Portal
-
హోం వర్క్ చేయకుంటే గోడకుర్చీ వేయిస్తారా?
సాక్షి, న్యూఢిల్లీ: ‘సార్.. నేను హోంవర్క్ చేయకుంటే మా టీచర్ నన్ను గోడకుర్చీ వేయించవచ్చా? పిల్లలను కొట్టే తల్లిదండ్రులపై కేసు పెట్టవచ్చా? నేను సొంతింట్లో మరుగుదొడ్డి నిర్మించాలనుకుంటున్నాను. ప్రభుత్వం నుంచి ఏ మేరకు సహాయం అందుతుంది? అదెలా పొందాలి? ప్రేమికుడి దగ్గరకి వెళ్లాలనుకుంటున్నాను. వివాహమైన నెల రోజులకు విడాకులు సాధ్యమేనా?’పెళ్లైన 30ఏళ్ల తర్వాత విడాకులు తీసుకోవచ్చా?.. ఇలాంటి విచిత్ర ప్రశ్నలు కేంద్ర ప్రభుత్వ టెలీ–లా పోర్టల్‌కు పోటెత్తాయి. న్యాయ సలహాల కోసం ఇలా ఎన్నో రకాల ప్రశ్నలు అడుగుతూ దేశవ్యాప్తంగా లక్షలాది మంది పోర్టల్‌ను ఆశ్రయించారు. ఇలాంటి ప్రశ్నలు అడిగిన వారిలో 12 ఏళ్ల మైనర్ల నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకు ఉండటం విశేషం. గత సంవత్సరం పోర్టల్‌ను ఆశ్రయించిన వారి సంఖ్య కోటి దాటడం గమనార్హం. అత్యధికంగా ఉత్తరప్రదేశ్ నుంచి ఏకంగా 19 లక్షల మంది పోర్టల్‌ను ఆశ్రయించారు. ఎక్కువ మందితో ఉత్తర్‌ప్రదేశ్ తొలి స్థానంలో నిలిచింది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్‌లో మూడు లక్షలకు పైగా, తెలంగాణలో రెండు లక్షలకు పైగా వ్యక్తులు టెలి–లాను ఆశ్రయించారని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా న్యాయపరమైన హక్కులపై ప్రజలకు అవగాహన కలి్పంచి వారికి న్యాయ సహాయం అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘టెలి–లా’పోర్టల్‌ను ప్రారంభించిన విషయం విదితమే. ఈ పోర్టల్‌కు పౌరుల నుంచి మంచి స్పందన వస్తోంది. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు అత్యంత తీవ్రమైన సమస్యలతో పాటు అసంబద్ధమైన విషయాలపైనా న్యాయ సలహాలు కోరుతున్నారు. దీని ద్వారా.. కొన్ని చోట్ల పిల్లలపై జరుగుతున్న తీవ్రమైన నేరాలు వెలుగులోకి వచ్చాయి. మైనర్ల నుంచి ఆసక్తికరమైన ప్రశ్నలు సైతం పోర్టల్ అందుకుంది. న్యాయ సలహాలే కాకుండా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకునేందుకు కూడా ‘టెలి–లా’పోర్టల్‌ను పెద్దసంఖ్యలో పౌరులు ఆశ్రయించి తగు సూచనలు, సలహాలు పొందారు. ఈ పోర్టల్ ద్వారా అన్ని రకాల చట్టపరమైన సమస్యలపై లీగల్ సర్విసెస్ అథారిటీకి చెందిన న్యాయవాదులు సంప్రదింపులు, సహాయంతోపాటు దిశానిర్దేశం చేస్తారు. 2024 డిసెంబర్ 31 నాటికి వివిధ రాష్ట్రాల నుండి 1,06,18,641 మంది న్యాయ సలహా కోసం పోర్టల్‌లో తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వారిలో 1,0492,575 మందికి న్యాయ సహాయం, సంప్రదింపులు కూడా అందించారు. ‘టెలి–లా’ను ఆశ్రయించిన టాప్ ఐదు రాష్ట్రాల్లో యూపీ తొలిస్థానంలో ఉంది. ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 1,902,911 మంది ఆశ్రయించగా 1,888,805 మంది సలహాలు పొందారు. మధ్యప్రదేశ్‌లో 1,126,681 మంది పోర్టల్‌ను ఆశ్రయించగా 1,125,191 మంది సలహాలు పొందారు. మహారాష్ట్ర నుంచి 838,214 మంది ఆశ్రయించగా 834,149 మంది సలహాలు పొందారు. జమ్మూకశ్మీర్ నుంచి 694,208 మంది ఆశ్రయించగా 687,375 మంది సలహాలు పొందగలిగారు. రాజస్థాన్ నుంచి 650,980 మంది ఆశ్రయంగా పొందారు. వీరిలో 646,394 మందికి లాయర్లు సలహాలు ఇచ్చారు. దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక అగ్రస్థానంలో నిలిచింది. కర్ణాటక నుంచి 401,838 మంది టెలి–లా పోర్టల్‌ను ఆశ్రయించగా 369,859 మంది సలహాలు అందాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ముందంజలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ నుంచి 341,884 మంది పోర్టల్‌ను ఆశ్రయించగా 341,424మంది సలహాలు పొందారు. తెలంగాణ నుంచి 300,171 మంది ఆశ్రయించారు. వీరిలో 294,977 మందికి న్యాయవాదులు సలహాలు ఇచ్చారు. తమిళనాడు నుంచి 286,107 మంది ఆశ్రయంగా పొందగా 284,408 మంది సలహాలు పొందారు. కేరళ నుంచి 40,746 మంది పోర్టల్‌ను సలహాలు, సూచనలు అడగ్గా 36,891 మందికి సలహాలు ఇచ్చారు. -
మన రాష్ట్ర అగ్రిమెంట్ పలు దేశాలకు మారింది
-
ఇందిరాగాంధీ హయాంలో అసైన్డ్ ల్యాండ్ పంపణీ జరిగింది: CM Revanth
-
ఎన్సీఎస్ పోర్టల్‌లో అమెజాన్ జాబ్స్
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ సంస్థ అమెజాన్ ఉద్యోగావకాశాల వివరాలు ఇక నుంచి నేషనల్ కెరీర్ సర్వీస్ (ఎన్సీఎస్) పోర్టల్‌లో దర్శనమీయనున్నాయి. కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖతో అమెజాన్ రెండేళ్ల కాలానికి ఒప్పందం చేసుకుంది. ఎన్సీఎస్ పోర్టల్‌లో నమోదైన అభ్యర్థులు అమెజాన్ చేపడుతున్న నియామకాల వివరాలు తెలుసుకోవడంతోపాటు దరఖాస్తు చేసుకోవచ్చు.మోడల్ కెరీర్ సెంటర్స్ వద్ద జాబ్ ఫెయిర్స్ సైతం కంపెనీ నిర్వహించనుంది. ఇందుకు మంత్రిత్వ శాఖ సాయం చేయనుంది. ఇలా ఒప్పందం చేసుకున్న తొలి ఈ–కామర్స్ కంపెనీ తామేనని అమెజాన్ తెలిపింది. ఎస్సీఎస్ పోర్టల్‌లో ప్రస్తుతం 60 లక్షల పైచిలుకు ఉద్యోగార్థులు, 33.5 లక్షల కంపెనీలు సభ్యులుగా ఉన్నాయి. ప్రతిభను పెంపొందించడంలో అమెజాన్ నిబద్ధత దేశంలోని యువతకు కొత్త ఉపాధి అవకాశాలను అందిస్తుందని విశ్వసిస్తున్నామని కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రి మన్సుఖ్ మండావియా అన్నారు. -
వాణిజ్యానికి ప్రత్యేక పోర్టల్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తాజాగా వాణిజ్యానికి ప్రత్యేక పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ట్రేడ్ కనెక్ట్ ఈప్లాట్‌ఫామ్ పేరుతో ఏర్పాటు చేసిన పోర్టల్ ద్వారా ఎగుమతులు, దిగుమతులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందించనుంది. వెరసి ప్రస్తుత, కొత్త వ్యాపారవేత్తల(ఆంట్రప్రెన్యూర్స్)కు ట్రేడ్ పోర్టల్ సహాయకారిగా నిలవనుంది.ఎంఎస్ఎంఈ శాఖ, ఎగ్జిమ్ బ్యాంక్, టీసీఎస్, ఆర్థిక సేవల శాఖ, విదేశీ వ్యవహారాల శాఖల సహకారంతో తాజా ట్రేడ్ పోర్టల్‌ను అభివృద్ధి చేసింది. ట్రేడ్ పోర్టల్‌ను వాణిజ్యం, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ప్రవేశపెట్టారు. కస్టమ్స్ సుంకాలు, నిబంధనలు, నియంత్రణలు తదితర అన్ని రకాల సమాచారానికి ఒకే సొల్యూషన్‌గా తాజా పోర్టల్ నిలవనున్నట్లు గోయల్ వివరించారు. తద్వారా సమాచార లోపాలకు చెక్ పెట్టనున్నట్లు తెలియజేశారు. -
ఒక్క క్లిక్‌తో ఆధార్ సెంటర్ లొకేషన్ తెలుసుకోండిలా
మీకు దగ్గరలో ఆధార్ కేంద్రం ఎక్కడ ఉందో తెలియక ఇబ్బంది పడుతున్నారా? గూగుల్ మ్యాప్‌లో ఆధార్ సెంటర్ లొకేషన్ కనిపించడం లేదా? అయితే ఇప్పుడు దీనికి పరిష్కారం లభించింది. గూగుల్ మ్యాప్ నావిగేష్ను తలదన్నేలాంటి టెక్నాలజీ మనముందుకొచ్చింది. దీనిని యూనిక్ ఐడెంటిటీ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) రూపొందించింది. దీని సాయంతో ఒక్క క్లిక్‌తో సమీపంలో ఆధార్ కేంద్రం ఎక్కడుందో సులభంగా తెలుసుకోవచ్చు. ఈ పోర్టల్‌కు ‘భువన్ ఆధార్’ అని పేరు పెట్టారు.దీనిని యూఐడీఏఐ డివైన్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఆఫ్ ఇండియా స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో(ఎన్ఆర్ఎస్సీ) సహాయంతో రూపొందించింది. ఇది వెబ్ ఆధారిత పోర్టల్. ఇది ఆధార్ వినియోగదారులకు ఎంతో ఉపయోగకరంగా ఉండనున్నదని యూఐడీఏఐ చెబుతోంది.సాధారణంగా వినియోగదారులు సమీపంలోని ఆధార్ కేంద్రాన్ని గుర్తించేందుకు గూగుల్ మ్యాప్ సహాయం తీసుకుంటారు. అయితే అన్ని సమయాల్లోనూ గూగుల్ మ్యాప్ ఖచ్చితమైన సమాచారం అందించలేదు. లేదా అప్డేట్ను అందించదు. ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకే యూఐడీఏఐ ‘భువన్ ఆధార్’ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని సాయంతో వినియోగదారులు ఆధార్ కేంద్రాన్ని సులభంగా గుర్తించవచ్చు. ఈ పోర్టల్‌ను ప్రతీ 15 రోజులకు అప్డేట్ చేస్తుంటామని యూఐడీఏఐ తెలిపింది. #BhuvanAadhaarPortal #EaseOfLivingBhuvan Aadhaar Portal is facilitating Ease of Living by routing easy navigation to your nearest #authorized #Aadhaar Centre.To locate your nearest #AadhaarCentre visit: https://t.co/3Kkp70Kl23 pic.twitter.com/e7wEar5WXi— Aadhaar (@UIDAI) August 21, 2024 -
NewsClick Row: ప్రబీర్ తక్షణ రిలీజ్‌కు సుప్రీం కోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: న్యూస్‌క్లిక్ పోర్టల్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థ అరెస్ట్ చెల్లదని, ఆయన్ని తక్షణమే విడుదల చేయాలని సుప్రీం కోర్టు బుధవారం ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. ఈ న్యూస్ పోర్టల్‌కు విదేశీ నిధులు అందుతున్నాయంటూ.. ఉగ్రవాద నిరోధక చట్టం కింద కిందటి ఏడాది అక్టోబర్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే.. అరెస్టుకు సరైన కారణాలు చెబుతూ రిమాండ్ కాపీని సమర్పించడంలో ఢిల్లీ పోలీసులు విఫలమయ్యారు. దీంతో.. రిమాండ్ కాపీ తమకు అందకపోవడంతో ఈ అరెస్ట్ చెల్లదని, వెంటనే ఆయన్ని రిలీజ్ చేయాలని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా పంకజ్ బన్సాల్ కేసును కోర్టు ప్రస్తావించింది. అరెస్టుకు గల కారణాలేంటో నిందితులకు కూడా రాతపూర్వకంగా పోలీసులు తెలియజేయాల్సి ఉంటుందని పంకజ్ బన్సాల్ కేసులో సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఇప్పుడు ఈ కేసులోనూ అదే వర్తిస్తుంది అని బెంచ్ స్పష్టం చేసింది. చైనా అనుకూల ప్రచారానికి నిధులు అందుకున్నారనే ఆరోపణలు రావడంతో ఉపా చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. అక్టోబర్ 3వ తేదీన న్యూస్‌క్లిక్‌పోర్టల్‌లో పని చేసే జర్నలిస్టుల ఇళ్లలో సోదాలు చేశారు. డిజిటల్ పరికరాలు, పలు డాక్యుమెంట్లను సీజ్ చేశారు. అదే రోజు ప్రబీర్ పుర్కాయస్థతో పాటు ఆ సంస్థ హెచ్ఆర్ హెడ్ అమిత్ చక్రవర్తిని అరెస్టు చేసినట్టు ఢిల్లీ పోలీస్ అధికార ప్రతినిధి సుమన్ నల్వా వెల్లడించారు. ‘న్యూస్‌క్లిక్’ సంస్థకు చైనా నుంచి నిధులు అందుతున్నాయంటూ గత ఏడాది ఆగస్టులో ‘న్యూయార్క్ టైమ్స్’లో కథనం ప్రచురితమైంది. చైనా ప్రభుత్వానికి సన్నిహితంగా ఉండే అమెరికా మిలియనీర్ నెవిల్ రాయ్‌సింగం నుంచి గ్లోబల్ నెట్‌వర్క్‌లో భాగంగా ఉన్న న్యూస్‌క్లిక్ నిధులు పొందినట్టు ఆ కథనంలో పేర్కొంది. దీంతో చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA)లోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు దిల్లీ పోలీసులు.ఈ క్రమంలోనే న్యూస్‌క్లిక్ ఆఫీస్‌తో పాటు ఆ సంస్థలో పనిచేసే జర్నలిస్టుల ఇళ్లు సహా మొత్తం 30 చోట్ల సోదాలు జరిపి ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో ఢిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. పోలీసుల తీరుపై ప్రెస్‌క్లబ్ ఆఫ్ ఇండియా తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. ఇంకోవైపు.. ‘న్యూస్‌క్లిక్’పై దాడులను విపక్ష కూటమి ‘ఇండియా’ నేతలు తీవ్రంగా ఖండించారు. వాస్తవాలు మాట్లాడేవారి గళాన్ని అణచివేసేందుకే కేంద్రం సోదాలు చేపట్టిందని విమర్శించారు. బిహార్‌లో కులగణనలో బయటపడిన విషయాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే కేంద్రం న్యూస్‌క్లిక్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిందని విపక్షాలు ఆ సమయంలో మండిపడ్డాయి. -
రుణ గ్రహీతల పూర్వ ధ్రువీకరణకు పోర్టల్
న్యూఢిల్లీ: రుణాలు కోరుకునే వారికి సంబంధించి పూర్వపు ధ్రువీకరణ వివరాలతో ఒక పోర్టల్‌ను సెంట్రల్ ఎకనమిక్ ఇంటెలిజెన్స్ బ్యూరో (సీఈఐబీ) ప్రారంభించింది. రుణాల మంజూరు విషయంలో బ్యాంక్‌లు సకాలంలో నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా కావాల్సిన సమాచారాన్ని ఇది అందిస్తుందని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ తెలిపింది. అతిపెద్ద బ్యాంక్ మోసాలకు సంబంధించి 2015 మే 13, 2019 నవంబర్ 6న ఆర్థిక వ్యవహారాల శాఖ విడుదల చేసిన ఆదేశాల మేరకు.. ప్రభుత్వరంగ బ్యాంక్‌లు (పీఎస్‌బీలు) రూ.50 కోట్లకు మించిన రుణాన్ని కొత్తగా మంజూరు చేసే ముందు, లేదా అప్పటికే ఎన్పీఏగా మారిన రుణ గ్రహీత విషయంలో సీఈఐబీ నుంచి నివేదిక కోరాల్సి ఉంటుందని పేర్కొంది. ఎస్బీఐ సహకారంతో సీఈఐబీ రూపొందించిన పోర్టల్ ఇప్పుడు బ్యాంక్‌ల పని సులభతరం చేయనుంది. పెద్ద రుణాలకు సంబంధించి సీఈఐబీ అనుమతిని ఈ పోర్టల్ ద్వారా బ్యాంక్‌లు పొందే అవకాశం ఏర్పడింది. -
ధరణి: కలెక్టర్ల మొర.. మమ్మల్ని బాధ్యులను చేయడం సరికాదు!
సాక్షి, హైదరాబాద్: ధరణి పునర్నిర్మాణ కమిటీ సమావేశంలో భాగంగా పలు సమస్యలను జిల్లా కలెక్టర్లు కమిటీ దృష్టికి తీసుకువచ్చినట్టు తెలుస్తోంది. ధరణి విషయంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలకు తమను భాద్యులు చేయవద్దని కమిటీకి మొర పెట్టుకున్నారు. ధరణితో పాటు రెవెన్యూ వ్యవస్థలోని లోపాలకు తమను బాధ్యులను చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు పరిధిలోని అంశాలకు తమను బాధ్యులను చేయడం సరికాదంటున్న కలెక్టర్లు ధరణి కమిటీ దృష్టి తీసుకువచ్చారు. తెలంగాణ సెక్రటేరియట్లో ధరణి కమిటీ సమావేశం సుదీర్ఘంగా కొనసాగుతోంది. ధరణి వాస్తవ పరిస్థితులను కలెక్టర్లు కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. బుధవారం ధరణి కమిటీ సమావేశంలో రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్, ఖమ్మం , నిజామబాద్ జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. చదవండి: ‘కాంగ్రెస్ పార్టీకే రేవంత్ ముఖ్యమంత్రా?.. తెలంగాణకు కాదా?’ -
TS: ధరణిపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధరణిపై బుధవారం సమీక్ష నిర్వహించారు. ధరణి లోటుపాట్లపై వారం, పదిరోజుల్లో నివేదిక ఇవ్వాలని సీసీఎల్ కమిషనర్ నవీన్ మిట్టల్‌ను ఆదేశించారు. వ్యవసాయ, వ్యవసాయేతర భూముల వివరాలు నివేదికలో పొందుపరచాలన్న సీఎం.. ధరణి యాప్ భద్రతపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ధరణి లావాదేవీలపై వస్తున్న విమర్శలకు డాటా రూపంలో వివరణ ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. భూ సమగ్ర సర్వే చేయడంపై అధికారులను అడిగిన సీఎం.. భూ నిపుణుల సలహాలు తీసుకున్నారు. ఇప్పటి వరకు వచ్చిన ధరణి సమస్యలు.. వాటి పరిష్కారంపై చర్చించారు. గ్రామ సదస్సులు, రికార్డ్స్ సవరణ ఎందుకు చేయడం లేదని సీఎం ప్రశ్నించారు. కిషన్‌రెడ్డికి రేవంత్‌రెడ్డి ఫోన్ కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. తెలంగాణకు రావాల్సిన నిధులు, ఇతర అంశాలపై పరస్పర సహకారం ఉండాలని సీఎం కోరారు. త్వరలోనే కేంద్ర ప్రభుత్వ ముఖ్యులతో సమావేశం ఏర్పాటు చేసేలా చొరవ చూపాలని కిషన్ రెడ్డికి సీఎం విజ్ఞప్తి చేశారు. ఇదీ చదవండి: ప్రజా భవన్ ఇక డిప్యూటీ సీఎం భట్టి అధికారిక నివాసం -
మహిళల సమస్యలపై ‘సాహస్’ అస్త్రం
సాక్షి, హైదరాబాద్: పని ప్రదేశాల్లో మహిళా ఉద్యోగులు ఎదుర్కొనే లైంగిక వేధింపులు, ఇతర సమస్యలపై ‘సాహస్’పోర్టల్‌లో ఫిర్యాదు చేయవచ్చని మహిళా భద్రత విభాగం అధికారులు తెలిపారు. ఉద్యోగం చేసే మహిళలు ఈ పోర్టల్‌లో తమ సమస్యలు చెప్పుకునేందుకు ‘గెట్ హెల్ప్’ఆప్షన్ ఉన్నట్టు వారు వెల్లడించారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజూ ఉదయం 10–30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 7331194540 నంబర్లోనూ ఫిర్యాదు చేయవచ్చని అధికారులు సూచించారు. సాహస్ పోర్టల్‌ను ఇప్పటికే ప్రారంభించామని, మహిళల్లో అవగాహన కోసం దీనిపై మరింత ప్రచారం చేస్తున్నామని పేర్కొన్నారు. పని ప్రదేశంలో మహిళా ఉద్యోగుల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలు మొదలు.. లైంగిక వేధింపులపై ఎలా ఫిర్యా దు చేయాలి, న్యాయ సాయం ఎలా పొందాలో పోర్టల్‌లో పొందుపరిచినట్టు తెలిపారు. ఫిర్యాదులకు https:// womensafetywing. telangana. gov. in/ sahas/ లో క్లిక్‌చేసి వివరాలు పొందవచ్చని వివరించారు. -
మీ ఓటు ఉందో లేదో చెక్ చేసుకున్నారా? సందేహాలున్నాయా? చెక్ చేసుకోండిలా!
తెలంగాణ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది…పార్టీలు ప్రచారాల్లో మునిగితేలుతూంటే… ఓటరు మహాశయుడూ నవంబరు 30వ తేదీ కోసం ఎదురు చూస్తున్నాడు. తొలిసారి ఓటేస్తున్నామన్న ఉత్సాహం యువ ఓటర్లది.... నచ్చని నేతలను వదిలించుకోవాలని ఇతరులు ఎదురు చూస్తున్నారు. మరి… ఓటరు జాబితాలో మీ పేరుందో? లేదో చూసుకున్నారా? దాంట్లో తప్పులేమీ లేవు కదా? ఉంటే సరిచేసుకోవడం ఎలా అన్న అనుమానం వెంటాడుతోందా? ఏం ఫర్వాలేదు… సాక్షి.కాం మీతోనే ఉంది. ఎన్నికల సంఘం వెబ్సైట్ ద్వారా మీ ఓటరు కార్డు డౌన్లోడ్ చేసుకోవడం ఎలా? పేరెలా పరిశీలించాలి? మొబైల్‌ఫోన్‌కు ఆధార్ నెంబరును లింక్ చేసుకోవడమెలా వంటి అనేక సందేహాలకు సమాధానాలు అందిస్తోంది. ఆలస్యం ఎందుకు…. చదివేయండి. మీ సందేహాలు తీర్చుకోండి. ఇంకా ఏవైనా మిగిలిన ఉంటే ఎన్నికల కమిషన్ అధికారులతోనే మీ డౌట్స్ క్లియర్ చేసేందుకూ ప్రయత్నిస్తాం. మీరు చేయాల్సిందల్లా… మీ సందేహం/సమస్యను vote@sakshi.com ఐడీకి మెయిల్ చేయడమే!! ఓటర్ల సమాచారాన్ని ప్రజలకు మరింత దగ్గర చేసేందుకు ఎన్నికల కమిషన్ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ఓటర్లకు సంబంధించిన అన్ని సేవలను, సమాచారాన్ని ఒక దగ్గరకు చేర్చి https://voterportal.eci.gov.in ను రూపొందించింది. ఓటరుగా నమోదు చేసుకోవడం మొదలుకొని జాబితాలో పేరును చెక్ చేసుకోవడం వరకూ అన్ని సేవలూ ఇక్కడే లభిస్తాయి. జాబితాలో మీ పేరు చూసుకోండిలా… ఈ వెబ్సైట్లోకి ప్రవేశించగానే… కుడివైపున సర్వీసెస్ అన్న భాగంలో ‘సెర్చ్ ఇన్ ఎలక్టోరల్ రోల్’ అని ఒక చిన్న ట్యాబ్‌ను గమనించండి. దాన్ని క్లిక్ చేస్తే ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకునే పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీ ఇలా ఉంటుంది…. ఇందులో మూడు రకాలుగా మీ పేరును చెక్ చేసుకోవచ్చు. మొదటది మీ వివరాలను అందించడం. రెండోది మీ ఓటర్ ఐడీ సంఖ్య ద్వారా… మూడోది మొబైల్ నెంబరు ద్వారా (ఓటరు ఐడీకి మొబైల్ ఫోన్ నెంబరు అనుసంధానం చేసి ఉంటేనే) వివరాలిచ్చి ఇలా…. ఓటర్ ఐడీలో ఉన్నట్టుగానే మీ పేరును టైప్ చేయాల్సి ఉంటుంది. లేదంటే ఇంటిపేరైనా ఇవ్వవచ్చు. లేదంటే… ఓటరు ఐడీలో మీరు ఇచ్చి తల్లి/తండ్రి లేదా ఇతర బంధువు పేరు వివరాలు ఇచ్చి కూడా వెతకవచ్చు. నమోదు చేసుకున్న పుట్టినరోజు లేదా మీ వయసు వివరాలు ఇచ్చి కూడా జాబితాలో మీ పేరు ఉందో లేదో చూసుకోవచ్చు. ఇవేవీ లేకుంటే స్త్రీ, పురుషుడు లేదా థర్డ్ జెండర్ అన్న వివరాల ద్వారా కూడా తెలుసుకోవచ్చు కానీ… కొంచెం వ్యయ ప్రయాసతో కూడుకున్న పని. చివరగా.. మీ జిల్లా, మీ నియోజకవర్గం వివరాలు ఇవ్వడం ద్వారా కూడా వివరాలు తెలుసుకోవచ్చు. పేజీ చివర ఉన్న Captcha Code బాక్స్లోఉన్న అక్షరాలు లేదా అంకెలను రాసి సెర్చ్ బటన్ నొక్కితే మీ వివరాలు కనిపిస్తాయి. నోట్: పేర్లు, ఇతర వివరాలు టైప్ చేసేటప్పుడు పెద్ద, చిన్న అక్షరాలు, పదాల మధ్య ఖాళీలు సరిగా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. పేజీ పై భాగంలోనే మీ రాష్ట్రాన్ని ఎంపిక చేయడం మరచిపోవద్దు. అలాగే తెలుగుతోపాటు దాదాపు 11 భారతీయ భాషల్లో సమాచారాన్ని వెతకవచ్చునని గుర్తించండి. ఓటర్ ఐడీ ద్వారా… మీ ఓటర్ ఐడీలోని సంఖ్య ద్వారా జాబితాలో మీ పేరు చెక్ చేసుకోవడం చాలా సులువు. పైన కనిపిస్తున్న మాదిరిగా ఉంటుంది వెబ్‌సైట్‌లోని స్క్రీన్. ఒక పక్కన ఓటర్ ఐడీ సంఖ్యను ఎంటర్ చేయాలి. రెండోవైపున ఉన్న కాలమ్ నుంచి మీ రాష్ట్రాన్ని ఎంచుకోవాలి. ఆ తరువాత Captcha Code ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే సరి. మొబైల్ ఫోన్ ద్వారా… రాష్ట్రం, భాషలను ఎంచుకున్న తరువాత స్క్రీన్ మధ్యలో ఉన్న కాలమ్‌లో ఓటర్ ఐడీకి అనుసంధానమైన మొబైల్ ఫోన్ నెంబరును ఎంటర్ చేయాలి. ఎన్నికల కమిషన్ పంపే ఓటీపీని దిగువనే ఉన్న కాలమ్‌లో టైప్ చేసి Captcha Code కూడా ఎంటర్ చేయాలి. దీని తరువాత సెర్చ్ కొడితే మీ వివరాలు ప్రత్యక్షమవుతాయి. ఓటర్ ఐడీ డౌన్లోడ్ చేసుకోవాలంటే… ముందుగా https://voterportal.eci.gov.in కు వెళ్లండి. సర్వీసెస్ భాగంలో దిగువన ‘ఈ-ఎపిక్ డౌన్లోడ్’ అని ఉన్న కాలమ్పై క్లిక్ చేయండి. ఇలా ఒక స్క్రీన్ ప్రత్యక్షమవుతుంది. భారతీయ ఓటరు లేదా విదేశాల్లో ఉన్న ఓటర్లు తమకు సంబంధించిన కాలమ్స్‌పై క్లిక్ చేసి వివరాలు నమోదు చేయాలి. రిజస్టర్ చేసుకున్న మొబైల్ ఫోన్‌కు వచ్చే ఓటీపిని ఎంటర్ చేసి ఓటర్ ఐడీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఏ పోలింగ్ స్టేషన్లో ఓటు వేయాలో తెలుసుకోవాలంటే… హోమ్ పేజీలో సర్వీసెస్ భాగంలో ‘నో యువర్ పోలింగ్ స్టేషన్ అండ్ ఆఫీసర్’ అన్న కాలమ్‌ను క్లిక్ చేయండి. ఓటర్ ఐడీ సంఖ్య, Captcha Code లు ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే ఆ వివరాలు ప్రత్యక్షమవుతాయి. చివరగా… ఓటర్ ఐడీలో మీ వివరాలు మార్చుకోవాలనుకుంటే https://voterportal.eci.gov.in హోమ్ పేజీలోనే ఫామ్స్ అన్న భాగంలో అవసరమైన పత్రాలు ఉన్నాయి. వాటిని డౌన్లోడ్ చేసుకుని వివరాలు నింపి మార్పులు చేర్పులు, అభ్యంతరాలు, తొలగింపుల వంటివి చేయవచ్చు. -
చంద్రయాన్ 3 పోర్టల్ ప్రారంభం
ఢిల్లీ: చంద్రయాన్ 3 ప్రాజెక్టుపై కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. చంద్రయాన్ 3పై పోర్టల్‌ను నేడు ప్రారంభించనుంది. కోర్సులను కూడా ప్రవేశపెట్టనున్నట్లు స్పష్టం చేసింది. చంద్రయాన్‌పై ప్రత్యేక కోర్సు మాడ్యూళ్లను ప్రారంభించినట్లు పేర్కొంది.'అప్నా చంద్రయాన్' వెబ్సైట్ ను కూడా అందుబాటులోకి తీసుకురానుంది. పోర్టల్‌ను ప్రోత్సహించాలని ఉన్నత విద్యా సంస్థలను కోరింది. విద్యార్థులు, ఉపాధ్యాయులలో అవగాహన కల్పించి ప్రచారం చేయాలని తెలిపింది. విద్యార్థులందరినీ ఈ ప్రత్యేక కోర్సుల్లో చేరేలా ప్రోత్సహించాలని కోరింది. చంద్రయాన్-3 మహా క్విజ్‌కు రిజిస్ట్రేషన్ ప్రక్రియను నిర్వహించాలని యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ విద్యా సంస్థలను కోరింది. చంద్రయాన్-3 మిషన్, అంతరిక్ష శాస్త్రం గురించి విద్యార్థుల జ్ఞానాన్ని పరీక్షించేందుకు వీలుగా క్విజ్ నిర్వహించనున్నారు. అంతరిక్ష కార్యక్రమాలపై తెలుసుకోవడానికి విద్యార్థులను ప్రోత్సహించడం ఈ క్విజ్ ప్రధాన లక్ష్యం. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో అక్టోబర్ 31, 2023 వరకు నమోదు చేసుకోవచ్చు. ఇదీ చదవండి: స్వలింగ జంటల వివాహంపై సుప్రీంకోర్టు తీర్పు -
కౌలు రైతులకు తీపికబురు
సాక్షి, అమరావతి: కౌలు రైతులకు మరింత అండగా నిలవాలని ప్రభుత్వం సంకల్పించింది. గడచిన నాలుగేళ్ల కంటే మిన్నగా ఈ ఏడాది పంట హక్కు సాగు పత్రాలు (కౌలు కార్డులు) జారీ చేసిన ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి పంట రుణాలు మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్ధేశించుకుంది. ఇందుకోసం తొలిసారిగా సీసీఎల్ఏ వెబ్‌ల్యాండ్ పోర్టల్‌తో సీసీఆర్సీ వెబ్‌పోర్టల్‌ను అనుసంధానించింది. ఫలితంగా బ్యాంక్ లోన్చార్జ్ మాడ్యూల్లో భూ యజమానులతోపాటు కౌలుదారుల వివరాలను సైతం బ్యాంకర్లు ఖరారు చేసుకుని సాధ్యమైనంత ఎక్కువ మంది కౌలుదారులకు పంట రుణాలు మంజూరు చేసే అవకాశం కల్పించింది. సాధారణంగా సీసీఎల్ఏ వెబ్‌ల్యాండ్ పోర్టల్ బ్యాంకుల లోన్చార్జ్ మాడ్యూల్లో అనుసంధానమై ఉంటుంది. లోన్‌చార్జి మాడ్యూల్లో సర్వే నంబర్ లేదా ఆధార్ నంబర్ నమోదు చేయగానే భూ యజమానుల పేర్లు మాత్రమే కన్పించేవి. దీంతో కౌలుదారులకు రుణాల మంజూరు చేసేందుకు బ్యాంకర్లు ఏదో సాకుతో వెనుకడుగు వేస్తుండేవారు. రబీ సీజన్లో మరింత ఎక్కువ మంది కౌలుదారులకు రుణాలు మంజూరు చేయడమే లక్ష్యంతో సీసీఎల్ఏ వెబ్‌ల్యాండ్ పోర్టల్‌ను సీసీఆర్సీ వెబ్ పోర్టల్‌తో ప్రభుత్వం అనుసంధానించింది. లోన్చార్జ్ మాడ్యూల్తో సీసీఎల్ఎ వెబ్‌ల్యాంబ్ పోర్టల్ అనుసంధానించి ఉండడంతో ఆటోమేటిక్‌గా లోన్‌చార్జి మాడ్యుల్లో భూ యజమానుల వివరాలతో పాటు కౌలుదారుల వివరాలు కూడా బ్యాంకర్లకు కనిపిస్తాయి. భూ యజమానులను ఒప్పించి.. భూ యజమానుల వివరాలతో పాటు కౌలు రైతుల వివరాలను ఖరారు చేసుకుని బ్యాంకర్లు వారికి రుణాలు మంజూరు చేస్తారు. ఒకవేళ కౌలుకు ఇచ్చిన భూమిపై భూ యజమాని కనుక పంట రుణం తీసుకుని ఉంటే కౌలుదారులకు పంట రుణం మంజూరు చేయరు. అయితే, సాగు చేయకపోయినప్పటికీ వరుసగా రెండు సీజన్లలో భూ యజమాని కనుక పంట రుణం పొంది ఉంటే, అటువంటి వారిని గుర్తించి ఆర్బీకే స్థాయిలో అవగాహన కల్పిస్తారు. తమ భూమి కౌలుకు తీసుకున్న వాస్తవ సాగుదారులకు చేయూతనిచ్చేలా సహకరించాలని సూచిస్తారు. ఫలితంగా భూ యజమానుల స్థానంలో కౌలుదారులు పంట రుణాలు పొందే అవకాశం ఏర్పడుతుంది. నాలుగేళ్లలో రూ.6,906 కోట్ల పంట రుణాలు.. రాష్ట్రంలో 16 లక్షల మంది కౌలుదారులు ఉంటారని అంచనా. వీరికి ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.1.60 లక్షల వరకు పంట రుణం అందించే అవకాశం ఉన్నా.. ఆంక్షల పేరిట బ్యాంకులు మోకాలడ్డేవి. ప్రస్తుతం ఏటా 11 నెలల కాల పరిమితితో జారీ చేస్తున్న కౌలు కార్డుల ఆధారంగా పంట రుణాలతో పాటు సంక్షేమ ఫలాలు అందిస్తోంది. నాలుగేళ్లలో 17.61 లక్షల మందికి సీసీఆర్సీలు జారీ చేయగా.. వీరిలో 9.83 లక్షల మందికి రూ.6,905.76 కోట్ల పంట రుణాలు మంజూరు చేశారు. 2023–24 సీజన్లో 8.89 లక్షల మంది కౌలుదారులకు సీసీఆర్సీల జారీ లక్ష్యం కాగా.. ఇప్పటికే 8.19 లక్షల మందికి సీసీఆర్సీలు జారీ చేశారు. వీరికి కనీసం రూ.4 వేల కోట్ల పంట రుణాలు మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్ధేశించుకున్నారు. ఇప్పటికే 3.33 లక్షల మందికి రూ.1,085.42 కోట్ల పంట రుణాలు మంజూరు చేశారు. నూరు శాతం రుణాలు మంజూరే లక్ష్యం మరింత ఎక్కువ మంది కౌలుదారులకు పంట రుణాలు మంజూరు చేయడమే లక్ష్యంగా సీïసీఎల్ఏ వెబ్‌ల్యాండ్ పోర్టల్‌తో సీసీఆర్సీ పోర్టల్‌ను అనుసంధానం చేశాం. ఫలితంగా కౌలుదారులకు రుణాల మంజూరు విషయంలో బ్యాంకర్లకు మరింత వెసులుబాటు కలుగుతుంది. జేఎల్‌జీ గ్రూపులతో పాటు వ్యక్తిగతంగా కూడా కౌలుదారులు పంట రుణాలు మంజూరు చేయడమే లక్ష్యంగా ఈ మార్పు చేశాం. – చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ -
తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలు: ఈ విషయాలు మీకు తెలుసా?
మీకు తెలుసా? ►1952 ఎన్నికల సమయంలో తెలంగాణతో పాటు, కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన కొన్ని జిల్లాలతో కలసి హైదరాబాద్ రాష్ట్రం ఉండేది. అప్పుడు ఈ రాష్ట్రానికి జరిగిన ఎన్నికలలో తెలంగాణ వరకు చూస్తే కాంగ్రెస్‌కు 38 సీట్లు, పీడీఎఫ్ 36, సోషలిస్ట్ పార్టీకి 11, షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్‌కు మూడు సీట్లు రాగా ఇండిపెండెంట్లు ఏడుగురు గెలిచారు. అప్పట్లో తెలంగాణలో కమ్యూనిస్టు పార్టీపై నిషేధం ఉండేది. కాని ఆ పార్టీ వారంతా పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్ పేరుతో ఎన్నికలలో పోటీచేశారు. అప్పట్లో సోషలిస్టు పార్టీ కూడా కాస్త బలంగానే ఉండేది. ► 1956లో ఆంధ్ర, తెలంగాణ విలీనం అయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినా, 1957లో మాత్రం తెలంగాణ భాగానికే ఎన్నికలు జరిగాయి. దానికి కారణం 1955లో ఆంధ్ర రాష్ట్రానికి మధ్యంతర ఎన్నికలు జరగడమే. ఆంధ్రలో ఎన్నికైన ఎమ్మెల్యేలకు 1962 వరకు పదవిలో ఉండే అవకాశాన్ని పార్లమెంటు కలి్పంచింది. తెలంగాణలో 1957లో రెగ్యులర్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ 68, పీడీఎఫ్ 22, సోషలిస్టు 2, ప్రజాపార్టీ ఒకటి, ఎస్.సి.ఎఫ్ ఒకటి గెలుచుకోగా, ఇండిపెండెంట్లు పది మంది గెలిచారు. తొలి ఎన్నికల్లోనే రెండు సభలకు ఎన్నిక సాక్షి, యాదాద్రి: తెలంగాణ సాయుధ పోరాట సేనాని రావి నారాయణరెడ్డి 1952లో జరిగిన తొలి సాధారణ ఎన్నికల్లో పీడీఎఫ్ పార్టీ తరఫున పోటీచేసి భువనగిరి ఎమ్మెల్యేగా, నల్లగొండ ఎంపీగా విజయం సాధించారు. పార్లమెంట్ సభ్యునిగా రావినారాయణరెడ్డి అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కంటే అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిచారు. భువనగిరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా కొనసాగారు. రావి నారాయణరెడ్డి స్వగ్రామం బొల్లేపల్లి. ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలో ఉంది. రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల తీరే వేరు. వారి రూటే సెపరేటు. అధికారంలోకి వస్తామన్న ధీమానో...కేంద్రంలో అధికారంలోకి వచ్చేది లేదనే బెంగనో కానీ, కాంగ్రెస్ ఎంపీలు, మాజీ ఎంపీలంతా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి తెగ ఉబలాటపడిపోతున్నారు. ఆఖరుకు కుమారుడి కంటే తనకే టికెట్ ముఖ్యమని, అన్ని కలిసి వస్తే మంత్రి పదవి దక్కుతుందని నగరానికి చెందిన ఓ మాజీ ఎంపీ భావిస్తూ, ఆ దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొందరు ఎంపీలేమో ఏకంగా సీఎం సీటునే ఆశిస్తున్నారు. బీజేపీకి పూర్తి భిన్నంగా కాంగ్రెస్ వైఖరి ఉందనే మాట వినిపిస్తోంది. కాంగ్రెస్‌లో అందరూ పెద్దనాయకులే.. అందరూ సీఎం పదవికి పోటీదారులే. అందుకే వారంతా ఎప్పుడో మరో ఐదారు నెలలకు వచ్చే పార్లమెంట్ ఎన్నికల కంటే కూడా గడప ముందున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకే సిద్ధమైపోతున్నారు. అన్ని బాగుండి అధికారంలోకి వస్తే... సరేసరి. ఒకవేళ ఓడిపోయినా.. తిరిగి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఎలాగూ ఉంటుందన్న ధీమా కాంగ్రెస్ నాయకుల్లో ఎక్కువ అన్న ప్రచారమూ ఉంది. ఇప్పుడున్న ముగ్గురు ఎంపీల్లో ఇద్దరు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా.. తిరిగి పార్లమెంట్‌కు ఎన్నికై కాంగ్రెస్ వాణిని, రాష్ట్ర సమస్యలను గట్టిగానే వినిపించారన్న పేరు ఉంది. ఆన్‌లైన్‌లోనూ నామినేషన్ ఈసారి కొత్తగా ఎన్నికల సంఘం అవకాశం కరీంనగర్ అర్బన్: నామినేషన్‌కు సాంకేతికతను జోడించింది ఎన్నికల సంఘం. శాసనసభ ఎన్నికల్లో అభ్యర్థులు ఇంట్లో నుంచే నామినేషన్ వేసేలా ఆన్లైన్లో వెసులుబాటు కల్పించింది. దీంతో అభ్యర్థులు స్వదేశం, విదేశం ఎక్కడి నుంచైనా నామినేషన్ దాఖలు చేయొచ్చన్న మాట. SUVIDHA.ECI.GOV.IN యాప్ ద్వారా నామినేషన్ దాఖలు చేసే అవకాశం కల్పించారు. నిర్దిష్ట విధానంలో సాధారణ నామినేషన్ తరహాలోనే ఎన్నికల కమిషన్ సూచించిన పత్రాలను ఆన్లైన్లో పొందుపరచాల్సి ఉంది. దరఖాస్తు ఫారంలో దశలవారీగా అభ్యర్థుల వివరాలు పొందుపరచాలి. వివరాలన్నింటినీ సమర్పించిన తరువాత నామినేషన్ దాఖలు చేసేందుకు ఉన్న నిర్ణీత సమయంలో స్లాట్‌లో సమయాలను బుక్ చేసుకోవాలి. రిటర్నింగ్ అధికారిని నేరుగా కలిసి ఆన్లైన్లో దరఖాస్తు చేసిన వివరాలతో కూడిన పత్రాలు మూడుసెట్లు అందించాల్సి ఉంటుంది. నామినేషన్ చివరి రోజు లోపుగా ఆన్లైన్ సెట్లను తప్పనిసరిగా అందించాలి. రిటర్నింగ్ అధికారికి నేరుగా అందిస్తేనే నామినేషన్ దాఖలు చేసినట్లుగా భావిస్తారు. ఆ తరువాత నామినేషన్ల పరిశీలన, గుర్తుల కేటాయింపు వంటి విషయంలో నేరుగా అభ్యర్థులు లేక వారి తరఫు ప్రతినిధులు హాజరు కావాల్సి ఉంటుంది. -
అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు తెలుసుకోవడానికి కొత్త పోర్టల్ - ఇది చాలా సింపుల్
ముంబై: బ్యాంకుల్లో డిపాజిట్లు చేసి, గడువు ముగిసినప్పటికీ, వెనక్కి తీసుకోని వాటి (అన్ క్లెయిమ్డ్ డిపాజిట్లు) వివరాలను తెలుసుకునే ఉద్గమ్(యూడీజీఏఎం) పోర్టల్‌పైకి 30 బ్యాంక్‌లు చేరాయి. ఈ వివరాలను ఆర్బీఐ గురువారం ప్రకటించింది. ఈ పోర్టల్ సాయంతో తమ, తమవారి అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల వివరాలను ఏ బ్యాంకుల్లో ఉన్నదీ తెలుసుకోవచ్చు. ఆగస్ట్ 17 నుంచి ఈ పోర్టల్‌ను ఆర్బీఐ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆరంభంలో ఏడు బ్యాంక్‌లకు సంబంధించిన వివరాలే ఈ పోర్టల్‌పై అందుబాటులో ఉన్నాయి. సెప్టెంబర్ 28 నాటికి 30 బ్యాంక్‌లకు సంబంధించిన డిపాజిట్ల వివరాలు తెలుసుకునే విధంగా అప్‌గ్రేడ్ చేసినట్టు ఆర్బీఐ ప్రకటించింది. అన్క్లెయిమ్డ్ డిపాజిట్లలో 90 శాతం ఈ 30 బ్యాంక్‌ల కస్టమర్లకు చెందినవి కాగా, ప్రస్తుతం ఆ డిపాజిట్లు డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్ (డీఈఏ) రూపంలో ఉండడం గమనార్హం. అన్ని ప్రముఖ బ్యాంక్‌లు ఈ పోర్టల్‌తో అనుసంధానమయ్యాయి. 2023 ఫిబ్రవరి నాటికి ఎలాంటి క్లెయిమ్ రాని రూ.35,000 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. ఇందులో అత్యధికంగా ఎస్బీఐ కస్టమర్లకు చెందినవే రూ.8,086 కోట్లు ఉన్నాయి. ఆ తర్వాత పీఎన్బీ నుంచి రూ.5,340 కోట్లు, కెనరా బ్యాంక్ నుంచి రూ.4,558 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రూ.3,904 కోట్ల చొప్పున ఉన్నాయి. నిబంధనల కింద గడువు తీరి పదేళ్లు అయినా క్లెయిమ్ రాని డిపాజిట్లను, బ్యాంక్‌లు డీఈఏకి బదిలీ చేయాల్సి ఉంటుంది. -
రోజుకు 5,500 రిజిస్ట్రేషన్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రోజుకు సగటున 5,500 వరకు రిజిస్ట్రేషన్ లావాదేవీలు జరుగుతున్నాయి. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా జరిగే వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్లతో పాటు ధరణి పోర్టల్ ద్వారా నిర్వహించే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు కలిపి ఈ ఆర్థిక సంవత్సంలో ఇప్పటివరకు (ఏప్రిల్ 1 నుంచి సెపె్టంబర్ 20 వరకు) 9.5లక్షల వరకు లావాదేవీలు జరిగినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇందులో వ్యవసాయేతర లావాదేవీలు 5.26లక్షల పైచిలుకు కాగా, వ్యవసాయ భూముల లావాదేవీలు 4.23లక్షలు కావడం గమనార్హం. ఈ లావాదేవీలపై గత ఐదు నెలల (ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు) కాలంలో రూ.7 వేల కోట్లు ఖజానాకు సమకూరింది. ఇందులో వ్యవసాయేర లావాదేవీల ద్వారా రూ.5000 కోట్ల వరకు రాగా, ధరణి పోర్టల్ ద్వారా రూ.1700 కోట్ల వరకు వచ్చి ఉంటుందని, ఇక సొసైటీలు, మ్యారేజీ రిజిస్ట్రేషన్లు, ఈసీ సర్టిఫికెట్లు తదితర లావాదేవీలు కలిపి ఆ మొత్తం రూ.7వేల కోటుŠల్ దాటి ఉంటుందని అధికారులు చెపుతున్నారు. రంగారెడ్డి జిల్లా నుంచే రూ.1,703 కోట్ల ఆదాయం ఇక, జిల్లాల వారీ రిజిస్ట్రేషన్ల విషయానికి వస్తే రాష్ట్రంలోని 12 రిజిస్ట్రేషన్ జిల్లాల్లో వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్లు ఎక్కువగా రంగారెడ్డి జిల్లాలోనే జరుగుతున్నాయి. ఈ జిల్లా రిజిస్ట్రేర్ పరిధిలో ఆగస్టు నాటికి 1.07లక్షల డాక్యుమెంట్ల లావాదేవీలు జరిగాయి. తద్వారా ప్రభుత్వానికి రూ.1,703 కోట్ల వరకు ఆదాయం వచ్చింది. వెయ్యి కోట్ల రూపాయల ఆదాయం దాటిన జిల్లాల్లో మేడ్చల్ కూడా ఉంది. ఇక్కడ 70వేలకు పైగా లావాదేవీలు జరగ్గా రూ.1,100 కోట్ల వరకు ఆదాయం వచ్చి ఉంటుందని అంచనా. ఇక, రాష్ట్రంలో అతి తక్కువగా హైదరాబాద్–1 పరిధిలో లావాదేవీలు జరిగాయి. ఇక్కడ గత ఐదు నెలల్లో 9,148 లావాదేవీలు మాత్రమే జరిగాయి. కానీ ఆదాయం మాత్రం రూ. 185 కోట్ల వరకు వచ్చింది. అదే వరంగల్ జిల్లా రిజిస్ట్రేర్ కార్యాలయ పరిధిలో 40వేలకు పైగా లావాదేవీలు జరిగినా వచ్చింది అంతే రూ.188 కోట్లు కావడం గమనార్హం. అంటే హైదరాబాద్–1 పరిధిలో ఒక్కో లావాదేవీ ద్వారా సగటు ఆదాయం రూ. 2.02 లక్షలు వస్తే, వరంగల్ జిల్లాలో మాత్రం రూ.40 వేలు మాత్రమే వచ్చిందని అర్థమవుతోంది. బంజారాహిల్స్ టాప్..ఆదిలాబాద్ లాస్ట్ అన్ని జిల్లాల కంటే ఎక్కువగా సగటు డాక్యుమెంట్ ఆదాయం బంజారాహిల్స్ (హైదరాబాద్–2) జిల్లా పరిధిలో నమోదవుతోంది. ఖరీదైన ప్రాంతంగా పేరొందిన బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగే లావాదేవీల ద్వారా ఒక్కో డాక్యుమెంట్‌కు సగటున రూ.2.3లక్షలు ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 31 వరకు ఇక్కడ 16,707 లావాదేవీలు జరిగాయని, తద్వారా రూ. 396.56 కోట్ల ఆదాయం వచ్చిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇక, డాక్యుమెంట్ సగటు ఆదాయం అతితక్కువగా ఆదిలాబాద్ జిల్లాలో వస్తోంది. ఇక్కడ సగటున ఒక్కో డాక్యుమెంట్‌కు రూ.23వేలకు కొంచెం అటూ ఇటుగా ఆదాయం వస్తోంది. డాక్యుమెంట్ల వారీగా పరిశీలిస్తే రంగారెడ్డి ప్రథమ స్థానంలో ఉండగా, ఖమ్మం చివరి స్థానంలో ఉంది. ఖమ్మం జిల్లా రిజిస్ట్రేర్ కార్యాలయ పరిధిలో గత ఐదు నెలల కాలంలో కేవలం 20వేల పైచిలుకు మాత్రమే రిజిస్ట్రేషన్లు జరగడం గమనార్హం. -
ఆన్లైన్ చదువులయోగం.. ‘స్వయం’ వేదికగా ఆన్లైన్ కోర్సులు
సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్, ఫార్మసీ, మేనేజ్మెంట్ తదితర కోర్సుల మంజూరు, పర్యవేక్షణ, నియంత్రణ సంస్థ అయిన అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) తాజాగా భారతీయ ప్రాచీన విద్య అయిన యోగాపై కూడా దృష్టి సారించింది. ఇందులో భాగంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో యోగాను ప్రోత్సహించే దిశగా చర్యలు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వ చర్యలతో యోగాకు అంతర్జాతీయంగా ఇప్పటికే ఎంతో గుర్తింపు వచ్చిన నేపథ్యంలో దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేలా ఏఐసీటీఈ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ప్రొఫెషనల్ కోర్సులకు శ్రీకారం చుట్టింది. ఆన్లైన్ వేదికగా ఈ కోర్సులను విద్యార్థులకు అందుబాటులోకి తెస్తోంది. కేంద్రం ఏర్పాటు చేసిన ‘స్వయం’ పోర్టల్ ద్వారా ఈ ఆన్లైన్ కోర్సును ప్రవేశపెట్టింది. ఈ కోర్సును అభ్యసించే వారికి క్రెడిట్లను కూడా అందించనుంది. వీటి ద్వారా విద్యార్థులకు భవిష్యత్తులో అదనపు ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఈ అంశాల్లోనూ క్రెడిట్ కోర్సులు.. యోగాతోపాటు విద్యార్థులకు ఉపయోగపడేలా మేధో హక్కులు, బేసిక్ రిమోట్ సెన్సింగ్, భౌగోళిక సమాచార వ్యవస్థ, గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ వంటి అంశాల్లో కూడా క్రెడిట్ కోర్సులను ప్రారంభించింది. కేంద్ర ఆవిష్కరణల విద్యా విభాగం, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), వివేకానంద యోగా అనుసంధాన సంస్థలు ఈ కోర్సులకు రూపకల్పన చేశాయి. యోగాను ప్రొఫెషనల్‌గా నిర్వహించే వారికి ఈ సర్టిఫికెట్ కోర్సుల వల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. రిమోట్ సెన్సింగ్, భూ పరిశీలన సెన్సార్స్, థర్మల్ రిమోట్ సెన్సింగ్, స్పెక్టరల్ సిగ్నేచర్స్, హైపర్ స్పెక్టరల్ రిమోట్ సెన్సింగ్ తదితర అంశాలపై విద్యార్థులకు ఈ కోర్సుల ద్వారా పరిజ్ఞానం అలవడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా ఆ సర్టిఫికెట్ల ద్వారా వారికి అదనపు ప్రయోజనం చేకూరుతుందని చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన పాఠ్యాంశాలను 12 ప్రాంతీయ భాషల్లోనూ ఏఐసీటీఈ అనువాదం చేయిస్తోంది. అంతేకాకుండా ఆయా మాధ్యమాల్లోనూ ఈ కోర్సులను అందుబాటులోకి తెస్తోంది. ఇప్పటికే తెలుగులో ఇంజనీరింగ్ పుస్తకాలు.. కాగా 12 ప్రాంతీయ భాషల్లో ఇంజనీరింగ్ కోర్సులను అందించేలా ఇప్పటికే ఆయా సంస్థలకు ఏఐసీటీఈ అనుమతులు మంజూరు చేస్తోంది. ఆయా భాషలకు విద్యార్థుల డిమాండ్‌ను అనుసరించి.. ప్రాధాన్యత క్రమంలో వీటిని అందుబాటులోకి తెస్తోంది. ఈ క్రమంలో 218 సబ్జెక్టుల్లోని పాఠ్యాంశాల అనువాదాన్ని ఏఐసీటీఈ చేపట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే తెలుగు, కన్నడం, ఒడియా, గుజరాతీ, మరాఠీ తదితర భాషల్లో ఇంజనీరింగ్ పుస్తకాలను విడుదల చేసింది. విద్యార్థులు తమ మాతృభాషల్లో ఆయా భావనలను అర్థం చేసుకుంటే.. వారు వాటిని బాగా గుర్తుంచుకుని అన్వయించే అవకాశముంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటివరకు చాలామంది విద్యార్థులకు సమాధానం తెలిసినప్పటికీ.. ఇంగ్లిష్ పరిజ్ఞానం లేకపోవడం వల్ల పరీక్షలు రాయలేకపోయేవారని అంటున్నారు. ప్రాంతీయ భాషా పాఠ్యపుస్తకాల వల్ల వారికి ఈ ఇబ్బంది తొలుగుతుందని అభిప్రాయపడుతున్నారు. -
'వాణిజ్య భవన్'ను ప్రారంభించిన ప్రధాని మోదీ!
మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ విభాగానికి చెందిన 'వాణిజ్య భవన్'ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. (ఎన్‌ఐఆర్‌వైఏటీ) నేషనల్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ రికార్డ్ ఫర్ ఇయర్లీ అనాలసిస్ ఆఫ్ ట్రేడ్ పోర్టల్‌ని లాంచ్ చేశారు. ఈ పోర్టల్ స్టేక్ హోల్డర్లకు ఒక వేదికలా ఉపయోగ పడుతుందని ఈ సందర్భంగా ప్రధాని మోదీ తెలిపారు. ఈ సందర్భంగా మోదీ చేసిన ప్రసంగం ఇలా ఉంది. ♦వాణిజ్య భవన్,ఎన్‌ఐఆర్‌వైఏటీ పోర్టల్‌తో ఆత్మనిర్భర్ భారత్ ఆకాంక్షలు నెరవేరుతాయి.వాణిజ్య-వ్యాపార సంబంధాలతో పాటు చిన్న, మధ్యతరహా (ఎంఎస్ఎంఈ) పరిశ్రమలకు సానుకూల ఫలితాలు పొందవచ్చని ఈ సందర్భంగా ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ♦వాణిజ్య భవన్‌తో వ్యాపార-వాణిజ్య రంగాలకు చెందిన వారితో పాటు ఎంఎస్ఎంఈలకు లబ్ధి చేకూరుతుంది. ♦గతేడాది ప్రపంచ వ్యాప్తంగా అనేక ఆటంకాలు ఎదురయ్యాయి. అదే సమయంలో భారత్ 670 బిలియన్ల(భారత కరెన్సీలో రూ.50లక్షల కోట్లు) ఎగుమతులు చేసింది. ♦దేశ ప్రగతికి ఎగుమతులు కీలకం. 'వోకల్ ఫర్ లోకల్' వంటి కార్యక్రమాలు దేశ ఎగుమతులను వేగవంతం చేసేందుకు దోహద పడ్డాయని మోదీ తెలిపారు. ♦గతేడాది దేశం ప్రతి సవాలును ఎదుర్కొన్నప్పటికీ ఎగుమతుల విషయంలో భారత్ 400 బిలియన్ల పరిమితిని దాటాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ మనం అనూహ్యంగా 418 బిలియన్ డాలర్లు అంటే 31 లక్షల కోట్ల రూపాయల ఎగుమతితో సరికొత్త రికార్డ్‌ను సృష్టించాం. ♦ఈరోజు ప్రతి మంత్రిత్వ శాఖ, ప్రభుత్వంలోని ప్రతి విభాగం 'పూర్తి ప్రభుత్వ' విధానంతో ఎగుమతులను పెంచడానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి." ఎంఎస్ఎంఈ, మంత్రిత్వ శాఖ లేదా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, వ్యవసాయం,వాణిజ్య మంత్రిత్వ శాఖ..ఇలా అందరూ ఉమ్మడి లక్ష్యం కోసం కలిసి కట్టుగా ప్రయత్నాలు చేస్తున్నారంటూ ప్రధాని మోదీ ఈ సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
టెక్నాలజీ దుర్వినియోగం కానివ్వొద్దు: నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: టెక్నాలజీలు దుర్వినియోగం కాకుండా చూసేందుకు డిజిటైజేషన్‌ను అర్థం చేసుకోవడంలో మరింత ముందు ఉండాలని నియంత్రణ సంస్థలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. ఈ దశాబ్దంలో డిజిటల్ విధానాల వినియోగం గణనీయంగా పెరగనుందని, డిజిటైజేషన్‌పరంగా తగు రక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని ఆమె పేర్కొన్నారు. కార్పొరేట్ వ్యవహారాల శాఖ నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ (ఏకేఏఎం) ఐకానిక్ డే వేడుకలను ప్రారంభించిన సందర్భంగా నిర్మలా సీతారామన్ ఈ విషయాలు తెలిపారు. మార్కెట్లపై డిజిటైజేషన్ ప్రభావం గణనీయంగా ఉంటోందని ఆమె పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నిబంధనలు ఎక్కడ దుర్వినియోగ మవుతున్నాయి, ఎక్కడ సడలించాలి, ఎక్కడ కఠినతరం చేయాలి అనే అంశాలపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ), నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ (ఎన్ఎఫ్ఆర్ఏ) తదితర నియంత్రణ సంస్థలు దృష్టి పెట్టాలని నిర్మలా సీతారామన్ సూచించారు. కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రావ్ ఇందర్జిత్ సింగ్, కార్యదర్శి రాజేశ్ వర్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పారదర్శక విధానాలు ఉండాలి.. సమాజాన్ని అన్ని కోణాల్లోనూ ప్రభావితం చేసే డిజిటైజేషన్‌కు సంబంధించిన విధానాలు సముచితంగా, జవాబుదారీతనంతో, పారదర్శకంగా ఉండాలని నిర్మలా సీతారామన్ చెప్పారు. డిజిటైజేషన్‌తో నియంత్రణ సంస్థలు, ఇతరత్రా సంస్థలు ప్రయోజనం పొందాలన్నారు. అదే సమయంలో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు, డిజిటల్ ప్రపంచాన్ని సురక్షితంగా ఉంచేందుకు నిపుణులు నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి పేర్కొన్నారు. మార్కెట్లకు రిటైల్ ఇన్వెస్టర్ల దన్ను.. తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యే స్టాక్ మార్కెట్లలో రిటైల్ ఇన్వెస్టర్లు షాక్ అబ్జర్బర్లుగా ఉంటున్నారని నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలకు దిగినా మార్కెట్లు పతనం కాకుండా దన్నుగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి సమయంలో రిటైల్ ఇన్వెస్టర్ల సంక్య గణనీయంగా పెరిగిందని ఆమె తెలిపారు. మార్చి నెల గణాంకాల ప్రకారం సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ (ఇండియా) దగ్గర యాక్టివ్‌గా ఉన్న డీమ్యాట్ ఖాతాల సంఖ్య ఆరు కోట్లకు పెరిగింది. ఎస్ఎన్ఏతో పారదర్శక పాలన.. కార్యక్రమంలో భాగంగా నేషనల్ సీఎస్ఆర్ ఎక్సే్చంజ్ పోర్టల్‌ను, ఇన్వెస్టర్లకు అవగాహన కల్పించడంపై స్మారక పోస్టల్ స్టాంపును ఆవిష్కరించారు. రాష్ట్రాలకు నిధుల బదలాయింపు, వాటి వినియోగాన్ని ట్రాక్ చేసేందుకు ఉపయోగపడే సింగిల్ నోడల్ ఏజెన్సీ (ఎస్ఎన్ఏ) డ్యాష్‌బోర్డును సీతారామన్ ఆవిష్కరించారు. దీనితో పాలన మరింత పారదర్శకంగా మారగలదని, రాష్ట్రాలకు కేంద్రం పంపే ప్రతీ రూపాయికి లెక్క ఉంటుందన్నారు. కేంద్ర పథకాల ద్వారా రాష్ట్రాలకు రూ. 4.46 లక్షల కోట్లు బదిలీ అవుతుంటాయని మంత్రి చెప్పారు. 75 ఏళ్లు పైబడిన వారికి క్లెయిమ్‌ల విషయంలో తోడ్పాటు కోసం ఐఈపీఎఫ్ఏ ప్రత్యేక విండో ప్రారంభించింది. Smt @nsitharaman launches National CSR Exchange Portal during Iconic Day celebrations of @MCA21India under the #AzadiKaAmritMahotsav. The portal is a digital initiative on CSR enabling stakeholders to list, search, interact, engage & manage their CSR projects on voluntary basis. pic.twitter.com/B6Pf495Py4 — NSitharamanOffice (@nsitharamanoffc) June 7, 2022 -
ఉప సంఘమైనా పరిష్కరిస్తుందా!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్ ఏర్పాటు చేసి రైతుల సమస్యలు 94 శాతం పరిష్కరించినట్లు ప్రకటించింది. వాస్తవానికి రెవెన్యూ సమస్యల పరిష్కారానికి వేల మంది రైతులు కోర్టుల చుట్టూ, తహసీల్ కార్యాలయాల చుట్టూ ప్రతి రోజు తిరుగుతూనే ఉన్నారు. తమ సమస్య పరిష్కారం కాకపోతే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రెవెన్యూ కోర్టులలో ఉన్న 16,130 కేసులు ట్రిబ్యునల్స్ పరిష్కరిస్తాయని ప్రభుత్వం చేసిన ప్రకటన కాగితాలకే పరిమితం అయ్యింది. ఈ కేసులన్నీ తిరిగి సివిల్ కోర్టులకు వెళ్ళాయి. 6,18,360 సాదాబైనామాలు పరిష్కారానికి నోచుకోలేదు. నిజాం కాలం నుండి తెలంగాణలో తెల్లకాగితాలపై క్రయ, విక్రయాలు జరుగుతున్నాయి. పాస్‌బుక్కులలో 2,65,653 తప్పిదాలు ఉన్నట్లు ప్రభుత్వమే చెప్పింది. పాసుబుక్కులో ‘చనిపోయిన వారిపేర్లు ఉండడం, ఆధార్ తప్పుగా నమోదు, ఫొటోలు తప్పుగా పెట్టడం, తండ్రి పేరు, పట్టాదార్ పేరు తప్పుగా రాయడం, భూ విస్తీర్ణం ఎక్కువ, తక్కువ రాయడం, సర్వే నెంబర్ తప్పుగా రాయడం, అసైన్డ్ భూములు మార్పు చేయడం, అటవీశాఖ వివాదాస్పద భూములు రాయడం, రెండు ఖాతాలు రాయడం’’ తదితర తప్పులు ఉన్నట్లు ప్రభుత్వమే చెబుతున్నది. ఈ పొరపాట్లపై ప్రజలలో పెరిగిన అసంతృప్తిని గమనించి ఇంత కాలం తర్వాత ధరణి పోర్టల్‌పై సలహాలు ఇవ్వడానికి ముఖ్యమంత్రి ఉప సంఘాన్ని వేశారు. టీ. హరీశ్‌రావు, వి. ప్రశాంత్ రెడ్డి, టి. శ్రీనివాస్ గౌడ్, జి. జగదీశ్వర్‌రెడ్డి, ఎస్. నిరంజన్ రెడ్డి, పి. సబితా ఇంద్రారెడ్డితో కూడిన ఈ కమిటీ సమస్యకు పరిష్కారం చూపుతుందా! తహసీల్దార్ మొదలు కలెక్టర్ వరకు రెవెన్యూ సమస్యలను పరిష్కరించడానికి సుముఖతగా లేరు. ప్రభుత్వ విధానాలు అమ లుజరపటానికి చట్టాలు మార్చాలని సలహాలు ఇస్తున్నారు. పాసుబుక్కుల చట్టం 1971 సెక్షన్ 26ను పూర్తిగా రద్దు చేసి సవరణ పెట్టారు. ఆ సవరణ ప్రకారం సాగు కాలం తొలగిం చడంతో రెవెన్యూ రికార్డులలో భూములు అమ్ముకున్నవారే తిరిగి పట్టాదారులయ్యారు. మ్యుటేషన్ జరగకపోవడంతో కొనుగోలు చేసిన వారు హక్కులు కోల్పోయారు. జాగీర్దారుల భూములు ప్రభుత్వాలకే చెందుతాయని సవరణ చట్టం చెప్పింది. వారసత్వ భూములు చార్జీలు చెల్లించి మ్యుటేషన్ చేయించుకోవాలని చట్టసవరణ చేశారు. తగాదా భూములను, కోర్టు కేసులలో ఉన్నవాటిని పార్ట్ బీలో చేర్చారు. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ‘నిషేధ పుస్తకం సెక్షన్ 22ఎ పేరుతో’ పెట్టారు. భూమిలో కొంత భాగం అమ్ముకోగా మిగిలిన భూమిని కూడా నిషేధ పుస్తకంలో పెట్టారు. పట్టా భూములను కూడా నిషేధ పుస్తకంలో పెట్టడం జరిగింది. రెవెన్యూ అధికారులు చేసిన తప్పుల వలన తగాదా లేని భూములు కూడా నిషేధ పుస్తకం లోకి వెళ్లాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి 2014లో భూములు సర్వే చేస్తానని ప్రకటించి ఇప్పటికి ఏడేళ్లు గడిచాయి. డిజిటల్ సర్వే చేస్తానని చెప్పారు. టోల్ నెంబర్ 1800 425 8838 కూడా ప్రకటించారు. ప్రభుత్వం గతంలో ఒకే రోజు సమగ్ర సర్వే చేసి రికార్డులు తయారుచేసింది. కానీ డిజిటల్ సర్వే పేర కాలయాపన చేస్తున్నది. భూముల అమ్మకాలు, కొనుగోళ్లు నిరంతరం సాగుతుంటాయి. కొనుగోళ్లకు అనుకూలంగా రెవెన్యూ చట్టాన్ని మార్చారే తప్ప భూయజమానుల ప్రయోజనాలను కాంక్షించి చట్టాల సవరణ జరగలేదు. ఒకేఒక్క చట్ట సవరణను (1971 పాసుపుస్తకాల చట్టం, సెక్షన్ 26) మాత్రమే మార్చారు. అసైన్డ్ భూములు కొనుగోలు చేసిన అర్హులు 2017 వరకు పట్టాలు మార్పిడి చేయించుకోవచ్చని ప్రభుత్వం చట్టసవరణ చేసింది. కానీ రాష్ట్రంలో ఈ రోజుకు 2.80 లక్షల ఎకరాల అసైన్డ్ భూమిని 82వేల మంది కొనుగోలు చేసినట్లు ప్రభుత్వ సర్వేలో తేలింది. కానీ కొనుగోలు చేసిన వారిలో అర్హులను గుర్తించి వారికి పట్టాలు ఇవ్వడానికి ఇబ్బంది ఏమిటి? అక్రమంగా కొనుగోలు చేసిన వారిని రక్షించడానికే ఈ జాప్యం. లక్షలాది ఎకరాల భూములు అటవీ, రెవెన్యూ శాఖల మధ్య తగాదాలలో ఉన్నాయి. షెడ్యూల్డ్ ప్రాంతాలలో 1963 డిసెంబర్ 1కి ముందు కొనుగోలు చేసిన గిరిజనేతరులకు భూమిపై హక్కు ఉంటుంది. కానీ ఈ చట్టాన్ని కూడా అమలుచేయలేదు. 1967 అటవీ చట్టం ప్రకారం రెవెన్యూ భూమిని అడవి భూమిగా మార్చాలంటే ఈ చట్టంలోని సెక్షన్ 4 నుండి సెక్షన్ 15 వరకు అమలుచేయాలి. అవేవీ లేకుండానే అటవీ అధికారులు రైతులపై దాడులు చేస్తున్నారు. ఇది ధరణీ చట్టానికి అనుకూలం కాదు. రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ చట్టాన్ని సమూలంగా మార్చుతానని, రైతుల ప్రయోజనాలు, వారి హక్కులు కాపాడుతానని, చేసిన వాగ్దానం అమలుచేయలేదు. ప్రభుత్వ భూ సేకరణకు ధరణి ద్వారా భూములు సేకరించడం సుగమం చేసుకుంది. అలాగే ఇతర దేశాలలో, ఇతర ప్రాంతాలలో ఉన్నవారు భూములు కొనుగోలు చేయడానికి ఈ చట్ట సవరణ తోడ్పడుతున్నది. కానీ సాగు చేసుకుంటున్న భూ యజమానులకు మాత్రం ఈ చట్టం పనికి రావడం లేదు. అవినీతి అధికారులు మరో రూపంలో పట్టాదారులను, సాగుదారులను అనేక ఇబ్బందుల పాలు చేస్తున్నారు. వేల కేసులు సివిల్ కోర్టుల నుండి హైకోర్టుల వరకు పెండింగ్‌లో కొనసాగుతున్నాయి. ప్రతి ఏటా ఆగస్టు, సెప్టెం బర్ నెలల్లో గ్రామ సర్వే చేసి రికార్డులను అప్డేట్ చేయాలి. కానీ ధరణీలో సెక్షన్ 26 సవరణతో ఆ బాధ్యత నుండి ప్రభుత్వం, రెవెన్యూ శాఖ తప్పుకొని భూ యజమానిపై పెట్టారు. భూ యజమాని నిర్దిష్ట చార్జీలు చెల్లించి మార్చుకోవాలి. ప్రభుత్వం ధరణి ద్వారా రిజిస్ట్రేషన్ చార్జీల ఆదాయాన్ని పెంచుకోవడానికి చేసిన ప్రయత్నం తప్ప సమస్యల పరిష్కారానికి కాదన్నది అచరణలో రుజువైంది. ప్రభుత్వం వేసిన కమిటీ ఈ సమస్యలన్నింటిని చర్చించి పరిష్కారం చూపాలి. అందుకు అవసరమైన రెవెన్యూ చట్టాలను సవరించాలి. భూయాజమానుల అందోళలను తొలగించాలి. భూయజమాని భూమి అమ్ముకోవడంలోకానీ, అభివృద్ధి చేసుకోవడంలో కానీ గతంలో ఏ అటంకాలూ రాలేదు. అందువల్ల ధరణీ అమలులో వస్తున్న ఇబ్బందులను తొలగించే విధంగా కమిటీ దోహదపడుతుందని ఆశిద్దాం. -సారంపల్లి మల్లారెడ్డి వ్యాసకర్త ఆర్థిక, వ్యవసాయ రంగ నిపుణులు మొబైల్: 94900 98666 -
