హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో గత కొన్నేళ్లుగా రోబోటిక్స్ రంగంలో ఉద్యోగ అవకాశాల కోసం వెతుకులాట గణనీయంగా పెరిగింది. 2015 మే నుంచి 2018 మే మధ్య రోబోటిక్స్ ఉద్యోగ అవకాశాల సెర్చిలో 186 శాతం వృద్ధి నమోదయిందని ప్రముఖ జాబ్ సెర్చ్ పోర్టల్ ఇన్‌డీడ్ తెలియజేసింది. ఇదే కాలంలో జాబ్ పోస్టింగ్స్ 191 శాతం వృద్ధిని నమోదు చేశాయని ఒక నివేదికలో తెలియజేసింది. 2015 తర్వాతి నుంచి దేశంలోని ప్రముఖ కంపెనీలు రోబోటిక్స్ మినహా ఇతర విభాగంలో కొత్త ఉద్యోగ అవకాశాలను చాలా వరకు తగ్గించేశాయని ఇన్‌డీడ్ ఎండీ సతీష్ కుమార్ తెలిపారు. మేకిన్ ఇండియాలో భాగంగా కేంద్రం రోబోటిక్స్ రంగంలో 13 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టిందని, ఇదే రోబోటిక్స్ ఉద్యోగ డిమాండ్‌కు కారణమని తెలిపారు. కన్‌స్ట్రక్షన్స్, హెల్త్‌కేర్, తయారీ రంగాల్లో రోబోటిక్స్ హవా నడుస్తోందన్నారు.
మూడో స్థానంలో తెలంగాణ..
రోబోటిక్స్ సెక్టార్‌లో అత్యధిక ఉద్యోగ అవకాశాలున్న రాష్ట్రంలో తొలి రెండు స్థానాల్లో మహారాష్ట్ర, కర్ణాటక నిలవగా.. తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత వరుసగా తమిళనాడు, హర్యానా, న్యూఢిల్లీ, వెస్ట్ బెంగాల్, గుజరాత్, ఉత్తర్‌ప్రదేశ్, కేరళ రాష్ట్రాలు నిలిచాయి.
సర్జరీల్లోనే ఎక్కువ..
రోబోటిక్స్ ఉద్యోగ అవకాశాలు విభాగాల వారీగా చూసుకుంటే సర్జరీ, కన్‌స్ట్రక్షన్స్ రంగంలోనే ఎక్కువగా ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే దేశీయ సర్జికల్ రోబోటిక్స్ మార్కెట్ వృద్ధి ఎక్కువగా ఉందని నివేదిక తెలిపింది.
రోబో జాబ్స్ జోరు.. మూడేళ్లలో 191 శాతం వృద్ధి
Published Fri, Jul 6 2018 1:42 AM | Last Updated on Fri, Jul 6 2018 1:42 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment