: జిల్లాలో సాగునీటి ప్రాజెక్టు పనులకు బ్రేక్ పడింది. పదేళ్లుగా సాగుతున్న దేవాదుల... ఏడేళ్లుగా కాల్వల్లోనే మగ్గుతున్న ఎస్సారెస్పీ పనులన్నీ నిలిచిపోయాయి. కంతనపల్లి ప్రాజెక్టు నిర్మాణానికి ఇప్పుడిప్పుడే అడ్డంకులన్నీ తొలగిపోతుండగా... కొత్త జీఓతో ఇక్కడ కేవలం సర్వే పనులకే పరిమితం చేశారు. ప్రాజెక్టుల భూ సేకరణ విషయం ఇప్పుడిప్పుడే కొలిక్కి వస్తున్న తరుణంలో.. పార్లమెంట్లో కొత్త చట్టం రూపొందించడం, ఆమోదం తెలుపడంతో పనులన్నీ నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం భూ సేకరణతో ముడిపడి ఉన్న పనులన్నీ ఆపాలని, ఎక్కడా సెంటు భూమిని కూడా వినియోగించరాదంటూ ఆదేశాలిచ్చారు. ఇప్పటి నుంచి చేసిన పనులకు బిల్లులు చెల్లించబోమని, పనులు చేయరాదని అధికారులకు, కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేశారు. దీంతో త్వరలో పూర్తవుతాయనుకున్న పలు ప్రాజెక్టుల పనులు మరింత జాప్యమయ్యే పరిస్థితి నెలకొంది. పదేళ్ల కిందట మొదలుపెట్టిన దేవాదుల ప్రాజెక్టు పనులకు మొదటి, రెండో దశల్లో భూ సేకరణ ఇబ్బందులున్నాయి. ధర్మసాగర్, తపాస్‌పల్లి, ఘన్పూర్, భీంఘన్‌పూర్ ప్రాంతాల్లోని ఉప కాల్వల నిర్మాణానికి కొంతమేరకే భూమిని సేకరించాల్సి ఉంది. కొన్ని చోట్ల వందల గజాల్లోనే భూమిని తీసుకోవాల్సి ఉండగా... రైతులు, భూ యజమానులతో ఇప్పుడిప్పుడే చర్చలు జరిపి, పరిహారం చెల్లింపుల కోసం తిరిగి దరఖాస్తులు చేసే సమయానికే పనులు నిలిపివేయాలంటూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో మొదటి దశలో కాల్వల నిర్మాణం పూర్తి చేసినప్పటికీ... ఉప కాల్వలు కొన్ని చోట్ల పూర్తికాకపోవడంతో వచ్చే ఖరీఫ్‌లో కూడా నీటిని అందించడం కష్టంగా మారనుంది. రెండో దశలో కూడా ఆయా ప్రాంతాల్లో భూమిని సేకరించాల్సి ఉంది. అదే విధంగా ఎస్సారెస్పీ-2 కాల్వ పనులకు సైతం పాలకుర్తి, జనగామ, వర్ధన్నపేట, మహబూబాబాద్, డోర్నకల్ ప్రాంతాల్లో కొంత భూమిని సేకరించాల్సి ఉంది. ఈ ప్రాంతాల్లో సుమారు 46 ఎకరాల భూమిని రైతుల నుంచి తీసుకునేందుకు ఇటీవలే అధికారులు చెల్లింపుల జాబితాను సిద్ధం చేశారు. కానీ, భూ సేకరణపై ఆంక్షలు విధించడంతో ప్రస్తుతం బ్రేక్ పడింది. ఇక.. చాలా ఏళ్ల తర్వాత కదిలిన కంతనపల్లికి అడ్డంకులు తొలుగుతున్నా భూ సేకరణ చట్టంతో మళ్లీ వెనకడుగు పడింది. తొలి దశ బ్యారేజీ నిర్మాణానికి టెండర్లు పూర్తయ్యాయి. టెండర్లు దక్కించుకున్న సంస్థ బ్యారేజీ సర్వే పనులు, అక్కడ కార్యాలయాల నిర్మాణానికి స్థల సేకరణలో నిమగ్నమైంది. కానీ... భూ సేకరణ చేయరాదని, కొత్త చట్టం పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చేంత వరకు ఎక్కడా చెల్లింపులు చేయరాదని కేంద్రం నుంచి నీటి పారుదల శాఖకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో కంతనపల్లి వద్ద నిర్మాణ పనులకు అడ్డుకట్ట పడింది. కొత్త భూ సేకరణ చట్టం జూన్ తర్వాత అమల్లోకి వస్తుదని, అప్పటి వరకు పనులు నిర్వహించరాదని నీటి పారుదల శాఖ ఆదేశాలిచ్చింది. అంటే మరో నాలుగు నెలల వరకు ఒక్క పనీ చేయరు. -
మంచు కురిసే వేళలో..