ఐటీ పోర్టల్‌ను వీడని సమస్యలు
న్యూఢిల్లీ: ఆదాయ పన్ను పోర్టల్‌ను ఉపయోగించడంలో ఇంకా కొంతమందికి సమస్యలు ఎదురవుతూనే ఉన్నది వాస్తవమేనని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ అంగీకరించింది. అయితే, ఐటీ విభాగంతో కలిసి వీటిని వేగవంతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొంది. గత కొన్ని వారాలుగా ఐటీ పోర్టల్ వినియోగం క్రమంగా పెరుగుతోందని, సుమారు మూడు కోట్ల మంది పైగా పన్ను చెల్లింపుదారులు లాగిన్ అయ్యి విజయవంతంగా వివిధ లావాదేవీలు పూర్తి చేశారని ఒక ప్రకటనలో వివరించింది. కొందరు యూజర్లు సవాళ్లు ఎదుర్కొనడం తాము గుర్తించామని, వీటిని మరింత మెరుగ్గా అర్థం చేసుకోవడానికి 1,200 మంది ట్యాక్స్‌పేయర్లతో సమాలోచనలు జరుపుతున్నట్లు ఇన్ఫీ తెలిపింది. ప్రస్తుతం 750 మంది పైగా తమ సిబ్బంది ఈ ప్రాజెక్టుపై పనిచేస్తున్నారని పేర్కొంది. రిటర్నుల ప్రాసెసింగ్‌కు పడుతున్న 63 రోజుల సమయాన్ని ఒక్క రోజుకు కుదించేందుకు, రిఫండ్ల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఉద్దేశించి.. కొత్త ఐటీ పోర్టల్‌ను రూపొందించే కాంట్రాక్టును 2019లో ఇన్ఫీ దక్కించుకుంది. ఈ ఏడాది జూన్‌లో కొత్త పోర్టల్ అందుబాటులోకి వచ్చినప్పటికీ సాంకేతిక లోపాలు పోర్టల్‌ను వెన్నాడుతూనే ఉన్నాయి. -
ఇన్ఫీకి సెప్టెంబర్ 15 డెడ్‌లైన్
న్యూఢిల్లీ: కొత్త ఐటీ (ఆదాయ పన్ను) పోర్టల్‌లో లోపాలన్నింటినీ సెప్టెంబర్ 15లోగా సరిదిద్దాలంటూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ డెడ్‌లైన్ విధించారు. పోర్టల్ సమస్యలపై ఇన్ఫీ సీఈవో సలిల్ పరేఖ్, ఆయన బృందంతో మంత్రి సోమవారం భేటీ అయ్యారు. వెబ్సైట్ అందుబాటులోకి వచ్చి రెండున్నర నెలలు అవుతున్నా సాంకేతిక సమస్యలు వెన్నాడుతుండటంపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. లోపాలను పరిష్కరించలేకపోతుండటంపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఆదాయ పన్ను శాఖ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ‘పోర్టల్ విషయంలో పన్ను చెల్లింపుదారులు, నిపుణులు ఎదుర్కొంటున్న సమస్యలను సెప్టెంబర్ 15లోగా పరిష్కరించాలంటూ మంత్రి ఆదేశించారు‘ అని పేర్కొంది. ఈ ప్రాజెక్టుపై 750 మంది పైగా సిబ్బంది పనిచేస్తున్నారని, సీవోవో ప్రవీణ్ రావు స్వయంగా పర్యవేక్షిస్తున్నారని నిర్మలా సీతారామన్‌కు పరేఖ్ వివరించారు. ఈ అంశంపై ఇన్ఫీ అధికారులతో నిర్మలా సీతారామన్ సమావేశం కావడం ఇది రెండోసారి. గతంలో జూన్ 22న పరేఖ్, ఇన్ఫీ సీవోవో ప్రవీణ్ రావులతో ఆమె భేటీ అయ్యారు. రిటర్నుల ప్రాసెసింగ్ వ్యవధిని 63 రోజుల నుంచి ఒక్క రోజుకి తగ్గించేందుకు, రిఫండ్ల ప్రక్రియను వేగవంతం చేసేందుకు కొత్త పోర్టల్ రూపొందించే కాంట్రాక్టును 2019లో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ దక్కించుకుంది. ఈ పోర్టల్ జూన్ 7న అందుబాటులోకి వచ్చింది. అయితే, అప్పట్నుంచీ సాంకేతిక సమస్యలు వెన్నాడుతూనే ఉన్నాయి. తాజాగా రెండు రోజులపాటు నిర్వహణ పనుల కోసమంటూ సైట్‌ను ఇన్ఫీ నిలిపివేసింది. -
కోవిడ్ బాధిత కుటుంబాలకు ఆర్థిక ఆసరా
న్యూఢిల్లీ: కోవిడ్–19తో ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేందుకు ఉద్దేశించిన ఆన్లైన్ పోర్టల్‌ను సీఎం కేజ్రీవాల్ మంగళవారం ప్రారంభించారు. ‘ముఖ్యమంత్రి కోవిడ్–19 పరివార్ ఆర్థిక్ సహాయతా యోజన’కింద అందే దరఖాస్తుల్లో తప్పులు వెదకరాదని ఈ సందర్భంగా ఆయన అధికారులను కోరారు. కోవిడ్‌తో ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు ఈ పథకం కింద రూ.50వేలు పరిహారంగా అందించడంతోపాటు మరణించిన వ్యక్తి ఆ కుటుంబానికి జీవనాధారమైతే, మరో రూ.2,500 నెలవారీగా ప్రభుత్వం అందజేస్తుంది. ఈ సందర్భంగా వర్చువల్‌గా జరిగిన మీడియా సమావేశంలో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. కరోనా నాలుగో వేవ్ ఢిల్లీలోని ప్రతి కుటుంబంపైనా ప్రభావం చూపిందనీ, చాలా మంది చనిపోయారని చెప్పారు. చాలా మంది చిన్నారులు అనాథలుగా మారగా, కొందరు కుటుంబ పెద్దను కోల్పోయాయి. ఇలాంటి వారికి ఆసరాగా నిలిచేందుకు ఈ పథకాన్ని ప్రారంభించాం’అని ఆయన అన్నారు. ‘ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మా ప్రతినిధులు కూడా బాధిత కుటుంబాల వద్దకు వెళ్లి, దరఖాస్తులు స్వీకరిస్తారు’అని ఆయన వెల్లడించారు. బాధిత కుటుంబాల వద్ద సంబంధిత పత్రాలు ఏవైనా లేకున్నా దరఖాస్తులను మాత్రం తిరస్కరించబోమన్నారు. బాధిత కుటుంబాలకు సాధ్యమైనంత త్వరగా సాయం అందించడమే తమ లక్ష్య మని పేర్కొన్నారు. ఈ పథకం కింద లబ్ధి పొందే కుటుంబాలకు ఆదాయ పరిమితి లేదని చెప్పారు. ఢిల్లీ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ జూన్ 22వ తేదీన ‘ముఖ్యమంత్రి కోవిడ్–19 పరివార్ ఆర్థిక సహాయతా యోజన’ను నోటిఫై చేసింది. ‘మృతుడు, దరఖాస్తు దారు ఢిల్లీకి చెంది ఉండాలి. అది కోవిడ్ మరణమేనని ధ్రువీకరణ ఉండాలి. లేదా కోవిడ్ పాజిటివ్‌గా నిర్థారణ అయిన నెల రోజుల్లోనే మృతి చెందినట్లు ఆరోగ్య శాఖ కోవిడ్ మరణంగా ధ్రువీకరించాలి’అని ఆ నోటిఫికేషన్లో తెలిపింది. కోవిడ్‌తో తల్లిదండ్రుల్లో ఒకరిని లేదా ఇద్దరినీ కోల్పోయిన చిన్నారులకు ఉచిత విద్యతోపాటు, 25 ఏళ్లు వచ్చే వరకు నెలకు రూ.2,500 చొప్పున సాయంగా అందించనున్నట్లు ఇప్పటికే కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. -
మరో 4 వారాలు గడువిస్తున్నాం: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా అసంఘటిత రంగంలోని కార్మికుల వివరాలను నాలుగు వారాల్లోగా నమోదు (రిజిస్ట్రర్) చేయాలన్న తమ ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 127 వృత్తుల్లోని కార్మికుల వివరాలను మరో నాలుగు వారాల్లోగా పోర్టల్‌లో నమోదు చేయాలని, ఈ మేరకు తీసుకున్న చర్యలను వివరిస్తూ స్థాయి నివేదిక సమర్పించాలని కార్మిక శాఖ కార్యదర్శిని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. అసంఘటిత రంగంలోని కార్మికుల కోసం సామాజిక భద్రతా బోర్డు ఏర్పాటు చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ మాజీ ఉప ముఖ్యమంత్రి సి.దామోదర రాజనర్సింహ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ధర్మాసనం మళ్లీ విచారించింది. జూలై 31లోగా కార్మికుల వివరాలను పోర్టల్‌లో నమోదు చేయాలని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశించిందని, ఈ మేరకు అన్ని జిల్లాల కార్మిక శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. ఆ ప్రక్రియ త్వరగా పూర్తి చేసి నివేదిక సమర్పించాలని ధర్మాసనం కార్మిక శాఖను ఆదేశిస్తూ తదుపరి విచారణను ఆగస్టు 25కి వాయిదా వేసింది. -
కొత్త ఈ-ఫైలింగ్ పోర్టల్ వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే
కొత్త ఈ-ఫైలింగ్ పోర్టల్‌ను సోమవారం(ఈ నెల 7న) ప్రారంభించనున్నట్టు ఆదాయపన్ను శాఖ ప్రకటించింది. పన్ను చెల్లింపుదారులకు అంతరాయాలు లేని, సౌకర్యవంతమైన అనుభవం నూతన పోర్టల్ ద్వారా అందించనున్నట్టు ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) తెలిపింది. ముందస్తు పన్ను చెల్లింపుల గడువు ముగిసిన తర్వాత జూన్ 18న నూతన పన్ను చెల్లింపుల వ్యవస్థను అమల్లోకి తీసుకురానున్నట్టు ప్రకటించింది. గత వారం రోజులుగా ఆదాయ పన్ను విభాగం పోర్టల్ పనిచేయలేదు. పోర్టల్‌ని అప్డేట్ చేయడమే ఇందుకు కారణం. నేటి నుంచి ఈ పోర్టల్ అందరికీ అందుబాటులోకి వస్తుంది. పన్ను చెల్లించేవారికి, సంబంధిత వర్గాలందరికి ఇది ఎంతో ఉపయోగకరం. ఆధునీకరించిన ఈ పోర్టల్.. ఉపయోగించడానికి సులభతరంగా ఉంటుంది. రిటర్నులు వేయడం, అసెస్మెంట్లు చేయడం, రిఫండ్ జారీ చేయడానికి అనుసంధానించడం వల్ల రిఫండులు త్వరగా రాగలవు. డ్యాష్‌బోర్డు మీద మీకు సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరాలు, పెండింగ్‌లో ఉన్న పనులు అన్నీ కనిపిస్తాయి. ఐటీఆర్ వేయడానికి అనువైన సాఫ్ట్వేర్ ఉచితం. ఫోన్ ద్వారా మీ ప్రశ్నలకు జవాబులు ఇస్తారు. సందేహాలకు జవాబులుంటాయి. వీడియో ద్వారా మీకు పాఠాలు చెబుతారు. ఆన్లైన్ పాఠాలు ఉంటాయి. మొబైల్ అప్లికేషన్ కూడా అందుబాటులోకి వస్తోంది. పెద్ద ఉపశమనం ఏమిటంటే పన్నుని ఆన్లైన్ ద్వారా చెల్లించవచ్చు. నెట్ బ్యాంకింగ్, యూపీఐ, క్రెడిట్ కార్డు, ఆర్టీజీఎస్, ఎన్ఈఎఫ్టీ ద్వారా పన్నులు చెల్లించవచ్చు. జూన్ 1 నుంచి 6వ తారీఖు వరకు ఈ పోర్టల్‌ని తయారు చేశారు. ఈ రోజుల్లో ఎటువంటి కార్యకలాపాలూ జరగలేదు. ఎటువంటి కేసులు వినలేదు. అసెస్మెంట్లు చేయలేదు. ఒకవేళ ఎవరికైనా నోటీసులు వచ్చినా ఆ గడువు తేదీలను సవరిస్తారు. జూన్ 10 నుంచి కేసుల పరిష్కరణ, అసెస్మెంట్ మొదలవుతాయి. కొత్త పోర్టల్ పూర్తిగా వాడుకలోకి వచ్చే వరకూ కాస్త సంయమనం పాటించడం శ్రేయస్కరం. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అన్ని గడువు తేదీలను సవరించారు. పొడిగించారు. ఫారం 16 జారీ చేయడానికి గడువు తేదీ జులై 15. ఇది అయిన తర్వాత ఫారం 16ఎ, అటుపైన ఫారం 26ఎ అప్డేట్ అవుతుంది. అంతవరకూ ఓపిక పట్టాలి. ఫారం 26ఎలో సమస్త వివరాలు ఉంటాయి. సదరు ఆర్థిక సంవత్సరంలో మీ ఆర్థిక వ్యవహారాలన్నీ ఇది ప్రతిబింబిస్తుంది. సంవత్సరం పంచాంగం..జాతకం.. కుండలీ చక్రం అన్నీ ఇదే. అన్ని వ్యవహారాలను అర్థం చేసుకోండి. విశదీకరించండి. ఇక విశ్లేషణ వారి వంతు. ట్యాక్సేషన్ నిపుణులు కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య -
హస్త కళాకృతులకు ఇక ప్రపంచ స్థాయి మార్కెటింగ్ ..
హైదరాబాద్: రాష్ట్రంలో తయారవుతున్న సంప్రదాయ హస్త కళాకృతులకు ప్రపంచస్థాయి మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు ‘ఈ–గోల్కొండ’ వెబ్ పోర్టల్‌ను రూపొందించినట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొ న్నారు. తెలంగాణ చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ ప్లాట్‌ఫాం ద్వారా సంప్రదాయ హస్త కళా కృతులను కొనుగోలు చేసే వీలుంటుందన్నారు. గురువారం ప్రగతిభవన్‌లో జరిగిన కార్య క్రమంలో ‘ఈ– గోల్కొండ’ఆన్లైన్ ప్లాట్‌ఫాంను కేటీఆర్ ఆవిష్కరించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రైవేటు ఈ–కామర్స్ వెబ్సైట్లతో పోలిస్తే ‘ఈ–గోల్కొండ’పోర్టల్‌ను మెరుగైన ఫీచర్స్‌తో రూపొందించినట్లు తెలిపారు. ఈ పోర్టల్ ద్వారా ప్రస్తుతం దేశంలోని ఏ ప్రాంతానికైనా తమ కళా కృతులను సరఫరా చేయనున్నట్లు చెప్పారు. త్వరలో కేంద్ర ప్రభుత్వ అనుమతులు పొంది.. ప్రపంచ దేశాలకు కూడా ఎగుమతులు చేసేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ‘ఈ– గోల్కొండ’ద్వారా అమ్మకానికి పెట్టిన కళాకృతులను పరిశీలించేందుకు త్రీడీ చిత్రాలు అందు బాటులో ఉంటాయని తెలిపారు. మొబైల్ ఫోన్ వినియోగదారులకు కూడా సౌకర్యవంతంగా ఉండేలా వెబ్సైట్ రూపొందించామన్నారు. https://golkondashop.telangana.gov.in లింకు ద్వారా తమకు నచ్చిన కళాకృతులను ప్రజలు కొనుగోలు చేయొచ్చని సూచించారు. రాష్ట్రంలో శతాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్న చేనేత కళాకృతుల తయారీని ప్రోత్సహించేందుకు నైపుణ్య శిక్షణ, సాంకేతిక సహకారం, మార్కెటింగ్ సేవలు అందుబాటులోకి తెస్తామన్నారు. కామన్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు ద్వారా హస్త కళాకృతులు తయారుచేసే వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రకటించారు. ప్రగతిభవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద్‌గౌడ్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, రాష్ట్ర హ్యాండీక్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బొల్లం సంపత్‌కుమార్, చేనేత శాఖ కార్యదర్శి శైలజ రామయ్య పాల్గొన్నారు. -
‘న్యూస్‌క్లిక్’పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు
న్యూఢిల్లీ: న్యూస్‌క్లిక్ అనే న్యూస్ పోర్టల్‌కు సంబంధించిన పలు ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మంగళవారం ఏకకాలంలో దాడులు చేపట్టింది. మొత్తం ఎనిమిది చోట్ల దాడులు జరిగినట్లు ఈడీ అధికారులు చెప్పారు. మనీ లాండరింగ్ చట్టం కింద ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. దీనికోసం ఈడీ అధికారులు ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను పరిగణనలోకి తీసుకున్నారు. వీరు నడుపుతున్న వెబ్సైట్ పేరు న్యూస్‌క్లిక్.ఇన్ అని తెలిపారు. మంగళవారం ఉదయం ప్రారంభమైన సోదాలు ఇంకా కొనసాగుతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లు, ఖాతాలకు సంబంధించిన కీలక పత్రాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. పలువురిని ప్రశ్నించినట్టు సమాచారం. దానికి ప్రబీర్ పుర్కాయస్త ఎడిటర్ ఇన్ చీఫ్‌గా పని చేస్తున్నారు. తమపై దాడి జరగడంపై ఆయన స్పందిస్తూ.. జర్నలిజాన్ని తొక్కేసేందుకు, నిజాలు బయటకు రాకుండా ఉండేందుకు కేంద్రం ఈ దాడులు చేయిస్తోందని ఆరోపించారు. నిజం నిలకడ మీద తెలుస్తుందని, న్యాయవ్యవస్థపై తమకు నమ్మకం ఉందని వ్యాఖ్యానించారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయని, ముగిసిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. అయితే ఈడీ అధికారులు మాత్రం.. ఆ న్యూస్ పోర్టల్‌కు విదేశాల నుంచి వస్తున్న నిధుల్లో అవకతవకలు ఉన్న కారణంగా చర్యలు తీసుకున్నట్లు చెబుతున్నారు. చదవండి: ఎర్రకోట ఘటన: ‘మోస్ట్ వాంటెడ్’ అరెస్టు! ఇక వారానికి నాలుగే పనిరోజులు! -
యజమాని ఫొటో, ఆధార్, ఫోన్ నంబర్ తప్పనిసరి..
సాక్షి, హైదరాబాద్: ఆస్తుల నమోదు ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. వ్యవసాయేతర ఆస్తులకు కూడా పాస్ పుస్తకాలు (మెరూన్ రంగు) ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ప్రతి ఇంటి సమాచారాన్ని ఆన్లైన్లో నమోదు చేస్తోంది. కేవలం ఇళ్లే కాకుండా.. వ్యవసాయ పొలాల వద్ద ఉన్న కట్టడాల వివరాలను సేకరిస్తోంది. వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల లావాదేవీలకు వేర్వేరుగా ధరణి పోర్టళ్లను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కొత్త రెవెన్యూ చట్టాన్ని తెచ్చిన సర్కారు.. ఈ దసరా నాడు ఈ పోర్టళ్లను ప్రారంభించాలని ముహూర్తం కూడా ఖరారు చేసింది. ఆ రోజు నుంచి సాగు భూముల రిజిస్ట్రేషన్లను తహసీళ్లలో.. వ్యవసాయేతర ఆస్తులను సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో చేయనుంది. ఈ క్రమంలోనే వ్యవసాయేతర ఆస్తుల వివరాలను పకడ్బందీగా సేకరించడమే కాకుండా ధరణి పోర్టల్‌లో అనుసంధానం చేయాలని నిర్ణయించింది. 60 లక్షల కట్టడాలు..! రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12,751 గ్రామ పంచాయతీల్లో సుమారు 60 లక్షల కట్టడాలుంటాయని పంచాయతీరాజ్ శాఖ అంచనా వేసింది. ఈ ఆస్తుల వివరాలన్నింటినీ ఇప్పటికే అందుబాటులో ఉన్న ఈ–పంచాయతీ వెబ్సైట్లో పొందుపరిచింది. ఆస్తుల నమోదుకు ముందు.. రివిజన్ రిజిష్టర్‌లో 53.23 లక్షల కట్టడాలున్నట్లు లెక్క తేలగా.. కొత్త కట్టడాలతో కలుపుకొని ఈ సంఖ్య 60 లక్షలకు చేరింది. ఈ మేరకు ఈ–పంచాయతీ పోర్టల్‌లో నిక్షిప్తం చేసిన సమాచారాన్ని మ్యాపింగ్ చేయడంలో భాగంగా పంచాయతీ కార్యదర్శులు ఇంటింటికీ వెళ్తున్నారు. ఈ వివరాలను ప్రత్యేకంగా రూపొందించిన యాప్ న్యాప్ (నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీస్)లో నమోదు చేస్తున్నారు. అయితే, వివరాల నమోదుకు సాంకేతిక సమస్యలు ప్రతిబంధకంగా మారాయి. ఫోన్ సిగ్నల్స్ లేకపోవడం.. ఇంటర్నెట్ సమస్య.. సర్వర్ డౌన్‌తో యాప్‌లో సమాచారం నమోదు చేయడం కార్యదర్శులకు పెద్ద సవాల్‌గా మారింది. దీనికి తోడు గ్రామాల్లోని ప్రజానీకం వ్యవసాయ పనులకు వెళ్లిపోతుండటంతో సమాచార సేకరణపై ప్రభావం చూపుతోంది. కుటుంబ యజమాని ఫొటో, ఆధార్, ఫోన్ నంబర్ తప్పనిసరి చేయడం కూడా తలనొప్పిగా తయారైంది. దీంతో సమాచారాన్ని యాప్‌లో అప్లోడ్ చేయడంలో జాప్యం జరుగుతోంది. రోజుకు 70 ఇళ్ల సమాచారాన్ని అప్డేట్ చేయాలని లక్ష్యంగా నిర్దేశించిన 30 ఇళ్లు కూడా దాటడం లేదు. ఈ క్రమంలోనే సోమవారం నాటికి 10 లక్షల ఇళ్ల సమాచారాన్ని యాప్‌లో నిక్షిప్తం చేసినట్లు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ రఘునందన్‌రావు ‘సాక్షి’కి తెలిపారు. వారం పది రోజుల్లో మొత్తం ఇళ్ల సమాచార సేకరణ ప్రక్రియ పూర్తవుతుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. తొలుత ఆస్తుల నమోదులో కొంత ఇబ్బందులు ఎదురైనా.. వాటిని అధిగమించామని, నమోదు ప్రక్రియ గాడిలో పడిందని అభిప్రాయపడ్డారు. (చదవండి: ఆస్తుల గణనకు సాంకేతిక సమస్యలు) -
ధరణి పోర్టల్‌పై కేసీఆర్ సమీక్ష..
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం సమీక్షించారు. 15 రోజుల్లోగా ఆన్లైన్లో ప్లాట్లు, ఇళ్లు, అపార్ట్మెంట్ల వివరాలు నమోదు చేయాలని కేసీఆర్ తెలిపారు. ఇప్పటి వరకు నమోదు కాని వాటిని కూడా పూర్తి చేయాలని పేర్కొన్నారు. ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చేలోపు అన్ని ప్రక్రియలు పూర్తి చేయాలి. అయితే 100శాతం ప్లాట్లు, ఇళ్లు, అపార్ట్మెంట్లు ఆన్లైన్ చేయాల్సిందేనని కేసీఆర్ తెలిపారు. ప్రజలు తమ ఆస్తుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. -
విద్యార్థులకు వరం.. ఏపీ కెరీర్ పోర్టల్
శృంగవరపుకోట రూరల్: సమైక్యాంధ్ర విభజన తర్వాత ఏపీ విద్యార్థులకు విద్య, ఉద్యోగ కల్పన కోర్సుల వివరాలను తెలియజేసేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి చర్యలు చేపట్టారు. ‘ఏపీ కెరీర్ పోర్టల్.ఇన్’ను విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చారు. ఏపీఎస్సీఈఆర్టీ, యూనిసెఫ్, ఆస్మాన్ ఫౌండేషన్ సహకారంతో దీనిని అమలుచేస్తున్నారు. ఏపీలో 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న సెకెండరీ స్థాయి విద్యార్థుల చదువులతో పాటు భవిష్యత్‌లో ఎంచుకోబోయే ఉపాధి కోర్సులను, వాటి ద్వారా పొందబోయే ఉద్యోగాల వివరాలను తెలియజేస్తున్నారు. రాష్ట్రంలోని 20 లక్షల మంది విద్యార్థుల బంగారు భవిష్యత్‌కు బాటలు చూపిస్తున్నారు. శిక్షణ తరగతుల నిర్వహణ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వాడ్రేపు చినవీరభద్రుడు, పాఠశాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బి.రాజశేఖర్, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ జి.ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో యూనిసెఫ్, ఆస్మాన్ ఫౌండేషన్, ఎస్సీఈఆర్టీ ప్రొఫెసర్ల ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. గత రెండు రోజులుగా వెబ్‌నార్‌లో రాష్ట్రంలోని కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, సెకెండరీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, 9, 10, ఇంటర్ విద్యార్థులు, తల్లిదండ్రులకు ఆన్లైన్లో శిక్షణ అందజేస్తున్నారు. కేరీర్ గైడెన్స్ ఇస్తున్నారు. కెరీర్ పోర్టల్‌లో నమోదు ఎలా?.. ‘ఏపీ కెరీర్ పోర్టల్.ఇన్’లో విద్యార్థి తమ చైల్డ్.ఇన్ఫో ద్వారా రిజిస్టర్ కావాలి. పాస్‌వర్డ్‌గా 123456 ఉంటుంది. నమోదు తొమ్మిది భాషల్లో చేసుకోవచ్చు. విద్యార్థి తమకు నచ్చిన భాషలో ఎంపిక చేసుకుని లాగిన్ అయ్యి.. డాష్‌కోడ్‌లో మై కెరీర్లో డెమోలో ప్రొఫైల్ నింపాలి. విద్యార్థి చదువు, కుటుంబ వివరాలు, ఫోన్ నంబర్‌తో సహా ఎంటర్ చేస్తే ఈ పోర్టల్‌లో నమోదు అయినట్లే. కోర్సుల సమాచారం ఇలా... 550 క్లస్టరర్లతో కూడిన 672 రకాల కోర్సులు, ఉపాధి, ఉద్యోగావకాశాల సమాచారం ఇందులో లభిస్తుంది. వ్యవసాయం/అందం/ఆరోగ్యం/వృత్తి నైపుణ్యం/64 కళలకు సంబంధించిన కోర్సులు/ బయలాజికల్, మెరైన్, రబ్బర్, ఆరి్టఫీషియల్, ఎనర్జీ, సో లార్ తదితర ఇంజినీరింగ్ కోర్సుల వివరాలు ఉంటాయి. ఒక్కో కోర్సుకు అయ్యే ఖర్చు, కోర్సు తర్వాత వాటి భవిష్యత్తు, జీతభత్యాలు, ఆంధ్రప్రదేశ్‌లోని కాలేజీలు, ఉపకార వేతనాలు పొందే వీలుంది. (ఉదాహరణకు సంతూర్, గ్లో అండ్ లవ్లీ, రమణ్‌కుమార్ ముంజల్, ఆర్కేఎం ఫౌండేషన్) వారి ఉపకార వేతనాలు ఆంధ్రప్రదేశ్ కెరీర్ పోర్టల్.ఇన్‌లో ఉంటాయి. కోర్సులు, పరీక్షల వివరాలు.. వివిధ రకాల నోటిఫికేషన్లు, ఫీజులు, పరీక్షలు, కోర్సుల వివరాలు, చివరి తేదీ, వాటికయ్యే ఖర్చు, జీతం, ఉపకార వేతనాలు తదితర వివరాలు ఆంధ్రప్రదేశ్ కెరీర్ పోర్టల్.ఇన్‌లో ఉంటాయి. విద్యార్థులకు సువర్ణవకాశం.. 9, 10 తరగతులు, ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు కెరీర్ గైడెన్స్, లైఫ్స్కిల్స్పై రూపొందించిన చక్కని కార్యక్రమం ఇది. ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10 తరగతులు పూర్తిచేసిన విద్యార్థులకు ఉపయోగకరమయ్యే కోర్సుల వివరాలతో కార్యక్రమాన్ని చక్కగా రూపొందించారు. దీన్ని సది్వనియోగం చేసుకుంటే భవిష్యత్తు బంగారమే. – ఇందుకూరి అశోక్‌రాజు, జీవశాస్త్ర ఉపాధ్యాయుడు, భవానీనగర్, ఎస్.కోట మండలం ఉపాధి, ఉద్యోగావకాశాలు.. ఈ కెరీర్ పోర్టల్‌లో లైఫ్‌స్కిల్స్, కెరీర్ గైడెన్స్ అందుతుంది. సెకెండరీ స్థాయి విద్యార్థులు తమ భవిష్యత్‌ను తామే నిర్మించుకోవచ్చు. 672 రకాల ఉపాధి అవకాశాల్లో విద్యార్థులు నచ్చిన అవకాశం గురంచి పూర్తిస్థాయిలో తెలుసుకోవచ్చు. భవిష్యత్‌లో ఏం కాదల్చుకున్నామో విద్యార్థి దశలోనే గుర్తిస్తే ఉన్నత స్థానానికి ఎదగవచ్చు. – రహీం షేక్‌లాల్, సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడు, జెడ్పీ హైసూ్కల్, ధర్మవరం -
ప్రైవేట్ జెట్స్‌కు ‘కరోనా’ రెక్కలు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో ఆర్థిక కార్యకలాపాలు మొదలుకుని సాధారణ రవాణా సాధనాల దాకా దాదాపు అన్నీ స్తంభించిపోయాయి. ప్రస్తుతం ప్రయాణాలపరంగా కాస్త వెసులుబాటు లభించినప్పటికీ ఇంకా కొన్ని పరిమితులు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే, ఇలాంటి గడ్డు కాలంలో ప్రైవేట్ విమానాలకు డిమాండ్ భారీగా నెలకొంది. దీంతో వాటి చార్జీలకు కూడా బాగా రెక్కలొచ్చాయి. కరోనా వ్యాప్తి భయాల కారణంగా బడా పారిశ్రామికవేత్తలు, అత్యంత సంపన్నులు (హెచ్ఎన్ఐ) దేశీయంగానైనా, విదేశాలకైనా సాధారణ ఫ్లయిట్లలో ప్రయాణించేందుకు ఇష్టపడకపోతుండటం, ప్రైవేట్ జెట్లవైపు మొగ్గు చూపుతుండటం ఇందుకు కారణం. దీంతో వ్యాపారావకాశాలను అందిపుచ్చుకునేందుకు, ప్రయాణికులను ఆకర్షించేందుకు ప్రైవేట్ జెట్ కంపెనీలతో పాటు కొన్ని షెడ్యూల్డ్ విమానయాన సంస్థలు కూడా పోటీపడుతున్నాయి. ఆన్లైన్ ట్రావెల్ సర్వీసుల పోర్టల్ .. మేక్మైట్రిప్ కూడా తాజాగా బరిలోకి దిగింది. ప్రయాణాలపై ఆంక్షలు తొలగడంతో వివిధ ప్రాంతాలకు చేరేందుకు ప్రయాణికులు ఫ్లయిట్లను అద్దెకు తీసుకోవడంతో పాటు ఇతరత్రా రవాణా సాధనాలపైనా దృష్టి పెడుతున్నారని మేక్మైట్రిప్ సీవోవో (ఫ్లయిట్స్ వ్యాపార విభాగం) సౌజన్య శ్రీవాస్తవ తెలిపారు. సురక్షితం, సౌకర్యవంతం.. భౌతిక దూరం పాటించేందుకు అనువుగా ఉండటంతో పాటు సురక్షితంగా, తమకు కావాల్సిన విధంగా ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలనుకునే వారికి ప్రైవేట్ విమానాలు ఉపయోగకరంగా ఉంటున్నాయని సౌజన్య తెలిపారు. దీంతో వీటిని అద్దెకు తీసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని వివరించారు. మరోవైపు, కరోనా వైరస్ రాక మునుపు రోజుకు 30–40 చార్టర్ రిక్వెస్ట్‌లు వచ్చేవని ప్రస్తుతం డిమాండ్ తొమ్మిది రెట్లు పెరిగిందని జెట్‌సెట్‌గో ఏవియేషన్ సీఈవో కనికా టేక్రివాల్ తెలిపారు. అయితే, రాష్ట్రాలతో పాటు ఇతర దేశాల్లో రాత్రికి రాత్రి ప్రయాణ నిబంధనలు మారిపోతుండటంతో కేవలం 50–60 శాతం మాత్రమే సర్వీసులు అందించగలుగుతున్నామని వివరించారు. మేక్మైట్రిప్ ప్రధానంగా కార్పొరేట్లు, హెచ్ఎన్ఐలు, సంపన్న ప్రయాణికులు లక్ష్యంగా పెట్టుకుంది. 2014 నుంచి ఈ వ్యాపారంలో ఉన్న జెట్‌సెట్‌గో క్లయింట్ల సంఖ్య చాలా విస్తృతంగానే ఉంది. ఫార్చూన్ 500 కంపెనీల సీఈవోలు మొదలుకుని, సినిమా నిర్మాణ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, క్రీడాకారులు, హెచ్‌ఎన్‌ఐఏలు మొదలైన వారు క్లయింట్లుగా ఉన్నారు. ఇక 2016 నుంచి ఎయిర్ చార్టర్ వ్యాపారంలో ఉన్న జెట్‌స్మార్ట్ (ఇండ్‌జెట్స్ ఇండియా) సంస్థకు ప్రముఖ లాయర్లు, వ్యాపారవేత్తలు మొదలైనవారు క్లయింట్లుగా ఉన్నారు. ఖరీదైన వ్యవహారమే... ప్రైవేట్ విమానాలను సాధారణంగా మెట్రో నగరాల మధ్య, ద్వితీయ శ్రేణి పట్టణాల నుంచి ప్రథమ శ్రేణి పట్టణాలకు ప్రయాణాల కోసం ఉపయోగిస్తున్నారు. అందులోనూ ఎక్కువగా వైద్య అవసరాల కోసం ఎంచుకుంటున్నారు. ఇదేమంత చౌకైన వ్యవహారం మాత్రం కాదని పరిశ్రమవర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ప్రైవేట్ జెట్ అద్దె చార్జీలు గంటకు రూ. 85,000 నుంచి రూ. 4 లక్షల దాకా ఉంటోందని జెట్‌స్మార్ట్ సీఈవో అనూప్ సెహాన్ తెలిపారు. దీనికి జీఎస్టీ, ఎయిర్పోర్ట్ చార్జీలు మొదలైనవి అదనం. ఒకవేళ వన్–వే ట్రిప్ అయిన పక్షంలో సదరు విమానం తిరిగి వెళ్లేందుకు అయ్యే చార్జీలను కూడా కట్టాల్సి ఉంటుంది. -
‘ఆరోగ్య సేతు బాడీగార్డ్‌గా పని చేస్తుంది’
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వాలు కరోనాను ఎదుర్కొనేందుకు అంకితభావంతో పని చేస్తున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. బీజేపీ మెడికల్ సెల్ ఆధ్వర్యంలో హైదరాబాద్ జిల్లా కార్యాలయంలో ‘మెడికల్ పోర్టల్’ శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో వృద్ధులు, మహిళలు, దివ్యాగులకు ఈ పోర్టల్ ద్వారా అత్యవసర వైద్య సేవలు అందించనున్నామని తెలిపారు. కొన్ని నగరాలల్లో అధికంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వస్తున్నాయని, ఇందుకు కారణం మర్కజ్ ప్రార్తనలు చేసిన సభ్యులు తెలంగాణతో పాటు, దేశంలోని అన్ని రాష్ట్రాలకు వెళ్లారని తెలిపారు. 60 శాతం మర్కజ్‌కు వచ్చిన వారి కేసులే ఉన్నాయిని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించడం, సలహాలిచ్చేందుకు కేంద్ర అధికారుల బృందాన్ని కేంద్ర ప్రభుత్వం పంపిందని ఆయన తెలిపారు. కొన్ని మినహాయింపులు కేంద్రం ఇచ్చినా.. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో లాక్డౌన్ చేసిందని ఆయన అన్నారు. సింకింద్రాబాద్‌లో స్థానిక కార్యకర్తలు క్షేత్ర స్థాయిలో విస్తృతంగా కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా బీజేపీ కార్యకర్తలు పాటిస్తున్నారని మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. (ఆకలితో ఉంటే ఈ నెంబర్‌కి కాల్ చేయండి) ఆసుపత్రుల్లో ఓపీలను మూసివేశారు. ఎమర్జెన్సీ కేసులు పూర్తిగా తగ్గిపోయాయి. ఏదైనా జబ్బు వస్తే ఎక్కడికి వెళ్లాలో కూడా అర్థం కాని పరిస్థితి ఉందని, అలాంటి వారిని ఆదుకోవాలని ఆయన తెలిపారు. ‘ఆరోగ్య సేతు’ యాప్‌లో ఆరోగ్య వివరాలు పొందుపరిస్తే, కరోనాకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెబుతుందని ఆయన చెప్పారు. ప్రజలంతా ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుంటే మీ చుట్టూ ఉన్న వారికి కరోనా ఉంటే అలర్ట్ చేస్తుందని మంత్రి కిషన్‌రెడ్డి వివరించారు. అది బాడీగార్డులా పని చేస్తుందని ఆయన అన్నారు. పేదలను వైద్యపరంగా ఆదుకునేందుకు డాక్టర్ల బృందంతో మాట్లాడి ప్రతి నియోజకవర్గంలో సేవలందించడానకి సిద్దంగా ఉన్నామని ఆయన చెప్పారు. చాలా మంది డాక్టర్లు ప్రజలకు సేవలందిస్తామని చెబుతున్నారని, ఒత్తిడిలో ఉన్నా ప్రజాసేవకు ముందుకు వచ్చిన వారికి అభినందనలు తెలిపారు. (సఫాయీ.. ఓ సిపాయి) ప్రతి అసెంబ్లీలో నియోజకవర్గంలో సేవకులు ఉంటారని, ఏదైనా అనారోగ్యంతో బాధపడితే సంబందిత డాక్టర్లకు ఫోన్ చేసి మెడికల్ అసిస్టెంట్ తీసుకోవచ్చని, అన్ని విభాగాల డాక్టర్లు ఇందులో ఉన్నారని తెలిపారు. హైదరాబాద్ పరిధిలో ఒక్కో డాక్టర్‌కు ఇద్దరు బీజేపీ కార్యకర్తలు అసిస్టెంట్లుగా ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమం వృద్దులు, మహిళలు, దివ్యాంగుల కోసం ఏర్పాటు చేశామని తెలిపారు. వారికే మొదటి ప్రాధాన్యం ఉంటుందన్నారు. లాక్డౌన్ సమయంలో ఈ డాక్టర్ల సేవలను వినియోగించుకోవాలని ప్రజలను మంత్రి కోరారు. (అసలు సమస్య ఆ 6%) సంపత్ కుమార్ ఈ కార్యక్రమాన్ని కో ఆర్డినేట్ చేస్తారని, దివ్యాంగులు, వృద్దులకు ఇంటికే మెడిసిన్ తెచ్చిస్తారని కిషన్రెడడ్డి చెప్పారు. ప్రజలు లాక్‌డౌన్‌కు సహకరించడం లేదు, దీంతో కొద్దిగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన అన్నారు. సెల్ఫ్ క్వారెంటైన్ చేసుకొని కుటుంబ సభ్యలను కాపాడుకోగలమని, కోవిడ్‌కు వ్యతిరేకంగా పోరాడుతూ సేవలు అందిస్తున్న వారు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రజల ఏ సేవ చేసేందుకు ముందుకు వచ్చినా సామాజిక దూరం పాటించాన్నారు. కమాండ్ కంట్రోల్ రూంలో ఉండే సిబ్బంది పేదలు, వృద్దులు, మహిళలు ఏ సేవలు అడిగినా విసుక్కోకుండా సేవ చేయాలన్నారు. హెల్త్ ఎమర్జెన్సీ ఉన్నవారు మా హెల్ప్ లైన్ నంబర్ 9959261273 లేదా కిషన్‌రెడ్డి అనే వెబ్సైట్, ఫేస్బుక్, ట్విటర్లో పెట్టిన లిస్ట్ చూసి సంప్రదించాలని ఆయన కోరారు. 180 మంది డాక్టరు ఆయా సమయాల్లో అందుబాటులో ఉంటారని మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు ప్రకాష్ రెడ్డి, గౌతమ్ రావు, అజయ్, డాక్టర్లు సురేష్ గౌడ్ పాల్గొన్నారు. -
రోబో జాబ్స్ జోరు.. మూడేళ్లలో 191 శాతం వృద్ధి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో గత కొన్నేళ్లుగా రోబోటిక్స్ రంగంలో ఉద్యోగ అవకాశాల కోసం వెతుకులాట గణనీయంగా పెరిగింది. 2015 మే నుంచి 2018 మే మధ్య రోబోటిక్స్ ఉద్యోగ అవకాశాల సెర్చిలో 186 శాతం వృద్ధి నమోదయిందని ప్రముఖ జాబ్ సెర్చ్ పోర్టల్ ఇన్‌డీడ్ తెలియజేసింది. ఇదే కాలంలో జాబ్ పోస్టింగ్స్ 191 శాతం వృద్ధిని నమోదు చేశాయని ఒక నివేదికలో తెలియజేసింది. 2015 తర్వాతి నుంచి దేశంలోని ప్రముఖ కంపెనీలు రోబోటిక్స్ మినహా ఇతర విభాగంలో కొత్త ఉద్యోగ అవకాశాలను చాలా వరకు తగ్గించేశాయని ఇన్‌డీడ్ ఎండీ సతీష్ కుమార్ తెలిపారు. మేకిన్ ఇండియాలో భాగంగా కేంద్రం రోబోటిక్స్ రంగంలో 13 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టిందని, ఇదే రోబోటిక్స్ ఉద్యోగ డిమాండ్‌కు కారణమని తెలిపారు. కన్స్ట్రక్షన్స్, హెల్త్‌కేర్, తయారీ రంగాల్లో రోబోటిక్స్ హవా నడుస్తోందన్నారు. మూడో స్థానంలో తెలంగాణ.. రోబోటిక్స్ సెక్టార్లో అత్యధిక ఉద్యోగ అవకాశాలున్న రాష్ట్రంలో తొలి రెండు స్థానాల్లో మహారాష్ట్ర, కర్ణాటక నిలవగా.. తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత వరుసగా తమిళనాడు, హర్యానా, న్యూఢిల్లీ, వెస్ట్ బెంగాల్, గుజరాత్, ఉత్తర్‌ప్రదేశ్, కేరళ రాష్ట్రాలు నిలిచాయి. సర్జరీల్లోనే ఎక్కువ.. రోబోటిక్స్ ఉద్యోగ అవకాశాలు విభాగాల వారీగా చూసుకుంటే సర్జరీ, కన్స్ట్రక్షన్స్ రంగంలోనే ఎక్కువగా ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే దేశీయ సర్జికల్ రోబోటిక్స్ మార్కెట్ వృద్ధి ఎక్కువగా ఉందని నివేదిక తెలిపింది. -
టారిఫ్‌లను పోల్చి చూసుకోవడానికి పోర్టల్
న్యూఢిల్లీ: టెలికం కంపెనీల టారిఫ్‌లను పోల్చి చూసుకోవడానికి టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ తాజాగా ఒక పోర్టల్‌ను ఆవిష్కరించింది. ఇది బీటా వెర్షన్. టెలికం సర్వీస్ ప్రొవైడర్లు అందించే టారిఫ్‌ల వివరాలను ఒకే చోట అందించాలనే లక్ష్యంతో ట్రాయ్ www.tariff.trai.gov.in పేరిట ఈ పోర్టల్‌ను తీసుకువచ్చింది. పలు రకాల టారిఫ్ ప్లాన్స్‌ను, ఇతర టారిఫ్ ఇన్స్ట్రూమెంట్స్ను డౌన్లోడ్ ఫార్మాట్ రూపంలో వెబ్సైట్లో ఉంచుతామని తెలిపింది. తొలి దశలో ఈ సేవలను ఢిల్లీ సర్కిల్లో అందుబాటులో ఉంచామని, యూజర్లు ఈ సర్వీసుపై ఫీడ్‌బ్యాక్ అందించాలని కోరింది. సేవలను తర్వాత దశలవారీగా ఇతర సర్కిళ్లకు విస్తరిస్తామని పేర్కొంది. -
గృహ కొనుగోలుదారులకు ‘ఎస్బీఐ రియల్టీ’ పోర్టల్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ.. గృహాల కొనుగోలు దారుల కోసం ప్రత్యేకంగా ’ఎస్బీఐరియల్టీడాట్ఇన్’ పేరిట పోర్టల్ ప్రారంభించింది. ఆమోదం పొందిన 3,000 పైచిలుకు ప్రాజెక్టుల్లోని 9.5 లక్షల దాకా గృహాల వివరాలు ఇందులో ఉంటాయి. కొనుగోలుదారులు తమకు అనువైన ప్రాజెక్టును ఎంచుకుని ఫ్లాట్ కొనుగోలు చేసేందుకు ఈ పోర్టల్ తోడ్పడనుంది. మొత్తం 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని (యూటీ) 30 నగరాల్లో ఈ ప్రాజెక్టులు విస్తరించి ఉన్నట్లు ఎస్బీఐ పేర్కొంది. కస్టమర్లు ఆయా ప్రాంతాల్లోని ప్రాపర్టీల ప్రస్తుత, గత ధరల సరళని మొదలైనవి పోల్చి చూసుకోవచ్చని, ఆదాయం.. రుణ పరపతి ఆధారంగా ఎంత వరకూ రుణం తీసుకోవచ్చన్న విషయంలోనూ పోర్టల్ తోడ్పడుతుందని ఎస్బీఐ ఎండీ రజనీష్ కుమార్ పేర్కొన్నారు. -
ఐఐటీ పేద విద్యార్థులకు శుభవార్త
న్యూఢిల్లీ: లక్షల రూపాయలు కుమ్మరించి ఐఐటీ కోచింగ్ లకు వెళ్లలేని పేద విద్యార్థులకు శుభవార్త. ఐఐటీకి ప్రిపేరయ్యే వారికోసం త్వరలోనే ఒక ఆప్, పోర్టల్ ను రూపొందించనున్నట్టు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. ఎడ్యుకేషన్ ప్రైవేటు సొసైటీ ఫర్ ఇండియా(ఈపీఎస్ఎఫ్ఐ) కార్యక్రమంలో పాల్గొన్న ఈ సమాచారం వెల్లడించారు. ఐఐటీ ఉపాధ్యాయుల పాఠాలు, గత పరీక్ష ప్రశ్నా పత్రాలను ఈ యాప్ లో అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పారు. ఐఐటీ ప్రవేశ పరీక్ష ప్రశ్నలను ఇంటర్ స్థాయికి పరిమితం చేయాలని నిర్ణయించినట్టు ఆమె వెల్లడించారు. వ్యాపారంగా మారిపోయిన విద్యను పేద విద్యార్థులకు అందుబాటు లోకి తేవడమే తమ శాఖ ధ్యేయమని స్పష్టం చేశారు. కోచింగ్ సంస్థలు విద్యార్థులకు కీడు చేస్తున్నాయని, వారిపై ఒత్తిడి పెంచుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు నెలల్లో పోర్టల్, ఆప్ ను విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఇందులో 50 ఏళ్ల ఐఐటీ ప్రశ్నా పత్రాలను అందుబాటులో ఉంచనున్నామని తెలిపారు. వీటికి ప్రత్యేకంగా డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని అన్నారు. 13 ప్రాంతీయ భాషల్లోనూ సమాచారం ఉంటుందని చెప్పారు. -
ఫిట్నెస్ పాస్ తో కోరుకున్నచోట వ్యాయామం!
వ్యాయామం కోసం ఫిట్ నెస్ సెంటర్ కు దూర ప్రాంతాలకు వెళ్ళాలని ఆలోచిస్తున్నారా? ఇక మీదట అవసరం లేదు. ఎప్పుడు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ వ్యాయామం చేసుకునేందుకు వీలుగా ఫిట్నెస్ పాస్ లు అందుబాటులోకి వచ్చేస్తున్నాయ్. నెలవారీ సభ్యత్వం కట్టి పాస్ పొందితే చాలు... ఓ ఆన్ లైన్ పోర్టల్ ఈ ప్రత్యేక సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ప్రజలకు ఫిట్నెస్ సెంటర్ లు, జిమ్ లు అందుబాటులో ఉండేట్టు ప్రత్యేక సౌకర్యంతో వర్క్ అవుట్ ఆప్షన్లు ఎంచుకునేందుకు వీలు కల్పించింది. ఇప్పుడు కేవలం ఆన్ లైన్లో నెలవారీ పాస్ తీసుకుంటే చాలు.. ఢిల్లీ ప్రజలు వారనుకున్న చోట వ్యాయామం చేసుకునేందుకు వీలు కలుగుతుంది. ఇందుకోసం రాజధాని నగరంలో ఫిట్నెస్ పాస్ ఆన్ లైన్ పోర్టల్.. పాస్ ల సౌకర్యం అందుబాటులోకి తెచ్చింది. ఈ ఆఫర్ ను నగరంలోని వెయ్యి జిమ్ లు, స్టూడియోల్లోను వినియోగించుకొనే అవకాశంతోపాటు... లక్షకు పైగా రోజువారీ వ్యాయామం చేసుకునే ప్రత్యేక ఆప్షన్లను అందిస్తోంది. వినియోగదారులు నెలకు కేవలం రూ.999 చెల్లించి పాస్ ను పొందితే జుంబా, పిలేట్స్, ఏరోబిక్స్, ఎంఎంఏ, క్రాస్ ఫిట్, సర్క్యూట్ శిక్షణ, కిక్‌బాక్సింగ్, స్పిన్నింగ్, బూట్ క్యాంప్ వంటి మరిన్ని వ్యాయామాలను చేసుకునే అవకాశం ఉంది. భారతదేశంలో ఎంతోమంది వ్యాయామం చేయాలని కోరుకుంటున్నా అందుకు తగ్గ అవకాశాలు, సమయం లేకపోవడంతో ఆ ఆలోచనను విరమించుకొంటున్నారు. ఇదే విషయాన్ని దృష్టిలో పెట్టుకొన్న ఫిట్ పాస్ సంస్థ.. అనుకూల ధర, సౌలభ్యంతోపాటు దీర్ఘకాలిక ఒప్పందాలతో ప్రత్యేక సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు సంస్థ సహ వ్యవస్థాపకుడు అక్షయ్ వర్మ తెలిపారు. ప్రస్తుత మార్కెట్ అసమానతలను తొలగించి, సూపర్ ఫిట్నెస్ ను భారత వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చేందుకు సంస్థ ఈ ప్రత్యేక సదుపాయాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యంగా జిమ్ లు , ఫిట్నెస్ స్టూడియోల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి కస్టమర్లను పెంచేందుకు కూడ తాము సహకరించినట్లు అవుతుందని వర్మ చెప్తున్నారు. సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా లాభాలను విస్తరించేందుకు, కస్టమర్ల అనుభవాలను మెరుగు పరిచేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ముఖ్యంగా సిక్స్ ప్యాక్ యాబ్స్, సెక్సీకాల్వ్స్, డోలే షోలే, 36-24-36, పెక్స్ ఆఫ్ స్టీల్, బికిని బాడ్ వంటి మొత్తం ఆరు యాజమాన్య ఉత్పత్తులను ఫిట్నెస్ పాస్ ద్వారా పోర్టల్ అందిస్తుంది. దీంతోపాటు వినియోగదారులు ప్రణాళిక ప్రకారం ఫిట్నెస్ సాధించేందుకు సహకరించే డైట్ ప్లాన్ తో కూడిన వర్కవుట్ గైడ్ ను కూడా అందిస్తున్నారు. త్వరలో ఫిట్ పాస్ సేవలను బెంగళూరు, పుణె, ముంబై, హైదరాబాద్, చండీగఢ్ నగరాల్లో కూడ విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. -
లెక్కల గారడీలతో జాగ్రత్త..
అప్ టు 50% క్యాష్ బ్యాక్ ఆఫర్ చూసి ఆన్లైన్ పోర్టల్‌లో టికెట్లు బుక్ చేసుకున్నాడు వినయ్. ఎలాగూ.. క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది కదా అని ఈ సారి స్లీపర్ క్లాస్ బస్‌లో టికెట్లు బుక్ చేశాడు. రూ. 3,000 పెట్టి విశాఖపట్నానికి రెండు టికెట్లు తీసుకున్నాడు. ఆఫర్ కింద తిరిగి రూ. 1,500 వెనక్కి వస్తాయి కదా.. ఒక టికెట్ మీద ఇద్దరు ప్రయాణం చేస్తున్నాం అని సంతోషంలో బుక్ చేశాడు. కానీ తీరా అకౌంట్లోకి చూస్తే క్యాష్ బ్యాక్ కింద రూ. 200 మాత్రమే వెనక్కి రావడంతో లబోదిబోమంటూ కంపెనీకి ఫోన్ చేశాడు. కాల్‌సెంటర్ వాళ్ల సమాధానం విన్న వినయ్ గుడ్లు వెళ్లబెట్టాడు. ఈ ఆఫర్ కింద గరిష్టంగా రూ. 200 మాత్రమే వెనక్కి ఇస్తారంట. మరి 50% క్యాష్ బ్యాక్ అన్న ప్రకటన సంగతి ఏంటి అని రెట్టించి అడిగితే.... రూ. 400 టికెట్ తీసుకున్న వాళ్లకి 50% వస్తుందని, ఆ పైన మొత్తం పెరిగే కొద్ది ఈ శాతం తగ్గుతూ వస్తుందని సెలవిచ్చారు. వినియోగదారులను ఆకర్షించడానికి సంస్థలు అనుసరిస్తున్న లెక్కల గిమ్మిక్కులు ఇవి. ఇప్పుడు ఈ ఆఫర్ల సంస్కృతి ఫైనాన్షియల్ ప్రోడక్టులకు కూడా వ్యాపించింది. పెట్టుబడి, రుణ పథకాలపై విధ కంపెనీలు అనుసరిస్తున్న గిమ్మిక్కు ప్రచారాలపై అవగాహన కల్పించేదే ఈ కథనం. అధిక రాబడి, సున్నా శాతానికే రుణాలు వంటి ప్రకటనలు మనకు తరుచూ కనిపిస్తూనే ఉంటాయి. తీరా వాస్తవ రూపంలోకి వచ్చేసరికి ఇవి భిన్నంగా ఉంటాయి. పైకి కనపడని ఎన్నో చార్జీలు, షరతులు వాస్తవ రాబడిని తగ్గించేస్తాయి. ప్రస్తుతం మార్కెట్లో ప్రచారంలో ఉన్న వివిధ మార్కెటింగ్ ప్రచార పథకాలు, వీటిల్లో ఉండే జిమ్మిక్కులను ఇప్పుడు పరిశీలిద్దాం.. రుసుములు లేకుండా క్రెడిట్ కార్డు ఈ మెయిల్ ఓపెన్ చేయగానే లేక తరుచు మొబైల్స్‌కు ఇటువంటి మెసేజ్‌లు వస్తూనే ఉంటాయి. వీటికి ఆశపడి వెంటనే దరఖాస్తు చేసుకోవద్దు. అసలు ఎటువంటి రుసుములు లేకుండా జీరో కాస్ట్‌కే కార్డును ఎందుకిస్తున్నాయన్న విషయం పరిశీలించండి. ఇది తెలియాలంటే ముందు జీరో కాస్ట్ వర్తించాలంటే కంపెనీ పెట్టిన నియమ నిబంధనలను తప్పక చూడాలి. సాధారణంగా ఈ ఆఫర్ కింద కార్డులు ఇస్తున్నప్పుడు మొదటి ఏడాదికి ఎటువంటి రుసుములు వసూలు చేయవు. అలా కాకుండా జీవితాంతం ఎటువంటి రుసుములు వసూలు చేయము అని చెపితే దానికి తప్పకుండా కొన్ని నిబంధనలు ఉంటాయి. ప్రతీ ఏడాది నిర్ధిష్ట మొత్తం కొన్నప్పుడు మాత్రమే వార్షిక రుసుములు రద్దు చేస్తారు. ఉదాహరణకు ఏటా కనీసం రూ. 30,000 కార్డుపై లావాదేవీలు చేస్తే వార్షిక రుసుములు రద్దు వంటి నిబంధనలుంటాయి. 9 శాతానికే పర్సనల్ లోన్స్ తొమ్మిది శాతం సింపుల్ వడ్డీరేటుకే వ్యక్తిగత రుణాలు.. ఇదే ఆఖరి అవకాశం.. పర్సనల్ లోన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. వంటి ఈ మెయిల్స్ వస్తూనే ఉంటాయి. ప్రస్తుతం బ్యాంకులు వ్యక్తిగత రుణాలపై వడ్డీరేటును 13 నుంచి 18 శాతం దాకా వసూలు చేస్తున్నాయి. అంతకంటే తక్కువ వడ్డీరేటుకి అందులో సింపుల్ వడ్డీరేటుకే ఇస్తున్నారంటే ఎవరైనా ఎందుకు కాదంటారు. కానీ ఇక్కడ వడ్డీరేటును ఏ విధంగా లెక్కిస్తున్నారన్న విషయాన్ని గమనించాలి. సాధారణంగా రుణాలపై వడ్డీరేట్లను ప్రతీ నెలా కట్టేయగా మిగిలిన మొత్తంపై లెక్కించి ఈఎంఐని నిర్దేశిస్తారు. కానీ ఇలా తక్కువ వడ్డీరేటుకు ఆఫర్ చేసే రుణాల్లో రుణం మొత్తంపైన లెక్కిస్తారు. ఈ లెక్కన చూస్తే చివరకు ఇది ఏ 16 శాతానికో తేలుతుంది. ఇలా తక్కువ వడ్డీరేటును చూపించడం ద్వారా ఆకర్షించడానికి ప్రయత్నిస్తారు. 10 శాతం బోనస్ బీమా కంపెనీలు అధిక బోనస్‌లు ఇస్తున్నట్లు ప్రకటిస్తుంటాయి. కానీ వాస్తవ రూపంలోకి వచ్చేసరికి ఆ మొత్తం చాలా తక్కువగా ఉంటుంది. బీమా కంపెనీలు బోనస్‌లను షమ్ అష్యూర్డ్ (తీసుకున్న బీమా రక్షణ మొత్తం)పై ప్రకటిస్తాయి. కానీ కొన్ని ఎండోమెంట్ పాలసీల్లో కట్టే ప్రీమియం షమ్ అష్యూర్డ్ కంటే ఎక్కువగా ఉంటుంది. అప్పుడు మీరు కట్టిన ప్రీమియాన్ని లెక్కలోకి తీసుకుంటే సగటున 6 శాతం గిట్టుబాటు అవుతుంది. నెలకు రూ.5,000తో 20 ఏళ్లలో కోటిన్నర.. ఎలా! ఇటువంటి ఆఫర్లు మనం ఎక్కువగా బీమా కంపెనీల్లో చూస్తుంటాం. చూడగానే ఇన్వెస్ట్ చేసేయాలన్నట్టుగా ఉంటాయివి. సామాన్యుడు ఊహించలేని కోటిన్నర రూపాయల నిధిని ప్రతీ నెలా చిన్న మొత్తంతో సమకూర్చుకోవచ్చన్నదే ఈ ఆకర్షణకు ప్రధాన కారణం. ఇలాంటి ఆఫర్లలో వాళ్లు చెపుతున్న గణాంకాలను ఒకటికి రెండుసార్లు పరిశీలించి చూడాలి. సాధారణంగా అధిక రాబడి రేటుతో ఈ భారీ మొత్తాలను చూపిస్తారు. ఇందులో వార్షిక వ్యయాలు వంటి ఇతర చార్జీలను చూపించరు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే వాస్తవ రాబడి ఇంతకంటే తక్కువగా ఉంటుంది. అంతేకాదు కనిష్ట రాబడి రేటుకు ఎంత మొత్తం వస్తుందన్న విషయం కూడా అడిగి తెలుసుకోండి. గుర్తుంచుకోండి.. వ్యాపారంలో ఏదీ కూడా ఉచితంగా ఇవ్వరన్న విషయం మర్చిపోవద్దు ఏదైనా కొనేటప్పుడు లేదా ఇన్వెస్ట్ చేసేటప్పుడు నియమ నిబంధనలు క్షుణ్నంగా చదవండి అంకెలను చూసి మురిసిపోకుండా, వాస్తవ రాబడులను గణించి సరిచూసుకోండి -
పోర్టల్ స్పెషల్..
-
ఈ-కామర్స్‌లోకి ‘మహీంద్రా’
ముంబై: పారిశ్రామిక దిగ్గజం మహీంద్రా గ్రూప్ తాజాగా ఈ-కామర్స్ విభాగంలోకి ప్రవేశించింది. మహీంద్రా ఉత్పత్తులు, సర్వీసుల విక్రయానికి ఎం2ఆల్.కామ్ పేరిట పోర్టల్‌ను ఆవిష్కరించింది. కొత్తగా ఆవిష్కరించిన వాహనం మహీంద్రా టీయూవీ300కి సంబంధించిన ఆర్డర్లు దీని ద్వారా తీసుకోవడం ప్రారంభించినట్లు మహీంద్రా గ్రూప్ సీఎఫ్‌వో వీఎస్ పార్థసారథి తెలిపారు. -
మార్కెట్ లోకి సరికొత్త స్మార్ట్ ఫోన్!
వాషింగ్టన్: మొబైల్ రంగంలో కొత్తకొత్త ఫీచర్స్, వివిధ రకాల మోడల్స్ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. వినియోగదారుల్ని ఆకట్టుకునే మార్కెటింగ్ లో భాగంగా ఆరు ఇంచుల డిస్ ప్లే ఉన్న మొబైల్ స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేశారు. ఈ స్మార్ట్ ఫోన్ ప్రత్యేకత ఏమిటంటే వాచీలా చేతికి కట్టుకునే విధంగా రూపొందించారు. అండ్రాయిడ్ తోపాటు ఇతర ప్రత్యేకతలున్నా ఈ స్మార్ట్ ఫోన పేరు పోర్టల్. ఈ ఫోన్ స్మార్ట్ వాచీగా, ఫిట్ నెస్ ట్రాకర్ గా పనిచేస్తుందని, వాటర్ ఫ్రూఫ్, షటర్ ఫ్రూఫ్ పీచర్లు కలిగి ఉందని కంపెనీ వెల్లడించింది. 2జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ స్పేస్ తో కెపాసిటీతో పోర్టల్ ను రూపొందించారు. ఈ స్మార్ట్ ఫోన్ రూపొందించిన డెవలపర్లు 3లక్షల డాలర్ల పెట్టుబడి కోసం ప్రయత్నాలు చేపట్టారు. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ ను ముందుకు తీసుకు వెళ్లేందుకు ఇన్వెస్టర్లు సిద్దమైతే వచ్చే జూలై నుంచి ఉత్పత్తిని ప్రారంభిస్తామని డెవలపర్లు తెలిపారు. -
ఇంజనీరింగ్ విద్యార్థులకు ఏఐసీటీఈ జాబ్ పోర్టల్
ఎడ్యు న్యూస్ దేశంలో ఇంజనీరింగ్ డిగ్రీలు పొందిన విద్యార్థుల కెరీర్ కోణంలో ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) ప్రత్యేకంగా ఒక జాబ్ పోర్టల్‌కు శ్రీకారం చుట్టనుంది. ఉద్యోగాన్వేషణలో ఉన్న విద్యార్థులు ఈ పోర్టల్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవచ్చు. అదేవిధంగా సంస్థలు కూడా తమకు అవసరమైన ఉద్యోగాల సమాచారాన్ని పొందుపర్చుకోవచ్చు. ఈ రెండు వర్గాలను ఉమ్మడి ప్లాట్‌ఫాంపైకి తీసుకొచ్చే విధంగా రూపొందిస్తున్న ఈ వెబ్సైట్ ద్వారా అటు కంపెనీలు, ఇటు విద్యార్థులు తమకు కచ్చితంగా సరితూగే ఉద్యోగాలు పొందే అవకాశాలు మెరుగవనున్నాయి. ఏఐసీటీఈ వర్గాలు పేర్కొన్న సమాచారం ప్రకారం ఒక విద్యార్థి ఒకసారి లాగిన్ అవడం ద్వారా గరిష్టంగా అయిదు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది మరికొద్ది రోజుల్లో కార్యరూపం దాల్చనుంది. -
కొత్త సిలబస్‌తో 'ఎంసెట్' స్టడీ మెటీరియల్ పోర్టల్
ఎప్పటికప్పుడు విద్యార్థులకు మార్గదర్శకంగా నిలుస్తోన్న సాక్షిఎడ్యుకేషన్.కామ్ మరో అడుగు ముందుకేసి ఎంసెట్ కోసం ప్రత్యేక పోర్టల్‌ను ప్రారంభించింది. ఈ పోర్టల్‌లో కొత్త సిలబస్‌కు అనుగుణంగా నిపుణులతో రూపొందించిన పూర్తి స్థాయి స్డడీ మెటీరియల్ తో పాటు ప్రిపరేషన్ గెడైన్స్, క్విక్ రివ్యూస్, బిట్ బ్యాంక్, మాక్ టెస్ట్స్, ప్రీవియస్ పేపర్స్ వంటి సమగ్ర సమాచారం లభిస్తోంది. ఇప్పుడే 'ఎంసెట్' స్టడీ మెటీరియల్ పోర్టల్ లో లాగాన్ అయి ఎంసెట్‌లో మంచి ఫలితాలు పొందండి.